KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/నిత్యానంద ధ్యానపీఠం పుట్టుక :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

నిత్యానంద ధ్యానపీఠం పుట్టుక :

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

జ్ఞానోదయమయ్యాక స్వామి నిత్యానంద కావేరి నది ఒడ్డున చిన్న ఆశ్రమంలో ఉండేవారు. చాలా కొద్దిరోజులలోనే ఆయనకీర్తి తమిళనాడులో అన్ని వైపులా వ్యాపించింది. దానితో ఆయన దర్శనం కోసం, ఆయన చేతిలో ఆరోగ్యవంతులవ్వాలి అనే ఆశతో ఆయన ప్రవచనాలు వినాలనే కోరికతో భక్తులు అధిక సంఖ్యలో రావటం మొదలయింది. అప్పుడు కొందరు భక్తులు స్వామీజీతో అక్కడ పెద్ద ఆశ్రమం నిర్మించటానికి అనుమతి అడిగారు.అప్పుడు ఆయన వారితో నేను రెండు పెద్ద ఆశ్రమాలుని భవిష్యత్‌లో స్థాపించుతాను అందులో ఒకటి బెంగుళూరు దగ్గర మరొకటి లాస్‌యాంజిల్స్(అమెరికా) అనేచోట అని చెప్పారట. అప్పుడు కొందరు భక్తులు “స్వామీ! లాస్‌యాంజిల్స్ అనేది భారతదేశంలో లేదు అది అమెరికాలో ఉన్నది” అని అన్నారట. అప్పుడు ఆయన నవ్వి, అలాగా! అయితే నా రెండవ ఆశ్రమం అక్కడే వస్తుంది అన్నారట.

స్వామీజీకి తమిళం, కొంచెం హిందీ తప్ప మరే భాషా రాదు. అసలు అమెరికా అనే భావం ఆయనలో లేదు. కాని ఆయన తన దివ్యదృష్టితో అలా చెప్పగలిగారు. అంతేకాదు. ఆయన దివ్యదృష్టికి ఒక గొప్ప మర్రి వృక్షం కనిపించేది. ఆయన తన భక్తులతో "బెంగుళూరు పరిసర ప్రాంతాలలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ ప్రదేశంలోనే మన ఆశ్రమ నిర్మాణం జరగాలి అని చెప్పారట.

ఆయన అనుమతి ఇవ్వటం మహదానందంగా భావించి, ఆయన శిష్యులు, భక్తులు బెంగుళూరు పరిసరాలలో విస్తృతంగా గాలించి చివరికి బెంగుళూరుకి 20 కి.మీ. దూరంలో మైసూరు రోడ్డు నుంచి 3 కి॥మీ దూరంలో బిడిది అనే ఒక చిన్న ఊరులో ఒక వ్యక్తికి సంబంధించిన పొలంలో ఒక పెద్ద మర్రి చెట్టుని చూసారు. వారి ఆనందానికి అవధులు లేవు. వారు పరుగున వెళ్ళి పొలం సొంతదారుని అమ్మమని అడిగితే ఆయన ఆ పొలం అమ్మను అని చెప్పాడట. వారు ఎంతో నిరాశతో స్వామి దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెబితే ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నారట. కొన్నిరోజులు గడిచాక ఆ పొలం సొంతదారుడు వచ్చి ఆ పొలాన్ని స్వామీజీకి భక్తితో సంతోషంగా ఇచ్చారు.

2003వ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ పరమహంస జయంతి శుభవేళ ఆ ప్రాంతంలో ఆశ్రమ నిర్మాణం ప్రారంభమైనది. అక్కడ ఉన్న పవిత్ర మర్రి వృక్షం షుమారు 300 సంవత్సరాల నాటిదని తెలుసుకున్నారు. పూర్వం అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేశాడని స్వామీజీ చెప్పారు. ఆయన పూజించిన శివలింగం ఆ మర్రిచెట్టు మొదలులో ఉండే ఒక తొర్రలో కనుగొన్నారు. స్వామీజీ ఆ శివలింగాన్ని ఆ చెట్టుకింద పునః ప్రతిష్టించారు. అక్కడే దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. దక్షిణామూర్తి ఆ ఆశ్రమానికి మార్గదర్శి.

ఆ మర్రి వృక్షం చాలా విశాలమైనది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలలో కొన్ని ధ్యాన తరగతులు స్వామి ఆ వృక్షం క్రింద తీసుకుంటారు. అలాగే ఆయన ఆ మర్రి వృక్షం కింద ప్రవచనాలు ఇస్తారు. కొన్ని విషయాలని బోధిస్తుంటారు. ఈ ఆశ్రమంలో మర్రిచెట్టు, దాని క్రింది అతి చిన్న వయస్సు ఉన్నగురుదేవులు ఆయనచుట్టూ ఆయన కంటే వయస్సులో దాదాపు రెట్టింపు వయస్సు ఉన్న శిష్యులు, ఇదంతా చూసేవారికి ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తిని ఉద్దేశించి వ్రాసిన శ్లోకం గుర్తువస్తుంది.

చిత్రం వటతరోర్మూలే వృద్ధశిష్యా గురుర్యువా :
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాత్ :

ఎంత విచిత్రం. మర్రి వృక్షం క్రింద కనిపించే ఈ దృశ్యం ఎంత అద్భుతం. అక్కడ ఉన్న గురుదేవులు చిన్నయువకుడు, ఆయన చుట్టూ ఉన్న శిష్య బృందం వృద్ధులు. గురువులు మౌనంగా ఉన్నారు. కానీ శిష్యులు అనుమానాలన్నీ కరిగిపోతున్నాయి.

చరిత్ర తిరిగి సంభవిస్తుంది అని చదివినప్పుడు మనం నమ్మలేము. షుమారు 2500 సంవత్సరాల క్రితం అంతకంటే పూర్వీకుడయిన ఆదిగురువు మహేశ్వరుడు దక్షిణామూర్తిగా (గురుదేవునిగా) ఉన్న సందర్భానికి ఆదిశంకాచార్యులు ఒక అందమయిన చిన్న శ్లోకంగా వ్రాయటం ఒక అద్భుతమయితే, అదే దృశ్యం ఈ రోజు మనం బిడది ఆశ్రమంలో నిత్యం చూడగలగటం మహోద్భుతమే.

బిడది ఆశ్రమంలో 300 సంవత్సరాల పురాతనమైన మర్రివృక్షం

బిడది ఆశ్రమంలో 300 సంవత్సరాల పురాతనమైన మర్రివృక్షం స్వామి నిత్యానంద భక్తులకు, శిష్యులకు ఈ మర్రి వృక్షం పరిసరాలు ఎంతో ప్రీతి పాత్రమయినవి. స్వామీజీ తన భక్తులతో చెబుతుంటారు. ఆ మర్రి వృక్ష ప్రాంతమంతా చాలా గొప్ప శక్తి వ్యాపించి ఉంటుందని అక్కడ ధ్యానం చేయమని చెబుతారు.

ప్రస్తుతం బిడిది అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ఆశ్రమం స్వామీజీ ప్రపంచవ్యాప్తంగా చేపట్టే అన్ని కార్యక్రమాలకి కేంద్రం. చూడటానికి అతి సామాన్యంగా ఉండే ఆశ్రమం, ప్రాచీన రుష్యాశ్రమం లక్షణాలతో ఉంటుంది. అదేవిధంగా అత్యాధునికి శాస్త్ర జ్ఞానం సాంకేతిక పద్ధతులు కూడా మనకి అక్కడ కనిపిస్తాయి. స్వామీజీ లక్ష్యాలతో ఒకటయిన ప్రాచీన తూర్పుదేశాల యోగాని పశ్చిమదేశాల ఆధునిక జ్ఞానంతో మేళవించాలి అన్ని ఆయన లక్ష్యం అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది.

ఆ ఆశ్రమ ప్రాంతంలో ఉండే సహజత్వం ఎక్కడా దెబ్బతినకుండా, స్వామీజీ దానిని అభివృద్ధి చేసారు. ఆశ్రమంలోనిత్యానంద స్వామి యొక్క ఒక సాధారణంగా ఉండే క్వార్టర్లు, ఆశ్రమవాసుల గదులు, వంటశాల, భోజనశాల, ఆఫీసు గదులు ఒక వైపు వుంటాయి. అవి దాటి వెళితే ఒక పెద్ద హాలు వస్తుంది. అదే ఆనంద సభ. స్వామీజీ ఆశ్రమంలో నిర్వహించే కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతాయి. అక్కడక్కడా రెల్లుగడ్డితో వేసిన పాకలు అందంగా కనిపిస్తుంటాయి. క్లుప్తంగా వివరించితే ఇదీ నిత్యానంద ధ్యానపీఠం యొక్క ప్రధాన కార్యాలయము, స్వామీజీ దివ్యదృష్టితో రూపుదిద్దుకున్న మొట్టమొదటి ఆశ్రమం.