ధ్యానం అంటే ఏమిటి?
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
పరమహంస నిత్యానంద ధ్యానం అంటే ఏమిటి అన్న ప్రశ్నకి ఒక వివరణాత్మకమయిన నిర్వచనాన్ని ఇస్తారు. అది ఆయన యొక్క అనుభవసారం. ఆయన స్వయంగా ధ్యానాన్ని సాధన చేసి, ఆ అనుభవాన్ని ఆయన మాటలలో ఈ విధంగా చెబుతారు, మనిషి సహజంగా ఆనంద జీవి. ఆనందం అతనిలో నిక్షిప్తమయి ఉంటుంది. అలా అసలయిన ఆనందాన్ని తనలోపల, తన అంతరంగపు లోతులలో నిక్షిప్తంచేసి, నిక్షిప్తయిన ఆనందం కోసం బయట ప్రపంచంలో, అక్కడ ఉన్న మనుషుల దగ్గర, వస్తువుల దగ్గర, ఏవో కొన్ని సంఘటనల లోపల వెతుకుతూ ఉంటాడు. తాత్కాలిక సంతోషాన్ని ఆనందమనుకుని మహా ఆనంద పడతాడు. మరుక్షణం లో అది బాధగా, వృధగా మారగానే కలత చెంది కుంగిపోతాడు. తిరిగి ఆనందం యొక్క అన్వేషణలో నిమగ్నమయిపోతాడు. కానీ ఆ ఆనందం బయట ఎక్కడా లేదు. అందుకే ఎంత వెతికినా ఆ పరమానందం అతనికి దొరకదు. అలా జీవితాంతం వెతుకుతూనే ఉంటాడు కానీ ఆ ఆనందాన్ని, తనకు నిజంగా కావలసిన ఆనందాన్ని పొందలేడు, పరమహంస నిత్యానంద, ఆనందం అంటే ఈ విధంగా చెబుతారు, 'ఆనందం అంటే దానిని తగ్గించలేనిది, పోగొట్టుకోలేనిది. అది సంతోషం కాదు. అది సంతోషం, భాధ అనే వాటికి అతీతమైన ఒక నిశ్చల స్థితి. దానికి కారణం ఉండదు. అటువంటి పరమానందపు అనుభవాన్ని ధ్యానం ద్వారా పొందవచ్చు. ధ్యానం మిమ్మలని మీ నిత్య జీవితంలో ఉండే లాగుడూ, తోప్పుడులకి అతీతంగా తీసుకువెళుతుంది.'
ఆనంద స్థితిని చేరటానికి ఒక కచ్చితమయిన మార్గం ధ్యానం. పరమహంస ఈ విధంగా అంటారు, మీరు మీలోపల ఉండే పరమానంద స్థితిని కనుగోనటానికి సిద్ధమవ్వటమే ధ్యానం. మీరు బయట ప్రపంచంలో ఆనందం కోసం వెతకటం అనేది ప్రయోజనం లేని పని, అని ఏ నిమిషాన తెలుసుకుంటారో అప్పుడు మీరు ధ్యానానికి సిద్ధపడినట్టే.
ధ్యానం నిర్వచనం?
ధ్యానం అంటే ఏమిటో పరమహంస ఈ విధంగా చెబుతారు. ధ్యానం అనే పదాన్ని చాలా మంది యోగాలు చాలా రకాలుగా నిర్వచించారు. వారంతా వారి వారి అనుభవాల ఆధారంగా ధ్యాన స్థితిని, ధ్యాన పద్దతిని, ధ్యానాన్ని నిర్వచించారు. అదే విధంగా ఆయా సందర్భాలలో ఉండే అవసరాన్ని బట్టి కూడా ధ్యానాన్ని వివిధ రకాలుగా నిర్వచించారు.
ధ్యానం అంటే ప్రార్థన.
ధ్యానం అంటే మనలో నిక్షిప్తమయిన, మన అంతరంగంలో బందించబడిన సంపదలని కనుగొనటానికి సహాయం చేసే ఒక ప్రక్రియ. ధ్యానం మనని విశ్వశక్తితో కలపలిగే ఒక పద్ధతి. ఈవిధంగా ధ్యానాన్ని అనేక రకరకాలుగా నిర్వచించారు. స్వామీజీ ఈ విధంగా చెబుతారు, కానీ నేను చెప్పే నిర్వచనం, ధ్యానం అంటే ఆక్షణంలో ఆనంద స్థితిలో ఉండగలటమే. ఎప్పుడైతే మీరు ఆ క్షణంలో ప్రశాంతంగా ఉండగలరో మీరు ధ్యాన స్థితిలో ఉన్నట్టే. అంతకుమించి మీరు చేసేది ఏమీ లేదు.
ధ్యానం మిమ్మలని మీ అంతరంగపు ప్రపంచంలోనికి తీసుకువెళ్ళే ఒక చక్కని మార్గం.