KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/మరణాన్ని జయించి మరణ అనుభవం పొందిన స్వామీజీ:Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

మరణాన్ని జయించి మరణ అనుభవం పొందిన స్వామీజీ:

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

స్వామీజీ వారణాసిలో గంగానది ఒడ్డున తీవ్రమయిన తపస్సు చేసేవారు. ఒకరోజు ఆయన మణికర్ణిక ఘాటు దగ్గర పూర్తి ధ్యానంలో నిమగ్నమయిపోయి ఉన్నారు. మణికర్ణక ఘాటు దగ్గర ప్రతిరోజు ఎన్నో శవదహనాలు జరుగుతాయి. వారణాసిలో ఈఘాటు హిందువులకి చాలా పవిత్రమయినస్థలం. ఇక్కడ వందల సంఖ్యలో శవదహనాలు జరుగుతుంటాయి. ఆయన ముందు ఎన్నో శవ దహనాలు జరుగుతున్నాయి అప్పుడు ఆయన తనకి మరణంలో ఉండే మర్మం తెలుసుకోవాలి అనే తీవ్రమయిన కోరిక కలిగింది ఆయన రెండు రోజులు అదేస్థలం నుంచి కదలకుండా తన దృష్టిని మరల్చకుండా, పూర్తి నిశ్శబ్దంలో ఉండిపోయారు. మూడవ రోజు ఆయన తన శరీరం క్రమంగా కరిగిపోవటం గమనించారు. ఆయన ఆ సంఘటనలని ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అలా జరగనిచ్చారు. క్రమంగా ఆయన శరీరం పాదాల దగ్గర నుంచి మరణించటం ఆయన తెలుసుకున్నారు. భయం ఆయనని చుట్టిముట్టినట్టయింది. మరణం పైకి ఇంకా పైకి వస్తుంది. అంతే ఆయన ఆమరణ భయాన్ని పూర్తిగా జయించారు. మరణ అనుభవాన్ని పొంది మహర్షి అయ్యారు. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమయిన మలుపు. అది ఆయన ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరగా తీసుకు వెళ్ళినది.

తీవ్రరూపం దాల్చిన తపోనిష్ఠ:

మరణ అనుభవం స్వామీజీ ఆత్మసాక్షాత్కార తృష్ణని మరింత ఎక్కువ చేసింది. ఆయన పట్టుదల రోజురోజుకి అధికమవ్వసాగింది. స్వామి తపోనిష్ఠలో ఎక్కువ సమయం గడపసాగారు.

పంచతపస్సు :

ఇది చాలా కఠినమైన ప్రమాదకరమైన తపస్సు. ఈ తపస్సు చేయాలంటే చాలా ధైర్యం, పట్టుదలా తనపై తనకు నమ్మకం ఉండాలి. అత్యంత సాహసహపరులయిన నిత్యానంద స్వామి ఈ పంచ తపస్సుని ఎన్నుకున్నారు. ఈ పద్ధతిలో చుట్టూ మహా అగ్నిని రగిలించి మధ్యలో కూర్చుంటారు. తలపై నిప్పుల కుంపటి ఉంటుంది. సూర్యోదయంతో ఈ ధ్యానం మొదలవుతుంది. ధ్యాన సమయంలో సూర్యుని వైపు మాత్రమే కన్ను చెదరకుండా చూస్తూ ఉండాలి. సూర్యగమనానికి అనుగుణంగా తన దృష్టిని మరలుస్తూ ఉండాలి. ఆ విధంగా సూర్యోదయంతో మొదలు పెట్టి సూర్యాస్తమయంతో ముగించుతారు. దీనినే త్రాటక్ ధ్యానం అంటారు. స్వామి అగ్ని కీలల మధ్య ధ్యానం చేసే సమయంలో ఆయనకి తెలిసిన వ్యక్తులు అక్కడ ఉండి అగ్ని నిరంతరం జ్వలించే విధంగా చూస్తూంటారు.

స్వామిని ఎవరో ఈ విధంగా అడిగారు “ఇంత చిన్న వయస్సులో, ఇంత కఠనమైనయిన తపస్సు చేయటానికి ఎందుకు అంత సాహసం చేసారు” అని. ఆ ప్రశ్నికి స్వామి “ నాలో ఆత్మాసాక్షాత్కారం కోసం, జ్ఞానోదయం కావాలి అనే ఆకాంక్ష భయంకరమైన జ్వాలగా మండుతున్నది. ఆ మంటలను భరించే శక్తి నాకు ఇక లేదు. కనీసం నా బయట మండే ఈ అగ్ని జ్వాలలయినా నాలో రగులుతున్న అగ్ని కీలలని ఉపశమింప చేస్తాయేమో అనే ఆశతో నేను ఈ ధ్యానం చేసాను అని చెప్పారు. అది విన్న యోగులు, ఆయనలోని అసాధారణ సిద్ధ పురుషుని దర్శించి పులకితులయ్యారు.