KAILASA Library/బయలుపరచండి/అంతర్ మరియు బాహ్య ఛాయలను మేళవించుటSign in
బయలుపరచండి

అంతర్ మరియు బాహ్య ఛాయలను మేళవించుట

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

అంతర్చాయబాహ్యచ్ఛాయఎంచుకున్న ఛాయ
నేను బలహీనుడను★ నేను బలవంతుడను★ నేను బలవంతుడను
నేను అప్రసిద్ధుడను★ నేను ప్రసిద్ధుడను★ నేను ప్రసిద్ధుడను
★ నేను బాధ్యతాయుతుడను★ నేను బాధ్యతాయుతుడను★ నేను బాధ్యతాయుతుడను
★ నేను తెలివైనవాడినినేను అవివేకిని★ నేను తెలివైనవాడిని

4) ఎక్కడైతే విభేదము ఉంటుందో, మీయొక్క అంతర్చాయ మరియు బాహ్యచ్ఛాయను మేళవించడము మొదలుపెట్టండి. అనగా– మిమ్ముల్ని మీరు ఎలా గ్రహించుకున్నారో మరియు ఇతరులకు మిమ్మల్ని ఎలా మీరు ప్రతిరూపిస్తున్నారో – సర్వదా అధికోన్నతమైన అభిప్రాయమును ఎంచుకోవడము ద్వారా. ఉదాహరణకు, ఎక్కడైతే మీయొక్క బాహ్యచ్ఛాయ మీ యొక్క మమకారము (అంతర్చాయ) కంటే అధికముగా ఉంటుందో, మీ మమకారమును మీ యొక్క బాహ్యచ్ఛాయతో మేళవించుటకు నిర్ణయించుకోండి. అంతేగానీ ఇతరులకు మిమ్మల్ని మీరు ఏ విధముగా ప్రతిరూపిస్తారో దానిని తగ్గించుకోకండి, మిమ్మల్ని మీకు ఎలా మీరు గ్రహించుకుంటారో దానిని పెంచుకోండి. మీరు ఏదైతే ప్రతిరూపిస్తారో దానిని నిర్దిష్ట అంశముగా ఉండనివ్వండి.

5 ) ఒకొక్క విషయమునకు దీనిని మళ్ళీ చేయండి. వ్యక్తిత్వములు రెంటిటినీ పోల్చండి. రెంటిటిలోనూ ఏవైతే గుణములు ఉన్నతముగా ఉన్నవో, వాటిని ఎంచుకోండి. మీ యొక్క ఉన్నతమైన గ్రాహ్యములన్నిటి ప్రక్కగా ఒక నక్షత్రమును చిత్రించండి.

మీ యొక్క మననమునకు శ్రద్ధను తెచ్చుకోండి

మననములో శ్రద్ధకు రెండు అడుగులు ఉన్నవి.

  1. మొదటిది, మీ జీవితములో మీకు నిజముగా ఏది కావాలో తెలుసుకొండి, మీ యొక్క నాలుగు పరిమాణములు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో త్రికరణ శుద్ధిగా యోచించడము ద్వారా. మీ యొక్క ఉన్నతమైన అంతర్చాయ, బాహ్యచ్ఛాయ, ఇతరులకు మీపై గల ఛాయ మరియు జీవితముపై మీకు గల ఛాయలను ఒక పట్టికగా తయారు చేయండి మరియు మీ మంచము ప్రక్కన, మీ కార్యాలయము వద్ద బల్లపైన లేక మీరు మేలుకొనగానే మరియు దినమంతయూ ఎక్కడైతే చూడగలుగుతారో ఆ ప్రదేశములో దానిని ఉంచండి.
  1. ఇప్పుడు, మీరు ఏ విధముగా ఉండాలనుకుంటున్నారో, ఎవరిలా ఉండాలనుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో సాధించుకొనుటకు, మీకు పరధ్యానం కలుగచేయునది లేక మిమ్మల్ని ఆపుతున్న అడ్డంకులు ఏమిటో తెలుసుకొండి. అధిక జనులకు అతి పెద్ద అడ్డంకులలో ఒకటి ఆత్మ సంశయము. గత వైఫల్యముల యొక్క జ్ఞాపకములచేతనే జరుగుతున్నది నకారాత్మక ఆలోచనాక్రమము.

ఏ ఆలోచనాధోరణి అయితే మీ యొక్క అగ్రమైన సంభావనీయతతో సమలేఖనమౌతున్నదో, దానిని ప్రోత్సహించండి, సంవృద్ధిపరచండి, మరియు దానిని స్వీకరించండి. ఏ ఆలోచనాధోరణి అయితే దానితో సమలేఖనములో ఉండదో, దానితో పూర్తి చేసుకొండి. సచేతనత్వముతో, నిర్ణయాత్మకముగా ఆ క్రమముతో పూర్తిచేసుకొండి. ఏవైతే మీ యొక్క అగ్రమైన సంభావనీయతను సాధించుకొనుట నుండి మిమ్మల్ని ఆపుతున్నాయో ఆ క్రమములతో ప్రతిదినము పూర్తి చేసుకుంటూనే ఉండండి. మీరు శ్రద్ధను జీవించడము మొదలుపెట్టినప్పుడు, మీకు సరియైన పద్ధతిలో ఆలోచించడము తెలుస్తుంది మరియు మీరు జీవితములో కోరుకుంటున్నదేమిటో అది సాధించుకొనుటకు మీ యొక్క మననమును ఉపయోగిస్తారు. హిందూ ఆధ్యాత్మిక సాధనలో, ఇది రెండవ అడుగు, మననముగా ప్రసిద్ధమైనది, శ్రద్ధతో యోచించడము. మీ యొక్క మననము శ్రద్ధలో స్థాపింపబడుగాక!, నిరంతరాయముగా మీ యొక్క అగ్రమైన సంభావనీయత వైపుగా మిమ్మల్ని విస్తరింపచేయుచు. మీరు ఏది ఆలోచించిననూ అది సాఫల్యముగా అగునట్టి ఒక శక్తివంతమైన స్పష్టతను మీ ఆలోచనలలో మీరు సాధించినప్పుడు, మననము యొక్క శక్తిని మీరు బయలుపరచినారు.

బాధ్యత అనగా ఏమిటి ?

బాధ్యత అంటే మీరే సర్వమునకు మూలం కనుక మీ లోపల మరియు చుట్టూ జరిగేవాటికన్నిటికీ మీరే బాధ్యులనే సత్యము నుండి జీవిస్తూ మరియు జీవితం పట్ల స్పందించడం.

ఎవరో, ఎవరూకాదు, ఎవరైనా & అందరు

ఇక్కడ మన అందరికీ తెలిసిన ఒక చిన్న కథ! ఒకానొక కాలములో అందరు, ఎవరో, ఎవరైనా, మరియు ఎవరూకాదు అనే పేర్లతో నలుగురు ఉండేవారు. ఒకసారి ఒక ముఖ్యమైన కార్యము చేయవలసి ఉంది. కానీ దానిని ఎవరు చేయవలసి ఉంది ? అందరు అనుకున్నారు ఎవరో చేస్తారని. ఎవరైనా చేసి ఉండేవారు దానిని, కానీ దానిని ఎవరో చేయలేదు. అది అందరు యొక్క కార్యము కావున ఎవరోకు దాని గురించి కోపము వచ్చింది. అందరు అనుకున్నారు ఎవరైనా చేయవచ్చును కదా అని, కానీ ఎవరూకాదు తెలుసుకోలేదు అందరు దానిని చేయరు. అది ఎలా ముగిసిందంటే ఎప్పుడైతే ఎవరూకాదు ఎవరైనా చేయగలిగింది చేయలేదో అప్పుడు అందరు ఎవరోని నిందించారు !

young brahmacharis
Nithyananda seated on a throne

దుర్ఘటన సంభవిస్తే, నేను ఎలా బాధ్యుడను కాగలను ?

ఈ ప్రశ్న అందరూ అడుగుతారు !

వినండి: ఒక విషయమునకు కారకుడిగా ఉండుట, మరియు దాని కొరకు బాధ్యతగా ఉండుటకు మధ్య ముఖ్యమైన వ్యత్యాసము కలదు !

కొన్ని సమయములలో ఒక నిర్ణీతమైన సంభావమునకు మీరు కారణం కాకపోవచ్చు, కానీ అది మీ జీవితమును ప్రభావితము చేస్తున్నప్పుడు, మీరే ఆ సంభావమునకు బాధ్యులు. ఉదాహరణకు, మీ దేశములో రాజకీయ అవినీతికి మీరు కారకులు కాకపోవచ్చు, కానీ దేశము యొక్క నాగరికుడిగా దానికి మీరే బాధ్యులు! మీ యొక్క తర్కము ప్రకారముగా మీరు కారణము కాకపోవచ్చు, కానీ నిజానికి మీరు బాధ్యులు కారని అర్థం కాదు.

మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే మీరు బాధ్యత వహిస్తేనేగాని మీరు పరిస్థితిని మెరుగుపరచనూ లేరు లేక మీ యొక్క అంతరాకాశమును విస్తారపరచనూ లేరని.

Nithyananda blessing a devotee

బాధ్యత మిమ్మల్ని శక్తివంతులను చేస్తుంది

మనము సర్వదా బాధ్యత అనేది ఒక భారమని భావిస్తాము. కాదు! అది ఒక శక్తి! బాధ్యత మిమ్మల్ని నేరుగా నాయకత్వపు చైతన్యములోనికి తీసుకువెళుతుంది. మీ యొక్క కుటుంబమునకు మాత్రమే మీరు బాధ్యతగా భావించినంతకాలము, మీరు కేవలము మీ యొక్క కుటుంబమునకే పెద్ద. మీరు ఒక కులమునకు బాధ్యులుగా భావించినప్పుడు, మీరు ఒక కులమునకు నాయకులు ఔతారు. మీ యొక్క బాధ్యతాయుత భావన విస్తరించే కొలదీ, మీ యొక్క నాయకత్వపు లక్షణము కూడా విస్తరిస్తుంది. మొత్తము జగత్తుకంతటికి బాధ్యతగా భావించు నిర్ణయమే జీవన్ముక్తి! పూర్ణజగత్తుకు బాధ్యతగా భావించి మరియు ఆ భావన చొప్పున జీవించుటకు ఘోషించడం బాధ్యతాయుతఘోషణము. ఇది హిందూ ఆధ్యాత్మిక సాధనలో నిదిధ్యాసనగా ప్రసిద్ధమైనది. బాధ్యతాయుత ఘోషణ మీలో ప్రేమ యొక్క శక్తిని బయలుపరచును. మీ చుట్టూ జరుగుతున్న అంతటికీ మీరే బాధ్యులని మీరు విన్న క్షణమున మీరు అనుకుంటారు, 'కానీ రోడ్లపై ఉన్న చెత్త అంతటికీ నేను బాధ్యునిగా భావిస్తే, దినమంతా దానిని శుభ్రం చేస్తూ నేను ఇరుక్కుపోతాను! నేను ఇక వేరేదేమీ చేయలేకపోతాను!'

మీరు బాధ్యులుగా భావిస్తే, అంతయు సంతోషకరముగానే మీరు భావిస్తారు - ఎందుకంటే మిమ్మల్ని అశక్తులుగా ఏదీ చేయలేదు. కనుక మిమ్మల్ని మీరు బాధ్యత అనే దానితో శశక్తులను చేసుకుని మరియు ప్రేమ యొక్క శక్తిని బయలుపరచండి.

ప్రేమ యొక్క శక్తిని బయలుపరచడము చేత, మీరు –

■ సర్వదా పూర్ణత్వము మరియు శక్తి యొక్క స్థితి నుండి పనిచేస్తారు ■ పరిష్కారము పైన కేంద్రీకరించడము మొదలుపెట్టండి, సమస్యపై కాదు ■ మీ యొక్క అంతరాకాశమును విస్తరింపజేసి మరియు నవీన సంభావనీయతలను తెరవండి. ■ మీ యొక్క జీవితముపై ఒక ఉన్నత స్థాయి స్వాధీనతను పొందండి ■ మిమ్మల్ని మీరు సాఫల్యము యొక్క తరువాతి స్థాయికి లేవనెత్తుకుని మరియు నవీన జీవిగా పరిణమించండి.

Mind Map / Diagram
Women meditating

ప్రేమ యొక్క శక్తిని బయలుపరచుటకు అభ్యాసము

■ ఎక్కడైతే మిమ్మల్ని మీరు నిండుగా వ్యక్తపరచుకొనుట నుండి అణచిపెట్టుకుంటారో మీ జీవితము యొక్క ఆ భాగములన్నిటినీ వ్రాయండి. ఉదాహరణ: పనిచేసే చోటులో, బాంధవ్యములలో

■ మీ జీవితము యొక్క ఈ ఒక్కొక్క భాగముల కొరకు, మీకున్న ఆలోచనలను, మీరు పలికే మాటలు మరియు మీరు తీసుకొనే చర్యలను వ్రాయండి.

■ మీ జీవితము యొక్క ఏ అంశమునకు మీరు బాధ్యతను వహించుట లేదో దానికి బదులుగా ఎక్కడ మీరు బాహ్యపరిస్థితి మారుట కొరకు వేచియుంటున్నారో గుర్తించండి.

■ ఏదో ఒక భాగమును ఎన్నుకొని క్రొత్త పరిస్థితిని సృష్టించుట కొరకు మీ యొక్క బాధ్యతను ప్రకటించండి. అది జరుగుట కొరకు ఏది మారవలెనో గుర్తించండి.

■ ఒక వారం రోజులపాటు, మిమ్మల్ని మీరు కార్యానుసరించుకుని మీ యొక్క పురోగతిని వ్రాసుకోండి.