KAILASA Library/జీవన్ముక్తి/జీవన్ముక్తికి ధ్యానపద్ధతులుSign in
జీవన్ముక్తి

జీవన్ముక్తికి ధ్యానపద్ధతులు

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

■ జీవన్ముక్తికి ధ్యానపద్ధతులు

Tree illustration

జీవన్ముక్తికి ధ్యానపద్ధతులు

జీవన్ముక్తే అంతిమ ధ్యాన పద్ధతి

స్థిరంగా చేసే ధ్యానపద్ధతులు

1. మూడవ కంటి మీద ధ్యానం : ఈ ప్రపంచాన్ని ఒక కలగా చూడండి. మీలోని అ అత్యున్నతమేధాశక్తిని మేలుకొలపండి.

సమయం : వర్తించదు.

ఈ ధ్యానం నిద్ర పోయే ముందు చేయాలి.

మంచం మీద నిటారుగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మీ కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం అదే మూడవ కన్ను, దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏకాగ్రత నిలపవద్దు. దాన్ని శ్రమ పెట్టవద్దు. చాలా రిలాక్స్డ్ దాన్ని గుర్తు చేసుకోండి. ఆజ్ఞాచక్రాన్ని గుర్తుంచుకొని, మీ ప్రాణం కదలికల్ని తెలుసుకోండి. ప్రాణం జీవశక్తి. ప్రాణం ఏ విధంగా మీ శరీరంలో ప్రవహిస్తుందో గమనించండి. లోపలికి వచ్చే శ్వాస ఏ విధంగా చాలా శక్తిని తీసుకువస్తున్నదో, బయటికి వెళ్ళే శ్వాస ఎలా మీ శరీరానికి విశ్రాంతిని ఇస్తుందో తెలుసుకోండి. కేవలం తెలుసుకోండి చాలు.

ఏకాగ్రత ఎక్కడా నిలపవద్దు. విశ్రాంతిగా ఆజ్ఞాచక్రాన్ని తెలుసుకుంటూ మీ లోపలికి వచ్చే శ్వాసని బయటికి వెళ్ళే శ్వాసని గమనించండి.

ఇప్పుడు పడుకునే పొజిషన్కి రండి. నిద్రపోయేటప్పుడు మూడవ కంటిని గుర్తుచేసుకోండి. పడుకోగానే ఇలా నిర్ణయించుకోండి 'అవును నేను నిద్రపోతున్నాను' అని, మీ చేతనస్థితి చెదిరిపోయేటప్పుడు తెలుసుకోండి. మీరు చీకటి లోనికి లోతుగా వెళ్ళేది గమనించండి. నిద్ర పోయే ముందు ఆజ్ఞాచక్రాన్ని గుర్తుచేసుకుంటే చాలు. ఎందుకంటే మీరు మేల్కొని ఉన్నప్పుడు మీ ప్రాణం అక్కడే ఉంటుంది. మీరు నిద్ర పోగానే ప్రాణం మూడవ కన్ను ప్రాంతం నుంచి కిందికి జారుతుంది.

మరొక విషయం, రోజంతా మీరు ఏది ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు అదంతా, ఈ ప్రపంచం మొత్తం నిజం కాదు, ఇదంతా కల, మీరు చూసేది కల అనుకోండి. చేతనస్థితిలో గుర్తుంచుకోండి. మీరు చేసేవన్నీ, అన్ని పనులూ తినటం, నిద్ర పోవటం, నడవటం తాగటం, ఆఫీసులో కూర్చోవటం - ఇవన్నీ కల అనుకోవాలి.

వెంటనే మీరు అనుకోవచ్చు 'ఇది ప్రపంచం. కల అని ఎలా అనుకోను? ఇది నిజం కదా!' అని' ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. నిజానికి సత్యానికి తేడా ఉన్నది. మీ దృష్టిలో ఈ ప్రపంచం అంతా కల అన్నది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఏదైనా నిజమా కాదా అని కొలిచే స్కేలు కచ్చితం కాదు. ఒకసారి ఈ పద్ధతిని కొన్ని రోజులు సాధన చేస్తే, ఈ మాటల వెనుక ఉన్న సత్యం అర్థమవుతుంది. అవి మిమ్మల్ని సత్యం వైపు తీసుకువెళతాయి. మీ తార్కికమనస్సుకి అది నిజం కాకపోవచ్చు. నిజం లోతుగా చూస్తే అది సత్యం. కాబట్టి రోజంతా మీకు ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు మీకు మీరు ఇలా చెప్పుకోండి, 'ఈ ప్రపంచం ఒక కల, నేను చూసేదంతా కల.' అప్పుడు క్రమంగా మీరు చూసేది చెదిరిపోతుంది. అప్పుడు ఈ నాటకం అంతా జరిగే తెరని మీరు చూడగలుగుతారు.

ఈ పద్ధతిని పదకొండు రోజులు సాధన చేయండి. మీ ముందు జరిగేది, మీరు అనుభవించేది, అంతా మారుతున్న కల. దీన్ని గుర్తుంచుకోండి, చాలు.

ఒక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాలి. ఆ పదకొండు రోజులు రోజంతా ఏదైనా ఒక విషయం నిరంతరం గుర్తు వస్తుంటే, అదే మీ స్వప్నస్థితి లోనికి జొచ్చుకుపోతుంది. మీరు కల కనేటప్పుడు, అది కల అని తెలుస్తుంది. కలలో అది కల అని గుర్తు రాగానే మీరు మేల్కొంటారు. ఈ పదకొండు రోజులూ మీరు డాక్టరు కాకపోయినా నేను డాక్టర్ని అనుకుంటే మీ కలలో మీరు డాక్టరుగానే ఉంటారు. మీలోని గుర్తింపులు పోవాలి అంటే ఈ పదకొండు రోజులు చాలు. మీరు కొత్త గుర్తింపుని వెల్లడి చేయటం ప్రారంభిస్తారు.

ఈ భావం మీ అంతరాత్మ లోనికి జొచ్చుకొని వెళితే మీ అంతరంగంలో అద్భుతమైన హీలింగ్ జరిగిన అనుభూతి పొందుతారు. ఆ ఒక్క అనుభవం చాలు, మీ రోజువారీ జీవితంలో సమతుల్యతతో ఉండటానికి. అంతే కాదు, మీరు ఏది నిజం అనుకుంటారో దాన్ని మార్చే శక్తిని పొందుతారు. నేను మార్చలేను అనుకున్నవి మారటం ప్రారంభమవుతుంది. మీరు ఈ కలని చూసే తెర దీన్నే చేతనస్థితి అంటాను, దాన్ని చూడగలుగుతారు. ఎప్పుడైతే ఆ తెరని చూడగలరో, కలలో కూడా చేతనస్థితిలో ఆ తెరని చూడగలుగుతారు.

మీ మనస్సు అడిగే తరువాత ప్రశ్న, ‘అంతా కల అయితే నేను పని చేయటం ఎందుకు? ఇదంతా కల అయినా మీ పని మీరు చేసుకోవచ్చు. దానిలో తప్పు లేదు. మీరు పని చేయవద్దు అని ఎందుకు అనుకుంటారు. అంటే మిమ్మల్ని మీరు సీరియస్ గా తీసుకుంటారు. ఇదంతా కల అని గుర్తు చేసుకుంటే మీరు కల కంటున్నారా లేదా అనేది అనవసరం. మీరు రిలాక్స్ అవుతారు. జీవితం అలా జరుగుతుంది. మీరు జీవనప్రవాహంలో ఉంటారు. అకస్మాత్తుగా మీలో మేధస్సు మేల్కొంటుంది. సత్యం వైపు మేల్కొంటారు. ఇదంతా మీ ప్రొజెక్సన్, మీ కల్పన అని తెలుసుకుంటారు. ఇక మీరు పాత వ్యక్తి కాదు. ఎందుకంటే మీరు సత్యాన్ని చూసారు.

2. డైరీ : మీ ఆలోచనలని గమనించే సాక్షిగా ఉండి, భావావేశాల నుంచి విముక్తి పొందండి. ఒక డైరీ పెట్టుకొని మీ భావాలని, ఆవేశాలని వేరు వేరు సమయాలలో కలిగిన అనుభవాలని

  • ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా వేరు వేరు సమయాలలో రాయండి. ఈ విధంగా ఒక నెల రోజులు చేయండి.

తరువాత మీ డైరీ చదవండి. మీ మనస్సు ఏ విధంగా ఏ సమయంలో ఉన్నదో చూడండి. మీ మానసికవృత్తాన్ని తెలుసుకోండి. తరువాత మీ మూడ్ బాగా లేనప్పుడు ఆ వృత్తంలో ఉండండి. ఆ వృత్తంలో ఇది ఒక భాగం అనుకోండి. సంతోషంగా ఉండండి. అది అదే, అంతే ఇది ఎప్పటికీ ఉండదు. ఇది కూడా జరిగిపోతుంది.

మీరు నిజంగా సంతోషంగా ఉన్నప్పుడు గమనించండి. ఆ భావాన్ని గమనించండి. దాని ద్వారా మిమ్మల్ని గమనించండి. ఈ పద్ధతిని కొన్ని వారాలు సాధన చేయండి. మీ భావాలతో నిశ్చలంగా వ్యవహరించగలుగుతారు. అది ఎటువంటి భావమైనా సరే, మీరు నిశ్చలంగా ఉంటారు.

3. స్థిరంగా చెప్పటం : మీ మాటలు, ఆలోచనలు మీ మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. మీ చుట్టూ ఉండే ప్రపంచం మీద తమ ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు ఉపయోగించే మాటల శక్తిని తక్కువగా అంచనా వేస్తారు. అందుకే వాటిని చాలా మామూలుగా వాడేస్తారు. ముఖ్యంగా మీ లోపల మీరు మాట్లాడుకునే మాటలు వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఉంటాయి. మీ చేతనస్థితికి అనుకూలమైన మాటలని సృష్టించండి.

సమయం : వర్తించదు.

సరైనవి, అనుకూలమైన మాటలు మాత్రమే ఉపయోగిస్తాను అని ఇప్పుడు నిర్ణయించుకోండి. మీ లోపల వస్తున్న వ్యతిరేక ఆలోచనలకి ఆధారాన్ని ఇవ్వకండి. మీ శక్తిని ఆధారాన్ని కేవలం అనుకూలమైన ఆలోచనలకి, భావాలకి - రోజులో ఇరవై నాలుగు గంటలూ ఇవ్వండి.

మీరు ఎప్పుడైనా మూడ్ బాగా లేని స్థితి, మనస్సు బాగా లేదు అనుకున్నప్పుడు ఇది ప్రయత్నించి చూడండి. నిద్ర పోవటానికి ముందు, మంచం మీద కూర్చొని మీకు మీరు ఈ విధంగా గట్టిగా చెప్పండి. మీరు సంతోషంగా ఉన్నారని, జీవితం అందమైన అనుభవం అని, ఇక నుంచి ఉల్లాసంగా ఆనందంగా ఉంటానని చెప్పండి. ఈ రూఢిగా చెప్పే మాటలని పదకొండు సార్లు చెప్పండి. ఇప్పుడు పడుకోండి. మీ తల తలగడని తగలగానే అది కేవలం తలగడ కాదు. సర్వాంతర్యామి ఒడిలో నిద్రపోతున్నాను అనుకోండి. రిలాక్స్ అవ్వండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్న, మీ మూలం అయిన సర్వాంతర్యామి ఒడి లోనికి జారండి. ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవకుండా ఆ మాటలని మరలా మీకు మీరు పదకొండు సార్లు చెప్పండి. దీన్ని మిగిలిన వ్యతిరేకభావాలైన భయం, అసూయ, వ్యథ వీటికి కూడా ఉపయోగించవచ్చు. వ్యతిరేకతని తెలుసుకుని, దాన్ని వదిలేయాలి అని నిర్ణయించుకోండి. వాటి స్థానంలో అనుకూలభావాలు ఉంచి, ఆ మాటలని గట్టిగా చెప్పుకోండి.

4. బరువు లేని సాధనపద్ధతి : మీలోపల ఉన్న లోతైన ప్రశాంతతని, ఆనందాన్ని అనుభవించండి.

సమయం : కనీసం 10 నిమిషాలు.

నేల పైన కాని లేదా కుర్చీలో కాని సౌకర్యంగా, నిటారుగా కూర్చోండి. పాదాల మీద మీ బరువు అనకుండా చూడండి. చేతనస్థితిలో మీ పిక్కల కండరాలని కొంచెం పైకి లేపండి. అప్పుడు బరువు వెన్నెముక మీద ఉంటుంది. ప్రారంభంలో ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన శరీరాన్ని సంతులనంగా మనం ఎప్పుడూ ఉంచం. మీ శరీరం నేలని తగులుతున్న పాయింట్స్ ని గుర్తించండి. మామూలుగా ఆ విషయాలని మనం గమనించం. కాబట్టి కొంచెం సమయం పడుతుంది. అందులో రెండు నేలని తగిలే పాయింట్స్ మీద ఏకాగ్రత నిలపండి. ఆ రెండు పాయింట్స్ నుంచి మీ శరీరం బరువు మొత్తం భూమికి వెళుతుంది. మీరు ఆ రెండు పాయింట్స్ ద్వారా మీ బరువు భూమికి వెళ్ళటాన్ని అనుభవం చెందితే, ఆ తరువాత బ్యాలెన్స్ పాయింట్‌కి వెళ్ళవచ్చు. బాలెన్సింగ్ అంటే మీరు బరువు లేని మధ్య పాయింట్‌ని కనుగొనటమే. మీరు ఎంత వరకూ వంగలిగితే అంత వరకూ ముందుకు వంగి, మీ శరీర బరువు తెలుసుకోండి.

తరువాత చాలా నెమ్మదిగా, ఒక అంగుళం తరువాత మరొక అంగుళం చొప్పున వెనక్కి రండి. మీరు కదిలే సమయంలో శరీరం బరువుని తెలుసుకోండి. నెమ్మదిగా శరీరాన్ని నిటారుగా చేయండి. మీరు శరీరాన్ని నిటారుగా చేస్తున్నప్పుడు క్రమంగా శరీరం బరువు తగ్గినట్టు తెలుసుకుంటారు. ఏ పాయింట్ దగ్గర అసలు బరువు లేకుండా ఉంటారో, ఎక్కడ పూర్తిగా తేలికగా అనిపిస్తుందో ఆ పాయింట్ దగ్గరకి రావాలి. ఎక్కడ శరీరం బరువు లేకుండా ఉన్నదో తెలుసుకున్నాక ఇప్పుడు నెమ్మదిగా మీ శరీరాన్ని వెనక్కి వంచండి. అలా వెనక్కి వెళ్లే కొద్దీ శరీరం బరువు అవటాన్ని తెలుసుకోండి.

ఇప్పుడు నెమ్మదిగా శరీరాన్ని ముందు ఉన్న పొజిషన్కి తీసుకురండి. నిటారుగా ఉండి ఎక్కడైతే మీ శరీరం బరువు లేదో అక్కడికి రండి. ఈ విధంగా మీ శరీరాన్ని కనీసం రెండుమూడుసార్లు ముందుకీ వెనక్కీ కదపండి. ప్రతిసారీ నిటారుగా వచ్చి, ఎక్కడ అసలు బరువు లేదు అనుకుంటారో ఆ పాయింట్ దగ్గరకి రండి. ఆ విధంగా కొంచెం సేపు చేశాక, బరువు లేని పాయింట్‌ని మీరు కచ్చితంగా తెలుసుకుంటారు. ఎక్కడైతే మీ శరీరం బరువు ఉండదో ఆ పాయింట్ దగ్గర ఉండండి. అదే దశలో ఉండండి. మీరు దేన్ని గుర్తు చేసుకోవనవసరం లేదు, దేని మీదా ఏకాగ్రత నిలపనవసరం లేదు. ఎక్కడ మీరు తేలికగా అనుకుంటారో ఆ పాయింట్ దగ్గర పూర్తిగా సంతులితంగా ఉండండి.

మీ శరీరాన్ని ఆ విధంగా పది నిమిషాలు ఉంచే విధంగా రోజుకి ఒక్కసారైనా చేయండి. దీన్ని పది రోజులు సాధన చేయండి. ఇందులో ఉండే సౌలభ్యాన్ని పట్టుకుంటారు. అప్పుడు మీరు రోజంతా ఆ బరువు లేని పాయింట్ దగ్గరే కూర్చుంటారు. ఆ భంగిమలో మీ శరీరం సౌకర్యంగా, నిశ్చలంగా ఉంటుంది. మీ మనస్సు శరీరం నుంచి స్వేచ్ఛగా ఉంటుంది. మీరు పూర్తి సమతౌల్యంలో ఉంటారు. మీరు తెలివితేటలకి, భావావేశాలకి అతీతంగా ఉంటారు. మీరు బయట ప్రపంచానికి, మీకు చూపించే గుర్తింపులకి అతీతంగా ఉంటారు.

శరీరాన్ని సమతుల్యతలో ఉంచినప్పుడు మీలో లోతైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంకా మీరు చేయవలసినది ఏమీ లేదు. మీరు అనుకోవచ్చు, 'కేవలం బ్యాలెన్స్ చేసి ప్రశాంతతని ఎలా తేగలను' అని. మీరు సాధన చేసి చూడండి.

5. శరీరాన్ని చిన్న చిన్న వృత్తాలుగా కదిలించటం : చేతనస్థితిలో మార్పుని అనుభవించండి

సమయం : వర్తించదు.

ఈ పద్ధతి సాధన చేసేటప్పుడు విశ్లేషణ చేయవద్దు. కొలవవద్దు, లెక్కించవద్దు. మీ లోపల కదలికల్ని అలా జరగనీయండి. మనం మన లోపలికి చూసుకుంటే, అక్కడ చాలా చిన్న కదలికలు జరుగుతూ ఉంటాయి. అవి కనిపించని వృత్తాలుగా ఉంటాయి. మీరు ఆ కదలికలతో ఉండండి. వాటిని అలా జరగనీయండి. ఆ కదలికల్ని అలా జరగనిచ్చినప్పుడు వాటి మీద ధ్యానం చేయండి. అకస్మాత్తుగా మనకి ఇది ఒక గట్టి శరీరం కాదు, ప్రవహిస్తున్న శక్తి అని తెలుసుకుంటాం.

మనం ఒక ప్రవహిస్తున్న శక్తి అని తెలుసుకోవటాన్నే నేను జ్ఞానోదయం అంటాను. అదే అంతిమ అనుభవం.

అకస్మాత్తుగా మనం శరీరం కాదు అని తెలుసుకుంటాం. మనం శరీరంలో నివసిస్తున్నాం, అంతే కానీ మనం శరీరం కాదు అని తెలుసుకుంటాం.

ఈ ధ్యానపద్ధతి మనం ప్రాణంతో కదిలే విధంగా సహాయం చేస్తుంది. ప్రాణం అనే సూక్ష్మజీవశక్తి మన శరీరంలో కదులుతూ ఉంటుంది. మనం ఎంతలా గడ్డకట్టుకుపోయి ఉన్నామంటే ప్రారంభంలో శక్తిని అనుభూతి పొందటం కష్టం. ప్రారంభంలో మన శరీరానికి సహాయం చేయాలి సహకరించాలి. అందుకు మనం చిన్న చిన్న కనపడని వృత్తాలని, చిన్న కదలికల్ని సృష్టించాలి. కళ్ళు మూసుకొని కూర్చోండి. నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకుని వదలండి. శరీరాన్ని చాలా నెమ్మదిగా చిన్న చిన్న వృత్తాలుగా కదపండి. మీరు అలా అనుకున్నా చాలు. అకస్మాత్తుగా మీ శరీరం నెమ్మదిగా కదలటం గమనిస్తారు. ఆ కదలికలు మీకు సౌకర్యంగా ఉంటాయి. ఆ స్థితిలో ఉండి ఆ కదలికల్ని అలా జరగనీయండి.

మణిపూరకచక్రం దగ్గర ఏకాగ్రతని నిలపండి. మీ శరీరం మొత్తం చిన్న చిన్న వృత్తాలుగా తిరగటం గమనిస్తారు. మీరు మణిపూరకం దగ్గరే కేంద్రీకృతమవుతారు.

మీరు దేనిలోనైనా ప్రయాణించేటప్పుడు ఈ పద్ధతిని సాధన చేయవచ్చు. మీరు కారు డ్రైవ్ చేయనప్పుడు ఈ ధ్యానం చేయవచ్చు. అకస్మాత్తుగా మీరు శరీరానికి అతీతంగా వెళ్తారు.

దీన్ని కనీసం పదకొండు రోజులు సాధన చేయండి. మీరు మీ చేతనస్థితిలో మార్పు రావటం గమనిస్తారు.

6. ఒకదాన్ని తప్ప అన్నింటినీ తీసివేయటం : నిత్యానందస్థితి మీద కేంద్రీకరించండి.

సమయం : వర్తించదు.

ఈ ధ్యానపద్ధతిలో మూడు స్టెప్స్ ఉన్నాయి. ముందుగా మీ ఎదురు ఒక వ్యక్తి కాని వస్తువు కాని ఉన్నది అనుకోండి. కేవలం చూడటం కాదు, వ్యక్తి ఉన్న అనుభూతి పొంది పూర్తిగా అందులో కలిసిపోండి.

రెండవది, మిగిలిన అన్ని వస్తువులూ లేనట్టు, కేవలం మీ ముందు ఉన్నది ఒక్కటే ఉన్నట్టు అనుకోండి. ఆ ఒక్కటి తప్ప మిగిలిన వాటినన్నింటినీ తీసివేయండి. కేవలం ఆ ఒక్క వస్తువు లేదా వ్యక్తిని పూర్తిగా గ్రహించండి.

మూడవది, ఎప్పుడైతే ఎక్కడ ఏ వస్తువు, వ్యక్తి లేకుండా కేవలం ఈ ఒక్కటే ఉన్న స్థితికి వచ్చాక, ఆ వ్యక్తి లేదా వస్తువు నుంచి విముక్తి చెందండి. ఆ బంధాన్ని వదిలేయండి.

తరువాత వస్తువుని అనుకోవటం అది లేదు అని అనుకోవటం ఒక పక్కకి పెట్టి మిమ్మల్ని తెలుసుకోండి, అంటే మీ లోనికి మాయం అవ్వండి. అకస్మాత్తుగా మీ లోపల మీరు కేంద్రీకృతమై ఉండటాన్ని చూస్తారు. మీ అంతరాత్మ లోతులలో, మీ చేతనస్థితిలో, మీ ఆత్మలో మీరు ఉంటారు.

మీకు ఎవరైనా ఒక వ్యక్తి పట్ల లేదా వస్తువు పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఈ పద్ధతిని ప్రయత్నించండి. ముందు వారు మీ ఎదురుగా ఉన్నట్టు అనుకోవాలి. తరువాత ఆ వ్యక్తి తప్ప మొత్తం అంతా మాయమైపోవాలి. తరువాత ఆ వ్యక్తి కూడా లేనట్టు అనుకోవాలి. అప్పుడు మీరు నిత్యానందస్థితిలో కేంద్రీకృతమవుతారు.

7. అన్నింటినీ మీలో నిలుపుకోండి : మీ చేతనస్థితిని విస్తృతపరచండి.

సమయం: 21 నిమిషాలు

స్టెప్ 1 : సమయం : 2 నిమిషాలు.

నిటారుగా కూర్చోండి మీ శరీరపు హద్దులు తెలుసుకోండి. మీరు కూర్చున్న గదిని చూడండి.

స్టెప్ 2 : సమయం : 5 నిమిషాలు

కళ్ళు మూసుకొని ఆ గది మీలో ఉన్నట్టు భావించండి. అది మీలో ఒక భాగమైపోవాలి. మీ శరీరపు హద్దులు ఆ గదిని తనలో ఇముడ్చుకోవటానికి విస్తృతం కావాలి. మీలోని ప్రదేశం విస్తృతం కావాలి.

స్టెప్ 3 : సమయం 2 నిమిషాలు

గది లోంచి బయటకి వెళ్ళి చెట్లని ఇళ్ళని మీ చుట్టూ ఉన్న వాటిని చూడండి.

స్టెప్ 4 : సమయం 5 నిమిషాలు

కళ్ళు మూసుకొని మీరు మరింత విస్తృతమైనట్టుగా భావించి ఇప్పుడు వీటన్నింటినీ కూడా మీలో ఒక భాగం అనుకోండి.

సెప్ట్ 5 : సమయం 2 నిమిషాలు

కళ్ళు తెరచి విశాలమైన ఆకాశాన్ని చూడండి.

సెప్ట్ 6 : సమయం 5 నిమిషాలు

కళ్ళు మూసుకోండి, ఇప్పుడు ఆకాశం అంతా మీలో ఉన్నట్టు భావించండి. ఇది చాలా శక్తిమంతమైన ధ్యాన పద్ధతి. ఇది మీ రోజువారీ జీవితంలో ఒక భాగం కావచ్చు. మీ చుట్టూ ఉన్నవారిని, అందరినీ, అన్నింటినీ మీలో ఒక భాగం అనుకోండి.

ఉదాహరణకి మీరు పని చేసే చోట అక్కడ ఉన్న వస్తువులు మీలో ఒక భాగం అనుకోండి. మీ తెలుసుకునే తత్వాన్ని విస్తృతం చేయండి. మీరు కంప్యూటర్ మీద పని చేస్తున్నప్పుడు, కంప్యూటర్, మీరు కూర్చున్న కుర్చీ, టేబుల్ ఆఫీసు రూం అన్నీ మీలో ఒక భాగం అనుకోండి. కళ్ళు మూసుకొని అవన్నీ మీలో ఒక భాగమైనట్టు భావించండి.

మీ చుట్టూ పని చేసేవారిని, మీ సహోద్యోగుల్ని, పనివారిని అందరినీ మీలో ఒక భాగం అనుకోండి. మీ వ్యక్తిగతచేతనస్థితి సామాజిక చేతనస్థితిగా సంతోషపడండి. ఈ ధ్యానాన్ని అందరూ కలసి సాధన చేస్తే వ్యక్తిత్వాలు కరిగిపోయి అహంకారపు గొడవలు సమసిపోతాయి.

8. మూలాన్ని కనుగొనటం : మీ ఆలోచనల మూలాలని కనుగొని, అంతిమ మూలాధారమైన సర్వాంతర్యామిని మేలుకొలపటం. సమయం : వర్తించదు.

మీరు మామూలుగా కూర్చుని ఉన్నప్పుడు ఏవో ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించండి. వాటి కదలికలు మీ శరీరంలో ఏ భాగంలో మీకు తెలుస్తుందో గమనించండి. ఆ ఆలోచనలతో పాటు అనుభూతిని పొందండి.

మీ ఆలోచనలు ఒక దాని తరువాత ఒకటి మీ లోపలి భాగాలలో ఒక సున్నితమైన స్పందనని, చలనాన్ని కలిగించటం తెలుస్తుంది. ఏ ఆలోచన ఏ భాగాన్ని స్పందింపచేస్తుందో, చూడటానికి ప్రయత్నించండి. మీ లోపల ఏ భాగం స్పందిస్తున్నదో, ఆ భాగమే ఈ ఆలోచనని కలిగిస్తుంది. దీన్ని మీ ప్రతి ఆలోచనకి చేయండి.

ఈ పద్ధతిని సాధన చేసినప్పుడు, ఇరవై నాలుగు గంటలలో అది క్లిక్ అయితే ఈ పద్ధతి మీకు సరిపోతుంది అని అర్థం. కాకపోతే మరొక పద్ధతిని కొనసాగించండి. ఈ పద్ధతి మీకు జ్ఞానోదయ అనుభవాన్ని ఇస్తుంది.

9. కనురెప్పలని ఈకలా స్పర్శించండి : కుండలినీశక్తిని మేల్కొలపటానికి ఇది చాలా మంచి ధ్యానపద్ధతి. మీ శరీరంలో సున్నితత్వాన్ని పెంచగల ఒక చక్కని ధ్యాన పద్ధతి ఇది.

సమయం : 30 నిమిషాలు

కళ్ళు మూసుకొని, వేలి కొనతో మీ కంటి రెప్పలని పక్షి ఈక అంత సున్నితంగా స్పర్శించండి. లేదా పక్షి ఈకని కూడా ఉపయోగించవచ్చు. కంటి రెప్పని తాకినప్పుడు ఈక వంగకూడదు. అలా వంగితే దాన్ని మీరు బలంగా అదిమినట్టు అర్థం. దాని మీద అసలు ఒత్తిడి పడకూడదు. ఒత్తిడి ఈ పద్ధతికి పనికి రాదు. కేవలం అలా సున్నితంగా తాకండి.

A person gently touching their eyelid with a feather.

అది అంటీ అంటనట్టు ఉండాలి. కేవలం వేలి కొనలు మాత్రం కంటి రెప్పని తగులుతూ ఉండాలి. చేతిని సరైన రీతిలో ఉంచి, బ్యాలెన్స్డ్ గా ఉంచి కంటి రెప్పని కేవలం వేలి చివర్లు తగులుతున్న విధంగా ఉంచాలి. మొదటిసారి చేతులు కొంచెం వణుకుతాయి. మీరు కంటి రెప్పలని గట్టిగా అదుముతారు. లేదా అసలు మీ వేళ్ళు కంటి రెప్పని అంటవు.

ఎప్పుడైతే అతిసున్నితంగా మీ వేళ్ళు కంటి రెప్పలని స్పర్శిస్తాయో, గొప్ప శక్తి మీ వేళ్ళ నుంచి కళ్ళకి వెళ్ళటం మీరు చూడగలుగుతారు. క్రమంగా చేతి వేళ్ళు, చేతులు మీ కంటిలో ఒక భాగమైనట్టు మీకు అనిపిస్తుంది.

A person touching near their eyes during sadhana practice

ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోగానే, వాటి హద్దులు కంటి రెప్పల వరకే అనిపిస్తుంది. ఎప్పుడైతే అతిసున్నితంగా స్పర్శిస్తారో, కళ్ళు విస్తృతమైనట్టు తెలుస్తుంది. మీరు సరైన విధంగా స్పర్శిస్తే ఆ అనుభవం కలుగుతుంది. మీరు బయట అనుభవించే సున్నితత్వాన్ని లోపల కూడా అదే విధంగా కళ్ళు అనుభవించాలి.

ఈ పద్ధతిని బాగా సాధన చేస్తే, మీ లోపల శక్తి కళ్ళ ద్వారా బయటకి వెళ్ళి కూడా మీ లోపలే ప్రవహిస్తూ ఉంటుంది. ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు కళ్ళు మూసుకుంటే మీ జ్ఞానేంద్రియాలు పని చేయవు. దానితో శక్తి బయటికి వెళ్ళదు. అయినా మీ లోపల ఏవో కొన్ని దృశ్యాలు కదులుతూ ఉండి శక్తి వృధా అవుతుంది. ఎప్పుడైతే మీరు మీ లోపల బయటి దృశ్యాల్ని పూర్తిగా ఆపగలుగుతారో అప్పుడే జ్ఞానోదయం కలుగుతుంది.

ఒక్కసారి బ్యాలెన్స్ చేయాలన్నా కనీసం అరగంట సమయం పడుతుంది. సున్నితంగా స్పర్శించే స్థితికి రావాలంటే ప్రతి రోజూ కనీసం ఒక నెల రోజులు దీని సాధన చేయాలి. అప్పుడు పూర్తి బ్యాలెన్స్ వస్తుంది.

10. సూర్యునితో పాటు లేవండి : మీ లోపలి లోతైన శక్తిని మేల్కొలపండి.

సమయం : 10 నుంచి 15 నిమిషాలు.

సూర్యోదయానికి ముందు 10 నుంచి 15 నిమిషాలు ఆకాశాన్ని చూడండి. ఆకాశం లోకి రంగులు ప్రవేశించగానే లోతైన నిశ్శబ్దంతో, అత్యంత జాగ్రత్తతో గమనించండి. ఆకాశంలో సూర్యుడు పైకి వస్తుంటే మీ అంతరంగంలో సూర్యుడు కూడా పైకి వస్తున్నట్టు అనుభూతి పొందండి. సూర్యుడు దిక్చక్రాన్ని అంటగానే మీ లోపల సూర్యుడు నాభిప్రాంతానికి వచ్చినట్టు అనుకోండి.

సూర్యుడు పైకి వచ్చే కొద్దీ మీ లోపల సూర్యుడు కూడా తీవ్రమవటం గమనించండి.

15 నిమిషాలు గడిచాక కళ్ళు మూసుకోండి. ప్రకాశవంతంగా, నిశ్శబ్దంగా మీ లోపల సూర్యుని అనుభూతిని ఆనందించండి.

11. భక్తి : భక్తితో సున్నితత్వం పొంది మార్పు పొందండి.

సమయం : వర్తించదు.

కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చోండి. ముందుగా కొన్ని నిమిషాలు ఒక వ్యక్తిని ఎంచుకోండి, ఆ వ్యక్తి మీ జీవితంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి, మీ జీవితంలో ఆయన పాత్ః చాలా గొప్పది. ఏ వ్యక్తి అయితే మీ జీవితాభివృద్ధికి తోడ్పడ్డాడో, ఏ వ్యక్తి అయితే మీకు చాలా కావలసినవాడో ఆ వ్యక్తిని ఎంచుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తితో బంధాన్ని ఏర్పరచుకోండి. వ్యక్తిని స్పష్టంగా గుర్తుచేసుకోండి, మీ జీవితంలో గొప్ప మార్పుకి ఆ వ్యక్తి ఎలా సహాయం చేసాడో గుర్తుచేసుకోండి.

ఆ వ్యక్తితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోండి. మీ జీవితానికి ఆ వ్యక్తి ఇచ్చిన అందమైన విషయాల్ని, సంఘటల్ని గుర్తు చేసుకోండి. మీ అంతరాత్మకి ఎంత ఇచ్చాడో గుర్తు చేసుకోండి. ఆ వ్యక్తిలోకి, ఆ గుర్తులోకి పూర్తిగా విరామంగా నిమగ్నమవ్వండి. ఆ వ్యక్తి అంతరాత్మలోకి మాయం అవ్వండి. ఆ వ్యక్తితో మీకు ఉన్న అందమైన, అత్యంతసన్నిహితమైన గుర్తులలోకి మాయం అవ్వండి. ఆ వ్యక్తి అంతరాత్మలో విరామంలో ఐక్యమైపోండి.

12. బయట, అంతరంగంలో చూసి - వదిలేయండి : భయం, అభద్రతాభావాల నుంచి బయటికి రండి.

సమయం : వర్తించదు.

ఒక వస్తువుని తీసుకొని కూర్చోండి. దాని లోపలికి లోతుగా, తీవ్రంగా, గాఢతతో చూడండి. ఆ వస్తువుతో మీ మనస్సు మొత్తం నిండిపోవాలి. మీరు ఒక వ్యక్తి ఫోటోని ముందు ఉంచి దాని లోకి చూస్తే, మీ మనస్సు మొత్తం ఆ వ్యక్తి రూపంతో, ఆ వ్యక్తితో మీకున్న అనుభవాల జ్ఞాపకాలతో నిండిపోవాలి. ఆ అనుభవం మీ అంతరంగం అంతా నిండాలి.

ఇప్పుడు కళ్ళు మూసుకొని, ఆ వస్తువు నుంచి వెనక్కి వచ్చేయండి. మీ అంతరంగంలో కూర్చొని ఆ వస్తువుని లేదా ఆ వ్యక్తిని మీ అంతరంగంలో కొన్ని నిమిషాలు చూడండి.

ముందు ఆ వస్తువుని బయట చూడండి. ఆ తరువాత మీ అంతరంగంలో చూడండి. తరువాత కేవలం మీ అంతరంగంలోనే చూడండి. తరువాత దాన్ని కూడా వదిలేసి మీ అంతరాత్మతోనే ఉండండి. చేతనస్థితిలో ఆలోచనల నుంచి బయటికి వస్తాను అని నిర్ణయించుకొని, కేవలం మీతోనే ఉండండి.

13. నిద్ర పట్టే సమయంలో తెలుసుకోండి : తెలుసుకునే తత్వంతో సమాధిస్థితికి వెళ్ళండి.

సమయం : వర్తించదు.

ఈ పద్ధతిని మీకు నిద్ర పట్టే సమయంలో చేయాలి. కాని నిద్ర పోయేటప్పుడు లేదా పదుకోవటానికి కేటాయించిన సమయంలో కాదు. శరీరం నిద్రకి సిద్ధమయ్యాను అని చెప్పగానే ఈ ధ్యానం చేయండి.

విశ్రాంతిగా ఉండి, చైతన్యంగా లేకుండా ఎదురు చూడండి, అంతే! నిద్ర పోవటానికి ప్రయత్నించకండి. నిద్ర పట్టటానికి ఏ పద్ధతినీ పాటించకండి. నిద్ర రాకపోతే ఆత్రుత పడవద్దు, అపరాధభావం వద్దు. ఎదురుచూడండి. ఎదురుచూసేటప్పుడు మీరు బాగా తెలుసుకునే తత్త్వంతో ఉంటారు. మీరు ఏమీ చేయకుండా, కదలికలు లేకుండా ఎదురుచూస్తే, మీరు ఎక్కువ తెలుసుకునే తత్త్వంతో ఉంటారు. మీరు ఆత్రుతతో, దుడుకుగా ఉంటే తెలుసుకోలేరు.

ఒక ముఖ్యవిషయం అర్థం చేసుకోవాలి. కదలికలు లేకుండా, స్వాగతించే దశలో ఉంటే మీరు బాగా తెలుసుకోగలుగుతారు. అందుకే ప్రార్థన తెలుసుకునే తత్త్వాన్ని పెంచుతుంది. ప్రార్థించే సమయంలో మీలో కదలికలు లేకుండా, లోతుగా భగవంతుని దయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రార్థనతో కూడిన కదలికలు లేని స్థితి మీ లోపలికి తెలుసుకునే తత్త్వాన్ని తెస్తుంది. స్తబ్దంగా ఉన్న మనస్సుతో ఉండండి. నిద్రని దేవత అనుకోండి. ఉపనిషత్తులో నిద్రాదేవిని కొలిచే స్తోత్రాలు ఉన్నాయి. సుషుప్తిస్థితి గురించి ఆలోచించండి. సుషుప్తిని దేవత అనుకోండి. ఆమె మిమ్మల్ని ఆవరించేవరకు చలనం లేకుండా ఎదురుచూడండి. లోతైన ఎదురుచూసే మనస్సుతో ఉండండి.

అకస్మాత్తుగా మీరు మీ శరీరాన్ని మరచిపోతున్న స్థితి రావటం గమనిస్తారు. అది మీకు తెలుస్తుంది. 'నేను' అనే భావనని వదలేరు. ఆ క్షణాన్ని గమనించండి. నాల్గవ దశ అయిన సమాధిస్థితికి ద్వారం తెరుచుకుంటుంది. ఆ స్థితిలో మీలో మాటలు ఎక్కువగా ఉండవు. ఆలోచనలు ఉండవు. కాని 'నేను' అనే విషయం తెలుస్తుంది. నాకు నా శరీరం తెలియటం లేదు కాని నేను ఉన్నాను అని తెలుస్తుంది.

సరిగ్గా ఈ పాయింట్ దగ్గర, మీరు పూర్తి విరామంలో, పూర్తి రిలాక్స్డ్ స్థితిలో ఉండటాన్ని చూస్తారు. మీకు తెలుస్తుంది. కాని మీ శరీరం అనే భావం పూర్తిగా పోతుంది. తరువాత ఉదయం నిద్ర లేవగానే మీకు చాలా తాజాగా, హుషారుగా, చైతన్యవంతంగా అనిపిస్తుంది. అయితే మీకు రాత్రి అంతా తెలుస్తూనే ఉంది అనిపిస్తుంది. మీకు అంతా తెలుస్తూనే ఉంటుంది, కాని పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. మీకు అలసట అనేది ఉండదు. మీకు సమాధిస్థితి ఒక్క క్షణకాలం అనుభవమైనా ఆ అనుభవం ఇదే విధంగా ఉంటుంది.

చురుకైన - చైతన్యవంతంగా చేసే ధ్యానపద్ధతులు

1. ఆనందనాట్యం : మీ లోపల నిక్షిప్తమై ఉన్న గొప్ప శక్తితో నూతనత్వాన్ని పొందండి. మీ లోపల లోతైన ప్రశాంతతలో విరామంగా ఉండండి.

సమయం : 31 నిమిషాలు

స్వేచ్ఛానాట్యం అంటే ఒక పద్ధతిలో అడుగులు వేయకుండా చేసేది. దీనికి నియమాలు, అడుగులు, పద్ధతి ఉండవు, శరీరం తనకి నచ్చిన విధంగా కదలటమే స్వేచ్ఛానాట్యం. ఆడుకుంటున్నట్టుగా, ఎంజాయ్ చేస్తున్నట్టుగా మీ డాన్స్ అనే శక్తిలో ఒక భాగమైపోవాలి.

ఇందులో రెండు దశలు ఉన్నాయి. డాన్స్ చేయటం, విశ్రాంతిగా ఉండటం.

స్టెప్1 : సమయం 21 నిమిషాలు.

కళ్ళు మూసుకొని డాన్స్ చేయటం ప్రారంభించండి, స్టెప్స్ గురించి పట్టించుకోకండి. శరీరానికి తనకి ఇష్టమైన విధంగా స్వేచ్ఛగా కదలనీయండి. మీరు ఎలా ఉంటారో అని పట్టించుకోవద్దు. మీ బట్టలు ఎలా ఉన్నాయో అనుకోవద్దు. మిమ్మల్ని ఎవరూ చూడరు. ఇదేమీ స్టేజి మీద ప్రోగ్రాం కాదు. మీరు ఈ విధంగా డాన్స్ చేస్తూ ఉంటే మీలో చాలా శక్తి వస్తుంది. మీరు డాన్స్ చేస్తూనే ఉంటారు. మీరు డాన్స్ చేసే కొద్దీ మీరు మరింత శక్తితో ఉంటారు. మీకు అసలు అలసట రాదు. డాన్స్ లోపలికి లోతుగా వెళ్ళండి. ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా, అంత స్వేచ్ఛగా చేయండి. మిమ్మల్ని మీరే మరచిపోండి. మీరు నాట్యం అయిపోవాలి.

సెప్ట్ 2 : సమయం 10 నిమిషాలు

21 నిమిషాలు అయ్యాక మీరు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారో, ఆ పొజిషన్లో కిందికి వాలిపోండి. నేల మీద నిశ్శబ్దంగా చలనం లేకుండా పడుకోండి. అకస్మాత్తుగా వేగం నుంచి నిశ్చలత్వానికి రాగానే మీలో శూన్యం ఏర్పడుతున్న అనుభవం కలుగుతుంది. అదే ఆలోచనలు లేని స్థితి. అప్పుడు లోతైన నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు.

కొన్ని క్షణాలు గడిచాక ఆలోచనలు వస్తాయి. నిశ్శబ్దంగా ఆలోచనలని గమనించండి. వాటితో పోరాడవద్దు, వాటిలో నిమగ్నమవ్వద్దు. మీ లోపల ప్రశాంతతని తెలుసుకుంటారు. ఆలోచనలు వచ్చాక కూడా మీలో గొప్ప నిశ్శబ్దం ఉంటుంది. ఆ ప్రశాంతతని మీతోనే ఉండనీయండి. రోజంతా లోతైన నిశ్శబ్దం మీలో ఉంటుంది. మీ నిద్రలోకి కూడా ఆ నిశ్శబ్దాన్ని తీసుకువెళ్ళండి. నిద్ర లేచాక చాలా తాజాగా, చురుకుగా ఉంటారు.

2. గిరగిరా తిరగటం : మీలో కదలిక లేని కేంద్రాన్ని కనుగొనండి. సర్వసృష్టిలో ఐక్యమైపోండి.

మొత్తం సమయం 31 నిమిషాలు.

మీలో మీరు కేంద్రీకృతం అవటానికి ఇది అందమైన, సహజమైన ధ్యానం. ఈ ధ్యానానికి ముందు మూడు గంటలు ఏమీ తినవద్దు, తాగవద్దు. ఇందులో రెండు దశలు ఉన్నాయి. గిరగిరా తిరగటం, విశ్రాంతిగా ఉండటం.

గిరగిరా తిరగటం : గడియారానికి వ్యతిరేకదిశలో, కుడిచేతిని పైకి పెట్టి, అరచేయి ఆకాశం వైపు ఉండేలా ఉంచి, ఎడమచేతిని కిందికి పెట్టి, ఎడమ అరచేయి నేల వైపు ఉంచి నెమ్మదిగా తిరగటం ప్రారంభించండి. ఈ దశలో తిరగటం ఇబ్బందిగా ఉంటే గడియారం తిరిగే వైపు తిరగండి. నెమ్మదిగా మీ శరీరం సున్నితంగా తిరిగేలా తిరగండి. మీరు తిరిగేటప్పుడు చుట్టూ ఉన్నవి మసగ్గా కనిపిస్తాయి. దేని మీదా ఏకాగ్రత నిలపవద్దు. అలా చేస్తే కడుపులో తిప్పినట్టు అవుతుంది. వికారంగా ఉంటుంది.

నెమ్మదిగా వేగం పెంచండి. మీరే ఆ తిరుగుడు అయిపోవాలి. మీ శరీరం తిరుగుతూ ఉంటుంది. కాని లోపల ఎక్కడో కొంత భాగం నిశ్చలంగా ఉంటుంది. మీరు తిరగటాన్ని గమనిస్తున్నట్టు ఉంటుంది.

విరామంగా ఉండటం : మీరు అలా తిరుగుతూ ఉంటే కొంచెం సమయమయ్యాక శరీరం పడిపోతుంది. దాన్ని అలా పడనీయండి. మీరు కావాలని ఒక పద్ధతిలో పడవద్దు. అలా పడగానే బోర్లా పడుకోండి. మీ నాభిప్రాంతం భూమికి తగలాలి. మీ శరీరం భూమిలో ఒక భాగమైనట్టు అనుకోండి. కళ్లు మూసుకొనే ఉండండి. అదే స్థితిలో ఉండండి. నిశ్శబ్దంగా కదలకుండా 15 నిమిషాలు ఉండండి.

ఈ ధ్యానం చేశాక కొన్ని గంటలు నిశ్శబ్దంగా ధ్యానస్థితిలో ఉండండి.

వాత - పిత్త - కఫ ధ్యానపద్ధతులు

మీ శరీరంలోని మూడు ముఖ్యమైన శక్తులని సమతుల్యతలో ఉంచండి.

ప్రాచీన ఆయుర్వేదశాస్త్రం ప్రకారం మీ శరీరంలో మూడు ముఖ్యమైన శక్తివనరులు ఉన్నాయి. అవి వాత (కదలికలు గల శక్తి) - పిత్త (జీర్ణక్రియకి సంబంధించిన శక్తి) - కఫ (శరీరవ్యవస్థ పనిచేయటానికి లూబ్రికేట్లా పని చేసే శక్తి) ఈ మూడు సమతుల్యతతో ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంతో ఉంటుంది. సాధారణంగా అందరిలో ఈ మూడు సమతుల్యతతో ఉండవు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువగా ఉంటాయి. కింద ఇచ్చిన పద్ధతులు వీటిని సమతుల్యతలో ఉంచుతాయి.

ఈ పద్ధతుల్ని తీవ్రంగా చేస్తే క్యాన్సర్ రాదు. ఈ ధ్యానపద్ధతుల్ని ఖాళీ కడుపుతో చేయాలి. ఉదయం చేస్తే మంచిది.

వాత ధ్యానపద్ధతి : మొత్తం సమయం : 31 నిమిషాలు

స్టెప్ 1 : సమయం 10 నిమిషాలు

వజ్రాసనంలో కూర్చొని మీ చేతులు నడుము మీద పెట్టాలి. అలా చేతులు పెట్టటం ద్వారా మీలో పై భాగానికి, కింది భాగానికి సంబంధం ఏర్పడుతుంది. 'హు ' కారం చేయండి. శ్వాస బయటికి వస్తున్నప్పుడు దానితో పాటు హు కారం చేయండి. మరలా శ్వాస తీసుకొని హూకారం చేయండి. ఎంత సేపు చేయగలిగితే అంత సేపు చేయండి.

స్టెప్ 2 : సమయం 21 నిమిషాలు.

వజ్రాసనంలోనే కూర్చోండి. చేతులు నడుం పైనే ఉంచి మీ నుదురు నేలకి తగిలేలా ముందుకు వంగి హూకారం చేయండి.

పితృధ్యానం : మొత్తం సమయం 31 నిమిషాలు

స్టెప్ 1 : సమయం 10 నిమిషాలు.

వజ్రాసనంలో కూర్చొని చేతులు నడుము మీద పెట్టండి. హూకారం చేయండి. హూకారం చేస్తూ తెల్లని వెలుగు రేఖ మీ లోపల పైకి లేచి పైన తల వరకూ వెళ్ళి, బయటికి వెళ్ళి మళ్ళా మీ లోపలికి వెళుతున్నట్టు స్పష్టంగా చూడండి. హూకారం చేస్తున్నంత సేపూ తెల్లని వెలుగు రేఖ మీ లోపల నుంచి బయటికి, తిరిగి మీలోకి వృత్తంలా తిరుగుతున్న దృశ్యాన్ని చూడండి.

స్టెప్ 2 : సమయం 21 నిమిషాలు.

వజ్రాసనంలోనే కూర్చోండి. చేతులు నడుము మీద ఉంచి మీ నుదురు నేలకు తగిలేలా ముందుకి వంగండి. హూకారం చేయండి. తెల్లని కాంతిపుంజం మీ నుంచి పైకి వచ్చి, తలపై భాగం నుంచి బయటికి వెళ్ళి తిరిగి మీలోకి రావటం, అది ఒక వృత్తంలా తిరగటం చూడండి.

కఫధ్యానం : మొత్తం సమయం 41 నిమిషాలు

స్టెప్ 1 : సమయం 10 నిమిషాలు

వజ్రాసనంలో కూర్చొని, చేతులు నడుము మీద ఉంచి హూకారం చేయండి. తెల్లని కాంతిరేఖ మీలోంచి పైకి వచ్చి మీ పై భాగం నుంచి బయటికి వెళ్ళి తిరిగి మీ లోనికి వస్తున్న దృశ్యాన్ని గమనించండి. హూకారం చేస్తూ ఉండాలి.

స్టెప్ 2 : సమయం 21 నిమిషాలు.

వజ్రాసనంలోనే కూర్చోండి. చేతులు నడుము మీద ఉంచండి. నుదురు నేలకు తగిలేలా ముందుకు వంగండి. హూకారం చేస్తూ, తెల్లని కాంతిరేఖ మీ నుంచి పైకి వచ్చి తలపై భాగం నుంచి బయటికి వెళ్ళి తిరిగి మీ లోనికి రావటం చూడండి. స్టెప్ 3 : సమయం 10 నిమిషాలు.

కళ్ళు తెరవండి. మీ మూడవ కంటి నుంచి స్వామీజీ ఫోటోలో మూడవ కంటి వైపు చూడండి. తెల్లని కాంతిరేఖ స్వామీజీ మూడవ కంటి నుంచి మీ మూడవ కంటిలోకి ప్రవేశించటాన్ని స్పష్టంగా చూడండి. ఈ ధ్యానం తంత్ర - మంత్ర - యంత్ర - మూడు కలసిన ధ్యానం.

మంత్రం అంటే శరీరాన్ని కోరిన ప్రభావం వచ్చేలా ఉపయోగించటం - ఒక భంగిమలో కూర్చోని జపించటం (హుంకారం చేయటం). తంత్ర అంటే శరీరాన్ని, మనస్సుని కావలసిన ప్రభావం కోసం ఉపయోగించటం - తెల్లని కాంతిరేఖని చూడగలగటం. యంత్ర అంటే బయట ఏదైనా ఒక దాన్ని ఉపయోగించటం - స్వామీజీ కళ్ళు ఉన్న ఫోటోని ఉపయోగించటం.

పిత్తాన్ని సమతుల్యతలో ఉంచటం

మీ శరీరంలోని అగ్ని, జలమూలకాల్ని సమతుల్యతతో ఉంచండి. మీ శరీరంలోని మీరు ఉపయోగించని శక్తిని మేల్కొలపండి.

సమయం : 30 నిమిషాలు.

ఏదైనా తింటే మూడు గంటల తరువాత ఈ ధ్యానం చేయాలి.

స్టెప్ 1 : సమయం 10 నిమిషాలు.

నిలబడి శరీరం మొత్తాన్ని కుదుపుతున్నట్టుగా కదిలించండి. తల నుంచి పాదాల వరకు చెట్టుని కుదిపితే ఎలా ఉంటుందో ఆ విధంగా కదిలించాలి. ఈ విధంగా చేస్తే మీలో ఉపయోగించని శక్తికేంద్రాలు మేల్కొంటాయి. మీ శరీరాన్ని ద్రవంలా చైతన్యపరుస్తుంది. బాగా కుదపండి.

స్టెప్ 2 : సమయం 10 నిమిషాలు.

మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చోండి. ఏ శబ్దం మీకు అప్పుడు తడుతుందో ఆ శబ్దం చేయండి. ఇది జిబ్బరిష్ లాంటిది. మాటలు ఉండకూడదు. మీ లోపలి చికాకు, వ్యధ, కోపం ఏదైనా సరే, ఈ చికాకులు మీలో ఉంటే పిత్తం సమతుల్యతతో ఉండదు, కాబట్టి ఆ చికాకులు బయటికి పోవాలి.

స్టెప్ 3 : సమయం 10 నిమిషాలు.

నిశ్శబ్దంగా కూర్చోండి. కేవలం గమనించండి. మనసులోకి ఏది వచ్చినా దాన్ని నిలపాలని లేదా పోగొట్టాలని చూడవద్దు. మీ మనస్సులోకి ఏం వచ్చినా దాని మీద అభిప్రాయాలు ప్రకటించకుండా కేవలం గమనించండి.

శ్వాససంబంధమైన ధ్యానపద్ధతులు

శ్వాసని నిరంతరం గమనించటం ఒక శక్తివంతమైన ధ్యానం, ఇది చాలామందికి జ్ఞానోదయాన్ని కలిగించింది. శ్వాసని గమనించటం వల్ల తెలుసుకునే తత్త్వం పెరుగుతుంది. తెలుసుకునే తత్త్వం పెరిగితే అంతరంగం మేల్కొంటుంది. పరమానందం లభిస్తుంది.

1. లోపలికి వచ్చే శ్వాసని, బయటికి వెళ్ళే శ్వాసని, మధ్యలో ఖాళీని గమనించటం :

మొత్తం సమయం : 35 నిమిషాలు.

పూర్తి విరామంగా, సౌకర్యంగా కూర్చోండి. పూర్తిగా రిలాక్స్ అవ్వండి.

స్టెప్ 1 : సమయం 5 నిమిషాలు.

మీ శ్వాసని గమనించటం ప్రారంభించండి. కేవలం గమనించండి, దాన్ని పెంచవద్దు. మామూలుగా మీరు లోపలికి తీసుకొని, బయటికి శ్వాసించటాన్ని గమనించండి.

స్టెప్ 2 : సమయం 5 నిమిషాలు.

తరువాత కేవలం లోపలికి వెళ్ళే శ్వాసనే గమనించండి. బయటికి వెళ్ళే శ్వాసని పట్టించుకోవద్దు.

స్టెప్ 3 : సమయం 5 నిమిషాలు.

ఇప్పుడు కేవలం బయటికి వెళ్ళే శ్వాసని గమనించండి. లోపలికి వచ్చే శ్వాసని పట్టించుకోవద్దు. మీరు పూర్తిగా తెలుసుకునే తత్త్వంతో బయటికి వెళ్ళే శ్వాసని మాత్రం గమనించండి.

స్టెప్ 4 : సమయం 5 నిమిషాలు.

ఇప్పుడు అన్నీ వదిలి కేవలం లోపలికి వచ్చే శ్వాసకి, బయటికి వెళ్ళే శ్వాసకి మధ్య ఉన్న ఖాళీని గమనించండి. మీ శ్వాస మలుపు తిరుగుతుంది. ఆ మలుపుని గమనించండి. కేవలం రెండు శ్వాసల మధ్య ఖాళీని మాత్రమే గమనించండి.

స్టెప్ 5 : సమయం 5 నిమిషాలు.

ఇప్పుడు లోపలికి వచ్చే, శ్వాస, ఖాళీ, బయటికి వెళ్ళే శ్వాస, ఈ మూడింటినీ గమనించండి. ఈ మూడింటినీ తెలుసుకోండి. మీ శరీరం అంతా నూతనంగా, చైతన్యవంతంగా ఉండటాన్ని గమనించండి. మీరు జీవచైతన్యంతో ఉన్న నిశ్శబ్దంలో ఉన్నారు. అది శక్తిమయం. మీరు అత్యున్నతశక్తిని ప్రసరిస్తున్నారు.

స్టెప్ 6 : సమయం 5 నిమిషాలు. ఇప్పుడు రెండు శ్వాసల మధ్య ఖాళీని గమనించండి. కేవలం ఖాళీని మాత్రమే గమనించండి. మీకు అసలు శ్వాసించటం లేదు అనిపిస్తుంది. ఆ భావాన్ని కూడా గమనించండి.

స్టెప్ 7 : సమయం 5 నిమిషాలు.

కళ్ళు మూసుకునే ఉండి, రిలాక్స్ అవ్వండి. ధ్యానం చేయవద్దు. కేవలం రిలాక్స్ అవ్వండి. దేన్ని గురించీ ఆలోచించవద్దు. మనస్సుని స్థిరపడనీయండి. నెమ్మదిగా ఉన్నతశక్తిప్రదేశ్ం నుంచి బయటికి రండి. 5 నిమిషాలు గడిచాక నెమ్మదిగా చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి.

2. రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్న మేధ, శక్తి :

మొత్తం సమయం : 30 నిమిషాలు.

విరామంగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. శ్వాసని గమనించండి. లోపలికి వస్తున్న శ్వాస బయటికి వెళ్ళేదానిలా అవటాన్ని గమనించండి. బయటికి వెళ్లిన శ్వాస లోపలికి వచ్చే శ్వాసగా మారటానికి మలుపు తిరుగుతుంది. ఆ మలుపులో ఉండే ఖాళీని గమనించండి. రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీని గమనించండి. శ్వాస మలుపు తిరిగే దగ్గర ఉన్న ఖాళీని తెలుసుకోండి. ఈ సమయంలో రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీలో శ్వాసలోకి వెళ్ళే ముందు ఉన్న ఖాళీలో ఉన్నప్పుడు మీలోకి మేధ శక్తిప్రవాహంలా వస్తుంది.

కొన్నిసార్లు చిన్న కోరిక మీలోకి జీవచైతన్యాన్ని తెస్తుంది. ఉదాహరణకి సెలవు రోజు ఉదయం నిద్ర లేచాక కూడా మంచం మీద నుంచి లేవబుద్ధి కాదు. అప్పుడు అకస్మాత్తుగా మీ స్నేహితుడు గుర్తుకు వచ్చి అతన్ని కలవాలనుకుంటే, వెంటనే ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేస్తారు. ఆ ఒక్క ఆలోచన రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉండేలా చేస్తుంది. ఎప్పుడైతే మీరు శక్తితో నింపబడతారో... జాగ్రత్తగా తెలుసుకోండి ఆ శక్తి ఈ ఖాళీ ప్రదేశం నుంచి వస్తుంది.

అదే విధంగా మీ నుంచి ఏదైనా తీసేసుకోబడింది అనుకోండి. దానికి మీరు ఓదార్పు తెచ్చుకుంటారు. అప్పుడు మీరు మేధతో నింపబడతారు. మీరు దేన్నైనా పోగొట్టుకున్నప్పుడు, వెంటనే మీకు ఒక సందేశం వస్తుంది. జీవితం పట్ల ఒక విధమైన అర్థం తెలుస్తుంది. అదే మీ మేధ. అటువంటి మేధ వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోండి.

రెండు శ్వాసల మధ్య ఖాళీలో, మీరు శక్తి, మేధలతో నింపబడతారు. ఈ ఖాళీల్లోకి మీ తెలుసుకునే తత్వాన్ని తీసుకురాగలిగితే మీరు రోజంతా శక్తితో ఉంటారు. శ్వాసల మధ్య ఉన్న రెండు ఖాళీ ప్రదేశాల్ని గమనించగలిగితే మీలోకి శక్తి, మేధ ఒక ప్రవాహంలా వస్తాయి. మీరు కొంచెం లోతుగా వెళితే, మీరు మరొక ముఖ్యవిషయం అర్థమవుతుంది. ప్రతీ క్షణం మీకు ఆలోచన, శక్తి రెండూ ఉంటాయి. బైనరీ సిస్టమ్లోని 0, 1 అనేవి ఈ ద్వైతత్వం మీద, ఆలోచన - శక్తి మీద ఆధారపడి ఉంది. శక్తి - ఆలోచన; ఆలోచన - శక్తి; ఇవి రెండూ ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి.

నిజానికి ఒకసారి మీరు ఇచ్చాశక్తి - కోరిక తాలూకు శక్తితో నింపబడి ఉంటారు. తరువాత క్షణం క్రియాశక్తి - పని చేయగల శక్తితో నింపబడి ఉంటారు. ఒక క్షణం శక్తితో నింపబడి ఉంటారు. తరువాత మేధతో నింపబడి ఉంటారు. నిరంతరం ఈ రెండూ ఆట ఆడుతుంటాయి. ఈ రెండూ విశ్వంలో ముఖ్యమైన - పదార్థం, శక్తి ఈ రెంటింటితో విశ్వం నిండి ఉంటుంది.

నిరంతరం మీ అంతరంగంలో పదార్థం, శక్తి నాట్యం చేస్తూ ఉంటాయి. మీరు ఖాళీని తెలుసుకోగలిగినప్పుడు, మీరు నిత్య ఆనందస్థితిని అనుభవించగలరు.

కోరిక శక్తి, క్రియాశక్తి మీ అంతరంగంలో నాట్యం చేస్తుంటాయి. మీరు ఆ ఖాళీని గమనించగలిగితే, మీరు జ్ఞానశక్తిని సాధించగలరు. అదే మేధాశక్తి. శక్తి నిరంతరం ఆనందంలో ఉంటుంది. తనని తాను మీ అంతరంగంలో వెల్లడి చేస్తూ ఉంటుంది. ఆ ఖాళీని తెలుసుకుంటే చాలు - దివ్యచేతనస్థితితో నింపబడతారు.

3. శరీరం కదులుతున్నట్టు ఆ ఖాళీని తెలుసుకోవటం :

మొత్తం సమయం : 30 నిమిషాలు

నేల మీద నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకోండి. ఎంత నెమ్మదిగా చేయగలిగితే అంత నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకొని వదలండి.

స్టెప్ 1 : సమయం 3 నిమిషాలు.

నెమ్మదిగా మీ ఏకాగ్రతని లోపలికి తీసుకునే శ్వాస మీద ఉంచండి. కేవలం లోపలికి వచ్చే శ్వాసని గమనించండి.

స్టెప్ 2 : సమయం 3 నిమిషాలు.

నెమ్మదిగా బయటికి వెళ్లే శ్వాసని తెలుసుకోండి. ఏకాగ్రతను బయటికి వెళ్లే శ్వాస మీద ఉంచండి.

స్టెప్ 3 : సమయం 3 నిమిషాలు.

ఇప్పుడు లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్లే శ్వాసలని మరిచిపోండి. రెండు శ్వాసల మధ్య మీ ఏకాగ్రత ఉంచండి. ఆ ఖాళీని తెలుసుకోండి.

స్టెప్ 4 : సమయం 3 నిమిషాలు.

మీ ఏకాగ్రతని రెండు శ్వాసల మధ్య ఉంచి, ఖాళీలో రిలాక్స్ అవ్వండి. ఆ ఖాళీలో ఉన్నప్పుడు ఒక చేయి కదిపినప్పుడు మీరు ఖాళీ ప్రదేశం నుంచి బయటికి వచ్చేసాం అనిపిస్తే తిరిగి ఆ ఖాళీ ప్రదేశానికి వెళ్ళండి. అక్కడికి వచ్చాక మళ్ళా చేయి కదపండి.

స్టెప్ 5 : సమయం 3 నిమిషాలు.

అదే శూన్యప్రదేశంలో, రెండు శ్వాసల మధ్య ప్రదేశంలో ఉండి, నిలబడటానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆ ప్రదేశం నుంచి బయటికి వచ్చేసాం అనిపిస్తే కూర్చోండి. మళ్ళా ఆ ఖాళీ ప్రదేశానికి రండి. అక్కడ ఏకాగ్రత పోకుండా లేచి నిలబడండి.

కళ్ళు మూసే ఉంచండి. నిలబడిన తరువాత కూడా రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీని గమనిస్తూ ఉండండి. మీ ఏకాగ్రత రెండు శ్వాసల మధ్య ఉండాలి. ఎక్కడ ఆలోచనలు ఉండవో అక్కడ ఉండండి.

స్టెప్ 6 : సమయం 3 నిమిషాలు.

మీ ఏకాగ్రత రెండు శ్వాసల మధ్య ఉంచండి. ఆ ఖాళీని తెలుసుకోండి. అక్కడి నుంచి ఏకాగ్రత పోకుండా రెండు చేతులూ నెమ్మదిగా కదపండి. ఇక్కడ ముఖ్యమైన విషయం, ఖాళీ పైన మీ ఏకాగ్రత పోకూడదు. ఒకవేళ ఏకాగ్రత ఖాళీ దగ్గర ఉండకపోతే, మళ్ళా మీరు ఆ ఖాళీప్రదేశం దగ్గరకి వచ్చి, చేతులు కదపండి.

స్టెప్ 7 : సమయం 3 నిమిషాలు.

రిలాక్స్ అవ్వండి. రెండు శ్వాసల మధ్య కేంద్రీకృతమవ్వండి. అక్కడ సౌకర్యంగా ఉండండి. ఆ శూన్యప్రదేశంలో మీ తెలుసుకునే తత్త్వం ఉండాలి. అక్కడ ఏకాగ్రత పోకుండా నెమ్మదిగా తలని కదపండి. ముఖ్యవిషయం, మీ ఏకాగ్రత ఖాళీ దగ్గరే ఉండాలి.

స్టెప్ 8 : సమయం 3 నిమిషాలు.

మీ ఏకాగ్రత రెండు శ్వాసల మధ్య ఉంచి, ఏకాగ్రత అక్కడి నుంచి పోకుండా పాదాలు కదపండి. పూర్తిగా ఖాళీ ప్రదేశంలో కేంద్రీకృతమవ్వండి. ఏకాగ్రత పోయింది అనిపిస్తే మళ్ళా అక్కడికి వచ్చి పాదాలు కదపండి. మీరు పూర్తిగా ఆ ఖాళీ ప్రదేశంలో కేంద్రీకృతమై ఉండాలి. మీ ఏకాగ్రత రెండు శ్వాసల మధ్య ఉండాలి. అప్పుడు పాదాలు కదపండి.

స్టెప్ 9 : సమయం 3 నిమిషాలు.

మీ ఏకాగ్రత పోకుండా నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీరు కళ్ళు తెరిచినప్పుడు మీ ఏకాగ్రత పోయినట్లనిపిస్తే మళ్ళీ కళ్ళు మూసుకొని ఏకాగ్రతని నిలపండి. అదే తెలుసుకునే తత్వంలో ఉంటూ అదే ఖాళీ ప్రదేశంలో ఉంటూ మళ్ళీ కళ్ళు తెరవండి. మళ్ళీ ఏకాగ్రత పోతే కళ్ళు మూసుకొని తిరిగి ఏకాగ్రత ఖాళీలో నిలపండి. ఆ తెలుసుకునే తత్వం మీద ఏకాగ్రతని నిలపండి. రెండు శ్వాసల మధ్య ఏకాగ్రతని నిలపండి. ఆ ఖాళీలో ఏకాగ్రత నిలపండి.

స్టెప్ 10 : సమయం 3 నిమిషాలు.

అదే ఏకాగ్రతలో మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే కూర్చోండి. మీ ఏకాగ్రత తప్పుతుందని అనుమానం వస్తే కొంచెం సేపు ఆగి ఏకాగ్రతని నిలిపి కూర్చోండి. మీ ఏకాగ్రత రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీలో ఉంచి కూర్చోండి.

4. రెండు శ్వాసల మధ్య ఖాళీని తెలుసుకుంటూ - భక్తిభావంతో ఉండటం :

మొత్తం సమయం : 21 నిమిషాలు

ఈ పద్ధతిని పూర్తి భక్తితో సాధన చేయాలి. మీకు ఎవరి పట్ల అయినా లోతైన భక్తిభావంతో ఉంటే, ఆ వ్యక్తి - భగవంతుడు, గురువు, తల్లిదండ్రులు, మీ జీవితంలో మీకు సహాయం చేసిన వ్యక్తి ఎవరైనా సరే, వారి పైన లోతైన భక్తిభావంతో ఉండాలి. మీరు ఇద్దరు - ముగ్గురినైనా గుర్తు చేసుకోవచ్చు. చక్కని మీ అమ్మగారు, మీ ఇష్టదేవత, గురువు ఇలా ఇద్దరు-ముగ్గురిని కూడా గుర్తు చేసుకోవచ్చు.

కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చోండి. మీకు ఎవరి పైన అయితే లోతైన భక్తిభావం ఉంటుందో, ఎవరైతే మీ హృదయంలో ఉంటారో, ఎవరితోనైతే మీకు లోతైన అనుబంధం ఉంటుందో, ఎవరైతే మీకు జీవితంలో ప్రేరణని, ఉత్సాహాన్ని ఇచ్చారో, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే విధంగా సహాయం చేశారో అటువంటి వ్యక్తిని గుర్తుచేసుకోండి.

ఎవరైతే మీకు అతిముఖ్యులో వారితో మీ అంతరాత్మ లోతుల నుంచి బంధాన్ని ఏర్పరచుకోండి. ఆ వ్యక్తి పట్ల అత్యంతభక్తిభావాన్ని వెల్లడి చేస్తూ, ఆ భావంతో నిండి ఉండండి. మీ మొత్తం అంతరంగం అంతా ఆ భక్తిలో కరిగిపోనీయండి.

లోతైన భక్తిభావంతో మీ రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని తెలుసుకోండి. ప్రతి రెండు శ్వాసల మధ్య మీ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. సత్యం వెల్లడి అవుతూ ఉంటుంది. అందుకే ఆ ఖాళీలోకి తెలుసుకునే తత్వాన్ని ఉంచమని గట్టిగా చెప్పటం. ఎప్పుడైతే ఏకాగ్రత తెలుసుకునే తత్వం ఆ ఖాళీలోకి వస్తుందో సత్యాన్ని మేల్కొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

5. విపస్సన :

విపస్సన అంటే సత్యాన్ని అంచెలంచెలుగా తెలుసుకోవటం. విపస్సనని మూడు రకాలుగా చేయవచ్చు.

మీ శరీరం మనస్సు, హృదయం, పైన లోతైన ఎరుకని (తెలుసుకోవటం) కలిగి ఉండటం.

సమయం : ఎప్పుడైనా, ఎక్కడైనా.

మీరు నడిచినప్పుడు, చేయి కదిపినప్పుడు, నవ్వినప్పుడు, ఏ పని చేసినా తెలుసుకునే తత్వంతో చేయండి. ఆ పని చేసేది మీరు అని కచ్చితంగా తెలుసుకుంటూ చేయండి. జాగ్రత్తగా ఉండండి. ఒక్క క్షణం కూడా అచేతనస్థితిలో జరగకూడదు. మీకు తెలియకుండా మీ శరీరంలో ఒక్క పని కూడా జరగకూడదు.

మీ శరీరాన్ని గమనించినట్టే, మీ హృదయాన్ని, మీ మనస్సుని గమనించండి. మీ హృదయం లోనికి వచ్చే ప్రతి భావాన్నీ తెలుసుకోండి. ఎంపికలు చేయొద్దు. దేన్నీ విశ్లేషణ చేయొద్దు. కేవలం గమనించండి.

శ్వాసని గమనించటం

సమయం : ఎప్పుడైనా, ఎక్కడైనా.

శ్వాస లోనికి తీసుకోవడానికి, శ్వాస బయటికి వెళ్ళేటప్పుడు మీ పొట్ట భాగం పైకి లేచి, లోపలికి వెళ్ళాలి. నాభిప్రాంతం, మీ జీవశక్తి స్థానం, అదే పొట్ట భాగం. మీరు నాభిప్రాంతంలో ఏకాగ్రత నిలిపితే మీ శరీరం లోపలికి వచ్చే జీవశక్తిని తెలుసుకుంటారు. మీరు ఆ భాగాన్ని బాగా తెలుసుకునే కొద్దీ మీ హృదయం మనస్సు నిశ్శబ్దమైపోతుంది.

శ్వాస మీలోకి వచ్చేటప్పుడు ముక్కుపుటాలని తగిలే దగ్గర గమనించండి.

సమయం : ఎప్పుడైనా, ఎక్కడైనా.

చల్లని గాలి మీ ముక్కులోకి వెళ్ళటం గమనించండి. ఎంత సులభంగా, హాయిగా శ్వాస ముక్కులోకి వెళ్ళి బయటికి వస్తుందో గమనించండి.

విపస్సన కూర్చుని కాని, నిలబడి కాని సాధన చేయవచ్చు.

కూర్చొని

మొత్తం సమయం : 60 నిమిషాలు.

నిటారుగా సౌకర్యంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని మామూలుగా శ్వాస తీసుకోండి. మీ భంగిమ మారకుండా నిశ్చలంగా కూర్చోండి. మీరు శ్వాస తీసుకొని వదిలే సమయంలో పొట్ట భాగం పైకి లేచి లోపలికి వెళ్ళటం గమనించండి. శ్వాసపై ఏకాగ్రత నిలపవద్దు. నిశ్శబ్దంగా గమనించండి. మీకు ఏవైనా ఆలోచనలు, స్పర్శలు, భావాలు వస్తే రానీయండి. వాటిని గమనించి తిరిగి శ్వాసని గమనించండి. గమనించే పద్ధతి ముఖ్యం కాని, ఏది గమనిస్తున్నారో అది ముఖ్యం కాదు. ప్రతి దాన్ని గమనించండి. దీన్ని 45 నిమిషాలు చేసి, 15 నిమిషాలు విశ్రాంతిగా ఉండండి.

నడుస్తూ

నడుస్తూ ధ్యానం చేస్తున్న వ్యక్తి

సమయం : 30 నిమిషాలు.

మీ పాదాలు నేలకు తగలగానే మీరు గమనించాలి. తెలుసుకునే తత్త్వాన్ని పాదాల మీద ఉంచాలి.

మీరు పదిహేను అడుగులు తిన్నగా అయినా నడవండి. లేదా గుండ్రంగా ఒక సర్కిల్ పైన అయినా నడవవచ్చు. ఈ పద్ధతిని మీ ఇంట్లో గది లోంచి మరొక గదిలోకి వెళుతూ సాధన చేయవచ్చు. లేదా తోటలో సాధన చేయవచ్చు.

కళ్ళు కిందికి దించి నేల వైపు చూస్తుండాలి. లేదా పాదాలని చూస్తుండాలి. కూర్చున్నప్పుడు పొట్ట భాగాన్ని ఎలా గమనించారో, నడిచేటప్పుడు పాదం నేలని తగులుతున్న విషయాన్ని గమనించాలి. ఏదైనా ఆలోచనలు వస్తే రానీయండి. అవి మీ నిశ్చలతని పాడు చేయవు. మీరు వాటిని గమనించి తిరిగి మీ పాదాలని గమనించే దగ్గరికి వెళ్ళండి.

దీన్ని 20 నిమిషాలు చేసి 10 నిమిషాలు విశ్రాంతిగా ఉండండి.

తక్షణ ఫలితాల్నిచ్చే శక్తిమంతమైన ధ్యానపద్ధతులు

1. స్వీకరించటం : మీరు తొలగించలేని వర్తమానక్షణాలని, భవిష్యత్క్షణాలని పూర్తిగా స్వీకరించండి. మీరు ఊహించలేని లోతైన విరామాన్ని అనుభవించండి.

మొత్తం సమయం : 21 నిమిషాలు.

నిటారుగా, విరామంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని, శరీరాన్ని కదలనీయకుండా విరామంగా, అదే విధంగా కూర్చోండి. శరీరం కదలికలు ఆలోచనలని కలిగిస్తాయి. ఎప్పుడైతే మీ శరీరం కదలికలు లేకుండా నిశ్చలంగా ఉంటుందో, అప్పుడు అది మిమ్మల్ని లోతైన నిశ్శబ్దంలోకి తీసుకువెళుతుంది. పూర్తి చేతనస్థితిలో గట్టి నిర్ణయంతో, గాఢతతో ఈ నిమిషాన మీరు, మీ అంతరంగప్రపంచంలో బయటి ప్రపంచంలో ఎలా ఉంటారో అటువంటి మిమ్మల్ని మీరుగా స్వీకరిస్తాను అనే గట్టి ఉద్దేశాన్ని మీలో కలిగించండి. మీకు మీరు ఈ విధంగా చెప్పుకోండి. నాకు బయటి ప్రపంచంలో చాలినన్ని అద్భుతమైనవి సొంతానికి ఉన్నాయి. నా అంతరంగంలో నాకు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. నన్ను నేను సంపూర్ణంగా స్వీకరిస్తున్నాను. బయటి ప్రపంచంలో కాని, అంతరంగప్రపంచంలో కాని నన్ను నేను ఏమీ అభివృద్ధి చేసుకోవనవసరం లేదు. నాకు అహంకారం ఉన్నా పరవాలేదు. నాలో అపరాధభావం అనేది ఉన్నా పరవాలేదు. నాకు భయం ఉన్నా పరవాలేదు. నాకు ఆశ ఉన్నా పరవాలేదు. నా గురించి అందరూ ఏవేవి చెప్పినా పరవాలేదు. నేను మంచి అయినా, చెడు అయినా అన్నింటి తోటీ నన్ను నేను స్వీకరిస్తాను.

ఒక వేళ మీ మనస్సు 'అదేం లేదు. నేను దాన్ని ఒప్పుకోను. దీన్ని స్వీకరించను' అని అంటే ఆ విషయాన్ని కూడా, నేను అన్నీ స్వీకరించలేకపోతున్నాను అన్న విషయాన్ని కూడా స్వీకరించండి.

ఈ క్షణాన్ని స్వీకరించండి. రాబోయే క్షణాలనన్నింటినీ స్వీకరించండి. మీ మనస్సు మీకు రాగల అతి చెడ్డ విషయం ఉన్నది అంటే, దాన్ని కూడా స్వీకరించండి. ఒకవేళ అది నిజంగా జరిగితే మీరు ఎలాగూ దాన్ని ఆపలేరు. అది మీకు తప్పదు. తప్పదు అన్న విషయాన్ని స్వీకరించండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు స్వీకరిస్తారో, ఇక మీకు ఆలోచనలు రావు. మనస్సు నిశ్శబ్దమైపోతుంది. ఆ నిశ్శబ్దాన్ని ఆనందించండి.

2. ఆపండి : వర్తమానంలోకి, ఈ క్షణంలోకి మీ తెలుసుకునే తత్త్వాన్ని తీసుకురావడానికి ఇది బలమైన ధ్యానపద్ధతి.

సమయం : ఎప్పుడైనా, ఎక్కడైనా.

కేవలం ఆపండి, జస్ట్ స్టాప్. దీన్ని జ్ఞానోదయమైన జార్జ్ గుర్జీఫ్ అనే మహాత్ముడు ఎక్కువగా ఉపయోగించేవాడు. మీరు ఏదో చేయాలి అనుకున్నారు. దాన్ని ఆపండి. మీలో మోసపూరితమైన టక్కరితనం ఉంటుంది. అది జీవించటానికి అవసరం అనుకుంటారు. ఆ విధంగాంటూ మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు ఆ టక్కరితనాన్ని మానేసి అమాయకత్వాన్ని, విశ్వాసాన్ని పెంచుకోండి.

ఇందులో రెండవ స్టెప్, మీకు ఏదైనా ఒక అత్యవసరమైన కోరిక లేదా స్పందన లేదా చర్య కలగబోతున్నాయనుకోండి. అది ఆకలి, కోపం, దాహం, తుమ్ము రాబోవటం, ఇలా ఏదైన అకస్మాత్తుగా రాబోయినప్పుడు, ఆపండి. మీరు ఆ పని నుంచి ఆత్మ దగ్గరకి వెళ్ళండి.

3. భావావేశాల జ్ఞాపకాల మీద ధ్యానం : భావావేశాల జ్ఞాపకాల మధ్య నుంచి స్వేచ్ఛ పొందండి.

సమయం : వర్తించదు. మీరు ఏదైనా ఒక భావావేశాత్మకజ్ఞాపకంలో చిక్కుకుపోయారనుకోండి. మీరు దాంతో కూర్చోని, దాని మీద ధ్యానం చేయండి. చేతనస్థితిలో దానిలోకి వెళ్ళండి. అది ఆశ, భయం, ప్రేమ ఏదైనా సరే, దానిలోపలికి పూర్తిగా వెళ్ళండి. నెమ్మదిగా మీ అంతరాత్మ దాని నుంచి విడిపోతుంది. ఆ జ్ఞాపకం నుంచి బయటికి స్వేచ్ఛంగా వస్తుంది. ఇంకా ఆ జ్ఞాపకానికి సంబంధించి ఏదైనా ఉన్నా, మార్పు ఉన్నా, ధ్యానం కొనసాగించండి. మీరు త్వరలోనే ఆ జ్ఞాపకానికి అతీతంగా వెళ్ళి, మీ అంతరంగంలోకి ప్రవేశించగలుగుతారు.

ఎప్పుడైతే మీ అంతరంగాన్ని తిరిగి పొందగలుగుతారో, అప్పుడు మీరు సర్వసృష్టితో, సర్వాంతర్యామితో ప్రేమలో పడతారు. కష్టపడనవసరం లేకుండా, ప్రయత్నం లేకుండా మీ హృదయం కరిగిపోతుంది. దీన్ని కొన్నిసార్లు సాధన చేస్తే, మీకు సత్యం తెలుస్తుంది.

4. మార్పు రానిదాన్ని మార్చండి : మార్పు లేని చేతనస్థితి అంతిమసత్యం అని తెలుసుకోండి.

సమయం : ఎప్పుడైనా, ఎక్కడైనా

జరుగుతున్న మార్పుని అర్థం చేసుకోండి. మార్పుని మార్పుతో ఉపయోగించండి. మీరు మార్పు లేని చేతనస్థితిని చూడగలుగుతారు.

మీరు నిరంతరం మార్పు చెందే శాశ్వతమైన శక్తి. నిరంతరం మార్పు చెందే బయటి ప్రపంచంలోని మార్పుని తీసుకోండి. ఆ మార్పుని మీ అంతరంగంలో కలిగే మార్పు మింగేసేలా, అది లేకుండా చేసే విధంగా చేయండి. కల్లోలం కల్లోలాన్ని మింగనీయండి. కల్లోలాన్ని కల్లోలంతో మూసేయండి. కల్లోలంలో కల్లోలాన్ని నింపండి. ప్రశాంతమైన లోతైన విరామం లాంటిది తెలుసుకునే తత్వంలో కేంద్రీకృతమవ్వండి. ఈ విషయాన్ని అంటే మార్పుని మార్పుతో పొగొట్టాలి అనే విషయాన్ని పెంచుకోండి. నిరంతరం బయటి ప్రపంచంలో జరిగే మార్పుల్ని మీ అంతరంగంలో జరిగే మార్పులు మింగేస్తున్న దృశ్యాన్ని చూడండి.

మీ అంతరంగప్రపంచాన్ని లేదా బయటి ప్రపంచాన్ని నమ్మి మీరు ఏది చేసినా అది కల్లోలాన్ని విశ్వసించటమే. ఉదాహరణకి ఇంటి హాలులో ఒక మూల పెట్టడానికి నాకు అందమైన పూల మొక్క కావాలి అనుకుంటారు. దాని కోసం ప్రయత్నించి ఆ మొక్కని తెచ్చి మీ హాలులో పెట్టి సంతోషపడతారు. కానీ అప్పటికే ఇది కాదు, దీన్ని మరో చోట పెట్టాలి అనుకుంటారు. ఇటువంటి సాధారణమైన అనుభవాలు చాలా ఉంటాయి.

ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుంది. అంతరంగంలో మారుతున్న నిజాలు, బయటి ప్రపంచంలో జరిగే మార్పుల్ని లాక్కొని మింగేస్తున్నట్టు తెలుసుకోండి. అప్పుడు ఏదీ మిమ్మల్ని అంటదు. ఇప్పుడు మీరు ఇది చేయాలా, అది చేయాలా అనుకుంటారు. అంటే రెండు పడవలలో ప్రయాణించటం. ఒక కాలు ఈ పడవ మీద, మరొక కాలు ఆ పడవ మీద పెట్టి బాలెన్స్ చేయటానికి ప్రయత్నిస్తారు. అది ఎప్పటికీ పని చేయదు. నీళ్ళలోకి దూకి ఈదుకుంటూ, ప్రవాహంతో పాటు తేలుతూ వెళ్ళిపోండి.

ఎప్పుడైతే అంతరంగంలో, బయటి ప్రపంచంలో నిరంతరం మార్పు జరుగుతుందని తెలుసుకొని, అంతరంగంలో మార్పు బయటి మార్పుని మారుస్తుంది - అని అర్థం చేసుకుంటారో దాన్ని మీ హృదయంలో తల్లిలా జాగ్రత్తగా పెంచిపోషించండి. అప్పుడు మీకు ఎప్పటికీ రాని చేతనస్థితి అంతిమసత్యం అని తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని మీలో పెంచుకుంటారో, మీలో గొప్ప శక్తి వస్తుంది. మీ జీవితానికి నిజాయితీ, గాఢత అనేవి కలపబడతాయి. ఎప్పుడైతే నిజాయితీ, గాఢత మీ జీవితంలో ప్రవేశిస్తాయో, మీరు జీవన్ముక్తులు అవుతారు.

జీవన్ముక్తి అంటే మీ సహజస్థితిలో స్వచ్ఛంగా జీవించటం. స్వచ్ఛమైన, సహజమైన అనుభవాల్ని, జ్ఞానాన్ని, పనుల్ని పెంచి పోషించటం.

5. జీవచైతన్యాన్ని మీ లోపలా, మీ బయటా తెలుసుకోండి : విస్తృతమైన చేతనస్థితిని అనుభవించండి.

సమయం : 21 నిమిషాలు.

కళ్ళు మూసుకోండి, స్థిరపడటానికి కొంత సమయం తీసుకోండి. ఓపికతో ఉండండి. మీరు తెలుసుకునే తత్త్వాన్ని చేతనస్థితిలో సాధన చేస్తారు. ముందుగా మీరు కూర్చున్న కుర్చీతో ప్రారంభించండి. ఎందుకంటే అది మీకు అతిసమీపంలో ఉంది. మీరు కుర్చీలో ఉన్నట్టు చూడండి. మీరు మీ శరీరంలో ఉండటాన్ని ఏ విధంగా అనుకుంటున్నారో అదే విధంగా మీరు కుర్చీలో జీవించి ఉన్నట్లు అనుకోండి. మీరు శరీరంలో ఎంతగా జీవించి ఉన్నాను అనుకుంటున్నారో, కుర్చీలో కూడా అదే విధంగా జీవించి ఉన్నాను అనుకోండి. మీ శరీరంలో జీవం ఎలా ప్రకాశిస్తుందో కుర్చీలో కూడా అదే విధంగా జీవం వెదజల్లబడుతుంది.

మీ చుట్టూ ఉన్నవారిలో మీరు జీవించి ఉన్నట్లు అనుకోండి. కొంత సమయం తీసుకొని అందరిలో మీరు జీవించి ఉన్నట్టుగా చూడండి. మీరు అన్నింటిలో ఉన్నట్టు గోడలో, ఫర్నిచర్ లో, మనుషుల్లో, పూలలో, గదిలో, నేలలో, అన్నింటిలో ఉన్నట్టు ఊహిస్తూ అలా అనుకోండి.

6. బోలుగా ఉన్న వెదురు బొంగు : ఇది చక్కని శూన్యంగా అయ్యే ధ్యానపద్ధతి. మీ లోపల ఉన్నదాన్నంతా ఖాళీ చేయండి. సర్వాంతర్యామి, విశ్వశక్తి తాలూకు శక్తి తీసుకోవటానికి సిద్ధంగా ఉండండి. మీరు దివ్యాత్మగా మారండి.

సమయం : 21 నిమిషాలు.

నిశ్శబ్దంగా ఉన్న చోట కదలకుండా ప్రశాంతంగా కూర్చోండి. మీ శరీరాన్ని తెలుసుకోండి. మీ శరీరంతో సౌకర్యంగా, హాయిగా ఉండండి. ఇప్పుడు మీ శరీరం వెదురులా అయిందనుకోండి. అది ఖాళీ వెదురు బొంగులా ఉన్నట్టు అనుకోండి. మీ శరీరం, అందులో భాగాలు, ఎముకలు, కండరాలు, అన్నీ వెదురులో భాగాలు అనుకోండి. అందులో ఆ వెదురులో ఏమీ లేదు. ఖాళీ నిశ్శబ్దం తప్ప. మనస్సుని స్తబ్ధంగా ఉంచండి. ఎటువంటి అనుభవం కోసం చూడవద్దు. అలాగే ఉండండి.

అకస్మాత్తుగా శక్తి మీలోకి ప్రవహించటం తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉండి, ఆటంకపరచకుండా ఉంటారో, మీలోకి విశ్వశక్తి ప్రవహిస్తుంది. మీరు దివ్యమురళిగా మారి అమరగీతాలు ఆలపిస్తారు. మీరు గురువులతో ఉంటే, మీరు ఖాళీ వెదురుగా మారగలిగితే ఆయన మీతో అమరగీతాలు ఆలపిస్తారు. ముందు మీరు ఖాళీ వెదురు. తరువాత వెదురు బొంగు మాయం అవుతుంది...... మీరు దివ్యాత్మలవుతారు. ఇక మీలో 'మీరు ' ఉండరు.

7. అద్దం గుండా మీ లోపలికి చూడటం : నిరంతరం శక్తిమంతులుగా, చేతనత్వంతో ఉంటారు.

సమయం : 10 నిమిషాలు.

నిలువుటద్దం ముందు నిలబడి మీ వైపు చూడండి. బయట నుంచి ఒకసారి చక్కగా చూడండి. మీరు అనేది ప్రధానం. అద్దంలో కనపడే మీ ప్రతిబింబం మీరు చూస్తున్న లక్ష్యం. మీ నుంచి శక్తి దానికి వెళుతున్నట్టు అనుకుంటారు. మీరు చూస్తున్నారు. ప్రతిబింబం చూడబడే లక్ష్యం.

ఇప్పుడు మీ పాత్రల్ని అటూ ఇటూ చేయండి. మీ ప్రతిబింబం మిమ్మల్ని చూస్తున్నట్టు అనుకోండి. ముందు భయం అనిపిస్తుంది. ప్రతిబింబాన్ని అలా అనుకోలేరు కదా! ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టు ప్రతిబింబం చూడటం అంటే కొత్తగా ఉంటుంది.

మీకు కొత్తగా భయంగా, అనిపించినా, అలాగే ఉండండి. కొంచెం సేపటిలో మీలో గొప్ప మార్పు వస్తుంది. మీ ప్రతిబింబం నుంచి మీ వైపు శక్తి రావటం గమనిస్తారు. ఇప్పుడు మీరు ఆ వృత్తాన్ని పూర్తిచేసారు. అలా చేయటం వలన శక్తి వృధా కాదు. అది మీలోకి ప్రవేశిస్తుంది. మీలోని శక్తిని మీ కోసం ఆదా చేస్తున్నారు.

ఈ పద్ధతిని కొన్ని రోజులు సాధన చేయండి. మీలో కచ్చితమైన మార్పు వస్తుంది. మీరు చాలా శక్తితో ఉంటారు. మీలో కేంద్రీకృతమైన ప్రశాంతతతో ఉంటారు. ఈ పద్ధతిని మీరు రోజంతా సాధన చేయవచ్చు. అద్దంలోని ప్రతిబింబంతోనే కాకుండా, ఎవరి మీద అయినా, దేని మీద అయినా మీ ఏకాగ్రత నిలిపి చేయవచ్చు. మీ శక్తి ఎదుటివారికి వెళ్ళినప్పుడు, అది తిరిగి మీకు వస్తుంది అని ఊహించండి. శక్తి తిరిగి మీలోకి రావటాన్ని తెలుసుకోగలరు. అది మిమ్మల్ని నూతనోత్సాహంలో ఉంచుతుంది. ఈ పద్ధతిని మీరు రోజంతా పని చేస్తున్న కంఫ్యూటర్తో కూడా చేయవచ్చు.

8. శరీరభాగాలని రిలాక్స్ చేయటం : వెంటనే విశ్రాంతి, విరామం కావాలంటే ఇది మంచి పద్ధతి.

వ్యక్తి కూర్చుని బిగబట్టిన భంగిమ

సమయం : 2 నిమిషాలు, మీకు టైం ఉంటే ఇంకొంచెం సేపు చేయవచ్చు.

మీకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే పడుకుని ఈ ధ్యానం చేయండి. లేకపోతే వీలైనంత సౌకర్యంగా ఉండండి.

కళ్ళు మూసుకొని లోతుగా శ్వాస తీసుకోండి. మీరు శ్వాసని పట్టి ఉంచాలి. అందుకే ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా శ్వాస తీసుకోండి. మీ లోపల శ్వాసని ఉంచి ఒకదాని తరువాత ఒకటిగా మీ శరీరభాగాల్ని బిగబట్టండి. పాదాల దగ్గర నుంచి ప్రారంభించి పైకి వెళ్ళండి. కాళ్ళు, మోకాళ్ళు, వీపు కింద - ఇలా బిగదీస్తూ వెళ్ళండి, పైకి వెళ్ళేటప్పుడు కింది భాగాలని వదులుచేయవద్దు.

ఇప్పుడు మీ నడుము దగ్గరికి, తరువాత కడుపు గట్టిగా బిగబట్టండి. తరువాత ఛాతీ, వీపు మొత్తం బిగబట్టండి. తరువాత చేతివేళ్ళు, చేతులు, భుజాలు, మెడ బిగించండి. ముఖ్యంగా మెడ కండరాల్ని పట్టి ఉంచండి.

వ్యక్తి శవాసనంలో పడుకున్న భంగిమ

తరువాత ముఖం దగ్గరికి వెళ్ళండి. ముక్కు, కళ్ళు, నుదురు బుగ్గలు బిగించండి. పళ్ళు బిగించండి. ముఖం గట్టిగా బిగించండి. శరీరంలో మిగిలిన భాగం అలా బిగించే ఉండాలి. అలా ఎంత సేపు ఉండగలరో అంత సేపు ఉండండి. ఇక శ్వాసని పట్టి ఉంచలేను అనుకున్నప్పుడు దాన్ని గట్టిగా వదలటం ద్వారా శరీరాన్ని రిలాక్స్ చేయండి.

భౌతికంగా, మానసికంగా అదే విరామంలో ఉండండి. ఈ పద్ధతితో మీ శరీరం, మనస్సు రెండు నిమిషాలలో రిలాక్స్ అయ్యి, తాజాగా అవుతాయి. మీకు టైం దొరికితే దీన్నే తిరిగి మూడుసార్లు చేయండి.

9. నేను : మీ లోపలికి మీరు వెళ్ళండి-నిజమైన మిమ్మల్ని క్షణకాలం దర్శించండి.

సమయం : ఎప్పుడైనా, ఎక్కడైనా. ఈ పద్ధతిలో ప్రతిక్షణం మీ మీద మీకు ఏకాగ్రత ఉంటుంది. మీరు చేయవలసినది మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోవటం. మీరు తినేటప్పుడు, నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, 'నేను' అని అనుకోగలగాలి. 'నేను' ని తెలుసుకుంటూ ఉండాలి. మీ లోపల జీవించి ఉన్న శాశ్వతమైన చైతన్యాన్ని కనుగొనండి. మీ వినోదకార్యక్రమాలు ఏమిటి? మిమ్మల్ని మీరు మరచిపోవద్దు. మిమ్మల్ని మీరు మరచిపోవటానికి ప్రయత్నిస్తే జీవితంలో మరిన్ని సమస్యలు వస్తాయి.

మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో, మీ గురించి మీకు ఏం చెప్పారో, వాటినన్నింటినీ వదిలేసి, కేవలం నేనుని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు గుర్తుచేసుకోవటం ఆలోచించటం కాదు. మీరు 'నేను' అని ఆలోచిస్తే పాయింట్ మిస్సయినట్టే. అందుకే చివరికి నేను, నేను అంటూ ముగిస్తాం. మాటలు అనుభవం కాదు. మాటలు అనకండి. నేనుని 'ఫీల్' అవ్వండి. నేనుని అనుభూతితో తెలుసుకోండి. మీ శరీరం గురించి మనస్సు గురించి, మీ స్టేటస్ గురించి ఏమీ ఆలోచించవద్దు.

మీరు నడుస్తున్నప్పుడు ఒక్కసారి ఆగి, మీరు ఉన్నారు అని తెలుసుకోండి. మీరు దేన్నైనా పట్టుకున్నా, ఆ స్పర్శని తెలుసుకోండి. ఎవరైనా మిమ్మల్ని తాకితే ఆ స్పర్శని తెలుసుకోండి. ఆ స్పర్శ మిమ్మల్ని తాకింది అని తెలుసుకోండి. మీ చేతనస్థితి పదునుగా అవుతుంది.

ఈ తెలుసుకునే తత్త్వాన్ని మీరు ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకువెళ్ళండి. సూర్యరశ్మి మీకు తగిలినప్పుడు, మీ జుట్టులోకి గాలి వెళ్లినప్పుడు ఆ అనుభవం పొందేది ఎవరో తెలుసుకోండి. అది నేను అనుకోండి. ఒక్క క్షణం మీరు మీ లోపలికి, మీ అంతరంగంలోకి నెట్టబడతారు. మీరు ఒక్క క్షణం లోతైన నిశ్శబ్దాల్ని, సత్యాన్ని చూడగలుగుతారు.

10. కేవలం కూర్చోండి : ఆలోచనలు లేని స్థితి తాలూకు క్షణదర్శనం.

సమయం : 21 నిమిషాలు.

ఈ ధ్యానాన్ని జెన్ నుంచి తీసుకున్నారు. జాజెన్ అంటే కేవలం కూర్చోవటం. అన్నింటి కంటే కష్టమైనది ఏమీ చేయకుండా కూర్చోవటం. మీ మనస్సు చాలా వాదాలతో మీ ముందుకి వస్తుంది. ఈ ధ్యానం చేయకుండా ఉండగల చాలా కారణాలతో మీ ముందుకి వస్తుంది. అది మీతో ఇదంతా టైం వేస్ట్ అని చెబుతుంది. మీరు పట్టించుకోకపోతే, మనస్సు నిద్ర పోతుంది. పగటి కలల్లో, ఊహల్లో ఉంటుంది.

ధ్యానం ఉద్దేశం మనస్సుని తనకి ఇష్టం వచ్చిన ట్రిక్కులతో ఆడుకోనీయకపోవటమే. ఏదో ఒక రోజు మనస్సుకి మీ మీద అదే ఆటల పట్ల చికాకు వస్తుంది. అది మిమ్మల్ని తన ఆటలతో ప్రభావితం చేయలేనని తెలుసుకుంటుంది. తరువాత అది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ ధ్యానం చేయటానికి మీకు ప్రశాంతంగా ఉన్న చోట కూర్చోండి. మీ నిశ్చలత్వం, నిశ్శబ్దం, భంగం కలగకుండా ఉండే చోటు ఎంచుకోండి. మీరు కదలకుండా ఉండగలిగే పద్ధతిలో సౌకర్యంగా కూర్చోండి. మీరు కదలకుండా కనీసం అరగంటైనా కూర్చోగలగాలి. చాప గాని, కుషన్ గాని ఉపయోగించవచ్చు. ఎప్పుడైతే శరీరం కదలదో అప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది.

నిటారుగా కూర్చోండి. అవసరమైతే దేన్నైనా ఆనుకోండి. వీలైనంత వరకూ ఆనుకోకుండా ఉండే విధంగా కూర్చోండి. అరచేతులు ఒక దానిలో ఒకటి ఉంచి రెండు బొటన వేళ్ళూ కలపండి. అది ఒక వృత్తంలా ఉంటుంది.

ప్రకృతిని చూడటం మంచిది. మీ గదిలోంచి ఆకాశాన్నైనా చూడవచ్చు లేదా తెల్లని గోడ వైపు చూడండి. లేదా గదిలో ఒక మూలనైనా చూడండి.

మీ ఏకాగ్రత ఎక్కడా నిలపవద్దు. కళ్ళు సగం మూయండి. దేని పైనా చూపును ఏకాగ్రతతో నిలపవద్దు. మీ దృష్టి సున్నితంగా ఏదైనా దూరం దాని మీద ఉండాలి. అది మీకు విరామాన్ని ఇస్తుంది. మీ శ్వాస విరామంగా సహజంగా ఉంచండి. తెలుసుకునే తత్వంతో పరాకు లేకుండా ఉండండి. దేని మీదా ఏకాగ్రత నిలపకుండా స్వీకరించే స్థితిలో ఉండండి. ప్రతిక్షణం ఆ క్షణంలోనే ఉండండి.

ప్రారంభంలో ఏమీ చేయకుండా అలా కూర్చోవటం కష్టంగా ఉంటుంది. కొన్ని రోజులు గడిచాక ఇది మీకు చాలా బాగుంటుంది. పొరలు పొరలుగా మీ మనస్సు పడిపోవటం తెలుస్తుంది. చివరికి ఒక రోజు మనస్సు పూర్తిగా పోతుంది. మీరు ఆలోచనలు లేని స్థితి అనుభవం పొందుతారు.

11. తెలుసుకునే తత్వంతో తినటం, తాగటం : మీ తెలుసుకునే తత్వం విస్తృతం అవుతుంది.

సమయం : తినేటప్పుడు, తాగేటప్పుడు.

సాధారణంగా దేన్నైనా మనం నమిలి తినం, మనం దాన్ని నోట్లోకి తోసేస్తాం. ఆహారాన్ని, దాని రుచిని ఆనందించం.

ఇప్పుడు మీరు ఏది తిన్నా, ఎక్కడ తిన్నా తెలుసుకుంటూ పూర్తి తెలుసుకునే తత్వంతో తినండి. దాని రుచిని పూర్తిగా తెలుసుకోండి. ఆహారంలో రుచిని మీరు తెలుసుకున్నప్పుడు, అది కేవలం నాలుక మీదే కాదు, మీ శరీరవ్యవస్థ మొత్తంలో తెలుస్తుంది. మంచి నీళ్ళు తాగేటప్పుడు, నీళ్ళ చల్లదనం మీ గొంతు లోంచి కడుపులోనికి వెళ్ళటాన్ని గమనించండి. కళ్ళు మూసుకొని నెమ్మదిగా ప్రతి గుటకా ఎంజాయ్ చేస్తూ తాగండి. ఆ చల్లదనాన్ని పూర్తిగా అనుభవించండి. మీ నాలుక మీదే కాదు, మీ శరీరం మొత్తానికీ ఆ చల్లదనం తెలియాలి.

13. 'సరే, జెను' అని చెప్పండి : సున్నితంగా కరిగిపోయి అత్యున్నతవిశ్వమేధకి ఆధీనమవటం.

సమయం : ఎప్పుడైనా, ఎక్కడైనా.

మీరు గమనిస్తే ప్రతి దానికీ 'కాదు, లేదు' అని చెబుతారు. అలా చెబితే మీ అహంకారం మరింత గట్టిపడుతుంది. కాదు అని చెబితే మీరు ప్రత్యేకమైన వ్యక్తి అని అనుకుంటారు. సరే అని చెబితే మీ అహంకారం తక్కువైనట్టు అవుతుంది. ఎవరికో తల వంచినట్టు అవుతుంది.

ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా చేయండి. తరువాత 24 గంటలు ప్రతి దానికీ సరే అని చెప్పండి. కాదు అనేది పైకి వస్తుంది. ఏ స్థితిలోనైనా కాదు అని చెప్పడానికి మీ మనస్సు ముందుకి వస్తుంది. అది పైకి వచ్చి పడిపోతుంది. చేతనస్థితిలో సరే అని చెప్పండి.

మీకు మీరు సున్నితంగా కరిగిపోతున్నట్టు తెలుసుకుంటారు. మీతో మీరు కొత్త రకమైన సౌకర్యాన్ని అనుభవిస్తారు. ఎదుటివాళ్ళు మీలోని సున్నితత్వాన్ని, విప్పారి ఉన్న మీ తత్వాన్ని తెలుసుకుంటారు.

14. మీ శరీరాన్ని, మనస్సుని గమనించండి. - రిలాక్స్ : మీ టెన్షన్ నుంచి బయటికి రండి. మీరు చేస్తున్న ప్రతి పనీనీ ప్రేమించండి.

సమయం : ఎప్పుడైనా, ఎక్కడైనా

మీరు ప్రతి రోజూ చేసే అన్ని పనులనీ పూర్తిగా తెలుసుకునే తత్వంతో చేయండి. మీరు ఏ పని చేస్తున్నా, చేతనస్థితిలో విరామంగా ఉండి ఆ పని చేయండి. మీకు ఉన్న టెన్షన్ నుంచి చేతనస్థితిలో బయటికి రండి. మిమ్మల్ని మీరుగా స్వీకరించండి. ప్రతిక్షణాన్ని జీవితం మీకు ఇచ్చే బహుమతిగా స్వాగతిస్తూ దాన్ని స్వీకరించండి. మీరు ఏ పని చేసినా ప్రేమతో, సంతోషంతో చేయండి. మీరు చేసే దాన్ని సంపూర్ణంగా, స్వచ్ఛంగా చేయండి. అప్పుడు మీరు, మీరు చేస్తున్న పని మారిపోతాయి.

15. మీరు అక్కడ ఉన్నారా? : వర్తమానంలోకి దూకండి.

సమయం : నిద్ర పోయేటప్పుడు లేదా ఎప్పుడైనా, ఎక్కడైనా

మిమ్మల్ని మీరు అడగండి. 'నీవు అక్కడ ఉన్నావా?' అని. ఈ ప్రశ్నని చేతనస్థితిలో అడిగితే ఆలోచనలు ఆగిపోతాయి. ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వండి 'అవును' అని. అది మీ తెలుసుకునే తత్వాన్ని సూటిగా వర్తమానంలోకి తీసుకువస్తుంది. మీరు నిద్ర పోవడానికి ముందు దీన్ని ప్రయత్నించండి. లేకపోతే ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రయత్నించవచ్చు.

16. మాటలకి అతీతంగా : మాటలు వివరించడానికి అతీతంగా అనుభవం పొందటాన్ని నేర్చుకోండి. అప్పుడు మీరు సృష్టి అందాలని అనుభవంతో తెలుసుకుంటారు. అప్పుడు జీవితం నిత్యానందం.

సమయం : ఎప్పుడైనా ఎక్కడైనా.

దేన్నైనా ఎటువంటి మాటల్నీ తీసుకురాకుండా చూడాలి. మీరు ఒక పువ్వుని చూస్తే, కేవలం చూడండి. పైకి కాని, లోపల కాని ఏమీ మాట్లాడవద్దు. 'అహా! చాలా బాగుంది. అందమైన గులాబి' ఇలా ఏమీ అనవద్దు. పూర్తి తెలుసుకునే తత్వంతో దాని వైపు చూడండి. అదే నిజంగా గులాబీ వైపు చూడండి. అప్పుడే మీరు గులాబీతో అనుబంధాన్ని ఏర్పరచుకోగలరు. అప్పుడే గులాబీ తానేమిటో మీకు వెల్లడి చేసుకోగలదు.

రాత్రి పూట ఆకాశంలో చంద్రుడిని చూడండి. అందులో నిమగ్నమవ్వండి. కేవలం చూడండి. అది ఎంత అందంగా ఉందో అని కాని, అది చంద్రుడు అని నాకు తెలుసు అని కాని ఆలోచించవద్దు. అటువంటివి అనవద్దు.

కొన్ని సార్లు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. అద్దంలో మీ వైపు లోతుగా గాఢతతో చూడండి. కేవలం చూడండి. గమనించండి. సర్వాంతర్యామి సృష్టి అయిన మీరు ఆ సర్వాంతర్యామి ఎంత అందమైన వారో కదా! మీరు మాటలు ఉపయోగిస్తే ఈ మొత్తాన్ని ప్రాపంచికస్థితికి కిందికి తేవటమే అవుతుంది.

17. విమర్శించటం : సరైన విధంగా విమర్శించండి

సమయం : ఎప్పుడైనా, ఎక్కడైనా.

మీరు ఎప్పుడైనా, ఎవరినైనా విమర్శించాలి అనుకుంటే, ఈ పద్ధతిని ప్రయత్నించండి. ఆ వ్యక్తిని విమర్శించే ముందు, అనుకూలంగా మరేదైనా అనవచ్చేమో కనుక్కోండి. మీకు అలా అనుకూలమైనవి దొరకనప్పుడు, ఎదురు చూడండి. ఉపయోగం లేని, నిర్మాణాత్మకం కాని విమర్శ వల్ల ప్రయోజనం లేదు. అనుకూలమైన మాటలు దొరికాక, సమస్యకి పరిష్కారాన్ని ఇస్తూ మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి. అప్పుడే మీ విమర్శ నిర్మాణాత్మకంగా ఉండి, ఉపయోగపడుతుంది.

18. బయటా - లోపలా తిరగటం : తిరగటాన్ని గమనించండి, నిజమైన మీలో విరామంతో స్థిరపడండి.

సమయం : 21 నిమిషాలు.

కళ్ళు మూసుకొని విరామంగా కూర్చోండి. మనస్సుని నియంత్రించవద్దు. మీ మనస్సు (ఆలోచనలు) మీ లోపల ఉండకుండా వేరే విషయాల మీద ఉంటే దాన్ని బయట తిరగటం అంటాను. ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ ఉంటారు. మీ మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గుర్తుంచుకుంటారో మీ పేరు, మీ గురించి, మీ స్టేటస్ ఇలా అనుకుంటే అది లోపల తిరగటం.

బయట తిరగటం, లోపల తిరగటం - ఈ రెంటింటినీ గమనించండి. మీ గురించి ఏదైనా ఒక భావన వస్తే అది లోపల తిరగటం. ఈ తిరగటాన్ని గమనించండి. వాటి నుంచి రిలాక్స్ అవ్వండి. మీరు ఆలోచనలతో డిస్టర్బ్ అయితే వెనక్కి వచ్చేయండి. మళ్ళీ బయట తిరగటం, లోపల తిరగటం అనే వాటిని గుర్తు చేసుకోండి. రిలాక్స్ అవ్వండి. బయట తిరిగేదాన్ని, లోపల తిరిగేదాన్ని విరామంతో తెలుసుకోండి.

మీరు కానిదాని దగ్గరకి తెలుసుకునే తత్వాన్ని తీసుకువస్తుంటే మీ నిజమైన మీరు ఏమిటో మీకు తెలుస్తుంది. అదే విశ్వం.

19. అన్నింటినీ బయట ఉంచండి: మీ జ్ఞానాన్ని ఒక పక్కన పెట్టండి - అంతిమస్వేచ్ఛని

అనుభవించండి.

సమయం : 10 నిమిషాలు.

మీరు చదివినవి, విన్నవి, చూసినవి - వీటినన్నింటినీ మీ అంతరంగం నుంచి బయటికి తీసేయండి. అన్నింటినీ బయటికి తీసేసి చూడండి. అప్పుడు మీ అంత రంగానికి ఏమౌతుందో తెలుసుకోండి. ఏదైనా ఒక ఆలోచన వస్తే అది మీ అంతరంగానికి సంబంధించింది కాదు అనుకోండి. ఆలోచన ఎవరో ఒక వ్యక్తి వల్ల కాని లేదా అంతకు ముందు మీ అంతరంగంలో ఉన్న ఒక ఆలోచన వల్ల కాని వచ్చి ఉంటుంది. బోధనలు, భావనలు, విషయాలు ఇలా మీరు ఏం విన్నారో వాటినన్నింటినీ బయట పెట్టేసేయండి. మీ అంతరంగాన్ని ఖాళీగా ఉంచండి. ఈ పద్ధతిని కొన్ని నిమిషాలు సాధన చేశాక, ఈ పద్ధతిని ఎలా చేయాలనే క్లూని, నైపుణ్యాన్ని పట్టుకోగలుగుతారు.

ప్రతి రోజూ కనీసం ఒక 10 నిమిషాల పాటు మీ అంతరంగంలోని అన్నింటినీ బయట పెట్టేసేయండి. అప్పుడు మీలో అద్భుతమైన ప్రశాంతత, లోతైన నిశ్శబ్దాన్ని అనుభవించగలుగుతారు.

మీ అంతరంగంలోని అన్ని విషయాల్ని, బోధనల్ని, మాటల్ని, ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాల్ని అన్నింటినీ బయట పెట్టాలి అనే స్పష్టమైన ఉద్దేశంతో సాధన చేయండి. మాటల్ని, బోధనల్ని, విషయాల్ని, సత్యాలని-దేన్నీ మీ అంతరంగంలో ఉంచవద్దు. మీరు అంతిమస్వేచ్ఛలో ఉండండి. మీరు ఒత్తిడి నుంచి, ఇంత వరకూ విన్న విషయాల నుంచి స్వేచ్ఛని పొందండి. నిశ్శబ్దాన్ని కనుక్కోండి. ఖాళీ అనేది మీ సహజలక్షణం. మీరు దాన్ని పోగొట్టుకున్నారు.

20. శత్రువులతో వ్యవహరించటం : శత్రువుల చేత ఆటంకపరచబడకుండా నిశ్చలంగా ఉండండి.

సమయం : 24 గంటలు.

మీ శత్రువుల రూపాన్ని మీ మనస్సులోకి తెచ్చుకోండి. వాళ్ళ రూపం మనస్సులోకి రాగానే ద్వేషం కలుగుతుంది. చాలా మాటలు ఏవైతే వారికి చెప్పాలనుకున్నారో, అవి చెప్పటానికి అవకాశం లేదు, లేదా ధైర్యం లేదు, ఆ మాటలన్నీ బయటికి వస్తాయి. ఒక వేళ అవకాశం దొరికినా, చాలా మాటలు చెప్పవలసివచ్చి కొన్ని మీరు కోపంలో మరిచిపోయి ఉంటారు.

మీ శత్రువుల రూపాన్ని మీ ముందుకు తీసుకురండి. ఆ మాటలు, భావాలు మీలోకి రాగానే లోతుగా శ్వాస తీసుకొని, స్థిరపడండి. తరువాత రిలాక్స్ అవ్వండి. ఆ రూపాలని మీ అంతరంగంలో ఉంచండి, మీ మనస్సు ఎలా అరవాలి అని ఉంటే అలా అరవనీయండి. కొంత సేపయ్యాక మీరు అరవాలి అని అనుకున్న మాటల సంఖ్య తగ్గుతుంది. మీరు మీ సమస్యలోకి స్పష్టతతో చూడటం ప్రారంభిస్తారు. మీరు ద్వేషించే వ్యక్తి రూపాన్ని, మీ అంతరంగంలో నిశ్శబ్దంగా ఉంచితే ఆ వ్యక్తి పట్ల మీకున్న ద్వేషం, శత్రుత్వం, పగ, హింస, అన్నీ తగ్గిపోతాయి.

అకస్మాత్తుగా మీలో హింస తగ్గిపోవటం చూస్తారు. ఆ వ్యక్తిని నిజంగా చూసినా మీకు భయం అనిపించదు. కోపంతో మండిపోరు. మీరు రిలాక్స్ అవుతారు. విషయాలతో ప్రశాంతంగా వ్యవహరించగలుగుతారు. ఒక వ్యక్తి పట్ల తీవ్రమైన శత్రుత్వం, ద్వేషం ఉన్నప్పుడు దాని లోంచి నిశ్శబ్దంగా బయటికి రావటానికి ఇది మంచి పద్ధతి.

మిగిలిన రోజంతా మీరు ఎవరిని చూసినా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ లోపల ఆలోచనల సంఖ్య అదే విధంగా ఉండేలా చూడండి. రిలాక్స్ అవ్వండి. కోపం తెచ్చుకోవద్దు. మీ లోపల కేంద్రీకృతమవ్వండి. మీ లోపల చాలా కొత్త కోణాలు ఆవిష్కృతం కావటం చూస్తారు. మీ లోపల లోతైన నిశ్శబ్దాన్ని రోజంతా అనుభవిస్తారు. ధ్యానంలో మీరు పొందిన నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు.

బంధాలకి, స్వేచ్ఛకి అతీతంగా

ఒక సూర్యుడు నీళ్ళలో చాలా సూర్యులుగా కనిపించినట్టే ఒక నిజమైన మూలాధారాన్ని చూడండి. అన్ని రకాల బంధాల నుంచీ స్వేచ్ఛని పొందండి.

సమయం : 11 నిమిషాలు.

సూర్యునికి ఎదురుగా పది కుండలు నీటితో పెడితే పది కుండలలో సూర్యుని ప్రతిబింబాలు కనిపిస్తాయి. మీరు ఆ పది కుండల్ని ఒక దాని తరువాత ఒకటిగా పగలకొడితే సూర్యుల సంఖ్య తగ్గుతుంది. చివరి కుండ కూడా పగలకొట్టేశాక, సూర్యుని ప్రతిబింబాలు ఉండవు. కేవలం సూర్యుడు మాత్రమే ఉంటాడు. సూర్యుడు ఒక్కడే కానీ ప్రతిబింబాలు చాలా ఉంటాయి. అదే విధంగా అత్యుత్తమ చేతనస్థితి ఒక్కటే మూలం. మనందరిలో ఉండేది ఆ చేతనస్థితి ప్రతిబింబమే. కాబట్టి నీళ్ళలో చాలా సూర్యులు కనపడతారు. దాని మూలం వైపు చూస్తే సూర్యుడు ఒక్కడే. ఇవన్నీ కేవలం ఒక సూర్యుడి బింబాలే. ఒక ప్రతిబింబాన్ని మీరు పరిశోధించి, వెనక్కి తిరిగి అది ఎక్కడ నుంచి వస్తుందో చూస్తే మీ అసలు మూలాధారం కనిపిస్తుంది.

మీరు అందరూ ప్రతిబింబాలే. మీ శరీరం - మనస్సు అద్దం లాంటివి. సర్వాంతర్యామి అత్యుత్తమ చేతనస్థితి. ఆ అత్యుత్తమ చేతనస్థితి సరిగ్గా మీ లోపల, మీ శరీరం - మనస్సు లోపల ఎక్కడ తగులుతుందో అదే మీ చేతనస్థితి. ఇక్కడ చాలా చేతనస్థితులు ఉండవచ్చు. కానీ అన్నింటికీ మూలం ఏదీ అని చూస్తే, మీరు అత్యుత్తమ చేతనస్థితికి చేరతారు.

ఈ విశ్వం అంతా చాలా శరీరం - మనస్సుల పైన ఉన్న ప్రతిబింబాలే. వాటికన్నింటికీ మూలం ఒక్కటే. ఎప్పుడైతే ఈ విశ్వం అంతా శరీరం - మనస్సుల ప్రతిబింబాలే అని మీకు అర్థమవుతుందో, మీరు ఏదైనా చేయాలన్న మీ ఉద్దేశం మాయం అవుతుంది. ఎప్పుడైతే అన్ని ప్రతిబింబాలకీ మూలం ఒకటే అని తెలుసుకుంటారో, మీరు ప్రశాంతంగా, విరామంగా ఉండగలరు.

22. మీరు గ్రహించగలదానికి అతీతంగా ఆలోచించండి : ఆలోచనలు లేని పరమానందాన్ని అనుభవించండి.

సమయం : 10 నిమిషాలు.

మీరు దేన్నైనా అనుకుని, ఆ క్షణంలో దాని గురించి ఆలోచిస్తే అదే గతం అయిపోతుంది.

ఉదాహరణకి ప్రారంభంలో మీ ఆలోచనలకి అతీతమైనదాని గురించి ఆలోచించమంటే మీరు సౌరకుటుంబం గురించి ఆలోచిస్తారు. ఎప్పుడైతే సౌరకుటుంబం గురించి ఆలోచించగానే అది మీలో ఒక ఆలోచన అయ్యింది. కాబట్టి ఇప్పుడు దాన్ని వదిలేయండి. తరువాత దానికి అతీతంగా ఆలోచించండి. మీరు నిరంతరం ఆ విధంగా ఉన్నదాన్ని వదిలి, దానికి అతీతంగా ఆలోచించండి. మీరు నిరంతరం ఆ విధంగా ఉన్నదానికి అతీతంగా వెళుతుంటే, మీ మనస్సుని విస్తృతం చేస్తూ వెళితే, మీరు వర్తమానంలో ఉంటారు. ఈ క్షణంలో ఉంటారు.

అర్థం చేసుకోండి; మీరు దేన్నైనా గ్రహించి, దాని గురించి ఆలోచిస్తే, అది గతం అయిపోతుంది. అది మీ గతం తాలూకు ఆస్తి అవుతుంది. అక్కడ మీ మనస్సు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దానికి అతీతంగా, ఇంకా ముందుకి ఇంకా వెళ్ళండి. నేను ఇంకా ఏమీ ఆలోచించలేకపోతున్నాను అనుకుంటే దాన్ని కూడా వదిలేయండి. మనస్సు నిరంతరం అన్నింటినీ గ్రహించి మీ లోపల నిలువ చేస్తుంది. దాన్ని నెమ్మదిగా తిని ఆవులా నెమరువేస్తుంది. కాబట్టి వాటిని తిరిగి తీసుకురావద్దు. నిరంతరం వాటిని వదిలేస్తూ ఉండండి. ఏదైతే అంతిమ ఆలోచన అనుకుంటారో దాన్ని వదిలేయండి. మీ ఆలోచనని ఇంకా పెద్ద విషయానికి విస్తృతపరచండి. తరువాత మీ మనస్సు మరొక దాన్ని గ్రహిస్తుంది. మీ మనస్సును దేన్నీ పట్టుకొని ఉండనీయకండి. దాన్ని వదిలేయండి. అప్పుడు మీ మనస్సు అంటుంది. ‘ఇలా అన్నీ వదిలేస్తే నాకు ఏం జరుగుతుంది. నా ముగింపు ఎక్కడ?’ అని. ఈ ముగింపుల సంగతి పట్టించుకోవద్దు. ఈ ప్రశ్న అడగటం ద్వారా మీ మనస్సు మరి దేన్నో గ్రహించాలి అని చూస్తోంది, మీరు సాధన ప్రారంభించకముందే ఫలితాలని నిరూపించమని అడుగుతుంది. దాన్ని అలా ముందుకు రానీయొద్దు. అక్కడే మీరు మోసపోతారు. మీరు నిరంతరం ప్రతి హద్దునీ వదిలేస్తూ వస్తున్నారు. ప్రతి ఆలోచననీ వదిలి విస్తృతమవుతూ ఇంకా అతీతంగా వెళుతున్నారు.

నిజమైన గురువుల మీద, దేవుడి మీద, నిజమైన విశ్వం మీద ధ్యానం చేయండి. భగవంతుడిని, ఆ సారాంశాన్ని తెలుసుకున్నాను అనుకుంటారు. కాని అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మీ మనస్సు నిజమైన భగవంతుడు అంటే ఏమిటో గ్రహించలేదు. అది గ్రహించింది అంటే మీ మనస్సు భగవంతుడి కంటే గొప్పది అని అర్థం. కాబట్టి మీకు తెలిసింది భగవంతుడు కాదు, కేవలం భగవంతుడు అంటే మీకు ఉండే ఒక ఐడియా, ఒక అభిప్రాయం, ఆ భావాన్ని వదిలేయండి. మళ్ళా ప్రయత్నించండి. అంత కంటే పెద్దదాన్ని గ్రహించండి.

నిరంతరం అంతిమసత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నించండి. ఒక విషయం అర్థం చేసుకోండి. మీ మనస్సు లోంచి ఒక భావనని బయట పారేస్తే దానితో పాటు మీ మానసికవ్యవస్థలోని ఒక భాగాన్ని, ఒక ఎముకని బయట పారేసినట్లే. ప్రతిసారీ మీ మనస్సులోంచి ఒక ఆలోచనని తీసుకొని దాన్ని బయటికి పారేస్తుంటారు. దానితో పాటు మీ మనస్సు తాలూకు ఎముకల వ్యవస్థ నుంచి ఒక భాగాన్ని కూడా పారేస్తారు. అలా పారేసి, పారేసి, చివరికి అసలు ఆ వ్యవస్థ అనేది లేకుండా చేస్తారు. అకస్మాత్తుగా మనస్సు (ఆలోచనల వ్యవస్థ) మొత్తాన్ని బయట పారేసినట్టు తెలుసుకుంటారు. అప్పుడు మీరు ఆలోచనలు లేని స్థితిలో పరమానందస్థితి అయిన నిత్యానందాన్ని అనుభవిస్తారు.

23. మీ జ్ఞానేంద్రియాలని ఉపసంహరించుకోండి : మీ అంతరంగాన్ని అనుభవించండి

సమయం : రోజుకి 5 నిమిషాలు లేదా 1- 2 నిమిషాలు ఐదుసార్లు.

ఈ ధ్యానాన్ని మీరు ఎప్పుడైనా చేయవచ్చు. ప్రారంభంలో ఈ ధ్యానాన్ని మీరు ఒకేసారి ఐదు నిమిషాలు చేయలేరు. దీన్ని రోజులో ఒకటి నుంచి రెండు నిమిషాలు ఐదుసార్లు చేయండి. దీన్ని మీరు ఒకసారి ఉదయం టిఫిన్ చేసే ముందు, మధ్యాహ్నం భోజనానికి ముందు, రాత్రి భోజనానికి ముందు, రెండు భోజనాలకి మధ్య రెండు సార్లు చేయవచ్చు. మీ శరీరాన్ని అంటుకున్నట్టుగా లేని వదులు దుస్తులు వేసుకోండి. మీ కళ్ళు, నోరు గట్టిగా మూసుకోండి. మీ చేతులతో చెవులు మూసుకోండి. మీ కళ్ళ నుంచి, చెవుల నుంచి, నాలుక నుంచి, స్పర్శ నుంచి వచ్చే అన్ని స్పర్శలని ఆపేయండి. అప్పుడు సహజంగా మీ లోపల ఉన్న ఆలోచనలు పైకి రావటం ప్రారంభిస్తాయి. నిన్న ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది, రేపు ఏం పని చేయాలి - ఈ ఆలోచనలన్నీ మీ మనస్సు నుంచి వస్తాయి. వాటిని పట్టించుకోవద్దు. వాటికి మూడు క్షణాల కంటే జీవితం ఉండదు. క్షణం అంటే ఒక ఆలోచనకి, మరొక ఆలోచనకి మధ్య ఉన్న సమయం. నేను మళ్ళా చెబుతున్నాను, ఆలోచనల జీవితం మూడు క్షణాలు.

మీ జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం వెళ్ళకపోతే, ఆ ఆలోచనల క్రమం మూడు క్షణాల కంటే ఎక్కువ సేపు ఉండదు. మీరు అనుకోవచ్చు, నేను కూర్చొని ఎంత కాలమైనా ఊహిస్తూ కొత్తవి చూడగలను అని. అది సాధ్యం కాదు. అలా చేసారు అంటే జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం మీ లోపలికి వెళుతుంది అని అర్థం. మీ జ్ఞానేంద్రియాలనన్నింటినీ ఆపేయాలి. మీ నాలుకని అంగిటికి అదిమి కదపకుండా ఉంచాలి. మూడు క్షణాలలో మూడు - నాలుగు ఆలోచనలు మాత్రమే వస్తాయి. అయిదవది రాదు.

ముఖ్యసూచన: మీ శ్వాస సహజంగా, మామూలుగా ఉండాలి. ఆ విధంగా కొంచెం సేపు ఉంటే అకస్మాత్తుగా ఆలోచనలు లేని ప్రదేశాన్ని చూడగలుగుతారు. ఆలోచనలు లేని స్థితి రెండు - మూడు సెకండ్లు ఉన్నా మీలో చాలా శక్తి వస్తుంది. అది మీకు ఎనిమిది నుంచి పది గంటల నిద్రకి సమానంగా ఉంటుంది.

ఇది చాలా శక్తివంతమైన ధ్యానపద్ధతి. దీన్ని రోజుకి ఐదుసార్లు సాధన చేయండి. ఐదారు రోజులలో ఆ అనుభవాన్ని పట్టుకోగలుగుతారు. అంతరంగంతో బంధాన్ని ఏర్పరచటం అంత కష్టం కాదు. అది మీ అంతరంగం. మనకి సరైన పద్ధతి తెలియక, ఆ ఓపిక లేకపోవటం వలన, ఆ ప్రేరణ లేకపోవటం వలన మన అంతరంగంతో బంధాన్ని ఏర్పరచుకోలేకపోతున్నామంతే. అందుకే సత్యం గురించి జ్ఞానం ఉంటే సగం పని అయిపోయినట్టే. మిగిలిన సగం రిలాక్స్ అవటం, అనుభవాన్ని పొందటమే.

శబ్దం

సర్వసృష్టిలోకి వ్యాపించి ఉండే సంగీతనాదం ఉన్నది. అదే అనాహతధ్వని. ఆ శబ్దాన్ని వినటానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ శబ్దాన్ని వినగలిగితే, మీరు సర్వసృష్టి సంగీతాన్నీ వినగలరు.

1. శబ్దానికి మూలాలని అనుసరించండి : ప్రతిదాని మూలాల్లో ఐక్యమైపోండి

మొత్తం సమయం : 20 నిమిషాలు. కళ్ళు మూసుకుని చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుని వదలండి.

స్టెప్ 1 : సమయం 5 నిమిషాలు.

ఇప్పుడు ఓమ్ అనే శబ్దాన్ని చేయండి. గట్టిగా అవసరం లేదు. అది నాభిప్రాంతం నుంచి రావాలి.

స్టెప్ 2 : సమయం 5 నిమిషాలు.

అదే శబ్దాన్ని చేయండి, కాని దాని మూలం ఎక్కడో కనుక్కోండి. దాని ప్రకంపనలు ఎక్కడ మొదలవుతున్నాయో ఆ మూలాన్ని కనుక్కోండి. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోండి. దాని మూలాల్లోకి వెళ్ళండి.

స్టెప్ 3 : సమయం 5 నిమిషాలు.

ఆ శబ్దంలోకి ప్రవేశించండి. అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ మూలం దగ్గరకి ప్రవేశించండి. నెమ్మదిగా శబ్దాన్ని తగ్గించండి. ఆపవద్దు, శబ్దాన్ని తగ్గించండి. ఆ శబ్దం వచ్చే స్థావరంలోకి ప్రవేశించేటప్పుడు శబ్దాన్ని తగ్గించండి. మీరే ఆ శబ్దం అయిపోవాలి.

స్టెప్ 4 : సమయం 5 నిమిషాలు.

కళ్ళు మూసుకునే ఉండండి. రిలాక్స్ అవ్వండి. ఎటువంటి శబ్దాన్నీ చేయవద్దు. ఆ శబ్దం వచ్చే మూలాలకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఆ శబ్దం జ్ఞాపకాల్లో ఉండండి.

2. సంగీతం : అనాహతధ్వనిని వినండి - మార్పు పొందండి.

సమయం : 21 నిమిషాలు

ఈ ధ్యానపద్ధతికి సున్నితమైన సంగీతం కావాలి. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ కూర్చోండి. (సంగీతం పెట్టుకోండి)

మీ తలలో ఎక్కడ ఈ శబ్దాన్ని అనుభవిస్తారో అక్కడ ఏకాగ్రతని నిలపండి. సంగీతం బయటి నుంచి వస్తుంది కాని, దాని అనుభవం మీ తలలో ఉంటుంది. వినటం అనేది మీ తలలో జరుగుతుంది. ఆ పాయింట్ని గుర్తుంచుకోండి. మీరు ఎక్కడైతే ఆ అనుభవాన్ని పొందుతారో ఆ ప్రదేశాన్ని గుర్తుంచుకోండి. ఆ ప్రదేశంలో పూర్తి ఏకాగ్రతతో ఉండండి. మీరు వినే ఆ పాయింట్ని ఫీల్ అవ్వండి. తెలుసుకోండి. అక్కడ వినిపిస్తున్న సంగీతం మీ లోపల ఎక్కడ వినపడుతుందో అక్కడ ఏకాగ్రతని నిలపండి. సంగీతం పట్ల ఎటువంటి అభిప్రాయమూ ఏర్పరచుకోకండి. అది బాగుందా, లేదా అనుకోవద్దు. మీరు అంతకు ముందు విన్న సంగీతం గురించి ఆలోచించవద్దు. మీకు తెలిసినదానితో దీన్ని పోల్చవద్దు. మీకు తెలిసిన సంగీతవిద్వాంసుల్ని గుర్తుచేసుకోవద్దు.

మిగిలిన జ్ఞానేంద్రియాలని మరిచిపోండి. చూడటం, వినటం, రుచి, స్పర్శ అన్నీ మరిచిపోండి. కేవలం వినటం అనేదానితో నిండి ఉండండి. మీ తలలో వినే ప్రదేశంలో ఆ అనుభవంతో ఉండండి.

ఆ సంగీతాన్ని బయటి నుంచి వినవద్దు. మీ తల లోపలి నుంచి వినండి. ఆ ప్రదేశంలోనే ఉంది ఆ సంగీతం అనుభూతిని పొందండి. ఎటువంటి ఆలోచననీ రానీయొద్దు.

సంగీతంలో మునిగిపోవద్దు. సంగీతం లోపలికి వెళ్ళండి. ఆ శబ్దంలో ఒక కేంద్రబిందువు ఉంటుంది. ఆ లయ, ఆ కేంద్రబిందువే సంగీతానికి వెన్నెముక. ఆ సంగీతంలోని కేంద్రలయలో విరామంగా ఉండండి. ప్రతిక్షణం ఆ కేంద్రం దగ్గర వినండి. వెన్నెముక లాంటి ఆ ప్రధానసూత్రాన్ని పట్టుకోండి. దానిలోనికి వెళ్ళండి.

మీ తలలో ఆ సంగీతప్రకంంపనల్ని వినండి. ఆలోచనలని రానీయొద్దు. వర్తమానం నుంచి, ఈ క్షణం నుంచి కదిలిపోవద్దు. వర్తమానంలో ఉండండి, సంగీతంలో ఉండండి. ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఈ ధ్యానపద్ధతితో సరదాగా ఆడుకోండి. ఏదైనా సంగీతాన్ని పెట్టుకొని, అందులోకి వెళ్ళండి. ఆలోచించవద్దు. సంగీతానికి మీ మొత్తం ఏకాగ్రతని ఇవ్వండి. ఇప్పుడు మీకు సంగీతాన్ని మామూలుగా వినటానికి, సంగీతాన్ని ధ్యానంలా వినటానికి తేడా తెలుస్తుంది. ఒక నెల రోజులు సరదాగా ఆడుకుంటున్నట్టు ఈ పద్ధతిని సాధన చేయండి. అది మీలో బలమైన మార్పుని తెస్తుంది.

3. ఓం కారం : ఆలోచనలు లేని ప్రదేశంలోకి ప్రవేశించండి.

సమయం : 21 నిమిషాలు.

కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ కూర్చోండి.

స్టెప్ 1 : సమయం 11 నిమిషాలు

నాభిప్రాంతంలో ఉన్న మణిపూరకచక్రం మీద ఏకాగ్రతని నిలపండి. కొంత సమయాన్ని తీసుకొని మీ తెలుసుకునే తత్వాన్ని పూర్తిగా మణిపూరకం పైన ఉండే విధంగా చూడండి. మీ శరీరంలో మిగతా భాగాల్ని పూర్తిగా మరిచిపోండి. కేవలం నాభిప్రాంతంలోని మణిపూరకం మీద మాత్రమే ఏకాగ్రత ఉండాలి. నాభిప్రాంతం నుంచి ఓంకారశబ్దాన్ని చేయండి. నాభిప్రాంతం నుంచి ఎంత లోతుగా ఓంకారం చేయగలిగితే అంత లోతుగా చేయండి. మనస్సుని ఎక్కడికీ వెళ్ళనీయవద్దు. ఆ శబ్దంలో పూర్తిగా కేంద్రీకృతమై ఉండండి.

స్టెప్ 2 : సమయం 10 నిమిషాలు

ఆపేయండి. కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చోండి. మీరు ఓంకారం చేయకుండా ఆ శబ్దాన్ని మీలోపల వినటానికి ప్రయత్నించండి. రిలాక్స్, కళ్ళు తెరవండి. ఈ ధ్యానం పది రోజులు చేయండి. మీరు ఆలోచనలు లేకుండా కూర్చోగలుగుతారు. మీరు ఆ శబ్దంతో నింపబడి ఉంటారు. ఆ శబ్దం సృష్టించిన ప్రకంపనలు మీ మనస్సుని ఎటూ వెళ్ళనీయవు.

4. అనాహత ధ్వని : మీ శరీరంలో శక్తి ప్రవహించటాన్ని అనుభూతి చెందండి. పూర్తిగా శక్తిమంతులవటం

సమయం 21 నిమిషాలు

కళ్ళు మూసుకొని, చేతి బొటన వేళ్లతో చెవులు మూయండి. చెవులు పూర్తిగా మూయండి. అప్పుడు మీ లోపల అనాహతధ్వనిని వింటారు. అది సృష్టించని శబ్దం, విశ్వం తాలూకు శబ్దం. కేవలం ధ్యానం చేసేవారు మాత్రమే వినగల శబ్దం. మీ అంతరంగమంతా ఆ శబ్దంతో నిండిపోవాలి. మీ శరీరమంతా ఆ శబ్దంతో నిండిపోయిందని అనుకున్నప్పుడు, వెన్నెముక కింది భాగాన్ని మొత్తం బిగబట్టండి. అన్ని కదలికల్నీ ఆపేయండి. అలా మీరు ఎంత సేపు ఉండగలిగితే అంత సేపు ఉండండి.

మీ శరీరం రిలాక్స్ కాగానే, చేతులు చెవుల దగ్గరి నుంచి తీసేసి రిలాక్స్ అవ్వండి. మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యేవరకూ చేయండి. మీరు ఎంత సేపు బిగబట్టి ఉంచగలరో అంత సేపు ఉంచండి. మీ శరీరం రిలాక్స్ అయిన తరువాత మళ్ళీ చెవులు మూసుకొని, అనాహతధ్వనిని విని దాన్ని మీ అంతరంగమంతా నిండేలా చేసి, వెన్నెముక కింది భాగం ముఖ్యంగా రెక్టమ్ ప్రాంతాన్ని బిగబట్టండి. తరువాత రిలాక్స్ అవ్వండి.

దీన్ని ఐదుసార్ల కంటే ఎక్కువ చేయవద్దు. ప్రతిసారీ 40 సెకండ్లు రిలాక్స్ కావాలి. మీరు రిలాక్స్ అయ్యే సమయంలో కూడా కళ్ళు మూసి ఉంచండి. ధ్యానం ఐదుసార్లు చేశాక, కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ శరీరం అంతా శక్తి ప్రవహించటం గమనించండి. రిలాక్స్ అవ్వండి.

5. మీ పేరు తాలూకు శబ్దం : జ్ఞానోదయస్థితిలోకి ప్రవేశించండి.

సమయం : పది నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోండి. ముందు ఒక పదాన్ని ఎంచుకోండి. ఆ పదంతో మీరు ధ్యానం చేయబోతున్నారు. మీకు గురువులు ఇచ్చిన ఆధ్యాత్మికనామం ఉంటే అది మంచిది. లేకపోతే గురువుల పేరు లేదా మీరు ఏ దేవుడితో అయితే లోతుగా అనుబంధాన్ని ఏర్పరచుకున్నారో ఆ పేరు తీసుకోండి.

మీకు సంస్కృత ఆధ్యాత్మికనామం ఉంటే మంచిది. అది చాలా శక్తిమంతంగా పని చేస్తుంది. సంస్కృతశబ్దానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది. సంస్కృతం మాటలు మాట్లాడేవారిని, వినేవారిని స్వచ్ఛంగా చేస్తాయి. మీ పేరు ఒక ప్రత్యేకమైన మంత్రం. ఆ మంత్రాన్ని జపించినా, విన్నా, జ్ఞానోదయమైన గురువు సృష్టించిన ఆ మంత్రం, ఆ పేరు దేని కోసమైతే చేశారో ఆ ప్రభావం మీ మీద ఉంటుంది.

మీరు ఎంచుకున్న పేరు తాలూకు శబ్దంలోకి ప్రవేశించండి. పేరుని గట్టిగా బయటికి అనవద్దు. అంతరంగంలోనే జపించండి. ఆ జపం చేసే శబ్దంలోకి ఆ ప్రకంపనలోకి ప్రవేశించండి. నాలుక కదలకూడదు. ఆ పేరు శబ్దతరంగాలని సృష్టించి దాన్ని మళ్ళీ మళ్ళీ మీ అంతరంగంలో జపించండి. ఆ శబ్దంతో మీ అంతరంగం నిండిపోవాలి. మీ అంతరంగం మొత్తం శబ్దంతో నిండిపోవాలి. ఆ శబ్దాన్ని గాఢంగా, తీవ్రంగా జపించండి. వేగంగా జపించండి. మీలో మరే ఆలోచనా ఉండకూడదు. ఆకస్మాత్తుగా మీరు శబ్దం లేని ప్రదేశంలో ఉండటాన్ని గమనిస్తారు. మీరు మాటలు లేని స్థితిలో ఉంటారు.

ఒక నెల రోజులు ఈ పద్ధతితో ఆడుకోండి. ప్రతి రోజూ ఉదయం పది నిమిషాలు, సాయంత్రం పది నిమిషాలు సాధన చేయండి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు కళ్ళు తెరిచి కూడా సాధన చేయవచ్చు. మీరు నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు సాధన చేయండి. మీ ప్రత్యేకమైన ఈ మంత్రానికి ఎంత శక్తి ఉందో మీకు అర్థం అవుతుంది. మీ చేతనస్థితికి కొత్త ద్వారాలు తెరువబడతాయి. మీరు శబ్దాలు లేని స్థితికి, జ్ఞానోదయస్థితికి చేరతారు.

6. శబ్దాల తుఫాను మధ్యలో కేంద్రీకృతమవ్వండి :

మీలోని శబ్దాలన్నింటికీ మధ్య పాయింట్ని కనుక్కోండి. ఆ శబ్దాన్ని మార్చండి.

సమయం : 21 నిమిషాలు

మనం నిరంతరం శబ్దాల తుఫానులో ఉంటాము. శబ్దాలు నిరంతరం మన వైపు దూసుకువస్తుంటాయి. మనని చుట్టుముడుతుంటాయి. ఆ శబ్దాల మధ్యలో మనం వినని నిశ్శబ్దం ఉంటుంది. ఈ ధ్యానం, శబ్దాల తుఫాను మధ్యలో ఉన్న నిశ్శబ్దాన్ని తెలుసుకునేలా చేస్తుంది.

ఎక్కడైనా సౌకర్యంగా కూర్చోండి. బాగా శబ్దాలు వచ్చే ప్రదేశం అయితే చాలా మంచిది. అక్కడ శబ్దాలు నిరంతరం వస్తుండాలి. అది సహజమైన శబ్దమైతే మంచిది. లేదా రైల్వే స్టేషన్, మార్కెట్, ఏదైనా పర్వాలేదు. నిశ్శబ్దంగా కూర్చోండి. శబ్దతరంగాలు ఆ శబ్దాల నుంచి మీ వైపు అన్ని దిశల్లో వస్తున్నట్టు భావించండి. అన్ని వైపుల నుంచీ వచ్చే శబ్దాల తుఫానులో మీరు మధ్య ఉన్నాను అనుకోండి. మీరు మధ్యలో ఉన్నారు, శబ్దాలు అన్ని వైపుల నుంచీ వస్తున్నాయి.

ఆ శబ్దాలకి మధ్యలో ఉన్న మీ దగ్గర శబ్దాలు లేకపోవటాన్ని అనుభూతి పొందండి. మీ దగ్గర, అంటే మధ్యలో శబ్దాలు ఉంటే బయటి నుంచి వచ్చే శబ్దాలని మీరు వినలేరు. ఆ శబ్దాలు మీ వైపు చొచ్చుకొని వస్తున్నాయి. కాని మధ్య పాయింట్ దగ్గర ఆగిపోతున్నాయి.

మీ లోపల ఒక పాయింట్ దగ్గర శబ్దాలు అన్నీ ఆగిపోతున్నాయి. ఆ పాయింట్ దగ్గర నుంచి మీరు అన్ని శబ్దాలూ వినగలుగుతున్నారు. ఆ మధ్య పాయింట్‌ని పట్టుకోవటానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే ఆ పాయింట్‌ని పట్టుకుంటారో, అకస్మాత్తుగా మీరు బయటి ప్రపంచంలోని శబ్దాల నుంచి లోపలికి వెళతారు. మీరు నిశ్శబ్దంగా ఉంటే మధ్య పాయింట్ దగ్గర ఉంటారు. ఆ పాయింట్ దగ్గరకి ఏ శబ్దమూ ప్రవేశించలేదు. అది మీ లోపలి మీ కేంద్రం. మీరు ఒక్కసారి ఆ నిశ్శబ్దాన్ని వింటే, మీరు మరే శబ్దం చేతా డిస్టర్బ్ కారు. మిమ్మల్ని ఏ శబ్దమూ తాకలేదు, మీ మీద ప్రభావాన్ని చూపలేదు.

మనం ఏమనుకుంటామంటే, మన చెవులతో శబ్దాలు వింటాం అనుకుంటాం. ఈ ధ్యానం చేసాక శబ్దాలు చెవులతో కాని, తలతో కాని వినం. శబ్దాలని నాభి ప్రాంతంలో వింటాం. అదే శబ్దాలకి కేంద్రబిందువు.

ఈ ధ్యానాన్ని పాటలతో సాధన చేయలేరు. ఎందుకంటే పాటల్లో అర్థాలు ఉంటాయి. మీరు అర్థాల మీద ఏకాగ్రత పెడతారు. కాబట్టి ఏదైనా శబ్దం కావాలి.

7. శబ్దం నుంచి అనుభూతికి : శబ్దం ద్వారా ఆనందాన్ని పొందండి.

సమయం : 21 నిమిషాలు

కళ్ళు మూసుకొని విరామంగా కూర్చోండి.

స్టెప్ 1 : సమయం 10 నిమిషాలు

మీరు ధ్యానం చేయబోయే శబ్దాన్ని ఎంచుకోండి. అది ఏదైనా పర్వాలేదు. ఆ శబ్దం మీకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేదై ఉండాలి. ఆ శబ్దాన్ని గట్టిగా చేయండి, ఆ శబ్దానికి సంతోషంగా ఉండండి. ఆ శబ్దాన్ని సున్నితంగా చేయాలి, దాన్ని విని సంతోషపడాలి. అలా ఆ శబ్దాన్ని చేస్తూ అందులో సంతోషపడండి. ఆ సంతోషభావంలో కేంద్రీకృతమవ్వండి. స్టెప్ 2 : సమయం 11 నిమిషాలు

శబ్దాన్ని పెంచవద్దు, బయటికి అనవద్దు. మీ లోపలే ఆ శబ్దం చేయండి. నాలుకని నెమ్మదిగా కదపండి. అంతరంగంలోనే ఆ శబ్దాన్ని చేయండి. ఆ అనుభూతిని తెలుసుకోండి. ఆ భావంలో స్థిరపడండి. ఆ శబ్దం ఇచ్చిన ఉత్సాహంలో స్థిరపడండి.

మనస్సులో దృశ్యాన్ని ఏర్పరచటం

1. కాంతిదృశ్యాన్ని ఏర్పరచండి

మరణభయానికి అతీతంగా వెళ్ళండి. నిత్యానందస్థితిలో జీవించండి

సమయం ; రోజులో 24 గంటలూ, 21 రోజులు

మీరు వెలుగులా ఊహించుకోండి. మీ బయటా, లోపలా ఏమీ లేదు, కాంతి తప్ప. ఎవరూ లేరు. ప్రపంచం లేదు. అంతా ప్రకాశవంతమైన కాంతి తప్ప. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయేవరకూ, మీరు ఏ పని చేస్తున్నా ఇదే విధంగా అనుకోండి.

కొన్ని రోజులు గడిచాక ఈ భావం మీ స్వప్నస్థితిలోకి, గాఢనిద్రాస్థితిలోకి చొచ్చుకొని పోతుంది. కలలో కూడా మిమ్మల్ని కాంతిగానే చూస్తారు. గాఢనిద్రలో కూడా కాంతినే చూస్తారు. మీరు నిత్యం ప్రకాశించే కాంతిలా ఉంటారు.

ఇది చాలా శక్తివంతమైన ధ్యానపద్ధతి. ఈ ధ్యానం మీకు మరణం లేదు - అనే అనుభవాన్ని ఇస్తుంది. కాంతికి మరణం లేదు. మీరు పదార్థం అని అనుకుంటే ఏదో ఒక రోజు ముగిసిపోతాం

  • అనే భయం ఉంటుంది. మీరు కాంతి అని తెలుసుకుంటే మీలో మరణభయం ఉండదు.

⁂ ⁂ ⁂