జ్ఞానోదయం పొందాలని ఇల్లువదిలి వెళ్లిన నిత్యానంద:
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
నిత్యానంద స్వామి బాల్యం అంతా చాలా పెద్ద ఉమ్మడి కుటుంబంలో గడిచింది. ఆయనకి పదిహేడవ సంవత్సరం వచ్చేసరికి, ఇక ఆయన ఆ సమాజంలో, కుటుంబంలో ఆ పరిస్థితులకు, మనుషుల మనస్తత్వాలకి ఏమాత్రం ఇమడలేక పోయారు. ఆయనలో జ్ఞానోదయం పొందాలనే కాంక్ష రోజు రోజుకి చాలా బలంగా పెరుగుతున్నది. అది ఆయనని నిలువనీయలేదు. ఆయన హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేయాలి అని, అలా వెళ్ళటానికి ఇదే సరియైన సమయం అని చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు.
తన నిర్ణయాన్ని తల్లితండ్రులకి చెప్పారు. దానికి తల్లితండ్రుల చాలా బాధపడ్డారు కానీ ఆయనకి అడ్డం చెప్పలేదు. బంధువులనుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. నిత్యానంద చిన్నప్పటినుంచి చాలా ధైర్యస్తుడు. అనుకున్నది ఎంత కష్టమయినా సాధించితీరాలి అనే పట్టుదల గల వ్యక్తి. దాంతో ఎవరూ ఆయన నిర్ణయాన్ని మార్చలేక పోయారు.
చివరకి వాళ్ళ మామయ్య ఆయనని మద్రాసు తీసుకెళ్ళే విధంగా అందరూ నిర్ణయించారు. నిత్యానందకు ఇది ఒక మంచి అవకాశం అనిపించింది. ఎందుకంటే మద్రాసునుంచి హిమాలయాలకి వెళ్ళటం చాలా సులభం అని అనుకున్నారు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. నిత్యానంద పుట్టిన తరువాత తిరువణ్ణామలై దాటి ఎక్కడికీ వెళ్ళలేదు. ఆయన చదివినది కేవలం పాలిటెక్నిక్ మాత్రమే. అది కూడా తమిళ మీడియం. ఆయనకి హిమాలయాలు అనే పేరు తప్పా ఇక వాటి గురించి కానీ, అక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయం కానీ ఏమీ తెలియదు. ఆయనకి తమిళం తప్పా మరే భాషారాదు. ఇటువంటి పరిస్థితిలో ఆయన అంతదూరం వెళ్ళాలి అని నిర్ణయించుకోవటం గొప్ప సాహసమే. ఆయన తల్లితండ్రులు కూడా ఈ విషయంలోనే చాలా భయపడ్డారు.
మద్రాసులో కొన్ని రోజులయ్యాక అక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రవేశించారు. వారు ఆయనకి కాషాయ వస్త్రాలు,కమండలం ఇచ్చారు. ఒక రోజు సెంట్రల్ స్టేషన్కి వచ్చి ఢిల్లీవెళ్ళే ట్రెయినులో థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కి ఢిల్లీవైపు తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెట్టారు పరమహంస నిత్యానంద.
స్వామీజీ తన సత్యాన్వేషణ, ఆత్మసాక్షాత్కార శోధన విషయాలని చెప్పే సందర్భంగా ఒక ముఖ్యమయిన విషయాన్ని చెప్పారు.
ఆయన తిరువణ్ణామలై నుంచి బయలుదేరే ముందు, తనకి అత్యంత ప్రీతిక్రమయినది, ఆయన ఊపిరిలో ఊపిరి లాంటి అరుణాచలేశ్వరుని మందిరంలోనికి వెళ్ళి ఆయన దగ్గర వీడ్కోలు తీసుకున్నప్పుడు, నిత్యానంద స్వామి ఇలా అనుకున్నారట: హే! అరుణాచలేశ్వరా! తిరిగి నేను మరి నీసన్నిధికి రాను. నాకు జ్ఞానోదయమయ్యే వరకూ నేను హిమాలయాలను వదలను. అది నాకు ఏ ఎనభై, తొంభై సంవత్సరాల వయస్సులో జరుగుతుందో. కాబట్టి నేను నిన్ను ఇక చూడను అని అనుకున్నారట. స్వామి తన జీవితంలో ఎప్పుడూ దేనికీ అంతగా వ్యధ చెందలేదు కానీ అరుణాచలేశ్వరుని ఇక చూడలేను అనుకున్నప్పుడు ఆయన కొన్ని క్షణాలు తీవ్రమైన క్షోభని అనుభవించాను అన్నారు.
అదే విధంగా ఆయన రెండు ప్రమాణాలు చేశారు: నేను డబ్బు ముట్టుకోను: ఆహారం కానీ ఏదీ రేపటికి దాచుకోను అని. ఈ రెండు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అందువలన స్వామీజీ బస్సులోకాని, ట్రయినులో కానీ ఎప్పుడూ ఎక్కడో టిక్కెట్టు కొనలేదని చెప్పారు. ఆయనని ఎవరూ అడ్డగించలేదు. స్వామీజీ మరొక విషయం ఎప్పుడూ చెబుతారు. తాను ప్రయాణించినంత కాలం ఎవరో ఒకరు భోజన సమయానికి భోజనం పెట్టేవారని. ఒకసారి స్వామి ట్రయినులో ప్రయాణిస్తుండగా టికెట్ కలెక్టరే ఆయనకి భోజనం ఏర్పాటు చేశారట.
స్వామి తన ప్రవచనాలలో భారతీయుల ఈ అద్భుత సంస్కృతి గురించి ఎంతో గర్వంగా చెబుతారు: "ఎవరెయినా ఆధ్యాత్మిక వ్యక్తి అలా ధ్యానం చేసుకుంటూ ఏ చెట్టు క్రింద కూర్చున్నా, ఏ ఇంటి అరుగు మీద కూర్చున్నా, ఎవరూ అభ్యంతరం పెట్టరు. వారి నిశ్చలతని భంగపరచరు. అంతేకాదు వారి మంచి చెడులు, వారి భాధ్యత సమాజమే తీసుకుంటుంది. వారిని ఎంతో గౌరవంగా చూస్తుంది;" అని ముఖ్యంగా తన ప్రాశ్చాత్య శిష్యులకి చెబుతారు.
నిత్యానంద మూడవరోజు ఉదయానికి ఢిల్లీ చేరారు. ఆయన ఉద్దేశం హరిద్వార్ వెళ్ళాలి అని. కాని అప్పుడు హరిద్వార్ వెళ్ళే ట్రయిన్ లేదు. అప్పుడు ఆయన ఢిల్లీ అంతా నడచి చూచి అక్కడ వీధి పంపు దగ్గర స్నానం చేసి, ఢిల్లీ స్టేషన్ దగ్గరే ఉన్న గుడి దగ్గర పడుకున్నారు. గుడి పూజారి స్వామికి భోజనం పెడితే అక్కడే తిని పడుకొని, మర్నాడు హరిద్వార్ బయలు దేరారు.
అక్కడ కొంతవరకు సాధువుల సమూహంతో తిరిగారు. తరువాత ఒంటరిగా గంగానది ఒడ్డున ధ్యానం చేసుకునేవారు. స్వామి ఈ సందర్భంగా ఒక మాట చెప్పేవారు. ఆయనకి గంగానది అంటే అంతులేని గౌరవం. స్వామి ఇప్పుడు కూడా గంగానది అనరు. “గంగామాత” అంటారు. ఆయన ప్రతిరోజు గంగలో స్నానం చేసేవారు కాని ఎప్పుడూ, ఆ నదిని కలుషితం చేయలేదు అని చెప్పారు. స్వామి గంగామాత గురించి కాని యమున గురించి కానీ మాట్లాడుతుంటే, ఆయన శరీరం సంతోషంతో పులకించటం ఆయన శిష్యులు చాలా సార్లు గమనించారు.
స్వామీజీకి గంగామాతకి ఉన్న సాన్నిత్యం చాలా అపురూపమయినది. 2006 వ సంవత్సరం స్వామీజీ మూడవ బ్యాచ్ ని తీసుకుని హిమాలయ యాత్ర నిర్వహించారు. ఆయన గంగోత్రిలో హోమం చేసి గంగామాతకి పూజ చేసి హారితి ఇచ్చారు. ఆయన భక్తులు, శిష్యులు రెండు వందల మంది గంగానది ఒడ్డున ఉన్న రాళ్ళమీద కూర్చోని ఉన్నారు. పూజ పూర్తి అయిన ఐదు, పదినిముషాలలో పోలీస్(గార్డులు) వచ్చి అందరినీ అక్కడనుంచి ఖాళీ చేయించారు. విషయమేమిటని అడిగితే, అకస్మాత్గా గంగానది పొంగుతున్నది అని చెప్పారు. ఆ తరువాత స్వామీజీ వివరించారు. గంగామాత మన పూజ స్వీకరించి ఆ ఆనందంలో అందరిని దీవించినది అని. అక్కడ ఆయనకి అత్య ప్రియమైన గంగామాత దీవెనలు కనిపించాయి. ఆ సంతోషం తృప్తి ఆయన కన్నులలో, ఆయన నవ్వులలో చూడగలిగిన వారిదే భాగ్యం.
స్వామీజీ హరిద్వార్లో చాలామంది యోగులని రుషులని కలిసారు. వారి దగ్గర గ్రహించగలిగినన్నీ గ్రహించేవారు. నిత్యానందలో బాల్యం నుంచి ఉన్న గొప్ప లక్షణము ఏమిటంటే ఆయన బహు సూక్ష్మగ్రాహి, ఏక సందాగ్రాహి. సామాన్యులకి ఎంతో సాధన చేస్తే కాని చేయలేనివి, నేర్చుకోలేనివి ఆయన క్షణాలలో గ్రహించి విశ్లేషించి అర్థం చేసుకొని తిరిగి చెప్పగలరు. ఆయన ఉదయం, సాయంత్రం ఏదయినా ఆశ్రమంలో పెట్టినది తినేవారు. లేకపోతే గంగానది ఒడ్డున, ఆ మాత ఒడిలో ఉన్నట్టే ధ్యానం చేస్తూ ఆ పారవశ్యంలో మునిగిపోయే వారు.
నిత్యం పరాశక్తి రక్షణలో స్వామీజీ!
స్వామీజీ జన్మించినది మొదలు ఆయన జ్ఞానోదయం పొందేవరకూ ఏదో ఒక అదృశ్య హస్తం ఆయనకి నిరంతరం రక్షగా నిలిచేది. అది కచ్చితంగా సర్వాంతర్యామి, భగవంతుడు అయిన పరాశక్తి రక్షణ.
స్వామి పది సంవత్సరాల వయస్సులో ఆయన తన సాధనలో భాగంగా,అరుణాచలం పర్వతానికి ప్రదక్షణ చేసేవారు. అలా చేసే సమయంలో ఆయన అరుణాచలేశ్వరుని కీర్తనలు పాడుకుంటూ, భక్తి పారవశ్యంలో ఉండేవారు. ఒకరోజు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతానికి రాగనే,ఆయనకి అతి సమీపంలో తోడేలుల గుంపు కనబడింది.అవి స్వామి మీదకి దూకటానికి సిద్ధంగా ఉన్నాయి.స్వామి గట్టిగా “అరుణాచలేశ్వరా”, అన్నారు. అంతే వెంటనే ఒక సాధువు చేతిలో కర్రతో అక్కడికి వచ్చి వాటిని దూరంగా తరిమేసి, స్వామికి కనిపించకుండా వెళ్ళిపోయాడు.ఆయన కోసం ఎంత వెతికినా,ఎక్కడ వెతికినా,మరి అసాధువు కనబడలేదు.
స్వామీజీ,హరిద్వార్‌లో తపస్సు చేసుకోవటానికి అనువుగా గంగానది ఒడ్డున ఒక చిన్న వంతెన క్రింద కుర్చునేవారు.ఒకసారి ఆయనకి తీవ్రమైన అనారోగ్యం కలిగి లేవలేని స్థితిలో ఒంటరిగా ఆ గంగాఒడ్డున,వంతెన క్రింద పడుకుని ఉన్నారు.కనీసం కదలటానికి కూడా ఓపిక లేనంత నీరసంగా ఉన్నారు. ఆ సమయంలో ఒక యువకుడయిన సాధువు వచ్చి ఆయనకి మందులు, ఆహారం ఇచ్చేవాడు. ఆ సాధువు చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. అంత నీర్సంలో కూడా స్వామీజీ ఆయువకుడి షర్టు జేబుకి ఉన్న ఒక పెన్ని చూసారు. ఆయనకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఆ పెన్ బంగారంతో, వజ్రాలతో ఉన్నది. ఒక సన్యాసి దగ్గర పెన్ ఉండటమే అసాధారణం; అది బంగారం వజ్రాలతో ఉన్న పెన్. అందుకే ఆయన ఆశ్చర్యపోమారు.
స్వామీజీ ఆ సాధువుని వివరాలు అడిగితే తన పేరు శంకర్ మహరాజ్ అనీ, గంగానది ఒడ్డున ఉన్న ఒక ఆశ్రమమని ఏవో గుర్తులు చెప్పాడు. మూడురోజులకి స్వామి పూర్తిగా కోలుకున్నారు.
ఆ అందమయిన యువకుడయిన సాధువు తనకి సేవ చేసినందుకు కృతజ్ఞతలు చెబుదామని ఆయన ఆ తరువాత రోజు అతను చెప్పిన అడ్రస్ ప్రకారం ఆ ఆశ్రమాన్ని వెతుకుతూ వెళ్ళారు. అక్కడ చిన్న ఆశ్రమం ఉన్నది. బయట మెట్లమీద ఒక సాధువు కూర్చోని ఉన్నాడు. ఆయన వయస్సులో చాలా పెద్దాయన.
స్వామి ఆయనకి నమస్కరించి, తాను శంకర్ మహరాజ్ని కలవటానికి వచ్చాను అని చెప్పారు. దానికి ఆయన ఇక్కడ అలాంటివారు లేరు అని జవాబు ఇస్తాడు. అప్పుడు స్వామీ ఆ యువ సాధువు గుర్తులు చెప్పి, తనకు సేవచేసిన విషయాలు చెప్పి, అతను ఈ ఆశ్రమం అడ్రస్ చెప్పినట్టుగా వివరిస్తాడు.
ఆ పెద్దాయనకి చాలా విసుగు వస్తుంది. ఇక్కడ ఆ పేరు, ఆ గుర్తులుగలవారు ఎవరూ లేరు. మాకు ఉన్న శంకర్ మహరాజ్ ఒక్కరే. ఆయన అదిగో అక్కడ ఉన్నారు అని తన చేతిని ఒక చిన్న గుడి వైపు చూపించారు.
స్వామి పరుగున ఆ గుడి దగ్గరకి వెళ్ళిచూసి, ఆశ్చర్యంతో, నిశ్చేష్టులయి నిలబడిపోయారు. ఆయన ఆశ్చర్యపోవటానికి కారణం, ఆ గుడిలో ఉన్నది శివుడి విగ్రహం. ఆవిగ్రహం పైన వజ్రాలు పోదిగిన పెన్ ఉన్నది.స్వామికి చాలా అయోమయం అనిపించి పరుగునవచ్చి ఆపెద్దాయనతో ఆ పెన్ ఎవరిది? దానిని ఎవరు అక్కడ పెట్టారు? అని అడిగారు. ఆయనకి ఉన్న చిన్న అనుమానం ఆ సాధువు ఇక్కడ ఆ పెన్ పెట్టాడేమోనని. దానిని ఆపెద్దాయన “దానిని ఎవరో ఒక భక్తురాలు ఇచ్చింది. దానిని మేము అక్కడ పెట్టాము” అని కొంచెం విసుకుని, “నీవు చూడటానికి చదువుకున్న వాడిలా ఉన్నావు. నీకు ఆ పెన్ కావాలంటే తీసుకో” అని అన్నాడు. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుని పాదాల దగ్గర ఉన్న పుష్పం స్వామీజీని మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉదయం ఆయన గంగానదిలో స్నానం చేస్తున్నప్పుడు అందులో ఒక విచిత్రమైన పుష్పం ఒకటి కొట్టుకు వచ్చింది. అది సహజమైన పుష్పం కాదు కాని చూడటానికి చాలా అందంగా ఉన్నది. స్వామి ఆ పుష్పాన్ని తెచ్చి, ఆ ఒడ్డునే తానురోజూ పూజించే శివలింగం పైన ఉంచారు. ఈ పుష్పం ఇప్పుడు ఇక్కడ గుడిలో శంకర్ మహారాజ్ పాదాల దగ్గర కనపడింది.
స్వామికి సర్వం అర్ధమయి పోయింది.పరమేశ్వరుని మీద ప్రేమ,భక్తి, కృతజ్ఞత కన్నీటి ప్రవాహంలా బయటికి వచ్చేసింది. ఆ పెద్దాయన తాను విసుకున్నందుకు స్వామి బాధ పడుతున్నారని అనుకుని ఆ పెద్దాయన నిత్యానందని ఓదార్చాడు.
తనతో పాటు హిమాలయాలకి వచ్చిన ఆయన భక్తులు రెండువందల మందికి స్వామి ఈ విషయాలు ఎంతో ఉద్వేగంతో వివరించి అందరినీ ఆ ఆశ్రమానికి తీసుకు వెళ్లారు. ఇప్పటికీ ఆగుడిలో శంకర్‌మహారాజ్ అలానే చిద్విలాసంతో ఉన్నారు. శంకర్‌మహారాజ్ దర్శనంతో అందరూ ఎంతో పులకించి పోయారు.
కొంతకాలం స్వామీజీ ఓంకారేశ్వర్ దగ్గర ఉన్న దట్టమయిన అడవులలో తపస్సు చేసుకునేవారు. ఒకసారి ఆయన ఊరిలోనికి వెళదాము అని లేచి నిలబడేసరికి ఒక భయంకరమయిన ఎలుగుబంటి స్వామి మీదకి రాబోయింది. అక్కడినుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఆయన అలా నిలబడి దాని వైపు చూడసాగారు. అది దగ్గరగా వచ్చి ప్రక్కనుంచి వెళ్ళిపోయింది. ఆయన సదా పరాశక్తి రక్షణలో ఉన్నారు అని మరొక సారి అర్థమయింది.
ఇలా చెబుతూ వెళితే ఎన్నో సంఘటను ఉన్నాయి స్వామీజీ తన శిష్యులకి ఎప్పుడూ ఒక విషయం చెబుతారు, నేను పరాశక్తిని నమ్మి, ఆ పరాశక్తి మీద భారం వేశాను. ఎప్పుడూ ఆ పరాశక్తి రక్షణలోనే ఉన్నాను, అని.
హిమాలయాలలో, పవిత్రక్షేత్రాలలో స్వామి కఠోర తపస్సు:
నిత్యానంద స్వామి భారతదేశం, నేపాల్లోని హిమాలయాలలో విసృతంగా పర్యటించారు. భారతదేశంలో కన్యాకుమారి మొదలు గంగోత్రి పైన హిమాలయాలలోని తపోవనం వరకూ, తూర్పున కలకత్తా మొదలు పడమట ద్వారక వరకూ స్వామీజీ అన్ని పుణ్యక్షేత్రాలు చూసారు. అన్ని నదులలో స్నానం చేసారు. ఎందరో మహాయోగులని, రుషులని, కలిసి వారి దగ్గర తాను నేర్చుకోవలసిన విద్యలన్ని నేర్చుకున్నారు. ఇలా తరతరాలుగా వస్తున్నా భారతీయ పుణ్యగ్రంధాలని, విద్యలని, శాస్త్రాలని అభ్యసించి వాటిలో అసమాన్య ప్రతిభని, నైపుణ్యాన్ని సాధించారు.
భారతదేశంలోని మహాయోగులు, అవతారపురుషులు, జ్ఞానోదయం పొందిన గొప్ప ఋషుల జీవిత చరిత్రను ఎంతో క్షుణ్ణంగా చదివారు. ఒకసారి ఆయన అనుకోకుండా గాసిపిల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ అనే ఆరువందల పేజీల గ్రంధాన్ని పది గంటలలో ఏక బిగిన చదివారు. ఆయన ఆగ్రంధం నిమగ్నమయిపోయి, ఆనంద పరవశులయి చదివారు. ఆగ్రంధం చదవటం పూర్తిచేసాకా ఆయనకి మాత శారదా దేవి, శ్రీరామకృష్ణ పరమహంస యొక్క దర్శనం లభించింది. వారు ఆయన శిరస్సు మీద చేతులు ఉంచి చిరునవ్వుతో హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఆక్షణం స్వామీ నిత్యానందా వారి ఇరువుని ఎంతో గౌరవంతో ప్రేమతో తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు.ఆయన శ్రీరామకృష్ణ చిత్రపటానికి పూజలు చేసి ఆరాధించేవారు.
స్వామి తన సత్యాన్వేషణలో మనస్సుకు నచ్చిన విధంగా ప్రయాణం చేసేవారు. ఆయన ఎక్కువ భాగం ఒంటరిగానే ప్రయాణించేవారు.ఆయన చిన్నతనం నుంచీ ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు. చెప్పులు లేకుండానే, ఒక జత బట్టలు, త్రిశూలం,కమండలం కొంచెం విభూది,కుంకుమతో ఆయన తిరిగేవారు.
కంటికి నచ్చిన చోట ఆగేవారు, ముఖ్యంగా ఎక్కడ అయితే ప్రకృతి అందముగా ఉంటుందో, ఆయన మనస్సుకి ఆహ్లాదం కలుగుతుందో అక్కడ ఆగేవారు. మనస్సుకి తృప్తి కలిగినంతకాలం అక్కడ తపస్సుచేసుకునేవారు. అక్కడ ఆయన కలవగలిన మహాత్ములని కలిసి,వరి దగ్గర తాను నేర్చుకోగల అన్నివిషయాలు క్షుణ్ణంగా నేర్చుకొని తిరిగి పరాశక్తి ఎటు తీసుకువెళితే అటు వెళ్ళేవారు. ఇలా ఆయన హిమాలయాలలో ప్రతి అణువు కాలినడకన తిరిగేవారు.
చిన్నతనంలో తనకు గురువులు నేర్పిన యోగసాధన పద్ధతులతో ఆకలి దాహం ఆయనని బంధించేవి కావు. దొరికిన రోజు భోజనం చేసేవారు. దట్టమయిన అడవులు,స్మసానాలు,నది ఒడ్డులు,పర్వతాలు ఇవే ఆయన తపో భూములు ఎక్కడ ప్రకృతి అందంగా ఉంటుందో,ఎక్కడ ప్రశాంతత అనిపిస్తుందో అక్కడ కొద్దికాలం ఉండేవారు.అవిధంగా ఆయన చాలామంది యోగులని, నాగా బాబాలని, మహాపండితులని కలిసారు.