KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/జ్ఞానోదయమయ్యి నిత్యానందస్థితిని చేరిన స్వామి నిత్యానంద :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

జ్ఞానోదయమయ్యి నిత్యానందస్థితిని చేరిన స్వామి నిత్యానంద :

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

స్వామి తనకు జ్ఞానోదయమయిన శుభ తరుణాన్ని ఆయన శిష్యులకి చక్కగా వివరించారు. స్వామి నిత్యానంద యువకుడయిన మహాయోగి. ఈ సహస్రాబ్దికి, ఇప్పటి ప్రజల సాంఘిక, సాంస్కృతిక, సంస్కార మానసిక స్థితి గతులకు, ఆధునికుల జీవన సరళికి పూర్తిగా సరిపోయిన మహాయోగి. ప్రతి విషయాన్ని అది, తన జన్మరహస్యమే కానీ, లేదా జ్ఞానోదయ విషయమే కానీ లేదా యోగ, ధ్యాన, వేదాంత రహస్యాలు కాని, సామాన్య మానవులకి అర్థమయ్యేరీతిలో, ఆ భాషలో చక్కగా వివరించేవారు. ఒక విధంగా చెప్పాలి అంటే మార్మిక యోగాన్ని, వివిధ తత్వ రహస్యాలని మనకి ఆధునిక కాలంలో అందించిన యోగులలో ఈయనని ప్రధమునిగా చెప్పుకోవచ్చు.

స్వామి తన జ్ఞానోదయాన్ని ఈ విధంగా వివరించారు. “ ఆ విధంగా ఏడు రోజులపాటు జ్ఞానోదయం అనే కోరికని ఆలోచనలని పూర్తిగా వదిలి ప్రకృతి సోయగాలలో మైమరచి ఉండిపోయాను. క్రమంగా నా ఆలోచనలు ఒక్కొక్కటిగా నన్ను వదిలి వెళ్ళిపోయాయి. ఆలోచనలు రావటం చాలా తగ్గిపోయి చివరగా వున్న ఒక్కటీ పోయింది. నేను పూర్తిగా ఆలోచనలు లేని స్థితికి చేరాను. అప్పుడు ఒక దివ్యకాంతి పుంజం నాలోనికి అకస్మాకత్గా ప్రవేశించి, నాలో ఏదో విచ్ఛన్నమవటం తెలిసినది. నేను అద్భుతమయిన ఆనంద పారవశ్యంలో మునిగిపోయాను. అప్పుడు నా నుంచి వచ్చిన ఒకే ఒక మాట 'నిత్యానందం'

అతి చిన్న వయస్సులో కేవలం ఇరవై రెండు సంవత్సరాల ప్రాయంలో ఒక యోగి అంతిమ సత్యాన్ని కనుగొని రాజరుషి, మహాతపస్వి అద్భుతయోగి జ్ఞానోదయం పొందిన మహాజ్ఞానిగా రూపాంతరం చెందాడు. ఇది కేవలం సిద్ధపురుషులకు, కారణ జన్ములకు, దైవాంశ సంభూతులకు, జన్మతః జ్ఞానోదయం అయిన జ్ఞానులకు మాత్రమే సాధ్యపడే విషయం.

జ్ఞానోదయమయిన తరువాత స్వామి నిత్యానంద :

జ్ఞానోదయమయిన మహాజ్ఞానులు, యోగుల గురించి వారి తరువాత కార్యక్రమాల గురించి పరమహంస నిత్యానంద ఒక చక్కని వివరణని ఇస్తారు. ఆయన మాటలలో ఆ వివరణ ఇలా ఉంటుంది. “జ్ఞానోదయమయిన యోగీశ్వరులు రెండు విధాలుగా ఉంటారు. ఒక రకమైన వారు అదే పరమానంద స్థితిలో కళ్ళుమూసుకొని ఉండి కేవలం భగవంతునితో (సర్వాంతర్యామి లేదా విశ్వశక్తి) నేరుగా సంబంధాన్ని నెలకొల్పుకుని ఉంటారు. వారు ఆ పరమానంద స్థితి నుంచి బయటకి రావటానికి ఇష్టపడరు. ఎందుకంటే బాహ్యేంద్రియాల (స్పర్శేంద్రియాల) ద్వారా పొందే ఆనందంకంటే వారు పొందే ఆనందం చాలా ఉన్నతమయినది, ఘనమయినది, అద్భుతమయిన, శాశ్వతమయినది. ఇటువంటివారు సామాన్యప్రజలకి, లౌకిక ప్రపంచానికి దూరంగా అడవులలో, కొండలలో, గుహలలో ఉండిపోతారు. వారికి అంతచక్కటి శాశ్వతమయిన నిత్యానంద స్థితిని వదలి బయటకి రావటం ఇష్టం ఉండదు.

రెండవ రకం వారు కళ్ళు తెరచి ఈ ప్రపంచాన్ని చూస్తారు. ఈ ప్రపంచానికి ఏదో కొంత మంచిచేయాలి, వారిలోని జ్ఞానాన్ని అందరికీ పంచాలి అని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్ణయించుకుని, ఆ ప్రత్యేక లక్ష్యసాధన కోసం ప్రజల మధ్యకి, ఈ లౌకిక ప్రపంచం లోనికి వస్తారు. జ్ఞానోదయం పొందిన యోగులు గొప్ప ఆనందమయమయిన అత్యున్నత స్థితిలో ఉంటారు. వారిని ప్రపంచపు విషయాలు ఏవీ అంటవు. ఈ లౌకిక ప్రపంచంలోని సంతోషం, దుఃఖం, అనే భావావేశాలకి, స్త్రీ, పురుషుడు అనే భేధాలకి ఎంతో అతీతంగా ఉంటూ అత్యున్నత చేతన స్థితిలో ఉంటారు.

ఈ సందర్భంగా స్వామి నిత్యానంద చెప్పే ఒక చిన్న విషయం, ఈ సత్యాన్ని రూఢి చేస్తుంది. ఆయన అంటారు "నేను 8×8 మాత్రమే ఉన్న చిన్న గదిలో జీవించినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో, ఈ వైభవオペేతమైన సింహాసనం మీద కూర్చోని ఉన్నప్పుడూ అదే ఆనందంలో ఉన్నాను” అని అందుకే వీరు పరమహంసలు, ఈ లౌకిక ప్రపంచానికి అందనంత ఉన్నత స్థితిలో ఉండే మహా పురుషులు

భగవద్గీతలో జగద్గురువు భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుని ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు కూడా ఇటువంటి స్థితిలో ఉండే యోగులు గురించి తెలియజేస్తుంది.

అర్జున ఉవాచ :

ఏవం సతతయుక్తా భక్తాస్త్వాం పర్యుపాసతే
యే చాప్యక్షర మవ్యక్తం తేషాంకే యోగ విత్తమాః

అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు! భగవాన్, ఎవరైయితే ఎల్లప్పుడూ నీయందే మనస్సుని స్థిరపరచి నిన్ను ఉపాసించు చున్నారో అటువంటి వారా లేక ఎవరయితే ఇంద్రియ గోచరంకాని రూపంలేని, నాశనం లేని పరబ్రహ్మ రూపంలో నిన్ను ధ్యానించుతారో వీరు, ఈ ఇరువురిలో ఎవరు ఉత్తమ భక్తులు.

భగవానువాచ .

మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే
శ్రద్ధయా పరయోపేతాస్తేమే యుక్తమతా మతాః

భగవానుడు ఈవిధంగా చెప్పాడు :

ఎవరయితే నాయందు మనస్సుని స్థిరంగా నిలిపి నిరంతరం తదేక నిష్ఠతో నన్ను ఆరాధించుతారో, వారు నాలో ఐక్యమవుతారు వారు ఉత్తమ యోగులని నా అభిప్రాయం.

ఈ శ్లోకాలకి స్వామి నిత్యానంద తన వాఖ్యని ప్రేమేజీవితం (భగవద్గీత 2 అధ్యాయం) అనే పుస్తకంలో ఈ విధంగా చెబుతారు. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి, జ్ఞానోదయమయిన యోగి ఆ నిత్యానంద స్థితిలో, ఆ సచేతన స్థితిలో ఉండి నిన్ను పూజించే భక్తుడు గొప్పవాడా లేక జ్ఞానోదయమయ్యి సచేతన స్థితిని పొందిన జ్ఞానాన్ని ప్రేమని ప్రపంచానికి పంచిన భక్తుడు గొప్పవాడా? అని అడుగుతాడు. దీనికి జవాబుగా భగవంతుడు ఇద్దరూ ఉత్తములుయిన నా భక్తులే అని జవాబు ఇస్తాడు.

ఈ రెండు స్థితులలో దేనిని ఎంచుకోవాలి. నిత్యానంద స్థితిలో ఉండి కళ్ళు మూసుకొని ఈ ప్రపంచానికి చాలా దూరంగా ఆ భగవంతునిలో ఐక్యమయిపోయి ఆ ఆనంద పారవశ్యంలో ఉండటమా లేక జ్ఞానోదయంతో పొందిన జ్ఞానం అప్పుడు వారిలో పొంగి ప్రవహించే ప్రేమని ప్రపంచానికి పంచిపెడుతూ ఈ లోకంలో ప్రజలకి మంచి చేయాలా?

ఈ ఎంపిక విషయం గురించి స్వామి ఒక మాట చెబుతారు. ఏ విధంగా ఉండాలి అనే ఎంపిక మన చేతులలో ఉండదు. దానిని మనం నిర్ణయించము. ఈ నిర్ణయం చేసేది కేవలం సర్వాంతర్యామి, పరాశక్తి మాత్రమే నిర్ణయించుతారు. భగవంతుడు అటువంటి కొందరు యోగులని ప్రపంచంలోనికి పంపించి వారి ద్వారా విషయాలను చక్కదిద్దుతాడు. ఆ విశ్వశక్తి, పరాశక్తి అయిన భగవంతునిదే తుది నిర్ణయం. ఈ విధంగా ఆ మహానీయులద్వారా భగవంతుడు తాను చేయదలచిన పనులు నెరవేరుస్తాడు. తాను తన బిడ్డలకి ఇచ్చిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాడు.

పరమహంస నిత్యానంద జ్ఞానోదయం కలిగాక దాదాపు తొమ్మిది నెలలు పూర్తి మౌనంలో ఉండిపోయారు. ఆ తరువాత దక్షిణ భారతదేశంలోని పవిత్ర కావేరీ నది ఒడ్డున ఒక చిన్న పాకలో నివాసం ఉన్నారు. ఆ చుట్టు ప్రక్కల ప్రజలు స్వామిని దర్శించుకుని ఆయన దీవెనలు పొందేవారు. మరీ ముఖ్యంగా ఆయన అమృతహస్తం తాకగానే ఎటువంటి వ్యాధి అయిన మాయం అయిపోతుంది అని గ్రహించారు. అంతే, కొద్ది రోజులలోనే ఒక బాలయొగీశ్వరుడు కావేరి నది ఒడ్డున ఉన్నాడు, ఆయన చేతి స్పర్శతో ఎటువంటి వ్యాధి అయినా మటుమాయం అనే మాట అన్ని వైపులా మెరుపు వేగంతో వ్యాపించిపోయింది. దాంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది

ఆ భక్తులే స్వామికి కావేరీ ఒడ్డున కొంచెం పెద్ద ఆశ్రమంలాంటిదానిని తాటాకులతో, తడికలతో కట్టారు.

స్వామీజీ యొక్క ప్రత్యేక లక్ష్యాలు :

పరమహంస నిత్యానంద తన 22వ ఏట, జనవరి ఒకటి 2000 సంవత్సరం జ్ఞానోదయం పొంది, అంతిమగమ్యమయిన, అత్యున్నత నిత్యానంద స్థితిని పొందారు. జ్ఞానోదయం గురించి వివరిస్తూ స్వామి తన శిష్యులకి, భక్తులకి ఈ విధంగా చెబుతుంటారు. జ్ఞానోదయం పొందిన యోగిలో కరుణ, ప్రేమ, కృతజ్ఞతా భావాలు పొంగి ప్రవహిస్తుంటాయి. వారిలో ఆనందం హద్దులు లేకుండా, కారణం లేకుండా నిరంతరం జీవనదిలా పొంగుతుంటుంది. జ్ఞానోదయమయిన యోగి వాటిని ప్రపంచానికి పంచటం తప్పా వేరే దారి లేదు. వారు నిరంతరం ఆ పరాశక్తితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారు. విశ్వశక్తి నిరంతరం వారి ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే వారిలో అంతులేని శక్తి ఉంటుంది. వారు ఎల్లప్పుడు వర్తమానంలోనే, పూర్తిగా ఆలోచనలు లేని స్థితిలో ఉంటారు. కాని వారికి భూత భవిష్యత్తుల మొత్తం అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా జ్ఞానోదయమయిన యోగుల గురించి స్వామి ఎన్నో విషయాలని ఆయా సందర్భాలలో తన భక్తులకి వివరిస్తూ ఉంటారు.

జ్ఞానోదయమయ్యి, ఆయన మౌనం వీడి ప్రపంచంలోనికి అడుగు పెట్టే సమయానికి ఆయన చుట్టూ అనేక సమస్యలు కనిపించాయి. వాటిలో ఆయనకి స్పష్టంగా కనిపించినవి,.

ఆనందం కోసం మానవులు ఎన్నో మార్గాలలో ఎక్కడెక్కడో వెతుకుతూ వేసారిపోతున్నారు. వారు జీవితాంతం ఆనందాన్వేషణలోనే గడుపుతూ చివరికి మానసికంగా కుంగిపోయి ఉన్నారు.

భగవంతుని కోసం వారు తప్పు దారులలో వెతికి విసిగిపోతున్నారు.

అందరూ కూడా వారి నిజమయిన ఆత్మని, వారి నిజమయిన ఉనికిని గుర్తించలేనంతగా దానిని తమ అహంకారంతో కప్పేసారు.

అత్యధికమయిన వ్యతిరేకపు ఆలోచనలతో ప్రపంచాన్ని అశాంతి నిలయంగా మార్చివేసారు.

అంతులేని భౌతిక, శరీర, మానసిక భావావేశాత్మక వ్యాధులతో సతమతమవుతున్నారు.

తములో నిక్షిప్తమయిన అద్భుతశక్తిని, శక్తి కేంద్రాలని తెలుసుకోలేక నీరసపడి ఈ ప్రపంచాన్ని నీరస స్థితికి తీసుకువెళ్ళి శక్తిహీనగ చేస్తున్నారు. నిజమైన ఆధ్యాత్మికత అంటే వారికి తెలియదు. దానితో యుద్ధాలు, పోరాటాలు అహింస బాగా పెరిగిపోయాయి. ఇలా ఎన్నో రుగ్మతలలో, సమస్యలతో, అంతులేని కోరికలతో దుఃఖాలతో మానవులు సతమతమయిపోతున్నారు. నిజమైన ప్రేమకోసం, శాంతికోసం అలమటించి పోతున్నారు. మానసికంగా కుంగదీసే పోటీలు, అత్యధికమైన కోరికలు, అతిస్వార్థం మానవులలో మానవత్వం లేకుండా చేసింది.

ఈ సమస్యలకి చక్కని, సులభమైన, సామాన్య మానవునికి సరిపడే అతి బలమైన పరిష్కార పద్ధతులతో పరమహంస నిత్యానంద తన విప్లవాత్మకమైన, అత్యంత చైతన్యవంతమైన ప్రేమపూర్వక పోరాటాన్ని ప్రారంభించారు.

పరమహంస లోకానికి అందించిన అపురూపమైన బహుమతులు :

పరమహంస నిత్యానంద లోకకళ్యాణానికి అవతరించిన భగవత్ స్వరూపం. కేవలం సమస్యల సుడిగుండాలలో చిక్కుకుపోయిన సామాన్య మానవులకి ఒడ్డుకి చేర్చాలి అనే తపనతో ఆయన చేతనిండా అద్భుతమైన, అపురూపమైన బహుమతులతో మన మధ్యకి వచ్చారు. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము.

నిత్యానందంలో ఉండండి (Be Blissfull) :

పరమహంస నిత్యానందస్వామి ప్రపంచంలోని మానవులందరికీ ఇచ్చే చాలా ముఖ్యమైన సందేశం “నిరంతరం పరమానందంలో ఉండండి.” గురుదేవులు అందరి ఆనందం కోసం, అందరినీ ఈ సమస్యలనే గందరగోళం నుంచి, బాధలు కోరికలు అనే అల్లకల్లోలం నుంచి బయటికి తేవటానికి రూపొందించిన కార్యక్రమాలన్నీ ఈ సందేశం మీదే ఆధారపడి ఉన్నాయి.

పరమానందం గురించి స్వామీజీ ఈవిధంగా చెబుతారు. ఆనందం అంటే దానిని ప్రత్యేకంగా పుట్టించలేము. దానిని నాశనం చేయలేము. దానిని పెంచలేము తగ్గించలేము. అది ఒక నిరంతర ప్రవాహం. అది అదే. పరమానందలో ఉండటం, ఆనందంగా జీవించటం మీ జన్మ హక్కు. ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. అది మీలోనే ఉన్నది. ఆ విషయాన్ని తెలుసుకోండి. నిరంతరం మీరు ఆనందంలో ఉండటమే నిజమైన ఆధ్యాత్మికత. మీలో నిక్షిప్తమై ఉన్న ఆనందం అంతిమమైన ఉత్తమస్థితి. దానిని ఎవరూ మీకు దానంగా గాని, బహుమతిగా ఇవ్వనవసరం లేదు. అది మీ లోనే ఉన్నది. మీరే ఆనందం.

ఆనందం, సంతోషం రెండు వేరు వేరు పదాలు. సంతోషం అనే మాటికి వ్యతిరేక అర్ధాలు ఉన్నాయి. సంతోషం ఉన్న దగ్గరే దుఃఖం ఉంటుంది. సంతోషం అనేది అతి చంచలమయినది. కాసేపు ఉంటుంది. మరికొద్ది సేపట్లో మాయమైపోతుంది. ఉదా: ఎవరయినా మిమ్ములను మెచ్చుకుంటే సంతోషంగా ఉంటుంది. మరుక్షణం ఎవరైనా విమర్శించేతే ఆ సంతోషం కాస్తా దుఃఖంగా మారిపోతుంది. నిత్యానంద స్వామి చెప్పే ఆనందం ఈ సంతోషం కాదు.

నిత్యానందం, పరమానందం లేదా బ్రహ్మానందం అంటే శాశ్వతమయి ఆనందస్థితి. ఆనందం అంటే బాధకి సంతోషానికి అతీతమైన ఒక నిశ్చలస్థితి. ఆ స్థితిలో బాధకాని సంతోషం కాని మిమ్మలని ఏవిధంగా కూడా ప్రభావితం చేయలేవు. ఇది శాశ్వతమైనస, కారణంలేని నిశ్చలస్థితి. దీనికి వ్యతిరేక అర్ధాలు లేవు. అది మీ లోపల నుంచి అలా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఆనందం యొక్క ముఖ్యమయిన లక్షణం - అది కారణం లేకుండా కలిగే ఆనందం. ఈ ఆనందానికి బయట ప్రపంచంతో కాని, అందులోని విషయాలతో కాని ఎటువంటి సంబంధం ఉండదు. స్వామీజీ ఏమని చెబుతారంటే మీ ఆధ్యాత్మికీ లేదా లౌకిక జీవన మార్గం, మీ లక్ష్యం రెండూ కూడా ఆనందమయమే. (Bliss is the path and goal) మీలోని నిత్యానంద స్థితిని తెలుసుకొనగలిగితే మీ మార్గం మీ లక్ష్యం కూడా ఆనందమే అవుతుంది.

ఎప్పుడైతే మీ అంతరంగం, మీ ఉనికి, మీ ఆత్మ ఎటువంటి కారణం లేని ఆనందంతో నిండి ఉంటుందో అప్పుడు మీ నుంచి ప్రవహించే ఆనందం అన్ని వైపులా ప్రవహించి మీ పరిసరాలని ఆనందమయం చేస్తుంది. ఈ కారణంగానే జ్ఞానోదయమయిన యోగులు ఎక్కడ ఉంటే ఆ పరిసరాలన్నీ ఆనందంతో నిండి ఉంటాయి. ఆ చుట్టు ప్రక్కలవారు కూడా ఆనందంలో మునిగిపోతారు. కానీ మన సంఘం మనని అలా కారణం లేకుండా ఆనందంలో ఉండనీయదు. ఆనందానికి కారణాలు వెతకమంటుంది. మనలో అపరాధభావాన్ని నింపుతుంది. అలా చేయగలిగినప్పుడే సమాజం మనని తన గుప్పిటలో తన నియంత్రణలో ఉంచుకోగలుగుతుంది.

మనలోపల ఉన్న నిజమయిన ఆనందస్థితిని తెలుసుకోవటంలో మనకి ఉండే పెద్ద అవరోధం సమాజం విధించే నిబంధనలు, అది మనకు నేర్పిన అబద్ధపు సంతోషాలు.

మనం మనలోని ఆనందాన్ని తెలుసుకోగల పద్ధతులను స్వామీజీ చాలా సులభరీతిలో చాలా సామాన్య పద్ధతిలో మనకోసం సృష్టించారు. అందులో చాలా కీలకమయినవి రెండు : మొదటిది చేసే ప్రతి పనీ పూర్తిగా తెలుసుకునే తత్వంతో చేయగలగటం. రెండవది ధ్యానం. ఈ రెంంటినీ మనకి అందించాలనే గొప్ప లక్ష్యంతో ఆయన అనేక కార్యక్రమాలు రూపొందించారు. ఆయనని ఆయన లక్ష్యాన్ని అర్థం చేసుకుంటే మనందరం నిత్యానందస్థితికి చేరి, నిత్యానందం అయిపోతాము.

స్వామీజీ చెబుతుంటారు “ మనకి కారణమేమీ లేకుండా ఆనందంగా ఉండగలము అని, ఆ శక్తి మనకి ఉన్నదని మనకి తెలియదు. మనందరం ఎంతో కుతూహలంగా, ప్రయత్నపూర్వకంగా వెదికే విషయం ఆనందం. మనం డబ్బుద్వారా, అధికారం ద్వారా, మాన సంబంధాల ద్వారా, మన నిత్యజీవిత విషయాల ద్వారా నిరంతరం ప్రయత్నించేది కేవలం ఆ ఆనందం కోసమే. మన జీవితానికి ఉన్న ప్రధమ ఆధారం, జీవితేచ్ఛ, జీవించాలనే కోరికని నింపే శక్తి ఆ ఆనందంలో ఉన్నది. మనం జన్మించింది మొదలు ఆ ఆనందం కోసం ప్రపంచమంతా వెతుకుతున్నాము. కానీ అదే మన లక్ష్యం అని మనకి తెలియదు. ఆ ఆనందం కోసం మనలో తప్ప ప్రపంచమంతా వెతుకుతున్నాము. కానీ ఆ ఆనందం మనలోనే ఉన్నది. దానిని పట్టుకోండి, నిత్యానందంలో ఉండండి” ఆ ఆనందాన్ని చేరే అత్యంత సులభమార్గాలే స్వామీజీ ఇచ్చే కార్యక్రమాలు.

ధ్యానం : అన్ని సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే మాస్టర్ కీ : జ్ఞానోదయమయిన తరువాత పరమహంస నిత్యానంద తన చేత ఒక గొప్ప ఆయుధాన్ని ధరించి మన మధ్యకి వచ్చారు. అది రామ బాణంలా తిరుగులేనిది, శివుని త్రిశూలంలా దేనినైనా ఛేదించగలది. విష్ణుమూర్తి సుదర్శన చక్రంలా దేనినైనా తరిమిగొట్టగలది. అది సులభ సాధ్యమైనది, అత్యంత ప్రభావం గలది, మహాశక్తి గల అత్యద్భుతమైనది. మరీ ముఖ్యంగా ఆధునికి మానవుని జీవన సరళకి చక్కగా సరిపోయేది. అదే ధ్యానం. నిత్యానందంలో ఉండండి అనేది ఆయన ముఖ్య సందేశమయితే, ధ్యానం ఆ స్థితిని చేర్చగలిగే ఒక రాజమార్గం అని ఆయన చెబుతారు. ధ్యానం అనే విషయంలో పరమహంస నిత్యానంద తెలుసుకున్నంత పరిశోధన చేసినంత బహుశః ఇంతవరకూ ఎవరూ చేసి ఉండరు. "ధ్యానం చేయండి" అన్నది ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చిన పిలుపు.

స్వామి మాటలలో ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే దేని మీద అయినా ఏకాగ్రత నిలపటం కాదు. మనస్సుని దేనిమీద స్థిరపరచటం కాదు.

స్వామీజీ నిర్వచనలో, ధ్యానం అంటే, మిమ్మలని విశ్వశక్తితో కలపగలిగే ఒక పద్ధతి. ధ్యానం మీలో నిక్షిప్తం చేయబడిన ఐశ్వర్యాలని, సంపదలని తెలుసుకోగలేట్టు చేసే ఒక పద్ధతి.

ధ్యానం అంటే ఆ క్షణంలో నిత్యానందస్థితిలో ఉండగలగటమే. మీరు ఎప్పుడయితే వర్తమానంలో ఉంటారో, మీరు ధ్యానంలో ఉన్నట్టే. మీరు ఇంతకంటే చేసేది ఏమీ లేదు.

స్వామీజీ ఇలా చెబుతారు. మీరు ధ్యానం నేర్చుకోనవసరం లేదు. మీరు జన్మతః ధ్యానులు. దానిని తెలుసుకుని ఆస్థితిని అనుభవించగలిగితే మీరు పరమానందాన్ని పొందగలరు.

ధ్యానం మీలో మీ జీవనసరళిలో మీ అంతరంగ జీవితంలో సమూలమయిన మార్పుని తెస్తుంది. అది మిమ్ములని భౌతికంగా, మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా మార్చగలుగుతుంది. ధ్యానం మీలోని శారీరక మానసిక వ్యాధులను పూర్తిగా బాగుచేస్తుంది.

ధ్యానం మీలోని ఏకాగ్రతని, గ్రహింపు జ్ఞానాన్ని, విషయాలని గుర్తుంచుకునే శక్తిని ఆశ్చర్యకరమైన విధంగా అభివృద్ధి చేస్తుంది. ధ్యానం చేస్తే మీ ఆలోచనలలో స్పష్టత వస్తుంది. మీరు చాలా సృజనాత్మకంగా ఉండి మీ పనులలో మంచి నాణ్యతని సాధించగలుగుతారు. ఏ పని అయినా సామర్థ్యంతో చేయగలుగుతారు.

అన్నింటికంటే ముఖ్యమయినది, ధ్యానం మిమ్ములని మీ అంతరంగపు ప్రపంచంలోనికి తీసుకువెళ్ళ గల గొప్ప అద్భుతమయిన పద్ధతి. ధ్యానం చేయటానికి ముందుగా మీరు మీ శరీరాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి. మీ శరీరం మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు ఒక వాహనం లాంటిది. మీ జీవన సరళిని, మీ జీవన గమనాన్ని పూర్తి నాణ్యతతో నింపాలి. అప్పుడే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమయిన శరీరాన్ని కలిగి ఉండటం ఉత్తమ ఆధ్యాత్మిక లక్షణం.

ధ్యానానికి కావలసిన మరొక ముఖ్యమయిన విషయం మీ ఆలోచనల క్రమాన్ని, వేగాన్ని తగ్గించేవిధంగా వాటి మీద పనిచేయాలి. ఆలోచనలని అరికట్టటం, లేదా వాటిని నియంత్రించటం అనేది పూర్తిగా సాధ్యపడని విషయం. కాబట్టి తెలుసుకునే తత్వంతో ఆలోచనలని గమనించటం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. ఆలోచనలు అంటే ఏమిటి? ఆలోచనలు అంటే మనం మన అంతరంగంలో మనతో నిరంతరం మాట్లాడుకునే మాటలు. అవి అర్థం లేనివి, ఒకదానికి ఒకటి సంబంధం లేనివి. వాటినే మనం మైండ్ లేదా మనస్సు అని కూడా అంటాము. ఇవన్నీ మన అచేతన స్థితిలో మనకి తెలియకుండా మనలో స్థిరపడిపోయినవి. అవి కేవలం మన భూతకాలం భవిష్యత్ కాలం గురించి పడే తాపత్రయం లేదా అపరాధ భావం మాత్రమే. ఎప్పుడయితే అనవసరమయిన భూత, భవిష్యత్ కాలాలని పూర్తిగా వదిలివేయగలుగుతామో, మనం నిజమయిన ఆస్తితిలో స్థిరపడటమే ధ్యానం. అదే జ్ఞానోదయం పొందే స్థితి.

స్వామీజీ మన వేదాంతం, తంత్రాలు నుంచి, సుఫీ తత్త్వం నుంచి, బౌద్ధులు, జైన్ల ధ్యాన పద్ధతుల నుంచి, ప్రాచీన క్రైస్తవం నుంచి ఎన్నో ధ్యాన పద్ధతులను తీసుకొని వాటిని తన అనుభవంతో మనకి, సరిపడే కొన్ని ధ్యాన పద్ధతులని రూపొందించారు. స్వామీజీ ఈ ధ్యాన పద్ధతులని నేర్పించటానికి కొన్ని కార్యక్రమాలని తయారుచేసారు. వాటిలో చాలా ముఖ్యమయిన కార్యక్రమం చక్రా ధ్యానం. ఆ కార్యక్రమంలో మనలో ఉండే ఏడు ప్రముఖ్యమయిన శక్తికేంద్రాలు (చక్రాలని) ఏ ఏ ధ్యాన పద్ధతి ద్వారా శుభ్రపరచి తిరిగి శక్తివంతం చేయగలం అనేది వుంటుంది.

స్వామీజీ తన అనుభవంతో చెప్పే మాట ఏమిటంటే, ఆధునిక మానవులకి ఉండే అన్ని రకాల భౌతిక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక సమస్యలకి గట్టిది, నమ్మకమయిన పరిష్కారం ధ్యానం ద్వారా దొరుకుతుంది. నియమానుసారం చేస్తే ఫలితం చాలా బాగుంటుంది. అంతే. ఈ ధ్యాన పద్ధతులు అన్ని వయస్సులవారు చేయవచ్చు. ఆ భరోసా స్వామి మనకి పూర్తిగా ఇస్తారు. నిబంధనలు లేని, కారణాలు లేని ప్రేమని పంచాలి :

ప్రేమ అనేది చాలా అందమయిన అద్భుతమయిన భావన. పరమహంస నిత్యానంద చెప్పే దివ్యప్రేమ, దైవ ప్రేమ చాలా గొప్పది కూడా.

ప్రేమ అంటే ఏమిటి? మనకు తెలిసిన మామూలు ప్రేమ కేవలం హార్మోన్లు పెట్టే చిత్రహింస మాత్రమే. కానీ స్వామీజీ మనకు చెప్పేది. నేర్పించేది దైవప్రేమ. అది అత్యున్నతమయిన ఆధ్యాత్మిక లక్షణం. ఆ ఉన్నతమయిన, స్వచ్ఛమైన ప్రేమ మనం జ్ఞానోదయమయిన యోగుల దగ్గర మాత్రమే చూడగలం.

మామూలుగా మననకి తెలిసిన ప్రేమ నిబంధనలు, షరతులు, కారణాలు అనేవాటి ఆధారంగా ఉండే ఒక వ్యవహారం. "నేను ఇంత ప్రేమ ఇస్తాను. దాని బదులుగా నీవు ఇలా అంత ప్రేమ చూపాలి. లేకపోతే ప్రేమించను" ఇదీ మనకు తెలిసిన ప్రేమ. మనం సాధారణంగా చూపించే ప్రేమ, అది భార్యాభర్తల మధ్య కాని, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమగాని, స్నేహితులు లేదా ప్రేమికులు ఎవరి మధ్య ప్రేమ అయినా ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది.

ఒకసారి ఒకామె స్వామీజీతో, తల్లికి పిల్లలపై ఉండే ప్రేమ దివ్య ప్రేమ కదా! మరి అది సాధారణ ప్రేమ ఎలా అవుతుంది ? అని అడిగితే స్వామి ఇలా సమాధానం ఇచ్చారు " అది కొంతవరకూ నిస్స్వార్ధ ప్రేమ కావచ్చు కాని ఆ ప్రేమ కూడా షరతులు నిబంధనలతో ఉంటుంది. అందులో అంతర్లీనంగా ఏదో కొంత ఆశించటమూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, మీ పిల్లలు అన్నింటికీ మిమ్మలని ఎదిరిస్తున్నారనుకోండి, అన్నీ వాళ్ళు సొంత నిర్ణయాలు చేసుకుంటున్నారనుకోండి, మీకు ఇష్టంలేని ప్రేమ వివాహం కులాంతర వివాహం చేసుకున్నారనుకోండి, అప్పుడు మీ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఏ సంబంధాలయినా చూడండి మీరు ఆశించినట్టు ఎదుటివారు ఉండని మరుక్షణంలో ఆ ప్రేమ మాయమైపోతుంది. అది స్వచ్ఛమయిన ప్రేమ కాదు. ఇది ఏ క్షణంలోనయినా ద్వేషంగా మారవచ్చు. ఈ ప్రేమ పూర్తిగా సమయానికి, సందర్భానికి సంబంధించినది. ఇది మనుషులని విడదీస్తుంది.

స్వామీజీ మనకి నేర్పించే ప్రేమ దివ్య ప్రేమ, స్వచ్ఛమయిన ప్రేమ. దానికి నిబంధనలు షరతులు ఉండవు. అది మనుషులని కలిపే ప్రేమ. దానికి విడదీయటం తెలియదు. ఆ ప్రేమకి హద్దులు ఉండవు. అది అయిపోయింది ఇంకా నా దగ్గర లేదు అనదు.

ఈ దివ్యప్రేమ అనేదానిని మనం తయారు చేయలేము. దానిని సంపాదించలేము. అది మనలో ఎంతో సహజంగా ఉద్భవించే ప్రవహించే ఒక ప్రక్రియ.

మరి అది ఎలా జరుగుతుంది? ఎప్పుడయితే మనం 'నేను' 'నాది' అనే వాటిని పూర్తిగా మన నుంచి తొలగించుతామో అప్పుడు మనలో గట్టిపడిపోయిన అహంకారం కరిగిపోతుంది. అంతవరకూ అహంకారపు పొరలక్రింద కప్పబడిపోయిన అసలయిన అంతరంగం, ఉనికి బయటికి వస్తాయి. ఆ క్షణంలో మన ఆలోచనల ప్రోగు అయిన మనస్సు అనేది కూడా క్రమంగా కరిగి మాయం అయిపోతుంది. అప్పుడు వర్తమానంలో ఉండగలుగుతాము. ఆ స్థితిలో అత్యున్నత చేతన స్థితికి చేరి విశ్వశక్తి పరాశక్తితో ఐక్యమయిపోతాము. పరాశక్తి లేదా భగవంతునితో మన అంతరంగం నింపబడుతుంది. విశ్వశక్తి లేదా భగవంతుడు అంటేనే ప్రేమశక్తి. అలా నింపబడిన ప్రేమ అంతులేని శక్తి. అది మనలో నిండిపోయి పొంగి ప్రవహిస్తూ మన చుట్టు పక్కలకి వ్యాపిస్తుంది. అప్పుడు ఇక మనం దానిని అందరికీ పంచటం తప్పా ఏమీ చేయలేము. మననుంచి పొంగి ప్రవహించే ఆ ప్రేమ ప్రవాహం మన ఎదుటివారిని ప్రేమతో ముంచెత్తుతుంది. ఆ ప్రేమ పంచే సమయంలో ఎదురుగా ఎవరు ఉన్నారు? వాళ్ళు ప్రేమకి అర్హులేనా? వాళ్ళకి ఎంత ప్రేమ మాత్రమే ఇవ్వాలి? అలా ప్రేమని వారికి ఇస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఏవీ ఆ వ్యక్తుల దగ్గరకి రావు. ఆ ప్రేమను ఎవరయినా పొందవచ్చు.

ఇక్కడ మరొక ముఖ్య విషయం. జ్ఞానోదయం పొందటం అంటేనే ప్రేమ, కరుణ, కృతజ్ఞతలు వారి అంతరంగం నుంచి పొంగి నిరంతరం ప్రవహిస్తూ వారి సమక్షంలో ఎవరైతే ఉంటారో వారికి ప్రేమ అందిస్తాయి. అందుకే జ్ఞానోదయమయిన యోగులు సమక్షంలో అందరూ చాలా ఆనందంగా, ప్రశాంతంగా, తృప్తిగా ఉండగలరు. అది ఆ ప్రేమలోని మహత్మ్యం. ఆ ఆకర్షణ నుంచి ఎవరూ తప్పుకోలేరు. ఎందుకంటే వారిలో ఉండేది దైవ ప్రేమ.

స్వామీజీ తన భక్తులకి సరదాగా ఒక విషయం చెబుతుంటారు. "ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తే వారు ప్రేమలో పడ్డారు అంటారు. అది నిజం. ఎందుకంటే ఇక వాళ్ళు లేవలేరు. అదే జ్ఞానోదయమయిన గురుదేవుల విషయంలో భక్తులు, శిష్యులు ప్రేమలో లేస్తారు. వాళ్ళు గురువుల ప్రేమతో ఉన్నతస్థాయికి చేరుతారు. నేనుఎప్పుడూ మిమ్మలని ప్రేమలో పడనీయను. ప్రేమలో మిమ్మలని అత్యున్నతస్థాయికి చేరుస్తాను అని మీకు హామీ ఇస్తాను" అని అంటుంటారు. కాబట్టి మనం గురుదేవుల ప్రేమలోపడితే, ఆ ప్రేమలో గొప్ప స్థానానికి ఎదుగుతాము, కాని పడ్డచోట ఉండము.

ఎప్పుడయితే ప్రేమలో ఆశించటం ఉంటుందో దాని ఫలితం కచ్చితంగా వృధ మాత్రమే. మీరు ప్రేమలో ముందుగా తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి.

ప్రేమించండి, కాని దానికి బదులు ఏమీ ఆశించకండి.

ప్రేమించటానికి ఎదుటివారికి అర్హతలు పెట్టకండి.

కారణం లేకుండా ప్రేమించండి.

ఎప్పుడయితే మీరు ప్రతి వ్యక్తిలో ప్రతి ప్రాణిలో భగవంతుని చూడగలుగుతారో అప్పుడు మీరు ప్రతి వ్యక్తిని ప్రతి ప్రాణినీ కారణం లేకుండా ప్రేమించగలుగుతారు.

నిబంధనలు లేని స్వచ్ఛమయిన దివ్యప్రేమని అందరికీ అలా పంచండి. అది మీకు ఎన్నో వరాలని ఇస్తుంది.

భగవంతుని ప్రేమించమని మీ పిల్లలకి నేర్పించండి. ప్రకృతిని ప్రతిప్రాణినీ ప్రేమించటం నేర్పించండి.

ఇటువంటి ప్రేమతో మీరు ప్రపంచాన్ని మార్చివేయగలరు. ఇటువంటి ప్రేమ మీలో ఉంటే మీకు తెలియకుండానే అందరూ మిమ్ములని ప్రేమించుతారు.

ఇటువంటి ప్రేమకి భయం ఉండదు. అది ప్రశ్నలడగదు.

మీరే ప్రేమగా అయిపోవాలి, జీవితమే ప్రేమమయమై పోవాలి. మీరు భగవంతుడు అని నిరూపించటానికి నేను ఇక్కడ ఉన్నాను :

పరమహంస నిత్యానంద విప్లవాత్మకమయిన ఆలోచనలతో, మహా చైతన్యవంతమయిన దృక్పథంతో ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి అడుగుపెట్టిన ఒక దృఢసంకల్పం కలిగిన ఆధునిక యువకుడు, ఆధ్యాత్మిక గురువు. ఆయన సందేశం, ఆయన చెప్పే విషయాలు, ఆయన చేసే వాదనలు అన్నీ సంచలనాలే. ఆధ్యాత్మిక ప్రపంచం ఉలికి పడేలా, సామాన్య ప్రజలు అదిరిపడేలా ఆయన ఒక విషయాన్ని చాలా మామూలుగా చెప్పారు. అది “నీవు దేవుడవి అని నిరూపించటానికి నేను ఇక్కడికి వచ్చాను”.

సామాన్యప్రజలు కేవలం భక్తులు, పాపులు, హీనులు, బలహీనులు, అనర్హులు అనే సంబోధనలకి ఇంతకాలం అలవాటు పడ్డారు. ఒక్కసారే “నీవు భగవంతుడివి” అన్నమాట వారిని సంభ్రమాశ్చర్యాలకి గురిచేసింది.

పరమహంస నిత్యానంద చాలా కార్యక్రమాల సందర్భంగా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తన స్పర్శతో చికిత్స చేసే సందర్భాలతో భక్తులు ఆయనతో, “స్వామీ! మీరు సాక్షాత్తు భగవంతుడే” అంటారు. అలాగే కొందరు మేధాస్వులు “ స్వామీ అందరూ అంటుంటారు మీరు దేవుడని నిజమా” అని ప్రశ్నించేతారు. వాళ్ళందరితో స్వామి అవును నిజమే. అలాగే “ నీవు కూడా భగవంతుడివి” అంటారు. వెంటనే ఆయన భక్తులు చెంపలు వేసుకొని “అయ్యో! అలా అనవద్దు స్వామీజీ! అయినా ఇదెలా సాధ్యం?” అంటారు. అప్పుడు ఆయన “నేను ఇక్కడ ఉన్నది నేను భగవంతుడిని అని నిరూపించటానికి కాదు, మీరు భగవంతుడని నిరూపించటానికి” అని చాలా ఖచ్చితంగా స్పష్టంగా చెబుతారు.

స్వామీజీ నిర్వచనంలో భగవంతుడు లేదా దేవుడు అంటే సర్వవ్యాప్తి అయిన సర్వేశ్వరుడు అని, మనం చెప్పే విశ్వశక్తి దానినే పరాశక్తి అంటాము. ఆ పరాశక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు సమస్తం ఆ విశ్వశక్తి ఆధారంగానే ఉన్నది. దానినే స్వామీజీ అత్యున్నత చేతనస్థితి, సర్వ చైతన్య స్థితి, సర్వసృష్టి, అత్యున్నత ఉనికి (Existence) భగవంతుడు అని అంటారు. రూపంలేని రూపం ఆశక్తిది. ఆ శక్తి లేని ప్రదేశం లేదు. ఆ శక్తికి తెలియని విషయం లేదు. సర్వశక్తి సంపన్నమయినది, సర్వజ్ఞానమయమయినది ఆ విశ్వ మేధస్సు, ఆ పరాశక్తి.

ఈ సృష్టిలో ఉండే ప్రతి ప్రాణిలోను, జీవంలేని వస్తువులో కూడా ఉండేది ఆ పరాశక్తే. ఎప్పుడయితే మనం మనలోని ఆ భగవంతుడిని చూడగలుగుతామో అప్పుడు మనం ఈ విశ్వమంతా మనం ఉన్న అనుభూతిని పొందుతాము అని స్వామీజీ ఎప్పుడూ తన భక్తులతో చెబుతుంటారు.

అసలు ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి ఏ విధంగా భగవంతుడు? ఎలా నిరూపిస్తారు? అది నిరూపించే విషయం కాదు. దానిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి.

ఈ ప్రశ్నకు స్వామీజీ తన అనుభవాన్ని ఈ విధంగా చెబుతారు. “జ్ఞానోదయమయిన తరువాత ఆకస్మాత్తుగా నేను ఒక గొప్ప మార్పుని గమనించాను. నేను నా చుట్టూ ఉన్న ప్రతి వస్తువులో కనపడసాగాను. అదే విధంగా అన్ని వస్తువులూ నాలో కనపడసాగాయి. నేను అక్కడ ఉన్న రాళ్ళలో, చెట్టులో ప్రతి చోట ఉండటం స్పష్టంగా కనిపించింది. అప్పుడు నాకు అర్ధమయిన విషయం ఏమిటంటే మన అందరిలో ఉన్నది భగవంతుని అంశ లేదా పరాశక్తి మాత్రమే. అందరిలో ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఇక నాకు నాముందు ఉన్న వస్తువుగాని, మనిషిగాని లేదా మరోప్రాణిగాని వేరు అవడు కదా?”

స్వామి ఈ విషయం గురించి ఇలా కూడా చెబుతారు, “ఎప్పుడయితే మనలోని ఆలోచనలు పూర్తిగా మనని వదిలి వెళ్ళిపోతాయో, ఎప్పుడయితే నేను, నాది అనే వాటిని మనం పూర్తిగా వదిలివేస్తామో అప్పుడు మనం పూర్తిగా వర్తమానంలో ఉండగలుగుతాము. ఆ స్థితిలో మనకి ఉండే హద్దులు అంటే ఇంతవరకూ ఇది నాశరీరం, ఇది ప్రపంచం అనే హద్దులు పూర్తిగా కరిగిపోతాయి. ప్రపంచం మనలో ఉంటుంది. మనం ప్రపంచంలోని అని ప్రాణులు వస్తువులలో ఉంటాము అని మనకు తెలుస్తుంది. బహుశా ఈ కారణం వలననేనేమో జ్ఞానోదయమయిన వ్యక్తులు ఏపని చేసినా ఎంతో సున్నితంగా, మృదువుగా ఉంటుంది. వారు గడ్డి మీద నడిస్తే, గడ్డి నలగదు. వారికి ప్రతి దానిలోనూ భగవంతుడే కనిపించుతాడు.

స్వామీజీని దగ్గర నుంచి గమనిస్తే ఆయన కుర్చీలో లేదా సింహాసనం మీద కూర్చున్నా, మైక్ పట్టుకున్నా లేదా ఒక కాగితాన్ని పట్టుకున్నా ఎంతో సున్నితంగా, మృధువుగా అపురూపంగా ఉంటుంది.

ఆయన మనకి అందించే ఒక గొప్ప సందేశం " మీ అందరిలోనూ దివ్యత్వం ఉన్నది. కానీ అది మీలో గట్టిపడిపోయిన అహంకారపు పొరల క్రింద, మీలోని వ్యతిరేకపు భావాల క్రింద కప్పబడిపోయి ఉన్నది. ధ్యానపద్ధతులు సాధన చేయటం ద్వారా మీరు మీలోని దైవత్వాన్ని తెలుసుకోవచ్చు. దానిని పూర్తిగా బయటకి తేవచ్చు. అందుకే నేను ఎప్పుడూ అంటాను నేను, మీరు అందరూ భగవంతుని రూపాలు అని.

"ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలయిన బైబిల్, ఖురాన్, భగవద్గీత లేదా మరే గ్రంథమైనా చెప్పే విషయం ఒక్కటే, ప్రతీది భగవంతుడే, ప్రతీదీ దివ్యాత్మ స్వరూపమే. అవును కదా? మరి అటువంటప్పుడు, భగవంతుడిని కేవలం నా ఒక్కనిలోనే ఎందుకు చూస్తారు. మీరు భగవంతుడిని అందరిలో చూడగలగాలి. అది జరిగినప్పుడే మీ అందరి విషయంలో నాలక్ష్యం, నా ఆశయం నెరవేరుతుంది. వ్యతిరేకపు భావావేశాలని అనుకూల శక్తులుగా మార్చుకోగలగటం :

మనలో భయంకరమయినవి, మోసపూరితమయినవి మూడు విషయాలు ఉన్నాయి. అని మనలోని వ్యతిరేక భావావేశాలు మన అహంకారం, మన ఆలోచనలు ఇవన్నీ ఒకదానికి ఒకటి పరస్పరం ఆధారమై సంబంధాలు కలిగి ఉంటాయి.

ముఖ్యంగా మనలోని వ్యతిరేక భావావేశాలయిన అసూయ, కోరిక, కామం, కోపం, భయం, శ్రద్ధ ఆశించటం, అసంతృప్తి, బాధలు, వ్యధలు మొదలయినవి గొప్పశక్తి కలిగిన విషయాలు. మన దురదృష్టం కొద్దీ ఎన్నో కారణాలవలని అవి మనలో వ్యతిరేకపు శక్తివలయాలని సృష్టిస్తుంటాయి. వీటి విషయంలో పరమహంస ఒక చక్కని విషయాన్ని బోధిస్తారు.

వ్యతిరేక భావావేశాలు మనని ఉన్నతస్థితికి చేరనీయకుండా అడ్డుపడుతుంటాయి. మనలోని అద్భుతశక్తి మనకి ఉపయోగం లేకుండా చేస్తాయి. అలా అని వీటిని మనం నియంత్రించలేము, ఆపలేము. పోనీ వీటిని బలవంతంగా అణచివేద్దాము అని చూస్తే, అవి మన అచేతన స్థితిలో పేరుకుపోయి అక్కడ శక్తివంతమయిన ఆటంబాంబుగా తయారవుతాయి. వాటిపై ఏ మాత్రం వత్తిడి తెచ్చినా అవి భయంకరమయిన విస్ఫోటంలా అవుతాయి. అంతేకాదు వాటిని అణచేకొద్దీ అవి మనలోపల మానసిక, శారీరక వ్యాధులుగా తయారవుతాయి.

అయితే వీటికి పరిష్కారం ఏమిటి? అసలు ఉన్నదా? పరమహంస కచ్చితంగా నమ్మకమయిన పరిష్కారాలు ఉన్నాయి అని హామీ ఇస్తారు. అవే స్వామీజీ నేర్పించే ధ్యాన పద్ధతులు. ఆ ధ్యాన పద్ధతుల ద్వారా వ్యతిరేకశక్తిని అనుకూల శక్తిగా మార్చగలిగితే, ప్రతి వ్యక్తి అత్యద్భుతమయిన ప్రగతిని సాధించగలరు, అని స్వామి చాలా గట్టిగా చెబుతారు. ఆయన చేసి చూపించారు. ఆయన ప్రత్యేకంగా కొన్ని ధ్యాన పద్ధతులని కేవలం వీటికోసం మాత్రమే రూపొందించారు. అవి సామాన్యులకి, ఆధునిక జీవనసరణికి అలవాటుపడిపోయిన అందరికీ అందుబాటులో ఉండేలా వాటిని రూపొందించారు.