KAILASA Library/జీవన్ముక్తి/ముందుమాటSign in
జీవన్ముక్తి

ముందుమాట

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ప్రసిద్ధి చెందిన మేధావులు, శాస్త్రవేత్తలు చెప్పే విషయం, ఈ మధ్యకాలంలో మానవుల చేతనస్థితి ఉన్నతస్థాయిలో ఉందని. ఈ మార్పుకి ఎవరు, ఏ కారణం చెప్పారు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు.

అసలు విషయం, చేతనస్థితిని ఎలా నిర్వచించాలి అన్నది ఇక్కడ ప్రశ్న. సంఘజీవులుగా, మనం సమాజపు నీతినియమాలు, నిబంధనల ఆధారంగా మన జీవితాల్ని రూపందించుకున్నాం. మన ప్రవర్తనపద్ధతి మనస్సాక్షి ఆధారంగా ఉంటుంది. కాని మనస్సాక్షి చేతనస్థితి కాదు.

చేతనస్థితి అంటే మన వస్తుప్రపంచాని కంటే, ఈ విలాసాలు, సంతోషాల కంటే కూడా అతీతమైంది మన జీవితాలకి ఏదో ఉంది అని తెలుసుకోవటమే. మనలో ఇంత కంటే, మనం చూస్తున్నదాని కంటే ఉన్నతమైంది ఏదో ఉంది అని అంతరంగంలో పదే పదే చెప్పేది. మన అంతరాత్మలో మనం అనుకున్నదాని కంటే మనం ఉన్నతులమని తెలుసుకోగల స్థితికి అది దీపంలా దారి చూపిస్తుంది.

మానవులు జీవయంత్రాల కంటే ఉన్నతులు. అందుకే అంత శక్తిమంతమైన కంఫ్యూటర్ ప్రపంచం కూడా మనిషి లేకుండా ఏమీ చేయలేదు. కంఫ్యూటర్ మనిషి మెదడుకి బదులు, మనిషి శరీరానికి బదులుగా ఏ పనైనా చేస్తుంది కాని, మనిషిలోని శక్తికి మాత్రం అది ప్రత్యామ్నాయం కాదు. మనం జీవక్రమంలో జంతువుల నుంచి మానవులుగా అయ్యాం అనేది నిజమైవుండవచ్చు. కాని మనం ఈ స్థితి నుంచి మరింత ఉన్నతస్థితికి వెళ్ళగలం అనేది సత్యం.

అతిప్రాచీనకాలం నుంచీ అన్ని సంస్కృతులలోని మేధావులు, చాలా చిన్నదే కాని ప్రాముఖ్యం కలిగిన అంశం అయిన 'నేను ఎవరిని' అనే విషయం లోనికి లోతుగా వెళ్ళి చూసారు. చాలామంది ఆ ప్రశ్నకి జవాబుని తెలుసుకున్నారు. వారి జవాబులు ప్రయోగాత్మకంగా ఉన్నాయి. మనకి ఉన్న ఆధ్యాత్మికగ్రంథాలన్నీ, ఆ యోగుల అనుభవాలే. వారి అనుభవాల్ని గ్రంథాల రూపంలో వివరించారు. వారు జీవించి ఉన్నప్పుడు వారే ఆ అనుభవం. దాన్నే మనం తెలుసుకోగలం. పరమహంస నిత్యానంద అటువంటి అనుభవం.

ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు పరమహంస నిత్యానందవారి మేధాసంపత్తి సారాంశమే. పరమహంస చాలా కార్యక్రమాలలో దివ్యప్రవచనాలు ఇచ్చారు. ఆయన భగవద్గీత మొదలైన గొప్ప గ్రంధాల మీద వ్యాఖ్యానం ఇచ్చారు. చిన్న చిన్న సమూహాలలో గడిచిన ఐదు సంవత్సరాలలో చాలా ప్రవచనాలని ఇచ్చారు. ఆ ప్రవచనాలు, బోధనల సారాంశమే ఈ మహాగ్రంధం.

ఇందులో ఎందుకు మనం ఇలా ప్రవర్తిస్తాం, ఎందుకు అలా చేస్తాం అనే విషయాలు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. మనం విశ్వశక్తికి అనుగుణంగా ప్రస్తుతస్థితి నుంచి ఏ విధంగా మారగలం అనే విపులమైన వివరణ ఈ గ్రంథంలో మీకు దొరుకుతుంది. ఇందులో చెప్పిన ధ్యానపద్ధతులు మీకు ఆ అనుభవాన్ని కలిగిస్తాయి.

మనమూ, మన బయట ఉన్న శక్తి ఒక్కటే అన్న విషయాన్ని అనుభవంతో అర్థం చేసుకున్నప్పుడు మన చేతన స్థితి విస్తృతం అవుతుంది. మనం ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తి జాతి, మతం, భాష, సంస్కృతి ఏదైనా, అంతా ఒక్కటే అని తెలుసుకుంటాం. మనందరం విశ్వసాగరంలోని కెరటాలమే అని తెలుసుకుంటాం. ఆ అనుభవమే జీవన్ముక్తి. అదే నిత్యానంద అనుభవం.

ఈ గ్రంథంలోని అధ్యాయాలన్నీ ఒక పద్ధతిలో అమర్చాం. కాని మీరు ఎక్కడైనా, ఏ అధ్యాయం అయినా మీ ఇష్టం వచ్చిన విధంగా చదువుకోవచ్చు. ఇందులో అన్ని అధ్యాయాలూ జీవన్ముక్తి అనే ప్రధానసూత్రంతో అనుసంధానం చేయబడ్డాయి. అయినా ప్రతి అధ్యాయం దేనికి అదే ప్రత్యేకమైన మార్గం.

మీరు ఈ అనుభవంలో లోతుగా వెళ్లినప్పుడు, ఎవరితోనైనా అదే అనుభవం జరిగి ఈ విషయాలని గురించి చర్చించాలి అనుకుంటే జీవన్ముక్తి సెక్షన్ www. lifebliss.orgలో కలవవచ్చు. మీరు మీకు దగ్గరలోని నిత్యానంద ధ్యానపీఠం వారి సెంటర్లకి కూడా వెళ్ళవచ్చు. అక్కడ అదే మార్గంలో ఉన్నవారు మీకు పరిచయం అవుతారు.

ఈ గ్రంధం సర్వాంతర్యామి అంతిమసత్యాల లోనికి మీరు చేసే అద్భుత మైన ప్రయాణం. ఈ శతాబ్దంలో మన మధ్య ఉన్న జ్ఞానోదయమైన ఒక యోగీశ్వరుడు ఇచ్చిన బహుమతి ఈగ్రంథం!