KAILASA Library/ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?/ఆలోచనలు అంటే ఏమిటి?Sign in
ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?

ఆలోచనలు అంటే ఏమిటి?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ఈ ప్రశ్నికి పరమహంస నిత్యానంద శాస్త్రీయ నిరూపణతో వివరణని ఇస్తారు. ప్రతి వ్యక్తి నిరంతరం ఆలోచనల ప్రవాహంలో మునిగిపోయి ఉంటాడు. అసలు మనం నిరంతరం ఏమి ఆలోచిస్తాము? మీరు ఎప్పుడయినా ఒక్క క్షణమయినా ఆ విషయాన్ని గమనించారా?

“నేను ధ్యాన శిక్షణ కార్యక్రమాలు చేస్తుంటాను. అటువంటిదే నిత్యానంద స్ఫురణ అనే కార్యక్రమం. అందులో పాల్గొన్న వారిని ఒక పేపర్ పెన్ తీసుకొని ఐదు నిముషాలు కళ్ళుమూసుకుని కూర్చోమని చెబుతాను. ఆ ఐదు నిముషాలలో వారి ఆలోచనలని గమనించి వాటిని మార్పు చేయకుండా వ్రాయమంటాను. వాళ్ళు వ్రాసినవి ఎవరూ చదవరు, అందుకే మార్పు చేయకుండా వచ్చిన ఆలోచన వచ్చినట్టు వ్రాయమని చెబుతాను. ఐదు నిమిషాలు అయ్యాక పేపర్ చదువుకొని వారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచనలు అంత అర్ధంలేకుండా, ఒకదానికి ఒకటి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటాయి”. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరుక్షణంలో అమెరికాలో ఉన్న మీ బంధువు గురించి, ఆ తరువాత బజార్లో కూరలు, మరుక్షణంలో ఆఫీసు బాయ్, మీ బాస్ ఇలా దేనికీ సంబంధంలేని విషయాలు ఒక గొలుసులా, ఒక ప్రవాహంలా నిరంతరం మీ లోనికి వస్తుంటాయి. ఇవన్నీ ఒక రాశిలా ఏర్పడితే, దానినే మనస్సు అంటాము.

అంతరంగు మాటలు (Inner Chatler): ఈ ఆలోచనలకి మూలం మనం నిరంతరం మనలో మాట్లాడుకునే వ్యర్థపు మాటలు. ఆ మాటలు ప్రవాహానికి అంతం ఉండదు. ఆ మాటలకి అర్థం ఉండదు. ఉదా: మీ స్నేహితుడు మీ దగ్గరికి వచ్చి తనకి చాలా మంచి ఉద్యోగం వచ్చింది, అని చెప్పి, అతను తీసుకునే జీతం ఇతర సదుపాయాల గురించి చెప్పాడనుకోండి. దీనికి మీరు రెండు విధాలుగా స్పందించుతారు.

మొదటిది : చాలా సంతోషం, బాగుంది. అని

రెండవది : అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. జీతం, అలవెన్సులు అన్ని చాలా ఎక్కువ. అతను అదృష్టవంతుడు. ఈ విషయం నాభార్యకి తెలిస్తే ఏమనుకుంటుంది. నేనుకూడా కొత్త ఉద్యోగానికి ప్రయత్నించాలా? అదేమి కర్మోకానీ, నాకు ఏదీ కలసిరాదు. ఎప్పుడూ దురదృష్టం నావెంట ఉంటుంది. అసలు నా జాతకమే ..............ఇలా మాటలు సాగిపోతుంటాయి.

ఇవే మన ఆలోచనలు కూడా. ఇలా మనలో మనం మాట్లాడుకునే ఈ అర్థంలేని మాటలని విశ్లేషణ చేస్తే, మనకి చివరిలో అర్ధమయ్యే విషయం ఏమిటంటే, మన లోపల మనం ఒక పిచ్చి గృహాన్ని నడుపుతున్నాము అని. ఇదే మనలో అన్ని సమస్యలకి మూలం. ఇవన్నీ కలిపి మనలోపల ఒక గట్టి వ్యవస్థని ఏర్పరుచుతాయి. దానినే మనం మానసిక స్థితి అంటాము.

దేని గురించి ఈ ఆలోచనలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించితే అందరూ నిరంతరం దేనిని గురించి ఆలోచిస్తున్నారో అర్ధమవుతుంది. అందరూ తమ అంతరంగంలో మాట్లాడే మాటలు కాని, నిరంతరం ప్రవాహంలా వచ్చే ఆలోచనలు కాని, కేవలం భూతకాలానికి గాని, భవిష్యత్కి సంబంధించి ఉంటాయి. అవే ఆలోచనలు.

మనం నిరంతరం జరిగిపోయిన విషయాల గురించి మదన పడుతుంటాము లేదా, అపరాధ భావంతో ఉంటాము. అలా ఎందుకు జరిగింది, ఈవిధంగా జరిగితే ఎంత బాగుండేది, నేను ఎందుకు అలా మాట్లాడాను. నేనేనా ఆ తెలివితక్కువ నిర్ణయం చేసింది. ఇది ఎలా సాధ్యం, అసలు నాకు అప్పుడు ఏదో జరిగింది. ఈ విధంగా జరిగిపోయిన విషయాల గురించి మనలో ఉండే శక్తినంతా ఉపయోగించి వృధ చెందుతుంటాము.

లేదా, భవిష్యత్లో ఏమి జరుగుతుందో అని ఆత్రుత పడుతుంటాము. మీరు ఒక్కసారి మీ దిన చర్యని గమనించండి. మీరు ఉదయాన్నే నిద్రలేచి పళ్ళుతోముకుంటూ, 9 గం॥ ఆఫీసుకు వెళ్ళే విషయం, బస్సు దొరుకుతుందా లేదా, కారు డ్రయివర్ సమయానికి వస్తాడా రాడా అని ఆలోచిస్తుంటారు. ఆఫీసుకు వెళ్ళి మీ సీట్లో కూర్చోగానే లంచ్ టైం గురించి, మధ్యాహ్నం భోజనంలో కూర గురించి లేదా భోజనం చేసేటప్పుడు కోలీగ్తో ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తారు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో, సాయంత్రం జరగబోయే మీటింగ్ సంగతి ఆలోచిస్తుంటారు. మీటింగులో కూర్చొని సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సు దొరుకుతుందో లేదో, లేదా ట్రాఫిక్ జామ్ గురించి ఆలోచిస్తారు. ఇంటికి వెళ్ళి కుర్చీలో రిలాక్స్ అవుతూ రేపు ఆఫీసులో జరగబోయేథ విషయాల గురించి లేదా మరో విషయం గురించి ఆలోచిస్తుంటారు.

దీని అర్ధం ఏమిటంటే, మీరు నిరంతరం భూతకాలంలోనో లేదా భవిష్యత్లోనో ఉంటారు. అలా చేయటం వలన మీరు ఏమి పోగోట్టుకుంటున్నారు? అత్యంత విలువయిన ఈ క్షణాన్ని పోగోట్టుకుంటున్నారు. ఈ క్షణాన్ని మీరు ఎప్పుడూ ఆనందముగా అనుభవించటం లేదు. ఈ క్షణంలో మీరు చేస్తున్న పని యొక్క అనుభూతిని పూర్తిగా మిస్ అవుతున్నారు. అందుకే మీరు నిరంతరం ఆశాంతిగా, అసహనంగా (distrubed) ఉంటారు.

మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఒక పెద్ద రాజ్యానికి చక్రవర్తి ఒక రోజు వేటకి అడవి లోపలికి వెళ్ళి దారి తప్పుతాడు. అతడు గొప్ప ఐశ్వర్యవంతమయిన, విశాలమయిన మహారాజ్యానికి చక్రవర్తి. ఆయన యువకుడు, మహా మేధావి. అతను అలా వెళ్ళి వెళ్ళి ఒక ముని కుటీరానికి చేరుతాడు. అక్కడ ఉన్న ముని శిష్యులు ఆ చక్రవర్తికి అతిధి మర్యాదలు చేస్తారు. చక్రవర్తికి, గురుదేవులకి భోజనం వడ్డిస్తారు. ఆ చక్రవర్తి వారి గురువు అయిన రుషిని పరిశీలనగా చూస్తాడు. రుషిని అతనిలో పొంగి ప్రవహిస్తున్న మహానందాన్ని చూసి చక్రవర్తి ఆశ్చర్యపోతాడు. రుషి అంత ఆనందంగా అంత ప్రశాంతంగా, తృప్తిగా ఉండటానికి గల కారణం, ఈ మేధావికి అంతుపట్టలేదు. పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అయి ఉండే, ఎంతో ఐశ్వర్యంతో తులతూగే తనకి ఎప్పుడూ అంత ఆనందం కలగలేదు కదా! అని అనుకుని, చక్రవర్తి ఎంతో వినయంగా ఆ రుషిని ఇలా అడుగుతాడు, “గురుదేవా ! మీరు ఇంత ఆనందంగా, ప్రశాంతంగా, తృప్తిగా ఎలా ఉండగలుగుతున్నారు. నాకు సర్వసంపదలు, అన్ని ఐశ్వర్యాలు అంతలేని ధన ధాన్యరాసులు ఉన్నాయి.గొప్ప సామ్రాజ్యానికి చక్రవర్తిని, కానీ నాకు తెలిసి నేను ఎప్పుడూ కనీసం కొంత సమయమయినా మీలో కనపడే ఆనందం, తృప్తి, ప్రశాంతతో ఎప్పుడూ లేను. దాని కారణం ఏమిటి? అని అడుగుతాడు.

చక్రవర్తి ప్రశ్నకి ఒక చిన్న నవ్వు నవ్వి, “మహారాజా! ఇది చాలా సామాన్యమయిన చిన్న విషయం. నేను భోజనం చేసే సమయంలో భోజనమే చేస్తాను. నిద్రించే సమయంలో నిద్రిస్తాను.అదే రహస్యం” అంటాడు.

చక్రవర్తి ఆ రుషి నుంచి గొప్పగొప్ప తాత్వాలని, పెద్ద ప్రసంగాన్ని లేదా ఏవో ఉపనిషత్తులని చెపుతాడు అని ఆశిస్తాడు. అంత గొప్ప రుషి ఆ విధంగా అనగానే చక్రవర్తికి ఆశాభంగం కలిగి విసుగువస్తుంది. అతను గురువుతో, “గురుదేవా ! నేనుకూడా అదే చేస్తున్నాను కదా! అంటాడు.”

అప్పుడు గురుదేవులు ” లేదు మహారాజా! నీవు భోజనం చేసేసమయంలో, నీరాజ్య పాలనా లేదా నీ సభలోని సమస్యల గురించి ఆలోచిస్తువుంటావు. నీవు నిజంగా భోజనం చేయవు. అదేవిధంగా నిదురించే సమయంలో రేపటి కార్యక్రమాలు, సమస్యల గురించి ప్రణాళికలు వేస్తువుంటావు కాని నిదురించవు. అదే నీ అశాంతికి కారణం" అంటాడు. మహామేధావి అయిన చక్రవర్తికి వెంటనే తన లోపం అర్థం చేసుకొని, తనకి చక్కని జ్ఞానాన్ని ఇచ్చిన గురుదేవుని పాదాలకి నమస్కరించి ఎంతో ఉత్సాహంగా తన నగరానికి తిరుగు ప్రయాణం అయి వెళతాడు.

అందరూ కూడా ఆ చక్రవర్తి ఉన్న పరిస్థితిలోనే ఉంటారు. ప్రతి క్షణం గడచిపోయిన కాలానికి, భవిష్యత్ కాలానికి మధ్య తిరుగుతూ ఉంటారు. కాని ఒక్కక్షణమయినా వర్తమానంలో ఉండరు. ఎప్పుడయితే మీరు పూర్తిగా వర్తమానంలో ఉంటారో ఆ క్షణంలో మీ ఆలోచనలు సున్నా స్థాయికి (Zero state) పడిపోతాయి. ఆక్షణంలో మీరు పరమానందాన్ని అనుభవించుతారు. వర్తమానంలో ఉండగలిగితే ప్రతి క్షణం పరమానందమే. ప్రతి నిమిషం ఒక ఉత్సవంలా ఉంటుంది. అప్పుడే మీరు ఈ అద్భుత సృష్టిలోని అందాలు చూసి ఆనందించగలుగుతారు. అటువంటి స్థితిలోనే మీరు సర్వాంతర్యామికి అనుగుణంగా, ఒక చైతన్య స్రవంతిలా సాగిపోగలుగుతారు.

ఆ క్షణంలో పూర్తి వర్తమానంలో ఉండగలగడానికి ధ్యానం సహాయం చేస్తుంది. ధ్యాన సాధనతో అందరూ ఆస్థితిని చేరవచ్చు ఆలోచనలు లేని వర్తమాన స్థితిలో ఉన్నప్పుడు మీకు అనంతమయిన భూత భవిష్యత్ కాలాలు అందుబాటులో ఉంటాయి. జ్ఞానోదయమయిన యోగులు, రుషులు ఉండేది ఆ స్థితిలోనే. వారు ఎప్పుడు భూత భవిష్యత్ కాలాలలో ఉండరు. వారికి ఆలోచనలు అనేవి ఉండవు. వారు అంతరంగం నిశ్శబ్దంగా ఉంటుంది. అంతరంగంలో వారితో వారు మాట్లాడుకోవటం అనేది ఉండదు. అందుకే వారు నిరంతరం పరమానందంలో ఉండగలుగుతారు. నిత్య చైతన్యంతో సర్వాంతర్యామికి అనుగుణంగా, సర్వసృష్టితో సమానంగా జీవించగలుగుతారు. అందుకే వారు నిత్యం శాశ్వతమయిన పరమానంద స్థితిలో ఉంటారు.

పరమహంస శ్రీ నిత్యానంద

ఆనంద స్థితి అంటే ఏమిటి ?

మనలో ప్రతి ఒక్కరూ కోరుకునేది సర్వసామాన్యమయిన కోరిక, సర్వమానవాళి వెతికేది ఆనందం. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎన్ని కీర్తి ప్రతిష్ఠలు పొందినా అన్నింటి ధ్యేయం ఆనందంగా ఉండటం. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రతి క్షణం ప్రయత్నించేది ఆనందం కోసం. మరి ఎందుకు అందరూ ఎప్పుడూ ఆనందంగా ఉండరు? ఎందుకు మానవ జీవితాలు సంతోషం, దుఃఖం అనే రెండు భావోద్రేకాల మధ్య లోలకం ఊగినట్టగా ఊగుతుంటుంది. అప్పుడే ఎంతో సంతోషంలో ఉంటారు. మరి కాసేపు కాగానే దుఃఖంలో మునిగి పోతారు. ఎందుకు శాశ్వతంగా ఆనందస్థితిలో ఉండలేము?

ఈ ప్రశ్నకు పరమహంస శ్రీ నిత్యానంద చెప్పేజవాబు, మీకు కావలసిన ఆనందం మీ అంతరంగపు లోతులలో ఉన్నది. దానిని తెలుసుకోగలిగే పద్ధతి ధ్యానం. ఆ ఆనందాన్ని చేరే నమ్మకమయిన మార్గం ధ్యానం. ఆ ఆనందం యొక్క అనుభూతిని సొంతం చేసుకోగల శక్తి ధ్యాన శక్తి. ధ్యానసిద్ధి ఆనందస్థితికి అతి సులభమయిన, పూర్తిగా నమ్మకమయిన దారి.

ధ్యానం మనపై ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది? అసలు ధ్యానానికి మనిషికి మధ్య

ఉన్న సంబంధం ఏమిటి ? ఈ ప్రశ్న మన అందరిలో సామాన్యంగా ముందు వస్తుంది. ఈ ప్రశ్నకు పరమహంస నిత్యానంద చక్కని వివరణని ఇస్తారు. స్వామీజీ ఈవిధంగా చెబుతారు.

ఆనందం మనిషి యొక్క సహజ లక్షణం. దానికోసం మనం నిరంతరం వెతుకుతున్నాము. ఎందుకు? ఎందుకంటే తైత్తేయ ఉపనిషత్తులో ఒక అందమయిన, అర్థవంతమయిన శ్లోకం ఉన్నది.

శ్లోకం : ఏతాస్ ఆత్మనః ఆకాశ్య సంభూతః
ఆకాశత్ వాయుః, వాయోర్ అగ్నిః
అగ్నిర్ అపాః, అపాః పృధ్వి
పృధ్వీర్యో ఔషధః .......

ఈ శ్లోకం ద్వారా మనకి ఏమి తెలుస్తుంది అంటే, ఈ విశ్వం పంచభూతాలయిన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం తో నిర్మించబడినది. ఈ అయిదూ సర్వసృష్టిలో ఒక భాగమయిన మనిషి కూడా ఈ పంచభూతాలతోనే సృష్టించబడ్డాడు. మానవాళి పంచభూతాల సమ్మేళనం. కాబట్టి పంచభూత నిర్మితమయిన మనిషి నిరంతరం తన మూలాల వైపుకే ఆకర్షితుడవుతారు. తన మూలాలతో సంబంధం నెలకోల్పాలనే తీవ్రమయిన ఆకాంక్ష అతనిలో జ్వలిస్తూ ఉంటుంది.

తన మూలాలతో ఐక్యo అవ్వాలి అనే కోరికని వివిధ పద్ధతులలో సాధించుతుంటాడు. ఈ ఐదు శక్తులతో ప్రత్యక్ష సంబంధాన్ని రకరకాలుగా నెలకొల్పుతుంటాడు. విగ్రహారాధన చేయటం ద్వారా మనిషి భూమి యొక్క శక్తికి దగ్గరవుతూ దానికి అనుగుణంగా ఉంటాడు. పవిత్రమయిన నదులలో స్నానం చేయటం ద్వారా జల శక్తికి దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు. అందుకే నదీ స్నానానికి అంత ఉత్సాహాన్ని చూపుతాడు.

హోమాలు, యజ్ఞాలు చేయటం ద్వారా అగ్నితో సంభాషణచేస్తాడు. అగ్నితో సంబంధాలని నెలకొల్పుకుంటాడు.మంత్రాలు జపించటం ద్వారా వాయుశక్తికి సన్నిహితమవుతారు.

ఇక మిగిలిన అయిదవ అంశం ఆకాశ శక్తి. అది అతి సూక్ష్మమయిన అత్యున్నతమయిన శక్తి. ఆశక్తిని ఇటువంటి పద్ధతుల ద్వారా, బాహ్య ప్రపంచం ద్వారా చేరలేము. మన అంతరంగ ప్రపంచం ద్వారా ఆ శక్తిని చేరగలము. దానిని మన అంతరంగంలో మాత్రమే అనుభవించగలం. అటువంటి ఉన్నతమయిన ఆకాశ శక్తితో సంబంధాన్ని ఏర్పరచుకోగలం, ఆ అత్యున్నత శక్తిని తెలుసుకోగలం, దానిని చేరగలం.

మనం ఎప్పుడయితే ధ్యానంలోనికి ప్రవేశించుతామో, అప్పుడు ఈ పంచభూతాలను చేరాలి అనే సంకల్ప వృత్తం పూర్తి అవుతుంది. అప్పుడు మనలో ఇంతవరకూ కనపడకుండా పోయిన బంధం (link) కనపడుతుంది. ఆ బంధమే మనకి మన మూలాలకి సంబంధాన్ని నెలకొల్పే కీలక బంధం. ఎప్పుడయితే ఈ వృత్తం పూర్తి అవుతుందో అప్పుడే మనం మన మూలాలని చేరగలుగుతాము. అప్పుడే మనం సంపూర్ణ తృప్తిని పొందుతాము. మనం ఒక చక్కని భద్రతా భావాన్ని పొందుతాము. ఎప్పుడయితే తృప్తి, భద్రతా భావం కలుగుతాయో, అప్పుడే మనం మనకి కావలసిన నిజమయిన ఆనందాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందుతాము . సంపూర్ణమయిన అనుభూతి ఆ ఆనందాన్ని ఇస్తుంది. అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. అందుకే మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆనందంలో ఉండగలము.

కాబట్టి మనం బలంగా కోరుకునే ఆనందం అంటే, ఏమిటి అంటే మన మూలాలకి మనం చేరాలి అనే తపన. ఆ కారణం వలననే మనం మనకి తెలిసి కాని తెలియక గాని నిరంతరం ధ్యానం చేయాలి అనే కోరికని మనలోపల నింపుకొని తిరుగుతుంటాము. ఈ విధంగా ధ్యానానికి, మనిషికి విడదీయలేని అవినాభావ సంబంధం జన్మతః ఉంటుంది.

అయితే నేను కూడా ధ్యానం నేర్చుకోగలనా ?

ఈ ప్రశ్నకి పరమహంస చాలా చిన్నది కాని చాలా సూటిగా మనకి అర్థమయ్యి మనని ఆశ్చర్యంలో ముంచే ఒక జవాబు చెబుతారు.

నీవు ధ్యానం నేర్చుకోనవసరంలేదు. ఎందుకంటే నీవు ధ్యానివి.

ధ్యానం ప్రతి మనిషికి ఉండే ఒక అందమయిన సహజ లక్షణం. మనం మన జీవిత కాలంలో, మన దైనందిన జీవితంలో ఎన్నోసార్లు ధ్యాన స్థితిలోనికి వెళుతుంటాము. ఈ విషయం మీద పరమహంస నిత్యానంద ఈ విధంగా చెబుతారు;

మీరు ఎప్పుదయినా ఒక అద్భుతమయిన అందాన్ని చూసి, ఆ ఆనందపు అనుభూతిలో ఉన్న క్షణాలని గుర్తు చేసుకోండి. చాలా అందమయిన గులాబీ పూవుని చూసిన క్షణంలో ఆ అందాన్ని చూసిన అనుభూతి గుర్తు చేసుకోండి. ఆక్షణంలో మీరు నిశ్చలంగా అయిపోతారు. ఆ అందాన్ని చూస్తూ కొన్ని క్షణాలు ఆలోచనలు లేని నిశ్శబ్దంలోనికి వెళ్ళిపోతారు. ఆ క్షణాలు మీరు ధ్యానంలో ఉన్నట్టే. ఆ కొన్ని క్షణాలు మీరు మీ అంతరంగంలోని మాటలని ఆపివేస్తారు. అప్పుడు మీరు ఉన్న స్థితి ధ్యానం.

అయితే ఈ స్థితి మీకు కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. అది చాలా తక్కువ సమయం. వెంటనే మీలోనికి మీ మాటలు, ఆలోచనలు వచ్చేస్తాయి. ఆహా ! గులాబీపువ్వు ఎంత అందంగా ఉన్నది. అనుకుని వెంటనే ఆ రంగు, ఆ పువ్వు సువాసన, వీటిని పోల్చడం మొదలు పెడతారు. క్రమంగా ఇదివరకు మీరు చూసిన అటువంటి గులాబీని, దానిని మీకు ఇచ్చిన వ్యక్తి, ఆనాటి సంఘటనలు ఈ విధంగా ఆలోచనలు ప్రవాహంలో మీరు పూర్తిగా మునిగి పోతారు. ఎప్పుడయితే ఇలా ఆలోచనలు, అంతరంగపు మాటలు మొదలవుతాయో మీరు ధ్యానంలోంచి బయటికి వచ్చేసారు అని అర్థం.

కాబట్టి స్పష్టంగా అర్థం చేసుకోండి, ధ్యానం అంటే మీరు గులాబీ అందాన్ని చూడగానే పొందిన నిశ్చల స్థితిలో ఉండటం. మీ అంతరంగంలో నిశ్శబ్దంగా ఉండటం. అందుకే నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను, ధ్యానం అంటే మీరు ఏదో చేయటం కాదు. అది ఒక పనికాదు. అది అనుభవం.కాబట్టి మీరు ధ్యానాన్ని చేయరు, ధ్యాన స్థితి లోనికి వెళ్ళగలుగుతారు. ఆ స్థితి యొక్క అనుభవాన్ని పొందుతారు.

స్పష్టంగా అర్థం ధ్యానం అంటే ఏదో ఒకటి చేయటం కాదు. చేసే పనులు (actions), చర్యలు వదిలివేయటం .ఆలోచనలు కూడా ఒక పనే, వాటిని కూడా వదిలివేయటమే ధ్యానం. అంతేకాని భౌతికంగా చేసే కొన్ని చర్యలు ధ్యానం కాదు. అవి ధ్యానస్థితికి తీసుకెళ్ళగల పద్ధతులు మాత్రమే.

ధ్యానం అంటే మీలోని ఆలోచనలు, భావాలు, మీరు చేస్తున్న పనులు అన్ని మీనుంచి వెళ్ళిపోయాక మిగిలిన మీరు ఉండే స్థితి. అంటే ఇవేమీలేకుండా అసలయిన మీరు మాత్రమే, మీ నిజమయిన ఉనికితో మీరు ఉన్న స్థితి ధ్యానం. ఇందాక నేను చెప్పిన కథలో గురుదేవులు ఏవిధంగా అయితే ప్రతిక్షణం వర్తమానంలో ఉంటారో, ఆ విధంగా వర్తమానంలో ఉంటూ ఆ అనుభవాన్ని పొందటమే ధ్యానం.