మాటల యొక్క శక్తితో మీ వాస్తవమును మీరు సృష్టించగలరు!
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

మీరు ఉచ్చరించే మాటలే మీరు! మీరు మీతో మరియు ఇతరులతో మాట్లాడే మాటలే మీరు అవుతారు. మీరు "నేను రోగిని, నేను రోగిని" అని అంటూనే ఉంటే, మీరు సులువుగా అస్వస్థులు అవుతారు. అదే విధంగా, నేను ఆరోగ్యవంతుడను, అని మీకు మీరు నిరంతరమూ చెప్పుకుంటే, మీ యొక్క సాహసము మరియు సత్తువ మేలుకుంటుంది. మీరు చాలా ఆరోగ్యముగా ఉంటారు! జగత్-శక్తి మీ యొక్క వ్యవస్థలో జాగృతి చెంది మరియు మీ యొక్క ఘోషణలను వాస్తవము చేస్తుంది. సరియైన పదములను ఎంపిక చేసుకోవడము చాలా ముఖ్యము, ఎందుకంటే మీ యొక్క వాక్-శక్తితో మీ యొక్క వాస్తవమును మీరు సృష్టించుకో గలరు!

మీ యొక్క మాటలకు శ్రవణము సంపూర్తిని తెస్తుంది
ఆఖరిసారిగా మీరు మీ యొక్క స్వీయ మాటలను నిజముగా విన్నది ఎప్పుడు ?
మనము మనదిగానీ వేరొకరిదిగానీ ఎన్నటికీ ఎప్పటికినీ నిజముగా వినము. ఎప్పుడైతే మీరు నిజముగా మీది మీరు ఆలకించడము మొదలుపెడతారో, మీరు సహజముగానే మీకు మరియు ఇతరులకు ఇచ్చే వాగ్దానములను గూర్చి మరింత ఎరిగిన వారు అవుతారు. సంపూర్తితో ఇతరుల యొక్క మాటలను వినగలిగే సామర్ధ్యము కూడా మీకు ఉంటుంది.

శ్రవణమనేది మీ యొక్క స్వంత ఎరుకలేని అభిప్రాయములు మరియు తీర్మానములను సృష్టించుకోకుండా, నేరుగా వాస్తవమును ఉన్నది ఉన్నట్లుగా నిర్వహించే సామర్ధ్యముతో లంకెపడి ఉంది. మీకు శ్రవణమనేది లేనప్పుడు, సమాచారము పూర్తిగా మీలో అవగతమవ్వక ముందే మీరు సర్వదా ఒక తీర్మానమునకు వచ్చేస్తారు.
అందుచేతనే హిందూ ఆధ్యాత్మికా సాధన యొక్క మొదటి అడుగే : శ్రవణము, ఏకీకృతముగా ఆలకించడము.

నేను మాటను నిలుపుకోలేకపోతే ఏమి జరుగును ?

ఒక వాగ్దానమును నిలుపుకొనుటకు మీరు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికినీ మీరు నిలుపుకోలేరని ఇంకనూ తెలిస్తే, మీరు మీతో మరియు అవతల వ్యక్తితో వాగ్దానమును నిలుపుకోలేనని ముందుగానే వారికి తెలుపుట ద్వారా పూర్తి చేసుకొనవచ్చును. అప్పుడు ఆ వాగ్దానము వలన బాధ కానీ అపరాధభావము కానీ ఏ ఇతర శేషదుష్ప్రభావము కానీ లేకుండా ముందుకు సాగిపోండి. అయితే పరిపూర్తి లేకుంటే పూర్తి చేసుకోండి ! అర్ధంచేసుకోండి, పూర్ణత్వము కూడా సంపూర్తియే.
సంపూర్తి అంటే మీ యొక్క అంతర్ మరియు బాహ్య ఆకాశములైన రెంటిటిలోనూ మీరు ఉచ్చరించే మాటలను పూర్ణత్వము వైపుగా సమలేఖనపరచడము. మీరు సంపూర్తి యొక్క స్థితిలో ఉన్నప్పుడు, వాక్కు యొక్క శక్తి మీలో వికసిస్తుంది.

పూర్ణత్వము కొరకు రెండు ప్రక్రియలు
అ. నిరంతరాయ పూర్ణత్వమునకు ప్రక్రియ

జీవితము సంభవించు విధముగా దాని యందు పాల్గొనుచూ ఉండుటకు గతము నుండి మిమ్మల్ని ఏదైనా అడ్డగించినప్పుడు అదే అసంపూర్ణత్వము. కనుక గుర్తు తెచ్చుకోవడము, పునర్జీవించడము మరియు మీ యొక్క గతము తాలూకు సంఘటనలు ఏవైతే మీలో బాధను కలిగించినవో వాటి నుండి మిమ్మల్ని మీరు ఉపశమనింప చేసుకోవడము చేతనే పూర్ణత్వము మొదలౌతుంది. మీ యొక్క గతమును దిద్దుకోగల ఉపాయము పూర్ణత్వము అనేది మాత్రమే.
- అద్దము ఎదురుగా కూర్చుని ఉండండి.
- మీ యొక్క యావత్ప్రతిబింబమును మీరు చూచుకునేటట్లుగా అద్దము సరిపడినంత పెద్దదిగా ఉండాలి.
- మీ యొక్క శరీరము మరియు ప్రతిబింబమునకు కంటికి- కంటికి మధ్య ఉన్నంత లోతైన సంపర్కం ఉండునట్లు కొనసాగించాలి.
- మీకూ మీ ప్రతిబింబమునకూ మధ్య లోతైన సంపర్కము కలిగిన క్షణమున, మొదటి విషయము మీకు కన్నీళ్ళు వస్తాయి.
- వాటిని రానివ్వండి.
- ఏదైతే మీకు మీరు చెప్పాలని అనుకుంటున్నారో, అద్దము ముందు కూర్చుని మాట్లాడండి
- మీతో కాలం గడపండి. మాట్లాడండి. మాట్లాడండి.
- మీ బాధల యొక్క మూల క్రమమును రూపొందించిన ఈ అసంపూర్ణ ఆలోచనా ధోరణిని మీలో సృష్టించిన మొట్టమొదటి జ్ఞాపకమును గుర్తించుటకు ఇప్పుడు ప్రయత్నించండి.
- మీరు మొదటిసారి విభేదమును అనుభూతి చెందిన మీ జీవితము యొక్క మొదటి పరిస్థితుల కొన్నిటి దగ్గరకు వెనక్కి వెళ్ళండి. ఆ పరిస్థితులు ప్రత్యేకముగా మీ జీవితము యొక్క మూడవ మరియు ఐదవ సంవత్సరముల మధ్య జరిగి ఉండి ఉండవచ్చును. ఆ పరిస్థితిని మరల జీవించండి.
- కన్నీళ్ళు వస్తే, కోపము వస్తే, వాటిని రానివ్వండి.
- మీ యొక్క గతముతో ముఖాముఖీగా నిలబడి ఉండగా, వ్యధ మాయమౌతుంది! కోపము మాయమౌతుంది. ఎప్పుడైతే కోపము మాయమౌతుందో, అది ప్రేమలోనికి మారుతుంది. దయఉంచి అర్ధం చేసుకొండి, శక్తి ఎప్పుడైతే కోపములా వ్యక్తమౌతుందో, శక్తి నుండి కోపమును తొలగించినప్పుడు అది ఆపాటున పూర్తిగా ప్రేమలోనికి మారుతుంది.
మీరు కేవలం మూలక్రమము పైనే పనిచేస్తే పూర్ణత్వము జరుగదు: ఆ మూలక్రమము నుండి మొలకెత్తిన ప్రతి సంఘటనయు కూడా పూర్తిగావించబడవలెను. దయఉంచి అర్ధంచేసుకోండి: మీ చిన్నతనము యందు మీకు కలిగిన చాలా మొట్ట మొదటి జ్ఞాపకము వద్దకు మీరు వెనక్కి వెళ్లి ఆ జ్ఞాపకమును పూర్తిచేసుకోవాలి. ఇంకా, ఈ రోజు వరకు కలిగి ఉన్న ఒక్కొక్క మరియు ప్రతీ క్రమమును అప్పుడు పూర్తిచేసుకోండి.

బి. యథేచ్ఛపూర్ణత్వమునకు ప్రక్రియ
పూర్ణత్వము అంటే అర్థం మీ యొక్క జీవితములో జరిగేది అంతయూ గుడ్డిగా స్వీకరించడమని కాదు. జీవనము మనకు సంభవించునట్టి విధములో ప్రతిఘటించకుండా ఉండడమే అని సరళముగా దాని అర్థం.
మన అసంపూర్ణత్వములన్నిటికీ మూలము మనం మోసే అభిప్రాయమే – జీవితము ఈ విధముగా ఉండకూడదు.
అందుకే మనం మన జీవితమంతా “ఎందుకు, ఎందుకు, ఎందుకు?”, “జీవితము ఎందుకు ఇంత చెడ్డది?”, “ఇది నాకు ఎందుకు జరిగింది?”, “మంచి వాళ్ళకు చెడు విషయములు ఎందుకు జరుగుతాయి?”, అని అడుగుతూ గడిపేస్తాము.
యథేచ్ఛ పూర్ణత్వము లేక త్రుటిలో పూర్ణత్వము అంటే ఒక విశేషమైన పరిస్థితిలో మీకు విభేదమును సృష్టిస్తున్న అవగాహనను సులువుగా వదిలివేయడమని అర్థం.
అది సంభవమే!
"ఎందుకు జీవితము ఈ విధముగా ఉంది?” అని అడగకండి.
దాని బదులు, నిర్ణయించుకోండి:
ఇదే జీవితము! కనుక, ఇప్పుడు ఏమిటి?

మీ యొక్క మాటలకు బాధ్యతను తీసుకోవడము
మీ యొక్క మాటలకు బాధ్యతను తీసుకోవడము అనగా ధర్మమును ఆచరించడము, సరియైన రీతిలో జీవించడము. హిందు కావ్యమైన మహాభారతములో, చెప్పబడియున్నది, "ఎవరైనా మీ పట్ల ఏది చేసినప్పుడు మీకు దుఃఖము కలుగుతుందో అది ఇతరులపట్ల చేయవద్దు. ఇదే ధర్మము".
ధర్మమును గుర్తుంచుకొని మరియు మిమ్మల్ని మీరు అడగండి, "ఈ యొక్క మాటలు నాకు లేక అవతల వ్యక్తికి వ్యధను కలిగిస్తాయా?"
మీకు మరియు ఇతరుల పట్ల మీరు ఉచ్చరించే మాటల యొక్క శక్తి మరియు తాకిడిని గూర్చి సర్వదా జాగరూకంగా వుండండి. సరియైన మాటలను ఉచ్చరించడము మరియు వాటిని పరిపూర్తి చేయడం కొరకు బాధ్యతగా భావించడము మీలో వాక్కు యొక్క శక్తిని బయలుపరుచును.
ఘోషణ యొక్క శక్తి
ఏకీకృతముగా మరియు సంపూర్తిగా ఉండేదను అన్న మీ యొక్క నిర్ణయమును బలపరచుకొనుటకు, మీకు మరియు ఇతరులకు దానిని ప్రకటించండి. ఎప్పుడైతే మీరు ఒక నిర్ణయమును ప్రకటిస్తారో, అది చెల్లాచెదురైన మీ యొక్క శక్తులను కూడబెట్టి మరియు కేంద్రీకరించి, మీ యొక్క ఘోషణమును వాస్తవములోనికి చేసు కొను వైపుగా బాధ్యతాయుత చర్యల ద్వారా సహాయపడుతుంది. ఎప్పుడు మీరు నిరంతరాయముగా మరియు ఎరుకతో మీ మాటలను సరియైన చర్యలకు సమలేఖన పరుస్తారో, మీ యొక్క మాటలు శక్తివంతం అవుతాయి. మీరు వాక్-శక్తి లేక వాక్-సిద్ధిని సాధిస్తారు. అదే మీరు మాట్లాడేది ఏదైననూ వాస్తవములోనికి చేయుశక్తి. ఇదే మాటల శక్తి యొక్క ఉత్కృష్టమైన అనుభూతి. చేస్తుంది. మననమనేది ఆకస్మికమైనది కాదు. – మననము మీయొక్క స్వేచ్చాయుత సంలగ్నతతో జరుగుతుంది.
మీ యొక్క చింతనాధోరణి అసలు మీవల్లనే ప్రోత్సహించబడి, వినోదించబడి మరియు సంవృద్ధి కావించబడుతుంది. కానీ దురదృష్టవశాత్తు, చింతన అనేది ఆకస్మికమైనదని మరియు మీరు మీ యొక్క మనస్సును స్వాధీనపరచలేరని మీరు నమ్ముతారు. మననము యొక్క శక్తిని మీరు బయలుపరచినప్పుడు, మీ యొక్క అత్యోన్నతమైన యోగ్యతను సాధించుకొనుటకు మీ యొక్క ఆలోచనలను మీరు యధేచ్ఛగా కేంద్రీకరించగలుగుతారు. నిరంతరమూ మీ యొక్క అత్యంతోన్నతమైన సంభావనీయతయందు పనిచేస్తూ ఉండడమే శ్రద్ధ. మననము యొక్క శక్తిని బయలుపరచు కీలకమే శ్రద్ధ.
