KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/స్వామీజీ చెప్పే పద్ధతులన్నీ సామాన్యుల జీవితానికి సరిపడే పద్ధతులు :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

స్వామీజీ చెప్పే పద్ధతులన్నీ సామాన్యుల జీవితానికి సరిపడే పద్ధతులు :

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

స్వామీజీ ఏమి చెప్పినా ప్రతి విషయానికి హామీ ఇస్తారు. ఎందుకంటే ఆయన తన అనుభవంతో తెలుసుకున్న విషయాలు మాత్రమే చెబుతారు. మరొక విశేషమేమిటంటే ఆయన చెప్పే ప్రతి విషయం, చూపించే ప్రతి పరిష్కారం సామాన్య మానవ జీవితానికి సరిపడే విధంగా ఉంటాయి. మామూలు లౌకిక జీవితం సాగించే వారికి, సంసార జీవితంలో ఉన్నవారి సమస్యలకి ఆయన చక్కని పరిష్కారాలు చూపించుతారు. అదే చాలా ఆశ్చర్యకరమయిన విషయం.

పరమహంస నిత్యానంద, వయస్సులో చాలా చిన్నవారు. ఆయన 1978, జనవరి 1వ తేదీ జన్మించారు. వయస్సు 30లోపు. జనతః బ్రహ్మచారి. ఆయనకి అంటూ ఎటువంటి కుటుంబ జీవిత, సంఘ జీవతం లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు, బంధువులతో ఉన్నా, ఆయన వారితో ఎప్పుడూ లోతయిన సంబంధాన్ని కలిగి లేరు. ఐదు సంవత్సరాల వయస్సు నుంచే ఆయన ఎక్కువ భాగం యోగులతో సత్యాన్వేషణలో ఉండే మునులతో గడిపేవారు. ఆయన జీవితంలో ముప్పావు భాగం తపస్సుతో గడచిపోయింది. మరి ఈ విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయి. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగతంగా మనకి సమాజంతో ఉండే సంబంధాలు, ఇలాంటి మన సమస్యలు ఆయనకి ఎలా తెలుసు అనేది ప్రతి ఒక్కరి మనస్సులోనికి వచ్చే ప్రశ్న.

ఈ ప్రశ్నకి నిత్యానంద స్వామి చాలా చక్కని వివరణ ఇస్తారు. జ్ఞానోదయమయిన వ్యక్తికి ఈ భూమి మీద తెలియని విషయం ఏదీ ఉండదు. వారికి ఎటువంటి విషయాలు, ఎటువంటి జ్ఞానం కావాలన్నా పరాశక్తి దానిని వారిలో నింపుతుంది. వారు ప్రత్యేకంగా నేర్చుకునేది, తెలుసుకునేది ఏమీ ఉండదు.

ఇకపోతే సామాన్య మానవుల జీవన సరళి గురించి స్వామి ఇలా చెబుతారు. సన్యాస జీవితంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. అందులో ఒకటి పరివ్రాజకగా దేశ సంచారం చేసే సమయంలో వాళ్ళు ఎక్కడ అయినా ఊరులో ఒక రోజు మించి ఉండకూడదు. ఆ సమయంలో నిత్యానంద స్వామి కాలినడకన ఎక్కువభాగం తిరిగారు. ఒక ఊరుకి వెళ్ళటం, అక్కడ వారు పెట్టినది తినటం ఆ గ్రామంలోని ప్రజలతో మాట్లాడటం. మన దేశంలో సన్యాసులకి యోగులకి చక్కని గౌరవం దొరుకుతుంది. అంతేకాకుండా ఎటువంటి వ్యక్తిగత సమస్యనయినా వాళ్ళు చాలా స్వేచ్ఛగా ఒక యోగికి చెప్పుకోగలుగుతారు. ఈ విధంగా సామాన్య మానవులకి మామూలుగా ఉండే సమస్యలన్నీ ఆయనకి తెలుసు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన గురించి మనకి తెలియని విషయాలు కూడా పరమహంసకి చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఈ సందర్భంగా నిత్యానందస్వామి ఒక విషయం చెబుతుంటారు. జ్ఞానోదయమయిన యోగికి ఏదో ఒక ప్రాంతంతో కాని, ఒక ఇంటితో కానీ, లేదా ఏదో కొద్దిమంది వ్యక్తులతో కాని సాన్నిహిత్యం ఉండదు. వారికి ఉండే సన్నిహిత సంబంధం పరాశక్తితో, ఈ ప్రపంచంతోనూ, వారికి ప్రపంచం ఒక కుటుంబం లాంటిది. భాషా భేదాలు, వయస్సులో వ్యత్యాసాలు, స్త్రీ పురుష భేదాలు వారికి అసలు ఉండవు. ఆ భేదభావం చూపటం కూడా వారికి తెలియదు. కాబట్టి వారు ఎక్కడ ఉంటే అదే వారి ఊరు, అదే వారి ఆశ్రమం.

పరమహంస నిత్యానంద కూడా కేవలం ధ్యానపీఠం యొక్క ఆశ్రమంలో తప్పా ఎక్కడ ఒకటి రెండు రోజులు మించి ఉండను అని చెప్పారు. అందుకే ఎవరి ఇంటికి వెళ్లినా, ఏ దేశానికి వెళ్లినా అది కొత్త ప్రదేశం అని నాకు అనిపించదు అని చెబుతారు.

శాస్త్రీయ దృక్పథం - ప్రయోగాల మీద ప్రత్యేక ఆసక్తి :

పరమహంస నిత్యానందలో ఉండే మరొక ప్రత్యేకత, ఆయనకి శాస్త్ర విజ్ఞానం పట్ల ఉన్న అవగాహన. ప్రతి చిన్న విషయాన్ని శాస్త్రీయంగా వివరించుతారు. అంతే కాకుండా ఆయనకి ఏ విషయమైనా అనుభవంతో తెలుసుకోవాలి, అప్పుడే దానిని నమ్మాలి అనే విషయాన్ని కచ్చితంగా పాటించుతారు. మనకి కూడా అదే విషయాన్ని చెబుతారు. “నేను మామిడి పండు తియ్యగా ఉన్నది అని అంటే మీరు దానిని నమ్మవద్దు అలాగే తిరస్కరించవద్దు. మీరు మామిడి పండు తిని తెలుసుకోండి” అని అంటారు.

ఆయన ఒకసారి అమెరికాలోని ఒక్లాహోమా పట్టణంలో ఉండగా ఆయనని కొందరు డాక్టర్లు, న్యూరాలజిస్టులు, శాస్త్రవేత్తలు కలిసి ఆయన మెదడు పనితీరు మీద పరిశోధన చేస్తాము అని కోరతారు. దానికి ఆయన ఒప్పుకుని తన శరీరాన్ని, మెదడుని ఆ డాక్టర్స్కి అప్పగించారు. వారు ఆయన ధ్యానం చేసే సమయంలో, బాగా లోతుగా గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు, ఆయన ఒక వ్యక్తికి తన చేతి స్పర్శ ద్వారా చికిత్స చేసే సమయంలో, మామూలుగా ఉన్నప్పుడు అత్యంత ఆధునిక యంత్రాలతో పరిశోధనలు చేసి ఒక అద్భుతమయిన ఆశ్చర్యకరమైన రిపోర్టుని ఇచ్చారు. వారు అంతా ఏకకంఠంతోఆయన మెదడు పనితీరు చాలా ఖచ్చితంగా అద్భుతమయినది. అది సాధారణమయినది కాదు అని నిర్ణయించారు.

శాస్త్రవేత్తలు శ్రీ నిత్యానంద మెదడు పనితీరుపై పరిశోధన

శాస్త్రవేత్తలు శ్రీ నిత్యానంద మెదడు పనితీరుపై పరిశోధన ఆయన మామూలు స్థితిలో ఉండగా ఆయన మెదడు చాలా చైతన్యవంతంగా ఉన్నది. అది మామూలు మనిషి మెదడు పని తీరుకన్నా చాలా చైతన్యం ఉండటం గమనించాము అని చెప్పారు. వారు నిత్యానంద మెదడు ఎన్నో రేట్లు అధికంగా పనిచేయటం గమనించారు. అదే విధంగా మెదడు ముందుభాగం చాలా ఎక్కువ చైతన్యంతో ఉన్నది. ఆ భాగం తెలివితెటలు, మేధస్సు, జ్ఞానం నిర్ణయాలు చేయగల నేర్పు మొదలయిన పనులు చేస్తుంది.

ఆయన గాఢమయిన ధ్యానంలోనికి వెళ్లినప్పుడు మెదడులో 90% నిశ్శబ్దమయి పోయింది. మెదడు అలా నిశ్చలమయినప్పుడు మెదడు ముందు ప్రక్క క్రింద భాగంలో ఒక చోట చాలా ప్రకాశవంతంగా ఉన్నది. అదే మన అనుకునే మూడవ కన్ను ఉండే భాగం. ఆ తరువాత డాక్టర్లు స్వామీజీని ఆ సమయంలో ఏమి చేసారు అని అడిగితే మూడవ కంటిని తెరచినట్లు చెప్పారట. బహుశ: అదే ఆత్మ యొక్క స్థానం అయి ఉండవచ్చు. దాని ద్వారానే మనం పరాశక్తి (భగవంతుని)తో సంబంధాన్ని నెలకొల్పుకొనగలుగుతాము. దాని ద్వారానే అంతరంగపు ప్రపంచంలోని అద్భుతాలని మర్మాలని మనం చూడగలుగుతామేమో అని డాక్టర్లు తమ రిపోర్టులో వ్రాసారు.

ఈ ప్రయోగం ద్వారా డాక్టర్లు ఒక విషయాన్ని నిర్ధారించారు. అది మెదడు యొక్క పనితీరుని నియంత్రించటం ద్వారా మనం మన వ్యాధులకు చికిత్స చేయగలమేమో! ఆ అవకాశం ఉన్నది. ఈ పరిశోధనా ఫలితాలు మెదడుపై జరిపే పరిశోధనలలో కొత్త అధ్యాయాలని తెరిచాయి. ఈ విధంగా నిత్యానంద స్వామి మన ప్రాచీన మర్మయోగానికి, ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి మధ్య ఒక అద్భుతమయిన సంబంధాన్ని నెలకొల్పారు. ఆధునిక వైద్యరంగంనికి ఒక చక్కని సవాలు విసిరారు. వైద్యశాస్త్రంలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. తూర్పుదేశాల ప్రాచీన యోగానికి పశ్చిమ దేశాల ఆధునిక హేతువాద శాస్త్రానికి మధ్య పరమహంస ఒక వారధి :

పరమహంస నిత్యానంద స్వామి చాలా సార్లు తన శిష్యులకి ఒక విషయం చెబుతుంటారు. తూర్పుదేశాల ఆధ్యాత్మిక, యోగ శాస్త్రాలు ప్రాచీనమయినవి. వాటిని హేతువాదంతో నిరూపించలేము. అదేవిధంగా పాశ్చాత్యా దేశాల హేతువాద సిద్ధాంతాలు ప్రతి విషయానికి శాస్త్రీయ నిరూపణని అవసరం అని అంటాయి. ఈ రెంటింటిలోనూ మంచి ఉన్నది. ఈ రెండు చివరలని అనుసంధానం చేయటం ద్వారా మనం ఒక మంచి తత్వాన్ని తెలుసుకోగలుగుతాము అని అంటారు.

ఈ సందర్భంగా స్వామి నిత్యానంద పాశ్చాత్యుల సమాజపు స్వేచ్ఛ తూర్పుదేశాల వారి అంతరంగపు (ఆధ్యాత్మిక) స్వేచ్ఛ గురించి ఇలా చెబుతారు.

పశ్చిమదేశాలలో వారి సమాజం వారికి చాలా స్వేచ్ఛని ఇస్తుంది. వాళ్ళు మూడు నెలలకొకసారి కారు మార్చవచ్చు. ఇల్లు మార్చవచ్చు భార్యా భర్తలని కూడా మార్చవచ్చు. వారికి ఏమి తినాలనిపిస్తే అది తింటారు. ఎటువంటి దుస్తులు వేసుకోవాలంటే అవి వేసుకుంటారు. వారికి బయట ప్రపంచంలో అంతులేని స్వేచ్ఛ వున్నది. కానీ ఆధ్యాత్మిక విషయంలో అంతరంగపు ప్రపంచంలో వారికి అసలు స్వేచ్ఛలేదు. పెద్దలు ఏమి చెబితే అదే అంతిమం. వారు అంతరంగపు ప్రపంచంలోనికి వెళ్ళి పరిశోధనలు చేసే స్వేచ్ఛ లేదు. ఎవరినైనా ఒక వ్యక్తిని సెయింట్ (Saint) అనాలి అంటే ఏదో ఒక వ్యవస్థ దానిని ధృవీకరించి, ప్రకటించాలి. ప్రజలకి వేరు వేరు ఆధ్యాత్మిక మార్గాలని ఎంపిక చేసుకునే అవకాశం అసలు లేదు. ఇష్టముంటే ఉన్న ఒక్క మార్గాన్ని అనుసరించతారు లేకపోతే ఆధ్యాత్మికతని పూర్తిగా వదిలివేసారు.

ఇక తూర్పుదేశాల పరిస్థితి దీనికి పూర్తి వ్యతిరేకం. వారికి బయట ప్రపంచంలో అసలు స్వేచ్ఛ లేదు. దుస్తులు, ఆహారవ్యవహారాలు, జీవన సరళి అంతా సమాజ నియంత్రణలో ఉంటుంది. కాని వీరికి అంతరంగ ప్రపంచంలో అంతులేని స్వేచ్ఛ ఉన్నది. ఎవరు ఏ మార్గంలోనైనా వెళ్ళవచ్చు. తమ అంతరంగంలోనికి వెళ్ళి ఎన్ని పరిశోధనలయినా చేయవచ్చు. అలా చేసిన పరిశోధనల ఫలితాలను ప్రకటించవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఒక్కొక్క తత్వాన్ని అభివృద్ధి చేసారు. దీనిమూలంగానే తూర్పుదేశాలలో ఇంతమంది దేవుళ్ళు ఎన్నో తరగతులు, గ్రూపులు, తత్వాలు, మతాలు ఉంటాయి. దీనివలన ఆధ్యాత్మికంగా ఎవరు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటే ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. అంతే కాని ఆధ్యాత్మిక మార్గాన్ని పూర్తిగా వదలరు. అంతేకాకుండా తూర్పుదేశాలలో ఎవరయినా ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందిన తరువాత తమకి తాము యోగిగా (Saint) ప్రకటించుకోవచ్చు. దీనిని ఎవరూ ధృవీకరించనవసరం లేదు. మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో అంత స్వేచ్ఛ ఉన్నది. ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఆ కారణంగానే అంతరంగ శాస్త్రంలో, ఆధ్యాత్మిక రంగంలో తూర్పుదేశాల వారు అద్భుతమైన అభివృద్ధి సాధించారు. మనకి ఉన్నంతమంది మహాయోగులు, గురువులు, జ్ఞానులు మరి ఎక్కడా ఉండరు. అది అందించే ఫలితాలు శాశ్వతమయిన ప్రభావాన్ని మన సమాజంపైన దేశ ప్రజలపైన చూపించుతాయి.

పరమహంస నిత్యానంద ఇచ్చిన ఈ పరిశోధాత్మకమయిన వివరణ మనలో ఉండే ఎన్నో అనుమానాలని నివృతి చేస్తాయి. ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇస్తాయి. మనలోఉండే అస్పష్టతని అయోమయాన్ని తొలగించి ఆధ్యాత్మిక విషయాన్ని స్పష్టం చేస్తుంది.

పశ్చిమ, తూర్పుదేశాల ఆధ్యాత్మిక వ్యవస్థ మీద మంచి అవగాహన ఉన్నందునే పరమహంస ఈ రెండు చివరలని కలిపే ఒక అద్భుత ఆధ్యాత్మిక వారధి కాగలిగారు. సామాన్యంగా ఆయన కార్యక్రమాలు ఎక్కడరిగినా అవి పశ్చిమదేశాలలోనైనా లేదా భారత దేశంలోనైనా ఆకార్యక్రమాలలో భారతీయులు పాశ్చాత్యులు ఉంటారు. అప్పుడు స్వామి రెండు ప్రాంతాలలో ఉండే మంచి విషయాలని స్పష్టంగా సామరస్యంగా వివరిస్తూ వారిని మరింత లోతుగా తెలుసుకోమని ప్రోత్సహిస్తారు.

ఒక చిన్న సంఘటన. స్వామీజీ ప్రతి సంవత్సరం హిమాలయ యాత్ర రెండు వారాలపాటు నిర్వహించుతారు. అలాంటి ఒక యాత్రలో సగం మంది పాశ్చాత్యులు సగం భారతీయులు ఉన్నారు. హిమాలయాలలో కొన్ని ప్రాంతాలలో జీవితం చాలా అపాయాలతో ఉంటుంది. ముఖ్యంగా యమునోత్రి, కేదార్నాథ్ యాత్రికుల కోసం గుర్రాలు, డోలీలు నిర్వహించేవారు చాలా ప్రమాదకరమయిన దారులలో వాటిని నడుపుతారు. ఆ సందర్భంగా స్వామీజీ పాశ్చాత్య శిష్యులు, భక్తులతో వారు ఎటువంటి ఇన్స్యురెన్స్ పాలసీ తీసుకోరు. అసలు వారికి అటువంటి అవసరం ఉండదు. అనగానే పాశ్చాత్యు ఎంతో ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆ యాత్రలో ఉన్న భారతీయులు కూడా కేవలం ఉద్యోగస్తులు ఇన్కంటాక్స్ (ఆదాయపన్ను) మినహాయింపుకి మాత్రమే ఇన్స్యురెన్స్ తీసుకుంటారు, మిగతావారికి అది లేదు అని తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయారు. పాశ్చాత్యుల నిత్యజీవితంలో ఇన్స్యురెన్స్ ఒక ముఖ్యభాగం, అది లేని జీవితాలని వారు ఊహించలేరు.

స్వామిజీ సమక్షములో హిమాలయాలలో ధ్యానం చేస్తున్న అనుచరులు

స్వామిజీ సమక్షములో హిమాలయాలలో ధ్యానం చేస్తున్న అనుచరులు

దీనికి కారణం పరమహంస చాలాచక్కగా వివరించుతారు. పాశ్చాత్యులకి తరువాత జన్మ అనే అంశం లేదు. కాబట్టి వారు అంతర్లీనంగా ఈ జన్మని పూర్తిగా ఆనందంలో గడపాలి అనే తీవ్రమయిన కోరిక ఉంటుంది. ఎప్పుడైతే తీవ్రమైన కోరిక ఉంటుందో దానితో పాటు తీవ్రమైన భయం కూడా ఉంటుంది. వ్యాపారస్తులు ఆ భయాన్ని వ్యాపారంగా మలచుకుంటారు.అదే ఇన్సూరెన్సు వ్యాపారం.

కానీ భారతీయులకి అంతర్లీనంగా, తెలియకుండా ఒక భరోసా ఉంటుంది “ సరే, ఇప్పుడు కాకపోతే తరువాత లేదా మరోజన్మలో” అనే భావన చాలా లోతుగా ఉంటుంది. కాబట్టి భయం కూడా తక్కువ ఉంటుంది. అంతేకాదు. ఆ కారణం మూలానే వారు ప్రతి పనినీ నిదానంగా చేస్తారు. లేదా వాయిదా వేస్తారు. ఉదాహరణకి కార్యక్రమం ఉదయం 8 గం॥ అంటే భారతీయులు 9 గం తరువాతే వస్తారు. ఎందుకంటే వారి ముందు అనంతమైన కాలం ఉన్నది అని వారి ఆధ్యాత్మిక శాస్త్రాలు వారికి చెప్పాయి. ఆ కారణంగానే వారిలో కంగారు, తపన, పరుగులు తీయాలనే ఆతృత కనపడవు. స్వామి ఈ వివరణ ఇచ్చాక అక్కడ ఉన్న అందరికీ ఎన్నో అనుమానాలు నివృత్తి అయ్యాయి.

ఈ విధంగా ప్రతి చిన్న విషయంలో ఆయన పశ్చిమదేశాలు తూర్పుదేశాల సంస్కృతీ సంప్రదాయాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలను ఒక దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అరెంంటిలోను మంచిని గ్రహించేలా చేయటం ఆయన ముఖ్య ఉద్దేశ్యం.