నిత్యానంద స్వామి అంతర్జాతీయ కార్యక్రమాలు :
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
స్వామీజీ మొట్టమొదటసారి అమెరికాకి 2003లో వెళ్ళారు. ఆ తరువాత ఆయన అమెరికా, కెనడాలలో విస్తృతంగా పర్యటించారు. 2005లో అమెరికాలో లాస్యాంజిల్స్లో ఆశ్రమాన్ని స్థాపించారు. ప్రస్తుతం ఈ ఆశ్రమం పశ్చిమదేశాలలో స్వామి జరిపే కార్యక్రమాలకి, నిత్యానందా ధ్యానపీఠం కార్యక్రమాలకి అనుబంధ సంస్థ లైఫ్బ్లిస్ ఫౌండేషన్ వారి కార్యక్రమాలకి కేంద్ర స్థానంగా ఉన్నది. అక్కడ ఉన్న ఆశ్రమవాసులు భారతదేశం బయట జరిగే అన్ని కార్యక్రమాలని అక్కడ ఆశ్రమం నుంచి నిర్వహిస్తుంటారు.
పరమహంస నిత్యానంద 2003వ సంవత్సరం మొదటిసారి భారతదేశపు సరిహద్దులు దాటి బయట ప్రపంచంలోనికి వెళ్ళారు. ఆ తరువాత ఈ మూడు సంవత్సరాలలో స్వామి ప్రపంచమంతా విస్తృతంగా పర్యటించారు. అమెరికాలోని లాస్యాంజిల్స్లో ఆశ్రమాన్ని నెలకొల్పారు. పశ్చిమదేశాలలో నిత్యానంద ధ్యానపీఠం కార్యక్రమాలకి ఆ ఆశ్రమం ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. అక్కడ ఆశ్రమం చాలా చక్కగా ఉంటుంది.

లాస్యాంజిల్స్లోని శ్రీ నిత్యానంద ఆశ్రమం విదేశాలలో పర్యటించటానికి పరమహంస శ్రీ నిత్యానందకి కొన్ని నిశ్చయమయిన ఉద్దేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని
జ్ఞానోదయమయిన యోగీశ్వరులకి తర తమ భేదాలు ఉండవు. ఇది నా ఊరు, నాదేశం, అనే హద్దులు పూర్తిగా కరిగిపోతాయి. ప్రపంచమంతా ఆయన కుటుంబమే. ఆయనలోని అపారమయిన కరుణ, హద్దులు లేని ప్రేమ సర్వమానవుల అభ్యున్నతికి వారి సుఖసంతోషాలకి ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. పాశ్చాత్య దేశాలలోని ప్రజలు సరియైన మార్గదర్శకులు లేక ఆధ్యాత్మిక మార్గానికి వారు దూరమై అశాంతితో ఉన్నారు. అది మానవులని సుఖాలకి, ఆనందానికి దూరం చేస్తుంది. వారికి అనుగుణమయిన చక్కని ఆధ్యాత్మికతకి మార్గాన్ని ఏర్పరచాలి అన్నది ఒక ఉద్దేశం.
ప్రపంచంలో ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాలా వక్రీకరించి ప్రచారం చేసారు. మన యోగశాస్త్రం,
వేదాలు, తంత్రాలు ఆధ్యాత్మిక శాస్త్రాన్నే చాలా తప్పు పద్ధతిలో అక్కడ చూపించారు. మిడిమిడి జ్ఞానంతో లేదా మరొక విధమయిన చెడు తలంపులతో ఏవో కొన్ని కారణాల వలన మహోన్నతమయిన, అతి ప్రాచీనమయిన మన వేద సంస్కృతిని కించపరిచే ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటిని అరికట్టి ఈ అద్భుతమయిన ఆధ్యాత్మిక జరిగిన తప్పిదాన్ని సరిచేయాలి అనేది స్వామీజీ యొక్క మరొక ముఖ్య ఉద్దేశం.
పాశ్చాత్యుల హేతువాద సహితమయిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, తూర్పు దేశాల ప్రాచీన ఆధ్యాత్మికతని మేళవించి ఒక అద్భుత తత్వాన్ని ఆవిష్కరించాలి అన్నది ఆయన ఉద్దేశం. తూర్పుదేశాలలో మానవ అంతరంగ ప్రపంచానికి సంబంధించి కొన్ని వేల సంవత్సరాలుగా అద్భుతమయిన పరిశోధనలు జరిగాయి. ఈ అపురూప సంపదని పాశ్చాత్యులకి పరిచయం చేసి, వారి సాంకేతిక జ్ఞానాన్ని మనకి అందించాలి అనేది ఆయన తపన. ఈరెండు సంస్కృతుల మధ్య వారధి కాగలిగితే ప్రపంచంలో శాంతి స్థాపన సులభం అవుతుంది.
పరమహంస నిత్యానంద ఉద్దేశాలు ఈనాటి అల్లకల్లోలపు ప్రపంచానికి అత్యవసరం. ప్రపంచంలో మానవుల పరిస్థితి ప్రమాదపు అంచులలో ఉన్నది. వ్యతిరేకపు ఆలోచనలు అధికమయి, ప్రపంచమంతా వ్యతిరేకపు శక్తివలయాలతో నిండిపోయింది. వీటిని కరిగించగల మహత్తరమయిన శక్తి ధ్యానానికి ఉన్నది. దీనిని ప్రపంచమంతా వ్యాపింపచేసి, ధ్యానం సహాయంతో ప్రతి వ్యక్తిలోనూ మార్పుతే గలిగితే ప్రపంచపు స్వరూపంలో మార్పు సులభంగా తేవచ్చు అనేది పరమహంస యొక్క ఆకాంక్ష. ప్రస్తుతం నిత్యానందస్వామికి పాశ్చాత్య శిష్యులు చాలా మంది ఉన్నారు. వారంతా నిస్వార్థంతో, ప్రేమతో ఆయన లక్ష్యాలు సాధించే దిశగా శ్రమిస్తున్నారు.
ఇతర దేశాలలో స్వామి అనేక కార్యక్రమాలని నిర్వహించారు వాటిలో కొన్ని:
శిక్షణాల కార్యక్రమాలు : నిత్యానందా స్ఫురణ, ధ్యాన స్ఫురణ, శక్తి స్ఫురణ, ఆచార్యా శిక్షణా, హీలర్స్ శిక్షణా, కార్యక్రమాలు ముఖ్యమయినవి. ఈ కార్యక్రమాలు అమెరికా, కెనడా, పోలెండ్స్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రవచనాలు : పాశ్చాత్యులని బాగా ఆకట్టుకున్న నిత్యనందా కార్యక్రమాలలో ప్రముఖమైనది ఆయన ప్రవచనాలు. స్వామి చాలా చోట్ల ఎన్నో అంశాల మీద ప్రసంగించారు. వీటిలో చాలా ముఖ్యమైనవి 18 రోజులు భగవద్గీతపై ఆయన ఇచ్చిన వ్యాఖ్య. అదే విధంగా పతంజలి యోగ, శివసూత్రాలు మొదలయిన ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక విషయాల మీద ఆయన విస్తృతంగా ప్రవచనాలు ఇచ్చారు.

లాస్యాంజిల్స్లో 18 రోజులు భగవద్గీతపై వ్యాఖ్యానిస్తూన్న శ్రీనిత్యనంద
ప్రముఖ సంస్థలలో ఆయన ఇచ్చిన ప్రసంగాలు : నిత్యనంద స్వామి చాలా పెద్ద పెద్ద సంస్థలతో తన ప్రవచనాలని ఇచ్చారు. వీటిలో ముఖ్యమైనవి మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ కార్పొరేషన్, టెలికమ్యూనికేషన్స్ మొదలయిన సంస్థలలో మేనేజ్మెంట్, ఆధ్యాత్మికత అనే విషయంల మీద ఆయన ప్రసంగించారు.

మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉపన్యసిస్తున్న శ్రీ నిత్యనంద
ఆయన చాలా యూనివర్సిటీలు, కాలేజీలలో విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు. అదే విధంగా చాలా కాన్ఫరెన్సులలో ప్రసంగించారు. అంతర్జాతీయ అసోసియేషన్స్ అయిన ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (ATA), ‘అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్’ (A.A.P.I.) మొదలయిన వాటిలో ప్రసంగించారు.
అమెరికాలో ఉన్న హిందూ ఆర్గనైజేషన్స్‌ని దగ్గరగా రప్పించి కుంభమేళా జరిపించారు. కుంభమేళ యొక్క విశిష్టతని పాశ్చాత్యులకి తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పాశ్చాత్య గడ్డ మీద ఆయన కుంభమేళా జరిపించారు.
ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆయన రేడియోలలో, టి.వి.లలో ఇంటర్వ్యూలు ఇచ్చారు, ప్రసంగాలు చేసారు.

అమెరికాలో టి.వి. ఇంటర్వ్యూ ఇస్తున్న శ్రీ నిత్యానంద
ఆ తరువాత స్వామి యూరప్‌లో, సింగపూర్, బ్రెజిల్, ఫ్రాన్స్, వెస్ట్ ఇండీస్ ఇలా చాలా దేశాలలో పర్యటించారు. ఇక్కడ మరొక విచిత్రమైన విషయం, సామాన్య మానవుల మేధస్సుకి అందని అద్భుతం ఉన్నది.
నిత్యానంద స్వామి జన్మించినది, పెరిగినది తమిళనాడులో ఒక చిన్న పట్టణం, తిరువణ్ణామలై. ఆయన తన సత్యాన్వేషణలో తపస్సు కోసం హిమాలయాలకి వెళ్ళే ముందు జీవితంలో ఎప్పుడూ ఆయన ఆ పట్టణం దాటి బయటికి రాలేదు. అప్పటివరకూ ఆయన చదివిన చదువు కూడా తమిళ మీడియంలోనే. ఆ తరువాత జీవితం అంతా హిమాలయాలలో ధ్యానంలో గడిపారు. జ్ఞానోదయమయిన షుమారు ఒక సంవత్సరం వరకూ మౌనంలో ఉన్నారు. ఆ తరువాత సంవత్సరంన్నర కావేరీనది ఒడ్డున ఉన్నారు. అప్పుడు ఆయన భక్తులు శిష్యులు తమిళగ్రామీణులు మరి ఆయన అంత మంచి ఇంగ్లీషు ఎప్పుడు నేర్చుకున్నారు? మన మేధస్సుకు అందని జవాబు ఉన్న ప్రశ్న అది.
ప్రస్తుతం స్వామీజీ శిష్యులలో ఎక్కువమంది పాశ్చాత్యులు లేదా తమిళేతరులు. అందుకే ఆయన కార్యక్రమాలు ఎక్కువగా ఇంగ్లీషులో ఉంటాయి. ఆయన ఇంగ్లీషు చాలా ఉన్నత ప్రమాణాలతో ఉంటుంది. అది ఎంత ఉన్నతమైన భాషా చాతుర్యమంటే, ఆయన ఏ విష యంగురించైనా అనర్గళంగా, అసవుగా మాట్లాడేస్తారు. ఆయన దగ్గర ముందే వ్రాసిపెట్టుకున్న కాగితాలు ఉండవు. ఆయన చాలా సార్లు చెబుతుంటారు తాను అక్కడకి వచ్చి కూర్చునేవరకూ కూడా ఇది మాట్లాడాలి అని ప్లాన్ చేసుకోను అని. అక్కడ కూర్చొని, మైక్ తనవైపు తిప్పుకొని మాట్లాడటం మొదలుపెడతారు. ఆయన ప్రవచనాలన్నీ అదే విధంగా ఉంటాయి. అంత అనర్గళంగా అంతమంచి ఇంగ్లీషు మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నారు అని చాలా మంది భక్తులు అడుగుతుంటారు. ఆ ప్రశ్నకి ఆయన మన స్థాయిలో మన మేధస్సుకి సరిపడే జవాబు ఇస్తారు. కానీ ఇది కేవలం మన తృప్తి కోసమే. ఆయన కారణ జన్ముడు, సిద్ధపురుషుడు, మహాజ్ఞాని అయిన యోగేశ్వరుడు. ఆయన సర్వాంతర్యామితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగిన భగవత్స్వరూపుడు. అంతే. ఆయన ఆయనే. వేరే జవాబు ఆ ప్రశ్నకి సరిపడదు.మనని ఒప్పించలేదు.
ఆయన ఇంగ్లీషు ప్రవచనాలు ట్రాన్స్‌లేట్ (తర్జమా) చేయాలంటే తప్పనిసరిగా ఒకటి లేదా రెండు స్టాండార్డ్ డిక్షనరీలు తప్పనిసరిగా అది బాగా చదువుకున్న ప్రొఫెసర్లకయినా ఉండి తీరాలి. ఇక ఆయన మాతృభాష తమిళంలో అయితే, వినేవారికి అది తేనె ప్రవాహం : వినే కొద్ది ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. ఇంత అందంగా, ఇంత అద్భుతంగా గంటలకొద్దీ ఆయన మాట్లాడుతున్నా వినేవారు రెప్పవాల్చకుండా,తమని తాము మరిచిపోయి వింటారు. ఆ ఆకర్షణ అంత అద్భుతంగా ఉంటుంది. చాలామంది ముఖ్యంగా బాగా పెద్ద చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉండేవారు స్వామీజీని ఆ రహస్యం ఏమిటి అని అడుగుతుంటారు. దానికి ఆయన చాలా అందంగా నవ్వేసి "ఇందులో రహస్యం ఏమీలేదు. నేను ఏమి మాట్లాడాలో ముందుగా ప్లాన్ చేయను. అప్రయత్నంగా ఆ క్షణంలో మాట్లాడతాను. నేను చెప్పే ప్రతి మాట నా అనుభవంతో చెబుతాను. అవి కేవలం సత్యాలే. అందుకే మీరు విసుగులేకుండా వినగలుగుతారు," అంటారు.
గ్రంథాలయం :
బెంగుళూరు ఆశ్రమంలో ఒక చక్కని గ్రంథాలయం ఉన్నది. స్వామీజీ స్వతః పుస్తక ప్రియులు. ఆయన ఎన్నో ప్రసిద్ధి గ్రంథాలు చదివారు. చాలామంచి పుస్తకాలని సేకరించి తన శిష్యులకోసం, బ్రహ్మచారులకి, విద్యార్థులకి ఉపయోగించటానికి ఉంచుతారు. అందరినీ కూడా చదవమని ప్రోత్సహిస్తారు.
నిత్యానంద ధ్యానపీఠ విస్తరణ :
ప్రస్తుతం ధ్యానపీఠం కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలలో 1000కి పైగా ఉన్న సెంటర్ల ద్వారా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంచి కార్యక్రమాలని వారు చేస్తున్నారు. కొన్నివేలమంది ఆనందసేవకులు, ఆనందా హీలర్స్ ఈ పనులలోనిమగ్నమై ఉన్నారు. నిత్యానందస్వామి చేసే అన్ని కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకువచ్చి దాని ద్వారా ప్రపంచంలో మార్పు తేవాలి. ఆ ప్రపంచంలో అసూయ కోపం, అత్యాశ, అధికమయిన కోరికలు ఇలాంటి వ్యతిరేక భావాలు ఉండవు. దీనిని చాలా సులభమయిన ధ్యాన పద్ధతుల ద్వారా సాధించవచ్చు అనేది ఆయన మనకి ఇచ్చినహామీ. అదే విధంగా ప్రతీ వ్యక్తి తాను దైవాంశసంభూతుడనని పరమానందం అనేది తనలోనే ఉన్నది అని తెలుసుకోవాలి అనేది ఆయన తపన.
ధ్యానం మనలో తరంగాలుగా వ్యాపించే వ్యతిరేకపు ఆలోచనలని, భావాలని చాలా సమర్థవంతంగా అరికడుతుంది. అని స్వామి గట్టిగా చెబుతారు. వ్యతిరేకపు ఆలోచనలు తరంగాలు సమాజంలో అవే వ్యతిరేకపు భావాలని మరింతగా వ్యాపింపచేస్తాయి. ఒకసారి అమెరికా రాజధాని వాషింగ్టన్లో నిరంతరం వారం రోజులు ధ్యానం చేసారట. దీనిలో చాలా ధ్యానం నేర్పే సంస్థలు కలిసాయి. ఆ వారం అక్కడ నేరాల రేటు 25 శాతం పడిపోయినట్టు రికార్డులు ఉన్నాయి. స్వామీజీ చెప్పేది ఆయన తీసుకురావాలి అని అనుకున్న మార్పు ఇదే.
ఒక చిన్న విషయం కానీ చాలా శక్తివంతమైన విషయాన్ని పరమహంస తన భక్తులకి, శిష్యులకి చెబుతుంటారు. జ్ఞానోదయమైన ఒక యోగి చెప్పే విషయం చాలా చిన్నది అయినా అది గొప్ప సత్యం అవుతుంది అది అత్యద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. ఆయన చెప్పే చాలా చిన్న పద్ధతిగాని, ఒక సూత్రంకాని గొప్ప ఫలితాలని ఇస్తుంది. గౌతమబుద్ధుడు చాలా చిన్నది సామాన్యమైన ఒక మాట “మీ శ్వాసని గమనించండి” అని చెప్పి కొన్ని వేలమందిని జ్ఞానోదయం పొందేలా చేసాడు. కొన్ని లక్షల మందిలో అద్భుతమైన మార్పు తెచ్చాడు. ఆ మార్పు మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేసింది.
కానీ ఒక అద్భుతమైన సత్యం సామాన్య మానవుని ద్వారా వస్తే అది వినాశనానికే దారితీస్తుంది. ఆటంని విచ్ఛిన్నంచేస్తే చాలా శక్తి పుడుతుంది అనేది చాలాగొప్ప సత్యం. అది గొప్ప సూత్రం. కాని అది సామాన్య మానవుడు చెప్పిన సత్యం. అది వినాశకారి అయినది.
కాబట్టి, ఎన్నో ప్రమాదాలతో,సమస్యలతో తెలియని భయంకరమైన శారీరక, మానసిక వ్యాధులతో అల్లకల్లోలంగా ఉన్న ఈ ప్రపంచానికి ప్రస్తుతం కావలసిన ఔషదంతో, ఆయుధంతో భగవంతుడు ప్రపంచంలోనికి తన అంశను పంపించాడు. అందుకే ఆ పరమపావనమూర్తి ఏమి చెప్పినా అది మంగళశాసనం అవుతుంది. ఏమి చేసినా అది కళ్యాణకారి అవుతుంది.లోక కళ్యాణానికి, మానవ శ్రేయస్సుకి నిరంతరం పని చేస్తున్న నిత్యానందస్వామి సహస్రాబ్దిలో ఒక విప్లవాత్మకమైన యోగీశ్వరుడు.
ఒకసారి ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి స్వామి ఒక చక్కని వివరణని ఇచ్చారు. జ్ఞానోదయమైన యోగీశ్వరులకు చేయవలసిన కర్మలు ఏమీ ఉండవు. వారు సాధించవలసినది అంతకంటే ఉండదు. వారు కేవలం తములోని అపార కరుణతో, ప్రేమతో మానవులంతా తనవారే అన్నంత ఆప్యాయతతో వారికి మంచిచేయాలి అనే తపనతో ఈ లోకంలో జన్మించుతారు.వారు పొందిన పరమానందస్థితి, దాని నుంచి వారు పొందే అత్యద్భుతమయిన ఆనందం,ఈ ప్రపంచం కానీ, శరీర స్వార్ధావయవాలు కానీ, ఏ మానవులు కాని వారికి ఇవ్వలేవు. వారు పొందే ఆ అద్భుతమయిన ఆనందానికి సాటి రాగలది ఏవీ లేదు. అంత గొప్ప స్థితి నుంచి మానవుల మీద ఉండే అపార కరుణ ప్రేమతో వాళ్ళు మళ్ళీ ప్రపంచంలోనికి వస్తారు. ఆయన మరొక విషయం కూడా చెబుతారు. ఎప్పుదయినా ఎవరయినా గొప్ప సంతోషాన్ని పొందితే దానిని అందరికీ పంచాలి అని చూస్తారు. పరమహంస చేసేది కూడా అదే.
స్వామీ ఎంతో దయతో,మానవులపై ఉండే అపార ప్రేమతో అంటుంటారు. “జ్ఞానోదయం పొందటానికి,అంతిమ సత్యాన్ని చేరటానికి ఎన్నో కష్టాలు పడి పదివేల తాళం చెవులని ప్రయత్నించి, సరియైన తాళం చెవిని పట్టుకున్నాను. ప్రస్తుతం అది నా చేతిలో ఉన్నది. ఎవరు దానిని నిజంగా పొందాలి అని అనుకుంటారో ఎవరు నిజాయితీగా ఆ అంతిమ సత్యాన్ని చేరాలనుకుంటారో వారికి తాళం చెవి ఇస్తాను. మీరు చేయవలసింది సరియైన ఈ తాళం చెవితో తాళం తీయటం మాత్రమే
ఆ ప్రేమమూర్తి, ఆ కరుణా సాగరుడు కాక ఎవరు అంత దయ చూపించుతారు. అవకాశాలను భగవంతుడు తన బిడ్డలకి కోకొల్లలుగా ఇస్తుంటాడు. కానీ వాటిని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందేది ఎంతమంది?
నిత్యానంద ధ్యానపీఠం, లైఫ్ బ్లిస్ ఫౌండేషన్ అందించే కార్యక్రమాలు :
నిత్యానందా ధ్యానపీఠం, లైఫ్బ్లిస్ ఫౌండేషన్ ద్వారా పరమహంస శ్రీ నిత్యానంద ఎన్నో మంచి మంచి కార్యక్రమాలని అందిస్తున్నారు. వాటిలో కొన్ని ఇక్కడ ఇస్తున్నాము.
నిత్యా ఆధ్యాత్మిక చికిత్స, ధ్యానం : (ఆనంద హీలింగ్)
బెంగుళూరు ఆశ్రమానికి లేదా స్వామీజీ ఎక్కడ ఉంటే అక్కడికి కొన్ని వేలమంది తమలోని మానసిక,శారీరక అనారోగ్యాలకు చికిత్స చేయించుకోవటానికి వస్తుంటారు. అలా వచ్చేవారిలో తలనొప్పి, మైగ్రేన్ వంటి చిన్న చిన్న సమస్యలు దగ్గర నుంచి కేన్సర్ వంటి పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నవారు వస్తుంటారు. అలా వచ్చినవారిని స్వామి, తన చేతితో చికిత్స చేసి పంపుతుంటారు. ఇంతవరకూ ఎవరూ అసంతృప్తితో తిరిగి వెళ్ళలేదు. భయంకరమయిన అనారోగ్యం నుంచి స్వామి చేతితో కోలుకొని, పూర్తి ఆరోగ్యవంతులయినవారంతా ఆయన పాదాల మీద వాలి “స్వామీ మీరు భగవంతుడు” అని అంటే ఆయన చాలా అందంగా నవ్వుతూ ఇది మాయ కాదు, అద్భుతం కాదు. మీకు కూడా నేర్పిం చుతాను. ఆ శక్తి మీలోనూ ఉన్నది. మీరు కూడా భగవంతుడే. కాకపోతే ఆశక్తిని మీ లోపల ఉన్న శక్తిని మీరు తెలుసుకోవాలనే కుతూహలం, బలమయిన కోరిక మీలో ఉండాలి అంతే అంటారు.
పరమహంస అందరితో అదే విషయం పదే పదే చెబుతారు. మీ శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుకోగల శక్తి, మీ శరీరానికి వచ్చే ఎటువంటి వ్యాధికి అయినా చికిత్స చేసుకోగల శక్తి మీలోనే ఉన్నది. అది తెలుసుకుని దానిని బయటకి తేవటం సాధ్యమే. దానిని ధ్యానం ద్వారా సాధించవచ్చు.” అని తన శిష్యులకి భక్తులకి చెబుతుంటారు. ఆయనవైపు అపనమ్మకంగా చూసే భక్తులతో ఆయన రెండు విషయాలు చెబుతారు. మొదటిది “ చాలా విచారకరమయిన నిజం ఏమిటంటే మనని మనం నమ్మటం చాలా కాలం క్రితమే మానేసాము. (The sad truth is, we have all stopped trusting ourseleves a long ago)
సర్వప్రాణి కోటిలోనూ మనిషి అనే ఒక ప్రాణి ప్రకృతితో సంబంధాలను పూర్తిగా తెగ తెంపులు చేసుకొని చివరికి తన మార్గాన్ని మర్చిపోయాడు. (Humanbeing is the only animal who has lost connection with nature alltogether who has lost his way)
ఈ చికిత్సా శక్తి గురించి స్వామి నిత్యానంద ఒక సంఘటనని తన భక్తులకు చెబుతుంటారు. ఆయన హిమాలయాలలో బాగా లోపలి ప్రాంతం అయిన తపోవనంలో తపస్సు చేసుకునేవారు. అది గంగోత్రికి షుమారు 30 కి॥మీ. లోపలికి ఉంటుంది. ఆ ప్రాంతం సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఒకసారి నిత్యానంద తపోవనం నుంచి గోముఖికి వచ్చి అక్కడి నుంచి క్రిందికి నడచి వస్తున్నారు. దారిలో వెళ్తున్న ఒక మిలటరీ వాహనం ఆయనని ఎక్కించుకుని క్రిందికి వచ్చింది. ఆ సమయంలో చిన్న ప్రమాదం జరిగింది. అప్పుడు స్వామికి వీపు క్రింది భాగంలో చాలా పెద్ద గాయం అయింది. అది చాలా లోతు గాయం. వెంటనే వారు స్వామిని మిలటరీ వారి హాస్పటల్లో జాయిన్ చేసి రెండు మూడు రోజులు చికిత్స చేసి ఆయనని మూడు వారాలపాటు మంచం మీద నుంచి కదలకుండా పూర్తి బెడ్‌రెస్ట్ ఇవ్వాలి అనిచెప్పారు.
అన్నిరోజులు అలా పడుకోవాలి అనగానే స్వామీజీకి తన సాధన గుర్తువచ్చి, అలా ఉండటం తన వల్లకాదని మెల్లిగా లేచి బయటకి వచ్చేసారు. గాయం చాలా బాధగా ఉంటే తన చేతిన గాయంపై పెట్టి ఏకాగ్రతని అక్కడ నిలిపారు. కొంతసేపటికి నొప్పి తగ్గింది. ఆ తరువాత క్రమంగా గాయం మానిపోయింది. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. తరువాత తాను తనకు ఆ శక్తి ఉన్నది అని తెలుసుకున్నారు. శరీరానికి చికిత్స చేయగలను అని తెలుసుకున్నారు.
బహుశః ఆ పరాశక్తి ఆ సంఘటనని సృష్టించి ఆయన హస్తాలు నిజమయిన అమృతహస్తాలు అని ఆయనకి తెలియజేసి ఉంటుంది. ఆ అమృతహస్త స్పర్శ ఎన్ని ప్రాణాలను నిలిపిందో ఎంతమంది నిరాశలో మరణశయ్య మీద వారిని తిరిగి ఈ లోకంలోనికి పంపిందో ఆ పరమేశ్వరునికి, ఈస్వామికి మాత్రమే తెలుసు.
పరమహంస తన శిష్యులతో చాలామందికి చికిత్సా పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమయిన ధ్యానంతో కూడుకున్న శిక్షణ. శిక్షణ పూర్తి అయిన వారికి ఆయన దీక్షని ఇస్తారు. వారే ఆనంద హీలర్స్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది ఆనందా హీలర్స్ ఎందరికో హీలింగ్ చేస్తూ, స్వామి సేవలో పునీతులవుతున్నారు.
నిత్యా ఆధ్యాత్మిక చికిత్సా దీక్ష (నిత్య స్పిరిత్యువల్ హీలింగ్ ఇనిషియేషన్) నిత్యా ఆధ్యాత్మిక హీలర్స్ పరమహంస ప్రత్యక్ష పర్యవేక్షణలో శిక్షణ పొందుతారు. దీనికి ముందు వారు మరికొన్ని ప్రాథమిక కార్యక్రమమాలయిన ఎ.ఎస్.పి., ఎన్.ఎస్.పి. మొదలయినవి చేసి ఉండాలి. అప్పుడు వారు ఈ శిక్షణని స్వామి సమక్షంలో పొందవచ్చు. శిక్షణ పూర్తిగా శక్తి అంటే మేధస్సు అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. శిక్షణ పూర్తి అయి తరువాత గురుదేవులు వారిని ఆనందగంధ చక్రంతో దీక్షని ఇస్తారు. అప్పుడు వారు హీలర్స్ అవుతారు. ఇది వారి ద్వారా విశ్వశక్తి ప్రవహింపచేసే ఒక శాస్త్రీయ పద్ధతి. అలావారి ద్వారా విశ్వశక్తి ప్రవహించి వారు ఎవరికైనా చికిత్స చేయలుగుతారు. ఈ హీలింగ్ పద్ధతిలో ఉండే ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇది వ్యాధి వున్న పేషెంట్లకి చాలా సహాయం చేస్తుంది. అదే విధంగా హీలర్స్ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో తోడ్పడుతుంది. బయటకి చూడటానికి ఇది ఒక చికిత్సావిధానం కానీ అంతర్లీనంగా ఇది ఒక గొప్ప ధ్యానపద్ధతి. అన్నింటికంటే మంచి ఇది మానవసేవ చేయగల ఒక మంచి మార్గం, ఆ పరమహంస లక్ష్యసాధనకు కొంత తోడ్పడాలి అనుకునే వారికి ఒక అద్భుత అవకాశం.
నిత్యానంద ధ్యానపీఠం వారు అందించే వివిధ కార్యక్రమాలు, కోర్సులు :
నిత్యానంద ధ్యానపీఠం ద్వారా పరమహంస నిత్యానంద తన లక్ష్యాలని, తన సందేశాన్ని అందరికీ అందించటానికి ఒక వ్యవస్థ ఏర్పరిచారు. అందులో రెండు మార్గాలు ఉంటాయి. మొదటిది రకరకాల శిక్షణా కార్యక్రమాలు,ప్రవచనాలు రెండవది పుస్తకాలు, ఆడియో, వీడియో, సీడీలు ముఖ్యమయిన శిక్షణా కార్యక్రమాలు.
ఆనందస్ఫురణ కార్యక్రమము : (శక్తివంతులుకండి)
దీనినే అమెరికా, మిగతా దేశాలలో లైఫ్ బ్లిస్ ప్రోగ్రాం అంటారు. ఇది చక్రా ధ్యాన కార్యక్రమము. ఇది ఒక శిక్షణా కార్యక్రమము. ధ్యానపీఠం అందించే ప్రాథమిక శిక్షణా కార్యక్రమం. దీనిని గురుదేవుల సమక్షంలో ఆయనచేత శిక్షణ పొంది ఆయనచే నియమించబడిన ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతారు. ఇది రెండు రోజుల శిక్షణా కార్యక్రమం. ఇందులో మనలో ఉండే ఏడు కీలకమయిన శక్తి కేంద్రాలు, వాటినే చక్రాలు అంటాము, వాటిని ధ్యానం ద్వారా శుభ్రపరచి తిరిగి శక్తివంతంగా చేసే కార్యక్రమం. దీనిని పరమహంస సామాన్యుల కోసం చాలా సులభరీతిలో తయారుచేసారు. ఇందులో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ధ్యానపద్ధతిని నేర్పించుతారు. ఈ ధ్యాన పద్ధతులన్ని ప్రాచీన వేదాలు, తంత్రం, బౌద్ధం ఇలా వివిధ ఆధ్యాత్మిక శాఖల నుంచి తీసుకున్నవే. ప్రతీ ధ్యానపద్ధతి చాలా శక్తివంతమయినవి. అవి మన మానసిక, భౌతిక ఆరోగ్యంపై లోతయిన ప్రభావాన్ని చూపించగలుగుతాయి. ఈ ధ్యాన పద్ధతులను శిక్షణపొందిన నిత్యానంద ధ్యాన పీఠం వారి ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసాక ప్రతి ఒక్కరిలో మానసిక, శారీరక, భావాత్మక ఆధ్యాత్మిక అభివృద్ధిని స్పష్టంగా చూడగలము. ఇది మనని ఆనందంలోనికి తీసుకువెళుతుంది. అలాగే మనం ఈ కార్యక్రమం ద్వారా వికసింపగలుగుతాము. అందుకే పరమహంస దీనిని ఆనందస్ఫురణ అంటారు. దీనిని తెలుగు ఇంగ్లిషులో నిర్వహించుతారు.
నిత్యానంద స్ఫురణ ప్రోగ్రాం (ఎన్.ఎస్.పి.) (మరణరహస్యం వెల్లడి చేయటం) నిత్యానంద స్ఫురణ ప్రోగ్రాం గురుదేవులు నిత్యానంద నిర్వహించుతారు. ఇది నాలుగురోజుల శిక్షణ కార్యక్రమం. దీనిని ఇంగ్లీషు, తమిళంలో నిర్వహించుతారు. స్వామీజీ తన ప్రవచనాలలో మనకి తెలియని ఒక విషయం చెప్పినప్పుడు అందరం ఆశ్చర్యపోతాము. అది మనకి ఉండే ప్రతి భయం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరణభయానికి సంబంధించినదే. ఆ భయం మన జీవితంలో ప్రతిక్షణం ఉంటుంది. ఈ భయం వలన మనం జీవితాన్ని కళాత్మకంగా, ఆనందంగా జీవించలేము, అన్న విషయం.

సేలమ్‌లో ఎన్.ఎస్.పి. నిర్వహిస్తూ శ్రీ నిత్యానంద
ఈ కార్యక్రమంలో మరణం గురించి, మరణ సమయంలో ఆత్మ శక్తి పొరల గుండా ఎలా ప్రయాణిస్తుంది, అప్పుడు మనిషి పడే వేదన అన్నీ వివరించుతారు. ఈ కార్యక్రమంలో మనలో ఉండే భావావేశాలయిన కోరిక, కోపం, అపరాధభావం, బాధ, సంతోషం అనే విషయాలని మనలోని ఏడు శక్తి కేంద్రాల ద్వారా వివరించుతారు. ఈ కార్యక్రమంలో మనలో పేరుకుపోయిన భావాలని, కోరికలని పైకి తెచ్చేవిధంగా ధ్యానం చేయించుతారు. నిత్యానంద స్ఫురణ కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక స్నానం లాంటిది. అది మనకి తిరిగి కొత్త జన్మని ఇస్తుంది. మనం ఆనందంగా జీవించగలిగే శక్తిని ఇస్తుంది. నిత్యానంద స్ఫురణ చేయాలి అంటే ప్రాథమికమయిన ఆనంద స్ఫురణ కార్యక్రమాన్ని చేయాలి.
శక్తి స్ఫురణ కార్యక్రమం : (మిమ్మలని మీరు శుద్ధి చేసుకోండి) ఇది కూడా ఒక ధ్యాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనలోని మూడు శక్తి దేహాలని వివరించుతారు. అవి మనలోని భౌతిక దేహం, సూక్ష్మ దేహం, యాదృచ్ఛిక దేహం. మనలో అణిచివేయబడిన భావావేశాలను, తీరని కోరికలు, అనిశ్చలత, అశాంతి, మానసిక వేదన జడత్వం సోమరితనం ఇటువంటి భావావేశాలన్ని కూడా ఈ మూడు శక్తి దేహాలకి సంబంధించి ఉంటాయి. ఈ కార్యక్రమం మన అంతరంగంలో జ్ఞాన జ్యోతిని వెలిగించటానికి ఈ భావావేశాల నుంచి స్వేచ్ఛ పొందటానికి అనువయిన పద్ధతులని పరిష్కారాలని చూపిస్తుంది.
ఆత్మ స్ఫురణ కార్యక్రమం : (మీ అసలయిన ఉనికితో అనుసంధానం ఏర్పరచుకోవటం)
సర్వాంతర్యామి అయిన సర్వసృష్టిలో మనిషి ఒక భాగం. ఈ విషయాన్ని అతను అనుభవపూర్వకంగా ప్రయోగాత్మకంగా తెలుసుకుంటే అతను జ్ఞానోదయం పొందుతాడు. ఈ ధ్యాన పద్ధతులు మనలోని ఐదు కోశాలని తెలుసుకునే విధంగా వివరించతారు. ఈ ఐదు కోశాలు మనం సత్యాన్ని తెలుసుకోకుండా అవరోధలుగా ఉంటాయి. ఈ కార్యక్రమంలో మనం వాటిని ఛేదించి మనలోపలి చేతనస్థితిని బయటకి తెచ్చే విధంగా సహాయం చేస్తుంది.
భక్తి స్ఫురణ కార్యక్రమం : (మీ భావావేశాలని సుసంపన్నం చేసుకోవటం)
కాలం గడిచే కొద్దీ మనస్సు మన జీవితం మీద అధికారం చేజిక్కేటుతగా గట్టిపడిపోతుంది. మనసుదే పై చేయి అవుతుంది. స్వామీజీ ఇచ్చే నిర్వచనం ఏమిటంటే, మనస్సు అంటే మన ఆలోచనలన్నింటినీ రాసిగా పోస్తే ఏర్పడదే మనసు. ఈ ఆలోచనలన్నీ కూడా కేవలం మన అంతరంగంలో మనలో మనం మాట్లాడుకునే అర్థం లేని వ్యర్థపు మాటలే. అందుకే మన ఆలోచనలు కూడా ఏమాత్రం అర్థం లేకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. అటువంటి పిచ్చిగృహమైన మనస్సుకి మనం మన జీవితాన్ని అప్పజెబుతాము అని అంటారు గురుదేవులు.
ఈ కారణం వలన క్రమంగా మానవునిలోని సహజమయిన మానవత్వం దిగజారిపోయి అర్థంలేని, నిరుపయోగమయిన మేధస్సు చేతిలో బలైపోతుంది. మన అంతరంగంలోని నిజమయిన మన ఉనికి యొక్క భాష భక్తి. ఇది మనలోని అత్యల్పమయిన, ప్రాథమికమయిన భావోద్వేగాల నుంచి విముక్తి చేసి మనస్సుకి స్థిరత్వాన్ని చేకూరుస్తుంది. ఈ కార్యక్రమం మన కోర్కెలనితీర్చి, మనని వాటికి అతీతంగా తీసుకువెళుతుంది.
భక్తి స్ఫురణ కార్యక్రమం 4 రోజులు నిర్వహింటారు. ఈ కార్యక్రమాన్ని ఆధునిక మానవుని జీవనసరళికి సరిపోయే విధంగా భక్తి మార్గాన్ని సూచించే విధంగా గురుదేవులు రూపొందించారు. ఈ కార్యక్రమం మనని బుద్ధిస్థాయినుంచి మన ఆత్మస్థాయికి తీసుకువెళుతుంది. లౌకిక ప్రపంచంలో మనం చేసే పూజలు, వ్రతాలు, స్థాయినుంచి భగవంతునితో, విశ్వచేతనస్థితితో అత్యంత సన్నిహిత స్థాయికి తీసుకువెళుతుంది. నిత్యానంద కార్యక్రమం - (గాఢమైన జ్ఞానోదయపు అనుభవాలు) ఇది చాలా తీవ్రంగా లోతుగా నిర్వహించే ధ్యాన కార్యక్రమం. పరమహంస ప్రత్యక్ష పర్యవేక్షణలో 15 రోజులపాటు నిర్వహింటారు. నిత్యానంద స్థితిని సాంకేతికంగా సశాస్త్రీయంగా వివరించే కార్యక్రమము. ఈ కార్యక్రమము మనని శరీరము, మనస్సులకు అతీతంగా తీసుకువెళుతుంది. స్వచ్ఛమైన ఉన్నత చేతన స్థితి యొక్క అనుభవాలని ఇస్తుంది. జ్ఞానోదయపు అనుభవాలను తెలుసుకోగల అన్ని తాళాలని గురుదేవులు ఈ కార్యక్రమంలో మనకి అందించుతారు. ఆనందయోగం : (వికసించి, వ్యాపించి, విస్ఫోటకం అవ్వండి) పరమహంస నిత్యానందకి యువతపై ప్రత్యేక ఆసక్తి. ప్రపంచం యొక్క భవిష్యత్ నిర్దేశకులు వారు. యువత శక్తివంతమయితే దేశం శక్తివంతమవుతుంది. యువత అభివృద్ధిని ఆధారంచేసుకొని రూపొందించిన కార్యక్రమం ఇది. దీనిని 18నుంచి 30 ఏళ్ళలోపు యువతీయువకులకు ఒక సంవత్సరం నిర్వహింటారు. ఈ సమయంలో వారికి ఆశ్రమంలోనే ఉండడానికి వసతిని ఇస్తారు. వారికి భోజనం ఇతర సదుపాయాలు ఉచితంగా ఇస్తారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రాచీన మార్గికయోగ, వేద విద్యలద్వారా యువతకి సాధికారతపొందే విధంగా చూస్తారు. ఈ కార్యక్రమంలో వృత్తి నైపుణ్యం, జీవితానికి అవసరమైన సూత్రాలు, ఆరోగ్యంగా ఉండేందుకు చికిత్సా ధ్యానాలు, సంపూర్ణ శక్తితో పనిచేసే సామర్థ్యం మేధస్సు, సమయస్ఫూర్తి, సృజనాత్మకత తదితర అంశాలలో శిక్షణ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఆరోగ్యకరమైన మానసిక స్థితిని ఈ కార్యక్రమం కల్పిస్తుంది. మనలోని అంతర్గత శక్తులని వెలికి తీస్తుంది. ఆర్ధికంగా అధ్యాత్మికంగా స్థిరంగా ఉండగలిగే సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా గురుదేవుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకునే గొప్ప అవకాశం దొరుకుతుంది.