KAILASA Library/ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?/ఆలోచనలని కేవలం గమనించండి :Sign in
ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?

ఆలోచనలని కేవలం గమనించండి :

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ఆలోచనలు వస్తుంటాయి. పోతుంటాయి మీరు వాటిని ఆపాలి అని చూడవద్దు. మీరు అలా అనుకున్నప్పుడు ఆలోచనలని ఎలా ఆపాలి అనే సమస్య మీకు ఉన్నసమస్యలతో పాటు మరొక సమస్యలా మీ ముందుకి వస్తుంది. అంతేకాకుండా ఆలోచనలని ఆపాలి అని అనుకొని బలవంతంగా ఆపితే అవి మరింత విజృంబించి మరిన్ని ఆలోచనలు మీ లోపలికి వస్తాయి.

కాబట్టి ఆలోచనలని ఆపాలి అని చూడవద్దు. మీ లోపలికి వచ్చే ఆలోచనలని అలా గమనించండి. అంతే అవి వస్తుంటాయి. పోతుంటాయి. వాటికి చిరునవ్వుతో అలా గమనించండి. వాటిని అర్థాలు వెతకకండి. అలాగే ఒక దానికి మరొక దానితో లింకులు పెట్టకండి. ఎప్పుడైతే మీరు ఒక పరిశీలకుడిగా మారతారో అప్పుడు ఆలోచనల ప్రవాహం యొక్క వేగం తగ్గుతుంది. క్రమంగా ఆలోచనల సంఖ్య కూడా తగ్గుతుంది.

ఇప్పుడు మీరు లోతుగా,ఏకాగ్రతతో ఆలోచనలు ఎక్కడ నుండి వస్తున్నాయో గమనించండి. అవి మీ అచేతన స్థితి నుంచి రావటం గమనించుతారు. ఇప్పుడు మీరు మీ అచేతన స్థితిలోని ఆలోచనలని మార్చటానికి ప్రయత్నించండి. అవి మీ చేతనస్థితిలోని జీవితం పైన ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకి మీకు కోపం తగ్గించుకోవాలి అని ఉన్నదనుకోండి. మీరు నిద్రపోయే ముందు మీ మైండ్కి (మనస్సుకి) కోపం తగ్గించుకోమని సూచనని ఇవ్వండి. ఆ విధంగా పదే పదే అదే సూచనని మైండ్కి ఇవ్వండి. కొంతకాలంలోనే మీరు ఆశ్చర్యపోయేంత మార్పు మీలో కలుగుతుంది. మీలో కోపం బాగా తగ్గిపోతుంది.

స్వామి చివరిలో ఈ విధంగా చెబుతారు. మీరు కేవలం పరిశీలకునిగా మారినప్పుడు, మీ ఆలోచనలు, దానితో ఏర్పడిన మీ మైండ్ (మనస్సు) మీచేతిలో ఒకపనిముట్టుగా మారిపోతుంది. అప్పుడు దానిని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే మీరు మైండ్ని మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చిన ప్రకారం వాడటానికి అలవాటుపడతారో, అప్పుడు మీరు దానిని (ఆలోచనలని) సులభంగా వదిలివేయగలరు.

బాగా గుర్తుంచుకోండి, ఆలోచనలని అణచవద్దు. అలా చేస్తే అవి సరాసరి మీ మణిపూరక చక్రంలోనికి వెళతాయి. అవి క్రమంగా మీలో వ్యతిరేక భావాలని కలిగించుతాయి. ఈ వ్యతిరేక భావాలే చాలా సమస్యలకి కారణం. కాబట్టి మీ ఆలోచనలని ఒక పరిశీలకునిగా మారండి. ఆ తరువాత జరగవలసినది మీకు అనుకూలంగా జరుగుతుంది.

మీ భావావేశాల మీద పనిచేయండి :

మన అందరిలో రకరకాల భావావేశాలు ఉంటాయి. వాటిలో కొన్ని వ్యతిరేక భావాలు, కొన్ని అనుకూల భావాలు. భావావేశాల గురించి పరమహంస నిత్యానంద ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుతారు. ఉదాహరణకి ఆనందస్ఫురణ అనే ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని పరమహంస ప్రత్యేక శ్రద్ధతో రూపొందించారు. ఇందులో మన వ్యతిరేక భావావేశాలు అవి మన జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. ఆయన ముఖ్య ప్రవచనాల నుంచి కొంత తెలుసుకుందాము. ఈ భావావేశాల గురించి స్వామీజీ ఈ విధంగా చెబుతారు.

మనలోని భావావేశాలే మన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. మన భావావేశాలు ఎలా ఉంటే మన జీవితం, మన చుట్టుపక్కల ఉండే ప్రపంచం అదే విధంగా ఉంటుంది. మనలోని భావాలు స్పష్టంగా, అనుకూలంగా ఉంటే ప్రపంచం మనకి అనుకూలంగా ఉంటుంది. సర్వసృష్టి, సర్వాంతర్యామి అనుకూలమవుతారు. ఉదాహరణకి మీరు ప్రేమతో నిండి ఉంటే, మీరు ఎక్కడ అయినా ప్రేమనే చూడగలుగుతారు. మీరు ద్వేషంతో నిండి ఉంటే మీకు ప్రపంచంలో ద్వేషమే కనిపిస్తుంది. ఆ ద్వేషమే మీ దగ్గరకి ఏదో ఒక రూపంలో వస్తుంది. అప్పుడు మీరు ద్వేషాన్నే స్వీకరించుతారు.

ఇది సత్యం. అయితే ఈ విషయాన్ని మనం ఒప్పుకోము, అర్ధం చేసుకోము. స్పష్టంగా అర్ధం చేసుకోండి మీ జీవితాలలోని నాణ్యతకి పూర్తి బాధ్యత మీదే. మీలోని భావాలు మిమ్మలని అంతగా ప్రభావితం చేస్తాయి.

మనలో ఉండే సాధారణమైన వ్యతిరేక భావాలు, కోరిక, భయం, వ్యధ, అసూయ, అసంతృప్తి, అత్యాశ, అహంకారం, స్వార్థం మొదలయినవి. మనలోని అనుకూల భావాలు ప్రేమ, కరుణ, కృతజ్ఞతా భావం, నిస్వార్ధం మొదలయినవి.

మనలో వ్యతిరేక భావావేశాలు అధికంగా ఉంటే అవి నేరుగా మనలోని చక్రాలని కల్మషం చేసి వాటిని చిన్నవిగా కుంచించుకుపోయేలా చేస్తాయి. ఉదాహరణకి వ్యధలు,బాధలు, మణిపూరక చక్రాన్ని బంధించివేస్తాయి. భయం, స్వాధిష్టాన చక్రాన్ని బంధించి వేస్తుంది. అసూయ విశుద్ధి చక్రాన్ని శక్తిహీనం చేస్తుంది. అహంకారం ఆజ్ఞ చక్రాన్ని చైతన్య రహితం చేస్తుంది. పరమహంస వీటికి ప్రత్యేకమయిన ధ్యానపద్ధతులని రూపొందించారు.

ఇక్కడ మీరు చేయవలసినది ఏమిటి అంటే :ముందుగా మీలోని భావావేశాలని జాగ్రత్తగా గమనించండి. అందులో వ్యతిరేక భావాలు, అనుకూల భావాలు అన్నీ ఉంటాయి. అదే విధంగా శక్తివంతమయినవి, తక్కువ శక్తి గల భావాలు ఉంటాయి. ముందుగా మీరు మీలోని శక్తివంతమయిన భావాలని గమనించండి. మీలోని భావావేశాలని క్షుణ్ణంగా పరిశీలింటే ఇవి మీకు అర్థమవుతాయి.

ప్రతిరోజు మనలో మంచి ఆహ్లాదకరమయిన భావాలు, అనుభవాలు ఉంటాయి, అదే విధంగా మనకి నచ్చనవి, మనని నొప్పించే భావాలు, అనుభవాలు ఉంటాయి. రోజు చివరిలో ఎవరయినా మనని ఈ రోజు నీ అనుభవాలు ఏమిటి అనగానే మనకు నచ్చనివి, మనని బాధపెట్టినవే గుర్తువస్తాయి. మీ డ్రస్ మీద కాఫీ పడటం, ట్రాఫిక జామ్, ఆఫీసులో కొలిగ్తో చిన్న గొడవ, రిపోర్టులో వ్రాసిన తప్పు, దాని మీద బాస్ కామెంట్ ఇలాంటివే గుర్తువస్తాయి. కానీ వాటితో పాటు నిద్రలేవగానే చూసిన అందమయిన సూర్యోదయం, అంతకంటే అందమయిన చిరునవ్వుతో భార్య అందించిన కాఫీ, గార్డెన్లో కూర్చొని విరబూసిన మందారాలని చూస్తూ తాగిన కమ్మటి కాఫీ, బుజ్జిపాపతో ఆడిన ఆటలు, హాయిగా షవర్ క్రింద చేసిన స్నానం, ఆఫీసులో స్నేహితులతో పంచుకొని తిన్న కమ్మటి ఆవకాయ పప్పు అన్నం, ఇవన్నీ ఆహ్లాదకరమయిన మంచి భావనలు. మరి ఇవి మనకి రోజు చివరిలో గుర్తురావు.

పరమహంస నిత్యానంద కొన్ని శిక్షణ కార్యక్రమంలో ఇలా చెబుతారు. మీరు 24 గంటల సేపు కేవలం మీకు జరిగిన మంచి విషయాలని మీ మనస్సుకి ఆహ్లాదాన్ని ఇచ్చిన విషయాలని మాత్రమే పదే పదే గుర్తు చేసుకోండి. ఆ మంచి విషయాలు జరిగినందుకు కృతజ్ఞతని తెలియచేయండి. అలా 24 గంటలు తరువాత మీలో వచ్చే మార్పుని మీరే ఆశ్చర్యపోతారు. కృతజ్ఞత తెలియచేయటం కూడా ధ్యానమే. సుఫీ మతంలో కృతజ్ఞతని తెలియజేచేసే ప్రత్యేక ధ్యాన పద్ధతి ఉన్నది. అది సహస్రార చక్రాన్ని చైతన్యం చేసి, శక్తివంతం చేస్తుంది.

అదే విధంగా మీలోపలకి నిరంతరం వచ్చే వ్యతిరేకభావాలని అనుకూల భావాలుగా మార్చటానికి ప్రయత్నించండి. మీరు ధ్యానం చేయటం ద్వారా మీలో స్థిరపడిపోయిన వ్యతిరేక భావాలని, గట్టిపడిపోయిన వ్యతిరేకపు ఆలోచనలని కరిగించి వేయవచ్చు. ఆ తరువాత కొత్త భావాలని మీలో స్థిరపడనీయకండి. మీ ఆలోచనలని, భావాలని, సంతోషం, ఆహ్లాదంతో నింపితే మీరు నిరంతరం మంచి ఆలోచనలతో, అనుకూలమయిన భావావేశాలతో ఉండగలుగుతారు. అప్పుడు కోపం, వ్యధ ఇటువంటి ఏవీ కూడా మీ దగ్గర రావు. మీరు నిరంతరం సంతోషంగా నవ్వుతూ ఉంటే మీ జీవితమే ఆనందమయంగా ఉంటుంది. ఇటువంటి స్థితిలో మీరు ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానం మీలో గొప్ప మార్పుని తేగలుగుతుంది.

మీ శరీరాన్ని, మీ ఆలోచనలని శుభ్రపరచి వాటిని స్వచ్ఛంలా ఉంచగలిగితే దానినే తపస్సు అంటారు. నా అభిప్రాయంలో మీ శరీరం, మీ ఆలోచనల మీద పనిచేయటమే గొప్ప తపస్సు. అన్నింటికంటే అద్భుతమయినది, కఠినమయిన తపస్సు మీ శరీరాన్ని, ఆలోచనలని స్వచ్ఛంగా ఉంచగలగటమే. మీరు ఈ విధంగా మీ శరీరాన్ని ఆలోచనలని పరిశుభ్రం చేసుకోవటమే ధ్యానానికి మిమ్మలని మీరు సిద్ధం చేసుకోవటం.

మిమ్మలని మీరు తెలుసుకోవటం అతికీలకమయిన అంశం :

మీరు నిరంతరం మీ ఆలోచనలని, శరీరాన్ని గమనించటం ద్వారా మిమ్మలని మీరు తెలుసుకోగలుగుతారు. మిమ్మలని మీరు తెలుసుకోవటం ధ్యానానికి ఆధారం. మీరు ఎప్పుడయితే మీ ఆలోచనలకి, మీ శరీరానికి ఒక పరిశీలకునిగా మారతారో, అప్పుడు మీరు ఒక బయట వ్యక్తిలా విషయాలని తెలుసుకోవచ్చు. అందుకే నేను అంటాను తెలుసుకోగలగటం అనేది ధ్యానానికి చాలా కీలకమయిన అంశం.

ధ్యాన మార్గంలోని అడ్డంకులు :

ధ్యానం చక్కగా జరగాలి అంటే ఆ దారిలో అడ్డంకులు ఉండకూడదు. ఆ దారిలో వచ్చే అడ్డంకులలో చాలా ముఖ్యమయినది అహంకారం. మనం సంకల్పించిన ధ్యానమార్గంలో చాలా రకరకాల అడ్డంకులు వస్తుంటాయి. అవన్నీ కూడా అహంకారం యొక్క వివిధ రూపాలు.

అహంకారం అంటే ఏమిటి?

అహంకారం అంటే మీరు అంటే ఏమిటి అని మీరు ఏర్పరచుకున్న కొన్ని భావాల వ్యవస్థ. కాబట్టి అహంకారం అంటే కేవలం మీ పట్ల ఏర్పరచుకున్న కొన్ని భావాల రాసి మాత్రమే. అది అంతా ఒక ఊహ. అహంకారానికి నిజమైన ఉనికి లేదు. అది కేవలం కొన్ని భావాల సమూహంతో ఏర్పడిన నీడలాంటి భ్రమ. కాని అటువంటి అసత్యమయిన అహంకారమే మన జీవితాలని నిర్దేశించుతుంది. మనని తన నియంత్రణలో ఉంచుతుంది.

అహంకారం నిజమయిన మీ ఉనికి (ఆత్మ) నుంచి మిమ్ములని వేరు చేస్తుంది. ఈ అహంకారమే మీ జీవితంలోని ప్రతి అంశంలో హద్దులని కల్పిస్తుంది. అది మీరంటే ఏమిటో ఒక బొమ్మని తయారు చేస్తుంది. ఆ బొమ్మ మీ చుట్టూ ఉండే సమాజం మీకు అంటించిన ముద్రలకి అనుగుణంగా ఉంటుంది. అప్పుడే మీలో 'నాది,నేను' అనేవి బలంగా అభివృద్ధి చెందుతాయి. మిమ్ములని మీ నుంచి, ఎదుటివారి నుంచి చివరికి ప్రకృతి నుంచి వేరు చేసేది అహంకారం మాత్రమే. నా అభిప్రాయంలో ప్రకృతి నుంచి పూర్తిగా వేరుపడిపోయిన ప్రాణి ఒక్క మనిషి మాత్రమే. ఇదే మనిషికి ఉండే అనేక సమస్యలకి కారణం కాబట్టి మనకి ఉండే అన్ని బాధలకి, వ్యధలకి, కలతలకి అసలయిన కారణం మన అహంకారం.

ఉదాహరణకి, మీకు బాధ కలిగించే విషయాలు అయిన కోపం, అసూయ, భయం ఇలాంటివన్నీ కూడా మన అహంకారం వలన మాత్రమే మనకి కలుగుతాయి. నేను వేరు, ఇది నా శరీరం, ఇది నాది, ప్రపంచం ఇతరులు వేరు ఇలా ఆలోచించినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు బాధలు ఏర్పడతాయి. మీరు ఒక్కసారి అహంకారాన్ని వదిలితే మీరు ఏర్పరచుకున్న హద్దులు కరిగిపోతాయి. ఇంతవరకూ నా శరీరం, ఇది నాది అనే భావనలు పోతాయి. అప్పుడు ఈ ప్రపంచాన్ని మీలో చూడగలుగుతారు, మీరు ప్రపంచమంతా ఉంటారు. అటువంటి స్థితిలో అసూయ, కోపం, ద్వేషం అనే భావాలు వచ్చే అవకాశమే ఉండదు. ఈ విషయాన్ని మన మేధస్సుతో అర్థం చేసుకోవటం కొంచం కష్టం. స్వామి ప్రవచనాలు విన్నప్పుడూ, ఆయన శిక్షణ కార్యక్రమాలలో చెప్పినప్పుడు బాగా అర్థం అవుతుంది. ధ్యానం చేయటానికి ఇటువంటి పరిస్థితి చాలా అనువయినది.

అనుమానాలు :

ధ్యాన మార్గంలో ఉండే మరొక అడ్డంకు అనుమానం. ఇది కూడా అహంకారం యొక్క మరొక రూపం. గురువుల సమక్షంలో ఉన్నప్పుడు మీలో వచ్చే చాలా అనుమానాలు కరిగిపోతాయి. ఇంకా ఏమయినా వుంటే మీరు ఆయనని మీలోనికి ప్రవేశింపనిస్తే మిగతావి కూడా కరిగిపోతాయి. అందుకే ధ్యానం ప్రారంభించటానికి గురువులు అందించే సహాయ సహకారాలు అనన్యసామ్యానయినవి. అవి మనని ఆ ధ్యాన మార్గంలో అత్యున్నత శిఖరాలని చేరుస్తాయి.

ఈ సందర్భంలో పరమహంస నిత్యానంద స్వామి తన శిష్యులతో ఈ విధంగా చెబుతుంటారు. మీరు నా సమక్షంలో ఉన్నప్పుడు నన్ను మీ మీద పని చేయనీయండి. నేను తిన్నగా వెళ్ళి మీలో ఉన్న అడ్డంకుల మీద నా చేయివేసి వాటిని తొలగిస్తాను. అహంకారపు వాపులని సర్జరీ చేసి తీసివేస్తాను. అని చెబుతుంటారు. అప్పుడు మనలో అనుమానాలు, మనలో ప్రవాహంలా వచ్చే ప్రశ్నలు కరిగిపోతాయి. అదే గురుదేవుల సమక్షం యొక్క గొప్పతనం. అందుకే ఏ మాత్రం అవకాశం దొరికినా గురుదేవుని సమక్షంలో, ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో శిక్షణని ప్రారంభించటం చాలా మంచిది. అదీ ఒక జ్ఞానోదయమయిన మహాయోగీశ్వరుని సమక్షం అయితే అది మన అదృష్టంగా భావించాలి. అది ఒక అద్భుత వరమని అనుకోవాలి. అటువంటి అవకాశం చాలా అరుదుగా, కొద్దిమందికి మాత్రమే దొరుకుతుంది.

ధ్యానం చేసే సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్య సూచనలు :

ధ్యానం ప్రారంభించదలుచుకున్న జౌత్సాహిక ధ్యానులకు స్వామి ఈ సూచనలని ఇస్తారు.

తగిన సమయాన్ని కేటాయించండి :

ఈ సూచన కొత్తగా ధ్యానాన్ని ప్రారంభించే వారి కోసం చెబుతారు. ప్రతి రోజు ఒక నిర్ణీతమయిన సమయంలో అరగంట ధ్యానానికి కేటాయించండి. ఈ అరగంట సమయంలో ఎవరూ మిమ్మలని డిస్టర్బ్ చేయకుండా చూడండి. ఆ సమయంలో మీరు ఒంటరిగా ఉండే విధంగా చూడండి. ఇలా కొద్ది కాలం క్రమం తప్పకుండా చేయగలిగితే, మీ శరీరం, మనస్సు (మైండ్) ఆ సమయానికి అలవాటుపడిపోతాయి. ఆ టైం కాగానే మనస్సు, శరీరం ధ్యానానికి అప్రయత్నంగా సిద్ధపడిపోతాయి. ఒక్కసారి మీరు ధ్యానంలో ప్రవేశించటం సులభమయితే, అప్పుడు మీరు ఎప్పుడయినా, ఎక్కడయినా చేయగల ధ్యాన పద్ధతులని ఆచరించవచ్చు. కాబట్టి ప్రారంభంలో తప్పనిసరిగా ఒక్క అరగంట ధ్యానానికి కేటాయించండి. ఉదయం పూట అయితే బాగుంటుంది లేకపోతే భోజనం చేశాక రెండు గంటల తరువాత చేయండి. 24 గంటలలో మన కోసం కనీసం అరగంట కేటాయించుకోవడం అత్యాశకాదు. కదా!

తగిన స్థలాన్ని కేటాయించండి :

మనం ధ్యానం చేసే స్థలం అనువుగా ఉంటే మనం సౌకర్యంగా ధ్యానంలోనికి ప్రవేశించగలం. మీరు ధ్యానం కోసం కేటాయించిన స్థలం శుభ్రంగా, నిశ్శబ్దంగా సరిపడా ఖాళీతో ఉండాలి. మీకు వీలుకలిగితే దీనికోసం ఒక గదిని కేటాయించండి. పూజ గది అయితే బాగుంటుంది. అక్కడ శక్తిక్షేత్రాలు ఉంటాయి. మీరు ఎంచుకున్న గదిలో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. అదే ఆరుబయట ప్రదేశం అయితే మీకు ధ్యాన భంగం కలిగించే శబ్దాలు, మనుషులు లేకుండా చూడండి. అక్కడ మీకు తగినంత ప్రైవసీ వుండేలా చూడండి. మీరు ఎక్కడ స్థలం ఎంచుకున్న వీలనయినంత వరకు ప్రతిరోజూ అక్కడే మీరు ధ్యానం చేసేవిధంగా చూడండి.అప్పుడు ఆ ప్రదేశంలోనికి రాగానే మీరు ధ్యానంలోనికి వెళ్ళాలి అని మీ శరీరం మనస్సు సిద్ధపడిపోతాయి.

సౌకర్యంగా ఉండే డస్తులు వేసుకోండి :

ధ్యానం చేసే సమయంలో మీరు భౌతికంగా సౌకర్యంగా ఉండేలా చూడండి. మీకు హాయిగా సౌఖ్యంగా ఉండే ఏవైనా బట్టలు వేసుకోండి. అవి పరిశుభ్రంగా ఉంటే మీరు ధ్యానం మీద ఏకాగ్రతని చూపగలుగుతారు. వీలయినంత వరకు వదులుగా ఉండే కాటన్వి వేసుకోండి. తెలుపురంగే వేసుకోవాలా? అటువంటి అవసరం నిబంధనా లేదు. పరమహంస నిత్యానంద తన ప్రవచనాలలో ఒక విషయం చాలా స్పష్టంగా, గట్టిగా చెబుతారు. నిబంధనలు, హద్దులు (రూల్స్, కండిషన్స్) ఉన్నాయి అంటే అది ఆధ్యాత్మికత కాదు అని తెలుసుకోండి. సర్వాంతర్యామి కరుణామయుడు, ప్రేమమూర్తి. ఆయనని చేరాలని తపనపడే భక్తులకి, తన బిడ్డలకి ఎటువంటి నిబంధనలు, హద్దులు కల్పించడు. ఎవరయినా నిబంధనలని కల్పించితే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వారు మిమ్మలని నియంత్రించాలని (కంట్రోలు చేయాలని) చూస్తున్నారు అని అర్థం చేసుకోండి.

మరి వాలంటీర్సు కార్యక్రమంలో తెలుపు బట్టలే ఎందుకు వేసుకుంటారు?

ఈ ప్రశ్నకి పరమహంస చాలా హాయిగా అందంగా నవ్వి ఇలా జవాబు ఇస్తారు. నా కార్యక్రమంలో కాని, ఆశ్రమంలో కానీ ఎవరికీ ఎటువంటి నిబంధన ఉండదు. నేను కావి రంగు బట్టలు వేసుకుంటాను, ఎందుకంటే అవి మురికి అయినా కనపడదు. దానిని మెయిన్టైన్ చేయటం సులభం. ఇక తెలుపురంగు మనస్సుకి ఆహ్లాదంగా ఉండి ప్రశాంతతని ఇస్తుంది. అందుకే వారు తెలుపురంగు బట్టలువేసుకుంటారు. మీరు వినే ఉంటారుకదా రంగులకి మనస్సుకి ప్రభావం చేసే శక్తి ఉన్నది అని. దానినే కలర్ థెరపీ అంటారు. అంతే అంతకు మించి మరే కారణం లేదు.

శరీరం సౌకర్యంగా ఉండాలి :

ధ్యానం చేయటానికి ఇది చాలా ముఖ్యమయిన సూచన. మీ శరీరం సౌకర్యంగా ఉన్నప్పుడే మీరు ధ్యానం చేయగలుగుతారు. మీరు కూర్చున్న పద్ధతి చాలా సౌకర్యంగా ఉండేలా చూడండి. ఎక్కడో ఎటువంటి నొప్పి ఉండకూడదు. ఎందుకంటే మీరు ధ్యానం చేసే సమయంలో మీరు మీ శరీరాన్ని మర్చిపోవాలి. ఎక్కడయినా నొప్పి పుడుతుంటే మీ ఏకాగ్రత నొప్పి మీద లేదా శరీరం మీద ఉంటుంది.

సౌకర్యంగా నేల మీద కూర్చోగలిగితే నేల మీద కూర్చోండి. లేకపోతే కుర్చీలో కూర్చోండి. ఏవిధంగా కూర్చోని చేసినా ధ్యానం యొక్క ఫలితం ఒకే విధంగా ఉంటుంది. పడుకొని చేసే సమయంలో నేల మీద పడుకోవద్దు. కార్పెట్ వేసుకోండి, లేదా జంఖానా వేసుకోండి. అదీ లేకపోతే తుంగచాప వేసుకోండి. కళ్ళు మూసుకోండి :

మీరు ధ్యానం అరగంట సేపు చేస్తారు. ఆ అరగంట సేపు నిజాయితీగా కళ్ళుమూసుకుని ఉండండి. అసలు కళ్ళు తెరవవద్దు. అలా కళ్ళు తెరిస్తే మనం చుట్టుప్రక్కల వారు ఏమి చేస్తున్నారో గమనించాలని లేదా టైం ఎంతయింది ఇలా ఏదో ఒక విధంగా డిస్టర్బ్ అవుతాము. అరగంటసేపు కళ్ళు తెరవకుండా ఉండలేము అనుకుంటే కళ్ళకి గంతలు కట్టుకోండి. స్వామీజీ ఇచ్చే శిక్షణ కార్యక్రమలలో కళ్ళ గంతలు కట్టే బ్యాండ్స్ (Eye Bands) ఇస్తారు. ధ్యానం ప్రారంభించే ముందు తప్పనిసరిగా కళ్ళకి ఆ బ్యాండ్స్ కట్టుకోవాలి. తిరిగి తీయమన్నప్పుడే ఆ బ్యాండ్స్ విప్పాలి. ఇది చాలా మంచి పద్ధతి. అప్పుడు టైం లోపు మనం అసలు కళ్ళు తెరవం.

టైం ఎలా చూసుకోవాలి : మీరు సూచనలనిచ్చే సి.డి. పెట్టుకోండి. లేకపోతే అలారం పెట్టుకోండి. అదీ వీలుకాకపోతే ఎవరినైనా అరగంట కాగానే మీకు చెప్పమని చెప్పండి. ప్రాథమిక శిక్షణ అవసరం :

ధ్యానం అనేది ఒక సాంకేతిక పద్ధతి. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. పరమహంస నిత్యానంద ఈ ధ్యాన పద్ధతులు, వాటి క్రమం గురించి చాలా వివరంగా చెబుతారు.

ఇందులో ముఖ్యమయిన సూచన ఏమిటి అంటే, శిక్షణ పొందిన ఆచార్యుల పర్యవేక్షణలో మాత్రమే ప్రతీ ధ్యాన పద్ధతినీ నేర్చుకోవాలి. పుస్తకాలు చదివి, సి.డి.లు విని చేయకూడదు. ఒకసారి శిక్షణ పొందాక పుస్తకాలు, సి.డి.లు మీకు గొప్ప సహాయకారి అవుతాయి కానీ ముందుగా కాదు. కాబట్టి ధ్యానం చేయాలి, అని అనుకునేవారు తప్పనిసరిగా ఒక శిక్షణా కార్యక్రమంలో పాల్గొని శిక్షణని పొందాలి. ఆ తరువాత మీ అంతట మీరు ధ్యానం సాధన చేయవచ్చు.

నిత్యానంద ధ్యానపీఠం వారి శిక్షణ కార్యక్రమాలు :

పరమహంస నిత్యానంద పరివ్రాజకునిగా హిమాలయాలలో కాలినడకన తిరిగే సమయంలో అనేకమంది యోగులని,సుఫీ గురువులని, బౌద్ధ, జెన్ గురువులని, బాబాలని, రుషులని కలిసారు.ఆయన వారి దగ్గర అతి ప్రాచీనమయిన ధ్యాన పద్ధతుల నుంచి, ఆ నాటి వరకూ వాడుకలో ఉన్న ధ్యాన పద్ధతులని చాలా వివరంగా లోతుగా నేర్చుకున్నారు. ఆయనకి ధ్యానం అంటే చాలా ప్రియమయిన అంశం. ఆయన లక్ష్యం, ధ్యానం ద్వారా ప్రతి వ్యక్తిలో మార్పు తీసుకువచ్చి దాని ద్వారా ప్రపంచంలో మార్పు తేవాలి అని. స్వామి మాటలలో ధ్యానం అనేది సర్వాంతర్యామికి దగ్గర అవ్వగల అతి సులభమయిన అందమయిన మార్గం. ధ్యానం మనని అత్యుత్తున్నత చేతనస్థితికి తీసుకువెళ్ళగలుగుతుంది. అందుకే ఆయన ధ్యానం అనే అంశం మీద చాలా లోతయిన పరిశోధనలు చేసారు. స్వామీజీ యువకుడు, ఈనాటి మానవులకి ప్రతినిధి. నేటి ఆధునిక మానవుల స్థితిగతులని క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. ఈ నాటి సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక స్థితిగతులకి అనుగుణంగా నేటి అతి బిజీ మనుషులకి ముఖ్యంగా అసలు టైంలేదు అనే పాశ్చాత్యులకి అనుగుణంగా కొన్ని ధ్యాన పద్ధతులని రూపొందించారు.

పరమహంస ఒక విషయం చెబుతారు. పతంజలి రోజులలో ఆయన చెప్పిన పద్ధతులు అప్పటి వారికి సరిపోయాయి. అప్పటికీ ఇప్పటికీ మనుషులలో వారి జీవన పద్ధతులలో అనేక మార్పులు వచ్చాయి. సాంకేతిక విప్లవం మనిషికి ఎన్నో సౌకర్యాలని సమకూర్చింది. కాబట్టి అప్పటి పద్ధతులు యధాతధంగా ఇప్పటి వారికి అంతగా పనికిరావు. ఉదాహరణకి మీ తండ్రి మిమ్ములని పెంచినట్టు, మీ పిల్లలని మీరు పెంచలేరు. మీ పిల్లలకి మీరు చెప్పే క్రమశిక్షణ మీ మనమలకి, మనమురాళ్ళకి సరిపోదు, అది పని చేయదు. ఒక్కతరానికే అంత తేడా ఉన్నప్పుడు వేలసంవత్సరాల క్రితం ఏర్పరచిన పద్ధతులు యధాతదంగా ఇప్పటి వారమయిన మనకి పనికిరావు.

అందుకే పరమహంస నేటి మానవులకి అనుగుణంగా వారి జీవన శైలికి సరిపడే విధంగా, నేటి వారి అవసరాలని తీర్చేవిధంగా చాలా ధ్యాన పద్ధతులని రూపొందించారు. కొన్ని ధ్యాన పద్ధతులని ఇతర సంస్కృతుల నుంచి ఉదా : సుఫీ, భౌద్ధ, జెన్, ప్రాచీన క్రైస్తవం మొదలయిన వాటినుంచి తీసుకున్నారు. ఆయన ప్రతి ధ్యాన పద్ధతిని అరగంటకి సరిపడే విధంగా తయారుచేశారు.

ఆచార్య శిక్షణ : పరమహంస నిత్యానంద తన కార్యక్రమాలని నిర్వహించటానికి 2003, జనవరి ఒకటవ నిత్యానంద ధ్యానపీఠంని స్థాపించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలలో 1000కి పైగా సెంటర్స్ ద్వారా ఆయన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకి ఇండియాలో బెంగుళూరులోని ఆశ్రమం కేంద్రం కాగా అమెరికాలోని లాస్ఏంజెల్స్లోని ఆశ్రమం ఇతర దేశాలలో జరిగే కార్యక్రమాలకి కేంద్రంగా ఉన్నది.

పరమహంస ప్రారంభంలో శిక్షణ కార్యక్రమాలని తానే స్వయంగా నిర్వహించేవారు. తరువాత ఆయన కొంతమంది అనుచరులకి తానే స్వయంగా శిక్షణని ఇచ్చి, వారిని ఆచార్యులుగా దీక్షని ఇచ్చి, ఈ కార్యక్రమాలు నిర్వహించటానికి నియమించారు. దీక్షని ఇచ్చి స్వయంగా నియమించబడిన ఆచార్యులు 400 మంది పైగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ప్రపంచ వ్యాప్తంగా ధ్యానంలోని ప్రాధమిక శిక్షణని ఆనందస్ఫురణ అనే పేరు మీద నిర్వహిస్తున్నారు. దీనినే ఇతర దేశాలలో లైఫ్ బ్లిస్ ప్రోగ్రాం అంటారు. ఈ కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. వీటి తరువాత కార్యక్రమాలని పరమహంస స్వయంగా నిర్వహంచుతారు.

కాబట్టి ధ్యానం నేర్చుకోవాలి అనుకునే ఔత్సాహికులు 20 లేదా అంతకంటే ఎక్కువమంది కలసి ధ్యానపీఠం వారికి తెలియచేస్తే వారు ఆచార్యులని పంపించుతారు. మొదటి శిక్షణని రెండురోజులు పూర్తిగా నిర్వహించుతారు. ఈ కార్యక్రమం యొక్క వివరాలు ధ్యానపీఠం వారు ఇస్తారు. ధ్యానం ప్రారంభించాలి అనుకునేవారు నిత్యానంద ధ్యానపీఠం ద్వారా శిక్షణ పొంది ఆ తరువాత ధ్యానం సాధన చేయవచ్చు.

అందరూ ధ్యానం చేయవచ్చనా ?

అన్ని వయస్సులవారు, స్త్రీ పురుషులు ధ్యానం చేయవచ్చు గుండెకి సంబంధించిన సమస్యలు ,ఫిట్స్, కీళ్ళనొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు ఒకసారి వారి డాక్టర్స్ సలహా తీసుకుని ధ్యానం చేయటం మంచిది.

పరమహంస నిత్యానంద స్వామీ రూపొందించిన ధ్యానంయొక్క ప్రత్యేకత ఏమిటి ?

పరమహంస నిత్యానంద స్వామి ధ్యానం అనే అంశాన్ని చాలా లోతుగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆ తరువాత వీటిని రూపొందించారు. ఇవన్ని కూడా మనకి అనుగుణంగా ఉండే పద్ధతులు.

సమాజంలో ప్రజలలో ముఖ్యంగా పాశ్చాత్యులలో యోగా, ధ్యానం అనగానే ఏవో కొన్ని లక్షణాలు, అంశాలు నిబంధనలు అనుకుంటారు.ముఖ్యంగా ధ్యానం అనగానే కళ్ళుమూసుకొని ఏదో ఒక దానిమీద ఏకాగ్రతని నిలిపి ఉంచటం లేదా ఏదైనా ఒక మంత్రాన్ని, అక్షరాన్ని శబ్దాన్ని జపించటం అని అనుకుంటారు.

ధ్యానం గురించి నాత్యానందస్వామి ఈ విధంగా చెబుతారు. నిత్యజీవితంలో చాలా పనులతో, ఇంట్లో బయట ఉండే ఒత్తిడి, సమస్యలతో మనం శారీరకంగా, మానసికంగా అలసిపోతాము. ఇంటికి వచ్చి కుర్చీలో వాలి టీ తాగుతూ లేదా నిద్రపోతూ శరీరానికి విశ్రాంతిని ఇస్తాము. శరీరంతోపాటు అలసిపోయిన మనస్సుకి విశ్రాంతి ఎలా వస్తుంది?

అసలు మనస్సుకి (Mind) విశ్రాంతి అంటే ఏమిటి? మైండ్ ఎందుకు అలసిపోతుంది?

మైండ్ నిరంత రం ఆలోచిస్తూ ఉంటుంది. అది ఎంత అతిగా ఆలోచిస్తుంటుందంటే ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య సూక్ష్మాతి సూక్ష్మమయిన ఖాళీ ఉంటుంది. కానీ అది మనం తెలుసుకోలేనంత సూక్ష్మమయినది. కనీసం మనం నిద్రపోయే సమయంలోనైనా మైండ్ విశ్రాంతి గా ఉంటుందా అంటే లేదనే చెప్పాలి అప్పుడు ఆలోచనలు కలల రూపంలో వస్తుంటాయి. ఆవిధంగా కూడా మైండ్ కి విశ్రాంతి లేదు. ఎప్పుడయితే మైండ్ కి విశ్రాంతి లేదో అప్పుడే మనకి శారీరక, మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి.

పరమహంస నిత్యానంద నేర్పించే ధ్యానాలు మైండ్ కి విశ్రాంతిని ఇస్తాయి. మైండ్ కి విశ్రాంతి రావాలి అంటే మనలో వచ్చే ఆలోచనల సంఖ్య తగ్గాలి.అలాగే ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉండే ఖాళీ పెరగాలి. స్వామీజీ చాలా స్పష్టంగా ఈ విషయం ఇలా చెబుతారు; మీరు నిరంతరం ఖాళీ లేకుండా ఆలోచిస్తుంటారు. మీ ఆలోచనలు లోలకంలా భవిష్యత్ కి భూతకాలానికి మధ్య చాలా వేగంగా తిరుగుతుంటాయి. ఎప్పుడయితే ఆలోచనలు సున్నాస్థాయికి వస్తాయో అప్పుడు మీరు మీ మైండ్ కి సంపూర్ణమయిన విశ్రాంతిని ఇచ్చినట్టు అవుతుంది.

ఎప్పుడయితే మీ ఆలోచనలు సున్నాస్థాయికి వస్తాయో అప్పుడు మీరు వర్తమానంలోనికి వస్తారు. ఆ వర్తమానంలోనికి రావటమే నిజమయిన సమయం (Real Time) లోనికి మీరు ప్రవేశించినట్లు. అప్పుడే విశ్వశక్తిమీకు అందుబాటులోనికి వస్తుంది. అప్పుడు పొందే ఆనందమే శాశ్వతానందం, అదే నిత్యానందం (Bliss)

పరమహంస నేర్పించే ప్రతి ధ్యానం మనని ఆలోచనలు లేని స్థితికి తీసుకువెళ్ళటానికే ప్రయత్నిస్తుంది. ఇదే స్వామీజీ నేర్పించే ధ్యానపద్ధతిలోని ప్రత్యేకత.

మరొక విషయం ఏమిటంటే, మనందరం ధ్యానం చేస్తుంటాము. అది కొంతవరకు మనకి సహాయం చేస్తుంది. ఆవిధంగా కొంతకాలం చేసాకా మనలో ఇంకా అసంతృప్తి అనేది వుంటుంది. ఆ ధ్యానం మనని ఇంకా ముందుకు తీసుకువెళ్ళలేకపోతుంది. మనలో మనం ఆశించిన మార్పు కనిపించదు. దానితో మనకి అసంతృప్తిగా ఉంటుంది. ఆ అసంతృప్తికి కారణం మనలోపలి మన అసలయిన ఉనికికి మన ఆత్మకి కావలసినది దొరకలేదు. పరమహంస నిత్యానంద చెప్పేప్రతి ధ్యానం మనని మన అంతరంగంలోపల నిక్షిప్తమయి ఉన్న అసలయిన ఆనందం వైపు తీసుకువెళుతుంది. మనలోని నిజమయిన మనం (ఆత్మ) దగ్గరికి తీసుకువెళుతుంది.

నిత్యానందస్వామి నేర్పించే ధ్యాన పద్ధతి మరొక లోపాన్ని కూడా సవరించుతుంది. ఈ పుస్తకంలో ఇంతకుముందు వివరించనట్టు, మనలోపలకి మనం వెళ్ళటానికి, అదేవిధంగా శక్తిమనలో చక్కగా ప్రవహించటానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. అవి మనలో వ్యతిరేకపు ఆలోచనల వలన కాని, అణచివేయబడిన భావాలవలన కాని, గట్టిపొరలుగా ఏర్పడిపోయిన మనకి అడ్డంకులని సృష్టించుతాయి. మనం అసలయిన ధ్యానంలోనికి ప్రవేశించటానికి ముందు వీటి మీద కొంత పనిచేయాలి. అప్పుడే ధ్యానం మనకి మనం కోరుకున్న ఫలితాన్ని ఇస్తుంది.

ఆ విధంగా మనలోని అడ్డంకులని శుభ్రంచేసే ధ్యాన పద్ధతులని పరమహంస నిత్యానంద మనలో చేయించుతారు. ఇవన్నీ చాలా చురుకుగా చేసే ధ్యాన పద్ధతులు (Active Meditations) ఉదాహరణకి జిబ్బరీష్ చేయటం వలన మనలో ఎంతోకాలంగా గట్టిపడిపోయిన స్థితిలో ఉండే అణచి వేయబడిన భావాలు బయటికి వచ్చేస్తాయి. ఆ తరువాత మనం చేసే ధ్యానం మనకి కావలసిన ఫలితాన్ని ఇస్తుంది. అదే విధంగా దుఃఖహరణ, మహామంత్ర ఇలా చాలా పద్ధతులు ముందుగా మన శరీరాన్ని మనస్సుని శుభ్రపరిచి అందులో ఉండే ఆటంకాలని తొలగిస్తాయి. ఇది పరమహంస నిత్యానంద స్వామి ధ్యాన పద్ధతులలోని మరో ప్రత్యేకత.

స్వామీజీ ధ్యానం గురించి చెప్పేటప్పుడు మనలోని శక్తికేంద్రాలయిన ఏడు ప్రధాన చక్రాల గురించి చెబుతారు. స్వామీజీ రూపొందించిన ధ్యాన పద్ధతులు చక్రాలని శుభ్రంచేసి స్వచ్ఛంగా ఉంచుతాయి. తరువాత వాటిని శక్తితోనింపి చైతన్య పరుస్తాయి. అంతే కాకుండా ఒక్కొక్క చక్రం చైతన్యమవటానికి స్వామీజీ ఒక్కొక్క ప్రత్యేక ధ్యాన పద్ధతిని రూపొందించారు.వీటినే ఆనందస్ఫురణ (చక్రా ధ్యాన) కార్యక్రమంలో నేర్పించుతారు. ఒక్కొక్క రకమయిన వ్యతిరేకపు భావావేశాలు మనలో అధికమయినప్పుడు ఒక్కొక్క చక్రం బంధింపబడుతుంది. అది మనలో ఏదో ఒక శారీరక లేదా మానసిక సమస్యకి కారణం అవుతుంది. ఇప్పుడు మనం దానికి సంబంధించిన ధ్యానం 21 రోజులపాటు చేస్తే మనం ఆశ్చర్యపోయే మార్పు మనలో మనం చూడవచ్చు. ఈ సందర్భంగా నిత్యానందస్వామీ ఒక ఉదాహరణ చెబుతారు. నాదగ్గరికి ఎవరయినా మానసిక కుంగుబాటుతో వస్తే (Depression) వారికి మహామంత్ర ధ్యానం నేర్పించి, వారిని ప్రతిరోజూ చేయమని చెబుతారు. అలా చేస్తే కొన్ని రోజులకి వారు మందులు మానేయగలుగుతారు. ధ్యానం అనేది మందుకంటే శక్తివంతంగా పని చేస్తుంది. మీరు క్రమంగా మందులు వాడటం తగ్గించివేయవచ్చు. ధ్యానంతో అనారోగ్య సమస్యలకి చక్కగా చికిత్స చేయవచ్చు : పరమహంస నిత్యానంద ఈ విషయాన్ని చాలా విపులంగా వివరించారు. మనిషి విశ్వంలో ఒక భాగం, అదేవిధంగా మనలోపల విశ్వశక్తి ప్రవహించుతూ ఉంటుంది. మనలో ఎప్పుడయితే అడ్డంకులు ఏర్పడతాయో ఆ శక్తిప్రవాహం తగ్గిపోతుంది. మన లోపల శక్తి తగ్గినప్పుడే మన లోపల మానసిక, శారీరక రుగ్మతలు మొదలవుతాయి.

ఎప్పుడయితే ఆ అడ్డంకులు తొలగిపోయే ధ్యానం చేస్తామో మన శరీరం విశ్వశక్తిని అందుకోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడు మీరు చేసే ధ్యానం ఆ శక్తిని మీలోనికి తీసుకోగలుగుతుంది. గుర్తుంచుకోండి: విశ్వశక్తికి గొప్ప చికిత్సా శక్తి ఉంటుంది ఎప్పుడయితే విశ్వశక్తి మీలోనికి నిరాటంకంగా ప్రవేశించుతుందో, మీ సమస్యలు రుగ్మతలు అన్నీకూడా పోయి తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు లోతయిన ధ్యానంలో ఉన్నప్పుడు విశ్వశక్తి మీలోపల చేసే చికిత్స మీకు తెలుస్తుంది. ఇదే ధ్యానానికి ఉన్న విశిష్టత.

ధ్యానం తీవ్రమయిన కొద్ది మీరు విశ్వశక్తితో ప్రత్యక్షసంబంధాన్ని నెలకోల్పగలుగుతారు. అప్పుడు ఆశక్తిని నిరంతరం మీకు అందుబాటులో ఉంటుంది. అందుకే తీవ్రమయిన తపస్సు చేసిన యోగులు అంత శక్తివంతులు. వారిలో ఉండేది మహాద్భుతమయిన విశ్వశక్తి (Comsic Engery) నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను, మీరు కూడా ఆ స్థితికి వెళ్ళగలుగుతారు. మీరు ధ్యానాన్ని క్రమంతప్పకుండా సాధాన చేయండి, ఆ మహాపురుషులు సాధించినది మీరు సాధించగలుగుతారు.

స్వామీజీ మేము ఏవో కొన్ని ధ్యాన పద్ధతులు కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము.కాని ఎందుకు మాకు ఆ శక్తి దొరకటం లేదు? అసలు ఆ ప్రశాంతత ఎందుకు రావటం లేదు?

ఈప్రశ్న చాలామందికి వస్తుంది. పరమహంసని ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. ఈ ప్రశ్నకి స్వామీజీ ఈ విధమైన వివరణ ఇస్తారు.మీరు చేసే ధ్యానం, ధ్యానపద్ధతులు సరియైనవే అయితే ఇక్కడ రెండువిషయాలు మీరు గమనించాలి.

మొదటి విషయం. ధ్యానం చేసినప్పుడు మీలోపలికి విశ్వశక్తి ప్రవేశించి అంతటా ప్రవహించాలి.అయితే ప్రవేశానికి, ప్రవాహానికి ఎన్నో అడ్డంకులని మనం తయారు చేసుకుని ఉంచాము. ఇది ఎలా ఉంటుందంటే రక్తనాళాలలో రక్తం సాఫీగా ప్రవహించాలి. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మన ఆహారపు అలవాట్లతో ఆ నాళాలలో కొలేస్ట్రాల్ పెరిగి అడ్డుపడేలా చేసేస్తాము. అప్పుడు మనకి అనారోగ్యసమస్యలు వస్తాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళితే సర్జరీ చేసి అడ్డంకులని తొలగిస్తారు. అదే విధంగా మనం ధ్యానం చెయటానికి ముందు తప్పని సరిగా ఆ అడ్డంకులు తొలగించే ధ్యానం చేయాలి. వాటినే శుభ్రపరిచే ధ్యానాలుగా నేను రూపొందించాను. అవన్నీ చురుకుగా (యాక్టివ్‌గా) చేసే ధ్యానాలు. మీరు ఈసారి అలా ప్రయత్నించి చూడండి. తేడా మీకు స్పష్టంగా తెలుస్తుంది.

అంతేకాకుండా మన శాస్త్రాలు, ఉపనిషత్తులు, లేదా మరొక శాస్త్రం, ప్రత్యక్షంగా వాటిని రూపొందించిన గురువుల ద్వారా మనకి తెలిసే అవకాశం లేదు కదా! కాబట్టి ఈ పద్ధతులని చదివి వాటిని సాధన చేస్తారు. నేను ఇంతకు ముందు చెప్పాను అవి కొన్ని వేలసంవత్సరాల క్రితం అప్పటి మనుషులకి వారి జీవన సరళికి సరిపడే విధంగా అప్పటి రుషులు, గురువులు వాటిని రూపొందించారు. అప్పటి మనుషులకి ఇన్ని ఊహాలు, కల్పనలు అత్యాశలు, ఇంత పోటీ తత్వం ఉండేవి కాదు. ఇన్ని సౌకర్యాలకి లేవు. నేటి మానవుల శరీరాలు అతి సౌకర్యాలకి అలవాటు పడిపోయాయి. అంతేకాదు ఆరోజులలో మనుషుల చాలా విరామంగా ఉండేవారు. అంతులేని సమయం వారికి అందుబాటులో ఉండేది.కాబట్టి ఆ పద్ధతులు ఆనాటివారికి సరిపోయాయి. ఉదాహరణకి గౌతమబుద్ధుడు శ్వాస మీద ధ్యాస నిలపమని ఒక చిన్నది అతి సులభమయిన పద్ధతి చెప్పి వేలమంది జ్ఞానోదయం పొందేలా చేసారు. కానీ రెండువేల అయిదువందల సంవత్సరాల తరువాత మనం అలా ప్రయత్నించి జ్ఞానోదయం పొందలేము, ఈ విషయం కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమయిపోతుంది.

మీరు ఈ విషయాలని అర్థం చేసుకొని ధ్యానం చేస్తే, మీ ప్రశ్నకి సరియైన సమాధానం తెలియటమే కాదు ఆ అనుభవం కూడా అవుతుంది. అనుభవం ద్వారా మీ అంతట మీరు తెలుసుకోవచ్చు. నేను నా కార్యక్రమాలకి వచ్చేవారితో ఈ విషయం చాలా స్పష్టంగా చెబుతాను. నేను చెప్పేమాటలు శ్రద్ధగా వినండి. వాటిని నమ్మవద్దు, అలా అని తిరస్కరించవద్దు. అది అవునా కాదా అని మీరు ప్రయత్నించి మీ అనుభవంతో తెలుసుకోండి.

పరమహంస నిత్యానంద ఏవిషయాన్నైనా మనసుకి సశాస్త్రీయంగా, ఉదాహరణలతో సామాన్యులకి సహితం అర్థమయ్యేరీతిలో వివరించి చివరిలో పై విధంగా, మనంతట మనం అనుభవంతో తెలుసుకుని అప్పుడు ఆయన మాటలు నమ్మమని చెబుతారు. ఆయనలో విశిష్టత అదే. ఆ మహామేధావి, జ్ఞానోదయమయిన మహార్షి మాటలు వినగలిగే వారికి అవి అమృత వాక్కులు.

ప్రశ్న: స్వామీజీ, ధ్యాన పద్ధతులు చాలా ఉన్నాయి. కదా! ఏపద్ధతి మాకు సరిపోతుందో ఎలా తెలుస్తుంది?

ధ్యాన స్థితి అనేది ఒక్కటే. ఆ స్థితికిచేరే మార్గాలు పద్ధతులు అనేకం. ఒక్కొక్క రుషి, ఒక్కొక్క గురువు వారు పొందిన అనుభవాల ఆధారంగా ఒక్కొక్క పద్ధతిని మనకి పరిచయం చేసారు. అన్నీ చాలా మంచి పద్ధతులే. మీరు వీటిలో కొన్నింటిని తీసుకొని కొన్ని రోజులు సాధన చేయండి. మీకు ఏ ధ్యానం చేస్తున్నప్పుడు తృప్తిగా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా, సౌకర్యంగా ఉంటుందో ఆపద్ధతిని మీరు కొనసాగించండి. ఆపద్ధతే మీ మానసిక శారీరక వ్యవస్థకి సరిపడే పద్ధతి.

నేను వివిధ కార్యక్రమాలయిన ఆనంద స్ఫురణ (ప్రస్తుతం నిత్యానంద ధ్యానపీఠం ఆచార్యులు నిర్వహిస్తున్నారు) నిత్యానంద స్ఫురణ మొదలయిన కార్యక్రమాలలో చాలా ధ్యాన పద్ధతులని నేర్పించుతాను. అయితే అందులో పాల్గొన్న అందరూ అన్నీ చేయరు. మూడు నెలలు గడిచాక అడిగితే ఒక్కొక్కరు ఒకటి లేదా రెండు ధ్యాన పద్ధతులని చేస్తున్నట్టు చెబుతారు. దీని అర్థం ఏమిటి అంటే ఇవి వారికి అనువయిన పద్ధతులు.

ఇక పోతే నేను నేర్పే ధ్యానాల సంగతి: నేను మన వేదాలు, ఉపనిషత్తులు, వేరువేరు సంస్కృతుల నుంచి ధ్యాన పద్ధతులని నేర్చుకున్నాను. నా వ్యక్తిగత అనుభవంతో వాటిలో కొన్నింటిని యథాతధంగా తీసుకొని ఇప్పటి మీకు, మీ సమయానికి సరిపడే విధంగా రూపొందించాను. కొన్ని ధ్యాన పద్ధతులు నేను రూపొందించాను.

మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. ధ్యాన పద్ధతి దాని పేరు చరిత్ర ఇవికాదు మనకి ముఖ్యం. దాని నుంచి వచ్చే ఫలితాలు ముఖ్యం. నేను రూపొందించిన ప్రతి ధ్యాన పద్ధతి నా వ్యక్తిగత అనుభవంతో చెప్పినవే. ఈ విషయంలో మీకు నేను హామీ ఇస్తున్నాను.

ఒక ముఖ్యసూచన :

మీరు ధ్యానం ప్రారంభించినప్పుడు మీ శరీరంలో, మీ మానసిక వ్యవస్థలో కొన్ని అసాధారణ మార్పులని గమనించుతారు. వీటిని గమనించినప్పుడు కంగారు పడకండి. వీటికి తయారుగా ఉండండి. ధ్యానం అంటే మీ శరీరం వ్యవస్థలో, మానసిక వ్యవస్థలో ఉండే కల్మషాలని శుభ్రపరిచే కార్యక్రమం. మీలో ఎన్నో సంవత్సరాలుగా అణచివేయబడిన భావాలని బయటికి నెట్టివేసే ప్రయత్నం ఇది. మీరు జీవితాంతం కూడబెట్టిన అడ్డంకులని తొలగించే ప్రయత్నమే ధ్యానం. ఈ శుభ్రపరిచే ధ్యానాలు మిమ్ములని చాలా చురుకుగా చేస్తాయి. ఆ ధ్యానం సమయంలో గట్టి గట్టిగా అరవాలి, గెం తాలి, నడవాలి ఇలా శరీరాన్ని వేగంగా కదిలించాలి. అటువంటి సమయంలో మీకు కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీ శరీరం బాగా వేడిగా అవుతుంది. కొన్నిసార్లు తల బరువుగా అవుతుంది. చేతి వేళ్ళు తిమ్మిరి ఎక్కినట్టు అనిపిస్తుంది. ఇదంతాకూడా మీలోపల శక్తి ఎక్కువగా ప్రవహించటం వలన ఏర్పడే పరిస్థితులు. ఇవన్నీ తాత్కాలికమైనవే. మీరు కంగారుపడి ధ్యానం ఆపవద్దు. కాస్త సర్దుకునేవరకూ తీవ్రతని తగ్గించి, తరువాత మాములుగా చేయవచ్చు. ఉదాహరణకి మహామంత్ర ధ్యానం మొదటిసారి చేసినప్పుడు తల బరువుగా అయ్యి, తల తిరిగినట్టు అనిపిస్తుంది. అప్పుడు మీరు కొంచెం నెమ్మదిగా చేయండి క్రమంగా ఆ ధ్యానంలో పూర్తిగా నిమగ్నమయిపోండి. ఇవన్నీ వాటంతట అవే క్రమంగా పోతాయి. మీరు ధ్యానంలో నిమగ్నమవ్వగలిగి ధ్యానం చేస్తే, మీరు ఆశ్చర్యపోయే మార్పులు మీలో వస్తాయి.

ప్రశ్న : స్వామీజీ, ధ్యానం చేస్తే మాలో మార్పులు వస్తాయి అని చెబుతున్నారు కదా. భౌతికంగా మాలో ఎటువంటి మార్పులు వస్తాయి.?

ఈ ప్రశ్నకి స్వామీజీ చాలా వివరాలు చెబుతారు. ఆయన చెప్పే ప్రతీ మాట ఒక నిత్య సత్యం. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ ఆయన అనుభాలే. అందుకే స్వామి ప్రతి మాటని చాలా కచ్చితంగా, స్పష్టంగా సూటిగా చెప్పి చివరిలో ఆ విషయం మీద హామీ ఇస్తారు. నేను చెప్పే ప్రతిమాటికి నేను భాధ్యత తీసుకుంటాను, అని అందరిలో స్పష్టమయిన హామీ ఇస్తారు. ధ్యానం వలన మనం ఇతర లాభాలు ఏమిటో ఆయన వివరణ చూద్దాము.

అనంతమయిన స్వేచ్ఛ కలుగుతుంది.

మీరు ధ్యానం చేస్తే మీరు ఇంతవరకుయా పొందని ఒక అద్భుతమయిన స్వేచ్ఛని పొందిన అనుభూతిని పొందుతారు.

స్వేచ్ఛ అంటే ఏమిటి? అది ఎందుకు?

ఈ విషయాన్ని చెప్పేటప్పుడు మనకి తెలియని ఒక కొత్త కోణాన్ని చూపించి స్వామి మనని ఆశ్చర్యపడేట్లు చేస్తారు. స్వామి స్వేచ్ఛ గురించి ఈ విధంగా చెబుతారు.

ప్రతి మనిషి,ప్రతి క్షణం స్వేచ్ఛకోసం తపించి పోతుంటారు. నిరంతరం స్వేచ్ఛగా ఉండాలి అని చూస్తుంటారు.అసలు మీరు ధ్యానం నేర్చుకోవటంలో ఉద్దేశం కూడా అదే మీకు తెలిసిగాని, తెలియకగాని నిరంతరం వెతికేది ఆ స్వేచ్ఛకోసమే.

స్వేచ్ఛ దేని నుంచి, దేని కోసం? అని ప్రశ్నించితే మీరు ఏమి చెబుతారు : నాకు ఇష్టమయిన పనులు చేసేస్వేచ్ఛ, నాకు ఇష్టం లేని కష్టం కలిగించే వాటి నుంచి స్వేచ్ఛ కావాలి. ఉదాహరణకి నాకు అనారోగ్యం నుంచి , వ్యధలనుంచి, కోపంనుంచి, పనుల వత్తిడి నుంచి, బాధలనుంచి స్వేచ్ఛకావాలి అని అంటారు.

వీటినన్నింటినీ క్లుప్తీకరించితే మిమ్ములని రెండు విషయాలు నియంత్రిస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఒకటి అత్యాశ రెండవది భయం. నిజానికి ఈ రెండు తాళ్ళులా మారి మిమ్ములని బంధించి వేస్తాయి. అసలు మీరు కోరుకునే స్వేచ్ఛ ఈ బంధం నుంచి, ఈ తాళ్ళునుంచి. కానీ ఈ విషయాన్ని మీరు అంగీకించరు.

మీకు ఒక సంఘటన చెబుతాను. ఒకసారి ఒక యువకుడు నాతో ఇలా చెప్పాడు: స్వామీజీ ఈ యోగా,ధ్యానం ఇటువంటివి అంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వీటిలో రూల్స్, క్రమశిక్షణ, నిబంధనలు ఉంటాయి. నాకు స్వేచ్ఛ అంటే ఇష్టం అందుకే ఇలాంటివి చేయటం ఇష్టం ఉండదు, అని

అప్పుడు ఆ యువకుణ్ణి‘ సరే నీవు ఏం చేస్తావు ’ అని అడిగాను. దానికి అతను, నేను ఆలస్యంగా ఎనిమిదింటికి నిద్రలేస్తాను. కప్పు కాఫీ తాగుతా ఆ తరువాత వాకింగ్ కి వెళతాను. తరువాత నా వ్యాపారం చూస్తాను.ఇలా స్వేచ్ఛగా ఉంటాను అన్నాడు.

నిన్ను ఎవరయినా ఉదయాన్నే 5 గంటలకి నిద్రలేపారనుకో ఏమవు తుంది?అని అడిగితే అతను రోజంతా చికాకుగా, విసుగ్గా ఉంటుంది, కోపంవస్తుంది” అని జవాబు చెప్పాడు. నీకు ఉదయాన్నే కాఫీ ఇవ్వకపోతే ఏమవుతుంది, తిరిగి అడిగాను. దానికి ఆయువకుడు నాకు పిచ్చిఎక్కినట్టు ఉంటుంది. ఏపని చేయలేను అని కొంచెం విసుగ్గానే జవాబు చెప్పాడు. సరే ,నీవు రోజు వాకింగ్కి వెళతావు కదా! ఒకరోజు వర్షం వచ్చి నీవు వాకింగ్ వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగితే, నాకు ఆరోజంతా ఏదో మిస్ అయినట్టు ఉంటుంది అని జవాబు చెప్పాడు.

ఆ యువకుడి జవాబులు విన్న తరువాత మనకి ఏమి అర్థమవుతుంది అంటే, అతను ఎంతో గర్వంగా ఆనందపడే స్వేచ్ఛ అన్ని కండిషన్స్మీద (నిబంధనల మీద) ఆధారపడి ఉన్నది. మరి అది ఏవిధంగా స్వేచ్ఛ అవుతుంది. మనలో చాలామంది అనుకునే స్వేచ్ఛ ఇటువంటిదే. అందుకే ఆయా విషయాలలో మీకు ఎంత స్వేచ్ఛని ఇచ్చినా మీకు నిజమైన ఆనందం కలగదు. ఆ తృప్తి దొరకదు. ఎందుకంటే మీరు నిజంగా కోరుకునే స్వేచ్ఛ అత్యాశ, భయం అనే రెండు విషయాలు మాత్రమే. ఇవి పెద్ద పెద్ద తాళ్ళు వంటివి. అవే మిమ్ములని బంధించి మీకు స్వేచ్ఛలేకుండా చేస్తున్నాయి.

నేను మీకు చెప్పే స్వేచ్ఛ కేవలం స్వేచ్ఛ. అంతే. అది ఒక దానికోసం పొందే స్వేచ్ఛ కాదు, అదేవిధంగా ఒకదాని నుంచి పొందే స్వేచ్ఛ కాదు. ఇటువంటి స్వేచ్ఛ పొందాలి అంటే మీరు పూర్తిగా వర్తమానంలో, ఈ క్షణంలోనే ఉండాలి. కాని మీరు నిరంతరం భూతకాలంలో లేదా భవిష్యత్ కాలంలో ఉంటారు. మీరు కేవలం వర్తమానంలో ఉన్నప్పుడు అసలయిన స్వేచ్ఛని పొందగలుగుతారు. ఈ స్వేచ్ఛ బయటి విషయాలమీద ఆధారపడి లేదు. అది మీరు ధ్యానం ద్వారా పొందగలిగే స్వేచ్ఛ. అదే నిజమయిన స్వేచ్ఛ. మీరు ఒకసారి దానిని అనుభవించినప్పుడు నేను చెప్పే ఈ మాటలు ఇంకా స్పష్టంగా అర్ధమవుతాయి. ఇటువంటి స్వేచ్ఛని పొందాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం, ధ్యానం.

ధ్యానం చేస్తే అద్భుతమయిన ప్రేమ మీలో పొంగి ప్రవహిస్తుంది.

ప్రేమ ముఖ్యంగా దివ్య ప్రేమ గురించి నిత్యానందస్వామి ఈ విధంగా చెబుతారు. మీరందరూ అనుకునే ప్రేమ కేవలం అత్యల్ప స్థాయిలో,ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం మాత్రమే అది ఎన్నో షరతులతో,నిబంధనలతో నిండివుంటుంది. నేను నిన్ను ఎంత ప్రేమిస్తాను కాబట్టి నువ్వునన్ను అంత ప్రేమించు. నీవు నాగురించి మంచి మాటలు చెప్పావు: నాకు బహుమతులు ఇచ్చావు, అందుకే నేను నిన్ను ప్రేమిస్తాను; అతని ప్రవర్తన నాకు నచ్చదు అందుకే అతనిని ప్రేమించను. ఇది మీకు తెలిసిన ప్రేమ. అది ఈవిధంగా ఉంటుంది.

ప్రేమికుల మధ్యగాని, భార్యాభర్తలు, స్నేహితులు, తల్లితండ్రులు పిల్లలు ఇలా ఎవరిమధ్య ప్రేమ అయినా పైకి కనపడేవి కాని కనిపించనివి కానీ నిబంధనలు, ఆశించటాలు ఉంటాయి. ఎప్పుడయితే ఎదుటి వారి నుంచి ఎదయినా మీరు ఆశించుతారో అది ప్రేమకాదు. ఆప్రేమలో ఆనందం, శాంతి ఉండవు. ఆ ప్రేమ స్వీకరించేవారుకూడా ఆనందంగా ఉండరు అందుకే మన అందరికీ తెలిసిన ఈ లౌకిక ప్రేమ వ్యవహారం బాధ, వ్యధ, సమస్యలతో ముగుస్తుంది.

కానీ ధ్యానం చేసినప్పుడు మీరు ఊహించని అద్భుతమయిన అనుభవం కలుగుతుంది. అదే దివ్యమయిన అద్భుత ప్రేమ అదే దైవ ప్రేమ. దీనికి కారణం ఉండదు. అది జ్ఞానోదయయిన యోగులు, రుషులు కలిగి ఉండే ప్రేమ. వారిలో ప్రేమ నిరంతరం పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ తన ఎదురుగా ఎవరు ఉన్నారు అని ఆలోచించదు. వారికి అర్హత ఉన్నదా లేదా అని చూడదు. వారికి ప్రేమని పంచుతుంది. ఆ ప్రేమ అనుభూతి యొక్క ఆనందంలో వారు మునిగిపోతారు. ఇదే దైవ ప్రేమ, నిబంధనలు లేని షరతులు లేని కారణాలు లేని నిజమయిన ప్రేమ. ఆప్రేమ స్వీకరించిన వ్యక్తి, ఆ ప్రేమని పంచిన వ్యక్తి ఇద్దరూ ఈ ప్రేమ వలన నిజమయిన ఆనందాన్ని అనుభవిస్తారు. అంతేకాదు ప్రేమ ఇద్దరినీ ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది.

ఈ సందర్భంలో పరమహంస నిత్యానంద స్వామి ఒక విషయాన్ని చాలా గమ్మత్తుగా సూటిగా చెబుతారు "మీరు అందరూ ప్రేమలో పడ్డారు అని అంటారు కదా, నిజమే ఆ ప్రేమలో పడితే తిరిగి పైకి లేవలేరు.” కాని మీరు గురువుల ప్రేమలో పడితే వారు మిమ్మలని క్రింద పడనీయరు. మిమ్మలని అత్యున్నత స్థితికి తీసుకు వెళతారు. ఎందుకంటే వారిలో ఉండేది. ఉన్నతమయిన దైవ ప్రేమ .అది కారణాలు అడగని ప్రేమ, నిబంధనలు విధించనిప్రేమ. ఆ ప్రేమ వారిలో నిరంతరం పొంగి ప్రవహించి వారి సమక్షంలో ఎవరు ఉంటే వారిని ఆ ప్రేమలో పునీతం చేస్తుంది.

మీరు ధ్యానం చేస్తే అటువంటి దివ్య ప్రేమని మీలో చూడగలుగుతారు. మీ సమక్షంలోనికి ఎవరువచ్చినా ఆ అద్భుత ప్రేమయొక్క అనుభూతిని ఆస్వాదించ గలుగుతారు. మీలో జరిగే మార్పులు అద్భుతాలని చూసి మీరు ఆశ్చర్యపోతారు.

అప్పుడు మీరు అందరనీ సమానంగా ప్రేమించగలుగుతారు. అంతా మీవారే అనుకుంటారు. ఆ స్థితిలో మీరు అద్భుతమయిన ఆనంద పారవశ్యంలో ఉంటారు. ఇదంతా మీరు ధ్యానం ద్వారా సాధించవచ్చు. ఇది ఎంతో స్వేచ్ఛతో నిండిన ప్రేమ. మీరు అందరనీ ప్రేమిస్తారు. అంతకుమించి మీకు వేరే దారి ఉండదు.

ధ్యానం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది.

ధ్యానం చేస్తే జీవితం ఆనందమయమవుతుంది. ధ్యానం ద్వారా మీరు పొందే ఆనందం నిజమయినది, శాశ్వతమయినది. మీరందరూ అనుకునే ఆనందం నిజానికి ఆనందం కాదు. అది కేవలం సంతోషం. సంతోషం వెంట బాధ, దుఃఖం ఉంటాయి. కానీ ఆనందానికి వ్యతిరేకాలు ఉండవు. ఆనందం ఆనందమే. ఈ ఆనంద స్థితికి బయట ప్రపంచంలో ఏవిషయం కారణం కావు. కేవలం లోతయిన ధ్యానం ద్వారా మాత్రమే ఇటువంటి ఆనందస్థితికి మీరు చేరుగలుగుతారు. అలా కాకుండా ఏదో కారణం వలన మీకు ఆనందం అనిపిస్తే దానిని ఆనందం అనము, సంతోషం అంటాము. ఆ సంతోషం చివరికి ఏదో వ్యధకి దారి తీస్తుంది.

ధ్యానం ఆత్మప్రభోధస్థితికి తీసుకువెళుతుంది.

పరమహంస నిత్యానంద ఈ అంశం గురించి వివరాలు ఈవిధంగా చెబుతారు. మనజీవన సరళి యొక్క నాణ్యత మనం ఏదశ నుంచి పని చేస్తున్నామో, దాని మీద ఆధారపడి ఉంటుంది. మనిషి మూడు దశలలో పని చేస్తాడు; అవి సహజ దశ (Instinct), మేధస్సు లేదా తెలివితేటల దశ (intellect), ఆత్మ ప్రబోధ దశ (Intution). ఈ మూడు కూడా మన అచేతన వ్యవస్థ నుంచి పనిచేస్తాయి. మీరు సహజ దశలో పనిచేస్తున్నప్పుడు, అచేతనే స్థితి వ్యతిరేకపు ఆలోచనలలో, జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏమి సరియైనవి కావు. ఆ తరువాత మీరు ఆ నిర్ణయాలకి బాధపడతారు. ఇటువంటి నిర్ణయాలు చేసింది నేనేనా అని బాధపడతారు. ఈ దశలో మీరు విషయాన్ని అర్ధం చేసుకోలేరు. అందుకే సమస్యలు వస్తాయి.

దీని తరవాతది, తెలివితేటల దశ. ఇక్కడ నుంచి పని చేసినప్పుడు మీరు అర్ధవంతమయిన నిర్ణయాలు చేయగలుగుతారు. కానీ మీలో ఎటువంటి అదనపు కుతూహలం కాని, శక్తి కానీ ఉండవు. ఒక కంప్యూటర్లా పని చేయగలుగుతారు.

దీని తరువాతది ఆత్మప్రబోధ స్థితి. దీనినే అతఃప్రేరణ దశ అంటారు. ఈ దశలో మీరు మీలోని నిగూఢంగా ఉన్న శక్తులని నిజం చేయగలుగుతారు. మీ అచేతన స్థితి తెలుసుకునే తత్వంలో నిండిపోతుంది. ఇక్కడ మీరు చేసే నిర్ణయాలు తెలుసుకోగల తత్వంతో చేస్తారు. ఎటువంటి నిర్ణయాన్నైనా చాలా సులభంగా తీసుకోగలరు. ఈ దశలో మీరు అనంతమయిన శక్తిని పొందుతారు. దానితో మంచి ప్రణాళికలు వేయగలుగుతారు, వాటిని సమర్థతతో అమలు పరచగలుగుతారు. ఈ దశలో మీలోని నిగూఢశక్తి విడుదల అవుతుంది . మీరు సృజనాత్మకంగా ఉండగలరు. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు అద్భుత విషయాలు కనుగొన్నది ఈ ఆత్మప్రబోధ దశలోనే. అక్కడ మీరు పొందే శక్తి నిజమయిన మీ ఆత్మశక్తి. రుషులు, జ్ఞానోదయం పొందిన యోగులు ఎల్లప్పుడు ఈ దశలోనే ఉంటారు. వారికి భూత, భవిష్యత్ కాలాలు అందుబాటులో ఉంటాయి. ధ్యానం మిమ్మలని ఆ దశకి చేరుచుతుంది.

ధ్యానం మన మెదడు యొక్క పని తీరుని నియంత్రించ గలుగుతుంది.

ధ్యానం అనేది ఒక అద్భుతమయిన ప్రక్రియ. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన రుషులు కనుగొన్నారు. ధ్యానంతో అద్భుతాలు చేయవచ్చు, విశ్వశక్తిని నిరంతరం పొందవచ్చు, సాక్షాత్ భగవంతునితో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పుకోవచ్చు, మన అంతరంగ ప్రపంచంలోనికి వెళ్ళగలిగే ఒకే ఒక మార్గం ధ్యానం, ఇలా వీటిని మనకి తమ అనుభవాలద్వారా తెలుసుకున్న సత్యాలని వివరించారు.

మన అంతరంగంలో అద్భుతమయిన ప్రపంచం ఉంటుంది. ప్రాచీన రుషులు ఈ అంతరంగ శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి వారి సిద్ధాంతాలని, సూత్రాలని ప్రపంచానికి వెల్లడి చేసారు. అవే ఒక్కొక్క మతంగా అభివృద్ధి చెందాయి.

అదే విధంగా ధ్యానంలో మరొక అద్భుతాన్ని నిత్యానందస్వామి చూపించారు. ధ్యానం ద్వారా మెదడు యొక్క పని తీరుని నియంత్రించవచ్చు అని శాస్త్రీయంగా నిరూపించి, ఆధునిక వైద్యశాస్త్రంలో కొత్త అధ్యాయాలు సృష్టించారు. ఏదైనా శాస్త్రీయంగా ప్రయోగాలు చేసి చూపిస్తే కానీ నమ్మని వారు పాశ్చాత్యులు. అటువంటి వారు స్వామీజీ మెదడు మీద ప్రయోగాలు చేసి ధ్యానం యొక్క గొప్పదనానికి ఆశ్చర్యపోయి పరమహంస నిత్యానందని అద్భుత యోగిగా ప్రకటించారు.

ధ్యానం, మెదడు పని తీరుపై అమెరికాలో శాస్త్రజ్ఞులు, వైద్యులు చేసిన ప్రయోగాలు : పరమహంస నిత్యానంద తన అమెరికా పర్యటనలో భాగంగా ఒక్లహామాసిటీకి వచ్చినప్పుడు, ఆయన గురించి ముఖ్యంగా ధ్యానంతో ఆయన చేస్తున్న అద్భుతాల గురించి విన్న శాస్త్రజ్ఞులు, డాక్టర్లు (న్యూరోసర్జన్) ఆయనని కలిసి ధ్యాన సమయంలో ఆయన మెదడు యొక్క పనితీరు పైన పరిశోధనలు చేయడానికి అనుమతి అడిగారు. పరమహంస ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయనకి ఇటువంటి ప్రయోగాలన్నా లేదా దేనికైనా శాస్త్రీయంగా నిరూపించటమున్నా చాలా ఇష్టం. ఆయన ప్రతి కార్యక్రమంలో శాస్త్రీయ దృక్పథం, ప్రయోగాలు వీటి గురించి బాగా ప్రోత్సహిస్తారు. ఆయన చాలా సంతోషంగా అంగీకరించటమే కాదు ఆయన శరీరాన్ని వారికి అప్పగించేసారు. డా॥ మురళీకృష్ణ, ప్రెసిడెంట్ COO, Integris మెంటల్ హెల్త్; డా॥ ఫోర్టీస్, డా॥ రువే, డా॥ హిగ్గిన్స్, డా॥ చాకో ఒక బృందంగా ఏర్పడి స్వామీజీ పైన చేసిన పరిశోధనలో పాల్గొంటారు. వీరంతా ఒక్లాహోమా (యు.ఎస్.ఎ) కి చెందిన వారే.

స్వామీజీ మెదడు పనితీరుపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు

స్వామీజీ మెదడు పనితీరుపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు

వారు చేసిన ప్రయోగం :

వారు పరమహంస నిత్యానందని అధ్యయనం చేయటానికి, మాములు పేషెంట్లకి ఉపయోగించే సాంకేతిక పరికరాలని ఉపయోగించారు.వారు ముఖ్యంగా స్వామీజీ మెదడుని మూడు దశలలో పరిశీలించారు; అవి ఆయన మాములుగా ఉన్నప్పుడు, ధ్యానం ప్రారంభించి నప్పుడు, గాఢమయిన ధ్యానంలో ఉన్నప్పుడు. మెదడు యొక్క చర్యల చిత్రాలు.

స్వామీజీ మెదడు యొక్క దృశ్యాలని PET (Positron Emission Tomogra-phy) అనే పరికరం సహాయంతో చూసారు. MRI, PET అనే పరికరాలు మెదడులోని కణాల జీవరాసాయన క్రియ ద్వారా మెదడులో జరిగే చర్యలని స్పష్టమయిన చిత్రాలుగా చూపించుతాయి. గ్లూకోజ్ లాంటి పదార్థాన్ని రేడియో యాక్టివ్ PET ట్రేసర్‌కి అతికించారు. వారు PET స్కాన్నర్ చూపించిన దృశ్యాలు చూసి నిర్భాంతపోయాము అని, రిపోర్టులో చెప్పారు.

స్వామీజీ ధ్యానం ప్రారంభించటానికి ముందు మెదడు చురుకుగా ఉండటాన్ని గమనించారు. ధ్యానం ప్రారంభించాక సాధారణమైన వ్యక్తులలోని మెదడు కంటే చాలా రెట్లు అధికమైన చురుకుతనంతో ఉండటాన్ని గమనించారు. ముఖ్యంగా ఆయన మెదడు ముందు భాగం (నొసట వైపు) అత్యంత చురుకుగా ఉండటాన్ని చూసారు. మెదడులోని ఈ భాగం తెలివితేటలు, శ్రద్ధ చూపటం, వివేకం, నిర్ణయాలు చేయటం వీటికి కేంద్ర స్థానం.

తరువాత డాక్టర్స్ స్వామీజీ ని లోతయిన ధ్యానంలోనికి వెళ్ళమని చెప్పారు. అప్పుడు వారు రెండు విశేషయిన విషయాలని గమనించారు.

అందులో మొదటిది నిత్యానంద స్వామి మెదడు 90% పైగా నిశ్శబ్దమయిపోయింది. అది పూర్తిగా తన చర్యలని ఆపివేసింది. మెదడు మొత్తం నిశ్శబ్దంగా నిశ్చలంగా అయిపోయింది. ఈ పరిస్థితిని ఆయన ధ్యానం ద్వారా కావాలి అని చేసిన స్థితి.

రెండవ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, ఆయన మెదడు ముందు క్రింద భాగం చాలా ప్రశాంతవంతంగా ఉన్నది. ఈ భాగం అద్భుతమయిన మూడవ కన్నుకి సంబంధించిన భాగం. ఆ తరువాత డాక్టర్స్ స్వామీజీని, గాఢమయిన ధ్యానంలో ఉండగా ఏమి చేసారు అని అడిగితే ఆయన తన మూడవ కన్ను తెరిచినట్టు చెప్పారు.

మూడవ కన్ను అనేది ఆత్మయొక్క స్థానం. ఇది విశ్వమేధస్సు, అంతరంగ జ్ఞానం యొక్క కలయికతో ఏర్పడే ప్రదేశం, దీని ద్వారానే సర్వాంతర్యామితో సంబంధం ఏర్పరచవచ్చును.

అదే విధంగా QEEG ద్వారా స్వామీజీ మెదడులోని తరంగాలని గమనించినప్పుడు వాటిపై ఆయనకి పూర్తి నియంత్రణ ఉన్నట్టుగా తెలిసినది. చివరగా డాక్టర్స్ ఈ విధంగా చెప్పారు. మానవ శరీరంలో మెదడు అత్యంత క్లిష్టమయిన భాగం. దానిని స్వామీజీ ఎంతో తేలికగా నియంత్రించగలుగుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా కుతూహలం కలిగించే రహస్యాలు ఉన్న ప్రశ్నలు ఎన్నో మాకు కలిగాయి. ఈయనపైన చేసిన ప్రయోగాలు వైద్యశాస్త్రంలో కొత్తపేజీలని సృష్టించాయి. ప్రత్యేక శిక్షణ ద్వారా వ్యాధులు నివారించే పద్ధతులని, అనారోగ్యానికి చికిత్స చేసుకోగల నేర్పుని తేగలమేమో అనిపించినది అని చెప్పారు.

ధ్యానం యొక్క విశిష్టతని లోకానికి చాటటానికి ఆయన తన శరీరాన్ని, మెదడుని ప్రయోగశాలకి, శాస్త్రజ్ఞులకి అప్పగించి, వారికి పూర్తి సహాయసహకారాలు అందించి, తాను చెప్పినవన్నీ సత్యాలే అని ప్రపంచానికి చాటారు ఈ యోగీశ్వరుడు ఒక్లహామా డాక్టర్స్ శాస్త్రవేత్తలు స్వయంగా తయారు చేసి ఇచ్చిన రిపోర్టు నిత్యానంద ధ్యానపీఠం వారి దగ్గర ఉన్నది.

కాబట్టి ధ్యానంతో అద్భుతాలు చేయగలం అని ప్రపంచానికి నిరూపించి పాశ్చాత్యులతో ఈయన అద్భుత యోగి అని అనిపించారు పరమహంస నిత్యానంద. ధ్యానం గురించి వివిధ కార్యక్రమాలలో భక్తులు స్వామీజీని అడిగిన ప్రశ్నలు, వాటికి స్వామీజీ ఇచ్చిన అసాధరణ సమాధానాలు.

పరమహంస నిత్యానంద ప్రతి కార్యక్రమంలోను పాల్గొన్న వారిని అడిగే ప్రశ్నలని అక్కడే జవాబులు ఇస్తుంటారు. ప్రశ్నలకి కొంతమంది కాగితం మీద రాసి కూడా ఇస్తారు. ఆయన అద్భుతమయిన మేధస్సుతో, అత్యంత సమయస్ఫూర్తితో మనం అడిగే సాధారణ మయిన ప్రశ్నలకి అసాధారణమయిన జవాబులు ఇస్తుంటారు. స్వామీ ఎప్పుడూ ఇలా చెబుతారు. నేను ప్రశ్నకి జవాబు ఇవ్వను, ప్రశ్నించిన వ్యక్తికి జవాబు ఇస్తాను అని. అందుకే ప్రశ్న సాధారణంగా ఉంటుంది. జవాబు మాత్రం అసాధారణంగా ఉంటుంది. ఆ ప్రశ్నలలో కొన్ని ధ్యానం పై మనకి వచ్చే అనుమానాలని కూడా నివృత్తి చేస్తాయి.

ప్ర : ప్రియమైన స్వామీజీ, ధ్యానం చేస్తే మాలో మార్పు ఎలా వస్తుంది.?

ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో, మీలోని ప్రాథమిక స్థాయిలో ఉండే భావావేశాలు అయిన కోపం, కోరిక, అత్యాశ, అసూయ ఇలాంటివన్ని కూడా ఉన్నతమైన శక్తిగా మారుతుంది. ఆ శక్తి మిమ్ములని ఉన్నతయిన చేతన స్థితికి, మీలో తెలుసు కోగల స్థితికి తీసుకువెళుతుంది. అప్పుడు మీలో అసహనం, ఆందోళన మాయం అవుతాయి. ఇటువంటి మార్పు కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

ప్ర : స్వామీజీ ధ్యానం ద్వారా మాలో మార్పు తేవటంలో గురువుల పాత్రని వివరంగా చెప్పండి ?

మీరు మీలోపల మీవి కాని చాలా విషయాలని కొన్ని సంవత్సరాలుగా, కొందరిలో కొన్ని జన్మలుగా నిలువచేసి ఉంచారు. అవి మీరు కొన్ని జన్మలుగా పోగుచేసుకున్న అనవసరమయిన విషయాలు. అవి మీలో అణచివేయబడిన ఆలోచనలు, భావావేశాలు, ఇలాంటివి. ఇవే మీ ధ్యాన మార్గంలోని అడ్డంకులు. ఆ విషయం మీకు తెలియదు. గురువులు వాటిని గుర్తించి మీకు చూపించుతారు. అలా చూపించినప్పుడు మీరు వాటిని తొలిగించుకోవాలి. మీలో అణచివేయబడిన విషయాలని పైకి తేవటానికి కొన్ని పరిస్థుతలని కల్పించుతారు, గురువులు. ఆయన మీ లోపల ఉండే అనవసరమయిన విషయాలని కాల్చివేసి అడ్డంకులు తొలిగిస్తాడు. అయితే మీరు ఆయనని మీ మీద పని చేయనిచ్చినప్పుడే ఇది సాధ్యం. అందుకే గురువుల సమక్షంలో మీరు చేసే ధ్యానం మీకు అద్భుతమయిన ఫలితాలని ఇస్తుంది.

ప్ర ॥ మేము ధ్యానం ఎంతసేపు చేయాలి?

ఎంతసేపు ధ్యానం చేసారు అనేది ముఖ్యం కాదు, ఎంత తీవ్రంగా చేసారు అనేది ముఖ్యం. అప్పుడు మీలో ఉండే చేతనస్థితి యొక్క నాణ్యత ముఖ్యం. మీరు ధ్యానం చేసేటప్పుడు తీవ్రంగా ధ్యానం చేయండి. మీ ధ్యానంతో పాటు తీవ్రత కూడా ఉంటే, మీలో ఉన్నతమయిన చేతన స్థితి ఏర్పడుతుంది. అది మీరు వికసించటానికి సహాయం చేస్తుంది.

ప్ర॥ స్వామీజీ, ధ్యానం మాకు సంతృప్తిని పొందేందుకు ఏవిధంగా సహాయం చేస్తుంది.

మీరు నిరంతరం ధ్యానం చేస్తే సున్నితంగా, మృదువుగా తయారవుతారు. మీరు తెలుసుకోగల స్థితిలో ఉంటారు. మీ చేతన స్థితి విశాలమవటం మీరు తెలుసు కుంటారు. అప్పుడు అన్నివిషయాలు మీకు స్పష్టంగా ఉంటాయి. మీ మైండ్ కి మీకు మధ్య దూరం పెరిగి మీ అంతరాత్మఎన్నో అనుభవాలని పొందుతుంది. ఆ అనుభూతులు ఏమిటి అంటే, పరిపూర్ణమయిన తృప్తిని సాధించాము అన్న ఆనందం. అదే మనకి శాశ్వతమయిన నిత్యానందాన్ని ఇస్తుంది.

ప్ర ॥ స్వామీజీ, ధ్యానం చేయటం కూడా ఒక పనే కదా?

ధ్యానం ప్రారంభించినప్పుడు అది ఒక పని లాంటిదే. నిశ్శబ్దంగా కూర్చోవాలి అని మీరు ఎప్పుడు అనుకుంటారో అది మీకు ఒక పనిలాంటిదే. ఎందుకంటే ఒకపనిని (నిశ్శబ్దంగా కూర్చోవటం) మీరు చేస్తున్నారు కాని అది సహజంగా మీరు కూర్చున్నట్టుగా కాదు. ఎప్పుడయితే నేను నిశ్శబ్దంగా కూర్చోవాలి అని ప్రత్యేకంగా మీరు అనుకుంటారో, అప్పుడు ధ్యానం ఒక పని.

కాని లోతుగా విశ్లేషణచేస్తే, ధ్యానం ఒకపని కాదు. మీరు ధ్యానంలోనికి సహజంగా ప్రవేశించగలిగినప్పుడు, కూర్చోవాలి అనే ప్రయత్నాలు మాయం అవుతాయి. అప్పుడు పూర్తి విరామంలో ఉండగలుగుతారు. మీరు ఫలితాల కోసం ప్రయత్నించరు. క్రమంగా మీరు ధ్యానం చేస్తున్న విషయాన్ని కూడా మర్చిపోతారు. అప్పుడు ధ్యానం అంటే ఒక పని కాదు.

ప్ర : స్వామీజీ ధ్యానం చేసేటప్పుడు మాకు నిద్ర వస్తుంది. మేము ఏంచేయాలి?

ధ్యానం ప్రారంభించిన కొత్తలో నిద్ర రావచ్చు. అది సమస్యకాదు. మీరు అప్పుడు నిద్ర ఆపాలని ప్రయత్నాలు చేయకండి. నిద్రతో పోరాటానికి దిగకండి. అలా చేస్తే మీరు నిద్రపోలేరు, ధ్యానం చేయలేరు. ఆ తరువాత అయ్యో! ధ్యానం సరిగా చేయలేకపోయానే అని బాధ పడతారు. కాబట్టి నిద్రవస్తే హాయిగా నిద్రపోండి. నిద్ర అయిపోయి మీకు మెలకువ వచ్చాక అప్పుడు ధ్యానం చేయండి. అంతే.

ప్ర : స్వామీజీ, ధ్యానం ఎక్కువగా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

ధ్యానం చేస్తే ఉండే ఒకే ఒక ఎఫెక్ట్ ఆనందం. ఎక్కువగా ధ్యానం చేస్తే దొరికేది ఆనందమే. ఇది ఎలా ఉంటుందంటే అమృతం ఉన్న పెద్ద బాండారంలో మీరు పడ్డారనుకోండి; ఏమవుతుంది, అమృతం అంటే మరణం లేకుండా చేసేది. అందులో పడితే మరణించం కదా. ధ్యానం కూడా అంతే. ధ్యానం చేస్తే అది మిమ్మలని పరమానంద స్థితికి తీసుకువెళుతుంది. అంతేకాకుండా మీరు శారీరకంగా, మానసికంగా, భావావేశాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఆరోగ్యంతో ఉండగలుగుతారు. మీరు శక్తితో ఉత్సాహంగా ఉంటారు.

అంతే కాకుండా మీరు క్రమం తప్పకుండా, తీవ్రంగా ధ్యానం చేస్తే మీలో, మీ ముఖంలో అందమైన ప్రకాశం కనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటాను. మీరు ధ్యానం ప్రారంభించే ముందు ఫోటో తీయించుకోండి. 21 రోజులు ప్రతి రోజు ఏదో ఒక ధ్యాన పద్ధతిని సాధన చేయండి 21రోజులు తరువాత మీరు మరలా ఫోటో తీయించుకోండి. ఆ తేడా స్పష్టంగా మీకే తెలుస్తుంది. మీకు తెలిసినవారుకూడా మీలో మార్పుని స్పష్టంగా గుర్తించగలుగుతారు. అందం, ఉత్సాహం, ఆనందం మీ సొంతమవుతాయి. ఇవే ధ్యానం చేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్.

ప్ర : స్వామీజీ నేటి సమాజంలో ధ్యానం వలన కలిగే లాభాలు ఏమిటి?

ఏ సమాజంలో నైనా మానవులకి కావలసినవి ఆరోగ్యకరమైన బలమైన శరీరం. ఆరోగ్యకరమైన మానసిక స్థితి, ఆత్మబలం మన పనులు సమర్ధవంతంగా చేసుకోవటానికి ఉపయోగ పడుతుంది. మానసిక బలం మనస్సుని ప్రశాంతంగా జీవితాన్ని ఆహ్లాదంగా చేస్తుంది. ఆత్మబలం ఈ రెంటికికీ అతీతంగా మనని తీసుకువెళుతుంది. మనలో కరుణా, ప్రేమా, సమాజసేవ ఇటువంటి లక్షణాలని అభివృద్ధి చేస్తుంది. ఎప్పుడయితే ఈ మూడు బలంగా ఉంటాయో అప్పుడే మనిషి పరిపూర్ణుడుగా మారి తనకి, తన సమాజానికి తన దేశానికి ఒక ఐశ్వర్యంలా ఉంటాడు. ఈ మూడింటినీ సాధించగల ఒకే ఒక మాస్టర్ కీ (తాళం) ధ్యానం. ధ్యానం మనని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తుంది. మానసిక సమస్యలని తొలగిస్తుంది. మన ఆత్మకి నిజమైన బలాన్ని ఇస్తుంది.

ప్ర : స్వామీజీ మీరు నేర్పించే ధ్యానపద్ధతులలోని ప్రత్యేకత ఏమిటి?

నేను నేర్పించే ధ్యాన పద్ధతులు, మీ లోపలి శక్తులని సమతుల్యంలో ఉంచుతాయి. విశ్వం మీద, అంతరిక్షం మీద, గ్రహాలమీద, సూర్యుడిమీద, చంద్రుడిమీద పని చేసే శక్తి ఒకటి ఉన్నది. దీనినే నేను విశ్వశక్తి అంటాను. మనిషి ఈ విశ్వశక్తితో సంబంధాన్ని కోల్పోయాడు. నేను నేర్పించే ధ్యాన పద్ధతులు ఆ విశ్వశక్తితో మీ సంబంధాన్ని నెలకొల్పటానికి ఉపయోగపడతాయి. ఈ పద్ధతులు మిమ్మలని విశ్వశక్తిని అనుకూలంగా జీవించే విధంగా సహాయం చేస్తాయి.

ప్ర : స్వామీజీ నేరం, నేరప్రవృత్తిలో ఉండే వారిలో ధ్యానం మార్పు తేగలుగుతుందా? ఇటువంటి వాటిని మీరు సమర్థించుతారా ?

ధ్యానం ఎటువంటి వారిలోనైనా అద్భుతమైన మార్పులు తెస్తుంది. ఇటువంటి ప్రయత్నాలని నేను సమర్థించుతాను. నేరం చేసినవారు ఉండే ప్రదేశాలన్ని (ముఖ్యంగా జైళ్ళు) వ్యతిరేక ఆలోచనలతో, వ్యతిరేకపు భావాలతో నిండిపోయి ఉన్నాయి. అటువంటప్పుడు నేరప్రవృత్తి ఉన్నవారిని మరింత నేరగాళ్ళుగా పరిస్థితులు తయారు చేస్తున్నాయి.

ఈ విషయంలో ధ్యానం కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, ఎక్కడ ఎటువంటి మార్పు రావాలి అని అనుకున్నా అది ముందుగా మనిషి అంతరంగంలోని మార్పుతోనే ప్రారంభం కావాలి. అది నేర వృత్తిలోని వారయినా, ఆ వృత్తిలోకి రాబోయే వారయినా సరే. ధ్యానం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ మార్చుతుంది, అదేవిధంగా సమాజంలో ఉండే నేరాలని తగ్గిస్తుంది.

ప్ర : స్వామీజీ, ధ్యానం ఈ రోజులలో మాకు ఒక ప్రయోగాత్మకమైన ప్రత్యామ్నాయంగా ఉండగలదా?

అవును, ప్రత్యేకంగా ఈ నాటి సమాజంలో మనుషులమీద ఒత్తిడి అధికంగా ఉన్నది. ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు కుటుంబ బాంధవ్యాలు పడిపోతాయి. మనుషుల మధ్య మానవ సంబంధాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇటువంటి పరిస్థితిలలో ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. ధ్యానం చేయటానికి మీ ప్రయత్నాలు, మీ సమయం ఎక్కువ అవసరం లేదు. నాకు తెలుసు మీరంతా చాలా చాలా బిజీగా ఉంటారని. మీకోసం కేవలం అరగంట సమయాన్ని కేటాయించండి. ప్రతీరోజు అరగంట ధ్యానం చేయగలిగితే మీలో ఎంతో మార్పు వస్తుంది. మీ జీవన సరళిలో ఎంతో నాణ్యత ఉంటుంది. ఈ మార్పు మానవ సంబంధాలని మెరుగుపరచి మిమ్మలని ఎదుటి వారికి దగ్గర చేస్తుంది. ఈ రోజులలోని పరిస్థితులలో ధ్యానం ఒక శక్తివంతమయిన ఆయుధం లాంటిది.

A banyan tree with large aerial roots