KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/కేదార్నాథ్ :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

కేదార్నాథ్ :

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

హిందువులకి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో కేదార్నాథ్ ఒకటి. అక్కడ హిమాలయాలలో ఒక గుహలో స్వామి తపస్సు చేసుకునే వారు. ఆయన తనకు పరిచయమయిన ప్రతి ఒక్కరినీ అక్కడ ఉన్న జ్ఞానోదయమయిన యోగుల గురించి అడుగుతుండేవారు. ఆ సమయంలోనే ఆయన తనువు మనస్సు ఆత్మ ఆయన సమస్త ఉనికి జ్ఞానోదయం కోసం తపించిపోయేవి. ఎవరిని కలిస్తే తనకు మంచి మార్గదర్శకులుగా ఉండగలరో అనే ఆశతో ఆయన అటువంటి వారి కోసం వెతుకుతుండే వారు. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు స్వామి ధ్యానంలో ఉండగా ఒక అందమయిన యువకుడు ఎంతో ప్రకాశవంతమయిన తేజస్సుతో అలరారుతూ స్వామి ఉన్న గుహలోనికి వచ్చాడు. ఆ యువకుడి అందానికి ఆ తేజస్సుకి ఆశ్చర్యపడిన స్వామి నిశ్చేష్టులయి అలా చూస్తుండిపోయారు. అప్పుడు ఆయన స్వామి వైపు ఎంతోకాలంగా పరిచయమునట్లుగా చూస్తూ, చాలా దగ్గర వ్యక్తితో మాట్లాడినట్లుగా 'పరమహంస శ్రీ నిత్యానందా' అని చెప్పి ఆయనలోనే లీనమయినట్టుగా మాయమయి పోయారు.

అప్పుడు స్వామి ఆయనని మహావతార్ బాబాజీగా గుర్తించారు. స్వామి ఈ విధంగా అనుకున్నారు. “బాబాజీ నాకు ఒక మార్గాన్ని చూపించుతున్నారు. నన్ను పరమహంస నిత్యానంద అనే ఒక జ్ఞానోదయమయిన యోగిన కలమన్నారు” అని ఆయన అటువంటి పేరు గల యోగి కోసం ఎందరిని అడిగినా ఫలితం లేకపోయింది.

స్వామి కలకత్తాలో గంగానది ఒడ్డున ఉండగా ఒక వృద్ధుడయిన యోగి స్వామికి సన్యాస దీక్షని ఇస్తానని చెప్పి ఆయనకి దీక్షని ఇచ్చి ఆయన పేరుని పరమహంస నిత్యానందగా మార్చాడు. అప్పుడు స్వామికి అంతా అర్థమయింది. బాబాజీ తనకి ఆ పేరు పెట్టారని, ఈ వృద్ధుడయిన యోగి ద్వారా తనకి తిరిగి ఆ పేరుని గుర్తు చేసారు అని.

యమునోత్రి :

చార్ దామ్ పవిత్రయాత్రలో యమునోత్రి మరొక పుణ్యక్షేత్రం. యమునోత్రి యమునానది జన్మస్థానం. అద్భుతమయిన ప్రకృతి అందాలతో శోభిల్లుతూ హిమాలయాల అంతర్భాగంలో ఉంటుంది. స్వతః ప్రకృతి ప్రియుడయిన స్వామి నిత్యానంద యమునోత్రి అందాలకు ఆకర్షితుడయ్యి యమున ఒడ్డున ధ్యానం చేసారు. ఆయన యమునాదేవి ఆలయంలో మాత దర్శనం చేసుకొని ఆమెకి అభిషేక పూజలు జరిపారు. అక్కడ ఆయనకి యమునాదేవి దర్శనం ఇచ్చి ఆయనని ఆశీర్వదించింది. దర్శనంతో స్వామి మహదానంద భరితులయ్యి ఆమె ఆశీస్సులతో, సంకల్ప బలంతో మరింత ఉత్సాహంగా గంగోత్రి వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు.

గంగోత్రి :

భారతీయుల పరమ పావన నదీమ తల్లి గంగామాత. ఆదిశంకరాచార్యుల మాటలలో చెప్పాలంటే, గంగ నీటి బొట్టు తాగితే చాలు. సకల పాపాలు పటాపంచలవుతాయి అని. గంగా ప్రవాహం ఒట్టి నీటి ప్రవాహం కాదు, అది అమృతవాహిని. ఎందుకంటే ఆ నీటి కెరటాలు తమతో అద్భుతమయిన ఔషధాలని తీసుకువస్తాయి. కొన్ని వేలమంది మహా యోగులు, లక్షలమంది పండితులు, కోట్లకొలది భక్తులు నిత్యం తమ పూజలతో, ప్రార్థనలతో, ఆరాధనలతో గంగా జలాన్ని మంత్ర జలంగా వారుస్తారు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి నిరాటంకంగా జరుగుతూ ఉన్నది. అందుకే గంగానది మామూలు నది కాదు. ఆమె అమృతమూర్తి. అమ్మ. అందులో ప్రవహించేది మామూలు నీరు కాదు, సర్వప్రాణికోటికే అత్యవసరమయిన అమృతమే. అటువంటి ఆ పవిత్ర మాత జన్మస్థలమే గంగోత్రి. ఇందులో చాలా భాగం, చాలా కాలం మంచుతో నిండిపోయి ఉంటుంది.

స్వామి నిత్యానందకి అతి ప్రియమయిన పుణ్యక్షేత్రాలలో గంగోత్రి చాలా ముఖ్యమయినది. స్వామి చాలా కాలం ఇక్కడ తపస్సు చేశారు. తరువాత ఆయన అక్కడకి 15 కి॥మీ దూరంలో ఉన్న గోముఖ అనే ప్రదేశంలోను అక్కడ నుంచి మరొక 15 కి॥మీ దూరంలోని తపోవనం లోనూ తపస్సు చేశారు. ఈ రెండూ కూడా పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. ఇవి సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నాయి. అటువంటి. ప్రదేశంలో స్వామి కఠోర తపస్సు చేశారు. ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నత దశకు చేరిన యోగులు సత్యాన్వేషులు ఈ తపోవనాన్ని తమ తపస్సుకి ఎంచుకుంటారు. దీనిని చేరడానికి వెళ్ళే దారి కూడా చాలా ప్రమాదభరితంగా ఉంటుంది. ఏ క్షణాన మంచుశిలలు విరిగి పడతాయో ఎప్పుడు ఆప్రదేశాన్ని మంచుతో సమాధి చేస్తాయో ఎవరికీ తెలియదు. ఆ ప్రదేశమంతా లోతయిన అగాధాలతో, లోయలతో నిండి ఉంటుంది. అంత ప్రమాదమయిన ప్రదేశం కాబట్టి భక్తులు, యాత్రికుల తాకిడీ ఎక్కువగా ఉండదు. చాలా ప్రశాంతమయిన ప్రదేశం అది.

బదరీనాథ్ : హిమాలయాలలోని చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో బదరీ విశాల్ దేవాలయమే బదరీనాథ్. స్వామి కాలినడకన నడచివెళ్ళి బదరీ విశాల్ దర్శనం చేసుకొని కొంతకాలం అక్కడ ధ్యానం చేసారు. బదరీ గంగానది ఒడ్డున ఉన్న దేవాలయం. అక్కడ ప్రకృతి రమణీయత అద్భుతంగా ఉంటుంది.

బదరీనాథ్ లో దేవస్థానం వైపు భక్తులతో వెళుతున్న శ్రీ నిత్యానంద

బదరీనాథ్ లో దేవస్థానం వైపు భక్తులతో వెళుతున్న శ్రీనిత్యానంద

స్వామి ఆధ్యాత్మిక జీవితంలో యోగులు తాపసులు : పరమహంస నిత్యానంద తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎక్కువ కాలం హిమాలయాల లోపలి ప్రాంతాలలో కాలినడకన విస్తృతంగా పర్యటించారు.

మంచు కొండల్లో, ప్రతికూల పరిస్థితులలో ఏ విధంగా ఆయన కొన్ని వేల మైళ్ళు నడిచారో సామాన్య మానవులకి అర్థం కాదు. ఇదే ప్రశ్న ఒకసారి ఆయన శిష్యులు అడిగినప్పుడు ఆయన రెండు విషయాలు చెప్పారు.

స్వామి ఐదవ సంవత్సరం వయస్సు ఉన్నప్పుడే రఘుపతి యోగి అనే అద్భుతమయిన ఒక గొప్ప యోగీశ్వరుడు ఆయనకి యోగాలో చాలా అద్భుతమయిన శిక్షణని ఇచ్చారు. ఆ శిక్షణ స్వామి శరీరాన్ని ఇటువంటి కఠోరమయిన శ్రమకి ఓర్చుకునే విధంగా తయారు చేసింది. ఆ యోగీశ్వరుడే స్వామికి ఆకలి దాహం అనేవి లేని విధంగా ఎలా ఉండాలో ఆ శిక్షణని కూడా ఇచ్చారు.

ఇక రెండవ విషయం, స్వామి నడక ప్రారంభించగానే తన పూర్తి ఏకాగ్రతని విశుద్ధిచక్రంపై నిలిపేవారట. అలా చేసిన కొద్ది సమయం తరువాత ఆయన శరీరం గాలిలో తేలుతున్నంత హాయిగా నడిచేయగలిగేవారని ఆయన ఎంతో వివరంగా చెప్పారు. బహుశః ఆ అనుభవంతోనే స్వామి మనకి శక్తిసాగర ధ్యానాన్ని ఇచ్చి ఉంటారు. శక్తి సాగర ధ్యానం ఎ.ఎస్.పి.లో ఆచార్యులు మనతో నడుస్తూ చేయమని చెప్పే ధ్యాన పద్ధతి. ఇది మనలోని విశుద్ధి చక్రాన్ని శక్తివంతం చేస్తుంది.

వీటినన్నింటినీ మించి ఆయనలో అత్యధికస్థాయిలో ప్రజ్వలిస్తున్న “జ్ఞానోదయం పొందాలి” “అంతిమ సత్యాన్ని తెలుసుకోవాలి” అనే బలమైన కోరిక. ఆ దృడ సంకల్పమే ఆయనని అన్ని శ్రమలకి, ఎన్నో ప్రయాసలకి నిలబడేటట్లు చేసింది. నిజమైన సంకల్ప బలం గురించి, తన శక్తిమీద ఉన్న నమ్మకాన్ని గురించి తెలుసుకోవాలంటే స్వామి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చాలా క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోగలిగితే చాలు. అంత చిన్న వయస్సులో, చిలిపి అల్లరితో, ఆటపాటలతో ఆనందంగా గడిపే చిన్న ప్రాయంలో పెద్దవారిలో ఉండే దీక్ష, మహాయోగులలో మాత్రమే చూడగలిగే సంకల్పశక్తి మనం పదిహేడు సంవత్సరాల నిత్యానందలో చూడగలుగుతాము.

అలా విస్తృతంగా పర్యటించే రోజులలో ఆయన ఎందరో మహా తాపస్సులని, యోగులని, జ్ఞానులని కలిసారు. ఆయన వారితో కొంతకాలం గడిపి వారి నుంచి ఎంతో కొంత నేర్చుకునేవారు.

ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత శిఖరాలు చేరాలి అనే అతి బలీయమైన కోరిక, ఒక మహా జ్వాలగా ఆయన తనువు, మనస్సు ఆత్మలలో దేదీప్యమానంగా జ్వలిస్తుంటే ఆ ప్రకాశం ఆయన ముఖంలో ప్రస్ఫుటమవుతుంటే, ఏ యోగి మాత్రం ఆ యువకుడిని చేరదీయకుండా ఉండగలరు? ఆ పరాశక్తి ప్రేరణతో సాక్షాత్తు మహేశ్వరుని అంశతో భూదేవి నోములు పంటగా, మానవుల పుణ్యఫలంగా ఈ భూమి మీద అవతరించిన ఆయనని ఎవరు కాదనగలరు. ఆయన అనేక మంది సుఫీయోగులు, బౌద్ధ గురువులు, జెన్ యోగులు, ఎంతో కాలంగా తపస్సమాధిలో నిమగ్నమయిన మునీశ్వరులు, నాగాబాబాలు ఇలా ఎందరెందరినో ఆయన కలిసారు. అందరూ ఆయనకి చెప్పగలిగినవి చెప్పి నేర్పగలిగినవి నేర్పించి, దీవించి పంపించారు. మహిమాన్వితులయిన దేవతల దర్శనం :

పరమహంస నిత్యానంద జన్మించిన క్షణం నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిరంతరం దేవతలు, మహిమాన్వితుల రక్షణలో ఉండేవారు. ఆయన పసి బాలునిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ భైరవుల రక్షణవలయం ఉండేది. వారు ఎవరో ఆయనకి తెలియని సమయంలో వారిని ఆయన స్పష్టంగా చూడగలిగేవారు. వారంతా తన బంధువులే అనుకునేవారు. స్వామి నాలుగు సంవత్సరాల వయస్సులో ఆయన ఒక మహాయోగి రక్షణలోనికి వెళ్ళగానే భైరవులు మాయం అయిపోయారని అప్పుడు ఆ యోగి స్వామితో వాళ్ళు బంధువులు కాదు. భైరవులు అని స్వామికి చెప్పారని స్వామి తన శిష్యులతో ఒక సందర్భంలో వివరించారు.

అలాగే స్వామికి ఐదవ సంవత్సరంలో ఒక యోగి (రఘుపతి యోగి) ఆయనకి అరుణా చలేశ్వరుడు సన్నిధిలో దీక్షనిచ్చి మంత్రం చెప్పగానే జగన్మాత దర్శన మిచ్చింది. ఆదర్శనం ఎంతో స్పష్టంగా, లోతుగా ఆ చిన్నారి బాబు మనస్సులో హత్తుకు పోయింది. వెంటనే ఇంటికి వెళ్ళి జగన్మాత రూపాన్ని రాతి మీద చెక్కారు.

అదే ప్రాయంలో ఆయన ఒకసారి అరుణాచలేసుని సన్నిధిలో ఉండగా శ్రీచక్రం స్పష్టంగా కనిపించింది. అది ఏమిటో తెలియని అచిన్నారి బాలుడు దానిని రాగిరేకు మీద గీసాడు. శ్రీ చక్రం విశిష్టత బాగా తెలిసిన యోగిని ఒకామె దానిని చూసి ఆ బాలుడు సిద్ధపురుషుడు, కారణజన్ముడని తలచి అతని ఆధ్యాత్మిక పురోగతికి చాలా తోడ్పడినది.

స్వామి ఒకసారి గాసిఫిల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అనే గ్రంథాన్ని ఏకబిగిన పది గంటలపాటు నిర్విరామంగా చదివి పూర్తి చేసారు. అప్పుడు స్వామి రామకృష్ణ పరమహంస చిత్రపటానికి (ఫోటో) పూజలు చేసేవారు. ఆ రోజు రామకృష్ణ పరమహంస, శారదాదేవి ప్రత్యక్షమయ్యి, ఆయన తలపై చేయి ఉంచి స్వామిని దీవించారు.

స్వామి యమునోత్రిలో ఉండగా యమునాదేవి దర్శనమిచ్చినది. అదేవిధంగా పరమేశ్వరుడయిన శివుడు ఆయనకి అనేక సార్లు దర్శనాన్ని ఇచ్చారు. ఒకసారి స్వామికి ఆశ్రమంలో ఆయన దర్శనమయినప్పుడు మహేశ్వరుని అడుగులు ఉన్న స్థలంలో మరెవరూ నడవకుండా గట్టు కట్టించారు. దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు స్వామి నివాసముండే ఆశ్రమంలో నిరంతరం సంచరించే విషయం చాలా మంది భక్తులు కూడా గమనించారు.

బదరీనాథ్ నుంచి వ్యాస గుహకి వెళ్ళే దారిలో గణేశుని ఆలయం ఉన్నది. వ్యాసమహర్షి భారతం చెబుతుంటే గణేశుడు ఇక్కడే మహాభారతం వ్రాశాడట.నిత్యానంద స్వామి ఈ ప్రాంతంలో ఉన్న రోజులలో ఆయనకి గణేశుడు దర్శనమిచ్చి ఆశీర్వదించాడు.

తీవ్రమయిన జ్ఞానోదయ తపన :

హిమాలయాలలో, ఎన్నో పుణ్యక్షేత్రాలలో, గొప్ప గొప్ప సంస్థలలో మఠాలలో ఆశ్రమాలలో ఆయన నేర్వదగిన వేదాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రము తంత్రాలు సమస్తం నేర్చుకున్నారు. ఎన్నో గ్రంథాలు చదివారూ. స్వామి బహుసూక్ష్మగ్రహి, ఏక సందాగ్రాహి. ఎంత పెద్ద గ్రంథాన్నైనా ఇట్టే చదవగలరు. అందులో ఏ పేజీలోని విషయాన్నైనా ఎటువంటి తేడాలేకుండా చెప్పగలరు. ఆయన విషయాన్ని మెరుపు వేగంతో గ్రహించగలరు, అంతే అద్భుతంగా గుర్తుంచుకోగలరు. ఆయన ఆ మహాశక్తిని కలిగి ఉన్నందునే అతి తక్కువ కాలంలో శాస్త్ర విజ్ఞానము మానసిక శాస్త్రము, వైద్యశాస్త్రము, భౌతిక, రసాయన శాస్త్రాలు, ఇలా ఎన్నో పుస్తకాలని ఆయన చదివారూ. క్రిష్టియన్, ఇస్లాం, బౌద్ధ సుఫీ, జొరాష్ట్రియన్ మొదలయిన అన్ని మత గ్రంథాలని చదివారూ. ప్రపంచంలోని ప్రసిద్ధి పొందిన తత్వవేత్తలు వ్రాసిన గ్రంథాలు అన్నీ ఆయన పూర్తిగా చదివి అందులోని విషయాలని గ్రహించారు.

ఇలా అన్ని ఆశ్రమాలు తిరిగారు కానీ ఆయన తానుకోరుకుంటున్న జ్ఞానోదయాన్ని పొందలేకపోయాను అనే తపన ఆయనని దహించివేసేది. స్వామి కొంతకాలం ఓంకారేశ్వర్‌లోని నర్మదానది ఒడ్డున ఒక చిట్టడవి ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు. కొంతకాలం గడిచాక ఆయన చాలా మానసిక వ్యధకిలోనయ్యారు. తాను నిరంతరం పూజించే రామకృష్ణుల పటాన్ని వదిలివేసి, నర్మదలో తాను కలిసిపోవాలి అని నిర్ణయించి అంతులేని వేదనతో నర్మదానదిలోనికి దిగి నడవసాగారు.

గంగా యమునాదేవీల ప్రియపుత్రుడు, కావేరీ మాత అనంగు తనయుడు భారతదేశంలో ప్రతీనిదీమాతల్లి దీవెనలు పొందిన భాగ్యవంతుడు, ఆయనని నర్మదాదేవి మాత్రం బాధపెడుతుందా. ఆయనని తన ఒడిలో కొంత సేద తీరనిచ్చి, జాగ్రత్తగా అవలి ఒడ్డుకు చేర్చింది.

ఒడ్డుకు చేరిన నిత్యానందలో అకస్మాత్గా ఒక మార్పు వచ్చింది. జ్ఞానోదయం అన్ని ఆలోచనని ఆయన పూర్తిగా తన నుంచి తీసివేసారు. అక్కడే ఒక పెద్ద రాతిమీద ఏటవాలుగా పడుకొని అనంతమయిన, అద్భుతమయిన అందాల ప్రకృతిని చూసి ఆనందించూతూ ఆ ఆనందంలో పూర్తిగా మునిగిపోయారు. ఆ విధంగా స్వామికి తెలియకుండా ఏడురోజులు గడచిపోయాయి.