ఆలోచనలకి మనని మార్చే శక్తి ఉన్నది :
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
పరమహంస నిత్యానంద ఈ ఆలోచనలు మనని ఎలా ఆడిస్తాయో చక్కగా చెబుతారు. ఒకదానికి ఒకటి సంబంధం లేని ఆలోచనలకి లింకులు ఏర్పరచి దానిలో అర్థాలు వెతికి సమస్యలు మనమే సృష్టించుకుంటాము. స్వామి ఇలా చెబుతారు, మీరు ఏకాగ్రతలో, తెలుసుకునే తత్వంతో మీ సమస్యని గమనించండి. ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
అంతేకాకుండా మనం బాధపడాలి అని అనుకుంటే ఈ ఆలోచనల ప్రవాహం నుంచి బాధ కలిగించే వాటినన్నిటినీ జాగ్రత్తగా పోగుచేసి, వాటికి లింకులు పెట్టి, అప్పుడు బాధలతో నిండిపోతాము. సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఈ ఆలోచనల నుంచి, సంతోషం కలిగించే ఆలోచనలని పోగుచేసి, సంతోషంగా ఉంటాము. మన భాషలో మనం అనుకునే సంతోషం, బాధ అంటే ఇదే.
మీకు చెబుతున్నాను. స్పష్టంగా అర్థం చేసుకోండి. ఆలోచనలకి చాలా శక్తి ఉన్నది. అది మిమ్మలని, మీ జీవితాలని మార్చగలవు. అవి మీ మానసిక స్థితిని మీ జీవన సరళిని పూర్తిగా మార్చివేయగలవు. ఉదాహరణకి : మీరు నిరంతరం అందమైన ఆలోచనలతో ఉంటే మీ జీవితం అందంగా అవుతుంది. మీ ఆలోచనలన్నీ ఆహ్లాదకరంగా ఉంటే జీవితం చాలా ఆహ్లాదంగా ఉండటాన్ని మీరు గమనించగలుగుతారు.