అధ్యాయం - 8: అహంకారాన్ని వదిలివేయటం
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(Shedding the ego)
తరువాత చక్రం ఆజ్ఞ చక్రం. ఇది రెండు కనుబొమ్ముల మధ్య ఉంటుంది. సంస్కృతంలో ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించటం లేదు శాసించటం లేదా సంకల్పించడం అని అర్థం. ఆజ్ఞ చక్రాన్ని చక్రాలన్నింటిలోనూ ప్రధాన చక్రంగా (master chakra) వర్ణించవచ్చు.
సీరియస్‌గా ఉన్నప్పుడు, అహంకారంతో ఉన్నప్పుడు ఈ చక్రం బంధింపబడుతుంది. అమాయకత్వం, సామాన్యంగా ఉండగలగటం వివేకము. అహంకారాన్ని వదిలివేయడం వీటి ద్వారా ఈ చక్రాన్ని వికసింపచేయవచ్చు.
(ధ్యాన పద్ధతి : దివ్య నేత్ర ధ్యానం. ఇది జోరాస్ట్రియన్ల ధ్యాన పద్ధతి.)
ఆజ్ఞ చక్రాన్ని చక్రాలలో రాజా చక్రంగా వర్ణించుతారు. ఇది అన్ని చక్రాలలోనూ ప్రధాన చక్రం.
ఇది ఎంత ముఖ్యమైన చక్రం అంటే, అన్ని మతాలు కూడా ఈ చక్రాన్ని గురించి ఎంతో కొంత పరిశోధన చేసి ఎంతో కొంత సాధించినవే. ఈ ఆజ్ఞ చక్రం వికసించితే, మన స్వస్వరూపస్థితి (Being) కొత్త పరిధిలోనికి, ఒక కొత్త ప్రదేశం లోనికి ప్రవేశించుతుంది. అప్పుడు మనలోని మనః శక్తి, బుద్ధి పూర్తిగా వికసించుతాయి. అందుకే చాలా దేవుడి విగ్రహాలలో, చిత్రాలలో వాళ్ళ నుదుటి మీద మూడవకన్నుని చూపిస్తారు. మూడవకన్ను అంటే పూర్తిగా వికసించిన ఆజ్ఞ చక్రం యొక్క రూపం.
మన పెద్దవాళ్ళు ఒక మాట చెబుతారు; వారణాసి (కాశీ)లో చనిపోతే ఆ వ్యక్తికి మోక్షం కలుగుతుందని. వారణాసి అంటే అది ఏదో మనకి తెలిసిన ఒక పట్టణమే కాదు. ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశం. 'వారన' అంటే కనుబొమ్మలు 'నాసి' అంటే ముక్కు; అంటే కనుబొమ్మలు ముక్కు కలిసే ప్రదేశం. ఇదే సరిగ్గా ఆజ్ఞ చక్రం ఉండే ప్రదేశం. ఆజ్ఞ చక్రం మన నుదిటి మీద రెండు కనుబొమ్మలూ, ముక్కు కలిసే ప్రదేశంలో ఉంటుంది. మనకి జ్ఞానోదయం జరిగిన స్థితి సంకేతమే వికసించిన ఈ ఆజ్ఞ చక్రం.
ఆజ్ఞ చక్రం మనలోని అహంకారానికి, తీవ్రతకి, గంభీరతకి, మన గురించి మనం అతిగా ఆలోచించుకునే తత్వానికి, జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకునే పద్ధతికి సంబంధించిన చక్రం.
గంభీరత లేదా తీవ్రత అంటే ఏమిటి?
సీరియస్ లేదా గంభీరత అంటే ఏదైనా ఒక విషయానికి అత్యధిక ప్రాధాన్యతని ఇవ్వడమే. దాని కోసం మిగతా అన్నింటినీ వదిలివేసుకోవటం. ఇది ప్రతి క్షణం మారుతుంది అని తెలుసుకోలేక పోవటం. ఈ గంభీరత అనేది జీవితం నుంచి మనం దేనికైనా అతిగా ఆశించినప్పుడు కలుగుతుంది.
చిన్న కథ :
ఇద్దరు చిన్న పిల్లలు ఇసుకలో ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఇంతలో వాళ్ళ ఇద్దరికి ఏదో గొడవ వస్తుంది. వాళ్ళలో ఒక అబ్బాయికి చాలా కోపం వచ్చి రెండవ అబ్బాయి ఇసుక మేడని కూల్చేస్తాడు.
ఆ రెండవ అబ్బాయి వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాడు. ఆ అబ్బాయి చాలా తీవ్రంగా తన సమస్యను రాజుగారికి చెబుతాడు. అది విని రాజు నవ్వుతాడు. ఇసుకతో కట్టిన మేడ కూలగొడితే అది పెద్ద సమస్యా అన్నట్టు రాజు నవ్వుతాడు.
ఆ రాజుగారి కొలువులో ఉన్న రాజగురువు ఇదంతా గమనించి ఆయన రాజువైపు చూసి నవ్వడం ప్రారంభిస్తాడు. అలా నవ్వి అయన రాజుతో ఈ విధంగా అంటాడు "నీవు రాతి కోటల కోసం యుద్ధాలు చేసి నిద్రలేని రాత్రులు గడిపినప్పుడు ఈ పిల్లలు ఇసుక కోటల కోసం పోట్లాడుకోవడం వింతకాదు. నీవు ఎందుకు వాళ్ళని చూసి అలా నవ్వావు" అంటాడు.
ఈ సీరియస్‌నెస్ అంతా దేనికోసం. కేవలం ఇసుక ఇళ్ళ కోసం. అది అర్ధం చేసుకొండి. చిన్నపిల్లకి ఆ వయస్సులో ఇసుక ఇళ్ళే చాలా ముఖ్యమైనవి. అంతే అవి ఇసుక కోటలే కావచ్చు. లేదా రాతి కోటలే కావచ్చు. వాటిపట్ల చూపించే గంభీరత మాత్రం ఒక్కటే. కాకపోతే దేనికోసం ఆ గంభీరత అనేది మాత్రం వేరు. అందుకే చిన్న పిల్లలు ఇసుక మేడల కోసం పోట్లాడుకుంటుంటే నవ్వవద్దు. ఈ గంభీరత, తీవ్రత అనేవి మీ స్వేచ్ఛాయుతమైన జీవితానికి, మీ మైండ్ వెళ్ళకుండా దాని దారిని మూసేస్తుంది. అది మిమ్మలని మీ పాత కార్యక్రమాలని పట్టుకుని వేలాడేలా చేస్తుంది.
చిన్నకథ :
ఒక బౌద్ధుల ఆశ్రమంలో గురువుగారు శిష్యులకి ఎవరు తోటని బాగా పెంచగలరు అనే విషయం మీద పోటీ పెడతారు. ఒక శిష్యుడు ప్రతీది చాలా సీరియస్‌గా తీసుకునే తత్త్వం గల వ్యక్తి. ఆపోటీని కూడా అతను చాలా సీరియస్‌గా తీసుకుంటాడు.
అతను తన తోటని నిరంతరం చాలా శుభ్రంగా ఉంచుతాడు. ఉండవలసిన మొక్కలు అన్నీ ఒకే ఎత్తులో అందంగా ఉండేలా చూసేవాడు. చెట్ల గుబురులని అందంగా కత్తిరించేవాడు. అతనికి తప్పకుండా మొదటి బహుమతి వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.
ఆ పోటీ రోజుల్లో గురువుగారు అన్ని తోటలూ తిరిగి వెనక్కివచ్చి మార్కులు ఇస్తారు. ఈ శిష్యుడికి అందరికంటే చివరి మార్కు వస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు.
ఆ శిష్యుడు గురువు దగ్గరకి వెళ్ళి తనకి ఎందుకు బహుమతి రాలేదు అని అడిగాడు. అతను "గురుదేవా! నా తోటలో గాని, నా తోట పనిలోగాని ఉన్న తప్పు ఏమిటి? మీరు నా తోటకి ఎందుకు అన్నింటికంటే చివరి మార్కు ఇచ్చారు?" అని అడుగుతాడు.
గురువుగారు ఆ శిష్యుని వైపు చూసి ఇలా అడుగుతాడు, “చనిపోయిన ఆ ఆకులన్నీ ఎక్కడ ఉన్నాయి” అలా ఉన్న తోట ప్రాణం లేనట్టుగా ఉంటుంది. అది చనిపోయిన తోట. సీరియస్‌గా ఉన్నప్పుడు ఈ తత్త్వం అసంకల్పితంగా చేయగల శక్తిని చంపేస్తుంది. గంభీరత సృజనాత్మకతని నాశనం చేస్తుంది.
మీరు విరామంగా, తేలికగా, ఉత్సాహంగా ఉన్న సమయంలో మీరు చేసే పనులు, ఆలోచనలు, నిర్ణయాలు సమర్ధవంతంగాను, విశాలంగా ఉంటాయి అని శాస్త్రం నిరూపించింది. అదే మీరు గంభీరంగా ఉంటే మీ మైండ్ నిరుత్సాహంగా తయారవుతుంది. అప్పుడు మీరు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి.
మీకు ఒక విషయం చెబుతాను. గంభీరంగా ఉండడం అనేది ఒక అనారోగ్య చిహ్నం. అదీ ఒక రకమైన జబ్బు లాంటిదే. మనకి వచ్చే అన్ని రకాల అనారోగ్యాలకి ఈ గంభీరత్వమే కారణం. ఇక్కడి నుంచే వ్యాధులు ప్రారంభమవుతాయి. గంభీరతత్త్వం (seriousness) వ్యాధులను సృష్టించితే, వ్యాధులు మనిషిని సీరియస్‌గా ఉండేలా చేస్తాయి.
ఒక రోజు రాత్రి ఒక వ్యక్తి నాకు ఫోను చేసి ఏడవటం మొదలుపెట్టాడు. అతను ఫోనులో ఈ విధంగా చెప్పాడు, “స్వామీజీ! మీ పాదాల మీద పడతాను, దయచేసి నాకు సహాయం చేయండి. నేను పూర్తిగా కుంగిపోయాను. ఈ క్షోభ భరించలేను. నేను చనిపోవాలనకుంటున్నాను”. ఇలా చాలా చెప్పాడు.
నేను అతని ఆవేశం తగ్గించటానికి చాలా ప్రయత్నించాను, చివరికి, “రేపు ఉదయం ఆశ్రమంకి వచ్చి కొన్ని రోజులు ఇక్కడ నాతో గడపండి. అప్పుడు ఏంచేయాలో చూద్దాము,” అన్నాను. దానికి అతను “రేపు రావాలా స్వామీజీ! అయ్యో రేపు నేను ఆఫీసుకి వెళ్ళాలే. పోని వచ్చే ఆదివారం రమ్మంటారా స్వామీ” అని అడిగాడు.
మనలో చాలా మంది ఇలానే ఉంటారు. ఏవో సమస్యలకి అనవసరంగా ఎక్కువగా ఆందోళన పడతారు. ఒక చిన్న కుదుపు ఇస్తే చాలు, ఆ సీరియస్‌నెస్ అంతా పోతుంది. ఒక్కసారి మనం మేల్కొంటే మనం సమస్యలు అని బాధపడే విషయాలు ఎంత చిన్నవో, ఎంత ప్రాముఖ్యత లేనివో అర్ధం అవుతుంది.
ఎప్పుడయితే మీరు ఒక విషయాన్ని బాగా సీరియస్‌గా తీసుకుంటారో, ఎప్పుడయితే మీరు ఫలితాల పట్ల ఎక్కువ ఆందోళన చెందుతారో అప్పుడు మీరు అసలైన మీ వివేకాన్ని పూర్తిగా ఆపనిలో ఉపయోగించలేరు.
అయితే మీరు ప్రణాళికలు వేయాలి, ముందుగా దానిని గురించి ఆలోచించాలి. దానిని మీరు నిష్కపటంగా, మనస్పూర్తిగా చేయటం అంటే సీరియస్ లేకుండా చేయాలి. సీరియన్నెస్ లేదా గంభీరం అంటే నిష్కపటం, నిమగ్నమవటం కాదు. మనస్పూర్తి చేయటం అంటే సీరియస్‌గా అని కాదు. మనస్పూర్తిగా అంటే కుతుహలంతో ఉత్సాహంతో నిమగ్నమయి చేయటం. ఇలా అంటే మీరు మీ శక్తి కొద్ది ఆ పనిని చేయాలే తప్ప ఫలితాలను అతిగా సీరియస్‌గా పట్టించుకోకూడదు.
మీరు సీరియస్‌గా ఉంటే సంతోషంగా పనిచేయలేరు. మీరు నవ్వలేరు. మీరు గంభీరంగా ముఖం పెట్టుకుని పనిచేస్తే అసలు మీరు ఎలా నవ్వగలరు ? గంభీరత్వం, నవ్వటం రెండూ కలిపి చేయలేరు. ఎందుకంటే గంభీరతకి నిర్వచనం అలా ఉంటుంది కాబట్టి.
మీరు మనస్పూర్తిగా పనిచేసేటప్పుడు నవ్వుతూ, తుళ్ళుతూ, ఆడుతూ, పాడుతూ పనిచేయగలుగుతారు. మీ చేతిలో పనిని మీరు ఎంతో సంతోషంగా పూర్తి చేస్తారు. మీరు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీరు పనిని మనస్పూర్తిగా, నిష్కపటంగా పూర్తి చేస్తారు కాబట్టి.
మనస్పూర్తిగా పనిచేసినప్పుడు మీకు బాధలు, సమస్యలు ఉండవు. కేవలం ఉత్సాహం కుతూహలం మాత్రమే ఉంటాయి.
మీరు సీరియస్ గా ఉన్నప్పుడు మీలో అహంకారం బాగా ఉంటుంది. ఎందుకంటే సర్వము ఈ అనంత విశ్వం యొక్క నాటకము అని మీరు తెలుసుకోలేరు. దానిని అలా చూడలేరు. మీకు మీరు ఒక ప్రత్యేక వ్యక్తిలా అనిపించుతారు. మీరు "నేను" మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అందుకే మీరు ఎప్పుడూ గంభీరంగా ఉంటారు. ఇదంతా ఒక నాటకం మాత్రమే అని మీరు అర్థం చేసుకుంటే, అప్పుడు మీరు ఏవిషయంలోనూ అంత సీరియస్‌గా ఉండరు. మీ అంతరంగపు లోతుల్లో ఈ అర్ధమవటం అనేది జరిగినప్పుడు, మీరు ఏ పనినైనా ఆహ్లాదంగా, సంతోషంగా చేస్తూ సాగిపోతారు. మీరు అలా చేయగలిగినప్పుడు మీరు గంభీరంగా ఉండిపోరు. మీరు మనస్పూర్తిగా ఆ విశ్వనాటకంలో మీ పాత్రని మీరు పోషించుతారు. అంతే. చూడండి. ప్రణాళిక అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి కాలచక్రం తయారుచేసే ప్రణాళిక (chronological plan), రెండవది మానసిక ప్రణాళిక (Psychological plan)
కాలం ప్రకారం వేసే ప్రణాళిక టైంప్రకారం ఉంటుంది. అటువంటి ప్రణాళిక అంతా టైంప్రకారం నిర్ణయించ బడుతుంది. ఉదాహరణకి, ఉదయం ఎన్ని గంటలకి లేవాలి. ఎప్పుడు ఆఫీసుకి వెళ్ళాలి. ఆ పని ఎప్పుడు చేయాలి, ఈ పని ఎప్పుడు చేయాలి ఇలా అంతా టైం ప్రకారం ఉంటుంది. ఇది బాగానే ఉంది. ఒక విధంగా చూస్తే ఇది మీకు మంచి ఫలితాలను ఇచ్చేలా మీ పనులని నిర్వహించటమే. ఇటువంటి ప్రణాళికని నిష్కపటంగా, మనస్పూర్తిగా ఆచరించితే మీరు సంతోషం నుంచి మహా సంతోషంలోనికి వెళ్ళగలుగుతారు.
మానసిక ప్రణాళిక అనేది కేవలం మీ మైండ్‌తో చేసే ప్రణాళిక. దీనికి టైం కానీ, మరే విధమైన అవసరాలు, ఆధారాలు ఉండవు. ఇది కేవలం మీ మైండ్‌లో నిరంతరం సాగిపోయే ప్రణాళిక. ఇది కాలం ప్రకారం చేసే ప్రణాళిక కంటే చాలు ముందుకు వెళ్ళిపోతుంది. ఇటువంటి ప్రణాళిక మిమ్ములని చాలా గంభీరంగా చాలా బాధ్యతాయుతంగా తయారు చేస్తుంది. ఇది మరేదీకాదు. కేవలం కాలం ఆధారంగా చేసిన ప్రణాళికని మరింత జటిలంగా వ్యతిరేకపు ఆలోచనలతో దానిని నింపటమే. మీరు నిరంతరం ఆ ప్రణాళికని విశ్లేషణ చేస్తూ, నిరుత్సాహంగా తయారవుతారు. ఎందుకంటే మీలో శక్తి మొత్తం ఆ ప్రణాళికని విశ్లేషించటానికే ఉపయోగించుతారు కాబట్టి. మానసికమైన ప్రణాళిక మీ అహంకారాన్ని ఉత్సాహపరుస్తుంది. ఇది మిమ్ములని మీరు అధికులుగాను, గొప్పగాను, చూపిస్తుంది. అటువంటి ప్రణాళిక మిమ్ములని నిరంతరం చాలా గంభీరంగా ఉంచుతుంది. మీరు చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్న వ్యక్తి అనే అభిప్రాయాన్ని మీలో కలుగ చేస్తుంది. ఇదంతా కూడా మీ చేతిలోని పని, మీరు మాత్రమే ఈ పనిని సాధించగలరు అనే అభిప్రాయాన్ని మీలో కల్పించుతుంది. దాంతో ఆ పనికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని మీరు అతిగా తీసుకుంటారు. మీరే చేయాలి అని అనుకుంటారు.
అన్ని బాధలు మీరే భరించుతారు. ఆ పనులు చేయటంలోనే మీ సంతోషం ఉంది అని అనుకుంటారు. దీనినే మానసిక ప్రణాళిక అంటారు.
మీకు చెబుతున్నాను ఇదంతా కూడా సంతోషాన్ని వాయిదా వేయడం, జీవితాన్ని వాయిదా వేయడం. ఎప్పుడో జరుగుతుంది, అప్పుడు ఈ జీవితాన్ని సంతోషంగా గడుపుతాను, అప్పుడు ఆనందించుతాను అని ఎదురుచూడటమే.
మనం నిరంతరం ఇలా అనుకుంటాము నేను పెళ్ళి చేసుకుంటే జీవితంలో స్థిరపడిపోతాను. కాబట్టి పెళ్ళి చేసుకోవటానికి కావలసిన పనులలో మునిగిపోతారు. నాకు ఇద్దరు పిల్లలు ఉంటే జీవితంలో స్థిరత్వం వస్తుంది. నా జీవితం సాఫల్యమవుతుంది. నేను రిటైర్ అయ్యాక ప్రశాంతంగా ఉంటాను.
ఈ దృక్పధం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను సీరియస్‌గా ఉంటాను, ఆ తరువాత సంతోషంగా ఉండవచ్చు. చివరకి మీరు ఇప్పుడు సంతోషంగా ఉండలేరు. ఆ తరువాత కూడా సంతోషంగా ఉండరు. ఎందుకంటే అప్పటికి మీరు సంతోషపడే శక్తిని పోగొట్టుకుంటారు.
కేవలం సంతోషంగా, సామాన్యంగా, యథాలాపంగా, అప్రయత్నంగా, అమాయకంగా, సృజనాత్మకంగా జీవించండి. అది చాలు.
ఎటువంటి తేడా లేకుండా పనులు కచ్చితంగా చేయాలి అని హడావిడి చేయకండి. నేను చెబుతున్నాను. ఈ కచ్చితము అనే మాట మిమ్ములని మానసికంగా కుంగదీస్తుంది. మీరు ఏంచేయాలనుకున్నా దానిని పరిపూర్ణంగా చేయండి. అప్పుడు మీరు ఏ పనిచేసినా అది పూర్ణత్వంతో సిద్ధిస్తుంది. ఈ కచ్చితము, సామర్ధ్యం అనే మాటల గురించి అసలు మీరు పట్టించుకోవద్దు.
కచ్చితము, తప్పులేని సమర్ధత అనేది మీ మైండ్ నుండి వచ్చే విషయం. అదే మీకు లక్ష్యంగా మారుతుంది. మీరు అదే మీ లక్ష్యమని దానివైపుగానే పనులు చేస్తారు. అలా ఎప్పుడైతే దానినే లక్ష్యంగా పనిచేస్తారో లౌకికంగా (ప్రాపంచిక సంబంధమైన) జీవంలేని వారిలా మారిపోతారు. మీరు పరిపూర్ణత్వంతో పనులు చేస్తే అవి మీ హృదయంలో ఉండిపోతాయి. అవి మీకు లోతైన అనుభవాలని, మంచి అనుభవాలని ఇస్తాయి. అప్పుడు దాని ఫలితాలు చాలా అందంగా ఉంటాయి. అవి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. అప్పుడు మీరు ఏ పని చేసినా అది ఈ అనంత చైతన్యానికి అనుగుణంగా ఉంటుంది.
కచ్చితము, అనేది మీకు ఆనందాన్ని ఇవ్వదు. కానీ మీ అహంకారాన్ని తృప్తి పరుస్తుంది. చివరిలో మీరు ఏదో సాఫల్యాన్ని పొందాము, అని మీరు అనుకున్నా అది కేవలం మీ అహంకారం యొక్క తృప్తేగాని, మీలోపలి ఆత్మతృప్తి మాత్రం కాదు. స్పష్టంగా అర్ధం చేసుకోండి ; కచ్చితమైన వాళ్ళు చాలా అహంకారులు. వాళ్ళు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పొందలేరు. పరిపూర్ణత విషయంలో ఏదో కొంత లోపిస్తుంటుంది.
మరొక విషయం ; పరిపూర్ణత అనేది మీరు కేవలం అంతరంగం లోపలికి వెళ్ళగలిగినప్పుడే సాధ్యమవుతుంది. కచ్చితము అనేది ఎప్పటికి సాధ్యపడదు. ఎందుకంటే అది మైండ్ కి సంబంధించిన విషయం. మైండ్ అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. దానితో పాటుగా కచ్చితమైన పనికి నిర్వచనం కూడా మారుతూ ఉంటుంది.
మరొక విషయం ; తప్పులు ధైర్యంగా చేయండి. కచ్చితమైన వాళ్ళు, గంభీరంగా ఉండే వాళ్ళు తప్పులు చేయటానికి భయపడతారు.
వాళ్ళు వాళ్ళని చాలా సీరియస్ గా తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళని గురించి చాలా ఎక్కువ అంచనా వేస్తారు. అందుకే వాళ్ళు తప్పు చేయటమన్నా లేదా ఎవరైనా వాళ్ళ తప్పుని వేలెత్తి చూపించినా తట్టుకోలేరు. నిజానికి ఎవరైతే చిన్నతప్పులు చేస్తాము, అని నిరంతరం బయపడుతుంటారో. వాళ్ళు చివరికి చాలా పెద్ద పొరపాటుతో ముగించుతారు.
తప్పులు చేయటంలో తప్పేమిటి? మీరు చెబుతుంటారు. "స్వామిజీ! నాపనిలో నేను తప్పు చేయకూడదు. అందుకే నేను అంత సీరియస్ గా ఉంటాను" అని. మీరు చెప్పేది నిజం కావచ్చు. మీ పనిలో తప్పులు దొర్లకూడదు. కానీ నేను ఇక్కడ చెప్పే విషయం అది కాదు.
మీరు తప్పు చేసినప్పుడు ఎదుటివాళ్ళు మిమ్ములను తప్పుపట్టినపుడు మీరు భరించలేరు. మీ అహంకారం దెబ్బతింటుంది. మీరు మీ విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. మీకు ఆ సంగతి తెలుసు. మీ అహంకారానికి దెబ్బతగలకూడదని తప్పులు చేయకుండా ఉండేందుకు మీ శక్తి కొద్దీ ప్రయత్నించుతారు.
మీరు మీకు తెలియకుండా నిరంతరం మీ అహంకారాన్ని కాపాడుకుంటూ ఉంటారు. కానీ దానికి మీరు చెప్పే కారణాలు వేరుగా ఉంటాయి. అంటే మీరు అబద్ధం చెపుతున్నారు అని కాదు. ఇది మీకు తెలియకుండా మీ అచేతన స్థితిలో చాలా
సూక్ష్మంగా జరిగే పని. ఇదంతా మీ అహంకారం చేసే పని. మీరు లోతుగా విశ్లేషణ చేసి చూస్తే నేను ఏమి చెబుతున్నానో మీకు అర్థమవుతుంది.
తప్పు చేయటం అనేది ఏ విధంగా తప్పు కాదు. ఒక విధంగా చెప్పాలంటే, మీరు కొన్ని తప్పులు చేసినపుడు తప్పులను ఎలా చేయకుండా ఉండవచ్చో తెలుసుకుంటారు. మీరు అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. మీరు చేసిన తప్పుల నుంచి ఎక్కువ విషయాలు నేర్చుకుంటే, అసలు తప్పులు ఎలా చేయకుండా ఉండవచ్చో బాగా నేర్చుకుంటారు.
తప్పు ఎలా దొర్లకుండా ఉండాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. అప్పుడే మీరు విషయానికి రెండు ప్రక్కలా చూడగలరు. అప్పుడే మీరు విషయం యొక్క రెండు ప్రక్కలని పరిశీలించగలరు. అలా కాకపోతే అత్యవసర సమయంలో మీకు తెలియని వైపుకి మీరు పడే ప్రమాదం ఉంది. అటువంటి సమయాలలో మీరు తప్పు చేయకూడదు. అంటే అత్యవసర సమయంలో ఎటువంటి పరిస్థితులలోను తప్పు ద్రొల్లకుడని సమయంలో మీరు తప్పు చేయరు.
ఒక ముఖ్య విషయం. చేసిన తప్పు మళ్ళీ చేయకండి. మీ మైండ్ అదే పద్ధతిని తిరిగి కొనసాగిస్తుంది. తప్పులని తిరిగి చేయకండి. కొత్త తప్పులు చేయండి. ఇంకా బాగా అర్థ చేసుకునే దిశగా ముందుకు సాగండి.
నేను మిమ్ములని కావాలని తప్పులు చేయమనటం లేదు. అది పూర్తిగా తెలివితక్కువతనం. మీ తెలివితేటలను ఉపయోగించి పనులను చక్కగా చేయండి. అయితే ఆ పనులు చేసేటప్పుడు పొరపాటు జరుగుతుందేమోనని భయంతో పనులు చేయకండి. మీరు ఎప్పుడయితే తప్పు జరుగుతుంది అని భయపడతారో అప్పు మీకు మీ అహంకారం దెబ్బ తింటుందేమో అని భయపడుతున్నారు అని అర్థం.
మీరు ఎప్పుడయితే మీ అహంకారం గురించి ఆలోచించటం మానేస్తారో అప్పుడు ఏ పనిలోనికైనా దూకగలరు. ఏ పనినైనా ధైర్యంగా చేపట్టగలరు. మీరు అనుకునే
భయం కేవలం మీ అహంకారానికి దెబ్బ తగులుతుందనే భయం మాత్రమే. మీరు ఎప్పుడు అయితే ఈ అహంకారం నుండి స్వేచ్ఛ పొందుతారో అప్పుడు మీరు ఏ పనినైనా స్వేచ్ఛగా ధైర్యంగా చేయగలుగుతారు. మీరు అప్పుడు కొత్త కొత్త విషయాలు, పనులలో ఎక్కువ ఆసక్తి చూపుతారు.
ఒక చిన్న కథ :
క్లబ్బులో ఒక వ్యక్తి పేకాట ఆడి బయటికి వచ్చేస్తాడు. అక్కడ కోటు తగిలించిన స్టాండు దగ్గరకు వెళ్ళి, కోటు తీసుకొని వేసుకోబోతాడు.
అప్పుడు అకస్మాత్తుగా మెల్లగా మాటలు వినిపిస్తాయి. “ఏమండి! మీరు డి.సుబ్బారావు గారేనా” అని దానికి ఆయన వెనక్కి తిరిగి నేను సుబ్బారావుని కాను అంటాడు.
అదే నెమ్మది గొంతు, “భగవంతుడా నీకు కృతజ్ఞతలు. నేను డి.సుబ్బారావుని. ఆ కోటు నాది” అంటాడు.
(అంతా నవ్వులు)
మనం తప్పులు చేస్తామేమో అని దాని వలన మనని మనం బాధ పెట్టుకుంటామేమోనని నిరంతరం భయపడుతూనే ఉంటాము. అందుకే మనం అందరితో చాలా జాగ్రత్తగా, చాలా మంచిగా మసులుతుంటాయి. మనం చాలా మంచి వాళ్ళం, నెమ్మదస్తులమని ఆలోచిస్తాము. ఇవన్నీ కూడా మనలోని అహంకారం యొక్క చాలా రూపాలు. మీ అహంకారం ఎక్కడ దెబ్బ తింటుందో అని చాలా భయపడిపోతుంటారు. అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తారు. ముందు మీ అహంకారానికి కాపాలా కాసే పనులని, పద్ధతులని వదిలేయండి. మీరు స్వేచ్ఛగా ఉండండి.
సీరియస్‌గా ఉండకండి. ఎందుకోగాని మనం ఆధ్యాత్మికతని గంభీరంతో ముడిపెట్టేస్తాము. అది ఒక పెద్ద కల్పన మాత్రమే. గంభీర తత్వానికి, ఆధ్యాత్మికతకు ఎటువంటి సంబంధం లేదు.
నేను మీకు ఇన్ని జోక్స్, కథలు ఎందుకు చెబుతున్నాను. నేను అలా చెప్పక పోతే మీరు చాలా సీరియస్ గా కూర్చుంటారు. మీరు ఎప్పుడయితే గంభీరంగా అయిపోతారో మీరు బరువుగా, నిరుత్సాహంగా, జీవం లేనట్టు అయిపోతారు. మీరు తేలికగా హాయిగా ఉండలేరు. నేను మిమ్మలని బరువుగా గంభీరంగా చేయటానికి ఇక్కడికి రాలేదు.
నేను మిమ్మలని తేలికగా, హాయిగా ఉండేలా చేయటానికి వచ్చాను. మీ లోపలి బరువులు తగ్గించటానికి వచ్చాను. మీలో ఉండే గంభీరం కేవలం మీ అహంకారమని మీకు చెప్పటానికి వచ్చాను. మీరు ఏమిటో మీకు చూపించటం కాదు; లేదా మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో దాని బలపరచటానికి కాదు నేను ఇక్కడ ఉన్నది.
ఎవరైతే జరిగిపోయిన, జరగబోయే కాలాలతో వాళ్ళ మైండ్‌ని బరువుగా నింపుకుంటారో వాళ్ళు ఎప్పుడూ చాలా గంభీరంగా ఉంటారు. వాళ్ళకి అప్రయత్నంగా ఎలా నవ్వాలో తెలియదు. వాళ్ళు అలా భూత, భవిష్యత్లని వాళ్ళ భుజాలమీద మోయాలి కాబోలు అనుకుంటారు. అందుకే ఆ బరువు మోయటంలో వాళ్ళు చాలా సీరియస్‌గా నిమగ్నమైపోతారు. ఇది పూర్తిగా అహంకారపూరితమైన దృక్పథం. వాళ్ళేమనుకుంటారంటే, వాళ్ళు అలా చేయకపోతే ఇంకెవరూ వాళ్ళకి ఆ పని చేసిపెట్టరు అని.
ముందుగా మీరు ఒక విషయాన్ని అర్ధం చేసుకొండి. భవిష్యత్, భూత కాలాలని మీరు ఏ మాత్రం మోయనవసరం లేదు. మీరు వర్తమానంలో, ఈ క్షణంలో బ్రతకండి. అది చాలు. కానీ వీళ్ళంతా వర్తమానాన్ని, ఈ క్షణాన్ని పూర్తిగా మిస్ అవుతున్నారు. వాళ్ళు జీవితాలలో నవ్వులని పూర్తిగా పోగొట్టుకుంటున్నారు.
నవ్వు మీ అంతరాత్మలో నుంచి శక్తిని మీ శరీరంలోనికి తెలుస్తుంది. మిమ్ములని అది పూర్తిగా శక్తివంతులని చేస్తుంది. ఎవరూ, ఏదీ మాన్పలేనంతగా మనలోని గాయలని, బాధలని ఈ నవ్వు మాన్పుతుంది. మీరు చాలా కష్టమైన ధ్యాన పద్ధతుల ద్వారా వర్తమానాన్ని, ఈ క్షణంలోని ఏ అద్భుతాలని దర్శించాలనుకుంటున్నారో అవన్నీ మీకు నవ్వుతో సాధ్యమవుతాయి. నవ్వు ఒక శక్తివంతమైన ధ్యాన పద్ధతి.
నవ్వు ఒక చక్కని ఆధ్యాత్మిక లక్షణం. నిష్కపటం, నవ్వు కలిసి ఉంటాయి, కలసి సాగుతాయి. ఇంతకుముందు మీకు చెప్పానుకదా, గంభీరత్వం నవ్వు కలిసి ఉండవు అని. మీరు గంభీరంగా అయినా ఉంటారు లేదా నవ్వుతూ అయినా ఉంటారు. మీరు నిష్కపటంగా ఉన్నప్పుడు చక్కగా నవ్వగలుగుతారు. అప్పుడు మీ బాధ్యతలు బాగా నిర్వర్తించగలుగుతారు.
మనలో ఎంతమంది మనస్పూర్తిగా నవ్వగలం? మనం నవ్వుని కూడ అణిచివేగలం. ఈ సమాజం మనకి చాలా సభ్యతతో, మర్యాద పూర్వకంగా నవ్వటం నేర్పిస్తుంది. చిన్న పిల్లల నవ్వితే మనం నిబంధనలని విధిస్తాము. వాళ్ళ సహజ చర్యల మీద చన్నీళ్ళు జల్లుతాము. వెంటనే మనం వాళ్ళతో ఇక నవ్వింది చాలు, సీరియస్ ఉండండి అని చెబుతాము. వాళ్ళ నవ్వు మీద కూడా నిబంధనలు విధిస్తాం.
నేను చాలా సార్లు ఆడపిల్లలని, మగవాళ్ళలా నవ్వవద్దు; ఆడపిల్లలా నవ్వండి అనటం విన్నాను. నవ్వుని ఎలా మీరు తయారు చేయగలరు? నవ్వు అనేది మీ అంతరంగం లోపలి నుంచి వచ్చే ఒక సహజ చర్య. ఇలా పిల్లల మీద నిబంధనలు విధించడమనేది వాళ్ళని మీలా తయారు చేయటానికే. వాళ్ళని మీలాగా నిరుత్సాహంగా, జీవం లేనట్టు తయారు చేసే వరకూ మీరు నిద్రపోరు.
ఈ సంవత్సరం నేను అమెరికా వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లతో గడిపాను. వాళ్ళతో మాట్లాడతా షుమారు ఒక గంట సమయం గడిపాను. నేను ఎంత ప్రయత్నించినా, ఎన్ని జోక్స్ వేసినా కూడా వాళ్ళని నవ్వించలేకపోయాను. వాళ్ళని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళలో లేని పరిణితిని చూపిస్తున్నారు. వాళ్ళ పద్ధతులనుంచి నవ్వుని తొలగించేస్తున్నారు. వాళ్లు చిన్నపిల్లలగా చిన్నప్పుడే నవ్వలేకపోతే, పెద్దయ్యాక అసలు నవ్వుతారా? నాకు ఇది చాలా విపరీతమనిపించింది.
చాలా మంది నాతో అంటుంటారు నా నవ్వు చాలా త్వరగా అందరిలోనికీ వ్యాపించి వాళ్ళని నవ్వులలో ముంచుతుంది అని. ఈ పిల్లలతో, మొదటిసారి అది అబద్ధం అని అనిపించింది. వాళ్ళు తెచ్చిపెట్టుకున్న పెద్దరికంతో నావైపు చూసే వాళ్ళు నాకు భయం వేసింది. నేనూ వాళ్ళలా సీరియస్ అయిపోతానేమో అనే భయంతో అక్కడి నుండి వచ్చేశాను.
(అంతా నవ్వులు)
చూడండి : పరిణితికి, నవ్వటానికి సంబంధం లేదు. పరిణితితో ఉండాలి అంటే నవ్వుని మీ జీవితంలోంచి తొలగించుకోనవసరం లేదు. ఎందుకో తెలియదు కానీ మనం పరిణితి పొందాము, పెద్దరికంగా ఉన్నాము అనుకోగానే చాలా తక్కువ నవ్వాలి అని అనుకుంటాము. నవ్వుకి గొప్ప శక్తి ఉన్నది. ఎందుకంటే అది మీ అంతరంగపు లోపలి నుంచి శక్తిని తెచ్చి మీకు ఇస్తుంది.
మీరు నా ఉపన్యాసాలకి వచ్చినప్పుడు, మీరు ఎక్కువగా నవ్వేటట్టు చేస్తాను. ఏవో జోక్స్ చెబుతాను. ఎలాగయినా అందరినీ నవ్వేటట్టు చేస్తాను. నేను అసలు ఎవరినీ సీరియస్‌గా ఉండనివ్వను. ఇక్కడే కాదు ఆశ్రమంలో కూడా వాళ్ళు ఏ పని చేస్తున్నా సీరియస్‌గా మాత్రం ఉండనివ్వను.
చిన్న కథ :
చాలా హాస్యప్రియుడు అయిన ఒక వ్యక్తిని ఉపన్యాసం ఇవ్వవలసిందిగా ఒక ఊరికి ఆహ్వానించారు. ఆయన ఈ ప్రోగ్రాంకి చాలామంది మనుషులని తీసుకువచ్చాడు.
ఆ ప్రోగ్రాం చేసేవాళ్ళు ఆయన కూడా అంతమంది రావటం చూసి ఆశ్చర్యపోయారు. మాట్లాడటానికి వచ్చిన వ్యక్తి వాళ్ళ ఆశ్చర్యాన్ని చూసి ఇలా అన్నాడు "ఈ రోజుల్లో అందరినీ నవ్వించటం చాలా కష్టంగా ఉంది. అందుకే నా ప్రేక్షకులని నేనే తెచ్చుకుంటున్నాను" అన్నాడు.
(అంతా నవ్వులు)
ఇటువంటి సమాజంలోని ఉన్నతమైన మనుషులు నవ్వుతారు. కానీ చాలా మర్యాదగా, సంస్కారయుతంగా, జాగ్రత్తగా నవ్వుతారు. అది నిజమైన నవ్వుకాదు.
ఆ నవ్వులో జీవం ఉండదు. నవ్వుకి ఎప్పుడూ నిబంధనలు ఉండకూడదు. అలా ఉంటే అది నవ్వుకాదు. నేను చెప్పే ధ్యానం లాంటి నవ్వు అది కాదు, ఈ నవ్వు కేవలం మీలోని అహంకారాన్ని చూపించే ఒక పద్ధతి అంతే.
మీరు ఏదైనా జోక్ విన్నప్పుడు ఎందుకు నవ్వుతారు అని విశ్లేషణ చేస్తే మీకు ఒక విషయం అర్ధమవుతుంది. మీకు కొన్ని హేతుబద్ధంగా ఒక దానితో ఒకటి సంబంధమున్న మాటలు లేదా వ్యాఖ్యానాలు చెబుతారు. మీరు అందులో ఉండే అర్ధాన్ని తెలుసుకున్నప్పుడు మరొక వాఖ్యం చెబుతారు. అది పూర్తిగా మీరు అనుకునే అర్ధాన్ని మార్చేస్తుంది. ఎప్పుడయితే అందులోని అర్ధం, తర్కం మారిపోతాయో, మీ మైండ్ ఖాళీ అయిపోతుంది. ఆ కొన్ని క్షణాలు మీకు మైండ్ అనేది ఉండదు. అదే బుద్ధా స్థితి. అప్పుడు మీరు ఉండే స్థితి బుద్ధా స్థితి. మీరు ఎప్పుడయితే మైండ్ లేని స్థితిలో ఉంటారో అప్పుడు మీరు పూర్తిగా వర్తమానంలో ఉంటారు. మీరు నవ్వినప్పుడు మీరు పూర్తిగా వర్తమానంలో ఉంటారు. ఎందుకంటే మీలో ఆలోచనలు ఉంటే మీరు భూతకాలంలో కాని భవిష్యత్‌లో కాని ఉంటారు. అంతే కానీ మీరు వర్తమానంలో ఉండలేరు.
నవ్వు ఒక పరిపూర్ణమయినది. అది మిమ్మలని, మీలోని గాయాలని మాన్పుతుంది. మీలో మార్పు తెస్తుంది. ఇది మనుషులకి తేలికగా దొరికే చాలా మంచి మందు.
నేను చెబుతున్నాను : జీవితం చాలా విలువైనది. దానిని నీరసంగా సోమరితనంతో గడిపి దాని విలువ పోగొట్టకూడదు. హాయిగా నవ్వండి. మీ జీవితాన్ని ఉత్సాహంతో నిత్యానందంతో నింపండి. మీరు ఏ పని చేసిన నిరంతరం సంతోషంగా ఉండాలి అని నిర్ణయించండి. నిష్కపటంగా ఉండండి. కానీ గంభీరంగా ఉండవద్దు.
మీరు నవ్వినప్పుడు శక్తిని అన్నివైపులా వ్యాపింపచేస్తారు. నవ్వుకి వ్యాపించే గుణం ఉంది. అందరికీ అంటుకునే లక్షణం ఉన్నది. మీ చుట్టు ప్రక్కలకి మీరు మీ నవ్వుతో చికిత్సా విధానం తెలిసి చికిత్స చేయించగలిగే పరమానందాన్ని వ్యాపింపజేస్తారు. బహుశః ఇదే కారణం అయివుంటుంది. ఎవరైనా వాళ్ళు బాధపడుతున్న మూడ్‌తో లోపలికి వచ్చారనుకోండి, వాళ్ళు అదే బాధని వారి చుట్టుప్రక్కల కూడా వ్యాపింపజేస్తారు. ఆ చుట్టుప్రక్కల ఉండేవారికి కూడా ఆ నిరుత్సాహం, బాధ అనేవి అంటుకుంటాయి. అందుకే నేను డాక్టర్స్‌కి చెబుతుంటాను. వాళ్ళని ఒక రకమైన శుభ్రం చేయగల ధ్యానం చేయమని. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి నిరంతరం పేషెంట్లు రకరకాల బాధలతో, వ్యతిరేకపు ఆలోచనలతో వస్తుంటారు. అందుకని అలా చేయమంటాను.
ప్రశ్న : స్వామిజీ! మేము నవ్వాలి అంటే ఒక కారణం ఉండాలి. మాకు ఎటువంటి నవ్వు పుట్టించే విషయం తెలియకుండా మేము ఎలా నవ్వుతూ ఉండాలి?
మనం ఎప్పుడూ ఇలానే ఆలోచించుతాము. మనం నవ్వాలి అంటే కమేడియన్ కానీ ఒక జోక్ గాని కావాలి అని అనుకుంటాము. కానీ నేను చెబుతున్నాను అర్థం చేసుకోండి. మీరు వర్తమానంలో ఈ క్షణంలో జీవించగలిగితే, మీ ఉనికి చాలా అందంగా, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి శ్వాస మీలో రక్తంగా మారిపోతుంది. ఈ అనంత చైతన్య సృష్టిలో జరిగే ప్రతీ సంఘటనా మీతో పాటుగానే ఎంతో అద్భుతంగా ఉంటాయి. మీలో అద్భుతమైన పరమానందం ఉంటుంది. మీరు నిరంతరం చిరునవ్వులు కురిపిస్తూ, ఆనందంగా నవ్వుతూ ఉండగలుగుతారు. మీ సంపూర్ణ వ్యక్తిత్వం అనంతమైన సంతోషాన్ని, పరమానందాన్ని మీ నుంచి ప్రవాహంలా ప్రవహింపచేస్తుంది.
ఒక జోక్‌కి నవ్వటం మంచిది. కానీ మీరు ఈ సృష్టి లయలకి అనుగుణంగా సాగగలిగినప్పుడు, ఈ విశ్వం ఆడే పెద్ద నాటకం చూసి ఎంతో ఆనందపడతారు. అందులో జరిగేవి చూసి నవ్వుతారు. అటువంటప్పుడు గంభీరం అనే మాట ఉండదు. ఆ పరిస్థితి రాదు. అలాగే అహంకారానికి కూడా స్థానం ఉండదు. మీరు ఒక ఘన పదార్థంలా ఉండరు. మీరు ప్రవహిస్తుంటారు. మీరు హాయిగా నవ్వుతారు. మీరు ఈచరాచర సృష్టి, ఈ అనంత చైతన్యాన్ని చాలా లోతుగా అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు. అప్పుడు అది ఆడే నాటకం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అది చూసి నవ్వుతారు.
ఈ నాటకంలో ప్రతి ఒక్కరూ నటించటం మీరు చూడగలుగుతారు. కానీ కొంతమంది ఈ నాటకంలోని పాత్రలో పూర్తిగా లీనమైపోయి చాలా సీరియస్‌గా పాత్రలని పోషించటం చూసి నవ్వుతారు. ఈ ఆట ఆడుతున్నామని అనుకోగానే మీకు నవ్వు వస్తుంది. అలా మీరు నవ్వగలిగినప్పుడు మీరు ఒక పరిశీలకుడుగా మారగలుగుతారు. ఎప్పుడయితే మీరు గమనించే స్థాయికి వచ్చి ఒక పరిశీలకునిగా మారగలుగుతారో అప్పుడు మీరు ‘నేను’ నుంచి ‘నాది’ అనే మీ అహంకారం నుంచి వేరు పడిపోతారు.
ఒక చిన్న కథ :
ఒక సారి ఆధ్యాత్మికత మీద బౌద్ధ సన్యాసులకి ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ప్రతి ఒక్క సన్యాసి స్టేజ్ మీదకి వెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వసాగారు. ఈ సారి ఒక బౌద్ధ జెన్ సన్యాసి వంతు వచ్చింది. ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి నవ్వటం మొదలు పెట్టాడు. ఆయన అలా నవ్వుతూనే ఉన్నాడు. తన అంతరంగంలోపలి నుంచి, ఆయన లోపలి నుంచి నవ్వసాగాడు. ఆ నవ్వుతో ఆయన పూర్తిగా కదిలిపోసాగాడు.
ఆయన నవ్వు అంతటా వ్యాపించి అందరికీ అంటుకుంది. దానితో ఆ హాలులో ఉన్న ప్రతి ఒక్కరూ నవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళు అలా ఎందుకు నవ్వుతున్నారో కూడా తెలియకుండా నవ్వుతున్నారు. అలా అందరి నవ్వులతోటి అక్కడ శక్తి తరంగాలు ఏర్పడ్డాయి. అందరూ ఏదో తెలియని ఒక ఉన్నత స్థితికి చేరిపోయారు. వాళ్ళ ఆలోచనలు చెదిరిపోయాయి. వాళ్ళందరూ పరమానందంతో నిండిపోయారు.
అప్పుడు చివరిలో ఆ మాస్టర్ “ఇదే నిజమైన ఆధ్యాత్మికత అంటే” అన్నాడు.
నవ్వు అనేది ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్షణము. అది మిమ్మిలని జ్ఞానోదయం వైపు మళ్ళిస్తుంది. దానికి గొప్ప చికిత్స చేసే శక్తి ఉన్నది.
మెడిటేషన్ ప్రోగ్రామ్స్ మేము నవ్వటం, డాన్స్ చేయటం తప్పని సరిగా ఉండేటట్లు చూస్తాము. అవి రెండూ కూడా మనని బుద్ధస్థితిలో ఉంచే తేలికైన పద్ధతులు డాన్సు చేస్తే మీరు తేలికగా హాయిగా ఉంటారు. నవ్వు లాగా డాన్స్ కూడా సరదాగా ఉండి మనని ఆనందపరిచే ఒక ధ్యాన పద్ధతి. మీరు ఎటువంటి శ్రద్ధ చూపించకుండా డాన్స్ చేయగలిగితే మీరే నాట్యమైపోతారు. అప్పుడు మీ లోపలి నుంచి శక్తి ఘల్లుఘల్లున ప్రవహిస్తుంది.
మీరు ఎటువంటి శ్రద్ధ లేకుండా నాట్యం చేయాలంటే మీలోని అబద్ధపు గుర్తింపులు ఉండకూడదు. ఎంతవరకూ మీరు పలానా అని మీరు అనుకుంటారో అప్పటి వరకూ మీరు ఆనందంతో నాట్యం చేయలేరు. నాట్యం అనేది మన అంతరంగంలోని ఆనందాన్ని బయటకి వ్యక్తంచేసే ఒక రీతి, ఒక పద్ధతి. నేను ఒక పద్ధతిలో ఒక స్టెప్ తరువాత ఒకటి వేసే నాట్యం గురించి కాదు చెప్పేది, నేను చెప్పే నాట్యం ఈ అనంత సృష్టిలో మమేకమై, దానిలో భాగమైన ఆ లయల జతులకి అనుగుణంగా మీరు ఆనందంతో చేసే నాట్యం. దీనిలో మీరంటే ఏమిటో, మీరు ఎవరో అనే విషయాలు ఉండవు. కేవలం మీరు, ఈ అనంత సృష్టి మాత్రమే ఉంటాయి.
ఎవరైతే తమ మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతారో వాళ్ళంతా అహంకారులు, వాళ్ళు నిరంతరం తమ నాట్యం గురించి ఎదుటి వాళ్ళు ఏమంటారో అనే భయంతో ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా ఒక మూల కూర్చుంటారు. మళ్ళీ వాళ్ళు తమ అహంకారాన్ని కాపాడుకోవడంలో నిమగ్నమైపోతారు. దానితో జీవితంలో అసలైన ఆనందాన్ని మిస్ అయిపోతారు.
అప్పుడప్పుడు మీ ఇంట్లో మంచి సంగీతం పెట్టుకుని డాన్స్ చేయండి. మీ మనస్సుకి నచ్చినట్లుగా చేయండి. అది ఒక లోతైన సాంప్రదాయమైన ధ్యానం. అది మీ మైండ్ అతీతంగా మిమ్ములని తీసుకువెళుతుంది. మీలో చక్కని మార్పుని తెస్తుంది. మాటలు చేయని పనిని ఈ ధ్యానం చేయగలుగుతుంది. మీలో చక్కని మార్పుని తెస్తుంది. సహజంగా మీరు ఏమిటో మీ లాగా ఉండండి. మీ డాన్స్ చూసి ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళు ఆ డాన్స్‌లోని గొప్ప ఆనందాన్ని పోగొట్టుకున్నవాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకండి. వాళ్ళని వదిలేయండి. మీరు ఆ నాట్యంలో నిమగ్నమై మీరు ఆనాట్యం అయిపోండి. నవ్వు, నాట్యం మీ అహంకారాన్ని విడిచిపెట్టటానికి, ఈ అనంత చైతన్య సృష్టిలో కలిసిపోవటానికి చాలా తేలికైన పద్ధతులు.
ప్రశ్న : స్వామీజీ ! మాకు అహంకారం లేదని ఎలా తెలుస్తుంది ?
ఎప్పుడయితే మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని అనుకోరో మీలో అహంకారం ఉండదు. మీకు జ్ఞానోదయం కలిగినప్పుడు, మీ అహంకారం పక్వం చెంది, విడిపోతుంది. ఎప్పుడయితే అహంకారం విడిపోతుందో మీలో అడ్డు గోడలు కరిగిపోతాయి. ఈ అనంత చైతన్య సృష్టి మీలోపలికి స్వేచ్ఛగా ప్రవహించుతుంది.
మీకు తెలిసినా తెలియకపోయినా, మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మీరు కావాలి అనినా, అనకపోయినా ఈ అనంత చైతన్య సృష్టి ప్రతి నిముషం మీలోపలకి ప్రవహించుతూనే ఉంటుంది. అయితే మీరు అహంకారంతో నిండిపోయి ఉంటారు. అందుకే దానిని మీరు తీసుకోలేకపోతున్నారు. ఈ అహంకారం వల్ల మీరు సృష్టి యొక్క అద్భుతాలని చూడలేకపోతున్నారు. వాటి అనుభూతిని పొందలేకపోతున్నారు. మీరు ఈ సృష్టితో సంబంధం పెట్టుకోలేకపోతున్నారు. అందుకే మీరు మీ అహంకారంతో, అమాయకత్వంతో, దుర్భరమైన సమస్యలతోనే జీవిస్తున్నారు.
మీరు అహంకారంతో నిండిపోయి మీలోపలి అంతరాత్మకి చాలా దూరంగా జీవిస్తున్నారు. మీలోపల చాలా ఎక్కువగా అనవసరమైన పదార్థాలు నింపబడి ఉన్నాయి. మీరు ఎన్నో జన్మలుగా మీలోపల కూడబెట్టిన ఆ చెత్త పదార్థానంతా తీసివేయగలగాలి. అది ఎంత ఎక్కువగా ఉన్నదంటే మీలోపల మీరు ఉండటానికి కూడా మీకు స్థలం లేనంతగా. ఈ కారణం వలనే మీరు మీ అంతరంగంలోని మీ ముఖ్యమైన అంతరాత్మ నుండి మీ పరిది నుండి మాత్రమే మీ పనులు చేయగలుగుతున్నారు.
మీ లోపలి అహంకారం కరిగిపోతే మీరు ఉండరు. మీరు కేవలం ఈ అనంత చైతన్య సృష్టిలో కలిసిపోయి అందులో ఒకటయిపోతారు. ఇదే జ్ఞానోదయం పొందిన యోగుల స్థితి.
నేను ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటాను. మీలోపల మీరు కాని మిమ్ములని నాశనం చేసేయండి. వాళ్ళు నావైపు నిర్ఘాంతపోయి చూస్తారు. నేను ఇలా చెప్పటంలో అర్థమేమిటి అంటే. "మీరు అంటే మీ అంతరంగంలోని మీ ఆత్మ; మీ అంతరంగంలో ఉండే మీ ఉనికి" మీ అంతరంగంలో ఈ అనవసరపు విషయాలు, జన్మజన్ములుగా మీరు కూడబెట్టిన అనర్థపు పదార్ధాలు, మీ అహంకారం వీటితో కల్మషం అయిపోయింది. ఇవేవి మీవి కావు. ఈ మీవి కాని వీటిని తొలగించి నాశనం చేయండి. దీనినే మీరు కాని మిమ్ములని తొలగించమని నేను చెప్పేది.
మీరు ఈ అనంత చైతన్య సృష్టిలో ఒక భాగం. అది కాకుండా, ఇంకా వేరే ఏదైనా అని మీరు అనుకుంటారో అది అహంకారం. అంతే.
ఇది ఎలా ఉంటుందంటే ; ఒక చేప తాను ఒప్పుకున్నా లేకపోయినా, ఇష్టపడినా లేకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, అది మహాసముద్రంలో ఒక భాగం మాత్రమే. దానికి రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది ; ఆ సముద్రంతో పాటు అది ఆనందంగా జీవించటం ; రెండవది ; నిరంతరం సముద్రంతో పోరాడుతూ జీవించటం. అలా జీవిస్తూ తన జీవితాన్ని దుర్భరం చేసుకోవటం.
మీరు అనంత చైతన్య సృష్టితో పాటు సాగిపోతే, మీ జీవితంలో ప్రతి క్షణం ఆనందాన్ని అనుభవించుతారు. మీరు జలా జలా ప్రవహించగలరు. సున్నితంగా సహజంగా సృజనాత్మకంగా జీవించగలరు.
ఒక చిన్న కథ :
ఒక టీచరు తన విద్యార్థులని పిక్నిక్ని తీసుకువెళుతుంది. వాళ్ళు చాలా సేపు ఆడుకుని, పాడుకుని తిని ఆనందంగా గడుపుతుంటారు. అకస్మాత్తుగా టీచరు ఆ
పిల్లలందరినీ పిలిచి ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సుని చూపిస్తుంది. పిల్లలందరూ దానిని చూసి ఆనందపడతారు. అప్పుడు టీచరు వాళ్ళతో, “బాగుంది. ఇప్పుడు ఇంత అందమైన చిత్రాన్ని గీసిన చిత్రకారుణ్ణి చప్పట్లు కొట్టి అభినందించుదాము,” అంటుంది. అందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు. వెంటనే పరిసరాలు మారు మ్రోగేలా తప్పట్లు కొట్టి వాళ్ళ అభినందనలు ఆ చిత్రకారుడికి తెలియజేస్తారు.
పిల్లలకి తమ చుట్టూ ఉన్న ఈ అనంత సృష్టి యొక్క అందాలు చూడటం, దానిని మెచ్చుకోవటం నేర్పించాలి. లేకపోతే వాళ్ళు ఈ సృష్టితో సంబంధం తెంచుకుని అహంకారులుగా మారిపోతారు. వాళ్ళని యాంత్రికంగా, అహంకారులుగా తయారు చేయకండి. వారిని ఒక చైతన్య స్రవంతిలా, మృధువుగా తయారు చేయండి.
మీరు ఎప్పుడయితే ఈ అనంత చైతన్య సృష్టిని అభినందించగలరో అప్పుడు మీరు దీనికి దగ్గర కాగలరు. ఈ సృష్టి మొత్తం ఒక గొప్ప సృజన. సృజనాత్మకత ఉన్న వ్యక్తి హృదయానికి దగ్గరగా ఉంటారు. అతను మేధస్సు కంటే హృదయానికి దగ్గర అవుతాడు. మీలో సృజనాత్మకత ఉన్నప్పుడు భగవంతునికి దగ్గరవుతారు. ఈ అనంత సృష్టి మొత్తం ఆయన సృష్టించినదే. మీరు దేనినైనా సృష్టించినప్పుడు మీ అంతరంగంలోని అంతరాత్మని చూపించినట్టే. అదే ఈ అనంత చైతన్యం యొక్క సహజ లక్షణం. మీరు ఏదైనా సృష్టించితే మీలో ఉండే ప్రేమని చూపించినట్టే. మీరు ఈ అనంత సృష్టిని అభినందించినట్టే. ఈ అనంత సృష్టికి మీరు మరి కొన్ని అందాలు అద్దినట్టే.
మీరు ఈ అనంత చైతన్య సృష్టి యొక్క అద్భుతాలని మీలో నిలుపుకుంటే మీరు ఏదైనా సృష్టించగలరు. అలా కాకుండా మీరు అహంకారంతో నిండిపోతే మీరు ఏ సృజనాత్మకమైన పని చేయలేరు. మీరు ఏదైనా సృష్టించినా అది జీవంలేనిది అవుతుంది. అది ప్లాస్టిక్ పువ్వు లాంటిది. దానికి సహజ పరిమళాలు ఉండవు. దానిలో జీవం ఉండదు. ఒక కళాకారుడు సృష్టించినది ఏదైనా ప్రేమలోంచి వస్తుంది. అందుకే ఈ సృష్టికి ప్రత్యేకతని ఇవ్వగలడు. అలా కాకుండా అహంకారంతో సృష్టించితే అతని సృష్టికి ప్రాణం ఉండదు.
మీరు ఎప్పుడయితే ఈ అనంత సృష్టితో పాటు ముందకు సాగలేరో మీరు ఈ సృష్టి యొక్క సుమధుర పరిమళాలను ఆస్వాధించలేరు. ఇది ఎలా ఉంటుందంటే మధుర పరిమళాలు మిమ్మలని చుట్టుముట్టినప్పుడు కంపుకొట్టే వేళ్ళతో ముక్కు మూసుకున్నట్టే. దీనినే అహంకారం అంటారు. ఎప్పుడయితే మీరు ఈ అనంత సృష్టి యొక్క పరిమళాల అనుభూతిని పొందగలుగుతారో అప్పుడు మీరు ఈ సృష్టికి అనుగుణంగా సాగిపోగలుగుతారు. ఈ సమస్త సృష్టిలో ప్రతిధ్వనించగలుగుతారు. ప్రతి ఆకు, ప్రతీ కొమ్మా ఆ భగవంతుని ప్రతి రూపాలుగా మీరు గుర్తించగలగుతారు. మీరు ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు ఏది కోరితే అది మీకు దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఈ సృష్టితో పాటు జీవిస్తున్నారు. అప్పుడు జీవితం ఒక అద్భుతంలా అనిపిస్తుంది. దీనినే ఈ సృష్టితో ఏకకాలంలో ఒకే విధంగా జీవించటం అంటారు.
ఒక విషయం అర్ధం చేసుకోండి ; మీరు ఈ అనంత సృష్టికి అనువాదమై ఆ సృష్టిలో ప్రతిధ్వనించగలుగుతున్నప్పుడు, మీరు దేనిని అత్యాశతో చూడరు. మీకు అప్పటికి ఏది అవసరమో అది మీకు ఈ అనంత చైతన్య సృష్టి ఇస్తుంది. అది మీరు అడగకుండానే ఇస్తుంది. దీనినే నేను “ మీరు ఏది కోరితే అది ఇస్తుంది“ అని చెప్పిన మాటకి అర్ధం.
కాని అసలు సమస్య ఏంటంటే మనం ఈ అనంత చైతన్యం నుండి చాలా దూరం వెళ్ళిపోయాము. మనం మన అంతరంగంలోని మూలాధారం వైపు నుండి చాలా దూరం వెళ్ళిపోయాము. కాబట్టి మనం ఈ విషయాన్ని నిరంతరం గుర్తు చేయవలసిన స్థితిలో ఉన్నాము. మన చుట్టు ప్రక్కల సృష్టిలో ఉన్న అందాలను ఆరాధించి అభినందించటం ద్వారా మనలోని అహంకారాన్ని కొంత తగ్గించవచ్చు. అలా చేయటం మనలో జరగబోయే మార్పుకి విత్తనం వేయటమే. అప్పుడు మీరు ఈ అనంత చైతన్యంలో ఉన్న జీవన, ప్రాణాధార శక్తి ఈ విశ్వాన్ని నడిపించుతుంది అని అర్ధం చేసుకుంటారు.
మీరు ఎంతగా మిమ్ములని ఈ సర్వ సృష్టికి (భగవంతునికి) సమర్పించుకుంటారో, మీరు అంతగా అహంకార రహితులవుతారు. మీరు ఎంత అహంకారాన్ని వదిలితే అంత ఎక్కువగా ఈ చైతన్యానికి మిమ్ములను మీరు సమర్పించుకోగలరు.
ప్రశ్న : స్వామీ మా మేధస్సు దశలో, మా తెలివితేటతో అహంకారాన్ని వదిలివేయాలి అని మాకు తెలుస్తుంది. కానీ అలా చేయలేకపోతున్నాము. ఎందుకు ?
చూడండి. మనిషి ఈ పరిపూర్ణ తత్త్వంతో ముందుకి సాగిపోవటానికి ఇష్టపడడు. అతను దేనికో ఒక దానికి అంటుకుపోయి ఉండటానికి ఇష్టపడతాడు. ఆ ఏదో ఒకటి అతని అహంకారం. మీ అహంకారం మీ శక్తి. ఎన్నో సంవత్సరాలుగా మీరు దానిని కాపాడుకుంటూ వస్తున్నారు. అదే మీ జీవితానికి ఆధారమయింది.
మీకు మీ అహంకారానికి అతీతంగా ఒక ప్రపంచం ఉన్నది అని తెలియటం లేదు. ఆ ప్రపంచం పరమానంద భరితం. అది మీరు ఇప్పుడు పొందుతున్న అనుభవాలకంటే అద్భుతమైనది. కానీ ఆ విషయం మీకు తెలియదు. కానీ మీ అహంకారమే మీ జీవితాన్ని నిలబెట్టే ఆధారం. అసలు సత్యం ఏమిటంటే, ఆ అహంకారాన్ని పూర్తిగా వదిలివేయాలి.
ఇది ఎలా ఉంటుందంటే : ఒక విత్తనాన్ని నాటామనుకోండి. ఆ విత్తనం పగిలి అందులోంచి మొక్క బయటికి రావాలి. అవును కదా ? కానీ విత్తనం మాత్రం సరే ముందు మొక్కని పెరగనివ్వు. తరువాత నేను పెరుగుతాను' అని అనుకుంటే కుదురుతుందా ? లేదు. అలాగే ముందు మనిషి యొక్క అహంకారం పగిలిపోవాలి. అందులోంచి మనిషి విప్పారాలి, వికసించాలి. కాని అతను ఎంత కాలం తన అహంకారాన్ని కాపాడుకుంటాడో, అతను అంతకాలం వికసించటాన్ని వాయిదా వేస్తుంటాడు. అంతే.
అతను తన గురువుని కలిసే వరకూ తనలో అడ్డంకులు ఉన్నాయి అని గుర్తించలేడు. అన్నింటికంటే తన అహంకారమే ఒక పెద్ద అడ్డంకు అని అతనికి తెలియదు. ఒక్కసారి తన గురువుని కలిసాక తనకి కావలసిన తాళం చెవి దొరుకుతుంది. అప్పుడు ఇక దానిని ఎంతవరకూ ఉపయోగించాలి. అనేది అతని ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ గురువుగారి బాధ్యత తన శిష్యుల అహంకారం పక్వానికి వచ్చేటట్టు చేయటమే.
మీరు బయట నుంచి చూసినప్పుడు, గురుదేవుని మాటలు, చర్యలు ఏదో అకస్మాత్‌గా జరిగేవిగా ఉండి ఆమోదయోగ్యంగా ఉండవు. పరిస్థితికి అనుకూలంగా లేనట్టు అనిపిస్తుంది. కానీ ఆ మాటలలో, చేతలలో సత్యం ఉంటుంది. అందులో మీలోని అహంకారాన్ని నాశనం చేయాలనే సంకల్పం ఉంటుంది. అసలు గురువులు, యోగులు, ఈ మనుషుల మీద ఉండే అపారమైన కరుణతో, దయతో వీళ్ళ దగ్గరికి వస్తారు. ఆయనకి ఎవరి మీద గాని, దేని మీద గాని ఆశక్తి ఉండదు. ఆయన ఈ కోరికలకి అతీతుడు. ఆయన మిమ్మలని తన లాంటి స్థితిలోనికి తీసుకురావాలి అని ప్రయత్నిస్తాడు. అదే పరమానంద స్థితి. శాశ్వతానంద స్థితి. ఆ స్థితిలో కేవలం మీ చేతన స్థితి మాత్రమే ఉంటుంది. అందులో ‘నేను’ ‘నాది’ అనేవి ఉండవు.
చండి స్తోత్రంలో 700 సంస్కృత శ్లోకాలు ఉంటాయి. అవన్నీ చండీ దేవిని స్తుతిస్తూ చెప్పిన స్తోత్రాలే. దేవి స్త్రీ శక్తి రూపం. ఇవన్నీ కూడా దేవి చండీ రకరకాల రాక్షసులని ఎలా సంహరించిందో ఉంటుంది. కాని ఇది నిజానికి ఎవరినో చంపటం కాదు. ఆమె ఎలా ఎవరినైనా సంహరించుతుంది ? అలా చేసి ఉంటే ఆమె ఈ పాటికి జైలులో ఉండేది. అలా చేసి ఉంటే ఆమెని మనం పూజించం కదా !
ఆమె సంహరించిన రాక్షసులంతా కూడా మనలోని చెడు ప్రవృత్తులే. మనలోని అహంకారం. దేవి మాత వీటిని సంహరించి మనకి మన నుండి స్వేచ్ఛని ప్రసాదించుతుంది. ఈ విషయాన్ని మనం అర్ధం చేసుకోవాలి. ఒక రాక్షసుడు మహిషాసురుడు. అతని తల మహిషం తల. ఇది మనలో ఉండే మొద్దు తత్త్వానికి నిదర్శనం. మనం ఎంత మొద్దుబారిపోయి ఉంటామంటే, గురువు ఎంత ప్రయత్నించినా మనం మేలుకోలేము. ఆయన మార్గంలోనికి రాలేము. మన దారిని గట్టిగా పట్టుకుని వేలాడతాము. మనం గురుదేవుని పిలుపుకి స్పందించే అంత సున్నితత్వాన్ని కలిగి ఉండము. మనం మరీ ఘన పదార్థాలులా ఉంటాము.
చూడండి. గురువుతో వాదించటమంటే మీకు మీరు వేసుకునే ఒక పెద్ద శిక్ష. నేను చెబుతున్నాను. అర్ధం చేసుకోండి. గురువులతో వాదనలకు దిగితే మీరు, మీకు చేసుకునే హాని ఎవ్వరూ మీకు చేయలేరు. మీకు మీరు హాని తలపెట్టినట్టే. గురువుకి మిమ్ములని మీ పరిధిలో ఎలా వికసింపచేయాలో బాగా తెలుసు. మీరు కేవలం ఆయన ముందు విప్పారిన మనస్సుతో, ఆయన మీద అపార నమ్మకంతో, ధైర్యంతో ఆయన సమక్షంలో ఉండండి. అది చాలు.
ప్రశ్న : స్వామీజీ! మీరు నా గురు దేవులు అని నాకు తెలుసు. కానీ మీ సమక్షంలో నేను ఎందుకు భయపడతాను? ఎందుకు వెనక్కి తగ్గుతాను ?
(స్వామి నవ్వుతారు)
మీరు ఈప్రశ్నతో ముందుకి వచ్చారు అంటే, మీరు ప్రస్తుతం ఉన్న స్థితి నుండి బయటకి రావాలి అని ప్రయత్నిస్తున్నట్టే. మీరు ముందడుగు వేయాలి అని నిర్ణయించుకున్నారు.
మీకు వివరంగా చెబుతాను ; మీ అంతరాత్మ నన్ను స్పష్టంగా గుర్తించింది. కానీ మీ మైండ్ ఇంకా పోరాడుతుంది. మీ అంతరాత్మ నన్ను గుర్తించకపోతే మీరు నాదగ్గరికి మళ్ళీ రారు. ఇక్కడికి వచ్చే ముందు మీరు మీ ఇంట్లో చాలా సమస్యని ఎదుర్కొంటారు. అవును కదా ? మీరు మీ ఇంట్లోనే ఉండి మీ పని చేసుకోండి. అది చాలా తేలిక అయిన విషయం. మీరు అలా చేస్తే మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషించుతారు. అవును కదా !
కానీ మీరు ఎందుకు ఆశ్రమానికి పదే పదే నన్ను చూడటానికి వస్తారు. ఎందుకు ఇంటిలో పదే పదే వాదించి ఇక్కడికి వస్తారు ? మీరు ఇంట్లోనే ఉండిపోయి మీ వాళ్ళని సంతోషపెట్టడం చాలా సులభం కదా ! కారణం ఏమిటి అంటే ఇలా రావాలి అనే కోరిక మీ అంతరాత్మ నుండి గట్టిగా ఆశ్రమం వైపు లాగుతుంది. ఒక్కసారి మీ అంతరాత్మ నన్ను గుర్తించాక అది వెనక్కి వెళ్ళదు. మీరు ఎంత ప్రయత్నించినా మీరు తప్పించుకోలేరు.
మీ అంతరంగం నన్ను గుర్తించింది. కానీ మీ మైండ్ అడ్డంకులు సృష్టిస్తుంది. గుర్తుంచుకోండి : మీరు ఎప్పుడూ మీ హృదయం చెప్పే మాట వినండి. అదే మీరు ఇక్కడ చేయవలసిన పని. మీరు మీ హృదయం చెప్పే మాట వింటే నన్ను చేరగలుగుతారు. మీరు మీ మైండ్ చెప్పే మాట వింటే నన్ను చేరలేరు. నన్ను మిస్ అవుతారు.
మిమ్మలని మీరు నాకు వదలుకోవటానికి భయపడతారు. అది అసలు సమస్య. అది మీ అహంకారానికి దెబ్బ. మీ వ్యక్తిత్వపు గుర్తింపు విషయంలో అభద్రతా భావం కలుగుతుంది. మీ వ్యక్తిత్వం కరిగిపోతున్నట్లు అనుకుంటారు. మీ కంటూ ఒక గుర్తింపు లేకుండా ఎక్కడికి వెళుతున్నాము, అని ఆశ్చర్యపోతారు. మీ అహంకారం ఒక భయంకరమైన సమస్యలో ఇరుక్కుంటుంది.
ఎప్పుడయితే ఇలా జరుగుతుందో మీ అహంకారం వెంటనే తనకి ఆహారం కావాలి అని కోరుతుంది. ఈ విషయంలో మీరు దాని కోర్కె తీర్చలేరు. అప్పుడు మీరు నన్ను అనుమానించతారు. మీలోని భావాలకి అన్ని కారణాలు వెతుకుతారు. ఈ మొత్తం వ్యవహారం మీద పని చేయాలని చూస్తారు. కానీ ఏమీ చేయలేరు. మీకు ఒక వైపు నామీద అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. మరొక ప్రక్క ప్రేమ మీద చాలా అనుమానాలు ఉంటాయి.
గుర్తుంచుకోండి. ప్రేమ మీ హృదయం లోంచి వస్తుంది. భయం మీ మైండ్లోంచి వస్తుంది. ఎప్పుడూ ప్రతి సారి మీ హృదయం చెప్పే మాట వినండి. ప్రేమ సహజమైనది. భయం సమాజపరమైనది. భయం, అనుమానం అనేవి చాలా లోతుగా సంబంధించిన విషయాలు. నిబంధనలు వాటితో ఉంటాయి.
స్పష్టంగా అర్ధం చేసుకోండి. అనుమాన పడటంలో తప్పులేదు. అవమానం జ్ఞానోదయానికి ఒక వెలుగుతున్న కాగడా లాంటిది. ఎటువంటి అనుమానం లేకుండా ముందుకు వెళ్ళటం మీ మైండ్‌కి చాలా కష్టమయిన పని. అయితే ఈ అనుమానాలన్నీ కూడా చివరికి నమ్మకంగా మారాలి. అప్పుడే మీరు అభివృద్ధి చెందగలరు. మీరు మీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రశ్న : దానికి మేము ఏం చేయాలి స్వామీజీ ?
మీరు పూర్తిగా ప్రేమలో పడిపోండి. అంతే. పూర్తిగా ప్రేమలో పడిపోవటం అంటే పూర్తిగా అహంకారం లేని స్థితిలో పడటం, గురువు పూర్తిగా అహంకారం లేని స్థితిలో ఉంటారు. అందుకే ఆయన ప్రేమించగలరు. కరుణ, దయ చూపించగలడు. మిగతా భావావేశాలు, కోపము, విసుగుని నటిస్తారు. ఆయన మీ స్థితికి వచ్చి భావావేశాలు చూపించుతారు. అలా చేసి మిమ్ములని మరింత స్పష్టంగా అర్థం చేసుకునేలా చేస్తారు. అంతే. ఆయన భాషని మీరు అర్ధం చేసుకునే వరకూ ఆయన మీ భాషలో మాట్లాడతారు. ఆయన భాష ఈ అనంత చైతన్య సృష్టి యొక్క భాష భగవంతుని భాష.
ప్రశ్న : స్వామీ ! పూర్తి ప్రేమలో మేము ఎలా ఉండగలం. ఇది చెప్పటం తేలికగా ఉందికానీ చేయటంకష్టం కదా ?
ముందుగా మీరు చేయవలసింది ; మీ ప్రతి పనిని చేతన స్థితిలో చేయండి. మీ ప్రతి పనిలోను తెలుసుకునే తత్వాన్ని నింపండి. మీరు పరిశీలకుడిగా మారండి. అప్పుడు మీకు ఈ సమస్తం ఒక నాటకంలా కనిపిస్తుంది. మీరు మీ పాత్ర పోషించుతూ ఈ నాటకాన్ని గమనించుతారు.
రెండవ విషయం : మీరు చూసిన ప్రతి దానికి తీర్పులు చెప్పటం, నిర్ణయాలు చేయటం మానివేయండి. మీరు ఎప్పుడైతే తీర్పులు చెప్పటం, అభిప్రాయాలు వ్యక్తం చేయటం మానివేస్తారో అప్పుడు మీరు ప్రతి మనిషినీ, ప్రతి వస్తువునీ అమాయకత్వంతో ప్రేమించుతారు.
మీరు మీ అభిప్రాయాలని వ్యక్తం చేస్తే, మీరు అసలు ఉన్నదానిని చూడరు. మీరు చూడాలనుకున్నది మాత్రమే చూస్తారు. చాలా మంది చాలా విషయాలపై ముందుగానే అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. అవే మనకి పునాది రాళ్ళు. వాటిని గట్టి ఆధారంగా చేసుకుని, దాని ప్రకారం మనం పని చేస్తాము. మనం దేనిని చూసినా ముందుగా మనం మనలో ఏర్పరుచుకున్నా అభిప్రాయాలని ముందుకు తెచ్చుకుని దాని ప్రకారం వాటిని చూస్తాము.
మనం ఈ విధంగా ప్రవర్తిస్తే వేటిని కూడా వాటిలా చూడలేము. అప్పుడు మనం పూర్తి ప్రేమలో ఎలా ఉండగలం. మీరు ప్రతి విషయాన్ని, ప్రతి మనిషిని స్వచ్ఛంగా, అమాయకంగా, వాటిని వాటిలాగానే మీరు స్వాగతించినప్పుడు మీరు తప్పకుండా పూర్తి ప్రేమలో పడగలుగుతారు. కానీ మీరేం చేస్తారు. ప్రేమించటంలో కూడా ఉండే సాధక బాధలని విశ్లేషణ చేయటం ప్రారంభించుతారు. ఎప్పుడయితే మీరు విశ్లేషణ చేయటం మొదలు పెడతారో అప్పుడు మీరు దానిని పోగొట్టుకుంటారు. తీరా మీరు దానిని చేయాలి అని నిర్ణయించుకుంటే అప్పటికే అది చాలా ఆలస్యమయిపోతుంది.
చూడండి. గురు శిష్యుల సంబంధంలో ఉండే ముఖ్య అంశం, మీరు మీ అహంకారాన్ని వదిలి వేయటమే. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ అహంకారాన్ని వదిలి వేయలేరు. మీరు మీ అహంకారాన్ని వదిలివేయటానికి గురువు మీకు ఒక ఆధారమవుతారు. మీరు ఆయనలో ఎంతగా కలిసిపోగలిగితే మీరు మీ వ్యక్తిత్వాన్ని ఎంతగా తెరచి ఉంచగలిగితే మీరు అంతగా మీ అహంకారాన్ని వదిలివేయవచ్చు. మీ అహంకారం కరిగిపోతుంది. అని మీకు ఎప్పుడు తెలుస్తుంది. మీరు అంతకు ముందు ఎప్పుడూ అనుభవించని ఆనందాన్ని మీరు అనుభవించితే మీ అహంకారం కరిగిపోయింది అని అర్ధం.
మీరు ఎటువంటి కారణం లేకుండానే సంతోషంగా ఉండగలుగుతారు. కేవలం జీవించటంలోనే ఆనందాన్ని అనుభవించుతారు. అయితే గురువుగారి సమక్షంలో మీ అహంకారానికి నిరంతరం కోతపడుతూ ఉంటుంది. మీ అహంకారానికి కోతపడే సమయంలో మీరు ఎంతో వ్యధని అనుభవించుతారు. అయితే ఇదంతా జరిగాక
మీరు అభివృద్ధికి ఎన్నో ముందడుగులు వేయగలుగుతారు. ఎటువంటి కారణం లేకుండా మీరు అవధులు లేని ఆనందాన్ని పొందుతారు.
చిన్న పిల్లలని చూడండి. వాళ్ళకి జీవితం పట్ల ఎంత కుతూహలం, ఉత్సాహం ఉంటాయో చూడండి. వాళ్ళు ఎంతో ప్రేమతో ఉంటారు. మీరు ఎందుకు అంత కుతూహలంతో ఉండలేరో ఎప్పుడయినా ఆలోచించారా ? మీరు ఒకప్పుడు అలానే ఉండేవారు. అవును కదా ? మరి ఆ కుతూహలం, ఆ ఉత్సాహం, ఆ అమాయకత్వం ఎక్కడికి పోయాయి ? చెప్పండి. మీరు వాటికి ఎక్కడ పారేసుకున్నాం అని అనుకుంటున్నారు.
ఒకరు ఇలా జవాబు చెప్పారు.
స్వామీజీ, మేము పెద్దవాళ్ళమయ్యాము. మాలో పరిణితి వచ్చింది. వాళ్ళకంటే చాలా అనుభవం సంపాదించాం....
ఆహా ! అనుభవం. ఏ విషయంలో. బోర్ కొట్టటం లోనా ? స్పష్టంగా అర్థం చేసుకోండి. మనం అనుకుంటాం మనం పిల్లల కంటే ఎక్కువ పరిణితి పొందామని. మనకి జీవితం పట్ల సరియైన అవగాహన ఉన్నది అనుకుంటాం. కానీ పిల్లలు ఆ జీవితం గుండా వెళ్ళాలి. జీవించాలి అప్పుడే వాళ్ళకి పరిణితి వస్తుంది అని అనుకుంటాం.
అయితే అసలు సత్యం ఏమిటంటే, మనం చాలా మేధావులమయిపోయాము. దాంతో మనకి హృదయాలతో సంబంధం తెగిపోయింది. మనం మన మైండ్ నుండి మాత్రమే పనిచేస్తాము. మనలోని భావావేశాలు కూడా మన మైండ్ చెప్పినట్టే వుంటాయి. మన భావాలు మన అంతరంగం నుండి రావటం మానివేసాయి. మనం మన అంతరాత్మతో ఎటువంటి సంబంధం లేకుండా అయిపోయాము.
మనం ఈ ప్రపంచంలోనికి వచ్చేటప్పటికి మనం గొప్ప ఉత్సవం లాంటి స్థితిలో ఉన్నాము. మనం యధాలాపంగా ఉండే వాళ్ళము. సంవత్సరాలు గడిచే కొద్దీ
సమాజం మనలను నిబంధనల చట్రంలో ఇరికించి వేసింది. మనకి మైండ్ అనే ఒక దానిని తయారు చేసింది. క్రమంగా ఆ మైండ్ చాలా గట్టిగా స్థిరపడిపోయింది. అది మనకి ఆజ్ఞలు జారీ చేయడం మొదలు పెట్టింది. దాంతో మనలో యధాలాపంగా, అప్రయత్నంగా పనులు చేసే లక్షణం పూర్తిగా మాయమైపోయింది.
మీకు ఒక విషయం చెబుతాను. మనలోని అహంకారాన్ని వదిలివేసే క్రమంలో మనం మనలోని పసితనాన్ని తిరిగి కనుక్కుంటాము. మనం చిన్నప్పుడు భగవంతుని కనుగొనే విషయానికి చాలా దగ్గరగా ఉంటాము. మనం పెరిగే కొద్దీ, మనలో పరిణితి పెరుగుతుంది. మన సమాజపు కట్టుబాట్లు మనలోని పసితనాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాయి.
చాలామంది నన్ను అడుగుతుంటారు, "స్వామీజీ మీరు మాకు అంతిమ సత్యాల గురించి చెబుతున్నా కూడా, మీరు మాకు చిన్నపిల్లవాడిలా కనిపించుతారు. ఎలా అది సాధ్యం ? అని. ఇప్పుడు మీరు చెప్పండి. నేను పెరగనందుకా ? లేకపోతే నాలో పరిణితి లేనందుకా ? ఎందుకు చిన్నపిల్లవాడిలా కనిబడుతున్నాను. మీరు విషయాలని మీకు అనువైన విధంగా, మీకు తెలిసిన వేదంత పద్ధతులలో అర్ధం చేసుకుంటారు. అది అసలు సమస్య.
కానీ సమాజపు కట్టుబాట్లకి, నిబంధనలకి, ఎంత సామర్ధ్యం ఉన్నదంటే, మనం ఈతకొట్టగలగడం లేదా గాలిలో ఎగరగలిగే సామర్ధ్యం ఎటువంటి ట్రయినింగ్ లేకుండానే, ఉంటుంది. ఇది వినటానికి అతిగా ఉండవచ్చు. కానీ ఇది నిజం. మనలో ఆ సామర్ధ్యం ఉన్నది. సమాజం మనకి ఏమీ రాదు అని హెచ్చరించేవరకూ ఎటువంటి ట్రయినింగ్ లేకుండానే ఈతకొడతాం. గాలిలో ఎగురుతాం, ఎప్పుడయితే ఎదుటివాళ్ళు అయ్యో నీవు చేయలేవు అనగానే, అవును చేయలేను అని మానేస్తాము. అప్పుడే పుట్టిన బిడ్డని స్విమ్మింగ్ ఫూల్లో వదిలితే, ఆ పాప మునగదు. చక్కగా నీళ్ళలో తేలుతుంది.
ఈ అహంకారం ఎన్నో రూపాలలో ఎన్నో విధాలుగా మన జీవితంలోనికి వస్తుంది. మనం ప్రతి నిమిషం దాని ఇష్ట ప్రకారమే బ్రతకాలని చూస్తాము. మనం మన నిత్య జీవితంలో ముసుగులు వేసుకుని బ్రతుకుతాము. మనం అమ్మతో ఉన్నప్పుడు ఒక రకం ముసుగు వేసుకుంటాం. తండ్రి దగ్గర మరొకటి, యజమాని దగ్గర ఇంకొక ముసుగు ఇలా వేరు వేరు చోట్ల వేరు వేరు ముసుగులతో ఉంటాము. మనం సరియైన వ్యక్తి దగ్గర సరియైన ముసుగు వేసుకోగలిగిన అన్ని రోజులు అంతా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర తప్పు ముసుగు వేసుకుంటే, పొరపాటుగా వేరే ముసుగులో వెళితే అక్కడ మన అహంకారం బయటికి వస్తుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సమర్ధతతో ముసుగులు మారుస్తూ, ఈ ప్రదర్శనని చూసి ఆనందించటమే. అప్పుడు మీరు ఒక పరిశీలకుడు మాత్రమే. మీరు అప్పుడు ఆ ఆటలో ఒక వ్యక్తిగా నిమగ్నమవ్వరు.
మీరు ఎప్పుడయితే ఈ ముసుగుకి అతీతులమని అనుకుంటారో అప్పుడే మీరు దీనినంతా చూసి ఆనదించగలుగుతారు. లేకపోతే మీరు ఆ ముసుగులోనే నిమగ్నమైపోయి, ఆ ముసుగే మీరు అయిపోతారు. దాంతో జీవితంలోని అసలు అందాన్ని పోగొట్టుకుంటారు. ఎప్పుడయితే మీరు ఆ ముసుగులని కేవలం ఉపయోగించుకుంటున్నాము అని తెలుసుకుంటారో అప్పుడు మీలోని కోరికలు మాయమవుతాయి.
ఇది ఎలా ఉంటుందంటే, మీరు పెద్దవాళ్ళయ్యాక బొమ్మలతో ఆడుకోవటం మానేస్తారు. అప్పుడు మీకు బొమ్మలంటే ఏ మాత్రం ఇష్టముండదు. అదే విధంగా మీరు తెలివితేటలతో ఈ ముసుగులని చూసినప్పుడు, ఆ ముసుగులు అంటే కోరిక పోతుంది. మీరు కేవలం వాటిని వాడుకుంటూ ముందుకు సాగిపోతారు.
అహంకారం చాలా జిత్తులమారి రూపాలలో, కపట దారుల్లో కనిపిస్తుంది. అందుకే నేను మీకు ఇన్ని వివరాలు ఇవ్వవలసి వచ్చింది. ఈ వివరాలన్నీ కూడా మీరు మీ అంతరంగంలోనికి ప్రవేశించేటప్పుడు మీకు కలిగే అడ్డంకులను చూడటానికి సహాయపడుతుంది.
మీ అంతరంగంలో ఈ అడ్డంకులు ఎంత తక్కువగా ఉంటే మీరు అంత చైతన్య స్రవంతిలా తయారవుతారు. మీలో అడ్డంకులు తక్కువగా ఉంటే మీరు హాయిగా ప్రవహిస్తారు. అలా కాకుండా అడ్డంకులు ఎక్కువగా ఉంటే, మీరు లోపలికి చొచ్చుకుని పోలేరు. మీ అహంకారం ఒక గట్టి పదార్ధంలా అడ్డుకుంటుంది.
ఉదాహరణకి, ఎవరైనా మీకు ఏదైనా చెప్పగానే మీ మొదటి స్పందన ఏమిటి ? మీరు ముందుగా వ్యతిరేకంగా స్పందించుతారు. వెంటనే 'లేదు' కాదు అని అంటారు. అలా లేదు, కాదు అని చెప్పగానే మీ అహంకారం తృప్తి పడుతుంది. మీ అంతరంగంలో చాలా గట్టిదనాన్ని అనుభవించుతారు. అదే మీరు సరే అని చెప్పారనుకోండి, మీరు ఒక ప్రవాహంలా అనుభూతిని పొందుతారు. అప్పుడు మీ అహంకారం లోపలికి అణిగిపోతుంది. అందుకే లేదు కాదు అంటారు.
ఈ కారణం చేతనే మీరు ఇంట్లోగాని, స్కూలులోగాని, ఆఫీసులోగాని ఎక్కడయినా రూల్స్ పాటించకపోతే మీకు సంతోషం అనిపిస్తుంది. అసలు మీరు ఎప్పుడయితే ఒక నిబంధనని పట్టించుకోరో, మీరొక గొప్ప వ్యక్తి అని మీకు మీరే అనుకుంటారు. స్కూలు, కాలేజీ స్టూడెంట్స్, క్లాసు మానేస్తే గొప్ప అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిబంధనలకి వ్యతిరేకంగా వెళితే వాళ్ళ అహంకారం పెరిగినట్లు అనుకుంటారు. చిన్న పిల్లని మీరు ఏది వద్దంటారో, అదే కావాలని పేచీ పెడతారు. పెద్దవాళ్ళు కూడా వద్దన్నవి చేస్తూ ఆనందించుతారు.
భార్య, భర్త ఎప్పుడూ కూడా మొదటి సలహాకి ఒకేలా స్పందించరు. ఉదాహరణకి: నా అనుచరులు విషయంలో, భర్త నాకు ముందుగా దగ్గరయితే, భార్య వద్దని చెబుతుంది. తరువాత ఆమె రహస్యంగా నా పుస్తకాలు చదివి నన్ను ఇష్టపడుతుంది. కానీ భర్త ముందు ఒప్పుకోదు. అలానే భార్య ముందుగా నాకు దగ్గర అయితే భర్త ముందుగా అడ్డు చెబుతాడు.
అహంకారం యొక్క ఆట అదే. 'సరే' అని చెబితే మీరు సహజ స్రవంతిలా ప్రవహించుతారు. అందులో అడ్డంకులు ఉండవు. అలా అని చెప్పటం మీ
అహంకారం ఆధారంగా కాకుండా యథాలాపంగా, అప్రయత్నంగా మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు చెప్పవచ్చు. అప్పుడు మీరు సరియైన నిర్ణయాలు చేయగలుగుతారు. ఒక విషయం అర్థం చేసుకోండి; ‘లేదు’, ‘కాదు’ అనేది మీకు రక్షణ కవచం కాదు. మీరు మీ వ్యక్తిత్వం దేనికీ అడ్డంకులు చెప్పకుండా తెరచిన స్థితిలో ఉండాలి. అది చాలు.
ప్రశ్న : స్వామీజీ, నేను ఇప్పటివరకూ నాకు ప్రాముఖ్యతను ఇచ్చుకోవటం అహంకారం యొక్క ఒకే ఒక రూపం అనుకున్నాను.
లేదు. అహంకారం చాలా రకాలుగా ఉంటుంది. అది స్తబ్దత రూపంలో ఉండవచ్చు. లేదా చురుకుగా కనపడవచ్చు. ఇప్పటి వరకూ చెప్పుకున్నదంతా ఇదే. అందుకే అది జిత్తులమారిది, కపటమైనది అని చెప్పాను.
చురుకైన అహంకారాన్ని తొందరగా గుర్తించవచ్చు. అలాంటివాళ్ళు ప్రతి దానిలోనూ వాళ్ళదే పై చేయిగా ఉండాలని చూస్తారు. వాళ్ళు వ్యక్తి ప్రాముఖ్యతని బహిరంగంగానే చూపిస్తారు. వాళ్ళు ఎవరికీ లొంగరు. వాళ్ళు గర్వంతో ఉంటారు. అటువంటి వాళ్ళతో వ్యవహరించటం గురువులకి తేలిక అయిన పని. ఆయన ఆ అహంకారం మీద కొన్ని దెబ్బలు వేస్తే చాలు. అది విరిగిపోతుంది.
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తి పేకాటలో ఆస్తి అంతా పోగొట్టుకుని పేదవాడయిపోతాడు. ఒక రోజు అతను రోడ్డు ప్రక్కన హోటల్లో టిఫిన్ చేద్దాం అని వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
అంతలో వెయిటర్ వచ్చి ఏం కావాలి అని అడుగుతాడు. అతనిని చూసి ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అతను కూడా డబ్బున్న వ్యక్తి, ఇతని స్నేహితుడు. అతనిని చూసి "ఏమిటి నువ్వు ఇక్కడ ఇలా వెయిటర్‌గా ఇలాంటి హోటల్లో పని చేస్తున్నావా? అంటాడు. దానికి ఆ వెయిటర్, “నేను ఇక్కడ వెయిటర్నే. కాని ఇక్కడ నేను తినను” అంటాడు.
(అంతా నవ్వుతారు)
చురుకుగా ఉండే అహంకారాన్ని గుర్తించడం చాలా సులభం. ఇటువంటి అహంకారమున్న వ్యక్తులు వాళ్ళ సంపదలన్నీపోయినా అహంకారాన్ని మాత్రం వదలరు. ఇలాంటి అహంకారాన్ని చక్కగా నియంత్రించవచ్చు.
కానీ నెమ్మదిగా, స్తబ్దతగా ఉండే అహంకారం మాత్రం చాలా సూక్ష్మంగా ఉండి, చాలా కపటంగా ఉంటుంది., ఇటువంటి అహంకారం ఉన్న వాళ్ళు చాలా నెమ్మదిగా అణకువగా, విధేయతతో ఉంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే భయపడతారు. వాళ్ళని మెచ్చుకున్నా సిగ్గుపడి దూరంగా వెళ్ళిపోతారు. అన్నింటి కంటే చాలా చెడ్డది, భయంకరమైన విషయం ఏమిటంటే, వాళ్లు ఈ విధంగా ఉండి మేము అహంకారులం కాదు అని చాలా గట్టిగా నమ్ముతారు. కానీ అసలు సత్యం ఏమిటంటే వాళ్ళు చురుకైన వాళ్ళ కంటే ఎక్కువ అహంకారులు. వాళ్ళు వాళ్ళ అహంకారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. ఇలా విధేయంగా ఉంటూ వాళ్ళ అహంకారానికి దెబ్బ తగలకుండా చూసుకుంటారు.
మీరు ఎప్పుడైతే లోతుగా తెలుసుకొని పూర్తిగా అర్ధం చేసుకుంటారో, అప్పుడు మీరు మీ అహంకారాన్ని కేవలం ఒక పరిశీలకుడిగా ఉండి గమనిస్తుంటారు. ఆ స్థితిలో మీరు విధేయతగా ఉండరు. అహంకారాన్ని ప్రదర్శించరు. మీరు మెప్పులు పొందాలని చూడరు. అలాగే ఎవరైనా మెచ్చుకుంటే సిగ్గుతో వెళ్ళిపోరు. ఆ స్థితిలో మీరు కనీసం ఈ విషయం గురించి ఆలోచించరు. మేము ఇలాంటి వారము అని కూడా అనరు. మీరు కేవలం మీరు మాత్రమే. అంతే. ఎవరైనా మిమ్ములని మెచ్చుకుంటే మీరు కేవలం ఈ అనంత సృష్టికి తిరిగి అప్పచెప్పి దాన్ని అలా వదిలేస్తారు. అంతే. మీకు దేనితో పోల్చుకునే అవసరం ఉండదు. ఇది అది అనే అవసరం కూడా ఉండదు.
కాబట్టి స్పష్టంగా అర్ధం చేసుకోండి; చాలా మంది చురుకుగా ఉంటే అహంకారమే అహంకారం అనుకుంటారు. కానీ నెమ్మదిగా కనపడకుండా ఉండే అహంకారం కూడా ఉంటుంది. దాని వ్యవహారం కష్టం.
చురుకైన అహంకారులు ఎండిన చెట్టు కొమ్ములాంటి వాళ్ళు. అహంకారాన్ని తుంచటం చాలా తేలిక. కానీ అహంకారంతో విధేయంగా ఉండే వాళ్ళ అహాన్ని తుంచలేము. వాళ్ళు పచ్చని కొమ్ములాంటి వాళ్ళు. వాళ్ళ అహానికి దెబ్బతగిలితే వంగుతారే కానీ వాళ్ళ అహాన్ని తుంచలేము. వాళ్ళు అహంకారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడతారు. అందుకే వాళ్ళ అహంకారాన్ని వదిలించాలి అంటే కష్టం. వాళ్ళు అహంకారాన్ని కాపాడుకోవటానికి చాలా కష్టపడతారు. అయితే నెమ్మదిగా, విధేయతతో కాపాడుకుంటారు. అందుకే ఇటువంటి అహంకారం ప్రమాదకరం.
ఉదాహరణకి, ఇప్పుడు మీరు నాతో ఇక్కడ క్లాసులో ఉన్నారు. మీ మనస్సులో చాలా ప్రశ్నలు వుంటాయి. కానీ మీరు వెంటనే అవి అడగరు. వాటిని మీ లోపలే అణచి వేస్తారు. ఎందుకంటే మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మలని తెలివి తక్కువ వాళ్ళు అని అనుకుంటారేమో అనే భయం. మీరు ఎదుటి వారి ముందు తెలివి తక్కువగా కనపడటం మీకు ఇష్టం ఉండదు. మీ అహంకారాన్ని కప్పి దాచిపెడతారు. నా సమక్షంలో ప్రశ్నలు అనేవి కరిగిపోతే అది వేరే విషయం. కాని అది ఇక్కడి విషయం కాదు.
మీరు ఎదుటివారి స్పందనకి, వారి అభిప్రాయాలకి చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తారు. మీరు ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన మీ అహంకారానికి చిన్న దెబ్బ తగిలినా మీరు భరించలేరు. ఇదే మీకు ముఖ్యమైన స్థావరం. మిమ్మలని పట్టి ఉంచే పాయింట్ ఇదే. అది చెదిరిపోతే, మీకు స్థిరత్వం లేనట్టు, ఆధారం కోల్పోయినట్టు అయిపోతారు. కానీ చాలా నెమ్మదస్తులం అనే ముద్ర కింద మౌనంగా ఉండిపోతారు. అప్పుడు మీరు గురువు దగ్గర మీ అహంకారాన్ని ప్రదర్శించే మరొక అవకాశాన్ని కోల్పోతారు. అప్పుడు మీరు వికసించటానికి ముందుకు వెళ్ళ గలిగే మరొక అవకాశాన్ని పోగొట్టుకుంటారు.
మీకు ఒక విషయం చెబుతాను : రోజు చివరికి వచ్చేసరికి అన్ని ప్రశ్నలు తెలివి తక్కువ ప్రశ్నలే. కొన్ని ప్రశ్నలు తెలివైనవి. కొన్ని తెలివి తక్కువ ప్రశ్నలు ఉండవు. మీలో లోతుగా అర్థం చేసుకునే శక్తి ఉంటే, అలా మీరు ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకోగలిగితే ఆ ప్రశ్నలన్నీ కరిగిపోతాయి. ఇది నిజమైన వివేకం అది సరే, మనందరం మన అహంకారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాము.
ఈ అహంకారం ఆడే మరొక ఆట సమాజపు అహంకారం. సమాజపు అహంకారం అంటే ఏమిటి ?
మీరే మనుకుంటారంటే మీ జీవితం పూర్తిగా మీ సొంత వ్యవహారం, బయట వాళ్ళు ఎవరూ కూడా అందులోపలికి రాకూడదు. అందులోకి చూడకూడదు అని.
ఉదాహరణకి : కొంత మంది నా దగ్గరికి వాళ్ళ పిల్లల ప్రవర్తన గురించి చెప్పటానికి వస్తారు. అలా నాతో చెప్పేటప్పుడు చుట్టూ ఎవరైనా ఉంటే చాలా ఇబ్బంది పడతారు. ఎదుటి వాళ్ళకి ఇటువంటి విషయాలు, మీ గురించి తెలియటం ఇష్టం ఉండదు. ఎందుకంటే సమాజం దృష్టిలో మీకంటూ ఒక ప్రత్యేకతని మీరు నిర్మించుకున్నారు. ఆ ప్రత్యేక భావనని, రూపాన్ని మీకు, మీ కుటుంబానికి కల్పించుకుంటారు. మీ కుటుంబం గురించి ఎవరికైనా ఏమైనా తెలిస్తే ఈ ప్రత్యేకత దెబ్బ తింటుందని భయం. అటువంటప్పుడు ఆ ప్రత్యేక భావన కూలిపోతే, మిమ్మలని గురించి సమాజంలో ఏ ప్రత్యేకత ఉండదని భయం. దీనినే సమాజ అహంకారం అంటాను.
మీరు సమాజంలో కష్టపడి నిర్మించుకున్న మీ ప్రత్యేకత, ఏదైతే మీకు ముఖ్యమైన గుర్తింపు ముద్ర అవుతుందో, దేనితో అయితే సమాజం మిమ్మలని గుర్తిస్తుందని అనుకుంటారో, ఆ గుర్తింపు అనుమానస్పదమైనది. అసలు అది కేవలం మీకు మీరు అనుకునే గుర్తింపే తప్ప ఇతరులది కాదు. అలా కాకుండా మీరు మీరుగా, మీ కుటుంబాన్ని యధాతథంగా సమాజానికి చూపగలిగిన రోజున మీరు ఎటువంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉండగలరు. ఎందుకంటే దాచిపెట్టాలనే ఒత్తిడి మీ మీద ఉండదు కాబట్టి.
మీరు ఈ విధంగా అనవచ్చు. "స్వామీజీ మేము మా విషయాలు, కుటుంబ విషయాలు రహస్యంగా ఉంచకపోతే మా చుట్టు ప్రక్కల వాళ్ళు ఆ విషయాల మీదే మాట్లాడుకుంటారు. అదే విషయం చర్చించుకుంటారు".
మీకు ఒక విషయం చెబుతాను. ఎవరికి కూడా ఎవరి గురించీ మాట్లాడే అర్హత లేదు. అలా మాట్లాడితే వాళ్ళు తెలివి తక్కువ మూర్ఖులు. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ఎదుటివారికి అలా మాట్లాడుకునేందుకు ఇచ్చే శక్తి తగ్గుతుంది. దాంతో పాటు వాళ్ళు అలా మాట్లాడటం కూడా మాయమవుతుంది. మీకు మీరు ఆ మాటలతో ప్రభావితమయ్యే శక్తిని ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఆ శక్తి మాయమవుతుంది.
మీరు ఒక తెరచిన పుస్తకంలా జీవించండి. అది చాలు. మీ ధైర్యాన్ని, మీ శరీర కదలకని చూసి, ఎవరూ కూడా మీ గురించి ఉపయోగం లేని మాటలు మాట్లాడరు. నేను చెబుతున్నాను. మీ సమాజ అహంకారాన్ని వదిలివేయండి. ఎటువంటి దాపరికాలు లేకుండా జీవించండి. మీరు గొప్ప స్వేచ్ఛని అనుభవిస్తారు.
ఇటువంటి అహంకారం ఉన్నవాళ్లు ప్రతి క్షణం తమ ప్రతి పనిని భయంతో చేస్తుంటారు. ప్రతి క్షణం తమ మీద శ్రద్ధ నిలుపుతారు. ఎందుకంటే అందరూ తమని చూస్తున్నారు, మన ప్రతి పనిని గమనిస్తున్నారు, మన గురించే మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటారు. అందుకే అలా భయపడతారు.
స్పష్టంగా అర్ధం చేసుకోండి. మీరు అలా మీ ప్రతి పనిని ఎదుటి వారు చూస్తున్నారు అనే భయంతో చేసారు అంటే మీరు అహంకారులు అని అర్ధం. మీకు మీరు చాలా ప్రముఖ వ్యక్తి అని అనుకుంటారు. అందరి కళ్ళూ మీ మీదే ఉన్నాయి అని అనుకుంటారు. అందుకే నిరంతరం మీ ప్రతి చర్యని జాగ్రత్తగా భయంగా చేస్తారు.
నేను ఒక వ్యక్తిని కాదు అని మీరనుకున్నప్పుడు ఈ సమస్య ఉండదు. ఇలాగా ఉంటూ ఎంతో వినమ్రతని ప్రదర్శించుతున్నాను అని మీరు అనుకుంటారు. కానీ ఇది ఒక సమస్య, దీని వలన మీరు బాధపడుతున్నారని కూడా మీకు తెలియదు. కానీ మీరు మిమ్ములను చాలా వినయ విధేయతలు కలిగిన నిదారాంబరమైన వ్యక్తి అని అదే పద్ధతిలో కొనసాగుతారు.
మీరు మీ పై శ్రద్ధతో ఉన్నప్పుడు మీరు జీవిస్తారు, కానీ దానిలో జీవం ఉండదు. అది మీ సహజ సౌందర్యానికి, మీ లోని మృధుత్వానికి పెద్ద ఆటంకం. మీలోని సహజ సౌందర్యం స్వేచ్ఛగా ముందుకు ప్రస్ఫుటం కాదు. జంతువులను, ప్రకృతిని గమనించండి. అవి ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా ఉంటాయి వాటిలో అందం, స్వేచ్ఛ నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. అవి అలా ఎందుకు ఉండగలుగుతాయి? ఎందుకంటే అవి ఈ అనంత చైతన్య సృష్టిలో ఒక భాగమైపోయి మహా ఆనందంగా జీవిస్తుంటాయి. ఎప్పుడయితే ఎదుటివారు మిమ్మలని గమనిస్తున్నారు అని అనుకుంటారో ఆ క్షణంలోనే అహంకారం ముందుకు వస్తుంది. మీరు మీ సహజ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటారు.
చిన్న పిల్లలు పెద్దవాళ్ళలా ఎవరో తమని గమనిస్తున్నారు అని ఇబ్బందిపడరు. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు గమనించండి. వాళ్ళు వాళ్ళ ఆటలలో ఎంతో అమాయకత్వం, అందం కనిపిస్తాయి. మీకు తెలియకుండా తీసిన ఫోటోలలో మీరు చాలా అందంగా ఉంటారు. అదే ఫోటోకి ఫోజు ఇవ్వమని తీసిన ఫోటోలో మీరు అంత అందంగా ఉండరు.
ఎప్పుడయితే ఫోటోకి ఫోజు పెట్టమంటారో మీరు కాన్షియస్ గా అయిపోతారు. మీ అహంకారం ఎదుటివాళ్ళు మిమ్మలని గురించి ఏమనుకుంటారో అని ఆలోచించుతారు. అటువంటి అహంకారం ఉన్నవాళ్ళు నిరంతరం ప్రతి పనిలోను ప్రతి విషయంలోను ఉండే మంచి చెడులు, లాభనష్టాలు లెక్కకడుతుంటారు. ఇవన్నీ ఎదుటివారి అభిప్రాయాల ప్రకారం వాళ్ళ ఇష్టాల ప్రకారం లెక్కకడతారు. అలా చేస్తూ వాళ్ళ స్వేచ్ఛని పోగొట్టుకుంటారు.
ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు నేను మిమ్మలని కళ్ళకు బాండ్స్ గంతలు కట్టుకోమని చెబుతాను. నేను అలా చెప్పగానే మీరు ముందుగా అందరివైపూ చూస్తారు. వాళ్లు కట్టుకున్నారా లేదా గమనిస్తారు. ఈ ధ్యాన మందిరంలో కూడా మీరు అలాగే ఉంటారు. మీరు కళ్ళకి ఆ బాండ్ కట్టుకున్నా తరువాత కూడా నేను, ఇక్కడ ఉన్న
వాలంటీర్స్ మిమ్ములని చూస్తున్నారేమో అనే భావంతో మెడిటేషన్ సరిగ్గా చేయరు. ఏదో యాంత్రికంగా ధ్యానం చేస్తారు. దాంతో మీరు ఇక్కడికి వచ్చికూడా సాధించాలి అనుకున్నది సాధించలేకపోతున్నారు.
మీరు ఎప్పుడయితే లెక్కలు కట్టటం మానివేస్తారో, ఎప్పుడైతే అమాయకత్వంతో మీ వ్యకిత్వాన్ని తెరచి ఉంచగలుగుతారో అప్పుడు మీరు అద్భుతాల తోటి, స్వచ్ఛతతోటి నింపబడతారు. అప్పుడు మీ జీవితంలో అణచి వేయబడటం, స్తబ్దత అనేవి ఉండవు.
మరొక విషయం : అమాయకుడు ఎవరికీ ఎటువంటి హాని చేయడు. ఎందుకంటే హాని చేయాలంటే లెక్కలు కట్టే సామధ్యం ఉండాలి. ఒక వేళ అటువంటివారు తెలియక హాని చేసినా ఎవరూ బాధ పడరు, ఎందుకంటే వాళ్ళు అలా చేయాలి అని అనుకోలేదు అని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ శరీర కదలికలు ఆ విషయాన్ని చెబుతాయి.
ఇప్పుడు మనం మరొక అహంకారాన్ని చూద్దాము. అది విజ్ఞానంతో వచ్చే జ్ఞాన అహంకారం. మీరు పెద్ద అయ్యే కొద్దీ మీకు అందరితో ఉండే పరిచయాల తోటి, పుస్తకాలలో చదివిన జ్ఞానంతో మీరు అందరి అభిప్రాయాలను పోగుచేసుకుంటారు. ఇదంతా కూడా కలిసి మీకు జ్ఞానంలా తయారవుతుంది. ఇది మీకు మానసిక రూపంలా అవుతుంది. అపుడు మీరు దేనిని చూసినా మీలో అంతకు ముందే తయారయిన మీ మానసిక రూపంతోనే చూస్తారు.
మీరు దేనిని చూసినా అది మీరు అంతకు ముందే ఏర్పరచుకున్న మీ అభిప్రాయాలకు ఆధారమయ్యే వాదనలుగానే ఉంటాయి. మీరు అక్కడే జీవం లేనట్టు స్థిరపడిపోతారు. మీలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. మీరు నిరంతరం మీ కళ్ళ అద్దాలకి మీరు వేసుకున్న రంగుల గుండానే అన్నింటినీ చూస్తారు. దీని వలన ఈ అద్భుత ప్రపంచంలో ఉన్న ఎన్ని అద్భుతాలని మీరు చూడలేకపోతున్నారో మీకు తెలియదు.
ఒక చిన్న కథ :
ఒకతను మరొక వ్యక్తితో ఇలా అంటాడు, "నీకు తెలుసా నేను ఎంత తెలివి తక్కువ పని చేశానో" అని.
ఆ వ్యక్తి అడుగుతాడు, "ఏమి జరిగింది?" అని.
దానికి ఇతను, ఇలా జవాబు చెబుతాడు, "నేను మా ఇంట్లో కిటికీలు పగిలిపోయాయి అనుకుని వాటిని మార్చాను, తీరా చూస్తే నా కళ్ళజోడు అద్దం పగిలి ఉంది'.
మనం ఒక్కసారి మన అంతరంగంలోనికి చూసుకుని అర్ధం చేసుకోగలిగితే, మనం చూసే ప్రతి దానిలో 'మనం' అనే విషయం ఉంది అని తెలుస్తుంది. కాని ఎందుకో మనం అలా చూడటానికి ఇష్టపడం. మనకి అన్నీ తెలుసు అనుకుంటాము. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ లౌకిక జ్ఞానం మనలని మనంగా తయారయ్యే అవకాశం ఇవ్వదు.
మరొక ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ జ్ఞానంతో మీరు స్థిరపడిపోయారు, అది బలంగా తయారయిపోతుంది. ఆ జ్ఞానంతోనే మీరు అంత బలపడ్డారని అనుకుంటారు. కానీ మీ అంతరంగం మీద బరువుగా మారారని మీకు తెలియదు.
మీ ఉనికి యొక్క సహజ లక్షణం ప్రవహించటం. కాని ఈ జ్ఞానంతో మీరు దాని ప్రవాహాన్ని ఆపి అది నిలిచిపోయేటట్టు చేసారు. అటువంటిది నిజమైన జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానం అంటే ఇలా గట్టి పడిపోయిన జ్ఞానాన్ని ఎలా వదిలివేయాలో చెప్పేది మాత్రమే. అది పసి మనసులా యధాలాపంగా ఉంటుంది. నిరంతరం ప్రవహించుతూనే ఉంటుంది. మీరు అహంకారం నుంచి అప్రయత్నంగా జరిగేలా మారాలి.
మనం జీవితంలో చూసిన ప్రతి దానిని ఏదో ఒక పేరు మీద విభజించి, దానికి ఒక ముద్రని వేస్తాము. అలా చేసి జీవితంలోంచి అప్రయత్నంగా చేసే పద్ధతిని పూర్తిగా తొలగించేస్తాము. మన జీవన గమనంలో ఎదురు వచ్చే మనుషులను, స్థలాలని, విషయాలని, సంఘటనలని అన్నింటినీ కూడా ఏదో ఒక భాగంలో ఒక తరగతిగా విభజించేస్తాయి.
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తి సినిమా చూద్దామని ఒక థియేటర్‌కి వెళ్ళాడు. సినిమా ముందుగా ఆ సినిమా స్టూడియో పేరుతో ప్రారంభమయింది. అది చూడగానే అతను “అయ్యో! ఈ సినిమా నేను ఇంతకు ముందే చూసేశాను” అని అనుకుని లేచి హాలు బయటికి వచ్చేస్తాడు.
(అంతా నవ్వులు)
ఆ స్టూడియో వాళ్ళు తీసిన ప్రతి సినిమాకి ముందుగా ఆ పేరు వేస్తారు. అతను ఆ పేరు చూసి నేను సినిమా చూసేశాను అని నిర్ణయం చేసేసి బయటికి వెళ్ళిపోయాడు. దాంతో అతను మొత్తం మిస్ అయ్యాడు.
మనందరం అలానే ఉంటాము. ముఖ్యంగా పెద్దవాళ్ళు. చిన్న పిల్లలని చూడండి, వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు ప్రతి విషయాన్ని కొత్తగా చూస్తారు. వాళ్ళు జీవితంలో సంపూర్ణంగా జీవిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. మనలా జీవంలేని వారిలా ఉండరు.
మీరు బీచ్‌కి వెళ్ళినప్పుడు గమనించండి. ముఖ్యంగా పిల్లలని చూడండి. ఎంత ఉత్సాహంగా ఉప్పొంగుతుంటారో. కానీ మీరు ఏమి చేస్తారు. ఈ బీచ్ నాకు తెలుసు, కొత్త కాదు అన్నట్టు చూస్తారు. ఈ చైతన్యపు ప్రకృతిలో ప్రతిక్షణం మారే అందాలని మీరు రంగు కళ్ళ అద్దాలనుంచి చూడలేరు.. మీరు ఆ కళ్ళ అద్దాలని వదలలేరు. మీకు ఉన్న జ్ఞానాన్ని చూపించటానికి ఈ బీచ్ మరొక స్థలం అవుతుంది. అంతే.
మీకు ఒక విషయం చెబుతాను. మీరు జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా గడపలేకపోతున్నాము అని అనుకుంటే, దానికి కారణం మీ మైండ్; మీలో బలంగా గట్టిపడిపోయిన మీ అహంకారం. అంతే కానీ జీవితం అందంగా లేక కాదు.
చిన్న కథ :
ఒక వ్యక్తి శలవులు గడపటానికి ఒక నెల రోజులు స్విట్జర్లాండ్ వెళతాడు. అతను నెల అయ్యాక తిరిగి వస్తాడు. అతనిని ఒక స్నేహితుడు "స్విట్జర్లాండ్ చాలా అందంగా ఉంటుందట కదా! నీవు బాగా ఎంజాయ్ చేసావా?" అని అడుగుతాడు.
దానికి అతను "అవును ఒక విధంగా అంతే, కానీ మధ్య మధ్యలో కొండలు వస్తుంటాయి" అంటాడు.
(అంతా నవ్వులు)
మనలో సున్నితత్వం అసలు ఉండదు. మనం ఈ ప్రకృతికి చాలా దూరం వెళ్ళిపోయాము. మన చుట్టూ ఎంతో అందం ఉంది, కానీ దానిని చూసి మనం ఆనందపడలేక పోతున్నాం. అసలు ఏమైంది? మీరు చాలా గంభీరంగా తయారయ్యారు. సంతోషపడడం మరచిపోయారు. మీకు ఉండే జ్ఞానంతో మీరు స్తబ్దతగా, డల్ గా అయిపోయారు.
నేను ఇంతకు ముందు చెప్పాను. నన్ను చాలా సార్లు చాలామంది అడుగుతుంటారు, "స్వామిజీ! మీకు ఉన్న అపారమైన జ్ఞానంతో మీరు చిన్న పిల్లవాడిలా ఎలా ఉండగలుగుతున్నారు. మీరు జోక్ చేస్తారు. అప్రయత్నంగా, సహజంగా నవ్వుతారు. మేము మీ వైపు భక్తితో, వినయంతో చూస్తాం. అదే మేము అయితే అంతకు ముందు విన్న జోక్ అయితే మేము నవ్వము. కానీ మీరు మాత్రం ఎవరో మీకు కొత్తగా చెబుతున్నట్టు హాయిగా, ఆహ్లాదకరంగా నవ్వేస్తారు. ఇది ఎలా సాధ్యం?"
మీరు యధాలాపంగా అప్రయత్నంగా జీవించటాన్ని, జీవితాన్ని సంతోషంగా ఉంచగలిగే శక్తినీ మర్చిపోయారు అని వాళ్ళతో చెబుతుంటాను. ఆ మాటకి అర్థం ఇదే. మీకు ఉన్న జ్ఞానంతో నాకు అన్ని తెలుసు అనే దృక్పదాన్ని పెంచుకున్నారు. ఈ సందర్భంగా నేను మీకు ఒక సంగతి చెబుతాను. ఈ విషయాన్ని నేను నా ప్రతి ఉపన్యాసంలోను చెబుతాను. నేను ఎన్నిసార్లు చెప్పినా నాకు చాలా నవ్వు తెప్పించే సంఘటన ఇది.
తమిళనాడు పల్లెలలో సంవత్సరానికి ఒకసారి గుడిలో ఉత్సవాలు చేస్తారు. అప్పుడు బయట స్టేజీలు కట్టి దాని మీద నాటకాలు ప్రదర్శించుతారు. నాటకాలు వేసే ట్రూపులు వచ్చి నాటకాలు వేస్తారు. వాళ్ళు సామాన్యంగా మహాభారతం, రామాయణంలోని కొన్ని ఘట్టాలను నాటకంలా ప్రదర్శించుతారు. నేను వెళ్ళి ఆ నాటకాలు చూస్తుండే వాడిని.
ఒక సారి ద్రౌపతి వస్త్రాపహరణం నాటకం వేస్తున్నారు. అందులో దుశ్శాసుడు ద్రౌపతిని అవమానిస్తుంటే శ్రీ కృష్ణుడు ఆమెను రక్షించుతాడు. ద్రౌపతి పాత్ర ఒక మగతను వేస్తున్నాడు. నాటకం ప్రకారం అతను 7 చీరలు కట్టుకుంటాడు. దుశ్శాసనుడు ఒక దాని తరువాత ఒకటి చీరలు లాగాలి. 7వ చీర వచ్చేటప్పటికి ద్రౌపతి రక్షించమని కృష్ణుని వేడుకుంటే, కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు.
పొరబాటున ఆ రోజు ద్రౌపతి పాత్ర వేసే అతను ఆరు చీరలే కట్టుకున్నాడు. దుశ్శాసనుడు చీరలులాగేపప్పుడు ద్రౌపతి పాత్ర వేసిన వ్యక్తి తప్పు తెలుసుకొని దుశ్శాసనుడితో వదలమని గట్టిగా అరుస్తూ చెబుతాడు. అయితే దుశ్శాసనుడు ద్రౌపతి చాలా బాగా యాక్ట్ చేస్తుందని అనుకొని పూర్తిగా చీరని లాగేస్తాడు.
అప్పుడు ద్రౌపతి పాత్ర వేసిన వ్యక్తి పైన జాకీటు కింద ఫాంట్‌తో స్టేజ్‌మీద నిలబడతాడు. అప్పుడు చాలా సమయస్పూర్తితో అతను గట్టిగా, "హే! కృష్ణా! నీవు ఎంత దయ గలవాడివి నన్ను అవమానం నుంచి కాపాడటానికి నన్ను పురుషునిగా మార్చేసావా" అంటాడు.
(స్వామీజీ నవ్వుతూ చెబుతారు) (హాలు నవ్వులతో నిండిపోయింది)
నాకు ఆ సీను ఎప్పుడు గుర్తు వచ్చినా నేను నవ్వు ఆపుకోలేను.
అందుకే, అర్థం చేసుకోండి; జ్ఞానం అవసరం కానీ దానితో మీరు గట్టిపడిపోకండి. మీ సహజ లక్షణం నదిలా నిరంతరం ప్రవహించటం, యధాలాపంగా, అప్రయత్నంగా ఉండటం అనేవి మీ సహజ స్వభావం. ఈ సంపాదించిన జ్ఞానం
వలన మీరు ఈ లక్షణాలకి దూరంగా వెళ్ళిపోయారు. మీరు అమాయకత్వంతో జీవించగలిగితే మీ కోసం ఒక కొత్త బంగారు లోకం తలుపులు తెరచి మిమ్ములని లోపలికి ఆహ్వానిస్తుంది.
ప్రతి క్షణాన్ని వికాసంతో ఎదుర్కొనండి. ఎటువంటి అభిప్రాయాలతో మీరు ఆ క్షణాలని సమీపించవద్దు. మీరు అలా జీవించగలిగితే మీకు ప్రతి రోజు కొత్తగా అందంగా ఉంటుంది. దానిని చక్కగా ఆనందించగలుగుతారు. మీకు లౌకిక ప్రపంచం అనేది ఉండదు. మీ నిజజీవితం ఎంతో కొత్తగా ఉండి మీరు ఇంత కాలం కలసి జీవిస్తున్న మీ భార్య చాలా కొత్తగా అనిపిస్తుంది.
ఇదే మీ దృక్పథం అయితే ఎదుటి వ్యక్తులు మీలో వికసించిన వ్యక్తిత్వాన్ని చూసి ఆనందించతారు. వాళ్ళు కూడా మీకు మరింత చేరువ అవుతారు. దానితో జీవితం ఆనందంగా ఉంటుంది. ఇలా మీరు ఒక అనంతమైన వృత్తంలోనికి వెళతారు. క్రొత్తదనం నుంచి క్రొత్తదనంలోనికి వెళుతూ ఉంటారు. అప్పుడు మీకు ఎక్కడ చూసినా స్వచ్ఛమైన కొత్తదనమే కనిపిస్తుంది. కానీ నిలవ అయిన గుర్తులు కనబడవు.
మీరు మీ అహంకారంతో జీవిస్తే, మీకు మీ చుట్టూ చాలా సామాగ్రి, సరంజమా కొంత ఆధారం, మనుషులు ఎప్పుడూ ఉండాలి. ఇటువంటి ఆధారమే మీకు గుర్తింపునిస్తుంది. అది లేకపోతే మీరు ఏమీ కాదు. ఒక రాజు కేవలం రాజ్యం ఉంటేనే రాజు. అదే పరమహంస అయిన వ్యక్తికి అసలు ఏమీ అవసరం లేదు. అయన కాళ్ళు చాపి నిద్రిస్తాడు. చేయి చాపి ఆహారం తీసుకుంటాడు. ఆయన కేవలం ఈ చైతన్య సృష్టి యొక్క ప్రవాహంతో పాటుగా జీవిస్తాడు. ఆయన ఆయనకి రాజు. ఆయనకి రాజ్యాలు అవసరం లేదు. ఆయన సర్వం తెలిసిన జ్ఞాని ఆత్మ జ్ఞాని.
మీరు పరమహంస అయితే మీ చుట్టూ అప్రయత్నంగా వాటంతట అవే మహా సామ్రాజ్యాలు ఏర్పడతాయి. కానీ పరమహంసని అవి ప్రభావితం చేయవు. ఆయన వాటిని అంటడు. అవి ఆయనను అంటుకోలేవు. కేవలం బలహీనులు మాత్రమే
ఆధారం కోసం రాజ్యాలు ఏర్పరచుకుంటారు. కానీ పరమహంసకి ఆయన స్థితి ఆయన సర్వస్వం. ఆయన చుట్టూ అలముకునే పేరు ప్రతిష్ఠలు ఆయనను ఏ విధంగా కూడా ప్రభావితం చేయలేవు.
మీరు సామాగ్రి, సరంజామా కోసం వెతుకుతుంటారు. ఎందుకంటే అవి లేనప్పుడు జీవితం చాలా ఖాళీగా కనబడుతుంది. జీవితం లౌకికంగా, స్తబ్దతగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నిరంతరం అద్భుతాల కోసం వెతుకుతుంటారు. మీ కళ్ళ ముందే ప్రతి నిమిషం ఈ అనంత చైతన్య సృష్టి యొక్క అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. మీరు మీ అహంకారంతో నిండిపోయి చూడలేక పోతున్నారు.
మీ శరీరమే ఒక అద్భుతం. అది ఒక గొప్ప సూపర్ కంప్యూటర్ కంటే గొప్పది. మీలో ఉండే కోట్ల కొలది కణాలలో వేలకొద్ది చర్యలు జరుగుతుంటాయి. ఈ ప్రపంచంలో అది ఒక అద్భుతం. మీరు మీ మైండ్‌ని వదిలిపెట్టి, ఈ సృష్టికి అనుగుణంగా జీవించగలిగితే, మీరు ఏ అద్భుతాల కోసమైతే వెతుకుతున్నారో అవి ఈ సృష్టిలో ఉన్నాయి అని మీకు అర్ధం అవుతుంది. మీలోని అహంకారం ఇవన్నీ మామూలే అని అనిపించేటట్టు చేస్తుంది. అంతే, మీలోని జ్ఞానం విషయాలను ముక్కలుగా చేసి విశ్లేషణ చేసి వాటిని మాములు ప్రాపంచిక విషయాలుగా మార్చేస్తుంది.
ప్రశ్న : స్వామీ! మాకు తెలిసి కూడా ఈ విషయాలను మా లోనికి ఎందుకు తీసుకుంటాము?
ఇది మంచి ప్రశ్న : మనం మన జీవితాన్ని సంతోషంగా గడిపే విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు సమస్యలని బాధలని ఎంచుకుంటాము...?
చూడండి. మీ అంతరాత్మ మీ అంతరంగంలోని ఉనికి మీ నిజమైన గుర్తింపులు అనే విషయం మీకు తెలియదు. మీరు క్రమంగా బయట ప్రపంచపు విషయాలతో సంబంధాలు పెంచుకొని అందులో మీ వ్యక్తిత్వాన్ని గుర్తించాలని ప్రయత్నిస్తారు.
అవి అన్నీ కూడా అబద్ధపు గుర్తింపులే. మీరు బయట ప్రపంచంలో సంబంధాలు పెట్టుకోవచ్చు. కానీ ఈ అబద్ధపు గుర్తులు కేవలం మీ అహంకారం మాత్రమే. ఇవి కేవలం ఇతరులు మీకు అంటించిన ముద్రలు మాత్రమే. దాంతో మీరు నిజంగా ఏమిటో మీకు తెలియదు.
నేను మిమ్మలని మీరు ఎవరు? అని అడిగాననుకోండి, మీరు ఇలా జవాబు ఇస్తారు; “నేను పలాన ఆయన కొడుకుని, పలానా వ్యక్తి భార్యని, నేను డాక్టరుని...” ఇలా చెబుతారు. కానీ అవన్నీ ఏమిటి? ఇవన్నీ సంబంధాలు, మీరు చేసే వృత్తులు. మీరు మీ తండ్రికి కూతురు; మీ భర్తకు భార్య, మీ పిల్లలకి తల్లి. ఇవన్నీ మీరు చుట్టూ ఉండే వారికి ఏమిటో అది మాత్రమే. మరి మీకు మీరు ఏమిటి?
మీరు ప్రస్తుతం సంబంధాలలో, వృత్తులోనే జీవిస్తున్నారు. వీటి మీద మీ అహంకారాన్ని నిర్మించుతారు. మిమ్మలని మీరు దీని ద్వారానే గుర్తించుతారు. అందుకే మీ ప్రత్యేకమైన గుర్తింపుని మీరు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇది మానవ నిర్మితమైన సున్నితమైన వస్తువు. ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అందుకే దానిని రక్షించుకోవటానికి మీరు చాలా శ్రమ పడాలి.
మీ సహజ లక్షణం నిజానికి ఒంటరితనమే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు ఒంటరిగానే ఉన్నారు. మీకు మీరు చాలు. అదే మీ ప్రత్యేకమైన ఏకత్వం. కానీ కొంతకాలం గడిచేసరికి మీ ఏకత్వం మాయమయిపోయి ఆ స్థలంలోనికి మీ వ్యక్తిత్వం వచ్చేస్తుంది. ఏకత్వం సహజమైనది; వ్యక్తిత్వం సమాజపరమైనది.
ఇది ఎలా ఉంటుందంటే, ఒక పార్శిల్ని ఒక చోటు నుంచి వేరే చోటుకి పంపించేటప్పుడు దాని మీద చాలా ముద్రలు వేస్తారు. పార్శిల్ అంటే ఆ ముద్రలు కావు. పార్శిల్ అంటే అందులో ఉండే పదార్ధం. అవును కదా? అలాగే మీరు ముద్రలు కాదు. సమాజంలో మీ చుట్టుప్రక్కల వాళ్ళు వేసే ముద్రలు మీరు కాదు. మీ లోపల ఉండేదే నిజమైన మీరు.
కొంతకాలానికి ఈ ముద్రల మీద మీ అహంకారం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు మీరు ఇంకా చాలా మంది చాలా ముద్రలు వేయాలి అని కోరుకుంటారు. అందుకే మీరు ఒంటరిగా ఉండలేను అని అనుకుంటారు. మీతో మీరు ఉండలేను అని అనుకుంటారు. మీరు మీతో మాత్రమే ఉంటే మీ చుట్టుప్రక్కల మీ అహంకారానికి ఆహారం అందించే మనుషుల గొంతులు మీకు వినపడవు. మీ అహంకారానికి ఆహారం అందదు. అప్పుడు మీరు ఏం చేస్తారు. కనీసం టి.వి. అయినా చూద్దాం అని టి.వి. చూస్తారు.
చిన్న కథ :
ఒక పెద్ద రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి మరణిస్తుంటాడు. అతని స్నేహితులకి ఆయన తన విశ్వాసాన్ని ప్రతిపక్ష పార్టీ వైపు మరల్చాడు అని తెలుస్తుంది. వాళ్ళు ఆయనని ఎందుకు అలా చేసావు అని అడుగుతారు. దానికి ఆయన, "ఓ! నేను వారిలో ఒకరిలా మరణిస్తాను" అని అంటాడు.
(నవ్వులు)
మన ఈ అబద్దపు గుర్తింపులు చాలా బలంగా ఉంటాయి. అవి నిజాలేనేమో అన్నంతగా మనలో గట్టిపడిపోతాయి. మనలని నిజాలని చూడకుండా గుడ్డివాళ్ళని చేస్తాయి. మన మరణ సమయంలో కూడా మనం మన అహంకారాన్ని, ప్రతిష్టని వదులుకోవటానికి ఇష్టపడం. మనం అచేతన స్థితిలో బ్రతుకుతాం, అందులోనే మరణిస్తాం.
మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటామనే భయం మిమ్ములని ఈ విధంగా ప్రవర్తించేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తిత్వం మీకు ఉండే ఆధారం. అందుకే అంటాను, మీ అహంకారం ఆటలు ఆడుతుంది అని. ఆధ్యాత్మికత అంటే నేను మీకు ఉండే గుర్తింపులని, అహంకారాన్ని వదిలివేయటం. ఇది జరగాలంటే మీరు నమ్మకాలలోంచి, నిమగ్నమయిపోవటం నుంచి బయటకి వచ్చి పరిశీలకునిగా మారాలి. మీరు పరిశీలకుడిగా మారినప్పుడు మీరు పార్శిల్ లోపల ఉన్న పదార్థం. అంతే కాని దాని మీద ముద్రలు కాదు అని తెలుస్తుంది. మీరు ఈ విషయాన్ని తెలుసుకోగలిగినప్పుడు, మీకు ఉపన్యాసాలతో, బోధనలతోగాని, పాఠాలతో కానీ అవసరం ఉండదు.
ప్రశ్న : స్వామీజీ, మేము మీకు అంటే మా గురుదేవుని ఆధీనంలోనికి వెళ్ళినప్పుడు మీరు మా అహంకారం పోయేటట్లు చూస్తారా?
మీరు గురువుకి పూర్తిగా ఆధీనులైతే మీరు జ్ఞానోదయం పొందినట్టే. అప్పుడు నేను ఆధీనమైతే అనే ప్రశ్న రాదు. సరే కనీసం వాధనని అర్ధం చేసుకోవటానికి చెబుతాను; నన్ను మీ లోపలికి ప్రవేశింపనిస్తే, నేను మీ లోపలి అహంకారాన్ని తొలగిస్తారు. దానిని చిన్న వృక్షంలా చేస్తాను. అప్పుడు మీరు అహంకారాన్ని పూర్తిగా వదిలివేస్తారు. మీకు జ్ఞానోదయం కలుగుతుంది.
మీకు మీ నిత్యజీవన పనులు చేసుకోవటానికి సరిపడా అహంకారం కావాలి. అయితే అది మిమ్ములని కానీ ఎదుటివారిని కాని బాధించకూడదు. మీ అహంకారం వేగిపోయిన విత్తనంలా ఉంటుంది అని అర్థచేసుకోండి. ఎవరికైతే జ్ఞానోదయం కాదో అతనిలో ఏ మూలనో ఏదో రూపంలో అహంకారం ఉంటుంది. మీలో ఉండేది చరుకైన అహంకారం కావచ్చు. లేదా వినయంతో కూడిన అహంకారం కావచ్చు. ఏది అయినా సరే, మీరు పరిశీలకునిగా మారి దానిని గమనిస్తుంటే అహంకారం క్రమంగా కరిగిపోతుంది. మీరు ఇప్పటికి ఇది అర్థం చేసుకుంటే చాలు.
మీరు మీ చుట్టుప్రక్కల వారితో తిరిగేటప్పుడు, కలిసి జీవించేటప్పుడు, మీలోని అహంకారానికి ముసుగువేసి అది కనపడకుండా చేయవచ్చు. కానీ గురువు దగ్గర అలా మోసం చేయలేరు. మీరు ఆయనని మోసం చేస్తున్నాను అనుకుంటారు, కానీ మిమ్ములని మీరు మోసం చేసుకోవటమే. మీరు ఎంత లోతుగా దాచేసినా,
ఎంతనేర్పులో దానికి మూతవేసిపెట్టిన, మీ అహంకారం గురుదేవుని చూపులనుండి మాత్రం తప్పించుకోలేరు. మీరు దానిని దాచిపెట్టడానికి నానా తంటాలు పడుతుంటే, గురువుగారు దానికి చికిత్స చేస్తారు. కేవలం గురువుకి మాత్రమే దాని వ్యాధి గురించి తెలుసు.
మీకు భగవద్గీత నుంచి కొన్ని విషయాలు చెబుతాను. భగవద్గీత భగవానుడయిన శ్రీకృష్ణుడు ప్రపంచానికి చేసిన బోధన.
భగవద్గీతని ఆరంభించినపుడు అర్జునుడు అయోమయంలో ఉంటాడు. ఆయన భగవంతునితో, "హే! దేవా! జీవితంలో నాకు ఏం చేయాలో తెలియటం లేదు. నా పై కరుణ చూపి నాకు మార్గాన్ని చూపించు" అని ప్రార్థిస్తాడు.
శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునికి సాంఖ్య యోగం వివరించతాడు. అది ఆత్మని చేరే మార్గం.
తరువాత ఆయన కర్మ యోగం, భక్తి యోగం, కర్మ సన్యాసయోగం, ఆ తరువాత జ్ఞాన కర్మ సన్యాస యోగం, ఆ తరువాత రాజయోగం ఇలా ఒక దాని తరువాత ఒకటి వివరించతాడు.
ఆయన వివిధ ధ్యాన పద్ధతులని 700 శ్లోకాలలో 18 అధ్యాయాలలో వివరించతాడు.
చివరిలో అర్జునుడు ఈ విధంగా అంటాడు, "శ్రీ కృష్ణా! నేను చాలా అయోమయంలో ఉన్నాను. నీవు నాకు ఈ వివరాలు చెప్పే ముందు ఉన్న స్థితి కంటే ఇంకా అయోమయంలో పడిపోయాను. నేను ఏ పద్ధతిని అనుసరించను? ఏ పద్ధతి మంచిది? ఏది త్వరగా ఫలితాలనిస్తుంది? అన్నింటి కంటే చిన్నది ఏది. అసలు అంతిమమైనది ఏది? ఈ ప్రశ్నకు శ్రీ కృష్ణుడు 18వ అధ్యాంలో జవాబు ఇస్తాడు. ఏ గురువు అయినా ఆయన ఇచ్చే ముగింపు వ్యాఖ్యలే చివరివి. అవే అంతిమ సత్యాలు.
సర్వ ధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం ప్రజ
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయి ష్యామి మాశుచః
ఈ శ్లోకంలో భగవానుడు చెప్పిన విషయాలు ఎలా ఉంటాయంటే ప్రపంచంలోని మతాలన్నింటినీ మతపరమైన గ్రంథాలు వేదాంతాలు అన్నీ ఒక పాలతో నిండిన కుండ అని అనుకుంటే, ఈ శ్లోకం అందులోంచి చిలికి తీసిన వెన్నముద్ద.
శ్రీ కృష్ణుడు ఈ విధంగా చెబుతాడు, "నేను నీకు అన్ని రకాల న్యాయం చెప్పాను. నీవు మొత్తాన్ని నా ఆధీనం చేయి. నీవు ఆధీనుడవయిపో. నేను నిన్ను సంరక్షిస్తాను. నిన్ను సమస్త పాపాల నుంచి స్వేచ్ఛపొందేలా చేస్తాను. నిన్ను పూర్తి విముక్తుడిని చేస్తాను.
శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో అందమైన, అద్భుతమైన ప్రమాణం చేస్తాడు. ఈ శ్లోకం ద్వారా శ్రీ కృష్ణుడు ప్రపంచానికి "ఆధీనమైపోవటం" అనేది చిట్ట చివరి, స్థిరమైన అంతిమ పద్ధతిని చెబుతాడు. అది అహంకారాన్ని వదిలి సర్వ స్వేచ్ఛని పొందటానికి ఉండే అంతిమ పద్ధతి.
శ్రీ కృష్ణుడు అర్జునుని గురించి మరొక చక్కటి కథ ఉన్నది.
ఒకరోజు సాయంత్రం శ్రీకృష్ణుడు, అర్జునుడు వ్యాహ్యాళికి వెళతారు.
అకస్మాత్‌గా శ్రీ కృష్ణుడు ఒక కాకిని చూపించి 'అర్జునా, ఆ ఆకుపచ్చ కాకిని చూడు' అంటాడు. అర్జునుడు అటువైపు చూచి "అవును కృష్ణ, నేను దానిని చూసాను" అంటాడు. కొంచెం సేపు అయ్యాక శ్రీ కృష్ణుడు "అర్జునా! ఆ నల్లటి కాకిని చూడు" అంటాడు. అప్పుడు అర్జునుడు అటు చూసి "అవును కృష్ణా! దానిని నేను చూశాను" అంటాడు.
శ్రీ కృష్ణుడు అర్జునుని పరీక్షించాలి అనే ఉద్దేశంతో "అర్జునా! ఎంత మూర్ఖుడిగా ఉన్నావు. ఎక్కడా ఆకుపచ్చని కాకి ఉండదు. నేను ముందు అలా చూపించినప్పుడు, నీవు ఎలా చూశావు" అంటాడు. దానికి అర్జునుడు "కృష్ణా! నీవు ఎప్పుడైతే ఆకుపచ్చని కాకి అన్నావో నేను అక్కడ ఆకు పచ్చని కాకినే చూశాను" అంటాడు.
అర్జునుని యొక్క సర్వేంద్రియాలు కూడా శ్రీ కృష్ణుని ఆధీనం అయిపోయాయి. గురువుకి సర్వేంద్రియాలనీ ఆధీనం చేయటం అన్నింటి కంటే కష్టమైన పని.
గురుదేవుడే ఈ సమస్త సృష్టి. ఆయన రూపంలేని రూపం గలవాడు. గురుదేవులు చెప్పినవి మాత్రమే మీ సర్వేంద్రియాలు గ్రహించగలిగినపుడు మీరు అత్యున్నత స్థానానికి చేరినట్టే.
అసలు ఈ ఆధీనం అంటే ఏమిటి? దీనికి చాలా లోతైన అర్ధం ఉన్నది. దీనిని మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతే, మీరు తప్పుగా అర్ధం చేసుకుంటారు. అలా చేస్తే మనం చాలా ప్రమాదకరమైన తప్పు చేసినట్టే. ఒక సత్యాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నావాళ్ళం అవుతాము.
ఒక చిన్న కథ :ఒక రోజు ఇద్దరు తాగుబోతులు రాత్రి పూట రోడ్డు మీద వీధి లైటు ప్రక్కగా నడుస్తుంటారు. వాళ్ళలో ఒకతను దానిని చూసి "చూడు సూర్యుడు మన కోసం క్రిందికి దిగి వచ్చాడు" అని అంటాడు
దానికి రెండవ వ్యక్తి; "అది కాదు. ఇప్పుడు రాత్రి సమయం. అది చంద్రుడు" అని అంటాడు.
మొదటి వ్యక్తి "కాదు. అది పసుపు రంగులో ఉన్నటి కాబట్టి అది సూర్యుడే" అంటాడు.
మరొక తాగుబోతు అటు వెళుతుంటాడు.
వాళ్ళు అతనిని పిలిచి ఇది సూర్యుడా, చంద్రుడా అని అడుగుతారు.
దానికి ఆ మూడవ వ్యక్తి, "నేను ఈ ప్రాంతానికి కొత్త. నాకు తెలియదు" అంటాడు.
(అంతా నవ్వుతారు)
కాబట్టి అసలు జవాబు తెలియని వ్యక్తిని మీరు ప్రశ్నించితే మీకు జవాబు రాదు, లేదా తప్పు జవాబు వస్తుంది.
ఎవరికైతే అనుభవం ఉన్నదో వాళ్ళే సరిగ్గా వివరించగలరు. మీరు ఆ అనుభవం లేని వ్యక్తిని అడిగితే అతను ఏమంటాడు, "మీకు ఉన్నదంతా భగవంతునికి ఆధీనం చేయండి. అంతే" అంటాడు.
ఒక వ్యక్తి నా దగ్గరకి వచ్చి "నేను భగవంతునికి అన్నీ ఆధీనం చేస్తే నాకు అంతా బాగుంటుందా" అని అడిగాడు.
నేను అతనితో, "అవును. నీవు నిజంగా అన్నీ భగవంతునికి ఆధీనం చేస్తే, అంతా బాగుంటుంది" అని జవాబు చెప్పాను
మూడు రోజులు గడిచాక ఆ వ్యక్తి నా దగ్గరకి వచ్చి, "స్వామీజీ, నేను అన్నీ భగవంతునికి ఆధీనం చేసేసాను" అని అన్నాడు.
నేను సంతోషించి అతనితో, "ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అన్నాను".
దానికి అతను "నేను బార్ కి వెళుతున్నాను" అన్నాడు. అతను ఇలా చెప్పసాగాడు "ఇక నుంచి నేను ఏమి చేసినా బాధ్యత భగవంతుడదే".
ఇది మిమ్ములని మీరు మూర్ఖులుగా చేసుకునే పద్ధతి. అతను నిజంగా భగవంతుడికి అన్నీ సమర్పించేస్తే, అతని తాగుడు వ్యసనాన్ని కూడ సమర్పించేవాడు. అతను తిరిగి ఎప్పుడూ తాగే వాడు కాదు.
రామకృష్ణ పరమహంస చాలా చక్కగా చెప్పారు, "మీలో నిజమైన అధీనత అనేది మీ హృదయంలోంచి వస్తే భగవంతుడు మీ ప్రతి అడుగులోను మీకు మార్గదర్శకునిగా ఉంటాడు. మీ జీవితంలో ప్రతి దశలోను ఆయన మీకు దారి చూపుతారు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లనూ తప్పు చేయరు".
అధీనత అనేది మీ హృదయం నుంచి రానప్పుడు, అది కేవలం మీ పెదవుల దగ్గరే ఉంటుంది. మిమ్ములని మీరు తెలివి తక్కువవారిగా చేసుకుంటారు. అంతే.
అధీనత మిమ్ములని నిరంతరం ఈ అనంత బ్రహ్మాండం గురించి ఆలోచించేదిగా చేస్తుంది. మీరు క్రమంగా మీ గుర్తింపుని, మీ అహంకారాన్ని వదిలేస్తారు. భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఇందులో గోపిక ఇలా చెబుతుంది, "నేను శ్రీ కృష్ణుని తప్ప దేనిని గురించి ఆలోచించ లేకపోతున్నాను. నేను నా మనస్సుని శ్రీ కృష్ణునికి అధీనం చేసాను. నేను దేనిని గురించి అయినా ఆలోచించాలి అంటే నా మనస్సుని ఆయన దగ్గర నుంచి వెనక్కి తెచ్చుకోవాలి. నేను ఆ పని ఎలా చేయగలను".
రామకృష్ణ పరమహంస ఆయన చివరి రోజుల్లో కాన్సర్‌తో బాధ పడ్డారు. ఆయన ఎంతో మందిని ఎన్నో వ్యాధులనుంచి కాపాడాడు. చికిత్స చేశాడు. ఆయనని ఎవరో అడుగుతారు, "స్వామీ, మీ మైండ్‌ని కాసేపు మీ ఈ వ్యాధి మీద ఉంచి దానికి చికిత్స చేసుకోవచ్చు కదా!" అని.
దానికి ఆయన ఈ విధంగా జవాబు చెప్పడు, "నేను నా మైండ్‌ని ఈ అనంత విశ్వ శక్తికి అధీనంచేసేసాను. దానిని మరలా వెనక్కి ఎలా తీసుకురాను. దానిని ఈ వ్యాధి మీద ఎలా కేంద్రీకరించను.
అది నిజమైన అధీనత అంటే.
ఈ విశ్వశక్తి మనని రక్షిస్తుంది. మీరు నన్ను అడగవచ్చు. "మేము అధీనులమయితే ఈ అనంత విశ్వశక్తి మా సమస్యలని పరిష్కరిస్తుందా ?".
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఈ ప్రశ్నకి చాలా చక్కటి జవాబు ఇస్తాడు. దానిలోనే ఒక అద్భుతమైన ప్రమాణము ఉంటుంది. "ఎటువంటి వేరే ఆలోచనా లేకుండా, ఎవరైతే కేవలం నా గురించి మాత్రమే ఆలోచించుతాడో, ఆ వ్యక్తి యొక్క బహుమతులన్నీ నేను చూసుకుంటాను. వాళ్ళు ఆనందపడేలా చేస్తాను. ఎవరైతే మాటకి కట్టుబడి నాకు అధీనులవుతారో వాళ్ళ ఆదాయం, వాళ్ళ ఐశ్వర్యం అన్నీ నేనే చూస్తాను. వాళ్ళ సమస్యలన్నీ మాయమయిపోతాయి".
మాటికి కట్టుబడి ఉండటం, పరిణితి అనేవి అధీనతకి అనవసరం. మీరు భగవంతునికో లేదా గురువుకో అధీనులు కానవసరంలేదు. మీరు దేనికైనా అధీనులు కావచ్చు. అధీనమవటమనేదే గొప్ప విలువ. దానికి చాలా గొప్ప శక్తి ఉన్నది. ఎప్పుడయితే మీరు అధీనులువుతారో అప్పుడు మీరు మీ అహంకారం కంటే కూడా చాలా గొప్ప శక్తి; ఈ అనంత చైతన్యంలోని జీవశక్తి ఉన్నది అని ఒప్పుకుంటారు. అంతే.
అసలు చెప్పాలంటే, ఆ భగవంతుడు అనే మాట మీరు అధీనులవటానికి ఒక సాకు మాత్రమే అధీనమవటమనే చర్య ముఖ్యమయినది. భగవంతుడు కాదు ఇక్కడ లక్ష్యం. అధీనమవటం అనేది లక్ష్యం. మీరు అధీనులయినప్పుడు, మీ అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు, మీరు ఈ అనంత సృష్టి నుంచి వేరు కాదు అని అర్ధమవుతుంది. మీరు ఈ బ్రహ్మాండ శక్తి, భగవంతునిలో కలిసి కరిగిపోతారు. అప్పుడు మీకు భగవంతుడు అనే వాళ్ళు ఎవరూ మీపైన కూర్చుని లేరు అని అర్థం అవుతుంది. కేవలం అనంత చైతన్య శక్తి మాత్రమే ఈ విశ్వమంతా నిండి ఉన్నది అని అందులో మీరు ఒక భాగమని మీకు స్పష్టంగా తెలుస్తుంది.
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తి అధీనమైపోవాలి అని అనుకుంటాడు. కానీ తనని తాను ఎవరికి అధీనమవ్వాలో అర్ధం కాదు. అప్పుడు అతను అడవిలోనికి వెళ్ళి తనకు ముందుగా ఎవరు కనపడితే వాళ్ళకి అధీనమివ్వాలి అని అనుకుంటాడు. అలా అడవిలో ఎదురు చూస్తుంటాడు.
అతనికి కనిపించిన మొట్టమొదటి వ్యక్తి ఒక్క బందిపోటు దొంగ. అతనిని పోలీసులు తరుముతుంటే పారిపోతుంటాడు.
ఈ వ్యక్తి ఆ దొంగ కాళ్ళు పట్టుకుని నేను నీకు అధీనమయ్యాను. నీవే నాకు గురువువి, అని అంటాడు. ఆ దొంగకి ఏం చేయాలో తెలియదు.
అప్పుడు ఆ దొంగ, “సరే ! నీవు నిజంగా అధీనమయితే కళ్ళు మూసుకుని ఇక్కడే నేను తిరిగి వచ్చే వరకూ ఉండు” అని చెప్పి పారిపోతాడు. ఈ వ్యక్తి మాటకి కట్టుబడే మనిషి. అతను అక్కడే భోజనం నిద్ర లేకుండా కళ్ళు మూసుకుని చాలా కాలం ఉంటాడు. అతని పట్టుదల చూసి భగవంతుడు ప్రత్యక్షమై అతనిని కౌగలించుకుని అతనికి మోక్షాన్ని ఇస్తాడు.
మీరు ఎవరికి అధీనులు అయ్యారు అనేది ముఖ్యం కాదు. మీరు పూర్తిగా అధీనులవ్వటమనే మీ ఆలోచనకి చాలా శక్తి ఉంటుంది. ఇది మీ జీవితాన్ని శాశ్వతానందంగా మార్చివేస్తుంది. ఎప్పుడయితే మీరు అధీనులవుతారో మీరు అనంతమైన శక్తిని పొందుతారు. మీకు మీ జీవితంలో ఏది ఎదురయినా దానిని సాధించగలుగుతారు.
ఏమి జరిగినా, ఏది ఎదురయినా మీరు తొణకరు, బెణకరు, మిమ్మలని ఏ శక్తి కదిలించలేదు. మీ చుట్టు ప్రక్కల వారికి మీరు ఒక శక్తివంతమైన స్తంభంగా ఉంటారు. మీలో ఏదో ఒక అదృశ్య హస్తాన్ని చూడగలుగుతారు. మీరు అధీనులు కాలేకపోయారు అంటే మీ అహంకారం మిమ్మలని వెనక్కి లాగి పట్టుకుంది, మిమ్మలని ఈ అనంత చైతన్య శక్తిలో, భగవంతునిలో కలిసి పోనీయటం లేదు అని అర్థం. అప్పుడు మీలోని శక్తి, శక్తి వనరులు కొంత వరకు మాత్రమే ఉంటాయి. అవి మీకు పరిమితంగా దొరుకుతాయి.
గురువు మీరు అధీనులవటానికి సహాయం చేస్తాడు. అధీనమవటం అంటే మీరు వేరే వారిపై ఆధారపడతారు అని అర్థం కాదు. మీరు మీలోని అహంకారాన్ని వదిలి వేయటానికి వారి సహాయం తీసుకుంటారు. అంతే.
ప్రశ్న : స్వామీజీ ! మీరు దయచేసి ధ్యానం గురించి, అది ఏ విధంగా మాలోని అహంకారాన్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుందో కొంచెం వివరంగా చెప్పండి.
అలాగే ముందుగా మీకు ఈ ధ్యానం అనేది మనలోకి ఎలా వచ్చిందో చెబుతాను.
మనిషి ఈ సృష్టిని గమనించినప్పటి నుంచీ ఇంత అందమైన ఈ అనంత విశ్వాన్ని ఎవరు సృష్టించారు ? ఏ శక్తి ఇంత అందమైన భూమిని సృష్టించి, దానిని విశ్వంలోనికి దొర్లించింది. ఏ శక్తి ఈ నదులు ప్రవహించేలా, పర్వతాలు పెరిగేలా చేసింది ? ఇలా అనేక ప్రశ్నలు అతనిలో ఉండేవి. చివరికి అతను ఒక అనంతమైన విశ్వశక్తి ఇదంతా చేస్తుంది అనే అభిప్రాయానికి వచ్చాడు. అతనికి ఒక అనంత చైతన్య సృష్టి యొక్క శక్తి ఈ మొత్తాన్ని నడిపిస్తుంది అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతను ఈ శక్తితో ఎలా సంబంధం పెట్టుకోవాలి అని ఆలోచించటం మొదలుపెట్టాడు.
ఈ విషయంలో పరిశోధనలు చేసి, ఈ అభిప్రాయాలను వెల్లడి చేసి, ఈ శక్తితో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఋషులు, జ్ఞానోదయం పొందిన జ్ఞానులు ఒక్కసారి వాళ్ళు ఆ విధంగా సంబంధాలని నెలకొల్పేక, ఆ పద్ధతులని ముందు తరాలకి అందించటానికి, వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. అనే ఉద్దేశ్యంతో వాళ్ళు చాలా పద్ధతులని తయారు చేసారు. వాళ్ళు ఇచ్చిన పద్ధతి ఒక్కొక్క మతంగా గాని, లేదా ఒక్కొక్క ధ్యాన పద్ధతిగా గాని అభివృద్ధి చెందాయి.
వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేరు వేరు పద్ధతుల ద్వారా భగవంతుని గురించి తెలుసుకున్నారు. వాళ్ళు అనుసరించిన పద్ధతిని వాళ్ళ అనుభవాలని వారి వారి పద్ధతిలో వేరు వేరుగా రికార్డు చేసి ఉంటారు. అంటే అవి పరిశోధనా రిపోర్టులు అని అనికోవచ్చు. ఇది ఎలా అంటే, శాస్త్రజ్ఞులు ఎలా అయితే వాళ్ళు కనిపెట్టిన విషయాలని రిపోర్టులుగా తయారు చేసేవారో అలాగే ప్రతి ఋషి కూడా తను పొందిన జ్ఞానం మీద ఒక్కొక్క రిపోర్టు ఇచ్చారు. అదే వేరు వేరు మతాలుగా అవి వేరు ధ్యాన పద్ధతులుగా అభివృద్ధి చెందాయి.
ఈ జ్ఞానోదయం పొందిన జ్ఞానులు ఒక్కొక్కరు ఈ విశ్వశక్తి ఏ విధంగా ప్రపంచాన్ని నడుపుతుందో ఆ విషయాలని, వారి అనుభవాలు, భావాల ఆధారంగా ఒక్కొక్క మతం రూపంలో అభివృద్ధి చేసారు. ఆ విశ్వశక్తినే మనం జీసస్, అల్లా, శివ
రకరకాల పేర్లతో పిలుస్తాము. మీరు ఏదేవుడినీ నమ్మనవసరం లేదు. నాస్తికులు భగవంతుణ్ణి నమ్మరు. కానీ వాళ్ళు వాళ్ళ ఉనికిని నమ్మాలి కదా ? మనం మన ఉనికిని నమ్మి, దాని మీద పరిశోధన చేసి "నేను ఎవరిని" అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోగలిగితే, అదే ఒక ధ్యాన పద్దతి అవుతుంది. అప్పుడు భగవంతుణ్ణి కూడా తెలుసుకుంటారు. అది సరే ! ఈ విధంగా వివిధ పద్ధతులలో కాల క్రమంలో రకరకాల ధ్యాన పద్ధతులు ఏర్పడ్డాయి.
కానీ తరువాత ఏమయింది ? అందరూ ఈ ప్రాథమిక భావనని వదిలివేసి మతం పేరుతో పోట్లాడుకోవటం మొదలుపెట్టారు.
ఒక చిన్న కథ :
ఒక తమిళ వ్యక్తి, ఇంగ్లీషు వ్యక్తి, ఉత్తర భారతదేశం వ్యక్తి, ఒక బెంగాల్ వ్యక్తి కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు దూరంగా ఒక సరస్సుని చూస్తారు. అది చూసి తమిళ వ్యక్తి దానిని తన్నీర్ అంటాడు. తమిళంలో తన్నీర్ అంటే నీరు. ఇంగ్లీష్ వ్యక్తి చూసి దానిని వాటర్ అంటాడు, ఉత్తరాది వ్యక్తి పానీ అంటాడు బెంగాల్ అతను దానిని జల్ అంటాడు.
ఆ నలుగురూ నీరు గురించే మాట్లాడుతుంటారు. కానీ నేను చెప్పిందే నిజం అని పోట్లాడుకుంటారు.
వాళ్లలో ఒక్కరు కూడా ఆ చెరువు దగ్గరకి వెళ్ళి అక్కడ అసలు ఏముందో కచ్చితంగా తెలుసుకోరు. ఈ తమిళం వ్యక్తి తన తాత అలా చెప్పాడు కాబట్టి అది అంతే అని దానిని పట్టుకుని కూర్చుంటాడు. అలాగే మిగతా ముగ్గురూ కూడా.
మనం చేసే పని సరిగ్గా ఇలానే ఉంది. మతం పేరుతో పోట్లాడుకునేవాళ్ళు చేసే పని ఇదే. వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన పూర్వీకులు దానిని ఏ దశలో, ఏ పద్ధతిలో చూసారో. దానికి ఆ విధంగా పేరు పెట్టారు అని. కానీ ప్రతి పద్ధతి కూడా భగవంతుని గురించే. అంతా ఒక్కటే సర్వసృష్టి లేదా భగవంతుడు.
కృష్ణ అన్న క్రైస్ట్ అన్న ఒక్కటే. కానీ ప్రజలు దానిని వేరు వేరు రూపాలలో, పద్ధతుల్లో చూస్తున్నారు అంతే.
ఈ నలుగురు వ్యక్తులు కూడా అసలు చెరువు దగ్గరకి వెళ్ళి అదేమిటో చూడకుండా వాళ్ళ పూర్వీకులు, తాతయ్యలు ఏం చెప్పారో దానినే పట్టుకుని వాదించుకుంటున్నారు. వాళ్ళు వాదనలని ఒక ప్రక్కన పెట్టి, నలుగురూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏముందో చూసి తెలుసు కోగలిగితే, వాళ్ళ నలుగురు తాతయ్యలు చెప్పిన విషయం ఒక్కటే అని వాళ్ళకి అర్థం అయి వుండేది. అప్పుడు పోట్లాడుకోవలసిన అవసరం లేదు.
ఈ రోజుల్లో ఎవరయితే చెరువు దగ్గరకి వెళ్ళి అన్ని నీళ్ళు చూడకుండా, కేవలం ఒక దోసిలి నీళ్ళని మాత్రమే వాళ్ళ చేతిలో చూసుకుని అదే చెరువు అని అనుకుంటున్నారో వాళ్ళ యుద్ధాలు చేస్తున్నారు. కులం, మతం పేరు మీద మారణహోమాలు సృష్టించే వాళ్ళు టెర్రరిజాన్ని వ్యాపింప జేసే వీళ్ళు అసలు ఆధ్యాత్మికత అనే చెరువు దగ్గరికి వెళ్ళలేదు. అందులోని అసలయిన సత్యం యొక్క రుచిని చూడలేదు. కేవలం చెరువుకి దూరంగా నిలబడి వాళ్ళ తాతయ్యలు చెప్పిన విషయాలు ఆధారంగా పోట్లాడుకుంటారు. కాబట్టి అర్థం చేసుకోండి. సత్యం అనే దానిని వివిధ రూపాలలో చూపించారు. అంతే.
ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటో చూద్దాము. ధ్యానం మీ మైండ్‌ని విరామంలో ఉంచుతుంది. ఉంటే మైండ్ విరామంగా అంటే అదే ధ్యానం. అంతే. ధ్యానం అంటే ఏదో ఒక దాని మీద మనస్సుని తదేకంగా కేంద్రీకరించటం కాదు. అలా ఏకాగ్రత చూపించాలి అంటే మీ మైండ్‌లో నుండి ప్రతి విషయాన్ని తొలగించాలి. అది అసాధ్యం.
మీరు రెండు నిమిషాలు కూర్చుని మీ మైండ్ నుండి అన్నింటినీ తొలగించటానికి ప్రయత్నించండి. మీరు పిచ్చివాళ్ళయిపోతారు. మీరు తొలగించాలి అనుకున్న ప్రతి చిన్న విషయం వెనక్కి వచ్చి మిమ్మలని హింసిస్తుంది. అందుకే ఏకాగ్రత మెడిటేషన్ కాదు. ధ్యానం అంటే మైండ్‌లో ఉంచుకుని అప్పుడు విరామంతో ఉండటమే ధ్యానం. మీరు ఎప్పుడయితే దేనినీ తొలగించకుండా, దేని మీదా ఏకాగ్రత చూపకుండా ఉన్నప్పుడు మీరు విరామంగా ఉండగలరు.
మీరు సమయం కలిగినప్పుడు విరామంగా ఉండండి. మీ చుట్టూ జరిగే విషయాలని గమనించండి. మీ హృదయంతో ప్రతి శబ్దాన్ని వినండి. అవి పక్షులు శబ్దాలు కావచ్చు. గాలికి ఎగిరే కాలెండర్ శబ్దం కావచ్చు. మీపైన తిరిగే ఫాను శబ్దం కావచ్చు. మీ చుట్టూ ఉండే మనుషుల శబ్దాలు కావచ్చు. ఇంకా ఏదైనా కానివ్వండి. వికసించిన హృదయంతో వినండి. గుర్తుంచుకోండి. అవి మీకు అంతరాయాలు కాదు. మీరు వాటితో పాటుగా ప్రవహించుతున్నారు. అందుకే మీకు అవి అంతరాయాలు కావు. ఎప్పుడయితే మీరు వాటితో పాటు ముందుకి సాగుతారో అవి మీకు అంతరాయాలుగా అనిపించవు.
మీరు ఇలా చేసేటప్పుడు, మీలోపల ఒక నిశ్శబ్దం ఉన్నది అని తెలుసుకుంటారు. మీ అంతరంగంలో ఒక సంయుక్త అంతర్భాగం అనేది దీనినంతా గమనిస్తుంది, అని తెలుసుకుంటారు. అప్పుడు మీ అంతరంగంలోని నిశ్శబ్దాన్ని ఇంకా బాగా తెలుసుకోగలుగుతారు. ఆ నిశ్శబ్దాన్ని మీరు దర్శించుకోగలుగుతారు.
క్రమంగా మీ శరీరం అనేది ఉన్నది అనే విషయం మర్చిపోతారు. కేవలం మీరు తెలుసుకునే తత్వంలోనే ఉంటారు. అంతే కానీ మీ శరీరంతో కానీ, మైండ్‌తో కానీ ఏ అనుభవాన్ని తెలుసుకోరు. అలా అని మీ శరీరం మొద్దు బారదు. కాకపోతే మీ శరీరం ఉన్నది అని మీకు అనిపించదు. అంతే, మీ చేతన స్థితి మాత్రం, మీతెలుసుకునే తత్వం మాత్రం అలానే ఉంటుంది. దీనిని మీరు బాగా తీవ్రంగా చేస్తే, అది మిమ్మలని మీ మైండ్‌కి అతీతంగా తీసుకు వెళుతుంది.
ధ్యానం మీకు మీ జీవితానికి పరిశీలించే ఒక పరిశీలకులు మాత్రమే అని నేర్పించుతుంది. మిమ్మలని మీ అంతరాత్మలోనికి ప్రవేశించేటట్లు సహాయం చేస్తుంది. ఇదంతా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీరు నిరంతరం మీ
అంతరంగంలో నిశ్శబ్దాన్ని కలిగి ఉంటారు. అందువలన మిమ్మల్ని ఏ విషయం కూడా విసిగించవు. మీలోపలికి రాలేవు. మీ నిశ్శబ్దాన్ని ఛేదించలేవు. మీకు అంతరాయాలు ఉండవు. మీరు ఇలాగే కొనసాగితే క్రమంగా నేను, నాది అనే విషయాలని వదిలివేస్తారు. మీ అహంకారం కరిగిపోతుంది. మీ అహంకారం అంటే మీలో ఉండే గుర్తింపుల విషయంలో మీకు ఉండే బలమైన ఆలోచనలు. మీ శరీరం గురించి మీ మైండ్ గురించి మీరు అనుకునే విషయాలు.
మేము ఈ ధ్యానాన్ని ప్రపంచ వ్యాప్తమైన ఒక ఉద్యమంలా ఎందుకు చేస్తున్నాము అని అనుకుంటున్నారు ? ప్రపంచ శాంతికి ధ్యానం ఒక్కటే సరియైన మార్గం. మీరు మీలోపలికి చూడగలిగినప్పుడు బయట ప్రపంచంలోని అంతరాయాలయిన డబ్బు, అధికారం, ప్రతీకారం ఇలాంటివి మిమ్ములని చెదరనివ్వవు. మీలో ప్రాధమిక స్థాయిలో ఉండే శక్తులన్నీ కూడా ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తులుగా మారతాయి. మీలోపలి చేతన స్థితిలో మార్పు వస్తుంది. అప్పుడు దాని అంతట అదే శాంతి వ్యాపిస్తుంది.
అందుకే నేను ప్రతి వ్యక్తిలో మార్పు తెచ్చే విషయం మీద నా దృష్టిని పెట్టాను. ఒక టీంగా కొంతమందిని నేను ఈ విధంగా మార్చగలిగితే, వాళ్ళకి ప్రయోగాత్మకమైన అనుభవాన్ని ఈ విషయంలో నేను ఇవ్వగలిగితే, తిరిగి వాళ్ళు, వాళ్ల అనుభవంతో మరికొందరిని ప్రోత్సహించుతారు. ఈ విధంగా ఇది నిరంతరం జరిగి, మన సమాజంలో అనుకూలమైన మనఃస్థితి ఏర్పడుతుంది.
మీరు అర్ధం చేసుకున్న విషయాలు మీ అనుభవంలోనికి రాకపోతే, మీలో మార్పు జరగటం కష్టం. ధ్యానం మీరు అర్ధం చేసుకున్న విషయాలని మీ అనుభవంలోనికి తెస్తుంది. కేవలం ధ్యానం మాత్రమే ప్రతి వ్యక్తిలో, అలాగే సమాజంలోను మార్పు తీసుకురాగలదు.
మీరు ధ్యానం చేస్తే మీలోని తెలివితేటలు, వివేకము వికసించుతాయి. మీకు ప్రతి విషయంలోనూ స్పష్టత కనిపిస్తుంది. మీరు ఎవరినీ ప్రత్యామ్నాయాల కోసం, సలహాల కోసం అడగనవసరం లేదు. మీకు అన్నీ తెలుస్తాయి. అంతే, ఎందుకంటే మీరు మీ అంతరంగంలోని వివేకంతో మంచి సంబంధం కలిగి, దానితోపాటు ముందుకు సాగుతారు. మీకు అది ఎప్పుడూ తప్పు చెప్పదు అని కూడా తెలుసు.
మీరు మీ అంతరాత్మ ద్వారా మీరు సరియైన మార్గంలోనే ఉన్నారు అని మీకు తెలుస్తుంది. కొన్నిసార్లు మీ మార్గం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువ మంది అనుసరించే మార్గాన్ని ఎదిరించవలసి వస్తుంది. కానీ దాని ఫలితం చాలా అందంగా స్వేచ్ఛగా ఉంటుందని మీకు తెలుసు. మీరు చేయవలసిన పని మీ అంతరాత్మలో వివేకాన్ని నిలపండి. దాని మీద అపార నమ్మకాన్ని ఉంచండి.
మిమ్మలని మీరు ధ్యానంతో వృద్ధి చేసుకోగలిగితే, మీ సామర్థ్యపు పరిధి విస్తృతం అవుతుంది. అప్పుడు మీరు బయట ప్రపంచంలో చాలా పనులు చేయగలుగుతారు. మీరు చేయగలిగే పనులకి, మీరు చెప్పగలిగే విషయాలకి ఒక హద్దు ఉండదు. మీరు వేరు వేరు విధాలుగా ఎంతో అభివృద్ధి చెందుతారు.
మీరు మీ అంతరంగపు వివేకం తో పని చేస్తే ఏదైనా మీకు సులభంగా లభ్యమవుతుంది. అది మీ అహంకారంతో సాధ్యపడదు. మీరు ఏదైనా సాధించే విషయంలో అది కష్టంగా ఉంటే దాని అర్ధం ఏమిటంటే మీ అహంకారం మిమ్మలని ఆ విషయం నుండి వేరు చేస్తుంది. మిమ్మలని మీరు వదిలివేసి ఈ అనంత చైతన్యంలో కలిసిపోతే మీకు ఏ విషయం కూడా కష్టం అనిపించదు. మీరు అలా ప్రవాహంలా ముందుకు సాగిపోతారు. మీ లోపలి వివేకము మీ కోసం ఈ విశ్వ శక్తిని మీలోపలికి తెచ్చిపెట్టి ఉంచుతుంది.
మీకు మీరే ఒక అద్భుతమైన వ్యక్తిలా కనబడుతారు. ఒకప్పుడు మీ శక్తిని మించినవి అనుకున్న పనులు మీ చేతిలోనికి వస్తాయి. మీరు అజ్ఞానం నుండి వివేకం వైపుకి సాగిపోతారు.
ప్రశ్న : స్వామీజీ ! మేము కలలు లేని గాఢ నిద్రలో ఉన్నప్పుడు, నిజమైన ధ్యానంలో ఉన్నప్పుడు మాకు మైండ్ లేని స్థితి ఉంటుంది కదా ! అవి ఒక్కటేనా ? కాదు. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు విత్తనం దశకి వెళ్ళిపోతారు. ఆ తరువాత ఇప్పుడు మీరు ఉన్న స్థితి. అంటే నిద్రకి ముందు ఉన్న స్థితికి వచ్చేస్తారు. మీలో ఎటువంటి అభివృద్ధి జరగదు. మీరు నిజమైన ధ్యానంలో ఉంటే మీరు విత్తనం దశకి వెళతారు. అక్కడ విత్తనం పగిలి దాని తరువాత ఉన్నత స్థానంలోకి వెళతారు. అదే తేడా. ఇవి రెండూ (నిద్ర, ధ్యానం) రెండు చివరలు. బయట నుండి చూసినప్పుడు ఆచివర, ఈ చివర ఒకేలా ఉంటాయి. ఒక పిచ్చివ్యక్తికి, ఒక అద్భుతమైన వ్యక్తి ఒకేలా ఉంటారు. పిచ్చి మనిషి అద్భుతంలా ; అద్భుతమైన యోగి పిచ్చివాడిలా కనపడతారు. ఇద్దరూ వాళ్ళ మైండ్‌ని పోగొట్టుకున్న వాళ్ళే. కాకపోతే మైండ్ పోగొట్టుకున్న పద్ధతి, దశ వేరుగా ఉంటాయి.
ప్రశ్న : స్వామీజీ మీరు ఎప్పుడూ అందంగా ఎలా ఉండగలరు?
(స్వామి నవ్వుతారు)
ఇది చాలా ఆసక్తి అయిన ప్రశ్న : నేను ఎప్పుడూ అందంగా ఎలా ఉండగలను ?
చూడండి : ఒకవేళ ఇది ఈ రూపమే అయితే, నా ఆకారం మీకు అందంగా అనిపిస్తే, అదే మిమ్మలని నాదగ్గరికి లాగితే, ఆ ఆకర్షణ అలా స్థిరంగా ఉండదు. అది ముందుకీ వెనక్కి ఊగిసలాడుతుంది. అది సమయానుకూలంగా మారుతుంది. అది పరిస్థితి బట్టి మారుతుంది. అలంకరణతో మారుతుంది. అలా ఏదైనా కావచు; మీరు నన్ను ఇదే విధంగా చూస్తున్నారు. ఇవే పాటలు వింటారు, అదే గొంతు ప్రతి రోజూ వింటారు. అయినా కూడా మీరు అదే కుతూహలంతో, అదే శ్రద్ధతో నా దగ్గరికి వస్తున్నారు. మీరు ఇదే విధంగా మీ జీవితంలో మరొక వ్యక్తితో ఉండగలరని అనుకుంటున్నారా? అర్ధం చేసుకోండి. అది వ్యక్తి కాదు. అతని సమక్షము, అతని ఉనికి మాత్రమే. నా సమక్షం, నా ఉనికి అందంగా వ్యాపిస్తుంది. అదే మిమ్మలని నా దగ్గరకి ఆకర్షించుతుంది.
మీ విషయానికి వస్తే మీరు ఒక వ్యక్తి. నా విషయానికి వస్తే నేను ఒక ఉనికి ; ఒక సమక్షము అంతే. అహంకారంలేని ఉనకి చాలా బలంగా ఉంటుంది. అది మిమ్మలని తనవైపుకి ఆకర్షించుతుంది. చాలా మంది హీరోలు చాలా అందంగా ఉంటారు. వాళ్ళ అందం వైపు మీరు ఆకర్షితులు అవ్వవచ్చు. కానీ వారివైపు వెళ్ళాలి, మరీ మరీ వెళ్ళాలి అనే కోరిక తీవ్రంగా ఉండదు.
ఈ కోరిక అనేది మీ అంతరాత్మ నుండి వస్తుంది. అంతరాత్మ రూపానికి వెనుక వున్న దైవత్వాన్ని చూడగలుగుతుంది. మీ ఆత్మ కోరిక అది మాత్రమే. అహంకారంలేని ఉనికి, అటువంటి వారి సమక్షం మీ అంతరాత్మకి ఒక ఆకర్షణ. అందుకే మీరు మళ్ళీ మళ్ళీ నా వైపుకి లాగబడుతారు. చూడండి భగవంతుణ్ణి చూడాలని, ఆ అనుభవాన్ని తెలుసుకోవాలని ప్రతి వ్యక్తికి అంతరంగం లోతులలో ఉండే ఒక బలమైన కాంక్ష. కాని అతను దానిని చూడలేదు. మీరు నన్ను చూసినప్పుడు అటువంటి ఆకర్షణ కలుగుతుంది. ఆ ఆకర్షణ ఎందుకో మీకు తెలియక మీరు ఆశ్చర్యపోతారు. అదే మీ అంతరాత్మ కోరిక. కానీ వెంటనే మీరు ఇది ఏమిటి అని ఆలోచించుతారు. మీరు మీ మైండ్‌ని ఉపయోగించుతారు. ప్రతి దానిని తర్కంతో ఆలోచిస్తారు. కానీ భగవంతుడు తర్కానికి అతీతుడు. అందుకే మీరు ఈ ఆకర్షణకి తర్కంతో, మైండ్‌తో వివరించలేరు.
మీరందరూ ఇక్కడ కూర్చోని నావైపు కన్ను ఆర్పకుండా చూస్తుంటారు. అలా ఎందుకు చూస్తున్నాము అని ఆశ్చర్యపోతారు. అలా గంటలకొద్దీ కన్ను ఆర్పకుండా ఎలా చూస్తున్నాము. అని ఆశ్చర్యంగా అనుకుంటారు. ఎప్పుడయితే మీ అంతరాత్మలోని కోరిక చాలా లోతుగా ఉంటుందో, అప్పుడే ఈ విధంగా జరుగుతుంది. అది మీ ఇంటిని చేరాలనే కోరిక. ఈ కోరిక మీకు కొన్ని జన్మలుగా ఉంటుంది. కానీ అది తీరదు. అందుకే మీరు తిరిగి జన్మించుతారు.
ఈ లోతైన కోరికని కనుగొన్నప్పుడు, మీలో కొందరు మీ అంతరాత్మ లోపలికి ప్రయాణం సాగించుతారు. మీలో కొంత మంది భయపడిపోతారు. మీరు బయట ప్రపంచానికి వేలాడుతారు. అక్కడి నుండి నన్ను గమనిస్తుంటారు. ఏదైనా జరిగితే అక్కడి నుండి పారిపోతారు. అప్పుడు నేను మిమ్ములని మోసం చేయాలి. అప్పుడు
మీరు గమ్యం చేరరు. ఇంకా చేసేది ఏమి లేదు. అలాగే మీ అహంతో ముందుకు సాగమని చెప్పాలి.
మీరు నిరంతరము భయంతో పనులు చేస్తారు. అలా చేయాలని మీకు నేర్పించారు. భయం అహంకారం యొక్క అణుకువ అయిన రూపం. మీకు ఇవ్వాలి అనే భయంతో, వదిలివేయవలసి వస్తుందనే భయంతో మీరు చాలా దూరంగా ఉంటూ, నాకు భయం అందుకే దూరంగా ఉంటాను అని అంటారు. భయం వినయం కాదు. అది అహంకారం యొక్క మోసపూరిత రూపం దానిని వదలటానికి మీకు భయం. మీరు కరిగిపోతారని భయం.
అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇది కేవలం ప్రేమ మాత్రమే. ఈ అనంత చైతన్య సృష్టికి మీరు తనలో భాగమని తెలుసు. ఈ సృష్టికి (భగవంతునికి) మీరు అందులో భాగమని తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది. అందుకే మీరు దేనికి భయపడనవసరంలేదు.
మీరు సృష్టి ముందు ఏ విధంగానూ అబద్ధం చెప్పనవసరం లేదు. నటించనవసరం లేదు. మీరు మీలా ఉంటే చాలు. భగవంతుడు మీ మీద వరాలను కురిపించుతాడు. భగవంతునికి లేదా ఈ అనంత చైతన్యానికి కేవలం ప్రేమించటం, ఇవ్వటం, క్షమించటం మాత్రమే తెలుసు. దీనికి మిగతా విలువలు ఏమీ తెలియవు. మీరు ఈ అనంత చైతన్యాన్ని మీ అహంకారంతో, మీరు పిలుచుకునే నైతిక విలువలతో తీర్పులు చెబుతారు. అదే అసలు సమస్య. దాంతో మీరు ఈ విధంగా ప్రవర్తించుతారు.
మీరు ఎప్పుడయితే ఈ అనంత చైతన్యంలో ఒక భాగమని తెలుసుకుంటారో అప్పుడు మీరు స్వేచ్ఛని అనుభవిస్తారు. ఎప్పుడయితే మీరు ఈ చైతన్యానికి దూరం అయిపోతారో అప్పుడే మీలో సమస్యలు ప్రారంభమవుతాయి. ఈ అనంత చైతన్య సృష్టి (భగవంతుని) లో భాగం అయ్యాము అనే అనుభూతి అద్భుతంగా ఉంటుంది. మీలో ఉండే అహంకారం వలన మీరు ఈ సృష్టికి దూరం అయిపోతున్నారు.
మీరు మీ అంతరంగంలోనికి ఎప్పుడయితే ప్రయాణం మొదలు పెడతారో అప్పుడు మీరు ఈ అనంత సృష్టిలో ఒక భాగమని బాగా తెలుసుకుంటారు. అలా తెలుసుకునే తత్త్వం పెరిగే కొద్దీ మీలో అహంకారం తగ్గిపోతుంది. ఆ స్థలంలోనికి తెలుసుకునే తత్త్వం వస్తుంది. అప్పుడు అహంకారం కరిగిపోతుంది. దానికి మరో దారి లేదు. మీలో తెలుసుకునే తత్త్వం వచ్చే వరకు మీరు ఒక గట్టి బలమైన వ్యవస్థగా ఉండిపోతారు. అప్పుడు మీరు ఈ అనంత సృష్టితో సంబంధం లేకుండా ఉంటారు.
నిజానికి ఆకాశమంతా మీరు చూడవచ్చు. కానీ మీరు దానిని కేవలం మీ కిటికీ లోంచి మాత్రమే చూస్తారు. అది కూడా మీ అహంకారం ఎంత వరకూ చూడమంటే అంతవరకు మాత్రమే చూస్తారు. మీరు దానినే నిజమైన ఆకాశం అని అనుకుంటారు. ఇవి అన్నీ కూడా మీ అహంకారం ఆడే ఆటలు. ఈ విషయం తెలుసుకోవటమే దానిలోంచి బయటికి వచ్చేసే మొదటి అడుగు. మీ అంతరంగంలోని ఏ తాళాన్ని తీయాలన్నా ఈ తెలుసుకొనే తత్త్వం అనేది ఒక తాళం చెవిలా ఉపయోగపడుతుంది. అందుకే మీకు నేను మళ్ళీ మళ్ళీ చెబుతుంటాను. మీలోపలికి తెలుసుకునే తత్త్వాన్ని తీసుకురండి. ప్రతి విషయం తెలుసుకోండి. అని.
ప్రశ్న : స్వామీజీ ! మీరు మమ్మలని పట్టించుకునే విషయాన్ని వివరించండి ?
నేను మీ విషయంలో చేసే పని ఒక్కటే, మిమ్ములని వికసింపచేయటం. అదే నేను మీకు చేసే ఒక గొప్ప పని. మీరు నాకు చేసే గొప్ప సహాయం కూడా అదే. నేను అందరని కోరుకునేది ; వారి అంతరంగాలలోని శాశ్వత ఆనందాన్ని, వాళ్ళలో ఉండే అనంత శక్తిని గుర్తించమని చెబుతాను. ప్రస్తుతం మనుషులు తాను ఒక సామాన్య మానవుడనని, ఆధ్యాత్మికమైన అనుభవం కోసం వెళుతుంటారు. కానీ అతను అర్ధం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ; అతను ఒక ఆధ్యాత్మికమయిన వ్యక్తి. మానవ సంబంధమైన అనుభవం కోసం చూస్తున్నాడు అని తెలుసుకోవాలి. నేను ఈ విషయం మీకు నేర్పించే పనిలోనే ఉన్నాను. ఈ విషయాన్ని మీరు మీలోని ఎన్నో రకాలుగా ఉండే అహంకారాన్ని తెలుసుకోవటం ద్వారా అర్ధం చేసుకోవచ్చు. ఈ అహంకారమే మిమ్ములని మీరు ఒక సామాన్య
మానవుడిగా అనుకోమని, మీరు ఆధ్యాత్మికమైన వ్యక్తి కాదు అని నేర్పించుతుంది. మనిషి ప్రార్ధన నుండి అది సాధించే దిశగా వెళితే అతనికి తాళం చెవి దొరుకుతుంది.
ప్రశ్న: స్వామి మేము ధ్యానం చేస్తే మాలో మార్పు ఎలా వస్తుంది ? మాకు ఈ విషయంలో గురువుల పాత్ర ఎలా ఉంటుందో వివరించండి.
ఎప్పుడయితే మీరు ధ్యానం చేస్తారో మీలోని ప్రాథమిక స్థాయిలో ఉండే భావావేశాలు, కోపం, కోరిక, అత్యాశ, అసూయ, ఇలాంటివన్నీ కూడా ఉన్నతమైన శక్తులుగా మారతాయి. అవి మిమ్ములని ఉన్నతమైన చేతన స్థితికి, మీలో తెలుసుకోగల స్థితికి తీసుకువెళతాయి. అప్పుడు మీరు ఇదివరకులా అసహనంగా ఉండరు. ఇలా శక్తిలో మార్పు రావాలంటే అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.
ఇటువంటి మార్పు ప్రతీ ఒక్క వ్యక్తిలో జరిగితే, మొత్తం సమాజంలో మార్పు వస్తుంది. అప్పుడు ప్రపంచంలో హింస తగ్గిపోయి ప్రేమ పెరుగుతుంది. ప్రపంచ శాంతికి చాలా తేలికైన మార్గం, ప్రయోగించగలిగే మార్గం ఇదే ప్రతీ వ్యక్తిలోనూ మార్పు తేవటమే ఈ మార్గం యొక్క ఉద్దేశం.
గురువుల మార్గదర్శకత్వం, ధ్యానం అనే వాటితో మీలో సంభవించే మార్పులు మీలో మీరు కాని వాటిని నాశనం చేస్తాయి. గురువుల ఆధ్వర్యంలో ఇది కష్టపడి చేసే పని. ఎందుకంటే ఇంతవరకూ మీరు మీ హృదయానికి చేరువుగా పెట్టుకున్న విషయాలని వదిలివేయాలి. ఏ ఏ విషయాలయితే మీరు అని అనుకున్నారో వాటిని వదిలి వేయాలి. అది మీకు బాధని కలిగిస్తుంది.
గురువు మీకు మీరు కాని వాటినన్నింటినీ చూపించుతూ ఉంటారు. మీరు వాటినన్నంటినీ వదిలి వేస్తూ ఉండాలి. మీలో అణచివేయబడిన అనుభవాలని పైకి తేవటానికి ఆయన కొన్ని పరిస్థితులు కల్పించుతారు. ఆయన మీ మీద అలా పని చేయటానికి మీరు అంగీకరించాలి. అప్పుడే ఆయన మీలోపల వుండే అనవసరమైన పదార్ధాలని కాల్చేస్తాడు. మీరు కొన్ని జన్మలుగా మీలో పోగుచేసుకున్న అనవసరమయిన వాటినన్నింటినీ ఆయన తొలగిస్తాడు.
నేను ఎప్పుడూ చెబుతుంటాను ; మీరు నా నుండి పారిపోతే మీరు మరొక సారి నన్ను పోగొట్టుకుంటారు. పారిపోవటానికి ప్రయత్నించకండి. మీ అంతరంగంలో ఉండే వ్యర్థాల మీద నేను కచ్చితంగా నా చేయి పెడతాను. అవి మీ అహంకారపు వాపులు మాత్రమే. మీరు నామీద నమ్మకాన్ని ఉంచండి. ధైర్యంతో మీరు మిమ్ములని నాకోసం తెరచి ఉంచుకోండి. అప్పుడు మీ లోపల ఉన్న వాపులనన్నింటికీ చికిత్స చేస్తాను. మిమ్ములను మీరు గురువు కోసం తెరచి ఉంచుకోగలిగితే మీలోని అహంకారం సగం నాశనమైపోతుంది. మిగతా సగం విషయం గురువు చూసుకుంటారు. మీరు చేయి చూపితే చాలు ఆయన మిమ్ములని పైకి లేవదీస్తాడు. అంతే.
మీరు నిష్కపటంగా బ్రతికే వ్యక్తి అయితే, మీరు నిజంగా మార్పుకి సిద్ధంగా ఉంటే, మీరు మీ గురువు ముందు తెరవబడిన వ్యక్తి అవుతారు. అప్పుడు జరగవలసినవన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. అలా కాకుండా మీరు కేవలం చూస్తూ కూర్చుంటే ఏమీ జరగదు. మీరు ఒక గురువు దగ్గర నుండి మరొకరి దగ్గరకి మారటం తప్ప మీరు ఎవరి దగ్గర నుండీ ఏమీ నేర్చుకోలేరు.
మీరు ధ్యానం చేసేటప్పుడు తీవ్రంగా ధ్యానం చేయండి. మీ ధ్యానంతో పాటు తీవ్రత కూడా ఉంటే మీలో మార్పు తప్పకుండా జరుగుతుంది. మీలో ఉన్నతమైన చేతన స్థితి ఏర్పడుతుంది. మనం తీవ్రంగా ఉంటే ధ్యానం చేయం. ధ్యానం చేస్తే మనం తీవ్రంగా ఉండం. ఒకటి చేస్తే ఒకటి వదిలేస్తాం. మనం నిజంగా వికసించాలి అంటే ఈ రెండూ ఉండాలి.
మీరు ఎంతసేపు ధ్యానం చేసారు అనేది ముఖ్యంకాదు. ఎంత తీవ్రంగా చేసారు అనేది ముఖ్యం. మీలో ఉండే చేతన స్థితి యొక్క నాణ్యత ముఖ్యం. మీరు మీ చేతన స్థితిలో మీ అంతరంగంలోనికి తిరగాలి అని నిర్ణయించుకుంటే అదే మీరు ధ్యానాన్ని తీవ్రంగా చేసేట్టు సహాయం చేస్తుంది.
స్వామీజీ! మేము ఎప్పుడూ జీవితంలో ఏదో సాధించాలి అని చూస్తాము. అది కూడా అహంకారం ఆడే ఆటేనా?
అవును మీరు అసలు విషయానికి వచ్చారు. మీరు జీవితానికి ఒక ఉద్దేశ్యం, ఒక ప్రయోజనం ఉన్నది, అనుకున్నప్పుడు ఆ ప్రయోజనం వెనుక పరిగెడతారు. అంతే. మీలో అహంకారం ఉన్నది అని అర్థం. మీరు ఈ అనంత చైతన్యసృష్టి యొక్క అందాలని తెలుసుకొని వాటితో పాటు ముందుకి సాగిపోతే అప్పుడు మీకు జీవితమే ఒక ప్రయోజనం ఈ లక్ష్యాలు అన్ని ఊహలు అని అర్ధమవుతుంది. అప్పుడు మీరు తెలుసుకోగలిగే శక్తిని సంపాదించుకుంటారు. అప్పుడు మీలో అహంకారం ఉండదు.
గురువు మీకు మీ జీవితంలో ఉద్దేశాలు లేకుండా ఉండే విధానాన్ని అర్థం చేసుకోవటం నేర్పించుతాడు. మీరు ఏదో ఉద్దేశాలతో వెతికితే అసలు నిజాలు పోగొట్టుకుంటారు. ఎందుకంటే మీరు ఉద్దేశాల వెనుక పరిగెదితే, వర్తమానాన్ని పోగొట్టుకుంటారు. అప్పుడు ఈ అనంత చైతన్యాన్ని పోగొట్టుకుంటారు.
ఎప్పుడయితే మీరు ఉద్దేశరహిత జీవితాన్ని అర్ధం చేసుకుంటారో, మీలో ఒక కొత్త చేతన స్థితి వికసించుతుంది. అప్పుడు మీరు ఇంతకాలం దాచుకున్న వజ్రాలు కేవలం రాళ్ళు అని అర్ధమవుతుంది. మీరు ఇంతకాలం చాలా గొప్పది అని అనుకున్నవన్నీ కేవలం బొమ్మలుగా కనపడతాయి. డబ్బు మీరు ఇంతకాలం వెతుకుతున్న ఆనందం కాదు అని అర్ధమవుతుంది. మీరు వీటి అన్నింటికంటే అతీతంగా వెతుకున్నారు.
మీరు ఈ జీవితం భగవంతుడు ఆడే దివ్యమైన నాటకం అని తెలుసుకుంటారు. మీరు ఆ నాటకంచూసి ఆనందపడతారు. మీ పాత్రని మీరు సంతోషంగా సమర్ధవంతంగా పోషించుతారు. మీరు జీవితంలో లక్ష్యాల కోసం జీవించరు. మీరు జీవించటం కోసం జీవిస్తారు. అలా జీవించటంలో ఆనందాన్ని పొందుతారు.
ఒక విషయం అర్థం చేసుకోండి. నేను మిమ్ములని డబ్బు సంపాదించవద్దు అని చెప్పను. మీ జీవితంలో డబ్బులేకుండా ఏమీ చేయలేరు. నేను మీకు చెప్పేది ఒక్కటే, జీవితంలో ప్రతిక్షణాన్ని ఆనందంగా గడపండి. ఈ లక్ష్యాలని కేవలం అంత ముఖ్యం కాని సంఘటనలుగా చూడండి. ఇదంతా ఒక నాటకం, మీరు మీ పాత్ర పోషించుతున్నారు అని అర్థం చేసుకోండి. ఎప్పుడయితే మీరు లక్ష్యాలు మీద మనస్సుని లగ్నం చేస్తే ఈ మొత్తాన్ని మీరు పోగొట్టుకుంటారు
ఒక నాటకంలో మీ పాత్రలో కానీ లేదా మరో పాత్రతో కానీ సంబంధాన్ని పటిష్టం చేసుకొని వాటికి మీరు అంటుకుపోతే దాంట్లో ఏమైనా అర్థం ఉన్నదా? లేదు. చూడటానికి నవ్వువచ్చేటట్టు ఉన్నది. అలాగే జీవితం ఒక పెద్ద నాటకం. అందుకే దేనికీ అతిగా అంటుకుపోకండి. మీ పాత్ర మీరు పోషించండి. మొత్తం నాటకాన్ని చూసి ఆనందపడండి.
ఒక విషయం అర్థం చేసుకోండి. జీవితం లక్ష్యం కాదు. అది ఒక మార్గం మీకు లక్ష్యం ఉంటే దాని వెంట పరిగెడతారు. మీరు పరిగెడితే మీ కాళ్ళు భూమి మీద ఆనవు. ఎప్పుడయితే మీ కాళ్ళు భూమి మీద ఆనవో మీరు ఈ సృష్టిలో అందాలని పోగొట్టుకుంటారు. మీరు పరిగెడితే మీరు నిజంగా పూర్తిగా ఈ అనంత చైతన్యపు అందాల అనుభూతులని కోల్పోతారు. లక్ష్యాన్ని మీరు వదిలేవేస్తే, అప్పుడు మీ దృష్టి దారి మీద ఉంటుంది. అప్పుడు ఆ దారి మీద ఆనందంగా వెళతారు. లక్ష్యం దానంతట అదే నెరవేరుతుంది.
మీరు ఎప్పుడయితే ఉద్దేశరహిత జీవితాన్ని అర్థం చేసుకుంటారో, మీరు జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోగలిగే వరకూ మీరు అచేతనస్థితిలోనే జీవిస్తుంటారు. మీరు సరియైన చేతన స్థితిలో జీవించలేరు. మీరు బలంగా గట్టిపడిపోయిన అహంకారంలో జీవించుతారు. అది కేవలం జీవితంలోని లక్ష్యాలని చూస్తుంది. కాని అందులో అందాలను చూడదు.
ఈ జీవిత లక్ష్యాలు నెరవేర్చటానికి మీ మొత్తం జీవితాన్ని త్యాగం చేయటం అనేది మీరు జీవించే దారి కాదు. మీరు ఆ విధంగా జీవించితే, ఒక్కొక్క లక్ష్యాన్ని మీరు చేరుకున్నప్పుడు, ఇంత ఉపయోగం లేని విషయాల కోసం జీవితాన్ని వృధా చేసుకున్నాను అని మీరు బాధపడతారు. లక్ష్యాలని వదిలివేయండి. జీవితపు దారిలో ఆనందంగా నడవండి. ఈ విషయం పై మళ్ళీ మళ్ళీ ధ్యానం చేయండి. ఏదో ఒక సమయంలో సత్యం మీ ముందు ఆవిష్కరించబడుతుంది.
మరొక విషయం : మీ జీవితం నుంచి దేనినీ తీసివేయకండి. అలాగే జీవితంలో ఏదో మిస్ అయిపోయామని అనుకోకండి. ఆధ్యాత్మిక అనే దానిని మీరు ఎప్పుడూ తీసివేయలేరు. అది మీతోనే ఉంటుంది. మీరు జీవితంలోంచి దేనిని తీసివేసినా మీరు ఏదో ఒక దానిని కోల్పోతారు. దాని బదులు అన్నింటిని అనుసంధానం చేయండి. అన్నింటిని మీ జీవితంలో ఉండనీయండి. అప్పుడు మీరు సంపూర్ణ వ్యక్తిగా అవుతారు. ఎప్పుడయితే మీరు సంపూర్ణులవుతారో మీరు పవిత్రంగా ఉంటారు.
ఒక వేళ మీకు ఇష్టంలేని అంశాలు ఉన్నాయనుకోండి. అది వేరే విషయం. వాటిని మీ జీవితంలో ఉంచాలి, అనే అవసరం లేదు. మీరు తెలుసుకునే తత్వంలో జీవిస్తూ ముందుకి సాగండి.
ఒక విషయం అర్ధం చేసుకోండి. ఒక శాస్త్రజ్ఞుడు ఒక ఫార్ములాని కనిపెట్టి దానితో ఒక కొత్త విధానం లేదా వస్తువు తయారుచేస్తాడు. దానిని బయట ప్రపంచంలో వాళ్ళు ఉపయోగించటానికి ఇస్తాడు.
ఒక గురువు తన అంతరంగంలోని అనుభవాల ఆధారంగా ఒక ఫార్ములాని తయారు చేస్తాడు. దానిని ఎదుటివారి అనుభవంకోసం వారికి ఇస్తాడు. ఆయన తాను చేతన స్థితిలో అనుభవించిన శాశ్వత ఆనందాన్ని ఎలా పొందాలో ఆ ఫార్ములాని ఎదుటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కూడా ఆ ఆనందం పొందే విధంగా సహాయం చేస్తాడు.
ఇప్పుడు నేను మీకు ఆ అంతిమ, శాశ్వత ఆనందమయిన నిత్యానందాన్ని పొందటానికి ఫార్ములా ఇస్తున్నాను.
ప్రశ్న : స్వామీజీ, మేము మాలోని అహంకారాన్ని ఎలా పోగొట్టాలి?
ముందుగా మీలోని అహంకారం ఏ రూపంలో ఉన్నదో చురుకుగానో, అణుకువగా ఉన్నదో, అర్ధంచేసుకోండి. ఆ తరువాత అది ఏఏ రూపాల్లో ఉంటుందో మనం ఇప్పటి వరకూ చెప్పుకున్న విధంగా అర్ధం చేసుకోండి. మీలోని అపరాధ భావం కోరికలు, భయం ఆత్మస్తుతి ఇలాంటివన్నీ కూడా మీ అహంకారం యొక్క వివిధ రూపాలు. ఇవన్నీ కూడా మీలో ఏర్పడ్డ "నేను నాది" అనే వాటివలన ఉంటాయి. మీరు ఒక్కసారి వీటిని అర్ధం చేసుకుంటే మీరు వాటి విషయంలో ఒక పరిశీలకునిగా మారతారు. అప్పుడు మీరు ఈ నాటకాన్నంతా చూడగలుగుతారు. జీవితం నాటకం అని తెలుస్తుంది. అలా మీరు తెలుసుకున్నప్పుడు మీలో బలపడిన 'నాది' అనేది మీ అహంకారం కరిగిపోవటాన్ని మీరు తెలుసుకుంటారు.
ఇది మీలో జరగటం మొదలయినప్పుడు మీరు అప్రయత్నంగా ఈ అనంత చైతన్య సృష్టిలో ప్రతి ధ్వనించతారు. అప్పుడు విషయాలన్నీ తిరిగి స్థిరపడి జీవితాన్ని మీ కోసం చాలా అందంగా చేస్తుంది. అప్పుడు మీరు మీ అహంకారాన్ని నాశనం చేయాలనే ఒకే ఒకలక్ష్యంతో ఉండాలి. దానిని ఏవిధంగా కూడా కాపాడాలని చూడవద్దు. ప్రతి నిముషం అహాన్ని చంపటానికి సిద్ధంగా ఉండండి. ఎప్పుడయితే మీలోని అహంకారాన్ని చంపటానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు మీరు స్వేచ్ఛని పొందుతారు. అంతే.
ప్రశ్న : స్వామీజీ, మీరు ఆజ్ఞ చక్రం అనేది అమాయకత్వానికి తెలివితేటలకి సంబంధించినది అని చెప్పారు. ఈ అమాయకత్వాన్ని, తెలివితేటలని ఎలా వివరించతారు?
ఎప్పుడయితే మీరు స్థిరంగా యాంత్రికంగా ఉండే మైండ్‌ని పగలగొట్టి, స్వేచ్ఛని పొందుతారో అప్పుడు మీరు ఒక నదిలా ప్రవహించుతారు. అప్పుడు మీరు తెలివైనవారవుతారు. ఎప్పుడైతే మీరు తర్కం లేకుండా ఆలోచించగలరో అప్పుడు మీరు తెలివైన వాళ్ళు. ఎప్పుడయితే మీరు యధాలాపంగా, అప్రయత్నంగా ఉంటారో అప్పుడు తెలివైన వాళ్ళు. మిమ్ములని చాలెంజ్ చేయటం కష్టంగా ఉంటుందో అప్పుడు మీరు తెలివైన వాళ్ళు.
మీరు జీవితం ఒక నాటకం అని తెలుసుకోగలిగితే మీరు తెలివైన వాళ్ళు. మీరు ఈ అనంత చైతన్య సృష్టి అనేది అంతిమ జీవన శక్తి అని తెలుసుకుంటే తెలివైన వాళ్ళు. ఎప్పుడయితే మీరు మీ అంతరంగంలోని నిశ్శబ్దాన్ని చేతనస్థితిలో తెలుసుకోగలరో అప్పుడు మీరు తెలివైన వారు.
ఎప్పుడయితే మీరు మీ మైండ్‌ని ఉపయోగించకుండా హాయిగా నవ్వగలరో అప్పుడు మీరు తెలివైన వారు. కేవలం మీ ఉనికిలో శక్తిని వ్యాపింప చేస్తే మీరు తెలివైన వాళ్ళు. ఎక్కడా దేనికీ అంటుకుపోకుండా ఉండగలిగితే మీరు తెలివైన వాళ్ళు. మీలోని అహంకారాన్ని మీ చేతన స్థితిలో తెలుసుకోగలిగితే మీరు తెలివైన వాళ్ళు. మీరు ఎప్పుడయితే మీ అంతరాత్మ మూలాన ధనికులం కాని ఐశ్వర్యం వలన కాదు అని తెలుసుకుంటారో అప్పుడు మీరు తెలివైన వాళ్ళు.
మీరు మీ గురువుని గుర్తించ గలిగితే తెలివైనవారు. మీ అహంకారాన్ని మీ గురువుకి వదిలేస్తే తెలివైన వారు. ఎప్పుడయితే జీవితం అనే ఆటలో ప్రతి నిముషం ఆనందంగా గడపగలో అప్పుడు మీరు తెలివైన వారు
చిన్న కథ :
ముగ్గురు వ్యక్తులని ఒక ప్రశ్న అడిగారు "నీవు ఇంకా పదిరోజులు మాత్రమే బ్రతుకుతావు అని చెబితే మీరు ఏం చేస్తారు"?
మొదటి వ్యక్తి ఇలా జవాబు చెప్పాడు " నేను చేస్తున్న అన్ని పనులు ఒక పద్ధతిలో పెడతాను. దాంతోనేను చనిపోయాక నా కుటుంబ సభ్యులు కష్టపడరు. అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను"
రెండవ వ్యక్తి ఇలా అంటాడు. “ నేను ఇంతవరకూ చేయని పనులు చేసి చాలా సంతోషంగా ఉంటాను”
మూడవ వ్యక్తి ఇలా చెబుతాడు. “ నేను మరొక డాక్టర్ని కలుస్తాను”
(అంతా నవ్వులు)
దీనిని తెలివి అంటారు. మీరు యథాలాపంగా చెప్పగలగాలి. అంతేకాని అందరికి తెలిసిన విషయాలే కాదు. మీ అంతట మీరు మిమ్ములని నిరూపించుకోవాలి. అది తెలివి అంటే.
మరొక చిన్న కథ:
హాస్పిటల్లో ఫోన్ మోగుతుంది. నర్సు ఫోన్ తీసి ఏమి కావాలి అని అడుగుతుంది. దాని అవతల నుంచి "రూం నెం. 10లో ఉన్న చందాబాబు ఎలా ఉన్నాడు” అని అడుగుతారు.
నర్సు ఈవిధంగా సమాధానం చెబుతుంది. "ఆయనకి బాగుంది. ఆయనని రేపు సాయంత్రం డిస్పాచార్జి చేస్తాము. మీరు ఎవరు మాట్లాడేది?” అని అడుగుతుంది.
దానికి అంతను “ నేను చందాబాబుని. మీరు పేషంట్లకి వాళ్ళ పరిస్థితి చెప్పరు కదా!” అంటాడు.
(అంతా పెద్దగా నవ్వుతారు)
ఇది తెలివి. మీరు ఏ పాయింట్ దగ్గర ఎక్కువ సేపు ఉండిపోకూడదు, అలా మిమ్ములని ఎక్కువసేపు చాలెంజ్ చేయనివ్వకుండా ఉండటమే తెలివి.
మరొక కథ చెబుతాను వినండి.
ఒక వ్యక్తి సిటీ నుంచి వచ్చిన అతని స్నేహితుణ్ణి అలా బయటికి దూరంగా తీసికెళ్ళి అన్నీ చూపిస్తుంటాడు. అతనిని "ఇక్కడ ఇన్ని గొర్రెలను చూసి నీవు ఆశ్చర్యపోతున్నావు కదా! నీవు వాటిని లెక్కపెట్టగలవా” అంటాడు.,
దానికి సిటీ స్నేహితుడు “ఓ! లెక్కపెడతాను. అవి మొత్తం 300” అంటాడు
దానికి ఒక వ్యక్తి నిర్ఘాంతపోతాడు. అతనిని ఇలా అడుగుతాడు. "నువ్వు ఎలా వాటిని లెక్కపెట్టగలిగావు ” అంటాడు.
స్నేహితుడు ఇలా జవాబు చెబుతాడు " ఓ! అది చాలా తేలిక. నేను ముందు వాటి కాళ్ళని లెక్కపెట్టాను. మొత్తాన్ని నాలుగుతో భాగించాను”!
ఇది తెలివికాదు. ఇది విషయాన్ని కఠినం చేయటం, సమస్యాత్మకంగా చేయటం. ఇదే విధంగా మనం జీవితంలో చిన్న విషయాలని పెద్ద సమస్యలుగా చేస్తాము.
ఇప్పుడు అమాయకత్వమంటే ఏమిటో చూద్దాం. పిల్లలని చూస్తే అమాయకత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. వాళ్ళు చెప్పాలనుకున్నది ఎటువంటి ఎడిటింగ్ లేకుండా చెప్పేస్తారు. వాళ్ళు లెక్కలు కట్టరు. వారి ప్రవర్తన సంపూర్ణంగా ఉంటుంది. వాళ్ళ కపటంగా మోసంగా ఉండరు. దీనినే అమాయకత్వం అంటాము.
కానీ మనం ఏం చేస్తాం? మనం వాళ్ళని మాటలు ఎడిట్ చేయమంటాము. వాళ్ళని హృదయంలోంచి మైండ్ లోనికి మార్చేస్తాం. దాంతో వారిలోని స్వచ్ఛమైన అమాయకత్వం మైండ్‌తో కల్మషమయిపోతుంది.
చిన్న కథ:
ఒక రోజు ఒక అబ్బాయికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికి బాగా డబ్బు ఉన్న అత్త వస్తుంది కాబట్టి ఆమెతో చాలా మర్యాదగా, జాగ్రత్తగా ఉండమని చెబుతాడు.
ఆమె వస్తుంది. కొంచెం సేపయ్యాక ఆమెకి చాలామంది భోజనం పెడతారు. భోజనం చేస్తున్నంతసేపు ఆ అబ్బాయి ఆమెనే గమనిస్తుంటాడు. చివరికి ఆమెని ఇలా అడుగుతాడు " అత్తా! నీవు నీ ట్రిక్ ఎప్పుడు చేస్తావు"
దానికి ఆమె "ఏం ట్రిక్" అని అడుగుతుంది.
"మానాన్నగారు చెప్పారు. నీవు చేపలా నీళ్ళు తాగుతావని" అంటాడు ఆ అబ్బాయి.
(అంతా నవ్వులు)
చిన్న పిల్లలు వాళ్ళకి ఏం మాట్లాడాలిపిస్తే అది మాట్లాడేస్తారు. స్వేచ్ఛగా చెప్పాలనుకున్న విషయాలు చెప్పేస్తారు. అందుకే వాళ్ళని చూస్తే సంతోషంగా ఉంటుంది. అందుకే మనం పిల్లలతో సంతోషంగా గడుపుతాము. వాళ్ళు అమాయకత్వం మనలని ఆకర్షించుతుంది. కానీ మనం వాళ్ళని కపటంగా తయారు చేస్తున్నాం అని మనకి తెలియదు. ఇదేమనం నిరంతరం చేసే పని.
చిన్నకథ :
ఒక అబ్బాయి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళు "తాత గారూ! మీరు కప్పలాగా అరవగలరా!" అంటాడు
దానికి ఆయన ఆశ్చర్యంగా "ఎందుకు" అంటాడు దానికి ఆ అబ్బాయి "మా అమ్మానాన్న అంటుంటే విన్నాను. మీరు క్రోక్ అంటే మాకు కొంత ఆస్తి వస్తుందట" అంటాడు.
(అంతానవ్వులు)
మనం నిరంతరం కపటంగా ఉంటాము. మనం ఏమిటో పూర్తిగా చెప్పము. స్వేచ్ఛగా మనం చెప్పాలనుకున్నది చెప్పము. మనం ఒకటి అనుకుంటాము. మరొకటి మాట్లాడతాము. దీనివలనే మనం అందంగా ఉండం. మనం మన అమాయకత్వాన్ని పోగొట్టుకున్నాము. చిన్నపిల్లలకి కపటం తెలియదు. వాళ్ళు చాలా సహజంగా ఉంటారు. వాళ్ళు అందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు స్వేచ్ఛగా చూపిస్తారు. చెప్పాలనుకున్న విషయాలు స్వేచ్ఛగా చెబుతారు.
చిన్నకథ :
ఒకామె వాళ్ళ అబ్బాయిని తన స్నేహితురాలు ఇంట్లో వదులుతుంది. ఆమె అబ్బాయితో నువ్వు సాయంత్రం వచ్చే ముందు ‘ఆంటీకి థాంక్స్ చెప్పు’ అంటుంది. సాయంత్రం ఆ అబ్బాయి ఇంటికి వచ్చాక ఆమె ఆ అబ్బాయిని తన స్నేహితురాలికి థాంక్స్ చెప్పావా? అని అడుగుతుంది.
దానికి అబ్బాయి. “నేను చెప్పలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి థాంక్స్ అన్నపుడు ఆంటీ నోమెన్షన్ అన్నారు” అని అంటాడు.
చిన్నపిల్లలంటే అలానే ఉంటారు. మనం వాళ్ళకి కొన్ని మర్యాదలు నేర్పాలి. కానీ వాళ్ళని కపటంగా తయారు చేయకూడదు. వాళ్ళకి ఈ ఆట గురించి చెప్పాలి. ఈ ఆటని తెలుసుకునే తత్త్వంతో ఆడమని నేర్పించాలి. వాళ్ళతో అహంకారం లేకుండా చూడాలి. వాళ్ళకి ప్రాథమికమైన రూల్స్ చెప్పాలి. వాళ్ళకి వాళ్ళు ఏమిటో తెలిసే తెలివి నేర్పించాలి.
మరొక విషయం, చిన్న పిల్లలలోని అమాయకత్వం వాళ్ళకి ఏమీ తెలియక పోవటం వలన ఉంటుంది. ఇటువంటి అమాయకత్వం వాళ్ళకిఉంటుంది. ఎందుకంటే సమాజపు నిబంధనలు వాళ్ళకి ఇంకా అంటవు. ఒక్కసారి ఆ నిబంధనలు వాళ్ళ మీద పడితే వాళ్ళు జ్ఞానాన్ని పొందటం మొదలు పెడితే వాళ్ళు అమాయకత్వాన్ని వదిలేస్తారు. కానీ పిల్లలు తిరిగి అమాయకత్వంతో సంబంధం పెట్టుకోవాలంటే వారికి చాలా లోతైన తెలుసుకునే తత్త్వం ఉండాలి. తిరిగి పొందిన అమాయకత్వమే నిజమైన అమాయకత్వం. ఎందుకంటే ఈ అమాయకత్వంలో అజ్ఞానం, అవిద్య అనేది ఉండదు కాబట్టి, ఈ అమాయకత్వం వారికిచాలా లోతుగా అర్ధం చేసుకోవటం వలన దొరికినది.
పిల్లల అమాయకత్వానికి గురువులు, యోగులు అమాయకత్వానికి ఉండే తేడా అదే. ఈ లౌకిక జ్ఞానం అమాయకత్వానికి చెదరగొడుతుంది. అహంకారాన్ని పెంచుతుంది. అయితే తెలుసుకునే తత్వం, వివేకం ఈ జ్ఞానాన్ని ఒక ప్రక్కన పెడతాయి. అమాయకత్వాన్ని మరొక సారి బయటకి తెస్తాయి. అది జరిగినప్పుడు మీకు మార్గం కనిపిస్తుంది.
ప్రశ్న : స్వామీజీ ! మేము భగవంతునితో ఎలా సంబంధం పెట్టుకోవాలి?
మీరు సంబంధం పెట్టుకోవడానికి భగవంతుడు అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏమీ ఉండదు. ఈ విషయాన్ని ముందు అర్ధం చేసుకోండి. ఆయన మీ తలమీద స్వర్గం అనే స్థలంలో కూర్చుని ఉండడు. మీతో సంబంధం పెట్టుకోవటానికి ఎదురు చూస్తూ అక్కడే కూర్చోడు. ఆయన ఈ విశ్వంలో ప్రతి వస్తువులో ప్రతి ప్రాణిలో ఉంటాడు. ప్రతిదీ ఆయన సృష్టి
ఆయనే సృష్టి. ఆయన సృష్టించినదే సృష్టి. ఆయనే అనుభవం. ఆయన అనుభవమే అనుభవం.
ఈ అనంత సృష్టికి మనం పెట్టిన పేరు భగవంతుడు. అంతే. మీరు ఎప్పుడయితే ఈ విషయం అర్ధం చేసుకుంటారో అప్పుడే భగవంతుని అనుభవాన్ని పొందుతారు. అప్పుడు భగవంతునితో సంబంధం పెట్టుకోవటమనే సమస్య ఉండదు.
కొంతమంది నన్ను అడుగుతుంటారు, స్వామీ మీరు భగవంతుని దగ్గరగా ఉంటారా?” అని. అప్పుడు నేను వాళ్ళతో “నేను భగవంతుణ్ణి” అలాగే “మీరు కూడా భగవంతుడే” అని చెబుతాను. కానీ వాళ్ళు నా మాట వినరు. వాళ్ళకి భగవంతుడికి ఎలా దగ్గర కావాలో తెలియాలి. దగ్గరికి అనే మాట వచ్చింది అంటే మీకు భగవంతుకి మధ్య దూరం ఉన్నది అని అర్ధం అదిమిమ్ములని భగవంతునికి దూరం చేస్తుంది, అని అర్ధం.
నేను మీకు చెబుతున్నాను. మీరే భగవంతుడు. అటువంటప్పుడు దగ్గర అవ్వటం అనే మాట రాదు. నేను ఏమి చెప్పటానికి ప్రయత్నిస్తున్నానో అర్థమయిందా? ఇది చాలా చిన్న విషయం. భగవంతుడు అనేమాట మనం సృష్టికి ఇచ్చిన పేరు. మీరు ఆసృష్టి లో భాగమే కదా!
ఎప్పడయితే మీరు ఈ సృష్టికి అనుగుణంగా జీవిస్తారో, మీరు ఈసృష్టితో ఎప్పుడు అనుబంధాన్ని పెంచుకుంటారో అప్పుడు మీరు భగవంతుడే. అంటే ఎప్పుడయితే మీరు ఎవరితోనైనా దేనితోనైనా అత్యంత సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంటే అప్పుడు మీరుస్వచ్ఛమైన చేతన స్థితిలో ఉంటారు. ఎప్పుడయితే మీ చుట్టు ప్రక్కవాళ్ళ పట్ల వాళ్ళు తెలిసినా తెలియక పోయినా వారి పట్ల మీకు ప్రేమ కలిగితే మీరు భగవంతుని యొక్క అనుభూతి పొందినట్టే. ఇదే మీకు మీరు భగవంతుని నుంచి ఎంత దూరంలో ఉన్నారో కొలవగలిగే కొలమానం
మీరు ఎప్పుడయితే ఈ అనంత చైతన్యసృష్టికి అనుగుణంగా ఉండగలుగుతారో అప్పుడు మీరు మీ అంతరాత్మ యొక్కమాటని వినగలుగుతారు. అప్పుడు మీకు మరొక మార్గదర్శి అవసరం లేదు. మీకు ఎవరూ వచ్చి ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి అని చెప్పనవసం లేదు. మీకు అర్ధమయిపోతుంది. మీలోనివివేకం అన్ని విషయాల్లో చక్కని మార్గం చూపిస్తుంది. నిర్ణయాలు చేయవలసిన వచ్చినప్పుడు మీకు అవి భారంగా అనిపించవు. మీరు స్వేచ్ఛగా సాగిపోగలగుతారు. గురువు మీ లోపలి అంతరవాణిని మేలుకొలుపుతాడు. ఆయన మీ వివేకం వికసించేలా చేస్తాడు.
మనలో చాలా మంది కేవలం కారణం ఉన్నప్పుడు భగవంతుడికి చాలా దూరంగా అయిపోతారు. మనం అంటుంటాం మేము మా కుటుంబ సభ్యుల మీద స్నేహితుల మీద ప్రేమ వర్షం కురిపిస్తామని. ఈ భూమి మీద ఉదయించిన యోగులను, గురువులను చూడండి. వాళ్ళలో ఉండే సామాన్య లక్షణం ఏమిటి? స్వచ్ఛమయిన
ప్రేమ. అంతే. వాళ్ళు మీరు నిత్య జీవితంలో పొందినటువంటి మామూలు ప్రేమని పొంది ఉంటే గొప్ప ప్రత్యేక కార్యక్రమాలని ఏర్పరచగలిగేవారా? ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ప్రపంచమంతా కేవలం మామూలు ప్రేమలో స్థాపించటం సాధ్యమేనా? మామూలు ప్రేమ ఎంత వరకూ సహాయం చేయగలుగుతుంది? అది మిమ్ములను త్వరలోనే బలహీనపరుస్తుంది. యోగులు గురువులు ప్రపంచమంతా తిరిగి ప్రజలని మార్చగలుగుతున్నారంటే అది కేవలం దైవ ప్రేమవలన మాత్రమే సాధ్యం. వాళ్ళకి ఉండే ఆ దివ్య ప్రేమ, ప్రతి ఒక్కరిని సమానంగా చూడగలిగే కరుణ, ఈ భూమి మీద అందరూ సమానమే అనుకునే తత్త్వం వాళ్ళ చేత అంత గొప్ప పనులు చేయించుతుంది
మీరు వాళ్ళు జీవిత చరిత్రలు చదివితే వాళ్ళు తమ కుటుంబాలని ప్రక్కన పెట్టినట్టు మనికి అర్ధమవుతుంది. వాళ్ళు నిరంతరం ప్రజలకోసం వాళ్ళ దగ్గరికి వెళ్లినట్టు మనకి అర్ధమవుతుంది. ఇటువంటి విషయాలలో కుటుంబం ఒక అడ్డంకి గానే ఉంటుంది. ఒకసారి వారిలో పరిణితి కలిగి జ్ఞానోదయమయ్యాక అన్ని విషయాలు మిగతా ప్రపంచంలో అందరిలా అనుసరిస్తారు, వాటిని స్వీకరిస్తారు.
మిమ్ములని భగవంతుని నుంచి వేరు చేసిది అహంకారం మాత్రమే. అహంకారం ఉన్నప్పుడు మీరు స్థిరంగా ప్రేమించలేరు. అదే లోతైన అనుభూతితో నిరంతరం ప్రేమించలేరు. మీ ప్రేమ ఏదో ఒక దానిని ఆధారం చేసుకొని ఉంటుంది. అది రెండు చివరలకి మధ్య తిరుగుతూ ఉంటుంది.
గురువులు శరీరకదలికలని శరీర భాషని గమనించండి. వాళ్ళలో ప్రతిధ్వనిస్తున్న దైవ ప్రేమని చూడగలుగుతారు. గురువు నిరంతరం ఈ అనంత సృష్టికి అనుగుణంగా ఉండటాన్ని మీరు గమనించుతారు. ఆయన నిరంతరం ప్రేమని ప్రవహింపచేస్తుంటాడు. ఆయన ప్రేమ తన ముందు ఉన్నది ఎవరు అని చూడదు. మీరు అతని శరీర కదలికలని, శరీర భాషని గమనించ గలిగితే వాటిలో కొన్నింటిని మీరు నేర్చుకోగలుగుతారు.
మీరు గురువులని కొంతకాలం గమనించితే ఆయన నదిలా ఎంతో అందంగా, ఒక కవితలా ఈ సృష్టిలయలకి అనుగుణంగా ఎలా ప్రవహిస్తారో అర్థమవుతుంది. ఆయన ప్రతీ చర్య సృష్టికి కచ్చితంగా సరిపోయేటట్టుగా ఉంటుంది. అందుకే ఆయనని చూస్తే అంత అందంగా ఉంటుంది. కేవలం గురువులని గమనిస్తే చాలు మీకు ఈ సృష్టి యొక్క అందాలన్నీ అనుభవమవుతాయి. ఈ సృష్టి ఎంత అందంగా ప్రవహిస్తుందో మీకు తెలుస్తుంది.
ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అంటే గురువులకి అహంకారం ఉండదు. ఆయనలోపలి ప్రవాహాలకి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే ఆయన లోపల “నేను నాది” అనేవి ఉండవు. ఈయన కేవలం ప్రేమని మాత్రమే వెదజల్లుతాడు. ఆయన వ్యాధులకి, కష్టాలకి చికిత్స చేయగలుగుతాడు. చికిత్స చేయటం లేదా బాగు చేయటం అంటే కేంద్రీకరింపబడన ప్రేమ మాత్రమే. అందుకే మనం ఎన్నో సార్లు గురువులు చూపించే అద్భుతాల గురించి వింటుంటాము. అందుకే వాళ్ళని దేవుడిలా కొలుస్తాము. స్పష్టంగా అర్థం చేసుకోండి.
కాబట్టి భగవంతునికి దగ్గరగా వెళ్ళాలి, అనే సమస్యలని వదిలివేయండి. ఈ సకల సృష్టికి అనుగుణంగ జీవించండి. మీరే భగవంతుడు అవ్వండి.
ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఈ సృష్టిని జయించలేరు. మిమ్ములని ఈ సృష్టి జయించుతుంది. మీరు మీ అహంకారాన్ని వదిలేస్తే మిమ్ములని మీరు జయించకుంటారు. అంతే. మీరు భగవంతునికి సరిపోయే దేవాలయంలా ఉండగలిగితే ఆయన మీ లోపలే ఉంటాడు. ముందు రోజులలో ప్రాథమిక దశలో మీరు దేవుడికి అతిథి, చివరికి ఆయన మీకు అతిథి అవుతారు. ఆయనని మీలోపలికి ఆహ్వానించగల వాళ్ళవ్వాలి. అలా చేయాలంటే మీలోని అహంకారాన్ని పూర్తిగా వదిలివేయగలగాలి. మీరు ఆ భగవంతునిలో, ఈ అనంత సృష్టిలో
కరిగిపోవాలి. అప్పుడు జీవితం ఒక అద్భుతమైన సంగీతంలా ఉంటుంది. అది శాశ్వతమైన ఉత్సవంలా ఉంటుంది.
ఇప్పుడు మన ఒక అందమైన చాలా శక్తి గల ధ్యాన పద్దతిని నేర్చుకుందాం. దీని పేరు దివ్య నేత్ర ధ్యానం ఇది ఆజ్ఞ చక్రానికి సంబంధించినది.
దివ్యనేత్ర ధ్యానం (మొత్తం సమయం 30 నిముషాలు)
దివ్యనేత్ర ధ్యానం ఆజ్ఞ చక్రాన్ని వికసింపచేయటానికి చేస్తాము. ఆజ్ఞ చక్రాన్ని వికసింప చేస్తే అది మీకు విశ్వ వివేకానికి సంబంధాన్ని నెలకొల్పుతుంది. దీనిని జోరాస్ట్రిజం నుంచి తీసుకోబడింది. దీంట్లో రెండు భాగాల ఉంటాయి. మొదటి భాగం ఆజ్ఞ చక్రాన్ని శుభ్రం చేస్తుంది. రెండవది దానిని శక్తి మయం చేస్తుంది. ఆజ్ఞ చక్రం లేదా మూడవ కన్ను మనలోని భ్రమలని, కోరికలని నాశనం చేస్తుంది. ఇది మీలో ఉన్నతమైన చేతన స్థితి ఏర్పడటానికి సహాయం చేస్తుంది.
ఇక్కడ మీ ముందు ఒక దీపం ఉంది. దీనిని ఆవు నెయ్యితోగాని, నవ్వుల నూనెతోగాని వెలిగేస్తారు. మీరు క్రొవ్వొత్తిని కూడా ఉపయోగించవచ్చు. కానీ అది మొక్కల సంబంధిత నూనెతో చేసినది అయి ఉండాలి. ఇది మార్గదర్శకమైన ధ్యాన పద్ధతి. నేను చెప్పే సూచనలు జాగ్రత్తగా గమనించండి. నేల మీద కళ్ళు మూసుకొని కూర్చోండి. నేల మీద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోవచ్చు
(సున్నితంగా సంగీతం వినిపిస్తుంది)
ఆజ్ఞ చక్రంమీద మీరు ఏకాగ్రతని నిలపండి. దానిలోపలికి వెళ్ళినట్టుగా ఉండాలి. కళ్ళు తెరచి ఆ దీపం వైపు చూడండి. ఆ దీపాన్ని మీ మూడవ కన్ను ద్వారా చూడండి
మీ రెండు కనుబొమ్మల మధ్య నుంచి చూడండి. కళ్ళు కొంచెం మూసినట్టు అవుతాయి. కళ్ళలో నీరు కారుతుంది. అలా జరగనీయండి
(5నిముషాలు)
కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీ ఆజ్ఞ చక్రం మీద ఏకాగ్రతని నిలపండి. కళ్ళు తెరవండి. మళ్ళీ దీపాన్ని మీ మూడవ కన్ను ద్వారా చూడండి (5నిముషాలు)
కళ్ళు మూసుకోండి. ఆజ్ఞ చక్రం మీద ఏకాగ్రత నిలపవద్దు. విరామంగా రిలాక్స్ అవ్వండి (5 నిముషాలు)
ఓం శాంతి శాంతి శాంతిః
మెల్లగా చాలా మెల్లగా కళ్ళు తెరవండి
తరువాత సెషన్లో కలుద్దాం,
ధన్యవాదములు
