KAILASA Library/జీవన్ముక్తి/గురుదేవులు - జీవన్ముక్తులుSign in
జీవన్ముక్తి

గురుదేవులు - జీవన్ముక్తులు

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

■ గురుదేవులు - జీవన్ముక్తులు

గురుదేవులు - జీవన్ముక్తులు

గురుదేవులు అంటే రూపంలేని జ్ఞానోదయశక్తి మానవరూపంలో ఉండటమే

చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్యా, గురూర్యువః
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నాః సంశయాత్

ఎంత విచిత్రం! మర్రి చెట్టు కింద కనిపించే ఈ దృశ్యం ఎంత అద్భుతం! గురుదేవులు చిన్న యువకుడు. ఆయన చుట్టూ ఉన్న శిష్యులు వృద్ధులు. గురువు మౌనంగా ఉన్నారు. శిష్యుల అనుమానాలన్నీ కరిగిపోతున్నాయి.

గురుదేవుల సమక్షంలో జరగవలసిన చర్చ జరగనప్పుడు విషయాలని అర్థం చేసుకున్నా అవి విద్యలా ఉండిపోతాయి. నేర్చుకున్న సాధనపద్ధతులు ఉపకరణాలుగా మిగిలిపోతాయి. భగవంతుని తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికీ గురువు అవసరం ఉంది.

వేదసంస్కృతిలో ఆధ్యాత్మిక గురుదేవుల్ని భగవంతుని కంటే ఎక్కువ గౌరవంతో చూసేవారు. గ్రంథాలు ఏం చెబుతాయంటే గురువు అంటే తల్లి, తండ్రి, భగవంతుడు. ఈ మూడూ ఆయనే, ఆయన అంత కంటే కూడా అతీతుడు.

మనలో చాలా మందికి భగవంతుడు అంటే ఒక విషయం. చాలా కొద్ది మంది మాత్రమే భగవంతుడిని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆయన గురించి మాట్లాడగలరు. ఒక చక్కని మాట ఉన్నది, 'అనుభవమైనవారు మాట్లాడరు, మాట్లాడేవారికి ఆ అనుభవం ఉండదు.' కేవలం గురుదేవులు మాత్రమే ఆ అనుభవాన్ని పొంది, ఆ దివ్యానుభవాన్ని మాటల రూపంలోనే కాదు, తన శరీరభాష ద్వారా, జీవనసరణి ద్వారా, స్పష్టంగా ఇతరులకి వెల్లడి చేయగలరు. వారివారి దివ్యానుభవానికి గురుదేవులు ఒక మహాద్వారం వంటివారు. ఆయన తన శిష్యుల చేతిని పట్టుకొని ఆ అనుభవం గుండా, తన అంతరంగంలోని దివ్యత్వం అనే సత్యం గుండా తీసుకువెళ్ళగలరు. ఈ క్రమంలో శిష్యుడు గురువుగా మారతాడు, తన శిష్యులకి మార్గదర్శి అవుతాడు. ఈ విధంగా ఇది ఒక వృత్తంలా ఉంటుంది.

జ్ఞానోదయం అనే ఈ ధర్మచక్రం వారి సహజస్థితి అనుభవంలోకి తీసుకువెళుతుంది. అది ఛేదించలేని విషవలయమైన కోరికలు, బాధలని తెంచగలుగుతుంది. మనమందరం ఆ వలయంలోనే చిక్కుకొని ఉంటాం. లోతైన అనుభవంతోనే గౌతమబుద్ధుడు కోరికలు అంటే వ్యధలు అని చెప్పాడు. ఇక్కడ ఆయన చెప్పే విషయం ఏమిటంటే, జ్ఞానేంద్రియాల ద్వారా ఈ కోర్కెలని తీర్చుకోవాలనేది మానవనైజం అని. అవి అలా పెరుగుతూనే ఉంటాయి. కేవలం తనలోని అద్భుతశక్తిని అర్థంచేసుకోవటం ద్వారా, అంతరంగానందాన్ని పొందినప్పుడు మాత్రమే బాధలు పూర్తిగా తొలగిపోతాయి. అదే మనిషి సహజలక్షణం అవుతుంది.

గురుదేవులు అంటే అద్దం వంటివారు. ఆయన మేధతో కూడిన అద్దం అనే శక్తి. ఆ శక్తి మనం అంటే ఏమిటో చూసుకునేలా చేస్తుంది. మనం ఇప్పుడు ఆ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.

సింహం, సింహం కూన కథ

ఒకసారి నిండు గర్భంతో ఉన్న సింహం ఒక గొర్రెల గుంపు మీదకి దూకి, ఒక సింహం కూనకి జన్మనిచ్చి చనిపోతుంది. అప్పుడే పుట్టిన సింహం కూన కళ్ళుకూడా పూర్తిగా తెరవదు. సహాయం కోసం కొన్ని శబ్దాలు చేస్తుంది. ఆ కూనని చూసి గొర్రెలు జాలిపడతాయి. అవి సింహం పట్ల ఎలా జాలి, కరుణ, చూపిస్తాయి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. శత్రువు నుంచి ప్రమాదం లేదు, శత్రువు మనకి హాని చేయడు అని తెలిసినప్పుడు ఎదుట ఉన్నది శత్రువైనా మనకి జాలి, కరుణ కలుగుతాయి. అదే విధంగా సింహపు కూన నుంచి వాటికి ఎటువంటి హాని లేదు కాబట్టి అవి జాలిపడతాయి. గొర్రెలు ఆ కూనపట్ల జాలిపడి వాటితో తీసుకువెళ్ళి దాన్ని పెంచాయి. గడ్డి ఎలా తినాలి, పాలు ఎలా తాగాలి, ఎలా 'బే' అని అరవాలో దానికి నేర్పించాయి.

అది పుట్టినప్పటి నుంచీ ఎవరూ దానితో నీవు సింహానివి అని చెప్పలేదు. కాబట్టి అది గొర్రెగానే పెరిగింది. వాటితో ఒక గొర్రెపిల్లలా కలిసిపోయింది. సింహం కూన పెరిగేకొద్దీ దాని సహజశక్తిని చూపించేది.

ఒక రోజు ఒక సింహం ఈ గొర్రెల మంద మీదకి దూకింది. అన్నీ భయపడి తలా ఒక దిక్కుకి పరిగెత్తాయి. ఆ సింహానికి, గొర్రెలతో పాటు పారిపోతూ గొర్రెలా 'బే' అని అరుస్తూ వెళుతున్న సింహం కూన కనపడింది. సింహం తన కళ్ళని తాను నమ్మలేక పోయింది. తనని చూసి సింహం కూన ఎందుకు భయపడి పారిపోయిందో, అది ఎందుకు గొర్రెలా అరుస్తోందో సింహానికి అర్థం కాలేదు.

మర్నాడు ఆ సింహం కూనని చూడటానికి సింహం మళ్ళీ ఆ గొర్రెల గుంపు దగ్గరకి వస్తుంది. అది గొర్రెలతో ఉన్న సింహం కూనని చూసి నెమ్మదిగా వెనక నుంచి వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది. సింహం కూన భయంతో, 'నన్ను వదులు బే... బే... నన్ను వదులు' అంటూ గొర్రెలా అరుస్తుంది.

సింహం దానితో, 'ఏయ్! మూర్ఖంగా మాట్లాడకు. భయపడకు, నేను నిన్ను చంపను. నీవు ఎవరివో నీకు తెలియదా?' అంటుంది. సింహం కూన భయంతో, అరుస్తూ 'నేను గొర్రెని నన్ను వెళ్ళనీయ్'... అంటుంది.

సింహం దానితో 'ఓ తెలివితక్కువ దద్దమ్మా! నీవు గొర్రెవి కావు. నన్ను చూసి భయపడకు' అంటుంది. కాని సింహం కూన బాగా భయపడిపోయి సింహం ఏం చెప్పినా వినదు. అది మెల్లిగా సింహం నుంచి తప్పించుకొని పారిపోతుంది.

మర్నాడు ఈ గొర్రెలు ఉన్న చోటికి సింహం వచ్చి, జాగ్రత్తగా సింహం కూనని పట్టుకుంటుంది. ఈసారి దాన్ని చాలా గట్టిగా పట్టుకుంటుంది. సింహం గుప్పిటలో గిజగిజలాడుతుంది సింహం కూన. అయినా దాని మనస్సులో ఒక పక్కన అక్కడి నుంచి తప్పించుకోమని చెబుతుంది, మరొక పక్క సింహం స్పర్శ చాలా బాగుంది అని చెబుతుంది. సింహం స్పర్శ సింహం కూన అంతరంగం లోతుల్లో ఏదో మేల్కొన్నట్టు అవుతుంది. సింహం కూన గిజగిజ కొట్టుకోవటం చూసి సింహం దాన్ని వదిలి, 'నేను రేపు కూడా ఇక్కడికి వస్తాను. కానీ నేను నిన్ను పట్టుకోను,' అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోతుంది.

సింహంకూనకి రాత్రి అంతా నిద్ర పట్టదు. దాని మనస్సు అంతా చాలా ఆలోచనలతో నిండిపోతుంది. 'ఆ సింహం మాటలు నేను నమ్మలేను. కాని అది చెప్పిన దానిలో ఏదో నిజం ఉండి ఉండవచ్చు. అబ్బే! లేదు, లేదు. సింహం చెప్పింది నిజం కాదు. నేను గొర్రె కూనని అని నాకు తెలుసు. ఆ సింహం చెప్పే మాట అర్థం లేనిది. నా నుంచి ఏదో ఆశించి ఆ సింహం అలా చెబుతుందని అనుకుంటుంది.

ఒక విషయం అర్థం చేసుకోండి. సింహం చెప్పిన విషయం సింహం కూన తర్కజ్ఞానానికి అందని విషయం. మీకు స్పష్టంగా చెబుతాను. గురువుగారి సమక్షంలో మీ తర్కానికి అందని విధంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తే మీ లోపల గురువు మేల్కొన్నట్టే, మీరు సింహంతో బంధాన్ని ఏర్పరచుకోవాలి అంటే మీ అంతరంగంలోని సింహం మేల్కోవాలి. మీకు గురుదేవుల సమక్షం ఆనందపారవశ్యాన్ని ఇచ్చినప్పుడు, ఆ భావాలని తిరిగి మీరు మననం చేసుకుంటుంటే, అది మీ ఊహలోనైనా సరే స్పష్టంగా తెలుసుకోండి సింహం మీ అంతరంగపు లోతుల్ని స్పర్శించినది అని అర్థం. మీలో ఒక భాగం ఆ సున్నితమైన అనుభూతిని పొందింది. మీలో ఒక భాగం గురుదేవులు చెప్పిన విషయంలో ఏదో ఉంది అనే భావంతో ఉంటుంది.

మరుసటి రోజు సింహం వచ్చేసరికి సింహం కూన అక్కడ నిలబడి ఉంటుంది. సింహం కూన ఓపికగా సింహం కోసం అడవి మొదట్లో నిలబడి చూస్తూ ఉంటుంది. కాని సింహం రాగానే నెమ్మదిగా దాని నుంచి దూరంగా వెనక్కి గొర్రెల వైపు అడుగులు వేస్తుంది కాని ముఖం మాత్రం సింహం వైపు ఉంటుంది. దాన్ని చూడకుండా ఉండలేదు. ఆ విధంగా కొంచెం వెనక్కి వెళ్ళి సింహంతో, 'నీవు అక్కడే ఉండు. నేను ఇక్కడ నిలబడతాను. మనం ఇలా మాట్లాడుకోవచ్చు. నిజమే, నేను నిన్ను మరిచిపోలేక పోతున్నాను కానీ మన మధ్య దూరం ఇలానే ఉండాలి' అంటుంది. సింహం 'సరే' నీవు అక్కడే ఉండి నాతో మాట్లాడు' అంటుంది.

అప్పుడు సింహం, సింహంకూనతో, 'ఈ విషయం అర్థం చేసుకో! నీవు సింహానివి. నీవు మరొకలా ఉండాలి అని ప్రయత్నిస్తూ, నీ సహజస్థితిని మరిచిపోతున్నావు. జాగ్రత్తగా చూడు! నీకు ఆ గొర్రెలకీ చాలా తేడా ఉంది' అంటుంది. వెంటనే 'సింహం కూన 'ఎం కాదు! అది ఎలా సాధ్యం. నేను అదే గడ్డి తింటాను. ఆ గొర్రెల్లాగానే జీవిస్తున్నాను' అంటుంది. సింహం, 'ఓ మూర్ఖసింహమా! ఈ చిన్న విషయాన్ని గమనించు. నిన్ను నీవు చూసుకో. మిగిలిన గొర్రెలు నాతో ఎటువంటి బంధాన్నీ ఏర్పరచుకోలేదు. మరే గొర్రె నా కోసం ఎదురుచూడవు. అవన్నీ నన్ను చూసి భయపడుతున్నాయి. నీవు ఒక్కదానివే నా కోసం ఎదురు చూస్తున్నావు. దీన్ని బట్టి చూస్తే నీలో ఏదో మార్పు జరిగింది. నీవు నా కోసం ఎందుకు ఇక్కడ ఉండి ఎదురు చూడాలి? నాతో నది దగ్గరకి రా. అందులో నీ ముఖం, నా ముఖం చూస్తే నీకు అర్థమవుతుంది' అని అంటుంది.

సింహం కూనకి సింహంతో వెళ్ళటానికి భయం వేస్తుంది. అది సింహంతో, 'వద్దు. నేను రాను. మనం ఇక్కడే నిలబడి మాట్లాడుకుందాం. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే నిలబడు. నేను ఇక్కడే నిలబడతాను. నీవు ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. నేను ఇక్కడే ఉండి వింటాను. అని అంటుంది. అప్పుడు సింహం కూనతో ఈ విధంగా చెబుతుంది. 'సరే! నేను నీకు ఒక విషయం చెబుతాను. నీవు సరే అంటే నీ నిజమైన నిన్ను నది నీడలో చూపిస్తాను. నీవు నేను ఒకటే అని నిరూపిస్తాను. అయితే నేను నిన్ను బలవంతపెట్టను. నేను ఒక వారం తరువాత వస్తాను. నీవు సరే అనుకుంటే ఇక్కడికి వచ్చి నన్ను కలవవచ్చు. నేను నిన్ను నాతో నది దగ్గరకి తీసుకు వెళతాను. లేదు అనుకుంటే నన్ను మరిచిపో, నన్ను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. నీ ఇష్టం వచ్చిన విధంగా వెళ్ళు!' ఇలా చెప్పి సింహం వెళ్ళిపోతుంది.

ఒకవారం గడిచాక సింహం తాను చెప్పినట్టే వస్తుంది. సింహం కూన ఇంకా అయోమయంలో ఉంటుంది. 'నేను వెళ్ళి సింహాన్ని కలవాలా వద్దా!' అంతరంగం లోపల వెళ్ళి సింహాన్ని కలవాలని ఉంటుంది. కానీ పైకి సింహం అంటే భయం కలుగుతుంటుంది.

చివరికి సింహం ఉన్న దగ్గరికి వస్తుంది. సింహం అక్కడ ఉంటుంది. సింహం దాని వైపు చూసి, లేచి నిలబడుతుంది. సింహం దారి చూపిస్తూ నడుస్తుంటే సింహం కూనకూడా దాని వెంట నడుస్తూ వెళుతుంది. అలా ఆ రెండూ నది వైపు నడిచి వెళుతుంటాయి. సింహం కొంచెం దూరం జరిగి నెమ్మదిగా సింహం కూనకి కథలు చెప్పటం ప్రారంభిస్తుంది. తను చిన్నకూనగా ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఎలా పెద్దదైంది. అన్నీ చెబుతుంది. సింహం కూన కథలు వినటంలో మునిగిపోయి సింహం దగ్గరగా నడుస్తుంది. అలా నడుస్తూ సింహం, సింహం కూన దగ్గరికి జరుగుతుంది. సింహం కూన పూర్తిగా కథలో మునిగిపోయి, 'ఆహా! అలా జరిగిందా? తరువాత ఏమైంది, నీకు కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయా?' అని అడుగుతుంది.

సింహం కూనకి తెలియకుండా సింహం దానికి బాగా దగ్గరగా వచ్చి దానికి తగులుతూ నడుస్తుంది. అకస్మాత్తుగా సింహం కూన గమనిస్తుంది. కాని భయపడి దూరం జరగదు. సింహం స్పర్శ దానికి చాలా హాయిగా, ఆహ్లాదంగా ఉంటుంది. అది సింహాన్ని దగ్గరకి రావద్దని ఆపదు. సింహం అలా చెబుతూనే ఉంటుంది. సింహం కూన 'అలానా! అది బాగుంది' అని అంటూ ఉంటుంది. ఇప్పుడు సింహం, సింహం కూనని పట్టుకొని నడుస్తుంది. కాని సింహం కూన కథల్లో పూర్తిగా నిమగ్నమై అసలు ఈ విషయాన్ని పట్టించుకోదు.

అవి నది దగ్గరకి రాగానే 'సింహం, సింహం కూనని పట్టుకొని నీళ్ళలో చూడమంటుంది. సింహం కూన తాను తప్పించుకోలే తెలుసుకుంటుంది. కాని ఆశ్చర్యంగా దానికి తప్పించుకోవాలి అనే కోరిక కలగదు.

అర్థం చేసుకోండి, సింహం కూనకి తాను తప్పించుకోలేను అని తెలుసు అంతే కాదు, దానికి తప్పించుకోవాలి అనే కోరిక కూడా లేదు. కాని దాని మనస్సులో ఒక మూల ఉన్న అహంకారం దాన్ని అలా అనుకోనీయదు.

అప్పుడు అది, 'వద్దు, నన్ను వెళ్ళనీయి. నన్నేం చేస్తున్నావు? నన్ను ఎందుకు పట్టుకున్నావు? అని భయంగా అడుగుతుంది.

A lion taking a cub to look into the water

సింహం సమాధానమిస్తుంది, 'నేను
నిన్నేమీ చేయను. నీళ్ళలోకి చూడు' సింహం
కూన నీళ్ళలోకి చూసి, 'సరే! నేను నీళ్ళలోకి
చూస్తున్నాను' అంటుంది. అప్పుడు సింహం,
'నీకు రెండు రూపాల కనిపిస్తున్నాయా?'
అంటుంది. అది 'అవును' అని అంటుంది. 'సరే
అయితే, ఆ రెండింటిలో ఒకటి నేను, ఒకటి
నీవు' అని చెబుతుంది సింహం.

'ఏమీ కాదు! ఇది నిజం కాదు. ఆ రెండు రూపాలూ నీవే అయివుండవచ్చు' అని గట్టిగా అరుస్తూ చెబుతుంది. సింహం గట్టిగా అరిచి 'ఓ! తెలివితక్కువదానా! చూడు నేను చేతిని పైకి ఎత్తాను. నీళ్ళలో ఏ రూపం చేయి ఎత్తింది' అని అడుగుతుంది. సింహం కూన వేలితో చూపిస్తూ 'ఆ రూపం' అంటుంది. అప్పుడు సింహం, 'సరే! ఈ సారి నీవు చేయి ఎత్తు' అంటుంది.

సింహం కూన చేతిని ఎత్తి నదిలో రూపాన్ని చూస్తూ 'అవును! అవును! నేను, నేను చూసాను. నేను చూసాను' అంటుంది. తరువాత మెల్లని గొంతుతో 'కాని... ఇది ఎలా సాధ్యం. నేను ఎలా సింహాన్ని అవుతాను. నేను గొర్రెని కాదా' అంటుంది.

సింహం దాని వైపు చూసి, 'నేను నీతో ఆడటానికి ఇక్కడికి రాలేదు' అంటుంది. అప్పుడే సింహం కూనలో ఒక విధమైన ఆనంద పారవశ్యం కలుగుతుంది. ఏదో అద్భుతం జరుగబోతుంది అని ఆ సింహం కూనకి అర్థం అవుతుంది.

వెంటనే దాని మనస్సు ముందుకి వచ్చి అది నిరాశలోకి వెళుతుంది. తన మనస్సులో ఇలా అనుకుంటుంది, 'నన్ను హిప్నటైజ్ చేసి ఉంటుంది. ఇది నా నిజమైనా స్థితి కాదు. ఇది నేను కాదు, నేను ఎప్పుడూ ఇంత ఆనందంగా, ఇంత ఆహ్లాదంగా లేను. సింహం నన్నేదో చేస్తోంది. నాకు ఏదో చేసింది.' సింహం పారిపోవాలని చూస్తుంది. కాని అది పూర్తిగా వెళ్ళాలని కాదు. ఎందుకంటే దానికి నిజంగా సింహం దగ్గర నుంచి వెళ్ళాలని లేదు.

సింహం కూన వెంటనే, 'కాదు! కాదు! నేను వెళ్ళిపోవాలి. నన్ను వెళ్ళనీయి. నీవు సింహానివి అని నాకు తెలుసు. నీకు బహుమతిగా రోజూ నేను తినే గడ్డి తీసుకువస్తాను. నేను తాగే పాలు తెస్తాను. నా సమయాన్ని నీ సేవకి ఉపయోగిస్తాను' అని అంటుంది.

చివరికి సింహం ఇలా ఆలోచిస్తుంది, 'దీన్ని ఇప్పుడు వదిలివేయాలి. ఇప్పటికి ఈ మాత్రమే అర్థం చేసుకోగలిగింది.' సింహం కూన వైపు తిరిగి, 'సరే! రేపు మనం మళ్ళీ కలుద్దాం. నిన్ను కలవటానికి నేను అడవి చివరికి రాను. నేను నా ఇంట్లో ఉంటాను. నీకు నన్ను చూడాలనిపిస్తే నీవే నా ఇల్లు కనుక్కొని అక్కడికి రా. నిన్ను వెతుకుతూ నీ దగ్గరకి వచ్చి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చే టైం లేదు నాకు. నీ అంతట నీవు రాలేకపోతే వదిలేసెయ్యి' అని సింహం కూనకి చెప్పి సింహం అడవిలోకి వెళ్ళిపోతుంది.

ఈ సారి సింహం కూన ఎప్పటిలా పరిగెత్తి పారిపోదు. నెమ్మదిగా నడుస్తూ వెళుతుంది. దానికి వెనక్కి వెళ్ళటం ఇష్టం ఉండదు. కానీ దాని మనస్సు మాత్రం గొర్రెల దగ్గరకి వెళ్ళమని చెబుతుంది. దాని మూడు కాళ్ళు ముందుకి పడటం లేదు. ఒక కాలు మాత్రమే ముందుకి కదులుతోంది. వెళ్ళిపోవాలి అనుకోగానే ఆ చిన్న కళ్ళ నుంచి కన్నీరు ధారగా ప్రవహిస్తుంది.

Lion and lion cub

మర్నాడు సింహం తన ఇంట్లో మహా చక్రవర్తిలా కూర్చొని ఉంటుంది. సింహం కూన నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ చేతిలో లేతగా, తాజాగా ఉన్న పచ్చగడ్డితో వచ్చి, దాన్ని సింహం ముందు ఉంచి 'ఇది నీ కోసం తెచ్చాను దయచేసి తీసుకో' అంటుంది. సింహం దాని వైపు చూసి ఇలా అనుకుంటుంది. 'సరే, నేను ఈ గడ్డి తీసుకుంటే సింహంకూనకి నాతో అనుబంధం పెరుగుతుంది. దాంతో మా మధ్య బంధం గట్టిపడుతుంది, ఈ విధంగా ఆలోచించి ఎప్పుడూ గడ్డి తినకపోయినా, కాస్త గడ్డి తీసుకుని నోట్లో పెట్టుకొని నములుతుంది. సింహం కూనని మెచ్చుకుంటుంది. 'నీవు తెచ్చిన గడ్డి చాలా రుచిగా ఉంది' అంటుంది. సింహం కూన చాలా సంతోషపడుతుంది. సింహం గడ్డి తిన్నాక వారి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.

ఒక విషయం అర్థం చేసుకోండి; సింహం కింది స్థాయికి దిగి వచ్చి గడ్డి తినటం, కేవలం సింహం కూనతో మంచి అనుబంధాన్ని పెంచుకోవాలని. నిజానికి సింహం గడ్డి తినదు ఇక్కడ అలా నటిస్తుంది. గడ్డిని ప్రేమిస్తుంది. క్రమంగా సింహానికి, సింహం కూనకి మధ్య అనుబంధం బలంగా తయారవుతుంది. కొన్నిసార్లు సింహం గడ్డి చూసి, సింహంకూనని కోప్పడేది, ‘మూర్ఖుడివి! నాకు ఎటువంటి గడ్డి తీసుకురావాలో తెలియదా! ఇదేం గడ్డి? ఈ పాటికి నేను ఎటువంటి గడ్డి తింటానో నీకు తెలిసి ఉండాలి. ఈ సారి మంచి గడ్డి తీసుకురా!’ అని అరచేది.

సింహం కూన ఈ విధంగా ఆలోచించేది, ‘సింహానికి కోపం వస్తుంది. నాకు కూడా కొన్నిసార్లు కోపం వస్తుంది. సింహం నాలాగే మాట్లాడుతుంది. సింహం నాలాగే ఉంది’ అని అనుకుంటుంది.

సింహం మరియు సింహం కూన

సింహం గడ్డి తింటుంది అంటే తన స్థితి నుంచి, తన ఉన్నతచేతనస్థితి నుంచి కిందికి, సింహం కూన స్థితికి వస్తుంది అంటే ఆ అనుబంధం పెంచాలని మాత్రమే.

సింహం కూనకు ఇప్పుడు సింహంతో చక్కని అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు సింహం కూన ఇలా అనుకుంటుంది, ‘ఈ సారి నేను మంచి గడ్డి తీసుకురావాలి. నేను చేసే పనులు సరిగ్గా చేయాలి. గడ్డిని చక్కగా కట్టి తీసుకురావలసింది. ఈ విధంగా సింహం కూన చక్కని ప్లాన్స్ వేస్తుంది. తాను సరిగ్గా పని చేయలేదు కాబట్టే సింహం తనని తిట్టింది కాబట్టి ఈ సారి బాగా చేయాలి అనుకుంటుంది. ఈ విధంగా సింహంతో దాని అనుబంధం గట్టిపడుతుంది. సింహం దగ్గర సౌకర్యంగా, విరామంగా, ఆనందంగా ఉంటుంది. ఇదే మాస్టర్ వేసే మాస్టర్ ప్లాను.

ఒక రోజు సింహం కూన మామూలుగా గడ్డి, పాలు తీసుకొని వచ్చేసరికి సింహం మాంసం తింటూ కనిపిస్తుంది. మాంసం చూడగానే సింహం కూన భయపడిపోతుంది. అది అరవటం మొదలుపెడుతుంది, ‘నీ దగ్గర మాంసం ఎందుకు ఉంది. ఇదంతా ఏమిటి? నీవు మాంసాహారివా? నీవు మాంసాహారివని నాకు తెలియదు. నీవు చూడటానికి ఎంతో ప్రేమగా, తేజస్సుతో ఉంటావు. అలాంటి నీవు మాంసం తినకూడదు. ఇలాంటివన్నీ నీవు తింటావా? నేను శాకాహారిని. ఇవన్నీ నాకు పడవు’ అని గట్టిగట్టిగా అరుస్తూ అడుగుతుంది.

ఈ సారి సింహం దానికి ఏం వివరణా ఇవ్వదు. అది సింహం పిల్ల గొంతు పట్టుకొని కొంత మాంసం తీసుకుని దాన్ని బలంగా సింహం కూన నోట్లో పెడుతుంది. ఎప్పుడైతే మాంసం తన నోటిలోకి వెళుతుందో, దాని రుచి సింహం కూనకి తెలుస్తుంది. దాని అంతరంగంలో అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది. తనలో ఏం జరుగుతుందో సింహం కూనకి అర్థం కాదు. మొదటిసారి అది మాంసం రుచిని చూసింది. దానిలో కలిగిన భావంతో పరవశిస్తుంది. ఇదే మీలో జరిగే మొదటి ఆధ్యాత్మికానుభవం 'సతోరి' ఆ ఆనందం, ఆ అనుభవం అయితే మీకు అర్థం అవుతుంది.

మాంసం రుచి చూసాక సింహం కూన సింహంలా గర్జిస్తుంది. తన సహజస్థితిని చూపిస్తూ సింహంలా గర్జిస్తుంది. ఇప్పుడు సింహం సూటిగా సింహం కూన కళ్ళలోనికి చూస్తూ 'తత్త్వమసి' నీవు అదే అంటుంది. దీక్ష జరుగుతుంది. సింహంగా మారుతుంది. తాను గొర్రెని అని అనుకుంటున్న సింహం, సింహంలా మారుతుంది.

మీరు సింహమే కాని గొర్రె కాదు

ఒక విషయం తెలుసుకోండి; మీరు మామూలు మనిషి కాదు, మీరనుకునే గుర్తింపు కూడా కాదు.

మీరు గొర్రెలా ఉన్నారు. నా వైపు చూసి అర్థం చేసుకోండి. నేను కూడా గొర్రెని అని అనుకునేవాడిని. నేను ఏ విధంగా సింహంలా అయ్యానో చూడండి. నా జీవితంలోకి చూడండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. నేను గొర్రెని అని ఎంత తెలివి తక్కువగా అనుకుంటున్నారో తెలిసి మీరు సింహంలా అవుతారు.

కృష్ణుడు అన్న మాట, 'నీవు నా జీవితాన్ని అర్థం చేసుకుంటే ముక్తి పొందుతావు' కి అర్థం ఇదే. ముక్తి పొందిన వ్యక్తి జీవితం మీకు ముక్తిని ఇస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారో సరిగ్గా చూపిస్తుంది. ఆ జీవితం ముక్తి పొందిన వ్యక్తి కూడా ఒకప్పుడు అజ్ఞాని మీరు ఉన్న చోటే అయినా ఉన్నాడు. ఇది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అది మీ సహజలక్షణమైన ఆనంద స్థితి అనే మాంసం మింగే ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు సింహంలా గర్జిస్తారు. కాని గొర్రెలా బే బే అనరు.

సింహం కూనకు తాను సింహాన్ని అని తెలుసుకోవడానికి ఎంత సమయం పట్టింది. అంతా కలిపి ఒక క్షణం. ఎప్పుడైతే మాంసం లోపలికి వెళ్ళిందో, సింహం గర్జించటం మొదలుపెట్టింది. కాని గుర్తుంచుకోండి, మాంసం నోట్లోకి వెళ్ళటానికి ఎంత సమయం పట్టింది. గురుదేవుల గుహలోకి రావటానికి చాలా సమయం పట్టింది. దానికి ముందు అనుబంధం ఏర్పడాలి. అందుకే అంత సమయం అవసరం. జ్ఞానోదయం పొందటానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఆ వంతెన నిర్మాణానికి, ఆ అనుభవం పొందటానికి సమయం పడుతుంది.

గురువులు అవసరమా?

గురువులు మీతో మాట్లాడటం మీకు సత్యాన్ని బోధించటానికి కాదు, అది మీలో ఉన్నది అని మీరు తెలుసుకునే విధంగా సహాయం చేయటానికి. గురువు అద్దం వంటివారు. ఆయన సమక్షంలో లోతైన నిశ్శబ్దంతో కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోగలరు. జ్ఞానోదయం భాష గురుదేవులు.

ఆదిశంకరాచార్యులు, భజగోవిందంలో ఈ విధంగా చెబుతారు :

గురుదేవుల పాదపద్మముల దగ్గర ఆధీనమైతే

ప్రపంచపు సంకెళ్ళ నుంచి స్వేచ్ఛని పొందుతారు.

అప్పుడు మీ మనస్సు, ఇంద్రియాలు మీ నియంత్రణలోకి వస్తాయి.

అప్పుడు మీ హృదయంలో భగవంతుడిని చూస్తారు.

గురుదేవుల ప్రాముఖ్యం

ఆధునికమనస్సుకి గురువుల అవసరం గురించి అర్థం చేసుకోవటం చాలా కష్టం. గురువు మాత్రమే నిజమైన నీవు ఎవరు అనే సత్యాన్ని ఒక క్షణకాలదర్శనంలా ఇవ్వగలడు. ఆయన బోధించటానికి రాలేదు, మిమ్మల్ని మేల్కొలపటానికి వచ్చాడు.

గురువు అనే ఒకే ఒక గ్రంథం జీవించి ఉంది.

భగవంతుడికి ఆధీనమవటం కష్టం. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుడు అంటే ఎవరు మీకు తెలియదు కాబట్టి. భగవంతుడు అంటే మీకు కేవలం ఒక విషయం మాత్రమే కాని గురువు అంటే ఒక సంపూర్ణత్వం. ఆయన అంతిమస్థితిని చేరాడు. ఆయనకి భగవంతుడు అంటే సత్యం ఆయన భగవంతునితో జీవిస్తాడు. గురువు అంటే మీకు నిజం అని తెలుసు. ఆయనని చూడగలరు, కాబట్టి భగవంతుడిని చేరటానికి ఆయన మీకు ద్వారం లాంటివాడు. ఆయన ద్వారా భగవంతుని చేతుల్లోకి మీరు దూకవచ్చు.

మీ నిజమైన మీలోని మీరు అనే పరమానందానికి లేదా భగవంతునికి మధ్య ఉన్న అడ్డు గోడ అహంకారం. శిష్యుడిగా మారటం అంటే అహంకారాన్ని వదలేయటమే. అహంకారాన్ని వదలటం అంటే మీ గుర్తింపుల్ని వదలేయటం. అంటే, మీరు జీవించటానికి ఇంత కాలం మీరు మోస్తూన్న మీ గుర్తింపుల్ని వదలేయటం. అహంకారం మీకూ, జీవితానికీ మధ్య ఉన్నప్పుడు అహంకారాన్ని వదలటం అంటే మరణించినట్టే.

కేవలం గురుదేవుల పై ఉండే విశ్వాసం, ప్రేమ, గౌరవం మాత్రమే అహంకారాన్ని వదిలే విషయం సాధ్యమయ్యేలా చేసేది. మీరు క్రమంగా ధైర్యాన్ని కూడగట్టుకొని ఇంత కాలం మీరు పట్టుకొని వేలాడిన అహంకారాన్ని వదిలేయగలుగుతారు. మీరు అహంకారాన్ని ఎప్పుడు వదులుతారంటే, అలా వదిలినప్పుడు మీరు పడిపోయినా ఆ పడేది సర్వాంతర్యామి రూపమైన గురుదేవుల ప్రేమ, కరుణ అనే వలలోకే అని తెలుసుకున్నప్పుడు.

ప్రస్తుతం మీ అనుభవాలన్నీ మీ అంతరంగంలోకి భయాన్ని, ఆశని తీసుకువస్తాయి. అది కాకుండా ఉండే మరే అనుభవమైనా మీ అంతరాత్మకి బలాన్ని, చేతనస్థితిని ఇస్తుంది. ఇదే గురుదేవులు మీ పైన చేసిన పని ఫలితం. అది మీలో మానసిక విప్లవాన్ని తీసుకువచ్చి, మీలో సంపూర్ణమైన మార్పుని తెస్తుంది.

గురుదేవుల నుంచి నేర్చుకోవటం

మీరు అడగవచ్చు, 'నాకు గురువుతో అవసరం ఏమిటి? నేను నా జీవితం నుంచి నేర్చుకుంటాను కదా!' అని.

గురుదేవుల నుంచి నేర్చుకోవటం అనేది మధురమైన, ఆనందకరమైన అనుభవం. గురుదేవులు మీ అహంకారం అనే కణితిని ఆపరేషన్ చేసి తీసే ముందు, తన ఒడిలో కూర్చోపెట్టుకుని ప్రేమ అనే అనేస్థీషియా ఇస్తారు. ఆయన మీ మీద చూపించే ప్రేమతో, మీలో జరిగే మార్పు యొక్క బాధని తెలుసుకోలేరు. ఒకవేళ ఎప్పుడైనా బాధ కలిగినా కూడా దాన్ని ఆహ్లాదంగా తెలుసుకునే తత్వంతో గురుదేవుల సమక్షంలో ఉన్న ఆనందంలో చూస్తారు. గురుదేవులు అంటే గాఢమైన జీవితం ఆయన మీకు నేర్పించటమే కాదు, మీరు పొందవలసిన మార్పుని ఆనందంగా పొందే విధంగా చేస్తారు.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి చిన్నవాడైన తన కొడుకుని రాయిని కదపమని చెబుతాడు. అది పెద్ద రాయి, ఆ అబ్బాయి ఎంత ప్రయత్నించినా దాన్ని కదపలేడు. ఆ అబ్బాయి అలసిపోతాడు. అప్పుడు తండ్రి ఆ అబ్బాయితో ‘నీవు నీలోని శక్తిని మొత్తం ఉపయోగించలేదు. నీ శక్తినంతా ఉపయోగించు’ అంటాడు. కొడుకు పూర్తిగా అలసిపోతాడు. ఆ అబ్బాయి తండ్రి వైపు తిరిగి కోపంగా, ‘నీవు ఏం చెబుతున్నావు? నా శక్తిని అంతా ఉపయోగించలేదు అన్నావు. నేను అలసిపోయాను. నీవు చూడటం లేదా?’ అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు తండ్రి కొడుకుతో, ‘నీవు నన్ను అడగవలసింది. నేను నీ శక్తిని కాదా?’ అంటాడు.

అదే విధంగా మీరు గురువుల సమక్షాన్ని ఉపయోగించుకోవచ్చు. అర్థం చేసుకోండి, మీరు నన్ను అడగవచ్చు. మీరు గురువు సహాయం తీసుకోవచ్చు, కాని మీరు ఆ పని ఎప్పుడూ చేయలేదు. గురువు కూడా మీ శక్తి అని అనుకోలేదు. చాలా సహాయం దొరుకుతుంది, మీకు చాలా దొరుకుతుంది, కానీ మీరు ఎప్పుడూ అడగరు, ఉపయోగించుకోరు.

జీవితం ఒక గురువు, కాని ఎక్కడ నుంచి నేర్చుకోవాలి, ఏది నేర్చుకోవాలి, ఎలా? అనే విషయాలు తెలుసుకోవటం కష్టం. దత్తాత్రేయుడు, ఒక గొప్ప గురుదేవులు ఈ విధంగా చెబుతారు, ‘నాకు ఎప్పుడూ గురువు లేరు. ఎందుకంటే నా జీవితమే నా గురువు. ఏ విధంగా ఏకాగ్రత నిలపాలో వేటగాడి దగ్గర నుంచి నేర్చుకున్నాను. చీమల నుంచి సంపద ఎలా దాచాలో నేర్చుకున్నాను.' జీవితం మీకు గురువు అయితే సరైన విషయాలు తెలుసుకునే వివేకం ఉండాలి. కానీ జీవితంలో చాలా సార్లు మీరు తప్పు విషయాలు ఎంచుకుంటారు.

ఒక చిన్న కథ : హరిశ్చంద్రుడు తన జీవితాంతం సత్యంతోనే జీవించాడు. ఆయన కథ ఏం చెబుతుందంటే సత్యం కోసం ఒక సమయంలో భార్యని, కొడుకుని కూడా అమ్ముకోవలసి వస్తుంది.

ఒకసారి ఒక గ్రామంలో ఒక బోధకుడు హరిశ్చంద్రుని కథ చెప్పి, ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, అని అడుగుతాడు. ఒక వ్యక్తి 'జీవితంలో ఏం జరిగినా సరే నిజమే చెప్పాలి' అని నేర్చుకున్నాను అని జవాబు ఇస్తాడు. బోధకుడు సంతోషపడి మరొక వ్యక్తిని 'నీవు ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నావు' అని అడుగుతాడు. ఆ రెండవ వ్యక్తి 'అవసరానికి భార్యని అమ్మవచ్చు అందులో తప్పు లేదు' అని నేర్చుకున్నాను అని జవాబు ఇస్తాడు. చూడండి, ఒకే కథ నుంచి మీరు రెండు విషయాలు నేర్చుకోవచ్చు.

జీవితంలో ప్రతిసారీ సరైన విషయాలు నేర్చుకునే వివేకం మీకు లేకపోవచ్చు. అందుకే జీవితంలోనికి గురుదేవులు ప్రవేశిస్తారు. ఆయన మీకు సరైన మార్గం చూపించగలడు ఎందుకంటే ఆయన ప్రయత్నించి విజయం పొందాడు కాబట్టి.

చూడండి, కొన్ని మందులు ఇచ్చి కూడా ట్యూమర్ని తగ్గించవచ్చు. కాని దానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు. గురుదేవులు వాటిని క్షణకాలంలో తీసివేయగలరు. మరొక విషయం ఆ ట్యూమర్స్ తో బ్రతికేటప్పుడు ఉండే బాధతో పోల్చితే గురువులు దాన్ని తొలగించేటప్పటి బాధ చాలా తక్కువ. అది అసలు బాధ కాదు. కాని ట్యూమర్ తో జీవించటం కష్టం ప్రమాదకరం కూడా. అందుకే గురుదేవుల దగ్గరకి వెళ్ళటం అన్ని విధాలా మంచిది.

జీవితం ఒక లోతైన రహస్యం, దాన్ని మన కోరికలతో తెలుసుకోలేం. మన కోరికలు గొప్పవిగా, జీవితానికి సరితూగేవిగా కనిపించవచ్చు. ఎందుకంటే జీవితం అంటే మనకి ఉండే తక్కువ, సంకుచితమైన అభిప్రాయం వల్ల ఉపయోగం లేనివి ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. కాని చాలా అద్భుతమైన అర్ధవంతమైన అనుభవాలు మన గుమ్మం దగ్గరే ఉన్నాయి. మన సమస్య ఏమిటంటే అటువంటివి ఉన్నాయని ఊహించలేం. ఎందుకంటే అది మనకి తెలియదు కాబట్టి.

ఈ సందర్భంలోనే గురువు ప్రవేశిస్తారు. ఆయన జీవితాన్ని సంపూర్ణంగా చూసారు. మీరు ఊహించలేనివాటిని, ఆయన చూడగలరు. మీ జీవితంలో కూడా పరిపూర్ణత సాధించే విధంగా ఆయన సహాయం చేయగలడు. మీరు చేయవలసింది, నమ్మకంతో ఆయనతో పాటు నడవగలగటం, తరువాత జరిగే విషయాలు ఈ సత్యం పట్ల మీలో నమ్మకాన్ని కలిగిస్తాయి. అప్పుడు మీరు ధర్మచక్రంలోకి ప్రవేశించగలుగుతారు. అది మరింత నమ్మకం వైపు తీసుకువెళుతుంది.

గురువు మీ మీద ఏదీ బలవంతంగా మోపరు. మీలో మీకు అవసరం లేనివాటిని తీసేయగలుగుతారు. మీ మీద బలవంతంగా మోపబడినవాటిని తీసివేస్తారు. మిమ్మల్ని కొత్తగా, తాజాగా చేయగలుగుతారు. మిమ్మల్ని చక్కని ఖాళీ కాన్వాసులా చేస్తారు. దాని మీద మీ ఇష్టమైన అందమైన పెయింట్ వేసుకోవచ్చు. మీ సంగీతాన్ని మీరు కూర్చవచ్చు. మీ నాట్యాన్ని మీరు చేయవచ్చు. గురుదేవులు మీ జీవితంలో అతిమధురమైన అనుభవాలకి ద్వారం తెరవగలడు. మీ ప్రత్యేకమైన అనుభవాలని మీరు పొందగలరు.

పద్ధతికి, క్రమానికి తేడా తెలుసుకోండి. పద్ధతి మళ్ళీ చేస్తే అదే ఫలితం వస్తుంది కానీ చేసే కార్యక్రమం తిరిగి చేస్తే ప్రతిసారి అదే ఫలితాన్ని ఇవ్వదు. దాన్ని మీ అంతట మీరు స్వయంగా చేయలేరు. పద్ధతిని గురువులతో చేయటమే సాధనకార్యక్రమం. గురువు లేకుండా చేస్తే పద్ధతి అవుతుంది.

శాశ్వతమైన నిత్యానుబంధం

అనుబంధం అంటే ఏమిటి ?

అనుబంధం అనేది మీలో ఉన్న మీకు తెలియని కోణాలని మీకు చూపిస్తుంది. మీకు అనుభవపూర్వకంగా మీరు ఎవరినైనా దేన్నైనా ప్రేమించగలరని నిరూపిస్తుంది. మీరు ప్రేమించగలరని. ప్రేమకోసం ఎంత గొప్ప విషయాన్నైనా త్యాగం చేయగలరు అని అనుబంధం మీకు చూపిస్తుంది.

మనం జన్మించినప్పుడే సంపూర్ణత్వంతో జన్మిస్తాం. అయితే మనలోని అన్ని కోణాలూ మనం చేతనస్థితిలో లేనప్పుడు మనకి తెలియదు. బయటి ప్రపంచానికి కూడా తెలియదు. అనుబంధం మనకి తెలియని కోణాలని మనలో మేల్కొలుపుతుంది. మనం వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేసి వాటిని బయటి ప్రపంచానికి అనుబంధంగా చూపిస్తుంది. అనుబంధాలు మీకు తెలియని మీలో ఉన్న అనేకకోణాలని మేల్కొలుపుతుంది, ఎవరితోనైనా, దేంతోనైనా ఉండే అనుబంధం గురుదేవులతో ఉండే అంతిమబంధానికి తీసుకువెళుతుంది.

మీరు ఎవరితోనైనా ప్రేమలో పడితే, అది స్త్రీ, పురుషుడు, పిల్లలు, దేవతామూర్తి, గురువు, ఎవరితోనైనా సరే, మీరు ఇంతకు ముందు మీలో చూడని అంశాలని చూడగలుగుతారు. మీలో ప్రేమ వికసించే కొద్దీ బాధ్యతాయుతంగా తయారవుతారు. మీరు జీవితసారాన్ని అనుభవించగలుగుతారు. గురుదేవులు, సర్వాంతర్యామితో ఒకటిగా ఉండే ఆయనతో అనుబంధం అన్ని రకాల బంధాల కంటే లోతైన బంధం. అది అత్యుస్థాయిలో ఉండే బంధం.

సాధారణంగా అన్ని రకాల అనుబంధాలూ బందీల్ని చేస్తాయి కాని గురుదేవులతో ఉండే అనుబంధం విముక్తుల్ని చేస్తుంది. దానికి మిమ్మల్ని అంతిమస్థితి అయిన నిత్యానంద స్థితికి తీసుకువెళ్ళగల శక్తి ఉంటుంది. ఈ బంధంలో కూడా మీరు బందీ అవ్వాలని ప్రయత్నించినా, అది పరమానందాన్ని మాత్రమే ఇస్తుంది. గురుదేవులతో అనుబంధం ఎప్పటికీ బందీలని చేయదు.

గురుదేవుల రూపం అంతిమస్థితికి మీకూ మధ్య వారధి. ఎందుకంటే గురుదేవుల రూపం అంతిమసత్యం తాలూకు రూపం. అందులో మానవాంశ, భగవదంశ, రెండు ఉంటాయి. మీరు ఆ రూపంతోనే కాకుండా, ఆ రూపం తాలూకు సత్యంతో కూడా అనుబంధాన్ని పెంచుకుంటే మీరు అంతిమజ్ఞానాన్ని చేరగలరు. గురుదేవులు అంటే అన్ని రూపాలు, రూపం లేనివారు. ఆయనని ఒక చట్రంలో కుదించలేం. ఆయనని విగ్రహంలా మార్చి పూజించలేం. ఆయన అన్ని రూపాలకీ అతీతమైనవాడు. అన్ని కోణాలకీ అతీతుడు. ఆయనలో అనంతమైన కోణాలు ఉంటాయి. ఆయనని మాతృదేవిగానో, ప్రియుడుగానో ఒక ప్రేమలో ఉంచినప్పుడు ఆయనని పట్టుకొని ఉంచటం మీకు సులభం. ఆయన మిమ్మల్ని అయోమయంలోకి తోస్తాడు. అప్పుడు మీరు మీ లోపలికి వెళ్ళి జ్ఞానోదయం పొందుతారు. ఆయన మీరు అనుకునే మీరు మరణించి, అసలైన మీరు మేల్కొనాలని చూస్తాడు.

అమాయకత్వంతో గురువుల సమక్షానికి రండి. ఆయన మీకు మార్గాన్ని చూపిస్తారు. ప్రేమతో ఆయన చేతుల్లో ఒదిగిపోవటానికి తటపటాయించవద్దు. ఆయనతో పరమానందంలోకి ఎగిరివెళ్ళిపోతారు.

గురుదేవులు మనతో చాలా చట్రాల్లో, చాలా స్థితులలో బంధాన్ని ఏర్పరుస్తారు. అందలోని అందాన్ని, గాఢతని మనకి ప్రతి అనుబంధంలో కనిపించేలా చేస్తుంది ఈ బంధం. ఎవరైతే ఆయనలోనికి ప్రవేశిస్తారో ఆ అదృష్టవంతులకి ఈ అవకాశం ఉంటుంది. సత్యం కోసం అన్వేషించే ప్రతి ఒక్కరిని ఆయన వారివారికి సరిపడే ప్రత్యేకమైన, అందమైన దారిలో అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం అనే ప్రకాశం వైపు తీసుకువెళతారు. ఇది సున్నితమైన ప్రేమ వ్యవహారం. లోతైన నమ్మకంతో, అనుబంధంతో రెండు ఆత్మల కలయిక ఇది. గురుదేవుల అంతరంగజ్యోతి శిష్యుల అంతరంగంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడే తెలుసుకునే తత్త్వం అనే నిప్పు రవ్వ వెలుగుతుంది.

రకరకాల అనుబంధాలు మీలో రకరకాల అంశాలని, చూపిస్తాయి. ప్రేమికునిలో ప్రేమ అనే భావం కలిగిస్తుంది. మీ చుట్టూ ఉండే స్నేహితులు స్నేహభావం మీలో కలిగేలా చేస్తారు. మీ పిల్లలు మీలో మాతృత్వం అనే కోణాన్ని బయటికి తెస్తారు. మీ తల్లిదండ్రులు మీలోని చిన్నతనాన్ని చూపిస్తారు. కాని గురుదేవులు మాత్రం మీలోని అన్ని కోణాలనీ ఆవిష్కరిస్తారు. ఆయన మాత్రమే మీలో మీకు తెలియని జ్ఞానోదయం అనే కొత్త కోణాన్ని మేల్కొలుపుతాడు. గురుశిష్య సంబంధం మీలో తీసుకువచ్చే మార్పుని మీరు లెక్క కట్టలేరు. గురువు మీకు చాలా రకాలైన అనుబంధాల్ని కలిగించి మీలో అంతిమసత్యం అనుభూతిని, ఆ అనుబంధం ద్వారా ఆ యోగం ద్వారా కలిగిస్తారు.

భగవంతుడు, గురుదేవులు

కబీరు చాలా చక్కగా ఈ విధంగా పాడేవాడు.

గురువు, భగవంతుడు ఇద్దరూ నా ముందుకి వస్తే, ముందుగా ఎవరికి నమస్కరించాలి? నేను ముందుగా గురువుకి నమస్కరిస్తాను. ఆయనే నాకు భగవంతుడిని చూపాడు కాబట్టి.

ఒకసారి స్వామి వివేకానంద తన తోటి శిష్యులతో ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంసని భగవంతుడుగా చెబుతాడు. దానికి ఒక శిష్యుడు అభ్యంతరం చెప్పి, ‘ఆయన జ్ఞానోదయమైన యోగీశ్వరుడు. అది ఒప్పుకుంటాను, కాని ఆయనే భగవంతుడు అంటే అతిగా ఉంది. ఆయనని భగవంతుడు అని ఎలా చెప్పగలవు? అంటాడు.

అతన్ని వివేకానందుడు, ‘నీ దృష్టిలో భగవంతుడు అంటే ఏమిటి?’ అని అడుగుతాడు. దానికి ఆ శిష్యుడు ‘భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్లలో ఉంటాడు’ అని జవాబు ఇస్తాడు.

అంతటా ఉంటాడు అంటే అర్థం ఏమిటి?’ అని వివేకానందుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు. ఆ శిష్యుడు ‘భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని అర్థం’ అంటాడు, ‘అయితే ఇక్కడ నీకు భగవంతుడు కనిపించాలి కదా!’ అంటాడు. శిష్యుడు అయోమయపడి ఏమీ జవాబు చెప్పలేదు. అప్పుడు వివేకానందుడు అతనితో, ‘నీకు భగవంతుడంటే ఒక విషయం. నీవు చూడలేవు. నీకు అర్థం కాదు. కాని నీ ముందు ఉన్న గురువు భగవంతుడు, అది నిజం’ అని అంటాడు.

నన్ను ఒక వ్యక్తి ‘గురువుకీ భగవంతుడికీ తేడా ఏమిటి?’ అని అడిగారు. నేను అతన్ని ‘భగవంతుడి గురించి నీకేమీ తెలుసు’ అని అడిగాను. మీకు తెలిసింది ఏవో కొన్ని మాటలు మాత్రమే. అది ఒక విషయం మాత్రమే. భగవంతుడు అని మీరు అనేటప్పుడు మీరు ఎం మాట్లాడుతున్నారో మీకు తెలియదు. మీకు భగవంతుడు అంటే ఒక భావన. ఆ అంతిమశక్తి, విశ్వచేతనస్థితి లేదా మీరు మరే పేరు అనుకున్నా, అదేమిటో మీకు ఏమీ తెలియనిదాని గురించి మీకు ఉండే ఊహ. భగవంతుడంటే బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మసృష్టి గురించి ఈ విధంగా ఉంటుంది. త్రినేత్రుడైన శివుడు గురువు

నాలుగు చేతుల విష్ణుమూర్తి

నాలుగు ముఖాల బ్రహ్మ

ఆయనే మానవరూపంలో ఉన్న పరమశివుడు (అత్యున్నతుడు)

గురువు అంటే అంతిమవిశ్వశక్తి నిజమైన రూపం. గురువు ఆయన ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఆయన వర్తమానం. మీకు, భగవంతునికి మధ్య వారధి గురువు. ఆ విధంగా చూస్తే ఆయన భగవంతుని కంటే గొప్ప.

నన్ను చాలా మంది అడుగుతుంటారు, 'మీరు భగవంతుడా?' అని. నేను వారితో, 'మీరు భగవంతుడు అంటే ఏమిటి, ఎవరు అని తెలియనప్పుడు, నేను భగవంతుడినా కాదా అని మీరు ఎలా అడగగలరు?' అని అంటాను. భగవంతుడిని నిర్వచించలేం. ఆయనని అనుభూతితోనే తెలుసుకోగలం. మీకు ఒక విషయం స్పష్టంగా వివరిస్తాను; నేను భగవంతుడిని అని నిరూపించటానికి ఇక్కడికి రాలేదు. మీరు భగవంతుడు అని నిరూపించటానికి ఇక్కడికిరా వచ్చాను. నాలోని దివ్యత్వాన్ని నిరూపించటానికి రాలేదు మీలోని దివ్యత్వాన్ని నిరూపించటానికి ఇక్కడికి వచ్చాను.

గురువు అంటే నదికి ఒక పక్కన ప్రజ్వరిల్లే కార్చిచ్చు లాంటివాడు. శిష్యుడు నదికి అటు పక్కన ఉంటాడు. ఆ నది సంసారం, జననమరణాల సంసారమే ఆ నది. గురువుకి, శిష్యుడికి మధ్య వారధి ఉంటే కార్చిచ్చు శిష్యుణ్ణి చేరలుగుతుంది. వారధిని దేంతో చేశారనేది అనవసరం. దాన్ని చెక్కతో కాని సిమెంట్ తో కాని చేయవచ్చు. కాని అది ఆ కార్చిచ్చుని అటు వైపు వెళ్ళనీయగలగాలి. అదే విధంగా మీరు ఏ అనుబంధాన్ని గురువులతో ఏర్పరచుకున్నా పరవాలేదు. కాని మీరు ఆ అనుబంధంలో కరిగిపోగలగాలి.

మీరు దానిలోకి కరిగిపోగలిగితే, మీ భావనలని సఫలం చేసుకుంటారు. మీరు అంతిమస్థితి అయిన నిత్యానంద స్థితిని చేరలుగుతారు. ఈ సత్యాన్ని మీరు లోతుగా అర్థం చేసుకోగలిగి పట్టుదలతో సాధన చేయండి. 'నేను నా భావనల మీద ఏకాగ్రతని నిలిపి గురుశిష్యబంధంలో కరిగిపోతాను' అని, అది మిమ్మల్ని అంతిమస్థితికి తీసుకువెళుతుంది. ఎలా కరిగిపోవాలో తెలియదు అని అనవద్దు. ఆ పట్టుదల చాలు. అది ఆటోమాటిక్గా జరుగుతుంది. గురుశిష్యుల మధ్య ఏ అడ్డంకి వచ్చినా వారి మధ్య ఉన్న బంధంలో అది కరిగిపోతుంది.

గురుదేవులతో ఐదు రకాల అనుబంధం

గురుదేవులతో అనుబంధాన్ని ఐదు విధాలుగా పెంచుకోవచ్చు. ఒక్కొక్క అనుబంధం ఒక్కొక్క మార్గాన్ని తెరుస్తుంది. అది మిమ్మల్ని మీకు దగ్గర చేస్తుంది. అందులో ఒకటి మాతృభావం, తల్లికి బిడ్డల పట్ల ఉన్న దృక్పథం. గురుదేవుల్ని మీ బిడ్డలా భావించటం. దీన్నే వాత్సల్య భావం అంటారు. ఇదే యశోదకి శ్రీకృష్ణునితో ఉన్న అనుబంధం. మరొకటి బిడ్డకి తల్లి పట్ల ఉన్న భావం. దీన్నే మాతృభావం అంటారు. రామకృష్ణ పరమహంసకు కాళీమాతతో ఉన్న భావం. గురుదేవుల్ని తల్లి అనే భావంతో చూడటం. మూడవది స్నేహభావం గురుదేవుల్ని మీ స్నేహితుడుగా చూడటం. దీన్ని సఖ్యభావం అంటారు. కుచేలుడికి, కృష్ణుడికి; అర్జునుడికి, కృష్ణునికి మధ్య ఉన్న అనుబంధం.

తరువాతది సేవాభావం దీన్నే దాసభావం అంటారు. ఈ సంబంధంలో శిష్యుడు, గురువు పట్ల విశ్వాసం గల సేవకుడుగా ఉంటాడు. హనుమంతునికి, రామునికి మధ్య ఉన్న బంధం. అంతిమభావం ప్రేమభావం. దీన్నే మధురభావం అంటారు. రాధాకృష్ణుల మధ్య ఉన్నది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మధురభావానికి స్త్రీపురుషభేదం లేదు. ఇది శరీరానికి సంబంధించిన విషయం కాదు. శరీరానికి అతీతమైన ఆత్మకి సంబంధించిన భావం. గురువు పురుషుడు, మీరు పురుషుడు, లేదా గురువు స్త్రీశిష్యులు స్త్రీ అయినా వారి మధ్య మధురభావం ఏర్పడవచ్చు. ఇది స్త్రీపురుష అనే విషయానికి సంబంధించి ఉండదు. ఇది లోతైన, గాఢమైన అనుబంధం మాత్రమే.

చివరిది మహాభావం, ఇది ఐదు భావాలు ఉండి ఇంకా ఏదో ఉంటుంది. అసలైన గురుశిష్యుల బంధం, కొన్ని సార్లు గురువు మీ బిడ్డలా అనిపించవచ్చు. కొన్నిసార్లు మీకు తల్లిలా ఉండవచ్చు. ఒకసారి మీ స్నేహితుడుగా, మీ యజమానిగా, ప్రియుడుగా ఈ విధంగా అనిపించవచ్చు. గురుదేవులతో అనుబంధం, ఈ ఐదూ ఉండి ఇంకా ఏదో ఉంటుంది. మీరు గురువుతో ఈ ఐదు భావాల్లో ఏదో ఒక విధంగా ఉండవచ్చు. లేదా ఈ ఐదు భావాలూ కలిసి ఉండవచ్చు.

గురుశిష్యుల సంబంధం వివిధదశలు

గురుశిష్యుల సంబంధంలో చాలా దశలు ఉంటాయి. అందులో మొదటిది పూర్తిగా తెలివితేటలు, తార్కికజ్ఞానదశ. ఇది అనుమానాల మీద ఆధారపడి ఉంటుంది. చాలా అనుమానాలు నిరంతరం వస్తూ ఉంటాయి. మీరు ఇలా అనుకోవచ్చు 'ఆ.....! ఈయనకి చూస్తే ముప్పై సంవత్సరాల వయస్సు, ఈయన ఏం గురువు? పెద్దగా చదువుకోలేదు. ఈయన చెప్పేది ఏ విధంగా లక్షల మంది వింటున్నారు?' ఇలా మీకు అనుమానాలు ఉంటాయి. తెలివితేటల దశలో అనుబంధం ఏర్పడదు.

తెలివితేటల తరువాతది మేధ లేదా వివేకదశ. వ్యతిరేకదృక్పథం నుంచి అనుకూల దృక్పథానికి వస్తుంది. 'ఆయన ప్రోగ్రాంకి వెళ్ళి అసలు ఏమి చెబుతున్నారో, ఎలా చెబుతున్నారో చూడవచ్చు కదా! ఆయన ఏం చెబుతాడు అనుకునేదాని నుంచి 'ఏదో ఉండి ఉంటుంది, అనుకునే వైపు వెళ్ళటమే. నేను నమ్మను అనను, అలా అని నమ్ముతాను అనను. చూద్దాం అసలు అక్కడ ఏముందో అన్న దశ వివేకదశ.

దీని తరువాతది మేధ, దాంతో పాటు భావావేశాలు ఉంటాయి. అంటే 60% మేధ, 40% భావాలు ఉంటాయి. అప్పుడు గురువు మంచి స్నేహితుడుగా అనిపిస్తారు. నాకు సలహా అవసరమైనప్పుడు ఈయన మార్గదర్శిగా ఉంటారు అనుకుంటారు. నా జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు. ఈయన చెప్పనవసరం లేదు. కాని ఎప్పుడైనా అవసరం అనిపిస్తే ఈయన సహాయం తీసుకుంటాను. ఇదే గురువుని స్నేహితుడుగా చూసే దశ. దీన్నే సఖ్యాభావం అంటాను.

ఇది నడవటానికి ఉపయోగించే ఊత కర్ర లాంటిది. ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు కర్రని ఉపయోగిస్తారు. తరువాత పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మీకు మీరు పరిష్కారం తెలుసుకోలేనప్పుడు మీరు ఆయనతో, 'మీ బోధలు బాగున్నాయి. కాని వాటిని నేను పూర్తిగా అర్థం చేసుకొని అనుసరించలేకపోతున్నాను. నేను ఏం చేయాలి? అని అడుగుతారు. అప్పుడు ఆయన మీకు మానసికాధారాన్ని ఇస్తారు. అప్పుడు కర్ర ఒకటే సరి పోదు మరికొంత ఆధారం కావాలి అనుకుంటారు. అప్పుడు ఆయన చేతిని ఆసరాగా తీసుకొని నడవటం ప్రారంభిస్తారు. ఆయన చేతిని పట్టుకున్నప్పుడు మీలో కృతజ్ఞతాభావం ఉంటుంది.

మీకు కేవలం కర్రే ఉంటే అది భావావేశంతో ఉన్న మేధ, అది స్నేహభావం. మీరు ఆయన చేతిని పట్టుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఉన్నత స్థితికి లేపుతారు. అప్పుడు మేధతో కూడిన భావావేశంగా మారుతుంది. ఈ దశలో గురువు తల్లిగా, తండ్రిగా అనిపిస్తారు. స్నేహితుని దగ్గర నుంచి తల్లి, తండ్రి అనే భావం వైపు వచ్చాక అనుబంధం మరింత లోతు అవుతుంది. క్రమంగా మీరు ఈ విధంగా అనుకోవటం మొదలుపెడతారు. ఈయన కేవలం స్నేహితుడే కాదు. ఈయన సలహాలు ఇచ్చే వ్యక్తి మాత్రమే కాదు. ఈయన నన్ను సమస్యల నుంచి బయటికి తీసుకువస్తాడు.

పలుసార్లు మిమ్మల్ని సమస్యల నుంచి కాపాడాక, మీ ఊహలకి అందని సహాయం చేసాక ఆయన పట్ల మీ దృక్పథం కేవలం భావాత్మకమే అవుతుంది. ఆయన మీ హృదయంలో, మీ అంతరంగంలో నిండి ఉంటాడు. ఆ సమయంలో ఆయనకి ఒక సేవకుడుగా నమస్కరిస్తారు. అది సిగ్గుపడుతూ కాదు. మిమ్మల్ని మీరు అర్పించుకోగల వ్యక్తి దొరికినందుకు ఆయనకి అధీనమవుతూ గౌరవంతో నమస్కరిస్తారు. రామాయణంలో హనుమంతుడు, రాముని పట్ల ఇదే విధమైన దృక్పథంతో ఉంటాడు. అతను రామునికి పూర్తిగా అధీనమై ఉంటాడు. అటువంటి అనుబంధం లోతుగా భావాత్మకతతో ఉంటుంది. ఇది మరింత భావాత్మకమైంది.

క్రమంగా మీ అనుబంధం గురువులతో మరింత గాఢంగా లోతుగా ఉంటుంది. ఆయన రక్షణలో ఉంటారు. ఆయన శ్రద్ధ మీ మీద కావాలని అడగటం సహాయం కావాలి అని అడగటం మాని ఆయనకి ఆధారంగా ఉండటానికి ఇష్టపడతారు. ఆయనని ప్రేమిస్తారు. ఇది సంపూర్ణమైన భావాత్మకదశ. తల్లి తన బిడ్డ బాగుని కోరే దృక్పథం ఇది.

ఈ నాలుగు స్థితుల్లో, తెలివితేటలు, మేధ, మేధ - భావాత్మకత ; భావాత్మకత- మేధ; మీ జీవితం గురువుల జీవితం వేరువేరుగా ఉంటుంది. మీరు కేవలం ఆయన నుంచి సహాయం పొంది జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటారు, అంతే.

భావాత్మకదశ పరిణతిని పొందినప్పుడు, మీ జీవితం ఆయన నుంచి వేరు కాదు అని తెలుసుకుంటారు. భావాత్మకదశ నుంచి అంతరాత్మదశకి మారతారు. అప్పుడు మీరు ఆయన కోసం మీ జీవితాన్ని త్యాగం చేయాలి అనుకుంటారు. ఆయనకి మీ జీవితాన్ని అంకితమిస్తారు. అంతరాత్మదశలో ఆయనతో ఐక్యమవుతారు. ఇది తల్లిబిడ్డల మధ్య ఉన్న అనుబంధాని కంటే బలమైనది. స్త్రీపురుష భేదం తెలియకుండా వారి మధ్య ఉన్న లోతైన ప్రేమబంధం అది. దీన్నే నేను మధురభావం అంటాను. అంతరాత్మ దశలో, భావాత్మకత కలసిపోయే గాఢమైన అనుబంధం ఇది.

మధురభావం పరిణతి పొందితే మీకు ఆయనకి మధ్య భేదం కనిపించదు. ఇద్దరు వ్యక్తులు ఉండరు. ఆయన మీరు ఒకటే. అదే మహాభావం. మీరు గురుదేవులు ఒకటే అన్న అనుభూతి మహాభావం. మీరు అంతిమభావమైన 'తత్త్వమసి' అదే నీవు అన్న భావాన్ని అనుభవిస్తారు.

ఈ విధంగా ఒక దాని తరువాత ఒక దశలో గురుశిష్యుల బంధంలో మీరు అభివృద్ధి చెందుతారు. కాకపోతే ఏ సమయంలోనైనా ఏదో ఒక భావం అన్నింటి కంటే ప్రాముఖ్యంలో ఉంటుంది.

అందరూ సామాజికశక్తితోనే వృద్ధి చెందుతారు. కాని గురుదేవులతో ఉండే అనుబంధం ఎవరిది వారిదే. ఇదే ఇందులోని అందమైన విశేషం. అది రాముడు - హనుమంతుల మధ్య ఉన్న భావం లాంటి దాసభావం కావచ్చు. యశోదాకృష్ణుల మధ్య ఉన్న వాత్సల్యభావం కావచ్చు, కృష్ణార్జునుల మధ్య ఉన్న స్నేహభావం లేదా సఖ్యభావం కావచ్చు, రామకృష్ణ కాళీమాతల మధ్య ఉన్న మాతృ భావం కావచ్చు. లేదా రాధాకృష్ణుల మధ్య ఉన్న మధురభావమై ఉండవచ్చు. ప్రతి భావం ప్రత్యేకమైందే. గురుశిష్యుల మధ్య అనుబంధం ఇలా ఏదైనా ఉండవచ్చు. ప్రతి శిష్యుడు తన మార్గంలో సత్యాన్వేషణని చేస్తూ అభివృద్ధి చెందుతాడు.

గురువులతో ఏ విధంగా ఉండాలి - విప్పారిన అంతరంగంతో ఉండాలి

మీరు గురువుల సమక్షంలో విప్పారి, తెరవబడిన, అంతరంగంతో ఉండాలి కాని బిగుసుకుపోయి, ముడుచుకుపోయి ఉండకూడదు. తర్కజ్ఞానాని కంటే చాలా గొప్పది జీవితం. మీ తర్కాన్ని వదిలేయండి. పూర్తిగా విప్పారి, ఎరుకతో ఉండండి. ఎప్పుడైతే మీరు తర్కాన్ని వదిలి విప్పారి ఉంటారో, జీవచైతన్యంతో ఉండే గురుదేవుల శక్తి మీలో మార్పుని తెస్తుంది. మీరు ఒక కొత్త వ్యక్తిగా, కొత్త శక్తిగా, కొత్త చేతనస్థితిగా రూపాంతరాన్ని, మార్పుని పొందుతారు.

ఈ విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు ఒక కొత్త వ్యక్తిగా అవుతారు. మీరు కొత్తగా, స్పష్టంగా ఉండే ఒక న్యూక్లియర్ అవుతారు. మీరు తేలికగా అవుతారు. మీలో ఒక భాగం కాని కణితాల్ని మోస్తూ ఉండే మీరు, ఆ కణితల బరువు వదిలించుకున్నారు. మీలో సహజమైన భాగం ఎప్పుడూ మీ నిశ్చలత్వాన్ని భంగపరచదు. అలా భంగపరిచేది మీలో భాగం కాదు.

కాబట్టి వికసించి ఉండండి. తెరవబడిన అంతరంగంతో ఉన్నప్పుడు మాస్టర్ సర్జన్ మీలో మీరు జన్మ జన్మల నుండి మోస్తున్న కణితాల్ని తొలగిస్తారు. మీరు గురుదేవుల సమక్షంలో సంపూర్ణంగా ఉండండి. గురువులు చెప్పే విషయాన్ని మీరు ఒప్పుకుంటారా లేదా అని కాదు. దీనికి అతీతంగా వెళ్ళండి. మీరు సూర్యోదయాన్ని చూసినప్పుడు దాన్ని ఒప్పుకోవటం, ఒప్పుకోకపోవటం అని ఏదైనా ఉంటుందా? లేదు! అది అదే, అంతే. ఒకసారి ఆ భావం మీలో ఒక భాగమైతే చాలు, ఇక ఏదీ అవసరం లేదు. మిమ్మల్ని మీకు తెలియచేసే అనుమతిని, గురువుకి మీరు ఇచ్చినట్టే. శిష్యుడుగా ఉండటం అంటే పూర్తిగా విప్పారి ఉండాలి. భయపడకూడదు. మిమ్మల్ని మీరు దాచకూడదు. మీరు పూర్తి నిజాలతో విప్పారి ఉండాలి. అప్పుడే గురువు మీ మీద పనిచేయగలరు. మీరు చేయగలను అని ఊహించలేని దిశ వైపుగా ఆయన మిమ్మల్ని తిప్పుతారు. మీరు భయపడే దశల్లోకి వెళ్ళగలిగే ప్రేరణని ఆయన మీకు ఇస్తారు. హద్దులు లేవు అని మీరు తెలుసుకునే అంతిమ స్థితికి మీరు చేరేవరకూ ఆయన మీ హద్దుల్ని విస్తృతం చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు కూడా ఆయనలా అవుతారు. మీరు పూర్తి స్వేచ్ఛని పొంది, హద్దులు లేని పరమహంస అవుతారు. మీరు చేయవలసింది కేవలం గురుదేవులకి, సర్వాంతర్యామికి తెరవబడిన అంతరంగంతో ఉంటే చాలు. ఈ విశ్వాసం ఉంటే మీకు సర్వాంతర్యామికి మధ్య వారధి ఏర్పడుతుంది.

ఒక చిన్న కథ : ఒక శిష్యుడు గంగానదిలో పడిపోతాడు. అతని గురువుగారు గంగ ఒడ్డున కూర్చొని ఉంటాడు. ఆయనని చూసి శిష్యుడు 'రక్షించండి! రక్షించండి! భగవంతుడా రక్షించు, గురుదేవా రక్షించండి' అని గట్టిగా అరుస్తాడు.

అప్పుడు గురువుగారు ఆ శిష్యుడితో ‘మూర్ఖుడా! లేచి నిలబడు. నిన్ను నీవు రక్షించుకో’ అని అంటాడు. శిష్యుడు గురువుతో గట్టిగా, 'మీ పాఠాలు తరువాత బోధించండి. ముందు నన్ను రక్షించండి. నా జీవితం ప్రమాదంలో ఉంది. నన్ను రక్షించండి, చాలు' అని అరుస్తూ అడుగుతాడు. గురువుగారు అక్కడి నుంచి కదలకుండా అదే మాట అంటాడు, ‘మూర్ఖుడా! నిన్ను నీవు రక్షించుకో. నిలబడు అంటాడు. అప్పుడు శిష్యుడు గురువుతో, ‘మీరు నా గురుదేవులు అనుకున్నాను. దయచేసి నన్ను రక్షించండి రక్షించండి' అని అడుగుతాడు. గురువుగారు పెద్ద గొంతుతో 'మూర్ఖుడా! లేచి నిలబడు' అని అరుస్తాడు. శిష్యుడు భయపడి లేచి నిలబడతాడు. చూస్తే నీళ్ళు అతని నడుం వరకే ఉంటాయి.

మీరు కూడా ఇదే విధంగా పోరాడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు కూడా నీళ్ళలో పడి అవి నడుము లోతు మాత్రమే ఉన్నాయని తెలియక పోరాడతారు. మీరు గురువుల మాట విని నిలబడినప్పుడే, నీళ్ళు నడుము వరకు మాత్రమే ఉన్నాయని తెలుసుకొని రిలాక్స్ అవుతారు. మీరు మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి అనుకునే సమస్యలు అసలు లేవు. అవన్నీ మీ ఊహలు. అవి ఏవీ కూడా నిజం కావు. కాబట్టి అర్థంచేసుకోండి, నేను చూసుకుంటాను (ఐ విల్ టేక్ కేర్) అని నేనంటే దాని అర్థం మీకు కర్రనిస్తున్నారు. దాని సహాయంతో లేచి నిలబడమని అర్థం. గురువులు నేను చూసుకుంటాను అన్నప్పుడు మీరు అనుమానిస్తే మీరు లేచి నిలబడే అవకాశాన్ని పొగొట్టుకున్న వారవుతారు.

గురువుల సమక్షంలో మీలోని సంస్కారాలు కాలిపోతాయి

రమణమహర్షి జీవితం నుంచి ఒక చక్కని సంఘటన.

ఒక శిష్యుడు రమణపురాణం రాస్తూ ఉంటాడు. అతనిలో రచయితకి ఉండే అడ్డంకి ఉండి ఒక చోట రచన ఆగిపోతుంది. మీరు అహంకారంతో రాసినప్పుడు ఎక్కడో ఒక చోట రచన ఆగిపోతుంది. అతను రమణమహర్షి దగ్గరకి వచ్చి 'భగవాన్, నేను రచనాన్ని కొనసాగించలేకపోతున్నాను. దయచేసి సహాయం చేయండి' అని వినయంగా ప్రార్థిస్తాడు. రమణ భగవాన్ అతనితో, 'ఆ కాగితాలు అక్కడ పెట్టి వెళ్ళు. నీతో తరువాత మాట్లాడతాను' అంటారు. శిష్యుడు ఆ కాగితాలు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. మర్నాడు అతను వచ్చే సరికి ఆ పద్యం పూరించబడి ఉంటుంది. అంటే అందులో 300ల లైన్లు రమణమహర్షి రాసారు. ఆ గ్రంథాన్ని ప్రచురించాక ఈ 300ల లైన్లని కొటేషన్స్లో పెట్టి క్రింది 'ఈ 300ల లైన్లు భగవాన్ రమణమహర్షి రాసారు' అని రాయిస్తాడు.

భగవాన్ ఆ పుస్తకాన్ని చూసి, అతనితో, 'ఓహో! అయితే మిగిలినవన్నీ నీవు రాసావా! అంతేనా!' అని అంటారు. ఆ శిష్యుడు ఆ తరువాత ఒకసారి ఈ విధంగా అన్నాడు, 'ఆయన ఆ మాట అన్నప్పుడు నాలో ఏదో జరిగింది. కళ్ళలో నీరు ధారలా కారింది. నేను భగవానుని పాదాల మీద వాలిపోయాను, మరలా పైకి లేవలేదు'.

ఆ ఒక్క మాటతో మురుగనార్ అనే ఆ శిష్యుడు జ్ఞానోదయాన్ని పొందాడు. ఒక విషయం అర్థం చేసుకుంటే రచయితని అనే అహంకారపు సంస్కారం మురుగన్ లో ఉన్న విధంగా మీలో కూడా చాలా సంస్కారాల్ని మీరు మీ లోపల మోస్తూ ఉంటారు. మీరు సంస్కారాలలో చిక్కుకుపోయి ఉన్నట్లయితే గురుదేవుల సమక్షంలో ఉండండి. మీకు పూర్తి చికిత్స జరుగుతుంది. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఆ సంస్కారం కనీసం మీలో ఉన్నది అని కూడా తెలుసుకోనీయదు. అది తాను ఉండటాన్ని సమర్థించుకుంటుంది. అది దాని జీవితసమస్య. అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఇటువంటి బలమైన సంస్కారాలలో చిక్కుకున్నప్పుడు, ముఖ్యంగా మిమ్మల్ని ముందుకి నడిపే కోపం, మోహం, భయం, ఆశ, అసూయ, నిరాశ – ఇటువంటి సంస్కారాలలో చిక్కుకుని ఉన్నప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు చేయవద్దు అంటాను. మీరు గురువుల సమక్షంలో ఉండండి, ఆ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు. మీరు పూర్తిగా చికిత్స చేయబడి అందులోంచి బయటకి రాగలుగుతారు. మీరు సంస్కారాలలో చిక్కుకున్నప్పుడు గురువుల సమక్షాన్ని పోగొట్టుకోవద్దు.

ఎవరైనా డిప్రెషన్లో ఉన్నప్పుడే నన్ను వదలి వెళ్ళిపోతే ఆ వ్యక్తి గురించి నేను చాలా అనుకుంటాను. అంటే ఈ మిషన్కి ఒక వ్యక్తి తగ్గిపోయాడు అని కాదు, అతని లోతైన నిరాశలో ఉండగా వెళ్ళినందుకు. అదే వ్యక్తి సంతోషస్థితిలో ఉన్నప్పుడు నన్ను వదిలి వెళితే పరవాలేదు. అది సాధారణ బంధం. అతను ఎక్కడికి వెళ్లినా నన్ను తనతో తీసుకువెళ్ళగలుగుతాడు. అదే ఆ వ్యక్తి నిరాశలో ఉంటే, అతను వృద్ధి పొందలేదు. అంతే కాదు, ఆ సంస్కారం నుంచి బయటకి రాలేదు. అది అతనిలో ఒక పెద్ద గాయం అవుతుంది. వేడి పాలతో మూతి కాల్చుకున్న పిల్లి, తిరిగి పాల వైపు వెళ్ళదు. ఈ వ్యక్తి కూడా అదే స్థితిలో ఉంటాడు.

మీ మూడ్ బాగా లేనప్పుడు నిర్ణయాలు చేయవద్దు. అది నిజాలని మీ నుంచి చెదరగోడుతుంది. నిర్ణయాలు చేయటానికి అది సరియైన సమయం కాదు. మీ మనః స్థితి బాగు అయ్యేవరకూ వేచి ఉండండి. అప్పుడు విషయాలు స్పష్టంగా ఉంటాయి. మీరు మానసికోల్లాసాన్ని కలిగి ఉన్నప్పుడే గట్టి నిర్ణయాన్ని తీసుకోండి. నిర్ణయాన్ని తీసుకునే ముందు మానసిక స్థితి దానిని స్వీకరించే స్థితిలో ఉండాలి. మనం చీకటి రాత్రిలో నిద్రలో ఉండి కాకుండా మేలుకొని ఉండి పగటి వెలుగులో నిర్ణయాలు తీసుకున్నట్లుగానే అవి ఉండాలి.

స్పష్టత కలిగి ఉండాలి. తక్కువ భావోద్వేగం కూడా తీవ్రభావోద్వేగంలానే ఉంటుంది. అది మానసిక సహజత్వం, చక్రంలాంటిది. క్రిందనున్నది పైకి వస్తుంది. పైనున్నది గొప్పదనికాని క్రిందనున్నది అల్పమైనదని కాని చెప్పడానికి వీలులేదు. అవి రెండూ ఉన్నాయి అంతే. కలిగి ఉన్నదాన్ని విశ్వసించడం నీకు గల గొప్ప అవకాశం.

మానసికస్థితి సరిగా లేని సందర్భంలో కొంతమంది వాటిని వదిలివేయాలనుకుంటారు, కాని వచ్చిన సమస్యల్లా మనసుతోనే. మానసిక స్థితి బాగుపడినప్పుడు తిరిగి అతను తన నిర్ణయాన్ని మార్చుకోవాలనుకుంటాడు కాని, అసాధ్యమవుతుంది. ఎందుకంటే అతను ఆత్మన్యూనతలో పడిపోయి, తిరిగి పూర్వపుస్థితికి చేరుకోగల అర్హతలేదనుకుంటాడు.

మీ మానసికస్థితి బాగా లేకున్నా మీరు వదిలిపెట్టొద్దని నేను ఎప్పుడూ చెప్తుంటాను. మీరు మానసిక ఆందోళన కలిగి ఉన్నప్పుడు నా సన్నిధిలో ఉండడమే మంచిదని భావిస్తాను. నానుండి మీరు దూరంగా ఉండాలనుకోవడం అంటే మీరు జబ్బు పడివుండి కూడా వైద్యుడి దగ్గరకు వెళ్ళడానికి నిజంగా అదే సరియైన సమయం.

చొరవ అంటే ఏమిటి?

మిమ్మల్ని మీరు స్వస్థత పొందాలి అనుకున్నప్పుడు, మీ అంతరంగానికి స్వస్థత చేకూరాలన్నప్పుడు. మీరు మీ జీవితాన్ని శక్తిమంతం చేసుకోవాలి. బాహ్య ప్రపంచం నుండి అడ్డంకులు వస్తూ ఉండడం మీరు చాలాసార్లు చూస్తూనే ఉంటారు. మనసులోని పాత జ్ఞాపకాలు మీలో నుండి శక్తిని తొలగించవచ్చు.

ఇంకో విషయం ఒకేసారి అనేక నిర్ణయాలు తీసుకోవడం కూ మీరు మీ శక్తిని కోల్పోయేలా చేయవచ్చు. ఇలా మీరు చేయవచ్చు. మీ ఆఫీసుకి వెళ్ళి కూర్చోండి. ఏ పనీ చేయకండి. కేవలం ఒక ఐదారు ముఖ్య నిర్ణయాలు మాత్రం తీసుకోండి. మీరు అలసిపోయినట్లుగా భావిస్తారు.

నిజాలు, ఆలోచనలే మిమ్మల్ని అలాంటి అలసట చెందిన మానసిక స్థితి అనే దాని నుండి బయటకు తెచ్చి మీలో బలాన్ని విశ్వాసాన్నిస్తాయి. వాటినే నేను ‘శాస్త్రశస్త్రాల’ని లేక జ్ఞానాయుధాలని పిలుస్తాను.

నిజాలనేవి మిమ్మల్ని మానసిక ఆందోళననుంచి బయటికి తేవడమే కాకుండా, మానసిక ఆందోళనలకి మూలమైన వాటిని శాశ్వతంగా నిర్మూలించే మంత్రాలని నేను అంటాను. మానవాళికి మార్గాన్ని నిర్దేశం చేసే శబ్దాలే మంత్రాలు. గొప్ప అనుభూతితో వెలువడిన ఏ మంత్రమైన, అది పరిశుద్ధమై అంతరంగం నుండి వెలువడినదెవుంటే, దాన్ని గురించి ఏమిటి? ఎందుకు? అని ప్రశ్నించకుండా అకస్మాత్తుగా అది పని చేయడం మీరు చూస్తారు.

వెంటనే మీలో ఓ ‘మెరుపు ఆలోచన’ వచ్చి మంత్రం వల్లెవేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అది నిజంతో కూడుకున్న సహజమైన పదాల ఉచ్ఛారణ అయి ఉండాలి. అది మీ అంతరంగికం నుండి పైకి తెచ్చేదిలా ఉండాలి. మొదటి సారిగా మీరు ఆ నిజాన్ని విన్నప్పుడు చలించిపోతారు. అది మిమ్మల్ని మీ అంతరంగాన్ని, అక్షరాలవిస్ఫోటం కలిగిస్తుంది. దాన్ని మీరు మరచిపోలేరు. మీరు ఎలా వింటారో అలానే నివసించడం మొదలుపెడతారు.

ఏ ప్రయత్నం లేకుండానే మీ జీవితంలో మార్పు వస్తుంది. అదే మంత్రం యొక్క శక్తి. ప్రారంభంలో మీ తర్కజ్ఞానం ఒక పక్కన పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే సత్యాన్ని మీరు ఒప్పుకుంటే అది మీ జీవితం ద్వారా వెల్లడికావటం ప్రారంభిస్తుంది. మీ ప్రాముఖ్యాలే నిజమైన జీవితం అని మీరు అనుకునే విషయాలు వాటి మనుగడ అనుమానాస్పదం అవుతుంది. కాని మీ అంతరాత్మ అర్థం చేసుకోలుగుతుంది. దానికి క్లిక్ తెలుస్తుంది. అది చెప్పేది నిజం అని నాకు తెలుసు అని అంటుంది. మీ మనస్సులో ఒక మూల అనుమానం ఉండవచ్చు. కాని మీ అంతరాత్మ ఆ సత్యంతో బంధాన్ని ఏర్పరచుకోలుగుతుంది. మీరు మీ తార్కికజ్ఞానంతో అర్థం చేసుకోలేరు, కాని అకస్మాత్తుగా ఆ మాటలకి, ఆ భావాలకి మీ హృదయం స్పందించి వాటితో ఏకం అవుతుంది.

గురువుగారి మాటలకి, బోధలకి అకస్మాత్తుగా ఏర్పడే క్లిక్స్నే నేను దీక్ష అంటాను.

దీక్ష అంటే గొప్ప సత్యాలు, మాటలు, మిమ్మల్ని సత్యం వైపు తీసుకువెళ్ళటం, మీకు ఆ సత్యం వైపు తీసుకువెళ్లే మార్గాన్ని చూపిస్తుంది. దాన్ని అనుభవంతో పొందినప్పుడు, కనీసం ఒకసారైనా శక్తిమంతమైన ఒక అనుభవం, మీ తార్కికజ్ఞానానికి అందని అనుభవం జరిగి మీలోని ప్రాపంచికకోరికలలో మార్పు జరిగితే అప్పుడు మీ లోపల దీక్ష జరిగింది అని అర్థం. మీరు దీక్షని పొందారు అని అర్థం. నేను దీక్ష అన్న మాట అనగానే మీలో చాలా అనుమానాలు వస్తాయి. నేను ఇంతకు పూర్వమే మరొక గురువు దగ్గర దీక్ష పొందాను, మరి మీ దగ్గర కూడా నేను దీక్ష పొందవచ్చనా? మీ దగ్గర దీక్ష తీసుకుంటే, మరొక గురువు దగ్గరకి నేను వెళ్లవచ్చనా? నేను ఇంకా కొత్తవి నేర్చుకోవచ్చనా? ఇలా చాలా అనుమానాలు మీలో కలుగుతాయి.

చక్కగా చేయవచ్చు అది తప్పు కాదు. నేను ఎప్పుడూ చెబుతుంటాను, అన్ని తోటల లోనికీ వెళ్ళి మంచి పూలని తెచ్చుకొని మీకు అందమైన పూలమాలని తయారుచేసుకోండి. ఇదేమీ దుకాణం కాదు. ఒక షాపుకు వెళితే మీరు కొనవలసినవి పూర్తి అయ్యేంతవరకూ ఆ షాపు యజమాని మిమ్మల్ని వదలడు. కాని ఇది షాపు కాదు. మనిషిలోని అహం చాలా పెద్దది. దాన్ని పదిమంది గురువులు కొడితే కాని అది తగ్గదు. కాబట్టి చాలా మంది గురువుల దగ్గరకి వెళ్ళండి, అన్ని మంచి విషయాలూ నేర్చుకుని మీ జీవితాన్ని ఐశ్వర్యవంతం చేసుకోండి. అయితే ఏదో విండో షాపింగ్ చేస్తున్నట్టు కాదు. అలా చేస్తే మీరు జీవితంలో ఏదీ నేర్చుకోలేరు. ఎవరి నుంచీ ఏమీ తెలుసుకోలేరు.

సత్యాన్వేషకులకి జరిగే మొదటి మార్పు, వారిలోని ప్రశ్నలన్నీ కరిగిపోతాయి. ప్రశ్నలు కరిగిపోయి దాహం మిగులుతుంది. ఎప్పుడైతే గురువులు మీలో దీక్షని కలిగిస్తారో అప్పుడు ముందుగా జరిగేది మీ ఏకాగ్రత - జ్ఞానం నుంచి తెలుసుకోవాలి అనే విషయం మీదకి, జ్ఞాపకం ఉంచుకోవాలి అనే అంశం నుంచి వివేకానికి మారుతుంది.

ఒకసారి మీ ఏకాగ్రత జ్ఞానం నుంచి తెలుసుకోవాలి అనే విషయం మీదకి మారగానే, ఒక దాని గురించి కాకుండా లోతుగా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. మీ గురించి తెలుసుకోవటానికి ఆసక్తి చూపిస్తారు. దానికి గురువుల సహాయాన్ని ఉపయోగించుకుంటారు. మీరు గురువులకి దగ్గర అయ్యే కొద్దీ ఆయన మీ గురించి మీరు తెలుసుకోవటానికి అతీతంగా మిమ్మల్ని తీసుకువెళతారు. మీరంటే మీకు ఉండే ఆ గుర్తింపు మీద అతి మక్కువని వదిలే వరకూ మీరు అంటే ఏమిటో తెలుసుకోలేరు. అదే మీ అహంకారం అంతిమదశ మీలో కలగాలి అంటే మీరు అహాన్ని వదలి, దాన్ని గురుదేవుల పాదాల దగ్గర అధీనం చేయాలి. మిమ్మల్ని మీరు మరిచిపోయినప్పుడే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు.

అంతిమ ప్రేమవ్యవహారం

మీ అంతరాత్మ తపనని తృప్తి పరచగలిగే వ్యక్తి గురువు. అది లోతైన, సున్నితమైన ప్రేమవ్యవహారం. మీరు మీ ప్రేమలో గురువులకి దగ్గర అయ్యేకొద్దీ, విశ్వసంతో దగ్గర అయ్యేకొద్దీ మీలో లోతైన నిశ్శబ్దం ప్రారంభమవుతుంది. అది జీవంలేని శ్మశాన నిశ్శబ్దం కాదు. జీవచైతన్యంతో ప్రతిధ్వనించే జీవితం, ప్రేమల నిశ్శబ్దం.

మీ జీవితలక్ష్యాన్ని తెలుసుకునే కొద్దీ మీ జీవితం ఉత్సవంలా ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండానే మీలో లోతైన ఆహ్లాదకర ఆనందం కలుగుతుంది. మీ లోపల లోతైన అనంతమైన ఆనందసాగరాన్ని కనుగొని, ఆ ఆనందాన్ని అందరికీ పంచిపెడతారు. మిగిలిన సంబంధబాంధవ్యాలలో ఈ ఆహ్లాదాన్ని, ఈ బంధాన్ని ఏదో కొన్ని సార్లు మీరు అనుభవించి ఉంటారు. అయితే అది గురుదేవుల బంధంలో కలిగినప్పుడు చాలా గాఢంగా ఉండి, అది మరొక, ఉన్నతస్థితిలో జరుగుతుంది.

గురుశిష్యుల సంబంధం చాలా లోతైన అన్యోన్యమైన అనుబంధం. గొప్ప ప్రేమికుల మధ్య కూడా అంత అన్యోన్యత ఉండదు, ఎందుకంటే అది రెండు అహంకారాల మధ్య ఉన్న ప్రేమ. అహంకారాలు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. ఎందుకంటే అవి రెండూ స్వతంత్రమైనవి. కాని గురువు అంటే ఒక వ్యక్తి కాదు. అక్కడ ఏమీ 'నేను' అని ఉండదు. ఆయనలో అహం అనేది లేదు. కాబట్టి గురుశిష్యబంధంలో ఒకే అహం ఉంటుంది. అది మీరు ఆయన లక్ష్యం దాన్ని కరిగించి మిమ్మల్ని కూడా 'ఎవరూ కాని' వ్యక్తిగా చేయటమే.

గురువుగారి కరుణతో, గాఢతతో అహంకారాన్ని కరిగించేటప్పుడు వారి మధ్య ఉన్న బలమైన బంధమే శిష్యుడిని పట్టి ఉంచుతుంది. అక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు, అంతా ఒక పూర్ణత్వం. ఆ పూర్ణత్వం విశ్వాసాన్ని తనలో ప్రతిధ్వనింపచేస్తుంది. ఒకసారి నిజమైన అనుభూతి గురుదేవుల అనుబంధంలో మీ లోపల వికసిస్తే, మీరు ఎవరితోనైనా నిజాయితీతో, ప్రేమతో బంధాల్ని ఏర్పరచుకోగలరు. మీకు మనుషులతో, చెట్లతో, రాళ్ళతో, సర్వసృష్టితో ఉండే అన్ని రకాల బంధాలలోనికి మీలో వికసించిన పరిమళాలు వెళ్తాయి.

అద్భుతమైన క్షణాలు

జీవితంలో అద్భుతమైన క్షణాలు శిష్యుడికి గురువు పట్ల విశ్వాసం, ప్రేమ కలిగిన క్షణాలు. ఈ బంధం ప్రపంచం నుంచి విశ్వరహస్యాలకి అతీతంగా వెళ్ళే బంధం. అది విశ్వంతో నాట్యం చేస్తూ అంతా జరుపుకునే ఒక మహా ఉత్సవం. ఇది ఎలా ఉంటుందంటే సాగరసంగమానికి నాట్యం చేస్తూ అత్యుత్సాహంతో పరుగున వచ్చే నది ఆ సాగరంలో ఒకటిగా అవటం లాంటిది. గురువులకి దగ్గరగా రావటం, తాను గురువుగా మారగల మార్గం విశ్వంతో ఐక్యమవ్వటమే ఈ బంధం. గురుశిష్య బంధంలో అందమైన విశేషం ఏమిటంటే అది ఆశించటాలు, ఇవ్వటం

  • తీసుకోవటం అనే విషయాలతో కల్మషం కాని స్వచ్ఛమైన బంధం. గురుదేవులు నిన్ను నీవుగానే స్వీకరిస్తారు. ఆ బంధంలోని స్వచ్ఛత నిన్ను మరొకలా చేయాలనే ప్రయత్నం ఉండదు. మీరు గురువుల్ని ఎందుకు ప్రేమిస్తారంటే ఆయన మీకు సంపూర్ణస్వేచ్ఛని ఇస్తారు. నిన్ను నీవుగా ఉంచే స్వేచ్ఛ. నీకు ఎటువంటి బంధాలూ లేనిది. అందుకే గురుదేవుల్ని కలిసినప్పుడు నిత్య తాజాదనం, శాశ్వతమైన దివ్యప్రేమావ్యవహారం. ఇది సర్వాంతర్యామితో ప్రేమావ్యవహారం.

గురుశిష్యుల బంధం యొక్క శక్తిని సోదరి నివేదిత ఈ విధంగా వివరించారు. వస్తువులు, విషయాల పట్ల ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోతుంది; తమ అలవాటుగా ఉండే ఆలోచనసరళి అకస్మాత్తుగా అతన్ని వదలివెళ్ళిపోతుంది. దాని స్థానంలో ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది. ఇదంతా ఎటువంటి వాదాలు, వివరణలు, బోధనలూ అనేవి లేకుండా, ఆ విషయానికి సంబంధించి ఒక్కమాట మాట్లాడకుండా జరుగుతుంది. చర్చలు లేకుండా కేవలం గురువుల సమక్షంలో ఉండటంతోనే శిష్యునిలో జ్ఞానవృద్ధి జరుగుతుంది.

గురువులు - జీవించి ఉన్న ప్రమాణం

ఇది ఈ విధంగా ఉంటుంది; విత్తనం పగిలి, మొలకెత్తి, చెట్టు కావాలి అని ప్రయత్నిస్తుంది. అది చెట్టుతో, 'దయచేసి నీవు ముందు బయటికి రా, ఆ తరువాత నేను పగిలి మొలకెత్తుతాను. నేను పగిలి మొలకెత్తాక నీవు వస్తావని నమ్మకం ఏమిటి? నేను చనిపోయి మాయం అవుతానేమో' అని అంటుంది. చెట్టు విత్తనంతో, 'అలా కుదరదు. నీవు పగలకుండా నేను రాలేను. ముందు విత్తనం పగలాలి' అంటుంది. అప్పుడు విత్తనం, 'కుదరదు, నీవు ముందు బయటికి రా, ఆ తరువాత నేను మొలకెత్తుతాను' అంటుంది. ఈ విధంగా ఈ రెంటింటి మధ్య పోరు అలా జరుగుతూనే ఉంటుంది.

విత్తనానికి పగలాలి అంటే భయం ఎందుకంటే తాను చనిపోతానేమో, చెట్టుగా తయారవనేమో అని. చెట్టు 'నీవు పగలకపోతే నేను రాలేను' అంటుంది. వీరిద్దరి మధ్య పోరు అలా కొనసాగుతూ ఉంటుంది.

గురువు ఒకప్పుడు విత్తనం దశలో ఉన్న వ్యక్తి. ఆ తరువాత వృక్షంలా అయ్యారు. మనం విత్తనాల వంటివారం. ఆయన విత్తనాలకి హామీ ఇస్తారు, భయపడవద్దు. నేను లగానే ఉండేవాడిని. నేను విప్పారే ధైర్యంతో ఈ విధంగా అందమైన వృక్షాన్ని అయ్యాను. కాబట్టి విప్పారండి. విరామంగా ఉండండి. మీరు వృక్షంలా అవుతారు కాని చనిపోరు.' ఈ విధంగా ఆయన మనకి హామీ ఇచ్చి నమ్మకం పెంచుతారు. గురుదేవులు అంటేనే ఒక ప్రమాణం, ఒక హామీ, ఒక ఆదర్శం. ఆయన మీకు ప్రమాణం చేస్తున్నారు, 'విప్పారండి. మీరు ఎప్పటికీ మరణించరు.'

అహంకారానికి, అసూయకి అతీతంగా

గురువుల ప్రేమ ఒక్కటే ఎటువంటి నిబంధనలూ లేని ప్రేమ. అది నిస్స్వార్థమైనది. ఎటువంటి ఆశించటాలూ లేకుండా ఇవ్వటమే కాని అడగటం లేని ప్రేమ. అది బంధాలు లేనిది, నిరంతరం ప్రకాశించే ప్రేమ. మీరు ఉన్నా లేకపోయినా అది ప్రకాశిస్తూ ఉంటుంది. మీరు చేయవలసినది కేవలం మీ పాత్రతో నిలబడి దాన్ని మరలా మరలా నింపుకుంటూ ఉండటమే.

తీసుకోవటానికి మగవారిలో ఉండే అడ్డంకు అహంకారం. స్త్రీలతో పోల్చి చూస్తే భావాత్మతకి మగవారు తక్కువ ప్రభావితులవుతారు. వారు తెలివితేటల నుంచి పని చేస్తారు. ఒకరికి సమర్పించుకోవటానికి లేదా ఒకరిని గురువుగా ఎటువంటి నిబంధనలూ లేకుండా స్వీకరించటం అనేది మనస్సుకి సాధ్యం కాదు. హృదయం దాన్ని స్వీకరిస్తే తప్ప మనస్సు అంగీకరించదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనస్సు స్థాయిలో ఉంటాడో. అర్పించుకోవటం అంటే తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవటం, తన గుర్తింపుల్ని వదులుకోవటం అది తన అహం మరణించటమే. దాన్ని పోగొట్టుకోవటం చాలా పెద్ద విషయం. అయితే ఈ విషయాన్ని తెలుసుకునే తత్వంతో చూడగలిగితే, తాను ఏది కోల్పోతున్నాడో తెలుసుకుంటే అలా కరిగిపోయి, తనని తాను సమర్పించుకోవటం సాధ్యమే.

ఇక స్త్రీల విషయానికి వస్తే, సొంతం చేసుకోవటం, అసూయ అనేవి గురువుగారికి, ఆమెకి మధ్య ఉన్న ప్రమాదకరవిషయాలు. స్త్రీ గురువు రూపానికి అతీతంగా, రూపం లేని స్థితిని చూడగలగాలి. రూపాన్ని పట్టి ఉంచాలి - అనే విషయానికి అతీతంగా ఆయన ప్రేమని, కరుణని అందరితో పంచుకుంటూ, అసూయ లేకుండా ఆధ్యాత్మికంగా ఎదగగలగాలి. ప్రారంభంలో కొంత ఈ స్వభావం, అసూయ, అధీనత ఉంటే పరవాలేదు. నిజానికి ఈ భావాలు మీలో పైకి వచ్చిన తరువాతే మిమ్మల్ని వదిలివేస్తాయి. అవి మీలోపల లోతుగా దాగి ఉంటే అవి మిమ్మల్ని వదలవు. గురుదేవులతో అనుబంధం వృద్ధిచెందే కొద్దీ తెలివైనవారు ఈ భావాల్ని స్వచ్ఛమైన ప్రేమగా మార్చుకుంటారు. అప్పుడే వారు గురుదేవుల స్వచ్ఛమైన ప్రేమని అనుభవించగలరు. అంతవరకూ వారిలోని అధీనపరచుకోవాలనే భావం, అసూయ, స్వచ్ఛమైన ప్రేమ అనుభవానికి అడ్డంగా ఉంటాయి.

గురువుగారు అంటే ఒక నది వంటివారు. మీరు చేతులు విప్పి ఉంచితే నదిలో నీరు స్వేచ్ఛగా మీ చేతులలో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు నిరంతరం మీ చేతులలో ఉంటుంది. నీటిని పట్టి ఉంచాలి అని చూస్తే దాన్ని పోగొట్టుకుంటారు. గురుదేవుల ప్రేమ మీ నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా మీకు ఎంత కావాలో అంత మీ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పట్టి ఉంచాలి అని చేతులు మూస్తారో, మీరు నదిని పోగొట్టుకుంటారు. గురువుని కూడా మీరు జీవనప్రవాహంలో ఒక అందమైన భాగంగా ఎంచి గురుదేవుల ప్రేమని పొంది ఆ ప్రేమలో ఆనందాన్ని పొందవచ్చు.

మీ జీవితలక్ష్యానికి, గురువులకి అనుగుణంగా మేలుకోవాలి

ఒక విషయం అర్థం చేసుకోండి, శిష్యులకి తమ అజ్ఞానం తెలియదు. ఎందుకంటే వారు చీకటిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ బాధ్యత వెలుతురులో ఉన్న వ్యక్తిదే కాని చీకటిలో ఉన్న వ్యక్తిది కాదు.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి జన్మతః అంధుడు. హిమాలయప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు. ఒకసారి అతను కర్ర కోసం వెతుకుతూ ఉంటాడు. అతని మీద మంచుకి గడ్డ కట్టిన పాము కనపడుతుంది. అతను దాన్ని కర్ర అనుకొని దాని సహాయంతో నడుస్తుంటాడు. జ్ఞానోదయమైన యోగీశ్వరుడు అతన్ని చూసి ‘ఓ మూర్ఖుడా! నీవు పట్టుకున్నది కర్ర కాదు పాము. దాన్ని పారవేయి’ అంటాడు. ఆ అంధుడు, యోగి మీద అరుస్తాడు.’ ‘ఏమీ కాదు. బహుశః నీ దగ్గర కర్ర లేదు కాబోలు, నేను దాన్ని పారవేస్తే నీవు తీసుకుందామని అనుకుంటున్నావు. అందుకే నన్ను పారవేయమని చెబుతున్నావు’ అంటాడు. అప్పుడు యోగీశ్వరుడు, ‘మూర్ఖుడా! నాకు అది అవసరం లేదు, అది కర్ర కాదు పాము. త్వరలో సూర్యుడు పైకి వస్తాడు. ఆ వేడికి పాము బయటికి వచ్చి నిన్ను చంపుతుంది’ అంటాడు. అయినా ఆ వ్యక్తి నమ్మడు. అప్పుడు యోగి, ‘నీవు నన్ను నమ్మకపోయినా నిన్ను రక్షించవలసిన బాధ్యత నాది’ అని దాన్ని అతని చేతి నుంచి లాగేయబోతాడు. ఆ వ్యక్తి దానితోనే యోగీశ్వరుని కొడతాడు. అప్పుడు యోగీశ్వరుడు, ‘నీవు నన్ను కొట్టినా నిన్ను కాపాడవలసిన బాధ్యత నాది’ అని అతని చేతిలో పాముని లాగి దూరంగా పారవేస్తాడు.

మీకు తెలియదు, ఒక గురువుని చేరడానికి మీరు ఎన్ని జన్మలు బాధపడ్డారో, ఎన్ని జన్మలు ప్రార్ధనలు చేశారో. మీ లోపలి నిజమైన కోరిక ఏమిటో కూడా మీకు తెలియదు. ఒక విషయం అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఒక గురువు తారసపడటం అనేది, అషామాషి విషయం కాదు. జీవించి ఉన్న ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుని దర్శనం కోసం మీరు ఎన్ని జన్మలుగా ఎదురుచూస్తున్నారో, ఎన్ని జన్మలు పూజలు చేశారో మీకు తెలియదు, ఆ గురుదేవుని పట్ల మేలుకోగలగటమే మీ జీవిత లక్ష్యాన్ని మీ అంతరాత్మ కోరికని తీర్చటం.

జీవితలక్ష్యం Vs సంస్కారాలు

నేను నిత్యానంద స్ఫురణకార్యక్రమంలో ఎప్పుడూ చెబుతుంటాను, మీ మరణసమయంలో మీరు శరీరాన్ని వదిలే సమయంలో, మీ జీవితంలో ముఖ్యం అనుకున్న విషయాలు మీ జ్ఞానేంద్రియాల సంతోషానికి కారణమైన విషయాలు ఉపయోగ లేనివి అవుతాయి. అవి నలుపు తెలుపులలో ఉంటాయి. అవి ఇప్పుడున్నంత అందంగా ఉండవు. అది ఇలా ఉంటుంది. మీ కలల స్థితిలో ప్రపంచం నలుపు - తెలుపులలో ఉంటుంది. కల నుంచి బయటికి వచ్చాక కలలు నలుపు తెలుపులలో ఉంటాయి. అదే విధంగా మీరు శరీరాన్ని వదిలాక పాత జీవితం నలుపు - తెలుపులలో ఉంటుంది. అప్పుడు ఆధ్యాత్మికంగా వివేకంతో కూడిన విషయాలు, చేతనస్థితిలో మీ ఆధ్యాత్మికప్రయాణంలో చేసిన నిర్ణయాలు రంగురంగులలో ప్రకాశవంతంగా ఉంటాయి. మీ మనస్సు, శరీరస్థాయిలో పొందిన సంతోషాలన్నీ నలుపు - తెలుపులలో డల్గా ఉంటాయి. కేవలం చేతనస్థితిలో చేసినవే ప్రకాశవంతంగా ఉంటాయి.

ప్రస్తుతం మీకు గురువుగారు, ఆధ్యాత్మికత, చేతనస్థితి, ఇవన్నీ ఆసక్తి లేని విషయాలు. అవి మసకగా ఉంటాయి. అవన్నీ పెద్ద వయస్సువారికి అనుకుంటారు. ప్రస్తుతం గురువు అంటే ఒక ఎంపిక. మీరు శరీరాన్ని వదిలే సమయంలో చేతనస్థితిలో చేసిన నిర్ణయాలు, గురువులు, ఆయన బోధనలు అన్నీ రంగురంగులుగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ప్రపంచానికి సంబంధించిన వస్తువులు, విషయాలు మసకగా, నలుపు తెలుపు రంగుల్లో అందవిహీనంగా కనిపిస్తాయి.

అప్పుడు 'అయ్యో! భగవంతుడా! నేను మొత్తం పోగొట్టుకున్నాను. ఊహలు కల్పనలతో అంధుడినయ్యాను' అని మరణసమయంలో మీరు ఈ విషయాన్ని చాలా లోతుగా అనుకుంటే, తరువాత జన్మ సమయంలో గురుదేవులని ఎట్టి పరిస్థితిలో కూడా పోగొట్టుకోను' అని చాలా గట్టిగా నిర్ణయించుకుంటారు. తరువాత జన్మ తీసుకునే సమయంలో బాధతో కోమాలోకి వెళ్ళి ఆ నిర్ణయాన్ని మరిచిపోతారు. మరలా మరణ సమయంలో అనుకుంటారు. ఇది ఈ విధంగా చాలా జన్మల వరకూ జరుగుతుంది.

కాబట్టి ఈ జన్మలో గురుదేవులతో ఉన్నా, ఇంతకు ముందు ఎన్ని జన్మలలో ఆయనని మీరు పోగొట్టుకున్నారో మీకు తెలియదు. అంతకు ముందు ఎంత బాధతో శరీరాన్ని వదిలారో మీకు తెలియదు. మీ జీవితలక్ష్యాన్ని మరిచిపోయారు. అదే అహంకారం, అవే సంస్కారాలు, అవే సమస్యలు తిరిగి మీరు అనుభవిస్తున్నారు. ఎందుకంటే అంతకు ముందు గురువుల్ని కలిసే అవకాశం పోగొట్టుకున్నట్టే ఇప్పుడూ పోగొట్టుకుంటున్నారు. ఈ సారి కూడా మీరు శరీరాన్ని వదిలే సమయంలో అదే బాధని, అయ్యో! గురువుని కలిసే అవకాశం పోయిందే అని చాలా బాధ పడతారు.

మీకు, గురువులకి మధ్య వారధి - విశ్వాసం

ప్రస్తుతం గురువులు, ధ్యానం, చేతనస్థితి వీటి గురించి అనుకుంటున్నాం అంటే కారణం మనకి టైం ఉన్నది కాబట్టి. అంతే కానీ వీటి వెనుక ఉన్న అనుభవం కోసం కాదు. మరణసమయంలో ఈ ప్రపంచంలో విషయాలు మన అనుభవాలు మసక బారిపోతాయి. కేవలం గురువులతో ఉన్న క్షణాలు, చేతనస్థితిలో ప్రయాణం ఆధ్యాత్మిక అనుభవాలు ప్రకాశవంతంగా ఉంటాయి.

మీరు శరీరాన్ని వదిలే సమయంలో మీలో జరిగేవన్నీ నేను చూడగలను. అందుకే ఏదో ఒకటి చేయటం నా బాధ్యత అని అనుకున్నాను. అందుకే ఎవరైనా నన్ను మిస్ అయితే అప్పుడు 'అయ్యో! మరొకరు ఆ అనుభవాన్ని మిస్ అవుతున్నారే' అని అనుకుంటాను. గురువుతో ఉండటం ఎంత అవసరమో వారికి నా శక్తి కొద్దీ అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

చూడండి, మీరంతా ఈ శరీరంలో ఉండే 70 - 80 సంవత్సరాల జీవితాన్ని మాత్రమే చూస్తారు. అందుకే గురువు అంటే చాలా విషయాలలో ఒక ఎంపిక. మీరే మనుకుంటారంటే, సరే జరగాలని ఉంటే జరుగుతుంది' అనుకొని మరిచిపోతారు. ప్రస్తుతం ఇదే మీ దృక్పథం, కానీ నేను అంత కంటే ఎక్కువ చూడగలను.

ఈ విషయం అర్థం చేసుకోండి; మీరు నేల మీద ఉన్నారు. అందుకే మీరు కేవలం ఒక మైలు దూరం మాత్రమే చూడగలరు. మీ జీవితంలో కూడా మీరు 30 సంవత్సరాల భవిష్యత్తుని మాత్రమే చూడగలరు. నేను పదమూడవ అంతస్తులో ఉన్నాను. కాబట్టి నేను కొన్ని గతజన్మల్ని, కొన్ని రాబోయే జన్మల్ని చూడగలను. అందుకే నేను చెబుతున్నాను, గురువు తారస పడటం అనేది చాలా అరుదైన గొప్ప అవకాశం. అందుకే మీరు నన్ను పోగొట్టుకోకూడదు అని అంత శ్రద్ధ తీసుకుంటాను. అంతే కాకుండా ఆ విధంగా మిస్ అయిన వారు కొన్ని జన్మల వరకూ అయ్యో మిస్ అయ్యాను అని బాధ పడతారు. వారు శరీరాన్ని వదిలాక కూడా చాలా జన్మలు బాధ పడతారు.

కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, గురువుల్ని కొన్ని జన్మలలో మిస్ అయ్యాక, ఆ తరువాత జన్మలో కొందరు లోతైన నిరాశ, కుంగుబాటుల్ని కాని ఏదైనా ఒక వ్యాధిని తీసుకుని కొత్త జన్మకి వస్తారు. అప్పుడు ఆ జన్మలో గురువుల్ని పోగొట్టుకోరు. ఆ వ్యాధి వారిని గురువులకి అంటిపెట్టుకొని ఉండేలా చేస్తుంది. 'అఫర్' అనే గొప్ప యోగీశ్వరుడు ఆయన 63 మంది నాయన్మార్లలో ఒకరు. తమిళకవి, యోగీశ్వరుడు. ఈయన చాలా ఎక్కువ కడుపు బాధతో వస్తాడు. ఆయన తన జీవితచరిత్రలో ఇలా వివరిస్తారు. 'ఈ జన్మలో కావాలి అని ఈ వ్యాధితో వచ్చాను. అప్పుడు నేను శివుడిని మరిచిపోను.' మీరు గురువుని గుర్తుంచుకోవటానికి అంత బాధతో రానవసరం లేదు. మీరు ఆనందంతో గురువుల్ని ఈ జన్మలో గుర్తుంచుకోవచ్చు.

చూడండి, రోడ్డు మీద దూకుతూ ఆడుకుంటే ఏమవుతుందో చిన్న పిల్లలకి తెలియదు, కాని అమ్మకి తెలుసు అందుకే ఆమె పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. కాని పిల్లలు ఆ విషయాన్ని తెలుసుకోరు పిల్లలు ఏమంటారు 'నేను బయటకి వెళ్ళి ఏది కావాలో అలా చేస్తాను' అంటారు. తల్లి తాను చేయగలిగినంతా చేసి వారిని కాపాడుతుంది అంతే. మీరు గురువుల్ని పోగొట్టుకుంటే, ఆయన ఏమీ పోగొట్టుకోరు. ఆయన సాధించ వలసినదంతా సాధించారు. ఇక ఆయనకి కావలసినది ఏమీ లేదు. గురువులు ఎప్పుడూ ఏదీ పోగొట్టుకోరు. కాని శిష్యులకి అది చాలా పెద్ద నష్టం. ఏ కారణంతోనైనా, ఏ పొరపాటు వలననైనా గురువుని పోగొట్టుకోవటం చాలా పెద్ద నష్టం. అందుకే నేను అది ఎవరికీ జరగకూడదు అనుకుంటాను. ఇది ఎలా ఉంటుందంటే పళ్ళు అమ్మే వ్యక్తికి డబ్బులు ఇవ్వకుండా ఒక అరటిపండు తీసేసుకుని తిన్నాడు. అంత చిన్న తప్పుకి మరణ శిక్షవేయటం ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అందుకే ఏ కారణం చేతనైనా ఎవరైనా నన్ను పోగొట్టుకుంటే నేను నా శక్తి కొద్దీ వారిని అటునుంచి మళ్ళించటానికి ప్రయత్నిస్తాను.

గురువులని మిస్ అవ్వకండి. ఆయనని అంటిపెట్టుకొని ఉండండి. లోతైన నమ్మకం అనే వారధి నిర్మించుకోండి. అప్పుడు జీవితమే వేరుగా ఉంటుంది. గురుశిష్యుల బంధం కోసం ఏదైనా త్యాగం చేయవచ్చు, కాని దేని కోసమూ కూడా గురుశిష్యుల బంధాన్ని త్యాగం చేయకండి.

జీవితంలో మానసికనాటకానికి చివర

మీ జీవితం నాటకం, మీ సంబంధబాంధవ్యాలు, అందులోని పాత్రలు అంతా నాటకం. దయచేసి ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి, ప్రతి సంబంధం ఒక మానసికనాటకం అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక కుటుంబంలో జన్మించి, ఎవరో ఒకరిని తల్లి, తండ్రి, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అనుకొని ఆ కుటుంబసభ్యులతో ఒక నాటకమాడతారు. చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్టు, ఇప్పుడు ఒకసారి మీ జీవితంలోనికి చూడండి. సంబంధబాంధవ్యాలను కాని, వస్తువులు కాని ఇంకా ఇంకా పొందాలి, ఇంకా కావాలి అని చూస్తుంటారు. మీ ఆస్తి ఐశ్వర్యాలు ఇంకా పెంచుతూనే ఉంటారు. అకస్మాత్తుగా ఈ నాటకం మరణంతో ముగుస్తుంది.

మరలా మీరు ఇంకొక కుటుంబంలో జన్మిస్తారు. వేరే తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అదే నాటకాన్ని మరలా ఆడతారు. మన జీవితం అంతా పిల్లలు ఆడుకునే బొమ్మలాట లాంటిదే. ఇది జీవితంలోని మానసిక క్రీడ. ఎవరైతే పూర్తిగా గురుశిష్యుల అనుభవాన్ని పొందుతారో, వారికి ఈ మానసికనాటకం మరలా ఉండదు.

మరగనివ్వండి - జ్ఞానోదయాన్ని పొందండి

ఒకరు నన్ను ఈ విధంగా అడిగారు, 'నాలోని సంస్కారాలు గతజన్మల జ్ఞాపకాలు మీకు శిష్యుడవటానికి అడ్డంకులు అవుతాయా, అని. సంస్కారాలు అదే విధంగా ఏ మాత్రం ఆటంకం కావు. కాని ఎప్పుడైతే గురువుగారు ఆ సంస్కారాల మీద పని చేస్తారో, వాటిని తొలగించాలి అని చూస్తారో అప్పుడు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఆయనని ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ప్రార్ధించినందుకే ఆయన మీ మీద పని చేస్తున్నారు అని.

నేను మీ సంస్కారాల మీద పని చేసినప్పుడు ఏదో నాకు ఉపయోగం అని నాకు ఆశ లేదా భయంతో చేస్తున్నాను అని అనుకుంటారు. మీరు ఆ విధంగా ఎందుకు అనుకుంటారంటే, మీలోని భయాన్ని, ఆశని నా మీద మోపుతారు. అవి నాలో ఉన్నాయి అనుకుంటారు. జ్ఞానోదయమైన యోగీశ్వరులకి అటువంటి ఆశ, భయం ఉండవు. నేను మీ సంస్కారాల మీద పని చేస్తాను. వేల జన్మలలో వేలసార్లు నన్ను కోరి ప్రార్ధించారు కాబట్టి పని చేస్తాను.

మీలోని సంస్కారం ఎప్పుడూ సమస్య కాదు. నేను పని చేసేటప్పుడు, మీరు ఆపకుండా ఉంటే పరవాలేదు. నేను దాని మీద పనిచేసే సమయంలో మీ నుంచి వచ్చే ఆటంకమే అసలు సమస్య. మీ సంస్కారాలు సమస్య కాదు కాని మీరు వాటిని పట్టుకొని ఉండాలి అని ప్రయత్నించటమే సమస్య. నేను వాటి మీద పని చేసేటప్పుడు, మీరు వాటిని వదిలివేయగలిగితే సమస్య లేదు. మీలోని ట్యూమర్ని (కణితిని) తొలగిస్తున్నాను అని అర్థం చేసుకొని నాకు సహకరిస్తే చాలా బాగుంటుంది. కాని కొన్నిసార్లు మీరేమనుకుంటారంటే నేను ఏదో కక్షతో చేస్తున్నాను అనుకుంటారు. అప్పుడే మీరు ఫిర్యాదులు చేస్తారు. నన్ను ఆపాలని చూస్తారు. ఆ సింహం కూనలా నన్ను తప్పు పడతారు.

సింహం మాంసం తింటుంటే, ఆ కథలో సింహం కూన ఏమంటుంది, 'నీవు చాలా మంచివాడవనుకున్నాను, గొప్పవాడివి అనుకున్నాను. నీవు నాకు చాలా సహాయం చేసావు. నాలో నమ్మకాన్ని పెంచావు. కానీ నీవు మాంసం తింటావని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీవు కూడా నాలాగా వెజిటేరియన్వి అనుకున్నాను' ఇలా ఉంటుంది. మీ వాదం మీలోని పరిణతి లేని నీతినియమాలు, పరిణతి లేని విధంగా అర్థంచేసుకోవటం, మీలోని భావాలని గురువుల మీద మోపటం - ఇవన్నీ గురువులు మీ మీద పని చేయకుండా ఆపుతాయి.

సంస్కారాలు సమస్య కాదు. ఆ సంస్కారాల వలనే మీరు గురువుల దగ్గరకి వస్తారు. మీలో సంస్కారాలు లేనప్పుడు ఎందుకు గురువు దగ్గరకి రావటం. మీరు ఇప్పటికే జ్ఞానోదయం పొంది ఉంటారు. నేను మిమ్మల్ని మీరుగానే స్వీకరిస్తాను. కాని మీరు సంస్కారాలతో ఉన్నప్పుడు మీరు మీ నిజమైన మీరు కాదు. మీరు మీ నరకంలో బాధపడుతూ ఉంటారు. నేను మీ నరకాన్ని చెదరగొడతాను. మీరు బందీలుగా ఉన్న జైలును పగలగొడుతుంటే, నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు. అప్పుడు మీరు నన్ను ఆపాలని చూస్తూ మరిన్ని సమస్యల్ని సృష్టిస్తారు.

కొన్నిసార్లు మీరు నా దగ్గరకి వచ్చినప్పుడు మీలో గొప్ప శక్తి, ఆనందం పైకి రావటాన్ని మీరు తెలుసుకుంటారు. కొన్నిసార్లు మీలో చాలా కోపం, డిప్రెషన్ నిరాశ రావటం కూడా చూస్తారు. కానీ డిప్రెషన్ త్వరలోనే మాయం అవుతుంది. ఎప్పుడైతే మీరు నాకు దగ్గరగా వస్తారో, ఒక గొప్ప శక్తి దగ్గరికి వచ్చినట్టే. అప్పుడు మీలోని వ్యతిరేకభావాలన్నీ ఆ శక్తిలో కరిగిపోతాయి. అందుకే మీరు మీ లోపల అన్నీ కలిసిన గాఢమైన భావాల్ని అనుభవిస్తారు. చూడండి, గురువుల శరీరం ఒక అణుశక్తికేంద్రం. మీరు దగ్గరగా వచ్చినప్పుడు మీలో ఏ భావాలు ఉంటాయో అవి మరగటం ప్రారంభమవుతుంది. ఇది ఎలా అంటే మరిగే నీళ్ళలో బంగాళదుంపల్ని వేస్తే అవి ఎగిరెగిరి పడుతుంటాయి. బంగాళదుంప దానంతట అది నాట్యం చేయదు. క్రింద ఉన్న మంటలోని శక్తి వలన అలా డాన్స్ చేస్తుంది.

నేను ఎప్పుడూ చెబుతుంటాను, సంస్కారాలు సమస్య కాదు అని. బంగాళదుంప సమస్య కాదు. దూకే దుంప పాత్ర నుంచి బయటికి దూకి పారిపోకూడదు. అక్కడే జాగ్రత్త తీసుకోవాలి. అది పాత్రలోనే ఉంటే అది సిద్ధ దుంప అవుతుంది. సంస్కృతంలో సిద్ధ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఉడకటం, రెండు జ్ఞానోదయం పొందటం. బయటికి దూకకుండా ఉంటే అది ఉడికిన దుంపే కాదు, జ్ఞానోదయం పొందిన దుంపగానూ మారుతుంది.

అధీనమవటం - అంతిమపద్ధతి

భగవద్గీతలో అర్జునుడు తాను ఏ మార్గాన్ని అనుసరించాలో తెలియక గొప్ప అయోమయంలో పడిపోతాడు. చివరి అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి చేసిన బోధ, అంతిమస్థితిని తెలుసుకో అని. చాలా పద్ధతులు ధ్యానం, భక్తి జ్ఞానం, అన్నీ చెప్పాక కృష్ణుడు సూటి అయినది, కచ్చితమైనది, అంతిమమైనది అయిన ఒక పద్ధతిని చెబుతాడు. అదే అధీనమవటం. స్పష్టంగా అర్థం చేసుకోండి, మీరు ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుడికి అధీనమైతే, మీరు నిజానికి అహంకారం లేని, నేను అనే గుర్తింపు లేని వ్యక్తికి అధీనమైనట్టు. ఆయనకి మీ అధీనత విషయంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆయనకి ఆసక్తి కూడా ఉండదు. ఆయన పొంగి ప్రవహిస్తున్న విశ్వశక్తి. ఆయన చేతిని పట్టుకోవటం ద్వారా మీరు ఆయన ఉండే నిత్య ఆనందసాగరానికి మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళమని అడగటమే.

నేను చేసేవాడిని అని అనుకోగానే బాధలు, టెన్షన్ పెరుగుతాయి. మీరు త్వరగా అలసిపోతారు. దీని అధికారాన్ని పైవాడికి బదలాయిస్తే, మీ పని మీరు ఆనందంగా చేసుకువెళితే మీరు అద్భుతంగా రిలాక్స్ అవుతారు.

ఒక చిన్న కథ : ఒక బ్యాంక్ మేనేజరు రోజు డబ్బు మొత్తం ఇంటికి తీసుకువెళ్ళి మరలా ఉదయం బాంకుకి తెస్తుంటాడు. ఆ విధంగా ఒక నెల రోజులు చేసి ఇక ఆ విధంగా చేయలేకపోతాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు భయంతో వణికిపోతుంటాడు. అంత డబ్బు దగ్గర ఉంది కాబట్టి రాత్రి సరిగ్గా నిద్రపోడు. చివరికి అతనిపై అధికారిని తనను ఉద్యోగం నుంచి మార్చమని, తాను ఆ టెన్షన్ పడలేకపోతున్నానని అడుగుతాడు. ఆ అధికారి డబ్బు పోయినా పరవాలేదు, నిన్ను ఎవరూ ఏమీ అనరు అని అంటాడు. ఆ రోజు నుంచి మేనేజరు ప్రశాంతంగా నిద్రపోతాడు.

అతనిలో వచ్చిన తేడా ఏమిటి? అతను అదే ఉద్యోగం చేస్తున్నాడు. ఆ భయం, టెన్షన్ ఏమయ్యాయి? ఏమీ లేదు, బాధ్యతని పై అధికారికి బదలాయించాడు అంతే. అతను చేస్తున్న పని, ఉద్యోగం అదే విధంగా కొనసాగించాడు. మీరు పైవాడికి, ఉన్నతమైన విశ్వశక్తికి అధీనమైతే, మీరు అలసిపోరు. ఎందుకంటే మీరు శక్తితో సూటిగా బంధాన్ని ఏర్పరచుకున్నారు. అదే అధీనత మీకు ఇచ్చే బహుమతి.

అధీనత యొక్క గాఢత

దూడ ఆవు దగ్గర పది నిమిషాలే ఉంటుంది. కాని అది గోక్షీరాన్ని తాగుతుంది. దోమ ఆవు మీద ఇరవై నాలుగు గంటలు ఉండవచ్చు. కాని అది రక్తం పీలుస్తుంది. మీరు గురువుల సమక్షంలోనే ఉండవచ్చు. కాని ఆయనతో ఎటువంటి అనుబంధం మీకు ఉండకపోవచ్చు. మీలో అన్వేషణ లేకపోవచ్చు. లేదా మీరు గురువులకి దూరంగా ఉండవచ్చు. కాని నిరంతరం ఆయనతో అనుబంధంతో ఉండవచ్చు కాబట్టి భౌతికంగా ఆయన సమక్షంలో ఉండటం అనేది విశేషం కాదు. ఆధ్యాత్మిక అన్వేషణలో దానికి అంత ప్రాముఖ్యం లేదు. అన్వేషణ అనేది ఎంత లోతుగా ఉన్నదో, అది ముఖ్యం.

రామకృష్ణ పరమహంస ఒక విషయం చక్కగా చెబుతారు, 'మీరు దేనికైనా ఎవరికైనా అధీనం కావచ్చు. ఇక్కడ అధీనమవటం ముఖ్యం అంతే కాని ఎవరికి అన్నది ముఖ్యం కాదు. మీరు రాయికి అధీనులైతే అదే భగవంతుడుగా మారి మీకు మార్గం చూపిస్తుంది.'

మీలో తీవ్రమైన సత్యాన్వేషణ అనే తపన లేనప్పుడు, సాక్షాత్తు భగవంతుడే వచ్చినా, మీరు ఆయనని ఐడెంటిటీ కార్డ్డు అడుగుతారు. మీలో సత్యాన్వేషణతపన ఉన్నప్పుడు చిన్న రాయి కూడా మీకు బోధించగలుగుతుంది.

నాలో ఉన్న జీవశక్తి బయట కూడా ఉన్నది. అది మీలోనికి ప్రవేశించి మీకు నేర్పించవలసినవి నేర్పిస్తుంది. నేను ఖాళీగా ఉంటాను. నాలో ఏమీ లేదు. అందుకే జీవశక్తి నా లోపల ప్రవేశించి, అమరగీతంలా బయటికి వస్తుంది. కాబట్టి మీలో ఆధ్యాత్మికతృష్ణ లోతుగా, తీవ్రంగా ఉన్నప్పుడు, మీ నాసికద్వారా లోపలికి వెళ్ళే గాలి, మీ హృదయంలో గొప్ప ప్రేరణని ఇచ్చి, మీ లోపల బోధన జరిగేలా చేస్తుంది. మీలో ఆ తీవ్రత లేనప్పుడు, నేను ఏమి చెప్పినా మీకు అది గుర్తు ఉండదు. అది మీలో నాటుకోదు.

మీలో మీరు పరీక్షించుకోవలసిన సూక్ష్మవిషయం ఇదే. మీ మనస్సు ఒప్పుకోనప్పుడు, మీరు గురువులు చెప్పే మాటలు వినగలుగుతున్నారా లేదా గమనించండి. అవును అని జవాబు వస్తే మీరు అధీనులయ్యారు. కాకపోతే మీరు మీ మనస్సుకి నచ్చినవి చెబితేనే గురువుని అనుసరిస్తారు. మీ మనస్సుకి నచ్చినవి చెప్పటం, మీరు గురువుల మాట విని అనుసరించటం అనేది కొన్నిసార్లు అనుకోకుండా, యాదృచ్ఛికంగా జరుగుతుంది. అంతే అంతకు మించి మరేమీ లేదు.

గురువుల పని విషయానికి వచ్చినప్పుడు, ఆశకి, అనుకూలదృక్పథం అనేవి అవసరం లేదు. కేవలం ఆధీనమవటం, ఆయన చెప్పినవి స్వీకరించి చేయటం. ఎందుకంటే అది అంతరాత్మ లోతుల నుంచి వస్తుంది. కానీ ఏదో పై పై నుంచి మనస్సు నుంచి కాదు.

మీరు సర్వాంతర్యామికి ఆధీనులు కాలేరు కాబట్టి గురువులకి ఆధీనమవ్వాలి. విశాలమైన ఆకాశాన్ని చూస్తే మీరు భయపడతారు. కాబట్టి ఆకాశం లోనికి చూడటానికి మీకు ఉన్న కిటికీ వంటివాడు గురువు.

ఆధీనతలో మూడు దశలు

ఆధీనతలో ఉండే మూడు రకాలని వివరిస్తాను. తెలివితేటలు లేదా తార్కికజ్ఞానాన్ని ఆధీనం చేయటం, భావావేశాల్ని అధీనం చేయటం. ఇక మూడవది జ్ఞానేంద్రియాల్ని అధీనం చేయటం.

మొదటిది తెలివితేటలని అధీనం చేయటం అంటే గురువుల తెలివితేటలు మీ కంటే గొప్పవి అని అనుకోవటం. ఇదే తెలివితేటల అధీనం చేయటం అంటే. ఈ దశలో గురువులు చూపించిన విధంగా మీ జీవనసరళిని మార్చుకుంటారు.

రెండవది: మీ భావావేశాల కంటే గురువులవి ఉన్నతమైనవి అని నమ్మటం. దీని అర్థం గురువులతో ఉన్న అనుబంధం అంతిమమైనది, అత్యున్నతమైనది అని నమ్మటం. భగవంతుడు ప్రత్యక్షమై ఈ భూమి మీద ఉన్న ఒక వ్యక్తిని ఎంచుకో, అతను మాత్రమే జీవించి ఉంటాడు అని అన్నప్పుడు మీరు గురువుని ఎంచుకుంటే అది భావావేశాత్మక ఆధీనత. అయితే ఒక విషయం, గురువు ఎప్పటికీ నాశనం కాదు. అది వేరే విషయం. ఏదో మీరు ఎంచుకున్నారు కాబట్టి ఆయన జీవించి ఉన్నారు అని అనుకోవద్దు. మీరు ఎంచుకున్నా లేకపోయినా ఆయన జీవించి ఉంటాడు.

మీకు గురువు పట్ల ఉన్న భావం అన్ని భావాల కంటే ఎక్కువ అని మీకు అనిపిస్తే, మీలో ఆధీనత భావావేశాల దశలో జరిగింది అని అర్థం. స్పష్టంగా తెలుసుకోండి. 99% మంది మొదటి దశలో ఉంటారు. వీరిలో 20% నుంచి 40% మంది రెండవ దశకి వెళ్ళగలుగుతారు. మిగిలిన వారు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారు.

మూడవరకం ఆధీనత అనేది జ్ఞానేంద్రియాల్ని కూడా అధీనం చేయటం.

చిన్నకథ : మహాభారతయుద్ధం ముగిసాక ఒకరోజు శ్రీకృష్ణుడు, అర్జునుడు విశ్రాంతిగా కూర్చుని ఉంటారు. అకస్మాత్తుగా కృష్ణుడు, 'అర్జునా! చూడు, ఆ ఆకుపచ్చ కాకిని' అంటాడు. అర్జునుడు, 'అవును ఆకుపచ్చకాకి అందంగా ఉన్నది' అంటాడు. అప్పుడు కృష్ణుడు, 'మూర్ఖుడా! అది నలుపు 'ఆకుపచ్చ కాదు' అంటాడు. అర్జునుడు అవును కృష్ణా అది నలుపు, ఆకుపచ్చ కాదు' అంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునితో, 'నీకు ఏమయ్యింది? నేను ఆకుపచ్చ అంటే నీవు ఆకుపచ్చ అంటున్నావు. నేను నలుపు అంటే నీవు నలుపు అంటున్నావు. నీకు ఏమయ్యింది?' అని అడుగుతాడు.

అప్పుడు అర్జునుడు కృష్ణునితో, 'నేను నిజాయితీగా చెబుతున్నాను. ఆ కాకి రంగు ఏమిటో నాకు తెలియదు. నీవు ఆకుపచ్చ అన్నప్పుడు నేను ఆకుపచ్చనే చూసాను. నీవు నలుపు అన్నప్పుడు నలుపే చూసాను. నాకు ఏమీ తెలియదు' అంటాడు.

అర్జునుని జ్ఞానేంద్రియాలు కృష్ణుడిని నమ్మాయి. అతను గురువుల జ్ఞానేంద్రియాల్ని తన కంటే ఎక్కువగా నమ్మాడు.

ప్లేసిబో ప్రభావం, ఇంకా ఎక్కువ

వైద్యభాషలో 'ప్లేసిబో ప్రభావం' అనే ఒక మాట ఉన్నది. ఒక పేషెంటుకి మందు లేని టాబ్లెట్ ఇచ్చి, ఇది మందు అని చెబితే అతని అనారోగ్యం నయమవుతుంది. అయితే ఈ మధ్య జరిగిన పరిశోధనలలో ప్లేసిబో ప్రభావంలో చాలా లోతైన విషయాలు నిరూపించబడ్డాయి.

ఇటలీలోని ట్యురిన్లో జరిగిన పరిశోధనల గురించి చదివాను. ఒక వ్యక్తికి కొన్ని కంత్రోల్ చేయగల కరెంట్ షాకులు అమర్చారు, అతనికి నొప్పి తెలియని తక్కువ షాక్ నుంచి అతను భరించగల షాకు వరకూ ఒక స్కేలు అమర్చారు.

అతనికి షాక్ ఇచ్చే ముందు, అతని ఎదురుగా ఆకుపచ్చ, ఎరుపు రంగుల బల్బులు వెలిగేలా అమర్చారు. ఆకుపచ్చ బల్బు వెలిగితే అతనికి కొంచం షాకు ఇస్తారు. ఎరుపు బల్బు వెలిగితే ఎక్కువ షాకు ఇస్తారు. అతను స్కేలు మీద తనకి ఇచ్చిన షాకుల ప్రభావాన్ని 1 నుంచి 10 వరకూ రేటింగ్ చేయాలి. 1 నుంచి 10 వరకూ తక్కువ నుంచి ఎక్కువ షాక్ అని అర్థం. అతని మీద 15 నిమిషాలు షాక్స్ ప్రయోగించారు. చివరలో అతను ఈ విధంగా చెప్పాడు, 'ప్రారంభంలో షాక్ ఎక్కువగా ఉంది తరువాత తక్కువ స్థాయిలో ఉన్నాయి' అని.

నిర్భాంతపోయే విషయం ఏమిటంటే అసలు వాళ్ళు ఇచ్చిన షాక్స్ దానికి పూర్తిగా వ్యతిరేకం. చివరలో ఇచ్చినవి బలమైన షాక్స్. మరి అతనికి అవి చిన్నవిగా ఎలా అనిపించాయి. ఎలా అంటే ఆ షాక్ ఇచ్చే ముందు, ఇవ్వబోయే షాక్స్ చిన్నవి అని చెప్పే ఆకుపచ్చ బల్బు వెలిగేది. కాబట్టి ఆ వ్యక్తి మనస్సు వచ్చే షాకు చిన్నది అని తయారుగా ఉండేది. కాని నిజానికి బలమైన షాకు ఇచ్చినా మనస్సు అది చిన్నది అనుకున్నందుకు ఆ వ్యక్తి ఆ షాక్స్ని చిన్నవిగానే అనుభవించాడు. అతని శరీరానికి అవి చిన్న షాకులా అనిపించాయి. దీని ఫలితాల ఆధారంగా పరిశోధకులు ఏమంటారంటే ప్లేసిబో ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మనం అనుకున్న దాని కంటే దాని ప్రాముఖ్యం ఎక్కువ అని.

మందులు కూడా అన్ని వేళలా సూటిగా ప్రభావాన్ని చూపించవు. వాటి ఫలితాలు మనం ఎలా ఆశిస్తామో అదే విధంగా ఉంటాయి. ఒక వ్యక్తికి పెయిన్ కిల్లర్ అని చెప్పకుండా ఇంజక్షన్ ఇస్తే, అది పని చేయాలి అంటే చాలా ఎక్కువ డోస్ ఇవ్వాలి అని డాక్టర్స్ చెబుతారు. అదే ఆ వ్యక్తితో అది పెయిన్ కిల్లర్ అని చెప్పి ఇస్తే, చాలా తక్కువ డోస్ సరిపోతుంది.

మనస్సు చాలా బలమైనది. అది మీలో శారీరక మార్పుని కలిగించగలుగుతుంది. జ్ఞానేంద్రియాలు మనస్సుకి ఏ విధంగా ఆధీనమయ్యాయో అత్యున్నతచేతనస్థితికి కూడా ఆధీనమవ్వగలవు. కృష్ణార్జునుల విషయంలో ఇదే జరిగింది. కృష్ణుడు ఆకుపచ్చ కాకి అంటే అర్జునుడు ఆకుపచ్చ కాకిని మాత్రమే చూసాడు.

మీ జ్ఞానేంద్రియాలు మీరు సాధారణమానవులు అని చెబుతాయి. నేను మీరు దివ్య ఆధ్యాత్మికులు అని చెబుతాను. మీ జ్ఞానేంద్రియాల్ని నమ్మినంత కాలం మీరు సాధారణ మానవులుగానే ఉండిపోతారు. గురువుని నమ్మితే మీరు ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతారు. దీన్నే నేను స్పష్టంగా చూడగల మార్పు అంటాను.

గురువు - అంతిమవిలాసం

మీ జీవితంలో గురువులు అంతిమవిలాసం. మీ జీవితంలో గురువే తారసపడితే ఇక మీకు ఏమీ అవసరం లేదు. ఆయనని కలవకపోతే ఏం ఉన్నా ప్రయోజనం లేదు. మీ జీవితంలోనికి వివేకాన్ని తెచ్చే ఒక దారి గురువు. అవసరానికి తగిన విధంగా ఆయన మీ మేధను పెంచగలడు. జీవశక్తి, గురువు రెండూ వేరు వేరు కాదు. గురువులు పదే పదే ఒక విషయం చెబుతారు. మీలోని గురువుని అనుభూతితో తెలుసుకోండి అని. మీలోని గురువుని అనుభూతితో తెలుసుకోగలిగేవరకూ బయట ప్రపంచంలో గురువు అవసరం అని మీరు అనుకుంటారు. ఒకసారి మీ అంతరంగంలోని గురువుని అనుభవంతో తెలుసుకోగలిగాక బయట ప్రపంచంలో గురువుల అవసరం లేదు.

గురుదేవుల సమక్షం

గురుదేవుల సమక్షంలో మీరు ధ్యానం చేస్తే అది అత్యున్నత రసాయనచర్య (ఆల్కెమీ) అవుతుంది. మీరు ఒక్కరే మీ ఇంట్లో చేస్తే అది ధ్యానం. అదే ధ్యానాన్ని గురువుల సమక్షంలో ఆయన సూచనతో, ఆయనతో పాటు చేస్తే అది ఆల్కెమీ లేదా రసాయన చర్య అవుతుంది. అది మిమ్మల్ని మరిగించటం లాంటిది. ఆ కార్యక్రమం గాఢతతో, చైతన్యంతో ఉంటుంది.

మీ అంతట మీరు ధ్యానం చేసినప్పుడు మంట వెలిగించటం మరిచిపోతారు. గురువుల సమక్షమే అగ్ని, అది మీలో జరగవలసిన రసాయనచర్య జరిగే విధంగా చూస్తుంది.

నన్ను ఇలా అడగవచ్చు, ‘మీ సమక్షంలోనే ఎందుకు ఉండాలి? అని. మీరు సి.డిలు చూస్తూ కూడా నా మాటలు వినవచ్చు. కాని సత్యాలని వెల్లడి చేసేటప్పుడు నా శరీరం కదలికల నుంచి సత్యాన్ని పట్టుకోవచ్చు. మీరు పట్టుకుంటారు కూడా ఆ క్లిక్ ని మీరు అనుభవిస్తారు. అవును ఈయన చెప్పేది సత్యమే ’ అని మీకు స్పష్టంగా తెలుస్తుంది.

ఒకవేళ మీరు అనుమానించాలి, అని అనుకున్నా, మీ లాజిక్ మీ మీద ప్రభావాన్ని చూపించలేదు. మీ లాజిక్ కు అతీతంగా ఈ మాటలు మీ లోపలికి వెళ్తాయి. అది మీరు గురువు సమక్షంలో ఉన్నప్పుడే జరుగుతుంది. దీన్నే ఉపనిషత్ అంటారు. గురువు సమక్షంలో ఉండి, వికసించి ఉండటమే ఉపనిషత్.

విశ్వాసంతో విప్పారి ఉండండి. మీరు ఆ విశ్వాసం లోనికి దూకండి. అక్కడ పట్టుకోవటానికి గురువుగారు ఉంటారు. మీ తల నుంచి హృదయంలోనికి జారండి. అక్కడ మిమ్మల్ని పట్టుకోవటానికి గురువుగారు ఉంటారు. మీకు జ్ఞానోదయం జరుగుతుంది’ అంతే.

ఉపనిషత్తులు

ఉపనిషత్ అంటే కూర్చోవటం. ఎప్పుడైతే శిష్యుడు గురువు సమక్షంలో కూర్చుంటాడో, గురువులో కలిగిన అనుభవం శిష్యుడిలో తిరిగి జరుగుతుంది. ఏ శిష్యుడైతే గురువుల అనుభవం పొందుతాడో, ఎవరిలోనైతే గురువు తిరిగి ఆ అనుభవాన్ని ఇస్తాడో ఆ శిష్యుడు తనకి జరిగిన ఆ అనుభవాన్ని రాస్తాడు. గురువు కాని, శిష్యుడు కానీ లేదా మరొకరు ఆ అనుభవం ఎలా జరిగిందో రాస్తారు. ఇది ఎలా ప్రారంభమైంది, ఎలా ముగిసింది. ముగిసాక ఏం జరిగింది, ఇవన్నీ రాసినదాన్నే ఉపనిషత్ అంటారు.

కారణం-ప్రభావం అనే సూత్రానికి అతీతంగా ఉపనిషత్ ఎలా జరిగింది.

మనం కారణం - ప్రభావం అనే సూత్రం గురించి విన్నాం. బంతిని వదిలితే అది క్రింద పడుతుంది. నీటిని 100 సెం.మీ. దగ్గర వేడి చేస్తే ఆవిరి అవుతుంది. నీళ్ళలో ఉప్పు వేస్తే కరిగిపోతుంది. ఇది కారణసూత్రం, ప్రతి చర్య ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. శాస్త్రం ఈ సూత్రం మీద ఆధారపడి ఉంది.

అయితే సర్వాంతర్యామి సూత్రాలలో ఇది ఒక్కటే సూత్రం కాదు. సర్వాంతర్యామిలో ముఖ్యసూత్రం ఆత్మప్రబోధసూత్రం. దీన్నే కార్ల్ జంగ్ అనే వేదాంతవేత్త ఒకే విధమైన సూత్రం అంటారు. ఇక్కడ అర్థం ఒకటి జరిగింది కాబట్టి మరొకటి జరిగింది అని కాదు. ఏదో జరుగుతుంది. దాంతో మరి కొన్ని జరుగుతాయి.

మనమందరం కారణ ప్రభావాన్ని చూడటానికి అలవాటు పడ్డాం. వీటి మధ్య సంబంధ, ముందు కారణం చూస్తాం, వెంటనే దాని ప్రభావాన్ని చూస్తాం. అయితే జీవితంలో చాలా సంఘటనలలో, ప్రభావం చాలా కాలం తరువాత కనిపిస్తుంది. ఇప్పటికి అసలు మూలమైన కారణాన్ని మరిచిపోతాం. మీరు నీళ్ళలో రాయి విసిరితే చిన్న తరంగాలు వస్తాయి. అది రాయి విసరటం మూలాన అని మీకు తెలుసు. కొంత సేపయ్యాక మరలా ఉప తరంగాలు వస్తాయి. అయితే అవి ఏ విధంగా వచ్చాయో మీకు తెలియదు. మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు జరిగి ఉండి ఉండవచ్చు. మీరు మీ స్నేహితురాలి ఇంటికి వెళ్ళి మీకు ఇష్టమైన స్వీటు చేయించుకోవాలి అనుకుని ఆమె ఇంటికి వెళతారు. అప్పుడు ఆమె అదే స్వీటు చేసి ఉంటుంది. ఆమెకి ఎందుకో అది చేయాలి అనిపించి చేస్తుంది. అంతే.

గురుశిష్యుల మధ్య కూడా ఇదే విధంగా జరుగుతుంది. అది, చాలా దగ్గర సంబంధాలు అయిన స్నేహితులు, ప్రేమికులు, భార్యాభర్తల మధ్య కంటే ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే గురుశిష్యుల సంబంధం ఈ సృష్టిలోనే లోతైన అనుబంధం. ఇదే అంతిమ ప్రేమ వ్యవహారం. ఇది అద్భుతంగా ఉంటుంది. ఇది లాజిక్కి అతీతంగా ఉంటుంది. నిజానికి మీరు లాజిక్కి అతీతమైనదాన్ని స్పృశించాక జీవితం ప్రారంభమవుతుంది. అది మనస్సు ప్రేమలో ఇమడలేదు. అది మనస్సు చెప్పే వాదాలని పక్కన పెట్టేస్తుంది.

నిజమైన శిష్యుడు అసలు శిష్యుడు కాడు. ఎందుకంటే అది గురువుల స్థితి కాబట్టి. అందుకే గురువుల సమక్షంలో కూర్చుంటే శిష్యులు గురువుల లయకి అనుగుణంగా మారగలుగుతారు. అదే ఉపనిషత్ అంటే. అదే నిజమైన శిష్యరికం అంటే. విప్పారి ఉంటే గురువుల ప్రేమ వర్షిస్తుంది. మీరు ఆ వైభవాన్ని, ఆ తేజస్సుని తీసుకొని వృద్ధి చెందవచ్చు.

అనుమానం, నమ్మకం

మీకు ఎప్పుడైనా అనుమానం కలిగితే అనుమానాన్ని, నమ్మకాన్ని ఆయన పాదాల దగ్గర అర్పించండి. చూడండి, గురువు మీకు నమ్మకాన్ని ఇస్తారు. ఆయనే అనుమానాన్ని ఇస్తారు. మీరు అనుమానంలో చిక్కుకుపోయి ఉంటే మనస్సులో ఈ విధంగా అనుకోండి, 'గురుదేవా! నాలో మీ పట్ల నమ్మకం కలిగించింది మీరు. నాకు అనుమానాలు కలిగేలా చేసింది మీరు. ఈ రెంటిటినీ మీ పాదాలకి అర్పిస్తున్నాను. నేను ఈ ఆటలు ఆడలేను. ఈ ఆటలతో అలసిపోయాను. దయచేసి మీరే అంతా చూసుకోండి.'

ఎప్పుడైతే అనుమానాన్ని, నమ్మకాన్ని గురువుల పాదాల దగ్గర అర్పిస్తారో అప్పుడు మీలో విశ్వాసం ఏర్పడుతుంది. విశ్వాసం అంటే అనుమానం కాదు, నమ్మకం కాదు. విశ్వాసం సత్యాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకునే ధైర్యాన్ని ఇస్తుంది.

లోతైన విశ్వాసం

ఒక బౌద్ధగురువు దగ్గర చిన్నతనం నుంచీ ఉన్న శిష్యుడు ఉంటాడు. ఆ అబ్బాయికి గురువు పట్ల లోతైన, ప్రేమపూర్వకమైన అనుబంధం ఉంటుంది. కాని ఆ అబ్బాయి చాలా చిలిపివాడు. అతను గురువుగారిని అనుకరిస్తూ ఉంటాడు. ఆయన వెనక నిలబడి ఆయనలా చేసి అల్లరి చేస్తుండేవాడు. ఆయనకి ఒక అలవాటు వుంది. ఏ విషయమైనా గట్టిగా చెప్పాలి అంటే బొటనవేలు చూపించి చెప్పేవాడు. ఆ శిష్యుడు కూడా వెనుక నిలబడి వేలు పైకి పెట్టిగురువుగారిని అనుకరించే వాడు.

ఒక రోజు గురువుగారికి కోపం వచ్చి కత్తితో ఆ అబ్బాయి బొటనవేలు నరికేస్తాడు. అర్థం చేసుకోండి. ఈ కథలో ఒక విషయం చక్కగా చెప్పబడింది. విశ్వాసం, ప్రేమ అన్నవి ఎంత లోతుగా ఉన్నాయి అంటే ఆ అబ్బాయి ఒక్క క్షణం కూడా తనకి అన్యాయం జరిగింది అనుకోలేదు. ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే గురువుగారు ఏం చేసినా నా మంచికే ' అని. అంత బాధలోనూ ఆ అబ్బాయిలో విశ్వాసం అదే విధంగా ఉంది. అంతే, ఆ క్షణంలో అబ్బాయికి జ్ఞానోదయం అవుతుంది.

ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. మొదటిది - ఆ అబ్బాయిలో గురువు పట్ల చాలా విశ్వాసం, అనుబంధం ఉన్నాయి. రెండవది ఆ అబ్బాయి ఎంత బాధనైనా అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి తపస్సుకైనా సిద్ధంగా ఉన్నాడు. తపస్సు అంటే ఆ సాధనపద్ధతి మీద ఎంత కష్టమైనా, నష్టమైనా పని చేయటం. ఎందుకంటే జ్ఞానోదయం అతని ప్రముఖాంశం కాబట్టి. సాధనపద్ధతి ఎప్పుడైనా జ్ఞానోదయం ముఖ్యం అనుకునేవారి కోసమే.

మీ గుర్తింపుని అనుమానించండి, గురువుని కాదు

ఎప్పుడైతే మీరు ఒక భావాన్ని గాని, ఒక వ్యక్తిని గాని గట్టిగా పట్టుకొని ఉంటారో మీ నిరాశ, డిప్రెషన్ అంత లోతుగా ఉంటాయి. ఉదాహరణకి మీరు మీ బాయ్ ఫ్రెండ్‌ని లేదా భర్తని లేదా కొడుకుని గట్టిగా పట్టుకొని ఉన్నారనుకోండి. ఆ అనుబంధంలో తప్పనిసరిగా మీరు డిప్రెషన్ లోకి వెళతారు. ఆ తరువాత ఆ వ్యక్తిని తప్పుపడతారు. ఈ విధంగా డిప్రెషన్ ప్రారంభమవుతుంది. అదే విధంగా మీరు మీ అహంకారాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే లేదా మీ గుర్తింపుల్ని పట్టుకొని ఉంటే, మీరు డిప్రెషన్ లోకి వెళతారు.

మీ గుర్తింపు వలన గాని లేదా మీ అహంకారం వలన కాని మీరు డిప్రెషన్‌లోకి వెళితే, మీరు ప్రపంచాన్ని తప్పుపడతారు. ఎందుకంటే తప్పుపట్టడానికి అక్కడ రెండవ వ్యక్తి లేడు కాబట్టి. మీకు ఈ ప్రపంచం మొత్తం మీద నమ్మకం పోతుంది. ఈ ప్రపంచం మీద విశ్వాసం ఉండదు. మీ డిప్రెషన్ కి కారణం ఏమిటో మీకు తెలియదు. మీరు ప్రపంచాన్ని తప్పుపడతారు. మీరు ఇటువంటి డిప్రెషన్ లో పడితే, ఆ డిప్రెషన్ కి కారణం మీలో మీరు పట్టుకువేలాడే గుర్తింపు అని తెలుసుకోగల వివేకం ఉండదు. అప్పుడు మీరు అందరినీ, అన్నింటినీ అనుమానంగా చూస్తుంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా చాలు, మీ డిప్రెషన్ కి ఆ వ్యక్తే కారణం అని తప్పుపడతారు. అహంకారం ఆధారంగా ఉండే గుర్తింపుతో ఇదే పెద్ద సమస్య.

మీరు ఏమనుకుంటారంటే, నాకంటూ ఒక రకమైన గుర్తింపు లేకపోతే, ఒక పద్ధతి లేకపోతే ఎదుటివారు నన్ను మోసం చేస్తారు అనుకుంటారు. కాని ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే ఏదో కొన్ని నిమిషాలు చేయగలరు. దీని కోసం మీరు బలమైన గుర్తింపుని నిర్మించుకుంటే అది మిమ్మల్ని జీవితాంతం మోసం చేస్తూ ఉంటుంది. అది మీరు మేల్కొన్న స్థితిలో, స్వప్నస్థితిలో, గాఢనిద్రాస్థితిలో మీతోనే ఉంటుంది. కాని మీరు దాన్ని తెలుసుకోలేరు. కాబట్టి ఎదుటివారు మోసం చేసినా పరవాలేదు కాని మీ గుర్తింపు మోసం చేయకుండా ఉంటే చాలు.

ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, గురువుని ఎప్పుడూ అనుమానించవద్దు, మిమ్మల్ని అనుమానించండి. మీరు మోస్తూ తిరిగే గుర్తింపుని అనుమానించండి. అదే సరైన పద్ధతి.

ప్రేమ, ద్వేషం అనే చక్రం

ప్రారంభంలో మీరు గురువుల దగ్గరకి ప్రేమతో వస్తారు. ఆయన మీ అహంకారం అనే ట్యూమర్ మీద ఆపరేషన్ ప్రారంభించగానే అకస్మాత్తుగా చక్రం తిరిగిపోతుంది. ప్రేమ ద్వేషంగా మారుతుంది. కోపం, ఆటంకపరచటం అనేవి మొదలవుతాయి. మీలో తెలుసుకునే తత్త్వం ఉంటే మనస్సు ఆడే మోసపూరిత క్రీడలని గమనించగలుగుతారు. అప్పుడు ప్రేమద్వేషాలకి అతీతంగా వెళ్ళగలుగుతారు. అప్పుడు అనుబంధం మరింత లోతుగా ఉంటుంది. అప్పుడు మీలో ప్రేమ, ద్వేషం, భయం అనేవాటిని ఆశించరు. కాబట్టి మీకు కోపం వస్తే ఓపికగా ఉండండి. ఆ పాయింట్లోనే మీలో మార్పు వస్తుంది.

ఒక విషయం అర్థం చేసుకోండి, పోరాటం మీకు, మీ మనస్సుకి మధ్య కాదు. పోరాటం మీ మనస్సుకి, నాకు మధ్య జరుగుతుంది. ఆ పోరాటంలో ఎవరి వైపు ఉండాలి అనే నిర్ణయం మీది. మీరు కొంచెం లోతుగా చూస్తే, ఇది ఓడిపోయే పోరాటం అని మీ మనస్సుకు తెలుసు. కాబట్టి దాని జీవనానికి అది అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. ఈ యుద్ధంలో మీరు ఓడిపోతేనే గెలవగలుగుతారు.

గురువుల చేతిలో ఓడిపోవటం అంటే మీలోని అబద్ధపుపొర మీద నిజమైన మీరు గెలిచారు అని అర్థం. అది మీ మీద మీరు సాధించే అంతిమవిజయం. మీరు భగవంతుని రాజ్యాన్ని తిరిగి పొందగలరు. దాన్ని ఇప్పటి వరకూ మీ మనస్సు దొంగిలించి ఉంచింది.

గురువు సమక్షంలో కేవలం 'ఉండండి'.... అది జరుగుతుంది

ఎప్పుడైతే గురువుల సమక్షం లోకి దూకగలుగుతారో, ఆయన సమక్షంలో సర్వసృష్టితో ఉత్సవాలు జరుపుకుంటారో, ఎప్పుడైతే మీ సమక్షాన్ని, గురువుల సమక్షాన్ని ఉత్సవంలా చేస్తారో, అప్పుడు మీలోజరగవలసినవి అవే జరుగుతాయి. మరింకేమీ కాదు. నిజమైన గురుశిష్యుల సంబంధం ఏర్పడటానికి ఇదే జవాబు, ఇదే పద్ధతి, ఇదే పరిష్కారం.

ఈ విషయం మీకు అర్థం కానప్పుడు నేను చాలా చాలా మాట్లాడాలి, మీ ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలి. ఇది మరిన్ని సమస్యల్ని సృష్టిస్తుంది. అంతే. నేను మీ ప్రశ్నలకి జవాబుల్ని ఇస్తే ఏమవుతుంది? మీరు అది ఎలా చేయాలి అని తిరిగి అడుగుతారు. దానికి పద్ధతి ఏమిటని అడుగుతారు. అప్పుడు మీకు అది అర్థం చేసుకోవడానికి మరొక పద్ధతి చెప్పాలి. అప్పుడు ఆ పద్ధతి ఎలా సాధన చేయాలి అంటారు. ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది.

ప్రశ్నలు మరిన్ని ప్రశ్నల్ని కల్పిస్తాయి. అందుకే తత్త్వం అనేది ఏ ప్రశ్నకీ పూర్తి సమాధానాన్ని ఇవ్వలేదు. ప్రశ్నలకి ఎప్పుడూ జవాబులు ఇవ్వలేము. ప్రశ్నలకి జవాబులు ఆ ప్రశ్నల దశ కంటే పైకి వెళ్ళినప్పుడే దొరుకుతాయి. అప్పుడు ఇక ప్రశ్నలు ఉండవు. అవి కరిగిపోయి మాయమైపోతాయి.

మీలో అనుమానాలు, ప్రశ్నలు ఉన్నప్పుడు మీరు ఉత్సవం చేసుకోలేరు. ఉత్సవం - అనుమానం పూర్తి వ్యతిరేకాలు. మీరు ఉత్సవం చేసుకుంటే ప్రశ్నలు, అనుమానాలు కరిగిపోతాయి. అవి పోయేవరకూ ఎదురుచూడాలి అనుకోవద్దు. అది జరగదు, మీరు ఉత్సవాలు చేయండి, ప్రశ్నలు అవే కరిగిపోతాయి.

రామకృష్ణ పరమహంస చక్కగా చెబుతారు, 'మీరు చెట్టు క్రింద కూర్చొని చప్పట్లు కొడితే చెట్టు మీది పక్షులు అన్నీ ఎగిరిపోతాయి' అదే విధంగా డాన్స్ చేయండి మీలోని సంస్కారాలన్నీ కరిగిపోతాయి. మీ లోపల ఉన్న అనుమానాలన్నీ ఎగిరిపోయి మాయమవుతాయి. కాబట్టి బాగా గెంతుతూ వేగంగా డాన్స్ చేయండి. మీలోని పక్షులన్నీ ఎగిరిపోయి మాయం అవుతాయి. అవి తిరిగి రావాలి అనుకోవు. మీరు వాటి గూళ్ళు పడిపోయేలా గెంతండి. మీ లోపల ఉన్నవన్నీ పడిపోయి మాయమైపోతాయి.

మీరు అభివృద్ధి చెందాలంటే మీ అహంకారం మీద కొట్టాలి. అయితే ఒక విషయం తెలుసుకోండి. నేను ఎప్పుడూ మిమ్మల్ని నా నుంచి దూరం చేయను. కాబట్టి మీరు పడిపోయినా నా ఒడి లోనికే పడతారు. నేను మిమ్మల్ని కొట్టినప్పుడు రెండు జరుగుతాయి. మీరు సత్యాన్ని పట్టుకుంటారు లేదా మీరు పట్టుకోలేకపోతే నా ఒడి లోనికే పడతారు. ఒక విషయం అర్థంచేసుకోండి, నేను మిమ్మల్ని కొట్టినప్పుడు స్వాగతించండి. దాన్ని ఆపవద్దు. దాని నుంచి తప్పించుకోవద్దు. దెబ్బవల్ల మీకు బాధకలగదు. దాన్ని ఆపటమే బాధ కలుగుతుంది. నేను కొట్టటం మీకు దెబ్బ కాదు, దాన్ని ఆపటమే. అది కొట్టటం కాదు కరుణతో కూడిన దీవెన. మీ అభివృద్ధి కోసం గురువుల దీవెన అని తెలుసుకున్నప్పుడు అందులో అందాన్ని తెలుసుకొని దాన్ని స్వాగతిస్తారు.

బంధాన్ని ఏర్పరచుకున్న అనుభూతి

ఒకసారి గురువుతో బంధం ఏర్పడితే ఆయన మీకు ఇచ్చేది ఏమీ ఉండదు, ఆయన నుంచి తీసుకోవటానికి ఏమీ ఉండదు. ఇచ్చేవారు, తీసుకునేవారు ఉండరు. ఎందుకు? ఎందుకంటే ఒక విస్ఫోటం జరిగి ఇచ్చేవారు, తీసుకునేవారు ఒకరుగా కలిసిపోతారు.

నేను ఎప్పుడూ చెబుతుంటాను, మీకు జీవితంలో భక్తి కలిగే అవకాశం, గురువులతో అనుబంధం ఏర్పరచుకునే అవకాశం కలిగినప్పుడు, ఆ అంతిమసంఘటనకి అవకాశం కలిగినప్పుడు ఆ అవకాశాన్ని అసలు పోగొట్టుకోవద్దు. అసలు మిస్ అవ్వకండి. ఆ అవకాశం పోయింది అంటే అది చాలా ఖరీదైన నష్టం. అది లోతైన సంఘటన, అది అంతిమవరం. మీకు ఆ అవకాశం వస్తే దాన్ని పోగొట్టుకోవద్దు.

మీలో నిరంతరం అనుబంధం ఏర్పడుతున్న అనుభూతి కలిగినప్పుడు, దాన్ని ఎన్ని కష్టనష్టాలు వచ్చినా పోగొట్టుకోవద్దు. మీకు, ఆయనకి మధ్య వచ్చే ఏ భావాన్నైనా విసిరిపారేయండి. ఏది పోయినా పర్వాలేదు. కాని గురువులతో అనుబంధం పోకూడదు. ఎందుకంటే ఆ అనుబంధాన్ని జీవించనిస్తే, మీకు చాలా జరుగుతాయి. అవకాశాలు అనంతం, అన్ని ద్వారాలూ తెరవబడతాయి. మీరు ఆ అనుబంధంలో విప్పారి తెరవబడిన అంతరంగంతో ఉన్నారా లేదా అని కొలవటానికి ఒక స్కేలు ఇస్తాను.

మీ అంతరంగం లోనికి గురువుగారు ప్రవేశించగానే మీ టి. పి. ఎస్ (సెకండుకి వచ్చే ఆలోచనల సంఖ్య) తగ్గిపోతే, దాని అర్థం మీరు విప్పారి ఉన్నారు అని.

రాళ్ళని కూడా కదపగల శక్తి

నా ఆధ్యాత్మికప్రయాణంలో జరిగిన ఒక సంఘటనని చెబుతాను.

ఒక గురువుగారు తన శిష్యులతో హిమాలయాలతో పూర్తిగా బంధాన్ని ఏర్పరచుకున్న విషయం గురించి మాట్లాడుతున్నారు. ఆయన చాలా ప్రేమతో, ఆదరణతో నన్ను కూడా ఆ ఉదయం పూట జరుగుతున్న క్లాసులో కూర్చోనిచ్చారు. ఆయన ఒకరి తరువాత ఒకరిని 'ఆ పద్ధతి సాధన చేశావా?' అని అడుగుతున్నారు. ఆయన అంతకు ముందు కొన్ని రోజుల క్రితం ఒక పద్ధతి చెప్పి సాధన చేయమన్నారు. అది హిమాలయాలు మొత్తం వారి శరీరంలో ఒక భాగం అని, ఆ భావాన్ని పూర్తిగా అంతరంగంలో నిలుపుకోవాలి. ఒక శిష్యుడు, 'చేసాను గురుదేవా! నేను ఇప్పుడు పూర్తిగా హిమాలయాలతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను' అని చెప్పాడు. అప్పుడు గురువుగారు 'సరే! అయితే ఆ రాతిని కదుపు' అన్నారు. దూరంగా ఉన్న రాతిని చూపిస్తూ నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, దీన్ని నాకళ్లతో చూసాను. ఆ శిష్యుడు, తన చేతిని కదపగానే అక్కడ రాయి కదిలింది.

తర్కజ్ఞానంతో చూస్తే దీన్ని అర్థంచేసుకోవటం చాలా కష్టం. నేను నిర్ఘాంతపోయాను. అక్కడ జరిగింది చూసి కదిలిపోయాను. గురువుగారు నా వైపు చూసి, 'మనస్సు యొక్క శక్తి ఎంత ఉంటుందో చూస్తావా?' అని అడిగి ఇక్కడ కూర్చో అన్నారు. ఆ శిష్యుడి వైపు తిరిగి నా చేయి పట్టుకోమని చెప్పారు. నాతో ఆయన, 'ఇప్పుడు నీ చేతిని కదుపు' అన్నారు. నేను నా చేతిని కదపగానే రాయివెనక్కి యథాస్థానానికి వచ్చేసింది. అది చాలా పెద్ద రాయి. గురువుగారు నాతో చాలా చక్కగా చెప్పారు. అది ఆ శిష్యుడు మాత్రమే చేయగలడు నీవు చేయలేవు అని కాదు, ఎవరైనా ఆ అనుబంధంలో భాగంగా ఉంటే వారు చేయగలరు. రాతినే కాదు, పర్వతాన్ని కూడా కదపగలరు.

నేను మిమ్మల్ని రాళ్ళు కదపమని చెప్పటం లేదు. ఈ పద్ధతి గురించి చెప్పాను. ఈ సాధనపద్ధతిలో ఉన్న శక్తి గురించి చెప్పాను.

మీరు పోగొట్టుకోకూడని ఒక విషయం

మీరు గురువుల ప్రేమలో ఉన్నప్పుడు ఆయనని భగవంతుడుగా భావించటమే కాదు, ఆయన సమక్షంలో భగవంతుడు చేసే అద్భుతాల్ని ఆయన ముందు చూడగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఆ ప్రేమ పోతుందో, మీకు గురువుల పట్ల ప్రేమ ఉండదో ఆ అద్భుతాల్ని చూడలేరు. మీరు అదే వ్యక్తి, గురువు అదే వ్యక్తి. కాని అద్భుతాలు జరగవు.

ఇలా ఎందుకు జరుగుతుంది అని నన్ను ఎవరో అడిగారు. గురువుల జ్ఞానోదయం పోతుందా? లేదు. ఆయన దాన్ని పోగొట్టుకోరు. మీరు వాటిని గుర్తించే శక్తిని పోగొట్టుకున్నారు. మీరు జ్ఞానోదయంతో అనుబంధాన్ని పోగొట్టుకున్నారు. మీరు భగవంతుడా? అని ఎవరైనా నన్ను అడిగితే వారితో అది మీలో ఉంది అని చెబుతాను.

నేను నిరంతరం దొరుకుతాను. నేను విప్పారి ఉంటాను. మీరు నాతో ఒక టీచర్గా అనుబంధాన్ని పెంచుకుంటే ఆ జ్ఞానాన్ని పొందుతారు. ఒక గురువుగా నాతో బంధాన్ని ఏర్పరచుకుంటే, ఆ దీక్షని పొందగలుగుతారు. గురువు మాత్రమే దీక్షని ఇవ్వగలడు, టీచర్ ఇవ్వలేదు. టీచర్ బోధిస్తాడు. గురువు దీక్ష ఇస్తాడు. మీరు భగవంతుడు అని అనుబంధాన్ని పెంచుకుంటే, ఆ అంతిమశక్తితో బంధం ఏర్పడితే మీరు ఆ అనుభవాన్ని తీసుకుంటారు.

ఇదంతా మీ అంతరంగంలో నాకు దొరికే చోటుని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే. మీరు తెలివితేటల దశలో బంధాన్ని ఏర్పరచుకుంటే మీరు జ్ఞానాన్ని తీసుకువెళ్తారు. భావాత్మకత కూడా కలిపితే, కొంచెం ప్రేమని కూడా కలిపితే, మీరు దీక్షని తీసుకువెళతారు. నా సాఫ్ట్వేర్ మీలోపలికి వస్తుంది. మీరు అంతరాత్మస్థాయిలో బంధాన్ని ఏర్పరచుకుంటే, మీకు దీక్ష కూడా అవసరం లేదు. ఆ అనుభవం మీ లోనికి బదిలీ అవుతుంది. సాఫ్ట్వేర్, దాని ఉపయోగాలు అన్నీ మీ లోనికి బదిలీ అవుతాయి. ఇదంతా ఆయా వ్యక్తులు అనుబంధాన్ని ఏర్పరచుకునే స్థాయి, దేనితో ఎలా ఏర్పరుచుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది.

నేను ఎప్పుడూ చెబుతుంటాను, భక్తి లేదా గురుదేవులతో ఏర్పరచుకున్న అనుబంధం - అన్నింటిలోనూ అత్యుత్తమమైన అంతిమ సంబంధం. మీ జీవితంలో ఆ అవకాశం వస్తే దాన్ని మిస్ అవ్వకండి. ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. మీరు బయట ప్రపంచానికి సంబంధించిన వస్తువులు, అవకాశాలు మిస్ అయితే పరవాలేదు. మీ అంతరంగప్రపంచంలో మీకున్న భావాలు మిస్ అయినా పరవాలేదు.

ఇంగ్లీషులో ఒక సామెత ఉన్నది. మీ ఐశ్వర్యం పోతే మీరు పోగొట్టుకున్నది ఏదీ లేదు. ఆరోగ్యం పోతే ఏదో కొంత పోగొట్టుకున్నవారవుతారు. మీ ప్రవర్తనను పోగొట్టుకుంటే పోయేది ఏదీ లేదు! కాని గురువులతో ఉన్న అనుబంధం పోతే సమస్తం పోయినట్టే.

మరొక విషయం, మీరు నాతోనే బంధాన్ని పోగొట్టుకోవటం కాదు, నిజమైన అంతరాత్మతో కూడా బంధాన్ని పోగొట్టుకుంటారు. ప్రేమలో మీరు బంధం ఏర్పరచుకుంటారు. ద్వేషంలో దాన్ని తెంచుతారు. భక్తిలో ఈ రెండింటికీ అతీతంగా వెళతారు. మీరు నా సమక్షాన్ని అనుభూతితో తెలుసుకుంటారు. నేను భౌతికంగా ఉన్నా లేకపోయినా మీకు ఆ అనుభూతి కలుగుతుంది. ప్రేమకి అతీతంగా వెళ్ళటమంటే ద్వేషించమని కాదు, బంధాన్ని తెంచుకోమని కాదు నేను చెప్పేది. ఆ ప్రేమ భక్తిగా మారాలి. మీరు, గురువు వేరు కాదు ఒకటే అని మీరు అనుకోగలగాలి. అప్పుడు భౌతికంగా లేకపోయినా గురువుల సమక్షంలో మీరు ఉండగలరు. ఆయన నిరంతరం మిమ్మల్ని మీ లోనికి చూడమని గుర్తుచేస్తుంటాడు. ఆయన మిమ్మల్ని ఏ విధంగాను బందీ చేయడు.

ఎవరినైనా వారి సమక్షాన్ని అనుభూతితో తెలుసుకోవటానికి చాలా ఎక్కువ ప్రయత్నం చేయవలసి వచ్చినా, అందుకు చాలా శక్తిని వినియోగించినా, ఆ వ్యక్తితో ప్రయత్నపూర్వకంగా బంధాన్ని ఏర్పరచుకోవాలి అనుకున్నా, మీరు వారి మీద ఆధారపడతారు. ఆ తరువాత క్రమంగా వాళ్ళు కూడా మీ మీద ఆధారపడతారు. ఎవరైనా మీ మీద ఆధారపడకుండా, మిమ్మల్ని ఆయన మీద ఆధారపడనిస్తే అది మీరు స్వతంత్రంగా వ్యవహరించగలిగే స్థితి వరకూ ఆయన మీద ఆధారపడనిస్తే ఆయన జ్ఞానోదయమైన యోగీశ్వరుడు. జ్ఞానోదయమైన వ్యక్తి మీ మీద ఎప్పటికీ ఆధారపడడు. కాబట్టి మిమ్మల్ని ఆయన తన నియంత్రణలో ఉంచవలసిన అవసరం, ఆ ఆసక్తి ఆయనకి లేవు. సమయం వచ్చినప్పుడు, మీరు మీ లోపలికి వెళ్ళగల స్థితికి చేరినప్పుడు, ఆయన మిమ్మల్ని మీ లోనికి మళ్ళిస్తాడు. ఆయన మిమ్మల్ని మీ లోనికి వెళ్ళమని చెబుతాడు. ఒకసారి ఆ కేంద్రీకరించే పని పూర్తి అయితే, వెంటనే ఆయన 'ఇక చాలు, నేను లేకుండా నీవు పని చేయాలి. నీ మీద పని చేయాలి' అంటాడు. ఆయన సమక్షం లేని సమయంలో మీకు సహాయంగా ఉంటూ, శక్తిని అంతా మీ పని లోనికి మళ్ళే విధంగా చేస్తాడు. ఆయన మిమ్మల్ని బంధాలలో ఉంచరు. అదే గురువులతో ప్రేమలో పడటంలోని గొప్పతనం.

గురువు ఎప్పుడూ మీ మీద ఆధారపడడు. ప్రారంభంలో మిమ్మల్ని ఆయన మీద ఆధారపడనిస్తాడు. సమయం వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పూర్తి స్వేచ్ఛలోనికి వదిలేస్తాడు. ఆయన మీ శక్తిని అంతా మీలో నింపి 'ఇక సెలవు' అంటారు. అంతిమ అనుభవాన్ని మీ అంతట మీరు పొందేలా చేస్తారు.

హార్డ్వేర్, సాఫ్ట్వేర్లో మార్పు

మీలోని అచేతనస్థితి సాఫ్ట్వేర్ లాంటిది. దాన్ని ధ్యానంతో శుభ్రం చేయవచ్చు. మీ మెదడు అనే హార్డ్వేర్ని కొత్త సాఫ్ట్వేర్కి అనుగుణంగా మార్చాలి అంటే మీకు దర్శనం లేదా గురుకృప కావాలి.

ఎప్పుడైతే ధ్యానం ద్వారా మీ అచేతనస్థితిని, చేతనస్థితిని శుభ్రపరుచుకుంటారో, మీరు మీ లోపల మార్పుని తెస్తారు. ఆ మార్పుని మీలోని హార్డ్వేర్ పట్టిఉంచలేదు. గురువుల దర్శనంతో ఆయన దీవెనలతో హార్డ్వేర్ కూడా మారి దాన్ని పట్టుకొని ఉంచుతుంది. మీకు ఆ దీవెనలు దొరక్కపోతే, ధ్యానం, బోధనలు అనేవి క్రమంగా హార్డ్వేర్ మారటానికి సహాయం చేస్తాయి.

హార్డ్వేర్ పాతది, సాఫ్ట్వేర్ కొత్తది అయినప్పుడు క్రమంగా హార్డ్వేర్ కూడా కొత్తగా అవుతుంది. మీ హార్డ్వేర్లో వెంటనే మార్పు రావాలి అంటే మీకు గురుకృప, దర్శనం సరియైనవి. అది సూటిగా హార్డ్వేర్ని మారుస్తుంది. కొన్ని సార్లు కొత్త సాఫ్ట్వేర్ని పెట్టకుండానే హార్డ్వేర్ మారిపోయి కొత్త సాఫ్ట్వేర్ లక్షణాలని చూపిస్తుంది. అది జరగాలి అంటే శిష్యుడు గురువుగారి దగ్గర పూర్తి విప్పారి ఉండాలి. కొన్నిసార్లు శిష్యుడు ఎటువంటి కారణం లేకుండానే గురువుగారి ప్రేమలో పడతాడు. ఆయన బోధనలకి ఆకర్షితుడు కాకపోవచ్చు. ధ్యానపద్ధతులు అతన్ని ఆకర్షించకపోవచ్చు. కాని గురువుల ప్రేమలో పడతారు. కారణం లేకుండా గురువుల పైన శిష్యుడు ప్రేమతో ఉంటే గురువు సూటిగా ఆ శిష్యుడి సాఫ్ట్వేర్ మార్చగలరు. అటువంటి శిష్యులు ఆయన బోధనలని, ధ్యానపద్ధతుల్ని అవి నేర్చుకోకుండానే వెల్లడి చేయగలరు.

ప్రస్తుతం హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండూ బయట ప్రపంచం వైపు ఉన్నాయి. బోధనలు వినటం వలన సాఫ్ట్వేర్లోని చేతనస్థితి అంతరంగం వైపు తిరుగుతుంది. కాని సాఫ్ట్వేర్ అంతరంగం వైపు తిరిగినా హార్డ్వేర్ దానిని నిర్వహించలేదు. కాబట్టి హార్డ్వేర్ తన పూర్వస్థితిలోనే ఉండటానికి చూస్తుంది. ఒకవేళ సాఫ్ట్వేర్ చాలా బలంగా ఉండి అది ఆ స్థితిలో ఉండగలిగితే క్రమంగా హార్డ్వేర్ మారుతుంది. కాని బోధనలు, ధ్యానం తరువాత వెంటనే గురుదర్శనం, ఆయన దీవెనలు ఉంటే, హార్డ్వేర్ వెంటనే మారిపోయి కొత్త సాఫ్ట్వేర్కి అనుగుణంగా ఉంటుంది. అదే అనుభవాన్ని పట్టి ఉంచేందుకు సిద్ధంగా ఉంటుంది.

మార్పుని పట్టి ఉంచగల శక్తి

జ్ఞానోదయమైన యోగీశ్వరుల సమక్షంలో ఉన్నప్పుడు ఆయన మీ హార్డ్వేర్ని మార్చి మీలో జరిగిన మార్పుని, ఆ కార్యక్రమాన్ని పట్టిఉంచే శక్తిని దానికి ఇస్తాడు.

ఒక విషయం అర్థం చేసుకోండి. జ్ఞానోదయంతో మీ భౌతికవ్యవస్థలో పూర్తీమార్పు వస్తుంది. గురుదేవులు మీలోనికి జ్ఞానోదయ వ్యవస్థని చొప్పించి మీ భౌతికవ్యవస్థలో కూడా మార్పు తీసుకురాగలరు. ఆయన సమక్షంలో ఆయన మిమ్మల్ని స్పృశించినప్పుడు పూర్తిగా తెరువబడిన అంతరంగంతో ఉంటే, జ్ఞానోదయభౌతికవ్యవస్థ మీలోనికి పంపించబడుతుంది. మీ శరీరం ఇప్పుడున్నదాని కంటే చాలా బాగా ఉన్నాను. అని తెలుసుకుంటుంది. మీలోని జీవసంబంధ జ్ఞాపకవ్యవస్థ ఇంకా బాగా ఉండగల అవకాశాల్ని తెలుసుకుంటుంది.

వసుధైక కుటుంబకం

గురువుల ప్రేమతో, తోటి శిష్యులపైన కూడా ప్రేమ కలుగుతుంది. నేను అనేది తొలగిపోయి 'మేము' వస్తుంది. తోటి శిష్యులతో బలమైన బంధం ఏర్పడుతుంది. అది రక్తసంబంధీకులతో ఉండే బంధం కంటే బలమైనదిగా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి నిబంధనలు ఉండవు. ఆ ప్రేమ అంతా ఆవరించి ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పిన వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబంగా ఉంటుంది.

మీరు అందరూ సామాజికంగా వృద్ధి చెందుతారు. కానీ గురుదేవులతో సంబంధంలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఆ ప్రేమ వ్యవహారం, తెలివితేటల దశ లేదా హృదయదశ నుంచి ప్రారంభమవుతుంది. క్రమంగా త్వరలోనే అది అంతరాత్మదశకి వెళుతుంది. ఎప్పుడైతే అంతరాత్మ మరొక దానితో కలసిపోతుందో, శిష్యుల ఆత్మ గురువుల ఆత్మతో కలసిపోతుందో, అదే ముక్తి, నిత్య ఆనంద స్థితి.

జీవన్ముక్తి అంటే గురుదేవులతో జీవించటమే.... అది అంత సులభం.

ప్రశ్నలు- జవాబులు

గురువుగారు శిష్యులని ఎంచుకుంటారా లేక శిష్యులు గురువుగారిని ఎంచుకుంటారా?

మొదటి విషయం, శిష్యుడు గురువుని ఎంచుకుంటాడు. ఎందుకంటే గురువు ఎప్పుడూ ఎంచుకోరు. తన దగ్గరకి వచ్చినవారి మీద కరుణ కురిపిస్తాడు. ఆయన పవిత్రగంగానది వంటివాడు. ఆయన ప్రవహిస్తూ ఉంటాడు. మీరు కావాలి అనుకుంటే నది దగ్గరకి వెళ్ళవచ్చు. ఆ నది లోనికి దిగవచ్చు. అందులో మునగవచ్చు, ఆ నీరు తాగవచ్చు, అక్కడ ఆడుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కావలంటే అది చేయవచ్చు. కాని గంగానది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎవరినీ ఎంచుకోదు. అదే విధంగా గురువు కూడా. ఆయనది ఎంపిక లేని శక్తి, ఎంపిక లేని పరమానందం.

కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఆ అనుబంధాన్ని శిష్యుడే ఏర్పరచుకోవాలి. గురుశిష్యుల సంబంధాన్ని ఏర్పరచటంలో శిష్యునికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. అది అంతిమస్వేచ్ఛ. ఆ సంబంధాన్ని ఏర్పరచాక, ఆ స్వేచ్ఛ పోతుంది. ఎందుకంటే అతను జ్ఞానోదయాన్ని పొందుతాడు కాబట్టి. మీరు చేయగల చివరి పని, మీ జీవితంలో చేయగల చివరి ఎంపిక గురువుని ఎంచుకోవటం, అంతే. ఒకసారి గురువుని ఎంచుకోగానే మీరు మాయమవుతారు. ఇక మీరు ఒక వ్యక్తి కాదు. మీరు గురువు అవుతారు.

గురుశిష్యుల మధ్య విశ్వాసం ఎలా ఏర్పడుతుంది? శిష్యుడు నిదర్శనం అడగవచ్చినా? అతను నిబంధనలు లేని అధీనతని ఆశిస్తారా?

మొదటి విషయం శిష్యుడు నిబంధనలు లేని అధీనతని ఇవ్వడు. అతను నిరూపించే విషయాల గురించి అడగటం మానడు. శిష్యుడు ఎప్పుడూ గురువు అసలు స్థితిని తెలుసుకోవటానికి గట్టి నిదర్శనలని ఆశిస్తాడు. రెండవ విషయం శిష్యుడికి ఉండే అన్ని అర్హతలూ అతనికి ఉండవు. అతనే శిష్యుడు. అతను కచ్చితమైన శిష్యుడు కాదు కాని గురువులో కచ్చితమైన అర్హతలని ఆశిస్తాడు. అదే శిష్యుడి లక్షణం. దీని గురించి పట్టించుకోవద్దు. గురువుల లక్షణం ఆయన అధీనం అయ్యే శిష్యులకి నిబంధనలు పెట్టడు. ఆయన నిరంతరం తాను నిజమైన గురువుని అని నిదర్శనాలు చూపుతూ ఉంటాడు. అదే గురువుల అర్హత. మరొక విషయం మీరు నిదర్శనం అడిగినా నిబంధనలు లేని అధీనతకి సిద్ధపడకపోయినా పరవాలేదు. అది అవసరం లేదు. మీరు అలా చేయలేరు కూడా. నిదర్శనాలు అడగండి, దొరుకుతాయి.

ఎప్పుడైతే మీకు నిదర్శనం దొరుకుతుందో నిబంధనలు లేకుండా అధీనమవుతారు.

ఎవరైనా గురువుగారు మారవచ్చైనా లేక వారిని ఎంపిక చేస్తారా?

మిమ్మల్ని ఎవరూ ఎంపిక చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి, అంతే. అర్థం చేసుకోండి, అదృష్టం కొద్దీ గురువుని ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపిక చేయరు. ఎవరూ వారికి ఓటు వేయనవసరం లేదు. మీరు చేయవలసినది, కేవలం మీ ఓటు మీకు వేసుకోవటం. మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి. ఎవరూ మిమ్మల్ని గురువులుగా ఎంపిక చేయనవసరం లేదు. మీరు ఈ విధంగా నిర్ణయించుకోండి, ఈ రోజు నుంచి నా అంతరాత్మ యొక్క సత్యంతో, సత్యంగా జీవిస్తాను. మీరు ఆ నిర్ణయం చేసుకుంటే చాలు, మీరు గురువు అవుతారు అంతే.

నేనెప్పుడూ చెబుతుంటాను, నేను ఫలానా రోజున జ్ఞానోదయం పొందాను అంటే ఆ రోజు ఏదో అయ్యింది అని కాదు. అంటే నా లోపల ఏదో జరగటం వాస్తవమే, అది ముఖ్యం కాదు. అది కాదు నేను చెప్పదలచుకున్న విషయం.

మొదటి విషయం, అప్పుడు ఏమైందంటే నేను చేతనస్థితిలో, జ్ఞానోదయస్థితిలో జీవిస్తాను అని నిర్ణయించుకున్నాను. నేను అలా నిర్ణయించగానే నాలో ఏదో జరిగింది. అందరూ ఏమనుకుంటారంటే ముందు జ్ఞానోదయం జరుగుతుంది. తరువాత నిర్ణయం చేస్తాం అని, అది కాదు. ముందు నిర్ణయం చేస్తాం తరువాత అనుభవం కలుగుతుంది.

స్వామీజీ ! జీవితం, ప్రపంచం, విశ్వం, భగవంతుడు లక్ష్యం ఏమిటి?

మీ జీవితలక్ష్యం తెలిస్తే, మిగతా మూడూ ఆటోమాటిక్‌గా తెలుస్తాయి. జీవిత లక్ష్యం, విశ్వలక్ష్యమే. విశ్వలక్ష్యం భగవంతుని లక్ష్యమే. అంటే మీ జీవితలక్ష్యమే భగవంతుని లక్ష్యం. స్పష్టంగా తెలుసుకోండి, ముందు మీ జీవితలక్ష్యాన్ని తెలుసుకోండి, అప్పుడు భగవంతుని లక్ష్యం తెలుస్తుంది. అయితే మీ జీవితలక్ష్యం నేను చెప్పలేను.

Mరొక ముఖ్యమైన విషయం, మీ జీవితలక్ష్యం ఏది అనుకుంటారో అటువంటి విశ్వాన్ని మీ చుట్టూ ఆకర్షిస్తారు. అటువంటి ప్రపంచాన్ని మీ చుట్టూ నిర్మించుకుంటారు. అటువంటి దేవుడిని పూజిస్తారు. మీ జీవితలక్ష్యం మీ ప్రపంచాన్ని, మీ విశ్వాన్ని మీ భగవంతుడిని తయారుచేస్తాయి.

మీ లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే అయితే మీరు అటువంటి కార్పోరేట్ ప్రపంచాన్ని సృష్టిస్తారు. అటువంటి కార్పోరేట్ విశ్వాన్ని సృష్టించుకుంటారు. ఈ ప్రపంచాన్ని ఒక వ్యాపార సంస్థగానే అర్థం చేసుకుంటారు. కాబట్టి మీ జీవితలక్ష్యం ప్రపంచలక్ష్యాన్ని, మీ విశ్వలక్ష్యాన్ని, మీ దేవుడి లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. మీ జీవితలక్ష్యం జ్ఞానోదయం అయితే, డబ్బు మరేదీ కానప్పుడు అకస్మాత్తుగా మీరు అటువంటి సమాజాన్ని మీ చుట్టూ చూస్తారు. అటువంటి విశ్వాన్ని అటువంటి దేవుడిని, ఎవరైతే మీకు జ్ఞానోదయం ఇవ్వగలరు అనుకుంటారో ఆ భగవంతుడిని మీరు చూడగలుగుతారు.

మీకు డబ్బు, జ్ఞానోదయం - రెండూ కావాలి అని అనుకుంటే, మీ విశ్వం అదే విధంగా ఉంటుంది. మీ చుట్టూ అటువంటి ప్రపంచాన్ని నిర్మిస్తారు. కాబట్టి జీవితలక్ష్యం అనేది చాలా ముఖ్యo. అదృష్టం కొద్దీ లేదా దురదృష్టం కొద్దీ ఆ ఒక్కటీ నేను మీకు నేర్పించలేను. అది మీరే తెలుసుకోవాలి.

శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు అవతరిస్తాడు - అన్న మాట నిజమేనా?

అవును, అది నిజమే. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు అవతరిస్తాడు. కొన్నిసార్లు శిష్యుడు సిద్ధంగా లేకపోయినా కరుణతో గురువు అవతరిస్తాడు. ఆయన అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి సిద్ధంగా లేనివారు కూడా అందులోనికి దూకవచ్చు. కాబట్టి ఆ అవకాశానికి నా సహాయ హస్తాన్ని ముందుకి చాపుతాను.

అయితే కొందరు ఆ చేతిని కొరుకుతారు. ఏం చేయాలి. నేను వారితో సరే కొరకండి, అది మీ సహజగుణం అంటాను. కాని నేను నా చేతిని, సహాయాన్ని అందిస్తూ ఉంటాను. అది నా సహజలక్షణం. ఏదో మీరు చేయి కొరికారు అని నేను నా చేతిని అందించను అని అనుకుంటారు. నేను మరొక చేతిని ముందుకి చాస్తాను. ఇది బాగు అయ్యాక, నొప్పి తగ్గాక ఈ చేతిని కూడా పట్టుకోమంటాను. అంతే.

అర్థం చేసుకోండి. కొన్నిసార్లు శిష్యులకి ఒక పెద్ద అడుగు వేసే అవకాశం దొరుకుతుంది. అందుకే శిష్యుడు సిద్ధంగా లేకపోయినా గురువులు అవతరిస్తారు.

స్వామి వివేకానంద తన గురువైన రామకృష్ణ పరమహంసని పరీక్షించాడు. నేను కూడా అదే విధంగా మిమ్మల్ని పరీక్షించవచ్చా?

నేను ఒకసారి కాలేజీ స్టూడెంట్స్ ప్రోగ్రాంలో మాట్లాడుతున్నాను. అప్పుడు ఒక స్టూడెంట్ నన్ను 'దేవుడిని చూసారా మీరు?' అని అడిగాడు. నేను అతన్ని 'నీవు వివేకానందుడి పుస్తకం చదివావా' అని అడిగాను. 'అవును నేను వివేకానంద పుస్తకాలు చదివాను. వివేకానందుడు రామకృష్ణపరమహంసని ఇదే ప్రశ్న అడిగాడు. అదే విధంగా నేను మిమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతున్నాను, మీరు దేవుడిని చూసారా?' అన్నాడు.

నేను అతనితో, 'చూడు! వివేకానందుని ప్రశ్నకి రామకృష్ణ పరమహంస' 'అవును చూసాను' అని జవాబు ఇచ్చాడు. వెంటనే సర్వం వదలి వివేకానంద రామకృష్ణుల వెనుక వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు చెబుతున్నాను, 'నేను చూడటమే కాదు. నీకు కూడా చూపిస్తాను. నాతో రా అన్నాను. ఆ అబ్బాయి జనంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక విషయం అర్థంచేసుకోండి. గురువుని పరీక్షించే ముందు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ తరువాత నా దగ్గరకి వచ్చి పరీక్షించండి.

విశ్వాసం లోతుగా ఏర్పడటానికి విమర్శాత్మకంగా పరీక్షించనవసరం లేదు. అనుమానాలు ఉన్న మార్గం పరవాలేదు, కాని ఆ అనుమానం శాస్త్రజ్ఞుని అనుమానంలా తెరవబడి ఉండాలి. అంతేకాని ఎతీస్టు అనుమానంలా ఉండకూడదు. శాస్త్రజ్ఞుడు దేని మీదా ఇంకా అభిప్రాయాన్ని ఏర్పరచడు. వికసించిన మనస్సుతో ఇంకా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి శాస్త్రవేత్తలా అనుమానం ప్రశ్నలు ఉండవచ్చు కాని ఎతీస్టులా కాదు.

నేను ఏ విధంగా మీ శిష్యుణ్ణి కాగలను.

మీరు బంధవిముక్తులైతే నా అంతరంగప్రదేశ్ం లోనికి, నా పరిధి లోనికి ప్రవేశించవచ్చు. ఆ విధంగా ఉంటే నాతో సూటిగా బంధాన్ని ఏర్పరచుకోగలరు. అప్పుడు మీ నుంచి అద్భుతమైన శక్తి ప్రవహించటం ప్రారంభమవుతుంది. బంధ విముక్తి అంటే ఏమిటి? ఏ వ్యక్తినీ, విషయాలన్నీ ఆలోచనని పట్టుకొని వేలాడకుండా విరామంగా ఉండగలగటం.

నేను ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటాను, ఎవరైతే ఏదైనా బాధ కలిగి నా దగ్గరకి హీలింగ్కి వస్తారో వారు భక్తులు. భక్తుడు కేవలం తన సమస్యల గురించే చెబుతూ ఉంటాడు. ఏ వ్యక్తి అయితే నా బాధని తీసుకుంటాడో, నా బాధ్యతని తీసుకుంటాడో, అతను నా శిష్యుడు.

ఏ వ్యక్తి అయితే నా బాధ్యత తీసుకున్న తరువాత, 'ఒక జ్ఞానోదయమైన గురువులకి ఏ విధంగా నొప్పి ఉంటుంది. ఈ బాధ్యత తీసుకోక ముందు బాధ, నొప్పి అని నేను అనుకున్న బాధ్యత బాధ కాదు, అది నిత్యానందం అని తెలుసుకుంటాడో ఆ వ్యక్తి నా అంతరంగం లోనికి, నా ప్రదేశం లోనికి వచ్చిన నా లోపలివాడవుతాడు.

కాబట్టి ఇప్పుడు మీకు ఎలా శిష్యుడుగామారాలో తెలిసింది. నా బాధ్యత, సర్వాంతర్యామి బాధ్యతే. దాన్ని తెలుసుకోండి. అప్పుడు నా శిష్యులవుతారు.

ఒక ఆధ్యాత్మిక అన్వేషికి తాను గురువుని చేరాను అని ఎలా తెలుస్తుంది? అతనికి చాలా మంది గురువులు ఉండవచ్చానా?

మీరు మీ గురువుని చేరినప్పుడు 'ఈయన నా గురువేనా కాదా?' అన్న ప్రశ్న మాయం అవుతుంది. స్పష్టంగా తెలుసుకోండి. నన్ను చాలా మంది అడుగుతుంటారు. మేము మిమ్మల్ని గురువుగా స్వీకరించాలా? అని. నేను చెబుతాను, ఆ తప్పు పొరపాటున కూడా చేయవద్దు అని. నన్ను మీ గురువుగా తీసుకోండి అని నేను ఎప్పుడూ చెప్పను. నేను మీ గురువుని అయితే మీ తెలివితేటల స్థితికి అతీతంగా ఏదో ఉంటుంది. మీరు నన్ను మరచిపోలేరు. ఇప్పుడు చెబుతున్నాను. నన్ను మరచిపోగలిగితే మరచిపోండి. అప్పుడు నేను మీ గురువుని కాదు. రిలాక్స్ అవ్వండి. మీకు సరియైన గురువు దొరుకుతారు. దాన్ని గురించి ఆదుర్దా పడవద్దు.

మీరు నన్ను మరిచిపోలేకపోతే నేను మీ గురువుని. నేను ఎప్పుడూ చెబుతుంటాను, నన్ను మీ గురువుగా అనుకోవద్దు. నేను మీ గురువుని అయితే నేను రాత్రి, పగలు కూడా మీ మనస్సులో ఉంటాను. మీ కలలలో కూడా నేనే ఉంటాను. మీ ఆలోచనల నిండా నేనే ఉంటే, నేను మీ గురువుని.

కొంతమంది అడుగుతుంటారు. స్వామీజీ మిమ్మల్ని గుర్తుంచుకోవాలా? అని. వద్దు, అలా చేయవద్దు, మరిచిపోవటమే సమస్య కాని నన్ను గుర్తుపెట్టుకోవటం సమస్య కాదు. మీరు మరిచిపోగలిగితే మరిచిపోయి, మీ ప్రయాణాన్ని కొనసాగించండి. అది మీకు మంచిది.

మీరు నన్ను మరిచిపోలేకపోతే నేను మీ గురువుని మీ మనస్సులో ఏదో ఒక మూలలో నా మీద అనుమానం ఉంటే నేను మీ గురువుని కాదు. రిలాక్స్ అవ్వండి. బాధ పడవద్దు, పోరాటం వద్దు, మిమ్మల్ని మీరు హింసించుకోవద్దు. నానుంచి ఆనందంగా సెలవు తీసుకోండి. మీకు మంచి గురువు దొరకాలని దీవిస్తాను. మీ గురువు కోసం అన్వేషణ ప్రారంభించండి. ఆ విధంగా నేను చాలా మందికి సహాయం చేశాను. ఇది షాపు కాదు, వ్యాపారం కాదు, మరొక చోటకి వెళ్ళకూడదు అని లేదు. నేను మరొక విషయం కూడా చెబుతాను, మీరు నా శిష్యులైనా, మిగతా గురువుల నుంచి కూడా నేర్చుకోమంటాను. అన్ని తోటలకి వెళ్ళి మంచి పూలు తెచ్చుకొని మీ కోసం అందమైన మాలని తయారుచేసుకోండి. జీవితం అంటే దాన్ని మరింత ఐశ్వర్యవంతం చేయటమే. ముందుగా మీరు తెలుసుకోండి. మీరు నా శిష్యులా కాదా అన్న ప్రశ్న, నేను మీ గురువునైనప్పుడు అసలు రాదు. మీకు ఆ ప్రశ్న వచ్చినప్పుడు స్పష్టంగా తెలుసుకోండి నేను మీ గురువుని కాదు అని. మీ అన్వేషణని కొనసాగించండి.

రెండవ విషయం: ఆ అనుమానం పూర్తిగా పోయాక, మీలో ఎటువంటి అనుమానం లేకపోయినా నాతో పూర్తిగా బంధాన్ని ఏర్పరచుకున్నాక అప్పుడు కూడా కొత్త విషయాలు కొత్త చోట్ల నుంచి నేర్చుకోవటం మానవద్దు. అందరి గురువుల నుంచీ దొరికే ప్రతి అవకాశం నుంచీ కొత్త విషయాల్ని నేర్చుకోండి. నేర్చుకోవటం ఆపవద్దు.

రెండు - మూడు సంవత్సరాలు మీతో గడిపాక ఎందుకు కొంతమంది మిమ్మల్ని వదలి వెళ్ళిపోతారు? వాళ్ళు ఆ విధంగా ఎలా వెళ్ళగలుగుతారు? మీరు వాళ్ళని ఎందుకు ఆపరు?

అదే జ్ఞానోదయమైన గురువుల గొప్పదనం. ఆయన మిమ్మల్ని హిప్నటైజ్ చేయడు. మీకు బ్రెయిన్ వాష్ చేయడు. మీకు ఆయన అన్ని అవకాశాలనిస్తాడు. మీరు పది సంవత్సరాల తరువాత అయినా ఆయనని వదిలివేయవచ్చు. ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. మామూలు బోధకుడు మీ చుట్టూ చాలా విషయాలు అల్లుతాడు, చాలా విషయాలు బోధిస్తాడు, వ్యవస్థల్ని తయారుచేస్తాడు. మీరు వదిలివెళ్ళకుండా అన్నీ తయారుచేస్తాడు. దాంతో మీరు వదిలివెళ్ళలేరు. కాని గురువులు మీకు అన్ని అవకాశాలూ ఇస్తారు. అవకాశాలు అన్నీ తెరవబడి ఉంటాయి. మీరు లోపలికి రావచ్చు. బయటకి వెళ్ళవచ్చు. నిరంతరం అన్ని అవకాశాలూ దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ అనుబంధాలు ప్రేమ, స్వేచ్ఛ, వికాసం, కరుణ అనేవాటి మీద ఏర్పడ్డాయి. మీరు ప్రేమలో ఉన్నప్పుడు సత్యాన్ని చూడగలుగుతారు. మీరు లోపలికి వచ్చినప్పుడు, నేను మీకు మార్గదర్శిగా ఉండాలి అని మీరు ఆశించినప్పుడు నేను కల్పించుకుంటాను. లేకపోతే నేను మీకు దూరంగా ఉంటాను. చూడండి. నా దగ్గరకి సలహాల కోసం, మార్గం కోసం వస్తారనుకోండి, వాళ్ళు వాళ్ళకి ఉన్న అయోమయస్థితి నుంచి తప్పించుకోవాలని అనుకుంటారు. ఇక్కడ శక్తి మంతమైన రక్షణవలయం ఉంది అని వారికి తెలుసు. ఇక్కడ ఒక మహామేధస్సు వారికి దారి చూపిస్తుంది అని వారికి తెలుసు. అయితే కొన్నిసార్లు వారి అచేతనస్థితి ఆ సలహాలని, ఆ మార్గదర్శకత్వాన్ని ఒప్పుకోదు. నేను వారిని వేచి ఉండమని చెబితే, నేను వారికి పరిష్కారం చూపించటం లేదు అనుకుంటారు. అలా కాకుండా నేను పదే పదే వారికి పరిష్కార మార్గం చూపిస్తే, వారు వారి స్వేచ్ఛని కోల్పోయాం అనుకుంటారు. ఇటువంటివి చూసాక నేను వాళ్ళని వేచి ఉండండి, మెల్లమెల్లగా జరగవలసినవి జరుగుతాయి అని చెబుతాను.

ఆ విధంగా వెళ్ళిపోయేవాళ్ళని వారికి రావాలనిపిస్తే తిరిగి వచ్చే స్వేచ్ఛ మీకు ఉంది అని చెబుతాను. అయితే వారు నన్ను సలహా అడిగితే వారిని విమర్శించను. వారు ప్రేమతో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలపైన అది లేనప్పుడు వారి అభిప్రాయాల్ని ఏర్పరచుకోకూడదు. అదే ప్రేమ లేనప్పుడు ఆ ప్రేమ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలపై సత్యాల పైనా వారు ఇప్పుడు ఆ ప్రేమ లేని సమయంలో అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు.

  • జ్ఞానోదయం పొందటానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఆ అనుభవం పంపించగల విశ్వాసానికి సమయం పడుతుంది.
  • జీవించి ఉన్న ఒకే ఒక ఆధ్యాత్మికగ్రంథం గురువు.
  • గురువు సహాయంతో మీరు భగవంతుని చేతుల లోనికి దూకవచ్చు.
  • మీ జీవితం అసలు లక్ష్యాన్ని మీరు మరిచిపోయారు.
  • జీవితం ఒక నాటకం. సంబంధబాంధవ్యాలు అన్నీ ఒక మానసికనాటకం.
  • నేను పని చేసేవాడిని అని మీరు అనుకున్నప్పుడే బాధ, టెన్షన్ కలుగుతాయి.