జీవనము యొక్క శక్తిని బయలుపరచుట
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
సంవృద్ధిపరచడము
జీవించడము అనేది ఒక శక్తి
ప్రతిదినము మీరు నడుస్తున్నారు,
మాట్లాడుతున్నారు, కూర్చుంటున్నారు,
ఆలోచిస్తున్నారు, చెబుతున్నారు,
భావిస్తున్నారు మొదలగునవి. ఇవి
అన్నియూ కలిపితేనే జీవించడము.
జీవించడము అనేది తనకుతానే ఒక శక్తి !
మీరు సంవృద్ధిపరచే ఒక జీవనశైలిని
అవలంబించినప్పుడు మీ యొక్క
జీవితములో ఆత్మ యొక్క శక్తిని మీరు
ఉపయోగించుకోగలరు.

వినండి! మీరు పుట్టడానికి ఉద్దేశ్యము ఏమనగా మిమ్ముల్ని మీరు మరియు ఇతరులను సంవృద్ధిపరచడానికే. ఈ యొక్క అవగాహన నుండి మీరు నిర్వహించినప్పుడు, మీరు అత్యంత చైతన్యవంతులుగా మీ యొక్క అగ్రస్థితి యందు ఉండి మరియు జీవన్ముక్తిని జీవిస్తూ ఉన్నారు ! మీలో ఆత్మ యొక్క శక్తిని బయలుపరచే కీలకమే సంవృద్ధిపరచడము.
సంవృద్ధిపరచడము అంటే ఏమిటి ?
సంవృద్ధిపరచడం అంటే మీరు సంపూర్తితో మరియు శ్రద్ధతో నిరంతరాయముగా సంవృద్ధిపరచుటకు ఒప్పుకున్నారు అని మీరు బాధ్యతను తీసుకోవడం, అది ఏమనగా మిమ్ముల్ని మరియు మీ చుట్టూ మరియు మీలో ఉన్న జీవనమును విస్తారపరచడము.
మీరు మిమ్ముల్ని మరియు మీ చుట్టూ ఉన్న అంతటినీ సంవృద్ధిపరచుటకు ఒప్పుకున్నప్పుడు, జీవితము ఉత్తమమైనదంతటినీ మీకు కురిపిస్తుంది! మీరు మీ లోపల మాత్రమే కాకుండా ఇతరులతో మీ బయట కూడా జీవితమును అనుభూతి చెందుతారు. మీరు సంవృద్ధిపరచితే, ఆత్మ యొక్క శక్తి మీలో జాగృతి చెందుతుంది.
అంతయూ మీ యొక్క భాగమే
వినండి: జీవితములో మీ యొక్క పోరాటములు అన్నియూ ఇతరులు మీ నుండి వేరు అని మీరు ఆలోచించడం మొదలుపెట్టిన క్షణములోనే మొదలైనవి. అర్థంచేసుకోండి, మీ యొక్క జీవితములో 'ఇతరులుగా పిలువబడే వారెవరూ లేరు! ఆ 'ఇతరులు' అనేది కేవలము మీ యొక్క మరచిపోయిన మరియు ఒప్పుకోని భాగములు! ఇతరులతో మీ యొక్క పోరాటములు అనేవి మీ మరచిన పక్షముతో పోరాటముకాక మరేమీ కాదు. ఇతరులను మీరు సంవృద్ధిపరచినప్పుడు, మీరు సహజముగానే మీ స్వీయ ఉనికి యొక్క అలక్ష్యము చేయబడ్డ పక్షమును సంవృద్ధి పరచుతున్నారు. కనుక ఇతరులను మీరు ఎక్కువ సంవృద్ధి పరచేకొద్దీ, మిమ్మల్ని మీరు మరింత ఎక్కువ సంవృద్ధిపరచుతారు. అన్నిటికన్నా మిన్నగా, అందరూ మరియు అంతయూ మీ యొక్క భాగమే అను సత్యమునకు మీరు జాగృతి చెందుతారు.
సంవృద్ధిపరచడము శక్తులన్నిటికీ జీవమును ఇస్తుంది.
సంపూర్తితో మీరు సకారాత్మకత యొక్క స్థితిని అనుభూతి చెందుతారు, శ్రద్ధతో సంభావనీయత యొక్క స్థితిని అనుభూతి చెందుతారు, మరియు బాధ్యతతో నాయకత్వము యొక్క స్థితిని అనుభూతి చెందుతారు. సంవృద్ధిపరచడముతో జీవన్ముక్తి యొక్క స్థితిని అనుభూతి చెందుతారు. జీవన్ముక్తంగా జీవించడము అనేది మీ యొక్క అంతర్-శక్తులు అన్నింటినీ నియంత్రించుకుని మరియు మిమ్మల్ని మీరు మరియు ఇతరులను సంవృద్ధిపరచుటకు వాటిని ఉపయోగించడమే, మరేమీ కాదు. కనుక జీవనము యొక్క శక్తి తనలో అన్నీ ఇతర శక్తులను కలుపుకుని ఉంది.

మీకు సమాకలిత ఆలకించడము( శ్రవణము) , శ్రద్ధతో ఆలోచించడము( మననము) మరియు బాధ్యతాయుత ఘోషణము చేయుట (నిదిధ్యాసన) ఉన్నప్పుడు, మీరు ఒక సంవృద్ధికరమైన జీవితమును జీవిస్తారు.
మిమ్మల్ని మీరు మరియు అన్యులను సంవృద్ధిపరచినప్పుడు, అది బాధ్యత వహించడమును మించిన ఒక అడుగు. సంవృద్ధిపరచడం ఒక్కటే మీలో ఏ సంపూర్తి లేమినైనా, అశ్రద్ధ లేక బాధ్యతాహీనతను దహించగలదు! అందరికీ మరియు అంతటికీ బాధ్యత వహించడమే సంవృద్ధిపరచడం, ఇంకా అన్యుల అశ్రద్ధ మరియు సంపూర్తిలేమిని కూడా – ఎందుకంటే అవి మీ యొక్క భాగమే.