KAILASA Library/నమ్మకమైన పరిష్కారాలు/అనుబంధంSign in
నమ్మకమైన పరిష్కారాలు

అనుబంధం

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

పరమహంస శ్రీ నిత్యానంద స్వామి :

పరమహంస శ్రీ నిత్యానంద స్వామి

పరమహంస శ్రీ నిత్యానందస్వామి ఈ రోజు మన మధ్యఉన్న ఒక అద్భుతమయిన మహాయోగి, పరమపావన గురు దేవులు. ఆయన శాశ్వతానంద స్థితిని చేరాలి అనే ఒకే ఒక స్థిర సంకల్పంతో అతి చిన్న వయస్సులోనే తీవ్రమయిన తపస్సు చేసారు. స్వామీజీ భారత దేశమంతా పాదచారియై తిరిగారు. ఆయన భారతదేశం, నేపాల్ లోని గొప్పగొప్ప యోగులు, రుషుల దగ్గర యోగా, తంత్రము, తూర్పుదేశాలకి సంబంధించిన వేదాంతా అది భౌతిక తత్వ శాస్త్రాలు మొదలయిన విద్యలని సశాస్త్రీయంగా అభ్యసించారు. ఆయన అద్భుతమయిన ఆధ్యాత్మిక అనుభవాలను లోతుగా, గాఢంగా తెలుసుకున్న గొప్ప యోగీశ్వరుడు

స్వామీజీ యొక్క ప్రత్యేక లక్ష్యం ప్రతీ వ్యక్తి తనలో దాగి ఉన్న అద్భుత శక్తిని తెలుసుకునే విధంగా వారికి సహాయం చేయటం. ఆచరణాత్మకమయిన కరుణతో కూడిన దృక్పధంతో స్వామీజీ ప్రతి వ్యక్తీ యొక్క అంతరంగంలోనికి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని కలిగించాలి అని నిరంతరం వారిని తన ఆత్మీయ స్పర్శతో ప్రోత్సహించుతూ, ప్రపంచ నలుమూలలా లక్షల మందిలో అనూహ్యమయిన మార్పుని తెచ్చి వారి జీవిన విధానంలో పెనుమార్పుని తెచ్చారు.

స్వామీజీ, తన దివ్య ఆరోగ్య చికిత్సా స్పర్శతో నిత్య ఆధ్యాత్మిక చికిత్సా పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఇది ఒక సశాస్త్రీయమయిన ఆధ్యాత్మిక చికిత్స పద్ధతి. ధ్యానం ద్వారా అనారోగ్య లక్షణాలని బాగుచేసి ఆరోగ్యమంతులని చేసే పద్ధతి. స్వామి ప్రత్యక్షంగా తన దివ్య స్పర్శతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో ఆరోగ్యవంతులని చేసారు. స్వామీజీ చేత శిక్షణ పొంది ఆయనచే నియమించబడిన హీలర్స్ అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్యవంతులుగా చేసే పుణ్యకార్యంలో నిరంతరం నిమగ్నమయి ఉంటారు. స్వామీజీ, ఆయనచే నియమించబడిన హీలర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో నిమగ్నమయి, తలనొప్పి వంటి చిన్న వ్యాధులు నుంచి కేన్సర్ వంటి భయంకరమయిన వ్యాధుల వరకు బాగుచేస్తున్నారు.

స్వామీజీ యొక్క ముఖ్య సందేశమైన ధ్యానము, శాశ్వతానందం (నిత్యానందం) అనే విషయాలని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన నిత్యానందా ఫౌండేషన్ సంస్థ ద్వారా అందరికీ అందేలా చేస్తున్నారు. ఈ విప్లవాత్మకమయిన కార్యక్రమాల ఆధ్యాత్మిక ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉన్నది. అదే విధంగా పశ్చిమ దేశాలలో జరిగే కార్యక్రమాల ప్రధాన కార్యాలయం లాస్ ఏంజిల్స్ ఉన్నది. ఈ కార్యక్రమం మొత్తం 800 కేంద్రాల ద్వారా 24 దేశాలలో నిరంతరం కొనసాగుతూ ఉన్నది. ఈ మొత్తం కార్యకలాపాలు ప్రతి వ్యక్తిలో మార్పుని తెస్తూ దాని ద్వారా సమస్త మానవ జాతిలో మార్పుని తేవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో పని చేస్తున్నాయి.

స్వామీజీ ధ్యాన పద్దతుల గురించే ఇచ్చే స్పష్టమయిన, ప్రయోగాత్మకమయిన వివరణ ప్రతి వ్యక్తీ భౌతికంగా మానసికంగా, ఆధ్యాత్మికంగా వికసించటానికి ఎంతో సహాయం చేస్తుంది. ఈ విషయంలో కొన్ని వేల మంది ఆనందసేవకులు ప్రపంచం అంతటా నిరంతరం పనిచేస్తున్నారు.

స్వామీజీ తనకుతాను ఒక ప్రయోగశాలగా మారి, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులతో కలిసి పనిచేస్తూ పశ్చిమదేశాల సాక్ష్యాధారమయిన హేతువాదానికి, ప్రాచీన తూర్పుదేశాల అద్భుత మర్మయోగాకి మధ్య వారధి నిర్మిస్తూ సర్వ మానవాళి శ్రేయస్సు కోసం, వారి ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం స్వామి నిరంతరం కృషి చేస్తున్నారు.

శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మికతకు మధ్యవారధి

పరమహంస శ్రీ నిత్యానంద స్వామి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వైద్యులు, శాస్త్రజ్ఞులతో కలసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాని ద్వారా మనవాతీత ఆధ్యాత్మిక విషయాలపై ప్రయోగాత్మక విశ్లేషణ చేసారు. ఆయన తన నాడీ వ్యవస్థపై (ముఖ్యంగా మెదడు యొక్క పని తీరు) అధ్యయనం చేసి వాటి ఫలితాలను వైద్యశాస్త్రంలోని రహస్యాలను అధ్యయనం చేయటానికి ఉపయోగించారు. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా, కొన్ని రకాల వ్యాధులకు, ముఖ్యంగా కాన్సర్, ఆర్ధటీస్, మత్తుపానం వంటి వ్యాధులను తగ్గించే అవకాశం, అది సాధించే మార్గం ఉన్నాయి అని శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారు. అంతేకకుండా, ఈ ప్రయోగాల ఫలితంగా వారు మానవ మెదడుకి తన శరీరంలోని వ్యాధులను బాగుచేయాలి అని నిర్ణయం చేయగల శక్తి ఉన్నది అని చెప్పారు.

కొన్ని శతాబ్దాలుగా శాస్త్ర విజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము మానవాళికి అత్యవసరమయిన ఈ విషయాలను వెల్లడి చేయటానికి పోరాడుతున్నాయి. ఆధ్యాత్మిక గురువులు ఎన్నోసార్లు, మైండ్లేని స్థితి అనే విషయం సత్యం అని, ప్రతి ఒక్కరు కచ్చితంగా ఆ స్థితిని సాధించగలరు అని చెబుతున్నా, శాస్త్రజ్ఞులు మాత్రం ఆ విషయాన్ని ఆధారాలు లేవు అనే వాదనతో అంగీకరించలేదు.

ఈ శతాబ్దంలో మొట్టమొదటిసారి, అసాధారణమయిన అద్భుతాలు, శాస్త్రీయ వివరణకు అతీతమయిన విషయాలను శాస్త్ర విజ్ఞానానికి నిరూపించగలిగే తాళంచెవి వారికి దొరికింది. ఆధ్యాత్మికంగా అద్భుతాలు సాధించిన వ్యక్తికి చాలా శక్తులు ఏ విధంగా ఉంటాయో వైద్యపరమయిన నిరూపణలతో, సశాస్త్రీయమయిన వివరణ, స్వామీజీ పై చేసిన ప్రయోగాల ద్వారా దొరికినది. స్వామీజీ యొక్క మెదడు పనీతీరుపై చేసిన పరిశోధనల ఫలితాలను ఈ క్రింది పేజీలలో వివరించబడినది. స్వామీజీ అమెరికాలో ఉండగా ఈ ప్రయోగాలు జరిగాయి

అద్భుతమయిన ఒక యోగీశ్వరుని మైండ్ :

డా॥ మురళీకృష్ణ, ప్రెసిడెంట్, COO, INTEGRIS మెంటల్ హెల్త్ & జేమ్స్, ఎల్.హాల్ Jr. సెంటర్ ఫర్ మైండ్, బాడీ & స్పిరిట్, ఒక్లహామా వారు ఇచ్చిన నివేదిక ఈ విధంగా ఉన్నది.

A photograph of Paramahamsa Nithyananda seated, surrounded by medical professionals and doctors

A Mind Matters Column™ The Mind of a Mystic By R. Murali Krishna, M.D. President COO, INTEGRIS Mental Health & James L. Hall, Jr. Center for Mind, Body and Spirit

పరమహంస శ్రీ నిత్యా నంద స్వామి చక్కని ఆరోగ్యం కలిగిన యువకుడు. ఆయన చామనఛాయ శరీర ఛాయ కలిగి, భుజాల వరకూ పెరిగిన జుట్టుతో ఉన్న సౌమ్యత కలిగిన అందమయిన యువకుడు. ఆయన చాలా విశాల భావాలు కలిగి, చాలా కుతూహలం ఉన్న వ్యక్తి. ఆయన చూడటానికి అమెరికాలోని ఒక కాలేజీ విద్యార్ధిలా ఉంటారు. కాకపోతే ఆయనతో పోల్చినప్పుడు అమెరికాలోని కాలేజీ విద్యార్థి కొన్ని విషయాలలో వేరుగా ఉంటాడు. అమెరికాలోని కాలేజీ విద్యార్థి కాషాయ వస్త్రాలు ధరించరు, తలపాగా కట్టుకోరు. అతనికి ఆధ్యాత్మిక జ్ఞానోదయం వంటి అనుభవాలు లేవు. ఆ విద్యార్థిని ఎవరూ గురువుగా, హీలర్గా, అద్భుతమైన యోగిగా ప్రపంచంలో అన్ని మూలల నుంచి లక్షల మంది గుర్తించారు.

అద్భుతమయిన యోగి అనే మాట స్వామీజీకి సరిగ్గా సరిపోతుంది. ఇటువంటి యోగులు భగవంతునితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటారు, అనే విషయం యోగీ సంస్కృతి తెలియజేస్తుంది. యోగులు అంతిమ సత్యాలని పొంది ఉంటారు అని చెబుతారు. అది ఏవిధంగా ఉంటుంది అనేది తెలియదు. యోగీశ్వరుడు అని మనం అనుకోగానే మన ముందు నిత్యానందం తో నిండుగా ఉండే వ్యక్తి, ఉన్నతమ్రయిన, మహత్తరమయిన ఆలోచనలతో ఉండి మనలో ఎవరికీ లేని ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తియొక్క చిత్రం మన కళ్ళముందు ఉంటుంది. అటువంటి యోగీశ్వరుని గురించిన ఆలోచన మాత్రం చేత మనలో గొప్పశాంతి సౌఖ్యం కలుగుతుంది.

ఇదంతా కూడా నిత్యానంద స్వామికి పూర్తిగా సరిపడే వివరణ. స్వామి 27 సంవత్సరాల, దక్షిణ భారతదేశపు వ్యక్తి, స్వామీజీ దగ్గరికి ప్రపంచం అన్ని మూలల నుంచి లక్షలాది మంది తమలో ఉన్న వ్యాధుల నివారణ కోసం వస్తుంటారు. ఆధునిక వైద్యం పరిష్కరించలేని సమస్యలతో వారు స్వామీజీ సమక్షానికి వస్తారు. ఆయన తన దివ్య స్పర్శతో వ్యాధులని నిర్మూలించుతారు. స్వామీజీ జీవిత చరిత్ర అంతా అద్భుతాలతో నిండియున్నది. ఆయన చిన్న వయస్సులో ఇల్లువదలి, భారతదేశంలో అనేక ఆశ్రమాలలో ఉండి, వేదాంత విషయాలు, ఆధ్యాత్మిక విద్యలు విస్తృతంగా చదివి, ధ్యాన పద్ధతులని శాస్త్రీయంగా మలచి ఆ సాధనలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించారు.

ఈ మధ్య స్వామీజీ ఒక్లహామా పట్టణం గుండా ప్రయాణిస్తూ అక్కడ ఆగారు. అప్పుడు నేను ఆయనని కలిసి, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులలో ఆయన ధ్యానం చేసే సమయంలో మెదడుని పరిశీలించి అధ్యయనం చేయటానికి అనుమతి అడిగాను. నా ఉద్దేశం ఏమిటంటే ధ్యానం అనే అద్భుతం జరిగే సమయంలో మెదడులో జరిగే విషయాలను అర్ధం చేసుకొని, వాటి పరిమాణం లెక్కకట్ట తెలుసుకోవాలి. స్వామీజీ ధ్యానం అనేది శాస్త్రీయ ప్రక్రియ అని నమ్ముతారు ఆయన ఈ ప్రయోగానికి వెంటనే ఆనందంగా ఒప్పుకున్నారు.

స్వామీజీ పాల్గొన్న ఈ ప్రయోగంలో ఒక్లహోమాలోని పేరు, అనుభవం ఉన్న డాక్టరు, శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు. వాళ్ళు డా॥ ఫోర్టీస్, డా॥ రువే, డా॥ హిగ్గిన్స్ వీరందరూ జిమ్ తోర్పే రిహాబిలిటేషన్ సెంటర్, న్యూరోసైకాలజీ డిపార్టుమెంట్కి సంబంధించిన వారు. డా॥ చాకో, PET సెంటర్, ఒక్లహోమాకు చెందినవారు వీరంతా ఈ ప్రయోగాన్ని పరిశీలించి అధ్యయనం చేసారు. వారు స్వామీజీని అధ్యయనం చేయటానికి సాధారణంగా పేషెంట్లకు ఉపయోగించే సాంకేతిక పద్ధతులనే ఉపయోగించారు.

Swami Rama undergoing laboratory tests

అధ్యయన ఫలితాలు “చాలా కచ్చితంగా ఇది అసాధారణ స్థితి అని నిర్ధారించాయి”

మెదడు యొక్క చర్యల చిత్రాలు

స్వామీజీ మెదడు యొక్క మొదటి దృశ్యాలని Positron Emssion Tomography పరికరం సహాయంతో చూసారు. సాంప్రదాయ పరికరాలయిన X-rays, CT స్కానింగ్లా కాకుండా MRI, PET పరికరం మెదడులోని కణాల జీవరసాయన క్రియ ద్వారా మెదడులో జరిగే చర్యలని చిత్రాలుగా చూపించుతుంది. గ్లూక్లోజ్ లాంటి పదార్ధన్ని రేడియో యాక్టివ్ PET ట్రేసర్కి అతికించారు. అప్పుడు PET స్కానర్ మెదడులోని జీవరసాయన చర్యలని ఎప్పుడు అవసరమయితే అప్పుడు చూపించేది.

స్వామీజీ విషయంలో దేనిని మెదడులో అయిన మెలకువగా, తెలివి కలిగిన స్థితిలోనున్నప్పుడు మెదడులోని అతి చురుకుగా ఉన్న ప్రాంతాలని గుర్తించటానికి ఉపయోగించారు. దీనిని వాళ్ళు స్వామీజీ ధ్యానం ప్రారంభించిన ఆ సమయంలో ఆ తరువాత పూర్తిగా లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు మెదడులోని చర్యలని గుర్తించటానికి ఉపయోగించారు.

PET స్కానర్ పరీక్షల ఫలితాలు చూసి వారు నిర్ఘాంతపోయారు. ముందుగా నొసటివైపుగా ఉండే భాగాలతో మెదడు యొక్క చర్యలు అత్యంత చురుకగా ఉన్నాయి. అవి ధ్యానం ప్రారంభ దశలో కూడా చాలా చురుకుగా ఉన్నాయి. ఆ చర్యలు సాధారణ వ్యక్తుల మెదడులో జరిగే చర్యలకంటే చాలా రెట్లు, అధికమయిన చురుకుతనంలో ఉన్నాయి. మెదడులోని ఈభాగం తెలివితేటలు, శ్రద్ధ చూపటం, వివేకం, నిర్ణయాలు చేయటం మొదలయిన పనులని చేస్తుంది.

మేము స్వామీజీని గాఢమయిన, లోతయిన ధ్యానంలోనికి వెళ్ళమని కోరినప్పుడు రెండు విశేషమయిన ఫలితాలని కనుగొన్నాము.

అందులో మొదటిది స్వామీజీ మెదడులోని అత్యధిక భాగం 90% నిశ్శబ్దమయిపోయింది. అది పూర్తిగా తన చర్యలని నిలిపివేసింది. అది ఎలా ఉంది అంటే స్వామి మెదడు అన్ని పాక్ చేసుకొని శలవలకి వెళ్ళిపోయిందేమో అనిపించేటట్టుగా ఉన్నది. అది పూర్తిగా నిశ్శబ్దంగా, నిశ్చలంగా, పూర్తి ప్రశాంతతతో ఉంది. ఇది అంతా స్వామీజీ చేయాలి అని కల్పించిన పరిస్థితి

రెండవ ఆశ్చర్యకరమయిన పరిశీలన ఏమిటంటే స్వామీజీ గాఢమయిన లోతయిన ధ్యానంలో ఉన్నపుడు ఆయన మెదడులోని ముందు వైపు క్రింది భాగం చాలా ప్రకాశవంతంగాను, స్పష్టంగా ఉన్నది. ఈ భాగం అద్భుతమయిన మూడవకన్నుకి సంబంధిన భాగం

మేము తరువాత స్వామీజీని ఆ సమయంలో మీరు ఏమి చేసారు అని అడిగినప్పుడు ఆయన తన మూడవ కన్ను తెరచినట్లు చెప్పారు.

మూడవ కన్ను అనేది ఆత్మ యొక్క స్థానమని, ఇది విశ్వజ్ఞానం అంతరంగ జ్ఞానం యొక్క కలయికతో ఏర్పడే ప్రదేశం అని, ఇది స్పష్టతకి ప్రశాంతతకి నిలయమని అంటారు. లోతైన ధ్యానంలో ఉంటే మెదడులో తెరవబడే భాగం బహుశః సర్వాంతర్యామితో సంబంధం ఏర్పరచవచ్చు. అలాగే విశ్వశక్తితో సంభాషించే అవకాశం కల్పించవచ్చు అని అనుకోవచ్చు. ఈ భాగం ద్వారా యోగి తన అంతరంగ లోతులలోనికి, అక్కడ జరిగే అద్భుతాలలోనికి చూడగలుగవచ్చు. PET స్కాన్ చూపించిన ఈ భాగానే నేను మెదడులోని డి ప్రాంతం D-Spot అంటాను. డి అంటే దైవం కావచ్చు. ఆనందం కావచ్చు లేదా డొపామైన్ అనే ఒక పదార్ధం కావచ్చు. (డొపామైన్ అనే పదార్ధం శరీరానికి ఆనందాన్ని ఇస్తుంది) అంటే ప్రారంభదశలోని గుర్తుల ప్రకారం ధ్యానం ఆ ఆనందాన్ని ప్రేరేపించవచ్చు

మెదడులోని తరంగాలని కొలవటం (QEEG)

స్వామీజీపై చేసిన మరొక అధ్యయనం(QEEG) ని తెలుసుకోండి. QEEG అనేది మెదడులోని విద్యుత్ తరంగాలని లేదా మెదడులోని తరంగాలుని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది

మానవ మెదడులో నాలుగురకాల తరంగాలు ఉంటాయి. ఒక్కొక్క తరంగం ఒక్కొక్క వేగాన్ని కలిగి ఉండి మెదడు యొక్క వివిధ స్థితులను సూచిస్తుంది. ఉదాహరణికి బీటా తరంగాలు చిన్నవి, వేగంగా ఉండి అవి మెదడులోని మెలకువ స్థితిని సూచించుతాయి. ఆల్ఫా తరంగాలు నెమ్మదిగా ఉండి పెద్దగా ఉంటాయి. అవి మనం బాగున్నాము. అనే ఆలోచనలకు సంబంధించి ఉంటాయి. తీటా తరంగాలు మన చేతన స్థితిని తెలియజేస్తాయి. అవి నిద్రావస్థకి దగ్గరగా ఉంటాయి. ఈ స్థితిలో నిశ్శబ్దంగా నిశ్చలంగా, ప్రశాంతంగా ఎటువంటి చురకయిన ఆలోచనలు లేని స్థితిని తెలియచేస్తాయి.

ఒక రోజులో చాలా మంది వ్యక్తులు ఈ నాలుగురకాల తరంగాలకదలికలని కలిగిఉంటారు. అయితే ఒకదానిలోంచి మరొక తరంగంలోనికి వెళ్ళటం అనేది వారి అధీనంలో ఉండదు.

స్వామీజీ (QEEG) ఆధారంగా చూస్తే మెదడులోని తరంగాల కదలిక మీద పూర్తి నియంత్రణ ఉన్నది అని నిరూపణ జరిగింది. స్వామీజీ గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మెదడు అతి మృదువుగా ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారగలిగింది. ఎటువంటి అడ్డంకు అనుమానం లేకుండా మెదడులోని ద్రవ పదార్ధం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారుతుండేది. అది ఎలా అంటే ఎంతో నైపుణ్యం గల పియానిస్ట్ ఒక శ్రుతి నుంచి మరొక శ్రుతిలోనికి మారినంత అద్భుతంగా మారుతుంది. (QEEG) మెదడులోని తరంగాలని అయిదు రంగులలో చూపిస్తుంది. స్వామీజీని గమనించినప్పుడు ఇంద్రనస్సులోని రంగులు ఒక దాని నుంచి మరొకటి కదులుతున్నట్టుగా అనిపించింది.

ముగింపు వాక్యాలు మానవ శరీరంలో మెదడు అత్యంత క్లిష్టమైన భాగం. దీనిలో 100 బిలియన్లు (100కోట్లు) న్యూరాన్లు ఉంటాయి. ప్రతి న్యూరాన్ మరో 10,000 న్యూరాన్లతో రసాయన విద్యుత్ సంబంధాలు కలిగి ఉంటాయి. విషయాలని నియంత్రించి ముందుకు పంపించే పని చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంత క్లిష్టమయిన మెదడు పనీతీరుని స్వామీజీ చాలా తేలికగా నియంత్రించగలుగుతున్నారు. స్వామీజీ యొక్క మనస్సు అంటే ఆయన ఆలోచనలు, భావావేశాలు, తెలివితేటలు మెదడుని నియంత్రించగలుగుతున్నాయి. ఆయన ఒక ద్రవ పదార్ధంగా ఎంతో సులభంగా మెదడు చేసే పనులని, తరంగాలని ఒక స్థితి నుంచి మరొక స్థితికి మార్చగలుగుతున్నారు. మేము చేసిన ఈ ప్రయోగంతో మా ప్రశ్నలకి జవాబులు తెలుసుకోగలగటం కంటే కూడా, మాకు కుతూహలం కలిగించే రహస్యాలు కలిగిన ఎన్నో ప్రశ్నలు మా పరిశోధనలకి దొరికాయి. ఉదా: మానవ జీవితాలలో సమతుల్యాన్ని ప్రశాంతతని తేగల పద్దుతులని మనం నేర్చుకోగలమా? ప్రత్యేక శిక్షణ ద్వారా అనారోగ్యాన్ని బాగు చేసే క్రియలని తీసుకురాగలమా? వ్యాధులను నియంత్రించి బాధలను నియంత్రించే పద్ధతులని మనం నేర్చుకోగలమా? డి. ప్రాంతాన్ని చురుకుగా చేయగల పద్దతిని మనం నేర్చుకోగలమా? అలా చేసి సర్వాంతర్యామితో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పగలమా? శాశ్వత ఆనందాన్ని పొందగలమా? మేము స్వామీజీతో జరిపిన పరిశోధనా ఫలితాలు మెదడుపై జరిపే పరిశోధనలలో కొత్త పేజీలని ఈ ప్రపంచానికి అందించాయి. మెదడు తన శరీరాన్ని అనారోగ్యాన్ని నియంత్రించి దానిని బాగుచేసుకోగలదు అనే విషయాన్ని సూచిస్తుంది. స్వామీజీ మన కంటికి కనిపించని, అద్భుతాలతో నిండిన ప్రాచీన ప్రపంచానికి మనకి కనిపించే ఆధునిక శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ప్రపంచానికి మధ్య వారిధి లాంటి వారు. మెదడుపై పరిశోధనలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. మనం సరియైన సమయంలో ఈ అద్భుతాలని శాస్త్ర జ్ఞానంలోనికి తీసుకురాగలిగితే మానవాళి ఆరోగ్యవిషయంలో ముందడుగు వేసినట్టే

నిత్యానందా ఫౌండేషన్ వారు అందిస్తున్న కార్యక్రమాలు

ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన పద్ధతుల మీద కొన్ని ప్రత్యేక కార్యక్రమాలని తయారు చేసి నిరంతరం అందరికీ అందుబాటులోనికి తేవటానికి నిత్యానందా ఫౌండేషన్ ప్రయత్నిస్తుంది. ఈ ధ్యాన పద్ధతులు మానవాళికి భౌతిక, మానసిక ఆధ్యాత్మిక స్థితులలో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఫౌండేషన్ అందిస్తున్న ధ్యాన కార్యక్రమాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

1. ఆనంద స్ఫురణ ప్రోగ్రాం / లైఫ్ బ్లిస్ ప్రోగ్రామ్

(Ananda Spurana Program (ASP)/ Life Bliss Program (LBP) (మిమ్ములని శక్తివంతులుగా చేసుకోవటం)

ASP or LBP అనేది చక్రా ధ్యాన కార్యక్రమం

ఈ కార్యక్రమంలో మనలో ఉండే 7 శక్తి పీఠాలని, వాటినే మనం చక్రాలు అంటాము, వాటి పని తీరు అవి మన శరీరం మీద మానసిక స్థితి మీద ఎలా ప్రభావం చూపుతాయో తెలియచేస్తుంది. ఈ ప్రోగ్రాం చక్రాలకి మన భావావేశాలకి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని వివరించుతుంది. ఈ ప్రోగ్రాంలో సులభమయిన ధ్యాన పద్ధతులని నేర్పించుతారు. వాటి ద్వారా మనం మన భావావేశాలని సమర్ధవంతంగా నియంత్రించగలుగుతాము. మన మానసిక స్థితి మీద స్పష్టమయిన అవగాహన ఏర్పడుతుంది. మన మధ్య సత్సంబంధాలు ఏర్పడటానికి సహాయం చేస్తుంది. దీనితో మనం ఆనందమయ జీవితాన్ని సాధించే దిశగా పని చేయగలుగుతాము.

ఇదే ప్రోగ్రాం విద్యార్థుల కోసం తయారుచేయబడినది. అది విద్యార్థుల ASP ప్రోగ్రాం

నిత్యానంద స్ఫురణ ప్రోగ్రాం
Nithyananda Spurana Program (NSP)
(మరణ రహస్యాన్ని ఛేదించటం)

అన్ని రహస్యాలలోకి గొప్ప రహస్యం లేదా మర్మం మరణం. మన జీవితంలో ప్రతి క్షణం మరణ భయం మనలని అంటిపెట్టుకొని ఉంటుంది. అది మన భావావేశాలలో వ్యతిరేక భావాలని సృష్టిస్తుంది. దీనితో ఆనందంగా జీవించగలిగే నేర్పుని మనం కోల్పోతున్నాము.

ఈ కార్యక్రమంలో మరణం అంటే ఏమిటి, మరణ సమయంలో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మనలోని 7 శక్తి కేంద్రాలు (7 చక్రాలకు) మనలోని భావావేశాలయిన కోరికలు, భయం అపరాధభావం, బాధలు, ఆనందం మొదలయిన వాటితో ప్రత్యక్ష సంబంధాన్ని సృష్టించుతుంది. ఈ భావావేశాల ఏవిధంగా మొదలవుతాయి. ఆత్మ విడిపోయే సమయంలో ఈ 7 శక్తి కేంద్రాలు ఏవిధంగా దాటుతుంది తెలియజేస్తుంది.

మన పూర్వ జన్మల నుండి మనలో నింపబడిన చేతన, అచేతన భావావేశాలని బయటకి తీసుకువచ్చి వాటి నుంచి మనలని విముక్తులని చేస్తుంది. ఈ ప్రోగ్రాం ఒక విధమయిన ఆధ్యాత్మిక స్నానం వంటిది. అది మనకి క్రొత్త జన్మని ఇస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మనం ఆనందంగా ఎలా ఉండగలమో తెలుసుకోవచ్చు మనలోని లోతైన అజ్ఞానాన్ని తొలగించి ఆ స్థలంలో తెలుసుకునే తత్వాన్ని ప్రవేశపెడుతుంది.

శక్తి స్పురణ ప్రోగ్రాం
Shakti Spurana Program (SSP)
(మిమ్ములని శుభ్రపరచుకోవటం)

ఇది ఒక ధ్యాన సంబంధమయిన ప్రోగ్రాం. దీని ద్వారా మనలోని మూడు శక్తి శరీరాలయిన భౌతిక, సూక్ష్మ కారణాత్మకమయిన శరీరాలు గురించి తెలుసుకుంటాము. మనలో అణచివేయబడిన భావావేశాలు, తీరని కోరికలు, అవిశ్రాంతి, సోమరితనం వంటిభావావేశాలని ఈ మూడు శరీరాలతో సంబంధాన్ని నెలకొల్పి వాటి గురించి నేర్చుకుంటాము. మనలో విజ్ఞాన జ్యోతాలు వెలిగించటానికి, మన భావావేశాల నుంచి స్వేచ్ఛ పొందటం నేర్చుకుంటాము.

ఆత్మ స్పురణ ప్రోగ్రాం
Atma Spurana Program (ATSP)
(మీతో సంబంధాన్ని నెలకొల్పటం)

ఈ సర్వ విశ్వ సృష్టిలో, సర్వాంతర్యామిలో మానవులు ఒక భాగం ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకుంటే, అతనిలో జ్ఞానోదయమవుతుంది. ఈ ధ్యాన పద్ధతి ద్వారా, అంతిమ సత్యం తెలుసుకోవటంలో మనకి కలిగే అడ్డంకుల విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ ప్రోగ్రాం మనలోనికి 5 శరీరాలయిన కోశాల గురించి తెలియజేస్తుంది. వీటి ద్వారా మనలో తెలుసుకునే తత్వాన్ని బయటకి తీస్తుంది. దానితో మనం మనతో సంబంధాన్ని నెలకొల్పుకోవచ్చు

భక్తి స్పురణ ప్రోగ్రాం (BSP) (మనలోని భావావేశాలని సంవృద్ధిపరచుకోవటం)

మన జీవితాలలో కొన్ని సంవత్సరాలు గడిచే సరికి మైండ్ మన ఉనికిని అణిచి తానే అన్ని నిర్ణయాలు చేస్తుంది. మానవాళి క్రమంగా నిరుపయోగమయిన తెలివితేటల బారిన పడిపోతుంది. దీని ఫలితంగా మనలోని భావాలు బాధలలో ఉండిపోతాయి.

మన అంతరాత్మ యొక్క నిజమయిన భాష భక్తి. ఇది భగవంతులని పై మన కుండే అత్యున్నతమయిన ప్రేమ. అది మనలోని క్రిందిస్థాయిలో ఉండే భావావేశాలనుంచి మనని బయటకి తెస్తుంది. అది మన మైండ్కి సంపూర్ణ సఫలసిద్ధిని సమ దృష్టితో చూడగలగటం నేర్పుతుంది. ఈ కార్యక్రమం మన కోర్కెలకి అతీతంగా మనలో తీసుకువెళుతుంది. భక్తి స్ఫురణ ప్రోగ్రాం 4 రోజులు కార్యక్రమం. ఇందులో ఆధునిక మానవులకి భక్తిమార్గాన్ని చూపించే దిశగా కార్యక్రమం తయారు చేయబడినది. ఇది మనలని తెలివితేటల దశ నుంచి లౌకిక పుణ్యకార్యక్రమాల నుంచి భగవంతునికి అతి సన్నిహితంగా మనలని తీసుకువెళుతుంది.

నిత్యానందం
Nithyanandam
(తీవ్రమయిన ఆత్మసాక్షాత్కారంగా )

ఇది తీవ్రమయిన ధ్యాన కార్యక్రమము. ఇది మొట్టమొదటిసారిగా నిత్యానంద స్థితిని చేరగలిగే ఒక ప్రత్యేకమయిన సాంకేతిక పద్ధతి. జ్ఞానోదయపు అనుభవాలకు పొందగలిగతే తాళం చెవులని మన చేతికి అందించే ఒక ప్రత్యేక కార్యక్రమం ఇందులో ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తం స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మన శరీరం, మైండ్ కి అతీతంగా వెళ్ళి స్వచ్ఛమయిన సచేతన స్థితి యొక్క అనుభవాలని పొందవచ్చు

ధ్యాన స్ఫురణ ప్రోగ్రాం Dhyana Spurana Program (DSP) (మైండ్ ఒక కల్పన, తెలుసుకొని స్వేచ్ఛని పొందండి)

మన మైండ్ అనేది మన ఆలోచనల సమూహము మాత్రమే. స్వాభావికంగా, మన ఆలోచనలు ఒకదానికొకటి సంబంధం లేని, అర్ధంలేని విషయాల క్రమం కానీ మనం వాటి మధ్య సంబంధం ఏర్పరచటానికి ప్రయత్నించుతూ మనకి మనం బాధలని సృష్టించుకుంటాము. ఎప్పుడయితే మన ఆలోచనలు ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి అని తెలుసుకుంటామో అప్పుడు మనం మన మైండ్ ని వదిలివేస్తాము. దాని బంధం నుంచి వేరు పడతాము. ఎప్పుడయితే మనం మన మైండ్ ని వదిలివేస్తామో అప్పుడు మనం స్వేచ్ఛని పొందుతాము. ధ్యాన స్ఫురణ ప్రోగ్రాంలో మనకి నేర్పించే ధ్యానం మన మైండ్ ని వదిలివేస్తామో అప్పుడు మనం స్వేచ్ఛని పొందుతాము. ధ్యాన స్ఫురణ ప్రోగ్రాంలో మనకి నేర్పించే ధ్యానం మన మైండ్ ని వదిలివేయటానికి సహాయపడుతుంది. మనం మన చేతనస్థితి మీద పూర్తిగా కేంద్రీకరించగలుగుతాము.

ఆరోగ్య స్ఫురణ ప్రోగ్రాం & చికిత్సా ధ్యానం Arogya Spurana Program and meditation therapy

మంచి ఆరోగ్యం అంటే వ్యాధులు లేకుండా ఉండటం కాదు. అది వాస్తవంగా నిశ్చయింగా మంచి స్థితిలో ఉండగలిగితే మన అంతరంగపు ఉనికి.

ఆరోగ్య స్పురణ ప్రోగ్రాంలో శాస్త్రీయంగా శరీరం, మైండ్ ఆత్మ అనే వాటిని అనుసంధానం చేయగలిగే తీవ్రమయిన ధ్యానాన్ని నేర్పించుతారు. ఈ కార్యక్రమం ద్వారా మన శరీరం కేవలం ఒక జీవ సంబంధమయిన యంత్రాంగం కాదు అని తెలుస్తుంది. మన శరీరం యొక్క వేర్లు మన లోతైన చేతన స్థితిలో, మన బుద్ధి కుశలతలో ఉంటాయి అని తెలుసుకుంటాము.

ఆరోగ్య స్పురణ ధ్యాన చికిత్సా కార్యక్రమం. ఆరోగ్యపరమయిన చికిత్సా విధానము. ఇందులో నేర్పించే ధ్యాన పద్ధతులు మనలోని ప్రత్యేకమయిన వ్యాధులను నివారించుతాయి. అంతేకాకుండా మనలో ఒక క్రొత్త మానసిక స్థితిని నెలకొల్పుతాయి. దానితో మనలో నిశ్చయమయిన వాస్తవ దృక్పథం ఏర్పడుతుంది.

నిత్య స్పిరిచ్యువల్ బిల్డింగ్ ఇనిషియేషన్ Nithya Spiritual healing intiation (నిత్యా ఆధ్యాత్మిక చికిత్సా నియామకం హీలర్ అవ్వటం)

ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో ప్రతి ఒక్కరిని ఆనందగంధ చక్రంలో నియమించుతారు. దీనితో ఎదుటివారికి చికిత్స చేయగలిగే దివ్యశక్తి మీద్వారా ప్రహించి ఎదుటివారికి చికిత్స చేయటానికి ఉపయోగపడుతుంది. ఇది శక్తి అంటే బుద్ధికుశలత అనే విషయం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఈ ప్రోగ్రాం పత్యేకత ఏమిటంటే, అది మీరు ఎదుటి వారికి చికిత్స చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి సహాయం చేస్తుంది. బయటికి ఇది చికిత్సా పద్ధతి. అంతరంగంలో ఇది ఒక ధ్యాన పద్ధతి.

ఆనందాయోగం Ananda Yogam (విస్తృతమవ్వండి విస్ఫోటమవ్వండి)

ఆనందయోగం అనే కార్యక్రమమం 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండే యువత కోసం తయారుచేసిన ప్రోగ్రాం. ఇది ఆశ్రమంలో సంవత్సరం పాటు యువతకి ఇచ్చే ఒక ఉచిత ట్రయినింగ్ కోర్సు. ఈ ప్రోగ్రాం తూర్పు దేశాల యోగాతంత్రం, వేదాల ఆధారంగా ఉండి, ఆధునిక యువతని ఈ విషయంలో సాధికారత సాధించేలా చేస్తుంది. ఇందులో

  • వృత్తిపరమయిన నైపుణ్య పెంపొందించటం
  • విజయసాధనకి సూత్రం మరియు జీవిత సత్యాలు
  • చికిత్సా విధానం, ధ్యానం, యోగా మొ॥ సంపూర్ణ సఫలతకి
  • మనలో ఉండే పూర్తి శక్తి యుక్తులని తెలుసుకోగలగటం
  • సృజనాత్మకతతో కూడిన బుద్ధి కుశలత, అప్రయత్న సిద్ధత

ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో ఒక స్పష్టమయిన, స్థిరమయిన మానసిక స్థితిని ఏర్పరచుతుంది. మనలో ఉండే అంతర్గత శక్తిని తెలుసుకునేలా చేసి మనలని బయట ప్రపంచంలో అత్యున్నతులుగా చేస్తూ మనలో మనం ఏకాగ్రతని నిలిపేలా చేస్తుంది. ఇది మనలో ప్రాచీన వేద సూత్రాలని నింపుతుంది. దానితో పాటు ఆధునిక తర్క వాదాన్ని నేర్పుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఆర్ధికంగా, ఆధ్యాత్మికంగా స్థిరమయిన వారిగా తీర్చిదిద్దుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఒక జ్ఞానోదయమయిన గురుదేవుని సమక్షంలో నేర్చుకునే జీవితావకాశాన్ని మనకి ఇస్తుంది.

ఆనందగెలీరియం (డివైన్ షాప్) Ananda Galleria

ఆనందగెలీరియా అనేది ఒక షాపు. ఇందులో నిత్యానంద స్వామిజీ యొక్క ప్రవచనాలు పుస్తక రూపంలో అన్ని భాషలలోనూ దొరుకుతాయి. ఇవి ఇంగ్లీషు, తమిళం, కన్నడ గుజరాతీ, తెలుగు, హిందీ పోర్చుగీసు, ఫ్రెంచ్ ఇంకా అనేక భాషలలో దొరుకుతాయి. స్వామీజీ ప్రవచనాల సి.డి.లు వీడియోలు దొరుకుతాయి ఇంతేకాకుండా స్వామీజీ ఫోటోలు, శాలువలు, మాలలు, గొలుసులు, టి. షర్టులు ఇలా అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి.

మీరు చదవటానికి ఇతర గ్రంథాలు:

1. Bliss is the Path and Goal

ఈ పుస్తకంలో స్వామీజీ ప్రవచనాలు ఉంటాయి. అవి చాలా అంశాలకి సంబంధించి ఉన్నాయి. మైండ్ ఎలా పనిచేస్తుంది అనే విషయం నుంచి మనం మన శరీరాన్ని ఏవిధంగా ద్వేషించుతాము అనే విషయం వరకూ, అలాగే సంపూర్ణ ఆధీనులవటం నుంచి వస్తు ప్రపంచపు జీవితం, ఆధ్యాత్మిక జీవితం వరకూ, ఇలా చాలా అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం మనలో ఉండే అనేక ప్రశ్నలకి జవాబులిస్తుంది. మన అంతరంగపు జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. మన అంతరంగంలోని చేతన స్థితిని తెలుసుకునేలా చేస్తుంది. మన శరీరం, మైండ్ మన ఉనికి విషయాలలో మార్గాన్ని నిర్దేశించే పుస్తకం. ఇది మనం నిత్యానంద స్థితిలో ఎలా జీవించగలమో చెబుతుంది.

జీవన మరణాలకి అతీతంగా

Beyond Life and Death

ధ్యానం జీవితాన్ని మరణాన్ని అనుసంధానం చేస్తుంది. ఇది మనకి జీవించే కళని మరణించే కళని నేర్పిస్తుంది. లేకపోతే మనం జీవన మరణాలు అనే వలయంలో చిక్కుకుపోతాము. స్వామీజీ తన ప్రవచనాల ద్వారా మరణ రహస్యాలని ఛేదించి అది అర్ధమయ్యేటట్టుగా మనకి వివరిస్తారు. అయిన ఒక విషయం స్పష్టంగా చెబుతారు. మనం మరణాన్ని అర్ధం చేసుకున్నప్పుడు జీవితాన్ని ఒక ఐశ్వర్యంలా జీవించవచ్చు

Glimpses of my Master

ఒక జ్ఞానోదయం పొందిన యోగీశ్వరులయిన గురుదేవుని సమక్షం అనేది మనిషి జీవితంలో దొరికే ఒక అరుదయిన అపురూప అవకాశం. అటువంటి గురుదేవుని సమక్షంలో మనం పొందే అనుభవాలే మనకు జ్ఞానోదయ మార్గాలు. ఈ పుస్తకంలో స్వామీజీ శిష్యుడు స్వామీజీ యొక్క అద్భుతమయిన జీవిత విశేషాలని చెబుతారు. వాస్తవాలు శాస్త్రీయమయినవి, చారిత్రాత్మకమయినవి, కాలక్రమమయినది. కానీ అంతిమ సత్యం వీటన్నింటికి అతీతమయినది, శాశ్వతమయినది. ఇందులో ఉపోద్ఘాతంలో ఒక జ్ఞానోదయం పొందిన యోగి యొక్క మహత్తరమయిన అవతారం గురించి ఇవ్వబడినది.

From Ignorance to Enlightenment

ఈ పుస్తకంలో శ్రీ నిత్యానంద స్వామి మనకు పతంజలి యొక్క యోగ సూత్రాలని గురించి చెబుతారు. సూత్రాలు అంటే లఘువాఖ్యాలు అని అర్థం. చిన్న సూత్రాల ద్వారా అనంతమయిన విషయాలు చెప్పటం అని అర్థం. కాలాతీతమయిన ఈ సత్యాలపై నిత్యానందస్వామి వాఖ్యానం ఇస్తారు. అవి ఆధునిక మానవులకి అర్థమయ్యే రీతిలో చెప్పబడ్డాయి. ఇందులో సాధకులు అడిగిన ప్రశ్నలకి స్వామీజీ ఇచ్చిన జవాబులు ఉన్నాయి.

Nithyopanishnad

ఉపనిషత్తు అంటే గురుదేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం. నిత్యోపనిషత్‌లో స్వామీజీ గురు శిష్య సంబంధం మీద ఇచ్చిన ప్రవచనాలు ఉన్నాయి. స్వామీజీ హిమాలయాలలో గంగానది ఒడ్డున అనేక సత్యాలని ప్రాచీన ఉపనిషత్తుల సాంప్రదాయంలో వివరించారు. ఎవరికయినా నాకు గురువు యొక్క అవసరం ఏమిటి అనే ప్రశ్న ఉంటే, దాని జవాబు ఇక్కడ దొరుకుతుంది.

ఇంకా వివరాలు కావాలనుకునేవారు ఈ క్రింది వెబ్‌సైట్‌ని చూడవచ్చు.

www.nithyananda.org

ముఖ్యమైన లైఫ్ బ్లిస్ ధ్యాన కేంద్రాలల

యు.ఎస్.ఎ.
928 హంటింగ్టన్ డిఆర్, డ్యూర్టి,
లాస్ ఏంజిల్స్, CA 91010, యు.యస్.ఎ.
Ph: 1-626-205-3286
Email: [email protected]

భారత్
ధ్యానంద ధ్యానపీఠం
ధ్యానందపురి, కల్లగోపహల్లి,
మైసూరు రోడ్, బిడది,
బెంగళూరు 562 109, కర్ణాటక, ఇండియా
ఫోన్: +91 80 56691844 / 7202085
ఫ్యాక్స్: +91 80 7288207
Email: [email protected]

ధ్యానంద ధ్యానపీఠం శ్రీ ఆనంద రాజరాజేశ్వరి టెంపుల్ ధ్యానందగిరి, పాశంబండ సౌంరాం విలేజ్ శంషాబాద్ మండల, రంగారెడ్డి జిల్లా - 501 218 ఆంధ్రప్రదేశ్, ఇండియా ఫోన్: (+91) 93470 65288

ధ్యానంద ధ్యానపీఠం
36/1, కామాక్షిఅమ్మన్ స్ట్రీటు, పెరవనూర్
సేలం 636 007, ఇండియా
Ph.: +91 427 3098133

మనస్సు పనిచేసే విధానం ...
చేతన మనస్సు
Tp ప్రాసెసింగు సమయం

మనస్సు ఇదే, ఇదే - గుర్తించడం

చిత్తం ఇది కాదు, ఇది కాదు

డిఎస్పి డిజిటల సిగ్నల ప్రాసెస్

కన్న

అచేతన మనస్సు Tp Quantum Leap

అహంకారం

ఇది చెయ్యి - నిర్ణయం తీసుకోవడం

మనస్సు, చిత్త, చక్షు

బ్రెయిండ్ ఏ విధంగా పని చేస్తుంది ...
చేతన స్మృతి
Tp ప్రాసెసింగు సమయం

బ్రెయిండ్ ఇది, ఇదే - గుర్తించటం

జ్ఞాపకం ఇది కాదు (తీసి వేయుట)

డిఎస్పి డిజిటల సిగ్నల ప్రాసెస్

కన్న

అచేతన స్మృతి (Tp) పెద్ద అడుగ

అహంకారం

ఇది చేయి; నిర్ణయం

మనస్సు
చిత్తి
చక్షువు

నమ్మకమైన పరిష్కారాలు

దీనికోసం

Sahasrara / Crown Chakra

అసంతృప్తి

Ajna / Third Eye Chakra

అహంకారం

Vishuddha / Throat Chakra

శ్రద్ధ ఆశించటం

Anahata / Heart Chakra

అసూయ

Manipura / Solar Plexus Chakra

భయం

Svadhishthana / Sacral Chakra

బాధ

Muladhara / Root Chakra

కోరిక

‘నమ్మకమయిన పరిష్కారాలు’ అనే ఈ పుస్తకాన్ని, మనలోని కోపం, బాధ, శ్రద్ధ ఆశించటం, అసూయ, అహంకారం, అసంతృప్తి అనే భావావేశాలలో సమూలమయిన మార్పు తీసుకురానటానికి ఒక శుభ ఆరంభంగా ప్రచురించాము. ఇందులో ఉన్న సమాచారం మొత్తం పరమహంస నిత్యానంద ప్రపంచమంతా వివిధ ఆనంద స్ఫురణ అలాగే లైఫ్ బ్లిస్ ధ్యాన కార్యక్రమాలలో ఇచ్చిన ప్రవచనాలు. ఈ పుస్తకం మనలోని చక్రాలు అని మనం పిలిచే 7 శక్తి కేంద్రాని గురించి, అవి పనిచేసే విధానం గురించి మన శారీరక, మానసిక ఆరోగ్యంపైన అవి చూపించే ప్రభావం గురించి వివరంగా చెప్పబడినది. ధ్యాన కార్యక్రమాలలో మనకి మనలోని భావావేశాలకి, ఈ చక్రాలకి గల సంబంధాన్ని వివరిస్తారు. దీని ద్వారా మన భావావేశాలు అతి సూక్ష్మ దశలో మన ఆరోగ్యం మీద ఎలా పనిచేస్తాయో నేర్చుకోవచ్చు. ఈ భావావేశాలు అనేవి కేవలం ఆధారం లేని నీడలే అని మనం సులభంగా అర్ధం చేసుకునే పద్ధతిలో నేర్పించారు. ఈ భావావేశాలని నియంత్రించేందుకే శక్తివంతమయిన ధ్యాన పద్ధతులని బోధించారు. మనం ఈ భావావేశాలు లేని స్వేచ్ఛాయుత జీవితాన్ని గడపగలమన్న నమ్మకాన్ని మనకి ఇస్తాయి. ఈ కార్యక్రమాలు మనం మైండ్ ఆడే ఆటల నుంచి, మానసిక కుంగుబాటు నుంచి స్వేచ్ఛని పొందగలిగే అనంతమయిన అవకాశాన్ని ఇస్తుంది. మనకి మానసిక బానిసత్వం నుంచి స్వేచ్ఛని ఇస్తాయి. మనకి మనలోని అతి ముఖ్యమయిన అంతరంగం వికసించేలా శరీరానికి, మైండ్కి అతీతమయిన స్వచ్ఛమయిన శాశ్వతానందం, నిత్యానందం. ఈ ధ్యాన కార్యక్రమాలు ప్రపంచమంతా ధ్యానపీఠం ఆచార్యుల పర్యవేక్షణలో నిరంతరం జరుగుతుంటాయి.

Ebook ISBN: 979-8-88572-126-4

Nithyananda Foundation 928 Huntington Drive, Duarte, CA 91010, U.S.A. Ph: 1-626-205-3286

India Ashram: Dhyanapeetam Nithyanandapuri, Kallugopahalli, Off Mysore Road, Bidadi - 562 109, Bangalore District, Karnataka. Ashram : +91-80- 56691844 Fax: +91-80-7288207 E-mail: [email protected] URL: www.nithyananda.org