ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?
ఇప్పుడు మనం ఏమి చేయాలి?
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ముందుగా మీ ఆలోచనలని జాగ్రత్తగా గమనించండి. మీ లోపలికి ఆలోచనలు వస్తున్నప్పుడు మీలో ఏమి జరుగుతున్నదో గమనించండి. వ్యతిరేకపు ఆలోచనలయిన కోపం భయం, అత్యాశ, అసూయ ఇటువంటివి కలిగినప్పుడు,వెంటనే మీరు చాలా అసౌకర్యంగా అయిపోతారు. అది మీకు స్పష్టంగా తెలుస్తుంది. అదే విధంగా మీ అహంకారం బయటికి వచ్చే అహంకారపూరితమయిన ఆలోచనలు వచ్చినపుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు సౌకర్యంగా, ఆహ్లాదంగా ఉంటారు.జాగ్రత్తగా వాటిని గమనించి మీకు అసౌకర్యం, ఇబ్బంది కలిగించే ఆలోచనలని వదిలివేయండి. మీకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే మంచి ఆలోచనలని మాత్రమే పోగుచేయండి. అప్పుడు మీరు సౌకర్యంగా ఉండగలుగుతారు.