వాక్కు యొక్క శక్తిని బయల్పరుచుట
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
— సంపూర్తి
మీ యొక్క మాటలే మీ యొక్క జీవితము !


మీ యొక్క మాటలను
నిలబెట్టుకోవడం ఎందుకంత
ముఖ్యమైనది ?
మీరు తెలుసుకున్నా లేకపోయినా, మీ యొక్క జీవితము మీ మాటలు మరియు వాగ్దానముల పైనే నిర్మించబడినది. మీరు మీకు మరియు ఇతరులకు ఇచ్చిన మాటలు అనే నిర్మాణాక్రమము పైనే మీ యొక్క జీవన నిర్మాణము నిర్మించబడినది! మీ యొక్క జీవితమును ఒక్క నిర్మాణముతో పోల్చగలిగితే, మీరు మీకు మరియు ఇతరులకు ఇచ్చుకున్న మాటలు ఈ నిర్మాణము యొక్క పునాది వంటివి అని తెలుస్తుంది. అది ధూళి మరియు తుప్పుల నుండి స్వేచ్ఛగానే ఉండాలి, దానికర్థం అది ఎరుకలేని క్రమముల నుండి స్వేచ్ఛగా ఉండాలి.
మీకు మీరు మరియు ఇతరులకు ఇచ్చే అనాలోచితమైన మాటలే మీ యొక్క నిర్మాణము పైన ధూళి మరియు తుప్పు. తుప్పుపట్టిన మరియు దుమ్ముపట్టిన నిర్మాణాక్రమముపై నిర్మించబడిన నిర్మాణము కలకాలము నిలువదు! అది తప్పకుండా పరిశుద్ధమైన, ప్రామాణికమైన, బలమైన ఉక్కుతోనే తయారు కావాలి. అదేవిధముగా జీవితము, మీరు మీకు మరియు ఇతరులకు ఇచ్చిన మాటలు మరియు వాగ్దానములపైనే నిర్మించబడినది. అది ఎటువంటి అజ్ఞానము మరియు తెలియనితనముతోను లేకుండా ఉండాలి.
మీ జీవితము యొక్క పటుత్వము మీరు మీకు మరియు ఇతరులకు ఇచ్చే మాటలపైనే ఆధారపడి ఉంది. మీ యొక్క మాటలు చైతన్యవంతమైతే, మీ యొక్క జీవితము చైతన్యవంతముగా ఉంటుంది. మీ యొక్క మాటలు చైతన్యరాహిత్యములయితే మీ యొక్క జీవితము చైతన్యరాహిత్యముగానే ఉంటుంది. అందుచేతనే మీ యొక్క జీవితమునకు సంపూర్తి ఆధారమును ఏర్పరుచుతుంది. సంపూర్తి అనేది మీ యొక్క జీవశక్తిలోని భాగము. అదే శక్తి పైన మీరు మరియు జగత్తు మొత్తం నడుస్తున్నది !
సంపూర్తి అంటే ఏమిటి ?
సంపూర్తి అంటే మీరు మీకు మరియు ఇతరులకు ఇచ్చుకున్న మాటలను మరియు ఆలోచనలను పరిపూర్తి చేయుట, ఇంకా, మీతో మరియు జీవితముతో పూర్ణత్వ స్థితిని అనుభూతి చెందుట.
సంపూర్తి అంటే మనం మన జీవితములో చేసే పెద్ద వాగ్దానముల గురించి మాత్రమే కాదు, అది మీకు మీరు చెప్పుకునేటంతటి సాదా అయిన విషయము కావచ్చును, "నేను ప్రతి ఉదయము త్వరగా లేచి మరియు యోగ సాధన చేయబోతున్నాను", లేక "సాయంత్రము ఐదు గంటలకు కలుద్దాము" అని స్నేహితునకు చెప్పడము'. ఏది ఏమైనప్పటికీ మీరు మీకు మరియు ఇతరులకు ఇచ్చిన మాటను, అదే మీ యొక్క జీవితముగా నిలబెట్టుకోవడమే నిజమైన సంపూర్తి.
మీ యొక్క నిలబెట్టుకోని మాటలే
శేషదుఃస్వభావమును సృష్టిస్తుంది
ఎన్నోసార్లు, మీరు మీకు మరియు ఇతరులకు
చేసిన వాగ్దానములు మీకు గుర్తు కూడా
ఉండవు, ఎందుకంటే మీ యొక్క మాటలను
చాలా తెలియనితనముతో, ఆలోచించకుండా
వాడతారు. ఇతరులపై ఉండగల వాటి యొక్క
తాకిడిని మనము గుర్తించము.
ఎప్పుడైతే మీరు వాగ్దానము చేసి దానిని నిలబెట్టుకోరో, అది మీలో గానీ ఇతర వ్యక్తిలో గానీ 'శేషదుఃస్వభావమును' వదిలిపెడుతుంది. అదే మీ యొక్క ఆత్మవిశ్వాసమును మరియు అవతల వ్యక్తికి మీ పై గల విశ్వాసమును నాశనము చేయగలదు.
మీరు మీ యొక్క బాంధవ్యములలోను లేక వ్యాపారములోను లేక మీ యొక్క జీవితములో ఎక్కడైనను అనాలోచిత మాటలను ఉచ్చరించినప్పుడు, మీకు జీవితము ఎటువంటి పర్యవసానములను తెస్తుందో మీరు యెరుగరు. ఎప్పుడైతే మీ మాటల యొక్క పర్యవసానములను గూర్చి ఎరుగకుండా ఉంటారో, జీవితము సర్వదా మీకు ఆఘాతములను తెస్తుంది. జీవితము నిరంతరాయముగా మీకు ఆఘాతములను తీసుకొని వస్తుంటే, అర్ధంచేసుకోండి - మీరు సంపూర్తిలో జీవించుట లేదు!


ఎందుకు మీరు మాటలను ఎరుకతో వాడాలి ?
పదములను ఎరుకతో, జాగరూకతతో వాడడము, మీపై మరియు ఇతరులపై మీ మాటల యొక్క తాకిడిని అర్ధం చేసుకునేందుకు మీకు సహాయపడుతుంది.
సరియైన పదములు వాడడము వలన మీ గురించి మీరు ఆలోచించే మరియు భావించే విధానమును వెంటనే మార్చగలదు. ఒక పరిస్థితిని మీరు సరియైన మాటలతో నిర్వహించినప్పుడు దానిపట్ల మీ యొక్క శరీర ప్రతిస్పందనలో మార్పును కూడా మీరు గమనిస్తారు.
సరియైన పదములు మీ యొక్క అంతరాకాశమును ప్రశాంతముగా, విభేదముక్తముగా ఉంచుతూ, మీ యొక్క ఆరోగ్యమును, ఆయువును ప్రత్యక్షముగా మెరుగుపరచుతుంది.
మీకు మీరు మరియు ఇతరులకు సరియైన మాటలను సృష్టించి మరియు వ్యక్తపరచడము వలన, మీరు ఎంపిక చేసుకొన్న రీతిలో వాస్తవమును యధార్థముగా మీరు తీర్చిదిద్దు కొనగలరు!