లోతైన జీవిత సత్యాలు
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
- మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు
- కర్మచక్రాన్ని ఛేదించవచ్చు
- మరణం ఒక ఉత్సవం
- మీరే మేధ
- బాధ్యత మిమ్మల్ని ఉన్నతస్థితికి చేరుస్తుంది
- నాయకత్వం ఒక స్థితి, హోదా కాదు
- తీవ్రత - అపజయం లేని మార్గం
- జీవిత ద్వారాన్ని తెరిచే అమాయకత్వం
- సమష్టిచైతన్యంలో మీరూ ఒక భాగం
- విశ్వశాంతి మీ నుంచి ప్రారంభమవుతుంది
- సన్యాసం అంటే అంతిమద్వైతం
- మీ సామ్రాజ్యానికి తాళం చెవి జ్ఞానోదయం

మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు
జీవన్ముక్తి అంటే ఆలోచనలు లేని స్థితిలో జీవించటమే
మనని నడిపించే ప్రాథమిక భావావేశాల గురించి తెలుసుకున్నాం. ఈ భావావేశాలని వ్యతిరేకంగా వ్యక్తపరిస్తే అవి మన లోపలి శక్తిని నాశనం చేసి బయటి నుంచి శక్తిని పొందలేని విధంగా చేస్తాయి. ప్రతి చాప్టర్లో ఇచ్చిన పద్ధతులని సాధన చేయటం ద్వారా ఆ వ్యతిరేకభావాల నుంచి ఏ విధంగా బయట పడగలరో తెలుసుకున్నారు. దానితో మీలోని శక్తిప్రవాహానికి ఉన్న అడ్డంకులని ఏ విధంగా తొలగించుకోవచ్చో నేర్చుకున్నారు.
ఇప్పుడు మనం మరి కొన్ని విషయాలని తెలుసుకుందాం. వాటిని బాగా అర్థం చేసుకోవటం ద్వారా మనం మన జీవనసరళిని మార్చుకోవచ్చు. వీటిని అర్థం చేసుకుంటే మనం మారవచ్చు.
మనం ఒక చిన్న విషయంతో ప్రారంభిద్దాం. దేన్నైతే మనం యధాలాపంగా తీసుకుంటామో, దాన్ని చూద్దాం. మన మనస్సు నిజంగా ఏ విధంగా పని చేస్తుందో చూద్దాం.
పది నిముషాల ప్రయోగం
పది నిముషాలు చేసే ఈ ప్రయోగాన్ని ప్రయత్నించండి. ఒక పేపరు, పెన్ తీసుకొని ఒక్కరే కూర్చోండి. మీ మనస్సు లోనికి వచ్చిన ప్రతి ఆలోచననీ రాయండి. మీ మైండ్‌కి ఒక రాసే యంత్రాన్ని కనెక్ట్ చేస్తే ఎలా ఆలోచనలని రాస్తుందో ఆ విధంగా వచ్చిన ఆలోచనని అదే విధంగా రాయండి. దేన్నీ ఎడిట్చేయవద్దు. ఆలోచనలని ఆపవద్దు. ఇది కేవలం మీ కోసం చేసే ప్రయోగం. మీరు రాసిన దాన్ని ఎవరూ చదవరు. పది నిముషాలు అయ్యాక మీరు ఏమి రాసారో చదవండి. మీరు ఆశ్చర్యపోతారు. మీ మనస్సులో ఏర్పడిన ఆలోచనలకి ఏ మాత్రం అర్థం లేదు అని తెలుస్తుంది.
ఉదాహరణకి మీరు వీధిలో ఒక కుక్కని చూస్తారు. వెంటనే మీకు, మీరు చిన్నప్పుడు భయపడిన కుక్క గుర్తు వస్తుంది, ఆ తరువాత ఆలోచన మీ చిన్నతనం గురించి. మీ చిన్నప్పుడు స్కూల్ టీచర్ గురించి ఆ తరువాత ఆలోచన మీ క్లాసు రూమ్, మీ టీచర్ ఇల్లు. మీరు ఇప్పుడు చూసిన కుక్కకి, మీ చిన్ననాటి స్కూల్ టీచరుకి ఏ విధమైన సంబంధం లేదు. కేవలం కొన్ని సెకండ్ల కాలంలో మీ ఆలోచనలు అర్థం లేని విషయాల మీదకి దూకుతూ ఉంటాయి. మీ ఆలోచనలు ఒక దాని నుంచి మరొక విషయానికి మారటం మీరే చూస్తారు. దీన్ని ‘ఆలోచించటం’ అనలేం. ఇది ఒక సమూహం మాత్రమే. కుక్క మీ చిన్నతనాన్ని కలిపింది. మీరు తరువాత టీచరు, ఇల్లు ఇలా ఒకదాని కొకటి కలుపుతూ వెళ్లారు. నిజానికి ఈ ఎక్సర్సైజు ఒక్కసారి చేస్తే దాని నుంచి మీరు తెలుసుకున్న విషయం మీరు, మీ గురించి ఆలోచించే పద్ధతిని మార్చేస్తుంది. అదే విధంగా మీరు మిమ్మల్ని, ఎదుటివారిని ఏ విధంగా చూస్తారో ఆ ధోరణిలో మార్పు వస్తుంది. మీ జీవితంలోనూ మార్పు వస్తుంది.
మానసిక వ్యవస్థ ఏ విధంగా పని చేస్తుంది?
మనం ఆలోచనలని ఏ విధంగా సృష్టిస్తాం, వాటిని ఒక దానితో మరొక దానికి ఏ విధంగా బంధాలు కల్పిస్తాం?
జీవితాన్ని ఏ విధంగా అనుభవిస్తాం?
మనస్సు లక్షణం

మీ లోపల ఆలోచనలు ఏ విధంగా సాగుతాయో, ఆలోచనకి, ఆలోచనకి ఏ విధంగా మీరు లింకులు పెడతారో ఒక బొమ్మ వేసి మీకు వివరిస్తాను. ఈ బొమ్మలో ఒక్కొక్క చతురస్రం ఒక్కొక్క ఆలోచన. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు, ఒక్కొక్క రంగులో ఉంటాయి. రకరకాల ఆలోచనలు నిరంతరం మీలోనికి వస్తూ పోతూ ఉంటాయి. ఒక ఆలోచన బాధకి, ఆ అనుభవానికి సంబంధించి ఉంటే, మరొక ఆలోచన సంతోషానికి సంబంధించి ఉంటుంది. మరొక ఆలోచన సంతోషానికి సంబంధించినదే కాని మీరు దాన్ని బాధ అనుకుంటారు. దాన్ని చార్ట్ లో జె.పి.గా చూపించాను. జె.పి అంటే ఆనందకరమైన అనుభవం, కాని మీకు బాధలా కనిపిస్తుంది. అదే విధంగా బాధాకరమైన ఆలోచన కాని మీకు సంతోషకరంగా కనిపిస్తుంది. అదే పి.జె.గా చార్టులో చూపించాను.
ఆలోచనలు వల్ల సంతోషమా, బాధా
సాధారణంగా మనలోని ఆలోచనలు అన్నీ కూడా గతానికి కాని, భవిష్యత్తుకి కాని సంబంధించి ఉంటాయి. వర్తమానం అంటే ఈ క్షణం గురించి మీకు ఆలోచనలు ఉండవు. వర్తమానంలో కేవలం చేతనస్థితిలో మాత్రమే ఉండగలరు. ఆలోచనలు ఉండవు. ఆలోచనలు గతంలో జరిగిన ఒక సంతోషకరమైన అనుభవం కాని లేదా భవిష్యత్తులో మీరు పొందబోయే సంతోషకరమైన అనుభవం గురించి ఉంటాయి లేదా మీరు గతంలో అనుభవించిన బాధ గురించి, భవిష్యత్తులో ఆ బాధ లేకుండా ఎలా ఉండాలి అనే ఆలోచనలు ఉంటాయి.
మీరు సీరియస్ గా ఉన్న సమయాలలో కూడా అనుకూలమైన ఆలోచనలు అకస్మాత్తుగా రావచ్చు. సంతోషం అత్యున్నతస్థాయిలో అనుభవంలో ఉన్న సమయంలో వ్యతిరేకమైన ఆలోచనలు రావచ్చు. ప్రతి ఆలోచనా స్వతంత్రమైంది. దాని ముందు ఆలోచనతో ఎటువంటి సంబంధం లేని ఆలోచన. అందుకే బాధపడే ఆలోచనల మధ్య సంతోషకరమైన ఆలోచనలు మీకు రావచ్చు. ఒక విషయం అర్థం చేసుకోండి. ఏ రెండు ఆలోచనలూ అర్థవంతంగా ఒకదానికొకటి లింక్ చేసి ఉండవు. తరువాత ఆలోచన రావటానికి ముందు ఆలోచనది ఎటువంటి బాధ్యత ఉండదు. అవన్నీ విడివిడిగా, అర్థం లేకుండా ఉండే ఆలోచనలు ఒక దానితో ఇంకొక దానికి సంబంధం ఉండదు.
ఈ విధంగా వచ్చే ఆలోచనల నుంచి మీరు ఏ విధంగా బయటకి రాగలరు. దాని నుంచి విముక్తులు అవ్వాలి (అన్క్లచ్). బంధ విముక్తులు అవటం (అన్క్లచ్) అనే మాటని పదే పదే ఉపయోగించబోతున్నాను. దాని అర్థం ఏమిటో వివరిస్తాను. కారు డ్రైవ్ చేసేటప్పుడు మీరు గేర్లు మారుస్తారు కదా? ఆ విధంగా మొదటి గేరు నుంచి రెండవదాని లోనికి, రెండవ గేరు నుంచి మూడవ దాని లోనికి ఇలా గేరు మారిన ప్రతీ సారీ మీరు న్యూట్రల్ గేరు లోనికి వెళతారు. అంటే పూర్తిగా అన్క్లచ్ అయ్యి న్యూట్రల్ లోనికి వెళ్తాం. అప్పుడే తరువాత గేర్ లోనికి వెళ్ళగలుగుతాం. అంతే కదా! అదే విధంగా రెండు ఆలోచనల మధ్యలో మనం న్యూట్రల్ లోనికి వెళ్తాం. అంటే రెండు ఆలోచనల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం. అదే రెండు ఆలోచనల మధ్య ఉండే నిశ్శబ్దం. అదే శాంతి, ఆనందం. ఎప్పుడైతే గతానికి, భవిష్యత్తుకి ఆలోచనలతో బంధాలు వేయకుండా ఉంటామో మనం బంధాల నుంచి స్వేచ్ఛని పొందుతాం. అదే బంధవిముక్తి లేదా అన్క్లచ్ స్థితి. ఎప్పుడైతే ఆలోచనలకి లింకులు ఏర్పరచమో ఆ శూన్యప్రదేశంలో పూర్తి తెలుసుకునే తత్వంతో ఉండగలుగుతాం. అలా ఉన్నప్పుడు రెండు ఆలోచనల మధ్య ఉండే ఖాళీ పెరుగుతూ ఉంటుంది. మనం ఆ శూన్య ప్రదేశంలో ఎక్కువసేపు ఉండగలుగుతాం. అప్పుడు ప్రశాంతతని, ఆనందాన్ని అనుభవించగలుగుతాం.
తెలుసుకునే తత్త్వం
చివరి తాళంచెవి : మీరు అకస్మాత్తుగా తెలుసుకునే తత్వంతో ఉండగలిగితే, మీ ముందుకి ఏ ఆలోచన వచ్చినా అది మీ జీవితం అవుతుంది. మీరు దాని పట్ల మీ ఏకాగ్రత నిలుపగలుగుతారు. మీరు దాన్ని సాధిస్తారు. లేదా దాని నుంచి తప్పుకుంటారు. ఇది ప్రొజెక్టర్ ముందు ఉన్న స్లైడు లాంటిది. ప్రొజెక్టరు ముందు ఏ స్లైడుని ఉంచితే అదే నిజం అన్నట్టు తెర మీద చూపిస్తుంది. కాని సమస్య ఏమిటి అంటే మీ అంతరంగంలో ఉండే ప్రొజెక్టర్ లైటు ఎప్పుడూ వెలుగుతూ ఉండదు. ఇక్కడ ప్రొజెక్టరు లైటు అంటే మీలోని తెలుసుకునే తత్త్వం. అది వస్తుంది పోతుంది ; వస్తుంది పోతుంది. మీరు పూర్తిగా నిరంతరం తెలుసుకునే తత్వంతో ఉండరు.
చాలా సార్లు మీరు కళ్ళు తెరచి ఉంటారు, శరీరం కదులుతూ ఉంటుంది. కాని మీరు ఉన్నారు అని మీకు తెలియదు. ఉదాహరణకి మీరు ఇంట్లో నుంచి కారులో బయలుదేరతారు. అరగంట డ్రైవ్ చేసి ఆఫీసుకి వస్తారు. అక్కడ కారు పార్క్ చేసి దిగాక అకస్మాత్తుగా గుర్తొస్తుంది, మీరు అరగ్ంట డ్రైవ్ చేసారు అని, ఆఫీసుకి వచ్చేసారు అని. దీని అర్థం ఏమిటంటే మీరు డ్రైవ్ చేస్తున్నంతసేపూ మీ అంతరంగంలోని ప్రొజెక్టర్ లైటు ఆరిపోయి ఉన్నది. మీ ప్రొజెక్టర్ లైటు ఆరిపోయి ఉన్నప్పుడు అంటే మీలో తెలుసుకునే తత్త్వం లేనప్పుడు, ఏంరిగినా ఏ స్లైడు ఉంచినా, అది మీ జీవితంలో భాగం కాదు. దాన్ని మీరు గుర్తుంచుకోలేరు. మళ్ళీ లైటు వెలిగినప్పుడు, మీలోనికి తెలుసుకునే తత్త్వం వచ్చినప్పుడు, అప్పుడు మీకు వచ్చిన ఆలోచన మాత్రమే మీ జీవితంలో భాగం అవుతుంది. ఇది చాలా సూక్ష్మసత్యం. మీకు వచ్చిన అన్ని ఆలోచనలూ కలిపి - మీకు తెలిసి వచ్చినవి, తెలియకుండా వచ్చినవి అన్నీ కలిపి - మీ జీవితం.
దురదృష్టం కొద్దీ మీలో తెలుసుకునే తత్త్వం లేని స్థితిలోనే మీరు చాలా ముఖ్యమైన నిర్ణయాలు చేస్తారు. జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు జరుగుతాయి. అవి కూడా మీ జీవితంలో భాగమే కానీ అవి మీకు తెలియదు. అప్పుడు వచ్చిన ఆలోచనలు, చేసిన నిర్ణయాలు మీకు తెలియదు. మీకు తెలియకుండానే అవి మీ జీవితానికి తోడ్పడతాయి.
స్పష్టంగా తెలుసుకోండి, మీ జీవితంలో జరిగే ఏ క్షణమైనా మీకు తెలియకుండా, మీ అనుభవం లేకుండా జరిగితే అది బాధాకరమే. మీరు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని బాధని సృష్టించినవారవుతారు. మీ కారులోని మలుపు తిప్పాలి అని సూచించే లైటు వెలిగి ఆరుతూ ఉన్నట్టును మీ అంతరంగంలో చేతనస్థితి మినుకుమినుకుమంటూ ఉంటుంది. కాని మీలో తెలుసుకునే తత్త్వం లేనప్పుడు అది ఎప్పుడు వెలిగిందో, ఎప్పుడు ఆరుతుందో తెలుసుకోలేరు.
ఆలోచనల ప్రవాహం మీ ముందు వెళుతూ ఉంటే మీరు అకస్మాత్తుగా తెలుసుకుంటారు, ‘అయ్యో! భగవంతుడా! ఇవన్నీ నిజంగా నాలో జరుగుతున్నాయా? నేను ఎక్కడికి వెళుతున్నానో తెలియటం లేదు. నాలో ఏం జరుగుతున్నదో తెలియటం లేదు’ అని. మీకు తెలియదు కాని, మీకు అన్నీ తెలుస్తున్నాయి అని అనుకోవటం మీలోని మొదటి ఊహ. మీరు నిరంతరం తెలుసుకునే తత్త్వంతో ఉంటే మీరు విప్పారి ఉంటారు. అప్పుడు సత్యాన్ని మొదటిసారి చూడగలుగుతారు. ప్రారంభంలో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం గాఢంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకూ మీరు అచేతనస్థితిలోనే గడిపారు. ఎప్పుడైతే తెలుసుకునే తత్త్వంతో ఉంటారో మీరు కేవలం సంతోషాన్ని, ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తారు.
మీ నిజమైన గతం మీకు తెలియదు
ఇది మొదటి సత్యం. మీ నిజమైన గతం మీకు తెలియదు. మీ ముందు జరుగుతున్న అన్ని విషయాలూ మీకు తెలియవు. నిజంగా ఏ విధంగా జరిగిందో ఆ విధంగా మీకు గుర్తుండదు. ఒక చిన్న ఉదాహరణని తీసుకోండి. మీ జీవితం అంతా రకరకాల సంఘటనలతో నిండి ఉంటుంది. కొన్ని సంతోషకరమైన సంఘటనలు, కొన్ని బాధ కలిగించేవి, మరి కొన్ని అపరాధభావంతో, మరి కొన్ని నిరాశా నిస్పృహలతో ఉన్నవి. మీరు జీవితాన్ని యథాతథంగా చూడరు. మీరు సాధారణంగా ఏం చేస్తారు? మీరు కేవలం బాధ కలిగించిన సంఘటనల్ని మాత్రమే తీసుకుంటారు. వాటినన్నింటినీ ఒక గొలుసులా చేసి, ఆ భావాలనే కలిపి జీవితం అంటే బాధపడటం అని చెబుతారు. మీరు ఏమనుకుంటారంటే జీవితం బాధలతో ఉన్న ఒక పొడవైన గొలుసు, అని అనుకుంటారు. చాలా అరుదుగా మీరు సంతోషాల గొలుసుని తయారు చేస్తారు. చాలా అరుదుగా సంతోషకరమైన సంఘటనలని పోగుచేసి ఆ భావనలతో సంతోషాల గొలుసు చేసి, జీవితం అంటే సంతోషం అని అనుకుంటారు. సంతోషాల గొలుసులు అరుదుగా ఉన్నట్టే వాటి నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. చాలా వరకు మీరు బాధ కలిగించే సంఘటనలని, భావాలని తీసుకొని, ఒక గొలుసు చేసి జీవితం బాధలమయం అనే భావాన్ని సృష్టించుకుంటారు. ఎప్పుడైతే జీవితం నిరంతరం ప్రవహించే బాధలు అని అచేతనస్థితిలో అనుకుంటారో, మీరు నమ్మకాన్ని బలంగా తయారుచేస్తారు. కానీ మీకు తెలిసే విధంగా ఆ గొలుసుని విడగొట్టాలి, తెంపాలి అని చూస్తారు. ఒక విషయం అర్థం చేసుకోండి, జీవితం అంటే బాధల గొలుసు లేదా సంతోషాల గొలుసు అని మీరు అనుకునేది, మీరు అచేతనస్థితిలో ఉన్నంతవరకు మాత్రమే ఉంటుంది. ఒక్కసారి మీరు తెలుసుకునే తత్వంతో ఉంటే అది మాయం అవుతుంది.
మీ అంతరంగంలో ఆలోచనలకి, మీలోని తెలుసుకునే తత్వానికి మధ్య
మీరు మోహం (కోరిక) కి సంబంధించిన ఆలోచనలతో సంతోషపడితే, అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు, మీరు తెలుసుకుంటారు. అప్పుడు 'నేను' అనేది ఉంటుంది. మీరు హింసాత్మక ఆలోచనలతో సంతోషపడితే, అటువంటి ఆలోచనలు మీలోనికి వచ్చినప్పుడు మీలో జీవం వస్తుంది. మీరు ఉన్నారు అని తెలుస్తుంది. దీనినే ఛేదించలేని వృత్తం అంటాను. మీరు మీలోని వ్యతిరేక ఆలోచనలని, వ్యతిరేకతని జీవంతో తిరిగి తీసుకువస్తారు. వ్యతిరేక ఆలోచనలకి బలాన్ని ఇస్తారు. దాంతో వ్యతిరేక ఆలోచనలు ఇంకా పెరుగుతాయి, జీవితాన్ని ఉత్సాహపరచటానికి మరింత వ్యతిరేకతని తెస్తారు.
మీరు అనుకుంటున్న అసలు లేదు
బాధాకరమైన గొలుసు ఎప్పుడూ బాధాకరమైన సంఘటనలని మీ జీవితంలోనికి ఆకర్షిస్తుంది.
రమణమహర్షి ఈ విషయాన్ని చక్కని ఉపమానంతో చెప్పేవారు. ఒక కుక్క ఎండిన ఎముకని కొరుకుతూ ఉంటుంది. అలా నములుతుంటే ఆ ఎముక దాని నోట్లో గుచ్చుకొని రక్తం వస్తుంది. కుక్క ఆ రక్తం ఎముక నుంచి వస్తూఉంది అని సంతోషంగా ఇంకా ఆ ఎముకని కొరుకుతూ ఉంటుంది. ఆ రక్తం తన నుంచి వస్తూందని తెలుసుకోలేదు. అది ఎముక నుంచి వస్తూంది అని సంతోషపడుతుంది.
మీలో హింస ఉత్సాహాన్ని కలిగిస్తే మీరు అటువంటి సంఘటన కోసం ఎదురు చూస్తారు. మీలో బాధలు ఉత్సాహాన్ని కలిగిస్తే జీవితంలో అటువంటి సంఘటన కోసం చూస్తారు. వాటికి బలాన్ని ఇచ్చి ఇంకా నమ్ముతారు. అది సాధారణమానవుల మానసికస్థితి. చెప్పటానికి మాత్రం హింస లేదా బాధాకరమైన గొలుసుని తెంపాలి అని చూస్తున్నాం అంటారు కానీ రహస్యంగా దాన్ని పెంచి పోషిస్తారు.
బాధలు
మీకు బాగా లోతుగా అర్థమయ్యేలా చెబుతాను. పది సంవత్సరాల క్రితం అనుభవించిన బాధ, తొమ్మిది సంవత్సరాల క్రితం అనుభవించిన బాధ, ఏడు సంవత్సరాల క్రితం అనుభవించిన బాధ, మూడు సంవత్సరాల క్రితంది, నిన్నటిది - అన్నీ ఒక దానికొకటి ఎటువంటి సంబంధం లేని స్వతంత్రమైన సంఘటనలు. కానీ మీరు వాటిని అన్నింటినీ కలిపి బాధల గొలుసు తయారు చేస్తారు. ఇటువంటి బాధల గొలుసులు మరిన్ని కలిపి మరొక పెద్ద బాధల గొలుసు తయారుచేస్తారు. అలా చేసి నా జీవితం బాధలమయం అని గట్టిగా నమ్ముతారు. కానీ అది సరి కాదు. మధ్య మధ్యలో మీరు ఆనందించిన మధురక్షణాలు, మంచి సంఘటనలు ఏమయ్యాయి? తప్పనిసరిగా ఆ సంతోషకరమైన సమయం ఉండి ఉంటుంది. గొలుసులు తయారుచేసేటప్పుడు వాటిని మరిచిపోయారు. కాబట్టి ఎటువంటి గొలుసైనా అది నిజం కాదు. ఎందుకంటే అది మీ జీవితంలో ఒక చిన్న భాగమే కానీ పూర్తి జీవితం కాదు.
ముందుగా మీరు బాధాకరమైన సంఘటనలని ఎందుకో గుర్తుపెట్టుకుంటారు. డాక్టరుకి చెప్పటానికి లేదా అటువంటి అవసరానికి కష్టం, బాధ కలిగించిన సంఘటనలని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. క్రమంగా వీటిని ఒక గొలుసులా అల్లి, జీవితం అంటే బాధ అనుకుంటారు. ఎప్పుడైతే మీ జీవితం బాధాకరం అని మీరు నిర్ణయించి దాన్ని నమ్ముతారో, అది మీకు నరకాన్ని సృష్టిస్తుంది.
ఉదాహరణకి, నిన్నటి వరకూ మీరు నడిచారు. ఎప్పుడూ గాలిలోకి ఎగరలేదు. మీ గతంలో ఎప్పుడూ ఎగరలేదు అని తెలుసు. ఎప్పుడూ నడిచినట్టే తెలుసు. రేపటి నుంచి నీవు ఎగరగలవు అని చెబితే నమ్ముతారా? లేదు. మీరు నమ్మలేరు. రేపు కూడా మీరు నడవగలనని మాత్రమే అనుకుంటారు. మీ భవిష్యత్తుని కేవలం మీ గత అనుభవాలతోనే తయారుచేస్తారు. ఆ అనుభవాలలో కొత్త అవకాశాలని వదిలేస్తారు.
బాధ జ్ఞానోదయానికి మహాద్వారం
బాధ గురించి మరొక విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇది మార్మికమైనది, నమ్మటం కష్టం. కానీ నిజాయితీగా చెబుతున్నాను. పతంజలి ఈ విధంగా చెబుతారు, 'ఎటువంటి బాధనైనా జ్ఞానోదయానికి ద్వారంగా ఉపయోగించవచ్చు.' ఆ పద్ధతిలో దానికి బాధ అని పేరు పెట్టకూడదు. కేవలం అక్కడ ఏం జరుగుతుందో గమనించండి. చిన్న పిల్లలు కొత్త విషయాలని ఎంత కుతూహలంగా, ఉత్సాహంగా చూస్తారో ఆ విధంగా చూడండి. బాధ కలిగినప్పుడు ఆ విధంగా చూడండి. ఆ అనుభవం మీలో గొప్ప మార్పుని తీసుకువస్తుంది.
ఎప్పుడైతే మీరు బాధని చూడగలుగుతారో రెండు విషయాలు జరుగుతాయి. ఆ బాధ అనే కార్యక్రమంలో శరీరం తిరిగి కోలుకోవటాన్ని చూడగలుగుతారు. శరీరం చక్కగా చికిత్స చేసుకుంటుంది. ఆ కార్యక్రమానికి మీరు బాధ అని పేరు పెడతారు. రెండవది అప్పుడు మీరు దాన్ని బాధ అనరు. దాన్ని ఆపటానికి ప్రయత్నించరు. అప్పుడు ఆ భాగం త్వరగా బాగు అవుతుంది. మీరు దాన్ని బాధ అన్నప్పుడు, మీ శరీరంలో జరిగే చికిత్సాకార్యక్రమానికి అడ్డుపడినవారవుతారు. దానితో బాధపడే సమయాన్ని పెంచుతారు.
సంతోషాల గొలుసు

పది సంవత్సరాల క్రితం మీకు కలిగిన సంతోషం, తొమ్మిది సంవత్సరాల క్రితం, మూడు సంవత్సరాల క్రితం కలిగిన సంతోషం, నిన్న కలిగిన సంతోషం – అన్నీ ఒక దానికొకటి సంబంధం లేని స్వతంత్ర సంఘటనలు. ఇప్పుడు మీరు వీటినన్నింటినీ కలిపి ఒక పెద్ద సంతోషాల గొలుసు తయారు చేస్తారు. మీరు మీ సంతోషానికి ఒక వ్యక్తి, ఒక సంఘటన లేదా ఒక స్థలాన్ని కారణంగా గుర్తిస్తారు. అప్పుడు మీరు తిరిగి అదే వ్యక్తిని లేదా సంఘటనని పదే పదే మీ జీవితంలోనికి తీసుకురావటానికి ప్రయత్నిస్తారు. కాని మీరు ఎంత ప్రయత్నించినా తిరిగి అదే సంతోషాన్ని పొందలేరు. అది మీకు బాధని కలిగిస్తుంది.
బాధల గొలుసు లేదా సంతోషాల గొలుసు, ఏదైనా బాధే.
మనం జీవితంలో నిరంతరం బాధలదో, సంతోషాలదో ఏదో ఒక గొలుసుని తయారుచేస్తుంటాము. ఒకసారి బాధల గొలుసుని తయారుచేసి, దాన్ని తెంపాలి అని చూస్తారు. సంతోషాల గొలుసుని పెంచాలి అని చూస్తారు. కాని దాన్ని తెంపలేరు, దీన్ని పెంచలేరు అని అర్థం చేసుకోరు. ఎందుకంటే అసలు ఆ గొలుసులు నిజంగా అక్కడ లేవు. అవి కేవలం కొన్ని ఎంపిక చేసుకున్న జ్ఞాపకాలు మాత్రమే. గొలుసు అనేది కేవలం మీ ఊహ మాత్రమే.
ఆలోచనలు చెరువులోని గాలి బుడగలు
మనలో వచ్చే ఏ రెండు ఆలోచనలకి ఎటువంటి సంబంధం ఉండదు. వాటికి ఉన్న సంబంధం కేవలం ఒక్కటే, ఆలోచనలు అన్నీ ఒక దగ్గర నుంచే వస్తాయి. కాని మనం నిరంతరం ఒక ఆలోచనను మరొక ఆలోచనతో కలుపుతుంటాం. చెరువులో వచ్చే గాలి బుడగలు చెరువు అడుగు నుంచి నిలువుగా వస్తాయి. మన ఆలోచనలు కూడా అదే విధంగా వస్తాయి. ఒక గాలి బుడగ నీటి పైకి వచ్చాక రెండవది వస్తుంది. ఆ తరువాత మూడవది వస్తుంది. అయితే అవి చాలా వేగంగా రావటం వల్ల, ఒక గొలుసులా కనిపిస్తాయి. నిజానికి రెండు గాలి బుడగల మధ్య ఖాళీ ఉంటుంది. అదే విధంగా మన రెండు ఆలోచనల మధ్య కొంత శూన్యప్రదేశ్ం ఉంటుంది. అయితే రెండు ఆలోచనల మధ్య ఉండే ఖాళీ చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి, అవన్నీ ఒకదానికొకటి కలిసిపోయి, ఒక గొలుసులా కనిపిస్తాయి. కాని ఆలోచనల మధ్య ఎప్పుడూ ఖాళీ ఉంటుంది.
మీకు ఒక సంఘటన చెబుతాను.
ఒక మధ్యవయస్సు వ్యక్తి నా దగ్గరకి వచ్చి తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని, అందుకు ఆశీర్వదించమని అడిగాడు. అతనికి సుమారుగా నలభై ఐదు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పుడు అతనితో, 'నేను వివాహాలకే ఆశీర్వదిస్తాను, కాని విడాకులకి కాదు' అని చెప్పాను. నీకు విడాకులు ఎందుకు? అని అడిగాను. అతను నాతో, 'నేను చాలా కష్టాలు పడ్డాను, మీరు తప్పకుండా నన్ను ఆశీర్వదించాలి,' అని గట్టిగా అడిగాడు.
నేను అతనితో, 'బాధ అనేది ఎప్పుడూ ఇచ్చి పుచ్చుకునేదే. కేవలం తీసుకోవటం ఒక్కటే ఉండదు. నీవు నీ భార్యని తగినంత కష్టపెట్టి ఉంటావు. కాబట్టి అసలు జరిగినది ఏమిటో నిజం చెప్పు' అని అడిగాను. అతను, 'అసలు మీకు నేను ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదో తెలియటం లేదు.' చాలా సంఘటనలు ఉన్నాయి. ఆమె మొదటి రోజు నుంచి నన్ను చిత్రహింసలు పెడుతున్నది. నేను ఎన్ని హింసలు అనుభవించానో మీకు తెలియదు. అని చెప్పి, అతను తన పెళ్ళినాటి సంఘటనని ఒకటి చెప్పాడు.
ఉంగరం తీసే సమయంలో ఆమె నా చేతిని గీరింది. ఆమె గోళ్ళతో నా చేతి మీద గీరింది అని. ఆ తరువాత చాలా విషయాలు చెప్పాడు. అతను ఒక పోలీసు ఫైలులా ఫైలు పెట్టుకొని అన్నీ అందులో రికార్డు చేసినట్టు గుర్తుంచుకున్నాడు. ఆ విధంగా రెండు - మూడు సంఘటనలు చెప్పాక నేను అతన్ని ఇక మాట్లాడవద్దు అని చెప్పాను. నీవు ఇదే విధంగా ఉంటే, నీ నుంచి విడిపోతే ఆమె సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా పెద్ద పెద్ద ఫైల్స్ మైండ్‌లో పెట్టుకుని తిరిగేవారితో ఎవరికైనా బతకటం చాల కష్టం. ఎప్పుడు ఆమె ఏమి చేసినా అతను ఆ ఫైల్స్ నుంచి మాత్రమే చూడగలడు. ఆ తరువాత అతను విడాకులు తీసుకోవటానికి గల కారణం చెప్పాడు. ఆమె నా మీద కాఫీ ఒంపింది. అది కారణం అన్నాడు. నేను అతనితో కాఫీ ఒలికితే విడాకులు ఇవ్వాలా అని అడిగాను. అతను నాతో, 'మీకు తెలియదు. ఇవాళ ఆమె నా మీద కాఫీ పోసింది, రేపు యాసిడ్ పోయవచ్చు' అని అన్నాడు. ఆ కనెక్షన్ ఏమిటో నాకు అర్థం కాలేదు. నేను అతన్ని కాఫీకి, యాసిడ్‌కి సంబంధం ఏమిటి అని అడిగాను. అతను నాతో 'మీకు తెలియదు స్వామీజీ!' అన్నాడు.
అతని ధోరణి కొంచెం అతిగా అనిపించవచ్చు. ఇది విన్నప్పుడు మీరు నవ్వుతారు. కాని మీ జీవితం లోనికి కొంచెం లోతుగా చూస్తే మీరు కూడా ఇంచుమించు ఇదే విధంగా అర్థం లేని కనెక్షన్స్ పెడుతుంటారు. మీరు ఆ సంఘటల్ని విడివిడిగా చూడలేరు. ఎందుకంటే మీరు ఆలోచనలని విడివిడిగా చూడరు.
మీరు ఈ చిన్న పద్ధతిని పాటించగలిగితే, ఆలోచనలకి లింకులు పెట్టకుండా ఉంటే, మీరు మీ అంతరంగంలో, అంతరాత్మలో చాలా శక్తిని నిలుపుకోగలుగుతారు. అప్పుడు మీరు ఎంతో సృజనాత్మకంగా, చాలా బాగా పని చేయగలుగుతారు. మీకు ఇతరులతో ఉండే సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక సంఘటనకి, మరొక దానికి లింకులు పెట్టరు కాబట్టి. ఎదుటివారు మీ నుంచి ఆశించే విషయంలో మీరు ఉక్కిరిబిక్కిరి కాకుండా స్వేచ్ఛగా ఉండగలరు. మీ అంతరంగంలో చాలా ప్రదేశం మీ అందుబాటులోకి వస్తుంది. మీరు మీ అవసరాలనే కాకుండా ఇతరుల అవసరాలు కూడా తీర్చగలుగుతారు. ఎదుటివారు బాధపడితే వారి విషయంలో కలుగచేసుకునే కరుణ మీలోకి వస్తుంది. మీరు ఎదుటివారి బాధని అర్థం చేసుకోనప్పుడు మాత్రమే మీరు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. మీరు లింకులు ఏర్పరచకుండా ఉన్నప్పుడు ఎదుటివారికి మీ అంతరంగంలో స్థానం కల్పించగలుగుతారు. మీరు అప్రయత్నంగా కరుణతో ఉంటారు. మీ జీవితంలో నాణ్యత పెరుగుతుంది. మీరు ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారతారు.
అది ఎప్పుడూ ఒక్కటే కాదు
మన జీవితంలో ప్రతి చిన్న సంఘటన వేరువేరుగానే ఉంటుంది. అవి తినటం, తాగటం వంటి సాధారణవిషయాలు కూడా ప్రతి అనుభవం ప్రత్యేకమైందే. నిన్న మంచినీళ్ళు తాగటం, ఇవాళ మంచినీళ్ళు తాగటం రెండూ పూర్తిగా వేరు వేరు సంఘటనలు. చూడటానికి ఒకే విధంగా ఉన్నా నిన్న చేసిన భోజనం, ఈ రోజు చేసిన భోజనం రెండూ వేరువేరు, రెండూ ప్రత్యేకమే. కాని మీ మానసికవ్యవస్థ మాత్రం నిన్న తిన్నది, ఇవాళ తిన్నది, ఒక్కటే అని చెబుతుంది.
స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు ప్రతి రోజూ ఒక రకమైనవే తినరు. మీరు తినటం అనే మాటని రెండు అనుభవాలకి వాడతారు. మీరు ఉపయోగించే మాటలతో మోసగింపబడవద్దు. ఇవాళ తినటం, నిన్న తినటం, రేపు తినటం అనేవి ప్రత్యేకమైనవి. అవి వేరు వేరు అనుభవాలు. అవన్నీ పూర్తిగా స్వతంత్రమైనవి. ఒక దానితో ఒకటి సంబంధం లేనివి. మధ్య భారతదేశంలో ఉన్న ఒక జ్ఞానోదయమైన యోగి జీవితం నుంచి ఒక చక్కని సంఘటనని చెబుతాను.
ఆ యోగికి, డాక్టర్స్ ఆరోగ్యరీత్యా ఒక విధమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెప్పారు. ఆ విధంగా ఆయన జీవితంలో చివరి పది సంవత్సరాలు ఉన్నాడు. అది తప్ప ఆయన మరేమీ తినకూడదు. అదే భోజనాన్ని ప్రతి రోజూ మూడుసార్లు తినాలి. ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచాక ఆయనకి వంట చేసే వ్యక్తి ఆయన దగ్గరకి వచ్చి, 'ఇదే వండటానికి నాకు ఎంతో విసుగ్గా ఉంది. అదే భోజనం చేయటానికి మీకు ఇంక ఎంత విసుగ్గా ఉందో కదా!' అని అడుగుతుంది. ఆయన నవ్వి 'నేను ప్రతి రోజూ ఒకే ఆహారాన్ని తినటం లేదు. ప్రతి రోజూ ఒకే విధమైన భోజనం ఎలా చేయగలుగుతాను. ఈ రోజు భోజనం ఇవాళ చేస్తాను. రేపు తినేది పూర్తిగా వేరే భోజనం' అని చెబుతాడు.
జీవితం అంటే ప్రతిక్షణం కొత్తదనంతో ఉంటుంది. కేవలం మానసికస్థితే నిస్సారంగా, విసుగ్గా అదే పని చేస్తున్న విధంగా ఉంటుంది.
భయం నుంచి స్వేచ్ఛకి
మీ భయమే మీ మానసికవ్యవస్థకి బలం : ఒక రౌడీ మొదటిరోజు టౌనులో అడుగు పెట్టినప్పుడు భయంభయంగా ఉంటాడు. ఎప్పుడైతే అందరూ అతనికి అణుకువగా ఉంటారో అప్పుడు అతనికి తన మీద నమ్మకం కలుగుతుంది. 'అవును, నేను గొప్పవాడిని' అనుకుంటాడు. అలా అనుకోగానే అతని ప్రవర్తనలో, నడక, మాటతీరులలో మార్పు వస్తుంది.
అదే విధంగా మీ మీద దాడి చేసే ముందు, మనస్సుకు ప్రారంభంలో తన మీద తనకి నమ్మకం లేకుండా ఉంటుంది. కాని ఎప్పుడైతే మీ మానసికవ్యవస్థకి భయపడతారో, అప్పుడు దానికి నమ్మకం పెరిగి మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఒక్కసారి మీ భయాన్ని దానికి చూపిస్తే, ఒక్కసారి మీ సున్నితత్వం చూపిస్తే చాలు, అది మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటుంది.
ఇది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఆడించాలి అనుకునే వ్యక్తి, ముందుగా మీరు మీ జీవితాన్ని నడుపుకోలేరు అని మీరు నమ్మే విధంగా చేస్తాడు. ఆ వ్యక్తి సహాయం లేకుండా మీరు బ్రతకలేరు, అనే నమ్మకాన్ని మీలో కలిగిస్తాడు. అది అతను చేసే మొదటి పని. మీరు ఒక్కసారి ఆ దారిలో పడితే, మీతో ఆటలు ఆడుకోవటం ప్రారంభిస్తాడు. ఒక్కసారి అతను లేకుండా మీరు బ్రతకలేను అని అనుకుంటే, అతను మిమ్మల్ని తిట్టినా, బాధపెట్టినా భరిస్తారు.
అదే విధంగా మీ మనస్సు ఒక్కసారి మిమ్మల్ని ఒప్పిస్తే అది లేకుండా మీరు బ్రతకలేను అనుకుంటారు. ఎప్పుడైతే మనస్సు మిమ్మల్ని నమ్మిస్తుందో మీరేమీ చేయలేరు. అప్పుడు ఇక మీరు మీ మనస్సుని వదల్లేరు.
గుర్తింపును వదిలెయ్యండి
నేను పరివ్రాజకుడుగా భారతదేశంలో తిరిగే సమయంలో జరిగిన సంఘటన. ఉత్తరభారతదేశంలోని అడవులలో వేటగాళ్ళు పక్షులని పట్టుకునే పద్ధతి చూసాను. రెండు కొమ్ములకి మధ్య ఒక తాడు కడతారు. తాడు మధ్యలో ఒక చిన్న కర్రని అడ్డంగా వేలాడే విధంగా కడతారు. ఈ కర్ర వేటగాళ్ళు పక్షులని పట్టే సాధనం.

ఒక చిన్న కర్ర ఏ విధంగా పక్షులని పడుతుంది అనుకుంటారు. అంతే పక్షి ఆ కర్రమీద వాలగానే, ఆ బరువుకి, కర్ర తలకిందులవుతుంది. ఇప్పుడు ఆ పక్షి తలకిందులుగా వేలాడుతుంది. అది కర్రని కాళ్ళతో పట్టుకొని వేలాడుతుంది. ఎప్పుడైతే పక్షి తలకిందులవుతుందో అది పూర్తిగా భయపడిపోతుంది. కాళ్ళతో ఆ కర్రని గట్టిగా పట్టుకుంటుంది. ఎందుకంటే తలకిందులుగా వేలాడుతుంది కాబట్టి, కర్రని వదిలితే కిందపడి చనిపోతాను అనుకుంటుంది.

ఎక్కడా, ఎప్పుడూ పక్షి కిందపడి చనిపోవటం అనేది లేదు. కాని పక్షికి అంత వివేకం లేదు. అది ఆ విధంగా వేలాడుతూ ఉంటుంది. ఆ కర్రని వదలకుండా వేలాడి దాని స్వేచ్ఛని పోగొట్టుకుంటుంది. వేటగాడు నెమ్మదిగా వచ్చి దాన్ని తన బుట్టలో వేసుకునే వరకూ, ఆ విధంగా కర్రని వదలకుండా వేలాడుతూ ఉంటుంది.
ఆ పక్షిలా మీరు కూడా మీ మనస్సుని వదలరు. ఎప్పుడైతే దాన్ని వదులుతారో మీరు పరమహంస అవుతారు. మీకు స్వేచ్ఛ దొరుకుతుంది. హాయిగా ఎగిరి వెళ్ళిపోవచ్చు. ఆ పక్షి భయంతో కర్రకి వేలాడే స్థితి ఇప్పుడు మీకు ఉంది. మీ భయం, పక్షి భయం ఒక్కటే. పక్షి కర్రని వదిలి బ్రతకలేను అనుకుంటుంది. మీరు కూడా మనస్సుని (ఆలోచనలని) వదిలి స్వేచ్ఛగా ఉండలేము అనుకుంటారు. దాన్ని వదలలేను నేను ఆ విధంగా దానితో ఉండకపోతే, బంధాలు ఏర్పరచకుండా, స్వతంత్రంగా ఉంటే నేనేమైపోతాను అనుకుంటారు.

రెండు - మూడు గంటలయ్యాక వేటగాడు వచ్చి పక్షిని బుట్టలో వేసుకొని వెళ్తాడు. ఇప్పుడు ఆ పక్షి ఎగరలేదు. వేతాడటానికి కర్ర లేదు. ఆ తెలివితక్కువ పక్షికి కర్రని వదిలితే స్వేచ్ఛగా ఎగిరి వెళ్ళిపోవచ్చు అని తెలియదు. అదే విధంగా మీరు కూడా మీరు అని అనుకునే గుర్తింపుకి, రక్షణ అనుకునే మీ చదువు, మీ ఆలోచనలు, మీ జీవితం, మీ అనుబంధాలు, ఆస్తులు - వీటిని పట్టుకొని వేలాడుతారు. యముడు వచ్చి మీ గుర్తింపు అనే కర్ర తీసే వరకూ అలా వేలాడుతూ ఉంటారు. మీరు పరమహంస కాలేకపోతారు. మీ వ్యక్తిత్వాన్ని పట్టుకొని ఉండలేరు. మీకు స్వేచ్ఛ ఉండదు. మీరు అనుకునే కర్ర ఉండదు. ఎందుకంటే ఆ కర్ర ఒక ఊహ!
ఒక విషయం చెబుతాను. ఆ పక్షి కర్రని వదిలితే ఒకటి - రెండు క్షణాలు రెక్కలు కొట్టుకుని స్థిరపడుతుంది. కాని కిందపడి చనిపోదు. కర్ర వదలగానే కొంచెం కందికి వచ్చి వెంటనే పైకి ఎగిరిపోవచ్చు. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు స్వేచ్ఛగా వదిలేస్తే మీరు ఎప్పుడూ కిందపడి చనిపోరు. మీరు పరమహంస (జ్ఞానోదయమైన మహాత్ముడు) అవుతారు.
ఈ క్షణంలో మీ మీద నమ్మకాన్ని ఉంచండి. మీ వ్యక్తిత్వం పోతుంది, గుర్తింపు పోతుంది అనే విషయాన్ని పట్టించుకోకండి. మీ మీద నమ్మకంతో మీ గుర్తింపుని వదిలేయండి. మీరు వెంటనే పరమహంస అయి స్వేచ్ఛని పొందుతారు. మీరు చేయవలసింది మీరు బంధాలు అనేవి లేని స్వేచ్ఛాజీవి అని నమ్మటం. మీరు నమ్మకపోయినా అది సత్యం!
సంఘం అనేది రక్షణ వల
ఎప్పుడైతే మీరు ఇటువంటి బంధాలని ఏర్పరచుకోకుండా, బంధవిముక్తులవుతారో మీ జీవనసరళిలో, నిర్ణయాలు చేసే పద్ధతిలో, మీ జీవన విధానంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ధైర్యంగా ఆ మార్పుల గుండా వెళ్ళగలగటాన్నే నేను తపస్సు అంటాను.
నేను పరివ్రాజకుడుగా ఉన్న రోజులలో ఒక అరుదైన సంఘటనని చూసాను. కర్రకి ఒక పక్షి వేలాడుతుంటే మరొక పక్షి వచ్చి దాన్ని పొడుస్తూ కర్ర వదలమని చెబుతుంది. ఆ పక్షి ఒకప్పుడు కర్రకి వేలాడి ధైర్యంతో పట్టు వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోయిన పక్షి. అది వేలాడే పక్షిని ‘రిలాక్స్ అవ్వు, పట్టు వదిలి ఎగిరిపో, నేను అదే విధంగా చేసి ఎగిరిపోయాను, నేను స్వేచ్ఛని పొందాను,' అని చెప్పటమే. కానీ వేలాడే పక్షి ఆ మాటలని నమ్మదు. అలా స్వేచ్ఛ పొందిన పక్షికి వేలాడుతున్న పక్షులని రక్షించటం అనేది ఒక బాధ్యత. స్వేచ్ఛ పొందిన పక్షి అలా వేలాడే పక్షులని పొడిచి, పట్టు వదిలి స్వేచ్ఛగా ఎగిరిపో అని చెప్పాలి. నేను ఆ విధంగా స్వేచ్ఛ పొందిన పక్షిని. నేను ఒక రక్షణ వలని తయారుచేసాను. మీరు పడిపోయినా ఆ వలలోనే పడతారు. మీకు దెబ్బ తగలదు. కాబట్టి రిలాక్స్ అవ్వండి, ఇవన్నీ వదిలేయండి, అప్పుడే స్వేచ్ఛగా ఎగరలుగుతారు. గురుదేవుల సంఘాన్ని చూడండి, అదే వల. మీరు పడినా ఆ వలోనే పడతారు. మీకు దెబ్బలు తగలవు. అసలు మీరు పడరు. కాని మీకు లోతైన నమ్మకాన్ని ఇవ్వటానికి ఈ ఆధ్యాత్మికవ్యవస్థని, ఈ సంఘాన్ని సృష్టించాను. నేను మిమ్ములనందరినీ ఈ సంఘం లోనికి వచ్చి ఆ అనుభవాన్ని పొందమని ఆహ్వానిస్తున్నాను. అర్థం చేసుకోండి, ఇది స్వేచ్ఛ పొందిన పక్షి బాధ్యత. కర్రకి వేలాడే పక్షులకి సహాయం చేసి, వాటిని స్వేచ్ఛగా ఎగిరే విధంగా చేయటం ఆ స్వేచ్ఛ పొందిన పక్షి బాధ్యత.
కోతి కథ
పక్షులని పట్టినట్టే వేటగాళ్ళు కోతులని కూడా పడతారు. అందుకు చిన్న డబ్బాని వాడతారు. ఒక డబ్బాకి చిన్న మూతి ఉంటుంది. అందులో కొన్ని తీపిపదార్థాలు పెడతారు. అవి తీసుకోవటానికి కోతి చేతిని దాంట్లో పెట్టి వాటిని పట్టుకుంటుంది. చేతిలో స్వీట్లు పట్టుకుని ఉన్నంత వరకు కోతి చేయి డబ్బా లోంచి బయటకి రాదు. ఎందుకంటే కోతి గుప్పిట డబ్బా మూతి లోంచి పట్టదు. కోతి స్వీట్లని వదిలేస్తే, చేతిని లాగేసి స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. కాని అది తెలుసుకునే తెలివితేటలు కోతికి లేవు. అది స్వీట్లని ఆ విధంగానే పట్టుకొని, గిలగిలాడుతూ ఉంటుంది. స్వీటుని వదిలితేనే దానికి స్వేచ్ఛ. మీరు ఈ కథలోని అర్థాన్ని తెలుసుకునేలా చేసుకోగలిగితే మీరు ఈ గొలుసుల నుంచి వెంటనే, ఈ క్షణమే విముక్తి పొందుతారు.
సమాజం మీకు స్వేచ్ఛను ఇవ్వదు
సమాజం మీకు నిరంతరం ఇచ్చే శిక్షణ ఏమిటంటే మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి అని మీరు నమ్మే విధంగా చేయటమే. సమాజం మీరు నిరంతరం బాధల గొలుసుతో కాని, సంతోషపు గొలుసుతో గాని ఉండాలి అని నేర్పిస్తుంది. మీరు బాధల గొలుసుని నమ్మితే నిరంతరం గొలుసుని తెంపటానికి మీ సమయాన్ని ఖర్చు చేస్తారు. ఆ విధంగా చేస్తూ మీరు జీవితాన్ని వృథా చేస్తారు. మీరు సంతోషపు గొలుసుని నమ్మితే నిరంతరం దాన్ని పొడిగించాలని చూస్తారు. ఆ విధంగా కూడా జీవితాన్ని వృథా చేస్తారు. మీరు స్వేచ్ఛగా ఉంటే సమాజం భరించలేదు. అందుకే బంధవిముక్తులు కాగల ధైర్యాన్ని సమాజం మీకు కలగనీయదు. ఎందుకంటే ఒక్కసారి మీరు బంధవిముక్తులైతే సమాజం మిమ్మల్ని నియంత్రించలేదు. మిమ్మల్ని ఎవరూ ఆడించలేరు. మీరు బందీగా ఉన్నప్పుడే సమాజం కాని, ఇతరులు కాని, మిమ్మల్ని ఆడించగలుగుతారు. తనకి కావలసిన పద్ధతిలో నియమాలు విధించి మీరు అనుసరించేలా చేస్తుంది సమాజం. సమాజానికి ఏది అవసరమైతే దాన్ని, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు, మీ లోనికి ఆ విషయాన్ని పంపిస్తుంది. అప్పుడు మీరు సమాజానికి ఉపయోగపడతారు. కాని మీరు ఒక ఉపయోగపడే వస్తువుగా మాత్రమే ఉంటారు. నిజానికి సమాజం మీ మంచినేమీ పట్టించుకోదు. మీరు సమాజానికి అవసరం, అంతే.
మీరు ఎప్పుడైతే సహజంగా మీరు స్వేచ్ఛ గలవారు, స్వేచ్ఛ మీ లక్షణం అని తెలుసుకొని విరామంలో ఉండగలరో, మీ లోపలికి ఆనందం ప్రవేశిస్తుంది. మీరు స్వేచ్ఛని అనుభవించగలరు. ఒక్కసారి మీరు స్వేచ్ఛని అనుభవించగలిగితే చాలు, అది మీరు ఎగిరిపోగల గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. మీ అంతరాత్మ పరమహంసలా మారుతుంది. అది స్వచ్ఛమైన విశ్వచేతనస్థితి.
అచేతనస్థితి ఒక కల్పన
మనకి నేర్పించిన విధంగా అచేతనస్థితి అనేది మనకి లేదు. స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను ధైర్యంగా ఒక విషయాన్ని చెబుతున్నాను. అయితే నాకు ‘ప్రాచీనఋషుల’ ఆధారం ఉన్నది. వారు మానవ చేతనస్థితి లోనికి లోతుగా వెళ్ళి పరిశోధనలు చేశారు. అంతరంగ ప్రపంచానికి సంబంధించి చాలా పరిశోధనలు చేశారు. కాబట్టి అర్థం చేసుకోండి. అచేతనస్థితి అనేది మీలో భయాన్ని కలిగించటానికి సృష్టించిన మరొక విషయం మాత్రమే. మీకు ఒక సమయంలో కేవలం ఒక ఆలోచనే ఉంటుంది. ఒకే సమయంలో రెండు - మూడు ఆలోచనలు ఉంటాయా? లేదు. అలా జరగదు. మీకు ఒక సమయంలో ఒకే ఆలోచన ఉంటుంది. మరి అటువంటప్పుడు అచేతనస్థితికి అవకాశం ఏది? అసలు అది ఉందా? ఉంటే అది ఏమిటి?
ఒక విషయం అర్థం చేసుకోండి. సంతోషాల గొలుసులు, బాధల గొలుసులు తయారుచేయటం అసలు పాపం. అంతకు మించి మీరు పాపాత్ములు కారు. వేదకాలం నాటి ఋషులు మనుష్యులని ‘అమృతస్య పుత్ర’ అంటే మరణం లేని కుమారులు లేదా భగవంతుని బిడ్డలు అని సంబోధించేవారు. ఆ స్థితిని వేరుగా సాధించనవసరం లేదు. మనిషి అంటేనే తీవ్రమైన జ్ఞానోదయ అనుభవం నుంచి జన్మించినవాడు.
బంధవిముక్తులు కండి!
తెలుసుకునే తత్వాన్ని, శక్తిని మేధస్సుని వ్యాపింపచేయండి
ఎప్పుడైతే మీరు పూర్తిగా బంధాలు ఏర్పరచని స్థితికి చేరతారో మీలో అంతు లేని శక్తి, చేతనస్థితి, మేధ అనేవి ప్రవేశిస్తాయి. శక్తిని తయారుచేయలేం. దాన్ని ఒక వస్తువులా తయారుచేయలేం.అది మీ అంతరాత్మలో నిరంతరం కలుగుతూ ఉంటుంది. నేను శరీరాన్ని అని మీరు అనుకుంటే మీరు భౌతికస్థితిలో వస్తుప్రపంచంలో ఉంటారు. అప్పుడు మీరు కేవలం శరీరంలోనే జీవించగలరు. అప్పుడు మీ కోరికలూ, మీ భయాలూ కూడా భౌతికస్థితిలో ఉంటాయి. ఉదాహరణకి మరణభయం, మొదలైనవి.
మీరు మానసికవ్యవస్థని అని అనుకుంటే మీరు మానసికదశలో జీవిస్తారు. మీ కోరికలు, భయాలు అన్నీ మీ మానసికవ్యవస్థకి సంబంధించి ఉంటాయి. ఉదాహరణకి పేరు ప్రతిష్ఠలు కావాలని కోరిక, మీ గుర్తింపు పోతుందేమో అనే భయం. మానసికశరీరంలో కోరికలు, భయాలు చాలా సూక్ష్మస్థాయిలో ఉంటాయి. ఆధ్యాత్మికస్థితిలో కోరికలు, భయాలు ఉండవు. మీరు నిరంతరం శక్తిని వ్యాపింప చేస్తూంటారు. మీరు ఏ దశలో ఉన్నా మీ సమక్షం శక్తిని వెదజల్లుతూ ఉంటుంది.
మనస్సు - శరీరం - అపోహ
మన ఆలోచనలే (మనస్సు) మన శరీరాన్ని సృష్టిస్తాయి
యోగానే కాకుండా వైద్యశాస్త్రం కూడా మన శరీరం నిరంతరం కొత్తదనాన్ని తెచ్చుకుంటుంది, నిరంతరం కొత్త శరీరం ఏర్పడుతూ ఉంటుంది, అని నిరూపించాయి. మనం నిరంతరం కొత్త శరీరాన్ని తయారుచేసుకుంటూ ఉంటాము. ఇది మొదటి సత్యం. రెండవ సత్యం దీన్ని యోగా, ఆయుర్వేదమే కాకుండా వైద్యశాస్త్రం, జీవశాస్త్రం కూడా రూఢి చేశాయి. అది మన శరీరాన్ని మన మనస్సు సృష్టిస్తుంది. మన శరీరానికి మనస్సే మార్గదర్శి.
బ్రూస్ లిప్టన్ అనే శాస్త్రవేత్త బయాలజీ ఆఫ్ బిలీఫ్ అనే పుస్తకాన్ని రాసారు. ఆయన జీవశాస్త్రంలో ముప్పై సంవత్సరాలు పరిశోధనలు చేసి చాలా బలమైన ఫలితాలని చెప్పారు.ఆయన స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు. మన శరీరాన్ని డి.ఎన్.ఎ. లేదా కణాల కంటే మనలోని వ్యతిరేక, అనుకూలభావాలే ఎక్కువగా నియంత్రిస్తాయి అని, మన శరీరం మన నమ్మకాలు, విశ్వాసం, మన అనుకూల, వ్యతిరేకభావాల మీద ఆధారపడి ఉంది అని చెప్పారు. ఆయన ఇంకా ఏం చెబుతారంటే మన మనస్సు శరీరనిర్మాణాన్ని కూడా మార్చగలదు అని. ఆయన చాలా వివరంగా ఒకదాని తరువాత ఒకటిగా, మనలోని జెనిటిక్, భౌతిక, మానసికసమస్యల్ని మన నమ్మకం ఏ విధంగా సృష్టిస్తుందో వివరాలతో చెప్పారు.
Mతమ అసలు తల్లిదండ్రుల నుంచి వేరైన పిల్లల మీద కూడా కొన్ని ప్రయోగాలు చేశారు. వారిని పెంచిన తల్లిదండ్రులే తమ సొంత తల్లిదండ్రులు అనే నమ్మకంతో పెరిగిన పిల్లల్లో, వారిని పెంచినవారి వంశపారంపర్యసమస్యలే వీరిలో కూడా వచ్చాయి.
బంధ విముక్తి ద్వారా
మీకు ఒక వడ్రంగి కథ చెబుతాను : ఒక వ్యక్తి నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుని గొడ్డలితో కొడుతూ ఉంటాడు. అతని గొడ్డలి జారి నదిలో పడిపోతుంది. అప్పుడు నది లోంచి దేవత వచ్చి బంగారు గొడ్డలి చూపించి ఈ గొడ్డలి నీదేనా అని అడుగుతుంది? అతను కాదు అంటాడు. మళ్ళా ఆ దేవత వెండి గొడ్డలి తెచ్చి ఇది నీ గొడ్డలేనా? అని అడుగుతుంది. అతను కాదు అని జవాబు ఇస్తాడు. ఈ సారి దేవత ఇనప గొడ్డలి చూపించి ఇది నీదేనా? అని అడుగుతుంది. అతడు 'ఔను అది నాది' అంటాడు. దేవత అతని నిజాయితీకి సంతోషించి, మూడు గొడ్డళ్ళు అతనికి ఇస్తుంది.
ఇప్పుడు నేను మీకు ఈ కథకి పొడిగింపు చెబుతాను.
ఆ వ్యక్తి ఆ తరువాత ఒకసారి అదే నది దగ్గర చెట్టు కొడుతుంటారు. అతనికి అతని భార్య సహాయం చేస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా భార్య నదిలో పడిపోతుంది. అదే దేవత ఒక అందమైన అమ్మాయిని తీసుకువచ్చి ఈమె నీ భార్యేనా? అని అడుగుతుంది. అతను 'ఔను! ఈమె నా భార్య' అంటాడు. దేవతకి చాలా కోపం వస్తుంది. 'అబద్ధం చెప్పటానికి ఎంత ధైర్యం. నీ గొడ్డలి నదిలో పడిపోయినప్పుడు నిజం చెప్పావు. ఇప్పుడు నీ భార్య పడిపోతే అబద్ధం చెబుతున్నావు.' అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, 'లేదు లేదు! నీకు నా సమస్య అర్థం కాలేదు. క్రితం సారి బంగారు, వెండి గొడ్డళ్ళు నావి కావు అని చెప్పినప్పుడు మూడూ నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా నీవు ముగ్గురు స్త్రీలని ఇస్తే నా గతేం కావాలి? ఒక్కరితోనే నేను పడే బాధలు నీకు తెలియవు. అందుకే ముందు జాగ్రత్తతో అలా చెప్పాను. ఎవరైనా ఒక్కటే కాని దయచేసి నన్ను ఒక్క భార్యతో వదిలేయి' అని ప్రార్థిస్తాడు.
సరే! ఆ దేవతలాగానే విశ్వమాత కూడా 'ఇది నీ కొత్త శరీరమేనా?' అని అడుగుతుంది. ప్రకృతి మీకు ప్రతి నిమిషం కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటుంది. మనలోని శరీరకణాలు ప్రతి నిమిషం కొత్తగా జన్మిస్తుంటాయి.
విశ్వమాత వచ్చి, 'ఇది నీ కొత్త శరీరమా' అని అడిగితే మీరు వెంటనే 'కాదు, కాదు నాకు నా పాత శరీరమే కావాలి, అంటారు'. అదీ సమస్య. శరీరం ఎప్పటికప్పుడు కొత్తగా తయారైనా 'ఎన్ని సంవత్సరాలు గడిచినా మీ శరీరంలో పెద్దగా మార్పుల్ని చూడరు. మన శరీరానికి కొత్తగా శరీరాన్ని సృష్టించుకునే మేధస్సు ఉంటుంది. అంటే మీ మనస్సులో నాకు వ్యాధి ఉంది అని గట్టిగా నమ్ముతారు. మీరు అదే మానసికవ్యవస్థని మోస్తూ ఉంటారు. అందుకే అది తిరిగి అదే శరీరాన్ని తయారుచేస్తుంది. ఆ విధంగా బంధాలు ఏర్పరుస్తూ మీ శరీరానికి సహజంగా జరిగే చికిత్సని మీరే ఆపినవారవుతారు.
ఎప్పుడైతే మీ లోపల మీ అంతరంగంలో చికిత్స జరగనిస్తే బయటి శరీరంలో చికిత్స అదే జరిగిపోతుంది. ఎప్పుడైతే మీరు వీటి నుంచి బంధవిముక్తులవుతారో అప్పుడు మీ లోపల నిరాశ, కుంగుబాటు మాయం అవుతాయి. నేను చెబుతున్నాను, మీరు పూర్తిగా కొత్త శరీరాన్ని తయారుచేసుకుంటారు. మీలోని అనారోగ్యాన్ని కొత్త శరీరం లోనికి తీసుకురానవసరం లేదు. కాని మీరు అవే అనారోగ్యాల్ని కొత్త శరీరం లోనికి తెచ్చుకుంటారు. ఎందుకంటే మీరు అన్నింటినీ ఒక దానితో ఇంకొకటి కలుపుతారు. ఇంతకు ముందు తయారు చేసి పెట్టుకున్న గొలుసులు ఇంకా సహాయం చేస్తాయి. ఎప్పుడైతే మీరు కొత్త కణాలని, కొత్త శరీరభాగాల్ని సృష్టిస్తారో, మీరు అదే అనారోగ్యాన్ని ఆ కొత్త శరీరం లోనికి కూడా తీసుకువెళతారు.
ఈ విషయాన్ని మీరు మీ జీవితంలో చూడవచ్చు. చిన్నప్పుడు మీ అమ్మగారు వర్షంలో తడిస్తే నీకు జలుబు చేస్తుంది అని చెప్పి ఉంటారు. ఈ విషయాన్ని మీ చిన్నతనంలో చాలాసార్లు మీ లోపలకి బాగా నాటుకునేలా అంటుంటారు. మీరు పెద్దవారయ్యాక మీరు వర్షంలో తడవనవసరం లేదు. కిటికీ దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తే చాలు, మీరు తుమ్మటం మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు బంధాలు ఏర్పరచకుండా ఉండగలుగుతారో మీలోని నొప్పులని, బాధల్ని నివారించుకోగలరు చికిత్స చేసుకోగలరు. మీకు త్వరగా తగ్గిపోతుంది కూడా. అప్పుడు మీకు అనారోగ్యాన్ని, నిరాశని కలిగించే గొలుసుల్ని మీరు తయారుచేయరు. ఉదాహరణకి పది రోజుల క్రితం మీకు వచ్చిన మోకాళ్ళ నొప్పులకి, తొమ్మిది రోజుల క్రితం వచ్చిన మోకాళ్ళ నొప్పులకి, ఎనిమిది రోజుల క్రితం వచ్చిన మోకాళ్ళ నొప్పులకి ఎటువంటి సంబంధం లేదు. అవన్నీ ఒక దానికొకటి సంబంధంలేని స్వతంత్ర సంఘటనలు కాని, ఎప్పుడైతే మీరు వాటినన్నింటినీ కలిపి ఒక గొలుసులా తయారుచేస్తారో, అప్పుడు మీరు 'నాకు మోకాళ్ళ నొప్పి అనే' ఒక గొలుసుని చేస్తారు. ఎప్పుడైతే నాకు గడిచిన పది సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పి అని గట్టిగా నమ్ముతారో, అప్పుడు మిగతా జీవితం అంతా మోకాళ్ళ నొప్పి ఉంటుందని మరింత నమ్మకంతో ఉంటారు. ఈ నమ్మకం ఒక్కటి చాలు, ప్రతి రోజూ ఉదయం మీలో తయారయ్యే ఆ కొత్త శరీరం లోనికి మోకాళ్ళ నొప్పుల్ని ప్రవేశపెట్టడానికి. ఎందుకంటే మీరు అదే మైండ్‌తో (మానసికవ్యవస్థతో) ఒకదానికి ఒకటి లింకులు పెడుతూ, అదే వ్యాధిని కొత్త శరీరంలోనూ సృష్టిస్తారు.
ఎప్పుడైతే మీరు అదే మనస్సుని మోయటం మానేస్తారో, పాత గుర్తింపుల్ని వదిలేస్తారో, అప్పుడు మీ శరీరంలో ఉన్న వ్యాధిని కొత్త శరీరంలో సృష్టించరు. అదే బాధని తిరిగి కలిగించరు. అదే నిరాశ, అవే సమస్యలు, అవే వ్యాధులు కొత్త శరీరంలో ఉండవు. మీరు స్వేచ్ఛని పొందుతారు. మీరు బాధల నుంచి స్వేచ్ఛ పొందితే మీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని మీ శరీరమే బాగుచేసుకునే అవకాశాన్ని శరీరానికి ఇస్తారు. అప్పుడు మీరు కొత్త శరీరాన్ని ఆరోగ్యాన్ని పొంది శక్తితో చైతన్యవంతంగా ఉంటారు. మీరు అప్పుడు చిన్న పిల్లల్లా ఉంటారు. చిన్న పిల్లలు నూతనోత్సాహంతో ఉరకలేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిక్షణం కొత్త శరీరాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ గొలుసుల దగ్గర ఆగిపోరు. వాళ్ళకి పైన ఎటువంటి ముద్రలు, గుర్తింపులూ వారికి తెలియవు. అందుకే నిన్న మీరు వారితో పోట్లాడినా ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్వుతారు. అసలు ఏమీ జరగనట్టే ఉంటారు. వాళ్ళు మనస్సులో రికార్డులు మోస్తూ తిరగరు. వారికి సంబంధించి ఎటువంటి గుర్తింపులనీ వాళ్ళు మోయరు. వాళ్ళు నిన్నటి గొడవని, మొన్నటి గొడవని, ఈ రోజు గొడవని, నెల క్రితం గొడవని కలపరు. వాళ్ళు ఇటువంటి గొలుసుల నుంచి స్వేచ్ఛగా ఉంటారు.
గుర్తింపులను వదిలేయండి
ఒక విషయం ముందు అర్థం చేసుకోండి. శరీరమే మీరు అనుకోవటం ఒక ఊహ. అదే ముందుగా మీరు సృష్టించే గొలుసు, దాని ఫలితమే బాధలు పడటం. మీరు సహజంగా తర్కం లేని, బాధ్యత లేని, స్వతంత్రమైన, ఒక దానితో సంబంధం లేని, బంధాలు లేని వ్యక్తి అనే సత్యాన్ని అనుభవిస్తే అప్పుడు మీరు కొత్త జీవనచైతన్యంతో ఉన్న తాజా శరీరాన్ని సృష్టించగలరు. మన అహాన్ని తృప్తి పరచటానికి శరీరాన్ని అగౌర పరుస్తాం. ఎప్పుడైతే ఈ శరీరం నేను కాదు అని అనుకుంటారో, మన శరీరాన్ని సహజంగా పని చేసేలా చేయగలం.
సహజమైన శరీరమేధస్సు
సహజంగా శరీరం తనకి తాను చికిత్స చేసుకోగలదు. శరీరానికి మేధస్సు ఉన్నది. కాని మీరు అద్భుతమైన ఆ మేధస్సుతో సంబంధాన్ని తెంచేసుకున్నారు. మీరు నిరంతరం మీ శరీరాన్ని అగౌరవపరుస్తూ దాన్ని హింసిస్తారు. ఎప్పుడైతే నా శరీరమే నేను అనుకుంటారో, శరీరాన్ని అగౌరవంతో చూస్తూ హింసిస్తారు. మనస్సుని తృప్తి పరచటానికి చాలా పనులు చేస్తారు. మనస్సు లక్షణం శరీరాన్ని అగౌరపరచటం.
మీరు ఈ శరీరం నేను అనే విషయం నుంచి బయటకి వచ్చి విరామంగా ఉండగలిగితే మీరు మీ శరీరాన్ని గౌరవిస్తారు. అప్పుడు శరీరం తన మేధస్సుని ఉపయోగించే నిర్ణయాలు చేస్తారు. శరీరం సహజంగా ఉండే విధంగా చూస్తారు. మీరు ఉత్సాహంతో పొంగిపొర్లే శక్తితో ఉంటారు. మీరు అంటే మనస్సు కాదు అని తెలుసుకోగానే, మీలో చురుకైన తెలివితేటలు, అప్రయత్నంగా స్పందించే తత్త్వం అభివృద్ధి చెందుతాయి. ముందుగా మీరు అర్థం చేసుకోవలసిన విషయం మీరు ఈ శరీరం, ఈ మనస్సు కాదు. మీరు మనస్సు, శరీరం కాదు అని ఎప్పుడు తెలుసుకుంటారో, అప్పుడు మీరు ఆ రెంటింటినీ గౌరవంగా చూస్తారు. మీరు వాటితో జీవిస్తారు, కాని వాటికి వ్యతిరేకంగా కాదు. మీరు శరీరాన్ని, దానికి ఉన్న మేధస్సుని గౌరవిస్తారు. మీ శరీరం సహజంగా ఆనందంగా ఉండే విధంగా చేస్తారు.
అష్టావక్రుడు (జ్ఞానోదయమైన ఒక యోగీశ్వరుడు, ఆయన అష్టావక్ర గీతని రాసారు) ఈ విధంగా చెబుతారు, 'నీవు శరీరం కాదు, మనస్సు కాదు. నీవు భూమివి కాదు, నీరు కాదు. నీవు అగ్నివి కాదు, వాయువు కాదు. నీవు ఆకాశానివి కూడా కాదు' అని.
శరీరం నుంచి విముక్తి పొంది, మేధస్సులో ఉండగల సూత్రం
మీరు శరీరం నుంచి విడిపోయి మేధస్సులో విరామంగా స్థిరపడగలిగితే మీరు సంతోషంగా ప్రశాంతంగా ఎటువంటి బంధాలు లేకుండా స్వేచ్ఛగా ఉండగలరు. ముందు విషయం మీరు శరీరం మనస్సు కాదు. రెండవ విషయం మీరు శరీరం నుంచి, మేధస్సులో విరామంతో ఉండగలిగితే మీరు ఒక్కసారిగా సంతోషంతో ప్రశాంతతతో అన్ని రకాల సంకెళ్ళని తెంచుకొని స్వేచ్ఛగా ఉండగలరు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీరుగా స్వీకరించగల స్థితిలో ఉంటారు. ఆ క్షణంలోనే మీరు మీ లోపల విరామంతో ఉండగలరు. మీరు నిశ్శబ్దంగా అవుతారు. ఆ క్షణంచె నుంచి పరమానందంలో ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ శరీరం మనస్సు కాదు అని తెలుసుకుంటారో ఈ సంసారసాగరం నుంచి, ఈ భౌతికప్రపంచం నుంచి విశ్రాంతి తీసుకొని, ఆనందస్థితిలో స్థిరపడగలుగుతారు. మీ శరీరం, మనస్సు మీరే అని అనుకున్నంత కాలం, శరీరం, మనస్సుల్లో ఉండే సమస్యల్ని మీరు భరిస్తుంటారు.
ఈ క్షణంలో, వర్తమానంలో గాధతతో ఉండండి
ప్రతీక్షణాన్ని సన్యసించటం (వదిలివేయటం) మీ సహజలక్షణం
అదృష్టం కొద్దీ ఒక సమయంలో మీరు కేవలం ఒక ఆలోచనతోనే ఉండగలరు. రెండవ ఆలోచన మీ లోనికి రాగానే ముందు ఆలోచన తన శక్తిని పోగొట్టుకుంటుంది. దాని ప్రభావం మీ మీద ఉండదు. మీ లోనికి కొత్త ఆలోచన వచ్చింది అంటే పాత ఆలోచన వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక సమయంలో మీలో ఒక్క ఆలోచన మాత్రమే ఉంటుంది. ఒక వేళ మీరు మీ పాత ఆలోచన ఇంకా అక్కడ ఉంది అని అంటే దాని అర్థం కొత్త ఆలోచన లేదని.
రామకృష్ణ పరమహంస ఒక చక్కని కథ చెబుతారు.
ఒక రాజుగారు కోట లోపల ఉండగా రెండు లక్షల మంది సైన్యంతో శత్రురాజు కోటని ముట్టడిస్తాడు. రాజు దగ్గర కేవలం నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు. రాజు చాలా భయపడిపోతాడు. తన సలహాదారునితో ‘నేను ఒక్కడినే ఆ 2 లక్షలమందితో ఎలా పోరాడగలను.’ అంటాడు. అప్పుడు ఆ సలహాదారుడు, ‘భయపడకండి రాజా! మీరు ఒక తలుపు మాత్రమే తీయం డీ. అప్పుడు లోపలికి ఒకరి తరువాత ఒకరు వస్తారు. మీరు ఒక పక్కన నిలబడి లోపలకి వచ్చిన వారిని వచ్చినట్లే చంపేయండి. అప్పుడు మీరు అందరితో యుద్ధం చేయనవసరం లేదు’ అని చెబుతాడు.
ఎప్పుడైతే మీరు మీ శత్రువులంతా కలసి ఉన్నారు అని అనుకుంటారో భయపడతారు. మీకు ఎప్పుడూ రెండు ఆలోచనలు కలసి రావు. ఒక సమయంలో ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. దీని అర్థం ఒక ఆలోచన ముందుదాని స్థానం లోనికి వస్తుంది. నేను మరొక సారి చెబుతున్నాను, ఒక సమయంలో మీకు ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. రెండవ విషయం పాత ఆలోచన బయటకి వెళ్ళకుండా కొత్త ఆలోచన రాదు. మూడవ విషయం, ఎవరైనా నన్ను ఇక్కడి నుంచి తోసేసి, ఈ కుర్చీలో కూర్చున్నారు అంటే అతను నా కంటే బలవంతుడై ఉంటాడు. కొత్త ఆలోచన పాతదాన్ని తోసేయగలిగింది అంటే అది పాత ఆలోచన కంటే బలమైనది అని అర్థం. అంటే ఏ ఆలోచన వచ్చినా అది వర్తమానంలో ఉంటుంది. అది వెళ్ళిపోయిన ఆలోచన కంటే బలంగా ఉంటుంది. అది ఎటువంటిదైనా సరే, దాని కంటే కొత్త ఆలోచన బలమైనది. మీరు సహజంగా దేన్నైనా వదిలేయగలరు. సన్న్యసించటం మీరు నేర్చుకోనవసరం లేదు. ప్రతి నిమిషం మీరు సన్న్యసిస్తుంటారు. ఇక్కడ సన్న్యసించటం అంటే ఏమిటి? ఇక్కడ దాని అర్థం, మీరు ఒక ఆలోచనని తెచ్చుకునే ముందు ప్రతి నిమిషం మీ అంతరంగంలోని ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి.
ఆలోచనలు నిరంతరం సన్న్యసిస్తుంటాయి. ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నింటినీ ఒక గొలుసులా ఒకదానికొకటి లింకులు పెడతారో అప్పుడు మీరు బాధపడతారు. నాకు ఏదో సమస్య ఉంది అనుకోవటమే మీ నిజమైన సమస్య. ప్రతి నిమిషం మీ అంతరంగం కొత్త ఆలోచనలతో స్వచ్ఛంగా ఉంటుంది. మీరు దాన్ని ఆ విధంగా జరగనిస్తే అంతా దానంతట అదే జరుగుతుంది. మీరు మీ మనస్సుని శుభ్రం చేసుకోవలసిన అవసరం లేదు. మీరు చేయవలసింది కేవలం ఆ వ్యవస్థ నుంచి బయటికి రావటమే. అప్పుడు వ్యవస్థ దానంతట అదే పని చేసుకుంటుంది. ఒక ముఖ్యవిషయం, మీరు కావాలని పట్టుకొని ఉండాలని ప్రయత్నించినా, ఒక బాధని లేదా సమస్యని కాని ఎక్కువ కాలం పట్టుకొని ఉండలేరు. మీరు పట్టుకోవాలి అని ప్రయత్నించినా చేయలేరు. ఎందుకంటే బాధని కలిగించే ఆలోచనలు పోయి కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఒక ఆలోచనని పట్టుకొని ఉండాలి అంటే మీరు చాలా ప్రయత్నించాలి. ఎందుకంటే ఆలోచనలు నిరంతరం ఒక ప్రవాహంలా వస్తుంటాయి.
ఆలోచనల స్థానంలో మరొకటి వచ్చేలా చేయండి
ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. ఒక కొత్త ఆలోచనని తీసుకురాగల శక్తి మీకు ఉంది అంటే దాన్ని వదలంగా శక్తి కూడా మీకు ఉంటుంది. వస్తున్న కొత్త ఆలోచనల్ని గమనించవలసింది పోయి మీరు వాటికి పాత ఆలోచనల్ని కలుపుతారు. ఇది ఎలా ఉంటుందంటే ట్రాష్‌లో వేసిన ఫైల్స్‌ని తిరిగి మీ ఇన్ బాక్స్ లోనికి తెచ్చుకున్నట్టు. ఎప్పుడైతే మీరు మీ పాత ఆలోచనల్ని తిరిగి తెస్తారో దానితో సమస్యల్ని సృష్టించుకుంటారు. ఒక విషయం అర్థం చేసుకోండి, ఏ బాధనైనా కొత్త ఆలోచనల ప్రవాహంతో నింపవచ్చు అనే ఆలోచనని పెంచి పోషిస్తే అది మీకు నిజమవుతుంది. అప్పుడు మీకు బాధలు అనేవి ఉండవు. ఆ విధంగా కాకుండా నేను ఎంత ప్రయత్నించినా బాధల ఆలోచనల లోనికి కొత్త ఆలోచనల్ని తీసుకురాలేకపోతున్నాను అనే ఆలోచనని పెంచుకుంటే అదే నిజం అవుతుంది. నాకు బాధల ఆలోచనలు తిరిగి వస్తాయి అని అనుకుంటే అవే ఆలోచనలు వస్తాయి.
మీరు అర్థం చేసుకోవలసింది ఏమిటంటే కనీసం ఒక్కసారి మీ ఆలోచనని మీ అంతరంగం లోనికి తిరిగి రానీయకుండా చేయగలిగితే, మీకు మీ మీద నమ్మకం కలుగుతుంది. నేను ఒకసారి పాత ఆలోచనని తిరిగి రానీయలేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ విధంగా చేయగలను అనే నమ్మకం పెరుగుతుంది. అప్పుడు మీకు మీరు ఈ విధంగా చెప్పుకోవచ్చు, 'ఒకవేళ పాత ఆలోచన పదిసార్లు నా లోనికి వచ్చినా నేను పదిసార్లు దాన్ని కొత్త ఆలోచనతో నింపగలను' అంతే. అలా అనుకోగలిగినప్పుడు పాత ఆలోచనలు తిరిగి రావు.
గౌతమబుద్ధుని జీవితంలో చక్కటి సంఘటన ఉన్నది.
బుద్ధుడు ఈ విధంగా చెబుతుండేవారు, 'నేను ధ్యానం చేసుకున్నప్పుడు, కొన్ని గంటలు అయ్యాక నేను ధ్యానంనుంచి లేస్తాను అని అనుకున్నంత కాలం నాకు జ్ఞానోదయం కాలేదు. ఒకసారి నేను ఈ విధంగా అనుకున్నాను,' 'నాకు జ్ఞానోదయం అయ్యే వరకూ ఇక్కడి నుంచి కదలను. నా శరీరం కృశించి ఎండిపోయినా సరే. నాకు ఆత్మసాక్షాత్కారం కలిగే వరకూ ఇక్కడి నుంచి కదలను,' అని గట్టిగా నిర్ణయించుకున్నాను, అని బుద్ధుడు చెబుతాడు. తాను ఆ విధంగా గట్టిగా స్పష్టంగా నిర్ణయించుకున్న మరుక్షణం ఆయనకి ఆత్మసాక్షాత్కారం జరిగిందని చెబుతారు. ఆయన తనలో కల్పించుకున్న గట్టి సంకల్పం మరు నిమిషంలో ఆయన్ని జ్ఞానోదయస్థితికి తీసుకు వెళ్ళింది. మీరు మీ బాధల ఆలోచనల్ని బయట తోసి అక్కడ కొత్త ఆలోచనల్ని నింపాలి అని పదిసార్లు అనుకుంటారు. ఆలోచని కొత్త దానితో నింపుతాను, పాత ఆలోచన పదకొండవసారి వస్తే రేపు చూస్తాను అనుకున్నారనుకోండి, మీరు ఏమీ చేయలేరు. మీలో మార్పు జరగదు. స్పష్టంగా నిర్ణయించుకోండి, పాత ఆలోచన రావటం ఆగనంతవరకూ నేను కదలను అనుకోవాలి. దీన్నే నేను ధైర్యం అంటాను.
భౌతిక మానసిక భావావేశాత్మక సమస్యలకి పరిష్కారం
మనం బంధాలు కల్పించటం మానివేయగానే మొదటిగా మనలో జరిగేది, అంతరంగంలో చక్కని చికిత్స. దీని ప్రభావంతో మనలో లోతైన నిశ్శబ్దం, ప్రశాంతత ఏర్పడతాయి. రెండవది, ఆ అంతరంగచికిత్స మన శరీర ఆరోగ్యంలో కనిపిస్తుంది. అది మనకి ఇతరులతో ఉండే అనుబంధంలో కూడా కనిపిస్తుంది. ఇక నాల్గవది, ఈ మూడూ చక్కగా ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో, మీరు చాలా సృజనాత్మకతతో ఉంటూ, నాణ్యమైన రీతిలో పనులు చేస్తారు.
తీవ్రమైన వ్యాధులకి పరిష్కారం
చాలా మంది నా దగ్గరకి వచ్చి 'స్వామీజీ! నాకు ఇరవై సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు' అని చెబుతుంటారు. అది సరి కాదు, అలా ఉండదు. అర్థం చేసుకోండి, నిజంగా అలా ఉండదు. మీ సమస్యలు, బాధలు అన్నీ కేవలం మీ తలలో మాత్రమే ఉంటాయి. అలా అని నేను మిమ్మల్ని అగౌరవపరచటం లేదు, లేదా ఏదో మరో బాధని మీకు కలపటం లేదు. నేను సత్యాన్ని చెబుతున్నాను, అంతే. మీ బాధలు అన్నీ మీ తలోనే ఉన్నాయి. మీకు రెండు సంవత్సరాల క్రితం ఉన్న మోకాళ్ళ నొప్పి, మూడు నెలల క్రితం నొప్పి, రెండు గంటల క్రితం నొప్పి - అన్నీ వేరు వేరు సంఘటనలు. మీరు వీటినన్నింటినీ కలిపి మీకు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పి అని ముగింపులు చెబుతారు. అది నిజంగా నిజమేనా? ఇరవై సంవత్సరాలుగా నిరంతరం మోకాళ్ళ నొప్పి ఉందా? మరి నొప్పి లేని సమయాలు ఏమిటి? మీరు అన్నింటినీ ఒక గొలుసులా చేసి నొప్పి నిరంతరం ఉంది అని చెప్పటం వలన అక్కడ చికిత్స జరిగే అవకాశాన్ని పోగొడుతున్నారు.
నిరాశకు పరిష్కారం
మీకు నెల క్రితం కలిగిన నిరాశ, సంవత్సరం క్రితం నిరాశ, మూడేళ్ళ క్రితం కలిగింది అన్నీ విడివిడిగా జరిగిన సంఘటనలు. అవి ఒక దానితో మరొక దానికి ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండవు. ఇది కూడా భౌతికసమస్య లాంటిదే. మీరు అన్నిటికీ లింకులు పెట్టి, నాకు డిప్రెషన్ ఉన్నది అని మరింత కుంగిపోతారు. చివరికి నా జీవితం అంటే డిప్రెషన్ అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. అప్పుడు దానితో పోరాటం మొదలు పెడతారు. ఆ పోరాటమే డిప్రెషన్‌కి మరింత బలాన్ని ఇస్తుంది. పది సంవత్సరాలుగా నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నేను నిరాశ డిప్రెషన్లో ఉన్నాను, అని గట్టిగా నమ్మినప్పుడు అదే పరిస్థితితో ఒక బలమైన మానసికవ్యవస్థని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి సహజంగానే నా భవిష్యత్తు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది, అది నిరాశానిస్పృహలతో నిండి ఉంటుంది అని నమ్ముతారు. ఒక వ్యక్తి మీ ఎదురుగా ఉన్నాడనుకోండి, అతను శత్రువు అనుకోండి, అకస్మాత్తుగా అతని తల, కాళ్లు, చేతులు వేరుచేయబడ్డట్టు కనిపించాడనుకోండి, అతనితో పోరాడ బుద్ధి అవుతుందా? లేదు. అతను మీరు పోరాడదగినవాడు కాదు అనిపిస్తుంది. అతను మీరు అనుకున్న విధంగా లేనప్పుడు మీరు పోరాడటం ఎందుకు అనుకుంటారు. అదే విధంగా మీ సమస్య పెద్దదిగా, ఒక భారీ మనిషిలా మీ ఎదురుగా ఉన్నప్పుడు మీకు పోరాడాలి అనిపిస్తుంది. అప్పుడు మీరు పోరాడుతూ ఉంటారు. మరిన్ని సమస్యల్ని తెస్తారు. మీరు అనుకున్నట్టు మీ డిప్రెషన్ పెద్ద శత్రువు కాదు. తల, కాళ్లు లేని ఒక వ్యక్తి లాంటిది. విడిపోయిన భాగాలన్నీ కలిపి మీరు దానికి జీవితాన్ని ఇస్తున్నారు. దాంతో చేసే పోరాటమే మీ నిరాశకి అసలు కారణం.
ఎప్పుడైతే మీరు ఆ గొలుసు నుంచి బయటికి వస్తారో మీరు శూన్యాన్ని అనుభవిస్తారు. అప్పుడు మీ అంతరంగంలో చికిత్స ప్రారంభమవుతుంది. అప్పుడు మీరు భౌతికంగా కూడా ఆరోగ్యవంతులు అవుతారు. మీరు నిరాశానిస్పృహలని వదలండి. సహజంగా అదే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అది మీ నుంచి బయటకి వెళ్ళిపోతుంది. మీలో సహజంగా సంతోషం అనేది ఏ విధంగా మాయం అవుతుందో నిరాశ కూడా అదే విధంగా మాయం అవుతుంది. ఎప్పుడైతే మీరు దాన్ని ప్రయత్నపూర్వకంగా బయటికి పంపించాలి అని అనుకుంటే మీరు దాన్ని పొడిగించి మరింత జీవితాన్ని బలాన్ని ఇచ్చినవారవుతారు. చూడండి. మీలో లోతైన నిరాశ ఉన్నదనుకోండి, మీరు ఆఫీసుకి వెళ్ళటం మానేస్తారా? లేదే! మీ మనస్సులో డిప్రెషన్ ఉంటుంది. శరీరం మాత్రం ఆఫీసుకి వెళుతుంది. మీరు పని చేస్తారు. అయితే మీ పనిలో అంత నాణ్యత ఉండకపోవచ్చు. కాని మీ శరీరం కదులుతూ ఉంటుంది.
ఆ విధంగా నిరాశలతో జీవించే కంటే దాని నుంచి విముక్తులయి జీవించండి. మనం మానసిక కుంగుబాటులో ఉన్నప్పుడు మనలో ఈ ప్రశ్నలు ఉండవు. నాలో డిప్రెషన్ ఉంటే నేను ఏ విధంగా కదలగలను, ఇటువంటి ప్రశ్నలు ఉండవు. డిప్రెషన్ మన జీవితంలో ఒక భాగమవుతుంది. ప్రారంభంలో మీలో కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు. నేను ఏ విధంగా అన్నింటినీ, అన్ని ఆలోచనలకి లింకులు పెట్టకుండా ఉండగలను, ఇది సాధ్యమేనా, అలా ఉంటూ నా పనులు నేను ఏ విధంగా చేయగలను? ఒక విషయం అర్థం చేసుకోండి. నిరంతరం బంధవిముక్తిని గుర్తుచేసుకోవటం అనేది మీ జీవితానికి అడ్డు కాదు. అది మీ శరీరం మనసులకి అడ్డు రాదు. అది మీ లోపలికి డిప్రెషన్ రాకుండా చూస్తుంది. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు, పోయినప్పుడూ మీరు ఏమీ పట్టించుకోరు, లింకులు పెట్టరు, ఆ విధంగా డిప్రెషన్ పోతుంది.
అలవాట్లు మానటానికి పరిష్కారాలు
అలవాటు అంటే ఏమిటి? ఏ పనైనా మీరు చేయకపోతే ఏదో చాలా పోగొట్టుకున్న భావం, ఏదో తీవ్రమైన లోటు ఉండటం. కాని ఆ పనిని చేస్తే అది మీకు అదనపు సంతోషాన్ని ఇవ్వదు. అది యాంత్రికంగా జరిగిపోతుంది. అలవాటంటే ఒక వస్తువు మూలంగా లేదా వ్యక్తి మూలంగా లేదా స్థితి వల్ల సంతోషం కలుగుతుంది అని నమ్మటం. అర్థం చేసుకోండి. సంతోషాల గొలుసుని తిరిగి సృష్టిస్తూ పొడవుగా చేయటమే అలవాటు అంటే. అదే వస్తువులు, స్థితి లేదా మనుష్యుల్ని తిరిగి మళ్ళీ మళ్ళీ మీ జీవితంలోనికి తీసుకురావటమే అలవాటు అంటే. అలా చేయటం వలన అదే సంతోషం కలుగుతుంది అనే నమ్మకం. కొంతమంది త్రాగుడుకి, కొందరు సిగరెట్ కాల్చటానికి - ఇలా రకరకాలుగా అలవాటు పడుతుంటారు.
ఒక విషయం గుర్తుంచుకోండి, అదే సంతోషం కోసం దేన్నైనా తిరిగి మీ జీవితంలోనికి తెచ్చుకుంటే అది అప్పుడు ఇచ్చిన ఉత్సాహాన్ని, సంతోషాన్ని మళ్ళీ మీకు ఇవ్వదు. అది మిమ్మల్ని అలవాట్లోకి మాత్రం తీసుకువెళుతుంది. కాని సంతోషంలోకి మాత్రం కాదు. మొట్ట మొదటిసారి స్వీటు తిన్నప్పుడు అది చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. అది పూర్తిగా వేరుగా ఉంటుంది. అయితే మీరు అదే స్వీటుని పదే పదే తింటే అదే ఆనందాన్ని ఇవ్వదు. తృప్తి ఇవ్వకపోవటం కాదు, దాన్ని కనీసం చూడబుద్ధి కూడా కాదు. అదే విధంగా ఒక వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆ తరువాత అది ఉండదు.
చాలామంది నన్ను అడుగుతుంటారు, 'నా అలవాట్లు ఎలా మానగలను' అని. అలవాటు అన్నది చాలా చక్కని మాట. అందులోంచి నేను అనే మాటని తీసేస్తే అలవాటు లేకుండా పోతుంది. స్పష్టంగా అర్థం చేసుకోండి, మీరు రెండు రోజుల క్రితం సిగరెట్ కాల్చటం, సంవత్సరం క్రితం సిగరెట్ కాల్చటం, ఐదు సంవత్సరాల క్రితం సిగరెట్ కాల్చటం అన్నీ విడివిడిగా జరిగిన సంఘటనలు. వాటికి ఒక దానితో ఒకటి సంబంధం లేదు. మీరు వీటినన్నింటినీ ఒక గొలుసులా కలిపి, నాకు సిగరెట్ కాల్చే అలవాటుంది అనుకోవటం ఆ నమ్మకం, అలవాటు అనే గొలుసుని తయారుచేస్తుంది. అప్పుడు దాంతో పోరాడుతూ ఉంటారు. దీన్నే 'నేను' అనే దాన్ని వదలాలి అని నేను చెప్పిన మాటలో అర్థం. మీ నమ్మకమే అలవాటుని తయారు చేస్తుంది. మీరు నమ్మకాన్ని వదిలేస్తే అలవాటు పోతుంది. సిగరెట్ కాల్చటం అనేది సంతోషాన్ని ఇస్తుంది అని మీరు అనుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ అడ్డుకోకుండా సిగరెట్ కాల్చి మీరు ఎలా ఫీల్ అవుతారో గమనించండి. మీరు పొగని లోపలికి పీల్చినప్పుడు అది సంతోషంగా ఎలా ఉంటుంది. అది ఎప్పటికీ నిజమైన సంతోషం కాదు.
మీరు సిగరెట్ కాల్చినప్పుడు, ఆ క్షణంలో మీ అంతరంగంలో ఏం జరుగుతుందో గమనించండి. మీరు ఏమీ సంతోషపడరు. మీరు దేన్నుంచో తప్పించుకోవాలి అని చూస్తున్నారు.
మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు మీరు కేవలం సిగరెట్ కాల్చటం సంతోషం అనుకుంటారు. సిగరెట్ కాల్చినప్పుడు మీకు నిజంగా సంతోషం కలగకపోయినా, దానిలోంచి సంతోషాన్ని పిండాలి అని చూస్తారు.
మీరు మీ జీవితాన్ని లోతుగా స్కాన్ చేసి చూస్తే, మీరు సెక్స్ విషయంలో కాని, సిగరెట్ కాల్చటంలో కాని, డబ్బు సంపాదనలో కాని మొదటిసారి పొందిన సంతోషం ఆ తరువాత పొందకపోయినా, దానినుంచి ఆ సంతోషాన్ని బలవంతంగా రాబట్టడానికి ప్రయత్నిస్తారు అని అర్థం అవుతుంది. మిమ్మల్ని మీరు, 'కాదు కాదు, ఇది నిజంగా సంతోషమే' అని ఓదార్చుకుంటారు. 'ఇది కాకపోతే సంతోషం' ఏమిటి, అని మీలోని నిరాశని కప్పిపుచ్చుతారు. అదే సంతోషం అని నమ్మాలి అని అనుకుంటారు.
ఏ అలవాటునైనా వదిలేయటానికి ప్రయత్నించండి. మీరు వదల్లేరు. ఒకవేళ ఒక అలవాటుని మీరు ఆశతోనో, భయంతోనో వదలవచ్చు. అది పెద్ద అలవాటు కాకపోవచ్చు. మీరు భయంతోనో ఆశతోనో సిగరెట్ కాల్చటం మానేస్తే మీరు మీ అంతరంగానికి చెడు చేసినవారవుతారు. మిమ్మల్ని మీరు మరింతగా పాడుచేసుకున్నవారవుతారు. మీరు సిగరెట్ కాల్చడం మానేసి ఉంటారు. కాని ఏ భయం లేదా ఆశతో దాన్ని వదిలారో అది మీ అంతరంగంలో స్థిరపడిపోతుంది. సిగరెట్ కాల్చటం వల్ల కేవలం మీ శరీరం పాడైపోతుంది. భయం, ఆశల వల్ల మీ అంతరంగాన్ని, మీ ఉనికి మొత్తాన్ని నష్టపరుస్తుంది.
దాంతో జన్మ తరువాత మరు జన్మ, ఆ తరువాత జన్మ అన్నీ నష్టపోతారు. ఆ తరువాత తీసుకున్న శరీరంలో మీరు భయం, ఆశలని నింపుతారు. సిగరెట్ కాల్చడం అనేది మీరు మరు జన్మకి తీసుకువెళతారు. కాబట్టి మంచి పద్ధతి ఏమిటంటే అసలు ఆ అలవాటు మీకు ఉంది అనే భావనని వదిలేయడం.
మరణభయానికి ఒక కప్పు కాఫీ
ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకి వచ్చి మరణ భయం నన్ను వెంటాడుతోంది. నా ఆస్తి పోతుందేమో లేదా నేను మరణిస్తానేమో అనే భయం ఎక్కువగా ఉంది. నాకు ఏదైనా పరిష్కారాన్ని చూపించండి. నా భయాన్ని పోగొట్టండని అడిగాడు. నేను అతనితో ఒక కప్పు కాఫీ తాగమని చెప్పాను. అతను నాతో మీరు ఏం చెబుతున్నారు అని అడిగాడు. ఆయనతో వెంటనే ఒక కప్పు కాఫీ తాగాలి అనుకొని ఒక కప్పు కాఫీ తాగండి అన్నాను. అతను ఇది ఏ విధంగా నాకు సహాయం చేస్తుంది? అని అడిగాడు.
నీవు ఒక కప్పు కాఫీ తాగాలి అనుకొని, ఒక కప్పు కాఫీ తాగినప్పుడు, నిన్ను వెంటాడే భయం నీ అంతరంగం నుంచి వెళ్ళిపోతుంది. అవును కదా! అది ఒక్క క్షణం పాటైనా సరే. ఎప్పుడైతే కాఫీ తాగాలి అనే ఆలోచన మీలోకి వస్తుందో భయం మీ నుంచి వెళ్ళిపోతుంది. మరణభయం అతని అంతరంగాన్ని వదలకుండా కప్పు కాఫీ తాగాలి. ఒకసారి ఒక్క ఆలోచన మాత్రమే ఉంటుంది. వెళ్ళిపోయిన పాత ఆలోచన మళ్ళీ మీలోకి వచ్చింది అంటే అర్థం ఏమిటి? మీరు ఆ ఆలోచనని బలవంతంగా మీ అంతరంగంలోనికి తీసుకురావటమే. అంటే ట్రాష్‌లో వేసిన మెయిల్ ని తిరిగి ఇన్ బాక్స్ లోనికి తెచ్చినట్టు. కాబట్టి ఒక కప్పు కాఫీ తాగాలి, అనే చిన్న ఆలోచన చాలా బలమైన మరణభయం అనే ఆలోచనని తోసివేయ గలుగుతుంది.
అప్పుడు అతను 'ఇది చాలా మామూలుగా ఉంది. తిరిగి మరణభయం నాలోకి వస్తుంది. అప్పుడు ఏం చేయను అని అడిగాడు. అది మళ్ళీ వస్తే ఇంకో కప్పు కాఫీ తాగు అంతే అని చెప్పాను.
చిన్ని విషయం అర్థమైతే చాలు. అదృష్టం కొద్దీ ఒక సమయంలో ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే కొత్త ఆలోచన వస్తుందో, దాని అర్థం పాత ఆలోచన మీ మీద ప్రభావాన్ని చూపించలేదు. ఆ విధంగా కాకపోతే కొత్త ఆలోచన మీ లోనికి రాదు.
ఒకవేళ పాత ఆలోచన అంత బలంగా ఉంటే, అది మరింత బలంగా తయారై మీ మీద కూర్చుంటుంది. అది మీ అంతరంగాన్ని వదిలేయగలగాలి. కాబట్టి మీ లోపలికి కొత్త ఆలోచన రాగానే, పాత ఆలోచన మీ మీద పట్టు కోల్పోతుంది. అది మిమ్మల్ని వదిలేస్తుంది. అందుకే కొత్త ఆలోచన రాగానే అది మీలోనికి రాగలిగింది. ఎప్పుడైతే ఒక కప్పు కాఫీ తాగాలి అని అనుకుంటామో మరణ భయం మిమ్మల్ని వదిలేస్తుంది.
అతను మళ్ళీ ఈ విధంగా అడిగాడు, 'ఆ భయం నాలోకి వచ్చినప్పుడు కప్పు కాఫీ తాగుతాను. అది మళ్ళీ వస్తే ఏం చేయను? అప్పుడు ఒక గ్లాసు నీరు తాగు అని చెప్పాను, అంతే.
ఒక విషయం అర్థం చేసుకోండి. ఆ భయం తిరిగి వస్తుందేమో అన్న భయాన్ని తిరిగి మీలో ఆ భయం కలిగేలా చేస్తుంది. ఎందుకు ఆ భయానికి, ఆ ఆలోచనకి అంత శక్తిని ఇస్తారు. ఇది మిగతా ఆలోచనల లాంటిదే కదా! మరొక ఆలోచనని మీ లోనికి తెచ్చుకోవచ్చు కదా! మీరు భయం అనే ఆలోచనకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు. అందుకే అది తిరిగి మీ లోనికి వస్తున్నది. ఇది కూడా ఒక ఆలోచనే. దీనికి ఎందుకు అంత ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు.
మీరు మీ భయాల గురించి ఆశల గురించి, అంత వ్యధ చెందనవసరం లేదు. మీ బాధల గురించి బాధ పడటం, భయాల గురించి బాధ పడటం ఆశల గురించి బాధ పడటం ఇదే అసలు సమస్య. అంతే కాని భయం సమస్య కాదు. భయం గురించి బాధ పడటమే సమస్య. భయం ఎందుకు వస్తుందంటే మీరు సాధించవలసిన లక్ష్యాన్ని సాధించలేను అని అనుకున్నప్పుడు. భయం అపజయానికి సంబంధించింది కాదు. భయం, అపజయం పొందుతానేమో అన్న భయం గురించి మాత్రమే.
మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు
ఉదరసంబంధ సమస్యలకి పరిష్కారం
ఆయుర్వేదం ఏం చెబుతుందంటే మనకి ఉదరసంబంధ సమస్యలు, మలబద్ధకం - ఇవి మనం శరీరాన్ని అతిగా నిరంతరం పట్టుకొని ఉంటే వస్తాయి. మనం రిలాక్స్ అయ్యి, గమనించగలిగితే, మన శరీరం మనం కాదు అని అనుకోగలిగితే, మనకి ఇటువంటి సమస్యలు రావు. నాకు కొన్ని లక్షల మందితో ఉన్న అనుభవంతో చెబుతున్నాను. ఇటువంటి సమస్యలు ఉన్నవారు, ఈ పద్ధతిని రెండు మూడు రోజులు సాధన చేయండి. నిరంతరం మీరు శరీరం కాదు అని రెండు - మూడు రోజులపాటు అనుకోండి. ఆ విధంగా అనుకోగలిగితే ఈ సమస్యల నుంచి బయటపడతారు. మీ ఉదరం శుభ్రపడుతుంది. మీకు అల్సర్, ఇరిటేషన్ - ఈ విధంగా కడుపులో సమస్యలు ఉంటే ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. రెండు - మూడు రోజులు వరసగా ‘నేను శరీరాన్ని కాదు’ ‘నేను ఈ శరీరం కాదు’ అని అనుకోండి. రిలాక్స్ అయి శరీరాన్ని దానంతట అదే పని చేసే విధంగా చేయండి. నేను చెబుతున్నాను, రెండు - మూడు రోజులలో మీకు బాగైపోతుంది.
ఎలర్జీలకి పరిష్కారం
మీలో ఉండే రకరకాల భయాలకి, ఎలర్జీలకి కారణం, స్వతంత్రంగా ఒక దానితో ఒకటి సంబంధం లేని ఆలోచనలని కలపటమే. ఇక్కడ మీకు కావలసింది కేవలం వాటికి బంధాలు ఏర్పరచకుండా ఉండటమే. ఒక విషయం అర్థం చేసుకోండి. గడచిన మూడు సంవత్సరాలలో నేను కనీసం వేయిమందికి ఎలర్జీల విషయంలో హీలింగ్ చేశాను. నేను హైదరాబాద్‌లో క్లాసు తీసుకునే సమయంలో ఒక వ్యక్తి వచ్చి వేరుసెనగ పప్పు తింటే తనకి ఎలర్జీ అని, తాను 25 సంవత్సరాల నుంచి దానితో బాధ పడుతున్నాడని కేవలం ఒక స్పూను తిన్నా ఒళ్ళు ఉబ్బుతుందని చెప్పాడు. నేను అతన్ని అది తెచ్చుకొని నా పక్కన కూర్చొని తినమని చెప్పాను. అతను నా పక్కన కూర్చొని తిన్నాడు, అతను చక్కగా తిన్నాడు కాని ఏమీ కాలేదు. ఎలర్జీ మాయమైపోయింది. ఇక్కడ కావలసింది ఆ ఆలోచన నుంచి బయటికి వచ్చే ధైర్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే అతనితో నేను చూసుకుంటాను అని అన్నాడో, ఆ ఆలోచనల గొలుసుని తెంపగల ధైర్యం అతనికి వచ్చింది. ఎలర్జీ అనే భయాన్ని కలిగించే ఆలోచనల గొలుసుని ఛేదించగలిగాడు.
పెద్ద వయస్సు వారి సమస్యలు - పరిష్కారం
నేను ఆధ్యాత్మికప్రయాణంలో ఉన్న రోజుల్లో జరిగిన ఒక సంఘటనని చెబుతాను.
నేను ఒక పల్లెటూరికి వెళ్ళాను. అక్కడ అంతా పెద్ద వయస్సులో ఉన్న లామాలు ఉన్నారు. నేను ఒక వ్యక్తిని అడిగాను, ‘నేను ఒక పెద్ద లామాని చూడాలి (లామా అంటే బౌద్ధ సన్యాసి) అని. అతను నన్ను అక్కడ ఉన్న పొలం దగ్గరకి వెళ్ళమన్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఆ లామాతో మాట్లాడాను. అతను పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. నేను అతనితో, ‘మీరంతా వయస్సులో చాలా పెద్దవారు. మీ జీవితవిధానం గురించి, మీ అనుభవాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అని అన్నాను. నా మాట విని అతను నవ్వటం మొదలు పెట్టాడు, ‘ఏమిటి? పెద్దవారమా? నేను మధ్యవయస్సు వాడినే. నా వయస్సు 136 సంవత్సరాలే. ఇక్కడ ఇంకా చాలా పెద్దవారు ఉన్నారు. 190 సంవత్సరాల కంటే పెద్దవారు ఉన్నారు. వెళ్లి వాళ్లతో మాట్లాడు’ అన్నాడు. నేను నిర్ఘాంతపోయాను. నేను అతనితో, మీరు అంత కాలం ఎలా జీవిస్తారు’? అని అడిగాను.
అతను చాలా మామూలుగా ‘ఏముంది దాంట్లో, మాకు చిన్నప్పటి నుంచీ మనిషి 300 సంవత్సరాలు జీవిస్తాడు’ అని నేర్పిస్తారు అన్నాడు.
వారికి ముందు నుంచీ 300 సంవత్సరాలు జీవిస్తారు అని నేర్పిస్తారు. మీ శరీరం పసిబిడ్డ లాంటిది. మీరు ఏది చెబితే అది వింటుంది. మీరు చేయవలసింది కేవలం సరైనదాన్ని బలమైన నమ్మకంలా మీలో కలిగించటమే. మీరు ఆలోచనలకి లింకులు పెట్టకుండా ఉంటే జరగవలసినవి జరిగే రీతిలో జరుగుతాయి. మీరు నిరంతరం నూతనత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మనిషి అంటే 70 - 90 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు అనే విషయాన్ని బలంగా నమ్ముతారు. మీకు 70 సంవత్సరాలు రాగానే మరణానికి సిద్ధపడతారు. మీరు నిరంతరం ‘నేను పెద్దవాడినయ్యాను ఇక చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను.’ అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా మీ శరీరాన్ని మరణానికి సిద్ధం చేస్తారు.’
విసుగుకి పరిష్కారం
ఏ వ్యాధినైతే గౌరవంగా చూస్తుంటారో ఆ వ్యాధిని మీ శరీరం సృష్టిస్తుంది. అలసిపోవటం, విసుగు వంటివన్నీ అటువంటి గుర్తింపులకి సంబంధించినవే. దీన్ని మీరు గుర్తింపుల గొలుసు అనవచ్చు. గుర్తింపుల గొలుసు అంటే ఏమిటి? ఉదాహరణకి అలసటని తీసుకోండి, మీరు నిన్నటి అలసటని - వారం క్రితం దాన్ని కలిపి నాకు 8 గంటలు కాగానే నీరసం వస్తుంది అని అనుకుంటారు. అప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచే ఎనిమిది అయ్యేటప్పటికి నాకు నీరసం వస్తుంది అనే భావనతో ఉంటారు. ఎనిమిది కాగానే నీరసం అనిపిస్తుంది. మీ ఈ గుర్తింపుని తృప్తి పరచడానికి బలవంతంగా నీరసాన్ని అనుభవిస్తారు.
కాబట్టి మీరు ఆరు అయ్యేటప్పటికి సోమరితనాన్ని, నీరసాన్ని తయారు చేసుకుంటారు. ఇప్పుడు మీరు సృష్టించుకున్న ఈ గుర్తింపుని నిరూపించాలి. కొన్నిసార్లు ఈ గుర్తింపుని బయట ప్రపంచానికి నిరూపించే కార్యక్రమాన్ని మరిచిపోవచ్చు కాని మీకు మీరు నిరూపించటం మానరు. ఒకవేళ బయట ప్రపంచం మీ ముద్రల్ని గుర్తించకపోతే పర్వాలేదు. కాని మిమ్మల్ని మీరు అనుమానిస్తే అది మీ అహంకారానికి ఒక పెద్ద దెబ్బ. అది జరగకుండా మీరు జాగ్రత్త పడతారు. మీరు ఒక సంవత్సరం క్రితం నీరసపడ్డాను అని అనుకున్నా చాలు, ఇప్పుడు దాన్ని తిరిగి తాజా చేసుకుంటారు. నిజానికి మీకు ఇప్పుడు ఆ సమస్య లేకపోవచ్చు. కానీ మీరు విసుగు నుంచి బయటికి వచ్చాను అన్న విషయాన్ని నమ్మటం మీకు ఇష్టం ఉండదు. మీ పాత గుర్తింపుల్ని నిలుపుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. మీ అహం దేన్నైనా త్యాగం చేస్తుంది కాని గుర్తింపుని చేయదు. అందుకే మీరు చక్కగా మంచి పద్ధతిలో ఒక మోసపూరితమైన జిత్తులమారి ఆట ఆడతారు.
అపరాధభావానికి పరిష్కారం
ఒక వ్యక్తి నాతో, 'నేను సిగరెట్ కాల్చే అలవాటు వల్ల చాలా బాధ పడుతున్నాను. నేను నిద్ర లేవగానే సిగరెట్ కాల్చాలి. కాని ఒక గంట తరువాత తప్పు చేశానే అని బాధపడతాను. ఆ తరువాత ఆఫీసుకు బయలుదేరే ముందు మళ్ళా సిగరెట్ కాలుస్తాను. ఆ తరువాత తప్పు చేశాను అని బాధపడతాను. నేను ఏం చేయాలి? నేను నిరంతరం తప్పు చేశానని బాధపడతాను. ఈ అలవాటు వల్ల చాలా బాధపడుతున్నాను' అని చెప్పాడు.
నేను అతనితో 'నీవు సిగరెట్నైనా వదలాలి లేదా అపరాధభావాన్నైనా వదలాలి. ఏదో ఒకదాన్ని వదలాలి. అప్పుడే ఈ అలవాటు నుంచి స్వేచ్ఛని పొందుతావు!' అని చెప్పాను.
ఇది విని అతను ఆశ్చర్యపోయాడు. అతను నాతో, నేను సిగరెట్ కాల్చటం మానలేను. నేను అపరాధభావాన్ని వదిలినా ఇంకా ఇంకా ఎక్కువ సిగరెట్లు కాలుస్తాను కాని మానెయ్యను. అప్పుడు నేను సిగరెట్ కాల్చటం మానేస్తాను అని మీరు ఏ విధంగా చెప్పగలరు? అని అడిగాడు. చూడండి, ఇది ఒక ఛేదించలేని వృత్తం లాంటిది. మీలో తప్పు చేశాను అనే భావం ఉన్నప్పుడు మీరు నిరంతరం 'నేను సిగరెట్ కాల్చకూడదు. నేను సిగరెట్ కాల్చటం ఆపాలి ' అనుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? మీ మనస్సులో సిగరెట్ అనే మాటకి ఎక్కువ శక్తిని ఇస్తారు. ఆ ఆలోచన సిగరెట్ అనే మాటని మీ అంతరంగంలో లోతుగా నాటుకునే విధంగా చేస్తుంది. అప్పుడు మీరు ఏ విధంగా సిగరెట్ కాల్చటం మానగలరు?
ఎప్పుడైతే మిమ్మల్ని మీరు క్షమించుకోలేరో దాన్నే అపరాధభావం అంటారు. ఎదుటివారిని క్షమించలేకపోతే దాన్ని పగ అంటారు. ఎప్పుడైతే మీరు ఆలోచనలకి బంధాలు కల్పించకుండా దానిలోంచి బయటికి వస్తారో అపరాధభావం, పగ - రెండూ మీ నుంచి మాయమౌతాయి. మీరు ఎదుటివారిని క్షమించటమే కాదు, మీరు ఆ విషయాన్ని మరిచిపోతారు. ఎందుకంటే మీ ప్రవర్తనకి ఆలోచనలకి బంధాలు ఉండవు కాబట్టి.
ముందుకు వేసే పెద్ద అడుగే - గతం నుంచి పొందే స్వేచ్ఛ
మీరు అడగవచ్చు, ‘మేము బంధవిముక్తులమైతే మా గతం నుంచి ఏం నేర్చుకోగలం’ అని మీరు గతం అనుభవాల నుంచి స్వేచ్ఛని పొందినప్పుడే గతం నుంచి నిజంగా ఏదైనా నేర్చుకోగలరు. ఎప్పుడైతే గతంలోని అనుభవాల నుంచి స్వేచ్ఛని పొందుతారో, అప్పుడే గతం నుంచి నేర్చుకోగలవి, నేర్చుకోవలసిన విషయాల్ని నేర్చుకుంటారు. అవి మీలో ఒక భాగం అవుతాయి. ఎప్పుడైతే మీరు నిరంతరం గతబంధాలతో ఉంటారో, అప్పుడు బాధలు, సమస్యలు, అపరాధభావం మీ అంతరంగంలో నిండి ఉంటాయి. మీరు అభివృద్ధి చెందిన వివేకంతో గతం యొక్క సారాన్ని తెలుసుకోలేరు. అంతే కాకుండా మీకు మీ గతం పట్ల ఎక్కువ గౌరవభావం ఉన్నా దాని మీద మీరు ఎక్కువ ఆధారపడినా మీరు వర్తమానంలో ఈ క్షణంలో ఉండలేరు. మీరు నిరంతరం గతాన్ని వర్తమానంలోకి భవిష్యత్తు లోనికి తీసుకువచ్చి వాటిని కూడా పాడుచేస్తారు. మీరు ఆ విధంగా చేసినప్పుడు ఏ విధంగానూ ఆనందంలో ఉండలేరు. గతం నుంచి బయటికి రండి. అప్పుడు మీరు నేర్చుకోగల సారాంశం మీలో ఒక భాగమౌతుంది. అప్పుడు ఈ క్షణంలో జీవితాన్ని ఒక ఉత్సవంలా జరుపుకోండి.
అప్రయత్నంగా జరిగే నీతి, క్రమశిక్షణ
కొన్ని ఆలోచనలని ఒక గొలుసులా చేయవచ్చు అని మీరు నమ్మి, సంతోషం కలిగించే ఆలోచనలకి మాత్రం ప్రాణం పోస్తారు. కొన్ని ఆలోచనలు బాధాకరమని మీరు అనుకుంటే వాటి నుంచి శక్తిని వెనక్కి తీసుకుంటారు. దీని వల్ల మీరు జీవితాన్ని పూర్తిగా జీవించరు. మీరు నిరంతరం ఏ భాగంలో జీవించాలి అని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే మీరు మీ మనస్సు మీద అత్యధికంగా ఆధారపడి ఉంటున్నారు. మీకు ఒక విషయం అర్థం కావడం లేదు, మీరు మీ మానసికవ్యవస్థ (ఆలోచనలు) లేకుండా కూడా జీవించగలరు. మీరు జీవితంలో నీతి నియమాలు లేని జీవితాన్ని గడపాలేమో అనుకుంటారు. ఏ వ్యక్తి అయితే సహజసిద్ధంగా తన ఆలోచనలకి బంధాలు లేవు అని తెలుసుకుంటాడో, ఆ వ్యక్తి సంఘం పెట్టే నియమనిబంధనలకి అతీతంగా చాలా సహజమైన నీతి నియమాలతో జీవించగలడు. అటువంటి వ్యక్తిలోనే మీరు లోతైన చేతనస్థితిలో ఉండే నీతినియమాల్ని చూడగలరు. అటువంటి వారిలోనే అత్యంతక్రమశిక్షణతో కూడిన జీవితాన్ని చూడగలరు. ఆ క్రమశిక్షణని ఎవరూ కుదపలేరు. ఆ నీతినియమాల్ని ఎవరూ అతని నుంచి తీసేయలేరు. ఆ నీతినియమాలు భయం, ఆశల నుంచి రావు. నిజమైన నీతినియమాలు తనని, తాను తెలుసుకుని, ప్రపంచాన్ని, భగవంతుడిని లోతుగా తెలుసుకున్నప్పుడే ఆ వ్యక్తిలో వికసిస్తాయి.
గమనించటం ఒక చేతనస్థితి
భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు చక్కగా ఒక విషయాన్ని పాడతారు. కుమ్మరి చక్రం తిరుగుతూ ఉంటుంది. దాని పీఠం మాత్రం నిరంతరం తిరిగే చక్రం మధ్య నిశ్చలంగా ఉంటుంది. అదే విధంగా ఒక కచ్చితమైన వ్యక్తి ఏ పనిలో ఉన్నా నిశ్చలంగా ఉండగలడు. మీరు దేనితోను బందీలు కాదు అని తెలుసుకున్నప్పుడు అకస్మాత్తుగా మీరు కుమ్మరి చక్రంలోని పీఠంలా ఎటువంటి కుండను చేసినా, ఎటువంటి అనుభవాలు మీలో మిగిలినా మీరు మాత్రం ప్రభావితం కారు. ఒక విషయం అర్థం చేసుకోండి, అక్కడ చూపిస్తున్న సినిమా మీరు కాదు. మీరు కేవలం సినిమాని ప్రదర్శిస్తున్న తెర మాత్రమే. తెర మీద ఏ సినిమాని ప్రదర్శించినా తెర నిశ్చలంగా ఉంటుంది.
ప్రభావంతో బంధాలు
బాలుడైన అష్టావక్రుడు, జనకుడితో ఈ విధంగా చెబుతాడు. నీవు నిశ్చయంగా ఎప్పటికీ స్వేచ్ఛా జీవివి. నీవు అన్నీ చూడగల నిత్యస్వేచ్ఛాజీవివి. నిశ్చయంగా ఇది ఒక్కటే బంధం. అదే నీవు చూసేవాడిని మరొక విధంగా చూడటం. ఎప్పుడైతే చూసేది చూసేవాడిని ప్రభావితం చేస్తుందో అప్పుడే బంధాల సమస్య ప్రారంభమవుతుంది. అసలైన మీ ఉనికి స్వచ్ఛమైంది. కాని ఎప్పుడైతే మీరు చూసే వ్యక్తి కాక మరొకరుగా అనుకున్నప్పుడే సమస్య ప్రారంభమౌతుంది. అంతకు మించి బంధాలేమీ ఉండవు.
ఇప్పుడు బంధవిముక్తులైతే
మీరు బాధల గొలుసుని తయారుచేసాను అనుకోవటం, మరొక గొలుసుని చేయటమే. పది సంవత్సరాల క్రితం చేసిన గొలుసు, తొమ్మిది సంవత్సరాల క్రితం గొలుసు, నిన్నటిదీ అన్ని స్వతంత్రసంఘటనలు. వీటినన్నింటినీ ఒక గొలుసులా చేయటం మరొక గొలుసు, అంతే. ఈ విషయం మీరు అంతరంగపు లోతులలో మీకు అర్థం అయితే అది తన జాగ్రత్తని తాను తీసుకుంటుంది. అప్పుడు మీ ఆలోచనలలో, మీ పనులలో మార్పు వస్తుంది. నన్ను చాలామంది అసలు గొలుసులు సృష్టించకుండా వుండాలి అని నిరంతరం గుర్తుంచుకోగల విధానాన్ని చెప్పండి అని అడుగుతుంటారు. మీరు ఆ విధంగా అనుకోవటం కూడా మరొక గొలుసుని సృష్టించటమే. ఎప్పుడైతే ఒకటి మీకు సంతోషం అనిపిస్తుందో అది ఎప్పటికీ కావాలి అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, మరొక గొలుసుని తయారుచేస్తారు.
ఎంపిక పరమానందం కాదు
బంధవిముక్తితో దొరికే పరమానందాన్ని మీలో ఉంచాలని ప్రయత్నించవద్దు. మీకు శాశ్వతమైన ఆ ఆనందానికి కారణం మీలో ఏదీ ఉంచలేను అని తెలుసుకోవటం వల్లే. మీలో లోతైన సంతోషాన్ని మీరు ఎలా పొందారంటే ఎంపికల నుంచి స్వేచ్ఛ పొందారు కాబట్టి. మీరు దేంతోనూ బంధాలలో లేరు కాబట్టి. మీరు బంధవిముక్తులని తెలుసుకున్నారు కాబట్టి. ఇప్పుడు తిరిగి బంధాలు కల్పించవద్దు.
ఎవరైనా మీతో నేను టెన్నిస్ ఆడి ఆ సంతోషపారవశ్యంలో ఉన్నాను అని చెబితే, మీరు టెన్నిస్ ఆట పారవశ్యాన్ని ఇస్తుంది అనుకొని మీలో ఒక ఈక్వేషన్ వేసుకుంటారు. అప్పుడు మీరు టెన్నిస్ ఆడటం ప్రారంభించి బంతిని కొడుతూనే ఉంటారు. కానీ మీలో ఏమీ జరగదు. పారవశ్యం ఉండదు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, టెన్నిస్ ఆట పారవశ్యాన్ని ఇస్తుందని చెప్పి అతను మిమ్మల్ని మోసం చేశాడు. ఒక విషయం అర్థం చేసుకోండి, టెన్నిస్ ఆడేటప్పుడు, అతను సంతోషం గురించి అసలు పట్టించుకోడు. అతను ఆటలో ఎంతో విరామంగా ఉంటాడు. ఆ కారణంగానే అతనిలో సంతోషం కలుగుతుంది. కాకపోతే ఆ సంతోషానికి కారణం టెన్నిస్ ఆడటం అనుకుంటాడు. అతని సంతోషానికి కారణం టెన్నిస్ కాదు. అతను పూర్తి బంధవిముక్తిస్థితిలో ఎంత సేపు ఉంటే అంతవరకూ ఆనందపారవశ్యంలో ఉంటాడు. అతను టెన్నిస్ ఆడనవసరం లేదు.
ఎంపిక లేకపోవటమే పరమానందం. ఎప్పుడైతే మీరు ఎంచుకుంటారో పరమానందం కలగదు. ఎందుకంటే మీరు దాన్ని ఎంచుకొని, అది కలిగే అవకాశాన్ని పోగొట్టారు. మీరు ఎప్పుడైతే ఎంపిక లేకుండా, పూర్తి విరామంలో ఉంటారో అప్పుడు మీలో ఆనందం దానంతట అదే కలుగుతుంది. ఎప్పుడైతే మీరు ఆనందం గురించి అనుకుంటారో, మీరు కచ్చితంగా ఆ అనుభవాన్ని పొందరు.
మీ కలల సాధనకి ఉన్న పద్ధతి బంధవిముక్తులవటం
ఎప్పుడైతే మీరు బంధవిముక్తులవుతారో అప్పుడు మీ కలలన్నీ నిజమవుతాయి. స్పష్టంగా తెలుసుకోండి. మీ కలల్ని నిజం చేసుకోగల ఒక చిన్నది, శక్తివంతమైన పద్ధతి ఇది. మీ భవిష్యత్తు గురించి మీకు ఎటువంటి కలలు ఉన్నా మీరు విరామంగా ఉన్నప్పుడు, మీరు బంధవిముక్తులుగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీరు మీ ఆలోచనల ద్వారా ఒక కొత్త శక్తి మీలోకి ప్రవేశించటాన్ని చూడగలుగుతారు. ఆ శక్తి మీ కలలపట్ల శ్రద్ధ తీసుకుంటుంది. ఇది విరామంగా ఉండగలిగి తెలుసుకునే తత్త్వం యొక్క స్థితి. అంతరంగప్రపంచంలో జరిగిన పరిశోధనల సారాంశం అదే. బంధవిముక్తి అనేది మీకు అన్నీ ఇవ్వగల అంతిమపద్ధతి.
అబద్ధపు గుర్తింపులు, అహం అవసరం లేదు
ఈ చిన్న సత్యాన్ని అర్థం చేసుకోండి. ఒక జంతువుగా ఉండి శ్వాస తీసుకోవటానికి అహం కాని, గుర్తింపు కాని, లక్షణాలు కాని అవసరం లేదు. కాని ఒక మనిషిగా మీరు మీ గుర్తింపుని వదులుకోవటానికి భయపడతారు. మీ శరీరాన్ని ఉపయోగించలేనేమో అని భయపడతారు. మీకు ఏదో చెడు జరుగుతుంది అని భయపడతారు. మీ గుర్తింపుని వదిలితే మీ శరీరం సరిగా పని చేయదు అని భయపడతారు. మీ గురించి మీకు ఒక భావన ఉంటుంది. నేను ఫలానావారి తండ్రిని, ఫలానావారి కొడుకుని అని మీ గురించి మీకు ఉన్న ఈ భావన, ఈ గుర్తింపు మీరు మోస్తూ తిరిగే అహంకారం, మీ శరీరం చక్కగా పనిచేయటానికి ఏ మాత్రం అవసరం కాదు. అయితే దీన్ని నమ్మటం చాలా కష్టం. మీరు శ్వాసించటం గురించి, గుండె కొట్టుకోవటం గురించి, ఆహారం జీర్ణమవటం గురించి ఆలోచించాలా? లేదు! ఈ సత్యం ఆధారంగా మీరు జీవించటానికి అహం అవసరం లేదు అని తెలుసుకోండి. అహానికి అతీతంగా ఏదో ఉంది. అదే మీరు జీవించగలిగేలా చేస్తుంది. మీ జీవితం అహంకారం మీదే ఆధారపడి ఉంటే అది ఎంత విపత్తు అయి ఉండేదో, మనం దాంతో వ్యవహరించలేం. మనం మన అహాని కంటే ఎంతో ఉన్నతులం. కాని ఇది నమ్మటానికి చాలా కష్టంగా ఉంటుంది.
ఒక చిన్న కథ : ఒక అంధుడు డాక్టరు దగ్గరికి వెళ్ళి తనకు చూపు వచ్చేలా చేయమని ప్రార్థిస్తాడు. డాక్టరు అతనితో నీకు ఆపరేషన్ చేస్తాను. అప్పుడు నీవు చూడగలుగుతావు. నీవు ఈ కర్ర అవసరం లేకుండా నడవగలవు, అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, 'డాక్టర్‌గారూ, మీరు ఆపరేషన్ చేస్తే నాకు తిరిగి చూపు వస్తుంది అన్న విషయం అర్ధమైంది, కాని నేను కర్ర లేకుండా ఎలా నడవగలనో అర్థం కాలేదు,' అంటాడు.
కంటి చూపు లేని వ్యక్తిని, అతనికి చూపు వస్తే కర్ర లేకుండా ఏ విధంగా నడవగలడో చెప్పి ఒప్పించలేం. అతన్ని వివేకంతో ఒప్పించలేం. ఎందుకంటే నమ్మడు కాబట్టి. అతనికి చూపు వచ్చాక మాత్రమే తాను కర్ర లేకుండా నడవగలను అని తెలుసుకోగలడు.
అదే విధంగా మీరు మీ శరీరంలో, మానసికవ్యవస్థలో జీవించటానికి అహం అవసరంలేదు. మీ శరీరం లోపల, మీ మానసిక వ్యవస్థ లోపల అహం లేకుండా జీవించగలరు. చూపు వచ్చిన వ్యక్తికి కర్ర ఏ విధంగా అవసరం ఉండదో, మీరు జీవించటానికి అహం అవసరం లేదు.
అహంకారం మమకారం గుర్తింపులు
మన అందరికీ రెండు రకాల గుర్తింపులు ఉంటాయి. మనం బయటి ప్రపంచానికి చూపించేది, మన అంతరంగంలో మనం అని నమ్మే గుర్తింపు. మన లోపల ఉండే గుర్తింపుని మమకారం అని అంటారు. అది మనం నిజంగా ఉన్నదాని కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. మీరు మీ అపజయాలనే గుర్తుంచుకుంటారు. మీరు గతంలో చేసిన తప్పులు, అపరాధ భావం వీటినే గుర్తుంచుకొని మీ గుర్తింపుని బాగుపరచటానికి నిరంతరం చెక్కుతూ ఉంటారు.
మీరు బయటి ప్రపంచానికి చూపించే గుర్తింపు అహంకారం. అది మీ విజిటింగ్ కార్డు. అందులో ప్రపంచం మీలో ఏదేది గుర్తించాలి అనుకుంటారో అవన్నీ ప్రింటు చేస్తారు. అది ఎప్పుడూ కూడా మీ నిజమైన మీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు అమ్ముకోవాలి అనుకుంటారు. కాబట్టి ఏ సమాజంలో అయితే మిమ్మల్ని మీరు అమ్ముకోవాలో ఆ సమాజంలో ఇది ఒక ప్రాథమిక అవసరం. ఆ కారణమే మీరు కంటే ఎక్కువగా చూపించాలి అని ఒత్తిడి చేస్తుంది.
అహంకారం నేను ఎక్కువ అనే భావం మీద ఆధారపడి ఉంటుంది. మమకారం తక్కువ అనే భావం మీద ఉంటుంది. అహంకారం భయం మీద ఆధారపడి ఉంటుంది. మమకారం ఆశ మీద ఆధారపడి ఉంటుంది. మీరు మీ శక్తిని అహంకారం మీద ఎక్కువగా ఉపయోగించి దాన్ని విస్తృతం చేయాలి అని చూస్తే మీరు ప్రాపంచికవిషయాల్లో ఎక్కువగా ఉంటారు. మీరు జీవితం అంతా మమకారాన్ని చెక్కుతూ దాన్ని మరింత బాగా చేయాలి అని చూస్తుంటే మీరు నీతిబోధకులవుతారు. అణచివేయబడినవారవుతారు. మీరు బయటి ప్రపంచానికి మీలోని శక్తిమంతమైన పాయింట్‌ని చూపిస్తారు. మిమ్మల్ని మీరు మీ లోపల గణించేటప్పుడు అత్యంత బలహీనమైన లింకుతో చూస్తారు. అహంకారమమకారాల మధ్య విభేదాలు, మీరు బయటి ప్రపంచానికి, లోపలి ప్రపంచానికి చూపించే వ్యక్తిత్వాల మధ్య పోరాటమే టెన్షన్ అంటే.
మీరు నిరంతరం ఈ రెండు గుర్తింపుల్ని కాపాడాలని చూస్తుంటారు. అవి పెరిగే కొద్దీ వాటి మధ్య పోరాటం కూడా పెరుగుతుంది. అదే మీకు సమస్యల్ని సృష్టిస్తుంది. ఇది ఎలా అంటే - ఒకేసారి ఇద్దరు స్త్రీలని వివాహమాడి వారితో ఒకే చోట కలసి ఉన్నట్టే. ఈ రెండు గుర్తింపులూ ఊహలే. మీరు నిరంతరంచేసే ఈ రెండు గుర్తింపుల కంటే ఉన్నతమైనవారు మీరు. ఈ రెండు గుర్తింపుల నుంచి పొందే స్వేచ్ఛనే నేను మోక్షం (ఆత్మజ్ఞానంతో పొందే స్వేచ్ఛ) లేదా నిర్వాణస్థితి అంటాను. అదే జ్ఞానోదయం. ఈ రెండు గుర్తింపులూ బంధాలే. ఎప్పుడైతే మీరు ఈ రెండింటికీ అతీతమైనవారని తెలుసుకుంటారో మీరు జీవన్ముక్తులవుతారు.
నేను మీకు ఒక విషయాన్ని చెబుతాను. మీరు అనుకునే ఆ భావనని వదిలినప్పుడే మీరు చైతన్యవంతులవుతారు. అంతవరకూ మీరు జీవించి ఉన్నారు అనడానికి శ్వాస తీసుకుంటూ ఉంటారు, కానీ మీ లోపల చైతన్యం ఉండదు. శ్వాస మీరు జీవించి ఉన్నారు అని చెప్పే ప్రామాణికం కాదు. శ్వాస తీస్తున్నాను కాబట్టి నేను జీవించి ఉన్నాను అని ఎప్పుడూ అనుకోవద్దు. మీరు బయటి ప్రపంచానికి, అంతరంగప్రపంచానికి కనబడేదాని కంటే కూడా చాలా ఉన్నతులు. ఎప్పుడైతే మీరు ఈ రెండు గుర్తింపుల నుంచీ విరామంగా ఉండగలరో మీరు జీవన్ముక్తులవుతారు. అంటే జీవించి ఉండగానే జననమరణచక్రం నుంచి బయటికి వస్తారు. నేను మీకు చెబుతున్నాను మీరు భగవంతుని కంటే తక్కువ అని ఏది అనుకున్నా మీరు మీ కంటే తక్కువ స్థాయిలో ఉన్నారు అని అర్థం. ఎందుకంటే మీరు భగవత్ స్వరూపులు.
మీరు బంధవిముక్తులు అని మనస్సు మిమ్మల్ని నమ్మనీయదు
మీరు బంధవిముక్తులు అని మీ మనస్సు మిమ్మల్ని నమ్మనివ్వకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మీరు బయట ప్రపంచంలో దేనినైతే మీ గుర్తింపు అని అనుకుంటారో - అవి ఆస్తి, ఐశ్వర్యం, బంధుత్వాలు, ఇలాంటివన్నీ కూడా మీరు తయారుచేసుకున్న గొలుసులు ఆధారంగానే ఉంటాయి. మీరు ఆ గొలుసుల నుంచి స్వేచ్ఛని పొందితే మీ గుర్తింపులు పోతాయి. అందుకే మీ గుర్తింపు పోతుందనేది మొదటి భయం.
తరువాత కారణం మీలోని నీతినియమాలు. మీరు అనగానే ఎలా ఏంచేయాలి అనుకుంటారో అది. మీరు మీ గుర్తింపుని పోగొట్టుకుంటే మీలోని ఆలోచనలను ఒక దానికి ఒకటి లింకులు పెట్టే విషయాన్ని నమ్మనప్పుడు మీపై మీకు ఉన్న గుర్తింపు పోతుంది. మీరు బయటి ప్రపంచానికి చూపించే గుర్తింపు మీకు మీరు చూపించే గుర్తింపు రెండూ మాయం అవుతాయి. అప్పుడు మంచి ఏది చెడు ఏది, అని ఎలా తెలుసుకుంటారు? అలా నిర్ణయించటానికి ఆధారం లేదు. అందుకే మీ మనస్సు మీరు బంధవిముక్తులని నమ్మనీయదు.
స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను నా అనుభవం నుంచి చెబుతున్నాను. నేను ఇంతవరకూ తన గుర్తింపుని పూర్తిగా భావించే ఒక్క వ్యక్తిని కూడా చూడలేదు. మీరు సంపూర్ణంగా అనుకోరు, ఎందుకంటే మీరు స్వచ్ఛంగా కచ్చితంగా ఉండాలి అని అనుకున్నా, దాన్ని ఏళ్ళ తరబడి సాధన చేసినా, మీరు అదే మనస్సుతో ఉంటారు. ఎందుకంటే మీకు అక్కడ నిజంగా లేని మనస్సుని చెక్కుతున్నారు. అది అక్కడ నిజంగా ఉంటే దాన్ని మీకు ఇష్టమైన విధంగా చెక్కుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు ఉంచుకోవచ్చు. కాని అదే లేదు. ఆ గొలుసే లేదు. ఇక అక్కడ చెక్కడానికి ఏముంది.
అష్టావక్రుడు ఈ విధంగా చెబుతాడు. మీరు - బంధాలు లేని, రూపం లేని అన్నింటినీ గమనించేవారు.
మీరు మీ గుర్తింపు కాదు మీరు రూపం లేని దేనితోనూ బంధం లేని మీ చుట్టూ జరుగుతున్నదాన్ని గమనించేవారు మాత్రమే.
అహం, భయాన్ని ఉపయోగిస్తుంది
మీరు భయపడుతున్నంత కాలం అహంకారం మిమ్మల్ని ఆడిస్తుంది. మిమ్మల్ని ఎవరైనా ఆడించాలి అనుకుంటారో, బానిస చేయాలనుకుంటారో వారు ముందుగా మీలో భయాన్ని కల్పిస్తారు. అప్పుడు మీరు అతను లేకపోతే ఏ పనీ చేయలేను అని నమ్ముతారు. అది మీ ఇంట్లో కాని మీ ఆఫీసు లేదా వ్యాపారంలో కాని. అతను ముందు మీలో భయాన్ని సృష్టిస్తాడు. ఆ భయం ఎంత ఉందో అంత ఎక్కువగా మిమ్మల్ని ఆడిస్తాడు. అదే విధంగా మీ అహంకారం ముందుగా తాను లేకపోతే మీరు మీ శరీరంలో మానసిక వ్యవస్థలో జీవించలేరు అని మీకు నిరూపిస్తుంది. ఒకసారి భయం మీలోకి వస్తే, ఒకసారి అహం లేకుండా నేను జీవించలేను అని నమ్మితే అది సులభంగా మిమ్మల్ని ఆడిస్తుంది. స్పష్టంగా అర్థంచేసుకోండి, అది కేవలం భయం మాత్రమే.
బంధవిముక్తి - అంటే చక్కగా పనిచేయటం
ఎప్పుడైతే ఆలోచనలకి లింకులు పెట్టం అని వింటారో మీరు భయపడతారు. నేను ఆలోచనలను కలిపి ఉంచకపోతే నా బిల్లులు ఎవరు కడతారు? నా ఆస్తి ఎవరు కాపాడతారు? నేను డబ్బు ఎక్కడ పెట్టానో ఎలా గుర్తు ఉంటుంది. అసలు నేను ఎలా జీవించగలను. ఈ సమాజంలో ఎలా నెగ్గుకురాగలను. నా ఉద్యోగం ఎలా చేయగలను? నా విషయాలన్నీ ఎలా జాగ్రత్తగా చూడగలను. నేను ఆఫీసుకి ఏవిధంగా వెళ్ళగలను? అనే భయాలు వస్తాయి. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆఫీసుకి ఎందుకు వెళ్ళలేరు. మీరు ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగారో ఎక్కడో మీ అంతరంగంలో అనువంశకమైన అయిష్టత ఉద్యోగం పట్ల ఉన్నది అని అర్థం. అందుకే ఏదైనా చిన్న అవకాశం రాగానే ఆ పని తప్పించుకోవాలి అని చూస్తారు. ఈ ప్రశ్న అడగటం ద్వారా మీ దైనందినజీవితం పట్ల మీకున్న కోపాన్ని, కక్షని ఈ విధంగా చూపిస్తారు. అంతకు మించి ఏమీ లేదు. అసలు విషయం బంధాల నుంచి విముక్తి పొందటం ఇష్టం లేకపోవటమే.
మీకు అటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఆలోచనలకి లింకులు పెట్టటం ఆపి ఒక పది రోజులు నిద్రపొండి. అందులో తప్పేమీలేదు. పది రోజులు సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్ళండి. నేను రెండు గుర్తింపుల నుంచి విముక్తి పొందుతున్నాను, అని నిర్ణయించుకోండి. ఎన్ని రోజులు మీరు నిద్రపోగలరు? మీరు పనులు చేయకుండా ఎన్ని రోజులు ఉండగలరు. మీలో తమస్సు (త్రిగుణాలలో ఒకటి - సోమరితనం) పోతుంది, ఆ తరువాత పని చేయటం మొదలుపెడతారు.
బాధ్యత లేనితనం పని తప్పించుకోవటం అని అనుకున్నా పరవాలేదు. మీరు ఆలోచనలకి బంధాలు ఏర్పరచటం ఆపేయండి. అప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీరు బంధవిముక్తులుగా ఉన్నప్పుడు సోమరితనం అసలు ఉండదు. మానసికంగా మీరు నిశ్శబ్దంగా ఉంటారు కాని భౌతికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు బాధ్యత లేని పని నుంచి తప్పించుకునే దృక్పథంతో ఉన్నప్పుడు, మానసికంగా చాలా చైతన్యంతో ఉంటారు. కాని భౌతికంగా త్వరగా అలసిపోతారు. మీరు బంధవిముక్తులైనప్పుడు భౌతికంగా చైతన్యంతో ఉంటారు. కాని మానసికంగా నిశ్శబ్దంగా ఉంటారు.
చూడండి, మీ శరీరంలో 33% సత్త్వం (జడత్వం నిశ్శబ్దం) అంటే స్వచ్ఛమైన నిశ్శబ్దం ఉంటుంది. 33% రజస్సు అంటే అసహనం ఉంటుంది. మిగిలిన 33% తమస్సు ఉంటుంది. తమస్సు అంటే గాఢనిద్ర, సోమరితనం. మీరు బంధవిముక్తులు కండి. అప్పుడు మీలోని 33% సోమరితనం త్వరగా మాయం అవుతుంది. కొద్ది రోజులలోనే అది మీ వ్యవస్థ నుంచి మాయం అవుతుంది. అప్పుడు మీ అంతరంగంలోని మేధస్సుతో పనిచేయగలరు. అప్పుడు మీరు ఆశ, భయం అనే వాటితో మీ జీవితాన్ని గడపనవసరం లేదు.
మిమ్మల్ని పూర్తిగా ఆలోచించటం మానమని నేను చెప్పటం లేదు. నేను కేవలం బంధాలు పెట్టనప్పుడు మీ ఆలోచనలు అప్రయత్నంగా వస్తాయి అని చెబుతున్నాను. బంధవిముక్తులుగా ఉన్నప్పుడు ప్రారంభంలో అసలు ఆలోచనలు లేవు అనిపిస్తుంది. ఆ తరువాత అవసరమైనప్పుడు మీరు ఆలోచించగలరని, ఆలోచనల్ని కలపగలమని తెలుసుకుంటారు. ఆలోచనలు అవసరం లేదు అనిపించగానే మీ మనస్సు బంధవిముక్తమవుతుంది. అప్పుడు మీ మనస్సుని ఒక పనిముట్టులా వాడవచ్చు.
అప్పుడు మనం స్వచ్ఛమైన ఉత్సాహంలో జీవించవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే మనకి నమ్మకం ఉండదు. ఉత్సాహంతో జీవించగలం అనే ధైర్యాన్ని మనకి ఇవ్వరు. కొన్నిసార్లు మీరు ఏ కారణం లేకుండా ఉత్సాహంతో ఉరకలువేస్తూ ఉంటారు. కారణం లేకుండా మేధస్సుని నలుదిశలా వెదజల్లుతూ ఉంటారు. దానినే ప్రోత్సాహం, ఉత్సాహం, అంటాను. అది కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు మాత్రమే ఉండవచ్చు. కాని మీరు ఆ విషయాన్ని తెలుసుకోగలగాలి. అదే జీవనసరళి అని తెలుసుకోవాలి. మీరు బంధవిముక్తులుగా ఉంటే మీలో ఆ ఉత్సాహం నిరంతరం పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. బంధవిముక్తి మీలో మేధస్సుని ప్రకాశింపచేస్తుంది. అది అంతరంగశక్తిని కలిగిస్తుంది. అదే ఉత్సాహం, అదే బంధవిముక్తి.
మీ జీవితాన్ని నడపటానికి ‘మీరు’ అవసరమా?
ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి. మనకి అప్రయత్నంగా పని చేసే మేధస్సు ఉంటుంది. అదే మన రోజువారీ జీవితంలోని బాధ్యతలు చూసుకుంటుంది. అది జీవితాన్ని నడపటమే కాదు జీవితాన్ని నిర్వహిస్తుంది, అభివృద్ధి చేస్తుంది. విస్తృతం చేస్తుంది కూడా. కాని సమాజం మీ చిన్నతనం నుండి మిమ్మల్ని నిబంధనలలో ఉంచుతుంది. మీరు ప్లాన్ చేయకుండా, భయం, ఆశ లేకుండా అప్రయత్నంగా బ్రతకలేరు అని నేర్పిస్తుంది. మీ ఆత్మగౌరవాన్ని మీ నుంచి తీసేస్తుంది. అందుకే నిరంతరం మీరు ఆశని, భయాన్ని మీలో నింపుకుంటూ ఉంటారు. మీరు బ్రతకటానికి భయాన్ని, ఆశని, ఇంధనంగా వాడుకుంటారు.
స్పష్టంగా తెలుసుకోండి, భయం, ఆశలతో మీరు జీవితాన్ని నడపలేరు. మీరు భయం, ఆశలతో జీవితాన్ని ముందుకి నడిపితే మీరు నిరంతరం విసుగుని, అసహనాన్ని మోస్తూ ఉంటారు. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయేవరకూ చికాకుతో ఉంటారు. ఎవరి మీదైనా విరుచుకుపడే అవకాశం కోసం చూస్తూ ఉంటారు. ఒక చిన్న కారణం చాలు ఎదుటివారి మీదికి విరుచుకుపడిపోతారు. ఎదుటివారు తప్పు చేయనవసరం లేదు, కేవలం మీ ముందుకి వస్తే చాలు, మీలో అసహనం ఉప్పెత్తున లేస్తుంది. ఇదంతా కూడా జీవితాన్ని ఆశ, కోపాలతో ముందుకు నడపటం వల్ల కలిగిన శ్రమ వల్ల మాత్రమే. మీరు వీటి నుంచి విరామంగా ఉండగలిగితే విశ్వ మేధస్సు మీ జీవితాన్ని అందంగా ముందుకు తీసుకువెళ్తుంది. మీ పనులన్నీ విశ్వశక్తి సహాయంతో అద్భుతంగా పూర్తి అవుతాయి.
చేసేది నేను కాదు - ఒక పద్ధతి
అష్టావక్రుడు ఈ విధంగా చెబుతారు.
అన్నీ చేసేది నేనే అన్న నల్లత్రాచు పాము అనే అహంకారంతో కాటు వేయబడ్డారు. 'నేను కాదు అన్నీ చేసేది' అనే విశ్వాసంతో ఉన్న అమృతాన్ని తాగి ఆనందంగా ఉండండి. అష్టావక్రుడు ఈ పద్ధతిని జనకమహారాజుకి బోధిస్తాడు. ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు నేను కాదు చేసేది అనే విషయం మీద నమ్మకాన్ని ఉంచగానే, ఆ భావన రాగానే మీకు స్వేచ్ఛ (ముక్తి) రాదు. ఈ పద్ధతి మీకు స్వేచ్ఛని ఇవ్వదు. అది మీరు అలసిపోయేలా చేస్తుంది. మీరు నిరంతరం నేను కాదు చేసేది అనే విషయాన్ని గుర్తుంచుకోలేరు, ఈ విషయాన్ని నేను కాదు చేసేది అనే భావనని నిరంతరం గుర్తుంచుకోలేకపోతున్నాను అనే నిరాశలో మీరు మీ మనస్సుని వదిలేస్తారు. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయో నేను కాదు చేసేది అన్న భావం నిజమవుతుంది. ఇక్కడ చెప్పిన పద్ధతి ఇదే.
బంధవిముక్తి - ఆత్మప్రక్షాళనాక్రమపద్ధతి
బంధ విముక్తి అనే దాన్ని సులభంగా అర్థం చేసుకునే పద్ధతి. ఎప్పుడైతే పాత ఆలోచనలకి మీరు అర్థాలని ఇవ్వటం ప్రారంభిస్తారో వెంటనే వాటి నుంచి బయటికి వచ్చేయండి. లేదా పాత ఆలోచనలని ఒకదానికొకటి దానికి లింకులు ఏర్పరుస్తారో, అది మిమ్మల్ని పట్యించుకునేలా చేయండి. మీ ఆలోచననీ సృష్టించవద్దు, పోషించవద్దు, అణిచేయవద్దు. ఎప్పుడైతే మీరు ఈ మూడూ చేయగలుగుతారో మీరు పరమహంస అవుతారు.
బంధాలు ఏర్పరచకపోవటం అంటే ఆత్మశుద్ధి కార్యక్రమం. ఆత్మప్రక్షాళనా కార్యక్రమం. ఏదైనా సరే మీకు స్వేచ్ఛని ఇచ్చే ఏ పద్ధతైనా సరే మీరు సూక్ష్మస్థాయికి వెళ్ళగానే అది కూడా సూక్ష్మంగా అయిపోవాలి. ఇది అటువంటి పద్ధతి. ఏదైతే సూక్ష్మం కాదో అది పెద్దగా కనిపిస్తుంది. ఏ పద్ధతి అయితే తనని తాను నాశనం చేసుకోదో, తనంతట తాను మిమ్మల్ని వదిలిపోదో అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. బంధవిముక్తి విషయంలో ఒక చక్కని విశేషం ఏమిటి అంటే మీరు సూక్ష్మంగా అయ్యేకొద్దీ అది మరీ సూక్ష్మంగా అవుతుంది. చివరికి అది కరిగిపోతుంది.
ధ్యానపద్ధతులు
శ్వాస ద్వారా బంధవిముక్తులవటం : మన శరీరంలో నిరంతరం జరిగే శ్వాసతో బంధవిముక్తి ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉన్నదో చూద్దాం.
లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాసలకి మధ్య శూన్యప్రదేశ్ ఉంటుంది. లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాసలో మీ గుర్తింపు ఉంటుంది. మీరు శ్వాస పైన ఏకాగ్రత నిలిపితే వాటిని ఒకదానితో ఒకటిగా కలిపి బంధాలు ఏర్పరచవచ్చు. కాని రెండు శ్వాసల మధ్య ఉన్న శూన్యప్రదేశంలో మీ గుర్తింపు ఉండదు. అప్పుడు ఖాళీని కలపలేరు. అందుకే ఆ శూన్యం మీది నుంచి దూకేస్తారు.
శ్వాససమయం, శూన్యసమయం కంటే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే శ్వాస తీసుకునే సమయంలో మీలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీ గుర్తింపుకి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అందుకే శ్వాసించేసమయం శూన్యం కంటే ఎక్కువ అనిపిస్తుంది. నిజానికి అది సరి కాదు. ఇది మీమనస్సు ఆడే ఆట.
శూన్యప్రదేశం
బయటికి వెళ్ళే శ్వాస లోపలికి వెళ్ళే శ్వాస శూన్యప్రదేశం.
ధ్యానానికి సూచనలు : ఇది సూచనలతో ఉన్న ధ్యానం. ఒక్కసారి మీరు బంధవిముక్తి అనుభవాన్ని పొందితే మీరు ఈ పద్ధతిని సాధన చేయనవసరం లేదు. ఆ అనుభవాన్ని గుర్తుంచుకోండి చాలు. అప్పుడు మీరు ఆ ప్రదేశంలో ఉండగలరు. ప్రారంభంలో మాత్రం మీరు రిలాక్స్ కాగలగాలి. వేలాడే పక్షి ఎగిరిపోయిన విధంగా మీరు విముక్తులు కాగలిగితే, మీరు ఏ విషయాన్నీ పట్టించుకోనవసరం లేదు. కళ్ళు మూసుకొని, నిటారుగా కూర్చోండి. ముందుగా మీరు శ్వాసని లోతుగా తీసుకోండి.
తరువాత లోపలికి తీసుకునే శ్వాసని మాత్రం గమనించండి. బయటికి వెళ్ళే శ్వాసని పట్టించుకోవద్దు. కేవలం లోపలికి వెళ్ళే శ్వాసనే మాత్రం గమనించండి. కేవలం చూడండి. లోపలికి వెళ్ళే శ్వాసనే జాగ్రత్తగా గమనించండి.
(ఐదు నిమిషాలు గడిచాక)
ఇప్పుడు నెమ్మదిగా బయటికి వెళ్ళే శ్వాసని గమనించండి. లోపలికి వెళ్ళే శ్వాసని మరిచిపోండి. కేవలం బయటికి వెళ్ళే శ్వాసనే గమనించండి.
(ఐదు నిమిషాల తరువాత) ఇప్పుడు చాలా నెమ్మదిగా రెండు శ్వాసల మధ్య ఉన్న రెండు శూన్యప్రదేశ్లను గమనించండి. లోపలికి వెళ్ళే శ్వాస బయటికి వెళ్ళే శ్వాసగా తిరిగే మలుపులో, అదే విధంగా బయటికి వెళ్ళే శ్వాస లోనికి తిరిగే మలుపుని గమనించండి. కేవలం ఆ ఖాళీ ప్రదేశాలని గమనించండి. కేవలం ఆ శూన్యప్రదేశాలనే గమనించండి.
(ఐదు నిముషాల తరువాత)
ఇప్పుడు లోపలికి వచ్చే శ్వాసని, అక్కడి శూన్యప్రదేశాన్ని, బయటికి వెళ్ళే శ్వాసని అక్కడి శూన్యప్రదేశాన్ని గమనించండి.
ఆలోచనలకి లింకులు పెట్టవద్దు. వచ్చే ఆలోచనలకి ఎటువంటి బంధాలూ ఏర్పరచవద్దు. మీరు ఆలోచిస్తున్నాను అని కూడా అనుకోవద్దు. మీరు ఆలోచనల్ని కలిపినప్పుడే ఆ ఆలోచన వస్తుంది. ప్రతిదీ స్వతంత్రమైంది, కాబట్టి వాటిని కలపవద్దు.
స్వతంత్రమైన ఆలోచన అనే గాలిబుడగని పైకి వచ్చిపోనీయండి. స్వతంత్రమైన ఆలోచనలు వస్తే కానీయండి పోనీయండి. వాటిని కలిపి ఆలోచిస్తున్నాను అని అనుకోవద్దు. బంధాలు చేయకుండా వాటి నుంచి బయటికి రండి. ఆలోచనలు వస్తే కానీయండి. పోతే పోనీయండి. మీరు ఆలోచిస్తున్నాను అన్నది అబద్ధం. మనస్సు నుంచి బయటికి రండి. స్వేచ్ఛని పొందండి.
ఎక్కడైనా ఎప్పుడైనా బంధాల నుంచి విముక్తి పొందండి
మీరు కూర్చుని ఉన్నప్పుడు సహజంగానే ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే ఆలోచన రావటం గమనిస్తారో దానికి అర్థాన్ని ఇవ్వకండి. మీరు వాటిని గతంతో కలిపితేనే వాటిని అర్థాలని ఇస్తారు. వాటికి అర్థాన్ని ఇవ్వకుండా వాటినుంచి విముక్తి పొందండి. అలా చేసి ఏమవుతుందో చూడండి. మీరు ఆలోచన నుంచి బయటికి రావాలి వాటికి అర్థాన్ని ఇవ్వకూడదు అనుకోగానే కొన్ని సెకండ్లపాటు నిశ్శబ్దం ఉంటుంది. ఎప్పుడైతే ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తారో అది మరొక ఆలోచన అవుతుంది. మీరు దాని నుంచి కూడా బయటికి రండి. అప్పుడు మరలా కొన్ని సెకండ్లు ఖాళీ ఏర్పడుతుంది. అప్పుడు మరొక ఆలోచన వస్తుంది. నేను నిశ్శబ్దంగా ఉన్నాను అని లేదా నేను ఆలోచన నుంచి బయటికి వస్తున్నాను అని. ఆ ఆలోచన నుంచి కూడా బయటికి రండి. అప్పుడు నిశ్శబ్దం లేదా ఖాళీ సమయం పెరుగుతుంది. అదే ఈ పద్ధతి ఉద్దేశం.
సహజంగా మనస్సు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా తిరుగుతున్నది, అని అనుకోగానే దాని నుంచి బయటికి వచ్చేయండి. దీని గురించి ఎటువంటి అపరాధభావం అవసరం లేదు. దీని గురించి కంగారు పడవద్దు. గుర్తు రాగానే ఆ ఆలోచన నుంచి బయటికి వచ్చేయండి అంతే. ప్రారంభంలో ఇది ఒక పెద్ద విషయంలా ఉంటుంది. మీరు విముక్తి పొందాలి అని ఒక మంత్రంలా జపించాలి. కొంత సేపటికి అదిచాలా సూక్ష్మంగా అవుతుంది. బంధవిముక్తి, ఆలోచనలని లింకులు పెట్టకుండా ఉంటే...
ప్రతిక్షణం కొత్తగా ఉంటుంది.
ప్రతిక్షణం పారవశ్యంతో ఉంటారు.
ప్రతిక్షణం సంతోషంగా ఉంటారు.
ప్రతిక్షణం ఉత్సాహం ఉరకలేస్తుంది.
బంధవిముక్తి అనేది నిత్యోత్సాహానికి, నిత్యానందస్ఫురణకి ఆధారం, మూలం.
- మీరు తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడూ వచ్చిన ఆలోచనల మొత్తమే మీ జీవితం.
- సంతోషాల గొలుసు, బాధల గొలుసు అనేవి అసలు లేవు.
- మన జీవితంలో ప్రతి చిన్న సంఘటన స్వతంత్రమైనది.
- మీరు చేయవలసినది మీరు సహజంగా బంధాలు లేని స్వేచ్ఛాజీవి అని నమ్మాలి. మీరు నమ్మకపోయినా అది సత్యం.
- మన శరీరం నిరంతరం కొత్తగా తయారవుతూ తనకి తాను కొత్త శరీరాన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది.
- మీరు బంధాలు ఏర్పరచకుండా ఉంటే మీరు మీ శరీరాన్ని చికిత్స చేసుకోనిస్తారు.
- ఎప్పుడైతే మనం బంధాలు పెట్టకుండా, వాటి నుంచి విముక్తి అవుతామో, మన అంతరంగంలో చికిత్స ప్రారంభమై భౌతికంగా కూడా బాగుంటాము.
- మీరు నా జీవితం నిరాశాభయo అనే భావనని సృష్టించుకుంటారు. ఆ తరువాత దానితో పోరాడతారు.
- మీరు బంధవిముక్తులుగా ఉంటే భౌతికంగా చాలా చైతన్యంతో ఉంటారు. మానసికంగా నిశ్శబ్దంలో ఉంటారు.
కర్మచక్రాన్ని ఛేదించవచ్చు
జీవన్ముక్తి అంటే మీ విధిని అదృష్టాన్ని మీరు తయారుచేసుకోవటం.
ఎప్పుడైతే మన మానసికవ్యవస్థ ఆలోచనల గొలుసులని బాధ, సంతోషాలతో చేస్తుందని మనం ఆ విధంగా గొలుసు తయారుచేయకుండా ఉండవచ్చు అని తెలుసుకుంటామో, అప్పుడు నిజంగా మన మనస్సుని మనం చక్కగా ఉపయోగించగలం. అప్పుడు బుద్ధుడు చెప్పిన సంపూర్ణత్వంలో ఉండగలం. మనలోని ఆలోచనలు నిరంతరం మనని గతం నుంచి భవిష్యత్తుకి, భవిష్యత్తు నుంచి గతానికి తీసుకువెళుతుంటాయి. ఆలోచనలు మనని వర్తమానంలో ఉండనీయవు.
దీన్ని స్పష్టంగా అర్థంచేసుకోండి, మనం వర్తమానంలో (ఈ క్షణంలో) ఉండగలిగితే భయం, ఆశ లేకుండా సమస్య నుంచి బయటికి రావచ్చు. భయం, కోరిక అనేవి లేకుండా మనం పనులు చేయవచ్చు. ఎలా అని మీరు అడగవచ్చు, నాకు కోరిక లేకపోతే ఏ పనీ చేయాలనే ప్రోత్సాహం ఉండదు అనవచ్చు. అసలు మీకు ప్రోత్సాహం అవసరం లేదు. మీలో ఏ ప్రోత్సాహం శ్వాస తీసుకునేలా చేస్తుంది, ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. అది మీలోని మేధాశక్తి. మనం ఉన్నా లేకపోయినా మనం జీవించే విధంగా, అభివృద్ధి చెందే విధంగా చేస్తుంది. మనం మన వల్ల జీవించటం లేదు. మనం లేకపోయినా జీవించగలం.
ఎప్పుడైతే దేంతోనూ అనుబంధాన్ని పెంచుకోకుండా పని చేస్తామో, అప్పుడు ఆ పని ఫలితాలు మనని అంటవు. ఆ పనుల నుంచి మనం కర్మలని సృష్టించం.
కర్మ అంటే ఏమిటి?
ఈశావాస్య ఉపనిషత్తులో చాలా అందమైన శ్లోకం ఉన్నది.
ఓంపూర్ణమదః పూర్ణమిదమ్ పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే.
పూర్ణం నుంచి వచ్చినదే పూర్ణం. పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేస్తే అక్కడ మిగిలేది పూర్ణం.
మనం సహజంగా పూర్ణత్వాన్ని కోరుకుంటాం. సహజంగానే మనం ఏ పని చేసినా అందులో సంపూర్ణత్వాన్ని పొందాలి అని చూస్తాం.
అది తినటం, తాగటం, ఎగరటం, చదవటం, మాట్లాడటం, నిద్ర పోవటం లేదా ధ్యానం చేయటం, ఇలా ఏ పని చేసినా మన అంతరాత్మ దాన్ని పూర్తిగా అనుభవం చెందాలని, అందులో పూర్తిగా నిమగ్నమవ్వాలి అని చూస్తుంది. మనం చేస్తున్న ప్రతి పనిలో పూర్తి చేతనస్థితిలో నిమగ్నమవుతామా? మన జీవితంలో ప్రతి క్షణాన్ని మనం తెలుసుకునే విధంగా జీవిస్తున్నామా?
ఒక చిన్న కథ : ఒక వ్యక్తి ఒక టాక్సీలో ఎయిర్‌పోర్టుకి వెళుతుంటాడు. డ్రైవరు చాలా వేగంగా తీసుకువెళుతుంటాడు. మలుపుల దగ్గర, మూలల దగ్గర కూడా వేగం తగ్గించడు. ఆ వ్యక్తి భయంతో వణికిపోతుంటాడు.
అప్పుడు డ్రైవర్ వణికిపోతున్న ఆ వ్యక్తిని చూసి ‘నీవు నేను ఎలా చేస్తానో అలా చేయవచ్చు కదా! మలుపులు వచ్చినప్పుడు నేను ఎలా కళ్ళు మూసుకుంటానో నీవు అలా కళ్ళు మూసుకోవచ్చు కదా’ అంటాడు.
ఎప్పుడు మీరు పూర్తి తెలుసుకునే తత్వంలో ఉండరో అప్పుడు మీరు ఏ పనిలో ఉన్నా మీ అంతరాత్మ ఆ అనుభవంతో సంతృప్తి చెందదు. అసంతృప్తిగా, అసంపూర్ణంగా ఉన్న ఆ అనుభవం అంతరంగంలో ఉండి అది నిరంతరం ఆ పనిని తిరిగి మరింత తీవ్రంగా చేసి పరిపూర్ణతని సాధించమని అటు వైపు లాగుతూ ఉంటుంది. ఇదే కర్మ అంటే. మనలోని తీరని అనుభవాల రాశి మన అంతరంగంలో ఉండి వాటిని సంపూర్తిగా సాధించమని, అటు వైపు లాగుతూ ఉండేవి కర్మలు అంటే.
దేన్నైతే మనం తీవ్రంగా, లోతుగా చేస్తామో, ఏదైతే లోతైన అనుభవాన్ని ఇస్తుందో అది మీ వ్యవస్థని త్వరగా వదిలేస్తుంది. అది మీకు స్వేచ్ఛనిస్తుంది. ఏ అనుభవం అయితే మనం పూర్తిగా లోతుగా దాని లోనికి వెళ్ళమో, ఏదైతే సంపూర్ణమైన సంతృప్తినివ్వదో, ఏదైతే మన శక్తిని పూర్తిగా పొందదో, మన ఏకాగ్రతని, తెలుసుకునే తత్వాన్ని పొందదో అది మన అంతరంగంలో ఒక కర్మగా మిగిలిపోతుంది.
మన లోపల కర్మలు ఉన్నా, మనం సంపూర్ణమైన సంతృప్తితో ఉండే సంపూర్ణులం. కాబట్టి ఏ కర్మ అయినా సంపూర్తిగా సాధించలేకపోతే అది మన అంతరంగంలో ఎక్కువ కాలం విరామంగా ఉండలేదు. అది పరిపూర్ణత పొందడానికే ప్రయత్నిస్తుంది. అదే పనిని తిరిగి చేయమని పదే పదే మనని ఆ వైపు తోస్తుంది. ఏ కోరిక అయితే, ఏ అనుభవం అయితే మన లోపల పూర్తిగా సంతృప్తి చెందదో అది మన వ్యవస్థలో కర్మగా ఉండి ఆ పనిని చేయమని పదే పదే అటు వైపు మనని లాగుతుంది. ఆ అనుభవం పరిపూర్ణత పొందే వరకూ పదే పదే ఆ పనిని చేయమని ప్రోత్సహిస్తుంది.
మనం లోతైన అజ్ఞానంతో, సంతృప్తి లేకుండా, ఎటువంటి స్పష్టతా లేకుండా ఆలోచిస్తాం, మాట్లాడతాం, పనులు చేస్తాం. ఈ ఆలోచనలు, మాటలు పనులు కర్మ అనే ఒక బరువైన లగేజిని మనలో తయారుచేస్తాయి. ఎందుకంటే అటువంటి మాటలు, పనులు మనకి తృప్తినివ్వవు కాబట్టి. ఎప్పుడైతే అవి సంతృప్తినివ్వవో వాటి వైపు పదే పదే మనని తోస్తుంటాయి. ఆ కర్మల్ని ఏదో ఒక విధంగా సాధించేలా చేస్తాయి. మన ఆలోచనలు, మాటలు, పనులే మన కర్మలుగా మారుతాయి. అవి పరిపూర్ణ అనుభవం పొందేవరకూ ఏదో ఒక విధంగా ఆ పనిని చేసే విధంగా చేస్తాయి.
వర్తమానం మన పూర్తి గతం
ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఈ పుస్తకం చదువుతున్నారంటే గతంలో మీరు చేసిన నిర్ణయాల ఫలితమే. షాపులో ఉన్న పుస్తకాన్ని చూడాలి అనుకున్నారు, దాన్ని కొనాలి అనుకున్నారు, కూర్చుని ఈ పుస్తకాన్ని చదవాలి అని అనుకున్నారు. ఈ నిర్ణయాలు అన్నీ కలిపి ఇప్పుడు మీరు కూర్చొని ఈ పుస్తకాన్ని చదవగలిగేట్టు చేశాయి.
గతంలోని అన్ని నిర్ణయాల మొత్తం మీ వర్తమానం. అదే విషయాన్ని ఇప్పటికి వర్తమానానికి అన్వయిస్తే, ఈ వర్తమానం మీ భవిష్యత్తు అవుతుంది.
కర్మసిద్ధాంత సారాంశం ఇదే. మీ గతం మొత్తం మీ వర్తమానం. మీ వర్తమానమే మీ భవిష్యత్తు. ఇక్కడ సమస్య ఏమిటంటే మనం చాలా నిర్ణయాల్ని అచేతనస్థితిలో చేస్తాం. అచేతనస్థితిలో వేల కొద్దీ నిర్ణయాల్ని చేస్తాం. ఈ కారణం వల్లనే మనం కారణానికి ఫలిటానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోలేకపోతున్నాం.
మీ ఆలోచనావ్యవస్థ లోనికి చాలా ఎక్కువగా తెలుసుకునే తత్వాన్ని, వివేకాన్ని ప్రవేశపెట్టండి. మీ నిర్ణయాల వ్యవస్థ లోనికి ఎక్కువ తెలుసుకునే తత్వాన్ని, ఎక్కువ చేతనస్థితిని ప్రవేశపెట్టండి.
ఏ క్షణంలోనైనా మీ భవిష్యత్తు నిబంధనలతో ముందుగా నిర్ణయించబడింది. ఆ సమయం వరకు భవిష్యత్తు ఇప్పటి సంఘటనలు ఆధారంగా కచ్చితమైనదే. అదే నిర్ణయించబడిన భవిష్యత్తు అయితే అది నిబంధనలతో ఉంటుంది. అయితే దీన్ని మార్చగలది, మార్చేది, ఒకటి ఉంది, అదే చేతనస్థితి.
చిన్నకథ : అన్నదమ్ములు ఇద్దరు ఒక యోగి దగ్గరకి వెళ్ళి తమ భవిష్యత్తు చెప్పమని గౌరవంతో ప్రార్థేయపడతారు. యోగి వారితో మీరు భవిష్యత్తు తెలుసుకోవటం అంత మంచిది కాదు, అయినా అది ఎప్పుడైనా మారవచ్చు అంటాడు. కానీ వారు తమ భవిష్యత్తు చెప్పమని పట్టుపడతారు. ఆ యోగి అన్న వైపు చూసి, ఒక సంవత్సరంలో నీవు రాజవుతావు అంటాడు. తమ్ముడి వైపు చూసి సంవత్సరంలో నీవు ఒక హంతకుడి చేతిలో మరణిస్తావు అని చెబుతాడు.
అన్నదమ్ములు ఇంటికి బయలుదేరతారు. అన్న చాలా సంతోషంగా ఉంటాడు. తమ్ముడు చాలా నిరాశలో ఉంటాడు.
అన్న తాను రాజైనట్టు ఊహల్లో ఉంటాడు. తమ్ముడు తాను జీవించే ఈ కొద్ది కాలం బాగా ఉండాలి అని చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తిరుగుతూ ఆధ్యాత్మికసేవ చేస్తూ నిరాశ నుంచి బయటకి వస్తాడు.
ఆ విధంగా పదకొండు నెలల సమయం గడచిపోతుంది. ఒకరోజు అన్న, తమ్ముడిని తీసుకొని తాను రాజు అయితే తాను కట్టుకోబోయే రాజభవనానికి తగిన స్థలం చూడటానికి వెళతాడు. వాళ్ళు నడిచివెళుతుండగా వారికి సగం భూమిలో పూడ్చిన కుండ కనిపిస్తుంది. దాన్ని తవ్వి బయటికి తీస్తే దాని నిండా బంగారు నాణాలు ఉంటాయి.
అన్నకి అత్యంత ఉత్సాహం కలుగుతుంది. ఈ ఐశ్వర్యం నా కోసమే. దీనితో రాజభవనాన్ని కట్టుకుంటాను. నా రాజ్యాన్ని స్థాపిస్తాను అని అరుస్తాడు. అప్పుడే ఒక దొంగ వారి మీదికి దూకి అన్నని గట్టిగా కొట్టి ఆ కుండని లాక్కోబోతాడు. తమ్ముడు ఆ దొంగ మీదికి దూకి అన్నని రక్షిస్తాడు. దొంగ తమ్ముడిని కత్తితో గాయం చేసి అక్కడి నుంచి పారిపోతాడు.
అన్నకి తమ్ముడి పట్ల చాలా కృతజ్ఞత కలుగుతుంది. కుండలోని సగం బంగారం తమ్ముడికి ఇస్తాడు. తమ్ముడు తాను ఎక్కువ కాలం ఉండనని, తనకి అవసరం లేదని బంగారాన్ని తీసుకోడు. అన్న ఆ బంగారంతో విలాసాలలో మునిగిపోతాడు.
ఆ విధంగా సంవత్సరం గడిచిపోతుంది. అన్న రాజు అయ్యే సూచనలు ఎక్కడా కనిపించవు. తమ్ముడు ఆరోగ్యంతో ఉంటాడు. వారిద్దరూ యోగి దగ్గరకి వెళ్ళి ఆయన చెప్పిన విషయం ఎందుకు తప్పు అయ్యింది అని అడుగుతారు. యోగి ధ్యానంలోకి వెళ్ళి 'నేను చెప్పాను కదా మీ భవిష్యత్తు మారవచ్చు అని' అంటాడు.
యోగి అన్న వైపు చూసి, 'నీ బాధ్యతారహితమైన పనుల వల్ల నీ భవిష్యత్తు మారింది. రాజు కావలసిన నీకు కుండ బంగారంతో అది సరిపెట్టింది' అంటాడు.
తమ్ముడి వైపు చూసి, 'నీ ఆధ్యాత్మిక జీవనసరళి వల్ల సర్వాంతర్యామి నీ మరణాన్ని హంతకుడి చేతిలో చిన్న గాయంగా మార్చేసాడు.' అంటాడు.
అర్థం చేసుకోండి, భవిష్యత్తు అనేది ఒక రాతి మీద చెక్కి ఉండదు. అది మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మీరు ఏ విధంగా స్పందిస్తారో దాని ఆధారంగా ఉంటుంది. మీలోని తెలుసుకునే తత్త్వం మీకు కావలసిన వివేకాన్ని ఇస్తుంది. అది మీ జీవితంలో జరిగే సంఘటనల్ని మార్చే ధైర్యాన్ని ఇస్తుంది.
కర్మ, టి.పి.ఎస్
మీకు మీ గతం పూర్తిగా తెలియనప్పుడు మీరు అదే గతంలోని విషయాలనే తిరిగి చేస్తారు. మీలో సెకండ్‌కి వచ్చే ఆలోచనల సంఖ్య (థాట్స్ పర్ సెకండ్, టి.పి.ఎస్.) బాగా తగ్గినప్పుడు గతాన్ని జరిగినదాన్ని జరిగినట్టు తెలుసుకుంటారు. అప్పుడు మీరు దాన్నే తిరిగి చేయరు. అప్పుడు మీరు కర్మముక్తులు అవుతారు. అంటే కర్మ నుంచి స్వేచ్ఛని పొందుతారు. ప్రస్తుతం మీరు కర్మబంధీలు. ఎందుకంటే మీ గతాన్ని మీరు పూర్తిగా జీవించలేదు కాబట్టి.
ఉదాహరణకి చిన్నతనం రోజులు బంగారు రోజుల్లా అనిపిస్తాయి. గతం ఎప్పుడూ బంగారం అనుకుంటారు. ఆ తరువాత కాలేజి రోజులు చాలా బాగున్నాయి అనిపిస్తుంది. కాని మీరు నిజంగా కాలేజీలో ఉన్నప్పుడు మీరు అసలు అలా అనుకోరు, ఎందుకు? ఎందుకంటే మీరు అప్పుడు పడిన బాధ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి అప్పుడు గతంతో ఇప్పటి స్థితిని పోల్చిచూస్తే గతమే బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకే గతం చాలా సంతోషంగా ఉంది అంటారు. మీరు ఆ సమయంలో జీవించినప్పుడు మీకు ఆ విధంగా అనిపించిందా? లేదు.
మీరు ఈ క్షణంలో ఆలోచనలు సున్నా స్థాయిలో ఉండే స్థితికి వచ్చి అక్కడ 11 క్షణాలు ఉండగలిగితే, మీరు కాలం అనే గొలుసు గుండా వెళ్ళగలుగుతారు. అదే సున్నా ఆలోచనల స్థాయిలో 21 క్షణాలు ఉండగలిగితే, మీరు కాలం అనే గొలుసుగుండా వెళ్ళి మీ భవిష్యత్తుని మార్చగలరు. అది మీ చేతుల్లోనే ఉన్నది.
ధ్యానపద్ధతులన్నీ మీ టి.పి.ఎస్. ని తగ్గించే పద్ధతులే. అప్పుడు మీరు కాలగమనంలోకి చొచ్చుకుపోగలరు.
క్షణం
క్షణo అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. క్షణం అనే మాటికి సమానమైన పదం ఇంగ్లీషులో లేదు. క్షణం అంటే ఏమిటో వివరిస్తాను. క్షణం అంటే కాలాన్ని కొలిచేది. అయితే మీరు అనుకున్నట్టు నిమిషంలో ఉండే సెకండ్ కాదు.
రెండు ఆలోచనల మధ్య ఉండే ఖాళీనే క్షణం అంటే. మనందరికీ కాలం అనగానే ఉన్నది ఉన్నట్టుగా చూడటమే తెలుసు కాని కాలం పోలికతో ఉంటుంది. ప్రతి మనిషిలో ఆలోచనలు వచ్చే వేగం చాలా వేరుగా ఉంటుంది. కాబట్టి క్షణం మనిషి మనిషికీ మారుతూ ఉంటుంది.
ఏ వ్యక్తి అయితే అసహనంతో ఉంటాడో, అతనికి ఒక సెకండ్‌కి చాలా ఆలోచనలు వస్తాయి. ఆ వ్యక్తి క్షణంలో చాలా చిన్నది. ఎందుకంటే అతని రెండు ఆలోచనల మధ్య ఖాళీ చాలా చిన్నది. ఏ వ్యక్తి అయితే విరామంగా, శాంతంగా ధ్యానిలా కూర్చుని ఉంటాడో అతని ఆలోచనల సంఖ్య తక్కువగా ఉంటుంది. అతని క్షణం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రెండు ఆలోచనల మధ్య ఖాళీ ఎక్కువగా ఉంటుంది.
కర్మ-చేతన స్థితిలో చేసే ఎంపిక మొత్తం
మీ జీవితం అంటే చేతనస్థితిలో నిరంతరం మీరు చేసే నిర్ణయాల మొత్తం. మీరు కావాలన్నా, వద్దన్నా, ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మీరు నిరంతరం ఎంపిక చేస్తూనే ఉంటారు. ఎవరో మీకు ఎంపిక చేయరు. మీరే చేస్తారు. చిన్నకథ: ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తి బాస్ దగ్గరికి వెళ్లి ‘నా భార్య జీతం పెంచమని మిమ్మల్ని అడగమన్నది,’ అంటాడు. బాసు, ‘అలాగా! నేను నా భార్యని అడిగి నీకు జీతం పెంచాలా వద్దా నిర్ణయిస్తాను’ అని జవాబు ఇస్తాడు.
అర్థంచేసుకోండి, నిరంతరం ఎంపికలు చేసేది మీరే. మీ నిర్ణయాలు మీరు చేస్తారు. మీరు అనుకుంటారు ఎవరో నిర్ణయించారు అని కాని నిర్ణయించేది మీరే.
ఈ సత్యం అర్థమయ్యేలా మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి. మీరు గాయపడాలి, బాధపడాలి అని నిర్ణయించుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే సంతోషపడాలి అని నిర్ణయించుకుంటారు. మీకు ఉండే అలవాటుతో మీకు తెలియకుండా మీ అచేతనస్థితిలో నిర్ణయాలు చేస్తారు. ఎవరో చేసే నిర్ణయం కాదు. అది మీరు చేసే ఎంపిక. ఎవరో మీ నిర్ణయాల్ని ప్రభావితం చేశారు అని ఆలోచించటానికి అలవాటు పడిపోయారు. కాబట్టి మీరు ఎంపిక చేస్తున్నారు అన్న విషయాన్ని మరిచిపోయారు. ఎవరైనా విమర్శిస్తే బాధపడాలి అనేది మీ ఎంపిక ఎప్పుడైనా ఎవరైనా మెచ్చుకుంటే సంతోషపడటం మీ నిర్ణయం. ఇది ఎవరో చేసే ఎంపిక కాదు. అది మీ నిర్ణయం. మీరు ఏదో ఒకటి నిర్ణయించవచ్చు. ఎవరైనా విమర్శిస్తే బాధపడనవసరం లేదు అని మీరు నిర్ణయించుకోవచ్చు. బాధపడాలా, వద్దో అన్నది మీ నిర్ణయం.
ప్రతి నిమిషం మీరు చేతనస్థితిలో చేసే ఎంపికల మొత్తం కలిసి మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. నిర్ణయం మీరు చేయకుండా, సంఘటనలు నిర్ణయించే విధంగా చేస్తే మీరు మీలో కొంత భాగం చచ్చిపడిపోయినట్టు భావిస్తారు. మన జీవితాలు ప్రస్తుతం పక్షవాతంతో ఉన్నాయి. ఎప్పుడైతే మీ జీవితం బయటి సంఘటనల ఆధారంగా కాకుండా, నిర్ణయాలని మీ మీద బలవంతంగా మోపకుండా జీవిస్తారో, మీరు నిజంగా జీవించటానికి నిర్ణయించారు అని అర్థం.
జీవితంలో ప్రతీదీ మీ ఎంపిక, మీ నిర్ణయం
మనం రోజుకి కొన్ని వేల నిర్ణయాలు చేస్తాం. అది ఆలోచించటం, మాట్లాడటం లేదా వంట చేయటం ఏదైనా సరే, చేయాలి కాబట్టి చేస్తాం.
మీరు భోజనం చేసేటప్పుడు పూర్తిగా అందులోనే నిమగ్నమవుతారా? భోజనం చేసే సమయంలో సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలో ప్లాను వేస్తారు లేదా పని ఎలా బాగా చేయాలి అని ఆలోచిస్తారు. ఆహారం లోపలికి వెళుతూ ఉంటుంది. కాని మీరు ఆ రుచిని పూర్తిగా, సంతోషంగా అనుభవించరు. మీరు తెలుసుకునే తత్వంతో భోజనం చేస్తే అప్పుడు ఏ రకమైన ఆహారం ఎంత తీసుకోవాలో మీకు తెలుస్తుంది.
మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని మీరు జీవితంలో ప్రతి దాన్నీ నిర్ణయిస్తారు. మీ జీవితంలో వేరే ఎవరో నిర్ణయాలు చేయరు. మీరే ఎంపిక చేసుకుంటారు. నిరంతరం ప్రతిదీ మీ ఎంపిక, మీ నిర్ణయం మీరు అనుకుంటారు వేరే ఎవరో మీ జీవితాన్ని నిర్ణయిస్తారు అని, అది సరి కాదు! అన్నీ ఎంపిక చేసుకునేది మీరే.
ఎవరైనా విమర్శిస్తే బాధపడాలి పొగిడితే సంతోషపడాలని మీరు అచేతనస్థితిలో స్పందించటం వల్ల ఆ విధంగా అలవాటు పడిపోయారు. ఇది వేరే ఎవరైనా నిర్ణయించారా? లేదు. ఇది పూర్తిగా మీ ఎంపిక. అది అలవాటుగా మారింది, కాబట్టి మీరే నిర్ణయిస్తారు, అనేది మరిచిపోయారు.
చిన్నకథ : ఒక వ్యక్తిని శాస్త్రవేత్త భోజనానికి ఆహ్వానిస్తాడు. ఆ వ్యక్తి టేబుల్ దగ్గర కూర్చుని గోడకి ఉన్న గుర్రం నాడాని గమనిస్తాడు. అది అదృష్టాన్ని తెస్తుంది అని ఒక నమ్మకం. ఆ వ్యక్తి నిర్ఘాంతపోయి శాస్త్రజ్ఞుడితో, సార్! నేను నమ్మలేకపోతున్నాను. మీరు శాస్త్రజ్ఞుడై ఉండి ఇలాంటివి ఎలా నమ్ముతారు? గుర్రం నాడా అదృష్టం ఇస్తుంది అని ఎలా అనుకున్నారు? అని అంటాడు.
అప్పుడు ఆ శాస్త్రవేత్త ‘అబ్బే లేదు! ఇలాంటి మూఢనమ్మకాలు నాకు లేవు. ఇది ఇచ్చిన వ్యక్తి నేను నమ్మినా నమ్మకపోయినా ఇది అదృష్టాన్ని తెస్తుంది అని చెప్పాడు’ అని జవాబు ఇస్తాడు.
ఎలా స్పందించాలో మీరు నిర్ణయిస్తారు. అయితే ఎవరి మూలానో మీరు నిర్ణయాలు చేసాను అని నమ్మి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. వాళ్ళు ఇష్టపడినట్టు మీతో పనులు చేయిస్తున్నారు అనుకుంటారు.
అర్థం చేసుకోండి, మీరు వేరుగా స్పందించవచ్చు అని మీరు నిర్ణయం చేయవచ్చు. ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే బాధపడకూడదు అని మీరు నిర్ణయించుకోవచ్చు. విరామంగా, నిశ్చలంగా ఉండాలి అని నిర్ణయించుకోవచ్చు. బాధపడటం అనేది మీ నిర్ణయం.
మనం ఎప్పుడూ మనకి ప్రతికూలఫలితాలు వస్తాయి అని అనుకుంటాం. ఇలా ఎందుకు అనుకుంటామంటే కారణానికి, ఫలితానికి మధ్య సంబంధం తెలియదు కాబట్టి. ఆ విధంగా తెలియకుండానే మన జీవితంలో చాలా విషయాలు జరుగుతుంటాయి. అయితే మనం వాటికి కారణం మనం అని తెలియకుండా గడిపేస్తాం. అచేతనస్థితిలో జీవిస్తూ అవి అలా జరిగేలా చేస్తాం.చివరికి అనేక కర్మల్ని పోగుచేసుకుంటాం.
వాసన, సంస్కారం, కర్మ
సంస్కృతంలో వీటికి సంబంధించి మూడు విషయాలు ఉంటాయి. అవి వాసన, సంస్కారం, కర్మ.
కర్మచక్రాన్ని ఛేదించవచ్చు
వాసన : వాసన అంటే కోరిక తాలూకు విత్తనం, ఉదాహరణకి, మీరు నడిచి వెళుతూ షాపులో పెట్టిన మెరిసే నెక్లెస్ చూసారనుకోండి, దాన్ని పొందాలి అనే కోరిక కలుగుతుంది. ఇది వాసన అంటే.
సంస్కారం : వాసన అనే విత్తనం మొలకెత్తితే వచ్చే మొక్క సంస్కారం. ఆ నెక్లెస్‌ని మరీ మరీ చూస్తూ ఉంటే దాన్ని పొందాలి అనే కోరిక బలమవుతుంది. ఎప్పుడైతే దాన్ని పొందాలి అనే కోరికబలమవుతుందో, అది మొక్కకి నీరు, ఎరువులూ అవుతుంది. ఇది వాసన అనే విత్తనానికి బలాన్ని ఇస్తుంది.
అంతరంగంలో జరిగే కల్మషాన్నే నేను సంస్కారం అంటాను. అవే లోతుగా నాటబడే జ్ఞాపకాలు. అవి జ్ఞాపకాలుగా మీ అంతరంగంలో స్థిరపడి పదే పదే ఆ అనుభవం కోసం మిమ్మల్ని అటుగా లాగుతూ ఉంటాయి. అవి మీరు అదే పనిని తిరిగి చేసేలా పదే పదే లాగుతూ ఉంటాయి. అవే ఆలోచనలు కలిగేలా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అదే పని చేయమని అటు లాగుతూ ఉంటాయి. ఈ జ్ఞాపకాలనే నేను సంస్కారాలు అంటాను.
ఏ సంస్కారమైతే మీ చేతనస్థితిలో కాని అచేతనస్థితిలో కాని పని చేస్తుందో అదే మీరు సంపూర్ణత్వాన్ని సాధించటానికి ఉండే అడ్డంకి. సంస్కారాలలో మంచివిచెడువి అని ఉండవు. ఏ సంస్కారం మంచిది కాదు. సంస్కారాలతో అంతరంగం నిండిపోయి ఉంటే అది నరకం. సంస్కారాలు లేని అంతరంగం స్వర్గం. సంస్కారాల్ని మంచిచెడులుగా విభజించవద్దు.
సహజసిద్ధంగా సంస్కారం అంటేనే వ్యతిరేకమైంది. అది కుంగుబాటుతనంతో ఉంటుంది. సంస్కారాలతో ఏ పని చేసినా అది శూన్యంగా ఉంటుంది, విసుగుపుడుతుంది. స్వచ్ఛమైన అంతరంగం నుంచి లోతుగా అర్థం చేసుకొని మీరు ఏంచేసినా అది మీకు నాణ్యతని, విలువని కలుపుతుంది. సంస్కారాల నుంచి చేసే పని మిమ్మల్ని బందీలని చేస్తుంది.
చిన్నతనం నుంచి రకరకాల సంస్కారాలని రకరకాల మార్గాలలో మనం పోగుచేసుకుంటాం. వాటిని పోగుచేసుకొని మరింతగా పెంచుతాం. అవి వాటంతట అవే ఏ పనీ చేయకపోయినా పెరిగిపోతాయి.
సంస్కారాలు రకరకాల మార్గాల ద్వారా బలపడుతుంటాయి. కొన్ని సంస్కారాలు కొన్ని పనుల ద్వారా మాత్రమే బలపడతాయి. ఆ పని తిరిగి చేసినప్పుడు ఆయా సంస్కారాలకి శక్తి వస్తుంది. కొన్ని సంస్కారాలు కేవలం బయటి ప్రపంచం నుంచి కొంత సమాచారం మీలోకి చేరటం ద్వారా బలపడతాయి. కొన్ని సంస్కారాలకి మీరు ఏ పనీ చేయనవసరం లేదు. మీకు సమాచారంతో పని లేదు. కేవలం వాటిని గుర్తుంచుకుంటే చాలు, అవి బలంగా అవుతాయి.
Mనం రకరకాల స్థాయిలలో సంస్కారాల్ని పోగుచేసుకుంటాం. వాటిని మన అంతరంగ వ్యవస్థలో నిలవచేసి వాటిని అభివృద్ధి చేస్తుంటాం.
కర్మ
కోరిక ప్రోద్బలంతో ఆ పనిని చేస్తే అది కర్మ అవుతుంది. కోరిక శక్తితో మీరు నెక్లెస్ కొంటారు, ఆ పని కర్మ.
ఏ పన్నైనా సగం చేస్తే అది మీ అంతరంగంలో ఒక సంస్కారంగా మిగిలి పోతుంది. దేంట్లోనైతే పూర్తిగా జీవించరో దాని శేషభాగం సంస్కారంలా మీలో మిగిలిపోతుంది. అదే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అదే పని చేసే విధంగా ఆ పని వైపు లాగుతుంది. అది పూర్తిగా తీరే వరకూ అటు వైపు లాగుతుంది.
అలవాట్లు కూడా సంస్కారాల వల్ల ఏర్పడతాయి. నాకు కొన్ని వేలమందితో ఉన్న వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను. ధ్యానం ద్వారా వారు అలవాట్లని వదిలేయగలిగారు. ఇందులో సత్యం ఏమిటంటే మీరు జీవితాన్ని అస్పష్టంగా, అసంపూర్తిగా జీవిస్తారు కానీ సంపూర్తిగా కాదు. ఆ విధంగా పూర్తిగా జీవించని కోరికలు, ఆ కోరిక వైపు పదే పదే బలంగా లాగుతూ ఉంటాయి. తీరని కోరికలు మీ లోపల సంస్కారాలని సృష్టించి తిరిగి అదే అనుభవాన్ని పొందమని పదే పదే ఆ కోరిక వైపు బలంగా లాగుతాయి.
ఏ భావావేశంలో అయితే మీరు లోతుగా జీవిస్తారో మీరు దాని నుంచి స్వేచ్ఛని పొందుతారు. అది కోపం కావచ్చు. భయం, తినాలి అనే కోరిక లేదా ఏదైనా వస్తువు, వ్యక్తి పట్ల మీకు ఉన్న అనుబంధం. మీరు దాంట్లో పూర్తిగా జీవిస్తే అది మిమ్మల్ని పూర్తిగా వదిలేస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి పదే పదే ఒక సమస్య వైపు వెళుతున్నారు అంటే అర్థం వారు దాంట్లో పూర్తిగా జీవించలేదు అని.
మనం జీవించేటప్పుడు మన మనస్సు సగభాగం ఎక్కడో ఉంటుంది. పతంజలి చాలా చక్కగా చెబుతాడు, 'పరిమాణం పెరిగితే నాణ్యత తగ్గుతుంది,' అని. ఎప్పుడైతే ఒక వస్తువు నుంచి పొందే సంతోషం పెరుగుతుందో, దాని పరిమాణం తగ్గుతుంది, కాబట్టి నాణ్యతని పెంచాలి.
జీవితం ఒక చిన్న కొవ్వొత్తి కాదు. అది ప్రకాశవంతంగా వెలుగుతున్న ఒక కాగడా. దాన్ని ఎంత ప్రకాశవంతం చేయగలరో అంత ప్రకాశవంతం చేయండి.
ఏడు శరీరాల సంస్కారాలు
మన వ్యవస్థలో ఏడు శక్తి శరీరాలు ఉంటాయి. అందులో మొదటిది భౌతికశరీరం. అది రక్తమాంసాలతో తయారవుతుంది. అదే మిమ్మల్ని మోస్తూ తిరుగుతుంది.
రెండవ శరీరం ప్రాణశరీరం. అందులో ప్రాణం తిరుగుతూ ఉంటుంది. ప్రాణం అంటే మీరు శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస ద్వారా మీ లోపలికి వచ్చే జీవశక్తి. మీ జీవితాన్ని నిలిపే ప్రాణం గాలి ద్వారా మీ లోపలికి వస్తుంది. మీ వ్యవస్థలో ప్రాణం ఐదు దశల్లో తిరుగుతుంది. ఆ దశల్లోనిదే ప్రాణశరీరం లేదా శ్వాస శరీరం.
ఆ తరువాతఇది మానసికశరీరం. మనలో నిరంతరం సాగే మాటలు, ఆలోచనల ప్రవాహాన్ని అంతరంగుపు మాటలు (ఇన్నర్ చాటర్) అంటాను. ఆ అంతరంగుపు మాటలు నిరంతరం మానసికశరీరంలో ఉంటాయి. అదే మానసికశరీరం.
నాలుగవ శరీరం భావావేశాల శరీరం. మీలోని తర్కానికి, వివేకానికి కూడా అర్థం కాని లోతైన అంతరంగుపు మాటలే మీ భావావేశాలు.
గాఢనిద్రలో మీరు అనుభవించే లోతైన నిశ్శబ్దమే ఐదవ శరీరం. దీన్ని కారణశరీరం అంటారు.
లోతైన ధ్యానంలో, ఆలోచనలు లేని స్థితి లోనికి మీరు వెళ్లినప్పుడు, పూర్తి తెలుసుకునే తత్వంతోఉన్నప్పుడు మీ లోపల ప్రతి ధ్వనించే నిశ్శబ్దం ఏర్పడుతుంది. అందులో మీకు అద్భుతమైన సంతోషం ఉంటుంది. అదే ఆరవ శరీరం. ఏడవ శరీరం జ్ఞానోదయం. మనం ఈ ఏడు శరీరాల్లో రకరకాల సంస్కారాలని పోగుచేసి ఉంచుతాం.
భౌతికశరీరం - లోతైన దీర్ఘకాలశ్రమ
భౌతికశరీరంలో దీర్ఘకాల నిలువచేయబడి ఉంటుంది. అందుకే మీరు ఏదైనా చేయాలి అని అనుకోగానే, అది చిన్న పని కాని లేదా నడవాలి అనుకున్నా, ఎక్సర్సైజు చేయాలనుకున్నా ముందుగా మీ శరీరం అలసటని ముందుకి తెస్తుంది. ఇటువంటి మొదటిదశ సంస్కారాల్ని పట్టించుకోకుండా మీరు చేయదలచుకున్న పనిని చేస్తే అకస్మాత్తుగా ఆ పని మీకు శక్తిని ఇస్తుంది. మీరు నడవటం ప్రారంభించగానే మీ మనస్సు పదిసార్లు చెబుతుంది, 'నేను అలసిపోయాను ఇక చాలు ఇప్పటికే ఎక్కువ నడిచాను. ఈ రోజుకి ఇది చాలు, రేపు ఇంకొంచెం ఎక్కువ నడవవచ్చు,' ఇలా చెబుతుంది. మీరు మీ మనస్సు చెప్పే మాటలు ఈ సంస్కారాల్ని వినకుండా ముందుకి వెళితే, కొద్ది నిముషాల్లో ఆ పని మీలో కొత్త శక్తిని తెస్తుంది.
చాలాకాలంగా ఉండిపోయిన లోతైన అలసట మిమ్మల్ని నిరంతరం ఏ పనీ చేయకుండా విశ్రాంతిగా ఉండే విధంగా చేసే లక్షణం భౌతికశరీరంలో నిలువ ఉంటుంది. దీర్ఘకాలిక విశ్రాంతి కోసం అలమటించేవారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ కోరికే మీలోకి వ్యాధులని తీసుకువస్తాయి. అవే మిమ్మల్ని మంచం మీద ఉండేలా చేస్తాయి.
సెలవులో గడిపే రిసార్టుల అడ్వర్టైజ్మెంట్లు చూడండి. చక్కని బీచ్, ఆ పక్కనే ఒక వాలు కుర్చీ, అందులో చాలా విరామంగా, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న వ్యక్తి ఉన్నట్టు చూపిస్తారు. అది చూడగానే మీలో ఏదో జరగటం ప్రారంభమవుతుంది. మీకు కూడా ఆ ఫోటోలోని వ్యక్తిలా ప్రశాంతంగా, పూర్తి విరామంతో, విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తుంది. దాన్నే తీవ్రమైన తమస్సు ( పని లేకుండా ఉండే స్థితి) అంటాను.
ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు అదే బీచ్‌కి వెళ్ళి, అదే కుర్చీలో పడుకున్నా మీకు మీరు ఊహించిన ప్రశాంతత ఉండదు. మీలోని తమస్సుకి సంబంధించిన సంస్కారాలు పూర్తిగా పోయేవరకూ, అవి మీ భౌతికశరీరంలో ఉన్నంత వరకూ ఆ ప్రశాంతతని పొందలేరు. విశ్రాంతి కావాలి అనే మీ కోరిక మిమ్మల్ని విశ్రాంతి తీసుకోనీయదు. ఎందుకంటే ఆ కోరిక సంస్కారాల నుంచి వస్తుంది.
అదే బీచ్, అదే స్థలం, అదే వాలు కుర్చీ, అందులోనే పడుకున్నాక మీలోని సంస్కారం కొద్ది సేపు నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ తరువాత సంస్కారం బయటికి వచ్చి మిమ్మల్ని విశ్రాంతిగా ఉండనీయదు. మీరు విశ్రాంతి తీసుకోవాలి అన్న నిర్ణయం మీ సంస్కారం నుంచి కాబట్టి మీరు నిజంగా విశ్రాంతి తీసుకోలేరు.
నేను మీకు చెబుతున్నాను, సెలవు కావాలి, విశ్రాంతి కావాలి అనే లోతైన కోరిక మీ శరీరవ్యవస్థని వదిలి వెళ్ళిపోతే మీ ఆధ్యాత్మిక ప్రయాణం 90% ముగిసినట్టే. ఈ మొదటి దశ సంస్కారం అన్నింటి కంటే చెడ్డది.
ప్రాణశరీరం - కోరికల సంస్కారాలు
ఆ తరువాతిది ప్రాణశరీరం లేదా శ్వాసశరీరం. కోరికలకు సంబంధించిన సంస్కారాలు ప్రాణశరీరంలో నిలువచేయబడి ఉంటాయి. అందుకే మీలో కోరికలు మారగానే మీ శ్వాసలో కూడా మార్పు వస్తుంది. ఉదాహరణకి మీరు కోపం లేదా మోహం అనే వాటిలో తీవ్రంగా చిక్కుకుపోయారనుకోండి, మీ శ్వాస ఒక విధంగా మారిపోతుంది. అప్పుడు మీ శ్వాస గందరగోళంగా, లోతుగా ఉంటుంది. కోరికలోకి వెళ్ళే కొద్దీ మీ సంస్కారాలు శక్తిమంతమవుతాయి.
మానసికశరీరం - అపరాధభావ సంస్కారాలు
మూడవది మానసికశరీరం. రెండవదైన ప్రాణశరీరంలో మీ జీవితం ఎలా ఉండాలో అన్న ఆలోచనలు నిండి ఉంటాయి. మానసికశరీరంలో మీ జీవితం ఎలా ఉండకూడదు అనుకుంటారో ఆ ఆలోచనలు ఉంటాయి. ఈ శరీరం అపరాధభావం మీద సృష్టించబడి ఉంటుంది. మీ శక్తి నిరంతరం భవిష్యత్తు వైపు ప్రవహిస్తూ ఉంటే అది కోరిక. అది గతం వైపు ప్రవహిస్తూ ఉంటే అపరాధ భావం.
ఈ శరీరంలో మీరు ఒక పనిని పదే పదే చేయనవసరం లేకుండానే సంస్కారాలు బలపడతాయి. కేవలం సమాచారం అందించటం ద్వారా లేదా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా ఆ సంస్కారాలు బలపడతాయి. ఉదాహరణకి మీరు అదే స్థలం లేదా అదే వ్యక్తిని చూసారనుకోండి, అదే సంఘటనని ఎదుర్కొన్నారనుకోండి, వెంటనే ఆ సంస్కారాలు బలపడతాయి. అవి చైతన్యమవుతాయి.
భావావేశాత్మక శరీరం - బాధ సంస్కారాలు
నాలుగవ శరీరం భావావేశాలకి సంబంధించినది. ఈ శరీరంలో మీరు బాధకి సంబంధించిన ఊహలని నిలువచేస్తారు.
ఇది చాలా శక్తివంతమైనది ఈ సంస్కారాల్ని శక్తివంతం చేయటానికి సమాచారం అవసరం లేదు. అదే విధంగా మీరు ఏమీ చేయనవసరం లేదు. కాబట్టి అదే బాధని తిరిగి మరలా పొందరు. మీలో ఈ సంస్కారం చాలు. అది దానంతటి అదే కొన్ని రెట్లు పెరిగిపోతుంది. అది అలా విస్తృతం అవుతూ ఉంటుంది.
కారణశరీరం, గాఢనిద్ర
గాఢనిద్రలో పొందే అనుభవమే మీ కారణ శరీరం. ఈ శరీరంలో ఉండే సంస్కారాల్ని మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే గాఢనిద్రలో మీ ఆలోచనలు ఏమీ చేయలేవు, అది అచేతనశరీరం.
మొదటి నాలుగు శరీరాలలో సంస్కారాల లోతుని తగ్గించవచ్చు. ఐదు, ఆరు శరీరాలు సహజంగానే శుభ్రపడతాయి. మొదటి నాలుగింటినీ మీరు శుభ్రపరిస్తే, ఐదవది దానంతట అదే శుభ్రపడుతుంది. ఎప్పుడైతే ఐదవ శరీరం శుభ్రపడుతుందో ఆరవదాని అనుభవాన్ని క్రమంగా పొందగలరు. ఆరవది ధ్యానశరీరం.
మీరు సులభంగా గాఢనిద్రలోకి వెళ్ళగలుగుతున్నారు అంటే మొదటి నాలుగు శరీరాలు శుభ్రంగా ఉన్నాయి అని అర్థం. మొదటి నాలుగు శుభ్రంగా లేకపోతే ఐదవ కోశంలో మీరు కష్టపడతారు. అందుకే మీ మీద ఒత్తిడి, భారం ఉన్నప్పుడు నిద్ర సంబంధమైన సమస్యలతో బాధపడతారు.
అంతే కాదు, మొదటి నాలుగు శరీరాలలో సంస్కారాలు ఎక్కువగా ఉంటే, ఐదవ శరీరంలో మీకు మీ శరీరానికి అనుబంధం తెగిపోతుంది. మొదటి నాలుగు శరీరాలలో సంస్కారాలు తక్కువగా ఉంటే మీ శరీరం మీకు స్నేహితురాలవుతుంది.
మన శరీరాన్ని ఏ విధంగా బాధపెట్టి, తక్కువగా చూస్తామో మీరు తెలుసుకోరు. అర్థం చేసుకోండి, మీ శరీరం బరువు ఎక్కువగా ఉంటే అది ప్రత్యక్షంగా ఈ సంస్కారాలతో సంబంధం కలిగి ఉంటుంది. మీ లోపల ఖాళీగాను, మీరు ఒంటరిగా ఉన్న భావన ఏర్పడినప్పుడు, మీ లోపల నింపటం ప్రారంభిస్తారు. ఆహారంతో గాని, పానీయాలతో గాని నింపుతారు. సాధారణంగా స్త్రీలు ఆహారంతో, పురుషులు పానీయాలతో నింపుతారు. ఈ ఆధునికకాలంలో ఇలా చెప్పలేం. మీరు ఒంటరిగా ఖాళీగా అనిపించినప్పుడు మీరు మీ లోపల ఏదో ఒకటి నింపాలి అని చూస్తారు.
మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటనా, ఏదో ఒక సంస్కారంతో సంబంధాన్ని కలిగిఉంటుంది. ఈ సంస్కారాల్ని తీసేయటమే మీ శరీరంతో స్నేహం చేయటం. మీ శరీరంతో లోతైన స్నేహబంధాన్ని ఏర్పరచుకోవటం. ఇది మీ శరీరాన్ని బాగు చేసే ఒక మంచి మార్గం.
కర్మలు మూడు రకాల
ఆగామ్య, ప్రారబ్ధ, సంచిత.
మొదటిది సంచిత కర్మ : సంచితకర్మ బ్యాంకులో రిజర్వ్ అకౌంటు లాంటిది. ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు శరీరాన్ని తీసుకోవటం భూమిమీదకి రావటం ఇది మొదటిసారి కాకపోవచ్చు. ఇంతకు ముందు కొన్ని వేల వేల శరీరాలు తీసుకొనిఉండి ఉంటారు. అన్ని వేల వేల జన్మలలో మీరు చేసిన ఆలోచనలు పనులు, మాట్లాడిన మాటలు, తీరని అనుభవాలు అవన్నీ లోతైన సంస్కారాలుగా మీ లోపల ఉంటాయి. వీటన్నింటినీ కలిపి సంచితకర్మ అంటారు. నేను బ్యాంక్ అనగానే అది మీ డిపాజిట్ అనుకోవద్దు. అది అప్పు మాత్రమే. ఇది తిరిగి తీర్చవలసిన బాకీ లాంటిది.
రెండవది ప్రారబ్ధ కర్మ : ప్రారబ్ధం అంటే, మీరు సంచిత కర్మల నుంచి కొన్ని కర్మల్ని తీసుకొని వాటితో ఈ శరీరాన్ని పొందుతారు. ఆ తరువాత ఈ శరీరం ద్వారా వచ్చిన కర్మలని పూర్తిచేసుకోవాలి అని నిర్ణయించుకుంటారు. కాబట్టి ప్రారబ్ధం అంటే మీ రిజర్వు అకౌంటులోని సంచిత కర్మలలో కొన్నింటిని తెచ్చుకుని ఈ శరీరంతో భూమి మీదికి వస్తారు. అదే ప్రారబ్ధ కర్మ.
మూడవది ఆగామ్యకర్మ : మూడవది అన్నింటిలోనూ మహా చెడ్డది, ఆగామ్యకర్మ. ఈ భూమి మీదికి వచ్చాక కొత్తగా మీరు పోగుచేసుకునేదే ఆగామ్యకర్మ. మీలో వచ్చే కొత్త ఆలోచనలు కొత్త పనులతో కొత్త మాటలతో ఈ కర్మల్ని పెంచుతారు.
ఎవరైతే ఈ భూమి మీదికి వస్తారో వాళ్ళు మరణించే లోపు ప్రారబ్ధకర్మలని పూర్తిగా పోగొట్టుకోవాలి. ఉదాహరణకి మీ సంచిత కర్మలు 1000 అనుకుంటే మీరు అందులోంచి 10 కర్మలు తీసుకొని శరీరాన్ని పొంది భూమి మీదికి వస్తారు. అంటే మీరు 10 ప్రారబ్ధ కర్మలతో వస్తారు. ముందుగా ఈ పది కర్మలు పూర్తి చేయాలి. అయితే మీరు ఈ భూమి మీదికి వచ్చాక ఆ పది కర్మలు పోగొట్టుకోకుండా కొత్త కర్మలని పోగుచేసుకోవటం ప్రారంభిస్తారు. ఎదుటివారి కోరికలు మీ కోరికలుగా తెచ్చుకొని వాటితో కొత్త ఆలోచనలు, కొత్త మాటలు, పనులు చేస్తారు.
ఉదాహరణకి మీరు ఎవరైనా అందమైన వారిని చూసారనుకోండి, అసూయతో మీ ఆలోచనలు రెట్టింపు అవుతాయి. ఈ ఆలోచనలతో కొత్త కర్మలు చేస్తారు. కొన్నిసార్లు ఎదుటివారి గురించి చెడ్డగా మాట్లాడతారు. అప్పుడు కూడా ఆ మాటలు ఆధారంగా కర్మలని కలుపుకుంటారు.
ప్రతి రోజూ మీలో ఉండే చికాకు, అసహనం నుంచి బయటకి రావటం - మీ ప్రారబ్ధ కర్మలలో జీవించటం.
కర్మలలో రకాలని వేరు వేరు కోణాలలో వివరిస్తాను. చూడండి, మీకు తెలిసిన అవకాశాలన్నీ తెలుసుకుంటూ, విశ్వంలో దొరికే అవకాశాలని తెలుసుకుంటూ వాటిని ఉపయోగించుకోవటమే అగామ్య కర్మలు. అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. మీరు చేపగా, పాముగా, మనిషిగా, దేవుడుగా ఏదైనా కావచ్చు, ఇవన్నీ అవకాశాలు. దీన్నే అగామ్య అంటాం.
మీకు మరొక విధమైన అవకాశాలు కూడా ఉన్నాయి. అవి మీకు తెలిసిన చేప, కప్ప, కుక్క, కోతి, మనిషి ఇవే కాకుండా మీకు తెలియని అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి. మనకి తెలిసిన, తెలియని అన్నిరకాల సాధ్యాలని కలిపి సంచిత అంటారు.
మొత్తం సంచితం అయితే, మీ ముందు ఉన్న అవకాశాలు అగామ్యం. మీరు ఈ శరీరంలోనికి వచ్చాక ఏవో కొన్ని హద్దులలోనే జీవిస్తారు, అవే ప్రారబ్ధం. చూడండి, మీరు కిందికి వచ్చినప్పుడు మీరు కొన్ని హద్దులు కల్పించుకుంటారు. వాటినే ప్రారబ్ధం అంటారు.
ఇక్కడికి వచ్చాక చాలా అవకాశాలు చూసి వాటిని పోగుచేసుకుంటారు. వాటిని పొందాలి అనుకుంటారు. అవే అగామ్య. మీతో తెచ్చుకున్న ప్రారబ్ధాలకి మీ జీవితాన్ని నడపగల మేధ ఉన్నది. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటి అంటే, మీరు చాలా అగామ్యాలు చూసి, చాలా అవకాశాలని చూస్తారు. దానివలన మీరు మీ ప్రారబ్ధాలని నమ్ముతారు. మీరు ముందుగా అవకాశాలు తగ్గుతాయి. అప్పుడు మీ ప్రారబ్ధ జీవితాన్ని నడపేంత శక్తి గలవి అని నమ్మకం కుదరదు. ఎందుకంటే మీ ముందు అగామ్యాలు ఉన్నాయి.
మీకు ఇది వివరిస్తాను, ప్రారబ్ధాన్ని నమ్మటం శక్తివంతమైనది. ప్రారబ్ధాన్ని పూర్తిచేస్తే మీలో చికాకు తగ్గుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకూ మీతో మోసే చికాకు అసహనం అనేవి అగామ్య ఇచ్చిన బహుమతి.
నిద్రలేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకూ మీకు అసహనం, చికాకు ఉంటాయి. మనకి ఎవరో ఒకరు ఒక చిన్న తప్పుచేసి దొరకాలి, అంతే వాళ్ళమీద విరుచుకుపడతాం. మనం దానికోసమే ఎదురుచూస్తుంటాం. మన ముందుకి ఎవరు వస్తే వారికి మన దీవెనలు తప్పవు. ఆ చికాకుకి కారణం మనం అగామ్య మీద కేంద్రీకృతం అయ్యాం. మనలో శక్తి, మన అంతరంగం ప్రారబ్ధం మీద ఏకాగ్రతని నిలిపితే, మనం మనలో అసహనాన్ని, చికాకుని మోయాం. అంటే మనం పని చేయం అని కాదు. మనం మన పనిని చక్కగా చేస్తాం. కాని మన ప్రారబ్ధం మీదే ఉంటాం. చూడండి, నిరంతరం అన్నింటినీ వ్యతిరేకిస్తూ నిరంతరం అసహనంతో చికాకుగా ఉన్నారు అంటే కారణం ఆగామ్య. ఎందుకంటే మన చుట్టూ అవకాశాలు చూస్తాం. కాబట్టి మనం ఎంపికల వెనుక పరిగెడుతున్నాం. అవే ఆగామ్య. అయితే ప్రారబ్ధం చాలా శక్తివంతమైనది, తెలివైనది, అని మర్చిపోతున్నాం.
ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. అందులో కొందరి అంతరంగం ఆగామ్యం మీద కేంద్రీకృతమై ఉంటుంది. రెండవ రకంవారికి ప్రారబ్ధం మీద ఉంటుంది. ప్రారబ్ధం మీద ఉన్నవారు విరామంగా తెలుసుకునే తత్వంతో గడుపుతారు.

ఆగామ్యం మీద కేంద్రీకృతమైన మనస్సు భయం, ఆశలతో ముందుకు నడుస్తుంది. అది మీరు నిద్రలేవగానే తెలుస్తుంది. మీరు కలలోంచి బయటకి రావాలి అంటే మీకు కోరిక ఉండాలి. లేదా భయం వేయాలి. ఉదాహరణకి మీ పాపని స్కూలుకి పంపించాలి అనే కోరికతో నిద్రలేస్తారు. అంటే మీ పాపకి మంచి చదువుచెప్పించి, మంచి భవిష్యత్‌ని ఏర్పరచాలి అనే కోరిక లేదా ఆఫీసుకి ఆలస్యం అవుతుంది, అనే భయంతోనైనా త్వరగా నిద్రలేస్తారు.
శరీరాన్ని ఆశ లేదా భయంతో కదిలించే దానినే ఆగామ్యం పైన జీవించే జీవితం అంటాను.
కర్మ చక్రం నుంచి బయటకి రావటం
మనం చేసే పనులన్నీ ఆశ, భయంతో జరుగుతాయి. దాంతో ఏదో పైపైన జరిగే పనులతో మనం కర్మల్ని కలుపుకుంటూ ఉంటాం. ఈ విధంగా చాలా కర్మల్ని పోగు చేసుకుంటాం.
తిరిగి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? మీ కర్మల బాంక్ బాలెన్స్ ఆగామ్య కర్మలతో నిండిపోయి ఉంటుంది.

ఉదాహరణకి మీరు 10 కర్మలు తీసుకుని వచ్చారు. ఈ పది కర్మలు పోగొట్టు కోవలసినది పోయి మరొక 200 కర్మలు కొత్తగా పోగుచేసి మీతో తీసుకువెళుతున్నారు. మరలా మీరు శరీరాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది. మీకు ఉన్న 1000 సంచితకర్మలకి మరో 200 ఆగామ్యకర్మలని కలుపుతున్నారు. అంటే కిందటి జన్మ కంటే మరొక 200 కర్మలు ఎక్కువ అయ్యాయి. ఇందులోంచి మళ్ళా ఒక పది కర్మలు తీసుకొని మరొక శరీరాన్ని తీసుకుంటారు. మరలా చాలా కర్మలని పోగుచేసుకొని వెనక్కివెళతారు. ఇది ఛేదించలేని ఒక విషవలయంలా అవుతుంది. దీన్నే జననమరణ చక్రం అంటారు. నిరంతరం పుడుతూ, మరణిస్తూ మళ్ళా పుడుతూ ఉండటమే.

ఆ విధంగా కాకుండా మీరు జీవించి ఉన్నప్పుడే మీకు ఎవరైనా మీరు అంటే శరీరం మానసికవ్యవస్థ కాదు, మీరు అంటే కర్మల ప్రభావం మాత్రమే, ఆ కర్మల ప్రభావం వలనే మీరు తిరిగి ఈ భూమి మీదికి వస్తారు, అనే జ్ఞానాన్ని ఇస్తే అప్పుడు మీరు ఈ కర్మల్ని పోగొట్టుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అప్పుడు ముందుగా మీ ప్రారబ్ధకర్మల్ని పూర్తిగా పోగొట్టుకోగలుగుతారు.
ఉదాహరణకి మీరు ప్రారబ్ధ కర్మలతో ఈ శరీరాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చారు. మీరు పది కర్మలతో వచ్చారనుకోండి. అందులో మూడు సంస్కారాలు మిమ్మల్ని నిరాశలోకి పంపించే శక్తి ఉన్నవి అనుకోండి. మీరు వీటి మాట వింటున్నంత కాలం అవి ఇంకా ఎక్కువై అవి పది అవుతాయి. మీరు తీసుకున్న ఏడు కర్మలు ఆగామ్యకర్మలు. తెచ్చుకున్న ప్రారబ్ధకర్మలు పోగొట్టుకునే బదులు మీరు మరిన్ని కొత్తవి కలుపుతున్నారు.
అచేతనస్థితిలో జీవించటం : ఆ విధంగా కాకుండా మీరు నిరాశలోనికి వెళ్లినప్పుడు మీరు నేర్చుకున్న కొన్ని పద్ధతుల ద్వారా ఆ కుంగుబాటు నుంచి బయటికి వస్తే, ఆ సంస్కారాలు తమ శక్తిని కోల్పోతాయి. క్రమంగా ఆ పది కర్మలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ప్రారబ్ధకర్మల ప్రభావం మీ మీద తగ్గుతుందో, ప్రారబ్ధకర్మలు మండిపోయి మీ నుంచి వెళ్ళిపోతాయి. ఆ విధంగా ప్రారబ్ధకర్మలు మండిపోతే కొత్త ఆగామ్యకర్మలు చేరే అవకాశం తగ్గుతుంది. అప్పుడు ఆగామ్య కర్మలు తగ్గిపోతాయి.
ఎప్పుడైతే ప్రారబ్ధప్రభావం మీ మీద ఉండదో మీరు ఆగామ్యాలని పోగుచేసుకోరు. ఎప్పుడైతే 10 ప్రారబ్ధకర్మల ప్రభావం మీ మీద ఉండదో మీరు ఆగామ్యాలను పోగుచేయరు. ఎందుకంటే ఈ పది ప్రారబ్ధకర్మలే ఆగామ్యాలకి కారణం.
ఇప్పుడు సంచితకర్మ గురించి చూద్దాం మీరు సంచితకర్మల రిజర్వు అకౌంటు గురించి ఏమీ చేయలేరు. సంచితకర్మలు పోవాలి అంటే గురుకృప ఉండాలి. గురుదేవుల కరుణతోనే సంచితకర్మలు పోతాయి. గురుదేవులు మాత్రమే ఈ విషయంలో సహాయం చేయగలరు.
విశ్వకారణం - ప్రభావసూత్రం
మీరు పాపం చేస్తే నరకానికి వెళతారని, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతారని చెబుతుంటారు. నేను మీకు చెబుతున్నాను, సమాజం మిమ్మల్ని నియంత్రించటానికి నరకం అనే భయాన్ని, స్వర్గం అనే ఆశని మీలో కల్పిస్తుంది.
ఒక చిన్న కథ : ఒక ప్రమాదంలో ఒక గ్రామం మొత్తం కొట్టుకుపోతుంది. ఆ గ్రామప్రజలందరూ స్వర్గద్వారాల దగ్గర ఉంటారు. భగవంతుడు వారితో, 'మగవారంతా రెండు వరుసలలో నిలబడండి. భూమి మీద ఉన్నప్పుడు స్త్రీలపై అధికారం చలాయించినవారంతా ఒక వరుసలో, వారి భార్యల అధికారంలో ఉన్నవారు మరొక వరుసలో నిలబడండి' అని చెబుతాడు.
భార్యలు అధికారం చలాయించిన వారి వరుస కొన్ని మైళ్ళు ఉంటుంది. మగవారు అధికారం చలాయించిన వరుసలో ఒక్క వ్యక్తి మాత్రమే ఉంటాడు. భగవంతుడు అతన్ని 'నీ భార్య నీ మీద అధికారం చలాయించకుండా నీవు ఏ విధంగా తప్పించుకున్నావు?' అని అడుగుతాడు.
ఆ వ్యక్తి, 'నాకు తెలియదు భగవాన్, నా భార్య ఇక్కడ నిలబడమని చెప్పింది' అని జవాబు ఇస్తాడు.
మీరు భయంలో చిక్కుకున్నప్పుడు సమాజం ఏంచెబితే అదే చేస్తారు. మీ మీద ఎటువంటి అధికారం ఉండదు. మీరు సమాజం నియంత్రణలో ఉంటారు. ఎక్కడా స్వర్గం, నరకం అని లేవు. నరకం, స్వర్గం కేవలం మీ మానసికస్థితులు మాత్రమే.
మీకు మంచి ఆలోచనలు వచ్చినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు మీరు స్వర్గంలో ఉంటారు. మీకు చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చెడ్డ పనులు చేసినప్పుడు నరకంలో ఉంటారు అంతే. అదంతా కూడా కర్మ. ఇదే విశ్వకారణం, ప్రభావం అనే సూత్రం. మీరు అంటే మీ మనస్సు ఎక్కడ ఏకాగ్రత ఉంచుతుందో, ఏదైతే మీరు అనుకుంటారో అదే అవుతారు. మీలోని లోతైన తెలుసుకునే తత్వం నుంచి రాని మాటలు, పనులు ఏదో పైపైనే ఉండి కర్మలని సృష్టిస్తాయి. తిరిగి వాటిని సాధించటానికి మళ్ళీ మాటలు, పనులు వస్తాయి.
ప్రతిధ్వనించే చైతన్యం విశ్వం
ఎప్పుడైతే విశ్వం అంటే శక్తి అని తెలుసుకుంటారో అప్పుడు మీకు ఇది ఒక చైతన్యజీవం అని అర్థం అవుతుంది. విశ్వంలో మన సౌరకుటుంబం ఒక చిన్న భాగం మాత్రమే. విశ్వం నిత్యనూతనత్వంతో నిరంతరం తనని తాను సృష్టించుకుంటూ ఉంటుంది. ఇందులో బిగ్ బాంగ్ ద్వారా కొత్త సౌరకుటుంబాల సృష్టి, కృష్ణబిలం ద్వారా నక్షత్రాల నాశనం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఎప్పుడైతే విశ్వంలో బిగ్ బాంగ్ జరుగుతుందో అప్పుడు విశ్వంలో మరొక చోట కృష్ణబిలం (బ్లాక్ హోల్) ఏర్పడుతూ ఉంటుంది అని. ఒకటి లేకుండా మరొకటి సాధ్యపడదు. అన్ని రకాల శక్తి ఒకదానికొకటి సంబంధించి ఉంటుంది, ఇదే విశ్వకర్మ.
ఎప్పుడైతే విశ్వం మొత్తం శక్తి అని తెలుసుకుంటారో, అది చైతన్యజీవనం అని మీకు అర్థం అవుతుంది.
కయాస్ (గందరగోళం) థియరీ అని ఒక సిద్ధాంతం ఉన్నది. ఆ థియరీ ప్రకారం చైనాలో సీతాకోక చిలుక రెక్కలు కొట్టుకుంటే మెక్సికోలో తుఫాను వస్తుంది అని చెబుతారు. దీన్నే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు. సీతాకోక చిలుక రెక్కలు కొట్టుకున్నప్పుడు వాతావరణంలో చిన్న మార్పుని తెస్తుంది. అది ఒక గొలుసులా యాక్షన్, రియాక్షన్ల ద్వారా వాతావరణంలో ఒత్తిడిని కలిగిస్తుంది. అది భూమి మీద మరొక ప్రాంతంలో ఫలితం కనిపించే విధంగా జరుగుతుంది. ఎక్కడో ఒక అణువు కదిలితేనే ఇక్కడ ఒక అణువు కదులుతుంది.
మీరు కొంచెం లోతుగా చూస్తే మనం శారీరకవ్యాధులనే మనలోకి ఆహ్వానించటం లేదు, ప్రమాదాలని కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ సమస్య ఏమిటంటే మనం అంతా అచేతన స్థితిలో ఆలోచిస్తాం. అందుకే కారణానికి, ఫలితానికి సంబంధాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం.
ప్రతిచర్య లేక ప్రతిస్పందన
కర్మ అంటే చర్య లేదా పని. అయితే చర్య అనేది రెండు రకాలు. అది ప్రతిచర్య కాని లేదా ప్రతిస్పందన కాని.
ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీకు కోపం వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆశించినట్టు మీరు ప్రవర్తిస్తారు. అతను క్షమించమనగానే మీ భావం, మీ మూడ్ మారిపోతాయి. కాబట్టి అతను యజమాని, మీరు బానిసగా ప్రవర్తిస్తున్నారు. మీకు సంఘటన మీద ఎటువంటి నియంత్రణ లేదు. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరు వెంటనే మీ పాత అనుభవాల నుంచి ప్రతిస్పందిస్తారు. ఈ ప్రతిచర్యనే కర్మ అంటారు. ఇది బందీలని చేసే శక్తి. ఇది మీకు సంకెళ్ళని సృష్టిస్తుంది.
కాని ప్రతిస్పందన అనేది పూర్తి వేరుగా ఉంటుంది. ఎవరైనా అవమానిస్తే మీరు కోపం తెచ్చుకోనవసరం లేదు. ఎవరైనా ఏదైనా అంటే మీరు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా, ఇది తప్పు, ఇది సరే అని అనకుండా వాళ్ళు చెప్పేది వినవచ్చు. వెంటనే ప్రతిచర్య చూపించకుండా మీరు వాళ్ళు చెప్పేది వినవచ్చు. ఆ తరువాత పూర్తి తెలుసుకునే తత్వంతో జవాబు ఇవ్వవచ్చు. మీరు గత అనుభవాల నుంచి ప్రతిస్పందించనవసరం లేదు. మీరు వర్తమానం నుంచి స్పందిస్తున్నారు.
ఒకవేళ ఎదుటి వ్యక్తి చెప్పేది కరెక్టు అయితే అతను అలా చెప్పినందుకు కృతజ్ఞతలు చెబుతారు. అతను చెప్పేది తప్పు అయితే మీరు మీ భావావేశాన్ని కేవలం గమనిస్తారు. కాని ప్రతిచర్య చూపరు. అతను అన్నది అబద్ధమైతే మీరు ఎందుకు ప్రతిచర్య చూపాలి?
జార్జిగూర్జీఫ్ (ఈయన గ్రీకు-అమెరికా యోగి, ఆధ్యాత్మిక గురువు ఆయన నాలుగవ దారి అనే సూత్రాన్ని చెబుతాడు. అది మన వేదాలలో ఉన్న తురీయదశని పోలి ఉంటుంది) జీవితం నుంచి ఒక చక్కని సంఘటన.
జార్జి గుర్జీఫ్ తొమ్మిది ఏళ్ళ వయస్సులో ఉండగా తండ్రి చనిపోతాడు. అతను పేదవాడు కాని చాలా నిజాయితీ పరుడు. ఆయన మరణ సమయంలో గుర్జీఫ్ని పిలిచి తన చివరి సందేశాన్ని ఇస్తాడు. ఎవరైనా అవమానిస్తే నిశ్శబ్దంగా పూర్తిగా అతను చెప్పేది విను. ఆ తరువాత అతనితో నా పట్ల అంత శ్రద్ధ తీసుకున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పు, మళ్ళీ 24 గంటల తరువాత వచ్చి నీకు జవాబు ఇస్తాను అని చెప్పు, అని చెబుతాడు. గుర్జీఫ్ తండ్రికి ఆ విధంగా ఉంటాను అని ప్రమాణం చేస్తాడు.
ఆయనకి పెద్ద వయస్సు వచ్చాక తన శిష్యులతో, 'మా నాన్నగారు చెప్పిన చిన్న పద్ధతి నాకు చాలా సహాయం చేసింది. ఎందుకంటే 24 గంటల తరువాత ఎవరూ కోపంగా ఉండరు 24 గంటల తరువాత అతను కరెక్ట్ అని తెలుస్తుంది లేదా అతను తప్పు అని తెలుస్తుంది.
ఒకవేళ అతను చెప్పింది సరైనదే అయితే మిమ్మల్ని మీరు బాగుచేసుకోవటానికి ఒక అవకాశం అది. మీ గురించి మీరు బాగా తెలుసుకుంటారు. ఒకవేళ అతను తప్పు అయితే మీరు కోపం తెచ్చుకోవలసిన అవసరం లేదు.
మీ స్పందన అద్దంలో ప్రతిబింబంలా ఎటువంటి అభిప్రాయాలు, తీర్పులు లేకుండా ఉండాలి. అది మీ కర్మల నుంచి గత అనుభవాల నుంచి రాకూడదు. అది వర్తమానం నుంచి రావాలి. ఏదైతే మీ గత అనుభవం నుంచి వస్తుందో అది కర్మల గొలుసుని తయారుచేస్తుంది. వర్తమానం నుంచి వచ్చే స్పందన మీకు స్వేచ్ఛని ఇస్తుంది.
మీ కర్మల్ని మీరే సృష్టించుకుంటారు. కర్మ మిమ్మల్ని సృష్టించదు. మీ పనుల ఫలితమైన ఉపవస్తువు కాదు. మీరు మీ పనుల కంటే ఉన్నతులు.
గురుదేవులకి కర్మలు ఉండవు
ఒక చిన్న కథ : ఒక అందమైన తోటలో చాలా పూల చెట్లు, రకరకాల పళ్ళ చెట్లు, ఉంటాయి. ముగ్గురు స్నేహితులు ఆ తోట దగ్గరకి వస్తారు. తోట చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ వుంటుంది. వారిలో ఒకరు గోడ ఎక్కి అటు చూస్తాడు.
అతను గట్టిగా, 'అబ్బో! ఎంత అందమైన తోట' అని అరిచి అటు వైపు దూకుతాడు. అక్కడ అందాలు చూస్తూ, మధురమైన ఆ పళ్ళు తింటూ ఆనందంగా తిరుగుతూ ఉంటాడు. రెండవ వ్యక్తి గోడ ఎక్కి తోటని చూస్తాడు. అది చాలా అందంగా కనిపిస్తుంది. అతనికి కొంచెం మర్యాద తెలుసు, కింద నిలబడ్డ తన స్నేహితునితో, 'ఓ! స్నేహితుడా! ఇక్కడ చాలా అందమైన తోట ఉన్నది. నేను వెళుతున్నాను. నీవు కూడా ఇక్కడికి రా' అని చెప్పి అటు వైపు తోటలోనికి దూకి ఆ పళ్ళు తింటూ ఆనందంగా తిరుగుతాడు.
మూడవ వ్యక్తి గోడ ఎక్కి తోటని చూస్తాడు. అతని స్నేహితుల ఆనందపారవశ్యాన్ని చూస్తాడు. అప్పుడు తనకి తాను ఈ విధంగా చెప్పుకుంటాడు, 'నేను వెనక్కి వెళ్ళి అందరికీ ఈ అందమైన తోట సంగతి చెబుతాను. వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకువస్తాను.' అని వెనక్కి తిరిగి వెళతాడు. అవతారమూర్తి, అవధూత అంటే ఈ విధంగా తిరిగి భూమి మీదికి వచ్చి తాను పొందిన పరమానందస్థితి గురించి అందరికీ చెప్పే మహానీయుడే.
ఎవరైతే దివ్యత్వం నుంచి ఈ భూమి మీదికి వచ్చి తాను పొందిన అద్భుత అనుభవాన్ని అందరికీ వివరిస్తాడో, అందరూ అది తెలుసుకునే విధంగా చేస్తాడో ఆయన అవతారమూర్తి, ఆయనకి కర్మలు ఉండవు. వారు సాధించవలసింది ఏమీ ఉండదు. వారు పొందవలసింది ఏదీ ఉండదు. అటువంటప్పుడు వారు శరీరాన్ని ఎందుకు ధరిస్తారు?
వారు మానవులపై ఉండే అపారమైన ప్రేమ వల్ల ఈ భూమి మీద అవతరిస్తారు. అవతారమూర్తులు మానవశరీరాన్ని తీసుకోవడానికి కారణం మానవులకు జననమరణచక్రం నుంచి విముక్తి కలిగించటానికి, కర్మల సంకెళ్ల నుంచి స్వేచ్ఛని కలిగించటానికి.
ఉద్దేశమే ముఖ్యం
భాగవతంలో ఒక చక్కని కథ ఉంది : కృష్ణుడు గోపికలతో కలసి యమునానది ఒడ్డుకి వస్తాడు. వారంతా యమునని దాటాలి కాని ఎక్కడా దారి లేదు. అప్పుడు కృష్ణుడు, 'నేను నిజమైన బ్రహ్మచారిని అయితే యమున దారి ఇస్తుంది.' అంటాడు. యమున వారందరికీ దారి ఇస్తుంది.
మామూలుగా చూస్తే కృష్ణుడు అమ్మాయిలతో ఉన్న సాధారణవ్యక్తిలా కనిపిస్తాడు. కాని కృష్ణుడు శరీరానికి, మనస్సుకి అతీతమైన వాడు. ఆయన పనులు సాధారణమానవునిలా ఒక ఉద్దేశంతో ఉండవు. ఎప్పుడైనా పనిలోని ఉద్దేశం ముఖ్యం కాని పని కాదు. ఉద్దేశం అనేది లగేజి. అది కర్మ. అంతే కాని చర్య కాదు. ఒక పని ఉద్దేశాన్ని సృష్టిస్తే అది లగేజి అవుతుంది. స్వచ్ఛమైన పనికి ఫలితం గురించి ఉద్దేశం ఉండదు.
గురుదేవుల సమక్షం ఉద్దేశాన్ని ప్రభావితం చేస్తుంది
చూడండి, గురుదేవుల సమక్షంలో మీరు ఏం చేసినా అది గురువుల కోసమే. ఇది ఏ విధంగా కూడా మీకు పేరు ప్రతిష్ఠలని ఇవ్వదు అని తెలుసు. కాబట్టి మీ పనులు ఒక ఉద్దేశ్యతో ఉండవు. అక్కడ ఉద్దేశాలు ఉండవు. ఉద్దేశం గురువు గారిది, పనులు మీవి. ఉద్దేశ్యాలు అనేవి లేని వ్యక్తిలోని అంతరాత్మ ఉద్దేశం ఇది.
చూడండి, పూర్తి సంచితకర్మలు మీవి కాని నావి కాని, కాదు. ఇది సర్వాంతర్యామి దివ్యనాటకం. మీది బాధపడటం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, మీ సంచితకర్మ కూడా దివ్యనాటకంలా ప్రారంభమవుతుంది. కాని ఆగామ్యకర్మలు పోగుచేసి పోగుచేసి అది అసహ్యంగా మారుతుంది.
నాకు కర్మలు ఉండవు కాబట్టి నాతో పాటు ముందుకి సాగితే మీకు ఉద్దేశాలు, కోరికలు ఉండవు. ఉద్దేశం లేకుండా పని చేయటమే జీవన్ముక్తి.
కర్మచక్రాన్ని ఛేదించవచ్చు
ఉద్దేశం లేని పనులు - కర్మ నుంచి స్వేచ్ఛ
ఒక వ్యక్తి పది హత్యలు చేస్తే అతని హత్యల సంఖ్య రికార్డు కాదు కాని హత్యల ఉద్దేశం రికార్డు అవుతుంది. అందులోని నాణ్యత, మానసికస్థితి, దృక్పథం - ఇవే కర్మ అనే భారాన్ని తెస్తాయి.
అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు పదే పదే పని కాదు దాని ఉద్దేశం ముఖ్యం అని చెబుతాడు. భగవద్గీత సందేశం అదే ఆయన ఇలా చెబుతాడు, ‘మీరు ఉద్దేశం లేకుండా ఉంటే నేను మీ బాధ్యత తీసుకుంటాను’ అని. పని రికార్డు చేయబడదు, దాని ఉద్దేశం రికార్డు చేయబడుతుంది.
మహాభారతంలో ఒక చక్కని కథ ఉన్నది.
ఒక సాధువు, వేశ్య ఇంటికి ఎదురుగా నివసిస్తూ ఉంటాడు. అతను ఆమె దగ్గరికి వచ్చే వారిని లెక్కిపెడుతూ ఆ ఇంట్లో ఏమేం జరుగుతుంటాయో, ఆమె జీవితం ఏ విధంగా ఉంటుందో ఊహిస్తూ ఉంటాడు. ఆమె మాత్రం ఖాళీ సమయమంతా కృష్ణుని ధ్యానిస్తూ ఆ జీవితం నుంచి విముక్తి ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉంటుంది.
చివరికి వారిద్దరూ చనిపోయి యముడి దగ్గరకి చేరుతారు. యముడు వారి జీవితాన్ని పరిశీలించి సాధువుని నరకానికి పంపించి, వేశ్యని స్వర్గానికి వెళ్ళమంటాడు. సాధువు నిర్భాంతపోయి యముడితో గొడవ పడతాడు, ‘నేను చాలా పవిత్రమైన జీవితాన్ని గడిపాను. ఆమె అవినీతితో జీవించింది. నన్ను ఏ విధంగా నరకానికి పంపిస్తున్నారు? అని గట్టిగా అడుగుతాడు.
అప్పుడు యమధర్మరాజు, ‘నా న్యాయస్థానంలో పనులకి విలువ లేదు వాటి ఉద్దేశానికే విలువ. నీవు సన్న్యాసి బట్టలు ధరించి బయటకి పవిత్రమైన జీవితాన్ని గడిపావు. కాని నీ అంతరంగం కామంతో నిండి ఉన్నది. అందుకే బయట ప్రపంచంలో నీ శరీరానికి గౌరవమర్యాదలతో అంత్యక్రియలు జరిగాయి. కానీ ఆ స్త్రీ అంతరంగం శ్రీకృష్ణునితో నిండి ఉన్నది. అందుకే ఆమె శరీరానికి అంత్య క్రియలే జరగలేదు. కాని ఆమె స్వర్గానికి వెళ్ళింది.’
మీరు అడగవచ్చు, ఇలా అయితే అందరూ అవినీతి పనులు చేయవచ్చు కదా అని. అవినీతి పనులకి ఇది లైసెన్సు కదా అని.
జ్ఞానోదయమైన అవతారమూర్తులు సర్వాంతర్యామితో ఉంటారు. వారు మాత్రమే సర్వాంతర్యామికి అనుగుణంగా ఉండగలరు. అందులోంచి బయటికి రారు. ఆయన పనులన్నీ పూర్తి తెలుసుకునే తత్వంలో చేతనస్థితిలో ఉంటాయి. అవి కరుణాపూరితం. మనకి అటువంటి చేతనస్థితి, తెలుసుకునే తత్త్వం ఉండవు కాబట్టి మన పనుల్ని సమర్థించుకోలేం. వాటిని అవతారమూర్తుల పనులతో పోల్చుకోలేం. పనులు ఒకే విధంగా ఉండవచ్చు కాని అంతరంగం, అందులో ఉద్దేశం వేరుగా ఉంటాయి. ఆదిశంకరాచార్యుల వారి జీవితం నుంచి ఒక చక్కని కథ:
ఆదిశంకరాచార్యులు శిష్యులతో ఒక చోటినుంచి మరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయనకి బాగా దాహం వేస్తుంది. ఎక్కడా నీళ్ళు దొరకవు. అక్కడ ఒక షాపు కనిపిస్తే అతడు మంచి నీళ్ళు అడుగుతాడు ఆదిశంకరాచార్యులు. అతను తన దగ్గర కల్లు మాత్రమే ఉంది, మంచినీళ్ళు లేవు అని చెబుతాడు.
ఆదిశంకరాచార్యులు అతనితో 'సరే! అదే ఇవ్వు, అని అడిగి కల్లు తాగి దాహం తీర్చుకుంటాడు. శిష్యులు ఇది చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు కూడా తృప్తిగా కల్లు తాగుతారు.
వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. ఆదిశంకరాచార్య మామూలుగా నడుస్తుంటారు కాని శిష్యులు ఆ మత్తులో సరిగ్గా నడవలేకపోతారు. అలా కొంత దూరం వెళ్ళాక ఇనుము కరిగించే దుకాణం వస్తుంది.
శంకరాచార్యులు ఇనుము కరిగించే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మంచి నీళ్ళు అడుగుతాడు. అతను తన దగ్గర మంచి నీరు లేదని చెబుతాడు. ఆదిశంకరాచార్య కరిగిన ఇనుముని ఇవ్వమని అడుగుతాడు.
ఆయన శిష్యులు నిర్ఘాంతపోయి ఆయననే చూస్తుంటారు. శంకరాచార్యులు కరిగిన ఇనుముని మంచి నీళ్లలా తాగి శిష్యుల వైపు తిరిగి మీరు కూడా తాగండి అంటాడు. శిష్యులు తలలు వంచి నిలబడతారు. అప్పుడు ఆయన శిష్యులతో నేను చేసే పనులు అనుకరించవద్దు. నేను చెప్పింది చేయండి, లేదా మీ మనస్సు చెప్పినట్టు నడుచుకోండి అని చెబుతాడు.
ఒక విషయం అర్థం చేసుకోండి. జ్ఞానోదయమైన యోగీశ్వరులు ఒక స్థితిలో ఉంటారు. అది సాధారణమానవులు ఉండే స్థితికి వేరుగా ఉండే స్థితి. కాబట్టి వారు మామూలు మనుషులు చేసే విధంగా చేయనవసరం లేదు. వారి ఉద్దేశం ముఖ్యం. దాన్ని మామూలు తర్కంతో వివరించలేం.
జ్ఞానోదయమైన యోగీశ్వరునికి వ్యక్తిగత ఆసక్తి ఉండదు ఎందుకంటే ఆయనలో నేను, నాది ఉండదు, ఆయనలోని వ్యక్తిత్వపు గుర్తింపు సర్వాంతర్యామిలో కరిగిపోయి ఉంటుంది.
ఉద్దేశం, చర్య
ఎవరిలోనైతే ఉద్దేశం లోతుగా, చేసిన పని తక్కువగా ఉంటే వారిలో సోమరితనం ఉంటుంది. అతను తమస్సులో ఉంటాడు. ఉద్దేశం చేసే పని సమానస్థాయిలో ఉంటే అసహనంగా ఉంటాడు. అదే రజస్సు (రజస్సు త్రిగుణాలలో ఒకటి, ఇది అసహనం). ఉద్దేశం లేకుండా కేవలం పని మాత్రం ఉంటే అది సత్త్వగుణం. అందుకే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుని యుద్ధం చేయమంటాడు. యుద్ధం చేయటం కాదు ముఖ్యం, దాని ఉద్దేశం. ఆ ఉద్దేశం కృష్ణుని ఉద్దేశమే. అదే విశ్వశక్తి ఉద్దేశం. ఎందుకంటే కృష్ణుడు విశ్వశక్తి కాబట్టి.
మీరు విశ్వశక్తికి అనుగుణంగా ఉంటే ఆ విశ్వశక్తి మిమ్మల్ని దీవిస్తుంది. అప్పుడు మీరు అన్ని అనుకూలసంఘటనలనే ఆకర్షిస్తారు. అందుకే ఎవరైనా అటువంటి వ్యక్తికి ఏది చేసినా వారికి నలుమూలల నుంచి మంచి వారిపై వర్షిస్తుంది.
ప్రతి రోజూ ఉండే ఉద్దేశం యొక్క శక్తి
మనం ఏడు రకాలైన భౌతిక, ప్రాణ, మానసిక, భావావేశాత్మక, కారణ, ఆనందమయ, నిర్వాణ శరీరాల గురించి తెలుసుకున్నాం. ఒక విషయం అర్థం చేసుకోండి. కారణ శరీరంలో ఆగామ్యకర్మ మనకి పూర్తి అందుబాటులో ఉంటుంది. కారణ శరీరంలో మీలోని నైపుణ్యాలు ఉండవచ్చు. క్రికెట్ ఆడటం, టెన్నిస్ ఆడగల నైపుణ్యం ఈ విధంగా ఉండవచ్చు. నిద్ర లేవగానే నేను క్రికెట్ ఆడాలి అని గట్టిగా నిర్ణయించుకొని ఆ ఉద్దేశంతో గాఢనిద్ర లోంచి లేస్తే, క్రికెట్ ఆడే వివేకం కారణశరీరం నుంచి దొరుకుతుంది. దానికి తగిన వాతావరణం, మేధలోకిని వెళతారు. నిద్ర పోయే ముందు రేపు గోల్ఫ్ ఆడాలి అనే గట్టి ఉద్దేశంతో పడుకుంటే తెల్లవారి నిద్ర లేచాక ఆ ఆట ఆడే నేర్పుతో నిద్ర లేస్తారు.
కారణశరీరం మారకం చేసే స్థలం, అది డబ్బు మారకం వంటిది. కారణశరీరంలో మీరు దేనిన్నై మార్చవచ్చు. మీరు కారణ శరీరంలోనికి వెళ్లినప్పుడు ఈ జన్మకి కారణమైన కర్మ మారిపోవచ్చు. మీరు బలమైన ఉద్దేశంతో ఉంటే దాన్ని మార్చవచ్చు. అది నిజమైన స్వేచ్ఛ.
మనం పోగుచేసుకున్న ఆగామ్యకర్మలని, మనం జన్మిస్తూ తెచ్చుకున్న ప్రారబ్దకర్మలని మార్చగల శక్తి బలమైన ఉద్దేశానికి ఉంటుంది. అయితే ఇది సంచితకర్మలని మార్చలేదు. సంచిత కర్మల్ని ఎవరికైతే ఎటువంటి కర్మలు ఉండవో ఆ గురుదేవుల కృపతో మాత్రమే సాధ్యమవుతుంది.
కార్యప్రచారసంఘం లేదా యంత్రం
గురుదేవుల్ని కలవటం, ఆయన చెప్పినవి చేయటం, ఎటువంటి ఉద్దేశం లేకుండా పనులు చేయటం - ఇవన్నీ కూడా జీవితం అనే ఆట మాత్రమే. ప్రత్యేక ఉద్దేశం లేకుండా చేసే పని సంఘ కార్యం లేదా మిషన్ ఏదైనా ఒక ఉద్దేశం లేదా కోరికతో చేసే పనిలో మీరు కేవలం యంత్రంలా ఉంటారు.
మీరు ఎటువంటి ఉద్దేశం లేకుండా పని చేస్తే మీరు మిషన్ (సంఘం) అవుతారు. సంఘం కావాలా, యంత్రంలా ఉంటారా అనేది మీ ఎంపిక. మీరు నా ఉద్దేశం ప్రకారం పని చేస్తూ అందులో మీ ఉద్దేశాన్ని కలపకుండా ఉంటే నేను మీకు శిక్షణ ఇస్తుంటాను. నేను చెప్పింది చేయండి. మీ ఉద్దేశాల నుంచి ప్రోత్సాహం తెచ్చుకోవద్దు. మీ ఆశ, భయాల నుంచి ప్రోత్సాహాన్ని పొందవద్దు. స్వచ్ఛమైన పని, అంటే ఎటువంటి ఉద్దేశాలూ లేని పని. అది మీకు పరిపూర్ణతని, సంతృప్తినిస్తుంది.
ఈ జన్మలో కర్మ అంటే ఏమిటి? అది మన పూర్తి కర్మ సూక్ష్మరూపం
మరొక విషయం అర్థంచేసుకోండి. మీకు ఉన్న సంచితకర్మలలో 100 కోరికలు మీ మూలాధారానికి సంబంధించినవి అనుకోండి. అంటే ఆశ కోరికలకి సంబంధించినవి. మరొక 100 స్వాధిష్టానానికి సంబంధించినవి అనుకోండి. అంటే భయం. మరొక 100 బాధలకి సంబంధించి మణిపూరకానికి చెందినవి. ఆ విధంగా మీకు 700 కోరికలు ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క చక్రానికి 100 చొప్పున 700 కోరికలు ఉన్నాయనుకోండి. వీటిలో ఒక్కోదాని నుంచి 10 తీసుకొని ఈ జన్మ తీసుకున్నారనుకోండి. మీకున్న సంచితకర్మల లోంచి తీసుకున్న ఈ కొద్ది భాగమే ప్రారబ్ధకర్మ.
జన్మతో వచ్చిన కర్మలని శ్వాస ద్వారా ఎలా కరిగించాలి
మరొక ముఖ్యవిషయం మీరు ఆగామ్యకర్మలని పోగుచేసుకోకుండా ఉండగలిగితే కేవలం శ్వాస ద్వారా జన్మతో తీసుకున్న ప్రారబ్ధకర్మలని కరిగించవచ్చు. అవి మీ ఆలోచనాక్రమంలోనే కరిగిపోతాయి.
ఉదాహరణకి మీరు ఎవరినైనా చూడగానే మీలో కోరిక బయటకి వస్తే ఆ ఉద్దేశంలో ఆ భావావేశంలో ఆ ప్రారబ్ధకర్మ కరిగిపోతుంది. ఆ విధంగా కాకుండా మీరు ఆ కోరిక తీర్చుకోవటానికి ఏదైనా చేస్తే అది ఆగామ్యకర్మని సృష్టిస్తుంది. మీరు ఏ పనీ చేయకుండా, ఎటువంటి ఆగామ్యని పోగుచేయకుండా ఆ కోరికని బయటకి శ్వాసించేస్తే ప్రారబ్ధం కరగిపోతుంది. తెలుసుకునే తత్వంతో శ్వాసించటం చేస్తే దానికి ఆ కర్మని మండించే శక్తి ఉంటుంది. అప్పుడు ప్రారబ్ధం కరిగిపోతుంది.
మా నిత్యానందస్ఫురణ ధ్యానకార్యక్రమంలో పాల్గొన్నవారిని ప్రాణశరీరంలో చేసే ధ్యానంతో అక్కడ ఉన్న కోరికల్ని, సంస్కారాల్ని కరిగించేస్తాం. వాళ్ళు తమ కోరికల్ని లిస్టులా రాస్తారు. వాటిని ధ్యానం చేసే సమయంలో శ్వాస ద్వారా తెలుసుకునే తత్వాన్ని ఆ కోరికలో ఉంచి, కోరికల్ని బయటకి శ్వాసింప చేస్తే అవి కరిగిపోతాయి.
అదే కత్తి మీకు గుచ్చుకుంటుంది
కర్మ అంటే బహుమతి కాదు, శిక్ష కాదు, భగవంతుడు పాపం చేసిన వారిని శిక్షించటానికి ఉపయోగించేది కాదు. అది మీ మానసికస్థితి. అదే మీకు స్వర్గం, నరకం అనే అనుభవాల్ని ఇస్తుంది.
ఒక చిన్న కథ : స్పీడుగా వెళుతున్న ఒక వ్యక్తిని ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటాడు. అతనికి వార్నింగ్ టికెట్ ఇవ్వబోతాడు.
అంతలో కారు లోంచి ఒకామె గట్టిగా, ‘చూడండి! నేను చెప్పాను స్పీడుగా వెళ్ళవద్దు. అలా వెళ్ళితే పట్టుబడతారు అని. ఎవరు మిమ్మల్ని అంత స్పీడుగా వెళ్ళమన్నారు. నేను జాగ్రత్త, నెమ్మదిగా వెళ్ళండి, గమనించండి, అంటే నన్ను నోరు మూసుకో అన్నారు. ఇప్పుడు చూడండి, పట్టుబడ్డారు. అంటుంది. గట్టిగట్టిగా అరుస్తూ. పోలీసు అతనితో ‘ఆమె ఎవరు’ అని అడుగుతాడు. అతను ‘ఆమె నా భార్య’ అంటాడు.
పోలీసు వార్నింగ్ టికెట్ చింపేసి, ‘ఇక వెళ్ళు. నీకు సరిపడా శిక్ష పడింది’ అంటాడు.
మీకు కోపం వస్తే పాపం వస్తుంది. దానితో తరువాత జన్మలో దాన్ని అనుభవించాలి అని అనుకోవటం సరి కాదు. ఇప్పుడు ఆ కోపంతో మీరు బాధ పడుతున్నారు. అదే మీరు అనుభవించే నరకబాధలు. మీరు కోపంతో ఏ విధంగా మరొకరిని బాధించారో అదే హింసని మీ అంతరంగంలో మీరు అనుభవిస్తారు.
మీరు బయటివారి మీద వేసే మంటలు, అదే వేడితో మీ అంతరంగంలో మిమ్మల్ని కాల్చివేస్తాయి. మీ కోపం ఎదుటివారిని కాలుస్తుందో లేదో తెలియదు కాని అది మాత్రం కచ్చితంగా మిమ్మల్ని మీ అంతరంగంలో కాలుస్తుంది. బయట ఎవరి మీదో మీరు కత్తి దూస్తే ముందుగా అది మిమ్మల్ని అదే తీవ్రతతో పొడుస్తుంది. గుర్తుంచుకోండి, దీనికి రెండు వైపులా పదునే.
గౌతమబుద్ధుని జీవితం నుంచి ఒక అందమైన కథ : ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుని ముఖం మీద ఉమ్మేస్తాడు. బుద్ధుడు ముఖం తుడుచుకొని అతనితో ‘నీవు ఇంకా ఏమైనా చెబుతావా? లేకపోతే ఇది చాలా? ’ అని అడుగుతాడు. బుద్ధుని శిష్యుడు ఆనందుడికి చాలా కోపం వస్తుంది. అతను లోపల మండిపోతుంటాడు. ఏ కారణం లేకుండా ఒక వ్యక్తి వచ్చి తన గురువుని అలా చేయటం అతనికి చాలా కోపాన్ని తెప్పిస్తుంది. అతను బుద్ధునితో, ‘భగవాన్! నాకు అనుమతిని ఇవ్వండి. ఇతని సంగతి నేను చూసుకుంటాను’ అంటాడు.
బుద్ధుడు ఆనందునితో, ‘నీవు సన్యాసివని మరిచిపోయావా? ఆ వ్యక్తి కోపంతో చాలా బాధపడుతున్నాడు. అతని కోపంతో ఉన్న ముఖం చూడు, అతని శరీరం కోపంతో ఎలా వణికిపోతున్నదో చూడు. అతను నా ముఖం మీద ఊసే ముందు ఆనందంలో ఉత్సవం చేసుకుంటున్నాడు అని అనుకున్నావా? అతను కోపంతో పిచ్చివాడయ్యా అప్పుడు వచ్చి నా మీద ఊసాడు.
అతను ఆ స్థితిలో ఉండటం కంటే మరొక శిక్ష ఏముంది? అతను నాకు చేసిన హాని ఏముంది? అతను ఊసింది తుడుచుకున్నాను. ఇప్పుడు నీవు కోపం తెచ్చుకోకు. అలా చేస్తే నీ లోపల అదే స్థితి ఏర్పడుతుంది. నిన్ను నీవు ఎందుకు శిక్షించుకుంటావు? అది తెలివితక్కువతనం. అతని పట్ల జాలి చూపించు.’ అని అంటాడు.
బుద్ధుడు అతనితో, ‘ఇంటికి వెళ్ళు. నీవు చాలా అలసిపోయావు. నిన్ను నీవు శిక్షించుకున్నది చాలు. నీవు నా పట్ల ఎలా ప్రవర్తించావో మర్చిపో. ఈ శరీరం తిరిగి భూమిలో కలవవలసిందే. అప్పుడు అందరూ దీని మీద అన్నీ చేస్తారు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో ’ అంటాడు. బుద్ధుని జవాబుతో ఆ వ్యక్తి పూర్తిగా కదలిపోతాడు. అతను ఇంటికి వెళ్ళి తిరిగి సాయంత్రం వచ్చి బుద్ధుని పాదాల మీద పడి క్షమించమని దీనంగా ప్రార్థిస్తాడు.
బుద్ధుడు చాలా శాంతంగా ‘నాకు కోపం లేదు ఇక నేను నిన్ను క్షమించటం ఏమిటి? నీవు ఆ కోపం నుంచి స్వేచ్ఛని పొందటం చూసి ఆనందంగా ఉన్నది. ఒక మాట గుర్తుంచుకో. ఇటువంటి పని మరి చేయకు. ఈ విధంగానే నీకు నీవు నరకాన్ని సృష్టించుకుంటావు’ అని చెబుతాడు.
ధర్మం, కర్మ
మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఎవరైతే మిమ్మల్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో, అటువంటి వారి దగ్గర నుంచే గౌరవాన్ని పొందండి. అటువంటి వ్యక్తి ఎప్పటికీ మిమ్మల్ని అగౌరవపరచడు. ఒకవేళ అగౌరవపరచినా అతనే బాధపడతాడు. మీరు బాధపడరు. ధర్మమార్గంలో జీవించండి. మిమ్మల్ని స్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి మాత్రమే మిమ్మల్ని గౌరవించేందుకు అనుమతించండి. ఒకవేళ వారు మిమ్మల్ని అగౌరవపరచినా అది మిమ్మల్ని అంటదు. ఎందుకంటే ధర్మానికి శక్తి ఎక్కువ. అది మీ అంతరంగమంతా నిండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.
ధర్మం అంటే మీ అంతరంగం పట్ల స్పష్టతతో, నిజాయితీగాంటూ, దాన్ని అర్థం చేసుకోవటమే. ధర్మం అంటే చేతనస్థితిలో, ధర్మ బద్ధంగా జీవించటమే. ధర్మం అంటే సమాజం చెప్పే నీతినియమాలలో జీవించటం కాదు. మీరు సమాజం చెప్పిన నీతి నియమాలలో జీవింెచేతే బయట ప్రపంచంలో మీకు రక్షణ ఉంటుంది. మీరు ధర్మమార్గాన్ని అనుసరించితే మీ అంతరంగప్రపంచంలో రక్షణ ఉంటుంది. మీరు ధర్మమార్గంలో ఉంటే నిరంతరం సరైన విధంగా ఉంటారు. మీరు నిరాశకి లోను కారు.
మనం బయట ప్రపంచరక్షణ కోసం న్యాయసూత్రాల్ని అధికంగా పట్టించుకుంటాం. అర్థం చేసుకోండి, మీరు ధర్మాన్ని అనుసరించండి. మీరు సమస్యలలో ఇరుక్కోరు, నిరాశతో కుంగిపోరు.
బయట ప్రపంచసమస్యల కంటే అంతరంగప్రపంచ సమస్యలు చాల బలమైనవి, అవి చాలా ప్రమాదకరం. అంతరంగ ప్రపంచ సమస్య వస్తే మీరు కదలిపోతారు, వణికిపోతారు. అప్పుడే బయట ప్రపంచసమస్యల్ని మీలోనికి తెచ్చుకుంటారు. మీ అనుబంధాలు అన్నీ ధర్మపథంలో స్పష్టతతో ఉండాలి. మీ బోధలతో మీరు అంటే తెలుసుకున్నవారు మిమ్మల్ని అవమానపరిస్తే మీరు బాధపడరు. మీరు వారి చేత ప్రభావితం కారు. ఆ వ్యక్తి నిరాశ, కుంగుబాటులకి లోనవుతాడు. సమాజంలో న్యాయసూత్రాలు ఏవిధంగా తయారుచేయబడి, ఒక పద్ధతిలో ఆచరించబడతాయో అదే విధంగా అంతరంగప్రపంచ న్యాయసూత్రాలు సర్వాంతర్యామి చేత చేయబడి ఉంటాయి. ధర్మాన్ని అనుసరించండి. అది ఇంకా వర్ధిల్లుతూ ఉన్నది.
ఒక చక్కని మాట ఉన్నది ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఎప్పుడైతే సర్వాంతర్యామి న్యాయాన్ని మీరు నిలబెడతారో, దాని మార్గంలో జీవిస్తారో, ఆ న్యాయం మీకు శక్తిని ఇస్తుంది. ధర్మం తాలూకు న్యాయసూత్రాలు చాలా శక్తివంతమైనవి.
నన్ను చాలామంది అడుగుతుంటారు, 'స్వామీజీ! మంచివారు బాధలు పడటం, చెడ్డవాళ్ళు సంతోషంగా ఉండటం నేను చూసాను, ఇది ఎలా అని. ముందు ఒక విషయం అర్థంచేసుకోండి, మంచివాళ్ళు ఎప్పుడూ బాధపడరు కాని ఆ విధంగా కనిపిస్తారు. వాళ్ళు నిజంగా బాధపడితే ఎక్కడో ధర్మమార్గం తప్పింది అని అర్థం. మంచివాళ్ళకి బాధలు ఎక్కువ చెడ్డవారు సంతోషంగా ఉంటారు అన్న మాట తప్పుగా అర్థం చేసుకున్న మాట. ఒక సరదా మాట ఉన్నది. అదృష్టం అంటే ఏమిటి? ఎవరికైతే అవసరం లేదో వారికి విజయాన్ని ఇచ్చిన ఒక కారకం.
వక్రమార్గంలో అర్థం చేసుకున్న మాట ధర్మం కాదు. మరొక ముఖ్య విషయం మీ అనుభవంలో ఒక భాగం కాని ఉన్నత శ్రేణి విషయాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైన విషయాలు, సత్యం పట్ల మాత్రం నిజాయితీగా ఉండండి, అది చాలు.
మీరు ధర్మస్థాయిలో ఉంటే పూర్తిగా ధర్మంలోనే ఉండండి. అదే స్వధర్మం. మీ అంతరంగంలో అతిముఖ్యమైన భాగం అయిన ధర్మం విషయంలో నిజాయితీగా ఉంటూ, దానికి అనుగుణంగా ఉంటే చాలు.
అప్పుడు మీలో అనవసరమైన కదలికలు ఉండవు. మీరు నిరాశలో పడరు. మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. నేను చెబుతున్నాను, మీరు ధర్మాన్ని రక్షిస్తే అది మీకు చాలా శక్తిని ఇస్తుంది. అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది.
బాధ్యత
కర్మసిద్ధాంతం ఏమి చెబుతుందంటే మీకు ఏది జరిగితే అది మీ పని వల్లనే అని. మీ బయట నుంచి మీకు ఏమీ జరగదు. మీకు జరిగేదంతా మీరు సృష్టించుకున్నదే. అయితే ఈ విషయం చాలావరకు మీకు తెలియదు. మీరు చేతన స్థితిలో ఉండరు, కాబట్టి చేసేవన్నీ మీరు చూడరు. మీరు విచారంగా ఉన్నప్పుడు దానిలోకి చూడండి. దాని మీద ధ్యానం చేయండి. ఏ విధంగా ఆ విచారాన్ని మీరు సృష్టించుకున్నారో తెలుసుకోండి, ఆ విచారణకి కారణం మీ లోపల ఎక్కడ ఉన్నదో చూడండి. మీ విచారణకి అందరూ కారణం అని మీ మనస్సు చెబుతుంది. మీ భార్య లేక భర్త స్నేహితుడు, బాస్, పక్కింటివాళ్ళు - ఇలా ఎవరో ఒకరు కారణం అని చెబుతుంది.
ఒక చిన్న కథ : న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టెజ్మెంటు వస్తుంది. 'మా సంస్థలో ఉద్యోగం చేయటానికి ఒక బాధ్యత గల వ్యక్తి కావాలి' అని. ఒక వ్యక్తి ఆ ఉద్యోగం కోసం వెళతాడు. అతను బాస్‌తో' నేను మీ ఉద్యోగానికి సరిగ్గా సరిపోయే వ్యక్తిని అంటాడు. బాస్ కుతూహలంగా 'ఎందుకు?' అంటాడు.
ఆ వ్యక్తి 'నేను ఎక్కడ పని చేసినా అక్కడ ఏ తప్పు జరిగినా నాదే బాధ్యత అనే వారు.' అని జవాబు చెబుతాడు. స్పష్టంగా తెలుసుకోండి, మీరు ఏమి చెప్పినా, ఏది చేసినా దానికి బాధ్యులు మీరే.
మీరు నిశ్శబ్దంగా అనుమతించకపోతే ఎవరూ మిమ్మల్ని బాధపెట్టలేరు. ఒక్కసారి మీరు ఏం జరిగినా దానికి బాధ్యత మీ లోపలనే ఉన్నది అని తెలుసుకుంటారో, అప్పుడు అకస్మాత్తుగా జరిగే మార్పులు చూడవచ్చు. మీ పైన పూర్తి బాధ్యత మీరే తీసుకోండి. అప్పుడు మీరు ఏది చేసినా చాలా చక్కగా చేయగలరు.
ఎదుటివారిని తప్పు పట్టడం ఆపితే, జరిగేవాటి కన్నింటికీ మీరే బాధ్యులు అని తెలుసుకుంటే, మీరు ప్రతి పనిని తెలుసుకునే తత్వంతో చూడగలరు. మీ ప్రతి ఆలోచనా మీకు తెలుస్తుంది.
ఆ మాత్రం తెలుసుకోగలిగితే చాలు, మీరు వివేకంతో ఏ పనైనా చేస్తారు. మీరు విచారంగా ఉండాలి అంటే విచారంగా ఉంటారు. దానిలో తప్పు లేదు. విచారంలో పూర్తి విచారంతోనే ఉండండి. విచారం అవసరం లేదు అనుకుంటే సంతోషంగా ఉండండి, అంతే.
మీ సమస్యల్ని మీరు ఎలా సృష్టించుకుంటారో గమనించండి. రకరకాల మూడ్స్‌ని ఎలా తయారుచేసుకుంటారో, గమనించండి. మీరు తయారు చేసుకున్నవాటికి ఎదుటివారిని బాధ్యుల్ని చేసే తెలివితక్కువ పని చేయకండి. అలా చేస్తే మీరు ఎప్పటికీ మారరు. మీరు ఎప్పటికీ విచారంగానే ఉంటారు. ఎందుకంటే మీరు ఏమీ చేయలేరు. కాబట్టి ఎదుటివారు అన్నీ చేస్తున్నారు
- అని మీరు అనుకుంటే ఇక మీరు ఏం చేయగలరు? మీ పాత్ర ఏముంది? అప్పుడు మీ చేతుల్లో ఏమీ ఉండదు. మీరు ఎదుటివారు మారేదాకా ఎదురుచూడాలి. కాని మార్పు ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీ లోపల జరిగే వాటికన్నింటికీ ఎదుటివారు బాధ్యులు కాదు.
కర్మ, మీ తరువాత శరీరం
తరువాత జన్మని ఎలా ఎంచుకుంటాం : మన నుంచి జీవశక్తి బయటకి వెళ్ళగానే, అది మూడు క్షణాల్లో తరువాత శరీరాన్ని తీసుకుంటుంది. మరణించే సమయంలో మీ లోపల ఉన్న అత్యంతసంతోషకరమైన మూడు అనుభవాలు మీ చివరి ఆలోచనలో ఉంటాయి. ఈ మూడు అనుభవాల ఆధారంగా ఏర్పడే మీ మానసికవ్యవస్థ ఆధారంగా తరువాతి శరీరాన్ని తీసుకుంటారు.

ఈ మూడు ఆలోచనలు ఒక్కొక్క కర్మనుంచి, సంచిత, ప్రారబ్ధ ఆగామ్యకర్మల నుంచి ఉంటాయి. దీని ఆధారంగా ఈ జీవితంలో ప్రారబ్ధకర్మలు రూపుదిద్దుకుంటాయి.
ఆధ్యాత్మికజీవనసరళి సంచితకర్మల్ని తగ్గిస్తుంది, తెలుసుకునే తత్వంలో జీవించేలా చేస్తుంది.
ధ్యానం ప్రారబ్ధకర్మల్ని తగ్గిస్తుంది. ధ్యానం చేతనస్థితిలో, భౌతికస్థితిలో సహాయం చేయటమే కాదు, అచేతనస్థితి లోనికి చొచ్చుకుపోయి అక్కడ భౌతిక - మానసిక - ఆత్మస్థాయిలో శుభ్రం చేసి, స్వచ్ఛంగా ఉంచగలుగుతుంది.
అయితే కర్మల అకౌంటులో పెద్ద బ్యాలెన్స్ సంచితకర్మలు. అవి కేవలం గురువుల కృపతోనే కరిగిపోతాయి.
ఈ కర్మలు కరిగిపోయే కొద్దీ తరువాత శరీరాన్ని తీసుకొనేటప్పుడు ఉండే అడ్డంకులు తొలుగుతాయి.ఈ మూడు కర్మలూ తరువాత శరీరంలో లోతుగా ఉండవలసిన అనుభవాల్ని నిర్దేశిస్తాయి. తరువాత తీసుకునే శరీరం ఆ అనుభవాలకి అనుగుణంగా ఉండాలి. అది ఈ విధంగా ఉంటుంది, నేను ఇంగ్లీషు మాట్లాడే వ్యక్తిని కలవాలి అనుకుంటే నాకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా నేను ఇంగ్లీషు, స్పానిష్, జర్మన్ మాట్లాడగలిగే వ్యక్తిని కలవాలి అనుకుంటే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
అదే విధంగా మీకు మూడు కర్మలూ ఉంటే మరొక శరీరాన్ని తీసుకునేటప్పుడు చాలా అడ్డంకులు ఉంటాయి.
ఉదాహరణకి మీ సంచితకర్మల నుంచి ఉన్న కోరిక నేను అందంగా ఉండాలి అని, ప్రారబ్ధం అంటే జన్మ తీసుకున్న కర్మ నుంచి నేను బాగా డబ్బున్నవాడి నై ఉండాలి అనే కోరిక, జన్మలో పోగుచేసుకున్న ఆగామ్యకర్మ నుంచి నేను అమెరికాలో సెటిల్ అవ్వాలి అనే కోరిక ఉన్నాయనుకోండి. అప్పుడు శరీరం దొరకటం మీ జీవశక్తికి కష్టంగా ఉంటుంది.
శరీరాన్ని వదిలిన మూడు క్షణాల్లో అటువంటి శరీరం అంత తక్కువ సమయంలో దొరకటం కష్టం. అప్పుడు జీవశక్తి ఉన్నవాటిలో బలమైన కోరికని తృప్తిపరచగల శరీరాన్ని తీసుకుంటుంది. ముందు శరీరాన్ని వదిలే సమయంలో ఉన్న కోరికలు, మానసికవ్యవస్థ వీటినే వాసన అంటారు.
ఈ మూడు కోరికల్ని, మూడు ఆలోచనల్ని ఒక్క క్షణదర్శనంలా మూడు క్షణాల్లో ఒక వాసనలా చూస్తారు. వాసన అనేది టెలివిజన్ ఛానెల్. ఆ వాసనకి ఆకర్షితమైన శరీరం టెలివిజన్ సెట్టుని ఆ ఛానెల్ కి ట్యూన్ చేయటమే. వాసన లోతు శరీరానికి సరిపడనప్పుడు అది జీవశక్తిని ఆకర్షిస్తుంది. ట్యూన్ చేసిన టి.వి. ఏ విధంగా ఛానెల్ కి తగిన విద్యుత్తరంగాలని ఆకర్షిస్తుందో, వాసన తగిన శరీరాన్ని ఆకర్షిస్తుంది.
జీవశక్తి, ఆత్మశరీరాన్ని వదిలి తాను ఎంచుకున్న కొత్త శరీరం లోనికి ప్రవేశించి తల్లి గర్భం నుంచి బయటికి వస్తుంది. తల్లి గర్భంలో శరీరం లోనికి ప్రవేశిస్తుంది. కారణశరీరంలోని చీకటి తల్లి గర్భంలోని చీకటితో పోలి ఉంటుంది. శరీరం తల్లిదండ్రుల శక్తితో తయారయ్యి ఉంటుంది. కాబట్టి జీవశక్తి తన కోరికలు, వాసనలు, మానసికవ్యవస్థ ఆధారంగా, ఆ రెండు శక్తులూ కలసి ఉన్న శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంచుకోరు. బిడ్డలే తల్లిదండ్రులని ఎంపిక చేసుకుంటారు.
ఒక శరీరాన్ని ఎంపిక చేసుకున్నాక, జీవాత్మ మిగిలిన రెండు కోరికలనీ తృప్తిపరచాలి. అయితే అందుకు అనువైన శరీరం దొరకలేదు. అయితే చీకటిలో తల్లి గర్భంలో తాను పొందిన బాధతో ఆత్మ తనలోని వాసనలని మరిచిపోయి కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఈ కొత్త శరీరం పాత శరీరాన్ని వదిలేటప్పటి కోరికల్ని గుర్తుంచుకోలేదు. దారిలో తాను ఏ కోరికతో పాత శరీరాన్ని వదిలిందో, వాటిని మరిచిపోతుంది. ఆ కోరికలు తీర్చటం బదులు కొత్త శరీరం కొత్త కోరికల్ని తెచ్చుకొని కొత్త కర్మల్ని పోగుచేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ మూడు కర్మలలో ఒకటి పోతుందో, జీవాత్మకి తన ఎంపిక మీద ఏకాగ్రత ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోగుచేసుకున్న ఆగామ్యకర్మ, జన్మతో తెచ్చుకున్న ప్రారబ్ధకర్మల్ని ధ్యానం ద్వారా, జీవనసరళిని అర్థం చేసుకోవటం ద్వారా పోగొట్టుకోవచ్చు. గురుకృపతో సంచితకర్మలు తగ్గించుకోవచ్చు.
ఒకసారి సంచితకర్మలు పూర్తిగా శుభ్రపడితే ఇక మరొక శరీరాన్ని తీసుకోవలసిన అవసరం ఉండదు. ఒకవేళ మరొక జన్మ తీసుకున్నా అది పొంగి ప్రవహించే ఉత్సాహంతో ఆనందంతో ఉంటుంది. అప్పుడు జన్మ చేతనస్థితిలో జరుగుతుంది. ఎందుకంటే బలంగా శరీరం వైపు లాగే కర్మలు ఉండవు కాబట్టి. వారు జీవించే జీవితం లీల, కారణం లేని ఒక నాటకం, ఒక ఆట. ఇదంతా అవతారమూర్తులు ఆడే ఆట.

జననమరణచక్రం ఎలా ప్రారంభ మవుతుంది?
మన అందరికీ మన పూర్తి సంచితకర్మ ప్రారంభంలో ఒక దైవనాటకం. జ్ఞానోదయమైన యోగికి అది ఎప్పుడూ దైవనాటకమే. ఎందుకంటే ఆయనకి కర్మలు ఉండవు కాబట్టి. ఇది ఆట ఎందుకంటే మీరంతా ఆడేది ఆ భగవంతుని ఆటని మాత్రమే.
మనం ఎంచుకొని జన్మ తీసుకుంటాం. మన ప్రారబ్ధకర్మలు మరిచిపోయి ఆగామ్యకర్మల్ని పోగు చేసుకుంటూ సంచితకర్మల్ని మరింత పెంచుకుంటాం. తరువాత పెరిగిన కర్మల భారం తొలగించుకోవటానికి మరొక జన్మ తీసుకుంటాం. మరలా చాలా కర్మల్ని పోగు చేసుకుంటాం. ఈ విధంగా జనన మరణాల చక్రం ఏర్పడుతుంది.
ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు పోగు చేసుకున్న ఆగామ్యకర్మలే మీకు బంధాలు మొత్తం కర్మలైన సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు సర్వాంతర్యామి ఆట. దాని ఫలితం ఆ జన్మలోని కర్మ జన్మించాక తిరిగి కర్మల్ని పోగుచేసుకోకుండా ఉంటే సర్వాంతర్యామి ఆట కొనసాగుతుంది. బంధాలు పోగుచేసుకున్న కర్మలతోనే ఉంటుంది.
మనిషి తరువాతి జన్మలో జంతువుగా పక్షిగా, పురుగుగా లేక మనిషిగా - జన్మ తీసుకుంటాడు?
ఇది మంచి ప్రశ్న. ఈ సత్యాన్ని ధైర్యంగా చెబుతాను. జననమరణచక్రానికి సంబంధించిన ఊహలని మీకు పోగొడతాను.
ఒకసారి మనిషి జన్మ తీసుకున్నాక అతను తిరిగి మనిషిగానే జన్మిస్తాడు. అతను చేతనస్థితికి వ్యతిరేకంగా ఏ పని చేసినా అంటే ఎదుటివారిని మాటల ద్వారా చేతల ద్వారా భౌతికంగా, మానసికంగా బాధిస్తే, సర్వసృష్టి గురుదేవులు లేదా మానసికచేతనస్థితి ఏమైతే సర్వాంతర్యామి స్వరూపంలో వారిని బాధిస్తే తిరిగి మనిషి జన్మ పొందకపోవచ్చు. ఈ పనుల తీవ్రత విశ్వశక్తిలో రికార్డు చేయబడతాయి. ఒక విషయం అర్థంచేసుకోండి, పని ఒకటే కాదు దాని తీవ్రత కూడా ముఖ్యం.
ఏ వ్యక్తి అయితే అత్యల్పచేతనస్థితిలో జీవిస్తాడో అతను జంతువుగా జన్మ తీసుకుంటాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి జీవితం అంతా తినడానికి, నిద్ర పోవడానికే గడిపితే అతను జంతువుగా జన్మిస్తాడు. మనిషికి ఉండే ప్రత్యేకలక్షణాలైన ప్రేమని పంచటం, జ్ఞానోదయం కోసం తపించటం ఇటువంటివి కనీసం ఒక్కసారైనా అనుభవాన్ని పొందకపోతే అతను జంతువుగా జన్మిస్తాడు. ఎందుకంటే అతని శరీరం మానవశరీరమే కాని అతనిలో అనుభవాలు మేలుకొనలేదు.
మనం దేని గురించి అయినా బలంగా అనుకుంటే అది ప్రారబ్ధం కాకుండా ఉంటే తరువాతి జన్మ కోసం ఎదురుచూడాలా?
లేదు, మీరు మీ ప్రారబ్ధాన్ని బలమైన సంకల్పం ద్వారా మార్చవచ్చు. మీలో సంకల్పం బలంగా ఉంటే ఈ జన్మలోనే మీకు పునర్జన్మ జరగవచ్చు. ఆ తరువాత జన్మ ఇప్పుడే తీసుకుంటారు. ఉదాహరణకి గృహస్థులు, బాధ్యతలలో చిక్కుకుపోయి ఉన్నవారు నన్ను అడుగుతుంటారు, 'స్వామీజీ, కనీసం వచ్చే జన్మలోనేనా నేను మీతో ఉండేలా దీవించండి' అంటారు. వాళ్ళు కొన్ని నెలలోనే ఆశ్రమవాసులవుతారు. ఇదంతా వారి సంకల్పబలం మాత్రమే.
జ్ఞానోదయం - తిరిగి మన ఇంటికి వెళ్ళటం
సర్వాంతర్యామి అనే మహాసముద్రంలో పైకి లేచిన ఒక కెరటం మీరు. కెరటం పైకి లేచినా అది సముద్రంతో అనుబంధాన్ని కలిగిఉంటుంది. అది తాను స్వతంత్రమైన ఉనికి కలిగి ఉన్నాను అని అనుకుంటుంది. కాని అది ఒక ఊహ. అది సముద్రానికి పైన లేచినా, సముద్రంలో పడిపోతున్నా కెరటం సముద్రంలో ఒక భాగమే.
దానంతట అది సంతోషంతో శరీరాన్ని తీసుకుంటే దానికి ఆగామ్యకర్మలు ఉండవు. ఎప్పుడైతే ఆగామ్యకర్మల్ని పోగుచేసుకుంటుందో స్వచ్ఛమైన సంచిత కర్మ కూడా కలుషితం అవుతుంది. ఆ సంచిత కర్మ తిరిగి మరు జన్మలోనే పోగొట్టుకోలుగుతారు. కల్మషమైన సంచిత కర్మ జనన మరణ చక్రాన్ని సృష్టిస్తుంది. ఆ విధంగా జననమరణచక్రం తయారవుతుంది.
జీవాత్మ కొత్త శరీరాన్ని తీసుకున్నాక ప్రారబ్ధకర్మల్ని మరిచిపోతుంది. కాబట్టి ఏ కోరికలతో మీరు మీ క్రితం జన్మ శరీరాన్ని వదిలారో అది మరిచిపోతారు. ఆ కోరికలని గుర్తు చేసి, వాటిని ఈ జన్మలో సాధించేలా చేసేది తపస్సు, అదే జ్ఞానోదయం పొందటం. కాబట్టి దివ్యనాటకం ద్వారా జన్మించినప్పుడు మీరు మరిచిపోతే ఏమవుతుంది. కర్మల భారం ఎక్కువైనప్పుడు తెలుసుకుంటారు, ఎక్కడో ఏదో సమస్య ఉన్నది అని అర్థం అవుతుంది. అప్పుడు మేల్కొని జ్ఞానోదయం పొందాలని చూస్తారు. తిరిగి జ్ఞానోదయం పొందుతారు. తిరిగి వెనక్కి రావటమే జ్ఞానోదయం.
కొన్నిసార్లు భయంకరమైన కల వచ్చినప్పుడు మాత్రమే ఇది కల అని వెంటనే అనుకుంటారు. అప్పుడు మేలుకొంటారు. నేను కలకంటున్నాను అన్న ఆలోచన వచ్చినప్పుడు మీరు జ్ఞానోదయం పొందుతారు. నేను కల కంటున్నాను, ఈ ప్రపంచం ఒక కల అని తెలుసుకొని అబద్ధమైన ప్రపంచాన్ని వదిలివేసి, సత్యాన్ని పట్టుకోవటమే జ్ఞానోదయం. ఈ ప్రపంచంలో అవే అనుభవాలు వాటితో అలసిపోతారు. అప్పుడు మీకు అనుమానం వస్తుంది, నేను కల కంటున్నానా అనుకుంటారు. అప్పుడు ప్రపంచాన్ని అనుమానిస్తారు. ప్రపంచం మీకు చేసిన ప్రమాణాల్ని అనుమానిస్తారు.
ఇదంతా న్యూస్ పేపర్ అడ్వర్టైజ్‌మెంట్‌లా ఉంటుంది. అందమైన బీచ్, చక్కని టేబుల్, దాని మీద రుచికరమైన పదార్థాలు, అంతా స్వర్గంలా ఉంటుంది. అది అత్యంతవిలాసాన్ని మీకు ఆశ పెడుతుంది. ఆ ప్రమాణాన్ని అనుమానిస్తారు, ఎందుకంటే వందమంది దీన్ని చూసి అక్కడికి వెళితే వారి అందరికీ అదే ఆనందపారవశ్యం కలగదు. ఈ విషయం మీరు తెలుసుకుంటారు. జీవితం కూడా అంతే, మీ మనస్సు చేసే ప్రమాణాలు నెరవేరలేదు అని తెలిసి అనుమానిస్తుంటారు.
కర్మ నుంచి బయటికి రావడానికి సాధనపద్ధతులు
స్వేచ్ఛ పొందటానికి తిరిగి జీవించండి : ఇంత వరకు మనం చెప్పుకున్న విషయాలు కర్మలు రాకుండా ఎలా ఉండాలి అని. దాని నుంచి తప్పించుకోవటానికి ఒక చిన్న సాధన చెబుతాను. ఈ క్షణం నుంచి ప్రయత్నించి, మీ జీవితంలోని అన్ని సంఘటల్ని గుర్తుచేసుకోండి. మీ చిన్నతనపు రోజుల వరకూ వెళ్ళండి. మీరు గుర్తు తెచ్చుకోగలిగినంత గుర్తు తెచ్చుకోండి.
మీకు గుర్తుకు రాని విషయాల గురించి పట్టించుకోవద్దు. ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు గుర్తు పెట్టుకోలేనివి కేవలం వేలాడేవి మాత్రమే. అవి మిమ్మల్ని లోతుగా ప్రభావితం చేయలేదు. అందుకే మీ జ్ఞాపకాలలో అవి లేవు. ఈ పద్ధతిని ఒక సంవత్సరం సాధన చేయండి. తిరిగి అందులో జీవిస్తే దాని నుంచి స్వేచ్ఛ దొరుకుతుంది.
నిత్యానందస్ఫురణ కార్యక్రమంలో ఈ విషయం మీదే ఏకాగ్రతని ఉంచి కర్మలు పోయేలా చేస్తాం. అది జ్ఞానోదయం అయిన యోగీశ్వరుని సమక్షంలో మీరు తీసుకునే ఆధ్యాత్మికస్నానం.
విగ్రహాలు - జ్ఞానోదయమైన యోగీశ్వరులు : మీ కర్మలు పోగొట్టే మార్గం
తిరిగి కర్మల్ని పోగుచేసుకోవద్దు అని పదే పదే గుర్తుచేయటానికి ఒక దారి ఉన్నది. మీ గతంకర్మల ప్రభావం లేకుండా జీవించటానికి మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది కర్మ ఉన్నత చేతనస్థితి సమక్షంలో శక్తి హీనమవుతుంది అని అర్థం చేసుకోవటం. సాధారణ మానవులకి, జ్ఞానోదయం అయిన గురువులకి మధ్య చాలా తేడా ఉన్నది. సాధారణ మానవునికి తన సంకల్పంతో తన శరీరాన్ని జీవింపజేసి ఉంచే శక్తి లేదు. అంటే మామూలు మనిషి శరీరం జీవించి ఉంటుంది లేదా మరణిస్తుంది. అది అతని నియంత్రణలో ఉండదు.
కాని జ్ఞానోదయమైన వారికి అది వారి నియంత్రణలో ఉంటుంది. ఆయన తన శరీరాన్ని జీవంతో ఉంచగలడు లేదా విశ్రాంతి ఇవ్వగలడు. ఈ శక్తి ద్వారా ఆయన మరొక శరీరానికి కూడా జీవితాన్ని ఇవ్వగలడు. ఆయన ఒక రాతికి కాని, లోహానికి కాని ప్రాణాన్ని ఇస్తే అది ఆయన ప్రతినిధి అవుతుంది.
మనకి ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలలోని విగ్రహాలన్నీ జ్ఞానోదయమైన యోగీశ్వరుల చేత ప్రాణప్రతిష్ఠ కావించబడ్డాయి. అరుణగిరి యోగీశ్వరుడు తిరువణ్ణామలైలోను, పతంజలి చిదంబరంలోను, కరూరార్ తంజావూరులోను, కొంగనావర్ తిరుపతిలోను, మీనాక్షి మదురైలోను ఆయా విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేశారు.
అందుకే విగ్రహాలు సాక్షాత్తు జ్ఞానోదయమైన యోగీశ్వరుల శరీరాలతో సమానం. యోగీశ్వరులు శరీరాన్ని వదిలాక కూడా వారి శిష్యులు ఆ విగ్రహాలకి సేవ చేస్తుంటారు. ఆ విగ్రహాన్ని గురుదేవుల శరీరంగానే భావిస్తారు. అందుకే విగ్రహాలకి గురుదేవులకి చేసే సేవలన్నీ చేస్తారు. ఉదాహరణకి అరుణగిరి యోగీశ్వరుని శిష్యులు, అరుణాచలం గుడిలో కొన్ని తరాలుగా అవే సేవల్ని అందిస్తున్నారు. గురుదేవులకి ఏ విధంగా సేవ చేసేవారో విగ్రహాలకి కూడా అవే చేస్తారు.
గురుదేవులు శరీరాన్ని వదిలాక కూడా ఈ విగ్రహాల ద్వారా శిష్యులకి అందుబాటులో ఉంటారు. ఉదాహరణకి నా జీవితకాలంలో నా భౌతికశరీరం, నా సమక్షం అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ విగ్రహాలని ఏ విధంగా చేశాను అంటే నేను భౌతికంగా లేని చోట అవి నా ప్రతినిధిగా పని చేస్తాయి.
విగ్రహాలకి స్వతంత్రమైన మేధ ఉంటుంది. వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేయటం చాలా పెద్ద కార్యక్రమం. అది బిడ్డకి జన్మనివ్వటం లాంటిది. ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలు డైరెక్ట్‌గా మీ ప్రార్థనని ఆలకించి, జవాబు ఇవ్వగలవు. మీరు వాటితో అనుబంధాన్ని పెంచుకోగలిగితే అవి డైరెక్ట్‌గా మీతో అనుబంధాన్ని పెంచుకుంటాయి. మీరు మా ఆశ్రమంలో పూజ, మొదలైన కార్యక్రమాలు చూస్తే అర్థం అవుతుంది. ఉదయాన్నే సుప్రభాతం ఉంటుంది. అక్కడ విగ్రహానికి సుప్రభాతసేవ అది. తరువాత చిన్న గిన్నెలో నూనె తెలకి రాసుకోవడానికి, పళ్ళు పొడి బ్రష్ చేసుకోవడానికి ఇస్తారు. తరువాత స్నానం చేయించి ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు ఇస్తారు. తరువాత గురుదేవులకి ఇచ్చినట్టే (ఆహారం) నివేదన చేస్తారు. హారతి ఇస్తారు. రాత్రి ఒక ఉత్సవంలా ఆ విగ్రహానికి పవళింపుసేవ చేస్తారు.
ఒక విషయం అర్థం చేసుకోండి. ఇదంతా చేయటం విగ్రహాలు కాని, గురువు కాని ఏమీ పొందరు. అది మనకి జరుగుతుంది. దీనినే భగవంతునితో జీవించటం అంటారు. గురుదేవుల సమక్షాన్ని సాధన చేయటమే పూజ. ప్రతి రోజూ పూజ చేయటం వల్ల గురుదేవుల సమక్షాన్ని, భగవంతుని సమక్షాన్ని గుర్తు చేసుకోవటమే.
పూజలు, హోమాలు మొదలైనవి
పూజా కార్యక్రమాలు చాలా శక్తివంతమైనవి. వాటికి చాలా శక్తి ఉన్నది. నన్ను చాలా మంది అడుగుతుంటారు, 'మీరు జ్ఞానోదయమైన యోగీశ్వరులు కదా మీరు ఎందుకు పూజాకార్యక్రమాలు చేస్తారు అని. నేను వాళ్ళకి చెబుతాను.' 'నేను జ్ఞానోదయమైనందుకే పూజలు ఎందుకు, కచ్చితంగా ఎలా చేయాలో అందరికీ నేర్పిస్తున్నాను. జ్ఞానోదయమైనవారికి వారి కోసం ఎటువంటి పూజాకార్యక్రమాలు అవసరం లేదు.'
ఒక చిన్న కథ : ఒక వ్యక్తి హోటల్‌కి వెళ్ళి ఇడ్లీలు తినటం ప్రారంభిస్తాడు. అతను ఎనిమిది ఇడ్లీలు తింటాడు. తొమ్మిదవ ఇడ్లీ తిన్నాక అతనికి తృప్తి కలుగుతుంది. ఆకలి తీరుతుంది. వెయిటర్ బిల్లు తొమ్మిది ఇడ్లీలకి తెచ్చి ఇస్తాడు. అతను వెయిటర్‌తో, 'ఇదేమిటి? నేను ఒక ఇడ్లీకే బిల్లు కడతాను. ఎందుకంటే తొమ్మిదవ ఇడ్లీ ఒక్కటే నా ఆకలి తీర్చింది. ముందు ఎనిమిది ఇడ్లీలు నా ఆకలి తీర్చలేదు. అందుకే నేను ఆ తొమ్మిదవ ఇడ్లీకే బిల్లు కడతా' అంటాడు.
అతను ఎనిమిది ఇడ్లీలు తినకపోతే తొమ్మిదవ ఇడ్లీ ఒక్కటే ఏ విధంగా ఆకలి తీరుస్తుంది. మనం సరిగ్గా ఇదే పని మన జీవితాలలో చేస్తుంటాం. పూజలు వద్దు అనేవారంతా ముందు తిన్న ఎనిమిది ఇడ్లీలు వద్దు అన్నవారే. ఎవరైతే పూజలు చేయటం వృథా, తిన్నగా ధ్యానం లోనికి వెళతాం, ఆ విధంగా ఆధ్యాత్మిక అనుభవం పొందుతాం, అంటే ముందు ఎనిమిది ఇడ్లీలకి డబ్బు కట్టమంటున్నారని అర్థం.
అర్థం చేసుకోండి. తొమ్మిదవ ఇడ్లీ పని చేయటానికి కారణం ముందు తిన్న ఎనిమిది ఇడ్లీలు. అతను ముందు ఎనిమిది ఇడ్లీలు తినకపోతే ఒక ఇడ్లీ ఆకలి తీర్చలేదు కదా. ధ్యానం విషయం కూడా అంతే. మీరు పూజలు నిజాయితీగా చేశారు కాబట్టి ధ్యానం పని చేస్తుంది. మీరు ఈ ప్రాథమికమైన వాటిని తోసేస్తే, డైరెక్ట్‌గా తొమ్మిదవ ఇడ్లీ ఆకలి తీరుస్తుందనుకోవటమే. మీకు శరీరం ఉన్నది అని అనుకున్నంత కాలం, మీరు విశ్వశక్తితో అనుబంధాన్ని మరొక శరీరం ద్వారా మాత్రమే ఏర్పరచుకోగలరు. ఎప్పుడైతే మీరు శరీరం అనే భావాన్ని వదులుతారో సర్వాంతర్యామిని రూపంలేకుండా చూడగలరు. అంత వరకు మీకు ఒక రూపం కావాలి. దాన్ని గుర్తు చేయటానికి పూజాకార్యక్రమాలు కావాలి. పూజతో పాటు ధ్యానం కూడా ఉంటే మంచిది. అలా ఉన్నప్పుడు సాధన చేసే క్రమశిక్షణ కలుగుతుంది.
లేకపోతే ధ్యానం నిరంతరం చేయలేరు. మొదటి రోజు, 'ఇవాళ మా అత్తగారు ఇక్కడే ఉన్నారు. పని ఎక్కువగా ఉంది. రేపు ధ్యానం చేయవచ్చులే' అనుకుంటారు. రెండు రోజుల తరువాత మీ అత్తగారు వెళ్ళిపోయాక, 'మా అత్తగారు ఇప్పుడేగా వెళ్ళారు. కాస్త రిలాక్స్ అయ్యి ధ్యానం చేస్తానులే' అనుకుంటారు. అలా కాకుండా మీరు సంతోషంగా ఉంటే, ఇవాళ సంతోషంగా ఉన్నాను, ఇంకా ధ్యానం ఎందుకు అని ధ్యానం చేయరు. ఒకవేళ నిరాశగా ఉంటే, నాకు నిరాశగా ఉంది, నేను ధ్యానం మీద ఎలా ఏకాగ్రత నిలపగలను అనుకుంటారు ధ్యానం చేయకుండా ఉండేందుకు మీ మనస్సు ఏదో ఒక చక్కని కారణాన్ని వెతుకుతుంది. దాన్నేఒక పూజాకార్యక్రమంలా అనుకోండి, ఇక మానటానికి ఏ వాదాన్నీ వెతకరు. ధ్యానం లేదా పూజ చేసేస్తారు.
కార్యక్రమంలా చేసే పూజ - మీలో క్లిక్ కలిగించే ఒక పద్ధతి దీక్ష
కేవలం దీక్షతో మీలోని ప్రారబ్ధకర్మలని తగ్గించవచ్చు. వాటి ప్రభావాన్ని మీ మీద తగ్గించి, మీ అసలైన సంతోషస్థితి వైపుగా మీరు వెళ్ళవచ్చు. మీ స్వచ్ఛమైన అంతరంగాన్ని మీరు తిరిగి పొందవచ్చు. అప్పుడు మీరు ఆగామ్యకర్మల్ని పోగుచేయటం కూడా ఆపవచ్చు.
దీక్ష అంటే జ్ఞానం. మిమ్మల్ని నిరాశ, కుంగుబాటు ఆలోచనల నుండి బయటికి తీయగల క్లిక్‌లు.అవి మిమ్మల్ని ప్రారబ్ధ కర్మల ప్రభావం నుంచి బయటికి తెస్తాయి.
పూజ
పూజ అంటే ఒక కార్యక్రమంలా చేసే సేవ. పూజ అంటే ఈ రోజు వరకు మీకు జరిగిన క్లిక్లని గుర్తుచేసుకోవటమే. అప్పుడు మీకు అవసరమైనప్పుడు అవసరమైన క్లిక్ మీ ముందుకి వచ్చి మీ సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తుంది.
గురువులు బోధిస్తున్నారు అంటే అది బోధ కాదు. అది ఒక శక్తిమంతమైన అనుభవం. ఆయన ఇచ్చిన దీక్షలని మీరు సరిగా ఉపయోగించుకోలేకపోతే, ఈ శాస్త్రశస్త్రాలని మళ్ళీ మళ్ళీ ఉపయోగించలేకపోతే, మీరు ఈ దీక్షలని సరిగ్గా గుర్తుంచుకోలేరు. ఈ ముఖ్యవిషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మీకు ఒక మంచం ఉందనుకోండి, దాన్ని రెండు సంవత్సరాల పాటు ఉపయోగించలేదనుకోండి, ఇక అది పనికి రాదు. కొన్నాళ్ళకి అది మాయమైపోతుంది కూడా. మీకు గురుదేవులు ఇచ్చిన దీక్షల్ని, జ్ఞానాన్ని రెండు సంవత్సరాల పాటు ఉపయోగించకుండా పోతే, అవి మీ కోసం ఎదురు చూస్తూ కూర్చోవు, అవి మాయమైపోతాయి, అంతే.
కాబట్టి మీలో గురుదేవుల ద్వారా జరిగిన క్లిక్లని ఏ విధంగా ప్రతి రోజూ గుర్తు పెట్టుకుంటారు, అదే పూజ. పూజని ఆ విధంగా రూపొందించారు.
మీరు ప్రతి రోజూ ఒక కార్యక్రమంలా పూజకి కూర్చోగానే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఆ క్లిక్‌ని, ఆ అనుభవాల్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడు ఆ క్లిక్ మీ లోపల పైకి వస్తాయి. ఈ పూజలు మీలోని స్వచ్ఛమైన చేతనస్థితిని ప్రతి రోజూ తీసుకువస్తాయి. అప్పుడు సంస్కారాల శక్తి, ప్రభావం తగ్గిపోతాయి.
మీరు జన్మ తీసుకుంటూ తెచ్చుకున్న కర్మల ప్రభావం తగ్గిపోతే మీరు ఈ జన్మలో కొత్త కర్మల్ని పోగుచేసుకోరు. కొత్త కర్మల్ని పోగుచేయటం ఆగిపోగానే, బ్యాలెన్స్‌లో ఉన్న కర్మల శక్తి, వాటి ప్రభావం మీపైన తగ్గిపోతాయి. మిమ్మల్ని పదే పదే అత్యుత్తమచేతన స్థితికి తీసుకురాగల వ్యక్తి గురుదేవులు. మీరు శరీరాన్ని వదిలే సమయంలో మీకు కనిపించి సంచితకర్మల్ని పూర్తిగా తొలగిస్తాడు.
ఉదాహరణకి చిన్న పాప మీ ఒడిలో కూర్చొని చాలా ప్రయత్నించి ఇల్లు కట్టడానికి కష్టపడుతుందనుకోండి, మీరేం చేస్తారు, 'సరేలే! దీన్ని పట్టించుకోవద్దు. నేను ఇల్లు కట్టి నీకు ఇస్తాను.' అంటారు. అదే విధంగా శిష్యులు నిజాయితీగా ప్రారబ్ధ, ఆగామ్య కర్మల్ని పొగొట్టడానికి ప్రయత్నిస్తుంటే, గురుదేవుల కరుణ మీపై ఉండి ఆయన సంచిత కర్మల్ని తొలగిస్తాడు.
ఒక ముఖ్యవిషయాన్ని అర్థంచేసుకోండి, ఇక్కడ నేను చెప్పే గురుదేవుల కరుణ అనేది నా మీద ఆధారపడి లేదు. ఎవరైతే ధ్యానం చేస్తారో, నేను లేకపోయినా, నేను కాకపోయినా ఆ కరుణ వారి మీద కురుస్తుంది. దీనికి నేను కారణం కానవసరం లేదు. ఇది ఆటోమాటిక్‌గా జరుగుతుంది.
స్పష్టంగా అర్థం చేసుకోండి, మీలో దీన్ని తీసుకోగల శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాని నా మీద అది ఆధారపడి లేదు. నేను ఒక సముద్రం లాంటివాడిని. నా దగ్గరికి ఎవరు వస్తే వారికి అందుబాటులో ఉంటాను. ఈ సముద్రం ఎంత గిన్నె తెస్తే అన్ని నీళ్ళు తీసుకువెళ్ళవచ్చు. కొబ్బరి చిప్ప తెస్తే అంతే నన్ను తీసుకెళ్ళగలరు. పెద్ద గిన్నె తెస్తే అంత నన్ను తీసుకెళ్ళగలరు. పెద్ద డ్రమ్ము తెస్తే, డ్రమ్ము నిండా నన్ను తీసుకువెళ్ళవచ్చు. తెలివైనవారు నిత్యానందసాగరంలోకి దూకేసి అక్కడే ఉంటారు. కాబట్టి పూజ అంటే మీకు జరిగిన అనుభవాల్ని గురుదేవుల ద్వారా పొందిన కిక్ ని, అనుభూతుల్ని ప్రతి రోజూ గుర్తు చేసుకోవటమే. మిమ్మల్ని అదే చేతనస్థితిలోకి తిరిగి మళ్ళీ మళ్ళీ తీసుకురావటమే. మీరు ప్రతి రోజూ ఉత్సాహంగా ఉండగలిగితే ఆ తరువాత 24 గంటల జీవితనాటకం సజావుగా జరుగుతుంది. అందుకు కావలసిన శక్తి ఉంటుంది. పూజ అంటే అర్ధం అదే.
ధ్యానం చేతనస్థితి - కర్మకి విరుగుడు
మీరు కనీసం ఒక క్షణం పాటైనా స్వచ్ఛమైన చేతన స్థితిని అనుభవించగలిగితే ఏ కర్మ మీ మీద ప్రభావాన్ని చూపదు. మీ ఫ్రీక్వెన్సీ, కర్మ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువగా ఉంటుంది. మీలో ఆలోచనలు ఉన్నంతవరకు మాత్రమే కర్మ పని చేస్తుంది. చేతనస్థితిలో మీరు ఆలోచనలకి అతీతంగా వెళ్ళిపోతారు కాబట్టి సహజంగానే మీరు కర్మల కంటే అధికస్థాయిలో ఉంటారు. ఏ ధ్యానమైనా తీవ్రంగా, గాఢంగా చేస్తే అది మీకు చేతనస్థితి యొక్క క్షణదర్శనాన్ని ఇస్తుంది. మీరు అంతిమసత్యదర్శనం చేయవచ్చు. అందుకే అంటారు, ధ్యానం అంటే మీ ఫిల్మ్ ని ఎండకి ఎక్స్పోజ్ చేయటమే అని. కెమెరా ఒక్క సెకండ్ తెరిస్తే, ముందు ఉన్నది ఫిల్మ్ లో ఫోటోగా రికార్డు అవుతుంది. షట్టర్ పూర్తిగా తెరచి ఉంచేస్తే, సూర్యకిరణాలు తిన్నగా ఫిల్మ్ మీద పడితే ఎం జరుగుతుంది? అందులోని ఫోటోలన్నీ తుడుచుకుపోతాయి.
మీరు జన్మించినప్పుడు కెమెరా షట్టర్ ఒక్క సెకండ్ తెరవబడి మీ శరీరంలోనికి జీవాత్మ ప్రవేశిస్తుంది. అప్పుడు బయట ఉన్న సీన్ అంతా రికార్డు అవుతుంది. ఇక్కడ సీన్ అంటే అర్ధం గ్రహస్థితి. అందుకే జన్మకాలం చాలా ముఖ్యం. దాని ఆధారంగా మీ చేతనస్థితి పని చేస్తుంది. అయితే ధ్యానం చేసినప్పుడు చేతనస్థితి ఎక్కువ సేపు తెరవబడి ఉంటుంది. కాబట్టి అక్కడ రికార్డు చేసి ఉన్నదంతా తుడుచుకుపోతుంది.
అంటే మీరు పుట్టినప్పుడు మొదటిసారి షట్టర్ ఒక్కసెకండు పాటు తెరవబడుతుంది. రెండవసారి మీరు దీక్షని పొందినప్పుడు తెరవబడుతుంది. దీక్ష సమయంలో ఎక్కువ సేపు తెరవబడి ఫిల్మ్ ని ఎక్కువ సేపు వెలుగుకి ఎక్స్పోజ్ చేస్తారు గురువులు. అప్పుడు మీ కర్మలు తుడుచుకుపోతాయి. అందుకే గురువులు మీకు దీక్షని ఇచ్చినప్పుడు మిమ్మల్ని ద్విజులు అంటారు. ద్విజులు అంటే రెండుసార్లు జన్మించటం, కెమెరాని ఉపయోగించి షట్టర్ తెరిచే వ్యక్తి గురువు. ఆయనే మీ గురుదేవులు.
నిత్యం - ధ్యానం - ఆనందం
కాబట్టి ఇక్కడ కావలసింది ఏమిటంటే ఆగామ్యకర్మల్ని పోగుచేసుకోకూడదు. ఇదే జీవితపరిష్కారం. దీన్నే నిత్యం అంటాను. ఎందుకంటే మీరు నిత్యం సాధన చేసే విషయం కాబట్టి ఈ జన్మలో కర్మల్ని కరిగించటానికి మీరు ధ్యానం చేయాలి. అందుకే మన ధ్యాన పద్ధతులు చాలా శ్వాస ఆధారంగా ఉంటాయి. శ్వాసని మార్చటం, నెమ్మదిగా చేయటం, గబగబా చేయటం ఇవన్నీ ధ్యాన పద్ధతులే. మొత్తం కర్మ అంతా కరగాలి అంటే గురుదేవుల కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.
కాబట్టి స్పష్టంగా అర్థంచేసుకోండి, కర్మ అంటే లోతైన అజ్ఞానంతో మనం చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనులు. అవి మనలో కొన్ని తెలిసిన సమస్యల్ని, బాధల్ని సృష్టిస్తాయి. దీని నుంచి బయటకి రావాలంటే గురుదేవుల నుంచి వచ్చే క్లిక్ ని తీసుకోగలిగి ఉండాలి, అలాగే మీరు ఉన్నతమైన చేతనస్థితిలో జీవించగలగాలి.
కర్మలు కొన్ని అపోహలు
ప్ర: మరో వ్యక్తి మనకి సలహా ఇచ్చినా, మనని అంటుకున్నా వారి కర్మలు మనకి వస్తాయా? ఎదుటివారి కర్మలు మనకి ఎంత వరకూ వస్తాయి?
ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు కర్మని మరొకరి నుంచి తెచ్చుకోలేరు. మీకు సరిపడా కర్మలు మీకు ఉన్నాయి. కాబట్టి ఇతరుల కర్మలు నాకు వస్తాయేమో అనే భావన పూర్తిగా వదిలేయండి.
అంటుకోవటం వల్ల కాని, సలహా పొందటం వల్లకాని, లేదా చాలా దగ్గరగా కలిసి జీవించటం వల్ల కాని మరొక వ్యక్తి కర్మలు మీకు రావు. దగ్గరగా కలిసి జీవిస్తే వారి మనస్తత్వం మీకు వస్తుందేమో గాని, కర్మలు రావు. వారి మానసికస్థితి రానంత బలమైన స్థితిలో మీరు ఉండగలగాలి. మీ అంతరంగంలో బలంగా మీలో జరిగిన క్లిక్ ని తెలుసుకోగలిగివుంటే మానసికస్థితి మీకు ఇతరుల రాదు.
మరొక విషయం అర్థం చేసుకోండి, నేను మీ కర్మలలో కల్పించుకోను. సూర్యోదయం అయితే చీకట్లు ఏ విధంగా మాయం అవుతాయో అదే విధంగా మీరు నా సమక్షంలోనికి రాగానే కర్మలు వాటంతట అవే మండిపోతాయి. చీకటిలా కర్మలకి ఉనికి లేదు. దాన్ని చేత్తో తీసి బయట వేయలేం. వెలుగులేకపోవటమే చీకటి. మీ అంతరంగంలో వెలుగు లేకపోవటమే కర్మ. అది కేవలం అజ్ఞానం. అది శక్తి లేని స్థితి. క్లిక్ ని గుర్తుచేసుకోవటం ద్వారా కర్మల్ని పోగొట్టుకోవచ్చు. క్లిక్ ని అర్థం చేసుకోవాలి. కర్మ అంటే ఉండే భయం మీద మీకు ఉన్న నమ్మకం.
మీ భయం ఉన్నంత లోతులో కూడా కర్మ ఉండదు. భయం లోతుగా ఉండే మీ కారణ శరీరం వరకూ వెళుతుంది. కర్మ అంత లోతుగా ఉండదు. అది మీరు చేసే పనిలో ఉంటుంది. అర్థం చేసుకొని, తెలుసుకునే తత్వంతో ఆ పని చేయకుండా ఉంటే, చేతనస్థితిలో ఆలోచనలు, మాటలు పనుల ద్వారా కర్మ చేయను అని నిర్ణయించుకుంటే చాలు.
కర్మలని పోగొట్టుకుంటూ జీవించటం ముఖ్యం. అంతే కాని ఇంకా ఇంకా పోగు చేసుకోకూడదు. వేదసంస్కృతిలోని వివాహాల్లో ఇదే సందేశం ఉంటుంది. వివాహసమయంలో భార్యాభర్తలు ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యంఇస్తాం అని ప్రమాణం చేస్తారు. ఒకరి కర్మలు పోయేలా మరొకరు సహకరిస్తాం అని చెబుతారు. వివాహబంధంలో మగవారు కోరిక ఆధారంగా, స్త్రీలు భయం ఆధారంగా జీవిస్తారు. ఈ విధంగా ఒకరి బలహీనతని మరొకరు వాడుకుంటారు. వివాహసమయంలో ఒకరి కర్మలు ఒకరు పోగొట్టటానికి సహకరిస్తాం అని ప్రమాణం చేసి ఇక్కడ కర్మలు పెరిగేలా జీవిస్తారు.
ప్ర : ధార్మికకార్యాలు చేస్తూ కర్మల్ని కరిగించుకోవచ్చునా?
సంఘసేవ చేయటానికి మీకు ఉన్న ప్రోత్సాహం ఎలా ఉన్నది అనే విషయం గమనించాలి. నిజాయితీగా చూడండి. ఎందుకు సేవ చేయాలనుకుంటున్నారు? నరకానికి వెళతాను అనే భయంతో మంచి పనులు చేయాలనుకుంటున్నారా? లేదా సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు కావాలి అని చేస్తున్నారా? మీ కాలక్షేపానికి చేస్తున్నారా? మీరు జన్మలో మంచి జరుగుతుంది అని చేస్తున్నారా? మీరు భయం, ఆశలతో చేస్తే, చేసే సేవ నుంచి సంతోషం పొందలేరు. మీలో ఒక భాగం సేవ చేస్తుంది. మరొక భాగం అందులో మీరు పొందే లాభాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఏక దృక్పథంతో ఉండరు. అందుకే సంపూర్ణత్వాన్ని పొందలేరు.
ఇది కూడా మీకు బంధమవుతుంది. బయటికి సమాజపరంగా అది చూడటానికి బాగుంటుంది. బంధవిముక్తిలా ఉంటుంది. కానీ మీ అంతరంగంలో ఆ విధంగా ఉండదు. మానవులంతా ఫలితాల ఆధారమైన పనులలో ఇరుక్కుపోయారు. అదే సేవకి కూడా అన్వయిస్తున్నారు. కనీసం సేవ విషయంలోనైనా డబ్బు, పేరు అనే విషయాల గురించి ఆలోచించవద్దు. మీ ప్రాముఖ్యం కోసం చేయవద్దు.
సేవను కేవలం సేవ కోసం మాత్రమే చేయండి. ఏదీ ప్లాన్ చేయవద్దు. ఏ సేవ ఎక్కడైనా చేయండి. ఆ విధంగా చేసినప్పుడు మీ లోపలికి చాలా శక్తి వస్తుంది. మీ అంతరంగశక్తితో నిండుతుంది. రోజూ కనీసం ఒక అరగంట పాటు ఎటువంటి ఉపయోగాలూ ఆశించకుండా సేవ చేయండి. అప్పుడు సేవలోని నిజమైన ఆనందాన్ని మీరు అనుభవించగలరు.
కర్మలు కేవలం లోతుగా అర్థం చేసుకొని, తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడు మాత్రమే మీ నుంచి వెళ్ళిపోతాయి. కనీసం ఒక్క క్షణం అయినా చేతనస్థితిని అనుభవించాలి.
ప్ర : మీరు మాకు ధ్యానం నేర్పిస్తున్నారు. ప్రపంచమంతా బాధల్లో ఉంటే మేం వారికి సేవ చేయకుండా ధ్యానం చేస్తూ కూర్చోవటంలో అర్థం ఏమిటి?
ఒక చిన్న కథ : ఒక రాజుగారు చాలా కరుణామూర్తి అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన మారువేషంలో దేశాటన చేస్తూ పరిస్థితులు గమనించేవాడు.
ఒక రోజు ఆయన చిన్న అబ్బాయి పావురాన్ని పట్టుకోవటం చూస్తాడు. అది రెక్కలు కొట్టుకుంటుంటే అతను దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. రాజు అతనితో చూడు అది భయపడిపోతుంది. దాన్ని వదిలేయి అంటాడు.
ప్రయత్నించి పట్టుకున్నాను. దీన్ని ఎలా వదల్గలను అంటాడు. 'అప్పుడు రాజు కొంచెం ఆలోచించి, 'దీన్ని నాకు అమ్ముతావా' అని అడుగుతాడు. ఆ అబ్బాయి ఒప్పుకుంటాడు. రాజు ఆ అబ్బాయికి బంగారు నాణాన్ని ఇచ్చి పావురాన్ని తీసుకుంటాడు.
అప్పటికి అక్కడ చాలా జనం మూగుతారు. రాజు ఆ పావురాన్ని తీసుకొని దాన్ని స్వేచ్ఛగా వదిలివేస్తాడు. అందరూ ఆయనని పొగుడుతారు.
రాజుగారు మిగతావారిని చూసి, 'మీ దగ్గర కూడా ఏమైనా పక్షులు ఉన్నాయా? ' అని అడుగుతాడు. వాళ్ళు ఉన్నాయి అని తెచ్చి రాజు గారికి ఆ పక్షుల్ని ఇచ్చి, బంగారు నాణాలు తీసుకుంటారు. ఆయన గర్వంగా ఆ పక్షుల్ని విడిచిపెడతాడు. కొన్ని రోజులు గడిచాక, రాజగురువు రాజు దర్శనానికి వస్తాడు. ఆయన రాజుని మారువేషంలో రాజ్యంలోకి తీసుకువెళతాడు. అలా వాళ్ళు అడవిలోకి వెళతారు. అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయే విధమైన సంఘటల్ని చూస్తారు. చాలామంది గ్రామస్థులు వలలు పన్ని పక్షుల్ని పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా పట్టడంలో చాలా పక్షులు చనిపోయి ఉంటాయి. అందరూ బంగారు నాణాల కోసం పక్షుల్ని పట్టడం ప్రారంభించారు.
రాజగురువు రాజుగారిని, 'నీ కరుణని చూపటానికి ఇన్ని పక్షులు తమ ప్రాణాలని బలి ఇవ్వాలా?' అని అడుగుతాడు.
మనం చేసే పనులు స్వచ్ఛమైన చేతనస్థితి నుంచి వస్తేనే అవి నిజమైన ప్రభావాన్ని చూపలుగుతాయి.
మనం నిజంగా మనుషుల బాధలు చూసి చలించితే, ఆ కరుణతో వారి బాధలు తొలగించటానికి పని చేస్తే అది చాలా మంచిది. కాని ముందుగా మనం మన చేతనస్థితి విప్పారాలి, అది కరుణని తెలుసుకోవాలి. అంతే కాదు, మీరు మనుషులకి చేసే గొప్ప సేవ మీరు ఒక దివ్యమానవుడుగా తయారుకావాలి. దానికి ధ్యానం మొదటి అడుగు.
ప్ర : ఎవరికైనా అకాలమరణం ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఏం జరుగుతుంది?
అకాలమరణంతో, ఆత్మ తన సమయం వచ్చేవరకూ వేచి చూడాలి. ఆ తరువాత మాత్రమే కొత్త శరీరాన్ని తీసుకోగలుగుతుంది. ఆత్మహత్య విషయంలో బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. అది బ్రతికి ఉన్నప్పటి కష్టాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఇష్టమైన భోజనం ఎదురుగా ఉంటుంది. కాని తినటానికి చేతులు, శరీరం ఉండవు.
ప్రమాదాల విషయంలో కూడా ఆత్మ కొత్త శరీరం తీసుకోవటానికి ఎదురుచూడాలి. కాని ఆత్మ చేతనస్థితిలో ఉంటుంది. కొత్త శరీరం కోసం ఎదురుచూస్తుంది. అంతే.
ప్ర : చనిపోయినవారికి కొన్ని కర్మకాండలు చేస్తారు. ఎందుకు?
అలా చేయటం జీవించి ఉన్నవారికి మరణాన్ని ఆహ్వానించాలి అని చెప్పటానికి చేస్తారు. అయితే జ్ఞానోదయమైన యోగీశ్వరులు చేస్తే అది కర్మకాండ కాదు. అది ఒక సంకల్పంలా పని చేస్తుంది. జ్ఞానోదయమైన యోగీశ్వరులు సంకల్పం చేస్తే మీరు శరీరంలో ఉంటే, అది స్థిరపడటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మీరు ఉండే స్థితి, ఆయన చేసిన సంకల్పస్థితి వేరు వేరు శ్రేణులలో ఉంటాయి కాబట్టి, శరీరంతో లేనివారికి అది వెంటనే ఉపయోగపడుతుంది. ఎందుకంటే గురుదేవుల శక్తిలా అది కూడా సూక్ష్మశక్తి రూపంలో ఉంటుంది కాబట్టి.
అదే విధంగా ఆత్మ మరొక శరీరంలో ఉంటే స్థిరపడటానికి సమయం పడుతుంది. అయితే వారు పాత సంస్కారాల నుంచి విముక్తి పొందుతారు. అకస్మాత్తుగా ఆ వ్యక్తి ఏ కారణమూ లేకుండా స్వేచ్ఛని, తేలికదనాన్ని పొందుతాడు.
ప్ర : ఈ జీవితంలో క్రింతం జన్మలోనికి వెళ్ళటం ఉపయోగమేనా? అది మంచిదేనా?
పాత జీవితంలోకి కేవలం జ్ఞానోదయమైన గురువులు మాత్రమే తీసుకెళ్ళాలి. దాని ప్రభావం ఈ జన్మ మీద ఉంటుంది. ఉదాహరణకి క్రింతం జన్మలో ఒక వ్యక్తి অন্ধుడైతే ఆ జన్మలోకి తీసుకువెళితే అతను ఇప్పుడుంధుడయ్యే అవకాశం ఉన్నది. జ్ఞానోదయం పొందినవారు అలా చేస్తే వారికి అలా చేసే వ్యక్తి కర్మలు వస్తాయి. పాత జన్మకర్మలు పోగొట్టుకోవడానికి, వాటితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. వాటిని మూసేయాలి.
ప్ర : గురుదేవులు కర్మల్ని పోగొట్టే సమయంలో మేం బాధపడతామా?
గురువులు కర్మలని పోగొట్టే సమయాన్ని మీరు బాధ అంటారు. కాని గురుదేవులు కేవలం ఒక సెకండులో వాటిని తీసేస్తారు. లేకపోతే అవి పోగొట్టుకోవటానికి మీకు కొన్ని జన్మల సమయం పడుతుంది. కాబట్టి ఇది బాధపడటం కాదు.
శారదాదేవి ఈ విధంగా చెబుతారు, గురుదేవులు సంస్కారాలని తీసేయటం అంటే కాలు విరిగిపడే బాధ బదులు ముల్లు గుచ్చుకున్నట్లే అని.
⁂ ⁂ ⁂
- కర్మ అంటే మనలోని తీరని అనుభవాలు మన అంతరంగంలో ఉండి వాటిని సంపూర్తిగా సాధించమని అటువైపు లాగుతూ ఉంటాయి.
- మీ గతం అంతా కలిసి ఇప్పటి మీ వర్తమానం, మీ వర్తమానం మొత్తం కలసి మీ భవిష్యత్తు అవుతాయి.
- అదృష్టం, నీ భవిష్యత్తు అనేవి జీవితంలో నీకు కలిగే సంఘటనలకి నీవు ఎలా స్పందిస్తావో దాని ఆధారంగా ఉంటుంది.
- మీరు ఆలోచనలు సున్నాస్థాయిలో 21 క్షణాల వరకు ఉండగలిగితే మీరు మీ కాలగమనంలోకి చొచ్చుకుని వెళ్లి, భవిష్యత్తుని మార్చవచ్చు.
- ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే బాధ పడకూడదు అని మీరు నిర్ణయించుకోవచ్చు, మీరు నిశ్చలంగా ఉండాలి అని అనుకోవచ్చు.
- మీలో కోరికలు మారినప్పుడు మీ శ్వాసలోని క్రమం కూడా మారుతూ ఉంటుంది.
- మీలో నిక్షిప్తమైన సంస్కారాల్ని తీసేయటం అంటే మీ శరీరంతో లోతైన స్నేహబంధాన్ని ఏర్పరచుకోవటం.
- ప్రారబ్ధాన్ని పూర్తిగా సాధించితే మనలోని ఒక వ్యతిరేకవిషయం అయిన అసహనం, చిరాకుల్ని మన జీవితం నుంచి తీసేయవచ్చు.
- జన్మ తరువాత జన్మలలో పోగుచేసిన సంచితకర్మలు జన్మ విషవలయం అచేతనస్థితిలో జీవించటం ప్రారబ్ధకర్మలతో ఆగామ్య కర్మలు జన్మించటం.
- నరకం, స్వర్గం అనేవి మీ మానసికస్థితి మాత్రమే.
- మీరు మీ పనుల ఫలితమైన ఒక ఉపవస్తువు కాదు. మీరు మీ పనుల కంటే చాలా ఉన్నతులు.
మరణం ఒక ఉత్సవం
జీవన్ముక్తి అంటే ప్రతిక్షణం అంతిమ ఆనందంలో తిరిగి జన్మించటమే
మన కర్మల గురించి ఉన్న ఆందోళనకి మూలం మరణభయంలో ఉంది. తెలియని దాని గురించి ఉండే అతిముఖ్యమైన భయం అది. ఈ జన్మలో మన పనులు చాలా వరకు వచ్చేక జన్మలో మంచి జీవితం కావాలి అన్న కోరిక ఆధారంగా నిర్దేశించబడి ఉన్నాయి. మరణం తరువాత ఇంకా తక్కువ స్థాయి ఉండకూడదు అనే కోరిక ముందుకి తీసుకువెళుతుంది. శరీరాన్ని, మానసిక వ్యవస్థని వదిలేస్తామేమో అన్న భయం అతిప్రాచీనకాలం నుంచీ ఉంది.
యయాతి కథ
మహాభారతంలో ఒక చక్కని కథ ఉంది. యయాతి అనే ఒక రాజు వంద సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తూ, సకల ఐశ్వర్యాల్ని అనుభవిస్తూ, భౌతిక, మానసిక సౌకర్యాలతో జీవించాడు. ఆయనకి 100 సంవత్సరాలు పూర్తి అయ్యాక యమధర్మరాజు వచ్చి అతన్ని తీసుకువెళ్లాలి అని అంటాడు. యమధర్మరాజుని చూసిన రాజు నిర్ఘాంతపోతాడు. ఎందుకు ఇంత త్వరగా వచ్చావు. ఇంత అకస్మాత్తుగా వస్తే ఎలా? నేను నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించలేదు. నాకు ఇంకొంతకాలం జీవించడానికి అవకాశం ఇవ్వు అని ప్రార్థిస్తాడు.
యమధర్మరాజు అది సాధ్యం కాదు అంటాడు. యయాతి దీనంగా ప్రార్థించి కొంత సమయం ఇమ్మని కోరతాడు. అప్పుడు యమధర్మరాజు ఆయనతో నీ కొడుకులు ఎవరైనా వారి జీవితాన్ని నీకు ఇస్తే నీవు అంత కాలం జీవించవచ్చు అంటాడు. యయాతి తన కొడుకుల్లో ఒకరిని పిలిచి తన కోసం వారి జీవితాన్ని ఇమ్మని అడుగుతాడు. కొడుకు అందుకు ఒప్పుకొని అతని జీవితాన్ని తండ్రికి ఇస్తాడు. యమధర్మరాజు యయాతి జీవితాన్ని వంద సంవత్సరాలకి పెంచుతాడు.
యయాతి అన్ని విలాసాల్ని అనుభవిస్తూ సంతోషంగా వంద సంవత్సరాలు గడుపుతాడు. వంద సంవత్సరాలు పూర్తి కాగానే యమధర్మరాజు వస్తాడు. ఈ సారి కూడా యయాతి యముడితో వెళ్ళడానికి నిరాకరించి, నేను జీవితాన్ని పూర్తిగా అనుభవించలేదు. నాకు మరి కొంచెం సమయాన్ని ఇవ్వు అని ప్రార్థిస్తాడు. యముడు యయాతికి మరొక అవకాశం ఇస్తాడు. ఇప్పుడు మరొక కొడుకు తన జీవితాన్ని తండ్రికి ఇస్తాడు. మరొక వంద సంవత్సరాలు అన్నీ అనుభవిస్తూ గడుపుతాడు. మళ్ళీ యముడు వచ్చినప్పుడు నేను రాను అని నిరాకరిస్తాడు. ఈసారి యముడు అదే ఆట ఆడదలచలేదు.
ఆయన యయాతితో అత్యంతకరుణతో మాట్లాడతాడు, 'రాజా! నీవు నూనె పోసి మంట ఆర్చగలవా? నీవు కోరికలలో జీవిస్తూ వాటిని సంపూర్ణంగా జీవించగలనని అనుకుంటున్నావా?'
ఈ విధంగా యమధర్మరాజు యయాతికి జీవితలక్ష్యాన్ని చక్కగా వివరిస్తాడు. చివరికి యయాతి ఈ భూమిని వదిలి సర్వాంతర్యామి పాదాల దగ్గర విశ్రాంతి పొందుతాడు.
జ్ఞానేంద్రియాలకి విలాసాలని ఇస్తూ మీరు ఎప్పటికీ పరిపూర్ణమైన సంతృప్తిని పొందలేరు. మీరు లోతుగా, గాఢతతో జీవించి ఉండకపోతే, ఎప్పటికీ మరణానికి సిద్ధపడలేరు. జ్ఞానేంద్రియాల్ని తృప్తి పరుస్తూ, వాటిలోనికి విలాసాల్ని పంపిస్తూ, మీకు ఇష్టమైన పద్ధతిలో ఉండటాన్ని లోతుగా జీవించటం అనరు. ఎప్పుడైతే గాఢమైన, లోతైన అనుభవాలతో జీవిస్తారో, అప్పుడు మీరు స్వేచ్ఛని పొందుతారు.
మరణం సాధారణ అవగాహన
మరణం అనే మాట కలవరాన్ని, భయాన్ని కలిగిస్తుంది. ఆ విషయం గురించి మాట్లాడటం అశుభంగా అనుకుంటారు. అలా చేస్తే మరణాన్ని ఆహ్వానించటం అనుకుంటారు.
మరణాన్ని శత్రువుగా చూస్తారు. అందుకే అన్ని మతాల్లో మరణాన్ని నలుపు రంగులో చూపిస్తారు. హిందూమతంలో యముడు నలుపు. క్రిస్టియానిటీలో సైతాన్ నల్లగా ఉంటాడు. బౌద్ధమతంలో మరణాన్ని నల్లగా చూపిస్తారు. అన్ని మతాలలో మరణాన్ని నల్లగా చూపిస్తారు. మరణం మనకి విలన్ కాని హీరో కాదు. మరణం అనే విషయాన్ని వ్యతిరేక దృక్పథంతోనే చూస్తాం. మరణం మన నుంచి అన్నీ తీసుకువెళ్ళిపోతుంది అనుకుంటాం. ఏదైతే కావాలి అనుకుంటామో వాటిని, మన సంతోషాన్ని మనకి ఉన్న వాటిని అన్నిటినీ బలవంతంగా మన నుంచి తీసుకువెళుతుంది అనుకుంటాం. చాలామంది అందుకే మరణాన్ని వద్ద అనుకుంటారు లేదా మరణం అంటే భయపడతారు. మనం ఏమనుకుంటామంటే అసలు మరణం గురించి ఇప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి. అది వచ్చినప్పుడు చూడవచ్చు అనుకుంటాం. కావాలని ఆ ఆలోచన రాకుండా చూస్తాం.
తప్పించుకోవాలి అని చూస్తాం. అతిప్రాచీనకాలం నుంచి అన్ని మతాలు, అన్ని సంస్కృతులూ మరణాన్ని జయించటానికి అన్ని అవకాశాల ద్వారా ప్రయత్నించాయి. శాస్త్రజ్ఞులు మందులు అందుకే కనిపెట్టారు, అదే అలోపతి. తూర్పుదేశాల సిద్ధులు ఆయుర్వేదం ద్వారా మూలికావైద్యం చేస్తూ 'సిద్ధ' సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. కాయకల్పచికిత్స ఇందులో భాగమే. యోగులు మంత్రాల ద్వారా ప్రయత్నిస్తున్నారు. అవే మృత్యుంజయమంత్రం, ప్రాణాయామపద్ధతి. బౌద్ధసన్యాసులైన లామాలు ధ్యానం ద్వారా ప్రయత్నిస్తున్నారు. వారు సృష్టించిందే మహామంత్రధ్యానం. అన్ని మతాలు, సంస్కృతులు మరణాన్ని జయించాలని చూస్తున్నాయి. మరణానికి అతీతంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాయి.
మరణం అంటే మనం ఎందుకు భయపడతాం
మానవజాతి మొత్తం ఒకే విషయం గురించి పోరాడుతుంది, అదే అందరి జీవితాల్లో కచ్చితంగా జరిగే విషయం. మరి ఎందుకు అలా పోరాడుతుంది?
మనం భూమిని బల్లపరుపుగా చేయగలమా? లేదు. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది. కానీ మనం ఈ నిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే, మన పోరాటంలో ఏదో లోపం ఉంది. మనం అర్థం చేసుకోవడంలో ఎక్కడో లోపం ఉంది అని అర్థం. మరణం విషయంలో కూడా అంతే. సత్యాన్ని స్వీకరించటానికి ఎందుకు పోరాటం? దీని వల్ల చాలామంది మరణం సంభవించినప్పుడు దాన్ని స్వీకరించలేకపోతున్నారు. వాళ్ళు జీవించిన జీవితాన్ని యథాతథంగా తీసుకోలేకపోతున్నారు. మనం మరణం అంటే ఎందుకు భయపడుతున్నాం? మనం ఎందుకు భయపడతామంటే సహజంగా మనం మార్పుని అడ్డుకుంటాం. మరణం అనేది అకస్మాత్తుగా జరిగే ఒక మార్పు. చాంగ్సు అనే గురువు చాలా చక్కగా చెబుతారు, 'భవిష్యత్తులో జీవించాలి అనే తపన మనిషిని వర్తమానంలో జీవించకుండా చేస్తున్నది.'
మనం ఎందుకు భయపడతామంటే, మనకి మనం అంటే ఏమిటో తెలియదు కాబట్టి, మనం మనలోని గుర్తింపుల్ని గట్టిగా పట్టుకొని ఉంటాం. ఈ గుర్తింపులు కుటుంబ అనుబంధాలకి సంబంధించి కానీ, ఉద్యోగం, ఆస్తి, ఐశ్వర్యాలు, పేరుప్రతిష్ఠలు ఇలాంటివాటి మీద ఆధారపడి ఉంటాయి. మరణం మనం నిర్మించుకున్న గుర్తింపుల పునాదుల్ని తీసివేస్తుంది. అందుకే మరణం మన నుంచి అన్నీ తీసేసుకుంటుంది అనుకుంటాం.
మనం మరణం గురించి అర్థం చేసుకున్నది, సరిగ్గా చెప్పాలి అంటే అపార్థం చేసుకున్న విధానం, మనం మరణమంటే భయపడే విధంగా చేస్తుంది. అది మనకి భయాన్ని మిగిల్చే అనుభవం అవుతుంది. మరణాన్ని అడ్డుకునే వ్యక్తి జీవించి ఉండగానే మరణిస్తాడు. అతను ప్రతిక్షణం మరణిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ భావంతో ప్రతిక్షణం చిత్రహింసకి గురవుతుంటాడు. మరణం అని నేను అనగానే అది భౌతికమరణమే కాదు. మరణరూపంలో పోగొట్టుకునేది ఏదైనా సరే సౌకర్యవంతమైన జీవితాన్ని పోగొట్టుకోవడం, బంధువులని పోగొట్టుకోవడం, ఇటువంటివి అర్థం చేసుకోండి. ఏ రూపంలో దేన్ని పోగొట్టుకున్నా అది మరణమే.
ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మన జీవితం చివరిలో జరిగే మరణం అన్న సంఘటన, అసలైన మరణం ఒక్కసారే జరుగుతుంది. కానీ మానసికమరణం, మరణభయం ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. మరణభయం అన్నదే మన జీవనవ్యవస్థని నిర్మిస్తుంది.
మీరు నన్ను అడగవచ్చు, ఎందుకు సమీపబంధువులు మరణిస్తే అందరూ అలా కుంగిపోతారు, నిశ్చలంగా అవుతారు అని. మీకు వారితో అంత అనుబంధం లేకపోయినా, వారి మరణం మీ మీద లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీ అమ్మగారు చనిపోతే మీ ఎడమభాగం చాలా బాధతో ఉంటుంది. మీ తండ్రి మరణిస్తే కుడిభాగం బాధతో ఉంటుంది. అన్నదమ్ములు చనిపోతే చేతులు బాధలో ఉంటాయి. మీకు, మీ బంధువులకి మధ్య లోతైన అనుబంధం ఉంటుంది. మీలోని ప్రతి భాగం ఎవరో ఒకరితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మీ ఉనికి ఒంటరిది కాదు. అది ప్రత్యేకమైనది కాదు. మనం అందరం, ఒకరితో ఒకరు బంధాలు ఏర్పడి ఉన్నవారిమే. అందుకే ఎవరైనా మరణిస్తే మనం చాలా బాధపడతాం. మీరు పోగొట్టుకునే ప్రతి వ్యక్తీ మీకు ఒక మరణమే.
మరణం గురించి మనకి తెలిసిన విషయం ఒక్కటే, అది జీవితానికి వ్యతిరేకమైంది. భయం కొద్దీ మరణం గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఆ భయంతో దాన్ని ఒక రాక్షసిలా చూస్తాం. నిజమైన మరణం ఆరు అడుగుల పొడవు అయితే, మన భయం అరవై అడుగుల పొడవు ఉంటుంది. మరణ భయం అంటే పొడిగించి కొనసాగించటం లేదా ఆపేయటం. మన భయం - తరువాత ఏమిటి అని.
మరణమర్మంలోనే జీవిత సమాధానం
ఒకసారి అమెరికాలో ఒక యువతి, స్వామి వివేకానందని 'జీవితం అంటే ఏమిటి,' అని అడిగింది. స్వామి వివేకానంద, 'నాతో భారతదేశానికి వస్తే బోధిస్తాను' అని జవాబు ఇచ్చారు. ఆమె 'మీరు నాకు ఏం బోధిస్తారు?' అని తిరిగి ప్రశ్నించింది. ఆయన, 'ఎలా మరణించాలో నేర్పిస్తాను' అని జవాబు ఇచ్చారు.
ప్రశ్న జీవితం గురించి కాని జవాబు మరణం గురించి చెప్పారు ఆయన. ఇది కొత్తగా అనిపించవచ్చు. ఇక్కడ స్వామి వివేకానంద ఏం చెబుతున్నారంటే మరణరహస్యాన్ని తెలుసుకుంటే మీ జీవితంలో నాణ్యత పెరుగుతుంది. ప్రతి విషయాన్నీ చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రతి దాని పట్ల ఉన్న మీ దృక్పథంలో మార్పు వస్తుంది.
మరణం మీ జీవితం చివరిలో జరిగే ఒక సంఘటన కాదు. అది గొప్ప జ్ఞానం. ఎలా మరణించాలో తెలిస్తే ఎలా జీవించాలో తెలుస్తుంది. జీవించటం, మరణించటం ఒక నాణేనికి రెండు వైపులు. ఒకసారి మరణం అంటే ఏమిటో అర్థం చేసుకుంటే, మీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది.
మరణంలోకి ప్రవేశించటం
ప్రతి సంస్కృతీ మరణాన్ని జయించటానికి చాలా ప్రయత్నాలు చేసింది. అయితే తెలివైన ఒక సంప్రదాయం వారు మరణం గురించి తెలుసుకోవటంలో మనం తప్పు దిశగా వెళుతున్నాం, అందుకే పోరాడవలసి వచ్చింది, అనుకొని 180 డిగ్రీలు వెనక్కి తిరిగారు. మరణం గురించి మరొక మార్గంలో పని చేశారు. వారు ధ్యానాన్ని ఒక పద్ధతిగా ఎంచుకున్నారు. మిగిలినవారు ఆ ధైర్యం చేయలేకపోయారు. వారే ఉపనిషత్తుల కాలానికి సంబంధించిన ఋషులు. వారు మరణంపై చేసిన పరిశోధన ఫలితాల సిద్ధాంత గ్రంథమే కఠోపనిషత్తు. వారు చాలా లోతుగా పరిశోధనలు చేసి, మరణాన్ని ఆపటం ద్వారా అర్థం చేసుకోలేం. మరణాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ మీరు మరణానికి అతీతంగా వెళ్ళలేరు. జనన మరణ చక్రాన్ని ఛేదించటానికి మీరు జ్ఞానోదయం పొందాలి. భయాన్ని విడిచి మరణంలోకి ప్రవేశించాలి.
మీరు భయపడుతున్నంత కాలం మీరు మరణాన్ని మీ కళ్ళతో చూడలేరు. మీరు అలా చేయనంత కాలం మీరు ఎంత గొప్ప దీవెనల్ని పొందారో తెలుసుకోలేరు. ఎప్పుడైతే ఒక దాన్ని పోగొట్టుకుంటాను అని తెలుసుకుంటారో అప్పుడే దాని విలువ తెలుసుకుంటారు.
ఒకసారి ధ్యానం చేయండి, మీరు రెండు రోజుల్లో మరణించబోతున్నారు అని తెలిసిందనుకోండి, మీరు ఏం చేయాలనుకుంటారు? మీరు పూర్తి చేయవలసింది ఇంకా ఎంత ఉంది? మీరు జీవితాన్ని చూసినప్పుడే మీకు ఎంత మంచి జరిగిందో అర్థం చేసుకుంటారు. మీరు ఎల్లకాలం ఉంటాను అనే నమ్మకంతో ప్రతి దాన్ని చాలా యథాలాపంగా తీసుకున్నారు. ఎప్పుడైతే మరణాన్ని అర్థం చేసుకుంటారో జీవితం విలువ మీకు తెలుస్తుంది.
ఒకసారి మరణాన్ని భయం లేకుండా ఎదుర్కొంటే మరణం జీవితానికి చివర కాదు, అది జీవితంలో అత్యున్నతఘటన అని అర్థం అవుతుంది. ఎప్పుడైతే ఈ విషయం మీకు అర్థమవుతుందో అప్పుడు ఇంకా జీవితం పొడిగించాలి అని కోరుకోరు. ఒక విషయం అర్థం చేసుకోండి, మరణం మీ కంటే శక్తితో ఉంటుంది. ఎందుకంటే మీకు దానిలో ఉన్న నమ్మకం దానికి ఆ శక్తిని ఇస్తుంది, అంతే. ఇది కేవలం నమ్మకం మాత్రమే. ఎప్పుడైతే మరణం భయపెడుతుంది అని నమ్ముతారో అది నిజంగా భయపెడుతుంది. ఇది అద్దంలా మీరు ఏమిటో దాన్ని విశ్వాసంతో చూపిస్తుంది.
ఒక గాడిద అద్దంలో చూస్తే ఏం కనిపిస్తుంది? గాడిదే కనిపిస్తుంది. మరేమీ కాదు. అదే విధంగా మరణం అంటే మీరు భయపడితే అందులో మీకు భయమే కనిపిస్తుంది. అప్పుడు మరణం నిజంగా మరణమే అవుతుంది. మీరు కొంచెం సమయం తీసుకొని మరణ భయంలోకి చూడగలిగితే అది మిమ్మల్ని ఎంతో చక్కగా, అనుకూలంగా మార్చగలుగుతుంది. దానికి ఆ శక్తి ఉంది. అది జీవితానికి వ్యతిరేకం కాదు, అనుకూలమైనది అని మీకు అర్థం అవుతుంది.
స్వేచ్ఛగా వదిలేయటమే అంతిమం
మనం మరణాన్ని చూడలేకపోతున్నాం. ఎందుకంటే నిరంతరం మారే జీవితాన్ని చూడలేకపోతున్నాం. మనం ఎప్పుడూ మనుషులలో, వస్తువులలో, సంఘటనలలో, పట్టుకొని వేలాడుతూ ఉంటాం, అదే సమస్య. దాన్ని స్వేచ్ఛగా వదిలేయటానికి భయపడిపోతున్నాం. ఈ స్థితి బాధాకరమైంది. అసాధ్యాలని పట్టుకొని వేలాడటమే కాదు, బాధలకి మూలాల్ని పట్టుకొని ఉన్నాం. మీరు స్వేచ్ఛగా వదిలేయగలిగితే, సర్వాంతర్యామి మీద విశ్వాసం ఉంచి విరామంగా ఉండగలిగితే, సర్వాంతర్యామి మీ రక్షణ బాధ్యతని తీసుకుంటాడు. మీరు ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
మీ జీవితంలో జరుగుతున్న ప్రతి దాన్ని అర్థంచేసుకుంటూ చూడండి. మార్పు అనేది జీవనలక్షణం. అందుకే జీవితం రంగురంగులుగా, ఆసక్తికరంగా, అందంగా ఉంటుంది. అప్పుడు జీవితం మీకు చూపించే అందమైన అద్భుతాల్ని చూడవచ్చు. వాటి అందమైన మరొక అద్భుతమే మరణం.
మరణం అంటే లోతైన విరామం. అది అంతిమస్వేచ్ఛ. పాతని వదలి కొత్త దానిలోకి వెళ్ళటమే మరణం. ఎప్పుడైతే మీలోని ఆత్మశక్తి తాను సాధించాలి అనుకున్నది ఈ శరీరం ద్వారా సాధించలేను అనుకున్నప్పుడు, ఈ శరీరాన్ని వదిలి మరొక దానిలోకి వెళుతుంది. అలా వెళ్ళటమే మరణం అంటే.
మీ ఇల్లు కొన్ని సంవత్సరాలయ్యాక పాతబడిపోతుంది. ఉండటానికి వీలుగా ఉండదు, రిపేరు చేయటానికి వీలు కాలేదు అనుకోండి. మీరు దాన్ని అమ్మి కొత్త ఇంట్లోకి వెళతారు లేదా కొత్తగా మళ్ళీ కట్టుకుంటారు. అప్పుడు మీరు బాధపడతారా? లేదే బాధపడరు. అదే విధంగా మీరు ఏ విధంగా జీవించాలి అనుకున్నారో, అలా పూర్తిగా జీవించలేనప్పుడు, ఈ శరీరాన్ని వదలి మరొక కొత్త శరీరంలోకి వెళతారు. కొత్త జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తారు. తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించటమే మరణం అంటే.
కొత్తగా ప్రారంభించటం
మీరు మరణించినప్పుడు అక్కడ జరిగేది ఏమిటంటే నూతనత్వాన్ని పొందటం. మీ శరీరం, మానసిక వ్యవస్థ కొత్తగా అవుతాయి. మీరు తాజా జ్ఞాపకాల్ని, కొత్త స్థలాన్ని, కొత్త బంధువుల్ని, కొత్త జీవితాన్ని పొందుతారు. ఇంకా చెప్పాలి అంటే మీరు కొత్త జన్మ తీసుకొని పూర్తి కాని మీ పనుల్ని సాధిస్తారు. తీరని కోరికలు తీర్చుకుంటారు. మీరు సగంలో వదిలినవాటిని పూర్తి చేయటానికి తిరిగి భూమి మీదికి వస్తారు. మీకు తిరిగి ప్రారంభించే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వటాన్నే మరణం అంటారు. ఈ చిన్న సత్యాన్ని అర్థం చేసుకోకుండా మరణాన్ని ఆపుతూ మీరు జీవితాన్ని వృథా చేస్తున్నారు. ఒకసారి ధ్యానాన్ని మీ జీవితానికి కలిపితే, సంవత్సరాల్ని (వయస్సుని) అర్థం చేసుకోలుగుతారు. భయాన్ని ఎదుర్కోగలిగితే మరణరహస్యం తెలుస్తుంది. మీకు పొగ మంచు వీడి అసలు సత్యం వికసించి స్పష్టంగా కనిపించటం ప్రారంభమవుతుంది. మీ కళ్ళలో ఎదురుగా మరణాన్ని చూడగలరు.
మరణాన్ని ఎదురుగా చూడగలిగితే అది జీవితం అని అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రతిక్షణం మీరు మరణిస్తారు. ప్రతిక్షణం జన్మిస్తారు. మరణం, జననం ఒక చక్రం లాంటివి. మీరు చనిపోతే మరలా పుడతారు. మీరు పుడితే మరలా చనిపోతారు. మీకు ఈ విషయం అర్థమైతే మీలోని భయాలన్నీ పోతాయి. జీవితాన్ని జీవించటం ప్రారంభిస్తారు. ప్రతి శ్వాసలో సంతోషాన్ని పొందుతారు. ఈ భూమి మీద ప్రతిక్షణం ఉత్సవం చేసుకుంటారు.
మీరు నలభై సంవత్సరాల వయస్సులో ఉంటే 20 లేదా 30 నాటి మనుషులు కాదు. కాని మీరు పూర్తి వేరుగా ఉన్నా మరణించాను అని భావించరు. మీరు భౌతికంగా, మానసికంగా, భావాత్మకంగా, ఏ విధంగా చూసినా పూర్తి కొత్త వ్యక్తులు. కాని మీరు జీవితం అలా కొనసాగుతుంది అనుకుంటారు. మరణం కూడా అంతే, అది జీవితానికి మరొక పొడిగింపు. ఏదీ మరణించదు, ఏదీ ఆగిపోదు. సృష్టి చెప్పిన విధంగా అది కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు మరణం లేదు అని తెలుసుకుంటారో, మీలో పరమానందం వెల్లివిరుస్తుంది. మీరు ఆనందపారవశ్యంలో ఉంటారు. మీ జీవితభయం నుంచి భయం లేని విధంగా మరణం నుంచి అమరత్వంగా మార్పు చెందుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చక్కగా చెబుతాడు. మరణం అంటే వస్త్రాలు మార్చుకోవటం వంటిది అని. మనం ఏ విధంగా అయితే చొక్కా మార్చుకుంటామో అదే విధంగా శరీరాన్ని మార్చుకుంటాం. ఈ విధంగా శరీరాన్ని మార్చటం ద్వారా మన అంతరంగంలో మార్పు కలుగుతుంది. మరణం జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించటమే.
రహస్యాలకే రహస్యం
మహాభారతంలో ఒక చక్కని కథ ఉన్నది.
యక్షుడు పాండుకుమారుడైన యుధిష్ఠిరుని (ధర్మరాజుని) ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ భూమి మీద అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతం ఏది? యుధిష్ఠిరుడు చక్కని జవాబు ఇస్తాడు, 'ప్రతి రోజూ ఎందరో యమలోకానికి వెళ్ళటం చూస్తూ కూడా, ఇక్కడ ఉన్నవారు మాత్రం తాము ఎప్పటికీ ఈ భూమి మీదే ఉంటాం అనుకుంటారు. ఇదే ఆశ్చర్యకరమైన రహస్యం.
మనం ఎప్పుడూ ఏమనుకుంటామంటే, ఎవరో చనిపోతారు నేను కాదని. అందుకే మరణం రహస్యాల్లోకే ఒక రహస్యం. మరణం గురించి రెండు విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. మనం ఏదో ఒకరోజు మరణిస్తాం. రెండవ విషయం ఎప్పుడు ఎక్కడ ఎలా మరణిస్తాం అన్న విషయం తెలియదు. పుట్టిన ప్రతిదీ మరణించాలి అదే జీవిత లక్షణం.
బుద్ధుని జీవితం నుంచి ఒక చక్కని కథ : ఒక స్త్రీ చనిపోయిన తన కొడుకుని తీసుకుని బుద్ధుని దగ్గరకి వస్తుంది. కొడుకు మరణంతో ఆమె కుంగిపోయి ఆ దుఃఖంలో పిచ్చిదానిలా అయిపోతుంది. ఆమె బుద్ధుని పాదాల మీద పడి బిడ్డని బ్రతికించమని ప్రార్థిస్తుంది.
బుద్ధుడు ఆమెతో, ‘నాకు గుప్పెడు ఆవాలు ఇవ్వు’ అంటాడు. ఆమె అలాగే అని చెప్పి పరుగున ఇంటికి వెళ్ళబోతుంది. అప్పుడు బుద్ధుడు ఆమెతో, ‘ఏ ఇంట్లో అయితే మరణం సంభవించలేదో, ఎవరినీ వారు పోగొట్టుకోలేదో ఆ ఇంటి నుంచి మాత్రమే ఆవాలు తీసుకురావాలి' అంటాడు. ఆమె ఇంటింటికీ తిరుగుతూ దీనంగా ఆవాలు ఇవ్వమని ప్రార్థిస్తుంది. ఆమె మీద జాలితో అందరూ ఆవాలు ఇవ్వబోతారు. అప్పుడు ఆమె మీ ఇంట్లో ఎవరూ మరణించలేదు కదా అని అడిగితే వారు ఎవరో ఒకరి గురించి చెప్పేవారు. ఆ విధంగా సాయంత్రం వరకూ ఆమె ఇళ్లన్నీ తిరిగింది కాని మరణం లేని ఇల్లు ఎక్కడా కనిపించలేదు. ఆమె బిడ్డ శవాన్ని సమాధి చేసి బుద్ధుడి దగ్గరకి వస్తుంది. ఆయన పాదాల మీద పడి 'నాకు సత్యం బోధించండి. మరణం అంటే ఏమిటి? మరణానికి అతీతంగా ఏం ఉంటుంది.' అని అడుగుతుంది.
ఆమె చివరికి బుద్ధుడి శిష్యురాలుగా మారి జీవితాంతం ఆయన మార్గాన్ని అనుసరిస్తుంది.
ఒక చక్కని మాట ఉంది, రేపు లేదా తరువాత జన్మ ఏది ముందు వస్తుందో మనకి ఎప్పటికీ తెలియదు. బుద్ధుడు ఈ విధంగా చెబుతాడు, 'సర్వాంతర్యామి మేఘంలా వెతుకుతుంటాడు. జనన మరణాల్ని గమనిస్తే అది నాట్యంలా ఉంటుంది అని.
ఏ మతాలవారు అయితే మనిషికి ఉన్నది ఒకే జన్మ అని నమ్ముతారో వారే కంగారు, ఒత్తిడిలను సృష్టించారు. జీవితసారాంశాన్ని పిండుకోవాలని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదీ పోగొట్టుకోలేరు కాబట్టి. మనిషికి ఉన్నది ఒక జన్మ మాత్రమే అన్న నమ్మకం శాస్త్రసాంకేతిక అభివృద్ధికి కారణం. అప్పుడే జీవితంలో ఎక్కువ సంతోషాన్ని పొందవచ్చు అన్నది వారి అభిప్రాయం.
తూర్పుదేశాల మతాలు, మనిషికి చాలా జన్మలు ఉన్నాయి అని నమ్ముతాయి. మీరు ఈ భూమి మీదకి పలుసార్లు వస్తారని నమ్ముతారు. తిరిగి అదే జీవితం అనే నాటకం ఆడాలి. అదే వ్యవస్థ, అవే బంధాలు, కాకపోతే వేరు వేరు కాలాలు. అందుకే జన్మ అంటే విసిగిపోయి ఉంటారు. ఎన్నిసార్లు జన్మించాలి? ఎన్నిసార్లు అదే నాటకం, నాకు దీని నుంచి స్వేచ్ఛ కావాలి అనుకుంటారు. అందుకే విముక్తి, మోక్షం గురించి పని చేస్తారు. మరణం అంటే మీకు ఉండే భావం మీ జీవనవిధానాన్ని మార్చేస్తుంది.
పునర్జన్మ అన్న విషయం అంత ప్రాచుర్యాన్ని పొందలేదు. ఎందుకంటే దాన్ని శాస్త్రీయంగా నిరూపించలేం. నియర్డెత్ ఎక్స్పీరియన్స్ అనే విషయం ఇప్పుడు బాగా ప్రాచుర్యాన్ని పొందింది. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ వారి అనుభవాల్ని అందులో చెప్పారు. మరణం సమీపానికి వెళ్ళి బతికిన వేలమంది తమ అభిప్రాయాల్ని చెప్పారు. అందరి అనుభవం ఒకే విధంగా ఉంది. వారు సంఘటనలో జీవించారు. హిప్నటిస్ట్స్ కూడా కొందరిని వారి క్రితం జన్మలోకి తీసుకువెళ్లినప్పుడు అది కూడా ఒకే విధంగా ఉన్నది. ఇవన్నీ కూడా కఠోపనిషత్తులో ఋషులు ఏం చెప్పారు అదే విధంగా ఉన్నాయి.
జ్ఞానోదయానికి ముందు నా సమక్షంలో జరిగిన మరణం
నాకు జ్ఞానోదయం జరగటానికి ముందు ఆధ్యాత్మికప్రయాణంలో, ఒక సంఘటన జరిగింది. నేను వారణాసికి దగ్గరలో గజియాబాద్ అనే ఊరిలో ఉన్నాను. అక్కడ ఒక పెద్దవయస్సు సాధువు హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐ.సి.యు.) లో ఉంటే నేను అతనికి తోడుగా ఉన్నాను. ఇది సంప్రదాయం. పెద్ద వయస్సు సాధువుకి ఆరోగ్యం బాగుండకపోతే చిన్న సాధువులు వారి సంరక్షణ చూసుకుంటారు. నేను ఆ విధంగా ఆయన దగ్గర ఉన్నాను.
నేను ఒక రోజు ఆయన దగ్గర ఉన్నప్పుడు పక్క మంచం మీద వ్యక్తి చనిపోతున్నాడు. అతను జీవితం కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. అతని అంతరంగంలో జరిగేది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. నాకు లోతైన ఆధ్యాత్మిక అనుభవం జరిగింది కాని జ్ఞానోదయం కాలేదు. నేను ఇంకా అన్వేషణలోనే ఉన్నాను. నా శరీరం జ్ఞానోదయం జరిగినప్పుడు సంభవించే శక్తి విస్ఫోటానికి తయారు అవుతున్నది.
చాలామంది డాక్టర్లు ఆయన ప్రాణాలు నిలపటానికి చాలా ప్రయత్నం చేశారు. అతనికి శ్వాస అందటం లేదు. అతనికి మరణం ఎలా సంభవించిందో నేను స్పష్టంగా చూడలిగాను. అతనిలోని జీవాత్మ ఏ విధంగా శరీరం బయటికి వెళుతుందో చూడలిగాను.
నా శరీరం బయట నాకు జరిగిన అతిశక్తిమంతమైన అనుభవం. అక్కడ జరుగుతున్నది నాకు కనపడుతూన్నది. కాని నేను దాన్ని భరించలేకపోయాను. మీరు ఒక ముఖ్యవిషయం తెలుసుకోవాలి, ఎవరైనా భౌతికంగా బాధపడుతుంటే, అది మిమ్మల్ని ముప్పై నుంచి నలభై శాతం ప్రభావితం చేస్తుంది. అది మానసికంగా బాధపడితే, డిప్రెషన్లో ఉంటే అది అరవై శాతం మీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అదే భావాత్మకస్థితిలోని బాధ అయితే ఎనభై శాతం మీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. బాధ సూక్ష్మంగా అయ్యే కొద్దీ దాని ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది.
నేను శారీరక, మానసిక, భావాత్మకబాధనే కాదు, అంతరంగంలోని జీవాత్మస్థాయిలో బాధని కూడా చూసాను. ఆ బాధ అంతా నేను పడినట్లు అయ్యింది. అక్కడి నుంచి పరుగెత్తి, వెళ్ళిపోవాలి అనుకున్నాను. కాని ఆ సాధువు నా చేయి పట్టుకొని, నన్ను వెళ్ళవద్దు అని బతిమిలాడసాగాడు. నేను మూడు నెలలుగా అతన్ని చూసుకుంటున్నాను. అదే మా మధ్య అనుబంధం.
నా చిన్నప్పటి నుంచి సాధువులకి, సన్యాసులకి సేవ చేయటం నాకు చాలా ఇష్టం. మా ఇంటి నుంచి భోజనం, బట్టలు తీసుకువెళ్లి వాళ్ళకి ఇచ్చేవాడిని. అది నాకు ఇష్టం. ఈ రోజుకి కూడా వేదసంస్కృతి నిలబడి ఉంది అంటే దానికి కారణం ఈ యోగీశ్వరులే. ఆ శాస్త్రాన్ని అలా నిలబెట్టారు. వారు వారి శాస్త్ర సాంకేతికరంగాల్లో పరిశోధనలు చేయాలి అంటే చాలా రకాలైన సహాయ సహకారాలు అందించాలి. ఉదాహరణకి పాశ్చాత్యదేశాలలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. దానికి చాలామంది, చాలా సంస్థలు సహాయం చేస్తాయి. వైద్యరంగంలో పరిశోధనలకి ఫార్మసీ కంపెనీలు సహాయం చేస్తాయి. అదే అంతరిక్షపరిశోధనలు అయితే ప్రభుత్వం సహాయం చేస్తుంది.
అదే విధంగా భారతదేశం మొత్తం ఆధ్యాత్మికపరిశోధనలకి తన సహాయసహకారాలు అందిస్తుంది. దేశం మొత్తం అంతరంగ ప్రపంచశాస్త్రవేత్తల బాధ్యతని తీసుకుంటుంది. వారికి భోజనం, బట్టలూ, ఆశ్రయం ఇచ్చి, వారి పరిశోధనలకి అంతరాయం కలగకుండా చూస్తుంది. వారు బయట ప్రపంచంలో ప్రాథమిక అవసరాలకి సమయాన్ని వృధా చేయనీయకుండా ఆ అవసరాల్ని చూస్తారు. అందుకే నేను ఎప్పుడూ సాధువులకి, యోగులకి సేవచేయటం నా బాధ్యత అని చేసేవాడిని.
ఆ పెద్ద సాధువు నన్ను అక్కడి నుంచి వెళ్ళనీయలేదు. ఆ పక్క మంచం మీద వ్యక్తి మరణించటం అతన్ని భయపెట్టింది. ఆ వ్యక్తి యాతనని అనుభవిస్తున్నాడు. ఆరు అడుగుల శరీరం వేరు చేయబడినట్టు బాధపడుతున్నాడు. మన వేలికి చిన్న గాయం అయితేనే నొప్పి భరించలేం. అది ఎంత బాధగా ఉంటుందో కదా! ఒకేసారి వేయి తేళ్ళు కుట్టినంత బాధని అనుభవిస్తున్నాడు. నాకు అతను పడుతున్న బాధ స్పష్టంగా కనిపిస్తోంది.
ఒక వైపు అతని ఆత్మకి సంబంధించిన తీరని కోరికలు, భావావేశాలు, అత్యాశ, అపరాధభావం - ఇవన్నీ వ్యధని చెందుతున్నాయి. ఆత్మ శరీరంలో ఉండి ఈ కోరికలన్నీ తీర్చుకోవాలి అనుకుంటుంది. కాని శరీరం అలసిపోయి విశ్రాంతి కావాలి అంటుంది. శరీరం చాలు అంటుంది. ఆత్మ కావాలి అని శరీరాన్ని పట్టుకొని ఉంది. కుడి చేయి పోతే, ఎడమ చేతిని పట్టుకొని ఉంటుంది. ఎడమ చేయి చనిపోతే ఆత్మ కాలుని పట్టుకొని వేలాడుతుంది. ఆ విధంగా శరీరంలో ఏ భాగం బాగుందో దాన్ని పట్టుకొని వేలాడుతుంది. ఒక భాగం తరువాత ఒకటిగా శరీరం మరణిస్తుంది. నాకు స్పష్టంగా కనిపించింది. కింది భాగంతో అతను అంత యాతన అనుభవించలేదు కాని శరీరంపై భాగం బాధకి అతను వణికిపోతున్నాడు.
క్రమంగా జీవాత్మ శరీరాన్ని వదలి బయటకి వెళ్ళిపోతుంది. ఒక విషయం అర్థం చేసుకోండి, ఎప్పుడైతే శ్వాస ఆగుతుందో, జీవాత్మ శరీరాన్ని వదిలింది అని అర్థం. మీ లోపల ఏడు శరీరాలు ఉంటాయి. రక్తమాంసాలతో ఉండి మీరు చూడగలిగేది భౌతిక శరీరం. మీలోని జీవశక్తి అయిన ప్రాణం కదలాడే శరీరం ప్రాణశరీరం. ప్రాణం మీ లోపల ఐదు రకాల కదలికల్ని కలిగి ఉంటుంది. మీ లోపలికి ప్రవేశించిన శ్వాస, మీ లోపల తిరిగే గాలి, శరీరమంతా జీవశక్తిలా వ్యాపించే గాలి, మీ నుంచి బయటికి వచ్చేసే గాలి, ఇదంతా కలిపి మీలోని రెండవ శరీరంగా ఉంటుంది. అదే ప్రాణ శరీరం. మూడవది, నిరంతరం మీ లోపల మీరు మాట్లాడుకునే మాటలు. అంతరంగపు మాటలు (ఇన్నర్ చాటర్). అంటే మీలో ఒక ప్రవాహంలా వచ్చే మాటలు ఆలోచనలు. అవి మీ లోపల ఒక ప్రవాహంలా కదులుతూ ఉంటాయి. నాలుగవ శరీరం మీ భావావేశాలైన భయం, కోపం, ఆశలూ మొదలైనవి. ఇవన్నీ ఎటువంటి మాటలూ అవసరం లేకుండా మీ శరీరమంతా ఒక భావంలా వ్యాపిస్తాయి. మాటలు లేకుండా కేవలం ఆ భావావేశం మిమ్మల్ని కుదిపేస్తుంది. ఇదే భావావేశాల శరీరం. ఐదవది, మీరు గాఢనిద్రలో అనుభవించే నిశ్శబ్దం. ఇక్కడే లోతుగా నాటుకుపోయిన సంస్కారాలు ఉంటాయి. అవి విత్తనం స్థాయిలో ఉంటాయి. ఈ సంస్కారాలు చైతన్యంతో ఉండవు. అలా అని జీవం లేకుండా కాదు అవి లోతైన కోమాలో ఉంటాయి. మీరు మీకు ఇష్టమైన విధంగా జీవించలేరు. అలా అని మీరు మరణించలేదు. అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు.
కారణశరీరం నుంచి ఆత్మ ఆనందశరీరానికి చేరుతుంది. ఇది ఆరవ శరీరం. ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తారు. ఇదే మిమ్మల్ని ఆధ్యాత్మిక అన్వేషకులుగా ఉండాలి అని నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక అన్వేషకులైతే ఈ శరీరం మీలో చాలా బలంగా ఉంటుంది. మీరు ఈ శరీరాన్ని ఐశ్వర్యవంతం చేస్తే, మీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ శరీరంలో ఏమైనా సంస్కారాలు మిగిలి ఉంటే తిరిగి మీరు జన్మ ఎత్తుతారు.
మీరు సంతోషకరమైన అనుభవాలతో ఎక్కువగా ఉంటే, మీరు స్వర్గంలో ఉంటారు. మీరు బాధలలో ఇరుక్కుపోయి ఎక్కువ కాలం ఉండిపోతే మీరు నరకంలో ఉన్నట్టే. మీరు జీవించి ఉన్నప్పుడు ఎంత బాధని అనుభవించారో మరణించే సమయంలో అంత సేపూ బాధల్లో ఉంటారు. అదే మరణసమయంలో నరకం. మీరు జీవించినప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవించారో, అంత సేపు మరణ సమయంలో ఆనందంలో ఉంటారు. అదే స్వర్గం. అంత సేపు ఈ ఆనందకోశంలో ఉంటారు.
స్వర్గం, నరకం అనేవి మానసికస్థితులు, అది సత్యం. మీ లోపల ఉన్న సంస్కారాలు ఆధారంగా మీరు స్వర్గాన్ని, నరకాన్ని అనుభవిస్తారు. అందుకే రకరకాల సంస్కృతులలో స్వర్గనరకాల్ని వేరువేరుగా ఊహిస్తారు. ఎందుకంటే స్వర్గం ఒక స్థలం కాదు, అది మానసిక స్థితి. ఏడవ శరీరం నిర్వాణశరీరం ఇది జ్ఞానోదయశరీరం. మరణసమయంలో వ్యక్తి జీవాత్మకి, అతని శరీరానికి మధ్య చాలా పెద్ద పోరాటం జరుగుతుంది. శరీరం ఇక నా వల్ల కాదు నేను అలసిపోయాను అంటుంది. ఆత్మ కాదు, నాకు నీవు కావాలి నిన్ను ఇంకా ఉపయోగించుకోవాలి, అంటుంది.
శరీరం గెలిస్తే, ఆత్మ తరువాతి శరీరంలోకి వెళుతుంది, అదే ప్రాణశరీరం మీరు కలల్లో ఉండేది. ఈ శరీరంలో మీ తర్కం పని చేయదు. కాని కోరికలు అదే విధంగా ఉంటాయి. కల అంటేనే అర్థం ఎటువంటి తర్కం, అర్థం లేనిది. కానీ కోరికలు, సంస్కారాలు అదే విధంగా చైతన్యంతో ఉంటాయి. మీరు అచేతనస్థితిలో ఉన్నా, కోమాలో ఉన్నా, మీ తర్కం పని చేయదు.
మీరు భౌతికశరీరంలో ఉన్నంత కాలం మీలో కోరికలు ఉంటాయి. మీరు అవి అవసరమా, కాదా అని విశ్లేషణ చేయగల తర్కం ఉంటుంది. ఏ కోరికల్ని ముందు తీర్చాలి అని నిర్ణయించే తర్కం ఉంటుంది. కోరికలు మీ నియంత్రణలో ఉంటాయి. అక్కడ సమతుల్యతలో ఉంచే యంత్రాంగం ఉంటుంది. ఎప్పుడైతే తగిన తర్కం ఉండదో, కోరికలు ఆత్మని ఫుట్బాల్ని కొట్టినట్టు ఆడుకుంటాయి. ఒక పక్క అపరాధభావం ఉంటుంది. మరొక పక్క కోరికలు ఆత్మని అన్ని వైపులకీ లాగుతుంటాయి.
నేను ఆ మరణించే వ్యక్తిని గమనించినప్పుడు, అతనిలోని ఆత్మ ఒక దాని తరువాత ఒక శరీరం లోంచి వెళ్ళటం స్పష్టంగా చూడగలిగాను. కోరికలు తీరని శరీరం గుండా వెళ్ళేటప్పుడు ఆత్మపడిన క్షోభని, యాతనని చూసాను. అపరాధభావం ఆత్మని ఎంత బాధపెట్టిందో చూసాను. నేను అనుకున్నది సాధించలేకపోయాను అనే భావం ఆత్మని అతిగా బాధపెట్టింది. అప్పుడే మీరు జన్మించిన మీ లక్ష్యాన్ని మరణసమయంలోనే గుర్తు చేసుకుంటారు.
మీరు జన్మనెత్తే సమయంలో చాలా బాధని అనుభవిస్తారు. ఆ బాధలో జన్మ లక్ష్యాన్ని మరచిపోతారు. అది లోతైన అచేతన స్థితిలో జరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, మీరు విమానంలో కూర్చున్నాక కోమాలోకి వెళ్ళారనుకోండి, తరువాత విమానం దిగాక మీరు ఎందుకు విమానం ఎక్కి అక్కడికి వచ్చారో మరిచిపోతారు. ఆ స్థలాన్ని వదిలాక అకస్మాత్తుగా అక్కడికి ఎందుకు వచ్చారో గుర్తు వస్తుంది.
అదే విధంగా మరణించే సమయంలో మీలో బలమైన అపరాధభావం అందుకే కలుగుతుంది. నేను జన్మ నెత్తిన ఉద్దేశాన్ని అంటే ప్రారబ్ధకర్మలని పూర్తి చేయలేకపోయానే అనే అపరాధభావం అది. ఈ భావం లోంచి ప్రయాణం చేశాక, మీ జీవితంలో, అనుభవించిన బాధల అనుభవాలు వస్తాయి. కాబట్టి మరణసమయంలో మీరు ముందుగా శారీరకబాధల లోంచి, ఆ తరువాత కోరికల గుండా, ఆ తరువాత అపరాధభావం ద్వారా ఆ తరువాత భావావేశాల బాధల గుండా, చివరికి ఆనందకోశం ద్వారా ఈ జన్మలో అనుభవించిన ఆనందంతో బయటికి వెళ్ళిపోతారు.
సాధారణంగా మీరు ఆనందమయకోశం అయిన ఆరవ శరీరాన్ని చేరగానే తరువాతి శరీరం తీసుకోవటానికి సిద్ధపడతారు. అంటే వ్యక్తిలోని జీవాత్మ ఆ తరువాతి శరీరాన్ని తీసుకోవటం. చాలా అరుదుగా ఆరవ శరీరం దాటి నిర్వాణశరీరంలోకి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించగలిగితే తిరిగి వెనక్కి వచ్చి కొత్త శరీరాన్ని తీసుకోరు. మీరు ఈ శరీరాల నుంచి ప్రయాణం చేసినప్పుడు మీకు చాలా అనుభవాలు కలుగుతాయి. మీలోని తీరని కోరికలు, లోతైన అపరాధభావం, తీవ్రమైన బాధ - వీటి అనుభవంతో మీరు గట్టిగా ఒక నిర్ణయానికి వస్తారు. నేను మరొక శరీరాన్ని తీసుకొని, నేను సాధించవలసిన విషయాలు ఈ సారి మరిచిపోకుండా సాధించి తీరతాను. నేను తిన్నగా సత్యమార్గంలో సత్యాన్వేషణలో ఉంటాను అనుకుంటారు. కాని జన్మ నెత్తే సమయంలో ఆ తీవ్రమైన బాధకి మీ లక్ష్యాలు మరిచిపోతారు.
చివరికి ఆ వ్యక్తి మరణించాడు. కాని ఆ అనుభవం నా లోపల ఒక లోతైన గుర్తుగా మిగిలిపోయింది. అదృష్టం కొద్దీ ఆ సాధువుకి ఆరోగ్యం కుదుటపడి ఆయనని డిశ్చార్జి చేశారు. నేను తిరిగి నా ప్రయాణం కొనసాగించాను. ఆ తరువాత కొంత కాలానికి నాకు మరణ అనుభవం కలిగింది. నాకు జ్ఞానోదయం అయ్యింది. నా జీవితం ఒక విముక్తి పొందినవానిలా నా పన్నెండవ సంవత్సరంలోనే ప్రారంభమైంది. అప్పుడే నాకు చాలా గాఢమైన, లోతైన ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. కాని నా లక్ష్యం, నా మిషన్ గురించి స్పష్టత జ్ఞానోదయం తరువాత మాత్రమే కలిగాయి. ఈ శరీరం ద్వారా ఏం జరుగబోతున్నది అనే విషయం జ్ఞానోదయం తరువాత మాత్రమే స్పష్టంగా నాకు తెలిసింది.
జ్ఞానోదయమైన తరువాత నా సమక్షంలో జరిగిన మరణం
నాకు జ్ఞానోదయం అయిన తరువాత నేను దక్షిణభారతదేశం వచ్చి బెంగళూరులో ఒక భక్తుని ఇంట్లో ఉంటూ అందరికీ హీలింగ్ చేసేవాడిని. ఆ సమయంలో ఒక వ్యక్తి ఐ.సి.యు.లో ఉంటే హీల్ చేయటానికి అక్కడికి వెళ్లాను.
అక్కడ నేను హీలింగ్ చేసే సమయంలో పక్క మంచం మీద ఉన్న వ్యక్తిలో మరణం ప్రారంభమైంది. నేను ఎప్పుడైతే అతను మరణించబోతున్నాడు అని అనుకున్నానో, ఆ బాధ చూడలేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. కానీ హీలింగ్ చేయించుకుంటున్న వ్యక్తి నన్ను వెళ్ళనీయలేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం, మరణిస్తున్న ఈ వ్యక్తి అంతకు ముందు నాకు జరిగిన అనుభవంలోని వ్యక్తిలా బాధ పడటం లేదు. నేను నిర్భాంతపోయాను. నాకు చాలా కుతూహలం కలిగింది. ఇంతకు ముందు వ్యక్తిలో ఆత్మ ఒక శరీరం నుంచి మరొక దానిలోకి ఎంతో యాతనపడి, బాధపడి వెళ్ళేది. కాని ఇతని ఆత్మ ప్రశాంతంగా శరీరాల్ని దాటుతూ వెళ్ళిపోతూంది. అంతా చాలా నెమ్మదిగా మెత్తగా, ప్రశాంతంగా వెళ్ళటం నేను చూసాను.
మొదటిదైన భౌతికశరీరంలో కొంత బాధ అనుభవించాడు. అకస్మాత్తుగా బాధ మాయమైంది. ఆత్మ ప్రశాంతంగా ప్రాణ శరీరంలోకి ప్రవేశించింది. రాజరీవితో ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి వెళ్ళగలిగింది. ఆత్మ చాలా శక్తిమంతం అయింది. కోరిక, అపరాధభావం - ఇటువంటివి ఏవీ కూడా ఆత్మని ఏమీ చేయలేకపోయాయి. కారణశరీరంలో అది గాఢనిద్రలోకి వెళ్ళలేదు. అది చివరిగా నిర్వాణశరీరంలోకి ప్రవేశించి అక్కడ విరామంగా ఉండి మాయమైపోయింది. నేను ఆ వ్యక్తిని గొప్ప ఆధ్యాత్మికడు అనుకున్నాను. నేను ఆయన బంధువుల్ని ఆ విషయం అడిగాను. అతని బంధువులు కాదని చెప్పారు. అతను జీవితంలో ఎప్పుడూ ధ్యానం చేయలేదు, ఏ ఆధ్యాత్మికసాధనా చేయలేదు, అని చెప్పారు. అతను మామూలు ప్రాపంచికజీవితాన్ని గడిపాడు.
నేను ఈ విషయం గురించి లోతుగా ఆలోచించాను. నేను మొదట చూసిన మరణం భయంకరంగా ఉంది. రెండవది అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడు మీకు చెబుతున్న విషయం నిజాయితీతో, సత్యాన్ని తిన్నగా చెబుతున్నాను. ఈ విషయం చెప్పటంలో నా బాధ్యత ఎక్కువగా ఉంది. ఈ రెండు మరణాలకి తేడా ఏమిటి అని ధ్యానంలోకి వెళ్ళి గమనిస్తే నాకు విషయదర్శనం అయ్యింది. రెండవ మరణ సమయంలో నాకు జ్ఞానోదయం కలిగింది. ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుని సమక్షంలో రెండవ మరణం సంభవించింది. మొదటి మరణంలో నా సమక్షం ఏ మాత్రం సహాయం చేయలేకపోయింది. ఎందుకంటే జ్ఞానోదయశక్తి నా నుంచి ప్రసరించలేదు. నాకు అప్పటికి జ్ఞానోదయం కాలేదు. అందుకే మొదటి వ్యక్తి సాధారణమరణాన్ని పొందాడు. రెండవ వ్యక్తి జ్ఞానోదయమైనవారి సమక్షంలో మరణించాడు. అదే తేడా.
ఈ విషయం నాకు ఎప్పుడైతే అర్ధమైందో, నా అంతరంగం నుంచి గాఢమైన కరుణ పెల్లుబకటం తెలిసింది. నాకు అప్పుడు అనిపించింది దీన్ని ప్రతి మనిషికి ఒక బహుమతిగా నేను ఇవ్వగలిగితే నా మిషన్, నా లక్ష్యం నెరవేరినట్టే. అని అంత ప్రశాంతమైన మరణాన్ని కేవలం జ్ఞానోదయమైన యోగీశ్వరుడు మాత్రమే ఇవ్వగలడు. అప్పుడు నేను ధ్యానంలోకి వెళ్ళి ఏ విధంగా ఈ బహుమతిని నేను అందరికీ ఇవ్వగలను అనుకున్నాను. నేను అన్ని ఐ.సి.యు. లో ఉండలేను. దీని వెనుక గల శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాను. మరణం వెనుక ఉన్న విషయాన్ని శాస్త్రీయంగా తెలుసుకోగలిగాను. మరణసమయంలో నిజంగా ఏమి జరుగుతుందో తెలుసుకున్నాను. మీకు వివరిస్తాను.
మీరు మామూలు తర్కానికి కట్టుబడి కేవలం భౌతికశరీరంలోనే ఉండిపోతే, గురుదేవులు అనగానే మీకు మామూలుగా ఉండే నమ్మకం అనిపిస్తుంది. అంతే అప్పుడు బయట ప్రపంచం చాలా దృఢంగా, గొప్పగా, ఒక సత్యంలా అనిపిస్తుంది. మీరు లోతుగా వెళ్ళే కొద్దీ మిగతా శరీరాల్లోకి వెళ్ళే కొద్దీ గురువులు సత్యం అని, ప్రపంచం మసకగానూ కనిపిస్తుంది. నిద్ర పోయేటప్పుడు కల నిజంలా బయట ప్రపంచం మసకగా కనిపిస్తాయి. నిద్ర లేచాక ఏ విధంగా కల నిజం కాదు, బయటి ప్రపంచం నిజం అనిపిస్తుందో, ఇది కూడా అంతే. మీరు చేతనస్థితిలో ఉన్నప్పుడు మీరు కలలో చూసే ప్రపంచం ఒక ఊహ, ఒక కల్పనలా అనిపిస్తుంది. కలలో చూసే ప్రపంచం చైతన్యంతో 4డి కలర్ సినిమా లా ఉంటుంది. కల లోంచి బయటకి రాగానే కల నలుపు - తెలుపులా ఉంటుంది. అదే విధంగా మీ చేతనస్థితి అత్యున్నతస్థాయికి చేరితే ఈ బయటి ప్రపంచం జీవం లేనట్టు డల్‌గా ఉంటుంది. ఆధ్యాత్మిక సత్యాలు, గురువులు నిజమని తెలుస్తుంది. మీరు శరీరం నుండి విడిపోయి ఉన్నతచేతనస్థితిలోకి వెళ్ళగలిగితే, గురుదేవులు, అత్యున్నత చేతనస్థితి శక్తి ఒక దృఢమైన సత్యమని మీరు తెలుసుకోగలుగుతారు.
రెండవ వ్యక్తి మరణించినప్పుడు అతను గాఢమైన జ్ఞానోదయ శక్తిక్షేత్రంలో ఉన్నాడు. అది అతన్ని ఆ శక్తితో కలపగలిగింది.
ఒక విషయం అర్థం చేసుకోండి, మీరు ఇక్కడ కూర్చుని నేను చెప్పేది వింటున్నారు. మిమ్మల్ని ఆ జ్ఞానోదయశక్తితో బంధం ఏర్పరచుకోనీయకుండా, ఆ శక్తిలో లీనమవకుండా ఏమి ఆపుతుంది అంటే అది మీలోని తర్కం, కారణాలు వెతికే తెలివితేటలు. మీరు ఇక్కడ అచేతనస్థితిలో చాలా అనుమానాలతో కూర్చున్నారు. నేను నా సర్వస్వం ఆయనకి అధీనం చేసి నేను అధీనమైపోతే, గురువుగారు అవన్నీ తీసేసుకుంటారేమో అనేది మరొక కారణం. ప్రస్తుతం మీకు ఈ ప్రపంచం నిజంలా కనిపిస్తుంది. గురువుగారు కూడా అంతే అనుకుంటారు.
వస్తుప్రపంచంలో మిగిలినవి ఏ విధమైన లోతుతో మీరు అర్థం చేసుకుంటారో గురువుని కూడా అదే విధంగా అర్థం చేసుకుంటారు. రెండవ వ్యక్తికి మరణసమయంలో బయటి ప్రపంచానికి సంబంధించి ఏదీ అందుబాటులో లేదు. అతని మరణసమయంలో బ్యాంక్ అకౌంటు చూసే స్థితిలో లేదు, కారు డ్రైవ్ చేసే స్థితిలోలేదు, అతను ప్రాపంచికవిషయాలతో వేరు పడిపోయాడు. అతని చుట్టూ కేవలం జ్ఞానోదయమైనవారి నుంచి ప్రకాశించే శక్తి మాత్రమే ఉంది. అతను శక్తిమంతమైన ప్రకాశం నా నుంచి రావటం చూసాడు. అప్పుడు అతనిలో అప్రయత్నంగా అధీనం జరిగింది. ఆ క్షణంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి అతను నాకు అధీనమవ్వగలిగాడు. ఆ వ్యక్తి బతికి ఉండగా నన్ను చూసి ఉంటే నాతో బంధం ఏర్పరచుకోవడానికి, నాకు అధీనమవ్వడానికి చాలా పోరాటం చేయవలసి వచ్చేది. అతని నుంచి అన్నీ తీసివేసుకోబడ్డాయి. అతను పట్టుకొని వేలాడడానికి అక్కడ ఏమీ లేదు. అందుకే నాతో బంధం ఏర్పరచుకోగలిగాడు.
భాగవతంలో ఒక చక్కని కథ ఉంది.
శ్రీకృష్ణుడికి ధనవంతుడైన భక్తుడు ఒకడు ఉంటాడు. అతను కృష్ణుణ్ణి ఇంకా ఐశ్వర్యం ఇవ్వమని కోరతాడు. కృష్ణుడు అదే విధంగా ఇస్తాడు. అక్కడే ఒక పేదరాలు ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. కృష్ణుడు ఆమె ఇంటికి వెళ్ళి ఆమెపెట్టిన ఫలాహారం తీసుకుని, ఆమెని దీవించి వెళతాడు. ఆ రోజు ఆమె ఆవు చనిపోతుంది.
కృష్ణుణ్ణి ఒకరు ఈ విషయం గురించి ఇలా అడుగుతారు, ధనవంతుడికి ఇంకాస్త ధనాన్ని ఇచ్చావు. పేదరాలికి ఉన్న ఒకే ఒక ఆధారమైన ఆవుని తీసేసావు, ఇది ఏమి న్యాయం, అని? కృష్ణుడు చక్కగా వివరణ ఇస్తాడు. ఆ ధనవంతుడు ఇంకా ఈ మిధ్యావస్తుప్రపంచాన్నే నమ్ముతున్నాడు. అందుకే అతనికి అదే ఇచ్చాను. ఏదో ఒక రోజు ఈ ఐశ్వర్యంతో అలసిపోయి జ్ఞానోదయం వైపు వస్తాడు. ఆ పేదరాలు విషయం అలా కాదు, ఆమెకి ఉన్న ఒకే కోరిక నాతో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అని. దానికి ఆమెకి ఉన్న ఒకే ఒక అడ్డం ఆవు. నేను ఆవుని తీసేసాను. ఇక ఆమె పూర్తిగా నాలో లీనమైపోతుంది.
అదే విధంగా రెండవ వ్యక్తి మరణించే సమయంలో ఆవుని తొలగించటమైంది. భౌతికశరీరంతో అనుబంధాన్ని ఏర్పరచుకోలేక పోయాడు. కాని ప్రాణశరీరంలో అతనిలోని చేతనస్థితి ఉన్నతస్థానంలోకి వచ్చింది. అతను నన్ను స్పష్టంగా చూడగలిగాడు. గురుదేవుల సమక్షం బయటి ప్రపంచాని కంటే చాలా బలమైంది. మీ కల కంటే ఈ ప్రపంచం ఎలా బలమైందో, ఇది కూడా అంతే.
ఆ వ్యక్తి అక్కడ బలమైన శక్తిని చూసాడు. ఆ శక్తికి అధీనమైపోయాడు. ఎప్పుడైతే ఆ విధంగా అధీనమయ్యాడో అతనిలోని సంస్కారాలు శక్తిని పోగొట్టుకుని అతణ్ణి ఏమీ చేయలేకపోయాయి. అతని వ్యక్తిగతచేతనస్థితి శక్తిమంతమైంది. కోరికలు, అపరాధ భావం అన్నీ తల వంచేసాయి. తిన్నగా ఆత్మశక్తి పెరిగింది.
అర్థం చేసుకోండి, సత్యాన్వేషి బలంగా ఉంటే అతను చూసేది ఏదీ అతని మీద ప్రభావాన్ని చూపదు. ఇదే మరణం వెనుక ఉన్న శాస్త్రం. మొదటి మరణంలో చూసేవాని కంటే చూడబడేది బలమైంది. రెండవ మరణంలో చూసేవాడు చూడబడే దానికంటే బలవంతుడు. ఈ శాస్త్రాన్ని అందరికీ ఎలా చెప్పాలి అనే విషయం మీద తీవ్రంగా ధ్యానం చేసాను. అప్పుడు అకస్మాత్తుగా నాకు ఒక విషయం స్ఫురించింది.
ఒక విషయం అర్థం చేసుకోండి. శక్తికి కాలం, స్థలం అనేవి అడ్డం కాదు. అది ఉపగ్రహ శక్తితరంగాల్లా విశ్వంలో ఉంటుంది. దానికి తగిన యంత్రాన్ని పెడితే ఆ తరంగాల్లోని విషయాల్ని వినవచ్చు, చూడవచ్చు. జ్ఞానోదయమైన యోగీశ్వరుని శక్తి విశ్వమంతా వ్యాపించగలదు. ఆ యంత్రాన్ని నేను మనుషుల్లో అమర్చగలగాలి. అది ఫేస్మేకర్ లాంటిది. అది ఒకసారి అమర్చిస్తే ఆ శక్తితో అతను అనుబంధాన్ని ఏర్పరచుకోగలడు. ముఖ్యంగా శరీరాన్ని వదిలే సమయంలో గురుదేవులంటే తన అంతరంగప్రపంచంలో జరిగిన ఆధ్యాత్మిక అనుభవాలు. అందరి అంతరంగంలో జరిగే విధంగా సూత్రాల్ని తయారుచేసే వ్యక్తి. ఆ సూత్రమే నిత్యానంద స్ఫురణ కార్యక్రమం. ఆ కార్యక్రమం ఫేస్ మేకర్ ని మీలోపల అమర్చగలుగుతుంది.
ఆ విధంగా అమర్చటమే కాదు, నేను మీకు ప్రమాణం చేసి చెబుతున్నాను, మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మీరు మరణించే సమయంలో నేను మీ దగ్గర ఉంటాను. మీరు హాయిగా, అందంగా, నిర్వాణ శరీరంలో విరామంగా ఉండే విధంగా చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి, నేను ఈ రోజు ఇక్కడ ఏం మాట్లాడుతున్నానో, దానికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైతే ఈ మాటల్ని ప్రత్యక్షంగా నా నుంచి వింటున్నారో వారికి నేను కట్టుబడి ఉంటాను.
ఈ శాస్త్రాన్ని చెప్పటం మొదలుపెట్టాక అందరి అనుభవాల నుంచీ నాకు తెలిసిన విషయం ఏమిటంటే, వారి జీవితం చివరి దశలో ప్రశాంతతని పొందటమే కాదు. వారి జీవితమే గాఢతతో, సంతోషంతో ఆనందపారవశ్యంతో గడిచింది. ఒక విషయం అర్థం చేసుకోండి, జీవితం, మరణం
- రెండు ఆనందమయం కావాలంటే మీ లోపల లోతుగా నాటుకుపోయిన సంస్కారాలు పూర్తిగా తొలగిపోవాలి. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఐశ్వర్యాన్ని, మంచి అనుబంధాల్ని పొందగలుగుతారు. ఎందుకంటే మీరు ఉండే స్థితి చాలా బలమైంది. మీరు నిర్వాణశరీరంలో విరామంగా ఉండగలుగుతారు. ఈ శాస్త్రం అనే పేస్ మేకర్ మీలో అమర్చితే మీరు విరామంగా నిర్వాణ శరీరంలో ఉండగలుగుతారు. అప్పుడు మీరు చేతనస్థితిలో జన్మ తీసుకొని జ్ఞానోదయం పొందగలుగుతారు. ఇక తిరిగి జన్మ పొందవలసిన అవసరం మీకు ఉండదు.
చివరి నిమిషంలో మీకు గుర్తున్నదే లెక్క
ఉపనిషత్తులలో ఒక చక్కని కథ ఉన్నది : జడభరతుడు అనే ఋషి ఉండేవాడు. అతను రక్షించిన ఒక లేడితో అతనికి అనుబంధం ఏర్పడింది. అతను సన్న్యాస జీవితం గడుపుతున్నాడు కాని ఈ లేడి పిల్లతో అనుబంధాన్ని పెంచుకుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆ లేడికి సంరక్షణ చేస్తూ దానితోనే సమయాన్ని గడుపుతుంటాడు. అతను మరణించే సమయంలో ఆ లేడిని మరిచిపోలేకపోతాడు. దాని సంరక్షణ ఎవరు తీసుకుంటారు అని బాధపడతాడు. 'అయ్యో! దాన్ని ఎవరు చూస్తారు? నేను మరణించాక దాని గతి ఏమిటి?' అని అనుకుంటూ ఉంటాడు.
అతను మరణించాక మరుజన్మలో లేడిగా జన్మిస్తాడు.
ఉపనిషత్తులోని ఒక శ్లోకంలో చాలా చక్కగా చెబుతారు, చివరి క్షణాల్లో నీవు దేని గురించి అయితే అనుకుంటావో నీవు అదే అవుతావు అని.
చాలా మంది అతి తెలివితో ఇలా అనుకుంటారు. జీవితమంతా నా ఇష్టం వచ్చినట్టు గడిపి, చివరి నిమిషంలో దేవుడి పేరు తలచుకుంటాను, అప్పుడు నేను స్వర్గానికి వెళ్ళవచ్చు, అని. స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు జీవితంలో ఎక్కువగా దేని గురించి అనుకున్నారో చివరి నిమిషంలో అదే ముందుకు వస్తుంది. ఆ సమయంలో ఆటలు ఆడటానికి కుదరదు.
నిజానికి మీరు శరీరాన్ని వదిలే సమయంలో మీ శరీరవ్యవస్థ మొత్తం బాధలో ఉంటుంది. ఎందుకంటే మీ 80 లేదా 90 సంవత్సరాల జీవితం ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. మీలో కలిగిన లోతైన అనుభవాలు మాత్రమే పైకి వస్తాయి. మీలోని ఆధ్యాత్మిక అనుభవాలు రంగురంగులుగా పైకి వస్తాయి.
స్పష్టంగా అర్థంచేసుకోండి, ఆలోచనలు లేని తెలుసుకునే తత్త్వం అన్నింటి కంటే బలమైన అనుభవం అవుతుంది. అది ఒక్క క్షణం కలిగినా చాలు, మీరు శరీరాన్ని వదిలే సమయంలో అదే పైకి వస్తుంది. అదే దీపంలా మీ ముందుకి వచ్చి మీరు చేతన స్థితిలోకి వెళ్ళే విధంగా దారి చూపిస్తుంది.
మరణసమయం గురించి మరొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఆత్మహత్య కారణంగా అకాలమరణం సంభవిస్తే వారి సమయం వచ్చే వరకూ శరీరాన్ని ధరించలేరు. ఆ జీవాత్మ అంత వరకూ ఎదురు చూడవలసిందే. దానికి శరీరం లేకుండా ఎదురుచూడాలి.
ఉదాహరణకి ఒక వ్యక్తి 90 సంవత్సరాలు జీవించాలి అని శరీరాన్ని పొందినప్పుడు నిర్ణయించుకున్నాడనుకోండి, అతను 60వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుని మరణించాడనుకోండి, అతను 30 సంవత్సరాల వరకూ మరొక కొత్త శరీరంలోకి వెళ్ళలేడు. శరీరంతో ఉన్నప్పుడు పడే బాధల నుంచి తప్పించుకోవడానికి అతను ఆత్మహత్య చేసుకుంటే, చనిపోయాక అతను శరీరం లేకుండా నరకం అనుభవిస్తాడు. అందుకే ఆత్మహత్య జీవితంలో ఏ సమస్యకి పరిష్కారం కాదు అని అర్థం చేసుకోవాలి.
ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఎందుకంటే ఈ జీవితం బాధామయం, నేను చిత్రహింసలు అనుభవిస్తున్నాను అనుకుంటారు. కాని ఆత్మహత్య చేసుకున్నాక వారు అనుభవించే బాధలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మీ ముందు రుచికరమైన పదార్థాలు ఉంటాయి, కాని తినటానికి శరీరం ఉండదు. అది ఎంత బాధో కదా! ప్రపంచం అంతా మీ ముందు ఉంటుంది. కాని సంతోషంగా అనుభవించటానికి శరీరం ఉండదు. వాళ్ళు సమయం పూర్తి అయ్యే వరకూ జీవాత్మ అలా తిరుగుతూ ఉంటుంది.
నా మరణానుభవం
నాకు చేతనస్థితిలో జరిగిన మరణానుభవం గురించి చెబుతాను. ఇది వారణాసిలో జరిగింది.
నాకు ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది. చేతనస్థితిలో మరణానుభవం పొందాలి, మరణాన్ని ఎదురుగా చూడాలి అని. అయితే అది నా ప్రాధాన్యంలో మొదటి స్థానంలో లేదు. ఏ అనుభవం జరగాలనుకున్నా, ఆ ఆలోచన మన ప్రాధాన్యాల్లో అన్నిటికంటే ప్రథమస్థానంలో ఉండాలి. అది మీ మనస్సులో ఒక మూల ఉంటే చాలదు.
సాధారణంగా మనం చేయాలని అనుకున్న లిస్టులో ఇల్లు శుభ్రం చేయటం, వండుకోవటం, బిల్స్ కట్టడం, అద్దె కట్టడం - ఇలా ఉంటాయి. చివరగా టైం ఉంటే జ్ఞానోదయం కూడా లిస్టుకి కలుపుతాం. అలా ఉండకూడదు. జ్ఞానోదయం కావాలనుకుంటే అది ప్రాధాన్యంలో ముందు ఉండాలి. కోరిక అత్యవసరమైనప్పుడే మీ చుట్టుపక్కల పరిస్థితులు దానికి అనుగుణంగా మారతాయి. ఇది ఒక్క జ్ఞానోదయం విషయమే కాదు. దేని పట్ల అయినా అంతే, ఇది సత్యం.
ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు అనుకున్నది జరగటం లేదు అనుకున్నారనుకోండి, ఒక విషయం తెలుసుకోండి. అది మీ ప్రాధాన్యం కాలేదు అని. దీని గురించి ఎవరినీ, ఏ పరిస్థితిని నిందించనవసరం లేదు. ఎప్పుడైతే, మీ ఆలోచన మొదటి ప్రాధాన్యంలోకి వస్తుందో, అది సాధించే శక్తి మీలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అది జరుగుతుంది. అప్పటి వరకూ మీరు ఎదురుచూడవలసినదే. మరణానుభవం అనే కోరిక అప్పటిలో నా ప్రాధాన్యం కాదు. అందుకే అది వాయిదా పడుతూ వస్తున్నది.
నేను పరివ్రాజకుడుగా తిరిగే రోజులలో వారణాసిలో ఉన్నాను. అక్కడ ఉన్న ఘాట్లలో మణికర్ణిక ఘాట్ ఒకటి. అక్కడ రోజుకి సగటున 100 శవాల దహనం జరుగుతుండేది. అది పవిత్రగంగానది ఒడ్డున ఉన్నది. అక్కడ నమ్మకం ఏమిటంటే అక్కడ మరణించినా లేదా శరీరాన్ని అక్కడ దహనం చేసినా వారికి ముక్తి వస్తుంది అని. అంటే వారికి జ్ఞానోదయం కలుగుతుంది అని అర్థం.
ఇది ఒక సంప్రదాయకమైన నమ్మకం మాత్రమే కాదు రామకృష్ణ పరమహంస, జ్ఞానోదయమైన మహాయోగీశ్వరుడు, ఆయన తన అనుభవంతో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన ఈ విధంగా చెబుతారు 'నేను నా కళ్లతో స్పష్టంగా చూసాను. శివుడు ప్రతి శవదహనం దగ్గరకి వెళ్ళి, ఆత్మని తనలోకి తీసుకుని దాన్ని బంధవిముక్తి చేసి శరీరానికి, మానసికవ్యవస్థకి ముక్తిని ఇస్తాడు. కాబట్టి ఇదేదో పురాణకాలం నాటి నమ్మకం మాత్రమే అనుకోవద్దు. ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుని అనుభవం.
నా అదృష్టం కొద్దీ నేను మణికర్ణిక ఘాట్ దగ్గరకి వెళ్ళాను. ఇది నమ్మకం మాత్రమే కాదు సత్యం. గడిచిన 2000 సంవత్సరాలుగా శవదహనానికి ఉపయోగించే మంట ఈ నాటికీ ఆరలేదు. వర్షంలో, ఎండలో, వరదలలో ఎప్పుడూ కూడా శవదహనానికి మంటని తీసుకురారు. అక్కడ నిప్పు ఎప్పుడూ రగులుతూ ఉంటుంది. అక్కడి నుంచి నిప్పుని తీసుకొని చితికి నిప్పుపెడతారు అంతే. శవాలు వచ్చినవి వస్తుంటాయి. మంటలు మండుతూ ఉంటాయి. కొన్నిసార్లు రెండు - మూడు శవాలు ఒకేసారి ఒకే చోట దహనం కావటం చూసాను. ఆ విధంగా శవాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎక్కువగా ఉంటాయి. మనిషి మరణించిన ప్రదేశం దగ్గర నుంచి మనుషులు శవాన్ని 'రామ్నామ్ సత్య హై' అంటూ ఇక్కడికి మోసుకు వస్తారు. సాయంత్రానికి అక్కడికి చేరుతారు.
అక్కడి విషయాలు అనుభవంతో తెలుసుకోవాలి కాని మాటల్లో చెప్పలేను. మీరు అక్కడికి వెళ్ళి ఆ అనుభవాన్ని తెలుసుకోవాలి.
మరణం ఒక ఉత్సవం మీకు నిజాయితీగా చెప్పాలి అంటే, కేవలం అక్కడ ఉన్నందుకే నాలో మరణం అంటే భయం పోయింది. నిరంతరం శవ దహనాలు జరుగుతూనే ఉంటాయి. నేను అనుకునేవాడిని, ‘నేను కూడా ఒక రోజు అదే విధంగా అవుతాను కదా!’ అని అంతే. అక్కడ మీకు చాలామంది, తోడు ఉంటారు. మీరు ఒక ట్రిప్ వేసినట్టే. అక్కడ చూస్తే మరణం అంటే ఒంటరితనం అనిపించదు.
మీ జీవితంలో మీరు ఒకటో - రెండో మరణాల్ని చూసి ఉంటారు. దానికే మీకు మరణం అంటే భయమేస్తుంది. కాని మణికర్ణిక ఘాట్‌లో కార్యక్రమాలు ఏవీ ఉండవు. శవాన్ని తిన్నగా గంగానదిలోకి తీసుకువెళ్ళి ‘రామ్ నామ్ సత్య హై’ అంటూ అందులో మూడుసార్లు ముంచుతారు. ఈ లోపు అక్కడ చితిని ఏర్పాటు చేస్తారు. శవాన్ని తీసుకువచ్చి చితి మీద పెడతారు. అంతే.
అక్కడ మీరు గమనించదగిన కొత్త విషయం, బంధువులు ఎవరూ అక్కడ ఉండరు. అక్కడ ఎటువంటి కార్యక్రమాలూ చేయరు. నదిలో శవాన్ని ముంచి చితి మీద పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా విషయాలు అక్కడి నిర్వాహకులే చూసుకుంటారు. ఒక శవదహనానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలియదు. అక్కడ ఇంకా చాలా శవాలు లైనులో ఉంటాయి.
నేను అనుకున్నాను, ‘ఇక్కడ కూర్చొని ఏం జరుగుతుందో చూడాలి’ అని ఆ ఘాట్ దగ్గర కూర్చున్నాను. ఒక గంటలోనే మరణం అంటే ఏదో ఒక కొత్త సంఘటన అనిపించలేదు. అదేదో నా బంధువో, నా స్నేహితుడో అన్నట్టు అనిపించింది. అక్కడ కూర్చొని ఒకదాని తరువాత ఒకటిగా వస్తున్న శవాల్ని చూడటం మొదలుపెట్టాను. అది కూడా మామూలుగా మిగతా లైనుల లాగానే అనిపించింది. రకరకాల సైజులు, రకరకాల వయస్సుల వారు, స్త్రీల, పురుషుల శవాలు అక్కడికి వస్తున్నాయి, అగ్నికి ఆహుతి అవుతున్నాయి.
నిరంతరం శవాలు అలా దహనమవటం చూస్తుంటే, మరణం అంటే మీకు గౌరవం పోతుంది. ప్రస్తుతం మీకు మరణం అంటే చాలా గౌరవం ఉన్నది. అందుకే మరణం గురించి ఎన్నో భావాలు. అదే సమస్య. మరణం అంటే ఏమీ లేదు. మన లోపలికి వెళ్ళిన శ్వాస బయటికి రాదు, అంతే. అదే మరణం, అంతకు మించి మరేమీ లేదు. దాన్ని ముందుకు, వెనక్కి జరపలేరు.
నేను అలా చూస్తున్నప్పుడు, మరణం అంటే ఉండే కొంచెం భయం కూడా పోయింది. కొంత సేపటికి అలా చూడాలి అని ఆసక్తి కలిగింది. నేను కొన్ని శవాల దగ్గరకి వెళ్ళి వారికి సహాయం చేశాను. అప్పుడు నాకు నేను అనుకున్నాను, ‘ఒక రోజు నా శరీరం కూడా ఈ విధంగా దహనం అవుతుంది. కదా!’ అని.
ఎప్పుడైతే మరణం మీకు సంభవిస్తుంది అనుకుంటారో, మీ అహం పట్ల మీరు మోస్తున్న గౌరవం పోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా నన్ను వదలకూడదు అనుకుంటారో అది అహం మాత్రమే. ఎప్పుడైతే మీరు కచ్చితంగా ఏదో ఒక రోజు అన్నీ నన్ను వదిలేస్తాయి, అని అనుకుంటారో అప్పుడు అహం పట్ల మీకు ఉన్న గౌరవభావం పోతుంది. నా అహం పట్ల నాకు ఉన్న గౌరవభావం పూర్తిగా పోయింది.
నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎలాగూ నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తాను. కాబట్టి నాకు ఇప్పుడు చేతనస్థితిలో మరణానుభవం జరగాలి, తిరిగి నా మిగిలిన జీవితం అంతా మరణ భయం లేకుండా గడవాలి లేదా నేను మరణించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. నాలో మరణం ఎలా జరుగుతుందో చూడాలి అని నిర్ణయించుకున్నాను. ఆ ఘాట్ దగ్గర చిన్న శివాలయం, ఒక చిన్న మంటపం ఉన్నాయి. నేను ఆ చిన్న మండపంలో కూర్చున్నాను. అక్కడైతే ఎవరూ నన్ను కదిలించరు. ఎవరూ డిస్టర్బ్ చేయరు అని అక్కడ కూర్చుని శవదహనాలు చూస్తూ ఉన్నాను.
నాకు ఇంకా బాగా గుర్తు ఉన్నది. ఒక అనుభవం ద్వారా ఒక బలమైన క్లిక్ నాలో ఏర్పడింది. దానితో నాకు ఒక విషయం తెలిసింది. ఒక పెద్దావిడ శవం దహనమవుతోంది. ఆమె ఒంటి మీద బట్టలు కాలిపోయాయి. శవంపై ఇంకా ఎక్కువ మంటలు లేచాయి. అది చూసాక నాలో ఒక బలమైన క్లిక్ ఏర్పడింది, 'భగవంతుడా! ఈ శరీరానికి కూడా ఈ విధంగానే జరుగుతుంది కదా!' అని.
ఆ క్లిక్, నా శరీరంలో మరణం అంటే ఒక విధమైన భయాన్ని కల్పించింది. ఆ భయం నా శరీరమంతా వ్యాపించింది. భయం నా శరీరమంతా వ్యాపించటం నాకు స్పష్టంగా కనిపించింది. అయితే నేను ఆ భయాన్ని చేతనస్థితిలో అనుభవించాను. ఎప్పుడైతే భయం నా తెలుసుకునే తత్త్వాన్ని ఢీ కొట్టిందో అదే మరణానుభవం. నేను చేతనస్థితిలో నా మరణాన్ని అనుభవించి, అందులోంచి బయటకి రాగలిగాను.
ఒక విషయం అర్థం చేసుకోండి. భయాన్ని అణచేస్తే అది మీ లోపలే ఉండిపోతుంది. ఎప్పుడైతే భయం బయటికి వస్తుందో అప్పుడు దాన్ని చేతనస్థితిలో ఎదుర్కోకపోతే అది పెద్ద భయంలా తయారై, మిమ్మల్ని కుదిపివేస్తుంది. మీ నరాల వ్యవస్థ తెగిపోయినట్టు అవుతుంది. భయాన్ని చేతనస్థితిలో ఎదుర్కొంటే అది మరణానుభవం అవుతుంది, అంతే.
మరణభయం అచేతనస్థితిలో కలిస్తే అణచివేయబడుతుంది లేదా మరొక రూపంలో వక్రమార్గంలో బయటపడుతుంది. మరణ భయం, అచేతనస్థితితో కలిసినప్పుడు దాన్ని అణచకపోతే భయం ఒక ఘాతంలా తగిలి నరాల వ్యవస్థ దెబ్బ తింటుంది. ఎందుకంటే మీరు భయంతో కదిలిపోతారు. మరణభయం, చేతనస్థితిలో జరిగితే అది మరణానుభవం అవుతుంది. నా లోపల కలిగిన భయాన్ని నేను స్పష్టంగా చూడగలిగాను. నేను దాన్ని పూర్తిగా తెలుసుకునే తత్వంతో చేతనస్థితిలో ఎదుర్కొన్నాను. అది నాకు మరణానుభవం అయినది. నా శరీరం మరణించింది. దానిలో కదలికలు లేవు. ఆ విధంగా రెండున్నర రోజులపాటు నాకు ఆహారం, నీరు లేవు, ఆలోచనలు లేవు, ప్రశ్నలు లేవు, అనుమానాలు లేవు. ఆ అనుభవం జరిగిపోయాక నేను ఆ విధంగా రెండున్నర రోజులు ఉన్నాను అని అర్థమైంది. నేను కళ్ళు మూసుకొని నా శరీరం మరణించటం చూసాను. ఎక్కడా కదలికలు లేవు, రెండున్నర రోజులు గడిచాక అకస్మాత్తుగా నాలో ఒక క్లిక్ జరిగినది. 'భగవంతుడా! నా శరీరం మరణించింది కాని నేను జీవించి ఉన్నాను. అని ఆ స్పష్టత నాలో ఒక చక్కని పారవశ్యాన్ని కలిగించింది. మరణభయం నా నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది.
నేను ఆనందపారవశ్యంలో, లోతైన ఆనందంలో ఉన్నాను, నేను నెమ్మదిగా కళ్ళు తెరిచాను. నేను నా శరీరాన్ని కదిలించగలిగాను. నాలో ముందుగా కలిగిన భావం, నాలో ఉప్పొంగుతున్న కృతజ్ఞత, ఆనందపారవశ్యం. నేను కిందికి వెళ్ళి, గంగ నీళ్ళు కొంచెం నా మీద చల్లుకొని, కమండలంలో గంగ నీరు పట్టుకొని, చితి మంటలో బూడిద కొంచెం తీసుకొని విశ్వనాథుని గుడికి వెళ్ళాను. నేను శివలింగం దగ్గరకి వెళ్ళి ఆ బూడిదని, ఆయనకి సమర్పించి ఉప్పొంగుతున్న కృతజ్ఞతాభావంతో ఆయనకి పూజ చేసాను. నా కంటికి విశ్వనాథుడు అక్కడ నిలబడి కనపడ్డాడు.
ఒక విషయం అర్థం చేసుకోండి, నేను మరణించాను కాబట్టి విశ్వనాథుడు జీవంతో నాకు కనిపించాడు. అంతకు ముందు రోజు వరకూ నేను బతికి ఉన్నాను. కాబట్టి విశ్వనాథుడు నాకు ఒక రాయిలా కనిపించాడు. నేను అనుకునేవాడిని, ఈ చిన్న రాయిని ముట్టుకోవటానికి రోజూ లక్షల మంది అక్కడికి వస్తారు, ఎంత మూర్ఖత్వమో అనుకునేవాడిని. నేను ఎప్పుడూ విశ్వనాథుడిని ఒక రాయిగా మాత్రమే చూసేవాడిని. నేను అలా ఎందుకు అనుకునేవాడిని అంటే అప్పుడు నేను ఇంకా బ్రతికి ఉన్నాను కాబట్టి. నేను మరణించాక జీవించి ఉన్న ఆయనని స్పష్టంగా చూసాను.
ఎవరో ఒకరే జీవించి ఉండగలరు. మీరు కాని, ఆ సర్వాంతర్యామి కాని. మీరు సత్యాన్ని చూసినప్పుడు, ఆయన జీవిస్తారు. మీరు అనుకున్న విధంగా ఇక జీవించి ఉండరు. మరణభయం నన్ను శాశ్వతంగా వదలి వెళ్ళిపోయింది. ఇది నాకు జరిగిన ఒక బలమైన అనుభవం. అదే నన్ను అంతిమ అనుభవమైన జ్ఞానోదయాన్ని ప్రోత్సహించే విధంగా నాలో మార్పు తీసుకువచ్చింది.
మరణసమయంలో ఏం జరుగుతుంది?
శరీరాన్ని వదిలే సమయంలో అసలు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకి జవాబు జీవించి ఉన్న వ్యక్తి ఇవ్వలేడు. ఎందుకంటే అతనికి మరణానుభవం లేదు కాబట్టి. మరణించిన వారు చెప్పలేరు. ఎందుకంటే ఆ అనుభవాన్ని చెప్పటానికి వారు రాలేరు కాబట్టి. కేవలం జ్ఞానోదయమైన వ్యక్తి, ఎవరైతే చేతనస్థితిలో మరణానుభవాన్ని పొందుతారో, తిరిగి కొత్త వ్యక్తిగా వస్తాడో అతను మాత్రమే కచ్చితంగా మరణసమయంలో ఏం జరుగుతుందో చెప్పగలడు.
మరణరహస్యాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను. మీకు ఇది ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మీరు నిర్ఘాంతపోవచ్చు. కాని అది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఔను అన్నా, కాదు అన్నా, మీరు స్వీకరించినా, లేకపోయినా, మరణసమయంలో ఇదే జరుగుతుంది.
మనకి ఒక శరీరం కాదు ఉన్నది. మనకి కనిపించే భౌతిక శరీరం మనకి ఉన్న ఏడు శరీరాల్లో ఒకటి. దాన్ని మాత్రమే మనం చూడగలం. కాని మనలో ఏడు పొరలు లేదా ఏడు శరీరాలు ఉంటాయి. అవి అతి సూక్ష్మస్థాయిలో ఉంటాయి. మనం వాటిని చూడలేం, వాటిని అంటుకోలేం. ఆ ఏడు శరీరాల బొమ్మ కింది విధంగా ఉంటుంది.

భౌతిక శరీరం
ప్రాణ శరీరం
మానసిక శరీరం
భావావేశాత్మక శరీరం
కారణ శరీరం
విశ్వ శరీరం
నిర్వాణ శరీరం
ఈ శరీరాలు ఒక్కొక్కటి ఒక్కొక భావావేశాన్ని పట్టుకొని ఉంటాయి. ఉదాహరణకి, ప్రాణశరీరంలో మీ జీవితంలో కలిగిన కోరికలు ఉంటాయి. మానసికశరీరంలో మీలోని అపరాధభావం, ఆ అనుభవాలు ఉంటాయి. ఆకాశశరీరం లేదా భావావేశ శరీరంలో మానసిక వ్యధలుంటాయి. ఆత్మ శరీరాన్ని వదిలే సమయంలో ఈ ఏడు శరీరాల ద్వారా వెళుతుంది. భౌతికశరీరం మరణిస్తుంది. కాని మిగిలిన ఆరు శరీరాలు పూర్తిగా మరణించవు. మీరు మీ జీవితంలో చాలా కోరికలతో ఉంటే, ఆ తీరని కోరికలన్నీ ప్రాణ శరీరంలో ఉంటాయి. అందుకే భౌతికశరీరం మరణించినా, ప్రాణశరీరం మరణించదు. ఆత్మ ప్రాణశరీరం లోంచి ప్రయాణించే సమయంలో చాలా బాధ పడుతుంది.
మీరు భౌతికశరీరాన్ని వదిలే సమయంలో చేతనస్థితి మీ శరీరం నుంచి వేరవుతుంది. అది శరీరం నుంచి చీల్చుతుంది. అప్పుడే ఆ వ్యక్తి కోమాలోకి వెళతాడు. డాక్టర్లు కోమా గురించి ఏం చెబుతారంటే, ఇది మీరు బాధని తట్టుకోలేని స్థాయిలో ఉంటే ఆటోమాటిక్ అనెస్థేషియాగా పని చేస్తుంది అని. బాధని తట్టుకోలేనప్పుడు ఆటోమాటిక్‌గా కోమాలోకి వెళ్ళిపోతారు.
ఆత్మ మొదటి శరీరం నుంచి రెండవదానిలోకి వెళ్ళే సమయంలో వారిలోని తీరని కోరికలు ముందుకి వస్తాయి. ఇది జరిగినప్పుడు ఒక గదిలో పదిమంది ఉండి ఫుట్ బాల్ ఆడితే ఎలా ఉంటుందో అదే విధంగా చేతన స్థితిని అన్ని మూలల నుంచి కోరికలు కొడుతూ ఉంటాయి. ఒక్కొక్క మూల ఒక్కొక్క కోరిక ఉండి చేతనస్థితిని పుట్ బాల్ లా తన్నుతూ ఉంటాయి. ఆ సమయంలో చేతనస్థితి శరీరాన్ని వదిలి వెళ్లటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కోరికలు చేతన స్థితిని తిరిగి శరీరంలో ప్రవేశించమని బలవంతం చేస్తుంటాయి. తిరిగి వాటిని సాధించమంటాయి.
ఒక పక్క కోరికలు శరీరంలోకి ప్రవేశించమని గొడవ చేస్తుంటాయి, మరొక పక్క శరీరం, నా వల్ల కాదు నేను బాగా అలసిపోయాను, నన్ను వదిలెయ్య అంటుంది. అదే మరణసమయంలో జరిగే తోపులాట. అది శరీరానికి, కోరికలకి మధ్య జరిగే పోరాటం. తరువాత అక్కడి నుంచి తరువాతదైన మానసికశరీరంలో ప్రవేశిస్తారు. అక్కడికి చేరగానే వారిలోని అపరాధభావం పైకి లేస్తుంది. వారు ఏ విధంగా జీవించాలి అనుకొని జీవించలేకపోయారో దాని గురించి, చేసిన తప్పుల గురించి - అన్నీ ఆ సమయంలో ముందుకు వచ్చి బాధపెడతాయి.
అర్థం చేసుకోండి, కోరిక భవిష్యత్తుకి సంబంధించింది. అపరాధభావం గతానికి సంబంధించింది. కానీ రెండూ ఒకటే. మనం ఎలా జీవించాలని అనుకున్నామో అది కోరిక, ఎలా జీవించకూడదు అనుకున్నామో అది అపరాధభావం. అపరాధభావం అంటే మన గతనిర్ణయాల్ని, ఇప్పటి తెలివితేటలతో విశ్లేషించటమే. ఈ విధంగా ఒకదాని తరువాత మరొక శరీరంలోకి ప్రవేశిస్తారు.
మీలో తీరని కోరికలు తక్కువగా ఉంటే మీ ప్రాణశరీరం తేలికగా ఉంటుంది. అప్పుడు శరీరాన్ని వదలటం సులభం. అదే విధంగా అపరాధభావం తక్కువగా ఉంటే మానసికశరీరాన్ని సులభంగా వదలవచ్చు. మరొక విషయం, కోరికలు, అపరాధభావం, బాధ అనేవి తక్కువ తీవ్రతతో ఉంటే మరణం తక్కువ బాధతో సులభంగా జరగటమే కాదు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అంతే కాదు, పెద్ద వయస్సులో ఆహ్లాదంగా ఉండగలుగుతారు. ఇదే వానప్రస్థసన్యాసం అంటే (వానప్రస్థసన్యాసం అంటే వేదసంస్కృతిలో జీవితంలో మూడవ దశ. భార్యాభర్తలిద్దరూ ఆధ్యాత్మికకార్యక్రమాలలో, అంతిమసత్యాన్వేషణలో ఉండటమే ఈ దశ). జీవితం చివరి దశలో పరిపూర్ణతతో జీవించగలగటం వానప్రస్థజీవితం ఇచ్చే గొప్ప బహుమానం. మానసికశరీరంలో మనం జీవితం అంతా పోగుచేసుకున్న అపరాధ భావం ముందుకి వస్తుంది. ఆ తరువాత భావావేశాల శరీరం ఇక్కడ మనం పడిన బాధలు, వ్యధలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రకమైన సంస్కారాలు ఉంటాయి. ఈ శరీరాల గుండా ప్రయాణించటమే నరకం. అంతే కాని మరెక్కడో నరకం అనేది లేదు. స్వర్గం, నరకం ఏదో కొన్ని స్థలాలు కాదు. అవి మన మానసిక స్థితి.
మొదటి నాలుగు శరీరాలు శారీరక - మానసికవ్యవస్థకి సంబంధించినవి. అందులో కోరికలు, అపరాధభావం, బాధలకి సంబంధించిన సంస్కారాలు ఉంటాయి. ఐదవ శరీరం గాఢనిద్ర. ఆరవది సంతోషకరమైన అనుభవాలకి సంబంధించింది. ఏడవది బాధలు, సంతోషాలకి అతీతమైంది. అదే అంతిమచేతనస్థితి. అర్థం చేసుకోండి, సంతోషంతో అనుబంధాన్ని పెంచుకుంటే అది కూడా తిరిగి జననమరణచక్రంలోకి తీసుకువస్తుంది. సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్ని మళ్ళీ మళ్ళీ తిరిగి అనుభవించాలి అనే కోరిక మరలా జన్మ ఎత్తేలా చేస్తుంది.
సంతోషానికి, పరమానందానికి చాలా తేడా ఉన్నది. సంతోషం బయటి ప్రపంచపు వస్తువుల నుంచి, ఏదో ఒక కారణంతో వస్తుంది. ఉదాహరణకి మీకు ఇష్టమైన తీపి తింటే సంతోషం కలుగుతుంది. మీరు ఏమనుకుంటారు, ఆ తీపి మీ సంతోషానికి కారణం అనుకుంటారు. కాని ఒకసారి దాని గురించి ఆలోచించండి. నిజంగా ఆ తీపి మీ సంతోషానికి కారణమైతే అది ప్రతిసారి సంతోషాన్ని ఇవ్వాలి. కాని అది అలా ఇవ్వదు. ఆ తీపిని మరీ మరీ బలవంతంగా పెడితే మీరు అక్కడి నుంచి పారిపోతారు.
సంతోషం అనేది మనస్సు సృష్టించే ఒక అశాశ్వతస్థితి. పరమానందం, మనలోని ఏడవ శరీరం నిజమైంది. కారణం లేని అనంతమైన ఆనందం మన లోపల ఉంది. అది మంగళకరమైన, అప్రయత్నంగా ప్రవహించే శక్తి వాహిని. ఏ కారణం లేకుండా నిరంతరం మనలో పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. నిజానికి ఆ తీపి మిమ్మల్ని ఆనందంలోనికి పంపించే ఒక కారకంలా పని చేస్తుంది. కాని మీరు మీ సంతోషానికి తీపి కారణం అని అనుకుంటారు. కొద్ది సేపు మీ ఆనందమయకోశం దగ్గరకి వస్తారు. అదే మీ సంతోషానికి కారణం. ఈ శరీరాలు శుభ్రంగా ఉంటే, తేలికగా ఉండి, జీవాత్మ సులభంగా ప్రయాణించి శరీరాన్ని వదలగలుగుతుంది. పండిన అరటి పండు నుంచి తొక్కని సులభంగా తీయవచ్చు. అదే విధంగా జీవాత్మ శరీరాన్ని సులభంగా వదలగలుగుతుంది.
మరణం ప్రతి రోజూ సంభవిస్తూ ఉంటుంది
ఈ ఏడు శరీరాలలో, మొదటి నాలుగు, భౌతిక, ప్రాణ, మానసిక, భావాత్మకశరీరాలు మీరు నిద్ర పోయినప్పుడు కారణ శరీరంలో కలిసిపోతాయి. కారణశరీరంలోని గాఢమైన నిద్ర మిమ్మల్ని నూతనంగా చేస్తుంది. మీరు ఐదవది దాటనంత వరకు మరణం రోజూ జరుగుతుంది. మీరు ప్రతి రోజూ నిద్రపోయినప్పుడు ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ ఐదవ శరీరాన్ని దాటి ఆరవ శరీరంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు మరణ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఒక వేళ జీవాత్మ మరొక శరీరాన్ని తీసుకునే అవసరం లేనప్పుడు ఇంకా తీరవలసిన కోరికలు లేనప్పుడు అది ఏడవ శరీరం అయిన నిర్వాణశరీరంలోకి చేరుతుంది. అదే జ్ఞానోదయం. జీవాత్మ వెనకకి వచ్చి మరొక శరీరాన్ని తీసుకుంటే అది మరణం.
జాగ్రృత్ ప్రపంచం Vs స్వప్నప్రపంచం
మరొక విషయం, మీరు కలల స్థితిలోకి వెళ్ళి కల కంటున్నప్పుడు మీరు నివసించే ప్రపంచం నలుపు - తెలుపుల చిత్రంలా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కలలో ఉన్నారు కాబట్టి, మీరు మేలుకొని ఉన్నప్పటి ప్రపంచాన్ని మరచిపోతారు. స్వప్నప్రపంచం నిజమనిపిస్తుంది. అది రంగురంగులుగా కనిపిస్తుంది. మీరు కలలోంచి బయటికి వస్తే, ఈ ప్రపంచం నాలుగు డైమెన్షన్స్ లో 4డి లో కనిపిస్తుంది. మీరు భౌతికశరీరంలో ఉంటూ మేలుకుని ఉన్న స్థితిలో ఉంటే ఈ ప్రపంచం రంగురంగులుగా 4డిలో కనిపిస్తుంది. కలలో ఉన్నప్పుడు ఆ ప్రపంచం 4డిలో కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు స్వప్నప్రపంచం 4డిలా, బయటి ప్రపంచం నలుపు - తెలుపుల్లా ఉంటుంది.
మీరు భౌతికశరీరం నుంచి ప్రాణశరీరంలోకి వెళ్లినప్పుడు, మరణసమయంలో, ఈ వస్తుప్రపంచం, ఈ భౌతికప్రపంచం నలుపు - తెలుపులలో కనిపిస్తుంది. మీరు సాధించినవి, మీ గర్వం, మీ ప్రయత్నాలు, మీ దుఖం, మీ సంతోషం - అన్నీ కూడా అర్థం లేనివిగా కనిపిస్తాయి. అవి నలుపు - తెలుపులలో కనిపిస్తాయి.
ఈ విధంగా ఎందుకు జరుగుతుందో మీకు వివరిస్తాను. మీరు జీవించి ఉన్నప్పుడు మీరు అంటే, మీ వ్యక్తిత్వం అంటే ఏవో డబ్బు, కీర్తి ప్రతిష్ఠలు, మానవసంబంధాలు, గర్వం, స్నేహితులు, శ్రేయోభిలాషులు - ఇలా కొన్ని స్తంభాల మీద మీరు అనేదాన్ని నిర్మించుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని 'మీరు ఎవరు?' అని అడిగితే మీరు ఏమని జవాబు ఇస్తారు. నేను ఇంజినీరుని, నేను డాక్టరుని, నేను నాలుగు ఇళ్ళకి అధిపతిని, నేను ఆమె భర్తని, నేను వాళ్ళ కూతురిని - ఇలా ఉంటాయి మీ సమాధానాలు. మన వ్యక్తిత్వాన్ని ఏవో కొన్ని స్తంభాల మీద నిర్మించుకుంటాం.
మీరు భౌతికశరీరం నుంచి వెళ్ళేటప్పుడు ఈ స్తంభాలన్నీ కదిలిపోతాయి. మీరు మీ చెక్కుల మీద సంతకాలు చేయలేరు. మీ సంతకాన్ని ఎవరూ ఒప్పుకోరు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ తో మీకు సంబంధం ఉండదు. మీ కారు ఏ మాత్రం మీకు ఉపయోగపడదు. మహా అయితే అంబులెన్స్ ఉపయోగపడుతుంది, అంతే.
మీ ఇల్లంతా మీ బంధువుల రోదనలతో నిండి ఉంటుంది. కానీ మీ ఇల్లు కాని, మీ బంధువులు కాని, అప్పుడు మీకు ఉపయోగపడరు. వాళ్ళు ఎవరూ మీతో రారు. మరణం అనే పాయింట్ దాటి రాలేరు కూడా. మీతో వచ్చేది కేవలం చేతనస్థితి యొక్క క్షణం పాటు అయినా జరిగిన అనుభవం మాత్రమే. మీ ఆధారాలు, మీ పునాది పూర్తిగా కదిలిపోయాక ఇక మీరు అనేది ఏదీ ఉండదు. అప్పుడు మీరు పట్టుకొని వేలాడడానికి ఏమీ ఉండదు.
ఈ ఒక్క విషయం అర్థం చేసుకోండి. అకస్మాత్తుగా వ్యాపారంలో పెద్ద దెబ్బ తగిలిందని తెలిసిందనుకోండి, మనం మొత్తం కదిలిపోతాం. ఆ బాధ కేవలం ఏదో ఒక భాగంలో కాదు, శరీరవ్యవస్థ మొత్తం ఉంటుంది. మన ఉనికి ఆ బాధలో నలిగిపోతుంది. కాబట్టి మన నుంచి ఏదైనా వెళ్ళిపోతే, మనం మొత్తం బాధపడతాం. మనం భౌతిక శరీరం నుంచి వెళ్లినప్పుడు శరీరం మొత్తం బాధపడుతుంది. మనం మన పునాది అనుకున్నది పూర్తిగా కదిలిపోతుంది. ప్రస్తుతం ఈ ప్రపంచం 4డిలో రంగురంగులుగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికత, ధ్యానం, అంతరంగప్రపంచం - ఇవన్నీ నలుపు - తెలుపుల్లో కనిపిస్తాయి. నేను ధ్యానం చేయమంటే ఏమంటారు! స్వామీజీ! ధ్యానం చేయటానికి మాకు టైం లేదు అంటారు. నేను చాలా బిజీ ఇంకొక రెండుమూడు సంవత్సరాల తరువాత ఆలోచిస్తాను, అంటారు. స్పష్టంగా తెలుసుకోండి, ధ్యానం చేయటానికి నాకు టైం లేదు అనవద్దు. మీకు మీరు స్పష్టతతో ఉండండి. ఇప్పుడు ధ్యానం నా జీవితానికి ముఖ్యం కాదు, అని చెప్పండి. నా జీవితానికి ధ్యానం అంత ముఖ్యం అని అనుకోవటం లేదు అని చెప్పండి. అది నిజాయితీ ఉన్న సమాధానం. నాకు టైం లేదు అంటున్నారు అంటే, మిమ్మల్ని మీరు మూర్ఖులు చేసుకోవటమే. ఎవరికైనా చేతిలో ఉండేది 24 గంటలు మాత్రమే. ఆ సమయంలో వారు ఏమి చేయాలి అంటే ఆ పనులు చేయగలరు. ధ్యానం చేసేవారికి ఉద్యోగం లేదు, వేరే పనీ, పాటూ లేదు అనుకోవద్దు. ఇది కేవలం ప్రాధాన్యమీయటం. మీ జీవితానికి ఏది ముఖ్యం అని నిర్ణయించుకోవటం మీకు ఆధ్యాత్మికత, ధ్యానం నలుపు - తెలుపుల్లో కనిపిస్తే, దాని వైపు మీ శక్తిని పోనీయరు. అంతే.
మీరు భౌతికశరీరం నుంచి వెళ్ళేటప్పుడు జరిగేది ఇదే, మీరు జీవించి ఉన్నప్పుడు ఏది 4డిలో నిజం అనిపించిందో, ఆ ప్రపంచం మాయమౌతుంది. అది నలుపు - తెలుపుల్లో కనిపిస్తుంది. మిమ్మల్ని ఆకర్షించినవి ఏం మీకు ఉండవు. అందుకే మరణం అంటే బాధ కలిగేది. మీకు జీవితంలో కనీసం ఒకసారైనా అంతిమసత్యానుభవం కేవలం ఒక్కక్షణం పాటు జరిగినా మీరు మరణంలోకి తెలుసుకునే తత్వంతో, చేతనస్థితిలోకి వెళ్ళవచ్చు.
చూడండి, ప్రస్తుతం మనం రెండు డైమెన్షన్స్‌లో ఉన్నాం. బయటి ప్రపంచం, ఆధ్యాత్మికప్రపంచం. మనం ఇప్పుడు నిర్మించుకున్న స్తంభాలు అన్నీ బయటి ప్రపంచం ఆధారంగా నిర్మించినవే, ఒక్క స్తంభం కూడా మన అంతరంగప్రపంచానికి సంబంధించి ఉండదు. మన వ్యక్తిత్వం మొత్తం బయటి ప్రపంచం నుంచి, సమాజం ఏమి చెప్పిందో దాని నుంచి తయారు చేసుకున్నాం. అందరూ మనని గొప్పవారు అంటే, అవును గొప్పవారం అని నమ్ముతాం. నీవు పనికిరానివాడివి అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, కుంగిపోతాం.
ఇలా ఎందుకు జరుగుతుందంటే - మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న ఒక్క స్తంభం కూడా ఆధ్యాత్మికత ఆధారంగా ఉండవు. మొత్తం నిర్మాణమంతా బయటి ప్రపంచం నుంచే ఉంటుంది. అందుకే ఎవరైనా ఈ స్తంభాల్ని కుదిపితే మనం బాధపడతాం. మనం కనీసం ఒక స్తంభాన్ని అయినా చేతనస్థితితో నిర్మిస్తే, మనం దాని ఆధారంగా బాధలు కలిగినప్పుడు ఎటువంటి బాధాలేకుండా తిన్నగా నిలబడగలుగుతాం, కుంగిపోం.
మరొక విషయం. ఈ బయటి ప్రపంచస్తంభాలు మన నియంత్రణలో ఉండవు. ఎవరైనా ఈ స్తంభాల్ని సులభంగా కుదిపేయగలరు. ఒక చిన్న పిల్లవాడైనా సరే, ఒక అబ్బాయి మీ దగ్గరికి వచ్చి నీవు మూర్ఖుడివి అంటే చాలు, మీరు కదిలిపోతారు. అవును కదా! ఆ అబ్బాయి మీతో ఏదో సరదాగా నేను నేర్చుకున్న కొత్తమాటల్ని ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పినా మనం కదిలిపోతాం. కాబట్టి బయటి ప్రపంచానికి సంబంధించిన స్తంభాలు ఎంత బలహీనమైనవో అర్థం చేసుకోండి.
శ్రీకృష్ణభగవానుని సందేశమైన భగవద్గీతలో అదే ఉంటుంది. మీ మరణసమయంలో ఏదైతే మీ మనస్సులో నిలబడి ఉంటుందో అదే మీ తరువాత జన్మని లేదా మీ జ్ఞానోదయస్థితిని నిర్ణయిస్తుంది. మనకి కనీసం ఒక్క స్తంభమైనా చేతనస్థితి మీద నిర్మించబడి ఉంటే, మరణసమయంలో మనం బాధపడం. అప్పుడు మిగతా స్తంభాలు నలుపు - తెలుపుగా మారతాయి. కానీ ఈ స్తంభం మాత్రం రంగురంగులతో 4డిలో ఉంటుంది. ఇప్పుడు మనని తీసుకువెళ్ళ గల స్తంభం ఒకటి కూడా లేదు. మన వ్యక్తిత్వం మొత్తం బయటి ప్రపంచం మీద మాత్రమే ఆధారపడి ఉంది. అందుకే ఒక ఫుట్ బాల్లా అందరూ మనని ఈ మూల నుంచి ఆ మూలకి తన్నగలుగుతున్నారు. ఎవరైనా మనని ఒక్క మాటతో కుంగిపోయేలా చేస్తున్నారు. ఎవరైనా నీవు పిచ్చివాడివంటే మనం వారి మీద అరిచి ఆ విషయం నిరూపిస్తాం. దయచేసి అర్థం చేసుకోండి, మనం మన అంతరంగం ఆధారంగా కనీసం ఒక స్తంభాన్ని అయినా నిర్మించుకోగలిగితే అది మరణసమయంలో 4డిలో మెరుస్తూ మనని మన శరీరం నుంచి అందంగా దాటిస్తుంది.
మరణించే కళ
జెన్ బౌద్ధమతంలో ఒక మంచి మాట ఉన్నది, 'మరణించే కళ తెలియటం సత్యం. అదే మనం జీవితంలో నేర్చుకోగల అంతిమ జ్ఞానం.'
ఒక చిన్న జెన్ కథ : ఒక జ్ఞానోదయమైన గురువుగారు అకస్మాత్తుగా తాను మర్నాడు ఉదయం 6గం.లకి మరణిస్తున్నాను అని శిష్యులకి చెబుతాడు. జ్ఞానోదయమైన యోగీశ్వరులకి వారి మరణం గురించి తెలుసు. వాళ్ళు ఆ విషయం ముందే చెప్పగలరు. ఆయన మర్నాడు ఉదయం 6గం॥ మరణిస్తున్నట్లు ప్రకటిస్తారు. అది విన్న ఆయన శిష్యులు ఆయనతో, ‘గురుదేవా! మీరు మరొక 2 లేదా మూడు గంటలు ఉండండి. ఉదయాన్నే అయితే బాగా చలిగా ఉంటుంది. మీరు మరి కొన్ని గంటలు ఆగవచ్చు కదా! అప్పుడు మేము చేయవలసిన కార్యక్రమాల్ని సజావుగా చేయగలం.’ అంటారు. ఆయన సరే అని రేపు మధ్యాహ్నం 12 గంటలకి మరణిస్తాను అని చెప్పి, సరిగ్గా 12 గంటలకి అందరికీ చెప్పి ఆయన శరీరాన్ని వదులుతారు.
చరిత్రలో జరిగిన ఒక సంఘటనని చెబుతాను.
బ్రిటిషు వారు భారతదేశాన్ని ఆక్రమిస్తున్న రోజుల్లో ఒక గిరిజనగ్రామానికి వస్తారు. ప్రస్తుతం ఆ గ్రామం లేదు. వారు ఆ గ్రామాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. ఆ గ్రామం అంతా కలిపి వంద మంది జనాభా ఉంటారు కాని వారంత గొప్ప యోగశాస్త్రప్రవీణులు, ఆధ్యాత్మికులు. వారు ధ్యానంలో, ప్రాచీన ఆధ్యాత్మికతలో ప్రవీణులు. ఆ గ్రామంలో ఎప్పుడూ, ఎవరూ అనారోగ్యంతో బాధ పడలేదట. వారు ఎవరినైనా బాధ పెట్టినట్టు కల కన్నా ఉదయాన్నే ఆ వ్యక్తిని కలసి క్షమాపణ కోరేవారట. మీ లోపల సూక్ష్మస్థాయిలో పగ అనేది ఉన్నప్పుడే ఎక్కడో అచేతనస్థితిలోనైనా వారి మీద కక్ష ఉంటేనే ఆ విధంగా కల వస్తుంది. అందుకే ఆ విధంగా కల వచ్చినా వెళ్ళి వారిని క్షమాపణ కోరేవారు. వారు చాలా పరిణతిపొందిన ఆధ్యాత్మికులు. వారి అంతరంగ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. బ్రిటీషువారు ఆ గ్రామాన్ని స్వాధీనపరచుకోవాలి అని చూసినప్పుడు, ఆ గ్రామస్థులు తమ స్వేచ్ఛని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు బ్రిటీషు సైనికులు వారితో, 'మీరు అధీనం కాకపోతే మిమ్మల్ని చంపేస్తాం.' అని బెదిరిస్తారు.
మీరు ఆశ్చర్యపోతారు, వారు ఏమన్నారో తెలుసా! 'మీరు మమ్మల్ని చంపనవసరం లేదు. మీరు ఆ విషయం పట్టించుకోవద్దు. ఎలా మరణించాలో మాకు తెలుసు' అని అంటారు. బ్రిటీషు సైనికులు వారు ఆత్మహత్య చేసుకుంటారేమో అని అనుకుంటారు.
ఆ గ్రామస్థులంతా ఒక చోట గుమిగూడి, బ్రిటీషు సైనికులు చూస్తుండగా, వారి కళ్ళ ముందు ఒక మంత్రం జపించి కిందపడి మరణిస్తారు. వారు వారి శరీరాలని నేల పైకి వదిలి మరణిస్తారు. ఈ సంఘటనని బ్రిటీషు వారు ఒక రిపోర్టులా రాసి దాచి వుంచారు. ఆ రిపోర్టులో వారు ఈ విధంగా రాసారు, 'మొదటిసారి అమాయకప్రజల్ని చంపాం అనే అపరాధభావం మాలో కలిగింది. మేం చంపటానికి శిక్షణ పొందాం. ఎంతో మందిని చంపినప్పుడు కూడా మేం ఈ విధంగా తప్పు చేశామే అని బాధ పడలేదు. కాని ఇప్పుడు ఇక్కడ మాలో లోతైన అపరాధభావం కలిగింది. గొప్పవారైన అమాయకుల మరణానికి కారణమయ్యామే అని చాలా బాధపడ్డాం' అని వారు ఆ రిపోర్టులో రాసారు.
కొత్తవానికి స్థలం (అవకాశం)
వేదసంప్రదాయంలో శివుడు లయకారుడు. ఆయనని శుభకరుడు, మంగళకరుడు అంటారు. 'శివ' అంటే కారణం లేని మంగళత్వం. సంస్కృతంలో నాశనం అనే మాటకి వాడే పదం సంహార. సంహార అంటే నాశనం అని అర్థం కాదు. దాని అర్థం కొత్తదనం పొందటం. మనం నాశనం అనే అర్థానికి వాడే పదం అసలు అర్థం కొత్తవి జరగటానికి అనువైన అవకాశాన్ని కల్పించటం అనే అర్థంతో చూడవచ్చు. నాశనం అనే దాన్ని మరొక కోణం నుంచి చూస్తే అది కొత్తవి, మరింత మెరుగైనవి జరిగే అవకాశాన్ని కలిగించటం అని అర్థమౌతుంది. మీ శరీరానికి ఏదైనా ఒక వ్యాధి కలిగితే అది మీకు కొత్త శరీరం ఏర్పడటానికి సహాయం చేస్తుంది అని, మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు అని అర్థం. మీరు తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. చూడండి, తిరిగి ప్రారంభించటం ద్వారా మనలోని చాలా గాయాల్ని మాన్పవచ్చు. నిద్ర పోయి లేవటం ద్వారా చాలా గాయాల్ని మాన్పవచ్చు. మీరు నిద్ర మేలుకునేసరికి వాటిని మరిచిపోతారు.
మనలోని కొన్ని గాయాలు నిద్రలో పోవు. ఆ పాయింట్ దగ్గర మీరు నిర్ణయం తీసుకోవాలి, ‘నేను స్వచ్ఛతతో తిరిగి మొత్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను’ అని. మీ శరీరానికి ఏదైనా వ్యాధి ఉన్నా మీరు తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. వేద సంస్కృతి ప్రకారం ఏ అనుభవమూ వృథా కాదు, మీరు నిరంతరం, ఒక క్షణం నుంచి మరొక క్షణంలోకి వెళ్ళేటప్పుడు విస్తృతం అవుతుంటారు. మీరు నేర్చుకుంటూ ఉంటారు. మరింత అభివృద్ధి చెందుతారు. మీరు ఈ విధంగా ఆలోచించగలిగితే మరణం కూడా మంగళకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ తరువాత దశకి వెళతారు కాబట్టి. ఎప్పుడైతే ఆ తరువాత దశ గురించి మీకు స్పష్టంగా తెలియదో అప్పుడే మరణం అంటే భయపడతారు.
వర్తమానంలో ఉండండి, మరణాన్ని జయించండి
ఒక విషయం అర్థం చేసుకోండి. భవిష్యత్తు గతంగా మారటమే వర్తమానం. వర్తమానం అనే పాయింట్ దగ్గర భవిష్యత్తు మెల్లగా భూతకాలంగా మారుతుంది. వర్తమానం అనేది నూతనత్వాన్ని సాధించటానికి గల అవకాశం.
మీరు ఈ క్షణంలో వర్తమానంలో ఉండగలిగితే, భవిష్యత్తు మీ లోపలికి వచ్చి గతంలా మారి బయటికి వెళుతూ శక్తిని మీలో నింపటాన్ని మీరు స్పష్టంగా చూడగలరు. ప్రతిక్షణం మీరు శక్తితో ఉప్పొంగుతూ ఉంటారు. మీరు భవిష్యత్తులో చిక్కుకుపోతే ఊహలు, కల్పనలలో ఉంటూ, గాలిలో మేడలు కడుతూ ఉంటారు. నిజమైన ప్రపంచంలో బ్రతకటానికి శక్తి ఉండదు. మీరు భవిష్యత్తులో చిక్కుకొని ఉన్నంత వరకు ఆభద్రతాభావంతో, భయంతో ఉంటారు.
మీరు గతంలో చిక్కుకొని ఉంటే, మీకు విషయాలన్నీ అశుభంగా కనిపిస్తాయి. జీవితం నిస్సారంగా, డల్‌గా, జీవం లేనిదానిలా అనిపిస్తుంది. మీరు రాయిలా కదల్లేని స్థితిలో మీలో జీవం, శక్తి లేని విధంగా తయారవుతారు. మీరు వర్తమానంలో స్థిరపడి ఉన్నప్పుడు, ఏమి జరిగినా మంగళకరంలో అనిపిస్తుంది. మీరు శివునిలా కొత్తవాటి సృష్టికి కారణం అవుతారు. నిరంతరం కొత్త విషయాలురిగేందుకు వీలుగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయగలుగుతారు.
మీకు భయం ఉండదు. ఎప్పుడైతే మీలో భయం అన్నది పోతుందో, అప్పుడు మీ చుట్టూ జరిగే ప్రతిదీ మంగళకరంగా, శుభకరంగా అనిపిస్తుంది. మీరు ప్రవహిస్తున్న నదిలా, ప్రవహిస్తున్న శక్తిలా ఉంటారు, మీరు కారణం లేని మంగళత్వాన్ని ప్రసరింపచేస్తుంటారు. మీరు వర్తమానంలో ఉన్నప్పుడు మీ నుంచి భవిష్యత్తు, గతంలా మారి బయటికి వస్తుంది. మీరు ఖాళీ వెదురులా, కాలం చేత ప్రభావితం కాకుండా మరణానికి అతీతంగా ఉంటారు. మరణాన్ని గెలవటం అనేది చాలా చిన్న విషయం. మీరు కేవలం వర్తమానంలో ఉండి, కాలాల్ని మీ నుంచి ప్రవహించనీయండి. కాలం మీలోకి చొచ్చుకుపోయే విధంగా ఉండండి. కాలం మీ ద్వారా తన పనిని తాను చేసుకొనీయండి. భవిష్యత్తు మీలోకి వచ్చినప్పుడు అత్యాశతో దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నించకండి. దాన్ని మీ నుంచి వెళ్ళనీయండి. దాన్ని గతంలో మారనియండి. దాని కార్యక్రమం దానికి ఉంటుంది, అలా ఉండనీయండి. మీరు వర్తమానంలో ఉంటే మీరు శాశ్వతులుగా జీవించగలరు. మీలో ప్రతి రోజూ శక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రతిక్షణం మీ జీవితం విస్తృతం అవుతూ ఉంటుంది. మీ తర్కానికి అతీతంగా విస్తృతం అవుతుంది. అది అలా జరుగుతూనే ఉంటుంది.
సంపూర్ణాంగీకారం
మీ నుంచి దేన్నైతే తీసుకువెళ్ళాలో దాన్ని తీసేయటమైంది. మీకు ఏమైతే కలపాలో (మీకు ఇవ్వాలో) అవన్నీ కలపబడ్డాయి. నిరంతరం మంగళత్వం మీ ద్వారా వెల్లడి అవుతున్నది. మీ మనస్సు ఎప్పుడైతే దానికి 'కాదు' అని చెబుతుందో, అదే అమంగళం, అశుభం. మీ మనస్సు మీకు చెప్పే రక్షణ పద్ధతి అన్నింటి కంటే అమంగళమైంది. మీ జీవితంలోకి చూడండి దేనికైనా ఎప్పుడైనా సంపూర్ణంగా 'సరే' అని మీరు అన్నారా? కనీసం ఒకసారైనా అన్నారా? జీవితానికి ఒకసారైన సంపూర్ణమైన 'సరే' అనటమే జ్ఞానోదయం అంటే. ఇప్పుడు నిర్ణయించుకోండి, జీవితానికి సంపూర్ణమైన 'సరే' 'అవును' అని అంటాను అని, అప్పుడు మీ మనస్సులోకి అనేకమైన అభద్రతాభావాలు వస్తాయి. ఏమైనా జరిగితే ఎలా? తరువాత అరగంట సరే అనటానికి నిర్ణయించుకోండి. మీ మనస్సు 'అబ్బే కుదరదు' అని చెప్పవచ్చు. అలా అయితే నా జీవితం ఏమైపోతుందో అనుకోవచ్చు. నేను చనిపోతానేమో, నాకు భోజనం దొరకదేమో ఇవన్నీ మీ మనస్సు చేసే ట్రిక్స్. మిమ్మల్ని తన నియంత్రణలో ఉంచటానికి మీ అహం నియంత్రణలో ఉంచటానికి మీ మనస్సు ఆడే ఆట. మీలోని అన్ని సమస్యలకి మూలం ఇదే.
ఎప్పుడు కాదు అని చెప్పే మీ మనస్సుని బలంగా, దృఢంగా తయారు చేస్తే, అప్పుడు అది ప్రతి దానికి, ప్రతి విషయానికి 'కాదు' అనే చెబుతుంది. క్రమంగా కాదు అనేది మీ లోపల లోతుగా నాటుకుపోతుంది. మీ శ్వాసలో నాటుకుపోతుంది. కాదు అనేది మీ శక్తి ప్రవాహంలో కలవటమే క్యాన్సర్ కి మొదటి కారణం. జీవితంలా దాని గుండా కూడా మీరు సంపూర్ణమైన అంగీకార భావంతో వెళితే, మరణం కూడా ఉన్నతస్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళగలుగుతుంది. లేదు కాదుతో ఉంటే మిమ్మల్ని అత్యల్పస్థాయికి తీసుకువెళుతుంది. ఉన్నతస్థితికి, ఉన్నతమైన చేతనస్థితికి వెళ్ళాలా, అల్పస్థాయికి వెళ్ళాలా అనే నిర్ణయం మీరు చెప్పే అవును, కాదు అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది.
మంగళకర మరణం
జరిగిన సంఘటన: పరమహంస యోగానంద 1920లో అమెరికాకి వెళ్లారు. ఆయన గొప్ప యోగీశ్వరుడు. ఆయన శరీరాన్ని ఏ విధంగా వదిలారన్నది చాలా ఆసక్తిగా ఉంటుంది. చివరి నిముషం వరకూ ఆయన తన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రవచనాలు ఇస్తూనే ఉన్నారు. ఒక రోజు భారతరాయబారి గౌరవార్థం ఇచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగాన్ని ముగించి కుర్చీలో శరీరాన్ని వదిలారు. ఇరవైరోజుల తరువాత కూడా ఆయన శరీరం పాడవలేదు. అన్ని రోజులుగా ఆయన శరీరం నుంచి ఎటువంటి దుర్గంధమూ రాలేదు. ఆయన జీవితచరిత్రలో ఈ సంఘటన గురించి చక్కగా వివరించారు. అది ఒక అందమైన అనుభవం. ఆయన మరణం ఆయనకి మంగళకరమైంది.
నిజమే ఒక కల
మీరు అంటే కళ్లు కాదు. అవి ఒక పనిముట్టు లాంటివి. చాలాసార్లు మీ కళ్లు తెరచి ఉంటాయి. కాని మీరు చూడరు. ఆ చూసేది మీలో ముద్ర పడదు. మీరు కళ్ళ ద్వారా చూస్తున్నారు అని గుర్తుంచుకోండి. మీరు కళ్ళ ద్వారా చూస్తున్నాను అనుకోగానే మీరు ప్రతి దాన్నీ గమనించగలరు. రెండు రంధ్రాలు ఉన్న కళ్ళు మీరు కాదు. మీరు కళ్ళ ద్వారా చూస్తున్నారు. మీరు కళ్ళు అని అనుకుంటే అహంలో చిక్కుకుపోతారు. మీ కలలో చూసేదాని మీద మీ ఏకాగ్రత ఉన్నంత వరకూ మీరు కలని పొడిగిస్తారు. ఎప్పుడైతే మీ ఏకాగ్రత మీ వైపు తిరుగుతుందో, మీరు మేలుకుంటారు.
మీరు కళ్ళ కంటే అతీతమైనవారు అని ఎప్పుడు తెలుసుకుంటారో, అప్పుడు మీ ఏకాగ్రత మీ మీదకి మళ్ళుతుంది. అప్పుడు మీరు ఈ ప్రపంచం కూడా మీ కలలోని పదార్థంతోనే తయారైంది అని తెలుసుకుంటారు. ఎంత కాలమైతే మీరు చూస్తున్నారు అనుకుంటారో, అంత వరకూ మీ ఏకాగ్రతని చూసే దాని మీద ఉంచుతారు. దీన్నే అహం అంటాను. ఎప్పుడైతే మీరు దీన్ని ఆపి, మీరు కళ్ళ ద్వారా చూస్తున్నాను అని తెలుసుకుంటారో అప్పుడు మీ ఏకాగ్రత మీ మీద ఉంటుంది. దాన్నే నేను అమాయకత్వం అంటాను. అమాయకత్వం అంటే ప్రపంచంలో మీరు చూస్తున్నది, కలలో చేసిన పదార్థంతోనే చేయబడింది అని తెలుసుకోగలగటం.
దీంట్లో ఈ విధంగా ఉంటుంది, ముందుగా మీరు కల కంటున్నారు అనుకోండి. తరువాత ఆ కలని మార్చగల శక్తి మీకు ఉంది. అది కల మాత్రమే దాన్ని మార్చవలసిన అవసరం లేదు అని నిర్ణయించుకోగల బుద్ధి (వివేకం) ఉన్నది. మీరు తెలుసుకోవలసిన ఒక ముఖ్యసత్యం మీ కలలు, బయటి ప్రపంచం రెండూ ఒకటే. ఒకే పదార్థంతో చేయబడ్డాయి. మీరు కలలు మామూలే అనుకుంటే ఈ ప్రపంచం కూడా మామూలే. మీరు ఈ ప్రపంచం ఒక విధమైన సత్యం అని అనుకుంటే మీ కలలు కూడా సత్యమే. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, అది మీ కలల్ని నిజం చేయగల శక్తిని ఇస్తుంది. అంతే కాదు, మీరు దేన్నైతే, నిజం అనుకుంటున్నారో అది మరొక కల అని అర్థం చేసుకునే బుద్ధిని (వివేకాన్ని) ఇస్తుంది.
జీవితం, మరణం Vs మేలుకొని ఉన్న, నిద్ర పోయే స్థితి
గాలి - ప్రాణం : మీ జీవితాన్ని మార్చగల బలమైన సత్యం గురించి తెలుసుకోవాలంటే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది మీ కలల ప్రపంచం. మీ బయటి ప్రపంచం ఏ పదార్థంతో తయారైంది అనే విషయం. అదే విధంగా ప్రాణం అనేది మనం జీవించి ఉండేలా చేస్తుంది. దాన్ని గురించి కూడా తెలుసుకోవాలి.
మీరు లోపలికి తీసుకునే గాలి, ప్రాణాన్ని తీసుకువచ్చే ఒక వాహనం మాత్రమే. ప్రాణం లేదా ప్రాణ అంటే జీవశక్తి. అది ఒక శక్తి. ఒక ఉదాహరణ, మీ ఆవరణలోకి లారీ వచ్చి సామాను దించి ఎలా వెళుతుందో, గాలి ప్రాణాన్ని తీసుకువచ్చి మీ లోపల ఉంచి వెళుతుంది. ఆ విధంగా గాలి నిరంతరం ప్రాణాన్ని లోపలికి తీసుకువెళ్లి అక్కడ వదిలి బయటకి వస్తుంది. మనం నిరంతరం గాలి ద్వారా ప్రాణాన్ని తీసుకుంటున్నాం. మీరు కుంభమేళాకి వెళితే అక్కడ యోగులు తలలని భూమిలో పూడ్చిపెట్టి ఉండటాన్ని చూడవచ్చు. ఆ విధంగా వాళ్ళు మూడు రోజులు ఉంటారు. వారు ఆ విధంగా ఎలా చేయగలరు అంటే వారికి ప్రాణాన్ని తిన్నగా విశ్వశక్తి నుంచి తీసుకోవటం తెలుసు. వారు ప్రాణాన్ని గాలి ద్వారా తీసుకోవనవసరం లేదు. మీరు గాలి ద్వారా ప్రాణాన్ని తీసుకున్నంత కాలం, మీరు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. కాని మీరు ప్రాణాన్ని తిన్నగా విశ్వశక్తి నుంచి తీసుకోగలిగినప్పుడు, మీరు శ్వాసించనవసరం లేదు. మీ శరీరం విశ్వం నుంచి ప్రాణాన్ని గ్రహించగలుగుతుంది.
జీవించటం, మరణించటం ప్రాణం కదలికల మీద ఆధారపడి ఉంటాయి
మరొక విషయం - మీరు లోపలికి తీసుకునే గాలి ప్రాణాన్ని తీసుకువచ్చి తిరిగి ఖాళీగా వెళుతున్నంత కాలం మీ జీవితం బలపడుతుంది. ఆ విధంగా కాకుండా లోపలికి వచ్చే శ్వాస తక్కువ ప్రాణంతో వచ్చి బయటకి వెళ్ళే శ్వాస ఎక్కువ ప్రాణంతో వెళుతుంటే, మరణం దగ్గరైంది అని అర్థం. జీవశక్తి మరణం వైపు వెళుతుంది అని అర్థం. మరణం సమీపించినప్పుడు లోపలికి ఖాళీగా ఉన్న గాలి వెళ్ళి, బయటికి ప్రాణంతో వెళుతుంది. ఈ కారణం వల్ల గొప్ప జ్ఞానోదయమైన యోగిశ్వరులు, అవతార మూర్తులైన గౌతమబుద్ధుడు, శంకరాచార్యులు, గురునాసక్, మహావీరుడు మొదలైనవారు తమ మరణాన్ని చెప్పగలిగారు. మరణించటానికి ఆరు నెలల ముందు వారు ప్రాణం బయటకి వెళ్ళటం స్పష్టంగా చూడగలిగేవారు.
ఆయుర్వేదంలో శిఖరాగ్రవయస్సు అనే ఒక చక్కని విషయం ఉన్నది. అది ప్రాణశాస్త్రం మీద ఆధారపడి చెప్పబడింది. కొంత వయస్సు వరకూ ప్రతి ఒక్కరూ లోపలికి ఎక్కువ ప్రాణాన్ని తీసుకుంటారు. అప్పుడు బయటికి వెళ్ళే ప్రాణం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే బయటికి వెళ్ళే శ్వాస ద్వారా ఎక్కువ ప్రాణం బయటికి వెళుతుందో, ఆ వ్యక్తి మరణానికి చేరువ అవుతున్నాడు అని అర్థమవుతుంది.
మేలుకొని ఉన్నప్పుడు, స్వప్నావస్థలో, గాఢనిద్రలో ప్రాణం కదలికలు
మీరు మేల్కొని ఉన్నప్పుడు, జాగ్రత్స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం కదలికలు ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటాయి. అది ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటుంది. మీరు స్వప్నావస్థలో ఉన్నప్పుడు అది మెడ ప్రాంతంలో విశుద్ధచక్రం దగ్గర ఉంటుంది. మీరు గాఢనిద్రలో ఉన్నప్పుడు అనాహతచక్రం ఉండే ప్రాంతంలో ఉంటుంది. అందుకే మీ తల నిటారుగాఉన్నప్పుడు నిద్ర పోలేరు. తలని ఒక వైపు వాల్చకుండా మీరు నిద్ర పోలేరు. ప్రాణ నుదుటి నుంచి గుండె ప్రాంతానికి వెళ్లినప్పుడే నిద్రపోగలరు. అందుకే తల ఒక పక్కకి వాల్చకుండా మీరు నిద్ర పోలేరు. మీరు మంచం మీద పడుకున్నప్పుడు కూడా, మీరు తలని తిన్నగా పెడితే మీరు నిద్రపోలేరు. మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటే మీ తల నిటారుగా ఉంటుంది. భుజాల నొప్పిపుడుతుంది. తల నిటారుగా ఉండటానికి భుజాల నొప్పి పుట్టడానికి దగ్గర సంబంధం ఉంటుంది. అది మీరు గమనించవచ్చు. మీరు ఆఫీసుకు వెళ్ళి ఏ పని చేయనవసరం లేదు. మీరు సమస్యల గురించి ఆలోచించండి, మీ భుజాలలో నొప్పి కలుగుతుంది. నిజానికి అన్ని రకాల బాధ, ఒత్తిడి ముందుగా మీ భుజాల్లోనే కనిపిస్తాయి. భుజాలపై ఒత్తిడి ఉన్నప్పుడు తలని విరామంగా ఉంచలేము. అందుకే నిరంతరం ఆలోచించేవారు రిలాక్స్ కాలేరు. నిద్ర పోలేరు.
జీవితాన్ని నియంత్రించటం
ప్రతి నిమిషం జీవితం మరణం వైపుగా జారుతూ ఉంటుంది. జీవితం మరణం వైపుగా జారటాన్నే మనం జీవించటం అంటాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, మనం నిజంగా జీవించటం లేదు, మరణం కోసం ఎదురు చూస్తున్నాం. సాధారణమానవులు ఎవరూ జీవించరు. జీవితం మరణం వైపుగా వెళుతూ ఉంటుంది. అందుకే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా సంతృప్తి అనేది ఉండదు. మీరు జీవితాన్ని జీవించాను అనుకోరు. ఎందుకంటే జీవితమంటే ఏమిటో మీకు తెలియదు. ఎప్పుడైతే మీ జీవితాన్ని చేతనస్థితిలో చూస్తారో, ఎప్పుడైతే మీరు మీ జీవితం గురించి ఆలోచిస్తారో, ఎప్పుడైతే మీ జీవితంలోకి కేంద్రాన్ని ఏర్పరుస్తారో. ఈ జీవితానికి మరణానికి మధ్య, మీరు జీవితంలోనికి ఎక్కువ తెలుసుకునే తత్త్వాన్ని తీసుకువచ్చినప్పుడు మీరు మీ లోపల ఒక కొత్త కేంద్రాన్ని, కొత్త ప్రదేశాన్ని ఏర్పరచగలుగుతారు. దాన్నే నేను చేతనస్థితి అంటాను.
మీరు తెలుసుకునే తత్త్వంతో ఉన్నప్పుడు మీరు మీ జీవితం గురించి నిర్ణయాలు చేస్తారు. మీరు ఎక్కువ తెలుసుకునే కొద్దీ, మీరు ఎక్కువగా ఎంపికలు చేస్తూ ఉంటారు. ఏ కారు కొనుక్కోవాలి, ఎటువంటి ఇంట్లో ఉండాలి, ఎటువంటి జీవితం కావాలి - ఇలా జీవితాన్ని రూపొందిస్తారు. ప్రతి చిన్న విషయాన్ని నిర్ణయించటం ప్రారంభిస్తారు. ప్రతి విషయంలో జాగ్రత్త పడతారు. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆలోచించాలి - ఇలా ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకునే విధంగా చేస్తారు.
ఎప్పుడైతే మీరు ప్రతిదీ తెలుసుకునే విధంగా చేస్తారో, మీరు నిర్ణయాలు చేయటం ప్రారంభిస్తారు. అప్పుడు జీవితాన్ని నియంత్రిస్తారు. ఎప్పుడైతే ప్రతి దానిలోకి మీ తెలుసుకునే తత్వాన్ని తీసుకువస్తారో, మీరు మరణాన్ని కూడా నియంత్రించవచ్చు. అప్పుడు చేతనస్థితిలో పుట్టటం, మరణించటం జరుగుతాయి. మీరు చేతనస్థితిలో ఆలోచించగలిగితే అది జీవితం. మీ చేతనస్థితిలో ఆలోచించకపోతే అది మరణం.
జిజ్ఞాసతో నియంత్రణ
అచేతనస్థితిలో రెండు విషయాలు జరుగుతాయి. కలల స్థితి, గాఢనిద్ర. అచేతనస్థితిలో ఉండే తెలుసుకునే తత్వమే కల. అప్పుడు మీరు దేన్నైనా చూడగలిగితే, కదలిన అనుభవమైతే, తెలుసుకోగలిగితే అది కల. మీకు ఏమీ తెలియకపోతే ఏదీ అర్థం కాకపోతే అది గాఢ నిద్ర.
మీరు మేల్కొని ఉన్నప్పుడు, తెలుసుకోగలిగితే తెలుసుకునే స్థితిలో ఉంటారు. ఆ విధంగా తెలుసుకోలేకపోతే అది మరణం.
మీ జీవితంలోకి తెలుసుకునే తత్వాన్ని తీసుకువచ్చినప్పుడు మీ జీవితబాధ్యత తీసుకుంటారు. అదే విధంగా, కలలోకి తెలుసుకొనే తత్వాన్ని తీసుకువస్తే మీ కలలని, గాఢనిద్ర బాధ్యతని తీసుకుంటారు.
మీ జీవితాన్ని, మరణాన్ని నియంత్రించటానికి, మీ కలలని, గాఢనిద్రని నియంత్రించటానికి ఒక ముఖ్య నిబంధన; తెలుసుకొనే తత్వం. అదే ముఖ్యమైన విషయం. అదే వీటిని నియంత్రించటానికి అవసరమైన విషయం.
మీ కలలోనికి తెలుసుకునే తత్వాన్ని తీసుకురావటం వలన మీరు మీ కలలని గాఢనిద్రని; మీ మరణాన్ని, జీవితాన్ని, నియంత్రించవచ్చు.
నిజమూ, కలా రెండు ప్రాణ రూపాలే !
నుదుటి దగ్గర ఉన్న ప్రాణాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితే, మీకు ప్రాణం అనేది శ్వాస ద్వారా రావటమే కాదు మీరు అనుకునే నిజాన్ని, కలని అదే సృష్టిస్తుంది అని అర్థం అవుతుంది.
మీరు అనుకునే కల, నిజం రెండు కూడా ప్రాణం తయారు చేసినవే. దీన్నే ఆది శంకరాచార్య ‘ఈ ప్రపంచం మాయ, మిధ్య’ అనటంలో అర్థం. ఎప్పుడైతే మీరు దీన్ని అర్థం చేసుకుంటారో మీలో కలలని, జీవితాన్ని నియంత్రించే శక్తి వస్తుంది. ప్రస్తుతం మీరు వాటి చేత బాధితులు. మీ కలలని, జీవితాన్ని నియంత్రించలేరు.
మీరు కలల స్థితిలోకి ఎక్కువ తెలుసుకునే తత్వాన్ని తీసుకురాగలిగితే మీరు మేలుకొని ఉన్నప్పుడు ఆ తెలుసుకునే తత్వం పెరుగుతుంది. అది మరింత విస్తృతం అవుతుంది. అప్పుడు మీరు మరణాన్ని నియంత్రించగలరు.
కలలు, జీవితం
మీరు కలల్లోకి మరింత తెలుసుకునే తత్వాన్ని, మరింత చేతనస్థితిని తీసుకురాగలిగితే, మీ జీవితంలో చేతనస్థితి నాణ్యత పెరుగుతుంది. మీ కలల్లోని నాణ్యత మారినప్పుడు, మీ గాఢనిద్రలో నాణ్యతలో మార్పు వస్తే అప్పుడు మీ జీవితంలో నాణ్యత పెరుగుతుంది. ఈ రెండూ ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక విషయం అర్థం చేసుకోండి. జీవితం అంటే పగటిపూట కల కనటం. కల అంటే రాత్రి పూట జీవించటం, రాత్రి జీవితం కల, పగటి కల జీవితం.
మీరు పగలు ఏం చేసినా దాన్ని జీవితం అంటారు. రాత్రి ఏం జరిగినా దాన్ని కల అంటారు. మీరు పగలు ఏమీ చేయలేకపోతే దాన్ని మరణం అంటారు. రాత్రి పూట మీరు ఏమీ చేయలేకపోతే దాన్ని గాఢనిద్ర అంటారు. పగటి పూట అనుభవం, అనుభవించేవాడు, అనుభవించబడేది అనే మూడు ఉంటే దాన్ని జీవితం అంటాం. ఉదాహరణకి కాఫీ తాగటం, కాఫీ తాగే వ్యక్తి, తాగే అనుభవం, ఈ మూడింటినీ పగలు అనుభవిస్తే దాన్ని జీవితం అంటారు. మీరు వీటిని అనుభవించకపోతే మరణం అంటారు. అదే రాత్రి పూట ఈ మూడింటినీ అనుభవింఛితే కల లేకపోతే గాఢనిద్ర అంటారు.
నిద్రలో, మరణ సమయంలో ప్రాణ కదలికలు
మీరు స్వప్నస్థితి వైపు వెళితే ప్రాణం మీలోని విశుద్ధి దగ్గరకి వస్తుంది. మీరు గాఢనిద్రలోకి వెళితే అది అనాహత చక్రం వైపు వెళుతుంది. అదే విధంగా మరణించేటప్పుడు, జీవించి ఉన్నప్పుడు కూడా ప్రాణం కదులుతుంది. మీరు చైతన్యంగా, శక్తిమంతంగా ఉన్నప్పుడు మీ లోపల ప్రాణం ఎక్కువగా ఉంటుంది. అది నుదుటి దగ్గర చేరుతుంది.
లోపలికి వచ్చే శ్వాస ఎక్కువ ప్రాణాన్ని తీసుకువస్తే, బయటికి వెళ్ళే శ్వాస ఖాళీగా వెళితే, మీలోని ప్రాణం నుదుట దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది. లోపలికి వచ్చే శ్వాసలో తక్కువ ప్రాణం ఉండి బయటికి వెళ్ళే శ్వాసలో ఎక్కువ ప్రాణం వెళితే అది విశుద్ధి దగ్గరకి జారుతుంది. లోపలికి వచ్చే శ్వాస ప్రాణాన్ని తీసుకురాకపోతే, బయటికి వెళ్ళే శ్వాసతో ప్రాణం బయటికి వెళితే అది అనాహత దగ్గరకి వెళుతుంది. నిజానికి జీవితం నుంచి మరణస్థితికి వెళ్ళటం, మేలుకొని ఉన్న స్థితి నుంచి గాఢనిద్రలోకి వెళ్ళే స్థితి ఈ రెండూ ప్రాణం కదలికలకి సంబంధించి ఉంటుంది. మీరు శ్వాస ద్వారా వచ్చే ప్రాణాన్ని నియంత్రించగలిగినప్పుడు, దానితో వ్యవహరించ గలిగినప్పుడు, మీరు జీవితాన్ని, మరణాన్ని కూడా నియంత్రించగలుగుతారు. అదే విధంగా స్వప్నస్థితిని, గాఢనిద్రస్థితిని కూడా నియంత్రించగలుగుతారు. ప్రాణం అనే ఒక తాళంచెవితో కలని, నిద్రలని, జీవితాన్ని, మరణాన్ని నియంత్రించవచ్చు.
జననమరణచక్రాన్ని ఆపటం
మీరు నిద్రాస్థితిలోకి జారే సమయంలో తెలుసుకోగలిగితే, చేతనస్థితిలో ఉండగలిగితే, క్రమంగా మీ చేతనస్థితి మసకబారుతుంటే, మీకు క్రమంగా నిద్ర పడుతూ ఉంటే, అక్కడ మీ తెలుసుకునే తత్త్వాన్ని ఉంచగలిగితే, మీరు మీ కలలని మార్చగలరు.
ఏ వ్యక్తి అయితే తన కలలని చేతనస్థితిలో తెలుసుకునే తత్త్వంతో చూడగలడో ఆ వ్యక్తికి కలలు రావు. ఏ వ్యక్తి అయితే జీవితాన్ని తెలుసుకునే తత్త్వంతో, చేతనస్థితిలో జీవించుతాడో ఆ వ్యక్తి తిరిగి జన్మ తీసుకోడు. అందుకే తూర్పుదేశాల ఆధ్యాత్మికగ్రంథాలు అవి వేదాలు కాని, ధమ్మపదం కాని, జైనసూత్రాలు కాని, గురుగ్రంథ సాహిబ్ కాని, పునర్జన్మ లేని లక్ష్యం వైపు నిర్దేశించబడి వుంటాయి. వాటి అన్నింటికీ ఒకటే లక్ష్యం. అది మోక్షం అంటే జననమరణచక్రం నుంచి స్వేచ్ఛ.
మీరు కలలని మార్చగలిగినప్పుడు ముందుగా మీరు తెలుసుకునే విషయం, మీరు చేసేది, కల కనటం మానేస్తారు. ఎందుకంటే కలలు ఉపయోగం లేనివి అని మీకు తెలుస్తుంది. మీరు కలల్లో మీ సమయాన్ని, శక్తిని వృథా చేస్తున్నారు అని అర్థం అవుతుంది. ఎవరైతే కలలని తెలుసుకుంటారో, వాళ్ళు కల కనరు, కలలని ఆపేస్తారు. జీవితాన్ని తెలుసుకున్నవారు జననమరణచక్రాన్ని ఆపుతారు. మళ్ళీ మరొక శరీరాన్ని తీసుకోరు.
మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను మరణం అన్న మాటని ఉపయోగించినప్పుడు అది ఆత్మహత్య కాదు. మీరు జీవితాన్ని తెలుసుకునప్పుడు మరణంలోకి ప్రవేశిస్తారు. మీరు సాధారణ పద్ధతిలో జీవించరు. మీ గుర్తింపులతో జీవించటం మానేస్తారు. మీ గుర్తింపులకి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు. మీరు తిరిగి జన్మించతారు. అందుకే జ్ఞానోదయమైన వారు యోగీశ్వరులని మరణించిన వ్యక్తులుగా చెబుతారు. నిజానికి జ్ఞానోదయమైన వారు ఈ ప్రపంచ నిర్వచనంతో జీవించి ఉండరు. వారికి గుర్తింపులు ఉండవు. వారు అర్థం చేసుకోవటానికి జీవితం లేదు. వారి జీవితాన్ని జీవితం అని అనలేం. కచ్చితంగా చెప్పాలంటే వారి జీవితానికి ఒక పేరు పెట్టాలి. మీరు ఉపయోగించవలసిన ఒకే ఒక పదం మరణం. అందుకే ఆధ్యాత్మిక గ్రంథాలు పదే పదే వారిని తిరిగి జన్మించినవారు అని చెబుతుంటాయి. ఈ స్థితిలో ప్రాపంచిక విషయాలు మిమ్మల్ని బాధపెట్టవు. జీవితం మసకగా కనిపిస్తుంది. అది వారిలో చొచ్చుకొని రాదు. వారి నిశ్చలతని భంగపరచదు.
ప్రాణం గుండె ప్రాంతంలోకి జారటాన్ని మీరు తెలుసుకోగలిగితే, మీరు మీ కలలని మార్చవచ్చు. నియంత్రించవచ్చు, ఆపవచ్చు. మీ ప్రాణం ఆజ్ఞాచక్రం నుంచి అనాహతకి జారటం తెలిస్తే మీ జీవితం చివరిదశలో మీ జీవితాన్ని మార్చవచ్చు. దాన్ని ముందుకు జరపవచ్చు. అవసరం అనుకుంటే మరణాన్ని వాయిదా వేయవచ్చు. మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా ఆడుకోవచ్చు.
మానవ చేతనస్థితి మీద కొన్ని వేల సంవత్సరాల పరిశోధన ఫలితమే, వేదసాంకేతిక పరిజ్ఞానం.
ఇవి సిద్ధాంతాలు కావు అని తెలుసుకోండి. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాలుగా ఋషులు మానవచేతనస్థితి మీద జరిపిన పరిశోధనల ఫలితాలు.
ఈ సాంకేతికపద్ధతులు మీ జీవితనాణ్యతని అభివృద్ధి చేస్తాయి. నేను ఈ పద్ధతులు పది సంవత్సరాలు సాధన చేస్తే పదకొండవ సంవత్సరంలో ఫలితాలు వస్తాయేమో అని మీరు అనుకోనవసరం లేదు. ఈ సాంకేతిక పద్ధతులు, ఈ జ్ఞానం మీ జీవితంలో నాణ్యతని ఈ రోజు నుంచే మార్చేస్తాయి. దీని గురించి తెలియదు కాబట్టి ఆ అనుమానం వస్తుంది. ఉదాహరణకి భూమ్యాకర్షణ సిద్ధాంతం మీ జీవితానికి పనికివస్తే ఆ శాస్త్రాన్ని మీరు నమ్ముతారు. అలా ఉపయోగపడనప్పుడు మీరు దాన్ని మరిచిపోతారు, అనుమానిస్తారు చివరికి, ఆ శాస్త్రాన్ని బయటికి విసిరివేస్తారు.
కేవలం మనం శాస్త్రాన్ని సాధన చేయకపోవడం వల్ల ఈ సత్యాల్ని అనుమానించడం మొదలు పెట్టాం. ఆధ్యాత్మికతని ఇది నాకు ఉపయోగపడుతుందా? ఇది నాకు నిజంగా సహాయం చేస్తుందా? అని ప్రశ్నించడం ప్రారంభించాం.
ప్రాణం కదలికల్ని మార్చడం ద్వారా చికిత్స చేయవచ్చు, నూతనత్వాన్ని పొందవచ్చు
మీరు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదేది చెప్పానో అది మీ మరణానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు, జీవితంలో ప్రతిక్షణం మీకు సహాయం చేస్తుంది. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మీరు అడగవచ్చు.
నిజానికి స్వప్నస్థితి అంటే ప్రాణం తక్కువ స్థితిలో ఉంది అని అర్థం. అంటే ప్రాణం హృదయప్రాంతం వైపు వెళుతుంది అని అర్థం. మీరు ఆ సమయాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు మీ కలల్ని నియంత్రించగలుగుతారు అంతేకాదు, మీలోని శక్తిస్థాయిని పెంచగలుగుతారు. ఎప్పుడైతే మీలోని ప్రాణం తక్కువ స్థాయిలో ఉండటాన్ని గమనిస్తారో మీరు మీ శరీరంలో ప్రాణం స్థాయిని పెంచుకోవచ్చు. అలా తెలుసుకుంటే చాలు మీలోకి ఎక్కువ ప్రాణం వస్తుంది. అదే విధంగా మరణసమయంలో, దాన్ని ఆపి పైకి తీసుకురావచ్చు.
మీ ప్రాణ నెమ్మదిగా అనాహతం దగ్గరకి జారుతుంది. అది మరణసమయంలోనే కాదు, మీకు అనారోగ్యం కలిగినప్పుడు కూడా. అది కిందికి జారే కొద్దీ మీరు మరింత అనారోగ్యులు అవుతారు. మీరు ప్రాణం కదలికల్ని ఆపి పైకి తీసుకురాగలిగితే తిరిగి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మీ శరీరాన్ని అనారోగ్యం నుంచి కాపాడి చికిత్స చేయగల అంతిమపద్ధతి ఇది.
జీవితానికి, మరణానికి ఎదురుగా నిలబడగలగటానికి ధైర్యం కావాలి.
మీరు ప్రాణాని సాధన చేస్తే మీరు అనుకున్న విధంగా మరణం ఉండదు. మీరు మరణం అనగానే ఎందుకు భయపడతారు అంటే అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి. అదే మీకు భయాన్ని కలిగిస్తుంది.
చూడండి అందరూ ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తారని తెలుసు. అయితే అది ఎప్పుడు, ఎలా ఆ తరువాత ఏమిటి అనే విషయాలు మనకి తెలియదు. ఈ విధంగా తెలియనిదాన్ని గురించి మనలో కలిగే ప్రశ్నలే ఒక పెద్ద సమస్య. మరణం అనే మాట వినగానే మనం పడే మానసికవేదన నిజానికి మరణం గురించి కాదు, మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియక. ఒకసారి ఇది స్పష్టమైతే, మరణం అనే విషయం పూర్తిగా మారిపోతుంది. మన అంతరంగంలో మరణం అంటే ఉండే వ్యతిరేకత పూర్తిగా పోతుంది.
జీవితాన్ని, ఆరోగ్యాన్ని, మరణాన్ని నియంత్రించడం
మీరు మరణాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మాత్రమే కాకుండా, దాన్ని వాయిదా వేయగలగటం, అది ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోగలగటం కూడా సాధ్యమవుతుంది. ఏ ఆధ్యాత్మికపద్ధతి నుంచి అయినా మీరు పొందగలిగే చివరి బహుమతి ఇది.
అంతే కాకుండా, మీకు అనారోగ్యం కలిగినప్పుడు, ప్రాణం పూర్తిగా అనాహత లోనికి వెళ్ళకుండా అటు వైపుగా ప్రయాణిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఇలా ప్రయత్నించండి. మీరు నిద్ర పోయే ముందు మీ నుదుటిపైన మీ ఆజ్ఞాచక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మీరు పడుకుని, ఇక నిద్ర పడుతుంది అని అనుకున్నప్పుడు మీ చేతనస్థితి కరుగుతున్నప్పుడు మీరు చీకటిలోకి వెళ్ళే ముందు, గాఢ నిద్రలోకి వెళ్ళేముందు, మీ మూడవ కన్ను మీద ఏకాగ్రతని నిలపండి.
తరువాత మీరు మేల్కొని ఉన్నప్పుడు నిరంతరం ఈ జీవితం ఒక మాయ అని అనుకుంటూ ఉండండి. మీరు మేల్కొని ఉన్నప్పుడు కూడా కల కంటున్నాను అని అనుకోండి. మళ్ళీ మళ్ళీ ఇలా అనుకోండి నేను ఏమేం చూస్తున్నానో అదంతా కల అని.
దీనిలోకి తర్కంతో చూడవద్దు. అది నిజమా కాదా అని విశ్లేషణ చేయవద్దు. మీరు అనుకోవచ్చు అది నిజం కదా! ఎలా ఇది కల అనుకోవాలి అని, ఈ ప్రపంచం నిజం కదా? ఇలా అనుకుంటారు.
ఒక విషయం అర్థం చేసుకోండి. నిజం. సత్యం రెండూ వేరు వేరు విషయాలు. ఈ ప్రపంచం అంతా కల అని నేను అంటే అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే నిజాన్ని కొలిచే మీ పద్ధతులు ఏదీ సత్యం కాదు కాబట్టి.
మీరు ఈ విధంగా కొన్ని రోజులు సాధన చేస్తే, నేను చెప్పే మాటల వెనుక ఉన్న సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటారు. అది మిమ్మల్ని సత్యం వైపు తీసుకువెళుతుంది. మీరు అది కరిగిపోవటాన్ని చూడగలుగుతారు. ఈ కల కనపడే తెరని చూడగలుగుతారు. ఎప్పుడైతే తెరని చూడగలుగుతారో అదే తెరని మీ తెలుసుకునే తత్వంతో కలలో కూడా చూడగలుగుతారు. ఈ కలని చూపించే తెరనే నేను చేతనస్థితి అంటాను.
మీ మనస్సు అడిగే ఆ తరువాత ప్రశ్న, నేను మేల్కొని ఉన్నప్పుడు కల అనుకుంటే నేను ఎందుకు పని చేయాలి? అని. మీరు ఎందుకు పని చేయకుండా ఉండకూడదు?
మీకు పని ఎందుకు చేయకూడదు అనిపిస్తుందంటే, మీకు పని చేయాలి అని ఉండదు. మీ పనుల్ని ఏదో సాధించాలని చేస్తారు. ఫలితాల కోసం మీరు ఆ పనితో అనుబంధాన్ని పెంచుకుంటారు. మీరు కల కంటున్నాను అనుకుంటే మీరు కల కన్నా లేకపోయినా అక్కడ జరిగే మార్పు ఏదీ ఉండదు అని మీరు తెలుసుకుంటారు. ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. అలా జరిగే విధంగా మీరు సహకరిస్తారు. స్పష్టంగా తెలుసుకోండి, జీవితం ఒక కల. అకస్మాత్తుగా మీలోని మేధ మేల్కొంటుంది. మీరు సత్యం వైపు మేల్కొంటారు. అదే ఈ జీవితం అనే నాటకం. ఇది మొత్తం మీ ప్రొజెక్సనే. అది మీ ఊహ మాత్రమే.
మరణం అంటే జీవితం చివరి భాగంలో జరిగే ఒక సంఘటన కాదు. అది మీరు జీవించి ఉన్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు డబ్బు పోగొట్టుకుంటే, మీరు కోటీశ్వరుడు అనే గుర్తింపు చనిపోతుంది. మీ సోదరులు చనిపోతే, మీరు ఫలానావారి సోదరుడు అనే గుర్తింపు చనిపోతుంది. ఇలాంటి సంఘటనలతో మీలోని ఆయా భాగాలు చనిపోతాయి. అర్థం చేసుకోండి. జీవితం చివరి భాగంలో జరిగేది సంపూర్ణమరణం. మీరు జీవించి ఉండగా కొన్ని భాగాలు మరణిస్తూ ఉంటాయి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాక ఆయా సంఘటనలు జరిగినప్పుడు మీరు బాధపడరు. మీరు మీ పనిని చేసుకువెళతారు. వాయిదా వేయాలి అంటే వేయగలుగుతారు లేదా ఆయా సంఘటల్ని ఆపాలి అంటే ఆపుతారు.
విశ్వంలో విలీనం కావటమే మరణం
మీరు ఒక ఖాళీ కుండని తీసుకున్నారనుకోండి. కుండ లోపల ఉన్నది ఖాళీ, బయట ఉన్నది కూడా ఖాళీ ప్రదేశం. మీరు కుండని పగలకొడితే, కుండ పోతుంది కానీ ఆ ప్రదేశం నాశనం కాదు. కుండ లోపలి ఖాళీ ప్రదేశం విశ్వంలో విలీనమైపోతుంది. కుండ బయట ఉన్న ఖాళీలో కలిసిపోతుంది. కుండ లోపల పట్టి ఉంచిన ఖాళీ బయట ఖాళీ ప్రదేశంలో కలిసిపోతుంది. మీరు ఆ ఖాళీ ప్రదేశం రూపాన్ని మార్చగలరు కాని, దాన్ని నాశనం చేయలేరు.
అదే విధంగా మరణించినప్పుడు మీ శరీరంలో ఉన్న చేతనస్థితి బయట ఉన్న చేతనస్థితిలో విలీనమైపోతుంది. మీ శరీరంలో ఖాళీ ప్రదేశం, మీ శరీరం బయట ఉన్న ఖాళీ ప్రదేశం అనే ఆ హద్దు చెరిగిపోగానే మీ లోపల ఉన్న ఖాళీ బయటిదానిలో కలిసిపోతుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మీరు మరణభయం నుంచి స్వేచ్ఛని పొందవచ్చు. మీలోని దేన్నీ నాశనం చేయలేం.
సోక్రటీస్ జీవితంలో ఒక చక్కని సంఘటన ఉంది :
సోక్రటీస్ ని హెమ్లాక్ అనే విషం ఇచ్చి చంపేస్తారు. అతనికి విషం ఇచ్చి నీకు మరణిస్తున్నాను అని భయం కలగటం లేదా అని అడుగుతారు.
అతను చాలా చక్కగా జవాబు ఇస్తాడు. భయం ఎందుకు? మరణం వల్ల రెండు విషయాలు జరగవచ్చు. నేను అనేవాడిని ఉండకపోవచ్చు. లేదా నేను మరొక రూపంలో మరొక చోట ఉండవచ్చు. నేను అనే వాడిని లేకపోతే అసలు సమస్య లేదు. ఇక భయటపడానికి అక్కడ ఏమీ లేదు. నాకు ఏమీ తెలియదు కూడా నేను మరొక రూపంలో ఉంటే, అప్పుడు కూడ బాధ పడనవసరం లేదు. ఎందుకంటే నేను ఏదో ఒక రూపంలో ఉంటాను కాబట్టి, నేను మరణించను కాబట్టి.
సోక్రటీస్ చెప్పిన ఈ మాటలు గొప్ప మంత్రాలు
మీ జీవితంలోకి వెనక్కి తిరిగి చూడండి. మీరు జీవితం అంటే బాధ లేకపోతే సంతోషం అని చెబుతారు. ఈ రెండు మాత్రమే సాధ్యం. ఒక వేళ జీవితం అంటే వ్యథా పూరితం అనిపించిందనుకోండి, ఇక మరణానికి భయపడటం దేనికి? మీకు ఎలాగూ బాధలు ఉన్నాయి. మరొక బాధని ప్రయత్నించవచ్చు కదా?
మీరు జీవితం అంటే సంతోషం అన్నారు అనుకోండి. ఇప్పుడు కొత్త అనుభవాన్ని ప్రయత్నించండి. మీ జీవితం ఆనందమయమైనప్పుడు మీరు తీసుకునే కొత్త అడుగు కూడా ఆనందమయమే కదా! కాబట్టి ఎలా చూసినా మరణం అంటే భయపడనవసరం లేదు అని తెలుస్తుంది. అర్థం చేసుకోండి. మీ లోపల ఉన్న శక్తి మీ బయట ఉన్న శక్తితో విలీనమైపోతుంది. కాబట్టి మీ శరీరం మానసిక వ్యవస్థ నాశనమైపోయాక కూడా మీరు జీవించి ఉంటారు. ఇదే మీలో మార్పు తీసుకురాగల ప్రాథమికసత్యం. ఏ వ్యక్తి అయితే ఈ సత్యంలో స్థిరపడతాడో అతను నిర్భయత్వాన్ని, ఆనందాన్ని నిరంతరం వెదజల్లుతూ ఉంటాడు. అతను అద్భుతమైన ఆనందాన్ని, అనంతమైన శక్తిని వెదజల్లుతూ, పరమానందస్థితిలో స్థిరపడి ఉంటాడు.
ధ్యానపద్ధతి : 1
విశ్వవిస్ఫోటంతో జనించే శక్తి నిరంతరం విస్తృతమవుతూ ఉంటుంది. అదే శక్తి మీ లోపల కూడా ఉంది. లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస కలిసే దగ్గర మీ తెలుసుకునే తత్త్వాన్ని ఉంచండి. అది శక్తికి, శక్తిహీనతకి మధ్య స్థలం.
శ్వాసించిన గాలి బయటికి వెళితే అది పూర్తి శక్తితో ఉంటుంది. మీ చేతనస్థితి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. జీవశక్తిని స్పర్శించవచ్చు. తెలుసుకోవచ్చు. బయటికి వచ్చిన గాలి లోపలికి వెళ్ళేందుకు తిరిగే మలుపు శూన్యం. లోపలికి తీసుకున్న శ్వాస బయటికి వచ్చినప్పుడు దాన్ని స్పర్శించవచ్చు, తెలుసుకోవచ్చు. మనం మన ఏకాగ్రతని ఈ రెండు పాయింట్ల దగ్గర ఉంచితే మనలో జరిగే విశ్వవిస్ఫోటాన్ని, శక్తి కరిగిపోవటాన్ని తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు దీన్ని తెలుసుకుంటారో, మీరు విశ్వశక్తిగా మారతారు.
ధ్యానపద్ధతి : 2
ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి మీరు నిద్ర పోయేటప్పుడు. రెండవది మీరు మేల్కొని ఉన్నప్పుడు. ఏ పని చేస్తున్నా గుర్తు చేసుకుంటూ చేసేది. మొదటిది మీలో చాలా శక్తిని సృష్టిస్తుంది. రెండవది దానికి వ్యతిరేకం. అది ఒక దానికి ఒకటి ఆధారం.
మొదటిభాగం : మీరు పడుకుని, నిద్రపోయేముందు, ఆజ్ఞాచక్రాన్ని గుర్తుచేసుకోండి. కానీ ఏకాగ్రత పెట్టవద్దు. కేవలం గుర్తు చేసుకోండి. ఏకాగ్రతని బలవంతంగా అక్కడ నిలిపితే మీ నిద్ర పాడవుతుంది. మీకు తల నొప్పి వస్తుంది. కేవలం ఆ భాగాన్ని గుర్తు చేసుకోండి. చాలా విరామంగా గుర్తు చేసుకోండి. మీరు మెల్లగా విశ్రాంతిలోకి వెళతారు. క్రమంగా నెమ్మదిగా నిద్రలోకి జారుతారు. గాఢనిద్రలోకి వెళతారు.
ఈ సమయాన్ని తెలుసుకోండి. మీరు గాఢనిద్రలోకి జారే ఆ పాయింటుని తెలుసుకోండి, చాలు. మొదటి రోజు మీకు నిద్ర రానట్టే ఉంటుంది. దాన్ని పట్టించుకోవద్దు. ఆజ్ఞాచక్రం దగ్గర ప్రాణం కదలికల్ని గమనించండి.
మీరు కల కంటున్నట్టు తెలుసుకుంటారు. మీరు కలని పొడిగించాలి అంటే పొడిగిస్తారు. వద్దు అనుకుంటే దాని లోంచి బయటికి వచ్చేస్తారు. కానీ మీకు భయంకరమైన కలలు మాత్రం రావు. కలల్లో తీవ్రత ఉండదు. ప్రస్తుతం మీ కలలు మిమ్మల్ని కుదిపివేయగలవు. పీడ కల వస్తే మీరు మేలుకోగానే గుండె కొట్టుకునే వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కల గురించి తెలుసుకుంటే దాని ప్రభావం మీ మీద ఉండదు. ఆ తరువాత మీకు కలలు లేని నిద్ర పడుతుంది. అది లోతైనది. ఎప్పుడైతే కలలు లేని నిద్ర కలుగుతుందో మీకు పగలు కూడా కలలు రావు. అంత వరకూ మీ శక్తి ఆదా చేయబడుతుంది.
మీరు ప్రాణం కదలికల్ని తెలుసుకుంటే, అది చాలు. అది ఆటోమాటిక్‌గా ఉన్నతమైన శక్తి లోనికి వస్తుంది. ప్రాణం కదలికలతో మీ శరీరారోగ్యం బాగవుతుంది. అనారోగ్యానికి ప్రాణం కదలికలతో ప్రత్యక్షసంబంధం ఉన్నది. అంత కంటే కూడా మీరు మీ కలలని మార్చగలరు. మీరు మీ కలల్ని ఎప్పుడైతే నియంత్రించగలుగుతారో అప్పుడు మీ జీవితంలో జరిగే సంఘటనలతో వ్యవహరించటానికి గొప్ప శక్తి, బలం మీకు దొరుకుతాయి.
ప్రస్తుతం మీరు కలల ప్రభావానికి లోనవుతారు. వాటిని నియంత్రించలేరు. మీరు కనీసం తుమ్ముని ఆపలేరు. మీరు మేల్కొని ఉన్నప్పుడు కాని, నిద్రపోయే సమయంలో కాని దేనినీ ఆపలేరు. అవి అలా జరుగుతాయి అంతే. కాకపోతే అవి నేను చేస్తున్నాను అనే ఊహలో ఉంటారు. మీరు కలల స్థితిని తెలుసుకోగలిగితే, మీకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. అప్పుడు మీ చేతనస్థితి విస్తృతం అవుతుంది.
నిత్యానందస్ఫురణ ప్రోగ్రామ్, ఎస్. ఎస్.పి
నిత్యానందస్ఫురణ కార్యక్రమం మీ జీవితంలోకి మిమ్మల్ని ప్రయాణింపచేసే విధంగా ఉంటుంది. దానితో పాటు మరణ రహస్యాలు తెలిసేలా చేస్తుంది. అది మీ అంత రంగాన్ని శుభ్రంగా, స్వచ్ఛంగా చేస్తుంది. మీరు మీ లోపల మోసే భావావేశాల భారాన్ని తగ్గిస్తుంది. అది మీరు ఆనందంలో జీవించటాన్ని, ప్రశాంతంగా శరీరాన్ని వదలటాన్ని నేర్పిస్తుంది. అది మీకు మరణాన్ని సరైన విధంగా చూపించి జీవితాన్ని అర్ధవంతంగా, ఆనందంగా చేస్తుంది.
నిత్యానందస్ఫురణ కార్యక్రమం - చికిత్సాప్రభావం
కార్యక్రమం మీ లోపల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితులకి చికిత్స చేస్తుంది. నన్ను చాలామంది అడుగుతుంటారు, ధ్యానం ఏ విధంగా చికిత్స చేస్తుంది అని. అర్థం చేసుకోండి నేను నా శరీరంతో మీ అనారోగ్యానికి చికిత్స చేయను. నా సమక్షం మీలో ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. సూర్యోదయం అయితే పద్మం వికసిస్తుంది అదే విధంగా గురుదేవుల సమక్షంలో చికిత్స జరుగుతుంది.
మీ శరీరం నా సమక్షంలో ఉంటే హీల్ చేయగలను. అదే విధంగా మీ మనస్సు విప్పారి ఉంటే అది కూడా బాగా అవుతుంది. ఎస్.ఎస్.పి.లో మీ మనస్సుని విప్పే విధంగా చేస్తాం. మిమ్మల్ని గురించి రాయమంటాం. మీ బాధలు, కోరికలు, అపరాధభావం, సంతోషం అన్నీ రాస్తారు. ఇదంతా మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి, మీలోని సంస్కారాలని తెలుసుకోవటానికి. నన్ను చాలామంది అడుగుతుంటారు, ఆ విధంగా ఎందుకు రాయిస్తారని. వాళ్ళు రాసినవి నేను చూడను. ఎవరికీ చూపించనీయను. అలా రాస్తే నా సమక్షంలో మీ మనస్సుకి చికిత్స చేస్తాను. మీ గాయాలకి చికిత్స జరుగుతుంది.
నిత్యానందస్ఫురణ కార్యక్రమంలో మీలోని శక్తి పొరలని ఒక దాని తరువాత ఒకటిగా వికసింపచేస్తారు. అవి తెరవబడతాయి. మీ బాధలు, సంతోషాలు, కోరికలు, అన్నీ తెరవబడతాయి. ఒకసారి ఇవి వికసిస్తే, వాటికి చికిత్స జరిగితే మీరు భగవదనుభవాన్ని మీ లోపల క్షణకాలమైనా అనుభవించగలుగుతారు.
⁂ ⁂ ⁂
| ★ | మనం ఎందుకు భయపడతామంటే, సహజంగా మనం మార్పుని అడ్డుకుంటాం. మరణం అంటే అకస్మాత్తుగా జరిగే మార్పు. |
| ★ | జననమరణచక్రాన్ని ఛేదించే ఒకే ఒక మార్గం జ్ఞానోదయాన్ని పొందటం. |
| ★ | తిరిగి కొత్తగా ప్రారంభించాలి అనుకోవటాన్నే మరణం అంటారు. |
| ★ | మరణం అంటే జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించటమే. |
| ★ | రేపు లేదా మరు జన్మ - ఈ రెండింటిలో ముందు ఏది వస్తుందో మనం ఎప్పటికీ చెప్పలేం. |
| ★ | కోరిక భవిష్యత్తుకి సంబంధించింది. అపరాధభావం గతానికి సంబంధించింది. నిజానికి ఈ రెండూ ఒకటే. |
| ★ | మీరు వర్తమానంలో ఉండి కాలాన్ని మీ నుండి పోనీయండి. |
| ★ | మీరు మీకు తెలిసేలా ఆలోచిస్తే అది జీవితం. మీ చేతనస్థితి ఆలోచించలేకపోతే అది మరణం. |

మీరే మేధ
తమలో విశ్వమేధని అనుభవమే జీవన్ముక్తి
మరణం భయం అంటే మన గుర్తింపుని కోల్పోతామేమో అన్న భయం. దీని నుంచి విముక్తి పొందాలంటే, మనం ఈ శరీరానికి, మనస్సుకి అతీతులం అని తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకోవాలంటే మనకి మేధ ఉండాలి. అప్పుడు మనకి ఈ కింది ప్రశ్నలు వస్తాయి.
మేధ అంటే ఏమిటి?
మనలో కొందరు ఎక్కువ మేధస్సుని కలిగి ఉంటారా?
మనం మనలోని మేధస్సుని పెంచవచ్చునా?
సహజమేధ
మేధ అనేది ఏదో పొందగలిగే ఒక విషయం కాదు. ప్రతి ఒక్కరూ మేధని కలిగి ఉంటారు. మనందరికీ మేధ ఉన్నది. అది మన సహజలక్షణం. అది మన పుట్టుకతో వస్తుంది. మంట వేడిగా, ఐసు చల్లగా ఉన్నంత సహజంగా మనకి మేధ ఉంటుంది.
మేధావుల మీద ఒక జోక్ నాకు గుర్తుకు వస్తుంది.
ఒకసారి నలుగురు వ్యక్తులు విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అకస్మాత్తుగా విమానం తోక భాగంలో మంటలు లేస్తాయి. దురదృష్టం కొద్దీ అక్కడ మూడు పారాచూట్స్ మాత్రమే ఉంటాయి. అప్పుడు వారిలో మొదటి వ్యక్తి ఒక పారాచూట్ తీసుకొని, నాకు ఈ మధ్యనే వివాహం జరిగింది. నా భార్య నా కోసం చూస్తుంటుంది, అని చెప్పి కిందికి దూకేస్తాడు.
రెండవ వ్యక్తి, నేను ఈ భూమి మీద చాలా తెలివైనవాడిని. ఈ ప్రపంచానికి నా తెలివితేటలు చాలా అవసరం అని అతను దూకేస్తాడు. మిగిలిన ఇద్దరిలో ఒకాయన వయస్సులో బాగా పెద్దవాడు. ఆయన నాలుగవ వ్యక్తితో ‘నేను పెద్దవాడినైపోయాను. నీకు ముందు చూడవలసిన జీవితం చాలా ఉన్నది. అందుకే ఈ పారాచూట్ తీసుకొని నీవు కిందికి దూకు’ అని చెబుతాడు.
అప్పుడు ఆ యువకుడు ‘మీరు కూడా రావచ్చు. మనం ఇద్దరం వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద చాలా తెలివైన వ్యక్తి బాక్ పాక్‌తో దూకేసాడు’ అని అంటాడు.
మనలో చాలామంది మన సహజమేధని మరిచిపోయారు, అందుకే మనం జీవితాన్ని సంపూర్ణంగా పూర్తి స్థాయిలో జీవించలేకపోతున్నాం. మనం సంపాదించుకున్న తెలివితేటల్ని పొరపాటుగా మన మేధ అనుకుంటాం. మనందరం ఆ తెలివైన వ్యక్తిలా బాక్ పాక్‌ని పారాచూట్ అనుకొని కిందకి దూకేస్తున్నాం.
ఈ సృష్టిలో ప్రతిప్రాణికి తన సహజమైన మేధ ఉంటుంది. పక్షులు ఆకాశంలో ఎగరగల మేధ వాటికి ఉంటుంది. వలస పక్షులు కొన్ని వేల మైళ్ళు ఆకాశంలో ఎటువంటి పటం (మాప్) కాని, గైడ్స్ కాని లేకుండా అదే అడ్రస్ కి రావటం ఎంత ఆశ్చర్యం. సీజను అయిపోగానే తిరిగి అదే దారిలో వాటి సొంత ప్రాంతానికి జాగ్రత్తగా వెళ్ళిపోతాయి.
గొంగళి పురుగు నుంచి చింపాజీ వరకు ప్రతి జంతువూ తమ సహజమైన తెలివితేటలను ఉపయోగిస్తూ తమ జీవితాల్ని ఎంతో అందంగా జీవిస్తున్నాయి. మొక్కలకి, చెట్లకి సహజమేధ ఉంటుంది. ఆ మేధతో అవి సూర్యుడి నుంచి తమ ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. మనిషికి కూడా అద్భుతమైన సహజమేధ ఉన్నది. అతను మరింతగా అభివృద్ధి చెందిన జీవి. అతనికి పక్షులు, జంతువులు, చెట్ల కంటే కూడా ఉన్నతమైన చేతనస్థితి ఉంది.
పతంజలి భారతదేశంలో ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుడు. ఆయన ప్రాచీనయోగ శాస్త్రాన్ని రచించాడు. ఆయన ఈ విధంగా చెబుతాడు, తక్కువ స్థాయి ప్రాణులైన చెట్లు, పక్షులు జంతువుల్లో ఉండే అల్పస్థాయి చేతనస్థితి వివిధరూపాల్లో మనుషుల్లో ఉంటుంది.
మనిషి చెట్టులా ఆహారాన్ని తయారుచేయగలడు. జంతువులా, పక్షిల్లా మనిషికి జన్మ తీసుకుని తనంతట తానుగా జీవించే శక్తి ఉంది.
పతంజలి ఈ విధంగా చెబుతాడు, 'నీవు తాబేలుగా పుట్టినప్పుడు అంతకు పూర్వం నీవు తీసుకున్న పక్షులు, మొదలైన జన్మల జ్ఞాపకాలు ఆ తాబేలులో నిలువ చేయబడి ఉంటాయి. అదే విధంగా అంత కంటే మరో ఉన్నతమైన జన్మ తీసుకున్నప్పుడు, పాత జన్మల జ్ఞాపకాలు ఆ జన్మ తీసుకునే ముందు ఆ శరీరంలో నింపబడతాయి.
మీరు క్రమంగా మానవజన్మ స్థాయికి వచ్చే సమయానికి, మీ పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ మీ లోపల నింపబడి ఉంటాయి. మీకు సరైన పద్ధతి తెలిస్తే ఆ పద్ధతితో మీరు ఏ సమయంలోనైనా, ఏ జ్ఞాపకాన్నైనా పట్టుకోవచ్చు.
సహజంగానే మనకి అన్ని రకాల తెలివితేటలు మానవ శరీరంలోనే ఉంటాయి. కానీ సమస్య ఏమిటంటే మనతెలివి చాలా చిన్న పరిధిలోనే చాలా పరిమిత స్థాయిలోనే ఉన్నది అని గట్టిగా నమ్ముతాం. మనకి చాలా కొద్ది శక్తి మాత్రమే ఉన్నది అనే నియమం మన మీద రుద్దబడి, దాన్నే బలంగా నమ్ముతాం. ఏదైనా నా వల్ల కాదు అనుకుంటాం. కాబట్టి ఈ శక్తిని ఎలా ఉపయోగించాలో మనం మరచిపోయాం. అందువల్ల మనలోని అన్ని కోణాలను చూడగల పద్ధతిని ఉపయోగించలేకపోతున్నాం.
ఉదాహరణకి : మనిషికి ఎటువంటి శిక్షణ లేకుండా నీళ్ళలో ఈత కొట్టగలడు. జపాన్‌లో ఈ విషయం మీద ప్రయోగాలు చేసారు. అప్పుడే పుట్టిన బిడ్డని నీళ్ళలో వేయగానే ఆ బిడ్డ ఈత కొట్టటం ప్రారంభించింది.
పిల్లలు మేధతో పుడతారు
ఒక చిన్న కథ : ఒక అబ్బాయి స్కూలు నుంచి వచ్చాక వాళ్ళ అమ్మతో ‘నీవు స్కూల్ డెంటిస్ట్ నొప్పి లేకుండా చేస్తాడు అన్నావు కానీ అది కరెక్ట్ కాదు’ అని అంటాడు. అతని తల్లి కంగారుగా, ‘ఏమైంది? నీకు బాగా నొప్పి కలిగిందా?’ అని అడుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి, ‘కాదు! నేను వేలు కొరికినప్పుడు అతను చాలా గట్టిగా అరిచాడు’ అని అంటాడు.
పిల్లలు జన్మతః మేధావులు. వారు అసంకల్పితంగా, సృజనాత్మకంగా ఉంటారు. కానీ తల్లితండ్రులు, సంఘం, స్కూలు, కాలేజీ చదువులు ఆ సహజమేధని నాశనం చేస్తాయి. చదువులు తర్కానికి, జ్ఞానంతో కూడిన తెలివికి, గుర్తు పెట్టుకునే శక్తికి, పోటీకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తాయి. స్కూలు చదువుకి పిల్లలు చెల్లించే మూల్యం ఈ విధంగా చాలా ఎక్కువ. ఆ చదువు కోసం అత్యంత విలువైన సృజనాత్మకతని, తన ప్రత్యేకతని వదులుకుంటున్నారు. కనీసం వారికి ఈ విషయం తెలియదు.
ఒక రోజు యువకుడి టీ-షర్ట్ మీద ఒక కొటేషన్ చదివాను, ‘నా చదువు నాశనం చేసే ముందు వరకు నేను మేధావిని’ అని. ఈ రోజుల్లో పిల్లలకి అందిస్తున్న చదువుని గమనిస్తే అర్థమౌతుంది, అది వారి అభివృద్ధిని ఎంతగా నాశనం చేస్తుందో. తర్కానికి, విశ్లేషణలకి అనవసరప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ మెదడు ఎడమ పక్క భాగానికి చెందిన పనులు. కుడి పక్క మెదడు పనులైన సృజనాత్మకత, కళలు అనే వాటిని మరిచిపోయాం. మన మెదడులోని సగం శక్తిని పూర్తిగా వదిలివేసాం. మీ మెదడులో, మీ శరీరంలో సగభాగం వెల్లడి చేయాలి అని ఆతురత పడుతున్నది. కానీ మనం పట్టించుకోవటం లేదు. సత్యాన్ని మేల్కొల్పగలిగినప్పుడు విద్య అద్భుతాల్ని ఆవిష్కరిస్తుంది. మెదడు ఎడమ భాగంలో విద్యాభ్యాసం మంచిదే. కుడి భాగం ఇంకా ముఖ్యమైనది.
ఎప్పుడూ మీ ఆత్మ, మీరు సంపూర్ణంగా వెల్లడి అవుతూ ఉంటారో మీలోని సహజమేధ అందంగా వికసిస్తూ ఉంటుంది. దాన్నే నేను పూర్ణత్వం లేదా ఏకత్వంలో ఉండగలిగి సంతృప్తిని సాధించటం అంటాను.
భయం, ఆశ ముందుకు నడిపే శక్తులు
మనం చాలా తెలివైనవారం అనుకొని మన పిల్లల్ని కూడా మనలా తెలివైనవారిలా చేయాలి అని అనుకుంటాం.
ఆ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వారికి తార్కికంగా ఆశ, భయం ఏ విధంగా జీవితాన్ని ముందుకు నడిపిస్తాయో నేర్పిస్తాం. అతను ఏదైనా ఇంకా సాధించటానికి ప్రయత్నించాలి తనకి వద్దు అనుకున్నది ఆపటానికి పని చేయాలి అని చెబుతాం. మీరు అనుకున్నది జరగాలి అనుకుంటే అది ఆశ. మీరు ఏదైనా జరుగుతుందేమో అని భయపడితే అది భయం.
మంచి కాలేజీలో సీటు కోసం బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇదే ఆశతో ముందుకు వెళ్ళటం. బాగా చదవకపోతే ముందు జీవితంలో మంచి ఉద్యోగం దొరకదు. ఇది భయంతో ముందుకు వెళ్ళటం.
పిల్లల్లోని ప్రోత్సాహం కేవలం ఆశ, భయం. అంతే కాని అంతరంగంలో దొరికే పరిపూర్ణమైన తృప్తి కాదు. అందుకే పిల్లలు అనవసరమైన పోటీల్లో (రాట్ రేస్) పడిపోయి, పరుగెడుతూనే ఉంటారు. ఎలా పరుగెడుతారంటే కనీసం ఒక్కసారి నిలబడి తాము ఎందుకు ఎక్కడికి పరుగెడుతున్నారో చూసుకోకుండా పరుగెడుతుంటారు. ఆ పరుగులో చక్కని సంతోషాన్ని పొందవచ్చు అని వారికి తెలియదు. వారికి ఏం నేర్పిస్తారంటే, మీరు అటూ ఇటూ చూస్తే, విలువైన సమయం వృథా అవుతుంది, మీ లక్ష్యాన్ని చేరటం ఆలస్యమవుతుంది అని.
లక్ష్యాన్ని చేరాక ఎంత మంది సంపూర్ణమైన తృప్తిని పొందారు? మీరు నిజంగా అనుకున్న లక్ష్యాన్ని చేరాక అక్కడ అసలు లక్ష్యం లేదని తెలుసుకుంటారు. అది ఇంకా ముందుకు జరిగిపోయిందని తెలుసుకుంటారు. ఇప్పుడు మీకు మరొకటి కనిపిస్తూ ఉంటుంది.
మీ లోపలికి చూడండి. మీరు నిజంగా మీ పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తున్నారా లేక వారిని భయంతో, ఆశతో ముందుకు సాగమని చెబుతున్నారా? మీరు మీ అంతరంగం లోపలికి లోతుగా చూడండి. మీరు కేవలం పోటీ పరుగులో పరుగెడుతున్నారా? ఆ పరుగు మీకు మీ అంతరంగంలో సంతృప్తిని ఇస్తున్నదా? మీరు నిజంగా చేయాలి అని అనుకున్నది చేస్తున్నారా! లేకపోతే మీ కుటుంబం, మీ సంఘం మీ నుంచి ఏదో ఆశిస్తున్నది కాబట్టి పరుగెడుతున్నారా?
ఒక విషయం అర్థం చేసుకోండి; ఎదుటివారు ఏం చేస్తున్నారో చూసి మీరు కూడా అదే చేయాలని చేస్తే, మీరు విలువైన మీ జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు అని తెలుసుకోండి. దీన్నే గుంపులో ఉండే మనస్తత్వం అంటారు. అందరూ పరుగెడుతున్నారు కాబట్టి, నేను పరుగెడుతున్నాను అనే తత్త్వం ఇది. రాట్ రేస్‌లో గెలిచినా మీరు ఎలుకగానే మిగిలిపోతారు అని తెలుసుకోండి.
మేధని కొలవటం ఎలా?
మనం మేధని కొలవగలమా? అలా కొలవగలిగే ప్రమాణాలు ఉన్నాయా?
స్కూలు జీవితం నుంచి మనిషి మేధని కొలవటానికి ఏవో కొన్ని కొలమానాల్ని ఉపయోగిస్తున్నారు. స్కూలు, కాలేజీలలో ఇచ్చే గ్రేడులు ఒకరితో మరొకరిని పోల్చి ఇస్తారు. ఒక విద్యార్థి సైన్సులో బాగా చదవచ్చు. ఒకరు సంగీతంలోనూ గ్రేడ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరు మేధావి అని ఎలా నిర్ణయిస్తారు. ఒకవేళ వారి సామర్థ్యాన్ని సైన్సు ఆధారంగా లెక్క కడితే మరొక విద్యార్థి తప్పుతాడు. అదే సంగీతం ఆధారంగా లెక్కిస్తే ఇంకొక విద్యార్థిని తగ్గించాలి.
చూడండి సైన్సు ఆధారంగా విద్యార్థులు తెలివైనవారని నిర్ణయిస్తే కవి అయిన విద్యార్థికి తాను తెలివితక్కువవాడిననే భావం కలుగుతుంది. తెలిసి కానీ తెలియక కానీ తనలోని సహజమేధని ఆ విద్యార్థి అణిచేస్తాడు. సైన్సు విద్యార్థిని అనుకరించటం ప్రారంభిస్తాడు.
ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సైంటిస్టుగా ఉండాలి అంటే ఒక రకమైన మేధ అవసరం. కవిగా ఉండాలి అంటే మరొక రకమైన మేధ అవసరం. ఒలింపిక్ ఆటలలో ఈత పోటీలకి వెళ్ళాలి అంటే మరొక రకమైన మేధ ఉండాలి.
మేధ అంటే ఒక సమస్యకి కాని ఒక సంఘటనకి కాని స్పందించగల సామర్థ్యం. సంఘటన లేదా సమస్య మారినప్పుడు, ఉపయోగించవలసిన మేధ కూడా మారుతుంది. దానితో స్పందించే పద్ధతి మారుతుంది. సైంటిస్టు విద్యార్థి ఒక ప్రత్యేక కోణంలో ప్రత్యేకసంఘటనకి ప్రతిస్పందిస్తాడు. అదే విధంగా మరొక సమస్యకి కవి విద్యార్థి మరొక కోణంలో ప్రతిస్పందిస్తాడు. ఈత పోటీలకి వెళ్ళే వ్యక్తి మరొక కోణంలో ప్రతిస్పందిస్తాడు.
ప్రతి ఒక్కరూ జన్మతః మేధావులు. ఇక్కడ సమస్య ఆ వ్యక్తిలోని మేధ ప్రత్యేకకోణం ఏదో, ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవటం.
అప్రయత్నంగా స్పందించటం మేధ
మీ అందరిలో సహజమైన, సమయోచితమేధ ఉంటుంది. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దాన్ని ఉపయోగిస్తారు.
చిన్నతనంలో మీరు వస్తువుల్ని కాని, విషయాల్ని కానీ మామూలుగా, తిన్నగా చూడగలుగుతారు. అందుకే మీరు అప్పుడు అప్రయత్నంగా, సమయోచితస్ఫూర్తిగా ఉండేవారు. మీరు పెద్దవారయ్యాక ఆ సామర్థ్యం ఎక్కడికి పోయింది. మీ చిన్నతనం నుంచి సంఘం, సంఘనియమాలు నీకు అంత సామర్థ్యం లేదు అని చెబుతూ ఉన్నాయి. మీరు నిరంతరం ఏదో సాధించి మరేదో అవ్వాలి అనే అనుకుంటున్నారు. నిరంతరం మీరు అంటే ఇదీ అని నిరూపించాలని చూస్తుంటారు. ఎప్పుడూ నాకు నేను సరిపడా లేను అనే భావంతో ఆలోచిస్తూ ఇతరులను అనుకరించటానికి ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల మీ లోపల ఉన్న అద్భుతమైన సహజశక్తిని వృథా చేస్తున్నారు.
నేను ఒక సరదా వాక్యాన్ని ఒక కంపెనీ నోటీసు బోర్డులో చదివాను. మరణాన్ని క్షమించి స్వీకరిస్తాం కాని దానికి రెండు వారాల ముందుగా నోటీసు ఇవ్వాలి. ఎందుకంటే మీ వృత్తివిషయాలు మరొకరికి, మరణం ముందు, ఆ తరువాత నేర్పించటం మీ బాధ్యత.
సూచన : ఈ కొత్త కార్యక్రమం నిన్న ప్రారంభమైంది.
మీరు మీ అంతరంగంలోని మేధతో పని చేయకుండా గుడ్డిగా మరొక కంపెనీ పద్ధతిని కాని, మరొక వ్యక్తిని కాని అనుకరిస్తే అద్భుతమైన అవకాశాలని పొందకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటమే.
ఒక స్టాటిస్టిక్స్ స్టూడెంట్ కారు డ్రైవ్ చేసేటప్పుడు, జంక్షన్ దగ్గర బాగా స్పీడు పెంచి ఆ తరువాత నెమ్మదిగా వెళతాడు. ఒక రోజు అతని స్నేహితుడు అతనితో పాటు కారులో ప్రయాణిస్తూ ఉంటాడు. అతని పద్ధతిలో జంక్షన్ దగ్గర వేగంగా, ఆ తరువాత నెమ్మదిగా డ్రైవ్ చేస్తాడు. అతని స్నేహితుడు ఆశ్చర్యంగా ‘అదేమిటి’ జంక్షన్ దగ్గర నెమ్మదిగా వెళ్ళి ఆ తరువాత వేగంగా వెళ్ళాలి కదా. మరి నీవేంటి వ్యతిరేకంగా చేసావు’ అని అడుగుతాడు.
అప్పుడు అతను ‘స్టాటిస్టిక్స్ ప్రకారం జంక్షన్ దగ్గర ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ నేను తక్కువ సమయం ఉండే విధంగా జాగ్రత్త పడతాను’ అని జవాబు ఇస్తాడు.
జ్ఞానం మంచిదే కాని దాన్ని వివేకంతో ఉపయోగించాలి. మేధ మాత్రమే సరైన ఫలితాల్ని ఇస్తుంది, కాని జ్ఞానం కాదు. జ్ఞానాన్ని సరైన సమయంలో సరైన చోట ఉపయోగించటమే మేధ. సమయోచితం అంటే జ్ఞానాన్ని మేధతో కలిపి సున్నితంగా వెల్లడి చేయటమే. మీరు దేన్నైనా, మీలోని నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ఉపయోగించకపోతే కొంత కాలానికి మీరు దాన్ని మరిచిపోతారు. అదే విధంగా మేధని ఉపయోగించకపోతే కొంత కాలం జరిగాక మీకు మేధ ఉన్నది అని మరిచిపోయి నేను మేధావిని కాదు, తెలివితక్కువవాడిని, ఏ విషయంలో సమయోచితంగా వ్యవహరించలేను అని గట్టిగా నమ్మి మీరు మీ గతం మీద కాని, ఇతరుల మీద కాని ఆధారపడిపోతారు.
జిజ్ఞాసకు కీలక అంశాలు.
ఒక చిన్న కథ : ఒక అబ్బాయి స్కూలులో, ఇంట్లో చాలా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. ఒక రోజు ఆ అబ్బాయి టీచర్‌తో, ‘నిన్న నేను 3 ఆడ ఈగలని, 2 మగ ఈగలని చంపాను’ అంటాడు. టీచర్ చాలా కుతూహలంగా ‘అవి ఆడ, మగ ఈగలు అని నీకు ఎలా తెలుసు? అని ఆ అబ్బాయిని అడుగుతుంది. ఆ అబ్బాయి ‘ఇది చాలా చిన్న విషయం, మూడు ఈగలు అద్దం మీద, రెండు ఈగలు సిగరెట్ పెట్టె మీద ఉన్నాయి’ అని జవాబు ఇస్తాడు.
మేధ అంటే సమయోచిత స్ఫూర్తితో, ఎరుకతో ఉండగలగటమే.
ఒక ముఖ్య విషయాన్ని అర్థం చేసుకోండి, మీరు లోతైన ఎరుకతో ఉన్నప్పుడు పూర్తి తెలుసుకునే తత్వంలో తప్పులు చేయరు! ఎప్పుడైతే మీరు పూర్తి ఎరుకతో ఉంటారో మీరు ఇతరుల మీద కాని, మీ గతం మీద కాని ఆధారపడరు. మీ లోపలికి నిబంధనలు, నియమాలు అనేవి కొన్ని సంవత్సరాలుగా నింపబడుతున్నాయి. మీరు పూర్తి తెలుసుకునే తత్వంలో ఉండగలిగినప్పుడు స్వచ్ఛమైన మేధతో పనులు చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు లోతైన (ఎరుకతో) తెలుసుకునే తత్వంతో ఉంటారో అప్పుడు మీరు వర్తమానంలో ఉండగలరు. ఎప్పుడైతే మీరు వర్తమానంలో, ఈ క్షణంలో ఉంటారో మీరు చైతన్యవంతంగా, జీవంతో, జాగరూకతతో ఉండగలుగుతారు. అదే మేధ అంటే. మేధ ముఖ్య లక్షణం సమయోచితంగా, అప్రయత్నంగా ఉండగలగటం. దీనికి ప్రత్యేకశిక్షణ, నేర్చుకోవటం అనేవి ఉండవు. దీనికి కేవలం మీరు మీలో ఉన్న మేధని మేల్కొల్పాలి, అంతే.
ఇందులో మొదటి దశ మిమ్మల్ని మీరు గమనించటం. అదే విధంగా ఏదైనా ఒక సంఘటనకి మీరు అచేతనంగా ఎలా స్పందిస్తారో గమనించటం. మీరు మీ పనులు ఏ విధంగా మీ దృక్పథంలో నాటుకుపోయి ఉంటాయో, మీరు ఏ విధంగా గతం నుంచి ముగింపులు ఇస్తారో చూడండి. మిమ్మల్ని మీరు తెలుసుకునే తత్వంతో గమనించటం మొదటి స్టెప్. తెలుసుకునే తత్వానికి సంబంధించి మంచి విషయం ఏమిటంటే, ఇదొక్కటే మీకు నిజంగా అవసరమైన విషయం.
మనం జీవితంలో చాలా భాగం గడచిపోయిన గతంలోనే జీవిస్తుంటాం. జీవితంలోని అద్భుతమైన క్షణాలని పోగొట్టుకుంటున్నాం లేదా జరిగిన విషయాల మీద కోపం తెచ్చుకొని బాధపడతాం. ఈ రెండు విధాలుగా కూడా మనం ఏదో ఒక దానిలోకి పూర్తిగా వెళ్ళటం లేదు. అలా చేయకుండా, మీరు సమస్యలోనికి లోతైన తెలుసుకునే తత్వంతో చూడగలిగితే, మీలో ఒక శక్తి ఉదయిస్తుంది - ఆ శక్తి మేధ - ఆ మేధ సమస్యకి సరైన పరిష్కారాన్ని ఇస్తుంది.
ఈ తెలుసుకునే తత్త్వం నిబంధనల నుంచి మీకు స్వేచ్ఛని కల్పిస్తుంది. దాన్ని మేల్కొల్పగలిగితే మీరు మేధస్సుతో పనిచేస్తారు. తెలుసుకునే తత్త్వం మీలో మేధ అనే అగ్గిరవ్వని వెలిగిస్తుంది. అది నిరంతరం మీలో ఒక భాగంలా ఉండిపోతుంది. తెలుసుకునే తత్త్వం అనే వెలుగు మీ లోపల సంవత్సరాల నుండి ఉన్న అలవాట్లు జీవితం అనే చీకటిని తొలగిస్తుంది.
ఒక ముఖ్యవిషయం, తాళం చెవి తెలుసుకునే తత్త్వం. దానితోనే మీలోని మేధ పనిచేస్తుంది. ప్రతిక్షణం ఆ ఎరుకతో ఉండటమే ధ్యానం అంటే.
నియమాలకి అతీతంగా, బాధ్యత వైపుగా
ఒక చిన్న కథ : ఒక శిక్షణార్యక్రమంలో సార్జెంట్ అందరినీ ఉద్దేశించి 'వాల్నట్స్ని తుపాకీ తయారీలో ఎందుకు ఉపయోగిస్తారు' అని అడుగుతాడు. శిక్షకులు చాలాసేపు ఆలోచిస్తారు కానీ జవాబు దొరకదు. అందులో ఒకరు 'బహుశః దీని కంటే గట్టి గింజలు మరేమీ లేవు కాబట్టి' అని జవాబు ఇస్తాడు. సార్జెంట్ 'అది కూడా తప్పు' అంటాడు. మరొకరు 'ఇది చాలాకాలం ఉంటుంది, అందుకని' అని జవాబు ఇస్తాడు. సార్జెంట్ 'అది తప్పు' కూడా అని గట్టిగా అంటాడు. మూడవవ్యక్తి 'అది నీళ్ళలో తడవదు కాబట్టి', అని అంటాడు. ఈ సారి సార్జెంట్ మండిపడుతూ 'మీకు ఏమీ తెలియదు. మీరు చాలా నేర్చుకోవాలి' అని 'దీన్ని ఉపయోగించే కారణం చాలా చిన్నది, ఏమిటంటే అది ఒక రూలుగా రూల్స్ పుస్తకంలో ఉన్నది కాబట్టి దాన్ని ఉపయోగిస్తారు' అని అంటాడు.
జీవితంలో బాధ్యతని ఎదుటివారి మీద మోపి, గుడ్డిగా వారి సూచనలని అనుసరించటం సులభం. మీ మేధని ఉపయోగించటం కంటే ఇది సులభం.
మీరు ఏమంటారంటే ఇవి వినయవిధేయతలు అని కానీ, నిజానికి మీరు చేసే పనుల బాధ్యతని తప్పించుకోవటమే. ఇది ప్రమాదకరమైన పాత కాలం నుంచి ఉన్న ఒక అలవాటు. పుస్తకంలోని రూల్స్‌ని అనుసరించటం అంటేనే ప్రమాదకరం. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే కొన్నిసార్లు మీ బాధ్యతని, మీ వివేకాన్ని పోగొట్టుకుంటున్నారు అన్న విషయం కూడా మీకు తెలియదు. చిలకలా ఎవరో చెప్పినవి వల్లించటం, సంవత్సరాల కొద్దీ అదే పనిని ఎవరో చెప్పారని చేయటం మీరు చేస్తారు.
బాధ్యత గురించి మాట్లాడటం, దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనే దాని మీద ఒక జోక్ ఉన్నది.
ఒకసారి ఒక నేరగాడు అతని లాయర్ని గట్టిగా తిడుతుంటాడు, 'నీవు ఏం లాయర్వి. ఉపయోగం లేని లాయర్వి. నీ బాధ్యత నీకు తెలియదు. ఎప్పుడు ఎదుటివారి మాటలకి, వాదానికి అడ్డు చెప్పాలో తెలియదు' అంటాడు. లాయర్‌కి చాలా అయోమయంగా ఉండి 'నాకు అర్థం కావటం లేదు. నేను ఎప్పుడు అడ్డు చెప్పాలని నీవు అనుకుంటున్నావు' అని అంటాడు.
అప్పుడు నేరగాడు 'ఎదుటి పార్టీ లాయరు మాట్లాడుతున్నప్పుడు మాత్రం నీవు అడ్డం వేస్తూ వచ్చావు. కానీ జడ్జి గారు నన్ను నేరగాడుగా చెపుతున్నప్పుడు మాత్రం నీ పెద్ద నోటిని మూసుకొని ఉన్నావు. అప్పుడే కదా లాయర్‌గా నీవు అడ్డు చెప్పాలి' అంటాడు కోపంగా.
మీ జీవితంలో మీకు జరిగిన విషయానికి ప్రపంచాన్ని నిందించటం చాలా తేలిక. కానీ మీరు కొంచెం లోపలికి వెళ్ళి, మీ అంతరంగంలోకి చూస్తే మీకు జరిగిన విషయాలకి మీరు ఎలా బాధ్యులో అర్థమవుతుంది. మీరు మీ జీవితంలో ప్రతిక్షణం వర్తమానంలో ఉండకుండా, మీరు మాట్లాడిన మాటలకి, చేసిన పనులకి బాధ్యతని తీసుకోకుండా, మీరు చాలా పనులు అచేతనస్థితిలో చేస్తుంటారు. ఎప్పుడైతే ఆ పనుల ప్రభావం కనపడటం ప్రారంభమవుతుందో, మీరు ఆ ఫలితాలు నాకు వద్ద అంటారు. మీ మేధ ప్రకారం పనిచేయటం అంటే మీరు ప్రతి నిమిషం మాట్లాడే మాటలు, పనుల బాధ్యతని తీసుకోవటమే. ఉదాహరణకి; మీరు వినయంగా ఉంటే వారికి లోబడిపోయాను అనుకుంటారు. వినయంగా లేకపోతే అపరాధభావంతో ఉంటూ అయ్యో వినయంగా ఉండవలసింది అని అనుకుంటారు. ఈ డైలమా, ఈ అయోమయం నుంచి బయటికి రావాలంటే మీరు ఆ సమయంలో మీ మేధని స్పష్టతలో అనుసరిస్తూ మీ పనులకి, మాటలకి మీరే బాధ్యత తీసుకోవాలి. అప్పుడు మీరు ఎవరినీ బాధ పెట్టరు. మిమ్మల్ని బాధించుకోరు. మీరు ఎదిరించిన వ్యక్తికి కూడా వివేకంతో ప్రతిస్పందించగలుగుతారు.
ఇప్పుడు, ఇక్కడ
ఒక జోక్ చెబుతాను; ఒక సేల్స్‌మాన్ కస్టమర్‌ని పిలిచి బాస్ లోపల ఉన్నారా? అని అడుగుతాడు. కొత్త ఆఫీసు అసిస్టెంట్, 'మీరు సేల్స్‌మాన్ లేదా బిల్లు కలెక్టరా లేక స్నేహితుడా' అని అతణ్ణి అడుగుతాడు. అప్పుడు సేల్స్‌మాన్ కొంచెం ఆలోచించి 'ఈ మూడు' అని జవాబు ఇస్తాడు. అసిస్టెంట్ 'అలా అయితే బాస్ బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నారు, ఊళ్లో లేరు, లోపలికి వచ్చి ఆయనని కలవండి' అని అంటాడు.
మామూలుగా మనం యంత్రాల్లా స్పందిస్తాం. సందర్భాన్ని అనుసరించి మనం స్పందించం. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే మీరు ఆ విషయం పైన ఏం చేయబోతున్నారో తెలుసుకోక ముందే కోపం తెచ్చుకుంటారు.
గౌతమబుద్ధుని జీవితం నుంచి ఒక చక్కని సంఘటన : ఒక సారి ఒక వ్యక్తి బుద్ధుడిని అందరి ముందు అవమానిస్తాడు. ఆయన శిష్యుడైన ఆనందుడు బుద్ధునితో, 'నాకు అతని మీద చాలా కోపం వచ్చింది. నీవు ఎందుకు మౌనంగా ఉండిపోయావు' అంటాడు. అప్పుడు బుద్ధుడు ప్రశాంతంగా 'నీవు నన్ను ఆశ్చర్యపరుస్తున్నావు. అతను ఏం మాట్లాడుతున్నాడో అది అర్థం లేనిది. అప్పుడు నీవు ఎందుకు కోపం తెచ్చుకోవటం? నిన్ను నీవు ఎందుకు శిక్షించుకుంటావు. అది తెలివితక్కువతనం. ఎవరో తప్పుచేస్తే నీవు దానికి ఎందుకు బాధ పడతావు?'
గట్టిపడిపోయిన అహంకారం కంటే కాలంతో కదులుతూ, జీవితంతో ప్రవహిస్తూ, చైతన్యస్రవంతిలా ఉండటమే మేధ అంటే. మనం మేధతో ఉండటానికి బద్ధకిస్తాం. ఎందుకంటే నిరంతరం అప్పటి అవసరాలకి స్పందించాలంటే ఎరుకతో, మెలకువతో ఉండాలి.
వర్తమానంలో ఉండటం అంటే రక్షణ లేకుండా జీవించటం. దానికి ధైర్యం, మేధ అవసరం. నిజానికి జీవితంలో రక్షణ అనేదే ఒక ఊహ. తరువాత క్షణంలో ఏమి జరగబోతుందో మీరు ఎలా చెప్పగలరు. మీరు ఏది ఊహించినా అది గతంలో మీరు చూసినదాని ఆధారంగానే ఉంటుంది. భవిష్యత్తు ఇంకా రాలేదు. అది తెలియని బహుమతి కాబట్టి మీరు ఎప్పుడూ ఏది జరగబోతుంది అనే విషయాన్ని ముందుగా ఊహించలేరు.
వ్యక్తుల్ని, సందర్భాల్ని, జీవితాన్ని ఆహ్వానించండి
మేధ అంటే జీవితానికి ఆహ్వానం. అది వ్యక్తుల్ని, సందర్భాల్ని జీవితంలో ప్రతిదాన్ని ఆహ్వానించటమే. మీరు చూస్తే మీ జీవితంలో కొన్ని విషయాలు ఎలా జరగాలో, ఇలా ఉండాలి అనే ఆశలు, ఆశించటాలు, కొన్ని భావాలు ఉంటాయి. చేతులు చాచి విప్పారి ఉంటే జీవితాన్ని స్వీకరించటానికి మీరు సహాయపడతారు. రేపు వాతావరణం ఎలా ఉండాలో నియమాలు విధించగలరా మీరు. లేదు. అటువంటప్పుడు ఇంట్లో వాతావరణం అంటే భార్య, పిల్లలు మానసికస్థితి (మూడ్) ఎలా ఉండాలో మీరు ఏ విధంగా నిర్ణయిస్తారు.
ఒక విషయం అర్థం చేసుకోండి. మనం రెండు పనులు చేయవచ్చు. ఒకటి కావలసిన వివరాలు సేకరించి, వాదాలు తయారు చేసుకొని, నిర్ణయాలు (తీర్పు) చెప్పవచ్చు. రెండవది, ముందుగా నిర్ణయాలు చేసి దానికి వాదాలు తయారుచేసి, వాటికి అనుగుణంగా వివరాలు సేకరించవచ్చు.
మనం చాలాసార్లు ముందు నిర్ణయాలు చేసేసి, ఆ నిర్ణయానికి అనుకూలంగా ఉండే సంఘటనల్ని మాత్రమే తీసుకుంటాం. ఉదాహరణకి: మీరు మీ భార్య / భర్త పట్ల ఒక అభిప్రాయానికి వస్తారు. ఇప్పుడు మీరు మీ భర్తని షాపింగ్‌కి రమ్మంటే అతను ఏమంటాడో తెలుసు. అదే విధంగా మీ భార్యని మీరు ఫుట్ బాల్ ఆట చూడటానికి రమ్మంటే ఏమంటుందో తెలుసు. ఈ ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు కొన్నింటి ఆధారంగా మీరు చాలా విషయాలలో చాలా నిర్ణయాలు వారి పైన / వారి గురించి చేసేస్తారు.
వారు వారిలో పెంపొందించుకునే జ్ఞానం పట్ల, వారి మేధ పట్ల మీరు ఎప్పుడూ గౌరవం చూపరు, దాన్ని గుర్తించరు. అసలు సమస్య ఏమిటంటే మీలోని సహజమేధనే మీరు గుర్తించలేరు, ప్రోత్సహించలేరు. అందుకే మీరు ఎదుటివారిలోని మేధని, వారు కొత్తగా పెంపొందించుకున్న జ్ఞానాన్ని నమ్మరు.
మెదడుకి అతీతంగా ఉండేదే మేధ
ఒక రోజు తండ్రి, కొడుకు ఒక మామూలు రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్లో రాత్రి ఉండటానికి నిర్ణయించుకుంటారు. ఇద్దరూ పడుకున్నాక, తండ్రి కొడుకుతో 'భయపడకు, దేవదూతలు చూస్తూ ఉంటారులే' అంటాడు. అప్పుడు కొడుకు 'అవును, నాకు తెలుసు. ఇప్పుడే ఇద్దరు నన్ను కొరికి వెళ్లారు' అంటాడు. మేధతో పనిచేయటం అంటే చిన్ననాటి అమాయకత్వంలోనికి వెళ్ళటమే. ఇది ఏదోగా అవ్వటానికి జరిగే పద్ధతి కాదు. ఏదో కొత్తది పొందటం కాదు. ఇది మీ లోపలి అసలైన ఉనికిని కనుగొనటమే. మీ అసలైన మీరు అంటే ఏమిటో తెలుసుకోగల ద్వారం. మీరు కేవలం మేధావి అయితే మెదడు నుంచి, మీ తర్కం నుంచి (జ్ఞానం) మాత్రమే పని చేస్తారు.
ఒక చిన్న కథ : ఒక వ్యక్తి తత్వశాస్త్రంలో పి. హెచ్. డి. చేస్తుంటాడు. ఆయన తన పరిశోధనలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. అతని భార్య తన భర్త తనని మరిచిపోతాడేమో అనే భయంతో అతనికి గుర్తు చేయాలి అని అనుకుంటుంది. ఆమె అతనితో 'హనీ! నీవు నన్ను అంతగా ప్రేమించటానికి ఒక కారణం చెప్పగలవా'? అని అంటుంది. అతను భార్య వైపు సీరియస్‌గా చూస్తూ' ‘నీవు అంతగా ప్రేమించటం' అంటే అర్థం ఏమిటి? అంత లోతుగా అని అనుకుంటున్నావా? లేక అంత ఎక్కువ లేక వెల్లడిచేసే పద్ధతి గురించి అడుగుతున్నావా అని అడుగుతాడు.
మీరు మీ జ్ఞానంలో ఎక్కువగా చిక్కుకుపోయి ఉన్నప్పుడు మీ జ్ఞానం, తర్కంతో జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అనుకుంటారు.
మరొక చిన్న కథ : ఒక వ్యక్తి నీరు పోయే గొట్టాల పని (ప్లంబింగ్)లో డిగ్రీ పాస్ అవుతాడు. అతను స్నేహితులతో కలసి నయాగరా జలపాతం చూడటానికి వెళతాడు. అతను జలపాతాన్ని చూసి ‘నేను దాన్ని ఆపగలను (నిలపగలను) అని అనుకుంటున్నాను' అంటాడు.
మీ జ్ఞానం అన్నింటినీ తెలుసుకున్నాను అనే ఒక కపటమైన ఊహని ఇస్తుంది. అది మీరు మీ జ్ఞానంలో స్థిరపడిపోయేలా చేస్తుంది.
మీలో మేధ మేల్కొంటే, మీరు తల నుంచి హృదయంలోకి, తర్కం నుంచి ప్రేమలోకి వస్తారు. అప్పుడు మీరు కేవలం మేధ నుంచి కాకుండా కేవలం భావావేశాల నుంచి కాకుండా, ప్రేమతో కూడిన మేధ నుంచి పని చేస్తారు. అప్పుడు మీరు అప్రయత్నంగా మీ చుట్టూ ఉన్నవారి మీద కరుణని చూపిస్తారు.
ఆలోచించటం కాదు, అర్థం చేసుకోవాలి
ఒక చిన్న కథ : ఒకసారి ముగ్గురు జ్ఞానులు, జీవితం గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలి అని ఒక పట్టణానికి వెళుతుంటారు. వాళ్ళు చాలా పెద్ద నగరంలోకి వెళతారు. వారికి దూరంగా ఒక ఎత్తైన బహుళ అంతస్తుల భవనం కనిపిస్తుంది. అది ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.
వాళ్ళు ఏంచేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. దాని దగ్గరకి వెళ్ళి చూడటానికి వారికి భయం అనిపిస్తుంది. అందులో ఏదైనా ప్రమాదం ఉండవచ్చు అని భయపడతారు. దానిలోంచి బయటికి రాలేకపోతే ఎలా అనుకుంటారు. కాబట్టి లోపలికి వెళ్లే ముందు, అందులోంచి ఎలా బయటికి రావాలో తెలుసుకోవాలి అని అనుకుంటారు. వాళ్లు తమ గత అనుభవాల ఆధారంగా దాన్ని విశ్లేషించి అన్ని రకాల దారుల్ని, పద్ధతుల్ని తయారు చేస్తారు. అన్ని విశ్లేషణలు అయ్యాక, వారు ఇలా అనుకుంటారు, 'అది మనిషి కంటే పెద్దది. కాబట్టి రాక్షసుల వంటి అతి పెద్ద ఆకారగల ప్రాణులదై ఉండవచ్చు. కాబట్టి అక్కడికి వెళ్లటం క్షేమం కాదు' అని ఒక నిర్ణయానికి వస్తారు. ఇంత గొప్ప విషయాన్ని తెలుసుకున్న తృప్తితో వారు తిరిగి తమ ఊరికి వెళ్ళిపోతారు.
గత అనుభవాల జ్ఞానంతో మీరు అర్థం చేసుకోగలది చాలా తక్కువ. మీరు మనస్సులో ఒక విషయం గురించి అనుకుని దానితో ఆ విషయాన్ని అర్థం చేసుకోలేరు. మీరు దాన్ని చూసి అర్థం చేసుకోలేరు. ఒక వ్యక్తి ఒక బకెట్టులో నయాగరా జలపాతం నీరు చూసి నాకు నయాగరా జలపాతం గురించి బాగా తెలుసు అంటే ఎలా ఉంటుందో ఇదీ ఆ విధంగానే ఉంటుంది.
మీరు ఆలోచనల మీద ఆధారపడతారు, ఎందుకంటే మీలోని సహజంగా అర్థంచేసుకోగల శక్తి పని చేయకుండా చేస్తున్నారు. అర్థం చేసుకోగల శక్తి మీలో ఉండేట్టు చూస్తే, మీరు ఇంకా ఏమీ ఆలోచించనవసరం లేదు. ఎవరైతే అవసరాలని అర్థం చేసుకోరో ఆ వ్యక్తి ఆలోచించాలి.
మరొక విషయం: మీరు కేవలం మీకు తెలిసిన విషయాన్ని గురించి మాత్రమే ఆలోచించగలరు. మీకు జరిగిన అనుభవం గురించి ఆలోచించగలరు. కానీ, మీకు తెలియని విషయం గురించి మీరు ఆలోచించగలరా? కేవలం అటువంటి వాటి గురించి ఊహిస్తారు. అది కూడా మీరు గతంలో చూసిన దాని ఆధారంగా మాత్రమే.
ఆలోచించినప్పుడు మేధ, సత్యం శక్తి అక్కడ ఉండవు. కాబట్టి మీకు స్ఫురించే జవాబు పరిమితమైన అనుభవం నుంచి మాత్రమే వస్తుంది. ఆ జవాబు తిరిగి మరి కొన్ని అనుమానాలు, ప్రశ్నలకే దారి తీస్తుంది.
అర్థం చేసుకోవటమే మేధ. అది కొత్తగా స్వచ్ఛతతో ఉంటుంది. అది స్పష్టంగా ఉంటుంది. కాబట్టి అది తిరిగి మరొక ప్రశ్న అనేది రాకుండా జవాబుని ఇస్తుంది. ఆ జవాబు మీ అంతరాత్మ నుంచి వస్తుంది. కాబట్టి అది సత్యం. ఒక వేళ జవాబు నాకు తెలియదు అని వచ్చినా మంచిదే. అమాయకత్వం, సత్యానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే లేనిది ఉన్నట్టు భావించటం కంటే ఇదే మంచిది.
గతజ్ఞాపకాల నుంచి వచ్చే జవాబులు కాకుండా, వర్తమానం లోనికి చేతనస్థితి నుంచి పని చేయటాన్నే అర్థం చేసుకోవటం అంటారు.
మనస్సు - యజమానా లేక ఒక ఉపకరణమా?
మనస్సు లోంచి వచ్చేవే ఆలోచనలు. మనస్సు ఒక అద్భుతమైన యంత్రాంగం. అయితే సమస్య ఎక్కడ ఉంటుందంటే, ఆ మనస్సు మీ చేతిలో ఒక పనిముట్టులా కాకుండా మీ యజమాని అయినప్పుడు.
ఒక చిన్నకథ : ఒక రాజుగారి దగ్గర చాలా నమ్మకస్తుడైన సేవకుడు ఉండేవాడు. అతను ఎంతగా రాజుకి నమ్మకస్తుడంటే రెండు - మూడుసార్లు తన జీవితాన్ని పణంగా పెట్టి రాజుగారి ప్రాణాలు కాపాడాడు.
అటువంటి ఒక సందర్భంలో రాజుగారు చాలా సంతోషపడి, ఆ వ్యక్తిని నీకు ఏంకావాలో కోరుకోమని అంటాడు. ఆ సేవకుడు, 'నాకేమీ అవసరం లేదు మహారాజా! మీరు నాకు సమస్తం ఇచ్చారు' అని వినయంగా జవాబు చెబుతాడు. కానీ రాజుగారు అతణ్ణి బలవంతం చేస్తాడు. చివరికి అతను, 'మీరు నిజంగా నాకు వరం ఇవ్వదలుచుకుంటే నన్ను ఒక్క రోజు ఈ దేశానికి రాజుని చేయండి' అంటాడు.
అది విన్నరాజు కొంచెం అసౌకర్యంగా భావిస్తాడు కానీ అతనికి మాట ఇచ్చాడు. కాబట్టి, ఒప్పుకుంటాడు. మర్నాడు ఉదయం సేవకుడు రాజు అవుతాడు. అతను సింహాసనాన్ని అధిష్ఠించగానే భటుల్ని పిలిచి రాజుని చంపమని చెబుతాడు. రాజు నిర్ఘాంతపోయి అతనితో, 'నీవు ఏం మాట్లాడుతున్నావో తెలుసా'? అంటాడు. అప్పుడు సేవకుడు 'ఈ రోజు నేనే రాజుని, నేను ఏది తలచుకుంటే అది చేయగలను' అంటాడు. రాజుగారు చనిపోతాడు. సేవకుడు ఎప్పటికీ రాజుగా ఉండిపోతాడు.
అర్థం చేసుకోండి, ఇదే విధంగా ఎప్పుడైతే అధికారాన్ని మనస్సుకి ఇస్తామో అది మన జీవితాన్ని నియంత్రిస్తుంది.
మనస్సు అనేది రేడియో లాంటిది. కానీ దాన్ని ఎలా ఆపాలో మీకు తెలియటం లేదు. అందుకే అది మీలోని మేధని మీరు చూడగలిగే ఖాళీని, అవకాశాన్ని మీకు ఇవ్వటం లేదు. అందుకే మీరు విరామంగా ఉండటాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోతున్నారు. మీరు అలసిపోతున్నారు, బలహీనులవుతున్నారు.
మనస్సు లోతుల లోనికి
మీరు ఈ చిన్న ఎక్సర్సైజు చేయండి. అది మీ మనస్సు లోతుల్లో దాని లక్షణాల్ని మీకు చూపిస్తుంది. మీరు ఒక పేపర్, పెన్ తీసుకొని, మీకు వచ్చిన ఆలోచనల్ని ఆ పేపర్ మీద రాయండి. నిజాయితీగా రాయండి. దాన్ని ఎడిట్ చేయకుండా వచ్చిన ఆలోచన వచ్చినట్టే రాయండి. ఆలోచన రాగానే రాయండి. అలా ఐదు నిమిషాలు రాయండి. ఆ తరువాత మీరు ఏం రాసారో చదవండి.
అది చదివి మీరు నిర్ఘాంతపోతారు. ఒక ఆలోచన ఇక్కడ జరిగిన విషయం మీద ఉంటే, మరొక ఆలోచన అమెరికాలో ఉన్న మీ కూతురి గురించి ఉంటుంది. ఆ తరువాత మీ చిన్నప్పటి స్కూలు టీచర్ గురించి ఉంటుంది, అక్కడ రోడ్డు మీద అరచిన కుక్క గుర్తొస్తుంది. ఆ పేపరు ఒక పిచ్చాసుపత్రిలా ఉంటుంది. మీరు ఆ పేపరు మీద రాసిన విషయాల్ని విశ్లేషిస్తే, మన ఆలోచనలు స్వతంత్రమైన, ఒక దానితో మరొక దానికి ఎటువంటి సంబంధం లేని, అర్థం లేని విషయాలని మీకు తెలుస్తుంది. మనస్సు అంటే ఈ విధంగా అర్థం లేని, ఒక దానితో మరొక దానికి సంబంధం లేని ఆలోచనల సమూహం అని అర్థమవుతుంది.
ఆలోచనలకి గట్టి పునాది ఉండదు అని అర్థం చేసుకోండి. మనస్సు అని మనం పిలిచేదే ఒక ఊహ. అది ఒక దానితో మరొక దానికి ఎటువంటి సంబంధం లేని ఆలోచనల సమూహం. అవి కేవలం ఊహలు. అవి ఖాళీ గాలి బుడగల్లాంటివి. మీరు తెలుసుకునే తత్త్వం అనే వేలితో ఆ గాలి బుడగలని అంటుకుంటే అవి పేలిపోతాయి. ఆ ఖాళీ బయట ఉన్న అనంతంలో ఐక్యమైపోతుంది.
మీరు చేయవలసింది కేవలం మీ ఆలోచనల్ని గమనించటం, తెలుసుకునే తత్త్వంతో ఉండగలగటం. అప్పుడు క్రమంగా మీ ఆలోచనలు తగ్గుతాయి.
మీరు గమనించటం అనే బాణాన్ని ఉపయోగిస్తే ఆలోచనలు జీవించలేవు. మేధ ఆలోచనల్ని చక్కగా గమనించగలదు.
శరీరమేధ
మీలో ఎంత మందికి మన శరీరం వెల్లడిచేయగల మేధ గురించి తెలుసు?
జీర్ణాశయం తాలూకు మేధ
ఉదాహరణకి మన జీర్ణాశయాన్ని తీసుకోండి. ఆహారాన్ని రక్తంగా మార్చే ప్రక్రియ ఎంత కష్టమైందో, ఎంత సున్నితమైందో కదా - రకరకాల ఆహారాన్ని శరీరాన్ని నడిపే శక్తిగా మార్చటమే దీని పని. కొన్ని అడుగుల పేగులలో జరిగే పని బయట ఇండస్ట్రీలో చేయాలంటే ఎన్ని మైళ్ళ గొట్టాలు కావాలో కదా!
జీర్ణక్రియ మన నోటి దగ్గర ప్రారంభమవుతుంది. మనం ఆహారాన్ని నమిలే సమయంలోనే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. చిన్న, పెద్ద శరీర భాగాలు ఆశ్చర్యం గొలిపే పనులు చేస్తాయి. మనం ఆహారం మింగగానే అది గొంతు ద్వారా పేగు లోనికి వెళుతుంది. అక్కడే ఉన్న గాలి గొట్టం (శ్వాసనాళం) లోనికి వెళ్ళకుండా తిన్నగా ఆహారనాళం లోనికి వెళ్ళే అమరిక ఎంత అందమైన అమరికో కదా! ఎలాస్టిక్ సంచిలా ఉండే జీర్ణాశయం లోనికి ఆహారం వెళుతుంది. అక్కడే శక్తివంతమైన జీర్ణక్రియ జరుగుతుంది. ఆహారంలో ఉన్న పదార్థాల ప్రకారం జీర్ణక్రియ మారుతూ ఉంటుంది.
మనలో ఉన్న జీర్ణశక్తిని సంస్కృతంలో జఠరాగ్ని అంటారు. అది ఒక యాసిడ్. జీర్ణాశయం అత్యంతసున్నితమైన భాగం. కానీ అందులో చాలా శక్తివంతమైన యాసిడ్స్ ఉంటాయి. అవే ఆహారం జీర్ణమయ్యేలా చేస్తాయి. ఆ యాసిడ్స్ నుంచి పేగుల్ని మ్యూకస్ పొరరక్షిస్తూ ఉంటుంది. ఆ జీర్ణాశయం గోడల దగ్గర యాసిడ్ అంత శక్తితో ఉండదు.
మనం లోపలికి తీసుకునే రకరకాల ఆహారపదార్థాలు కొన్ని గంటలలో జీర్ణమై శక్తిగా కలసిపోతాయి. ఒకసారి ఊహించండి. ఇందులో ఏ విషయమూ మనకి తెలియవలసిన అవసరం లేదు. అంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. మన రుచులకి అనుగుణంగా సర్దుకుపోతుంది.
అక్కడి నుంచి ఆహారం చిన్న పేగుల లోనికి వెళుతుంది. జీర్ణక్రియలో చాలా భాగం ఇక్కడే జరుగుతుంది. జీర్ణమైన ఆహారం మన వ్యవస్థ లోనికి సులభంగా వెళ్ళేలా ఉంటుంది. ఆహారంలో కావలసిన పోషకాలు వ్యవస్థలోనికి వెళ్ళేది ఇక్కడే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ సూక్ష్మ భాగాలుగా మారి, కాలేయంలోనికి వెళతాయి. అక్కడ మరి కొంత ప్రక్రియ జరుగుతుంది.
ఆ తరువాత పెద్ద పేగులలోనికి వెళుతుంది. అందులో నీటిని గ్రహిస్తుంది. అతరువాత వ్యర్థాలతో బయటికి పోతుంది. జీర్ణక్రియ గురించి కొన్ని ప్రాథమిక విషయాలు మాత్రమే చెప్పాను. కానీ శరీరంలో అది చాలా క్లిష్టతరమైన, చాలా కచ్చితంగా జరిగే ఒక పద్ధతి.
రక్తంలొ చక్కెర స్థితిని నియంత్రించటానికి ఎంత చక్కని పద్ధతి ఉందో కదా! మనం ఆహారం తీసుకోగానే రక్తంలోని చక్కెరస్థాయి పెరుగుతుంది. రక్తం మన శరీరంలో చాలా ముఖ్యభాగం. అది చక్కెరిని దాని స్థాయిని గమనిస్తూ ఉంటుంది. అలా కాకపోతే, మనలో చాలా భాగాలు కిడ్నీలు, కళ్ళు, నరాలు - ఇవన్నీ కూడా పాడైపోతాయి. దయాబెటిక్ రోగులకి ఇదే జరుగుతుంది.
మనలో ఉండే పాంక్రియాస్ ఇన్సులిన్ని తయారు చేస్తుంది. అదే మన రక్తంలోని చక్కెర స్థితిని తగ్గిస్తుంది. దాని వల్ల రక్తంలోని చక్కెర స్థాయి తగ్గదు, ఎక్కువ అవ్వదు. ఆహారం తీసుకున్నాక కూడా క్షేమంగా ఉంటుంది. ఎప్పుడైనా రక్తంలో చక్కెర స్థాయి తగ్గితే వెంటనే కాలేయం నుంచి చక్కెర రక్తం లోనికి విడుదల అవుతుంది.
ఏదైతే రక్తంలోని చక్కెరిని తగ్గించే ఇన్సులిన్ ను తయారుచేస్తుందో అదే పాంక్రియాస్ మరొక హార్మోన్ గ్లూకాజెన్ అనే చక్కెరిని పెంచే హార్మోనుని కూడా తయారు చేస్తుంది. ప్రతి నిమిషం రక్తంలోని చక్కెరని శరీరం అద్భుతంగా నియంత్రిస్తూ ఉంటుంది. అది ఎక్కువ తక్కువ కాకుండా చూస్తుంది.
మెదడుకి ఉండే మేధ
ఉదాహరణకి మనిషి మెదడుని తీసుకోండి. రెండు గుప్పిళ్ళ సైజు ఉన్న మెదడులో అద్భుతమైన మేధ పని చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఈ నాటికి కూడా సైంటిస్టులు మెదడులా పని చేయగలదాన్ని సృష్టించలేకపోయారు.
ఈ మధ్యనే వచ్చిన ఒక రిపోర్టులో, పదిమంది ఆంగ్లభాషాప్రవీణులు పది సంవత్సరాలపాటు ఇంగ్లీషు భాషని అధ్యయనం చేసి, విశ్లేషించగలిగినవారు కేవలం ఐదు సంవత్సరాల పాప భాష నేర్చుకునే శక్తితో కంప్యూటర్ ప్రోగ్రాం చేయలేకపోయారు.
కంప్యూటర్ కొన్ని లక్షల లెక్కల్ని ఒక సెకండ్లో చేయగలుగుతుందేమో గాని, ఒకేసారి మెదడు సెకండ్లో లక్షవ భాగంలో చేసే రకరకాల పనులు మాత్రం చేయలేదు.
గుండె తాలూకు మేధ
మీరు చూస్తే అర్థమవుతుంది. గుండె, శరీరం ఎంతో అద్భుతంగా ఒక దానికి తోడు మరొకటి పని చేస్తాయి. గుండెలో ఉండే సహజమైన పేస్ మేకర్ ప్రతి కొన్ని సెకండ్స్కి విద్యుత్తరంగాల్ని పంపిస్తూ ఉంటుంది. అవి శరీరమంతా వెళ్తాయి. అప్పుడు శరీరంలోని ప్రతి కణానికీ తెలుస్తుంది. అది ఒక కణంతో మరొకటి అనుసంధానం అవుతాయి. ఈ తరంగాల వల్ల ప్రతి కణం తన ప్రత్యేక విధుల్ని అది చేస్తూ పక్క కణం చర్యలకి అనుగుణంగా ఉంటుంది. అప్పుడే శరీరం అంతా ఒకే విధంగా పనిచేయగలుగుతుంది.
పంపిణీ మేధ
మానవశరీరం ఒక కణంలో ప్రారంభమై అది 250 రకాల కణాలుగా అభివృద్ధి చెందుతుంది. ఒక్కసారి ఊహించండి. ఒక కణం ఎన్నో రకాలైన ప్రత్యేకకణాలుగా రూపాంది అవి క్లిష్టమైన శరీర భాగాలుగా అభివృద్ధి చెందుతాయి. అంతే కాదు, ఈ కణాలు తమ ప్రత్యేకవిధుల్ని చేస్తాయి. ఒక సెకండ్‌కి కొన్ని లక్షల పనుల్ని చేస్తాయి. అవన్నీ శరీరం చేసే పనులకి అనుగుణంగా ఉండాలి. ఇదే పంపిణీ మేధ అంటే.
శరీరమేధపై విశ్వాసం ఉంచండి
ఒక్కసారి ఆలోచించండి; మన శరీరం ఆహారాన్ని జీర్ణింపచేస్తుంది, రక్తాన్ని అన్ని భాగాలకీ పంపిస్తుంది. పరిసరాలకి తగిన విధంగా మారగలుగుతుంది. అంతే కాకుండా బయట ఎవరి సహాయం లేకుండా కొన్ని వేల పనుల్ని చేస్తుంది. శరీరంలో మేధ అనే ఒక శక్తి ఉందని మీరు తెలుసుకోవాలి. ఆ శక్తి మిమ్మల్ని ముందుకి నడుపుతుంది. ఈ విషయాన్ని మీరు కొంచెం ఆలోచిస్తే మీకు శరీరమేధస్సు అనేది ఉన్నదని మీకు తెలుస్తుంది. దీన్ని మనం గమనించం. ఎందుకంటే అది నిశ్శబ్దంగా తన పనిని తాను చేసుకుంటూ వెళుతుంది కాబట్టి.
ఒక చిన్న కథ : ఒక రాజుగారు జ్ఞానోదయమైన బౌద్ధ గురువు దగ్గరకి వెళ్ళి 'మీరు జ్ఞానోదయమైన గురుదేవులు అని విన్నాను. నిరంతరం మీ చుట్టూ శక్తి వ్యాపిస్తూ ఉంటుంది. మీరు నిరంతరం పరమానందంలో ఉంటారు. మీరు దీనికి ఏం చేస్తారు? అని అడుగుతాడు.
బౌద్ధగురువు, 'నేను తినే సమయంలో తింటాను, నిద్ర పోయే సమయంలో నిద్ర పోతాను' అని జవాబు ఇస్తాడు.
మీరు అడగవచ్చు, 'మేమూ అదే చేయటం లేదా'? అని. మీరు మీ జీవితం లోనికి చూడండి. మీరు భోజనం చేసే సమయంలో మీ సమస్యలు, బాధలు, వ్యథలు అన్నింటినీ తీసుకువస్తారు. రేపు చేయబోయే పనిని, సెలవు రోజు చేయబోయే పనులకి ప్లానింగ్ చేస్తుంటారు. తినటానికి సమయం లేదు అంటూ గబగబా తినేస్తారు. మీరు భోజనం చేసేటప్పుడు నిజంగా భోజనం చేయరు. అదే విధంగా మీరు నిద్ర పోయేటప్పుడే ఆ రోజు జరిగిన విశేషాల్ని విశ్లేషిస్తారు. మీరు తినేటప్పుడు మీ అంతరాత్మ ఏ మాత్రం ఆహారాన్ని తీసుకున్న తృప్తితో ఉండదు. మీరు తెలుసుకునే తత్త్వంలో భోజనం చేస్తే మీరు ఎప్పుడూ బరువుగా అనుకోరు. అదే విధంగా మీరు ఎక్కువ తినరు. మీరు ఎంత, ఏది ఎప్పుడు తినాలో శరీరమేధ నిర్ణయిస్తుంది. మీరు మీకు ఏ ఆహారం కావాలో ఎరుకతో స్పష్టంగా తెలుసుకోవచ్చు. అదే గొప్ప ధ్యానం. అదే విధంగా మీరు నిద్రపోయినప్పుడు మీరు రిలాక్స్ కాలేరు. మీరు కేవలం వర్తమానంలో ఉండగలిగితే మీరు నిద్ర పోతారు. అది చాలు.
అలవాట్లను వదిలేయొచ్చు
నిజంగా జరిగిన ఒక సంఘటన : ఒకసారి ఒక యువకుడు నా దగ్గరకి వచ్చి సిగరెట్టు మానే విధంగా సహాయం చేయమని అడిగాడు. అతణ్ణి నేను ఆ అలవాటు ఎలా ప్రారంభమైందో చెప్పమన్నాను. అతను ఒక రోజు తన స్నేహితులలో ఉన్నాడు. వారంతా సిగరెట్స్ కాలుస్తున్నారు. ఈ యువకుడు వాళ్ళతో ఉండగా అతణ్ణి వాళ్ళ నాన్నగారు చూసి ఈ అబ్బాయి కూడా సిగరెట్ కాలుస్తున్నాడనుకొని అతణ్ణి బాగా తిడతాడు. ఆ అబ్బాయి ఎంత చెప్పినా నమ్మడు. ఆ అబ్బాయి ఇదంతా చెప్పి చివరలో ఇలా అన్నాడు, 'మర్నాడు సిగరెట్స్ కొని కాల్చాను. మా నాన్నగారు నన్ను నమ్మనందుకు కాల్చాను. క్రమంగా దీనికి అలవాటు పడిపోయాను'.
అతను నన్ను మళ్ళీ అడిగాడు ఈ అలవాటుని ఎలా వదలాలని. నేను అతనితో 'అలవాటు వదలవద్దు. సిగరెట్స్ కాల్చు. కానీ ఎవరికో ఏదో చేసి చూపించటానికి కాదు. అంతే కాదు, నీవు సిగరెట్ కాలిస్తే పెద్దవాడినయ్యాను అనే ఫీలింగ్‌తో కాల్చవద్దు. నీవు ఎప్పుడు సిగరెట్ కాల్చాలని తీస్తావో దాన్ని నిశ్శబ్దంగా చేయి. నీవు ఎందుకు సిగరెట్ కాలుస్తున్నావో పూర్తిగా తెలుసుకునే తత్త్వంలో, పూర్తి స్పృహతో చేయి. చేతనస్థితిలో నీ లోపలికి పొగ వెళ్ళటాన్ని గమనించు. నీవు సిగరెట్ ఎలా పట్టుకున్నావో, ఎలా నోట్లో పెట్టుకున్నావో అంతా పూర్తిగా నీకు తెలియాలి.
కొన్ని రోజుల తరువాత ఆ యువకుడు నా దగ్గరకి వచ్చి నేను ఇక సిగరెట్ కాల్చలేకపోతున్నాను. చేతనస్థితిలో చేయటం, నేను నా లోపలికి పొగని ఎలా పంపించగలను. ఆ తరువాత సిగరెట్ కాల్చటం నాకు అంత అవసరం అనిపించలేదు అన్నాడు. ఆ తరువాత ఆ యువకుడు అన్న మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి. నేను ఇంత కాలం నా శరీరం లోనికి పొగని పంపించి నా శరీరాన్ని ఏ విధంగా బాధపెట్టానో కదా; అని అన్నాడు.
మనం చేసే చాలా విషయాలు మనని వదిలేస్తాయి. ఇదే సమస్యలకి శాశ్వత పరిష్కారం. అయితే మేధని మేల్కొల్పటానికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు. ఆ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యవిషయం, ఆశను వదులుకోవద్దు. సంఘం నుంచి నేర్చుకున్న తప్పు జ్ఞానం లోనికి పంపవద్దు. సంఘం నేర్పే నీతి నియమాలలో ఇరుక్కోవద్దు. మీ శరీరానికి ఉన్న సహజమేధపై నమ్మకం ఉంచండి, అది చాలు.
శరీరాన్ని నియంత్రించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దేన్ని అదుపు చేస్తారో అది మరొక రూపంలో బయటికి వస్తుంది. మీరు అలా చేయాలని చూస్తే అది వ్యతిరేకిస్తుంది. ఇక్కడ మనకి కావలసింది మనం చేసే ప్రతి పనిలోనూ తెలుసుకునే తత్త్వాన్ని ఉంచటం. అదే విధంగా మనలోని సహజమేధ మీద విశ్వాసం ఉంచటం. అదే మన చుట్టూ ఉన్న నిబంధనలు అనే గోడని పగలగొడుతుంది. ఆ నిబంధనలే మనం అసహజంగా పని చేయటానికి, అచేతనస్థితిలో మనం జీవించటానికి కారణం.
ప్రతి కణానికీ మేధ ఉంది
జీవశాస్త్రంలో మరొక ఆశ్చర్యకరమైన పరిశోధన ఫలితాల్ని శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో తెలియచేశారు. మనకి తెలివితేటలు మెదడులోనే ఉంటాయని నేర్చారు. మెదడు శరీరాన్ని నియంత్రిస్తుంది, అని అనుకున్నాం. శాస్త్రం ఇంత కాలం రక్తప్రసరణ, జీర్ణక్రియ, శ్వాసక్రియ మొదలైన శరీరం పనుల్ని మెదడు నియంత్రిస్తుంది అని చెప్పేది.
ఇప్పుడు ఎపిజెనిటిక్స్ అనే శాస్త్రం అభివృద్ధి చెందింది. అందులో ప్రముఖశాస్త్రపరిశోధకుడు బ్రూస్ లిప్టన్ ఒక పరిశోధన గ్రంథం బిలీఫ్ ఆఫ్ బయాలజీలో ఈ విధంగా చెప్పాడు, 'మెదడు మన శరీరాన్ని నియంత్రించదు. ప్రతి కణంలోనూ మేధ ఉంటుంది. అది సెల్ మెంబ్రేన్‌లో ఉంటుంది', అని. ఈ మధ్యకాలంలో అమెరికాలోని శాండియా నేషనల్ లాబోరేటరీస్‌లో జరిగిన పరిశోధనలు కూడా కణాలకి మేధ ఉన్న విషయాన్ని ధ్రువీకరించాయి. శరీరం మీదకి యాంటి జన్ అనే హానికకరమైనవి వచ్చినప్పుడు కణాలు ఏ విధంగా స్పందిస్తాయో వివరించారు. వారు ఏ విధంగా చెప్పారంటే కణానికి ఉన్న పొరలో చాలా చక్కని, క్లిష్టమైన వ్యవస్థ ఉంటుంది. అది యాంటి జెన్‌తో పోరాడగలుగుతుంది. ఇంత వరకూ మనం అనుకున్న విధంగా అది చిన్న నిర్మాణం కాదు.
మన శరీరం మెదడు కేంద్రంగా పని చేసే సాధారణమేధతో పనిచేసే వ్యవస్థ కాదు. మన శరీరంలో మేధ అద్భుతంగా శరీరమంతా విస్తరించి పని చేస్తుంది.
తనకు తాను చికిత్స చేసుకోగల మేధ
విద్యుత్తుకి సొంత మేధ లేదు. బల్బుని పెడితే వెలుగుతుంది.అదే మీ వేలుని పెడితే షాక్ కొడుతుంది. కానీ మీ శరీరంలో నిరంతరం ప్రవహించే శక్తి ఆ విధంగా చేయదు. దానికి చికిత్స చేసే మేధ ఉన్నది. మీ శరీరానికి సహజంగా తనకి తాను చికిత్స చేసుకోగల శక్తి ఉన్నది. మీ వేలి మీద ఒక గాటు పడితే మీరు దాన్ని పట్టించుకోకపోయినా అది మానిపోతుంది. ఈ విషయం మీరు చాలాసార్లు గమనించి ఉంటారు.
మీరూ చికిత్సకులే!
శరీరానికి తిరిగి కొత్త శక్తి పొందే మేధ ఉంటుంది. అది మీ శరీరాన్ని నిరంతరం మారుస్తూ ఉంటుంది. మీ శరీరంలో ఏదైనా ఒక భాగం పాడైతే, తిరిగి దాన్ని పునర్నిర్మించుకోగల మేధ మీ శరీరానికి ఉంది. అయితే మీ అహం కాని, ఆలోచనలు కాని అడ్డుపడితే ఆ కార్యక్రమం ఆగిపోతుంది. మన శరీరంలో తనని తాను తిరిగి నిర్మించుకోగల మేధ ఉన్నది. నిరంతరం శరీరం తిరిగి నిర్మితమవుతూ ఉంటుంది. అప్పుడు మీరు అడగవచ్చు, ‘అలా అయితే అదే వ్యాధి తిరిగి ఎందుకు వస్తుంది అని.’ ఎందుకంటే ఆ వ్యాధి మీలో ఉందని మీరు బలంగా నమ్ముతారు కాబట్టి.
మీ ఆరోగ్యం బాగా లేదు అని దృఢంగా నమ్మే మానసికస్థితిని కొనసాగిస్తారు. అదే శరీరం తనకు తాను చికిత్స చేసుకోలేకుండా చేస్తుంది.
మీరు చేయవలసింది కేవలం ఒక్కటే, అది మీ శరీరానికి తనకి తాను చికిత్స చేసుకోగల శక్తి ఉంది అని నమ్మి విరామంగా ఉండటమే.
శక్తి అంటే మేధ. మీ అంతరాత్మ మేధ. కాని సమస్య ఏమిటంటే మీ అంతరాత్మకి మేధ ఉందని మీరు నమ్మరు. మీలోని బలహీనమైన లింకుని చూసి దాని ఆధారంగా మిమ్మల్ని మీరు లెక్కిస్తారు. మీలోని బలహీనత మీరు కాదు. మీరు దాని కంటే ఎక్కువ. ఒక గొలుసు బలాన్ని అందులో ఉండే బలహీనమైన లింకుతో లెక్క కట్టవచ్చు. కాని మీ ఆత్మశక్తిని ఈ విధంగా లెక్కించకూడదు. మీరంటే ఏమనుకుంటున్నారో అంత కంటే మీరు చాలా అధికులు అని అర్థం చేసుకోండి.
నిత్య స్పిరిచువల్ హీలింగ్ (నిత్య ఆధ్యాత్మికచికిత్స)
నిజానికి మీ శరీరానికి ఎంత పెద్ద వ్యాధినైనా, అది మానసికమైనా, శారీరకమైనా దానికి చికిత్సచేసి మాన్పగల శక్తి ఉన్నది. ఇందులో రహస్యం ఏమితీ అంటే, మరచిపోయిన ఆ శాస్త్రాన్ని ఉపయోగించగలగాలి. అదే నిత్య ఆధ్యాత్మికచికిత్సశాస్త్రం. ఈ కార్యక్రమంలో మేధని విశ్వశక్తికి అనుసంధానం చేయాలి. విశ్వశక్తి స్వచ్ఛమైన మేధ. ఈ అనుసంధానం దీక్షపొంది హీలర్ ద్వారా జరుగుతుంది.
కరుణ, మేధ, పరమానందం
ఒక విషయం అర్థం చేసుకోండి : శక్తి అంటే కరుణ, శక్తి అంటే మేధ, శక్తి అంటే పరమానందం. శక్తి, కరుణ, మేధస్సు, పరమానందం అనేవి ఒకే స్తంభానికి ఉన్న నాలుగు పక్కలు. ఈ నాలుగూ ఉన్నప్పుడు అది అత్యుత్తమచేతనస్థితి.ఇందులో ఏదైనా లేకపోతే అది అచేతనస్థితి. శక్తి మెదడు ద్వారా పని చేస్తే అది మేధ. అది హృదయం ద్వారా పని చేస్తే కరుణ, ఆత్మ ద్వారా పనిచేస్తే అది స్వచ్ఛమైన శక్తి. శక్తి ఏ విధమైన రూపాల్లో లేకుండా మన లోపల ఉంటే అది పరమానందం.
మీ జీవితం మీవల్ల నడవదు!
మీరు నిర్ఘాంతపోయే ఒక ముఖ్యవిషయం మీరు అర్థం చేసుకోవాలి. మీ ప్రమేయం లేకుండా మీ జీవితాన్ని నడిపే స్వతంత్ర మేధావ్యవస్థ మీలో ఉంది. మీరు ఏమనుకుంటారంటే నా జీవితం సంతోషంగా గడవటానికి నా ప్రమేయం కావాలి, నేను కల్పించుకోవాలి అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఏ మేధ అయితే మీరు ఈ భూమి మీదికి వచ్చేలా చేసిందో, ఏ మేధ మీ శరీరాన్ని సృష్టించిందో ఆ మేధ మీ జీవితాన్ని చక్కగా ముందుకు నడుపుతుంది.
మీరు జన్మించినప్పుడు మీ శరీరాన్ని సృష్టించిన మేధని జీవమేధ (బయో మెమోరీ) అంటారు. ఇక్కడ ఈ ముఖ్యమైన విషయాన్ని (సత్యాన్ని) మీరు అర్థం చేసుకోవాలి. మీ శరీరాన్ని మీరే కొన్ని విషయాల్ని సాధించేందుకు వీలుగా కల్పించుకున్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు జీవించాలని అనుకున్నారో, ఏ పనులు చేయాలి అని ఈ భూమి మీదికి వచ్చారో దానికి అనుగుణమైన శరీరాన్ని రూపొందించుకుంటారు. మీరు జన్మించినప్పుడే మీ జీవితాన్ని, మీ సంతోషాల్ని, మీరు ఏమేం చేయదలచుకున్నారో అన్నీ నిర్ణయించుకుంటారు. ఆ జీవమేధకి సరిపడా వివేకం ఉంటుంది. అదే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది, అభివృద్ధి చేస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఆ గొప్ప మేధ ప్రతిక్షణం మీ లోపల పని చేస్తూ ఉంటుంది. మనలో పరిమితమైన జ్ఞానం ఈ విషయాన్ని తెలుసుకోకుండా చేస్తుంది. అందుకే మనం జీవితం అంటే వర్తమానం కంటే మరేదో అనుకుంటాం. ఆ మేధ మీద నమ్మకం ఉంచి రిలాక్స్ అవ్వగలగటాన్నే నేను భక్తి అంటాను. అత్యుత్తమమేధకి అధీనమవటమే నిజమైన అధీనత. సహజ మేధకి అనుగుణంగా ఉండగలగటమే ఆధ్యాత్మికజీవితం.
భయం, ఆశ కాదు, అనివార్యమైన జీవితాన్ని స్వీకరించాలి
మనలో చాలామంది జీవితాల్ని ముందుకు నడిపేది రెండు విధాలుగా ఉంటుంది. వాటిలో మొదటిది ఆశ – అది జీవితంలో వర్తమానాన్ని స్వీకరించనప్పుడు వస్తుంది. ఈ జీవితం కాకుండా మరేదో కావాలి అని అనుకున్నప్పుడు పుట్టేదే ఆశ. మరొకటి భయం. జరగబోయే విషయాల్ని స్వీకరించలేనప్పుడు వచ్చేది భయం. భయం అంటే భవిష్యత్తుని చూసి భయపడటం. వర్తమానాన్ని స్వీకరించలేకపోతే ఉండేది ఆశ - అదే అవిశ్రాంతి. భవిష్యత్తుని స్వీకరించలేకపోవటమే భయం.
ఈ రెండు విషయాల్లో మనకి అర్థం అయ్యే విషయం ఏమిటంటే అనివార్యమైన జీవితాన్ని స్వీకరించలేకపోవటమే. అనివార్యం అనే మాటని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి.
ధ్యానపద్ధతి - స్వీకరించటం అనే నిత్యసూత్రం
తిన్నగా కూర్చోండి. కళ్ళు మూసుకొని, శరీరాన్ని కదిలించకుండా విరామంగా కూర్చోండి. శరీరం కదలికలు ఆలోచనల్ని కలిగిస్తాయి. మీరు శరీరాన్ని కదిలించకుండా నిశ్చలంగా ఉండగలిగితే మీరు లోతైన నిశ్శబ్దం లోనికి వెళ్ళవచ్చు. మీరు చేతనస్థితిలో, చాలా తీవ్రంగా ఒక ఉద్దేశాన్ని ఏర్పరచుకోవాలి. అది బయట ప్రపంచంలో, మీ అంతరంగంలోనూ ఈ క్షణంలో మిమ్మల్ని మీరుగా స్వీకరిస్తాను అని.
మీకు మీరు ఈ విధంగా చెప్పుకోండి; నాకు బయటి ప్రపంచంలో సరిపడా మంచి విషయాలు, వస్తువులు ఉన్నాయి. నా అంతరంగంలో నాకు సరిపడా మంచి లక్షణాలు ఉన్నాయి. నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను. నేను బయటి ప్రపంచంలో కాని, అంతరంగప్రపంచంలో కానీ ఇక ఏమీ సాధించనవసరం లేదు. నాకు అహంకారం ఉంది. పరవాలేదు. నాలో అపరాధ భావం ఉంది. అయినా పరవాలేదు. భయం ఉంటే అది కూడా పరవాలేదు. అత్యాశ ఉన్నా పరవాలేదు. నాలో ఏవేవి ఉన్నాయి అని అంటారో అవన్నీ పరవాలేదు. నేను మరు నిమిషంలో మరణిస్తాను అని తెలిసినా పరవాలేదు. చేతనస్థితిలో అన్నిటినీ అదే విధంగా స్వీకరిస్తాను అని నిర్ణయించుకోండి. అది తప్పా కాదా అని అనుకోవద్దు. మీ మనస్సు ఏదైనా అడ్డుపెట్టినా దాన్ని కూడా స్వీకరించండి.
ఈ క్షణాన్ని తీసుకోండి. రాబోయే క్షణాల్ని తీసుకోండి. మీకు ఇంత కంటే దారుణమైంది లేదు అనేది జరుగుతుందేమో అనిపించినా దాన్ని స్వీకరించండి. అది జరిగినప్పుడు మీరు ఆపలేరు. అనివార్యమైనదాన్ని స్వీకరించండి. దీన్ని 21 నిమిషాలు చేయండి. మీలోని మేధ మేల్కొంటుంది. అది ప్రతిక్షణంలో ఏ విధంగా అనుబంధాన్ని పెంచుకోవాలో చూపిస్తుంది. అదే విధంగా సంబంధాలతో, సంఘటనలతో ఏ విధంగా అనుబంధాన్ని పెంచుకోవచ్చనో చెబుతుంది.
విశ్వమేధ - మ్యాక్రోకోసమ్, మైక్రోకోసమ్
మైక్రోకోసమ్ అంటే వ్యక్తిగతమైన శరీరమేధ. అదే విధంగా మ్యాక్రోకోసమ్ అంటే విశ్వమేధ. అదే స్వచ్ఛమైన శక్తి. విశ్వాన్ని నడిపించే ఆ స్వచ్ఛమైన శక్తి మన శరీరాన్ని కూడా నడిపిస్తుంది.
క్రమంలో గందరగోళం ; గందరగోళంలోనే క్రమం ఉంటుంది
విశ్వాన్ని, మ్యాక్రోకోసమ్ని చూస్తే అదంతా ఒక పెద్ద గందరగోళం అనిపిస్తుంది. విశ్వంలో చాలా నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు ఎన్నో కలిసి ఉంటాయి. అయితే అవన్నీ కూడా చాలా చక్కని క్రమపద్ధతిలో ఉంటాయి. వాటిని నియంత్రించే ట్రాఫిక్ పోలీసు ఉండడు. ఒక్కసారి ఊహించండి, ఒక్క గ్రహం తన గతి నుంచి తప్పితే, ఎన్ని అనర్థాలు జరుగుతాయో కదా! ఆ క్రమం లేకపోతే విశ్వంలో గ్రహాలు అన్నీ ఒక దానితో ఒకటి ఢీ కొట్టుకునేవి. దీన్నే గందరగోళంలో ఉండే ఒక క్రమపద్ధతి అని అంటాను. విశ్వంలో మనం అనుకునే గందరగోళంలో ఒక చక్కని క్రమం ఉన్నది. విశ్వానికి శక్తితో పాటు మేధ కూడా ఉంది అని చెప్పటానికి ఇది చాలు.
మేధ అంటే విశ్వశక్తి. శక్తి మేధ. అందుకే శక్తి స్వచ్ఛంగా ఉంటే చికిత్స చేయగలుగుతుంది. స్వచ్ఛమైన విశ్వశక్తికి శరీరంలో ఏ భాగానికి వెళ్ళి చికిత్సచేయాలో తెలుసు. అందుకే శరీరంలో లివర్ (కాలేయం) ఎక్కడ ఉందో కూడా తెలియకుండా దానికి చికిత్స చేయవచ్చు. చికిత్స చేయగల శక్తితో ఆ భాగంలో చికిత్స చేయవచ్చు. శక్తి స్వచ్ఛమైన మేధ. ఎప్పుడైతే విశ్వంలోని క్రమ పద్ధతిని తెలుసుకుంటామో మనం పరమానందస్థితికి చేరవచ్చు.
విశ్వంలో గందరగోళంలో చక్కని క్రమం ఉంది అని మనం ఎలా తెలుసుకోగలిగామో అదే విధంగా మనలో ఒక పద్ధతి క్రమం అనుకునే దానిలో గందరగోళం ఉంది. ప్రస్తుతం మనం ఒక పద్ధతి ఒక క్రమం అనుకునే దానిలో గందరగోళం ఉంది. ప్రస్తుతం మనం ఒక పద్ధతిలో ఉన్నాం అనుకుంటాం. ఎందుకంటే మన చుట్టూ ఒక చిన్న హద్దుని చూస్తున్నాం. ఇల్లు, ఆఫీసు, కొద్దిమంది బంధువులు, ఈ విధంగా చూస్తాం. అందుకే చాలా శ్రమపడి దీన్ని ఒక క్రమపద్ధతిలో ఉంచటానికి ప్రయత్నిస్తాం. క్రమపద్ధతిలో లేనివారిని విమర్శిస్తాం. కానీ సత్యం ఏమిటంటే, మన అంతరంగంలో మనం ఒక చక్కని గందరగోళం. మనం సూక్ష్మవిశ్వం. విశ్వంలో మేధ-అదే అందమైన గందరగోళంలోని క్రమం. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటామో మనం మన పట్ల, ఇతరుల పట్ల కరుణతో ఉంటాం. ఎదుటివారిని విమర్శించటం మానివేస్తాం. నిజమైన క్రమపద్ధతి అంటే విశ్వంలోని క్రమం మాత్రమే అని అర్థం చేసుకోగలుగుతాం.
కాబట్టి అర్థం చేసుకోండి; మనం ఒక క్రమపద్ధతిలో ఉండాలి అని ఎందుకు అనుకుంటామంటే, మనం హద్దుల్ని చూస్తాం కాబట్టి. మనం ఆ హద్దులని వదిలేస్తే, మనం ఒక క్రమపద్ధతి కోసం చేసే ప్రయత్నాలు ఆపేస్తాం. అప్పుడు మనం విశ్వక్రమానికి అనుగుణంగా ఉండగలుగుతాం. అప్పుడు మనలో ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే మనం మనలోని విశ్వచేతన స్థితిని తెలుసుకుంటామో మనలోని క్రమాన్ని తెలుసుకుంటాం. అప్పుడు మనం మనని స్వీకరిస్తాం. ఎదుటివారిని స్వీకరించగలం.
మీరు విశ్వక్రమాన్ని గందరగోళంలో అనుభవించగలిగితే పరమానందాన్ని అనుభవించగలరు. ఎప్పుడైతే మీ క్రమంలో ఉన్న గందరగోళాన్ని తెలుసుకుంటారో కరుణని పంచగలరు.
విశ్వమేధ ప్రతిస్పందన
మనలోని ప్రతి ఆలోచనకీ విశ్వమేధ స్పందిస్తుంది. ఇది నమ్మలేని సత్యం. జపాన్ శాస్త్రవేత్త డా॥ మసారొ ఎమోటో చేసిన పరిశోధన ఇది నిజం అని నిరూపిస్తుంది.
మన ఆలోచనలకి నీరు ప్రతిస్పందిస్తుంది
డా॥ మసారొ ఎమోటో నీళ్ళ మీద ప్రయోగం చేసారు. ఆయన నీళ్ళని కొంచెం కొంచెం తీసుకొని వాటిని మన ఆలోచనలు తెలిసేలా చేసాడు. అంటే వాటిని మన ఆలోచనకి ఎక్స్పోజ్ చేసారు. వాటిని గడ్డ కట్టించి, ఆ స్ఫటికాలని మైక్రోస్కోప్‌తో ఫోటోలు తీసాడు. వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు.
నీళ్ళ మీద ఆయన చాలా పరిశోధనలు చేసారు. వాటి దగ్గర రకరకాల సంగీతం వినిపించారు. కొన్నింటి దగ్గర ప్రార్థనలు చేసాడు. కొన్నింటికి ఆధ్యాత్మికగ్రంథాలు చదివి వినిపించాడు. చక్కని సంగీతం ఉన్న నీటి క్రిస్టల్స్ ఫోటోలు చాలా అందంగా వచ్చాయి.
వ్యతిరేకఆలోచనలకి ఎక్స్పోజ్ చేసిన నీటిని గడ్డ కట్టిస్తే ఆ ఐసు గడ్డలో ఎటువంటి రూపం లేదు. అవి ఆ వ్యక్తి భావాల్ని మాత్రం చూపించాయి. అదే విధంగా మనం మాట్లాడే మాటలని ఆ నీటి మీద ప్రయోగించి మరొక పరిశోధన చేసాడు. డిస్టిల్ నీళ్ళని చిన్న చిన్న సీసాలలో నింపి వాటి మీద కృతజ్ఞతలు, నీవు మూర్ఖుడివి అని ఇంగ్లీషు, కొరియన్, జపాను భాషల్లో రాసాడు.
ఆ నీటిని గడ్డ కట్టించి, ఆ పలకల్ని మైక్రోస్కోపులో చూస్తే ఒక దానికి మరొక దానికి చాలా తేడాలు కనిపించాయి. కృతజ్ఞతలు ఉన్న నీటి క్రిస్టల్స్ చాలా అందంగా ఉన్నాయి. నీవు తెలివితక్కువదానివి అని ఉన్న నీటి క్రిస్టల్స్ సమతులంగా లేవు.
అదే విధంగా వ్యతిరేక వ్యాఖ్యానాలు ఉన్నవి సరిగా లేవు. అదే ప్రేమ, పొగడ్తలు, శాంతి అని ఉన్న నీటి క్రిస్టల్స్ అందంగా ఒక చక్కని అమరికతో ఉన్నాయి.
ఈ విధమైన మాటలే కాదు, మాటలు చెప్పే సమయంలో గొంతులోని స్థాయి కూడా వాటిలో తేడాలు చూపించాయి. మనం కలిసి చేద్దాం. అని చెప్పిన నీటి క్రిస్టల్స్ విరామంగా ఉన్నాయి. అందమైన చెర్రీస్ ఉన్న ఫోటో చూపించిన నీటి క్రిస్టల్స్ అదే రంగులో అందంగా ఉన్నాయి.
ఆ తరువాత ఆలోచనలలో వచ్చే మార్పు నీటి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనే దాని మీద పరిశోధనలు చేసారు. జపాన్‌లో భూకంపం వచ్చినప్పుడు నీటి క్రిస్టల్స్ నల్లగా అడ్డదిడ్డమైన రూపంలో ఉన్నాయి. అవి మనిషిలో బాధని, భయాన్ని చూపించాయి. కొంత కాలం వారికి సహాయం చేసినవారికి ప్రేమ చూపుతూ నీటి క్రిస్టల్స్ అందంగా కనిపించాయి.
డామ్ దగ్గర నీటిని ముందుగా పరిశోధిస్తే అవి అందవికారంగా, దారుణంగా కనిపించాయి. ఒక గంట ఆ నీటి దగ్గర ప్రార్థనలుచేసి, నీరు శుభ్రమవ్వాలి అని కోరుకుని ఆ తరువాత పరిశోధన చేస్తే, ఆ నీటి క్రిస్టల్స్ అందంగా కనిపించాయి.
మన శరీరంలో 70% నీరు ఉంటుంది. భూమి కూడా 70% నీటితో ఉంటుంది. మన ఆలోచనల ప్రభావాన్ని నీటి మీద పరిశోధించాక, ఒకసారి ఊహించండి, మన ఆలోచనలు, మాటలు, ఉద్దేశాలు భూమి మీద ఎంత వ్యతిరేకప్రభావాన్ని చూపిస్తాయో. మన మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో. విశ్వమేధతో మనకి ఉన్న సంబంధం అంత లోతుగా ఉంటుంది.
చరిత్రలో మరొక సంఘటన : భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించే రోజుల్లో, వారు ఒక విషయాన్ని గమనించారు. లండన్ నుంచి భారతదేశానికి మంచి నీరు ఓడలో తెచ్చేటప్పుడు అది దారిలోనే పాడైపోయేది, కానీ భారతదేశం నుంచి తీసుకువెళ్ళే నీరు అదే విధంగా స్వచ్ఛంగా ఉండేది. దీని మీద శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేసి ఒక అద్భుతాన్ని కనుగొన్నారు.
భారతదేశం నుంచి తీసుకువెళుతున్న నీరు కలకత్తాలోని పవిత్రగంగానది నీరు. ఆ గంగని కొన్ని లక్షల మంది పూజిస్తూ ఉంటారు. ఆ నీటికి బాక్టీరియాని నాశనం చేసే లక్షణం ఉంది. కొన్ని కోట్లమంది వేల సంవత్సరాలుగా గంగానదికి పూజలు చేస్తున్నారు. వారి పూజలు, ఆ ఆలోచనలు గంగానదిలో ఉన్నాయి. అందుకే గంగానది నీరు పవిత్రమైంది, స్వచ్ఛమైంది దానికి చికిత్స చేసే శక్తి ఉంది. ఈజిప్ట్ దేశస్థులు నైలునదిని కొన్ని వేల సంవత్సరాలుగా దాని ప్రవాహవేగం, లోతుల మీద చాలా పరిశోధనలు చేశారు. ప్రవాహవేగం, లోతు అనేవి రాబోయే ప్రకృతివైపరీత్యాల్ని తెలియచేసేవి. అవి భూకంపం, తుఫాను వంటివి దగ్గరలోనైనా, దూరప్రాంతాల్లో జరిగినా వారికి ఆ నది ద్వారా తెలిసేది.
ప్రకృతితో సంబంధం
ఎందుకు మనం ప్రకృతికి సున్నితంగా స్పందించలేకపోతున్నాం. ఎప్పుడైతే మీలో అహంకారం వస్తుందో ఆ సున్నితత్వం పోతుంది. నేను ఒక యువకవి జీవితం నుంచి చక్కని సంఘటనని చదివాను. అతను తన ఇంటికి దగ్గరలో ఉన్న అడవి మృగాలతో ఆడుకునే వాడట. ఆ విధంగా చేయవద్దని అతని తండ్రి చాలాసార్లు ఆ యువకుడిని వారించాడు. కానీ అతను వాటి దగ్గరికి వెళ్ళటం మానలేదు.
ఒకసారి అతను ఈ విధంగా చెపుతాడు; నేను వాటి విషయం కొంచెం జాగ్రత్త పడినట్టు ఉన్నా, కొంచెం భయపడినా అవి నా దగ్గరికి రావు. వాటికి, నాకు మధ్య ఎటువంటి సంబంధమూ ఏర్పడేది కాదు. సంభాషణ జరిగేది కాదు.
కానీ నేను చక్కగా సంతోషకరమైన మనస్సుతో ఆడుకునే స్థితిలో ఉంటే అవి నా దగ్గరకి వచ్చేవి. మా మధ్య చక్కని అనుబంధం ఉండేది. అవి నాతో ఎంతో అనుబంధంతో ఉండటాన్ని నేను స్పష్టంగా చూడగలిగేవాడిని.
ఇక్కడ అహంకారం అని నేను అన్న మాటకి అర్థం, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. ప్రకృతిలో వేరుగా ఉండే మనిషిని అనే గుర్తింపు. అది మీలో ఏర్పడినప్పుడు మీరు ప్రకృతికి దూరమైపోతారు. అమాయకంగా ప్రకృతితో ఏర్పరచుకునే బంధం చెదరిపోతుంది. మనిషికి జరిగే ఒక గొప్ప నష్టం ఇదే.
జన్మతః అంధుడికి అతను ఏది పోగొట్టుకున్నాడో చెప్పలేం. అదే విధంగా ప్రకృతితో అనుబంధాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి తాను ఏం పోగొట్టుకున్నాడో అర్థం అయ్యేలా చెప్పటం కష్టం.
ఉద్దేశం శక్తి
'స్పాంటేనియస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్' అనే గ్రంథంలో దీపక్ చోప్రా ఒక ఆసక్తికరమైన పరిశోధన గురించి రాస్తాడు. రకరకాల ఉత్తేజకాలకి తెల్ల రక్తకణాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలనేది ఆ ప్రయోగం. తెల్ల రక్తకణాలు బయట ఒక పరీక్షనాళికలో ఉన్నాయి. అకస్మాత్తుగా, పరిశోధకుడికి ఒక అభిప్రాయం కలుగుతుంది. తన చేతి వెనుక చిన్న గాయం చేస్తే బయట టెస్ట్ ట్యూబ్‌లోని తెల్ల కణాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలనిపించి, గాయం చేయటానికి ఒక చాకు కోసం చూస్తుంటాడు. అంతలోనే టెస్ట్ట్యూబ్లోని తెల్ల రక్తకణాలు చాలా ఎక్కువ చైతన్యవంతమవటం అతను గమనించాడు.
పరిశోధకుడు చేతికి గాయం చేసుకోవాలి అనే ఉద్దేశానికే తెల్ల రక్తకణాలు చాలా ఎక్కువగా స్పందించాయి. అతను కనీసం గాయం చేసుకోకుండానే, కేవలం అతని ఉద్దేశానికే స్పందించాయి. మానసికవ్యవస్థలోని ఉద్దేశం భౌతిక స్థితి మీద ప్రభావాన్ని చూపించగలదు అని తెలిసింది. అందుకే ఎప్పుడూ మంచి ఉద్దేశంతో ఉండటం అనేది చాలా ముఖ్యం.
ప్రదేశం అడ్డం కాదు
1987లో గ్రీన్ బెర్గ్ - జిల్ బెర్ బామ్ పరిశోధన అని ఒక ప్రముఖపరిశోధన జరిగింది. ఎలక్ట్రోఎన్సెఫలో గ్రాఫ్ అనేదాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఇద్దరిద్దరు కలసి ధ్యానం చేస్తున్నప్పుడు వారి మెదడు తరంగాల్ని కొలిచారు. కొన్ని జంటల్లో మెదడు తరంగాలు ఒకే విధంగా ఉన్నాయి. ఆ విధంగా ఉన్న ఒక జంటలో ఇద్దరినీ పక్కపక్కన కూర్చొని ధ్యానం చేయమని చెప్పి, కొంత సేపయ్యాక వారిని వేరు వేరు గదుల లోనికి మార్చారు.
ఆ తరువాత ధ్యానంలో ఉన్న ఒక వ్యక్తి మీదికి బాగా వెలుతురు వచ్చే లైట్‌ని ఫోకస్ చేశారు. అప్పుడు ఇ.ఇ.జి. ఆ వ్యక్తిలోని మెదడు తరంగాలు చైతన్యవంతమవటాన్ని రికార్డు చేసింది - కాని చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే:
పక్క గదిలో ధ్యానం చేస్తున్న వ్యక్తి మీద ఎటువంటి లైటు ఫోకస్ చేయకపోయినా ఇవతల గదిలోని వ్యక్తి మెదడులో జరిగిన మార్పులే అతని మెదడులోనూ వెంటనే, ఆటోమేటిక్‌గా జరిగాయి.
అర్థం చేసుకోండి; మీ మెదడులో ఏం జరిగి మీమీద ప్రభావం చూపిస్తుందో, అదే ప్రభావాన్ని మీ చుట్టు పక్కలవారి మీద కూడా చూపిస్తుంది. ఆలోచనలకి ఒక ప్రదేశం అవసరం కాదు. అవి గాలిలో ప్రయాణించగలవు. అందుకే మీరు ఇంట్లో ఒక బాధని వ్యక్తం చేస్తే అది ఇంట్లో వారందరినీ బరువుగా చేస్తుంది. మీ నుంచి వచ్చే వ్యతిరేకత అంతటా వ్యాపించి అందరినీ ప్రభావితం చేస్తుంది.
మేధ అనేది అనుభవం కాదు; అనుభవం నుంచి నేర్చుకోవలసిన పాఠం మేధ
అంటే మీ దగ్గర ఉన్న సమాచారం కాదు. అది కేవలం జ్ఞానం. మరొక విధంగా చెప్పాలి అంటే, మేధ అంటే మీ అనుభవాలు కాదు కాని అది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు. మీరు వికసించి ఉండి, ఎటువంటి అభిప్రాయాలు, పక్షపాతాలు లేకుండా ఉండి యాదృచ్ఛికంగా ఉన్నప్పుడు అది జరుగుతుంది. మీరు కల్పించుకున్న అభిప్రాయాలతో ఉంటే అర్థం అవటం అనేది మీ లోపలికి చొచ్చుకొని పోయి, మీరు మేధావులు అవుతారు.
ఉదాహరణకి : ఒక వ్యక్తి వెలుగుతున్న అగ్గి పుల్లని ముట్టుకొని ఇది కాలుతుంది అని తెలుసుకుంటాడు. ఆ తరువాత వెలుగుతున్న గ్యాస్ స్టౌ పట్టుకొని అది కాలుతుంది అని తెలుసుకుంటాడు. ఆ విధంగా అన్నీ తెలుసుకునేసరికి తానే చితి మంటల లోనికి వెళతాడు.
మేధావి అయిన వ్యక్తి మొదటిసారి మంటని ముట్టుకొని అది కాలుతుందని తెలుసుకొని, ఏ మంటైనా సరే కాలుతుంది అని అర్థం చేసుకుంటాడు. ఇంకా మేధ కలిగిన వ్యక్తి కనీసం మొదటిసారి కాలేవరకు కూడా ఎదురుచూడకుండా, ఎదుటివ్యక్తికి అగ్గి పుల్ల కాలేటప్పుడే అతను మంట ఏదైనా కాలుతుంది అని తెలుసుకుంటాడు.
బుద్ధుని జీవితం నుంచి ఒక అందమైన కథ : ఒక రోజు ఒక తత్వవేత్త బుద్ధుడి దగ్గరకి వచ్చి, 'మాటలు లేకుండా, మాటలు లేవు అనే భావం లేకుండా, నాకు సత్యాన్ని తెలియచేయండి' అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు నిశ్శబ్దంగా అయిపోతాడు. తత్వవేత్త బుద్ధునికి నమస్కరించి, 'మీరు ప్రేమ, కరుణలతో నాలోని ఊహల్ని తీసేసారు. నేను సత్యమార్గం లోనికి రాగలిగాను' అని చెప్పి వెళ్ళిపోతాడు. తత్వవేత్త వెళ్ళాక ఆనందుడు బుద్ధుడిని, 'ఆ తత్వవేత్త ఏం నేర్చుకున్నాడు' అని అడుగుతాడు. ఆనందుడి ప్రశ్నకి 'మంచి గుర్రం చెర్నాకోలా నీడకి కూడా పరుగెడుతుంది' అని జవాబు ఇస్తాడు.
గుర్రాలు మూడు రకాలు. ఒకటి కొడితే గాని అంగుళమైనా కదలదు. కొట్టినప్పుడు కొంచెం ముందుకి వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ కొడితేనే ముందుకి కదులుతుంది. రెండవదాన్ని అంతగా కొట్టనవసరం లేదు. కొట్టబోతే చాలు ముందుకి వెళుతుంది. మూడవది చాలా తెలివైనది. కొట్టబోనవసరం లేదు. చర్నా కోల నీడ కనపడితే చాలు అది పరిగెడుతుంది.
బుద్ధుడి దగ్గరకి వచ్చిన తత్వవేత్త సత్యాన్ని తెలుసుకోవాలనే కోరికతో రగిలిపోతున్నాడు. అతనికి సత్యం తప్ప ఏమీ అవసరం లేదు. అతను చాలా చాలా మాటలు విన్నాడు. చాలా పద్ధతులు పాటించాడు. అందుకే మాటలు లేకుండా, నిశ్శబ్దం కాకుండా సత్యాన్ని తెలియచేయమని బుద్ధుడిని అడుగుతాడు. బుద్ధుని మౌనంలో అతనికి చర్నా కోల నీడ కనపడింది, అతనికి కావలసిన జవాబు దొరికింది.
భావాత్మక అనుబంధం - మేధకు పెద్ద అడ్డంకి
మీరు గతం నుంచి ఏమైనా నేర్చుకోగలిగితే, ఆ గతం మేధలో భాగం అవుతుంది. మీరు దాన్ని స్వచ్ఛమైన చేతనస్థితిలో, గమనించే భావంతో, వ్యతిరేక లేదా అనుకూల - వ్యతిరేకభావం లేకుండా గతం లోనికి వెళ్ళగలిగితే అది మేధలో భాగం అవుతుంది. అనుకూలభావం అంటే ఆ జ్ఞాపకం పట్ల ప్రేమ, వ్యతిరేకభావం అంటే ఆ జ్ఞాపకం పట్ల ద్వేషం. ఈ రెండు విధాలుగా కూడా ఆ జ్ఞాపకం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒక విషయం అర్థం చేసుకోండి; జ్ఞాపకం ఎప్పుడూ సమస్య కాదు. దాంతో ఉండే అనుబంధమే సమస్య.
ఆ జ్ఞాపకం పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు దాన్ని అభిమాన ఫెయిల్‌లో భద్రపరుస్తారు. ద్వేషించేదైతే చెత్తలో వేస్తారు. దాన్ని మీరు చెత్త బుట్టలో వేసినా, దాని మీద ద్వేషంతో అది మరీ మరీ మీ ముందు అపరాధభావంతో వస్తూనే ఉంటుంది. గతంలో మీకు ఉన్న భావాత్మక అనుబంధం మీ జీవితంలో మొదటిది, చివరిది అయిన సమస్య అని అర్థం చేసుకోండి.
జీవితానికి నమ్మకమైన మేధ
మీరు చుట్టూ చూడగలిగితే మీ సమస్యల్ని పరిష్కరించగల మేధ, శక్తి నిరంతరం కనిపిస్తూ ఉంటాయి. మీరు గనక 50 సంవత్సరాలు జీవించి ఉంటే, మీ అనుభవంతో జీవిత సమస్యల్ని మీరే పరిష్కరించవచ్చు అని అర్థమై ఉంటుంది. ఈ అనుభవం మీద ఆధారపడి ఎటువంటి వృథా లేకుండా మీరు మరొక 50 సంవత్సరాలు జీవించవచ్చు.
పరమానందం మీరు సమస్యని పరిష్కరించుకోగల శక్తిని ఇస్తుంది. మీరు పరమానందస్థితిలో లేకపోయినట్లయితే ఆ శక్తి మరిన్ని సమస్యల్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది, అదీ సమస్య. మీరు పరమానందంలో ఉంటే బాధల నుంచి వేరు చేయబడతారు. ఆ శక్తిని సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు.
భౌతికంగా కూడా పరిశోధనలు ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. మీరు ఆనందంలో ఉన్నప్పుడు మీ మెదడులో డొపామిన్ అనే ఒక రసాయనం విడుదల అవుతుంది. అది మెదడు ముందు భాగాన్ని బాగా ఉత్తేజపరుస్తుంది. మెదడు ముందు భాగం మేధకి తెలివికి సంబంధించినది. అప్పుడు ఆ భాగం బాగా పనిచేస్తుంది. మీరు నిజంగా పరమానందంలో ఉన్నప్పుడు మీరు అత్యున్నత మేధస్సు తో పనిచేయగలుగుతారు. మీరు ఎప్పుడైతే కొన్ని నిమిషాల పాటు బాధ లేకుండా ఆనందంలో ఉంటారో అప్పుడే మీకు కొత్త కొత్త ఊహలు, సృజనాత్మక ఊహలు మీ లోపల నుంచి వస్తుంటాయి.
జ్ఞానం వర్సెస్ మేధస్సు
మన విద్యావ్యవస్థ మొత్తం సమాచారాన్ని విశ్లేషించటం మీద ఆధారపడి ఉన్నది కాని మేధ మీద కాదు. అది జ్ఞానం, మాటల ఆధారంగా ఉంటుంది కాని మీ దృష్టికి తెలిసిన వాటి వల్ల కాదు.
మీరు సమాచారం ఆధారంగా ముందుకి సాగితే, మేధని పొందే శక్తిని పోగొట్టుకుంటారు. మీరు హేతుబద్ధంగా, తార్కికంగా తర్కాన్ని అర్థం చేసుకుంటే తర్కం అసలు తార్కికంగా ఉండదు అని అర్థం అవుతుంది. జీవితం తర్కం కాదు. జీవితాన్ని ప్రాపంచిక తర్కంతో, జ్ఞానంతో వివరించలేం. జ్ఞానం కంటే అది అత్యుత్తమస్థాయిలో ఉంటుంది.
మేధావి ప్రతి నిమిషం వర్తమానంలో జీవిస్తాడు కానీ తర్కంతో కాదు. అతను అప్పు తెచ్చుకున్న జవాబుల్ని నమ్మడు. అతను పరిస్థితి తీవ్రతని గమనిస్తాడు. దానికే సూటిగా ప్రతిస్పందిస్తాడు.
జ్ఞాని ఫోటోగ్రాఫ్ లాంటివాడు. అతని మీద గతం బొమ్మ ఉంటుంది. మేధావి అద్దం లాంటివాడు. అతను సత్యాన్ని ప్రతిబింబిస్తాడు, దానికి స్పందిస్తాడు. అందుకే అతను అప్రయత్నంగా ఉంటాడు.
జ్ఞానం ఒక ఉపకరణంలా ఉన్నంతవరకూ అది చక్కని పద్ధతి. అది మిమ్మల్ని నియంత్రించకూడదు. మీరు జ్ఞానాన్ని పక్కన పెడితే మీ లోపల మేధ మేల్కొంటుంది. అప్పుడు మీరు మీ హద్దుల నుంచి కాకుండా మీ కేంద్రం నుంచి పని చేస్తారు. మీ కేంద్రం అనేది స్వచ్ఛమైన మేధాశక్తి.
మేధ తిరిగి కనుగొనవచ్చు. దాన్ని ధ్యానం ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. ధ్యానం సంఘం సృష్టించిన అడ్డంకుల్ని, ఆటంకాల్ని తొలగిస్తుంది. మీ మేధకి అడ్డుపడే అన్నింటినీ తొలగిస్తుంది. దాంతో అది చక్కగా ప్రవహిస్తుంది.
మేధకి ధైర్యం కావాలి. సాహసం అంటే ప్రేమించగలగాలి! మీరు నిరంతరం తెలియని దానిలోకి వెళుతూ ఉంటే, తెలియని సాగరం లోనికి వెళుతూ ఉంటే, మీ మేధ పెరుగుతూ ఉంటుంది. అది పదును అవుతుంది. అది ప్రతి నిమిషం తెలియనిదానిని ఎదుర్కొంటేనే పెరుగుతుంది.
జ్ఞానం అనేది ఒక మానసిక క్రీడ. అది సృజనాత్మకంగా ఉండదు. అది ఒక ఊహ. కాని సృజనాత్మకత కాదు. మేధ సృజనాత్మకమైనది. ఎందుకంటే అది విశ్వశక్తిలో భాగం కాబట్టి.
తప్పుల నుంచి మేధ
ఒక చిన్న కథ : ఒకసారి ఇద్దరు సాహస వేటగాళ్ళు బాగా చిక్కటి అడవి లోనికి వెళ్ళి, వారి ప్రాంతాలలో కనపడని జంతువుల్ని వేటాడాలి అని నిర్ణయించుకుంటారు. అడవి లోనికి వెళ్ళటానికి విమానం అద్దెకి తీసుకుని అడవికి వెళతారు. అడవి అంతా తిరుగుతూ చాలా జంతువుల్ని వేటాడతారు. కొన్ని రోజులు గడిచాక విమానంతో పైలట్ వారిని వెనక్కి తీసుకువెళ్ళడానికి వస్తాడు. అతను ఇద్దరు వేటగాళ్ళని, అక్కడ ఉన్న అడవి దున్న, జీబ్రాలని చూసి ఇంత బరువు ఈ విమానంలో కుదరదు. దేన్నైనా ఒక దాన్ని వదిలేయమని చెబుతాడు. వారిలో ఒకడు ‘క్రితం సారి మేమువచ్చినప్పుడు ఏ సైజు విమానం తీసుకున్నామో ఇప్పుడు సరిగ్గా అదే విధంగా తీసుకున్నాం’ అంటాడు. పైలట్ సరే అని అన్నింటినీ తీసుకుంటాడు. విమానం కొంచెం పైకి లేవగానే, అది కూలిపోతుంది.
పైలట్, ఇద్దరు వేటగాళ్ళు దెబ్బలు లేకుండా తప్పించుకున్నారు. వేటగాళ్ళలో ఒకరు ‘మనం ఎక్కడ ఉన్నాం’ అని అడుగుతాడు. దానికి రెండవ వ్యక్తి ‘క్రితం సారి మన విమానం కూలినదానికి కొంచెం అవతల ప్రక్క ఉన్నాం’ అని జవాబు ఇస్తాడు.
మీరు మీ జీవితాన్ని గమనించి మీకు డైరీ రాసే అలవాటు ఉంటే, మీరు చేసిన తప్పులనే చేయటం గమనించవచ్చు. గత ఇరవై, ముప్పై సంవత్సరాలలో మీరు చేసిన తప్పులనే చాలా సార్లు చేసి ఉంటారు. కాకపోతే వాటి డిగ్రీ వేరు, స్థలం వేరు, వేరు పద్ధతిలో చేసి ఉండవచ్చు. కానీ తప్పులు మాత్రం దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కొత్త తప్పులు చేయటానికి చాలినంత మేధ అవసరం.
ఒక చిన్న కథ : ఒక వ్యక్తి డాక్టరు దగ్గరికి వచ్చి రెండు చెవుల దగ్గర మంటగా ఉన్నది అంటాడు. డాక్టరు అతన్ని ‘ఏ విధంగా రెండు చెవులూ కాలాయి’ అని అడుగుతాడు. ఆ వ్యక్తి ‘నేను ఫోన్ వచ్చే సమయానికి ఇస్త్రీ చేస్తున్నాను. పొరపాటున ఫోను బదులు ఇస్త్రీ పెట్టె తీసాను’ అని జవాబు ఇస్తాడు. డాక్టరు ఆశ్చర్యంగా ‘మరి రెండవ చెవి ఎందుకు కాలింది’ అని అడుగుతాడు’ ఆ వ్యక్తి కోపంగా ‘ఆ ఫోన్ చేసిన మనిషే మళ్ళీ ఫోను చేసాడు’ అని జవాబు ఇస్తాడు.
మీరు మేధతో జీవిస్తే, చేసిన తప్పు మళ్ళీ చేయరు. ఎందుకంటే మీరు వివేకంతో ఉంటే ఆ తప్పు లోనికి మీ తెలుసుకునే తత్వాన్ని తీసుకువస్తారు. అందులోంచి పాఠం నేర్చుకుంటారు.
జీవితం ఒక కల అని తెలుసుకోగల మేధ
ఇక్కడ నేను రెండు వాక్యాలు చెబుతాను. వాటిని మీరు అర్థం చేసుకోవాలి. అందులో మొదటిది. మీరు ప్రపంచం అంటే ఏమిటి అని అనుకుంటున్నారో, ఆ విషయాలతో, ఆ పదార్థాలతో చేసినదే మీ కల కూడా. ఇది ముఖ్యమైన వాక్యం. దీన్ని అర్థం చేసుకుంటే మీరు దీన్ని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి మీ కలని సృష్టించే శక్తిని ఏ విధంగా ఉపయోగించవచ్చో ఆ శక్తితో మీరు బయటి ప్రపంచంలో వెల్లడి చేయవచ్చు. మీ కలల్లోని శక్తితో బయటి ప్రపంచాన్ని సృష్టిస్తారు.
రెండవ వాక్యం: మీరు చూసేదంతా మీరు సృష్టించిందే, కాబట్టి దీన్ని మార్చగల శక్తి మీకు ఉంది. మనం మన జీవితం ఒక యాక్సిడెంట్ అనుకుంటాం. అది కాదు. అది యాక్సిడెంట్ కాదు అది ఒక సంఘటన. మీరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం చాలా విధాలుగా మార్పు చెందుతుంది. అది మీ దృష్టిని మార్చుతుంది. అది మీ ఆలోచనలని, కలల్ని సృష్టించే మీ ఊహల్ని మారుస్తుంది.
మనం చాలాసార్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండే లేదా మనకి వ్యతిరేకంగా ఉండే కలలని కంటుంటాం. అదే మనని అయోమయానికి గురి చేస్తుంది. అనవసర కలలతో మన శక్తి వృధా అవుతుంది. ఆ శక్తిని పొదుపు చేసి సరియైన పద్ధతిలో ఉపయోగిస్తే, అప్పుడు మీరు సృష్టించే సత్యం, మీరు ఇప్పుడు ఉన్న సత్యం కంటే గొప్పగా ఉంటుంది.
మీకు మీ కలల్ని సాకారం చేసుకునే శక్తి ఉంది. అంతే కాదు, మీరు నిజం అని చూస్తున్నదంతా కూడా ఒక అందమైన కల అని తెలుసుకోగలుగుతారు. ఈ విషయాలు మీ జీవితంలో మంచి మార్పుని తెస్తాయి. మీ కలల్ని నిజం చేసుకోవటం, ఆ నిజం ఒక కల అని అర్థం చేసుకోవటం మీలో చక్కని మార్పుని తెస్తాయి.
మీరు జీవితంలో ఏది సాధించాలి అని అనుకున్నారో దాన్ని సాధించటానికి మీ ఉద్దేశం అనే శక్తి, సృజనాత్మకశక్తి, కలల్ని ఉపయోగించగల శక్తి అవసరం. ఇవి మీ జీవితాన్ని పరిపూర్ణతృప్తితో జీవించగల శక్తిని సృష్టిస్తుంది. అయితే అది నణానికి ఒక వైపు మాత్రమే. ఇక్కడ శాస్త్రం కూడా వదిలేసిన ఒక ముఖ్యవిషయం - మీరు చూసేదంతా కూడా ఒక కల మాత్రమే అని తెలుసుకోగల మేధ. మీరు దాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే. మీరు మీ లోపల విరామంగా ఉండగలరు. అప్పటివరకు అసంతృప్తితోనే ఉంటారు. అదే మీలో చెప్పలేని అసహనం, విసుగుని కలిగిస్తుంది.
మేధ, దృష్టి
స్పష్టమైన దృష్టి మేధకి ఆధారం. మీకు స్పష్టమైన అవగాహన లేకపోతే మీరు ఏ ప్రణాళికనీ చేయలేరు. స్వచ్ఛమైన, స్పష్టమైన దృష్టి ఏ విషయాన్నైనా మీకు పూర్తిగా చూపిస్తుంది. అటువంటి దృష్టి లేనప్పుడు మీరు ఒక దాని తరువాత ఒకటిగా ప్రణాళికలు వేయాలి.
జ్ఞానోదయమైన గురువులకి అంతరంగపు మాటలు ఉండవు. వారిలో ఆలోచనల ప్రవాహం ఉండదు. అందుకే వారిలో స్వచ్ఛమైన, అంతిమదృష్టి ఉంటుంది.
ఎవరికైతే స్పష్టమైన దృష్టి ఉంటుందో వారికి ప్రణాళికలు అవసరం లేదు. అప్రయత్నంగా పనులు జరిగిపోతాయి. అటువంటి వ్యక్తి చుట్టూ ప్రణాళికలు అవే తయారవుతాయి. అతనికి ఏదైనా ఒక కొత్త విధానం తెలిసినా అది అందులో చక్కగా అమరిపోతుంది. కేవలం స్వచ్ఛమైన దృష్టి ఉన్న వ్యక్తి మాత్రమే ప్రణాళికలు వేసి దాన్ని మరింత కొత్తగా తన మేధతో చేయగలడు.
మీరు చాలా ఉదాహరణలు చూడవచ్చు. తిరువణ్ణామలై, గొప్ప దేవాలయం ఉన్న చిన్న పట్టణం. అక్కడ ఖాళీ ప్రదేశాన్ని అందమైన ఆశ్రమంలా కేవలం 18 రోజుల్లో చేశాం. 18వరోజున 12 విగ్రహాల్ని, 1008 శివలింగాలని ప్రతిష్టించాం. మంచి భోజన, వసతి సదుపాయాలు తయారయ్యాయి. దీన్ని దగ్గర దగ్గర లక్షమంది చూసారు. వారంతా సాక్ష్యమే.
ధ్యాన పద్ధతి - జ్ఞానాన్ని వదిలిపెట్టండి
దీన్ని 48 గంటలు ప్రయత్నించండి. మీ సమస్యల గురించి ఆలోచించను అని చేతనస్థితిలో నిర్ణయించుకోండి. అప్రయత్నంగా సమస్యని పరిష్కరించే మేధ లేదు అని మీకు మీరు చెప్పుకుంటూ మీ జ్ఞానాన్ని ఒక పక్కన పెట్టేయండి. మీకు ఆ ప్రయత్నం చేసే శక్తి లేదు అని చెప్పుకోండి.
మీ సమస్యల్ని ధైర్యంగా, పూర్తి ఎరుకతో పరిష్కరించండి. మీలో మేధ ముందుకి రావటం మీరు గమనిస్తారు. మీరు ఒక పాఠం నేర్చుకుంటారు. మీ జ్ఞానం అనేది అడ్డు రానప్పుడు ఉన్నతమేధ ముందుకి వస్తుంది, అది మీకు పరిష్కారాలు చూపిస్తుంది. దానికి సున్నితంగా స్పందించగలిగితే మీరు ఒక పెద్ద అడుగు వేయగలరు. అప్పుడు మీ సమస్యల పరిష్కారానికి మీరు ఏమీ పని చేయనవసరం లేదు. మీలోని అప్రయత్నమేధతో వాటంతట అవే పరిష్కరింప బడతాయి.
- మీ అంతరాత్మని సంపూర్ణంగా వెల్లడి కానీయండి. అది ఏకీకృతంగా, సంపూర్ణంగా ఉంటుంది.
- మీ లోపల సహజమైన, సమయస్ఫూర్తితో కూడిన మేధ ఉంది.
- కొత్త విషయాలకి స్పందించగల సమర్థతే మేధ.
- ప్రతి క్షణం పూర్తి తెలుసుకునే తత్త్వంతో జీవించటమే ధ్యానం అంటే.
- మీ మేధ నుంచి పని చేయటం మీ పనులకి పూర్తి బాధ్యత తీసుకోవటమే.
- మీరు ఆలోచనల మీద ఆధారపడతారు, ఎందుకంటే సహజమేధని మీరు ముందుకి రానీయరు.
బాధ్యత మిమ్మల్ని ఉన్నతస్థితికి చేర్చుతుంది
మీచుట్టూ ఉన్న బాధ్యతల్ని తీసుకోవటమే జీవన్ముక్తి
మనం ఎవరిమో, మనం ఇక్కడ ఏమిచేస్తున్నామో ఆ వివేకాన్ని పొందిన తరువాత మనం ఎదుటి వారిపట్ల బాధ్యతని తీసుకుంటాం. అప్పుడు మనం స్వతంత్రులం కాదు అని, మనం ఎదుటివారితో అనుబంధంతో ఉంటామని తెలుస్తుంది.
ఒకసారి తమిళనాడులోని ఒక ప్రాంతమంతా టి.బి. అంటువ్యాధిలా వ్యాపించింది. అధికారులు దాన్ని సమర్థవంతంగా అరికట్టి, అది పూర్తిగా పోవటానికి తామే బాధ్యులమని గర్వంగా ప్రకటించారు. మరి అది వ్యాపించటానికి వారే బాధ్యులని చెప్పుకోలేదు. ఆ వ్యాధి వ్యాపించకుండా చూడవలసిన బాధ్యత వారిదే. అదేవిధంగా మన జీవితాలలో మంచి జరిగితే బాధ్యత తీసుకుంటాం కాని చెడు విషయాలకి తీసుకోం. అంటే బాధ్యతని విడివిడిగా అనుకూలంగా తీసుకుంటాం.
ఎప్పుడైతే మనం ప్రతిదానికి బాధ్యత తీసుకుంటామో అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. ఎప్పుడైతే 'నేను బాధ్యుణ్ణి' అని అనుకుంటారో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు కూర్చొని జాగ్రత్తగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటననీ పరిశీలిస్తే అన్నింటికీ బాధ్యత మీదే అని తెలుస్తుంది. కానీ సాధారణంగా మన జీవితంలో జరిగిన సంఘటనలకి ఎవరో ఒకరిని బాధ్యుల్ని చేస్తాం. ఒక విషయం అర్థం చేసుకోండి, ఎవరైతే మరింత వికసించాలి అని అనుకుంటారో వారు ప్రతి దానికి ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని బాధ్యతని తీసుకుంటారు.
స్వామి వివేకానంద చాలా చక్కగా చెబుతారు, 'నీవు మోయగలిగినంత బాధ్యతని తీసుకో, ఎక్కువ బాధ్యతని తీసుకుంటే ఎక్కువ విస్తృతం అవుతారు అదే అభివృద్ధి అంటే. విస్తృతం కాలేకపోతే కుచించుకుపోయి మరణిస్తారు'.
ఒక చిన్న కథ : ఒక వ్యక్తి ఛారిటీక్లబ్బులో బాధ్యతమీద చక్కని ఉపన్యాసాన్ని ఇస్తూ ఒక సంఘటన చెప్పాడు. ఒకరోజు నేను, నాస్నేహితుడూ నడుస్తూ వెళ్తుంటే ఒక వ్యక్తి రోడ్డుమీద పడిపోయి ఉన్నాడు. ఎవరూ అతణ్ణి పట్టించుకోలేదు. అంతేకాదు మేం తిరిగి వెనక్కి వచ్చేటప్పటికి కూడా అతను అలాగే పడి ఉన్నాడు.
ఎదుటివారిని తప్పుపట్టే బదులు మనలోనికి చూద్దాం. సమస్యల పరిష్కారానికి ఏమి చేస్తున్నామో గమనిద్దాం. మనం నిరంతరం ఎదుటి వారిని తప్పుపట్టడానికి సిద్ధంగా ఉంటాం. కాని సమస్య పరిష్కారానికి మనం ఏమి చేశాం? మీరు ఎక్కువ బాధ్యత తీసుకునేకొద్దీ అభివృద్ధి చెందుతారు. మీ చుట్టూజరిగే విషయాలకి బాధ్యత వహించినప్పుడే మీరు నాయకుడిగా అవుతారు. అప్పటి వరకూ మీరు కేవలం అనుచరులు మాత్రమే.
కరుణ అంటే బాధ్యత, శక్తి
నన్ను ఒకరు 'స్వామీజీ! నిరంతరం మీలో అంతశక్తి ఎలా ఉంటుంది?' అని అడిగారు. ఎప్పుడైతే మీరు బాధపడే వారిపట్ల కరుణ చూపిస్తారో అది బాధ్యతగా మారుతుంది. అదే శక్తిగా వెల్లడి అవుతుంది. అంతే. ఎవరైనా ఎదుటివారి బాధలపట్ల బాధ్యత తీసుకుంటారో వారి నుంచి శక్తి ప్రసరిస్తూ ఉంటుంది.
ఏసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? పన్నెండు. రామకృష్ణ పరమహంసకి పదహారుమంది. అంత కొద్దిమంది శిష్యులైనా, వారు తీసుకున్న బాధ్యత వలన ఆ మిషన్స్ అంతగా విస్తృతం అయ్యాయి.
మీరు స్పష్టంగా తెలుసుకోండి, ఎప్పుడైతే మీరు ఎదుటివారి అభివృద్ధికి బాధ్యత తీసుకుంటారో అప్పుడే మీరు ఆ బాధ్యతని వహించగలరు. ఎప్పుడైతే ఎదుటివారికి అవసరమైంది ఏదైనా సరే చేస్తాను అని మీరు నిర్ణయించుకోగలిగితే మీ నుంచి శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. మీలో దివ్యశక్తి ప్రవేశిస్తుంది. ఈవిషయం గురించి కొంచం విశ్లేషించండి, మీకు లోతుగా అర్థం అవుతుంది.
మూసుకుపోయిన వెదురు నుంచి గాలి వెళుతుందా? లేదు. ఆ కర్ర శవాన్ని మోయటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఖాళీ అయినప్పుడే మురళిగా మారుతుంది. మీరు కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తే మీరు మూసుకుపోయిన వెదురులా పని చేస్తారు. మీ అహంకారం నుంచి బయటికి వచ్చి బాధ్యతని తీసుకుంటే, మీరు విస్తృతం అవుతారు, మురళిలా మారతారు. దానిలోంచి గాలి వెళ్ళి సంగీతాన్ని సృష్టిస్తుంది.
ఒక గొప్ప మార్పు
మీరు బాధ్యత తీసుకుంటే మీలో గొప్ప మార్పు కలుగుతుంది. మీ మానసికవ్యవస్థలో మార్పు వస్తుంది. మనలో చాలామంది బానిసలుగా ఉంటాం. మీరు పని చేసే చోట బాధ్యతతో చేస్తే మీరు ఉల్లాసంగా ఉంటారు. ఉదాహరణకి సొంత వ్యాపారం చేసే వ్యక్తి, అందులో పని చేసే వ్యక్తిని చూడండి. యజమాని పూర్తి బాధ్యత వహిస్తాడు కాని అందులో పని చేసే వ్యక్తి ఎటువంటి బాధ్యతని తీసుకోడు. అందుకే అతనిలో ఎటువంటి ప్రోత్సాహం, ఉత్సాహం ఉండదు. అతనికి జీతం తీసుకున్న రోజు మాత్రమే ఒక ఉత్సవం. కాని యజమానికి ప్రతి రోజూ ఉత్సవమే. ఎందుకంటే అతను బాధ్యతని తీసుకుంటాడు. బాధ్యత తీసుకుంటే గొప్ప విషయాలు సాధించవచ్చు. బాధ్యత తీసుకున్నప్పుడు మీరు ఒక దృఢమైన శక్తిగా మారతారు. అప్పటివరకూ మీకు మీరు, ఎదుటివారికి బరువుగా ఉంటారు.
రామకృష్ణ పరమహంస చక్కగా చెబుతారు, సన్న్యాసి భగవంతుని గురించి ఆలోచించాలి. ఇది గొప్ప విషయం కాదు. కాని సంసారి భగవంతుని గురించి ఆలోచిస్తే అది గొప్ప విషయం, సన్న్యాసి భగవంతుని గురించి ఒక్కక్షణం మరిచిపోయినా అది పాపం. కాని సంసారి భగవంతుని గురించి ఒక్క నిమిషం తలచినా అది పుణ్యం. అదే విధంగా నాయకుడు బాధ్యత వహించాలి, అది గొప్ప విషయం కాదు. కాని అతని జూనియర్ బాధ్యత తీసుకుంటే ఆ సంస్థలో అందరూ ప్రోత్సాహాన్ని పొందుతారు.
కింది స్థాయిలో పనిచేసేవారు అందరినీ ప్రోత్సహించటానికి అవకాశం ఎక్కువ. కాబట్టి బాధ్యత తీసుకోవటానికి అధికారం కావాలి అని చూడవద్దు. అంతే కాదు, మీరు ఏదో తక్కువ స్థాయిలో ఉన్నారు అని అనుకోవద్దు. మీలో ఆ గొప్ప మార్పు జరిగేలా చూడండి.
మీ మానసికవ్యవస్థలో అది జరగాలి. ప్రస్తుతం మీ మానసికవ్యవస్థ మిధ్యలో ఉంది. ఊహలతో ఉంది. మీ మనస్సు బయట ప్రపంచంలోని బాధల్ని, దుఃఖాల్ని వెతుకుతూ ఉంటుంది. మీరు లోతుగా పరిశీలిస్తే, మీరు ఏదైనా సంతోషంలో మునిగినప్పుడు అకస్మాత్తుగా బాధలు లేవేమిటి అనుకుంటారు. వెంటనే బాధగురించి ఆలోచిస్తారు. బాధల్ని పోగుచేసుకుంటారు.
మిధ్య అంటే లేనిదాన్ని వెతకటం. మనం మిధ్యనుంచి నిత్యకి మారాలి. అదే వర్తమాన స్థితి. అదే మీలో రాగల పెనుమార్పు. మీరు బాధ్యత తీసుకున్నప్పుడే ఆ మార్పు మీలో కలుగుతుంది.
మీరు కేవలం 24 గంటల సేపు బాధ్యతతో ఉంటే పూర్తి కాని పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవనసరళి పూర్తిగా మారిపోతుంది. మీరు కొత్త ఆనందంతో వికసిస్తారు. మీలో చక్కని పారవశ్యం నిండుగా ఉంటుంది. మీరు సహజమైన నాయకుడుగా తయారవుతారు. జీవితం ఒక ఉత్సవంలా ఉంటుంది.
మీరు ఎప్పుడైతే బాధ్యతని తీసుకుంటారో, మీరు విస్తృతం అయి, నాయకునిలా కనిపిస్తారు. నాయకుడు సింహాసనం మీద కూర్చుని, ఏ బాధ్యతా తీసుకోకుండా, ఎదుటివారిని అన్నింటికీ బాధ్యుల్ని చేస్తే అతను చిన్నవాడుగా కనిపిస్తాడు. మీ స్థితి మీకు ఆ ఆధికారాన్ని ఆ హోదాని ఇస్తుంది కాని హోదా స్థితిని తీసుకురాదు. నిత్యానందస్థితి వేరు నిత్యానంద హోదా వేరు.
సేవా నిబద్ధత
స్వామి వివేకానంద తన మిషన్ లక్ష్యం ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ - 'మోక్షం పొందటం, మానవసేవ' అని చెప్పారు. దీని అర్థం మానవసేవ చేయకుండా, ప్రపంచానికి మంచి చేయకుండా మీరు మోక్షం గురించి మాట్లాడకూడదు.
భగవంతుడు బాధ్యతలతో ఉన్న వ్యక్తిని ప్రేమిస్తాడు. వారి కోసం దిగివస్తాడు. అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను, మీరు బాధ్యతని తీసుకుంటే శక్తి మీలో ప్రవహిస్తుంది అని.
అహంకారం Vs బాధ్యత
మీరు బాధ్యతని తీసుకున్నప్పుడు సమస్యలు కరిగిపోతాయి. మీలో కొత్త మేధ మేల్కొంటుంది. మీరు అహంకారులు అనుకోవద్దు. అహంకారం, బాధ్యత వేరు, వేరు విషయాలు. మీరు బాధ్యత అని అనుకున్నప్పుడే ఆసక్తితో ముందుకి వస్తారు. మీరు అహంకారంతో ఉండరు. నేను అందరి కంటే బాగా చేశాను అనుకున్నప్పుడు మీ లోనికి అహంకారం వస్తుంది. ఎప్పుడైతే అహంకారం ఆటలు మొదలవుతాయో, మీరు బాధ్యతని తీసుకోలేరు.
బాధ్యత అంటే గంభీరత కాదు - ప్రపంచం ఒక కల మాత్రమే
బాధ్యతతో ఉండటం అంటే గంభీరంగా ఉండటం కాదు. నిజాయితీగా ఉండటం. గంభీరంగా ఉంటే అహంకారాన్ని పెంచుతారు. మీరు నిజాయితీగా ఉంటే జీవితం పట్ల స్పష్టతతో ఉంటారు. అప్పుడు జీవితానికి అనవసరమైన ప్రాధాన్యమివ్వరు. మీరు జీవితాన్ని ఉరకలెత్తే ఉత్సాహంతో తీసుకుంటారు. అమాయకత్వంతో, అప్రయత్నంగా ఉండగలుగుతారు.
చిన్న పిల్లల ప్రపంచం అంటేనే ఉత్సాహం, అమాయకత్వం. అతను నా పెన్సిల్ తీసుకున్నాడు, నా చాక్లెట్ నాకు ఇచ్చేయి.... ఈ విధంగా ఉంటుంది. మనందరం అదే అమాయకత్వంలో ఉన్నవారిమే. అవి గుర్తు వస్తే మనకి ఏమనిపిస్తుంది. మనం ఎంతో ఆహ్లాదంగా నవ్వుకుంటాం.
మనం ఒక్కసారి మన బాల్యానికి వెళదాం. మన ఐదారు సంవత్సరాల వయస్సులో పెన్సిల్ ముక్క కోసం ఎంత పోట్లాడామో. మీరు ఇంకా పెద్దవారవుతారు, అప్పుడు మీ స్నేహితుడు మరొకరితో సరదాగా ఉంటే మీరు భరించలేరు. ఇప్పుడు ఆ విషయాలు గుర్తుకి వస్తే నవ్వుకుంటారు. పెద్దవారిని, యువత సమస్యల గురించి చెప్పమంటే అవేమంత పెద్ద విషయాలు కాదు అంటారు. ఈ విధంగా చూస్తూ వెళితే మనం ఈ స్థితులన్నీ దాటుతూ ఉంటాం. చివరికి ఈ స్థితులకి అతీతంగా ఉండే స్థితికి చేరతాం. అదే ఆనందాన్ని అనుభవించే ఆనందస్థితి. ఆ స్థితి మన జీవితంలోని మిగిలిన స్థితులకి అతీతమైన స్థితి. మీకు పీడ కల వచ్చినప్పుడు, మీ ప్రియమైనవారిని పోగొట్టుకొని దుఃఖిస్తున్నట్టు కల వస్తే అందులో అంతు లేని బాధని అనుభవిస్తారు. అకస్మాత్తుగా మిమ్మల్ని నిద్ర లేపితే, ‘ఓ! ఇది కలేనా!’ అని రిలాక్స్ అవుతారు. ఈచిన్న విషయం అర్థం చేసుకుంటే, జీవితాన్ని జీవించటం తెలుస్తుంది. కల మాయం అయితే మనలో ప్రశాంతత ఏర్పడుతుంది.
శివుడు, ఈ ప్రపంచమంతా ఒక కల అంటాడు. ఈ విషయాన్ని ఎంత మంది ఒప్పుకుంటారు. మీరు ఈ ప్రపంచాన్ని నిజం అంటారు. ఎందుకంటే మీరు దాన్ని ఆ విధంగా అనుభవించారు.
మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాటినే స్వీకరిస్తాం. అనుభవం లేనివాటిని ఒప్పుకోం. కాబట్టి మనం చేయగలిగేది మన అంతరంగం లోనికి వెళ్ళి ఆనందస్థితిని తెలుసుకుని దాన్ని అనుభవించాలి.
మనం మధ్యవయస్సులో ఉన్నప్పుడు చిన్ననాటి పనులు నవ్వు తెప్పిస్తాయి. పెద్దవారం అయ్యాక మధ్యవయస్సు సమస్యలు నవ్వు తెప్పిస్తాయి. మనం అంతిమస్థితిని తెలుసుకున్నప్పుడు జీవితంలో జరిగిన ప్రతీదీ ఒక ఆటలా కనిపిస్తుంది. అప్పుడు జీవితం అనే ఆటని అందంగా ఆడవచ్చు. దానిలో గొంతు వరకూ మునిగిపోయినా సరే దాంతో ప్రభావితం కారు.
విశ్వాసం, సహనం
నేనెప్పుడూ ఒక విషయం చెబుతుంటాను, మీకు ఎంతో కొంత శక్తి ఉందని దాని ప్రకారం పనులు చేయాలి అని అనుకోవద్దు. మీరు ఏదైనా ఒక పనిని, బాధ్యతని తీసుకోగానే మీకు తెలియకుండా ఆ పనిని పూర్తి చేసే శక్తి మీ లోనికి వస్తుంది. మీరు తీసుకున్న బాధ్యతలకి అనుగుణంగా మీలో శక్తి కలుగుతుంది. మీరు బాధ్యత తీసుకునే కొద్దీ మీ అంతరంగం విస్తృతం అవుతూ ఉంటుంది. అది ఎంత విస్తృతం అయితే మీ లోనికి అంత శక్తి ప్రవహిస్తుంది.
మీ చుట్టుపక్కల జరిగే విషయాలకి అప్రయత్నంగా బాధ్యత వహిస్తే, మీరు నాయకుడుగా ఎదుగుతారు. మీరు మీ జీవితాన్ని, ఎదుటివారి జీవితాల్ని మార్చగలుగుతారు. చేతనస్థితిలో అభివృద్ధి చెందడానికి బాధ్యత తీసుకోవటం ఒక పద్ధతి.
మీరు రెండు విషయాలు చేస్తే చాలు; జీవితం మంచిది అని నమ్మాలి. మీరు ఎంత బాధ్యత తీసుకుంటారో అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతారు అని తెలుసుకోవాలి. మరొక విషయం, ఆ ఎదుగుదల జరిగే సమయంలో సహనంతో ఉండండి. ఆ మార్పు జరిగే కాలంలో సహనంతో ఉండటాన్నే నేను తపస్సు అంటాను. షిరిడీ బాబా ఒక విషయాన్ని చెబుతారు, శ్రద్ధ, విశ్వాసం, సహనం అని, అదే జీవితసారాంశం.
బాధ్యత మిమ్మల్ని ఉన్నతస్థితికి చేరుస్తుంది మీరు జీవితంలో మరింత విస్తృతం అవుతారు అనే నమ్మకం మీరు తీసుకున్న బాధ్యతల్ని నెరవేర్చేంతగా మిమ్మల్ని ఎదగనిస్తుంది. ఆ విస్తృతం అనేది జరుగుతున్నంత సేపూ మీరు సహనంతో ఉండాలి అంతే. అంతకు మించి మరేమీ అవసరంలేదు.
మనకి నమ్మకం కాని, సహనం కాని ఉంటుంది. అందుకే మనం మన గతాన్నే తిరిగి భవిష్యత్తులో తయారు చేస్తాం. మన జీవితంలో ఒక పెద్ద మార్పుని ఎందుకు తీసుకురాకూడదు? మన జీవితం ఒక కొత్త స్థితికి తీసుకు వెళ్ళగలుగుతుంది అని నమ్మం. అందుకే మీకు సహనం, నమ్మకం కావాలి. ఒక సూక్ష్మసత్యం ఏమిటంటే మీరు ఎక్కువ బాధ్యతని తీసుకుంటే మీ లోనికి ఎక్కువ శక్తి ప్రవహిస్తుంది. అది మీ ద్వారా వెల్లడి అవుతుంది. దానికి అనుగుణంగా మీరు అభివృద్ధి చెందుతారు.
ఎదుటివారి కోసం బాధ్యత తీసుకోవటం
చేతనస్థితిలో ఎదగగల ఒక పద్ధతి బాధ్యతని తీసుకోవటం. ఎదుటివారి కోసం బాధ్యతని తీసుకోవటం అనేది జ్ఞానోదయం పొందగల ఒక సాధనపద్ధతి. దీన్నే భగవద్గీతలో కర్మయోగం అన్నారు. మీరు కర్మ చేయాలి అని నిజంగా అనుకున్నప్పుడు, మీరు ఎదుటివారి బాధ్యత తీసుకున్నప్పుడు, మీరు ఫలితాల్ని అసలు పట్టించుకోరు. కరుణతో, బాధ్యతతో పని చేస్తారు.
మీ నుంచి పొంగి ప్రవహించే శక్తితో, కరుణతో, బాధ్యతతో పని చేయటమే ఆధ్యాత్మిక జీవితం అంటే. భయం, ఆశతో కాకుండా మీ నుంచి పొంగి ప్రవహించే బాధ్యతతో పని చేయడమే ఆధ్యాత్మికజీవితం.
జ్ఞానోదయబాధ్యత
ఒక విషయం అర్థం చేసుకోండి, జ్ఞానోదయం బాధ్యతతో వస్తుంది. మీలో అత్యధికమైన కరుణ తాలూకు ఒత్తిడితో వస్తుంది. ఒత్తిడి అనేది సరియైన మాట. మీ అంతరంగం మొత్తం కరుణతో నిండి, ఆ ప్రకంపనల్ని ప్రసరిస్తూ ఉంటుంది. అది లోతైన, గాఢమైన కరుణ.
మీకు ఒక సంఘటన చెబుతాను : ఒక రోజు ఉదయం వివేకానందుడు అకస్మాత్తుగా నిద్ర లేచి, నా కుడి చేతిలో చాలా నొప్పిగా ఉంది అంటాడు. ఆయన వారితో, నా చేతి వైపు సముద్రానికి అవతల ఒక దేశంలో ఏదో ఒక ఉపద్రవం జరుగుతోంది. అదేమిటో తెలుసుకోండి. అవసరమైతే సహాయంగా మన స్వాముల్ని ఎవరినైనా పంపిద్దాం అంటాడు. మర్నాడు వాళ్ళకి ఆ ప్రాంతంలో భయంకరమైన భూకంపం వచ్చినట్టు తెలుసుకుంటారు. స్వాములు చాలా మంది బృందంగా అక్కడ సహాయం చేయటానికి వెళ్తారు. వివేకానందుడు ఎంత సున్నితత్వంతో ఉన్నాడంటే, ఎక్కడో బాధని అనుభవిస్తున్న ప్రజల బాధని ఆయన అనుభవించాడు.
జ్ఞానోదయంతో విశ్వం అంతా మీలో ఉన్న అనుభవాన్ని పొందుతారు. జ్ఞానో దయానభవంతో పాటు గాఢమైన కరుణ కూడా మీ లోనికి వస్తుంది. అర్థం చేసుకోండి, జ్ఞానోదయం అంటేనే బాధ్యత. అది కేవలం స్వేచ్ఛ కాదు. అది గొప్ప బాధ్యత కూడా.
స్థితే కాని హోదా కాదు
మనలో చాలా మంది బాధ్యత తీసుకోవాలి అంటే తగిన హోదా ఉండాలి అనుకుంటారు. అది పని చేయదు. మీరు బాధ్యత తీసుకున్నాక మాత్రమే హోదా వస్తుంది. హోదా కోసం ఎదురు చూసేవారు ఎప్పటికీ బాధ్యత తీసుకోరు. హోదా వచ్చాక కూడా బాధ్యత తీసుకోరు. బాధ్యత తప్పించుకోవడానికి మరొక కారణం వెతుకుతారు.
స్పష్టంగా తెలుసుకోండి, బాధ్యత అంటే చేతనస్థితి.
చాలా మంది జ్ఞానోదయం అంటే బంగారు సింహాసనం మీద కూర్చోవటం అనుకుంటారు. ఎవరో ఒకరు భోజనం, ఆశ్రయం ఇస్తారు అనుకుంటారు. అందరూ వారి ఫోటోకి పూజ చేస్తారు అనుకుంటారు. మీరు ఇలా అనుకుని జ్ఞానోదయం పొందాలి అనుకుంటే మీరు మోసపోయినట్టే, మీరు జ్ఞానోదయమైన గురువుల హోదా కాకుండా ఆ స్థితి చూసి దాన్ని పొందాలి అనుకుంటే మీరు విజయం సాధిస్తారు. మీరు సంతోషంగా ఉంటారు. అదే హోదాకి, స్థితికి ఉన్న తేడా.
- మీరు బాధ్యత తీసుకుంటే మీలో గొప్ప మార్పు కలుగుతుంది. మీ మానసికవ్యవస్థలో మార్పు వస్తుంది.
- మీరు ఎప్పుడైతే బాధ్యతని తీసుకుంటారో, మీరు విస్తృతం అయి, నాయకునిలా కనిపిస్తారు.
- భగవంతుడు బాధ్యతలతో ఉన్న వ్యక్తిని ప్రేమిస్తాడు. వారి కోసం దిగివస్తాడు.
- బాధ్యతతో ఉండటం అంటే గంభీరంగా ఉండటం కాదు. నిజాయితీగా ఉండటం.
- మీరు బాధ్యతని తీసుకున్నప్పుడు సమస్యలు కరిగిపోతాయి. మీలో కొత్త మేధ మేల్కొంటుంది. మీరు అహంకారులు అనుకోవద్దు. అహంకారం, బాధ్యత వేరు, వేరు విషయాలు.

నాయకత్వం ఒక స్థితి, హోదా కాదు
జీవన్ముక్తి అంటే జీవితపు అన్ని కోణాల్లో సహజనాయకుడుగా సమర్థంగా జీవించగలగటం
మనం ఇతరులకి బాధ్యత వహించినప్పుడు, మన మీద దృష్టి కేంద్రీకరించం, మనం ఇతరులకి సేవ చేస్తాం. ఇతరులకి సేవ చేయడం నాయకత్వం. మన అవసరాలు తీర్చుకుంటూ ఇతరులపై శ్రద్ధ చూపించకపోతే నాయకత్వం లోపించిందని అర్థం.
నేపథ్యం
నాయకత్వం, ఒక సంస్థని జయప్రదంగా నడిపించడానికి దాని ప్రాముఖ్యం తెలియడానికి, ఈ రోజులలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఎందరో గురువులు నాయకత్వం వహించి, సంస్థలలో ఉన్నవారికి నాయకత్వం పెంపొందించడానికి శిక్షణ ఇస్తున్నారు. అయినా మనం అన్ని సంస్థలలో లాభాల కోసం వ్యాపారం చేస్తున్నవారిలో లేదా ఏ ప్రభుత్వ ఉద్యోగంలో వారిని, లేదా సామాజిక సేవా సంస్థల్లో వారిని చూస్తే నాయకులు అరుదుగా కనిపిస్తారు.
మీరు ఏ సంస్థనైనా చూస్తే, అందులో 1% కంటే తక్కువ మంది నాయకులు అవడానికి ప్రయత్నిస్తారు. మనం వ్యాపారసంస్థలలో చూస్తే, వాటిలో 1% బహుశ నిజమైన నాయకులు ఉండి, వారి రంగంలో అభివృద్ధి సాధించి, లాభాలు గడించి - మంచి ఉత్పత్తి సాధించి సమాజసేవ చేస్తున్నారు. వారు ఉద్యోగుల్ని తృప్తిపరుస్తున్నారు. అందుకే నిజమైన నాయకులు విజయం పొందిన వ్యాపార సంస్థలలో 1% ఉంటారు. అంటే, మొత్తం పని చేసేవారిలో 0.01% మందికి నిజమైన నాయకత్వలక్షణాలు ఉన్నాయి అని అర్థం. మిగతా రంగాలలో ఉన్నటువంటి ఇతర సంస్థల గురించి ఇదే అనుకోవచ్చు. అందుకే నిజమైన నాయకులు అరుదు అని అంటాను.
ఇది ఇలా ఎందుకుందో తెలుసుకుందాం. దానికి ఈ కింద ఇచ్చినవాటిని అర్థం చేసుకోవాలి.
- నాయకత్వం అంటే ఏమిటి?
- నాయకులని తయారు చేయగలమా లేదా పుట్టుకతో నాయకులై ఉండాలా?
- విజయవంతమైన నాయకుడు అవడానికి కావలసినవి ఏమిటి?
- ఎందుకు కొంతమంది సహజంగా కష్టపడకుండా నాయకత్వం వహిస్తారు, మరి కొంత మంది చాలా కష్టపడతారు?
- మనం నాయకులు అవడానికి ఏ విధంగా ప్రయాణం చెయ్యాలి?
పైన ఇచ్చినవాటిని, ఒకటి తరువాత ఒకటి అర్థం చేసుకుందాం.
నాయకత్వం అంటే ఏమిటి?
చాలా మంది ఈ విషయం మీద అనేకపుస్తకాలు రాసారు. చాలామంది ఒక నాయకుడు సఫలీకృతం కావాలంటే ఏ లక్షణాలు ఉండాలో రాసారు. వ్యాపారసంస్థలు నాయకత్వం మీద అనేక శిక్షణకార్యక్రమాలు నిర్వహించారు.
వ్యాపారప్రపంచం నుండి వచ్చిన నా శిష్యులు, ఆ శిక్షణ తరగతులు ఎలా జరుగుతాయో, ఆ శిక్షణ నుండి వారు ఏ విధమైన ఉపయోగం పొందారో నాకు వివరించారు. ఆ కార్యక్రమాలు వారికి సహాయపడినా, కొన్ని రోజుల తరువాత ఆ శిక్షణ ప్రభావం తగ్గిపోతుందని వారు నాతో చెప్పారు.
వారాంతశిబిరాల్లో, తాడు మీద నడవడం, ఆటలు ఆడటం, స్నేహభావాన్ని కలిగించడం వలన జట్టు చైతన్యం ఎలా పెంపొందిస్తారో అన్నది నాకు చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాలు వ్యక్తి బాహ్యగుణాల మీదే పని చేస్తాయి. అంతరంగభావాల మీద ప్రభావం చూపించవని, నా శిష్యులు చెప్పినదాని నుంచి నేను అర్థం చేసుకున్నాను. వ్యక్తిగతాభివృద్ధి, మార్పు చెందిన వ్యక్తి నుండి ప్రసరించే అనుభవమే నాయకత్వం, అది ఒక గుణం కాదు.
సంప్రదాయపద్ధతిలో నాయకత్వాన్ని ఎలా వర్ణించారో అన్నది నేను వివరిస్తాను. ఇంటర్నెట్లో 'నాయకత్వం' 'నాయకుడు' అనే మాటలకి అర్థాలు వెతికితే, చాలా సమాధానాలు రావడం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్యనే, నేను గూగుల్‌లో, 'నాయకత్వం' అన్న పదం టైపు చేసినప్పుడు వేల సమాధానాలు వచ్చాయి. కాబట్టి ఈ విషయాల మీద రాయవలసినది లేదా చెప్పవలసినది అంతా చెప్పేసారు. అందుకే నేను ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించేవారు నాయకత్వం మీద చెప్పిన విషయాలు, ఉదాహరణలు చెప్తాను. ముఖ్యంగా, నాయకుడు ఎలా అవ్వాలి అన్నడానికి అసలైన అర్థం, పద్ధతులు చెప్పిన తరువాత, వారి వ్యక్తిత్వంలో మార్పు వచ్చిన తరువాత ఎలా 'నాయకత్వ' లక్షణాలు చూపించగలరో చెప్తాను.
ప్రతి మానవుడు ఒక శక్తి గల నాయకుడు అన్నది అర్థం చేసుకోండి. అందరూ అనుకునే విధంగా, కొంత మందికి పుట్టుకతో 'నాయకత్వం' అనే గుణం ఉండదు. ప్రతి ఒక్కరూ నాయకుడు కావచ్చు. అతను ఒక ప్రత్యేకసంస్థ లేక పరిస్థితికి తీసుకున్న బాధ్యత నుండి అతనిలో నాయకత్వగుణం పెంపొందుతుంది.
ఇక్కడ మీకు ఇంటర్నెట్ నుంచి 'నాయకత్వం' మీద దొరికే కొన్ని నిర్వచనాలు ఇస్తాను.
పీటరు డ్రక్కరు, ఇచ్చిన నిర్వచనం 'ఏ వ్యక్తికైతే అనుచరులు ఉన్నారో అతను 'నాయకుడు'
జాన్ సి మాక్స్వెల్ ఇచ్చిన నిర్వచనం 'నాయకత్వం, అనేది ప్రభావం - ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా ఉండటం.'
Warren Benni's ఇచ్చిన నిర్వచనం 'నాయకత్వం నిన్ను నువ్వు తెలుసుకునే ప్రక్రియ, బాగా చెప్పగలిగే, ముందు చూపు ఉండగలగటం, సహోద్యోగులలో విశ్వాసం కలిగించటం, నీ నాయకత్వశక్తిని తెలుసుకోవడానికి ఉపయుక్తమైన చర్య చేయడం' అని అన్నారు.
నాయకత్వానికి ఒక నాయకుడు ఇచ్చిన నిర్వచనం: 'నాయకత్వం అంటే ఒక వ్యక్తి ఇతరులను ప్రభావితం చేసి, తన లక్ష్యాన్ని సాధించే విధానంతో ఆ సంస్థని కలిసి ఉండేట్లు చేయటం. నాయకులు తమ నాయకత్వగుణాలైన నమ్మకాలు, విలువలు, జ్ఞానం, నైతికత, స్వభావం నిపుణతతో ఈ పనిని నిర్వహిస్తారు.'
'నాయకుడు', 'నాయకత్వం' అనే పదాలకి ఎన్నో వేల నిర్వచనాలు ఉన్నాయని నాకు కచ్చితంగా తెలుసు. అందుకే కొంత మంది నాయకుడు, నాయకత్వానికి ఇచ్చిన నిర్వచనాలని, మీ ముందు ఉంచాను. ఈ నిపుణులందరూ, నాయకుడు ఎలా ఉండాలి, ఒక అనుకూలమైన నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అన్నది చెప్పారు. కాని ఈ లక్షణాలు ఎలా పొందాలన్నది అంతగా చెప్పలేదు.
నాయకత్వలక్షణాలు పుట్టుకతో వస్తాయా, లేకపోతే నాయకుడిని తయారు చేయగలమా అన్న ప్రశ్న కలుగుతుంది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం మనస్సు అంటే ఏమిటి, అంతరం గప్రపంచ విజ్ఞానం తెలుసుకోవాలి. ఈ అంతరంగప్రపంచం గురించి తెలుసుకోవడానికి తూర్పు దేశపు మార్మికులు కొన్ని వేల సంవత్సరాలు పరిశోధన చేశారు. వారు నాయకత్వలక్షణాలను పెంపొందించడానికి, కొన్ని పద్ధతులు కనుక్కున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
నాయకులను తయారుచేయగలమా లేదా పుట్టుకతో నాయకుడై ఉండాలా?
చాలా మంది, నాయకుడు ఎలా ఉండాలన్నది చెప్పారు. కాని ఆ స్థితికి ఎలా చేరుకోవాలో అన్నది తక్కువగా చెప్పారు. దీని అర్థం ఏమిటి?
నాయకత్వం అనే గుణం పుట్టుకతో రావాలా లేదా అలవర్చుకోవచ్చా? ఒక వ్యక్తి నాయకత్వపు నైపుణ్యాన్ని ఎలా వృద్ధి చేసుకోగలడు? ఆమె లేదా అతడు, వ్యక్తిగత కష్టాలు లేదా కలవరపాటులో ఉన్నప్పుడు ఒక సంస్థను నడపగలడా?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పేముందు నాయకత్వపు లక్షణాలు అలవరచుకోవచ్చని అనుకుందాం.
అది అంతా నాయకుడు అనే చైతన్యస్థితి పొందడమే, కాని హోదా కాదు. ఇది చదివేటప్పుడు, నేను మిమ్మల్ని ఆధ్యాత్మిక ప్రయాణం చేయిస్తున్నానని అనుకోవద్దు! నేను చెప్పబోయే పద్ధతి, కాలానుగుణంగా, వ్యక్తిగతంగా మారడానికి నిరూపితమైన శాస్త్రం. అంతరంగవిజ్ఞానం మీద పదివేల సంవత్సరాలు పరిశోధించి అభివృద్ధి చేసిన ఫలితం ఈ శాస్త్రం. దీని అర్థం ఏమిటంటే,
మొదటిది, ప్రతి నాగరికత తమ శక్తులన్నింటినీ ఏదో కొన్ని రంగాలపై కేంద్రీకరించింది. పశ్చిమదేశాలు, వారి ప్రయత్నాలన్నీ బాహ్య ప్రపంచం మీద కేంద్రీకరించి, సుఖంగా జీవించేందుకు కావలసిన సౌకర్యాలు చాలా కనుక్కున్నారు. బయటి ప్రపంచం మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు, మానవులకు అత్యంతసుఖజీవనానికి ఉపయోగపడే చాలా వస్తువులు కనుక్కున్నారు, సేవాసంస్థలు స్థాపించారు.
బాహ్యప్రపంచం మీద శాస్త్రం ఎలా ఉందో అలాగే అంతరంగ ప్రపంచం మీద కూడ శాస్త్రం ఉంది. అది మన అందరిలో ఉంది. అంతరంగ ప్రపంచ వైజ్ఞానికులు లేదా ఋషులు, మన మనస్సుని, అనుభూతి చెందే వివిధభావావేశాలను అదుపులో పెట్టడానికి ఎన్నో రకాల పద్ధతులను కనిపెట్టారు. సుమారు పదివేల సంవత్సరాల నుండి, మన అంతరంగ ప్రపంచ వైజ్ఞానికులు, మనకు భావావేశాల వల్ల కలిగే ఒత్తిడి, వ్యాకులతలను పోగొట్టుకోవడానికి కావలసిన పరికరాలు, సాంకేతిక పద్ధతులను కనుక్కున్నారు. మనం పరమానందంతో ఉండడానికి చాలా పద్ధతులని సృష్టించారు. ఈ సాంకేతికపద్ధతులనే, నేను ధ్యానపద్ధతులు అని అంటాను.
నాయకత్వం మీద నేను చెప్పబోయే విషయాలు, మన భావావేశాలను, మనస్సును అర్థం చేసుకోవడం మనం సంపూర్ణంగా సఫలమైన జీవితం గడపడానికి, అంతరంగవైజ్ఞానికులు చెప్పిన పద్ధతులు ఎలా ఉపయోగపడతాయో అన్నదానిపై ఆధారపడుతుంది.
చాలా సంస్థలలో నాయకులైనవారు, నాయకుడు అనే హోదా పొందారు కాని వారు నాయకుడు అన్న స్థితి పొందలేకపోయి ఉండవచ్చు. దీని అర్థం ఏమిటి? ఇది అర్థం చేసుకోవాలంటే, ఒక విజయవంతమైన నాయకుడిని తయారు చేయాలంటే కావలసిన అంశాలేమిటో అర్థం చేసుకుందాం.
విజయవంతడైన నాయకుడిని తయారు చేయడానికి కావలసిన ముఖ్య అంశాలు:
ఒక చిన్న కథ : ఒకప్పుడు రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం కొన్నాళ్ళు జరిగేసరికి ఆ సైనికులు అలసిపోయారు.
ఒక మిట్టమధ్యాహ్నం అలసిన సైనికులు పెద్ద గొయ్యి తవ్వుతున్న సమయంలో, ఒక వ్యక్తి సామాన్యపౌరుడి దుస్తులలో గుర్రం మీద ఆ దిశగా వెళ్ళాడు. ఆ సైనికుల నాయకుడు, వారిని గంట లోపల పని పూర్తి కాకపోతే, శిక్షిస్తానని బెదిరిస్తు గట్టిగా ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. గుర్రం మీద ఉన్న అపరిచితవ్యక్తి ఆగి, 'అయ్యా, మీరు వారి మీద అరుస్తూ ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నారు? మీరు కూడా వారికి సహాయం చేయొచ్చుకదా?' అని ఆ సైనికుల నాయకుడిని అడిగాడు. నాయకుడు ఆ వ్యక్తి వైపు చూసి, 'ఏమిటి మీ ఉద్దేశ్యం? నేను నాయకుడిని. నేను ఏది చెపితే అది ఆ సైనికులు చెయ్యాలి. మీకు అంతగా సహాయం చెయ్యాలి అని అనిపిస్తే మీరే వచ్చి చెయ్యండి' అని సమాధానం ఇచ్చాడు.
ఆ వ్యక్తి గుర్రం దిగి ఆ సైనికుల వైపు వెళ్ళాడు. పని పూర్తి అయ్యేవరకు, పరికరాలు తీసుకుని, ఆ సైనికులకి సహాయం చేశాడు. ఇది చూసి నాయకుడు ఆశ్చర్యపోయాడు.
ఆ వ్యక్తి తిరిగి వెళ్ళబోయే ముందు, సైనికులను మెచ్చుకొని, నాయకుడి వద్దకువెళ్ళి, ఈ సారి నీ హోదా సైనికులకి సహాయం చెయ్యడానికి అడ్డు వస్తే, నీ పై అధికారికి తెలియచేస్తే - నీకు ఏదో ఒక పరిష్కారం చెప్తారు. అని అన్నాడు.
ఆ సైనికుల నాయకుడు ఆశ్చర్యపోయి, ఆ వ్యక్తి కేసి నిశితంగా చూసాడు. అతను సైనికదళాధిపతి అని గుర్తించాడు.
ఇప్పుడు మనం, 'ఎన్ని సంస్థలలో అలాంటి నాయకులు ఉంటారు?' అని ప్రశ్నించుకోవాలి. మీకు తెలిసిన ఎంత మంది వ్యక్తులు ఆ సైనికుల నాయకుడిలాగా ఉంటారు. అలాగే ఎంత మంది సైన్యాధిపతిలా ఉంటారు. సంస్థలలో ఉండే చాలామంది నాయకులు కథలో సైనికనాయకుడిలా ఉంటారు అని అందరికి తెలుసు. వారికి నాయకుడనే హోదా ఉంటుంది కాని స్థితి ఉండదు.
పని పూర్తి కావాలని సహాయానికి సిద్ధంగా ఉండేవారు చాలా తక్కువమంది ఉంటారు.
సైన్యాధిపతి ఒక నిజమైన నాయకుడికి ఉండవలసిన లక్షణాలని వ్యక్తపరిచాడు.
1. నిజాయితీ, బాధ్యత.
2. ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధ కలిగి ఉండడం.
3. విశ్వాసం.
4. సామర్థ్యం - పలురకాలుగా ఆలోచించే నైపుణ్యం.
5. సవిస్తరంగా తెలుసుకోవటం మీద శ్రద్ధ.
6. సామర్థ్యం.
7. విస్తారంగా ఆలోచించి పని చేయటం.
ఈ లక్షణాలని మీకు వివరిస్తాను.
నాయకుడి చేతనస్థితి :
నాయకత్వం - ఒక వ్యక్తి చేతనస్థితిలో ఎంచుకున్న దాని ఫలితం
నాయకుడి చేతనస్థితి అనే పదానికి అర్థం ఏమిటి?
మనం చాలా మంది, నాయకుడు అనే హోదా పొందుతాం కాని ఆ స్థితిని కాదు. స్థితి, అన్నది హోదా కంటే పూర్తిగా భిన్నమైంది. హోదా అన్నది సమాజం నుండి వస్తుంది. మీరు ఒక జనసమూహానికి నాయకత్వం వహిస్తే, లేదా, ఒక సంస్థలో ఒక విభాగం బాధ్యత బలవంతంగా ఇవ్వబడితే లేదా, ఆశతో ఒక విభాగం బాధ్యత తీసుకుంటే మీకు నాయకుడన్న హోదా వస్తుంది. కాని 'స్థితి' అన్నది పూర్తిగా వేరుగా ఉంటుంది.
నేను 'స్థితి' అన్న పదం ఉపయోగిస్తే, మీ అంతరంగం ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని నా ఉద్దేశ్యం.
మనకి స్థితి లేకుండా హోదా వస్తే, వ్యాపారసంస్థలలో సమస్యలన్నీ మొదలవుతాయి - వ్యక్తిగతంగా టెన్షను, ఒత్తిడి, సామూహికంగా రాజకీయాలు, పరోక్షంగా నిందించడం, ఈ సమస్యలన్నీ మీరు హోదా పొంది, ఆ స్థితి చేరక ముందు ఉంటాయి.
తూర్పు దేశాల సంప్రదాయంలోని కొన్ని నిజాలు మీకు వివరిస్తాను - నాయకత్వచేతనస్థితి ఎలా పొందాలి, నాయకుడు హోదాయే కాకుండా స్థితిని కూడా ఎలా పొందాలి? హోదా సులభంగానే వస్తుంది, స్థితిని నిజంగా పొందాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి అయితే నాయకుడు అనే స్థితిని చేరుకుంటాడో, హోదా వెంటనే వస్తుంది. ఆ హోదా రావడానికి కొంత సమయం పట్టినా, అతను పెద్దగా పట్టించుకోడు, ఎందుకంటే అతను ఒక రాజులా జీవిస్తాడు. అతని జీవితం పూర్తి సంతృప్తితో నిండి ఉంటుంది. ఎవరైతే నాయకత్వ చేతనస్థితి పొందుతారో విలువ కట్టలేని సంతృప్తితో జీవిస్తారు.
నాయకుడి, హోదా Vs స్థితి!
నాయకుడి స్థితి అనే దానికి అర్థం ఏమిటి?
ఏ వ్యక్తి అయితే పూర్తి స్పృహతో, బాధ్యత తీసుకోవడానికి, జీవితం జీవించడానికి సిద్ధంగా ఉండి, తన పాతజ్ఞాపకాలమీద ఆధారపడడో, అతనే నిజమైన నాయకుడు. మీరు మీ జ్ఞాపకశక్తి మీద ఆధారపడి, లేదా జరిగిపోయిన జీవితం పైన ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే, మీరు కేవలం ఒక అనుసరించే వ్యక్తి మాత్రమే కాని మీరు నాయకుడు కాదు. అని స్పష్టంగా తెలుసుకోండి. పరిస్థితులకి అప్రయత్నంగా స్పందించడాన్నే, నేను బాధ్యత అని అంటాను. ఏ
వ్యక్తి అయితే పరిస్థితులకి అప్రయత్నంగా స్పందిస్తాడో, నిరంతరం స్వచ్ఛంగా, సచేతనంగా ఉండి పాత జ్ఞాపకాలలో ఉండిపోడో అతనే బాధ్యత గల నాయకుడు.
నాయకుడు స్థితి ఎలా పొందవచ్చో, ఎలా మనలో నాయకత్వచేతనస్థితి కలుగుతుందో, మనస్సు ఎలా పని చేస్తుందో అన్నవి, ఒక చిన్న బొమ్మతో వివరిస్తాను.
మనస్సు ఎలా పని చేస్తుందో అర్థం చేసుకుందాం - మనం విషయాన్ని గ్రహించి, అది విశ్లేషించిన తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామన్నది తెలుసుకుందాం.

ఉదాహరణకి మీరు కంటితో ఏదో చూస్తున్నారు. అది ఎలా క్రమబద్ధీకరించబడి ఎలా దాన్ని తయారు చేస్తుందో ఆ బొమ్మ చూపిస్తుంది. ఇది కేవలం కళ్ళతో చూసిన సమాచారమే కాదు. అది చెవుల ద్వారా, లేదా నాలుక ద్వారా, స్పర్శ ద్వారా లేదా ముక్కు ద్వారా, ఏ స్పర్శేంద్రియం నుంచి వచ్చిన సమాచారమైనా సరే అదే విధంగా మనలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఉదాహరణకి కళ్ళని తీసుకుందాం. కళ్ళు చూసిన సమాచారం ఒక ఫైలు రూపంలో చక్షువు (శక్తికేంద్రం) దగ్గరికి వెళ్తుంది. ఇది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ (Digital signal processor)గా పని చేస్తుంది. అలా కళ్ళ ద్వారా వచ్చిన సమాచారాన్ని చక్షువు, డిజిటల్ ఫైలు కింద మారుస్తుంది. ఈ ఫైలు 'చిత్తం' అనే భాగానికి వెళ్తుంది. ఇది కంప్యూటర్ మెమొరీ లాంటిది. ఉదాహరణకి మీరు ఈ పుస్తకం చూసినప్పుడు - అది ఒక ఫైలు క్రింద చక్షువు దగ్గరికి వెళ్తుంది. అక్కడ డిజిటల్ ఫైలుగా మారి 'చిత్తం' దగ్గరకి పంపబడుతుంది. 'చిత్తం' అంటే జ్ఞాపకాలు ఉండే భాగం, అది ఫైలుని విశ్లేషించడం మొదలుపెడుతుంది. 'ఇది రాయి కాదు, ఇది చెట్టుకాదు, ఇది జంతువు కాదు' అని చిత్తం ఫైలులో ఉన్న సమాచారంలోని అనవసరవిషయాలని తొలగిస్తుంది. ఇలా తీసేసే కార్యక్రమం 'చిత్తం'లో జరుగుతుంది. ఇప్పుడు ఆ ఫైలు మనస్సు లోనికి వెళ్తుంది. మనస్సు ఆ ఫైలుని గుర్తిస్తుంది. మనస్సు ఆ ఫైలుని 'ఇది ఒక పుస్తకం', ఇది ఆధ్యాత్మికత మీద రాసిన పుస్తకం' 'ఇది ఒక జ్ఞానోదయమైన గురువుచే రాయబడింది' అని గుర్తిస్తుంది. గుర్తింపబడిన తరువాత ఆ ఫైలు 'అహం' అనే చోటుకి వెళ్తుంది. ఇది నిర్ణయాలు చేసే కేంద్రం. మీ 'అహం'లో మీకు ఉన్న పరిస్థితికి ఏమిటి సంబంధం అని ఆలోచన మొదలవుతుంది. ఈ రకమైన పుస్తకాలతో మీ పూర్వానుభవాలు బాగుంటే, మీరు ఈ పుస్తకం చదువుతారు. మీ పూర్వ అనుభవాలు బావుండకపోతే, 'ఇది వరకు ఇలాంటి పుస్తకం చదివినప్పుడు చాలా విసుగు కలిగింది, ఇలాంటి పుస్తకాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు' అని అనిపించి, పుస్తకం చదవరు. మీ పూర్వానుభవాల మీద మీ అహం నిర్ణయం తీసుకుంటుంది. ఈ విధంగా మీ మనస్సు పని చేస్తుంది.
ఇప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన ముఖ్యవిషయం ఏమంటే, నిర్ణయాలు అచేతనంగా జరుగుతాయి అని.
పైన చెప్పిన విధంగా సూటిగా మనస్సు నిర్ణయం తీసుకుంటే, ఏ విధమైన సమస్యా లేకుండా మీ జీవితంలో పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ప్రతీదీ స్పష్టంగా, సూటిగా ఉంటుంది. కాని జరిగే పని ఎప్పుడు సూటిగా జరగదు. కొన్నిసార్లు కొన్ని విషయాలు అచేతనంగా జరుగుతాయి. ఉదాహరణకి, మీరు ఇలాంటి పుస్తకం చదివినప్పుడు, అందులోని ఏ విషయమైనా మిమ్మల్ని బాధపెట్టినా లేదా మిమ్మల్ని కలవరపెట్టి ఉంటే, ఈ పుస్తకం చూసిన వెంటనే, ఆ జ్ఞాపకం అచేతనంగా బైటికి వస్తుంది.
చూడండి, మీ జీవితంలో ఒక ప్రత్యేకసంఘటన వల్ల లేదా, ఏదైనా ఒక రంగు దుస్తులు ధరించిన వ్యక్తి వల్ల కాని మీకు బాధ కలిగి ఉంటే, అదే ప్రదేశానికి వెళ్లినప్పుడు లేదా అదే రంగు దుస్తులు ధరించిన వ్యక్తిని చూసినప్పుడు, మీ పాత అనుభవాలకి ఏమీ సంబంధం లేదని తెలిసినా, మీకు మళ్ళీ అలాంటి భావనే కలుగుతుంది. అదే మీ మనస్సులో జ్ఞాపకంగా ఉండిపోతుంది. అదే అనుభవం మళ్ళీ కలుగుతుంది. వీటినే నేను 'సంస్కారాలు' అని అంటాను. నిలువ చేసి ఉంచిన పాత జ్ఞాపకాలు.
ఈ పాత జ్ఞాపకాలు, మీ నిర్ణయించే సామర్థ్యాన్ని కలవరపెడతాయి. మనస్సు పని చేసే విధానం అనే బొమ్మలో నేను చెప్పిన కార్యక్రమం అంతా చేతనస్థితిలో జరిగితే ఆ కార్యక్రమం సూటిగా ఉంటుంది. కాని అది అచేతనస్థితిలో జరగటం వల్ల కార్యక్రమం సూటిగా ఉండదు. ఇదే స్థానంలో రాజకీయాలు జరుగుతాయి. ఈ ప్రదేశంలోనే పాత జ్ఞాపకాలు లేదా ఎన్ గ్రాములు ఉండి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియనియ్యవు. మీకు అచేతనస్థితిలో మనస్సు ఎలా పని చేస్తుందో బాగా అర్థం అవడానికి ఇంకొక ఉదాహరణ ఇస్తాను.
మీరు చేతనస్థితిలో విశ్లేషిస్తే, పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని మీకందరికీ తెలుసు. మీ జ్ఞానేంద్రియాలు గ్రహించిన సమాచారం, ఒక పద్ధతిలో కంటి నుండి మనస్సు వరకు వెళితే, మీకు పొగతాగటం ఆరోగ్యానికి హానికరం అని స్పష్టంగా తెలుస్తుంది. మీ తర్కబుద్ధి మీకు పొగ తాగవద్దు అని చెప్పినా, వెంటనే మీరు పొగ తాగాలని నిర్ణయించుకుంటారు. మీ తర్కానికి, చేతనస్థితికి వ్యతిరేకంగా, ఇక్కడె అచేతనంగా ఉన్న ఎన్గ్రామ్స్ ఉంటాయి.
చేతనంగా మీకు పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా సమాచారం ఫైలు రూపంలో అహం దగ్గరకి వెళ్ళేసరికి పొగ తాగాలని నిర్ణయం తీసుకుంటారు. మీలో ఏదో జ్ఞాపకం లేదా ఏదో అనుభవం పొగ తాగినప్పుడు హాయిగా ఉండి ఉంటుంది, లేదా మీరు చిన్నప్పుడు సిగరెట్టు కాల్చినప్పుడు నేను ఒక 'హీరో'ని అన్న భావం మీలో కలిగిఉండచ్చు. ఈ అలవాటుతో ఇలాంటి ఎన్గ్రామ్స్ (engrams) కి సంబంధం ఉండబట్టి మీకు చేతనంగా పొగ తాగడం హానికరం అని తెలిసినా వెంటనే పొగ తాగాలి అన్న నిర్ణయం తీసుకుంటారు.
ఇదే విధంగా, మీ జీవితంలో చాలా సార్లు, మీకు ఏది సరైనదో తెలిసినా, మీ సంస్కారం వల్ల అచేతన స్థితిలో నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవితం అచేతనంగా ఉన్న సంస్కారాల నియంత్రణలో ఉంటుంది మీ నియంత్రణలో ఉండదు.
మీ నిర్ణయాలు మీరు చేస్తున్నారని అనుకుంటారు, కాని అన్నీ సంస్కారాలే నిర్ణయిస్తాయి.
మన ప్రవర్తనకి ఈ సంస్కారాలే మూలకారణం. వీటి కారణంగా మనం ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాం. సంస్కారాలు మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మన అభిప్రాయాల్ని మబ్బులా కప్పేస్తాయి. ఒక సంస్థలో మనం నిర్వహించే పనిపై ఆ సంస్కారాలు ప్రభావం చూపిస్తాయి. ఇవి మన ఉత్పాదకత, అంతర వ్యక్తిగతసంబంధాల మీద, పని, అభిప్రాయాలు, మన అన్ని స్పందనల, మన ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తాయి. వ్యాపారసంస్థల ట్రైనింగులో, నాయకత్వలక్షణాలను పెంపొందించుకునేటప్పుడు, ఈ సంస్కారాలు అంటే ఏ విధమైన ప్రాముఖ్యమూ ఇవ్వరు, ఇవి ఎవరికీ అర్థం కావు.
మనలో పాత జ్ఞాపకాలను తుడిచేయడానికి, తూర్పుదేశపు ఋషులు, అంతరంగ ప్రపంచశాస్త్రవేత్తలు ధ్యానపద్ధతులను కనుగొనటానికి కొన్ని వేల సంవత్సరాలు పరిశోధన చేశారు. ఈ సంస్కారాలని ధ్యాన పద్ధతుల ద్వారా సమర్థంగా తుడిచేయొచ్చు.
నేను ఈ మధ్యనే ఒకరి ఇంటికి వెళ్లినప్పుడు, వారి గదిలో ఉన్న చక్కని వాక్యాన్ని చూసాను.
‘నేను ఈ ఇంటి యజమానిని, అలా అనడానికి నాభార్య అనుమతి ఇచ్చింది.’ అలాగే మీరు యజమాని అని మీరు అనుకోవచ్చు, కాని మీలో అచేతనంగా ఉన్న సంస్కారాలు మీకు తోవ చూపిస్తున్నాయి. మీరు ఈ అచేతనంగా ఉన్న సంస్కారాలలో చిక్కుకుని ఉన్నంత వరకు, మీరు నాయకుడు అన్న స్థితికి చేరుకోలేరు. మీరు చాలా కష్టపడి, బాధతో నాయకుడు అన్న హోదా సంపాదించుకోగలరు. మీరు నాయకుడి కుర్చీలో చాలా ప్రయాస, ఆవేదనలతో కూర్చుంటే, మీ అనుచరులకి కూడా అదే ప్రయాస, ఆవేదన కలిగిస్తారని స్పష్టంగా తెలుసుకోండి.
ఈ స్థాయికి వచ్చాను, ‘నేను ఎంతో ప్రయాసపడి, చాలా బాధపడి ఈ స్థాయికి వచ్చాను. వారు కూడా ఎందుకు బాధపడకూడదు’ అని పదే పదే మీ మనస్సు చెప్తుంది. ఇది సంస్థలో వారిని నిరుత్సాహపరిచే అంశం.
నిర్ణయం తీసుకోవడం, ఒత్తిడి
ఇప్పుడు కొన్ని ముఖ్యమైన నిజాలని చెబుతాను.
మీరు చేతనంగా నిర్ణయాలు తీసుకుంటే మీకు ఎప్పుడూ ఒత్తిడి ఉండదు. మీరు అచేతనంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు సంస్కారాలు అడ్డుపడితే, ఒత్తిడి కలుగుతుంది. అన్నీ సవ్యంగా జరిగితే, మీరు వేల నిర్ణయాలు తీసుకున్నా హాయిగా ఉంటారు. మీ జీవితం ఒక నదిలా ప్రవహిస్తుంది.
కాని మీరు సంస్కారాలతో నింపబడి ఉన్నప్పుడు రెండు - మూడు నిర్ణయాలు తీసుకున్న తరువాత, మీరు పూర్తిగా అలసిపోతారు. మీరు పని చేయకుండానే, కుర్చీలో కూర్చుని, పని గురించి ఆలోచిస్తే అరగంటలో భుజం నొప్పి పుడుతుంది. అంటే మీరు సంస్కారాల్లో చిక్కుకుని ఉన్నారని అర్థం. అవి మిమ్మల్ని నిర్ణయాలు తీసుకోనియ్యవు.
ఫైల్ మనస్సు నుండి పెద్ద అడుగుతో వెళ్లినప్పుడు, దాని మీద ప్రతి సంస్కారం తన అభిప్రాయాన్ని రాస్తుంది. ఎన్ని ఎక్కువ సంస్కారాలు ఉంటే, అన్ని ఎక్కువ నిర్ణయాలు ఉంటాయి, అందుకే ఫైలు అహాన్ని చేరుకున్నప్పుడు, పూర్తిగా తిక్కమక పడుతుంది. ఆ ఫైలు మీద 300 అభిప్రాయాలు ఉంటే, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? మీ అహం, ‘నీకు కావలసిన విధంగా చేసుకో, నన్ను వదిలేయి’ అని అంటుంది. మీకు నిర్ణయం తీసుకునే ఓపిక ఉండదు. ఏ విధమైన స్పష్టతా లేకుండా క్రమపద్ధతి లేని నిర్ణయాలు తీసుకుంటారు.
మీరు నిరంతరం స్పష్టత లేకుండా నాయకుడి కుర్చీలో కూర్చుని నిర్ణయిస్తే, మీరు బాధపడటమే కాకుండా ఇతరుల్ని కూడా బాధపెడతారు అన్న విషయం స్పష్టంగా తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా నాయకులే. మీరు మీ టీముకి నాయకులు లేదా మీ ఇంటికి నాయకులు. ఏదో ఒక రీతిలో మనమంతా నాయకులమే. ఏ వ్యక్తి అయితే సంస్కారాల్లో చిక్కుకుని ఉంటాడో, ఎవరైతే సంస్కారాలతో బాధపడతాడో అతను హాయిగా ఉండలేడు, సెలవులకి ఎక్కడికీ వెళ్ళలేడు. మీ నిజజీవితంలో మీరు ఉదయం లేచి పళ్ళు తోముకుంటునప్పుడు మీ మనస్సు ఆఫీసులో ఉంటుంది. మీరు ఆఫీసులో పని చేస్తున్నప్పుడు, మనస్సు సాయంత్రం బీచ్ దగ్గర ఏం చెయ్యాలి అని అనుకుంటుంది. మీరు బీచ్ లో కూర్చుని ఉన్నప్పుడు మనస్సు ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక్కటి మటుకు కచ్చితంగా చెప్పొచ్చు, మీ శరీరం ఇక్కడ ఉంటే మనస్సు ఎక్కడో ఉంటుంది.
మీ శరీరం ఉన్న ప్రదేశంలో మీరు వుండరు. మీరు నిరంతరం ఎక్కడో ఉంటారు. మీరు ఇంట్లో వుండి వ్యధ చెందితే మీరు ఇంటి నుండి పని చేస్తున్నట్టు అని నేను చాలామందికి చెప్తాను. మీరు ఆఫీసులో ఉండి వ్యధ చెందితే అక్కడ ఉద్యోగం చేస్తున్నట్టు. మీరు బీచ్ లో కూర్చుని బాధపడితే, మీరు సెలవులో ఉన్నట్టే. అది అంతే. స్థలం వేరు కావచ్చు కాని మీ మానసికవ్యవస్థ ఒక్కటే.
ఏ వ్యక్తిలో అయితే సంస్కారాలు నిండి ఉంటాయో అతను హాయిగా ఉండలేడు. అలాంటి వ్యక్తి నుండి సృజనాత్మకత, సరైన నిర్ణయాలు ఆశించలేం. ఎవరైతే సంస్కారాలతో చిక్కుకుని ఉంటారో, వారు జీవితాన్ని పూర్తిగా జీవించలేరు, సెలవులు తీసుకోలేరు. పని లేదా సెలవులు, జీవించడం లేదా వెళ్ళిపోవడం అన్నీ మీ చేతనస్థితికి సంబంధించినవే. వాటికి మీ ఉనికితో సంబంధం ఉంది, మీరు చేసేదాంతో కాదు. ఏ వ్యక్తికి తన ఉనికి పైన ఎరుక ఉంటుందో, కేవలం అతనే నాయకుడి చేతనాన్ని పొందుతాడు.
ఉత్పత్తిదాన నిర్వచనాలు, అర్ధం చేసుకోవటం
ఒక చిన్నకథ : ఒకసారి యజమాని తన ఉద్యోగిని 'ఇంత చిన్న పని పూర్తిచెయ్యడానికి ఆరు నెలలు ఎందుకు పట్టింది?' అని అడిగాడు.
'మీరు ఇచ్చిన అవకతవక సూచనలు, నిరంతర మార్పులు, తక్కువ పని దినాల వల్ల' అని ఉద్యోగి సమాధానం చెప్పాడు.
'నేను నీలాంటి బద్ధకస్తుడి గురించే ఎదురుచూస్తున్నాను' అని యజమాని అన్నాడు.
ఉత్పాదాన గురించి వ్యాపారసంస్థల్లో చాలా చెప్పారు, రాసారు కూడా. రెండు లేదా మూడు దశాబ్దాల నుండి, సంస్థల్లో 'ఉత్పాదాన' అనేది ఒక మంత్రం అయిపోయింది.
కంఫ్యూటర్లు వచ్చిన తరువాత, కొత్తగా సందేశాలు పంపడానికి ఇంటర్నెట్, సెల్ ఫోను వచ్చిన తరువాత, మన ప్రపంచం చాలా చిన్న ప్రదేశం అయిపోయింది. వ్యాపారసంస్థల్లో ఉత్పాదాన పెరిగినా అది ఉద్యోగుల భౌతిక మానసికఆరోగ్యాల మీద దెబ్బ తీసింది. ఇప్పుడు
మనం ఉత్పాద న అంటే ఏమిటి, దాన్ని ఉద్యోగులకి ఒత్తిడి కలగకుండా ఎలా పెంపొందించాలన్నది అర్థం చేసుకుందాం.
సరళమైన పదాల్లో
ఉత్పాదన = Output/Input
ఒక వ్యాపారసంస్థ ఉత్పాదక కొలత, ఒక వ్యక్తి లేదా జట్టు చేసే పనుల సంఖ్య. ఒక ప్రాజెక్టుకి ఎన్ని గంటలు పని చేశారు అన్నది ఉత్పాదక కొలతని ఇస్తుంది.
ఉత్పాదన మీద సంస్కారాల ప్రభావం
మానవుల ఉత్పాదనశక్తి పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారసంస్థలు కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. చాలా సంస్థల ప్రయత్నాలు సంస్థకి ముఖ్యమైన రంగాలలో నైపుణ్యాన్ని పెంచడానికి శిక్షణ ఇప్పించడం లేదా సాంకేతికపద్ధతులను మెరుగు పరచడం, అంటే కంప్యూటర్ల ఉపయోగం, ఇంటర్నెట్ లేదా సందేశం పంపడానికి క్రొత్త విధానాలు అమలుపరచడం మీద కేంద్రీకృతమైనాయి. కొన్ని కంపెనీలు, అంతర వ్యక్తిగతనైపుణ్యం, జట్టు నిర్మాణంలో నైపుణ్యం అనే సాఫ్ట్ స్కిల్సు పెంపొందించడానికి పెట్టుబడి పెట్టారు. ఇలాంటి శిక్షణలన్నీ వ్యక్తుల చేతనస్థితి పైపైన ఉన్న స్వభావం, పనులు, గ్రహింపు మొదలైనవి మారడానికి ఉపయోగపడతాయి. కాని 90% మన భావావేశాలు, స్వభావాలు మనస్సులో లోతుగా స్థిరపడి ఉంటాయి. దీన్నే సిగ్మండ్ ఫ్రాయిడ్ అచేతనమనస్సు అని అంటాడు.
మనస్సుని చూస్తే చేతనస్థితిలో ఆలోచనలు, జ్ఞానం పోగుచేయబడి ఉంటాయి. కాని లోతుగా జ్ఞాపకాలలో సమస్యలకు పరిష్కరించుకోవడానికి కావలసిన జ్ఞానం ఉంటుంది. అచేతనస్థాయిలో చాలా భావావేశాలు, అనుభవాలు నిక్షిప్తమై ఉంటాయి. ఇక్కడై సంస్కారాలు ఉంటాయి.
మనం నిజానికి, ఏ క్షణమైనా బద్దలయే భావావేశాలు అనే అగ్నిపర్వతం మీద కూర్చుని ఉంటాం. ఈ దాగి ఉన్న భావావేశాలే మనం అప్పుడప్పుడు తర్కవిరుద్ధం, సామర్థ్యం లేకుండా ప్రవర్తించడానికి కారణం అవుతాయి.
అందుకే సంస్కారాలు మనం నిర్ణయాలు చేసేటప్పుడు అడ్డుపడతాయి. వీటిని మనస్సులో ఉన్న పనికి రాని విషయాలని అంటాం. ఎక్కువ సంఖ్యలో సంస్కారాలు ఉంటే మన ఆలోచనాస్థితి మబ్బుకమ్మి ఉంటుంది. మన ఉత్పాదకశక్తి తగ్గిపోతుంది. ఇంకోవిధంగా చెప్పాలంటే చాలా సంస్కారాలు ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన ఉత్పాదన చేయాలంటే ఎక్కువ కాలం లేదా ఎక్కువ మనుష్యులు, డబ్బు అవసరం. దీని వల్ల ఉత్పత్తి తగ్గుతుంది.
అచేతనమనస్సు ఫ్రాయిడ్ వివరణ
సైకాలజీ చదివిన పాఠకులకి, మనస్సుకి ఫ్రాయిడ్ ఇచ్చిన వివరణ తెలిసే ఉంటుంది. వ్యాపారసంస్థలు ఇచ్చే సాంప్రదాయక శిక్షణ కేవలం 10శాతమే మనలోని శక్తిని ఉపయోగించేలా చేస్తుంది. మీలో సంస్కారాల్ని తుడిచేస్తే మిగిలిన 90 శాతం ఉపయోగంలోకి వస్తుంది. మీలో నిక్షిప్తమైన అద్భుతశక్తిని ధ్యానం ద్వారా సాధించవచ్చు.
నేను ఇంత వరకు వివరించిన దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. 15 నిమిషాలు మీ సమయంలో ఈ చిన్న సాధన చెయ్యడానికి వినియోగించండి. ఒక తెల్ల కాగితం తీసుకుని, మీ మనస్సులోకి ఎం వస్తే అది రాయండి. మీ మనస్సులో వచ్చిన ఆలోచనల్ని యథాతథంగా రాయండి. వేటినీ తీసివేయొద్దు. అభిప్రాయం మార్చుకోవద్దు. మీకు ఒక ఆలోచన రికార్డర్ పెట్టారనుకుని, మీకు వచ్చే ఆలోచనలన్నీ అందులోకి వెళ్తున్నాయనుకోండి. 15 నిమిషాలు తరువాత, రాసినవి చదువుకోండి.
మీరు నిజాయితీగా రాస్తే, మీ మనస్సులో ఆలోచనలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అర్థం లేకుండా ఉన్నట్టు తెలుసుకుంటారు. ఈ ఆలోచనలు, యంత్రంలో ఘర్షణలా ఉంటాయి. అవి యంత్రాన్ని పనికి రాకుండా, ఉత్పాదన లేకుండా చేస్తాయి. అదే తక్కువ ఉత్పాదనకి మూలకారణం. నా శిష్యులు చాలామంది చేతనంగా వారి సంస్కారాల్ని పోగొట్టుకోడానికి సాధన చేసి నాదగ్గరకు వచ్చి ఇలా చెప్పారు. వారు తమ జీవితంలో, అస్థిరమనస్సుతో, ఆలోచనలతో బాధ పడటం లేదు అని చెప్పారు. దానితో వారి బిజీ జీవితంలో కావలసినంత సమయం దొరుకుతుంది అని చెప్పారు.
సంస్కారాల వల్ల వచ్చే అర్థం లేని ఆలోచనలని తొలగించటానికి ఉపయోగపడే పద్ధతి ధ్యానం అని నేను అంటాను. ఈ ఆలోచనలు తొలగించడం అనేది యంత్రంలో ఘర్షణ తొలగించి, యంత్రాన్ని సమర్థంగా పని చేయించి ఉత్పాదన పెంచడమే.
అన్ని జాతులు, కులాలు, సామాజిక, ఆర్థికనేపథ్యం ఉన్నవారు వేలమంది మా ధ్యానకార్యక్రమాల్లో సంస్కారాలను పోగొట్టుకున్నారు. వారి ఉత్పాదకశక్తి పెరిగింది, పరస్పరసంబంధబాంధవ్యాలు మెరుగుపడి, ఒత్తిడి లేకుండా, వారి వ్యక్తిగతవృత్తివ్యాపార జీవితాలలో సృజనాత్మకత పెరిగిందని చెప్పారు.
కొంత మంది కార్పొరేట్ నాయకులకి నోబెల్ బహుమతి గ్రహీతలకి నాతో ఈ విషయం మీద ఆసక్తికరమైన సంభాషణలు జరిగాయి. వారి సంస్కారాలు తొలగిపోయిన తరువాత వారి అంతఃప్రేరణ మెరుగైనట్లు, అద్భుతమైన ఆ అనుభవాన్ని నాతో పంచుకున్నారు.
ఇప్పుడు ఉత్పాదనసమీకరణాన్ని ఈ క్రింది విధంగా రాయవచ్చు.
ఉత్పాదన = Output/Input
Input = (వివేకం + సాంకేతికనైపుణాలు + సంస్కారాలు)
మీకు తెలిసినట్టు మనం రోజుకి 24 గం. సంవత్సరానికి 365 రోజులు మనస్సుతోనే ఉంటాం. చాలామందికి మనస్సు ఎప్పుడూ పరుగెడుతూ, విశ్లేషణ చేస్తూ, వ్యక్తులపై అభిప్రాయాలు ఏర్పర్చుకుంటూ, రకరకాల భావావేశాలతో, సంఘటనలకి స్పందిస్తూ ఉంటుంది. ఇది అంతా వారిని వెంటాడుతున్న సంస్కారాలపై ఆధారపడిఉంటుంది.
ఈ సంస్కారాల బరువు లేకపోతే, మీ అంతరంగవివేకం, మీరు నేర్చుకున్న నైపుణాలు, మీ జీవితానుభవాలూ, మీరు చేసే పనికి ఉపయోగపడతాయి. ఉత్పాదన పైకి దూసుకుపోతుంది.
ఈ విషయంపై వ్యాపారసంస్థలు ఎక్కువ దృష్టి పెట్టలేదు. ఈ సంస్కారాల్ని తుడిచేయడానికి, యోగులు అభివృద్ధి చేసిన ధ్యాన పద్ధతులు ఉన్నాయి.
కొన్నిసార్లు కొంత మంది వ్యక్తులు ‘ఈ సంస్కారాలు లేకపోతే మేం ఆలోచించడం మానేస్తామా? మేం సోమరులుగా, ఉంటామా?’ అని నన్ను అడుగుతారు. నిజానికి దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. నేను ఇంతకు ముందు మీకు ఇచ్చిన అభ్యాసాన్ని గుర్తుచేసుకోండి. 15 నిమిషాలు, తెల్ల కాగితంపై మీ ఆలోచనలు రాయమన్నాను. మీ మనస్సులో ఏ సంస్కారాలు లేకపోతే, మీ వివేకంలో పెద్ద అడుగుని చూస్తారు. మేధలో కొత్త ప్రదేశం ఏర్పడి మీ సృజనాత్మకశక్తి పెరుగుతుంది. ఆకస్మాత్తుగా మీ అంతఃప్రేరణ, నైపుణ్యం అభివృద్ధి చెందుతాయి. మీరు ప్రవేశించేది మార్మికమండలం కాదని అర్థం చేసుకోండి. అంతఃప్రేరణ నైపుణాలు మన అందరిలో ఉంటాయని స్పష్టంగా తెలుసుకోండి. అవి సంస్కారాల ప్రభావం వల్ల మేఘావృతమై ఉన్నాయి. ఇప్పుడు నేను, సంస్కారాలు లేని, మనస్సు - శరీరవ్యవస్థలో, అంతఃప్రేరణ, నూతనకల్పనాశక్తి ఎలా వృద్ధి చెందుతాయో వివరిస్తాను.
అంతఃప్రేరణ సంస్కారాల ప్రభావం
అంతఃప్రేరణ అన్నది అద్భుతమైన విషయం. ఆధునిక సి.ఇ.ఓ. లని వారి జీవితంలో మలుపు ఎలా వచ్చింది, వారు ప్రధానమైన నిర్ణయాలు ఎలా చేశారని అడిగితే వచ్చే సమాధానాలు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
వారు పదే పదే మేధకి అతీతమైన శక్తి ఏదో వారికి నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని, శక్తిని ఇచ్చిందని, అందువల్ల జీవితంలో విజయం పొందామని చెప్తారు. ఇది సఫలమైన సి.ఇ.ఓ.లకే పరిమితం కాదు. శాస్త్రవేత్తలు కూడా అదే అంటారు.
ఆ మధ్య, నాకు డా. ఛార్లెస్ టౌన్స్, (భౌతికశాస్త్రం నోబుల్ గ్రహీత) ని కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు నేను ఆయనని ‘మీరు లేజర్ కనిపెట్టడం ఎలా జరిగింది? అది మీరు ఎలా తయారు చేయగలిగారు?’ అని అడిగాను. ‘నేను వాషింగ్టన్ డి.సి.లో ఒక పార్కులో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా ఏదో జరిగింది. నాకు ముగింపు ఏమిటో తెలిసింది. నాకు కలిగిన అనుభూతిని రాసాను. కాని అప్పుడు ఒక పెద్ద ఇబ్బంది వచ్చింది. నాకు ముగింపు తెలిసింది కాని, అది ఏ విధంగా నిరూపించాలో తెలియలేదు. అందుకే అది ఎవరికి చెప్పలేకపోయాను.’ అని అందమైన సమాధానం ఇచ్చారు.
ఇదే విధంగా ఆల్బర్ట్ ఐన్స్టీనుకి కూడా జరిగింది. ‘నాకు ఏది కొత్తగా తట్టినా అది అంతఃప్రేరణ వల్ల వచ్చింది. వివేకం వలన కాదు’అని ఆయన అంటారు, ‘అంతః ప్రేరితమైన మనస్సు ఒక పవిత్రమైన బహుమతి, హేతుబద్ధమైన మనస్సు విశ్వాసం గలసేవకుడు. మనం సేవకుడిని సన్మానించి, ఆ బహుమతిని మరిచిపోయిన సమాజాన్ని నిర్మించాం’ అని ఆయన చక్కగా చెప్పారు.
మనం నమ్మినా, నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, అంతఃప్రేరణ లేదా ఆత్మప్రబోధస్థితి అనేది ఉన్నది. ఆల్బర్ట్ ఐన్స్టీను దీన్ని బహుమతి అంటారు, ఎందుకంటే, అదిఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో అనేది కచ్చితంగా చెప్పలేం. మీరు దాని గురించి సాధన చేస్తే తప్పకుండా వస్తుంది అని యోగులు, ఋషులు పదే పదే చెప్తారు. మీరు అది ఒక బహుమానం అని అనుకోనక్కర్లేదు. దాని గురించి సాధన చేయొచ్చు. అప్పుడు, ఆత్మప్రబోధం మీ జీవితంలో ఒక భాగం అవుతుంది. కొత్తవి ఎంజరిగినా, మీ వివేకానికి అతీతంగా ఉన్నప్పుడు, అంతఃప్రేరణతో జరిగినవే.
మీరు ఉన్నతశిఖరాన ఉన్నప్పుడు, ఏదో వికసిస్తుంది, వివేకానికి అతీతంగా జరిగేదాన్నే అంతఃప్రేరణ లేదా వెల్లడి చేయటం అంటాం. ఋషులు పదే పదే అది ఒక శాస్త్రం అని చెప్పారు. మీ ఉనికిలో నిరంతరం దొరికే అంతఃప్రేరణ అనే శక్తిని శ్రుతి చేసుకుంటే, మీ నిజజీవితంలో ఈ శక్తిని ఉపయోగించవచ్చు. ఋషులు పదే పదే అది సంభవించేది అని చెప్తారు. మీరు కూడా అంతఃప్రేరణ కలిగేట్టు చేసుకోవచ్చు. ఋషులకి అది జరిగేట్టు ఎలా చెయ్యాలో తెలుసు. ఆ శక్తిని మీలో ఎలా మేలుకొల్పాలో అన్నది మనం చూద్దాం. మనం ఇంత క్రితం చర్చించుకున్న మనస్సు ఎలా పని చేస్తుంది అన్న విషయానికి ఈ అంతఃప్రేరణ నైపుణ్యాలు ఎలా జోడించాలో చూద్దాం.
అంతఃప్రేరణ గురించి విపులంగా చర్చించే ముందు, అది ప్రకృతిలో అనుకోకుండా సంభవించేది అనే ఊహని పోగొట్టాలి. మీరు అలవరచుకునే నైపుణ్యాల లాగే, అంతఃప్రేరణ అనే నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. అది ఎవరి దగ్గర నుండో కాదు, మీ నుండే వస్తుంది. మనం ఆ భాగాన్ని, మన ఉనికి ఆ పరిమాణాన్ని అనుభూతి చెందలేదు కాబట్టి మనం అది మరిచిపోయాం. ఒక ధ్యాన కార్యక్రమంలో ఒకతను నాతో, నాకు ఎవరో జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆ మరు క్షణంలో ఫోను మోగినప్పుడు తీస్తే, అతనే మాట్లాడాడు. ఒక పార్టీలో ఎవరో గుర్తుకి వస్తే, మరు క్షణం అతన్ని చూసాను.’ అని అన్నాడు. నేను ఆ కార్యక్రమంలో ఉన్న మిగతావారిని, వారి జీవితాలలో ఇలాంటి సంఘటన ఒక్కసారైనా జరిగిందా అని ప్రశ్నించాను. 70 శాతం మంది జరిగిందని చెప్పారు. అది ఒక వ్యక్తికి జరిగితే దాన్ని యాదృచ్ఛికసంఘటన అంటాం. అది 70 శాతం మందికి జరిగితే యాదృచ్ఛికం అని అనలేం. దాని వెనక ఏదో కారణం ఉన్నది.
దాన్ని తార్కికంగా తెలుసుకోలేం కాని పూర్తిగా కొట్టి పారేయలేం. తర్కపరంగా తెలిస్తే, దాన్ని సంఘటన అంటారు. తర్కబద్ధంగా తెలియకపోతే యాదృచ్ఛికం అంటారు. ఈ భూమి మీద కారణం లేకుండా ఏదీ జరగదు. అది ఎప్పుడూ కారణం - ప్రభావంతో ఉంటుంది. మీకు కారణం - ప్రభావం మధ్య లింకు తెలిస్తే దాన్ని సంఘటన అంటారు. మీకు ఆ సంబంధం తెలియకపోతే దాన్ని యాదృచ్ఛికం అంటాం.
అంతఃప్రేరణని అర్థం చేసుకునే ఈ కార్యక్రమంలో ఒకసారి ముందు చెప్పిన మనస్సు బొమ్మని గుర్తు చేసుకుందాం. కళ్ళు చూసిన సమాచారాన్ని చక్షువు వద్దకి పంపిస్తుంది. చక్షువు నుండి చిత్తానికి, చిత్తం నుండి మనస్సుకి వెళ్లి, అక్కడి నుండి అహానికి ఒక పెద్ద అడుగు వేస్తుంది. ఆ సంస్కారాలతో మబ్బు కమ్మిన అహంలో నిర్ణయాలు జరుగుతాయి.
కంటికి, మనస్సు మధ్య జరిగే కార్యక్రమం చేతనంగా జరుగుతుంది. మీకు ఇది తెలుస్తుంది. అది మీ ఎరుకతో జరుగుతుంది. కాని మనస్సుకి అహానికి మధ్య జరిగే పని అచేతనంగా జరుగుతుంది. అది మీకు చాలాసార్లు తెలియదు. మీ ఆలోచనపద్ధతికి వ్యతిరేకంగా నిర్ణయం చేస్తారు. ఉదాహరణకి, మీరు సేకరించిన సమాచారంతో, మీకు పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, అది మీ శరీరానికి మంచిది కాదని తెలుసు. కాని మనస్సు అచేతనంగా అహానికి ఒక గంతు వేస్తే, మీరు పొగతాగాలన్న నిర్ణయం తీసుకుంటారు.
చేతనస్థితి, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తుంది. కాని అచేతనంగా జరిగిన పని - ఏమి చెప్పకుండానే, నిర్ణయం తీసుకుంటుంది. మీరు అది అమలుపరుస్తారు. అచేతనస్థితి చాలా శక్తి కలది కాబట్టి ఈ నిర్ణయాలు మీ అధీనంలో ఉండవు. అచేతన మనస్సు మూడు స్థాయిలలో పని చేస్తుంది. - సహజస్థాయి, వివేకస్థాయి, అంతఃప్రేరణస్థాయి. అచేతనస్థితి, జ్ఞాపకాలు అసహనంతో నిండి ఉంటే, అది సహజస్థాయిలో పని చేస్తుంది. మీరు వెంటనే నిర్ణయం తీసుకుంటారు. మీకు కోపం ఎందుకు ఉందో కూడా తెలియదు. అకస్మాత్తుగా విరుచుకుపడతారు. కొన్ని సార్లు మీరు చేసే పనులు, లేదా మీరు మాట్లాడే మాటలు, మీవి కావు అని అనిపిస్తుంది. మీరు ఏదో చేశాక ఇలా ఆలోచిస్తారు - 'ఇది నేను కాదే. నేను ఇలా ఎలా చేశాను, ఎలా జరగనిచ్చాను?'అని. మీ అచేతనస్థితి సహజస్థాయిలో ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది.
చాలా సార్లు మనం హేతుబద్ధంగా ఆలోచించం. ఉదాహరణకి, మీరు తెల్ల డ్రెస్సు వేసుకున్న వ్యక్తివల్ల బాధపడితే, మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక వ్యక్తి తెల్ల డ్రెస్సు వేసుకుని మీ కంటబడితే, వెంటనే మీకు పాత జ్ఞాపకం వచ్చి కోపం వస్తుంది. ఇది సహజస్థాయి. మీ చేతన మనస్సుకి తెలియకుండా, మీకు అర్థం కాకుండా అది అలా జరుగుతుంది.
మీ అచేతనమనస్సు సంస్కారాల బరువుతో అసహనంగా ఉంటే మీరు సహజస్థాయిలో ఉంటారు. తరువాతిది వివేకస్థాయి. మీరు చేతనంగా ఉన్నారుకాని, కావలసినంత ఉత్సాహం లేదు. మీరు చేతనస్థితిలో ఉన్నా సృజనాత్మకత లేనప్పుడు మీరు పెద్ద అడుగులు వేయరు, ఎదగలేరు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పినట్టు ఒక విశ్వాసం గల సేవకుడిలా ఉంటారు. మీ జీవితమంతా సేవకుడిలా ఉంటారు. మీ వల్ల ఏ రకమైన గొప్ప పనీ జరగదు. మీరు సమాచారాన్ని సేకరించి, దాని మీద పని చేసి, వచ్చే ఫలితాన్ని ఒక కంప్యూటరులా అందజేస్తారు. మీరు వివేకస్థాయిలో ఉండిపోతే మీ శక్తిని పూర్తిగా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోన్లేదు.
తరువాతిది అంతఃప్రేరణస్థాయి. ఈ స్థాయి అర్థం చేసుకోవడానికి శాస్త్రంలోకి లోతుగా వెళ్ళాలి. అప్పుడే మీకు నేను అనే అంతఃప్రేరణ ఏమిటో అర్థం అవుతుంది. మీ వివేకానికి అతీతంగా ఉండేది మీ అంతఃప్రేరణ. దీనివల్ల అకస్మాత్తుగా మీకు ఇది సరైన పని అని తెలిసి, చేయడానికి కావలసినంత శక్తి ఉంటుంది. కాని ఏ విధంగా ఆ నిర్ణయం తీసుకున్నారో తెలియదు.
మీకు ముందుగా జరిగింది ఏమీ లేనప్పుడు ఉండే పరిస్థితిలో ఈ శక్తి అవసరమవుతుంది. ఎప్పుడైతే మీ దగ్గర సమాచారం తక్కువగా ఉండి, నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా, మీకు చాలా ఎంపికలున్నాయి కాని, మీకు ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేనప్పుడు, అంతఃప్రేరణశక్తి మీకు సహాయపడుతుంది. అంతఃప్రేరణశక్తిధైర్యాన్ని, సరైన ఎంపిక చేయనిస్తుంది. అంతః ప్రేరణ, నిర్ణయించడానికే కాకుండా నిర్ణయించింది అమలుచెయ్యడానికి కూడా శక్తిని ఇస్తుంది. చాలామంది, 'నాకు అంతఃప్రేరణ ఉందని ఎలా తెలుస్తుంది? కొన్నిసార్లు అది అంతః ప్రేరణ లేక వివేకమా అని కలవరపడుతున్నా' అని నన్ను అడుగుతారు. వారు తికమకపడితే అది వివేకమే అని నేను చెప్పాను. కలవరపడ్డాను అని అన్నప్పుడే అది వివేకం అని తెలిసిపోతుంది. మీరు అంతఃప్రేరణ అనుభూతి చెందితే మీకు స్పష్టంగా తెలిసి, మీకు అమలు పరచడానికి తగినంత శక్తి వస్తుంది. మీలో ఉన్న మొత్తం శక్తి వెలువడుతుంది, మీరు దీన్నివెల్లడి చేస్తారు.
తరువాతి ప్రశ్న - ఈ అంతఃప్రేరణశక్తిని ఎలా మేలుకొల్పాలి?
మీరు చేతనంగా దానికి కొంత విశ్రాంతిని ఇస్తే, అచేతనస్థితిలో ఉన్న శక్తి వికసిస్తుంది. ఈ శక్తి వికసించినప్పుడు, ముందు అణచేసినదంతా బయటికి వస్తుంది. దాని తరువాత స్వచ్ఛమైన అంతఃప్రేరణశక్తి వెల్లడి అవుతుంది.
స్వచ్ఛమైన శక్తి, అచేతనస్థితి నుండి వెల్లడి అయినప్పుడు, అచేతనాన్ని సహజస్థితి లేదా వివేకస్థాయిలో ఉపయోగించకుండా దాన్ని అంతఃప్రేరణ స్థాయిలో ఉపయోగిస్తాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ఈ ఉన్నతస్థాయిలో వచ్చే శక్తి, మిమ్మల్ని భౌతికంగా, మానసికంగా, మీ భావావేశాలను బాగుచేస్తుందని ఋషులు నిరూపించారు. ఇది మీ ఒత్తిడిని తగ్గించి, అప్రయత్నంగా నిర్ణయాలు తీసుకునేట్టు చేస్తుంది. అప్రయత్నంగా సేకరించిన సమాచారంతో కాకుండా అది ఏ విధంగా కార్యరూపంలోకి మారుతుందో అన్న దానికి సంబంధం ఉన్నది. అదే సమాచారాన్ని అనేకవిధాలుగా కార్యరూపంలోకి మార్చవచ్చు. అంతఃప్రేరణ అనేది వివేకానికి అతీతంగా పనిని ఏ విధంగా చేస్తే, దాన్ని పూర్తి చేయగలమో అన్నది తెలియజేస్తుంది.
ధ్యానం అనే కొన్ని సాంకేతికపద్ధతుల ద్వారా ఈ అంతఃప్రేరణశక్తికి అనుగుణంగా మనని మనం సిద్ధం చేసుకోవచ్చు. తూర్పుదేశాల సంస్కృతిలో, మన ఉనికిలో ఉన్న ఈ గొప్ప శక్తిని తెలుసుకోవటాన్ని ధ్యానం అని అంటాం. మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీరు మీతో ఉండండి, మనం అందరికీ సమయాన్ని ఇస్తాం కానీ మనకి సమయాన్ని కేటాయించుకోం. మీకు మీరు సమయం ఇచ్చుకుంటే, మీలో ఉన్న ఏదో భాగం ఏదో తెలియచెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి, అన్నది మీరు చూస్తారు. కానీ మనం ఆ భాగానికి సమయం, అవకాశం ఇవ్వం. మనం ఎప్పుడూ వివేకంలో చిక్కుకుని ఉంటాం. అదే అతిఉత్తమమైంది అని అనుకుంటాం. కానీ పదే పదే ఋషులు దాని కంటే అతీతమైనది సాధ్యం అని నిరూపించారు.. Albert Einstein లేదా Isaac Newton ఎవరైనా కావచ్చు, వారికి వివేకానికి అతీతమైన శక్తి ఉంది. వారిలో వివేకానికి అతీతంగా ఏదో జరిగింది. అదే శక్తి మన అందరిలో ఉంది. మనం ఆ శక్తిని శ్రుతి చేసుకుంటే దాన్ని వ్యక్తపర్చగలం. దానికి శ్రుతి చేసుకోవడమే ధ్యానం, అని నేను అంటాను. మీ సంస్కారాలు తుడిచివేయడానికి నేనొక చిన్న ధ్యానపద్ధతిని ఇచ్చాను. అది సాధన చేస్తే, కొన్ని రోజుల్లో మీలో నిద్రిస్తున్న ఈ శక్తిని మేలుకొల్పవచ్చు. కొన్ని రోజులంటే రెండు లేదా మూడు రోజులు, అంతఃప్రేరణశక్తి, శ్రుతి చేసుకోవడానికి ఈ రోజులు చాలు. ఇప్పటి వరకు మనం సహజజ్ఞాన స్థాయిలో లేదా వివేకస్థాయిలో అచేతనస్థితిలో ఉన్న శక్తిని ఉపయోగిస్తున్నాం. శక్తిని శ్రుతిచేసుకుని అంతఃప్రేరణస్థాయిలో వాడుకొని, నిర్ణయం తీసుకోవచ్చు.
నేను అంతఃప్రేరణ గురించి ఇంకొంత సమాచారాన్ని ఇస్తాను. ఈ కింది విషయాల్ని మీరు ఒప్పుకునేందుకు అది చాలా ముఖ్యం.
1. మన అందరిలో అంతఃప్రేరణ అనేది ఉన్నది.
2. అది మీలో ఉంది, మీరు దాన్ని వ్యక్తపరచగలరు.
మీ మనస్సు మూడు స్థాయిలలో పని చేస్తుంది - సహజజ్ఞానం, వివేకం, అంతఃప్రేరణ. సహజస్థాయిలో మీ మనస్సు వ్యతిరేక జ్ఞాపకాల వలన విరామం లేనందుకు - అచేతనంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు తెల్ల డ్రస్సు వల్ల కలత చెందారంటే, నర్సుని చూసినా అచేతనంగా కలత చెందుతారు. వివేకస్థాయిలో చేతనస్థితిలో - శక్తి, ఉత్సాహం లోపించి, ఒక కంఫ్యూటరులా మరమనిషిలా పని చేస్తారు. అంతఃప్రేరణస్థాయిలో మీకు అకస్మాత్తుగా ఏది సరియిందో తెలుస్తుంది. ఎలాగో తెలియదు కాని మీకు శక్తి ఉంటుంది. మీకు కొంత సమాచారం ఉంటుంది. కాని ముందు ఏం జరిగిందో తెలియదు, మీకు చాలా ఎంపికలు ఉంటాయి, అందులో ఒకటి నచ్చుతుంది. అంతఃప్రేరణ, నిర్ణయించి అదే అమలు చేయడానికి శక్తిని ఇస్తుంది.
| వివిధ చేతన స్థితులు | ||
|---|---|---|
| ఆలోచనలతో | ఆలోచనలు లేకుండా | |
| “నేను” అన్న చేతనతో | జాగ్రత్ మేల్కొన్న అవస్థ ఆలోచిస్తూ | తురీయ పరమానంద స్థితి సంపూర్ణ చేతనస్థితి |
| “నేను” అన్న చేతన లేకుండా | స్వప్న స్వప్నస్థితి కలలుకంటూ | సుషుప్తి అచేతన స్థితి గాఢ నిద్ర |
ఇదే మరొక విధంగా చెబుతాను.
మనకు రెండు స్థాయిలలో చేతనస్థితి, రెండు స్థాయిలలో ఆలోచనలు ఉంటాయి. మనం మెలుకువగా ఉన్నప్పుడు, ‘నేను’ అనే చేతనస్థితి, ఆలోచనలు ఉంటాయి (మేలుకొని ఉన్న స్థితిని
- సంస్కృతంలో జాగ్రత్ అవస్థ అంటారు) మీకు స్వప్నంలో ఆలోచనలు ఉంటాయి కాని ‘నేను’ అనే స్పృహ ఉండదు. ఆలోచనల వేగం, ‘నేను’ అనే స్పృహ కంటే ఎక్కువ ఉంటుంది. అందుకే స్వప్నస్థితిలో మీరు కలలని అదుపులో ఉంచలేరు. కలలు వాటంతట అవే వస్తాయి.
మేలుకుని ఉన్నప్పుడు, మీరు ఆలోచనలని అదుపులో పెట్టుకోవచ్చు. గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు మీకు ‘నేను’ అనే స్పృహ ఉండదు, ఆలోచనలు ఉండవు. (అచేతనస్థితి - సంస్కృతంలో సుషుప్తి అంటారు.) మీకు తెలియని నాల్గవస్థితి - దాన్నే అంతఃప్రేరణ లేదా ధ్యానం అంటారు. ఈ స్థితిలో 'నేను' అనే స్పృహ ఉంటుంది ఆలోచనలు ఉండవు. ఈ స్థితిని వివరించడానికి సైకాలజీలో పదం లేదు. సంస్కృతంలో ఈ స్థితిని తురీయ అంటారు. దీన్నే నేను అంతః ప్రేరణ లేదా ధ్యానం లేదా ఆలోచన లేని ఎరుక అని అంటాను. ఈ స్థితినే సమాధిస్థితి అని కూడ అంటారు. మీరు ఈ నాల్గవస్థితిని అనుభూతి చెందితే, మీరు వివేకానికి అతీతమైన చేతనానుభవం తెలుసుకోగలరు. ఈ స్థితిలో బ్రహ్మానందం, శాంతి అంతఃప్రేరణ ఉంటాయి.
ఈ స్థితిలో మీకు ధైర్యం, సృజనాత్మకత ఉంటాయి. అప్రయత్నంగా నిర్ణయాలు తీసుకుంటారు. అప్రయత్నంగా నిర్ణయాలు తీసుకోవడమే బాధ్యత అని నేను అంటాను. మీరు ఎంత ఎక్కువ అప్రయత్నంగా నిర్ణయాలు తీసుకుంటే అంత ఎక్కువ బాధ్యత గలవారు అవుతారు. ఎన్నో పరిస్థితుల్లో మీకు కేవలం సమాచారం ఉంటే పని చేయలేరు. ఆ సమాచారం కూడా అంతా తెలియకపోవచ్చు. దీనికి ముందు జరిగింది ఏమిటో మీకు తెలియదు - అంటే మీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలు వగైరా. అలాంటి పరిస్థితుల్లో మీకు వివేకం కంటే ఎక్కువైనది ఏదో కావాలి. సమాచారానికి అతీతంగా అవసరం ఉంటుంది. అదే ఆలోచన లేని తెలుసుకునే తత్త్వం. మీ జీవితం లోనే కాకుండా - మీ బాంధవ్యాలలో, లేదా సామాజికవ్యాపారస్థాయిలో ఆ స్థితిని కనీసం ఒక నిమిషం మాత్రం అనుభూతి పొందితే, మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది.
ఈ స్థితి అనుభవం మీకు చాలా లాభాలను ఇస్తుంది. అన్ని స్థాయిలలో మీ సంబంధ బాంధవ్యాలు అభివృద్ధి చెందుతాయి. మీ వ్యక్తిగతజీవితంలో, వ్యాపారసంస్థస్థాయిలో కూడా. మన అచేతనస్థితి వల్ల సంబంధాలలో దెబ్బ తగలవచ్చు. అచేతనమనస్సునే ప్రతిక్రియామనస్సు అని కూడా అంటారు. ఈ అచేతనమనస్సులో మనం నిరంతరం వాదాలని సేకరించి, ఒక వ్యక్తి మీద లేదా సంఘటన మీద అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. మీరు, అతను లేదా ఆమె తప్పు చేసింది అని నిర్ణయం తీసుకుని అప్పుడు మీ అభిప్రాయాన్ని బలపరుచుకోడానికి వాదాల్ని సేకరిస్తారు. అంటే మీరు కేవలం సహజజ్ఞానస్థాయిలో పని చేస్తున్నారు.
కొన్ని సార్లు సహజ జ్ఞానస్థాయి, అంతఃప్రేరణ ఒకలాగే అనిపిస్తాయి. వీటి మధ్య భేదాన్ని ఎలా కనుక్కోవాలి అని నన్ను అడుగుతారు. అంతఃప్రేరణతో మీరు చాలా శక్తిమంతంగా, చైతన్యంతో ఉంటారు. సహజజ్ఞానస్థాయిలో, మీలో నుండి శక్తిని తీసేసినట్టుగా ఉంటారు. మీ వివేకాన్ని ఉపయోగించినప్పుడు, మీకు అలసట అనిపిస్తే, మీరు సహజజ్ఞానస్థాయిలో పనిచేస్తున్నారని స్పష్టంగా తెలుసుకోండి. చాలా సార్లు మీరు కోపంతో లేదా వేరే ఆవేశంతో పని చేసినప్పుడు మీరు సహజజ్ఞానస్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు అర్థం చేసుకుని ఆలోచిస్తారు- 'నేను ఇలా ఎందుకు చేశాను?' అప్పుడు మీలో అపరాధభావం కలుగుతుంది. అపరాధభావం, అచేతనస్థితి ఇచ్చిన బహుమతి. ధ్యాయనం అనే నాల్గవస్థితిని అనుభవిస్తే, మన ఉనికిలో అంతఃప్రేరణశక్తిని నియంత్రించవచ్చు. ఈ నాల్గవస్థితి ఆధునిక ఫ్రాయిడి మానసిక శాస్త్రవ్యవస్థకి తెలియదు. కాని ఈ నాల్గవస్థితి అయిన తురీయ లేదా సమాధిస్థితిలో ఆలోచన లేని ఎరుక ఉన్న చోటిలో అంతఃప్రేరణ, జ్ఞానం ఉంటాయి. ఇది చాలా మందికి తెలియని స్థితి. ఎవరైతే దీన్ని చేతనంగా ఉపయోగిస్తారో వారికి వ్యక్తిగతంగా సంస్థపరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి.
చివరిగా, నిజమైన నాయకుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే అంతఃప్రేరణస్థితిలో పని చేయగలిగి ఉండాలి. ఒత్తిడి లేకుండా నిర్ణయాలు చేసి వాటిని కచ్చితంగా సమర్థంగా అమలు చేస్తాడు.
ధ్యానపద్ధతి
మహామంత్రధ్యానం : ఈ మహామంత్రధ్యానం, గుండె ప్రాంతంలోని 'అనాహత' చక్రాన్ని వికసింప చెయ్యడానికి టిబెట్టు బౌద్ధులు ప్రాచీనకాలంలో వాడిన ధ్యానపద్ధతి. ఈ ధ్యానం మీ మనస్సుని దృఢంగా, స్థిరంగా చేస్తుంది. మీ మనస్సు ఎప్పుడూ ఆలోచనలతో ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ ధ్యానం మీ మనస్సుని స్థిరపరచి, ఆలోచనలు లేని స్థితికి తీసుకెళ్తుంది.
ఈ ధ్యానాన్ని ఖాళీ కడుపుతో ఉదయం చెయ్యాలి. లేదా భోజనం చేశాక రెండు గంటల తరువాత చెయ్యాలి. ఇది ఒక్కరు లేదా సమూహంగా చేసుకోవచ్చు. సామూహికంగా ఈ ధ్యానం చేస్తే, ఆ ప్రదేశానికి శక్తి కలుగుతుంది.
చెయ్యవలసిన పద్ధతి :
సమయం 30 నిమిషాలు
స్టెప్ 1 : 1:20 నిమిషాలు సౌకర్యంగా నేల మీద కూర్చోండి. మీ తల, మెడ, వెన్నెముక నిటారుగా ఉండాలి. మీరు కింద కూర్చో లేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు. కళ్ళు మూసుకుని, రిలాక్స్ అవ్వండి. మనం కళ్ళు మూసుకున్న తరువాత కూడ మనకు బొమ్మలు కనిపిస్తాయి. వీటిని అదుపులో పెట్టాలంటే, మీ కళ్ళు రాళ్ళలా అయినట్లు ఊహించుకోండి. మానసికంగా వాటిని గట్టిగా చేస్తే, బొమ్మలు మాయమవుతాయి. కళ్ళ కదలికలకి, మనస్సులో ఆలోచనలకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే మీ కనుగుడ్లని ఏ కదలికా లేకుండా చెయ్యమంటారు. దాన్ని ఎక్కువగా పట్టించుకోకండి.
మీ పెదవులు రెండూ దగ్గర పెట్టి 'మ్మ్...' అనే శబ్దాన్ని లోపల నుండి చెయ్యండి. మీరు ఖాళీ అల్యూమినియం గిన్నెలో మొహంపెట్టి హమ్మింగ్ చేస్తే, ఆ శబ్దం ఇలాగే ఉంటుంది. ఇది 'హుం' కాని 'ఓం' కాని కాదు, అది మీ పెదవులు రెండు దగ్గర పెట్టి, 'మ్…' అనే శబ్దం చేయడం. ఇది పొడవుగా లోతుగా నాభిప్రాంతం నుండి గట్టిగా చేయాలి.
ప్రతిసారి 'మ్మ్….' అనే శబ్దం చేయగానే ప్రయత్నపూర్వకంగా దీర్ఘమైన శ్వాస తీసుకోవలసిన అవసరం లేదు. శరీరానికి అవసరమైనప్పుడు తనంతట తానే శ్వాస తీసుకుంటుంది. ఒత్తిడికి గురి కాకండి. మీ శక్తి నంతా ఈ శబ్దం చేయడంలో పెట్టండి. మీరు శబ్దంగా మారిపోవాలి. మీ శరీరం అంతా ఆ శబ్దప్రకంపనాలతో నిండిపోనివ్వండి. కొంత సేపు అయిన తరువాత, హమ్మింగు మీ ప్రయత్నం లేకుండా అదే జరుగుతుంది. మీరు ఒక శ్రోతగా మిగిలిపోతారు.
ఈ హమ్మింగు మీ ఎరుకను ఈ క్షణంలోకి తెచ్చే శక్తివంతమైన విధానం. మీరు తీవ్రంగా చేస్తే, మీకు ఆలోచనలు రావు. కాబట్టి మీకు సెకనుకు వచ్చే ఆలోచనలు (TPS) తగ్గిపోతాయి. ఆ హమ్మింగు వలన వచ్చే శక్తి, శరీరంలో ఉండే శక్తికేంద్రాలకి శక్తిని ఇస్తుంది. మీరు తీవ్రంగా హమ్మింగు చేస్తే, మీ గురించి మీకున్న అభిప్రాయాలన్నీ పూర్తిగా కదిలిపోతాయి. ఇది మనస్సుని కుదిపేయడానికి ఒక చక్కని పద్ధతి.
స్టెప్ 2 : 10 నిమిషాలు హమ్మింగు ఆపేసిన తరువాత, కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా చిరునవ్వుతో, ప్రశాంతంగా కూర్చోండి. ఏదైనా ఆలోచన వస్తే రానీయండి. టి.వి. చూస్తున్నట్టు చూడండి. వచ్చే ఆలోచనల్ని ఆపవద్దు, వాటి మీద అభిప్రాయాలు ఉండకూడదు. నిశ్శబ్దంగా, ఆనందంగా ఉండండి. ఈ సమయంలో శరీరంలో ప్రతి భాగంలోకీ హమ్మింగు వల్ల వచ్చిన శక్తి వెళ్ళి, ఆ భాగాన్ని శుభ్రపరుస్తుంది. అది మిమ్మల్ని వర్తమానంలో ఉంచుతుంది. ఈ ఎరుక మీలో ఉన్న అన్ని వ్యతిరేకాలోచనలు పోగొట్టి, మీ నిజమైన శక్తి ఏదో మీకు తెలియచేస్తుంది.
- ఇతరులకి సేవ చేయడం నాయకత్వం. మన అవసరాలు తీర్చుకుంటూ ఇతరులపై శ్రద్ధ చూపించకపోతే నాయకత్వం లోపించిందని అర్థం.
- ఏ వ్యక్తిలో అయితే సంస్కారాలు నిండి ఉంటాయో అతను హాయిగా ఉండలేడు. అలాంటి వ్యక్తి నుండి సృజనాత్మకత, సరైన నిర్ణయాలు ఆశించలేం.
- సంస్కారాల వల్ల వచ్చే అర్థం లేని ఆలోచనలని తొలగించటానికి ఉపయోగపడే పద్ధతి ధ్యానం.
తీవ్రత - అపజయం లేని మార్గం
ప్రతిదానిలో లోతైన తీవ్రతతో ఉండటమే జీవన్ముక్తి
మనం అనుచరులుగా అనుసరిస్తున్నా, నాయకుడుగా ముందుకి నడిపిస్తున్నా మనం చేస్తున్నదానిలో పరిపూర్ణత్వాన్ని సాధించాలంటే అందులో గాఢత ఉండాలి. దాన్ని తీవ్రంగా చేయాలి.
ఒక చిన్న కథ : ఒక బౌద్ధగురువు ఆయన శిష్యుడు నది ఒడ్డున నడుస్తూ ఉంటారు. శిష్యుడు అంతకు ముందు చాలా సార్లు గురువుగారిని అడిగినట్లే మళ్ళీ ఈ విధంగా అడుగుతాడు ‘గురుదేవా! దయచేసి నాకు జ్ఞానోదయం కలిగించండి’ అని. అకస్మాత్తుగా గురువు శిష్యుడి తల పట్టుకుని నీళ్ళల్లో ముంచుతాడు. శిష్యుడు నిర్ఘాంతపోయి, తన తలని బయటికి తీయటానికి కొట్టుమిట్టాడుతాడు. కాని గురువుగారు తలని అలాగే నీళ్ళల్లో బలంగా అదిమి పెడతాడు. శిష్యుడు శ్వాస ఆడక కంగారు పడుతుంటాడు. అప్పుడు గురువు అతని తలను వదులుతాడు. శిష్యుడు ఆశ్చర్యంగానూ, పూర్తిగా వణికిపోతూనూ బయటికి వస్తాడు.
అప్పుడు గురువుగారు శిష్యుడితో ‘నీవు నీళ్ళల్లో తల ఉన్నప్పుడు శ్వాస కోసం ఎంత తీవ్రంగా ప్రయత్నించావో అంతే తీవ్రతతో జ్ఞానోదయం కావాలి అని అనుకుంటున్నావా’? అని అడుగుతాడు.
కోరిక అత్యవసరమైనప్పుడు, ప్రశ్న పరిశోధనగా మారినప్పుడు అంతిమ అనుభవం జరుగుతుంది. జ్ఞానోదయం జరగడానికి కావలసిన ముఖ్యాంశం తీవ్రత.
తీవ్రత లేదా గాఢత అంటే?
చూడండి, మనందరం బయటి ప్రపంచం విషయాలలో తీవ్రమైన అసహనాన్ని అనుభవిస్తాం. నేను ఇది చేయలేదు, అది చేయలేదు, ఇలా అనుకుంటూ ఉంటాం. అదే అసహనాన్ని మీ అంతరంగం వైపు మళ్ళిస్తే దాన్ని గాఢత అంటారు.
ఏమి జరుగుతుందో, ఏమి జరగాలో మీకు తెలియదు కాని మీ అంతరంగంలో మీకు లోతైన అసంతృప్తి ఉంటుంది. దాన్ని నేను తీవ్రత లేదా గాఢత అంటాను.
నేను అసంతృప్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నానా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను సంతృప్తి గురించి మాత్రమే చెప్పాలి కదా! నేను చెబుతున్నాను, మీ అసంతృప్తి ప్రస్తుతం బయటి ప్రపంచం వైపు ఉన్నది. అదే అసంతృప్తిని మీ అంతరంగం వైపు మళ్ళించండి. అప్పుడే మీకు నిజమైన సంతృప్తి కలుగుతుంది.
ముందుగా జరగవలసింది సంతృప్తి కాదు, మీ దిశ మారాలి. మీలో మానసికవిప్లవం రావాలి. అసహనం తీవ్రతగా మారాలి. అది బయట ప్రపంచానికి సంబంధించినదైతే మీ చేతనస్థితి నిరంతరం బయటి ప్రపంచం వైపు మళ్లితేదాన్ని అసహనం అంటారు. అదే మీ అంతరంగం లోనికి మళ్లితేదాన్ని తీవ్రత అంటారు.
తీవ్రత అంటే వెంటనే ఏదో జరగాలనే అత్యధికమైన కాంక్ష, బంధాల నుంచి స్వేచ్ఛని పొంది అంతరంగం లోనికి వెళ్లాలనే కోరిక. తీవ్రత అనేది భావావేశం కాదు. మీరు అసహనంలో ఉన్నప్పుడు, అందులో ఒక భావం భావావేశమై ఉండవచ్చు. కాని తీవ్రత భావావేశం కాదు. అది వేడి లాంటిది. తీవ్రతలో ఒక భాగం కరిగి బయటికి వస్తుంది. దాన్ని భావావేశం అనవచ్చు. ఇది ఎలా అంటే హృదయం కరిగితే దాన్ని భావావేశం అంటాం. హృదయంతో పాటు, మీ మేధ, మీ అంతరాత్మ కూడా కరగాలి, తీవ్రత పరిణామం భావావేశం.
మీ తీవ్రత ఏమిటని పట్టించుకోవద్దు. అది దేని గురించి అని కూడా పట్టించుకోవద్దు. అది నాణ్యతతో ఉండాలి. మీరు ఎవరినైనా లేదా దేన్నైనా పట్టుకున్న అది గాఢతతో ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు, మీ అనుబంధాలు, మీ నిర్ణయాలు, మీ జ్ఞాపకాలు, మీ ఆలోచనలు, కోరికలు, భయాలు అన్నీ ఆ క్షణంలో గాఢతలో ఉండాలి. దాన్నే తీవ్రత అంటాం. తీవ్రత అంటే బయటి ప్రపంచంలో, అంతరంగంలో విభేదాలు సృష్టించని శక్తి. మీ అంతరంగంలో లోతైన గాఢతతో ఉండటమే తీవ్రత అంటే.
అది విభేదాలు లేకుండా సున్నితంగా, దృఢంగా సాగిపోతూ ఉంటుంది.
మీరు అనుకోవచ్చు నదిలా సున్నితంగా సాగిపోతే అందులో గాఢత ఉండదు. అది రాయిలా గాఢతతో ఉంటే నదిలా స్వేచ్ఛగా, సున్నితంగా సాగిపోలేదు అని అనుకుంటారు, అది సరి కాదు. గాఢత అంటే వరదలా ప్రవహించటం.
నిరంతరం తీవ్రమైన విభేదాలు సృష్టించేవారిని నేను చాలా మందిని చూసాను. వాళ్ళని ఏదైనా చేయమని చెప్పగానే వారిలో వెంటనే ఏవో విభేదాలు వచ్చేస్తాయి.
ఒక చిన్న కథ: ఒక వ్యక్తి పన్నెండేళ్ల తరువాత జైలు నుంచి తప్పించుకుని పారిపోయి ఇంటికి చేరతాడు. అతని భార్య తలుపు తీసి అతని మీద గట్టిగా అరవటం మొదలుపెట్టింది, 'ఎందుకు అంత ఆలస్యంగా వచ్చావు. జైలు నుంచి తప్పించుకుని 24 గంటలు అయ్యింది. ఇంటికి తిన్నగా రాకుండా ఏంచేస్తున్నావు? ఎక్కడికి వెళ్లావు? ' అని అతని మీద విరుచుకుపడుతుంది.
ఆమె కేవలం తన భర్త ఎందుకు తిన్నగా ఇంటికి రాలేదు అని మాత్రమే చూస్తుంది. ఆమె చాలా తీవ్రతతో ఉంది. కాని అది విభేదాలు సృష్టించటానికే. నిజమైన గాఢత విభేదాలను సృష్టించదు. అది ప్రవాహంలా సాగుతూ ఉంటుంది. గాఢత అంటే ఏకీకృతం, అది నిజాయితీ.
పతంజలి ఈ విధంగా చెబుతాడు, 'ఎవరి ప్రయత్నాలైతే తీవ్రంగా, నిజాయితీతో ఉంటాయో వారే విజయానికి దగ్గరగా ఉంటారు. చూడండి, నీటికి దారి చూపే నావికుడు అవసరం లేదు. సముద్రం ఇటు వైపు అనే బోర్డులు అవసరం లేదు. అన్నీ నదులూ సముద్రాన్ని చక్కగా చేరతాయి. అవి వాటి లక్ష్యాలని గమ్యాలని, కచ్చితంగా చేరతాయి. మీలో శక్తి అంతా ఒకే మొత్తంగా ఒక దిశలో సాగితే మీరు చాలా సులభంగా వెళ్ళగలరు. మీరు గాఢతతో ఉండి ప్రవహించటానికి సిద్ధంగా ఉంటే, మీ లక్ష్యాన్ని సాధించగలరు.
మామూలుగా సాంద్రత అనగానే దృఢంగా అనిపిస్తుంది, మీరు గాఢతతో ఉంటూ ప్రవహించే శక్తిని పోగొట్టుకోవచ్చు. లేదా మీరు ప్రవహిస్తూ తీవ్రంగా ఉంటే శక్తి లేకుండా ఉండవచ్చు.
చూడండి, మీరు గాఢతతో ఉండి ప్రవహించే శక్తిని ఎందుకు పోగొట్టుకుంటారు అంటే మీరు మీ అహంకారంతో ముందుకు వెళ్తారు. మీరు ఏది సాధించాలి అనుకుంటారో దాన్ని సాధించాలని చూస్తారు. అయితే అది ఎలా అనే దానికి మీ స్థిరమైన అభిప్రాయాలు మీకు ఉంటాయి. మీ సృష్టి మీ కంటే చాలా బాగా, చాలా సమర్థంగా చేస్తుంది అని మీరు అర్థం చేసుకోలేకపోయారు.
నేను నా శిష్యులకి ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటాను, మీరు ఏది ప్లాన్ చేసినా మీ శక్తి కొద్దీ చక్కగా చేసి, వదిలేయండి అంటాను. మీరు అనుకున్నట్టు జరగలేదనుకోండి, నిరాశతో కుంగిపోవద్దు. ఇంత కంటే మీరు ప్లాన్ చేసినదాని కంటే ఇంకా చాలా మంచిది జరగవచ్చు.
మరొక విషయం, మీరు ప్రవహిస్తున్నారు కాని తీవ్రత లేదు, ఈ విధంగా కొందరిలో ఉంటుంది. వారు దానికి ఎదురు వచ్చినవాటితో డిస్టర్బు అవుతారు. వారి దృష్టి ఏకాగ్రత నిశ్చలంగా ఒక దాని మీద ఉండదు. వారు శక్తిని వృథా చేస్తారు. ఒక విషయం అర్థం చేసుకోండి, నీరు ఆవిరిగా మారేది కేవలం 100 డిగ్రీల దగ్గర మాత్రమే. కనీసం 99 డిగ్రీల దగ్గర అది ఇంకా నీటిలా ఉంటుంది. అది ఆవిరిగా మారదు. అదే విధంగా, ఆధ్యాత్మిక అన్వేషణలో మీరు ఒకే దృష్టితో ఉండనప్పుడు శక్తి ఒకే వైపు కేంద్రీకృతం కాదు. అప్పుడు సంపూర్ణమైన మార్పు జరగదు. ఏదైనా ఒకటి తీసుకొని పూర్తి గాఢతతో దాన్ని అనుసరించాలి. గాఢత అంటే మార్పులు లేని అతి స్థిరత్వం కాదు. అవసరానికి తగిన మార్పులు చేసుకుంటూ ఉంటేనే నదిలా తీవ్రతతో మీరు ప్రవహించగలుగుతారు.
మీరు ఏదో అనుకుని ఏదో చేస్తారు. కాని మీ నిర్ణయం ప్రకారం జరుగుతుందా లేదా అని చూసుకోరు. మీ ఉద్దేశం ఇంకా కూడా ఉపయోగమా లేదా చూడరు.
రగులుతున్న తీవ్రత
ప్రాచీనవేదాల నుంచి ఒక చక్కని కథ : ఒక శిష్యుడు గురువు దగ్గరకి వెళ్ళి తనకి జ్ఞానోదయాన్ని ఇవ్వమని ప్రార్థిస్తాడు. గురువు గారు అతనితో, ‘తత్వమసి’ అని తొమ్మిది సార్లు అంటాడు. తత్వమసి అంటే ‘అదే నీవు’ అని అర్థం. దీన్ని మహావాక్యం అంటారు. అది సూటిగా జ్ఞానోదయాన్ని ఇస్తుంది. మహత అంటే విశ్వం.
గురువుగారు తొమ్మిది సార్లు తత్త్వమసి అంటారు. శిష్యుడికి జ్ఞానోదయం అవుతుంది.
ఇది అంత సులభమా? మరి అది మాకు ఎందుకు జరగటం లేదు? మాలో లేనిది ఏమిటి? మాకు ఆ శిష్యుడికి తేడా ఏమిటి?
ఆ శిష్యుడు పరిపూర్ణంగా ఏకీకృతమై ఉన్నాడు. అతనిలో సత్యాన్ని తెలుసుకోవాలనే తపన తీవ్రంగా రగులుతోంది.
ఆలిచిప్పని చూడండి, వర్షపు నీటి కోసం చూస్తూ ఉంటుంది. వర్షపు చినుకు పడగానే దాన్ని తన గర్భంలో దాచి సముద్రపు అడుగు భాగానికి వెళుతుంది. అక్కడ వర్షపు చినుకు ముత్యంగా తయారవుతుంది. సముద్రం మీద ఆలిచిప్ప నోటిని తెరిచి వర్షం కోసం చూస్తుంది. ఎంతో తీవ్రంగా ఎదురుచూస్తుంది. సముద్రపు నీటితో ముత్యాన్ని తయారుచేయదు. దానికి స్వచ్ఛమైన మంచి నీరు కావాలి. ఒక చుక్క నీరు పడగానే అది సముద్రం లోనికి వెళుతుంది. అక్కడ ముత్యం తయారయ్యాక పైకి వస్తుంది.
అదే విధంగా గురువుగారి మాటలు తీవ్రంగా సత్యాన్ని కోరుకుంటున్న శిష్యుడి అంతరంగం లోనికి వెళ్తాయి. ఆ మాటల్ని తన లోనికి తీసుకుని అంతరంగంలోనికి వెళతాడు. అక్కడ జరగవలసింది జరిగాక ముత్యం అనే జ్ఞానోదయంతో బయటికి వస్తాడు.
తీవ్రమైన ఆధ్యాత్మిక అన్వేషికి కొన్నిమాటలు చాలు. అతను అకస్మాత్తుగా తన అంతరాత్మ వికసించటం, విస్తృతం అవటం, అది వెల్లడి కావటం చూడగలడు. శిష్యుడిలోని తీవ్రత, విప్పారి ఉండే తత్త్వం ఆలిచిప్పలా ఉంటుంది. గురువుల మాటలు వర్షపు బిందువులుగా శిష్యుని అంతరంగం లోనికి ప్రవేశించి జ్ఞానోదయం అనే ముత్యం బయటికి వస్తుంది.
ఆ విధంగా ఉండాలి అనుకోవటం Vs కేవలం ఉండటం
మీరు తీవ్రతతో ఉన్నప్పుడు మీరుగా ఉంటారు. మీరు మరేదో కానవసరం లేదు. మీరు అలా ఉంటే చాలు.
ఏదో విధంగా ఉండటానికి చాలా మార్గాలు ఉన్నాయి. అలా జరగటం అనేది అదే విధంగా ఉండటానికి చాలా తేడా ఉన్నది. ఒక డాక్టర్‌గా కాని, లాయర్‌గా కాని అవ్వాలి అంటే ఏంచేయాలో మీకు తెలుసు. రాజకీయనాయకుడు కావాలి అంటే ఏంచేయాలో తెలుసు. మన జ్ఞానం అంతా ఇలా ఏ విధంగా కావాలంటే ఏం చేయాలో అది అవటానికే.
ఏదైనా అలా తయారు కావాలి అన్నది మనస్సుకి సంబంధించింది. అదే విధంగా, మీరు మీరుగా ఉండటం అనేది మీ సహజత్వానికి సంబంధించింది. మనకి ఏదైనా ఎలా కావాలో తెలుసు కాని మనం ఎలా ఉండాలో అన్న ముఖ్య విషయాన్ని మనం మరిచిపోయాం. ఎందుకంటే మన అంతరంగం కలుషితమైపోయింది. ఏదో అవ్వాలి అనే దానిలో పడి మనం ఎలా ఉండాలి అన్నది మరిచిపోయాం. మనలోని అసలైన అంతరాత్మని మరిచిపోయాం.
అంతరాత్మ చికిత్సాస్పర్శ
మీకు కనీసం ఒక్కసారి ఒక క్షణమైనా మీ అంతరాత్మ అనుభవాన్ని పొందగలిగితే మీలోని శారీరక, మానసికాది, అన్ని అనారోగ్యాలూ పోతాయి, మీ అంతరంగంలోని చికిత్సని అనుభవంతో తెలుసుకోగలరు. మీలోని గాయాలు మానిపోతాయి. వీటి అన్నింటి కంటే కూడా మీరు ఏదో అవటానికి దృఢమైన ఆధారం ఏర్పడుతుంది. ఏదో ఒకటి అవటం అనేది కూడా మీ అంతరాత్మ అనుభవంతో జరిగితే అది కూడా విజయమే. ఆ అనుభవం లేకుండా మీరు ఏదో కావాలి అంటే, అది ఒక అపజయమే.
ఉండటం అంటేనే గాఢత
ఉండటం అంటే ఏమిటి? సంపూర్ణంగా, ఏకత్వంతో ఉంటూ శక్తిని వెల్లడి చేయగలగటమే. మీ అనుభవంలో కాని, వెల్లడి కాని సగమే ఉంటే అది కపటం.
కోపంలో తీవ్రత
మీ కోపం కూడా కపటమే. మీరు కోపాన్ని వెల్లడి చేయాలా, వద్దా అనుకుంటారు. మీ కోపం కూడా మీ తర్కజ్ఞానానికి సంబంధించిందే. మీ తర్కానికి అతీతంగా మీకు కోపం రాదు. అది ఎప్పుడూ తర్కంలో ఉంటుంది. ఈ సందర్భంలో నేను దేన్నైనా పోగొట్టుకుంటున్నానా? అని ఆలోచిస్తారు. ఏదైనా నష్టం కలుగుతుంది అంటే కోపాన్ని అణచేస్తారు. నష్టం లేదు అనుకుంటే మీ కోపాన్ని చూపిస్తారు. కాని అప్పుడు చూపించవలసినదాని కంటే ఎక్కువ కోపాన్ని చూపించి ఎదుటి వ్యక్తి మీద ఎక్కువగా అరుస్తారు. మీలో నిలువ చేసి ఉన్నదాన్ని బయటకి తెస్తారు.
వెల్లడి, అణచటంవద్దు - కావలసింది
స్పష్టంగా అర్థం చేసుకోండి, తర్కం మీ కోపాన్ని నియంత్రిస్తే, మీకు రెండు రకాల సమస్యలు ఉంటాయి. మొదటిది, అవసరం లేనప్పుడు కోపాన్ని వెల్లడి చేస్తారు. రెండవది మీరు కోపాన్ని వెల్లడి చేయకపోతే, దాన్ని అణచుకుంటారు.
మొదటిది, మీరు వెల్లడి చేస్తే అవసరమైనదాని కంటే చాలా ఎక్కువ వెల్లడి చేస్తారు. తరువాతిది, దాన్ని వెల్లడి చేయకపోతే అణచేస్తారు, రెండూ తప్పే. వెల్లడి చేయటం, అణచటం రెండూ మీకు ఏ విధంగానూ సహాయం చేయవు. మీరు అడగవచ్చు 'అయితే మేం ఏం చేయాలి' అని. మీరు ఏమీ చేయవద్దు, అలా ఉండండి.
జిడ్డు కృష్ణమూర్తి చక్కగా చెబుతారు, 'ఎప్పుడైతే ఒక భావావేశం మిమ్మల్ని అధిగమించినప్పుడు, మిమ్మల్ని తన చేతుల్లోనికి తీసుకున్నప్పుడు, మీరు కనీసం ఒక్కసారి అయినా మీ శరీరాన్ని కదపకుండా, ఆ ఆవేశానికి సహకరించకుండా ఉంటే మీరు దాని నుంచి విముక్తిని పొందుతారు' అని.
మీరు ఏదైనా ఆవేశంతో నిండిపోయి ఉన్నప్పుడు, శరీరాన్ని కదపకుండా నిశ్చలంగా ఉంచగలిగితే, ఆ ఆవేశం నుంచి మీరు బయటికి వచ్చేయగలుగుతారు. దీన్ని నిరంతరం సాధన చేయాలి అని నేను చెప్పటం లేదు. ఈ విధంగా ఒక్కసారి మీరు చేయగలిగితే, మీరు ఆ ఆవేశం నుంచి స్వేచ్ఛని పొందగలుగుతారు.
గాఢతతో జీవించటం
జ్ఞానేంద్రియాల తృప్తితో మీరు నిజమైన సంతృప్తిని పొందలేరు. గాఢతతో జీవించటం అంటే జ్ఞానేంద్రియాల తృప్తి కాదు. గాఢత అంటే మీకు ఎలా జీవించాలని ఉంటే అలా జీవించటం కాదు.
నన్ను ఎవరో అడిగారు 'బంధాలతో ఉండటం, స్వేచ్ఛని పొందటం అనేది కేవలం ఒక పోలికలోనే కాబట్టి హాయిగా తిని జల్సాగా ఉండవచ్చు కదా! ' అని. అలా చేస్తే మంచిదే కాని గాఢతతో చేయండి అంతే. తినేది తీవ్రతతో తినండి. తినేటప్పుడు కేవలం తినండి. నిద్ర పోయేటప్పుడు కేవలం నిద్ర పొంది. తాగేటప్పుడు ఎంజాయ్ చేసేటప్పుడు కేవలం ఆ పనిని మాత్రమే చేయండి మరేదీ చేయవద్దు.
అసలు సమస్య ఏమిటంటే ఎంజాయ్ అంటారు కాని నిజంగా మీరు ఎంజాయ్ చేయరు. అందుకే మీకు విముక్తి గురించి ఇన్ని బోధలు అవసరం. అందుకే ఇక్కడ మీరు ఆలోచిస్తారు. కేవలం తిని, తాగి, జల్సా చేయటం అంత సులభం అనుకున్నారా? కాదు. మీకు సంతోషంగా ఉండటం తెలియదు. అందుకే మీ శరీరానికి అవసరం లేనివాటిని తాగుతారు. మీ శరీరం స్వీకరించలేనివాటిని లోపలికి తీసుకుంటారు.
అర్థం చేసుకోండి, గురువుల మాటల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ మాటల్ని గాఢంగా, లోతుగా, స్పష్టంగా అర్థం చేసుకోవాలి కాని ఏదో పైపైన కాదు. మీరు అనుకున్నట్టు తిని, తాగి, జల్సా చేయటం అంత సులభం కాదు. దాన్ని మీరు తీవ్రంగా చేయగలిగితే అది చాలా మంచిది.
తీవ్రత గురించి ఒక చిన్న కథ : ఇరవై ఐదు సంవత్సరాల వివాహజీవితం తరువాత ఒక వ్యక్తి భార్యకి భర్త అలమారులో మూడు సోయా బీను గింజలు, ముఫ్పై డాలర్ల డబ్బు కనిపిస్తాయి. అవి ఏమిటో అనే కుతూహలంతో ఆమె భర్త దగ్గరకి వెళ్ళి 'ఈ గింజలు, ఈ డబ్బు ఏమిటి? ఎలా వచ్చాయి? వీటి అర్థం ఏమిట'ని అడుగుతుంది.
అప్పుడు భర్త చాలా నెమ్మది గొంతుతో 'ఇప్పుడు నీకు నిజం చెబుతాను. నేను నిన్ను మోసం చేసిన ప్రతీసారీ ఒక గింజని అక్కడ పెట్టేవాడిని' అంటాడు. భార్య నిర్ఘాంతపోతుంది. కాని వెంటనే తనకి తాను పోనీలే ఇరవై ఐదు సంవత్సరాల్లో కేవలం మూడుసార్లు మాత్రమే మోసం చేసాడులే అనుకుంటుంది. తరువాత అతణ్ణి 'ఆ డబ్బు ఏమిటి' అని అడుగుతుంది.
'సోయా గింజలు కేజీ అయినప్పుడు పది డాలర్లకి అమ్మేసాను,' అని జవాబు ఇస్తాడు.
కాబట్టి తిని, తాగి ఎంజాయ్ చేయండి, కాని దాన్ని సోయాగింజలని అర్థం చేసుకున్నట్టు కాదు. దాని వెనక ఉన్న ముప్పై డాలర్లని కూడా చూడాలి. అప్పుడే అసలు నిజం ఏమిటో తెలుస్తుంది. విముక్తి అంటే అర్థమవుతుంది. మీరు తీవ్రతతో జీవిస్తే అప్రయత్నంగా విముక్తి కలుగుతుంది.
కర్మ, సంస్కారం
మీరు ఏ క్షణంలోనైనా గాఢతతో జీవించకపోతే ఏమవుతుంది?
మీ మనస్సు ఆ క్షణంలో ఆ పనిని తిరిగి చేయాలి అని చూస్తుంది. ఎందుకు? ఎందుకు మీ మనస్సు అదే అనుభవానికి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని లాగుతుంది.
మీరు అదే చాక్లెట్ కావాలి అని అనుకుంటారు. కొన్నింటికి అలవాటు పడిపోతారు. ఎందుకు? మీరు లోతుగా చూస్తే, అది ఎందుకో చూడగలరు. మీరు చాక్లెట్‌ని తినటం కాని లేదా మీ అలవాటుని కాని పూర్తిగా అందులోనే నిమగ్నమై చేయరు. ఆ పని లోనికి పూర్తిగా వెళ్ళకుండా మిమ్మల్ని మీరు పట్టుకొని ఉంటారు. దీని గురించి మీరు అపరాధ భావంతో ఉండవచ్చు. లేదా ఆ సమయంలో మీలో అయోమయాన్ని కలిగించే చాలా ఆలోచనలు ఉండి ఉండవచ్చు. కాబట్టి మీరు ఆ పనిని ఆలోచనలు లేకుండా చేయాలి అని నిర్ణయించుకోండి.
చూడండి, మీలో ఒక భాగం ఆ పనిలో నిమగ్నమవ్వమని చెబుతుంది. మరొక భాగం ఎందుకు అని వాదిస్తుంది. మీరు చాలా ఆలోచనల్లో చిక్కుకుపోయి ఉంటారు. ఆ ఆలోచనలలో చాలా పరస్పర విరుద్ధమైన ఆలోచనలు. ఈ పోరాటాల్లోనే మీరు మీ శక్తిని పోగొట్టుకుంటారు. చివరికి ఆ పనిని చేసినా, చేయకపోయినా మీరు ఒకటిగా ఉండరు.
మీరు గాఢతతో ఉండరు. అందుకే ఆ కోరిక తృప్తిని ఇవ్వదు. దాని జ్ఞాపకాలని మీ లోపల ఉంచుతుంది. ఏ కోరికలైతే పూర్తి తృప్తిని ఇవ్వవో ఆ కోరికల జ్ఞాపకాలనే సంస్కారాలు అంటారు. ఈ సంస్కారాలు మిమ్మల్ని అదే దారిలో వెళ్ళే విధంగా చేసే శక్తిని కలిగి ఉంటాయి. అది కాఫీ తాగటం లేదా సిగరెట్ కాల్చటం, ఏదైనా సరే, ఒకసారి సంస్కారంగా మీలో ఏర్పడితే అది మీతో ఆ పనిని పదే పదే చేయిస్తుంది. ఆ పనిలో మీరు సంపూర్ణమైన తృప్తిని పొందే వరకు అది అలానే ఉంటుంది.
మీ అలవాటుని మీరు తీవ్రంగా, లోతుగా ఒకసారైనా అనుభవించ గలిగితే, మీరు దాని నుంచి పూర్తిగా స్వేచ్ఛని పొందగలుగుతారు. ఆ సంస్కారం మిమ్మల్ని అదే మార్గంలో వెళ్ళమని ఎప్పుడూ ప్రోత్సహించదు. తీరని సంస్కారాలనే కర్మలు అంటారు. మీ శరీరం, మనస్సు ఇంకా జీవంతో ఉన్నాయి, అంటే అర్థం అవి మీకు ఏదో ఇస్తాయి అనే ఆశ మీలో ఉండటమే. ఇంకా ఏదో అనుభవిస్తాను అన్న ఆశ మీలో ఉండటమే. ఈ శరీరం, మనస్సు ద్వారా ఏదో తృప్తిని పొందాలి అనుకోవటమే. దాన్నే నేను కర్మ అంటాను.
కర్మ అంటే మీ అంతరంగంలో ఉన్న సంస్కారాలు, కోరికలు. అవే నిరంతరం మిమ్మల్ని అదే దారిలో వెళ్ళమని, ఆ అనుభవాన్ని పొందమని పదే పదే ప్రోత్సహిస్తాయి. ఏ పనినైనా మీరు పూర్తిగా నిమగ్నమై చేస్తే, ఏ కోరికనైనా పూర్తిగా చేస్తే మీలో తిరిగి ఆ పనిని చేయాలి అనే కోరిక ఉండదు. మీరు ఆ కోరిక నుంచి విముక్తులవుతారు. ఇప్పుడు మీరు మీ శక్తిని కొత్త అనుభవాలు, కొత్త విషయాల్లోకి మళ్ళించవచ్చు. అప్పుడు మీరు విషవలయంలో చిక్కుకోరు. మీ జీవితం అభివృద్ధి వైపు, పరిపూర్ణత వైపు వెళుతుంది. జీవితం మీకు తాజా అయిన కొత్త క్షణాల్ని బహుకరిస్తుంది అని తెలుసుకుంటారు. దీని అంతటికీ మీ నుంచి కావలసినది కేవలం తీవ్రతతో, గాఢతతో జీవించటమే.
జంతువుమార్గం, బుద్ధునిమార్గం
జీవించటం అనేది రెండు రకాలుగా ఉంటుంది.
ఒకటి పశువులా, కేవలం శ్వాసిస్తూ జీవించటం. దానిలో గాఢత ఉండదు. ఎటువంటి తీవ్రమైన కోరికా ఉండదు. మరొక మార్గం బుద్ధుని మార్గం అంటే ఈ క్షణంలో వర్తమానంలో, చేస్తున్న పనిలో గాఢతతో ఉండటం.
మీకు ఎప్పుడైనా పీడ కల వచ్చిందా? పీడ కల వచ్చినప్పుడు కళ్ళు తెరవాలన్నా మీరు కళ్ళు తెరవలేరు. చేతులు కదపాలన్నా కదపలేరు. అప్పుడు పీడ కల చాలా తీవ్రంగా ఉంటుంది. కలలో సింహం మిమ్మల్ని తరుముతుంది, మిమ్మల్ని పట్టేసుకోబోతోంది. మీరు పడిపోతారు, లేదా మరొకటి, మీ జీవితం మరణం అంచుల్లో ఉంటుంది. ఎప్పుడైతే కల తీవ్రత పెరుగుతుందో, అది అత్యధిక స్థాయికి వెళుతుందో మీకు మెలకువ వస్తుంది. పీడ కల అంత తీవ్రంగా లేకపోతే మీకు మెలకువ రాదు, మీరు కల లోంచి బయటికి రాలేరు. అది తీవ్రంగా ఉన్నప్పుడు, ఆ తీవ్రత మిమ్మల్ని మేల్కొలుపుతుంది. అది కల మాత్రమే కాని మీరు నిజం అనుకుంటారు.
అర్థం చేసుకోండి, అది జరుగుతుంది అని మీరు అనుకున్నా మీరు దాని లోంచి బయటికి వస్తారు. అది మీ ముందు జరుగుతున్న ఒక సినిమా లాంటిది.
పనితో సంబంధం లేకుండా తీవ్రత స్వతంత్రంగా ఉంటుంది
తీవ్రత అనేది పని మీద ఆధారపడి ఉండదు. పని అనేది కోట్ల విలువైన కంపెనీని నడపటం అయినా, గదులు తుడిచే పని అయినా ఏదైనా సరే, పని ఏమిటన్నది ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నారన్నది ముఖ్యం. మీరు చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమై, అందులో మిమ్మల్ని మీరు మరిచిపోయేంత తీవ్రతతో చేస్తే, తీవ్రతలోని అసలు సూత్రాన్ని పట్టుకున్నవారవుతారు. ఎప్పుడైతే చేస్తున్న పనిలో మీరు పూర్తిగా నిమగ్నమవుతారో, అప్పుడు మీరు సర్వాంతర్యామి అధరాల మీద మురళి అవుతారు. పూర్తిగా, తీవ్రతతో ఉండండి. మీ బాణం అనుకున్న లక్ష్యానికి సరిగ్గా తగలాలంటే ఇదే చేయాలి.
ఆసక్తి Vs తీవ్రత
తీవ్రత అనటానికి అర్హతలు ఏమిటి? తీవ్రతకి, ఆసక్తికి తేడా ఏమిటి?
ఆసక్తి అనేది పోతుంది, తీవ్రత ఎప్పటికీ పోదు. ఆసక్తి మనస్సులో వస్తుంది. తీవ్రత అంతరాత్మ నుంచి వస్తుంది. కొంత కాలం అయ్యాక ఆసక్తి పోతుంది. కాని తీవ్రతలోని దాహం అదే విధంగా ఉంటుంది. అది మీ తత్వజ్ఞానాన్ని మారుస్తుంది. తీవ్రత మీ అంతరంగం లోపలి నుంచి వచ్చే పిలుపు.
లైటుకి, లేజర్ కి ఉన్న తేడా చూడండి. రెండూ అవే కాంతిరేఖలతో చేయబడ్డాయి. లేజర్ ఒక పాయింట్ మీద తీవ్రంగా ఉంటుంది. తీవ్రత అనే శక్తి లేజర్ కి అంత శక్తినిస్తుంది. దాన్ని ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. ఆ శక్తి లోహం మీద కూడా రంధ్రాన్ని చేయగలదు. అదే శక్తి అత్యంత సున్నితమైన కంటి లోపల భాగాల్ని కూడా తొలగించగలదు.
బయాజిద్ కథ : బయాజిద్ అనే జ్ఞానోదయమైన ఒక సూఫీ యోగి జీవితం నుంచి, ఒక కథ
బయాజిద్ తన గురువు దగ్గర పన్నెండు సంవత్సరాలు ఉంటాడు కాని గురువు ఒక మాట కూడా అతనితో మాట్లాడలేదు. పన్నెండు సంవత్సరాలు గడిచాక, ఒక రోజు గురువుగారు బయాజిద్ ని పిలిచి హాలులో ఒక పుస్తకం ఉంటుంది అది తీసుకురా అంటాడు. పన్నెండు ఏళ్ళుగా బయాజిద్ గురువుగారిని చూడటానికి ప్రతి రోజూ ఆ హాలు నుంచి వచ్చేవాడు.
అతను గురువుతో, 'నేను ఎప్పుడూ పుస్తకాన్ని అక్కడ చూడలేదు. నిజానికి నేను హాలుని సరిగ్గా చూడలేదు. నా ఆసక్తి కేవలం మీ మీదే. మరింక దేని మీద లేదు కాని మీరు వెళ్ళి, తీసుకురమ్మంటే వెళతాను అంటాడు. అప్పుడు గురువు అతనితో 'వద్దు, ఇక్కడడే ఉండు' అంటాడు.
బయాజిద్ ఆసక్తి మొత్తం గాఢతతో ఉంది. అతని ఆసక్తి మొత్తం గురువుగారు మాత్రమే. గురువుగారు అతనితో 'ఆ పుస్తకం అవసరం లేదు. నేను నీ ఏకాగ్రత పూర్తిగా ఉందా లేదా అని చూసాను' అని అంటాడు. ఆ రోజు రాత్రి గురువుగారు శిష్యుడిని అక్కడే పడుకోమని చెప్తాడు. అతను గురువుగారి పక్కనే పడుకుంటాడు. అతనికి నిద్ర పట్టదు. అతను ఎంతో గాఢతతో నింపబడి ఉంటాడు. అతని మనస్సు పని చేయటం ఆగిపోయింది. మర్నాడు ఉదయం బయాజిద్ మరణించి, కొత్త వ్యక్తిగా నిద్ర లేస్తాడు. అతనికి బోధనలు కాని, సూచనలు కాని ఇవ్వలేదు. కేవలం పన్నెండు సంవత్సరాలు ఎదురుచూసాడు అంతే.
అది కేవలం ఆసక్తి అయితే ఆ శిష్యుడు పన్నెండు సంవత్సరాలు, గురువు ఏమీ మాట్లాడకపోయినా ఆ విధంగా ఉండేవాడు కాదు. అతని మనస్సు ఇక అక్కడ ఉండనవసరం లేదు. అతని ఎదురుతిరిగేది, ఇక్కడ నీవు ఏం చేస్తున్నావు? నీ టైం అంతా వేస్టు అయిపోతూది ఏమీ జరగలేదు. గురువుగారికి నీ మీద ఆసక్తి లేదు, ఇలా ఎంత కాలం సమయాన్ని వృథా చేస్తావు? అని మనస్సు తొందర చేస్తుంది.
మీలోని తీవ్రత మిమ్మల్ని పట్టి ఉంచుతుంది, ఎందుకంటే మీ అంతరంగం లోతులలో, పన్నెండు సంవత్సరాలు ఏమిటి అంతిమ సత్యం లోనికి గురుదేవులు మనని తీసుకువెళతారు అంటే పన్నెండు లక్షల జన్మలైనా ఎదురుచూడవచ్చు అనుకుంటారు. అది కూడా తక్కువే. ఎడారిలో దాహం వేసినప్పుడు గ్లాసు నీళ్ళ కోసం మీ ప్రాణాన్ని అయినా ఇస్తారు. అదే విధంగా ఆధ్యాత్మికదాహం అయినా అంతిమసత్యం కోసం ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధం అన్నంత తీవ్రంగా ఉండాలి కోరిక.
జెన్ బౌద్ధమతం నుంచి ఒక చక్కని కథ : ఒక శిష్యుడు జెన్ గురువు దగ్గరకు వచ్చి తనకి జెన్ గురించి నేర్పించమని అడుగుతాడు. గురువు శిష్యుడితో, ‘సరే నీవు ఒక చేతితో కొట్టిన చప్పట్ల శబ్దం విని నా దగ్గరకు రా’ అని చెపుతాడు.
శిష్యుడు, మూడు సంవత్సరాలు ప్రయత్నిస్తాడు. కాని గురువు చెప్పిన ఆ శబ్దాన్ని వినలేకపోతాడు. అతనికి నిరాశ కలుగుతుంది. కన్నీటితో అతను గురువు దగ్గరకు వచ్చి మీరు చెప్పింది చేయలేకపోయాను. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే స్థితి వచ్చింది అంటాడు.
అప్పుడు గురువు, ‘మరొక వారం రోజులు చూడు. నిరంతరం ధ్యానం చేయి అంటాడు. అతను వారం రోజులు ఉంటాడు. కాని ఫలితం ఉండదు. గురువు గారు అతనితో మరొక ఐదు రోజులు ప్రయత్నంచేయమని చెపుతాడు.
శిష్యుడు మరో ఐదు రోజులు ఉంటాడు, ఫలితం ఉండదు. శిష్యుడు అత్యంతనిరాశతో వచ్చి తనని పంపించేయమని అడుగుతాడు, అప్పుడు గురువు అతనితో ‘మరొక మూడు రోజులు ప్రయత్నించు. నీకు జ్ఞానోదయం జరగకపోతే చనిపో’ అంటాడు.
రండవ రోజున శిష్యుడికి జ్ఞానోదయం అవుతుంది.
ఎప్పుడైతే మీ అంతరంగం మొత్తం ఆ సత్యం కోసం దహించుకుపోతుందో అప్పుడుగురువుల సూచనల్ని మీరు సూటిగా గ్రహించ గలుగుతారు. అప్పుడు మీలో మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది. అప్పుడే మీరు దేన్నైనా స్వీకరించే స్థితిలో ఉంటారు. అప్పటి వరకూ మీలో ఉన్నది కేవలం ఆసక్తి మాత్రమే.
ఏ పని చేసినా తీవ్రతతో చేయాలి
తంత్రం ఏం చెబుతుందంటే సత్యాన్ని తెలుసుకోవాలంటే మీకు కావలసింది ఒకే ఒక నిబంధన, అది - తీవ్రత. మీరు చేసేదానిలో మీలో సంపూర్తిగా నిమగ్నమవ్వండి. ఈ క్షణంలో తీవ్రతతో ఉండండి. అప్పుడు నిజమైన జీవితపురుచిని చూస్తారు. లేకపోతే మీరు జీవిస్తున్నట్టు కాదు, కేవలం మరణం కోసం ఎదురుచూడటమే.
తినేటప్పుడు తీవ్రతతో తినండి. మీ ఏకాగ్రత, మీ శక్తి అంతా ఆ తినేదాని మీద మాత్రమే ఉండాలి. మీ ఏకాగ్రతని అక్కడి నుంచి మళ్లించవద్దు, మీరు చేసే పని నుంచి ఆలోచనలను అటూ ఇటూ వెళ్లనీయవద్దు.
మీ అన్ని జ్ఞానేంద్రియాలతో ఆహారాన్ని అనుభవించండి. నోట్లో ఆహారం పెట్టుకోగానే ఆ రుచిని, మీ కళ్ళ ముందు ఉన్న భోజనాన్ని, దాని స్పర్శని ప్రేమతో ఒక ఉత్సవంలా సంతోషించండి. భోజనం నుంచి వచ్చే చక్కని వాసనని అనుభవించండి. ఈ విధంగా భోజనం చేస్తే దాన్ని మీ వ్యవస్థలోకి పంపించగలరు. ఆ జీవశక్తికి ఆహారాన్ని ఇవ్వటమే భోజనం అంటే. మీరు నీరు తాగేటప్పుడు, గాఢతతో మీరే దాహం అయిపోయి తాగండి. మీ నోటి లోంచి గొంతు ద్వారా అన్నవాహికలోకి నీళ్ళు తీసుకువెళ్ళే చల్లదనపు అనుభూతిని పొందండి. మీ నోటి లోనికి వెళ్ళే ప్రతి నీటి బొట్టూ మీకు తృప్తిని ఇవ్వాలి.
తమిళంలోని పెరియ పురాణంలో నాయనార్లు అనే శివభక్తుల కథలు ఉంటాయి. వారిలో చాలా మంది కేవలం సామాన్యమైన పనులు చేస్తూ, శివుడికి పూలమాలలు అల్లుతూ జ్ఞానోదయం పొందిన సంఘటనలు ఉన్నాయి. ఒక ఉదాహరణ, గణనాథ నాయన్మార్ ఒక శివభక్తుడు. అతడు శివపూజకి పూలు కోసి దండలు అల్లేవాడు. గుడి తుడిచి కడిగేవాడు. దీపాలు వెలిగించేవాడు. సాధారణ కార్యాలు చేస్తూ అంతిమస్థితిని చేరాడు. అందుకే అతనికి గణనాథుడు అనే పేరు. గణనాథుడు అంటే శివుని గణాలకి అధిపతి.
మీరు పూజ చేసే సమయంలో నిజంగా, అప్రయత్నంగా ఉండండి. మీరు ఏ అనుభూతిని పొందుతారో దాన్ని పూర్తిగా పొంది భగవంతునికి సమర్పించేవి ఇవ్వండి. నాకు అటువంటి అనుభూతులు లేవు అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. భగవంతుడి నుంచి మీరు దేన్నీ దాచలేరు. మీ గురించి మీ కంటే భగవంతునికే బాగా తెలుసు.
మీ సత్యాన్వేషణ, మీ కోరిక అనేవి తీవ్రత ఉన్నప్పుడే జరుగుతాయి. మీలోని తీవ్రత తారస్థాయిలో ఉంటే అది అప్పుడే ఆ క్షణంలోనే జరుగుతుంది. ఆ తీవ్రత పూర్తిగా లేకపోయినా లేదా కొన్ని భాగాలుగా విడిపోయినా జరగటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే తీవ్రత బలాన్ని పుంజుకోవటానికి సమయం పడుతుంది.
ఒక చిన్న కథ : జ్ఞానోదయమైన సూఫీ యోగి జునాయిద్ తొమ్మిదవ శతాబ్దానికి చెందినవాడు. ఒక రోజు ఉదయం ఆయన నడుస్తుంటే ఒక వ్యక్తి వచ్చి నేను రాజధాని పట్టణానికి వెళ్ళాలి ఎంత సమయం పడుతుంది అని అడుగుతాడు. జునాయిద్ అతని వైపు చూసి నడవటం కొనసాగించాడు. ఆ వ్యక్తి అటు వైపు వెళుతున్నాడు. అతను జునాయిద్ని అనుసరించాడు. జునాయిద్ సరిగా వినలేదు అనుకొని అతన్ని మళ్ళీ, 'నేను రాజధాని పట్టణం చేరటానికి ఎంత సమయం పడుతుంది.' అని అడుగుతాడు.
జునాయిద్ నడుస్తూనే ఉంటాడు. అతను ఇక అడగవద్దు అనుకుంటాడు. కొంత దూరం నడిచాక జునాయిద్ అతనితో, నీవు మరొక పదిగంటలు నడవాలి. అని అంటాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా, 'ఆ మాట ముందే చెప్పవచ్చు కదా!' అంటాడు.
జునాయిద్ అతనితో ముందే నేను ఎలా చెప్పగలను. నువ్వు ఎంత వేగంగా నడుస్తున్నావో గమనించకుండా ఎలా చెప్పను. నిన్ను గమనించి నీవు ఎప్పటికి చేరగలవో చెప్పాలి కదా' అంటాడు.
అదే విధంగా మీరు అంతిమ సత్యాన్ని ఎంతలో తెలుసుకోగలరు అనేది మీరు ఎంత తీవ్రంగా అన్వేషిస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు తీవ్రంగా ఉంటే అంతిమ స్థితిని చేరటానికి ఎక్కువ సమయం అవసరం లేదు. మీరు ఎవరు ఎక్కడ ఉన్నారు అన్నది అనవసరం. ఇప్పుడే ఇక్కడే ఆ స్థితిని చేరవచ్చు.
ఒక చిన్న కథ : ఒక రాజ్యంలో భయంకరమైన బందిపోటు దొంగ ఉన్నాడు. అతను చాలా మందిని దోచుకున్నాక, అతని పనులకి అతనిలో అసహనం, అసౌకర్యం అనే భావనలు ప్రారంభమవుతాయి. అతను ఒక గురువు దగ్గరకి వెళ్ళి 'గురుదేవా! నేనొక పాపాత్ముడిని, నేను స్వేచ్ఛ పొందే అవకాశం ఉన్నదా? నాకు ముక్తి లభిస్తుందా?' అని అడుగుతాడు.
గురువు దొంగ వైపు చూసి నీవు ఏ విషయంలో సమర్థుడివి అంటాడు. దొంగ ఏదీ లేదు అంటాడు. ఏమీ లేదా? ఏదో ఒక దానిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది కదా! అని అంటాడు. దొంగ చాలా సేపు ఆలోచించి, 'గురుదేవా! నాకు కేవలం దొంగతనం చేయటమే తెలుసు. నా జీవితం అంతా నేను ఆ పనే చేశాను' అని అంటాడు.
గురువుగారు నవ్వి, 'మంచిది. ఇప్పుడు నీవు దాన్నే ఉపయోగించాలి. ఏదైనా ప్రశాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి నీలోని భావాల్ని, ఆలోచనల్ని దొంగతనం చేయి. భూమి మీద ఉన్న చెట్లని, రాళ్ళని, నదుల్ని అన్నింటినీ దొంగతనం చేయి. వాటినన్నింటినీ నీ అంతరంగంలో ఉన్న విశాలమైన ఖాళీ ప్రదేశంలో కరిగించేయి,' అని చెబుతాడు.
దొంగ గురువుగారి సూచనల్ని అదే విధంగా పాటించాడు. అతను 21 రోజుల తరువాత తన సహజ స్థితిని తెలుసుకుంటాడు, అతను జ్ఞానోదయం పొందుతాడు.
తీవ్రత - చేతన స్థితిలోని నాలుగు దశలు
చేతనస్థితిలో నాలుగు దశలు ఉన్నాయి. మీకు మీ మీద పూర్తి స్పృహ ఉండి ఆలోచనలు ఉన్న జాగ్రత్‌స్థితి లేదా మేలుకొని ఉన్న స్థితి. అది ఇప్పుడు మీరు ఉన్న స్థితి. ఈ స్థితిలో నేను అనేది మీ ఆలోచనల కంటే వేగంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆలోచనల్ని నియంత్రించవచ్చు. మీ మీద మీకు స్పృహ ఉండదు. కాని ఆలోచనలు ఉంటాయి. అదే స్వప్నస్థితి. స్వప్నస్థితిలో మీ ఆలోచనల వేగం ఎక్కువ. అందుకే మీరు ఆలోచనల్ని నియంత్రించలేరు.
వివిధ చేతన స్థితులు
| ఆలోచనలతో | ఆలోచనలు లేకుండా | |
|---|---|---|
| “నేను” ఉన్న చేతనతో | జాగ్రత్ మేల్కొన్న అవస్థ ఆలోచిస్తూ | తురీయ పరమానంద స్థితి సంపూర్ణ చేతనస్థితి |
| “నేను” ఉన్న చేతన లేకుండా | స్వప్న స్వప్నస్థితి కలలుకంటూ | సుషుప్తి అచేతన స్థితి గాఢ నిద్ర |
మీ మీద మీకు ‘నేను ’ అనే స్పృహ ఉండదు, ఆలోచనలు ఉండవు. అదీ గాఢనిద్రస్థితి అయిన సుషుప్తి. సాధారణంగా మనకి ఈ మూడు స్థితులు తెలుసు. నాలుగవదానిలో నేను అనే స్పృహ ఉంటుంది. కాని ఆలోచనలు ఉండవు. ఇదే తురీయదశ.
తీవ్రమైన అన్వేషణ - మూడు స్థితులలో తెలుసుకునే తత్త్వం
తీవ్రత అంటే మీరు ఏ పని చేసినా ఆ క్షణంలో ఆ పనిని తీవ్రతతో చేయటమే. కాబట్టి ముందుగా మీ మీద మీకు పూర్తి స్పృహ, తెలుసుకునే తత్త్వం ఉండాలి. అప్పుడే మీరు తీవ్రంగా ఉండగలరు.
ఇప్పుడు మీరు తెలుసుకునే తత్త్వంతో మీరు అంటే ఎవరో జాగ్రత్స్థితిలో తెలుసుకోండి. మీరేమనుకుంటారు. నేను డాక్టర్ని, నేను లాయర్ని ఇలా అనుకుంటారు. మీరు మీ గుర్తింపులు తెలుసుకొని మూడు స్థితులలో సంతోషంగా ఉండగలిగితే అసలు సూత్రాన్ని పట్టుకున్నట్టే. ఈ మూడు స్థితుల్లో ఉండే కేంద్రసూత్రాన్ని పట్టుకున్నప్పుడు, అకస్మాత్తుగా మనం ఈ మూడు స్థితుల్లో మన గుర్తింపుని తెలుసుకోగలుగుతాం.
నన్ను ఒకరు ఇలా అడిగారు, ‘గాఢనిద్రలో నన్ను నేను తెలుసుకోలేను కదా!’ అని గాఢనిద్ర లోంచి వచ్చి గాఢనిద్రలో ప్రశాంతంగా నిద్ర పోయాను అని చెప్పేది ఎవరు? నేను చీకటితో నింపబడ్డాను, అక్కడ నేను అనే వ్యక్తిని లేనంతగా నిద్రపోయాను అని చెప్పేది ఎవరు. నేను అసలు లేను అని గుర్తుంచుకొని చెప్పే వ్యక్తి ఎవరు? ఆ స్థితిలో ఆ వ్యక్తి లేకపోతే వెనక్కి వచ్చి ఈ మూడు దశలని కలిపి చెప్పే వ్యక్తి ఎవరు. కాబట్టి గాఢనిద్రలో నేను లేను అని చెప్పలేం. మనం అక్కడ ఉన్నాం కాని మన గుర్తింపులు మనకి ఆ స్థితిలో తెలియవు. అర్థం చేసుకోండి, ఈ మూడు స్థితులు తెలుసుకున్న వ్యక్తి చేతనస్థితి. మనం ఈ మూడు స్థితుల్లో మన గుర్తింపుని తెలుసుకోగలిగితే, మనలో చేతనస్థితి ఉంటుంది. మన అన్వేషణ తీవ్రంగా ఉంటుంది. మనం దీక్ష పొందగల తీవ్రత ఉంటుంది.
మనకి ఈ మూడు స్థితులూ తెలిసి ఉండకపోతే, ఈ మూడు స్థితుల్ని అదే గుర్తింపుతో తెలుసుకోకపోతే, మనం మన ఆధ్యాత్మిక అన్వేషణని తీవ్రం చేయాలి.
తీవ్రమైన ఆధ్యాత్మిక అన్వేషకుడు ఈ మూడు స్థితుల్లోనూ తన గుర్తింపుతో ఉంటాడు. కనీసం ఒకటి - రెండు సార్లయినా మీరు మేలుకుని ఉన్నప్పటి మీ గుర్తింపుని మీ కలల స్థితిలో కూడా తెలుసుకోగలిగితే మీలో తీవ్రత ఉందని అర్థం. కొన్నిసార్లు అకస్మాత్తుగా మీ కలల స్థితిలో మీ గుర్తింపుకి అతీతంగా వెళ్ళినట్టు తెలుసుకుంటారు. ఆధ్యాత్మికులు కలల స్థితికి ఈ అనుభవం పొందటం నాకు తెలుసు. వారికి కల వస్తుంటుంది. అకస్మాత్తుగా మేలుకున్న స్థితిలోని వారు అంటే ఏమిటో దాన్ని గుర్తిస్తారు. అప్పుడు వాళ్ళు కలల గురించి ఆలోచిస్తారు. ఇది చిన్నది, ఇందులో ఏమీ లేదు అనుకుంటారు. మీరు మేలుకుని ఉన్నప్పటి స్థితి కలల స్థితిలో గుర్తించుకోగలిగితే మీలో తీవ్రత ఉంది అని అర్థం. మీ అన్వేషణ తీవ్రమైంది.
మేల్కొండి
పీడ కల వచ్చేటప్పుడు ఒక్క ఆలోచన, 'ఓ! ఇది కల' అనేది చాలు, మీరు మేలుకుంటారు. అదే విధంగా మీరు ఉన్న ఇప్పటి పెద్ద కల అయినా మేల్కొని ఉన్న స్థితిలో ఒక క్లిక్ చాలు, ఈ పెద్ద కల అనే దాని నుంచి మీరు మేల్కొంటారు.
'కాదు! నాకు మరొక పద్ధతి అవసరం,' అని మీరు అనుకుంటే, మీరు నిజంగా పీడ కల లోంచి వెళ్ళటం లేదు. మీ కల తీవ్రంగా లేదు. ఏవో కొన్ని ఆలోచనలు ఉన్నాయి.
కొన్నిసార్లు కలల్లో ఏవో స్పష్టత లేకుండా మసకగా చూస్తారు. ఏవో మామూలు విషయాలు సాధారణంగా ఉంటాయి. మీకు అవి చూడాలి అనిపించదు. దాని లోంచి బయటకి రావాలి అనిపించదు. మీరు ఇటువంటి కలలతో ఉంటే మీరు సమయం వృధా చేస్తున్నారు అని అర్థం. మీలో తీవ్రత లేనప్పుడు మీరు ఇటువంటి కలల స్థితిలో ఉంటారు. మీరు కిందికీ వెళ్ళలేరు, పైకి వెళ్ళలేరు. దయచేసి ఆ స్థితిలో ఉండవద్దు. అర్థం చేసుకోండి, మీరు అటువంటి మధ్య స్థితిలో ఉంటే, మీలో క్లిక్ అనేది జరగదు. మీలో బలమైన మార్పు జరగదు.
ఏదో ఒక టైంలో నిద్ర లేవాలి కాబట్టి లేస్తారు. కొన్ని జన్మలుగా ఉన్న ఆ నిరుత్సాహంతోనే నిద్ర లేస్తారు. మీలో నిద్ర లేవాలి అనే తీవ్రమైన కోరిక ఉంటే ఈ క్షణంలోనే మేల్కొంటారు.
కబీరు చాలా చక్కగా, గట్టిగా ఒక విషయం చెబుతాడు, 'మీరు ఆయన కోసం చూస్తే వెంటనే ఆయన మీకు కనిపిస్తాడు.' కొంత మంది అంటుంటారు, 'మా చేతులలో ఏముంది? మేము ఎప్పుడు మేల్కోవాలి అని భగవంతుడు నిర్ణయిస్తే అప్పుడే మేల్కొంటాం అది మా విధి రాత్ అని.' అర్థం చేసుకోండి, ఇవన్నీ మీ మనస్సు చేసే ట్రిక్స్ మాత్రమే. మీరు మీ కోసం నిర్మించుకున్న జైలు తలుపుని ఎప్పుడూ తడుతుంటాడు. మీరు తెరవకపోతే ఏం చేయగలడు.
నేనెప్పుడూ చెబుతాను. భగవంతుడు కరుణామయుడు. మీ స్వేచ్ఛకి అడ్డు పడడు. మీరు నిద్రలోనే ఉంటాను అనుకుంటే ఆయన మీరు మేల్కొనేవరకూ ఎదురు చూస్తుంటాడు. మీ స్వేచ్ఛని ఆయన గౌరవిస్తాడు. మీకు విసుగు కలిగి మీరు ఉన్న ప్రపంచం అంతా ఒక ఊహ అని తెలుసుకునేవరకూ ఓపికతో చూస్తాడు.
మీ లోపలికి చూడండి. మీ కల్పనల ప్రపంచంలో నిద్ర పోవడానికి మీరు నిర్ణయించుకుంటారు. నిజంగా భగవంతుడు ప్రతిక్షణం మీ తలుపు తడుతూ ఉంటాడు, కాని మీరు పట్టించుకోరు. మనం మన కలల ప్రపంచానికి ఎంతగా అలవాటు పడిపోయామంటే, మేలుకోవడానికి ఇష్టపడనంత. ఎప్పుడైతే గురుదేవులు అసలైన సత్యం, అది చాలా అందంగా ఉంటుంది, అని చెప్పినా మీరు ఆ నిద్ర మొద్దు తనంలోనే ఉంటారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ పెద్ద కల నుంచి బయటికి రావాలి అని మీరే నిర్ణయించుకోవాలి. అది మీ ఎంపిక, మీ బాధ్యత.
నిద్రలో తీవ్రత
ఒక చిన్న ప్రయోగాన్ని ఎప్పుడైనా ప్రయత్నించారా? మీరు ఉదయం నాలుగు గంటలకు మేల్కోవాలి అనుకున్నారనుకోండి. మీ దగ్గర అలారం లేదనుకోండి, అప్పుడు మీరు నిద్ర పోయే ముందు గట్టిగా మీకు మీరు 'నేను 4 గం. మేలుకుని తీరాలి' అనుకుంటారు. సరిగ్గా 4 గం. కి మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీకు మెలకువ వస్తుంది, నిద్ర మాయం అవుతుంది. మీ శరీరం అనే గడియారం మీలోని తీవ్రమైన, నిజాయితీగా ఉన్న కోరికకి స్పందిస్తుంది.
మీరు నిజాయితీగా అనుకోకపోతే, మీ అంతరంగంలో 'చూద్దాం! లేవగలిగితే లేస్తాను. ఒకవేళ లేవలేకపోయినా పరవాలేదు అనుకుంటే ' మీరు లేవలేరు. మీరు నిజాయితీగా, దృఢంగా అనుకుంటే అది జరుగుతుంది. తీవ్రతకి మీ అచేతన స్థితిలోనికి, మీ గాఢ నిద్ర స్థితిలోనికి వెళ్ళగల శక్తి ఉంది.
ఏకాగ్రత మారాలి
ఈ నాలుగు స్థితుల్లో ఒకటి అన్నింటిలో ఉంటుంది. అదే వాటిని చూసే వ్యక్తి. ఆ అనుభవాన్ని పొందే వ్యక్తి. మనం కొంచెం లోతుగా చూస్తే, ఈ మూడు స్థితుల్లోనూ అక్కడున్న నిజమైన దాన్ని మార్చటానికి ప్రయత్నిస్తున్నాం అని తెలుస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతి దాన్నీ మార్చటానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తుంటాం.
ఒక చిన్న కథ : ఒక అబ్బాయి అతని తల్లితండ్రులతో కలసి సినిమాకి వెళతాడు. అది చిన్న పిల్లల సినిమా. సింహం పిల్ల అడవి జంతువుల కథ. ఈ అబ్బాయి సినిమాలో లీనమైపోయి చూస్తుంటాడు. సినిమాలో ఒక వేటగాడు వచ్చి సింహం పిల్లని పట్టుకుని బోనులో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు, అది భయపడిపోతుంది.
ఈ దృశ్యం చూసి ఆ అబ్బాయి తట్టుకోలేక పోతాడు. కుర్చీ లోంచి దూకి స్క్రీన్ దగ్గరకి వెళ్ళి కాళ్ళతో చేతులతో వేటగాడిని కొడుతుంటాడు. కొంత సేపటికి జంతువులన్నీ కలసి వేటగాడిని తరిమి సింహం పిల్లని రక్షిస్తాయి. ఆ అబ్బాయి తన కుర్చీ దగ్గరకి వచ్చి గర్వంగా వాళ్ళ అమ్మతో, 'చూసావా! నేను ముందు వెళ్ళగానే జంతువులన్నీ నన్ను అనుసరించాయి. మేం సింహం పిల్లని కాపాడాం' అని అంటాడు.
ఇది చూడటానికి చిన్నపిల్లల చేష్టగా ఉంటుంది, కాని మీరు కొంచెం లోతుగా మీ జీవితాల్లో చూస్తే ఆ అబ్బాయిలా మనం కూడా మన జీవితాల్ని నియంత్రిస్తున్నాం అనుకోవటం కనిపిస్తుంది. జీవితం అంటే ఒక సినిమా అది ఈ మూడు స్థితుల నుంచీ సాగుతూ ఉంటుంది.
మీరు చూసే వ్యక్తి ఆ ప్రొజెక్టరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదంతా మీ సృష్టి. సీను మార్చాలి అంటే ఆ ప్రొజెక్టరులోని రీలు మార్చాలి. ఎప్పుడైతే ఈ మార్చటం అనేది ఈ మూడు స్థితుల్లో అసాధ్యం అని తెలుసుకుంటారో ఏకాగ్రత మీలోకి మారుతుంది, అప్పుడు మేల్కొంటారు. అలా కాకుండా, ఈ స్థితులలో ఏదో ఉపయోగం ఉన్నది అనుకుంటే, మీ ఏకాగ్రత వాటి మీద మాత్రమే ఉంటుంది. మీరు నిరంతరం వాటిలోనే నిమగ్నమై ఉంటారు. అప్పుడు మీరు సీనులు మార్చటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
ఈ విషయం మీలో క్లిక్ అయితే మీరు ఏస్థితిలో ఉన్నా, అది మేల్కొని ఉండే జాగ్రత్‌స్థితి, స్వప్నస్థితి లేదా గాఢనిద్ర అయిన సుషుప్తి నుంచి మేల్కోగలుగుతారు. మనకి కావలసింది కేవలం ఒక క్లిక్ మాత్రమే. 'ఇది ఒక కల మాత్రమే,' అంతే మనం ఆ స్థితి నుంచి మేల్కొంటాం.
నాల్గవస్థితికి ద్వారం
ఇదే తెలుసుకునే తత్త్వాన్ని గాఢనిద్రస్థితికి కూడా తీసుకువెళ్ళగలుగుతారు. అటువంటివారు, ఈ విషయాన్ని ఈ మూడు స్థితులలో అర్థం చేసుకున్నప్పుడు అకస్మాత్తుగా వారు వారి అంతరంగం లోనికి వెళతారు. అప్పుడు వారు వారిని మేల్కొల్పగలుగుతారు.
ఒక చిన్న కథ : ఒక రోజు ఉదయాన్నే ఒక జెన్ బౌద్ధగురువు నిద్ర లేచి బయటకి వచ్చి ఏడవటం మొదలుపెడతాడు. అతని శిష్యులు ఆయనని అలా చూసి చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఆయనతో, 'గురుదేవా' ఎందుకు మీరు అలా బాధ పడుతున్నారు' అని అడుగుతారు.
అప్పుడు గురువుగారు, 'రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో నేను సీతాకోక చిలుకలా ఉన్నాను' అంటాడు. శిష్యులు ఆయనతో, 'కాని అది కల కదా, 'ఇప్పుడు మీరు మా ముందు కూర్చుని ఉన్నారు, ఇంకా ఎందుకు బాధపడతారు?' అని అంటారు. అప్పుడు గురువుగారు చాలా చక్కని సమాధానం ఇస్తారు. నాకు తెలియటం లేదు. నేను నా కలలో సీతాకోక చిలుకని అయ్యాక గురువుని అయ్యానా లేకపోతే సీతాకోకచిలుక కలలో ఒక గురువుని అయ్యానా, నాకు ఏమి తెలియటం లేదు.
అర్థం చేసుకోండి, చాలా కొద్దిమంది మాత్రమే మనస్సు తాలూకు మూడు స్థితుల్లో అదే తీవ్రతతో, అదే బంధంతో తమ గుర్తింపుని చూడగలుగుతారు. అన్ని స్థితుల్లో ఆ గుర్తింపు నిశ్చలమైన, విడిపోని అదే గుర్తింపుని ఈ మూడు స్థితుల్లో గుర్తించగలిగితే, మీరు ఆధ్యాత్మిక అన్వేషి. అప్పుడు మీలోని చేతనస్థితి మేలుకుంటుంది. ప్రత్యగాత్మ చైతన్య జాగ్రత్ స్థితి మీలో కలుగుతుంది. నేను కొన్ని సంస్కృతపదాలని వాడుతుంటాను. ఎందుకంటే వేదాల్లో మనం తీసుకువెళ్లలేని విషయాలు ఉంటాయి. అంటే మనం వెల్లడి చేయలేని కొన్ని కోణాలు. అటువంటి పదాల్ని ఇంగ్లీషు లోనికి అనువదించటానికి కుదరదు. అలా అనువదిస్తే ఆ పదాలు చెప్పే అనుభవాలు అర్థం కాదు. ఆ సంస్కృతపదం తనలోని అనేకకోణాలలో ఉన్న అర్థాన్ని వెల్లడి చేస్తుంది.
జ్ఞానోదయం పొందటం ఎలా?
అర్థం చేసుకోండి, ప్రశ్న ఒక పదం, కోరిక ఒక భావం. మనిషి ఒక కోరికతో జన్మించాడు. సృష్టిలో మిగిలింది ఏదీ కూడా మనిషి సర్వాంతర్యామిని ప్రతిబింబించినంతగా ప్రతిబింబించదు. మనిషి అద్దం వంటివాడు. అతను సర్వాంతర్యామి వైపు తిరిగి, ఆయనది తనలో ప్రతిబింబించాలి అని అనుకోవచ్చు లేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. మనిషి చేతనస్థితిలో తన ఎంపికని చేసుకొని అభివృద్ధి పొందవచ్చు. తనలోని మానవరూపంలో అతను భగవంతుని తెలుసుకోవచ్చు. సృష్టిలో మరే ప్రాణికీ ఈ అవకాశం లేదు.
మీలోంచి 'నాకు జ్ఞానోదయం ఎలా జరుగుతుంది? నాకు చాలా చాలా అత్యవసరంగా జ్ఞానోదయం కావాలి, అన్న మాటలు వస్తే, ఈప్రశ్న మీ అంతరంగపు లోతుల నుంచి నిజంగా వస్తే, ఇక మీరు ఏమీ చేయనవసరం లేదు. కేవలం మురిగిపోండి. ఆ కోరికతో మీ వ్యవస్థ పూర్తిగా మురిగి పోవాలి, అది చాలు. మీరు ఇంకేమీ చేయనవసరం లేదు. ఆ మురగటం అనేది, దహించటం అనేది తీవ్రంగా ఉండాలి. దాన్ని అలా జరగనీయండి. ఆ కోరిక దహించేసేలా చెయ్యండి. ఆ తీవ్రతని అదే విధంగా కొనసాగించండి. ఆ అవసరాన్ని అదే విధంగా ఉంచండి.
అవసరం అత్యవసరం కావాలి. ప్రశ్న మీ తీవ్రమైన కోరికలా మారాలి. ఆ కోరిక మీ అహంకారాన్ని తినేయాలి. అది మీ అంతరంగం అంతా నిండాలి.
నన్ను చాలామంది అడుగుతుంటారు, 'మీరు భగవంతుని కృప వలన జ్ఞానోదయం పొందారా లేకపోతే కోరికతో పొందారా అని. నేను వారితో, మీలో కోరిక ఉంది అంటేనే భగవంతుని కృప అని చెప్పాను. అర్థం చేసుకోండి, ఈ కోరిక లేదా అన్వేషణ అనేది ఒక విత్తనం లాంటిది. విత్తనం లోపల ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటుంది. విత్తనం లోపల ఉన్న జీవచైతన్యం అందులో ఉక్కిరిబిక్కిరి కాకపోతే, ఇక అందులో తాను బ్రతకలేను అనుకున్నప్పుడే అది బయటికి వస్తుంది. లేకపోతే అది పగిలి బయటికి రాదు, చెట్టుగా మారదు. ఎప్పుడైతే విత్తనం తాను బయటికి రావాలి అని అనుకుంటుందో, అప్పుడే అది తన సత్యాన్వేషణని ప్రారంభిస్తుంది. ఆ కోరిక అత్యవసరమైనప్పుడు, అది వికసించి మొక్కగా మారుతుంది. దీని అర్థం ఏమిటి? ఆ మొక్క విత్తనంలోనే ఉంది, కాని అది వికసించాక తనని తాను వెల్లడి చేసుకోవటం ప్రారంభించింది.
మీకు జ్ఞానోదయం కావాలి అనే భావన కలిగిందనుకోండి, మీలోని బుద్ధుడు కళ్ళు తెరచినట్లే. మీ లోపల ఉన్న బుద్ధుడు మేల్కొన్నట్లే. మీరు చేయవలసింది, కేవలం కళ్ళు తెరవటమే.
ఆ అన్వేషణని జరగనీయండి. ఉదయం నుంచి రాత్రి వరకు దాన్ని అలా మరిగిపోనీయండి. అది మీ లోపల లోతైన అసంతృప్తిని కలిగించనీయండి, మీ శరీరంలో ప్రతికణం, ప్రతీ రంధ్రం ఆ తీవ్రతతో నిండిపోయేలా చేయండి. మీ జీవితంలో అది పొందలేదు, ఇది సాధించలేదు అన్న నిరాశలు చాలా ఉంటాయి. కొన్ని రకాల బాధలు, వ్యథలు ఉంటాయి. ఈ ఒక్క బాధతో ఆ బాధలన్నీ కరిగిపోయేలా చేయండి.
జెన్ బౌద్ధం నుంచి ఒక చక్కని కథ : ఒక అమ్మాయి జెన్ బౌద్ధగురువు దగ్గర చాలా కాలం నుంచి అన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. కాని నిజమైన ధ్యాన స్థితి అనుభవం ఆమెకి ఎంత కాలానికీ కలగదు. ఒక పౌర్ణమి రోజున ఆమె ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకువస్తూ ఉంటుంది. ఆమె ఒక కర్ర మోస్తూ ఉంటుంది. ఆమె ఆ బకెట్టు నీళ్ళలో చంద్రుడి బింబాన్ని చూస్తుంది. అప్పుడే కర్ర విరిగిపోతుంది. నీళ్ళు బకెట్ నుంచి బయట పడిపోతాయి, చంద్రుడి బింబం మాయం అవుతుంది. దాంతో పాటు ఆమె అహం కూడా పోతుంది.
మీలో తీవ్రత, తపన ఎక్కువగా ఉంటే, అది మీ అహంకారంలోని సారాంశాన్ని తీసేస్తుంది. పచ్చగడ్డి, ఎండుగడ్డి అయినట్టు అహం మారిపోతుంది. చిన్న అగ్ని రవ్వ చాలు, ఎండుగడ్డి మోపుని మండించేయటానికి. అంతిమస్థితి కేవలం ఒక్క క్షణంలో జరగవచ్చు. ఒక చిన్న సంఘటన చాలు అది జరగటానికి.
కాబట్టి అర్థం చేసుకోండి, మీరు అంటున్నారే, జ్ఞానోదయం ఎలా పొందాలి, నాకు అత్యవసరంగా కావాలి అని అంటున్నారే అది ఒక తీవ్రమైన కోరికగా మారాలి. ఆ కోరిక మిమ్మల్ని దహించేయాలి. అది మీలోని వ్యథల్ని, నిరాశని, కోరికలని, మీ జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్నీ దహించేయాలి.
అది జరగనీయండి. అకస్మాత్తుగా మీలోని అన్వేషణ, కోరిక అనేవి పూర్తిగా మాయమైపోవటం మీరు చూస్తారు. అది అక్కడ ఉండదు. ఎప్పుడైతే అన్వేషణ, కోరిక అన్నవి మాయమైపోతాయో మీకు జ్ఞానోదయం జరుగుతుంది. మీరు కోరుకున్నది, మీరు అన్వేషించేది మీకు దొరుకుతుంది.
గాఢతతో జీవించటం
మీరు నిజంగా జీవితాన్ని అనుభవించాలి అనుకుంటే, మీరు నిజంగా సర్వాంతర్యామి అంతిమ అద్భుతాన్ని తెలుసుకోవాలి అనుకుంటే, ఆనందసాగరంలోకి దూకాలి అనుకుంటే, మీకు కావలసినది గాఢత, తీవ్రత. మీరు ఏది చేసినా తీవ్రతతో చెయ్యండి, అందులో పూర్తిగా నిమగ్నమైపోండి. సగం పనులు చేయొద్దు. మిమల్ని మీరు ఆ పనిలో ఒకటిగా చేసేయండి.
మీరు డాన్సు చేస్తే మీరే డాన్సు అయిపోయేంతగా, పూర్తిగా అందులో నిమగ్నమవ్వండి. అక్కడ డాన్సు చేసే వ్యక్తి ఉండరు, కేవలం డాన్సు మాత్రమే ఉంటుంది. మీరు బొమ్మ వేస్తున్నారనుకోండి, పెయింటర్ మాయమైపోయి ఆ చిత్రమే మిగలాలి. అప్పుడు మీలోని అబద్ధపు గుర్తింపులు మాయమైపోతాయి. అప్పుడు మీలో ప్రవహించే మేధని చూడగలుగుతారు. విశ్వశక్తి మీ నుంచి ప్రవహించటం చూస్తారు.
బోధిధర్మ, జ్ఞానోదయమైన బౌద్ధయోగి, ఆయనే బౌద్ధమతాన్ని చైనా, జపాను దేశాలకి తీసుకువెళ్ళింది. ఆయన పైన ఒక చక్కని కథ ఉన్నది. బోధిధర్మ, తన గుహలోని గోడ వైపు తిరిగి దాన్ని చూస్తూ తొమ్మిది సంవత్సరాలు కూర్చున్నాడట. ఆయన ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా తొమ్మిది సంవత్సరాలు కూర్చున్నాడు. కాళ్ళలో కదలికలు లేని మూలాన అవి ఎలాగో అయిపోయాయి.
ఆయన ఎవరినీ శిష్యులుగా తీసుకునేవారు కాదు. ఎవరైతే తీవ్రతతో దహించుకు పోతుంటారో వారినే శిష్యులుగా తీసుకునేవారు. తొమ్మిది సంవత్సరాల తరువాత అతని మొదటి శిష్యుడు హాయ్ కాజో వస్తాడు. అతను తన చేతిని నరికి గురువుకి అర్పిస్తూ ఇలా చెబుతాడు. 'మీరు దీన్ని తీసుకోండి గురుదేవా. మీరు ఇప్పుడు నా వైపు చూడకపోతే, నేను నా తలని కూడా నరికేస్తాను అంటాడు.
బోధిధర్మ శిష్యుడి వైపు తిరిగి, 'నా సందేశాన్ని ఇవ్వగల వ్యక్తి వచ్చాడు,' అని అంటాడు.
ఒక్కసారిగా భగవంతుడిని చూడవచ్చు
కబీర్ ఈ విధంగా చెబుతాడు, 'నీవు నిజమైన ఆధ్యాత్మిక అన్వేషివైతే ఒక్కసారిగా చూడగలవు,'
మీరు నిజమైన ఆధ్యాత్మిక అన్వేషి అని ఎలా తెలుస్తుంది? మీలో ఆ అగ్ని రగులుతూ ఉంటే, ఆ తీవ్రత లోతుగా ఉంటే, అది అత్యవసరం అని అనిపిస్తే, ఆ దాహం ఉన్నప్పుడు మీరు ఆధ్యాత్మిక అన్వేషి, సత్యాన్ని కోరే వ్యక్తి. కబీర్ ఏం చెబుతాడు, మీలోని కోరిక నిజమైందిగా ఉండాలి. ఇక్కడ కావలసింది తీవ్రమైన తపన, లోతైన కోరిక, నిజాయితీ, ఏకీకృతంగా ఉండే సత్యాన్వేషణ. మీలో ఇవన్నీ ఉంటే మీరు తప్పనిసరిగా భగవంతుడిని చూడగలరు. మీరు చూడలేకపోతే, మీలో ఆ తీవ్రత లేదు అని అర్థం. అది పూర్తిగా లేదు. మీరు ఆయనని సగం హృదయంతోనే పిలుస్తున్నారు.
భగవంతుడిని చూడాలి అనే తీవ్రమైన కోరిక
మనలో చాలామంది అంటుంటాం, నేను చాలా తీవ్రంగా ప్రార్థిస్తున్నాను. భగవంతుడిని ఎలా చూడాలి? అని. మీ లోపలికి జాగ్రత్తగా చూడండి. భగవంతుడు మీ ప్రధాన ప్రాధాన్యమేనా? మనలో చాలామందికి భగవంతుడు ప్రాధాన్యాల లిస్టులో చివర ఉంటాడు. నిజం చెప్పాలంటే మీరు ఏమనుకుంటారు, 'నాకు మంచి ఇల్లు సమకూరేక, నా కుటుంబసభ్యులకి చేయవలసింది చేసాక, ఇంకా టైం ఉంటే అప్పుడు నేను కోరుకునే లిస్టులో భగవంతుడిని కూడా కలుపుతానని. భగవంతుడిని కోరికల లిస్టులో చివరివాడైతే ఆ లిస్టుకి చివరంటూ ఉండదు, ఇది ఒక విషవృత్తం. భగవంతుడు ఎన్నటికీ ఆ లిస్టులో పైన ఉండడు, ఎందుకంటే కోరికలకీ చివర ఉండదు. ఒక కోరిక తీరటానికి మీరు పని చేస్తారు. ఆ పనిలో మీరు పూర్తిగా నిమగ్నం కారు. అప్పుడు భగవంతుడు కోరుకునే వాటి లిస్టులో ఇంకా కిందికి నెట్టబడతాడు.
తీవ్రత వయస్సుని నిర్ణయిస్తుంది
ఒక చిన్న కథ : ఒక వ్యక్తి గురువు గారిని మీ వయస్సు ఎంత? అని అడుగుతాడు. ఆయన, 'నాకు మూడు వందల సంవత్సరాలు,' అని జవాబు ఇస్తాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, 'అది ఎలా? మీరు చూడటానికి అరవై సంవత్సరాల వ్యక్తిలా ఉన్నారు,' అని అంటాడు. అప్పుడు గురువు గారు, 'భౌతికంగా, కేలేండరు ప్రకారం నా వయస్సు అరవై సంవత్సరాలు కాని నేను జీవితాన్ని సాధారణమనిషి కంటే ఐదు రెట్లు గాఢతతో జీవించాను,' అని జవాబు ఇస్తారు.
ఇక్కడ కావలసింది ఎన్ని సంవత్సరాలు జీవించాం అని కాదు, ఎంత గాఢతతో జీవించాం, అని.
తీవ్రతతో అంతిమస్థితికి దీక్ష
వేదాలు ఏం చెబుతాయంటే, దీక్ష పొందిన వ్యక్తికి ప్రపంచమంతా స్వర్గంలా కనిపిస్తుందని. దీక్ష అనే పదాన్ని అర్థం చేసుకోండి. ఏదో ఒక పనిని పూజలా, యాంత్రికంగా చేయటం కాదు.
మీరు ఆహా! అది నిజమే, అని అనిపిస్తే, అకస్మాత్తుగా మీరు 'అవును ఆయన చెప్పింది నిజం, నేను ఇదే విధంగా చాలా సార్లు అనుకున్నాను అని అనుకోవటమే దీక్ష. ఆయన సరైన పద్ధతిలో చెప్పారు, అనుకున్నప్పుడు మీలో జరిగిందే దీక్ష. నేను మాట్లాడేది మీకు తెలిసిన విషయం, దాన్ని సరైన పద్ధతిలో చెప్పాను అని మీరు అనుకుంటే మీలో జరిగిందే దీక్ష. ఒక విషయం అర్ధం చేసుకోండి, చేయవలసినవన్నీ చేశాక, మీరు తీవ్రమైన స్థితిలో ఉన్నప్పుడే, గురువులు చెప్పేది మీలో దీక్షగా ఒక క్లిక్ అవుతుంది.
గురువులు మీతో ఇక మీరు కోరుకునేది, వెతికేది ఏమీ లేదు, ఇప్పుడే ముక్తిని పొందవచ్చు అన్నప్పుడు మీకు ఆ స్థితి కలగాలి. అంటే మీరు దానికి తగిన అన్వేషణని చేసి ఉండాలి. ఆ కోరిక అంత తీవ్రంగా అంత లోతుగా ఉండాలి. ఇక్కడ పద్ధతి ఏమిటంటే గాఢతతో ఉన్న సరియైన దృక్పథం. నిజానికి మీ లోపల తీవ్రతతో ఉన్న శక్తి ఉన్నప్పుడు సరిగ్గా వినగలుగుతారు. మీరు ఆ క్షణదర్శనాన్ని పట్టుకోవడానికి చూస్తుంటారు. వినటానికి ఎదురుచూస్తుంటారు. దాన్ని మీలో ఇముడ్చుకోవడానికి ఎదురుచూస్తుంటారు.
అందుకే గురువులు అదే విషయాన్ని పదే పదే, చెబుతుంటారు. నేను కొన్ని సంవత్సరాల క్రితమే మాట్లాడటం మొదలు పెట్టాను. గౌతమబుద్ధుడు నలభై సంవత్సరాలు మాట్లాడాడు. ఆయన మొదటి ఉపన్యాసం, చివరిది ఒకటే. మీరు అనుకోవచ్చు, ఎందుకు వేలమంది కూర్చుని అదే ప్రవచనాలని, అదే సందేశాన్ని మళ్ళీ మళ్ళీ వింటారు అని. ఎందుకంటే మీలో తీవ్రమైన శక్తి ఉన్నప్పుడే క్లిక్ అనేది జరుగుతుంది. తీవ్రతలోనే దీక్ష ఉంటుంది. మీరు ఆ అగ్ని రవ్వని పట్టుకోండి, మీలో మేల్కొలుపు జరుగుతుంది.
లోతైన ఆధ్యాత్మిక అనుభవం- ఆధ్యాత్మిక అనుభవానికి కావలసినవి
ఆధ్యాత్మిక అనుభవం జరగాలంటే రెండు నిబంధనల్ని పాటించాలి. మొదటిది, మీరు పూర్తిగా విప్పారి, పరిసరాలకి అందుబాటులో ఉండాలి. రెండవది గాఢమైన శక్తిక్షేత్రం. కొన్ని సమయాల్లో మీరు పూర్తిగా విప్పారి ఉన్నా, అక్కడ తీవ్రమైన శక్తిక్షేత్రం లేకపోతే కొబ్బరికాయ లాంటి మీ అహంకారం పగలదు. ఆధ్యాత్మిక అనుభవం జరగదు. మొదటి ఆధ్యాత్మిక అనుభవం అంటేనే కొబ్బరికాయ లాంటి మీరు పగలటం. ఒకసారి ఇది జరిగితే, మిగిలిన కాయల్ని పగలగొట్టడం కష్టం కాదు. మొదట అహంకారం తొలగాలి. అంటే గాఢమైన శక్తికేంద్రం ఉండాలి.
నా మొదట ఆధ్యాత్మిక అనుభవానికి ఈ రెండు విషయాలే కారణం. నేను విప్పారి ఉండి పరిసరాలకి అందుబాటులో ఉన్నాను. నేను అప్పుడు గొప్ప శక్తిక్షేత్రమైన అరుణాచలంలో ఉన్నాను. అదృష్టం కొద్దీ ఆ పర్వతం అందాలకి నేను ఆకర్షితుడనయ్యాను. మాములుగా మీరు ఒక పర్వతాన్ని కాని, నదిని కాని, సముద్రాన్ని కాని ప్రతి రోజూ చూస్తే వాటిని చాలా యధాలాపంగా తీసుకుంటారు. ఎందుకో గాని అరుణాచలపర్వతాన్ని నేను ఆ విధంగా చూడలేకపోయాను. నాకు దాని గురించి తెలుసు అని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎప్పుడూ తెరచిన అంతరంగంతో, ఆ పర్వతానికి అందుబాటులో ఉన్నాను.
తెరచి ఉండబడటం, అందుబాటులో ఉండటం అంటే ప్రతి ఉదయం కొత్త కళ్ళతో ప్రతి విషయాన్ని తాజాగా, కొత్తగా చూడటం. మనస్సుని విప్పారి ఉంచటం చాలా సమయాల్లో మనం మన సమాజానికి దొరకకుండా మూసుకుపోయి ఉంటాయి. మనం ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని, ఏదో అర్థం చేసుకుని తిరిగి దానికి కొత్తవిషయాల్ని కలపం.
నాకు ప్రతి రోజూ అరుణాచలపర్వతం జీవంతోనే కనిపించేది. నాకు ఎప్పుడూ అది కొత్త అందాలతోనే కనిపించేది. ఎప్పుడూ పాత దృశ్యం కనబడలేదు. నాకు ఒక అలవాటు ఉండేది. నిద్ర లేవగానే కళ్ళు మూసుకుని గోడ పట్టుకుని నెమ్మదిగా ఒక చోటికి వచ్చి కళ్ళు తెరిచేవాడిని. కళ్ళు తెరవగానే అరుణాచలపర్వతం కనిపించేది. అంటే నేను కళ్ళు తెరవగానే ముందుగా అరుణాచలాన్ని చూడాలి అన్నది నా ఉద్దేశం. ఇది చూడటానికి విచిత్రంగా, మూఢనమ్మకంగానూ ఉండవచ్చు. కాని నేనెప్పుడూ ఏమనుకుంటానంటే, నేను జన్మ తీసుకున్నది, ఈ శరీరాన్ని తీసుకున్నది ఆ అరుణాచలపర్వతం ఆకర్షణ వల్లనే. జ్ఞానోదయమైనవారిని ఆ పర్వతం బలంగా తన వైపు ఆకర్షిస్తుంది.
తమిళంలో అరుణాచలపర్వతం గురించి ఒక పద్యం ఉన్నది, 'ఆ పర్వతం జ్ఞానోదయమైనవారిని తన వైపు ఆకర్షిస్తుంది' అని. ఆ పర్వతం అంటే గౌరవం, భక్తిభావం ఉండటానికి కారణం, అది అన్ని దిశల నుంచి జ్ఞానోదయమైనవారిని తన వైపు ఆకర్షిస్తుంది. అందుకే ఆ పర్వతాన్ని మాములుగా ఎప్పుడూ నేను అనుకోలేదు. అది నాకు ఎప్పుడూ జీవచైతన్యంతోనే కనిపిస్తుంది.
భగవంతునికి ఎదురుపడటం
ఒక రోజు అరుణాచలం మీదున్న ఒక రాయి మీద కూర్చొని ధ్యానం చేయటానికి ప్రయత్నిస్తున్నాను. ఆ రోజు పౌర్ణమి. రమణ మహర్షి శిష్యుడు, జ్ఞానోదయమైన యోగీశ్వరుడు, అణ్ణామలై స్వామి నాకు దీక్షని ఇచ్చి చెప్పిన ధ్యానం చేయటానికి ప్రయత్నిస్తున్నాను.
ఆ రాయి మీద కూర్చొని ఎక్కడ నుంచి 'నేను' అనేది వస్తుంది అని తెలుసుకోవాలను కుంటున్నాను. చాలా సేపు కళ్ళు మూసుకొని కూర్చోని ఉన్నాను. నా లోపల ఏదో తెరవబడినట్టు అయ్యింది. అలా జరగగానే నేను 360 కోణంలో అంతా స్పష్టంగా చూడగలుగుతున్నాను. కళ్ళు మూసే ఉన్నాయి కాని నేను చుట్టూ జరిగేది, నా వెనుక, ముందు, పక్కన, కింది, పైనా అన్నీ చూడగలుగుతున్నాను. చూడటమే కాదు, మనం మన శరీరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అదే గాఢతతో నన్ను నేను అన్నింటిలో ఉన్న అనుభూతిని పొందుతున్నాను.
నా చుట్టూ ఉన్న రాళ్ళు, చెట్లు, మొక్కలు అన్నిటిలో నేను జీవించి ఉన్నాను. మీరు మీ శరీరంలో ఉండటాన్ని ఎలా అనుభవిస్తారో అదే విధంగా నేను సర్వసృష్టిలో, ప్రతిదానిలోనూ జీవిస్తున్నట్టు తెలుసుకున్నాను.
అప్పటి వరకు నేను అంటే శరీరం అనుకునేవాడిని. తరువాత నేను శరీరం కూడా అని తెలుసుకున్నాను. అర్థం చేసుకోండి, 'నేను శరీరం కూడా' అని తెలిసింది. ఇది చాలా లోతైన అనుభవం. అనుభవం కేవలం మాటలు గాని లేదా ఊహ గాని అయితే అది మీ మీద ప్రభావాన్ని చూపించదు. అది తీవ్రమైన చేతనస్థితిలో జరిగిన అనుభవం.
కాని మీకు ఎంత మంది చెప్పినా, మీరు మీ శరీరం మాత్రమే కాదు అని ఎన్ని సార్లు చెప్పినా మీరు విని ఊరుకుంటారు. ఆ మాటల్ని మీ మీద పని చేయనీయరు. ఎందుకంటే చేతనస్థితిలో మీ అనుభవం శరీరం మాత్రమే.
నా అనుభవం నేను అన్నింటిలోనూ ఉన్నాను అన్నది నాకు సత్యమైంది. అందుకే నేను ఆ విధంగా జీవించటం ప్రారంభించాను.
అంత చిన్న వయస్సులో, అంత తీవ్రమైన జీవితాన్ని అనుభవించటం గురించి తెలిసినవారు చాలా ఆశ్చర్యపోయారు. వారంతా ఇది చాలా కష్టం, ఊహించలేని విషయం అన్నారు. మీకు ఇది ఊహించలేని విషయం, ఎందుకంటే ఇది మీ చేతనస్థితిలోని అనుభవం కాదు కాబట్టి. ఇది నాకు సులభం. ఎందుకంటే విశ్వమంతా అన్నింటిలోనూ నేను ఉన్నాను అన్నది నా దృఢమైన అనుభవం.
రమణమహర్షి మరణానుభవం
రమణమహర్షి జీవితం గాఢత గల జీవితానికి ఉన్న శక్తికి ఒక చక్కని ఉదాహరణ. పదహారు సంవత్సరాల వయస్సులో ఇది ఆయనకి జరిగింది. ఆయన మదురై దగ్గర తిరుచ్చుజి అనే ఊరిలో ఉన్నారు. ఒక రోజు అకస్మాత్తుగా ఆయన తాను మరణిస్తున్నట్టు తెలుసుకున్నారు. మరణం అనే గొప్ప భయం ఆయనలో కలిగింది.
మనకి కూడా కొన్నిసార్లు, ముఖ్యంగా ఎవరిదైనా మరణవార్త విన్నప్పుడు, లేదా మరణించినవారిని చూసినప్పుడు మరణం అంటే భయం కలుగుతుంది. మనం ఆ భయాన్ని అణచటంలో మంచి శిక్షణని పొందాం. ఆ భయం బయటికి రాకుండా, దాన్ని నియంత్రిస్తాం. మనం ఎంత కపటంగా ఉంటామంటే మనని మనం మోసం చేసుకుంటున్నాం అని కూడా మనకి తెలియదు. చాలా సార్లు మనలో భయం కలుగుతుంది, కాని మనలో దాన్ని అణిచే ఒక వ్యవస్థ ఉండి భయాన్ని అణచివేస్తుంది. కొంత కాలం గడిచేసరికి మనలో సమతుల్యతని, అణచటాన్ని బాగా నేర్చుకుంటాం. దాన్ని అణచేసి మరిచిపోతాం. మరొక విషయం మీద ఏకాగ్రత నిలుపుతాం.
కాని రమణమహర్షి ఆ విధంగా చేయలేదు, దాన్ని ద్వారంగా మలచుకొని ఒక పెద్ద అడుగు ముందుకేయగలిగారు. మనందరం కూడా ఆ ద్వారం వరకు వెళతాం. ఎపుడైనా ఎవరిదైన మరణవార్త విన్నప్పుడు, భయం వేసినప్పుడు ఆ ద్వారం వరకు వెళతాం. కాని అక్కడి నుంచి దూకటానికి భయపడతాం. మనం కపటంగా ఉండటంలోనే శిక్షణ పొందాం కాని తీవ్రతలో కాదు. మనం ఏదో ఒక విధంగా దాని నుంచి తప్పించుకుంటాం... టి.వి చూస్తాం లేదా ఇంకొక దాని మీదికి దృష్టి మరలిస్తాం. రమణమహర్షి మరణం లేని స్థితికి ఒక పెద్ద అడుగు వేయగలిగారు. ఆయన నేల మీద కదలకుండా పడుకుని మరణాన్ని ఆహ్వానించారు. ఆయనకి జ్ఞానోదయం జరిగాక ఈ విషయం చాలా చక్కగా చెప్పారు.
'అకస్మాత్తుగా కారణం లేకుండా నేను మరణిస్తున్నాను అని నాకు అనిపించింది. నాలో లోతైన భయం కలిగింది. నాకు ఎటువంటి అనారోగ్యం లేదు. ఎటువంటి మానసికసమస్య లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. అకస్మాత్తుగా 'నేను' చనిపోతున్నాను అనిపించింది. నేను ఆ భయంతో సహకరించాను. నేను పారిపోవాలి అని చూడలేదు. నేను అసలు ఏ విషయమూ పట్టించుకోలేదు. నాకు ఏమీ చేయాలనిపించలేదు. అలాగే కదలకుండా ఉండి అనుభవాన్ని జరగనిచ్చాను. నాకు మరణం కలగనిచ్చాను. నేను పడుకుని ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాను. దాన్ని స్వీకరించి భయం లోనికి వెళ్ళాను. భయం నా మీద పనిచేయటం ప్రారంభించింది. నేను చనిపోవటం చూసాను. నా శరీరం నుంచి బయటికి రావటం నాకు స్పష్టంగా కనిపించింది. అకస్మాత్తుగా ఒక వెలుగు లాగా సత్యం నాకు తెలిసింది. నా శరీరం చనిపోయింది కాని నేను జీవించి ఉన్నాను. 'నేను' మరణించలేదు, నా శరీరం మరణించటం నేను చూడగలిగాను. నేను ఉన్నాను, అంటే నేను శరీరానికి అతీతుడని.
ఈ చిన్న సత్యం నన్ను కుదిపేసింది. నేను శరీరం కాదు, శరీరానికి అతీతుడనని నాకు తెలిసింది. ఆ తరువాత నాకు మరణభయం కాని, మరే భయం కాని కలగలేదు. నా అంతరాత్మ నుంచి ఆ భయం శాశ్వతంగా పోయింది. నా శరీరం గురించి నాకెందుకు అన్న విషయం తెలుసుకున్నాను. నేను మరణించిన శరీరం గురించి ఎందుకు పట్టించుకోవాలి. ఎందుకంటే అది మరణించినా, నేను ఉంటాను. దీని అర్థం నా గురించి నేను ఏమనుకుంటున్నానో నేను దానికి అతీతుడిని. ఈ విషయం నన్ను ఎప్పటికీ వదిలిపెట్టలేదు. ఈ అనుభవం తరువాత నేను ఈ సత్యాన్ని ఎప్పుడు వదలలోదు'.
ఒక భయం రమణ మహర్షిలో అంత మార్పుని ఎలా తీసుకురాగలిగింది? మన జీవితాలలో భయం చాలా సార్లు కలుగుతుంది కాని మనలో మార్పు రాదు. దీనికి జవాబు ఆ వ్యక్తిలోని తీవ్రత అటువంటి అంతిమ అనుభవానికి కారణం.
సమాజసేవకి ప్రేరణ
మీకు సమాజసేవ చేయాలంటే మీకు తీవ్రమైన ఉద్దేశం ఉండాలి. నేను చాలా మందిని చూసాను. సమాజసేవ పేరు మీద ఏదో చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళతో కూర్చోలేరు అందుకే అలా చేస్తారు. స్పష్టంగా తెలుసుకోండి, మీతో మీరు కూర్చోలేక గుడికి వెళ్ళటమో, సమాజసేవ చేసే సంస్థల దగ్గరకి వెళ్ళటం ఇలా చేసినప్పుడు మీరు సత్యాన్ని అనుభవించలేరు.
గుడికి వెళ్ళటం, సమాజసేవ అనేవి మీలో ఆ భావం పొంగి ప్రవహించేటప్పుడు చేయాలి. మీరు నిండుగా ఉండి, ఇక చేయవలసింది మరేది లేదు, నాకు చాలా టైం ఉన్నది కాబట్టి సేవ చేస్తాను అనుకోవటం బాగుంటుంది. అప్పుడు అది జ్ఞానోదయానికి దారి తీస్తుంది. ఆ సేవ మీకు ఆధ్యాత్మిక అనుభవం కలిగేలా చేస్తుంది. మీరు పొంగి పొరలే భావంతో ఉన్నప్పుడు మీరు ‘భగవంతుడు’ నాకు చాలా ఇచ్చాడు, జీవితం అంతా చాలా బాగున్నది అనుకుని గుడికి కాని చర్చికీ గాని వెళ్ళి మీ కృతజ్ఞతాభావాన్ని వెల్లడి చేసే స్థితిలో ఉండాలి. అప్పుడు మీకు ముక్తి కలిగి జ్ఞానోదయం అవుతుంది.
మీతో ఉండలేక, సంఘసేవకో, గుడికో వెళితే అది మీకు ప్రశాంతతని ఇవ్వదు. మీలో చాలా అసహనం ఉంటుంది. దానితో ఏదో చేయాలని తపన ఉంటుంది. ఇటువంటి దృక్పథం ఉన్నవారు గుడికి వెళ్ళినా, అక్కడ కూడా అందరి మీదా అరుస్తుంటారు. ఇది చేయవద్దు, అలా చేయకండి, మీరు ఇలా ఏమి చేస్తున్నారు? భగవంతుడికి ఇలా చేస్తే నచ్చదు, అని చెబుతారు. వాళ్ళు భగవంతుడికి ప్రతినిధిని అనుకుంటారు. అంతే కాదు, కొన్నిసార్లు వాళ్ళే దేవుడిలా ప్రవర్తిస్తుంటారు. ఇటువంటివారు, ఏదైనా సేవ చేసినా, వారు ముందుగా అక్కడికి వారి అహంకారాన్నితెస్తారు. వారు ఎదుటివారిని చిత్రహింసలు పెడుతుంటారు, ఎదుటివారికి సేవ చేయరు.
ఒక చిన్న కథ : ఒక స్కూల్ టీచర్ స్కౌట్ మాస్టరు. అతను తన స్టూడెంట్స్‌ని రోజు ఒక మంచి పని చేసి తనకి చెప్పాలి అని నిబంధన పెడతాడు. ఒక రోజు ముగ్గురు స్నేహితులు ఆయనతో ఈ రోజు మేము ముగ్గురం కలసి ఒక ముసలామెని రోడ్డు దాటించామని చెబుతారు. అప్పుడు టీచర్ వాళ్ళతో ముసలమ్మని రోడ్డు దాటించటం బాగానే ఉంది, కాని దానికి ముగ్గురు ఎందుకు అని అంటాడు.
స్టూడెంట్స్, అవును సార్, ముగ్గురం కలసి చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆమె రోడ్డు దాటనని గొడవ చేసింది, అని చెబుతారు.
స్పష్టంగా తెలుసుకోండి, మీరు సేవ చేయాలి కాబట్టి అనుకుని చేస్తారు తప్ప ఆ సేవాభావం మీ నుంచి పొంగి ప్రవహించటం వల్ల కాదు. మీరు ఏం చేస్తున్నారో అది మీకు ఒక అనుభూతి కాదు. మీకు ఎదుటివారి అవసరం తెలియదు. మీకు మీ టైం పాస్ కావాలి, మీ రిపోర్టులు ఎవరికైనా చూపించాలి అని మాత్రమే సేవ చేస్తారు. ఈ విధమైన ఉద్దేశంతో సేవ చేస్తే అంతా గందరగోళం చేసి ఎదుటి వారికి చాలా సమస్యల్ని సృష్టించిన వారవుతారు.
నేనెప్పుడూ అనుకుంటాను, సేవ అనేది మన అంతరాత్మ నుంచి పొంగి ప్రవహించాలి అని వేరే ఉద్దేశంతో ఎప్పుడూ సేవ చేయకూడదు. అ విధంగా చేస్తే మీరు అభివృద్ధి చెందలేరు. మీ ప్రేమ,సేవ కేవలం కపటం అవుతాయి, అది కూడా కల్తీతో కూడిన కపటం. మీరు కపటంలోనైనా స్వచ్ఛంగా వుంటేనే స్వేచ్ఛని పొందగలుగుతారు. కాని మీ కపటం కూడా కల్మషమే.
బుద్ధుని తీవ్రత
గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర చూస్తే, ఆయన ఆరు సంవత్సరాలు తీవ్రసాధన చేసినట్టు తెలుస్తుంది. ఆయన అనేకమార్గాల్లో ప్రయత్నం చేసాడు. ఇందులో చక్కని విషయం ఏమిటంటే ఆయన ఏది చేసినా పూర్తిగా అందులో నిమగ్నమైపోయి చేసేవాడు. ఏ మార్గాన్ని అనుసరించాలి అనుకుంటే అందులో పూర్తిగా, తీవ్రతతో నిమగ్నమై ఆ పని చేసేవాడు. ఆయన చాలా పద్ధతులు, ఉపవాసాలు, కఠినమైన నియమాలు, జపాలు – ఇలా చాలా చేశాడు. చాలా ప్రయత్నించాడు. కాని ఏదీ పని చేయలేదు.
గౌతమబుద్ధుడు తన సత్యాన్వేషణ రోజుల్లో ఆయన గురువులు రోజుకి ఒక బియ్యపు గింజని మాత్రం తిను అని చెప్పారు. బుద్ధుడు ఆ విధంగా మూడు నెలలు చేశాడు. చాలా నిజాయితీగా గురువుగారి సూచనల్ని పాటించాడు. అతను కేవలం చర్మం ఎముకలు తప్ప మరేమీ లేని స్థితికి చేరాడు. అత్యంతబలహీనంగా అయ్యాడు.
ఒక రోజు నదిలో స్నానానికి దిగి, బలహీనతతో కాళ్ళు కదపలేక నీళ్ళలో కొట్టుకుపోయాడు. ఎలాగో ఒక చెట్టు కొమ్మని పట్టుకోగలిగాడు. ఆ విధంగా వేలాడుతూ అకస్మాత్తుగా ఈ పద్ధతులు ఉపయోగం లేనివి అని తెలుసుకున్నాడు. అతను శరీరాన్ని కృశించేసే క్రమంలో, శరీరశక్తిని పోగోట్టుకున్నాను అనుకున్నాడు.
అంతరంగప్రపంచంలో ఏది సాధించలేకపోయానే అని నిరాశతో కుంగిపోయాడు. అతనికి బయటి ప్రపంచంలో కావలసింది ఏదీ లేదు. నది నుంచి బయటికి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చాలా నిరుత్సాహంతో, నిరాశతో ఉన్నాడు. మామూలు నిరాశకి, బుద్ధుని నిరాశకి తేడా ఉన్నది, బుద్ధుని నిరాశ పూర్తిగా తీవ్రతతో ఉంది.
ఆయనలో ఆవగింజంత ఆశ కూడా లేదు. అతను పూర్తిగా ఆశ వదిలేసుకున్నాడు. సాధించటానికి ఏమీ కనిపించటం లేదు. ముందుకి చూడటానికి ఏమీ లేదు. ఆ రోజు రాత్రి నిద్ర పోయే ముందు ఆకాశం వైపు చూసాడు. ఆయన నిర్వాణాన్ని పొందాడు, నిర్వాణం అంటే ఆత్మజ్ఞానద్వారవిముక్తి లేదా జ్ఞానోదయం పొందటం.
బుద్ధుడు ఆ స్థితి సాధించటానికి సహాయపడిన ఒకే ఒక అంశం తీవ్రత. మనలో చాలా మంది అంటుంటాం, మేం చాలా చేస్తున్నాం కాని ఏమీ జరగటం లేదు అని. మీరు కొంచెం మీ అంతరంగపు లోతుల లోనికి చూడండి, మీ కోరిక, మీ అన్వేషణ ఎంత తీవ్రతతో ఉన్నాయి. మీ అన్వేషణ అనే దాహం ఎంత తీవ్రంగా ఉన్నది చూడండి. మీరు దేన్ని కోరుకున్నా మీలోని శక్తులన్నింటినీ ఆ కోరిక వైపు కేంద్రీకరించండి, అప్పుడు విశ్వశక్తి మీ కోసం తలుపులు తెరవటాన్ని చూడగలుగుతారు,
మొదటి ఆధ్యాత్మిక అనుభవానికి నా తీవ్రమైన తపన
నేను మీకు నా మొదటి ఆధ్యాత్మిక అనుభవం గురించి చెప్పాను, ఇప్పుడు నాకు 360 డిగ్రీలలో చూడగల దృష్టి వచ్చింది అని చెప్పాను. చాలామంది చాలా ధ్యానపద్ధతుల్ని సాధన చేస్తూ ఉంటారు. తేడా ఏమిటి? ఒక చిన్న పిల్లవాడికి అనుభవం ఎలా జరిగింది?
నేను ఒక విషయం చెప్పగలను, నా అంతరంగం మొత్తం పరిణతిని పొంది పక్వానికి వచ్చింది. ఏ చిన్న పద్ధతైనా అది వికసించటానికి సిద్ధంగా ఉన్నది. నాకు తెలియకుండానే గురువులు ఉండే అత్యుత్తమస్థితిలో ఉండేవాడిని. చూడండి, చిన్నతనంలో మిమ్మల్ని ఎవరు ప్రభావితం చేస్తారో వారే మీ అంతరంగంలో హీరో. చాలా గొప్ప యోగీశ్వరులు నా మీద చాలా ప్రభావాన్ని చూపించారు. నేను నిరంతరం, ప్రతి విషయంలో ‘ఆ యోగీశ్వరులు ఏ విధంగా ఉండి ఉంటారు?’ అని అనుకుంటూ ఉండేవాడిని.
ఉదాహరణకి నాకు భయం వేస్తే నేను ఇలా అనుకునే వాడిని ‘అన్నా మలైస్వామికి ఇలా భయం అనిపిస్తే ఏం చేసి ఉండేవారు?’ అని. ఆయన అసలు దాన్ని పట్టించుకోరు ఆయన జ్ఞానోదయమైన యోగి. నేను కూడా ఆయన లాగానే ఉండాలి, ఇలా అనుకునే వాడిని.
నా అంతరంగంలోని గొప్ప ప్రేరణ, గొప్ప గొప్ప యోగీశ్వరుల ప్రభావం వల్ల నేను ఏ పని చేయాలన్నా, వారైతే ఏం చేసేవారు అని ఆలోచించి అలా చేసేవాడిని, అంతరంగం స్వచ్ఛంగా ఉండేది. ఆ చిన్న వయస్సులో యోగులు, ఋషులు తప్ప నా అంతరంగంలో మరో హీరో ఉండేవాడు కాదు. ప్రతి చిన్న విషయానికి ఆయన అయితే ఎలా చేసేవారు నేనూ అలాగే చేయాలి. ఈయన అయితే ఎలా చేసేవారు, నేను కూడా ఇదే విధంగా చేయాలి అని అనుకునే వాడిని.
శ్మశానాల్లో ఉండేవాడిని
నేను అరుణాచలం గిరిప్రదక్షణానికి వెళ్ళేవాడిని. అది సుమారు 12 కిలోమీటర్లు ఉంటుంది. చీకటి పడ్డాక వెళ్ళేవాడిని. నాకు కొంచెం భయం వేసినప్పుడు, ‘అణ్ణామలైస్వామి అయితే ఏం చేసేవారు? అనుకునేవాడిని. ఆయన భయపడరు. నేను కూడా భయపడను అనుకుని నడిచేవాడిని.
మీకు ఒక సంఘటన చెబుతాను.
ఆ రోజు నేను గిరిప్రదక్షిణ చేస్తుంటే బాగా వర్షం పడుతున్నది. మెరుపులు, ఉరుములు, పెద్ద వర్షం చూసి కొంచెం భయపడ్డాను. వెంటనే అణ్ణామలైస్వామి అయితే ఏం చేసేవారు అనుకుని, ఆయన భయం లేకుండా నడిచేవారు. నేను కూడా అలాగే నడవాలి అనుకుని నడక సాగించాను.
అలా ఒక శ్మశానం గుండా నడుస్తూ గిరిప్రదక్షణకి వెళ్ళాలి. అలా వెళుతున్నప్పుడు అక్కడ కుక్క దేన్నో తినటం చూసాను. దాని దగ్గరికి వెళ్ళే కొద్దీ అది అరవటం మొదలు పెట్టింది. నాకు భయం అనే మొదటి ఆలోచన రాగానే వెంటనే ‘అణ్ణామలై స్వామి అయితే ఏం చేసేవారు? ఏం పట్టించుకోకుండా వెళ్ళేపోయేవారు. నేను అలాగే వెళతాను అనుకుని ముందుకు వెళ్ళాను. కుక్క భయంతో పారిపోయింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది మనిషి శవం. దాన్ని పూర్తిగా పూడ్చిపెట్టలేదు. వర్షానికి బయటికి వచ్చేసి రోడ్డు మీద ఉన్నది. ఊహించండి, పన్నెండేళ్ళ అబ్బాయి అర్ధరాత్రి ఒంటరిగా తల లేని శవాన్ని చూస్తున్నాడు అంటే ఎలా ఉంటుంది. భయం మొదలైంది కాని అది నా అంతరాత్మ వరకూ వెళ్ళలేదు. షాక్ కాని, భయంతో వణుకు రావటం కాని జరగలేదు. మొదటి ఆలోచన రాగానే, అదే అణ్ణామలైస్వామి అయితే ఏం చేస్తారు అనుకుని నడిచి వెళ్ళిపోయాను. నేను అలా నడుస్తూనే ఉన్నాను. అంతే పక్కనుంచి వెళ్ళిపోయాను. నేను కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. భయం అనేది గాలి బుడగలా ప్రారంభమైంది. కాని పైకి రాలేదు. భయం అసలు లేదు, అది మరణించింది.
తీవ్రత, అమాయకమైన అంతరంగం
అంతరంగంలోని చేతనస్థితి మొత్తం తీవ్రంగా, గాఢతతో సిద్ధంగా ఉన్నది. ఆ కారణం వల్లనే చిన్న అనుభవం, చిన్న పంచ్ నన్ను ఆ అనుభవంలోనికి తీసుకు వెళ్ళగలిగింది. దాన్నే నేను జీవన్ముక్తి అంటాను.
మీరు గురువుల శరీరభాషలో జీవిస్తే జీవన్ముక్తులవుతారు.
నేను ఒకసారి అణ్ణామలైస్వామితో ‘నేను కలలో జగన్మాతని (దేవి) చూసాను. మీరు కూడా కలలో దేవిని చూస్తారా?’ అని అడిగాను. ఆయన నాతో, ‘నాకు కలలు రావు’ అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఆయనకి కలలు రావు మరి నా కెందుకు కలలు వస్తాయి. ఆ రోజు రాత్రి నాకు నేను ఇక కలలు రావు. అణ్ణామలై స్వామికి కలలు రావు అని చెప్పుకున్నాను. మీరు ఆశ్చర్యపోతారు ఆ రోజు రాత్రి నాకు కల వస్తుంటే నాకు ఎలా కలలు వస్తాయి అనుకున్నాను.
కల మాయమైపోయింది. అంతరంగం చాలా అమాయకంగా, సూటిగా ఉంటుంది. అది అలా జరిగింది. నాకు ఎప్పుడైనా జలుబు చేసినా అణ్ణామలైస్వామి ఏం చేస్తారు. ఆయన పట్టించుకోరు, నేనూ పట్టించుకోను అని అనుకునేవాడిని. ఆ తరువాత ప్రశ్నలు, వాదాలు అనేవి ఉండేవి కావు.
జీవన్ముక్తి సందేశం - ‘గురువులు ఎలా ప్రవర్తిస్తారు?
మీరు కూడా చిన్నది, శక్తివంతమైన ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. మీ మనస్సు దీన్ని తప్పించుకోవటానికి ఎటువంటి సాకులూ చెప్పలేదు. ఏ పరిస్థితిలోనైనా, ‘ఇదే గురువుగారైతే ఎలా చేస్తారు? ఆయన ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు? అదే చేయండి. అప్పుడు కొత్త ద్వారాలు తెరవబడటం చూస్తారు. దీన్ని నేను జీవన్ముక్తి అంటాను. మీరు వేరే ఏమీ చేయనవసరం లేదు. ఈ ఒక్కటీ చేస్తే చాలు. మీరు కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయనుకోకండి. వెంటనే, గురుదేవులు కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది? అనుకోండి. సహజంగానే నిశ్శబ్దం. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నిశ్శబ్దంగా ఉండండి, అంతే. ఇంకేమీ లేదు. మీ మనస్సు అనవచ్చు, ‘అబ్బే, అబ్బే,’ అదేం కుదరదు. నాకు తెలుసు ఇది సత్యం అని. కాని ఇది చాలా కష్టం. అప్పుడు మళ్ళీ అనుకోండి, ‘గురుదేవుల మనస్సు ఇలా చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారు? ఆయన మనస్సుని తినేస్తారు, అంతే. అది తెలుసుకోండి. ఈ ఒక్క సందేశాన్ని తెలుసుకోండి. అది మీలో జీవం కావాలి. అదే జీవన్ముక్తి అనే సందేశం. ఒక విషయం అర్థం చేసుకోండి. నాకు పది సంవత్సరాల వయస్సు నుంచి నేను అణ్ణామలైస్వామి చేత ప్రభావితమయ్యాను. అప్పటి నుంచీ ఇదే పద్ధతి పాటించాను. అప్పుడు అది ఒక ధ్యానపద్ధతి అని నాకు తెలియదు.
గురువులతో నిజమైన అనుబంధం
దీన్నే నేను గురువులతో ఉండే అనుబంధం అంటాను. గురువులతో అనుబంధం అంటే ఏదో పూజ చేయటం, పూలు పెట్టటం, ఎప్పుడో ఒకసారి పూజించటం కాదు, అనుబంధం అనేది మీ మీద గురువుల ప్రభావం లోతుగా ఉన్నప్పుడే సాధ్యం. ఎప్పుడైనా ఏ స్థితి ఎదురైనా, అది కోపం, ఆశ, అభద్రతాభావం, భయం వెంటనే ‘ఇదే గురుదేవులైతే ఏమి చేస్తారు?’ అనుకోండి. అది మాయమవుతుంది. అది పూర్తిగా వెళ్ళిపోతుంది.
నేను చాలా సార్లు చెబుతుంటాను, గురువులతో దృఢమైన అనుబంధం ఉంటే చాలు. మరి ఇంకేమీ అవసరం లేదు. అది సాధారణ అనుబంధం కాదు. మామూలు సంబంధమైతే మీరు గురువుల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరు, ఆయనని మీలో నిలుపుకోరు. నేను దాన్ని సంబంధం అని కూడా అనను. అది కేవలం సాధారణపరిచయం మాత్రమే.
గురువులతో అనుబంధం అంటే ఆయనలో, ఆయనలా జీవించటం. అప్పుడే ఆయనతో గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడే మీరు విస్తృతం అవుతారు. మనలో ఉండే అనేకసంబంధ బాంధవ్యాల వల్ల అది మనలో జరగలేదు. మన అంతరంగంలో చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని ఉత్సాహపరచి, మీ మీద ప్రభావాన్ని చూపి మీ దృష్టిలో వారే హీరోలు అన్నవాళ్ళు ఉంటారు. మీ అంతరంగాన్ని గురువుగారితో నింపండి. మీ సమస్యలు కరిగిపోతాయి.
తీవ్రతతో నడవండి
నా మొదటి ఆధ్యాత్మిక అనుభవం, అంతిమసత్యాన్ని క్షణకాల అనుభవంతో చూపించింది. ‘దాని తరువాత నాకు అంతిమ జ్ఞానోదయం పొందాలి అన్న కోరిక ఎంత తీవ్రంగా ఉండేదంటే, అది ఎలా అన్న ఒక్క ప్రశ్న నా అంతరంగం అంతా నిండిపోయింది.
ఈ తీవ్రత చిన్న వయస్సులోనే ఇల్లు వదిలి వెళ్ళే ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యమే తీవ్రమైన సాధనలు చేసే విధంగా చేసింది. ఆధ్యాత్మికప్రయాణం చేయటానికి, రోజుకు 10,000 సార్లు మంత్రాన్ని జపించటం, అతిసాధారణమైన జీవితం, కఠినమైన నియమాలతో దేశం మొత్తం తిరిగేలా చేసింది.
అడగండి, మీకు లభిస్తుంది
జీసస్ క్రైస్ట్ ఈ విధంగా అంటారు, 'అడగండి, మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు కనబడుతుంది,' అని. మనం ఒక ప్రశ్న అడుగుదాం. మనలో ఎంతమందికి అడగటం తెలుసు. కొన్ని సార్లు అయోమయంతో, సోమరితనంతో మనం అజ్ఞానంలో ఇరుక్కుపోతాం. మనం ఏం అడగాలని అనుకుంటున్నామో అది మనకి స్పష్టంగా తెలియదు.
మనలోని సంస్కారాలు, అబద్ధపు గుర్తింపులు సర్వాంతర్యామి స్వచ్ఛమైన దివ్యప్రేమని అర్థం చేసుకోకుండా అడ్డుకుంటాయి. మనం కరుణామూర్తి అయిన, మనని నిరంతరం కాపాడే సర్వాంతర్యామిని ఏమడిగితే అవి ఇస్తాడు. మన ఏకాగ్రత ఒక్క పాయింట్లా చేసి నిజాయితీతో, భక్తితో ఉన్నప్పుడు భగవంతుడిని నిజంగా ఏమడగాలనే వివేకం మనకి కలుగుతుంది. అప్పుడు మనం అడిగినవి కచ్చితంగా ఆయన ఇస్తాడు.
తీవ్రత, అంతిమపద్ధతి
మీరు ఏది చేస్తే దాన్ని తీవ్రతతో చేయండి. మీరు తిన్నా, పాట పాడినా, పూజ చేసినా, పని చేసినా, దానిలో పూర్తిగా నిమగ్నమవ్వండి. ఆ క్షణంలో ఉండండి. తీవ్రత అంటే జ్ఞానోదయమే. ప్రస్తుతం మీలోని ఒక భాగం తీవ్రతతో మరొక భాగం సోమరితనంలో ఉంటుంది. 100% తీవ్రతతో ఉండటయే జ్ఞానోదయం.
తీవ్రంగా నిర్ణయించుకోండి, నేను జీవితం అని పిలిచే ఈ జీవితం నుంచి మేల్కొనాలనే తీవ్రమైన కోరికని, ప్రార్థనని సృష్టించండి. మీరు ఒక ఉద్దేశాన్ని కల్పించి దాన్ని మీ వైపు తిప్పితే అది సంకల్పం అవుతుంది. దాన్ని భగవంతుని వైపు మళ్ళిస్తే అది ప్రార్థన అవుతుంది. తీవ్రంగా మేల్కోవాలి అనే దృఢమైన ఉద్దేశం, జీవన్ముక్తిని సాధించాలి, నిత్యానందస్థితిని సాధించాలనే దృఢమైన కోరిక. మీకు, జ్ఞానోదయానికి మధ్య ఉన్న తేడా తీవ్రత.
ధ్యానపద్ధతి - గురుదేవుల జీవనసరళి
ఈ పద్ధతిని ప్రయత్నించండి, మీ మనస్సుకి ఏది వచ్చినా, గురుదేవులు ఎలా చేస్తారు? అది చేయండి. మరొక విషయం, మీరు నాలా ప్రవర్తిస్తే, నా దగ్గర ఉన్నవి మీకు దొరుకుతాయి. అది సర్వాంతర్యామి ప్రమాణం. నాకు అర్హత లేనివి నా దగ్గర లేవు, అయితే నా దగ్గరి ఏవైనా పోతాయేమో అన్న భయం నాకు లేదు.
అదే విధంగా మీరు కేవలం ఒక్క సందేశాన్ని తీసుకుంటే, గురువుల మాదిరిగా జీవించండి. అప్పుడు మీకు అర్హత ఉన్నవన్నీ మీ చుట్టూ చేరతాయి, అవి ఎప్పటికీ మీతోనే ఉంటాయి. ధైర్యం ఉన్న వ్యక్తి ‘గురుదేవులు ఎలా జీవిస్తారో అదే విధంగా జీవిస్తాను అనుకుంటాడు.’ మీ మనస్సు చాలా ప్రశ్నలు వేయవచ్చు, ఆయన ఎలా ఉంటారో ఎవరికి తెలుసు, ఆయనేంచేస్తారు ఇలా ఉంటాయి. ఈ ప్రశ్నికి గురువులు ఏ విధంగా స్పందిస్తారు? నిశ్శబ్దంగా ఉంటారు. అప్పుడు మీరు కూడా అదే చేయండి. అది చేస్తే చాలు. ఈ సత్యాన్ని మీతోనే ఉంచితే, మీతో నేను ఉంటాను. గురువుల్ని మీతోనే ఉంచండి. అప్పుడు మీకు మీరు జన్మనిస్తారు.
ఎటువంటి కష్టాన్నీ పట్టించుకోవద్దు. వస్తే ఏమొస్తుంది? మరణం. కేవలం ఒకటి గుర్తుంచుకోండి, గురువులు ఏ విధంగా మరణిస్తారు. ఆయన శరీరాన్ని అందంగా వదిలేస్తారు, నేను కూడా అదే చేస్తాను. ఇది గుర్తు పెట్టుకోండి, చాలు. ఈ అనుబంధమే నాకు సత్యాన్ని చూపించింది, అది నన్ను చైతన్యంగా, తీవ్రంగా శక్తిమంతుడుగా తయారు చేసింది.
ఈ ఒక్క సందేశాన్ని మీతో తీసుకువెళ్లండి, గురువుగారు ఈ పరిస్థితికి ఎలా స్పందిస్తారు? ఈ ఒక్క ప్రశ్నతో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. అంతరంగం ప్రపంచానికి సంబంధించిన ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు, పరమహంస అంటే అన్ని అనుభవాలూ చూసిన వ్యక్తి. ఒక వేళ ఆ అనుభవాలు లేకపోతే, సర్వాంతర్యామి ఆ అనుభవాల గుండా ప్రయాణింపచేస్తాడు. అప్పుడు అతను పరమహంస అవుతాడు. కాబట్టి మీకు ఎటువంటి అనుభవాలు జరుగుతాయో అవన్నీ నాకు జరిగాయి. నాకు అవి జరగలేదు అని మీరు అనుకోవద్దు.
తీవ్రత కోసం ధ్యానపద్ధతి
మీలో దహించుకుపోయే తీవ్రత. జరగకపోతే దాని కోసం తీవ్రంగా ప్రార్థించండి, అది మీలో జరుగుతుంది.
మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాల వెనుక ఎంత తీవ్రంగా, ఆదుర్దాగా పరుగులు తీస్తారో గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీకు ఎవరు తీవ్రంగా ప్రార్థన చేస్తారో, వారికి పది లక్షల రూపాయలు ఇస్తారంటే మీరు మీ జీవితంలోని తీవ్రత మొత్తంతో ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మీకు తృప్తిని ఇచ్చేది ఏదో ఒకటి ఉన్నది కాబట్టి. అది మీ జీవితానికి ఉపయోగం కాబట్టి. జ్ఞానోదయం కూడా మీ జీవితానికి ఉపయోగం.
జ్ఞానోదయం కోసం తీవ్రంగా ఉండటాన్ని వస్తువుల ద్వారా నేర్చుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కావాలంటే ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తారు, అదే జ్ఞానోదయం వైపు ఉండాలి. మీలో తీరని కోరికలు ఆ తీవ్రతలో కాలిపోతాయి. మీలో సంతృప్తి కలిగినప్పుడు దాని కోసం తపించండి. అది చాలు మిమ్మల్ని ఆవిరి చేయటానికి. ఆ సంతృప్తి మీరు ఇంతకు ముందు పొందిన తృప్తి కంటే చాలా రెట్లు ఎక్కువ.
శివసూత్రాలలో శివుడు, దేవి పార్వతితో ‘ఒక చక్కని పద్ధతి చెబుతాను, నీలోని సారం ఒక వెలుగు రేఖలా కేంద్రం నుంచి వెన్నెముఖ మధ్యగా వస్తుంది. నీలో జీవచైతన్యం పైకి లేస్తుంది’ అని చెబుతాడు.
ఈ ధ్యానపద్ధతి ప్రాముఖ్యం అర్థం చేసుకోండి. దీన్నే నిత్యధ్యానంలో మూడవ స్టెప్‌లో ఉపయోగించాను.
మిమ్మల్ని మీలో ఒక వెలుగులా మూలాధారచక్రం నుంచి పైకి వెళ్ళండి. మీ తీవ్రత, చైతన్యం మీ కేంద్రం నుంచి పైకి రావటం చూస్తారు. అప్పుడు మీలోని తీవ్రత కూడా పైపైకి వెళుతుంది.
మీరు అనుకోవచ్చు అలా చూడటం ఏ విధంగా దృశ్యానికి అతీతంగా తీసుకువెళుతుందని. ఎంపిక లేని స్థితిని మీరు ఎంచుకోవచ్చు. అర్థం చేసుకోండి, మీరు ఒక దృశ్యాన్ని అంతరంగంలో చూస్తూ దానికి అతీతంగా వెళ్ళవచ్చు. దీన్ని జంపింగ్ బోర్డులా ఉపయోగించి మీరు ఉన్నతచేతనస్థితిని చేరటం చూస్తారు.
తీవ్రతకు ధ్యానపద్ధతి
ఇది శివసూత్రాలలోని ఒక శక్తిమంతమైన ధ్యానపద్ధతి. సూత్రం ఇలా చెబుతుంది; అనంతశూన్యంలోకి, ఎక్కడైతే నీవు ఉండవో ఆ శూన్యంలోకి కరిగిపో (మరణించి) జ్ఞానేంద్రియాలకి అతీతంగా శివుని చేతనస్థితిలోకి వెళ్ళటమే. ఈ ధ్యానపద్ధతిని షణ్ముఖిముద్ర అంటారు. ఈ ముద్రలో ఉండటం కష్టం. మీరు నేల మీద కూర్చొని చేతుల ఆధారంమీద ఉండండి. మీ ముందు కుర్చీ వేసుకొని దాని మీద చేతులు పెట్టుకోండి. అవసరమైనప్పుడు కుర్చీలో కూర్చొని చేతులకి సపోర్టు ఇవ్వండి. అలా చేస్తే భుజాలు నొప్పి పుట్టవు.
1. షణ్ముఖి ముద్ర అంటే చేతులతో కళ్ళు, చెవులు, ముక్కు, నోరు మూసి ధ్యానం చేయటం. ఈ ముద్ర మీ జ్ఞానేంద్రియాల ద్వారాల్ని మూసేస్తుంది. దీన్ని ధ్యానంలో ప్రవేశం ఉన్నవారు మాత్రమే చేయాలి. కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చోండి.
2. షణ్ముఖిముద్రలో ఉంటే మీ ముఖంలోని ఏడు రంధ్రాల నుంచి బయటికి వెళ్ళే శక్తి (రెండు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు) మీ లోపలి వెళ్తుంది. అది శక్తిని బయటికి వెళ్ళకుండా ఆపగలుగుతుంది. దాన్ని ఆజ్ఞా చక్రం వైపు మళ్ళిస్తుంది.
ముక్కుని సగం మూయాలి. అలా చేయడం వలన శ్వాస ద్వారా వెళ్ళే గాలి తగ్గి శ్వాసని నియంత్రిస్తుంది. షణ్ముఖి ముద్ర బయటికి వెళ్ళే శక్తిప్రవాహాన్ని ఆపుతుంది.
రెండవది, ఈ జ్ఞానేంద్రియాల్ని మన లోపలికి మళ్ళించటం.
మూడవది, వాటిని మూడవ కన్ను అయిన ఆజ్ఞాచక్రం మీదే కేంద్రీకరించటం.
సూచనలు
కళ్ళ జోడు ఉన్నవారు వాటిని తీసివేయండి. చేతి వేళ్ళని కింది విధంగా ఉంచండి. బొటన వేళ్ళు చెవి దగ్గర ఉన్న చిన్న లోబ్స్‌తో లోపలికి మీకు హమ్మింగ్ శబ్దం వచ్చేవరకూ నొక్కి ఉంచండి.

చూపుడు వేళ్ళతో కళ్ళు రెండు మూయండి. మధ్య వేలు ముక్కు రెండు వైపులా (ముక్కు దూలం పైన) ఉంచండి. ఉంగరపు వేలుతో ముక్కు సున్నితంగా సగం మూయండి.
చిటికెన వేలు పెదాల మీద ఉంచాలి.
తరువాత 21 నిమిషాలు ఈ కింది విధంగా చేయండి.
ముక్కు సగం మూయండి. ప్రాణప్రవాహాన్ని కొంచెం తగ్గించండి. మనస్సు స్థిరంగా ఉంటే ప్రాణప్రవాహం తగ్గుతుంది. షణ్ముఖముద్రలో ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. నోరు గట్టిగా మూయండి. కనుగుడ్లు రాళ్ళుగా మారాయి అనుకోండి.
మీ తెలుసుకునే తత్త్వాన్ని తీవ్రం చేయండి. ఒత్తిడి వద్దు. మీ తెలుసుకునే తత్త్వం లోనికి లోతుగా వెళ్ళండి. ఒత్తిడి వద్దు, తెలుసుకునే విధంగా ఉండండి. మీ మూడవ కంటిలోకి చొచ్చుకొని పోతున్నట్టు ఊహించండి, దాని లోపలికి డ్రిల్ చేసుకుంటూ వెళుతున్నట్టు అనుకోండి.
రిలాక్స్, నెమ్మదిగా కళ్ళు తెరవండి.
మీరు సౌకర్యంగా షణ్ముఖముద్రలో ఉండాలి, మీ మూడవకంటి దగ్గర చాలా శక్తి ఉండటం గమనిస్తారు. అది మీలోని ఆత్మప్రబోధస్థితిని మేల్కొలుపుతుంది. మీరు సౌకర్యంగా ఉంటే మీరు లోతైన శక్తి లోనికి ప్రవేశించటాన్ని అనుభూతితో తెలుసుకుంటారు. మీరు ఉన్నతచేతనస్థితిలో ప్రవేశిస్తారు.
- కోరిక అత్యవసరమైనప్పుడు, ప్రశ్న కేంద్రంగా మారినప్పుడు అంతిమ అనుభవం జరుగుతుంది.
- తీవ్రత మీ లోపల బయట విభేదాలు సృష్టించదు. అది సున్నితంగా బలంగా ప్రవహిస్తుంది.
- తీవ్రత అంటే మార్పులు లేకుండా కఠినంగా ఉండడం కాదు.
- అన్వేషణలో మీరు మమేకం కాకపోతే మార్పు జరగదు.
- అంతిమసత్యం అనే కోరికతో దహించుకుపోయే అంతరంగంలోకి గురుదేవుల మాటలు ప్రవేశించినప్పుడు, జ్ఞానోదయం అనే ఆణిముత్యం తయారవుతుంది.
- మీలో ఏదైనా ఆవేశం ఉన్నప్పుడు, అది మిమ్మల్ని అధిగమించినప్పుడే, మీ శరీరాన్ని కదలకుండా ఒక్కసారి ఉండగలిగినా మీరు ఆ ఆవేశం నుంచి స్వేచ్ఛని పొందగలరు.
- మీరు తీవ్రంగా ఉంటే విముక్తిని పొందుతారు.
- చేసే పనిలో మిమ్మల్ని మీరు మరిచిపోతే సర్వాంతర్యామి అధరం మీద వేణువుగా ఉంటారు.
- ఈ క్షణంలో తీవ్రంగా ఉండి నిజమైన జీవితం రుచిని చూడండి లేకపోతే మీరు జీవించే ఉన్నట్టు కాదు.
- సర్వాంతర్యామి నుంచి మీరు దేన్నీ దాచలేరు మీ కంటే మీ గురించి ఆయనకి బాగా తెలుసు.
- కనీసం ఒకటి రెండు సారైనా కలల స్థితిలో మీ గుర్తింపుల్ని అనుభవిస్తే మీరు తీవ్రతతో ఉన్నట్టే.
- తీవ్రతతో మీ చేతనస్థితిలోకి, మీ గాఢనిద్రలోకి చొచ్చుకునిపోయే శక్తి ఉంది.
- మనిషి అద్దం లాంటివాడు. సర్వాంతర్యామికి ఎదురు నిలబడవచ్చు లేదా వెనుతిరిగి వెళ్ళిపోవచ్చు.
- మీ అన్వేషణ, కోరిక, తీవ్రంగా వుంటే అహంకారంలోని జీవాన్ని తీసేస్తుంది.
- కేవలం తీవ్రతతోనే క్లిక్ జరుగుతుంది. అగ్నిని పట్టుకోండి, మేల్కొలుపు జరుగుతుంది.
- మీరు గాఢమైన శక్తితో ఉన్నప్పుడే క్లిక్ జరుగుతుంది.
- మన కపటం ఎటువంటిదంటే అది మనని మోసం చేస్తుందని తెలుసుకోలేం.
- మీ తీవ్రత ఎంత శక్తి గలదంటే అది మీ శరీరాన్ని, డి.ఎన్.ఎ.ని కూడా మార్చేస్తుంది.

జీవిత ద్వారాల్ని తెరిచే అమాయకత్వం
జీవన్ముక్తి అంటే స్వచ్ఛమైన అమాయకత్వం అద్భుతమైన మేధ
తీవ్రత గురించి, సాంద్రత గురించి మాట్లాడిన తరువాత అమాయకత్వం గురించి మాట్లాడుతుంటే కొత్తగా అనిపించవచ్చు. కాని నిజం చెప్పాలి అంటే మీరు దేనిలోనైనా పూర్తిగా నిమగ్నమవ్వాలంటే మీలో అమాయకత్వం ఉండాలి. నేను చెప్పే అమాయకత్వం, మీ నిఘంటువులో ఉన్న అమాయకత్వం వేరు. నేను చెప్పేది పసిబిడ్డలలోని అమాయకత్వం. చిన్న పిల్లలు ఏది చేసినా పూర్తిగా నిమగ్నమై గాఢతతో చేస్తారు. పెద్దవారిలో ఆ శక్తి పోయింది. కాని దాన్ని తిరిగి పొందవచ్చు.
అమాయకత్వం అంటే?
నిరంతరం మనం మంచిగా, స్వచ్ఛంగా, అమాయకంగా ఉండాలి అని చెబుతుంటారు. అమాయకత్వాన్ని మన మీద బలంగా మోపుతారు. నిరంతరం సమాజం, నీతి బోధకులు మనకి ఇది మంచిది ఇది చెడ్డది, ఇది తప్పు ఇది కరెక్టు, ఇది స్వచ్ఛమైంది. ఇది కలుషితమైంది, ఇది అమాయకత్వం అది కలుషితం ఇలా చెబుతూనే ఉంటారు. నిరంతరం మనకి మంచి చెడుల గురించి చెబుతూ ఉంటారు. సమాజం ఏది మంచి అని చెబుతుందో దాన్ని బలవంతంగా మనతో అమలు చేయిస్తారు.
కానీ జీవితం సమాజం చెప్పిన, నమ్మినవాటిలో ఉండదు. జీవితం పూర్తి వేరుగా ఉంటుంది. సమాజం నమ్మేది ఒక విధంగా ఉంటుంది, జీవితం మరొక విధంగా ఉంటుంది. ఒక చక్కని వాక్యం ఉంది, 'మీరు ఆలోచించేటప్పుడు అందరికీ సాధారణంగా ఉండే విధంగా ఆలోచిస్తారు. కాని జీవించేటప్పుడు అలా చేయరు.' ఇది ఎలా ఉంటుందంటే ఆలోచించేటప్పుడు ప్రపంచం దృష్టితో ఆలోచించి చేసే పని మన ప్రాంతానికి సరిపడే విధంగా చేయాలి అని.
సంఘటనల్ని జనసామ్యం చేయలేం. మీ జీవితంలో చాలా సంఘటనల్ని సాధారణంగా జనసామాన్యంగా చేయలేం. మామూలుగా ఆలోచించి మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అని మీ జీవితస్థితులకి అన్వయించలేరు. మీరు అనుకునే మంచిచెడులు, నీతి నియమాలు ప్రయోగాత్మకంగా ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండవు. నన్ను ఒకరు ఈ విధంగా అడిగారు, 'మన ప్రాచీనసాహిత్యంలో జూదం గురించి ఎందుకు ప్రస్తావించలేదు? అది పురాణాల్లో మాత్రమే ఎందుకు ఉంది?' అని.
నేను వారికి చెప్పాను, ఆ రోజుల్లో జూదం అనేది లేదు. కాబట్టి వారు దాని గురించి ఏ విధంగా మాట్లాడగలరు. అందుకే ఏ హిందూప్రాచీనసాహిత్యం కూడా జూదాన్ని, మత్తుమందుల్ని నిషేధించలేదు. ఎందుకంటే అప్పట్లో అవి లేవు కాబట్టి. నీతి నియమాలు అనేవి పూర్తిగా ఆయా సంఘటనల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే అది పోలికలోనే ఉంటుంది. దానికి దృఢమైన ఉనికి లేదు.
అమాయకత్వం అంటే అంతరంగస్వచ్ఛత. అది ఆలోచనలతో లేదా సంస్కారాలతో ప్రభావితం కాకుండా ఉన్న స్థితి. మీకు స్పష్టంగా చెబుతాను. మీరు భావావేశాల్ని, కోపం, ఆశ, కోరిక మొదలైనవాటిని వెల్లడి చేయలేకపోయినా, మీ లోపల ఉంటే మీరు అమాయకత్వంలో లేరు అని అర్థం. సమాజదృష్టిలో మీరు స్వచ్ఛమైనవారు కావచ్చును కానీ అంతరంగంలో కాదు. అంతే మీరు కోపాన్ని, కోరికని వెల్లడి చేస్తూ వాటితో మీ అంతరంగం ప్రభావితం కాకపోతే, మీరు పసిబిడ్డలోని అమాయకత్వంతో జీవిస్తున్నారు అని అర్థం. అప్పుడు మీరు స్వచ్ఛమైనవారు.
పిల్లలు కోపం తెచ్చుకోవటం చూడండి. వాళ్ళకి అత్యాశ కూడా ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆశ మీదే నిర్మించుకుంటారు. అందుకే నాది అనేది వారు పూర్తి తెలుసుకునే తత్వంతో చేతనస్థితిలో చూపిస్తారు. వారి దగ్గర నుంచి ఒక బొమ్మ తీసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళ జీవితాన్ని తీసేసుకున్నట్టు ప్రవర్తిస్తారు. అరుస్తారు, గోల చేస్తారు. ఎందుకంటే వారు దాన్ని నాది అనే భావం మీద నిర్మించుకుంటారు. కాబట్టి పిల్లల్లో ఆశ, కోపం ఉంటాయి. కాని వారిని స్వచ్ఛత లేనివారు అని అనలేం. ఎందుకంటే ఏదైతే కల్మషం అని మీరు అనుకుంటారో అది వారి అంతరంగాన్ని అంటదు కాబట్టి. వాళ్ళు బొమ్మలతో ఆడుకుంటారు. కొంత సేపు అయ్యాక వాటిని పక్కన పారవేసి వెళ్ళిపోతారు, వారితో వాళ్ళు ఏదీ తీసుకువెళ్లరు. వారి అంతరంగం స్వచ్ఛంగా, అందంగా ఉంటుంది.
చిన్న పిల్లలలో ఆశ, కోపం ఉంటాయి. కాని వారి అంతరంగం స్వచ్ఛంగా అందంగా ఉంటుంది.
వాళ్ళు ఎవరినీ అడగకుండా ఏదైనా తీస్తే దొంగతనం అనలేం. ఎందుకంటే అవి ఎవరివో నేను వాటిని తీసుకోకూడదు అనే భావం వారికి ఉండదు. ఒక వస్తువు మరొకరి సొంతం అన్న భావం వారికి ఉండదు. అమాయకత్వం స్వచ్ఛమైనది. ఒక వస్తువు మరొకరిదని తెలిసి దాన్ని దొంగతనం చేయకపోయినా, మీరు దాన్ని కోరితే మీరు దొంగతనం చేసినట్లే. అక్కడ మీరు దొంగ కాదు ఎందుకంటే పోలీసులు పట్టుకోలేరు కాబట్టి అంతే.
అమాయకత్వం అనేది అంతరంగానికి సంబంధించింది. అది ఏ విధంగా కూడా బయటి ప్రపంచానికి సంబంధించినది కాదు. శివసూత్రాల్లో శివుడు ఈ అమాయకత్వాన్ని తిరిగి పొందగల ఒక సాధన పద్ధతిని వివరిస్తాడు. మీరు హిందూపురాణాలలో వివరించిన శివుడి జీవిత సరళిని gమనిస్తే ఆయనలో సామాజిక, లేదా సంప్రదాయపరమైన అమాయకత్వం ఎక్కడ కనిపించదు. కాని ఆయనలో స్వచ్ఛమైన అంతిమ అమాయకత్వం ఉంటుంది. ఆయన జీవనవిధానం, నివసించే స్థలం ఏదీ కూడా ఆయనలోని స్వచ్ఛతకి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండదు. శివుడు శ్మశానంలో నివసిస్తాడు. ఆయన చుట్టూ ఉండేది ప్రేతాత్మలు, భూతాలు.
సంస్కృతంలో శివ అంటే అర్థం కారణం లేని మంగళత్వం. ఈ శుభకరమంగళత్వమే నిత్యానందాన్ని సృష్టించగల శక్తి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడికి వెళితే అక్కడ ఆ పరమానందస్థితి స్వచ్ఛమైన అమాయకత్వంతో ఉండే ఆయన అంతరంగం నుంచి వస్తుంది.
వేదసంస్కృతిలో చాలా సాహిత్యం ఉంది. వాటిలో ఉపనిషత్తులు అనేవి ఒక భాగం. ఉపనిషత్తు అంటే సంస్కృతంలో గురువుల పాదాల దగ్గర శిష్యులు కూర్చొని గురువుల బోధనల ద్వారా నేర్చుకోవటమే. జ్ఞానోదయానికి అవి అవసరమైన శాస్త్రాన్ని ఇస్తాయి. వాటిని గొప్ప గొప్ప ఋషులు, యోగీశ్వరులు వేదకాలంలో తరువాత తరాలవారి కోసం అందించారు.
వేదసంస్కృతిలో 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు జ్ఞానోదయ శాస్త్రసారాంశం. వేదకాలం నాటి జ్ఞానోదయమైన యోగీశ్వరులు వీటిని మనకి అందించారు. వీటిలో ఛాందోగ్య ఉపనిషత్తు అనేది ఒకటి ఉంది. అందులో ఒక చక్కని కథ ఉంది. ఆ కథ ఈ విధంగా ఉంటుంది.
సత్యకాముడు అనే ఒక శిష్యుడు గురువుగారి దగ్గరకి వెళ్ళి తనకి జ్ఞానోదయం పొందే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తాడు. అప్పుడు గురువుగారు అతనికి నాలుగు వందల ఆవుల్ని ఇచ్చి 'నీవు ఈ ఆవుల్ని తీసుకొని అవి వేయి ఆవులు అయ్యేంతవరకూ అడవిలో ఉండి తిరిగి రా' అని చెబుతాడు.
సత్యకాముడు అడవిలోకి వెళ్ళి ఆవులతో పాటు ఉంటాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇన్ని సంవత్సరాలూ అతను ఎవరితో మాట్లాడకుండా అలా ఆవులతోనే ఉండిపోతాడు. కొంత కాలానికి మానవభాషని మరిచిపోతాడు. లోతైన నిశ్శబ్దంలో, ఏ మనిషితో ఎటువంటి సంబంధం లేకుండా క్రమంగా బయట ప్రపంచంలోని తన గుర్తింపుని మరిచిపోతాడు.
కొంత కాలానికి ఆవులు అతని దగ్గరకి వచ్చి 'అయ్యా! మేం వేయి ఆవులు అయ్యాం. మనం గురువుగారి దగ్గరకి వెళదాం' అని అంటాయి. అతను 'అలాగా! అయితే వెళదాం' అంటాడు. సత్యకాముడు ఆనందపారవశ్యంలో ఉంటాడు. అతను దారి మరిచిపోతాడు. ఆవులు అతనికి దారి చూపిస్తూ అతణ్ణి తీసుకువెళతాయి. వెళ్ళే దారిలో జంతువులు, పక్షులు, తాను వంట చేసుకోవటానికి వెలిగించిన - అగ్ని అన్నీ చాలా విషయాల్లో సత్యకామునికి సూచనలని ఇస్తాయి. పరబ్రహ్మ గురించి, అంతిమసత్యం గురించి బోధిస్తాయి.
సత్యకాముడు గురువు దగ్గరికి రాగానే, గురువుగారు అతని చిరునవ్వుతో చూస్తాడు. ఆయన సత్యకాముణ్ణి 'నీవు అంతిమసత్యం తెలుసుకున్నవాడిలా ప్రకాశిస్తున్నావు. ఎవరు నీకు అది బోధించారు' అని అడుగుతాడు. సత్యకాముడు తాను ఏ విధంగా పశుపక్ష్యాదుల నుంచి అంతిమసత్యాన్ని తెలుసుకున్నాడో వివరిస్తాడు. చివరిలో గురువుగారిని ఆయన మాటలలో సత్యబోధ చేయమని ప్రార్థిస్తాడు.
గురువుగారు, 'నీకు సత్యం తెలుసు' అని దీవిస్తారు. కథలో ఏముంటుందంటే సహజంగా ఉంటూ, ప్రకృతి చెప్పేది వింటూ సత్యకాముడు తనలో తాను స్థిరపడగలిగాడు. ఆ అంతిమసత్యంలో స్థిరపడ్డాడు. అతనికి జ్ఞానోదయం జరిగింది. సంపూర్ణ అమాయకత్వం జ్ఞానోదయం వైపు తీసుకువెళుతుంది. ఒక విషయం అర్థం చేసుకోండి. మీలో తర్కజ్ఞానం లేనంత వరకూ మీరు దాంతో విసిగి అలసిపోయేంత వరకూ మీలో మార్పు రాదు.
గురువు చెప్పిన దాన్ని శ్రద్ధగా ఆచరించడం వల్లనే సత్యకామునికి జ్ఞానోదయం కలిగినట్లు, ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది.
సత్యకాముడు గురువుని జ్ఞానోదయమార్గం తెలియజేయమంటే గురువు అతన్ని ఆవుల సంఖ్య పెంచమని చెబుతాడు. జ్ఞానోదయానికి ఆవుల సంఖ్య పెంచడానికి ఏమిటి సంబంధం? అదృష్టం వల్ల సత్యకామునికి హేతుబద్ధమైన ఆలోచన లేదు. అతను అలాంటి విద్యను అభ్యసించలేదు. అందుకే ఆ ప్రశ్న అతను అడగలేదు. అతనిలోని వినయం సౌమ్యత, అమాయకత్వం జ్ఞానోదయం పొందడానికి సహకరించాయి. అతనిలో తర్కజ్ఞానం లేదు. హేతువాదం మీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మీ అంతరంగప్రపంచంలోకి వెళ్ళటానికి మీకు సహాయం చెయ్యదు. అందుకే దాన్ని వదిలితే గాని మీలో మార్పు కలగడానికి సిద్ధంగా లేరని అర్థం చేసుకోండి.
నన్ను కొంతమంది అడుగుతుంటారు. 'స్వామిజీ! మీరు తర్కశాస్త్రానికి వ్యతిరేకులా?' అని. నేను వ్యతిరేకిని కాను. మీరు పడే కష్టాలు వివేకం లేని తర్కంవల్లే అంటాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు తార్కికజ్ఞానం మీలో ఎంత రాజకీయం సృష్టిస్తుందో చూసారా? అసలు రాజకీయం అంటే ఏమిటి? ఒకే విషయం మీద విభిన్న అభిప్రాయాలు కదా! ఇప్పుడు మీ మనస్సును గమనించండి. మీరు ఉదయం ఒక విషయాన్ని గురించి ఒక విధంగా ఆలోచిస్తారు, సాయంత్రానికి మీ అభిప్రాయం మారిపోతుంది. దీన్నే సందిగ్ధావస్థ అంటారు. ఏమీ నిర్ణయం చేయలేని స్థితి. అందరూ ఆధ్యాత్మికసంస్థలలో రాజకీయాలు ఎక్కువ అని అంటారు. అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి అని నేను వారిని అడుగుతాను. ఎవరైతే ఇలా అంటారో వారిలోనే రాజకీయం ఉంది. రాజకీయం సృష్టించడానికి ఇద్దరు మనుషులు అవసరం లేదు. ఒక్కరుంటే చాలు. తార్కికంగా ఆలోచించేవారైతే చాలు. ఎందుచేతనంటే అతని తర్కబుద్ధి ఉదయం ఒకటి చెబితే, సాయంత్రానికి అదే విషయం మీద వేరే ఆలోచన పుట్టిస్తుంది. మీ మనస్సులో మీతో మీరు చేసే పోట్లాటే రాజకీయం. అలాంటప్పుడు ఆధ్యాత్మికసంస్థలలో రాజకీయాలున్నాయి అని ఎందుకు అంటారు? మీరు ఒక విషయంపై ఉదయం తీసుకున్న నిర్ణయాలు, సాయంత్రం తీసుకున్నవి మీ ముందుంచితే, మీలోని రాజకీయనాయకుడిని చూస్తారు. తర్కం మీ అమాయకత్వాన్ని నిరాడంబరతను పోగొడుతుంది. మీలో మార్పు రావడానికి సహాయపడదు. మీలో మార్పు రావాలంటే మీరు తర్కాన్ని వదిలేయాలి. తర్కం లేనప్పుడు అమాయకత్వం ఉంటుంది. అమాయకత్వం మనలో మార్పు కలగాడానికి సహకరిస్తుంది.
సత్యకాముని కథలో అదృష్టం కొద్దీ అతనికి తర్కబుద్ధి లేదు. ఎవరైనా శిష్యుడు గురువు దగ్గరకి వెళ్ళి నాకు జ్ఞానోదయం కావాలి అని అడిగితే గురువుగారు ఆవులని వేయి చేసి తెమ్మంటే, శిష్యులు గురుదేవులు నా జీవితంతో ఆడుకుంటున్నారు, నన్ను గోవుల కాపరిలా ఉపయోగించుకుంటున్నారని ఆలోచిస్తారు. తర్కం అతని అమాయకత్వాన్ని పోగొడుతుంది. అందుకే ఆధునికకాలంలో ఏ శిష్యుడూ కూడా అంత అద్భుతమైన పద్ధతులను పాటించలేదు.
అర్థం చేసుకోండి, ఇది కథ కాదు. దీనిలో గొప్ప సత్యం ఉంది. అమాయకత్వంతో సత్యకాముడు తన గురువు చెప్పింది చేశాడు. అతనికి లెక్కించే జ్ఞానం పోయింది. అతను పూర్తిగా ఆనందపారవశ్యంలో మునిగిపోయాడు. అతని మనస్సు పని చేయడం మానేసింది. అతను గోవులు 1000 లేక రెండు వేలా అన్నది పట్టించుకోలేదు. అతని అమాయకత్వం, అంగీకారం అతనిలో గొప్ప మార్పుని తెచ్చాయి. అదే జ్ఞానోదయం. మీరు పూర్తిగా అంగీకరిస్తే మనస్సుతో అవసరం లేదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు పోట్లాడేటప్పుడు మీకు బుద్ధి అవసరం. మీరు అంతరంగప్రపంచంలో, బయటి ప్రపంచంలో ఈ క్షణంలో మిమ్మల్ని స్వీకరిస్తే, ఈ క్షణంలో ఉండగలిగితే, జ్ఞానోదయస్థితిని పొందుతారు.
అన్ని సంవత్సరాలు, సత్యకాముడు తన గురుదేవులు చెప్పింది ఆచరించడం వల్ల అతనికి జ్ఞానోదయం కలగకుండా ఉంటుందా? మీరు అనుకోవచ్చు గురుదేవులు చెప్పింది చేస్తే అంత గొప్ప మార్పు సాధ్యమా? ఇక్కడ సమస్య ఏమిటంటే ఆధ్యాత్మికత, జ్ఞానాన్ని తెలుసుకోడానికి బుద్ధికుశలత అవసరమా? మేధలోంచే ఎలా అనే ప్రశ్న వస్తుంది. బుద్ధి ఎప్పుడూ ప్రశ్నిస్తుంది. వివేకవంతుడు నేను చెప్పింది వెంటనే పాటిస్తాడు. అదే బుద్ధికి, వివేకానికి గల తేడా.
శివసూత్రాలలో శివుడు ఈ విధంగా చెబుతారు, 'అంతిమసత్యాన్ని బోధించేటప్పుడు, జాగ్రత్తగా వినండి, కనురెప్పలు మూయకుండా, కళ్ళు కదిలించకుండా, నిశ్చలతతో వింటే మీరు సంపూర్ణమైన స్వేచ్ఛని పొందుతారు.
శివుడు 'కళ్ళు స్థిరంగా కనురెప్పలు మూయకుండా' అన్న మాటలను ఎందుకు వాడాడు? మీరు మీ కనురెప్పలు మూయకుండా ఉంటే మీరు ఎందులోనేనా లీనం అయ్యారని తెలుస్తుంది. మీరు కనురెప్పలు కదిలిస్తే మీరు లీనం కాలేదని అర్థం. మీరు కనురెప్పలు కదిలిస్తే మీరు కేవలం వింటున్నారు ఆలకించడం లేదని అర్థం. వినడానికి, ఆలకించడానికి చాలా తేడా వుంది. మీరు వింటున్నప్పుడు మీ బుద్ధి పని చేస్తుంది. ఆలకించేటప్పుడు (అంటే శ్రద్ధగా వినడం) మీరు అందులో లీనమయ్యారని తెలుస్తుంది. మీ మేధస్సు పని చేయదు. మీరు పూర్తిగా కరిగిపోతారు. మీరు గురుదేవులు తప్పితే బాహ్య ప్రపంచం ఉండదు. మీరు పూర్తిగా అమాయకత్వంతో సత్యకామునిలా వికసిస్తారు. ఆ స్థితిలో గురుదేవులు పలికే ఒక్క మాటతో మీరు జ్ఞానోదయంపొందుతారు.
అమాయకత్వంతో సంపూర్ణంగా వికసించి ఉన్నప్పుడు కేవలం ఉపదేశమే జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. శివసూత్రాల్లో ఇది ఒక పద్ధతి. గురుదేవులు సత్యాన్ని బోధించినప్పుడు అంకితభావంతో విని - జ్ఞానోదయం పొందండి.
కేవలం సమర్పణభావంతో వింటే ఎలా జ్ఞానోదయంపొందగలం అనే సందేహం వస్తుంది. మనకు జ్ఞానోదయం కలగలేదు. సత్యకామునికి ఆ స్థితి ఎలా వచ్చింది? మొదటి కారణం సత్యకాముడు అమాయకమైన వివేకంతో గురుదేవుల ఆదేశాన్ని పాటించాడు. రెండవది, అతను ధైర్యంగా అడవికి వెళ్ళి నివసించాడు. అతనికి గురువు మీద పూర్తి నమ్మకం ఉంది. నమ్మకాన్ని వెన్నుంటే అమాయకత్వం ఉంటుంది.
నేను మిమ్మల్ని వెయ్యి గోవులు తీసుకురమ్మనడంలేదు. సత్యకాముని మానసికస్థితిలో రమ్మని అంటున్నాను. అదే అమాయకత్వంతో రండి. సత్యకామునిలా అడవికి వెళ్ళక్కర్లేదు, కాని అతను ఎలా ఉన్నాడో అలా ఉండండి. మీ అంతఃకరణ అంత స్వచ్ఛంగా ఉంటే ఈ క్షణంలో మీలో మార్పు వస్తుంది. మీరు పరమార్థాన్ని తెలుసుకుంటారు.
నిశ్చింతగా ఉండు
ఉపనిషత్ అంటే గురుదేవుల పాదాల దగ్గర కూర్చొని విద్యనేర్చుకోవటం. పూర్వం భారతదేశంలో 'గురుకులం'లో గురువుతో శిష్యులు నివసించేవారు. ఏడు సంవత్సరాల పిల్లలని గురుకులానికి పంపించేవారు. ఆ పిల్లలు అందమైన మనోవికాసంతో గురుదేవుల దగ్గర పెరిగేవారు. గురువులు సత్యంతో జీవించే అవతారమూర్తులు. వారి ఆలోచనలు, మాటలు, చేసే పనులు అన్ని పరమార్థాన్ని తెలియజేస్తాయి. శిష్యులు వారితోంటూ ఆ సత్యాన్ని గ్రహిస్తారు.
గురుకులం - పురాతన భారతీయసంప్రదాయం, గురుశిష్యులు కలిసి ఒక కుటుంబంలా ఉండేవారు. శిష్యులు, గురుకులంలోనే, గురువు సంరక్షణలో పెరిగి, అంతరంగప్రపంచ జ్ఞానం పొందేవారు. సహజసిద్ధంగా వారికి బాహ్యప్రపంచం మీద అవగాహన కలిగేది.
స్వామి యుక్తేేశ్వరగిరి భారతదేశంలో జ్ఞానోదయమైన గొప్ప యోగీశ్వరుడు. ఆయన ఈ విధంగా అన్నారు - గురువు దగ్గర కూర్చోవటమంటే కేవలం భౌతికంగా కాదు, ఆయన మూర్తిని మీ హృదయంలో ఉంచుకోవాలి. గురుదేవుల పద్ధతిని అనుసరిస్తూ పూర్తిగా ఆయనతో అనుసంధానం ఏర్పరచుకోవాలి. ఇదే ఉపనిషత్‌లో చెప్పిన పద్ధతి, గురువు ఎప్పుడూ సచేతనస్థితిలో ఉంటారు. శిష్యుడు గురువుతో అనుసంధానం ఏర్పరచుకుంటే ఆ చేతనస్థితిని పొందుతాడు. ఇది కేవలం అమాయకత్వంతో మాత్రమే లభిస్తుంది.
వికసించడం అంటే శూన్యతతో ఉండడం. మీరు జ్ఞానంతో నిండి ఉండకూడదు. జ్ఞానం ఒక పరికరం మాత్రమే. అది మీలోని పదార్థం కాదు. ప్రతి దాన్ని ఇది కాదు, అది కాదు అని నిరాకరించండి. నేను మీతో అనేది ఏమంటే, మిడిమిడి జ్ఞానంతో ఉండవద్దు, అంతిమసత్యాన్ని తెలుసుకొనే వరకు ఏదీ వద్దనండి. మీకు నిరంతరం వచ్చే ఆలోచల్ని వదిలేస్తే శూన్యం మిగులుతుంది. మీలో మీరుంటారు. అక్కడే మీరు పరమార్థాన్ని తెలుసుకుంటారు. అప్పుడు మీరు సంపూర్ణంగా సత్యమనే వెలుగుతో నింపుతారు.
అది శంకరాచార్యులవారు ఎనిమిదవ ఏట నిర్వాణశతకం అనే అందమైన కవితని ఆశువుగా చెప్పారు.
నిర్వాణశతకం - నిర్వాణ అంటే అత్యున్నత ఆనందస్థితి. శంకరాచార్యులవారిని ఆయన గురుదేవులైన గోవింద భగవత్పాదులవారు ఈ విధంగా అడిగారు 'ఎవరు నీవు?' అని. ఆ ప్రశ్నకు జవాబుగా, ఆశువుగా శంకరాచార్యుల వారు, నిర్వాణశతకం చెప్పారు.
నాకు ప్రేమ కాని ద్వేషం కాని లేవు.
నాకు లోభత్వం కాని అవిశ్వాసం కాని లేవు.
నాకు గర్వం కాని అసూయ కాని లేవు.
నేను చేయవలసిన పని లేదు.
సంపాదించవలసిన ధనం లేదు.
నేను ఆనందాన్ని కోరుకోవటం లేదు.
విముక్తికి బంధించబడి లేను.
చేతనస్థితి, బ్రహ్మానందం సహజస్వభావం.
నాలో అంతా శుభప్రదమే
శివోహం, నేను శివుడిని.
శంకరాచార్యులవారు అతి చిన్న వయస్సులో అంత బ్రహ్మానందంలో ఉన్నారు.
మీరు పిల్లలని చూస్తే, వారి కళ్ళు ఎప్పుడూ ఆశ్చర్యం, కొత్తదనంతో నిండి ఉంటాయి. ఆ పసి మనస్సులు ఖాళీగా ఉంటాయి. దేని మీద అభిప్రాయం ఏర్పరచుకోరు. తెలుసుకోవాలనే కుతూహలస్థితిలో ఉంటారు. వారి కళ్ళు వారి సంసిద్ధతని తెలియజేస్తాయి. మీరు పెద్దవారిలో అలాంటి కళ్ళు చూసారా? పెద్దవారిలో వయస్సుతో పాటు కళ్ళు కాంతి తగ్గుతుంది. వయసుతో బుద్ధి పెరగడం వల్ల కళ్ళు నిస్తేజం అవుతాయి. మనకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి. కాని వాటి వల్ల కళ్ళు కాంతి తగ్గకూడదు. మన అంతరంగం ఖాళీగా ఉండాలి.
మీరు జీవితం మీద అభిప్రాయం ఏర్పరచుకోకుండా, స్థిరమైన ఆలోచనలు లేకుండా ఒక ఖాళీ టీ కప్పులా ఉంటే తయారుచేసిన టీని నింపవచ్చు. మీరు గ్రహించే స్థితిలో ఉంటారు. మీరు తెలుసుకునే తత్వంలో ఉంటారు. మీకు విసుగు పుట్టదు. మీరు ఒక చిన్న పిల్లాడిలా అమాయకత్వంతో సహజంగా ఉంటారు.
అమాయకత్వం జీవితంలోని అద్భుతాలను పంచుకోవడానికి ఆహ్వానిస్తుంది. బుద్ధి జీవితంలో అద్భుతాలని అడుగు పెట్టనివ్వదు. పిల్లల దాగుడుమూతలు ఆడుకునేటప్పుడు, పెద్దవాళ్ళు ఎక్కడ దాక్కుంటారో, ఎప్పుడూ అక్కడే దాక్కుంటారు. అలా ఎందుకు చేస్తారంటే, వారి అమాయకత్వం వల్ల. వారి మనస్సులో ఏ ఆలోచనా ఉండదు. వారి పసి హృదయం ఎలా చెప్తే అలా వింటారు. మీపై వారికి చాలా నమ్మకం ఉంటుంది. అందుకే ఆటలో మీరు ఎక్కడ దాక్కున్నారో అక్కడికే వెళ్ళి దాక్కుంటారు. ఆ అమాయకులకి మీరు వారిని అక్కడే వెతుకుతారు అన్న అనుమానం కూడ రాదు. అంత అందమైంది, స్వచ్ఛమైంది వారి అంతఃకరణం.
మానసనిపుణులు పిల్లల తెలివితేటల మీద, వారికి ఉన్న అవగాహన పైన ఒక చక్కని ప్రయోగాన్ని చేసారు. పిల్లలకి బొమ్మల కొలువుని చూపించి అందులో తల్లి, తండ్రి బొమ్మల్ని, కూతురు, కొడుకు బొమ్మల్ని చూపించారు. తరువాత తల్లి, తండ్రి బొమ్మలు అక్కడ నుంచి తీసేసి, పిల్లలతో వారు ఆఫీసుకి పనికి వెళ్ళారు అని చెప్పారు. తరువాత కొద్దిసేపు వారి దృష్టిని మరల్చి తిరిగి ఆ బొమ్మల్ని అదే స్థానంలో ఉంచారు. పిల్లలు ఆ బొమ్మల్ని చూస్తారు. ఇప్పుడు మరలా వారిని 'అమ్మ, నాన్నల బొమ్మలు ఏవి' అని వారిని అడిగినప్పుడు వారి నుంచి వచ్చిన జవాబులు ఆసక్తికరంగా ఉన్నాయి.
నాలుగు సంవత్సరాల వయస్సు వరకూ, పిల్లలు బొమ్మల్ని చూసి కూడా వాళ్ళు ఆఫీసుకి వెళ్ళారు అనే చెప్పారు. ఆ వయస్సులో వాళ్ళు చూస్తున్నదాన్ని అన్వయించుకోవటం వారికి రాలేదు. ఇంకా కూడా వాళ్ళు ఆ కౌన్సిలర్ చెప్పిన మాటలనే నమ్ముతున్నారు.
ఇదే అమాయకత్వంలోని అందం. అమాయకత్వంలో విశ్వాసం ఉంది. అమాయకత్వం తనని వాడుకుంటారేమో అనే భయాన్ని కలిగించదు. ఇప్పుడు న్యూరోసైంటిస్ట్లు వివరాలు కనుక్కుంటున్నారు. పిల్లలకి ఐదు - ఆరు సంవత్సరాల వరకూ మెదడు తరంగాలు తీటా డెల్టా స్థితిలో ఉంటాయి. ఇదే మనం కలలు కని నిద్ర పోయే స్థితి. ఈ స్థితిలో గుర్తింపుల అవసరం లేని స్థితి. పన్నెండు సంవత్సరాల వయస్సు వరకు ఆల్ఫా స్థితిలో ఉంటాయి. అది కూడా మంచి స్థితి. అందుకే పిల్లలు పెద్దవాళ్ళు ఏమిచెబితే దాన్నే నమ్ముతారు. వారి అమాయకత్వంలో విశ్వాసం ఉంటుంది. మీరు చిన్న పిల్లల కళ్ళు చూడండి. అవి ఖాళీగా, స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే బ్రహ్మానందంలో ఉంటారు. పెద్దవారవుతున్న కొద్దీ కళ్ళు జ్ఞానంతో నిండుతాయి. అప్పుడు మీకు చూపు ఉంటుంది, వివేకం ఉండదు. దీనికి కారణం మీరు నమ్మకాలు, అభిప్రాయాలు, తెలివి నిండిన కళ్లతో చూస్తారు. దాని వల్ల నేర్చుకునేది ఎం ఉండదు. అలాంటి కళ్ళు మీకు ఎం తెలియజేయవు.
మీరు శూన్యమైన కళ్లతో చూస్తే చూసింది లోతుగా మనస్సుకు హత్తుకుంటుంది. జీవితం వికసిస్తున్న అద్భుతంలా ఉంటుంది. మీరు ప్రశ్నించే వారి అమాయకత్వాన్ని తెలుసుకోవచ్చు.
ప్రశ్నలు మూడురకాలుగా అడగవచ్చు, అమాయకత్వంతో అడగవచ్చు, మీకు ఉన్న జ్ఞానంతో అడగవచ్చు, మీకు తెలిసింది ధ్రువీకరించడానికి అడగవచ్చు).
మీరు అమాయకత్వంతో అడిగితే – మీరు జవాబు వినడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు జ్ఞానంతో అడిగితే, మీకు సమాధానం వినిపించదు. మీరు ఖాయం చేసుకోవడానికి అడిగితే – జవాబును నిరాకరిస్తారు.
ఒక చిన్న కథ : బౌద్ధగురువులు సాధారణంగా శిష్యులకి వ్యక్తిగతమైన సలహాలు ఏకాంతంలో ఇస్తారు. ఒక బౌద్ధగురువు నిత్యం వ్యాపారులతో, పత్రికా విలేఖరులతో, తన శిష్యులతో మాట్లాడుతూ సంతోషంగా గడిపేవారు. ప్రతి రోజూ ఆయన దగ్గరికి ఒక చదువు రాని తొట్టెల వ్యాపారి వచ్చి, అర్థం లేని ప్రశ్నలు అడిగి, టీ తాగేసి వెళ్ళేవాడు. ఒక రోజు అతను ఉండగా శిష్యుడు బౌద్ధగురువుతో ఏకాంతంలో సలహా తీసుకోవడానికి వచ్చాడు. గురువు ఆ తొట్టెల వ్యాపారిని, కాసేపు బయటకి వెళ్ళి కూర్చోమన్నారు. వ్యాపారి ఇలా అన్నాడు, 'మీరు జీవంతో ఉన్న బుద్ధుడు, శిల్పాకృతిలో ఉన్న రాయితో చేసిన బుద్ధులు కూడా వాటి ముందు మనుష్యుల సమావేశాన్ని వద్దనరు, అలాంటప్పుడు నన్ను ఎందుకు వెళ్ళమంటున్నారు?'
బౌద్ధగురువు తన శిష్యుడితో మాట్లాడడానికి బయటకు వెళ్ళిపోయారు.
ఆ తొట్టెల వ్యాపారి జ్ఞానంతో ప్రశ్నించాడు, అతను ఆ క్షణం వివేకహీనుడు అయ్యాడు. గురుదేవులు ప్రతిక్షణం బోధిస్తూంటారు? పూర్తి వికాసంతో ఉన్నవారు ఆ బోధ గ్రహిస్తారు. అమాయకత్వం నేర్చుకోవడానికి సహకరిస్తుంది. గురువు చెప్పింది అర్థం చేసుకోవడానికి వ్యాపారి మిడిమిడి జ్ఞానం అడ్డుపడింది. మీరు పిల్లలను చూస్తే, వారు తమ చుట్టూ ఉన్న ప్రతీది గ్రహిస్తారు. అందరు చెప్పింది అర్థం చేసుకుంటారు. వారి గ్రహణస్థితిని ఆ చిన్న వయస్సులో ఏదీ ఆపదు. అందుకే వేదసాంప్రదాయప్రకారం పిల్లలకి ఏడేళ్ళు నిండేసరికి గురుకులానికి పంపేవారు. గ్రహించడానికి లేదా నేర్చుకోవడానికి ముఖ్యంగా కావలసింది అమాయకత్వం. అసలు సమస్య ఎవరి మనస్సు శూన్యంగా లేదో వారు గ్రహించలేరు. వారు జ్ఞానంతో నింపబడి ఉన్నారని వారితో చెప్పలేం. వారు చెప్పినా అర్థం చేసుకోరు, ఒప్పుకోరు. అమాయకత్వంతో ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, 'నాకు ఉన్న జ్ఞానం వల్ల నేను అర్థంచేసుకోలేక పోతున్నాను, నాకు నిజంగా తెలియదు. నేను ఈ క్షణం నేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నాను' అని. ఎప్పుడైతే ఖాళీ ఏర్పడుతుందో, తెలుసుకోవడం జరుగుతుంది. వారిలో తెలుసు అన్న అహం ఉండదు. వారు నిరోధించే స్థితిని వదిలేసి పూర్తిగా గ్రహించే స్థితిలో ఉంటారు.
జిడ్డు కృష్ణమూర్తి ఒక గొప్ప వేదాంతి. ఆయన ఈ విధంగా చెబుతారు, 'మనకి జ్ఞానం సమకూర్చుకోటానికి ప్రేరణ తెస్తే మనం జ్ఞానం నుండి స్వేచ్ఛ పొందుతాం'. సాధారణంగా జ్ఞానానికి ప్రేరణ ఏమిటి? వర్తమానం ఒక తెరుచుకుంటున్న రహస్యమైన అద్భుతం. మనకున్న జ్ఞానంతో ఆ రహస్యాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అదే జ్ఞానసంపాదనకి ప్రేరణ. కాని అది జరగదు. తెలియని దాన్ని తెలివితో బంధించలేం. అది కేవలం ఆత్మసమర్పణతో తెలుసుకోగలం. ఆ సమర్పణాభావమే వివేకం. వివేకం వర్తమాన క్షణాల అద్భుతాన్ని గుర్తిస్తుంది. దానికి ఆనందంగా అంకితం అవుతుంది. ఆ ఆనందం అమాయకత్వంతో కూడి ఉంటుంది.
జ్ఞానం అద్భుతమైన ఈ క్షణాన్ని నిరాకరిస్తుంది. జ్ఞానం ప్రతి నిమిషం ఆ క్షణాన్ని వెతుక్కుంటుంది. కాని ఆ క్షణం జ్ఞానానికి దొరకదు. అందుకే నిరంతరం మీకు ఆ తెలియనిదాని గురించి భయం. కనుక్కోవాలన్న ప్రయత్నమే తెలియనిదాని గురించి భయం పుట్టిస్తుంది. లేకపోతే మీకు భయం ఉండదు. మీకు ఈ క్షణం ఒక అద్భుతం అని స్పష్టంగా తెలుసు. జ్ఞానం వల్ల ఈ క్షణం గురించి తెలుసుకోలేరు. మన అహానికి తెలుసుకోలేకపోవటమంటే ఏమీ లేదని అర్థం. కాని మన అహంకారం దాన్ని ఒప్పుకోదు. అమాయకత్వం అంటే ఏమీ లేకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించడం. వాస్తవం ఒక తెరవని బహుమతి. కాని జ్ఞానం ఆ ఉత్కంఠని దోచుకుంటుంది. జ్ఞానానికి మన అంతరంగాన్ని తెలుసుకోవాలని అర్థమైతే అంతిమపరిజ్ఞానాన్ని తెలుసుకునే విధానానికి అడ్డుపడదు. జీవితంలో దాగి ఉన్న అద్భుతాల్ని చవి చూస్తున్నప్పుడు కాకుండా, కావలసినప్పుడు జ్ఞానాన్ని ఒక పరికరంలా ఉపయోగించాలి.
మనం ఎప్పుడైతే జ్ఞానం జీవితరహస్యాల్ని నిరాకరిస్తుంది అని గ్రహించి, తెలియనిదాని గురించి భయం వల్ల జ్ఞాన సముపార్జన చేస్తున్నామని తెలుసుకుంటే, మనలో వివేకం ప్రవేశిస్తుంది. అదే మనం జీవితానికి అధీనమవటం. దీని వల్ల అమాయకత్వం పుడుతుంది.
సమాజం, పుట్టిన ప్రతి శిశువులో కొన్ని నమ్మకాల్ని, కట్టుబాట్లని ప్రవేశపెడుతుంది. పెంచడంలోనే నమ్మకాల్ని ఆ పసి మనస్సులో నింపుతారు. అసలు నమ్మకం అంటే ఏమిటి? అది ఒక వ్యక్తికి గురించి కలిగిన సొంత అభిప్రాయం అని అర్థం. పిల్లల్లో అలాంటి నమ్మకాలు నిండే అవసరంలేదు. వారిని స్వేచ్ఛగా వారి అభిప్రాయాలు ఏర్పరచుకోనివ్వాలి.
జిడ్డు కృష్ణమూర్తిగారు జ్ఞానం ఒక సంప్రదాయం, అది సహజంగా వస్తుంది అని అంటారు. ఆయన ఉద్దేశ్యం ఏమిటి? ఉదాహరణకి, మీరు ఒక హిందూకుటుంబంలో జన్మిస్తే స్థిరమైన హిందూసంప్రదాయాన్ని పుణికి పుచ్చుకుంటారు. మీరు చేసే పనులు మీరు చెప్పే జవాబులు హిందూసంప్రదాయ గాఢమైన నమ్మకాల, ఆదర్శల, ప్రభావాన్ని చూపిస్తాయి. సచేతనంగా, అచేతనంగా ఆ పద్ధతులకి అలవాటు పడతారు. అచేతనం నుండి వచ్చే జవాబే మీ సహజస్వభావాన్ని తెలియచేస్తుంది. మీ అనుభవాలు ఆ సంప్రదాయం, స్వభావం బట్టి ఉంటాయి యథాతథంగా ఉండవు. అందుకే దేన్ని గురించి యథాతథంగా తెలియదు. మీకు ఉన్న జ్ఞానంతోనే దాన్ని తెలుసుకోగలరు. అందుకే జ్ఞానం ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు.
అంతరంగం జ్ఞానంతో నిండిపోతే అనుభవించటానికి వారిలో ఖాళీ ఉండదు. దేన్నైనా ఆ జ్ఞానంతోనే చూస్తారు. ప్రతీది పాత అనుభవాల్ని లేదా ఏర్పరచుకున్న అనుభూతులని ప్రతిబింబించేస్తుంది. వారి భవిష్యత్తులో కూడా నిరంతరంగా సాగిపోయే పాత అనుభవాలు, పాత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. మీకు పువ్వు పరిమళం తెలుసు, మీకు అలల శబ్దం తెలుసు, ఉదయించే సూర్యుడి అందం తెలుసు, ఇవి సృష్టి అంటే దేనికీ కొనసాగింపు కాదు అని అర్థం చేసుకోండి. ప్రతి నిమిషం దానిలో క్రొత్తదనం ఉంది. అది తెలుసుకోవడం సాధ్యం కాదు. తరువాత నిమిషంలో ఏం జరుగుతుందో మీకు ఎలా తెలుస్తుంది. ఇది అర్థమైతే జ్ఞానాన్ని వదిలేయవచ్చు. అప్పుడు ఉండేది ఎరుక మాత్రమే. ఎరుక అమాయక వివేకం. అది జ్ఞానం అడ్డురాకుండా అనుభవాన్ని పొందనిస్తుంది. అప్పుడు అంతరప్రపంచం, బాహ్యప్రపంచం, వాటిని కలిపే అద్భుతరహస్యాల గురించి తెలుసుకోవచ్చు.
జిడ్డు కృష్ణమూర్తిగారు ఇలా అన్నారు, నమ్మకం అనేది సాధ్యపడేవాటిని తోసి పుచ్చి ఒక ప్రత్యేకమైన వ్యాపకంపై మీ మనస్సును ప్రేరేపించటమే. మనస్సు వ్యాపకం కోసం వెతుక్కుంటుంది. అందుకే నమ్మకం వెంటే ఉంటుంది. జీవితం పూర్తిగా నమ్మకాలపై ఆధారపడుతుంది. అందుకే మనం పని మీద కాకుండా వ్యాపకంలో మునిగిపోతాం. వ్యాపకానికి నమ్మకమనే ఇంధనం కావాలి. అది మధ్యలో ఆగకూడదు. అది ఆగిపోతే మనం కుంగిపోతాం. అవసరమైనప్పుడు పని చేస్తాం. లేకపోతే ఆపేస్తాం. వ్యాపకం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. పని జరిగేది అవగాహన మీద. వ్యవహారం వల్ల నీరసం వస్తుంది. పని శక్తిని ఇస్తుంది, ఉత్సాహపరుస్తుంది. మీకు వ్యవహారం కాదు, పని అవసరం.
నమ్మకం అంటే ఒక దానిపై మీ అవగాహన. అది యథార్థంకాదు. ఒక పరిస్థితిని నలుగురు నాలుగు విధాలుగా అర్థం చేసుకుని నాలుగు నమ్మకాలను ఏర్పరచుకుంటారు. నమ్మకంలో పూర్తి నిజం లేదు. అది ఒక వ్యక్తి అవగాహన మాత్రమే. అమాయకత్వం అవగాహనని తెరిచి ఉంచుతుంది. అదే అందులో ఉండే అందం. అమాయకత్వం దేని పైనా ఒక అభిప్రాయానికి వచ్చి దాన్ని మూసేయదు.

ఈ ప్రక్క బొమ్మ చూడండి.
ఈ బొమ్మలో ఒక పెద్దావిడ కనిపిస్తుంది. అదే బొమ్మలో ఒక యువతి ముఖం కూడా కనిపిస్తుంది. పెద్దావిడ ముక్కు చిన్నామె ఎడమ బుగ్గ, పెద్దామె మూతి, యువతి వేసుకొన్న డ్రెస్ మెడ, పెద్దామె ఎడమ కన్ను చిన్నామె ఎడమ చెవి.
ఈ విధంగా ఆ బొమ్మని ఎన్ని రకాలుగానైనా వివరించవచ్చు. ఒకే వివరణని పట్టుకొని ఉండక పోవటమే అమాయకత్వం. అప్పుడే స్పూర్తి సజీవంగా ఉంటుంది.
నిశ్శబ్దం – నేర్చుకోవటానికి, మరిచిపోవటానికి సరైన ప్రదేశం
పరమహంస యోగానంద ఇలా అన్నారు, 'పగలు పిశాచాల ఆట స్థలం', పగలు మనం నిరంతరం మనస్సుని మాటలతో నింపుతాం. మాటలు అనేవి నేర్చుకొనే మార్గానికి అవరోధం కలిగిస్తాయి. ఉదాహరణకి, మీరు నా ముందు కూర్చొని ఉన్నారు. మీలో చాలా మందికి నేను ఏమి చెప్తున్నానో అర్థం కాదు, ఎందుకంటే నేను మీకు తెలియని ఇంగ్లీషులో మాట్లాడుతున్నాను. మీకు బాధగా ఉంది. కాని మీరు అందరిలో అందరి కంటే అదృష్టవంతులు. నా మాటలు మీకు ఎం నేర్పవు. నేను మిమ్మల్ని నిశ్శబ్దంగా ఉంచడానికి మాట్లాడతాను. నేను మాటలు ఆపితే మీరు లోపల మాట్లాడుకుంటారు. అందుకే నేను మాట్లాడతాను. నిశ్శబ్దం నుంచి మీరు చాలా నేర్చుకుంటారు. నిశ్శబ్దంలో అమాయకత్వం ఉంది. మాటలలో తెలివి ఉంది. తెలివి సత్యాన్ని తెలుసుకోలేదు. అమాయకత్వం తెలుసుకుంటుంది.
ఇక్కడ అమాయకంగా కూర్చొని ఉంటే చాలు, అప్పుడు మీరు ఎంతో కొంత పొందుతారు. నా మాటల మధ్యన ఉన్న ఖాళీల్లో నిజమైన సందేశం ఉంది. గురుదేవులు ఒక కావ్యం, జీవంతో ఉన్న కావ్యం. ఆయన వ్యక్తపరచేది జీవంతో నిండి ఉంటుంది. మీరు వినటానికి గురుదేవులు మాట్లాడతారు. ఆయన మాట్లాడుతుంటే అందమైన నిశ్శబ్దం ఉంటుంది. అదే ఆయన మాటల మధ్య అంతర్లీనంగా ఉన్న శక్తి. మీరు మనోవికాసంతో ఉంటే ఆ శక్తి మిమ్మల్ని తాకుతుంది. మాటలు సృష్టించిన ఖాళీలను నిశ్శబ్దం పూరిస్తుంది. నిశ్శబ్దం అంతరంగంలో మార్పుకి అవకాశం ఇస్తుంది. అప్పుడు నిజమైన (బోధన) సందేశాన్ని పొందుతారు. నిశ్శబ్దంలో మీరు మనోవికాసంతో ఉంటారు. ఆ క్షణాల్లో నేను సులభంగా మీ పద్ధతులు తుడిచేస్తాను. మీరు పూర్తి అమాయకత్వంతో ఉంటారు. దీన్నే నేను జీవన్ముక్తి అంటాను. అర్థం చేసుకోండి, సంభాషణ అనేది రెండు మేధల మధ్య జరిగేది. సంభాషణతో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అదే సంభాషణ రెండు హృదయాల మధ్యన అయితే అది ఒకరిలో ఒకరు ఐక్యమవడమే కాని సంభాషణ కాదు. అది రెండు ఆత్మల సంయోగం. సంభాషణలని మీరు మీలోని మేధతో ఎదుర్కొంటారు. అదే హృదయసంయోగంలో మీరు సూటిగా దీక్షని తీసుకుంటారు. కాని ఆ అనుభవాన్ని పొందుతారు. సంయోగంలో మాటలకి అందని మీ తపసని తృప్తిపరుస్తారు. అదే నా దగ్గర మీకు దొరికేది, దాన్నే మీరు నా నుంచి తీసుకోదగింది.
ధ్యానం అంటే సంయోగాన్ని ప్రారంభించటమే. మీలో అది నిశ్శబ్దాన్ని తెలుసుకోగలగటం. మీ అంతరంగనిశ్శబ్దం మీ ఆలోచనల వల్ల కాని, లేదా మీ అనుభవాలు వల్ల కాని ఏ విధంగా ప్రభావితం కాదు. ఆ అమాయకత్వాన్నే మీరు వెతుక్కుంటున్నారు. అందుకే హిమాలయాలకి, అడవులకి వెళ్ళి ఏకాంతంగా ఉండాలనుకుంటారు. బాహ్యనిశ్శబ్దంలో తమ అంతరంగనిశ్శబ్దాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. అది జరిగినప్పుడు మీరు పూర్తి సృష్టితో అనుసంధానంలో ఉంటారు. ఈ నిశ్శబ్దంలో ఏది జరిగినా సృష్టి దాన్ని ధృవీకరిస్తుంది.
చిన్న కథ : చైనాలో ఒక వ్యక్తి బౌద్ధగురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు అతణ్ణి 'నాయనా, నీకు ఏం కావాలి' అని అడుగుతాడు. ఆ వ్యక్తి తనకు జ్ఞానోదయం కావాలని కోరుకున్నాడు. గురుదేవులు ఇలా అడిగారు. 'నీలోనే ఆ నిధి ఉంది బయట ఎందుకు వెతుకుతున్నావు?' శిష్యుడు 'అది ఎక్కడ ఉంది?' అని అడిగాడు. గురువుగారు ఇలా అన్నారు. 'నీ ప్రశ్న ఎక్కడ నుంచి వచ్చిందో అదే నీ నిధి' ఆ క్షణంలో శిష్యుడికి జ్ఞానోదయమైంది.
అంతరంగ నిశ్శబ్దమే నిధి ఉండే స్థలం. దాన్ని కనుక్కోడానికి గురువు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి, మీకు నేను చెప్పేది అర్థంకాకపోయినా బాధ పడకండి. అమాయకత్వంతో ఉండి, మాటల మధ్య నిశ్శబ్దంతో కలిసిపోండి. అప్పుడు మరిచిపోవడం, నేర్చుకోడంరెండూ జరిగే విధంగా జరుగుతాయి. ఆ నిశ్శబ్దంలో స్వర్గం పొందాలన్న కోరిక కాని, నరకం వలన కలిగే భయం కాని, ఇతరులంటే అసూయ కాని, ప్రేమ కాని, బాధ కాని ఉండవు. ప్రతిధ్వనించే అమాయకత్వం గురుదేవులతో మాత్రమే ఉంటుంది. అప్పుడు ప్రత్యక్షంగా అది మీలోనికి పంపబడుతుంది.
అమాయకత్వంతో గ్రహించండి
అమాయకత్వం సున్నితమైన పరిమళం అయితే జ్ఞానం దృఢమైన వడపోత సాధనం. అదే రెంటికి తేడా. అమాయకత్వమనే పరిమళం మొత్తం ప్రపంచాన్ని మీ దగ్గరకు ఆకర్షిస్తుంది. జ్ఞానం అనే వడపోసే సాధనం మీ దగ్గరకు చాలా వస్తువులని రానీయదు. మిమ్మల్ని జ్ఞానం పట్టుకుంటే మీరు ఎప్పుడూ తొందరలోనే ఉంటారు. మీరు అమాయకత్వంతో ఉన్నప్పుడు ప్రతిక్షణం ఆనందంలో ఉంటారు. మీరు అమాయకమైన మనుష్యులని చూస్తే వారు ప్రతిక్షణాన్ని సహజంగా, సంపూర్ణంగా ఆస్వాదిస్తారు. అమాయకత్వం ఆ క్షణాన్ని అనుభవిస్తుంది. జ్ఞానం ఆ క్షణాన్ని కోల్పోతుంది. జ్ఞానానికి కేవలం ఉద్దేశం ఉంటుంది. అమాయకత్వం ఉద్దేశరహితంగా ఉంటుంది.
మీ జ్ఞానాన్ని పక్కన పెడితే, మీరు ఈ క్షణాన్ని అనుభవిస్తారు ఇదే వాస్తవం. ఈ కాలం విద్యావ్యవస్థ కేవలం జ్ఞానానికే ప్రాధాన్యత ఇస్తున్నది. పాఠశాలలో, కాలేజీలలో జ్ఞానం బోధిస్తున్నారు. తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతున్నారు. అమాయకత్వాన్ని మరిచిపోయేలా చేస్తున్నారు.
ఒక తండ్రి తన సహోద్యోగులకి తన కొడుకుని గర్వంగా పరిచయం చేశాడు. అందరూ ఆ అబ్బాయి చుట్టూ నిల్చొని ఉండగా తండ్రి - “బాబూ నీ వయసెంతో చెప్పమ్మా?” అని అడిగాడు. కొడుకు వెంటనే ఇలా సమాధానం ఇచ్చాడు. “నేను ఇంట్లో ఉన్నప్పుడు నా వయస్సు ఏడు సం॥లు. నేను బస్సులో వెళ్తున్నప్పుడు నాకు ఐదు ఎక్కు.” ఈ విధంగా పిల్లకి పెద్దలు నేర్పుతున్నారు. ప్రతి దానిలో ఉపయోగమే చూస్తున్నారు. నీ ఉపయోగాన్ని బట్టి విద్య నీకు విలువ కడుతుంది. కానీ నీవు నీ ఉపయోగంకాదు. నీవు జీవుడివి. జీవునికి విలువ కట్టలేం. మనసుకు విలువ కట్టగలం కానీ అది కల్పితం. సమాజం కల్పితాన్ని సృష్టిస్తుంది అదే నీ మనసు. ఆ మనస్సునే కొలబద్ధంగా తీసుకొని నీకు విలువ కడతారు. అందుకే ఈ రోజుల్లో జ్ఞానం ముఖ్యమైంది అనుకుంటారు.
ఒక చిన్న కథ : ఒక ఊళ్ళో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడు కలిసి కాలం గడిపేవారు. ముగ్గురు స్నేహితులు బాగా చదువుకున్నారు. నాల్గో వ్యక్తి అంతగా చదువుకోలేదు కాని చాలా తెలివైనవాడు.
ఒక రోజు వారి విద్యలను ప్రదర్శించి డబ్బు సంపాదించడానికి బయలుదేరారు. నాల్గవ స్నేహితునికి ఏమీ రాకపోయినా, వారితో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. మొదటి స్నేహితుడు నాల్గవ స్నేహితునితో ‘నీకు ఏ విద్య రాదు, నీవు మాతో వస్తే అనవసరంగా మా డబ్బు నీతో పంచుకోవాలి’ అన్నాడు. రెండవ స్నేహితుడు కూడ అతనికి వంతపాడి నాల్గవ వాడిని ఉండి పొమ్మన్నాడు. మూడవ స్నేహితుడు జాలితో ఇలా అన్నాడు. ‘మనం అందరం కలిసి పెరిగాం. అతణ్ణి ఉండి పొమ్మనడం భావ్యం కాదు. మనతో వస్తాడు’ అన్నాడు. ఆ విధంగా నలుగురు స్నేహితులూ కలిసి బయలుదేరారు. వారు ఒక దట్టమైన అడవిలో వెళ్తున్నారు. వారు క్రూరజంతువులను చూసారు.
ఒక రోజు దారిలో ఎముకల గుట్టని చూసారు. మనం నేర్చుకున్న విద్యతో ఈ జంతువుని బ్రతికిద్దాం మన విద్యకిది ఒక పరీక్ష అన్నాడు వారిలో ఒకడు. మిగతా స్నేహితులిద్దరూ అందుకు ఒప్పుకున్నారు. నాల్గవ స్నేహితుడు ఇలా అన్నాడు. ఈ ఎముకల్ని చూస్తుంటే అది చాలా పెద్ద జంతువులా ఉంది. కాబట్టి దాన్ని తిరిగి బ్రతికించవద్దు,” అన్నాడు. మిగతా ముగ్గురు అతణ్ణి చూసినవ్వి అతణ్ణి పిరికివాడుగా ఎంచి మాలా నీకు జ్ఞానం ఉంటే ఇలా భయపడవు. మాట్లాడకుండా మేం చేసేది చూడు, అని చెప్పారు.
ముగ్గురూ వారు నేర్చుకున్న విద్యను ప్రయోగించారు. మొదటివాడు ఆ ఎముకల్ని క్రమంలో పెట్టి ఒక జంతువు ఆకారాన్ని తయారుచేసాడు. అతడు కొన్ని మంత్రాలు చదివి దాని మీద పవిత్రమైన నీటిని చిలకరించగానే, అది ఆ జంతువు అస్థిపంజరంగా మారింది. రెండవ స్నేహితుడు వచ్చి మరి కొన్ని మంత్రాలు వల్లించి నీళ్ళు చల్లగా ఆ అస్థిపంజరం కండరాలు రక్త మాంసాలతో నిండి చర్మంచే కప్పిన ఒక జీవంలేని సింహం ఆకృతిని పొందింది. ఆ స్నేహితులకి చాలా ఆశ్చర్యం కలిగింది. మూడవ స్నేహితుడు ముందుకు వచ్చి దానికి ప్రాణం పోస్తానంటాడు. నాల్గవ స్నేహితుడు మరొకసారి వారిని వారించాడు. ఆ ముగ్గురూ అతణ్ణి మళ్ళీ హేళన చేసారు. నాల్గవవాడు నెమ్మదిగా ఒక చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు. మూడవవాడు ఆ కళేబరానికి ప్రాణం పోయగానే ఆ సింహం జీవంతో లేచి నిలబడింది. గర్జిస్తూ ఆ ముగ్గురి స్నేహితుల పైనా దూకింది. వారు నాల్గవ స్నేహితుడు ఎక్కడున్నాడని చూసారు. అతడు చెట్టుపై నుండి వీరినే చూస్తున్నాడు. సింహం ఆముగ్గురు స్నేహితుల్నీ చంపేసింది.
కాబట్టి జ్ఞానం ఒక పరికరం మాత్రమే. అది మనలో వివేకాన్ని కలిగించదు. దాన్ని మనకి అవసరమైనప్పుడు ఉపయోగిస్తే అది అద్భుతాల్ని చేస్తుంది. తప్పేమిటంటే మనం పూర్తిగా జ్ఞానానికి లొంగిపోతాం. కాని అమాయకత్వం స్వచ్ఛమైన వివేకానికి దారి చూపిస్తుంది.
ఇంకొక చిన్న కథ : ఒక చిన్న పల్లెటూరులో ఒక మర్రిచెట్టు ఉంది. దాని నీడన ఒక ఆవు, ఒక అలసిపోయిన కుక్క ఉన్నాయి. అక్కడే ఒక వృద్ధుడు పొడవైన గడ్డంతో, ఆ చెట్టు మొదలు దగ్గర అనుకొని, కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నాడు. ఆ చెట్టు రెండు రాజ్యాల సరిహద్దుపై ఉంది. ఒక బాటసారి ఆ మార్గంలో వెళ్తూ ఇలా అన్నాడు. “నీ మారువేషం బావుంది. కాని అది పని చేయదు. నేను ఆ మధ్యన ఒక బంగారు గొలుసు దొంగిలించినప్పుడు ఇలాగే మారువేషం వేసుకున్నాను. ఒక కావలివాడు నన్ను వెతికి ఆ గొలుసు తీసుకొని నన్ను బాగా కొట్టాడు. సరే నీవు ఈ మారువేషం వల్ల తప్పించుకుంటావేమో చూద్దాం” అన్నాడు.
ఆ తర్వాత ఒకరు గుర్రంపై స్వారీచేస్తూ వచ్చాడు. అతడు ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తున్న గూఢచారి. అతడు వృద్ధుణ్ణి చూసి మనస్సులో ఇలా అనుకున్నాడు. “ఇతడు ఏ ఉద్దేశ్యంతో ఇక్కడ ఉన్నాడో ఎవరికి తెలుసు. ఇతడు కూడ నాలా ఒక గూఢచారి అయివుండవచ్చు, ఏమో” అనుకుంటూ అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోయాడు. ఒక గంట తర్వాత పూర్తిగా తాగిన ఒక మనిషి తూలుతూ వచ్చి చెట్టుకు అనుకుని కూర్చున్న వృద్ధుడితో, “ఇవాళ నీవు ఎంత తాగావు? నా వంక చూడు నేను ఒక కుండని ఖాళీ చేశాను. అయినా ఎంత స్థిరంగా నడుస్తున్నానో చూశావా, అప్పుడప్పుడు తల కొంచెం బరువుగా ఉంది” అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
కొంత సేపటికి చీకటి పడింది. చుట్టూ ప్రశాంతంగా ఉంది. ఆ దారిలో నాల్గవ మనిషి వచ్చి, ఆ వృద్ధుణ్ణి చూసి అతని దగ్గరకి వెళ్ళి నమస్కరించాడు. ఆ వృద్ధుడితో 'నేను చాలా అదృష్టవంతుడిని. మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది,' అని అతడి మీద పాకుతున్న చీమల్ని పురుగుల్ని తరిమే ప్రయత్నంలో ఒక పెద్ద ఆకు తీసుకుని విసురుతున్నాడు.
ఆ యోగి సమాధి నుండి కళ్ళు తెరచి చిరునవ్వుతో తనకు విసురుతున్న మనిషిని చూసాడు. అప్పుడు ఆ యువకుడు మళ్ళీ ఇలా అన్నాడు. ‘ఓ మహాత్మా! మీరు నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి దగ్గర్లో ఉన్న మా యింట్లో ఈ రాత్రి గడిపితే నేను మీ ఆశీర్వాదం పొందుతానని అనుకుంటాను’ అనగానే, ఆ యోగి 'అదే భగవంతుడి కోరిక అయితే అలాగే పద' అని అతని వెంట వెళ్ళాడు.
తెలివితో పోగొట్టుకునేవాటిని అమాయకత్వం గ్రహిస్తుంది. అమాయకత్వం జరిగినవి వదిలేస్తుంది. కాని సత్యాన్ని గ్రహిస్తుంది. అమాయకత్వంతో వివేకం కలిసిఉండడం అనేది చాలా అరుదైన విషయం. జ్ఞానాన్ని పక్కకు పెట్టేది వివేకంతో కూడిన అమాయకత్వం. మీరు జ్ఞానాన్ని సమకూర్చుకోవద్దని నేను అనను. జ్ఞానం అమాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదని అర్థం చేసుకోండి.
మీరు చదువుకోని గ్రామీణప్రజలను చూస్తే వారు స్వచ్ఛమైన వివేకాన్ని ప్రదర్శిస్తారు. అందుకే మీరు ఎక్కడ ఆగిపోతారో గ్రామీణ వ్యక్తి వెంటనే దాన్ని సులభంగా చేయగలుగుతాడు. అమాయకమైన వివేకానికి ఆ సామర్థ్యం ఉంది. అప్పుడు క్లిష్టమైనదాన్ని అర్థం చేసుకోవటం కష్టం కాదు. మీరు మీ మనస్సుతో విశ్లేషణాత్మకంగా వేరొక విధంగా ఆలోచిస్తే అది మీకు వెంటనే అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి విమానశాస్త్రాన్ని సులభంగా అర్థం చేసుకోగలడు, కాని సరళమైన బౌద్ధ సూత్రాలు అర్థమవుతాయా? బుద్ధుడు బోధించినవి బౌద్ధసూత్రాలు అవి మీ ఉనికిని తెలుపుతాయి. మీరు ఎవరు అన్నది తెలియజేస్తాయి, అవి మీ గురించి తప్పితే వేటి గురించి మీకు సలహాలు ఇవ్వవు. మీ గురించి తెలుసుకోవడానికి సహకరిస్తాయి. చాలా సాధారణంగా సూటిగా ఉంటాయి.
ఒక వ్యక్తి మేధను ఎలా పదును పెట్టాలో అన్న దాని మీదే అన్ని విశ్వవిద్యాలయాలూ పని చేస్తున్నాయి. వారు మనల్ని సమాజానికి పనికి వచ్చేలాగా, ఉపయోగకరంగా తయారుచేస్తారు. పనికివచ్చేలా ఉండడం తప్పుకాదు. అవి నేర్చుకోవటంలో మనం విశ్వాన్ని సృష్టితోపాటు అమాయకత్వాన్ని మరిచిపోతున్నాం. సృష్టితో పాటు ఏకకాలంలో కలిసి ఉండలేక పోతున్నాం. విశ్వప్రణాళిక ప్రకారం నడచుకోవడం లేదు.
ఉండడం, చేయడం, పొందడం - అనేవి మూడు స్థితులు. చేయడం నుంచి పొందడానికి మనం నిరంతరం ఏదో ఒకటి చేస్తాం. నేర్చుకోవడం, ఆ నేర్చుకున్నది ఉపయోగిస్తే మనకు కావలసిన డబ్బు బాంధవ్యాలు, సుఖాలు పొందగలుగుతాం. అంత కంటే మెరుగైంది పొందాలని ఇంకా పని చేస్తుంటాం. మనం నిరంతరం చేయటం, పొందటంలోనే ఉండిపోతాం. మనలో మనం ఉండడం మరిచిపోతాం. మన నిజమైన విశ్రాంతి మనలో ఉండడంలోనే ఉంది. అందువల్ల మనం ఎంత చేసినా, పొందినా విశ్రాంతిని వెతుకుతూనే ఉంటాం. ఈ అనుభూతే మన ఉనికి పిలుపు.
మన ఉనికి నుంచి చేయడం జరిగితే పొందడానికి నిరంతరం పని చేయనక్కర్లేదు. ఉనికి ప్రేరణ వల్ల చెయ్యడంలో నాణ్యత ఉంటే పొందడం ఒక ఉపఫలం మాత్రమే. ఇదే సృష్టిరహస్యం. విశ్వవిద్యాలయానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది, వ్యక్తీకి, సమాజానికి, మొత్తం విశ్వానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మనం ఎప్పుడూ మొత్తం గురించే ఆలోచించాలి.
పూర్వం భారతీయవిశ్వవిద్యాలయాలైన తక్షశిల, నలందాలలో విద్యార్థులు అంతరంగస్థాయిలోనే శిక్షణ పొందేవారు. భారతదేశం ఎప్పుడూ వ్యక్తి అంతరంగపు అమాయకత్వాన్ని పెంపొందించడం మీద తమ దృష్టిని కేంద్రీకరించింది. అది మనలో ఆత్మస్థైర్యాన్నిపెంచుతుంది. ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు.
పరమహంస యోగానంద ఆధ్యాత్మికత గురించి చాలా అందంగా వివరిస్తారు. ఆయన ఇలా అంటారు. “మన శరీరంలో లక్ష కొలది కణాలున్నాయి. ప్రతికణం ఒక తెలివైన వ్యక్తితో సమానం. ప్రతికణంలో డి.ఎన్.ఎ. అనే పదార్థంతో ఒక కొత్త శరీరం మేధను పుట్టించడానికి అవసరమైన సమాచారం, వివేకం ఉన్నాయి. నిద్రాణమై ఆ వివేకాన్ని లేపితే బుద్ధి వక్రమార్గం పట్టకుండా ఆనందంలో ఉంటుంది.
డి.ఎన్.ఎ.అనేది మనిషికి వివేకం కలిగించే పదార్థం. ఆయన ఇంకా ఇలా అంటారు, ఆధ్యాత్మికవిద్య వల్ల ప్రాణం అనే విద్యుత్ వెన్నెముక ద్వారా మేధలో ప్రవేశించి, కణాలకి అయస్కాంతత్వం కలిగిస్తుంది. ఒక వ్యక్తి దీని వల్ల పరిణామాత్మకమైన వికాసాన్ని పొందుతాడు. ఈ దివ్యమైన అయస్కాంతత్వంతో ప్రతికణం జీవంతో ఉన్న మెదడులా ప్రతి జ్ఞానబిందువును గ్రహిస్తుంది. ఇలా జీవితంలో మేల్కొన్న కణాలవల్ల ఒక వ్యక్తి మేధాశక్తి ఎన్నో రెట్లు పెరిగి అన్ని రకాల జ్ఞానాన్ని సులభంగా అర్థంచేసుకునేలా చేస్తుంది అది అంతా ఆధ్యాత్మికవిద్య ప్రభావం.
గ్రీకు రాజు అలెగ్జాండరు మూడు వంతుల ప్రపంచాన్ని జయించి, ఆసియా ఖండాన్ని జయించాలని బయలుదేరాడు. ఆయన సింధునది తీరాన స్థిరపడి, భారతదేశాన్ని జయించాలని అనుకున్నాడు. అదే తీరాన ఒక సన్న్యాసి ఉండేవాడు. అలెగ్జాండరు అతని సైన్యం ఆ తీరం వెంబడి వెళ్ళేటప్పుడు ఆ సన్న్యాసి ధ్యానంలో ఉండి రాజు వచ్చినప్పుడు నిలబడి నమస్కరించలేదు. అలెగ్జాండరు అవమానంతో “నీకు ఎంత ధైర్యం నాకు నమస్కరించాలని తెలియదా?” అని అరచి, సన్యాసి తల నరకాలని కత్తి తీసాడు.
సన్న్యాసి రాజుకేసి చూసి నవ్వాడు. అలెగ్జాండరు ఆశ్చర్యంతో “నేను నిన్ను చంపబోతుంటే ఎలా నవ్వుతున్నావు?” అన్నాడు. అందుకు సన్న్యాసి “నీవు ఎవరిని చంపాలనుకుంటున్నావు? నేను చంపబడను. నేను శాశ్వతం, నాశనం చేయబడను. ఆయుధాలు నన్ను ఏమీ చేయలేవు. అగ్ని నన్ను దహించదు. నీరు నన్ను తడపలేదు. ఈ ఆత్మను గాలి ఎండించలేదు” అని భగవద్గీతలోని విషయాన్ని తెలియజేసాడు. అలెగ్జాండరు తన కత్తిని జారవిడిచి, సన్న్యాసికి నమస్కరించి ఇలా అన్నాడు. “భారతదేశంలో మహాపురుషులు ఉన్నారు. వారు చావుకి భయపడరు. అలాంటి గొప్ప దేశానికి ఇదే నా ప్రణామాలు” అని భారతదేశం నుండి తిరిగి వెళ్ళిపోయాడు.
భగవద్గీత మహాభారతంలో భగవానుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 700 శ్లోకాల సంపుటి. పూర్వకాలంలో విశ్వవిద్యాలయాల శిక్షణ వల్ల ఒక వ్యక్తి అత్యంతశ్రేష్ఠమైన జ్ఞానాన్ని పొంది. మనోవికాసం కలిగి తమ అమాయకత్వాన్ని నిలుపుకునేవారు. ప్రతీ విద్యార్థి ఋషిలాగా మంచి గుణగణాలను అలవరచుకునేవాడు. ఋషికి బయటి ప్రపంచజ్ఞానం కలిగి అంతరంగంగా అత్యంత అమాయకత్వంతో ఉండగలడు.
బుద్ధుడు ‘ధమ్మపదం’ అనే తన బోధనలలో ఇలా చెప్పాడు, భగవంతుడు కూడా ఋషి అంటే అసూయపడతాడు. ఎవరి ఇంద్రియాలు శిక్షణ పొందిన గుర్రాల వలె స్వాధీనంలో ఉంటాయో, ఎవరికి గర్వం ఉండదో, ఎవరు గర్వం నుండి విముక్తులౌతారో, భూదేవిలా సహనం కలిగి ఇంటి గడపలా నిలచి ఉంటారో, వారు బురద లేని స్వచ్ఛమైన సరస్సులా చావుబ్రతుకుల చక్రంలో పడకుండా ఉంటారు. జ్ఞానికి బాహ్యప్రపంచంలో ఏది చెయ్యడానికైనా అర్హత ఉంటుంది.
పురాతనమైన గురుకులపద్ధతిలో నేర్చుకోవడం వేరే విధంగా ఉండేది. సృజనాత్మకమైన తెలివి. లోతైన చేతనస్థితి నుండి పుట్టేది. వారు సూటిగా ఉనికినే సంబోధించేవారు. చేయడం, పొందడం అనేవి పూర్తిగా వేరే అర్థం కలిగి ఉండేవి.
ఒక చిన్న కథ : మందబుద్ధి గల ఒక అబ్బాయిని అతని తండ్రి తమ ఊరిలోని సంస్కృత పాఠశాలకి తీసుకొని వెళ్ళాడు. ఆ ఊరిలోని పిల్లలందరు. ఆ పాఠశలోనే చదువుకునే వారు. తండ్రి ఉపాధ్యాయునితో, “నా కొడుకు తెలివితక్కువవాడు. మా అబ్బాయిని చివర వరుసలో కూర్చోడానికి అనుమతి ఇవ్వండి. చదువుల తల్లి సరస్వతీ దేవి నివసించే ఈ వాతావరణంలో ఉంటాడు. మీరు జాలి కరుణ కలిగినవారని తెలుసు, మావాడికి మార్గం చూపించండి. అదృష్టం ఉంటే ఏదైనా నేర్చుకుంటాడు” అని వేడుకున్నాడు.
హైందవసంప్రదాయంలో సరస్వతీదేవి విద్యకు అధిదేవత. ఆ ఉపాధ్యాయుడు, ఆ పిల్లవాడిని పాఠశాలలో చేర్చుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆ అబ్బాయి ప్రతి రోజూ ఎవరూ రాక ముందే వెళ్ళి తరగతి తుడిచి, అలికి, ఉపాధ్యాయుని బల్ల సరిచేసి కుర్చీ వేసి తాను గది మూలకి వెళ్ళి పాఠం వినడానికి శ్రద్ధగా కూర్చునేవాడు. పాఠాల వల్ల ఆ అబ్బాయి ఏమైనా నేర్చుకుంటాడని ఎవరూ అనుకోలేదు.
ఒక రోజున అతడు నమ్రతతో ఉపాధ్యాయుని ఇలా అడిగాడు. “అయ్యా! మీరు నాకు ఎప్పుడు ఉపదేశిస్తారు? నేను ఎప్పుడు జ్ఞానాన్ని పొందుతాను?”
‘ఇదుగో, ఇప్పుడే అని ఉపాధ్యాయుడు ఆ అబ్బాయిని ఆపకుండా, ‘అహం బ్రహ్మాస్మి’ అని బిగ్గరగా కాని, తనలో కాని చెప్పమన్నాడు. ఆ అబ్బాయి, ఆ వాక్యాన్ని పట్టుదలగా, ఉత్సాహంగా అర్థం గురించి పట్టించుకోకుండా, నేర్చుకున్నాడు. ఉపాధ్యాయుడు కూడా అతనికి ఆ వాక్యార్థాన్ని బోధించలేదు. ఆయనకది అవసరమనిపించలేదు.
ఆ విద్యార్థి ఇంటిలో ‘అహం బ్రహ్మాస్మి’ అని వల్లె వేయడం మొదలు పెట్టాడు. “నీకు ఆ వాక్యం అర్థం తెలుసా?”అని తండ్రి కుమారుని అడిగాడు, ఆ పిల్లవాడు కళ్ళు పెద్దవి చేసి తండ్రికేసి చూస్తూ “ఆ మాటలకి అర్థం ఉంటుందా?” అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసాడు. తండ్రి ఇలా చెప్పాడు. ‘నేను అది’ అన్నది దాని అర్థం. ఆ పిల్లవాడు బాబాయి ఇంటికి వెళ్ళి ‘అహం బ్రహ్మాస్మి’ అంటే మా నాన్న పరమాత్మ అని చెప్పాడు. దానికి అతడి బాబాయి “ఆ వాక్యానికి అది కాదు’ అర్థం ‘నేను బ్రహ్మను’ అని చెప్పాడు. ఆ పిల్లవాడికి ఆశ్చర్యం కలిగింది. కానీ ఏమీ మాట్లాడలేదు. ఇంటికెళ్ళే దారిలో ‘అహం బ్రహ్మాస్మి’ అంటే బాబాయి పరమాత్మ అని అర్థం అనుకున్నాడు. అదే దారిలో వెళ్తున్న ఆ ఊరి పెద్ద ఆ పిల్లవాడి మాటలు విని ‘బాబూ! ఆ మాటలకి మీ బాబాయి పరమాత్మ అని అర్థం కాదు ‘నేను బ్రహ్మను’ అని అర్థం చెప్పాడు. ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. ఒక పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయా? నాన్న, బాబాయి, ఊరి పెద్ద పరమాత్మలు. అతడి తల తిరిగినట్లనిపించి, ఒక పెద్ద రాతి మీద కూర్చున్నాడు. ఆ పదాల అర్థం తెలుసుకుందామని ఆ రెండు పదాలను చాలా సార్లు వల్లె వేయటం మొదలు పెట్టాడు.
సూర్యాస్తమయం అయింది. చీకటి పడింది. చంద్రోదయమైంది. ఆ పిల్లవాడు వాటి అసలు అర్థం తెలుసుకోవడానికి ‘అహం బ్రహ్మాస్మి’ అని అంటూనే ఉన్నాడు. తెల్లవారే సరికి, తను కూడా, తండ్రి, బాబాయి, ఊరి పెద్దలా, పరమాత్మనేనని తెలుసుకున్నాడు. ‘ప్రతి మనిషి పరమాత్మే’ అని తెలుసుకున్నాడు. ఈ విధంగా ఆ పిల్లవాడికి జ్ఞానోదయమైంది. అర్థం చేసుకోండి. ఏక్షణాన ఆ అబ్బాయికి ఏమీ తెలియదని అర్థమైందో, అతనిలో మార్పు మొదలైంది. అజ్ఞానం అమాయకత్వంతో వెతుకుతుంది. మీకు ఎప్పుడైతే తెలియదు అని తెలియదో అదే అజ్ఞానం. మీకు తెలియదు అని తెలిస్తే అది అమాయకత్వం. అప్పుడు మీలో తెలియడం ఆరంభమౌతుంది. తెలుసుకొనేటప్పుడు జ్ఞానాన్ని సరిచూసుకోవాలి. తెలుసుకోవడానికి, జ్ఞానానికి తేడా ఉంది. తెలుసుకోవడం అమాయకత్వం. తెలుసుకోవడం మీరు అర్థంచేసుకున్న అసలైన అనుభవం. అప్పు తెచ్చుకున్నది జ్ఞానం. అది మీరు అనుభవించనిది. మీది కానిది. అది మీలో కొన్ని మాటల సంపుటి మాత్రమే.
ఒక వ్యక్తి ఏదో ఒకటి చదువుకుంటూ సంతోషపడగలడు. కేవలం చదవడం వల్ల వినోదం కలుగుతుంది. కాని జ్ఞానోదయం కాదు. వినోదానికి, జ్ఞానోదయానికి తేడా ఉంది. కొన్ని మంచి పుస్తకాలు చదివి ఆనందించటం, జ్ఞానోదయం పొందటం కాదు. అర్థం చేసుకోండి. ఏ పుస్తకాలు మీ తర్కానికి పదును పెడతాయో అవి మీకు తెలుసు అన్న భావన కలిగిస్తాయి. అప్పుడు మొదలవుతుంది అసలు సమస్య. ప్రతి పని ఒక లోతైన అనుభవం కలిగేట్టు చేయండి. అప్పుడు మీరు ఒక నిరాడంబరమైన వ్యక్తి, నిరాడంబరత్వం మిమ్మల్ని తేలిక చేసి ఇంకా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. అది కేవలం అమాయకత్వానికి తోడ్పడుతుంది.
అమాయకత్వం దేన్ని గ్రహిస్తుందో, దాన్ని వ్యక్తం చేయలేదు. ఎందుకంటే అది మాటల కందని భావం. కాని ఆ భావం కళ్ళలో కనిపిస్తుంది. కళ్ళు ఆత్మకి కిటికీలు. అందుకే మీరు జ్ఞానుల కళ్ళల్లోకి చూసినప్పుడు ఒక మహాసముద్రాన్ని చూసినట్టు అనిపిస్తుంది. వారి కళ్ళు కాంతిని ప్రసరిస్తాయి. అది బంధించబడదు. పాదాన్ని చెప్పుపై నుండి ఎలా గోకలేమో అలా వారి కంటి తేజస్సును వివరించలేం.
అర్థం చేసుకోండి; అమాయకత్వం పోయినందుకు ఆధునికతను నిందించలేం. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. నేను కాలస్వరూపుడను. శ్రీకృష్ణుని మాటల్ని బట్టి ఆధునికత కూడ దివ్యమైన సృష్టి ఆటలో ఒక భాగమే, మనిషి ఆధునికతని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాలి. దాన్ని పూర్తిగా అనాది నుండి వచ్చే పద్ధతుల బదులుగా అలవరచుకోకూడదు.
అమాయకత్వంతో ఉండండి
మీరు అమాయకత్వంతో ఉన్నప్పుడు ప్రకృతి ఏం నేర్పాలన్నా చైతన్యస్థితితో ఉంటారు. మీరు ముడుచుకుపోతే మీ చుట్టూ ఒక గోడ ఉన్నట్టుగా ఉండి, తాజా గాలి లోనికి రాలేదు. అది మిమ్మల్ని తాకదు. అదే విధంగా మీరు బయటకు వెళ్ళి ఆ గాలిని తాకలేరు.
చైతన్యస్థితిలో ఉన్నప్పుడు గోడ కూలిపోయి చల్లని గాలి లోనికి ప్రవేశించి మీలో ఉన్న మిమ్మల్ని తాకుతూ చైతన్యస్థితి ప్రతిదీ మిమ్మల్ని తాకేలా చేస్తుంది. మీరు చైతన్యస్థితిలో ఉన్నప్పుడు విశ్వచేతన మీ దగ్గరకి వస్తుంది. చేతన్యస్థితిలో ఉండడం లోపం కాదు. మీ చుట్టూ ఉన్న గోడని పగలగొట్టినప్పుడు మీకు ఏ ప్రమాదంరాదు. ఆ గోడను భయం చేత కట్టుకున్నారు. మీ నిజతత్వమే చైతన్యంలో ఉండటం. మీ చేతనస్థితిని విశ్వానికి తెలియజేయడానికి భయపడతారు. మీ లోతైన మనసులో మీకు తెలుసు ఈ విషయం మీరు చేతనస్థితిలో ఉంటే పూర్తిగా అమాయకత్వంలో ఉండిపోతారు. అందుకే మీ అంతరంగ తలుపులను మూసివేస్తారు. కాని అదే గాలి ప్రవహించడం వల్ల ఉక్కిరిబిక్కిరవుతారు. అవే ఆలోచనలు, అవే పద్ధతులు మనసులో మెదులుతూ ఉంటాయి. అలాంటప్పుడు గోడ అవసరమేమిటి. ఆ గోడ పగలగొట్టినప్పుడు మిమ్మల్ని ఏదీ వదిలిపెట్టిపోదు. ఒక నూతనమైన జీవితాన్ని పొందుతారని తెలుసుకుంటారు.
ఒక సాయంత్రం ఇద్దరు జ్యోతిష్కులు కలిసారు. ఒక జ్యోతిష్కుడు ఇలా అన్నాడు. ఎంత అందమైన సాయంకాలం. నేను ఎప్పుడూ చూడలేదని. ఇంకొక జ్యోతిష్కుడు ఇలా సమాధానం చెప్పాడు. నిజమే నాకు 2070 నాటి సాయంత్రం గుర్తుకు వచ్చింది.
మీరు చేతనస్థితిలో ఉంటే మీ ఉనికి ప్రతీదాన్నీ అనుభవిస్తుంది. లేకపోతే అది మేధ కలిగించిన అనుభవం అవుతుంది. ఉనికి ఒక కవిత్వం. మేధ సాహిత్యం. కవిత్వమే జీవితం.
ఒక రాత్రి భార్య తన భర్త ఊయల దగ్గర నిలబడి తమ పాపను చూడడం గమనించింది. అతని ముఖంలో అనేకభావాలు కనిపించాయి. అపనమ్మకం, ఆశ్చర్యం, అనుమానం, వినయం, ఇంకా ఎన్నో ఇతర భావాలు. భార్య నెమ్మదిగా భర్త దగ్గరకు వెళ్ళి భుజం మీద ప్రేమగా చేయి వేసి 'మీ ఆలోచనలకు నా జోహార్లు' అంది.
భర్త ఇలా అన్నాడు ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. కేవలం 45 రూపాయలకే ఈ ఊయలను ఎవరు తయారుచేసారో.
కాబట్టి మీ మెదడుతో మీరు చేతనస్థితిలో ఉండలేరు. మీరు చేతనలో లేనప్పుడు మీరు మీ ఇంటి పెద్ద గోడ వెనుక కూర్చుని ఉన్నారన్నమాట. జీవితం ఇంకా మొదలవలేదు. జీవితం చేతనస్థితిలోనే ప్రారంభమౌతుంది.
చేతనస్థితిలో ఉంటే మీరు సత్యం వైపు వేరే మార్గంలో వెళ్ళగలరు. అది ఆనందమైన మార్గం. ఎందుకంటే మీరు ప్రకృతి నుండి సూటిగా గ్రహిస్తున్నారు. మీరు చేతనను గ్రహించే స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రకృతి మీకు ఇవ్వగలుగుతుంది. ప్రకృతికి సొంత నియమాలు ఉన్నాయి. జ్ఞానోదయమైన గురువులకు వారి సొంత నీతిసూత్రాలు ఉంటాయి. చేతనలో ఉంటే వాటిజల్లు మీ మీద కురుస్తుంది. మీ చుట్టూ గోడ ఉంటే అది కష్టం. వారి నీతి సూత్రాలకు లోపలకు జొచ్చుకుపోయే అనుమతి లేదు. అందుకే గోడ పగిలేంత వరకు ఎదురుచూస్తారు.
మీరు చేతనలో ఉంటే ప్రకృతికి 'ఔను' అని చెప్పనట్టు. ప్రకృతి ఒక గొప్ప అద్భుతం. మనకు బోధించే శాశ్వతమైన గురువు. మీరు ప్రకృతికి 'ఔను' అని అంటే మీ శక్తి ఒక కొత్త దిశలో ప్రయాణిస్తుంది. తల నుండి హృదయం వైపు మీరా ప్రకృతి నుండి బోధనలు స్వీకరిస్తారు. మీరు ముందు చెప్పిన 'కాదు' అని చెప్పినవన్నీ 'అవును' గా మారతాయి. అప్పుడు ప్రపంచం, మీ ఆలోచనలో ఉన్నట్టు కాకుండా కొత్తగా కనిపిస్తుంది.
ఒకసారి మీరు అవును అని చెప్పడం మొదలుపెడితే మీరు ప్రేమను తెలియజేస్తారు. అదే మీ హృదయభాష. తర్కంతో ప్రేమని తెలుసుకోలేం. ప్రేమను ఇంకొకరితో 'అవును' అనడంలో తెలుసుకుంటాం. ఇంకొకరిని ఉపయోగించుకోవడానికి కాకుండా కేవలం ప్రేమకోసం ఆహ్వానించడం వల్లనే సాధ్యమౌతుంది. అది వారి మీద ఉన్న గాఢమైన నమ్మకం వల్ల తెలుస్తుంది. మీరు చేతనలో ఉంటే మీకు ఇతరుల మీద గొప్ప నమ్మకం ఉంటుంది.
చాలామంది నన్ను అడుగుతుంటారు, మీ సమక్షంలో మేము ఎలా ఉండాలి అని. మీరు అమాయకత్వంలో పూర్తి చేతనస్థితిలో ఉండండి. మీరు చేతనస్థితిలో ఉంటే మీ ఉనికి నేరుగా సత్యాన్ని గ్రహిస్తుంది. గురువు సృష్టికి స్వచ్ఛమైన ప్రతిరూపం. ఆయనకు అనుమతిస్తే ప్రకృతిని మీలో ప్రవేశించడానికి అనుమతించినట్లు. ప్రకృతి ప్రవేశించినప్పుడు మీ ఉనికిలో సత్యం ముద్రితమవుతుంది. గురుదేవుల దర్శనంతో ఆ ముద్ర గాఢమౌతుంది. గురువు బోధనల కన్నా ఈ ముద్రే గొప్పది.
బుద్ధుడి శిష్యుడు ఒకసారి ఇలా అన్నాడు. గురుదేవా, ఈ ప్రపంచం శాశ్వతమా! కాదా! అది పరిమితమా! అనంతమా! ఆత్మ శరీరం ఒకటా! వేరా! అన్న మా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేదు.
బుద్ధుడు అతడి వంక చూసి ఇలా అన్నాడు, నేను ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తానని మీకు ప్రమాణం చేశానా? శిష్యుడు 'లేదు' అన్నాడు. అప్పుడు మళ్ళీ ఇలా అన్నాడు. 'గుండెలో బాణం గుచ్చుకున్న ఒక మనిషి ఉన్నాడనుకో, అతని గుండెలో నుంచి బాణం బయటకు తీయబోతున్నప్పుడు అతడు నిన్ను ఆగమని నా మీద బాణం వేసిన మనిషి కులం, అతని ఎత్తు, బరువు, అతని కుటుంబ వివరాలు, అతను ఎక్కడి నుండి వచ్చాడు, ఆ బాణం ఏ రకమైన కఱ్ఱతో చేశారని చెప్పే వరకు, నిన్ను ఆ బాణం తీయడానికి ఒప్పుకోకపోతే, ఆ వ్యక్తి గురించి నువ్వు ఏమనుకుంటావు?'
శిష్యుడు సిగ్గుతో ఇలా అన్నాడు. 'గురువుగారూ! అతడు ఒక మూర్ఖుడు. అతడు అడిగే ప్రశ్నలకి, ఆ బాణానికి ఏమిటి సంబంధం? సమాధానాలు తెలుసుకునే లోపల అతను చనిపోతాడు'.
బుద్ధుడు అన్నాడు, నీవు చెప్పింది నిజం. అలాగే నేను కూడా ప్రపంచం శాశ్వతమా, అది పరిమితమైనదా లేక అనంతమా, శరీరం ఆత్మ ఒకటేనా వేరా అనే వాటి గురించి బోధించను. ఆ బాణాన్ని వెంటనే తీసేయి అని చెప్తాను. ఎందుచేతనంటే నీ బాధకి కారణం అదే అజ్ఞానం. అర్థం చేసుకోండి, ఒక గురువు మీకు ఆధ్యాత్మికత బోధించలేరు. కాని మీరు చైతన్యంతో ఆయన మీద నమ్మకం ఉంచితే నేర్చుకోగలరు. ఆధ్యాత్మికతకి మాటల అవసరంలేదు, అది ఒక అనుభవం. అది మీరు గురుదేవుల శరీరకభాషని చూసి నేర్చుకోవాలి. జ్ఞానోదయకాంతిని చూసి దాన్ని పట్టుకోవచ్చు.
మీరు ఓర్పు లేకుండా ప్రశ్నిస్తుంటే, ఆ ప్రశ్నలే మీరు సత్యాన్ని గ్రహించడానికి అడ్డుపడతాయి. మీరు ఓర్పుతో జ్ఞానోదయ పరిమళాన్ని పట్టుకుంటే ఆ ప్రశ్నలు కరిగిపోతాయి. ప్రశ్నలు ఉదయించక ముందే సమాధానాలు దొరుకుతాయి. అది గురుదేవులతో ఉండడం వల్ల కలిగే గొప్ప అనుభవం. అందుకే జ్ఞానులు అప్పుడప్పుడు భూమి మీద కొంత మంది శిష్యులైనా జ్ఞానోదయం పొందుతారేమో అనే ఆశతో అవతారపురుషులుగా వస్తారు.
మీరు చైతన్యస్థితిలో ఉన్నప్పుడు ప్రతిక్రియ వ్యవస్థ వికసిస్తుంది. విశ్వం తాలూకు వివేకం మీ ద్వారా పని చేసేందుకు అవకాశం కలుగుతుంది.
ఒక చిన్న కథ : నది ఒడ్డున ఒక రైతుకు కొంత స్థలం ఉంది. ఆ స్థలంలో ఒక ఋషి నివసించేవాడు. ఆ గ్రామ పెద్దకు ఆ ఋషి అంటే ఇష్టం లేక ఆ స్థలాన్ని కొనాలనుకున్నాడు. గ్రామ పెద్ద ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారైతు అది అమ్మడానికి ఒప్పుకోలేదు. రైతు ఆ గ్రామ పెద్దతో ఇలా అన్నాడు. నేను ఆ స్థలాన్ని అమ్మితే వెంటనే ఆ ఋషిని అక్కడి నుంచి తరిమివేస్తావు. దానికి గ్రామ పెద్ద కోపంగా నువ్వు అతణ్ణి ఋషి అని ఎలా చెప్తావు? కాషాయరంగు బట్టలు వేసుకుంటే చాలా! అతను కూడా నీలాగా, నాలాగా ఒక మామూలు మనిషి అంటాడు.
రైతు ఇలా అన్నాడు, ఆయనలో ఋషి లక్షణాలు చూసాను. ఉదాహరణకి అతనికి కోపం రాదు. అందుకు గ్రామ పెద్ద, నీవు ఎలా చెప్పగలవు? అతనికి కోపం వచ్చే సందర్భం రాలేదేమో. రేపు ఆయన కుటీరం దగ్గరికి రా. ఆయనకు కోపం ఎలా వస్తుందో చూపిస్తాను అన్నాడు.
మర్నాడు ప్రొద్దున రైతు ఆ ఋషి కుటీరం దగ్గరకి వెళ్ళి గమనించసాగాడు. గ్రామ పెద్ద పంపించిన ఒక అబ్బాయి కుటీరం దగ్గరకి వచ్చాడు. ఆ ఋషి తల వంచుకొని ఏదో రాసుకుంటున్నాడు. ఆ అబ్బాయి ఆయన వెనుకకు వెళ్ళి ఆయన మీద ఉమ్మేస్తాడు. అది ఆ అబ్బాయి చేసిన పని అని తెలుసుకొని ఋషి లేచి వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. ఆ అబ్బాయి మళ్ళీ ఉమ్మేసాడు ఋషి మరొకసారి నదిలో మునిగి వచ్చి కూర్చున్నాడు. రైతు అదిచూసి భరించలేకపోయాడు. ఆ గ్రామ పెద్ద ఒక చెట్టు వెనక నుండి ఇదంతా చూస్తున్నాడు. అతడు ఆ ఋషి శాంతస్వభావాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఋషి నదిలో మునిగి వచ్చిన వెంటనే ఆ అబ్బాయి ఆయన మీద ఉమ్మేవాడు. ఇలా చేసినా ప్రతిసారీ ఋషి ఆ అబ్బాయిని chasi chirunavvu navvi, velli nadilō munigi vachyēvādu. Ilā 107 sārlu ummādu. Dānitō ā abbāyi mukham kala tappindi. Ika atani valla kālēdu. Ventanē velli ఋshi kālla mīda padi edavasāgādu. ‘Nannu kshaminchandi. Nēnu pāpam chēsānu. Nēnu mimmulni bādhapettānu. Ilā chēyadāniki nāku dabbu ichchāru. Mīru shapistāru. Nāku bhayangā undi’ ani ā abbāyi annādu.
Ā ఋshi shāntangā ilā annādu. ‘Ayitē nuvvu nā mīda ika ummēyavā?’ Ā abbāyi ilā samādhānamichchādu, ‘Mī mīda ummadam kantē chāvadam mēlu.’ Appudu ఋshi ā abbāyini lēvadīsi ‘nēnu nīkō rahasyam cheptānu. Nēnu nīku krutajñatalu cheppukōvāli. Endukantē chālā kālam krītam nēnu ī pavitramaina nadilō 108 sārlu munugutānani mokkukunnānu. Ī nātitō adi tīrindi. Nā mokku chellinchadāniki inkokasāri munigi rāvāli. Ī sāri nī gurinchi prārthistānu’ ani antādu.
ఋshi inkokasāri munigivachyāka ā grāma pedda atani kālla mīda padi kshaminchamani vēdukunnādu. ‘Asalu pāpini nēnu. Chinna abbāyiki dabbichchi nēnē alā chēyamani cheppānu. Nēnu mīku kōpam vastundani nirūpinchālanukunnānu’ ani annādu. ఋshi navvi ilā annādu ‘Ā abbāyi adi nāku mundugā cheppi untē nēnu tvaragā kōpam techchkuni ataniki bahūmati vachyēlā chēsēvādini’ annādu. Apputi nundi ā grāma pedda ataniki shishyudainādu.
ఋshi chēsina pani anukūlangā unnadi. Āyana vikāsantō undadam valla vishwashakti atani mokku tīrēttugā sahāyam chēsindi. Nēnu mimmulni ummēyunchōmani cheppalēdu. Prati panī vikāsantō undadamanēdi enta mukhyamō ardham chēsukōndi. Mīru vikāsantō unnappudu mīlō ā kshanamlō entō manchi jaragadāniki avakāsham istāru. Mī prati panitō mī vyavasthalō mārupu vachchi mī jīvanashaili mārutundi.
Oka Jain kadha : Bauddhaguruvulu vāri shishyulaki ē vidhangā vyaktaparachālō annadi mātramē nērputāru. Oka bauddhārāmamlōni oka shishyudu udayam kūralu konadāniki vellinappudu prati udayam maroka bauddhārāmamlōni shishyunnī kalisēvādu.
Okarōju mudati shishyudu rendava vānni nuvvu ekkadiki velturnāvu? Ani adigādu dāniki rendava shishyudu ‘Nā kālku ekkadiki tīsukelitē akkadiki’ ani samādhāna michchādu. Ī samādhānam mudati shishyudini tikamaka pettindi. Tana guruvugārini dāni ardham ēmitani adigādu. Ā guruva rēpu atadini kalisinapudu adē prashna adugu. Atadu nīku adē samādhāna mistādu. Appudu ‘nīku kālku lēkapōtē ekkadiki veltāvu’ ani mullī adugu. అతనికి బుద్ధి వస్తుంది' అని చెప్పాడు. మర్నాడు మళ్ళీ మొదటి శిష్యుడు అదే ప్రశ్న అడిగాడు. దానికి రెండవ శిష్యుడు ఇలా సమాధాన మిచ్చాడు. 'గాలి ఎటు వీస్తే అటు వెళ్తాను'. మొదటి శిష్యుడు మళ్ళీ వెళ్ళి తన గురువుగారి సహాయం అడిగాడు. 'నువ్వు రేపు అతడిని కలిసినప్పుడు గాలి లేకపోతే ఎక్కడికి వెళ్తావు అని అడుగు' అని గురువు చెప్పారు. మర్నాడు మొదటి శిష్యుడు రెండవ వాణ్ణి 'నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?' అని అడిగాడు. రెండవ శిష్యుడు 'నేను కూరలు కొనడానికి మార్కెట్‌కి వెళ్తున్నాను' అని సమాధాన మిచ్చాడు.
చైతన్యంతో వ్యక్తపరచాలంటే ఒక పక్షిలా స్వేచ్ఛగా ఉండడమే. భూతభవిష్యత్తుల గురించి విచారించకుండా ఆ క్షణంలో ఉండడం. అదే బౌద్ధగురువులు వారి శిష్యులకి నేర్పేవారు.
నమ్మకంతో లొంగిపోండి
అపారమైన నమ్మకం అధీనానికి దారి చూపిస్తుంది. అధీనమవడం అంటే హృదయనిరాడంబరతే. మీరు అంతిమసత్యాన్ని గురించి నిర్ణయించుకోకుండా దాంతో పాటు ఉండటం అని తెలుసుకోవటం. మీరు సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు అధీనమవుతారు.
మీ పెంపుడు కుక్కను మీరు మోసం చేసినా మళ్ళీ మీ దగ్గరకు నమ్మకంతో వస్తుంది. ఆ పెంపుడు జంతువు విశ్వాసంలో అమాయకత్వంతో ఉంటుంది. దాని విశ్వాసానికి కారణం అనేది ఉండదు. ఆ కుక్క మిమ్మల్ని ఏమీ ప్రశ్నించదు. దానికి మీరు సమాధానం చెప్పక్కర్లేదు. దానికి ఎందులోనూ ఉపయోగం కనిపించదు. అది ఒక తెరిచివున్న పుస్తకం లాంటిది.
రెండు బంగారు రంగు చేప పిల్లలు ఒక నీళ్ళ కుండీలో ఉన్నాయి. మొదటిది రెండవదాన్ని 'నీకు భగవంతుడంటే నమ్మకం ఉందా?' అని అడిగింది. రెండవది 'ఎందుకు లేదు? రోజూ మన కుండీలో నీటిని ఎవరు మారుస్తున్నారు?' అని సమాధానమిచ్చింది.
అమాయకత్వమే నమ్మకానికి, అధీనానికి పునాది. జ్ఞానం ప్రతిదీ మనకు ఉపయోగమా, కాదా - అని ఆలోచిస్తుంది. ప్రతి దాంట్లో కారణం వెతుకుతుంది. అధీనమవటం కారణం పరస్పరం భిన్నమైనవి. అధీనమవటం నమ్మకంతో ఉంటుంది. కేవలం అమాయకత్వంతో అధీనం కావచ్చు. ఎందుకంటే అమాయకత్వం వల్ల నమ్మకం కలుగుతుంది.
నమ్మకంలో అంగీకారం పుడుతుంది. అంగీకారం అంటే మనం జీవించే పరిస్థితులు, మనుషుల్ని అంగీకరించమని అర్థం కాదు. అంగీకారం అంటే జీవితాన్ని సృష్టి ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతిలా ఆహ్వానించడం. ప్రతి మనిషి లేదా ప్రతి పరిస్థితి, తాజాగా జరిగేది. దాన్ని లోతుగా అంగీకరించడమే అధీనమవటం అంటే. మనిషిని పరిస్థితుల్ని నేరుగా చేపట్టాలి. అప్రయత్న అంగీకారమే అధీనమవటం అంటే. మనల్ని రక్షించే ప్రకృతి పట్ల మనకు గల గాఢమైన నమ్రతే అంగీకారం. అది మళ్ళీ ప్రకృతిని 'ఔను' అనడమే. మీరు 'ఔను' అంటే అంతటా వ్యాపించిన విశ్వాన్ని నడిపించే జీవశక్తిని సమ్మతించినట్లు. అదే 'అధీనమవటం' అవుతుంది. అధీనంతో గాఢమైన విశ్రాంతిని పొందగలరు. అధీనం కావడం వల్ల వివేకం పుడుతుంది. ఆ శక్తే వివేకం. నమ్మకమంటే పని లేకుండా ఉండడం కాదు, జ్ఞానంతో కాకుండా పూర్తి వివేకంతో చేసే పనే 'నమ్మకం' అవుతుంది.
ఒక సూఫీ మతగురువు గుడారం దగ్గరకి ఒక వ్యక్తి ఒంటె మీద వచ్చాడు. అతడు ఒంటె దిగి గుడారం లోపలికి వెళ్ళి, గురువుగారికి నమస్కరించి 'గురువుగారూ! నాకు భగవంతుడంటే చాలా నమ్మకం. భగవంతుడు తనని ప్రేమించేవారిని ఎప్పుడూ రక్షిస్తాడు. అందుకే నా ఒంటెను కట్టేయకుండా బయట వదిలివచ్చాను' అని అన్నాడు.
గురువుగారు అతన్ని మందలించి 'ఓ మూర్ఖుడా! వెంటనే వెళ్ళి ఒంటెను కట్టేయి. నీవు చేయగలిగే పనిని భగవంతుడు పట్టించుకోడు' అని చెప్పాడు.
నమ్మకం అనేది ఒక వైఖరి, అది తగిన చర్యకు బదులు కాదు. నమ్మకం అనేది జీవితసారం అని గ్రహించండి. నమ్మకంతో, అమాయకత్వంతో అధీనమవగలిగితే మీరు విశ్రాంతిని, పరమానందాన్ని పొందవచ్చు. మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఆ మార్గంలో వెళితే మీరు ఏమీ పోగొట్టుకోరు. అంతవరకు నమ్మకమనే మార్గంలోనే ఉంటారు.
గొప్ప జ్ఞానులందరూ నిరంతరం బ్రహ్మానందస్థితిలో ఉంటారు. వారు పూర్తి నమ్మకంతో సృష్టికి అధీనమయ్యారు కాబట్టి, బోలుగా ఉన్న వెదురు లోంచి గాలి ఏ విధంగా ప్రవహిస్తుందో అదే విధంగా వారిలో జీవశక్తి ప్రవహిస్తుంది. అందుకే జ్ఞానోదయమైనవారు తేజస్సుతో అందంగా ఉంటారు. జీవశక్తి ప్రవాహమైనప్పుడు వారు దైవత్వాన్ని వ్యక్తపరుస్తారు. వారి అనుగ్రహమే విశ్వకృప. వారే భూమి మీద అమాయకులుగా ఉంటారు.
యోగులకు సృష్టిలో ప్రతిదీ సాధ్యమే అని తెలుసు. వారు నమ్మకానికి జీవంతో ఉన్న ప్రతిరూపాలు. వారి బ్రహ్మానందం దాన్ని తెలియజేస్తుంది. వారికి ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా అందుబాటులో ఉన్నా అమాయకత్వంతోఉంటారు.
మనకి జ్ఞానం ఉంటుంది కాని సమస్య ఏమిటంటే మనకి తెలిసినదే సరైంది అని, మిగతా జ్ఞానమంతా తప్పు అని అనుకుంటాం. అర్థం చేసుకోండి, అంతిమజ్ఞానం అందరికీ ఒక్కటే. ఇంకేదైనా ఉంటే మనం అప్పు తెచ్చుకున్న భావం మాత్రమే. ఇది స్పష్టంగా తెలుసుకుంటే ప్రకృతికి అధీనమై, మనకు బరువైన జ్ఞానాన్ని వదిలేసి, అమాయకత్వాన్ని పొందుతాం. మనకు తెలియనిదాన్ని ఎలా తెలుసుకోవాలి? మనకు తెలియదని స్పష్టంగా తెలిస్తే చాలు. జ్ఞానానికి మూలమైన పరమాత్మ కొరకు ధ్యానం చేయండి. ఎప్పుడూ సృష్టికి అధీనమయ్యే భావంతో ధ్యానం చేయండి. సృష్టికి ఆధీనమవడానికి పట్టుదల చూపండి. మీ చుట్టూ అద్భుతాలు జరగటం చూస్తారు.
పురాణంలో, అవతారపురుషుడైన శ్రీరాముని భక్తుడు, హనుమంతుని గురించి ఒక కథ ఉంది. హనుమంతుణ్ణి ఒకసారి చాంద్రమానంలో అది ఏ రోజు అని అడిగితే 'నేను ఎల్లప్పుడూ రాముడినే తలుచుకుంటాను, ఈ నెలలో ఇవాళ ఏతిథి, ఏ నక్షత్రం అనేవి నాకు తెలియవు', అని సమాధానం చెప్పాడు.
మీరు సత్యమనే అద్భుతంలో స్థిరపడితే మీరు ఎంత అమాయకత్వంతో ఉంటారంటే మీకు జీవితం ఒక ధ్యానంలాగా, అద్భుతంగా అనిపిస్తుంది. హనుమంతుడు రామనామం జపిస్తూ ఒక ప్రయత్నంతో సముద్రాన్ని దాటి భారతదేశం నుండి లంకకు వెళ్ళాడు. శ్రీ రాముడు తన వానరసైన్యంతో సముద్రాన్ని దాటడానికి వారధి కట్టవలసి వచ్చింది. దీన్ని బట్టి పరమాత్మకి అమాయకత్వంతో ఆధీనమైతే కలిగేది అత్యంతశక్తి అని గ్రహించండి.
ఒక వ్యక్తి ఎప్పుడైతే దైవానికి ఆధీనమవుతాడో ప్రతిక్షణం అద్భుతాలు జరుగుతాయి. మానవులు ఎప్పుడూ అద్భుతాల కోసం ఎదురుచూస్తారు. ఆధీనంతో పెద్ద అద్భుతాలు జరుగుతాయి. భారతదేశంలో యోగీశ్వరుడైన షిరిడీ సాయి బాబా జీవితచరిత్రలో ఒక అద్భుతమైన కథ ఉంది.
ప్రతి రాత్రి సాయిబాబా మసీదులో దీపాలు వెలిగించేవారు. ఆయన మానవజాతిలో అజ్ఞానమనే చీకటిని తొలగించడానికి చిహ్నంగా దీపాలు వెలిగించేవారు. కానీ అందరూ ఆయనకు అలా చేయటం ఇష్టం కాబట్టి దీపాలు పెట్టేవారని అనుకునేవారు. బాబా నూనె వర్తకుల దగ్గర నుండి నూనె తెచ్చుకునేవారు, ఒకసారి నూనె వర్తకులంతా కలిసి ఉచితంగా బాబాకు నూనె ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. బాబాకి వారి నిర్ణయం తెలిసినా, తెలియనట్టు మర్నాడు నూనె కోసం వర్తకుల దగ్గరికి వెళ్లారు. వర్తకులు నూనె ఇవ్వమని అన్నారు. బాబా చిరునవ్వుతో మసీదుకి తిరిగి వెళ్ళిపోయారు. ఆ గ్రామప్రజలు, నూనె వర్తకులు కుతూహలంతో బాబా ఏం చేస్తారో చూద్దామని మసీదు చుట్టూ వచ్చి నిలబడ్డారు. బాబా ప్రమిదల్లో నీరు పోసి వత్తులు వెలిగించారు. అవి రోజూ కంటే ఎక్కువ కాంతితో వెలిగాయి. నూనె వర్తకులు ఆశ్చర్యపోయారు. వారు బాబాను క్షమించమని అడిగారు. సాయిబాబా వారిని క్షమించారు.
ఆధీనమవడం అంటే సృష్టి మీలో నుండి జరగడం. జ్ఞానోదయమైనవారు, ప్రకృతి తమతో ఆడుకోవడంలో ఆనందాన్ని పొందుతారు. ఒక చిన్న పిల్లవాడిలా అమాయకత్వంతో ఆనందిస్తారు. అందుకే వారిని చూస్తే మనకు కూడా ఆనందంగా ఉంటుంది.
మరో సంగతి - మీరు ఎప్పుడైతే నమ్మకంతో ఆధీనమై ఉంటారో, అప్పుడు మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు. అమాయకత్వంతో కూడిన నమ్మకం, మోసం నుండి రక్షిస్తుంది. అది ఆ విధమైన కాంతిని ప్రసరిస్తుంది. మా ఆశ్రమంలో అన్ని రకాలైన మనుషులు వచ్చి ఉంటారు. వారు ఆశ్రమంలో ప్రవేశించగానే వారిలో ఒక గాఢమైన నమ్మకం కలుగుతుంది. బయటి ప్రపంచం నుండి ఆధ్యాత్మికప్రపంచంలోకి ఆశ్రమవాసిగా అడుగుపెట్టాలనే నిర్ణయం, నమ్మకం వల్లనే అది కలుగుతుంది. వారు ఒకసారి ఆశ్రమంలో ప్రవేశించి ఇతరులతో అన్నీ పంచుకుంటూ నివసిస్తుంటే, వారిలో వింత నమ్మకం ఏర్పడుతుంది. అంటే వారు వేటికీ తాళాలు వెయ్యరు. వారు ఉండే గది అపరిచితవ్యక్తులతో నిండి ఉండవచ్చు, అయినా తాళం వెయ్యాలి అనుకోరు. వారి వస్తువు ఏదీ పోదు. పోయినా దాన్ని గురించి పట్టించుకోరు. అదే దానిలో ఉండే అందం.
హబీబ్ అజమీ అనే గొప్ప సూఫీ సన్యాసి ఉండేవాడు. అతడు ఒక రోజు ఒక నది ఒడ్డున తన కోటును వదిలేసి స్నానానికి వెళ్ళాడు. ఆ దారిలో వెళ్తున్న ఓ మనిషి ఆ కోటును చూసాడు. ఎవరు ఈ కోటును ఇంత నిర్లక్ష్యంగా వదిలివెళ్ళారనుకుంటూ, ఆ కోటు యజమాని వచ్చేంత వరకు అది పోకుండా చూద్దామని అక్కడే నిలుచున్నాడు. హబీబ్ తన కోటు కోసం వచ్చినప్పుడు ఆ వ్యక్తి అతనితో మీరు స్నానానికి వెళ్ళినప్పుడు ఈ కోటు ఎవరికి అప్పగించి వెళ్ళారు? దీన్ని ఎవరైనా పట్టుకుపోయేవారు కదా, అని అన్నాడు. దానికి హబీబ్ నేను నా కోటును భగవంతుడి రక్షణలో వదిలివెళ్ళాను. ఆయనే నిన్ను కాపలాదారుగా పంపించారు, అని అన్నాడు.
బాగా అర్థం చేసుకోవడం వల్ల నమ్మకం ఏర్పడితే, ఏదీ పోదు.
నేను నా శిష్యులకు ఎప్పుడూ నేను హిమాలయాల్లో ఆధ్యాత్మికత కోసం తిరిగినప్పుడూ కలిసిన బౌద్ధసన్యాసుల గురించి చెప్తాను. ఆ బౌద్ధసన్యాసులు అన్నీ వదులుకొని తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వచ్చారు. కాని అక్కడ వారు కమండలం కోసం పోట్లాడుకునేవారు. వస్తువు మారింది, కాని ‘నాది’ అనే భావన పోలేదు, అంతే. అర్థం చేసుకోండి, నమ్మకం ఏర్పడితే భౌతికమైనవన్నీ ప్రకృతికి చెందుతాయనే భావన కలుగుతుంది. స్వాధీనంలో ఉంచుకోవాలనే వైఖరిని వదిలేస్తాం. అది మనసుకు విశ్రాంతినిస్తుంది.
2004వ సం॥లో కొంతమందితో హిమాలయాలకు వెళ్ళాను. మీ జీవితంలో ఒకసారైనా హిమాలయాలకు వెళ్ళాలి. మేం ‘గోముఖ్’కి వెళ్ళాం. అక్కడే పవిత్రగంగానది పుట్టింది. ఆ మార్గం వెడల్పు కేవలం నాలుగు అడుగులే. పోనీ (చిన్న గుర్రం) మీద వెళ్ళాలి. రానుపోను 10 గం॥లు పడుతుంది. కాలు జారితే కింద ప్రవహిస్తున్న గంగానదిలో పడతారు. ‘గోముఖ్’ చేరగానే అక్కడ కొంత సమయం గడిపి అందరూ వెళ్ళిపోయారు. నేను కొంత మంది శిష్యులతో అక్కడే ఉండిపోయాను. కిందికి వెళ్ళేవారు సరిగ్గా చీకటి పడే సమయానికి బయలుదేరారు. నేను వారిని ప్రకృతే సంరక్షిస్తుందని, ఏమీ భయపడవద్దని చెప్పాను. చిమ్మచీకటిలో ఆ చిన్న గుర్రం వారిని కొండ దిగువకు తీసుకెళ్తున్నదో లేక తీన్నగా అగాధం వైపు వెళ్తున్నదో వారికి తెలియకుండా వారు కిందికి చేరుకున్నారు. ఆ మర్నాడు నేను వారి అనుభవం ఎలా ఉన్నది అని అడిగాను. వారిలో ఒకరు ఇలా అన్నారు, స్వామీజీ గుడ్డిగా నమ్మడం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఆ నమ్మకమైన క్షణాలను పొడిగిస్తే అదే జీవితసారం. అప్పుడు మీరు ఫలితాన్ని సృష్టికి వదిలేసి పని చేయవచ్చు.
హిమాలయపర్వతాలను చూస్తే చాలు నమ్మకం, అధీనమవటం మీలో మొలకెత్తుతాయి. పర్వతాలను చూస్తే సృష్టి మానవమేధ కంటే శక్తిమంతమైనదని మీకు తెలుస్తుంది. ఆ పర్వతాలు సులభంగా అంతు పట్టవు అన్న సత్యం తెలుసుకుంటే సంఘర్షణ ఉండదు. అప్పుడు మనసు పని చేయదు. అప్పుడు మీరు హిమాలయాల్లో తిరిగితే బ్రహ్మానందం గమ్యస్థానం కాదు, ఒక మార్గం అని తెలుసుకుంటారు. మీరు ఈ క్షణంలో ఉంటే మీరు అమాయకత్వంతో పూర్తి వికాసంతో ఉంటారు. ఎందుకంటే ఈ క్షణంలో మీ మనసు లేదు. మనసుకి గమనం ఉండాలి. అది భూత - భవిష్యకాలాల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ క్షణంలో భూతభవిష్యత్తులు లేవు. వర్తమానం ఒక్కటే ఉంది. అంతే.
నమ్మడం, అధీనమవడం, అంటే 'నేను' 'నాది' అనేవి వదులుకోవటం. 'అహం' అనేది 'నాది' తో మొదలై 'నేను' దగ్గరకి వెళుతుంది. నేను అనే గుర్తింపు రాక ముందే 'నాది' అనే భావం ఉంటుంది. చిన్న పిల్లవాడిని చూస్తే 'నేను' అనే భావం లేక ముందే 'నాది' అని పోట్లాడతాడు. మీరు ఆ పిల్లవాడి చేతిలో బొమ్మ లాగి చూడండి. దాన్ని వదలడు, ఆ బొమ్మ అతనిది. మీరు దాన్ని తీసుకోలేరు. ఆ పిల్లవాడు 'నేను' అనే ముందే 'నాది' అని అంటాడు. అధీనమవడం అంటే సృష్టితో కలిసిపోవటం, నేను నాది అనేవి లేక పోవడం. అధీనమవడం అంటే మనసుని, అహాన్ని చంపుకోవటం. మీరు సృష్టి ఒకటి కాదు అనే భావనే అహం. ఈ వేరు భావం వల్లనే నేను నాది అనేవి బలంగా కలుగుతాయి. నేను, నాది అనేవి బలంగా ఉండడం వల్ల వేరు అనే భావం కలుగుతుంది.
అర్థం చేసుకోండి; మనిషికి మనసే శత్రువు వ్యక్తి ప్రకృతితో ఏకీభవిస్తాడు. కానీ మనసు అడ్డుపడుతుంది. ఉనికికి తెలుసు కానీ మనసుకు అనుమానం. ఉనికి ఎప్పుడూ జెసంటుంది. మనసు కాదంటుంది. ఉనికి అమాయకంగా ఉంటుంది. మనసు జిత్తులమారి. జెసనడం మనసుకు మరణం లాంటిది. కాబట్టి ఎప్పుడూ కాదనే అంటుంది. దాన్ని ఒప్పించగా ఒప్పించగా జెసంటుంది. అలా వదిలేస్తే కాదనే అంటుంది.
మనసును ఎలా నిశ్శబ్దంగా ఉంచాలి అని మీరు అడుగుతారు. మనసుతో మనసుని నిశ్శబ్దంగా ఉంచలేరు. ఇది నేరస్థుడిని అధీనంలో ఉందమనడం లాంటిది. అది ఎన్నటికీ జరగదు. మనసనేది వాస్తవం కాదని మీరు తెలుసుకోవాలి. అది కేవలం కల్పితం. వాస్తవం కాని దాన్ని పట్టుకొని దాన్ని నిశ్శబ్దంగా ఉంచాలనుకుంటారు. మీలో జరుగుతున్నదాన్ని అవగాహన చేసుకుంటే, మీకు మనసు ఎక్కడ కాదని అంటుందో తెలుస్తుంది. అప్పుడు దాన్ని విశ్రాంతిగా ఉంచి మీ ఉనికి అంటున్న జెను అనేదాన్ని వినవచ్చు. అవగాహనతో ఉన్నప్పుడు నిరాకరించడాన్ని వదిలేస్తుంది. అవగాహన అనేది ఒక తాళం చెవి లాంటిది. అప్పుడు మీరు మీలోనికి వెళ్లి విశ్రాంతిని పొందుతారు.
అక్కడ నుండి అమాయకత్వం వ్యక్తమౌతుంది. అమాయకత్వం లేనిదే సన్నిహితత్వం రాదు. సన్నిహితత్వమే ప్రకృతి భాష. మనసుకు సన్నిహితత్వం తెలియదు. అది కేవలం ఉనికికే తెలుసు. సన్నిహితత్వంతోనే వికాసం ఉంటుంది. అప్పుడు దేన్నైనా చిత్తశుద్ధితో చెబుతారు. అప్పుడు మీరు చెప్పే మాటలు, చేసే పనుల్లో ప్రామాణికత ఉంటుంది. దాంతో మీరు ప్రసరింపచేసే శక్తి ఇతరుల్ని అమాయకత్వంతో నింపి వికాసం కలిగేలా ప్రేరణనిస్తుంది. అప్పుడు ప్రకృతి అందాన్ని అనుభవించగలరు.
ఆధ్యాత్మికత - అమాయకత్వంతో కూడిన గౌరవానికి మార్గం
ఒక ప్రసిద్ధమైన నానుడి ఉంది. నీవు కలత చెందితే ప్రార్థన చేయనట్టు. ప్రార్థన చేసినట్లయితే కలత చెందవు.
ఆధ్యాత్మికత అంటే కలతను ప్రకృతికి అధీనం చేసి స్వేచ్ఛగా ఉండడమే. ఆధ్యాత్మికత అనేది ఆధునికమానవునికి విశ్రాంతిని కలిగిస్తుంది. అది నిరూపితమైన విజ్ఞానం. ఈ నాటి విజ్ఞానప్రపంచంలో ఉనికి పిలుపును వెంటనే తెలుసుకోవాలి. ఆధ్యాత్మికతే దానికి మార్గం. విశ్వరహస్యాన్ని పవిత్రతను పూర్వస్థితికి తీసుకువస్తుంది. అది మనిషి ఈ భూమి మీద గొప్ప జీవి కాదని, ప్రకృతి శక్తే విశ్వమంతటా ఆవరించి ఉందని గుర్తు చేస్తుంది. అది మనసులో అమాయకత్వంతో అధీనమవడాన్ని తెలియజేస్తుంది.
ఆధ్యాత్మికత అంటే ఆచారం కాదు. అది ప్రకృతితో లీనమయ్యే విజ్ఞానం. అనాది కాలం నుండి ప్రపంచమతాలు దైవభక్తిని జీవితంలో ఒక భాగంగా చేశాయి. దేవాలయం అనేది విశ్వశక్తితో సంబంధం కలిగి ఉండి, విశ్రాంతినిచ్చే ఒక చక్కని ప్రదేశం. అన్ని ప్రపంచమతాల ఉద్దేశం కూడా ఇదే. విశ్వశక్తితో సంబంధం గాఢమైనప్పుడు ఒక వ్యక్తిలో బ్రహ్మానందస్థితి కలుగుతుంది. మతం అనేది ఆధ్యాత్మికతకు ఒక మెట్టు లాంటిది.
కొంతమంది పరిశోధకులు పరిశోధన చేసి తేల్చిన విషయమేమంటే, మనుషులే కాకుండా జంతువులు కూడా ఒక ప్రత్యేకస్థలంలోనే విశ్రాంతిని తీసుకుంటాయి. ఆ ప్రదేశంలో తినడం లాంటి యితర పనులు చేయవు. వాటికి పూజ, ప్రార్థన లాంటివి తెలియవు, కానీ అవి ఆ నిర్ణీతప్రదేశంలోనే విశ్రాంతిని తీసుకుంటాయి. ఆ ప్రదేశంలో ప్రకృతితో అనుబంధం ఏర్పరచుకొని ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవడానికే ఉద్దేశింపబడింది. మానవుడు తన వేగవంతమైన జీవితంలో విశ్రాంతి తీసుకోలేకపోవచ్చు కానీ, జంతువులు ఒక క్రమపద్ధతిలో విశ్రాంతి తీసుకుంటాయి. అవి ప్రకృతి ఆధీనంలో ఉండడం వల్ల వాటి కళ్ళలోకి చూస్తే గాఢమైన అమాయకత్వం.
మానవుడు తెలివి మీరి విజ్ఞానాన్నే అనుసరిస్తూ తాను కనుగొన్న కొత్త విషయాలను తన తెలివితేటలతో కనిపెట్టానని అనుకుంటాడు. ఆధ్యాత్మికత అనేది విశ్వరహస్యాన్ని జీవింపచేస్తుంది. జీవశక్తి అనేది మానవమేధ కంటే బలమైంది. ఆధ్యాత్మికత అనేది జీవశక్తి పట్ల గౌరవాన్ని, నమ్రతను కలిగిస్తుంది కాబట్టి, ఆధ్యాత్మికత అనేది అమాయకత్వ పూర్వస్థితిని కలిగిస్తుంది. విశ్వశక్తిని గౌరవించి మానవమేధనే శాంతింపచేయటమే మన తక్షణకర్తవ్యం. అప్పుడు మానవుడు అగాధమైన విశ్వాన్ని గురించి భయపడడు. గాఢమైన భక్తిప్రేమలతో విశ్వంతో అనుసంధానంలో ఉండి బ్రహ్మానందపారవశ్యాన్ని పొందుతాడు. భారతదేశమహర్షులు తమ ఆధ్యాత్మికత ద్వారా ఈ బ్రహ్మానందపారవశ్యాన్ని పొందారు.
ఒక చిన్న కథ : మురుగనార్ అనే శివభక్తుడు ఉండేవాడు. ప్రతి రోజు సూర్యోదయానికి ముందే నదిలో స్నానం చేసి చెట్లు, తీగల నుండి, పూలు కోసుకొని, శివునికి పూల మాలలల్లేవాడు. మాలలోని పూవులు నలగకుండా భద్రంగా ఆ మాలను, దేవాలయానికి నడిచి వెళ్ళి శివునికి సమర్పించేవాడు. పవిత్రమైన మంత్రాలను వల్లెవేస్తూ గంటలకొద్దీ ఆలయంలోనే గడిపేవాడు. అతడు అమాయకత్వంతో కూడిన భక్తితో జ్ఞానోదయాన్ని పొందాడని ప్రతీతి. ఆ విధంగా అమాయకమైన దైవభక్తితో జ్ఞానోదయం పొందిన శివయోగులైన 63 మంది నాయన్మార్లలో ఒకడుగా అతడు నేడు పూజలందుకుంటున్నాడు.
ఆధ్యాత్మికతలోని మాధుర్యం తెలియనివారు దాన్ని వదులుకుంటారు. గంభీరంగా ఉండటమే ఆధ్యాత్మికతగా భావిస్తారు. భగవంతుడు ఆనందస్వరూపుడైనప్పుడు ఆధ్యాత్మికత గంభీరత ఎలా అవుతుంది? మానవుడే ఆచారాలు ఏర్పాటు చేసి ఆధ్యాత్మికతను గంభీరంగా చేసాడు. మనం ఏ సమయాల్లో ప్రార్థిస్తే అంతరాత్మతో సంబంధం కలుగుతుందో కూడా మన గురువులు బోధించారు. తెల్లవారు జామున ప్రార్థించడం మంచిదని చెప్పారు. అప్పుడు మేధ విశ్రాంతిలో ఉంటుంది. ఆ సమయంలో గనక మనం ఆధ్యాత్మికతను సాధన చేస్తే మనసు మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనసు అమాయకంగా, తాజాగా ఉండడం వల్ల ఆధ్యాత్మికతతో అది ప్రభావితమౌతుంది. ఆధ్యాత్మికత అనేది మన అమాయకత్వాన్ని, నమ్మకాన్ని పూర్వస్థితికి తీసుకురావడానికి సరైన మార్గాన్ని కల్పిస్తుందని, మన గురువులు బోధించారు.
ఒక చిన్న కథ : ఒక రైతు సాయంకాలం బజారు నుండి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ప్రార్థన పుస్తకం తన దగ్గర లేదని గ్రహించాడు. బండి చక్రం అడవి మధ్యలో ఊడిపోవడం వల్ల ఆ నాటి ప్రార్థన చేయలేనేమో అనే బాధ కలిగింది. అప్పుడు అతడు భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాడు, ఓ దేవా! నేను ప్రార్థన పుస్తకాన్ని మరిచిపోయిన మూర్ఖుడిని. నాకు జ్ఞాపకశక్తి లేదు. ఒక ప్రార్థన కూడా గుర్తు రావడం లేదు. కాబట్టి అక్షరాలన్నింటినీ ఐదు సార్లు వల్లె వేస్తాను. నీకన్ని ప్రార్థనలూ తెలుసు గనుక నాకు గుర్తు రాని ప్రార్థనల్ని ఆ అక్షరాల నుండి సమకూర్చుకో, అని అక్షరాలని మననం చేసాడు. ఆ రోజు భగవంతుడు దేవతలతో ఇలా అన్నాడు, 'నేను విన్న ప్రార్థనలన్నింటిలో ఇతనిది అత్యుత్తమమైన ప్రార్థన, ఎందుకంటే అది నిజాయితీగా, హృదయం నుండి వెలువడిన సహజమైన ప్రార్థన గనుక.'
అమాయకత్వాన్ని పవిత్రంగా వ్యక్తీకరించేదే ఆధ్యాత్మికత అని గుర్తించాలి.
ఆధ్యాత్మికత స్వచ్ఛమైన అమాయకత్వాన్ని వ్యక్తపరచడానికి అవకాశమిస్తుంది. అమాయకత్వమే భగవంతునికి నివేదన, అమాయకత్వమే భగవంతునికి ఒక గొప్ప ప్రార్థన.
మతం అనేది అందరూ అనుకునేట్టు నమ్మకం కాదు. ప్రతిమతం ఆయా గురువుల ఆధ్యాత్మిక అనుభవాల సారాంశం. అదే అనుభూతిని మానవులందరూ పొందాలనే ఉద్దేశంతో ఆయా గురువులు తమ అనుభూతిని మతం రూపంలో అందించారు. ఇది అర్థమైతే మనిషి ఏ మతాన్నైనా అనుసరించవచ్చు. అదే మతాల్లో ఉండే అందం.
మీరు అమాయకత్వంతో గురుదేవుల అధీనంలో ఉండండి. అమాయకత్వంతో ఉంటే, గురుదేవుల నిశ్శబ్దం మీ అంతరంగంలోకి ప్రవేశిస్తుంది. నిశ్శబ్దం అనేది మతాలన్నింటిలోకీ గొప్పది. గొప్ప యోగీశ్వరుల మతం నిశ్శబ్దమే. అదే అసలైన ఆధ్యాత్మికత.
ఆధ్యాత్మికతను, అమాయకత్వంతో సాధన చేస్తే, అది మిమ్మల్ని పసిపిల్లలుగా ఉంచుతుంది. తంజావూరులోని వేదకాలం నాటి చిత్రాలను చూస్తే, వాటిలో ఆడ, మగ, ఋషుల, దేవతల ముఖాలన్నీ అమాయకంగా చిన్నగా కనిపిస్తాయి. మీరు మేధతో ఉంటే వార్ధక్యచిహ్నాలు తొందరగా వస్తాయి. మీరు హృదయంతో ఉంటే, ఎప్పుడూ నూతనంగా చిన్నగా కనిపిస్తారు.
ఆధ్యాత్మికతతో, మీ అంతరాత్మ నుంచి పరమాత్మపై గాఢమైన భక్తి కలుగుతుంది. అది వెల్లువలా పొంగి, మీ అవరోధాలన్నింటినీ తొలగించి, మిమ్మల్ని చేతనస్థితిలోకి తెచ్చి ప్రకృతిని మీలోకి ప్రవేశింపచేస్తుంది. మన పురాణాల్లో అత్యంతభక్తి గల భక్తుల కథలు చాలా ఉన్నాయి. ఆ భక్తులు వారి ప్రగాఢమైన భక్తి వల్ల ఎన్నో అద్భుతాలు చూసారు. అమాయకత్వంతో పూజ చేసేవారి భక్తి అంత గాఢంగా ఉంటుంది, పూజ అయిన తర్వాత కూడా వారు దైవధ్యానంలోనే ఉంటారు. ధ్యానం లేదా ప్రార్థన అనేది నమ్రతగా, అమాయకంగా కృతజ్ఞతాభావంతో విశ్వశక్తి పట్ల భక్తిని వ్యక్తపరచడం. దీనికి కారణాలనేవి ఉండవు.
సహజంగా ఉండండి
నేను సత్యకాముని కథను కొంత మందికి చెప్పినపుడు వారిలో ఒకరు ఇలా అన్నారు, స్వామీజీ ! మీరు చెప్పే పద్ధతులు ఆధ్యాత్మికంగా అత్యున్నతస్థితికి చేరినవారికి సరిపోతాయి. ఆ కథలో గురువు ఆశీర్వాదం వల్ల శిష్యుడికి జ్ఞానోదయమైంది. సత్యకాముడు ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితికి చేరిన వ్యక్తి.'
నేను అతనితో ఇలా అన్నాను, 'కాదు. ఆ పద్ధతి బాగా ఉన్నతస్థితికి చెందినవారిది కాదు. బాగా అమాయకత్వంతో ఉన్న వ్యక్తులది.'
అర్థం చేసుకోండి; బాగా వికసించిన వ్యక్తికి ఏ పద్ధతీ అవసరం లేదు. పతంజలి చెప్పిన అష్టాంగయోగంలో ఎనిమిది పద్ధతులు ఒకేసారి సాధన చేయాలి. మీరు ఒక పద్ధతిని సాధన చేస్తే ఒక మెట్టు పైన ఉన్నట్టు కాదు. మొదటి పద్ధతిని మీరు గట్టిగా సాధన చేస్తే రెండో పద్ధతి అవసరం లేదు. మొదటి పద్ధతి 'యమ' ప్రవర్తనవిధానంలో ప్రత్యేకమైన అడ్డంకులు. ఈ పద్ధతిలో ప్రావీణ్యం పొందితే మిగతా ఏడు అవసరం లేదు. మీరు ఏ యోగ ప్రాణాయామం చేయనక్కర్లేదు. అర్థం చేసుకోండి. ఎనిమిది పద్ధతులు జ్ఞానోదయం నిజంగా కోరుకునేవారి కోసం ఇవ్వబడ్డాయి. ఆ ఎనిమిది ఒక దాని తర్వాత ఒకటి సాధన చేసే పద్ధతులు కావు.
అష్టాంగయోగం, పతంజలి చెప్పిన యోగపద్ధతులు. అలాగే సత్యకామునికి ఇచ్చిన పద్ధతి అమాయకత్వంతో ఉన్నవారికే ఇవ్వబడుతుంది. నేర్పరితనంతో ఉన్నప్పుడు చేతనస్థితిలో ఉండరు. మీరు చేతనస్థితిలో స్వచ్ఛంగా పసివాడిలా ఉంటారు. పసి పిల్లవాడు, ఒకేసారి వివేకంగా, అమాయకంగా ఉండగలడు. కాలక్రమేణా వివేకం అలాగే ఉంటుంది. కాని అమాయకత్వం నేర్పరితనంగా మారుతుంది. పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే అమాయకత్వంతో ఉంటారు. వారికి మనం ఎన్నో విషయాలు నేర్పి సంఘజీవుల్లా తయారుచేస్తాము. అర్థం చేసుకోండి, పిల్లల్ని నేర్పరులుగా చేయకుండా పెంచడంలో మన బాధ్యత చాలా ఉంది.
ఖలీల్ గిబ్రాన్ ఒక గొప్ప కవి, పిల్లల గురించి ఆయన ఇలా అందంగా చెప్పారు.
మీరు పిల్లలకి ప్రేమ ఇవ్వండి, కాని మీ ఆలోచనలు వద్దు. వారికి వారి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మీరు వారి శరీరాలకి ఇల్లు కట్టవచ్చు కాని వారి ఆత్మలకు కాదు. ఎందుకంటే, అవి ఉండే రేపటి ఇళ్లు. మీరు కలలో కూడా సందర్శించలేరు. మీరు వారిలా ఉండడానికి ప్రయత్నించవచ్చు. కాని వారిని మీలా చేయ్యాలని అనుకోవద్దు. జీవితం వెనక్కి వెళ్లదు. నిన్నటిలా ఆలస్యం చేయ్యదు కనుక మీరు ధనుస్సులు, వాటి నుండి పిల్లలనే జీవబాణాలు వెలువడతాయి.
విలుకాడు అనంతవిశ్వంలో తన లక్ష్యం చూసుకొని బలమంతా ఉపయోగించి ధనుస్సు నుంచి వదిలిన బాణాలు వేగంగా దూరంగా వెళ్లాలని వేస్తాడు. మీరు భగవంతుడనే విలుకాడి చేతిలో ఆనందంగా వంగింది. ఆయనకి వేగంగా వెళ్ళే బాణాలంటే ఎంత ప్రేమ ఉన్నదో స్థిరంగా ఉన్న ధనుస్సు మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది.
అసలు సమస్య ఏమిటంటే దేన్నైనా సంపూర్ణంగా కాకుండా విభజించి చూస్తాం. ఒక పాప తాను ఆడుకునే ప్రతి బొమ్మని మొత్తంగా చూస్తుంది. మొత్తం బొమ్మను నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ చిన్న పాపకి ఆ బొమ్మను నోట్లో పెట్టుకోవచ్చా లేదా అని తెలియదు. ఆ కళ్ళకి వస్తువును మొత్తంగా చూడడమే తెలుసు. కాని విభజించి చూడాలనుకోవు. మీరు ఎప్పుడైతే విడదీసి చూపించటం నేర్పుతారో, మీరు వారిలో నేర్పరితనానికి బీజం నాటినట్లు అవుతుంది. అది అమాయకత్వంగా, సహజంగా వ్యక్తపరచటాన్ని ఆటంకపరుస్తుంది. నేర్పరితనానికి విభజించటం, లెక్కించటమే వచ్చు. లెక్కించటం ద్వారానే వ్యక్తపరచటం వచ్చు. అది లెక్కకు సరిగా ఉన్నా అంతరాత్మకు సరి కాదు. మనం ఎప్పుడైనా వరాలను లెక్కపెడతామా? అయాచితంగా వాటిని తీసుకుంటాం.
నేర్పు అనేది మొత్తాన్ని విభజించటంతో ఆరంభమౌతుంది. మనస్సును విభజించేసరికి అమాయకత్వం పోతుంది. ఒక్కసారి మనస్సు దానికి అలవాటు పడితే, సహజమైన అమాయకత్వానికి దూరంగా వెళ్ళిపోతుంది.
ఒక దుకాణం దగ్గర రెండు చిన్న పిల్లల చక్రాల బళ్ళు పక్కపక్కన ఉన్నాయి. ఒక దానిలో ఉన్న చిన్న బిడ్డ, రెండో బండిలో ఉన్న పాపను అడిగింది, నీవు ఆడా, మగా? అని. ఆ పాప తనకు తెలియదని సమాధానమిచ్చింది. మొదటి పాప ‘ఉండు నేను చెప్తాను’ అని రెండో పాప చక్రాల బండిలోకి తొంగి చూసింది. తిరిగి ‘నీవు అమ్మాయి’, ‘నేను అబ్బాయిని’ అని చెప్పింది. రెండో పాప ఆశ్చర్యంగా ‘నీకు ఎలా తెలిసింది?’ అని అడిగింది. ఆ మొదటి పాప ‘నువ్వు గులాబీ రంగు బూట్లు వేసుకున్నావు నేను నీలం రంగువి వేసుకున్నాను’ అని ఠీవీమని సమాధానమిచ్చింది.
చాలా చిన్నప్పటి నుండే పిల్లలకి విభజన నేర్పుతారు. పిల్లలు తమకు తెలియకుండానే అమాయకత్వాన్ని పోగొట్టుకొని కపటాన్ని నేర్చుకుంటారు. ఈ నేర్పరితనం వల్ల ప్రమాదం ఏమిటంటే, దాని వేళ్ళు అన్ని వైపులకూ చొచ్చుకుపోయి మనిషిలో పాతుకుపోతాయి. ఆ వ్యక్తికి తాను నేరుగా మాట్లాడుతున్నానని కూడా తెలియదు. తనలోని సంఘర్షణ, నేర్పరితనం వల్లనే అని కూడా తెలియదు.
ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. స్వామీజీ, నాకు వివాహేతరసంబంధాలు ఉన్నాయి. అది తప్పని నాకు తెలుసు, అన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, అలాంటివి ఆపేయి అని. ‘మీరే ఆపగలరు’ అని అతడు తిరిగి అన్నాడు. ‘అరే, నేను ఆపడానికి ఎలాంటి సంబంధాలు లేవు. నీకు అలాంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మానేయడానికి నీవు నిర్ణయించుకోవాలి' అని నేను అంటే అతను మాట్లాకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు, నేను మీరు ఆపండి అంటే అర్థం ఏమిటి? నీ కారు తాళాలు తీసుకుని నిన్ను వెళ్ళకుండా చేయాలా? అని అడిగాను. ఇదే నేరుగా మాట్లాడడం అంటే. అప్పుడు అతడు ఇలా అన్నాడు, నేను మీకు అధీనం అయ్యాను, అందుకే మీరే అంతా చూసుకోవాలి. సరే నీవు నాకు అధీనమయ్యావు కదా! అయితే ఇక్కడ కూర్చోని ధ్యానం చెయ్యి, అన్నాను. అప్పుడు అతను, అదేంటి స్వామీజీ అలా అంటున్నారు, అని అన్నాడు. ఇప్పుడే కదా నువ్వు నాకు అధీనమయ్యానన్నావు. నేను చెప్పినట్టు చెయ్యాలి. కదలకుండా ఇక్కడే కూర్చో అని నేనన్నాను. అతడు అలా చేయడానికి సిద్ధంగా లేడు.
ఒక చిన్న కథ : ఒక రోజున నదులన్నీ కలసి సముద్రంతో 'మేం మంచి నీరుగా తాగాడానికి వీలుగా వస్తాం. నీలో ప్రవేశించేసరికి నీవు మమ్మల్ని ఉప్పుగా తాగడానికి వీలు లేకుండా చేస్తావు,' అని అన్నాయి. నదులన్నీ తననే తప్పు పడుతున్నాయని గ్రహించి సముద్రం 'మీరు నా దగ్గరకు రావద్దు, అప్పుడు మీరు ఉప్పు నీరుగా మారరు,' అంది.
మీరు సులభమైన పరిష్కారాలకు సిద్ధంగా లేరంటే మీరు నేరుగా నాటకమాడుతున్నారని అర్థం. మీరు నేర్పరితనంతో విసుగు చెందితే గానీ మీకు సహాయం చేయడం వీలు కాదు. మీకు ఏ పద్ధతీ పనికి రాదు. మీ నేర్పరితనానికి ప్రతి పద్ధతి నుండి తప్పించుకోడం తెలుసు. చాలా మంది, నా దగ్గరకు వచ్చి ఇలా అంటారు, స్వామీజీ! మీరు చెప్పేది అంతా బాగుంది కాని... అర్థం చేసుకోండి. ఏ క్షణం మీరు కాని అంటారో అప్పుడే మీరు పోగొట్టుకున్నట్టు. అంతా అయిపోయినట్టు మీరు మీ నేర్పుతో తప్పించుకోడానికి చూస్తున్నారని అర్థం.
మరి కొంతమంది, స్వామీజీ! మీరు చెప్పేది అంతా సరి అయిందే కాని మీరు చెప్పినట్టు నేను చేసేట్టు చూడండి అంటారు. ఏమిటి మీ ఉద్దేశం? నేను మీకు మీరు చేస్తున్నారా లేదా అని కాపలా పెట్టాలా? నేర్పుతో నాతో ఆడుకోవటం మానేయండి. అప్పుడు మీరు నేను చెప్పింది చేయగలరు. నేర్పు అనేది మీరు మీతో దాగుడుమూతలు ఆడటం లాంటిది. అది నాతో మీరు ఆడలేరు. మీరు ఎక్కడ దాక్కున్నారో నాకు తెలుసు నేను కనుక్కోడానికి మీ దగ్గరకు రానక్కరలేదు. అందుకే అర్థం చేసుకోండి. మీరు మీతో ఆడుకుంటున్నారు. మీరు మీతో మనఃపూర్వకంగా నిజాయితీగా ఉండాలని బలమైన నిర్ణయం తీసుకుంటే, మీరు నేర్పరితనాన్ని వదిలేస్తారు. అది కరిగిపోతే నిజాయితీ, యథార్థం బయటికివస్తాయి. మీకు తొందరగా జ్ఞానోదయం అవుతుంది. నిజాయితీగా ఉన్నప్పుడు మాటలు చెప్పరు, నేర్పు పని లేని మాటల్ని వ్యక్తపరుస్తుంది. మీరు మనిషి ముఖం మీద చెప్పలేనిది నేరుగా వెనక మాట్లాడుకుంటారు. ఆ నేర్పు నుండి బయట పడాలి అని నన్ను అడిగితే నాకు ఎలా తెలుస్తుంది? నేను దాన్ని ఎలా ఆపగలను. మీరు దాన్ని రహస్యంగా పోషిస్తున్నారు. అందుకే ఆపలేరు. అది మీ సృష్టి, ఒక నిమిషం కూడా దాన్ని పోషించడం వదలరు. అందుకే మీరు 'నేర్పును మానేయాలని ఉంది' అని నా ఎదుట నటిస్తారు. నన్ను మాయ్పంచమని అడుగుతారు. నిద్ర పోతున్న మనిషిని లేపవచ్చు. నిద్ర నటిస్తున్నవారిని లేపలేం. మీరు నిద్ర పోతున్నట్టు నటిస్తున్నప్పుడు మీకు లేవాలన్న గట్టి అవసరం కలగదు. సూటిగా దాంతో ఏకీభవించడం మానండి. అంతే అది ఒక్కటే మార్గం. నిప్పు ముట్టుకుంటే కాలుతుందని తెలిసినప్పుడు, నన్ను మీరు నిప్పు ముట్టుకోకుండా ఉండేట్టు ఆపమని అడుగుతారా? అడగరు. అలాంటప్పుడు మీరు నేర్పుగా మాట్లాడుతున్నారని తెలిసి దాన్ని వదిలేయలేరా?
ఎప్పుడు మీరు నేర్పును వదిలేస్తారో, సహజత్వం మీలో వికసిస్తుంది. అది లెక్కలు కట్టడానికి వ్యతిరేకి. సహజత్వం అంటే వివేకం, అమాయకత్వాల కలయిక. వివేకం నేర్పుతో కలిస్తే ప్రతి దానికీ విలువకడతారు. వికసించే అమాయకత్వమే సహజత్వం అవుతుంది. అంటే మీలో మీరు మోయలేని బరువు లేకుండా ఉండడం. అర్థం చేసుకోండి, మీరు నేర్పుతో చాలా వస్తువులను పొందుతున్నామని అనుకుంటారేమో! కానీ అసలు నిజం ఏమంటే, మీరు మీ అమాయకత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. అమాయకత్వం పోయిందంటే మీ జీవితాన్ని పోగొట్టుకున్నట్టు. మీరు దేన్నైనా కోల్పోవచ్చు, కాని అమాయకత్వాన్ని కోల్పోకూడదు.
నేర్పుతో మీ సహజస్వభావాన్ని మరిచిపోతున్నారు. నిరంతరం వేరే విధంగా ఉండాలని ప్రయత్నిస్తూ సహజత్వాన్ని వదిలేస్తున్నారు. మీరు మరొకరిలాగా నటిస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు మోసగించుకోవడమే గాక, మీ అంతరంగపరిమళాన్ని పోగొట్టుకునే ప్రమాదంలో ఉన్నారు. సృష్టిలో సహజమైన, అనంతమైన పరిమళం మీలోనూ ఉంది. సహజస్వభావం మీ వరకే పరిమితమైంది.
మీరు సహజంగా ఉన్నప్పుడు కచ్చితమైన అభిప్రాయాలతో ఉండరు. ఎప్పుడూ ఒక నిశ్చితమైన అభిప్రాయంతో పని చేయవలసిన అవసరం లేదు. వివేకం అనేది వాస్తవానికి దగ్గర్లో ఉంటుంది. నిశ్చితమైన అభిప్రాయంలో సహజమనే రసం పోతుంది. సమాజం మనల్ని వివిధ అభిప్రాయాలతో ఉండేట్టు తయారుచేస్తుంది. మనకి కొన్ని ప్రామాణికమైన అభిప్రాయాలుంటాయి. మనం మన అభిప్రాయాలను వదులుకొని వికాసంతో ఉండడానికి భయపడతాం. ఎందుకంటే మనసు ఎప్పుడూ ఒకే మూసకు అలవాటు పడింది. ఒకే మూసలో ఉండడం వల్ల అది పదిలంగా ఉన్నాననుకుంటుంది.
సృష్టి అదే విధంగా తిరిగి చెయ్యదు. ప్రతి రాత్రి పగలు వేరుగా ఉంటాయి. ఇది అదే పగలు, అదే రాత్రి అని ఎవరూ చెప్పలేరు. అది ప్రతి రోజూ జరిగేదే కాని ఒకే విధంగా ఉండవు. అదే ప్రకృతిలో ఉన్న అందం. అటువంటప్పుడు మనం మూస కోసం ఎందుకు వెదకాలి? అవసరం లేదు. సహజంగా ఉండడంలో కలిగే ఆనందాన్ని అనుభవించవచ్చు. పిల్లలు ఏడు సం॥ల వరకు వికాసంతో, సహజత్వంతో ఉంటారు. అప్పుడు సమాజం వారి మీద ముద్ర వేయడం ప్రారంభిస్తుంది. ఒక యువతి దారిలో సిగరెట్ కాలుస్తున్న వ్యక్తిని చూసి, 'అబ్బాయీ, మీ అమ్మకి నువ్వు రోడ్ మీద సిగరెట్ కాలుస్తున్నావని తెలుసా?' అని అడిగింది. వెంటనే అతడు ఆమెకేసి చూసి 'మీ భర్తకి మీరు దారిలో ఒక అపరిచితవ్యక్తితో మాట్లాడతారని తెలుసా?' అన్నాడు.
పిల్లలు ఎంతో సహజంగా ఉంటారు. వారు దేన్నీ పట్టించుకోరు. ఒక టీచరు తరగతిలో తోక చుక్క అంటే ఏమిటి? అని అడిగింది. ఒక పిల్లవాడు వెంటనే 'ఒక నక్షత్రానికి తోక ఉంటే దాన్ని తోక చుక్క అంటారు” అని చెప్పాడు. అయితే ఒక తోక చుక్క పేరు చెప్పమని మళ్ళీ ఆ టీచరు అడిగింది. ఆ పిల్లవాడు ‘మిక్కీమాస్’ అని సమాధానమిచ్చాడు.
పిల్లలకి భయం ఉండదు. వారు చెప్పాలనుకున్నది వెంటనే అనేస్తారు. వారు మరు క్షణంలో ఏం మాట్లాడతారో ఎవరూ చెప్పలేరు. అదే వారి ప్రత్యేకత. ఇక్కడ సమస్య ఏమంటే చిన్న పిల్లల సహజస్వభావాన్ని మనం ఒప్పుకుంటాం. అదే పెద్దవారిలో తప్పు పడతాం. ఒక పిల్లవాని సహజత్వానికి మనసులో చోటిస్తాం, కానీ మన తోటివారి సహజత్వాన్ని మనం భరించలేం.
పిల్లలు కొట్టినా ఏమీ అనరు, పైగా ఆనందిస్తారు. అదే పెద్దవారు చేస్తే ఊరుకుంటారా? పిల్లల అమాయకత్వం వల్ల కొట్టడం కూడా అందంగా అనిపిస్తుంది. పిల్లలు చేసే దాని వెనక అమాయకత్వం ఉంటుంది. పెద్దవాళ్ళు చేసే పని వెనక మనసు ఉంటుంది, అదే తేడా.
అమాయకత్వం/ సంపూర్ణత్వం, పరిణతి
ధమ్మపదలో ఇలా ఉంది : “అంతరంగికదీపం వెలిగించు, జ్ఞానం పొందడానికి కష్టపడు, స్వచ్ఛంగా, అమాయకంగా ఉండు. కాంతి అనే ప్రపంచంలో నివసించు.”
నీవు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఒక అమాయకమైన చంటి బిడ్డవు. సమాజం నీకు మనసు అనేది కల్పించేంత వరకూ, నీవు అమాయకత్వం అనే కాంతిని ప్రసరించావు. ఇప్పుడు నీ బుద్ధిని వదిలేసి మళ్ళీ అమాయకంగా ఉండాలనుకుంటున్నావు. అమాయకత్వాన్ని తిరిగి పొందడమే పరిణతి. అమాయకత్వాన్ని తిరిగి పొందవచ్చు. నీవు ఒకప్పుడు అమాయకంగా ఉన్నావని నమ్మకం ఉంటే చాలు. నీలో ఆ అమాయకత్వం ఇంకా ఉందని నమ్మితే మళ్ళీ దాని కాంతిని ప్రసరించవచ్చు. అది అర్థం చేసుకుంటే తిరిగి ఆ పని ఆరంభమౌతుంది.
పరిణతి, మనం సంపూర్ణంగా జీవించేట్టు చేస్తుంది. సంపూర్ణత్వం అనేది ఎంతో అమాయకత్వం వల్ల కలుగుతుంది. మీలో ఏ అభిప్రాయం, తీర్పూ లేవు. కేవలం ఆ క్షణానికి తీవ్రమైన ఉత్సాహంతో వికసించటమే అమాయకత్వం. మళ్ళీ మీరు అమాయకంగా ఉండాలంటే ఒకటే మార్గం, మీరు అబద్ధమైన జ్ఞానం వెనుక దాగవద్దు. దాని నుండి బయటకు వచ్చి మీ సహజస్థితిని తెలియజేయండి. అప్పుడు మీరు పూర్తి వికాసంతో ఉన్నట్టు. అదే జ్ఞానోదయానికి దారి తీస్తుంది. మొదట మీరు ఎక్కడ దాగి ఉన్నారో తెలుసుకోవాలి. రెండవది మీరు అక్కడ నుండి బయటకు రావడానికి తీసుకున్న బలమైన నిర్ణయం. అప్పుడు అమాయకత్వం పరిణతి పొందుతుంది.
మీరు పరిణతి చెందాలంటే, మొదట మీరు మీ లోపలకు వెళ్లాలి. మీరు మీ సహజ స్వభావంతో, అరమరికలు లేకుండా, హాయిగా ఉండడమే పరిణతి చెందటం. మీ సహజ స్వభావంతో ఉండాలంటే మీ మనసుని తేలికగా ఉంచండి. మీరు ఎక్కడ ఉన్నా, ఎం చేస్తున్నా మీ అంతరంగాన్ని ఎప్పుడూ హాయిగా ఉంచండి. అప్పుడు మీరు స్వచ్ఛతను నిలబెట్టుకోవచ్చు, మీ అంతరంగంలో ఉన్న మీ సహజస్వభావాన్ని కష్టపడకుండా, అరమరికలు లేకుండా గ్రహించాలి.
సమాజం మిమ్మల్ని ఎప్పుడూ ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండమని చెప్పడం వల్ల మీ సహజ స్వభావం అణిగిపోతుంది. నిరంతరం ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండవలసిన అవసరంలేదు. అది ఒక అపరిపక్వమైన ఆలోచన. ఆ ఆలోచనను వదిలేస్తే మనసు విశ్రాంతిని పొందుతుంది. మనసు నేర్పుతో ఉండాలనే ఒత్తిడి ఉండదు. ఈ విశ్రాంతి అమాయకత్వాన్ని పుట్టిస్తుంది.
మీరు మీ మనస్సుని సాంత్వనపరచలేకపోతున్నారు. కాబట్టి అమాయకత్వం కోసం ప్రయాసపడుతున్నారు. మీరు అమాయకత్వాన్ని తిరిగి పొందడానికి మీ మనసు అడ్డుపడుతుందని అర్థం చేసుకుంటే ఆ పోరాటం ఉండదు. మీరు అర్థం చేసుకోకపోతే పోరాటం తప్పదు. ఆ పోరాటాన్ని మీ అహం అడ్డుకుంటుంది.
మీరు మనసును వదిలితే ఈ క్షణంలోకి వస్తారు. మీ మనసు భూతభవిష్యత్తుల మధ్య ఊగిసలాడుతుంది. ఒక పిల్లవాడు ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటాడు. జరిగిపోయిన దాన్ని గుర్తుంచుకోడు. అది వాడికి అవసరం లేదు. ఆ క్షణాన్ని ఆనందించడంలోనే ఇష్టం చూపిస్తాడు. మనం ఏదైనా గుర్తు తెచ్చుకోవాలంటే క్షణాలనే కాని రోజుల్ని గుర్తు తెచ్చుకోలేం. అలా కాకుండా ప్రతి క్షణాన్నీ గుర్తుంచుకొనేట్టుగా చేసుకోవాలి. భూతభవిష్యత్తుల వెనక పరుగులు పెట్టకూడదు.
దారి తప్పినపుడే మీకు అమాయకత్వం తిరిగి పొందాలన్న ప్రేరణ కలుగుతుంది. మీరు పెదదారి పట్టినపుడు దాని పర్యవసాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు ఆత్మపరిశీలన ఆరంభమౌతుంది. ఆ ఆత్మపరిశీలనే మీలో మిమ్మల్ని తిరిగి అమాయకత్వం పొందడానికి ప్రేరేపిస్తుంది. పెదదారి పట్టినపుడు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు.
అవగాహన తెచ్చుకొని సరైన మార్గంలో సమైక్యం పొందండి. మీ చైతన్యస్థితిని తెలుసుకోవటం, నిజాయితీతో సమైక్యం చెందటం, జరిగినప్పుడు మీరు పసిబిడ్డగా అవుతారు. పసితనంలో ఉన్నప్పుడు మీలో అమాయకత్వం ఉంది కాని అది అవగాహనతో కాదు. మీరు ఎదిగిన తరువాత అమాయకత్వాన్ని కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి పొందుతున్నారు. ఈ కొత్త అమాయకత్వం పూర్తి అవగాహనతో ఉంటుంది. ఇదే అసలైన అమాయకత్వం. మీరు అమాయకత్వాన్ని తిరిగి పొందినప్పుడు, పసితనం కంటే విలువైంది ఏదీ లేదనే నిర్ణయంతో వికసిస్తారు. అదే జ్ఞానోదయానికి దారి తీస్తుంది.
అందుకే పసివారి అమాయకత్వాన్ని చాలా జాగ్రత్తగా పోషించాలి. వారి అమాయకత్వం మీద మన జ్ఞానాన్ని ఆపాదించకపోతే, వారు తమ అమాయకత్వాన్ని పోగొట్టుకోకుండా పెరుగుతారు. ఉదాహరణకి, ఆకాశం కొన్ని సమయాల్లో నీలంగా, అప్పుడప్పుడూ తెల్లగా ఎందుకు ఉంటుంది, అని పిల్లవాడు అడిగితే అది అలాగే ఉంటుందని చెప్పాలి. ఆ పిల్లవాడు చదువుకునేటప్పుడు దాన్ని గురించి ఎలాగూ తెలుసుకుంటాడు. మీరు అది అలాగే ఉంటుంది, అని చెప్పడం వల్ల ప్రకృతి సహజంగా ఎలా ఉంటుందనేది పిల్లవాడికి అర్థమవుతుంది. దాని గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకోడు. ఆ జ్ఞానాన్ని విశ్వవిద్యాలయాలు ఎలాగూ అతనికి అందిస్తాయి.
ఆకాశం సహజంగా అలాగే ఉంటుందని మీరు పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పి దానికి జ్ఞానంతో పని లేదని తెలియజేస్తే, అతనిలోని అమాయకత్వం అలాగే ఉండిపోతుంది. అతడు ప్రకృతి మీద ఒక అభిప్రాయాన్ని చిన్నతనంలోనే ఏర్పరచుకోడు, దాన్ని సహజరూపంలో చూడగలుగుతాడు. ఎప్పుడైతే వర్ణించడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు అమాయకత్వమనేది పోతుంది. అది చూడటం కాదు, గమనించడం అవుతుంది. దాంతో మొత్తం అందం పోయినట్టే. ఎదగడాన్ని అందరూ గంభీరంగా చూస్తారు. గంభీరతతో పెరిగితే మీరు కేవలం పెద్దవాళ్ళవుతారు, ఆడుతూ పాడుతూ, పెరిగితే మీరు చిన్నగానే ఉంటారు. అప్పుడప్పుడు పిల్లల్ని జంతువుల్ని గమనిస్తే, అవి ఆడుతూ, పాడుతూ అమాయకత్వంతో ఉంటాయి. వాటిని చూస్తే మనం తిరిగి అమాయకత్వంతో సంబంధం ఏర్పరచుకోవచ్చు.
ఒక చిన్న కథ : ఒక సింహం అడవిలో వెళ్తూ క్రూరజంతువు లన్నింటిలో గొప్ప జంతువు ఏది? అన్న సమాచారాన్ని సేకరిస్తోంది. ఆ సింహం ఒక ఖడ్గమృగాన్ని చూసి, ఈ అడవికి రాజు ఎవరు? అని ప్రశ్నించింది. ‘తప్పకుండా మీరే’ అని అది సమాధానమిచ్చింది. సింహం సంతోషంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. జీబ్రాను కూడా అదే ప్రశ్న అడిగింది. జీబ్రా కూడా నువ్వే ఈ అడవికి రాజువి అన్నది. సింహం గర్వంగా ముందుకి నడిచింది. అక్కడ ఉన్న ఒక ఏనుగుతో ఈ అడవికి రాజు ఎవరో చెప్పు అనగానే ఏనుగు తొండంతో సింహాన్ని పట్టుకొని ఒక చెట్టుకేసి విసిరింది. సింహం చెట్టుకు కొట్టుకొని, కింద పడి, నీకు సరైన సమాధానం తెలియకపోతే అంత పిచ్చి కోపం తెచ్చుకోవాలా? అంది.
అమాయకత్వంతో జీవితాన్ని సమీపించాలి, ఎప్పుడైతే మీరు మీ అమాయకత్వాన్ని తిరిగి పొందాలని గ్రహిస్తారో ఆ క్షణమే మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారని అర్థం. అమాయకత్వాన్ని మీరు తిరిగి పొందడానికి మీ జీవితంలో జరిగే చిన్న సంఘటనకూ మీ ప్రతిచర్యను గమనిస్తే తెలుస్తుంది, అదే సరైన కొలమానం. అమాయకత్వం అన్నింటినీ ఆశ్చర్యంగా, వినయంగా చూస్తుంది. చిన్న పిల్లల కళ్ళల్లో ఎప్పుడూ ఆశ్చర్యం కనిపిస్తుంది. మీరు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారంటే అమాయకత్వం పొందుతున్నారని అర్థం. అప్పుడు మీకు ప్రపంచజ్ఞానం ఎంత ఉన్నా, మీ కళ్ళు స్వచ్ఛంగా, అమాయకంగా ఉంటాయి. అటువంటి కళ్ళు ఋషులకు ఉంటాయి.
పిల్లలు అమాయకత్వంతో ఎన్నో తెలుసుకుంటారు. కాని అర్థం చేసుకోలేరు. పిల్లలు తమ అమాయకత్వంలోనే వాటిని ఆనందిస్తారు. కానీ అమాయకత్వాన్ని తిరిగి పొందినవారు ఏదైనా కనుగొన్నపుడు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అదే ఇద్దరికీ ఉన్న తేడా.
పిల్లల అమాయకత్వం అందంగా ఉంటుంది. కాని అంత మాత్రమే సరిపోదు. అది జీవితంలో పోగొట్టుకొని, తిరిగి పూర్తి అవగాహనతో పరిణతి పొందాలి.
ఒక పిచ్చివాడు, యోగి, ఒకేలాగా కనిపిస్తారు. వారిద్దరి ప్రవర్తనా విపరీతంగానే ఉంటుంది. కారణం లేకుండా నవ్వుతారు. అర్థం లేని పనులు చేస్తారు. వారు ఒక పటానికి రెండు అంచుల వంటివారు. అంచులు రెండూ ఒకేలా ఉంటాయి. చూడటానికి వారిద్దరూ ఒకే విధంగా కనిపిస్తారు అంతే. ఒక పసివాడు, యోగి కూడా ఒకేలా కనిపిస్తారు. కాకపోతే ఆ పసివాడికి ఇంకా అమాయకత్వాన్ని తిరిగి పొందటం ఆరంభం కాలేదు. యోగికి పూర్తి అయిపోయింది.
పిల్లవాడి అమాయకత్వం భగవంతుడు ఇచ్చింది. కానీ జీవితంలో తిరిగి పొందింది కాదు. పిల్లవాడి అమాయకత్వాన్ని సులభంగా చెదరగొట్టవచ్చు. యోగి అమాయకత్వాన్ని చెదరగొట్టలేం. అమాయకత్వాన్ని పోగొట్టుకొని, తిరిగి దాన్ని శాశ్వతంగా పొందటమే పరిణతి చెందడం. అది చిత్రపటానికి ఒక చివరి నుండి మరొక చివరికి ప్రయాణించడం వంటిది.
ఒక పసివాడిని ప్రేమతో పెంచితే వాడి అమాయకత్వాన్ని పదిలపరచినట్లే. అప్పుడు అతడు తన హృదయంతోనే కాని ఆలోచనతో పనిచేయడు, అవసరమైనపుడు తన తెలివితేటల్ని ఉపయోగిస్తాడు, అందువల్ల ఆ పిల్లవాడు పనికి రాకుండా పోతాడని అర్థం కాదు, అతని అమాయకత్వాన్ని జ్ఞానం చెడగొట్టదు. అతడికి జ్ఞానం కేంద్రం కాదు. ప్రేమే కేంద్రం అవుతుంది. జ్ఞానం అనేది సమస్య కాదు. దాన్ని మనం వాడుకునే విధానంలోనే సమస్య.
మీరు అమాయకత్వాన్ని తిరిగి పొందినప్పుడు ఇంకొకరి కళ్ళలోకి సూటిగా చూడగలుగుతారు, మిమ్మల్ని అమాయకత్వం చేతనస్థితిలోకి తీసుకురావటమే కాకుండా పరిపూర్ణతను కలిగిస్తుంది.
అమాయకత్వాన్ని తిరిగిపొందినప్పుడు, సమైక్యభావంతో, మీ తోనూ, ఇతరులతోనూ నిజాయితీగా ఉంటారు, మీ కళ్ళలోని నిజాయితీ ఇతరులను ఆకట్టుకుంటుంది. ఆ నిజాయితే పరిణతి. తిరిగి అమాయకత్వం పొందాలనుకుంటే చాలు, మీలో మీరు కానిదాన్ని నాశనం చేస్తుంది. అవన్నీ నిబంధనల పొరలే. పూర్తిగా ఆ పొరలు తొలగిపోయేంత వరకు దృఢమైన నిశ్చయంతో ఉండాలి. ఆ సంకల్పం నేర్పుతో కాకుండా, నిజాయితీగా, సద్భావంతో ఉండడాన్ని గుర్తు చేస్తుంది. పూర్తిగా మీలో నిబంధనల పొరలు తొలగిపోయేవరకు విశ్రాంతి తీసుకోనని గట్టి నిర్ణయం తీసుకోండి.
పరిణతి చెందడంలో అందం ఏమంటే, అవసరమైనపుడు, పెద్దవారిలా లేకపోతే చిన్నపిల్లల్లా ఉండచ్చు. ఒక స్థితి నుండి వేరొక స్థితికి సులభంగా మారుతూ, మీ అంతరంగంతో అన్యోన్యంగా ఉంటారు.
మీరు మళ్ళీ అమాయకత్వాన్ని పొందితే, మిమ్మల్ని 'ద్విజ' అని అంటారు. దీనికి కీలకం మీరు అమాయకత్వాన్ని తిరిగి పొందే ప్రయత్నాన్ని వదలకపోవటమే. వెంటనే అమాయకత్వం పొందలేకపోవడం వల్ల ఆశాభంగం కలుగుతుంది. దీనికి కారణం సమాజం మిమ్మల్ని చాలా నియమాలతో కట్టుదిట్టం చేసింది. ఉల్లిపాయ పొరలు ఎలా తీస్తామో అలా ఆ నియమాల పొరలన్నీ తీస్తే, అమాయకత్వకేంద్రానికి చేరుతారు. అందుకే విశ్రాంతి తీసుకోకుండా ఉంటే, అమాయకత్వం తిరిగి పొందుతారు. అమాయకత్వం మీలో ఉంది. అది బాహ్యంగా చేరవలసిన లక్ష్యం కాదని గుర్తు తెచ్చుకుంటే, ప్రతి ఆశాభంగం వెనుకా ఆశ కనిపిస్తుంది.
ప్రతి రోజూ, కొద్ది క్షణాలు మీరు ఒంటరిగా కూర్చుని, ప్రశాంతంగా మీలోకి వెళ్ళి, స్వచ్ఛతని, అమాయకత్వాన్ని అనుభూతి చెందండి. ఆ అనుభూతి మీ శరీరంలో, మనస్సులో అంతరంగంలో వ్యాపించనివ్వండి. మీ అమాయకత్వంతో ఎంత అందంగా ఉన్నారో అనుభూతి చెందుతారు. ఇలా చేస్తే త్వరలోనే అది సహజస్వభావం అవుతుంది. మీలో మీరు కానిది కాలిపోయి అసలైన మీరు బయటికి వస్తారు.
అమాయకత్వం సంపూర్ణత్వంతో ఉంటుంది. ఆ సంపూర్ణత్వాన్నే 'సుకుమారం' అంటారు. అందువలనే జ్ఞానోదయమైన గురువులు సుకుమారంగా, అందంగా ఉంటారు. చూసేవారికి అమాయకత్వం ఒక అద్భుతమైన అందంగా కనబడుతుంది. ఎంతో నేర్పు గలవారు కూడా కాదనలేనంత సంపూర్ణంగా ఉంటుంది. అది తర్కాన్ని కాదని మిమ్మల్ని స్పృశిస్తుంది.
అమాయకత్వం పొందడం అంటే మన అంతరాత్మ నుండి పని చేస్తున్నట్టు ఆలోచనలు లేని అవగాహనతో ఉండడం. అంత వరకు మీరు మీ మనస్సుతో పని చేస్తున్నారు. మీ ఆలోచనలు ఎక్కడ నుండి వస్తున్నాయో గమనిస్తే, అవి విడిచిపెట్టి, చిన్నప్పటి ఆలోచనలు లేని అవగాహన స్థితికి వెళతారు. అదే అమాయకత్వం కాని ఇది పరిణతి చెందిన అమాయకత్వం. ఈ అవగాహన మీ జ్ఞానానికి ఏమీ జోడించదు, మీ అమాయకత్వాన్ని మరింత గాఢం చేస్తుంది. అది విశ్వాన్ని ఇంకా అద్భుతంగా, అందంగా కనిపించేట్టు చేస్తుంది. అమాయకత్వానికి వ్యతిరేకభావాలు ఉండవు. అది చూస్తూ ఉంటుంది. తార్కికదృష్టి లేకపోవడమే అమాయకత్వపు అందం. ఒక యువకుడు చాలా కాలం తరువాత తన స్నేహితురాల్ని చూడటానికి వెళ్లాడు. అప్పుడు ఆ అమ్మాయి తమ్ముడు అక్కడే కూర్చుని ఏదో తింటూ టి.వి. చూస్తున్నాడు. ఆ యువకుడు అబ్బాయిని మేడ మీదికి వెళ్ళి రోడ్డు మీద ఎర్ర టోపీతో వెళ్ళేవారిని లెక్కపెట్టమని, ఒక్కొక్కరికి 50 పైసల చొప్పున ఇస్తానని చెప్పాడు. ఆ చిన్నబ్బాయి హుషారుగా మేడ మీదికి వెళ్లాడు. ఆ యువకుడు తన స్నేహితురాలి దగ్గర కూర్చుని మాట్లాడే సమయంలో పది నిమిషాల తరువాత ఆ అమ్మాయి తమ్ముడు, ఆ గదిలోకి హరాత్తుగా వచ్చాడు. ఆ యువకుడు, కోపంగా, 'నేను నిన్ను రోడ్డు మీద వెళ్ళే ఎర్ర టోపీల వాళ్ళని లెక్కపెట్టమన్నానా?' అని అరిచాడు. ఆ చిన్న అబ్బాయి ఆయాసపడుతూ 'నాకు తెలుసు ఇప్పుడు ఎర్ర టోపీలు పెట్టుకున్న ఒక సైనిక సమూహం వెళ్ళింది. టోపీకి 50 పైసలు చొప్పున నువ్వు నాకు 1200 రూపాయలు ఇయ్యాలి' అని సమాధానమిచ్చాడు.
మనం పిల్లలు అంతగా ఎదగనివారనుకుంటాం. అలాగే పెద్దవారు ఏడ్చినా, వారి భావాలను వ్యక్తపరిచినా, పరిణతి చెందలేదని అనుకుంటాం. వారి భావాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అమాయకత్వానికి నిదర్శనం. నేర్పరులు వారి భావాలను పూర్తిగా వ్యక్తపరచరు. ఎవరి ముందైనా ఏడ్వడంలో తప్పు లేదు. మీరు ఏం దాచాలనుకుంటున్నారు? ఏడ్వడం వల్ల మీ నిజమైన అనుభూతిని తెలియజేస్తున్నారు. అందులో దాచవలసింది ఏమి లేదు. సమస్య ఏమిటంటే సమాజం మీరు మీ నిజస్వభావాన్ని మరుగుపరచి వేరొకరిలా కనిపించేట్టు చేస్తుంది. కొంత కాలానికి మన సహజస్వభావాన్ని, అమాయకత్వాన్ని మరిచిపోతాం.
ఉపాధ్యాయులు - తల్లిదండ్రుల సమావేశంలో ఒక టీచరు, ఒక అమ్మాయి తండ్రితో 'మీ అమ్మాయి అన్నింట్లోనూ చక్కగా ఉంటుంది. కాని ఇంకా పూర్తిగా ఎదగలేదు' అన్నది. దానికి ఆ తండ్రి టీచర్కేసి ప్రశ్నార్థకంగా చూసి, మూడేళ్ళ పిల్ల ఎలా ఉండాలని మీ ఉద్దేశ్యం? అని అడిగాడు.
పిల్లలతో వారి స్నేహితునిలా ఆడుతూ పాడుతూ గడిపితే, మళ్ళీ అమాయకత్వాన్ని పొందవచ్చు. వారితో ఉన్నప్పుడు నటించకుండా, నిజంగా పిల్లలా అయిపోండి. అదే మీరు మీకు చేసుకునే ఉపకారం.
మన సమస్య, సమాజం మనకి నేర్పినదాన్ని పొగొట్టుకుంటామని భయం. సమాజం నుండి మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో నేర్చుకుంటాం. మన సహజస్వభావం, వ్యక్తిత్వం వేరు. సహజ స్వభావం నిజమైంది, వ్యక్తిత్వం నిర్మించుకున్నది. మన సహజస్వభావాన్ని దృఢపరిస్తే మనం వాస్తవంలో ఉన్నట్టు, వ్యక్తిత్వాన్ని దృఢపరిస్తే ఊహల్లో ఉన్నట్టు. మనం పిల్లలు తినే విధానం చూస్తే వారు ఎంత ఇష్టంగా తింటారో తెలుస్తుంది. ఉదాహరణకి వాళ్ళు బంగాళ దుంప చిప్స్ తినేటప్పుడు ప్రతీది ఎంతో ఆనందంతో చూస్తూ ఇష్టంగా తింటారు. అదే వారికి గొప్ప ఆశీర్వాదం. పిల్లలు తింటున్నది చూసి, మనం వాళ్ళని వేగంగా తినమని తొందర చేస్తాం. ఆ విధంగా మనం జీవితంలో అద్భుతక్షణాలను, అమాయకత్వాన్ని తెలుసుకునే స్థితిని కోల్పోతాం.
మీలో దాగి ఉన్న పసితనాన్ని కనుక్కోడానికి ఎన్నో విధాలు ఉన్నాయి. పిల్లలతో దాగుడుమూతలు ఆడండి. టామ్ అండ్ జెర్రీ కార్టూన్ చూడండి. మట్టితో బొమ్మలు చెయ్యండి, లేదా, రంగురంగుల పీచు మిఠాయి తినండి ఇవన్నీ మీలో ఉన్న చిన్నతనాన్ని బయటికి తీసుకువస్తాయి. మీ కరడుగట్టిన వ్యక్తిత్వం కరిగిపోతుంది. మీరు ద్రవించిన నదిలా ప్రవహిస్తారు. మీ గంభీరత అనే బరువుని వదిలేసి తేలికై పరమానందస్థితికి వెళ్తారు.
గంభీరత అనేది అహం. మీరు మీ అధికారం పోతుందని, ఇతరులు బాధపెడతారని భయపడడం వల్ల గంభీరంగా మారతారు. మీరు మిమ్మల్ని కేంద్రంగా చేసుకుంటే జరిగేది అదే. అన్నీ వదిలేసి, ఆడుతూ పాడుతూ, మీ అమాయకత్వాన్ని పొందగలరు. అప్పుడు కలిగే ఆనందం మీ గంభీరతని పోగొడుతుంది. ఆ కాస్త సమయంలో పట్టుకువేలాడడానికి ఏమీ లేదని అర్థమవుతుంది. ఆ అవగాహన మీకు కలిగితే, మీరు పూర్తిగా అమాయకత్వాన్ని పొందడానికి, స్వచ్ఛం కావడానికి ముందుకి సాగిపోతారు.
అమాయకత్వం మన చైతన్యాన్ని బుద్ధిలో స్థిరపడకుండా హృదయానికి దగ్గర చేస్తుంది.
★ అమాయకత్వం అంటే స్వచ్ఛమైన అంతరంగం.
★ తర్కజ్ఞానంతో అలసిపోయాక కాని మీరు మార్పుకి సిద్ధం కారు.
★ మధ్యంతరంగా ఉండే జ్ఞానంలో స్థిరపడవద్దు, అంతిమసత్యంలోనే ఉండండి.
★ మీరు అమాయకత్వంతో ప్రశ్నిస్తే మీరు జవాబు స్వీకరించటానికి పూర్తిగా సిద్ధంగా ఉంటారు.
★ తెలియనిదాన్ని తెలుసుకోవటం అనేది పూర్తిగా ఆ విషయానికి అధీనమైనప్పుడే సాధ్యం.
★ ఏదో ఒక అభిప్రాయాన్ని పట్టుకొని వేలాడకుండా ఉండటమే అమాయకత్వం.
★ సమాజం సృష్టించిన కల్పన మీ మనస్సు దాన్నే కొలబద్దలా ఉపయోగించి మిమ్మల్ని కొలుస్తారు.
★ విశ్వాసం ఒక దృక్పథం. అది అమాయకత్వానికి, అధీనతకి, విరామస్థితికి, పరమానందానికి తీసుకువెళుతుంది.
★ ఆధ్యాత్మికతని అమాయకత్వంతో సాధన చేస్తే మీరు పసిబిడ్డలలా ఉంటారు.
★ అమాయకత్వం దేవునికి చేసే ఒక గొప్ప ప్రార్థన.
★ మోసపూరితమైన నేర్పరితనం మిమ్మల్ని విడదీస్తుంది. అది నిరంతరం లెక్కలు కడుతుంది.
★ పిల్లల్లోని అమాయకత్వశక్తి వారి వెనకనే ఉంటుంది. అదే పెద్దవారిలో వారి మనస్సు వారి వెనుక ఉంటుంది.
# సమష్టిచైతన్యంలో మీరూ ఒక భాగం
జీవన్ముక్తి అంటే సర్వసృష్టిలో ఒకడుగా అనుభవాన్ని పొందటమే
మనం ఇప్పుడు కొంచెం కష్టమైన విషయం గురించి తెలుసుకుందాం. అది మన చుట్టూ ఉన్న బయటి ప్రపంచానికి, మనకి ఉన్న సంబంధం. మనం చూసేది ఎందుకు అలా కనబడుతుంది? మనం చూసేది ఎలా చూస్తాం? మనం ఈ (విశ్వశక్తి) సృష్టిలో ఎలా ఇముడుతాం?
పదార్థం, శక్తికి అతీతమైన..
ఈ ప్రపంచం దేంతో చేయబడింది? మన పంచేంద్రియాలు, చూడటం, వినడం, వాసన, రుచి, స్పర్శ అనేవి ఈ ప్రపంచాన్ని అనుభూతి చెందడానికి ద్వారాల వంటివి. అవి, ఈ ప్రపంచం పదార్థంతో చేయబడిందని మనకు తెలియజేస్తాయి. వస్తువులు వివిధ ఆకారాలు, రంగులు, గుణాలు కలిగి ఉంటాయి.
మనం ఐదు మూలకాలైన - భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశంతో ఏర్పడిన మూడు పరిమాణాలు (three dimensional ) గల ప్రపంచంలో నివసిస్తున్నాం. మనం ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు, కాలంతో మార్పు చెందడం చూస్తాం. అన్నీ కాలంతో సృష్టి, స్థితి, లయం చెందుతాయి.
పదార్థం, మూడు గమనసూత్రాలు, గురుత్వాకర్షణ, ప్రవాహగతికశాస్త్రం అనే భౌతిక సూత్రాలకు లోబడి ఉంటుందని, మన ప్రాచీన భౌతికశాస్త్రం చెప్తున్నది. అన్ని వస్తువులు, అణువులతో, అవి పరమాణువులతో, పరమాణువులు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రానులతో చేయబడి ఉంటాయి. ఈ ప్రాథమికవిషయాలన్నీ మనం స్కూలులో నేర్చుకున్నాం.
కాని ఆధునికశాస్త్రప్రకారం, ప్రపంచం మాలికంగా పదార్థంతో చేయబడలేదు. ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రానులు ప్రాథమిక కణాలు కావు. పదార్థమే శక్తి అని ఆధునికశాస్త్రం చెబుతుంది.
ప్రసిద్ధి కెక్కిన ఆల్బర్ట్ ఐయిన్స్టీన్ సమీకరణం E=mc² ('E'అనేది శక్తి, m అన్నది ద్రవ్యరాశి, c అంటే కాంతి వేగం) పదార్థం, శక్తి రెండూ ఒక్కటే అని నిరూపిస్తుంది. నేను ఈ మధ్య ఒక అమెరికా జర్నల్‌లో ఈ సమీకరణనిరూపణ గురించి చదివాను. కేంద్రకం (nucleus) లో ఉన్న ప్రాథమికకణాలు ఇంకా చిన్నవైన క్వార్కులు (Quarks) తో చేయబడ్డాయి. అవి గ్లూఆన్సు (Gluons) తో అతకబడి ప్రాథమికకణాల కింద ఏర్పడతాయి. అన్నింటి కంటే ఆశ్చర్యమైన విషయం, గ్లూఆన్సుకి ద్రవ్యరాశి '0' క్వార్కులకి ద్రవ్యరాశి 5% మాత్రమే ఉంది. మిగతా 95% ద్రవ్యరాశి, ఆ గ్లూఆన్సుకి, క్వార్కుల మధ్య అంతరచర్య, కదలికల నుండి వచ్చే శక్తి నుండి వస్తుంది. అందుకే ద్రవ్యరాశి, శక్తి, సమానమైనవి. ఏ నిజాన్నయితే కొన్ని దశాబ్దాల కింద శాస్త్రం కనుక్కుందో, అదే తూర్పుదేశ ఋషులు, వేదసారమైన ఉపనిషత్తుల్లో ప్రతిపాదించారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన ఈశావాస్య ఉపనిషత్తులోని మొదటి వాక్యం - ఈశావాస్యం ఇదం సర్వం - ఉన్నది అంతా శక్తిమయమే.
క్వాంటం ప్రపంచం
ఈ రోజున మనం క్వాంటం ప్రపంచయుగంలో ఉన్నాం. మనం క్వాంటం భౌతికశాస్త్రం, క్వాంటం లీప్స్, క్వాంటం ఆలోచన గురించి మాట్లాడుకుంటాం. అసలు క్వాంటం అనే పదానికి అర్థం ఏమిటి? క్వాంటం అంటే మధ్య ఉన్న స్థితుల్లో నుండి వెళ్ళకుండా, ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి పెద్ద అడుగు వేయడం. ఈ రోజుల్లో మధ్య ఉన్న స్థితులలో నుండి వెళ్ళడానికి ఎవరికీ సమయం లేదు. ప్రతి దానిలో వెంటనే ఫలితాలు కావాలి. మనకి క్వాంటం ఫలితాలు కావాలి.
ఒక చిన్న కథ : ఒక వ్యక్తికి నిద్ర సరిగ్గా పట్టక డాక్టర్ దగ్గరకు వెళ్ళి నిద్రకు మంచి మందు ఇమ్మన్నాడు. డాక్టర్ ఒక మాత్ర ఇచ్చి సగం వేసుకుంటే బాగా నిద్ర పడుతుందని చెప్పాడు.
ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి బాగా నిద్ర పట్టడానికి పూర్తి మాత్ర వేసుకున్నాడు. ఉదయం లేచేసరికి అతనికి తాజాగా, ఉత్సాహంగా అనిపించింది, అతను ఆఫీసుకి వెళ్ళాడు. మేనేజరు దగ్గరికి వెళ్ళి, 'నేను ఇవాళ ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నిన్న రాత్రి మొద్దు నిద్రపోయాను. ఉదయం లేవగానే ఒక పిల్లవాడినన్న భావన కలుగుతుంది' అన్నాడు.
'బావుంది, కాని నిన్నంతా నువ్వు ఎక్కడ ఉన్నావు?' అని మేనేజరు అడిగాడు.
మనకు ప్రతి దాంట్లో క్వాంటం ఫలితమే కావాలి. పరమాణువులో కేంద్రకం ఉంటుంది, దాని చుట్టూ, ఎలక్ట్రానులు నిర్దిష్టమైన దూరాల్లో తిరుగుతాయని నేర్చుకున్నాం.
ఎలక్ట్రాను తన కక్ష్యలోనే ఉంటుందని నేర్చుకున్నాం. ఆ ఎలక్ట్రాను వేడి వల్ల లేదా రసాయనికచర్య వల్ల ఉత్తేజితమైతే, అది కొంత శక్తిని విడుదల చేసి పై కక్ష్యలోకి వెళ్తుంది. కొంత శక్తిని ఇచ్చేసి కింది కక్ష్యకి వచ్చేస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎలక్ట్రాను ఒక కక్ష్య నుండి ఇంకొక కక్ష్యకు, (మధ్యనున్న స్థలంలో నుండి వెళ్ళకుండా) దూకుతుంది. ఒక క్షణం ఒక కక్ష్యలో ఉంటుంది, మరుక్షణం వేరొక కక్ష్యలో ఉంటుంది. దీన్నే క్వాంటం జంప్ అంటాం. క్వాంటం జంప్ అంటే మధ్య నుండి వెళ్ళకుండా ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి మారడం.
పదార్థ కంపనశక్తి
శక్తి తరచుగా కంపిస్తూ వివిధరూపాలు తీసుకోవడాన్నే పదార్థం అని అంటారు. ఈ తరచుదనం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కంపనాలు మన కంటికి కనిపించవు. కదలిక చాలా వేగంగా ఉంటే విడిగా ఉన్న ఫలకాల్లో వస్తువులని కళ్ళు చూడలేవు. కళ్ళకి ఒక వస్తువు ఇంకొక దాంట్లో నిరంతరం విలీనం అవడమే కనిపిస్తుంది.
అలాగే శక్తికంపనాలు కంటికి కనిపించవు. అది ఘనపదార్థం కింద కనిపిస్తుంది. శక్తి స్థూలరూపపదార్థం. పదార్థం సూక్ష్మరూపం శక్తి. సూక్ష్మరూపంలో ఉన్న మనస్సుకి స్థూలరూపమే శరీరం. స్థూలమైన శరీరానికి సూక్ష్మరూపం మనస్సు. వ్యక్తి వ్యక్తికి మనస్సు పని చేసే విధానం వేరుగా ఉంటుంది అని అర్థం చేసుకోండి.
మనుష్యుల మధ్య పరస్పర లేదా అంతరచర్యలు కూడా శక్తి అంతరచర్యలే. ఉదాహరణకి, పరమాణువులో కేంద్రకం చుట్టూ మేఘంలా ఉన్న ఎలక్ట్రానులను, ఒక ఫుట్ బాల్ క్షేత్రంతో పోల్చవచ్చు. కేంద్రకం ఆ క్షేత్రంలో ఒక వేరుశెనగ గింజంత ఉంటుంది. చుట్టూ ఉన్న ఎలక్ట్రానులు, క్షేత్రంలో ఉన్న ఖాళీ స్థలంలా ఉంటాయి. ఇంకొక పోలిక ఏమిటంటే భూమి మీద ఉన్న పరమాణువుల మధ్య ఖాళీస్థలం తీసేస్తే అది ఒక పంచదార క్యూబ్ లా తయారవుతుంది. ఈ ఉదాహరణలో ఘనపదార్థంలా కనిపించే ఫుట్ బాల్ క్షేత్రం నిజానికి పెద్ద ఖాళీ స్థలాల్లో ఉన్న ఎలక్ట్రాను మేఘాలు. ఒక దానిలో ఒకటి అంతరచర్యలో ఉన్నాయి. ఇదే విధంగా, మిగతావారితో మన పరస్పర అంతరచర్యలు కేవలం శక్తి అంతరచర్యలే. ఈ చర్యలో శక్తిని ఉపయోగించటం జరుగుతుంది. మీరు కొంత శక్తిని ఇచ్చి వేరొక వ్యక్తి లేదా వస్తువు నుండి శక్తి తీసుకుంటారు.
సాధ్యమైనవి అనంతం
అసలు పదార్థానికి శక్తికి ఉత్పత్తిస్థానం అంటే మూలం ఏది? శరీరానికి, మనస్సుకి ప్రారంభం ఎక్కడ? వస్తువుల్లో ఎక్కడి నుండి శక్తి వస్తుంది? ఈ కనిపిస్తున్న ప్రపంచం వెనక ఉన్న అసలు సత్యం ఏమిటి? మన ఇంద్రియాలతో నిజరూపాన్ని చూడలేకపోతే, ఆ నిజస్వభావం ఏమిటి?
శివసూత్రాల్లో ఈ ప్రశ్న ఉంది. శివుడి భార్య పార్వతీదేవి, 'ఈ అద్భుతమైన విశ్వం స్వభావం ఏమిటి?' అని అడిగింది.
దానికి సమాధానంగా శివుడు జ్ఞానోదయం పొందడానికి 112 సాంకేతికధ్యానపద్ధతులను చెప్తాడు. అవి సాధన చేస్తే, ప్రశ్నకు అనుభూతి రూపంలో సమాధానం వస్తుంది.
సత్యం గురించి ఈ ప్రశ్న, మనని పదార్థానికి, శక్తికి అతీతంగా, కాలం, స్థలం, అవధులకి అతీతంగా తీసుకువెళ్తుంది. ఈ ప్రపంచంలో అన్ని రకాల శక్తి బీజరూపంలో ఉన్నాయి. అదే ఆలోచనలకి మొదలు, ఈ భౌతికప్రపంచంలో జరిగే సంఘటన లన్నింటికీ అదే మూలం.
ప్రపంచానికి అతీతంగా, తర్కం ఉండదు. కారణం - ప్రభావాలకి సంబంధం ఉండదు. ఒక సంఘటన జరగడం, ఇంకొక సంఘటన జరగడానికి కారణం. రెంటింటికీ పరస్పరసంబంధం
సమష్టిచైతన్యంలో మీరూ ఒక భాగం ఉంటుంది. ఈ పరస్పరసంబంధం కాలం, స్థలం మీద ఆధారపడదు. అంటే మనం బీజం అనేది, అనంతశక్తి అనే మహాసముద్రం. అక్కడి నుండి సంఘటనలు కెరటాల రూపంలో పైకి లేస్తాయి.
అనంతవిశ్వం, అందులో జరిగే సంఘటనలు, అన్నీ కారణం లేని శుభకరాలే, మహాసముద్రంలో వస్తున్న కెరటాల వంటివి. విశ్వం అనేది పరమానందం, ఇది మహాసముద్రం. ఏ కారణం లేని పొంగి పొర్లుతున్న బ్రహ్మానందం నుండి, విశ్వశక్తి అనే మహాసముద్రం లోంచి సృష్టి అనే కెరటం లేస్తుంది. అసంఖ్యమైన విశ్వాల్లో, అనంతమైన రూపాల్లో భగవంతుడు ఆడుకున్న ఆటే జీవం అంటే. ఆట వదిలేసి, ఆ విశ్వశక్తిలో కలిసిపోవడమే లయం అంటారు.
లయం చెందడం అంటే, ఆ పరబ్రహ్మస్థితికి తిరిగి చేరుకోవడం. ఏ కారణం లేకుండా మళ్ళీ ఆట మొదలవుతుంది. ఇది ఇలా కొనసాగుతుంది. మనం విశ్వంలో జరిగే అనంతమైనవాటిని ఫలితాల కింద చూస్తాం.
సహజప్రకృతి
మన వ్యక్తిగతగ్రహింపును బట్టి మనం ఈ కారణం లేని, పరమానందమైన విశ్వశక్తి ఆటని చూస్తాం. ఆ అద్భుతమైన ఆటని మన గ్రహింపు శక్తి ఒక స్థానికసంఘటనలా చూపిస్తుంది. ప్రతివ్యక్తి ఆ అందమైన సంఘటనని తన గ్రహింపుకి అనుగుణమైన సత్యాన్ని చూస్తాడు.
ఒకరు నన్ను అడిగారు 'నేను ఇక్కడ ఈ బల్లను చూస్తాను. ఈ గదిలో ఉన్న వ్యక్తులు అందరూ, అదే బల్లను చూస్తారు. అప్పుడు, ఈ బల్ల నిజరూపం కాదని ఎలా అనగలరు?' అని. అర్థం చేసుకోండి! 'నీవు చూసే ఈ బల్ల, ఇంకొకరు చూసేది ఒకలా ఉండవు. ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ బల్లను వేరేగా చూస్తారు. అదే అసలు నిజం' అదే నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను.
మనస్సు గ్రహించినంతసేపూ, గ్రహించబడింది అంతిమసత్యం కాదు, కేవలం అనంతమైన చేతనస్థితి ఉన్నవారే, సత్యాన్ని అసలు జరిగినట్టుగా గ్రహించగలరు. అతను దాన్ని మాటలలో వివరించలేడు. మాటలు కాలానికి, స్థలానికి అతీతమైనవాటిని వివరించలేవు, అతను మీకు అదే అనుభూతి కలిగేవరకు వేచి ఉండని చెప్పగలడు. అందుకే శివభగవానుడు వేదాంతం నుండి సమాధానాలు ఇవ్వటం లేదు, ధ్యానపద్ధతులను చెప్పాడు. విశ్వశక్తిస్వభావం, సత్యాన్ని అనుభూతి చెందడానికి, సూటిగా, సాంకేతికపద్ధతులను శివుడు దేవికి చెప్పాడు.
ఈ విషయాన్ని శక్తి - పదార్థం అనే ఆధారం తీసుకుని వివరిస్తాను. నిజానికి పదార్థం
- శక్తిరూపం. ప్రాచీనభౌతికశాస్త్రం, ఎలక్ట్రాను ఒక కణం అని చెప్తుంది. కాని క్వాంటం భౌతికశాస్త్రం, అది ఒక తరంగం అని చెప్పింది, వేరు పరిస్థితులలో ఎలక్ట్రాను, కణస్వభావాన్ని వ్యక్తపరుస్తుంది. భౌతికశాస్త్రవేత్తలు, ఎలక్‌ట్రానుకి 'కణం - తరంగం'గా రెండు స్వభావాలు ఉన్నాయి అని తీర్మానించారు.
సాధ్యాన్ని నిజం చేసే పరిశీలన
ఎలక్ట్రాను ఒక కణం అయితే అది ఎక్కడ ఉంటుంది? అది ఒక తరంగమైతే దాని వేగం ఎంత? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆశ్చర్యానికి దారి తీస్తాయి. ఈ కణం - తరంగం అనేది, కణమైనా లేదా తరంగమైనా కావచ్చు లేదా ఏకకాలంలో రెండు కావచ్చు. మీరు ఎలక్ట్రాను, స్థానం, వేగం ఒకేసారి కనుక్కోలేరు. స్థానం కనుక్కునే లోపల వేగం మారిపోతుంది. వేగం కనుక్కునే సమయంలో, స్థానం మారిపోతుంది. దీన్నే శాస్త్రంలో హైసన్బెర్గ్ అనిశ్చయనియమమని అంటారు.
కణం - తరంగం అనేది పరిశీలించేవరకు ఏకకాలంలో కణం, తరంగం అవచ్చు. ఈ పరిశీలనని, మనం కారణం లేకుండా విశ్వంలో జరిగేవాటిని పరిశీలనతో జోడించవచ్చు. మనం పరిశీలించేటప్పుడు, మన సంస్కారాల్లో, మనలో లోతుగా పాతుకుపోయి ఉన్న జ్ఞాపకాల్లో, పరిశీలిస్తాం. ప్రతి ఒక్కరి పరిశీలనా, వారి సంస్కారాలు లేదా ఎన్గ్రామ్స్తో ప్రభావితమవుతుంది. దీన్ని ఆధారం చేసుకుని, జరిగేదాన్ని తమ అనుభవానికి సరిపడే విధంగా నిజం అనుకుంటారు.
కణం - తరంగం విషయంలో పరిశీలన తరంగం - కణాన్ని, తరంగంలోకి లేదా కణంలోకి వెళ్ళిపోయేట్టుగా చేస్తుంది. ఇది ఎర్విన్స్క్రోడ్జ్ Erwin Scrodurge అనే భౌతికశాస్త్రజ్ఞుడు తన ఊహించిన పిల్లి ప్రయోగంలో చూపించాడు.
మీరు ఒక పిల్లిని, చిన్న సీసాతో విషాన్ని ఒక అరలో పెట్టి మూశారనుకోండి. బయట ఉన్న పరిశీలకుడికి లోపల పిల్లి చచ్చిపోయిందో లేదా బతికీ ఉందో అన్నది తెలియదు. మనకు తెలియదు కాబట్టి, పిల్లి బతికి ఉంది, చనిపోయిందని రెండూ అనుకోవచ్చు. ఇది సంభావ్యతల వివరణ, అందులో చనిపోయే, బ్రతికివున్న రెండు సంభావ్యతలు ఉంటాయి.
మీరు అరను తెరచి, పిల్లి స్థితిని చూడాలనుకుంటే, అరను తెరవడమే, పిల్లి స్థితిని మార్చేస్తుంది. మనం అరని బలవంతంగా తెరచేటప్పుడు, ఆ విషం సీసా పగిలి, పిల్లి చనిపోవచ్చు. అసలు జరిగింది ఏమిటో పరిశీలించకుండా, ఉంటే, ఎప్పటికీ ఏం జరిగిందో తెలియదు.
దీన్ని బట్టి రెండు స్థితులు ఒకేసారి సంభావ్యమని మనకు అర్ధమవుతుంది. పరిశీలించడమే, ఈ సంభావ్యతని ప్రత్యేకమైన సత్యానికి మారుస్తుంది.
నేను మీకు అందమైన సత్యాన్ని, పరిశీలన అన్నది ఎలా మార్చేస్తుందో దానికి ఇంకొక శాస్త్రీయప్రయోగం చెప్తాను. మీరు - కాంతిలో రెండు చీలికల ప్రయోగం (double-slit ex-periment) గురించి విని ఉండవచ్చు. ఈ ప్రయోగంలో కాంతిపుంజాన్ని రెండు చీలికలు ఉండే రేకు మీద పడేట్టు చేస్తారు. రెండో వైపున ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేటు మీద, రెండు చీలికల నుండి వెళ్ళిన కాంతి పడుతుంది. ఒకే చీలిక తెరిచిఉంటే, ఫోటోగ్రాఫిక్ ప్లేటు మీద, కాంతి గీతలా ఏర్పడుతుంది. రెండు చీలికలు తెరిచి ఉంటే, ఆ ప్లేటు మీద రెండు గీతలు ఏర్పడతాయి అని అనుకుంటాం, కానీ చాలా గీతలు, గాఢంగా లేనివి, మారుతున్న పరిమాణం గల నల్లనివి ఏర్పడతాయి. ఇదే కాంతివ్యతీకరణనియమం, ఇందులో కాంతితరంగాలు కింద ప్రవర్తించి, ఒకదానితో ఒకటి జోక్యం చేసుకుంటాయి. కాంతిపుంజవేగాన్ని బాగాతగ్గించినప్పుడు, ఫోటాన్లు వెళ్ళి ప్లేటును తాకితే, వ్యతీకరణం జరగకుండా, చీలికలో ఏకీభవించే కాంతి గీత కనపడాలి, కాని ఇప్పుడు కూడా కాంతి వ్యతీకరణమే కనిపించింది.
ఇది ఎలా సాధ్యం? అక్కడ ఒక ఫోటానే ఉంది. అది వెళ్ళి దాంట్లోనే వ్యతీకరణ చెందాలి కదా? ప్రతి ఫోటాను రెండు చీలికల నుండి వెళ్ళి, అదే సమయంలో అన్ని దారుల నుండి ఫోటోగ్రాఫిక్ ప్లేటు వైపు వెళ్తుంది అని ప్రయోగంలో నిరూపించారు.
ఇది ఎలా జరుగుతుందో చూడడానికి, ఒక ఫోటాను ఏ దారిలో వెళ్తుందో తెలుసుకోవడానికి అనేకప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగం చేసినప్పుడు, ఏదో విధంగా ఫోటాన్ల త్రోవ చెదరగొట్టబడేది. పరిశీలించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్లేటు మీద రెండు గీతలు కనిపించేవి. వాటిని కొలవడానికి ప్రయత్నిస్తే, ఎన్నో గీతలు తక్కువ గాఢంగా ఉన్నవి, నల్లనివి కనిపించేవి.
ఒక ఫోటాను ఒకేసారి చాలా దారులలో ప్రయాణిస్తుంది. కాని, వాటిని కొలవడానికి ప్రయత్నిస్తే, ఒకే బాటలోకి కలిసిపోతాయి. అలాగే మనం అనంతమైనవాటిని విశ్వం అనే మహాసముద్రంలో చూడాలని ప్రయత్నిస్తే, అది మన పరిమితమైన మనస్సుకి పరిమితంగా కనిపిస్తుంది.
ఒక జెన్ గురువుని అతని శిష్యుడు, 'అసలు బాట ఏది' అని అడిగాడు. 'ప్రతి రోజూ జీవితమే బాట' అని గురువు సమాధానం ఇచ్చారు. 'దాన్ని అధ్యయనం చేయొచ్చా?' అని శిష్యుడు అన్నాడు.
గురువు 'నువ్వు అధ్యయనం చెయ్యాలని ప్రయత్నిస్తే, దానికి నువ్వు చాలా దూరంగా ఉంటావు' అని అన్నాడు. 'నేను అధ్యయనం చెయ్యకపోతే అదే బాట అని ఎలా తెలుస్తుంది?' అని శిష్యుడు అడిగాడు.
గురువు: 'ఆ దారి ప్రపంచానికి చెందదు. అది కనిపించని ప్రపంచానికి కూడా చెందదు. కనిపించేది మోసం. కనిపించనిది చైతన్యం లేనిది. నీకు అనుమానం లేకుండా నిజమైన పథాన్ని చేరాలంటే, ఆకాశానికి ఉన్నంత స్వేచ్ఛతో ఉండు. దానికి మంచిది, మంచిది కాదు అని పేరు పెట్టకు', అని జవాబు ఇస్తాడు.
విషయగ్రహణస్థితి
మనం విషయాలని గ్రహించినప్పుడు, భౌతికస్థాయిలో నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. భౌతికవాస్తవాన్ని గ్రహించినప్పుడు, మెదడులోని వేర్వేరు భాగాలలో నాడీవ్యవస్థ నిర్మాణానికి మూలమైన నాడీకణాలు ఒక్కసారిగా ప్రేరణ పొందటం చేత నరాల క్రియాశీలతలో మార్పు కనబడుతుంది. దీని వల్ల క్రమం లేకుండా కాంతి, విశేషమైన ఆకారాల్లో బొమ్మలని కలిగిస్తుంది. మన స్పర్శేంద్రియాలు గ్రహించిన ప్రతి విషయం, శబ్ద, స్పర్శ, గంధ, రుచి లేదా దృష్టి అనుభవం కింద మారుతుంది.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే పరిశీలించి, గ్రహించే ముందు ప్రపంచం, మీరు అంటే చూడబడేది, చూసేవారు ఇద్దరూ కల్లోలస్థితిలో ఉంటారు. గ్రహించిన తరువాత కల్లోలస్థితి ఉన్న రెండు అంటే బాహ్యప్రపంచంలో చూడబడింది, చూసినవాడు, చూసే విధానంలో ఒకేసారి కొంత క్రమం ఏర్పడుతుంది. చూసే క్షణంలో, చూడబడిన దాని సంభావ్యత ఒక విశేషమైన ఆకారంలోకి మారిపోతుంది.
భగవద్గీతలో కృష్ణభగవానుడు తన శిష్యుడైన అర్జునుడికి తన విశ్వరూపదర్శనం అనుభూతిని ఇవ్వాలని అనుకుంటాడు. అప్పటి వరకు అర్జునుడు ఆరు అడుగుల అందమైన స్నేహితుడిని చూస్తాడు. అర్జునుని కోరిక మీద కృష్ణుడు తన విశ్వరూపం అర్జునుడు చూడడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకొని, ఆ అనుభూతిని అతనికి ఇవ్వడానికి నిర్ణయించుకుంటాడు. అర్జునుడు కృష్ణుడిలో మొత్తం విశ్వం అల్లకల్లోలంలో ఉండడం చూస్తాడు.
అర్జునుడు 'ఓ దేవా, నీ శరీరంలో నాకు అందరు దేవుళ్ళు, దేవతలు, కనిపిస్తున్నారు. నాకు అందరు ఋషులు, దివ్యమైన సృత్తులు కనిపిస్తున్నాయి. విశ్వం అంతటికి అయిన ఓ భగవంతుడా, నేను చాలా చేతులు, పొట్టలు, మొహాలు, కళ్ళు నీ అనంతమైన ఆకారంలో చూస్తున్నాను.
'ఓ విశ్వరూపుడా, నీ ఆరంభం, మధ్యభాగం అంతం నాకు కనిపించటం లేదు' అని ఎలుగెత్తి కృష్ణుడితో చెప్పాడు. అర్జునుడి వివేకం విషయాల మీద నియంత్రణ కోల్పోయి ఆ విశ్వరూపానుభూతిని భరించలేకపోతాడు. అతనికి సమతాస్థితిని ఇమ్మని వేడుకుంటాడు, అంటే అతని మనస్సు అతని వివేకనియంత్రణలో ఉండాలని అర్థం. అతనికి జరిగే విషయాల, కారణం
- ప్రభావం తెలుసుకొని అవి తన నియంత్రణలో ఉన్నాయన్న భావన కలగాలి. ఆ అనుభూతి అతణ్ణి కారణం - ప్రభావం అనే తర్కగ్రహణం నుండి పూర్తిగా చీల్చేసింది. ఎంత వరకు కారణం - ప్రభావం అనే తర్కం మీ నియంత్రణలో ఉంటుందో మీరు నిజాన్ని గ్రహిస్తున్నారన్న భావన కలుగుతుంది. మీ అహం దృఢంగా, నిశ్చలంగా ఉంటుంది. ఏ క్షణంలో మీ జ్ఞానం కుదపబడుతుందో, అప్పుడు మీకు చాలా భయం కలుగుతుంది. మీరు మహాసముద్రంలో కేవలం ఒక బొట్టు మాత్రమే అని మీకు అనిపిస్తుంది. అర్జునుడు చూసింది సంపూర్ణమైన యథార్థం. కాని అదే నిజం, అతని తర్కానికి అందలేదు కాబట్టి అతను భయపడ్డాడు. అర్జునుడు అహం వల్ల తన పంచేంద్రియాలు గ్రహించే రూపంలోకి మారిపోమని కృష్ణుడిని వేడుకుంటాడు.
అసలు ప్రదేశం - సమయం
1 డి, 2 డి, 3 డి ప్రపంచాలు
బిందువు ఒక పరిమాణం గల వస్తువు. బిందువు ఒక దిశలో కదిలి గీత ఏర్పడుతుంది. ఒక గీత జరిగితే, రెండు పరిమాణాలు ఉన్న వస్తువు ఏర్పడుతుంది. ఒక గీత అదే దిశలో జరిగితే గీతగానే ఉండిపోతుంది. ఒక గీత అది ఉన్న దిశలో వేరే దిశలో జరిగితే ఒక సమతలం ఏర్పడుతుంది.
| . | . . . . . . . . . . . . . . . . . . . . . . . . . | ____________________ |
|---|---|---|
| బిందువు | రేఖను గుర్తిస్తున్న బిందువులు | రేఖ |
అలాగే ఒక సమతలం అది ఉన్న దిశలో కాకుండా కదిలితే ఘనపదార్థాన్ని అంటే మూడు పరిమాణాలు ఉన్న వస్తువు ఏర్పడుతుంది.

అందుకే ఒక గీతలో అనంతమైన బిందువులు ఉంటాయి.
ఒక సమతలంలో అనంతమైన గీతలు ఉంటాయి, ఒక ఘనపదార్థంలో అనంతమైన సమతలాలు ఉంటాయి.
అలాగే నాలుగు పరిమాణాల ప్రదేశాన్ని అనంతమైన మూడు పరిమాణాలు ఉన్న ప్రదేశాల కింద ఊహించుకోవచ్చు.

ఇప్పుడు మనం ఎక్కువ పరిమాణాలున్న వస్తువుల్ని తక్కువ పరిమాణాల నుండి ఎలా నిర్మించామో అలాగే, తక్కువ పరిమాణాల్ని ఎక్కువ పరిమాణాలు గల ప్రదేశం భాగాల కింద తీసుకోవచ్చు.
ఉదాహరణకి రెండు గీతలు ఖండించుకుంటే బిందువు ఏర్పడుతుంది. అంటే బిందువు ఒక గీతలో భాగం. ఒక గీత సమతలంలో భాగం. ఒక సమతలం ఘన పదార్థంలో భాగం. అలాగే ఒక ఘనపదార్థం, నాలుగు పరిమాణాలు ఉన్న వస్తువులో భాగం, మన మూడు పరిమాణాలు ఉన్న ప్రదేశం, నాలుగు పరిమాణాలు ఉన్న ప్రదేశంలో భాగం. పి.డి. ఊస్పెన్స్కీ తన పుస్తకంలో వీటిని చాలా అందంగా వివరిస్తారు. ఆయన, విడిగా మూడు పరిమాణాలు ఉన్న వస్తువులు, ఉదాహరణకి మనుష్యులు, నాలుగు పరిమాణాలు ఉన్న వస్తువుల్లో భాగమై ఉండవచ్చు అని అంటారు.

దీన్ని ఆయన చక్కని ఉదాహరణతో వివరిస్తారు.
క్షిితిజసమాంతరంగా ఉన్న ఒక సమతలం చెట్టు పై భాగాన్ని ఖండిస్తే, ఆ సమతలం పై ఉన్న కొమ్మలన్నీ ఒక దానికి, ఇంకొక కొమ్మకి సంబంధం లేకుండా వేరుగా


కనిపిస్తాయి. కాని మూడు పరిమాణాలు ఉన్న ప్రదేశం నుండి చూస్తే, ఇవి అన్నీ ఒక చెట్టు భాగాలే అని తెలుస్తుంది.
నాలుగు పరిమాణాలున్న ప్రదేశం - కాలం
నాలుగు పరిమాణాలు ఉన్న ప్రపంచంలో, ప్రదేశంలో గరిష్ఠసంఖ్య ఉన్న పరిమాణాలు మూడే, కాలం నాల్గవ పరిమాణం. అందుకే నాలుగు పరిమాణాలు ఉన్న ప్రపంచాన్ని, ప్రదేశం - కాలం Continuum (సాతత్యం) కింద తీసుకోవచ్చు. కాలాన్ని, ప్రదేశపు నాల్గవ పరిమాణం అనవచ్చు.
మనం కాలాన్ని మూడు రూపాల్లో చూస్తాం - భూత, వర్తమాన, భవిష్యత్తులు. మనం భూతకాలం గతించింది, ఇంక ఉండదు అనుకుంటాం. భవిష్యత్తు జరగలేదు కాబట్టి అది ఉండదు. అందుకే జరుగుతున్న వర్తమానం, లేని భవిష్యత్తు, ఇంకొక లేని భూతకాలంలోకి మారుతోంది.
మూడు పరిమాణాలున్న ప్రపంచంలో ఒక చెట్టు కొమ్మలు రెండు పరిమాణాలున్న ప్రపంచంలో వేరుగా కనిపించేవి, మూడవ పరిమాణంలో ఒకటిగా కలిసి ఉన్నట్టు కనిపిస్తాయి. ఇదే విధంగా మనం ఉండే తలం (స్థితి) పైకి వెళ్ళే చైతన్యాన్ని ఊహించుకుంటే, చైతన్యం నాల్గవ పరిమాణం అయిన కాలాన్ని అవిచ్ఛిన్నంగా చూస్తుంది. భూత, వర్తమాన, భవిష్యత్తులు అన్నీ ఏకకాలంలో ఉంటాయి. మామూలు చైతన్యం ఏ సంఘటనలనైతే విడిగా నియమితకాలాల్లో చూస్తుందో, అవి ఈ చైతన్యానికి ఏకకాలంలో జరిగే సంఘటనలుగా కనిపిస్తాయి.
మూడు పరిమాణాలు ఉన్న వస్తువు కాలంతో కదిలితే నాలుగు పరిమాణాలున్న వస్తువుని ఏర్పరుస్తుంది. మనలో పసి వయస్సు నుండి యౌవనంలోకి యౌవనం నుండి ప్రౌఢత్వంలోకి, ప్రౌఢత్వం నుండి వార్ధక్యంలోకి వెళ్ళినప్పుడు కాలంలో మనకు గమనం కనిపిస్తుంది. కాని మన గ్రహింపు పరిమితం కాబట్టి మనకు ఈ నాలుగు పరిమాణాల శరీరం కనిపించటం లేదు. మనం మూడు పరిమాణాల లోకంలో ఉంటున్నాం కాబట్టి మనకు నాలుగు పరిమాణాల శరీరంలో భాగంగా మూడు పరిమాణాలు ఉన్న శరీరాన్ని చూడగలం. అది సినిమా రీలులో వరుసగా ఉన్న బొమ్మల్లో ఒక బొమ్మలా ఉంటుంది.
నాలుగు పరిమాణాలు ఉన్న ప్రపంచం, మూడు పరిమాణాల్లో ఎలా గ్రహిస్తామో అని

అర్ధం చేసుకోవడానికి, ముందుగా మూడు పరిమాణాల్లో జరిగేది, రెండు పరిమాణాల ప్రపంచంలో ఎలా కనిపిస్తుందో చూద్దాం.
మీరు రెండు పరిమాణాల ప్రపంచంలో ఉన్నారనుకోండి. అంటే సమతలాలు, ఉపరితలాల లోకం, మీ జీవితం. మీరు గ్రహించేది గోడలా ఒక సమతలానికి పరిమిత మవుతుంది. ఒక చక్రం మీరు ఉండే తలానికి లంబంగా తిరుగుతాందని ఊహించుకోండి. దాని ఒకొక్క ఊచకి ఒకొక్క రంగు వేసారు.
ఆ చక్రం గమనం మీకు ఎలా కనిపిస్తుంది? ఆ చక్రం ఊచ సమతలాన్ని ఖండించినప్పుడు ఆ రెండూ ఖండించుకున్న చోట ఒక రంగు గీత కనబడుతుంది. ఒక ఊచ తరువాత, ఖాళీ ప్రదేశం వల్ల, మీకు ఏమీ కనిపించదు. అప్పుడు, ఇంకో రంగు ఉన్న ఊచ సమతలం లోంచి వెళ్తుంది. అందుకే మనకు చక్రగమనం సమానకాల వ్యవధులలో రంగుల గీతలు కింద కనిపిస్తాయి.
ఏం జరుగుతుందో అది ఇది : తక్కువ పరిమాణాలు ఉండే ప్రపంచంలో, పరిమితమైన గ్రహింపు వల్ల, ప్రదేశంలో కనిపించేదాన్ని కాలంలో జరిగేట్టుగా మారుస్తుంది. మీకు మూడు పరిమాణాలలో రెండే కనిపిస్తాయి కాబట్టి, మీ మూడవ పరిమాణం మీ సమతలాల్లో కాలంలో కనిపిస్తుంది. అందుకే అది మీకు కనిపించే రెండు పరిమాణాలకి, ప్రదేశానికి సంబంధం లేకుండా చూసి దాన్ని కాలంలో జరిగే విషయంగా గుర్తిస్తారు.
ఇప్పుడు ఒక ఆకుపచ్చ ఊచ ఆ సమతలం లోంచి వెళ్లినప్పుడు, ఎక్కడో ఒక కుక్క మొరిగింది అని ఊహించుకోండి. రెండు పరిమాణాలు ఉన్న ప్రపంచంలో, ఒక ఆకు పచ్చ గీత వచ్చినప్పుడు, కుక్క మొరగటానికి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది, కాని నిజానికి అలాంటిదేమీ లేదు.
రెండు పరిమాణాలు ఉన్న మనిషికి తనకు తెలిసిన సమతలం పైన సంఘటనలు జరుగుతాయి అంటే నమ్మకం కలగదు. మూడు పరిమాణాల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, అతను రెండు పరిమాణాల చైతన్యంతో ఉంటే సరిపోదు. అతను మూడు పరిమాణాల చైతన్యానికి ఎదగాలి. అలాగే నాలుగు పరిమాణాల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం నాల్గవ పరిమాణచైతన్యంలో ఉండాలి.
ఇది సాధ్యమా? మనం పంచేంద్రియాలతో గ్రహించే మూడు పరిమాణాల ప్రపంచం కంటే అతీతంగా వెళ్లడం సాధ్యమా? మనం కాలంలో నిమిషమాత్రం చూడగలిగిన నిజాన్ని అస్సలు చూడగలమా? వీటికి సమాధానం 'అవును' చూడగలం.
తూర్పుదేశ ఋషులు లోతుగా పరిశోధన చేసి, యథార్ధాన్ని అది ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు, అనుభూతి కూడా పొందవచ్చు అని కనుక్కున్నారు. ఇది మామూలుగా జీవితంలో జరగవచ్చు. ఈ అనుభవం వారికి కలిగింది. ధ్యానం ద్వారా మనం కూడా అదే స్థితిని అనుభవించవచ్చు.
ఒక అందమైన జెన్ కథ : ఒకసారి ఇద్దరు సైనికులు గాలిలో జెండా ఎగరడం చూసారు. ఒక సైనికుడు 'జెండా కదులుతోంది' అని అన్నాడు. రెండవ సైనికుడు 'కాదు, గాలి వీస్తోంది' అని అన్నాడు.
ఆ దారిన వెళ్ళే జెన్ గురువు ఆ ఇద్దరి వాదం విన్నాడు. ఆ సైనికులు గురువుని వారి వాదానికి తీర్మానం చెప్పమని అర్థించారు. అందులో ఒక సైనికుడు 'గురుదేవా, నేను జెండా కదులుతోంది అన్నాను. కాని అతను గాలి కదులుతుంది అని అంటాడు. ఏది సరైంది?' అని ప్రశ్నించాడు. ఆ గురువు 'మీరు ఇద్దరూ తప్పే చెప్పారు. కేవలం చైతన్యం కదులుతోంది' అని చెబుతాడు.
ఇప్పటికీ మనం జీవితంలో ప్రతి రోజూ యథార్థం అని అనుకునేది కూడా 'మిథ్య'. అది కేవలం ప్రదేశం, కాలంలో వస్తువుల గ్రహింపు వేరుగా ఉండటమే. మనం లోతుగా చూస్తే మనం ప్రపంచాన్ని గ్రహించే విధానాన్నే ప్రశ్నించుకోవాల్సివస్తుంది. మనం ఏ రకమైన చైతన్యంతో చూసినా, మనకి యథార్థం అనిపించేది, సంపూర్ణమైన యథార్థం కాదు.
యథార్థానికి పదకొండు పరిమాణాలు
మనం మూడు పరిమాణాల ప్రపంచం, నాల్గవ పరిమాణమైన కాలంలో ఉన్నామని అనుకుంటాం. నిజానికి పదకొండు పరిమాణాలు ఉన్నాయి. పొడవు, వెడల్పు, లోతు, కాలం, చైతన్యం అనేవి ప్రాథమికపరిమాణాలు. వీటి కలయిక హెచ్చు పరిమాణాన్ని ఇస్తుంది.
ఉదాహరణకి ఒక కర్రకి పొడవు, వెడల్పు, లోతు ఉంటాయి. అది ప్రదేశం, కాలాల్లో ఉంది. ఇప్పుడు, పొడవు, వెడల్పు ఉంచి, లోతు తీసేస్తే, కర్ర కనబడుతుంది, చెయ్యి అందులోంచి దూరిపోతుంది. లోతుని ఉంచి, పొడవు, వెడల్పు తీసేస్తే, ఏమీ కనిపించదు. చెయ్యి దూర్చడానికి ప్రయత్నిస్తే, ఏదో అడ్డు తగులుతుంది.
ఈ విధంగా, రకరకాలుగా కలిపితే పదకొండు పరిమాణాలు ఉన్న విశ్వం ఏర్పడుతుంది. మీరు ఈ నాలుగు పరిమాణాలు ఉన్న ప్రదేశం - కాలం కన్నా ఉన్నతమైన సమతలంలో ఉంటే మీకు పదకొండు పరిమాణాలు కనిపిస్తాయి. జ్ఞానోదయం పొందినవారు చూడగలిగినట్టు మీరూ యథార్థాన్ని చూడగలుగుతారు.
కల్లోలక్రమం - క్రమకల్లోలం
పరమాణువులో శక్తి అయినా లేదా విశ్వంలో శక్తి అయినా పెద్ద కల్లోలం కింద ఉంటుంది. ఆ గందరగోళంలో మీరు ఊహించని క్రమం ఉంటుంది. కల్లోలం ఒక క్రమంలో కదిలితే, చైతన్యాన్ని లేదా మేధని సృష్టిస్తుంది.
కల్లోలమే శక్తి
అస్తవ్యస్తంగా ఉన్నది పద్ధతి లేకుండా శక్తిమంతంగా ఉంటుంది. దేనికి క్రమం ఉంటుందో అది ఉత్సాహం కలిగించదు. మన జీవితంలో ఏదైతే అస్తవ్యస్తంగా ఉంటుందో, పద్ధతి లేకుండా ఉంటుందో, శక్తిని ప్రసరిస్తుంది. మనం పిల్లలని స్వేచ్ఛగా వదిలేస్తే, వాళ్ళు చాలా శక్తిని వెల్లడించడం మనం చూస్తాం. మన జీవితాల్లోనే, మనం ఏదైనా నియమాన్ని ఉల్లంఘించడానికి అవకాశం వస్తే మనకి ఆనందం కలుగుతుంది. మనం చాలా శక్తిని వెల్లడిస్తాం. కల్లోలానికి శక్తితో సంబంధం ఉంది (అస్తవ్యస్తంలో ఉన్న స్వేచ్ఛ, నియమాలతో బంధింపబడి లేకపోవటం, ఒక క్రమం లేకుండా).
మనం స్వేచ్ఛగా వేసే అడుగుల్లో క్రమం లేకుండా నృత్యం చేస్తే మనం చాలా శక్తిమంతులై ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నియమాల్లో బంధింపబడి లేం. అస్తవ్యస్తంలో ఉన్న స్వేచ్ఛ దీనికి కారణం. ఏ క్షణమైతే బంధింపబడి ఉన్నామని తెలుస్తుందో, మనకి ఉత్సాహం ఉండదు. భౌతికంగా మనని అది ప్రభావితం చెయ్యకపోయినా మనలో నిరుత్సాహం ప్రవేశిస్తుంది. ఉదాహరణకి మీరు ఒక హాలులో కూర్చున్నారు, అది తెరిచి వుంది. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోవచ్చు, మీరు స్వచ్ఛతతో, జీవంతో, ఆనందంగా ఉంటారు. అకస్మాత్తుగా హాలు తాళం వేసారు, మీరు హాలు నుండి బయటికి వెళ్ళలేరు అన్న విషయం మీకు తెలుస్తుంది, మీరు సుఖంగా అక్కడ కూర్చోగలరా? లేదు!
ఏ నియమమైనా స్వేచ్ఛను పోగొడుతుంది, శక్తిని తగ్గిస్తుంది. ఏ విధమైన నిబంధనైనా మీ శక్తిని తగ్గిస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా, 'నువ్వు ఆ స్థానంలో కూర్చోవద్దు' అని అంటే మీకు అదే చోట కూర్చోవాలి అనిపిస్తుంది. ఆ నియమం ఏర్పడేవరకు మీరు అక్కడ కూర్చోవాలి అని అనుకోరు.
మనం బంధితులమని, స్వేచ్ఛగా ఉన్నాం అన్న మానసికసంతృప్తి కోసం, పొగ తాగే అలవాటు మానుకోం. మిమ్మల్ని మీరు చేతనంగా పరిశీలించుకుంటే మీరు నిబంధనల్ని అతిక్రమించినప్పుడు, అంటే మీకు ఒక క్రమం లేకుండా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుందన్న విషయం, అర్థమవుతుంది.
అస్తవ్యస్తమే ఒక క్రమం
మొత్తం విశ్వమంతా అస్తవ్యస్తమే. ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు తిరుగుతున్నాయి. ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్, దారి స్తంభాలు, పోలీసులు లేకపోయినా, గ్రహాలు ఎంతో క్రమంలో అందంగా కదులుతున్నాయి. అదే విధంగా, క్వాంటం భౌతికశాస్త్రంలో అతి చిన్నదైన కణానికి, తరంగధర్మాలు కూడా ఉన్నాయి. దానికి సంభావ్యతలు కూడ అనేకం. ఆ అస్తవ్యస్తంలో ఒక క్రమం ఉన్నది. సృష్టి అంతా క్రమం లేకుండా అస్తవ్యస్తంగా ఉంటే, అది విచ్ఛిన్నానికి దారి తీస్తుంది. అస్తవ్యస్తం క్రమంలో ఉండడాన్నే 'విశ్వమేధ' అని నేను అంటాను.
మనం నివసించే భూమినే తీసుకుందాం, దీని మీద ఉష్ణోగ్రత లేదా నీరు లేదా గాలి, అగ్ని - ఏది లేకపోయినా ఇప్పుడు మనం ఉంటున్నట్టు ఉండలేం. ఇది అకస్మాత్తుగా సంభవించింది కాదు. మొత్తం అస్తవ్యస్తానికి ఒక క్రమం ఉంది.
విశ్వంలోని అస్తవ్యస్తానికి ఒక క్రమం ఉంది. పరమాణువులో క్రమం ఉంది అని శాస్త్రం ఇంకా నిరూపించలేకపోయింది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం వివేకానికి అతీతంగావెళ్ళాలి.
ఋషులకి, వేదకాలం నాటి శాస్త్రవేత్తలకి, అస్తవ్యస్తంలో ఒక క్రమం ఉందని స్పష్టంగా తెలుసు. దీన్నే వారు 'విశ్వమేధ' అంటారు. లేజరు మేసర్ మీద పని చేసిన, నోబుల్ బహుమతి గ్రహీత, భౌతికశాస్త్రజ్ఞుడు అయిన డా. చార్లెస్ టౌన్స్ని కలిసే అవకాశం నాకు వచ్చింది. ఆయన ఇలా అన్నారు - 'ఈ విశ్వమంతా ప్రత్యేకమైంది. విశ్వం అంతా ఒక ఆధ్యాత్మిక జీవి. దానికి సొంత వివేకం ఉంది. నేను అది మాటల్లో చెప్పలేకపోయినా, అది ఒక వివేకం గల ఆధ్యాత్మికజీవి.'
విశ్వానికి సొంత మేధ ఉంది. అది కేవలం అధికారం కాదు శక్తి కూడా. శక్తికి, అధికారానికి తేడా ఉంది. అధికారం ప్లస్ వివేకం శక్తి. వివేకం లేని శక్తి అధికారం. విశ్వశక్తి అనేది కేవలం బలం కాదు. అది శక్తితో కూడిన వివేకం. అది మీ ఆలోచనలకి, ప్రార్థనలకి స్పందిస్తుంది.
ఒక వ్యక్తి బుద్ధుడిని 'ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరు?' అని అడిగారు. బుద్ధుడు 'విశ్వమే తన సృష్టికర్త' అని సమాధానమిచ్చాడు.
సృష్టి, సృష్టికర్త వేరుగా ఉంటే, సృష్టికర్త వివేకవంతుడు, సృష్టికి వివేకం లేదు అని అర్థం. విశ్వానికి వివేకం ఉంది కాబట్టి విశ్వమే తన సృష్టికర్త. విశ్వం జీవిస్తున్న శక్తి. మీరు ఒక జీవిస్తున్న శక్తిలో ఉన్నారు.
తైత్తిరీయ ఉపనిషత్తు చక్కగా ఇలా చెప్తుంది.
చేతనస్థితి లేదా భగవంతుడు లేదా అంతిమచేతనస్థితి నుంచి ఆకాశం, ఆకాశం నుంచి గాలి, గాలి నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి ఆహారం వచ్చాయి. ఈ విధంగా సృష్టి జరిగింది. ఇలా ఋషులు పదే పదే మనం చేతనస్థితి అంటే భగవంతుడి నుండి వచ్చామని చెప్పారు.
సృష్టి తన సృష్టికర్త, అది కేవలం వివేకాన్ని వ్యక్తపరుస్తున్నది. ఎంత కాలం మీరు విశ్వాన్ని కేవలం భౌతికం, యాంత్రికం, వివేకం లేనిది అని అనుకుంటారో, మీకు జీవితంలో ఏ లక్ష్యమూ ఉండదు. 'బలం మీ హక్కు' అన్నది అంతిమసూత్రం అవుతుంది.
ప్రపంచం కేవలం పదార్థం అని నమ్మడం మనం చేసే మొదటి తప్పు. ఈ నమ్మకం భూమి మీద హింసకి, ఉగ్రవాదానికి మూల కారణం. మనం ఎంత కాలం విశ్వం కేవలం జీవం లేని పదార్థం అని నమ్ముతామో, అది అధికారదాహాన్ని ఎక్కువ చేస్తుంది. మనం మొత్తం ప్రపంచం అస్తవ్యస్తంగా ఉంది అని అనుకుంటే, మనం సహజంగా, 'అంతా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, ఏదో ఒకటి పట్టుకుని ఎంత జీవించగలనో అంత జీవిస్తాను' అని అనుకుంటాం. మనం 'బలమే మన హక్కు' అన్న విషయంతో జీవించడానికి ఉత్సాహపడతాం. పదే పదే, విశ్వమేధ మన ఆలోచనలకి స్పందిస్తున్నట్టు నిరూపిస్తుంది. కొన్ని వందల ప్రయోగాలు మొక్కల మీద, జంతువులు, రాళ్ళు, అగ్ని, నీటి మీద కూడా చేశారు. ఇవన్నీ మన ఆలోచనలకి స్పందిస్తాయి. డా. మజర్ ఇమోటో, అనే జపాన్ శాస్త్రజ్ఞుడు నీటి మీద ప్రయోగాలు చేసి, నీరు మన ఆలోచనలకి స్పందించి, వాటికి అనుగుణంగా ఆకారాన్ని ఎలా మార్చుకుంటుందో నిరూపించారు.
మనం ఎప్పుడైతే విశ్వానికి మేధ ఉందని తెలుసుకుంటామో, శాంతిబీజం నాటబడింది అని అర్థం. మన జీవనవిధానం ప్రతిఫలిస్తుందని, మన ప్రార్థనలు ఫలిస్తాయని, జీవించే మేధ ఉందని, అస్తవ్యస్తంలో క్రమం ఉందని అర్థం చేసుకుంటే అప్పుడే మనం శాంతికి, పరమానందానికి, ఆధ్యాత్మికతకు కృషి చేస్తాం. మన సరిహద్దులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే బదులు, మన చేతనాస్థితిని వ్యాపింపచేయడానికి ప్రయత్నిస్తాం. ఏ క్షణమైతే విశ్వమే మేధ అని నమ్ముతామో, మనం హాయిగా విశ్వాన్ని నమ్ముకుని ఉండవచ్చు.
అస్తవ్యస్తంలో క్రమం
ఒక చక్కని జెన్ కథ : ఒక శిష్యుడు తన గురువుని, 'గురుదేవా, మీరు ఎలా ఆరంభించారు, ఏ పథంలో వెళ్ళారు, అంతిమ అనుభూతిని ఎలా పొందారు' అని అడిగాడు.
గురువు : 'నేను బయలుదేరినప్పుడు కొండ - కొండలా, నది - నదిలా, చెట్టు - చెట్టులా ఉన్నాయి. నేను ప్రయాణం చేసినప్పుడు కొండ - కొండలా లేదు, నది - నదిలా లేదు, చెట్టు - చెట్టులా లేదు. నేను అంతిమ అనుభూతిని పొందిన తరువాత కొండ - కొండలా ఉంది, నది - నదిలా ఉంది, చెట్టు - చెట్టులా ఉంది' అని సమాధానం ఇచ్చాడు.
మీరు పొందే ముందు, అసాధారణమైనవారని అనుకున్నా, మీరు సాధారణమైన వ్యక్తే. మీరు పొందిన తరువాత అసాధారణమైన వ్యక్తి అయినా, మీరు సాధారణమైనవారని అర్థం చేసుకుంటారు.
మీ శరీరం, మనస్సు, ఉనికి క్రమంలో ఉన్నాయి అని అనుకున్నవాటిలో అద్భుతమైన అస్తవ్యస్తం ఉంది. మీరు అస్తవ్యస్తంగా ఉన్న విశ్వం అంటే బ్రహ్మాండంలో క్రమం ఉందని అనుభూతి చెందితే, క్రమం ఉన్న శరీరం పిండాండంలా అస్తవ్యస్తంగా ఉందని తెలుసుకుంటారు.
మీరు శరీరం కాదు. మీరు సూక్ష్మప్రపంచం కాదు. మీరు సూక్ష్మరూపంలో ఉన్న బ్రహ్మాండం. మీరు విశ్వంలాగే అంతిమ అనంతమైన స్థితిశక్తి, మహాసముద్రం అని తెలుసుకుంటారు. మీరు అనుకునేదాని కంటే, అతీతమైనవారని అనుభూతి చెందుతారు.
మీ సరిహద్దు చిన్నదిగా ఉంది కాబట్టి మీరు క్రమంలో ఉన్నారనుకుంటారు. ఏ క్షణమైతే విశ్వచైతన్యాన్ని, అస్తవ్యస్తంలో ఉన్న క్రమాన్ని అనుభూతి చెందుతారో, మీ క్రమంలో ఉన్నా అస్తవ్యస్తాన్ని తెలుసుకుంటారు. మీ శరీరం లోపల ఉన్న చైతన్యాన్ని, శక్తిని తెలుసుకుంటారు. అప్పుడు మిమ్మల్ని ఎలా క్రమంలో పెట్టుకోవాలో అన్నది మీరు ఆలోచించరు. అది దానంతట అదే జరుగుతుంది. మీరు క్రమశిక్షణ కోసం పాటుపడరు. క్రమశిక్షణ మీలో వచ్చేస్తుంది.
సమష్టిచైతన్యంలో మీరూ ఒక భాగం శరీరంలోని విశ్వచైతన్యాన్ని అంటే పిండాండంలో బ్రహ్మాండాన్ని తెలుసుకుంటే, మీ శక్తి తగ్గకుండా మీరు పద్ధతి ప్రకారం ఎలా ఉండాలో నేర్చుకుంటారు. మీరు క్రమంలో ఉండాలని ప్రయత్నిస్తే, మీ శక్తిని అణిచేస్తారు, ప్రతి ఒక్కరినీ అణిచేస్తారు.
మొదట మీరు అస్తవ్యస్తంలో క్రమాన్ని తెలుసుకుంటే, ఒక ఆధ్యాత్మికవ్యక్తి అయి, ప్రేమని, పరమానందాన్ని అనుభూతి చెందుతారు. మీరు క్రమంలో అస్తవ్యస్తాన్ని తెలుసుకుంటే, మీరు కరుణ గల వ్యక్తి అవుతారు. మీరు అస్తవ్యస్తంలో క్రమాన్ని తెలుసుకున్నప్పుడు, మీరు ప్రేమ, పరమానందంలో అనుభవం చెందే భాగాన్ని అనుభూతి చెందుతారు. మీరు క్రమంలో అస్తవ్యస్తాన్ని తెలుసుకున్నప్పుడు, మీరు ప్రేమతో వ్యక్తపరిచే భాగం అంటే కరుణని వ్యక్తపరుస్తారు.
చూసేవాడు - చూడబడేది - చూడటం
చూడటం అనే కార్యక్రమంలో రెంటింటిని చూస్తాం, చూసేవాడు, చూడబడే వస్తువు. ఈ చూడటం అన్న దాంట్లో ఏం జరుగుతోంది? (ఇక్కడ కంటి ఉదాహరణ ఇచ్చినా, ఇది అన్ని ఇంద్రియాలకీ వర్తిస్తుంది).
చూసేవాడి దగ్గర నుంచి చైతన్యం చూడబడేదాని వరకు నిరంతరం వెళుతూ ఉంటుంది. ఎందుచేతనంటే అది చూసేవాడిలోనే ఉండలేదు. చైతన్యానికి అవిశ్రాంతి వల్ల చూడబడేదానికి జీవం ఇస్తుంది.
చూసేవాడి నుండి చూడబడేదానికి నిరంతరం దూకడం వల్ల చూడటం అనేది జరుగుతుంది (చూసేవాడి నుంచి, చూడబడేదానికి, చూడబడేదాని నుండి చూసేవాడికి, ఇలా చైతన్యం దూకుతూనే ఉంటుంది).

చూడబడేది చూడడం చూసేవాడు
చూసేవాడు ఎప్పుడైతే పరమానందంలో ఉండడో, అతను గెంతుతాడు. అప్పుడు చూడబడేదానికి జీవం వస్తుంది. దాన్నే చూడటం అంటారు. ఈ చూసే పనిని రెండు రకాలుగా వదిలేయవచ్చు. చూసేవాడైనా, చూడబడేదైనా, ఈ చూసే కార్యక్రమాన్ని ఆపాలి. చూడబడేదాన్ని వదిలేసినప్పుడు, అది చూసేవాడి మీద అధికారం కోల్పోతుంది. చూడబడేది ఏమీ లేదు కాబట్టి దూకడానికి అవసరం లేదు. దూకడానికి ఏమీ లేనప్పుడు, చూసేవాడు తనలోనే ఉండిపోతాడు. అప్పుడు చూడడం అన్నది జరగదు. చూడటం అనేది లేనప్పుడు, చూసేవాడు జ్ఞానోదయం పొందుతాడు.
ఏ వ్యక్తి అయితే, చూడబడేదాన్ని వదిలేసి గెంతడం మానేస్తాడో అతను సన్యాసి. ఈ చూడబడే వస్తువులకి విలువ లేదు అని నమ్మడానికి, అతను చూసే కోరికని వదిలేస్తాడు. చూడబడేది ఉత్సాహం కలిగించకపోవడం వల్ల గెంతడం ఆగిపోతుంది. అతను సన్యాసించి జ్ఞానోదయం పొందుతాడు. ఇది నిజమైన ఆత్మజ్ఞానం - జ్ఞానం.

చూడబడేది ఉండదు చూసేవాడు తనలోనే ఉండిపోతాడు
జ్ఞానమార్గంలో చూచేవాడు, బంధవిముక్తుడై కేవలం సాక్షిగా ఉంటాడు. ఈ విధంగా అతను యథార్థాన్ని కనుక్కోడానికి ప్రయత్నిస్తాడు. యథార్థాన్ని అనుభూతి చెందడానికి, చురుకైన స్వచ్ఛమైన వివేకాన్ని అభివృద్ధి చేయటమే ముఖ్యమైన ఉద్దేశం. ఆదిశంకరాచార్యులు, భారతదేశ గొప్ప జ్ఞానయోగి, జ్ఞానమార్గం అనుసరించి జ్ఞానోదయం పొందారు.
ఆయన ఆత్మజ్ఞానంపై ఎప్పుడూ రాయబడని చక్కని వాడిగా ఉన్న (వేదాలు) గ్రంథాల్ని రాసారు.
ఆ విధంగా కాకుండా చూసేవాడిని వదిలేస్తే, చూడబడేది మిగులుతుంది, రెండింటి మధ్య గెంతడం ఆగిపోతుంది. యథార్థం కనిపిస్తుంది. చూసేవాడు భక్తి వల్ల జ్ఞానోదయం పొందుతాడు.

చూడబడేది చూసేవాడు చూడబడేదానిలో కలిసిపోతాడు చూసేవాడి గుర్తింపు పోయి, చూడబడేదానిలో లయం చెందితే సర్వాంతర్యామి మీద అత్యంతభక్తి కలుగుతుంది.
అతనికి ప్రతి దాంట్లో సర్వాంతర్యామి రూపమే కనిపిస్తుంది. అతనికి గుర్తింపు ఉండదు. అతను సర్వాంతర్యామిలో లయం చెందుతాడు. భారతదేశంలో భక్తిమార్గంలో నడిచిన మీరాబాయి ఎప్పుడూ తన ఉనికిని మరిచిపోయి, భగవంతుడి ధ్యానంలో, తన్మయత్వంలో ఉండేది. తన శరీరం మీద స్పృహ లేకుండా, వీధుల వెంట నడుస్తూ భగవత్సంకీర్తన చేస్తూ వుండేది.
అందుకే, ఏదో విధంగా, చూసేవాడైన లేదా చూడబడేదాన్నైనా వదిలివేయాలి. అప్పుడే, రెంటింటి మధ్యనా గెంంతడం ఆగిపోతుంది. గెంంతడం ఆగితే చూడటం కూడా ఆగిపోతుంది.
మీరు చూసేవాడితోనో లేదా చూడబడేదానిలోనో చిక్కుకుపోతే అలాగే పూర్తిగా నిమగ్నమైపోతే, మీరు జ్ఞానోదయం పొందుతారు. మీరు చూసేవాడు, చూడబడేదాని మధ్య దూకితే మీరు దేనిలోకీ వెళ్ళకుండా రెండూ, విడిగా ఉన్నాయి అన్న భ్రమలో ఉంటారు. ఈ దూకడాన్నే మీరు 'చూడటం' అంటారు.
చూడబడేదాని తరచుదనం, చూసేవాడి కంటే ఎక్కువగా ఉంటే చూడబడేది, చూసేవాడిని మార్చేయగలదు. చూసేవాడి తరచుదనం చూడబడేదాని కంటే ఎక్కువగా ఉంటే, చూడబడేది, చూసేవాడితో మార్చేయబడుతుంది. The Morphing of conciousness into 'Seer (s) and Seen(s)'. కారణం లేని ఉప్పొంగుతున్న బ్రహ్మానందంలో నుంచి విశ్వశక్తి అనే మహాసముద్రంలో, సృష్టి అనే కెరటం లేస్తుంది.
అసంఖ్యాకమైన విశ్వాల్లో అసంఖ్యమైన రూపాల్లో సర్వాంతర్యామి ఆటనే జీవనాధారం అని అంటారు. ఆ ఆటని వదిలేసి తనలోకి తను వెళ్ళిపోవడమే లయం చెందడం. ఇది సంపూర్ణమైన స్థితిలో స్థిరపడటం. ఏ విధమైన తార్కికకారణం లేకుండా మళ్ళీ ఆట ఆరంభం అవుతుంది. ఈ విధంగా, విశ్వచైతన్యశక్తి అనేక ఆకారాలలో, లెక్క లేనన్ని చూసేవాళ్ళని, చూడబడేవాటిని సృష్టిస్తుంది. ఇదే భౌతికప్రపంచానికి మూలం.
సామూహిక చేతనస్థితి
మనం అనుకునే విధంగా మనం విడిగా సంబంధం లేని ద్వీపాల వంటివారం కాము. భౌతికంగా మనం విడిగా ఉన్న ద్వీపాల్లా కనిపిస్తాం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కావలసినా అక్కరలేకపోయినా, మనమంతా సామూహికచేతనస్థితితో కలపబడి ఉన్నాం.
ఆహారంలో విషం కలిపితే, అది తినే వ్యక్తి బాధపడతాడు, ప్రతి మనిషి కాడు. ఇలా ఆలోచిస్తే, మీరు ఒక వ్యక్తి, కాని మీరు సృష్టిలో సూక్ష్మస్థాయిలకి వెళ్తే, మీకు మనలోని అంతర్సంబంధాలు ఎక్కువ స్పష్టంగా తెలుస్తాయి. ఉదాహరణకి, గాలిలో విషవాయువులు ఉంటే, ఎవరు ఆ గాలి పీల్చేస్తే వారు బాధపడతారు, ఒకరి నుండి ఒకరు చాలా దూరంలో ఉన్నా సరే. ఈ సంబంధం గాలి పీల్చుకునే స్థాయిలో ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, సూక్ష్మశక్తి స్థాయిలలో మన మధ్య దూరం తగ్గుతుంది.
భౌతికంగా గాలి పీల్చుకునే స్థాయిల కంటే మానసికస్థాయిలో, మనం ఇంకా దగ్గరగా ఉంటాం. మానసికస్థాయి అంటే ఆలోచనల స్థాయి అని నేను చెప్పే అర్థం. మన ఆలోచనలు మననే కాకుండా, మన చుట్టూ ఉన్నవారిని, దూరంగా ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తాయి. మీ జలుబు కంటే మీ ఆలోచనలు ఎక్కువ అంటుతాయి. అంటే మీ జలుబు నుండి మనుష్యులు తప్పించుకుంటారు కాని మీ ఆలోచనల నుండి తప్పించుకోలేరు. ఉదాహరణకి ఒక ఆదివారం నాడు కాలేజీ ఫుట్‌బాల్ ఆటకి వెళ్లారనుకోండి. మీరు స్టేడియంలోకి ప్రవేశించగానే వాతావరణం అంతా ఆవేశంతో నిండి ఉన్నట్లు గ్రహిస్తారు. అక్కడున్న ఉత్సాహభరితమైన వాతావరణంతో మీరు ప్రభావితం అవుతారు. అలాగే ఎక్కడైనా సమూహంలో గొడవ జరుగుతుంటే, మతసంబంధమైన గొడవలు లేదా, ఏ ఇంట్లోనైనా మరణం సంభవిస్తే అది మీ మనస్సుని మీ అధీనంలో లేనంత ప్రభావితం చేస్తుంది.
మీకు ఎవరి వల్లనైనా జలుబు వస్తే, మీరు దాంతో కొన్ని రోజులు బాధపడిన తరువాత, పూర్తిగా కోలుకుంటారు. మీరు ఇతరుల ఆలోచనలతో ప్రభావితమైనప్పుడు, మానసికంగా బాధపడతారు. అలాగే, మీరు ఏది అనుకున్నా, మీ చుట్టూ ఉన్న వ్యక్తులని ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి మనస్సు కలుషితమై ఉంటే అతనే కాకుండా, అతని చుట్టూ ఉన్నవారు బాధపడతారు. ఉదాహరణకి చెదిరిన మనస్సు గల వ్యక్తి ఒక నగరానికి నాయకుడైతే, అతని నిర్ణయాల వల్ల నగరమంతా ప్రభావితం అవుతుంది. అతని చెదిరిన మనస్సు, తప్పు నిర్ణయాలు తీసుకుని, మొత్తం నగరానికి హాని కలిగిస్తుంది.
వ్యతిరేకాలోచన కలిగిన వ్యక్తి చేసే ప్రతి పనీ, మొత్తం జనాభా మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది.
ఉదాహరణకి, ఆటంబాంబు సంగతి తీసుకోండి. ఇది పరమాణు కేంద్రకసిద్ధాంతం మీద ఏర్పడిన ఊహాచిత్రం, ఈ బాంబుకి మూలం భౌతికశాస్త్రవేత్త (Albert Einstein ) కనుక్కున్న E=mc². దీని ఆధారంగా చెడు ఆలోచనతో రూపొందించిన ఆటంబాంబు, భూమికి నష్టం కలిగించింది. ఈ ఒక్క ఆవిష్కారం వల్ల, కేంద్రీయసిద్ధాంతం అందరికీ భయం కలిగిస్తోంది. ఈ రోజున భూమిని 700 సార్లు పదే పదే నాశనం చేసుకోవడానికి కావలసినన్ని అణ్వాయుధాలు ఉన్నాయి.
మనం విడిగా సంబంధం లేని వ్యక్తులం అని అనుకున్నప్పుడు, హాని కలిగించే విత్తనాలు నాటబడతాయి. మనం హింసాప్రవృత్తి, స్వార్థం, పెడసరం గల వ్యక్తులుగా తయారవుతాం.
సమష్టిచైతన్యంలో మీరూ ఒక భాగం
మనం కేవలం ఒక్క వ్యక్తి చైతన్యంతో జీవిస్తే, మనం ప్రతి విషయం ముక్కలు చేసి విశ్లేషిస్తాం. అలాంటి తర్కం నాశనానికి దారి తీస్తుంది. మన సమష్టిచైతన్యంతో ఉంటే, అన్నింటినీ కలపడానికి ప్రయత్నిస్తాం.
మానసికస్థాయిలోనే కాకుండా, ఇంకా లోతుగా ఉండే చేతనస్థితిలో కూడా మనం చాలా గాఢంగా కలపబడి ఉంటాం. ఈ కింది బొమ్మని చూడండి. ఈ బొమ్మ ఆధారంగా, నేను నిజాన్ని వివరిస్తాను.
ఈ ఏడు వృత్తాలూ మన శరీరంలో ఉన్న ఏడు శక్తి పొరలని సూచిస్తాయి. మొదటి పొర, భౌతికశరీరం - మీ చేతులు, కాళ్ళు మొదలైనవి. రెండవది మీ ప్రాణిక్ శరీరం - ఏ శరీరంలో అయితే ప్రాణం లేదా జీవశక్తి లేదా మీ శ్వాస ఉంటుందో ఆ శరీరం. ఈ విధంగా, ఏడు శక్తి పొరలు, మన శరీరంలో ఉంటాయి. భౌతికశరీరం పొరలో, మీరు, భగవంతుడు, నేను మూడు వేరు బిందువులుగా సూచించబడ్డాయి. ఈ భౌతిక పొరలో మన మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది.

మీరు ఇంకొంచెం లోతుగా ప్రాణిక్ శరీరం దగ్గరికి వెళితే మన మధ్య దూరం తగ్గుతుంది. ఇంకా లోతుగా ఉన్న మానసికశరీరం దగ్గరకి వెళితే, దూరాలు ఇంకా తగ్గుతాయి. మీరు ఇంకా బాగా లోతుగా వెళితే మూడు ఒక బిందువులా కలిసిపోతాయి. మధ్యలో ఉన్న బిందువు దగ్గర, మీరు, భగవంతుడు, నేను కలిసి ఒకే బిందువు కింద ఏర్పడ్డాం. మధ్యన దూరం అంతరించిపోయింది. ఇదే స్థూలస్థాయిలో కూడా ఉన్న సత్యం. మీరు విడిగా ఉన్నారన్నది కేవలం మీ భావన మాత్రమే. మీరు అనుకునేట్టు మీరు విడిగా ఉన్న వ్యక్తి కాదు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే, అతను కాని ఆమె ప్రేమ లేదా బాధ మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అది మీలోకి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందంటే, అంతరాంతరాల్లో మీరు వేరే వ్యక్తి కాదు, మీరు సామూహికచేతనస్థితిలో ఒక భాగం. మీరు బాధ కోరుకోవటం లేదు, కాని దాని నుండి తప్పించుకోలేరు. ఆధిభౌతికమైన నొప్పి లేదా మానసికబాధ లేదా ఆధ్యాత్మికబంధం, ఏదైనా సరే, అది పదే పదే అనుభూతి పొందుతారు. దీనికి కారణం, మీరు సమష్టి చైతన్యంలో భాగం అన్న విషయం మీకు తెలియకపోవడమే.
ఒక్కసారి మీరు సమష్టిచేతనస్థితిలో భాగం అని తెలుసుకుంటే, మీకు విడిగా గుర్తింపు లేదని అర్థంచేసుకుంటే, మీకు విడిగా అహంకారం ఉండదు, మీరు బాధపడరు.
ఈ విశ్వసృష్టిలో, విడిగా ఏ ఒక్కదానికీ గుర్తింపు లేదు. ఇది ఒక్కసారి మీ అనుభవంలోకి వస్తే, మీరు, బాధ, కుంగుబాటు, అనారోగ్యం అనేవాటికి అతీతంగా వెళ్తారు. దయచేసి అర్థం చేసుకోండి, మీ భావనలు మీకు ఉన్నంతసేపూ, మీరు ప్రత్యేకచేతనతో ఉండి ఏదో విధంగా బాధపడతారు. మీరు ప్రకృతిలో ఉన్న వేడిని, చలిని ఎందుకు నిరంతరం వ్యతిరేకిస్తున్నారని అనుకుంటున్నారు? ప్రకృతి ఏది మనకి ఇచ్చినా మనం వ్యతిరేకిస్తాం. ఒక అందమైన నానుడి ఉంది:
మనిషి నియమానుసారం అవివేకి
వేడిగా ఉన్నప్పుడు, చల్లదనం కావాలనుకుంటాడు
చల్లగా ఉన్నప్పుడు, వెచ్చదనం కావాలనుకుంటాడు
ఎల్లప్పుడూ లేనిది కావాలనుకోవడం
చల్లగా ఉన్నప్పుడు మీరు చలిని నిరోధిస్తారు. మీకు, సర్వాంతర్యామికి వ్యత్యాసం ఉంది అని మీరు అనుకోవడం వల్ల, ఇలా జరుగుతుంది.
నేను బాగా చలిగా ఉండే హిమాలయపర్వతాలలో తక్కువ వస్త్రాల్లో ఉన్నాను. నాకు ఏ సమస్యా రాలేదు. దీనికి కారణం నేను, వాతావరణం వేరు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ప్రకృతిలో ఒకడిని అనే భావనే నాలో ఉండేది. నేను హిమాలయాల్లో చాలా మంది సన్యాసులు ఇదే విధంగా ఉండటం చూసాను.
మీరు, వాతావరణం వేరు అని అనుకున్నప్పుడు, మీరు దాన్ని నిరోధించడం మొదలుపెడతారు.
ఇప్పుడు మీరు చాలా సరళమైన సాధన చెయ్యవచ్చు. మీకు చలిగా ఉంటే మీలో మీరు ఉండండి, ఎక్కడ చలి అనిపిస్తోందో ఆ భాగాన్ని గుర్తించండి. దాన్ని గమనించండి. అక్కడ వాతావరణాన్ని నిరోధించవద్దు, గాలిని నిరోధించకండి, ఉష్ణోగ్రతను నిరోధించకండి. మీలో ‘నేను ప్రకృతిని నిరోధించను, నేను ఉష్ణోగ్రతను నిరోధించను, నేను సృష్టిని నిరోధించను’ అనుకుని చేతనస్థితిలో నిర్ణయం తీసుకోండి. మీ శరీరం సడలుతున్నట్లు, చలి అనే భావన మాయమవుతున్నట్లు మీకు తెలుస్తుంది. మీకు పూర్తిగా సుఖం అనిపిస్తుంది.
నేను ఇలా చెప్పినప్పుడు, వ్యక్తులు ‘మీరు చెప్పినట్లు ఇప్పుడు సాధన చేస్తే బానే ఉంటుంది, నిజంగా తీవ్రమైన పరిస్థితుల్లో ఎం చెయ్యాలి?’ అని నన్ను అడుగుతారు. నిజంగా తీవ్రమైన వాతావరణ మార్పులు రాకపోయినా, మనస్సు అలాగే ఆలోచిస్తుంది. తీవ్రమైన పరిస్థితుల్లో కూడా మీరు సంపూర్ణంగా మనస్సుపెట్టి సాధన చేయవచ్చు అన్నది స్పష్టంగా తెలుసుకోండి. ఇప్పుడు సమస్య మీరు పూర్తిగా మనస్సు పెట్టలేదు, స్పష్టత లేదు. మీరు సంపూర్ణంగా ప్రకృతికి అనుగుణంగా ఉంటే, మీరు తీవ్రమైన పరిస్థితుల్లో కూడా సుఖంగా ఉండగలరు. చాలా మంది అలా చేస్తున్నారు. మీరు కూడా చేయగలరు.
గాలిలో అన్ని రకాల బాక్టీరియా, వైరసులు ఉంటాయి. ఏ క్షణంలో అయినా ఏదో ఒక వైరస్ కాని బాక్టీరియా కాని, మీలో వ్యాధికి కారణం అవుతుంది. మీరు ప్రకృతిలో పూర్తిగా శ్రుతిలో ఉంటే, వైరస్ లేదా బాక్టీరియా లోపలికి వెళ్లినా, మీకు ఏ వ్యాధి రాదు. ఏ క్షణం మీరు ప్రకృతి నుండి వేరుగా ఉన్నట్లు భావిస్తారో, ఆ క్షణం ప్రకృతి మొత్తం మీకు శత్రువు అవుతుంది. అది మీ విశ్వాసపాత్రుడైన తండ్రి, తల్లి, స్నేహితుడు గురువు.
మీరు సమష్టిచేతనస్థితితో అనుగుణంగా ఉన్నప్పుడు, అందులో భాగం అయినప్పుడు, ప్రకృతి మీ స్నేహితుడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది.
మీరు ఎప్పుడైతే సామాజికంగా లేదా ఆర్థికంగా ఏదైనా సాధించాలని అనుకుంటారో, మీరు మొత్తం సమూహంతో, సమష్టి చేతనస్థితిలో ఉంటే మీరు పొందవలసింది పొందుతారు. మీరు ఎంత కాలం ఒక వ్యక్తిగా, ప్రత్యేకమైన గుర్తింపు కావాలనుకుంటారో, స్పష్టంగా తెలుసుకోండి, మీరు ఆఫీసు లేదా ఏ ప్రదేశమైనా సరే, ఇది జరుగుతుంది. మీరు సమష్టిచేతనస్థితిలోకి అదృశ్యమైతే, మీకు రక్షణ కలుగుతుంది, మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తారు. మీరు సామాజికంగా, ఆర్థికంగా పూర్తి విజయం పొంది, సంతృప్తిగా ఉంటారు. ఆ భావనని వివరించలేరు. ఏ క్షణమైతే నిరోధించడం మొదలుపెడతారో, మీకు నరకం కనిపిస్తుంది.
ఒక చిన్న కథ : కొంత మంది వ్యక్తులు వచ్చి ఒక మనిషితో, అతని భార్య నదిలో దూకింది, ఆమెను రక్షించడానికి అతను నదిలో దూకాలని చెప్తారు. ఆ మనిషి వెంటనే నదిలోకి దూకి, ప్రవాహానికి ఎదురీత మొదలుపెట్టాడు.
అందరికీ ఆశ్చర్యం కలిగి, ‘ఎందుకు ప్రవాహానికి ఎదురీదుతున్నావు? నీ భార్య ప్రవాహం దిశలోనే కొట్టుకుపోయి ఉంటుంది’ అని అరిచారు. ఆ వ్యక్తి ‘మీకు నా భార్య గురించి తెలియదు. ఆమె నదిలో పడినా ఆమె ప్రతీది ఎలా ఎదురిస్తుందో, అలాగే నదిలో ప్రవాహానికి కూడా ఎదురు తిరుగుతుంది!'అని సమాధానం ఇచ్చాడు.
అది మీరు పని చేసే స్థలం, మీ ఇల్లు లేదా మీ వ్యాపారసంస్థ లేదా ఏ ప్రదేశమైనా సరే, మీరు ఎంతకాలం ప్రవాహాన్ని నిరోధిస్తారో, ఎంత కాలం సమష్టిచేతనస్థితిలో కలిసిపోరో, అంత కాలం మీకు నరకం సృష్టించుకుని, ఇతరులకి కూడా నరకం చూపిస్తారు. మీ భౌతిక శరీరంలో మీరు వేరు అని అనుకుంటే, వ్యాధిని ఆహ్వానిస్తున్నారని స్పష్టంగా తెలుసుకోండి.
మీ మానసికపు పొరలో, మీరు ప్రత్యేకమైన వ్యక్తి అని అనుకుంటే, పదే పదే మీలో హింసాబీజాలు నాటుకుంటాయి. సమష్టి చేతనస్థితిలో మీరు ఉంటే అందరినీ కలుపుతారు. విడి చేతనస్థితిలో ఉంటే విడదీస్తారు, చిన్న ముక్కల కింద వస్తువులను కత్తిరిస్తారు. తర్కం ఎప్పుడూ విడదీస్తుంది (ముక్కలు చేస్తుంది), అంతఃప్రేరణ ఎప్పుడూ కలుపుతుంది.
ఏ క్షణం అయితే మీరు లోతుగా, సంపూర్ణంగా, తీవ్రంగా, మొత్తం సమూహంలో మొత్తం విశ్వంలో ఉన్నారని అర్థం చేసుకుంటారో మీరు బ్రహ్మానందానుభూతి పొంది, జీవించడం ఆరంభిస్తారు. మీ ఉనికిలో ఎన్నో పరిమాణాలు వికసిస్తాయి.
ప్రస్తుతం మీరు ఒత్తిడికి గురై, నిరంతరం కలత చెందుతూ చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఒక్క శరీరం లో మీరు చాలా ఆలోచించాలి. మీరు చాలా సంతోషించవచ్చు. మీరు సమష్టిచేతనస్థితిలోకి అదృశ్యమైతే, మీకు ఎన్నో పరిమాణాలు ఉంటాయి, మీకు సాధ్యమైనవి ఎన్ని ఉంటాయో, మీరు ఊహించలేరు! చూడండి, ఇప్పుడు ఒక్క శరీరంతో, మీరు చాలా సౌఖ్యాలు అనుభవించి, సంతోషిస్తున్నారు. మీకు రెండు శరీరాలు ఉంటే ఏం చెయ్యగలరో ఊహించండి! చాలా శరీరాలు ఉంటే ఎలాంటి భావన కలుగుతుందో ఊహించండి. మీరు సమష్టిచేతనస్థితిలో భాగం అని తెలుసుకుంటే అదే అనుభూతి కలుగుతుంది.
మీరు ఏకత్వం లేదా సమష్టిచేతనస్థితి అనుభూతి చెందితే, మీ పేరు, ఆస్తి, సామాజిక అంతస్తు, పరువులో ఉన్న భేదాలని మరిచిపోతారు. మీరు మీ గురించి ఏమనుకుంటారో అది అంతా మాయమై అసలైన మిమ్మల్ని తెలుసుకుంటారు.
ఆలోచన (ఏకకాలంలో సంభవించటం) ఏకీభవించటం!
మీరు చేపల గుంపు ఈదుతున్నప్పుడు లేదా పక్షుల గుంపు ఎగురుతున్నప్పుడు పరిశీలిస్తే, వాటి గమనంలో సమకాలీకరణం చూస్తారు. వందల కొద్దీ పక్షులు 'V' ఆకారంలో ఎగురుతూ ఉండచ్చు, కాని అవి దిశ మార్చుకునేటప్పుడు, అన్నీ ఏకకాలంలో ఏ విధమైన తిక్కమక పడకుండా ఆలస్యం చేయకుండా ఒకేసారి మార్చుకుంటాయి. శాస్త్రజ్ఞులు ఇది ఎలా సాధ్యం అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జంతువులు, పురుగుల మీద అధ్యయనాలు, వాటికి ప్రమాదం సంభవించినప్పుడు అవి ఎంత త్వరగా స్పందిస్తాయో చూపించాయి. ఆ స్పందనలని మనం వాడుకలో ఉండే పద్ధతుల్లో వివరించలేం.
కుక్కలపై ఆలోచన ప్రభావం మీద ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. కుక్కల యజమానుల్ని ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళమని చెప్పారు. వారు ఇల్లు వదిలిన తరువాత వారిని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలకి వెళ్ళి, మధ్యలో క్రమం లేకుండా తిరిగి రమ్మని చెప్పారు. ఆ యజమాని తిరిగి ఇంటికి వెళ్ళే సమయానికి, కుక్క తలుపు దగ్గరకు వెళ్ళి యజమాని గురించి ఎదురు చూసినట్టు, ఈ ప్రయోగం వల్ల తెలిసింది.
భారతదేశంలో అండమాన్ – నికోబార్ ద్వీపాలలో సునామీ రాకముందే అన్ని జంతువులూ, ఏనుగులు కూడా, ఆ ప్రదేశాన్ని వదిలేసి మహాసముద్రం నుండి దూరంగా, సురక్షితమైన ఎత్తయిన ప్రదేశాలకి వెళ్ళిపోయాయి. భూకంపం రాక ముందే, నిమిషాల ముందు భూమి కంపస్తుందని, జంతువులకూ, పురుగులకూ తెలిసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ జంతువులకి, మనకి గల తేడా ఏమిటి? వాటికి ప్రకృతితో ఉన్న సంబంధమే. అవి ప్రకృతితో ఉంటాయి కాబట్టి ప్రకృతి ఇచ్చే సంకేతాలని అర్థం చేసుకుంటాయి. మానవులమైన మనం అబద్ధపు గుర్తింపు, అహం వల్ల, ప్రకృతితో సంబంధాన్ని పోగొట్టుకున్నాం. అందుకే ప్రకృతి ఇచ్చే సంకేతాలను గ్రహించలేం.
అత్యున్నతమేధకి అనుగుణంగా
భూమిపై వివిధప్రదేశ్లలో ఉన్న వ్యక్తులు ఒకేసారి ఒకేలాంటి పరిశోధన చేయడం మనం చరిత్రలో చాలా సార్లు చూసాం. దీనికి కారణం వారి ఆలోచనలు సమష్టిచేతనస్థితిలో ఉండడం. గాలిలో వందల కొద్దీ విద్యుదయస్కాంతతరంగాలు ఉంటాయి కాని మీ టి.వి. ఏ పౌనఃపున్యానికి (frequency) ట్యూను చెయ్యబడి ఉంటుందో, అదే తరంగాలని తీసుకుంటుంది. అలాగే మనస్సులు ట్యూన్ చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. గాలిలో తేలుతున్న ఆలోచనలను గ్రహించి, వాటిని నిజం చేస్తాయి.
మనకు అవే ఆలోచనలు వస్తున్నప్పుడు, వాటిని ఒకే రూపంలో వెల్లడి చేసి గ్రహిస్తుంటాం. మన ఆలోచనల అల్లికలోనే చిక్కుకుని ఉంటాం. ఈ విధంగా ఒక సగటు మనిషి తన జీవితాన్ని గడుపుతాడు. కాని తెలివిగల వ్యక్తులు విశ్వసూత్రాలను అర్థం చేసుకుని, ఉన్నతస్థాయిలో ఉన్న మేధకి అనుగుణంగా సృజనాత్మకంగా, కొత్త విషయాలు తెలుసుకుంటూ జీవిస్తారు.
విశ్వం తనకి ఒకే ఉనికి అని ఎలా సూచిస్తుందో అలాగే ప్రకృతి తన యథార్థస్వభావాన్ని సూచిస్తుంది. ఎలుక మెదడులో ఏ భాగం తీసేసినా, అది మెదడు పూర్తిగా ఉన్నప్పుడు ఎలాంటి కష్టమైన పనులు చేయగలిగిందో, తరువాత కూడా అలాంటి పనులు చేయగలిగింది. ఇది 1920లో చేసిన ప్రయోగాల్లో నిరూపితమైంది. ఎలుక మెదడు 'హోలోగ్రాఫిక్' మెమరీని చూపించింది.
లేసర్ కాంతి అడ్డదిడ్డంగా (criss-cross) చలించి, త్రిదిశ ఫోటోగ్రాఫ్‌ను ఎలా తయారుచేస్తుందో అదే విధంగా మెదడులో నాడీప్రచోదనాలు అడ్డదిడ్డంగా వెళ్ళడం వల్ల, వివిధ నమూనాలలో జ్ఞాపకాలు ఏర్పడతాయి. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. ఇదే విధంగా రెండు గుప్పిళ్ళ పరిమాణంలో ఉన్న మనిషి మెదడులో కోట్ల బిట్సు రూపంలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది.
విశ్వం ఒక త్రిదిశ ఫోటోగ్రాఫ్. అందులో మనం ఒక భాగం, ఈ త్రిదిశ ఫోటోగ్రాఫ్ (hologram) లో ఏభాగమైనా మొత్తం ఉన్నదాన్ని చూపిస్తుంది. అలాగే మనం కూడా విశ్వం పూర్ణత్వాన్ని పరావర్తనం చేస్తాం. విశ్వాన్ని జీవం ఉన్న జీవం లేని పదార్థాలుగా వర్గీకరించలేదు. అది సంపూర్ణమై, అంతరసంబంధాలు కలది. మీకు చుట్టూ ఉన్న చెట్లు, జంతువులు, పక్షులు, భూమి మీద ఉన్న రాళ్ళు, గ్రహాలు, నక్షత్రాలు, విశ్వంలో ఉన్న నక్షత్రాలు, అన్నింటితో సంబంధం ఉంది. అది మీరు గ్రహిస్తారో లేదో అన్నది మీ చేతనస్థితిపై ఆధారపడి ఉంది.
ప్రశ్నలు, జవాబులు
ప్ర : శాస్త్రప్రకారం, పదార్థం లేకపోతే శూన్యం ఏర్పడుతుంది. మీ ప్రకారం శూన్యం అంటే శక్తి. పదార్థం శక్తి రూపం. శూన్యం అంటే నిర్వచనం ఏమిటి?
శాస్త్రం తన అభిప్రాయాన్ని మార్చుకుంది అని అర్థం చేసుకోండి. ఇప్పుడు శాస్త్రజ్ఞులు, శూన్యాన్ని మనం సృష్టించలేం అన్న విషయాన్ని తెలుసుకున్నారు. అంతరిక్షంలో ఎక్కడైతే శూన్యం ఉందని అనుకున్నారో అక్కడ ఈథరు ఉంది. శక్తి స్థూలరూపం ఈథరు. ఈథరు పదార్థం అని కూడా శాస్త్రం చెప్తోంది. దాన్ని పట్టుకోవచ్చు, కొలవవచ్చు. ఆధ్యాత్మికసత్యాలని కొంత వరకు అర్థం చేసుకోవడానికి శాస్త్రం అభివృద్ధి చెందింది. ఇప్పుడు శాస్త్రం పదార్థంలో కొన్ని భాగాల లోపమే శూన్యం అని చెప్తున్నది. భూమి, అగ్ని, నీరు, గాలి, ఈథరు అనేవి అయిదు ప్రధానమైన మూలకాలు. ఇందులో భూమి, నీరు, అగ్ని, గాలి అనే నాలుగు మూలకాలు లోపిస్తే శూన్యం ఏర్పడుతుంది. అంటే మొత్తం పదార్థం లేకపోవడం కాదు. అది నాలుగు మూలకాలు లేకపోవడంతో ఏర్పడేది.
వేల సంవత్సరాల క్రితం తూర్పుదేశాలకి చెందిన ఋషులు, వాస్తుశాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. అది మన దైనందినజీవితంలో ఈథరు సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించాలి అని చెప్పే శాస్త్రం. అది ఏ పద్ధతిలో ఇళ్ళు, భవనాలు నిర్మిస్తే, వాటి లోపల ఈథరు శక్తిని ఉంచుకోగలరో చెప్పే శాస్త్రం. ఈ రోజు శాస్త్రజ్ఞులు ఈథరును ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది ఆలోచిస్తున్నారు.
సమష్టిచైతన్యంలో మీరూ ఒక భాగం అందుకే నా ప్రకారం, శాస్త్ర ప్రకారం శూన్యం అంటే శక్తి. పదార్థం లేకపోవడం శూన్యం కాదు.
ప్ర : ఒక వ్యక్తి తన మనస్సుని నియంత్రించగలడు అని అన్నారు. అంటే ఇతరుల మనస్సులు ఆ వ్యక్తి మనస్సుని, ఆలోచనవిధానాన్ని ప్రభావితం చెయ్యగలవా? మనం దీన్ని ఎలా నియంత్రించి, కోపం క్రుంగుబాటుల నుండి విముక్తి పొందగలం?
మంచి ప్రశ్న. మీ మనసుని మీరు అదుపులో పెట్టగలరా?
కొన్నిసార్లు అది నాకు కష్టమనిపిస్తుంది.
సరే. ఇదే జవాబు నాకు అందరి నుండి వస్తుంది. ఒక వ్యక్తి మనస్సుని నియంత్రించవచ్చు అనేది కేవలం చెప్పటం మాత్రమే, అది సాధన చెయ్యరు, అనుభవంలోకి తెచ్చుకోరు. ఇతరుల మనస్సులు ఆ వ్యక్తి మనస్సుని, ఆలోచన విధానాన్ని ప్రభావితం చెయ్యగలవు.
మీకు వివాహం అయిందా?
అయింది!
అయితే మీ భర్త మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తారని అంగీకరిస్తారు. అతని మాటల వల్లనే కాకుండా, వేరే విధంగా కూడా జరుగుతుంది.
ఉదాహరణకి, మీకు ఈ రోజు ఇక్కడికి ధ్యానానికి రావాలని ఉందనుకోండి, అతనితో ధ్యానానికి వెళ్తానని చెప్తారు. అతను వద్దనకుండా, సీరియస్ గా మొహం పెడతారు. అతని మొహం జ్ఞాపకంతో మీ ధ్యానం ప్రభావితం అవుతుంది. మీరు ఇక్కడ కూర్చుని అతని ముఖంపై ధ్యానం చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, అతను ఊళ్ళో లేకపోయినా, మీకు అతని సీరియస్ మొహం గుర్తుకు వచ్చి, ఇక్కడ ధ్యానం ఉత్సాహంగా చేయలేరు.
ఇతరులు తమ ఆలోచనలు వ్యక్తపరచకుండానే, మీ మనస్సుని ప్రభావితం చేయగలరు అన్నది అర్థం చేసుకోండి.
ప్ర : కోపం, డిప్రెషన్ రాకుండా ఉండడానికి మనస్సుపై ప్రభావాలని ఎలా నియంత్రించాలి?
ధ్యానం ద్వారా!
మీరు ఒక ఉల్లిపాయ లాంటివారు. ఉల్లిపాయ పొర తరువాత పొరను తీసేస్తే లోపల ఏముంటుంది? ఖాళీ మాత్రమే. ఉల్లిపాయ తనలో ఏదో కొంత ఉంది అనుకుంటుంది, కాని పొరలు అన్నీ తీసేస్తే, అక్కడ ఖాళీ మిగులుతుంది. అలాగే మనిషి తన చైతన్యం అని అనుకుంటాడు, కాని విడిగా ఉన్న పొరలని తీసివేస్తే, అతను విశ్వచైతన్యాన్ని अनुभूति పొందుతాడు, అదే సమష్టిచేతనస్థితి. ఈ విధంగానే ఇతరుల నుండి, ఇతరుల వల్ల మీ చైతన్యంలోకి చొరబడే కోపాన్ని ఆపగలరు. మీరు ధ్యానం చేస్తే, మీ ఎరుక వృద్ధి చెంది, మీ వ్యక్తిగతచేతనత్వానికి కేవలం ప్రేక్షకుడుగా మిగిలిపోతుంది, మీరు ఏది చూసినా అది విశ్వచేతనత్వంలో కరిగిపోతుంది.
ప్ర : మనం ఎందుకు బాధ పడాలి? బాల్యంలో మనం మిగిలినవారి కంటే వేరు అని శిక్షణ ఇస్తారు. స్కూలులో గుర్తింపు వస్తుంది - పెద్దయ్యాక ఇతరులతో పోటీ చేయాలని చెప్తారు. అంతిమసత్యం మనం అంతా ఒక్కటే, మనమందరం పరమానందంలో ఉన్నట్టు అయితే, సమిష్టిచేతనస్థితి ఈ ఆనందాన్ని, శాంతి ప్రేమని ఎందుకు ప్రతిబింబింపచేయదు?
ఇది చాలా మంచి ప్రశ్న. ఒక దాని తరువాత ఒకటి, సమాధానం చెప్తాను. ఈ ప్రశ్నకి మంచి శక్తి గల అర్థం ఉంది.
ఇప్పటి విద్యావ్యవస్థని స్థాపించిన వ్యక్తులు జ్ఞానోదయం పొందలేదు. గురుకులం అనే ప్రాచీన విద్యావ్యవస్థను ఋషులు స్థాపించారు. దురదృష్టవశాత్తూ ఆ పద్ధతి ఇప్పుడు లేదు.
జ్ఞానోదయమైన గురువులు ప్రారంభించిన విద్యావ్యవస్థ గురించి కొంచెం చెప్పనీయండి. ఈ పద్ధతిలో దేశంలో ఏ బాలుడైనా సరే గురువుకి చెందుతాడు! గురువు ఆ బాలుడికి సంరక్షణ చేస్తాడు. పుట్టిన కొన్ని సంవత్సరాలకి, తల్లిదండ్రులు, బాలుడిని లేదా బాలికని గురువుకి అప్పగిస్తారు.
ఈ విద్యావ్యవస్థలో, కొంత వయస్సు వచ్చేవరకు పిల్లలని బట్టలు వేసుకోమని బలవంతం చేసేవారు కాదు. అలాంటప్పుడు పిల్లలకి తమవి వేరు శరీరాలు అన్న భావన కలిగేది కాదు. వారు సులభంగా ఆకాశం, పువ్వులు, అడవులు, చెట్లు, భూమి అన్నింటితో సంబంధం పెట్టుకునేవారు. వారు వేరు అనే ఆలోచన వారికి ఉండేది కాదు. ఆడ, మగ అన్న భేదం ఆ పిల్లలలో ఉండేది కాదు. నిజానికి మగ అంటే 51% పురుషశక్తి, 49% స్త్రీశక్తి ఉంటాయి. ఆడ అంటే 51% స్త్రీశక్తి, 49% పురుషశక్తి ఉంటాయి. వారిలో ఉన్న తక్కువ శక్తిని సమాజం అణిచేసి, వారు పూర్తిగా మగ లేదా ఆడ అన్న భావన కలిగించేది. ఇది వారి చేతనస్థితిలో చాలా సమస్యలని కలిగిస్తుంది.
పిల్లలని పెంచేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు బట్టలు వేసేటప్పుడు, పైభాగాన్ని, కింది భాగాన్ని కప్పేట్టు రెండూ విడిగా వేయకుండా, పొడవుగా ఒకటే వేయండి. వారికి మగ, ఆడ అన్న భావం కలగనీయకండి. మీరు పిల్లల్ని స్కూలుకి పంపాలి కాబట్టి ఇది కొంచెం కష్టమవుతుంది. కాని ప్రయత్నించండి.
గురుకులం పద్ధతిలో, పిల్లలకు ముందు ధ్యానం నేర్పేవారు. వారికి మగ, ఆడ అనే భావన కలిగినా, ఆ ధ్యానపద్ధతిని సాధన చేసి ఆ భావనని తగ్గించుకునేవారు. ఈ పద్ధతి వారిని సమిష్టిచేతనస్థితిలో సంబంధం ఏర్పరచుకోవడానికి సహాయపడేది. ఈ సాంకేతిక పద్ధతినే గాయత్రిమంత్రం అంటారు. ఏడు సంవత్సరాల నుండి 14 సం॥ వయస్సు వచ్చే దాకా పిల్లలు గాయత్రి సాధన చేసేవారు. 14 సంవత్సరాలకి వారికి చేతనస్థితి క్షణమాత్రం దర్శనం కలిగేది. వారి అనుభవతీవ్రతను బట్టి వారికి లోతైన ధ్యానపద్ధతులు చెప్పేవారు. 21 సం॥ల వయస్సు వచ్చేసరికి వారు జ్ఞానోదయం పొండేవారు.
ఒకానొక కాలంలో 70% వ్యక్తులు జ్ఞానోదయం కలిగినవారై ఉండేవారు. మిగతా 30% మందీ జ్ఞానోదయం పొందడానికి సాధన చేసేవారు. జ్ఞానోదయమైన గురువులు ఎలాంటి సమాజాన్ని నిర్మించారంటే, జ్ఞానోదయం పొందిన వ్యక్తులు లేదా జ్ఞానోదయం పొందడానికి సిద్ధంగా ఉన్నవారే ఉండేవారు. వేరొక వర్గానికి చెందిన వ్యక్తులు లేనే లేరు. అలాంటి పద్ధతిని మనం దురదృష్టవశాత్తూ కోల్పోయాం. అందుకే ప్రపంచమంతా, ప్రతివారం, ధ్యానకార్యక్రమాలు పెట్టాల్సిన అవసరం కలుగుతోంది.
భారతదేశం ఆశ్రమంలో ఆ గురుకులం పద్ధతి ఉంది. మేం ఆధునికవిద్యాపద్ధతికి హాని కలిగించకుండా తిరిగి వేదపద్ధతిని పునరుద్ధరిస్తున్నాం. ఈ పద్ధతి వల్ల వారు పెరుగుతూ, సమిష్టిచేతనస్థితితో సంబంధం ఏర్పరచుకోగలరు.
ప్ర : మనమంతా సమిష్టిచేతనస్థితిలో భాగమే. అలాంటప్పుడు భగవంతుడు ఇందులోకి ఎలా వస్తాడు?
ఆ సమిష్టిచైతన్యాన్నే నేను భగవంతుడు అని అంటాను. సంపూర్ణంగా ఉన్నదాన్ని నేను భగవంతుడు అని అంటాను. మీరు సంపూర్ణంగా ఉంటే, పవిత్రమైనవారు.
⁂ ⁂ ⁂
- మనం స్వేచ్ఛగా వేసే అడుగుల్లో క్రమం లేకుండా నృత్యం చేస్తే మనం చాలా శక్తిమంతులై ఉన్నట్టు అనిపిస్తుంది.
- ఏ నియమమైనా స్వేచ్ఛను పోగొడుతుంది, శక్తిని తగ్గిస్తుంది.
- ప్రపంచం కేవలం పదార్థం అని నమ్మడం మనం చేసే మొదటి తప్పు. ఈ నమ్మకం భూమి మీద హింసకి, ఉగ్రవాదానికి మూల కారణం.
- మనం ఎప్పుడైతే విశ్వానికి మేధ ఉందని తెలుసుకుంటామో, శాంతిబీజం నాటబడింది అని అర్థం.
- శరీరంలోని విశ్వచైతన్యాన్ని అంటే పిండాండంలో బ్రహ్మాండాన్ని తెలుసుకుంటే, మీ శక్తి తగ్గకుండా మీరు పద్ధతి ప్రకారం ఎలా ఉండాలో నేర్చుకుంటారు.
- మీరు ఎంతకాలం ప్రవాహాన్ని నిరోధిస్తారో, ఎంత కాలం సమిష్టిచేతనస్థితిలో కలసిపోరో, అంత కాలం మీకు నరకం సృష్టించుకుని, ఇతరులకి కూడా నరకం చూపిస్తారు.

విశ్వశాంతి మీ నుంచి ప్రారంభమవుతుంది
జీవన్ముక్తి అంటే ఈ భూమికి శాంతి బహుమతి కావటమే
ఎప్పుడైతే మనం విశ్వశక్తి పథకంలో భాగమే అని తెలుసుకుంటామో, అప్పుడు మనం, సృష్టి వేరు వేరు అని అనుకోం. ఎప్పుడైతే అందులో మన పాత్రని అచేతనస్థితిలో చేస్తామో, దాని గురించి తెలుసుకోమో అప్పుడే మనం, సృష్టి ఒకటి కాదు అనుకుంటాం. జ్ఞానోదయమైనవారిని ఎక్కువ సంఖ్యల్లో భూమి మీద తయారు చేయవలసిన సమయం వచ్చింది. కేవలం అంతిమసత్యాన్ని తెలుసుకున్న, జ్ఞానోదయం పొందిన చాలా మందిని తయారు చేయటం ద్వారా మాత్రమే, ఈ భూమి మీద పేరుకుపోయిన వ్యక్తిగత వ్యతిరేకశక్తిని సమూలంగా నాశనం చేయగలం. ఈ భూమి మీద జరుగుతున్న ప్రమాదాలన్నీ కూడా అచేతనస్థితిలో ఉన్నవారి వల్ల మాత్రమే జరుగుతున్నాయి. భూమి వేడెక్కటం, హెచ్.ఐ.వి., ఉగ్రవాదం, మతోన్మాదం, కుప్పలుగా పేరుకొనిపోయిన అస్త్రశాస్త్రాలు, ఇవన్నీ కూడా మనిషిలో వ్యతిరేకాలోచనలతోనే జరుగుతున్నాయి. ఈ రోజు మనం చాలా ప్రమాదాల్ని ఎదుర్కొంటున్నాం. మనం శాంతప్రవృత్తితో, ఆనందంగా ఉత్సాహంగా ఉండే జ్ఞానోదయమైన సంఘాన్ని సృష్టించకపోతే, ఈ అందమైన భూమిని కాపాడుకోలేం.
నా లక్ష్యం ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన, చేతనస్థితి కలిగిన జ్ఞానోదయసమాజాన్ని సృష్టించాలని.
విశ్వశాంతి-వ్యక్తిగతానందఫలితం-పరస్పరవిరుద్ధమైన ఆలోచనలు
మనలో చాలా మంది మన మీద మనం పోరాటం చేసుకోవటంలోనే చిక్కుకుపోయాం. మనం పరస్పరవిరుద్ధమైన ఆలోచనలు, కోరికలు అనే సాలె గూటిలో చిక్కుకుపోయాం. మన ఆలోచనలు, మాటలు అనేవి చాలా శక్తిమంతమైనవి. కానీ మనం వాటిని చాలా యధాలాపంగా వాడుతున్నాం.
ఉదాహరణకి : మీకు తలనొప్పిగా ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? మీకు మీరు నాకు తలనొప్పి తగ్గితే బాగుంటుంది అని పదే పదే అంటుంటారు. కానీ మీరు అలా అనుకున్న ప్రతిసారీ, అందులో ప్రతి మాట, కోరిక తీరే శక్తితో మీ లోపలికి వెళుతుంది. మీరు పదే పదే ఈ మాటలు అంటూ, తలనొప్పి అనే మాటకి పోతే బాగుండు అనే మాటతో పాటు ఎక్కువ శక్తిని ఇస్తున్నారు. దీన్నే నేను పరస్పరవిరుద్ధమైన ఆలోచనలు అంటాను. అంటే మీ కోరికకి వ్యతిరేకంగా అంటున్నారు. అప్పుడు అనుకూలమైన దృక్పథం కూడా పోరాడవలసి వస్తుంది. మీ మాటలు, ఆలోచనలూ అయోమయంలో పడతాయి. మనస్సు లక్షణమే అయోమయం.
అప్పుడు మీరు నన్ను అడగవచ్చు, 'మరి తలనొప్పిని ఏ విధంగా పోగొట్టగలం' అని. మీరు 'నేను బాగుండాలి' అని మాత్రం మీకు మీరు చెప్పుకోండి. కాని మనస్సుకి నిరంతరం వ్యతిరేకపదాల్ని అనటమే అలవాటు. అదీ సమస్య. మనలోని పరస్పరవిరుద్ధమైన ఆలోచనలే మన అన్ని వ్యధలకి కారణం. మనలో అన్ని బాధలకి కారణం మన సహజలక్షణం పరమానందం అని తెలియకపోవటమే. మనం పరమానందభరితమైన సర్వసృష్టిలో ఒక భాగం. ఒక్కసారి ఈ విషయాన్ని మనం వివేకంతో, అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలిగితే, అప్పుడు మనం చేతనస్థితిలో, బలంగా మనలోని పరస్పర విరుద్ధాలోచనల్ని వదిలేసి మనకి చికిత్స చేయగల మాటలతో అంతరంగాన్ని నింపుతాం.
మనం నిరంతరం చికిత్స చేయగల ఆలోచల్ని మన లోపలికి పంపిస్తూ ఉంటే మనం అనుకూలమైన ఆలోచనలకి, మాటలకి శక్తిని ఇవ్వగలం. వాటిని మన కండరాల జ్ఞాపకాల్లో నిక్షిప్తం చేయగలం. మనం నిరాశలో ఉన్నప్పుడు ఈ ఆలోచనలు, మాటలు అప్రయత్నంగా మన అంతరంగంలోకి వచ్చి మనని ఆ నిరాశ నుంచి బయటికి తెస్తాయి. మనంతట మనం నిరాశ నుంచి, మన మనస్సు ఆడే వ్యతిరేకపు ఆట నుంచి పైకి లేవగలుగుతాం.
వ్యక్తిగతమైన ప్రశాంతత సహజంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది
గౌతమబుద్ధుని జీవితం నుంచి ఒక చక్కని కథ : దేవదత్తుడు, బుద్ధుని సోదరుడు. అతను బుద్ధుని ఆధ్యాత్మికవ్యవస్థలో ప్రవేశిస్తాడు. అతనికి అధికారకాంక్ష ఎక్కువ. అతనికి ఆ సన్న్యాసపీఠానికి అధికారి కావాలని కోరిక.
పరిణతి లేని అటువంటి వ్యక్తి జ్ఞానోదయం కోసం కాకుండా, అధికారం కోసం పాకులాడే వ్యక్తి అధికారంలోకి రావటం బుద్ధునికి ఇష్టం లేదు. దాంతో దేవదత్తుడు బుద్ధుడంటే అసూయ, వ్యతిరేకతలతో ఉండేవాడు. బుద్ధుడిని చంపటానికి చాలా ప్రయత్నాలు కూడా చేశాడు.
ఒకసారి దేవదత్తుడు పట్టపుటేనుగుకి బాగా మత్తు ఇచ్చి దాన్ని బుద్ధుడు వస్తున్న దారిలో వదులుతాడు. అది భయంకరంగా అరుస్తూ, విచ్చలవిడిగా పరిగెడుతూ ఆ వీధులలో బీభత్సం చేస్తుంటుంది. ప్రజలంతా భయంతో పరుగులు తీస్తుంటారు.
ఏనుగు బుద్ధుడి దగ్గరకి వస్తూంటుంది. బుద్ధుడు ప్రశాంతంగా, స్థిరంగా అదే పంథాలో నడుస్తూనే ఉంటాడు. ఏనుగు భయంకరస్థితి బుద్ధునిలోని పరమానందాన్ని, ప్రశాంతతని ఏమీ చేయలేకపోయింది. పిచ్చి కోపంలో అది బుద్ధుడిని సమీపిస్తుంది. అది బుద్ధుని దగ్గరికి రాగానే, నిశ్శబ్దంగా అయిపోతుంది. బుద్ధుని జ్ఞానోదయసమక్షంలో దానిలోని క్రూరత్వం కరిగిపోతుంది. బుద్ధుడు దాని నుదుటిని సున్నితంగా స్పర్శిస్తాడు. అప్పుడు ఏనుగు కాళ్ళ మీద వంగి బుద్ధునికి నమస్కరిస్తుంది.
ఇదంతా చూస్తున్న ప్రజలు నిశ్చేష్టులవుతారు. పరమానందంలో ఉంటూ ఆ ప్రశాంతతని, ఆనందాన్ని నలుదిశలా వ్యాపింపచేసే వ్యక్తి పరిసరాల్లోకి పంపే శాంతితరంగాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక కొలనులో, రాయి విసిరితే అక్కడి నుంచి వచ్చిన తరంగాలు కొలను అంతా వ్యాపిస్తాయి. ఆ తరంగాలు కొలనులోని ప్రతి భాగాన్నీ స్పర్శిస్తాయి. ప్రశాంతమైన వ్యక్తి నుంచి వ్యాపించే పరమానందతరంగాలు, సహజంగా, అప్రయత్నంగా ప్రతి వ్యక్తిని, జంతువుల్ని, చెట్లని, రాళ్ళని, సమస్తాన్ని, ఆ పరిసరాలలో ప్రతిదాన్నీ ప్రభావితం చేస్తాయి.
సమూహచేతనస్థితి
నేను మీకు ఒక సత్యాన్ని చెబుతాను. మనందరం సమాజపరంగానే ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉండం. మనందరం చేతనస్థితిలో, సమూహచేతనస్థితిలో ఒక భాగం. ఆ విధంగా ఒకరికొకరం సంబంధించి ఉంటాం. మనం ఏకాంతద్వీపాలం కాదు. మన ఆలోచనలు, భావాలు, మాటలు మననే కాదు, మిగిలిన ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.
సర్వాంతర్యామి, సర్వసృష్టి అనే మహాసాగరంలో మనమంతా అలలం. సర్వాంతర్యామి అంటే స్వచ్ఛమైన మేధాశక్తి. ఈ శక్తి మనందరం విజయులమై జీవితంలో పరిపూర్ణత సాధించాలి అని కోరుకుంటుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం మనలోని భయాలని, అసూయని, బాధలనీ, నిరాశని అలా వదిలేసి నిరంతరం సర్వాంతర్యామి ప్రేమహస్తాలలో విశ్రాంతిగా ఉండగలం.
ఈ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే, అప్పుడు మనలో ప్రతి ఒక్కరూ ఎంత ప్రత్యేకమైనవారమో తెలుస్తుంది. ఈ అద్భుత విశ్వంలో మనని పోలినవారు ఉండరు. మన ఖాళీ మరొకరు భర్తీ చేయలేరు, అని తెలుసుకుంటాం.
లోపలికి చూడటం
ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే కంటే, మీ లోపలికి మీరు చూడగలిగితే, మీ లోపలి శత్రువే మీకు సమస్యలు సృష్టిస్తుంది అని తెలుస్తుంది. అంతే గాని బయట ఎవరికీ శత్రువులు ఉండరు. అంతా కూడా మీలాగే సర్వాంతర్యామిలో ఒక పరమానందభాగమే.
మనం ఎందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తామంటే మనకి తెలియదు కాబట్టి. మన ఆలోచనలు మన చుట్టూ ఉన్నవారినే కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. కఠినమైన మాటలు, కోపం, అణచివేయబడిన భావాలు, వ్యథలు అన్నీ కూడా ప్రపంచంలో అశాంతిని సృష్టించే విషయాలే.
వ్యక్తిగతమైన ఒత్తిడి, ద్వేషం, హింస అనేవి సంఘంలో అందరిలోనూ ఒత్తిడి, ద్వేషం, హింసల్ని ప్రేరేపిస్తున్నాయి. దీంతో మనిషిలో తెలుసుకునే తత్వం తగ్గిపోయి ప్రకృతికి వ్యతిరేకంగా అనేకహింసలు జరిగే స్థితి తయారవుతుంది. ఈ వృత్తాన్ని మనం ఛేదించాలి. ఆ విధంగా చేయకపోతే మరిన్ని మనిషి తప్పిదాలతో వచ్చే ప్రమాదాలు, ప్రకృతివైపరీత్యాలు పెరిగిపోతాయి. ప్రకృతి అంత హింసని తట్టుకొని నిలవలేదు. కాబట్టి ప్రపంచశాంతి అనే మాటకి అర్థం లేదు. అది వ్యక్తిలోని ప్రశాంతత, పరమానందస్థితి. ఆ స్థితి ఫలితమే విశ్వశాంతి. ఒక వ్యక్తిలోని సంతృప్తి, తెలుసుకునే తత్త్వం, సృజనాత్మకత, మేధ ఇవన్నీ కూడా ప్రపంచశాంతికి, ప్రపంచ అభివృద్ధికి, సౌభ్రాతృత్వానికి దారి తీస్తాయి.
ప్రపంచంలోని బాధతో ఏ విధంగా వ్యవహరించాలి
ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వస్థాయిలో చేసే ప్రతి నిర్ణయం కూడా సమూహపు అనుకూల లేదా వ్యతిరేకశక్తి వెల్లడి. ఎందుకంటే సమూహంగా అందరి చేతనస్థితి ఫలితం నాయకులు. కాబట్టి నాయకులని, అధికారులని నిందించే ముందు మనం కొంచెం మన అంతరంగం లోపలికి వెళ్లి, శక్తిని మన అంతరంగంలో ఉంచి అక్కడ పని చేస్తే, కొంత అనుకూలచేతనస్థితిని మన అంతరంగంలో సృష్టించగలిగితే, మనం నిజంగా కొంచెమైనా మంచి చేసినవారమవుతాం.
దేంతోనైనా రెండు విధాలుగా వ్యవహరించవచ్చు. కేవలం దాని గురించి మాట్లాడటం, రెండవది అసలైన పని చేయటం.
మీకు కేవలం ఆ విషయాల గురించి మాట్లాడటం మీదే ఆసక్తి ఉన్నట్లయితే, మీరు మీ చుట్టూ వున్న అందరినీ విమర్శిస్తారు. మీరు మీ ఇంటి పక్కన వారి నుంచి రాజకీయనాయకుల వరకు, వ్యాపారరంగం నుంచి ప్రపంచంలోని నాయకుల వరకు అందరినీ తప్పు పడతారు. ఎదుటివారిని విమర్శించటం ద్వారా మీరు ఏదీ సాధించలేరు, అంతే కాదు, అది మీలోని శక్తిని కిందికి లాగేస్తుంది. ఇది చాలా సామాన్యమైన ఉపయోగం లేని పద్ధతి.
ఇక రెండవ పద్ధతి : మీకు నిజంగా ఆ పరిస్థితి ఇష్టం లేకపోతే, దాన్ని మార్చడానికి నిజాయితీగా పని చేస్తారు. మీరు అనుకూల సామూహికశక్తిని సృష్టించటానికి పని చేస్తారు. అది ముందుగా మీ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తరువాత అది ప్రపంచంలోకి వెళుతుంది.
ఇదే సరైన సమయం.....
మన నుంచి ఎక్కువ అనుకూలతని సృష్టిద్దాం.
మన పనులలోకి ఎక్కువ ప్రేమని తీసుకొద్దాం.
మన వ్యక్తిగతచేతనస్థితిని మరింత ఉన్నతస్థితికి తీసుకెళదాం.
వ్యతిరేకనిర్ణయాల పట్ల మీరు అసహనంగా మారే కంటే, మీరు మీ చుట్టూ అనుకూలశక్తిని సృష్టించండి. అప్పుడు మీ చుట్టూ పక్కలవారు, ఈ ప్రపంచం కూడా ఆ అనుకూలచేతనస్థితి శక్తికి ప్రభావితం అవుతుంది. అప్పుడు అది నాయకుల నుంచి కూడా అన్ని దిశలా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే చాలా మంది మారతారో అప్పుడు సమష్టి అనుకూలశక్తి సరియైన దేశనాయకుల ద్వారా వెల్లడి అవుతుంది. నాయకులందరూ ప్రజలు సృష్టించిన సమష్టి అనుకూల - ప్రతికూల శక్తి వెల్లడి. వారంతా ప్రజల చేత నడిపించబడుతున్నారు.
విషయాలని రెండు విధాలుగా చూడవచ్చు. కూర్చొని విషయాలని విమర్శిస్తూ అందరినీ తప్పు పట్టటం లేదా అనుకూలశక్తిని సృష్టించే దిశగా పని చేయటం. నిజాయితీ గల వ్యక్తి ఎదుటివారిని తప్పు పట్టకుండా, ఎదుటివారి పరిస్థితుల్ని విమర్శించకుండా, పరిస్థితులకి అసహనం తెచ్చుకోకుండా, అనుకూలశక్తిని సృష్టించటానికి పని చేయాలి అని నేను అనుకుంటాను.
మీరు నిరాశతో, అసహనంగా ఉంటే ఏం సాధించగలరు, ఏమీ సాధించలేరు. కాకపోతే మీరు మరి కాస్త నిరాశకి లోనై, మరి కొంచెం వ్యతిరేకశక్తిని సృష్టిస్తారు. దాని వల్ల వ్యతిరేకచేతనాస్థితి తయారవుతుంది. కాబట్టి విప్లవం కాదు కావలసింది, క్రమమైన అభివృద్ధి కావాలి.
ప్రతి విప్లవం ఒక సత్యాన్ని, ఒక పరిష్కారాన్ని ఇస్తాయని ప్రమాణాలు చేశాయి. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? గడిచిన 3000 వేల సంవత్సరాల ప్రపంచచరిత్రలో 5000 యుద్ధాలు జరిగిన రికార్డు ఉంది. చరిత్రకారుల లెక్కల ప్రకారం గడిచిన 3000 సంవత్సరాల్లో కనీసం 9000 శాంతి ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల సగటు జీవితకాలం కేవలం ఎనిమిది సంవత్సరాలు.
దీన్ని బట్టి చూస్తే మనుషులు ఇంకే పని చేయకుండా యుద్ధాలు మాత్రమే చేస్తున్నారు అనిపిస్తుంది. కారణం ఏమిటంటే మనం విప్లవాలని నమ్ముతాం. ఇప్పుడు వ్యక్తిగతక్రమాభివృద్ధిని నమ్మవలసిన సమయం వచ్చింది. పెద్ద పెద్ద విప్లవాలు మరొక వ్యవస్థని చేస్తాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వ్యక్తులు సమష్టి ప్రతికూలశక్తితోనో లేదా సమష్టి అనుకూలశక్తితోనో ముందుకి సాగుతారు. కాబట్టి మరింత అనుకూలశక్తిని సృష్టించటం మనందరి బాధ్యత. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ చేయగల పని అదే.
శాంతిని వ్యక్తుల హృదయాల్లోకి తీసుకురాగలగాలి. అప్పుడు అది పుష్పాల్లోని పరిమళంలా అంతటా వ్యాపించి, ప్రపంచాన్ని మార్చేస్తుంది. మనం మన అంతరంగంలో నిజాయితీగా ఉందాం. అలాంటూ మనకి శాంతిని తెచ్చుకుని ప్రపంచానికి శాంతిని ఇద్దాం. అప్పుడు మనం సమష్టి అనుకూలచేతనాస్థితిని మరింత బలంగా సృష్టించగలుగుతాం.
అనుకూలశక్తిని సృష్టించండి. దాంతో మీ చుట్టుపక్కల వారు, ఈ ప్రపంచం మొత్తం ఆ అనుకూలచేతనాస్థితితో ప్రభావితం అవుతాయి. అప్పుడు అది నాయకుల ద్వారా వెల్లడి అవుతుంది.
ప్రపంచంలోని బాధలని ఏ విధంగా రూపుమాపాలి
మన చుట్టూ జరుగుతున్న చాలా సంఘటనలు గతం ఫలితాలు. కనీసం ఇప్పుడైనా, మనం చాలా ఎక్కువగా సమష్టి చేతనాస్థితిని సృష్టించగలగాలి. ఆ విధంగా సృష్టించిన శక్తితో రాబోయే కొన్ని ప్రమాదాల్ని, సమస్యల్ని తొలగించుకోవచ్చు. మనం అసహనంగా, ఆందోళనగా తయారైతే మరింత హింసని సృష్టించినవారమవుతాం. ఉన్నటువంటి హింసని తగ్గించటానికి మనం హింసని సృష్టిస్తాం. హింస హింసని ఆపలేదు. రక్తం రక్తాన్ని తుడిచేయలేదు.
బుద్ధుడు చాలా చక్కగా చెబుతాడు. కంటికి కన్ను అనే సూత్రాన్ని పాటిస్తే ప్రపంచం గుడ్డిదైపోతుంది. కంటికి కన్ను అని పని చేస్తే ఈ వర్గంలో వ్యక్తి అవతలి వర్గంవాడి కన్ను తీస్తాడు. ఆ వర్గం వాళ్ళు ఈ వర్గంలోని వ్యక్తి కన్ను తీస్తారు. చివరికి ప్రపంచమంతా అంధులైపోతారు.
మీరు చేయగలిగిన ఒకే ఒక పని చాలా చాలా ప్రశాంతమైన, అనుకూలమైన వాతావరణాన్ని మీ అంతరంగంలో సృష్టించి, ఆ తరువాత నిరంతరం బయటి ప్రపంచంలో ప్రేమని, శాంతిని సృష్టించటానికి పనిచేయటం. అదొక్కటే ఈ సమస్యకి పరిష్కారం.
మీరు ఈ విధంగా నిర్ణయించుకోండి: ఈ నిమిషంలో నాకున్న శక్తితో నాకు దొరికిన ప్రశాంతమైన ప్రార్థనలు, అనుకూలశక్తి, అనుకూలమైన ఆలోచనల్ని పంపిస్తాను. నా శరీర - మానసికవ్యవస్థలు నా నియంత్రణలో ఉన్నంత వరకూ అన్నీ అనుకూలంగా చేస్తాను.
ఆందోళన చేసినంత మాత్రాన ఏమీ సాధించలేం. ఆందోళన చేసేవారే యుద్ధాలకి కారణం. మనం కూడా ఆందోళనలు చేస్తే సమస్య ఏ విధంగా పరిష్కారమవుతుంది? మనం మరిన్ని సమస్యల్ని సృష్టిస్తాం. మీరు ఆందోళన చెందితే ఓడిపోయినట్లే. మనం ఏం చేసినా ఆందోళనలు, విప్లవాలు లేకుండా చేయగలగాలి.
దీనికి ఉండే ఒకే ఒక మార్గం, ఇక్కడై, ఇప్పుడే ఉండగలగటం. సమస్తచేతనస్థితికి సంతోషాన్ని, పరమానందాన్ని, నిశ్శబ్దాన్ని కలపగలగటం. ఎవరైతే విప్లవంతో ప్రయత్నించారో వారు మరొక వ్యవస్థని సృష్టించారు. మరొక సంప్రదాయాన్ని, మరొక అధికారక్రీడని సృష్టించగలిగారు. అది చివరికి యుద్ధంతో ముగుస్తుంది. కాబట్టి మనకి ఉన్న ఒకే ఒక మార్గం బుద్ధుని మార్గమైన శాంతి మార్గం, శివుని మార్గమైన నిశ్శబ్దమార్గం.
మనతో మనం పని చేయటం, మన మీద మనం యజమానులు కాగలగటం, ఆందోళన చెందకుండా సరైన దారిలో వెళుతూ సరైన పనులు చేయగలగాలి. మనం గొడవలు చేసేవారం కాకుండా ఉపయోగపడే పనులు చేయగలగాలి. మనం శాంతి, నిశ్శబ్దం, పరమానందం కోసం ఎంత చేయగలిగితే అంత చేయగలగాలి. మన చేతనస్థితిలోకి ఎంత శాంతిని వీలైతే అంత మనం మనలోకి తెస్తూ, నాయకుల్ని చేతనస్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి.
గందరగోళాన్ని తగ్గించేందుకు సమష్టి అనుకూలశక్తిని పెంచాలి
భౌతికస్థితిలో వేడిని తగ్గించగలిగితే, ఆందోళన, గందరగోళం తగ్గుతాయి. ఉదాహరణకి మీరు వేడి తగ్గించగానే ద్రవరూపంలో ఉన్న నీరు మంచుగడ్డలా తయారవుతుంది. అదే విధంగా అందులో ఉండే మలినాలు కూడా పోతాయి. ఉప్పు నీటిని గడ్డ కట్టిస్తే, అడుగున ఉప్పు ఉండటాన్ని చూడవచ్చు. అయితే అది నీరు గడ్డ కట్టాక మాత్రమే కనిపిస్తుంది. అదే విధంగా సంఘం సమష్టి చేతనస్థితి మారినప్పుడు, అందులో గందరగోళం తగ్గి ఆ వ్యవస్థ శుభ్రపడుతుంది.
శాంతిపై ధ్యానప్రభావం - పరిశోధనలు
సమూహంలో చేసే ధ్యానప్రభావం సంఘం మీద ఏ విధంగా ఉంటుందో చాలా పరిశోధనలు జరిగాయి. కొంచెం క్లిష్టమైన సమూహం మీద ట్రాన్స్ స్పాండల్ ధ్యానాన్ని ప్రయోగించి చూసారు. సమూహాల్లో ధ్యానం చేసినప్పుడు ఆయా ప్రాంతాలలో నేరాల సంఖ్య ఏడు శాతం తగ్గినట్టు ఫలితాలు వచ్చాయి. మరి కొన్ని ప్రాంతాల్లో 17% హింస తగ్గి 13 % సహాయసహకారాలు పెరిగాయి అని ఫలితాలు చూపించాయి. యుద్ధాలు జరిగే ప్రాంతాల్లో 50 శాతం పైగా మరణాలు తగ్గాయని, 25% గాయాలు జరగటం తగ్గాయని ఫలితాలు వచ్చాయి. మొత్తం మీద నేరాల సంఖ్య, ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, హింస బాగా తగ్గి జీవితంలో నాణ్యత పెరిగినట్టు తెలిసింది.
విశ్వశాంతి ధ్యానం
సెప్టెంబర్ 21న ప్రపంచ శాంతిదినం జరుపుతారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ప్రార్థనలు, ధ్యానాలు, ఉత్సవాలు చేస్తుంటారు. ఇవన్నీ ప్రపంచశాంతికి చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆ సందర్భంగా నిత్యానంద మిషన్ సెంటర్లలో సామూహిక ధ్యానకార్యక్రమాల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఆ విధంగా చేసినప్పుడు సమష్టి చేతనస్థితి అత్యున్నతస్థాయికి చేరుతుంది.
ఏదైనా ఒక పదార్థాన్ని లేదా ఒక వస్తువుని పంచుకుంటే తగ్గుతుంది. ఉదాహరణకి ఒక యాపిల్ నలుగురు పంచుకుంటే దాన్ని నాలుగు ముక్కలు చేయాలి. ఒక్కొక్కరికి ఒక ముక్క వస్తుంది. అదే విద్యుత్తును పంచుకుంటే దాని ఓల్టేజ్‌లో మార్పు ఉండదు. ఒక వైరులో 10 ఓల్టుల కరెంట్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పట్టుకున్నా 10 ఓల్టుల శక్తితో షాక్ కొడుతుంది. నలుగురు పట్టుకున్నా అంతే.
అయితే సూక్ష్మస్థాయిలో ఉండే ధ్యానశక్తి పరిస్థితి వేరు. ధ్యానాన్ని చాలా మంది ఒక సమూహంలో చేస్తే అది మరింతగా పెరుగుతుంది. అది తగ్గదు, అదే స్థితిలో ఉండదు కానీ చాలా రెట్లు పెరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ధ్యానం చేస్తే 10 ఓల్ట్‌ల శక్తి వస్తే 100 మంది చేస్తే 1000 ఓల్టుల వస్తుంది. ఆ శక్తి ధ్యానం చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేస్తుంది.
అందుకే సమూహంలో చేసే ధ్యానాన్ని బాగా ప్రోత్సహిస్తారు. దీన్ని మామూలు లైటుకి, లేజర్ లైటుకి ఉన్న తేడాతో పోల్చవచ్చు. లేజర్ లైటు సమష్టి ధ్యానం లాంటింది.
జ్ఞానోదయమైన గురువుల ప్రేమస్పర్శ
బుద్ధుని జీవితం నుంచి ఒక కథ : అంగుళీమాలుడు అనే దొంగ ఉండేవాడు. అతను అడవిలోంటూ ఆ అడవి మార్గంలో వెళ్ళేవారి ధనం దోచుకుంటూ ఉండేవాడు. అలా ఎవరి దగ్గర దోచుకుంటే వారి బొటన వేలు కోసి వాటిని మాల కట్టి వేసుకునేవాడు. అందుకే అతన్ని అంగుళీమాలుడు అనేవారు.
ఒకసారి బుద్ధుడు ఆ అడవి గుండా ప్రయాణిస్తున్నాడు. అక్కడివారు బుద్ధుడికి అంగుళీమాలుణ్ణి గురించి జాగ్రత్త చెబుతారు. బుద్ధుడు పట్టించుకోకుండా అదే మార్గంలో వెళ్తాడు. అడవి లోపలికి వెళ్ళాక, చెట్ల గుబురు లోంచి అకస్మాత్తుగా దూకి బుద్ధుడిని ‘కదలకుండా నిలబడు’ అని అరుస్తాడు. బుద్ధుడు నిలబడి ‘నేను కదలకుండా ఉన్నాను. నీవు కూడా అలా ఉండు’ అంటాడు.
అంగుళీమాలుడు జీవితంలో మొదటిసారి తన అంతరంగం నుంచి భయపడతాడు. బుద్ధుడి నుంచి ఏదో అతన్ని స్పర్శించింది. బుద్ధుడి మీద దాడి చేయలేకపోయాడు. అతను బుద్ధుని పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తాడు.
ఈ కథలో జ్ఞానోదయమైన గురుదేవుల ప్రభావం ఎంతగా ఉంటుందో అర్థం అవుతుంది. ఎటువంటి ప్రయత్నమూ లేకుండా జ్ఞానోదయమైన యోగీశ్వరులు తమ నుంచి శాంతిని, కరుణని నిరంతరం ప్రసరింపచేస్తుంటారు. ఆ శక్తి ఎదుటివారిని మార్చగలుగుతుంది.
ఆ ప్రభావం కేవలం మనుషులకే పరిమితం కాదు. జంతువులు కూడా ఆ స్వచ్ఛమైన ప్రేమ కరుణల ప్రభావానికి లోనవుతాయి. అంత అత్యున్నతశక్తి సమక్షంలో ఏదైనా మారుతుంది.
ఆదిశంకరాచార్యుల వారి జీవితం నుంచి ఒక అందమైన కథ : శంకరాచార్యుల వారు దక్షిణభారతదేశంలో సంచారం చేస్తూ శృంగేరి అనే ఊరికి వస్తారు. అక్కడ ఒక రోజు ఒక, చక్కని సంఘటనని చూస్తారు. ఒక రాతి మీద రెండు కప్పలు ఉంటాయి. ఎండ రాగానే అవి నీళ్ళలోకి దూకబోతాయి. సరిగ్గా ఆ సమయంలో ఒక త్రాచుపాము పడగని విప్పి ఆ కప్పలకి నీడనిస్తుంది. కప్పలు ఆ నీడలో కొద్దిసేపు సేదదీరి నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. పాము కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. శంకరాచార్యులు ఇదంతా చూసి ఆశ్చర్యపోతాడు. ఆయన మహామేధావి. ఆయన ఆ సంఘటనని అక్కడితో వదల్లేదు. ఆయన ఇలా అనుకుంటారు, ‘ఇది చాలా పవిత్రమైన ప్రదేశమై ఉంటుంది. అక్కడ ఉన్న అత్యున్నతశక్తికి జంతువులు తమ శత్రుత్వాన్ని మరచిపోయి చక్కగా కలిసి ఉంటున్నాయి.’ ఇలా అనుకొని ఆ చుట్టుపక్కల చాలామందిని ఆ స్థలవిశేషం అడుగుతారు. అక్కడ ఒకప్పుడు గొప్ప జ్ఞానోదయమైన యోగీశ్వరుని ఆశ్రమం ఉండేదని తెలుస్తుంది. జ్ఞానోదయమైన యోగీశ్వరులు అప్రయత్నంగా సమష్టి అనుకూలశక్తిని తమ అంతరంగం నుంచి నిరంతరం ప్రసరింపజేస్తుంటారు. పతంజలి ఈ విధంగా చెబుతాడు 'జ్ఞానోదయమైన యోగీశ్వరుని సమక్షంలో సహజంగా శత్రువులు కూడా తమ శత్రుత్వాన్ని వదులుతారు'.
పూర్తి స్థాయిలో మండే మంట దేన్నైనా తనలోకి తీసుకొని స్వాహా చేస్తుంది. కాని అది దేని వల్ల కూడా మలినం కాదు. ఆ మంటలోకి ఏది వెళ్లినా అది స్వచ్ఛంగా మారుతుంది. కాని ఆ మలినాలు మంటని అంటవు. అదే విధంగా జ్ఞానోదయమైన వారు మంచి, చెడు అనేవాటి వల్ల ప్రభావితం కారు. అవి వారిని ఏమీ చేయలేవు. వారి సమక్షం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, అక్కడికి వచ్చిన ప్రతిదీ వారి ప్రేమకరుణలకి కరిగిపోవలసిందే.
ప్రపంచశాంతికి ఉండే ఒక చక్కటి మార్గం ఎక్కువ మందిని జ్ఞానోదయం పొందేలా చేయటం. నా మిషన్ లక్ష్యం ఇదే.
నిత్యానంద మిషన్
నేను ఈ భూమి మీదికి వచ్చిన కారణం, వ్యక్తిగత చేతనస్థితి, దాని నుంచి కలిగే సమష్టిచేతనస్థితి, దాని నుంచి అత్యున్నత చేతన స్థితిలోకి ప్రవేశించగల ఒక ధర్మచక్రాన్ని సృష్టించటమే. అది సాధించటానికి, ఒక లక్షమందిని జీవన్ముక్తులుగా, జీవిస్తూ జ్ఞానోదయాను భవాన్ని పొందే విధంగా దీక్షని ఇచ్చాను.
కోటిమందికి నిత్యధ్యానం దీక్షని ఇచ్చాను. నిత్యధ్యానం ఈ భూమి మీద ఉన్నవారిని అనుకూలస్థితిలో ఉన్నతమైన వ్యక్తిగత చేతనస్థితికి తీసుకువెళుతుంది.
ప్రపంచశాంతికి ధ్యానపద్ధతి
ప్రపంచశాంతిని సాధించాలి అంటే వ్యక్తిగతశాంతి కావాలి. ప్రపంచశాంతికి చేసే ధ్యానం సమూహంలో చేసేది సమష్టిధ్యానం. ఇది చాలా సులభమైంది. చాలా శక్తివంతమైంది.
అందరూ వృత్తాకారంలో కూర్చొని ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. మీరు మీ కుడి పక్కన ఉన్న వ్యక్తి చేతిలో మీ కుడి అరచేతిని ఇస్తున్న విధంగా బోర్లించినట్టు ఉంచండి. అంటే శాంతిని, ఆనందాన్ని ఇస్తున్నారని అర్థం. మీరు మీ ఎడమచేతిని మీ ఎడమ పక్కన వారి చేతి కింద శాంతిని, ఆనందాన్ని తీసుకుంటున్న విధంగా ఉంచాలి. ఈ విధంగా కూర్చున్నప్పుడు అక్కడ గొప్ప శక్తి జనిస్తుంది. ఒక వ్యక్తిలోని ధ్యానశక్తి అందరూ పంచుకుంటారు. ఈ విధంగా ఈ ధ్యానాన్ని 21 నిమిషాల పాటు చేయాలి.
- మనలోని పరస్పరవిరుద్ధమైన ఆలోచనలే మన అన్ని వ్యధలకి కారణం.
- సర్వాంతర్యామి, సర్వసృష్టి అనే మహాసాగరంలో మనమంతా అలలం. సర్వాంతర్యామి అంటే స్వచ్ఛమైన మేధాశక్తి.
- ఆందోళన చేసినంత మాత్రాన ఏమీ సాధించలేం. ఆందోళన చేసేవారే యుద్ధాలకి కారణం.
- మనతో మనం పని చేయటం, మన మీద మనం యజమానులు కాగలగటం, ఆందోళన చెందకుండా సరైన దారిలో వెళుతూ సరైన పనులు చేయగలగాలి.
- ప్రపంచశాంతిని సాధించాలి అంటే వ్యక్తిగతశాంతి కావాలి. ప్రపంచశాంతికి చేసే ధ్యానం సమూహంలో చేసేది సమష్టిధ్యానం. ఇది చాలా సులభమైంది. చాలా శక్తివంతమైంది.

సన్యాసం అంటే అంతిమద్యూతం
అంతిమద్యూతమైన సన్యాసాన్ని గెలవటమే జీవన్ముక్తి
మనం మన చుట్టుపక్కల వున్నవారితో, సర్వసృష్టికి అనుగుణంగా ఉండగల శక్తి మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకునే ప్రాధాన్యాల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకోకపోతే ఏమవుతుంది? ఉన్నదాన్ని ఉన్న విధంగా తీసుకుంటే ఏమవుతుంది?
సన్న్యాసం గురించి మాట్లాడే సమయం ఇదే. సన్న్యాసం అంటే జీవితం నుంచి పారిపోవటం కాదు. దేన్నీ అడ్డగించకుండా జీవితంతో పాటు ప్రవహించటమే. సంస్కృతంలో సన్న్యాసం అంటే సర్వాంతర్యామి మీద నమ్మకంతో ముందుకు సాగుతూ మిగతా విషయాల్ని వదిలేయటమే.
గౌతమబుద్ధుని జీవితం నుంచి ఒక చక్కని సంఘటనని చెబుతాను. జ్ఞానోదయం అయ్యాక బుద్ధుడు ప్రజలకి ధర్మబోధనలు చేస్తూ, వారికి ఆధ్యాత్మికదీక్షలనిస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతూ ఉంటాడు.
ఈ విధంగా చాలా ప్రాంతాలను దర్శించి, తన జన్మస్థలమైన కపిలవస్తు నగరంలోకి ప్రవేశిస్తాడు. కాషాయవస్త్రాలు ధరించి, తన శిష్యులతో ప్రతి వీధిలోనూ తిరుగుతున్న బుద్ధుణ్ణి ప్రజలు ఆశ్చర్యంగా చూస్తుంటారు. బుద్ధుని భార్య యశోధర వీధిలోని కోలాహలాన్ని విని, అక్కడున్న పనివారిని ఆ సందడి ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు వారు ఆమెతో ఆయన మరెవరో కాదు, నీ భర్త. ఆయన జ్ఞానోదయం పొంది బుద్ధుడుగా ఇక్కడైకి వచ్చారు, అని చెబుతారు. ఆమె ఆయనని కలవటానికి వెళ్ళదు కాని, ఆమె కుమారుడైన రాహులుణ్ణి పిలిపిస్తుంది. రాహులుడు, బుద్ధుడు జ్ఞానోదయం కోసం ఇంటిని వదలి వెళ్లిన రాత్రి జన్మిస్తాడు.
ఆమె రాహులునితో, ‘ప్రకాశాన్ని నలుదిశలా వ్యాపింపచేస్తూ, చేతిలో భిక్షాపాత్ర ఉండి కూడా చక్రవర్తిలా ఉన్న వ్యక్తిని చూసావా? ఆయనే నీ తండ్రి. వెళ్ళి ఆయన ఆశీస్సుల్ని పొంది, వారి నుంచి వారసత్వాన్ని కోరుకొని రా!’ అని చెబుతుంది.
బాలుడైన రాహులుడు పరుగుపరుగున తండ్రి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద వాలిపోయి, తల్లి చెప్పిన విధంగా అవే మాటల్ని ధైర్యంగా చెబుతాడు.
బుద్ధుడు నెమ్మదిగా ఆ బాలుడిని లేపి, చక్కని చిరునవ్వుతో అతని వైపు చూస్తాడు. ఆ తరువాత ఆ బాలుడి ఒంటిమీద ఉన్న మేలిమి పట్టుబట్టని తీసేసి కాషాయవస్త్రాన్ని కప్పుతాడు.
ఏడు సంవత్సరాల ఆ బాలుడికి, తన వారసత్వాన్ని ఇస్తాడు. రాహులుడే అతి చిన్న వయస్సులో సన్న్యాసదీక్షని పొందిన ఏకైకవ్యక్తి.
నన్ను ఒక వ్యక్తి ఈ విధంగా అడిగాడు, జీవితంలో ప్రతివిషయం సహజపరిణామ క్రమంలో అభివృద్ధి చెందేదైనప్పుడు, ఏ విధంగా అంటే, కోతి నుంచి మానవుడుగా; చెడు నుంచి మంచిగా రూపాంతరం చెందగలిగినప్పుడు, మనిషి భగవంతుడుగా కూడా సహజంగా, క్రమపద్ధతిలో మారవచ్చు కదా! అప్పుడు ఈ ధ్యానం, తపస్సు, సన్న్యాసం - వీటి అవసరం ఏమిటి? అటువంటి ప్రోత్సాహకాల అవసరం ఏమిటి?
ఆ వ్యక్తితో నేను ఇలా అన్నాను 'కోతి మనిషిగా రూపాంతరం చెందటానికి ఐదు వేల సంవత్సరాల సమయం పట్టింది. అదే విధంగా మనిషి భగవంతుడుగా మారటానికి అంతే సమయం పడుతుంది. మీరు అంత సమయం ఎదురు చూడటానికి సిద్ధంగా ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు.'
ఆ విధంగా కాదు అనుకుంటే, పూర్తి చేతనస్థితిలో జీవించాలి అని మీరు నిర్ణయించుకొని, జీవితం పట్ల పూర్తి స్పష్టతలో, విశ్వనియమాలు, సూత్రాల్ని అనుసరించి ధ్యానంతో జీవించవచ్చు. మీ పరిణామక్రమాన్ని విప్లవాత్మకంగా చేసుకోవచ్చు. సరైన విప్లవాత్మకమైన మార్పు చక్కని పరిణామాత్మక, మార్పు అయిన జ్ఞానోదయం వైపు తీసుకువెళుతుంది, అదే సన్న్యాసం. అన్నింటి కంటే గొప్ప వ్యక్తిగత విప్లవాత్మకజీవితం. అదే పరమహంసలా, జ్ఞానోదయమైన యోగీశ్వరునిలా జీవించగలగటం.
ఆదిశంకరాచార్యులవారు వివేకచూడామణి అనే గ్రంథంలో చాలా అందమైన శ్లోకాన్ని రచించారు. అన్ని ప్రాణుల్లోనూ, అన్ని జన్మల్లోనూ అరుదైంది మానవజన్మ, అంత కంటే అరుదైంది సాత్త్వికజీవితం (మంచి దృక్పథం). దాని కంటే గొప్పది, వేదాల్లో వివరించిన విధంగా ఆధ్యాత్మిక మార్గంలో స్థిరపడటం.
ఆదిశంకరాచార్యులు చెప్పిన ఈ మాటలు, వివేకానందుని జీవితం మీద చాలా లోతైన ప్రభావాన్ని చూపించాయి. వివేకానందుడు భారతదేశంలో ఉన్నటువంటి మరొక జ్ఞానోదయమైన యోగీశ్వరుడు. ఆయన ఆదిశంకరాచార్యునికి రెండు వేల సంవత్సరాల తరువాత ఉన్న వ్యక్తి. వివేకానందుడు న్యాయశాస్త్ర (లా) పరీక్షలకి సిద్ధమవుతున్న సమయంలో ఈ మాటలు ఆయనకి ఒక మెరుపులా తాకాయి. ఆ తరువాత ఆయన ఏ మాత్రం తన చదువుని సాగించలేకపోయాడు. పుస్తకాలని ఒక పక్కన పెట్టి, తన గురుదేవులైన రామకృష్ణ పరమహంస దగ్గరకి వెళ్ళటానికి పరుగుతీస్తాడు. ఆయన ఆ విధంగా పరిగెత్తే సమయంలో ఆదిశంకరాచార్యుల మాటల్లోని సత్యాలు వివేకానందుని అంతరంగంలో పదే పదే మారుమోగుతుంటాయి. ఆయన తనలో ఈ విధంగా అనుకుంటాడు, నేను ఆదిశంకరాచార్యులు చెప్పిన మూడు స్థితులనీ పొందాను. నేను మానవుడుగా జన్మించాను. నాకు ముక్తి (స్వేచ్ఛ) కావాలి అనే కోరికని పొందాను. ఒక గొప్ప గురుదేవుణ్ణి పొందాను.
ఎవరైతే తమ మీద తాము గెలవాలని అనుకుంటారో వారికి కావలసింది సన్న్యాసమార్గం. ఎవరికైతే అసూయ, కోపం, ఒత్తిడి, క్రంగుబాటు - ఇటువంటి సంకెళ్ళ నుంచి శాశ్వత విముక్తి కావాలి అనే కోరిక ఉంటుందో వారికి సన్న్యాసం సరైన మార్గం. చాలామంది సన్న్యాసం అంటే జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయినవారు చేసే పని అనుకుంటారు. అది కాదు, కాకపోతే కొందరికి జీవితంలో ఏం చేయాలో తెలియక సన్యాసం తీసుకుంటారు. అయితే సన్యాసంలోని ముఖ్యార్థం అది కాదు.
సన్యాసం అంటే మొట్టమొదటిసారిగా చేతనస్థితిలోకి రావటానికి చేసే ప్రయత్నం. మనిషి చుట్టూ ఉండే యాంత్రికజీవితం నుంచి చేతనస్థితిలోకి రావటానికి చేసే ప్రయత్నం సన్యాసం. మీరు సర్వాంతర్యామిలో ఒక భాగం. సర్వాంతర్యామి తన పద్ధతిలో తాను సాగిపోతుంటాడు. తన సంగీతంతో తాను ముందుకి వెళుతుంటాడు. ఆ సంగీతలయలకి అనుగుణంగా సాగిపోయే శాస్త్రమే సన్యాసం. సర్వాంతర్యామి అయిన విశ్వశక్తికి మన ఆత్మతో ఉండే అనుబంధమే సన్యాసం. అది ఒక్కటే జీవితంలో విజయాన్ని సాధించగల దగ్గర దారి.
విశ్వశక్తి సంగీతనాదాన్ని వినాలి అంటే మీరు సరైన దశలో, సరైన స్థితిలో ముందుకి సాగాలి. ఆ స్థితిని కనుక్కోవాలి అంటే ముందుగా మీరు మిగతా విషయాల్ని వదిలి కేవలం ఆ సంగీతాన్ని లోతుగా, తెలుసుకునే తత్వంతో, పూర్తి ఎరుకతో వినగలగాలి. అప్పుడు ఆ స్థితిని మీరు కనుక్కుంటారు. ఆ స్థితిలోనే జీవితం సాగరం వైపు పరుగులు తీసే నదిలా సాగిపోతుంది. మరే ఇతరమార్గమైనా చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది.
ఎప్పుడైతే జీవితం ఒక ప్రవహిస్తున్న నదిలా ఉంటుందో, అప్పుడు అది సాగరంలో కలసిపోవలసిందే. అంతకు మించి దానికి వేరే దారి లేదు. సన్యాసం అంటే ప్రవహించే శాస్త్రం. సర్వప్రకృతికి, ఈ సృష్టికి అనుగుణంగా ప్రవహిస్తూ చివరికి ఆ విశ్వశక్తితో ఐక్యమైపోవటమే.
నదిలా ప్రవహించండి
నది ఎప్పుడూ సాగరం వైపు మాత్రమే ప్రవహిస్తుంది. అది ఎక్కడా ఆగి నిలిచిపోదు. సన్యాసి ఎప్పుడూ కూడా తన లక్ష్యమైన జ్ఞానోదయం వైపు ప్రవహిస్తూ ఉంటాడు. అతనికి అడ్డంకులు ఏవీ తెలియవు. నది నిరంతరం పరమానందంతో ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఏది, ఎంత వేసి కలుషితం చేసినా అది అలా ఆనందవాహినిలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి పూలని వేసినా, ఆకులు వేసినా, ఆహారం, పక్షులు, జంతువులు, కళేబరాలు, ఇది కాదు, అది కాదు అనకుండా ఏది వేసినా, ఏ మాత్రం వాటిని పట్టించుకోకుండా నిరంతరం ఆనందంగా ప్రవహిస్తూ, తనకి అడ్డం వచ్చేదాని ద్వారా కూడా ప్రభావితం కాకుండా, ముందుకు పోతూ ఉంటుంది. నదిలోని ప్రవాహవేగం, ఆ అడ్డంకుల్ని దాటే విధంగా చేస్తూ, అది తిరిగే సుడుల శబ్దం నుంచి సంగీతాన్ని సృష్టిస్తూ సాగరసంగమం కోసం సాగరదిశగా పరుగులు తీస్తుంది. విశ్వమేధాశక్తి కూడా సన్యాసిని అతనికి అడ్డం వచ్చే అడ్డంకుల నుంచి ముందుకి లాగుతూ, తన జీవితలక్ష్యమైన జ్ఞానోదయం వైపు సాగిపోయే విధంగా చేస్తుంది. అతనికి అసలు అడ్డంకులు ఏమిటో తెలియదు.
పరివ్రాజకుడుగా చాలా ప్రాంతాల్లో తిరిగే రోజుల్లో, ఒకసారి నేను, దాదాపు తొమ్మిది నెల్ల పాటు రెండు చోట్ల గడిపాను. అవి పవిత్రగంగానది ఒడ్డున, పవిత్రనర్మదానది ఒడ్డున. ఆ రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, ఆ నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చునేవాడిని. అలా కూర్చొని కేవలం ఆ నదీప్రవాహాన్ని చూస్తూ ఉండేవాడిని. సూర్యోదయం అయ్యేది. నేను అదే విధంగా నదీప్రవాహాన్ని చూస్తూ ఉండేవాడిని. అలా చూసే సమయంలో నా మనస్సు నిశ్శబ్దం అయ్యేది. ఆలోచనలు క్రమంగా తగ్గేవి. అంతరంగంలోని మాటల ప్రవాహం ఆగిపోయేది. నేను ఆ నదీప్రవాహంలో ఐక్యమైపోయేవాడిని. ఆ విధంగా కొన్ని గంటల పాటు ఉండేవాడిని.
అంతే కాదు, మీరు ఎప్పుడైతే నదిని నిరంతరంగా చూస్తుంటారో మీలో భయం పోతుంది. నదిలో చాలా కొట్టుకువస్తుంటాయి. శవాలు తేలిరావటం చూస్తారు. ఒక రోజు నేను కూడా చనిపోయి అలా తేలుతాను కదా అని అనిపిస్తుంది. ఎప్పుడైతే నదీప్రవాహంలో ఐక్యమైపోతారో, మీ అంతరంగపు లోతులలో ఉన్న అన్ని రకాల భయాలూ మాయమౌతాయి.
ఒకసారి ఒక వ్యక్తి జెన్ మాస్టర్ని 'జెన్ అంటే ఏమిటి?' అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు ఆయన 'నడుస్తూ ఉండు' అంటాడు.
జెన్ బౌద్ధమతంలో జీవితం గురించి చక్కగా చెబుతారు. జీవితం నదిలా ప్రవహిస్తూ, ప్రతి రూపాన్నీ తనలో నింపుతూ తన పరిధిని చెరిపేస్తూ నిరంతరం విస్తరిస్తూ ఉంటుంది. ఇదే జీవితానికి, సన్న్యాసికి ఉండవలసిన ముఖ్యలక్షణం. సన్న్యాసం అంటే జీవితాన్ని జీవిస్తూ అందులో నుంచి నేర్చుకోవటమే కాని దాన్ని ఒక వేదాంతంలా చేయటం కాదు, జీవితం ఒక శక్తి. అది సిద్ధాంతం లేదా ఒక నియమం కాదు. నిజమైన సన్న్యాసి జీవితం ఎప్పుడూ సరైన దిశలో ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణంలోనే తాను నేర్చుకోగల అన్ని అంశాలూ నేర్చుకుంటాడు. నేర్చుకోవటం, జీవితం వేరు వేరు కాదు. జీవిస్తూ జీవితానుభవాల నుంచి నేర్చుకుంటాడు.
ఒక చిన్న కథ : ఒకప్పుడు ఒక దొంగ ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఒక రోజు అతను కొడుకుని తీసుకొని ఒక ఇంటికి వచ్చి అందరూ నిద్ర పోయాక కొడుకుని ఇంట్లో లోపలికి వెళ్ళి ఏదైనా దొంగతనం చేసి తీసుకురమ్మని లోపలికి పంపిస్తాడు. కొడుకు సరే అని లోపలికి వెళతాడు. అతను లోపలికి వెళ్ళగానే దొంగ తలుపు మూసి గడియ వేసి, ముందు పక్క తలుపుని గట్టిగా కొడతాడు. ఆ శబ్దానికి ఇంట్లోవాళ్ళంతా మేలుకుంటారు. వాళ్ళు ఎవరూ tఅనను చూడకుండా త్వరగా అక్కడి నుంచి పారిపోతాడు.
కొన్ని గంటలయ్యాక కొడుకు తండ్రి దగ్గరకి వచ్చి, చాలా కోపంగా అరుస్తూ 'ఎందుకు నన్ను లోపలుంచి గడియ పెట్టావు? అని అడుగుతాడు. తండ్రి దొంగ నవ్వి, 'నేను అలా చేయకపోతే, నీవు దొంగతనంలో మొదటి పాఠం నేర్చుకునేవాడివి కాదు' అంటాడు. సన్న్యాసం అంటే నేరుగా సత్యాల్ని ప్రతిక్షణం సాధన చేయటమే. ప్రపంచంలో కావలసినంత వేదాంతం, ఆధ్యాత్మికగ్రంథాలు ఉన్నాయి. కానీ అనుసరించేవారు, సాధన చేసేవారు లేరు. సన్న్యాసం అంటే సత్యాల్లో జీవించటం, జీవితంలో ప్రతిక్షణం ఆ సత్యాల్ని సాధన చేయాలని చేతనస్థితిలో నిర్ణయించటం.
జెన్ బౌద్ధగురువు తన శిష్యులతో ఒక చక్కని మాట చెబుతాడు, ‘సత్యాల్ని వేదాంతపాఠాలుగా చదవటం అంటే బోధన పరికరాలని పోగుచేసుకోవటమే. బాగా గుర్తుంచుకో, ఆ సత్యాల్ని నిరంతరం సాధన చేయకపోతే, నీలోని సత్యం అనే జ్యోతి ఆరిపోతుంది.’
సాధన అంటే సరైన దిశలో, ఎక్కడా ఆగకుండా అలా నిరంతరం ప్రవహిస్తున్నట్టు వెళుతూ ఉండటమే. ఎప్పుడైనా, ఎక్కడైనా ఆ నిరంతరప్రయాణం ఆగితే, అక్కడ కూడా కదలికలు ఉండాలి. ప్రవాహానికి అడ్డు తగిలిన అడ్డంకి నుంచి తప్పుకొని ప్రవహించగల మార్గాన్వేషణ ఉండాలి. అటువంటివారికి ఆగటం అనేది అసలు ఉండదు.
ఒక జపాన్ యోధుడికి శత్రువులతో పోరాడవలసిన అవసరం ఏర్పడుతుంది. అతని సైన్యం శత్రుసైన్యంలో పదవ వంతు కూడా ఉండదు. కానీ తాను తప్పకుండా గెలుస్తానని అనుకుంటాడు. అతని సైన్యం ఆ మాటని నమ్మరు. యుద్ధానికి వెళ్ళే దారిలో వారు ఒక దేవాలయం దగ్గర ఆగుతారు. అప్పుడు ఆ యోధుడు తన సైన్యంతో ఈ విధంగా అంటాడు, ‘నేను గుడిలోకి ఒక నాణాన్ని వేస్తాను. బొమ్మ పడితే మనం గెలుస్తాం. బొరుసు అయితే మనం ఓడిపోతాం. మన అదృష్టాన్ని ఆ దేవత చేతిలో పెడుతున్నాను.’ సైన్యం దీనికి అంగీకరిస్తారు. యోధుడు గుడి లోపలికి వెళ్ళి నిశ్శబ్దంగా ప్రార్థన చేసి నాణాన్ని విసురుతాడు. అప్పుడు బొమ్మ పడుతుంది. అతని సైన్యం ఉత్సాహంతో ముందుకు దూసుకువెళ్ళి, ధైర్యంతో యుద్ధం చేసి గెలుస్తారు.
యుద్ధం తరువాత, ఆ యోధుని సన్నిహితుడు ఈ విధంగా అంటాడు, ‘అదృష్టాన్ని ఎవరూ మార్చలేరు’ అని. అప్పుడు యోధుడు, ‘అది సరి కాదు’ అని తన చేతిలోని నాణాన్ని చూపిస్తాడు. దానికి రెండు వైపులా బొమ్మ ఉంటుంది.
సన్న్యాసి నిరంతరం విశ్వమేధతో ముందుకి సాగుతాడు. అతను ఎక్కడా ఆగడు. అతను ప్రతిక్షణం వర్తమానంలో ఉంటాడు. ఏ క్షణానికి ఎలా అవసరమో ఆ విధంగా ఉంటాడు. దీన్నే చైతన్యవంతమైన జీవితం అంటారు.
విశ్వశక్తికి అధీనమై, ఆ శక్తి తాలూకు మేధకి అనుగుణంగా ముందుకి సాగటమే సన్న్యాసం, సన్న్యాసి నదిలా ముందుకి సాగుతూ ఉంటాడు. సర్వాంతర్యామి ప్రకృతి, పక్షులు, జంతువులు, సముద్రాలు - వీటితో పాటు ఆ సన్న్యాసిని కూడా తనతో ముందుకు తీసుకువెళుతుంది. అధీనం అవటం అంటే సోమరితనం, జడత్వం కాదు. చేయవలసిన పనుల్ని సర్వాంతర్యామికి అధీనమై చేయటమే. అప్పుడు సర్వసృష్టి న్యాయసూత్రాల ఆధారంగా ఆ పనుల ఫలితాలు ఉంటాయి. మీరు నిరంతరం విరామంగా ఉండగలుగుతారు.
ఎప్పుడైతే మీరు విరామంగా, విశ్రాంతిగా ఉండగలరో, అప్పుడే మీరు ఇతరుల పట్ల బాధ్యతతో వ్యవహరించగలరు. మీ ప్రతిస్పందన బాధ్యతాయుతంగా ఉంటుంది. అప్పటి వరకు మీరు ఎదుటివారికి చూపేది ప్రతిచర్య మాత్రమే కాని ప్రతిస్పందన కాదు. ప్రతిచర్య అంటే అచేతనస్థితి నుంచి వెల్లడి చేయటమే. అదే ప్రతిస్పందన అంటే చేతనస్థితి నుంచి వెల్లడి చేయటం. అది బాధ్యత కూడా. ప్రతిచర్య ఎప్పటికీ బాధ్యత కాదు. సన్న్యాసం అంటే ప్రపంచం పట్ల, ఆ వ్యక్తి పట్ల బాధ్యత దిశగా చేతనస్థితిలో వేసే మొదటి అడుగు. సన్న్యాసం అంటే ఇది అని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అందరూ సన్న్యాసం అంటే జీవితం పట్ల బాధ్యతల్ని వదిలేయటం అనుకుంటారు. అది కాదు, సన్న్యాసం అంటే జీవితంలో ఎక్కువ బాధ్యతలు తీసుకోవటమే సన్న్యాసం. వారికి ప్రపంచమే ఒక కుటుంబం. వారు అందరి బాధ్యతనీ తీసుకుంటారు.
సన్న్యాసం అంటే అన్నీ వదిలేయటం కాదు
సన్న్యాసం అనగానే అన్నీ వదిలేయటం అనే తప్పు అర్థాన్నిస్తారు. మీరు దేన్నీ వదిలేయనవసరం లేదు. మీరు ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలు - ఈ ఐశ్వర్యానికి, వస్తువులకి మీరు కొంత కాలం కాపలా ఉండే కాపలాదారులు మాత్రమే అని, ఆ ఐశ్వర్యం, వస్తువులు అన్నీ ఆ సర్వాంతర్యామివే. మీలాగానే అవీ ఆయన సొంతం. అటువంటప్పుడు మీరు దేన్నీ వదలనవసరం లేదు. ఎందుకంటే మీరు దేన్నీ 'నాది' అని అధీనపరుచుకోలేదు కాబట్టి. అంతే కాకుండా మీరు మీ ఐశ్వర్యాన్ని వదులుకోవలసి వచ్చినప్పుడు మీరు బాధ పడరు, ఎందుకంటే అది మీది కాదు కాబట్టి. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే నాది అనే దృక్పథంతో అన్నింటినీ సొంతం చేసుకోవాలి అనుకున్నప్పుడే.
నేను ఒక చక్కని జెన్ పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఈ విధంగా ఉంది 'నాది అని మీకు అనిపించిన వాటినన్నింటినీ మానసికంగా వదిలేయండి. ఏదైనా ఒక రోజు, అవి మీ దగ్గర నిజంగా లేకపోయినా బాధపడరు.' దీన్ని మీరు ఒక చక్కని పదినిమిషాల ధ్యానంలా ప్రతి రోజూ చేయవచ్చు. మీరు సొంతం చేసుకోవాలని అనుకునే మీ దృక్పథం మీద చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఉదయం నిద్ర లేవగానే 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కేవలం మీతోనే కూర్చోండి. మీకు ఉన్న ఐశ్వర్యమంతా ఆ సర్వాంతర్యామిది అని ఊహించండి, ఏదీ మీది కాదు. సర్వాంతర్యామి దయతో ఆ ఐశ్వర్యాన్ని ఉపయోగించుకోమని మీకు ఇచ్చాడు. ఆ విశ్వశక్తి పట్ల కృతజ్ఞతాభావాన్ని మీ అంతరంగంలో నింపండి. ఆ భావం మీ నుంచి భగవంతుని వైపు పొంగి ప్రవహించే విధంగా ఉండండి. ఈ భావాన్ని బలంగా స్పష్టంగా మీ అనుభవంతో తెలుసుకోండి. అప్పుడు మీరు మీ లోపల అకస్మాత్తుగా 180 డిగ్రీల మార్పు రావటాన్ని చూడగలుగుతారు. ముందుగా మీ సొంతమైంది ఏది అనే విషయంలో ఆశ్చర్యపోతారు. అర్థం చేసుకోండి, సన్న్యాసం అనేది కృతజ్ఞతాభావం పొంగి ప్రవహించే దగ్గర ప్రారంభమవుతుంది.
సన్న్యాసి ఈ ప్రపంచాన్ని ఎలా వదలాలి అని భయపడనవసరం లేదు. అదే విధంగా సంసారి సన్న్యాసం గురించి భయపడనవసరం లేదు. సర్వసృష్టికర్త సరైన సమయంలో ఇవ్వవలసింది ఇస్తాడు, తీసుకోవలసిందాన్ని తీసుకుంటాడు అని స్పష్టంగా తెలుసుకోగలిగితే చాలు. అప్పుడు మీరు ఈ నిమిషాన ఏం జరిగితే అదే మంచిది అని తెలుసుకుంటారు. జీవితం ఎలా సాగాలో అదే విధంగా సాగిపోతుంది. అప్పుడు మీకు, మీ ఐశ్వర్యానికి మధ్య ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీనే సన్న్యసించటం అంటారు. అది కేవలం ఖాళీ మాత్రమే. సొంతం చేసుకోవాలి అని కొనసాగే మన దృక్పథానికి ఒక బ్రేక్. అంతకు మించి మరేమీ కాదు. సన్న్యాసం అనే సందర్భంలో సన్న్యసించటం (వదిలేయటం) అనే మాటని తప్పుగా ఉపయోగించారు.
ఒక్క చిన్న కథ : ఇద్దరు ఆధ్యాత్మికసాధకులు కలసి ప్రయాణం చేస్తూ ఉంటారు. వారిలో ఒక వ్యక్తి ఐశ్వర్యం అవసరం, దాని ద్వారా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందవచ్చు, మంచి సాధన చేయవచ్చు అని నమ్మే వ్యక్తి. మరొక వ్యక్తి సన్న్యాసమార్గంలో వెళ్లే వ్యక్తి. ఇద్దరూ వారి వారి జీవనమార్గాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. వారు అలా మాట్లాడుతూ ఉండగా రాత్రి అవుతుంది. అప్పుడు వారు ఒక నది ఒడ్డుకి వస్తారు.
సన్న్యాసమార్గంలో ఉన్న వ్యక్తి దగ్గర డబ్బు లేదు. అప్పుడు అతను ‘మన దగ్గర నదిని దాటేందుకు కావలసిన డబ్బు లేదు. కాబట్టి ఈ రాత్రికి నది ఒడ్డున గడిపి తెల్లవారేక ఎవరి సహాయంతోనైనా నదిని దాటుదాం అంటాడు. అప్పుడు మొదటి వ్యక్తి, ‘అది జరగని పని. మనం రాత్రికి ఇక్కడ ఉంటే ఏ క్రూరమృగమైనా మనని తినవచ్చు. నా దగ్గర డబ్బు ఉంది. మనం పడవవానికి డబ్బు కట్టి నదిని దాటుదాం’ అంటాడు.
వారిద్దరూ ఆ విధంగా నదిని క్షేమంగా దాటి అవతలి ఒడ్డుకి చేరతారు. అప్పుడు మొదటి వ్యక్తి సన్న్యాసమార్గంలో ఉన్న వ్యక్తితో, ‘ఇప్పుడు నీకు డబ్బు విలువ తెలిసిందా? నేను కూడా నీలాగా సన్న్యాసమార్గంలో ఉండి ఉంటే ఏం జరిగేది?’ అంటాడు. అప్పుడు రెండవ వ్యక్తి ‘నీలోని సన్న్యాసదృక్పథమే మనని నదిని దాటించింది. నీవు నీ దగ్గరున్న డబ్బుని వదులుకోబట్టే మనం నదిని దాటగలిగాం’ అని జవాబు ఇస్తాడు.
సన్న్యసించటం అంటే దేన్నైనా అది నాది కాదు అనే భావంతో దాన్ని కలిగి ఉండటం. అదే విధంగా దాన్ని వదిలేస్తున్నారు అనే భావం లేకుండా దాన్ని వదిలివేయగలగటం. అంతే కాని బయటి ప్రపంచంలో ఏవో కొన్ని వస్తువుల్ని వదిలేయటం ద్వారా, మీరు ఏమీ పొందలేరు. మీరు కేవలం నాది అనే దాన్ని త్యాగం చేస్తున్న బాధని అనుభవిస్తారు అంతే. సన్న్యాసం అంటే నాది అనేదాన్నుంచి పారిపోవటం కాదు. నాది అనే దానికి అతీతంగా వెళ్ళటమే సన్న్యాసం. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని సన్యసిస్తే ఫరవాలేదు. అలా కానప్పుడు అది మీ లోపల ఉండి మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మీతోనే వస్తుంది. అంతే కాదు నేను, నాది అనే భావనతో సన్యసిస్తే మీ పని ఎలా ఉంటుందంటే చేసే పని కరెక్టే కానీ కారణం మాత్రం తప్పు అన్నట్టుగా ఉంటుంది. బయటి ప్రపంచంలోని ఐశ్వర్యాన్ని, వస్తువుల్ని సన్యసించినంత మాత్రాన మీరు సన్యాసి కాలేరు. సన్యాసి అంటే మీ అంతరంగానికి సంబంధించింది. అంతే కాని అది బయటి ప్రపంచానికి సంబంధించింది కాదు. సన్యాసం కోసం బయట ప్రపంచంలోని ఐశ్వర్యాల్ని, వస్తువుల్ని సన్యసించటం అంటే తప్పు కారణంతో సరైన పనిచేసాను అని చెప్పటమే.
అర్థం చేసుకోండి, నిర్ణయం సరియైందే కాని దాని కారణం మాత్రం తప్పు. బయటి ప్రపంచంలోని ఐశ్వర్యం, వస్తువుల్ని వదిలేయటం సన్యాసం అనుకుంటే ఇదే విధంగా ఉంటుంది. సరియైన పని అయినా కారణం మాత్రం తప్పు. ఐశ్వర్యం, సన్యాసం ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాదు. నిజానికి సన్యాసం అంటే మచ్చ లేకుండా ఐశ్వర్యాన్ని సంపాదించే ఒక కళ, ఒక శాస్త్రం.
మీరు ఒక నిజాన్ని తెలుసుకోవాలి. భారతదేశంలోని బంగారంలో చాలా భాగం దేవాలయాల్లో, ఆశ్రమాల్లోనే ఉంది. దక్షిణ భారతదేశంలో చాలా దేవాలయాల గోపురాలు బంగారంతో ఉంటాయి. మీరు ఊహించండి, అది ఎంత ఐశ్వర్యమో, మీరు సన్యాసం అంటే ఏమిటో, ఆ సత్యాన్ని అర్థం చేసుకుంటే ఐశ్వర్యం నుంచి మీరు పారిపోరు. దాని పట్ల మీకు గౌరవం కలుగుతుంది కానీ మీరు దానిలో చిక్కుకోరు. దాన్ని మీ అంతరంగంలో నిలుపుకోరు. మీ అంతరంగంలో ఐశ్వర్యానికి అసలు స్థానం ఉండదు. కాబట్టి దాని విషయంలో మీరు ఎప్పుడూ బాధ పడరు. ఐశ్వర్యం వల్ల మీరు ఎప్పుడూ వ్యధ చెందరు.
మీరు వేదసాహిత్యాన్ని చదివితో మీకు ఒక విషయం అర్థమవుతుంది. అందులో ఋషులు జీవితాన్ని సుసంపన్నంగా ఉంచటం గురించే చెబుతారు. జీవితం నుంచి పారిపోమని చెప్పరు. వారు బయటి ప్రపంచవిషయంతో మనకి ఉన్న బంధాల్ని వదులుచేయమని అంటారు. అంతే కాని వాటిని సన్యసించమని కాని, వాటిని ద్వేషించమని కాని చెప్పరు. సన్యాసం అంటే జీవితాన్ని సుసంపన్నంగా సంపూర్ణంగా చూడగలగటమే. అంతే కాని మీకు ఉన్న చిన్న చిన్న వస్తువులతో బంధాలు ఏర్పరచుకోమని కాదు. ఐశ్వర్యం కూడా సర్వాంతర్యామి, సర్వసృష్టి తాలూకు ఒక రూపం అని తెలుసుకోవటమే సన్యాసం. ఒక్కసారి ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే, అప్పుడు మీ దగ్గర ఎంత సంపద ఉన్నా మిమ్మల్ని ఏమీ చేయదు. మీరు దాని చేత ప్రభావితం కాలేరు. అది మిమ్మల్ని అంటదు. ఆ విధంగా ఐశ్వర్యం చేత ప్రభావితం కాకుండా, ఉండగలగటమే సన్యసించటం అంటే. సన్న్యాసి తనంతట తానుగా, తన ఎంపికతో, తన నిర్ణయంతో సంపదల్ని వదిలేయటం అయితే పరవాలేదు. అంతే కానీ సన్న్యాసం అంటే సంపదలు వదిలేయాలనే నిర్వచనం కోసం కాదు. నిజమైన సన్న్యాసి సంపదలకి అతీతంగా జీవిస్తాడు. ఎప్పుడైతే సంపదలకి అతీతంగా వెళతాడో, అప్పుడు అతనికి ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా ఒకటే. ఇదంతా లోతుగా అర్థం చేసుకొని అప్పుడు సంపదల్ని సన్న్యసిస్తే పరవాలేదు కానీ ఏదో బలవంతంగానో లేదా ఓడిపోయి సన్న్యసించటం సన్న్యాసం కాదు.
సన్న్యాసం అంటే ఆత్మహత్య కాదు, అది జీవితం. సన్న్యాసం అంటే అంతరంగ ప్రపంచంలోనూ, బయటి ప్రపంచంలోనూ అద్భుతమైన అందంతో జీవించగలగటమే.
పర్షియన్ యోగి జలాలుద్దీన్ రూమి కథ : ఒక సాధువు తన పొలంలో దున్నటానికి వెళతాడు. అక్కడ ఒక నెమలి తన ముక్కుతో అందమైన తన ఈకల్ని పొడిచి పాడు చేస్తుంటుంది. ఆ సాధువు తనని తాను పాడు చేసుకుంటున్న నెమలిని చూసి తట్టుకోలేకపోతాడు. అందులోనూ అంత అందమైన పక్షి అలా చేయటం సహించలేక, అలా చేయవద్దు అని దాన్ని వారిస్తాడు. అప్పుడు నెమలి సాధువుతో ‘నేను ఆపను. నా ఈ అందమైన ఈకలు నా యజమానికి కష్టాల్ని కలిగిస్తాయి. వేటగాళ్ళు నా ఈ అందమైన ఈకల కోసం నన్ను నిరంతరం వెంటాడుతుంటారు. నన్ను తన దగ్గర ఉంచుకోవటం నా యజమానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ అందమైన ఈకల్ని తీసేసి నన్ను నేను అందవిహీనంగా చేసుకుంటే వీళ్ళు నన్ను వెంబడించరు’ అని చెబుతుంది.
అర్థం చేసుకోండి, బయట కనిపించే అందం, సిరిసంపదలు సన్న్యాసమార్గానికి శత్రువులు కావు. అవి సన్నిహితులే. సన్న్యాసి బయటి అందానికి, ఐశ్వర్యానికి, అంతరంగపు అందాన్ని, సంపదల్ని కలుపుతాడు. సన్న్యాసం అతనికి బయట ప్రపంచపు అందాన్ని, ఐశ్వర్యాన్ని బాధలు లేకుండా నిర్వహించగల మేధని ఇస్తుంది.
వాస్తవంలో జీవించండి!
సన్న్యాసం అంటే వస్తుప్రపంచానికి, ఆధ్యాత్మికప్రపంచానికి మధ్య ఆడుకునే ఆట కాదు. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోండి, మనకి వస్తుప్రపంచం, ఆధ్యాత్మికప్రపంచం అని రెండు ప్రపంచాలు లేవు. మనకి ఉన్న ప్రపంచం ఒక్కటే.
ఇక రెండవ విషయం: సన్న్యాసం అంటే సిద్ధాంతం కాదు. ఈ ప్రపంచంలో సరైన దృక్పథంతో జీవించగలగటం. సన్న్యాసం అంటే ఎంత చక్కగా మనం జీవించవచ్చో అర్థం చేసుకోవటమే. వాస్తవానికి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఎలా జీవించాలో అర్థం చేసుకోవటమే. వాస్తవంలో జీవించటం అంటే జీవితాన్ని అత్యున్నతస్థితిలో జీవించటమే.
వాస్తవంలో, వాస్తవంతో జీవించటం అంటే ఏమిటి? ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పుడు మనం మేల్కొని ఉన్న స్థితిని మీరు సత్యం కాదు ఇది కూడా స్వప్నమే అన్నారు కదా! అది ఎలా సాధ్యం? మేము నిద్ర పోయి, తిరిగి మేల్కొన్నప్పుడు, మా చుట్టూ ఉన్న వస్తువులు, ఇల్లు, కారు, మనుషులు - అన్నీ అవే ఉంటాయి. నిద్ర లేచేసరికి అవి మారిపోవు. కానీ నిద్రలో మాకు కలలు వచ్చినప్పుడు అవి ఒకే విధంగా ఉండవు. కాబట్టి కల అంటే కలే. మేల్కొని ఉన్న స్థితి వేరు, అది నిజం.
నేను ఇప్పుడు ఏం చెబుతున్నానో జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మీకు ఒక రాత్రి వచ్చిన కలలో 10 నుంచి 12 సంవత్సరాల జీవితం కలగా వస్తుంది. కరెక్టేనా? మీ కలలో మీ కాలేజీ జీవితం, ఆ తరువాత వివాహం, పిల్లలు - ఈ విధంగా కల వస్తుంది. అంటే 10 సంవత్సరాల జీవితాన్ని ఒక రాత్రిలో జీవించారు.
దీని అర్థం ఏమిటి?
దీని అర్థం 10 సంవత్సరాల మీ జీవితాన్ని 10 గంటల్లో జీవించారు. అయితే మీరు కల కనేటప్పుడు అది అంత త్వరగా గడిచింది అని అనుకోరు. మీరు స్పష్టంగా 10 సంవత్సరాల జీవితాన్ని జీవిస్తున్నాను అని అనుకుంటారు. మీరు అకస్మాత్తుగా నిద్ర లేవగానే, మీరు కేవలం 10 గంటలే గడిపినట్లు తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి; అదే విధంగా, ఏ క్షణంలోనైనా మీరు మేల్కొని, మీరు ఈ భూమి మీద 70 సంవత్సరాలు గడపలేదు అని అది కేవలం ఏడు గంటలే అని అనుకోవచ్చు కదా! మీకు వివరిస్తాను.
నిన్న మే 10వ తారీఖు. సరేనా! మే 9 వ తారీఖు, 10వ తారీఖు మధ్యలో అంటే ఒక రాత్రి 10 గంటల సేపు మీకు వచ్చిన కలలో 10 సంవత్సరాల జీవితాన్ని గడిపారు. ఆ పది గంటల సమయంలో మీరు కాలేజీకి వెళ్ళి చదివారు, నిద్ర పోయారు, మేల్కొన్నారు. ఇలా 10 సంవత్సరాల జీవితాన్ని గడిపారు. అంటే 10 సంవత్సరాల్లో మీరు నిద్ర పోకుండా ఉండరు కదా! కాబట్టి కలలో కూడా మీరు నిద్ర పోతారు, మేల్కొంటారు, మామూలు జీవితాన్ని గడుపుతారు.
ఇప్పుడు ఒక ముఖ్యవిషయాన్ని అర్థం చేసుకోండి. మీరు 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకూ వచ్చిన కలలో 10 సంవత్సరాల జీవితాన్ని గడిపారు. అందులో చాలా సార్లు నిద్రపోయి లేచారు. ఇదంతా కలలో ఒక భాగంగానే చేశారు. ఆ కలలో నిద్ర మేల్కొన్న ప్రతిసారీ మీరు, మీకు సంబంధించిన వ్యక్తులు వస్తువులు - అన్నీ అదే విధంగా ఉంటాయి. అవును కదా! అంటే మీరు కలలో ఒక కాలేజీ స్టూడెంట్ గా నిద్రపోతే ఆ కలలో నిద్ర లేచినప్పుడు కాలేజీ స్టూడెంట్ గానే ఉంటారు. కాలేజీ స్టూడెంట్ గా కల మొదలై తరువాతి దశ, ఆ తరువాతిది
- ఇలా ఒక దాని తరువాత ఒకటిగా ఎటువంటి అయోమయం లేకుండా స్పష్టంగా అన్ని దశలూ జరుగుతాయి. దీని అర్థం ఏమిటి? ఇదంతా మీరు మేల్కొని ఉన్న సమయంలో ఏ విధంగా అయితే మీరు కాలేజీకి వెళ్ళివచ్చినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు, మీకు సంబంధించిన వస్తువు, ఇల్లు, కారు అంతా అవే ఉంటాయి. అందుకే ఇది నిజం కల కాదు అనుకుంటారు. అంతే కదా!
దీని అర్థం ఏమిటి? అంటే మీరు నిద్ర పోయి పొద్దునే మేల్కొన్నప్పుడు, మీకు అన్నీ అదే విధంగా కనిపిస్తాయి. అదే బ్యాంక్ బ్యాలెన్స్, అదే ఇల్లు, అదే కారు. మరి దీని అర్థం ఏమిటి? ఇది కూడా నిజం కాదు అనే కదా! ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ విషయం అర్థమైతే మీ జీవితాన్ని చక్కగా విశ్లేషించగలుగుతారు. చాలా విషయాలలో స్పష్టత వస్తుంది.
ఎప్పుడైతే ఇదంతా ఒక మాయ-మిథ్య అని తెలుస్తుందో, మీరు దేన్నీ సన్యసించరు. మీరు అన్నింటితోనూ జీవిస్తారు కాని దేని వల్ల మీ నిశ్చలతని పోగొట్టుకోరు. ఏ విషయం మీ మీద ప్రభావాన్ని చూపలేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే మీ 10 సంవత్సరాల జీవితం 10 గంటల కలలో గడిపారో అదేవిధంగా మీ 70 సంవత్సరాల జీవితం మరొకరికి, ఎవరైతే ఇంకా ఉన్నతాధ్యాత్మిక స్థితిలో ఉంటారో వారికి ఏడు గంటలే కావచ్చు. ఎవరి కాలెండరు వారిది.
సంస్కృతంలో దీన్నే క్షణికం అంటారు. మీకు ఒక సెకండ్‌కి వచ్చే ఆలోచనలు ఎక్కువగా ఉంటే చాలా సమయం పట్టినట్టు అనిపిస్తుంది. ఉదాహరణకి మీకు బాగా ఇష్టమైన వ్యక్తితో ఉన్నప్పుడు మీకు సమయం త్వరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మీలో సెకండ్‌కి వచ్చే ఆలోచనల సంఖ్య తగ్గుతుంది. మీరు ఇష్టం లేని వ్యక్తితో ఉన్నప్పుడు ఎంతకీ కాలం గడవనట్టే ఉంటుంది. ప్రతి ఐదు నిమిషాలకి మీరేం చేస్తారు? మీరు వాచ్‌లో టైం చూస్తూ ఉంటారు. అప్పుడు సెకండ్‌కి మీకు వచ్చే ఆలోచనల సంఖ్య చాలా ఎక్కువ. అప్పుడే మీరు అసహనంగా అవుతారు. చాలా సమయం గడిచిపోయినట్టు భావిస్తారు.
అందుకే వేదసంస్కృతిలో కాలాన్ని కొలిచే యూనిట్ సెకండ్ కాదు, అది క్షణం. పాశ్చాత్యసంస్కృతిలో కాలాన్ని కొలిచే యూనిట్ సెకండ్. అంటే కాలంలో ఒక యూనిట్ సెకండ్ అవుతుంది. వేదసంస్కృతిలో కాలాన్ని కొలిచే యూనిట్ క్షణం. క్షణం అంటే రెండు ఆలోచనల మధ్య ఉన్న ఖాళీ. పాశ్చాత్యుల కాలెండర్ ప్రకారం మీ సెకండ్, నా సెకండ్ వ్యవధి ఒకటే. కానీ వేదసంస్కృతి కాలెండర్ ప్రకారం మీ క్షణం, నా క్షణం వేరు. ఎందుకంటే నా ఆలోచనల మధ్య ఉన్న ఖాళీకి, మీ ఆలోచనల మధ్య ఉన్న ఖాళీకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ సమయం అంటే కాలమానం కాదు, అది మానసికమైంది.
ఒక్క సెకండ్‌కి వచ్చే ఆలోచనల్ని టి.పి.ఎస్. (థాట్స్ పర్ సెకండ్) అనవచ్చు. మీరు కలలతో ఉన్నప్పుడు మీకు వచ్చే ఆలోచనల సంఖ్య చాలా ఎక్కువ. టి.పి.ఎస్. ఎక్కువ. అందుకే కలలో మీరు ఎక్కువ కాలం ఉన్న అనుభూతిని పొందుతారు. మేల్కొని ఉన్న స్థితిలో మీ టి.పి.ఎస్. కొంత తక్కువగా ఉంటుంది. అందుకే సమయం త్వరగా గడచిపోతుంది. టి.పి.ఎస్. ఎక్కువ ఉంటే 10 సంవత్సరాలు పది గంటల్లో గడిచిపోతాయి. అదే దేవతలకి, టి.పి.ఎస్. చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారి ఒక రోజు మనకి ఒక సంవత్సరంతో సమానం అంటారు. దీన్ని వేదసంస్కృతి కాలెండర్లో చూడవచ్చు.
మీరు మీలోని టి.పి.ఎస్.ని తగ్గించగలిగితే మీరు తురీయ లేదా సమాధిస్థితిలోకి ప్రవేశించవచ్చు. దాని అర్థం సర్వాంతర్యామి అత్యున్నతచేతనస్థితితో ఐక్యం కావచ్చు, అదే సత్యం. ఎప్పుడైతే మీలోని ఆలోచనల సంఖ్య బాగా తగ్గిపోతుందో అప్పుడు ఈ సత్యాన్ని మీరు అనుభవంతో తెలుసుకుంటారు.
ఇప్పుడు మనం మళ్ళీ స్వప్నస్థితిని, మేల్కొని ఉన్న స్థితిని గురించి చూద్దాం. మీరు మేల్కొని ఉన్న స్థితిలో, మీలోని ఆలోచనల సంఖ్య తగ్గి ఉన్న స్థితిలో మీరు కలని నిజం కాదు అని తెలుసుకుంటారు. అవును కదా! అదే మీరు స్వప్నంలో ఉన్నప్పుడు, అది నిజం అనుకుంటారు. ఎందుకంటే అంతా నిజంలాగానే ఉంటుంది. మీరు ప్రతిదానికీ ప్రతిస్పందిస్తారు. మీకు పీడ కలలు వస్తాయి, మామూలుగా ఉండే సామాన్యసమస్యలు వస్తాయి. ఎప్పుడైతే మీ ఆలోచనల సంఖ్య మేల్కొనే స్థితికి తెచ్చేంతగా తగ్గుతాయో అప్పుడు, మీరు ఇదంతా నిజం కాదు కేవలం కల అని తెలుసుకుంటారు. అదే విధంగా, మీరు మేల్కొని ఉన్న స్థితి కూడా నిజం కాదు, అది అంతా కల్పన, మిథ్య అని తెలుసుకోవాలి అంటే మీ ఆలోచనల సంఖ్యని ఇంకా తగ్గించాలి. అవి ఇంకా ఇంకా తగ్గి మీరు తురీయదశకి వచ్చినప్పుడు, మీరు అకస్మాత్తుగా ఇదంతా నిజం కాదు, ఇది అంతా మాయ అని తెలుసుకుంటారు.
మీరు స్వప్నావస్థలో ఉన్నప్పుడు మీ ఆలోచనల సంఖ్య, ఒక సెకండ్‌కి 1000 అయితే, మీరు మేల్కొని ఉన్నప్పుడు అవి 100 ఉంటాయి. అవి సున్నా స్థాయికి వస్తే, అంటే ఆలోచనలు అసలు లేకుండా ఉంటే, అది సమాధిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నిద్ర మేల్కొంటారో, మీ ఆలోచనల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు కల నిజం కాదు అని తెలుసుకుంటారు. అదే విధంగా ఆలోచనల సంఖ్య సున్నా స్థాయికి వచ్చినప్పుడు, మేలుకున్న స్థితి నిజం కాదు అని తెలుసుకుంటారు. ప్రస్తుతం మీ అంతరంగం అంతా మీరు మేల్కొని ఉన్నప్పటి అనుభవాలతో నిండి ఉంది. అందుకే మీరు సమాధిస్థితికి చేరలేరు.
మరొక విషయం: ఇది ఒక ఛేదించలేని వృత్తం. మీరు కలల్లో సంతోషంగా ఉన్నంత సేపూ దాని లోంచి బయటికి రాలేరు. మీరు దాని లోంచి బయటికి వచ్చాక మాత్రమే అది నిజం కాదు, అది కేవలం కల అని తెలుసుకుంటారు. అదే విధంగా మీరు మేల్కొని ఉన్న స్థితిలో సంతోషంగా ఉన్నంతవరకూ, అది అంతా ఒక మాయ అని అనుకోరు.
ఇక్కడై శివుడు మనకి సహాయం చేయటానికి వస్తాడు.
ఆయన చెప్పే ధ్యానపద్ధతులు, ఆ మాయ నుంచి మేల్కొనడానికి సహాయం చేస్తాయి. చూడండి. ఇది చాలా సూక్ష్మమైన, ముఖ్యమైన విషయం. మీరు స్వప్నస్థితిలో ఉన్నా, మేల్కొని ఉన్న స్థితిలో ఉన్నా లేదా సమాధిస్థితిలో ఉన్నా అసలు వ్యక్తి మాత్రం ఒక్కరే. అవును కదా! మీరు 1000 ఆలోచనలతో ఉన్నా, 100 ఆలోచనలతో ఉన్నా, '0' ఆలోచనలతో ఉన్నా, ఆ కల కనే వ్యక్తి ఒక్కరే. అయితే కలల నుంచి మేల్కొనే స్థితికి మీరు రావటానికి కారణం ఏమిటి? మీ ఏకాగ్రతలో కలిగిన మార్పు. అది చూసేదాని నుంచి చూసేవాని వైపు మళ్ళటమే. అంతే కదా! ఎప్పుడైతే మీ ఏకాగ్రతని, మీ ఎరుకని చూసేదాని నుంచి చూసేవాని వైపు మళ్ళుతుందో, చూస్తున్న వస్తువు నుంచి చూసే వ్యక్తి వైపు మళ్ళుతుందో అప్పుడు మీరు ఆ తరువాత స్థితిలోకి, అంటే స్వప్నస్థితి నుంచి మేల్కొన్న స్థితికి చేరతారు. కాబట్టి ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి; ఎప్పుడైతే మీ ఏకాగ్రత, చూసే విషయం నుంచి చూసే వ్యక్తి వైపు మళ్ళుతుందో, మీరు మేల్కొంటారు.
ఇది ఒక ధ్యానపద్ధతి. మీ ఏకాగ్రతని చూసే వస్తువు నుంచి చూస్తున్న వ్యక్తి వైపు మారిస్తే మీరు మేల్కొంటారు.
సన్న్యాసం అంటే చూసే వ్యక్తి వైపు ఏకాగ్రత పెరిగేలా చేయటమే. సన్న్యసించటం లేదా ధ్యానం, ధ్యానపద్ధతులు - ఇవన్నీ కూడా చూసే వస్తువు నుంచి దాన్ని చూసే వ్యక్తి పైకి ఏకాగ్రతని మళ్ళించటానికి ఉపయోగించే వివిధమార్గాలు. ఒక్కసారి మీరు చూసే వ్యక్తి వైపు మీ ఏకాగ్రతని, మీ తెలుసుకునే తత్త్వాన్ని నిలపగలిగితే మీరు నిజమైన ఏకాంతాన్ని, మీతోనే మీరు ఉండగల నేర్పుని అనుభవంతో తెలుసుకోగలుగుతారు. ఒంటరితనం మీ సహజగుణం. మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒంటరితనాన్ని, ఆ ఆనందాన్ని అనుభవించారు. మీరు అనుకునే ఒంటరితనం, మీతో మీరు ఉండగల ఏకాంతం వేరు. సంఘం మిమ్మల్ని నిరంతరం మనుషుల సమక్షంలో, కుటుంబంతో, ఏదైనా ఒక సంఘంతో లేదా టి.వి.తో ఉండమని నేర్పిస్తుంది. ఇటువంటివాటి మీద ఆధారపడటం అలవాటైతే మీరు బలహీనులవుతారు. ఇవి మీ చుట్టూ లేనప్పుడు ఒంటరితనంతో బాధపడతారు. ఇటువంటి ఒంటరితనం ఎప్పుడూ బాధల్ని తీసుకువస్తుంది. ఏకాంతంగా, మీతోనే మీరు ఉండగల స్థితి మీకు ఎల్లవేళలా కారణం లేని ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానోదయమైన గొప్ప గొప్ప యోగీశ్వరులు పదే పదే చెప్పే పరమానందపారవశ్యం ఇదే. ఏకాంతం మాత్రమే ఆ శక్తిని ఇవ్వగలుగుతుంది.
సన్న్యాసం అంటే ఆ ఏకాంతాన్ని కనుగొని అందులో విరామంగా ఉండగలగటం.
సంసారం - సన్న్యాసం
సంసారం అంటే ప్రపంచం లేదా మార్గం అని అర్థం. సంసారం బాహ్యప్రపంచానికి సంబంధించి అందునుంచి వచ్చే అనేక కారణాల వల్ల అంతు లేనన్ని జననమరణవృత్తాల్ని సృష్టించేది అని అర్థం. ఆ రెండు మార్గాల్లో, ఏ మార్గంలోనైనా రెండు విధాలుగా సాగవచ్చు; అందులో ఒక పద్ధతి మనుషులు, వస్తువులతో లేదా ఒంటరిగా వారంతట వారు ప్రయాణించటం. మొదటి పద్ధతిలో మీరు చాలా సార్లు ఎదురు చూడాలి. రెండవ పద్ధతిలో మీరు గమ్యాన్ని చేరగలరు. దాన్ని ఈ నిమిషాన్నైనా చేరగలరు.
సన్న్యాసం అంటే ఆ మార్గంలో ప్రయాణించేటప్పుడు సామానులు, వస్తువులు, మనుషులు లేకుండా చేసే ప్రయాణం. మీకు అన్నీ ఉంటాయి కానీ మీరు వేటినీ మోయనవసరం లేదు. ఎప్పుడైతే మీరు వేటినీ మీతో పాటు మోయరో అప్పుడు విశ్వశక్తి మీకు అవసరమైన వాటినన్నింటినీ మీ దగ్గరికి పంపిస్తుంది. అదే సన్న్యాసం అంటే.
బుద్ధుని జీవితచరిత్ర నుంచి ఒక చక్కని కథ చెబుతాను; ఒక రోజు బుద్ధుని శిష్యులు ఆయన దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు వారిలో కొందరు సన్న్యాసం అంటే అసలైన అర్థం ఏమిటో వివరించమని బుద్ధుడిని అడుగుతారు. అప్పుడు ఆయన వారికి ఒక కథ చెబుతాడు.
ఒక ద్వీపంలో ఒక వ్యక్తి ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. ఒక రోజు అకస్మాత్తుగా అతనికి ఆ ద్వీపం నుంచి బయటికి వెళ్లే సమయం వచ్చింది అనే భావన కలుగుతుంది. అతనికి ఆ నదిని దాటటానికి పడవ లేదు. అక్కడ అతనికి దొరికిన చెట్ల కొమ్మలతో, ఆకులతో ఒక పడవని తయారు చేస్తాడు. అతికష్టం మీద అతను ఆ నదిలో ప్రయాణించి చివరికి ఒడ్డుకి చేరతాడు. ఈ విధంగా చెప్పి బుద్ధుడు శిష్యుల్ని ఒక ప్రశ్న అడుగుతాడు 'అవలి ఒడ్డుకి చేరాక ఆ వ్యక్తి పడవని ఉంచుతాడా లేక నీళ్ళలో పారేస్తాడా?' అని. శిష్యులు రకరకాల జవాబులు ఇస్తారు.
బుద్ధుడు చివరగా ఇలా జవాబు చెబుతాడు, అతను సన్న్యాసమార్గంలోని వ్యక్తి అయితే ఆ పడవని పారేస్తాడు. ఎందుకంటే అవసరమైనప్పుడు అతనికి దొరుకుతుంది అని తెలుసు. సంసారమార్గంలోని వ్యక్తి అంత కష్టపడి తయారు చేసిన పడవ, తిరిగి తాను మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని జాగ్రత్త చేస్తాడు. సన్న్యాసి విశ్వశక్తి మీద తన మనస్సుని లగ్నం చేసి ముందుకి సాగుతాడు. అదే సంసారి అయితే తాను ఎలా జీవించాలి అనే విషయం మీద మనస్సుని ఉంచి ముందుకి సాగుతాడు. సన్న్యాసి జీవితం అనే సముద్రాన్ని దాటటానికి పడవని ఉపయోగిస్తాడు. సంసారి ఆ పడవని తనతోనే మోస్తూ తిరుగుతాడు. ఆ పడవని వదిలేయవచ్చని అతనికి తెలియదు. అదే వారిద్దరి మధ్య ఉన్న తేడా. ఇందులో ఒకటి తప్పు. ఒకటి సరైంది అనేది ఏమీ లేదు. ఇవి రెండూ రెండు పద్ధతులు, అంతే.
ఇప్పుడు మీకు కర్మ అనే విషయంలో సన్న్యాసం ఏమిటో వివరిస్తాను. ఎందుకంటే మన కర్మల్ని పోగొట్టుకోవటానికి సన్న్యాసం దగ్గర దారి. కర్మ అంటే క్రితం జన్మల్లో మనం పూర్తి చేయని పనులు. అవే మనం తిరిగి పూర్తి చేసేంత వరకు పదే పదే జన్మించేలా జన్మ వైపు లాగుతూ ఉంటాయి. మన జననమరణచక్రానికి ఉండే అసలైన కారణం ఈ కర్మలు. ఆ కర్మలు పూర్తి అయ్యేవరకు అవి మనల్ని ఈ ప్రపంచంలో పదే పదే జన్మించేలా చేస్తాయి. కర్మలు మూడు రకాలు - సంచిత, ప్రారబ్ధ, ఆగామ్యకర్మలు.
సంచితకర్మలు అంటే జన్మజన్మలుగా మనం పోగుచేసుకున్న, పూర్తి చేయలేకపోయిన కర్మలు. అంటే అవి మన పూర్తి బ్యాంక్ బ్యాలెన్స్ అన్న మాట. ప్రారబ్ధకర్మలు అంటే సంచితకర్మల్లో కొన్నింటిని తీసుకొని వాటిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో జన్మ తీసుకుంటాం. మీరు జన్మ తీసుకున్న ప్రతీసారీ కొన్ని కర్మల్ని పూర్తి చేయాలని సంచితకర్మల్లోంచి కొన్ని తీసుకువస్తారు. ఇందులో మీ తీరని కోరికలు, కోపం, భయం, అత్యాశ, మొదలైనవన్నీ ఉంటాయి. ఇక మూడవది ఆగామ్యకర్మ. ఇది ఈ జన్మలో మీరు కొత్తగా పోగుచేసుకునే కర్మలు. ఈ జన్మలో మీ తీరని కోరికలు, పూర్తి చేయని పనులు.
కర్మల్ని పూర్తిగా పోగొట్టుకోవాలి అంటే మీరు మూడు పనులు చేయాలి. అందులో మొదటిది, ఈ జన్మలో కొత్త కర్మల్ని చేయకుండా, ఆగామ్యకర్మలు పెరగకుండా చూడాలి. అవి మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ని పెంచుతాయి. రెండవది మీరు ఈ జన్మలో పూర్తి చేయాలి అని తెచ్చుకున్న ప్రారబ్ధకర్మల్ని పూర్తి చేయాలి. వాటి శేషం మిగలకూడదు. ఇక మూడవది ఏదో ఒక విధంగా మీ సంచితకర్మల్ని మీరు తగ్గించుకోవాలి. దాని వల్ల మీరు తిరిగి జన్మించే జన్మల సంఖ్య తగ్గించవచ్చు.
ప్రారబ్ధకర్మల్ని సరైన పద్ధతిలో పోగొట్టుకోగలిగితే, ఆగామ్యకర్మలు ఏర్పడవు. ప్రారబ్ధకర్మల్ని పోగొట్టగలిగే మేధ, ఆగామ్యకర్మలు కొత్తగా ఏర్పడకుండా జాగ్రత్త తీసుకుంటుంది. సంచితకర్మలని మాత్రం జ్ఞానోదయమైన యోగీశ్వరుని కరుణతోనే పోగొట్టుకోగలం. ఇప్పుడు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. మీలోని ప్రారబ్ధకర్మల కల్పనలు మీ మేధ కంటే ఎక్కువైతే, మేధను మించి ఉంటే అప్పుడు మీకు కావలసిన మార్గం సంసారజీవితం. ఆ విధంగా కాకుండా మీ ప్రారబ్ధం తాలూకు కల్పనలు మేధ కంటే తక్కువగా ఉంటే, సన్న్యాసమార్గంలో మీ మేధ ప్రారబ్ధకర్మల మీద గెలుపు సాధించగలుగుతుంది. అప్పుడు ప్రారబ్ధకర్మలు మీ నియంత్రణలోకి వస్తాయి. సంసారమార్గంలో జీవితం మీకు చాలా రకాలుగా నేర్పిస్తుంది. అప్పుడు కొన్ని లక్షల జన్మల్ని తీసుకొని కాని మీరు ప్రారబ్ధకర్మల్ని పోగొట్టుకోలేరు.
పతంజలి యోగసూత్రాల్లో జ్ఞానోదయానికి ఎనిమిది విధాలైన మార్గాలు ఉంటాయి. ఈ ఎనిమిది మార్గాల్నీ ఒకేసారి అనుసరించాలి. అంటే అన్ని పద్ధతుల్నీ పాటించాలి. అందులో మూడు భాగాలు ప్రత్యాహార, ధారణ, ధ్యానం. ప్రత్యాహార అంటే మనస్సుని ఇంద్రియాల నుంచి అంతరంగంలోకి మళ్లించటమే. ఆ తరువాతది ధారణ. ధారణ అంటే మనస్సుని ఆత్మలో ఐక్యం చేయటం. మూడవది ధ్యానం.
మనస్సుని ఐదు జ్ఞానేంద్రియాల నుంచి మళ్లించటం అనేది, జ్ఞానేంద్రియాలు ఆత్మలో ఐక్యమైనప్పుడే సాధ్యమవుతుంది. ఉదాహరణకి నిచ్చెన మీద ఒక మెట్టు నుంచి పైదానికి కాలు పెట్టాలి అంటే ముందుగా ఈ మెట్టు మీద మీ కాలిని స్థిరపరచాలి కదా! మీరు పైకొమ్మ మీదికి ఎక్కిన తరువాతే చెట్టు మీద ఉన్న కింది కొమ్మని వదిలేయగలరు. మనం అందరం ఏమనుకుంటామంటే ప్రపంచంతో మనకి ఉన్న సంబంధబాంధవ్యాల్ని పూర్తిగా వదిలాక, భగవంతుడిని చేరతాం అని. అది సరి కాదు. సత్యం ఏమిటంటే భగవంతుడిని తెలుసుకోగలిగాక మాత్రమే, మనని ఈ బయటి ప్రపంచపు విషయాలు ప్రభావితం చేయవు. మీరు నిత్యానందస్థితికి చేరాక మాత్రమే ఈ మిథ్యానంద అనే కల్పనలు, మాయని ఛేదించగలరు, వదలగలరు. కానీ పైన ఉన్న మెట్టు గురించి తెలుసుకుని, దాన్ని పట్టుకున్న తరువాత మాత్రమే కింది దాన్ని వదలగలరు. ఈ తెలుసుకోగలగటమే సన్యాసం. పై మెట్టుని పట్టుకొని కింది మెట్టుని వదిలే ఒక కార్యక్రమమే సన్యాసం. అలా మీరు ముందుకి సాగే కొద్దీ సన్యాసం అనేది మీలో అప్రయత్నంగా కలుగుతుంది. ఇది ఒక ఉపవస్తువులా ఏర్పడుతుంది. ఎందుకంటే నిచ్చెనలో పైకి వెళ్ళటానికి మీకు మీరు చాలు అన్న విషయం తెలుసుకుంటారు. అప్పుడు మీరు మీతో మోసుకెళ్ళేవన్నీ భారమే; వాటితో మీరు ముందుకి వెళ్ళటం కష్టం.
ఒక చిన్న జెన్ కథ : ఒక రాజుగారు సన్యాసించి, తన దేశాన్ని వదిలి ఒక జెన్ బౌద్ధగురువు దగ్గరకి వెళ్ళి తనని శిష్యుడిగా తీసుకోమని అడుగుతాడు. అప్పుడు గురువుగారు అతనితో, ‘సరే’ నిన్ను శిష్యుడిగా తీసుకుంటాను. కానీ నీకు మరింత పరిణతి కలిగేవరకూ నీవు ఎదురుచూడాలి’ అంటాడు. కానీ అలా ఎదురుచూసే సహనం రాజుకి లేదు. అందుకని ఆయన గురువుగారిని బాగా ప్రార్థిస్తాడు. చివరికి గురువుగారు ఒక షరతు మీద ఒప్పుకుంటాడు. ఆయన రాజుతో, “సరే! కానీ నీవు మరొక అడవికి వెళ్ళి అక్కడ నివసించాలి” అంటాడు. రాజుగారు అందుకు ఒప్పుకొని అదే విధంగా చేస్తాడు.
కొన్ని రోజులు గడుస్తాయి. రాజుగారు అక్కడ ఉన్న దోమల బాధ పడలేక ఒక దోమ తెర తెచ్చుకొని తన చుట్టూ దోమల నుంచి రక్షణగా పెట్టుకుంటాడు. రాజు కొన్ని రోజులు పోయాక, మంచం ఉంటే బాగుంటుంది, అప్పుడు బాగా ధ్యానం చేసుకోవచ్చు అనుకొని, వెళ్ళి ఒక మంచం కొని తెచ్చుకుంటాడు. ఆ తరువాత వర్షం వల్ల మంచం పాడవటం గమనించి మంచాన్ని కాపాడటానికి ఒక చిన్న గదిని కట్టుకొని అందులో మంచం వేస్తాడు. మరి కొన్ని రోజులు గడిచేసరికి ఆ గది శుభ్రం చేయటానికి ఒక మనిషి ఉంటే బాగుంటుందని పనికి ఒక మనిషిని తెచ్చుకుంటాడు. ఆ తరువాత మరి కొంత మందిని తెస్తాడు. ఈ విధంగా కొంత కాలం జరిగేసరికి ఆ అడవిలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసేస్తాడు.
అర్థం చేసుకోండి; ఒక రాజు అడవిలోనైనా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలడు. సంసారి ఎక్కడైనా బయటకి ప్రకృతిలోని అందాన్ని చూడటానికి వెళతాడు. అదే సన్యాసి అయితే తాను ఎక్కడ ఉంటే అక్కడ, ఆ పరిసరాలలోనే దివ్యసౌందర్యాన్ని, భగవంతుణ్ణి చూస్తాడు. అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలడు. ఎప్పుడైతే సంసారి తన అంతరంగంలోకి మళ్ళగలుగుతాడో, అతను సన్యాసి అవుతాడు. అతనిలో జ్వలించే అవసరాన్ని కనుగొనేవరకూ, అతను తాను చేస్తున్న పనినే కొనసాగించాలి. సంసారి మనస్సు ఒక దాంతో మరొకటి సరిపడని విషయాలతో నిండి ఉంటుంది. అతను తనకు కావాలి అనుకునే విషయాన్ని సాధించే ప్రయత్నంలో ఉంటాడు. తనలోని మేధతో సంసారి సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. తనకి ఈ నిమిషంలో ఏది అవసరమో అతను దాన్ని పొందగలుగుతున్నాడు అనే సత్యాన్ని తెలుసుకుంటాడు.
సంసారి కేవలం బయటి ప్రపంచంలోని వస్తువులకి, తన జీవితానికే ప్రాముఖ్యాన్ని ఇస్తాడు. సన్యాసి మరణం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తనలో ఉన్న తాను కాని విషయాలకి, మరణానికి ప్రాముఖ్యాన్ని ఇస్తాడు. అహంకారం, అన్నీ పొందాలి అనుకోవటం, కోరికలు, కోపం, భయం, అసూయ, అసంతృప్తి - ఇలాంటి విషయాలను పూర్తిగా నాశనం చేయటానికి ప్రాముఖ్యాన్ని ఇస్తాడు. అతనికి తాను వీటి అన్నింటికీ అతీతుడినని తెలుసు. అతని ప్రయత్నమంతా దీన్ని తెలుసుకోవాలి అని మాత్రమే. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో అప్పుడు నిచ్చెనలో పైన ఉన్న మెట్టుని చేరగల్డు. అప్పుడు కింద ఉన్న మెట్టుని వదలగలడు. ఈ కింది మెట్టులోనే ఈ భావావేశాలు, కోరికలు, అహం అనేది ఉండేది.
సన్న్యాసం అంటే నేను ఎవరిని అనే ప్రశ్నకి జవాబుని తెలుసుకునే ప్రయత్నం. సన్న్యాసి తన శక్తిని, మేధని పూర్తిగా ఈ విషయం కనుగొనటానికి ఖర్చు పెడతాడు. మిమ్మల్ని మీరు ‘నేను ఎవరిని’ అని ప్రశ్నించుకుంటే మీకు దొరికే జవాబులు - నేను ఫలానా వారి కొడుకుని, నేను ఇంజినీరుని, నేను ప్రొఫెసర్ని, ఇలా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా బయటి ప్రపంచంలో మీకు ఉన్న బాంధవ్యాలు మాత్రమే. అసలు ఈ బయట ప్రపంచం అనేది లేకపోతే అప్పుడు మీరు ఎవరు? జ్ఞానోదయమైన యోగీశ్వరులు, గొప్ప గొప్ప గురుదేవులు, ప్రపంచంలోని మతాలను స్థాపించిన అవతారమూర్తులు పదే పదే చెప్పే విషయం అహం బ్రహ్మాస్మి - నేను అది. ఈ వాక్యం హిందూమతంలోనిది. క్రిస్టియన్ మతంలో ‘నిశ్చలంగా ఉండి భగవంతుడిని అని తెలుసుకోండి’ అని ఉంటుంది. ఇస్లాం మతంలో అనల్ హక్ - నేనే సత్యాన్ని అని ఉంది. నేనే భగవంతుడిని అనే అనుభవాన్ని పొందటమే మానవజీవిత లక్ష్యం.
ఒక్కసారి మీకు ఆ అనుభవం అయితే, యోగీశ్వరులు చెప్పే అంతరంగంలోని నిత్యానందస్థితి మీలో ప్రారంభమవుతుంది. అప్పుడు మీకు బయటి ప్రపంచం అనేది భగవంతుడు ఆడే దివ్యనాటకానికి ఏర్పడిన అందమైన వేదిక అని తెలుస్తుంది. అప్పుడు మీకు ఈ ప్రపంచంలోని అన్ని సమస్యలు, బంధాల నుంచి అంతిమస్వేచ్ఛ దొరుకుతుంది. అప్పుడు మీరు మాట్లాడతారు కాని మాట్లాడరు. మీరు పని చేస్తారు కానీ పని చేయరు. మీరు బాధపడతారు కాని బాధ మీకు ఉండదు. మీ అంతరాత్మ అన్ని సందర్భాల్లో నిశ్చలంగా ఉంటుంది.
మీరు పరమానందస్థితిలో ఉంటారు. అదే నిత్యానందం.
సమస్య ఏమిటంటే అందరూ సన్న్యాసానికి బాహ్యప్రపంచవిషయాలు అడ్డు అని అనుకుంటారు. వారంతా సన్న్యాసం అంటే గంభీరంగా, సీరియస్‌గా ఉండటం అనుకుంటారు. ఇది సరి కాదు. సన్న్యాసం అంటే జీవితాన్ని అత్యున్నతస్థితిలో జీవించగల ఒక లక్షణం. దీనికి గంభీరత్వం పని చేయదు. నిజాయితీ, నవ్వుతూ ఉండగలగడం అనేవి మాత్రమే జీవితాన్ని అత్యుత్తమస్థాయిలో ఉంచగలుగుతాయి. నవ్వటం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మికలక్షణం.
చిన్న కథ : ఒక గురువుగారు తన శిష్యులతో కూర్చొని ఉంటారు. ఆయన చాలా చక్కని స్థితిలో, ఆనందపారవశ్యంతో ఉంటాడు. ఇదే మంచి సమయం అని అనుకొని శిష్యులు ఆయనని ఈ స్థితికి చేరటానికి ఆయన ఏయే దశలని, ఎలా దాటారో అడుగుతారు.
గురుదేవులు వారి ప్రశ్నకి చాలా చక్కని వివరణ ఇస్తారు. 'భగవంతుడు నన్ను, పని చేసే స్థలానికి తీసుకువెళ్లాడు. అక్కడ నేను చాలా కాలం ఉన్నాను. తరువాత భగవంతుడు వచ్చి నన్ను వ్యథాపూరితప్రాంతానికి తీసుకు వెళ్లాడు. అక్కడ నేను అత్యంతదుఃఖంతో ఉండి, కొన్నిసార్లు దానికి అతీతంగా వెళ్ళేవాడిని. అప్పుడు నేను సంతోషపడేవాడిని. తరువాత భగవంతుడు నన్ను ఆకస్మాత్తుగా ప్రేమ భూమిలో నిలిపాడు. అప్పుడు నేను జ్వలించే భావావేశాలతో గడిపాను. అప్పుడే నేను శుద్ధి అయ్యాను అని తెలుసుకున్నాను. ఆ తరువాత ఆయన నన్ను నిశ్శబ్దానికి తీసుకువెళ్లాడు. అక్కడ నేను జీవనమరణాల మర్మాలని తెలుసుకున్నాను.'
అప్పుడు ఒక శిష్యుడు 'అంటే మీ అన్వేషణలో చివరి దశకి చేరారన్నమాట' అని అంటాడు. అప్పుడు గురువుగారు 'కాదు ఒక రోజు భగవంతుడు వచ్చి, 'ఈ రోజు నేను నిన్ను నా హృదయస్థానానికి తీసుకువెళ్తాను' అన్నాడు. అలా చెప్పి ఆయన నన్ను నవ్వుల భూమికి తీసుకువెళ్లాడు' అని ముగిస్తాడు.
కాబట్టి అర్థం చేసుకోండి; సన్న్యాసం అంటే మీ శక్తి. అటువంటప్పుడు అది దేనికైనా ఏ విధంగా అడ్డంకి అవుతుంది? అంతే కాదు, సన్న్యాసశక్తితో మీరు నిరంతరం యువకుడుగానే ఉండవచ్చు. మీరు నిరంతరం జీవితంలో ఎటువంటి సవాలునైనా ఎదుర్కోగలరు.
సన్న్యాసం గొప్ప శక్తి. ఎందుకంటే ఈ కల్పనలు, ఊహా ప్రపంచంలో మీరు అత్యుత్తమక్రమశిక్షణతో జీవించగల లక్షణాన్ని నేర్పిస్తుంది. ఒక వ్యక్తి జైన్ మతయోగీశ్వరుడైన భగవాన్ మహావీరుని ఒక ప్రశ్న అడుగుతాడు, ఎవరు గొప్ప? సంసారి గొప్పా లేక సన్న్యాసి గొప్పవాడా? అని. అప్పుడు మహావీరుడు క్రమశిక్షణ చాలా గొప్పది, అని జవాబు ఇస్తాడు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో సంసారి గొప్ప క్రమశిక్షణతో ఉండగలడు. అర్థం చేసుకోండి; క్రమశిక్షణ, అంటే తనని తాను చిత్రహింసలు పెట్టుకోవటం కాదు. అది మీలో ఏర్పడే అందమైన విరామం. ఈ ప్రపంచాన్ని, మానసికవ్యవస్థని చక్కగా, లోతుగా అర్థం చేసుకున్నాక మీలో ఏర్పడే చక్కని విరామమే క్రమశిక్షణ అంటే. అది మీ అంతరంగం నుంచి ఏర్పడుతుంది. అంతే. నేను ఈ విధంగా చెప్పినప్పుడు కొందరు నన్ను అడుగుతుంటారు ‘అలా అయితే మేం సంసారజీవితంలో ఉంటూ సన్న్యాసచేతనస్థితిలో ఉండవచ్చు కదా!’ అని. అర్థం చేసుకోండి, మనిషి సహజగుణం ఎలా ఉంటుందంటే చేతనస్థితిలో నిర్ణయం చేయకపోతే, అతని అంతరంగుంలో, అతని చేతనస్థితిలో శాశ్వతమైన మార్పు సాధ్యపడదు. సన్న్యాసం అంటే చేతనస్థితిలో శాశ్వతమైన మార్పు కావాలి అని చేతనస్థితిలో చేసే నిర్ణయం. అంతకు మించి మరేమీ కాదు. అందుకే సన్న్యాసం తీసుకోవాలి. ఎప్పుడైతే చేతనస్థితిలో ఒక నిర్ణయం చేస్తామో అది మనని నిరంతరం తెలుసుకునే తత్వంలో ఉంచుతుంది. అటువంటి పరిస్థితిలో వెనక్కి మళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. అలా కానప్పుడు మిమ్మల్ని ఆ మార్గానికి కట్టుబడి ఉండేలా చేయలేదు. అప్పుడు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీరు సన్న్యాసమార్గాన్ని ఎంచుకున్నప్పుడు, చేస్తున్న పనిని మరింత నైపుణ్యంతో కొనసాగించగలుగుతారు. అదే పనిని ఇంకాస్త నమ్మకంతో ఇంకా బాగా, ఇంకా సృజనాత్మకతతో చేస్తూ భగవంతునికి దగ్గరగా వెళ్ళగలుగుతారు. ఈ సృష్టి భగవంతుని లక్షణం. సర్వాంతర్యామి నిరంతరం సృష్టిస్తూనే ఉంటాడు. సన్న్యాసం అంటే ఆ సృష్టిలక్షణాల్ని అలవరచుకోవటమే. అతనికి సర్వం ఆ సర్వాంతర్యామి సృష్టి అని తెలుసు.
చిన్న కథ : ఒకామె తన గ్రామం నుంచి పక్క గ్రామానికి నడిచి వెళుతూ ఉంటుంది. ఆమె అలా నడుస్తూ గుమ్మడి తోట దగ్గరకి వస్తుంది. అక్కడే ఒక పెద్ద వేప చెట్టుని చూస్తుంది. అప్పటికే బాగా అలసిపోయి ఉందేమో, కాసేపు అక్కడ కూర్చుందాం అని, ఆ చెట్టు కింద నీడలో కూర్చుంటుంది. అకస్మాత్తుగా ఆమె తల పైకెత్తి చెట్టు మీదికి చూస్తుంది. చెట్టుకి చిన్న చిన్న వేపకాయలు ఉంటాయి. పెద్ద పెద్ద బలమైన కొమ్మలకి చిన్న చిన్న కాయలు వేలాడుతూ ఉంటాయి. ముందుకి చూస్తే సన్నటి తీగలకి చాలా పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచి ఉంటాయి. వాటిని చూసి ఆమె ‘భగవంతుడు కూడా అప్పుడప్పుడూ తప్పులు చేస్తుంటాడు.’ సన్నటి తీగలకి వేపకాయలని బలమైన వేపచెట్టుకి గుమ్మడి కాయలని ఆ భగవంతుడు ఇవ్వవలసింది అని అనుకుంటుంది. కొంత సేపటికి నిద్ర వచ్చి ఆ చెట్టు కింద పడుకుంటుంది. అంతలో గాలి వీచి ఒక వేపకాయ రాలి ఆమె చెంప మీద పడుతుంది. ఆ దెబ్బకి ఆమె మేలుకొని కాయ తగిలిన చోట చేత్తో తడుముకుంటూ ఇలా అనుకుంటుంది. ‘ఎంతైనా ఆయన భగవంతుడు. అన్నీ సరిగ్గానే చేస్తాడు’.
సన్న్యాసి సర్వసృష్టిలో ప్రతీదీ అద్భుతంగా అమరిపోయి చక్కగా కలసి ఉండటాన్ని చూడగలుగుతాడు. సన్న్యాసి అంటే తామరాకు మీద నీటిబొట్టు లాంటివాడు. తామరాకుని చూడండి. దాని మీద నీరు ఉంటుంది కాని అది దాన్ని అంటదు. సన్న్యాసి కూడా అంతే. బయటి ప్రపంచంలో అన్ని సంబంధబాంధవ్యాలతో ఉంటాడు కాని అవి ఏవీ అతణ్ణి అంటవు, అతనిలో నిశ్చలత్వాన్ని పాడు చేయవు. కాని సన్న్యాసం అనగానే సామాన్యంగా అందరూ అనుకునే విషయం బాంధవ్యాల్ని వదిలేయాలి అని. అది సరికాడు. సన్న్యాసం బాంధవ్యాల్ని మరింత బలపరుస్తుంది. నా శిష్యులు చాలా మంది నా దగ్గర ఒకమాట అంటుంటారు. సన్న్యాసదీక్ష తీసుకున్నాక భార్యాభర్తల మధ్య సంబంధాలు మరింత చక్కగా వికసించాయి. ఇప్పుడే మేం ఇద్దరం ఒకే పంథాలో జీవించగలుగుతున్నాం అని చెబుతుంటారు.
సన్న్యాసంతో మీరు మీ పరిసరాల్ని గమనించగల పరిశీలకులుగా మారగలుగు తారు. దీని వల్ల మీకు ఇతరులకి మధ్య ఒక ఖాళీ ప్రదేశాన్ని సృష్టించగలుగుతారు. ఈ ఖాళీని సన్న్యాసించటం అని తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంతకు ముందు ఆ ఖాళీ లేదు అని తెలుస్తుంది. అందరూ అందుకే ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఇప్పుడు ఆ ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ దూరం వల్ల ఏర్పడింది కాదు. చేతనస్థితితో, తెలుసుకునే తత్త్వం వల్ల ఏర్పడిన ఖాళీ. తెలుసుకునే తత్త్వం మీ మనస్సులోకి చేతనస్థితిని తెస్తుంది. అప్పుడు మీరు నిర్ణయాలు, తీర్పులు చేయకుండా కేవలం విషయాల్ని చూడగలుగుతారు. ఇది చాలా సూక్ష్మచర్య. అది క్రమంగా మీలో ఒక భాగం అవుతుంది. అదే సన్న్యాసం అంటే.
సన్న్యాసం ప్రతి క్షణంలోకి తెలుసుకునే తత్త్వాన్ని ప్రవేశపెడుతుంది. తెలుసుకునే తత్త్వం, మీలో బాధలు ప్రవేశించకుండానే వాటికి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మీరు పూర్తి ఎరుకతో విషయాల్ని గమనించటం నేర్చుకున్నారు కాబట్టి. ఆ తెలుసుకునే తత్త్వం మీలో లేనప్పుడు ఎప్పుడో ఒకప్పుడు, దేనికో ఒక దానికి మీరు బాధపడవలసి ఉంటుంది.
సన్న్యాసం అంటే అంతరంగంలో స్త్రీ లేదా పురుషుడు అనే బరువు లేకుండా జీవించే వ్యక్తి. అంతరంగ స్త్రీ లేదా పురుషుడు అంటే ఏమిటి? అది లోపల దాగి ఉన్న కోరిక. తంత్రంలో శివుడు చాలా అద్భుతంగా చెబుతాడు. ఎవరైతే తన అంతరంగంలో స్త్రీని పూర్తిగా తుడిచేస్తాడో అతనే సన్న్యాసి. అతను సంసారజీవితంలో ఉన్నా కూడా సన్న్యాసి. అదే విధంగా, మనస్సులో స్త్రీ ఆలోచనలు ఉన్నప్పుడు సన్న్యాసి సన్న్యాసమార్గంలో లేనట్లే. అటువంటి వ్యక్తి సన్న్యాసి కాడు. ఎవరైనా ఒక వ్యక్తి సన్న్యాసా కాదా అని కొలవాలి అంటే ఇదే కొలమానం.
గౌతమబుద్ధుని నాలుగు అత్యుత్తమబోధల్లో రెండవది బాధలు, వ్యథల గురించి, దానికి కారణాల గురించి ఉంటుంది. బాధపడటం గురించి బుద్ధుడు చాలా చక్కగా చెబుతాడు. మన జీవితంలో ప్రతి నిమిషం నుంచి ఏదో ఒకటి ఆశించటం వల్లనే బాధలు కలుగుతాయి. ఇది ఎలా ఉంటుందంటే అరటి చెట్టుని మామిడి పళ్ళు ఇవ్వమన్నట్టుగా ఉంటుంది. మనం తెలుసుకునే తత్త్వాన్ని జీవితంలో ప్రతిక్షణంలో నింపినప్పుడే ఈ విషయం మనకు అర్థమవుతుంది.
అంతే కాదు, మీరు ఎప్పుడైతే సంబంధబాంధవ్యాల్ని గమనించటం మొదలు పెడతారో అందులో జరిగే వ్యవహారాలు మీకు అర్థం అవుతాయి. ఎదుటివారి నుంచి ఆశించటం అనే విషయం మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా ముందుకి నడిపిస్తుందో మీరు తెలుసుకోవచ్చు. ప్రతి దానిలోని అసలైన ప్రోత్సాహకరం ఏమిటో తెలుసుకోవచ్చు.
నాకు పన్నెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. మా బామ్మల్లో ఒకామె 104 సంవత్సరాల వయస్సులో మరణించింది. ఆమెకి పిల్లలు లేరు. మా మామయ్యల్లో ఒకరు ఆమెని చూస్తుండేవారు. అయితే ఆ పెద్దావిడని చూడటం అతనికి, అతని భార్యకి ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఆమె మీద ఏదో ఒక ఫిర్యాదు చేస్తుండేవారు. ఆమెని సరిగ్గా చూసేవారు కాదు. ఆమె కూడా సమస్యలు సృష్టించే వ్యక్తి. ఆమెకి ఆస్తి ఉంది. ఆమె నన్ను అప్పుడప్పుడూ పొగాకు తెచ్చి పెట్టమనేది. నేను ఎప్పుడైనా డబ్బు అడిగితే, వెళ్ళి మీ నాన్నని అడుగు అనేది. తన పక్కింటివారికి కూడా వేసవి కాలంలో అయినా బావిలో మంచి నీళ్ళు ఇచ్చేది కాదు.
ఆమె చనిపోయినప్పుడు ఏడవటానికి ఎవరూ లేరు. కానీ ఆమెని చూసే ఆవిడ మాత్రం ఒక పాత చీర కట్టుకొని, లేని దుఃఖం తెచ్చుకొని, పలకరించటానికి వచ్చేవారిని చూసి గొల్లున ఏడ్చేది. మళ్ళీ ఎవరైనా వస్తే ఏడుపు మొదలు పెట్టేది. ఆమెని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.
ఆ పెద్దావిడ భౌతికశరీరం ఇంకా అక్కడ ఉండగానే ఆమెకి దగ్గరివారంతా ఆమె గదిలోకి వెళ్ళి నగలు పెట్టె తెరిచి, ఇది నా వాటా, ఇది నా వాటా అని పోట్లాడుకోవటం మొదలుపెట్టారు. శవం ఇంకా అక్కడే ఉంది, వాళ్ళు మాత్రం కంసాలిని పిలిచి బంగారం ఎంత ఉందో, దాని వెల ఎంతో లెక్కలు కట్టించటంలో మునిగిపోయారు.
ఆ క్షణంలో నాకు కుటుంబవ్యవస్థ అన్నా, సంబంధబాంధవ్యాలన్నా గౌరవం పోయింది. వారి ప్రవర్తన చూసి గట్టిగా నవ్వటం ప్రారంభించాను. మా మామయ్య ఒకరు నా నవ్వు ఆపటానికి కొట్టబోయాడు. నేను అతని చేతిని పట్టుకొని, 'ఇంకొకసారి నా మీద చెయ్యి ఎత్తితే మీరంతా కలసి చనిపోయిన పెద్దావిడ శవం ఉండగానే ఆమె ఆస్తిని ఎలా దోచుకున్నారో అందరికీ చెబుతాను' అన్నాను. మా అమ్మకి నా సంగతి తెలుసు. ఆమె మామయ్యని జాగ్రత్త అని చెప్పింది. నేను ఏ మాట అంటానో అది చేసి తీరతాను అని వారికి చెప్పింది.
ఆ తరువాత బంధువులు, చనిపోయిన ఆమె అంత్యక్రియలని ఎవరు చేస్తారు, ఆ ఖర్చు ఎవరు భరించాలి? అని వాదులాడుకోవటం ప్రారంభించారు. మా నాన్నగారు వారి వాదాలు చూసి చికాకు పడి ఆ ఖర్చులు నేను భరిస్తాను అని ముందుకు వచ్చారు. ఆయన నెమ్మదస్తుడు, అమాయకుడు.
ఈ గొడవ అంతా చూసి చాలా చికాకుపడ్డ నేను, చనిపోయిన బామ్మ దగ్గర కూర్చొని భగవద్గీతలోని శ్లోకాలు చదవటం ప్రారంభించాను. చనిపోయినవారి భౌతికకాయం దగ్గర భగవద్గీతలోని శ్లోకాలు చదివితే చనిపోయిన వ్యక్తికి ముక్తి దొరుకుతుంది అంటారు. నా ఆ వయస్సుకి ఆ సమయంలో నేను చేయగల మంచి పని అదే అనిపించింది. అర్థం చేసుకోండి, సన్న్యాసి ప్రపంచం బాధ్యతని తీసుకుంటాడు. అతనికి తన కుటుంబసభ్యులు, బయటివారు అనే తేడా తెలియదు. అతనికి అందరూ సమానమే. తన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికీ ముక్తిని ఇవ్వాలని చూస్తాడు.
కాని సంసారి అలా కాదు. అతను కేవలం తన కుటుంబబాధ్యతలే తీసుకుంటాడు. లేదా ఒకటి - రెండు సంస్థల బాధ్యత తీసుకుంటాడు. అతని బాధ్యత ఏదో ఒక కచ్చితమైన కారణంతో ఉంటుంది. అది కీర్తిప్రతిష్ఠలు పొందాలని లేదా ఏదో ఒక బాధ్యత తీర్చుకోవడానికి లేదా తన చుట్టు పక్కల ఉన్న ప్రజలతో చక్కగా ఇమిడిపోయి జీవించటానికి. సన్న్యాసి తీసుకునే బాధ్యత లక్షణాలు పూర్తి వేరుగా ఉంటాయి. అతనికి ప్రపంచమంతా అతని కుటుంబమే. అతణ్ణి ముందుకు నడిపే ప్రత్యేకబాధ్యత ఏదీ ఉండదు. ఇదంతా అతని అంతరంగలక్షణాల వల్ల జరుగుతుంది. సంసారి తన బాధ్యతలు తీరాక జీవితంలో ఒక స్థితిలో విశ్రాంతి తీసుకోవచ్చు. సన్న్యాసి మాత్రం నిరంతరం పని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతని దగ్గరికి ప్రజలు నిరంతరం వస్తూనే ఉంటారు. వారికి జీవితసత్యాల్ని తెలియజేస్తూ ఉండాలి.
సన్న్యాసి బలమైన సంబంధాలలో స్థిరపడగలడు. సామాన్యులు మాత్రం సన్న్యాసి బంధాల నుంచి పారిపోతాడు అని అనుకుంటారు. ఒకసారి ఒక కాలేజీ ప్రోగ్రాంలో ఒక అమ్మాయి నన్ను 'స్వామీజీ! మీరు ప్రేమలో ఓడిపోయి సన్న్యాసి అయ్యారా' అని అడిగింది. నేను ఆమెతో 'ప్రేమలో గెలిచాను కాబట్టి నేను సన్న్యాసినయ్యాను' అని చెప్పాను. నిజానికి సన్న్యాసమే మిమ్మల్ని ప్రేమలో నిలుపుతుంది. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఒక వ్యక్తి వైపు కాదు. ఆ ప్రేమ సర్వాంతర్యామి వైపు, సర్వసృష్టి వైపు ఉంటుంది.
సామాన్యంగా అందరూ ప్రేమ అనుకునే ప్రేమ ఒక కారణంతో లేదా కోరికతో ఉంటుంది. అర్థం చేసుకోండి, అంతరంగంలో స్త్రీ లేదా పురుషుడు అంటే ఏమిటి? అది మన లోపల దాగి ఉన్న కోరిక లేదా కామం. శివుడు తంత్రాల్లో ఈ విషయాన్ని చాలా చక్కగా చెబుతాడు. ఎవరైతే తన అంతరంగంలో స్త్రీని తుడిచేస్తాడో అతనే నిజమైన సన్న్యాసి.
సన్న్యాసి అంటే మహారాజులా జీవించే వ్యక్తి. సన్న్యాసం అంటే మహారాజు జీవితానికి ప్రారంభం. ఎప్పుడైతే నీ లోపలి బాధల్ని, వ్యథల్ని పూర్తిగా తొలగించి శుభ్రపడతావో, నీవు ఈ ప్రపంచంలో పొందదగినవన్నీ సాధిస్తావు. అప్పుడు మీరు ఏ ఐశ్వర్యం ఇవ్వలేని, ఏ సంపదకి సాటి రాని ఐశ్వర్యవంతులవుతారు.
నేను జన్మించినప్పుడు జ్యోతిష్యపండితుల్ని పిలిపించి నా జాతకచక్రం చూడమని చెప్పారట. ఆయన నా జాతకచక్రం చదివి 'ఈ అబ్బాయి రాజసన్న్యాసి అవుతాడు' అని చెప్పారట. అర్థం చేసుకోండి. సన్న్యాసమార్గాన్ని సరైన పద్ధతిలో అనుసరించగలిగితే అతనికి మహారాజయోగాన్ని ఆపాదిస్తారు. సన్న్యాసం అంతిమరాజసం. ఎందుకంటే సన్న్యాసి ఏమీ లేకుండానే ఐశ్వర్యవంతుడు. ఒక రాజు కేవలం అతని సంపద వల్ల మాత్రమే రాజు. అది బయటి ప్రపంచానికి సంబంధించిన ఐశ్వర్యం. సన్న్యాసి తన అంతరంగప్రపంచానికి సంబంధించిన ఐశ్వర్యంతో మహారాజు అవుతాడు. బయటి ప్రపంచసంపదని ఎప్పుడైనా పోగొట్టుకోవచ్చు. అప్పుడు మహారాజు కూడా పేదవాడై పోతాడు. అంతరంగసంపదలతో మీరు శాశ్వతంగా, ఎప్పటికీ ఐశ్వర్యవంతులే.
గౌతమబుద్ధుడు భిక్షాటనచేస్తూ వీధులలో తిరుగుతున్నప్పుడు, ఆయన మహాచక్రవర్తిలా కనిపించేవాడట. ఆయనకి భిక్షవేసేవారు భిక్షకులుగా అనిపించేవారు అని చెబుతారు. అదే సన్న్యాసి ముఖ్యలక్షణం. అప్పటికే బుద్ధుడు జ్ఞానోదయమైన యోగీశ్వరుడు. అయినా సన్న్యాసి లక్షణం కూడా అందులో ఉంది. సన్న్యాసం అంటే రాజసం ఉట్టిపడటమే.
అంతే కాదు; ఎప్పుడైతే అంతరంగప్రపంచం ఐశ్వర్యవంతమవుతుందో ఆ వ్యక్తికి బయటి ప్రపంచంలో ప్రతి అనుభవమూ ఐశ్వర్యవంతంగా ఉంటుంది. సన్న్యాసికి అంతు లేని సృష్టిసంపదలు కనిపిస్తూ ఉంటాయి. ఆయన దృష్టి మహాసముద్రం, ఆయన చిన్న చిన్న పరిధుల్లో చిక్కుకొని ఉండడు. అతనికి సర్వసృష్టి ఒకటేగానే కనిపిస్తుంది. అతను తనకి తాను ఆ ఐశ్వర్యంలో ఒక భాగం అని తెలుసుకుంటాడు. అందుకే తాను కూడా చాలా ఐశ్వర్యవంతుడిని అని తెలుసుకుంటాడు. అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి కొన్ని ఎకరాల పొలానికి అధిపతిని అని తాను ధనవంతుడినాని అనుకుంటాడు. కాని అతను నిజంగా ధనవంతుడు కాడు. అతను అంత వరకూ పేదవాడే. ఎవరైతే సృష్టిలోని అంతు లేని సంపదల్ని చూడగలడో అతనే ధనవంతుడు.
ఒక చిన్న కథ : ఒక రోజు ఒక ధనవంతుడైన వ్యక్తి తన కొడుకుని తీసుకొని ఊరు బయట ఉండే చిన్న గ్రామానికి వెళ్తాడు. అక్కడ ఉన్న పేదవారని, వారి జీవితవిధానాల్ని తన కుమారుడికి చూపించాలి అన్నది అతని ఉద్దేశం. అక్కడ ఒక వ్యవసాయదారుని కుటుంబంతో కొన్ని రోజులు గడుపుతాడు. తిరిగి వారి ఊరికి వచ్చేస్తూ, తిరుగు ప్రయాణంలో తండ్రి కొడుకును తమ ఈ ప్రయాణం ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు కొడుకు, చాలా బాగుంది అని జవాబు చెబుతాడు.
తండ్రి కొడుకుని ‘అక్కడ పేదవారి జీవనసరళిని గమనించావా?’ అని అడుగుతాడు. ‘అవును, చూసాను’ అని కొడుకు సమాధానం ఇస్తాడు. తండ్రి కొడుకుని ‘మన ఈ ప్రయాణం నుంచి నీవు ఏం నేర్చుకున్నావు’ అని అడుగుతాడు.
కొడుకు ఇలా సమాధానం ఇస్తాడు. ‘మనకి ఒక కుక్క మాత్రమే ఉంది. కాని వాళ్ళకి నాలుగు ఉన్నాయి. మనకి చిన్న కొలను ఉంది. అది మన తోట మధ్యలోనే ఉంది. కాని వారికి అవతలి ఒడ్డు కనపడనంత పెద్ద నది ఉంది. మన తోటలో దీపాలు వున్నాయి. కానీ వీరికి నక్షత్రాలు ఉన్నాయి. మన ముందు వైపు, వెనుక చిన్న తోట మాత్రమే ఉంది. వారికి మాత్రం దిక్కులన్నీ అంటే అంత పెద్ద వాకిలి, తోట ఉన్నాయి. మనం ఉండటానికి చాలా చిన్న స్థలం ఉంది. కాని వారు ఉండే స్థలం పొలాలు కంటికి కనపడేంత వరకూ ఉన్నాయి. మనకి సేవలు చేయటానికి పనివారు వున్నారు. కానీ అక్కడ వాళ్ళే ఇతరులకి సేవలు చేస్తారు. మనం మన భోజనపదార్ధాలు కొనుక్కుంటాం. వాళ్ళు వాటిని స్వయంగా పండించుకుంటారు. మనని రక్షించటానికి నాలుగు వైపులా గోడలు ఉన్నాయి. కాని వారిని రక్షించటానికి వారి స్నేహితులు ఉన్నారు.’ కొడుకు జవాబు విని తండ్రి నిర్ఘాంతపోతాడు. చివరలో కొడుకు ఇలా అంటాడు ‘నాన్నగారూ’ మనం ఎంత పేదవారమో నాకు చూపించారు. మీకు కృతజ్ఞతలు.’
అర్ధం చేసుకోండి; ధనవంతుడు, సంపదలు అనే మాటని చాలా తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఏదో ఒకటి - రెండు ఇళ్ళకి సొంతదారుని అనే వ్యక్తిని మీరు ఎలా ధనవంతుడు అంటారు. అది సరి కాదు. ఏ వ్యక్తి అయితే నిరంతరం తన చుట్టూ ఉన్న అనంతమైన సృష్టిలోని సంపదల్ని అనుభవిస్తాడో అతనే ధనవంతుడు. సన్న్యాసి నిజమైన ధనవంతుడు.
స్వేచ్ఛని మేల్కొలపడం
ఈ గ్రంథంలోని ఈ భాగం వివేకానందస్వామి రాసిన ఒక సన్న్యాసి పాట అనే పద్యభాగం మీద పరమహంస నిత్యానంద ఇచ్చిన వ్యాఖ్య. ఆయన బిడదిలోని ఆశ్రమవాసుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ విషయాల్ని వివరించారు. ఆయన చెప్పిన విషయాలు తక్కువే అయినా ప్రసంగం అందరిలో ఒక అందమైన, విజ్ఞానపూరితమైన నిశ్శబ్దంలోకి తీసుకువెళ్ళింది. ఇందులో పెద్దగా ఉన్న వరుసలు అసలు పద్యం తెలుగు అనువాదం. ఆయన బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులకి తాను ఏ విధంగా శిక్షణని ఇస్తారో వివరించారు.
స్వరాన్ని మేలుకొలుపు
స్వరాన్ని మేల్కొలపండి! పాటకి అదే జన్మస్థానం. సుదూరాల్లో ఎక్కడైతే ఈ ప్రపంచ మలినాలు చేరవో కొండ గుహల్లో, అడవుల అంతర్భాగాల్లో ఎవరైతే మౌనంగా ఐశ్వర్యం, పేరు కావాలని కోరిక లేదని అనేవారిని ఎవరైనా భంగపరచగలరా; ఎక్కడైతే జ్ఞానం, సత్యం, పరమానందం ఒక నిరంతరవాహినిలా ఉందో ఆ రాగాలని ఉచ్ఛస్వరంతో ఆలపించండి. ధైర్యంతో పాడండి గొంతెత్తి ఓ! సన్న్యాసీ ధైర్యంగా చెప్పు, ఓం తత్ సత్ ఓం!
నిన్ను బంధించే సంకెళ్ళు తెంచు! నిన్ను బందీని చేసే బంధాల్ని తెంచుకో. మెరిసే బంగారం కానీ, మెరవని మామూలు లోహం ప్రేమ - ద్వేషం; మంచి చెడు అన్నీ ద్వంద్వాలే. బానిస బానిసేనని తెలుసుకో, బుజ్జగించినా, బాధపెట్టినా అది స్వేచ్ఛ కాదు. సంకెళ్ళు బంగారానివైనా, బందీని చేసేవి బలహీనమైనవైనా వాటిని తొలగించుకో, సన్న్యాసీ ధైర్యంగా గొంతెత్తి అను ఓం తత్ సత్ ఓం!
ప్రస్తుతానికి మీలోని అహంకారం కొన్ని చోట్లలో స్థిరపడి ఉంది; అవి గర్వం, కోరిక, కోపం, సంపదలు, సంఘంలో పేరు ప్రతిష్ఠలు, వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఇలాంటివాటిల్లో ఉంది. మీరు ఆ విధంగా జీవిస్తున్నంత కాలం, మీరు అవి సాధించినా సాధించకపోయినా, మానసిక క్రంగుబాటు (నిస్పృహ) అనేవి మీకు ఆధారమవుతాయి. ఎందుకంటే అహంకారం ఏ రూపంలో ఉన్నా అది నిరాశానిస్పృహలకే దారి తీస్తుంది అది సూక్ష్మంగానైనా ఉంటుంది లేదా స్పష్టంగా కనిపిస్తుంది.
గుంపులుగా వచ్చే ద్వంద్వాలే, లాలన కాని, బాధించటం కాని గురువుగారు ప్రేమని చూపించినా లేదా మీ మీద మండిపడినా, మీరు అహంకారం ఆధారంగా జీవనసరళిని నడిపిస్తూ ఉంటే, మీరు ఎప్పటికీ బానిసగానే ఉంటారు.
బంగారానివైనా అవి సంకెళ్లే
అర్థం చేసుకోండి; వెంటనే దొరికే స్వేచ్ఛ అనే ఒక విషయం ఉంది. అది ఎలా ఉంటుంది అంటే, మీరు నిద్ర లేవగానే మీకు ఎలా చేయాలి అనిపిస్తే అలా చేస్తారు. ఎప్పుడు నిద్ర లేవాలి అనిపిస్తే అప్పుడు నిద్ర లేస్తారు. ఎప్పుడు ఏ పని చేయాలి అనిపిస్తే అప్పుడు ఆ పనిని చేస్తారు. మీ చేటికి డబ్బు వచ్చినప్పుడు ఏమి కొనాలి అనిపిస్తే అది కొంటారు. దీన్నే వెంటనే లభించే స్వేచ్ఛ అనవచ్చు. ఎప్పుడైతే మీలోని అటువంటి స్వేచ్ఛని కుదిపేస్తామో అప్పుడే మీలో సమూలమైన మార్పు వస్తుంది. నేను, నాది అనేవి కదిలిపోతాయి. అప్పుడే మీలో మార్పు అనేది సాధ్య పడుతుంది. ఆ మార్పు మీ చేతనస్థితిలోని మానసికవ్యవస్థ, అచేతనస్థితిలోని మానసికవ్యవస్థ ఒక దాంతో ఒకటి సంభాషించుకోవటమే.
నేను ఏం చేస్తున్నానో గమనిస్తే మీరు చాలా చూడవచ్చు; నేను నిరంతరం మీలోని వెంటనే లభించే స్వేచ్ఛని కుదిపేస్తూ ఉంటాను. అంతకు మించి మరేమీ లేదు. మీరు మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఇటువంటి స్వేచ్ఛలో స్థిరపరిచారు. దాన్ని నేను కుదిపేస్తున్నాను. మీకు కొంచెం వివరంగా చెబుతాను. అప్పుడు దాన్ని మీ జీవితానికి అన్వయించి అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం మీరంతా ఆశ్రమపద్ధతిని అనుసరిస్తున్నారు. దాని ప్రకారమే మీరు ఉదయం 5 గం నుంచి రాత్రి 12 వరకు చేయవలసిన విధంగా మీ విధులు చేస్తున్నారు. ఉదాహరణకి రేపటి నుంచి 10 రోజులు మీకు సెలవులు ఇస్తున్నాను అన్నాననుకోండి. అంటే మీరు ఆశ్రమపద్ధతులు పాటించనవసరం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు. ముందు మూడు - నాలుగు రోజులు కొంచెం ఎక్కువ సేపు నిద్ర పోతారు. మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ గడుపుతారు. ఆ తరువాత ఏం జరుగుతుంది? మీ కోరికలు ముందుకు వచ్చి మీ మీద అధికారం చేస్తాయి. మీరు వాటి ప్రకారం పనులు చేయటం మొదలు పెడతారు.
నేను మీకు విధించిన దైనందినజీవనపద్ధతి మీ చేతనస్థితిని ఉన్నతంగా ఉంచుతుంది. కానీ అది మీకు నచ్చదు. కాబట్టి మీకు స్వేచ్ఛని ఇవ్వగానే ముందు కొన్ని రోజులు చాలా స్వేచ్ఛగా ఉంటారు. కానీ ఆ తరువాత ఏం జరుగుతుంది? మీ లోపల ఉన్న, మీ అచేతనస్థితిలో ఉన్న కోరికలు ముందుకి వచ్చి, మీ మీద అజమాయిషీ చేస్తాయి. మీకు తెలియకుండా మీరు మరొకసారి బానిస అవుతారు. అది కూడా మీ కోరికలకి బానిస అవుతారు.
ప్రస్తుతం మీరు ఏమనుకుంటున్నారు? నిరంతరం ఒక బానిసలా పని చేసే అవసరం ఉందా? ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతి రోజూ అదే పనిని చేయాలా? మీరు నాలుగు రోజుల స్వేచ్ఛ తరువాత మీకు అర్ధమయ్యేది ఏమిటంటే మీ కోరికలకి మీరు బానిస అని, అంతే.
మీరు మీ కోరికల్ని అనుసరించి మీరు ప్రతి దాన్నీ వాయిదా వేస్తుంటారు. మీ దైనందిన కార్యాలను వదిలివేస్తారు. మీరు భోజనం చేసే సమయం, నిద్ర పోయే సమయం అన్నింటినీ విరామంగా చేస్తారు. మీరు ఆ విధంగా చేసేటప్పుడు మీ అంతరాత్మ పైన మానసికమైన క్రంగుబాటు అనే ఒక దళసరి పొర ఏర్పడటం గమనించవచ్చు (చేతితో గ్రిడ్‌లా చేసి చూపిస్తూ చెబుతున్నారు).
ఎప్పుడైతే మీ భ్రమలే మీకు తెలియకుండా మీ దైనందినజీవితాన్ని నడపటం ప్రారంభిస్తాయో, అప్పుడు మీ లోపల నిరాశానిస్పృహలు, క్రంగుబాటుతనం అనేవి ఒక దళసరి పొరలా ఏర్పడతాయి. అదే ఇక్కడ ఆశ్రమంలో నేను చెప్పే జీవనసరళి అటువంటి పొరలు ఏర్పడకుండా సహాయం చేస్తుంది. ఎందుకంటే ప్రతి రోజూ మీ వాదాలకి, మీ లౌక్యానికి అందని విధంగా మీ లోపల ఒక ఆహ్లాదకరమైన భావన మీ అంతరంగాన్ని కప్పుతూ మిమ్మల్ని తేలికపరుస్తుంది. ఇదే ఈ రెండు మార్గాల మధ్య ఉన్న పెద్ద తేడా. ఈ విషయాన్నే నేను ఉదయం ప్రాణనాథకి చెబుతున్నాను.
ఈ చీకటులు తొలగాలి ! మనోసంకల్పం ముందుకి సాగాలి
నిరాశ పొరల వెలుగులు మరింతగా తగ్గిపోవాలి. జీవితాంతంలోని దాహార్తి శాశ్వతంగా పోగొట్టాలి.
జన్మ నుంచి మరణానికి, మరణం నుంచి జన్మకి అది సాగాలి
ఎవరు తనని తాను గెలుస్తారో, అతనే విజయుడు
ఈ సంగతి తెలుసుకో, మిగిలి విషయానికి కరిగిపోకు
ఓ ధైర్యం గల సన్న్యాసీ, గొంతెత్తి పాడు
'ఓం తత్ సత్ ఓం' అనే నాదాన్ని
ఈ విషయాన్నే నేను చెబుతున్నది. జాగ్రత్తగా అర్ధం చేసుకోండి. ఎవరైతే మరణానికి తరువాత జన్మకి మధ్య 'ఆహా...... నేను చేయగలిగింది చేసి బయట పడ్డాను' అనే వ్యక్తి సన్న్యాసి. పుట్టుకకి, మరణానికి మధ్య ఉన్నదే జీవితం అనుకుని 'ఆహా! నేను గొప్పవి సాధించాను' అనుకునే వ్యక్తి సంసారి. అర్ధమైందా? మన అంతరాత్మ మరణానికి తరువాత జన్మకి మధ్య ఉండే సమయంలో తన పాత జ్ఞాపకాల్ని, పనుల్ని తిరిగి మననం చేసుకుంటుంది. ముందు జన్మలో సత్యానికి దగ్గరగా జీవించగలిగితే తృప్తిగా ఉంటుంది. అలా కాకుండా ఊహలు, కల్పనల్లో జీవించి ఉంటే బాధపడుతుంది. మరణానికి ఆ తరువాతి జన్మకి మధ్యలో తాను జీవితంలో మంచి పని చేశాను అని అనుకోగలిగితే చక్కగా బయటికి రాగలుగుతాడు. ఎందుకంటే అతను సత్యానికి అతి చేరువగా జీవించాడు కాబట్టి.
అదే సంసారి అయితే జీవితానికి, మరణానికి మధ్య ఉన్నదే జీవితం అనుకొని, కల్పనల్లో చేసిన పనుల్ని ఘనతగా భావించి, ఆహా! నేను సాధించాను అనుకుంటాడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి, నేను సంసారి అని అంటే వివాహం అయినవారు అని అర్థం కాదు. ఇది మానసికస్థితికి సంబంధించిన విషయం. ఎవరైతే సత్యానికి దూరంగా కల్పనల ప్రపంచంలో ఉంటారో వారంతా సంసారులే. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
జీవితంలోని దాహాన్ని పూర్తిగా పోగొట్టాలి: అది సాధ్యమా?
జీవితం మీద ఆశ ఎప్పటికీ మరణించదు. అది నిరంతరం జరుగుతూ ఉంటుంది. చాలా జన్మలు గడిచాక, జన్మలంటే బోరు కొట్టి, అప్పుడు స్థిరపడటమే అనుభవం అంటే అదే జీవితంలో అంతిమ అనుభవం. జ్ఞానోదయమైన యోగీశ్వరులు ఎన్నో వేల జన్మల్ని తీసుకొని, విసుగొచ్చి, ఒక స్థితిలో స్థిరపడతారు. అటువంటి వ్యక్తి నిరంతరం అపురూపమైన శక్తిని నలువైపులా ప్రసరింపచేస్తుంటారు. ఏ వ్యక్తి అయినా ఆ యోగీశ్వరుని చూస్తే ఆయనకి జీవితాంతం దగ్గరైపోతాడు. ఆయనని వదల్లేడు. అదే ఆ వ్యక్తి జ్ఞానోదయం పొందాడు అనడానికి గుర్తు. ఆ విధంగానే గురువుకి, శిష్యులకి మధ్య బంధం ఏర్పడేది. శిష్యుడు గురుదేవుల్లో తన తర్కానికి అందని శక్తిని చూసి దానికి కట్టుబడి ఉంటాడు.
అర్థం చేసుకోండి; చాలా చాలా జీవితాల నుంచి వచ్చిన అనుభవాల తరువాత నేను ఈ స్థితిలో ఉన్నాను. అందుకే మీరు నన్ను సీనియర్ ఆత్మ అని అంటారు. అ విధంగా కాకపోతే నా వయస్సు 31 సం॥కి, నా లోపల ఉన్న ఆత్మకి ఏం సంబంధం ఉంది? ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అటువంటి ప్రాచీన, సీనియర్ ఆత్మని చూడగానే ఆ అనుభవాన్ని గ్రహించి తమని తాము ఉన్నతస్థితికి వెళ్ళగలగటమే సన్న్యాసం అంటే. ఈ విషయాన్నే వివేకానందుడు ఇక్కడ వివరిస్తున్నాడు. సన్న్యాసం అంటే జ్ఞానోదయమైన యోగీశ్వరుని చూసి, ఆయనతో ఉండి తనకి తాను అత్యున్నతస్థితికి చేరటమే. ఎవరు తనని తాను గెలుస్తారో, వారు ఎవరి పైన అయినా గెలుపే సాధిస్తారు. ప్రాపంచికవిషయాలకి కరిగిపోవద్దు.
ఓ సన్న్యాసీ ధైర్యంగా గొంతెత్తి చెప్పు
'ఓం తత్ సత్, ఓం!'
ఎవరు విత్తనం నాటుతారో వారికే ఫలాలు అన్నది ఆర్యోక్తి
కారణమే ప్రభావానికి మూలం
మంచి అయితే దొరికేది మంచి
చెడు అయితే దొరికేది చెడు
ఎవరూ న్యాయసూత్రాన్ని తప్పించుకోలేరు.
కాని ఎవరు ఒక రూపాన్ని పొందారో
వారు బంధాల్ని భరించాలి
నిజమైన సత్యం : కాని సుదూరం
రూపం వేరు రెండు ఆత్మే
అది ఎప్పటికీ స్వేచ్ఛాభిలాషి
ఆ కళని నీవు నేర్చుకో ఓ సన్యాసీ
ధైర్యంగా గొంతెత్తి చెప్పు
ఓం తత్ సత్ ఓం!
ఒక సందర్భాన్ని కాని, లేదా న్యాయస్థానాన్ని కానీ ఒక్కసారి తప్పించుకుంటే మీరు నిజంగా తప్పించుకున్నాను అని ఎప్పుడూ అనుకోవద్దు. ఏదైనా ఒక సమస్య వస్తే, మీ అంతరాత్మ లోపలికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు సాంత్వన పరచుకునే మాటలు చెప్పండి.'నేను ఆత్మని' అని గుర్తు చేసుకోండి. ఆ సమస్యకి మీ నుంచి వచ్చే జవాబుని, అది మీ అంతరంగంలో కలగచేసే అనుభవాన్ని తెలుసుకోండి. అది ఎంత జటిలమైన సమస్య అయినా సరే, మీకు జవాబు వస్తుంది. దాని ప్రకారం నడుచుకోండి, అదే స్వేచ్ఛ అంటే. ప్రస్తుతం మీకు ఏదైనా సమస్య ఉంటే, మీరు ఏం చేస్తున్నారు? ఆ సందర్భం నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తున్నారు. అవును కదా? అలా తప్పించుకొని మీకు స్వేచ్ఛ ఉంది అనుకుంటున్నారు. ఆ పద్ధతి వద్దు అని వివేకానందుడు ఇక్కడ చెబుతున్నాడు.
పేరు, రూపం కూడా ఆత్మే. అది ఎప్పటికీ స్వేచ్ఛతో ఉంటుంది. ఆ (స్వేచ్ఛ) కళని నేర్చుకో.
జీవితపరిష్కారాల్ని మీ అంతరంగానికి అన్వయించటం ద్వారా స్వేచ్ఛని మేల్కొలపండి. ఆ విధంగా వచ్చే స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ మాత్రమే మిమ్మల్ని అంతిమస్వేచ్ఛకి తీసుకు వెళ్ళగలుగుతుంది. ఈ విధంగా కాకుండా, మరే విధంగా అయినా, ఏ పద్ధతిలోనైనా మీరు స్వేచ్ఛ దిశగా సాగుతున్నాం అని అనుకుంటే, అది మిమ్మల్ని మరింతగా బంధాల్లోకి తీసుకువెళుతుంది. ఎవరు విత్తితే వారు ఫలాలు పొందుతారు.
కారణం తప్పక ఫలితాన్ని ఇస్తుంది అనే ఆర్షోక్తి
మంచితో మంచిని పొందుతావు
చెడుతో చెడుని పొందుతావు. అది మరేమీ కాదు.
న్యాయం నుంచి తప్పించుకున్నా;
ఎవరైతే రూపాన్ని పొందుతారో, వారు బంధాల్ని భరించాలి.
అది నిజమైన సత్యం; కానీ ఎక్కడో సుదూరాల్లో ఉంది.
చూడండి! మీరు ఒక రూపాన్ని తీసుకోగానే అంటే మీరు జన్మించగానే మీరు స్వేచ్ఛ కోసం చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. అది ఈ జన్మ నుంచి తప్పించుకోవటం గాని లేదా దేన్నైనా ఆపాలి అని ప్రయత్నించటం ద్వారా గాని చేస్తారు. కానీ అది జరగదు. ఇది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని బంధించి ఉన్న గొలుసుని విప్పి మళ్ళీ మీకు మీరే మరొక చోట గట్టిగా కట్టినట్లుగా ఉంటుంది. ఒక గాయం తగ్గాలి అంటే దానికి మందు వేయాలి. అంతే కదా! కానీ దాన్ని ఇంకా ఇంకా లోపలికి తొలుస్తూ వెళితే అది ఎలా తగ్గుతుంది. తగ్గదు. బయటి ప్రపంచంలో ప్రయత్నాల ద్వారా స్వేచ్ఛ పొందాలి అని మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని మీరు లోతైన క్రంగుబాటుతనంలో మునిగేలా చేస్తుంది. ఆ నిరాశ నుంచి మీరు పని చేసినా అది మరింత నిరాశ, క్రంగుబాటులకే దారి తీస్తుంది. అదే విధంగా మీరు బందీలుగా బంధాలలో చిక్కుకుని ఏ పని చేసినా అది మిమ్మల్ని మరింత బంధాల్లోకి తీసుకువెళుతుంది. కేవలం మీరు మీ అంతరంగప్రపంచంలో పని చేసినప్పుడే మీకు ఆ స్వేచ్ఛ దొరుకుతుంది.
ఉదాహరణకి; మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఆ పరిస్థితుల నుంచి తప్పుకోవటానికి ఈ ప్రపంచంలో మనుషులని కాని లేదా పరిస్థితులని కాని మార్చాలి అని ప్రయత్నిస్తారు. అంతే కదా? ఆ తప్పుని మూసేయటానికి ఇటువి అటు మారుస్తారు. ఆ తరువాత అంత కంటే బాధాకరమైనవి జరుగుతాయి. ఆ దుఃఖం బయటికి వచ్చినప్పుడు 'ఎవరైనా ఈ విషయం మీద ప్రశ్నిస్తే ఏం జవాబు ఇవ్వాలి? ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అని ఆలోచించటం మొదలుపెడతారు. మీ అహంకారం' ఈ దుఃఖానికి కారణం మీరే అని చెప్పనీయదు. కాబట్టి మీరు ఏం చేస్తారు? మీ తప్పులు బయటికి రానీయకుండా, ఆ దుఃఖానుభవాన్ని మీలో కలగనీయకుండా ఆ దుఃఖాన్ని, బాధని బయటకి రానీయకుండా, మీరు 'ఆ........ నేను మంచి పనే చేసాను, ఇక దాన్ని వదిలేస్తాను. అది ఎలా జరగాలో ఆ విధంగా జరుగుతుంది' అని చెప్పుకుంటారు.
అంతే కదా! జీవితం ఆ విధంగానే సాగిపోతూ ఉంటుంది.
ఇక్కడ ఆశ్రమంలో మీ జీవితాన్నే ఉదాహరణగా తీసుకోండి. ఎప్పుడైతే మీ లోపల కదలికలు, అనిశ్చలత అనేవి ప్రారంభమవుతాయో, ఎప్పుడైతే నేను మీ అహంకారానికి సమస్యలు సృష్టించటం ప్రారంభిస్తానో, వెంటనే మీరు ఒక గుర్తింపుని తయారుచేసుకొని, మీ వ్యక్తిత్వం అది అనుకొని ఇక్కడ నుంచి పారిపోయి పాండిచ్చేరి ఆశ్రమానికి చేరుతారు. ఎప్పుడైతే మీరు పాండిచ్చేరి ఆశ్రమానికి చేరుతారో అక్కడ ఇంకా పెద్ద సమస్యలు (దుఃఖం) ఎదురుచూస్తూ ఉంటాయి. అప్పుడు అక్కడి నుంచి పారిపోయి సేలం ఆశ్రమానికి చేరుతారు. అక్కడి నుంచి తిరువణ్ణామలై ఆశ్రమానికి చేరుతారు. ఒకవేళ ఇవేవీ పని చేయకపోతే మీరు ఈ సంస్థనే వదిలేసి బయటికి వెళ్ళిపోతారు. అవును కదా! అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి; పారిపోవటం ద్వారా మరింత పెద్ద సమస్యని ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి దుఃఖం లేదా బాధ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, మిమ్మల్ని మీరు దాచుకుంటారు. మీరు 'అబ్బే! అటువంటిది ఏమీ లేదు. అంతా బాగుంది,' అని మభ్యపెట్టుకుంటారు. ఈ దుఃఖానికి కారణం మీరు తీసుకున్న నిర్ణయమే అని తెలిసి కూడా, మిమ్మల్ని మీరు ఓదార్చుకోవటానికి, ఆ పనినే కొనసాగిస్తారు. మీరు ఇలా నిరంతరం చేస్తూ, ఈ చక్రంలో స్థిరపడిపోతే, స్వేచ్ఛని పొందే అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటారు. మీ పేరు రూపం, ఆ స్వేచ్ఛ - అన్నీ ఆత్మే. ఆ కళని నీవు నేర్చుకో.
సరే! మరి దీనికి పరిష్కారం ఏమిటి? వివేకానందుడు మరీ మరీ ఒక విషయాన్ని చెబుతాడు, 'ఆ కళని నేర్చుకో' అని. మీ అంతరంగంలో స్వేచ్ఛని నిలబెడతాను అని పదే పదే అనుకోవాలి. బయటి ప్రపంచంలో ఏం జరిగినా అది సర్వాంతర్యామి మాత్రమే అనుకోవాలి. ఈ క్షణం అనే దాన్ని మనం మార్చలేం అని తెలుసుకోగలగాలి. మీరు అర్థం చేసుకోవనవసరం కూడా లేదు. నేను ఆత్మని అని అనుకోండి అది చాలు. నేను స్వచ్ఛమైన ఆత్మని ఈ శరీరానికి, మానసికవ్యవస్థకి నాకు ఏ బంధం లేదు అని అనుకోండి. బయటి ప్రపంచంలో మీకు ఏం జరిగినా దాన్ని భగవంతుడు ఆడే నాటకం అనే అనుభవంతోనే చూడండి. అవన్నీ కూడా కేవలం మీరు చూస్తున్న ప్రతిబింబాలే. ఈ సత్యాలని పదే పదే గుర్తు చేసుకోవటం ద్వారా మీ అంతరంగంలో స్వేచ్ఛని మేల్కొలుపుతారు. అదే నిజమైన స్వేచ్ఛ. అదే అంతిమస్వేచ్ఛ.
ఆ కళని నేర్చుకో, ఓ! సన్యాసీ ధైర్యంగా గొంతెత్తి చెప్పు
ఓం తత్ సత్ ఓం!
ఎవరైతే ఖాళీ కలలని కంటారో వారు సత్యాన్ని తెలుసుకోరు.
ఒక తండ్రిగా, తల్లిగా, భార్యగా, బిడ్డలుగా, స్నేహితుడుగా
లింగభేదం లేని ఆత్మ! ఎవరి తండ్రి అది? ఎవరి బిడ్డ?
ఎవరి స్నేహితుడు, ఎవరికి శత్రువు : అన్నీ అతనే
ఆత్మ అన్నింటిలో ఉండేది అదే, ఎక్కడా లేనిది అదే ;
ఆ కళని నేర్చుకో, ఓ సన్యాసీ ధైర్యంగా చెప్పుకో
ఓం తత్ సత్, ఓం.
ప్రతి నిమిషం కొన్ని వేల ఆలోచనలు మీలోంచి వెళుతుంటాయి. అవన్నీ ఖాళీ కలలే. ఉపయోగం లేని మీ మనస్సు సృష్టించే ఊహలే. ఈ బాంధవ్యాలు, భావావేశాలు అన్నీ కల్పనలే. మీరు ఈ ప్రపంచంలోకి మీ కర్మల్ని పోగొట్టుకోవటానికి వచ్చారు. ఈ ప్రపంచం నుంచి జ్ఞానోదయాన్ని పొంది వెళ్ళాలి అనుకుని వచ్చారు. కాని ఇక్కడికి వచ్చాక, మీరు ఈ ఉపయోగం లేని కలల్లో చిక్కుకుపోయారు. అంతే కాదు, బాంధవ్యాలు, భావావేశాలు ఒకటని ఏమిటి, ఎన్నో ఈ నిరుపయోగస్వప్నాలు మీ మనస్సు గుండా వెళుతూ ఉంటే, మీరు ఏమనుకుంటారంటే అతిభయంకరమైన హింస మీకు జరుగుతుంది అనుకుంటారు. దీన్ని ఇక ఏ మాత్రం భరించలేను అనుకుంటారు. అర్థం చేసుకోండి; ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఉక్కిరిబిక్కిరి అవుతారో, మీరు నిలబడే సమయం వచ్చింది అని తెలుసుకోండి. మీలోని ఊహల్ని కుదిపేసి సత్యాలని చూడవలసిన సమయం ఇదే అని తెలుసుకోండి. కానీ మీరు ఏం చేస్తారు? మీరు కలల్ని మార్చుకుంటారు. మీరు పరిస్థితుల్ని మారుస్తారు. అప్పుడేం జరుగుతుంది? మీ కలల్ని అలాగే కొనసాగిస్తారు. కాకపోతే అవి సున్నితంగా ఉంటాయి. మీరు మేల్కొనగలిగే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. సత్యాన్ని చూడగలిగే అవకాశాన్ని పోగొట్టుకుంటారు.
ఎప్పుడైతే నేను మిమ్మల్ని మరి మరి మరిగిస్తానో, మీ కలల్ని మీకు భయంకరంగా మారుస్తానో, నేను మిమ్మల్ని మేల్కొలుపుతున్నాను అని అర్థం చేసుకోండి. మరుగుతున్నప్పుడు, బంగాళదుంప బయటపడిపోతే ఏమవుతుంది, అది వృథా అవుతుంది. అదే విధంగా నేను మరిగించేటప్పుడు, బయటకి దూకేయకుండా, మీరు లోపలే ఉండగలిగితే, మీరు మీ మనస్సులో 'అసలు ఏం జరుగుతుందో చూడాలి' అని గట్టిగా నిర్ణయించుకోగలిగితే అది చాలు. అదే మీరు సిద్ధులు అవటానికి సహాయం చేస్తుంది. అదే ఆత్మజ్ఞానం అంటే.
ఖాళీ కలలు కనే............. ఓం తత్ సత్ ఓం.
అర్థం చేసుకోండి, మీరు బయటకి దూకటం ద్వారా కేవలం మీ ఖాళీ కలల్ని కొనసాగించటమే. చూడండి కల భయంకరమైంది అయితేనే మీరు మేలుకుంటారు. అది సున్నితమైందైతే మీరు మేల్కోరు. నేను మీ జీవితాన్ని భయంకరమైన కలలోకి తీసుకువెళ్ళగలిగితే, నేను మిమ్మల్ని మేల్కొలుపగలుగుతాను. నేను మిమ్మల్ని మేల్కొలిపే ఉద్యోగం చేస్తున్నాను. కానీ ఆ సమయంలో వద్దు! నన్ను వదిలేయండి స్వామీ! అని మీరు అరిస్తే, మీ పరిస్థితుల్ని మార్చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అది సున్నితమైన కలగా మారుతుంది. ఆ తరువాత మీరు ఏం చేస్తారు? ఆ కలని అలా కొనసాగిస్తారు. ఆ విధంగా ఎంత కాలం కావాలి అంటే అంత కాలం, అన్ని రోజులూ ఆ కలని కొనసాగిస్తారు. ఇది మీ వ్యక్తిగతప్రాధాన్యం.
అయితే ఒకటి ఉంది – స్వేచ్ఛ, అదే తెలుసుకునేవారు, ఆత్మ
రూపం ఉండదు, పేరు ఉండదు, దానికి కళంకమూ లేదు
సన్న్యాసం అంటే అంతిమద్వారతం అతనిలోనే ఉంది మాయ, ఈ కలల్ని కంటూ ఉండటమే
గమనించేవారు, సహజంగా ఉండే అది ఆత్మే
ఆ కళ నేర్చుకో, ఓ సన్యాసీ, ధైర్యంగా అను
ఓం తత్ సత్ ఓం! అని
నీకంటూ ఒక ఇల్లు లేదు. ఇక ఏ గృహం నిన్ను బంధిస్తుంది ఓ స్నేహితుడా!
ఆకాశమే ఇంటి కప్పుగా, పచ్చని గడ్డి నీ పడకగా,
భోజనం అంటారా, అది ఒక అవకాశం మాత్రమే
చక్కగా వండారా లేదా, ఏమీ అనుకోవు
ఆ పవిత్రాత్మని ఆహారం, పానీయం బాధించవు
తనను తాను మాత్రం తెలుసుకోగల ఆత్మ, నిత్యనదీప్రవాహమంత స్వేచ్ఛాజీవి
నీవు ఎవరైనా, ఓ సన్యాసీ ధైర్యంగా చెప్పు
ఓం తత్ సత్ ఓం!
రోజురోజుకి, ఆ కర్మ శక్తి ఖర్చు అయ్యేవరకు
ఆత్మకి పూర్తిగా స్వేచ్ఛని ఇవ్వండి తిరిగి జన్మ లేకుండా.
వివేకానందుడు పదే పదే చెప్పేది, మీరు ప్రతి రోజూ మేల్కొనగలిగే విధంగా జీవించండి. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరు నా దగ్గరకి బలమైన ఉత్సాహంతో ఈ కోరికతో నా దగ్గరికి వస్తారు. కొంత గడిచాక, ప్రతి రోజూ నేను మిమ్మల్ని మేల్కొలపడానికి మిమ్మల్ని రగిలిస్తాను అని మరచిపోతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఈ బయట ప్రపంచదృక్పథంలో స్థిరపడతారు. ఆహా! ఇదంతా ఒక వ్యవహారం అంతే అనుకుంటారు. ఇందులో ఏముంది? అందులో ఏముంది ? ఇటువంటి ఆలోచనలలో స్థిరపడి, మీ బలమైన ఉత్సాహాన్ని పలుచన చేసేస్తారు. నన్ను చాలా యధాలాపంగా తీసుకుంటారు.
ప్రతి రోజూ, నీ కర్మల శక్తి పూర్తిగా పోయేవరకూ
నీ ఆత్మ స్వేచ్ఛని పొందేవరకూ, తిరిగి జన్మ అనేది లేనంత వరకు
నేను కానీ, నీవు కాని, భగవంతుడు గాని మనిషి కాని
నేను అనేది సర్వంలో ఐక్యమయ్యి, సర్వం నేను అనేదిగా మారితే
అదే నిత్యానందం.
ఆ కళని నేర్చుకో, ఓ సన్యాసీ ధైర్యంగా చెప్పు. ఓం తత్ సత్ ఓం!
శరీరం ఎలా జీవిస్తుందో, మరణిస్తుందో మరి నీవు జాగ్రత్త పడనవసరం లేదు
తన పనిని పూర్తి చేస్తుంది. కర్మలు తేలిపోయే విధంగా ఎవరు పూలమాలలు వేసినా, మరెవరో అవమానం చేసినా
ఈ పరిధిని
పొగడ్తలైనా, అవమానాలైనా ఏమీ చేయలేవని
ఎక్కిపొగిడేవారు, పొగడబడేవారు అవమానించే వారు అవమానం పొందేవారు
అంతా ఒక్కటే, అందుకే శాంతంగా ఉండు ఓ సన్యాసీ, ధైర్యంగా చెప్పు.
ఓం తత్ సత్ ఓం అని.
ఎక్కడైతే కోరిక, కీర్తికాంక్ష, అత్యాశ, పొందాలనే కోరిక ఉంటాయో సత్యం ఆ దరిదాపులకి రాలేదు
ఎవరైతే స్త్రీని భార్యగా ఊహించడో, అతను కచ్చితమైనవాడు
అతనే ఏ వస్తువునీ పొందాలని ఆశించడు.
అతణ్ణి ఏ కోపం బంధించలేదు
మాయ అనే ద్వారం గుండా చక్కగా వెళ్ళగలుగుతాడు
అందుకే ఇటువంటి విషయాల్ని వదిలేయి
ఓ సన్యాసీ, ధైర్యంగా చెప్పు ఓం తత్ సత్ ఓం అని
అందరికీ శాంతిని ఆశించు నా నుంచి ప్రమాదం లేదు అని చెప్పు.
జీవించడానికి ఎవరిలోనైతే ఉన్నతస్థితి ఉంటుందో, ఎవరిలో అయితే వినయం ఉందో, నేను అందరిలో ఉండే ఆత్మని ఇక్కడ, అక్కడ పూర్తి జీవితాన్ని సన్యసించాను.
అన్ని స్వర్గాల్ని, నరకాల్ని, భూలోకాన్ని, అన్ని ఆశల్ని, భయాల్ని సన్యసించాను, బంధాలని తెంచాను అని ఓ సన్యాసీ ధైర్యంగా చెప్పు ఓం తత్ సత్ ఓం!
ఓ స్నేహితుడా! ఎక్కడ అన్వేషణ ఉందో అక్కడ స్వేచ్ఛ ఉంది.
దాన్ని ఈ ప్రపంచం ఇవ్వలేదు. గుడిలో గ్రంథాలలో వెతికినా కనిపించదు.
నిన్ను ముందుకి నడిపించే తాడు అదే.
నిన్ను ముందుకు నడిపేది ఆ తాడు పట్టుకున్న నీ చేయి మాత్రమే.
ఓ సన్యాసీ ధైర్యంగా చెప్పు ఓం తత్ సత్ ఓం!
వివేకానందుడు ఈ విధంగా చెబుతున్నాడు, స్నేహితులు, గ్రంథాలు, దేవాలయాలు ఇవేవీ కూడా సరైన జ్ఞానాన్ని ఇవ్వలేవు. ఆ ఇవ్వగలిగేది సత్యంలో జీవిస్తున్న గురుదేవుల హస్తాలు మాత్రమే. ఆ జ్ఞానాన్ని నీకు ఇవ్వగలవు. కాబట్టి ఆ చేతులని పట్టుకో. ఎప్పటికీ ఆ చేతులు వదలవద్దు. ఆ తరువాత నీకు దుఃఖం అనేది ఉండదు.
వివేకానందుడు నిజమైన సన్యాసి. ఆయన తన లక్ష్యానికి జీవితాన్ని త్యాగం చేసాడు. ఆయన పరమహంస ఏ విధంగా ఈ భూమి మీద జీవిస్తాడో తాను జీవించి చూపించాడు. అర్థం చేసుకోండి. ఈ మాటలన్నీ అత్యున్నతచేతనస్థితి నుండి వెల్లడి అయిన మాటలు. ఈ మాటలు ప్రతి ఒక్కరినీ లేచి నిలబడగలిగే శక్తిని ఇవ్వగల స్పష్టతని వారిలో మరీ మరీ కలిగిస్తాయి. ఈ మాటలు మంచి నిర్ణయాలు చేసే విధంగా సహాయం చేస్తాయి. అందులోంచి మనందరం ఆశిస్తున్న స్వేచ్ఛ దొరుకుతుంది అని వివేకానందుడు చెబుతున్నాడు.
కాబట్టి అర్థం చేసుకోండి; నిరాశ, క్రుంగుబాటుల నుంచి బయటికి రావటానికి పరిస్థితుల్ని మార్చకండి. అలా పరిస్థితుల్ని మారిస్తే మీరు మరింత లోతైన నిరాశలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు నిరాశతో తీసుకునే నిర్ణయం మిమ్మల్ని మరింత నిరాశ, క్రుంగుబాటులకి తీసుకువెళుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు నిరాశ, క్రుంగుబాటులలో ఉన్నప్పుడు మంచి నిర్ణయం చేయగల స్పష్టత మీలో ఉంటుందా? ఏ విషయాన్నైనా నిర్వహించగల స్పష్టత మీలో ఉంటుందా? ఉండదు. ఆ స్థితిలో మీరు ఏం చేసినా అయిదారు తాళం చెవులున్న హక్కుని తగులుకున్నవారవుతారు. తాగిన మత్తులో ఉన్న వ్యక్తికి తాడు దొరికితే అచేతనస్థితిలో తనని తాను మరింతగా బంధించుకుంటాడు. కాని తాను బంధవిముక్తుడిని అవుతున్నాను అనుకుంటాడు. మీరు నిరాశలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగానే ఉంటాయి.
కాబట్టి మీకు అవసరమైంది ఏమిటంటే, మీలోకి స్పష్టతని తీసుకురావటమే. కేవలం గమనించండి. ధైర్యంగా నిలబడండి. అప్పుడే నిజమైన స్వేచ్ఛ అనేది మీలో కలుగుతుంది.
నమో అరిహంతా!
సన్యాసంలో గురువుల పాత్ర ఏమిటి?
మహావీరజైనుడు ఒక గొప్ప జైనగురుదేవులు. ఆయన జైనసూత్రాల్ని, జైనుల బోధనలుగా రచించారు. ఆయన ఆ బోధనల్ని ఈ కింది మాటలతో ప్రారంభిస్తారు.
నమో అరిహంతనం
ఈ మాటలకి అర్థం: అంతిమసత్యాన్ని సాధించిన అరిహంతులకి గౌరవంతో నమస్కరిస్తున్నాను. ఆయన అందులో జ్ఞానోదయమైన గొప్ప యోగీశ్వరుల గురించి చెబుతారు.
ఈ యోగీశ్వరులు తాము అంతిమసత్యాన్ని సాధించటమే కాదు, ఆ సత్యప్రకాశాన్ని నలుదిశల ప్రసరింపచేస్తుంటారు. వారి సమక్షంలోకి ఎవరు వెళ్ళినా, వారు కూడా ఆ సత్యాన్ని సాధించాలి అనే ఉత్సాహాన్ని పొందుతారు. అరిహంత అంటే బోధలు చేసే వ్యక్తి కాదు. ఎవరైతే ఇతరుల్ని ప్రోత్సహిస్తారో వారిని అరిహంతులు అంటారు. బోధలతో జ్ఞానోదయాన్ని కలిగించలేరు. అలా చేయగలిగితే ఎప్పుడో దాన్ని అమ్మకానికి పెట్టేవారు. దాని కోసం వెబ్సైట్ ప్రారంభించేవాళ్ళు. జ్ఞానోదయం కావాలి అనుకునే వారు మా వెబ్ సైటుని సందర్శించండి అని చెప్పేవాళ్ళు. జ్ఞానోదయం గ్యారంటీ అనే షాపులు పెట్టేవారు. అదంతా జరగని పని. అదృష్టం కొద్దీ లేదా దురదృష్టం కొద్దీ జ్ఞానోదయాన్ని బోధల ద్వారా కలిగించలేం. కేవలం వారిని ప్రోత్సహించటం ద్వారా ఎదుటివారికి జ్ఞానోదయాన్ని కలిగించవచ్చు. ఎవరికైనా జ్ఞానోదయాన్ని కలిగించాలి అంటే వారిలో ఆ ప్రేరణ కలిగించటం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది కానీ బోధలు ద్వారా కాదు.
అరిహంత అంటే ఆ సత్యాన్ని చాలా శక్తిమంతంగా ప్రసరింపచేసే వ్యక్తి అని అర్థం. వారి సమక్షం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఎవరైతే వారి దగ్గరకి వచ్చి, కొన్ని నిమిషాలు వారి సమక్షంలో ఉంటేనే వారిలో ఆ ప్రేరణ కలుగుతుంది. వారిలో అగ్ని రవ్వ వెలిగి, జ్వాలగా మార్పు చెందుతుంది. ఇది చాలా అద్భుతమైన జీవితం అనే భావన వారిలో ప్రారంభమవుతుంది. ఇదే మనం జీవించగల చక్కని స్థితి అని అనిపిస్తుంది. నా జీవితంలో నాకు కలిగే అతి చక్కని స్థితి ఇదే అని అనిపిస్తుంది. అర్థం చేసుకోండి, మీరు ఒక జ్ఞానోదయం అయిన యోగీశ్వరుని సమక్షంలో రెండు - మూడు నిమిషాల పాటు ఉండగలిగినా చాలు, అప్పుడు మీకు అకస్మాత్తుగా, నా జీవితంలో జరగగలిగే ఎంతో మంచి స్థితి ఇదే అని అనిపిస్తుంది.
కేవలం ఆయన సమక్షంలో ఉండటం ద్వారా మీరు భగవదనుభవాన్ని పొందుతారు. అతను మీకు గొప్ప ఆకర్షణ అవుతాడు. ఆయన మిమ్మల్ని అంతగా ఉత్సాహపరుస్తాడు. ఆయన మీ అంతరంగాన్ని ఎంతగా ఆక్రమిస్తాడు అంటే, మీరు ఆ స్థితిని పొందే దిశగా పని చేస్తారు లేదా నేను అలా చేయలేకపోతున్నాను అనుకుంటారు. మీరు అలా చేయలేకపోతున్నాను అనుకున్నా పరవాలేదు. ఆ విధంగా అయితే కనీసం మీరు మొదటి మెట్టు ఎక్కగలుగుతారు. మీరు అన్వేషణ ప్రారంభించారు అని అర్థం. జ్ఞానోదయమైన యోగీశ్వరుని పట్ల గౌరవభావాన్ని వెల్లడి చేయటం అంటే జ్ఞానోదయానికి మీరు వేసే మొదటి అడుగు. దీని అర్థం ఏమిటంటే, మీరు ఆ స్థితిని కోరుకుంటున్నారు అని అర్థం. సామాన్యంగా ఏ విషయాన్నైనా, ఎవరినైనా మీరు త్వరగా గౌరవించరు. అందులోని అసలైన భావం మీకు నచ్చితేనే మీరు గౌరవిస్తారు. ఆ భావం పట్ల కొంత బాంధవ్యమైనా మీకు ఉన్నట్లయితే, లేదా సూక్ష్మస్థాయిలోనేనా ఆ స్థితి మీకు కూడా కావాలి అని అనిపించినప్పుడే మీరు ఆ భావాన్ని గౌరవిస్తారు. లేకపోతే మీరు గౌరవించరు. ఉదాహరణకి: మీరు ఎవరైనా అందంగా ఉన్నవారిని గౌరవిస్తున్నారంటే సూక్ష్మంగా మీరు ఆ విధంగా ఉండాలి అని కోరుకోవటమే. అదే విధంగా మీరు ఒక ధనవంతుణ్ణి గౌరవిస్తున్నారు అంటే, మీలో ఎక్కడో సూక్ష్మస్థాయిలో మీరూ ఆ విధంగా ఐశ్వర్యవంతులు కావాలి అనే కోరిక ఉంటుంది. మీరు దేన్నైనా గౌరవిస్తున్నారంటే అది మీ అంతరంగంలోకి ప్రవేశించింది అని అర్థం. ఎప్పుడైతే మీరు, జ్ఞానోదయమైన యోగీశ్వరులకి గౌరవంతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అంటారో దాని అర్థం మీరు జ్ఞానోదయాన్ని గౌరవిస్తున్నారు అని. అంతే కానీ, మీరు ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని భయం నుంచి కాపాడి మీకు సహాయం చేసే వ్యక్తికి నమస్కరిస్తున్నాను అని కాదు. మీరు ఒక రాజుకి నమస్కరించటం లేదు. మీకు ధనసహాయం చేసిన ధనవంతుడికి మీరు తల వంచి నమస్కరించటం లేదు. మీకు హేతువాదాన్ని, తర్కాన్ని, వేదాంతాన్ని చాలా చాలా మాటలని చెప్పే వ్యక్తికి వారు నమస్కరించటం లేదు. మీరు ఇక్కడ ఎవరినీ అనుసరించటం లేదు. మీరు కేవలం మీలో ప్రేరణ కలిగించగలిగే వ్యక్తికి మాత్రమే నమస్కరిస్తున్నారు. ఎవరైతే మీలో జ్ఞానోదయం అనే విత్తనాన్ని నాటుతారో, ఎవరైతే మీరు జ్ఞానోదయాన్ని సాధించే విధంగా మీకు సహాయం చేస్తారో అటువంటి వ్యక్తికి నమస్కరిస్తారు. ఎక్కడో ఒక చోట మీరు కేవలం ఆయన సమక్షంలో ఉండగలిగితే చాలు అని అనుకుంటారు. అది జరుగుతుంది. అదే అరిహంతుల సహజలక్షణం.
ఈ విషయం మీద చక్కని వ్యాఖ్యానం ఉంది. ఎప్పుడైతే మీరు అరిహంతుల సమక్షంలో, అంటే అత్యుత్తమచేతనస్థితిలో ఉన్న ఒక వ్యక్తి దగ్గర కూర్చుంటారో, మీకు తెలియకుండానే, మీ చేతనస్థితికి అర్థం కాకుండానే మీ అంతరంగం సర్వం ఒకే ఒక లక్ష్యం అయిన జ్ఞానోదయం పొందాలి అనే విషయంలో ఐక్యమైపోతుంది. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి మీరు అనుకున్నట్టుగా ఇక్కడ మీరు ఒక్క వ్యక్తి కాదు. మీ మెదడు, మీలోని తర్కం మిమ్మల్ని ఒక దిశ వైపుగా పిలుస్తూ ఉంటుంది. మీ కళ్లు మరొక వైపు లాగుతూ ఉంటాయి. మీ చెవులు మరొక వైపుగా లాగుతుంటాయి. ఈ వివిధదిశల్లో ఉన్న భాగాలని చేతనస్థితిలో ఒక్కటిగా చేసి, దాన్ని జ్ఞానోదయం వైపు మళ్ళించే శక్తి, ఆ స్థితినే సన్యాసం అంటారు. సన్యాసం అంటే నాలో మార్పు రావాలి అని చేసే ఒక గట్టి నిర్ణయం. అప్పుడు గురువులు మీలో ఆ మార్పు కలిగేలా చేయగలరు.
మీరు ఆ సన్యాసస్థితిని పొందినప్పుడు, దాన్ని మీరు ఎవరికీ వివరించలేరు. మీరు ఆ స్థితిని అనుభవించగలరు. ఆ స్థితిని నలు దిశలా ప్రకాశింపచేయగలరు. మీ నడకలో, మాటలో, మీ ప్రవర్తనలో అది స్పష్టంగా అందరికీ కనిపిస్తుంది. అప్పుడు మీరు అప్రయత్నంగా పెద్ద పెద్ద సమూహాలకి ఆకర్షణబిందువుగా మారగలరు. మీ నుంచి చెప్పలేనంత ప్రకాశం, శక్తి నలు దిశలా వ్యాపిస్తుంది. సన్యాసంతో తేజస్సు వస్తుంది. ఎందుకంటే సన్యాసం అంటే అంతరంగ సౌందర్యాలని ప్రతిబింబించటమే కాబట్టి. సన్యాసంలో ఉండే అసలైన పరిమళాలు తేజస్సు, నిత్యానందం.
ఏకత్వం - సన్యాసలక్షణం
'తపస్సు' లేదా సన్యాసం అంటే ఏకత్వంలో ఉండగలగటం. మిమ్మల్ని మీరు ఒకే వ్యక్తిగా మలచుకోవటమే సన్యాసం. మీరు నన్ను అడగవచ్చు. 'మేం ఇప్పుడు ఆ విధంగా లేమా? అని. మీరు ఒక్కసారి గమనించండి, అందరూ కూడా వేరు వేరు భాగాలుగా ఉంటారు కానీ ఒక్కటిగా కాదు. ఆ ఏకత్వం తప్ప, మన జీవితాల్లో అన్నీ ఉంటాయి.
మీరు మీ అంతరంగం లోతుల్లోకి చూడగలిగితే మీకు అర్థమౌతుంది. మీ అంతరంగంలో వందల కొద్దీ గొంతులు నిరంతరం మాట్లాడుతూనే ఉంటాయి. ఒక్క క్షణం మనం ఇది చేద్దాం అని అనుకోగానే వెంటనే మనం ఇది చేయవద్దు అనే ఆలోచన వస్తుంది. అలా చేయటం వల్ల జరిగే మంచి చెడు ఫలితాల్ని లెక్కలు కట్టిన తరువాత మనస్సు ఊగిసలాడటం మొదలుపెడుతుంది. ఈ విధంగా విడిపోయిన భాగాలుగా ఉన్న మనని ఒక్కటిగా చేయటమే జీవితపరమావధి. అదే భావాల్ని, ఆలోచనల్ని కలపగలిగే ఏకత్వం. మిమ్మల్ని మీ ఆలోచనల్ని ఒకటిగా చేయండి. మీ మనస్సులోని ఆలోచనలు, మీ ముఖంలోని భావాలు ఒక్కటే అన్న విషయాన్ని రూఢి చేసుకోండి.
మీరు గొప్ప గొప్ప యోగీశ్వరుల జీవితచరిత్రలు చదివి, వారి జీవితాన్ని అర్థం చేసుకోగలిగితే, వారిలోని గొప్పదనానికి భక్తి లేదా జ్ఞానం కారణం కాదు, ఏకత్వంలో ఉండగలగటమే అని అర్థమవుతుంది. వారు దేన్నైతే నమ్మారో అందులోనే ఆ సత్యంలోనే జీవించారు. వారిలోని ఏకత్వం చాలా దృఢంగా ఉంటుంది. వారు ప్రాణాన్నైనా వదులుతారు గాని వారిలోని ఏకత్వాన్ని కాదు.
చైతన్య మహాప్రభు ఒక గొప్ప జ్ఞానోదయమైన యోగీశ్వరుడు, ఆయన భక్తిగీతాలు పాడుతూ వీధివీధిలో తిరిగేవాడు. ప్రజలంతా తన గురించి ఏమనుకుంటున్నారో అని ఏ రోజూ అనుకోలేదు. అసలు వారిని ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆయనకి ఏ భావం మనస్సులోకి వస్తే దాన్ని అదే విధంగా స్వచ్ఛంగా వెల్లడి చేసేవాడు. ఆయన ఆ విధంగా వీధులలో తిరగటం నచ్చనివారు ఆయన్ను సముద్రంలోకి తోసేసారు. అయినా ఆయన తన విధానాన్ని వారి కోసం మార్చుకోలేదు. ఈ విధంగా ఉండగలగాలి అంటే త్యాగనిరతి ఉండాలి. ఏకత్వంలో జీవించాలి అంటే ధైర్యంతో దేన్నైనా వదులుకోగలగాలి.
అందుకే ఈ గొప్ప యోగీశ్వరులు వారి జీవితాలలో ఏది చేసినా, అది శాశ్వతమైన చేతనస్థితిని చేరే విధంగానే ఉంటుంది. ఎందుకంటే వారు ఏం చేసినా అది తమలో ఏకత్వాన్ని తీసుకురావడానికి చేసే ప్రయత్నమే అది. ఈ ఏకత్వం అనేది లోతైన భక్తిభావంతో, నిజాయితీతో చేసే ప్రయత్నమే. ఈ విధంగా తనని తాను ఏకత్వంలో నిలుపుకోవటానికి చేసే తీవ్రమైన ప్రయత్నమే సన్న్యాసం. మీ జీవితంలో లెక్క లేనన్ని విశేషాలు జరుగుతూ ఉంటాయి. వాటిని మీ ఏకత్వంలో అనుసంధానం చేయగలగటమే సన్న్యాసం. ఆ విధంగా కాకుండా, ఆ విషయాలు, విశేషాలు మిమ్మల్ని కుదిపేయగలిగితే, మీ నిశ్చలతని కుదిపేస్తే అప్పుడు మీకు మిగిలేది ఆవేదన, అవమానం. కాబట్టి ఏ విధంగా జీవించాలి అనేది పూర్తిగా మీ నిర్ణయం.
ఆదిశంకరాచార్యులు భారతదేశంలోనే ఒక గొప్ప యోగీశ్వరుడు, జ్ఞానోదయం పొందిన గురుదేవులు. ఆయన చిన్నతనంలో సన్న్యాసం తీసుకోవాలా, వద్దా అనే అయోమయంలో ఉంటాడు. ఆయన తన తల్లి అనుమతితో ఇల్లు వదిలి వెళ్లాలి అని నిర్ణయించుకుంటాడు. కానీ ఆమెకి ఆయనని పంపించటం ఇష్టం లేదు. ఒక రోజు శంకరాచార్యులు నదిలో స్నానం చేస్తుండగా, ఆయన తల్లికి రక్షించు అని పెద్దగా అరుపులు వినిపిస్తాయి. అది తన కుమారుడి ఆర్తనాదంగా గుర్తించి, ఆమె పరుగుపరుగున నది ఒడ్డుకి వస్తుంది. నదిలో శంకరాచార్యుల కాలు మొసలి పట్టుకొని లాగుతూ ఉంటుంది. ఆ బాలుడు మొసలి నుంచి తప్పించుకోవటానికి తన ప్రయత్నం తాను చేస్తుంటాడు.
అకస్మాత్తుగా అతనికి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. వెంటనే ఆ బాలుడు తల్లితో ‘అమ్మా! నేను సన్న్యాసం తీసుకోవటానికి నీవు అనుమతినిస్తే, ఈ మొసలి బారి నుంచి నేను బయటపడి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను’ అని గట్టిగా అరుస్తూ చెబుతాడు.
అతని తల్లి ఆశ్చర్యపోయి, ఏ విధంగా ఇది జరుగుతుంది అంటుంది. అప్పుడు శంకరాచార్యులు తల్లితో, ‘వేదాల ప్రకారం నేను ఆశ్రమానికి వెళితే, నేను తిరిగి కొత్త జన్మ తీసుకున్నట్టే. నీవు సన్న్యాసానికి నాకు అనుమతిని ఇస్తే, భగవంతుడు తిరిగి కొత్త జీవితాన్ని ఇవ్వవచ్చు కదా’ అంటారు.
ఈ స్థితిలో అతని తల్లి పూర్తిగా అసహాయురాలుగా ఉండిపోతుంది. ఆమె వెంటనే మనస్సుని దృఢపరచుకొని, తన కుమారుడు చనిపోవటం కంటే సన్న్యాసిగానైనా జీవించటం మంచిది అనుకుని అతనికి అనుమతిని ఇస్తుంది. వెంటనే మొసలి శంకరాచార్యులని వదిలివేస్తుంది. శంకరాచార్య ఆనందంతో తల్లి దగ్గరకి పరుగుపరుగున వెళతాడు. ఆయన ఆ నిమిషంలో సత్యం అనుకున్నదానిలోనే జీవించాడు. అది పని చేసింది. చూడండి, ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి.
సత్యాన్ని గురించి ఆలోచించటం
సత్యాన్ని మాట్లాడటం
సత్యంలో జీవించటం
మొదటి రెంటింటినీ అనుసరించటం చాలా సులభం. కానీ మూడవది, ఎప్పుడూ సత్యంలో జీవించటం చాలా కష్టం. అది చాలా అరుదైన విషయం. సత్యం అని అనుకున్నదాని ప్రకారం ధైర్యంగా జీవించగలగటమే సన్న్యాసం. మనం సత్యాన్ని మాట్లాడటానికి ప్రాముఖ్యాన్ని ఇస్తాం. కానీ అంత కంటే గొప్పది సత్యంలో జీవించటం. మీరు ఎప్పుడైతే సత్యంలో జీవించగలుగుతారో అప్పుడు మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది. ఇందులో ఉండే చక్కని విశేషం అదే.
మీరు నా దగ్గరకి ఏదైనా ఒక సమస్యతో వస్తే, కొన్ని సార్లు నేను మిమ్మల్ని ఓదార్చి, సరేలే ఇది పరవాలేదులే అని చెబుతాను. అర్ధం చేసుకోండి; మీరు నా దగ్గరకి ఒక సమస్యతో వచ్చారు అంటేనే మీరు ఏకత్వంలో జీవించలేకపోతున్నారు, ఆ సమస్యని దాటలేకపోతున్నారు అని అర్ధం. అందుకే నేను మిమ్మల్ని ఓదార్చాలి. దేన్నైనా పోగొట్టుకోవచ్చు కాని ఏకత్వాన్ని కాదు. ఏకత్వంతో మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే, మీరు ఉన్నతస్థితికి చేరగలరు. అప్పుడు మీ అచేతనస్థితిలోని మనస్సు మీ జీవితంలో జరగగలిగిన అతిశుభకరపరిణామం మీరే అని నమ్మటం ప్రారంభిస్తుంది. అప్పుడు స్వర్గద్వారాలు తెరచుకుంటాయి.
మీరు ఏకత్వంలో ఉంటే కపటజీవితాన్ని వదిలేయగలుగుతారు. కృత్రిమ (కపట) జీవితం అంటే మీరు రానిదాన్ని మీరు అని నమ్మటమే. ఇది చాలా విధాలుగా చాలా చోట్లలో దాగి ఉంటుంది. అందుకే ఎదుటివారికి మీ నిజమైన మీరు కనపడరు. మీ లోపలి వివిధభాగాలు ఒకదాన్ని ఒకటి మించాలి అని చూస్తుంటాయి. అదే మిమ్మల్ని ఒక కృత్రిమవ్యక్తిలా తయారుచేస్తుంది. మీ లోపల ముక్కలుగా అయిపోయిన వేరు వేరు భాగాలతో పోరాడి గెలవటం చాలా సులభం. మీరు ఎదుటివారితో పోరాడి గెలిస్తే మీరు వీరుడు అని చెప్పవచ్చు. మీతో మీరు పోరాడాలి అంటే చాలా ధైర్యం కావాలి. మీరు మీతో అలసిపోయేవరకు ఆ పోరాటాన్ని ప్రారంభించరు. ఎందుకంటే మీరు అలసిపోయాక మాత్రమే పోరాటం అవసరం అని తెలుసుకోగలుగుతారు.
ఎప్పుడైతే మీరు సంపూర్ణులుగా, ఏకత్వంతో ఉండగలరో, అప్పుడు మీ గురించి మీరు అసలు నిజాలని మొట్టమొదటిసారిగా తెలుసుకోగలుగుతారు. మీరు ఇంత వరకూ వేసుకున్న ముసుగులని వదిలివేస్తారు. మీరు మరింత స్పష్టతలో స్వచ్ఛంగా ఉండగలుగుతారు. మీరు అకస్మాత్తుగా మీరు అనేదాని వల్ల ఎన్ని పోగొట్టుకున్నారో తెలుసుకుంటారు. సన్యాసం అంటే ఆ స్వచ్ఛతతో ఉండటమే. స్వచ్ఛతతో ఉండటం అంటే మీలోని నిజమైన మిమ్మల్ని వ్యక్తం చేయటమే కాని మీరు మానసికంగా తెచ్చి పెంచిన వ్యక్తిత్వంతో కాదు. మీ లోపల మీరు భాగాలుగా విడిపోయి ఉంటే అది వ్యక్తిత్వం అవుతుంది. ఆ విధంగా కాకుండా ఆ భాగాలన్నీ ఏకత్వంలో ఉంటే మీరు సంపూర్ణత్వంలో ఉంటారు, అదే అసలైన మీరు. ఈ సంపూర్ణత్వాన్ని మీరు తెలుసుకోగలరు. అదే వ్యక్తిత్వం అయితే సంఘం చేత అది మీలో నిర్మితమైన ఒక భాగం.
ఇక్కడ గురువు మీ లోపల ఒక చక్కని ప్రదేశాన్ని సృష్టిస్తారు. అక్కడ మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉండదు. అక్కడ మీరు పూర్తి స్వేచ్ఛలో ఉండవచ్చు. అక్కడ కేవలం అర్ధం చేసుకోవటం ద్వారా మీలో మార్పుని సాధించవచ్చు.
బుద్ధుడు తన శిష్యులకి ఎప్పుడూ ఒక విషయం చెబుతుండేవాడు. మీరు సన్యాసం తరువాత మాత్రమే మీ జీవితాన్ని లెక్కించండి, అని.
సన్యాసం అంటే అంతిమద్వారత్వం నన్ను ఒకసారి ఒక వ్యక్తి ఈ విధంగా అడిగాడు, సన్యాసం లేదా బ్రహ్మచర్యదీక్ష తీసుకుంటే జ్ఞానోదయం కలుగుతుందా? అని. అది మిమ్మల్ని జ్ఞానోదయం వైపు తీసుకువెళుతుందా లేదా అనేది తరువాత విషయం. ఆ దీక్ష పట్ల, ఆ దీక్షని మీరు అమలుచేస్తూ ఒక నెల రోజులు గడిపిన మీదట మీకు అంతు లేని గౌరవం ఏర్పడుతుంది, అది చాలు, దీన్నే ఆత్మసాధన అంటారు. అంటే సాధ్యం కాని పనిని విజయవంతంగా పూర్తి చేయటం, ఇదంతా ఏమిటంటే, ఇది నీకు సాధ్యం కాదు అని నీ మనస్సు చెప్పిన పనులని చేయటమే. ఉదాహరణకి నిప్పుల గుండం మీద నడవడం వంటివి. సాధారణంగా మీరు నిప్పుల గుండం మీద నడవలేరు అని మీ మనస్సు పదే పదే చెబుతుంది. కాని మీరు అలా నడవగలిగినప్పుడు మీ మీద మీకు చాలా గౌరవం పెరుగుతుంది. అప్పుడు మీరు సంపూర్ణస్థితికి రాగలరు. ఏకత్వం లేదా సంపూర్ణత్వం అనే విషయాన్ని మీరు రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు.
మొదటిది : మీమనస్సులో పోరాడే వివిధభాగాలని ఏకం చేయటం. చూడండి, ఊగిసలాడే మనస్సుతో జీవితంలో చాలా భాగం వృథా అవుతుంది. మీరు ఏదో ఒక మార్గాన్ని అనుసరించగలిగితే చాలు మీరు సాధించగలరు. ఉదాహరణకి బెంగళూరు రావడానికి రెండు మార్గాలు ఉన్నాయనుకోండి. ఒక దారి 30 మైళ్ళు మరొకటి 30,000 మైళ్ళు ఉన్నాయనుకోండి, మీరు ఈ రెంటిలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలా అని ఊగిసలాడుతున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఒక దారిలో కొంత దూరం వెళతారు, ఆ తరువాత మీ మనస్సు మార్చుకుంటారు. అప్పుడు వెనక్కి వచ్చి మరొక మార్గంలో కొంత దూరం వెళతారు. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఎప్పటికీ బెంగళూరు చేరలేరు, కనీసం మీరు 30,000 మైళ్ళు ఉన్న దారి అయినా ఎంచుకుంటే ఎప్పటికో అప్పటికి బెంగళూరు చేరుతారు, అలా కాకుండా రెండు దారుల మధ్య మనస్సు ఊగిసలాడుతుంటే 30 సంవత్సరాలైనా బెంగళూరు చేరలేరు.
మీరు తప్పు దారి ఎంచుకున్నా మీరు ఏకత్వంతో ముందుకు వెళ్ళగలిగితే మీరు త్వరలోనే సరైన మార్గంలోకి రాగలుగుతారు. ఏది సాధించాలి అనుకున్నారో అది సాధిస్తారు. స్పష్టంగా అర్థం చేసుకోండి ఈ భూమి మీద రెండు రకాల మనుషులు ఉన్నారు. తప్పు మార్గంలో వెళ్ళేవారు, సరైన మార్గంలో వెళ్ళేవారు. ఏకత్వంతో, పూర్ణత్వంతో జీవించేవారు, చాలా భాగాలుగా విడిపోయి జీవించేవారు. అంతే. కాబట్టి ఒక వ్యక్తిని కొలవాలి అంటే అతను వెళ్ళే మార్గం కొలమానం కాదు. అతను ఏకత్వంతో జీవిస్తున్నాడా లేక ముక్కలుగా జీవిస్తున్నాడా అన్నదే కొలమానం. ఏకత్వంతో ఉంటే మీరు నమ్మేదానికి శక్తిని ఇస్తుంది.
రెండో విషయం : బయటి ప్రపంచవిషయాలు మీపై ప్రభావాన్ని చూపి మిమ్మల్ని నిర్వీర్యం చేయకూడదు. ఇది కూడా పూర్ణత్వానికి ఒక గుర్తు. మన అంతరంగంలోని అయోమయాలు కాని, మన బయటి ప్రపంచవిషయాలు కాని మనని బలహీనుల్ని చేయకూడదు. పూర్ణత్వంతో జీవించిన వ్యక్తి బయటి రోడ్డు మీద మరణించినా తాను సంపూర్తిగా జీవించాను అనే తృప్తితో మరణిస్తాడు. ఏ వ్యక్తి అయితే వివిధభాగాలుగా (ముక్కలు ముక్కలుగా) జీవిస్తాడో, అతను స్టార్ హాస్పిటల్లో మరణించినా అసంతృప్తితో మరణిస్తాడు. ఒక వ్యక్తి ఎంత నాణ్యమైన జీవితాన్ని గడిపాడు అనే విషయాన్ని కొలవాలంటే అతను జీవితం అంటే ఏది అని అనుభవపూర్వకంగా అనుకున్నాడో దానికి అంత అనుగుణంగా జీవించాలి, ఉదాహరణకి ఒక ఎతిస్తు (దేవుడిని నమ్మని వ్యక్తి) నిజమైన, శక్తి వంతమైన, ఎతిస్తులా జీవిస్తే తప్పు లేదు. అతను సాధించగలడు. ఎందుకంటే అతను బలంగా నమ్మే విషయంలోని శక్తి అతణ్ణి లోతుల్లోకి తీసుకువెళుతుంది. అలా శోధిస్తూ వెళ్ళి ఒక రోజు అంతిమసత్యాన్ని తెలుసుకోగలుగుతాడు.
మనస్సుని ఏకత్వంలో ఉంచటమే జీవితపరమావధి. మీరు మాట్లాడాలనుకుంది ఏది మంచి అని మీకు అనిపిస్తే అదే చేయాలి అని నిర్ణయించుకోండి, అప్పుడు మీలో అద్భుతమైన స్పష్టత వస్తుంది. అది మీ అంతరంగప్రపంచంలో బయటి ప్రపంచంలో ఉంటుంది.
వివేకానందుడు తను జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటాడు. ఆయన గురుదేవులైన రామకృష్ణ పరమహంస తన మిషన్ బాధ్యతలు వివేకానందుని మీద వదిలి మరణిస్తాడు. ఆ కుటుంబానికి ఉన్న ఒకే ఒక ఆశ వివేకానందుడు. ఆయన తన కుటుంబాన్ని కాపాడటం, ఈ ప్రపంచాన్ని కాపాడటం అనే ఈ రెండు విషయాల మధ్య ఉంటాడు. ఆయన మాట్లాడుతున్న మిషన్ (సంస్థ) గురించి ఎవరూ పట్టించుకోరు. ఆయన ఈ సందర్భంలో చాలా చక్కగా చెబుతారు; ఒక బాలుడి ఊహలని ఎవరూ అర్థం చేసుకుంటారు? వివేకానందుడు నిజంగానే బాలుడు. ఆ కొద్ది రోజులని ఆయన 'ఊహించలేని నరకంగా' వర్ణిస్తాడు. ఆయన మరి కొంత మంది యువకులతో ఉంటాడు. వారి దగ్గర డబ్బు ఉండదు. కాని వారి దగ్గర ఉంది ఆ ఏకత్వలక్షణం. వారు దేన్ని నమ్మారో, ఏవిధంగా జీవించాలి అనుకున్నారో అదే విధంగా, వారి గురుదేవులు చెప్పిన విధంగా మాత్రమే జీవించారు. పది సంవత్సరాల తరువాత వివేకానందుడు ఈ విధంగా చెబుతాడు - 'పది సంవత్సరాల క్రితం గురుదేవుల శతజయంతి ఉత్సవాలు చేయటానికి నేను 100 మందిని తీసుకురాలేక పోయాను. ఇప్పుడు ఏభై వేల మంది ఉన్నారు.'
సన్న్యాసం అంటే అచేతనస్థితి చేతనస్థితిని మూసేయకుండా ఉండగలగాలి అని తీసుకునే ఒక బలమైన నిర్ణయం. అంతే కాదు సన్న్యాసం అంటే చేతనస్థితిలో, గురుదేవుల మాటల ప్రకారం, దృఢంగా స్థిరపడగలగటమే.
వివేకానందుడిని చాలామంది 'ఆ సమయంలో నీవు ఏ విధంగా నీ కుటుంబాన్ని నిరాదరిస్తూ వదిలేయగలిగావు' అని అడిగారు. వారికి వివేకానందుడు చాలా చక్కని జవాబు ఇచ్చాడు, రామకృష్ణ పరమహంస బోధలు భారతీయులకి, అదే విధంగా ప్రపంచంలో ఉన్న ఎందరినో వారిలో వివేకం మేల్కొలిపేలా చేస్తాయి అని నమ్మాను. ఆ నమ్మకంతో కొంత మంది బాధపడినా పరవాలేదు కాని ఈ ప్రపంచంలో ఆ బోధలు, ఆ భావాలు నశించిపోకూడదు అని తెలుసుకున్నాను. ఒక తల్లి, ఇద్దరు సోదరులు మరణించగానే ఏం జరుగుతుంది? అది ఒక త్యాగమే. అది జరగనీయండి. త్యాగం లేకుండా ఏ గొప్ప విషయమూ జరగదు. హృదయానికి గాయం కావాలి. రక్తం చిందే ఆ హృదయాన్ని భగవంతుని పీఠం మీద అర్పించాలి. అప్పుడు మహోద్భుతాలు జరుగుతాయి.
అదే పూర్ణత్వం అంటే. అదే భాగాలు కాని ఒక వ్యక్తి ఏకత్వం. అంతే కాదు, వివేకానందుడు తన కుటుంబాన్ని నిరాదరించాడు, వదిలేసాడు అని మాట్లాడేవారికి కొన్ని నిజాలు తెలియవు. ఆయన తన కుటుంబసభ్యులకి కనీససావసరాలు తీర్చేవాడు. ఆ కుటుంబం ఎదుర్కొన్న కొన్ని సమస్యలకి ఆయన కోర్టుకి కూడా వెళ్ళేవాడు.
ఒక చిన్న కథ : జపాన్ లో సివిల్ వార్ జరిగే రోజులలో, సైన్యం ఒక చిన్న పట్టణంలోకి ప్రవేశించి దాన్ని అధీనం చేసుకున్నారు. అక్కడ ఒక గ్రామంలో, సైన్యం వచ్చే లోపు అందరూ పారిపోతారు కాని ఒక జెన్ మాస్టరు (బౌద్ధగురువు) మాత్రం ఉండిపోతాడు. సైన్యాధికారికి ఈ గురువు గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అతను ఆ గురువుని కలవటానికి గుడికి వెళతాడు. బౌద్ధగురువు ఆ సైన్యాధికారిని కనీసం పట్టించుకోలేదు, గమనించలేదు. సైన్యాధికారికి చాలా కోపం వస్తుంది. ఆయన మిలిటరీ అధికారి, అతన్ని అందరూ చాలా గౌరవిస్తారు. అటువంటి గౌరవానికి అతను బాగా అలవాటు పడ్డాడు. అతను కత్తి తీసి, 'ఓ! మూర్ఖుడా! నీ ముందు ఎవరు నిలబడ్డారో తెలుసుకోలేక పోతున్నావా? కనురెప్పపాటులో నీ నుంచి ఈ కత్తి దూసుకుపోయేలా చేసే వ్యక్తి నీ ముందు ఉన్నాడు!' అని గట్టిగా అరుస్తూ అంటాడు. అతని మాటలకి బౌద్ధగురువు ప్రశాంతంగా సైన్యాధికారి వైపు చూస్తూ, 'నీవు ఎవరి ముందు నిలబడ్డావో తెలుసా. నీ ముందు ఉన్న వ్యక్తి కనురెప్ప పాటులో నీ నుంచి దూసుకుపోగలడు' అని జవాబు ఇస్తాడు.
ఏకత్వంలో ఉన్న శక్తి మీకు సంపూర్ణస్వేచ్ఛని, పరమానందాన్ని ఇస్తుంది. అటువంటివారికి బయటి ప్రపంచంలో, అంతరంగ ప్రపంచంలో ఎక్కడా భయం అనేది ఉండదు.
జీవితం జ్ఞానోదయం పొందటానికే
జీవితం ఏకైకలక్ష్యం జ్ఞానోదయం పొందటమే. మీకు చాలా ఇతరలక్ష్యాలు ఉండి ఉండవచ్చు. అవన్నీ కూడా జ్ఞానోదయం పొందాలి అనే లక్ష్యానికి ఉన్న వేరు పేర్లు, రూపాలు. తెలిసి కాని, మీకు తెలియక కాని అవన్నీ కూడా జ్ఞానోదయం పొందాలి. అనే లక్ష్యాలే. అదే విధంగా మీరు దేన్నైతే అన్వేషిస్తున్నారో అది సన్న్యాసమే. అయితే మీకు ఆ విషయం తెలియదు. అదే అసలు సమస్య.
మీరేమనుకుంటారంటే మీ జీవితలక్ష్యం చాలా డబ్బు సంపాదించటం లేదా మంచి సంబంధబాంధవ్యాల్ని అభివృద్ధి చేసుకోవటం ఇలా ఉంటాయి. కాని అసలు సత్యం ఏమిటంటే, ఎవరైతే డబ్బు సంపాదన కోసం చూస్తున్నాడో అతను నిజానికి వెతికేది జ్ఞానోదయం కోసం మాత్రమే. చూడండి, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి డబ్బు, రెండవది కీర్తి, ప్రతిష్ఠ. కీర్తిప్రతిష్ఠలంటే మంచి సంబంధబాంధవ్యాలు కలిగి ఉండటమే. డబ్బు, కీర్తి ప్రతిష్ఠలు అంటే మంచి సంబంధబాంధవ్యాలు కలిగి ఉండటమే. డబ్బు, కీర్తిప్రతిష్ఠలు లేదా మంచి సంబంధబాంధవ్యాల ద్వారా మీరు ఏది పొందుతాను అనుకుంటారో, ఏ అనుభవాన్ని పొందాలని వీటి గురించి తాపత్రయపడతారో ఆ అనుభవం మీకు జ్ఞానోదయం ద్వారా మాత్రమే కలుగుతుంది. అందుకే మీకు జ్ఞానోదయం అయ్యేవరకూ మీ ఆత్మ నిశ్చలంగా ఉండలేదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత మంచి బాంధవ్యాలు ఉన్నా కూడా మీకు సంపూర్ణమైన తృప్తి అనేది ఉండదు. ఎప్పుడైతే ఐశ్వర్యం, మంచి సంబంధబాంధవ్యాలు మీకు తృప్తిని ఇవ్వవో ఆ స్థితిని 'డిప్రెషన్ ఆఫ్ సక్సెస్' అని చెప్పవచ్చు. అంటే విజయాలు తెచ్చిన నిరాశ, క్రంగుబాటు అని అర్థం. మీరు మీ వృత్తి వ్యాపారోద్యోగాలలో అత్యున్నతస్థాయికి వెళ్లాక జరిగేది ఇదే స్థితి. నేను జీవితంలో సాధించాలి అని అనుకున్నవన్నీ సాధించాను. దేని కోసం? నేను ఏది సాధించాలి అని చేశానో దాన్ని సాధించలేకపోయాను. నేను అసంతృప్తిగా ఉండిపోయాను. అని అంటుంటారు. అర్థం చేసుకోండి; మీరు ఇలా అనుకుంటున్నారు అంటే అర్థం, ఇది మీ ఆత్మ నుంచి వచ్చిన పిలుపు. అది కోరుకునేది కేవలం జ్ఞానోదయస్థితిని మాత్రమే. ఆ పిలుపుకి మీ నుంచి వచ్చే సమాధానం సన్యాసం.
జీవితంలో కావలసిన అసలు లక్ష్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటమే మనకి ఉండే అన్ని సమస్యలకి మూలకారణం. సన్యాసం అంటే ఆ అసలు లక్ష్యాన్ని గుర్తించి దాంతో మీరు అనుసంధానమై, ఆ స్థితిని సాధించటమే. మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న మీ జీవితలక్ష్యం ఏదైనా కావచ్చు, అది ఐశ్వర్యం లేదా మంచి సంబంధాలు ఏదైనా సరే, కాని మీ చివరి లక్ష్యం మాత్రం పరమానందస్థితిని పొందటమే. జీవితంలో అంతకు మించి మరే లక్ష్యం లేదు.
ఈ ప్రపంచంలో రెండు రకాలవారు ఉన్నారు. ఒక రకం వారికి పరమానందస్థితి జ్ఞానోదయస్థితి అనేవి తెలుసు. అదే విధంగా ఆ స్థితికి చేరే మార్గం కూడా తెలుసు. దాని ప్రకారం వారు జీవిస్తారు. రెండవరకం వారికి పరమానందం, జ్ఞానోదయం అనే మాటలు తెలియవు. దాన్ని పొందే దారే తెలియదు. అందుకే వారు చుట్టూ తిరిగి గమ్యం చేరుతారు. ఇందులో మొదటి రకం వారు సన్యాసులు, రెండవ రకం వారు సంసారులు.
మీరు బెంగళూరు వెళ్లాలి అని నిర్ణయించుకొని మైసూర్ రోడ్డులో నిలబడ్డారనుకోండి. మీకు దగ్గర దారి తెలిస్తే 30 మైళ్ళు ప్రయాణం చేసి బెంగళూరు చేరుతారు. ఆ దారి తెలియకపోతే మీరు 30,000 మైళ్ళు ప్రయాణం చేసి బెంగళూరు చేరుతారు. ఎవరికైతే దగ్గర దారి తెలియదో వారు చుట్టూ తిరుగుతూనే ఉంటారు.
జ్ఞానోదయం కాకుండా మరే లక్ష్యమైనా అది మిమ్మల్ని మధ్యలో ఆపేస్తుంది. ఆ లక్ష్యం మీకు సంపూర్ణమైన తృప్తిని ఇవ్వదు. జ్ఞానోదయం పొందాలి అనే లక్ష్యశక్తి మాత్రమే ఎప్పటికీ మీతో ఉండగలుగుతుంది. ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడే మీలో పరిపూర్ణమైన తృప్తి కలుగుతుంది.
మీరు ఈ శరీరంలో 70 లేదా 80 సంవత్సరాలు ఉంటారు. అవును కదా? ఆ 70 లేదా 80 సంవత్సరాల్లో మీరు మీ చేతనస్థితిని ఉన్నతస్థాయిలో లేదా తక్కువ స్థాయిలో ఉంచవచ్చు. మీరు ఈ రెండు విధాలుగా ఆడుకోవచ్చు. మీ చేతనస్థితిని ఉన్నతస్థాయిలో లేదా తక్కువ స్థాయిలో ఉంచుకోగల స్వేచ్ఛ మీకు ఈ 70 లేదా 80 సంవత్సరాల్లో ఉంటుంది. కొంచెం లోతుగా అర్థం చేసుకోండి; మీరు ఏదైనా ఒక బహుమతిని పొంది దాన్ని వృథా చేసుకుంటే పరవాలేదు. కానీ మీరు చేతనస్థితి అనే బహుమతిని పొంది దాన్ని వృథా చేసుకుంటే అది ఎంతో పెద్ద నష్టం అని తెలుసుకోండి. అది ఎప్పటికీ తీరని నష్టం.
ఎన్నో గాజు పలకలు ఉంటాయి. కాని కొన్ని మాత్రమే వాటిలో సూర్యకాంతిని ప్రతిబింబించే విధంగా అమర్చబడతాయి. అదే విధంగా కొన్ని కోట్ల జీవులు ఈ భూమి మీద నివసిస్తున్నాయి. కానీ అవి అన్నీ విశ్వచేతనస్థితిని తమలోకి తీసుకోగలిగి, దాన్ని ప్రతిబింబించేయగల శక్తితో లేవు. కేవలం మనిషికి మాత్రమే విశ్వచేతనస్థితిని తనలో నింపుకొని దాన్ని నలు దిశలా వెల్లడి చేయగల శక్తి ఉంది. కేవలం విశ్వచేతనశక్తి ప్రకాశం మనపై పడటం మూలానే మనం ఎంతో అదృష్టవంతులం అవుతున్నాం. ఆ అవకాశం భూమి మీద మనం పొందగలిగే అత్యుత్తమస్థితి. మనిషి అదృష్టవంతుడు. అతను శక్తిని ప్రతిబింబించగల ఒక గాజు పలక. అతనికి ఆ ప్రకాశాన్ని సరైన పద్ధతిలో తీసుకోగల వివేకం ఉంది. అతను విశ్వచేతనస్థితి తనలో ప్రకాశించే విధంగా తనను తాను మలుచుకోగలడు. కేవలం మానవుల చేతనస్థితికి మాత్రమే అత్యున్నతవికాసం జ్ఞానోదయస్థితిని పొందగల అవకాశం ఉంది.
నేను సామాన్యంగా ఏ విషయాన్నీ ఎవరి మీదా బలవంతంగా ఆపాదించను. ఏ విషయంలోనూ, నేను ఎవరినీ బలవంతం చేయను. కానీ జన్మలో అత్యున్నత అవకాశాన్ని వదులుకుంటూ, ఆ అవకాశాన్ని వృథా చేస్తున్నవారిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చుట్టూ ఉన్న అందరినీ గమనిస్తుంటే ఎలా ఉంటుందంటే, కళ్ళకి గంతలు కట్టుకొని అడవిలోకి వెళ్ళినవారిలా కనిపిస్తారు. ఎవరిదో అహంకారాన్ని తృప్తిపరచటానికి మీరు పరుగులు తీస్తూ, వృత్తాల్లో తిరుగుతూ ఉంటారు. కనీసం మీ అహాన్ని తృప్తి పరచటానికి మీరు పరుగులు తీయటం లేదు. మీరు ఎవరిదో అహాన్ని తృప్తి పరచటానికి పరిగెడుతున్నారు. మీ జీవితం ఈ విధంగా గడిచిపోతుంది. మీరు దేని కోసం పరిగెడుతున్నారో ఎందుకు పరిగెడుతున్నారో మీకు తెలియటం లేదు.
మీరు అద్భుతమైన మానవశరీరాన్ని పొందగలిగారు. దీంతో మీరు అత్యుత్తమచేతనస్థితిలోకి వెళ్ళగల శక్తి వస్తుంది. ఈ గాజు పలక సూర్యకాంతిని వెదజల్లటం ప్రారంభించింది. ఇప్పుడు ఆ గాజు పలక చేయవలసింది కేవలం ఆ సూర్యకాంతి వచ్చే మూలాన్ని కనుగొని, దాన్ని చూడగలగటమే. ఆ విధంగా అసలు మూలాలని కనుగొని అందులో ఐక్యమైపోవటమే. దాన్నే నేను జ్ఞానోదయం అంటాను. జ్ఞానోదయం అంటే వ్యక్తిగతమైన చేతనస్థితి విశ్వచేతనస్థితిలో కలసిపోగలగటమే. అదే గనక జరిగితే జన్మ తీసుకున్న లక్ష్యం, గాజు పలక లక్ష్యం నెరవేరినట్లే. అప్పుడు ఆ గాజు పలక పగిలిపోయినా నష్టం లేదు. కానీ ఆ గాజు పలకని దేనికోసమైతే సృష్టించారో దాన్ని సాధించకుండా పగిలిపోతే అది ఎప్పటికీ గొప్ప నష్టమే. మానవశరీరం జ్ఞానోదయాన్ని పొందకుండా మరణిస్తే, అంతకు మించిన నష్టం మరేదీ లేదు.
సన్యాసం దీనికి ఒక మార్గం. సన్యాసం జీవితానికి అంతం కాదు, అది జీవితానికి ప్రారంభం. అది జ్ఞానోదయసాధనకి ప్రారంభం. అదొక్కటే జీవితానికి ఉండే శాశ్వతమైన లక్ష్యం.
నిబంధన విధించటమే నేరం
జ్ఞానోదయమే జీవితలక్ష్యం అయినప్పుడు మనం ప్రస్తుతం ఎక్కడ ఆగిపోయాం? ఎక్కడ మనం తప్పు దారిలో వెళుతున్నాం? అర్థం చేసుకోండి; అసలు సమస్య సరైన లక్ష్యాన్ని గుర్తించలేకపోవటమే. మీరు గుర్తించిన లక్ష్యం సరైందైతే మీరు సాధించినట్టే. మీ లక్ష్యం సరైందైతే మీరు అందులో జీవిస్తున్నట్లే.
సన్యాసం అంటే మీ జీవితలక్ష్యం పట్ల స్పష్టతని సృష్టించటమే. లక్ష్యాన్ని ఎందుకు తెలుసుకోలేరంటే వారికి దాని పట్ల స్పష్టత లేనందువల్ల ఎవరికైతే జీవితలక్ష్యం పట్ల స్పష్టత ఉంటుందో అటువంటి వారు జీవన్ముక్తులు. అంటే సంపూర్ణస్వేచ్ఛ (అంతిమముక్తి) లో జీవించేవారు. అటువంటివారు జీవితంలో ప్రతిక్షణం తమ చేతనస్థితిని కేవలం తమ జీవిత లక్ష్యం వైపు, మాత్రమే నిలుపుతారు.
మీపై ఉండే నిబంధనలు, ఆంక్షలే మీరు లక్ష్యాన్ని గుర్తించకుండా చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఒక స్వేచ్ఛాజీవిగా వచ్చారు. మీరు అప్పుడు పరమహంస. పరమహంస నిరంతరం పరమానందస్థితిలో స్వేచ్ఛగా ఎగురుతూ, సర్వసృష్టిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఆనందపారవశ్యంలో ఉంటుంది. మీరు ఈ భూమి మీదికి తెలియకుండా వచ్చి, హాయిగా ఎగిరి ఈ భూమి మీద స్థిరపడ్డారు. అదే సమస్య ఇక్కడ అలా స్వేచ్ఛగా వచ్చి వాలే పక్షుల్ని పట్టుకోవటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సంఘం ఆ స్వేచ్ఛాజీవిని దేశం, మతం, కులం, రంగు అనే చట్రాల్లో బిగించాలని చూస్తుంది.
మీరు ఈ భూమి మీదికి వచ్చిన ఒక మధురజీవి. అంతే కానీ మీరు హిందువుగా, ఇంజనీరుగా, ధనవంతుడుగా ఇక్కడికి రాలేదు. అర్థం చేసుకోండి. సంఘానికి గుమాస్తాలు, పనివారు కావాలి. సంఘానికి మీ చేతనస్థితి అవసరం లేదు. నిజానికి మీ తల్లిదండ్రులకి, మీ సంఘానికి మీలో చేతనస్థితి అనేది ఒకటి ఉంది అని తెలియదు. వారికి ఆ వివేకం లేదు. వారు నేర్చుకున్నదే మీకు నేర్పిస్తారు, అంతే.
మనిషి పైన ఉండే నిబంధనలు అనేవి మనిషికి అక్కర లేని బహుమతిగా తరతరాలుగా ఇవ్వబడ్డాయి. అవి మనిషికి అందుతున్నాయి. అందులో మొదటిది తల్లిదండ్రుల నిబంధనలు. ఆ తరువాత వచ్చేది సంఘపు కట్టుబాట్లు, అది పెట్టే ఆంక్షలు. ఈ రెంటింటి ఆధారంగా మీకు మీరు కొన్ని ఆంక్షల్ని, నియమాల్ని పెట్టుకుంటారు. అది మీ మీద మీరు విధించుకున్న నిబంధనలు. దీన్నే స్వధర్మం అంటాం. మన మీద ఇన్ని పొరలుపొరలుగా నిబంధనలు ఉన్నాయి కాబట్టి మనం సత్యాన్ని చూడలేకపోతున్నాం. మన జీవితలక్ష్యాన్ని తిన్నగా తెలుసుకోలేకపోతున్నాం. మనం మన జీవితలక్ష్యంలో జీవించలేకపోతున్నాం. ఈ నిబంధనల్లో చిక్కుకుపోయి మనమంటే ఎవరో మరిచిపోయాం. ఈ నిబంధనలు మనలో కొన్ని పరిమితుల్ని సృష్టిస్తాయి. ఈ లోపాలు, పరిమితులే మనం అని మనం నమ్మే విధంగా మనపై నిబంధనలు ఉన్నాయి.
చాలా నిబంధనలు, నియమాల్ని మన ప్రశాంతజీవనం కోసం సృష్టించారు. ఉదాహరణకి భావాల్ని సులభంగా పంచుకోవటానికి భాషని సృష్టించారు. భాష నేర్చుకోవటం తప్పు కాదు. కాని దాన్ని ఒక నియమంలా తీసుకొని, భాషే మీ జీవితం అనుకొని దాంతో మీకు దుఃఖాన్ని తెప్పించుకొని, ఎదుటివారికి సమస్యలు సృష్టించినప్పుడు భాష అనేది తప్పు అవుతుంది. అటువంటి మానసికదృక్పథం తప్పు. చాలా మంది భాష కోసం ప్రాణాల్ని త్యాగం చేశారు. అసలు భాష అనే నిబంధనే లేకపోతే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు కదా! అప్పుడు మానవచరిత్ర మరో విధంగా రాయబడి ఉండేది. నిబంధనలు, నియమాలు అనేవే మనుషుల్లో ఈ టెర్రరిజానికి కారణం. ఈ రోజుల్లో నిబంధనలు అనేవి ఏ విధంగా మనుషుల్ని విభజిస్తున్నాయంటే అది కొన్ని రాజకీయ పార్టీలు ఆధారంగా కూడా జరుగుతుంది.
మీకు ఒక విషయం చెబుతాను. ఎప్పుడైతే నిబంధన అనేది మీలో నాటబడుతుందో అప్పుడే యముడి నీడ మీ మీద పడినట్టే. ఆ పాశం కేవలం మీ మరణసమయంలోనే మీ మీద పడుతుంది అని అనుకోవద్దు. ఈ నిబంధనలు అనేవి అత్యధికమవ్వటమే అంతిమ మరణం, అంతే. మరణం అంటేనే నిబంధనలు అత్యున్నతస్థాయిలో మీ పైన ఉండటమే. ఎవరైతే నిబంధనలు, నియమాల్లో చిక్కుకొని ఉంటారో వారు ప్రతి నిమిషం మరణం వైపుగా సాగుతూ ఉంటారు. ఎవరైతే జ్ఞానోదయమైన యోగీశ్వరుని దగ్గర ఉంటారో వారు జీవితంలో ప్రతి నిమిషం స్వేచ్ఛ వైపుగా సాగుతూ ఉంటారు. అంటే ఒక రకం వారు యముడి వైపుగా ముందుకి సాగుతూ ఉంటే మరొక వర్గం వారు శివుని వైపుగా సాగుతూ ఉంటారు. నిబంధనలు అనేవి రోజురోజుకూ తగ్గుతూ ఉంటే మీరు శివుని వైపుగా ముందుకి సాగుతారు. అంటే నిబంధనల నుంచి మీరు క్రమంగా స్వేచ్ఛని పొందుతూ ఉంటారు.
సన్యాసం స్వీకరించటం ద్వారా, మొట్టమొదటిసారిగా మీరు మీ గతాన్ని వదిలేయాలి అని చేతనస్థితిలో నిర్ణయం చేస్తారు. గతాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. గతం అనేది మీకు బాగా పరిచయం. అందుకే మీరు జరిగిపోయిన భూతకాలాన్ని ఇష్టపడతారు. మనస్సుకి బాగా పరిచయమున్న విషయాల్ని ఇష్టపడుతుంది. సంఘం కూడా మీరు గతాన్ని మోస్తూ ఉండాలి అని నేర్పిస్తుంది. జరిగిపోయిన సంఘటనల ఆధారంగా సంఘం మీ లోపల అపరాధభావాన్ని నింపుతుంది. గతం అనేది మనకి అవసరం లేని ఏ మాత్రం ఉపయోగం లేని బరువు మాత్రమే. సన్యాసం అంటే గతం నుంచి పూర్తిగా బయటికి రావటమే. మీరు ఎప్పుడైతే గతాన్ని వదిలేసి కొత్త ప్రపంచం వైపు వస్తారో, ప్రారంభంలో మీరు రక్షణ లేని భావంలో ఉంటారు. సన్యాసం అంటేనే రక్షణ లేని స్థితి. ఎప్పుడైతే పూర్తి రక్షణ లేని స్థితిలో ఉంటారో, అప్పుడు పట్టుకొని ఉండటానికి ఆధారం ఏమీ ఉండదు. అప్పుడే భగవంతుడిని చూస్తారు.
నేను మీకు ఆధ్యాత్మికనామాలు ఎందుకు ఇస్తాను అని అనుకుంటారు? అవి మీకు మీ గతంతో సంబంధాన్ని తెంపివేస్తాయి. ఎవరైనా మిమ్మల్ని మీ పేరుతో పిలిస్తే, వెంటనే మీ చేతనస్థితి మిమ్మల్ని తన గుప్పిట్లోకి తీసుకుంటుంది. అప్పుడు మీరు దానికి స్పందించి జవాబు ఇస్తారు. మీ పేరు మీ అచేతనస్థితిలో లోతుగా నాటుకుపోయి ఉంది. మీ పేరు మీలో వెంటనే తెలుసుకునే తత్త్వాన్ని తెస్తుంది. మీరు ఒక పెద్ద క్లాసులో ఉన్నారనుకోండి. టీచర్ మీ పేరు పిలవగానే, మీరు నిద్రపోతున్నా, లేదు ఏదైనా ఆలోచనల్లో ఉన్నా ఉలిక్కిపడి వర్తమానంలోకి వస్తారు. అవును కదా! మీ పేరు మిమ్మల్ని మీ లోపల కేంద్రీకరింపచేయటానికి చాలా ఉపయోగపడుతుంది. నేను మీకు ఇచ్చిన కొత్త పేరు మీలో మానసికచైతన్యం తీసుకురావాలి అని పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. మీ లోపల ఒక కొత్త విధానం, కొత్తగా అర్థం చేసుకునే శక్తి వస్తాయి. పేరు మీ ఆధ్యాత్మికమార్గాన్ని కూడా సూచిస్తుంది. మీ సహజలక్షణం ప్రకారం ఈ పేరు మీలో మీ చేతనస్థితిలో అంతిమవికాసం కలిగేలా చేస్తుంది.
సన్యాసి అంటే వర్తమానంలోంటూ, వర్తమానంలో పని చేసేవాడు. తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తాడు. అతను ఫలితాల గురించి అసలు పట్టించుకోడు. ఫలితాలు వాటి జాగ్రత్తని అవి తీసుకుంటాయి. అతనికి కేవలం ఆ క్షణం గురించి మాత్రమే తెలుసు. మరేమీ తెలియదు. అందుకే అతను ప్రతిక్షణం సర్వాంతర్యామి నుంచి నేర్చుకుంటూ ఉంటాడు. అందుకే అతనికి ఒక సిద్ధాంతం, ఒక మతం అనేవి ఉండవు. సర్వసృష్టికి అనుగుణంగా దాంతో పాటు ముందుకి సాగటం, దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయాల్ని నేర్చుకోవటమే తెలుసు.
సూఫీ సామెత ఒకటి ఉంది. 'సూఫీ అనే వ్యక్తి ఈ క్షణం తాలూకు బిడ్డ.' సూఫీలు సాహిత్యంలో ప్రతి క్షణాన్ని శ్వాస అంటారు. సూఫీీలని శ్వాస అనుచరులు అంటారు. ఎందుకంటే వారు ప్రతి శ్వాసలో ఎంతో ఎరుకతో, చేతనస్థితితో జీవిస్తారు. వారి మాటల్లో ప్రతిక్షణంలో కొత్త సూఫీ జన్మిస్తుంటాడు. అదే సన్యాసంలోని అసలు భావం. నిరంతరం స్వచ్ఛమైన తాజాదనంతో ఉండటం ఈ క్షణంలో ఉండగలిగే వ్యక్తి ఈ క్షణం నుంచి చాలా నేర్చుకుంటాడు. అటువంటివారికి సర్వాంతర్యామి, సర్వసృష్టి, గురువు.
సూఫీ యోగి అయిన హసన్ మరణించే సమయంలో, ఆయనని ఒకరు 'నీ గురువు ఎవరు' అని ప్రశ్నిస్తారు.
ఆ ప్రశ్నకి సమాధానంగా 'నాకు చాలా మంది గురువులు ఉన్నారు. వారి అందరి పేర్లూ చెబితే నెలలు, సంవత్సరాల సమయం పడుతుంది. ఇప్పుడు అది సాధ్యం కాదు. నాకు మరణం అతిసమీపంలో ఉంది. నేను మీకు ముగ్గురు గురువుల గురించి చెబుతాను.
'మొదటి గురువు దొంగ. నేను ఒకసారి ఎడారిలో దారి తప్పాను. దగ్గరలోని ఒక గ్రామానికి చేరే సమయానికి బాగా రాత్రి అయిపోయింది. అన్ని మూసేసి ఉన్నాయి. నేను చివరగా ఒక వ్యక్తిని కలవగలిగాను. అతను ఒక ఇంటి గోడకి కన్నం వేస్తున్నాడు. అతణ్ణి నేను ఈ రాత్రికి ఎక్కడ ఉండవచ్చు' అడిగాను. ఆ వ్యక్తి 'ఈ సమయంలో అది చాలా కష్టం. నీకు ఒక దొంగతో ఉండటానికి అభ్యంతరం లేకపోతే నీవు నాతో ఉండవచ్చు' అన్నాడు.
'నేను ఆ వ్యక్తితో ఒక నెల రోజులు ఉన్నాను. ఆ వ్యక్తి ప్రతి రోజూ రాత్రి బయటికి వెళుతూ 'నేను నా పని మీద వెళుతున్నాను. నీవు విశ్రాంతి తీసుకో. నా కోసం ప్రార్థన చేయి' అని చెప్పేవాడు. అతను వెనక్కి తిరిగి వచ్చాక, 'నీకు ఏమైనా దొరికిందా' అని నేను ఆ వ్యక్తిని అడిగేవాడిని. అతను 'ఈ రాత్రి ఏమీ దొరకలేదు. భగవంతుని కృప ఉంటే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను' అనేవాడు. అతను ఎప్పుడూ సంతోషంగా, ఆశతో ఉండేవాడు. అతణ్ణి ఏ నాడూ నిరాశాస్థితిలో చూడలేదు.
'నేను చాలా సంవత్సరాలు తపస్సు (ధ్యానం) చేసేటప్పుడు, నాకు ఏమీ జరగలేదు. ఏ ఫలితం రాలేదు. నాకు చాలా సార్లు నిరాశ అనిపించేది. నేను చాలా సార్లు ఈ ఉపయోగం లేని పనిని ఆపేయాలి అని అనుకునేవాడిని. అప్పుడు అకస్మాత్తుగా నాకు ఆ దొంగ గుర్తు వచ్చేవాడు. అతను ప్రతి రోజూ రాత్రి చెప్పే మాటలు, భగవంతుని కృప ఉంటే, రేపు జరగవచ్చు అనే మాటలు గుర్తు వచ్చేవి.
'నా రెండవ గురువు ఒక కుక్క. ఒక రోజు దాహం తీర్చుకుందామని నది వైపు వెళుతున్నాను. నాతో పాటు ఒక కుక్క కూడా దాహం తీర్చుకోవటానికి వచ్చింది. ఆ కుక్క నదిలోకి చూడగానే దానికి అక్కడ ఇంకొక కుక్క కనపడింది. అది దాని నీడ మాత్రమే. అది తన నీళ్ళలో ఉన్న మరొక కుక్కని చూసి అది భయపడి అరుస్తూ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయేది. దానికి దాహం ఎక్కువగా ఉండి తిరిగి నీళ్ళ దగ్గరకి వచ్చేది. ఈ విధంగా కొంత సేపు గడిచాక ఇక దాహం తట్టుకోలేక ఆ నీళ్ళలోకి దూకింది. అందులో నీడ మాయమైపోయింది. ఈ సంఘటన చూసాక భగవంతుడు నాకు తన సందేశాన్ని ఈ రూపంలో పంపించాడేమో అనిపించింది. ఎంత భయం ఉన్నా మనం ముందుకి దూకేయాలి.
'నా మూడవ గురువు చిన్న బాలుడు. నేను ఒక పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లవాడు కొవ్వొత్తిని వెలిగించి దాన్ని మసీదులో పెట్టడానికి వెళుతున్నాడు. నేను ఆ అబ్బాయిని, నీవే కొవ్వొత్తిని వెలిగించావా? అని అడిగాను. అతను అవును అని అన్నాడు. అప్పుడు నేను ఆ అబ్బాయిని, 'ఈ కొవ్వొత్తిని వెలిగించని సమయం ఉంది, అదే విధంగా దాన్ని వెలిగించిన సమయం ఉంది. మరి ఆ మంట ఎక్కడి నుంచి వచ్చిందో చూపించగలవా!' అని అడిగాను.
అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా ఆ కొవ్వొత్తి మీద ఊదాడు. ఆ గాలికి దీపం ఆరిపోయింది. అప్పుడు ఆ అబ్బాయి నవ్వుతూ 'ఇప్పుడు దీపం వెళ్ళటం నీవు చూసావు కదా ! అది ఎక్కడికి వెళ్ళింది? చెప్పు' అన్నాడు. 'నాలోని అహంకారం చెదిరిపోయింది. నాలో ఉన్న జ్ఞానం సర్వం కొట్టుకుపోయింది. నాకు గురువు లేరు అన్న మాట నిజం. అలా అని నేను శిష్యుడిని కాదు అని చెప్పలేను. ఈ సర్వసృష్టిని నా గురువుగా అనుకున్నాను. నేను మేఘాలని, చెట్లని నమ్మాను. అవకాశం ఉన్న ప్రతి దాని నుంచీ పాఠాలు నేర్చుకున్నాను.'
'సన్న్యాసం అంటే చాలా ఆనందంగా ఈ క్షణం తాలుకు మార్గదర్శకత్వంతో, జ్ఞానోదయం దిశగా సాగిపోవటమే. మీరు చేయవలసింది కేవలం దానికి అనుగుణంగా స్వచ్ఛంగా విప్పారి ఉండటమే. సన్న్యాసి ఈ క్షణంలో సంపూర్ణవిరామంతో ఉండగలడు.
'రేపు కూడా ఈ రోజు మాదిరిగానే వస్తుంది. కాబట్టి నేటి మీద మాత్రమే ఎందుకు ఏకాగ్రత పెట్టకూడదు. మీరు ఎప్పుడైతే ఈ క్షణంలో ఉండగలరో అప్పుడు మీకు బాధలు, కష్టం అనేవి ఉండవు. మీరు బాధపడటానికి అనువైన ప్రదేశాన్ని సృష్టిస్తారు. మీరు ఈ క్షణంలో ఉండగలిగితే, మీరు అక్కడ సృష్టించే ప్రదేశంలో అన్నీ అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అప్పుడు అప్రయత్నంగానే జీవితం సర్వసృష్టితో చక్కని ప్రేమానుబంధంతో ఉంటుంది. మీరు సంపూర్ణంగా వెల్లడి కాగలుగుతారు. మీరు ప్రతి వస్తువుని, ప్రతి వ్యక్తిని ప్రేమించగలుగుతారు. ఆ ప్రేమకి కారణం ఉండదు. అదే సన్న్యాసం అంటే. అప్పుడు మీరు దేన్నీ (బరువులని) పోగు చేసుకోరు. మీకు భయం, బాధ అనేవి అసలు ఉండవు. అప్పుడు మీ చుట్టూ జరిగేవన్నీ అందమైన కలలా ఉంటాయి.
'సన్న్యాసం అంటే శాశ్వతంగా తన భావాలలో స్వేచ్ఛగా సంచారం చేసే జీవి. అతను ఒక ప్రదేశంలోనే ఉన్నా అతని భావం మాత్రం ఎటువంటి నిర్దిష్టమైన పద్ధతి లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. అతను సుదూరప్రాంతాల్లోని వాటినైనా చూడగలడు. అతను దేన్నీ, వేటినీ పోగుచేసుకోవాలి అని అనుకోడు. అతనికి దొరికేవాటిన్నెంటినీ వదిలివేస్తాడు. అతనికి కావలసినవాటి కంటే ఎక్కువ అతని దగ్గరికి వస్తాయి. అతను ఒక మహారాజులా జీవిస్తాడు.
ఒక చిన్న కథ : ఒక ధనవంతుడికి నేల మాళిగలో ఒక గది ఉంటుంది. దాని నిండా ద్రాక్షరసం ఉంటుంది. అతని దగ్గర ఒక జగ్గులో ప్రత్యేకమైన ద్రాక్షరసం ఉంటుంది. దానికి జాగ్రత్తగా మూతపెట్టి ఉంటుంది. ఒకసారి ఆ రాష్ట్ర గవర్నరు అతని ఇంటికి వస్తాడు. అతను తనకి తాను ఇలా అనుకుంటాడు, ‘ఈ జగ్గులో ఉన్న వైన్ చాలా ప్రత్యేకమైనది. అతనికి వేరే వైను ఇస్తాను.’ కొన్ని రోజులు గడిచాక రాజకుటుంబీకులు అతని ఇంటికి వస్తారు. అప్పుడు కూడా ఆ ధనవంతుడు, ‘ఈ ప్రత్యేకమైన వైను ఇవ్వగలిగేంత గొప్పవారు కాదు. ఇంకా ప్రత్యేకమైన వ్యక్తులు వస్తే వారికి ఇస్తాను, అని అనుకొని వారికి మామూలు వైను ఇస్తాడు. ఆ తరువాత వాళ్ళ ఇంట్లో ఒక వివాహం వేడుక జరుగుతుంది. అప్పుడు కూడా అతను తన బంధువులకి కాని, దగ్గరివారికి కాని ఆ వైను ఇవ్వడు. చివరికి అతను చనిపోతాడు. ఆ ప్రత్యేకమైన వైనుని మిగతావాటితో పాటు బయటికి తెచ్చి పేదసాదలకి అందరికీ పంచిపెడతారు. ఎవరికీ అది ప్రత్యేకమైన వైను అని తెలియదు. ఎప్పుడైతే దాచుకోరో మీరు ప్రవహిస్తూ ఉంటారు. జీవితం అనేది ప్రవహించటానికి సృష్టించబడింది. సన్న్యాసి ఆ ఎరుకతో, సర్వాంతర్యామి అనే ఒక శక్తి లాగుతుంది అని తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవహిస్తూ ఉంటాడు. ఈ లక్షణమే సర్వాంతర్యామి దీవెనలని ఆకర్షించగలుగుతుంది.
అశాశ్వతస్థితిని ఆనందించండి
ఒకానొక రాజ్యంలో ఒక సంప్రదాయం ఉంటుంది. ఆ దేశపు పట్టపుటేనుగులు తరువాత సింహాసనాన్ని అధిష్ఠించగల వ్యక్తిని వెతికి, పట్టుకొని తమ వీపు మీద కూర్చోబెట్టుకొని రాజభవనానికి తీసుకువస్తాయి. అతనే ఆ దేశానికి రాజు అవుతాడు.
అటువంటి సందర్భంలో ఒకసారి ఏనుగు, కాబోయే రాజుని వెతుకుతూ అడవిలోకి వెళుతుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు దాన్ని అనుసరించి వెళతారు. అది తిన్నగా ఒక యోగీశ్వరుడి దగ్గరకి వెళ్ళి అతణ్ణి పట్టుకొని తన పైన కూర్చోబెట్టుకొని రాజభవనానికి తీసుకువస్తుంది.
ఆ యోగికి రాజ్యపాలన అంటే ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితిలో అతను రాజై సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఆయన యోగి కాబట్టి ఆయనలో భయం, అత్యాశ అనేవి లేవు. అతను తనలోని స్వచ్ఛమైన శక్తితో, తను ఉన్న ఉన్నతస్థితిలో దేశాన్ని అద్భుతంగా పరిపాలిస్తుంటాడు. మంత్రులు, ప్రజలు ఎవరికీ కూడా అవినీతి అనే మాట లేకుండా అంతా నిజాయితీగా తమ బాధ్యతలు నిర్వహిస్తుంటారు. పొరుగుదేశపు రాజుకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఆ రాజు ఈ రాజ్యాన్ని గెలవాలి అని నిశ్చయించుకొని, యుద్ధం ప్రకటిస్తాడు.
యోగి మాత్రం ఏమీ స్పందించకుండా, యుద్ధానికి వచ్చిన పిలుపుని కూడా పట్టించుకోకుండా, తన సైన్యాన్ని సిద్ధం చేయకుండా నిశ్చలంగా ఉంటాడు. యుద్ధం ప్రకటించిన రాజు తన సైన్యంతో యుద్ధభూమికి వస్తాడు. అక్కడ అతనికి ఎవరూ కనిపించరు. చాలా ఆశ్చర్యపోతాడు. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ రాజు రాజభవనానికి వచ్చి, యోగితో, 'నేను నీతో యుద్ధం చేయాలని వచ్చాను' అంటాడు.
అప్పుడు యోగి, 'ఎందుకు యుద్ధం' అని అడుగుతాడు. రాజు యోగితో 'నాకు నీ రాజ్యం కావాలి' అంటాడు.
అప్పుడు యోగి, 'సరే ! తీసుకో' అంటాడు
రాజు నిర్ఘాంతపోతాడు. అతను గట్టిగా, 'నీ మాటలో అర్థం ఏమిటి? యుద్ధం చేయకుండానేనా' అంటాడు. యోగి, 'అవును, యుద్ధం లేకుండానే' అంటాడు నిశ్చలంగా. రాజు యోగి పాదాల మీద పడి, 'నేను నా రాజ్యం పరిపాలించటానికి కూడా అర్హత లేనివాడిని, నా రాజ్యం కూడా దయచేసి నీవే తీసుకో' అని ప్రార్థయపడతాడు.
సన్యాసి అంటే ప్రతిదానిలోని అశాశ్వత్వాన్ని తెలుసుకోగలవాడు. కోరికలు, ఆస్తులు, భావాలు – అన్నీ కూడా ప్రతి నిమిషం మారుతూ ఉంటాయి. మీ కోరికల్ని ఒకసారి గమనించండి. ఒక కోరిక తీరక ముందు అదే మహోన్నతమైందిగా, ఒక గొప్ప పర్వతంలా ఉంటుంది. ఆ కోరిక తీరాక అది ఉపయోగం లేనిదవుతుంది. పర్వతమంత గొప్ప విషయం ఆవగింజంత అవుతుంది. కోరిక తీరక ముందు అదే మీ జీవితం అనిపిస్తుంది. అది తీరాక మీరు చాలా మామూలుగా మరొక కోరికలోకి వెళ్ళిపోతారు. అర్థం చేసుకోండి, ఈ చిన్న విషయంతోనే కోరికలు ఎంత అశాశ్వతమైనవో మీకు తెలుస్తుంది. కోరికలు అంటే నిరంతరం మారుతూ ఉండే మీ మనస్సు, ఊహలు అంతే.
సన్యాసం ఈ కోరికలు ఎంత అశాశ్వతమైనవో చూపిస్తుంది. అప్పుడు మీ లోపల క్రమంగా కోరికలు పుట్టటం ఆగిపోతుంది. అప్పుడు ఈ కోరికల్లో చిక్కుకుపోయిన శక్తి మీకు దొరుకుతుంది. అప్పుడు ఏ పనైనా చేయగల శక్తి మీలోకి వస్తుంది. అప్పుడు ఏ పనైనా సమర్థంగా చేయగలుగుతారు. మీరు బయటి ప్రపంచంలోనే ఉన్నా ఇక్కడి ఏ వస్తువు, ఏ విషయం మిమ్మల్ని ఆకర్షించలేవు. మీరు నిజంగా చాలా అందమైనదాన్ని చూసినా దాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకోరు. అంతే కాదు, ఆ అందాన్ని ఆస్వాదిస్తారు. అలా ముందుకి సాగిపోగలుగుతారు, అంతే, అదే సన్యాసం అంటే.
సన్యాసం అనేది చితి మంటల్లో శవదహనానికి ఉపయోగించే కర్ర లాంటిది. శవదహనం అయ్యాక కర్రని ఆ మంటల్లోనే వేసేస్తారు. అదే విధంగా సన్యాసం మనలోని కల్పనలు, ఊహలని కాల్చేసి, చివరికి అది కూడా ఆ మంటల్లో కలసిపోతుంది. ఇది ఒక పనిముట్టు లాంటిది.
ఆదిశంకరాచార్యులవారు భజగోవిందంలో చాలా చక్కగా చెబుతారు (భజగోవిందం అంటే భగవంతుని వైభవాన్ని కీర్తిస్తూ పాడటం). రాత్రి పగలు జరుగుతున్నా, వేసవిశీతకాలాలు వచ్చిపోయినా ఈ జీవితం చరామకంలోకి వచ్చినా కోరికల గుప్పిట మాత్రం అలానే ఉంటుంది.
కోరికలు అనేవి మన అచేతనస్థితిలో అంత బలంగా లాగుతాయి. ఆ కోరికల నుంచి స్వేచ్ఛని పొందగలగటమే అన్నిటి కంటే మహాద్భుతమైన స్వేచ్ఛ.
ఒక చిన్న కథ : ఒకప్పుడు రాతి పని చేసే వ్యక్తి ఉండేవాడు. అతనికి జీవితంలో తాను ఉన్న స్థితి మీద తృప్తి లేదు. ఒక రోజు అతను ఒక ధనవంతుడైన వ్యాపారి ఇంటి ముందు నుంచి వెళుతుంటాడు. తెరచి ఉన్న గేటు లోంచి అతను ఆ ధనవంతుని ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని, లోపల ఉన్న చాలా ముఖ్య అతిథుల్ని చూస్తాడు. అతను ఆ వ్యాపారి చాలా శక్తిమంతుడు అని అనుకుంటాడు. అతనిలో ఆ వ్యాపారి పట్ల అసూయ కలుగుతుంది. తాను కూడా ఆ వ్యాపారిలా ఉండాలి అని ఆశిస్తాడు.
అనుకోకుండా రాతి పని చేసే వ్యక్తికి వ్యాపారంలో బాగా లాభాలు వచ్చి ధన వంతుడవుతాడు. అతను చాలా సౌకర్యాల్ని సమకూర్చుకొని సంతోషపడుతుంటాడు. అతను తాను ఊహించినదాని కంటే బలవంతుడవుతాడు.
ఒక రోజు అతను బాట మీద నిలబడి ఉంటే ఒక ఉన్నతాధికారి వెళుతూ కనిపిస్తాడు. ఆయనని ఒక అందమైన పల్లకిలో తీసుకువెళుతుంటారు. ఆయనకి నాలుగు వైపులా పనివారు, సैनिकులు నడుస్తుంటారు. కొందరు డప్పులు వాయిస్తూ, బాకాలు ఊదుతూ ఉంటారు. అందరూ, ఎంత ధనవంతులైనా, పేదవారైనా ఆయనకి తల వంచి నమస్కరిస్తుంటారు. ఈ హడావుడి అంతా చూసిన ఆ వ్యక్తి 'నేను కూడా ఒక అధికారిగా ఉంటే ఎంత బాగుంటుంది!' అని అనుకుంటాడు. వెంటనే అతను ఒక ఉన్నతాధికారి అవుతాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా అట్టహాసంగా పల్లకిలో వెళుతుంటాడు.
ఒక రోజు వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. అతనికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. బాగా చిరాకుగా ఉంటుంది. అతను తల పైకి ఎత్తి ఆకాశంలోనికి చూస్తే అక్కడ అందమైన ఆకాశం, అందులో ఎంతో ప్రకాశంతో ఉన్న సూర్యుడు కనిపిస్తాడు. ఆహా! సూర్యుడు ఎంత శక్తిమంతుడు. నేను సూర్యుడిని అయితే బాగుండు అనుకుంటాడు.
వెంటనే అతడు సూర్యుడిలా అయిపోయి చాలా బలమైన స్థితిలో ఉంటాడు. ఒక రోజు నల్లని మేఘం సూర్యుడికి, భూమికి మధ్యలోకి వస్తుంది. సూర్యకాంతి భూమి మీదికి వెళ్ళదు. అతను ఆశ్చర్యపోతాడు. అతను ఈ విధంగా అనుకుంటాడు, ‘ఈ నల్లని మేఘం ఎంత శక్తివంతమైనదో కదా! నేను ఆ మేఘాన్ని అయితే బాగుంటుంది! వెంటనే అతను మేఘంగా మారి తుఫాను సృష్టించి వరదలు తెప్పించి ఊళ్ళు ముంచేస్తాడు.
అయితే అతను మరొక విషయం తెలుసుకుంటాడు. ఏదో ఒక శక్తి తనని బలంగా తోసింది అని. అది బలంగా వస్తున్న గాలి అని అర్థమవుతుంది. వెంటనే నేను గాలిగా మారితే బాగుండు అనుకుంటాడు. వెంటనే అతను గాలిగా మారి బలంగా వీస్తూ ఇళ్ళు, చెట్లు కూల్చేస్తాడు. అయితే అంత బలమైన గాలికి కదలకుండా ఉన్న ఒక పెద్ద రాయిని చూసి, ఆహా! ఈ రాయి ఎంత బలమైనది. నేను రాయిని అయితే బాగుంటుంది అని అనుకుంటాడు. వెంటనే అతను రాయిగా మారి, ఇప్పుడు నా కంటే బలమైనవాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు అనుకుంటాడు. అలా అనుకుంటూ ఉండగా అతనికి సుత్తితో కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. రాతి మీద దెబ్బలు పడుతుంటాయి, తరువాత రాయి ఆకారం మారుతూ ఉంటుంది. అప్పుడు అతను ఈ విధంగా అనుకుంటాడు ‘రాయి కంటే శక్తి గలది ఏముంది?’ అని. కిందకి చూస్తే రాతి పని చేసే వ్యక్తి సుత్తితో రాయిమీద కొడుతుంటాడు. ఈ కథలో మనకి అర్ధమయ్యే విషయం ఏమిటంటే, ఎంత సాధించినా, సాధించందే గొప్పగా కనిపిస్తుంది. దూరంగా అవతల పక్క గడ్డి చాలా అందమైన ఆకు పచ్చ రంగులో కనిపిస్తుంది. దాని దగ్గరగా వెళితే ఎం జరుగుతుంది? అప్పుడు ఇటు పక్క ఉన్న గడ్డి అందంగా కనిపిస్తుంది. మనం నిరంతరం ఒక దాని నుంచి మరొక దానిలోకి, ఒక కోరిక నుంచి మరొక కోరికలోకి, ఒక దృక్పధం నుంచి మరొక దానికి దూకుతూ అదే సంతోషం అనుకుంటాం.
కాని అసలు సత్యం ఏమిటంటే, మనకి మనం చాలు. మనం అది తెలుసుకుంటే చాలు. మనం ఆ విషయం తెలుసుకుంటే మన అందం మరింత ప్రకాశవంతం అవుతుంది. లేకపోతే దీన్ని వెతకటంలో మన డబ్బు, సమయాలను వృధా చేస్తాంతే.
సన్యాసి ప్రతి నిమిషం, ప్రతిది మారటాన్ని స్పష్టంగా చూడగలడు. అది ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉంటేనే అందం. సన్యాసికి మరొక విషయం కూడా తెలుసు, అందం చూసే కళ్ళలో, చూసే వ్యక్తిలో ఉంది అని. అందుకే అతను ముందుగా తన కళ్ళని శుభ్రం చేసుకుంటాడు. కళ్ళు ఆత్మకి ద్వారాలు కాబట్టి అతని పని చాలా ముఖ్యమైన స్థాయిలో ఉంటుంది.
ఒక విషయం అర్ధం చేసుకోండి; మీరు ఎరుపు రంగు కళ్ళ అద్దాల నుంచి చూస్తే ప్రపంచంలో అన్నీ ఎరుపు రంగులోనే కనిపిస్తాయి. ఆకు పచ్చ అద్దాల గుండా చూస్తే ఆకు పచ్చ రంగులో కనిపిస్తాయి. మీరు స్వచ్ఛమైన కళ్ళతో చూస్తే సర్వం స్పష్టంగా, అందంగా కనిపిస్తుంది. సృష్టి అద్భుతమైన అందాల రాశి. కానీ మనం ఆ అందాలని చూడలేకపోతున్నాం. సన్యాసం అంటే స్వచ్ఛంగా చూడాలి అని నిర్ణయించుకోవటమే.
జీవితం నిరంతరం మారుతూ ఉంటుంది. మరి అటువంటప్పుడు దాన్ని ఒక చట్రంలో బిగించటం ఎందుకు? బుద్ధుడు 'దమ్మపదం'లో ఈ విధంగా చెబుతాడు - జీవితం అంటే ఆకాశంలో మెరిసే మెరపు తీగ వంటింది. జీవితం మారుతూ ఉంటుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మనం అసాధ్యమైన పని చేయాలి అని అనుకుంటున్నాం. అసలు మన చేయవలసింది ఉన్నదాన్ని స్పష్టంగా చూడటం, ఆనందించటం, ముందుకి సాగిపోవటం. సర్వం సృష్టి చైతన్యరూపమే అయినప్పుడు ఇక మనకి అహంతో పని ఏమిటి? భయానికి, దురాశ లేదా అత్యాశకి అవకాశం ఎక్కడ ఉంది. అర్ధం చేసుకోండి; సన్యాసంతో ఏమీ మార్చలేం. అన్నీ అదే విధంగా ఉంటాయి. అయితే సన్యాసం మీరు చూసే దృక్పధాన్ని మారుస్తుంది. సన్యాసం అనేది మీలో మార్పులు తెస్తుంది. అంతే కాని బయటి ప్రపంచంతో సన్యాసానికి ఏమీ సంబంధం లేదు.
ఒక చిన్న కథ : ఒకసారి ఒక ఆధ్యాత్మికబోధకుడు రాజదర్శనానికి వస్తాడు. ఎవరూ అతన్ని అడ్డగించరు. అతను తిన్నగా రాజసభకి వస్తాడు. అక్కడ రాజు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆయనని చూసి రాజు 'మీకు ఏం కావాలి' అంటాడు. అందుకు ఆధ్యాత్మిక బోధకుడు 'నాకు నిద్ర పోవటానికి సత్రం కావాలి' అని అడుగుతాడు. అప్పుడు రాజు 'సత్రం ఎందుకు, నా రాజభవనంలో ఉండండి' అని అంటాడు. అప్పుడు ఆ మతబోధకుడు, 'నీకు ముందు రాజభవనం ఎవరిది' అని అడుగుతాడు. రాజు 'ఇది మా నాన్నగారిది, ఆయన మరణించారు' అని జవాబు ఇస్తాడు. 'అంతకు ముందు అది ఎవరిది' అని మళ్లీ రాజుని అడుగుతాడు. రాజు 'అది మా తాతగారిది, ఆయన కూడా మరణించారు' అని జవాబు చెబుతాడు. అప్పుడు బోధకుడు, 'అంటే ఈ భవనంలోకి చాలా మంది వచ్చి, కొంత కాలం నివసించి ఆ తరువాత వెళ్ళిపోతారు. నీవు కూడా అదే విధంగా వచ్చావు, మరి ఇది సత్రమే కదా'! అంటాడు.
సన్యాసి రథసారధిని మేల్కొలుపుతాడు. మనిషి శరీరం రథం అయితే అందులో ఉండే అతని చేతనస్థితి రథసారధి. రథసారధి గాఢనిద్రలో ఉన్నాడు. గుర్రాలు ఆ రథాన్ని వాటి ఇష్టప్రకారం తీసుకువెళుతున్నాయి. రథానికి పూన్చిన ఐదు గుర్రాలు మనలోని ఐదు జ్ఞానేంద్రియాలు, ఒక్కొక్కదానికి ఒక్కొక్క భావం, ఒక్కొక్క లక్ష్యం. వాటిలో ఒకటి కూడా సత్యం కాదు. అవి మారుతున్న భావాలు మాత్రమే.
చాలా కష్టసమయంలో కూడా సన్యాసి జీవితం అంటే మారుతూ ఉండే ఒక కల అనే ఎరుకతో ఉంటాడు. అతని నిర్వచనంలో విజయం, అపజయం అనేవి వేరే విధంగా ఉంటాయి. అతను జయాన్ని, అపజయాన్ని అదే విధంగా తీసుకోడు. అదే సంసారి తాను ఎక్కడికి వెళితే అక్కడకి జయం, అపజయం అనేవాటిని కూడా మోసుకెళుతూ ఉంటాడు. ఇక్కడే సమస్యలు ప్రారంభమయ్యేది.
అధీనమవటం, ప్రేమ, కరుణ, సన్యాసం
సన్యాసం అంటే సకలసృష్టికి, సర్వాంతర్యామికి 'సరే' అని చెప్పటం. అధీనమవటం అన్నా, ప్రేమ, కరుణా అన్నా కూడా అదే అర్థం.
మనిషి మెదడుకి ఎటువంటి శిక్షణ ఇస్తారంటే అన్నింటికీ 'కాదు, లేదు' అని చెప్పమని. లేదు, కాదు అనగానే అహంకారం గట్టిపడుతుంది. సరే అనగానే అహంకారం కరిగిపోతుంది. అందుకే మనస్సు ఎప్పుడూ లేదు, కాదు అనే అంటుంది. సన్యాసం అంటే సర్వాంతర్యామికి సరే, జెస్ల అని చెప్పటమే. సర్వాంతర్యామి మిమ్ముల్ని సృష్టించాడు. ఆ విశ్వశక్తి మీ ద్వారా తన దివ్యనాటకాన్ని, దివ్యలీలల్ని ప్రదర్శించాలి అని చూస్తుంటాడు. మీరు సరే అని చెప్పగలిగితే సర్వాంతర్యామిని ఆయన లీలలు మీ ద్వారా జరగనివ్వటమే. ఆ దివ్యలీలలు జరిగితే, ఎప్పుడు ఏవి సృష్టిధర్మం ప్రకారం జరగాలో అదే విధంగా జరుగుతాయి. సర్వాంతర్యామి ప్రకారం అన్నీ కచ్చితంగా జరుగుతాయి. అప్పుడు ఏం జరిగినా అది శుభప్రదం, మంగళకరం. ఇదే మనస్సుని (ఆలోచనలని) వదిలేయండి అనే మాటకి అసలైన అర్థం. సర్వాంతర్యామికి, సృష్టికి మీరు సున్నితంగా స్పందించగలగటం అంటే ఇదే. సృష్టికి అనుగుణంగా పనిచేయటమే. అదే అధీనత అంటే. సృష్టికి, సర్వాంతర్యామికి విధేయులుగా ఉండటం అంటే అధీనం కావటం. సరే అని చెప్పటానికి ప్రయత్నించటంలోనే మీరు సున్నితంగా అవుతారు. మీరు కాదు అని చెబుతున్న కొద్దీ గట్టిపడిపోతారు. మీరు సరే అని చెప్పటానికి చేసే ప్రయత్నం మిమ్మల్ని సున్నితంగా చేస్తుంది. ఎప్పుడైతే మీరు సరే అనాలి అని చేతనస్థితిలో నిర్ణయించుకుంటారో, అప్పుడే ఆ సున్నితత్వం ప్రారంభమవుతుంది. ఇక్కడై గురుదేవుల పాత్ర ప్రారంభమవుతుంది.
సన్న్యాసం అంటే గురుదేవులని ఎటువంటి వివరణ అడగకుండా సరే అని చెప్పగలగటం. ఎప్పుడైతే గురువులని మీరు పూర్తిగా నమ్ముతారో అప్పుడు మీలో సన్న్యాసం అనేది ప్రారంభమవుతుంది. ఎక్కడో ఒక చోట మీ కంటే గురువులకే అన్నీ తెలుసు అనే విషయం మీకు స్ఫురిస్తుంది. అప్పుడు మీ మానసికవ్యవస్థ మీద (ఆలోచనల మీద) మీ గుప్పిటని వదులు చేస్తారు. మనస్సుని వదిలి గురువుల చేతులని పట్టుకొని ముందుకు సాగుతారు. గురువులు ఎప్పుడూ చేతులు ముందుకు చాపి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. మీరే ఆ చేతులని పట్టుకోవటానికి సిద్ధంగా ఉండరు. ఒక్కసారి సరే అని మీరు అనటం ప్రారంభించగానే మీరు గురువులు చేతులు పట్టుకోవటం మొదలుపెడతారు.
ఎక్కడ ప్రేమ అనేది సృష్టి అవుతుందో అక్కడ అంతరంగపు ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ప్రేమ అనేది మీరు సరే, జెస్ అని చెప్పటం ప్రారంభించాక మాత్రమే జరుగుతుంది. సరే అని అంగీకరించటం వల్ల మీరు నిజమైన ప్రేమని వెల్లడి చేస్తూ ప్రేమించటం ప్రారంభిస్తారు. అదే విధంగా మీరు వారికి అనుమతిని ఇస్తారు. అప్పుడు రాతిలా ఉండే మీ అంతరంగం దూది పింజలా మారుతుంది. అది ప్రేమలో మునిగిపోతుంది. ఆ ప్రేమ కేవలం ఒక వ్యక్తి వైపు మాత్రమే ఉండదు. అదే విధంగా ఏదో ఒక కారణంతో జరగదు. ఆ ప్రేమ కేవలం మీ నుంచి పొంగి ప్రవహించే శక్తి మాత్రమే. ఆ ప్రేమ సర్వసృష్టి వైపూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ప్రతి చెట్టుతో, ప్రతి ప్రాణితో సంభాషిస్తూ అందులో ఐక్యమైపోగలరు. అప్పుడు మీకు జీవితం మధురగానంలా ఉంటుంది. అది సృష్టి గీతం అయితే మీరు అందులో ఒక రాగం అవుతారు. అప్పుడు మీరు మీతోనే కాదు అందరితో, అన్నింటితోనూ లోతైన ప్రేమానుబంధంతో ఉంటారు. అప్పుడు మీరు చేసే ప్రతి పనీ, మీలోని ఆనందాన్ని వెల్లడి చేయటమే అవుతుంది. మీరు నిరంతరం ఆనందపారవశ్యంలో ఉంటారు.
ఒక చిన్న కథ : ఒక బౌద్ధగురువు కేంబ్రిడ్జి బౌద్ధసంఘానికి వస్తాడు. ముఖ్య అతిథులు వస్తారు అనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని అందరూ శుభ్రపరుస్తూ ఉంటారు. వారంతా బౌద్ధగురువుని చూసి ఆశ్చర్యపోతారు. ఆయన నిజానికి మర్నాడు అక్కడైకి రావలసి ఉంది. ఆయన తన షర్ట్ చేతులు పైకి మడిచి వారితో పాటు ఆ శుభ్రంచేసే పనుల్లో వారికి సహాయం చేయటం ప్రారంభిస్తాడు. ఆయన వారికి సహాయం చేయటం అనే విషయాన్ని వారు నమ్మలేకపోతారు. ఆశ్చర్యపోతున్నవారితో ఆయన, ‘రేపు నేను వచ్చే సందర్భానికి చేసే పనుల్లో నేను కూడా ఎందుకు సహాయం చేయకూడదు?’ అని వారితో అంటాడు. మీరు ఎప్పుడైతే సర్వాంతర్యామిలో, సృష్టితో పాటు ప్రతిధ్వనిస్తూ ఉంటే, మీరు మీతోనే కాదు అందరితో, ఆనందంగా ఉండగలరు. ఎందుకంటే మిమ్మల్ని మీరు వేరే విధంగా, సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా చూడరు. ఏ విషయానికి వేరే కారణాన్ని వెతకరు. కానీ కొంత మంది సృష్టితో చక్కని అనుబంధాన్ని పెంచుకుంటారు. కానీ తోటి మనుషుల విషయంలో పూర్తిగా విఫలమవుతారు. అటువంటివారు ప్రకృతితో పెంచుకున్న అనుబంధం కూడా నిజం కాదు. కేవలం ప్రకృతిని మాత్రమే ప్రేమించగలరు అంటే అది నిజమైన ప్రేమ కాదు.
నాతో చాలా మంది అంటుంటారు, నాకు ప్రకృతితో చాలా మంచి అనుబంధబాంధవ్యాలు ఉన్నాయి, నేను ప్రకృతిని ప్రేమిస్తాను అని. ఒక విషయం అర్థం చేసుకోండి; చెట్లు, పక్షులు, జంతువులు మీకు ఎటువంటి సమస్యల్ని సృష్టించవు. అందుకే మీరు వాటిని ప్రేమిస్తున్నాను అని చెప్పగలుగుతారు. అవి ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటాయి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో కేవలం అది చెబితే చాలు. మీ భావాలు వాటి మీద పెట్టవచ్చు. వాటిని లాగవచ్చు. ఏది చేసైనా బాగుంది అనుకోవచ్చు. ఇదంతా మీ అహంకారానికి తృప్తి మాత్రమే. మీకు సమస్య ఉన్నప్పుడు కూడా సర్వసృష్టిని ప్రేమించగలగాలి. అదే అనుబంధం అంటే. మీరు ప్రతికూలస్థితిలో కూడా అటువంటి అంతరంగాన్ని సృష్టించుకోగలిగినప్పుడు, మీది నిజమైన అనుబంధం.
ఒకసారి ఒక కవి ప్రేమగీతాన్ని రాసి తన స్నేహితులకి పంపిస్తాడు. కొన్ని రోజులు గడిచాక అతనికి ఒక ఉత్తరం వస్తుంది. అది ఆయన ఆ గీతాన్ని పంపిన ఒక స్త్రీ నుంచి వస్తుంది. ఆమె ఉత్తరం ఈ విధంగా రాస్తుంది, నాకు మీరు రాసిన ప్రేమగీతం చాలా నచ్చింది. అది నా హృదయాన్ని తాకింది. దయచేసి మీరు మా ఇంటికి వచ్చి మా తల్లిదండ్రుల అనుమతితో నన్ను వివాహం చేసుకోండి, అని ఉంటుంది.
కవి ఆ ఉత్తరం చదివి ఆశ్చర్యపోతాడు. ఆయన ఆమెకి సమాధానమిస్తూ ఉత్తరం రాసి అందులో 'నేను నా హృదయస్పందన నుంచి ఒక ప్రేమగీతం రాసి దాన్ని కొంతమంది స్నేహితులకి పంపించాను. అంతకు మించి అందులో మరేమీ లేదు' అని రాస్తాడు. ఆ ఉత్తరానికి జవాబుగా ఆమె, 'నీవు ఒక కపటప్రేమికుడివి. నిన్ను చూసాక మరి నా జీవితంలో కవి అనే ఏ వ్యక్తినీ నమ్మను! అని రాస్తుంది.
ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రతిదీ మేధతో కూడిన కారణంతో ముడిపడి ఉంటుంది. ప్రేమని కేవలం ఒక కోరిక స్థాయికి దిగజార్చి చూస్తున్నారు. అది మరొకరి శరీరం పట్ల ఉన్న కోరిక మాత్రమే. అదే సమస్య. నిజమైన ప్రేమ అంటే మీ అంతరంగం నుంచి ఏ కారణం లేకుండా పొంగి ప్రవహించే ఒక శక్తి. అది కేవలం సర్వాంతర్యామికి, సృష్టికి అనుగుణంగా మీరు ఉండగలిగినప్పుడే సాధ్యపడుతుంది.
గొప్ప కవి అయిన కబీరు ఒక మాట చెబుతాడు, ఎప్పుడైతే మీరు ప్రేమ అధీనంలోకి, ప్రేమ గుప్పిట్లోకి వెళతారో రెండవసారి ఆలోచించరు అని. ఆ ప్రేమలో మునగండి. దాని గురించి ఆలోచించటం అంటే మీకు గాఢమైన నిద్ర వస్తున్నప్పుడు తలగడలని సర్దుకున్నట్టు ఉంటుంది. ఆయన ఇంకా చెబుతాడు, 'దాని కోసం తలని ఇవ్వవలసివస్తే ఇచ్చేయండి. తల కోసం ఎందుకు బాధ పడటం?
గురుదేవులు మీ కోసం కొన్ని జన్మలుగా ఎదురు చూస్తుంటారు. కానీ మీరు మాత్రం సరే అని చెప్పాలి. గురువు అంటే ఒక గౌరవప్రదమైన వ్యక్తి. ఆయన ఎంత గొప్పవాడంటే మీరు బందీలుగానే ఉంటాం అంటే ఆ స్వేచ్ఛని మీకు ఇస్తారు. మీరు తెలుసుకునేవరకు ఎదురుచూస్తూంటారు. ఒక్కసారి మీరు సరే అని చెప్పగానే ఆయన మిమ్మల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. కేవలం గురుదేవులు మాత్రమే మీకు ప్రేమలోని నిజమైన శక్తిని చూపించగలరు.
ఒక చిన్న కథ : సదాశివబ్రహ్మేంద్ర అనే ఒక గొప్ప యోగీశ్వరుడు దక్షిణభారతదేశంలో ఉండేవాడు. ఆయన ఒక పసిబిడ్డలా జీవించేవాడు. ఆయన ఎప్పుడూ బట్టలు కట్టుకోలేదు. ఆయన నిరంతరం ఆనందపారవశ్యంలో ఉండేవాడు. ఒక రోజు ఆయన మహదానందంలో నడుస్తూ వెళుతుంటాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నవాబు గుర్రం మీద వెళుతూ ఆ యోగీశ్వరుడి పక్కనుంచే వెళతాడు. ఆనందపారవశ్యంలో ఉన్న యోగి ఆ నవాబుని గమనించడు, అతనికి గౌరవసూచనగా ఏమీ చేయడు. అది చూసి నవాబుకి చాలా కోపం వస్తుంది. నవాబు కత్తి తీసి ఆ యోగి చేతిని నరికేస్తాడు. సదాశివబ్రహ్మేంద్ర అసలేమీ పట్టించుకోకుండా అలా నడుస్తూ అదే ఆనందంలో ముందుకు వెళుతుంటాడు.
ఆయన భక్తురాలు ఒకామె ఇదంతా చూసి, బాధతో దుఃఖిస్తూ ఆయన దగ్గరకి వెళ్ళి, 'గురుదేవా! మీరు ఆ నవాబుని గౌరవించకుండా మీ చేతిని పోగొట్టుకున్నారు' అని ఏడుస్తుంది. యోగీశ్వరుడు ఆమె మాటలకి ఆశ్చర్యపోయి ఆమెతో తెగిపోయిన చేతిని తీసుకురమ్మని చెప్పి ఆ చేతిని విరిగిన స్థానంలో పెడతాడు. చేయి మామూలుగా అయిపోతుంది. ఆ భక్తురాలు ఇది చూసి ఆశ్చర్యంతో ఏమీ మాట్లాడలేకపోతుంది.
యోగీశ్వరుడు ఆమె వైపు చూస్తూ, 'నవాబులోని ద్వేషం నా చేయి పోయేటట్లు చేస్తే, నీ ప్రేమ దాన్ని చికిత్సతో మామూలుగా చేసింది', అంటాడు.
జ్ఞానోదయమైన యోగీశ్వరుని ప్రేమ, కరుణ అనంతసాగరం లాంటివి. వాటికి హద్దులు ఉండవు. సన్యాసి కూడా జ్ఞానోదయమైన యోగీశ్వరునిలా జీవిస్తాడు. సన్యాసం అంటే, జ్ఞానోదయస్థితిలో జీవించటమే.
సన్యాసి అంటే తన అంతరంగప్రపంచంలో ప్రేమకరుణల్లో స్థిరపడి బయటి ప్రపంచంలో సున్నితంగా, కచ్చితంగా ఉండేవాడు. కచ్చితత్వం, సున్నితత్వం అతని చేతిలో కత్తి లాంటివి. అతను కళ్ళు మూసుకుంటే బయటి ప్రపంచం ఉండదు. కళ్ళు తెరిస్తే, చేసే పని కచ్చితంగా ఉంటుంది. అతని పనిలోనూ, మానవసంబంధాల్లో కూడా పరిపూర్ణతతో, కచ్చితంగా ఉండగలడు. సన్యాసి ఒక తండ్రి, తల్లి, సోదరుడు, స్నేహితుడు అందరినీ కూడా ఒకే సమయంలో చూపగలడు. అతను తన అంతరంగమేధ మార్గదర్శకత్వంలో ముందుకి సాగుతాడు. అందుకే అతను నిరంతరం వర్తమానంలో ఉండగలుగుతాడు. ఆయన చాలా చక్కగా స్పందించగలుగుతాడు. అదే అంతిమ బాధ్యత. అంటే అప్రయత్నంగా ఆ క్షణానికి స్పందించగలగటం. నిజమైన ప్రేమ, కరుణ అనేవి అప్రయత్నంగా ఆ క్షణానికి స్పందించటమే. అందుకే సన్యాసి మనుషులు ఎవరైనా, పరిస్థితులు ఏవైనా నిరంతరం కరుణప్రేమల్ని వెదజల్లుతూ ఉంటాడు.
ఒక చిన్న కథ : ఒక వ్యక్తి ఒక బౌద్ధారామానికి వెళ్ళి అక్కడ ఉన్న గురువుగారితో, 'గురుదేవా! నేను జెన్ బౌద్ధధర్మాన్ని నా మిగిలిన జీవితమంతా సాధన చేయాలనుకుంటున్నాను. నేను దేన్నైనా దగ్గరి దారిలో తెలుసుకుంటాను. జ్ఞానోదయానికి కూడా ఏదైనా దగ్గరి మార్గం ఉందా? అని అడుగుతాడు.
గురువుగారు ఆ వ్యక్తితో, 'నిన్ను మా ఆశ్రమంలోకి తీసుకుంటాను. అదీ రెండు రోజులు. ఈ రెండు రోజుల్లో జ్ఞానోదయానికి దగ్గరి మార్గాన్ని నేర్పిస్తాను. నీవు ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నావా?' అని అడుగుతాడు. గురువుగారి ప్రశ్నకు ఆ వ్యక్తి 'నేను దేనికీ కూడా ఎక్కువ కాలం కట్టుబడి ఉండను. అందువల్ల నేను ప్రత్యేకంగా ఏం చేయాలో నిర్ణయించుకోలేదు. కానీ నాకు చెస్ ఆడటం ఇష్టం' అంటాడు.
ఆ గురువుగారు ఒక యువకుడైన సన్యాసికి కబురు చేస్తాడు. అతను చెస్ బాగా ఆడతాడు. ఆయన వాళ్ళు ఇద్దరినీ కూర్చోమని చెప్పి, వాళ్ళ మధ్య చెస్ బోర్డు పెడతాడు. ఆతరువాత తన దగ్గర ఉన్న కత్తి తీసి వారి మధ్య బల్ల మీద పెట్టి వాళ్ళతో, 'మీ ఇద్దరూ చెస్ ఆడాలి. మీలో ఎవరైతే ఓడిపోతారో వెంటనే ఈ కత్తితో వారి తల నరకబడుతుంది,' అని చెబుతాడు.
గురువుగారి మాటలకు వారు నిర్ఘాంతపోతారు. ఇద్దరూ ఆట ఆడటం మొదలు పెడతారు. వారిద్దరూ అంతకు ముందు ఎప్పుడూ లేనంత ఏకాగ్రతతో ఆడుతుంటారు. ముందులో యువసన్యాసి బాగా ఆడతాడు. ఒక స్థితిలో అతనే ఆట గెలుస్తాడేమో అనిపిస్తుంది. కొంత సేపటికే విజయం అతనిదే అని తెలుస్తుంది.
అకస్మాత్తుగా అతను ఒక తప్పు చేస్తాడు. అప్పుడు ఆ కొత్త వ్యక్తి అవకాశాన్ని తీసుకొని ఆట గెలిచే దిశగా వెళుతుంటాడు. త్వరలోనే ఆ వ్యక్తి ఆట గెలిచే స్థితికి చేరతాడు. అప్పుడు ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఆ యువకుడైన సన్యాసి వైపు చూసి ఇలా అనుకుంటాడు, 'ఇంత చిన్న వయస్సులో అంకితభావం, భక్తితో గురువు దగ్గర ఉన్నాడు ఈ యువకుడు. కానీ నేను నా జీవితాన్ని వృథా పరిచాను'. వెంటనే ఆ వ్యక్తి ఒక నిర్ణయానికి వస్తాడు. 'ఒక వేళ ఎవరో ఒకరు చనిపోవటం అంటూ జరిగితే అది నేనే కావాలి' అనుకొని కావాలని తప్పు చేస్తాడు. సన్న్యాసి అది చూసి తాను ఆట గెలిచే దిశగా ఎత్తు వేస్తాడు. గురువుగారు ఇదంతా గమనిస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో గురువుగారు ఆ చెస్ బోర్డుని లాగేస్తాడు. పావులన్నీ చెల్లాచెదరైపోతాయి. ఆయన వాళ్ళతో, 'మీలో ఎవరూ గెలవలేదు. ఎవరూ ఓడిపోలేదు. ఆట అయిపోయింది. జ్ఞానోదయానికి కావలసినవి రెండే విషయాలు. అవి ఏకాగ్రత, కరుణ. ఈ రోజు మీరిద్దరూ ఆ పాఠం నేర్చుకున్నారు. మీరు నాతో ఉండి, ఈ రోజు చెస్ ఏ విధంగా ఆడారో ఆ విధంగా చదువుకోండి. మీకు తప్పక జ్ఞానోదయమవుతుంది' అని చెబుతాడు.
అర్థం చేసుకోండి; సన్న్యాసం అంటే ఏకాగ్రతని, కరుణని కలిపి తీసుకురావటం. ఏకాగ్రతతో మీరు జీవితగమ్యం అయిన జ్ఞానోదయం పొందాలి అనే లక్ష్యాన్ని ఎప్పుడూ మరిచిపోరు. మీ కరుణ త్యాగంతో ఎదుటివారి లక్ష్యం అయిన జ్ఞానోదయస్థితికి చేరే విధంగా సహాయం చేస్తుంది. ఈ రెండు లక్షణాలూ మీలో ఉన్నప్పుడు మీరూ మీ ఎదుటివారూ, ఇద్దరూ గమ్యం చేరగలుగుతారు. అదే సన్న్యాసంలోని అద్భుతమైన గొప్ప విషయం. అదే సన్న్యాసి ఉండే స్థితి.
సన్న్యాసికి ఉండే మరొక గొప్ప లక్షణం సర్వాంతర్యామి పైన, సర్వసృష్టి పైన ఉండే అపారమైన నమ్మకం. మీరు గమనిస్తే, ఈ సంఘం మీకు నిరంతరం మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది. అది అసలైన సమస్య. సృష్టి మీకు శత్రువు అని నేర్పిస్తారు. ఈ సృష్టి నుంచి నిరంతరం మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని సంఘం చెబుతూ ఉంటుంది. కాబట్టి మీరు నిరంతరం అదే సూత్రాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ సూత్రం ఆధారంగానే మీరు గురువుల నుండి రక్షించుకుంటూ ఉంటారు. మీ జీవితంలో గురువు చేసే పని మీలోని అహంకారాన్ని రూపమాపటమే. అందుకే ఆయన మీకు తారసపడతారు.
సన్న్యాసం అంటే మీరు మీ మార్గంలో ఎక్కడ తప్పుతున్నారో తెలుసుకోవాలని ప్రయత్నించటమే. ఆ తప్పు మార్గమే మీ అహంకారం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, మీరు మీ రక్షణపద్ధతులని వదిలేసి గురువులని మీలోకి అనుమతిస్తారు. గురువులకి మీ అంతరంగాన్ని తెరచి ఉంచుతారు. గురువుల్ని మీలోనికి అనుమతించకుండా మీ అంతరంగాన్ని మూసేయటం అంటే పరిమళాల గాలులు వీస్తున్నప్పుడు మీరు మీ చేతి వేళ్లతో ముక్కు మూసుకున్నట్టే. మీరు ఆయన మీద సంపూర్ణమైన నమ్మకంతో, ఆయనకి విప్పారి ఉంటే మీ చుట్టూ ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరే చూస్తారు.
ఒక చిన్న కథ : ఒక వ్యక్తికి కొంత మంది శిష్యులు ఉన్నారు. అతనికి జ్ఞానోదయం కాలేదు కానీ వారినందరినీ ఆధ్యాత్మికమార్గంలో నడిపిస్తుంటారు. ఒక రోజు అతన్ని దగ్గరికి ఒక కొత్త శిష్యుడు వస్తాడు. అతను వినయంగా, స్వచ్ఛంగా, సహజంగా ఉండేవాడు. అతన్ని చూసి మిగతా శిష్యులు అసూయపడుతుంటారు. వారంతా ఇతనే గురువుగారి వారసుడవుతాడు అని అనుకుంటూ ఉండేవారు. వాళ్ళలో వారికి చాలా రాజకీయాలు జరుగుతుంటాయి. చివరికి వాళ్ళు ఆ కొత్త శిష్యుణ్ణి చంపదలచుకుంటారు. ఒక రోజు వారంతా అతని దగ్గర చేరి ‘నీకు నిజంగా గురువు గారి మీద విశ్వాసం ఉంటే కొండ చివరి నుంచి కిందకి దూకాలి, అప్పుడు నీకు ఎటువంటి హానీ జరగకూడదు’ అంటారు. ఆ శిష్యుడు సరే అని దూకుతాడు. ఆ లోయ సుమారు మూడు వేల అడుగుల లోతు ఉంటుంది. అతను చనిపోయి ఉంటాడని భావించి వారు కిందికి వెళ్ళి చూస్తే, అక్కడ శిష్యుడు చిరునవ్వుతో పద్మాసనంలో కూర్చొని ఉంటాడు. వీరిని చూసి శిష్యుడు కళ్ళు తెరచి, ‘మీరు సరిగ్గా చెప్పారు. విశ్వాసం రక్షిస్తుంది’ అంటాడు.
ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన అయి ఉంటుంది అనుకొని అతన్ని చంపటానికి మరొక ప్లాను సిద్ధం చేస్తుంటారు. ఒక ఇంటికి నిప్పు అంటుకొని తగలబడిపోతూ ఉంటుంది. చాలా మంది ఆ ఇంట్లో ఉన్నవారిని రక్షించటానికి ప్రయత్నిస్తున్నారు కానీ మంటలు ఎక్కువగా ఉండటం వల్ల వారు ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే అదను అనుకొని మిగతా శిష్యులు కొత్త శిష్యుడిని, ‘నీకు మన గురువుగారి మీద నిజంగా ప్రేమ ఉంటే, ఈ మంటల్లోకి వెళ్ళి, లోపల ఉన్నవారిని రక్షించు’ అంటారు. అతను సరే అని కాలుతున్న ఇంట్లోకి వెళ్ళి, ఒక నిమిషంలో లోపల ఉన్న తల్లికూతుళ్ళని బయటకి తీసుకు వస్తాడు.
వాళ్ళు ఇంకా అతణ్ణి చంపాలనే చూస్తుంటారు. ఒక రోజు అందరూ నది దాటి వెళుతుంటారు. వారు కొత్త శిష్యునితో ‘నీకు పడవ అవసరం లేదు. నీకు గురువు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి నీళ్ళ మీద నడిచిరా,’ అంటారు. అతను సరే అని చెప్పి నీళ్ళ మీద నడిచి వస్తుంటాడు. వారంతా నిర్ఘాంతపోతారు.
గురువుగారు అతన్ని అలా చూడటం అదే మొదటిసారి. ఆయనకి అతను కొండ మీది నుంచి దూకటం, మంటల్లోకి వెళ్ళటం తెలియదు. గురువు గారు అతణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ, ‘నీవు ఏం చేస్తున్నావు?’ ఇది ఎలా సాధ్యం అని అడుగుతాడు. గురువు గారి ప్రశ్నకు ‘ఇది సాధ్యమే గురుదేవా! ఇదంతా మీలోని శక్తితోనే నేను చేస్తున్నాను’ అని జవాబు ఇస్తాడు. అప్పుడు గురువు ఆలోచిస్తూ, ‘నా పేరులోని శక్తితో ఈ అమాయకుడైన వ్యక్తి అంత గొప్ప పని చేస్తే, నేను ఇంకా ఎంత గొప్ప పని చేయగలనో కదా!’ అనుకొని లేచి వచ్చి నీటి మీద నడవబోయి నీటిలో మునిగిపోతాడు.
విశ్వాసానికి గొప్ప శక్తి ఉంది. అది మన తర్కానికి, తెలివితేటలకి అతీతంగా పని చేస్తుంది. ఏదైతే తర్కానికి అతీతంగా ఉంటుందో అది సత్యం. అది ఎప్పటికీ తప్పు కాదు. అపజయం ఉండదు. ఎందుకంటే మీరు గురువుని నమ్మినప్పుడు ఆయన మీ బాధ్యత తీసుకుంటారు. అందులో ఆయనకి అపజయం ఉండదు. ఒక విషయం అర్థం చేసుకోండి; మీరు ముందు గురువులకి అధీనమై ఆ తరువాత మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అనుకోవద్దు. అలా చేయకూడదు. ముందు ఒక విషయం తెలుసుకోండి, నిజమైన అధీనం అనేది జరిగితే అసలు తెలివితక్కువ పనులు చేయరు. నిజమైన అధీనత అంటే చేతనస్థితి, అంతే కాని అది ఒక విషయం లేదా ఒక ప్రయత్నం కాదు. సన్న్యాసం అంటే గురువుల సమక్షంలో సమూహంలో కొందరి చేతనస్థితి వికసించటమే. కొన్ని సంవత్సరాలుగా సన్న్యాసం అనేది ఎప్పుడూ సమూహాల్లో జరుగుతుంది. చాలా మంది గొప్ప గొప్ప గురువులంతా పెద్ద సమూహాల్లోనే సన్న్యాసదీక్షని ఇచ్చేవారు. ఎప్పుడైతే సమూహంలోని వారంతా ఆ ప్రేమలో కరిగిపోతారో, అందులో ఐక్యం అయిపోతారో అప్పుడే సన్న్యాసం అనేది జరుగుతుంది. అప్పుడు అకస్మాత్తుగా అద్భుతమైన అందం నలు దిశలా వ్యాపిస్తుంది. అకస్మాత్తుగా సృష్టి సర్వం అద్భుతంగా, ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. చేతనస్థితి తాలూకు శక్తి మీ జీవనసరళిగా మారుతుంది. అప్పుడు మీ నుంచి అంతు లేని శక్తి పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండానే ఎదుటివారు అద్భుతమైన అందంతో కనిపిస్తారు. ప్రతిదీ కూడా చాలా నాణ్యతతో, కచ్చితంగా కనపడుతుంది. మీ పరిసరాలన్నీ వికసిస్తున్న భావం కలుగుతుంది. అంటే సృష్టి అందంగా అయిందని కాదు. సృష్టి ఎప్పుడూ అదే విధంగా ఉంటుంది. మీరు ఆ సృష్టికి స్పందించటం ప్రారంభించారు అంతే. మీలోని మానవత్వలక్షణాలు ఉన్నతంగా మారాయి అంతే, అదే సన్న్యాసం. ఎప్పుడైతే మీరు సర్వసృష్టికి స్పందిస్తారో మీలోని లక్షణాలు మరింత ఐశ్వర్యవంతమవుతాయి. ఎప్పుడైతే ఆ సృష్టిలో కరిగిపోతారో, దాని కోసం తపించిపోతారో, అప్పుడు మీలో సన్న్యాసం అనేది జరగటం ప్రారంభమవుతుంది.
ఒక విషయం అర్థం చేసుకోండి; ఎప్పుడైతే సన్న్యాసం అనేది జరుగుతుందో మీరు సృష్టికి అందాలు తెస్తారు. మీరు సృష్టించగలుగుతారు. అందరూ సన్న్యాసం అంటే సృజనాత్మకతని వదిలేయటం అనుకుంటారు. అది సరి కాదు. సన్న్యాసంలోని శక్తి సృజనాత్మకశక్తి. సన్న్యాసంలోని ఈ లక్షణం గురించి ఎక్కువగా అందరికీ తెలియదు.
ఎప్పుడు సన్న్యాసం జరుగుతుందో అదే మంచి ముహూర్తం
ఒక రోజు ఒక వ్యక్తి సోక్రటీస్ దగ్గరకి వచ్చి, 'ఓ మహాత్మా! నేను నీ దగ్గరికి జ్ఞానం కోసం వచ్చాను.' అంటాడు. సోక్రటీస్ ఆ వ్యక్తిని సముద్రం దగ్గరకి తీసుకువెళ్లి అతని తలని నీళ్లలో ముంచి కొన్ని సెకండ్లపాటు నొక్కి ఉంచుతాడు. అతన్ని వదలగానే అతను ఆయాసపడుతూ గబగబ శ్వాస తీసుకుంటూ బయటికి వస్తాడు. సోక్రటీస్ అతన్ని చూస్తూ 'ఇందాక ఏమన్నావో మళ్లా చెప్పు, అంటాడు. అతను 'నాకు జ్ఞానం కావాలి' అంటాడు. సోక్రటీస్ అతన్ని మళ్లీ నీళ్లలో ముంచి ఇంకాస్త ఎక్కువ సేపు ఉంచి వదులుతాడు. మరలా అతన్ని 'నీకు ఏం కావాలి?' అని అడుగుతాడు' అతను 'జ్ఞానం' అని జవాబు ఇస్తాడు. సోక్రటీస్ మళ్లీ నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి అతని తలని ముంచి అతన్ని వదిలి అదే ప్రశ్న అడుగుతాడు. ఆ విధంగా కొన్ని సార్లు చేశాక ఆ వ్యక్తి చివరికి 'నాకు గాలి కావాలి' అంటాడు. అప్పుడు సోక్రటీస్ 'మంచిది. నీకు గాలి ఎంత అవసరమో జ్ఞానం అంతే. అవసరం అనుకున్నప్పుడు అది నీకు దొరుకుతుంది' అంటాడు.
సన్న్యాసం అనేది మీ అంతరంగంలో జనించే ఒక లోతైన కోరిక అయి ఉండాలి. అది మీలో లోతైన ఆశయం అయివుండాలి. ఆ కోరిక నిరంతరం అదే స్థాయిలో లేకపోయినా పరవాలేదు. మీరు ఉన్నతస్థితిలోకి పెద్ద అడుగు వేయగలరు. అది నిరంతరం స్థిరంగా ఉండనవసరం లేదు. స్థిరంగా ఉండాలి అనేది మీ ఆశయం కానవసరం లేదు. అది మీలో నాటుకుంటే చాలు, మీరు సన్యాసానికి సిద్ధమైనట్లే. మీరు ఒక అడుగు వేయగలిగితే, ఆ అడుగు మిగతా పని చేసుకుపోతుంది.
ఒక వ్యక్తి శీతాకాలంలో హిమాలయపర్వతాల వైపుగా నడిచి వెళుతుంటాడు. ఒక వృద్ధుడు ఈ వ్యక్తిని చూసి ‘పర్వతాల దగ్గర చలి ఎక్కువగా ఉంటుంది. మీరు భరించగలరా?’ అని అంటాడు. ఆ వ్యక్తి వృద్ధుని వైపు చూస్తూ ‘నా హృదయం ఇప్పటికే అక్కడికి చేరి అక్కడ ఉంది. మిగిలిన భాగం అక్కడికి చేరి అక్కడ ఉండటం సులభమే’ అని జవాబు ఇస్తాడు.
దీక్ష అనేది పని ప్రారంభానికి మొదలు. సన్యాసానికి బయటి ప్రపంచంలో సహాయం చేసేవి, మీ అంతరంగప్రపంచంలో ఉన్న దీక్షకి సహాయంగా ఉంటాయి. మీ లోపల ఉన్న శక్తిని బట్టి మీరు సన్యాసానికి సిద్ధంగా ఉన్నారు అని నేను చెప్పగలను. శక్తిని మీ తెలివితేటలతో, తర్కంతో విశ్లేషించలేరు. ఇది తర్కానికి అతీతమైంది. అర్థం చేసుకోండి; మీరు సన్యాసం తీసుకున్న క్షణం మంచి ముహూర్తం. మీరు తరువాత దాన్ని వదిలేసినా, దాని గురించి బాధపడనవసరం లేదు. ఎందుకంటే సన్యాసం అనేది మీలో నాటబడింది. ఒక్కసారి సన్యాసి అయితే అతను ఎప్పటికీ సన్యాసే. అది మళ్ళీ సరైన సమయంలో జరుగుతుంది. అదే చివరిది కావచ్చు.
సన్యాసం అనేది వివేకవంతులు చేసే నిర్ణయం. జీవితంలో ఒక స్థాయికి వచ్చినప్పుడు, నిరాశానిస్పృహలు శిఖరాగ్రస్థాయికి చేరినప్పుడు, బయటి ప్రపంచం అనేది మీకు ఉపయోగం లేని విషయం అనే స్థితికి చేరినప్పుడు, ఇంతకు మించి సాధించటానికి ఇక ఏదీ లేదు అని అనుకున్నప్పుడు, మీకు ఎంపిక చేసుకోవటానికి మూడు విషయాలు ఉంటాయి.
మొదటిది : ఆత్మహత్య. ఆత్మహత్య మీకు వెంటనే స్వేచ్ఛని ఇస్తుంది. కానీ ఇందులో బాధ అధికంగా ఉంటుంది. చాలా మంది ఆత్మహత్య చేసుకోవాలి అంటే ధైర్యం కావాలను కుంటారు. ధైర్యం అనేది ఒక అందమైన మాట. దాన్ని చాలా తప్పుగా ఉపయోగించారు. కారాన్ని కళ్ళలో పోసుకోవటానికి మీకు ధైర్యం కావాలా? లేదు. అది తెలివితక్కువ తనం, మూర్ఖత్వం, అవును కదా! అదే విధంగా ఆత్మహత్య చేసుకోవటానికి ధైర్యం అవసరం లేదు. అది తెలివితక్కువతనం. దీనిలో ధైర్యానికి సంబంధించి ఏమీ లేదు.
ఆత్మహత్య వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకోండి. మీ ఈ జీవితకాలం 90 సంవత్సరాలైతే, మీరు 45వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన 45 సంవత్సరాలూ మీరు ప్రేతాత్మగా ఉండవలసిందే. 90 సంవత్సరాల తరువాత మాత్రమే మీరు శరీరాన్ని, మరో జన్మని తీసుకోలుగుతారు. ఈ 45 సంవత్సరాలూ మీరు భయంకరమైన నరకాన్ని అనుభవించాలి. అది మీరు శరీరంలో ఉన్నప్పటి కష్టం కంటే భయంకరమైనది. మీరు అనుకున్నట్టు ఆత్మహత్య మీకు స్వేచ్ఛని ఇవ్వదు.
ఇక రెండవ విషయం: మీరు ఏదైనా మత్తు పదార్థానికి అలవాటు కావచ్చు. అది నెమ్మదిగా మీ లోపల మీరు నింపుకుంటున్న విషం. ఇది కూడా తెలివితక్కువతనం. ఎందుకంటే తెలిసి తెలిసి మీ శరీరాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు.
మిగిలిన మూడవ మార్గం వివేకంతో కూడిన మార్గం. అది మీలోకి మీరు చూసుకో గలగటం. ఎప్పుడైతే మీకు ఇక బయటి ప్రపంచంతో పని లేదు అనిపిస్తుందో, మీరు మీ అంతరంగంలోకి వెళ్ళే సమయం వచ్చింది అని అర్థం. ఎప్పుడైతే మీరు మీ అంతరంగంలోనికి వెళ్ళాలి అనుకుంటారో అప్పుడు మీ లోపల సన్యాసం ప్రారంభమైంది అని అర్థం. సన్యాసం అంటే ఒక అద్భుతమైన రసాయని చర్య. అది మీ జీవితసరళిని, మీలోని శక్తిని జ్ఞానోదయం వైపు మళ్ళిస్తుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికతని ఆశ్రయించాలి అనే ఆలోచన కలుగుతుందో మేధావి అయిన వ్యక్తి సన్యాసంలోకి ఒక పెద్ద అడుగు వేస్తాడు. ఆధ్యాత్మిక ప్రయాణంలో సన్యాసం దగ్గరి దారి.
సన్యాసం అంటే నీ మీద నీవు ఏకాగ్రత నిలిపి నీకు నీవు అపాయింట్మెంట్ ఇచ్చుకోవటమే. నీకు నీవు చేతనస్థితిలో నాలో నేను కాని విషయాల్ని నాశనం చేసేస్తాను, నన్ను నేను శుభ్రపరుచుకుంటాను అని చేసే నిర్ణయం. ఒక్కసారి మీరు నిర్ణయం చేయగలిగితే మీరు చూసే పద్ధతి, వినే విధానం మాట్లాడటం - అన్నీ పూర్తిగా మారిపోతాయి. ఆ విషయమే మీలో కొత్త అర్థాన్ని ఇస్తుంది. సన్యాసనిర్ణయం మీలో ఈ విధంగా పని చేస్తుంది. మీలోని తర్కాన్ని, తెలివిని ఒక పక్కన పెట్టి కేవలం మీలో ఉన్న శక్తికి అనుగుణంగా మీరు సన్యాసం తీసుకుంటే, మీ జీవితంలో జరిగే అద్భుతాల్ని మీరే చూడగలరు. ఎందుకంటే సన్యాసం ముఖ్య లక్షణం, మీతో అవసరం లేకుండానే మీలో మార్పు తీసుకురావటం.
సన్యాసం మాత్రమే మీ భవిష్యత్తుకి పరిష్కారం. ఎందుకంటే సన్యాసం మాత్రమే మీలో మీరు స్థిరపడగలిగే విధంగా చేస్తుంది. ఆ విధంగా స్థిరపడి మీరు బయటి ప్రపంచంలో ఆడుతూ, పాడుతూ ఆనందపారవశ్యంలో జీవించవచ్చు. సన్యాసం మీరు ఎన్ని పాత్రలైనా పోషిస్తూ, దేనిలో కూడా మీరు అదే అనే ముద్ర పడకుండా కాపాడుతుంది. అది మిమ్మల్ని నిత్యం ఉత్సాహభరితంగా ఉంచుతుంది. ఆనందపారవశ్యంతో ఉంచుతుంది. మీరు ఈ భూమి మీద జన్మని ఎందుకు తీసుకున్నారో ఆ అనుభవాన్ని మీకు ఇస్తుంది.
పరమహంస నిత్యానంద స్మృతులు
(ఈ భాగాన్ని పరమహంస బాల్యస్నేహితుడు చెప్పిన కొన్ని విషయాల నుంచి తీసుకోవటం జరిగింది. సంపత్ నిత్యానందకి జ్ఞానోదయం కలగక ముందు చాలా సన్నిహితుడు. ఆయన చిన్నప్పుడు పరమహంసలోని జ్ఞానోదయతృష్ణ గురించి ఈ విధంగా వివరించారు). పరమహంస నిత్యానంద పాలిటెక్నిక్ చదివే రోజుల్లో, ఇక్కడ తాను సాధించే విషయాలు వృథా అనే స్థితికి వచ్చారు. అప్పుడు ఆయన ఒక సేవకుడుగా మారారు. ఎప్పుడైతే ఒకటి సాధించాలనే ఆలోచన మనకి వస్తుందో, అప్పుడు మనం అన్ని విషయాల్ని తోసేసి, కేవలం సాధించాలి అని అనుకున్నా దాని మీద ఏకాగ్రతని నిలుపుతాం. ఇది ఎలా ఉంటుందంటే చిన్న పిల్లవాడి మొండి పట్టులా ఉంటుంది. మనం కావాలి అని అనుకున్నది సాధించే వరకూ నిద్ర, భోజనం వద్దు అని అనుకుంటాం. స్వామి ఆ విధంగా అయ్యారు.
మా సొంత ఊరు తిరువణ్ణామలై గొప్ప ఆధ్యాత్మికకేంద్రం. అక్కడికి చాలామంది ఆధ్యాత్మికయోగులు వస్తుంటారు. వారు ఆ ప్రాంతమంతా ఉంటూ, తమ తమ మార్గాల్లో సత్యాన్వేషణ చేస్తుంటారు. ఆ సమయంలో స్వామి అటుగా వెళ్లే సన్న్యాసుల్ని అర్థిస్తూ ఉండేవారు. ఆయన వారి దగ్గరకి వెళ్లి 'నన్ను మీతో తీసుకు వెళ్ళండి. నాకు ఏదైనా సహాయం చేయండి. దయచేసి నన్ను మీతో తీసుకువెళ్ళండి' అని అడుగుతుండేవారు.
ఆ సమయంలో తిరువణ్ణామలైకి ఒక కొత్త ఆధ్యాత్మిక అన్వేషకుడు వచ్చాడు. అతని వయస్సు 28-30 మధ్య ఉంటుంది. అతనికి, నున్నటి గుండు, దానికి రుద్రాక్షలు ఉండేవి. మెడలో చక్కటి రుద్రాక్షమాల, చెవులకి బంగారు కుండలాలు ఉండేవి. అతన్ని చూడటానికి అచ్చం శివుడిలా ఉండేవాడు. అతన్ని చూస్తే చాలు, ఆయన పాదాలకు నమస్కరించాలనిపించేది. ఆయనలో గొప్ప తేజస్సు ఉండేది. అతను చక్కటి ఆధ్యాత్మిక గీతాలు, పురాతనమైన పద్యాలు పాడుతూ ఉండేవాడు. ఆయన పాడుతుంటే అందరూ కన్నీళ్ళతో ఆ పాటలో కరిగిపోయేవారు.
అతను కేవలం ఒక ఆధ్యాత్మికపరివ్రాజకుడు. అతనికి సత్యాన్వేషణ మీద అంత తీవ్రమైన కోరిక లేదు. అతను చూడటానికి శివునిలా కనపడేటప్పటికీ ఆయనని చూసిన స్వామికి ఆయనలోని కోరిక మరింత రగలసాగింది. ఆయనలో స్వామి శివుడిని మాత్రమే చూడగలిగేవారు. ఆ వ్యక్తిని చూడగానే స్వామి కన్నీళ్ళతో ఆయన పాదాల మీద వాలిపోయారు.
ఆయనని ‘స్వామీ, దయచేసి మీరు నన్ను మీతో తీసుకు వెళ్ళండి. నన్ను మీతో తీసుకు వెళ్ళండి. నేను మీతో వస్తాను. నాకు సహాయం చేయండి’ అని ప్రార్థేయపడ్డారు. స్వామిని అలా చూసి నేను ఆశ్చర్యపోయాను.
స్వామిలోని ఆధ్యాత్మికతృష్ణ శిఖరాగ్రానికి చేరింది. అందుకే ఆయన ఏ యోగిని కాని, సన్న్యాసిని కాని చూస్తే చాలు, నాకు ఏదైనా చేయండి, నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడేవారు. వారెవరూ కూడా స్వామిని చూసి ఆయనకి తాము ఏ సహాయం చేసే అర్హత లేనివారం అని అనుకునేవారు. స్వామి చాలా ఉన్నతస్థితి నుంచి (ఆధ్యాత్మికంగా) వచ్చినట్టు వారికి స్పష్టంగా తెలిసేది. వారంతా ఆయనకి ఏమీ సహాయం చేయలేమని చెప్పి వెళ్ళిపోయేవారు. స్వామి పడుతున్న వేదన చూసి, అప్పటి నా స్థితులతో ఆయనకి తీవ్రమైన కోరిక ఉందని అర్థమైంది. ఆయన యోగుల్ని కన్నీళ్లతో ప్రార్థించే స్థితి చూసి అంతిమ సత్యాన్వేషణకి ఆయన పడుతున్న ఆవేదన అర్థమైంది. ఆయన ఏ విధంగా బాధ పడేవారో నేను మీకు చేసి చూపిస్తే మీరు భరించలేరు.
అటువంటి కొన్ని సంఘటనలు నాలో చాలా లోతైన గుర్తులుగా ఉండిపోయాయి. నేనెప్పుడూ, ఎందుకు ఈయన ఇంత దుఃఖిస్తున్నాడు, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఎందుకు ఇతను ఇవన్నీ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయేవాడిని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. బహుశా అప్పటిలో నేను ఒక రాతి మనిషిగా ఉండేవాడినేమో. నాకేమనిపిస్తుందంటే, ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలన్నా గురుదేవుల కృప అవసరం అని. ఎవరైనా ఆధ్యాత్మికవిషయాలు చెప్పినప్పుడు ఆ విషయాలు మన అంతరంగంలోకి వెళ్ళి అవి అక్కడ పని చేయాలంటే మనకి గురుకృప అవసరం. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, కనీసం నేను స్వామితో ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలైనా అర్థం చేసుకోగలిగాను అని.
నేను స్వామిని అడిగేవాడిని, నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? అని. దానికి ఆయన 'నేను ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఇంకా ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను దేని మీద ఏకాగ్రత నిలుపలేకపోతున్నాను. నేను ఇంకా ఇక్కడ ఉండలేనేమో అనిపిస్తోంది. సమయం వచ్చింది. ఇక నేను వెళ్ళిపోవాలి' అని చెబుతుండేవారు.
అప్పట్లో నాకు ఇటువంటి మరొక జీవితం అనేది ఉంటుంది అని తెలియదు. జ్ఞానోదయమే జీవితం అంతిమలక్ష్యం అని తెలియదు. దాని కోసమే మనం జన్మ తీసుకున్నామని తెలియదు.
ఆ రోజుల్లో ఆయన తనకి ఎవరూ సహాయం చేసేవారు లేక శ్రమపడేవారు. అటువంటి స్థితిలో నేను కూడా వెళ్ళవచ్చు అని ఎలా అనుకోగలను. చాలా సార్లు 'నేను కూడా వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను' అని నాతో అంటే నేను సరే..... సరే..... అని మాత్రం అనగలిగేను కానీ మరేమీ మాట్లాడలేకపోయాను. అంత ధైర్యం చేయలేకపోయాను.
నిజమైన ప్రేమ ఆధ్యాత్మికమార్గంలో అడ్డురాదు
నిజమైన తల్లి సమయం వచ్చినప్పుడు తన బిడ్డలని స్వేచ్ఛగా వెళ్లనిస్తుంది. తల్లి ఎల్లకాలం బిడ్డల్ని తన అధీనంలోనే ఉంచుకోవాలి అని అనుకుంటే, ఆమె ఆ బిడ్డకి జన్మనీయలేదు. బిడ్డకి జన్మనీయటం అంటే ఒక విధంగా స్వేచ్ఛని ఇవ్వటం. ఆమె బిడ్డని తన శరీరం వదిలి వెళ్లనిస్తుంది. ఏ తల్లి అయితే తన బిడ్డలో ఆ తరువాత ఉండే ఉత్తమస్థితికి చేరాలనుకుంటుందో, ఎవరైతే బిడ్డని స్వేచ్ఛగా వెళ్ళనిస్తారో, ఎవరైతే తన బిడ్డకి చక్కని ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతారో, ఆమె మాత్రమే నిజమైన తల్లి. ఒక విషయం అర్థం చేసుకోండి; మీరు అంతగా బిడ్డని మీ ఆధీనంలోనే ఉంచాలి అని అనుకుంటే, మీరు బిడ్డని స్వేచ్ఛగా వెళ్ళనీయటం అంత బాధగా ఉంటే, అప్పుడు బిడ్డకి అసలు జన్మనియకూడదు. తల్లిబిడ్డల మధ్య ఉన్న ఆ పేగు బంధాన్ని తెంచకుండా అలా ఉంచేయాలి. మీరు బిడ్డకి జన్మనిస్తేనే కదా ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యేది. అదే విధంగా ఆ బిడ్డతో బంధాన్ని తెంచి స్వేచ్ఛని ఇస్తేనే కదా ఆ బిడ్డ మానసికంగా పెరిగేది. భౌతికంగా బంధాన్ని తెంచేస్తే అది జన్మ. మానసికబంధాన్ని తెంచేస్తే అది సన్న్యాసం.
అర్థం చేసుకోండి; ఈ విధంగా చూస్తే నేను చాలా అదృష్టవంతుడినని. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి 'నేను సన్న్యాసజీవితం కోసం ఇల్లు వదిలి వెళుతున్నాను' అని రాత్రి 11 గం. సమయంలో చెప్పాను. అంతకు ముందు నేను గుడికి వెళ్ళి కొంత సమయం అక్కడ గడిపి ఇంటికి మామూలు సమయానికి వచ్చాను. తాళంతో తలుపు తీసి లోపలికి వెళ్ళాను, యోగులు వేసుకొనే చెక్క పాదుకలు వాడేవాడి రాతి నేల మీద అవి శబ్దం చేసేవి. ఆ శబ్దం విని మా అమ్మ వచ్చి నాకు భోజనం పెడుతుంది. ఒక్కొక్కసారి గుడిలోనే నేను ఏదైనా తింటే ఆ విషయం మా అమ్మకి చెప్పి, ఇద్దరం నిద్రపోయేవారం.
ఆ రోజు రాత్రి కూడా మా అమ్మ నాకు భోజనం సిద్ధం చేస్తోంది. ఆమెని పిలిచి 'అమ్మా, నేను సన్న్యాసజీవితం కోసం ఇల్లు వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నేను గుడిలో భోజనం చేశాను. అయినా నాకు భోజనం పెట్టు. నేను తింటాను. ఎందుకంటే రేపు నేను ఉండను' అని చాలా మామూలుగా చెప్పాను. కానీ అది ఆమెకి ఒక అనుకోని షాకు. ఆమె నాతో ఏమీ అనలేదు. ఒక సంగతి నేను ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే మారను అని వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి ఒక విషయాన్ని నేను చెప్పే ముందు నా అంతరంగంలో ఆ విషయం మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంటుందని అందరికీ తెలుసు. నేను ఏదైనా చెప్పానంటే అది జరుగుతుందని తెలుసు.
ఆమె కళ్ళ నుంచి నీరు రావటం మొదలైంది. నేను ఆమె వైపు చూసి 'అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు? అంటే నన్ను వెళ్ళవద్దు అని చెబుతున్నావా?' అని అడిగాను. ఆమె కాదు అన్నట్టు తల తిప్పుతూ 'కాదు, నేను ఆ విధంగా అనటం లేదు. నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. అందుకే ఏడుపు వస్తూన్నది. నేను ఎందుకో ఈ విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నాను. అంతే. నీవు వెళ్ళవద్దు అని నేను ఎలా చెప్పగలను? అంది.
ఇంత కాలం బట్టి నన్ను చూస్తున్నది ఇటువంటి రోజు వస్తుందని తెలుసు. ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానని తెలుసు. నా జాతకంలోనే అది ఉంది. ఇందులో చక్కని విషయం ఏమిటంటే, ఆమె ఎప్పుడూ లేదు అని చెప్పలేదు. ఆమె అలా అడ్డుపెట్టకపోవటమే కాదు, ఈ విషయాన్ని మా నాన్నగారికి ఆమె చెప్పింది. మా నాన్నగారు మరోలా అనుకున్నారు. మా అమ్మ నన్ను తిట్టింది కాబోలు, అందుకు కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నానని ఆయన, మా అమ్మని ‘ఎందుకు తిట్టావు. ఎందుకు అతనికి సమస్యలు సృష్టిస్తున్నావు’ అని గట్టిగా అడిగారు. మా అమ్మ అది కాదు అని చెప్పాక ఆయన మౌనంగా ఉండిపోయారు.
అది మామూలుగా, తిన్నగా చెప్పిన ఒక మాట. మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి కూర్చొని, ‘స్వామీ మీ అమ్మ నీవు ఏదో అన్నావని చెబుతుంది అది నిజమేనా? అని అడిగారు. తమాషాగా, అనుకోకుండా ఆ రోజుల్లో అందరూ నన్ను స్వామీ అని పిలిచేవారు. ‘అవును సన్యాసజీవితం కోసం, జ్ఞానోదయం కోసం ఇల్లు వదలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను,’ అని జవాబు ఇచ్చాను. ఇది ఆయనకి ఒక షాకు. కానీ ఆయనకి నేను చాలా విరామంగా, దృఢంగా, స్పష్టంగా, సమతుల్యంగా ఉండటం కనిపించింది. ఆయన నాతో ఒక్క మాట మాత్రం చెప్పారు. ‘ఎప్పుడైనా నీకు ఆరోగ్యం బాగా లేకపోతే మాకు తెలియచేయి, మేం నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం అంతే’ అని చెప్పారు. ఆయన చాలా మామూలుగా చెప్పారు. ఎప్పుడైనా నీ ఆరోగ్యం బాగా లేకపోతే, ప్రయాణంలో ఇబ్బంది కలిగితే మాకు తెలియచేయి. మేం వచ్చి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. ఇది తప్ప ఇంకేమీ లేదు. నీకు ఏది ఇష్టం అనిపిస్తే అలాగే చేయి.
నా తల్లితండ్రులు నా మార్గానికి ఎప్పుడూ అడ్డుపడలేదు. ఒక విషయం అర్థం చేసుకోండి. అనుబంధాలు ఏవైనా సరే, తల్లిదండ్రుల, బిడ్డల మధ్య అనుబంధమైనా, పిల్లల ప్రగతికి అడ్డు రాకపోతే అది చాలా మంచి అనుబంధం. నేను చాలా మంది యువకుల్ని చూసాను. చాలా ధైర్యంగా, ఉత్సాహంగా, ఆధ్యాత్మికమార్గాన్ని ఎంచుకునే శక్తి ఉంటుంది కానీ వారికి ఆ అవకాశాన్ని ఇవ్వరు. వారిలో శోధనలు చేయనీయరు వారి తల్లితండ్రులు.
వారంతా మామూలు జీవితంలో నిమగ్నమై, తల్లితండ్రుల అహంకారాన్ని తృప్తి పరుస్తూ, బిడ్డల్ని పెంచుతూ జీవించేస్తారు. ఎవరో, ఏ కొద్ది మందో మాత్రమే అన్వేషించే ధైర్యంతో ముందుకి సాగుతారు. నేను మీ పిల్లలని స్వాములుగా చేయమని చెప్పటం లేదు. ఎవరికైనా ఆ జీవితం పట్ల ఆసక్తి కలిగితే వారికి అడ్డు రావద్దు అని మాత్రం చెబుతున్నాను. వారి మార్గానికి అడ్డు రాకుండా ఉంటే మీరు అదృష్టవంతులవుతారు.
మీ పిల్లలు ఎంచుకున్న మార్గాన్ని వివేకంతో గమనించండి. మీ బిడ్డ అంతిమమార్గాన్ని ఎంచుకున్నాడు. అతను ఆ మార్గంలో బాధ పడినా, దుఃఖపడినా, అపజయం పొందినా ఏమీ పరవాలేదు. ఆ విషయంలో భయం వద్దు. నేను ఇంతకు ముందు పది జన్మల్లో అపజయాన్ని పొంది ఉండి ఉండవచ్చు. అందుకే ఈ జన్మలో విజయం సాధించాను.
మరొక విషయం సన్యాసానికి మీరు పడుతూ, జ్ఞానోదయాన్ని పొందకపోయినా పరవాలేదు. అది అపజయం కాదు. అది ఘనవిజయం. ఎందుకంటే మీరు పూర్ణత్వంలో జీవించారు. అది కూడా చేతనస్థితిలో మీరు పూర్ణత్వంలో జీవించారు. చేతనస్థితిలో ఉన్నప్పుడు సర్వాంతర్యామి నిరంతరం మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. ప్రతి దశలో మీకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఏ పరిశోధన అయినా, చేతనస్థితిలో మీరు చేసే ఏ సాహసకార్యమైనా దాన్ని ప్రోత్సహించండి, అనుమతించండి. వారికి ఆధారంగా నిలబడండి. నేను నా తల్లిదండ్రులకు నా మార్గంలో అడ్డు కల్పించనందుకు వారికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియచేస్తుంటాను.
✤ ✤ ✤
- మనం మన చుట్టుపక్కల వున్నవారితో, సర్వసృష్టికి అనుగుణంగా ఉండగల శక్తి మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.
- ఎప్పుడైతే జీవితం ఒక ప్రవహిస్తున్న నదిలా ఉంటుందో, అప్పుడు అది సాగరంలో కలసిపోవాల్సిందే.
- సాధన అంటే సరైన దిశలో, ఎక్కడా ఆగకుండా అలా నిరంతరం ప్రవహిస్తున్నట్టు వెళుతూ ఉండటమే.
- విశ్వశక్తికి ఆధీనమై, ఆ శక్తి తాలూకు మేధకి అనుగుణంగా ముందుకి సాగటమే సన్న్యాసం.
- ఎప్పుడైతే ఇదంతా ఒక మాయ-మిథ్య అని తెలుస్తుందో, మీరు దేన్నీ సన్న్యసించరు. మీరు అన్నింటితోనూ జీవిస్తారు కాని దేని వల్లా మీ నిశ్చలతని పోగొట్టుకోరు.
- మనస్సుని ఐదు జ్ఞానేంద్రియాల నుంచి మళ్లించటం అనేది, జ్ఞానేంద్రియాలు ఆత్మలో ఐక్యమైనప్పుడే సాధ్యమవుతుంది.
- సామాన్యంగా అందరూ ప్రేమ అనుకునే ప్రేమ ఒక కారణంతో లేదా కోరికతో ఉంటుంది.
- జీవితపరిష్కారాల్ని మీ అంతరంగానికి అన్వయించటం ద్వారా స్వేచ్ఛని మేల్కొలపండి. ఆ విధంగా వచ్చే స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ.
- నిజమైన తల్లి సమయం వచ్చినప్పుడు తన బిడ్డలని స్వేచ్ఛగా వెళ్లనిస్తుంది. తల్లి ఎల్లకాలం బిడ్డల్ని తన ఆధీనంలో ఉంచుకోవాలి అని అనుకుంటే, ఆమె ఆ బిడ్డకి జన్మనీయలేదు.
మీ సామ్రాజ్యానికి తాళం చెవి జ్ఞానోదయం
పరమానందం అనే మీ రాజ్యాన్ని తిరిగి పొందటమే జీవన్ముక్తి
ఇప్పుడు మనం అంతిమదశకి చేరాం. దీన్నే నేను అత్యున్నత అనుభవం అంటాను. మనం ఎవరు అని తెలుసుకొని ఈ విశ్వంలో అంతిమజ్ఞానాన్ని, అనుభవాన్ని తెలుసుకోవటమే. అజ్ఞానం అనే చీకటి నుంచి సత్యం అనే వెలుగులోకి వెళ్ళాం. మనం జ్ఞానోదయాన్ని పొందాం.
జ్ఞానోదయమైనవారు ఈ భూమి మీద ఎందుకు అవతరిస్తారు
ఎవరైనా ఈత కొడుతుంటే మీకు మూడు విషయాలు అర్థం అవుతాయి, మొదటిది ఈత కొట్టడం సాధ్యమే, మనిషి నీళ్ళలో తేలగలడు. రెండవది, ఒక వ్యక్తి ఈత కొట్టకలిగితే నేనెందుకు చేయలేను. నేను ఈతకొట్టగలను. మూడవది, నేను కూడా నీళ్ళలోకి దూకుతాను అనే ప్రోత్సాహం, ధైర్యం మీకు కలుగుతాయి.
అదే విధంగా జ్ఞానోదయమైనవారు ఈ భూమి మీద నడుస్తూ ఉంటే, వారిని చూసినపుడు, వారి పరిసరాల్లో మీరు ఉండగలిగినప్పుడు మీకు మూడు విషయాలు అర్థం అవుతాయి. మొదటిది జ్ఞానోదయం సుసాధ్యమే. మీరు కూడా భూమి మీద భగవంతునిలా జీవించవచ్చు. రెండవది, వారికి జ్ఞానోదయం జరిగినప్పుడు, నాకెందుకు జరగదు? జ్ఞానోదయమైనవారు అతిసాధారణంగా ఉంటూ, సామాన్య మానవునిలా ఉంటారు. అప్పుడు మీకు మీ మీద నమ్మకం కలుగుతుంది. అది సాధ్యమే అనిపిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానోదయమైనవారు సమక్షంలో ఉంటారో, వారి కదలికల్ని, వారిని నిరంతరం గమనిస్తుంటారో అప్పుడు మీలో ఈ మూడూ జరుగుతాయి.
విశ్వం చేసే ఐదు పనులు
ఐదు విశ్వ కర్మలు ఉంటాయి. వాటిని పంచకర్మలు అంటారు. అవి సృష్టి, రక్షణ, నాశనం, మాయని సృష్టించటం, మాయ నుంచి ఆత్మని బయటకి తీసుకురావటం. భగవంతుడు ఈ ఐదు పనులూ చేస్తాయి.
నటరాజుకి నాలుగు చేతులు ఉంటాయి. అతనిపై చేతిలో డమరుకం ఉంటుంది, అది సృష్టికి చిహ్నం. డమరునాదం నుంచి సమస్తసృష్టి ఉద్భవించింది అంటారు. కింది చేతులు రక్షణని ఇస్తుంటాయి, పై ఎడమ చేతిలో మంట ఉంటుంది. అది నాశనానికి చిహ్నం. ఆయన మెడ చుట్టూ ఉండే సర్పం మాయకి గుర్తు. ముక్తికి ముందు దీనిలోనే చిక్కుకుంటారు. ఆయన పాదలూ కింద ఉన్న రాక్షసుడు మాయ నుంచి బయటికి రావటానికి గుర్తు. శివుడు మాయని తన పాదలూ కింద నాశనం చేస్తాడు. ఈ ఐదు పనులూ చేస్తూ కూడా శివుడు ప్రశాంతంగా, పరమానందంలో ఉంటాడు. ఆయన తాండవం చేస్తూనే ఈ ఐదు పనులూ చేస్తుంటాడు. ఈ ఐదు పనులూ చేసే శక్తి విశ్వశక్తి. శివుడు మొదటి నాలుగు పనులు సృష్టి, రక్షణ, నాశనం, మాయని సృష్టించడం - అనేవాటిని ఆయన నిర్వాణశరీరంతో చేస్తాడు. నిర్వాణశరీరం ఏడు శరీరాల్లోనూ లోతైనది. దివ్యవిశ్వశక్తి తన నిర్వాణశరీరం నుంచి ఈ ఐదు పనులూ చేస్తుంది. ఈ పనులు చేయటానికి విశ్వశక్తి ఏ రూపాన్నీ తీసుకోవనవసరం లేదు. శక్తిస్థాయిలోనే పరమాత్మ ఈ పనులు చేయగలడు.
అయితే ఐదవదైన, మాయ నుంచి మనిషిని బయటికి తీసుకురావటం అనే పనిని కేవలం మానవరూపంలో మాత్రమే చేయగలడు. విశ్వశక్తి ముందు నాలుగు పనులు చేయటానికి మీ సహకారం అవసరం లేదు కాని, మనిషిని మాయ నుంచి బయటికి తీసుకురావటానికి వారి సహాయం కావాలి.
సృష్టికి మీ అనుమతి అవసరం లేదు. రక్షణకి మీ మీద ఆధారపడదు. అదే విధంగా నాశనం మీకు తెలియ కుండా జరుగుతుంది. మిమ్మల్ని మాయలోకి పంపించటానికి మీ సహాయం అవసరం లేదు. అయితే మిమ్మల్ని మాయ నుంచి బయటికి లాగటానికి మీ సహాయం కావాలి.
భగవంతుడు మీకు ముక్తిని ఇచ్చే వీసా ఇవ్వటానికి దరఖాస్తు నింపమని అడగటమే ఇది. దాన్ని నింపి, సంతకం పెట్టి ఇవ్వాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే దరఖాస్తు మీరు పూర్తిగా నింపరు. నింపే పనిని ఆలస్యం చేస్తారు. మీకు నమ్మకమైన ఆధారాన్ని ఇవ్వటానికి భగవంతుడు మానవరూపంలో వస్తాడు. మీకు జ్ఞానోదయం కలిగేలా చేయటానికి మనిషి రూపం తీసుకుంటాడు. ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరునిలా ఈ భూమి మీదకి వస్తాడు. ఈ భూమి మీదకి జ్ఞానోదయమైన మానవుడుగా వచ్చినప్పుడు, ఏడు శరీరాలతో వస్తాడు. ముందు నాలుగు పనులు చేయటానికి ఆయనకి నిర్వాణశరీరం ఒక్కటి చాలు, కాని మీకు జ్ఞానోదయం కలిగేలా చేయటానికి వచ్చినప్పుడు ఆయన ఏడు శరీరాలతో వచ్చి మిమ్మల్ని పైకి లేపుతారు.
పెద్ద అడుగు
ధ్యానకార్యక్రమాల్లో నన్ను చాలా మంది అడుగుతుంటారు. ధ్యానం చేసినప్పుడు నాలో లోతైన ప్రశాంతత కలిగింది, శక్తి కలిగింది. అంటే నేను జ్ఞానోదయానికి దగ్గరగా ఉన్నాను అని అర్థమేనా?
ముందుగా మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, మనం నిరంతరం జ్ఞానోదయానికి దగ్గరగానే ఉంటాం. అది ముఖ్య విషయం. మనం ఎప్పుడు జ్ఞానోదయానికి దగ్గరగానే ఉంటాం. ఒకరు దానికి దగ్గరగా ఉన్నారు, మరొకరు లేరు అనేది తప్పు భావం. ఉన్నది రెండు రకాలవారే, జ్ఞానోదయమైనవారు, కాని వారు అంతే. మీకు జ్ఞానోదయం జరగకపోతే, స్పష్టంగా తెలుసుకోండి మీరు జ్ఞానోదయానికి దగ్గరగా ఉన్నారు అని మీరు 99.9 శాతం జ్ఞానోదయం పొందినా, మీరు జ్ఞానోదయం పొందలేదు అని అర్థం. జ్ఞానోదయం సంపూర్ణమైన మార్పు. ఇది ఎలా అంటే నీరు కేవలం 100 డిగ్రీల దగ్గర మాత్రమే ఆవిరిగా మారుతుంది, 99 డిగ్రీల దగ్గర నీరులానే ఉంటుంది. కేవలం 100 వ డిగ్రీ మాత్రమే నీటిని ఆవిరిగా మారుస్తుంది. ఎప్పుడైనా అది నీటిలా ఉండాలి లేదా ఆవిరిలా ఉండాలి కాని రెంటిటిలా ఉండదు. వేడి నీరు కూడా నిప్పుని చల్లారుస్తుంది. అంటే అది ఇంకా నీటి లక్షణాలనే కలిగి ఉన్నది కాని ఆవిరి లక్షణాల్ని కాదు. ఆవిరితో నిప్పుని ఆర్చలేరు కాబట్టి వేడి నీరైనా నీటి లక్షణాలనే కలిగి ఉంటుంది. అదే విధంగా ఎప్పుడైనా మీరు జ్ఞానోదయం పొంది ఉండాలి లేదా పొందకుండా ఉంటారు. అంతే కాని ఒకే సమయంలో రెండు సాధ్యం కాదు కాబట్టి దగ్గర అనే ప్రసక్తి లేదు.
మనం నిరంతరం జ్ఞానోదయానికి దగ్గరగా ఉంటాం
ఒక విషయం అర్థం చేసుకోండి, జ్ఞానోదయం మీకు పొడిగింపు కాదు. మీరు ఇప్పుడు ఉన్నదాని కంటే కొంచెం అభివృద్ధి కాదు, అది ఒక పెద్ద అడుగు వేయటానికి కాని పొడిగింపు కాదు. ఆధ్యాత్మికక్రమంలో మీలో కొంత అభివృద్ధి, కొంత స్పష్టత ఇలాంటివి జరిగితే అవి మాములే. ఇవన్నీ మీరు సరైన దారిలో ఉన్నారు అనటానికి చిహ్నాలు. మీరు హైదరాబాద్‌కు 100 కి.మీ. అన్న బోర్డు చూస్తే, అది హైదరాబాద్‌కు దారి అని మీకు చెప్పటం. మీరు ఉన్నది సరైన మార్గంలోనే అని మీకు తెలుస్తుంది. అంతే కాని మీరు గమ్యం చేరారని అర్థం కాదు.
మనం నిరంతరం ఎదుటివారు చెప్పే ఓదార్పు మాటల మీద ఆసక్తి చూపుతాం, మీరు వారి ఆసరా కోరుకుంటారు. అదే విధంగా మీరు వారికి ఆధారాన్ని ఇస్తారు, కాని గురుదేవులకి మీ ఆసరా అవసరం లేదు. అందుకే ఆయన తిన్నగా మీకు సత్యాన్ని చెబుతారు.
ఎక్కడ 99.9 శాతం జ్ఞానోదయం అనేది లేదు, అదే విధంగా జ్ఞానోదయానికి దగ్గరగా ఉన్నాను అన్నది కూడా లేదు. అయితే ఇంకా జ్ఞానోదయాన్ని పొందినవారు లేకపోతే ఇంకా జ్ఞానోదయాన్ని పొందనివారై ఉండాలి, జ్ఞానోదయం అంటే సంపూర్ణమైన 'అవును' లేదా సంపూర్ణమైన 'కాదు' మధ్యలో మరేదీ ఉండదు. ఒక దశ తరువాత మరొక దశలో సాగే కార్యక్రమం కాదు జ్ఞానోదయం అంటే. కోతి నుంచి మానవుడుగా అభివృద్ధి చెందిన క్రమంలో ఆ తరువాత మనం తీసుకునే ఒక పెద్ద అడుగే అంతిమమైన దశ జ్ఞానోదయస్థితి.
జ్ఞానోదయం అసలైన లక్ష్యం
మీరు దారిలో ఉన్నప్పుడు, ఆగి గతాన్ని రికార్డు చేయనవసరం లేదు. మీరు ఆగి గతాన్ని రికార్డు చేస్తున్నారు అనుకుంటే, స్పష్టంగా అర్థం చేసుకోండి అక్కడ రావలసిన మార్పు రాలేదు అని అర్థం. ఎప్పుడైతే మీలో స్పష్టమైన పెను మార్పు వస్తుందో, మీరు ఒక పెద్ద అడుగు వేయగలరో, మీరు ఎంత అభివృద్ధి చెందారు అని లెక్కలు కట్టలేరు. ఆ అవసరం ఉండదు. ఆ అడుగు మీ తర్కానికి అతీతంగా ఉంటుంది. ఆపెద్ద అడుగు వేసాక మీరు పూర్తిగా ఒక కొత్త వ్యక్తిగా రూపొందుతారు. మీ శరీరం మానవశరీరంలా ఉండవచ్చు కాని మీ అంతరంగం పూర్తిగా మారిపోతుంది. మీ జీవనసరళిలో గొప్ప మార్పు వస్తుంది.
జ్ఞానోదయం అంటే...
1. అవధులు లేని అనంతమైన అనుభవం : అవధులు లేని అనంతమైన అనుభవంతో సాగిపోతూ జీవించటమే జ్ఞానోదయం. ఎప్పుడైతే మీరు మీలోని బయటి ప్రపంచం, అంతరంగప్రపంచపు గుర్తింపుల్ని వదిలేసి విరామంగా ఉండగలరో అప్పుడు మీరు అనుభూతితో జీవించగలరు. ఎప్పుడైతే మీరు అనంతమైన అనుభవంలో స్థిరపడతారో, ఎక్కడ చైతన్యంతో ఉండగలుగుతారో అప్పుడు మీరు జీవన్ముక్తులు. మీరు అందులో స్థిరపడలేకపోతే, కనీసం మీకు ఆ అనుభవం ఒక సారైనా జరిగితే అప్పుడు మీ అనుభవాన్ని సతోరి అంటారు.
2. ఆత్మని, ప్రపంచాన్ని, భగవంతుడిని తెలుసుకోండి : జ్ఞానోదయానికి కావలసిన ప్రాథమిక సూత్రం మీలో మానసికవిప్లవం రావాలి. మీ గురించి, ప్రపంచం గురించి, భగవంతుని గురించి మీలో ఒక కొత్త రకమైన స్పష్టత కలగాలి.
మీరు ఎందుకు, ఎలా ఆలోచించారు, మీరు ఎలా ముందుకు నడపబడుతున్నారు. మీలో ప్రోత్సాహాన్ని కలిగించేది ఎవరు, మీ జీవితానికి ప్రేరణ ఏమిటి - ఇది అర్థం అవటమే మీ జీవితానికి, మీ ఆత్మకి సంబంధించిన స్పష్టత ఇస్తుంది. ప్రపంచంలో మీ కోరికలు ఎలా తీర్చుకోవాలి, భయాలు ఏ విధంగా తొలగించుకోవాలి, ప్రపంచం మీ మీద బలంగా మోపిన విషయాల్ని ఎలా తప్పించాలి అనే విషయాల్ని స్పష్టంగా అర్థం చేసుకోవటమే జగత్తు.
భగవంతుడు లేదా ఈశ్వరుని పట్ల స్పష్టత అంటే, ఆత్మ గురించి, ప్రపంచం గురించి తెలుసుకోవటమే. ఈ మూడింటినీ తెలుసుకోవటం అసలైన మూలాలని సాధించటమే జ్ఞానోదయం అంటే.
మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు అనే దాన్ని పట్ల స్పష్టత కలిగితే మీకు ఆత్మ అనుభవాన్ని ఇస్తుంది. మీరు ప్రపంచంతో ఏ విధంగా బంధాల్ని ఏర్పరచాలి. భయంతో ఆశతో మీరు కోరుకున్నవాటిని సాధించాలి అని అనుకోవటం, మీకు అవసరం లేని dాన్ని వదిలేయటం - వీటి ద్వారా ప్రపంచానికి సంబంధించిన అనుభవం జరుగుతుంది. ఈ ఆత్మకి, ప్రపంచానికి ఆధారమైన మూలాలు భగవదనుభవాన్ని ఇస్తాయి. ఆత్మ, ప్రపంచం, భగవంతుడు అనే ఈ మూడు విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకోవటమే జ్ఞానోదయం అంటే.
3. కారణం లేని లోతైన, అధికమైన ఉత్సాహం : నన్ను చాలా మంది అడుగుతుంటారు, జ్ఞానోదయం అయ్యాక దేంతోనైనా ఉత్సాహం, సంతోషం పొందగలమా అని. నేను చెబుతున్నాను, జ్ఞానోదయమైన తరువాత మాత్రమే మీరు నిజమైన ఆనందాన్ని పొందగలరు. అంతకు ముందు మీరు కేవలం సంతోషంగా ఉన్నాననుకుంటారు, అలా ఆలోచిస్తారు. జ్ఞానోదయం తరువాత సంతోషంగా, ఉల్లాసంగా ఉండటానికి జ్ఞానేంద్రియాలతో అవసరం లేదు. మీరు నిరంతరం ఆనందంలో ఉంటారు. ఏ కారణం లేకుండా ఉరకలెత్తే ఉత్సాహంతో, ఆహ్లాదంతో ఉంటారు. జ్ఞానోదయం అనే మాటని రెండు పదాల్లో నిర్వచించాలంటే, అది అత్యధికమైన ఉత్సాహం అని చెప్పవచ్చు, ఏ కారణం లేకుండా, ఏ వస్తువు పైనా లేకుండా ఉండే అధికమైన ఉత్సాహపూరితమైన మనోభావన. అదే జ్ఞానోదయం అంటే.
నన్ను చాలా మంది అడుగుతుంటారు, ఏ కారణం లేకుండా ఎలా సంతోషంగా ఉండగలం అని. నేను వారితో ఇలా అంటాను - మీకు కారణం లేకుండా బాధపడే ఒక రహస్యం మాత్రమే తెలుసు. ఆ కళలో మీరు ఆరితేరారు. ఆ రంగంలో మీకు డాక్టరేటు ఉంది. దాన్ని కొంచెం మార్చండి. అంతే మనకి అది తెలిసినప్పుడు, ఇది నేర్చుకోలేమా?
మీరు చాలా సార్లు మూడ్ బాగా లేదు అని, ఎందుకు అలా ఉన్నారో కారణం కోసం వెతుకుతారు. కాని మీరు కారణాన్ని తెలుసుకోలేరు. ఏదో బాధతో ఉంటారు. మీలోని రసాయనశాస్త్రం లేకుండా బాధలోకి వెళ్ళటానికి అలవాటు పడిపోయారు. కొంత కాలం గడిచాక మీలోని రసాయనశాస్త్రం దీన్ని నేర్చుకుంటుంది. దాంతో అది మీ అంతరంగంలో స్థిరపడిపోతుంది, మీరు కారణం లేకుండానే బాధల్లోకి వెళ్ళగలుగుతారు. జ్ఞానోదయం అంటే ఎక్కడికో పారిపోవటం కాదు. జీవితాన్ని ఇక్కడే, ఇప్పుడే రుచి చూడటాన్ని నేను జ్ఞానోదయం అంటాను.
4. మిమ్మల్ని మీరు చూసుకున్నట్టే ఎదుటివారినీ చూడటం : మీరు పొందే లోతైన జీవితానుభవాన్ని మీ శరీరం బయట, మీ అంతరంగంలో పొందటాన్ని నేను జ్ఞానోదయం అంటాను. మీరు మీ శరీరం లోపల మాత్రమే జీవించి లేరు. మీరు మీ శరీరం బయట ప్రతి వ్యక్తిలో, వస్తువుల్లో, చెట్లు, జంతువుల్లో, రాళ్ళలో ఉన్నారు. మీ శరీరం మీద మీకు ఉన్న పట్టు విశ్వశరీరం మీద పట్టుగా మారుతుంది. విశ్వంలోని ప్రతి అణువులో మీరు ఉంటారు. ప్రతి అణువూ విశ్వంలో ఒక భాగం.
వేదాల్లోని పురుషసూక్తంలో ఒక చక్కని శ్లోకం ఉంటుంది.
ఓం సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠతా తశాంగులం
ఈ శ్లోకంలో విశ్వాన్ని అందమైన మానవరూపంలో 'పురుషుడుగా' వర్ణించారు. ఆయనకి వేయి తలలు, వేయి కళ్ళు, వేయిపాదాలు ఉన్నాయని చెప్పారు. ఆ రూపం భూమినంతా ఆవరించి, దానికి పది రెట్లు ఎక్కువగా ఉంది అన్నారు, ఇదే జ్ఞానోదయఅనుభవం.
ఒక విషయం అర్థం చేసుకోండి, నేను నా శరీరంలో ఎంత జీవించి ఉన్నానో శరీరం బయట కూడా అంతే జీవించి ఉన్నాను. కాబట్టి నేను లక్షల తలలలో, కళ్ళలో, పాదాల్లో ఈ విశ్వంలోని కోటాను కోట్ల జీవరాసుల్లో ఉన్నాను.
ఈ విషయం సాధించాలంటే మీరు ప్రతిదాన్ని మొదటిసారి చూస్తున్నట్టుగా చూడాలి. ఆ చూసే దానిలోకి మీ సంస్కారాల్ని (మీలో నిక్షిప్తమైన జ్ఞాపకాలు) తీసుకురావద్దు. అప్పుడు మీరు మీ శరీరంలో ఎంత లోతుగా, ఎంత గాఢతతో జీవిస్తారో మీ శరీరం బయట కూడా అంతే గాఢతతో జీవిస్తారు. మీరు దీన్ని పది రోజులు సాధన చేయండి. మీకు ఒక్కసారి ఒక క్షణం ఆ అనుభవం అయితే, మీరు దాన్ని ఎన్నటికీ పోగొట్టుకోరు. మీరు కారణం లేకుండా ఆనందపారవశ్యంలో ఉంటారు. ఏ కారణం లేకుండా మీరు ఉల్లాసంగా ఉంటారు. మీరు ఏ విషయాన్ని యధాలాపంగా తీసుకోరు. మీరు నిరంతరం ఉల్లాసంగా ఉంటారు.
5. బంధవిముక్త : ప్రస్తుతం మీరు మీ గతానుభవాల్ని కలిపి ఒక గొలుసు తయారు చేసుకుంటారు. మీ భవిష్యత్తులో జరగబోయే అనుభవాలు ఈ గొలుసు మీద ఆధారపడి ఉంటాయి. మీ గతం నుంచి ఏ పదాలని తీసుకున్నారో, ఏ విధంగా గొలుసు తయారు చేశారో దాని మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో మీ మాటలు, భావావేశాలు, ప్రతి చర్యలు, ఆలోచనలు - అన్నీ ఈ గొలుసు మీద ఆధారపడి ఉంటాయి. అయితే జ్ఞానోదయం జరిగాక జీవితం దీనికి వేరుగా ఉంటుంది. అవసరమైనప్పుడే ఆలోచనలు వస్తాయి. ఆ పని అయిపోయాక ఆలోచనలు మాయమైపోతాయి. మళ్ళీ ఏదైనా పని ఉంటే ఆలోచనలు వస్తాయి, ఇదంతా చాలా చక్కగా, సహజంగా జరిగిపోతుంది. గొలుసుతో అవసరం ఉండదు.
మనందరం నిద్ర లేచిన దగ్గర నుంచి, నిద్ర పోయే వరకూ నిరంతరం ఒక రకమైన చికాకుతో ఉంటాం. ఏదో ఒక చికాకుని మోస్తూ ఉంటాం. ఎప్పుడూ ఎవరి మీద విరుచుకుపడాలా అని చూస్తుంటాం. ఏదో కారణం దొరికితే చాలు అన్నట్టు ఉంటాం. జ్ఞానోదయం తరువాత చికాకుని కలిగించే భయం, ఆశ, అపరాధభావం ఇటువంటివి ఉండవు. మీరు ఆ గొలుసుల బంధం నుంచి కొద్ది సమయం, ఒక క్షణం బయటికి రాగలిగినా మీరు జ్ఞానోదయఅనుభవాన్ని క్షణకాలం పొందగలరు.
ఆ గొలుసు నుంచి బయటికి క్షణ కాలంలో రాగలరు. మీరు లోతైన తెలుసుకునే తత్వంలో ఉన్నప్పుడు, మీరు ఆ క్షణాన్ని, ఎప్పుడైతే మీరు గొలుసు నుంచి విముక్తి అవుతారో ఆ క్షణాన్ని పట్టుకోగలుగుతారు. మనం చేసే తపస్సు, ఆధ్యాత్మిక శిక్షణ అంతా కూడా ఆ క్షణాన్ని పట్టుకోవడానికి. అటువంటి క్షణాలు చాలా జరుగుతాయి. మీరు ఎరుకతో ఉండి ఆ క్షణాన్ని పట్టుకోగలగాలి. మీరు ఆ గొలుసు నుంచి శాశ్వతంగా విముక్తి అయితే అదే జ్ఞానోదయం.
6. నాలుగు శాశ్వతమైన మార్పులు : నాకు జ్ఞానోదయం కలిగినప్పుడు నాలో శాశ్వతమైన కొన్ని మార్పులు జరిగాయని చెప్పగలను.
జ్ఞానోదయం జరిగాక నిరంతరం ఉండే భయం, అపరాధభావం, కోరిక, నిరంతరం ఉండే చికాకు, పూర్తిగా మాయం అయిపోయాయి.
అందులో మొదటిది, అంతరంగంలో నిరంతరం జరిగే అంతరంగపు మాటలు ఆగి పోయాయి. మనందరిలో సాధారణంగా మాటలు జరుగుతుంటాయి. నేను మాట్లాడే సమయంలో మాటికి మధ్య విరామంలో కూడా నా అంతరంగంలో మాటలు ఉండవు. లోపల స్వచ్ఛమైన ఖాళీ ప్రదేశం, నిశ్శబ్దం మాత్రమే ఉంటాయి.
రెండవది నేను ఇక్కడితో ఆగి, ఇక్కడి నుంచి బయటి ప్రపంచం ఉంటుంది అనే భావన నాలోంచి పోయింది. నా హద్దు నాలో లేదు. నన్ను నేను అన్నింటిలో చూడగలను. ఆ భావంతో ఉంటాను. మీరు నన్ను గమనిస్తే, నా ఫోటోలు చూసి ఆనందపడే మొదటి వ్యక్తిని నేనే. నేను వాటితో నాలుగు - ఐదు రోజులు ఆడుకుంటాను.
నన్ను కొంత మంది అడుగుతుంటారు, ఇదేమిటి స్వామీజీ! మీరు మీ ఫోటోలు చూసి ఆనందిస్తున్నారు అని. నేను ఈ ఆరడుగుల రూపం మాత్రమే అనుకోను. మీరు ఏ విధంగా ఈ రూపాన్ని చూసి సంతోషిస్తారో నేను కూడా అదే విధంగా ఈ రూపాన్ని చూసి సంతోషిస్తాను. ఈ రూపం విశ్వంలో ఒక భాగంగా సంతోషిస్తాను. నిజం చెప్పాలంటే మీరు మీ ఫోటో చూసి ఆనందించటానికి మొహమాటపడతారు. ఎందుకంటే అది మీ హద్దులా భావిస్తారు, కాని నా విషయంలో అలా కాదు. నేను ఈ రూపం అనే భావం నాకు లేదు. అందుకే ఫోటోలతో ఆడుకుంటాను.
మూడవ విషయం ఈ శరీరం పురుషశరీరం అయినా, నా అంతరంగంలో భేదభావం, పురుషుడు అనే గుర్తింపు పోయాయి. నేను స్త్రీని, నేను పురుషుడిని అనే మానసిక భావం నాలో లేవు.
నాలుగవది నాలో నిరంతరం ఉండే ఉత్సాహం. ప్రతిదీ నన్ను ఉల్లాసంలో ఉంచుతుంది, చిన్నవైనా నాకు చాలా గొప్ప ఉత్సాహాన్ని, సంతోషాన్నిస్తాయి. చిన్న విషయమైనా నాలో గొప్ప ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
అది ఎంత చిన్నదైనా, చిన్న శివలింగం, చిన్న బుద్ధుడు, ప్రతి చిన్న విషయం కూడా గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మరొక ముఖ్యవిషయం - ఏ విషయం నాకు విసుగు తెప్పించవు. గత ఐదు సంవత్సరాల్లో వందల కొద్దీ కార్యక్రమాలు చేశాను కాని నాకు విసుగు అనిపించదు. ఎందుకంటే నాకు దృఢమైన గతం అనేది లేదు. ఎప్పుడైతే గతాన్ని దృఢంగా చేస్తారో అప్పుడు మీకు విసుగు పుడుతుంది. అన్నీ చూసినవేగా అనిపిస్తుంది. ఏ ముఖం చూసినా నాకు ఉత్సాహంగా ఉంటుంది. అంతే నాలో నిరంతరం ఉల్లాసం అత్యధికస్థాయిలో ఉంటుంది. జ్ఞానోదయం జరిగాక నాలో మార్పులు శాశ్వతంగా జరిగాయి.
7. అంతిమమే కాని చివరిది కాదు : స్పష్టంగా అర్థం చేసుకోండి, జ్ఞానోదయం చివరి దశ కాదు. అది అంతిమ అనుభవమే కాని చివరిది కాదు.
అంతిమమైంది, చివరిది అన్న మాటలు వేరు వేరు అర్థాలనిస్తాయి. ఉదాహరణకి మొదటి రోజు ప్రవచనం జరిగాక ఒక వ్యక్తి నాతో, మీరు అన్ని విషయాలూ చెప్పేసారు, ఇంతకు మించి తెలుసుకోవలసినవి ఏవీ లేవు అని. మరొక వ్యక్తి, స్వామీజీ! మొదటి రోజు మీరు మమ్మల్ని మాలోకి లోతుగా తీసుకు వెళ్ళారు. ఇక అంతకు మించి లోనికి వెళ్ళలేం అనుకున్నాను. రెండవ రోజు మరింత లోతైన అనుభవాన్ని ఇచ్చారు. నేను ప్రతి రోజూ ఇక లోతుగా వెళ్ళేది లేదు అనుకునేవాడిని. కాని మాకు ప్రతి రోజూ లోతైన అనుభవాలు జరిగేవి అన్నాడు. ప్రతి రోజూ ఆ వ్యక్తికి అంతిమ అనుభవం జరిగేది. అంతిమ అనుభవం అంటే ప్రతిక్షణాన్నీ పూర్తిగా జీవించటమే. అంతిమం చివర కాదు దాన్ని ఇంకాస్త అభివృద్ధి చేయవచ్చు.
చాలా మంది జ్ఞానోదయం జరిగాక గురువుల్లో అభివృద్ధి అనేది ఉండదు అనుకుంటారు. మీకు చెబుతున్నాను, జ్ఞానోదయం జరిగాక నిరంతరం అభివృద్ధి జరుగుతుంది. ప్రతిక్షణం విస్తృతం అవుతూ ఉంటాం. భగవంతుడు అంటేనే అభివృద్ధి. భగవంతుడు మాత్రమే విస్తృతం అవుతూ ఉంటాడు. మరేదీ అలా కాలేదు. మీ అంతరంగంలో మీరు అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటారు కాని నిజమైన వృద్ధి విశ్వశక్తి లోనే జరుగుతుంది.
ఒక వ్యక్తికి జ్ఞానోదయం అయితే అతను నిరంతరం విస్తృతం అవుతూ, చాలా మంది జ్ఞానోదయం పొందేలా చేయగలుగుతాడు. ఆయన చాలా మంది జ్ఞానోదయమైనవారు ఉండేలా చేయగలుగుతారు.
8. మాటలు, చూడటం ఉండవు : జ్ఞానోదయం అయ్యాక గొంతుకి, నాభికి మధ్యప్రాంతంలో మాటలు, పదాలు, అక్షరాల కదలికలు ఉండవు. పదాలు గొంతు నుంచి మాత్రమే వస్తాయి. ఇదే నేను జ్ఞానోదయానికి ఇచ్చేనిర్వచనం. నాభి నుంచి గొంతు వరకూ అక్షరాలు, మాటలు, శబ్దాలు, ఆలోచనలు అనేవి ఉండవు. మాట్లాడే సమయంలోనే మాటలు ఉంటాయి. మాట్లాడని సమయంలో మీ అంతరంగంలో ఆలోచనలు, మాటలు ఉండవు. కేవలం శక్తిప్రవాహం మాత్రం ఉంటుంది. మీ అంతరంగంలోని మాటలే ప్రశాంతత లేకుండా మీ జీవితాన్ని నిశ్చలం చేసే అంశం. ఈ విషయం అర్థం చేసుకోవటం చాలా మందికి కష్టంగా ఉంటుంది.
అందరు ఏమనుకుంటారంటే నా అంతరంగంలో మాటలు లేకపోతే జీవితంలో ఎలా ప్లాన్స్ వేయగలను? ఎలా జీవించగలను? ఒక విషయం అర్థం చేసుకోండి. అంతరంగంలో మాటలు లేవు అంటే అది జీవం లేని నిశ్శబ్దం కాదు. అది తీవ్రమైన శక్తి. అందులోంచి మీకు ఏది అవసరమో అది పూర్తిగా మీ స్ఫురణకు వస్తుంది. అదే అంతరంగపు మాటల్లో అయితే ఒక దాని తరువాత ఒకటిగా వస్తుంది. ఉదయం నిద్ర లేవాలి. తరువాత కొత్త ప్రాజెక్ట్ మీద పని చేయాలి. సాయంత్రం ఇంటికి రావాలి. ఇలా ఒక క్రమంలో మాటలు, ఆలోచనలు వస్తాయి.
మీ అంతరంగంలో మాటలు లేనప్పుడు, మీరు మీతోనే ఉన్నప్పుడు మొత్తం అంతా ఒక దృశ్యరూపంలో, ఒక విషయంలా మీకు స్ఫురిస్తుంది. దీన్నే ఇంటూషన్ లేదా ఆత్మప్రబోధం అంటాం. ఒక దాని తరువాత ఒకటిగా ఒక పద్ధతిలో వెళితే వాటిని అంతరంగపు మాటలు అంటాం. అది మేధ ఎప్పుడైతే మీలో అంతరంగపు మాటలు ఉండవో, మీకు విషయం తిన్నగా ఒక్క క్షణంలో మొత్తం స్ఫురిస్తుంది. మీకు మొత్తం తెలుస్తుంది.
9. సమస్యలతో వ్యవహరించే ధైర్యం : జ్ఞానోదయం అంటే సమస్యలు లేకపోవటం కాదు. ఆ సమస్యలతో వ్యవహరించే ధైర్యాన్ని ఇస్తుంది జ్ఞానోదయస్థితి.
10. మానవుని ఉనికి శిఖరాగ్రానికి చేరటం : తెలివితేటలు పరిణతి పొందితే వివేకంగా, మేధగా మారతాయి. భావావేశాలు పరిణతి పొందితే విశ్వాసంగా మారతాయి. ఎప్పుడైతే ఉనికి (ఆత్మ) పరిణతిలో శిఖరాగ్రానికి చేరుతుందో అది జ్ఞానోదయం అవుతుంది.
11. బయటికి మాట్లాడే మాటలు, అంతరంగపు మాటలు ఏకీకృతమవటం : ఏ వ్యక్తి అయితే తన అంతరంగంలోని కపటాన్ని తొలగిస్తాడో అతను జ్ఞానోదయానుభవాన్ని పొందుతాడు.
రామకృష్ణ పరమహంస జ్ఞానోదయం అంటే ఈ విధంగా వివరిస్తారు. అంతరంగపు మాటలు, బయటి మాటలు ఒకే విధంగా ఉండటమే జ్ఞానోదయ స్థితి. ఆయన ఇలా అంటాడు, మీ అంతరంగంలో అనుకునే మాటలు, మీరు బయటికి మాట్లాడే మాటలు ఒకే విధంగా ఉన్నప్పుడు మీకు జ్ఞానోదయం కలుగుతుంది.
ఈ విధంగా అంతరంగపు మాటలు, బయటికి మాట్లాడే మాటలు ఒకే విధంగా ఉండే శరీరంలో జీవించటమే స్వర్గం. అటువంటి శరీరంలో జీవించే జీవితం ఇచ్చే ఆనందం మరెక్కడా ఉండదు. అది స్వచ్ఛమైన పారవశ్యస్థితి. ఈ నిరంతరం పారవశ్యస్థితిని నేను నిత్యానంద స్థితి అంటాను. ఎప్పుడైతే అంతరంగపు మాటలు బయటికి మాట్లాడే మాటలు వేరు వేరుగా ఒకే విధంగా ఉన్న శరీరంలో ఉంటాయో మీరు అకస్మాత్తుగా ఒక బోలు వెదురులో ఉన్న అనుభవాన్ని పొందుతారు. మీరు అనంతమైన ఖాళీ ప్రదేశంలో ఉంటారు.
12. మిమ్మల్ని మీరు విశ్వం అనుకోవడం : మీరు మహాకాశం, విశ్వం అని అనుకోవటమే జ్ఞానోదయస్థితి. మిమ్మల్ని మీరు ఘటాకాశం అనే వ్యక్తిగతప్రదేశ్ం అని అనుకోకుండా మీరు విశ్వం అని అనుకోవటమే.
13. మీ మనస్సులోని మీరు అనే గుర్తింపు నుంచి బయటికి వచ్చేయటం : మీరు బయటి ప్రపంచానికి చూపించే మీరు అనే గుర్తింపు నుంచి బయటికి వచ్చే అనుభవమే మీ మొదటి అనుభవం. దాన్నే సతోరి అంటారు. మీ రెండవ గుర్తింపు అయిన మీరు అంటే మీ అంతరంగంలోని గుర్తింపు నుంచి బయటికి రావటాన్ని, ఆ అనుభవాన్ని నేను జ్ఞానోదయం అంటాను.
14. అత్యున్నతచేతనస్థితిలో జరిగే పరిశోధన : జ్ఞానోదయం పొందినవారికి పదునైన అత్యున్నతచేతనస్థితి ఉంటుంది. దాని సహాయంతో పరిశోధనలు, ప్రయోగాలు, విశ్లేషణ చేయటం సులభంగా ఉంటుంది. జ్ఞానోదయం జరిగాక నేను బయట ప్రపంచశాస్త్రవేత్తలతో, అంతరంగప్రపంచ శాస్త్రవేత్తలతో, నాతో అనేకప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నాను.
జ్ఞానోదయమైన గురువులు ఏదైనా ఆధ్యాత్మికసాధన చేస్తున్నారు అంటే అది ఆయన కోసం కాదు తన శిష్యులకి సరైన సూత్రాల్ని అందించాలని, వాటి సహాయంతో వారు కూడా అదే అనుభవాన్ని పొందాలి అని మాత్రమే.
15. మానవస్థితి నుంచి అత్యుత్తమరూపాంతరదశ : నన్ను ఒకరు ఇలా అడిగారు, జ్ఞానోదయం అంటే మానవుల్లో సహజంగా జరిగే ఒక దశ అవుతుందా లేక అది అత్యున్నతమైన మార్పు అవుతుందా? అని. కచ్చితంగా జ్ఞానోదయం మనిషిలో అత్యున్నత మార్పు. మీరు అనుకునే మానవదశ సంపూర్ణమైంది కాదు. మీరు బీజదశలోనే ఉన్నారు. ఇంకా వృక్షంగా మారలేదు. నిజానికి జ్ఞానోదయమే మీ నిజమైన స్థితి. మీరు బీజ దశలో ఉన్నప్పుడు మానవులు అంటారు. మీరు పరిణతి పొందిన దశని జ్ఞానోదయం అంటారు. మీరు ఆధ్యాత్మిక అనుభవంతో ఉన్న మామూలు మనిషి కాదు, మీరు మానవానుభవంతో ఉన్న ఆధ్యాత్మికాలు.
16. యోగ శక్తికి అతీతంగా : మీరు ధ్యానం సాధన చేస్తే చాలా యోగశక్తులు, సిద్ధులు కలుగుతాయి. అయితే మీరు వీటికి అతీతంగా వెళ్ళగలిగినప్పుడే జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయంంటేనే శక్తులతో వ్యవహరించగలగటమే కాదు, అవసరమైనప్పుడు వాటిని వదలగల స్థితి. అకల్ట్ కెమిస్ట్రీ అన్న ఒక ఆర్టికల్ చదివాను. అది అనీబిసెంట్, చార్లెస్ లెడ్ బీటర్ మూలకాల నిర్మాణం మీద చేసిన పరిశోధన. భౌతికశాస్త్రం అణువులో న్యూక్లియస్ ఉంది అని చెప్పిన నాటికి చాలా కాలం పూర్వమే ఆధ్యాత్మికులు ఆ విషయాన్ని చెప్పారు. ఈ రోజున మనకి తెలిసిన ఉపకణం వరకూ అన్నీ ప్రాచీనకాలంలో ఉన్నాయి అని ఈ యోగశాస్త్రజ్ఞులు చెప్పారు. ఆధునికసాంకేతిక పరికరాలు లేకుండా వారు ఆ విధంగా ఎలా చెప్పగలిగారు. అప్పటికి భౌతికశాస్త్రం పుట్టలేదు. ఆ పరిశోధన నివేదిక ఏం చెబుతుందంటే సిద్ధుల ద్వారా, మార్మికశక్తి ద్వారా ఆ విషయాలను కనుగొన్నారు అని. పతంజలి ఈ విషయం గురించి చక్కగా వివరించారు. అణిమా అంటే అతిసూక్ష్మ విషయాల్ని, దాగి ఉన్న విషయాల్ని, చాలా దూరంగా ఉన్న విషయాల్ని తెలుసుకునే శక్తిని అణిమాసిద్ధి ద్వారా పొందవచ్చు, అది అత్యుత్తమ భౌతిక కాంతిరేఖల ద్వారా సాధ్యం అని.
యోగసాధనతో, సాధారణ నేత్రానికి కనిపించని అతిసూక్ష్మమైన వాటి రూపాలని చూడవచ్చు. అటువంటి యోగశక్తితో వారు ఐదు కొత్త మూలకాలని చూడగలిగారు. ఆ మూలకాల అంతర్నిర్మాణంలోకి వాటి ఉప కణాల్లోనికి వెళ్ళగలిగారు. ఆధునికశాస్త్రం వీటిని చూడగల సాంకేతికపద్ధతిని ఇంకా తయారు చేయలేదు. వీటినే ప్రపంచంలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా వివిధకాలాల్లో కనుగొన్నట్టు వారు తెలియచేశారు.
వారు తమ ముగింపు వ్యాఖ్యల్లో విశ్వంలోని పదార్థమంతా ఒక గాలి బుడగలాంటిది. కంటికి కనబడని దారానికి ఉన్న ముత్యాల్లా ఉంటుంది. వాళ్ళు అతిసూక్ష్మమైనవాటిని చూడటమే కాదు, వాటి నిర్మాణాన్ని కూడా చూసినట్టు రాసారు. దాన్ని చూడగల పరికరాలు తయారు చేయాలంటే కోట్ల కోట్ల డబ్బు అవసరం అని కూడా అందులో రాసారు. తపస్సు, ధ్యానం ద్వారా ఇటువంటి సిద్ధులు పొందిన యోగులు చాలా మంది ఉన్నారు. మీరు వాటిలో చిక్కుకోకుండా ఉన్నంత కాలం అవి మంచివే. లేకపోతే మీరు అంతిమ దశ అయిన జ్ఞానోదయాన్ని పోగొట్టుకుంటారు.
17. భంగపరచలేని ప్రశాంతత : జ్ఞానోదయం అంటే మీలోని బలమైన, స్పష్టమైన ప్రశాంతత. దాన్ని మీ ఆలోచనలు కూడా భంగపరచలేవు. జ్ఞానోదయమైన గురువులకి ఆలోచనలు ఉండవు అని అనుకోవద్దు. అయితే వారి అంతరంగం అనంతమైంది, అతివిశాలమైంది. అందులో ఆలోచనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. మీ మానసికవ్యవస్థ పది ఎకరాలు అనుకుంటే, ఆ పది ఎకరాలు ఒక ‘జూ’ లాంటివి. అదే జ్ఞానోదయమైనా యోగీశ్వరునికి లక్ష ఎకరాల్లో ఒక పది ఎకరాలు జూ అయినా అది ఆయన మీద ఎటువంటి ప్రభావాన్నీ చూపించదు. ఎందుకంటే అది అత్యల్పం. అది అక్కడ లేనట్టే. అందుకే సాధారణ మానవుడు తాను శరీరం అనుకుంటాడు. జ్ఞానోదయమైన యోగి ‘నేను’ శరీరం కూడా అనుకుంటాడు. నేను శరీరాన్ని అన్న భావం మాయమవుతుందని కాదు అది మరింతగా విస్తృతమై నేను శరీరాన్ని కూడా అన్న స్థితికి తీసుకువెళుతుంది.
18. మీ శరీరం నుంచి సహజశక్తిని ప్రవహింప చేయండి : జ్ఞానోదయం అంటే సహజంగా ప్రవహించే శక్తిని ఎటువంటి అడ్డంకులూ, భేదాలూ సృష్టించకుండా మీ శరీరం ద్వారా ప్రవహించనీయటమే. ఎప్పుడైతే మీరు ఎంచుకోవటం ప్రారంభిస్తారో మీరు మీలో అడ్డంకులు సృష్టించినట్టే. జ్ఞానోదయాన్ని ఎంచుకున్న వ్యక్తికి జ్ఞానోదయం కలగదు. ఎవరైతే ఎంపికలు లేని స్థితిని ఎంచుకుంటారో వారికే జ్ఞానోదయం కలుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవలసిన ఒక ముఖ్యాంశం.
జ్ఞానోదయ భావనతో బంధం
కొన్ని వేల సంవత్సరాలుగా లక్షల మంది ఆధ్యాత్మిక అన్వేషకులు కఠోరప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో చాలా కొద్ది మంది మాత్రమే జ్ఞానోదయస్థితిని పొందగలిగారు. కారణం ఏమిటంటే, జ్ఞానోదయం అంటే మీకు ఏదో ఒక భావం ఉంటుంది. ఆ భావం మీద ఆధారపడి మీకు నిజమనిపించే ఆలోచనని ఎంచుకుంటారు. మీరు జీవించి ఉన్న జ్ఞానోదయమైన యోగీశ్వరుల్ని చూసినప్పుడు, మీరు వారిలో జ్ఞానోదయం తాలూకు ఒక ఉపఫలితాన్ని మాత్రమే చూస్తారు. వారి జీవితసరళిలోని నాణ్యత, వారి శక్తిని చూసి జ్ఞానోదయం అనే అత్యాశ మీలో కలుగుతుంది.
అది జ్ఞానోదయంతో ఏర్పడిన బంధం కాదు. జ్ఞానోదయం అనే భావనతో ఏర్పడిన బంధం. ఉదాహరణకి నాకు జ్ఞానోదయం అయితే బంగారు సింహాసనం వస్తుంది అనుకున్నారనుకోండి, మీరు బంగారు సింహాసనంతో బంధాన్ని ఏర్పరచుకున్నారు కాని జ్ఞానోదయంతో కాదు.
జ్ఞానోదయంతో ఏ విధంగా బంధాన్ని ఏర్పరచుకోగలరు? జ్ఞానోదయం అంటే ఇప్పుడు ఉన్న ఏ భావం అయినా అది జ్ఞానోదయం కాదు. అది జ్ఞానోదయం గురించి మాత్రమే. జ్ఞానోదయం అంటే మీకు జ్ఞానోదయానికి మరింత దగ్గరగా వెళ్తారు. మీరు దాంతో బంధాన్ని ఏర్పరచలేరు. మీరు జ్ఞానోదయంతో బంధాన్ని ఏర్పరచుకున్నాను అని అనుకుంటే, స్పష్టంగా తెలుసుకోండి మీ భావం స్పష్టంగా లేదు, స్వచ్ఛంగా లేదు అని. మీ భావాన్ని స్వచ్ఛంగా చేసి, జ్ఞానోదయం అంటే ఏమిటో స్పష్టతతో అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి. గురువులు చెప్పే విషయాలు వినండి. జ్ఞానోదయం అంటే స్పష్టమైన అవగాహనకి రండి.
జ్ఞానోదయం అంటే స్పష్టమైన అవగాహన ఎందుకంటే కొంత కాలం అయ్యాక గురువులతో మీ పోరాటం ఆగిపోతుంది. అప్పుడు ఆయన ఇచ్చిన స్పష్టతతో కూడిన వివరణ మీకు ఒక అనుభవం అవుతుంది. మీ అంతరంగం ప్రేమతో నిండి ఉన్నప్పుడు, మీరు గురుదేవులతో బంధాన్ని ఏర్పరుచుకున్నప్పుడు, ఆయన చెప్పే ప్రతి మాటా మీకు ఒక అనుభవం అవుతుంది. కాబట్టి స్పష్టమైన అవగాహనని ఏర్పరచుకోండి, అది సహజంగా జ్ఞానోదయం వైపు తీసుకువెళుతుంది. మీలోని బంధం మాయమవుతుంది.
19. జిజ్ఞాసతో అర్పణం : తెలుసుకునే తత్వంతో సరైన పనులు చేస్తూ, సర్వాంతర్యామికి అధీనమై ఉండటమే జ్ఞానోదయం అంటే. ఈ మూడూ కలిస్తే జ్ఞానోదయస్థితి. ఈ మూడూ విషయాలు వేరు అని మీరు అనుకున్నంత కాలం మీకు జ్ఞానోదయం జరగదు. ఆ మూడూ ఒక్కటే అని ఎప్పుడు తెలుసుకుంటారో ఆ మూడూ ఏకకాలంలో అప్రయత్నంగా కలుగుతాయి. మీకు జ్ఞానోదయం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే తెలుసుకునే తత్వంలో ఉంటారో మీరు సర్వాంతర్యామికి అధీనులై ఉంటారు. అప్పుడు మీరు అన్నీ సరైన పనులనే చేస్తారు.
20. ఆనందానికి అతీతంగా : నిరంతరం గాఢతతో ఉండటమే జ్ఞానోదయమైన గురువుల లక్షణం. వారిని చూసినపుడు అది పరమానందం లేదా సంతోషం మీకు తెలుస్తుంది. నిజాయితీగా చెప్పాలంటే నేను ఏదో ప్రత్యేకమైన ఆనందంలో ఉండే వ్యక్తిని అనిపించదు. నాకు తెలిసేది ఒకటే, నాలో ఏదో అత్యంతప్రత్యేకమైంది, అసాధారణమైంది జరుగుతుందని అది తీవ్రంగా జరుగుతున్నదని తెలుస్తుంది. నిజానికి అది ఆనందం కూడా కాదు. దాని నాణ్యతని, లక్షణాన్ని వివరించలేం. మీ మనస్సుతో దాన్ని అర్థం చేసుకోలేరు.
21. అనుభవం, అనుభవిస్తున్నవాడు, అనుభవించబడేది అనే మూడూ కలిసిపోవటం: ప్రస్తుతం మీరు మూడూ విషయాల్ని చూస్తారు. అనుభవిస్తున్న వ్యక్తి, అనుభవం, అనుభవించబడేది. ఉదాహరణకి మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు. మీరు అనుభవించే వ్యక్తి అంటే చదువుతున్న వ్యక్తి చదవటం అనుభవం. అనుభవించబడేది పుస్తకం మీకు జ్ఞానోదయం అయితే ఈ మూడూ కలిసి ఒకటిగా అయిపోతుంది. మీరు అనుభవిస్తున్న వ్యక్తి, మీలోనే అనుభవం, అనుభవించేవి ఉంటాయి.
జీవన్ముక్తి
1. విశ్వంలోని గందరగోళాన్ని మీ శరీరం లోపలే ఆనందించండి : ఇప్పటి స్థితిలో మీరు విశ్వాన్ని, అందులోని కల్లోలాన్ని మీ శరీరంలో పట్టి ఉంచే పరిణితిలో లేరు. ఆ కల్లోలాన్ని క్రమపద్ధతిలో పెట్టాలి. ఎందుకంటే విశ్వాన్ని పట్టి ఉంచే శక్తి మీకు లేదు. విశ్వంలోని కల్లోలాన్ని అదే విధంగా పట్టి వుంచే పరిణితి మీ ఆరు అడుగుల శరీరానికి లేదు. విశ్వాన్ని అనుభవించి ఆనందించే విధంగా మీ శరీరం లేదు. మీ శరీరాన్ని, మనస్సుని, మేధని మేల్కొలిపి, విశ్వానికి అనుగుణంగా, ఆ అనుభవాన్ని పొందే విధంగా మార్చటమే జీవన్ముక్తి అంటే. దాని కోసం శరీరం, మనస్సుని, మేధని సిద్ధం చేయాలి. నిత్యయోగా లాంటి పద్ధతులలో శరీరాన్ని సిద్ధం చేయవచ్చు. మనస్సు సాఫ్ట్వేర్ లాంటిది. అందులో చేతనస్థితి, అచేతన స్థితి, రెండూ ఉన్నాయి. చేతనమనస్సుని సరియైన బోధల ద్వారా, తప్పు భావాలని తొలగించటం ద్వారా, మంచి భావనల ద్వారా శుభ్రపరచవచ్చు. ధ్యానపద్ధతుల ద్వారా అచేతనస్థితిని బాగుచేయవచ్చు.
అయితే అంతిమంగా సాఫ్ట్‌వేర్‌ని శాశ్వతంగా మార్చాలి అంటే హార్డ్‌వేర్‌ని కూడా మార్చాలి. మీ మెదడులోని గీతలని మార్చాలి. అప్పుడే అది జీవన్ముక్తి అనుభవాన్ని పట్టి ఉంచి, దాన్ని వెల్లడి చేస్తుంది. దీక్ష ద్వారా మీలోని శక్తిలో మార్పు వస్తుంది. అది వివిధ కోణాల్లో మిమ్మల్ని మేల్కొలపటం ప్రారంభిస్తుంది.
2. విభేదాలు లేని స్వేచ్ఛాజీవితం : జీవన్ముక్తికి వివాహజీవితం లేదా బ్రహ్మచర్యజీవితం అనే విభేదాలు లేవు. జీవన్ముక్తి అంటే మనలో విభేదాలు లేని జీవితం. మీరు చేసే పనులు, జ్ఞానం మీ కోరికలకి అనుగుణంగా ఉండాలి.
3. ఆలోచనల సంఖ్య తగ్గటం : ఏ విషయంలోనూ తీవ్రస్థాయిలో లేకుండా, భావావేశాల తీవ్రత లేకుండా, మధ్యస్థాయిలో ఉండగలగటమే మధ్యమార్గం. మధ్యస్థాయిలో ఉండగలిగినప్పుడు మీలోని ఆలోచనలు సంఖ్య తగ్గటం గమనిస్తారు. అదే జీవన్ముక్తి. ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయి, మీ పనులు మీరు మామూలుగా చేసుకుంటే, ఆ సమయంలో ఆలోచనలు అసలు ఉండవు. ఆ స్థితి జ్ఞానోదయస్థితి.
4. సాత్వికస్థితిలో స్థిరపడటం : సత్వస్థితిలోంటూ అనుకూల శక్తిలో స్థిరపడి మీ పనులు మీరు చేసుకోగలిగితే, మీ ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ మీ సంబంధ బాంధవ్యాల్లో ఉండగలిగితే మీ జీవితం అప్రయత్నంగా, చాలా అందంగా ఉంటుంది. ఆ అనుకూలశక్తిలో కేంద్రీకృతమై ప్రతి విషయాన్ని చక్కగా నిర్వహించలుగుతారు. దాన్నే జీవన్ముక్తి అంటాను.
5. యాంత్రికంగా లేని మెదడు భాగాల్ని మేల్కొలపటం : మీరు అనుకూలశక్తి అయిన సాత్వికస్థితిలో స్థిరపడితే మీఆత్మ మీజీవం వీటి పైన స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ ప్రపంచం, జగత్తులతో ఏ విధమైన బంధాన్ని ఏర్పరచుకోవాలో అర్థమవుతుంది. ఆ స్పష్టత వల్ల, జీవం (ఆత్మ) జగత్ పట్ల కలిగిన స్పష్టత వల్ల, మీరు మూలాధారమైన ఈశ్వరులలోకి, సర్వాంతర్యామిలోకి ప్రవేశించలుగుతారు. అర్థం చేసుకోవటంలో మీకు స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత అప్రయత్నంగా మీ మెదడులోని యాంత్రికంగా లేని భాగాలని మేల్కొలుపుతుంది. అది మేల్కొన్నప్పుడు మీ లోపల కల్లోలం ప్రారంభమవుతుంది. అప్పుడు మీ దినచర్య తిరిగి ఒక పద్ధతిలోకి వస్తుంది. మీరు కేవలం దాంతో సహకరించండి. దాన్నే నేను జీవన్ముక్తి అంటాను.
6. మేలుకొనే స్థితికి సహకరించండి : మీ లోపల జరుగుతున్న కొత్త పారవశ్యస్థితికి, కొత్తగా జరిపిన జాగ్రత్స్థితికి మీరు సహకరించకపోతే, మీ పాత నిస్సారమైన దినచర్యలతో ఉన్న జీవితాన్ని తిరిగి తీసుకువస్తారు. ఆ పాత వ్యక్తి మళ్ళీ వస్తాడు. మీలో జరుగుతున్న కొత్త మేల్కొలుపుకి, పారవశ్యానికి సహకరించటాన్నే నేను శిష్యరికం లేదా జీవన్ముక్తి అంటాను.
7. గొప్ప సత్యాల్లో జీవించటం : జీవన్ముక్తి అనేది సరైన పదం. ఈ గొప్ప సత్యాల్లో జీవిస్తే మీరు జ్ఞానోదయం పొందినవారవుతారు అంతే. చాలా మంది జ్ఞానోదయం అంటే బాధ్యతలకి దూరంగా వెళ్ళిపోయి మీరు ఏ పని చేయనవసరం లేదు అనుకుంటారు. ఇది సెలవు లాంటిది అనుకుంటారు. బీచ్‌లో పడుకొని పని అనేది ఏదీ లేకుండా ఉండటం అనుకుంటారు. మీరు కోరుకున్నది, జీవితంలో ఎప్పుడూ దొరకనిది అయినదాని గురించి ఊహల్లో ఉంటారు. అవన్నీ జ్ఞానోదయమైన వారిలో చూడటానికి ప్రయత్నిస్తారు. మీ దృష్టిలో స్వర్గం అనేదాన్ని తీసుకువచ్చి జ్ఞానోదయం అంటే స్వర్గం అనుకుంటాను. జ్ఞానోదయం పొందటం అనేది సరైన పదం కాదు. జ్ఞానోదయంలో జీవించటం అనేది సరైన పదం.
మీరు సత్యాల్లో జీవించాలి. గొప్ప సత్యంలో జీవించటమే జ్ఞానోదయం. గురుదేవులు జ్ఞానోదయాన్ని మీకు అందించరు. అది మీకు ఆయన ఇవ్వగల ఒక వస్తువు కాదు. జ్ఞానోదయం అనుభవం. మీరు పొందే విధంగా ఆయన కొన్ని ఉపకరణాలనిస్తారు. ఆయన సత్యాలు తెలియచేస్తారు. ఆ సత్యాలతో జీవిస్తూ ఆ అనుభవాన్ని పొందాలి.
జ్ఞానోదయం అంటే శరీరాన్ని వదిలి మరణించటం కాదు. జ్ఞానేంద్రియాలకి అతీతంగా జీవించటమే జ్ఞానోదయం. అంటే మీలోని కేంద్రం జ్ఞానేంద్రియాల నుంచి మారుతుంది. మీలో పెద్ద మార్పు వస్తుంది. దాన్నే నేను జీవన్ముక్తి అంటాను.
అహంకారం Vs జ్ఞానోదయం
మీలోని జ్ఞానోదయాన్ని తీసేసేంత శక్తి అహంకారానికి లేదు. ఈ విషయం అర్థం చేసుకోండి, మీ అహానికి అంత శక్తి లేదు. మీలో అహం ఉంది అని అనుకోవటం ఆపేయండి. మీరు అనుకున్నంత పెద్ద విషయం కాదు మీ అహంకారం. మీరు అనుకున్నంత పెద్దవారు కాదు మీరు. కాబట్టి మీ అహంకారం మీ జ్ఞానోదయాన్ని తీసేయలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా, అనుభవం కలిగినా లేకపోయినా మీరు నిత్యచేతనస్థితి మాత్రమే. మీ తర్కం, వివేకం కూడా మీరు అనుకున్నంత బలమైనవి కావు. నేను ఎప్పుడూ చెబుతుంటాను, మీలోని అజ్ఞానం మీరు అనుకున్నంత బలమైంది కాదు. అది మీలోని జ్ఞానోదయాన్ని పొగొట్టలేదు. మీ అజ్ఞానం, మీ అహంకారం మీరు అనుకున్నంత పెద్దవి కావు అది సత్యం.
ముందు, ఆ తరువాత
ఒక చక్కని జెన్ సామెత ఉంది, జ్ఞానోదయానికి ముందు పర్వతం పర్వతంలా ఉంటుంది. నది నదిలా ఉంటుంది. అడవి అడవిలా ఉంటుంది. మీ సత్యాన్వేషణలో పర్వతం పర్వతంలా ఉండదు, నది నదిలా ఉండదు, అడవి అడవిలా ఉండదు, అంతా గందరగోళంలా ఉంటుంది. మీరు అన్వేషించే అంతిమసత్యమైన జ్ఞానోదయాన్ని పొందాక పర్వతం పర్వతంలా, నది నదిలా, అడవి అడవిలా ఉంటాయి. దీన్ని అర్ధం చేసుకోవటం కొంచెం కష్టం. దీని అర్ధం ఏమిటంటే మీ అన్వేషణ ముందు, అది సాధించాక విషయాలు అన్నీ స్పష్టంగా ఉంటాయి. అయితే ఆ అన్వేషణ జరిగే సమయంలో, స్పష్టత ఉండదు.అన్వేషణకి ముందు, జ్ఞానోదయం జరిగే సమయంలో, స్పష్టత ఉన్నా అందులో తేడా ఉంటుంది. ముందు ఉన్న స్పష్టతకి, జ్ఞానోదయం తరువాత ఉన్న స్పష్టతకి తేడా ఉంటుంది.
ముందు ఉన్న స్పష్టత కొద్దిపాటి మార్పు వచ్చినా మిమ్మల్ని అయోమయంలో పడేస్తుంది. అది అంతిమస్పష్టత కాదు. అది ఒక మసకగా ఉన్న భావన మాత్రమే. కాని జ్ఞానోదయం తరువాత, మీలో వచ్చిన స్పష్టతని ఎవరూ, ఏది చెదరగొట్టలేరు, అది అంతిమసత్యం, అదే తేడా. ఏ స్పష్టతనైనా తరువాత, మీలో వచ్చిన స్పష్టతని ఎవరూ, ఏది చెదరగొట్టలేరో అది జ్ఞానోదయస్పష్టత. జ్ఞానోదయం తరువాత విషయాలను చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. పర్వతం పర్వతంలా, నది నదిలా, అడవి అడవిలా ఉన్నా వాటిని చూసే పద్ధతిలో చాలా మార్పు ఉంటుంది. అందుకే ఆ అయోమయం. దీన్ని మీరు పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
లోతైన కోరిక, అర్హతలు లేవు
నన్ను చాలా మంది అడుగుతుంటారు, గురుదేవులు కావాలి అని అనుకుంటే, శిష్యులకి అర్హతలు ఉన్నా లేకపోయినా, వారికి జ్ఞానోదయాన్ని ఇవ్వగలరా? అని. గురుదేవుల ఒక్క ఆలోచనతో ఎవరికైనా జ్ఞానోదయాన్ని ఇవ్వగలరు. దానికి ఏమీ అవసరం లేదు. ఆయన ఎవరికైనా ముక్తిని స్వేచ్ఛని ప్రసాదించగలరు. ఈ భూమి మీద జరిగే అత్యంత గొప్ప విషయం అద్భుతమైన విషయం, జ్ఞానోదయం జరగని వ్యక్తి ఒక జ్ఞానోదయమైన గురుదేవుల సమక్షంలో కూర్చొని జ్ఞానోదయాన్ని పొందటమే.
గురుదేవులు జ్ఞానోదయపు సాఫ్ట్‌వేర్‌ని డౌన్ లోడ్ చేసి ఆ వ్యవస్థని ఎవరిలోనైనా నింపగలరు. మీరు పూర్తిగా విప్పారి ఉంటే, ఆ సాఫ్ట్‌వేర్‌ని మీలోపల నింపగలరు. ఇప్పుడు ఉన్నదాని కంటే ఇది చాలా మంచిదని మీ శరీరం తెలుసుకుంటుంది. మీ శరీరంలోని జీవసంబంధ జ్ఞాపకశక్తి ఇంకా బాగా ఉండగల విధానాన్ని నేర్చుకుంటుంది.
బుద్ధుని జీవితం నుంచి ఒక చిన్న కథ : ఒక వ్యక్తి బుద్ధుడిని భగవాన్, మీరు అందరికీ జ్ఞానోదయాన్ని ఇవ్వవచ్చు కదా, అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఆ వ్యక్తితో, మీ గ్రామంలో ఎవరికి జ్ఞానోదయం కావాలో అడిగి, కావాలన్నవారందరినీ తీసుకురా, వారికి జ్ఞానోదయాన్ని ఇస్తాను, అంటాడు. ఆ వ్యక్తి గ్రామంలోనికి వెళ్లి అందరిని జ్ఞానోదయం కావాలా అని అడుగుతాడు. సాయంకాలానికి చిన్నపుచ్చుకుని బుద్ధుని దగ్గరికి వస్తాడు. బుద్ధుడు అతన్ని ఏం జరిగింది అని అడిగి, ఎవరూ జ్ఞానోదయం కావాలి అని అనలేదు కదా? అంటాడు.
ఆ వ్యక్తి నవ్వు ముఖంతో, ఇద్దరు కావాలి అన్నారు, అంటాడు. బుద్ధుడు ఐతే వారిని ఇక్కడికి తీసుకురా, వారికి ఇప్పుడే జ్ఞానోదయాన్ని ఇస్తాను అంటాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా, అది కాదు భగవాన్, వారు ఇక్కడికి రావటం కుదరదు అన్నారు. మీరు వారున్న దగ్గరికి పంపిస్తే, తీసుకుంటాం అని చెప్పారు. అంటాడు. నిజానికి ఎవరూ జ్ఞానోదయాన్ని కోరుకోరు. ఏదో దాంతో వచ్చే ఉపయోగాల్ని కోరుకుంటారు లేదా దాన్ని షోకేసులో పెట్టుకోవటానికి అడుగుతారు.
ఒక విషయం అర్థం చేసుకోండి, మీరు బంధాల్లో ఉండాలి అని అనుకుంటే ఆ స్వేచ్ఛని భగవంతుడు మీకు ఇస్తాడు. జ్ఞానోదయాన్ని మీ మీద బలంగా రుద్దడు. అలా చేస్తే, స్వేచ్ఛ కూడా బందిఖానా అవుతుంది.
ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి; అర్హతలు, కోరిక.
జ్ఞానోదయానికి అర్హతలు లేవు. అయితే ఒక లోతైన భావన, తీవ్రమైన కోరిక, అది నాకు కావాలి అని ఉండాలి. స్పష్టంగా అర్థం చేసుకోండి. నాకు కూడా మీ అందరికీ ఉన్న అన్ని సమస్యలూ ఉండేవి. సర్వాంతర్యామి మీద విశ్వాసం ఉండేది కాదు. నా మీద నమ్మకం ఉండేది కాదు. ఇవన్నీ నాకూ ఉండేవి. నేను చెప్పేదేమిటంటే జ్ఞానోదయానికి అర్హతలు లేవు, ఎవరికి ఎటువంటి అర్హతులూ అవసరం లేదు.
ఇది లాటరీ టికెట్టు గెలవటం లాంటిది. ఎవరైనా నేను లాటరీ కోసం కష్టపడి పని చేసాను అంటారా? నేను వెళ్ళి, దాన్ని కష్టపడి కొని తెచ్చాను కాబట్టి గెలవటానికి నాకు అర్హత ఉంది, గెలిచి తీరాలి అని అంటారా? లేదు. కోటి రూపాయల లాటరీ గెలవటానికి కావలసిన అర్హత ఏమిటి? మీరు టికెట్టు కొనటమే అంతే! దాని ఫలితంతో చూస్తే మీరు పడ్డ కష్టం చాలా చిన్నది.
జ్ఞానోదయం లాటరీ లాంటిది. ఆ అనుభవం చాలా గొప్పది. ఆధ్యాత్మిక మార్గంలో మీరు పడిన కష్టం కంటే గొప్పది. ఒకసారి ఆ అనుభవం జరిగితే అది ఒక వరం అని అర్థం అవుతుంది. అప్పటి వరకూ మీరు చేసిందంతా లాటరీ టికెట్టు కొనటం లాంటిదే. లాటరీ టికెట్టు కొన్న వ్యక్తి తాను పడ్డ కష్టం వల్లనే లాటరీ గెలిచాను అని అనడు.
రమణమహర్షి అరుణాచలేశ్వరుని ఉద్దేశించి ఒక చక్కని పాటని పాడేవారు. నన్ను నేను ఇచ్చి, నిన్ను పొందాను. కాబట్టి ఇందులో విజయులు ఎవరు? ఎవరు తెలివైన వారు? అని.
మిమ్మల్ని మీరు సర్వాంతర్యామికి సమర్పించుకొని జ్ఞానోదయాన్ని పొందవచ్చు. మిమ్మల్ని మీరు సమర్పించుకోవటం మీరు పొందేదానికి సమానమైంది కాదు. మీ జీవితాన్ని ఇచ్చినా మీరు పొందే దాంతో పోల్చి చూస్తే ఇది లాటరీ టికెట్టు కొనటమే
ఇది జరిగిన తరువాత ఇదంతా కేవలం సర్వాంతర్యామి కరుణా, ఆయన దీవెన మాత్రమే అని తెలుస్తుంది. దీని ఫలితం, మీలో కలిగే అద్భుతమైన మార్పు. ఎంత గొప్పదంటే అంత గొప్ప వరాన్ని ఎలా నేను పొందాను అని అనుకుంటారు. ఇంత అద్భుతమైన అవకాశానికి నన్ను ఏ విధంగా సర్వాంతర్యామి ఎంచుకున్నాడు, ఇంత పెద్ద వరాన్ని నాకు అనుగ్రహించాడు అని ఆలోచిస్తాం. దీనికి ఏ అర్హతా అవసరం లేదు. లోతైన అవసరం, కోరిక, అన్వేషణా ఉంటే చాలు. సంతృప్తి ఎప్పుడూ ఒక బహుమతి. బహుమతి పొందటానికి అర్హత ఉండదు.
ఆ అనుభవం ఒక వరం!
ఆధ్యాత్మిక అన్వేషణ అంటే ఒక శూన్యభావాన్ని, ఖాళీ అనే భావాన్ని పొందటమే. ఎందుకంటే మీలో ఆధ్యాత్మికమైన స్పష్టత అనేది లేదు. మీకు ఇంకా జ్ఞానోదయం కలగలేదు. ఆ కోరిక అత్యవసరంగా మారాలి.
రామకృష్ణ పరమహంస ఈ విధంగా చెబుతారు, మీరు చాలా పేదరికంలో ఉన్నారనుకోండి. భోజనం, బట్టలు కూడా లేని స్థితిలో అతిదీనావస్థలో ఉన్నారనుకోండి. మీ పక్క గదిలో ఎవరో చాలా ఐశ్వర్యాన్ని ఉంచి తాళం వేసారనుకోండి. అది మీరు తీసుకుని వాడుకోవచ్చు అనుకోండి. అప్పుడు మీరు ప్రశాంతంగా నిద్ర పోగలరా? ఆ తలుపుని తెరవటానికి ప్రయత్నిస్తారు లేదా తలుపు పగలకొడతారు. అంత ఐశ్వర్యం మీ దగ్గర ఉన్నప్పుడు ఆకలితో నిద్ర పోలేరు.
అదే విధంగా ఇప్పుడు మీరు ఆధ్యాత్మికపరమైన పేదరికంలో ఉన్నారు. మీ అంతరంగంలో ఒక గదిలో అంతు లేని ఐశ్వర్యాన్ని పెట్టి తాళం వేసారు. ఆ జ్ఞానం, ఆ దృక్పథం, ఆ తీవ్రత ఇప్పుడు మీకు అవసరం. ఆ తీవ్రతతో చేసే అన్వేషణ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీలోని సమర్పణభావానికి చాలా శక్తి ఉంటుంది. అది జ్ఞానోదయం వైపు మిమ్మల్ని తీసుకువెళుతుంది. నిజానికి జ్ఞానోదయం అంటే వంట వండటం లాంటిది. అందులో కొంత కలపాలి, కొంత తీసేయాలి. మీరు తీవ్రమైన అన్వేషణని కలపాలి. అసహనం వంటి అనవసర విషయాల్ని తీసేయాలి. అవి అప్రయత్నంగానే బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు జ్ఞానోదయం జరుగుతుంది.
అకస్మాత్తుగా జ్ఞానోదయం
ఆధ్యాత్మికసంప్రదాయాల్ని రెండు రకాలుగా విభజించవచ్చు. అందులో ఒకటి ఒక పద్ధతిలో అభివృద్ధిని ఇచ్చేది. అందులో స్పష్టమైన, చక్కగా నిర్వచించి మార్గం ఉంటుంది. పతంజలి యోగసూత్రాల్లో 5 పద్ధతులని వివరించారు - యమ (క్రమశిక్షణ), నియమం (వ్యక్తిగతప్రవర్తన), ఆసనాలు (ఆసనాలు వేయటం), ప్రాణాయామం (శ్వాస), ప్రత్యాహారం (వెనక్కి తీసుకోవటం లేదా మళ్లించటం). ఇది సాధారణ మానవులకి బాగుంటుంది. మీరు ప్రారంభించి క్రమంగా ఒక దాని తరువాత మరొకటి సాధించే క్రమపద్ధతి సామాన్యులకి నచ్చుతుంది. ఇందులో ప్రారంభించటం సులభం కాని ముగింపు చాలా కష్టం, సాధించటం కష్టం.
మరొక సంప్రదాయం మీకు తిన్నగా ఆ అనుభవాన్ని ఇస్తుంది. ఉదాహరణకి శివుడు చెప్పిన శివసూత్రాలు, ఇందులో మీకు నేరుగా ఆ అనుభవాన్ని ఇచ్చే పద్ధతులు ఉంటాయి. అయితే ప్రారంభించటం కొంచెం కష్టం. ఎందుకంటే తార్కికంగా చూస్తే వాటితో బంధాన్ని ఏర్పరచుకోవటం మీకు తెలియదు.
శివుడు స్పష్టంగా ఈ విషయాన్ని చెబుతాడు. ఈ చిన్న చిన్న పద్ధతులు మీకు జ్ఞానోదయాన్ని ఇస్తాయి అని. ఉదాహరణకి ఒక పద్ధతి ఏం చెబుతుందంటే మీరు తుమ్మే సమయంలో చాలా లోతైన తెలుసుకునే తత్త్వంతో ఉంటే జ్ఞానోదయం అవుతుందని. ఆయన ఏం చెబుతాడంటే కేవలం తుమ్మటం ద్వారా జ్ఞానోదయాన్ని పొందవచ్చు అని. దీన్ని నమ్మటంఎలా? తార్కికంగా మిమ్మల్ని నమ్మించటం కష్టం, మీకు అర్థం కాదు. శివసూత్రాల్లో చెప్పినట్టు కొన్ని పద్ధతులు మీకు అకస్మాత్తుగా జ్ఞానోదయాన్ని ఇస్తాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పద్ధతుల్ని సాధన చేయటానికి మీకు ధైర్యం కావాలి. సర్వాంతర్యామితో లేదా గురుదేవులతో బంధాన్ని ఏర్పరచుకోగలగాలి.
జ్ఞానోదయం ఏ క్షణంలోనైనా జరగవచ్చు. టిబెటియన్ బౌద్ధమతంలో బర్దోస్, అంటే మరణానికి, జన్మకి మధ్య ఉన్న స్థితి, ఆ స్థితిలో జ్ఞానోదయం జరిగే అవకాశం ఉంటుంది అంటారు.
క్రమంగా జ్ఞానోదయాన్ని ఇచ్చే పద్ధతులు మనకి చాలా సహాయం చేస్తాయి. చాలామంది ఆధ్యాత్మిక అన్వేషకులకి అవి మంచి ప్రారంభం, ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. అయితే వీటితో ఒక ప్రమాదం ఉంది. అది మీకు చివరి మార్పుని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆధునికమనస్సు త్వరగా అలసిపోతుంది. ఆధునిక మనసుకి అసహనం ఎక్కువ. దానికి అన్నీ వెంటనే ఫలితాలని ఇచ్చే విధంగా ఉండాలి. ఇన్స్టంట్ కాఫీలా ఉండాలి.
అకస్మాత్తుగా జ్ఞానోదయాన్ని ఇచ్చే పద్ధతులు చాలా మంచివి ఎందుకంటే అవి మీకు క్షణకాల ఆధ్యాత్మికానుభవాన్ని అయినా ఇస్తాయి. దాంతో జ్ఞానోదయం సాధ్యమే అనే నమ్మకాన్ని ఇస్తాయి. అప్పుడు మీకు అనుమానాలు, సమస్యలు ఉండవు. మీకు ఉన్న సమస్య కేవలం అనుమానాలే. అది నిజంగా దొరుకుతుందా? అది నాకు సాధ్యమేనా? నేను విజయం సాధించగలనా? నాకు ఏం జరుగుతుందో తెలియదు నా భర్తకి లేదా నా భార్యకి ఏమవుతుందో?
ఈ అనుమానాలే అసలు సమస్య. మీకు కనీసం జ్ఞానోదయం క్షణకాలం అనుభవం జరిగినా ఈ సమస్యలు, అనుమానాలు మాయం అవుతాయి. అప్పుడు ఆధ్యాత్మికమార్గంలో ప్రయాణం చేయటం చాలా సులభం.
మరొక విషయం; గురువుల మాటల మీద అభిప్రాయాలు కల్పించటం ఆపేయాలి. గురువుల మాటల్లో దేన్ని అనుసరించాలి అని ఎంచుకోవటం మానేయాలి. ఆయనని అనుసరించండి. అప్పుడు అంతిమజ్ఞానోదయం మీకు కలుగుతుంది. ఒక విషయం అర్థం చేసుకోండి. ఎవరైతే మేల్కొని ఉన్న స్థితి, స్వప్న స్థితి, నిద్రాస్థితులని దాటి పోగలడో అతనికి జ్ఞానోదయం జరుగుతుంది. ఎవరైతే మూడు స్థితుల నుంచి బంధవిముక్తులవుతారో వారు జ్ఞానోదయాన్ని సాధించగలరు.
వెల్లడి చేయటమే అనుభవానికి దారి
జ్ఞానోదయం నుంచి ఏది వచ్చినా అది జ్ఞానోదయానికి మిమ్మల్ని తీసుకువెళుతుంది. మీరు వెల్లడి చేసేదాన్ని మీలో నింపుకోగలిగితే అది ఆ అనుభవాన్ని ఇస్తుంది. జ్ఞానోదయమైనవారి నుంచి చిన్న సంగీతం మీరు వింటే, దాన్ని మీలో నింపుకోగలిగితే అది మిమ్మల్ని జ్ఞానోదయానుభవంలోకి తీసుకువెళుతుంది.
ఇంతకు ముందు నేను కళతో చికిత్స అనే ఆర్ట్ థెరపీ మీద ఒక వ్యాసం చదివాను. మానసిక రోగుల్ని పెయింట్ చేయమంటే వారు చాలా మోటుగా చేస్తారు. దాని మీద పెయింట్ పోసేస్తారు. కాన్వాస్ మీదే కాకుండా వారి శరీరమంతా రంగులు పులుముకుంటారు. వారిని ఆ విధంగా ఒక నెల రోజులు చేయనిస్తే క్రమంగా వారిలోని పిచ్చిత్నం తగ్గి, మామూలు స్థితికి వస్తారు.
మీకు ఇది ఆశ్చర్యం అనిపించవచ్చు. వాళ్ళు అన్నీ చిందరవందర చేస్తారు. రెండవ పరిశోధనా ఫలితం ఎవరైతే స్త్రీ వల్ల లేదా కీర్తిప్రతిష్ఠల కోసం పిచ్చివారవుతారో వాళ్ళు అవే బొమ్మలు వేస్తారు. వారిని అలా పెయింట్ చేయనిస్తే వారిలో ఉన్నదంతా బయటికి వస్తుంది. వారి పిచ్చికి కారణం అయినదాన్ని వాళ్ళు పెయింట్ ద్వారా వెల్లడి చేయగలుగుతారు.
మూడవ ముఖ్యవిషయం - ఆ పెయింటింగ్స్ ని బాగా చదివి లోతుగా విశ్లేషణ చేసి ముగింపులు చెప్పిన ఆ డాక్టర్ పిచ్చివాడయ్యాడు. స్పష్టంగా అర్థం చేసుకోండి; ఎవరైతే ఒక విషయాన్ని చాలా తీవ్రంగా వివరిస్తారో లేదా వెల్లడి చేస్తారో, దాన్ని ఎవరైతే లోతుగా విశ్లేషిస్తే ఆ అనుభవం విశ్లేషించేవారి అంతరంగంలో స్థిరపడుతుంది. అందుకే ఆ డాక్టర్ పిచ్చివాడయ్యాడు.
ఇప్పుడు అర్థం చేసుకోండి. జ్ఞానోదయమైన గురువులు లోతైన జ్ఞానోదయఅనుభవాన్ని మీ అంతరంగంలో నిలుపుకోగలిగితే మీకు జ్ఞానోదయానుభవం కలుగుతుంది. జ్ఞానోదయమైన గురువుల సమక్షంలో ఉన్నవారు అదృష్టవంతులు.
సంగీతపు ఇంద్రజాలం
ప్రసిద్ధి చెందిన సంగీతవిద్వాంసులైన త్యాగయ్య, అన్నమయ్య, మొదలైనవారు ఆశువుగా పాటలు పాడితే, వారు తమలోని జ్ఞానోదయానుభవాల్ని వెల్లడి చేయటమే. సంప్రదాయ భారతీయ సంగీతాన్ని ధ్యానంలా జ్ఞానోదయం కోసం రూపొందించారు. భారతీయ నాట్యం జ్ఞానోదయం కోసం సృష్టించబడింది. అందుకే ఆ ప్రదర్శన ఇచ్చేవారు, దాన్ని చూసేవారు ఇద్దరూ ధ్యానస్థితిలో ఉంటారు.
సంగీతాన్ని ఏ స్థితి నుంచి సృష్టిస్తారో, దానిలోకి ఆ స్థితిలోకి మీరు ప్రవేశించవచ్చు. అది హృదయం నుంచి వస్తే మీరు హృదయంలోకి వెళ్ళవచ్చు. అది కోరిక నుంచి వస్తే మీరూ కోరికని అనుభవిస్తారు. సంగీతాన్ని సృష్టిస్తున్న వ్యక్తి మానసికస్థితి మీ మానసికస్థితి మీద ప్రభావాన్ని చూపిస్తుంది.
ఎప్పుడు సంగీతాన్ని విన్నా దాన్ని స్వాగతించండి. అందులో పదాలకి రాగాలకి ప్రాముఖ్యాన్ని ఇవ్వనవసరం లేదు. దాని కేంద్రంలోకి వెళ్ళండి. అందులో ఆధారాన్ని పట్టుకోండి. అందులో కేంద్రీకృతమైన శబ్దాన్ని పట్టుకోండి. అకస్మాత్తుగా అది ఎక్కడినుంచి వస్తుందో దాన్ని మీరు అనుభవిస్తారు.
అర్థం చేసుకోండి; వెల్లడి జ్ఞానోదయం నుంచి వస్తే అది మీ జ్ఞానోదయానికి దారి తీస్తుంది.
ఆరోగ్యకరమైన శరీరం జ్ఞానోదయాన్ని పొందగల నమ్మకాన్ని ఇస్తుంది
ఒక విషయం అర్థం చేసుకోండి; మీకు మీ కుటుంబం పూర్తి ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తే మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీరు నాయకులవుతారు. మీరు మీ మీ రంగాల్లో విజయులు అవుతారు. సంఘంలో విజయులుగా ఉండాలంటే మీ కుటుంబం అవసరం. ఎందుకంటే మీరు సరియైన నిర్ణయాలు చేయగల ధైర్యాన్ని, నమ్మకాన్ని కుటుంబం ఇవ్వగలదు. అదే విధంగా జ్ఞానోదయాన్ని సాధించాలి అంటే ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని మీ శరీరం మీకు ఇవ్వగలదు. అందుకే జ్ఞానోదయానికి యోగా అంతగా ఉపయోగపడుతుంది. అది మీ శరీరం, మనస్సుల మీద పని చేస్తుంది. అది మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని, ఇస్తుంది.
జ్ఞానోదయమైన సమాజం
వేదకాలంలో భారతదేశంలో జీవితం, సమాజం, జ్ఞానోదయం పైన ఆధారపడి ఉండేది. 70 శాతం మంది జ్ఞానోదయమైనవారు, మిగిలిన 30 శాతం మంది ఆధ్యాత్మిక అన్వేషకులుగా జ్ఞానోదయానికి పని చేసేవారు.
కళలు, శాస్త్రాలు, విద్య, జీవనసరళి - అన్నీ, ప్రతి పనీ అంతిమ అనుభవమైన జ్ఞానోదయం వైపుగానే ఉండేవి. నాట్యం, సంగీతం, శిల్పకళ, దేవాలయాల సాంకేతికకళ, ఈ విధంగా అన్ని రకాల కళలూ సంస్కృతభాష, వాస్తుశాస్త్రం, గురుకుల విద్యావ్యవస్థ, సంప్రదాయమైన వేడుకలు ప్రతీ విషయం కూడా, జీవితంలో జన్మించినప్పటి నుంచీ ఉండేవన్నీ జ్ఞానోదయమైన యోగీశ్వరుల నుంచి వచ్చినవే. అందుకే అవి అన్నీ జ్ఞానోదయానికి తీసుకువెళ్తాయి.
భారతదేశం - ఆధ్యాత్మిక ఇంకుబేటరు
భారతదేశం జ్ఞానోదయమైన యోగీశ్వరులని సృష్టించే ఆధ్యాత్మిక ఇంకుబేటరు. పరిణతితో జన్మించని శిశువుల్ని ఇంకుబేటరులో ఉంచి వారికి సరిపడా ఆక్సిజన్, ఆహారం, వేడి - ఇలాంటివి అందిస్తూ వారిని జాగ్రత్తగా చూస్తారు. వారు తిరిగి తమంత తాము సహజంగా ఉండగలిగేంతవరకూ అందులో ఉంచుతారు. అదే విధంగా ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుల్ని భూమి మీద అవతరించడానికి, తనలోని జ్ఞానోదయానుభవాన్ని పూర్తిగా వెల్లడి చేయగలగటానికి ఆయనకి ఇంకుబేటరు కావాలి. భారతదేశం అటువంటి ఇంకుబేటరు. ఎందుకంటే ఇక్కడ సమాజవ్య వ్యవస్థని అంతరంగపరిశోధనాలయాలుగా జ్ఞానోదయశాస్త్రశోధనలకి అనువుగా రూపొందించారు. జీవితంలో ప్రతిదశలో అది వ్యక్తిగతమైనా లేదా వ్యాపార - ఉద్యోగాలలో, కూడా జ్ఞానోదయానుభవం కోసమే సృష్టించబడినవి. ఈ రోజున కూడా భారతదేశం జ్ఞానోదయం పొందాలి అనుకునేవారికి ఆ దిశగా అభివృద్ధి చెందటానికి అత్యంత అనువైన ప్రదేశం.
కాలపరీక్షకి నిలబడగల అంతిమశక్తి
ఈ భూమి మీద జ్ఞానోదయపు అనుభవాన్ని మించింది ఏది లేదు. వేదాంతం, ఏ వ్యవస్థ, సిద్ధాంతాలు ఏవైనా కూడా జ్ఞానోదయం మీద ఆధారపడి రూపొందించకపోతే, అవి కేవలం ఒకటి లేదా రెండు తరాల వరకూ మించి ఉండవు. భారతదేశాన్ని దాదాపు 3000 మంది రాజ వంశాలు పరిపాలించి ఉంటారు. వారిలో జ్ఞానోదయమైన యోగీశ్వరుని మార్గదర్శకత్వంలో లేనివి కనుమరుగైపోయాయి. మీరు దక్షిణ భారతదేశంలోని గ్రామాల్లోకి వెళితే పెద్ద పెద్ద దేవాలయాలు కనిపిస్తాయి. అవన్నీ జ్ఞానోదయమైన యోగీశ్వరులు ప్రాణ ప్రతిష్ఠంచేసినవి. రాజులు నిర్మించిన రాజభవనాలు నిలవలేదు. కానీ దేవాలయాలు మాత్రం వేల సంవత్సరాలకి కూడా నిలబడి ఉన్నాయి.
ఒక విషయం అర్థం చేసుకోండి; దేవాలయాలు కట్టింది, రాజభవనాలు కట్టింది ఒకే శిల్పి, ఒక విధంగా చూస్తే రాజభవనానికి ఇంకా మంచి వస్తువులు వాడి ఉండవచ్చు. ఈ రోజున మీరు చూస్తే, దేవాలయాలు అలా నిలిచి ఉన్నాయి, కాని రాజభవనాలు లేవు. అవి కాలంతో కరిగిపోయాయి. మా సొంత ఊరు తిరువణ్ణామలైలో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో నిర్మించిన దేవాలయం ఉంది. అది రాజు నిర్మించిన గుడి. అది అదే విధంగా చెక్కు చెదరకుండా ఉంది. ఎందుకంటే అందులో ఉండేది జ్ఞానోదయమైన యోగీశ్వరుని శక్తి.
మానవజాతికి చేయగల గొప్ప సేవ- జ్ఞానోదయం నిలచి ఉండేలా చేయటం
మీ జీవితంలో మీరు చేయగల గొప్ప సేవ, మీ జీవితాన్ని చక్కగా ఉపయోగించగల పద్ధతి, జ్ఞానోదయం ఈ భూమి మీద ఉండేలా చేయటం. ఇన్ని రకాల మారణాయుధాలు ఈ భూమి మీద ఉన్నా జ్ఞానోదయమైన యోగీశ్వరులు ఉన్నంత కాలం, ఈ భూమిని ఎవరూ నాశనం చేయలేరు.
జ్ఞానోదయం పొందటానికి ముఖ్యమైన 10 కారణాలు
1. వ్యథలు ఉండవు; సంతోషంగా ఉంటారు. విజయానికి అవసరమైన సందర్భోచిత స్పందన, సృజనాత్మకత.
2. జీవితాన్ని లోతుగా ఆనందించటం. స్వచ్ఛమైన ఉత్సాహంతో జీవితాన్ని ప్రతిక్షణం ఉల్లాసంగా గడపటం.
3. నిరంతరం పవిత్రతతో, మంగళత్వంతో జీవితంలో ఏం జరిగినా అది మంగళకరమే.
4. నిరంతరం - సరైన దిశగా ప్రణాళికలు, సంబంధబాంధవ్యాలు, వ్యాపారం, జీవితంలో - నిరంతరం సరైన నిర్ణయం చేయటం.
5. ప్రతిక్షణం అంతిమ అనుభవాన్ని అనుభవించటం, జీవితం అన్ని కోణాల్లో విస్తృతం అవుతూ విస్ఫోటంలా అభివృద్ధి చెందటం.
6. చదవటం కాదు, డౌన్లోడ్ చేయటమే సైన్స్, కళలు, మతం, వ్యాపారం, వంట చేయటం.... ఏదైనా విశ్వశక్తి నుంచి డౌన్ లోడ్ చేయటమే.
7. ఆశ లేదు, భయం లేదు. పొందేది, పోగొట్టుకునేది ఏదీ లేదు- మీకు కావలసినవి ఇప్పుడే ఇక్కడే పొందవచ్చు.
8. బంధవిముక్తి - అత్యంతవేగవంతమైన గేర్ మాస్టర్ మైండ్ - మనసు బంధాల నుంచి నిత్యస్వేచ్ఛ
9. భగవంతుడుగా ఉండడం మీ గమ్యం యొక్క మాస్టరు - మీ నిజాన్ని సృష్టించుకోండి
10. ప్రదేశం, కాలం మనస్సుకి అతీతంగా నిత్య ఆనందస్థితి ఒడిలో ఆనందంగా ఉండటం. మీరు నిత్యానందం. ఇది అంతిమమైంది, జరుగుతూ ఉంటుంది, ఇది చివరిది కాదు జ్ఞానోదయం అంటే బలమైన స్పష్టమైన శాంతి మీ అంతరంగంలో ఉంటుంది. దాన్ని మీ ఆలోచనలు కూడా భంగపరచలేవు. గురుదేవులు జ్ఞానోదయపు సాఫ్ట్వేర్ డౌన్ లోడ్ చేసి ఎవరి శారీరక వ్యవస్థలోనైనా నింపగలరు. యోగా శరీర మానసికవ్యవస్థల మీద పని చేస్తూ అది మీరు అనుకున్నవి అమలుపరచే ధైర్యాన్ని నమ్మకాన్ని మీకు ఇస్తుంది.
ఆనందజీవితానికి మార్గాలు
■ ధ్యానం ఎందుకు
■ నిత్యధ్యానం - నిత్యానంద ధ్యానం
■ నిత్యయోగ - శరీరం, మనస్సులకి అతీతమైనవాటి కోసం
■ నిత్యానందస్థితిలో ఉంచే ఎనిమిది మెట్లు

ధ్యానం ఎందుకు
సహజంగా ధ్యానస్థితిలో ఉండటమే జీవన్ముక్తి
ఇప్పటి వరకూ నేను మాట్లాడిన సత్యాల అనుభవం పొందే విధంగా ఇప్పుడు వచ్చే ఈ నాలుగు అధ్యాయాల్లోనూ, ఆ తరువాత వచ్చే ధ్యానపద్ధతుల్లోనూ వివరణ ఇచ్చాను. ఈ పాటికి మీకు ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాల మీద కావలసిన వివేకపూరితమైన అవగాహన కలిగింది.
ఇప్పుడు మీకు ఎలా చేయాలి అనే అంశం గురించి చెబుతాను. చెప్పిన విషయాలన్నీ మీకు అనుభవాన్ని ఇవ్వకపోతే అవి ఒక సిద్ధాంతంలా ఉండిపోతాయి.
నిజమైన జీవిత లక్ష్యం ఏమిటి?
మీ జీవితంలో అంతిమలక్ష్యం ఏమిటి?
ఇంకా సంపాదించాలని ఉందా?
ఎప్పటికీ అందంగా, ఆరోగ్యంగా, యౌవనంతో ఉండాలి అని ఉందా?
మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయాలనా?
ఈ జాబితాకి ముగింపు ఉండదు. ప్రతి వ్యక్తికీ ఒక ప్రత్యేకలక్ష్యం లేదా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ప్రతిలక్ష్యం ఎటువంటి మినహాయింపులూ లేకుండా ఒక దాని వైపు నిర్దేశించి ఉంటుంది, అదే ఆనందం. ఎవరైనా నాకు సంతోషం అవసరం లేదు, నాకు సంతృప్తి వద్దు, పరమానందం అంటే ఆసక్తి లేదు అని అనగలరా? లేదు!
మనం అందరం ఆనందం కోసమే వెతుకుతున్నాం. కాని వేరు వేరు మార్గాలలో వెతుకుతున్నాం. ఆ మార్గాలు ఎంత మేధతో ఉన్నా, ఎంత ఆధునికతతో ఉన్నా, ఏ విధంగా మనం వివరించినా మనందరం వెతికేది ఆనందం కోసమే. కాకపోతే మనం వెతికే దారులు వేరు.
అయితే మనలో తొంబై తొమ్మిది శాతం మందికి మన నిజమైన లక్ష్యం ఆనందం అని తెలియదు. అది తెలియదు కాబట్టి దాని కోసం బయటి ప్రపంచంలో అన్ని చోటులలో వెతుకుతున్నాం. దాన్ని కనుక్కోవాలి అని ఎదురు చూస్తున్నాం.
ఒక చిన్న కథ : ఒక వ్యక్తి సాయంత్రం పూట తన ఇంటి ముందు దేని కోసమో చాలా తీవ్రంగా వెతుకుతూ ఉంటాడు. అతని భార్య దేని కోసం వెతుకుతున్నారు అంటే బంగారు నాణెం పడిపోయింది అంటాడు. అతని భార్య కూడా వెతకటం మొదలుపెడుతుంది. అంతలో చుట్టు పక్కల వారు కూడా వెతకటం మొదలు పెడతారు. ఎంత వెతికినా బంగారం నాణెం కనిపించదు. అప్పుడు పక్కింటాయన ‘ఎక్కడ నాణెం పడింది’ అని అడుగుతాడు. అతను అది ఇంట్లో పడిపోయింది అంటాడు. వెతుకుతున్న వారందరికీ కోపం వస్తుంది. మరి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు, అంటారు. ఆ వ్యక్తి ‘ఇంట్లో లైట్లు లేవు ఇక్కడ వీధి దీపాలు ఉన్నాయి కదా! ఈ వెలుగులో వెతుకుతున్నాను’ అని జవాబు ఇస్తాడు.
మన జీవితాల్లో సరిగ్గా ఇదే విధంగా మనం చేస్తుంటాం. మనందరం తప్పు చిరునామాలో జవాబులు వెతకటంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాం. ఆనందాన్ని అన్నింటిలో వెతుకుతాం
- డబ్బు, అధికారం, సంబంధబాంధవ్యాలు, కానీ మనలో మాత్రం వెతకం.
ఆనందం అంటే?
ప్రతి ఒక్కరికీ జీవితంలో గొప్ప సంతోషకరమైన అనుభవాలు ఉంటాయి. అయితే ఆ సంతోషం ఏదో ఒక కారణంతో ఉంటుంది. ఆ భావం బాగుంటుంది, కాని అందులో మనని విసిగించే రెండు లక్షణాలు ఉంటాయి. ఆ భావం ఎక్కువ సేపు ఉండదు. అది ఏదో ఒక కారణంతోనే కలుగుతుంది. మీ సంతోషానికి కారణం మీకు ప్రమోషన్ వచ్చింది లేదా మీ అనారోగ్యం బాగైంది, కాబట్టి సంతోషం. కొత్త కారు కొనుక్కున్నారు అందుకే సంతోషం.
ఆ సంతోషస్థితి నిరంతరం ఉండదు. అది కాసేపు మాత్రమే ఉంటుంది. అది మారినప్పుడు, అది పోయినప్పుడు మళ్ళీ బాధ కలుగుతుంది. ఒక విషయం అర్థం చేసుకోండి. ఏ సంతోషమైతే కారణం లేకుండా వస్తుందో, ఏదైతే మీ నుంచి ఏ కారణంతోనూ బయటికి పోదో, అదే నిజమైన సంతోషం, అదే శాశ్వతమైనది. దీన్నే పరమానందం అంటాం. అటువంటి ఆనందం మీ బయట దేని మీదా ఆధారపడి ఉండదు.
ఆనందం అంటే అర్థం తగ్గించలేనిది పోగొట్టలేనిది, ఆనందం అంటే సంతోషం కాదు. దీని అర్థం చూస్తే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. దేన్నైతే తగ్గించలేమో, దేన్నైతే పోగొట్టలేమో అది ఆనందం. ఏ కారణం చేతాకూడా తగ్గనిది పరమానందం.
ధ్యానం అంటే?
ఆకాశం మన చేతనస్థితిని ప్రతిబింబించగల ఒకే ఒక మూలకం.
ధ్యానం అంటే సర్వసృష్టికి, సర్వాంతర్యామికి అనుగుణంగా ఉండటమే. ఇది మీ సహజస్థితి. మీ నిజమైన ఆనందస్థితి అదే మిమ్మల్ని అంతిమచేతనస్థితితో కలపగలిగేది.
చూడండి, విశ్వం ఐదు మూలకాలతో చేయబడింది. అవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అది అనంతవిశ్వం. సూక్ష్మ విశ్వమైన మన శరీరం కూడా అవే ఐదు మూలకాలతో చేయబడింది. మనం అనంత విశ్వంతో, సర్వాంతర్యామితో ఈ మూలకాల ద్వారా అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చు, సూక్ష్మవిశ్వం అయిన మన శరీరం అనంతవిశ్వం అనుభవాన్ని ఈ మూలకాల ద్వారా పొందగలుగుతుంది.
అనంతవిశ్వాన్ని భూమి అనే మూలకం ద్వారా అనుబంధాన్ని ఏర్పరచుకోవటానికి మనం విగ్రహారాధన చేస్తాం. విగ్రహాల్ని భూమికి సంబంధించిన పదార్థాలతో చేస్తారు. అవి మట్టి, రాయి లేదా ఏదైనా లోహం. వాటిని పూజించటం అంటే భూమి ద్వారా పూజ చేయటం. నీటి ద్వారా విశ్వంతో అనుబంధాన్ని అభిషేకాలు చేయటం ద్వారా లేదా పవిత్రమైన నదుల్లో స్నానం చేయటం ద్వారా చేస్తాం. హోమాలు చేయటం అగ్ని ద్వారా విశ్వంతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం. వాయువు ద్వారా అనుబంధం మంత్రాలతో ఏర్పడుతుంది. ఆకాశం ద్వారా అనుబంధం ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. ఈ విధంగా ఐదు మూలకాల ద్వారా మనం అనంత విశ్వంతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం.
ఈ ఐదు మూలకాల్లో ఆకాశం మాత్రమే చేతనస్థితిని ప్రతిబింబిస్తుంది. మిగిలిన నాలుగూ భూమి, నీరు, అగ్ని, వాయువు చేతనస్థితితో బంధాన్ని ఏర్పరచలేవు. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం.
చేతనస్థితిని పెంచే పద్ధతి
ఏ పద్ధతి మీలోని చేతనస్థితిని మరింతగా పెంచుతుందో అదే ధ్యానం. మామూలుగా మనం తీసుకునే శ్వాస కూడా ఒక ధ్యాన పద్ధతి. ఒక మాటని పదే పదే జపించటం లేదా కేవలం కూర్చోవటం ఇవన్నీ ధ్యానమే. జెన్ బౌద్ధమతంలో కేవలం కూర్చోవటం ఒక ధ్యానపద్ధతి. మీరు అనుకోవచ్చు అది చాలా సులభమని. కేవలం కూర్చోవటం చాలా కష్టమైన ధ్యానపద్ధతి. మీలోని చేతనస్థితిని పెంచేది ఏదైనా ధ్యానమే.
వర్తమానంలో లోతైన ఆనందం
ధ్యానం అంటే ఈ క్షణంలో ఆనందంలో ఉండటమే. మీరు ఈ క్షణంలో పూర్తి ప్రశాంతతతో ఉండగలిగితే మీరు ధ్యానస్థితిలో ఉన్నట్లే.
మీ జీవితంలో చాలా గొప్ప అందాన్ని అనుభవించిన ఏవైనా కొన్ని క్షణాల్ని గుర్తుచేసుకోండి. కొండ వెనుక నుంచి పైకి వస్తున్న సూర్యుడు, మొదటిసారి మీరు విన్న చక్కని సంగీతం. అప్పుడు అకస్మాత్తుగా మీరు నిశ్చలంగా అయిపోతారు. మాటలు లేకుండా అయిపోతారు. ఆ అందం ముందు మీరు ఏమీ ఆలోచించలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. మీరు నిశ్శబ్దంగా, విరామంగా, ఆలోచనలు లేని తెలుసుకునే తత్త్వంతో ఉంటారు. మీరు ఆ అందంలో కరిగిపోతారు. ఆ క్షణమే ధ్యానం. ఆ విధంగా కొన్ని క్షణాలు గడిచాక మీ లోపల మాటలు ప్రారంభమవుతాయి. మీ మనస్సు చెబుతుంది, 'ఆహా! ఎంత అందమైన సూర్యోదయం! ఆ విధంగా ఎప్పుడైతే మాటలు వస్తాయో మీరు ధ్యానం నుంచి బయటికి వచ్చేస్తారు. మీరు ఆలోచిస్తారు లేదా ధ్యానంలో ఉంటారు, కానీ రెండూ ఒకసారి జరగవు.
ధ్యానం అంటే కేవలం అదే విధంగా ఉండటం. వర్తమానక్షణాన్ని ఎటువంటి అడ్డంకులూ లేకుండా అనుభవించటం.
ధ్యానానికి సరైన మార్గం ఏమిటి?
మొట్టమొదటి విషయం నిజాయితీగా ఉండటం. మీరు విప్పారి ఉండాలి. మనస్సు తెరవబడి ఉండాలి. ప్రయోగాలు చేయగలగాలి. కుతూహలంతో ఉండాలి.
దృక్పథాన్ని వర్ణించటానికి జెన్ బౌద్ధమతంలో ఒక మాట ఉంది. ప్రారంభకుల మనస్సు స్థితి. దీని అర్థం ప్రతి దాన్నీ కొత్తగా చూడగలగటం. దీంతో జీవితం ఉల్లాసంగా ఉంటుంది.
రెండవ విషయం, సాధిస్తాను అనే నమ్మకంతో ఉండటం. మీరు కచ్చితంగా సాధించగల లక్ష్యం ఆనందం. మీకు ధ్యానం తెలియకపోయినా మీరు దాన్ని సాధించగలరు.
చిన్న కథ : ఒక వ్యక్తి రమణమహర్షి దగ్గరకి వెళ్లి 'భగవాన్' నేను ఆధ్యాత్మికజీవితానికి అర్హుడనేనా?' అని అడుగుతాడు. రమణమహర్షి అతనితో, నీవు జీవించి ఉన్నావా? అని ప్రశ్నిస్తాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా అవును, జీవించి ఉన్నాను అంటాడు.
రమణమహర్షి 'అది చాలు. ఆధ్యాత్మికజీవితానికి కావలసిన అర్హత నీకు ఉంది' అని జవాబు ఇస్తాడు.
మానవజీవితలక్ష్యం జ్ఞానోదయం. జ్ఞానోదయం పొందగల శక్తి కుండలినీశక్తి, అది మీలో ఉంది. దాన్ని చైతన్యపరచగలిగితే అది మిమ్మల్ని వేరే దశకి, ఉన్నతచేతనస్థితికి తీసుకువెళుతుంది. ఉన్నతచేతనస్థితికి వెళ్ళగల శక్తి కేవలం మనిషిలోనే ఉంది. జంతువులకి జ్ఞానోదయం పొందే అవకాశం లేదు. ఉన్నతచేతనస్థితికి వెళ్ళలేవు.
మూడవ విషయం, అంతా ఒక ఆటలా చూడండి. ధ్యానం అంటే సాహసం చేయటం. మీరు ధ్యానాన్ని సీరియస్‌గా తీసుకుంటే మొత్తం మిస్ అవుతారు. ధ్యానాన్ని ఉత్సవంలా చేయండి. దానిలో ఆనందాన్ని పొందండి.
ఒక చిన్న కథ : మూడు కోతులకి పండిన మామిడి పండు దొరుకుతుంది. దాని కోసం మూడూ పోట్లాడుకుంటాయి. వాటికి ఎందుకో కొంత వివేకం కలుగుతుంది. ఆ మామిడి కాయని తినే బదులు భూమిలో పాతాలి అని నిర్ణయిస్తాయి. అది మొక్కగా మొలిచి, చెట్టు అయితే చాలా కాయలు కాస్తాయి. అప్పుడు ఎన్ని కాయలైనా తినవచ్చు). అని అనుకుంటాయి.
ఆ మూడు కోతులూ మూడు బాధ్యతలు తీసుకుంటాయి. మొదటిది ‘నేను రోజూ ఆ మొక్కకి నీరు పోస్తాను’ అంటుంది.
రెండవ కోతి ‘నేను మంచి మట్టిని వేస్తాను. ఎరువులు వేసి మొక్క బాగా పెరిగేలా చేస్తాను’ అంటుంది.
మూడవకోతి ‘నేను మొక్కకి కాపలా ఉంటాను. జంతువుల నుంచి మొక్కని కాపాడతాను ’అంటుంది.
ఆ విధంగా మూడు నెలలు గడచిపోతాయి. మొక్క మొలవదు. కోతులు ఒక మీటింగ్ పెట్టుకుంటాయి.
మొదటి కోతి, ‘నేను అన్న విధంగా రోజూ నీరు పోస్తున్నాను’ అంటుంది.
రెండవది, ‘నేను చెప్పిన విధంగా నేలలో ఎరువులు, మంచి మట్టి వేస్తున్నాను’ అంటుంది.
మూడవ కోతి, ‘నేను అన్న విధంగా విత్తనాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాను. అంతే కాదు, ప్రతిరోజూ విత్తనాన్ని బయటికి తీసి అది మొలిచిందా లేదా అని కూడా చూస్తున్నాను,’ అని చెబుతుంది.
మీరు ఇన్స్టంట్ ఫలితాల కోసం ఆశతో చూస్తుంటారు. దాంతో మీ అంతరంగంలో స్థిరపడే కార్యక్రమానికి అడ్డు పడుతున్నారు. మీరే ఈ మొత్తాన్ని అడ్డుకుంటున్నారు.
ఇక ఐదవది ఏకాంతం. మీ అంతరంగ పరిస్థితులని అనుభవించగల అవకాశాన్ని మీకు ఇచ్చుకోండి. ధ్యానం మీలో ఒక భాగమైనప్పుడు, ఆనందం సహజంగా మీలో వికసిస్తుంది.
ధ్యానం ఎందుకు ?
చేతనస్థితి నాలుగు దశలు
చేతనస్థితి వివిధదశలు ఆలోచనలు. ఆలోచనలు ఉన్న స్థితి, లేని స్థితి, నేను అనే స్పృహ జాగ్రత్దశ తురీయదశ ఉన్న స్థితి నేను అనే స్పృహ, స్వప్న దశ సుషుప్తదశ లేని స్థితి
ధ్యానం ఎందుకు, ధ్యానసాధన అవసరం ఏమిటి అనే విషయాలు మీకు అర్థమయ్యే విధంగా మీకు ఒక టేబిల్ ద్వారా వివరిస్తాను. దైనందినజీవితంలో మనలో రెండు రకాల మానసికస్థితి ఉంటుంది. ఆలోచనలు ఉన్న స్థితి, మరొకటి ఆలోచనలు లేని స్థితి. మనం మేల్కొని ఉన్నప్పుడు ఆలోచనలు ఉంటాయి. గాఢనిద్రలో ఆలోచనలు ఉండవు. కాబట్టి మన మానసికస్థితి రెండు రకాలు; ఆలోచనలు ఉన్న స్థితి, ఆలోచనలు లేని స్థితి.
మన ఉనికికి (ఆత్మ) కూడా రెండు స్థితులు ఉంటాయి. ఒక స్థితిలో నేను అనే గుర్తింపు పూర్తిగా ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది. మనం మేల్కొని ఉన్నప్పుడు మనకి నేను అనే స్థితి స్పష్టంగా ఉంటుంది. నేను డాక్టరుని, నేను టీచర్ని ఇలా ఉంటుంది. మనం మేల్కొని ఉన్నప్పుడు, మనలోని 'నేను' అనేది నిరంతరం తెలియకుండా ఉంటుంది. అయితే గాఢనిద్రలో అది ఉండదు. అవును కదా? మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు నేను అనే గుర్తింపు ఉండదు. కాబట్టి మానసికస్థితిలో మనం రెండు స్థితుల్లో ఉంటాం. మన ఉనికి స్థాయిలో కూడా మనం రెండు స్థితుల్లో ఉంటాం. ఒకటి నేను అనే గుర్తింపులో, మరొకటి అది లేకుండా.
| వివిధ చేతన స్థితులు | ||
|---|---|---|
| ఆలోచనలతో | ఆలోచనలు లేకుండా | |
| “నేను” ఉన్న చేతనతో | జాగ్రత్ మేల్కొన్న అవస్థ ఆలోచిస్తూ | తురీయ పరమానంద స్థితి సంపూర్ణ చేతనస్థితి |
| “నేను” ఉన్న చేతన లేకుండా | స్వప్న స్వప్నస్థితి కలలుకంటూ | సుషుప్తి అచేతన స్థితి గాఢ నిద్ర |
ఇప్పుడు ఈ రెండు మానసికస్థితులూ, ఉనికి, స్థాయి స్థితులు ఏ విధంగా ఒక దాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయో, అవి ఏ విధంగా మన చేతన స్థితిలో వేరు వేరు దశలని సృష్టిస్తాయో చూద్దాం.
మొదటి దశ జాగ్రత్ దశ. మనలో నేను అనే గుర్తింపు ఉంటుంది. ఆలోచనలు ఉంటాయి. మనం మేల్కొని ఉన్నప్పుడు నేను అనే గుర్తింపు గురించి తాపత్రయపడతాం. ఆ స్థితిలో మనకి ఆలోచనలు కూడా ఉంటాయి. ఈ స్థితిలో నేను అనే గుర్తింపు ఆలోచనల కంటే వేగంగా, ఉంటుంది. అందుకే ఈ స్థితిలో బలమైన నేను అనే గుర్తింపుతో ఆలోచనలని నియంత్రించగలుగుతాం. మనం కావాలనుకుంటే ఆలోచనని తీసుకురాగలం, దానిని నియంత్రించగలం, దాన్ని పోగొట్టగలం. అది మేల్కొని ఉన్న స్థితిలో మాత్రమే సాధ్యమవుతుంది.
దీని తరువాత దశ కలలు ఉండే స్వప్నస్థితి. స్వప్నస్థితిలో మనకి ఆలోచనలు చాలా ఉంటాయి, కాని నేను అనే గుర్తింపు ఉండదు. మనం మన గుర్తింపు విషయం తెలుసుకునే స్థితిలో ఉండం. కాని ఆలోచనలు ఉంటాయి. అందుకే కలలో మీరు మీ అబ్బాయి పక్కన స్కూల్లో చదువుతున్నట్టు కనిపించవచ్చు. దీన్ని బట్టి చూస్తే కలల స్థితి తార్కికంగా స్పష్టంగా ఉండదు. స్వప్న దశలో నేను అనే గుర్తింపు వేగం, బలం ఆలోచనల కన్నా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వాటిని నియంత్రించలేరు. అందుకే మీకు అర్థం లేని ఆలోచనలు (కలలు) వస్తుంటాయి.
ఒక విషయం స్పష్టంగా అర్థంచేసుకోండి. మేల్కొని ఉన్న స్థితిలో నేను అనే గుర్తింపు ఆలోచనల కంటే వేగంగా, బలంగా ఉంటుంది. అందుకే ఆలోచనలని నియంత్రించగలం. స్వప్నదశలో నేను అనే గుర్తింపు కంటే ఆలోచనలు బలంగా వేగంగా ఉంటాయి. అందుకే కలల్లోని ఆలోచనలని నియంత్రించలేం. గాఢ నిద్రావస్థలో నేను అనే గుర్తింపు ఉండదు, ఆలోచనలు ఉండవు. దీన్నే సుషుప్తి అంటారు. కలలు ఉండవు, నేను అనే గుర్తింపు ఉండదు.
మన జీవితంలో ఈ మూడు దశల అనుభవాన్నీ మనం నిరంతరం పొందుతుంటాం. అవి జాగ్రత్ స్థితి, స్వప్నస్థితి, సుషుప్తి.
నాల్గవ దశ కూడా ఉంది, అది మనం అనుభవించని దశ, దీన్నే తురీయదశ అంటారు. ఇందులో నేను అనే గుర్తింపు ఉంటుంది. కాని ఆలోచనలు ఉండవు. దీన్నే ఆలోచనలు లేని ఎరుక అంటారు. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ స్థితి అనుభవంలోకివస్తుంది. కొంత మందికి ఈ స్థితి కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉండవచ్చు. ఆ తరువాత తిరిగి మామూలు దశకి వెళ్ళిపోతారు. మీలో అకస్మాత్తుగా ఏదైనా జరిగినా లేదా అందమైన ప్రకృతిలో లీనమై పూర్తి విరామంగా ఉన్నప్పుడు, లోతైన నిశ్శబ్దంలో ఉన్నప్పుడు ఆలోచనలు లేని ఎరుక అనుభవించవచ్చు. నేను అనే పూర్తి స్పృహ ఉంటుంది. కానీ ఆలోచనలు ఉండవు. ఇదే నాలుగదైన తురీయ దశ.
మనలోని భౌతిక, మానసిక అనారోగ్యం స్వప్నస్థితిలో ప్రారంభమవుతుంది. అది సుషుప్తి, స్వప్నదశల్లోకి చొచ్చుకొని వస్తుంది. మనం మేల్కొన్న స్థితిలోకి స్వప్నస్థితి వస్తే దాన్నే పగటి కలలు అంటారు. అప్పుడు మనం చేయాలని అనుకున్నవాటిని అంతు లేని ఊహల్లో చూస్తాం. సుషుప్తిలోనికి స్వప్నస్థితి వస్తే అనిశ్చలమైన నిద్ర అంటాం.
రాత్రి కాని పగలు కాని, స్వప్నస్థితి మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సుషుప్తస్థితికి స్వప్నస్థితి ఆటంకమైనప్పుడు స్తబ్దత, సోమరితనం, నిద్ర లేమి అనే సమస్యలు వస్తాయి. అదే మేల్కొన్న స్థితిని ఆటంకపరిస్తే పగటికలల్లో అంటే ఊహల్లో ఉంటారు. బయటి ప్రపంచం gురించిన ఎరుక ఉండదు.
మీరు ఇటువంటి స్థితి చాలా సార్లు అనుభవించి ఉంటారు. ఇంటి నుంచి ఆఫీసుకి కారులో డ్రైవ్ చేసి వెళతారు. అక్కడ పార్కింగ్ దగ్గర ఆగాక అరె ఇంత దూరం డ్రైవ్ చేశానా అని అనుకుంటారు. ఆ డ్రైవింగ్ సమయంలో కొన్ని వందల నిర్ణయాలు చేస్తారు. కారులో కూర్చోవటం, బ్రేక్ వేయటం, సిగ్నల్స్ తిప్పటం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగటం - ఇలా చాలా చేస్తారు. కానీ మీకు తెలియకుండానే ఈ నిర్ణయాలన్నీ చేస్తారు. అకస్మాత్తుగా 'అరే! నేను ఆఫీసుకి వచ్చేసాను' అని అనుకుంటారు. ఇలా జరిగిందంటే మీ స్వప్నస్థితి మేల్కొన్న స్థితిలోకి చొచ్చుకొని వచ్చింది అని అర్థం. స్వప్నస్థితి మేల్కొన్న స్థితిలోకి ఎక్కువగా వచ్చే కొద్దీ మన చేతనస్థితి తగ్గిపోతూ ఉంటుంది. మనం మానవ శరీరంలో జీవిస్తూ నిజమైన మానవ జీవితాన్ని గడపం.
ఎప్పుడైతే చేతనస్థితి తగ్గుతుందో మనం చేసే నిర్ణయాల పట్ల మనకి పూర్తి అవగాహన, ఎరుక ఉండవు. మనం ఆలోచించే మాటల పట్ల ఎరుక ఉండదు. మన లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఇంట్లోనే ఉంటాం కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియని స్థితి ఇది. మేల్కొన్న స్థితిలో స్వప్నస్థితిలో ఆటంకపరుస్తూ జీవించే జీవితాన్ని నేను నరకంలో జీవించటం అంటాను. మనలోని శారీరక మానసికసమస్యలకి కారణం స్వప్నస్థితి సుషుప్తస్థితిలోకి కాని జాగ్రత్స్థితిలోకి కాని చొచ్చుకొని రావటం వల్ల మాత్రమే. ఆ విధంగా జరిగినప్పుడు భౌతిక, మానసికసమస్యలు వస్తాయి.
ధ్యానం మన జాగ్రత్స్థితిలోకి, సుషుప్తిలోకి లోతైన ఎరుకని నింపటానికి అవసరం.
మేల్కొని ఉన్న స్థితిలోకి స్వప్న స్థితి ఎక్కువగా చొచ్చుకొని వస్తే అది మానసిక క్రుంగుబాటుకి (డిప్రెషన్) కి దారి తీస్తుంది. ఎందుకంటే మన ఆలోచనలలో స్పష్టత ఉండదు. కాబట్టి మనలోని వ్యతిరేకాలోచనలను దాటి వెళ్ళగల స్వేచ్ఛ గాని, శక్తి గాని మనకి ఉండవు. డిప్రెషన్లో ఉన్నప్పుడు దారులన్నీ మూసుకుపోయి, అవకాశాలన్నీ అయిపోయాయి అనిపిస్తుంది. మీరు అడగవచ్చు, 'ఎందుకు ధ్యానం చేయాలి?' అని. ధ్యానం మీ జాగ్రత్ స్థితిలోకి సుషుప్తిలోకి తెలుసుకునే తత్త్వాన్ని నింపుతుంది. ధ్యానం చేసినప్పుడు స్వప్న స్థితి జాగ్రత్లోకి, సుషుప్తి లోకి చొచ్చుకుని పోయే బదులు తురీయ స్థితుల్లోకి వస్తుంది.
ధ్యానం తురీయదశని జీవితంలో ప్రతి క్షణంలోకి తీసుకువస్తుంది.
మనం ధ్యానం చేసే కొద్దీ మనలో తెలుసుకునే తత్త్వం పెరుగుతుంది. మనం చేతనస్థితి అయిన తురీయదశకి మరింత చేరువ అవుతాం. తురీయ అంటే నాలుగవ దశ. ఈ స్థితికి ఒక కచ్చితమైన పేరు ఇవ్వలేం. ఈ దశకి చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే విధమైన చేతనస్థితిని సూచిస్తాయి. ఎప్పుడైతే ఈ దశ మేల్కొన్న స్థితిలోకి లేదా గాఢనిద్రలోకి వస్తుందో శారీరక, మానసికారోగ్యం బాగుటుంది. మనం కారణం లేని ఆనందాన్ని అనుభవిస్తాం. అప్పుడు మన ఉనికి ధ్యానంగా మారుతుంది.
ధ్యానం ఉద్దేశం ఈ నాలుగవ దశని కనీసం ఒకసారైనా అనుభవించాలని. ఒక్కసారి ఈ దశని అనుభవిస్తే, ఆ అనుభవాన్ని మేల్కొని ఉన్న స్థితికి, గాఢనిద్రాస్థితికి తీసుకురావచ్చు. మన మేలుకున్న స్థితి, గాఢనిద్రాస్థితి నాల్గవ స్థితితో ప్రభావితమైతే, దాన్నే జీవన్ముక్తి అంటాం.
ధ్యానం ఉద్దేశం తురీయదశని మేల్కొన్న స్థితిలోకి, గాఢనిద్రస్థితిలోకి తీసుకురావటమే.
ధ్యానపద్ధతులు ఎందుకు
ధ్యానపద్ధతులు మీరు ఏదో సాధించటానికి సహాయం చేయవు. మీరు ఇంకా పరమానందస్థితి, నిత్యానందస్థితిని పొందలేదు అని గుర్తుచేయటానికి సహాయం చేస్తాయి.
నేను మిమ్మల్ని అకస్మాత్తుగా 'ఆనందంలోకి వెళ్ళండి' అన్నానునుకోండి, అది సాధ్యమవుతుందా? లేదు! ఆనందం మీ సహజ స్థితి అన్న విషయం కూడా మీకు తెలియదు. కాని ఎప్పుడైతే గురువులు పదే పదే ధ్యానం చేయమని చెబుతుంటారో, మీరు ఆ ఆనందాన్వేషణలో ఉన్నారు అని గుర్తువస్తుంది.
ధ్యానపద్ధతులు ఆనందసాగరాన్ని దాటించే లైఫ్ జాకెట్స్. మీకు ఈత కొట్టటం రానప్పుడు తిన్నగా నీళ్ళలోకి దూకరు కదా! మీకు లైఫ్ జాకెట్స్ కావాలి. అవి మీరు నీళ్ళలో తేలేలా సహాయం చేస్తాయి. అదే విధంగా ఆనందసాగరంలోకి దూకటానికి ప్రారంభంలో మీకు ధ్యానపద్ధతులు అవసరం. ఒకసారి ధ్యానం మీ జీవనసరళి అయితే, మీరు అప్రయత్నంగా ఆ పద్ధతుల్ని వదిలేస్తారు. ఎందుకంటే ధ్యానం మీ జీవితం అవుతుంది కాని అది దినచర్య కాదు. ప్రతి క్షణం మీరు ధ్యాన స్థితిలో ఉంటారు. ధ్యానం మీలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. మీరు బయటి ప్రపంచంలో ఏ పని చేస్తున్నా, ధ్యానం మీలో ఉంటుంది.
నన్ను చాలా మంది అడుగుతుంటారు, ఇన్ని ధ్యానపద్ధతులు ఎందుకు అని. చాలా ధ్యానపద్ధతులు ఎందుకు ఉన్నాయి అంటే చాలా రకాల మనుషులు ఉన్నారు కాబట్టి, ఒక్కొక్కరిది ఒక్కో మానసికవ్యవస్థ. ఒక ధ్యానపద్ధతి ఒకరికి కుదిరితే అది మరొకరికి నచ్చదు. కాబట్టి మీరు కొన్ని పద్ధతులతో ప్రయోగాలు చేసి మీకు బాగా పనిచేసే దానిని తెలుసుకోవచ్చు. రెండవ విషయం ఎప్పుడైతే మీరు రకరకాల పద్ధతుల్ని ప్రయత్నిస్తుంటారో మీకు తెలియకుండా మీరు ఆలోచనలు లేని స్థితికి వెళుతుంటారు. విరామ స్థితిని చేరతారు. పరమానంద స్థితిని పొందుతారు.
ధ్యానం ఉపయోగాలు
భౌతికారోగ్యం : ధ్యానం మిమ్మల్ని భౌతికంగా, మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా మార్చగల శక్తిని కలిగి ఉంది. ఈ నాలుగురకాల ఆరోగ్యం అంటే ఏమిటో వివరిస్తాను. భౌతికారోగ్యం అంటే మీరు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమై అది మీలో ఒక భాగం కావాలి. మానసికారోగ్యం అంటే మీలోకి తీసుకున్న ఊహలు, భావాలని, సమస్యల్ని, మీరు పరిష్కారాలు కనుగొనే క్రమంలో ఎదుర్కొనే విషయాల్ని, మాటల్ని, జీర్ణంచేసుకోగలగాలి. అంటే మీలో మీకు విభేదాలు లేకుండా జీవించగలగాలి. ఆధ్యాత్మికారోగ్యం అంటే మీరు విన్న గొప్ప బోధల్ని, శక్తిని జీర్ణంచుకొని స్వేచ్ఛగా జీవించాలి. ఈ మూడింటినీ పొందటమే సంపూర్ణారోగ్యం.
మీ జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తే అది భౌతికారోగ్యం. నేను చెబుతున్నాను ఇక మీకు ఏమీ అవసరం లేదు. మీ జీర్ణవ్యవస్థ కచ్చితంగా ఉంటే మీకు ఆహారంతో కూడా అవసరం లేదు. మీ శరీరవ్యవస్థకి విశ్వం నుంచి శక్తిని తీసుకునే మేధ ఉంటుంది. మీ జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటే చాలా కొంచెం ఆహారం చాలు, ఆహారం లేకపోయినా పరవాలేదు.
మందులకు బదులు ధ్యానం వాడవచ్చు. ధ్యానం ద్వారా మీలోని బి.పి.ని నియంత్రించవచ్చు. రక్తంలో ఉండే గ్లూకోజు పరిమాణాన్ని నియంత్రించవచ్చు. మీ శరీరం వ్యాధుల బారిన పడకుండా దానికి శక్తిని ఇవ్వవచ్చు. శరీరానికి ఉండే అలర్జీలు, ఆస్త్మా లాంటి వ్యాధుల్ని తగ్గించవచ్చు. ధ్యాన శక్తి ముందు ఏ వ్యాధి అయినా తల వంచవలసిందే.
మానసికారోగ్యం - మేధని, మేల్కొలిపి ఆత్మప్రబోధస్థితి వికసించేలా చేయటం :
మానసికవ్యవస్థలో ధ్యానం స్పష్టతని ఇస్తుంది. ఏకాగ్రతని, జ్ఞాపకశక్తిని పెంచటానికి ధ్యానం సహాయం చేస్తుంది. వీటి అన్నింటి కంటే ధ్యానం మీలోని తెలివితేటల దశ నుంచి మిమ్మల్ని మేధస్సుకి, అక్కడి నుంచి ఆత్మప్రబోధస్థితికి తీసుకువెళుతుంది. కేవలం తార్కిక జ్ఞానంతో నిర్ణయాల్ని చేస్తే దాన్ని తెలివితేటల దశ అంటారు. ఒక విషయానికి లేదా ఒక సంఘటనకి మీరు సృజనాత్మకంగా నిర్మాణాత్మకంగా ప్రతిస్పందిస్తే దాన్ని వివేకం అంటారు. వివేకం అంటే జీవితంలో ప్రతిక్షణం జరుగుతున్నవాటికి స్పందిస్తూ, అది విసిరే సవాళ్ళని తెలుసుకోగలగటమే. సంఘటన పట్ల పూర్తి ఎరుకతో ఉండి సమయస్ఫూర్తితో జవాబులు ఇవ్వగలగటమే వివేకం అంటే.
నిర్ణయాలు మనలో ఒక స్ఫురణలా ఏర్పడటమే ఆత్మప్రబోధం అంటే. అది మీ ఉనికి శక్తి నుంచి జరుగుతుంది కాని మానసిక వ్యవస్థ నుంచి కాదు. ధ్యానం మీలో ఉన్న ఆ దివ్యశక్తిని పొందేలా చేస్తుంది. ధ్యానంతో మీరు మనస్సుకి అతీతంగా వెళ్ళవచ్చు. మీ ఉనికిని చేరవచ్చు. ఉనికి దగ్గర నియమనిబంధనలు ఉండవు. మీలో నిక్షిప్తమైన శక్తిని తెలుసుకోవటానికి పూర్తి స్వేచ్ఛనిస్తుంది. అందుకే ధ్యానంతో అకస్మాత్తుగా మీరు మీతో సౌకర్యంగా ఉండగలుగుతారు. కొత్త విషయాలతో చక్కగా వ్యవహరించగలుగుతారు. మీలోని సమయస్ఫూర్తిని మరొకసారి కనుగొనగలుగుతారు.
మీకు చికిత్స చేసే ఆలోచనలు
వైద్యపరంగా మీ శరీరం మంచి ఆరోగ్యస్థితిలో ఉండవచ్చు. దాని అర్థం మీరు సంపూర్ణారోగ్యంతో ఉన్నారు అని కాదు. నా అనుభవంలో నేను లక్షల మందిని చూసాను. ఆ అనుభవంతో చెబుతున్నాను, ఎవరిలో అయితే తమకితాము చికిత్స చేసుకోగల స్పష్టత ఉండదో వారిలో తొంబై శాతం మందికి శారీరకారోగ్యం ఉండదు. చికిత్స చేసుకోగల శక్తి అంటే మీరు నిరాశానిస్పృహల్లోకి వెళ్ళే ముందు, ఆ స్థితిని అర్థం చేసుకొని అందులోంచి బయటికి రాగలగటమే.
ఒక సంవత్సరం క్రితం నేను చిన్న పరిశోధన చేసాను. ధ్యానకార్యక్రమాలు చేసి, ఆధ్యాత్మికంగా కొంత చదివిన కొంత మందిని తీసుకున్నాను. వారిని ఇరవై నిమిషాల పాటు వారికి వచ్చిన ఆలోచనలని ఎడిట్ చేయకుండా రాయమని చెప్పాను. అదే విధంగా మరి కొంత మంది ఎవరైతే ఎటువంటి ధ్యానకార్యక్రమాలూ చేయలేదో వారిని కూడా వచ్చిన ఆలోచనలని రాయమని చెప్పాను. ఫలితాలు చూసి నిర్ఘాంతపోయాను.
ఎటువంటి ధ్యాన కార్యక్రమాలూ చేయనివారిలో ఎనభైశాతం ఆలోచనలు నిరాశానిస్పృహలతో ఉన్నాయి. అవి డిప్రెషన్ కలిగించే ఆలోచనలు. కేవలం ఇరవై శాతం మాత్రమే సాంత్వన కలిగించే ఆలోచనలు. అవి డిప్రెషన్ నుంచి బయటకి తెచ్చే ఆలోచనలు. ధ్యాన కార్యక్రమాలు, ఆధ్యాత్మికకార్యక్రమాలు చేసేవారిలో దాదాపు అరవై శాతం సాంత్వన కలిగించి, అంతరంగంలో చికిత్స చేసే ఆలోచనలు కేవలం నలభై శాతం డిప్రెషన్ వైపు తీసుకువెళ్ళే ఆలోచనలు. అదే ధ్యానప్రభావం. అది మిమ్మల్ని సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంచుతుంది.
డిప్రెషన్ ని ఎదుర్కోగల జ్ఞానాయుధాలు
సత్యం గురించి చెప్పే జ్ఞానాన్ని నేను శాస్త్ర శస్త్రాలు, జ్ఞానా ఆయుధాలు అంటాను. శాస్త్రం అంటే సత్యం, జ్ఞానం, శస్త్రాలు అంటే ఆయుధాలు. ఈ శాస్త్రశస్త్రాలు మన లోపలి మానసిక క్రంగుబాటుని నాశనం చేస్తాయి. ఎప్పుడైతే డిప్రెషన్ కాని, బాధలు కాని మీమీద దాడి చేస్తాయో, మీ మనస్సు మీ ముందుకి కొన్ని దృశ్యాల్ని తీసుకువస్తుంది. ఆ క్షణాలలో ఈ శాస్త్ర శస్త్రాలు మిమ్మల్ని ఆ క్రంగుబాటు నుంచి బయటికి తెస్తాయి. ఆ ఆలోచనలు మీ వ్యధల నుంచి పైకి వచ్చేలా సహాయం చేస్తాయి. అందుకే సత్యాన్ని మీలో నింపుకోవటం ఒక భారమైన విషయం అనుకోవద్దు. దాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నించండి. అది మీ అంతరంగంలో ఉంటుంది. దాన్ని మీ అంతరంగంలో జ్ఞానాయుధంగా దాచండి.
మీలో శాస్త్ర - శస్త్రాలు, జ్ఞానాయుధాలు ఎక్కువగా ఉంటే డిప్రెషన్ భయపడిపోతుంది. మీ సైన్యం పెద్దదైనప్పుడు సహజంగానే శత్రుసైన్యం భయపడుతుంది. అది మీ మీద దాడి చేయదు. మీ దగ్గర ఉన్న ఆయుధాల్ని చూసి మీ మీద దాడి చేయాలి అంటే ఆలోచిస్తుంది. అదే విధంగా మీ లోపల సాంత్వన కూర్చే, మీ అంతరంగంలో చికిత్స చేయగల ఆలోచనలు ఎక్కువగా ఉంటే బాధలు, మానసిక క్రంగుబాటుతనం మీరంటే భయపడతాయి. నిజంగా చెప్పాలంటే మీ లోపల డిప్రెషన్ కలిగించే ఆలోచనలు తగ్గుతాయి. మిమ్మల్ని హింసించే ఆలోచనలు తగ్గి సాంత్వన ఇచ్చే ఆలోచనలు పెరుగుతాయి.
స్వేచ్ఛ
ధ్యానంతో మీరు మంచి జీవితాన్ని గడపవచ్చు. గొప్ప స్పష్టతతో, గాఢతతో చక్కగా జీవించవచ్చు. మీలో తెలుసుకునే తత్త్వం సృజనాత్మకత పెరుగుతాయి. మీ అంతరంగంలో లోతైన, నిశ్చలమైన నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు.
మీరు చేయరు, చేసే వ్యక్తిని చూడగలుగుతారు. ధ్యానంలో ఉండే రహస్యం ఇదే. మీరు చేసే పనులని, మీ భావావేశాల్ని మీరు గమనించగలుగుతారు. మీరు చూడగలుగుతారు. మీ పనులని మీరు గమనించగలిగినప్పుడు, మీ లోపల ఎటువంటి మార్పుచెందని ఒకరు ఉన్నారు అని తెలుసుకుంటారు. ఆ వ్యక్తిలో మార్పుండదు, బాధ పడడు, కోపం రాదు, డబ్బు, రక్షణ, పేరు ప్రతిష్ఠలు వీటిని లెక్క చేయడు.
అదే నిజమైన మీరు. మిమ్మల్ని ఏదీ అంటలేదు. మీ మీద ఎవరూ ప్రభావం చూపలేరు. మిగిలినదంతా మీ చుట్టూ మీరు తయారుచేసుకున్న మీ వ్యక్తిత్వం. ఎప్పుడైతే ఈ పనులు చేసేది నిజమైన మీరు కాదు అని తెలుసుకుంటారో, కోపం తెచ్చుకునేది, బాధ పడేది, క్రుంగిపోయేది ఇవన్నీ నిజమైన మీరు కాదు అని తెలుసుకుంటారో, మీరు అంతు లేని స్వేచ్ఛని అనుభవిస్తారు. అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. అదే నిజమైన స్వేచ్ఛ.
మన జీవితం అంతా స్వేచ్ఛ కోసం వెతుకుతూ ఉంటాం. మీరు తెలుసుకున్నా, లేకపోయినా మనలో ప్రతి ఒక్కరూ వెతికేది ఆ స్వేచ్ఛకోసమే. మన స్వేచ్ఛ వేరే వ్యక్తుల మీద ఆధారపడి ఉన్నది అనుకుంటాం. ఇప్పుడు మీకు ఎదుటివారికి, మీ స్వేచ్ఛకి ఎటువంటి సంబంధం లేదు అని అర్థం అవుతుంది.
సాధారణజీవితాల్లో మన అందరం చేసేది స్వేచ్ఛ కోసం లేదా దేన్నుంచైనా స్వేచ్ఛ పొందాలి అని పని చేయటానికి, దేన్నైనా పొందటానికి, ఉండటానికి ఇవన్నీ కలిపి మనం అనుకున్న విధంగా జీవించాలి అని కోరుకుంటాం. మనకి ఇష్టంలేని - అనారోగ్యం బాధలు, కోపం, ఒత్తిడి, వ్యథలు, కష్టాలు ఇలాంటివాటి నుంచి స్వేచ్ఛని కోరుకుంటాం. మనం మంచివాటి పట్ల ఆశ, మంచివి కాని వాటి పట్ల భయం అనే ఈ రెండింటి మధ్యలో చిక్కుకొని ఉంటాం. మన జీవితం అంతా ఆశ, భయం అనే ఈ రెండు తాళ్లతో నియంత్రించబడుతున్నాం. ఈ రెండు మరిచి మనని నియంత్రించేటప్పుడు మనం నిజంగా కోరుకునే స్వేచ్ఛ సంగతి మరిచిపోతున్నాం. ఒక రోజు ఒక వ్యక్తి నన్ను కలిసాడు. అతను కళాకారుడు. ధ్యానం అంటే నాకు ఇష్టం ఉండదు అని నాతో అన్నాడు. అతను ఇంకా ఇలా చెప్పాడు, 'ఈ రూల్స్ అన్నా, క్రమశిక్షణ అన్నా నాకు చాలా చిరాకు. నాకు స్వేచ్ఛగా నా ఇష్టం వచ్చినట్టు ఉండటం ఇష్టం. నేను పదింటికి నిద్ర లేస్తాను. ముందుగా కాఫీ తాగుతాను. తరువాత స్విమ్మింగ్ కి వెళ్తాను..... ఇలా అతను రోజంతా ఏం చేస్తాడో చెప్పాడు. అప్పుడు అతణ్ణి నేను అడిగాను, 'ఎవరైనా నిన్ను ఆరుగంటలకే నిద్ర లేపితే ఏమవుతుంది' అని లేదా నీకు నిద్ర లేవగానే కాఫీ ఇవ్వకపోతే ఏమవుతుంది? అని. అతను 'అమ్మో! అలా చేస్తే నాకు పిచ్చి ఎక్కుతుంది' అని చెప్పి నవ్వాడు.
'ఒక రోజు స్విమ్మింగ్ కి వెళ్ళకపోతే ఏమవుతుంది' అని అడిగాను. 'నాకు బాగుండదు. రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది' అని జవాబు ఇచ్చాడు.
అతనితో నేను ఇలా అన్నాను, నీ స్వేచ్ఛ ఇన్ని నిబంధనల మీద ఆధారపడి ఉంది. నిజంగా నీవు స్వేచ్ఛగా ఉన్నావా? అని. అతను నిర్ఘాంతపోయాడు. నిజంగా స్వేచ్ఛ అంటే అన్నింటి నుంచి స్వేచ్ఛగా ఉండాలి.
దాన్నే నేను నిజమైన స్వేచ్ఛ అంటాను. ఇది స్వేచ్ఛ కోసం కాదు వాటి నుంచి స్వేచ్ఛని పొందటం. నిజమైన స్వేచ్ఛ వర్తమానంలో, ఈ క్షణంలో జీవిస్తే దొరుకుతుంది. ఏ స్వేచ్ఛ అయితే బయటి ప్రపంచవిషయాల మీద ఆధారపడి ఉండదో అదే నిజమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ మీకు ధ్యానం ద్వారా అనుభవం అవుతుంది.
కారణం లేని ప్రేమ, ఆనందం
మీరు ధ్యానంలోకి ప్రవేశించగానే మీ నుంచి పొంగి ప్రవహించే ప్రేమని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ధ్యానం ద్వారా ఇంత వరకూ మీరు చూడని మీలోని ఒక కొత్త కోణం మీతో సంభాషించటం అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఎప్పుడైతే తరిగిపోని ఆనందాన్ని అనుభవిస్తారో, ఎప్పుడైతే బయటి ప్రపంచవిషయాలు లేకుండా ఆనందాన్ని పొందుతారో అప్పుడు మీరు మీ అంతరంగంలోకి లోతుగా వెళుతున్నారు అని అర్థం. మీరు కలిసిన ప్రతి ఒక్కరితో ఆ ఆనందాన్ని పంచాలని అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ఆనందం పొంగి ప్రవహిస్తుందో, అందరినీ ప్రభావితం చేస్తుందో దాన్ని ప్రేమ అంటారు.
స్వేచ్ఛ మాదిరిగానే ఈ ప్రేమ కూడా మీరు ఎప్పుడూ అనుభవించనిది. మీ జీవితం అంతా మీరు ప్రేమిస్తున్నారు, ప్రేమించబడుతున్నారు. అయితే అది ఏదో ఒక కారణంతో మాత్రమే. అది అత్యంతసన్నిహితుల మధ్య అయినా సరే భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమలో కూడా ఏవో కనపడని కారణాలు ఉంటాయి. మనకి తెలిసిన ప్రేమ, అసూయ, అధికారం, ఆశించటం అనే మరకలతో ఉంటుంది. ధ్యానంతో మొదటిసారిగా కారణం లేకుండా ప్రేమించటం అంటే ఏమిటో తెలుసుకుంటారు. మీరు ప్రేమని అలవోకగా ఇచ్చేస్తారు. ఎందుకంటే మీ దగ్గర పొంగి ప్రవహిస్తున్న ప్రేమ ఉంది.
ధ్యానం ప్రయోజనాలు - ఆరోగ్యం
ధ్యానం సంపూర్ణమైన ఆరోగ్యాన్నిస్తుంది. భౌతిక, మానసిక, భావావేశాత్మకస్థాయిలలో అది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధ్యానం చేసిన వారు చెప్పిన కొన్ని ఆరోగ్యసంబంధిత ఉపయోగాలు ఈ కింది వివరించాం.
1. బి.పి., బ్లడ్ షుగర్, శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకోవటం నిశ్చలంగా, నియంత్రణలో ఉంటాయి.
2. శారీరక మానసిక పరమైన కదలికలు పద్ధతిలో ఉంటాయి.
3. కండరాల్లో సమస్యలు తగ్గి, ఎముకలు బలపడతాయి. శరీరానికి వ్యాధులను తట్టుకొనే శక్తి వస్తుంది.
4. శరీరశుభ్రత - విషపదార్థాలు, వ్యర్థాలు త్వరగా బయటికి పోతాయి.
5. నిద్ర లేమి ఉండదు - మంచి నిద్ర పడుతుంది.
6. శక్తి పెరిగి ఎక్కువ పని చేయగలుగుతారు.
7. జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని చర్యలు బాగుంటాయి. శరీరకణాల జీవిత కాలం పెరుగుతుంది.
8. ఆరోగ్యకరమైన శరీరరసాయనాలు వృద్ధి చెందుతాయి. - సహజమైన నిరాశానిస్పృహల్ని, డిప్రెషన్ ని తొలగించే రసాయనాలు తయారవుతాయి. ఎండోర్ఫిన్, ఆనందాన్ని కలిగించే రసాయనాలు తయారవుతాయి.
9. మంచి సంబంధబాంధవ్యాలు - ధ్యానం మిమ్మల్ని మీకు అనుగుణంగా మారుస్తూ, ఎదుటివారికి అనుగుణంగా ఉంచుతుంది. దీంతో మానవసంబంధాలు లోతుగా అర్థవంతంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో, స్నేహితులతో, మీరు ఎవరిని కలిస్తే వారితో మంచి సంబంధాలు ఉంటాయి.
10. వివేకం - బాగా పనిచేయటానికి మేధ కావాలి. మీలోని మేధని ధ్యానం చైతన్యవంతం చేస్తుంది. మీరు పదునైన తెలుసుకునే తత్వంతో ఉంటారు. దాంతో మీరు ఏ ప్రనైనా సహజసిద్ధంగా, సమర్థంగా పూర్తిచేయగలుగుతారు.
11. సృజనాత్మకత - మన అందరిలో మనం కనుగొనని గొప్ప నైపుణ్యం అనే ఐశ్వర్యం ఉంటుంది. ధ్యానం దాన్ని మనకి తెలియచేస్తుంది. మనలో సృజనాత్మకతని పెంచుతుంది.
12. యథార్థమైన - ధ్యానం మీలోని నిజమైన మిమ్మల్ని స్పృశిస్తుంది. అది మీలోని ప్రత్యేకతని తెలుసుకునేలా చేస్తుంది. అప్పుడు మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది.
13. సమతుల్యత - మనందరం ఏదో భావావేశాల తోపుడులతో ఈ చివరి నుంచి ఆ చివరికి ఊగిసలాడుతూ ఉంటాం. బాధ, అసూయ, అసంతృప్తి, భయం, కోపం, అపరాధభావం, ఇలా మన నియంత్రణలో లేనివాటి ప్రభావంలో ఉంటాం. ధ్యానం మీ మీద మీరు కేంద్రీకరింపబడే విధంగా చేస్తుంది. మీకు మీరు యజమానిగా ఉండగలరు.
14. విరామంగా, ప్రశాంతంగా, పరమానందంలో - మనం జీవితాంతం కోరుకునే నిశ్చలమైన విశ్రాంతి, ప్రశాంతత అనేవి ధ్యానం ద్వారా మనకి దొరికే ఉపవస్తువులు, ధ్యానంతో మీరు భయం, ఆశ, ఒత్తిడి అనే విషచక్రం నుంచి ఆనందం అనే ధర్మచక్రంలోకి వస్తారు.
15. సంపూర్ణమైన ఆధ్యాత్మికప్రగతి - మనలోని మేధని ఐక్యూతో కొలుస్తారు. ఇప్పుడు ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో ఐక్యూ కంటే ఎమోషనల్ కోషెంట్ ప్రముఖంగా వినిపిస్తూంది. కాని మన జీవితంలో చాలా ముఖ్యమైనది మన అంతరంగంలో ఉండే సంతృప్తి, పరిపూర్ణత్వం. ధ్యానం వీటిని వృద్ధి చేస్తుంది. స్పిరిచ్యువల్ కోషెంట్ ఐక్యూ, ఐక్యూలని కూడా పెంచుతుంది.
16. జీవితం - ప్రస్తుతం మన మానసికవ్యవస్థ గట్టిపడిపోయి, మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. వ్యక్తిత్వం అని మన మనస్సులో మోసే ఈ ముద్ర మనకి చాలా సమస్యల్ని తీసుకువస్తుంది. దాంతో మనం పూర్తిగా జీవితాన్ని ఆనందించలేకపోతున్నాం. ధ్యానం దీన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనం సంపూర్ణంగా జీవించగలుగుతాం.
17. అంతిమశక్తి - మీరు విమానంలా ఎగరגל శక్తి ఉన్నవారు కాని మీరు ఎద్దుల బండిలా నడిచేవారిమే అనుకుంటున్నారు. మీ శక్తిని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ధ్యానం మీ శక్తిని తెలుసుకునేలా చేస్తుంది. మీరు చాలా నైపుణ్యాలతో, శక్తితో జన్మించారు.
ఆటలా పని చేయటం
మనలో చాలా మంది ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంటే, నాకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది, చాలా పోటీ ఉంది, ఏదైనా చేయాలంటే ఏ పనీ చేయలేకపోతున్నాను, ఇలా అనుకుంటారు. మీరు అసలు సత్యాన్ని చూస్తే అది టైం లేకపోవటం లేదా పని ఎక్కువగా ఉండటం కాదు. అది వాటి పట్ల మీకుండే దృక్పథం మాత్రమే.
మీరు ఈ విధంగా చేయండి. మీరు ఏ పని చేసినా పూర్తి తెలుసుకునే తత్త్వంతో చేయండి. తినేటప్పుడు పూర్తి తెలుసుకునే తత్త్వంతో తినండి. దానికి అదనపు సమయం అవసరం లేదు. అలా చేస్తే తినటానికి తక్కువ సమయం పడుతుంది కూడా. ఎందుకంటే ఆ విధంగా తినే సమయంలో శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకుంటారు. మామూలుగా అయితే పదార్థాల్ని మీలో నింపుతారు.
తెలుసుకునే తత్త్వానికి అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. మీ ప్రణాళికల కంటే ఇది అద్భుతాల్ని చేస్తుంది. తెలుసుకునే తత్త్వం దేనికీ వ్యతిరేకం కాదు. అది మీ పనులకి శక్తిని కలుపుతుంది. మీరు తెలుసుకునే తత్త్వంతో ఉన్నప్పుడు మీరు ఉండరు. మీరు తెలుసుకునే తత్త్వంతో ఉంటే అహంకారం ఉండదు. అహం ఉంటే ఎరుక ఉండదు. మీరు లేని స్థితి జీవన్ముక్తి. ఎప్పుడైతే మీరు ఎరుకతో ఉంటారో, తెలుసుకునే తత్త్వంతో ఉంటారో మీరు పనిని చాలా సమర్థంగా, శిఖరాగ్రస్థాయిలో చేయగలుగుతారు. మీలో శక్తిని సమర్థంగా ఉపయోగించగలుగుతారు. కాబట్టి రోజూ చివరలో స్వచ్ఛంగా, తాజాగా ఉదయం ఉన్న విధంగా ఉంటారు. మీ పని మిమ్మల్ని నీరసపడే విధంగా చేయదు. అది మీ దృక్పథం, మీ మనస్సు అలా చేస్తాయి.
చిన్న ఉదాహరణ తీసుకోండి, మీరు రెండు మైళ్ళు ఆఫీసుకి నడిచివెళ్ళటం, అదే రెండు మైళ్ళు సరదగా బీచ్ ఒడ్డున నడవటం. ఆఫీసుకి నడిచిన నడక పనిలా ఉంటుంది. మీకు నీరసం వస్తుంది. బీచ్‌లో నడిచిన నడక సరదాగా ఉండి మీరు తాజాగా అవుతారు. ఇదంతా మీరు పని చేసేటప్పుడు ఉండే మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ధ్యానం అంటే మీ పని దృక్పథం ఉండే మానసిక స్థితి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావటం. జీవితంలో ప్రతి దాన్ని సర్వాంతర్యామి ఆడే దివ్య క్రీడగా అందంగా చూడగలటమే.
జీవిత ధ్యానం నుంచి ధ్యాన జీవితంలోకి
ప్రారంభంలో మీ జీవితంలో ధ్యానాన్ని సాధన చేయాలి. మీకు తెలిసే విధంగా ధ్యానాన్ని మీ జీవితంలోకి ప్రవేశపెట్టాలి. ఒక ధ్యాన పద్ధతిని తీసుకొని ప్రతి రోజూ ఒక అర గంట కాని, గంట కాని సాధన చేయాలి. మీకు అది ఎలా ఉందో గమనించాలి. అది మీకు బాగుంది అనిపిస్తే దాన్ని పది రోజులు సాధన చేయండి. దాని నుంచి ఫలితాలు ఆశించకుండా సాధన చేయండి. పద్ధతి మిమ్మల్ని స్పందింపచేస్తే, అది మీలో కచ్చితంగా మార్పుని తీసుకువస్తుంది. కొన్నిసార్లు మార్పు చాలా సూక్ష్మస్థాయిలో జరుగుతుంది. కొన్నిసార్లు మన కంటే మనలోని మార్పుని ఎదుటివారు త్వరగా గమనించగలుగుతారు.
కేవలం ఒక్క క్షణం పాటు అయినా ధ్యానం ఆనందానుభూతి మీకు కలిగితే మీరు ధ్యానాన్ని ప్రేమిస్తారు. అప్పుడు మీరు దీన్ని ఎన్ని గంటలు సాధన చేయాలి అని అడగరు. మీరు నిద్ర లేవగానే మీకు వచ్చే మొదటి ఆలోచన ధ్యానం చేయాలి అని. మీరు స్నానం చేసే సమయంలో, భోజనం చేసే సమయంలో మీరు పూర్తి ఎరుకతో, పూర్తి తెలుసుకునే తత్వంతో చేస్తారు. ధ్యానంతో ప్రతిక్షణం చైతన్యవంతంగా ఉంటుంది. అప్పుడు జీవితాన్ని ధ్యానంలో జీవిస్తారు.
ధ్యానం ఎప్పుడు చేయాలి?
తరువాతి ప్రశ్న, ధ్యానం ఎప్పుడు చేయాలి.
ఇది ఎప్పుడూ ఒక వివాదాస్పదమైన ప్రశ్న. చిన్నవాళ్ళు దీన్ని మేము పెద్ద వయస్సు వచ్చాక జీవితాన్ని పూర్తిగా జీవించాక చేయాలి అనుకుంటారు. పెద్దవాళ్ళు, ఇది చిన్న తనంలో చేయాలి, అప్పుడు వయస్సులో ఉంది శక్తితో ఉంటాం' అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రశ్న 'ధ్యానం ఎంత సేపు చేయాలి అనే కాదు, ధ్యానం నా జీవితంలోనికి ఎప్పుడు తీసుకురావాలి' అని కూడా కాదు.
ధ్యానం అంటే కారు డ్రైవ్ చేసే ముందు ఓనర్ వర్స మాన్యువల్ చదివినట్టు. డ్రైవ్ చేయటానికి ముందు అది చదవకపోతే ప్రమాదం జరగవచ్చు. అదే విధంగా ధ్యానం మీ శరీరానికి, మీ జీవితానికి ఓనర్ వర్స మాన్యువల్ లాంటిది. జీవితాన్ని ప్రారంభించే ముందు ధ్యానం చేయటం మొదలు పెట్టకపోతే జీవితం సమస్యలతో ముగుస్తుంది. ఏదో ఒక సమయంలో డిప్రెషన్ లోకి వెళతారు.
దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి, ధ్యానం ప్రతి ఒక్కరికీ జీవితంలో కావలసిన ప్రాథమికావసరం, అది ఎంపిక కాదు. ప్రాథమికావసరం.
ఏడు సంవత్సరాల వయస్సు తరువాత ధ్యానం కావాలి. ఆ వయస్సు వరకు పిల్లలు ఉండేది ధ్యాన స్థితిలోనే. ఏడు సంవత్సరాల తరువాత సమాజల్లో నియమ నిబంధనల్లోకి వెళతారు. అప్పుడు మీ నిజమైన, సహజమైన లక్షణాన్ని వదిలివేస్తారు. మీరు నిజంగా ధ్యానం అంటే ఏమిటో అర్థం చేసుకుని దానిలోకి వెళ్ళాలంటే మీలో మానసిక విప్లవం రావాలి. మానసికవిప్లవం అంటే మీ ఆత్మ, ప్రపంచం, భగవంతుని గురించి స్పష్టమైన అవగాహన రావటమే.
ప్రస్తుతం జీవితం అంటే మీరు అనుకున్నది పూర్తిగా కాదు. అందుకే మీ లోపల ప్రశాంతమైన విశ్రాంతిని అనుభవించలేకపోతున్నారు. మానసికవిప్లవం అంటే మీ గురించి, ప్రపంచం గురించి, భగవంతుని గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం. ఆత్మకి మూలం, ప్రపంచానికి మూలం, భగవంతుని మూలం గురించి తెలుసుకోవటం. ఎవరైతే మానసికవిప్లవాన్ని పొందుతారో వాళ్ళు ధ్యానం చేయగలుగుతారు. అంతవరకూ మీరు ఏ ధ్యానపద్ధతిని సాధన చేసినా అది ఏదో ఒక దగ్గర ఆగిపోతుంది.
నాతో చాలా మంది అంటుంటారు, 'ధ్యానం చేయటానికి కళ్ళు మూయగానే మామూలుగా ఉన్నప్పటి కంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి, నేను ఏదైనా పని చేస్తుంటే ఆలోచనలు ఎక్కువగా రావు. ఎప్పుడైతే ధ్యానం చేయాలి అని కళ్ళు మూస్తానో ఎక్కువ ఆలోచనలు వస్తాయి' అని అంటారు. దీని అర్థం వారిలో మానసికవిప్లవం రాలేదు అని.
స్వప్నస్థితి నిరంతరం మేల్కొని ఉన్న స్థితిలోకి, గాఢ నిద్రాస్థితిలోకి చొచ్చుకొని వచ్చినప్పుడు, అది విషయాల్ని తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తూ, మనిషిని సోమరిగా, నిస్తేజంగా తయారుచేస్తుంది. దీన్నే బాధల వైపుగా ప్రయాణించటం అంటారు. ఎప్పుడైతే స్పష్టత ఉండదో, ధ్యానం చేయలేం. అది నిస్తేజంగా మనని చేస్తుంది. దాంతో స్పష్టతని కోల్పోతాం. ఇది ఒక విషవలయం లాంటిది.
తురీయదశ జాగ్రత్, సుషుప్తుల లోకి వస్తే మనం సంతృప్తి వైపు ప్రయాణిస్తాం. అది ధర్మచక్రం, స్పష్టత ధ్యానం చేసేలా చేస్తుంది. ధ్యానం మరింత స్పష్టతని ఇస్తుంది.
మీరు తిన్నగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి అనుకుంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి. అందుకే ప్రారంభంలో నేను ఒక పద్ధతి నేర్పిస్తాను. అది పూర్తి ధ్యానం కాదు. ఈ పద్ధతి తిన్నగా మిమ్మల్ని ఆలోచనలు లేని స్థితికి తీసుకువెళ్ళదు. అది స్పష్టత వైపు తీసుకువెళుతుంది. అది మానసికవిప్లవాన్ని కలిగిస్తుంది.
మానసికవిప్లవం అన్నది మీలో గాఢమైన ఒక ప్రదేశాన్ని సృష్టిస్తుంది. అక్కడ మీరు విశ్లేషణ చేయవచ్చు, మీ నిర్ణయాల్ని చూడవచ్చు. తిరిగి దాని గురించి ఆలోచించవచ్చు. మీ కోరికలు, భయాలు, బాధలు, ఇంకా మీ జీవితానికి ఏవి అవసరం అనుకుంటామో వాటన్నింటి గురించీ మళ్ళీ మళ్ళీ ఆలోచించవచ్చు. నిజానికి చాలా సందర్భాల్లో మన కోరికలు ఏమిటో మనకి తెలియదు.
చాలా సందర్భాల్లో మీరు జీవితం అంటే ఏమనుకుంటారో, జీవితంలో గొప్ప విషయం అని దేన్ని అనుకుంటారో అది మీ జీవితానికి ఏ విధంగానూ ఉపయోగముండదు. కాబట్టి ప్రారంభంలో ఒక పద్ధతిని సాధన చేస్తే అది మీలో మానసికవిప్లవాన్ని కలిగిస్తుంది. ధ్యానం ప్రారంభించండి. వయస్సు, సమయం వీటి గురించి ధ్యానాన్ని వాయిదా వేయవద్దు.
ఆ తరువాత నన్ను ఎక్కువ మంది అడిగే ప్రశ్న, 'ఉదయం ధ్యానం చేయాలా లేకపోతే సాయంత్రం ధ్యానం చేయాలా' అని. నేను చెప్పే జవాబు లక్ష్యం అనేది ధ్యానాన్ని ఒక లెక్కగా కలపటం కాదు, అది మీ జీవితానికి నాణ్యతని కలపాలి.
ధ్యానపద్ధతులు
మొదటిది సత్యాన్ని, ఎరుకని మీ జీవితంలోకి తెచ్చేవి. ఇటువంటి ధ్యానం ఇరవై నాలుగు గంటలూ చేయవచ్చు. శ్వాస ఆధారమైన ధ్యానాలు, విపాసన (బుద్ధుడు, నేర్పిన అంతరంగంలోకి వెళ్ళగల పద్ధతి) లేదా ఏ పద్ధతైనా వర్తమానంలో, ఎరుకతో ఉండేలా చేసేవన్నీ ఈ రకం ధ్యానాలు. అది మీ దినచర్యలో భాగం కాకూడదు. మీ దినచర్యకి నాణ్యత కావాలి. మీరు ఏ పని చేస్తున్నా, రాస్తున్నా, చదువుతున్నా, వంట చేస్తున్నా, ధ్యానం కనపడని దారంలా అందులో ఉండాలి.
రెండవ రకం ధ్యానపద్ధతికి మీరు కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. అది ఉదయం కాని, సాయంత్రం కాని అరగంట లేదా ఒక గంట కేటాయించాలి, లేదా మరే సమయమైనా సరే. ఈ రకం ధ్యానపద్ధతికి మహామంత్రధ్యానం ఒక ఉదాహరణ. అందులో కొన్ని నిమిషాలు హమ్మింగ్ చేస్తారు. ఆ తరువాత గమనిస్తారు. నిత్యధ్యానం మరొక ఉదాహరణ, ఇవి రోజులో ఏదో ఒక ప్రత్యేకమైన సమయంలో సాధన చేయాలి.
మూడవ రకం ధ్యాన పద్ధతి మీరు దాన్ని గుర్తు చేసుకుంటే చాలు. ఉదాహరణకి సత్యాలని, కొన్ని వ్యాఖ్యలని గుర్తు చేసుకుంటే చాలు. మీరు బాగా పరిణతి పొందిన దశలో ఉన్నప్పుడు మీకు ప్రత్యేకంగా ఏ పద్ధతి అవసరం లేదు. మీరు రోజంతా లేదా ఏదో ఒక సమయంలో సాధన చేయనవసరం లేదు. ఈ సత్యాల్ని గుర్తు చేసుకుంటే చాలు, అవి మిమ్మల్ని ఉన్నతస్థితికి తీసుకువెళతాయి. ఇది మూడవరకం ధ్యానపద్ధతి. దీనికి ఉదాహరణ జెన్ కోయన్స్ గొప్ప సత్యాల్ని చిన్న వాక్యంలో వ్రాస్తారు. వాటిని గుర్తు చేసుకుంటే చాలు ఆ సత్యాలు మిమ్మల్ని ఉన్నతస్థితికి తీసుకువెళతాయి.
ఉపనిషత్తులో ఒక చక్కని కథ ఉంది; ఒక శిష్యుడు గురువు దగ్గరకి వచ్చి జ్ఞానోదయం పొందటానికి ఒక సాధనపద్ధతి చెప్పమని అడుగుతాడు. గురువుగారు కేవలం 'తత్వమసి, తత్వమసి, తత్వమసి' అంటాడు. అంటే నీవే ఆ సత్యం అని అర్థం, ఆ శిష్యుడికి జ్ఞానోదయం అవుతుంది.
వినటానికి ఇది చాలా కొత్తగా ఉంటుంది. గురువుగారు కొన్ని మాటలు అనగానే శిష్యుడికి జ్ఞానోదయం జరుగుతుంది. అది ఎలా సాధ్యం ఇది నమ్మలేని విషయంలా ఉంటుంది. ఇది సాధ్యమే. మనం మొదటి రెండు రకాల ధ్యానపద్ధతులు సాధన చేస్తే అంటే రోజంతా గుర్తు పెట్టుకునే పద్ధతి, ఏదో ఒక సమయంలో చేసే ధ్యానపద్ధతి అవి ఇచ్చే పరిణతి, అంతిమసత్యాన్ని అనుభవించే విధంగా చేస్తుంది.
ధ్యానం సాధారణభయాలు
చాలా మంది అనుకుంటారు ధ్యానం అంటే దేన్నైనా గుడ్డిగా నమ్మటం అని. ఇది చాలా మందికి ఉన్న భయం. కొంత మంది నాతో చెబుతుంటారు, 'నేను ధ్యానానికి ఎక్కువగా అలవాటు పడిపోతానేమో అని భయంగా ఉంది' అని. ఒక విషయం అర్థం చేసుకోండి, ధ్యానం అంటే మీలో ఉండే ఆ బంధాలని, అలవాట్లని తొలగించేది. కాబట్టి ధ్యానానికి మీరు అతిగా అలవాటు పడరు.
కొంత మంది ధ్యానం చేస్తే తమ కోరికలు, భయాలు అదే విధంగా జీవితం పట్ల వారికి ఉన్న కొన్ని నమ్మకాలు అన్నీ పోతాయేమోనని భయం. ఒక విధంగా ఇది నిజం. ధ్యానం చేయటం ప్రారంభించాక మీరు దేన్నైతే అప్పటి వరకూ జీవితం అని అనుకుంటున్నారో అది ముఖ్యం అని అనిపించదు. అసలైన సత్యాలు మీకు తెలియటం ప్రారంభమవుతుంది. అప్పటి వరకూ మీకు ఉన్న ఊహలు కల్పనలు మిమ్మల్ని వదిలివెళ్ళిపోతాయి.
ఇప్పటి వరకూ మిమ్మల్ని మీరు ఈ సత్యాల నుంచి కాపాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఊహల్ని వదలటం మీకు ఇష్టం ఉండదు కాబట్టి. మీరు ఒక దృఢమైన వ్యక్తి అని మీరు అనుకునే విషయమే మీలోని భయాలకి, సమస్యలకి కారణం. ధ్యానం చేస్తే ఆ అభిప్రాయం కదిలిపోతుంది. మీరు అనుకునే మీరు, మీలోని భయాలు, అన్ని కదిలిపోయి, మీలో గొప్ప మార్పు సంభవిస్తుంది.
దీన్నే నేను మానసికవిప్లవం అంటాను. మీకు నిజంగా పునర్జన్మ జరుగుతుంది. మీ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ మార్చటమే ఇది. మీ హార్డ్‌వేర్ అదే ఉంటుంది. మీ అంతరంగపు సాఫ్ట్‌వేర్‌లో మార్పువస్తుంది. మీలో గొప్ప మార్పు వస్తుంది. ధ్యానం అంటే మీ అంతరంగపు సాఫ్ట్‌వేర్‌ని మార్చటమే. మీ శరీరం మీ హార్డ్‌వేర్, అందులో మీ చుట్టు పక్కల జరిగే విషయాలలో మార్పు ఉండదు. మీ చుట్టూ ఉండే వ్యక్తులలో మార్పు ఉండదు. కానీ మీ ఆత్మలో, మీ అంతరంగంలో గొప్ప మార్పు ఉంటుంది.
నాలుగు రకాల చేతనస్థితిని అర్థం చేసుకోగలిగితే మీలో మానసికవిప్లవం కలుగుతుంది. ఇది మాస్టర్ కీ లాంటిది. దీన్ని మీ జీవితంలో ప్రతి క్షణం ఉపయోగించగలిగితే, మీరు ఈ నాలుగు దశల చేతనస్థితిని తెలుసుకుంటూ ఉంటారు. మీ ప్రతి నిర్ణయంలోనూ మీ ఆలోచనక్రమం ధ్యానం వైపు ఉండి ప్రతి నిర్ణయం కూడా సరియైన పద్ధతిలో ఉంటుంది. దీన్నే నేను సమూలమైన మార్పు అంటాను. ఇది సమాచారాన్ని తీసుకొని దాంతో సరియైన నిర్ణయం చేయటం.
మీరు ఈ నాలుగు దశలూ అర్థం చేసుకుంటే ఈ నాలుగు దశల పట్ల పూర్తి తెలుసుకునే తత్వంతో ఉంటే, అది చాలు. అది ఈ విధంగా ఉంటుంది, మీరు గాఢనిద్రలో ఉన్నప్పుడు మీకు కలల పట్ల ఏదో ఆకర్షణ ఉంటేనే గాఢనిద్ర నుంచి బయటికి వస్తారు. మీరు కలల స్థితికి వచ్చినప్పుడు గాఢనిద్ర ఊహ అని, కలల స్థితి నిజం అని అనుకుంటారు. అదే విధంగా మీరు కలల స్థితిలో ఉన్నప్పుడు, మేల్కొని ఏదో చేయాలనే ప్రేరణ లేకపోతే మేలుకున్న స్థితిలోకి రారు. అందుకే నిద్ర మేల్కొన్నాకా కూడా మీరు అటు తిరిగి మళ్ళీ కలల స్థితిలోకి వెళ్ళిపోతారు.
మీకు మెలకువ రాగానే మంచం మీద నుంచి లేవకపోతే మేల్కొన్న స్థితి కంటే కలల స్థితి బాగున్నట్టుగా ఉంటుంది. కాని ఒక్కసారి మేలుకున్న స్థితికి వచ్చాక కలల స్థితి ఒక ఊహ అని, అది నిజం కాదు, అని అనుకుంటారు. అంతే కాదు మీరు మేల్కొన్న స్థితిలో ఉన్నప్పుడు, అది బాగా ఉత్సాహంగా లేదు అనిపిస్తే, మీరు కలల స్థితిలోకి జారిపోతారు.
ఇప్పుడు మీరు మేలుకున్న స్థితి నుంచి తురీయస్థితికి వెళ్ళాలంటే, మీకు బలమైన ప్రేరణ ఉండాలి. అదే ధ్యానం చేసే పని. అది క్రమంగా మీ చేతనస్థితిని పెంచి దాని ద్వారా తురీయస్థితికి తీసుకువెళుతుంది. ధ్యానంతో పాటు మీకు జ్ఞానోదయమైన యోగీశ్వరుడు గురువుగా దొరికితే ఆయన మీరు తురీయదశకి చేరటానికి చాలా గొప్ప పాత్ర పోషిస్తారు. కేవలం ఆయన మీకు దీక్షని ఇవ్వటం ద్వారా మీరు తురీయదశని చేరగాల కార్యక్రమాన్ని వేగవంతం చేస్తారు.
ఎప్పుడైతే మేలుకొన్న స్థితి నుంచి తురీయస్థితికి వెళతారో అప్పుడు మేల్కొన్న స్థితి కూడా ఒక ఊహలా తెలుస్తుంది. మీరు ఉన్న స్థితి నిజమైనది అని కొలవగల స్కేలు లేదు అని అర్థం చేసుకోండి. అయితే ఈ విషయం గుర్తుంచుకోండి, మీరు లోతైన మానసిక క్రుంగుబాటులో ఉన్నప్పుడు ఈ సత్యం క్షణకాలం బోధపడుతుంది.
లోతైన నిరాశలో ఈ అవగాహన బయటకి వస్తుంది. అయితే దాన్ని మనం చక్కగా అణచివేస్తాం. ఎందుకంటే అప్పటికి వారిలో మానసికవిప్లవం జరగలేదు కాబట్టి. మనం పట్టుకువేలాడే జీవితానికి నష్టం కలుగుతుంది కాబట్టి అందుకే మనం మానసిక విప్లవం అంటే భయపడతాం.
ఇక్కడ సమస్య ఏమిటంటే మనలో మానసికవిప్లవం జరిగితే, ఎలా ఉంటుందో ఫలితాలు మనకి తెలియవు. మన కోరికలు, లక్ష్యాలు, కలలు, భావనలు, ఆశయాలు, ఏమవుతాయో తెలియదు. ఏది జరిగితే అది జరగనీయ అనటానికి భయపడతాం. అందుకే మనలో మానసికవిప్లవం జరగకుండా జాగ్రత్త తీసుకుంటాం.
నిరాశ కలిగించే ప్రతి సంఘటనా మనలో ఆ విప్లవం జరగటానికి ఒక అవకాశం. కాని మనం పదే పదే ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడైతే ఊహ అన్న మాట వింటామో భయపడిపోతాం. మీరు అది తెలుసుకుంటే మొత్తం సన్యాసిస్తామేమో, అన్నీ వదిలేస్తామేమో, జీవితం మొత్తం మారిపోతుందేమో, అని భయపడతారు. నేను చెబుతున్నాను, మీరు వదిలేసేది కేవలం ఒక్కటే అది బాధపడటం.
ధ్యానం ఎందుకు మీకు కొన్ని సార్లు ఒక అరుదైన అనుభవం జరుగుతుంది. కలల స్థితిలో ఉండగానే ఇది కల అని మీకు తెలుస్తుంది. అవును నేను కల కంటున్నాను అని అనుకుంటారు. ఆ తెలుసుకునే తత్త్వం ఉండటం వల్ల కలలోని సంఘటనల్ని మీరు మార్చగలుగుతారు. ఆ కొన్ని క్షణాల్లో, మీరు కల కంటుంటారు అని తెలుసుకోగలిగినప్పుడు మీరు మీ కలని మార్చగలరు. ఆ తెలుసుకునే తత్త్వం ఇంకా పెరిగితే మీరు కలల స్థితిలో ఉన్నాను అని తెలుసుకుంటే, అందులోంచి బయటికి రాగలుగుతారు.
అదే విధంగా, ఈ ప్రపంచంలో కూడా, మేలుకున్న స్థితిలో ఉండగా, మీ గురించి తెలుసుకునే తత్త్వం పెరిగితే, అప్పుడు మీ ముందు ఉన్న ప్రపంచం ఒక కల అని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. అప్పుడు జీవితం మరొక మేల్కొని ఉన్న స్థితిలోని కల అని అర్థం చేసుకున్నప్పుడు, మీ చుట్టుపక్కల జరిగే సంఘటనలని మీ ఇష్టమైన పద్ధతిలో మార్చగలరు. దీన్నే సిద్ధులు పొందటం అంటారు.
కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోండి. నేను అనే చేతనస్థితి మీలో పెరగగలిగితే, అకస్మాత్తుగా మేల్కొన్న స్థితి కల అని తెలుసుకుని ఆ స్థితిలో సంఘటల్ని మార్చగల శక్తి, స్వేచ్ఛ మీకు దొరుకుతాయి. దాంతో మీ ముందు ఉన్న సంఘటల్ని మార్చగలుగుతారు.
అయితే ఈ స్థితిలో మీరు కేవలం సంఘటనలు మార్చుకునేదానిలోనే చిక్కుకపోతే, మీలోని చేతనస్థితి కిందికి తగ్గిపోతుంది. మీరు తిరిగి జాగ్రత్ స్థితిలోకి వచ్చేస్తారు. అప్పుడు మీకు కలిగిన ప్రత్యేకమైన శక్తులని పోగొట్టుకుంటారు. మీరు వీటిలో ఎక్కువగా చిక్కుకపోతే, మీరు మీలోనే కేంద్రీకృతమై ఉండగలిగితే, మీరు మీ చేతనస్థితిని మరింత ఉన్నతస్థితికి తీసుకువెళ్ళ గలుగుతారు. అప్పుడు మీకు జ్ఞానోదయం జరుగుతుంది.
మీరు కలల స్థితి నుంచి జాగ్రత్స్థితికి రావాలన్నా, జాగ్రత్ స్థితి నుంచి జ్ఞానోదయస్థితికి రావాలన్నా అక్కడ జరిగే కార్యక్రమం ఒక్కటే. ఎప్పుడైతే మానసికవిప్లవం జరుగుతుందో అంతరంగంలో అద్భుతమైన చికిత్స జరుగుతుంది. అప్పుడు కొన్ని పద్ధతులు సాధన చేస్తే సహజంగా బయటి చికిత్స జరుగుతుంది. మానసికవిప్లవం జరగకుండా, పద్ధతుల్ని సాధన చేస్తే దాన్ని క్రియా లేదా యోగా అంటారు. క్రియా అంటే పని, యోగా అంటే - శరీరం. మనస్సు ఆత్మల సంయోగం. ఇవన్నీ కేవల. భౌతికస్థాయిలో జరుగుతాయి. మానసికవిప్లవం జరిగాక యోగా చేస్తే అది ఒక లోతైన ధ్యానం అవుతుంది. మానసికవిప్లవంతో పూజలు చేసినా అది ధ్యానం అవుతుంది. లేకపోతే ధ్యానం ఒక దినచర్య అవుతుంది.
అంతరంగంలో స్పష్టత కలిగినప్పుడు, మీ అంతరంగానికి ధ్యానాన్ని కలిపితే మీరు ధ్యానం చేసినప్పుడు ఆ స్పష్టత మరింత లోతుగా ఉంటుంది. మీరు తిరిగి మేలుకున్న స్థితికి వచ్చినప్పుడు, తెలుసుకునే తత్త్వంతో మీకు ఒక విషయం అర్థం అవుతుంది. అర గంట సేపు మీ చుట్టు పక్కల జరిగినవి మీ నియంత్రణలో లేవు అని. మీరు మేల్కొని ఉంటారు, కళ్ళు తెరిచి ఉంటాయి కాని మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీరు ఎక్కడో కలల స్థితికి, మేల్కొని ఉన్న స్థితికి మధ్యలో ఉంటారు. మనలో చాలా మంది ఎనభై శాతం వరకూ ఆ స్థితిలోనే ఉంటాం.
మీరు మంచం మీది నుంచి లేచారు కాబట్టి మేల్కొని ఉన్నాను అని అనుకోవనసరం లేదు. రోజంతా మంచం మీద పడుకోలేరు కాబట్టి లేచి బయటికి వస్తారు. అంతేకాని మీరు కలల స్థితిలో లేరు అని అర్థం కాదు.
మిమ్మల్ని జాగ్రత్‌స్థితి, స్వప్నస్థితి, గాఢనిద్రాస్థితి నుంచి పూర్తిగా బయటికి తెచ్చే స్థితినే నేను ధ్యాన స్థితి అంటాను.
నిజం కలగా
మీరు అనుకోవచ్చు! నేను నిద్ర నుంచి లేవగానే ప్రతి రోజూ అదే ప్రపంచాన్ని చూస్తున్నాను కాని నిద్రపోయినప్పుడు కలలో అదే ప్రపంచాన్ని చూడటం లేదు, ఎలా? ఈ ప్రశ్న మేల్కొన్న స్థితి, శాశ్వతసత్యం అనే భావనకి ఆధారంగా ఉంటుంది.
ఒక రాత్రి కలని విశ్లేషిద్దాం. ఉదాహరణకి మీరు పద్నాల్గవ తేదీ రాత్రి పడుకొని పదిహేను ఉదయం లేచారనుకోండి. అంటే మీరు పది గంటలు నిద్ర పోయారనుకోండి. ఆ రాత్రి కలలో పది నుంచి ఇరవై సంవత్సరాల జీవితాన్ని మీరు జీవించి ఉండవచ్చు. కలలో మీ కాలేజీ జీవితంతో ప్రారంభించి, మీ పెళ్ళి, పిల్లలు, పిల్లల పెళ్ళిళ్ళు, ఇలా ఒకదాని తరువాత ఒకటి జరుగుతాయి. ఈ విధంగా పది గంటల కలలో ఇరవై సంవత్సరాల జీవితాన్ని గడుపుతారు. ఈ విధంగా మీకు ఒకసారైనా జరిగి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది అర్థం అవుతుంది.
చూడండి, మీరు నిద్ర పోయినప్పుడు స్వప్నస్థితికి తరువాత గాఢనిద్రాస్థితిలోకి వెళతారు. ఆ తరువాత గాఢనిద్రలోకి వెళతారు. అది బహుశ ఇరవై నిమిషాలు ఉండవచ్చు. ఆ తరువాత కలల స్థితికి వస్తారు. ఈ విధంగా కలల స్థితి నుంచి గాఢనిద్రకి గాఢనిద్ర నుంచి కలల స్థితికి మారుతూ ఉంటారు.
ఒక విషయం అర్థం చేసుకోండి; ఒక రాత్రి కలలో ఇరవై సంవత్సరాల జీవితాన్ని గడుపుతారు. మొదటి ఎపిసోడులో కాలేజీ జీవితం, తరువాత ఎపిసోడులో వివాహం, ఆ తరువాత పిల్లలు ఒకవేళ నాల్గవసారి కూడా కలల స్థితిలోకి వస్తే మీ కొడుకు పెళ్ళి కూడా చూస్తారు.
ఇక్కడ ఒక ముఖ్యవిషయం అర్థం చేసుకోవాలి. మీరు గాఢనిద్ర నుంచి కలల స్థితికి వచ్చిన ప్రతిసారి అదే ప్రపంచాన్ని చూస్తారు. అవును కదా? కొన్నిసార్లు కలలో ఒకే ప్రపంచాన్ని చూస్తారు. ఇది చాలా సూక్ష్మవిషయం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని అర్థం చేసుకోగలిగితే మీలో చక్కని స్పష్టత వస్తుంది. అప్పుడు మీరు జీవితం అంటే ఏమనుకుంటున్నారో ఆ అవగాహనలో గొప్ప మార్పు వస్తుంది. అప్పుడు మీ సమస్యలకి వెతికే పరిష్కారాల్లో కూడా మార్పు వస్తుంది.
ఉదాహరణకి: ఒక వ్యక్తిని పెద్ద పులి తరుముతున్నట్టు కల వస్తుందనుకోండి. నన్ను పెద్ద పులి తరుముతూన్నది, నన్ను రక్షించండి' అని అరుస్తాడు. పక్కనే నిద్రపోతున్న అతని భార్య మేల్కొని అతనితో 'నిద్ర మేల్కోండి' అని నిద్ర లేపాలి. అలా కాకుండా అతనికి కత్తి గాని, తుపాకి గాని పులిని చంపటానికి ఇస్తే ఏమవుతుంది. తనని తాను కాల్చుకుంటాడు లేదా ఆమెని చంపుతాడు. కాబట్టి ఆమె ఏం చేసినా ఆ సమయంలో అది సమస్యలకి దారి తీస్తుంది. అక్కడ చేయవలసింది కేవలం అతనికి మేల్కొలపటమే.
ప్రాథమికవిషయాలు అర్థం చేసుకుంటే మీరు చేసే నిర్ణయాలలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. మీలో అరూహ్యమైన మార్పు వస్తుంది. మీ ఆలోచనపద్ధతి, నిర్ణయాలు చేసే పద్ధతి, సమస్యలకి పరిష్కారాలు కనుగొనే పద్ధతిలో పూర్తి మార్పు వస్తుంది. మీరు సరైన పరిష్కారాల దిశగా మార్పు చెందుతారు.
మీరు కలగన్న పదిగంటల సమయంలో మీరు తేలికగా ఇరవై సంవత్సరాల జీవితాన్ని గడుపుతారు. గాఢనిద్రలోకి వెళ్ళి మళ్ళా కలల స్థితిలోకి వస్తారు. మీరు ఎప్పుడు కలల స్థితిలోనికి వచ్చినా, అక్కడ అంతరాయం ఉన్నా, మీరు అదే ప్రపంచాన్ని చూస్తారు. అంటే మీరు ఆ తరువాత అదే ప్రపంచాన్ని కలలో చూడటం వల్ల దాన్ని నిజం అని అనలేరు. మీరు నిద్ర నుంచి మేల్కొన్న తరువాత ఇరవై సంవత్సరాల జీవితాన్ని పదిగంటల నిద్ర సమయంలో గడిపాను అని తెలుసుకుంటారు. అదే విధంగా మీరు మేల్కొన్న స్థితి నుంచి మేల్కోగలిగితే అకస్మాత్తుగా మీ తొంభై సంవత్సరాల జీవితాన్ని కొన్ని గంటలలో గడిపాను అని అనుకుంటారు. మీరు మేల్కొని ఉన్న ఈ స్థితి మరొక పెద్ద కల అయి ఉండవచ్చు.
మీరు కలలో ఉన్నప్పుడు, కల నిజం అనుకుంటారు. మీరు ఎక్కడ ఉంటే అప్పుడు అది నిజం అనుకుంటారు. దానికి మరొక స్కేలు లేదు. మీరు కలలో ఉన్నప్పుడు 'ఇది కల' అని అనుకోరు. మేల్కొని ఉన్నప్పుడు ఇది మరొక కల అనుకోరు. మీరు కల లోంచి బయటికి వచ్చాక అది కల అనుకుంటారు. కాని కలలో ఉన్నంత వరకూ అది నిజం అనుకుంటారు. మీరు కలకనే సమయంలో నిజ జీవితం కలలా ఉంటుంది. మేల్కొన్న స్థితిలో కలని 'కల' అనుకుంటారు. కాబట్టి మీరు ఉన్న స్థితి మీద ఆధారపడి అది కల, నిజం అని మీరు అనుకుంటారు. అంతేకాని ఏది నిజం, ఏది కల అని కొలిచే స్కేలు లేదు. మేల్కొని ఉన్న స్థితి మరొక పెద్ద కల అని అర్థం చేసుకుంటే ఆ విషయాన్ని తెలుసుకోగలిగితే, మీరు మీ ఏకాగ్రతని, మీ లోపలికి, మీ చేతనస్థితి వైపు మళ్లిస్తారు. అదే అసలైన అంతిమ సత్యం. మీరు మేల్కొని ఉన్న స్థితికి అతీతంగా వెళ్లగలిగితే, అది కూడా ఒక పెద్ద కల అని మీకు తెలుస్తుంది.
ఆధ్యాత్మికతలో ఇది మొదటి మెట్టు, మానసికవిప్లవానికి ఇది మొదటి అడుగు.
మీలోని వ్యధ మీకు పదేపదే ఒకవిషయం చెబుతుంది, మీరు నిజంలో జీవించటం లేదు అని.
నన్ను చాలా మంది అడుగుతుంటారు. 'నేను మేల్కొన్న స్థితిలో అదే ప్రపంచాన్ని చూడటమే కాదు అదే మనుష్యులని చూస్తున్నాను, మరి అది కల ఎలా అవుతుంది' అని. స్పష్టంగా అర్థంచేసుకోండి. మీరు కలలో మీ కుటుంబసభ్యులతో కలిసి ఒక ఊరు వెళ్లారనుకోండి. కలలో మీరు, వాళ్ళు కూడా అదే ఊరిని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మీ మనస్సు కల్పించినవారే కాబట్టి.
మీ చుట్టూ ఉన్న మనుషులు, దృశ్యాలు - అన్నీ అలాగే ఉన్నాయి, కాబట్టి ఇది కల కాదు అని అనలేం. మీ చుట్టూ ఉన్నవారు, దృశ్యం అంతా మీ మనస్సు చిత్రాలే (ప్రాజెక్షన్స్).
అంతిమసత్యం ఏమిటంటే, మీ కలలు తయారయ్యే పదార్థం మీరు మేల్కొని ఉన్నప్పుడు ఉన్న ప్రపంచం నుంచి తయారు చేయబడిందే. మీరు ఆ పదార్థాన్ని పట్టించుకున్నంత కాలం మీ అంతరంగంలో చికిత్స జరగదు. మీ ఏకాగ్రత చేతనస్థితి మీద, ఈ పదార్థం మీద సమానంగా ఉంటే, అది సమతుల్యతలో ఉండే ఆరోగ్యకరమైన జీవితం దొరుకుతుంది. మీ భౌతిక, మానసికారోగ్యం చక్కగా ఉంటుంది.
మీ ఏకాగ్రత ఆ పదార్థం మీద కాకుండా కేవలం చేతనస్థితి మీద మాత్రమే ఉంటే, దాన్ని నేను జీవన్ముక్తి అంటాను. మీకు జీవన్ముక్తి కావాలా వద్దా, జ్ఞానోదయం కావాలా వద్దా అనేది తరువాత విషయం. మీరు మీ ఏకాగ్రతని మీ చేతనస్థితి వైపు కొంత తిప్పగలిగితే, అంతిమసత్యం వైపు తిప్పగలిగితే, మీ కేంద్రంలోనికి తిప్పగలిగితే అకస్మాత్తుగా మీ అంతరంగంలో చికిత్స జరగటాన్ని తెలుసుకుంటారు.
ఉదాహరణకి మీరు ఒక పెద్ద సమస్యలో ఉన్నారనుకోండి, లేదా నిరాశ, క్రంగుబాటులో ఉన్నారనుకోండి, మీరు చేతనస్థితిలో ఇదంతా ఒక పెద్ద కల అని అర్థంచేసుకోగలిగితే, మీరు రిలాక్స్ అవ్వగలుగుతారు. మీ అంతరంగంలో కావలసిన చికిత్స జరుగుతుంది. ఆ చికిత్సనే నేను ధ్యానం అంటాను. మీలో కలిగే ఆ విశ్రాంతితో కూడిన ఎరుకునే నేను సతోరి అంటాను. అదే సమాధి తాలూకు క్షణకాల అనుభవం. మీలో ప్రాథమికమైన పెద్ద మార్పు లేదా మానసికవిప్లవం అనే ఒక చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే దాని ద్వారా గొప్ప మార్పు జరుగుతుంది. అదే మీరు నిజం అని అనుకునేది నిజం కాదు. ఈ స్పష్టత మీ లోపల చికిత్స చేసి మీకు ఎరుకతో కూడిన విశ్రాంతిని, నిశ్చలత్వాన్ని ఇస్తుంది.
ధ్యానం పరిశోధనలు - వివరణ
ధ్యానానికి ఉన్న అనంతమైన శక్తితో శారీరక మానసికవ్యవస్థల్లో మార్పు తీసుకురావచ్చు అన్న విషయం మీద శాస్త్రజ్ఞులకి కొంచెం శాస్త్రీయ అవగాహన కలుగుతుంది. ధ్యానం వల్ల మనకి కలిగే ఉపయోగాలు అంతు లేనన్ని. అది అన్ని దశల్లో - భౌతిక, మానసిక, భావావేశాత్మక, ఆధ్యాత్మికదశల్లో ఉపయోగపడుతుంది. ధ్యానం జీవితనాణ్యతని మార్చేయగలుగుతుంది.
మెదడు శక్తి పెరుగుతుంది
ఈ మధ్య వరకూ మెదడులోని కణాలు చిన్నతనంలో ఏ విధంగా అమర్చబడ్డాయో అవి అదే విధంగా ఉంటాయని, మారవని అనుకునేవారు. అంటే చిన్నతనంలోనే మెదడు పెరుగుదల ఆగిపోతుంది అనుకునేవారు. ఇప్పుడు శాస్త్రజ్ఞులు మెదడు జీవితాంతం అభివృద్ధి చెందుతూ కొత్త కొత్త బంధాలు ఏర్పరచుకుంటుందని నిరూపించారు. దీన్నే 'న్యూరో ప్లాస్టిసిటీ ' అంటారు.
నేను న్యూస్ పేపర్లో ఒక విషయం చదివాను. విస్కాన్సిన్ యూనివర్సిటీ వారు మెదడు మీద ధ్యానప్రభావం అనే అంశం మీద పరిశోధనలు చేశారు. చాలా సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న టిబెట్ బౌద్ధమతసాధువుల మీద ఈ ప్రయోగం చేశారు. అదే విధంగా ధ్యానానికి కొత్తవారైన కొంత మంది విద్యార్థుల్ని కూడా తీసుకున్నారు. వారికి ధ్యానం ఎలా చేయాలో నేర్పించారు. వారి పరిశోధనల్లో కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న సాధువుల మెదడు చాలా వేగంగా, చైతన్యవంతంగా చాలా చక్కని నిర్వహణా సామర్థ్యంతో ఉంది అని, విద్యార్థులలో అంతగా అది లేదు అని తెలిసింది. మెదడులో సంతోషానికి సంబంధించిన భాగం, సాధువుల్లో చాలా చైతన్యవంతంగా ఉంది, విద్యార్థులలో అది తక్కువ స్థాయిలో ఉన్నది.
మరొక ముఖ్యవిషయం, పరిశోధకులు విద్యార్థులలో కంటే ధ్యానం చేస్తున్న సాధువులలో మెదడు పని తీరు గాఢంగా, ఒక చక్కని నిర్వహణ శక్తితో ఉన్నట్టు కనుగొన్నారు. కాబట్టి ధ్యానం ఉపయోగాలు శాశ్వతమైనవి. ధ్యానం మెదడు నిర్మాణాన్ని, పని తీరుని మార్చగలుగుతుంది.
అమెరికాలోని పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలైన యాలే, హార్వర్డ్, ఎమ్.ఎమ్.టి. కూడా ధ్యానప్రభావం మీద పరిశోధనలు చేశాయి. ఎమ్.ఆర్.ఐ ని ఉపయోగించి చేసిన పరిశోధనల్లో, తెలుసుకునే తత్త్వం, ఏకాగ్రతలకి సంబంధించిన మెదడులోని భాగాలు ధ్యానం చేసేవారిలో బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి అని తెలిసింది. వారిలో భావాలు సమతుల్యతతో ఉంటాయి.
పరిశోధనల్లో, రక్తనాళాలు వెడల్పు అయిన విషయాన్ని కనుగొన్నారు, వాటిలో చక్కని అభివృద్ధిని చూసారు. రక్తనాళాలు ఎక్కువగా పెరగటం గమనించారు.
ధ్యానం Vs నిద్ర
కెంటకీ విశ్వవిద్యాలయంలో నిద్ర-మనిషిలోని తెలుసుకునే తత్త్వం మీద ప్రభావం అనే అంశం మీద పరిశోధనలు చేసారు. కొంత మందిని ఒక తెర చూస్తూ దాని మీదికి ఏదైనా ఒక బొమ్మ రాగానే బటన్ నొక్కాలి అని చెప్పారు. నిద్ర తక్కువ ఉన్నవాళ్ళు ఆలస్యంగా స్పందిస్తారు. సాధారణనిద్ర ఉన్నవారు త్వరగా స్పందిస్తారు.
పరిశోధకులు వారిని 40 నిమిషాలు నిద్ర పోయాక, నిద్ర ముందు, అదే విధంగా ధ్యానం చేసే ముందు తరువాత, ఏదైనా చదివే ముందు తరువాత పరీక్ష చేసారు. వారి పరిశోధనలో ధ్యానం చేసిన తరువాత వారి స్పందన వేగంగా ఉంది. అని తెలిసింది. వారిలో కొంతమందికి ధ్యానం కొత్త అయినా వారి స్పందన వేగంగా ఉన్నది. వారు రాత్రి అంతా మేల్కొని ఉన్నా కూడా, ధ్యానం చేసిన వారిలో స్పందన వేగంగా ఉన్నది అని ఫలితాలు చెప్పాయి.
ఏకాగ్రత పెరుగుతుంది, త్వరగా స్పందిస్తారు
ధ్యానం వలన వేగంగా, సరిగ్గా స్పందించగలరు అని అనేకపరిశోధనఫలితాలు నిరూపించాయి. ఇంగ్లాండులో జరిగిన పరిశోధనలలో, కొందరికి కొన్ని వరుసలలో అక్షరాలు రాసి వాటి మీద వేరువేరు సంఖ్యలలో గీతలు వేసారు. వారు ఆ గీతలలో హెచ్చింపగల వాటిని వేగంగా కొట్టివేయాలి, అని చెప్పారు.
మరొక పరిశోధనలో కొందరికి ఎరుపు, ఆకుపచ్చ, నీలం అనే పదాల్ని వేరు వేరు రంగుల ఇంకుతో రాసి చూపించారు. ఆ పదాన్ని రాసిన రంగుని వారు వెంటనే గుర్తించాలి. ఇది కొంచెం కష్టం. ఎందుకంటే మెదడు అక్కడ రాసిన రంగుని ముందుగా గమనిస్తుంది. ఈ పరిశోధనలలో ధ్యానం చేసేవారు అందరి కంటే వేగంగా చేసారు. అదే విధంగా ధ్యానం చేయనివారి కంటే తక్కువ తప్పులు చేసారు.
ధ్యానం తెలుసుకునే తత్వాన్ని, ఏకాగ్రతని, జ్ఞాపకశక్తిని, స్పందించే వేగాన్ని, భావాల సమతుల్యతని, ఆరోగ్యాన్ని చాలా బాగా అభివృద్ధి చేస్తుంది. పాశ్చాత్యశాస్త్ర విజ్ఞానం ఇప్పుడే ధ్యానం ప్రభావాన్ని వేరు వేరు కోణాలలో పరిశోధించటం ప్రారంభించింది. అయితే తూర్పుదేశాల అంతరంగప్రపంచ శాస్త్రవేత్తలు దీన్ని కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే చేశారు. వేదసంస్కృతి ఈ ఆధ్యాత్మిక సత్యాల మీద ఆధారపడి ఉన్నది. దీని వలన మానవులు ధ్యానం ఉపయోగాలని పొందుతూ అంతిమస్థితిని చేరవచ్చు. ఆత్మ జ్ఞానానికి ఇవి కాలాతీతమైన సాధనపద్ధతులు.
⁂ ⁂ ⁂
- మనందరం వెతికేది ఆనందం కోసమే, అయితే వేరు వేరు మార్గాలలో వెతుకుతున్నాం.
- ధ్యానం అంటే ఈ క్షణంలో ఆనందంలో ఉండటమే. ధ్యానం చేయటానికి సరియైన పద్ధతి ఏది?
- ధ్యానం మన జాగ్రత్స్థితిలోనికి, సుషుప్తిలోనికి లోతైన ఎరుకని నింపటానికి అవసరం.
- మీరు తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడు పనిని శిఖరాగ్రస్థాయిలో చేయగలరు, మీ శక్తిని సమర్థంగా ఉపయోగించగలుగుతారు.
- మానసికవిప్లవంతో పూజలు ధ్యానంలా మారతాయి, మానసికవిప్లవం జరగనప్పుడు ధ్యానం ఒక పూజాకార్యక్రమంలా ఉంటుంది.

నిత్యధ్యానం - నిత్యానంద ధ్యానం
జీవన్ముక్తికి నిత్యధ్యానం ప్రతిరోజూ చేయగల ధ్యానపద్ధతి
నిత్యధ్యానం - నిత్యానంద ధ్యానం రాజా సాధనపద్ధతి
కొన్ని ధ్యానాలు కొంతమందికి, కొన్ని సమయాలలో చేయటానికి ఉంటాయి. కొన్ని ధ్యానాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చేయవచ్చు. అవి సర్వసామాన్యమైనవి. నేటి కాలంలోని ఆధ్యాత్మిక అన్వేషకులకి కావలసిన ధ్యానం, నిత్య ధ్యానం. ఇది సైబర్ ఏజ్ ధ్యానం.
నిత్యధ్యానం ఆవిర్భావం
ముందుగా నిత్యధ్యానం అనేది ఏ విధంగా జరిగిందో మీకు చెబుతాను. నాకు పదకొండు సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ చాలా ధ్యానపద్ధతుల్ని ప్రయోగాత్మకంగా ప్రయత్నించాను. పన్నెండవ సంవత్సరంలో నా మొదటి ఆధ్యాత్మిక అనుభవం చాలా లోతుగా, గాఢంగా జరిగినది. పన్నెండు నుంచి ఇరవై ఒకటవ సంవత్సరం వరకూ చాలా ధ్యానపద్ధతుల్ని నేను స్కాన్ చేసి, విశ్లేషణ చేసి వాటి ఉపయోగాలు తెలుసుకున్నాను. నాకు జ్ఞానోదయం జరిగాక మూడు సంవత్సరాలు, నాలో కలిగిన అనుభవం ఎదుటివారిలో కలిగించగల మంచి సాధనపద్ధతుల మీద పని చేశాను. అంతరంగప్రపంచంలో చేసిన పరిశోధనల సారాంశమే నేను రూపొందించిన నిత్యధ్యానం.
నిత్యధ్యానం ఒక సూత్రం, ఒక ధ్యానపద్ధతి. ఇది వ్యక్తి ఉనికి మీద పనిచేసి అంతిమ అనుభవమైన జ్ఞానోదయం పొందటానికి అనువైన మార్పుని మీ లోపలకి తీసుకురాగలుగుతుంది. ఇందులోని ప్రతి భాగం మీలోని చేతనస్థితి పెరిగేలా చేస్తుంది. నిత్య ఆనంద స్థితి కోసం మీరు ప్రతి రోజూ చేయగల ధ్యానం నిత్యధ్యానం.
చక్రాలని తెలుసుకోవటం
నిత్యధ్యానపద్ధతిని అర్థం చేసుకోవాలంటే మనలోని సూక్ష్మశక్తికేంద్రాలైన చక్రాల గురించి కొంచెం తెలుసుకోవాలి. చక్రాల మీద పనిచేయటం అంటే మన లోపల శక్తి ప్రవహించగల కొత్త దారుల్ని మేల్కొలపటమే. ఇది టి.వి.లో కొత్త ఛానల్‌కి ట్యూన్ చేయటం లాంటిది.
మనిషి ఈ ఏడు చక్రాల ఆధారంగానే ఆలోచించగలుగుతాడు. కొంతమందికి ఏ విషయమైనా వారికి కోరిక, కామం, స్పర్శ అనే ఉపయోగాలు ఉండాలి అని చూస్తారు. కొంతమందిలో భయం ముఖ్యంగా ఉంటుంది. కోరికల వంటి భావావేశాలతో ముందుకి వెళ్ళటంలో తప్పు లేదు కానీ మీరు మరొక కోణంలో ఉండే ప్రేమ వంటి భావాల్ని కూడా అనుభవించాలి. స్వచ్ఛమైన శక్తి నుంచి పనిచేయటం సాధ్యమే అని మీరు అర్థం చేసుకోగలగాలి. చక్రాలని చైతన్యవంతం చేయటం ద్వారా మీరు భావావేశాలకి అతీతంగా వెళ్ళి మానసికవ్యవస్థ నుంచి బయటికి వచ్చేయగలుగుతారు. మీరు ఒక స్వేచ్ఛాజీవిలా పనిచేయగలుగుతారు. మీరు మానసికవ్యవస్థ నుంచి స్వేచ్ఛని పొందినప్పుడే స్వేచ్ఛ విలువని మీరు తెలుసుకుంటారు. మీరు ఒక చక్రం నుంచి స్వేచ్ఛని పొందినప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఏ గుర్తింపు మీద మీ వ్యక్తిత్వం నిలబడి ఉన్నదో, ఏ భావం మీద మీ జీవితం ఉన్నదో అవి కరిగిపోతాయి. మీరు ఒక కొత్త శక్తిని అనుభవించగలుగుతారు.
ఉదాహరణకి మీరు అకస్మాత్తుగా షేర్ల మార్కెట్లోకి అడుగుపెట్టారనుకోండి అప్పుడు మీరు కొత్త సమాచారాన్ని మాగజైన్స్ నుంచి, టి.వి. రిపోర్టుల నుంచి సేకరించటానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. ఒక నెల గడిచాక అకస్మాత్తుగా ప్రపంచమంతా షేర్ మార్కెట్ గురించి తెలుసుకున్నారు అని అనుకుంటారు. ప్రపంచం ఇక్కడ మారలేదు. ప్రపంచం పట్ల మీ దృక్పథం మారింది. ఎప్పుడైతే మీ శక్తిని కొత్త విషయం మీద కేంద్రీకరిస్తారో, మీ చుట్టూ కొత్త రకం వ్యక్తులు చేరతారు. మీరు శక్తికేంద్రాన్ని మార్చినప్పుడు, మీరు చూస్తున్న ప్రపంచాన్ని మార్చగలుగుతారు. హిందూ పురాణాలలో ఏడు లోకాలు ఉన్నాయి అని చెబుతారు. దీని అర్థం మీలోని ఏడు భావావేశాలు ఈ లోకాన్ని ఎలా చూడాలో నిర్ణయిస్తాయి. అలా ఏడు లోకాలు కనిపిస్తాయి.
నిత్యధ్యానపద్ధతి
ఇందులో ఐదు దశలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఏడు నిమిషాల చొప్పున ఉంటాయి.
1. ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకోవటం (సమయం : 7 నిమిషాలు) : వజ్రాసనంలో కూర్చోండి. సాధారణంగా మన లోపల శక్తి సహస్రారం నుంచి మూలాధారం వైపుగా ప్రవహిస్తూ ఉంటుంది. వజ్రాసనంలో కూర్చుంటే అది మూలాధారం నుంచి సహస్రారం వైపు ప్రవహిస్తుంది. కళ్ళు మూసుకొని, చేతులు నడుము మీద పెట్టాలి. శ్వాస ఒక పద్ధతి లేకుండా తీసుకోవాలి. లోతుగా శ్వాస తీసుకుని వదలాలి. కేవలం శ్వాస మీద మాత్రమే మీ ఏకాగ్రతని ఉంచాలి. మీ ఉనికి మొత్తం శ్వాసగా మారిపోవాలి.
మొదటి దశ భౌతికమైంది. వజ్రాసనంలో కూర్చుని ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకుని వదలాలి. మీకు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి పూర్తిగా బాగువుతాయి. శరీరం సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే శరీరం గాఢత పెరుగుతుందో, జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. నిత్య ధ్యానంలో ఈ భాగం మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని సృష్టిస్తుంది.
ఇక్కడ ఒక ముఖ్యవిషయం మీరు అర్థంచేసుకోవాలి, మీ మానసికవ్యవస్థ మీద ఆధారపడి మీ శ్వాసలో నాణ్యత మారుతూ ఉంటుంది. మీ భావావేశాలు శ్వాస మీద ప్రభావాన్ని చూపిస్తాయి.

మీరు ఆత్రుతలో ఉంటే శ్వాస మారుతుంది. కోపంగా ఉంటే మరోలా ఉంటుంది. టెన్షన్‌గా అనిపించినప్పుడు లోతుగా శ్వాస తీసుకోండి, అకస్మాత్తుగా మీరు తేలికగా అవుతారు. రిలాక్స్ అయ్యి టెన్షన్ తగ్గుతుంది.
శ్వాస, మానసికవ్యవస్థ దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక దానితో ఒకటి మారుతూ ఉంటాయి. భావావేశాలు మన చేతుల్లో ఉండవు. కాని శ్వాస మన చేతుల్లోనే ఉంటుంది. మనం శ్వాసని నియంత్రించటం ద్వారా శ్వాసించే పద్ధతిలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు. ఆ విధంగా మన భావావేశాల్ని, మానసికవ్యవస్థని ప్రభావితం చేయవచ్చు. మనం ఎప్పుడూ ఏదో ఒక పద్ధతిలో శ్వాస తీసుకుంటాం. మన పాత జ్ఞాపకాలు, సంస్కారాలు అచేతనస్థితిలో ఉంటాయి, అవి తమకి అనుకూలమైన ఒక శ్వాసపద్ధతిని తయారుచేసుకుంటాయి. దానితో అటువంటి శ్వాసని ఆకర్షిస్తాయి. సంస్కారాలు ఒక శ్వాసపద్ధతిని తయారుచేస్తే, ఆ శ్వాస అదే రకం సంస్కారాల్ని ఆకర్షిస్తాయి. ఈ విధంగా ఒక ఛేదించలేని వలయాన్ని తయారుచేస్తాయి. దీన్ని ఛేదించాలి.
నిత్యధ్యానం ఒక పద్ధతి లేని శ్వాసతో ప్రారంభమవుతుంది. దీన్ని ఒక పద్ధతిలో చేయరు కాబట్టి ఒకే విధమైన శ్వాస ఉండదు. దీంతో సంస్కారాలు తయారుచేసుకునే పద్ధతికి ఆటంకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే శ్వాస అలవాటైన కొన్ని సంవత్సరాల నుంచి అనుసరించే పద్ధతిలో ఉండదో ఆలోచనలు తగ్గిపోతాయి.
మన కండరాల్లో జీవశక్తి ద్వారా మన జ్ఞాపకాలు నిలువ ఉంటాయి. లోతైన ఒక పద్ధతి లేని శ్వాస కండరాల్లోని టెన్షన్ పోగొడుతుంది. ఆ జ్ఞాపకాలు శరీరభాగాల నుంచి బయటికి వెళ్ళిపోతాయి. సాధారణంగా మన కండరాలు ఒత్తిడిలో ఉంటాయి. ఒక పద్ధతి లేని శ్వాస కండరాల్ని ఒత్తిడి నుంచి బయటికి తెప్పిస్తుంది.
మనలోని ఒక్కొక్క భావావేశం ఒక్కొక్క శ్వాసపద్ధతిని తయారుచేసుకుంటాయి. మీరు చిన్న పిల్లలని గమనిస్తే వారు చాలా లోతుగా ఆనందంగా శ్వాస తీసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు పెరిగే కొద్దీ సమాజనిబంధనలోకి వచ్చేస్తారు. సమాజం నుంచి బాధ, సంతోషం, కోరిక ఇటువంటి భావావేశాల్ని తీసుకుంటారు. దానితో శ్వాసలోని నాణ్యత పోతుంది. ఈ క్రమాన్ని కుదిపేయటానికే, ఒక పద్ధతి లేని శ్వాస అనేదాన్ని మీ లోపలికి తీసుకువెళ్ళాలి. మరొక క్రమపద్ధతిని లోపల పెట్టటం సమస్యకి పరిష్కారం కాదు.
మీ లోపల పాత గుర్తుల్ని బయటికి తీయటానికి తీవ్రమైన గందరగోళాన్ని మీ వ్యవస్థలో సృష్టించాలి. అందుకే ప్రాణాయామం లాంటి ఒక క్రమపద్ధతిలో ఉండే శ్వాసని నేను చెప్పను. ఈ ధ్యానంలో ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకోండి. ఇది మీ పాత జ్ఞాపకాల్ని వాటితో ఉన్న బంధాన్ని పోగొడుతుంది.
ఇది ఎలా ఉంటుందంటే పండుటాకులతో ఉన్న చెట్టుని కుదపటం లాంటిది. అప్పుడు పండుటాకులన్నీ రాలిపోతాయి. అదే విధంగా మీలో అణచివేయబడిన వాటిని పూర్తిగా కుదిపేస్తుంది. పాత జ్ఞాపకాలు, సంస్కారాలు మీ నుంచి వెళ్ళిపోతాయి. లోతైన శ్వాస మీలోనికి ఎక్కువ ఆక్సిజన్ ని పంపించి, కార్బన్-డై-ఆక్సైడ్ ని బయటికి పంపిస్తుంది. దీనితో మీరు చాలా తాజాగా ఉంటారు. ఎక్కువ ఆక్సిజన్ మీ లోపలికి వెళ్ళినప్పుడు, అది మీ లోపల చాలా బయో ఎనర్జీని, అంటే జీవశక్తిని సృష్టిస్తుంది. శరీరం చైతన్యవంతంగా అవుతుంది. ఆ శక్తి సంస్కారాల్ని తుడిచేస్తుంది. మీరు తేలికగా, శక్తివంతంగా, ఆనందంగా ఉంటారు.
2. తీవ్రమైన హమ్మింగ్ (సమయం : 7 నిముషాలు) : వజ్రాసనంలోనే కూర్చోండి. మీ చేతి వేళ్ళతో చిన్ ముద్ర పెట్టండి. చేతులు మోకాళ్ళ మీద ఉంచండి. అరచేతులు పైకి ఉండాలి. పెదాలు దగ్గరగా మూసి హమ్ చేయండి. గట్టిగా, లోతుగా పొడవుగా హమ్ చేయండి.

'మ్...' అనే శబ్దాన్ని మీ లోపలి నుంచి చేయాలి. మీ తల ఖాళీ అల్యూమినియమ్ పాత్రలో పెట్టి హమ్ చేస్తే ఏ శబ్దం వస్తుందో ఇది అదే విధంగా ఉంటుంది. ఇది కేవలం 'మ్... ' శబ్దం చేయాలి. ఇది 'ఓం' కాదు 'హమ్' కాదు. రెండు శ్వాసల మధ్య మ్.. పొడవుగా ఉండాలి. అది మీ నాభిప్రాంతం నుంచి రావాలి. శ్వాస లోతుగా ఉండాలి అని లేదు. శరీరం తనకి కావలసిన శ్వాసని తాను తీసుకుంటుంది.
మీ పూర్తి ఏకాగ్రత హమ్మింగ్ మీద ఉంచండి. మీరే హమ్మింగ్ అయిపోవాలి. మీలోపల నిరంతరం మాటలు జరుగుతూ ఉంటాయి. ఆ మాటలు తగ్గించే గొప్ప పద్ధతి ఈ హమ్మింగ్. అంతరంగపు మాటలు అంటే స్వతంత్రమైన ఆలోచనల ప్రవాహం. హమ్మింగ్ మీ శరీరం శక్తి అని తెలుసుకునేలా చేస్తుంది. ఎప్పుడైతే మీరు హమ్మింగ్ చేయటం మొదలుపెడతారో, మీరు చాలా తేలిక అయినట్టు తెలుసుకుంటారు. మీ శరీరం బరువు మీకు తెలియదు. ఎందుకంటే హమ్మింగ్ వైబ్రేషన్స్, శరీరం వైబ్రేషన్స్‌తో కలిసిపోతాయి. మీరు ఒక శక్తిగా మీకు అనిపిస్తుంది. ఇది చేసేటప్పుడు టెన్షన్ వద్దు. రిలాక్స్ అయ్యి చేయండి. హమ్మింగ్లో పూర్తిగా నిమగ్నమవ్వండి, రెండు హమ్మింగ్స్ మధ్య ఖాళీ తగ్గించటానికి ప్రయత్నించండి. కొంత సేపు అయ్యాక మీ ప్రయత్నం లేకుండా హమ్మింగ్ జరగటం మీరు గమనిస్తారు. మీరు హమ్మింగ్ వింటారు. మీ శరీరం మానసికవ్యవస్థ హమ్మింగ్ ప్రకంపనలతో నిండి ఉంటాయి. హమ్మింగ్ మీ లోపల ఆరోగ్యకరమైన అంతరంగపు మాటల్ని సృష్టిస్తుంది. దీంతో ఆరోగ్యకరమైన ఉన్నతమైన భావావేశాలు ఉంటాయి.
3. చక్రాల గురించి తెలుసుకోవటం (సమయం : 7 నిమిషాలు) : వజ్రాసనంలో కూర్చోగలిగితే కూర్చోండి లేదా మామూలుగా కూర్చోండి. చేతి వేళ్ళు చిన్ ముద్రలో ఉంచండి.

ఇప్పుడు మీ ఏకాగ్రతని మూలాధారచక్రం నుంచి ఒక్కొక్క చక్రం మీదికి తీసుకువెళ్ళండి. ఆ విధంగా సహస్రారం వరకూ అన్ని చక్రాల మీదికి తీసుకువెళ్ళండి. మిమ్మల్ని చక్రం మీద ఏకాగ్రత ఉంచమన్నప్పుడు మీరు ఆ శక్తికేంద్రంగా మారిపోవాలి. మీరు మొత్తం ఆ శక్తికేంద్రం అనుకోవాలి.
ఈ ఏడు చక్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క భావావేశంతో సంబంధం కలిగి ఉంటాయి. కిర్లియాన్ ఫోటోగ్రఫీ ఈ చక్రాలని ఫోటో తీయగలిగింది. ఇవి ఉన్నాయి అని నిరూపించింది. ఈ భావావేశాలు మనలోని సంస్కారాల వల్ల కలుగుతాయి. ఈ సంస్కారాలు మనని అదే విధంగా స్పందించేలా ప్రేరేపిస్తాయి. ఎప్పుడైతే భావావేశం పైకి వస్తుందో అది ఆ శక్తిప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనితో శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ దశలో ప్రతి చక్రం మీద ఏకాగ్రతని నిలుపుతారు. అది వెన్నెముక చివర ఉన్న చక్రం నుంచి శీర్షభాగాన ఉన్న చక్రం వరకూ చేస్తారు. ఎప్పుడైతే తెలుసుకునే తత్వంతో ఏకాగ్రత నిలుపుతామో వ్యతిరేకశక్తి కరిగిపోతుంది. అది భౌతికమైన బాధకి కూడా వర్తిస్తుంది. మీ శరీరంలో ఎక్కడైనా బాధ ఉంటే అక్కడ తెలుసుకునే తత్వంతో ఏకాగ్రతని నిలపండి. క్రమంగా బాధ చిన్న బిందువుగా మారి మాయం అవుతుంది.
ఈ విధంగా ఏడు చక్రాల మీద ఒక్కొక్క నిమిషం పాటు ఏకాగ్రతని నిలపండి. అలా చేసినప్పుడు కేవలం ఆ చక్రాన్ని మాత్రమే చూడాలి. మిగతా అంతా మరిచిపోవాలి. మీరు ఆ చక్రమైపోవాలి. అది మీ ఉనికి అయినట్టు భావించాలి. తరువాత మరొక చక్రం దగ్గరకి వెళ్ళాలి. ఈ దశ పూర్తి అయ్యాక మీరు పూర్తి శక్తితో నింపబడతారు. మీరు పైపైకి వచ్చే కొద్దీ మీలో జీవచైతన్యం మరింత గాఢంగా అవుతుంది. మీరు గాఢంగా లోతుగా అవుతారు. ఇది మీకు ఆరోగ్యకరమైన శరీరాన్ని, మనస్సుని తయారుచేస్తుంది. మీ భావావేశాలు ఎరుకతో ఉంటాయి. ఈ దశ పూర్తి అయ్యాక శక్తితో, తేలికగా అవుతారు. మీరు చక్రాల మీద ఏకాగ్రతని నిలిపితే మనస్సు ఎటూ వెళ్ళదు. అది ఒక దగ్గర స్థిరంగా ఉంటుంది. అదే శరీరంలో మరొక భాగంలో ఏకాగ్రత నిలిపితే మనస్సు ఎటో వెళ్ళిపోతుంది.
4. అన్క్లచ్డ్గా ఉండండి (బంధాల నుంచి విముక్తులవ్వండి) (సమయం 7 నిమిషాలు) : ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీ ఆలోచనలు ఒక దానితో ఒకటి సంబంధం లేని, అర్థం లేని స్వతంత్రమైనవి. మీకు ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని అణచవద్దు.

వాటితో ప్రభావితం కావద్దు. కేవలం వాటిని గమనించండి. అవి ఒక దానికొకటి ఎటువంటి సంబంధం లేనివి అని గమనించండి. అప్పుడు మీలో గమనించగల చేతనస్థితి ఏర్పడుతుంది. మీరు తెలుసుకున్నా లేకపోయినా జెను అన్నా కాదు అన్నా, మీరు జ్ఞానోదయమైనవారే. సహజంగా మీరు బంధవిముక్తులే. నిశ్శబ్దంగా కూర్చొని ఆ బంధవిముక్తిని అనుభవంతో తెలుసుకోండి. జ్ఞానోదయానుభవానికి ఇది అంతిమపద్ధతి.
5. గురుపూజ (సమయం 7 నిమిషాలు) : నిత్యధ్యానాన్ని విశ్వశక్తితో అనుబంధాన్ని ఏర్పరచు కోవటంతో ముగిస్తాం. విరామంగా కూర్చోండి.

విశ్వశక్తితో, సర్వాంతర్యామితో చక్కని అనుబంధంతో కూర్చోండి. దేవుడి పైన అయినా లేదా గురువుల పైన అయిన మీకు ప్రేమ ఉంటే లోతైన అనుబంధంతో కూర్చోండి, విరామంలో స్థిరపడండి.
నిశ్శబ్దంగా, ఆనందంగా కూర్చొని గురుమంత్రశ్లోకాలని వినండి. సర్వాంతర్యామితో అనుబంధాన్ని అనుభూతి పొందండి. మంత్రాల ప్రకంపనలు, ఆ శక్తి మీలో నింపండి. మంత్రాలు సర్వాంతర్యామి పట్ల, గురుదేవుల పట్ల కృతజ్ఞతని తెలియచేస్తాయి. మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు, అజ్ఞానం నుంచి మనని విముక్తుల్ని చేసినందుకు, నిత్యానందస్థితిని మనం పొందేలా చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేయండి.
సంస్కృతంలో చదవటం వల్ల దానికి ఉన్న శబ్దతత్త్వం మనకి సహాయం చేస్తుంది. ఆ మంత్రాల శబ్దంలో మన ఏకాగ్రతని నిలపగలిగితే, మనం మాటలకి శబ్దాలకి అతీతంగా వెళ్ళగలం. వాటి అర్థాలు మనకి తెలియకపోయినా, దానిలోని శబ్దతత్త్వం మనని మారుస్తుంది. మన మానసిక - శారీరకవ్యవస్థల్ని శుభ్రపరచి స్వచ్ఛంగా చేస్తుంది. మనలో అనుకూలప్రకంపనల్ని కలిగిస్తుంది.
మీరు గురుపూజ కూడా చేయవచ్చు. మంత్రాలు పఠిస్తూ గురుపూజ చేయవచ్చు. గురుపూజకి వేరే పుస్తకాలు ఉన్నాయి.
ఈ ధ్యానం రోజుకి ఒకసారి చేయండి. మీలోని మరొక కోణాన్ని తెలుసు కోగలుగుతారు. నిత్యధ్యానం మీ శరీరాన్ని, మనస్సుని స్వచ్ఛమైన చేతనస్థితిని అనుభవించే విధంగా తయారుచేస్తుంది. నిత్యానందాన్ని పొందేలా చేస్తుంది.
నిత్యధ్యానం వల్ల ప్రయోజనాలు
అరగంట చేసే నిత్యధ్యానం మనకి కింది ఉపయోగాలు కలిగిస్తుంది.
- ఒత్తిడి తగ్గిస్తుంది
- సంబంధబాంధవ్యాలు బాగుంటాయి.
- అంతరంగప్రశాంతత, సంతృప్తి కలుగుతాయి.
- ఆత్మప్రబోధస్థితి మేల్కొంటుంది.
- బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.
- నిద్ర బాగుంటుంది.
- స్పష్టత పెరుగుతుంది.
- రోజంతా శక్తితో ఉంటారు.
- విశ్వశక్తితో అనుబంధం పెరుగుతుంది.
మీ కుటుంబసభ్యుల్ని, స్నేహితుల్ని నిత్యధ్యానదీక్షతో నిత్య ధ్యానం చేయించండి. దీంతో ఈ భూమి మీద సామూహిక చేతనస్థితిని అనుకూలంగా పెంచగలం. ఎక్కువ మంది బంధవిముక్తులై జీవన్ముక్తులవుతారు. ప్రతి ఒక్కరిలో వచ్చే వ్యక్తిగతమైన మార్పు ప్రపంచంలో సామూహికచేతనస్థితిని ఉన్నతస్థితికి చేర్చి భూమి మీద ఉండే జీవశక్తి పైన, జీవితాల మీద అనుకూలప్రభావాన్ని చూపిస్తుంది.
శక్తికేంద్రాన్ని మార్చినప్పుడు మీరు చూస్తున్న ప్రపంచాన్ని మార్చగలుగుతారు.
మీ మానసికవ్యవస్థ ఆధారంగా మీ శ్వాస మారుతూ ఉంటుంది.
హమ్మింగ్ మీ అంతరంగపు మాటలను తగ్గించే గొప్ప పద్ధతి.
| ★ | నిత్య ఆనంద స్థితి కోసం మీరు ప్రతి రోజూ చేయగల ధ్యానం నిత్యధ్యానం. |
| ★ | కొంతమందికి ఏ విషయమైనా వారికి కోరిక, కామం, స్పర్శ అనే ఉపయోగాలు ఉండాలి అని చూస్తారు. |
| ★ | మీ లోపల పాత గుర్తుల్ని బయటికి తీయటానికి తీవ్రమైన గందరగోళాన్ని మీ వ్యవస్థలో సృష్టించాలి. |
| ★ | మీకు ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని అణచవద్దు. వాటితో ప్రభావితం కావద్దు. కేవలం వాటిని గమనించండి. |
నిత్యయోగ - శరీరం, మనస్సులకి అతీతమైనవాటి కోసం
నిరంతరం యోగలో ఉండటమే జీవన్ముక్తి
యోగా అంటే శారీరకదార్ఢ్యం కోసం మాత్రమే కాదు. ఇది శరీరం, మనస్సు. ఆత్మల సంయోగస్థితిని సాధించటానికి శరీరాన్ని సిద్ధం చేయటమే. ఈ సంయోగానికి పతంజలి భావాలతో రూపొందించించే నిత్యయోగాం. నిత్యధ్యానం ఏ విధంగా ఈ ఆధునిక తరానికి అనుకూలంగా ఉంటుందో, నిత్యయోగా కూడా అదే విధంగా నేటి తరాలవారికి అనుకూలంగా ఉంటుంది.
యోగ అంటే ఏమిటి?
ప్రాచీనయోగశాస్త్ర పితామహుడు, పతంజలి యోగశాస్త్రాన్ని రచించిన యోగీశ్వరుడు. ప్రాచీనయోగశాస్త్రానికి పునాదైన పతంజలి యోగసూత్రాలు కింది వాక్యంతో ప్రారంభమవుతాయి.
‘యోగః చిత్తవృత్తి నిరోధః’ పతంజలి ఈ విధంగా చెబుతున్నారు, ‘యోగా అంటే మనస్సు (ఆలోచనల) లేని స్థితి’ దీని అర్థం. ఆలోచనలు ఆగ గానే యోగా అయిపోలేదు, యోగ ప్రారంభమవుతుంది. ఆలోచనలు ఆగినప్పుడు యోగా ప్రారంభమవుతుంది.
నిజానికి యోగా ఎప్పటికీ ముగియదు. అది ప్రారంభమవుతుంది, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. యోగ నిరంతరం ఏ విధంగా సాగుతూ ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏది జరుగుతుందో అదంతా మంగళకరమే, అని తెలుసుకోవాలి.
ఒక విషయం తెలుసుకోండి. మీలో ప్రతి అనుభవం మిమ్మల్ని, మీలోని చేతనస్థితిని అత్యున్నతస్థాయికి తీసుకువెళుతుంది. అది మిమ్మల్ని పరిణతుల్ని చేస్తుంది. మీరు ఐశ్వర్యాన్ని పోగొట్టుకోవటం కూడా మీకు పరిణతిని ఇస్తుంది. ఆరోగ్యాన్ని పోగొట్టుకోవటం మరి కొంత తెలుసుకునే విధంగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మీరు మీ అంతరంగంలో నింపగలరో, అప్పుడు జీవితం ప్రతిక్షణం ఒక అద్భుతంలా సాగిపోవటాన్ని మీరు చూడగలరు.
ఒక చిన్న కథ : ఒకసారి సముద్రంలో ఒక ఓడ వెళుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆ ఓడ కెప్టెన్‌కి ముందు వైపు అత్యంత ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది. వెంటనే అతను ఓడను నడిపేవారి దగ్గరకి వెళ్ళి ఓడని ఆ ప్రకాశానికి దూరంగా తీసుకువెళ్ళమని హెచ్చరిస్తాడు. అతను వారితో ‘మీరు వెంటనే ఓడని 15 డిగ్రీలు ఉత్తరం వైపు మళ్ళించి ఓడ దాన్ని ఢీ కొట్టకుండా కాపాడండి’ అని హెచ్చరిస్తాడు.
వెంటనే ఒక గొంతు వెనక నుంచి ఈ విధంగా వినిపిస్తుంది, ‘మీ ఓడని 15 డిగ్రీలు దక్షిణదిశగా ఓడ ఢీకొట్టకుండా చూడమని చెబుతున్నాం’ అని. అప్పుడు కెప్టెన్‌కి చాలా కోపం వస్తుంది. చాలా అతిశయంతో, బెదిరించే విధంగా జవాబు ఇస్తాడు, 'ఇది దేశంలోనే అతి పెద్ద ఓడ. మా దగ్గర నాశనం చేయగల అస్త్రాలు, మమ్మల్ని, ఓడని రక్షించే పరికరాలు ఉన్నాయి. మీరు ఓడని ఉత్తరదిశగా 15 డిగ్రీలు మార్చండి. లేకపోతే ఓడని రక్షించటానికి మేము చేసే ప్రయత్నాలని మీరు ఎదుర్కోవలసి ఉంటుంది', అంటాడు.
వెంటనే మళ్ళీ ఇలా వినిపిస్తుంది, 'మేము లైట్ హౌస్', అని.
అర్థం చేసుకోండి; సర్వసృష్టి నిరంతరం ఉంటుంది. అది మీకు మార్గదర్శకంగా ఉంటూ మీకు ఏది జరిగినా ఉన్నంతలో చాలా మంచి జరిగే విధంగా ఉంటుంది. మీరు దానికి అనుగుణంగా ఉండండి. అదే మంచి పద్ధతి. యోగా అనేది ఆ విధంగా మిమ్మల్ని మీరు మలచుకోగల ఒక మార్గం. రేడియోని ఎక్కువ ఫ్రీక్వెన్సీకి ఏ విధంగా ట్యూన్ చేస్తామో ఇది కూడా అంతే.
యోగా ఒక లక్ష్యం కాదు. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది.
చాలా మంది యోగా అనగానే భౌతికంగా వేసే ఆసనాలు అనుకుంటారు. శరీరాన్ని ఎలా వంచాలి, ఎలా కదిలించాలి అనేది నేర్చుకోవటం అనుకుంటారు.
ఇంతకు ముందు ఒక జోక్ చదివాను. ఒక గుహలో కొన్ని గబ్బిలాలు పైన కప్పుకి వేలాడుతూ ఉంటాయి. వాటికి నేల మీద తిన్నగా నిలబడి ఉన్న ఒక గబ్బిలం కనిపిస్తుంది. అవి ఆశ్చర్యపోయి, దానితో, 'కింద ఏమీ చేస్తున్నావు' అని అడుగుతాయి. కింది గబ్బిలం 'యోగా చేస్తున్నాను' అని గట్టిగా జవాబు ఇస్తుంది.
అందరూ యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పటం అనుకుంటారు. అది ఆరోగ్యం కోసం అనుకుంటారు. దయచేసి అర్థం చేసుకోండి; యోగా అంటే ఒక లక్ష్యం కాదు. అది నిరంతరం జరిగే ఒక అనుభవం. యోగా అంటే ఐక్యమైపోవటం.
సత్యానికి, స్వప్నానికి మధ్య ఉన్న ఖాళీ తగ్గించటం
మన లోపల రెండు జీవితాలు ఉన్నాయి. ఆ విషయం తెలుసుకోండి. ఒకటి మనం ఏ విధంగా జీవించాలి అనుకుంటున్నామో ఆ జీవితం, అది స్వప్నం. మరొక జీవితం సత్యం, మనం జీవిస్తున్న జీవితం. ఈ రెండు జీవితాలు కలవటాన్నే నేను యోగా అంటాను. ఇప్పుడు ఈ రెండు జీవితాలు, మీ స్వప్నజీవితం, నిజజీవితం కలవటం ఎలా?
మీరు ఈ రెండింటి మధ్య దూరాన్ని తగ్గించాలి అంటే కలల మందాన్ని తగ్గించాలి. లేదా మీ శక్తిని పూర్తిగా వెల్లడి చేయాలి. అప్పుడు సత్యం స్వప్నం దగ్గరకి వస్తుంది. మీరు మీ ఊహలని, ఆశల లోతుని తగ్గిస్తే, స్వప్నస్థితి సత్యస్థితి ఒక దగ్గరకి వస్తాయి. అంతే కాకుండా మీరు మీలోని శక్తిని సత్యం ద్వారా వెల్లడి చేయగలిగినప్పుడు, సత్యదశ, స్వప్నదశకి దగ్గరగా వస్తుంది. ఈ రెండు దశలూ కలవటాన్నే నేను యోగా అంటాను.
నిరంతరం ఈ రెంటింటిలో ఏదో ఒకటి, స్వప్నం లోతు తగ్గించటం లేదా శక్తిని సత్యం ద్వారా వెల్లడి చేయటం, దీన్నే యోగా అంటాను. ఎప్పుడైతే ఈ రెండు దశలూ స్వప్నసత్యం కలుస్తాయో అప్పుడు ఆధ్యాత్మికవిస్ఫోటం జరుగుతుంది. అప్పుడే మనం చెప్పుకునే యోగా అనేది జరుగుతుంది. అయితే ఇక్కడితో యోగా అయిపోలేదు. కేవలం యోగా ప్రారంభమయ్యింది.
స్వప్నం

సత్యం
మామూలుగా యోగా అనగానే ఆసనాల్లో మంచి ప్రావీణ్యం సాధించి, ఒక స్థితికి రావటం అనుకుంటారు. యోగా అంటే ఆసనాల్లో ప్రావీణ్యం సంపాదించటం కాదు లేదా ఏదో ఒక లక్ష్యాన్ని సాధించటం కాదు. యోగా అంటే మీ అంతరంగంలో, మీ చుట్టూ జరిగే విషయాల్ని మేల్కొలపటం.
ఎవరైతే సత్యాన్ని స్వప్నస్థితికి తీసుకురావటానికి ప్రయత్నిస్తారో అతను భౌతికవాది. సత్యజీవితంలో తన కలలని నిజం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. కానీ దీంతో ఒక సమస్య ఉంది. స్వప్నం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. మీరు దాన్ని సాధించే దిశగా ప్రయత్నం మొదలు పెట్టాక, దాని లక్ష్యం మారిపోతుంది. మీ భావాలు మారే కొద్దీ మీ లక్ష్యం మారుతూ ఉంటుంది.
యోగా అంటే మీరు ఆధ్యాత్మిక ఆత్మని కలిగిన మానవానుభవాలతో ఉన్నవారు అని తెలుసుకోవటమే.
ఏ వ్యక్తి అయితే స్వప్నం లోతు తగ్గించి సత్యం వైపు దగ్గరగా వెళతాడో అతను తనలో అణచబడిన కోరికలు గల సన్యాసిలా సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన నిజాన్ని తెలుసుకోవాలి. కోరికల్ని అణచటం సన్యాసించటం లేదా శక్తిని వెల్లడి చేస్తూ కలలని సాధించటం అనే ఈ రెండు విషయాలు కూడా పని చేయవు. ఇక్కడే బుద్ధుడు చెప్పే మధ్యేమార్గం మనకి సహాయం చేస్తుంది. ఈ మధ్యే మార్గమే మేల్కోటానికి లేదా తెలుసుకునే తత్వాన్ని తీసుకురావటం లేదా యోగా అన్నా అదే అర్థం. మీరు మీ భావావేశాల తోపుడుకి లోను కాకుండా వాటిని చూడగలుగుతూ, మధ్యేమార్గంలో ఉండగలుగుతారు.
అంతరంగంలో స్థిరపడే స్థితి
యోగా అంటే అంతరంగంలో గల అసలైన ఉనికితో ఉండటమే. యోగసూత్రాల్లో పతంజలి యోగస్థితి గురించి చాలా అందంగా వర్ణిస్తాడు. 'యోగా అంటే మనస్సు (ఆలోచనలు) లేని స్థితి. ఎప్పుడైతే ఆలోచనలు అనేవి లేవో అప్పుడు మీరు యోగస్థితిలో ఉంటారు. అదే ఆలోచనలు లేని స్థితి. అదే అంతిమచేతనస్థితి, అదే జ్ఞానోదయం అంటే.
ఎప్పుడైతే మీరు ఆలోచనలు లేని స్వచ్ఛమైన చేతనస్థితిని అనుభవిస్తారో అప్పుడు మీలో చక్కని మానసిక విప్లవం ఏర్పడుతుంది. అది జీవం (ఆత్మ), ప్రపంచం (జగత్), భగవంతుడు (ఈశ్వరుడు)ల గురించి స్పష్టంగా అర్ధం చేసుకోగల శక్తిని ఇస్తుంది. అప్పుడు మీరు ఈ మూడూ వేరు కాదు, అవి అంతా ఒక సంపూర్ణత్వం అని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. మీ లోపల భగవంతుడు, ప్రపంచం అనే అనుభవాలు జరుగుతాయి.
యోగా ద్వారా మీరు ఆధ్యాత్మిక స్థితిని కోరే సామాన్య మానవులు కాదు. మీరు మానవానుభవంతో ఉన్న ఆధ్యాత్మికులు అని తెలుసుకోగలుగుతారు.
పతంజలి - యోగశాస్త్రవ్యవస్థాపకుడు
పతంజలి యోగశాస్త్రవ్యవస్థాపకులు. జ్ఞానోదయఅనుభవాన్ని ఎదుటివారిలో కలిగించగల ఒక స్పష్టమైన, శాస్త్రీయమైన వ్యవస్థని రూపొందించిన మొదటి గురుదేవులు పతంజలి.
పతంజలికి ముందు జ్ఞానోదయం అంటే ఏదో జాక్ పాట్ సాధించటం అని దాన్ని ఒక అదృష్టంగా భావించేవారు. ఆ అనుభవం జరిగినా లేకపోయినా, దాన్ని ఒక జూదం ఆటలా భావించేవారు. మీరు ఆడతారు కాని గెలుస్తారనే నమ్మకం ఉండదు.
పతంజలి ఈ విషయంలో మొట్టమొదటి గురువు. నేను ఆయనని ఆధ్యాత్మికనావికుడు అంటాను. ఆయన జ్ఞానోదయానికి చక్కని మార్గాన్ని, ఒక పటాన్ని పూర్తి వివరాలతో, సూచనలతో తయారుచేసిన మొదటి గురువు. ఆయన స్పష్టమైన సూచనలని ఇచ్చారు. ఒక దాని తరువాత ఒకటిగా చేయవలసినవన్నీ ఒక క్రమపద్ధతిలో, సూత్రాలతో ఇచ్చారు. ఇవన్నీ జ్ఞానోదయఅనుభవాన్ని కలిగించేవే. బయట ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఏవిధంగా అయితే సూత్రాలను సృష్టించి వాటి ద్వారా తాము తెలుసుకున్న విషయాలు అందరికీ అర్థమయ్యేలా చెబుతారో, పతంజలి కూడా జ్ఞానోదయం అనే అనుభవాన్ని అంతరంగప్రపంచపువిష్యాల్ని తెలుసుకోగల సూత్రాల్ని తయారుచేసాడు.
రఘుపతి యోగి - యోగా గురుదేవుడు
నేను చిన్నతనంలో ఒక గొప్ప యోగశాస్త్రప్రవీణులైన గురుదేవుల దగ్గర ఉండగల అదృష్టాన్ని పొందాను. ఆయన పేరు యోగిరాజ్ యోగానంద పూరి. ఆయనని రఘుపతి యోగి అని కూడా పిలిచేవారు. పతంజలి రూపొందించిన యోగశాస్త్రం మొత్తాన్ని ఆయన నేర్చుకొని అందులో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సంపాదించారు.
మీ శరీరం మీ జ్ఞాపకాల నుంచి తయారు చేయబడింది. మీరు ఏ ఉద్దేశంతో శరీరాన్ని, మనస్సుని కదిలిస్తారో అది మీ శరీరంలో మనస్సులో రికార్డు చేయబడుతుంది.
ఆయన ఆసనాల్లో గొప్ప ప్రావీణ్యం సాధించారు. భౌతికశరీరాన్ని ఏ విధంగానైనా వంచగల రకరకాల ఆసనాల్లో ప్రావీణ్యం సాధించారు. దీన్నే హఠయోగ అంటారు. అదే విధంగా ప్రాణయోగ అంటే జీవశక్తి, మనస్సుల మీద పని చేశారు. దృష్టి శక్తి, భావాలతో పని చేయటం ఈ విధంగా పతంజలి యోగశాస్త్రంలోని అన్ని కోణాల్లో ఆయన పూర్తి ఆధికారాన్ని సంపాదించారు. యోగలోని అత్యంతముఖ్యమైన లోతులలో ఆయన దాన్ని తెలుసుకున్నారు.
ఒక విషయం అర్థం చేసుకోండి. యోగశాస్త్రంలో కేవలం పతంజలి మాటల్ని మాత్రం రాయగలిగారు. కానీ ఆయన తన శరీర కదలికలతో శిష్యులకి ఇచ్చిన సందేశాల్ని రాయలేక పోయారు. అసలు ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో, ఏ ఉద్దేశంతో రాసారో ఆ విషయాల్ని రికార్డు చేయలేకపోయారు.
ఎవరైతే పతంజలి చేతనస్థితిని అనుభవిస్తారో, కేవలం ఆ వ్యక్తి మాత్రమే పతంజలిని తిరిగి తీసుకురాగలడు. నాకు అటువంటి గురువుతో ఉండే అదృష్టం దొరికింది. ఆయన పతంజలి అంత రంగాన్ని, పతంజలి చేతనస్థితిని అనుభవపూర్వకంగా తెలుసుకున్న యోగ గురువు.
నేను ఆయనతో ఉన్న రోజుల్లో ఆయన వయస్సు సుమారు వంద, నూట ఐదు సంవత్సరాలు ఉండవచ్చు. కానీ ఆయన మంచి శరీరదార్ఢ్యంతో చాలా ఆరోగ్యంతో ఉండేవాడు. ఆయనలో ఆశ్చర్యం గొలిపే శక్తి ఉండేది. ఆయన శారీరకబలాన్ని ఊహించలేం. ఆయన తన ఛాతీకి ఇనుపగొలుసు కట్టుకొని శ్వాస వదిలి, తిరిగి పూర్తి స్థాయిలో శ్వాస తీసుకుంటే, ఆ గొలుసు తెగిపోయేది.
తార్కికత గల మెదడుకి ఈ విషయం అర్థం కాదు. వారు ఈ విషయాన్ని ఒప్పుకోరు, అర్థం చేసుకోలేరు. ఆయన గాలిలో పైకి లేవటం కనీసం ఇరవై సార్లు చూసి ఉంటాను. ఆయన పూర్తిగా శ్వాస తీసుకొని లోపల పట్టి ఉంచగానే గాలితో ఉన్న బుడగలా పైకి లేచేవారు.
నేను మూడు సంవత్సరాల వయస్సు నుంచి పదమూడు సంవత్సరాల వయస్సు వరకు ఆయన పాదాల దగ్గర ఉండి, ఆయన ఆదరణలో ఆయన మార్గదర్శకత్వంలో పెరిగాను. ప్రతి రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కనీసం ఐదారు గంటలపాటు ఆయన నాతో రకరకాల యోగాసనాలు వేయించేవారు. నేతి, ధౌతి అనే పద్ధతిలో (నేతి అంటే ముక్కు నాళాలని, ధౌతి అంటే జీర్ణాశయాన్ని శుభ్రపరిచే యోగపద్ధతులు) నాతో ఒక పొడవైన గుడ్డని మింగించి దాంతో లోపలి భాగాలు శుభ్రపడే విధంగా చేసేవారు.
ఒక ఉద్దేశంతో శరీరాన్ని కదిలించి ఫలితాల్ని పొందండి
రఘుపతి యోగి కొన్నిసార్లు నన్ను కదలకుండా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కూర్చోమని చెప్పి, ఆ నిశ్చలత మీద ధ్యానం చేయమని చెప్పేవారు. అలా పది నిమిషాలు గడవగానే, అకస్మాత్తుగా నన్ను లేపి, గుడి అంతా ఎంత వేగంగా పరిగెత్తగలిగితే అంత వేగంగా పరిగెత్తమనేవారు.
నన్ను ఇటు పక్కకి, అటు పక్కకి వంగమనేవారు. నాకు ఆయన యోగా నేర్పే గుడిలో ఇరవై నుంచి ముప్పై స్తంభాలు ఉండేవి. ఆయన నన్ను స్తంభాలన్నీ ఒక చేతిని ఉపయోగిస్తూ ఎక్కి దిగమనేవారు. నేను ఆయనని అలా ఎందుకు స్తంభాలు ఎక్కి దిగాలి అని అడిగేవాడిని. ఎందుకంటే అటువంటి పద్ధతి ఏ యోగసూత్రంలోనూ లేదు.
నా ప్రశ్నికి ఆయన చాలా చక్కని జవాబు ఇచ్చారు. 'మీరు ఏ ఉద్దేశంతో శరీరాన్ని అటూ ఇటూ కదిలిస్తారో, అటూ ఇటూ వంచుతారో ఆ ఉద్దేశం మీ శరీరంలోనూ మానసికవ్యవస్థలోనూ పూర్తిగా నాటుకుపోతుంది, ఇది చాలా ఆశ్చర్యపరిచే ఒక సత్యం. ఆయన ఇలా చెప్పారు, 'మీరు ఏ ఉద్దేశంతో శరీరాన్ని అటూ ఇటూ వంచుతారో, శరీరాన్ని అటూ ఇటూ కదుపుతారో, ఆ ఉద్దేశం, ఆ లక్ష్యం మీ శరీరంలో నమోదు అవుతుంది. ఆ సంస్కారాన్ని మీ శరీరం వెల్లడి చేస్తూ ఉంటుంది.'
ఇక్కడ ఆయన చెప్పేది ఏమిటంటే, మీరు శరీరాన్ని ఏ విధంగా వంచుతున్నారు, ఏ విధంగా ఆసనాలు వేస్తున్నారు అన్న విషయం ముఖ్యం కాదు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, అన్నది ముఖ్యం. మీరు ఆరోగ్యం కోసం మీ శరీరాన్ని అటూ ఇటూ వంచితే, ఆ ఉద్దేశం అయిన ఆరోగ్యం మీకు కలుగుతుంది. ఈ రోజుల్లో, ముఖ్యంగా పశ్చిమదేశాల్లో, ఒక్కొక్క అనారోగ్యాన్ని ఒక్కొక్క ఆసనంతో కలిపి చేస్తున్నారు. ఈ అనారోగ్యానికి మీరు ఈ ఆసనం వేయాలి చెబుతున్నారు. ఈ సమస్యకి ఈ పద్ధతి నేర్చుకోవాలి అంటున్నారు.
మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో మన జీన్స్ ఆ విధంగా తయారు అవుతాయి. నిత్యయోగ మీ అంతరంగంలోని ఆనందాన్ని నిత్యానందస్థితిని అనుభవించి, వెల్లడి చేయటానికి మీ శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
ఒక చిన్న కథ : ఒక యువతికి చేతి వేళ్ళ గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. దాంతో ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. ఆమె తన స్నేహితురాలితో తన సమస్యని చెప్పి సహాయం చేయమని అడుగుతుంది. ఆమె స్నేహితురాలు యోగా నేర్చుకుంటే సమస్య పోతుంది అని సలహా ఇస్తుంది. అమ్మాయి యోగా చేయటం ప్రారంభించి కొంతకాలానికి గోళ్ళు కొరకటం మానేస్తుంది. గోళ్ళు అందంగా పెరుగుతాయి. ఆమె స్నేహితురాలు చాలా సంతోషపడి 'చూసావా! నేను చెప్పాను కదా. యోగా చేస్తే గోళ్ళు కొరికే నీ అలవాటు పోతుందని, నీ సమస్య పరిష్కారమైంది కదా' అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి 'నిజానికి సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు నేను, నా కాళ్ళ దగ్గరకి వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు కాళ్ళ గోళ్ళు కొరకటం మొదలు పెట్టాను'. అంటుంది.
అర్థం చేసుకోండి, వ్యాధులు తగ్గటానికి ఆసనాలు వేయటం యోగా కాదు. మీరు ఒక జబ్బు గురించి అనుకుని ఆసనాలు వేస్తే, మీరు ఆ సందేశాన్ని, ఆ ఆలోచనని, మీ శరీరంలోకి పంపిస్తున్నారు అని అర్థం.
రఘుపతి యోగి ఈ విధంగా చెప్పేవారు, 'ఏ ఆసనమైనా, ఆసనమే కాదు మీ భౌతికశరీరాన్ని కదపటానికైనా మీరు దేనికోసం చేస్తారో, ఏ ఉద్దేశంతో చేస్తారో, ఆ ప్రభావాన్ని మీ శరీరంలో సృష్టించగలుగుతుంది. అది కేవలం కూర్చుని ఉండటం ద్వారా కూడా చేయవచ్చు. మీరు కూర్చోవటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని గట్టిగా నమ్మి అలా కేవలం కూర్చోగలిగినా, మీరు కోరుకున్న ఆరోగ్యం మీలో కలగటం మీరు చూడగలుగుతారు.
ఒక విషయం అర్థం చేసుకోండి. మీ శరీరం మీ జ్ఞాపకాలతోనే తయారయ్యింది. మీ మనస్సు, మీరు అంటే మీరు ఏం అనుకుంటున్నారో అదే మీ శరీరాన్ని తయారుచేస్తుంది. మీరు ఫలానాది జరుగుతుంది అనే విశ్వాసంతో మీ శరీరాన్ని కదిలించితే అది జరిగి మీ నుంచి వెల్లడి కావడం ప్రారంభమవుతుంది. మీ శరీరపు కండరాల్లో ప్రతి జ్ఞాపకం నిలువచేయబడి ఉంటుంది. మీరు జ్ఞాపకాలను మార్చగానే, మీరు మీ వ్యవస్థని కూడా మార్చేస్తారు. మీ వ్యవస్థ మీ జ్ఞాపకాలకి స్పందిస్తుంది.
ఈ విధంగా నిత్యయోగ ద్వారా మీ శరీర మానసికవ్యవస్థల్లో మార్పు వస్తుంది. మీ అంతరంగం శుభ్రపడుతుంది. అప్పుడు మీ మానసిక వ్యవస్థ దానికి అనుగుణంగా మారుతుంది. అప్పుడు ఏ ఉద్దేశ్యంతో అయితే శరీర కదలికల్ని సాధన చేస్తారో దాన్ని శరీరం అనుసరిస్తుంది. ఆ ఉద్దేశం ప్రతి కండరంలోనూ, ప్రతికణం మేధలోకి చొప్పించబడుతుంది.
శాస్త్రీయనిరూపణ
మనం ఏది అనుకుంటామో అదే మనం. మనం అనుకునే విధంగానే మన పనులు ఉంటాయి. మన పనులు మన లక్ష్యాల్ని నిర్దేశిస్తాయి. ఇది ఉపనిషత్తులోని వాక్యం కాదు. బయాలజీ ఆఫ్ బిలీఫ్ అనే పుస్తకం లోది. దీన్ని డా॥ బూస్లిప్టన్ అనే బయాలజీ సైంటిస్ట్ రాసాడు. ఆయన శరీరంలోని కణాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అనే విషయం మీద ఒక కొత్త సిద్ధాంతాన్ని రాసాడు. మనం మన ప్రవర్తన మనలోని జీన్స్ ఆధారంగా ఉంటుంది అని అనుకునేవాళ్ళం. డా॥ లిప్టన్ పరిశోధన తరువాత దానికి వ్యతిరేకంగా చెప్పాడు - మన ప్రవర్తనని అనుసరించి మన జీన్స్ తయారు అవుతాయి!
ఉద్దేశం, దృష్టి పెట్టటం అనే విషయాల మీద భౌతికంగా నిజమైన సంఘటనలు చాలా రికార్డు చేయబడి ఉన్నాయి. ఉదాహరణకి భయంకరమైన వ్యాధులు కాన్సర్ వంటి వాటిని శారీరకవైకల్యాల్ని అద్భుతంగా మించి వారు సాధించగలం అనుకున్నవి సాధించగలిగారు. అవన్నీ కూడా సాధించాలి అని అనుకున్న సంకల్పం బలంతో వారి కణాల్లో ఉండే జ్ఞాపకాల్ని మార్చటం ద్వారా వారు సాధించగలిగారు.
ప్రాచీనమైన ఈ సత్యాన్ని ఇప్పుడు ఆధునికశాస్త్ర పరిశోధనలతో నిరూపించారు. వారు ఏం కనుక్కున్నారంటే మనం లోతుగా, నిరంతరం దేన్ని గురించి ఆలోచిస్తామో దాని ప్రభావం మన మీద శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది.
జ్ఞానోదయ శక్తిని నిలిపి ఉంచటానికి శరీరాన్ని సిద్ధపరచటం
నాకు పదమూడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు రఘుపతి యోగి నన్ను జ్ఞానోదయ స్థితిలోకి వెళ్ళి అక్కడ స్థిరపడగలిగే విధంగా తయారుచేసారు. ఆ జ్ఞానోదయానుభవంలోనికి వెళ్ళటం, దాని క్షణమాత్రపుదర్శనం, ఆలోచనలు లేని స్థితికి రావటం, సతోరి అనేది నిజానికి అంత కష్టం కాదు. కానీ ఆ స్థితిలో ఆ అనుభవంలో స్థిరపడి, మరీ ముఖ్యంగా ఆ శక్తిని శరీరం ద్వారా వెల్లడి చేయాలి అంటే మీ శరీరాన్ని, మనస్సున్ని దానికి సిద్ధం చేయాలి.
జ్ఞానోదయ క్షణమాత్రానుభవం అంత గొప్ప విషయం కాదు. కానీ అత్యుత్తమశక్తి స్థితిలో, అత్యున్నతచేతనస్థితిలో ఆ విశ్వశక్తిని వెల్లడిచేస్తూ, ఆ శక్తిని, అద్భుతమైన జ్ఞానోదయశక్తిని వెల్లడి చేయాలంటే అందుకు అనుగుణంగా శరీరాన్ని, మానసిక వ్యవస్థని సిద్ధం చేయాలి.
రఘుపతి యోగి నాకు, నా శరీరానికి, నా వ్యవస్థకి, నా నాడీమండలానికి ఇచ్చిన శిక్షణ ఆ అద్భుతమైన జ్ఞానోదయశక్తిని పట్టి ఉంచగల విధంగా సహాయం చేసింది. జ్ఞానోదయం అయిన శరీరం అంతు లేని శక్తిని కలిగి ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే నాలుగు ఏనుగుల్ని ఒక చిన్న పాకలో ఉంచినట్టు. ఆ శరీరం ఒక న్యూక్లియర్ రియాక్టర్ లాంటిది. నా శరీరం మామూలు ఉష్ణోగ్రత అందరి కంటే ఒకటి - రెండు డిగ్రీలు ఎక్కువ ఉంటుంది.
యోగా నా శరీరాన్ని అంతిమశక్తిలో స్థిరపడే విధంగా సహాయం చేసింది.
నిత్యయోగా ఉద్దేశం
నిత్యయోగా నేను ఈ ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతి. నాలో కలిగిన జ్ఞానోదయాను భవాన్ని ఎదుటివారికి ఇవ్వగల ఒక శాస్త్రం, ఒక సూత్రం.
ఇది పతంజలి యోగశాస్త్రాన్ని ఆయన శరీరభాషతో పాటు, ఆయన శరీరశక్తితో ఆయన అంతరంగం వెల్లడి చేసిన విధంగా ఇవ్వబడింది. పరమానందాన్ని అనుభవించటం, ఆ ఆనందాన్ని వెల్లడి చేయగలగటమే నిత్యయోగ ఉద్దేశం. నిత్యయోగాతో పరమానందం మీ అంతరంగంలోకి ఒక విస్ఫోటంలా వస్తుంది. మీ శరీరానికి ఆ ఆనందాన్ని వెల్లడి చేయగల, శక్తిని వ్యాపింపచేయగల సామర్థ్యం వస్తుంది.
ఇప్పటి మీ శారీరకవ్యవస్థ అదే స్థితిలో ఉండలేదు. అదే అనుభవాన్ని నిరంతరం వెల్లడి చేయలేదు. నిత్యయోగ మీ శరీరాన్ని ఆ అనుభవం పొంది, అందులో స్థిరపడి, ఆ అంతరంగపరమానందాన్ని, ఆ నిత్యానందాన్ని వెల్లడి చేయగల సామర్థ్యాన్ని ఇస్తుంది.
మీ మానసికవ్యవస్థకి ఆ పరమానందంలో స్థిరపడగల సామర్థ్యం లేదు. అంత అధికమైన చైతన్యస్థితిలో, ఆనందంలో స్థిరపడగల సామర్థ్యం లేదు. అటువంటి శిక్షణ పొందలేదు. నిత్యయోగా ద్వారా ఆధ్యాత్మిక అన్వేషణకులకి నేను ఆ పరమానందాన్ని పొందగలిగి, అందులో ఆ అనుభవంలో స్థిరపడగలిగి, దాన్ని వెల్లడి చేయగల శిక్షణనిస్తున్నాను.
నిత్యయోగ ఉద్దేశం ఆలోచనల బంధాలు తెంచుకొని పరమానందానుభవాన్ని పొందటం. దీని పాటు శారీరకారరోగ్యం కూడా ఉపఫలితంలా వారికి దొరుకుతుంది. అదే విధంగా ధ్యానం అంటే కేవలం మానసికారోగ్యం కోసం మాత్రమే కాదు. మంచి మానసికారోగ్యం ధ్యానం ఒక చిన్న ఉప ఫలితం మాత్రమే. ఒక విషయం అర్థం చేసుకోండి. యోగా అంటే కేవలం ఆరోగ్యం కాదు. అంత కంటే చాలా గొప్ప విషయాన్ని సాధించటానికే యోగా. యోగా ధ్యానం అనే వాటిని ఏదో శారీరక మానసికస్వస్థతలకోసం అనే అల్పస్థాయికి వాటిని దింపను. వాటి ద్వారా చాలా లోతైన అనుభవాన్ని పొందాలి. అదే అత్యుత్తమనిత్యానందస్థితి.
నిత్యయోగా అనే కొత్త పద్ధతి ద్వారా దీన్ని అతిప్రాచీనపద్ధతి అంటాను, జీవితాల్లోకి సత్యాన్ని తీసుకురవటానికి ప్రయత్నిస్తున్నాం. ఇది కొత్తది కాదు ఒక ప్రాచీనపద్ధతి. నిత్యయోగ ద్వారా పతంజలి ఏ విధంగా అయితే యోగశాస్త్రాన్ని చెప్పారో అదే విధంగా తీసుకువస్తున్నాం.
నిత్యయోగ ముఖ్యోద్దేశం మీ జీవితాన్ని, మీ ప్రతి పనిని, మీ ప్రతి క్షణాన్ని యోగాగా మార్చటమే. నిత్యయోగ జీవితానికి కదలికల్ని కలపటం కాదు. మీ కదలికలకి జీవితాన్ని ఇవ్వటం. మీరు వర్తమానంలో ఉండి, పూర్తి ఎరుకతో ఉండి, ఏది చేస్తున్నా కదలికతో ఉంటే అదే యోగా - నిత్యయోగా.
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నిత్యయోగా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. నిత్యయోగలోని ప్రతి సెషన్ మీలోని శరీరం మనస్సు - ఆత్మలని సంయోగం పొందే ప్రక్రియని మరింత లోతుగా చేస్తూ, పతంజలి చెప్పిన అష్టాంగయోగాని తీసుకువస్తారు. ఇందులో అసనాలని, ప్రాణాయామం, ముద్రలు, మొదలైనవి ఉంటాయి.
నిత్యయోగ మీ జీవితానికి మరిన్ని కదలికల్ని కలపటానికి కాదు. మీ కదలికలకి జీవితాన్ని కలుపుతుంది. ఇది మీ కదలికలకి గొప్ప జీవచైతన్యాన్ని చేరుస్తుంది.
మీరు వర్తమానంలో ఉండి, తెలుసుకునే తత్వంలో ఉంటే, ఏ పని చేసే సమయంలో అయినా పూర్తిగా మీ శరీరపు కదలికల్లో నిమగ్నమై ఉంటే, అది యోగా-నిత్యయోగ.
అష్టాంగయోగా: పతంజలి చెప్పిన ఎనిమిది అంగాలు లేదా మార్గాలు అవి యమా (క్రమశిక్షణ), నియమా (నింధనలు), ఆసన (ఆసనాలు), ప్రాణాయామ (శ్వాస), ప్రత్యాహార (ఇంద్రియాల నుంచి వెనక్కి రావటం), ధారణ (ఏకాగ్రత), ధ్యానం (ధ్యానం), సమాధి (నిత్యానందస్థితి).
ముద్రలు అంటే యోగసాధనలో, చేతులతో పెట్టే పద్ధతి. అది శక్తిని మనలో ఉండేలా చేస్తుంది.
- 'యోగా అంటే మనస్సు (ఆలోచనల) లేని స్థితి'
- నిజానికి యోగా ఎప్పటికీ ముగియదు. అది ప్రారంభమవుతుంది, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది.
- చాలా మంది యోగా అనగానే భౌతికంగా వేసే ఆసనాలు అనుకుంటారు. శరీరాన్ని ఎలా వంచాలి, ఎలా కదిలించాలి అనేది నేర్చుకోవటం అనుకుంటారు.
- ఏ వ్యక్తి అయితే స్వప్నం లోతు తగ్గించి సత్యం వైపు దగ్గరగా వెళతాడో అతను తనలో అణచబడిన కోరికలు గల సన్యాసిలా సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు.

నిత్యానందస్థితిలో ఉంచే ఎనిమిది మెట్లు
లోతైన నిత్యానందస్థితిలో ప్రతిక్షణం ఉండటమే జీవన్ముక్తి
ఆనందంలో జీవించటం
ఆనందజీవితానికి ఎనిమిది మార్గాల ఆనంద అష్టాంగం, అవి:
ఆనందకరమైన నవ్వు
ఆనందాన్ని ధ్రువీకరించటం
ఆనందకరమైన శుభ్రత
ఆనందయోగా
ఆనందధ్యానం
ఆనందకరపరికరాలు
ఆనందశక్తి
ఆనందజపం.
ఆనంద అష్టాంగం ఆనందకరజీవితం అనే జీవన్ముక్తికి ఎనిమిది అంశాల మార్గం. ఇవి చాలా సామాన్యమైన పద్ధతులు. అవి మీకు ఎటువంటి వివరణ అవసరం లేకుండా నేరుగా ఆ అనుభవాన్ని ఇవ్వగలవు.
ఆనందకరమైన నవ్వు
నవ్వు ధ్యానం లేదా హాసధ్యానం.
ధ్యానపద్ధతి
నిద్ర లేవగానే మంచం మీది నుంచి బయటికి రాకుండా ఐదు నిమిషాలు నవ్వండి. మిమ్మల్ని గుర్తు చేసుకుని నవ్వండి. కారణం లేకుండా నవ్వండి.
నవ్వు ఒక అద్భుతమైన ధ్యానం. ప్రాచీన జెన్ బౌద్ధమతంలో గురువులు, శిష్యులు నవ్వు ద్వారా ఆలోచనలు లేని స్థితిని పొందేవారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నవ్వు చక్కగా పనిచేస్తుంది. ఇతరపద్ధతులతో మీరు సాధన చేసి ఫలితాల్ని గమనించాలి. నవ్వుని సాధన చేయనవసరం లేదు. అది మొదటిసారి జరుగుతుంది. ప్రతిసారి కూడా జరుగుతుంది. అది లోతుగా అంతరంగంలోకి వెళ్ళి, మనని ఉన్నతస్థితికి తీసుకువెళుతుంది.
నవ్వు ఆరోగ్యంలోంచి పుడుతుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అది పొంగి ప్రవహించే శక్తి. మీలో అణచివేయబడిన భావావేశాల్ని బయటికి తెచ్చేస్తుంది. నవ్వటం అనేది గొప్ప ఆధ్యాత్మిక లక్షణం. నవ్వులో మనం బుద్ధుడు అవుతాం. అంటే అది జ్ఞానోదయస్థితి. బుద్ధ అంటే ఆలోచనలు లేని స్థితి. నవ్వు కాని ఆలోచనలు కాని ఏదో ఒకటే ఉంటాయి. రెండూ ఒకేసారి ఉండవు. మనం నవ్వినప్పుడు ఆలోచనలు మాయం అవుతాయి. మనం విశ్వశక్తితో ఒకటిగా అవుతాం. మనకి మన గుర్తింపు గుర్తుకి రాదు. నవ్వు శిఖరాగ్రాన ఉన్నప్పుడు మనం ఒక ప్రత్యేకం అని అనుకోగలమా? లేదు! ఆ విధంగా లేకుండా పోవటం అనేది క్షణకాలమే. ఆ క్షణకాలం ఆలోచనలు ఉండవు. మనం విశ్వశక్తితో ఉంటాం. అందుకే మనం ఎక్కువగా నవ్వాలి. మన వ్యక్తిత్వం అనే గుర్తింపు మాయం అవటం అనేది మనని మనం పోగొట్టుకునేంతగా ముందుకి వెళ్లి శక్తితో జీవించే విధంగా ఉండాలి.
నవ్వు చాలా రకాల వ్యాధుల్ని, ముఖ్యంగా నరాలకి సంబంధించిన గొంతుకి సంబంధించిన వ్యాధుల్ని బాగు చేస్తుంది. మన కణాలలో ఉండే హానికరపదార్ధాలని నవ్వు బయటికి తీసేస్తుంది.
ఆనందసంకల్పం
ఆనందప్రమాణం లేదా ఆనందసంకల్పం. ఆనందం అంటే పరమానందం, సంకల్పం అంటే ప్రమాణం, ఆనందసంకల్పం ఆనందప్రమాణం. మీరు ఆనందంగా ఉంటాను అని దృఢంగా నిర్ణయించుకోవచ్చు. ఇది మీరు చేసే ఎంపిక. నిజానికి ఇది ఎంపిక కూడా కాదు. మిమ్మల్ని మీరు ఎటువంటి ఎంపికలూ లేకుండా సర్వాంతర్యామి నిర్ణయంతో పాటు ముందుకి వెళుతూ శాశ్వతమైన నిత్యానందస్థితిలో ఉండగలగటం. ఎంపిక లేని దృక్పధాన్ని అలవాటు చేసుకోవచ్చు.
ఈ ధ్యానంలో కొంత భాగం సూఫీ యోగి నుంచి తీసుకొనబడింది. ( అబ్దుల్లా అన్సారీ హేరత్ అనే సూఫీ యోగి, గురువు). సూఫీలు ఎప్పుడూ పరమానందంలో ఉండే యోగులు. వారిన ప్రార్ధన కేవలం కృతజ్ఞతని వెల్లడి చేయటమే. అబ్దుల్లా ఎప్పుడు నవ్వు ముఖంతో ఉండే గురువుగా ప్రసిద్ధి పొందాడు. ఆయన తన మరణసమయంలో కూడా నవ్వుతూనే ఉన్నాడని చెబుతారు. అతని శిష్యులు కొందరు ఆయనని నిరంతరం ఆనందంగా ఉండటం ఎలా సాధ్యం అని అడిగి, మరణసమయంలో నవ్వటానికి ఏముంది అని అడుగుతారు. అప్పుడు అబ్దుల్లా తన గురువు తనకి చెప్పిన రహస్యాన్ని వారికి చెప్పారు. ఆయన ఈ విధంగా చెప్పారు, 'మీ సంతోషం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. మీ సంతోషం 100 శాతం మీ ఎంపిక. ప్రతి రోజూ మీకు ఒక అవకాశం ఇస్తుంది. మీరు సంతోషంగా అయినా ఉండవచ్చు లేదా దుః ఖంతో అయినా ఉండవచ్చు. దేన్ని ఎంచుకుంటారో అది మీ ఇష్టం.
ధ్యానపద్ధతి
దీని కంటే సులభమైన ధ్యానం మరేదీ లేదు. ఇది చాలా ప్రభావం గల ధ్యానం ఇది. ప్రతి రోజూ నిద్రలేవగానే, కళ్ళు తెరవక ముందు, మంచం పైన కూర్చోండి. మీ పేరు గట్టిగా పిలవండి. పక్కవారిని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేకపోతే మెల్లగా మాట్లాడండి. మీ పేరుని ఉపయోగించి ఇలా అడగండి, 'ఇవాళ ఏమనుభవించాలి అనుకుంటున్నావు. ఆనందాన్ని అనుభవిస్తావా లేక బాధనా? సహజంగా ఉదయాన్నే మీరు బాధని కోరుకోరు. కాబట్టి మీ మనస్సు ఆనందాన్ని ఎంచుకుంటుంది.
వెంటనే మీ పేరు ఉపయోగించి, సరే అలాగే సంతోషంగా ఉండు ఆనంది. అంతే ఆ తరువాత కళ్ళు మూసి ఉంచి దృఢంగా ఒక విషయం అర్థం చేసుకోండి, మీరు నిశ్శబ్దంగా అనుమతిని ఇవ్వకపోతే ఎవరూ, ఏ పరిస్థితీ మీకు బాధని ఇవ్వదు. మీరు ఎందుకు బాధ పడతారంటే బయట విషయాల వల్ల ప్రభావితం కావటానికి ఒప్పుకుంటారు కాబట్టి. నిరంతరం ఆనందంగా ఉండగల శక్తి మీ లోపల ఉన్నది. ఇప్పుడు కళ్ళు తెరచి మీ సంకల్పానికి అనుగుణంగా ఉండండి.
ఆ రోజులో మీ సంకల్పబలంతో మీ మానసికవ్యవస్థని మార్చగలగటం మీరు చూస్తారు. అప్పటి వరకూ మీ బాధలకి ఏ విధంగా అందరినీ బాధ్యుల్ని చేశారో తెలుసుకుంటారు. ప్రతి సంఘటనలో బాధపడాలి అని మీరు నిర్ణయించుకున్నట్టు మీకు అర్థం అవుతుంది. మీరు ఆనందంగా ఉండాలి అని నిర్ణయించుకున్నది, బయటి పరిస్థితుల్ని బట్టి కాదు. అలాంటివి ఏమీ అవసరం లేకుండానే మీరు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మీరే ఆనందం కాబట్టి అంతే.
ఆనందకరమైన శుభ్రత - ఆయిల్ పుల్లింగ్
మీ శరీరంలో ఏం జరుగుతుందో అది నాలుక మీద కనిపిస్తుంది. నాలుకని పరీక్ష చేసి, దాని రంగుని బట్టి మనిషి అనారోగ్యం ఏమిటో చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం నాలుక బట్టి శరీరంలో వివిధ భాగాల్ని తెలుసుకోవచ్చు. నాలుక మీది ఒక్కొక్క భాగం శరీరంలోని ఒక్కొక్క ప్రాంతంతో సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే నూనెని పుక్కిలిస్తామో అది మనలో ఉండే బాక్టీరియాని, కఫాన్ని, విషపదార్థాల్ని లాలాజలంతో కలిపి బయటికి తెస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కఫం విషపదార్థం. దాన్ని బయటికి తెచ్చేయాలి.
ధ్యానపద్ధతి
ప్రతి రోజూ ఉదయం పళ్ళు తోముకోకుండా, ఏమీ తినకుండా తాగకుండా ఒక గరిటెడు నువ్వుల నూనె కాని, రిఫైండ్ సన్ ఫ్లవర్ నూనె కాని నోట్లో పోసుకొని ఒక చోట కూర్చోండి. నూనె వెనుక పళ్ళ చివరి వరకూ వెళ్ళేలా గడ్డం పైకి పెట్టండి. దాన్ని నెమ్మదిగా పదిహేను నిముషాల పాటు పుక్కిలించండి. ఆ సమయంలో వేరే పనులు చేయవద్దు, సమయం అయ్యాక ఆ నూనెని వాష్ బేసిన్లో ఊసి బ్రష్ చేసుకోండి. అది బాగా పుక్కిలిస్తే, నూనె పల్చగా, తెల్లగా ఉంటుంది. పళ్ళు శుభ్రం చేసుకున్నాక రెండు గ్లాసుల నీళ్ళు తాగండి.

సూచన : పుక్కిలించిన నూనెని మింగవద్దు. దానిలో బాక్టీరియా, మొదలైనవి ఉంటాయి. భోజనం తరువాత ఆయిల్ పుల్లింగ్ చేయాలి అనుకుంటే కనీసం నాలుగు గంటలు ఆగాలి. ఆయిల్ పుల్లింగ్ వల్ల మడమలు పగలటం నుంచి కాన్సర్ వరకూ అన్నీ బాగు అవుతాయి. వెబ్ సైట్లో ఆయిల్ పుల్లింగ్ ఉపయోగాలు చాలా ఉంటాయి. మీరు చూడవచ్చు.
ఆనందయోగా సూర్యనమస్కారాలు
నిత్యయోగా ప్రత్యేకత ఏమిటంటే పతంజలి యోగశాస్త్రాన్ని ఆధునికులకి అదే విధంగా అందించటం.
సూర్యనమస్కారాలు అంటే ప్రతి రోజూ సూర్యునికి నమస్కరించటం. ఇది శరీరాన్ని అత్యుత్తమస్థితిలో ఉంచటమే కాదు, శరీరం - మనస్సుల మీద పూర్తి అవగాహనని ఇస్తుంది.
సూర్యనమస్కారం - ప్రయోజనాలు
సూర్యనమస్కారాలు శరీరమేధని మేల్కొలిపి, శరీరం సూర్యుని నుంచి నేరుగా శక్తిని గ్రహించే విధంగా చేస్తాయి. మన చుట్టూ ఉండే ఆకాశశక్తిని పొందేలా సూర్యనమస్కారాల్ని రూపొందించారు. అవి మనిషి శరీరం, మనస్సు ఆత్మల మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఉదయం సూర్యరశ్మిలో తూర్పు వైపు తిరిగి దీనికి సరైన శ్వాసతో, మంత్రంతో చేస్తే వీటి ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఇంకేమీ చేయనవసరం లేదు. సూర్యనమస్కారాలు శరీరంలోని ప్రతి భాగం మీద, ప్రతి వ్యవస్థ మీద, చక్రాల మీద పనిచేస్తాయి. ఇవి ఒక క్రమంలో శ్వాసతో చేసే ఆసనాలు.
ప్రతి ఉదయం మీరు ఆరు నుంచి పన్నెండు సార్లు సూర్యనమస్కారాలు చేయవచ్చు. యోగాసనాలన్నింటి కంటే మీ శరీరాన్ని దృఢంగా చేసి, ప్రతి భాగాన్ని చైతన్యవంతం చేసి, వెన్నెముక నిటారుగా ఉండేలా చేయగల ఆసనాలు సూర్యనమస్కారాలు. అన్ని యోగాసనాలలోనూ ఇది రాజాసనం లాంటిది.
సూర్యనమస్కారం మంత్రాల ప్రాముఖ్యం
మంత్రం అనేది కొన్ని అక్షరాలు, పదాలు, శబ్దాలు లేదా వ్యాఖ్యానాలతో చేయబడి దాన్ని చేతనస్థితిలో జపిస్తే, అది మన శరీర మానసికవ్యవస్థలలోకి చొచ్చుకుపోయి అక్కడ బలంగా పని చేస్తాయి. సూర్యనమస్కారమంత్రాలు బీజమంత్రాలు. సూర్యదేవుని వైభవాన్ని చెబుతాయి.
బీజమంత్రాలకి అర్థం ఉండదు. అయితే దాన్ని జపించేటప్పుడు కలిగే ప్రకంపనలు శరీరవ్యవస్థ మీద బలంగా పని చేస్తాయి. థియరీ ఆఫ్ వైబ్రేషన్స్ అని ఆధునికశాస్త్రవేత్తలు చెప్పిన విషయాన్ని కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే వేదకాలం నాటి ఋషులు ఉపయోగించారు.
డా॥ మసారం ఏమోటో చేసిన పరిశోధనలలో శబ్దతరంగాలు నీటి మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో నిరూపితమైంది. మనిషి శరీరంలో అరవై శాతం నీరు ఉంటుంది. అందుకే శబ్దతరంగాలు మనిషి శారీరక మానసికవ్యవస్థల మీద ప్రభావాన్ని చూపిస్తాయి.
అచేతనస్థితిలో మనలో ఉండే ఆలోచనలు, భావావేశాలు బలమైన తరంగాలని మనలో సృష్టిస్తాయి. అవి జ్ఞాపకాల రూపంలో, సంస్కారాల రూపంలో ఉంటాయి. వాటిని చేతనస్థితిలో కరిగించేయాలి. అప్పుడు మనలో నిక్షిప్తమై ఉన్న స్వచ్ఛమైన చేతనస్థితిని అనుభవించగలం.
మొత్తం ఆరు బీజ మంత్రాలున్నాయి.
ఓం హ్రామ్
ఓం హ్రీం
ఓం హ్రూమ్
ఓం హ్రైం
ఓం హ్రౌమ్
ఓం హ్రః
ఈ మంత్రాలు సూర్యదేవుని వైభవాన్ని వెల్లడి చేస్తాయి. ఒకసారి పూర్తి నమస్కారాల క్రమాన్ని చేయటానికి ముందు, పూర్తి తెలుసుకునే తత్త్వంతో మంత్రాన్ని జపించాలి. దీన్ని నిజాయితీగా సాధన చేసే సాధకుడు ఆ వైభవాన్ని తాను కూడా పొందుతాడు.
చాలా సులభంగా సాధారణంగా ఉండే సూర్యనమస్కారాల ద్వారా బయట కనిపించే సూర్యుడు, మనలో ప్రకాశించే అంతరాత్మ అనే మేధ అని తెలుసుకుంటాం. సర్వాంతర్యామి అయిన విశ్వశక్తితో మన బంధాన్ని తెలుసుకుంటాం.
సూర్యనమస్కార బీజాక్షరసహిత మంత్రాలు
1. ఓం హ్రామ్ మిత్రాయ నమః నిత్యస్నేహితుడైన సూర్యదేవునికి నమస్కారాలు
2. ఓంహ్రీం రవయే నమః నిత్యప్రకాశకునికి నమస్కారాలు
3. ఓం హ్రూమ్ సూర్యాయ నమః నిత్యచైతన్య ప్రదాతకి నమస్కారాలు
4. ఓం హ్రైమ్ భానవే నమః నిత్యప్రకాశదీప్తికి నమస్కారాలు
5. ఓం హ్రౌమ్ భగాయ నమః నిత్యవేగవంతునికి నమస్కారాలు
6. ఓం హ్రః పూష్ణే నమః నిత్యశక్తి ప్రదాతకు నమస్కారాలు
7. ఓం హ్రామ్ హిరణ్యగర్భాయ నమః నిత్య విశ్వకాంచన గర్భునికి నమస్కారాలు
8. ఓం హ్రీం మారీచాయే నమః నిత్యసంధ్యాధిపతికి నమస్కారాలు
9. ఓం హ్రూమ్ ఆదిత్యాయ నమః నిత్యవిశ్వమాత అదితిపుత్రునికి నమస్కారాలు
10. ఓం హ్రైమ్ సవిత్రే నమః నిత్యమాతృదేవికి నమస్కారాలు
11. ఓం హ్రౌమ్ అర్కాయ నమః నిత్యకీర్తిప్రకాశునికి, పొగడదగినవానికి నమస్కారాలు
12. ఓం హ్రః భాస్కరాయ నమః నిత్యజ్ఞానోదయప్రదాతకి నమస్కారాలు.
శ్వాసనియంత్రణ
సూర్యనమస్కారాల్లో ప్రతి శరీర, కదలికకీ శ్వాసపద్ధతి ఉంటుంది. ప్రతిసారీ శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాస వదిలినప్పుడు ఆనందశక్తిని తీసుకుంటున్న అనుభూతిని పొందండి. మీ శరీరంలోని ప్రతి కణంలో ఆనందశక్తిప్రవాహాన్ని అనుభవంతో తెలుసుకోండి. మీ శరీరం మనస్సు కొత్త శక్తిని పొందటం తెలుసుకోండి.
ధ్యానపద్ధతి

దీన్ని ఖాళీ కడుపుతో ఉదయం పూట చేయాలి.
సూర్యనమస్కారాల క్రమం.
- నిలబడి చేతులు నమస్కారం చెబుతున్నట్టు పెట్టాలి. సూర్యనమస్కారాలు మొత్తం కళ్ళు తెరచి చేయాలి. చెప్పవలసిన మంత్రం చెప్పాలి.
- శ్వాస లోపలికి తీసుకుంటూ నెమ్మదిగా చక్కగా చేతులు పైకెత్తి వెనక్కి ఎంత వంగ గలిగితే అంత వంగాలి.
- శ్వాస వదులుతూ ముందుకు వంగి చేతులు కాళ్ళకి రెండు పక్కలా పెట్టాలి. నుదురు భాగం మోకాళ్ళు దగ్గరకి రావాలి. సులభంగా చేయటానికి మోకాళ్ళని కొద్దిగా వంచవచ్చు.
- శ్వాస లోపలికి తీసుకుంటూ కుడి పాదాన్ని వెనుకకి ఎంత వరకూ పెట్టగలరో అంత వరకు పెట్టాలి. పైకి చూడాలి.
- శ్వాసని పట్టి ఉంచి ఎడమ పాదాన్ని కూడా వెనక్కి పెట్టాలి. ఒక బల్లలా మెడ, తల, వెన్నెముక, ఒక గీతలా ఉండాలి. చేతులు భుజాలకి కింద ఉండాలి. కళ్ళు కిందకి నేల వైపు చూడాలి.
- శ్వాస వదులుతూ, మోకాళ్ళు, ఛాతీ, గడ్డం నేలని తాకుతూ ఉండేలా చేసి, సాష్టాంగనమస్కారంలా, ఉండాలి. పొట్ట భాగం నేలకి తగలకూడదు.
- శ్వాస లోపలికి తీసుకుంటూ, కాలివేళ్ళని బయటకి పెట్టి, పొట్ట భాగం నేలకి అనిచి ఛాతీ తల పైకి పెట్టాలి. భుజంగాసనం. 8. శ్వాస వదులుతూ చేతులు, కాళ్ళు నేల పైకి పెట్టి నడుం భాగం పైకి లేపాలి. అధోముఖశ్వానాసనం, వేళ్ళు వెడల్పుగా పెట్టండి. కాలి మడమలు నేలను తగిలే విధంగా ప్రయత్నించండి.
9. ముందుకి చూస్తూ కుడి కాలు ముందుకి ఎంత వరకూ పెట్టగలిగితే అంత వరకూ పెట్టండి. చేతుల మధ్యకి వచ్చే విధంగా చూడండి.
10. ఎడమ పాదం ముందుకి కుడి పాదంతో సమానంగా పెట్టి, అవసరమైతే మోకాళ్ళు కొంచెం వంచండి. శ్వాస వదులుతూ తలని కాళ్ళ దగ్గరకి తీసుకురండి.
11. శ్వాస తీసుకుంటూ చేతులు వెనక్కి పెట్టి వెన్నెముకని వెనక్కి విల్లులా వంచండి.
12. శ్వాస వదులుతూ చేతులు కిందికి తెచ్చి, మీ హృదయం దగ్గర కలిపి ఉంచి, నమస్కరిస్తున్నట్టుగా నిలబడండి.
ఒక్కొక్క పర్యాయం చేసినప్పుడు దానిలో మొత్తం ఈ 12 ఆసనాలూ రెండుసార్లు చేస్తే అది ఒక ఆవృతమవుతుంది. మొదటి అర్ధభాగంలో నాలుగు, తొమ్మిది దశలు చేసేటప్పుడు కుడికాలు ముందుకి పెట్టండి. తరువాత సగ భాగంలో ఎడమకాలు ముందుకి పెట్టండి.
ఆనందధ్యానం
నిత్యధ్యానం అనేది సాంకేతికసూత్రం లాంటిది. ఇది ఒక వ్యక్తిలో సంపూర్ణమైన మార్పుని తెచ్చి వారిని జ్ఞానోదయానికి సిద్ధం చేస్తుంది. ఈ ధ్యానంలోని ప్రతి దశాచేతనస్థితిని ఉన్నతస్థితికి తీసుకువెళ్ళేలా చేస్తుంది. నిత్యానందానికి ఇది ప్రతి రోజూ చేయదగిన ధ్యానపద్ధతి.
నిత్యధ్యానం - వివరణ
నిత్యధ్యానంలో మొత్తం ఐదు దశలు ఉంటాయి. ఒక్కొక్కటి ఏడు నిమిషాల వ్యవధిలో ఉంటాయి. మిగిలిన వివరాలకి నిత్యధ్యానం అనే అధ్యాయాన్ని చూడండి.
ఆనంద ఉపకరణాలు
శాస్త్రశస్త్రాలు లేదా జ్ఞానాయుధాలు.
ధ్యానం
ప్రతి రోజూ ఒక అర గంట, జ్ఞానోదయమైన గురువులు రచించిన పుస్తకాలు చదవండి లేదా వారి ప్రవచనాలు వినండి. గురుదేవుల మాటలు శాస్త్రాలు - అవి అంతిమజ్ఞానం, అంతిమసత్యాలు. అజ్ఞానాన్ని నరకగల ఆయుధాలే శాస్త్రాలు. ఎప్పుడైతే పదాలు ఆయుధాలుగా మారి అజ్ఞానాన్ని నాశనం చేస్తాయో వాటిని శాస్త్ర - శస్త్రాలు అంటారు. అవే జ్ఞానాయుధాలు. గురుదేవుల మాటలు శాస్త్ర - శస్త్రాలు. అవి సూటిగా అజ్ఞానాన్ని నాశనం చేస్తాయి. గురువులు నిరంతరం సత్యాలు చెబుతూ ఉంటారు. అకస్మాత్తుగా ఒక భావం, ఒక సత్యం మిమ్మల్ని స్పృశిస్తుంది. మీకు క్లిక్ అవుతుంది. అది మిమ్మల్ని నిరాశ నుంచి బయటకి తీసుకు వస్తుంది. ఏదో ఒక సమస్యకి పరిష్కారాన్ని ఇస్తుంది. అదే క్లిక్, దాన్నే దీక్ష అంటాను. ఏ వ్యక్తి అయితే తన మాటల ద్వారా, పద్ధతుల ద్వారా, శరీరం కదలికల ద్వారా ఆ జ్ఞానాయుధాల్ని ఇవ్వగలరో ఆయనే గురువు. ఎవరైతే ఆ జ్ఞానాయుధాల్ని గురుదేవుల ద్వారా తీసుకుంటారో వారే దీక్ష పొందిన వారు.
గురువులు అంటే తమలో పొందిన అంతిమానుభవాన్ని ఇతరుల్లో కలిగించగల సాంకేతికసూత్రాల్ని సృష్టించగల వ్యక్తి. దీక్ష ఒక పద్ధతి. జ్ఞానాయుధాలు మన చేతనస్థితిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళ గల పద్ధతులు. జ్ఞానాయుధాలు మన లోపల స్థిరపడితే అవే మన అంతరంగగురువు. మన అంతరంగంలోని గురువు మేల్కొనే వరకూ బయటి ప్రపంచ గురువు మన మీద పని చేస్తుంటాడు. ఆయన తన మాటలు, పద్ధతులు, శరీరభాష - వీటి ద్వారా ఆ జ్ఞానాన్ని ఉపయోగించగలం అనే నమ్మకాన్ని మనలో కలిగిస్తారు. వీటన్నింటి కంటే కూడా జ్ఞానోదయజీవితాన్ని అందిస్తారు.
జ్ఞానోదయమైన గురువుల నుంచి అటువంటి క్లిక్స్, అటువంటి దీక్షలు పొందిన వారు అదృష్టవంతులు. ఆ క్లిక్ తార్కికమైంది కాదు. అకస్మాత్తుగా గురువులు చెప్పిన కొన్ని మాటలు హృదయాన్ని స్పృశిస్తాయి. ఎప్పుడైతే మొదటిసారి అటువంటి అనుభవం కలుగుతుందో అప్పుడు, అవును, ఈయన నా గురువు ఇదే నా మార్గం, అని అనిపిస్తుంది. అందుకే క్లిక్ అనేది మొదటి దీక్ష. ఎవరైతే గురుదేవుల మాటలు, పుస్తకాలు, బోధనలు, దీవెనలు, పద్ధతులు, శక్తి లేదా శరీర భాష ద్వారా ఆ క్లిక్ ని పొందుతారో వారు అదృష్టవంతులు.
ఒక విషయం అర్థం చేసుకోండి. విత్తనం పగలటానికి ఎప్పుడూ భయపడుతుంది. కాని ఏ విత్తనం అయితే పగిలి మొలకెత్తుతుందో అది మాత్రమే వృక్షంగా మారగలుగుతుంది. అప్పుడు ఆ వృక్షం మిగిలిన విత్తనాలకి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. భయపడవద్దు, పగలటం వల్ల మీరు చనిపోరు మీరు జీవిస్తారు, నా లాగా మరింత విస్తృతం అవుతారు అని. అయితే విత్తనం మొలకెత్తే వరకూ వృక్షం అలా ఎదురు చూస్తుంది. అందులోని విత్తనం పగిలి మొలకెత్తే వరకూ చూస్తుంది. అదే సమస్య. నేను చెబుతున్న సత్యం నాకు తెలుసు. ఓ! అమృతస్య పుత్రులారా! విత్తనాన్ని పగలకొట్టి మొలకెత్తి వృక్షంలా మారగల ధైర్యాన్ని పొందండి. ఆ ధైర్యంతో మరింత విస్తృతమవండి.
ఈ శక్తి ఈ ప్రేరణనే గురుదేవులు. మీ జీవితంలోనికి గురుదేవుల ఆగమనమే గొప్ప సాహసం. ఒకసారి గురువు మీ అంతరంగంలోకి ప్రవేశిస్తే, మీరు చేయవలసింది కేవలం నమ్మకంతో ధైర్యంతో, విశ్వాసంతో లేచి నిలబడగలగటమే.
మీ జీవితంలో ఏర్పడిన క్లిక్‌ని పదే పదే ఉపయోగించండి. ఏ ఆయుధాన్ని అయినా చాలా కాలం ఉపయోగించకుండా ఉంచితే అది తన శక్తిని పోగొట్టుకుంటుంది. మనం దాన్ని ఎలా ఉపయోగించాలో మరచిపోతాం. ఆ ఆయుధాల్ని ఉపయోగించే కొద్దీ అది మీలోకి స్పష్టతని, ధైర్యాన్ని తీసుకువస్తాయి. అప్పుడు వాటిని చక్కగా ఉపయోగించగలిగే వివేకం మీలో కలుగుతుంది.
గురుదేవుల మాటలని పదే పదే వింటూ మీ జీవితంలోనికి మరిన్ని క్లిక్స్‌ని తెచ్చుకోండి. వాటిని మీ అంతరంగంలో నింపుకోండి. మీకు నిరంతరం ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చే ఆధ్యాత్మికకుటుంబాన్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని ఏర్పరచుకోండి. ఆ ధైర్యంతో జ్ఞానాయుధాల్ని చక్కగా ఉపయోగించండి.
మరొక విషయం, గురుదేవుల మాటల్ని వినేటప్పుడు జ్ఞానోదయమైన యోగీశ్వరుని శరీరభాషని గమనిస్తాం. ఒక వ్యక్తి శరీర భాష అతనిలోని సత్యాన్ని, సంపూర్ణత్వాన్ని వెల్లడి చేస్తుంది. గురుదేవులు అంటేనే అంతిమవిశ్వసత్యం, సర్వాంతర్యామి రూపం. అందుకే అతని శరీరభాష సర్వాంతర్యామి భాష. ఆయనని గమనించటం ద్వారా మన తర్కానికి అందని అంతిమసత్యం మన మీద పనిచేస్తుంది.
ఆనందశక్తి విశ్వశక్తిని పొందటం - శక్తిధారణ
ఈ ధ్యానపద్ధతిని తంత్రశాస్త్రం నుంచి, కులార్ణవతంత్రం (శివుడు ప్రవచించిన అతిప్రాచీనసాహిత్యం) నుంచి తీసుకొన్నారు. విశ్వశక్తికి సంబంధించి ఇది చాలా చక్కని ధ్యానపద్ధతి. దీన్ని రాత్రి పూట నిద్ర పోయే ముందు చేయాలి. దీన్ని ఉదయం కూడా చేయవచ్చు. కాని ఈ ధ్యానం చేసాక కనీసం పదిహేను నిమిషాలు విశ్రాంతి కావాలి. లేకపోతే మత్తుగా ఉంటుంది. ఈ ధ్యానం మీరు విశ్వశక్తిలో ఐక్యమవ్వగల స్థితికి తీసుకువెళుతుంది. ఇది మిమ్ముల్ని తురీయ దశకి తీసుకువెళుతుంది. అక్కడ మీరు పూర్తి తెలుసుకునే తత్వంతో ఆలోచనలు లేని స్థితిలో ఉండగలుగుతారు.

ధ్యానపద్ధతి
మోకాళ్ళ మీద నిలబడి కళ్ళు మూసుకొని చేతులు పైకి పెట్టాలి. అరచేతులు ఆకాశం వైపు ఉండాలి. తలని కొంచెం పైకి పెట్టాలి. ఈ స్థితిలో ఉండి విశ్వశక్తి మీ నుండి ప్రవహించటాన్ని అనుభూతి పొందండి. కాంతిరేఖ మీ నుండి వెళ్ళే దృశ్యాన్ని చూడండి. ప్రారంభంలో నవ్వు ముఖంతో ఉన్న గురుదేవుల రూపాన్ని చూడవచ్చు. పిసినారి డబ్బు లెక్కపెట్టుకున్నప్పుడు ఆ స్థితిలో ఎంత శిఖరాగ్రాన ఉంటాడో, ప్రేమికుడు ప్రియురాలితో ఉన్నప్పుడు ఆ స్థితిలో ఎంత శిఖరాగ్రాన ఉంటాడో, గురుదేవులు నవ్వేటప్పుడు ఆయన శక్తి అంత శిఖరాగ్రాన ఉంటుంది. అందుకే ఆయన నవ్వు ముఖాన్ని మీ అంతరంగంలో నింపుకొని శక్తి మీలో ప్రవహించే విధంగా చేయండి. అంతే కాకుండా ఆ సమయంలో గురుదేవుల గురించి మాత్రమే ఆలోచించగలిగితే మరే ఆలోచనలూ రావు.
విశ్వశక్తి మీ చేతుల గుండా ప్రవహించినప్పుడు, మీకు సూక్ష్మస్థాయిలో ప్రకంపనల రూపంలో తెలుస్తుంది. అది చిరుగాలికి ఆకు నాట్యం చేసినంత సున్నితంగా ఉంటుంది. ఆ ప్రకంపనని ఆ విధంగా జరగనీయండి. ఆ ప్రకంపనకి సహాయం చేయండి. మీ శరీరంలో మొత్తం శక్తి ప్రకంపనలతో నిండనీయండి. ఏది జరిగితే దాన్ని జరగనీయండి. మీ కింది భూమి, పైన ఆకాశం కలిసిపోయినట్టుగా అనిపించవచ్చు. అది స్త్రీపురుషశక్తులు కలిసిపోయినట్టుగా ఉంటుంది. మీరు తేలిపోతున్నట్టు కరిగిపోతున్నట్టు మీకు అనిపించవచ్చు. ఆ భావాన్ని అదే విధంగా జరగనీయండి. మీరు అనే భావాన్ని పూర్తిగా వదిలేయండి. మీరు అనేది ఉండదు. మీరు సర్వాంతర్యామిలో ఒకటిగా ఐక్యమైపోతారు.

రెండు - మూడు నిమిషాల తరువాత, మీ అంతరంగం విశ్వశక్తితో నింపబడినట్టు అనిపించగానే ముందుకి వంగి చేతులు నేలమీద అనించండి. మోచేతుల నుంచి భూమిని అనాలి. భూమిని ముద్దాడండి. లేదా మీ నుదురు భూమికి తగిలేలా చేయండి. మీ నుంచి విశ్వశక్తి భూశక్తితో కలిసే విధంగా మీరు ఒక మధ్యవర్తిగా, ఒక ఉపకరణంలా ఉండండి. మీలోపలి శక్తినంతా భూమాతలో కలిసే విధంగా ఉండండి. ఇప్పుడు మీరు గురుదేవుల పాదాలని ఊహించవచ్చు. అప్పుడు మీరు భూమాతకి అధీనమై శక్తిని ఇస్తున్నట్టుగా ఉంటుంది.
మళ్ళా తిరిగి మామూలు స్థితికి రండి. ఈ క్రమాన్ని మరో ఆరుసార్లు చేయండి. అంటే మొత్తం ఏడుసార్లు ఆ విధంగా చేస్తారు.
ఈ ధ్యానం మీ శరీరంలో శక్తి బాగా ప్రవహించేలా చేస్తుంది. ఈ ధ్యానంతో వెన్నెముక సంబంధమైన సమస్యలన్నీ పోతాయి. ఎందుకంటే శక్తి మూలాధారం వరకూ వెళుతుంది కాబట్టి. ధ్యానం చేయటం పూర్తి అయ్యాక అదే ధ్యానస్థితిలో నిద్రలోకి వెళ్ళండి. అప్పుడు మీకు కలలు లేని గాఢ నిద్ర కలుగుతుంది. మర్నాడు ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, చైతన్యంతో ఉంటారు. ఇది చాలా శక్తివంతమైన ధ్యానపద్ధతి. దీన్ని ప్రతి రోజూ చేస్తే కొత్త జీవితం, కొత్త అర్థం, కొత్త సత్యం మీలో ప్రవహిస్తాయి. మీరు ఆనందంగా ఉంటారు. ప్రతి రోజూ ఒక ఉత్సవంలా ఉంటుంది.
ఆనందజపం
– ఆనందజపం లేదా పురశ్చరణం
మంత్రాలని వేదభాష అయిన సంస్కృతంలో జపిస్తాం. సంస్కృతభాషలోని అందం ఏమిటంటే అన్ని రకాల శబ్దాలూ దానిలోని ఏభై ఒక్క అక్షరాలలో వివరించబడ్డాయి. సంస్కృతభాష అర్థాన్ని చెప్పటమే కాదు, అది ఒక ప్రత్యేకమైన శబ్దతరంగాన్ని పంపిస్తుంది. మీరు మంత్రాల్ని అర్థం చేసుకోలేకపోయినా వాటి తరంగాలు మీ మీద పని చేస్తాయి. తూర్పుదేశాల్లో దీక్షని ఇవ్వటానికి సంస్కృత మంత్రాలనే ఉపయోగిస్తారు. గురువుగారు శిష్యునికి మంత్రం చెప్పగానే ఆ మంత్రమే శిష్యునిలో దీక్షని మేల్కొలుపుతుంది. ఆ తరంగాలు సూటిగా వెళ్ళి అతని అంతరంగాన్ని స్పృశించి అక్కడ పని చేయటం ప్రారంభిస్తాయి.
గురుమంత్రం: ఓం హ్రీం నిత్యానందాయ నమః
హిందూతత్వంలో ప్రతి పనీకీ చాలా స్థితుల్లో అర్థంచేసుకోవటం అనేది ఉంటుంది. వారి వారి చేతనస్థితి ఆధారంగా ఆయా స్థితుల్లో అర్థం చేసుకుంటారు. 'ఓం' అంటే చాలా అర్థాలు ఉన్నాయి.
'ఓం' ప్రాథమిక శబ్దం, సమస్తసృష్టి దీని నుంచి ఉద్భవించింది అంటారు. అ, ఉ, మ్, అనే శబ్దాల కలయిక ఓం. అ అంటే బ్రహ్మ, సృష్టికర్త. ఉ అంటే విష్ణుమూర్తి స్థితికారుడు (పాలకుడు), మ్ అంటే శివుడు కొత్త సృష్టికి అవకాశం ఇచ్చేలా నాశనం చేసే లయకారుడు. అందుకే ఇవన్నీ కలిసిన ఓం అంటే విశ్వం అని అర్థం.
లోతుగా విశ్లేషిస్తే దేవుని రూపాలన్నీ, సృష్టి, స్థితి, లయకారాలకి ప్రతినిధులు. ఈ మూడు మన శరీరం అంతరంగం అనే సూక్ష్మ విశ్వంలో ప్రతి కణంలోనూ జరుగుతుంటాయి.
ఓం అని జపించినప్పుడు భూప్రదక్షిణలా ఉంటుంది. అది మనలోని కోపం, కోరిక ఇటువంటి వాటికి కొన్ని మానసికసమస్యల్ని పరిష్కరిస్తుంది. అనంతమైన భూమాత మనలో నిండిన అనుభూతినిస్తుంది. వ్యతిరేకాలోచనల నుంచి మనస్సుని బయటికి తెస్తుంది. ఇది అంతు లేని శక్తిని ఇచ్చి, మెదడుని తాజాగా స్వచ్ఛంగా ఉంచుతుంది. ఇది మానసికప్రశాంతతని ఇస్తుంది. ఏకాగ్రతని పెంచుతుంది. మనస్సుని వదలి ఆత్మలోకి వెళ్ళటానికి ఇది జంపింగ్ బోర్డు. హ్రీం అంటే దేవి బీజ మంత్రం.
ప్రాచీనఋషులు ఈ శబ్దాలని సాధన చేస్తూ మానసిక, శారీరక, అంతరంగస్థాయిల్లో లోతైన అనుభవాల్ని పొందారు. అందరూ తాము పొందిన అనుభవాన్ని పొందాలి అనే ఉద్దేశంతో వీటిని శాస్త్రీయంగా వివరిస్తూ మనకి అందించారు. వేదకాలం నుంచి మంత్రోచ్చరణ అనేది ఋషుల పరిశోధనసిద్ధాంతాల వంటివి. మనుషుల మీద ఉన్న అపారమైన ప్రేమతో వారిలో కలిగిన అనుభవాన్ని అందరిలో కలిగించాలని వారు మనకి ఈ శాస్త్రాల్ని అందించారు.
ఓం హ్రీం కలిపి ఉచ్చరిస్తే, మనలోని స్త్రీపురుషశక్తులు రెండూ చైతన్యమవుతాయి.
నిత్యానంద అంటే అంతిమసత్యం తాలూకు రూపమైన గురుదేవులని మనలోకి ఆవాహన చేయటం, ఇది పూర్ణమూలమంత్రం. ఇది శక్తి అంటే బయటి ప్రపంచంలో విజయానికి, శివ అంటే అంతరంగప్రపంచంలో విజయమైన జ్ఞానోదయానికి సూటిగా తీసుకువెళుతుంది.
నిత్యానంద అంటే శాశ్వత ఆనందస్థితి. దీన్ని జపించటం ద్వారా మన ఆత్మకి మన చివరి కోరిక అయిన జ్ఞానోదయం గురించి చెప్పటమే.
నమః : అంటే నేను లేను అని అర్థం. నమః, నేను లేను అని చెప్పటం ద్వారా సర్వాంతర్యామికి, సర్వాంతర్యామి రూపమైన గురుదేవులకి సంపూర్ణంగా అధీనమవుతున్నాను అని చెప్పటమే. నమః అని పదే పదే జపిస్తే అధీనమయ్యే అనుభవాన్ని బలంగా చేస్తుంది. నమ్రతని, విధేయతని మనలోకి తీసుకువస్తుంది.
ధ్యానపద్ధతి
గురుమంత్రాన్ని ఏభైనాలుగుసార్లు పడకొండు రోజులపాటు జపించండి. లేదా మీకు గుర్తు వచ్చినప్పుడు జపించండి. గురుమంత్రాన్ని గట్టిగా బయటికి జపించండి లేదా నిశ్శబ్దంగా మనస్సులో జపించండి. జపవేగం మనిషి మనిషికీ మారుతుంది.
ఈ మంత్రం మీ అంతరంగాన్ని శక్తితో నింపి, మీకు అనవసరమైన ఆలోచనలు రాకుండా చేస్తుంది. ఆలోచనలు నాభిప్రాంతంలోని మణిపూరకచక్రం నుంచి వస్తాయి. మీరు గురుమంత్రాన్ని జపిస్తే మణిపూరకం శుభ్రపడుతుంది. అది ఆటోమాటిక్‌గా మీ బాధల్ని తొలగిస్తుంది. మీలోని వ్యతిరేకభావాల్ని, ఆలోచల్ని తొలగిస్తుంది.
గురుమంత్రం మీ వాక్కుతిని శుభ్రపరచి స్వచ్ఛంగా చేస్తుంది. అది మీలో అంతు లేని శక్తి పొంగి పొర్లేలా చేసి, జీవితాన్ని ఉత్సాహంగా ఆహ్లాదంగా చేస్తుంది. ఈ మంత్రంలోని ప్రకంపనలు మీ అంతరంగం వేగాన్ని మారుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం మీ ఎరుకని మంత్రం పైన ఉంచాలి. అలా మీ చేతనస్థితిలో ఉంచితే మీ ఆలోచనల వ్యవస్థ మొత్తం స్వచ్ఛంగా అవుతుంది. క్రమంగా మీ ప్రయత్నం లేకుండా మంత్రోచ్ఛారణ మీలో జరుగుతూ ఉంటుంది. మీరు చాలా సహజంగా ధ్యానస్థితిలోకి వెళ్ళగలుగుతారు.
ఒక పద్ధతిలో ఈ మంత్రాన్ని జపిస్తే అది ప్రార్థన అవుతుంది. ప్రార్థన మన శరీర, మానసికవ్యవస్థల మీద లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది అని వైద్యపరిశోధనలు నిరూపించాయి. అమెరికాలోని పరిశోధనలు, ప్రార్థన, గుండెపోటు, క్యాన్సర్ మొదలైన వ్యాధుల ద్వారా సంభవించే మరణాల్ని నలభై శాతం తగ్గించిందని నిరూపించాయి. అదే విధంగా గుండె ఆపరేషన్స్ జరిగాక 14 రెట్లు జీవించే అవకాశాన్ని పెంచింది ప్రార్థన. అలాగే హాస్పిటల్ లో చేరే పెద్దవారి సంఖ్య తగ్గింది. వెబ్ సైట్ లో ప్రార్థన వలన కలిగిన మంచి ఫలితాల్ని చాలా వివరంగా చూపించారు.
- నవ్వు ఆరోగ్యంలోంచి పుడుతుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అది పొంగి ప్రవహించే శక్తి.
- సూర్యనమస్కారాలు శరీరమేధని మేల్కొలిపి, శరీరం సూర్యుని నుంచి నేరుగా శక్తిని గ్రహించే విధంగా చేస్తాయి.
- గురువులు అంటే తమలో పొందిన అంతిమానుభవాన్ని ఇతరుల్లో కలిగించగల సాంకేతికసూత్రాల్ని సృష్టించగల వ్యక్తి.
- విత్తనం పగలటానికి ఎప్పుడూ భయపడుతుంది. కాని ఏ విత్తనం అయితే పగిలి మొలకెత్తుతుందో అది మాత్రమే వృక్షంగా మారగలుగుతుంది.