దివ్యశక్తి స్పర్శ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
■ నిత్య ఆధ్యాత్మికచికిత్స - మీరు కూడా చికిత్స చేయవచ్చు
■ జ్ఞానోదయమైన యోగీశ్వరుని స్పర్శానుభూతిని పొందండి

నిత్య ఆధ్యాత్మికచికిత్స - మీరు కూడా చికిత్స చేయవచ్చు
నిత్య ఆధ్యాత్మికచికిత్స జీవన్ముక్తికి ఒక దారి
నిత్య స్పిరిచువల్ హీలింగ్, నిత్య ఆధ్యాత్మికచికిత్స (హీలింగ్) నేను జ్ఞానోదయంతో పాటు పొందిన ఒక బహుమతి. అది నేను మీకు ఇస్తున్నాను. ఇది ధ్యానకార్యక్రమం కాదు. ఇది గురువు ఇచ్చే దీక్ష. ఆ దీక్ష మిమ్మల్ని విశ్వశక్తికి అనుగుణంగా చేస్తుంది. అది మీకు హీల్ చేయగల శక్తినిస్తుంది.
హీలింగ్ అంటే ఏమిటి?
జ్ఞానోదయమైన గౌతమబుద్ధుడు హీలింగ్‌కి చక్కని నిర్వచనాన్ని ఇచ్చాడు. హీలింగ్ అంటే మనలోని కరుణని, ఎదుటివారి పట్ల మనకి ఉన్న శ్రద్ధని, ఎదుటివారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే శ్రద్ధని, మన పద్ధతిలో వెల్లడి చేయటమే. హీలింగ్ అంటే ఒక వ్యక్తి తిరిగి శారీరక, మానసిక, భావాత్మక ఆరోగ్యాన్ని పొందటానికి చేసే సహాయం.
ఆరోగ్యం
మంచి ఆరోగ్యం అంటే అనారోగ్యం లేకపోవటం కాదు. మనం సౌకర్యంగా హాయిగా దృఢంగా ఉండగలగటమే ఆరోగ్యం. అనారోగ్యం తెచ్చుకొని, దాన్ని బాగుచేసుకునే మామూలు మనుషులం కాదు. మనం పరమానందరూపాలం. మనని నిరంతరం పరమానందంలో, ఆత్మస్థాయిలో జీవించే విధంగా సృష్టించారు. అదే మంచి ఆరోగ్యస్థితి అంటే.
చక్రాలు, హీలింగ్ శాస్త్రం
పతంజలి మనలో అత్యంతసూక్ష్మమైన ఏడు శక్తికేంద్రాలు లేదా చక్రాలు ఉన్నాయి అని చెప్పారు. ఈ ఏడు చక్రాలు మనలో భౌతిక, మానసిక, భావాత్మక, అంతరాత్మచర్యలని ప్రభావితం చేస్తాయి. అవి మనలోనే ఉన్నాయి. అవి మనలో అతికీలకమైన గ్లాండ్స్ దగ్గర ఉన్నాయి. అవి వాటి సమీపంలోని గ్లాండ్స్ పని తీరు పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
మనలోని ప్రతి చక్రం ఒక భావావేశానికి సంబంధించి ఉంటుంది. ఉదాహరణకి ప్రేమ, అనాహతచక్రానికి వృధ నాభిప్రాంతంలోని మణిపూరకచక్రానికి సంబంధించి ఉంటాయి. మనం ఏదైనా ఒక చెడ్డ వార్త వింటే అది పొట్ట ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే మనం ‘అమ్మో! ఈ వార్తని జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటాం. ఇది అన్ని భాషల్లోనూ ఉన్న ఒక మాట.
కిర్లియాన్ ఫోటోగ్రఫీ, ఈ చక్రాల మీద భావావేశాల ప్రభావాన్ని రికార్డు చేయగలిగింది. ఒక భావావేశాన్ని జాగ్రత్తగా సంబాళించగలిగితే, దానికి సంబంధించిన చక్రం బాగా పని చేస్తుందని, అది చాలా విస్తృతమై బండి చక్రమంత అవుతుందనీ నిరూపించారు. భావావేశాన్ని సరిగా నియంత్రించకపోతే, దాంతో సరిగా వ్యవహరించకపోతే, దానికి సంబంధించిన చక్రం చిన్నదిగా కుంచించుకుపోయి షర్టు బటన్ సైజు అవుతుంది. దానితో మన వ్యవస్థలో శక్తిప్రవాహం తగ్గిపోతుంది. ఆ స్థితి చాలా రకాల శారీరక, మానసిక అనారోగ్యాలకి కారణం అవుతుంది.
చక్రాలలో శక్తిప్రవాహానికి చాలా విషయాలు అడ్డంకులుగా ఉంటాయి. అవి చిన్నతనంలోని సమస్యలు, సమాజనిబంధనలు, ఒక పద్ధతి లేని అలవాట్లు, శారీరక - మానసికగాయాలు, ఎవరూ వారిపై శ్రద్ధ చూపించకపోవటం - ఇవన్నీ చక్రాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఎప్పుడైతే చక్రాలు ప్రభావితం అవుతాయో, ఆ చక్రానికి సంబంధించిన అనారోగ్యం కలుగుతుంది. మన శరీరం, మనస్సు ఒక దాంతో ఒకటి సౌకర్యంగా అమరితే, అదే ఆరోగ్యం చక్కగా ఉన్న స్థితి. అలా లేనప్పుడే అనారోగ్యాలు కలుగుతాయి. చక్రాల స్థితి ఆరోగ్యస్థితిని సూచిస్తుంది.
శరీరంపై మనస్సు ప్రభావం
శరీరం హార్డ్‌వేర్ అయితే మనస్సు సాఫ్ట్వేర్. సాఫ్ట్‌వేర్‌తో సమస్య ఉన్నప్పుడు హార్డ్‌వేర్‌ని పెడతాం. సాఫ్ట్వేర్ చెడిపోయినప్పుడు, అది నిరంతరం హార్డ్‌వేర్‌కి తప్పు సూచనల్ని ఇస్తుంది. ఒక విషయం అర్థం చేసుకోండి. మనలోని అనారోగ్యాలకి కారణం మన మానసిక వ్యవస్థ. శారీరక - మానసికవ్యవస్థలు సమతుల్యతతో లేనప్పుడు అనారోగ్యం కలుగుతుంది.
శక్తితో చికిత్స (హీలింగ్)
అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి శక్తిని ఇచ్చే శాస్త్రమే హీలింగ్ అంటే. శక్తిని చక్రాల్లో దేనికి శక్తి అవసరమో దానికి ఇవ్వాలి. అప్పుడు చక్రం స్పందిస్తుంది. మనకి సరైన పద్ధతి తెలిస్తే, దాన్ని ఉపయోగించే సమయం ఉంటే, మన అనారోగ్యాన్ని మనం బాగుచేసుకోవచ్చు. తిరిగి చక్రాన్ని శక్తిమంతం చేయవచ్చు. మనం అన్నిసార్లూ ఆ విధంగా చేసుకోలేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. మనకి సరైన పద్ధతి తెలియకపోవచ్చు. ధ్యానం చేసే సమయం లేకపోవచ్చు. ఆరోగ్యం బాగా లేదు కాబట్టి మనం ధ్యానం చేయలేం, ఆధ్యాత్మికసాధనలు చేయలేం. అటువంటి సందర్భాల్లో, ఎవరైతే ధ్యానంలో ఉంటారో, ఎవరైతే ధ్యానం చేస్తారో అటువంటివారు ఆ శక్తిని మనకి పంపి చక్రాల్ని శక్తిమంతం చేయవచ్చు. ఇదే శక్తితో చికిత్స అంటే.
నిత్యా ఆధ్యాత్మికచికిత్స అంటే ఏమిటి?
నిత్యా ఆధ్యాత్మికచికిత్స లేదా హీలింగ్ అంటే విశ్వశక్తితో హీల్ చేయటం. విశ్వశక్తికి, మనకి తెలిసిన శక్తికి చాలా తేడా ఉంది. మామూలు శక్తి అయిన ఎలక్ట్రిక్ శక్తికి మేధ ఉండదు. ప్లగ్‌లో బల్బ్ పెడితే అందులోకి కరెంటు వెళ్ళి బల్బ్ వెలుగుతుంది. మీ చేయి పెట్టినా కరెంటు వెళ్ళి షాక్ కొడుతుంది. కరెంటుకి నిర్ణయించే మేధ లేదు. విశ్వశక్తి స్వచ్ఛమైన మేధ. చాలాసార్లు విశ్వశక్తిని కరెంటుతో పోల్చినా, ఆ రెండూ వేరు వేరు శక్తులు. విశ్వశక్తి పొరపాటు చేయదు. ఎందుకంటే దానికి స్వతంత్రమైన మేధ ఉన్నది.
ఎవరు శక్తిని పొందగలరు? ఎవరైతే విప్పారిన హృదయంతో, మనస్సుతో ఉంటారో వారే.
ఎవరు శక్తిని పొందవచ్చు? ఎవరికి అవసరమైతే వారు పొందవచ్చు. దీనికి నిబంధనలు లేవు. ఆ శక్తిని చక్కగా పొందటానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఎవరైతే విప్పారిన హృదయం, మనస్సుతో ఉంటారో అటువంటివారు త్వరగా, సులభంగా శక్తిని పొందుతారు. ప్రశ్నలు, అనుమానాలు ఉంటే ఆలస్యం అవుతుంది.
చాలామంది నన్ను అడుగుతుంటారు, 'హీలింగ్‌కి నమ్మకం ఉండాలా?' అని. నేను చెబుతాను అది అవసరం లేదు. మామిడిపండు రుచిగా ఉంటుంది అని తెలుసుకోవటానికి మీకు నమ్మకం అవసరం లేదు. దాన్ని కొంచెం తిని రుచి చూసి తెలుసుకోండి అంతే! సూర్యోదయం తూర్పున జరుగుతుంది అని చెబితే మీరు నమ్మనవసరం లేదు. కళ్ళు తెరిచి చూడండి, మీకే తెలుస్తుంది. మీరు గుడ్డిగా నమ్మనవసరం లేదు. హీలింగ్ తీసుకోవటానికి మీకు నమ్మకం అవసరం లేదు. మీకు ఉండవలసింది కేవలం విప్పారిన మనస్సు, తీసుకోవలనే కోరిక అంతే. అప్పుడు మీలోకి ప్రవహించే శక్తిని ఆపరు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని, పూర్తి నిజాయితీతో దీనిలోకి ప్రవేశించండి అది చాలు. దీన్ని ప్రయోగత్మకంగా తెలుసుకునే ధైర్యం, వికసించిన మనస్సు ఉంటే చాలు. మీలోని ఆలోచనలని, తెలివిని, భావాలని, ఆత్మని ఈ విషయంతో ఏకీకృతం చేయండి.
నిత్యా ఆధ్యాత్మిక హీలర్స్ దీక్ష
నిత్య ఆధ్యాత్మిక హీలర్స్ దీక్ష అనేది సూటిగా జ్ఞానోదయానికి సంబంధించింది. ఇతరులకు హీలింగ్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ మాత్రమే. దాని ప్రధానప్రభావం వల్ల మీరు హీలింగ్ చేసే సమయంలో మీ అంతరాత్మ లోతుల్లోకి వెళ్ళగలుగుతారు.
ఉదాహరణకి ఆనందస్ఫురణ కార్యక్రమంలో మీరు ఆనందంగా జీవించే ఒక క్షణకాల దర్శన అనుభవం జరుగుతుంది. నిత్యానందస్ఫురణ కార్యక్రమంలో శక్తి పట్ల మీ చేతనస్థితిలో క్షణకాల దర్శన అనుభవం జరుగుతుంది. నిత్యా ఆధ్యాత్మిక హీలింగ్‌లో హీలర్గా మీరు ఎప్పుడూ ఆనందస్థితిలో ఉండగలరు. ఎందుకంటే ఒకసారి మీకు దీక్షని ఇస్తే, విశ్వశక్తి మీలో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మీరు మీ అంతరాత్మతో నిరంతరం అనుబంధంతో ఉంటారు. హీలింగ్ అంటే చేతనస్థితిలో ఉన్న ప్రేమ. ఆ శక్తి ఎదుటివారిని హీల్ చేస్తుంది.
ఒకసారి ఇలా ఊహించుకోండి. మీరు ఒక చిన్న చీమలా ఉండి, చాలా పెద్ద ఐస్ బర్గ్ కి కింద నీళ్ళ వరకూ బోరులా రంధ్రాన్ని చేయాలనుకోండి, దానికి ఎన్ని జన్మల సమయం పడుతుంది? అది జరుగుతుంది అని మీరు అనుకోలేరు. కాని గురువులు ఆ నీటిలో అడుగున ఉండి, ఒక్క క్షణంలో రంధ్రాన్ని వేసి మిమ్మల్ని నీళ్ళ దగ్గరికి క్షణంలో తెస్తారు. మీరు కూడా నీళ్ళలోకి వచ్చి సంతోషంగా ఉండవచ్చు. నిత్యా హీలర్ దీక్షలో జరిగేది ఇదే. నిత్యా ఆధ్యాత్మిక హీలర్ దీక్షలో గురుదేవులు ఆ శక్తి అయిన ఆనందగంధకి ద్వారాన్ని తెరుస్తారు.
ఆనందగంధ చక్రం
ఆనందగంధ మనలో ఒక శక్తికేంద్రం, ఒక చక్రం. ఈ చక్రంలో మనలోని ఏడు చక్రాలు, ఐదు కోశాలు కలిసిపోతాయి. ఈ పాయింట్ దగ్గర పదార్థం, శక్తి కలిసిపోతాయి. ఇది ఎటువంటి దశ అంటే ఐస్ బర్గ్, నీరు కలిసే స్థితి. ఈ శక్తి ప్రదేశంలో జ్ఞానోదయమైన గురువులు, యోగులు ఉంటారు. మనందరిలో శక్తికి మూలం ఆనందగంధ. ఇది విశ్వశక్తితో ప్రత్యక్షానుభవాన్ని కలిగిఉంటుంది. ఆనందగంధ భౌతికశరీరంలో ఉండదు. ఇది ఆధిభౌతికస్థితి.
ఏ వ్యక్తి అయినా జ్ఞానోదయమైన చేతనస్థితిలో ఉండి హీలర్ దీక్షని ఇస్తే, ఆయన ఆ దీక్షాపరునిలో ఆనందగంధకి ద్వారాన్ని తెరుస్తారు. దానితో ఆ వ్యక్తి విశ్వశక్తికి ప్రతిక్షణం అందుబాటులో ఉండి, ఆ శక్తిని పొందగలడు. మీరు ఆనందగంధలో ఉన్నప్పుడు జ్ఞానోదయస్థితిలో ఉంటారు. ఎందుకంటే అప్పుడు మీరు విశ్వశక్తితో ఉంటారు కాబట్టి. గురువులు ఆనందగంధలో ఉంటారు. మనం ఆనందగంధలో ఉన్నప్పుడు అదే శక్తితో అనుబంధం ఉంటుంది. అందుకే హీలింగ్ శక్తి కొత్త జీవితాన్ని ఇస్తుంది. కొత్త శక్తినిస్తుంది. వ్యాధులకి చికిత్స చేసి బాగు చేస్తుంది.
నేను ఇంతకు ముందు చెప్పాను, ఆనందగంధలో ఏడు చక్రాలు కలిసిపోతాయి. ఆనందగంధ చక్రానికి దారి మణిపూరక, అనాహత మధ్యభాగం. ఆనందగంధ చక్రం అక్కడ ఉండదు, అది దారి మాత్రమే. నిత్యా స్పిరిచువల్ హీలింగ్ కార్యక్రమంలో మీరు చేతనస్థితిలో ఆనందగంధలోకి వెళతారు. మిగతా చక్రాలని ధ్యానం ద్వారా చైతన్యపరచవచ్చు కాని ఆనంద గంధ చక్రాన్ని కేవలం జ్ఞానోదయమైన గురువు మాత్రమే విప్పారేట్టు చేయగలరు.
మనకి ఏడు శక్తి శరీరాలు ఉన్నాయి. అవి భౌతిక, ప్రాణ, మానసిక, ఆకాశ, కారణ, విశ్వ, నిర్వాణ శరీరాలు. ఆనందగంధ చక్రం, లోపలి పొర అయిన నిర్వాణశరీరంలో ఉంటుంది. ఒకసారి అది వికసిస్తే శక్తి మీలో ప్రవహిస్తూ ఉంటుంది. మనలో ఐదు కోశాలు ఉన్నాయి. అవి కూడా శక్తివ్యవస్థలో ఒక భాగం. అవి అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశం. ఆనందమయకోశం ఆత్మని తగిలే చోట ఆనందగంధ చక్రం ఉంటుంది.
ఆనందగంధస్థితిలో ఉండటం అంటే ఆలోచనలు లేని స్థితి. దీన్నే సమాధి స్థితి, నిర్వాణ నిత్యానందస్థితి లేదా జ్ఞానోదయస్థితి అంటారు. ఆనందగంధ చక్రం ప్రపంచానికి అంతా కలిపి ఒక పాయింట్ దగ్గర ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర పొడవు, వెడల్పు, ఎత్తు అనేవి మాయం అవుతాయి. ఆ పాయింటునే ఆనందగంధ అంటారు. ఏ పాయింట్ దగ్గరైతే కాలం అనేది పడిపోతుందో అదే ఆనందగంధ. ఎక్కడైతే గురుత్వాకర్షణశక్తి మాయం అవుతుందో అదే ఆనందగంధ. ఆనందగంధ గురించి ఈ వివరాలన్నీ మీకు అర్థం కావాలంటే చేతనస్థితి తాలూకు క్షణకాల దర్శనానుభవమైనా జరగాలి.
ఆనందగంధ ధ్యానం - ఉపయోగాలు
మీరు ప్రతి రోజూ నిరంతరం ఆనందగంధధ్యానం చేస్తే బయటి ప్రపంచంలోని ఏ విషయమూ మీ మీద ప్రభావాన్ని చూపించలేదు. మీ చుట్టూ అన్నీ అపజయాలు ఉన్నా, మీరు బలంగా, నిశ్చలంగా ఉండగలరు. త్వరలో మీరు ధ్యానం అనే మీ సహజస్థితికి వెళ్ళగలరు. మీరు శాశ్వతంగా ఆనందగంధలో ఉండగలరు.
ఈ ధ్యానం మీకు ఇచ్చే ప్రయోజనాలు:
సత్: ప్రతి విషయంలో స్పష్టత
మీరు ఏ విషయాన్నైనా ఆశ, భయం అనేవి లేకుండా దాన్ని దానిలాగానే చూడగలుగుతారు. అందుకే మీకు స్పష్టత వస్తుంది.
చిత్: చేతనస్థితి
మీరు చేసే ప్రతి పని మీదా కుతూహలం ఉంటుంది. మీలో ప్రతి క్షణం శక్తిని, కుతూహలాన్ని ప్రతిబింబిస్తూ, నలుదిశలా వెదజల్లుతుంటాయి. అలసిపోకుండా, అదే కుతూహలంతో, వివేకంతో ఎన్ని పనులైనా చక్కగా చేయగలుగుతారు.
ఆనంద : కారణం లేని ఆనందస్థితి
బయటి ప్రపంచంలో ఏం జరుగుతున్నా, మీరు నిశ్చలమైన ఆనందస్థితిలో ఉండగలరు. నిరంతరం ఆనందగంధలో ఉండగలిగితే మీ శారీరక, మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉండటమే కాదు, బయట ప్రపంచంలో ఏది జరిగినా దాన్ని స్పష్టతతో వ్యవహరించగలరు. ఉదాహరణకి మీకు ఒక వ్యక్తి మీద కోపం వస్తే, ఆ వ్యక్తిని తిట్టాక, అదే కోపపు మంట ఆ వ్యక్తిని ఎంత కాల్చిందో, ఎంత బాధపెట్టిందో అంతే మంటని, బాధని మీలో కూడా కలిగిస్తుంది. ఆ వ్యక్తి ఎంత ప్రశాంతత పోగొట్టుకుంటాడో మీరు కూడా అంతే డిస్టర్బ్ అవుతారు. అదే మీరు ఆనందగంధలో ఉంటే, ఎంత కోపం వెల్లడి చేయాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. అంతే కోపం చూపించగలుగుతారు. అనవసరంగా ఎక్కువ కోపాన్ని ఉపయోగించరు. అప్పుడు ఆ కోపం మీ లోపల మిమ్మల్ని కాల్చదు. మీలో అపరాధభావం కలగదు. దాని ప్రభావం మీ మీద అసలు ఉండదు. అవతల వ్యక్తి ఎంత కోపాన్ని మీ నుంచి తీసుకోవాలో అంతే వెళుతుంది. దానితో అతను ఎక్కువ బాధపడడు.
ఎవరైనా ఒక పని చేసినందుకు ఇరవై రూపాయలు ఇవ్వాలనుకోండి. మీరు నలభై ఇస్తారా? లేదు. అలా ఇవ్వరు అంతే కదా! అదే విధంగా ఒక వ్యక్తి పట్ల ఎంత కోపాన్ని చూపాలో అంతే చూపించాలి. మీరు ఎందుకు ఎక్కువ కోపాన్ని చూపాలి? ఎంత అవసరమో అంతే చూపించండి. అప్పుడు మీకు, ఆ వ్యక్తికి, ఎవరికీ బాధ ఉండదు. ఈ స్పష్టత మీరు ఆనందగంధలో ఉన్నప్పుడు ఉంటుంది.
నిత్యా స్పిరిచువల్ హీలింగ్‌లో రెండు అంశాలు ఉంటాయి. హీలర్గా మీరు ఆనందంలో ఉంటారు. మీ నుంచి హీలింగ్ పొందిన వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడు. అందుకే ఇది అంతిమపద్ధతి.
నిత్యా స్పిరిచువల్ హీలింగ్ ప్రయోజనాలు
1. రకరకాల అనారోగ్యాలు - క్యాన్సర్, ఆస్తమా, డయాబిటిస్, బి.పి., ఎలర్జీ, మైగ్రేన్ - ఇలా చాలా రకాల సమస్యల నుంచి బయటికి రావచ్చు.
2. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, భయాల నుంచి బయటికి రావచ్చు.
3. గాయాలు, నొప్పులు త్వరగా తగ్గుతాయి.
4. గర్భాశయసమస్యలకి పరిష్కారం.
సేవలు
నిత్యా స్పిరిచువల్ హీలింగ్ అనేది ఉచిత హీలింగ్ సేవ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల నిత్యానంద మిషన్ సెంటర్ల ద్వారా ఈ హీలింగ్ క్యాంపులు జరుగుతుంటాయి. విశ్వశక్తితో హీలింగ్ అనే ప్రత్యేకపద్ధతి ఒక ధ్యానం. ఇందులో హీలర్కి గాని, హీలింగ్ చేయించుకునే వ్యక్తికి కాని ఎటువంటి దుష్పరిణామాలూ ఉండవు.
అపెండిక్స్
పరమహంస నిత్యానంద పైన, ధ్యానం, హీలింగ్ పైన జరిగిన శాస్త్రపరిశోధనలు
పరమహంస నిత్యానందపై ధ్యానంలో ఉన్నప్పుడు, ఆయన మెదడులో జరిగిన మార్పుల పైన శాస్త్రపరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనల ఉద్దేశం జ్ఞానోదయమైన మార్మికులకు, యోగులకు ఏం జరిగిందో దాన్ని కొలవటం, ఆ రహస్యాన్ని తెలుసుకోవటం. అనుభవం ఉన్న డాక్టర్స్, న్యూరోసైకాలజిస్ట్స్, ఈ పరిశోధనని పరమహంస పైన అమెరికాలోని ఓక్లహామాలో చేసారు.
పి.ఇ.టి. స్కాన్ పరిశోధన
పాజిట్రాన్ ఎమిషన్ టొమోగ్రఫీ అనేది మెదడులో చైతన్యవంతమైన భాగాల్ని స్కాన్ ద్వారా చూపిస్తుంది. పరమహంస నిత్యానంద పి.ఇ.టి. స్కాన్ రిపోర్ట్‌లో, ఆయన ధ్యానం చేసే సమయంలో మెదడులోని ముందు భాగాలు చాలా ప్రకాశవంతంగా ఉండటాన్ని గమనించారు. మెదడులోని పని తీరు సాధారణమానవుల మెదడు కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండటాన్ని గమనించారు. మెదడులోని ముందు భాగం మేధకి, నిర్ణయాలకి, జ్ఞానానికి సంబంధించింది. ఆయన లోతైన ధ్యానస్థితిలో ఉన్నప్పుడు రెండు అత్యంతప్రత్యేకమైన విషయాల్ని గమనించారు. అందులో మొదటిది ఆయన మెదడులో తొంబై శాతం నిశ్శబ్దంగా అయిపోయింది. రెండవ విషయం మెదడు ముందు, కింది భాగం చాలా ప్రకాశవంతంగా ఉంది. అది మూడవ కన్ను ఉండే భాగం.
క్యు, ఇ. ఇ. జి పరిశోధన
క్వాంటిటేటివ్ ఎలక్ట్రో ఎన్సెఫాలో గ్రాఫ్, మెదడులోని తరంగాల్ని కొలుస్తుంది. మెదడులోని తరంగాలు రకరకాల బ్యాండ్ విడ్త్‌తో ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్థితిని తెలియచేస్తాయి. బీటా తరంగాలు చిన్నవిగాను, చాలా చైతన్యవంతంగా ఉంటాయి. అవి తెలుసుకునే తత్వానికి, చైతన్యానికి సంబంధించి ఉంటాయి. ఆల్ఫా తరంగాలు నెమ్మదిగా పెద్దదిగా ఉంటాయి. అవి ఆరోగ్యంగా, బాగా ఉన్నాను అనుకునే దానికి, నిద్రకి, నిశ్శబ్దానికి, నిశ్చలత్వానికి సంబంధించినవి.
ఒక రోజులో సాధారణవ్యక్తులు ఈ తరంగాల అనుభవం పొందుతారు. వాటి వేగం, ఒక దాని నుంచి మరొక తరంగపు బ్యాండ్‌విడ్త్ అనేవి వారి నియంత్రణలో ఉండవు. పరమహంస నిత్యానందపై జరిగిన పరిశోధనలో ఈ తరంగాలు పూర్తిగా ఆయన నియంత్రణలో ఉన్నట్టు తెలిసింది. ఆయన లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మెదడు చాలా సున్నితంగా ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారింది.
నిత్యా స్పిరిచ్వువల్ హీలింగ్
పరమహంస నిత్యానంద మరొక వ్యక్తికి హీలింగ్ చేసే సమయంలో ఆయన మెదడు తరంగాలు, గుండె కొట్టుకోవటంలో వేగం, ఆయన చర్మం పైన పరిశోధన చేసారు. ఆయన హీలింగ్ చేసే వ్యక్తి హార్ట్ బీట్ నిత్యానంద హార్ట్ బీట్‌కి అనుగుణంగా ఉందని తెలిసింది.
✤✤✤
- పతంజలి మనలో అత్యంతసూక్ష్మమైన ఏడు శక్తికేంద్రాలు లేదా చక్రాలు ఉన్నాయి అని చెప్పారు.
- అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి శక్తిని ఇచ్చే శాస్త్రమే హీలింగ్ అంటే.
- మనకు ఏడు శరీరాలు, ఐదుకోశాలు ఉన్నాయి.
జ్ఞానోదయమైన యోగీశ్వరుని స్పర్శానుభూతిని పొందండి
ఆనందదర్శనం
ఆనందదర్శనసమయంలో మీరు గురుదేవుల నుంచి పొంగి ప్రవహించే శక్తివాహినిలో ఉంటారు. మీరు ఆయన దగ్గరకి వెళ్లినప్పుడు ఆయన మీ ఆజ్ఞాచక్రాన్ని స్పర్శిస్తారు. అప్పుడు జ్ఞానోదయశక్తి, అనుభవం మీలోకి బదిలీ అవుతాయి.
దర్శనం అంటే దర్శించటం లేదా చూడటం. ఇక్కడ ఒక దివ్యత్వాన్ని చూడటం. ఆనందదర్శనం అంటే పరమానందాన్ని దర్శించటం. ఎప్పుడైతే విశ్వశక్తి మానవరూపంలో అవతరిస్తుందో, అప్పుడు మీ కళ్లు ఆ శక్తిని చూడగలుగుతాయి. మీ చేతనస్థితి ఆ శక్తిని గ్రహించగలుగుతుంది. అది మీలో మార్పు జరిగే విధంగా చేయగలుగుతుంది. అదే ఆనందదర్శనం అంటే. మీరు చూస్తున్న రూపం భూమి మీద మళ్లీ మళ్లీ అవతరించే జ్ఞానోదయం అయిన యోగీశ్వరుడు.
కొంత మంది అడుగుతుంటారు, ‘అసలు విశ్వశక్తి అనేది ఉందా’? అని. అవును! ఉంది. అది మీలోని జ్ఞానానికి అతీతమైంది. మనం జ్ఞానంలో అత్యున్నతశిఖరాలకి చేరగలిగినప్పుడు, ఆ జ్ఞానానికి అతీతమైనది ఏదో ఉంది అని తెలుసుకుంటాం. ఈ జ్ఞానంతో దాన్ని తెలుసుకోలేం. చాలామంది శాస్త్రవేత్తలు తమ విజ్ఞానంలో అత్యున్నతస్థాయికి చేరినప్పుడు వారికి ఆ విజ్ఞానానికి అతీతమైన, అంతు లేని విశ్వశక్తిని చూడగలిగారు. అది వారి జ్ఞానానికి తరువాత ఉండే మరొక శిఖరం అని అర్థమైంది. సున్నితత్వం ఉన్నప్పుడు, ఆ శక్తి ఉనికిని చూడగలుగుతాం.
కొంత మంది ఈ విధంగా అంటుంటారు, ‘విశ్వం అంటే విశ్వశక్తి అదే ఒక దివ్యమైన ఆట మాత్రమే’ అని. మరి కొంత మంది అది కేవలం ఒక యాదృచ్ఛికసంఘటన మాత్రమే అని. కానీ దీని వెనుక వివేకం, శక్తి అనేవి ఏవీ లేవు అంటారు. ఈ రెండవ రకం మనుషులు చాలా సౌలభ్యంతో వారి భావాల్ని ఉపయోగించి మార్ణా యుధాల్ని తయారుచేసి ఈ ప్రపంచంలో ఎన్నో ప్రమాదాల్ని సృష్టిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ విశ్వం ఒక యాదృచ్ఛికసంఘటన, అనుకోని సంఘటన అంటారో, అటువంటివారు విశ్వంతో ఎటువంటి సున్నితమైన స్పందననీ కలిగి ఉండరు. వారు కేవలం అత్యల్పస్థాయిలోనే ఉండగలుగుతారు.
మీరు గనుక మొదటి తరగతికి చెందినవారైతే మీరు ఒక సూక్ష్మస్థాయికి చేరి, ఈ విశ్వంలో ప్రతిదాని పట్ల ఎంతో గౌరవాన్ని చూపగలుగుతారు. మీరు ప్రతి రాయిని, చెట్టుని గౌరవించగలరు. మీ నుంచి లోతైన భక్తిభావం పొంగి పొర్లుతుంది. అప్పుడు మీ జీవితం ఒక
జ్ఞానోదయమైన యోగీశ్వరుని స్పర్శానుభూతిని పొందండి అందమైన ప్రవాహంతో పాటు సాగుతుంది. అప్పుడు జీవితం విశ్వసాగరంలో ఉవ్వెత్తున లేచిన అద్భుతతరంగంలా ఉంటుంది.
ఒక విషయం అర్థం చేసుకోండి; ఎవరైతే ఇదంతా ఒక గొప్ప మేధాశక్తి నడిపే దివ్యనాటకం అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలరో, ఆ వ్యక్తి తన జీవితాన్ని, విశ్వశక్తితో ఈ విశ్వశక్తి ఆడే దివ్యనాటకానికి అనుగుణంగా మలుచుకోగలడు.
సర్వశక్తిమయమైన సృష్టి ప్రతి మాటకి, భావానికి, ప్రార్థనకి స్పందిస్తుందని అర్థం చేసుకోండి. ప్రతి క్షణం అది బాధ్యతతో మీ చేతనస్థితికి అనుగుణంగా స్పందిస్తుంది. మీ స్థితిలో, మీ పద్ధతిలో చూడటానికి, వినడానికి, అర్థం చేసుకోవడానికి ఆ శక్తి జ్ఞానోదయమైన యోగీశ్వరుల రూపాన్ని పొందుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది చేసే ప్రార్థనలు, వారి కోరిక, ఆ శక్తిని జ్ఞానోదయమైన యోగీశ్వరుల రూపంలో భూమి మీదికి బలంగా లాగుతాయి. ఇది ఏ విధంగా ఉంటుందంటే అల్పపీడనం తుఫానుల్ని ఆకర్షిస్తుంది. ఇది కూడా అంతే.
గురుదేవుల దర్శనం అంటే ఆ సాగరంలోని ఒక పెద్ద అల పైకి లేచినట్లే. ఆ అల సాగరం నుంచి ఎప్పటికీ వేరుపడదు. అదే సమయంలో తనలోని అంతు లేని చైతన్యశక్తిని వెల్లడి చేస్తుంది. ఒక విషయం తెలుసుకోండి. నది కూడా సముద్రంతో సంబంధం కలిగి ఉంటుంది. కానీ దానిలో అలలో ఉండే చైతన్యశక్తి ఉండదు. అది నెమ్మదిగా మామూలుగా ప్రవహిస్తుంది అంతే. కానీ దర్శనం అంటే పరమానందసాగరంలో ఉవ్వెత్తున లేచిన చైతన్యపు అల. అది ఈ అంతరంగాన్ని చిలికి మీలో కావలసిన మార్పుని తెస్తుంది.
ఇప్పుడు అర్థం చేసుకోండి; ఆ అలలో ఒక ఇసుక రేణువు ఉంటే అది అలని ఏమైనా కల్మషం చేస్తుందా? లేదు! అల సంపూర్ణమైన స్వచ్ఛతతో ఉంటుంది. ఎందుకంటే ఆ ఇసుక చైతన్యశక్తి లోపల ఉంది కాబట్టి. అదే విధంగా మీరు దర్శనానికి వచ్చినప్పుడు మీరు బయట, లోపల ఆ చైతన్యశక్తి ద్వారా పరిశుభ్రమై స్వచ్ఛంగా అవుతారు. ఆనందదర్శనసమయంలో మీరు విశ్వశక్తిలో ఉంటారు. సూర్యకాంతికి పద్మం ఏ విధంగా వికసిస్తుందో అదే విధంగా గురుదేవుల సమక్షంలో మనలోని చేతనస్థితి వికసిస్తుంది.
మీరు చేయవలసింది కేవలం సహకరించటమే. మీరు సహకరించకపోయినా ఆ శక్తి మీ లోపలికి చొచ్చుకొని పోతుంది. ఇది ఎలా ఉంటుందంటే, సముద్రంలో అలిచిప్ప కెరటంతో సహకరించినా సహకరించకపోయినా, కెరటం అలిచిప్పని తనతో పాటు తీసుకువెళుతుంది. అదే విధంగా మీరు సహకరించినా సహకరించకపోయినా, ఆ శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. అది చేయవలసిన పనిని చేసుకు వెళుతుంది. అయితే ఆ కెరటంతో సహకరించే అలిచిప్ప ఆడుతూ పాడుతూ ఆ కెరటపు ఆనందడోలికలలో ఊగుతూ తనని తాను స్వచ్ఛం చేసుకుంటుంది. చివరికి ఆ సాగరంలో ఐక్యమైపోతుంది. మరొక విధంగా ఎలా ఉంటుందంటే, ఆ అలిచిప్ప కెరటంతో, నిన్ను నేను అంత త్వరగా నమ్మను అని కొన్ని గులకరాళ్ళని పోగుచేసుకొని, తన చుట్టూ గోడ కట్టుకొని. ఆ క్రమంలో బాధకి గురి అవుతుంది. కాని కరుణామూర్తి అయిన ఆ కెరటం అలిచిప్పని తనతో ఆనందసాగరంలోకి తీసుకువెళుతుంది.
ఎవరైతే ఆ కెరటానికి ఆనందంగా అధీనమవుతారో వారి జీవితం ఆనందదర్శనం, అంతే కాని ఏదో కొన్ని క్షణాల దర్శనం కాదు. ఒక విషయం అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీ చేతనస్థితి సర్వాంతర్యామి అయిన గురువు వైపు ఆనందానుభూతితో తిరుగుతుందో అప్పుడు ఆనందదర్శనం మీలో జరుగుతుంది. మీరు భౌతికంగా గురువుల సమక్షంలో ఉండనవసరం లేదు. మీ చేతనస్థితిని నిరంతరం ఆ శక్తి మీద ఉంచగలిగితే, మీ జీవితం ఆనందదర్శనం అవుతుంది. అలా కాకుండా ఆ శక్తిలో ఐక్యమవ్వటానికి ఎవరైతే ఆగుతారో, ఆ ఉత్సవాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళు అంతిమంగా అందులోనే ఐక్యమవుతారు.
ఆనందదర్శనసమయంలో గురుదేవుల నుంచి అంతు లేని శక్తి అన్ని వైపులా ప్రసరిస్తూ ఉంటుంది. ఆయన దగ్గర ఒక పసిబిడ్డలా అమాయకత్వంతో, చక్కని కుతూహలంతో, లోతైన భక్తిభావంతో, విప్పారి, ఉప్పొంగి కరిగే హృదయంతో ఉంటే చాలు. ప్రార్థనలో ఉన్న శక్తిని సంఘం నాశనం చేసింది. నీవు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మార్చగల శక్తి ప్రార్థనకి ఉంది.
ప్రార్థన అంటే ఏమిటి? మీరు దేన్నైనా సాధించాలని అనుకున్నప్పుడు మీరు మీ ఉద్దేశాన్ని, తీవ్రతని కేవలం దాని మీద కేంద్రీకరిస్తారు. దీన్నే ప్రమాణం అంటారు. కానీ మీకు వెంటనే ఈ విషయాన్ని సాధించాలి అంటే ఉన్నతమైన శక్తి సహాయం అవసరమని తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విషయం మీకు తెలుస్తుందో మీ ప్రమాణం ప్రార్థన అవుతుంది. అప్పుడు మీరు ఆ శక్తిని ప్రార్థించటం ప్రారంభిస్తారు. నేను చేయగలను అనుకుంటే అది ప్రమాణం. ఆ పని చేయటానికి నాకు అతీతమైన శక్తి కరుణ కావాలి అనుకోవటం ప్రార్థన. కాబట్టి అటువంటి ప్రార్థనస్థితిలోకి రండి.
మీరు గురుదేవుల సమక్షంలో విప్పారి ఉండగలిగితే, మీ భావాల్ని తెరచి ఉంచితే అవి ప్రొజెక్టరు ముందు పెట్టిన స్లైడులా పని చేస్తాయి. స్లైడులో ఏది ఉంటే అది అక్కడ తెర మీద పడుతుంది. అదే విధంగా మీలోని కోరిక, మీకు మంచి చేయటానికి ఉన్న కోరిక, అందరికీ మంచి చేసే కోరిక, అయితే తీరుతుంది. మీకు అవసరం లేని కోరిక మండి మాయమైపోతుంది. దానితో పాటు ఆ కోరిక తీరలేదనే అసంతృప్తి కూడా మాడిపోతుంది. కాబట్టి గురుదేవుల సమక్షంలో మీ కోరిక తీరుతుంది. లేదా మీ మనస్సు ఆ కోరికని మరిచిపోతుంది. కోరిక అనే విత్తనం మొలకెత్తుతుంది లేదా మాడిపోతుంది. రెండు విధాలా మీరు తృప్తిని పొందుతారు.
జ్ఞానోదయమైన యోగీశ్వరుని స్పర్శానుభూతిని పొందండి
ఒక విషయం అర్థం చేసుకోండి. మీలో చాలా కోరికలు ఉంటాయి. అన్ని కోరికలూ తీరాలని లేదు. ఈ విషయాలతో వ్యవహరించగల నేర్పుని గురుదేవుల శక్తి మీకు ఇస్తుంది.
ఒక చిన్న కథ : అడవిలో వెళుతున్న ఒక బాటసారి బాగా అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటాడు. ఆ చెట్టు దగ్గర ఏమనుకుంటే అవి జరుగుతాయి. అతను ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ 'మంచి భోజనం ఉంటే బాగుండును' అనుకుంటాడు. ఆ విధంగా అనుకోగానే మంచి భోజనం ఉన్న పళ్ళెం అతని ముందు ప్రత్యక్షమవుతుంది. అతను చాలా సంతోషపడి తృప్తిగా భోజనం చేస్తాడు. భోజనం చేశాక, 'మంచి పడక ఉంటే బాగుండు' అనుకుంటాడు. వెంటనే అత్యంతవిలాసవంతమైన మంచం ప్రత్యక్షమవుతుంది. అతను ఆశ్చర్యపోయి హాయిగా దాని మీద విశ్రాంతి తీసుకుంటాడు. అతను తలని తలగడ మీద పెట్టగానే ఎవరైనా విసనకర్రతో విసిరితే బాగుండు అనుకుంటాడు.వెంటనే ఒక అందమైన అమ్మాయి విసనకర్రతో ప్రత్యక్షమవుతుంది.
అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వస్తుంది, 'అమ్మో, ఈ అడవిలో ఏదైనా పెద్ద పులి వస్తే ఎలా?' అనుకుంటాడు. వెంటనే అక్కడికి ఒక పెద్దపులి వచ్చి అతన్ని చంపి తినేస్తుంది.
కోరిక తీరాలి అని అనుకునే ముందు ఆ కోరికని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు గురుదేవుల సమక్షంలో కోరికల్ని చెబితే, అవి మీకు స్పష్టంగా తెలుస్తాయి. అందుకు కల్పతరు కార్యక్రమంలో మీ కోరికల్ని చెప్పమని మీతో అంటాను. ఆ విధంగా చెబుతున్నప్పుడు మీకు నిజంగా ఏ కోరిక అవసరం, ఏది కాదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదే వెల్లడి చేసే శక్తి తాలూకు మేధ. కల్పతరుదర్శనం మీలో కొన్ని విత్తనాలను నాటుతుంది.
శక్తి : మీలో మార్పు రావలసిన వాటిని మార్చే శక్తి.
బుద్ధి : మార్పు చేయలేని విషయాల్ని స్వీకరించే బుద్ధి.
యుక్తి : అర్థం చేసుకోవటం - ఏది మారినా, సర్వాంతర్యామి, సర్వసృష్టి నిరంతరం మారిపోయే ఒక స్వప్నం
ముక్తి, స్వేచ్ఛ, పై మూడింటినీ జీవితంలో అనుభవించి పరమానందంలో జీవించటం.
మీరు మారగల విషయాల్లో, అవి చిన్నవైనా, అందులో మీ శక్తిని ఉంచండి. 'అయ్యో! నేను రెండు అలవాట్లనే మార్చగలిగాను. మిగిలినవాటి సంగతి ఎలా?' అని ఆలోచించవద్దు. మీరు మార్చగలిగినవి మార్చండి. మీరు మార్చలేనివాటిని స్వీకరించండి. ఎప్పుడైతే మీ శక్తిని వెల్లడి చేస్తారో మేధ మీలో వికసిస్తుంది. మేధ అంటే మీరు మార్చలేనివాటిని స్వీకరించటమే. అయితే మీరు మార్చగలవాటి విషయంలో శక్తిని వెల్లడి చేయనంతవరకూ మార్చలేని వాటిని స్వీకరించే మేధ మీలో కలగదు. ముందు మీరు మార్చగలవాటితో ప్రయత్నించండి. అప్పుడు మార్చలేనివాటిని స్వీకరించే గొప్ప సమర్థత మీలో కలుగుతుంది.
మూడవ విత్తనం స్పష్టత. మీరు విషయాల్ని ఏ విధంగా మార్చినా, ఎంత మార్చినా, మీరు మార్చగలవాటిని మార్చినా, ఈ ప్రపంచమంతా నిరంతరం మారుతూ ఉండే ఒక సత్యం, ఇది మారుతూ ఉన్న ఒక కల. కారణం లేకుండా నిరంతరం మారుతూ ఉండే కల ఈ ప్రపంచం. ఎందుకంటే, దీన్ని మీరు కారణం లేని మంగళకరశక్తి అనవచ్చు లేదా కారణం లేని కల్లోలం అనవచ్చు. ఎవరైతే దీన్ని కారణం లేని మంగళకరశక్తి అంటారో వారు తీస్ట్ అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవారు, సత్యాన్వేషకులు. ఎవరైతే ఇది కారణం లేని కల్లోలం అంటాడో అతను వస్తుప్రపంచానికి సంబంధించిన ఆశావాది.
ఈ విశ్వమంతా ఒక అద్భుతంలా కనపడవచ్చు లేదా ఒక శాపంలా కనపడవచ్చు. ఇది కారణం లేని మంగళత్వం అనుకుంటే ఇది అద్భుతంలా, నిరంతరం జరిగే మహాద్భుతంలా కనిపిస్తుంది. లేకపోతే ఒక శాపంలా ఉంటుంది.
ఆనందదర్శనసమయంలో చాలా మంచి అనుభవాలు కలుగుతాయి. హీలింగ్ అనుభవాలు, కారణం లేని పరమానంద అనుభవాలు జరుగుతాయి. అంతే కాదు, ఆ శక్తి తరంగం పైకి లేచినప్పుడు అది తెలియని భయాల్ని అచేతనస్థితిలో సృష్టిస్తుంది. భయంతో పాటు అపరాధభావం, కోరికలూ పైకి వస్తాయి. కొంత మంది లోతైన నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతారు. కొందరు కన్నీటితో నిండిపోతారు. వీటన్నింటికీ కారణం ఏమిటో మీకు తెలియదు. ఎందుకంటే అవి లోతైన మీ అచేతనస్థితి నుంచి వస్తాయి. మీలో లోతుగా నాటుకుపోయిన ఈ సంస్కారాల నుంచి స్వేచ్ఛని పొందటానికి దర్శనసమయం ఒక అపురూపమైన అవకాశం. ఆ సమయంలో పొంగి పొర్లే శక్తితో ఈ భావాలు కొట్టుకుపోతాయి.
దర్శనసమయంలో మీ ఆత్మ చైతన్యంతో ఉంటుంది. అది విశ్వశక్తి. మీ తండ్రి మీకు ఇచ్చే ఐశ్వర్యం లాంటిది. దాన్ని ఆనందించే అవకాశం పోగొట్టుకోవద్దు. సర్వాంతర్యామికి ‘సరే’ అని చెప్పి అందలోకి ప్రవేశించండి. ఒక పసిబిడ్డలా ప్రవేశించండి.
మీ అకౌంటు లోంచి డబ్బు తీసుకోవాలంటే మీరు చెక్కు మీద సంతకం చేయాలి. అదే విధంగా విశ్వశక్తి నుంచి శక్తిని పొందాలి అంటే మీరు తెరవబడిన అంతరంగంతో ఉండాలి అంతే. ఒక విషయం గుర్తుంచుకోండి; వర్షం కోసం తెరుచుకున్న ముత్యపుచిప్ప వర్షం చినుకుని పొంది దాన్ని ఆణిముత్యంలా మార్చగలుగుతుంది. మీరు గురుదేవుల సమక్షంలో మీ అంతరంగం పూర్తిగా విప్పారి ఉంటే, ఆయన నుంచి వచ్చే ఒక్క మాట చాలు, అది ముత్యపుచిప్పలో పడ్డ వర్షబిందువు ముత్యంగా మారినట్టు మారుతుంది.
గురుదేవుల సమక్షం మీ మీద పనిచేయాలంటే, అది జరిగే విధంగా మీరు ఉండాలి. కంగారు పడవద్దు. విసుగు చెందవద్దు, ఆపవద్దు. దేన్నీ ఆశించవద్దు. ఏది జరిగితే దాన్ని జరగనీయండి. ఆ ఆనందతరంగం మీద నాట్యం చేసే నాట్యమయూరిలా పరమానందాన్ని పొందండి.
✤✤✤
| ★ | ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది చేసే ప్రార్థనలు, వారి కోరిక, ఆ శక్తిని జ్ఞానోదయమైన యోగీశ్వరుల రూపంలో భూమి మీదికి బలంగా లాగుతాయి. |