అధ్యాయం - 9: అసంతృప్తి నుంచి కృతజ్ఞతకు
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(From discontent to gratitude)
ఇప్పుడు మనం చివరి చక్రం అయిన సహస్రార చక్రం గురించి చూద్దాము. ఈ చక్రం మన శిరస్సు శీర్ష భాగంలో, అంటే తలపైన ఉంటుంది.
సంస్కృతంలో సహస్రార అంటే వేయిరేకులు అని అర్థం. ఈ చక్రం వికసించినప్పుడు వేయిరేకుల పద్మంలా ఉంటుంది. యోగులు, గురువులూ ఈ చక్రాన్ని వికసింపచేసినప్పుడు వాళ్ళ తల మీద వేయిరేకులు పద్మం విప్పారినట్టు వాళ్ళ అనుభవాల బట్టి తెలుస్తుంది. అందుకే ఈ చక్రానికి ఆ పేరు వచ్చింది.
అసంతృప్తి, జీవితాన్ని చాలా తేలికగా, యధాలాపంగా తీసుకునే తత్వం ఈ చక్రాన్ని బంధించివేస్తాయి. కృతజ్ఞతా భావం, ఆత్మ తృప్తి ఉన్నప్పుడు ఈ చక్రం వికసించుతుంది.
ధ్యాన పద్ధతి : సహస్రార ధ్యానం : (సుఫీ ధ్యాన పద్ధతి)
చిన్నకథ :
ఒక వ్యక్తి భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థించుతుంటాడు, “హే ! భగవంతుడా, నాకు చాలినంత డబ్బులేదు. దయచేసి నాకు కోటి రూపాయల లాటరీ వచ్చేటట్టు చేయి. నాకు అలా డబ్బు వస్తే అందులో 20% నీకు ఇస్తాను. ఒక వేళ నీకు నా మీద నమ్మకం లేకపోతే అందులో 20 లక్షలు నీవు ముందే తీసేసుకుని మిగిలిన డబ్బు నాకు ఇవ్వు”
(అంతా పెద్దగా నవ్వుతారు)
మన వ్యవహారాలన్నీ ఇదే విధంగా ఉంటాయి. అంతా వ్యాపారం. ఇంత స్పష్టంగా ఈ కథలో లాగానే కాకపోయినా, మీ మీ ప్రార్థనలు, పూజలని కొంచెం లోతుగా విశ్లేషించితే, మీ వ్యవహారాలన్నీ, భగవంతునితో కూడా వ్యాపార పద్ధతిలోనే ఉంటాయి అని మీకు అర్థమవుతుంది.
ఒక చిన్న కథ :
ఒక రోజు ఒక పేద వ్యక్తి అక్బర్ చక్రవర్తి దగ్గరకి, ఆయనని తన కొడుకు చదువు కోసం డబ్బు సహాయం చేయమని అడుగుదామని వెళతాడు. అక్బరు తనని సహాయం అడగటానికి వచ్చిన వాళ్ళని ఖాళీ చేతులతో వెనక్కి పంపడని పేరు.
ఈ పేద వ్యక్తి రాజమందిరం చేరే సమయానికి అక్బర్ ప్రార్ధన చేస్తుంటాడు. అందుకని ఆ వ్యక్తి మిగతా వారితో పాటు ప్రార్థనా హాలు బయట నిబడతాడు.
అక్బర్ బయటకి వచ్చాక అందరూ ఆయన దగ్గరకి వెళ్ళి, వాళ్ళ బాధలు కోరికలు చెప్పుకుని సహాయం పొంది వెళ్ళిపోతున్నారు. అయితే ఈ పేద వ్యక్తి మాత్రం అక్బర్ ని సహాయం ఏమి అడగకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు.
అక్బర్ ఆ విషయాన్ని గమనించి ఆ వ్యక్తిని వెనక్కి పిలిచి “నీవు నన్ను ఏమి అడగకుండా వెళ్ళిపోతున్నావు. ఎందుకని అలా వెళ్ళిపోతున్నావు” అని అడుగుతాడు.
దానికి ఆ పేద వ్యక్తి, “మహారాజా! నేను మిమ్మలని దానం అడగాలని వచ్చాను, కానీ మీరే భిక్ష అడగటం చూసాను” అని అంటాడు.
మీరు మన ప్రార్థనలు, పూజలు గమనిస్తే, మనందరం బిక్షగాళ్ళమని అర్థమవుతుంది. మనం కేవలం అడుగుతాం. అడుగుతూనే ఉంటాం. మన పూజ కేవలం ఒక భిక్షపాత్ర. మనం వస్తువులు కావాలని, మంచి సంబంధాలు ఉండాలని, అధికారం కావాలని, మన లక్ష్యాలు నెరవేరాలని, అందం కావాలని ఇలా ఒకటేమిటి, ఎన్నో అడుగుతుంటాము.
మనం నిరంతరం మన మైండ్ లో ఏదో ఒక దానిని అడుగుతూనే ఉంటాము. నిజానికి ఈ అడగటం అనేది ఎంతవరకూ వెళ్ళిందంటే ఇది మనలో ఒక అచేతన కార్యక్రమంలా నిరంతరం జరిగేంతగా. కాని మనం అలా అడుగుతున్నాము అని చెబితే నమ్మం. మేము అడగటం లేదు అని వాదిస్తాము. ఎందుకంటే ఈ అడగటం అనేది మనకు కనబడదు కాబట్టి. మనం దానిని మన సహజ జీవితం అని అనుకుంటాము. మనం ఈ అడగటంలో ఎంతగా నిమగ్నమయిపోయామంటే, దానిని మన నుంచి వేరు చేసి చూడలేకపోతున్నాము. దానిని స్వచ్ఛమైన మైండ్ లో చూడలేకపోతున్నాం.
అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడం: ప్రపంచంలో రెండు రకాల మతాలు ఉన్నాయి. ప్రార్థనల ఆధారమైన మతం; కృతజ్ఞత ఆధారంగా ఉన్న మతాలు.
ప్రార్థనల మతం నిరంతరం ఏదో ఒకటి కావాలని కోరుకోవటాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. దీనిని చాలామంది అనుసరించుతారు. ఎందుకంటే ఇది అడిగే మనస్తత్వానికి సరిపోతుంది. ఇది మన చిన్నతనం నుంచి మనకు నేర్పించిన మనలోపల షరతులతో ఉంచటమనే తత్వానికి సరిపోతుంది. మన చిన్నతనం నుంచి అడగటమే ప్రార్థన అని మనం నేర్చుకున్నాము. మనకి అలా నేర్పించారు. ఇది మనం భగవంతునికి దగ్గర అయ్యే ఒక సహజమైన పద్ధతి అని అనుకుంటాం.
కృతజ్ఞతని ఆధారంగా చేసుకునే మతాలలో కేవలం భగవంతుని పైన వారి లోపలి నుంచి పొంగి ఉప్పొంగిపోయే కృతజ్ఞత ఉంటుంది. ఇది మనకి చిన్న తనం నుంచీ నేర్పిన విషయానికి సరిగ్గా వ్యతిరేకమైఉనది. కేవలం మనం పొందిన వాటికి కృతజ్ఞతలు చెప్పటం మాత్రమే మనకి నేర్పించారు. మనకి కృతజ్ఞత అనేది సమాజంలో మనం పాటించదగిన ఒక మర్యాదగా మాత్రమే నేర్పించారు.
అటువంటప్పుడు మనం నిరంతరం కృతజ్ఞతతో ఎలా ఉండగలం? ఇది మనకి చాలా అతిగా అనిపిస్తుంది. అందుకే ఈ కృతజ్ఞతా భావాన్ని కలిగిన మతాలని చాలా కొద్ది మంది మాత్రమే అనుసరించుతారు.
ధ్యాన మతాలు అయిన బౌద్ధ మతం, సుఫీ మతం అనేవి ఈ కృతజ్ఞతని ఆధారంగా చేసుకున్న మతాలు. ఈ మతాలని అనుసరించేవాళ్ళు, పాటించేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆ తక్కువమంది కూడా ఎంతో ఉన్నతమైన వాళ్ళు.
చూడండి: ప్రార్థన చేయటం తప్పుకాదు. కానీ ప్రార్థన లేదా పూజ అంటే కేవలం ఆ అడగటం దగ్గరే ఆగిపోతే, అది అసలు సమస్య. ప్రార్థన అనేది మనని ధ్యానంలోనికి నెట్టగలిగే ఒక సాధనలా ఉండాలి. ధ్యానం అంటేనే కృతజ్ఞత చూపటం. ధ్యానంలో కృతజ్ఞత ప్రార్థన అవుతుంది. అప్పుడు మీ అంతరాత్మ పరమానందాన్ని పొందుతుంది.
మీరు అనుకోవచ్చు. కృతజ్ఞత చూపటం అన్నది సమాజపు మర్యాద. అది ధ్యానం ఎలా అవుతుంది? కానీ మీరు ఎప్పుడైతే కృతజ్ఞతని చూపించటం మొదలు పెడతారో అప్పుడు ఈ విషయం మీకు స్పష్టంగా అర్ధమవుతుంది. ఎప్పుడైతే మీరు కృతజ్ఞతని చూపించుతారో అప్పుడు మీకు ఈ జీవితం యొక్క విలువ కూడా అర్ధమవుతుంది.
మీకు ఒక విషయం చెబుతాను: మీరు కేవలం మిమ్మలని ప్రత్యక్షంగా సంరక్షించి, మీ వృద్ధికి తోడ్పడే వారి గురించి మాత్రమే మీకు తెలుస్తుంది. కానీ కొన్ని వేలసార్లు మీకు సహాయం చేస్తూ, మిమ్మలని రక్షించుతూ, మిమ్మలని జాగ్రత్తగా చూస్తున్న ఈ అనంత చైతన్య సృష్టి, ఈ విశ్వం, ఈ విశ్వ శక్తి గురించి మాత్రం మీకు తెలియదు.
అయితే మీకు ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు లేదా మీరు ఏదైనా పొందినపుడు మీరు ఏమనుకుంటారు: అది పొందే అర్హత నాకు ఉన్నది. అందుకే అది నాకు దక్కింది అని అనుకుంటారు. లేదా; అనుకోకుండా నాకు అవన్నీ వచ్చాయి అని అనుకుంటారు. మీరు ఎప్పుడైతే మిమ్మలని సదా రక్షించే ఆ అనంత శక్తి యొక్క అదృశ్య హస్తాన్ని అనుభూతితో చూడగలరో అప్పుడు మీకు ఈ అనంత సృష్టి మిమ్మలని కోరుతుందని, మిమ్మలని ఆదరిస్తుందని అర్ధ చేసుకుంటారు. అప్పుడే మీరు ఈ సృష్టి మీపై వరాల జల్లులు నిరంతరం కురిపిస్తూ ఉంటుంది అని అర్ధ చేసుకుంటారు.
మీరు జీవించి ఉన్నారు అంటేనే అర్థం మీరు ఈ అనంత సృష్టికి కావాలి అని, ఆ శక్తి అందుకే మిమ్మలని కాపాడుతుందనేది ఒక సత్యం. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకోరో అప్పుడు మీరు స్తబ్దతా, నిరుత్సాహంగా, కుంగుబాటుతనంతో ఉండిపోతారు. మీరు ఈ ప్రపంచంలోనే సర్వం పోగొట్టుకున్న వ్యక్తిలా అయిపోతారు.
నేను చెప్పే విషయాలని మీరు మీ అంతరాత్మతో వినగలిగితే, మిమ్ములని మీరు మార్చుకుంటారు. ఈ అనంత శక్తి మీకు ఇచ్చే అద్భుతాల అందాలని అనుభవించగలుగుతారు.
మనలో చాలామంది భగవంతుణ్ణి భయంతో ప్రార్థించుతాము. కొంతమంది తల్లులు తమ పిల్లతో, ప్రార్థన, పూజ చేయకపోతే దేవుడికి కోపం వస్తుంది అని అంటారు. ఇలాంటి మాటలు పిల్లల మనస్సులో నాటుకుపోయి, భగవంతుడు అనే మాటకి తప్పు అర్థాలని వాళ్ళ మనసుతో కల్పించుతాయి. మీరు మీ పిల్లలకి పసి వయసులో విధించే నిబంధనలు, షరతులు, వాళ్ళు పెద్దవారయ్యాక వీటివలన సమస్యలతో అయోమయంలో పడిపోతారు. వాళ్ళు భగవంతుడు అనే ఈ అనంత చైతన్య సృష్టిని ఆనందంతో, ప్రేమతో, కృతజ్ఞతతో కౌగిలించుకోకుండా; భయంతో గౌరవంతో దూరంగా ఉండిపోతారు.
మతాన్ని భయంతో అనుసరించితే అది మిమ్ములని ఎక్కడికీ తీసుకెళ్ళదు. అది మీ లోపల ఎటువంటి మార్పులూ తీసుకురాదు. మీరు ఈ నమ్మకంతో, ప్రతి ప్రార్థనలోనూ ఏదో ఒకటి అడుగుతూ మీరు ప్రాపంచిక వస్తువులు, ఆస్తులు విషయంలో వృద్ధి చెందుతారేమో గాని మీ అంతరంగంలో మాత్రం ఎటువంటి అభివృద్ధి ఉండదు. ఈ వస్తు సంబంధమైన దారిలో తీసుకువెళ్ళే మతాలలో జీవితంలో కుంగిపోయే వారి సంగతి మీకు చెప్పాను కదా, ఇది అలానే ఉంటుంది.
ఈ అనంత చైతన్య సృష్టికి, ఆ భగవంతునికి లోతైన ప్రేమ కృతజ్ఞతా భావాలని చూపించగలుగుతూ మతాన్ని మనం అనుసరించాలి. సమాజం మీకు భగవంతుణ్ణి
భయంతో పూజించమని చెబుతుంది. కానీ నేను మీకు చెబుతున్నాను; అలా ఎప్పుడూ చేయకండి. నిరంతరం ప్రేమతో, కృతజ్ఞతతో ఆ భగవంతుణ్ని పూజించండి, ప్రేమించండి.
ఒక చిన్న కథ :
ఒక సుఫీ గురువు జున్నాబ్ ప్రతి రోజు భగవంతునికి కృతజ్ఞతులు తెలుపుతూ ఐదుసార్లు ప్రార్ధన చేసేవాడు. ఒకసారి ఆయన తన శిష్యులతో కలిసి కొన్ని గ్రామాల గుండా వెళుతుంటాడు. ఆ గ్రామాలలో వారికి సూఫీ మతం గురించి తెలియదు.
మొదటి గ్రామంలో వీళ్ళు బిక్షాటన చేస్తుంటే తిట్టి ఏదో కొంత ఆహారం ఇస్తారు. రెండవ గ్రామం వాళ్ళు అసలు ఏమీ ఇవ్వరు. మూడవ గ్రామం వాళ్ళు వీళ్ళని కర్రలతో ఊరు నుంచి తరిమివేస్తారు.
ఆ రోజు రాత్రి గురువు ఎప్పటిలాగానే మోకాళ్ళమీద కూర్చోని భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థన చేస్తాడు. ఇదంతా శిష్యులు చూస్తుంటారు. గురువు భగవంతునికి ఎందుకు కృతజ్ఞతలు చెబుతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి చాలా కోపం వస్తుంది.
వాళ్ళు గట్టిగా గురువుతో ఇలా అంటారు, "గురుదేవా! మూడు రోజుల నుంచి మనకి భోజనం లేదు. ఇవాళ అయితే మనని కొట్టి, కుక్కలని తరిమినట్టు తమిమేసారు. దీనికి మీరు భగవంతునికి కృతజ్ఞతలు చెబుతున్నారా?"
గురువు వాళ్ళ అందరివైపు ఒక సారి చూసి, "మీరు మూడు రోజుల ఆకలి గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు ముఫ్పై సంవత్సరాలు ఆహారం పొందినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారా? ఒక విషయం తెలుసుకోండి. నా కృతజ్ఞతలు నేను ఏదో పొందాను లేదా పొందలేదు అని కాదు. ఇది నా అంతరాత్మలో ఉండే గాఢమైన ప్రేమ, ఆనందం. ఇది ఎన్నికలేని ప్రార్థనతో కూడిన భావాల వెల్లడి మాత్రమే" అంతే అంటాడు.
ఎప్పుడైతే మీలో పొంగుతున్న కృతజ్ఞత ఉంటుందో, మీరు మీ లోపల అంతరంగంలో మరేమీ అవసరం లేదు అని అనుకుంటారు. దీని అర్థం మీరు ధ్యానంలో పడ్డారు అని. అప్పుడు మీరు దేని గురించి బాధపడరు. మీరు అప్పుడు సరియైన మార్గంలో ఉంటారు. అప్పుడు మీ అభివృద్ధికి మీ మైండ్ ఒక అడ్డం కాదు. మీ మైండ్ మాయమైపోతుంది. మీ మైండ్ మీలోనికి రాదు. ఎందుకంటే మీ హృదయం నిండిపోయి ఉంటుంది. అందులో మైండ్‌కి స్థానం ఉండదు. ఎప్పుడైతే మైండ్‌కి స్థానం ఉండదో, అప్పుడు అసంతృప్తికి స్థానం ఉండదు. అసలు అది ఎక్కడ నుంచి రాగలుగుతుంది. అసంతృప్తి హృదయంలోంచి రాదు. అది పూర్తిగా మైండ్‌కి సంబంధించిన విషయం.
మీ మైండ్ నిరంతరం మీకు మీ అంతరాత్మకి మధ్య నిలబడుతుంది. అది మిమ్మలని ఈ అనంత చైతన్యంతో మాట్లాడనివ్వదు. అందులోనికి చూడనివ్వదు. ఆ అనుభూతులని పొందనీయదు. మీరు ఒక్కసారి మీ మైండ్‌కి అతీతంగా వెళ్ళగలిగితే ఈ అనంత చైతన్యంలోని అందాలు చూడగలుగుతారు. అప్పుడు కృతజ్ఞతే మీ పూజ, ప్రార్థనా అవుతాయి. మీ అంతరాత్మ నిత్యానందంతో నిండిపోతుంది. అప్పుడు మీరు స్వేచ్ఛని, శాశ్వతమైన నిత్యానందాన్ని అనుభవింటారు.
మీరు ఎప్పుడైతే ఈ లౌకిక తర్కాన్ని మీ మైండ్ నుంచి వదిలేస్తారో, అప్పుడు మీరు నదిలా ప్రవహించుతారు. మీరు ఎటువంటి ఎంపిక లేకుండా, ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా, ఆనందంగా, ఉత్సాహంగా ఒక చైతన్య స్రవంతిలా ప్రవహించుతారు. అప్పుడు మీరు పోషించవలసిన పాత్రని చక్కగా పోషించుతూ, ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవిస్తారు. అప్పుడు మీరు ఈ అద్భుత నాటకంలో ఒక భాగం అని అర్థ చేసుకుంటారు. మీరు ఈ జగన్నాటక దర్శకునికి అనుగుణంగా, మారగలిగితే మీ పాత్రని మీరు సమర్థవంతంగా పోషించి, మీ భాగాన్ని మీరు సంతోషంగా చేయగలుగుతారు. మీరు ఆనందంగా ఉంటారు.
మీరు ప్రవాహానికి ఎదురు వెళితే ఎక్కువ శ్రమ పడాలి. ఎంపికలు చేసుకోవాలి., అలా కాకుండా మీరు ప్రవాహంతో పాటుగా వెళితే ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. మీరు బలహీనులు కారు. మీరు మానసికంగా కుంగిపోరు. మీరు తేలికగా తేలిపోతూ, ఆహ్లాదంగా ఆనందంగా మీ పాత్రని, మీ భాగాన్ని సంతోషంగా పోషించుతూ జీవిస్తారు. అప్పుడు జీవింలో ప్రతిదీ చాలా ఆనందంగా, అద్భుతంగా ఉంటాయి.
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తి ట్రయిన్లో ప్రయాణం చేస్తూ సమయమంతా బయట అందమైన ప్రకృతిని చూస్తూ గడిపేస్తుంటాడు. అంతలో ఒక పెద్దావిడ వచ్చి అతని ప్రక్కన కూర్చుంటుంది. అతను ఆమెని చూసి ప్రయాణం మొత్తంలో చాలా బాగున్న విషయం, బయట ఊపిరి తీయలేనంత అందమైన ప్రకృతిని చూడటం అని అంటాడు. దానికి ఆమె అలానా అన్నట్టు తల ఊపుతుంది.
ఆమె కాసేపు అలా కూర్చుని కిటికీ నుండి బయటకి చూసి, లేచి వెళ్లిపోతుంది. కొంచెంసేపయ్యాక మళ్ళీ వచ్చి కూర్చుని, కొంచెం సేపు కిటికీ లోంచి బయటకి చూసి వెళ్ళిపోతుంది కొంత సేపయ్యాక మళ్ళీ వస్తుంది. ఈ సారి ఆమె అతని వెనుక కూర్చుంటుంది. కొంచెం సేపు అయ్యాక, ఆమె అతని వీపు మీద కొట్టి ఇలా అంటుంది. "ఎక్స్యూజ్ మీ, నీవు నేను చూడనిది ఏమైనా చూసావా?"
(అంతా నవ్వులు)
మనకి ఈ అనంత సృష్టిలోని అందాలని చూసి ఆనందించటం చేతకానప్పుడు మనం సమస్తం పోగొట్టుకుంటాము. మనం నిరంతరం ఆనందపడటానికి, ఉత్సాహం చేసుకోవటానికి అన్నింటికీ కారణాలు వెతుకుతుంటాము. మనము ఏదీ ఆనందించాము ? మనం ఏది ఆనందించలేదు? అని ప్రశ్నించుతుంటాము. ఈ కారణంగానే మనం ఈ అనంత చైతన్య సృష్టితో సంబంధం పోగొట్టుకుంటాము.
మనం మన చుట్టుప్రక్కల ఉన్నదానికి కృతజ్ఞత చూపించవలసినది పోయి, మనం నిరంతరం అడుగుతుంటాము. ప్రశ్నించుతుంటాము.
మనం తిరిగి ఈ సృష్టితో మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. కృతజ్ఞతా భావం తిరిగి మనకి ఆ సంబంధాన్ని తెచ్చి ఇస్తుంది. అది మన మూలాలను మరొక సారి కనుక్కోవటానికి సహాయం చేస్తుంది. అది ఈ ప్రకృతిలో మనం కలిసిపోయేలా, ఈసృష్టిలో అనుబంధం పెరిగేలా చేస్తుంది.
చిన్న కథ :
ఒక వ్యక్తి గుడిలో ఎంతో దీనంగా, గట్టిగా ఇలా ప్రార్ధన చేస్తాడు, "భగవంతుడా ! నాకు వెయ్యి రూపాయలు ఒక 15 రోజులకి ఇవ్వు. అది నాకు చాలా అవసరం. నేను 16వ రోజున నీకు తిరిగి ఇచ్చేస్తాను. నేను ఎప్పుడయితే నా మొదటి చెక్కుని తీసుకుంటానో నీ డబ్బు ఇచ్చేస్తాను" అంటాడు. ఆ గుడి పూజారి అతని ప్రార్థన వింటాడు. అతనికి ఆ వ్యక్తి మీద జాలి కలుగుతుంది. ఆయన దగ్గర ఐదు వందల రూపాయలు ఉంటాయి. అవి ఒక కవరులో పెట్టి భగవంతుడు నీకు ఇమ్మన్నాడు అని చెప్పి ఇస్తాడు.
ఆవ్యక్తి చాలా ఆనందపడిపోతాడు. ఇంటికి వెళ్ళి కవరు విప్పి చూసి, డబ్బు లెక్కపెడతారు. అందులో ఐదు వందలే ఉంటాయి. వెయ్యి రూపాయలు ఉండవు.
అతను ఆ మర్నాడు గుడికి వెళ్ళి దేవుడుని ఇలా ప్రార్ధన చేస్తాడు, "భగవంతుడా ఈ సారి నీవు నాకు డబ్బు పూజారి ద్వారా పంపవద్దు. నువ్వే నేరుగా నాకు ఇవ్వు. పూజారి అందులో సగం తీసేసుకున్నాడు" అని అంటాడు.
(అంతా నవ్వులు)
మనం ప్రతీదీ యధాలాపంగా, మామూలుగా తీసుకుంటాం. అందుకే నిరంతరం అసంతృప్తితో ఉంటాం.
ఒక విషయం గుర్తుంచుకోండి : మీకు జీవితమే ఒక బహుమతి.
మీరు ఈ జీవితాన్ని పొందటానికి చాలా శ్రమ పడ్డారా ? మీలో ఎవరైనా చెప్పగలరా ? మీలో ఎవరు ఈ జీవితాన్ని పొందటానికి చాలా కష్టపడ్డారు అంటే చెప్పండి ? లేదు.
అందుకే మనకి దీని విలువ తెలియదు. మనం ప్రతీ దానిని యధాలాపంగా ఏదో ఉన్నదిలే అన్నటుగా తీసుకుంటాము. మన శరీరం, మన ఆహారం, ఈ ప్రకృతిలోని అందాలు, ఇలా ప్రతీదీ మనకి చాలా సామన్వమైన, యధాలాపమైనవే. మనం భగవంతుణ్ణి వజ్రపు ఉంగరం కావాలి అని అడుగుతాం. కానీ భగవంతుడు మనకి ఆ ఉంగరం పెట్టుకోవటానికి వేళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పం. అలా కొంత కాలం గడిచేటప్పటికీ వజ్రం ఉంగరం కూడా మనకి విలువలేనిది అయిపోతుంది.
చిన్న కథ :
ఒక రోజు ఒక స్కూల్ టీచర్ స్టూడెంట్స్ ప్రపంచంలోని ఏడు అద్భుతాలని వ్రాయమని చెప్పింది. పిల్లలందరూ ప్రపంచపు అద్భుతాలైన గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా, ఈజిప్ట్ పిరమిడ్స్, హాంగింగ్ గార్డెన్స్, ఇలా అన్నీ రాస్తుంటారు. ఒక అమ్మాయి మాత్రం అలా రాస్తూనే ఉన్నది. మధ్యలో తల అటూ ఇటూ తిప్పుతూ రాస్తుంది.
అప్పుడు టీచర్ ఆ అమ్మాయి దగ్గరకి వచ్చి "ఏమయింది, నువ్వు నేర్చుకున్నవి మర్చిపోయావా ?" అని అడుగుతుంది.
ఆ చిన్న అమ్మాయి "కాదు టీచర్, నాకు కొంచెం అయోమయంగా ఉన్నది. ఏడు అద్భుతాల కంటే చాలా ఉన్నాయి కదా" అంటుంది.
అప్పుడు టీచర్ ఆశ్చర్యపడి ఆ అమ్మాయి రాసినవి గట్టిగా చదువుతుంది. ప్రపంచంలోని ఏడు అద్భుతాలు : నేను చూడటం, నేను వాసన చూడటం ; నేను వినటం ; నేను నవ్వటం ; నేను ప్రేమించగలగటం. క్లాసు మొత్తం అకస్మాత్తుగా నిశ్శబ్దంగా అయిపోతుంది.
ఇలాంటి చిన్న విషయాలని మనం మర్చిపోతాం. ఎందుకంటే అవి చాలా చిన్నవి అని మనం అనుకుంటాం. ఏదైనా మనకి సులభంగా లభిస్తే దానిని తక్కువగా, చిన్న విషయంలా చూస్తాము. ఈ ప్రపంచంలో లక్షల మంది చూడలేరు, వినలేరు, మాట్లాడలేరు. మనం ఈ విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించం. మనం నిరంతర, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఆలోచించుతాము. అంతే
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తి పల్లెటూరుకి వెళ్ళటానికి హైవే మీద కారులో వెళుతుంటాడు. అకస్మాత్తుగా రోడ్డు మీద కారు ఆగిపోతుంది. కారణం ఏమిటా అని చూస్తే, కారులో పెట్రోలు అయిపోతుంది. అతను దారి మధ్యలో ఉన్నాడు. ఏమి చేయాలో తెలియదు. చేతుల్లో డబ్బులు కూడా లేవు. అతను చాలా దూరం నడిచి ఒక టౌన్ చేరతారు. పెట్రోల్ బంక్‌కి వెళితే డబ్బులేకుండా పెట్రోలు ఇవ్వమంటారు. దానికి ఎదురుగా మరొక పెట్రోలు బంకు ఉంటుంది. అతను అక్కడికి వెళ్ళి తన సంగతి అంతా చెబుతాడు. అతనిని చూసి జాలిపడి ఆ బంకు యజమాని కొన్ని లీటర్ల పెట్రోలు డబ్బు తీసుకోకుండా ఇస్తాను అంటాడు.
అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు. "పెట్రోలు బదులు డబ్బులు ఇవ్వండి. మీ ఎదురు బంకులో పెట్రోలు తక్కువ రేటు. అక్కడ కొనుక్కొంటాను" అంటాడు.
మనకి దొరికే వరకూ ఏ వస్తువైనా చాలా విలువైనదిగా ఉంటుంది. అది మనకి దొరికే వరకు మన మనస్సు ప్రార్థనలతో నిండి వుంటుంది. అది ఎప్పుడైతే మన చేతిలోనికి వస్తుందో దాని విలువ మన దృష్టిలో తగ్గిపోతుంది. అప్పుడు మన ప్రార్థన మరొక దానివైపు మళ్ళుతుంది.
మనం నిరంతరం తరువాత ఏమిటి ? అనే దృక్పథంతోనే జీవిస్తాము. మనం కృతజ్ఞతతో ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకోము.
ఉదాహరణకి. మనం షాపులో ఒక కొత్త అలారంని చూసామనుకోండి. దానికి ఏవో కొన్ని కొత్త సదుపాయాలు ఉన్నాయనుకోండి. అప్పుడు మనకి ఆ సదుపాయాలతో మన జీవితం చాలా బాగుంటుంది అని అనుకుంటాం. ఈ సదుపాయాలు మనకి దొరికితే మన జీవన విధానం ఎంతో నాణ్యతని సంతరించుకుంటుంది అని అనుకుంటాం. ఈ సదుపాయాలు పొందగలిగితే మనం చాలా సమర్ధతతో పనులు చేయగలుగుతాము అని అనుకుంటాము. ఈ చిన్న అలారం మన జీవితాన్ని మార్చేస్తుంది అని అనుకుంటాం. అంతే. దానిని కొని ఇంటికి తెస్తాం.
కొన్ని రోజులు గడిచాకా ఏమవుతుంది ? మనకి అంత గొప్పది అయిన అలారం క్లాక్ పైన పేరుకున్న దుమ్ము తుడవటానికి కూడా టైం ఉండదు. పాపం ఆ అలారం ఒక మూల దుమ్ముకొట్టుకుపోయి పడి ఉంటుంది. దానిని కొన్నందుకు మీకు తిట్లు కూడా పడతాయి. ఎందుకంటే ఇంటి నిండా పనికిరాని వస్తువులు నింపుతున్నందుకు. అంతే కాదు, ఈలోపు మీ మనసు మరొక వస్తువు మీదకి లేదా మరో కోరిక మీదకి వెళ్ళి ఉంటుంది.
మనకి లేని వస్తువు చాలా పెద్ద పర్వతమంత గొప్పగా అనిపిస్తుంది. అది లేకపోతే బ్రతకలేము అనిపిస్తుంది. అయితే ఆ వస్తువుని నిజంగా పొందినప్పుడు అది మనకి చాలా చిన్నది, విలువ లేనిది అయిపోతుంది. ఈ విధంగా మనం మన జీవితంలో అద్భుతమైన కృతజ్ఞతా భావాన్ని నిరంతరం పోగొట్టుకుంటున్నాము. మనం ప్రతి క్షణం ‘తరువాత ఏమిటి’ అనే దాని వెనుక పరిగెడుతున్నాము.
భగవాన్ రమణ మహర్షి భగవంతునితో ఇలా చెబుతారు. “నేను చాలా తెలివైన వాడిని ; నేను నా వ్యధాపూరితమైన జీవితాన్ని నీకు ఇచ్చేసి, దాని బదులుగా నీ అద్భుతమైన సమక్షం అనే పరమానందాన్ని నీ నుంచి తీసుకున్నాను”.
స్వామి భగవంతునితో, తాను భగవంతుని కంటే తెలివైన వాడినని అంటారు. ఎందుకంటే ఆయన ఎంతో తెలివితేటలతో కష్టాల జీవితాన్ని భగవంతునికి ఇచ్చేసి బ్రహ్మానందాన్ని తీసుకున్నందుకు. ఇదే పూజనీయమైన, పవిత్రమైన కృతజ్ఞత. దీనిని మనం ఆ సర్వాంతర్యామికి చూపించాలి. ఇది చదివినప్పుడు తప్పకుండా ఆయన మాటలు మిమ్ములని కదిలించుతాయి.
రామకృష్ణ పరమహంస గురించి మరొక చిన్న కథ :
రామకృష్ణ పరమహంస ఎవరైనా చైతన్య మహాప్రభువు ఉన్న స్థలం నుంచి వచ్చినట్లయితే ఆయన వాళ్ళ పాదాలని అంటేవారని చెబుతుంటారు.
చైతన్య మాహా ప్రభు గొప్ప ఋషి. జ్ఞానోదయం పొందిన గొప్ప యోగి. ఒకసారి రామకృష్ణ పరమహంస ఒక వ్యక్తి చైతన్య ప్రభు ఉన్న చోటు నుంచి వచ్చారని తెలిసి ఆయన పాదాలను స్పృసించారట.
అది చూసి ఎవరో మరొకతను పరమహంసతో ఇలా అన్నాడు, “స్వామీ, మీరేమిటి ఒక మామూలు వ్యక్తి పాదాలను తాకటమేమిటి ?
దానికి పరమహంస ఈ విధంగా జవాబు ఇచ్చారట, “వాళ్ళు సామాన్యులో లేక మహానుభావులో నాకు అవసరం లేదు. వాళ్ళు చైతన్య ప్రభువుల స్థలమైనటువంటి బానిగాటి నుంచి వచ్చారు. అక్కడే ఆయన సంకీర్తనలు పాడేవారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వచ్చాము అని చెబుతారో. ఆపేరు వినగానే నా లోపల చైతన్య ప్రభువుల గుర్తులు మెదులుతాయి. అది చాలు. వారికి కృతజ్ఞత తెలపటానికి నేను వారి పాదాలు స్పృసించుతాను. వాళ్ళ వలనే కదా నాకు ఆ గుర్తులు మనస్సులోని వచ్చాయి. వాళ్ళే రాకపోతే నాకు ఆ విషయాలు మనస్సులోనికి వచ్చేవి కాదు కదా ! నేను మరేవో విషయాలను ఆలోచించేవాడిని. వీళ్ళ ద్వారా ఆ జ్ఞాపకాలు నాలో కలిగాయి. ఆ పవిత్ర జ్ఞాపకాలు కదిలాయి. అని పరమహంస రామకృష్ణుని జవాబు.
చైతన్య ప్రభువుల జ్ఞాపకాలను తనలోనికి తెచ్చినందుకే ఆయన వాళ్ళ పాదాలని అంటే వారు. అది ఈ రోజు మనం ఊహించగలమా ? ఇదే నేను మీకు చెప్పిన
కృతజ్ఞత అనే మాటకి అర్ధం. నేను చెప్పేది ఒక్కటే ; ఏ విషయమైనా, ఎవరైనా సరే మనకి ఏ కొంచెం చేసినా వారివైపు కృతజ్ఞతతో చూడాలి. వాళ్ళకి కృతజ్ఞత తెలియచేయాలి. వారందరూ కూడా ఈ అనంత చైతన్య సృష్టిలో ఓ భాగమే. వాళ్ళంతా కూడా ఈ చైతన్య సృష్టికి అనుగుణంగా సాగిపోతారు. మీరు వీటి అన్నింటి పట్ల సున్నితంగా స్పందించగలిగితే, అప్పుడు మీరు జరిగే ప్రతి విషయం పట్ల కృతజ్ఞులయి ఉంటారు.
మనం ఈ మహా యోగుల నుండి కృతజ్ఞతా భావాలని నేర్చుకోవాలి. మనం వారి నుండి అలవరచుకోవలసిన ఒక విషయం ఈ కృతజ్ఞత కలిగి ఉండటం. ఆ ఒక్కటి మీరు నేర్చుకోగలిగితే మిగతావన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి. ఎందుకంటే మీలో ఈ కృతజ్ఞత అనే భావం ఉంటే, యాదృచ్చికంగా జరిగే శక్తితో మీకు జరిగేవన్నీ జరుగుతాయి. ఈ అనంత చైతన్య శక్తి మీపై వరాలు కురిపిస్తుంది.
అర్ధం చేసుకోండి : కోరిక, కృతజ్ఞత కలిసి ఉండవు. మీరు ఒక కోరిక తరువాత ఒక కోరికతో జీవిస్తుంటే, మీరు కృతజ్ఞతతో జీవించలేరు. మీరు ఎప్పుడైతే కృతజ్ఞతతో జీవించుతారో, అప్పుడు మీలో కోరికలు ఉండవు. మీరు కృతజ్ఞతతో జీవించినప్పుడు, మీకు ఏదైతే లభించుతుందో అది ఆసమయానికి మీకు ఉండే అవసరాలని తీర్చుతుంది. మీరు అడిగే లోపుగానే, మీకు అన్నీ దొరుకుతాయి. అప్పుడు అడగవలసిన అవసరం ఉండదు.
మనం ఏ పనినైనా కృతజ్ఞతతో చేస్తుంటే ప్రతి పనిలోనూ సంపూర్ణత్వాన్ని సాధించగలుగుతాము. అలా లేనప్పుడు ఏదో ఒక లోటు వుండి ప్రతి పనీ చెడిపోతుంది. మనిషిలో లోభబుద్ధి, అత్యాశ ఎలా ఉంటాయంటే, అతనిని ఈ ప్రపంచానికి రాజుని చేసినా, అయ్యో సముద్రాలు నామాట వినటం లేదే ; నక్షత్రాలు నాకు అణకువగా లేవే అని బాధపడుతుంటాడు.
శివ పురాణంలో శివుడు, బ్రహ్మకపాలం అనే ఒక కథ ఉంది.
బ్రహ్మ కపాలం అంటే ఒక కపాలం. దీనిని శివుడు భిక్షపాత్రగా వాడుతుంటాడు. మామూలుగా ఆయన ధ్యాన మూర్తిగా తిరుగుతున్నప్పుడు దానిని భిక్షపాత్రగా ఉపయోగించుతాడు.
బ్రహ్మ కపాలంలో ఎంత భిక్ష వేసినా అది మాయమైపోతుంది. అంటే ఆ కపాలం వాటని తీసేసుకుంటుంది. శివుడు దానిని నింపాలని ఎంత ప్రయత్నించినా అది ఎప్పుడూ ఖాళీగానే ఉండేది.
ఈ బ్రహ్మ కపాలం మన అందరిలోపలా ఉంటుంది. అదే మన అహంకారం. ఈ అహంకారం ఎన్ని ఇచ్చినా మిగేసి ఇంకా కావాలి అని అంటుంది. అదే మన అహంకారం. ఈ అహంకారం మనకి ఇవ్వబడిన వాటితో సంతోషపడకుండా అడ్డుపడుతుంది.
మీరు మీ జీవితాన్ని కృతజ్ఞత ఆధారంగా జీవించాలా లేక అడగటం అనే దాని ఆధారంగా జీవించాలా అన్న విషయం పూర్తిగా మీరే నిర్ణయించుకోవాలి. కృతజ్ఞత అనేది బయట ప్రపంచం నుండి మీ లోపలికి తెచ్చుకోగల ఒక నైతిక విలువ కాదు. అది మీ అంతరాత్మ లోపలి నుండి వికసించాలి. ఈ సర్వ సృష్టి, దాని విధానాల పట్ల చాలా లోతైన జ్ఞానంతో, ఆ సృష్టిని పూర్తిగా అర్థం చేసుకుంటూ మీలోపల కృతజ్ఞత అనేది పొంగి రావాలి. మీ లోపల నిజమైన కృతజ్ఞత అనేది వికసించినప్పుడు జీవితం పట్ల మీకుండే అభిప్రాయాలు, దృక్పథం పూర్తిగా మారిపోతుంది. ఆ పరిస్థితి మీలోపలికి శాశ్వతమైన సంతోషాన్ని శాంతిని తెస్తుంది.
ఒక సారి ఒక వ్యక్తి రమణ మహర్షి దగ్గరకి వెళ్ళి "భగవాన్! నాకు శాంతి కావాలి" అనే పదాలని తొలగించు. అప్పుడు నీకు మిగిలేది శాంతి.
దానికి స్వామి ఈ విధంగా చెబుతారు. "నీవు చెప్పిన వాఖ్యం నుంచి 'నాకు', 'కావాలి' అని అడుగుతాడు.
మీరు ఈ అనంత చైతన్య సృష్టితోటి సంబంధం నెలకొల్పుకుని జీవించాలి అంటే మీరు షరతులని, మీలోని అహంకారాన్ని పూర్తిగా వదిలివేయాలి. మీరు మీచుట్టూ నిర్మించుకున్న గోడలని కూలగొట్టేయాలి. అప్పుడు మీకు నిరంతరం మీతో ఈ అనంత సృష్టికి ఉన్న సంబంధం కనిపిస్తుంది. దాని కోసం మీరు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. మీరు దానిని వదిలివేయండి. అంతే.
ఎప్పుడైతే మీరు ప్రేమతో, కృతజ్ఞతతో నిండుగా ఉండి, ఒక చైతన్య స్రవంతిలా ప్రవహించుతారో, అప్పుడు మీలోపల నుండి ప్రవహించే ఈ అనంత విశ్వశక్తిని గమనించుతారు. అప్పుడు మీరు నిరంతరం సంపూర్ణతతో, తృప్తితో ఉంటారు. ఇదంతా మీరు ఏదో సాధించారు అని కాదు, ఆ అనంత సృష్టి యొక్క శక్తి మీ ఉనికిలో, మీ అంతరంగంలో నింపబడినందుకు. అదే మీ ఉనికి అయినందుకు మీకు అసంతృప్తి. ఇదే, ఈ పరిపూర్ణత కోసమే ప్రతి మనిషీ వెదుకుతుంటారు. మనం వెతికే అంతిమ పరిపూర్ణత ఇదే. కానీ అందరూ దీని కోసం ఈ ప్రాపంచిక వస్తువులలో వెతుకుతుంటారు. అసలు అయిన దానిని పోగొట్టుకుంటారు.
మీరు ఒప్పుకున్నా లేకపోయినా ఈ సృష్టి మిమ్ములను సదా రక్షిస్తుంటుంది. మీరు చేయవలసింది కేవలం దాని మీద నమ్మకాన్ని ఉంచటమే. మీ పనులు, బాధ్యతలు కృతజ్ఞతా భావంతో చేయటమే. అప్పుడు ఈ అనంత చైతన్యం మీ మీద వరాల జల్లులను మీరు అడగకుండానే కురిపిస్తుంది.
కానీ మనకి నమ్మకం ఉండదు.
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తికి భగవంతుడి మీద నమ్మకం ఉండదు. ఒక రోజు అకస్మాత్తుగా అతను కొండ చివర నుంచి లోయలోనికి జారిపడిపోతాడు. అతను ఒక చెట్టువేళ్ళలో ఇరుక్కుని వేలాడుతుంటాడు. అతను చాలా భయపడిపోతాడు.
అతనికి అకస్మాత్తుగా అందరూ మాట్లాడుకునే భగవంతుడు గుర్తుకువస్తాడు. అతను అప్పుడు ఆయన సహాయం చేస్తాడేమో ఒకసారి ప్రయత్నించి చూస్తాను అని అనుకుని; గట్టిగా. "భగవంతుడా నాకు నీమీద ఎప్పుడూ నమ్మకం లేదు. నీవు నిజంగా ఉన్నావా ? నన్ను ఇప్పుడు రక్షించగలవా?" అని అరుస్తాడు.
అప్పుడు అతనికి ఇలా వినిపిస్తుంది, "తప్పకుండా చేస్తాను బిడ్డా ! నువ్వు ఆ చెట్టు వేళ్ళు వదిలేయి, నేను నిన్ను కింద పట్టుకుంటాను".
దానికి ఆ వ్యక్తి, "అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా నాకు సహాయం చేయటానికి" అని అరుస్తాడు.
(అంతా నవ్వులు)
మనం ఈ విశ్వ చైతన్యం మీద, భగవంతుని మీద నమ్మకాన్ని ఉంచటానికి సిద్ధంగా ఉండం. మీరు ఈ విశ్వశక్తిని మీ అంతరాత్మలో సంపూర్ణంగా నమ్మగలిగినప్పుడు అది మిమ్ములను భూమిమీద దేవుడిలా చేస్తుంది. మీరు మీ అహంకారంతో, అజ్ఞానంతో ఈ అద్భుత అవకాశాన్ని పోగొట్టుకుంటారు".
తెలిసే విధంగా నిరంతరం జీవించగలిగితే, మన జీవితపు ప్రతి మలుపులో ఆ శక్తి మనని రక్షిస్తుంటుంది. మనని పూర్తిగా పట్టించుకుంటుంది. మనని ఉయ్యాలలో లాలిపాడి జాగ్రత్తగా చూసుకునే తల్లిలా ఈ శక్తి మనలని కాపాడుతున్నది. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం.
ఒక వ్యక్తికి తాను, భగవంతుడు ఒక బీచ్‌లోని ఇసుకలో నడుస్తూ ప్రయాణం చేస్తున్నట్లు కలకంటాడు. అతను దేవుడితో "భగవాన్ ! నీవు నేను ఇసుకలో నడుస్తున్నట్టు నాకు కలవచ్చింది. నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు, నేను చాలా కష్టాలలో కేవలం ఒక వరుస అడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి. నేను అంత కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు అంటాడు.
భగవంతుడు ఇలా సమాధానం ఇస్తాడు. “కుమారా ! ఆ సమయంలో నేను నిన్ను నా చేతుల్లో మోస్తున్నాను. ఆ కనపడే కాలి గుర్తులు నావి”.
నా అనుభవం నుంచి మీకు చెబుతున్నాను. నేను అంతా తిరిగే రోజుల్లో, కనీసం 30,000 మైళ్ళు ప్రయాణం చేసి ఉంటాను. అందులో 2000 మైళ్ళు కాలినడకతో తిరిగి ఉంటాను. అప్పుడు నా దగ్గర రెండు జతల బట్టలు, ఒక భిక్షా పాత్ర మాత్రమే ఉండేవి. నేను డబ్బు ముట్టుకోకూడదని నిర్ణయించుకున్నాను. నేనెప్పుడు రేపటికి ఆహారం దాచేవాడిని కాదు.
నన్ను చాలా మంది అడిగారు ; ఇది ఎలా సాధ్యం అని. నేను మీకు చెబుతున్నాను. నేను ఈ అనంత చైతన్య విశ్వశక్తిని నమ్మాను. నా లక్ష్యమయిన జ్ఞానోదయంపైన నా ఏకాగ్రతని నిలిపాను. ఆ అనంత శక్తి నా సంరక్షణ విషయం చూసుకుంది. ఆవిధంగా జరిగింది.
నేను ఈ విషయాలు చెబుతుంటే, ఆ సర్వాంతర్యామీ అయిన చైతన్య శక్తిని నమ్మండి అని అంటే, అదేదో పూర్వపు రోజుల విషయం, అది కేవలం యోగులకి సంబంధించిన విషయం అని మీరు అనుకుంటారు. అది సరికాదు. నేను నా అనుభవం నుంచి మీకు చెబుతున్నాను. నాకు జరిగిన దాని ఆధారంగా చెబుతున్నాను. నేను ఇప్పుడు మీ ముందు ఉన్నాను. నేననుకుంటున్నాను. నేను మీ అందరికంటే వయస్సులో చిన్నవాడిని కాబట్టి నేను చెప్పేది ప్రాచీన కాలం సంగతి కాదు. అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి.
మీరు కృతజ్ఞతతో జీవించండి. జరిగే అద్భుతాలని చూడవచ్చు. ఈ విశ్వశక్తి మీకు అన్నీ ఇస్తుంది. కాని అవి తీసుకోవటానికి ఎటువంటి ప్రశ్నలూ, ఆటంకాలూ లేకుండా, విప్పారిన హృదయంతో మీరు సిద్ధంగా ఉన్నప్పుడే అది సాధ్యం.
ఒక కథ :
ఒక వ్యక్తికి తాను స్వర్గానికి వెళ్ళినట్లు కల వస్తుంది. అందులో ఒక దేవదూత అతనికి స్వర్గం అంతా చూపిస్తుంటుంది. వాళ్ళు కలిసి నడుస్తుంటారు. ఒక పెద్ద గదిలోనికి వెళతారు. అక్కడ చాలా మంది దేవదూతలు చాలా బిజీగా పనిచేస్తుంటారు. ఆ గదిలో ఉండే ఫైల్స్ అన్నీ మనుషులు ప్రార్థన రూపంలో కానీ మరే విధంగా గాని కోరుకునే కోరికలకి సంబంధించినవి అని అతనికి చెబుతుంది. అక్కడ వాళ్ళు రకరకాల టేబుల్స్ మీద ఉన్న ఫైల్స్ ని వేరు చేస్తుంటారు. ప్రపంచంలో అన్ని మూలల నుంచి అన్ని భాషలలో వచ్చినవి ఉంటాయి.
వాళ్లు ఆ తరువాత ప్రక్క గదిలోనికి వెళతారు. అక్కడ కూడా చాలా మంది దేవదూతలు చాలా బిజీగా పేకట్లు, పేపర్లు చూస్తుంటారు. అది భగవంతుడు ప్రజలకి పంపించే ఆశీస్సులు, వారు అడిగిన కోరికలు తీర్చే హాలు అని ఆ దేవ దూత చెబుతుంది.
వాళ్ళు ఆ చివర ఉన్న చిన్న గది దగ్గర ఆగుతారు. అక్కడ ఒక్క దేవదూత మాత్రమే ఉంటుంది. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ దేవదూత కూడా టేబుల్ మీద తల పెట్టుకుని ఉంటుంది. ఇది కోరికల తీరిన భక్తులు వాటిని అందుకున్నాము. , అని చెబుతూ కృతజ్ఞతలు చెబితే అవి తీసుకుని వాటిని ఇక్కడ క్రమంలో పెడతారు, అని ఆ దేవదూత ఆ వ్యక్తికి చెబుతుంది.
మనం నిరంతరం అడుగుతూనే ఉంటాము. మనలో ఎంత మంది మనం పొందిన వాటికి కృతజ్ఞతలు చెబుతాము ? మనలో ఎంత మంది ప్రార్థనలలో, పూజాలలో అడగటంతోపాటు కృతజ్ఞతలు కూడా కలుపుతాము ?
మీరు ఒంటిరిగా ఉన్నప్పుడు ఈ చిన్న ఎక్సర్ సైజు చేయండి.
రెండు గంటల సేపు మీకున్న సమస్యలని, అవసరాలని, కోరికలని ఒక ప్రక్కన పెట్టండి. మీకు భగవంతుడు ఇంతవరకూ ఇచ్చిన దాని మీద మీ ఏకాగ్రతని నిలపండి. మీరు వెంటనే ఏమనుకుంటారు, "అమ్మో! నేను నా అవసరాల గురించి
ఆలోచించకపోతే వాటిని నేను ఎలా తీర్చగలుగుతాను ? నా కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు ? నా వ్యాపారం గతి ఏమవుతుంది ?" ఇలా ఆలోచించుతారు. నిజమే, మీరు వీటిని అన్నింటిని గురించి ఆలోచించాలి. కానీ కేవలం రెండు గంటలసేపు మీ మనస్సులోని బరువులన్నింటినీ ప్రక్కనపెట్టేసి, నేనేం చెప్పానో అది చేయండి.
ఒక వేళ మీ వ్యాపారం, మీ కుటుంబం మీ వలనే జరుగుతున్నాయి అవి మీకు అనుకుంటున్నారా ? మీకు చెబుతున్నాను ఏ విషయాలైనా చక్కగా జరుగుతున్నాయి అంటే అది మన వలన కాదు. ఒకవేళ ఆ సర్వాంతర్యామి మన తెలివి తేటల మీద ఆధారపడి మన కుటుంబాలని, ఆస్తులని కాపాడుతున్నాడు. అని అంటే మనం ఈ పాటికి అనాథలం, నిరుపేదలం అయిపోయేవాళ్ళం.
స్పష్టంగా అర్ధం చేసుకోండి : బాధపడటం వలన మీరు ఏమీ సాధించలేరు. ఈ విషయం గురించి ఇంతకు ముందు చాలా విపులంగా నేర్చుకున్నాము కదా !
కాబట్టి కొన్ని నిమిషాలపాటు, మీరు కళ్ళు మూసుకుని, మీకు ఇంతవరకూ పొందిన వాటిమీద, మీకు ఈ అనంత చైతన్య శక్తి ప్రసాదించిన వాటి మీద మీ ఏకాగ్రతని నిలపండి. వీటన్నింటినీ మీ ఆలోచనలోనికి తీసుకురండి. మీ శరీరం, మీకు సహాయం చేసిన వ్యక్తులు, మీ ఇల్లు, మీ ఆస్తులు, మీ సెలవలు ఇలా అన్నింటిలోంచి మీ ఆలోచనలని ప్రయాణించనీయండి. వాటిని చూసి విరామంగా, కృతజ్ఞతలతో సంతోషపడండి. ఇలా చేయటానికి మీకు ఎంత సమయం కావాలో అంత సమయం తీసుకోండి.
హడావిడిగా చేయకండి. వాటన్నింటితోటి ఉండండి. ఆ అనుభూతితో ఉండండి. అవి సాధించిన సంతృప్తితో ఉండండి. మీరు కృజ్ఞతా భావంతో నిండి అది మీలోపలినుంచి పొందుతున్నట్టుగా ఉండండి. మీరు కళ్ళు తెరచినప్పుడు, మీకు మీ జీవితానికి కావలసిన దానికంటే ఎక్కువగా ఉన్నట్టు మీకు అర్ధమవుతుంది. ఇంకా ఎక్కువ ఏమి కావాలి అని మీరు ఆశ్చర్యపోతారు.
మీరు కృతజ్ఞతగా మారాలి. మీరు కృతజ్ఞతగా మారాలి అంటే, కారణం లేకుండా సంతోషంగా, ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. మీరు చూసే ప్రతిదానిని వినే ప్రతి విషయాన్ని, చేసే ప్రతి పనిని: వీటన్నింటిలోనే అపూర్వమైన ఆనందాన్ని పొందండి. ఈ అనంత చైతన్య శక్తి మిమ్మలని కాపాడుతుంది, అనే ఒక ఉన్నతమైన నమ్మకంతో సంతోషపడండి. మీ కళ్ళ ముందే మీ జీవితం మారిపోతుంది. అప్పుడు మీరు నిరంతరం ఉప్పొంగిపోయే ఆనందంతో ఉంటారు.
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తి మామిడి తోట ప్రక్క నుంచి నడుస్తుంటాడు. అక్కడ ఎన్నో రకాల మామిడి పళ్ళు విగరకాసి ఉంటాయి. అతను ఆ తోటలోపలికి వెళ్ళి అంతా చూస్తాడు. వాటిని బాగా గమనించుతాడు. వాటి వివరాలు, ఎన్ని కాయలు ఉన్నాయో లెక్కలు అన్నీ రాసుకుంటాడు. అలా అన్నీ తెలుసుకుని అరగంట తరువాత తోట లోపలినుంచి వచ్చేస్తాడు.
కొంత సేపయ్యాక మరొక వ్యక్తి తోటలోపలికి వచ్చి, చూసి నాలుగు కాయలు కోసుకుని తిని సంతోషంగా బయటకి వెళతాడు.
(అంతా నవ్వులు)
ఇప్పుడు మీరు మామిడి తోటల్లోకి వెళ్ళి కాయల్ని కోసేయకండి. తోట యజమానులు మిమ్మలని చెట్లకి కట్టేస్తారు. నేను ఏమి చెప్పటానికి ప్రతిన్నిస్తున్నానో అర్థ చేసుకొండి. ఎటువంటి ప్రశ్నలు వేయకుండా, కారణాలు వెతకకుండా సంతోషంగా ఉండటం నేర్చుకొండి. సంతోషంగా ఉండటం మీ సహజ లక్షణంగా చేసుకొడి. అప్పుడు కృతజ్ఞత అన్నది మీ అంతరాత్మ అవుతుంది.
మీ ఉద్యోగం, వ్యాపారం, సమాజంలో మీ స్థానం, మీ ఐశ్వర్యం ఇలా ఏది ఎంత అయినా, మీరు ఏ స్థితిలో ఉన్నా అందరూ చేయగలిగినది నిరంతరం ఆనందంగా ఉండటమే.
కానీ మీరేం అనుకుంటారు? ప్రతి దానికి, ఆఖరికి సంతోషానికి కూడా ఒక కారణం ఉండాలి అని అనుకుంటారు. మీరు మీ మనస్సుని ఇటువంటి ఆలోచనా పద్ధతులలోనే అభివృద్ధి చేసారు. అందుకే మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి చాలా ఉన్నది. వాళ్ళకి అంత అర్హత లేకపోయినా వాళ్ళకి ఎంతో ఉన్నది అని అనుకుంటారు. అలాగే నాకు ఎంతో అర్హత ఉన్నది. నేను చాలా చేసాను కానీ నాకు సరిపడా ఇవ్వలేదు అనుకుంటాం.
మీరు నిరంతరం ఇలా అనుకుంటారు. 'నేను సంతోషంగా ఉండాలి అంటే నేను చాలా కష్టపడి పని చేయాలి' అది సరియైనది కాదు. కష్టపడటము మంచిదే. కానీ కష్టపడటానికి సంతోషించగలగటానికి ఏమీ సంబంధం లేదు. ఆ భావనని ఆ ఆలోచచని వదిలివేయండి. ఇలా చేయటమన్నది మీరు అసంతృప్తి నుంచి బయటకి రావటానికి ఉన్న ఒకే ఒక్క దారి.
ఈ అనంత విశ్వ శక్తి, భగవంతుడు, మీకు నిరంతరం ఇస్తూ ఉంటుంది. మీరు ఆనందించాలి అని నిర్ణయించుకుంటే ఆనందంగా ఉండగలరు. అది పూర్తిగా మీ నిర్ణయం. మీరు తప్పు నిర్ణయాలు చేసి ఎదుటివారి మీద పిర్యాదులు ఇస్తారు. లేదా ఎదుటివారిని నిందించుతారు.
బాగా గుర్తుంచుకోండి. మీకు జరిగే ఏ విషయానికైనా ఎవరూ బాధ్యులు కాదు. అది అంతా కూడా మీరు కావాలని చేసుకున్న నిర్ణయాలే. అయితే ఆ విషయం మీకు తెలియదు. ఎందుకంటే అది అంతా అచేతన స్థితిలో జరుగుతుంది. మీకు తెలుసుకునే తత్వం లేకపోతే మీరు ఎప్పుడూ చేసే నిర్ణయాలని అచేతన స్థితిలో చేస్తారు. చివరికి జీవితాన్ని నిందించుతారు.
ఎప్పుడూ గుర్తుంచుకొండి: స్వర్గం నరకం అనేవి ఏ ఒక ప్రత్యేకమయిన స్థలాలలోలేవు. అవి మీ లోపల మీరే సృష్టించుకుంటారు. ఎప్పుడైతే ఈ అనంత చైతన్య సృష్టితో మీ అనుబంధం తెగిపోతుందో అప్పుడు మీరు మీ లోపల నరాకాన్ని సృష్టించుకుని మీరు ఎక్కడికి వెళితే అక్కడికి దానిని మోస్తు తిరుగుతారు. నరకం ఎక్కడో మీకు
బయట ఉన్నది అని అనుకోవద్దు. అది మీ మనసులోనే ఉన్నది. అది పూర్తిగా మీ నిర్ణయం. మీ సహజ లక్షణం. అనేది మీరు స్వర్గంలో ఉండాలా లేక నరకంలో ఉండాలా అనే విషయాన్ని నిర్ణయించుతుంది.
ఒక చిన్న కథ:
ఒక టీచర్ స్టూడెంట్స్ ని "నరకం ఎక్కడ ఉన్నదో మీలో ఎవరైనా చెప్పగలరా" అని అడుగుతుంది. చాలా సేపు అయ్యాక ఒక అమ్మాయి లేచి "టీచర్, అది మా నాన్నగారి చదువులో ఉన్నది" అంటుంది.
టీచర్‌కి అర్ధం కాక, అలా ఎందుకు చెప్పావు అని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి "నేను ఎప్పుడు మా నాన్నగారి చదువు దగ్గరకి వెళ్ళినా, ఆయన ఇక్కడి నుంచి నరకాన్ని తీసుకువెళ్ళు అని అంటారు" అని చెబుతుంది.
(అంతా నవ్వులు)
పిల్లలని చిన్నతనం నుంచే స్వర్గం, నరకం అనేవి ఎక్కడో మన ప్రపంచానికి అవతల ఉన్నాయి అయి నేర్పించుతాము. మనం వాళ్ళకి భగవంతుడు అనే ఒక వ్యక్తి మన పైన ఎక్కడో పెద్ద సింహాసనం మీద కూర్చుని, ప్రతి నిముషం మనం చేసే పనులు గమనిస్తూ మన పాపాలని పుణ్యాలని రాస్తుంటాడు. అని ఆలోచించేటట్టుగా వాళ్ళకి నేర్పించుతాము.
ఈ విధంగా ఆలోచించుతూ, మన ప్రతి పనికీ కారణాన్ని దాని ప్రభావాన్ని అంచనాలు వేస్తుంటాము. మన మంచి పనులని స్వర్గంతోను, చెడ్డపనులని నరకంతోను ముడిపెడతాం. మనం భగవంతుణ్ణి, ఈ సర్వ సృష్టిని ఏదో ఒక వ్యవహారాల సెంటర్ అనుకుంటాము. ప్రతి ఒక్కరం మన మన దారుల్లో, ఒక వ్యాపారవేత్తలా ప్రవర్తిస్తాము.
మీరు గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు. పూలు, పళ్ళు, కొబ్బరికాయ కొని దేవుడికి ఇచ్చి మన కుటుంబంలో అందరి పేర్లు గోత్రాలు చెప్పి పూజ చేయించుతాము.
పాపం పూజారి పూజా ద్రవ్యాల పళ్ళెం పట్టుకునికి నిలబడతాడు. మీరు మీ ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు వివరాలు చెబుతారు. మీ భయమేమిటంటే, భగవంతుడు వేరే వ్యక్తికి తప్పు అడ్రస్ కి తన ఆశీస్సులు, వరాలు పంపించుతాడని, అందుకే మీ వివరాలు చాలా కచ్చితంగా చెబుతారు. భగవంతుడికి ఇవన్నీ ఇచ్చింది మీరేనని, మరెవో వేరే వాళ్ళు కాదని నొక్కి మరీ చెబుతారు. ఇదంతా చేసాక మీరు గుడిలోపల నుంచి బయటకి వస్తారు. అంతే కదా మీరంతా చేసేది?
ఇదంతా చెప్పకపోతే భగవంతుడికి మీరు ఎవరో తెలియదా? మీరు అనే వ్యక్తి ఒకరు ఉన్నారు అని భగవంతుడికి మీరు గుర్తు చేయకపోతే ఆయన మీకు ఇచ్చేవి ఇవ్వటం మానేస్తాడా? నేను చెబుతున్నాను. అర్థం చేసుకోండి: మీరు నిరంతరం కృతజ్ఞతతో భగవంతునికి కృతజ్ఞతా భావంతో ఉండండి. అంతే. ఆయన మీకు ఇవ్వవలసిన వరాలు ఇస్తూనే ఉంటాడు.
ఆయన మీరు సమస్యలలోనో, కష్టాలలోనో ఉన్నప్పుడు వాటి నుంచి బయటకి తీసుకురావటం లేదా మీరు ఆనందంగా ఉన్నప్పుడు మిమ్ములని వదిలేయటం చేస్తాడు అని మీరు అనుకునేది తప్పు. ఇవన్నీ కూడా మనం భగవంతుని గురించి అనుకునే ఊహలు మాత్రమే. ఇవన్నీ మనకి చిన్నతనం నుంచీ సమాజం నేర్పించిన ఆలోచనలే.
కృతజ్ఞతా భావం మనలో వక్రీకరించబడింది. ఎవరైనా, ఎప్పుడైనా మనం చాలా కష్టాలలో ఉన్నప్పుడు మనని బయటకి తీసుకువచ్చినప్పుడు లేదా వాళ్ళు వాళ్ళ శక్తిని మించి మనకి సహాయం చేసినప్పుడు మాత్రమే మనం కృతజ్ఞత చూపించాలి అని అనుకుంటాం. ఇది చాలా తప్పు ఆలోచన.
మీకు చెబుతున్నాను. మీరు గుడి లోపలికి కృతజ్ఞతా భావంతో వెళ్ళండి. విగ్రహం ముందు కొన్ని నిముషాలు పూర్తి కృతజ్ఞతతో నిలబడండి. అదే భావంతో గుడిలోపలి నుంచి బయటకి రండి. అది చాలు. మిగతా విషయాలని సంరక్షించే వాళ్ళు సంరక్షించుతారు. అదే అంతిమ ప్రార్ధన. కృతజ్ఞత అనేది అంతిమ పూజ.
మీరు ఇక్కడ ఉన్న ఈ కొన్ని రోజులు, నేను మీకు చెప్పే విషయాలని సమర్ధవంతమైన అనుభూతిగా అనుభవించండి. మీరు బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ఏడు రోజులూ కృతజ్ఞత మీలో నాటుకునేలా చూడండి. మీరు విప్పారండి. అంతరంగంలో మీ ఉనికి, మీఆత్మ వికసించేలా చేయండి. ఇది మీకు దొరికిన ఒక అరుదైన అవకాశం. ఇది మీలో మార్పు సంభవించటానికి ఒక చక్కని అవకాశం. దీనిని మీరు పోగొట్టుకోవద్దు. మీ అంతరంగంలో కొత్త స్థితిని సృష్టించండి. మీరు ఈ స్థలాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మీతో పాటు దానిని కూడా మీ వెంట తీసుకెళ్ళండి.
చూడండి. అసలు సమస్య ఏమిటంటే మనం నిరంతరం భగవంతుణ్ణి మేధస్సుతో చేరాలి అని ఆలోచిస్తుంటాము. ఎప్పుడైతే మీరు మేధస్సుని వదిలివేస్తారో, అప్పుడు మీరు మీ హృదయంతో పని చేయటం నేర్చుకుంటారు. ఆయనని మీరు కలవనవసరం లేదు. ఆ భగవంతుడు మీలోనే ఉన్నాడు.
మీ మేధస్సుతో మీరు నిరంతరం బయట ప్రపంచంలో భగవంతునికి కోసం చూస్తుంటారు. మీ మేధస్సుతో కృతజ్ఞతా భావం చూపించటానికి మీరు కారణాలు వెతుకుతారు. మీరు ఎప్పుడైతే మేధస్సు నుంచి హృదయంలోపలికి వస్తారో, మీ అంతరంగంలో ఒక కొత్త స్థితి ఏర్పడుతుంది. అది మీకు ఎప్పుడూ తెలిసినదే అన్నట్టు ఉంటుంది. అయితే మీ మైండ్ మిమ్మలని ఈ విషయం తెలుసుకోనివ్వకుండా చేస్తుంది. అది మీ మనస్సులో విధ్వంసాలు సృష్టించుతుంది.
మీరు మీ హృదయం నుంచి పనులు చేస్తే, మీరు నిరంతరం కృతజ్ఞతా భావంతో ఉంటారు. మనం ఎప్పుడైనా మైండ్ కృతజ్ఞతతో నిండిపోయింది అని అంటామా? అలా ఎప్పుడూ అనం. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అంటాము.
తరువాత మీరు నన్ను ఇలా అడుగుతారు, "మేధస్సు నుంచి హృదయానికి మేము ఎలా వెళ్ళాలి స్వామీజీ". మీరు మీ మేధస్సును తెలుసుకుంటూ ఉండండి. అది చాలు. మీరు ఎప్పుడైతే దానిని తెలుసుకోరో, మీరు దానిని ఇష్టం వచ్చినట్టు ఆడుకోనిస్తారు. అది యాంత్రికంగా పని చేసుకుపోతుంది. ఒక్కసారి మీరు మీ మేధస్సుని తెలుసుకోగలిగితే మీరు దానిని తేలికగా వదిలేయగలరు.
కృతజ్ఞత అనేది ఒక నైతిక విలువ కాదు. అది మీ దృక్పథం కావాలి. ఈ సర్వాంతర విశ్వశక్తికి అనుగుణంగా ఉండే మీ అనుభూతిలా ఉండాలి. మీరు కేవలం కృతజ్ఞతని మాత్రమే కలిగి ఉంటే మీరు ఎంతో చక్కగా ఈ విశ్వ శక్తికి అనుగుణంగా ఉండగలుగుతారు. అప్పుడు ఆ శక్తి తన అద్భుతాలని మీ మీద కురిపించుతుంది. అప్పుడు మీరు చేసే పని కూర్చొని ఆనందపడటమే.
ఈ అనుగుణంగా ఉండటం అంటే ఏమిటో మీకు వివరంగా చెబుతాను. మీకు అందరికీ రేడియో ఎలా పని చేస్తుందో తెలుసుకదా?
తెలుసు స్వామిజీ.
సరే! రేడియోని, దాని ఆకారంలో ఎటువంటి మార్పు చేయకుండా, దానిని ఏ రేడియో స్టేషన్‌కైనా కలపవచ్చు కదా! ఏ కార్యక్రమమైనా వినవచ్చు. అవును కదా? మీరు ఏదైనా కార్యక్రమం వింటున్నప్పుడునడు సరిగ్గా రాలేదనుకోండి అది వేరే స్టేషన్ ప్రోగ్రాంతో కలిసిపోయిందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి.
స్వామీజీ! మేము స్టేషన్ సరిగ్గా ట్యూన్ చేస్తాం.
అవును. అదే చేస్తారు. ఏదైనా ఒక స్టేషన్ కార్యక్రమం వినటానికి రేడియోని బాగా ట్యూన్ చేస్తారు. ఇదే పద్ధతినికి మిమ్మలని మీరు ఆ అనంత సృష్టికి అనుగుణంగా మార్చుకోవటానికి ఉపయోగించండి.
మన చుట్టుప్రక్కల వేలకొద్దీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం దేనికి ట్యూన్ చేసుకుంటే మనకి ఆ అనుభవం కలుగుతుంది. ఇప్పుడు ఏ కార్యక్రమానికి మిమ్మలని మీరు ట్యూన్ చేసుకుంటారు, అనేది కేవలం మీ ఎంపిక. అది మీ నిర్ణయం. ఎవరైనా ఇది కాదు అని అంటారా? లేదు. మీకు ఇష్టమైన కార్యక్రమం వినటానికి మీకు పూర్తిగా స్వేచ్ఛ ఉన్నది. అవునా?
ప్రేక్షకులలోంచి మెల్లమెల్లగా వినిపిస్తుంది. అవును స్వామీజీ.
అదే విధంగా మీరు మీ చుట్టూ ఉండే మనుషుల మైండ్స్ సృష్టించే కల్లోలం, అయోమయాన్ని మీరు ఎంపిక చేస్తే మీరు అయోమయంగా అయిపోతారు. మీరు అంతులేని అగాధంలాంటి బాదలు, అసంతృప్తి, అయోమయం ఇలా ఎన్నో సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతారు.
అలా కాకుండా ఈ అనంత చైతన్య సృష్టి, ఈ సర్వాంతర్యామి కి అనుగుణంగా మిమ్మలని మీరు ట్యూన్ చేసుకోగలిగితే, మీరు సరియైన ఆధారాన్ని పట్టుకున్న వాళ్లవుతారు. ఏదైతే ఈ అద్భుత ప్రదర్శనని చేస్తుందో ఆ అనంత శక్తి యొక్క ముఖ్యమైన శ్రుతిని మీరు అందుకోగలిగితే అప్పుడు మీరు అన్ని భావావేశాల నుంచీ స్వేచ్ఛని పొందుతారు. అప్పుడు మీరు ఒక అద్భుత సువాసనలు గల అందమైన పుష్పంలా వికసించుతారు.
మీకు ఇది వరకటి భావావేశాలు ఉన్నప్పుడు జీవితం అసంతృప్తితో ఉండేది. ఎప్పుడయితే అవన్నీ మీ లోంచి వెళ్ళిపోతాయో అప్పుడు జీవితం ఒక సంగీతంగా ఉంటుంది. అదే ఈ సృష్టి యొక్క భాష. అప్పుడు మీరు నిరంతరం కృతజ్ఞతా అనుభూతులలో మహానందంగా ఉంటారు. మీరు ఈ విశ్వశక్తి అయిన భగవంతునితో ఎంత బాగా ట్యూన్ చేసుకోగలిగితే మీ జీవితం అంత ఆనందమయంగా ఉంటుంది.
అసంతృప్తి మిమ్మలని క్రిందికి లాగేస్తుంది. అది మిమ్మలని భారంగా, దుర్భలంగా చేస్తుంది. అదే కృతజ్ఞత, తృప్తి అనేవి మిమ్మలని తేలికగా, ఆహ్లాదకరంగా అద్భుత ఆనందంగా చేస్తుంది. మనం అసంతృప్తితో ఎందుకు ఉంటామంటే మనం ప్రతి దానిని యధాలాపంగా, తేలికగా తీసుకుంటాము. అటువంటప్పుడే మీరు చాలా కోల్పోతారు. అప్పుడు మిమ్మలని ఎవరూ, ఏదీ కూడా ఆనంద పరచలేవు. అందుకే మీకు చెబుతున్నాను. దేనినీ కూడా యధాలాపంగా, ఆ ఏదోలే దొరికింది అన్నట్టుగా తీసుకోకండి.
చిన్న కథ :
భిక్షాటన చేసుకుని బ్రతికే ఒక భిక్షగాడు, ఒక వ్యక్తిని రోడ్డు మీద ఇలా అడుగుతాడు, “అయ్యా! రెండు సంవత్సరాల క్రితం నువ్వు నాకు 20 రూపాయలు ఇచ్చేవాడివి. క్రిందటి సంవత్సరం 10 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు కేవలం రెండు రూపాయలే ఇస్తున్నావు. కారణం ఏమిటి?”
దానికి ఆ వ్యక్తి ఇలా జవాబు ఇస్తాడు; ముందు సంవత్సరం నేను బ్రహ్మచారిని. తరువాత పెళ్ళి చేసుకున్నాను. నాకు ఇప్పుడు పాప పుట్టింది. అందుకే అలా చేసాను.”
దానికి ఆ భిక్షగాడు, “ఏమిటీ! నా డబ్బుతో నీ కుటుంబాన్ని పోషిస్తున్నావా” అని.
(అంతా నవ్వులు)
నిజానికి మనలో చాలా మంది ఇలానే ఆలోచించుతారు. ఎదుటి మనిషి మన అవసరాలు తీర్చటం అనేది మన జన్మ హక్కులా భావిస్తాము. వాటిని సామాన్యంగా, యధాలాపంగా తీసుకుంటాము.
మనం ఇటువంటి దృక్పధంతో ఉన్నాము అంటే అది ఎంత అమాయకత్వమో కదా. మనం ఈ విధంగా ఉండటం వలన ఎంతో పోగొట్టుకుంటున్నామన్న విషయం మనకి తెలియటం లేదు. ఈ మొత్తం దృక్పథంలో చాలా పెద్ద మార్పు రావాలి. కనీసం మీరు మీ అమ్మ, నాన్న, భార్య, భర్త ఎవరినీ కూడా అలా యధాలాపంగా తీసుకోకూడదు.
చిన్న కథ:
ఒక వ్యక్తి తన పని ముగించుకుని ఇంటికివచ్చేటప్పటికి అతని భార్య చాలా చెడ్డ మూడ్ లో ఉంటుంది. అతనిని చూడగానే పెద్ద గొంతుతో, “నేను ఆ పని అమ్మాయికి చాలా కష్టపడి పని నేర్చుకున్నాను. మొత్తం ఇంటిపని అంతా నేర్పించాను. ఇప్పుడు పని మానేసి వెళ్ళిపోయింది” అని భర్తతో చెబుతుంది.
దానికి భర్త సానుభూతితో, "ఏ కారణంతో వెళ్ళిపోయింది" అని అడుగుతాడు.
అప్పుడు భార్య ఇలా జవాబు చెబుతుంది, "మీ మూలంగానే వెళ్లిపోయింది, ఫోన్లో ఆమెతో మీరు చాలా అమర్యాదగా, మూర్ఖంగా మాట్లాడారంట. ఆమెకి చాలా కోపం వచ్చింది, నా ఆత్మ గౌరవాన్ని నేను కాపాడుకోవాలి అని వెళ్లిపోయింది"
ఆ వ్యక్తి చాలా కంగారు పడతాడు. మెల్లగా ఇలా అంటాడు "ఫోనులో నేను నీతో మాట్లాడుతున్నాను అని అనుకున్నాను"
(అంతా నవ్వులు)
మనం సంబంధాలని చాలా తేలికగా తీసుకుంటాము. అందుకే ఇటువంటి సమస్యలు. మనకి ఎదురవుతాయి. ప్రతి వ్యక్తినీ ఈ అనంత సృష్టిలో ఒక భాగంగా చూడటం చేర్చుకోండి. ప్రతి ఒక్కరివైపు కృతజ్ఞతని చూపించండి. అప్పుడు మీరు ఎవరినీ కూడా యధాలాపంగా తేలికగా తీసుకోరు. అప్పుడు మీరు అందరినీ గౌరవించుతారు. అందరిలోనూ ఆ సర్వాంతర్యామిని, ఆ అనంత విశ్వశక్తిని చూసి, వారిని ఆరాధించుతారు. ఎప్పుడైతే యధాలాపంగా, తేలికగా తీసుకోవటం మానేస్తారో అప్పుడు మీరు దీవెనలని లెక్కించుకుంటారు.
మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుంటే మీరు ఏమి పొందలేకపోయారో వాటిని లెక్కించుకుంటారు. మీకు ఎంత లభించినా, మీరు ఎన్ని పొందినా, అసలు సంతోషించరు. ఎందుకంటే మనం నిరంతరం మనకి లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాము.
మీరు ఒక్కసారి ఊహించుకోండి; మీరు ఒంటరిగా కూర్చుని మీరు పొందిన వరాలన్నీ ఒక లిస్టు రాయండి. మీరు మీ కళ్ళు దగ్గర మొదలు పెట్టండి. నేను ఇంతకు ముందు చెప్పాను. ఈ ప్రపంచంలో ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళున్నారు. మీరు ఊహించండి. మీరు నిద్రలేచేటప్పటికి మీరు చూడలేకపోయారనుకోండి. ఏమి జరుగుతుంది. మీరు కనీసం బాత్రూమ్ కి కూడా వెళ్ళలేరు. అసలు మీ మంచంమీద నుంచి లేవలేరు. అంటే మనం ఎన్నో పనులు కృతజ్ఞత అనేది లేకుండా చేసేస్తున్నాము. అందుకే ఇప్పుడు మీరు కష్టపడ్డాలి.
సరే. మీరు మీ జీవితంలో పొందినవన్నీ ఒక జాబితా రాస్తే, అది చాలా పెద్దది అవుతుంది. అది రాసాక మరొక పేపర్ తీసుకుని జీవితంలో మీరు పొందలేకపోయాను అనుకున్న వాటి లిస్ట్ వ్రాయండి. అది కూడా చాలా పెద్ద లిస్టు అవుతుంది. అదే బహుశా ఎక్కువ ఉండవచ్చు. ఆ లిస్ట్ బెంజ్ కారుతో ప్రారంభమవుతుంది. చివరికి అది బెంజ్ కారుకన్నా పొడవైపోతుంది. రెండు లిస్టులు అంతం లేనివి. మీరు ఒక్క విషయం కూడా వదలకుండా వ్రాస్తే అవి అంతులేని లిస్టులవుతాయి.
సరే. ఇప్పుడు మీ ముందు రెండు లిస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏ లిస్టు చూడాలి అన్నది మీరు నిర్ణయించుకోవాలి. మనం పొందాలి అనుకున్న లిస్ట్‌ని చూస్తే మనం జీవితాలని స్తబ్ధతగా, అసంతృప్తిగా, జీవం లేనట్లు చేసుకుంటాము. అలా కాకుండా మనం పొందిన, విషయాలున్న లిస్టుని చూస్తే సంతోషంగా ఉంటాము. మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఇది పూర్తిగా మీ నిర్ణయం.
ఎవరైతే జీవితంలో ప్రతి దానిని తేలికగా యధాలాపంగా తీసుకుంటారో వాళ్ళు రెండవ లిస్టుని చూస్తారు. దానివైపు అత్యాశతో, అసంతృప్తితో చూస్తారు. ఎప్పుడైతే మీరు అత్యాశతో ఉంటారో అప్పుడు మీలో లోతైన అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే మీ కోరికలకి, ఆశలకి అంతు ఉండదు కాబట్టి. అటువంటప్పుడు తృప్తి అనేది మీ లోపలికి అసలు రాదు. ఇటువంటి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని పోగొట్టుకుంటాడు.
జీవితంలో పెద్దదో, చిన్నదో ఏమి వచ్చినా దానిని మామూలుగా చూస్తాడు. నిరంతరం తరువాత ఏమిటి అని ఎదురు చూడటమే సరిపోతుంది. ఆ తరువాతది వస్తే అది మామూలు అయిపోతుంది. ఆ తరువాత ఏమిటి అని ఆలోచించుతాడు.
అలా కాకుండా ఎవరైతే నిరంతరం కృతజ్ఞతతో ఉంటారో, వాళ్లకి అసలు రెండవ జాబితా ఉన్నది అని కూడా తెలియదు. అతనికి కేవలం కృతజ్ఞతతో ఉండటం, కృతజ్ఞతనే ఊపిరిగా చేసి దానినే శ్వాసించటం తెలుసు. జీవితం వాళ్ళకి ఒక శాశ్వతమైన ఉత్సవమే. అతను ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంటాడు. అటువంటి వ్యక్తిని చూడటం చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటుంది. అతనిలో ఒకప్రత్యేకమైన అందం కనిపిస్తుంది. అటువంటి వ్యక్తికి రెండవ జాబితా గురించి గాని, ఆ భాష గురించి గానీ ఏమీ తెలియదు. అతనికి కేవలం లోతైన ప్రేమ, కృతజ్ఞతలతో సంతోషంగా జీవించటం మాత్రమే తెలుసు. అంతే.
జీవితంలో నిరంతరం కృతజ్ఞతతో ఉండగలిగితే, లౌకిక విషయాలన్నీ కూడా పవిత్రంగాను అద్భుతంగాను అవుతాయి. మీరు అనుకుంటారు జీవితం లౌకికంగా తయారయింది, అని ఎందుకంటే ప్రతి విషయాన్ని యధాలాపంగా తీసుకున్నందువలన మీరు అనుకున్నట్టు జీవితం లౌకికమైనది కాదు. మీ మైండ్ అటువంటిది, కానీ జీవితం కాదు. జీవితం చాలా అందమైనది. జీవితంలో ప్రతి చిన్న విషయం కూడా అద్భుతమైనవే. కానీ మీ మైండ్ మిమ్ములని ఆ అందాలు చూడకుండా ఆపుతుంది. ఈ అనంత చైతన్యంలోని అందాలని చూడనివ్వదు మీ మైండ్. అది కేవలం జీవంలేని, చెప్పిన మాటే చెబుతుంది. "ఆ తరువాత ఏమిటి" అని.
మీరు అన్ని విషయాలవైపు అద్భుతం నిండిన దృక్పథంతో చూడగలిగితే అది మీలో కృతజ్ఞతని నింపుతుంది. అప్పుడు మీకు సంపూర్ణమైన తృప్తి లభించుతుంది. ఎందుకంటే మీరు ఏ సమయంలోనూ, ఏ విషయంలోనూ ప్రశ్నలు వేయరు కాబట్టి మీరు మీ మైండ్ ఆటలు సాగనివ్వరు. మీరు మీ హృదయంతోనే పని చేస్తారు. దాని ప్రతిధ్వనిలోనే ఉంటారు. అప్పుడు మీరు పసిబిడ్డలా ఉంటారు. అలా ఉన్నప్పుడు ప్రతీదీ మీకు ఒక అందమైన అద్భుతమే.
అందుకే పిల్లలని చూడటానికి చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ మైండ్ జీవంతో తొణికిసలాడుతుంది. అది స్వచ్ఛంగా ఒక స్రవంతిలా ఉంటుంది. సమాజం వారి మైండ్‌ని ఇంకా కలుషితం చేయలేదు. వాళ్ళ మైండ్లోనికి అలవాటైన రీతులని, నిబంధనలు, షరతులని ఇంకా ప్రవేశపెట్టలేదు.
జీవితంలో ప్రతి దాని వైపు కృతజ్ఞతా భావంతో చూడటం నేర్చుకోండి. మీ శరీరాన్నే ఉదాహరణగా తీసుకోండి. ఈ చిన్న ఎక్సర్సైజు చేయండి, కళ్ళు మూసుకుని కూర్చోండి. ఒక చిన్న ప్రమాదంలో మీ చిటికినవేలు కొంతపోయింది అని అనుకోండి. మీ మిగతా శరీరమంతా చక్కగా ఉంది. అకస్మాత్‌గా చిటికెన వేలి చివరి భాగం పోయింది.
అప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? ఆ విషయాన్ని జీర్ణించుకోవటం మీకు చాలా కష్టంగా ఉంటుంది. అవును కదా? అప్పుడు ఏమవుతుంది? మీరు మానసిక క్షోభని అనుభవించుతారు.
ప్రతి రోజు కొన్న నిముషాలపాటు మీరు ఒక గదిలో ఒంటరిగా కూర్చొని మీ శరీరంలో ప్రతి భాగాన్ని ప్రేమతో తడమండి. ఆ భాగానికి కృతజ్ఞత చెప్పండి. ఆ శరీర భాగం మీ నిత్య జీవితంలో మీకు సంతోషాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలపండి.
మీరు ఎప్పుడైనా మీ శరీరం గురించి ఇలా ఆలోచించారా? మీ శరీరాన్ని ఎంత తేలికగా, యధాలాపంగా తీసుకుంటారో కదా! మీ శరీరాన్ని ఎంతో ద్వేషించుతారు కదా! అది అందంగా లేదు అని మన శరీరాన్ని అసహ్యించుకుంటాం కదా! మీరు ఈ ఎక్సర్సైజు ప్రతి రోజూ చేస్తే మీరు మీ శరీరాన్ని గాఢంగా ప్రేమించుతారు. మీ శరీరంలో ప్రతి భాగానికి కృతజ్ఞతలు తెలియచేస్తారు. అప్పుడు మీ శరీరం, మీ ముఖం ఒక కొత్త కాంతితో వెలిగిపోతుంది.
మీ శరీరం మీ మైండ్‌కి జవాబునిస్తుంది. మీ మైండ్‌కి స్పందిస్తుంది. దీనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. అలానే మీ శరీరాన్ని ఏదో యధాలాపంగా, తేలికగా తీసుకోవద్దు.
కేవలం మీ శరీరంతోనే మీరు మీ జీవితంలో ఆనందాన్నంతా అనుభవించుతారు. ఈ రోజు మీరు ఇక్కడికి రాగలిగారన్నా ఇక్కడ కూర్చుని వినగలుగుతున్నారన్నా, ఇదంతా మీ శరీరం వలననే సాధ్యమయింది. మీ శరీరంలోని ప్రతి భాగం మీకు సహకరించబట్టి మీరు వినగలుగుతున్నారు. అవును కదా?
చిన్న కథ :
ఒక కుటుంబంలోని వాళ్ళు భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అందరికీ ప్లేట్లలో భోజనం వడ్డించారు. ఒక అమ్మాయి అమ్మ ప్రక్కనే కూర్చుని అన్నం వడ్డించగానే, రోజూ భోజనానికి ముందు చెప్పే ప్రార్థన చెప్పకుండా భోజనం చేయటం మొదలుపెడుతుంది.
అది చూపి ఆ అమ్మాయి తల్లి నిర్ఘాంతపోతుంది. ఆ అమ్మాయిని అలా ఎందుకు చేసావు అని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి ఇలా జవాబు ఇస్తుంది. “ఈ ప్లేటులో నేను ఇంతకు ముందు కృతజ్ఞత చెప్పని పదార్థాలు ఏమైనా ఉన్నాయా?” అని.
దీనినే నేను యధాలాపంగా, తేలికగా తీసుకోవటం అంటాను. ఇటువంటి భావనలు చిన్న పిల్లలలో బాగా నాటుకోవటం చూస్తుంటే బాధ అనిపిస్తుంది.
చిన్న కథ :
ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని, “అమ్మా క్రిస్మస్ ఇంకా ఎన్ని రోజులు ఉన్నది” అని అడుగుతుంది. దానికి వాళ్ళ అమ్మ ఎందుకు నీవు తెలుసుకోవాలని అనుకుంటున్నావు అంటుంది. దానికి ఆ అమ్మాయి, “నేను ఇక మంచి అమ్మాయిగా ఉండే సమయం ఇదేనేమో తెలుసుకుందామని అడిగాను” అంటుంది.
మనం ఈ విధంగా పిల్లలని పెంచుతున్నాము. వాళ్ళ ఆలోచనలు, ప్రవర్తనా, మాటలు ఈ విధంగా ఉంటున్నాయి. వాళ్ళకి వ్యవహారాలు ఎలా నడపాలో చెబుతున్నాము. వాళ్ళకి ప్రతీదీ ఒక వ్యవహారం అని నేర్పిస్తున్నాము. వాళ్ళకి అప్రయత్నంగా ఉండటం,
ఒక చైతన్యంగా సాగిపోవటం నేర్పించటం లేదు. వాళ్ళకి ఒక చక్కటి ఆశయంతో జీవించటం నేర్పటం లేదు. వాళ్ళకై ప్రతి ఒక్కటి ఒక లక్ష్యం అన్నట్లు చెబుతున్నాము. ఇవన్నీ అర్థం లేనివి.
మనం ఇలాంటి వాటితో వాళ్ళని నింపి ఉంచాము. కాబట్టి ముందుగా వాళ్ళలో అవన్నీ తొలగించాలి. నేను నిరంతరం అవి తొలగిస్తున్నాను. నేను మీకు అలా ఎంత తొలగించానో ఊహించండి. కొన్ని తరాలుగా ఎందరో మీ లోపలికి ఇలాంటివన్నీ పంపించి వాటితో మిమ్ములని నింపేసారు. నేను ముందుగా అవన్నీ తొలగించి మీ అంతరంగంలో కొంత ఖాళీ ఏర్పరచాలి. అప్పుడు మీరు వికసింపగలుగుతారు.
నేను ఇలా నిరంతరం కృతజ్ఞతా భావంతో ఉండమంటే, కొంత మంది వెనక్కివచ్చి, “స్వామీజీ ! ఈ రోజుల్లో నేను ఆటోడ్రైవర్‌కి, పని వాళ్ళకి అందరికి కృతజ్ఞతలు చెబుతున్నాను” అని నాకు చెబుతారు. చూడండి ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావం మీ అంతరంగంలో ఒకటి అయిపోతుందో మీరే కృతజ్ఞతగా మారిపోతారో, అప్పుడు మీరు ఇలా చేసినవన్నీ చెప్పరు. అలా చెప్పే అవసరం మీకు కనిపించదు.
మీరు ఒక విషయం చెప్పండి. మీరు ఎవరైనా దగ్గర వాళ్ళని పోగొట్టుకున్న బాధలో ఉంటారనుకోండి. ఆ బాధని మీరు మాటలలో చెప్పగలరా ? లేదు. అది మీ అంతరంగపు లోతుల్లో నాటుకుపోయి మీ ఉనికిలో కలిసిపోతుంది. అదే మీ అంతరంగంలో మీరుగా మారిపోతుంది. అవును కదా ? మీరు దానిని అనుభవించగలరు. దానిని మీరు వివరించలేరు. అవునా ? కాదా ?
అవును స్వామీజీ
అదే విధంగా కృతజ్ఞత కూడా మీ అంతరాత్మలో కలిసిపోయి అది మీ ఉనికి మారిపోతుంది. అప్పుడు మీరు దానిని గురించి వివరించరు. దానిని పదే పదే చెప్పరు. కాకపోతే సమాజంలో మీరు థాంక్ యూ అని చెప్పాలి. లేకపోతే అవతల వ్యక్తికి అర్థం కాదు కదా !
అయితే నేను మీకు ఇదంతా చెబుతున్నప్పుడు మీ కృతజ్ఞతా భావం అనేది మీ మైండ్ నుంచి మీ అంతరాత్మలోనికి రావాలి. నేను చెబుతున్న ఈ కృతజ్ఞత అనే దానిని మీరు వివరించలేరు. ఎందుకంటే అది మీ అంతరంగం లోతుల్లో ఉంటుంది.
కొంత మంది నాతో అంటుంటారు, "స్వామీజీ ! మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు. మీ వలన మాకు జీవితంలో ఎంతో మంచి జరిగింది. మీకు మేము ఎంతో కృతజ్ఞతలు”.
మీకు చెబుతున్నాను: ఏదో సమాజ మర్యాదల కోసం మీరు ఒక వ్యక్తికి కృతజ్ఞత చెప్పవచ్చు. కానీ ఈ కృతజ్ఞతా భావం అనేది ఒక వ్యక్తిని ఉద్దేశించినది కాదు. మీరు ఒక వ్యక్తి నుంచి ఏదో పొంది అతనికి కృతజ్ఞతలు చెబితే కృతజ్ఞత అనేది మీ మైండ్‌కి సంబంధించినది అవుతుంది. అది దశలోని కృతజ్ఞత.
నిజమైన కృతజ్ఞత అనేది మీ అంతరంగం లోతులలో పొంగి ప్రవహించే ఒక అద్భుతమైన భావన. అది మీరు ఎవరి నుంచో ఏదో పొందారు అని వచ్చిన కృతజ్ఞత వ్యాప్తి అయిన విశ్వ శక్తి పట్ల ఉండే భావన. అంతే ఈ కృతజ్ఞతకి ఎటువంటి సంబంధాలు అవసరం లేదు. అది ఎవరి మీద, దేని మీద ఆధారపడిలేదు. అది ఎటువంటి భావావేశాలకి ప్రభావితం కాదు. కోరిక, కోపం, అత్యాశ, ప్రేమ, ద్వేషం ఇవేమి ఈ కృతజ్ఞతా భావాన్ని కదిలించలేవు. అది కేవలం ‘అదే’ అంతే.
మీరు మీ కృతజ్ఞతను మాటలలో వెళ్ళడి చేస్తారు. ఎందుకంటే మీలో అహంకారం ఉంటుంది. ఎదుటి వాళ్ళు మీకు మర్యాదలు తెలియవు అని అనుకోవటం మీకు ఇష్టం ఉండదు. దానిని వెల్లడి చేసిన క్షణంలో మీరు దానిని అసత్యంగా చేస్తారు.
నిజానికి మీ శరీర కదలికలు, అది తెలిపే భావాలు మీలోని పొంగుతున్న కృతజ్ఞతా భావాలని తెలియజేస్తుంది. మీ కళ్ళు ఆ కృతజ్ఞతని చూపిస్తాయి. మీ నవ్వు, మీలోని మంచితనము. ఇవన్నీ కూడా మీరు మాటలలో చెప్పే కృతజ్ఞత కంటే ఎక్కువగా చెప్పగలుగుతాయి. కృతజ్ఞతతో పొంగే కన్నీరు మంచి మాటల కంటే కూడా బాగా చెప్పగలవు. మీరు కృతజ్ఞతా భావంతో పొంగుతున్నప్పుడు, కన్నీరు బయటికి వచ్చేస్తుంది.
నేను మిమ్మలని ఏడవమని చెప్పటం లేదు. నేను ఏం చెబుతున్నాంటే, ఆ కృతజ్ఞతా భావం మీలో పొంగుతున్నప్పుడు, అది అంతా మీ శరీరం చక్కగా వెల్లడి చేస్తుంది అని. మీరు దానిని దాచిపెట్టలేరు. అది మీ నిజమైన అంతరాత్మ యొక్క గుర్తు.
మరొక విషయం గుర్తుంచుకోండి. ఈ కన్నీళ్ళకి కులం, మతం ఉండవు. ఎక్కడా వాటిని హిందూ కన్నీళ్ళు, క్రిస్టియన్ కన్నీళ్ళు అని విడదీయలేము. అవి కేవలం అంతరాత్మకి చెందినవి. అంతరాత్మ వీటన్నింటికీ అతీతమైనది. కృతజ్ఞత అనే ఒక్క భావం మానవ నిర్మితమైన అడ్డుగోడలని, నిబంధనలని కూలగొట్టగలుగుతుంది. అందుకే ఇది అంతిమ ప్రార్థన.
ఏదైతే లోతుగా ఉంటుందో దానిని పూర్తిగా వివరించలేము. కవులు దానిని వివరించటానికి కవితలు వ్రాయవచ్చు. కళాకారులు చిత్రాలు చేయవచ్చు, రచయితలు ఎన్నో రాయటం ద్వారా దానిని వివరించవచ్చు. కాని వాళ్ళు ఎంత చెప్పినా అవి మొత్తంలో కొంత భాగం మాత్రమే. ఇంకా చెప్పలేని భాగం మిగిలి ఉంటుంది. దానిని ఏ పద్ధతిలోనూ ఎవరూ వెల్లడి చేయలేరు.
ఈ అనంత చైతన్య శక్తిని ఏ మామూలు విషయాలు ద్వారా కూడా వెల్లడి చేయలేము. అందుకే అది ఒక అద్భుతం. అందుకే అది మీలో జరిగినప్పుడు మీరు పొందే ఉత్సాహాన్ని మాటలలో వర్ణించలేరు. అందుకే మీరు ఆ అనుభవాన్ని ఒక అనుభూతిగా పొందగలరు కానీ దానిని చెప్పలేరు. అందుకే మీరు నా దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తారు.
నా విషయంలో మీరు ఎటువంటి కృతజ్ఞతలు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మీరు చెప్పనవసరం లేకుండానే నేను దానిని గ్రహించగలను. మీలో నిజమైన కృతజ్ఞత వెల్లువగా పొంగుతుంటే మీ కంటే ముందుగా నేనే గ్రహించగలను. అసలు
మీరు నాకు కృతజ్ఞతలు చెప్పేటప్పుడు మిమ్మలని మీరు మోసం చేసుకుంటారు. ఎందుకంటే మీ మనస్సులో ఉండే భావం ఒకటి, మీరు పైకి మాట్లాడే మాట ఒకటి. మీ మనస్సులో మీరు అనుకున్న దానికి వేరుగా మీరు మాట్లాడతారు.
గుర్తుంచుకోండి : సర్వాంతర్యామికి మీరు మీలోపల వికసించటం తెలుసు. మీరు ఆ సర్వాంతర విశ్వశక్తికి సదా కృతజ్ఞత అయిఉండండి. అది చాలు. దానిని మీరు తెలియచేయనవసరం లేదు. మీరే ఆ కృతజ్ఞతగా మారిపోండి. అంతే.
భారతదేశంలో గురువుల పాదాలు అంటుకుని నమస్కరించటం ఒక ఆచారం. మీరు కృతజ్ఞతతో పొంగుతున్నప్పుడు, మీకు గురువు మీద కృతజ్ఞత అనేది వెల్లివిరిసినప్పుడు, దానిని తెలియచేయటానికి వేరే దారి లేదు. అప్పుడు ఆయన పొందాలనటమే. అలా చేసి ఆయనలో ఒకటిగా మారటమే మీలోని కృతజ్ఞతని తెలియచేయటం.
నా దగ్గరికి చాలా చోట్ల నుంచి చాలా మంది వస్తుంటారు. కొంత మంది నా ముందు నిలబడి ఏమీ మాట్లాడరు. వాళ్ళ కళ్ళ నుంచి ఆనందంతో కూడిన కన్నీరు మాత్రం బయటికి వస్తుంది. వాళ్ళు ఏదైనా మాట్లాడాలి అని బలవంతం ఉండదు. ఎందుకంటే వాళ్ళ కన్నీరుని మించి వాళ్ళు ఏమీ చెప్పలేరు. వాళ్ళ అంతరంగంలోని భావాన్ని వాళ్ళు ఆ విధంగా వెల్లడి చేస్తారు.
మీరు గురువుల సమక్షంలో ఉన్నప్పుడు మీరు ఆయన మీద అనంతమైన ప్రేమతో కృతజ్ఞతతో ఉండండి. అప్పుడు మీలోని ప్రశ్నలన్నీ కరిగిపోతాయి. మీరు చెప్పలేని అద్భుతమైన ఆనందంతో నిండిపోతారు. మీరు ఆ విధంగా సంతోషంతో నిండిపోయారు అంటే సరియైన ఆధారాన్ని పట్టుకున్నట్టే. ఎప్పుడైతే మీరు పరిపూర్ణులు కారొ, ఆ భావంతో నిండినట్టు అనిపించదో, మీరు ఒక విధమైన అసంతృప్తితో, జవాబులేని ప్రశ్నలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు అంతా మిస్ అయిపోతారు.
మీరు గురువు సమక్షంలో పూర్తిగా తెలుసుకునే తత్వంతో ఉండగలిగితే మీరు ఏమి మిస్ అవ్వరు. మీరు గురువు మీద కృతజ్ఞతా భావంతో ఉంటే ఆయనలోని శక్తి మీ అంతరంగంలోనికి పంపబడుతుంది. ఆయన అనుభవాలు మీలో నింపబడతాయి.
మీరు గురువుల పట్ల కేవలం కృతజ్ఞతని మాత్రమే కలిగి ఉంటే, ఆయన సమక్షంలో ఉండాలి అనే కోరిక కూడా దాటుకుని వెళుతుంది. అది అడ్డుగోడలని కూలగొట్టి మీరు విస్తృతం అయ్యేలా చేస్తుంది. అలా మీరు విస్తృతం అయ్యే కొద్దీ మీరు ప్రతి దానిలో ఒకటిగా అవ్వగలరు. క్రమంగా కొంతకాలానికి కృతజ్ఞత కూడా మీకు ఆటంకంగా మారుతుంది. అప్పుడు మీలో కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. మీకు చెబుతున్నాను : మీకు ఉండే బంధుత్వాలు, సంబంధాల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. మీకు ఏదైనా ఎవరితోనైనా ఉన్న బంధం చివరికి వస్తున్నట్లుగా అనిపించితే, మీకు వారిమీద ప్రేమ ఉన్నట్లయితే మీరు వారిపట్ల కృతజ్ఞతని మాత్రమే చూపగలిగితే మీరు విడిపోగలరు. అంతే. ఆ వ్యక్తితో మీకు ఉన్న అనుబంధానికి, ఆ వ్యక్తి ద్వారా మీరు నేర్చుకున్నదానికి, ఆ వ్యక్తి వలన మీరు పొందిన ఆనందానికి మీరు మీ అంతరంగంలో కృతజ్ఞతా భావంతో ఉండండి. అప్పుడు విడిపోండి. అటువంటప్పుడు విడిపోవటం కూడా చాలా అందంగా ఉంటుంది.
కొంత మంది నన్ను అడుగుతుంటారు : “స్వామీజీ! మా శత్రువుల పట్ల మేము ఏ విధంగా కృతజ్ఞతా భావాన్ని చూపించాలి”.
నేను చెబుతాను ! ఎందుకు చూపించకూడదు ? ఆ శత్రువులే మీరు బలవంతులుగా, శక్తివంతులుగా అవ్వటానికి కారణం. వాళ్లు మీకు ఒక సవాలు లాంటి వాళ్ళు. వాళ్ళు మీరు వృద్ధి అయ్యేందుకు దోహదపడతారు. వాళ్ళు మిమ్మలని బాధపెట్టిన మూలంగానే మీరు జీవితంలో మరో కోణాన్ని చూడగలిగారు. అంత చేసినప్పుడు వాళ్ల పట్ల మీరు ఎందుకు కృతజ్ఞతతో ఉండకూడదు ?
మీకు కావాలిసింది మీ అభివృద్ధి. అవును కదా ? ప్రతి క్షణం మీరు ఇంకా తెలివిగలవారు అవ్వాలి అనుకుంటారు కదా ? వీళ్ళు మీకు ఆ అవకాశాలని కల్పించకపోయినట్లయితే మీరు కేవలం మీ స్నేహితులతోనే ఉండిపోతారు. అప్పుడు
మీకు ఆ స్థితి ఏవిధంగా ఉపయోగపడదు. మీకు కొన్ని ఎదురు దెబ్బలు తగలాలి. అప్పుడే మీలో పరిణితి కలుగుతుంది. మీలో వివేకం వికసించుతుంది.
విత్తనం పగిలితేనే మొక్కబయటికి వచ్చి చెట్టులా పెరుగుతుంది. విత్తనం ఎప్పటికీ విత్తనంలా ఉండిపోతే అలా ఉండిపోయి మట్టిలో కలిసిపోతుంది. అంతే. అటువంటివారిలో మార్పు అనేది జరగదు.
శతృత్వ విషయానికి వచ్చే సరికి మామూలు మనిషి దానిని ఒక వికార వస్తువులా అసహ్యించుకుంటాడు. అతను ఒక స్థితికి వచ్చేటప్పటికి శత్రువుని ద్వేషించి ఆ ద్వేషంలోంచి మరింత ద్వేషంలోనికి వెళతాడు. ఇది ఒక విషవలయం. కొన్ని కుటుంబాల్లో జన్మ విరోధాలు, కుటుంబ వైరాలు ఉంటాయి. అవి చాలా అసహ్యంగా ఉంటాయి. వీటితో వ్యవహారం చాలా కష్టం. ఎందుకు ? దానిని అలా చూడండి. వివేకాన్ని ఉపయోగించండి. అప్పుడు మీలోని ద్వేషం మాయమవుతుంది. పెరిగేలా చేసింది మీరు. మీరు వివేకంతో, తెలుసుకునే విధంగా పనిచేయకపోతే అవి అలా ఏర్పడుతాయి. మీరు పరిపూర్ణతతో పని చేయకుండా అవి అలా పెరిగేటట్టు చేసుకున్నారు.
మీలోపల పరిపూర్ణత అనేది వుంటే మీలోపల శతృత్వం పెరగటానికి అసలు అవకాశం ఉండదు. నేనేం చెబుతున్నానో మీకు అర్థమవుతుందా ? మీలో పరిపూర్ణత అనేది ఉన్నప్పుడు మీ అంతరంగంలో ఇలాంటివి జరిగే అవకాశం ఉండదు. అప్పుడు అది మీకు తెలియని బాష అవుతుంది. ఎదుటి వ్యక్తి మీతో శతృత్వాన్ని కొనసాగించినా మీకు కేవలం అతని మీద ద్వేషం కలగదు. ఒక వేళ అతను మీతో సంబంధాన్ని తుంచుకోవాలనుకుంటే అది కూడా మీరు కృతజ్ఞతతోనే చేస్తారు.
కొన్ని కుటుంబాలలో వ్యక్తులు ఒకరిని ఒకరు చూసుకోరు. ఒకరి నుంచి ఇంకొకళ్ళు తప్పుకోవడానికి చాలా కష్టపడతారు. బయట ఎదురుపడినా ఎలాగో ఒకలా తప్పుకుంటారు. ఎందుకు ఈ అనవసరమైనవన్నీ ? ఎందుకు మీలోని శక్తిని ఇలా ఉపయోగం లేని వాటిమీద వృధాపరచుకుంటారు. ద్వేషం మిమ్ములని మింగివేయకుండా చూసుకోండి. దానివైపు పూర్తిగా తెలుసుకునే తత్వంతో చూడండి, అప్పుడు మీలో ప్రేమ కృతజ్ఞత మాత్రమే మిగులుతాయి.
ప్రశ్న : స్వామీజీ ! ఈ నాలుగు రోజుల్లో నాకు మీ పైన కృతజ్ఞజతా భావం ఒక్కటే ఉంది. నేను మీ నుంచి ఏమీ ఆశించటం లేదు. కానీ నాకు ఒక బలమైన కోరిక ఉన్నది. మీరు నాపేరు గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు నన్ను పిలవాలి అని. ఇది ఒక రకమైన అసంతృప్తియేనా ? లేకపోతే నావైపున ఉన్న కోరికా ?
(స్వామి నవ్వుతారు)
మీరు చాలా చక్కని విషయాన్ని తీసుకువచ్చారు. ఇది చూస్తుంటే మీలో మీరు మిమ్మలని చక్కగా విశ్లేషించుకున్నారు అని అనిపిస్తుంది.
చూడండి. మీరు మీ మైండ్ నుంచి మీ మీద శ్రద్ధ కావాలి అని అనిపించినప్పుడు, ముఖ్యంగా కేవలం మీ అసూయ, అసంతృప్తి మూలంగా ఇతరులు మీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అని మీరు అనుకున్నప్పుడు అది మంచిది కాదు. అలా కాకుండా మీరు లోతైన ప్రేమ, కృతజ్ఞతా భావాలతో అలా కోరుకున్నప్పుడు అది కోరిక. అత్యాశ కాదు. అది కేవలం మీకు నామీద ఉన్న ప్రేమ మాత్రమే.
మీరు కోరికతో ప్రార్థించితే అది కృతజ్ఞత కాదు. అది మీ అహంకారం ఆడే ఆట. అలా కాకుండా మీరు లోతైన ప్రేమతో అడిగితే అది ప్రార్థన. మీరు భక్తితో, కృతజ్ఞతతో అర్ధించితే అది ప్రార్థన. ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉన్నది.
మీరు ఇప్పుడు తెలుసుకునే తత్వంలో ఉన్నారు. అందువలన అలా కోరుకోవటం అత్యాశ కాదు. కొంత కాలం గడిచేసరికి ఇది కూడా పోతుంది. మరొక విషయం. మీకు ఈ ప్రశ్న అడిగే ధైర్యంతో ముందుకి వచ్చారు. చాలా మందికి ఇటువంటి అనుమానమే ఉంటుంది. కానీ వాళ్ళు ఆ విషయాన్ని అడగలేకపోయారు. వాళ్ళని వాళ్ళు “పేరు ఏముందిలే” అని ఓదార్చుకుంటారు. లేదా అలా అడగటానికి మొహమాటపడతారు. అసలు పేరులో ఏమీ లేదు. మీరు దీనికి అతీతంగా వెళ్ళగలగాలి. అంటే ధైర్యంగా ఇంకా ముందుకు వెళ్ళగలరు అని తెలుస్తుంది. అర్ధమయిందా ?
అర్ధమైంది స్వామీజీ !
కొంత మంది నన్ను అడుగుతుంటారు. "స్వామీజీ ! మా కృతజ్ఞత తెలుపుకోవటానికి మీకు నేను ఏమీ ఇవ్వగలను?” అని.
నేను వాళ్ళకి ఒకటే చెబుతాను. మీరు నాకు చేయగల గొప్ప ఉపకారం మీరు వికసించండి. అది మీరు నాకు చేయగలిగే గొప్ప పని, నేను మీకు చేయగలిగే గొప్ప పని. అది అర్ధం చేసుకోండి. మీరు ఈ మాటలని మీ అంతరంగంలోనికి తీసుకుని, మీ అంతరాత్మని కృతజ్ఞతతో నింపండి. అదే మీరు నాకు ఎంతో చేసినట్టు అవుతుంది.
అయితే ఒక విషయం మీకు నేను చెప్పాలి. మీరు తిరిగి ఏదైనా చేయాలి అని అనుకుంటే, ఈ సమాజానికి కొంత సేవ చేయండి. ఇతరులకి సహాయం చేయండి. మీరు ఇక్కడ కనుగొన్న ఆనందాన్ని ఇతరులు కూడా పొందేటట్టుగా వారిని మేల్కొలపండి. దానిని మీరు అహంకారంతోనో లేకపోతే మీరేదో గొప్పవారయిపోయినట్టో చేయకండి. దానిని మీలోని ప్రేమని, ఆనందాన్ని పంచటానికి చేయండి. మీరు ప్రయోగాత్మకమైన అనుభవాన్ని పొందాలి. మీరు ఈ ప్రశ్నతో ముందుకి వచ్చారు.
శక్తినంతా ఇవ్వండి. అలా చేస్తూ ఆనందాన్ని పొందండి. ఇది మీకు అనంతమైన ఆనందాన్ని కలిగించే ఒక ధ్యానం. అది ఎదుటి వారికి ఒక మేలుకొలుపు అవుతుంది.
మీరు నిరంతరం లోతైనా కృతజ్ఞతా భావంతో ఉంటే, మీరు ధ్యానంలో ఉన్నట్టే కాబట్టి మీరు ఊహించుకోండి. మీరు నిరంతరం కృతజ్ఞతతో ఉంటే, మీరు నిరంతరం ధ్యానంలో ఉన్నట్టే.
ఒక విషయం : కృతజ్ఞత అనేది ఒకరు నేర్పించితే రాదు. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు, కృతజ్ఞతలు తెలియచేయాలని, కృతజ్ఞతా భావంతో ఉండాలి అని మనం నేర్పించాలి. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళయ్యాక వాళ్ళే తెలుసుకుంటారు. అయితే ఇలా చెప్పటం వలన అన్నింటిలాగా ఇది కూడా ఒక సమాజపు నిబంధన అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే మీకు చిన్నప్పుడు పెద్దవాళ్ళని, టీచర్స్ని ఎలా గౌరవించాలో నేర్పుతారు, అది మైండ్ నుంచి చాలా యాంత్రికంగా వస్తుంది. అంతే కాని మీ అంతరంగంలోపల మీ అనుభూతుల నుంచి రాదు.
మీరు ఎప్పుడైతే ఈ సర్వాంతర్యామితో సంబంధాన్ని మొదలుపెడతారో అప్పుడు నిజమైన కృతజ్ఞత అనేది మీలోపల ఉదయిస్తుంది. దానికి వేరే దారి లేదు. మీకు కృతజ్ఞజత ఈ విధంగా మీలో ఉన్నప్పుడు, మీరు ఏదో ఒక ప్రత్యేకమైన దానివైపు మాత్రమే కృతజ్ఞతని చూపించరు. అది మీలో ఎంతో సహజంగా వికసించి సువాసనలను అన్ని దిక్కులా వ్యాపింపచేస్తుంది. అంతే.
ఇది జరిగినప్పుడు మీకు అప్రయత్నంగానే కృతజ్ఞత అంటే ప్రార్థన అని తెలుస్తుంది. ఇది మిమ్ములని ఉన్నత స్థితికి చేర్చగలిగే ప్రార్థన. ఇది మిమ్ములని ప్రేమలో, సంతృప్తితో అధికులని చేస్తుంది. మీకు ఈ అనంత సృష్టితో (భగవంతునితో) ఎలా ఒకరైపోగల సంబంధాన్ని సృష్టించి కోవాలో ఆ రహస్యం తెలుస్తుంది. నిరంతరం లోతుగా సంబంధాన్ని నిలువుకోవటం తెలుస్తుంది. కారణం లేకుండా సంతోషంగా ఉండగలగటం తెలుస్తుంది. అప్పుడు మీరు ప్రతి వస్తువుని, ప్రతి ప్రాణిని ఈ సృష్టిలో భాగమే అని చూడగలగటం తెలుస్తుంది. మీకు ఈ మొత్తంలో ఏకమైపోవటం తెలుస్తుంది. అప్పుడు మీరు దేనినీ కూడా ముక్కలుగా చేసి విశ్లేషించటం మానేస్తారు.
వీటన్నిటి కంటే కూడా మీకు గురువుతో ఎలా సంబంధాన్ని నిలుపుకోవాలో తెలుస్తుంది. గురువుతో నిజమైన సంబంధం కృతజ్ఞతతోనే మొదలవుతుంది. కృతజ్ఞత ప్రార్థనగా మారినప్పుడే గురువుతో మీకు సంబంధం ఏర్పడుతుంది. అప్పటి వరకూ
మీరు కేవలం ఇది కావాలి, అది కావాలి అని అడగటమే ఉంటుంది. దాంతో మీరు చాలా కోల్పోతారు.
ఇప్పుడయినా సరే : మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను మిమ్మలని కృతజ్ఞులుగా ఉండమని చెప్పటం లేదు. నేను కేవలం మీ అంతరంగం లోపల కొతం ప్రదేశాన్ని సృష్టిస్తున్నాను. ఆ ప్రదేశంలో నేను చెప్పే విషయాల అనుభూతిని మీరు పొందుతారు. అప్పుడు అది మీ స్వంత అనుభవం అవుతుంది. నా మాటల వెనుక ఉన్న శక్తి మీలోపల ఆ ప్రదేశాన్ని సృష్టిస్తుంది. అంతే.
మీకు స్వేచ్ఛని ఇస్తే మీరు చక్కని వ్యక్తిగా తయారవుతారు. అప్పుడు మీరు వికసించటానికి సిద్ధంగా ఉంటారు. అలా కాకుండా మీరు మానసిక బానిసత్వంలో ఉంటే మిమ్మలని మీరు పరిశోధించుకోలేరు. మీ అంతరంగంలోని ఖాళీ ప్రదేశాన్ని కనుక్కోలేరు.
నేను ఎప్పుడు అంటుంటాను. నేను స్వేచ్ఛని ఇచ్చే గురువుని అని, నేను ఎవరితో అయినా పని చేసేటప్పుడు పూర్తి స్వేచ్ఛని ఇస్తాను. అప్పుడే వాళ్ళు వాళ్ళలోనికి వెళ్ళి, శోధించి కనుగొని అప్పుడు పరిపూర్ణులవుతారు.
అలా అని నేను తల్లితండ్రులని వాళ్ళ పిల్లలకి పూర్తి స్వేచ్ఛనివ్వమని చెప్పటం లేదు. వాళ్ళకి అంతరాయం కలగకుండా వారిని గమనించండి. నేను కేవలం మీకు చెప్పేది ఈమానసిక బానిసత్వం ఉండకూడదు అని. వాళ్ళంతట వాళ్ళు పరిపూర్ణులుగా అయ్యే అవకాశాలు కల్పించండి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళంతట వాళ్ళు సత్యాన్ని తెలుసుకునేలా చేయండి. అంతే కాని అన్ని విషయాలువాళ్ళలో మీరు బలవంతంగా నింపకండి. వాళ్ళకి సరిపడా అవకాశం ఇస్తే వాళ్ళు చక్కగా వృద్ధి చెందుతారు. వారి అంతరంగంలో ఆనందాన్ని అనుభవించుతారు.
కొంత మంది నన్ను అడుగుతుంటారు, "స్వామీజీ ! మీరు నిరంతరం ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు" ? అని
యోగులు, గురువులు నిరంతరం పరమానందంలో ఉంటారు. ఎందుకంటే వారిలో ఎంతో లోతుగా కృతజ్ఞత అనేది నిరంతరం పొంగి ప్రవహించుతూ ఉంటుంది. ఎందుకంటే వారు నిరంతరం ఈ అనంత చైతన్య సృష్టితో, ఈ సర్వంతర్యామిలో ఏకమైపోయి ఉంటారు.
మీరు కేవలం నాపట్ల మాత్రమే కృతజ్ఞతని చూపారనుకోండి లేదా ఏదో ఒకరిపట్ల చూపించారనుకోండి, మీరు సమస్తాన్ని కోల్పోతారు. కృతజ్ఞత అనేది ఏమీ ఒక వెలుగు కిరణం కాదు, ఏదో జాగ్రత్తగా ఒక దాని మీద మాత్రమే ప్రసరింపచేయటానికి. అది అద్భుతసువాసన. మీరు దానిని కలిగి ఉంటే అది అన్ని ప్రక్కలా వ్యాపించి మొత్తాన్ని పరిమళ భరితం చేస్తుంది. అందుకే గురువులు నిరంతరం మహదానందంలో ఉంటారు. గురువు ఒక సుపరిమళాల సుమం. ఆ పరిమళాన్ని మీరు అనుభవించవచ్చు. ఆనందాన్ని పొందవచ్చు. ఆ కారణంగానే మీరు పదే పదే ఇక్కడికి వస్తారు.
ఒక విషయం అర్థం చేసుకోండి : ప్రతి క్షణం అందమయినది. దానిని మీరు చూడటానికి, దానిని స్వీకరించటానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీకు ప్రతి క్షణం అందంగా ఉంటుంది. ఆ అందం మనం ఏదో పండగ చేసుకున్నప్పుడో, లేకపోతే ఏదైనా ఘన విజయాన్ని సాధించినప్పుడో, లేదా ఏదైనా సంపాదించినప్పుడో మాత్రమే అది అందంగా ఉండటం కాదు.
ప్రతి క్షణం అందంగా ఉంటుంది. ఎందుకంటే విశ్వశక్తి, ఈ అనంత చైతన్యం నిరంతరం అప్రయత్నంగా ఆనందంగా ప్రవహించుతూ ఉంటుంది. అన్ని పనులూ కాలానికి అనుగుణంగా సాగిపోతుంటాయి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీకు ఎక్కడా ఏదీ తప్పు కనపడదు. అప్పుడు మీకు ఈ ఫిర్యాదులు చేసే వారిని చూస్తే అలా ఎందుకు చేస్తున్నారో అని ఆశ్చర్యంగా ఉంటుంది.
మీరు ఈ అనంత చైతన్య సృష్టికి నిరంతరం కృతజ్ఞులయి ఉంటే, అప్పుడు ఈ సృష్టి మొత్తం మీకు ఒక దేవాలయంలా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నా
మీ మనస్సు ప్రార్ధనతో, ధ్యానంతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు మీరు గుడికి వెళ్ళి పూజలు చేయనవసరం లేదు. ఈ సర్వసృష్టితో ఏకమైపోయి మీరు నిరంతరం మహదానందంలో ఉంటారు.
ఈ సర్వసృష్టి ఒక పవిత్ర దేవాలయమవుతుంది. చెట్టు, ఆకాశం, భూమి అన్నీ కూడా మీకు ఒక పరిపూర్ణమైనదిగా అనిపిస్తుంది. మీరు దాని ముందు శిరస్సు వంచి ఏమి కోరుకుంటారు. మీరు కేవలం కృతజ్ఞతతో శిరస్సు వంచుతారు. ఈ అద్భుత సృష్టిలో మీరు భాగమయినందుకు కృతజ్ఞతతో శిరస్సు వంచి నమస్కరించతారు. అంతే.
ఇది జరిగినప్పుడు మీరు సృష్టిలోని ప్రతి దానితో సంబంధ బాంధావ్యలని ఏర్పరుచుకుంటారు. అప్పుడు మీకు చెట్లు, ప్రాణాలు, భూమి, ఆకాశం అన్నీ మీకు బంధువులే. అన్నింటితోనూ బంధం ఏర్పరుతుంది. మీరు సంభాషణ అనే మైండ్ యొక్క భాష నుంచి, మనస్సు భాష అయిన ఒకటిగా కలిసిపోయి భావాన్ని వ్యక్తీకరించే స్థాయికి చేరుతారు. అప్పుడు మీ ఏకాగ్రత మీ మైండ్ నుంచి (మేథస్సు) హృదయానికి మారుతుంది.
ఎవరైతే భగవంతుడు ప్రార్థనలకి జవాబు ఇస్తాడు అని నమ్ముతారో వాళ్ళకి ఒక విషయం చెబుతాను : భగవంతుడు చాలా కరుణామయుడు. అందుకనే మీరు చేసే కొన్ని ప్రార్ధనలకి ఆయన జవాబు ఇవ్వడు.
అది ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లలకి జ్వరం, జలుబు ఉన్నప్పుడు ఐస్ క్రీం అడిగితే మీరు ఇవ్వరు కదా. అప్పుడు చిన్నపిల్లలకి మీమీద కోపం వస్తుంది. అయినా మీరు వాళ్ళకి ఐస్ క్రీం ఇవ్వరు, ఎందుకంటే ఆ సమయంలో చిన్న పిల్లలకి అది ఇవ్వటం మంచిది కాదు అని మీకు తెలుసు. కాబట్టి మీరు సరియైన నిర్ణయం తీసుకున్నారు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ సమయంలో ఐస్ క్రీం అడగటం మంచిది కాదు అని వాళ్ళకి తెలియదు.
అదే విధంగా మనం అమాయకత్వంతో మనకి మంచి ఏదో తెలియని స్థితిలో భగవంతుణ్ణి చాలా అడుగుతాము. కానీ కరుణామూర్తి, ప్రేమ మూర్తి అయిన ఆ సర్వాంతర్యామికి మనకి ఏది మంచిదో ఏది కాదో పూర్తిగా తెలుసు. అందుకే అటువంటి మన ప్రార్థనలని పూజలను ఆయన ఒక ప్రక్కన పెట్టేస్తాడు. ఆయన మీకు ఏది మంచిది అయితే, ఏది అవసరమైతే అదే మీకు ఇస్తాడు. ఆయన పూర్తిగా మీ సంరక్షణ విషయం ఆలోచించుతాడు. మీకు మంచి వివేకం ఏర్పడే విధంగా మంచి చేస్తాడు.
గుర్తుంచుకోండి. మీ అంతరంగంలోని వివేకం ఎంతగా వికసించుతుందో, మీరు ప్రార్థనలు చేయటం అంతగా తగ్గింపచేస్తారు. అలాగే భగవంతుణ్ణి అడగటం కూడా తగ్గించేస్తారు.
మీరు భగవంతుణ్ణి ఏమి కోరుకుంటారు ? ఏ క్షణంలో అయితే మీరు భగవంతుణ్ణి అడగటం మొదలుపెడతారో, అప్పుడే మీరు భగవంతుడికి కొన్ని విషయాలు తెలియవు అని అనుకోవటం మొదలవుతుంది. భగవంతునికి తెలియదు అనే కదా మీరు అడుగుతారు. అంటే మీరు అడిగితే తప్ప అవి మీకు ఇవ్వాలి అని ఆయనకి తెలియదు అని మీరు అనుకోవటమే కదా! ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. అవును కదా ! ఈ విశ్వంలో భగవంతునికి తెలియనిది ఏదైనా ఉన్నదా !
అర్థం చేసుకోండి : భగవంతుడు మీకు ఏది అవసరమో ఇదే ఇస్తాడు. అంతే కాని మీరి ఏది అడుగుతారో అది ఇవ్వడు. మీరు అడిగినవన్నీ ఇస్తే మీరు సమస్యల నుంచి, కష్టాలలోనికి, కష్టాలలోంచి దుఃఖంలోనికి ఇలా వెళ్ళిపోతారు. ఆయన మీకు కావలసినవి మాత్రమే ఇస్తే మీరు జ్ఞానంలోనుంచి విజ్ఞానంలోనికి, దానిలోంచి వికాసంలోనికి ఇలా అభివృద్ధి చెందుతారు. అప్పుడు ఏదో ఒక సమయంలో అడగటం అనే దానిని వదిలివేసి దాని స్థానంలో కృతజ్ఞతని నింపుతారు.
భగవంతుడు మీకు కష్టాల నుంచి బయట పడటానికి కావలసిన శక్తినీ, ధైర్యాన్ని ఇస్తాడు. మీ సమస్యలు పరిష్కరించుకునే మేధస్సుని ఆయన మీకు ఇస్తాడు.
ఆయన మీరు అభివృద్ధి చెందే విధంగా విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇస్తాడు ఆయన మిమ్మల్ని మీరు శోధించి మీలోని ప్రేమని, రక్షణని తెలుసుకునే అవకాశాన్ని ఇస్తాడు ఆయన మీరు పొందినదంతా మీకు అవసరమయినదే అన్న విషయం అర్ధం చేసుకునే శక్తినిస్తాడు. భగవంతుడు మీరు ఒక పరిమళ భరితమైన పుష్పంలా వికసించటానికి కావలసింది ఇస్తాడు.
మన అసలు సమస్య ఏమిటంటే మనందరం భగవంతునికి శక్తి ఉన్నది, ఆ శక్తితో మనం ఏది అడిగితే అది ఆయన మనకి ఇచ్చేస్తాడు అని నమ్ముతాము. కానీ మనం అసలు అర్ధం చేసుకోని విషయం ఏమిటంటే, భగవంతునికి మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలుసుకోగల బుద్ధి, జ్ఞానం ఉన్నాయి అన్న విషయం. కేవలం భగవంతునికి శక్తి ఉన్నది కాబట్టి మనం అడిగినవన్నీ ఇస్తాడు అని అనుకుంటాము. అందుకే నిరంతరం అడుగుతూనే ఉంటాం. ఒక దాని తరువాత ఒకటి అడుగుతూనే ఉంటాం.
కానీ మనం ఏమనుకుంటాం ; నాకు మంచి ఏదో బాగా తెలుసు. దాని కోసం భగవంతుణ్ణి ప్రార్ధించుతాను. అంటే మనం మన బుద్ధిని, భగవంతుడి శక్తిని ఉపయోగించి మనకి కావలసినవి పొందాలి అని అనుకుంటాము. మనం భగవంతుడికి చాలా స్పష్టంగా చెబుతాము. నాకు ఇది కావాలి. ఇది ఈ విధంగా జరగాలి. కాబట్టి నీ శక్తిని ఉపయోగించి ఈ పనిని ఈ విధంగా చేయి అని అంటాము. మనం మన కోరికలని, వాటి ప్రాధాన్యతలతో సహా వివరాలు బ్రాకెట్లో పెట్టి మరీ ప్రార్ధన చేస్తాము.
ఈ వైఖరి వలనే మనం సమస్యలలో పడిపోతాము. మీరు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. భగవంతునికి శక్తి ఉన్నది. అదే కాదు ఆయనకి మంచి, చెడు నిర్ణయించగలిగే మేధస్సు ఉన్నది. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైతే అర్ధం చేసుకుంటారో అప్పుడు అగటం మానేస్తారు.
మీరు అనుకుంటారు ఈ ప్రపంచమంతా మీ తెలివి తేటలతో నడుస్తుందని స్పష్టంగా అర్థం చేసుకోండి : మీ తెలివి తేటలు లేకపోయినా ఈ ప్రపంచం నడుస్తుంది.
మీకు వ్యాపార లక్షణాలు ఎక్కువ. అందుకే ఈ విషయం అర్థం కాదు. ఎవరో ఒకరు, మీ చుట్టం కాదు, ఎవరూ కాదు, మిమ్ములని ఎటువంటి షరతులు లేకుండా, మీ నుంచి ఏమీ ఆసించకుండా, నిరంతరం మిమ్ములని రక్షిస్తున్నారు అని మీకు చెబితే అది అర్థ చేసుకోవటం మీకు చాలా కష్టంగా ఉంటుంది. అది నమ్మాలంటే మరీ అతిశయోక్తిగా, చాలా అతిగా మీకు అనిపిస్తుంది.
మీకు చెబుతున్నాను. ఈ అనంత సర్వ చైతన్య శక్తి, ఈ భగవంతుడు మిమ్ములని రక్షించినంతా, మీ గురించి పట్టించుకున్నంతగా ఎవరూ మిమ్ములని పట్టించుకోరు. ఇది మీకు నేను చెబుతున్న సత్యం.
అయితే ఈ విషయం మీరు మీ అంతరంగంలో తెలుసుకోగలగాలి. అది మీ ఇష్టం. మీకు ఇష్టమయి తెలుసుకోగలిగినవాళ్ళు మీ సొంత అనుభవంతో మీ అంతట మీరు మీలోపల ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడే ఇది మీకు మొట్టమొదటి విజ్ఞానం అవుతుంది. అంటే వేరే వారి ద్వారా కాకుండా మీకు తెలిసే కొత్త విషయం అవుతుంది.
నేను ఎప్పుడూ చెబుతుంటాను: నేను మీకు ఆధ్యాత్మిక జీవితాన్ని నేర్పను. అది మీరే నేర్చుకుంటారు. నేను మీకు కొన్ని గొప్ప సత్యాలని చెబుతాను. అప్పుడు కనీసం మీకు కొన్ని విషయాలు తెలియవు అని అర్థమవుతుంది. అయితే ఆ సత్యాలని మీ కోసం మీరు అర్థం చేసుకోగలగటం అనేది మీ శక్తి, ఇష్టంపై ఆధారపడి ఉంటాయి. ఆ సత్యాలని మీరు ఎన్ని సార్లు వింటాను అని అంటే నేను అన్ని సార్లు మీకు చెప్పగలను.
ఒక చిన్న కథ :
ఒకసారి శంకరాచార్యులవారు తన శిష్యులతో కలసి కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శించుతూ ఉంటారు. ఆయనకి ఒకచోట విపరీతమైన దాహం వేస్తుంది. చుట్టు వెతుకుతారు. కానీ ఎక్కడా నీళ్ళు కనబడవు.
అక్కడ ఒక తాటితోపు ఉంటుంది. అక్కడ తాటికల్లు తీస్తుంటారు. శంకరాచార్యులవారు ఆ తాటి చెట్ల దగ్గరకి వెళ్ళి తనకి దాహంగా ఉన్నదని దాహం తీరటానికి ఏదైనా ఇవ్వమని ప్రార్థిస్తారు. వాళ్ళు తమ దగ్గర కల్లు తప్ప మరేం లేదు అని అంటారు.
శంకరాచార్యుల వారు ఆ కల్లునే అడిగి తాగుతారు. శిష్యులు ఆయన కల్లు తాగటం చూసి వాళ్ళు కూడా అడిగి దానిని తాగుతారు. ఆ కల్లు శంకరాచార్యులని ఏ విధంగానూ ప్రభావితం చేయదు. ఆయన జ్ఞానోదయం పొందిన మహాయోగి. ఆత్మ సాక్షాత్కారంతో అంతులేని చేతన స్థితిగల మహాయోగి. ఆయన మాములుగా నడిచి ముందుకి సాగుతున్నారు. కానీ శిష్యులు మాత్రం ఆ కల్లులోని మత్తు ప్రభావంతో తూలిపోతూ నడుస్తారు.
కొన్ని రోజులు గడిచాక వాళ్ళు ఒక ఎడారి ప్రాంతం చేరుతారు. వాళ్ళు అందరికీ దాహంగా ఉంటుంది. ఈ సారి వాళ్ళకి ఒక కమ్మరి ఇనుప పనులు చేస్తూ కనిపించుతాడు. వాళ్ళకి అక్కడ ఏమి కనిపించవు. శంకరాచార్యులు అక్కడ ఇనుముని కరిగిస్తున్న వ్యక్తిని చూసి తాగటానికి ఏమైనా ఉన్నదా అని అడుగుతాడు, ఆ పని చేసే అతను ఏమీ లేదు అంటాడు.
శంకరాచార్యులు కరిగిన ఇనుముని చూస్తారు. ఆయన ఆ పని చేసే వ్యక్తిని అడిగి అది తీసుకుని దానిని తాగి దాహం తీర్చుకుంటారు. ఆయన తాగాక, దానిని తన శిష్యులకి ఇస్తారు. వాళ్ళంతా భయంతో నిర్ఘాంతపోతారు.
శంకరాచార్యులు వాళ్ళకి ఒక విషయం అర్థమయ్యేలా చేయాలనుకుంటారు. అది: గురువులు చెప్పింది శిష్యులు చేయాలి, అంతే కాని గురువులు చేసినది కాదు అని.
ఆయన కల్లు తాగినప్పుడు అది ఆయనని ఏవిధంగా కూడా ప్రభావితం చేయలేకపోయింది. ఆయన మహాజ్ఞాని, యోగి. ఆయనది అంతులేని చేతన స్థితి.
మీరు ఏదైనా అనుభవించనిదే, దానిని మీరు తెలుసుకోలేరు. కాబట్టి మీరు బయట నుంచి అనుకరించకూడదు. మీలో ప్రతి ఒక్కరికీ అది మీ అంతరంగంలో మీకు అనుభవాన్ని ఇవ్వాలి. అప్పుడే మీరు ఆ విషయాన్ని పూర్తిగా అర్థ చేసుకోగలరు.
మీరు సత్యం పట్ల ఎంతవరకు కట్టుబడి వుండాలి, దాంతో ఎంత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనేది పూర్తిగా మీ నిర్ణయం. ఎవరైతే ఈ విషయంలో వారికి వారు సహాయం చేసుకుంటారో వారికి నేను సహాయం చేస్తాను. మీరు నన్ను చేరుకోవాలనే ఉద్దేశంతో కనీసం మీ చేయిని పైకి లేపగలిగినా, ఆ చేయి పట్టుకుని నేను మిమ్మలని పైకి తీసుకురాగలను. మీకు నిజంగా పైకా రావాలి అని అనుకుంటే మీ చేయి నాకు అందించండి లేదా మీరు ఎక్కడా ఉన్నరో అక్కడే ఉండిపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను. అందుకే నేను ఎప్పుడూ చెబుతాను, “బానిసత్వంలో ఉండే స్వేచ్ఛని భగవంతుడు మీకు ఇచ్చాడు”.
మనలో చాలామంది భగవంతుడు మనకు చేయవలసినంత సహాయం చేయటం లేదు అని అనుకుంటాము. కానీ నేను చెబుతున్నాను. అర్థం చేసుకోండి. భగవంతునికి మీ గురించి మీ కన్నా బాగా తెలుసు. అది నిజం. దానిని అర్థం చేసుకోండి. అది చాలు. మీకున్న అనుమానాన్ని వదిలివేయండి. నమ్మకాన్ని పెంచుకోండి. అది చాలు. మిగతా విషయాలు వాటంతట అవే సరిగా జరుగుతాయి.
చిన్న కథ :
రెండు గోల్డ్ ఫిష్‌లు ఒక అక్వేరియంలో ఉన్నాయి. ఒక చేప రెండవ చేపని అడుగుతుంది: “నీకు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నావా?”, ఆ ప్రశ్నకి రెండవ చేప ఇలా సమాధానం చెబుతుంది, “మరి ఎవరు రోజు మన కోసం నీళ్ళు మారుస్తున్నారు”.
మీరు ఈ అనంత చైతన్య శక్తిని నమ్మితే ఆ శక్తి మీ అవసరాల విషయం చూస్తుంది. అప్పుడు మీరు ఎటువంటి సమస్య లేకుండా స్వేచ్ఛగా ఉండవచ్చు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. మీకు నేను చెప్పాను. మీ అవసరాలు వేరు. మీ కోరికలు వేరు. అవసరాలు ఎప్పుడూ తక్కువగా ఉంటాయి. కోరికలకి అంతు ఉండదు. మీ అవసరాలన్నీ వాటంతట అవే ఈ సర్వాంతర్యామి ద్వారా తీర్చబడతాయి. మీకు కోరికలు పెరిగితే భగవంతుని మీద, ఈ సృష్టి మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే అవి తీర్చబడినట్టుగా మీకు అనిపించవు.
చూడండి. మామూలు నమ్మకం 'నమ్మటమే' అంతే. విశ్వాసం అంటే నమ్మకంతో పాటు దానిని అమలు పరిచే శక్తి కూడా. మీరు నమ్మకంతో ప్రారంభించి విశ్వాసంతో ముగించాలి. నమ్మకంలో అనుమానం ఉంటుంది. విశ్వాసంలో అనుమానం ఉండదు. ఎందుకంటే అది మీకు అనుభవమయింది. మీ అంతట మీరు కృతజ్ఞతని అనుభవపూర్వకంగా పెంపొందించుకుంటే, అది చేసే అద్భుతాల వలన మీరు అదృష్టాన్ని ఆకర్షింపగలుగుతారు. ఈ విషయాన్ని నేను నా అనుభవంతో మీకు చెబుతున్నాను.
ఒక చిన్న కథ :
ఒక యువకుడు రాజ మందిరానికి వెళ్ళి ఒక రోజు మందిరంలో ఉండాలని తన కోరికగా చెబుతాడు. రాజు గారు దానికి సరేనని ఆ యువకుడికి ఆ సదుపాయం కల్పించుతాడు. మర్నాడు ఆ యువకుడు రాజుగారి దగ్గరకి వచ్చి చాలా ఫిర్యాదులు చేస్తాడు.
అప్పుడు రాజుగారు ఆ అబ్బాయితో రాజమందిర వాసం అతని అర్హతని మించిన సదుపాయం అని, అతనిని వెంటనే బయటకి పంపించేయండి అని చెబుతాడు. ఆ యువకుడు చాలా బాధపడి ఒక సుఫీ గురువు దగ్గరికి వెళ్ళి తన బాధని వెళ్ళబోసుకుంటాడు. తనకి జరిగినదంతా చెబుతాడు.
దానికి గురువు ఏమీ జవాబు చెప్పడు. ఆ యువకుణ్ణి తన శిష్యునిగా ఉండమంటాడు. కొన్ని నెలలయ్యాక ఆ యువకుణ్ణి తీసుకుని రాజ భవనానికి వెళ్లి రాజుతో తాను రాజమందిరంలో కొన్ని రోజులు ఉంటానని చెబుతాడు. రాజు గారు అంగీకరించి వాళ్ళకి సదుపాయం చేయిస్తాడు.
మర్నాడు రాజుగారు గురువుని వసతులు ఎలా ఉన్నాయి అని అడుగుతాడు. దానికి గురువు తన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పి, చాలా సౌకర్యంగా ఉన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. రాజుగారు చాలా సంతోషపడి తన పరివారంతో గురువుగారిని జాగ్రత్తగా చూడమని అన్ని సౌకర్యాలు ఇవ్వమని ఆజ్ఞాపించుతాడు.
అప్పుడు గురువు ఆ యువకుడి వైపు తిరిగి, "ఇప్పుడు చూసావా? ఇదే జీవిత రహస్యం. కృతజ్ఞతతో ఉంటే వరాలు కురిపించబడతాయి" అంటాడు. మీరు ఈ అనంత సృష్టి పట్ల కృతజ్ఞతతో ఉండి, అది మీకు ఇచ్చిన వాటిలో లోపాలు చూపకుండా, ఇచ్చిన వాటి పట్ల కృతజ్ఞతని చూపించితే ఇలానే జరుగుతుంది. మీలోపలి కృతజ్ఞతా భావం వుంటే అది చక్కని అనుకూల తరంగాలని సర్వ శక్తిమయమైన ఆ అనంత చైతన్యం దగ్గరకి పంపించుతుంది. అప్పుడు అప్రయత్నంగా మీకు మీరు ఊహించలేనని వరాలు మీ దగ్గరకి పంపించబడతాయి.
అలా అని చెప్పి ఎదుటి వారిని ఏదో మాటలతో పెదాలపై పొగడటం కాదు. అది జిత్తులమారితనం. అది కపటం. వారిని మోసం చేసి ఎక్కువ పొందాలి అనుకోవటం. అది మంచిది కాదు. మీరు ఈ బయట ప్రపంచంలో ఏది పొందినా పొందకపోయినా, మీరు నిరంతరం కృతజ్ఞులయి ఉంటే ఆ కృతజ్ఞతా భావం నుంచి అన్ని వైపులకి వ్యాపించుతుంది. అప్పుడు జరగవలసినవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి.
కొంతమంది నన్ను అడుగుతుంటారు. స్వామీజీ! మన చుట్టూ ఎన్నో బాధలు కష్టాలు ఉన్నాయి. ఎందుకు ఇదంతా?
నేను చెబుతున్నాను. ఇదంతా అర్ధం లేనిది. ముందు ఒక విషయం అర్ధం చేసుకోండి: మీరు అనుకుంటున్నంత కష్టాలు, బాధలు లేవు. కష్టాలు సమస్యలు ఉన్నాయి. అయితే వాటిని మీ మైండ్ భూతద్దంలో చూపిస్తుంది. మీరు సరియైన సమాచారం తీసుకుని చూడండి. అప్పుడు మీకే అర్ధమవుతుంది. మీ మైండ్ ఎలా ఆడుతుందో. మామూలుగా సమాజంలో మాట్లాడే మాట ద్వారా చిన్న సమస్యలని అతి పెద్దగా చేస్తున్నారు. మనలో నమ్మకం పోయింది. దాంతో బాధలు ఎక్కువ అయ్యాయి. ఎంత అత్యాశాపరులం అయిపోయాం. మన అచేతన స్థితి చూపించే దారుల్లో పడిపోతున్నాము.
అర్ధం చేసుకోండి. ఈ అనంత చైతన్య శక్తి, ఈ విశ్వంలో జరిగే అన్నింటినీ ఒక శ్రుతిలో ఉంచుతుంది. అన్ని సంఘటనలూ ఒకే పద్ధతిలో ఒకే విధమైన లయలో సాగుతాయి. మీరు ఎంత ఎక్కువగా ఈ విషయాలని తెలుసుకోగలిగితే అంత ఎక్కువగా మీ చుట్టూ ఉండే గందరగోళంలో అంత అద్భుతమైన రీతి, పద్ధతి ఉండటాన్ని మీరు చూడగలరు. మీరు కేవలం ఈ విషయాన్ని తెలుసుకోగలగాలి. దాని ప్రకారం మీ పాత్ర మీరు పోషించాలి. అప్పుడు జీవితం ఒక సంగీత ఝరిలా ప్రవహిస్తుంది.
మీరు ఈ సంఘటనలకి, ఈవిషయాలకి సున్నిత మనస్కులయినప్పుడు, అతి సున్నితంగా స్పందించగలిగినప్పుడు, మీరు చిన్న విషయంలో నుంచి పెద్ద పెద్ద సంఘటనల వరకూ అవి మీ కోసం ఏ విధంగా తిరిగి అమర్చబడతాయో తెలుసుకోవటం మొదలు పెడతారు. ఇంత పెద్ద కార్యక్రమంలో ఒక చిన్న వస్తువు లాంటి మీ కోసం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో తెలుసుకోగలుగుతారు. ఈ అనంత శక్తికి అనుగుణంగా జరిగే అద్భుతాలని ఆశ్చర్యంగా చూస్తారు. ఈ అనంత విశ్వంలోని అమర సంగీతఝరిలో మీరు ఒక రాగమయిపోయారని అర్ధమవుతుంది. ఆ సంగీత స్రవంతితో పాటు మీరు ప్రవహించుతూ ఆనందడోలలలో ఊగగలుగుతారు. అలా కాకుండా ఆ ప్రవాహానికి ఎదురీదినప్పుడు, ఆ ప్రవాహంతో యుద్ధానికి సిద్ధమయినప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి.
చిన్నకథ :
ఒక రోజు కొంత మంది ఒక వ్యక్తి ఇంటికి పరిగెత్తుతూ వచ్చి అతనితో అతని భార్య నదిలో పడిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది అని చెబుతారు. వెంటనే ఆ వ్యక్తి నది దగ్గరకి పరిగెత్తి, వెంటనే నదిలో దూకి ప్రవాహానికి ఎదురు ఈదుకెళుతుంటాడు. ఆ గుంపులో ఒక వ్యక్తి “ఎందుకు ప్రవాహానికి ఎదురు వెళ్తున్నావు. నీ భార్య ప్రవాహంతో పాటు కొట్టుకు వెళ్ళి ఉంటుంది” అంటాడు.
దానికి ఆ వ్యక్తి ఇలా చెబుతాడు. “నా భార్య సంగతి నాకు తెలుసు. నదిలో అయినా సరే ప్రవాహానికి ఎదురు వెళ్ళటమే ఆమె అలవాటు”.
(అంతా నవ్వులు)
మనం ప్రవాహంతో గొడవకి దిగితేనే సమస్యలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే అప్పుడు మనం, మనకీ ఈ అనంత చైతన్య శక్తికి మధ్యలోనికి మన అహంకారం వస్తుంది. అలా కాకుండా మనం ఈ సృష్టి యొక్క శక్తిని అర్ధం చేసుకుని దానితో పాటు ముందుకు సాగితే మనం చాలా అప్రయత్నంగా ఉండగలుగుతాము. మనం జీవించే మార్గంలో ఏది వస్తే దానిని పొందుతూ మనం మన పరిధిని మరింత విస్తార పరచుకుంటాము. మనం మనలో చక్కటి కృతజ్ఞతా భావాన్ని నింపుకుని మరింత విశాలమవుతాము.
మీరు అప్రయత్నంగా ఉండగలిగినప్పుడు మీరు ఏ బాధ్యతనైనా తీసుకుంటారు. నేనెప్పుడూ ఒక విషయం చెబుతాను : దేనికైనా అప్రయత్నంగా స్పందించగలగటమే బాధ్యత. యోగులు, గురువులు ఈ ప్రపంచం మొత్తానికి బాధ్యత తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు ? ఎలా అంటే వాళ్ళు ఎంత అప్రయత్నంగా ఉంటారంటే, వాళ్ళు నిరంతరం ఈ అనంత చైతన్య సృష్టితో పాటుగా ముందుకు సాగుతారు. వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఈ సృష్టికి అనుగుణంగా ముందుకి వెళ్ళగలిగినప్పుడు జరగవలసినవన్నీ సహజంగా జరిగిపోతాయి. అని
మీరు ఆశ్రమంలో ఉండే ఆశ్రమ వాసులని అడిగితే వాళ్ళకి నాతో ఉన్న అనుభవాలు చెబుతారు. వాళ్ళకి ముందుగా ఏ విషయం తెలియదు. నాతో పని చేయటం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ సృష్టితో ముందుకి సాగుతూ ఉంటాను. కొంత కాలమయ్యాక ముందుగా తెలుసుకోవటం, ప్లాన్ చేయటం, ఏ పనైనా చాలా ముందు నుంచి అనుకోవటం ఇలాంటి వన్నీ వదిలేస్తారు. క్రమంగా ఏపని ఎప్పుడూ చేయటానికైనా సిద్ధంగా ఉంటారు. ఈ విధంగా ఆశ్రమంలో పనులు జరుగుతాయి. ఏదైనా ఆక్షణంలో జరిగేది అప్పుడే జరుగుతుంది.
ఇదంతా చూస్తే బయట వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది పూజ అయినా లేదా ఏదైనా శుభకార్యాలు, ఫంక్షన్స్ అయినా నేను వాళ్ళకి కొన్ని గంటల ముందు మాత్రమే చెబుతాను. అన్ని పనులూ సక్రమంగానే జరుగుతాయి. నేను చాలా తక్కువ సమయం ముందు విషయాలు చెబుతాను. ఎందుకంటే నేను నిరంతరం ప్రవహిస్తూ ఉంటాను. ముందుకి సాగుతూ ఉంటాను. కాని ఏదో ఒక ప్రణాళిక అనే ఫ్రేములో బిగుసుకొని ఉండను.
మనం ఈసృష్టితో పాటు ప్రవహించటం, దానికి అనుగుణంగా ముందుకి సాగటం నేర్చుకుంటే సమస్యలు ఉండవు. ఎందుకో గాని మనందరం, ఈ సృష్టిని ఎదిరించి పోట్లాడటం అనే కళలో ఆరితేరిపోయాం. ఆ తరువాత బాధపడతాం. మిమ్మలని మీరు ఈ అనంతచైతన్యం యొక్క శ్రుతికి అనుగుణంగా మలచుకోగలిగితే, మిమ్మలని ప్రతిక్షణం అది గమనిస్తున్నట్టుగా అర్థం చేసుకుంటారు. ఆ శక్తి నిరంతరం మీ అవసరాలని తీర్చటం మీరు గమనించగలుగుతారు.
మీరు అలా ఉండగలిగినప్పుడు ఆ విశ్వశక్తిని మీరు నలుదిశలా వ్యాపింపచేయగలుగుతారు. అప్పుడు అన్ని విషయాలు మీ కోసం తిరిగి సిద్ధం చేయటం మీరు చూడగలుగుతారు. మీకు జరగవలసినవి సజావుగా జరగటం చూస్తారు. అందరూ మిమ్మలని కొత్త రకమైన కుతూహలంతో ఆహ్వానించటం అర్థమవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అందరూ మిమ్మలని అప్రయత్నంగా స్వీకరించతారు.
అందరూ మిమ్మలని వేరుగా చూస్తారు. అందరూ మీ వైపుకి ఏదో తెలియని ఆశక్తితో ఆకర్షితులవుతారు. ఎవరో మనకి తెలియని అమర సంగీతకోవిధుని చేత పాడబడే అద్భుతమైన సంగీతంలా మన జీవితం సాగిపోతుంది. ఆ సంగీత సవ్వడుల రవళికి మీరు అనుగుణంగా నాట్యం చేస్తారు. అప్పుడు జీవితం సంగీతం, నాట్యంలా అనిపిస్తుంది. అది మీకు ఒక పెద్ద ఉత్సవంలా ఉంటుంది.
అయితే మనం ఈ ఉత్సవాలని చేసుకోకుండా నిరంతరం ఇంకా కావాలి అని వెతుకుతుంటాము. అద్భుతాల కోసం వెతుకుతుంటాము. నిరంతరం అద్భుతాలు జరగాలి అని చూస్తుంటాము. అలా చూసి చూసి అవి జరగటం లేదు అని బాధపడతాం.
మీకు చెబుతున్నాను. అద్భుతాలు ప్రత్యేకంగా జరగవు. అవి నిరంతరం మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. దానిని మీరు గుర్తించగలిగితే, మీలో ఉండే ఈ శక్తి అద్భుతాలని అద్భుతంలా మీకు చూపించుతుంది. కృతజ్ఞతని రాగంలా చేసుకుని మీరు ఈ అనంత సంగీత వాహినితో కలిసిపోగలిగినప్పుడు మీకు ఎన్నో అద్భుతాలు కనిపించుతాయి. కృతజ్ఞతా భావం మిమ్మలని అద్భుతాలు చూడగలిగినట్లు చేస్తుంది. అవి చూసి మీరు ఆనందపడిపోతారు. చూడలేనప్పుడు ఆ ఆనందాన్ని కోల్పోతారు. అది మీ నిర్ణయం.
ఆ ఆనందాన్ని కోల్పోయినప్పుడు మీరు అసంతృప్తితో ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే తలుపు గడియ తీసే ఉంటుంది. కానీ మీరు నిరంతరం తలుపు కొడుతూనే ఉంటారు. నేను మీకు ఒకటే చెబుతున్నాను. అన్నీ అక్కడ ఉన్నాయి. కేవలం మీరు వాటిని తీసుకోవటమే. కానీ ఆ విషయాన్ని నమ్మటానికి మీరు సిద్ధంగా లేరు.
అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి : నీళ్ళని వైనుగా మార్చటం అద్భుతం కాదు. సామాన్య మానవుణ్ణి మహనీయునిగా, దేవుడిగా మార్చటం అద్భుతం.
సర్కార్, ప్రఖ్యాత ఇంద్రజాలకుడు ఆయన ముందుది చేసాడు. కానీ రెండవది చేయటానికి చాలా లోతుగా అర్థం చేసుకోగలగాలి.
ఒకచిన్న కథ :
రామకృష్ణ పరమహంస ఈ కథని చాలా సార్లు చెబుతుండేవారు.
ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండేవారు. అన్నయ్య వ్యాపారంలో స్థిరపడతాడు. తమ్ముడు సాధువుగా మారతాడు. కొన్ని సంవత్సరాలయ్యాక వాళ్ళిద్దరూ కలుసుకుంటారు.
వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇన్నేళ్ళలో వాళ్ళు సాధించినది ఏమిటి, పొందినది ఏమిటి అని అడుగుతారు.
అన్నయ్య తాను ఇంతవరకూ ఈ ప్రపంచంలో తాను సంపాదించినవన్నీ చెబుతాడు. తన వ్యాపారం గురించి వివరించితాడు. ఎంత ఆస్తి సంపాదించాడో చెబుతాడు. ఆ తరువాత అతను తమ్ముణ్ణి ఏం సాధించావని అడుగుతాడు.
తమ్ముడు అన్నను నది ఒడ్డుకు తీసుకువచ్చి ఆ నదిని కాలినడకతో దాటి ఆవలి ఒడ్డుకు చేరి చాలా గర్వంగా, “నేను దీనిని సాధించాను” అంటాడు.
అన్నయ్య ఒక పడవ మాట్లాడుకుని అవతలి ఒడ్డుకు వచ్చి ఇలా అంటాడు, “ఏమిటి రెండు రూపాయలతో సాధించే పనిని నీవు ఇన్ని సంవత్సరాలు కష్టపడి సాధించావా?
కొంత మంది అనుకుంటారు, “ఏవో అద్భుతాలు చేసి చూపించితినే వాళ్ళు గొప్ప వాళ్ళు, ఆధ్యాత్మిక గురువులు అని. అది నిజం కాదు.
అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికత అంటే బయట ప్రపంచంలో చూపించే అద్భుతాలు కాదు. ఇది మీ అంతరంగంలోని ప్రపంచంలో జరిగే అద్భుతాలు. ఆ అద్భుతాలు కేవలం మిమ్మలని మార్చటానికి చేసేవి. మిమ్మలని ఒక సంపూర్ణ వ్యక్తిగా
మార్చగలగటమే ఒక పెద్ద అద్భుతం. వ్యక్తిత్వం నుంచి ఒక పూర్ణవ్యక్తిగా మార్చటమే నిజమైన అద్భుతం.
చాలా మంది నన్ను చాలా సార్లు అద్భుతాలు చేయమని అడుగుతారు. నేను వాళ్ళకి చెబుతాను, ఆ అద్భుతాలు నన్ను, నా స్థితిని కొలిచే సాధనాలు కావని. కాని వాళ్ళు వినరు. ఏవో చిన్న చిన్నవి చేసాననుకోండి. అవి చూడటానికి వస్తారు. అది కేవలం ఒక మేజిక్ షో మాత్రమే. ఆ షో చూడటానికి వస్తారు కాని మారటానికి రారు. అదే నా బాధ.
ఒకసారి కొందరు భక్తులు మరీ అడిగినప్పుడు, గాలిలో ఒక లక్ష్మీదేవి బొమ్మని సృష్టించి ఇచ్చాను. నేను వాళ్ళకి ఇది అద్భుతం కాదు అని చెప్పాను. మీకు కారణం దాని ప్రభావం మధ్య ఉండే బంధం తెలియదు. దాంతో మీరు ఏది చూస్తే దానినే అద్భుతం అని అనుకుంటారు.
ఇక్కడ నేను చేసినది ఏమీ లేదు, టెలిఫోనులోని శబ్దతరంగాలు టెలిఫోనులో ఎలక్ట్రికల్ తరంగాలుగా మారి అవి ఒక మీడియం ద్వారా ప్రయాణం చేసి ఆ తరువాత శబ్ద తరంగాలుగా ఆ చివరికి వెళ్ళాక మారతాయి. నేను కూడా అదే చేసాను. పదార్ధాన్ని శక్తిగా మార్చి దానిని గాలిలోనికి పంపించాను. తిరిగి దానిని పదార్ధంగా మార్చాను. అంతే, ఇందులో అద్భుతం అనేది లేదు.
అందుకే అద్భుతాల కోసం వెతకటం ఆపేయండి. కృతజ్ఞతా భావంతో జీవించండి. ప్రేమ నిలుపుకుని ప్రేమ మూర్తులుగా జీవించండి. ఈ అనంత చైతన్య సృష్టి కోసం జీవించండి. అప్పుడు అప్రయత్నంగానే మీరు మీ చుట్టూ ఎన్నో అద్భుతాలని చూడగలుగుతారు. ఒక గురువు ద్వారా మీలో జరిగే రూపాంతం లేదా మార్పు అనేది ఒక అపూర్వమైన అద్భుతం. మరొక విషయం గుర్తుంచుకోండి. గురువు దగ్గర నుంచి మీరు అద్భుతాలని కోరుకోకండి. కేవలం వివేకాన్ని మంచి బుద్ధిని కోరుకోండి.
మీలో వివేకం వృద్ధి చెందితే మీ నిత్య జీవితంలో పనులన్నీ సక్రమంగా, శ్రమ లేకుండా చేయగలుగుతారు. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇప్పుడు ఒక వేళ మీరు మేనేజర్ అయ్యారనుకోండి ; మీకు చాలా బాధ్యతలు ఉంటాయి. అవును కదా ? కొంత మంది పని వారిని పెట్టుకుంటారు. వాళ్ళు ఎలా పని చేస్తున్నారో గమనిస్తూ ఉంటారు. వాళ్ళ జీతాలు నిర్ణయించి అవి ఇస్తుంటారు. ఇలా ఎన్నో పనులు చేయాలి. మీరు శ్రమ పడకుండా ఈ పనులన్నీ చేయగలరా ? మీలో వివేకం, బుద్ధీ ఉంటే ఈ పనులన్నీ ఎటువంటి ఒత్తిడీ, శ్రమ లేకుండా చేయగలుగుతారు. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అందుకే మీకు కావలసినది బుద్ధి, వికాసం, కాని శక్తి, అధికారం కాదు. ఈ విషయం గుర్తు పెట్టుకోండి.
మీరు ఎప్పుడైతే సర్వoతర్యామి అయిన విశ్వశక్తి మిమ్ములని రక్షిస్తుంది అని తెలుసుకుంటారో, ఎప్పుడైతే దానిని అనుభవిస్తారో అప్పుడు మీలో మార్పు వస్తుంది. అప్పుడు మీరు ఇటువంటి కల్పనల నుంచి స్వేచ్ఛని పొంది ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా రూపాంతం చెందుతారు. మనం ఎప్పుడూ మన నమ్మకాన్ని మనుషుల మీద, జ్యోతిష్యుల మీద, గ్రహాల మీద, నక్షత్రాల మీద ఇలా చాలా వాటి మీద ఉంచుతాము. కానీ ఈ సర్వ విశ్వానికి ప్రాణాధారమై ఉన్న సర్వాంతర్యామి అయిన అనంత చైతన్యం మీద మాత్రం నమ్మకాన్ని ఉంచం.
ఇండియాలో చిలుక జ్యోస్యం ఉంటుంది. రోడ్డు ప్రక్కన ఒక చిన్న పంజరంలో చిలుకని పెట్టి ఒక వ్యక్తి కూర్చుంటాడు. ఆ దారిలో వెళ్ళే వాళ్ళు అతనికి ఒక రూపాయి ఇచ్చి చాలా నమ్మకంతో తమ భవిష్యత్ గురించి అడుగుతుంటారు. అప్పుడు ఆ వ్యక్తి పంజరం తలుపు తీస్తే చిలుక బయటకి వచ్చి ఒక కార్డుని తీస్తుంది. దానిలో ఏమి రాసి ఉన్నదో అది అతను చదివి వినిపిస్తాడు. అలా అడిగిన వ్యక్తి యొక్క భవిష్యత్‌ని చెబుతాడు.
మనిషికి ఆరు స్పర్శావయవాలు ఉంటాయి. చిలుకకి అవి నాలుగే. అటువంటి చిలుక మనిషి భవిష్యత్ ని ఏమని చెబుతుంది? మీరు ఈ తెలివితక్కువ పనులు వదిలివేయండి. ఈ అనంత చైతన్య స్రవంతికి అనుగుణంగా ప్రవహించండి. దానిలోని అసలైన శ్రుతి అయిన కృతజ్ఞతని పట్టుకోండి. ఆ శ్రుతిలో ముందుకు సాగండి.
మీరు గురువులని చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఆహ్లాదంగా, అద్భుతంగా, దైవత్వం నిండి దివ్యంగా కనిపించుతారు. దానికి కారణం వాళ్ళు ఈ చైతన్యంతో పాటు దానికి అనుగుణంగా మారిపోతారు. అయితే మీకు వారి స్థితి అర్ధం కాదు. మీరు కేవలం వారి హోదాని మాత్రమే చూస్తారు. మీరు వారి స్థితిని చూస్తే అప్పుడు మీకు వాళ్ళు ఎలా ఈ అనంత చైతన్యంలో కలిసిపోయారో తెలుస్తుంది. అందుకే వాళ్ళు నిరంతరం బ్రహ్మానందంలో ఉండగలుగుతారు. మీరు ఈ స్థితిని సాధించటానికి ప్రయత్నించాలి.
కానీ మీరేం చేస్తారు? ఈయన గురువు. మహాయోగి. ఆయన ఎప్పుడూ పరమానందంలో ఉంటారు. ఆయనకి నా సమస్యలేమి తెలుస్తాయి? నేను నా జీవితం కోసం, బ్రతకటం కోసం పోరాడుతున్నాను. ఆయన నన్ను నిరంతరం కృతజ్ఞతతో ఉండమంటారు అని అనుకుంటూ ఉంటారు.
మీకు చెబుతున్నాను : మీరు ఆయన పాదాల దగ్గర ఉన్న గులాబీ రేకులని మాత్రమే చూస్తారు. మీరు కేవలం ఆయన హోదాల్ని మాత్రమే చూస్తారు. అలా చూసి ఆయనకి మన నిత్య జీవితం గురించి అందులోని సమస్యల గురించి తెలియవు అని అనుకుంటారు. గుర్తుంచుకోండి : మీరు ఇచ్చే గౌరవం ఆయన పొందిన స్థితికే గాని ఆయన హోదాకి కాదు. ఈ స్థితికి చేరటానికి ఆయన పడిన కష్టాలు, పోరాటం గురించి మీకు తెలియదు.
మీరు నిత్య జీవితంలో మన అవసరాలైన భోజనం గురించి పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు. నా అనుభవాన్ని మీకు చెబుతాను. నేను సాధకునిగా తిరిగే రోజుల్లో
ఎన్నో రోజులు భోజనం లేకుండా ఉండే వాడిని. అయితే దాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నేను నా సత్యాన్వేషణలో నిమగ్నమయ్యేవాడిని. అప్పుడు ప్రతీదీ నాకు ధ్యానం గానే ఉండేది. ఆఖరికి భోజనం లేకుండా ఉండటం కూడా ఒక విధమైన ధ్యానంగా గడిచిపోయేది.
ఏవో కొన్ని ధర్మశాలలు, ఉత్తర భారత ప్రజలు సన్యాసులకి చాలా గౌరవాన్ని ఇస్తారు. వాళ్ళు కాకుండా మిగతా వారు సన్యాసులని అనుమానంగా చూస్తారు. వాళ్ళు మీ సంపదలు దోచుకెళతారు అని అనుకుంటారు. మీరు అలా ఎప్పుడూ చేయకండి. వారికి భోజనం పెట్టండి. అది వాళ్ళకి చాలు. వేరే వారికి భోజనం పెట్టే విషయంలో బాధపడకండి.
ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు దానం చేయలేకపోతే, అంటే మీకుండే దానిలో కొంత ఇవ్వగలిగే 'దాని' కాలేకపోతే ఆ తరువాత మీరు మహా దాని అయ్యి మీ సర్వస్వం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు అని తెలుసుకోండి.
అది సరే ! ఇక ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోండి. నేను చెప్పినవన్నీ నా అనుభవాలన నుండి చెబుతున్నాను. మీరు చాలా కష్టాలలో ఉన్నప్పుడు కూడా చెదరని నమ్మకం, కృతజ్ఞతతోనే ఉండండి. మీ అంతరంగంలోని వివేకాన్ని ఉపయోగించుతూ ఆ సమస్యల గుండా వెళ్ళండి. అప్పుడు మీరు ఆ సమస్యల నుంచి పూర్తిగా, విజయవంతంగా బయటకి వస్తారు. అప్పుడు మీరు ఇంకా మంచి వివేకంతో, ఇంకా లోతైన కృతజ్ఞతతో ఉంటారు.
మీకు చాలా విలువైనది పోయినప్పుడు కూడా, మీరు కేవలం కృతజ్ఞతనే చూపించండి. ఎందుకంటే దానితో కొంత కాలమైన ఆనందం పొందారు కదా ! అందుకని మీరు స్వచ్ఛమైన కృతజ్ఞతా భావంగా మారిపోయినప్పుడు, ఏది పోయినా మీరు బాధపడరు. అది మీతో ఉన్నంత కాలం దానితో ఆనందంగా ఉంటారు. ఆ తరువాత దాని విషయంలో కృతజ్ఞతా భావంతో ఉంటారు. ఆ కృతజ్ఞత ఆవస్తువు పోయిన తరువాత కూడా అలానే కొనసాగుతుంది.
ఒక చిన్న కథ :
ఒక రాజుగారు రాత్రి పూట మారు వేషంలో రాజ్యంలో తిరుగుతుండే వాడు. ఆయన ప్రతి రాత్రీ కూడా ఒక యోగిని చూస్తుండేవాడు. ప్రజలంతా నిద్రపోతున్న సమయంలో కూడా ఆయన పరమానందంలో ఉండేవాడు. ఆయనకి ఆ యోగిపట్ల చాలా గౌరవం కలుగుతుంది. ఆయన యోగిని తనతోపాటు రాజ భవనానికి వచ్చి ఒక రోజు ఉండమని అడుగుతాడు.
దానికి ఆ యోగి సరే అని చెప్పి, ఇప్పుడే వస్తాను రేపు అనేది నమ్మకం లేనిది అని అంటాడు. ఆయన అంత అకస్మాత్‌గా ఒప్పుకునేటప్పటికి రాజు కొంచెం కంగు తింటాడు. ఆయన సర్దుకుని సరే అని ఆ యోగిని రాజ భవనానికి తీసుకువెళతాడు. రాజ భవనంలో ఆయనకి మంచి వసతి, మంచి భోజనం ఇస్తాడు. ఆ యోగి చాలా ఆనందంగా గడిపేస్తాడు.
ఆ యోగి ఈ ప్రాపంచిక భోగాలు అనుభవించి ఆనందించటం చూస్తాడు రాజు. యోగులు ఇలా ఉంటారు అని ఆయన అనుకోడు. దాంతో రాజుకి ఆ యోగి పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతుంది. ఆయన మోసపోయానని బాధపడతాడు.
ఒక రోజు రాజుని చూసి, "రాజా ! నీవు ఏదో విషయంలో కలవరపడుతున్నావు. అది ఏమిటో నాకు చెప్పు" అంటాడు.
దానికి రాజు, "నేను ఆనందిస్తున్నట్లుగా ఈ భోగాలన్నీ మీరు కూడా ఆనందిస్తున్నారు. అప్పుడు మీకు నాకు తేడా ఏమిటి ?" అని అడుగుతాడు.
యోగి ఒక చిరునవ్వు నవ్వి "మనం అలా బయటికి వెళదాం" అని రాజుని బయటకి తీసుకువెళతాడు. వాళ్ళు నిశ్శబ్దంగా ఒక నది ఒడ్డు వరకూ నడుస్తారు. అది ఆ రాజ్యపు సరిహద్దు. అప్పుడు యోగి రాజుని చూసి, "సరే, నేను నీతో ఉండటం అయిపోయింది నేను నీ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నీవు కూడా నాతో వస్తావా ?" అంటాడు. ఆ ప్రశ్నకి రాజు, "నేను మీతో ఎలా వస్తాను. నా రాజ్యం,
నా ప్రజలు ఇవన్నీ ఎలా. ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి ఎవరు చూస్తారు" అని జవాబు ఇస్తాడు.
అప్పుడు ఆ యోగి, నవ్వి "రాజా ! నీకు ఇప్పుడు నీ ప్రశ్నకి జవాబు దొరికింది కదా” అంటాడు. యోగి మాటలకి రాజు నిశ్చేష్టుడవుతాడు.
యోగులకి, గురువులకి ఈ సమస్తము అనంత చైతన్య సృష్టి చెందినదే అని తెలుసు. అందుకే వాళ్ళు ఆ క్షణంలో జీవించుతారు. వాళ్ళకి ఏదైనా పోతుందేమో అనే భయం ఉండదు. పోవటానికి మీ సొంతమైనది ఏముంది?
ఎప్పుడూ గుర్తుంచుకోండి. ప్రతీది ఈ సృష్టికి, ఈ సృష్టికర్తకి చెందినదే. మీరు ఎదో కొంతకాలం మాత్రమే దేనినైనా పొందగలిగేది. మీరు ఏవైన సాధించినా లేకపోయినా, ఏవైనా పొందినా లేకపోయినా కృతజ్ఞతతో ఉండండి. అలా ఉండగలిగినపుడు మీరు జీవితం నుంచి స్వేచ్ఛని పొందుతారు. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు అద్భుతమైన స్వేచ్ఛని పొందుతారు.
ఇంకొక మంచి కథ :
భగవంతుడికి ప్రపంచంలోని శాస్త్రవేత్తలకి ఒక మీటింగ్ జరుగుతుంది. అందులో వారి మధ్య ఒక పోటీ కూడా ఉన్నది. భగవంతుడు ఏమి తయారు చేస్తే శాస్త్రవేత్తలు దానిని తయారు చేయాలి. అలా శాస్త్రజ్ఞులు భగవంతుడు చేసినవన్నీ చేసారు. చివరికి భగవంతుడు కొంచెం మట్టి తీసుకొని దాంట్లోంచి మనిషిని తయారు చేస్తాడు. అపుడు శాస్త్రజ్ఞులు కూడా ఆ మట్టిని తీసుకుని మనిషికి తయారు చేద్దామని మట్టిని తీసుకోబోయారు. అప్పుడు భగవంతుడు, "ఆగండి. అది నా మట్టి. మీరు మీ మట్టితో చేయాలి" అని అన్నాడు.
ప్రతి మనిషీ ఈ విషయాన్ని స్పష్టంగా అర్థ చేసుకోవాలి. సర్వాంతర్యామి అయిన విశ్వశక్తి ఈ సృష్టి కర్త. ఈ సృష్టి కూడా. మీరు ఈ విషయాన్ని అర్థ చేసుకున్నప్పుడు దేనిని పట్టించుకోకుండా ప్రతి దానిలోను ఆనందాన్ని చూడగలుగుతారు.
అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు అసంతృప్తి, బాధలు, మానసిక క్షోభ అనే వాటినుంచి కృతజ్ఞత వైపుకి రాగలిగితే, అప్పుడు అనంత విశ్వశక్తిని మీ లోపల పట్టి ఉంచుకోగలుగుతారు. అప్పుడు ఈ సృష్టిని అభినందించుతారు. అప్పుడు కృతజ్ఞత మీ దృక్పథం అవుతుంది.
చిన్న కథ :
ఒక వ్యక్తి అతని భార్య కూరలు తెమ్మని చెబితే మార్కెట్‌కి వెళతాడు. అక్కడ బెండకాయలు కొని ఇంటికి తెస్తాడు. వాటిని చూసి అతని భార్య" అవి ముదిరిపోయాయి. వాటితో కూర చేయటం నా వల్ల కాదు. నేను వండను" అని అంటుంది.
మర్నాడు మార్కెట్‌కి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఏరి ఏరి లేత బెండకాయలు కొని తెస్తాడు. ఆమె వాటిని చూసి "కాయలు మరీ లేతగా ఉన్నాయి. అవి కూర చేయటానికి పనికిరావు. ఇలాంటి కాయలు తెచ్చారేమిటి?" అని అంటుంది.
మర్నాడు అతను మార్కెట్‌కి వెళ్ళి ఆ షాపు అతనిని మంచి బెండకాయల్ని ఇవ్వమని బ్రతిమాలతాడు. ఆ షాపు యజమాని చాలా జాగ్రత్తగా ఏరి ఏరి మంచి బెండకాయలు ఇస్తాడు. అతను ఇంటికి వచ్చి వాటిని భార్యకి ఇస్తాడు.
భార్య వాటిని చూసి "ఏమిటి! ఇవాళ కూడా బెండకాయలే కొనుక్కొచ్చారా?" అంటుంది.
(అంతా నవ్వులు)
ఎదుటి వారిని అభినందించటం మనలో చాలా మందికి రాదు. మనం ఎపుడైన అప్రయత్నంగా ఎదుటివారిని మెచ్చుకోమో, మనలో ఏదో ఒక అసంతృప్తి, ఫిర్యాదులు చేసే గుణం ఉన్నది అని అర్థం. నిజం చెప్పాలంటే అసంతృప్తి అనేది మైండ్‌కి ఆహారం లాంటిది.
అసంతృప్తితో ఉండటం అంటే మైండ్ నమలటానికి ఏదో తినేది ఇస్తున్నట్టే. మైండ్ దానిని తింటూ చాలా బిజీగా ఉంటుంది. మనం తృప్తిగా ఉంటే ఏమవుతుంది. మైండ్ ఆకలితో అలమటించిపోతుంది. దానికి ఏం చేయాలో తెలియదు. అది భోజనం కోసం వెతకటం మొదలుపెడుతుంది. ఒక కథ:
ఒకామె చెప్పుల షాపుకి వెళుతుంది. ఆమె పాదాలకి సరిపోయే చెప్పులు చూపించమని అడుగుతఉంది. అక్కడ పనిచేసే అతను చాలా ఓపికగా చాలా రకాల చెప్పులు చూపించుతాడు. ఒక దాని తరువాత ఒకటి ప్రయత్నిస్తుంది. కానీ ఏదీ కూడా ఆమెకి సరిపోవు.
చివరికి అతను ఒక జత చూపించి అతి ప్రయత్నించమంటాడు. అవి ఆమెకి సరిగ్గా సరిపోతాయి. ఆమె అతనితో “ఇవి నాకు సరిగ్గా సరిపోయాయి. కానీ నా అనుమానం ఇది కరెక్ట్ సైజేనా అని” అంటుంది.
(అంతా పెద్దగా నవ్వుతారు.)
మీరు తృప్తిపడకూడదు అని నిర్ణయించుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. కేవలం మీ మైండ్ ఉన్న స్థితి మాత్రమే మీకు సహాయం చేస్తుంది. మనలో కొంతమంది అసంతృప్తిగా మాట్లాడటంలోనే, అసంతృప్తిగా ఉండటంలో చాలా సౌకర్యాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే అసంతృప్తి ఉన్నప్పుడే మాట్లాడటానికి ఏదైనా ఉండేది. అప్పుడే మైండ్‌కి నిండా పని దొరికేది, బిజీ అయ్యేది. సంతృప్తి పడటం అంటే మైండ్‌ని వదిలేసుకోవటమే. అందుకే మనం సంతృప్తి కావాలి అని అనుకున్నా తీరా అది దొరికినప్పుడు దానిని తీసుకోవటానికి సిద్ధంగా ఉండం. మన మైండ్ చాలా జిత్తులమారిగా ఆడుతుంది. దానికి కొంత తిండి కావాలి. ఆ ఆహారం నములుతూ ఉండాలి.
మనం దిక్చక్రం వెంట పరిగెడతాము. అది ఒక ఊహ మాత్రమే. అయినా ఆ దిక్చక్రం వెంట పరిగెడితే మనకి భద్రంగా ఉన్నట్టు అనుకుంటాము. మైండ్‌కి అలా పరిగెత్తాలని నేర్పించాము.
మీరు ఇలా ఉన్నారంటే మిమ్మలని మీరు తెలివితక్కువ వారిగా చేసుకోవటమే. మీ లోపల పరస్పర విరుద్ధమైన భావాలని మీరు కల్పించుకుంటున్నారు. ఉదాహరణకి మీ హృదయంలో మీకు తృప్తి కావాలి అని అంటుంది. కానీ నిరంతరం పిర్యాధులు చేస్తూ చూసిన దానిని ఒప్పుకోకుండా కావాలని అసంతృప్తిని తెచ్చుకుంటారు. మీరు ఒకటి కావాలని అనుకుంటారు, కానీ మీ లోపలకి మరొక విషయాన్ని తెచ్చుకుంటారు. కానీ సంతృప్తి సాధించటానికి జీవితాంతం ప్రయత్నించటంలోనే మీకు సౌక్యం ఆనందం ఉంటాయి.
ఒక్క విషయం అర్ధం చేసుకోండి : మీరు ఎప్పుడైతే పరస్పర విరుద్ధమైన భావాలు మీలో సృష్టించుకుంటారో అప్పుడే మీలో సమస్యలు ప్రారంభమవుతాయి. మీకు జీవితం ఎలా కావాలో స్పష్టంగా తెలుసుకోండి, అప్పుడు మిమ్మలని మీరు మోసం చేసుకోరు. మీరు త్వరలోనే ఏమి కావాలని అనుకుంటున్నారో అదే అవుతారు.
మీరు మీ అంతరంగంలోని ప్రదేశంలోనికి వెళ్ళగలిగితే, అక్కడ కృతజ్ఞతే మీ ధ్యానంగా మారిపోతే, మీలో సంతృప్తి అప్రయత్నంగా కలుగుతుంది. మనలో సాధారణమైన తృప్తి అనేది ఏదో ఒక కారణం మూలాన వస్తుంది. అది బయట ప్రపంచంలో ఏదో జరిగితే దాని మూలంగా వస్తుంది. ఆ తృప్తి మీ బిజీ మైండ్‌ని కొద్ది సేపు నిశ్శబ్దంగా ఉంచటం మూలంగా వస్తుంది. ఎప్పుడైతే మీ మైండ్ విశ్రాంతిగా ఉంటుందో, అప్పుడు మీరు తృప్తిగా ఉంటారు. కాని నిజమైన సంతృప్తి అది కాదు.
నిజమైన తృప్తి అనేది మీరు ఈ సృష్టికి శాశ్వతంగా కృతజ్ఞులయినప్పుడు మీకు లభిస్తుంది. నిజమైన తృప్తి దేనినీ ఆశించదు. అది ప్రతి దాని నుంచి ఆనందాన్ని పొందుతుంది. ఆనందం పొందటానికి దానికి కారణం అవసరం లేదు. మీరు ఈ స్థితికి చేరినప్పుడు అసంతృప్తి అంటే ఏమిటో మీకు అసలు తెలియదు.
చిన్న కథ :
ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరకి వెళ్ళి తనకి నిద్రపట్టటం లేదని చెప్తాడు. అప్పుడు డాక్టర్, "అయితే మీరు రాత్రి పూట బాగా నిద్రపోవటం లేదన్న మాట" అంటాడు.
దానికి ఆ వ్యక్తి, "నేను రాత్రి పూట బాగా నిద్రపోతున్నాను డాక్టరు గారు" అంటాడు. అప్పుడు డాక్టర్, "మరి మీ సమస్య ఏమటి?" అని అడుగుతాడు.
దానికి ఆ వ్యక్తి, "డాక్టరుగారు, నేను మధ్యాహ్నం, సాయంత్రం పూటల్లో నిద్రపోలేకపోతున్నాను" అని జవాబు చెబుతాడు.
(అంతా నవ్వులు)
మనం ఒక కొలతా, హద్దు లేకుండా ఇంకా ఇంకా అడుగుతూనే ఉంటాము. ఒక వేళ మన దగ్గర కొలిచే స్కేలు ఉన్నా అది చివర లేని స్కేలు అయి ఉండాలి. అది మన సమస్య.
మనం మళ్ళీ మళ్ళీ అడిగే వైఖరితో మరీ గుడ్డివాళ్ళమైపోతున్నాము. మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నాయో కూడా దానివలన మనకి తెలియటం లేదు. మనం ఎంతో కాలంగా మనలోపలకి మనం చూసుకోలేదు. మనం మన మైండ్ చేసే మోసాలలో ఇరుక్కుపోయాము. మనం ఎంతో కష్టాన్ని సృష్టించుకుంటున్నాము. దాని ఉపశమనానికి బయట వెతుకుతున్నాము.
మీరు ఈ జోక్‌కి నవ్వగలుగుతున్నారు. ఎందుకంటే మీరు కేవలం చూస్తున్నారు. వింటున్నారు. మీరు అందులో భాగం కాదు అని మీకు తెలుసు. కానీ మీ జీవితంలో మీరు చాలా సార్లు ఆ స్థితిలోనే ఉంటారు. కానీ ఆ విషయం మీకు తెలియదు. ఆ సమయంలో మీరు గమనించే పరిశీలకులు కారు. మీరు దానిలో ఎంత సీరియస్‌గా నిమగ్నమయిపోతారంటే, దానిని గమనించలేనంతగా. అందుకే అది మీకు నిజంలా కనిపిస్తుంది.
మీకు ఏదైనా సమస్యలా అనిపించినపుడు ఈ జోక్ గుర్తుపెట్టుకోండి. వెంటనే ఆ విషయాన్ని ఈ జోక్‌కి లింక్ చేసి జాగ్రత్తగా గమనించి విషయాన్ని తెలుసుకోండి. ఆ విషయంలో బాగా లోతుగా వెళ్ళండి. అసలు మీకు అది సమస్యేనా అని చూడండి. అది సమస్యా లేకపోతే మీ మైండ్ ఆడే ఆట అని గమనించండి. చివరలో మీరే మీ సమస్యని చూసి నవ్వుకుంటారు.
ఒకామె విమానంలో ప్రయాణిస్తుంటుంది. ఎయిర్ హోస్టెస్ అందరికి భోజనం సర్వ్ చేస్తుంది. ఆ సమయంలో ఈమె మంచి నిద్రలో ఉంటుంది. అందుకని ఆమెకి భోజనం ఇవ్వకుండా తరువాత సీటు దగ్గరకి వెళ్ళిపోతుంది.
కొంచంసేపయ్యాక ఆమెకి మెలకువ వచ్చి, తనకి భోజనం కావాలి అని అడుగుతుంది. ఎయిర్ హోస్టెస్ భోజనం తెస్తుంది. ఆమె దానిని అంటుకుని చూసి ఇలా అంటుంది. “భోజనం వేడిగా లేదు. మీది ఎటువంటి ఎయిర్ లైన్స్. ఎలా నడుపుతున్నారు. నేను చాలా డబ్బు పోసి టికెట్ కొన్నాను. కానీ నాకు వేడి భోజనం కూడా లేదా” అని కోపంగా అంటుంది.
ఎయిర్ హోస్టెస్ సంజాయిషీ ఇస్తూ, “మేడం క్షమించండి. ఇక్కడ వేడి చేసే వార్మర్ పనిచేయటం లేదు. అందరికీ ఇదే భోజనాన్ని ఇచ్చాము” అని అంటుంది.
అప్పుడు ఆమె, “ఓహో అలాగా! అయితే సరే” అంటుంది.
(అంతా నవ్వుతారు)
చూడండి. ఇప్పుడు కూడా భోజనం చల్లగానే ఉన్నది. కానీ ఆమెకి ఎటువంటి అసంతృప్తి లేదు. ఎందుకంటే అందరికీ అటువంటి భోజనమే ఇచ్చారు కాబట్టి. దీనినే నేను మైండ్ ఆడే ఆట అంటాను. ప్రతిదీ కూడా మైండ్ సర్దుకుపోవడమే మైండ్ ఎటుకావాలంటే అటువెళుతుంది. అలా చేసి మీతో ఆడుతుంది. మీరు దానిని అలా ఆడనిస్తారు. మీరు సంతృప్తి మీద మీ దృష్టిని కేంద్రీకరించలేదు. అందుకే మీ మైండ్ ఆడినట్లు ఆడతారు.
కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా మీరు రోజు చివరలో నవ్వలేకపోతే దాని అర్ధం మీరు దీని విషయంలో ఇంకా సీరియస్‌గా ఉన్నారు అని. మీరు ఇంకా ఈ ప్రపంచాన్ని మొత్తము మీ భుజాల మీద మోస్తున్నట్టుగా అనుకుంటారు. ఎందుకంటే ఈ ప్రదర్శన మొత్తం మీ మూలానే జరుగుతుంది అని మీరు అనుకోవటం వలన.
చూడండి. మీరు లోతుగా చూడగలిగితే మీకు నిజం తెలుస్తుంది. అది మనందరం ఈ సృష్టికి చెందినవారమే. అదే అంతిమ దశ. ఆ విశ్వశక్తి మాత్రమే ఈ మొత్తం ప్రదర్శననంతా నడిపించేది. మన నిజమైన, సహజమైన లక్షణం కూడా ఆ సృష్టితో మనకున్న బంధాన్ని తిరిగి తెచ్చుకోవటమే. అప్పుడు మనం సమస్యలు లేకుండా జీవించగలం. కానీ ఎక్కడో మనం ఈ అర్ధం చేసుకునే విషయాన్ని కోల్పోతున్నాము. దాంతో మనం ఈ సృష్టితో ఉన్న బంధాన్ని తెంచేసుకుంటున్నాము. ఈ ప్రాపంచిక వస్తువుల వెనుక పరిగెడుతున్నాము. అలా పరిగెడుతూ మనం వాటి కోసం వెతుకుతున్నామని అనుకుంటున్నాము.
మీరు ఎప్పుడైనా జూకి వెళితే అక్కడ గమనించండి. అక్కడ పులులు, సింహాలు ఉన్న దగ్గర ఎక్కువ మంది జనం ఉంటారు. వాళ్ళు అక్కడ ఎక్కువ సేపు గడుపుతారు. వాళ్ళు వాటిని గౌరవంతో, ఆరాధనతో చూస్తారు.
ఇలా మనకి తెలియకుండానే చేస్తాము. మనకంటే బలమైన వాటిని చూసినప్పుడు మనం అలా చేస్తాము. అలా చూసినప్పుడు మనం శక్తిలో అత్యున్నతులం కాదు అనే ఒక సౌఖ్యమైన భావంతో చూస్తాము. మన అంతరాత్మ అటువంటి గొప్పవాటిని చూడాలి అని ఈ విశ్వంలో నిరంతరం వెతుకుతుంది. ఆ శక్తి ఈ విశ్వంలో మన పాత్రని తెలియచేస్తుంది.
అందరూ గుడికి దీని కోసమే, ఈ భరోసా కోసమే వెళతారు. ఇటువంటి భావం గుడిలో దొరకని వాళ్ళు మరోచోటికి వెళతారు. ఎందుకో గాని మన అంతరాత్మ లోతుల్లో మనం అంతిమ శక్తి కాదు అని తెలుసుకుంటాము. ఈ భావం మనకి ప్రయోగాత్మక అనుభవంగా కావాలి. అప్పుడే ఆ భరోసా మనకి దొరుకుతుంది.
మీరు హిమాలయాలకి వెళితే అనంత చైతన్య సృష్టి యొక్క గంభీరత్వం, లోతైన జ్ఞానం మీకు ఒక బలమైన గుర్తులా ఉంటుంది. ఒక శిఖరం నుంచి మరొక శిఖరానికి పర్వతాలు పైకి లేచి, తరువాత లోయిలలోనికి దిగుతాయి. వాటికి ఆది, అంతం ఉండవు.
గంగా నది ఆ హిమగిరులలో, ఆ అందాల లోయలలో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహించేటప్పుడు వేరు వేరు చోట్ల వేరు వేరు భావాలతో దర్శనమిస్తుంది. వేరు ప్రాంతాలలో వేరు రంగుల్లో ప్రవహిస్తుంది. ఆ నది ఈ సృష్టి భాషలో మాట్లాడుతుంది. కొన్ని సార్లు అద్భుతంగా నవ్వుతుంది. ఈ ప్రపంచంలో మనిషి చేయని ప్రపంచమంటూ ఏవైనా ఉంటే అది హిమాలయాలే. హిమాలయాలని చూస్తే మనుషులు అంతిమ పాలకులు కాదు అని తెలుస్తుంది.
హిమాలయాలని చూస్తే కొన్ని వందల కిలో మీటర్ల మంచు కొడలు కనిపంచతాయి. అవి కేవలం మంచు మాత్రమే అన్నట్టు ఉంటాయి. తరువాత పర్వతాలు కనబడతాయి. ఆ తరువాత కొండలు, నీళ్ళు కనిపిస్తాయి. ఆ తరువాత నీళ్ళు మాత్రమే కనిపించుతాయి. ఈ ప్రకృతిలోని అద్భుతాల పతాక శీర్షిక అంటే ఆ హిమగిరులే.
పుస్తకాలలోని మాటలు, పదాలు చెప్పలేని విషయాలని హిమాలయాలే మనకి చక్కని అనుభవాలని ఇస్తూ నేర్పించుతాయి. కాకపోతే ఆ అనుభవాలని పొందటానికి మీరు సిద్ధంగా ఉండాలి. హిమాలయాలలో ఉండే శక్తి జీవ శక్తి. ఆ జీవ శక్తి యొక్క నిశ్శబ్దం మనలోపలికి చొచ్చుకుపోయేటట్టుగా ఉంటుంది. దానిని మీ లోపలికి అలా చొచ్చుకుపోనివ్వండి. మీరు ఈ అందాల అద్భుత సృష్టిలో ఒక చిన్న కణం మాత్రమే అని అర్ధం చేసుకోగలిగితే, మీరు దీనిని ఎదురు ప్రశ్నలు లేకుండా, వినయంతో ఆహ్లాదంగా ఒప్పుకుంటారు.
మీరు ఈ చైతన్య సృష్టి ముందు పూర్తిగా తెరచిన అంతరంగంతో ఉండగలిగితే, ఆ శక్తి మీలో నింపబడుతుంది. మీ అంతరంగం ఎంత విశాలంగా తెరవబడితే ఈ
చైతన్య శక్తి అంతగా అందులో నిండిపోతుంది. మీరనుకుంటారు, భగవంతునికి చేరువ కావాలి అంటే చాలా కష్టపడాలి అని. అది సరియైన ఆలోచన కాదు. పిల్ల కోతి తల్లి కోతిని అంటుకుపోవటం మీరు ఎప్పుడైనా చూసారా? అది ఎప్పుడైనా కిందపడిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా పిల్లిని చూశారా. తల్లి నోటితో పిల్లలని పట్టుకుంటుంది. అవి చాలా భద్రంగా ఉంటాయి.
మీరు భగవంతుని దగ్గరకి రావటానికి ప్రయత్నించనవసరం లేదు. మిమ్ములని మీరు అనుమతించితే, ఆ పనులు మీరు చేసుకుపోతూ ఫలితాలు భగవంతునికి వదిలేస్తే, ఆయనే మీ దగ్గరకి వస్తాడు. ఆయనే మిమ్ములని తన చేతుల్లోనికి తీసుకుంటాడు. అదే ఎంతో భద్రంగా ఉంటుంది. అలా కాకుండా మీరు భగవంతుడిని పట్టుకుని వేలాడితే ఏ నిముషంలోనైనా పడిపోతారు. భగవంతుడిని ప్రేమించటం, ఆయనకి అతుక్కుపోవటం గొప్ప విషయం కాదు. భగవంతుడు మీ దగ్గరకి వచ్చి, మిమ్ములని ప్రేమించి ఆయన చేతుల్లోనికి తీసుకోవటం చాలా గొప్ప విషయం. అది మీకు భగవంతుడు మీద పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు జరుగుతుంది. మీరు ప్రేమ, సేవ అనే వాటితో జీవించినప్పుడు జరుగుతుంది.
ఒక చక్కని కథ చెబుతాను
ఒక వ్యక్తి భగవంతుడంటే అతులేని భక్తి, ప్రేమ. అతను ప్రేమించబడే వ్యక్తి. అతను చాలా మంచి పనులు చేస్తుంటాడు. ఒక రోజు అతనికి ఒక వ్యక్తి దగ్గర ఉన్న పుస్తకంలో భగవంతుని ప్రేమించే మనుషుల పేర్లు ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ వ్యక్తి ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్ళి ఆ పుస్తకం చూస్తాడు. కానీ ఆ పుస్తకంలో ఎక్కడా అతని పేరు ఉండదు. ఆయన నిరుత్సాహపడి వెనక్కి వెళ్ళిపోతాడు.
ఒక సంవత్సరం అయ్యాక మళ్లీ వచ్చి తన పేరు ఏమైనా కలిసిందేమో అని చూస్తాడు. అన్ని పేజీలు జాగ్రత్తగా చూస్తాడు. కానీ ఎక్కడా అతని పేరు కనిపించదు. అతను వెనక్కి తిరిగి వెళుతుంటే, ఆ పుస్తకం గల వ్యక్తి అతనిని పిలిచి ఇలా అంటావు. "అయ్యా! కొంచెం నిలబడండి. నా దగ్గర ఇంకొక పుస్తకం ఉన్నది. అందులో
కొన్ని పేర్లు ఉన్నాయి, కానీ ఈ చిన్న పుస్తకంలో ఉన్న పేర్లు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళ పేర్లు ఉంటాయి అని ఆ పుస్తకాన్ని అతనికి ఇస్తాడు.
ఆ వ్యక్తి ఆ పుస్తకం తీసి చూడగానే అతని పేరు అందులో ఉంటుంది. భగవంతుని ప్రేమలో పడటం చాలా తేలిక. ఆయన ప్రేమమూర్తి. కరుణా సముద్రుడు. ఆయనకి ఇవ్వటమే తెలుసు. . ఆయన సర్వ శక్తి మయుడు. ఆ భగవంతుని ప్రేమలో పడకుండా ఉండలేము.
అయితే మీరు ఎప్పుడూ నేను భగవంతుడిని ప్రేమిస్తున్నాను అని చెబుతూ ఉంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారు. అలా కాకుండా భగవంతుడిని మీ అంతరాత్మలో నిలుపుకుని ఆ అనుభూతితో ఆయనను ప్రేమించితే మీలో అభివృద్ధి కరమైన మార్పు వస్తుంది. అప్పుడు భగవంతుడు మీ దగ్గరకి వచ్చి తన చేతులలోనికి తీసుకుంటాడు. అప్పుడు మీరు ఎన్ని విధాలుగా ప్రేమించబడతారో మీరే తెలుసుకుంటారు. అటువంటి ప్రేమని మీరు అంతకుముందు ఎప్పుడూ అనుభవించి ఉండరు. అదే భగవంతుని యొక్క కరుణాపూరితమైన ప్రేమ. ఆ ప్రేమ మూర్తి ప్రేమ అనంతమైనది, అపూర్వమైనది. కరుణతో దయతో నిండి ఉండేది.
మనకి ఎంతో కాలం భగవంతునితో జాగ్రత్తగా ఉండటం మాత్రమే నేర్పించారు. మనకి చెప్పులు వేసుకుని నడవటం నేర్పించారు. ఎందుకంటే అప్పుడు భూమి మనకి ఎటువంటి గాయం చేయదు. నొప్పి ఇవ్వదు. వర్షం నుంచి దూరంగా ఉండటం నేర్పించారు. ఇలా ఎన్నో జాగ్రత్తలతో మనని భగవంతునికి, ఈ సృష్టికి, ఈ ప్రకృతికి దూరంగా ఉంచేసారు.
మీకు నేను చెబుతున్నాను. ఈ అనంత సృష్టి ఈ భూమి మీద మీ కున్న గొప్ప స్నేహితుడు. ఈ భూమి యొక్క స్పర్శని అనుభవిస్తూ నడుస్తుంటే ఎంత ఆనందంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలుసా? నేను నా చిన్నప్పుడు ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడు మాత్రం అక్కడ రూల్స్ ప్రకారం.
తప్పనిసరిగా చెప్పులు వేసుకోవాలి. అందుకు వేసుకునే వాడి. నేను చెప్పులు లేకుండానే నడిచేవాడిని. అది ఇల్లయిన, స్కూలు అయినా సరే. అలాగే నేను సత్యాన్వేషణలో తిరిగే రోజులలో కూడా ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు.
ఇప్పుడు ఆశ్రమంలో కూడా చాలా వరకు నేను చెప్పులు లేకుండానే తిరుగుతాను. కానీ నా చుట్టుప్రక్కల ఉండే వారంతా నన్ను చెప్పులు వేసుకోమంటారు. లేకపోతే కాళ్ళకి దెబ్బ తగులుతుంది? అని అంటారు.
ఇలాంటివన్నీ చేసి మిమ్మలని మీరు ఈ ప్రకృతి నుంచి వేరు చేసుకుంటున్నారు. నన్ను చాలా మంది అడుగుతారు, "స్వామీజీ! మీ పాదాలు అంత సున్నితంగా, మృదువుగా అందంగా ఎలా ఉంటాయి. మీరు కొండలలో, ఎత్తుపల్లాల రాళ్ళ మధ్య ఎన్నో సంవత్సరాలు నడిచారు కదా! ఇది ఎలా సాధ్యం" అని అడుగుతారు. నేను చెబుతున్నను. నేనెప్పుడూ ఈ అనంత చైతన్య సృష్టికి దూరంగా వెళ్ళలేదు. ఈ ప్రకృతికి దూరంగా వెళ్ళలేదు. అదే నిజమైన కారణం. నేనెప్పుడూ ఈ సృష్టిలో భాగంగానే అనుకున్నాను.
నేను ఎప్పుడూ ఈ అద్భుత ప్రకృతిలోని భాగంగానే ఉన్నాను. అందుకే నేను ఎటువంటి రక్షణ లేకుండా అలా అంత దూరం తిరగగలిగాను. అలాగే నేనెప్పుడూ దేనికీ భయపడలేదు.
ఒక్కసారి ఊహించండి. క్రూర మృగాలు తిరితే అడవుల్లో రాత్రిపూట ఒంటరిగా భోజనం లేకుండా తిరిగేవాడిని. తరువాత భోజనం ఎక్కడో తెలియదు. ఎక్కడ నిద్రపోవటానికి స్థలం ఉండేది కాదు. మీరు అలాంటి స్థితిలో ఉంటే భయపడతారు కదూ.
అలా ఎందుకు భయపడతారంటే మీకు ఎవరూ కూడా ఈ ప్రకృతి, ఈ అనంత సృష్టి మీకు మంచి స్నేహితులు అని అనుకోరు. మీకు అలా నేర్పించలేదు. మీరు నిరంతరం ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉంటారు. ఎటువంటి సహాయానికైనా
మీరు మనుషుల మీదే ఆధారపడతారు. వాళ్ళనే నమ్ముతారు. కానీ ఈ సృష్టి మనుషుల ద్వారా మీకు సహాయం చేస్తుందని మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ మనుషులనే నమ్మారు, కానీ సృష్టిని నమ్మలేదు.
మీరు సృష్టిని నమ్మితే ఈ భూమి మీద ఒక చక్రవర్తిలా ఉండవచ్చు. నేను ఆ విధంగా సత్యాన్వేషణలో తిరిగే రోజులలో ఆనందించాను. నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళే వాడిని. నా తరువాత గమ్యం ఏమిటో నాకే తెలియదు. ఏదో ఒక ట్రయిన్ ఎక్కేవాడిని. ఎక్కడైన ప్రకృతి అందంగా కనబడితే అక్కడ దిగిపోయేవాడిని. నాకు హిందీ రాదు. కానీ నేను ఎక్కువగా ఉత్తర భారతదేశంలో, హిమాలయాలలోనే తిరిగే వాడిని. ఏవో కొన్ని హిందీ మాటలు నేర్చుకుని వాటితో దారి అడిగే వాడిని.
ఏదైనా ఒక భాష నేర్చుకోవాలంటే మొదటి సమస్య నాకు భాష రాదు అనుకోవటం. మీరు అటువంటి పరాధీనత నుంచి బయటకి రండి. నేను ఎక్కువ కాలం ఒంటరిగానే తిరిగాను. సాధువుల సమూహాలతో ఎప్పుడూ తిరగలేదు. కానీ నేను ఎప్పుడూ ఒంటరిగా ఉన్నాను అని అనుకోలేదు. నేను ఏ రోజూ భోజనం కోసం ఎవరినీ అడగలేదు. నాకు ఆకలి వేసినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా నాకు భోజనం పెట్టేవారు. దీనినే నేను ‘నమ్మండి. ముందుకు సాగండి. సృష్టి మీ రక్షణ బాధ్యత తీసుకుంటుంది' అని మీకు చెబుతాను.
నన్ను చాలా మంది అడుగుతారు, "స్వామీజీ, మీరు మీ లక్ష్యాన్ని చేరటానికి చాలా శ్రమ పడ్డారు. మేము కూడా మా లక్ష్యాన్ని చేరాలంటే అంత శ్రమ పడాలా? అని.
నేను వాళ్ళకి చెబుతాను. నేను చాలా శ్రమ పడ్డాను. ఎందుకంటే నేను ఒక తాళం తెరవటానికి 10,000 తాళం చెవులు ఉపయోగించాను. ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రయోగాలు చేసాను. చివరికి సరియైన తాళం చెవిని కనుక్కున్నాను. ఇప్పుడు నా చేతిలో ఆ తాళం చెవి ఉన్నది. ఎవరు కావాలి అని అడిగితే వాళ్ళకి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఆ తాళం తెరవటానికి ఒక్క క్షణం పడచుతుంది.
అలా కాకుండా మేము కూడా చాలా కష్టపడాలి అని మీరు నిర్ణయించుకుంటే, అది మీ ఇష్టం. నేనేమీ అనను. నేను విషయంలో అడ్డుకోను.
మీరు చేయవలసినదంతా కూడా, ఈ సృష్టికి మీలోనికి ప్రవహించనీయండి. ఆ ప్రవాహాన్ని అడ్డుకోండి. మీరు ఎంత తక్కువగా అడ్డుకుంటే, మీరు అంత తక్కువ శ్రమ పడితే చాలు. మీకు జ్ఞానోదయమయితే అప్పుడు మీరు ఒక ఖాళీ అయిపోయిన కాలువ లాంటటివారవుతారు. అప్పుడు మీలో ఈ సృష్టి నిరంతరం మీ గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అంతే. ఎప్పుడైతే మీరు ప్రయత్నించటం మానేస్తారో, ఈ అనంత చైతన్య శక్తి మీ నుంచి అప్రయత్నంగా ప్రవహిస్తుంది.
ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా?
ప్రశ్న : స్వామీజీ, ధ్యానం మాకు సంతృప్తిని పొందేందుకు ఏ విధంగా సహాయం చేస్తుంది.
చూడండి : మీరు నిరంతరం ధ్యానం చేస్తే మీరు సున్నితంగా, మృధువుగా తయారవుతారు. మీరు తెలుసుకోగలిగేస్థితిలో ఉంటారు. మీ చేతన స్థితి నిరంతరం విశాలమవటం మీరు తెలుసుకుంటారు. మీ చేతన స్థితి నిర్ణయాలని, మీ చర్యలని నిర్దేశించుతుంది. అందుకే నేను మిమ్మలని మరలా మరలా ధ్యానం చేయమని చెబుతాను. నేను మీ చేతన స్థితిని శుభ్రం చేస్తాను. అప్పుడు అన్ని విషయాలు మీకు స్పష్టంగా ఉంటాయి.
మీలోని ఏకాగ్రత మీ మైండ్ నుంచి హృదయంలోనికి వెళ్ళటం మీరు గమనించుతారు. మీ మైండ్‌కి మీకు మధ్య దూరం పెరిగినప్పుడు మీ అంతరంగపు ఉనికి, మీ అంతరాత్మ ఎన్నో అనుభూతుల ప్రతీధ్వనింపచేస్తుంది. ఆ అనుభూతులు ఏమిటంటే, పరిపూర్ణమైన తృప్తి సాధించామన్న లోతైన పరిపూర్ణత, గాఢమైన ప్రేమ, ఎటువంటి కారణం లేని స్వచ్ఛమైన ప్రేమ ఇవన్నీ కూడా అనంత చైతన్యంవైపు కలిగే అనుభవాలు. అదే మనకి సంతోషాన్ని శాశ్వతమైన నిత్యానందాన్ని ఇస్తుంది.
మీరు ఎంతకాలం మీ మైండ్ నుంచి పనిచేస్తారో అంతకాలం మీరు ఇంకా ఇంకా కావాలని అంటుంటారు. మీరు నిరంతరం ప్రతి విషయాన్ని ముక్కలుగా విభజించి, విశ్లేషించి, ముగింపులు చెప్పి అప్పుడు నిర్ణయాలు చేస్తారు. దీనితో మీకు దొరికే ముగింపు మాత్రం పూర్తి అసంతృప్తి తప్పా మరేం కాదు.
మీరు మీ హృదయం నుంచి చేస్తే, మీరు విశ్లేషణలని మానివేస్తారు. జరిగిపోయిన విషయాలను గాని భవిష్యత్ ని కాని విభజించి విశ్లేషించరు. మీరు కేవలం వర్తమానంలోనే ఉంటారు. అప్పుడు మీరు ఎటువంటి నిర్ణయాలు చేయరు, తీర్పులు ప్రకటించరు. ఈ స్థితిలో మీరు తృప్తి, కృతజ్ఞతని మాత్రమే కలిగి ఉంటారు. అప్పుడు మీ అంతరంగంలో ఒక కొత్త ప్రదేశం సృష్టించబడుతుంది. అది మీరు వికసించటానికి ఏర్పాటు చేయబడినది.
మీరు ఎప్పుడైతే దానిని కనుగొంటారో, అప్పుడు మీరు ఇంతవరకూ వ్యతిరేకపు ఆలోచనలు అసంతృప్తి వీటి మీద ఖర్చు చేసిన శక్తి విడుదల అవుతుంది. మీరు పరమానందాన్ని అనుభవించుతారు. మీరు శక్తితో ఒకటిగా అయ్యి, ఆ శక్తితో నింపబడుతారు. అప్పుడు కృతజ్ఞత మీ పూజ అవుతుంది. అప్పుడు 'ధన్యవాదాలు' అనే మాటం మీ మంత్రమవుతుంది.
మీరు ఈ అనంత చైతన్య స్రవంతి, ఈ సర్వాంతర్యామి అయిన విశ్వశక్తి పట్ల ఎపుడైతే కృతజ్ఞతా భావంతో ఉంటారో, మీలో పొంగిపొరలే శక్తి మాటలలో వర్ణించలేము. అది ఈ సృష్టి నుంచి ఎంతో, మరెంతో ఆకర్షించగలుగుతుంది. అప్పుడు మిమ్మలని ఈ అనంత ఉనికి వరాల జల్లులతో నింపుతుంది.
అకస్మాత్తుగా సమస్తము కూడా కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. అప్పుడు మీరు మరింత పరమానందాన్ని పొందుతారు. మీరు ప్రతి క్షణం ఆనందంతో పొంగిపోతుంటారు. కేవలం వర్తమానం మీలో పొందుతూ ఉంటుంది. అప్పుడు మీకు మీరే ఒక దీవెనగా అనిపిస్తారు. మీరు ఈ ప్రపంచానికే ఒక దీవెన అవుతారు.
అదే మీరు పదే పదే అడిగారనుకోండి, మీరు స్పష్టంగా సమస్తం కోల్పోతారు. అలా కాకుండా మీరు కృతజ్ఞతా భావంతో ఉంటే మీ పై వరాలు కురిపించబడతాయి. నిరంతరం కృతజ్ఞతతో ఉండండి. ఈ సమస్తానికి ఉపయోగించే అసలైన తాళం చెవి ఇదే. అయితే ఆ కృతజ్ఞతా భావం మీ అంతరాత్మ నుంచి రావాలి. అంతే కానీ మీ పరిధి నుంచి కాదు. ఎప్పుడైతే మీ అంతరంగపు లోతులలోని మీ ఉనికి నుంచి కృతజ్ఞతా భావం పొంగి వస్తుందో అప్పుడే జరగవలసినవి జరుగుతాయి.
మీరు నిద్రపోయే ముందు, ఒక రోజు ఈ సమస్త సృష్టితో ఉండగలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. నిద్ర లేచినప్పుడు మరొక కొత్త రోజు మీకు ఇవ్వబడినందుకు కృతజ్ఞతలు తెలపండి. కృతజ్ఞతని మీ అంతరంగంలో నింపటానికి ఇది చాలా చక్కని సులభమైన ధ్యానం పద్ధతి.
మీకు చెబుతున్నారు: కేవలం కృతజ్ఞతా భావాన్ని మీలో నింపుకుని, దానిని మీ అంతరంగం నుంచి అన్ని దిశలకూ వ్యాపింపచేయటం వలన ఈ భూమిపై ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చివేయవచ్చు. ఈ కృతజ్ఞతా భావాన్ని నలుదిశల వ్యాపింపచేసి ప్రపంచంలోని టెర్రరిజం, యుద్ధాలు, మత పోరాటాలు, అనారోగ్యం, పేదరికం ఇలాంటివన్నింటినీ పూర్తిగా తొలగించవచ్చు. ఈ కృతజ్ఞతా భావం ప్రతి ఒక్కరి లోపల నుంచి రావాలి.
ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావం ప్రతి వ్యక్తిలోనూ నింపబడి, అది వారి అంతరంగపు లోతుల నుంచి నలువవైపులా వ్యాపించుతుందో అప్పుడు, ద్వేషం, అసూయ ఇటువంటివేవి ఉండవు. ప్రపంచంలో ఉన్న వ్యతిరేకపు ఆలోచనలు మూలాలు సమూలంగా నాశనం చేయవచ్చు. వాటిని కేవలం ఒకే ఒక్క భావం; అదే కృతజ్ఞతా భావంతో పూర్తిగా తొలగించవచ్చు. ఎందుకంటే ఈ వ్యతిరేవతకి ఉండే కారణాలు కృతజ్ఞతా భావంలో కరిగిపోతాయి. అదే కృతజ్ఞతా భావంలో ఉండే అద్భుతమైన అందం.
ఇప్పుడు మనం ఒక చక్కని ధ్యానం చేద్దాం. అది సహస్రార ధ్యానం.
ఇది కృతజ్ఞతతో కూడిన ధ్యానం పద్ధతి
(అక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ పువ్వులు పంచిపెడతారు)
సహస్రార ధ్యానం (30 నిముషాలు)
మెల్లగా సంగీతం వినిపిస్తుంటుంది.
స్వామి ఇలా చెబుతున్నారు :
సహస్రార ధ్యానం అనేది కృతజ్ఞత ధ్యాన పద్ధతి. దీనిని సుఫీ ధ్యాన పద్ధతి నుంచి తీసుకోవటం జరిగింది.
చేతిలో పువ్వులు పట్టుకుని కళ్ళమూసుకుని కూర్చోండి. మీ సహస్రార చక్రం మీద ఏకాగ్రతని నిలపండి.
మీ శరీరంలోని మిగతా భాగాలని మర్చిపొండి. కేవలం మీ తలపై భాగం మీద మాత్రమే ఏకాగ్రత నిలపండి. అక్కడ విరామంగా ఉండండి. చిరునవ్వుతో ఉండండి.
మీ అంతరంగంలోపలి నుంచి మీ అమ్మగారికి కృతజ్ఞతలు తెలపండి. మీకు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు, గుర్తుంచుకోండి మీ అంతరంగంలోపలి నుంచి కృతజ్ఞతలు తెలపండి.
మీకు జీవితాన్ని ఇచ్చిన, మీకు సర్వ సదుపాయాలు కలుగచేసిన మీ నాన్నగారికి కృతజ్ఞతలు తెలపండి.
మీరు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మీకు సహాయం చేసిన డాక్టర్స్‌కి, నర్సులకి కృతజ్ఞతలు తెలపండి.
మీరు పుట్టిన చోట ఆ హాస్పటల్ నిర్మించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పండి.
మీ చిన్నతనంలో మీ గురించి పట్టించుకుని, మీకు రక్షణనిచ్చిన అందరికి కృతజ్ఞతలు చెప్పండి.
మీకు భోజనం, బట్టలు మిగతా సదుపాయాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పండి.
మీ చిన్నప్పుడు విద్య భోధించిన గురువులకు కృతజ్ఞతలు తెలపండి.
మీ చిన్నప్పటి స్నేహితులకి మీ ఆనందానికి కారణమైన వారికి, మీ అమాయకత్వాని, సంతోషాన్ని పంచుకున్న మీ సహచరులకి కృతజ్ఞతలు తెలపండి.
మీ అక్కచెల్లెళ్లకి, అన్నతమ్ములకి, బంధువులకి,ఎవరైతే మీకు సహాయం చేసారో అందరికీ కృతజ్ఞతలు చెప్పండి.
మీరు తెలిసో తెలియకో ఎవరినైనా బాధపెడితే క్షమించమని అడగండి. మీకు ఉన్నత చదువులు అందించిన వారికి, మీ ఉద్యోగంలో, మీ వృత్తితో ప్రోత్సహించిన వారికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడేందుకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పండి. మీ ఆరోగ్య విషయంలో మీకు సహాయం చేసిన డాక్టర్స్, నర్సులకి కృతజ్ఞత చెప్పండి. వారు మిమ్ములని ఎప్పుడైనా బాధించినట్లైతే క్షమించండి. మీరు వారిని బాధించినట్లయితే క్షమించమని అడగండి.
మీ ఆధ్యాత్మిక జీవితంలో మిమ్ములని ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలపండి. మీ జీవితంలో మీకు ఏదో ఒక విధంగా సహాయం చేసి వ్యక్తులు, పాలుపోసే వ్యక్తి, సరుకులు అమ్మే వ్యక్తి, పనివారు, డ్రయివరూ ఇలా అందరికీ కృతజ్ఞతలు చెప్పండి. మీ శత్రువులకు, మిమ్ములని బాధించినవారికి, మిమ్ములని దృఢంగా చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పండి. వారిని క్షమించండి. మీరు ఎవరిని బాధించితే వారిని క్షమించమని అడగండి.
మీకు భౌతికంగా, మానసికంగా, సమాజపరంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పండి.
మీరు సరిపడా సమయం తీసుకుని అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పండి.
మీ శరీరానికి అందులో ప్రతి భాగానికి కృతజ్ఞతలు చెప్పండి.
మీ మైండ్‌కి దాని అద్భుతమైన పని తీరుకి కృతజ్ఞతలు చెప్పండి.
భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. సమస్త విషయాలు సమస్త చర్యలకి కారణమైన దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపండి.
నేను మీ అందరికీ కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. నా మీద నమ్మకాన్ని ఉంచి ఇన్ని రోజులూ నేను చెప్పినవన్నీ విన్నందుకు మీకు కృతజ్ఞతలు.
ఇప్పుడు మీరు కళ్ళు తెరచి మీ దగ్గర ఉన్న పూలని కృతజ్ఞతతో ఈ తెల్లని వస్త్రం మీద వేయండి
(అందరూ వచ్చి పూలని ఆ వస్త్రం మీద ఉంచుతారు)
ఇప్పుడు ఆనంద దర్శనం ఉంటుంది.

అధ్యాయం - 10