అయితే ఇన్ని ధ్యాన పద్ధతులు ఎందుకు ?
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ఇది సరియైన ప్రశ్నే. మనకి చాలా ధ్యానపద్ధతులు ఉన్నాయి. అయితే ఈ ధ్యాన పద్ధతుల ద్వారా మీరు ధ్యానాన్ని సాధించలేరు. ఈ ధ్యాన పద్ధతులు ధ్యానం యొక్క అవసరాన్ని మీకు గుర్తు చేస్తాయి. ధ్యానంలోనికి ప్రవేశించటానికి మీకు కొంత సహాయకారిగా ఉంటాయి. లోతు ఎంతో తెలియని, ఆవలి ఒడ్డు లేని మహాసముద్రం వంటిది ధ్యానం. అటువంటి సముద్రంలోనికి ఈ తరంవారు ఏవిధంగా వెళ్ళగలుగుతారు? ముందుగా ఈత తెలిసిన ఈతగాళ్ళ దగ్గర నీళ్ళలోనికి ఎలా దిగాలో తెలుసుకుంటారు. అదేవిధంగా లైఫ్ జాకెట్స్ వేసుకుంటారు. అప్పుడు మీరు నీళ్ళలో మునిగిపోరు. క్రమంగా ఈడటం నేర్చుకుంటారు. ఈత వచ్చాక ధైర్యంగా నీళ్ళలోనికి దిగుతారు.అప్పుడు లైఫ్ జాకెట్స్ తో అవసరం ఉండదు.
ఈ సందర్భంలో ధ్యానంలోనికి ప్రవేశించటానికి, ధ్యాన పద్ధతులు మనకి లైఫ్ జాకెట్లుగా ఉపయోగపడతాయి. మనకి ధైరాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఒక్కసారి మీకు ధ్యానమే మీ జీవితంగా మారిపోగానే ఈ పద్ధతులు లైఫ్ జాకెట్లు, ఈతగాళ్ళు, అన్నింటినీ వదిలివేస్తారు. అప్పుడు వాటి అవసరం ఉండదు. కాబట్టి ధ్యానంలో కొత్తగా ప్రవేశించాలి అని అనుకునేవారికి ఈ ధ్యానపద్ధతులు అవసరం. నేను మీకు మరొకసారి గుర్తుచేస్తున్నాను, ధ్యానం అనేది సాధించే విషయంకాదు. దానిలోనికి ప్రవేశించి దానిని అనుభవించే స్థితి మాత్రమే. మీరు ధ్యానం నేర్చుకోనవసరం లేదు. మీరు జన్మతః ధ్యానులు. మీ జీవితంలో చాలా సార్లు ఆ ధ్యానస్థితిలోనికి వెళ్ళినవారే. అయితే తెలిసో తెలియకో ఆస్థితిలో ఎక్కువసేపు ఉండలేరు. మీరు దానినుంచి వచ్చేస్తారు. ధ్యానపద్ధతులని సాధన చేస్తే, ఆ స్థితిలో ఉండగలగటం తెలుస్తుంది.