నేను అన్యులను ఎందుకు సంవృద్ధి పరచవలెను?
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
మీరు ఒక నిర్మానుష్య గుహ లేక అడవిలో జీవించుటలేదని అర్ధంచేసుకొండి. మీరు ఇతరులతో జీవిస్తున్నారు, ఎక్కడ మీ యొక్క జీవనము బాహ్యముగా జరుగుతున్నదో అక్కడ జీవితము ఇతరులతో జరుగుతున్నది! మీరు వందలమందితో ముడిపడి ఉన్నారు మరియు వందల మంది మీతో ముడిపడి ఉన్నారు. కనుక సహజముగానే, మీ యొక్క జీవితము అంతమందితో ముడిపడి ఉన్నప్పుడు, మీ యొక్క జీవితములో మీరు ఏ పరివర్తనను కోరుకున్ననూ, దాని కోసం మీరు పనిచేసి మరియు ఇతరుల జీవితములు కూడా పరివర్తింపచేయ్యాలి!

'మీ యొక్క ధనమంతా పంచిపెట్టండి!' అని నేను చెప్పడములేదు. లేదు! మీరు పదిమంది పేదలను తీసుకుని మీ యొక్క ధనమంతా వారికి పంచిపెడితే, మనకి పదకొండు మంది పేదవారు ఉంటారు, అంతే! కనుక మీ యొక్క ధనమును పేదలకు పంచిపెట్టమని నేను మిమ్మల్ని అడగడంలేదు. వారిని యోగ్యులుగా తీర్చిదిద్ది అప్పుడు వారిని ధనవంతులుగా చేసేందుకు మిమ్మల్ని బాధ్యతను తీసుకోమ్మని నేను అడుగుతున్నాను. మీకు కలిగినదేదైనా పంచుకొనుట మరియు అది పెరిగేటట్లు చేయుటకు మీరు బాధ్యులు అవ్వండి.
సంవృద్ధిపరచుట గురించి కొన్ని సత్యములు
- సంవృద్ధిపరచడమనేదే మీ యొక్క స్వభావము! అర్ధంచేసుకోండి ఏదైతే మీరు చేస్తారో అది ఇతరులను సంవృద్ధిపరచడమే - మీ యొక్క ఊపిరి కూడా భూగ్రహముపై చెట్లను మరియు మొక్కలను సంవృద్ధిపరుస్తుంది.
- ఇతరులను సంవృద్ధిపరచడం మిమ్మల్ని సంవృద్ధిపరుస్తుంది, ఎందుకంటే అందరూ మీలో భాగమే.
- ఇతరుల కోసమే జీవితమని మీరు మీ యొక్క హృదయమును ఒప్పించిన మరుక్షణం, మీ యొక్క హృదయములోనున్న బాధ అంతయూ మిమ్మల్ని విడిచి పెడుతుంది.
మీరు విశ్వశక్తితో మేళవింపు అయ్యి జీవించినప్పుడు, మీరు ........
- ప్రమాణసిద్ధమైన శక్తివంతమైన ఆనందమయజీవిగా ఉంటారు.
- జీవితము పట్ల యథేచ్చగా మరియు సామరస్యముగా స్పందిస్తారు.
- మీకు మరియు ఇతరులకు చమత్కారములు జరిగేటట్లు చేయుటకు సాధికార పరచుకుంటారు.


మీ యొక్క జీవితములో చమత్కారములు జరిగేటట్లు చేసుకొండి !
సిద్ధులు అనేవి అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తులు, అవి చైతన్యశక్తి యొక్క ఉన్నత స్థాయిలకు మీరు చేరుకున్నప్పుడు క్రియాత్మకమవుతాయి. మీరు నిరంతరాయముగా మరియు త్రికరణశుద్ధిగా చతుర శక్తులతో పనిచేసినప్పుడు ఈ అద్భుతశక్తులు మీలో జాగృతి అవుతాయి.
మీయొక్క మాటలకు, ఆలోచనలకు, భావనలకు, మరియు మీ జీవితములో మీరు ఆచరించు చర్యలకు ధర్మమును జోడించండి. చతుర శక్తులకు మీరు ధర్మమును జోడించినప్పుడు, చమత్కారములు జరగడం చూస్తారు. ఉదాహరణకు మీరు అపూర్వమైన సంపూర్తితో జీవించినప్పుడు, విశ్వశక్తి మీ యొక్క మాటను పరిపూర్తి చేయుటకు కలయబడుతుంది!
సరియైన జాగాను సృష్టించుట యొక్క శక్తిని గురించి ఒక సరసమైన కానీ ప్రాముఖ్యమైన కధ ఉంది. బాల-రాజకుమారుడైన ప్రహ్లాదుడు విష్ణు పరమాత్మ యొక్క గొప్ప భక్తుడు. ఇది అతని తండ్రి
రాక్షస రాజైన హిరణ్యకశిపునకు నిజముగా క్రోధం తెప్పించింది, ఎందుకంటే భగవంతునికి బదులుగా అందరూ తనను ఆరాధించాలని అతను అనుకున్నాడు. ఒక రోజు ప్రహ్లాదునికి హిరణ్యకశిపుడు ఒక పందెము విసిరాడు. గదిలో ఉన్న స్తంభములవైపు చూపించి అన్నాడు, 'నీ దేవుడు విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నాడని నువ్వు చెబుతావు! అయితే ఈ స్తంభాలలో అతడు ఉన్నాడా?' ఎటువంటి సంకోచమూ లేకుండా బాలప్రహ్లాదుడు బదులు పలికాడు, 'అవును, ఈ స్తంభాలలో కూడా విష్ణువు ఉన్నారు.' ఓ, నిజంగా! ఏ స్తంభములో విష్ణువు కూర్చుని ఉన్నాడో నాకు చూపించు!' అని హిరణ్యకశిపుడు గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు తన చిన్న చేతిని ఎత్తి ఆ గదిలో ఉన్న ఒక స్తంభము దిశగా చూపడము మొదలుపెట్టాడు.


ఇలా చెప్పబడియుంది, ప్రహ్లాదుడను హిరణ్యకశిపుడు ప్రశ్నించుతున్నప్పుడు, విష్ణువు తన లోకములో ప్రశాంతముగా విశ్రమిస్తున్నారు అని. కానీ ప్రహ్లాదుడి వ్రేలు స్తంభముల వైపుగా కదలడం మొదలైన మరుక్షణము, విష్ణువు ఉలిక్కిపడి లేచి మరియు భూమి వైపుగా పరుగుపెట్టడం మొదలు పెట్టారు! ఆయన భార్య లక్ష్మీ అడిగారు, ఏమి జరిగింది, ఏమి జరిగింది?' “ఓ, నా భక్తుడు తన వ్రేలును ఒక స్తంభము దిశగా కదల్వడం మొదలు పెట్టాడు, అతడు ఎక్కడైతే సూచిస్తాడో, నేను ఆ స్తంభము లోనికి ప్రవేశించి తీరాలి!” అన్నారు విష్ణువు.

అమాయకుడైన బాలుడు ప్రహ్లాదుడు యొక్క సంపూర్తి మరియు శ్రద్ధ అటువంటిది కనుక ఎక్కడ అతని వ్రేలు నిలచిందో అక్కడ, విష్ణువు ఆ స్థంభములో ప్రత్యక్షమవ్వవలసివచ్చింది! మీరు అంత శక్తివంతమైన సంభావనీయత యొక్క జాగాను సృష్టించుకున్నప్పుడు దైవం కూడా మీ కోసం అక్కడ దిగుతుంది!
ఒక కోరికను వాస్తవములోనికి చేసుకొనుట

వినండి! ఎప్పుడెప్పుడు మీరు ఏదైనా జరుగుట కొరకు జాగాను సృష్టించుకుంటారో, మీరు దురదృష్టవశాత్తు అది అసలు ఎప్పుడైనా వాస్తవము అవుతుంది అనే సంభావనీయత గురించి కూడా సంశయములను సృష్టించుకుంటారు! మీరు ఆ జాగాను పంతం పలికినప్పుడు, అప్పుడే ఆ జాగాను కలుషితం చేశారు. మీరు ఒకానొక రోగముతో బాధపడుతున్నట్లు అయితే, మీరు ఆరోగ్యవంతులు అవ్వుటకుగాను ఒక జాగాను సృష్టించుకొనుటకు నిర్ణయించుకోండి. కానీ మీరు జాగాను సృష్టించుకున్న మరుక్షణం మీకు సాధ్యమైన అన్ని రకముల సంశయములు కలుగుతాయి - జాగా యొక్క శక్తి గురించి సంశయము, మరియు ఆ సరియైన జాగాను సృష్టించుకొను మీ యొక్క సామర్ధ్యము గురించి సంశయము. మీ యొక్క గత వైఫల్యములన్నీ వచ్చి మరియు రాక్షసుల వలె మీ ఎదురుగా నిలబడతాయి !
అదే అతి దురదృష్టవంతమైన విషయము - జాగా యొక్క శక్తిని పంతం కూర్చోండి. మీ నేత్రాలను మూయండి. మీకు గల ఆ యొక్క అభిప్రాయమును తీసుకోండి. ఆ యొక్క అసాధ్యతను పూర్తి చేసుకోండి.
■ ఇప్పుడు, ఆ పూర్ణత్వము యొక్క స్థితితో కూర్చోండి. మీ యొక్క చర్యల ద్వారా మీ ఉత్తేజమును వాస్తవములోనికి చేసుకుంటానని మీరు నిర్ణయించుకోండి. మీ యొక్క కోరికను వాస్తవములోనికి పరివర్తింపచేయుటకు ఒప్పుకోవడమే దాని కొరకు బాధ్యతను వహించడము. సంభావనీయత యొక్క జాగాను సృష్టించుకోవడం మరియు దాని కొరకు బాధ్యతను వహించడం మీ జీవితములో దానిని వాస్తవము లోనికి తెస్తుంది.
> నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను - మీ యొక్క జాగాలో > మీరు ఏదైతే సృష్టించుకున్నారో అది మీ జీవితములో > మంగళకరమైన వాస్తవముగా అవ్వుగాక !
పరమహంస నిత్యానంద స్వామి వారి ప్రపంచ వ్యాప్త సంఘం - వ్యక్తిగత పరివర్తన కార్యాగోష్టులు, ఆధ్యాత్మిక చికిత్స మరియు మానవతా సేవల ద్వారా జీవితములను సంవృద్ధిపరచుతుంది.సంఘం యొక్క అంతర్జాతీయ శిబిరము భారత దేశములో బెంగుళూరుకు దగ్గరగా బిడది యందు ఉంది. ఇక్కడ అందించు కార్యకలాపాలు మరియు సేవలలో - ధ్యానం, యోగ, సత్సంగములు ( ఆధ్యాత్మిక సమూహములు) , వ్యవస్థ కార్యక్రమములు, ఉచిత వైద్య శిబిరములు, స్త్రీలకూ మరియు యువతకు సదవకాశములు, అన్ని ఆశ్రమముల యందు అన్నదానం ( ఉచిత భోజనములు) మరియు పూర్ణరూపాత్మక గురుకుల విద్యాభ్యాసము మరియు సన్యాసము, సాధుజీవనము ద్వారా శ్రేష్టమైన వైదిక హిందూ జీవన శైలి యొక్క పునరుద్ధరణ.

పరమహంస నిత్యానంద వారి ప్రపంచ వ్యాప్త సంఘం
గురించి



శ్రీల శ్రీ పరమహంస నిత్యానంద స్వామి వారు జీవన్ముక్తి జీవించుట యొక్క విజ్ఞానములో ప్రపంచ వ్యాప్తగురువు, పరమాత్మ యొక్క సజీవ అవతారముగా లక్షలమందిచే పూజింపబడుతున్న వారు, ఈనాడు సమాకళిత సనాతన హిందూ ధర్మము యొక్క స్పష్టమైన, శాస్త్రసమ్మతమైన, రాజకీయము లేని కంఠధ్వనిగా గుర్తింపబడినవారు. మహానిర్వాణీ పీఠాధిపతులు, అది హిందూమతము యొక్క ప్రపంచ అతి పురాతన అగ్రపీఠము. ఈ మానవ స్వభావముపైన ఆయన ప్రబుద్ధ మరియు దయార్ద్ర అంతర్ దృష్టి ఈ యువ జీవన్ముక్త యోగిని బ్రహ్మాండమైన ప్రజాదరణ గల ఆధ్యాత్మిక గురువు మరియు యుట్యూబ్ లో 16 మిలియన్లకు పైగా వీక్షించే వారితో మొదటి శ్రేణి వారు.
ప్రతీ మాసము, పరమహంస నిత్యానంద వారు
ఇన్నర్ అవేకనింగ్ నిర్వహించును, 21 -
దినములు పరివర్తింపజేసే కార్యక్రమము. అది
వ్యవహారిక బోధలు మరియు కుండలిని జాగృతి
కొరకు 21 శక్తివంతమైన దీక్షల ద్వారా మీలో
చతుర్ శక్తులను బయలపరచును.
నిత్యానంద యూనివర్సిటీ ప్రెస్ www.nithyananda.org
Ebook ISBN: 979-8-88572-114-1
