ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?
ఆహారశుద్ధి :
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ఆహారశుద్ధి గురించి పరమహంస నిత్యానంద అద్భుతమయిన వివరణ ఇస్తారు. ఆయన ఆహారశుద్ధి గురించి ఈ విధంగా చెబుతారు. ఆహారం అంటే మనం మన లోపలికి తీసుకునే భోజనమే కాదు, జ్ఞానేంద్రియాల ద్వారా లోపలికి తీసుకునే అన్ని కూడా ఆహారమే. మనం కళ్ళతో చూసేవి, చర్మం స్పర్శ ద్వారా తెలుసుకునేవి, చెవులతో వినేవి, ముక్కు ద్వారా చూసే వాసనలు, నాలుక ద్వారా చూసే రుచులు అన్ని ఆహారమే. ఇవన్నీ కూడా పరిశుద్ధమయినవి అయినప్పుడే మన శరీరం, మనస్సు సౌకర్యంగా, ఆహ్లాదంగా ఉండగలుగుతాయి. అవి పరిశుద్ధిగా లేనప్పుడు శరీరం అసౌకర్యానికి గురి అవుతుంది.