ధ్యానం చేసే సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు :
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ధ్యానం ప్రారంభిస్తున్న ధ్యానులకి నిత్యానందస్వామి కొన్ని విషయాలని ప్రత్యేకంగా చెబుతారు. అవి మనం చేసే ధ్యానంలో మంచి ఫలితాలను పొందటానికి సహాయం చేస్తాయి. పరమహంస ధ్యానులని ఉద్దేశించి ఈ విధంగా చెబుతారు.
ధ్యానం మిమ్మలని మీ అంతరంగపు ప్రపంచంలోనికి తీసుకువెళుతుంది. అయితే మీరు మీ అంతరంగంలోనికి ప్రవేశించేముందు మీ బాహ్యప్రపంచంలో కొన్ని విషయాలపైన కొంత ఏకాగ్రతని నిలపాలి. ఎందుకంటే మీరు ఇంకా ధ్యానం ప్రారంభించలేదు ధ్యానం ప్రారంభించబోతున్నారు. మీరు ఒడ్డున నిలబడి కాలివేలిని నీటిలో ముంచి నీరు ఎలా ఉన్నది అని పరీక్షిస్తున్నారు. ఒకే వేళ నీరు చాలా చల్లగా ఉంటే నీళ్ళలోనికి దిగకూడదు అని కూడా అనుకుంటారు. అసలు ఇది నీళ్ళలోనికి దిగే సమయమేనా కాదా అని ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తూ ఉంటే మీరు నది ఒడ్డునే ఉండిపోతారు.
ఈ సందర్భంలో మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మీరు అని అనుకుంటున్న ‘మీరు’ మూడు అంశాల కలయిక. అవి మీ శరీరం, మీ ఆలోచనలు, మీ భావావేశాలు. మీరు జన్మించినది మొదలు నేటి వరకూ మీరు అనగానే ఈ మూడు అని మాత్రమే మీకు చెబుతారు. మీకు మీ అసలయినది, మీ సొంతమయిన మరొక ప్రపంచం మీ అంతరంగంలో ఉన్నదని, అక్కడే మీ అసలయిన ఉనికి ఉన్నది అని మీకు సమాజం కానీ, మీ చుట్టు ప్రక్కల వారు కాని ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే అటువంటిది ఉన్నది అని వారికి కూడా తెలియదు.
మీరు ధ్యానం చేసే ముందు కొంచం ఈ విషయాల మీద మీరు పని చేయాలి.