KAILASA Library/నమ్మకమైన పరిష్కారాలు/ఆనంద దర్శనంSign in
నమ్మకమైన పరిష్కారాలు

ఆనంద దర్శనం

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(Ananda Darshan)

(This section is about the Ananda Darshan - the darshan time when Swamiji becomes a pure channel for the Divine Energy to flow through him, which he gives to each and everyone present as a Divine gift.)

గురుదేవులు ఈ అనంత విశ్వం యొక్క దివ్యచేతన స్థితిలో భాగం. ఆయనది రూపం లేని రూపం. ఆయనే చైతన్య శక్తి. సర్వాంతర్యామి. మన మీద ఆయనకి గల అపార కరుణతో, అనంతమైన ప్రేమతో మనకి ఆనందదర్శనాన్ని ప్రసాదించుతారు. ఆ ఆనంద దర్శనం ద్వారా ఆయన మనకి చేరువ అవుతారు. ఆనంద దర్శన సమయంలో గురుదేవులు తన ద్వారా మనకి అనంత విశ్వచేతన స్థితి యొక్క అనుభవాన్ని ఇస్తారు.

గురుదేవుని అపారమైన దయ, అపురూపమైన దివ్య ప్రేమని ప్రతి ఒక్కరూ పూర్తిగా, లోతుగా అత్యధికంగా పొందుతారు. అనంత విశ్వశక్తిని ఆయన తన చుట్టు ప్రక్కల అన్ని దిశలలో నిరంతరం వ్యాపింపచేస్తారు. ఆనంద దర్శన సమయంలో ఆయన సున్నితంగా, మృదువుగా, ప్రేమతో ఆ విశ్వశక్తిని మన లోపల నింపుతారు. ఆయన అలా చేస్తే తన తేజస్సు అయిన విశ్వ తేజస్సుని మనలో నాటుతారు. అది మొలకెత్తి వికసించి, ఆయన తేజస్సుని ప్రతిబింబిస్తూ దశ దిశలూ పరిమళ భరితం చేస్తుంది

మనం దానిని మనలోనికి ప్రవేశించటానికి వీలుగా సిద్ధమయినప్పుడే ఆ శక్తి మనలోపలికి ప్రవేశించి, మన అంతరంగంలోపలి ఉనికి దశలో మార్పును తేస్తుంది.

మన అంతరంగంలో నిశ్శబ్దంగా ఉండి, లౌకిక తర్కంయొక్క గుప్పిళ్ళ నుంచి స్వేచ్ఛని పొంది, మనలోపల ఆలోచనలని, మాటల నుంచి పూర్తిగా స్వతంత్రులమయితే మన కోసం ప్రేమతో సృష్టించబడిన దివ్య నిత్యానంద సాగరంలో ఒక బిందువై అందులో ఐక్యమైపోతాము.

ఇదంతా మనం పొందాలి అనుకుంటే గురుదేవుని అనంత ప్రేమవాహిని మనలో ప్రవహించాలంటే ఆ గురుదేవుని మీద విశ్వాసాన్ని నిల్పుకుని, ఆయన ఇచ్చేవి స్వీకరించటానికి మనం సిద్ధంగా ఉండాలి. మన మైండ్‌ని పూర్తిగా కొంత సేపయినా వదిలేయగలగాలి. ఇక్కడా సృష్టించబడిన పరిస్థితికి, రీతికి అనుగుణంగా మనం స్పందించగలిగితే ఈ అనంత సృష్టికి సర్వాంతర్యామికి మనం ఎంతో గౌరవాన్ని చూపుతున్నట్టే

దర్శన సమయంలో చక్కటి కీర్తనలు, నాట్యం ఉంటాయి. పరమానంద భరితమైన గురుదేవుని సమక్షం అక్కడ ఆ సమయంలో ప్రవహించే దివ్యశక్తి మనని చుట్టుకొని ఉన్న శక్తి తరంగాలని ఉన్నతమైన దివ్యత్వంలా వారుస్తాయి. ఇది స్వచ్ఛమైన విశ్వ సృష్టి సర్వాంతర్యామి అయిన విశ్వశక్తి యొక్క ఉత్సవం.

దర్శన సమయంలో పొందిన ఆనందం, మైండ్‌కి అన్నింటికి అతీతంగా తీసుకువెళుతుంది. అప్పుడు మీరు ఈ సర్వసృష్టిలో ఒకరుగా అనుభూతిని పొందుతారు. మైండ్‌ నిశ్శబ్దమైన ఈ స్థితిలో ఎంతో కాలంగా ఈ అనుభవం కోసం ఎదురు చూస్తున్న మీ ఆత్మని ఆ అనుభవాన్ని పొందనియండి. మైండ్ క్రమంగా మాయమయిపోతుంది. ఆ ఖాళీలో పొంగి ప్రవహించే అనంతమైన ప్రేమ నింపబడుతుంది. అది సర్వసృష్టికి ఉండే ప్రేమ

దర్శన సమయంలో, సమాజిక ఆర్థిక పరమయిన అన్నిరకాల అడ్డుగోడలూ తొలగిపోతాయి. అందరూ అందరిలో దైవత్వాన్ని చూడగలుగుతారు. స్వేచ్ఛలో ఆనందాన్ని అనుభవించుతారు. ఈ సమయంలోనే మనకి ఉండే అన్ని రకాల గుర్తింపులూ మాయమవుతాయి. అందరూ పరమానందాన్ని ఉత్సవంలా చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ దివ్య తేజస్సుతో వెలిగిపోతారు. వాళ్ళలోని దైవత్వాన్ని అన్ని దిశలా వ్యాపింపచేస్తారు.

గురుదేవుని మాటలు మీరు మరలా వినగలరు. కాని దర్శన సమయంలో ఆయన మాట్లాడరు. ఆయనని ఆయన మనకి ఆవిష్కరిస్తారు. ఆయనని మనకి చూపించుతారు. మనందరికి గురుదేవులు ఇచ్చే ఒక అద్భుతమైన బహుమతి ఈ దర్శనం. మనం నిశ్శబ్దంగా తెలుసుకోగలిగే స్థితిలో ఉంటే దానిని మనం చూడగలం. అలాకాకుండా ఆలోచనలలో మాటలలో చిక్కుకుపోతే, ఈ మొత్తాన్ని మనం కోల్పోతాము.

మనం దర్శనాన్ని స్వీకరించినా తిరస్కరించినా ఆ అనుభూతిని కోల్పోతాము. అవి రెండూ చేయకుండా, ఎటువంటి అంగీకారం, అనంగీకారం లేకుండా : నిర్ణయాలు చేయకుండా, ఎటువంటి ఆలోచనలూ లేకుండా ఉన్నప్పుడు మనం సరియైన ఆధారాన్ని పట్టుకోగలుగుతాము. అప్పుడు మనం అనుభవసిద్ధమైన ప్రేమతో ఉండగలం. దానిని అనుభవించగలం. మనం మాట్లాడకుండా ఉంటే మనలోపలి స్పందనని తెలుసుకోగలం. ఎన్నో లక్షల మందికి ఈ దర్శనం గొప్ప మార్పుని ఇచ్చింది

ఈ దర్శనం ఎందరికో ఎన్నో విధాలుగా లాభించింది. దర్శన సమయంలో ఏదో ఒక అనుభవం కోసం ఆత్రుతపడకండి. అక్కడ ఏమి జరిగితే దానిని జరగనీయండి. అప్పుడే మనం దర్శనాన్ని ఆహ్వానించదగిన ప్రదేశాన్ని మనలో ఏర్పరచుకోగలుగుతాము. ఆ శక్తి చాలా తెలివైనది. ఆ శక్తికి ఏమీ చేయాలో బాగా తెలుసు. కాబట్టి మనం ప్రత్యేకంగా ఏమీ ఆశించనవసరం లేదు. అందుకే మనం అనుభవం కానీ మరేమీ కూడా ఆ సమయంలో ఆశించనవసరం లేదు.

ఆ సమయంలో పూర్తిగా ప్రార్థన స్థితిలో ఉంటే చాలు. మాటలకంటే కూడా ఎక్కువగా మనలో మార్పు తెస్తుంది. దర్శనం తరువాత స్వామీని మనం ఏమయినా అడగదలచుకుంటే అడగమంటారు. మనం మన సమస్యగాని ఏదైనా అడగవచ్చు.

కానీ ఆ సమయం లౌకికత్వానికి ప్రాపంచిక విషయాలకి అతీతంగా ఉంటుంది. అందుకే మనం అడగలేము. అలా కాకుండా ప్రశ్నమీద ఏకాగ్రత ఉంటే అసలైన అనుభూతిని కోల్పోతాము.

చాలా మంది తమ అనుభవాన్ని ఇలా చెబుతుంటారు. దర్శన సమయంలో స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన సరిగ్గా మనకి మనలోపల సమస్యబాధ ఉన్న ప్రాంతంలోనే ఆయన చేతిని పెడతారని చెబుతారు. ఏ ప్రాంతంలో అయితే సమస్య తీవ్రంగా ఉంటుందో ఆయనకి మనం చెప్పకుండానే ఆయన చేతిని అక్కడ పెడతారు. అందుకే ఆయనకి మనం చెప్పనవసరం లేదు. మన సమస్యలు ఆయనకి తెలుసు.

దర్శన సమయంలో మనం ఏమడిగినా స్వామి ఎంతో దయతో మృదువుగా మన మీద ప్రేమతో జవాబు ఇస్తారు. వేరు వేరు వ్యక్తులకి ఆయన ఇచ్చే జవాబులు వేరు వేరుగా ఉంటాయి. ప్రశ్న ఒక్కటే అయినా జవాబులు మాత్రం పూర్తిగా వేరు. దీనిని బట్టి వ్యక్తులు వేరని అర్ధమవుతుంది. ఎవరి మార్గం వారిది. ఎవరికి వారే స్వతంత్రంగా స్వామితో బంధాన్ని కలిగి ఉంటారు.

ప్రశ్న అడిగినప్పుడు స్వామి అడిగిన వారి అంతరంగంలోనికి చూస్తారు. ఆయన ప్రశ్నకు జవాబు చెప్పరు. అడిగిన వ్యక్తికి జవాబు చెబుతారు. ఆయనపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన వారికి "నేను చూసుకుంటాను” అని అంటారు. స్వామి ఇచ్చే ఈ భరోసాతో మనం మన భయాలని వదిలివేయవచ్చు.

ఆ కొన్ని క్షణాలు మనం ఆ అనంత చైతన్య సృష్టి పై పూర్తి విశ్వాసం ఉంచగలిగితే, మనం గొప్ప అనుభవాన్ని పొందగలం. ఈ సృష్టికి మనకి ఏమి కావాలో తెలుసు అని నమ్మితే చాలు. మనం ఈ వైఖరితో ఉంటే స్వామి మనకి ఇచ్చేవి పొందగలం. ఇవి ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన దివ్యమైన క్షణాలు.

దర్శన సమయం మనం సంభాషణ నుంచి ఏకాగ్రతతో కూడిన భావవ్యక్తీకరణ స్థితికి చేరగలం. స్వామి ప్రవచనాల సమయంలో మనం మైండ్ తో ఆయన చెప్పే విషయాలు అనుసంధానం చేస్తాం. కాని దర్శన సమయంలో మన అంతరాత్మ ఆయనతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది.

మనలో కొన్ని అనుభవాలని జరగనీయాలి. ఆ సమయంలో మైండ్ ని వదిలి కేవలం హృదయంతో ఉండగలగాలి. ఎందుకంటే మైండ్ తో మనం సర్వాంతర్యామిలో ఒకటిగా కలిసిపోలేము. అది హృదయంతోనే జరుగుతుంది. దానితోనే మనం ఆ అనంత చైతన్యంలో ఐక్యమవ్వగలం.

దర్శన సమయంలో స్వామి మన కళ్ళ ద్వారా ఆయనని మనలో చూస్తారు. ఆయన తన కళ్ళతో, స్పర్శతో మనకి కావలసిన చికిత్సని చేస్తారు. దర్శనం తరువాత మనం ఒక కొత్త వ్యక్తిగా బయటికి వస్తాము.

దర్శనం ప్రతి సారి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టి ప్రతి క్షణం మారుతుంది. స్వామి చెప్పినట్టు భగవంతుడు కళాకారుడు కానీ ఇంజనీరు కాదు. అందుకే దర్శనం ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభూతిని ఇస్తుంది. మనలో ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. మరొక విషయం మరలా దర్శనం పొందే వరకూ ఇది కొత్తదే.

ఆనంద దర్శన సమయంలో గురుదేవులు మనని కోరికలు లేని స్థితిలో నిలుపుతారు. మనం సిద్ధంగా ఉంటే అనేక మార్గాలలో అది మనలో మార్పుని తెస్తుంది. స్వామి కరుణతో మనం కోరికలు లేని స్థితిని ఆ సమయంలో సులభంగా పొందుతాము.

మనం సంతోషం కృతజ్ఞతాభావాలతో నిండి వుంటే, ఆ శక్తి మనలోపలికి చొచ్చుకుని వెళ్ళి మన కోరికలని తీరుస్తుంది. మనని కోరికలకి అతీతంగా తీసుకువెళుతుంది.

ఏ ప్రత్యేకమైన కోరికా లేని స్థితి అది. ఈ స్థితిలో స్వీకరించటానికి సిద్ధంగా ఉంటాము. వికసించే ఉంటాము. దాని కోసం మనం ఎటువంటి ప్రయత్నం చేయనవసరం లేదు. మన ప్రయత్నాలు వదిలేస్తే చాలు. ఆశక్తి మిగతా విషయాలు చూసుకుంటుంది. శక్తి తెలివైనది. దానిని అనుమతిస్తే శక్తి మనలో ప్రవేశించి చేయవలసినవి చేస్తుంది.

దర్శనం అంటే స్పష్టంగా చూడగలగటం. స్పష్టతని తెలుసుకోవటం. అక్కడ ఉన్న శక్తి మన అంతరంగం లోపల ఉనికిలో అద్భుతాలు చేయగలదు. మనలోపలికి తెలుసుకునే తత్త్వాన్ని తేగలదు. ఇక్కడ నాట్యం, సంగీతం, సంకీర్తనల మధ్య పవిత్ర ప్రశాంతత మనకి కనిపిస్తుంది. అది ఈ అనంత విశ్వం యొక్క శక్తి. ఈ శబ్దాల మధ్యలో మనకి ఆధారమైన నిశ్శబ్దం అన్ని దిశలా వ్యాపించి ఉంటుంది. అప్పుడు మనకి మనలోపల ఉండగలగటం తెలుస్తుంది. అంటే దేనినీ వదిలివేయటం కాదు. అన్నింటినీ మనలో ఉంచుకొని మన అంతరంగం పై ఏకాగ్రతని నిలపటం.

దర్శనం తరువాత మనలో వివేకం వికసించుతుంది. కోరికలు స్పష్టంగా తెలుస్తాయి. అవి తీరుతాయి. లేదా వాటిని వదిలేస్తాము.

గురుదేవుని సమక్షంలో మనం ఆశక్తులం. ఆయన మన అంతరాత్మని చూస్తారు. ఆయన అన్నీ గ్రహించుతారు. మనం ప్రశ్నలు అడగటం ఉపయోగం లేని పని, ఎందుకంటే మనకి నిజంగా ఏమి కావాలో తెలియదు. స్వామికీ మనకి ఏమి కావాలో తెలుసు. ఆయన వాటి విషయం చూస్తారు. స్వామి సమక్షంలో మనం ఆనందంతో నిండి ఉంటాము. మనలో ఎటువంటి ఆలోచనలూ ఉండవు. మొత్తం ఖాళీగా ఉంటుంది.

అటువంటి స్థితిలో మనం అప్రయత్నంగానే మన లోపల నిశ్శబ్దంగా అయిపోతాము. మనం ప్రేమతో స్వీకరించటానికి సిద్ధంగా ఉంటాము. మనలోపలికి శక్తి ఒక కిరణంలా ఒక ఫ్లాష్లా చొచ్చుకుపోతుంది. అది మన అంతరంగం లోతుల లోనికి వెళుతుంది. మన అంతరాత్మని స్పృసిస్తుంది. మనలో మార్పు తెస్తుంది. అయితే అది ఏవిధంగా జరుగుతుందో మనకి తెలియదు

దర్శన సమంలో స్వామిని చూడటమే ఒక ఆనందమయమైన, ఆహ్లాదకరమైన ధ్యానం. ఇది చాలా అరుదయిన అవకాశం. ఆ సమయంలో మనం దేనిలోనూ చిక్కుకుపోకూడదు. ప్రేమతో కృతజ్ఞతతో పూర్తిగా ఆయన సమక్షంలో ఉండగలగాలి. అది చాలు.

దర్శన సమయంలో స్వామి అద్భుతంగా ఆహ్లాదకరంగా, మనోజ్ఞనంగా కనిపిస్తారు. ఆయన కరుణా సముద్రునిలా ఉంటారు. ఆ సమయంలో అక్కడ ప్రవహించే విశ్వశక్తి మనని ఆ సర్వాంతర్యామిలో ఐక్యమయిపోయేలా చేస్తుంది. మనం మన వ్యక్తిత్వాన్ని వదిలి ఆ శక్తిలో ఐక్యమయిపోతాం.

ఆ శక్తి గురుదేవునిలో ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు స్వామి దర్శనం మనకు దైవత్వాన్ని చూపిస్తుంది. అప్పుడు మనం అందులో కలిసిపోతాం. విశ్వశక్తి యొక్క స్పర్శతో మనం మరింతగా వికసించుతాము. ఈ సమయంలోనే మనలోని అబద్ధపు గుర్తింపులు, హోదాలు మొదలైనవాటిని తొలగించాలి. అప్పుడే ఆ శక్తిని మనలోనికి ప్రవహింపగలుగుతుంది.

ఈ సమయంలోనే మనం గురుదేవునిలో ఐక్యమవ్వగలం. ఇది ఒక సాగర సంగమం లాంటిది. అనంత చైతన్య సాగరులయిన గురుదేవునిలో మనం నదిలా కలిసిపోతాము. అందుకే దర్శన సమయంలో మనం ఎంతో స్వేచ్ఛగా విశ్రాంతిగా ఉంటాము. మన చేతన స్థితి ఉన్నత స్థితికి చేరుతుంది.

స్వామి సమక్షంలో దర్శన సమయంలో మనలోని భావావేశాలు పైకి వస్తాయి. కన్నీటి రూపంలో పొంగుతాయి. మనకి కారణం తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయి. మనం ఈ భావావేశాలని అణచనవసరం లేదు. వాటిని అలా రానివ్వండి. అవి పూర్తిగా బయటకి వస్తాయి. మనం మాటలలో చెప్పలేనివన్నీ బయటకి వస్తాయి. మనలో లోతుగా నాటుకుపోయిన జ్ఞాపకాలు బయటకి వెళ్ళే ఒక చక్కని అవకాశం ఇది.

దర్శన సమయంలో జరిగేది ఏదైనా పూర్తిగా జరుగుతుంది. మనం చప్పట్లు కొడతాం. నవ్వుతాం, నాట్యం చేస్తాం, కన్నీరు కారుస్తాం. అంతా కూడా మనలో పొంగే భావావేశాలే. వాటికి తర్కం, కారణం ఉండదు. ఇది పూర్తిగా మనని మనం వ్యక్తీకరించుకోవటమే.

మనలో చాలా భిన్నత్వం ఉన్నది. ఈ నిముషం ఒకటి కోరతాం. మరు నిముషం మరొకటి. మనలో చాలా అయోమయం ఉంటుంది. దర్శన సమయంలో వీటన్నిటినీ మనం వదిలివేస్తాం.

ప్రతి దర్శనంలోను గురుదేవులు మన ఉనికిని, మన అంతరాత్మని ప్రకాశింపచేస్తారు. ఆయన నుంచి శక్తిని మనలోపలికి ఈ సమయంలోనే ప్రవేశించుతుంది. ఆయన మనకి ఇచ్చే అంతిమ బహుమతి ఇది. ఆయన తేజస్సుని మనకి ఇస్తారు. ఆ వెలుగుని మనం నిరంతరం మనతో మనం ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్ళవచ్చు.

ఎప్పుడైతే ఆ శక్తి మనలని స్పృశించుతుందో మనలో శాశ్వత మార్పు సంభవించుతుంది. మనలో వివేకం వికసించి ప్రశ్నలు కరిగిపోతాయి. మనకి దైవత్వానికి దారులు కనిపించుతాయి. దర్శనం మనకి ఆ దారులన్ని చూపిస్తుంది. ఇది మన అంతిమ అనుభవానికి ఆహ్వానం. అయితే ఎవరి దారి వారిది. అందరికీ ఒకే దారి ఉండదు.

దర్శన సమయంలో సృష్టించబడే శక్తి చాలా బలమైనది. అది మనకి సహజమైన మార్గదర్శిలా ఉంటుంది. మనలో విజ్ఞాన జ్యోతులు వెలిగించుతుంది. అవి మనలో అంతఃప్రేరణని కలిగిస్తుంది. మన సహజ జ్ఞానము అంతఃప్రేరణ యొక్క శక్తిని మన దైనందిన జీవితంలో మనం నిర్ణయాలు చేయటానికి ఎంతో సహకరిస్తుంది. ఆనంద దర్శనం మనలో తర్కంలేని జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది.

ఆనంద దర్శనం సమయంలో మన అంతరంగలోతుల్లో ఏమి జరుగుతుందో ఆ రీతులు మనకి తెలియవు. కానీ అది మనకు ఇవ్వబడ్డ ఒక అపురూపమైన కానుక. దానిని పూర్తిగా స్వీకరించితే, జరగవలసినవి వాటంతట అవే జరుగుతాయి.

ఆనంద దర్శన సమయంలోనే మనం స్వామీ సమక్షంలో ఆయనకి దగ్గర అవ్వగలం. భౌతికంగా ఆయన ప్రేమని దగ్గరగా తెలుసుకోగలం. ఆయన నుంచి మనలోపలికి వచ్చే శక్తి యొక్క అనుభూతిని పొందగలం. మనలో మనంకాని దానిని ఆ ఆనంద శక్తి త్రుంచి వేస్తుంది. అది మనం సర్వాంతర్యామిలో విశ్వచేతన స్థితిలో ఐక్యమయిపోగల ఒక అద్భుత అవకాశం. అనంత నిత్య ఆనంద సాగరంలో ఒక నదిలా కలిసిపోయే సాగర సంగమం ఈ ఆనంద దర్శనం.

నిత్యానంద సాగరం!

కోరికలు, ఆశలు భావావేశాలు పడిలేచే కడలి కెరటాలు ఎగిరిపడే ఆలోచనా కెరటాలు జీవిత ఒడ్డుని ఢీకొనే కష్టాలు బరువు బాధ్యతలు, కర్తవ్యనిర్వహణలు విరిగిపడే కెరటాలు హే ప్రభూ! ఈ కెరటాలులేని లోతైన సాగరంలోనికి నన్ను చేర్చు.

నా మనోశక్తి విరుచుకుపడే కెరటాల పోరాటంలో అలసిపోయాను మహాకెరటాల సముదాయం నన్నుదూరం నుంచి భయపెడుతున్నాయి. ముందుకు దూసుకువచ్చే ఈ కెరటాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి హే! ఆనంద సాగరా! నన్ను ఇవేమిలేని చోటులో నిలుపు

సముద్రపు ఒడ్డులో చిక్కుకుపోయి కదలలేకపోతున్నాను ఎన్ని జన్మలుగానో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ ఇలా ఒడ్డున గిలగిలలాడుతున్నాను. ఇది భరించలేను. హే! నిత్యానంద సాగరా! నన్ను ఈ బంధాల నుంచి తీసుకెళ్ళు

నన్ను సాగరలోతులలోనికి తీసుకువెళ్ళి స్వేచ్ఛని ప్రసాదించు హే ప్రభూ! నన్ను నీలోనికి చేర్చుకొని ఆనందాన్ని ప్రసాదించు నన్ను నీ గాఢమైన ప్రేమ, కరుణలలో భాగమైపోనీ హే నిత్యానంద సాగరా! నాకు సహాయం చేయి.

నన్ను తిరిగి స్పష్టతతో జన్మించనీయి
నీలో శాశ్వతమైన నన్నుగా జన్మించనీయి
దానిని కోల్పోలేని విధంగా జన్మించనీయి
నన్ను ఈ నిత్యానంద సాగరంలో ఐక్యమయిపోనీయి.