KAILASA Library/ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?/మీ శరీరం మీద పని చేయండి :Sign in
ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?

మీ శరీరం మీద పని చేయండి :

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

మీ శరీరం అంటే భౌతికంగా మీకు కనపడే మీ శరీర భాగాలు, తల నుంచి కాళ్ళ వరకూ ఉండే మొత్తం. మీరు ఈ శరీరంతో జన్మించుతారు. మీ వయస్సుతో పాటు అది పెరుగుతుంది.

సరే, మీరు మీ శరీరం గురించి ఏమనుకుంటున్నారు? అందరం మన మన శరీరాల గురించి కొన్ని అభిప్రాయాలని ఏర్పరచుకుంటాము. ఈ అభిప్రాయాలు అనేవి మీ సొంతం కాదు అని మీకు తెలుసు. సాధారణంగా ఇతరులు మన శరీరం గురించి వెల్లడి చేసిన వారి అభిప్రాయాలు నుంచి కొన్ని ఎంచుకొని వాటిని మనకి అన్వయించుకుంటాయి. మీరు ఒక్క నిముషం కళ్ళు మూసుకుని మీ శరీరంపై మీ అభిప్రాయాలని మీ శరీరం గురించి మీరు ఏమనుకుంటున్నారో గుర్తు తెచ్చుకోండి. మీకు రెండు విషయాలు అర్ధమవుతాయి.

అవన్నీ బయట ఎవరో అన్న అభిప్రాయాలే కానీ మీ అభిప్రాయాలు కావు. ఇందులో ఎక్కువ భాగం వ్యతిరేకపు భావనలే.అయితే ఈ విషయం ఇప్పటివరకూ మీకు తెలియదు. మీ అచేతన స్థితిలో మీ శరీరం గురించి ఇటువంటి వ్యతిరేక భావనలు లోతుగా నాటుకుపోయి ఉన్నాయి. మీరు ఇంతకాలం వాటిని ఆ భావనలని మీకు తెలియకుండా మోస్తున్నారు.

నాకు తెలిసినంతవరకూ చాలా చాలా అరుదుగా నేను నా శరీరంతో సౌకర్యంగా ఉన్నాను అని చెప్పేవారిని చూస్తాను. ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఎవరో కాని తమ శరీరాన్ని ద్వేషించకుండా, నాకు నా శరీరం సౌకర్యంగానే ఉన్నది అని అంటారు.

మీరు మీ జీవితంలో ఎక్కువభాగం శరీరానికి సంబంధించిన వ్యతిరేకపు అభిప్రాయాలని మాత్రమే వింటుంటారు. నీ శరీరమే నీ శత్రువు. నీ శరీరం చెడ్డది. అది పాపంతో కూడి ఉన్నది. అందుకే నీ శరీరాన్ని హింసించు. దానిని పూర్తిగా వదిలివేయి. అసలు పట్టించుకోవద్దు. ఇలాంటి అభిప్రాయాలు, మాటలు, శరీరం గురించి అనే అతి సాధారణమయినవి. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు ఎక్కువగా ఇటువంటి అభిప్రాయాలని కలిగి ఉంటారు. వారు ఆధ్యాత్మిక ప్రగతి సాధించే క్రమంలో ఈ శరీరం ఒక అడ్డంకు అని అనుకుంటారు. అంతేకాకుండా సమాజంలోని నిబంధనలు, క్రమశిక్షణ పేరుతో కూడా శరీరాన్ని అశ్రద్ధ చేస్తారు. ఈ అభిప్రాయాలు చాలా చిన్నవయస్సు నుంచే మీ అచేతన స్థితిలో లోతుగా నాటబడిపోతాయి. అప్పుడు మీరు మీ శరీరాన్ని ద్వేషించటం ప్రారంభిస్తారు. మీ శరీరం మీకు శత్రువు అని గట్టిగా నమ్ముతారు. ఈ శరీరం మీకు వ్యతిరేకంగా పని చేస్తుందనే గట్టి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు.

కానీ అసలు సత్యం మీకు తెలియదు. మీ శరీరం ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించే ఒక నౌక లాంటిది. ఒక్కసారి ఆలోచించండి. ఈ శరీరం లేకుండా మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికయినా వెళ్ళగలరా? మీరు ఈ శరీరం సహాయం లేకుండా ఏ పనైనా చేయగలరా? మీ శరీరం మంచి స్థితిలో లేనప్పుడు మీరు అసలు ధ్యానం చేయగలరా? ఆధ్యాత్మికంగా ఏమైనా సాధించగలరా? కనీసం ఈ పుస్తకాన్ని చదవగలరా? ఈ పుస్తకం చదవాలి అంటే మీకు కళ్ళు, మీ మెదడు సహాయం చేయాలి కదా?

అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చిపోకూడదు. మీరు చివరగా ఈ శరీరానికి అతీతంగా వెళ్ళగలగాలి. అలా శరీరానికి అతీతంగా వెళ్ళాలి కదా అని శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు.

కాబట్టి మీ శరీరాన్ని ఆదరించాలి. అర్థం చేసుకోవాలి. దానిపై కొంత పని చేయాలి. అప్పుడే మీరు ఈ శరీరంతో ధ్యానం చేయగలుగుతారు. ఇక్కడ ఒక ముఖ్యవిషయం మరిచిపోకూడదు. మీ శరీరం ఒక శక్తివంతమయిన ఆయుధంలాంటిది. అది మీ శత్రువు కాదు స్నేహితుడూ కాదు. ఇది మీకు ఉపయోగపడే ఒక పనిముట్టు మాత్రమే. కాబట్టి ధ్యానం చేయటానికి ముందు, మీ శరీరం మీద శ్రద్ధ చూపించండి. మీ శరీరం ఎంతబాగా పని చేస్తే, మీరు ధ్యానంలోనికి అంత కచ్చితంగా ప్రవేశించగలుగుతారు. మీకు మీ శరీరం గురించి వుండే వ్యతిరేక భావాలని పూర్తిగా వదిలివేయండి.

మన శరీరంపై ఎలా శ్రద్ధ చూపాలి :

ముందుగా మీ శరీరం పట్ల శ్రద్ధ చూపించటం మొదలుపెట్టండి. మీ శరీరం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నప్పుడే మీరు ధ్యానం బాగా చేయగలుగుతారు. కాబట్టి మీ శరీరాన్ని శుభ్రం చేయండి.

శరీరాన్ని శుభ్రపరచటం అంటే ఏమిటి ?

మన శరీరంలో శక్తి ఒక ప్రవాహంలా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆశక్తి ప్రవాహం నిరాటంగా ప్రవహిస్తున్నంత సేపు మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ చాలాసార్లు ఆ శక్తికి అడ్డంకులు ఏర్పడతాయి. అప్పుడు మనకి శారీరక సమస్యలు ఏర్పడతాయి.

శక్తి ప్రవాహానికి అడ్డంకులు అంటే ఏమిటి?

మనం మన చిన్నతనం నుంచి ఎన్నో భావావేశాలని అణచివేస్తాము. ఈ సమాజం మర్యాద పేరు మీద మనని మన శరీరం ద్వారా మనలోని భావావేశా లని వ్యక్తపరచనీయదు. ఉదాహరణకి మీకు ఎవరిమీదయినా కోపం వచ్చిందనుకోండి. వెంటనే శరీరం మనం పోట్లాడటానికి, ఇతరుల నుంచి మనని మనం రక్షించుకోవటానికి అవసరమయిన రసాయనాలని తయారుచేస్తుంది. ఒక వేళ మీకు కోపం వచ్చిన వ్యక్తి తండ్రి, గురువు లేదా మేనేజర్ ఇలా మీకంటే పెద్దవారయితే మీరు ఏం చేస్తారు. ఆ కోపాన్ని అణచివేస్తారు. అప్పుడు ఆ ఆవేశంతో పాటు విడుదల అయిన శక్తి అలాగే ఉండిపోతుంది. ఉపయోగించని శక్తి రసాయనాలు శరీరంలో అడ్డంకుగా తయారవుతాయి. అదే విధంగా కోరికని అణచినా, భయాన్ని అణచినా, ఆశని అణచినా చివరికి అవి అన్నీ అడ్డంకులుగా మారుతాయి. కాలం గడచే కొద్దీ ఇవన్నీ గట్టిపడిపోతాయి. అవే మనలో శక్తి ప్రవహించకుండా అడ్డాలు సృష్టించుతాయి. ఎప్పుడయితే మనలోని శక్తి ప్రవాహం చైతన్యవంతంగా ఉండదో అప్పుడు మనలోని శక్తి కేంద్రాలయిన చక్రాలు ముడుచుకుపోయి చిన్నవయిపోతాయి. అప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఈ విధంగా అణచివేయబడిన భావావేశాలు కొంత హద్దులు దాటితే అవి మనిషిని పిచ్చివాళ్ళుగా, మానసిక రోగులుగా మార్చేస్తాయి. అందుకే అంటుంటారు, మీ శారీరక సమస్యలు మానసిక సమస్యలకి దారి తీస్తాయి. అదే విధంగా మీ మానసిక సమస్యలు కొన్ని అనారోగ్యాలని కలిగించి శారీరక సమస్యలని సృష్టిస్తాయి. అంతేకాదు మనలో ఉండే 80% వ్యాధులు మానసికమయినవే అని శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి.

ఆహారపు అలవాట్లు :

కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మన శరీరానికి హాని చేస్తాయి. మనకి ఎన్నోసార్లు మన శరీరం ‘నాకు వద్దు. దయచేసి ఇది తినవద్దు’ అని కళ్ళ నీళ్ళతో ప్రార్థిస్తూ అడుగుతుంది. కానీ మనం వినం. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఘాటయిన మసాలాలు తిన్నప్పుడు, ఎక్కువ కారం, ఎక్కువ పులుపు లేదా ఉప్పు తిన్నప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ మనం బలవంతంగా అవన్నీ తినేస్తాము. అలా తిని వ్యాధులని మన మీదకి ప్రేమతో, మర్యాదలతో ఆహ్వానిస్తాము. అలాగే అతిగా తిని జీర్ణవ్యవస్థకి మోయలేని పనిని ఇస్తాం.

అదే విధంగా నిద్రవస్తున్నా టి.వి. చూస్తారు. కళ్ళు అలసిపోయినా నాకు విశ్రాంతి ఆ కంప్యూటర్ ముందు కూర్చోని పని చేస్తుంటాము. శరీరం నాకు విశ్రాంతి కావాలి అని గోలపెడుతున్న వినం. ఇవన్నీ మనం మన శరీరానికి చేసే హాని. ఈవిధంగా మన శరీరం మీదకి వ్యాధులని అతిధులుగా ఆహ్వానించి ఆ తరువాత వాటి మీద పిర్యాధులు చేస్తుంటాము.

అందుకే శరీరాన్ని ముందుగా శుభ్రం చేయాలి :

ముందుగా మీలో ఏర్పడిన ఈ అడ్డంకులని తొలగించుకోవాలి. దీనికి ధ్యానం మీకు సహకరిస్తుంది. ఆ తరువాత శరీరంలో ఎటువంటి అడ్డంకులని సృష్టించకూడదు. ఒక్కసారి మీరు మీ శరీరాన్ని ఈ అడ్డంకుల నుంచి కాపాడితే, అది ఎంత అందంగా వికసిస్తుందో మీరే స్వయంగా చూడగలరు. మీ శరీరం అందంగా దివ్యత్వంతో అలరారటం మీరు గమనించగలుగుతారు. అందుకే మీ శరీరంతో స్నేహపూరిత సంబంధాలని అందమయిన అనుబంధాన్ని పెంచుకోవాలి. శరీరాన్ని ప్రేమతో ఆదరించాలి. శరీర భాషని, అది మనకి ఏమి చెబుతుందో అర్థం చేసుకోవాలి. శరీరానికి కావలసిన తెలివితేటలు దానికి ఉన్నాయి. ఆ విషయం మీరు తెలుసుకోవాలి.