శ్రద్ధ అంటే ఏమిటి?
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
శ్రద్ధ అంటే మీరు మీ యొక్క అత్యంతోన్నతమైన సామర్ధ్యంలో స్థిరముగా ఉంటూ మరియు మీ గురించి మీరు ఏమని గ్రహించుకుంటారో, ఇతరులకు ఏ విధముగా మిమ్మల్ని మీరు ప్రతిరూపిస్తున్నారో, ఇతరులు తమ కోసం మిమ్మల్ని ఏ విధముగా వాంఛిస్తున్నారో, దాని నుండే జీవితం పట్ల స్పందించడం. దయయుంచి అర్థం చేసుకోండి, ఇది కూడా మీ యొక్క వ్యక్తిత్వమే, ఎందుకంటే ఇది మీరు మీ యొక్క జీవితములోని జనులను మరియు పరిస్థితులనుండి పొందేటటువంటి ఖచ్చితమైన అనుభవమును గూర్చి నిర్వచిస్తుంది! శ్రద్ధ అంటే ఈ ఒక్కొక్క పరిమాణములోనూ మీ యొక్క ఉచ్చతము యందు జీవించడము.
మూల ఆలోచనాక్రమములు
మీ యొక్క విభేదములకు మూలము
ఆలోచనాక్రమము అనగా ఎటువంటి పరిస్థితినందైనానూ అది ముందుగానే నిర్వచించబడినట్లుగా స్పందించే విధానము. ఈ స్పందించే విధానము శక్తివంతమైన గతానుభవముపై ఆధారితమై ఉంటుంది. అనగా వైఫల్యము, తిరస్కారము, దండింపబడుట, దూషణకు గురి అగుట లేక ప్రేమించినవారి యొక్క మరణమును తిలకించుట. అటువంటి విపత్కర క్షణములలో, మీరు మీ గురించి మరియు జీవితమును గూర్చి ఒక అభిప్రాయమును సృష్టించుకుంటారు – అనగా 'నేను బలహీనుడను' లేక 'నేను ఒక పరాజితుడను' లేక 'ఎవ్వరూ నన్ను ప్రేమించరు' లేక 'జీవితము ప్రమాదకరమైనది, కనుక నేను చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి.'
ఇంచుమించు మూల ఆలోచనాక్రమములు అన్నియూ నకారాత్మకమైనవే, ఏవైతే మీయొక్క జీవితములో సాఫల్యతకు దారి తీయవచ్చునో అవి కూడా, ఎందుకంటే అవి మీ యొక్క అశక్తత

శ్రద్ధ, మననము యొక్క శక్తిని ఎటుల బయలుపరచును?

మీరు లోతుగా చూచినచో, మీయొక్క సమస్యలన్నియూ మీ యొక్క చతుర వ్యక్తిత్వముల మధ్య ఉన్న విభేదముల నుండి ఉద్భవించినవి. మీ యొక్క పరిమాణములలో ఏ ఒక్కటైననూ అన్య వాటితో సమలేఖనములో లేనప్పుడు అది మీయొక్క జీవితములో రోగమును, బాధను మరియు అసంపూర్ణత్వమును కలిగిస్తుంది. దయయుంచి అర్ధంచేసుకోండి, మీరు మోస్తున్న ఈ వ్యక్తిత్వములన్నియూ అసలుగా మీ గురించి మీరు మోస్తున్న ఆలోచనాక్రమములే. మీ గురించి అన్యులకు గల ఛాయ కూడా వారిలో మీరు సృష్టించిన ఒక అభిప్రాయమే. కనుక మీయొక్క వ్యక్తిత్వములన్నిటికీ సృష్టికర్త మీరే, అర్ధంచేసుకోండి? ఇప్పుడు, ఒక వ్యక్తిత్వము వేరొక వ్యక్తిత్వముతో పోరాడుతున్నప్పుడు, మీ యొక్క మననము కేంద్రీకృతమై ఎలా ఉండగలదు? మీ శక్తి అంతయూ మీయొక్క పోరాడు వ్యక్తిత్వములను సమన్వయించుటకు ఉపయోగింపబడబోతుంది. మీయొక్క వ్యక్తిత్వములు లేక 'ఛాయలు' అన్నియూ మేళవింపులో ఉన్నప్పుడు, మీయొక్క మననము సమస్తమూ ఒకే దిక్కులో సమలేఖనమై ఉంటుంది. మీయొక్క మననము స్పష్టముగా మరియు పదునుగా, లేసర్ బీం గా అవుతుంది. మీరు మననముయొక్క శక్తిని మేలుకొలుపుతారు.
శ్రద్ధ ఉంటే, ఎరుకలేని జీవనము, మననము మరియు జీవించుటకు ఇకపై జాగా అనేదే లేదు, ఎందుకంటే మీరు మీ యొక్క జీవితములో పనిచేస్తున్న కారణములు మరియు వాటి ప్రభావములను గూర్చి సర్వదా ఎరిగి ఉంటారు.
మీరు ఏదైతే ఊహించగలరో అది వాస్తవము!
మిమ్మల్ని మీరు నిర్మించుకోవాలని అనుకొనే పద్దతికి మీయొక్క మననము తోడవుతుంది. మీ మననము యొక్క ఈ నాలుగు భాగములను పూర్తిగా పరిశుద్ధికావించవలసియున్నది. లోనికి చూచి మరియు మీ గురించి మీరు మోస్తున్న ఛాయలను గుర్తించండి. అప్పుడు ఈ నాలుగు ఛాయలకు ఏది