సంతోషంగా పంచుకోవడం
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
చికిత్సానుభవాలు
చికిత్స
1. హెపటైటిస్ బి. వ్యాధిసోకి నేను బాధపడుతుండేవాణ్ణి. అది కాలేయానికి సంబంధించిన తిరుగులేని వ్యాధిగా భావిస్తారు. ఆసుపత్రులన్నీ లాభం లేదని చెప్పేసాయి. కేవలం ద్రవపదార్థాలనే ఆహారంగా స్వీకరిస్తూ ఆరు సంవత్సరాలు పడివుండి, మృత్యువు చుట్టుపక్కలనే కాచుకొని ఉందని తెలుసుకున్నాను.
నా మిత్రుని సలహా మేరకు నేను నిత్యానందగారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు వారు దక్షిణభారతదేశంలోని తమిళనాడులోని ఈరోడులో ఉన్నారు. తనను దర్శించిన ప్రజలకు చికిత్స చేస్తూ ఉన్నారు. వారు కొంత పవిత్రభస్మాన్ని నాకిచ్చారు. దాన్ని మూడు రోజుల వరకు నేను స్వీకరించే అన్నపానీయాల్లో కలపమన్నారు. వారి సూచనని నేను అనుసరించాను. మూడవరోజునే నా ఉదరం ఆరు సంవత్సరాల తరువాత నెమ్మదిగా ఉన్నట్లు భావించాను. ఆరు సంవత్సరాల సుదీర్ఘకాలం తరువాత నేను మొదటిసారిగా వారి ఆదేశానుసారంగా మసాలాలు కలిపిన ఆహారాన్ని స్వీకరించాను. అప్పట్నుంచి నేను ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. నా ఆధ్యాత్మిక గురువుకి సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను.
- శ్రీ నిత్యసదానంద నిత్యానంద పరంపరలో సీనియర్ స్వామి. ([email protected])
2. నేను పోలిసిస్టిక్ ఒవారియన్ సిండ్రోమ్ (PCOS) తో బాధపడుతున్నట్లుగా వ్యాధి నిర్ధారణ జరిగింది. అది తీవ్రమైన హార్మోన్ల సమస్యలకు కారణమయ్యింది. అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా అది కనుక్కోబడింది. నా అండకోశములో పెద్ద కంతులతో కప్పబడినట్లుగా తెలిసింది. నేను నిత్యానందులవారి ఒక ధ్యానసంబంధ కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను నా సమస్యని వారికి చెప్పకముందే వారు నాకు చికిత్స చేయబడుతుందని చెప్పారు.
సుమారు నెల తరువాత, నేను ముప్పయి పౌండ్ల బరువుని కోల్పోయినట్లు తెలుసుకున్నాను. రెండు వందల పౌండ్ల బరువుని ఆహారపానీయాలద్వారా, వ్యాయామం ద్వారా ప్రయత్నం చేసి కూడా తగ్గించుకోలేకపోయాను. నా బరువు ఎంత భావోద్వేగంతో కూడుకొని వుందో నేను తెలుసుకున్నాను. అలవాట్లు మన భావనల్ని తృప్తి పరుస్తాయనుకుంటాం కాని అలాజరగదు. సుమారు ఒక సంవత్సరం తరువాత నేను అల్ట్రాసౌండ్ చెకప్ కి వెళ్లినప్పుడు. నాలో వున్న కంతులన్నీ మాయమైనట్లు తెలుసుకున్న డాక్టర్లు ఆశ్చర్యచకితులైనారు.
– రోషిని నంబియార్
ఓక్లహామా, యుఎస్ఎ.
([email protected])
3. నా అత్తమామలు నన్ను చూడటానికి సింగపూర్ వచ్చినప్పుడు వాళ్లు మలేసియా లోని ట్రైయోమన్ ఐలాండ్స్ ని చూడ్డానికి వెళ్లారు. వాళ్లు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వారిద్దరి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. సముద్రతీర వాతావరణం వారికి సరిపడలేదు. సముద్రపు నీటిలో ఈదులాడుతున్నప్పుడు వాళ్లు సముద్రపునీటిని పెద్ద మొత్తంలో తాగడం జరిగింది. తిరిగి వచ్చిన తరువాత కూడా వాళ్లు తీవ్ర ఆందోళనకి గురయ్యారు. మామగారు తీవ్రమైన జ్వరంతో వణికిపోసాగారు. నేనాయనకు పడుకోమని నిత్యా ఆధ్యాత్మిక చికిత్సను చేశాను. పదినిమిషాల్లో ఆయన గాఢనిద్రలోకి జారుకున్నారు. మరునాడు ఉదయం, ఏమీ జరగనట్టు మామూలుగా నిద్రలేచారు.
శ్రీ నిత్యానంద అర్పణ, నిత్యాస్పిరిచువల్ హీలర్, మలేసియా. ([email protected])
4. నా అమెరికన్ మిత్రరాలు ఒకామె, తను చాలాకాలంగా, మానసిక భావోద్వేగంతో బాధపడుతున్నాననీ, తరచూ దానికి లోనవుతుంటానని చెప్పింది. నిత్యా ఆధ్యాత్మిక చికిత్స, మానసిక సమస్యలకూ పనిచేస్తుందా అనుకుంది. ఆ చికిత్సాశక్తి అన్ని స్థాయిల్లోనూ ఎలా పని చేస్తుందో నేనామెకు వివరించాను. తరువాత పావుగంటపాటు ఆమెకు చికిత్స చేశాను. మరునాడామె, నాకు ఫోన్ చేసి, చికిత్స చేస్తున్న సమయంలోనూ, తరువాత, తనకెంతో ప్రశాంతంగా తేలికగా అనిపించిందనీ, నాలుగేళ్ల తరువాత, ఎంతో హాయిగా క్రితం రాత్రిని పోగలిగాననీ చెప్పింది. ఆమెలోని ఆ భావోద్వేగానికి కారణం. ఆమె జీవితంలో ఒకానొక దుర్ఘటన జరగడమే!
ప్రేమేశ్వరి, నిత్యా ఆధ్యాత్మిక చికిత్సకురాలు, మిచిబిగన్, యుఎస్ఎ. ([email protected])
5. నేను స్త్రీ రోగ నిపుణురాలిని. పరమహంస నిత్యానందులవారి స్పర్శతో నా దగ్గరికి వచ్చే రోగులెందరో అద్భుతానుభవాలు పొందారు. ఇటీవలే నా దగ్గరికి వచ్చిన ఒకామె, ట్యూబర్కులోసిస్తో బాధపడుతోంది. ఆమె గర్భాశయం లోపలి పొర పలుచబడి, గర్భకోశం పొర అంతా బాగా దెబ్బతిన్నది. మేమెన్నో రకాల వైద్యాలు చేసినా ఏవీ పని చేయలేదు. సర్రోగేట్ మదర్‌ను సూచిద్దామని అందరమూ అనుకుంటున్న తరుణంలో, నేనామెకు, పరమహంసవారితో చికిత్స పొందమని సలహా ఇచ్చాను. ఆమె అలాగేవెళ్లి ఆయన చేత చికిత్స చేయించుకుని, సంతానవతి అయ్యే భాగ్యాన్ని దీవెనగా పొందింది. ఆమె గర్భవతి అయి, మామూలుగా ప్రసవించడం, వైద్య చరిత్రలోనే అద్భుతం!
డాక్టర్ నిర్మల, గైనకాలజిస్ట్, అడ్వాన్స్డ్ ఫెర్టిలిటీ, సెంటర్, బెంగుళూరు. ([email protected])
ధ్యానకార్యక్రమాలు
1. నా ఎంఎన్‌సి కార్పొరేట్ కెరీర్లో నాకొక గొప్ప స్థానం ఉంది. నేను ఎన్నో సంస్థలు నడిపించి, కోట్లతో వ్యాపారాలు చేస్తూ నా స్వప్నాలు సాకారం చేసుకోసాగాను. కాని నాకెప్పుడూ సంతృప్తి కలగలేదు. నిత్యానందస్వామి దర్శనం తరువాత, బయటి ప్రపంచంలో విజయాలు సాధించడంతోపాటు లోపలి ప్రపంచంలో విజయవంతం కావడంమూ నేర్చుకున్నాను.
రామ్ ఎస్.రామ్, వ్యాపారవేత్త,
సింగపూర్.
([email protected])
2. ఐదేళ్లక్రితం నేనొక పెద్ద సంస్థకు ఉపాధ్యక్షుణ్ణి. 32 ఏళ్లకే నాకు మధుమేహం వచ్చింది. నా తల్లిదండ్రుల కుటుంబాల్లో చాలామందికి ఈ వ్యాధి ఉండేదట. నేనొక సందర్భంలో పరమహంసను కలిసినప్పుడు, ఈ సమస్య గురించి చెప్పాను. ఇది జరిగి నాలుగున్నరేళ్లయింది. నేటి వరకూ నా రక్తంలో చక్కెరస్థాయి మామూలు గానే ఉంది నేనెటువంటి ఆహారపు అలవాట్లూ మార్చుకోనప్పటికీ. వ్యాధి లక్షణాలు కూడా కనబడలేదు.
నేనొక అడ్వాన్స్డ్ ధ్యాన కార్యక్రమానికి, పరమహంసతో పాటు హాజరయ్యాను. అందులోని ఒక అంశం, మేము జ్ఞానానందంతో ఎందుకు జీవించలేకపోతున్నామో అందరూ చెప్పాలి. ఆ మాటలు చెప్పగానే మాలోని భయం తొలగిపోయింది. ఆక్షణంలో ఒక బలమైన రసమేదో భౌతికంకాని కాల్పనిక సమతలంలో ప్రవహించి నట్లయింది! మేము చెబుతున్న ప్రతిమాటనూ, పరమహంస సృష్టించిన అగ్నిలో శాశ్వతంగా కాలిపోయినట్లు అనుభూతి చెందాం. ఇప్పుడు నాలో ఎటువంటి భావాత్మక అసంతులనమూ లేదు. నేను అన్ని రంగాల్లోనూ ఆనందంగానూ, నిమగ్నతతో పనిచేయగలుగుతున్నాను. నేను చెప్పగలిగేదల్లా, స్వామి ప్రేమునూ, సానుభూతినీ మాపై వర్షించి, మేము పునర్జన్మించేలా చేశారని!
శ్రీ నిత్యసచ్ఛిదానంద, అంతర్జాతీయ సంవిధానకర్త, సీనియర్, స్వామి, నిత్యానంద ఆర్డర్, లాస్ ఎంజెలిస్, యుఎస్ఎ. ([email protected])
3. కష్టం లేకుండా పనిచేయడం అనేది నేనెప్పుడూ ఊహించనిది. పరమహంస ధ్యానకార్యక్రమాల్లో పనిలోని ఆనందాన్ని తెలుసుకున్నాను. అటుపైన సులువుగా ఫలితాలు సాధించగలుగుతున్నాను. అదీ సృజనాత్మకతతోనూ, సంతృప్తిగానూ చేయగలుగుతున్నాను.
అపూర్వీషేథ్, మార్కెటింగ్ డైరెక్టర్,
సింగపూర్.
([email protected])
4. నిత్యానంద స్వామి నన్ను తొలిసారి తాకినప్పటినుంచీ నాశక్తిలో అద్భుతమైన పెరుగుదల ఏర్పడింది. నా వ్యాపారమూ వర్ధిల్లింది. వ్యాపారంలో నేను తీసుకునే నిర్ణయాలు కొత్త కోణాల్లో సాగుతున్నాయి. ఇంట్లోనూ, బయటా నా సంబంధాలు మెరుగయ్యాయి. మా అమ్మాయి బెంగుళూరులోని నిత్యానంద గురుకులంలో ఉంది. ఒక ఆత్మవిశ్వాసంగల, తెలివిగల, సంతృప్తి గల వ్యక్తిగా ఆమె ఎదుగుతున్నది.
చరణప్రియ, వ్యాపారవేత్త,
పాండిచ్చేరి.
([email protected])

అరుణాచల పర్వతమున్న తిరువణ్ణామలై పుణ్యక్షేత్రం


రఘుపతియోగి పరమహంసకు అనేక అతిమానుష మహిమలను చూపించినప్పటికీ ఇవేవీ అంతిమసత్యాన్ని చేరుకోవడానికి కానీ ఆధ్యాత్మిక వికాసానికి కానీ ఉపయోగపడవని కూడా బోధించారు.

యోగి రామ్‌సూరత్ కుమార్‌తో - ఒక ఆధ్యాత్మికబంధం. యోగి రామ్‌సూరత్ కుమార్ లేదా విసిరి స్వామిగళ్ జ్ఞానోదయం పొందిన గురువు. ఈయన తిరువణ్ణామలై భగవాన్ శ్రీరమణమహర్షి సమకాలికుడు. తిరువణ్ణామలైలో ఈయన సుప్రసిద్ధుడు, ప్రియతముడు. పరమహంస ఈయనను తరచుగా కలుస్తుంటారు.

చిన్న వయసునుండే నిత్యానంద ధ్యాన, యోగాలతో సహా అనేకరకాల ఆధ్యాత్మిక ప్రక్రియలలో నిమగ్నమయ్యారు.



మాతాజీ కుప్పమ్మాళ్ ఒక గొప్ప ప్రేరణ. అరుణాచలంలో పరమహంస ఆధ్యాత్మిక వికాసం జరుగుతూ వున్న తొలినాళ్లలో ఆయనకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వహించి ఆయన బాగోగులు చూసినవారు బ్రహ్మయోగిని విశుద్ధానంద దేవి మాతాజీ కుప్పమ్మాళ్. 12 ఏళ్ల లేతవయసులోనే పరమహంస లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతున్నప్పుడు భవిష్యత్తును ముందుగానే దర్శించిన కుప్పమ్మాళ్ ఆయన బాధ్యతలను తీసుకొని వివిధ ఆధ్యాత్మిక విధానాలలో ఆయనకు శిక్షణ ఇచ్చారు.
పరివ్రాజకుడై నిత్యానంద భారతదేశమంతా దర్శించనప్పటి దృశ్యం


జ్ఞానోదయం పొందాక... నిత్యానంద ధ్యానపీఠం ప్రారంభించేముందు
జ్ఞానకాంతులు విరజిమ్ముతూ...

అనుబంధం
పరమహంస నిత్యానందుల వారిని గురించి
భారతదేశానికి చెందిన గురువు పరమహంస నిత్యానందులు, ప్రతివ్యక్తిలోనూ ఆత్మసాక్షాత్కారం జరగాలనే ఉత్తమోద్దేశంతో పర్యటిస్తున్నారు. నిత్యజీవితంలోని బాధలు, చింతలు, మానసిక పరమైన ఒత్తిడులకు కచ్చితమైన పరిష్కారాలను ఈ 'జీవన్ముక్తి'తో సూచించవచ్చునంటారు, నిత్యానందులవారు. విశాల దృక్పథం, హాస్య స్ఫూర్తి, విషయ పరిజ్ఞానం, చెప్పగలిగే సమర్థత, వైదిక విషయాలను నిత్యజీవితంలో ఆనందకరంగా ఉపయోగించగలిగే నేర్పుతో ఆయన చేసే బోధలు, సాంఘిక, సాంస్కృతిక, భాషా, వయో, లింగ భేదాలను దాటి, దేశవిదేశాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
600కు పైగా నిత్యానందస్వామి ఉపన్యాసాలు (http://www.youtube.com/Life BlissFoundation)లో ఉచితంగా లభిస్తాయి. యూట్యూబ్ అధ్యయనంలో, యూట్యూబ్ వీక్షకులు పదిలక్షలకు పైగానే అత్యధికంగా చూస్తున్న స్వామి నిత్యానందులేనని తేలింది.
నిత్యానంద ధ్యానపీఠం (http://www.nithyananda.org) వేలాది కేంద్రాలలో ఏర్పడిన ఈ పీఠంలో ధ్యానం, హీలింగ్ ఉద్యమంలా జరుగుతాయి. ప్రతి ఒక్కరిలోనూ ఎరుక కలిగించి, మానవత్వం మేల్కొల్పటం ఈ పీఠం లక్ష్యం. 100 మిలియన్ల జనానికి చైతన్యపరచి ప్రత్యేక ధ్యాన విధానాలు నేర్పేందుకు పూనుకుంది పీఠం. దాన్ని 'నిత్యధ్యాన్' అంటారు. 100,000 జనానికి 'జీవన్ముక్తి' కలిగించడం దాని ఆశయాల్లో ఒకటి.
కార్యక్రమాలు, వర్క్ షాపులు
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జనానికి శరీరం, మనస్సు, ఆధ్యాత్మికపరంగా లాభదాయకంగా ఉండాలని ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలకు కొందరిని ఈ పీఠం ఎంపిక చేసుకుంది. వారు:
అంతశ్చైతన్యం
అంతరంగాన్ని మేలుకొలిపే ఈ కార్యక్రమం, వ్యక్తుల్లో మార్పు తీసుకువస్తుంది. 21 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం, మానవుణ్ణి ఇహం నుంచి పరానికి తీసుకుపోతుంది. ఇందులో గురువు సత్యాన్వేషకులకు దగ్గరుండి మరీ మార్గదర్శనం చేస్తారు. మరో విశేషం, ఈ కార్యక్రమం సందర్భంలో, బెంగుళూరులోని ఆశ్రమంలో 21 రోజులపాటు ఉంటే సదవకాశమూ కలుగుతుంది. స్వామి, “ప్రతి వారిలోనూ ఈ జీవన్ముక్తిని కలిగించడమే అంతశ్చైతన్యం. నా ప్రతికార్యక్రమమూ, మీకు, నాలోని ఒక కోణాన్ని, ఒక అంశాన్ని చూపుతుంది. ఉదాహరణకు, ఎల్బిపి” అనేది. ‘ఆనందంగా జీవించడం’ అనే అంశాన్ని చూపుతుంది. ఎన్ఎస్పి అనేది ‘మరణాన్ని ఆనందంగా స్వీకరించడం’ అనే అంశాన్ని చెబుతుంది. నిత్యయోగ కార్యక్రమం, ‘యోగశరీరాన్ని’ కలిగి ఉండడాన్ని వివరిస్తుంది. ప్రతి కార్యక్రమమూ, జీవన్ముక్తిలోని వేర్వేరు అంశాలను తెలుపుతుంది.
“ఒక్కొక్క కోణాన్నీ అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, ఒకస్ఫూర్తిని, మరింత లోతుల్లోకి వెళ్లడానికి ఒక ద్వారం తెరుచుకోవడాన్ని పొందుతారు. ఒక అనుభవం లేదా ఒక ద్వారం తెరుచుకోవడం జీవన్ముక్తి పూర్తిగా పొందేందుకు సరిపోదు. మరో స్ఫురణ కావాలనిపిస్తుంది.
“అంతశ్చైతన్యం సంపూర్ణమూ, సమగ్రమూ అయిన మార్గం - నిత్యానందం, నిత్యయోగ వంటిది. అన్నిటినీ కలిపింది, ఇంకా ఏదో ఉందనిపించేది. జీవన్ముక్తిలోకి చేర్చేది. నాలో ఉన్నది, మీలో ఉన్నది జీవన్ముక్తే.
“ఇదంతా మీకు ఒకేచోట లభిస్తుంది.
“జీవన్ముక్తి అంటే ప్రతిక్షణమూ అవగాహనతో, బ్రహ్మాండంలోని కొత్తకోణాలను ఆవిష్కరించే అద్భుతం” అంటారు.
కల్పతరు
‘కల్పతరు’ అనేది జీవన్ముక్తి బీజాలను మీలో నాటే ఒకరోజు ధ్యానకార్యక్రమం.
ఇందులో భక్తులకు -
| శక్తి : | మీ జీవితంలో కావలసిన వాటిని మార్చుకునే శక్తి. |
| బుద్ధి : | జీవితంలో మార్చదగనివాటిని అర్థం చేసుకునే తెలివి. |
| యుక్తి : | సత్యం అనుకున్న, ప్రతీదీ నిరంతరమూ మారిపోతుందనే విషయాన్ని మీరెంత మారినా అర్థం చేసుకునే స్పష్టత. |
| భక్తి : | ఎప్పటికీ మారని, శాశ్వత, అంతిమమైన దానితో (భగవంతుడు)గా సంబంధాలున్న భావన, ఆరాధన |
| ముక్తి : | పై చెప్పుకున్న నాలుగూ సంపూర్ణంగా మీలో కలిగితే, చిట్ట చివరి విముక్తి, జీవన్ముక్తి కలుగుతాయి. |
ఈ కార్యక్రమం, మీ అభిప్రాయాలను, చర్యలతో సమీకరించి, విజయాలు సాధిస్తూ, ఆత్మానందంతో ముందుకు సాగే శక్తిని కలిగిస్తుంది.
ఎల్బిపి లెవెల్
మిమ్మల్ని మీరు శక్తిమంతం చేసుకోవడం.
మీ శరీరంలోని ఏడు చక్రాలనూ శక్తిమంతం చేసి తేలికపరిచే చక్రాధార ధ్యానం ఇది. ఇది మీ దురాశ, భయం, చింత, పట్టించుకోవాలనే కోరిక, ఒత్తిడి, అసూయ, అహంకారం, అసంతృప్తి వంటి మనోభావాలను, అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేస్తుంది. మీలోని ఆనందాన్ని అనుభవంలోకి తీసుకువచ్చే హామీ ఇవ్వగల జీవితపరిష్కారం. ఒక భావం నుంచి విముక్తి కలిగితే మీకు ఒక కొత్త ప్రపంచం, కొత్త శక్తి అనుభూతిలోకి వస్తుంది. విశ్వవ్యాప్తంగా లక్షలాది మందికి ఈ కార్యక్రమం. ఎన్నో విషయాలను అనుభవంలోకి తెచ్చింది.
ఎల్బిపి లెవెల్ 2
మరణరహస్యం బట్టబయలు!
మరణించే ప్రతి క్షణాన్నీ జీవనకళతో అనుభవంలోకి తెచ్చే ధ్యానకార్యక్రమం. అంతిమ భయమైన ‘మృత్యువు’ కారణంగా మనలో ఏర్పడి నిద్రాణంగా ఉండే భావాలైన అపరాధభావన, సంతోషం, నొప్పి వంటి వాటి నుంచి వైదొలగడం నేర్పుతుంది. సమయస్ఫూర్తితో కూడిన కుతూహలాన్నీ, సహజమైన తెలివితేటలతో సరికొత్త జీవితానికి మార్గదర్శనం చేసే కార్యక్రమం.
ఎల్బిపి లెవెల్ 3 - ఆత్మస్ఫురణ కార్యక్రమం
మీతో మీరే సంబంధం ఏర్పరచుకోండి :
మనసు చేత ఆదేశాలు పొంది దానికి లొంగి ఉండక, దాని మాయల ఆటలు కట్టించి, దానిమీద ఆధిపత్యం పొందే కార్యక్రమం. తక్షణ స్ఫూర్తినీ, సమగ్రతనూ పొందేందుకు, అద్భుతమైన ధ్యాన కార్యక్రమం.
ఎల్బిపి లెవెల్ - 3 - భక్తిస్ఫురణకార్యక్రమం
మీ భక్తికి సమగ్రతను ఆపాదించుకోండి.
మీతోటీ, ఇతరులతోటీ సమగ్రతను వ్యవహరించే కోణాలను ఆవిష్కరించే కార్యక్రమం. మీలోనే మీకు తెలియని కోణాలను పురికొల్పి, తెలియజేస్తుంది. సంబంధాల నిర్వచనాలు చెబుతుంది. జీవితంలోని ఎటువంటి సంబంధాన్నినా గాఢంగానూ, సంతోషకరంగానూ అనుభవించే విధానాలు నేర్పుతుంది.
ఎల్బిటి
గృహజీవితశాస్త్ర కార్యక్రమం ప్రపంచంలోని యువత అందరికీ నిర్వహించే కార్యక్రమం. ఆనందంగా జీవించడం అనే అంశం ప్రధానంగా, మూడునెలలు లేదా రెండేళ్లు జరిగే ఈ కార్యక్రమంలో, ప్రాచీన కాలంలోని జీవన్ముక్తిని, నేటి ఆధునిక యువతకు అందిస్తూ, శారీరక, మానసిక, భావనాత్మక ఆరోగ్యాలు, దైనందిన జీవన కళలు నేర్పుతారు. సృజనాత్మక మేధనూ, సమయస్ఫూర్తినీ, జీవనకళలనూ బోధించడమే కాక, ఆర్థికంగా ఆత్మసంతృప్తితోనూ, ఆధ్యాత్మికంగా బలంగానూ ఉండేలా యువతను తీర్చిదిద్దుతారు. అన్నిటినీ మించి, జీవితకాలం మహానుభావులైన గురువుల సంరక్షణలో జీవితకాలం ఉండి నేర్చుగలిగే మహత్తర అవకాశం ఇది!
నిత్యానందం
అన్వేషకులు గురువు సమక్షంలో ఉండి నిత్యానందాన్ని - శాశ్వతానందాన్ని - పొందే కార్యక్రమం. శక్తిమంతమైన గురువు సన్నిధిలో ఉపస్థితులై, ధ్యాన విధానాల నుంచి సేవలు చేసే సదవకాశం.
నిత్యా ఆధ్యాత్మిక చికిత్స
శారీరక, మానసిక రోగాలకు అద్భుతంగా శక్తిమూలకవైద్యాలు నిత్యానంద పీఠం అందిస్తుంది. నిత్యా ఆధ్యాత్మిక చికిత్స పద్ధతుల మూలంగా స్వామి, జనాన్ని చైతన్య పరచి, చికిత్సకులను తయారుచేస్తారు. ఈ ఉచిత సేవాకార్యక్రమంలో ఈ చికిత్సకులు, ప్రతిరోజూ కనీసం 20,000 మందికి సేవలందిస్తారు, ప్రపంచ వ్యాప్తంగా.
నిత్యానంద ధ్యానపీఠం ముఖ్యఅంశాలు
- ప్రపంచ వ్యాప్తంగా ధ్యానం, వ్యసనాలకు బానిసలైన వారిని సన్మార్గానికి మళ్లించే శిబిరాలు: నేటి వరకూ ఇరవై లక్షల మందికి పైగానే ప్రభావితులయ్యారు.
- నిత్యా ఆధ్యాత్మిక చికిత్స : ఐదువేలమంది చికిత్సకుల ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఆశ్రమాలు, కేంద్రాల్లో 20,000 మంది జనానికి రోజూ, శారీరక, మానసిక చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు.
- అన్నదానం : పలు రకాల పోషకాలు గల ఆహారాన్ని ప్రతివారమూ అన్ని ఆశ్రమాలలో అన్నమందిరాల్లో, వచ్చినవారికి, భక్తులకు, శిష్యులకు ఉచితంగా అందిస్తారు.
- నిత్యానంద శిక్షణ : ఆధ్యాత్మిక అభ్యర్థులకు సన్యాసులు, బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులుగా శిక్షణ ఇస్తారు. వీరికి తీవ్రస్థాయిలో యోగం, ధ్యానం, ఆధ్యాత్మిక అభ్యాసం, సంస్కృతం, వేదమంత్రోచ్ఛారణ, జీవనకళలు నేర్పి, నూటికి నూరు శాతమూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిత్యానంద ఆశ్రమాల్లో, స్వచ్ఛందంగా అన్ని కార్యక్రమాలకూ తమసేవలు అందిస్తారు. * నిత్యయోగ : ప్రపంచ వ్యాప్తంగా పతంజలి యోగ సూత్రాలను విప్లవాత్మక ధోరణిలో బోధించడం.
- నిత్యానంద వేదాలయాలు, ఆశ్రయాలు : ప్రపంచవ్యాప్తంగా 30 వేదాలయాలు, ఆశ్రమాలు స్థాపించారు.
- కారాగారాల్లో ధ్యానకార్యక్రమాలు : కారాగారాల్లోనూ, అపరాధుల శిబిరాల్లోనూ తీవ్రవాదుల ధోరణులను మార్చటానికి నిర్వహిస్తారు. వారిలో కలిగిన మార్పులు ఆశ్చర్య జనకం.
- వైద్య శిబిరాలు : అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్, నేత్ర పరీక్షలు, నేత్రశస్త్రచికిత్సలు, కృత్రిమ అవయవాల దానశిబిరాలు, స్త్రీల వ్యాధులు, తదితరాలకు ఉచితంగా చికిత్సలు చేస్తారు.
- గ్రామీణ బాలబాలికలకు ఆసరా : గ్రామీణ బాలబాలికలకు పాఠశాల భవనాలు, యూనిఫారాలు, విద్యాపరికరాలు ఉచితంగా అందిస్తారు.
- నిత్యానంద విద్యాలయం : ప్రాచీన వేదపద్ధతులను ఆధునిక సాంకేతిక విద్యతో జోడించి పిల్లల్లో అణచివేతను, భయాన్ని తొలగించే జీవన్ముక్తి ఆధార విద్యను నేర్పడం.
- కార్పొరేట్ ధ్యాన కార్యక్రమం : ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్, ఏటీ&టి క్వాల్కo, జెపిమార్గన్, పెట్రోబ్రాస్, పెప్సీ, ఒరాకిల్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ అరిజిన్లతో సహా కార్పొరేట్ సంస్థల వారికి మేనేజ్మెంట్, నాయకత్వ నైపుణ్యాలు, కలిసి పనిచేయటం, నేర్పడం.
- ఉపాధ్యాయ శిక్షణకు నిత్యానంద సంస్థ : 300 మందికి పైగా ఉపాధ్యాయులకు శిక్షణ : మార్పు తెచ్చే ధ్యానం, సంపూర్ణ జ్ఞాపకశక్తి, నిత్యయోగ, ఆరోగ్యం, చికిత్స కార్యక్రమాలు, ఆధ్యాత్మిక అభ్యాస కార్యక్రమాలు, ఇంకా ఎన్నో.
- మీడియా : జాతీయ - అంతర్జాతీయ దినపత్రికలు, పత్రికల్లో నిత్యానందుల సందేశాలను అందించే వ్యాసాల ప్రచురణ.
- నిత్యానంద ప్రచురణ కర్తలు : 5000 గంటలకు పైగా నిత్యానందులవారి ఉపన్యాసాలు రాయించి ప్రచురించారు. అవి, పుస్తకాలుగా, డివిడిలు, సీడీలుగా లభిస్తున్నాయి.
- లైఫ్ బ్లిస్ గ్యాలరీస్ : నిత్యానందుల పుస్తకాలు, నిత్యకీర్తనలు రికార్డింగులు 23 భాషల్లో ఉన్న దుకాణాలు, సంచార దుకాణాలు.
- నిత్యానంద ధ్యాన, చికిత్సా శిబిరాలు : ప్రపంచవ్యాప్తంగా ధ్యానం, చికిత్స సేవలు అందిస్తాయి. • నిత్యానంద సంగీత అకాడమీ : సంగీత నాట్యాలు, కళల ఇతర రూపాలు యువతకు నేర్పుతూ ప్రోత్సహిస్తారు. యువతకేకాక, పెద్దలకూ ఇంటర్నెట్ ద్వారా నేర్పుతారు.
• యుట్యూబ్లో ఉచిత ఉపన్యాసాలు : 600 కు పైగా www.youtube.com లో ఉచితంగా సులువుగా గ్రహించగలిగే ఉపన్యాసాలు లభిస్తాయి. ఇది అత్యధిక వీక్షకులున్న వాటిలో తొలిస్థానంలో ఉంది.
• శాస్త్రవేత్తలకూ, పరిశోధకులకూ ఆసరా : విజ్ఞానశాస్త్రానికీ, ఆధ్యాత్మికతకూ పరిశోధకుల ద్వారా ఆధ్యాత్మికశక్తి, చికిత్సలు అనే వారధిని నిరంతరం నిర్మిస్తోంది.
• నిత్యానంద అంతర్జాతీయ యువసంస్థ (ఎన్వైఎఫ్) : దైనిక, క్రియోన్ముఖమైన సమాజనిర్మాణానికి శాంతి, జ్ఞానాలతో కూడిన ఆదర్శాలు గల స్ఫూర్తి పొందిన యువకుల సమూహం.
• స్త్రీ శక్తి : జీవన్ముక్తి కోసం పాటుపడే క్రియోన్ముఖ స్త్రీల సమూహం. వీరు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక స్థాయిలో సమాజసేవ చేస్తారు.
• నిత్యధీర సేవాసేన : తమలో మార్పు తెచ్చుకోవడం ద్వారా, ఆనందసేవకులుగా పేరుపడిన ఈ బృందం, మానవతకు సేవచేయడం, తోడ్పడటం, ప్రకృతి వైపరీత్యాలు బాధితులు కోలుకోవడం నిర్వహిస్తుంది.
Contact us
USA:
Los Angeles
Nithyananda Vedic Temple
9720 Central Avenue,
Montclair, CA 91763
USA Ph.: +1 909 625 1400
Email: [email protected],
[email protected]
URL: www.lifeblissfoundation.org
MALAYSIA:
Kuala Lumpur
14, Jalan Desa Gombak 5,
Taman Desa Gombak
53000 KL, MALAYSIA
Ph.: +601 78861644 / +601 22350567
Email:[email protected],
[email protected]
URL: www.mynithyananda.com
INDIA:
Bengaluru, Karnataka
(Spiritual headquarters and Nithyananda
Vedic Temple)
Nithyananda Dhyanapeetam,
Nithyanandapuri, Off Mysore Road,
Bidadi, Bengaluru - 562 109
Karnataka, INDIA
Ph.: +91 +80 27202801
/ +91 92430 48957
Email: [email protected]
URL:www.nithyananda.org
VARANASI, UTTAR PRADESH
Nithyananda Dhyanapeetam
Leelaghar Bldg, Manikarnika ghat
Varanasi, INDIA
Ph.: +91 +99184 01718
HYDERABAD, ANDHRA PRADESH
Sri Ananda Raja Rajeshwari Temple,
Nithyananda Dhyanapeetam,
Sathamrai Village, Shamshabad
Rangareddy District, Hyderabad - 501 218
Andhra Pradesh, INDIA
Ph.: +91 93900 65553 / +91 93900 65556
Other Centres in Andhra Pradesh
Hyderabad : +91 93910 35463
Vijayawada : +91 98481 44977
Eluru : +91 94908 26692 / 94401 11492
Vizag : +91 98491 17400
Rajahmundry : +91 94408 46104
SALEM, TAMIL NADU
Nithyanandapuri,102,
Azhagapurampudur
(Behind Sharada College),
Salem - 636 016
Tamilnadu, INDIA
Ph.: +91 +427 2449711
Tiruvannamalai, Tamil Nadu
(1008 Ananda Linga Kshetram)
Nithyanandapuri, Girivala path
Tiruvannamalai - 606 604
Tamilnadu, INDIA
Ph.: 04175 237666 / 94449 91089
/ 94450 56262 / 94875 35394
E-mail:
[email protected]
RAJAPALAYAM, TAMILNADU
Nithyanandapuri, Kothainachiarpuram,
Sankaran Coil Road,
Rajapalayam, Virudhunagar District
Tamilnadu, INDIA
Ph.: +91 +4563 230001 /
+91 +98421 30008
Puducherry
Nithyanandapuri,
Embalam to Villianoor Main Road,
Embalam Post, Puducherry - 605 106
INDIA
Ph.: +91 94420 36037 / + 91 97876 67604
For further information visit www.nithyananda.org
NITHYANANDA GALLERIA
A wide range of products for blissful living:
- Nithyananda's insightful messages on video, audio tapes, CDs and books in over 26 languages.
- Enlivening music and chants for meditation and inner healing.
- Meditation and yoga books, kits and CDs for rejuvenating body, mind and spirit.
- Energized rosaries, bracelets, photographs, clothing and gift items for a stimu-lating life style.
- Ethnic energy bead jewelry for men and women for tranquility and continued high energy.
Visit : www.nithyanandagalleria.com or
www. lifeblissgalleria.com for more information.
E-mail: [email protected] & [email protected]
నిత్యానంద ధ్యానపీఠం వారి ఇతర ప్రచురణలు
- నమ్మకమైన పరిష్కారాలు
- తలుపు తెరవండి... చల్లనిగాలిని లోనికి రానివ్వండి
- ఆయన పేరు నిత్యానంద
- సూక్ష్మ సత్యం సూటిగా
- ఆనంద స్ఫురణ
- మా గురుదేవులు
- ధ్యానమార్గం
- ఉవాచ
- శ్రీ ఆనందేశ్వర దేవాలయం & ఆరోగ్య ప్రదాయిని మర్రి వృక్షం
- మరణం జీవించటం నేర్పించే గురువు
- చెప్పిన చిన్న కథలు పెద్ద సత్యాలు
- నిత్యధ్యానం
- గణపతి