KAILASA Library/జీవన్ముక్తి/ఉపోద్ఘాతంSign in
జీవన్ముక్తి

ఉపోద్ఘాతం

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ప్రస్తుతం మీరు ఇక్కడ ఉన్నారు అంటే సర్వాంతర్యామి మిమ్మల్ని ఈ రూపంలో ఇక్కడ ఉంచాలి అనుకోవటమే కారణం. మీరు ఒక యాదృచ్ఛికం కాదు, మీరు ఒక సంఘటన. సర్వాంతర్యామి చేతనస్థితిలో జరిగిన మహాద్భుతమే మీరు. ఇది ఏదో అనుకూలపద్ధతిలో చేసే ఆలోచన అనుకోవద్దు. ఇది సూటిగా ఉన్న సూక్ష్మ సత్యం. మీరు ఈ సత్యాన్ని విశ్వసిస్తే జీవితాన్ని అత్యున్నతస్థాయిలో అనుభవించగలరు.

ఒక విషయం అర్థం చేసుకోండి; సర్వాంతర్యామి మీ ద్వారా వెల్లడి అవుతాడు. మీలోని శక్తి విశ్వశక్తి చేసే వెల్లడి మాత్రమే, ఎప్పుడైతే విశ్వశక్తిని మీ ద్వారా వెల్లడి కానిస్తారో, మీరు అంతులేని శక్తిగల వారని తెలుసుకుంటారు. ఎప్పుడైతే మీరు సర్వాంతర్యామి యొక్క పరిపూర్ణతగా మారటం ప్రారంభిస్తారో, మీరు ప్రవహించే శక్తి అవుతారు. దాన్ని నేను జీవన్ముక్తి అంటాను. జీవన్ముక్తి అంటే ప్రవహించే విశ్వశక్తికి అనుగుణంగా విశ్వసృష్టిలో జరిగే అద్భుతాలతో పాటుగా జీవించటమే.

ఎప్పుడైతే మీరు ఈ విధంగా జీవిస్తారో, మీలో వ్యక్తిగతమైన ఆటంకాలు కాని, మానసికభారాలు కాని లేదా మిమ్మల్ని వెనక్కి లాగే అడ్డంకులు గాని ఉండవు. జీవితం ఆనందంతో, పరిపూర్ణతతో నిరంతరం ప్రవహించే నదిలా ఉంటుంది.

ఈ గ్రంథంలో మీలోని వ్యక్తిగతమైన ఆటంకాలు, మానసికసంఘర్షణలు లేని లోతైన సత్యాలు, శక్తిమంతమైన పద్ధతులు ఉన్నాయి. ఈ విశాలవిశ్వంలో మీ ఉనికిని సమర్థిస్తూ, దానికి సంబంధించిన సత్యాలు ఉన్నాయి. అది తెలుసుకుంటే మీరు ఉన్నతమైన చేతనస్థితికి చేరలుగుతారు.

ఏ వ్యక్తి అయితే సంపూర్ణతతో, సంతృప్తికరమైన జీవితం కావాలి అనుకుంటారో అటువంటివారి కోసమే ఈ గ్రంథం. ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద జన్మించిన లక్ష్యం అయిన ఆ అంతిమ అనుభవాన్ని పొందటం ప్రారంభిస్తారో వారి కోసం ఈ గ్రంథం. ఈ గ్రంథం వారికి ఇచ్చే అనుభవం;

శక్తి : జీవితంలో దేన్నైతే మార్చాలి అనుకుంటారో దాన్ని మార్చగల శక్తి.

బుద్ధి : దేన్నైతే మార్చనవసరం లేదో, దాన్ని అర్థం చేసుకుని స్వీకరించే బుద్ధి.

యుక్తి : ఎంత మార్చినా, మీరు చూసే నిజం నిరంతరం మారుతూ ఉండే కల అని స్పష్టంగా అర్ధం చేసుకుని, తెలుసుకునే యుక్తి.

భక్తి : అంతిమమైన, నిత్యమైన దానితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవటం.

ముక్తి : ఈ నాలుగు ఏకీకృతమైనప్పుడు జీవన్ముక్తి లోనికి పొందే అంతిమస్వేచ్ఛ.

జీవన్ముక్తికి (పరమహంస నిత్యానంద ప్రవచనాలు)

ప్రతి వ్యక్తిలోనూ అసాధారణమైన శక్తి నిక్షిప్తమై ఉంది. దానిని మేల్కొలిపితే, అది మానవశరీరం, మనస్సు అనే వాటికి అతీతంగా ఉన్నతమైన చేతనస్థితికి తీసుకువెళుతుంది. ఈ అత్యున్నత చేతనస్థితిని అనుభవించండి. మీలోని అంతిమశక్తిని తెలుసుకోండి. మానవజీవితంలో ఒకే ఒక లక్ష్యం - అంతిమవిలాసమైన జీవన్ముక్తి స్థితిలో ఆనందంగా ఉండగలగటమే,"

-పరమహంస నిత్యానంద, ఈ రోజు మన మధ్య ఉన్న జ్ఞానోదయమైన యోగీశ్వరుడు.

ఈ గ్రంథంలో ఉన్న అంశాలు

స్పష్టమైన జీవితపరిష్కారాలు సంపూర్ణంగా.

  • అపరాధభావం నుంచి ఎలా బయటికి రావాలి?
  • నిజమైన ప్రేమ అంటే ఏమిటి?
  • నిత్యం ఆనందస్థితిలో ఉండటానికి సరైన మార్గం.
  • ఆనందజీవనసరళికి యోగా, ధ్యానం.
  • 100కి పైగా ధ్యానపద్ధతుల్ని, నిత్యం తెలుసుకోగల సాధన.
  • కాలా తీతమైన సత్యాలలోనికి తొంగి చూడగల అరుదైన అవకాశం.
  • కర్మ అంటే ఏమిటి?
  • జీవితలక్ష్యం ఏమిటి ?
  • గురుదేవులలోని వివిధ కోణాలు.
  • గురువు అంటే ఎవరు?

నేను అంతిమసత్యం తెలుసుకోవాలంటే గురుదేవులు ఏ సహాయం చేస్తారు..... ఇంకా చాలా ఉన్నాయి.