KAILASA Library/నమ్మకమైన పరిష్కారాలు/అధ్యాయం - 7: అసూయ నుంచి స్వేచ్ఛ పొందటంSign in
నమ్మకమైన పరిష్కారాలు

అధ్యాయం - 7: అసూయ నుంచి స్వేచ్ఛ పొందటం

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

Vishuddha chakra symbol

(Freedom from Jealousy)

| ఇ | | --- |

ప్పుడు మనం విశుద్ధి చక్రం గురించి తెలుసుకుందాము. విశుద్ధి చక్రం గొంతుక దగ్గర ఉంటుంది. సంస్కృతంలో విశుద్ధి అంటే; శుద్ధికి అశుద్ధికి అతీతమైనది.

మనం ఒకరితో పోల్చుకుని అసూయ చెందినప్పుడు ఈ చక్రం బంధింపబడుతుంది. మనం ఎప్పుడయితే ఇతరులని చూసి బాధపడమో, ఎప్పుడైతే మన విలక్షణమైన లక్షణాలని, మన వ్యక్తిత్వాన్ని, మన పూర్తి శక్తిని, సృజనాత్మకతని పూర్తిగా వెల్లడి చేస్తామో అప్పుడు ఈ చక్రం వికసిస్తుంది.

ధ్యానపద్ధతి ; శక్తి సాగర ధ్యానం ; దీనిని బౌద్ధమతం నుంచి గ్రహించటమైనది. ఇతరులకి మనకంటే ఎక్కువ ఉన్నదని, వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ సాధించారనీ అనుకుంటూ అసూయపడతాము. మనం ఎప్పుడయితే ఇతరుల ఉన్నతిని చూసి భరించలేమో అప్పుడు మనలో అసూయపుడుతుంది. పోల్చుకోవటం విత్తనమయితే అసూయ దాని ఫలము.

నిజానికి పోల్చుకోవటం, అసూయ అనేవి ఏమీ లేవు. మనమే వాటిని సృష్టించుతాము. వాటిని ఎలా పోగొట్టుకోవాలో, వాటిని ఎలా అధిగమించాలా అని నిరంతరం ఎంతో మాట్లాడుతుంటాము. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ చక్రం పేరుని మీరు అర్థం చేసుకోవాలి .

ఈ చక్రం పేరు 'విశుద్ధి అంటే స్వచ్ఛమైన. అశుద్ధి అంటే స్వచ్ఛం కానిది. విశుద్ధి అంటే అశుద్ధి, శుద్ధి ఈ రెండింటికి అతీతమైనది. అందుకే విశుద్ధి చక్రం ఎప్పుడూ స్వచ్ఛం గానే ఉంటుంది. దీనిని కల్మషం అంటదు.కాబట్టి ఈ చక్రాన్ని శుభ్రం చేయవలసిన అవసరం లేదు . అందుకే పోల్చుకోవటం అనేది కేవలం ఈ చక్రాన్ని కమ్మే ఒక నీడమాత్రమే . ఈ నీడ కూడా వస్తువు లేని నీడ .

ఒక చిన్న కథ

ఒక వ్యక్తి ఒక మ్యూజిక్ గ్రూపులో పని చేస్తుంటాడు . ఆ గ్రూపు ప్రపంచమంతటా స్టేజి షోలు ఇస్తూ ఉంటుంది .

అలా ఒక ప్రదర్శన ఇచ్చేటప్పుడు అతను కొన్ని పాటలకి నల్ల విగ్గు , కొన్ని పాటలకి ఎర్రటి విగ్గు పెట్టుకోవాలని అనుకున్నాడు . అలా విగ్గులు మారుస్తూ ఆ ప్రదర్శన మొదటి భాగం పూర్తి చేసాడు .

ప్రదర్శన మధ్యలో, విశ్రాంతి సమయంలో ఆ షో డైరెక్టర్ మేకప్ రూమ్‌లోనికి వచ్చి అతనితో, “ సర్! ఈ మిగతా ప్రదర్శనలో మీరు ఎరుపు విగ్గు మాత్రమే పెట్టుకోవాలి అంటాడు .

ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు ఎందుకు అలా అని అడుగుతాడు.

దానిని డైరెక్టర్, “ ప్రేక్షకులు నల్ల జుట్టు ఉన్న గాయకుడి కంటే ఎర్ర జుట్టు ఉన్న గాయకుడు పాడిన పాటలు బాగున్నాయి అని అంటున్నారు “ అంటాడు .

(అంతా నవ్వులు)

మనం ఇలా పోల్చటాలలో ఎంత బిజీగా ఉంటామంటే, అందులోపడిపోయి అసలు విషయాలని వాటిలా చూడము. మన మైండ్ ఈ పోల్చటంలో ఎంత నిమగ్నమయిపోతుందంటే వాటిల్లో ఉండే అసలు నాణ్యతని మనం చూడలేనంతగా. మైడ్ అసలు మొత్తం విషయాన్నే మిస్ అయిపోతుంది. మనం వస్తువులని గాని

విషయాలను కానీ అవి ఏమిటో వాటిగానే చూడ గలగాలంటే మనం ఈ పోల్చటం అనే దృక్పథాన్ని మార్చుకోవాలి.

పోలిక అంటే ఏమిటి ?

మీలో ఎవరైనా మనం మమూలుగా పోల్చుకునే ముఖ్య అంశాలు ఏమిటో చెప్పగలరా నాకు తెలుసు మీరు అవి చెప్పగలరని. వాటితో ముందుకు రావటానికి సిద్ధంగా ఉంటారు.

(ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఉన్నది)

స్వామీజీ ! అందం .

ఆ ! అందం !ప్రతి ఒక్కరికి అతను లేదా ఆమె సొంత అంశాలు ఉంటాయి పోల్చుకోవటానికి ! సరే ! ఇంకా ఎవరైనా చెబుతారా.

ఆస్తి అంతస్తులు,
కీర్తి ప్రతిష్టలు ;
అధికారం, పేరు ;
జ్ఞానం ;
ఆరోగ్యం.

సరే ! ఈ అంశాలన్ని కూడా మనం మామూలుగా ఇతరులతో పోల్చుకునే అంశాలు. అవును కదా ? వీటన్నింటినీ మనం నాలుగు భాగాలుగా విభజింపవచ్చు ; అవి డబ్బు, జ్ఞానం, అందం, దీంట్లోనే ఆరోగ్యం కూడా ఉంటుంది, నాలుగవది హోదా. మీ అందరి సమస్యలు, చిక్కులు కూడా ఈ నాలుగింటితోనే.

సరే. ఇప్పుడు ఒక విషయం చూద్దాము. ప్రపంచంలో డబ్బు ఉన్న వాళ్ళందరినీ ఒక లైనులో, తక్కువ డబ్బు ఉన్నవారి నుండి ధనికులు అనే క్రమంలో నిలబెట్టామనుకోండి. మీరు కూడా ఆ లైనులో ఉంటారు. మీ ఆలోచన ప్రకారం మీరు ఆ లైనులో ఎక్కడ ఉండవచ్చు.

స్వామీజీ ! ఎక్కడో మధ్యలో ఉంటాము.

అవును. కచ్చితంగా మీరు ఎక్కడో మధ్యలో ఉంటారు. అవును కదా ? లైనులో మీ ముందూ వెనుకా నిలబడ్డవాళ్ళని మీరు లెక్కపెట్టలేరు. మీ ముందు ఎంతో మంది ఉంటారు. అలాగే మీ వెనుక ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు.

అలాగే చాలా మంది లైనులో తమ స్థానాలు మారుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొత్తగా డబ్బు వస్తుంటుంది. పోతుంటుంది. కాబట్టి ప్రతి నిమిషం చాలా మంది మారుతూ ఉంటారు. ఇప్పుడు, మీ ఆలోచనలతో, మీరు నిర్ణయించుకోవాలి. మీరు మీ ముందు ఉన్న పెద్దలైనులో ఉన్న వాళ్ళని చూసి అసూయ పడతారా, లేకపోతే మీ వెనుక లైనులో ఉన్న వాళ్ళని చూసి అమ్మయ్య ! అనుకుని విరామంగా ఉంటూ భగవంతునికి కృతజ్ఞతలు చెబుతారా ! ఇది మీ చేతులలో పని. మీకు చాలా బాగా తెలుసు; మీరు లైనులో ఎక్కడ ఉండగలరు అనే విషయం చెప్పలేని విషయం. ఆ ఆలోచన మిమ్మలని నిరంతరం కలతపెడుతూనే ఉంటుంది. మనని ఎక్కడాలేని ఒక విషయం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. అది వ్యతిరేకపు స్థితిని కలిగి ఉంటుంది.

ఈ వ్యతిరేకపు స్థితిలో ఉండటం (negative existence) అంటే ఏమిటో మీకు వివరిస్తాను. ఉదాహరణకు నా ప్రక్కనే ఉన్న ఈ గంటను తీసుకోండి. దీనిని ఇక్కడ నుండి తీసివేయాలి అనుకుంటే నేను దీనికి తీసి ఈ హాలు బయట పెట్టేస్తాను. అప్పుడు ఇక ఇక్కడ ఆ గంట అనేది ఉండదు. అంతే కదా ! ఈ గంటకి వాస్తవమైన లేదా నిశ్చయమైన ఉనికి ఉన్నది. (positive existence) అందుకే దీనిని ఇక్కడ నుండి నేను తీసివేయగలిగాను.

సరే ! ఇప్పుడు ఇక్కడ చీకటి ఉన్నది అని అనుకుందాము. నేను ఈ చీకటిని తీసుకు వెళ్ళి బయట పెట్టగలనా ? అది నాకు సంభవమేనా ?

కాదు. లేదు. కానీ నేను ఈ గదిలోనికి దీపం తీసుకువచ్చి పెడితే ఈ గదిలో చీకటి మాయమవుతుంది. చీకటికి నిజమైన నిశ్చయమైన ఉనికి లేదు. దానికి వ్యతిరేకమైన, అవాస్తవమైన ఉనికి ఉన్నది. దానిది అవాస్తవమైన ఉనికి కాబట్టి దానిని మామూలుగా మనం ఇక్కడి నుండి తీసివేయలేము.

ఇదే విధంగా పోలికకి కూడా నిశ్చయమైన ఉనికిలేదు. అది కేవలం మన మైండ్స్లోనే ఉంటుంది. అది కేవలం మనం ఏవైనా ఆలోచనలని మైండ్ లోనికి పంపినప్పుడే ఉంటుంది. కేవలం మనం ఏవైనా ఆలోచనలని మైండ్ నుంచి మామూలు పద్ధతిలో తీసివేయలేరు. అది మామూలుగా మీ నుండి వెళ్ళిపోదు. మీరు అర్థం చేసుకోవటం అనే దృక్పథాన్ని మీ మైండ్‌ లోనికి తీసుకురావటం ద్వారా మాత్రమే ఈ పోలికని మీరు అధికమించగలుగుతారు. అది ఎలా అంటే చీకటిని బయటికి పంపటానికి దీపాన్ని ఎలా తెస్తారో ఇది కూడా అంతే.

సంస్కృతంలో భ్రాంతి లేదా భ్రమని మాయా అంటారు ”యా మా ఇతి మాయా” అంటే ఏది అయితే లేదో అదే మాయ.

మాయ యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అంటే దానికి ఉనికి లేదు. మాయ అనేది లేదు. కానీ అది నిరంతరం మనకి కలత కలిగిస్తుంది. మన నిశ్చలతని పాడు చేస్తుంది. మీరు కేవలం దానికి ప్రాణాన్ని ఇస్తారు. అంతే. పోల్చటం అనేది పూర్తిగా, స్వచ్ఛమైన మాయ మాత్రమే.

ప్రశ్న : స్వామీజీ ! మనం మన లైను నుండి ఎటు ప్రక్కకి చూడకూడదు అంతేగా?

మీరెందుకు అలా చెబుతారు? అది సరే, మీరు చూడటానికి ఎందుకు భయపడతారు. మీరు చూడటానికి భయపడుతున్నారు అంటేనే మీరు మీ మైండ్ నుండి పారిపోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. మీరు గనుక చూసి, ఆ చూసిన దాని వలన ప్రభావితం కాకపోతే అప్పుడు మీరు సరియైన మార్గంలో ఉన్నట్లే లెక్క.

ఎప్పుడయితే మీరు ప్రతి దానిని చూడగలిగి, మీకు ఏముందీ, ఎదుటి వాళ్ళకి ఏముందీ అని చూసి అప్పుడు మీరు సఫలం అయిన అనుభూతితో ఉంటే అప్పుడు

ఈ చక్రం పూర్తిగా శక్తివంతమవుతుంది. స్పష్టంగా తెలుసుకోండి. నేను ఇక్కడ తృప్తి (contentment) అనే పదాన్ని వాడలేదు. కొంత మంది అంటుంటారు. తృప్తి పడటం నేర్చుకోండి' అని. మీరు తృప్తిపడటాన్ని ఎప్పటికీ నేర్చుకోలేరు.

సంతృప్తి అనేది దానంతట అదే వికసించాలి. మీరు అసూయని, వ్యతిరేకపు అనిశ్చయ స్థితిని ప్రయోగాత్మకంగా అర్థం చేసుకోగలిగినప్పుడు, దాని ఫలితంగా మీలో వికసించే తృప్తి నిజమైనది. మీకు ఏది అయితే ఈ అనంత చైతన్య సృష్టి ఇచ్చిందో దానిని పూర్తి కృతజ్ఞతతో తీసుకోగలిగినప్పుడు మీకు ఈ సంపూర్ణ తృప్తి అనేది కలుగుతుంది. దీనిని బయట నుండి మీలోపలికి తేలేము. మీ అంతరంగంలో అది వికసించాలి.

మీకు నేను ఏమి చెబితే అది స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు నిజాలని మరీ మరీ వినగలిగినప్పుడు అవి మీ అంతరంగంలో ఒక ప్రదేశాన్ని సృష్టించుతాయి. ఆ ప్రదేశంలో మీరు చక్కని అనుభూతులని పొందవచ్చు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది మీరు నిష్కపటమైన మనస్సుతో మీ అంతరంగం లోపలికి లోతుగా చూడగలిగితే అక్కడ మీకు పరిష్కారం దొరుకుతుంది. మీరు ఈ పోల్చుకోవటం, అసూయ అనే విషయాల లోపలికి లోతుగా చూడగలిగినట్లయితే, వాటిని వాస్తవ దృష్టితో అర్థం చేసుకునే తత్వంతో చూడగలిగినట్లయితే; అసూయ, పోల్చుకోవటం అనేవి కేవలం మీ మైండ్ ఆడే ఆటలు అని మీకు తెలుస్తుంది. అంతకు మించి మరేమి లేదు.

మీరు మీ సొంత ఇంటిలో మీతో మీరు ఉన్నప్పుడు, నాకు ఈ ఇల్లు, ఈ కారు చాలు అని అనుకుంటారు. అలా ఆలోచించగానే మీరు విరామంగా ఉండగలుగుతారు. ఈ నిమిషంలో మీరు తృప్తిగాను కృతజ్ఞతా భావంతో ఉంటారు. కొంత సేపయ్యాక, మీ ఇంటినుంచి బయటికి కారులో వెళతారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మీ కారు ఆగినప్పుడు మీ ప్రక్కనే మెర్సిడెజ్ బెంజి కారు ఆగుతుంది. అప్పుడు మీ మైండ్ ఆలోచనలని మొదలుపెడుతుంది. మీరు ఇలా అనుకుంటారు. నాకారు బాగాలేదు. ఇక నేను ఒక కొత్తకారు కొనుక్కోవాలి. బెంజి కారు కాకపోయినా కొత్త కారు కొనవలసినదే.

అంతకు కొన్ని నిముషాల ముందు మీకున్న వాటితో సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమయింది. ఇప్పుడు మీకు వచ్చిన కొత్త కోరిక గురించి ఆలోచించుతున్నారు. ఆ కొత్త కోరిక మీ కోరిక కాదు. ఎవరిదో కోరికని మీరు అప్పు తెచ్చుకుంటారు.

స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఇది మీ సొంత కోరిక కాదు. ఎవరికో చెందిన కోరిక. ఇది బెంజి కారు యజమాని కోరిక. ఈ విధంగా మీరు వేరే వారి కోరికలని మీ మైండ్‌లో నింపుతారు. వాటి ఫలితంగా పోల్చుకోవటం, ఆ తరువాత అసూయపడటం చేస్తారు.

మీరు ఎప్పుడూ మీ ఇంట్లో ఫ్రిజ్ లేదు అని అనుకోరు. కాని మీ ప్రక్క ఇంటివాళ్ళు ఫ్రిజ్ కొనుక్కున్న మరుక్షణం ఫ్రిజ్ లేకుండా బ్రతకలేము అనుకుంటారు. అప్పుడు ఫ్రిజ్ ఉంటే ఎంత బాగుంటుందో, దాని అవసరం ఎన్ని విధాలుగా ఉందో ప్రపంచం నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరించి మరీ ఫ్రిజ్ అవసరాలు చెబుతారు. ఇంతకు ముందు రోజులన్నీ ఫ్రిజ్ లేకుండానే హాయిగా గడిచిపోయాయి. మీ ఇంటిలో ఏమీ మార్పురాలేదు. మరి ఏం జరిగింది ? మీ మైండ్ పోల్చుకోవటంలోనికి జారిపోయింది.

కానీ మీరు ఇవి అప్పుతెచ్చుకున్న కోరికలు అంటే ఒప్పుకోరు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ మైండ్‌లో చాలా సూక్ష్మంగా జరిగిపోతాయి. వాటిలో ఈ అప్పుతెచ్చిన కోరికల విషయం మరుగున పడిపోతుంది. ఇదంతాకూడా మైండ్ ఆడే జిత్తులమారి ఆటలు మాత్రమే. కాని మనం ఎప్పుడూ ఏమని అంటామంటే "అబ్బే ! మేము ఇతరుల గురించి అసలు పట్టించుకోము".

ఒక చిన్న కధ ;

ఒక వ్యక్తి తన ప్రక్కన ఉన్న ఊరికి 10 సంవత్సరాల తరువాత వెళ్ళాడు. అతని స్నేహితునితో కలిసి అంతా చూస్తుంటాడు. అక్కడ జరిగిన మార్పులు చూసి ఆశ్చర్యపోతాడు.

అతను అతని స్నేహితునితో "అభివృద్ధి ఈ ప్రాంతం మొత్తాన్ని మార్చివేసింది" అంటాడు. దానికి స్నేహితుడు " అభివృద్ధి కాదు, అసూయ మార్చివేసింది" అంటాడు.

మనం ప్రతి క్షణం ఎదుటివారిని అధిగమించాలి అనుకుంటూ ఉంటాము. మీరు ఎప్పుడయితే ఇలా అప్పుతెచ్చుకున్న కోరికల వెంట పరిగెడుతుంటారో, మీరు ఎప్పటికీ ఆగలేరు. ఎందుకంటే మీకు ఒక కోరిక తీరేలోపుగా మరొక కోరకని మరొకని దగ్గర నుండి అప్పుతీసుకుంటారు. తిరిగి మళ్ళీ ఆ కోరిక తీర్చుకునే దారిలో పరిగెడుతుంటారు.

మీరు అలా పరిగెడుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు మీ దృష్టిని మీ మీద నిలుపుకోరు. మీ దృష్టి, ఏకాగ్రత మారుతూ ఉంటుంది. మీ ఏకాగ్రత అంతా ఎప్పుడూ బయట వాళ్ళమీద ఉంటుంది కాని మీ అంతరంగంలోనికి ఉండదు. వాళ్ళ దృష్టి వాళ్ళ మీద ఉండదు. మరెక్కడో ఉంటుంది. మీరు ఊహించటానికి ప్రయత్నించండి. మీరు ఇలా చేస్తే ఎంత పరిగెట్టాలో, ఎంత లాగటాలు తోయటాలు ఉంటాయో; మీ భావావేశాలు, మీ ఆలోచనలు ముందుకీ వెనకకీ ఎంతలా లాగుతాయో అర్ధం చేసుకోండి. పోటీ చేతిలో మీరు ఒక తోలు బొమ్మలా అవుతారు.

మీకు చెబుతున్నాను ; మీకు ఏదైనా కావాలి అని అనిపించినప్పుడు మీతో మీరు కూర్చుని, అది నిజంగా మీకు అవసరమా అని ఆలోచించండి. లేదా ఎవరికో ఉన్నది కాబట్టి మీరు దానిని కోరుకుంటున్నారా? ఆలోచించండి. ఎప్పుడయితే ఏదయినా ఒక కోరిక మీలోనికి వస్తే వెంటనే నిష్పక్షపాతంగా ఆలోచించండి. అది మీకు నిజంగా అవసరమా, కాదా అని తెలుసుకోండి. మీ హోదా పనులని వదిలివేయండి. మీ మనస్సుని విశ్లేషణ చేయండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ హోదాని వదల లేకపోతే మీరు అందరిలో ఉన్నప్పుడు ఆ హోదాని ఎలా వదులుతారు?

మీరు కేవలం మీ కోరికలతో మాత్రమే జీవించగలిగితే, మీరు ప్రశాంతంగా మరణించగలుగుతారు. మీరు సంపూర్ణమైన తృప్తితో మరణిస్తారు. అదీ మీరు

ప్లాట్‌ఫాం మీద అయినా సరే. అదే మీరు అప్పుతెచ్చుకున్న కోరికలతో గనుక జీవిస్తే మీరు మీ జీవితంలో నిజమైన ఫలితం పొందిన అనుభూతిని పొందలేరు. అటువంటప్పుడు మీరు పాలరాతి భవనంలో ఉన్నాకూడా ముందుకీ, వెనక్కీ తీసుకుంటూ ; ఈ అప్పుతెచ్చుకున్న కోరికలలోంచి బయటికి రాలేక మరణాన్ని పొడిగించుకుంటూ గడుపుతారు.

జైన మతంలో ఒక నమ్మకం ఉంటుంది. మీరు పుట్టినప్పుడు మీ జీవితానికి కావలసిన ఆహారం శక్తి కూడా మీతో పాటు పంపబడుతుంది అని. ఇలా చెప్పటంలో అర్థం ఏమిటి అంటే, మీరు పుట్టినప్పుడే ఈ అనంత సృష్టి మీకు కావలసిన శక్తిని, అవసరాలని మీ కంటే ముందుగానే ఈ భూమి మీదకి పంపిస్తుంది.

అయితే ఈ సృష్టి మీకు ఇచ్చిన శక్తిని అప్పుతెచ్చుకున్న కోరికలు తీర్చుకోవటానికి ఉపయోగించుకుంటే, మీరు ఏమీ పొందలేదనే భావం మీలో ఉండిపోతుంది. మీకు ఏదీ చాలదు. అయ్యో నేను ఏమీ పొందలేకపోయానే అని మీరు అలసి పోతారు. పూర్తిగా నీరసపడిపోతారు. చివరికి కుంగిపోతారు. ఈ విధంగా మీకు బాధలు, సమస్యలు మొదలవుతాయి.

చూడండి. అవసరాలకి, కోరికలకి చాలా తేడా ఉన్నది. మీ అవసరాలు మీకు ఏదో ఒక విధంగా తీరుతాయి. ఈ అవసరాలని తీర్చటం, తృప్తి పరచటం చేయవచ్చు, కానీ మీ కోరికలు తీర్చటం మాత్రం అసాధ్యమైన విషయం. ఎందుకంటే అవి నిరంతరం మారుతూ ఉంటాయి. అవి మీకు స్పష్టంగా ఉండవు. ఒకసారి ఒక కోరిక తీరగానే వంద కోరికలు ముందుకు వస్తాయి.

అంతులేని కోరికలు ఉండటం అనేది మన సహజ లక్షణం. ఎందుకంటే మనం నిరంతరం ఎదుటి వాళ్ళకి ఏమీ ఉన్నాయి అని చూసి, అవన్నీ మనకి కావాలి అని కోరుకుంటారు. కాకపోతే ఈ విషయాన్ని మీరు ఒప్పుకోరు. మీరు మీ అంతరంగాన్ని బాగా లోతుగా విశ్లేషించితే ఇది నిజము అని మీకు తెలుస్తుంది. మీ మైండ్ ఎంతో

తెలివిగా, నెమ్మదిగా ఇలా ఆటలు ఆడుతుంది. అందుకే మొదటిసారి మీరు ఈ విషయాన్ని తెలుసుకోలేరు.

ఉదాహరణకి మీరు ఫోను కొందామని బజారుకి బయలుదేరానుకోండి. దారిలో మీ స్నేహితుణ్ణి కలిసారనుకోండి. అతను మరొక షాపుకి వెళ్ళి వేరే ఏదో వస్తువులు కొనాలనుకుంటున్నాను అని చెబితే, మీరు కూడా అవి కొనుక్కుంటే బాగుండును అనుకుంటారు. వెంటనే మీ దారి మార్చుకుని ఆ వస్తువులు కొంటారు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, "అయ్యో ! ఫోను కొనుక్కోవటానికి నాదగ్గర సరిపడా డబ్బు లేదే", అనుకుంటారు.

మీరు ఎప్పుడయితే ఇతరుల కోరికలతో నివసిస్తారో, ఇతరులతో పోల్చుకుంటారో, చాలా లోతుగా కష్టాలలో కూరుకుపోతారు. ఎందుకంటే అసలు మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు కాబట్టి. మీరు ఎప్పుడూ మీ మీటరు ఉపయోగించి మిమ్ములను కొలుచుకోండి. అంతే కాని ఎదుటివారి మీటర్లతో మిమ్ములని మీరు కొలుచుకోవద్దు. ఇది చాలి తెలివి తక్కువ పని, అతి ప్రమాదకరమైన పని కూడా.

ఇండియాలో కొన్ని చోట్ల కోతిని ఆడించే వాళ్లు ఉంటారు. కోతిని ఆడించటమే వాళ్ళ జీవనోపాధి. వాళ్ళు ఒక కర్రతో కోతిని గుచ్చుతూ వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఆకోతిని ఆడిస్తారు.

వాళ్ళు ఆ కర్రని తిప్పుతూ "బండి చక్రాలు తిప్పు రామా, బండి చక్రాలు తిప్పు" అంటారు. కోతి కర్రని చూస్తూ బండి చక్రాలు తిప్పుతుంది.

అంటే కోతి ఆ కర్ర ఎలా తిప్పితే దానికి అనుగుణంగా ఆడుతుంది.

ఇదే విధంగా మనం పోల్చుకోవటం అనే కర్ర ఎలా తిప్పితే మన జీవితాన్ని అలా ఆడిస్తాము. మనం దానికి అనుగుణంగా డ్యాన్సు చేస్తాము. మనకి ఇష్టమైన పనులు చేయం. ఆ కర్ర ఏ పనులు చెబితే ఆ పనులు చేస్తాము.

ఇలా పోల్చుకోవటానికి చివర అనేది లేదు. అలాగే మన ఆశలకి అంతులేదు. మనం ప్రతి నిమిషం ఇంకా కావాలి, ఇంకా, ఇంకా అంటూనే ఉంటాము. మీరు నిరంతరం పోటీలో ఉంటారు. అటువంటప్పుడు మీరు ఎప్పుడు విశ్రాంతిగా ఉంటారు, ఎప్పుడు ఉన్నదాన్ని అనుభవించి ఆనందపడతారు, ఎప్పుడు సఫలం పొందిన అనుభూతిని పొందుతారు? ఈ నిరంతర పోటీలో మీరు గెలిచినా మీరు ఒక ఎలుకగానే మిగిలి పోతారు.

ఎలాగో ఒకలా చివరికి జీవితంలో ఏదో ఒక సమయంలో మీరు ఇలా అనుకుంటారు; ఈ నిరంతరపు గట్టి పోటీలో గెలిచినా అది ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు ; ఏదీ సాధించాము అన్న ఆనందం లేదు అని. విజయం కూడా ఒకరకమైన అసంతృప్తికి దారి తీస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే; మీరు ఈ ప్రపంచంలోని ప్రాపంచిక విషయాలని సాధించటంలో మునిగిపోయి మీలోపలి మిమ్మలని, మీ అంతరాత్మని ఎప్పుడూ పట్టించుకోలేదు. అందుకే మీరు అలా అనుకుంటారు.

ఈ అసంతృప్తి అనేది మీ అంతరాత్మ నుండి వచ్చే పిలుపు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడయితే అర్ధం చేసుకుంటారో అప్పుడు మీరు ఆధ్యాత్మికతవైపు మళ్కుతారు. అది ఆలస్యంగానయినా సరే. ఆ విషయాన్ని మీరు అర్ధం చేసుకోలేనప్పుడు మీరు మానసికంగా కుంగిపోతారు. ఎందుకంటే మీరు ఏం పోగొట్టుకున్నారో మీకు తెలియదు. ఆధారభూతమయి ఉన్న అసలు దారం ఎక్కడ ఉన్నదో తెలియదు. దానిని ఎక్కడ పోగొట్టుకున్నారో మీకు తెలియదు. మీరు ఎక్కడ ఏ తప్పు చేసారో మీకు తెలియదు.

నా అనుభవం నుండి మీకు చెబుతున్నాను. ఈ అనంత చైతన సృష్టి మనకు అన్నింటినీ ఇస్తుంది. అది కొరతలేకుండా మనకి ఇస్తుంది. కానీ మనం అసంతృప్తికి పూర్తిగా అలవాటు పడిపోయాము. మనం పొందిన వాటిని గమనించగలిగే పరిస్థితిలో మనం లేము. వాటి అనుభూతిని పొందే సున్నితత్వం మనకి లేదు. ఇది

చూసుకోకుండా మనం నిరంతరం ఇంకా ఇంకా కావాలి అని అనుకుంటాము. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఇంకా ఉన్నాయి కాబట్టి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే పోల్చడం అనేది మన అచేతన స్థితిలో నిరంతరం కొనసాగే ఒక కార్యక్రమం; ఎందుకంటే మనకి తృప్తిగా మనలోపలికి, మన అంతరాత్మలోనికి దృష్టిని నిలిపి సఫలమైన జీవితం జీవించటం తెలియదు కాబట్టి.

ఒక చిన్న కథ :

ఒక వ్యక్తి అడవిలో భగవంతుని దర్శనం కోసం ఘోరమైన తపస్సు చేస్తుంటాడు. అతనికి భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఏం వరాలు కావాలో కోరుకోమంటాడు.

ఆ వ్యక్తి చాలా ఆనందపడిపోతాడు. అతను తను ఒక భూస్వామిని అని ఆస్తి అంతా పోగొట్టుకున్నానని, తిరిగి తన ఆస్తి తనకి కావాలని కోరుకుంటాడు.

భగవంతునికి అతని మీద జాలికలుగుతుంది. అతనితో ఇలా అంటాడు. “రేపు ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ నువ్వు పరిగెడుతూ ఎంత భూమిని కవర్ చేస్తావో అదంతా నీ సొంతమవుతుంది” అంటాడు.

ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు. మర్నాడు సూర్యోదయాన్నే పరిగెడటం మొదలు పెడతాడు. తన శక్తి కొద్దీ పెరుగుతాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఆకలి వేస్తుంది. అయినా ఆగకుండా పరిగెడతాడు. సాయంత్రం అయ్యే ముందు దాహం వేస్తుంటుంది; బాగా నీర్సపడిపోతాడు. అయినా పరిగెడతాడు. తన ప్రక్క భూస్వామికి చాలా ఎకరాలు భూమి ఉంది. తనకి అంతకన్నా ఎక్కువ కావాలి అని పరిగెడుతుంటాడు.

సూర్యాస్తమయానికి కొంచం ముందు తల తిరిగినట్టవుతుంది. కానీ కష్టపడి మరికొన్ని అడుగులు వేస్తాడు. చివరికి కిందపడి మరణిస్తాడు.

మనందరం ఈ విధంగానే జీవిస్తున్నాము. మనం ఈ పోటీలో పరిగెడుతుంటాము. కానీ ఒక్కసారి కూడా నిలబడి ఇలా ఎందుకు పరిగెడుతున్నాము అని ఆలోచించము.

అందరూ పరిగెడుతున్నారు ; మనం కూడా పరిగెడదాము అనుకుని పరిగెడుతుంటారు.

శంకరాచార్యులువారు చాలా చక్కగా ఒక విషయం చెబుతారు ; తత్ కిం, తత్ కిం” అంటే తరువాత ఏమిటి ? తరువాత ఏమిటి ?.... మనం నిరంతరం తరువాత ఏమిటి ? అని ఆలోచిస్తూ ఉంటాము దీనివలననే మనం నిరంతరం పరిగెడుతుంటాము.

చిన్న కథ :

చందాబాబు అనే వ్యక్తి తన ఇంటి గుమ్మం ముందు కూర్చొని ఏడుస్తుంటాడు. అది చూసి అతని స్నేహితుడు కారణం ఏమిటని అడుగుతాడు.

దానికి అతను, “ మా బామ్మ ఒకామె చనిపోతూ తన ఆస్తినంతా నాకు రాసేసింది” అంటాడు.

అతని స్నేహితునికి ఏమీ అర్ధం కాదు. అతను ఇలా అంటాడు. “ఆమె చాలా పెద్దావిడ, అంతే కాకుండా ఆమె తన ఆస్తినంతా నీకు ఇచ్చేసింది. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు ?

చందా ఇలా జవాబు చెబుతాడు, “నీకు తెలియదు - ఒక వారం క్రితం మా మామయ్య చనిపోయాడు. అతని ఆస్తి కూడా నాకే వచ్చింది”.

“మరయితే ఎందుకు ఏడుస్తున్నావు” ఇంకా తికమకపడిపోయి అడుగుతాడు అతని స్నేహితుడు. చందా ఇంకా చెబుతాడు. “అంతకు ముందు మా అత్త చనిపోయింది. ఆమె ఆస్తి కూడా నాకే వచ్చింది”.

అతని స్నేహితునికి చందా ఎందుకు ఏడుస్తున్నాడో అర్ధం కాలేదు.

అతను చందాని అడుగుతాడు. "చందా ! దయచేసి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అంటాడు". చందా దానికి "నీకు తెలియదు, నాకు చాలామంది చుట్టాలు ఉన్నారు. వాళ్ళు చనిపోతు ఆస్తి నాకు ఇచ్చేస్తారు" అంటాడు.

(అంతా పెద్దగా నవ్వుతారు)

ఈ కథ కొంచెం అతిగా ఉంటుంది. కానీ మనం ఇలానే ఉంటాము. మనం జీవితంలో ప్రతి నిమిషం ఏదో సంపాదించుకోవాలి. ఏదో తీసుకోవాలి. అన్నట్టుగానే ఉంటాము. మన మనుకునే ఈ ప్రేమ అంతా కూడా బేరాలు ఆడటమే. కొన్ని సందర్భాలలో అది స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో అది చాలా సూక్ష్మంగా ఉండి మనకి తెలియదు. అది మీకు తెలియకుండా మీ అచేతన స్థితిలో ఆడే ఒక ఆట. కానీ మీరు దానిని నిజమైన ప్రేమ అనుకుంటారు.

అసలు పోల్చుకోవటానికి ముఖ్య కారణం మనలో మనం పొందినవి చూసి ఆనందపడలేకపోవడం. మన దగ్గర ఉన్న వాటిని చూసి మనం సంతోషించం. మీరు ఒక్కసారి 24 గంటలసేపు, ఉదయం నుండి రాత్రి వరకూ మీకు చూపులేదు అనుకోండి. కళ్ళు మూసుకుని మీ పనులు మీరు చేసుకోవటానికి ప్రయత్నించండి. కొన్ని నిమిషాలు కాగానే, మీరు రోజూ చేసే పని మీరు చేయలేనిదిగా ఉంటుంది. 24 గంటలు అక్కర్లేదు. కొన్ని నిమిషాలలోనే ఇది ఎంత కష్టమో మీకు అర్ధమవుతుంది. మీరు కళ్ళు తెరచి ప్రపంచాన్ని చూడగానే మీకు ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది. అప్పుడు భగవంతుడికి మీరు మీకు కళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతారు.

మీరు ఎప్పుడయినా కళ్ళు లేని వాళ్ళని చూసినప్పుడు, మీకు చూపునిచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు చెప్పారా ? మీ కంటి చూపు విషయంలో అప్రయత్నంగా మీ కళ్ళకి కృతజ్ఞతలు చెప్పారా ? లేదు. ఎందుకు చెప్పలేదంటే మీకు ఇచ్చిన ప్రతి దానిని చాలా మామూలుగా, యధాలపంగా తీసేసుకున్నారు. అదే కారణం. మనం ప్రతీసారీ, ప్రతీ దానికి తరువాత ఏమిటి అనటమే.

మనం నిరంతరం మూడు విషయాల చుట్టూ పని చేస్తుంటాము. పని చేయటం, సంపాదించటం, ఉండటం. సంపాదించటానికి పని చేస్తాము. కానీ మన ఉనికితో ఆనందపడము. మనకి ఉండే సమస్యలకి అదే ముఖ్య కారణం. మనం చాలా కష్టపడి ఒక కోరిక తీర్చుకుంటాము. వెంటనే చాలా కోరికలు మన వెనుక వస్తుంటాయి.

మీరు ఎప్పుడూ కూడా, "ఇప్పుడు పని చేసి తరువాత సంతోషంగా ఉంటాను" అని అనుకోవద్దు. మీరు తరువాత వచ్చి ఆనందపడతాను అని అనుకోకండి. మీకు చెబుతున్నాను. అర్ధం చేసుకోండి. అది ఎప్పటికీ జరగదు. ప్రతి రేపు కూడా ఇవాళ లాగానే వస్తుంది. మనం చేసే పని మన ఉనికివైపుకి దారి తీయాలి. అప్పుడే మీరు సరియైన మార్గంలో ఉంటారు.

జీవించటానికి వాయిదా వేసుకోండి. ఉత్సవంలా చేయండి. ఆనందంలో ఉండండి. అది ఇప్పుడే జరగాలి. లేకపోతే ఎప్పటికీ జరగదు. మనం జీవితమంతా తరువాత సంతోషంగా ఉందాములే అని అనుకుని ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటాము. చివరికి మనం స్మసానానికే పరిగెడతాము. మీరు ఎప్పుడయితే పరిగెడుతుంటారో సంతోషపడే శక్తిని కోల్పోతారు.

ఒక సామెత ఉంది. మనం ఏదైనా సాధించిన దానికంటే దాని కోసం చేసే ప్రయత్నంలోనే ఎక్కువ సంతోషపడతాము అని. మీరు ఒక దాని వెంట పరిగెడుతున్నంతసేపు అది ప్రపంచంలోనే చాలా విలువయినది అని అనుకుంటారు. దానిని సాధించాక అది ఎందుకో అంతకు ముందు అనుకున్నంత గొప్పగాను, అంత ముఖ్యమైనదిగాను అనిపించదు. మిమ్ములను మీరు తెలుసుకోగలిగితే, మీకు కచ్చితంగా ఏమికావాలో తెలుసుకోండి. అది చేయటానికి దానిని సాధించటానికి మాత్రమే ప్రయత్నించండి. అప్పుడు మీలో పరస్పర విరుద్ధ భావాలు ఉండవు. మీలో భిన్నత్వం కూడా ఉండదు. అంటే మీ వ్యక్తిత్వంలో చీలికలు ఉండవు.

రమణ మహర్షి చాలా చక్కగా ఈ విషయాన్ని చెబుతారు.

“మన మైండ్ ఒక గొప్ప మాయ. మనం దానిని సాధించే వరకూ ఆవగింజని ఒక గొప్ప పర్వతంలా చూపిస్తుంది. దానిని పొందాక పర్వతం కూడా మనకి ఆవగింజలా అనిపిస్తుంది”.

ఇటువంటి దృక్పథం రావటానికి పోల్చుకోవటమే ముఖ్య కారణం. మైండ్ తన చుట్టూ ఉన్న వాటిని చూసి వాటితో ఆడుకుంటుంది. నేను మిమ్మలని మీ కోర్కెలని వదిలివేయమని చెప్పటం లేదు. నేను మిమ్మలని పోల్చుకోవద్దు అని కూడా చెప్పను. నేను మీకు చెప్పేది ఒకటే ; మీరు పోల్చుకునే విషయాన్ని స్పష్టతతో చేయండి. మీ అసూయని కూడా స్పష్టంగా చూడండి. మీరు ఎందుకు పరిగెడుతున్నారో స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఎవరో పరిగెడుతున్నారని మీరు పెరిగెట్టకండి.

కొంతమంది నన్ను అడుగుతుంటారు. “స్వామీజీ ఇతరులతో పోల్చుకోకపోతే మేము ఎక్కడ ఉన్నామో మాకు ఎలా తెలుస్తుంది” అని.

చూడండి. పోలిక అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నిర్మాణాత్మకమైన పోలిక ; రెండవది వినాశకరమైన పోలిక.

నిర్మాణాత్మకమైన పోలికలో మీరు మీకు తెలియని విషయాలని ఇతరుల నుండి తెలుసుకుంటారు. ఏవో కొంత అనవసరమైనవి నేర్చుకుంటారు. కొన్ని భావనలను ఏర్పరచుకుంటారు. మీ చుట్టుప్రక్కల విషయాలని చూడటం ద్వారా మీరు ప్రయోగాత్మకంగా కొన్ని విషయాలని నేర్చుకుంటారు. మీరు ఉన్నదాని కంటే బాగా ఎలా చేయగలమనేది ఇతరులని చూసి నేర్చుకుంటారు.

నిజంగా చెప్పాలి అంటే దానిని పోలిక అనం. దీనిని నిజమైన జ్ఞానాన్ని సంపాదించటం అనవచ్చు. లేదా మనం మనకు తెలియని విషయాలని బాగా తెలుసుకోవటం అని కూడా అనవచ్చు. అటువంటప్పుడు మీకు ఎదుటి వాళ్ళని చూస్తే అసూయకాని లేదా చెడు ఆలోచనలు కానీ రావు. ఈ విషయంలో ఇది చాలా ముఖ్యమైన లక్షణము.

అయితే మనం ఇంతవరకూ చెప్పుకున్న పోలిక మాత్రం వినాశకరమైన పోలిక. మీరు ఎవరైనా ఏదైనా కలిగి ఉన్నారని చూస్తే భరించలేరు. వాళ్ళు దానితో సంతోషంగా ఉంటే చూసి భరించలేరు. అది అందమే కాని. డబ్బే కాని, హోదా కానీ లేదా పేరు ప్రతిష్ఠలే కానీ. ఏదయినా కావచ్చు. అప్పుడు మీరు దానిని పొందాలి అని ఉవ్విళ్ళూరుతారు. అప్పుడే అప్పుతెచ్చుకున్న కోరికల చక్రంలో ఇరుక్కుపోతారు. ఇదే చివరకి అసూయకి దారి తీస్తుంది.

మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా ప్రపంచంలో మీ కంటే ఉన్నత స్థితిలో ఉండే వాళ్ళు తప్పకుండా ఉంటారు. 99.9% వరకూ కూడా చెప్పవచ్చు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రపంచంలో ఉత్తమమైన ఇంజినీరు కాదు అని. లేదా అందరికంటే వేగంగా పరిగెట్ట గలిగే వ్యక్తి కాదు అనీ ; లేదా అందరికంటే గొప్ప పెయింటర్ కాదు అని. అలా అన్నంతలో మీలో ఉన్న ఈ నైపుణ్యానికి మీరు ఆనందించకుండా ఉంటారా ? మీరు ఎప్పుడయితే ఇతరుల కంటే ఆ విషయాలలో తక్కువ సంతోషంగా ఉన్నాను అనుకుంటారో అప్పుడు మీరు పూర్తిగా ఆనందపడలేరు. ఏ క్షణంలో అయితే నాకన్నా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారో ఆ క్షణంలోనే మీలోని ఆ సంతోషం తాలూకా సువాసనలలో తేడా వచ్చేస్తుంది. మీరు అసహనంగా తయారవుతాయి. అసూయపరులుగా అవుతారు.

చూడండి, పేదరికం ఒకటే మనని కష్టపెట్టదు. మనం పేదవాళ్ళం అన్న ఆలోచనే మనని కష్టపెడుతుంది. మనం చాలా ప్రశాంతంగా బ్రతుకుతూ ఉండవచ్చు, కానీ ఏ క్షణంలో అయితే పేదవాళ్ళం అనే ఆలోచన వస్తుందో ఆ క్షణం నుంచీ మనం బాధపడటం మొదలు పెడతాం. ఈ ఆలోచన మనకు ఎలా వచ్చింది ? వేరే వాళ్ళని చూసి వాళ్ళతో మనని మనం పోల్చుకుంటే వచ్చిన ఆలోచన అది. మనం ఈ విధంగా ఎందుకు అనుకుంటామంటే ఆ ఆలోచన తిన్నగా వచ్చి మన అహానికి తగులుతుంది. అప్పుడు మనం క్రుంగి కృశించిపోతాం.

ఒక చిన్న కథ :

ఒక వీధిలో ఎదురు ఎదురుగా రెండు షాపులు ఉంటాయి. ఆ రెండు షాపుల్లో కూడా ఒకే రకం వస్తువులు అమ్ముతుంటారు. దాంతో ఆ రెండింటికీ మధ్య చాలా పోటీ ఉంటూ ఉండేది.

ఒక రోజు ఒక షాపు అతను తన షాపు ముందు ఒక బోర్డు పెడతాడు. ఆ బోర్డు మీద “దీనిని స్థాపించిన సంవత్సరం 1929” అని ఉంటుంది.

దీనిని చూసిన ఎదురు షాపు యజమాని ఆ మర్నాడు తన షాపు ముందు ఒక బోర్డు పెడతాడు. దాని మీద ఇలా రాసి ఉంటుంది ; “ఇక్కడ అన్నీ తాజా వస్తువులే దొరుకుతాయి పాత వస్తువులు ఉండవు”.

(అంతా నవ్వులు)

మీరు ఎదుటి వాళ్ళని పోల్చుకుని దానికి తగినట్టుగా స్పందించుతున్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే మిమ్ములను మీరు మెచ్చుకోలేకపోతున్నారు. మీరు మీ మైండ్ ద్వారా స్పందించుతున్నారు, అంతే కాని మీ తెలివి తేటలతో స్పందించటంలేదు. మీ మైండ్ తను చూసినవన్నీ జాగ్రత్తగా నిలువ చేస్తుంది. వాటిని మీరు స్పందించేటప్పుడు మీరు అర్థం లేకుండా స్పందించేటట్టు చేయటానికి వాటిని ఉపయోగిస్తుంది. అలా కాకుండా అదే మీ అంతరంగంలోని తెలివితేటలు అయితే వాటిని వాటిలాగానే చూసి ముందుకు వెళుతుంది.

మీలో ఉన్న శక్తిని మీరు ఎప్పుడయితే అర్థం చేసుకోలేరో మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని మీరు కనుక్కోలేనప్పుడు, మీకు మీ మీద, మీ లోపల ఉన్న సామర్థ్యాల మీద నమ్మకం ఉండదు. అటువంటప్పుడే మీరు ఎదుటివారిని అనుసరించాలని చూస్తారు.

గౌతమబుద్ధుడు ఈ విధంగా చెప్పాడు. “ఏదైనా సరే కేవలం సంబంధాలలోనే అంటే పోలికలోనే ఉంటుంది.” మీరు ఒక్కరే ఒక కొత్త గ్రహంలో ఉన్నారనుకోండి. మీరు ధనవంతులా? పేదవారా? చెప్పండి. మీరు చెప్పలేరు. మీరు మిమ్ములని ఏవిధంగా కూడా అనలేరు. నేను సరిగ్గానే చెప్పాను కదా? అప్పుడు మీరు మీరు మాత్రమే. అంతే. అర్థం చేసుకోండి. ఇదే విషయం మీరు భూమి మీద ఉన్నప్పుడు కూడా వర్తిస్తుంది. ఇక్కడ కూడా అదే సత్యం.

ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎవరి ప్రత్యేకత వారిది. మీరు సింహాన్ని గుఱ్ఱంతో పోల్చగలరా? మిమ్ములను మీరు పూలతో కాని పక్షులతో గాని పోల్చగలరా? మనం వాటి అందాలను చూసి ఆనందించుతాము. అవును కదా!

అదే విధంగా మరొక వ్యక్తిని కూడా చూసి ఆనందించవచ్చు కదా.

మనుషులంతా చూడటానికి ఒకే విధంగా ఉన్నా కూడా, ఎవరికి వాళ్ళు చాల ప్రత్యేకమయిన వాళ్ళు. ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణిస్తుంటారు. మీదారిలో మీరు పూర్తి ఏకాగ్రతతో ప్రయాణిస్తున్నంత కాలం మీరుప్రతి క్షణం ఫలితాన్ని సాధించిన అనుభవాన్ని పొందుతుంటారు. మీరు ఇదే విషయం వేరే వ్యక్తి దారిలో ఎలా ఉంటుంది అని అసలు ఆలోచించరు. అది అసలు మీకు తెలియదు.

ఒక చిన్న కథ!

ఒక వ్యక్తి ఒక పల్లెటూరులో రాత్రి పూట చీకటిలో వీధిలైట్లు లేని ఒక వీధిలో కారు నడుపుతుంటాడు. అతను తన ముందున్న కారు వెనకే వెళితే బాగుంటుందని దాని వెనకనే కారు పోనిస్తాడు.

వాళ్లు అలా కొంత దూరం వెళ్ళాక ముందు వెళుతున్న కారు అకస్మాత్తుగా వెనక వెళుతున్న కారు ముందు ఆగుతుంది . దాంతో ఆ ముందు కారుని ఢీ కొడుతుంది. అప్పుడు వెనక కారు డ్రైవరు ముందు కారు దగ్గరకి వెళ్ళి, “కారు ఆపేముందు సిగ్నల్ ఎందుకు ఇవ్వలేదు?” అని గట్టిగా అడుగుతాడు.

అప్పుడు ముందు కారు డ్రైవరు తల బయటకు పెట్టి “ఏమిటి నా సొంత గారేజ్లోనా?” అని అడుగుతాడు.

(పెద్దగా నవ్వులు)

మీరు మీ సొంత మార్గం మీద ఏకాగ్రతను నిలిపితే మీరు నిరంతరం అభివృద్ధి చెందుతారు. మీశక్తి కొద్దీ మీరు ఉన్నత స్థితికి వెళతారు. మిమ్ములని కేవలం మీతోనే పోల్చుకోండి. అంతే కానీ ఎప్పుడూ కూడా ఎవరితో పోల్చుకోవద్దు. మీ మీద మీరు గెలవాలి. అంతేగానీ ఎదుటి వారి మీద కాదు. మీరు వేరే వారితో పోల్చుకున్న ప్రతిక్షణం మీ అభివృద్ధికి ఖర్చు పెట్టే సమయాన్ని వృధా చేసుకోవటమే.

మరొక చిన్న కథ.

ఒక వ్యక్తి 1000 మీటర్ల పరుగు పందెంలో పరిగెడుతున్నాడు. అతను 200 మీటర్లు వెళ్ళాక వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా తన వెనకే ఉన్నారు. అతను సంతోషంగా పరిగెత్తుతూనే ఉన్నాడు. 500 మీటర్లు వచ్చాక వెనక్కి చూసుకున్నాడు. మళ్ళీ సంతోషంతో పరిగెత్తసాగాడు. అతను అలా కొన్ని మీటర్ల కొక సారి వెనక్కి తిరిగి చూసుకుంటూ పరిగెత్తి చివరికి గెలిచాడు.

అతను అలా వెనక్కి తిరిగి చూడకుండా, కేవలం తన పరుగు మీదే ఏకాగ్రతని నిలిపివుంటే ఇంకా చాలా తక్కువ సమయంలో గెలిచేవాడు. కొత్త రికార్డు నెలకొలిపేవాడు. ఇదే విధంగా మనం మన జీవితాలలో కూడా, మన అభివృద్ధి మీదే పూర్తి ఏకాగ్రతని పెట్టగలిగితే, మనం మనలోని శక్తి సామర్ధ్యాలని పూర్తిగా మన అభివృద్ధికి వినియోగించగలుగుతాము. అయితే మనం మన ఎదుటివాళ్ళ వైపు చూస్తూ మనలో శక్తిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. అలా కొంత పోగొట్టుకుంటుంటాము.

మీరు ఒంటరిగా ఒక గదిలో కూర్చోని జాగ్రత్తగా గమనించండి. మీరు ఇతరులతో పోల్చుకోవటానికి ఎంత సమయాన్ని, శక్తిని వృధా చేస్తున్నారో. అది 60శాతం కంటే ఎక్కువే ఉండవచ్చు. ముఖ్యంగా పోలిక, అసూయ అనేవి మీ శక్తిని మొత్తంగా పడగొట్టేస్తాయి. మీ మైండ్ నిరంతరం ఎదుటి వాళ్ళకి ఎంత ఉంది, ఎలా సంపాదించారు, ఎలా దానిని మేనేజ్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలు లెక్కకట్టడంలో చాలా బిజీగా ఉంటుంది. ఈ లెక్కలతోనే మెదడు వేడెక్కిపోతుంది. ఇలాంటి అనవసరమైన లెక్కలతో మీశరీర నిర్మాణం మొత్తాన్ని బలహీన పరిచేస్తుంది. మీలో శక్తి అంతా చాలా తక్కువ సమయంలోనే హారించుకుపోతుంది. ఇదంతా కూడా కేవలం మీరు ఇతరులతో పోల్చుకుని అసూయపడటం వలననే జరుగుతుంది. .

మనం నిరంతరం పెట్రోలు, నీళ్ళు, ఎలక్ట్రిసిటీ వీటిని పొదుపు చేయటం గురించి జాగ్రత్తగా వాడటం గురించి మాట్లాడుతుంటాము. కానీ మనలోని శక్తిని ఎందుకు పొదుపు చేయము. మరి మనలోని శక్తిని గురించి ఎందుకు పట్టించుకోము? మనం ఈ శక్తిని ఎందుకు పొదుపు చేయము. మరి మనలోని శక్తిని మనం సక్రమంగా ఉపయోగించుతున్నామా? దాని విషయం ఏమిటి? మనం మనలోని శక్తిని గురించి ఎందుకు పట్టించుకోము? మనం ఈ శక్తి అనే గొప్ప వరాన్ని పొందాము అని మనకు తెలియదు. దానిని ఒక గొప్ప దీవెనగా మనం చూడము. అదే కారణం. మనం మన బయట వుండే వనరులని వృధా చేయకూడదని అంటాము. ఎందుకంటే వాటిని మనం స్పష్టంగా చూడగలము కాబట్టి. కానీ మనలోని శక్తిని నిరుపయోగం చేస్తాము. మనలోతైన అచేతన స్థితిలో ఆ శక్తిని వృధా చేస్తున్నాము. కానీ మనం మాత్రం మాకు సరిపడా ఇవ్వలేదు అని ఫిర్యాదులు చేస్తుంటాము. మీరు మీలో ఉన్న శక్తి మొత్తాన్ని కేవలం మీ అభివృద్ధి కే వినియోగించగలిగితే మీరు ఎంత సాధించ గలిగే వారో ఊహించండి. మీరు వృద్ధి చెంది చక్కగా ఆనందంలో స్వేచ్ఛలో ఉండి వుండేవారు.

చూడండి. పోలిక విషయంలో ఒకటి వుంది. మీరు మిమ్ములని బలహీనమైన లింకుతో మిమ్ములని కొలుచుకుంటారు లేదా మీ మీ సామర్థ్యంతో కొలుచుకుంటారు. అదే పెద్ద సమస్య. మీరు ఎందుకు అలా చేస్తారు? మీలో ఉండే బలహీనతతో అలా కొలవకండి. మీరు అహంకారంతో నేను చాలా గొప్పవాడిని అనుకోవద్దు. కానీ కొంత ఆత్మ గౌరవం ఉండాలి. మీకు మీరు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని గుర్తుంచుకోవాలి. అప్పుడు మిమ్మలని మీరు ఆ విధంగా విలువకట్టుకోరు. మీకు ఎప్పుడయితే ఆత్మ గౌరవం ఉంటుందో, అప్పుడు మీరు ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రత్యేకమైన వాళ్ళు అనే విషయాన్ని గౌరవిస్తారు, మెచ్చుకుంటారు. ఎక్కడా పోలికకి అవకాశం ఉండదు, అని అర్థం చేసుకోండి. ఇది మీ పట్ల మీరు కృతజ్ఞతా భావంతో ఉండటానికి మొదటి మెట్టు

చిన్న కథ;

ఒక రాజు ఒక యోగి దగ్గరికి వెళతాడు. ఆ రాజు కొన్ని మంత్ర శక్తులు సంపాదించి తన పొరుగున ఉన్న రాజుకంటే బలవంతుడనవ్వాలి అని అతని కోరిక. ఆ రాజు గురువు ఎదురుగా కూర్చొని తాను ఎందుకు వచ్చాడో చెబుతాడు. ఆ గురువు రాజు చెప్పినదంతా ఓపికగా వింటాడు.

తరువాత ఆయన రాజుని తన తోట్లలోనికి తీసుకువెళతాడు. అక్కడ ఒక గులాబీ మొక్క, ఒక సైప్రస్ మొక్క ఉంటాయి. అవి రెండూ కూడా ప్రక్కప్రక్కనే పెరుగుతాయి. అవిరెండూ నీకు గురువులు. నీవు ఏం నేర్చుకోవాలో అవి నీకు నేర్పిస్తాయి అని అంటాడు.

రాజు ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి చూస్తాడు. కానీ వాటి నుంచి తాను ఏమి నేర్చుకోవాలో అతనికి అర్థం కాదు. అతను తిరిగి గురువు దగ్గరికి వచ్చి, "మీరు ఏమి చెప్పారో నాకు అర్థం కాలేదు గురుదేవా. అవి నాకు ఏ విధంగా ఏమి నేర్పించుతాయో అర్థం కావటంలేదు అంటాడు.

గురువు ఆయనని తోట్లలోనికి తీసుకువెళ్ళి ఆ మొక్కలని చూపించి ఇలా వివరిస్తాడు, " ఈ సైప్రస్ మొక్క గులాబీ మొక్క ప్రక్కనే చాలా సంవత్సరాలనుంచీ ఉన్నది. అది ఎప్పుడూ కూడా గులాబీ మొక్కలా అవ్వాలని కోరుకోలేదు. అలాగే గులాబి మొక్క సైప్రస్ మొక్క కావాలి అని కోరుకోలేదు. అవి వాటి భాద్యతలని నిష్కపటంగా చేసేవి. అలా చక్కగా పెరిగి ప్రతిరోజూ వికసిస్తున్నాయి. మనిషి కనుక సైప్రస్ మొక్క అయి వుంటే అతను ఆ గులాబీ మొక్కతో పోల్చుకుని, ఆ గులాబీ మొక్క మీద అసూయని పెంచుకుని ఉండేవాడు. ఎందుకంటే ఎక్కువ మంది గులాబీ దగ్గరికి వెళతారు కదా! అదే గులా బీ మొక్క అయి ఉంటే, సైప్రస్ మొక్క వైపు అసూయతో చూసేవాడు. ఎందుకంటే ఈ సైప్రస్ ఎంత ప్రశాంతంగా బ్రతుకుతుంది. ఎక్కువ మంది రారు, దాని పూలని ఎక్కువగా కోయరు కదాఅని.

ఇది చెప్పి ఆ గురువు రాజుతో ఇలా అన్నాడు, రాజా! ఇదే నీవు పొందగలిగే గొప్ప శక్తి గల మంత్రం!

చూడండి; ఆ రెండుమొక్కలు ఎంతో బాగా పెరిగాయి. ఎందుకంటే అవి తమ పూర్తి శక్తిని వాటి పెరుగుదలకే ఉపయోగించాయి. అవి వృద్ధిని లెక్కలు కట్టటానికి మిల్లీ గ్రామంత శక్తిని కూడా ఖర్చుపెట్టలేదు. అవి వాటిలో వున్న100శాతం శక్తిని అవి పెరగటానికే వాడుకున్నాయి.

అలాగే మీరు కూడా మీలో ఉన్న శక్తిని మొత్తం మీతో మీరు వెళ్ళే పరుగు పందెంలో గెలవటానికి ఉపయోగించితే, మీతో మీరు పోటీ పడటానికి ఉపయోగించితే, మీరు ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందుతారు. మీరు ఎంత సాధించారు అని వెనక్కి తిరిగి చూసుకుంటే, అది చూసి మిమ్మలని మీరే నమ్మలేనంత సాధించుతారు. శాశ్వతమైన, నిశ్చలమైన శాంతి పొందటానికి ఇదే మంచి మార్గం.

నిశ్చలమైన, చెదరగొట్టలేని ప్రశాంతత చాలా ముఖ్యమైనది అని అర్ధం చేసుకోండి. మీరు ఇతరులతో కలిసి పరిగెడితే మీకు తక్కువ వ్యవధి గల శాంతి మాత్రమే దొరుకుతుంది. అది మీ కోరిక తీరినప్పుడు కావచ్చు. ఆ శాంతి మీరు మరొక పోలిక పెట్టుకోగానే మాయం అవుతుంది. అలా కాకుండా మీరు కేవలం మీతోనే పోటీపడుతుంటే మీలో అనూహ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే మీరు నిశ్చలమైన శాశ్వతమైన ప్రశాంతతని పొందవచ్చు.

ఎవరిచేతా చెదరగొట్టబడలేని నిశ్చల ప్రశాంతత పొందటంలో ఎంతో అద్భుతమైన

స్వేచ్ఛ ఉంటుంది. స్పష్టంగా అర్ధం చేసుకోండి. మీ ప్రశాంతతని ఎవరైనా చెదరగొట్టేరు అంటే దాని అర్ధం ఏమిటంటే ఎక్కడో అడ్డంకు ఉంది అని. మీలో ఎక్కడో దేనినో మీరు పూర్తిగా అర్ధం చేసుకోలేదని అర్ధం. దీని అర్ధం ప్రశాంతత కోసం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతున్నారని.

సమాజం అనే పేరు మీరు మీ బలహీనతలకి ఇచ్చే పేరు. మీకు స్పష్టత లేనప్పుడు వాడే మాట. అసలు సమాజం అనే వస్తువు ఎక్కడా లేదు. ఆకాశం హద్దు కానీ ఆకాశం లేదు. విప్పారటం, విస్తరించడం జీవనం అయితే, కుచించుకు పోవడం మరణం. మీకు మీ లోపల స్పష్టత ఉండదు. అందుకే ఎదుటి వారిని నిందించుతారు.

మీరు ఏ క్షణంలో అయితే ఎదుటి వారి కలలని మీ జీవితం లో సాఫల్యం చేసుకుంటారో మీరు పోటీలో ఉన్నట్టే. పోల్చుకోవటం, అసూయ అంటే ఎదుటి వారి కలలని మీరు అప్పు తెచ్చుకోవటమే. మీకున్న శక్తి అంతా ఈ పోటీలకు సరిపోతుంది. ఈ శక్తిని మీ కలలని నిజం చేస్తుంది. కానీ మీరు నిజంగా సాధించవలసిన విషయం ఏమిటంటే సత్యం అని మీరు అనుకునేది కల మాత్రమే. ఈ విషయం అర్ధం చేసుకోవడానికి మీరు మీశక్తిని ఉపయోగించనవసరంలేదు. మీ బుద్ధిని లేదా తెలివిని ఉపయోగించాలి.

శక్తి మీ కలలని నిజం చేస్తే: మీ బుద్ధి ఆ నిజమే కల అని మీరు అర్ధం చేసుకునేటట్టు చేస్తుంది. మీలోని వివేకము, మీరు ఏమి కావాలనుకుంటున్నారో అది మీలో ఉన్నది అని అర్ధం చేసుకునేటట్లు చేస్తుంది. అంతే కాదు అది మీకు ఇలా తెలియజేస్తుంది: మీరు కేవలం మీలో ఉండే మిమ్మలని, మీకు కావలసిన దానిని నిద్రలేపితే చాలు అని. మీరు దేనినైతే నిజం చేయాలి అనుకుంటున్నారో అదంతా కూడా మీరు అప్పుగా తెచ్చుకున్నవి, ఊహలు మాత్రమే.

మనం నిరంతరం బయట ప్రపంచంలో ఏదో సాధించాలి అని చూస్తాము. ఇదే పోలికలకి, అసూయకి ముఖ్య కారణం. ప్రజలు మిమ్ములన మీరేదైనా కనపడేదిగా ఉన్న విషయాన్ని సాధించినపుడే గౌరవిస్తుంది. మీ కాలేజీ డిగ్రీలు, అందం, ఉద్యోగపు

హోదాలు, మీ వ్రాసిన ఆర్టికల్స్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మీ గ్రేడుని కొలిచే కొలబద్దలే. ముందుగ మీరు ఒక విషయాన్ని అర్ధం చేసుకోండి. మిమ్ములని ఎవరూ గ్రేడ్ చేయనవసరంలేదు. మీ బుద్ధీ వివేకం మీద నమ్మకాన్ని పెంచుకోండి. మీ అంతట మీరు మిమ్ములని గ్రేడ్ చేసుకోండి. మీరు ఈ ప్రపంచంలో సాధించవలసినది చాలా ఉన్నది. మీరు ఈ ప్రపంచంలో మానవులకి చాలా సేవచేయవచ్చు. సైన్సు ఎన్నో సాధించబట్టే నేను ఫోనులో మాట్లాడగలుగుతున్నాను: మీరు నేను చెప్పేది వినగలుగుతున్నారు.

కానీ మీరు ఒక విషయాన్ని అర్ధం చేసుకోండి. మీ లోపల ప్రపంచంలో మీరు సాధించవలసినది చాలా ఉన్నది. బయటి ప్రపంచంలో సాధించినవన్నీ కూడా సందర్భానుసారం సంభవించిన సంఘటనలు. వాటివలన మీకు పేరు, కీర్తి,డబ్బు,వస్తాయి. కానీ మీరు నిజంగా సాధించవలసినది మీ లోపల ప్రపంచంలో ఉన్నది.

మీరు పూర్తిగా తెలుసుకోగలిగే తత్వంతో మీ మీద కేంద్రీకరించండి. బయట ప్రపంచంలోని పనులని అవి మీకు అంటకుండా, సరస్సులో పద్మం ఎలా అయితే నీటిని అంటకుండా ఉంటుందో అలా ఆ పనులు చేయండి. మీ పరిధిలోని పనులు చెదర కుండా చేసుకు వెళ్ళండి. కానీ మీ ఏకాగ్రత మాత్రం మీ మీద ఉండాలి. అప్పుడు మీరు బయట ప్రపంచంలో పనులను చాలా సమర్ధవంతంగా చేయగలుగుతారు. ఎందుకంటే మీ లోపలి వివేకము, బుద్ధీ బాగా వృద్ధి చెందుతాయి. దాంతో మీరు చేసే పనిలో అవి మార్గదర్శకులుగా ఉంటాయి. మీకు వచ్చే ఫలితాలని పరిశీలించుతూ ఒక పరిశీలకునిగా ఉంటాయి.

అప్పుడు మీరు బయట ప్రపంచంలోని సాధించిన ఫలితాలు ఆడించినట్లుగా ఆడటం ఆపేస్తారు. మీరు మీ మీద ఏకాగ్రతతో స్థిరత్వాన్ని పొందుతారు. చాలా సంతోషంగా ఉంటారు. ఈ పోల్చుకోవటం అసూయ అనే వలయం లోపలి నుండి బయట పడాలంటే ఉన్న ఒక మార్గం, మీ అంతరంగం మీద మీ ఏకాగ్రతని కేంద్రీకరించటం.

ఈ రోజుల్లో ఎంత మంది విజయవంతమైన వ్యాపారులు "విజయపు మానసిక కుంగుబాటు" అనే సమస్యతో బాధ పడటం లేదు. వాళ్ళు ఏమేమి సాధించాలనున్నారో అవన్నీ సాధించారు. వాళ్ళు కలలు, ఇతరుల దగ్గర అప్పు తెచ్చుకున్న కలలు అన్నింటినీ నిజం చేసుకున్నారు. కానీ వాళ్ళలో సాధించామన్న సంతృప్తి ఉండదు. వాళ్ళలో పెద్ద శూన్యం ఏర్పడుతుంది.

వాళ్ళు ఇలా ఆలోచించటం మొదలు పెడతారు ; చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నేను ఎందుకు ఇంత కాలం ఇలా పరిగెడుతున్నాను.

వాళ్ళ పోటీలలో వాళ్ళని అంకుశంతో పొడిచేసినట్లు పొడిచే కోరికలు, బలమైన ఆలోచనలూ ఇక వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళు వాళ్ళ గురించి అర్ధం కాక గందరగోళానికి లోనవుతారు. వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసే రోజుల్లో వాళ్ల మీద ఉన్నట్టు అకస్మాత్తుగా బలహీన పడినట్లు అనుకుంటారు.

ఇదంతా ఎందుకంటే వాళ్ళు ఏమీ తెలియకుండా వాస్తవాన్ని అర్ధం చేసుకోకుండా పరిగెత్తారు. వాళ్ళకి వాళ్ళు అప్పాయింట్మెంట్ ఇచ్చుకోకుండా పరిగెత్తారు. వాళ్ల గురించి ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. దాంతో వాళ్ళు పరిగెత్తటం ఆపగానే, ఎప్పుడయితే మిగతా వారితో పరిగెత్తలేరో అప్పుడు వాళ్ల లోపలికి చూసుకుంటారు. వాళ్ళు అకస్మాత్తుగా వాళ్ళు వాళ్ళతో సౌకర్యంగా ఉండలేరు. ఇదే క్రమంగా మానసిక క్షోభకి కుంగుబాటుకి ఆ తరువాత రకరకాల జబ్బులకి దారి తీస్తుంది.

మీరు విజయపు కుంగుబాటుకి లోనైనప్పుడు మీరు మూడు రకాలుగా అందులోంచి బయటకి రావటానికి ప్రయత్నిస్తారు. మొదటిది : మత్తు మందులకి అలవాటు పడటం. దాని వలన ఇంకా కుంగిపోతారు. రెండవది : ఆత్మహత్య. అది పారిపోవటం ; మూడవది ధ్యానం చేయటం. అది మిమ్ములని మీలోనికి చూసుకోవటానికి సహాయం చేస్తుంది. తెలివైన వాళ్ళు మూడవ పద్ధతిని ఎన్నుకుంటారు.

మీరు మానసిక కుంగుబాటుకు లోనైనపుడు దాని నుండి బయటకి రావాలంటే మీ గురించి మీరు విచారణ చేసుకోవాలి. అసలు సమస్య మీ అంతరంగంలో ఉన్నది. కానీ పరిష్కారం కోసం మీరు బయట ప్రపంచంలో వెతుకుతారు. మీరు మీ ఉనికిని, మిమ్ములని ఇంత కాలం నిర్లక్ష్యంచేసారు. మానసిక కుంగుబాటు అంటే నిజానికి మీ అంతరంగపు ఉనికి యొక్క పిలుపు మాత్రమే. అందుకే గురువులు మీకు మళ్ళీ మళ్ళీ ఎన్నో పద్దతులని నేర్పించి మిమ్ములని మీ అంతరంగం లోపలి మీ ముఖ్య ఉనికిని అంతరాత్మ మీద ఏకాగ్రతని నిలపమని చెప్పారు. మిమ్ములని మీ పరిధిలోనే పని చేయమని చెప్పారు.

ఇదే విషయాన్ని మీరు మీ వ్యాపార ఉద్యోగాలలో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు చెబితే, మీరు అసలు వినటానికి శ్రద్ధ చూపే వాళ్ళు కాదు. ఎందుకంటే మీకు అప్పుడు సరిపడా శక్తి ఉన్నది. ఆ శక్తితో మీరు మీ మీద ఏకాగ్రత లేకపోవటం వలన వచ్చే లోపాలని ఎదుర్కోగలిగారు. ఎప్పుడయితే మీలోపలి శక్తి సన్నిగిల్లుతుందో, బలహీనమవుతుందో అప్పుడు మీరు ఎక్కడో తప్పు జరిగింది అని అనుకుంటారు. ఆ 'ఏదో' దాని గురించే మీకు గురువులు మళ్ళీ మళ్ళీ చెప్పటానికి ప్రయత్నించతున్నారు.

అల్బర్ట్ ఐన్‌స్టీన్, గొప్ప భౌతిక శాస్త్రవేత్త. ఆయన మరణించే సమయంలో ఆయనకి సన్నిహితులు కొందరు ఆయన చుట్టూ ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి ఆయనని మీరు మరో జన్మలో మనిషిగా జన్మించవలసి వస్తే ఎలా పుట్టాలనుకుంటున్నారు అని అడుగుతాడు.

అందరూ ఆయన తిరిగి గొప్ప శాస్త్రవేత్తగా పుట్టాలి అని కోరుకుంటారు అని అనుకున్నారు. కానీ ఆయన "నేను గనుక మళ్ళీ పుడితే నీళ్ళ గొట్టపు పనులు చేసే వాడిగా పుడతాను" అన్నాడట.

ఆయన ఏదయితే సాధించాలనుకున్నాడో దానిని సాధించాడు. కాని దేనికి సాధించాలి అని అనుకున్నాడో అది సాధించలేక పోయాడు. ఆయన ప్రపంచానికి గొప్ప సత్యాలను చెప్పాడు. కానీ అతని జీవితం ఒక అబద్ధమయిందనుకున్నాడు. ఆయన చివరి రోజుల్లో, తాను బయట ప్రపంచపు విషయాలలో పూర్తిగా మునిగిపోయానని అనుకున్నాడు. బయట ప్రపంచపు సంఘటనలలో చిక్కుకుపోయాను. అని అనుకున్నాడు. దాంతో ఆయన తనలోపలి అంతరంగంతో ఉండవలసిన లోతైన, గాఢమైన సంబంధాన్ని కోల్పోయాడు.

ఆయన అందుకే తాను తిరిగి పుడితే చిన్న చేతి పనులు చేసే ప్లంబర్‌గా పుట్టాలని అనుకున్నాడు. అంతే గాని శాస్త్రజ్ఞుడిగా పుట్టాలని అనుకోలేదు. అందుకే మీరు మీ వ్యాపార, ఉద్యోగాలలో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, మిమ్ములని మీరు ఒక మెషిన్‌లా తయారవకుండా చూసుకోండి. ఇది ఆధ్యాత్మిక చింతనతో ఉండే వ్యక్తికి తేలిక అయిన పని. కానీ బయట ప్రపంచపు విషయాలలో మునిగిపోయే మామూలు మనుషులకి చాలా కష్టం.

చూడండి : ఒకరితో పోల్చుకోవటం, అందరితో పోటీలలో పరిగెత్తటం అనే ఈ మొత్తం కార్యక్రమమంతా మిమ్ములని ఒక మెషిన్‌లా తయారు చేస్తుంది. మీరు చేసే దైనందిన పనులు చాలా వరకు అచేతన స్థితిలో, మీకు తెలియని స్థితిలో చేసేస్తారు. మీరు కారుని డ్రయివ్ చేస్తున్నట్టు మీకు తెలియకుండానే కారుని డ్రయివ్ చేస్తారు. మీరు కారులాంటి ఒక మెషిన్‌లా తయారవుతాయి.

ఉదయాన్నే పళ్ళుతోముకునే దగ్గర నుంచి, మీరు నిద్రపోయే వరకూ ఒక రోబోటుగా పనులు చేసుకుకెళతారు. మీకు మీ గురించి అసలు ఏమీ తెలియదు. మీరు చేసే పనులన్నీ చాలా సమర్ధవంతంగా చేస్తారు. ఆ విషయంలో ఎటువంటి అనుమానాలు లేదు. కానీ మీలోని మానవత్వం పోతుంది. మీరు ఈ భూమి మీద జన్మించిన కారణానికి చాలా దూరంగా వెళ్ళిపోతారు. మీరు మీలోపలి ఉనికికి సంబంధం లేకుండా అయిపోతారు.

మీరు ఎప్పుడయితే నిరంతరం తెలుసుకోగలిగే తత్వంతో ఉంటారో మీరు మీ పనులని చాలా సమర్థవంతంగా నిర్వహించటమే కాదు మీరు చేసే పనులు పరిపూర్ణతతో చేయగలుగుతారు. పనులన్నీ సఫల సిద్దిగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక సూక్ష్మ ప్రపంచమై, ఈ విశ్వం యొక్క గమనానికి అనుగుణంగా మారుతారు. మీరు ఈ భూమియొక్క మూలాలతో ఎగర గలుగుతారు. భూమి యొక్క మూలాలు లేకుండా ఎగిరితే మీరు ఏ నిమిషంలో నైనా పడిపోతారు. కాబట్టి తెలిసిన తత్వంతో పని చేయగలిగితే మీ పని సామర్థ్యం పెరగటమే కాదు మీరు మీ అంతరంగిక ఉనికి యొక్క ఉద్దేశానికి దూరంగా వెళ్ళలేరు అని అర్థం చేసుకోండి.

సరే! ఇప్పుడు మనం అసూయ గురించి మరికొంత తెలుసుకుందాం. మీ కందరికీ తెలిసినట్టే, ఈ అసూయ ఒకరితో పోల్చుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఎప్పుడయితే మనం ఎదుటివారి సామర్థ్యాన్ని చూసి భరించలేమో అప్పుడే మనకి ఈ అసూయ అనేది ప్రారంభమవుతుంది. ఇది కాకుండా అసూయ కలగటానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఉదాహరణకి : ఎవరైనా ఒక వ్యక్తి చాలా అందంగా ఉంటే, మీకంటే అందంగా ఉంటే, అది మీరు భరించలేరు. అప్పుడు మీ లోపల మీకు భరించలేని బాధ ఉంటుంది. అప్పుడు మీరు “ఇది చాలా సహజం ఎందుకంటే ఎదుటి వ్యక్తి నా కంటే అందంగా ఉన్నారు కాబట్టి నాకు అసూయ కలగవచ్చు”, అని అనుకుంటారు.

ముందుగా మీరు ఈ విషయం అర్థం చేసుకోండి. భగవంతుడు కళాకారుడు. ఆయన ఇంజినీరు కాదు. ఆయన ఒక ఇంజినీరు అయితే ప్రతి స్త్రీని, ప్రతి పురుషుడినీ ఒకే రూపంలో ఉండేలా తయారు చేసేవాడు. ప్రతి స్త్రీని చాలా గొప్ప అందగత్తె మూసలోనే చేసేవాడు., ప్రతి పురుషుణ్ణి ప్రపంచంలోని అందమైన పురుషుని యొక్క మూసని ఉపయోగించి చేసేవాడు. కానీ భగవంతుడు ఇంజనీరు కాదు. ఆయన ఒక గొప్ప కళాకారుడు. అందుకే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు.

మీ వరకూ మీరు చాలా అందమైన వ్యక్తి. ప్రతి ప్రాణి అందమయినదే. మీరు అందాన్ని ఏ కొలమానంతో, ఏ స్కేలుతో కొలుస్తారు. అందాన్ని కొలవటానికి స్కేలు అనేది లేదు. ఇదంతా కూడా మీ సొంత భావాలు, మీ కల్పనలు .కొంచెం ఆలోచించండి. మీ దృష్టిలో అందమైన వ్యక్తి రూపంలో మీరు ఒక కప్పు టీ అయినా తాగటం ద్వారా ఆనందపడగలరా.

ఈ విషయాన్ని అర్ధం చేసుకోండి. మీరు మీకు కావలసినంత అందంగా ఉన్నారు. మీరు ఎదుటి వారిలా ఉండాలి అని కోరుకున్నప్పుడు మీలోని వ్యక్తిత్వానికి చీలికలు ఏర్పడతాయి. మీ వ్యక్తిత్వంలో చీలికలు వస్తాయి అప్పుడు మీరు మిమ్ములని అసహ్యించుకుంటారు.

మీకు తెలుసా, ఏ కళ్ళు అయితే మరొకరి మీద ఉండవో ఆ కళ్ళలో అందం, అమాయకత్వం ఉంటాయి. భగవంతుడు మీకు ఏమి ఇస్తాడో దాని మీద నమ్మకం పెంచుకోండి. ఏ రోజయithe భగవంతుడు మీకు ఇచ్చిన దాని మీద మీకు నమ్మకం ఉండదో అప్పుడే మీరు ఈ అర్ధం లేని పద్ధతులు ద్వారా మీ అందాన్ని పెంచుకోవాలని చూస్తారు. మీరు మిమ్ములని పూర్తి స్వీకరించగలిగితే, మీలోనికి చక్కటి అందం వస్తుంది. ఈ రకమైన అందం మీరు మాట్లాడే అందం కంటే చాలా బాగుంటుంది.

భౌతికమైన అందం వేరు. మీలో ఉండే అందం వేరు. భౌతికమైన అందాన్ని మీరు చాలా విధాలుగా సాధించవచ్చు. ఈ రోజుల్లో భౌతికమయిన అందాన్ని పెంచుకోవటానికి చాలా పద్ధతులు అందుబాటులోనికి వచ్చాయి. ప్లాస్టిక్ సర్జరీ, బ్యూటీ క్లినిక్స్, మిగతా సర్జరీలు. కానీ మీలోపలి అందం మాత్రం మీలో మీ మీద ఉండే నమ్మకం ద్వారా, మీలో ఉండే నిశ్చలత్వం వలన మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఎప్పుడయితే లేని దాని కోసం ఆరాటపడరో, మీరు పూర్తి విరామంగా మీ శరీరంతో సంతోషంగా ఉండగలరో అప్పుడే ఆ అందం మీ సొంతం చేసుకోగలరు.

మీలో మీరు సంతోషంగా ఉండగలిగినప్పుడు మీరు చాలా అందంగా ఉంటారు. చాలా మంది పేరు ఉన్న అందగత్తెల కంటే కూడా మీరే అందంగా ఉంటారు. అప్పుడు మీరు కొత్త విధానాన్ని ప్రారంభించిన వాళ్ళు అవుతారు.

నేను మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఎయిర్ పోర్టు ఆఫీసర్సు నన్ను ఇలా అడిగారు. “మీరు ఈవిధంగా కాషాయం కట్టుకుని వెళితే మీ మాటలు అమెరికాలో ఎవరు వింటారు అని”. నేను వాళ్ళతో చెప్పాను. “నాకు ఒక వారం టైం ఇవ్వండి దీనినే అమెరికాలో ఫ్యాషన్గా చేస్తాను” అని. ఒక నాయకుడు తనని తాను పూర్తిగా సమ్మతించాలి, స్వీకరించాలి. మిమ్ములని మీరు పూర్తిగా స్వీకరించనప్పుడు మీరు ఒక ప్రత్యేక పుష్పంలా ఉంటారు. మీలో అద్భుతమైన స్వేచ్ఛ, మీమీద మీకు అంతులేని నమ్మకం, అభివృద్ధి అవుతాయి. మీ మీద ఉండే అసహ్యభావం, తప్పు చేసిన భావము అనేవి మాయమయ్యి, వాటి స్థానంలో నమ్మకం, అందం వస్తాయి.

మీరు మీ శరీరంతో జీవించటం అనేది చాలా ముఖ్యం. ఏ నిమిషంలో అయితే మీరు ఇతరులు చాలా అందంగా ఉన్నారు, చాలా ఆకర్షణతో ఉన్నారు, అని మీకు అనిపిస్తుందో అప్పుడే మీ శరీరానికి మీకు మధ్య ఖాళీ ఏర్పడుతుంది. దూరం పెరుగుతుంది. నేను చాలా మందిని చూసాను. వాళ్ళు స్త్రీ లేదా పురుషుల మోడల్స్ పోస్టర్లు వాళ్ళ రూపంలో పెట్టుకుని, వాళ్ళ లాంటి శరీరాకృతి తెచ్చుకోవాలి. అని వ్యాయామాలు చేస్తుంటారు. స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఎప్పుడయితే ఎదుటివారి శరీరం చాలా అందంగా ఉంది అని అనుకుంటారో, మీరు మీకు మీ శరీరానికి మధ్య దూరాన్ని సృష్టించుతారు.

మీకు తెలియకుండా వేరే వారి వైపు మీరు చూసినప్పుడు మీ అంతరంగపు ఉనికిలో అభ్యంతరకరమై అదనపు చెడు ఫలితాలు కలుగుతాయి. మనలో ఎవరూ కూడా మన శరీరాన్ని గాఢంగా ప్రేమించము. దానిని ఒక బరువు మోస్తున్నట్లుగా మోస్తారు. అంతే. ఇది మనకి వసతి కల్పించే ఒక వసతి గృహంలా అనుకుంటాం. మనం

మన శరీరంలో ఎప్పుడూ ఉండము. ఎందుకంటే మనం మన శరీరాన్ని అసహ్యించుకుంటాం. మనం ప్రతి చోటా ఉంటాము. మన శరీరంలో తప్ప. అందుకే మనలో నిరంతరం మనం అసౌకర్యంగా, ఆందోళనగా ఉంటాము. దానిని ఏ నిమిషాన్నినా బ్రద్దలు చేయటానికి సిద్ధంగా ఉంటాము.

ఉదాహరణకి : మీ డ్రైవరు చిన్న తప్పు చేస్తే అతని మీద విరుచుకు పడతారు. మీరు పనిచేసే దగ్గర నిరంతరం మీరు అసహనంగా ఉంటారు. దానికి కారణం మీ చుట్టూ ఉన్న వాళ్ళు కాదు. కొంత మంది నాతో అంటుంటారు ; “స్వామిజీ ! మా పనివాళ్ళు అసలు బాగా పని చేయరు. అది చూసి నేను విసిగిపోయి అసహనంగా తయారవుతాను".

అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు అసహనంగా అవ్వటానికి కారణం మీ పనివాళ్ళ అసమర్ధత కాదు. మీరు మీ శరీరంతో సౌక్యంగా లేకపోవటం. అదే మీకు మీ లోపల అసహనాన్ని సృష్టిస్తుంది. ఇది చాలా చిన్న కారణం అందుకే మీరు దానిని గమనించలేరు.

మీరు నిరంతరం మీ కొలతలు, మీ పరిమాణం మార్చుకోవాలని చూస్తుంటారు. ఒక విషయం అర్ధం చేసుకోండి. మీ శరీరం, భగవంతుడు మీకు ఇచ్చిన బహుమతి. అది మీకు సరిపడదు అనే మీ ఆలోచనే మీ శరీరానికి మొదటగా హాని కలిగిస్తుంది.

ప్రశ్న : స్వామీజీ మీ ముఖం ప్రతిసారీ మారుతున్నట్లుగా నాకు కనిపిస్తుంది. అది నిజమా ? లేకపోతే నా ఊహ?

(స్వామి నవ్వుతారు)

అర్ధం చేసుకోండి : నా వ్యక్తిత్వపు ఉనికి ద్రవంలా ఉంటుంది. దీనిలో ఘనపదార్థం లాంటి అహంకారం ఉండదు. నేను ఈ అనంత చైతన్య సృష్టికి అనుగుణంగా సాగిపోతాను. నేను ఏది చెబుతానో అది ద్రవ పదార్ధాల ప్రవహిస్తుంది. అదే నా ముఖంలో కనిపిస్తుంది. అందుకే నా ముఖం ఎప్పుడూ మారుతూ ఉంటుంది.

అహంకారం లేనప్పుడు మన భావాలు ఎలా ఉంటాయో నేను తరువాత చక్రం ఆజ్ఞా చక్రం గురించి చెప్పినప్పుడు మీకు అర్ధమవుతుంది.

ప్రశ్న : స్వామీజీ మేము ఈ విధంగా అతిగా పట్టి ఉండటం, అసూయ అనే వాటి నుండి ఎలా బయట పడగలం ?

అవును. దీని నుండి ఎలా బయటపడాలి ? మీరు ఈ ప్రశ్నతో ముందుకి వచ్చారంటే మీరు ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకోవాలనుకుంటున్నారు అని అర్ధమవుతుంది.

ఒక విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోండి ; మనుషులు ఎప్పుడూ దేనిని పూర్తిగా తమ అధీనంలో ఉంచుకోలేరు. ఎప్పుడయితే మీరు ఒక వ్యక్తిని మీ గుప్పిటలో పెట్టుకోవాలి అని చూస్తే, అతనిని లేదా ఆమెని మీరు ఒక వస్తువుగా చూస్తున్నారు అని అర్ధం. అంటే ఆ మనిషిని ఒక ప్రాణం లేని వస్తువుగా చూస్తున్నారని అర్ధం. కేవలం ప్రాణం లేని వాటిని మాత్రమే మీరు గుప్పిటలో, మీ అధీనంలో పెట్టుకోగలరు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోండి. మీరు నీళ్ళని మీ గుప్పిటలో పెట్టుకోవాలి అనుకోవటం ఎంత తెలివి తక్కువ తనమో ఆలోచించండి. అదే విధంగా మనుషులని మీ అధీనంలో ఉంచుకోవాలి అనే ప్రయత్నాన్ని మానేయండి ; వాళ్ళు ఏమి అయితే దానితోనే ఆనందపడండి. వాళ్ళని వాళ్ళలా చూసి ఆనందించండి. అప్పుడు మీరు అసూయ గుప్పిటలోంచి స్వేచ్ఛ పొందుతారు.

అప్పుడు మీకు ఈ అధీనంలో ఉంచుకోవటం అనే ఆలోచన కేవలం మీ సమస్యాత్మకమైన మైండ్ సృష్టి అని అర్ధమవుతుంది. మైండ్కి ఆశక్తి మీరు ఇచ్చారు.

మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని మీ అదీనంలో పెట్టుకోవాలని చూస్తే అది ఆ వ్యక్తికి కూడా చాలా కష్టమవుతుంది. మీలో ఉండే భావాలన్నీ మీరు ఆ వ్యక్తికి అన్వయించుతారు. మీరు అన్వయించే మీ భావాలకి అనుగుణంగా ఆ వ్యక్తి ప్రవర్తించాలి అని చూస్తారు. దాంతో ఆ వ్యక్తి స్వేచ్ఛ లేనట్లుగా బంధింపడినట్లుగా అనుకుంటాడు. అతని వ్యక్తిత్వం భాగాలుగా చీలిపోతుంది. అతను మీతో అతని స్వాభావికమైన లక్షణంతో సహజంగా ఉండలేదు. అప్పుడు దానిని సంబంధం అని అనలేము.

మీరు నిజంగా ఒక వ్యక్తిని మనస్పూర్తిగా ప్రేమిస్తే, అతనిని స్వేచ్ఛగా ఉండనివ్వండి. అతనిని మీ అధీనంలోనికి తెచ్చుకోవటానికి ప్రయత్నించండి. అప్పుడే నిజమైన సంబంధం మీ మధ్య వికసిస్తుంది. అప్పుడే సంబంధ ప్రేమ మీద తప్పా మరి దేని మీదా ఆధారపడదు. అప్పుడే నమ్మకం వికసిస్తుంది. ఎప్పుడయితే మీరు దేనినైనా పట్టుకుని వేలాడాలి అనిపిస్తే అప్పుడే మీరు దీనిని అంతా పోగొట్టుకుంటారు. అతనిని ఎటువంటి బంధాలలో ఇరికించకుండా కేవలం ప్రేమించండి.

నాకు ఒక చిన్న కథ గుర్తు వస్తుంది :

ఒక చిన్న పల్లెటూరు, ఈ నాగరిక ప్రపంచానికి చాలా దూరంగా ఉంది. అక్కడి వాళ్ళకి ఈ నాగరిక ప్రపంచపు విషయాలు చాలా తెలియవు. అటువంటి పల్లెటూరులో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. ఒక రోజు మొట్టమొదటిసారిగా ఆ ఊర్లో చిన్న ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారు. ఈ పెద్దాయన ఆ ఎగ్జిబిషన్కి వెళ్లి అక్కడున్న వస్తువులను విచిత్రంగా చూసాడు.

అతను ఒక అద్దాన్ని తీసుకున్నాడు. దానిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను అంతకు ముందు ఎప్పుడూ అద్దాన్ని చూడలేదు. అతను దానిని కొనుక్కొని ఇంటికి తెచ్చి దాచాడు. అప్పుడప్పుడూ ఆ అద్దాన్ని బయటకి తీసి దాంట్లో తనని చూసుకుని అతని భార్య వచ్చే లోపు దానిని లోపల దాచేసేవాడు.

ఈ విషయం ఎలాగో భార్య కనిపెట్టింది. ఒక రోజు అతను బయటికి వెళ్ళినప్పుడు ఆ అద్దాన్ని తీసి అందులోకిచూసింది. అలా చూస్తే ఎవరో ఒక స్త్రీ ఉంది. నేను ఇలాంటిదేదో ఉందని ముందే అనుకున్నాను, అని అనుకుంటుంది.

(అంతా నవ్వులు)

మన ఊహలకి అంతు ఉండదు. ఇదంతా మనం ఒకరిని అధీన పరచుకోవాలనే కోరిక, అసూయ వలన మాత్రమే చేస్తాము . ఎప్పుడూ కూడా మన ఊహ నిజం కాదు. మనం ఒక్కసారి ఆగి మన అసూయలోనికి లోతుగా చూడగలిగితే అప్పుడు మనకి అది ఏసూత్రం ఆధారం లేనిది అని, అర్ధం లేని విషయం అని తెలుస్తుంది.

అయితే మీరు ఇలా అనవచ్చు. “స్వామీజీ ! నా భర్త లేదా భార్య బయటవారి మీద కన్ను వేస్తే ఎలా” ? అని., అలాంటప్పుడు మీరు ఆవిషయంలోనికి పూర్తిగా తెలుసుకునే తత్వంతో, అర్ధం చేసుకునే విధంగా చూడండి, కానీ అచేతన స్థితిలో ఏదో చేసే విధంగా మాత్రం చూడకండి.

ఎప్పుడయితే అసూయని, ఆధీనతని తెలుసుకునే వాస్తవ దృక్పధంతో చూడగలుగుతారో మీరు ఊహలు, భావావేశాల గుప్పిళ్ళలో చిక్కుకోరు. ప్రతి విషయాన్ని సరియైన పద్ధతిలో చూడగలుగుతారు ; సరియైన పద్ధతిలో తగినట్లుగా ప్రవర్తించుతారు. అప్పుడే మీరు సరియైన నిర్ణయాలు చేయగలుగుతారు.

అసూయపడవద్దు అని మీకు మీరు చెప్పుకొని మీరు దాంట్లోంచి బయటకి రాలేరు. మీరు ఈ విషయంలోనికి వాస్తవ దృక్పధాన్ని తెచ్చి, దానిని తెలుసుకొని చాలా విపులంగా అర్ధం చేసుకున్నప్పుడు మాత్రమే మీరు దాంట్లోంచి బయటకి రాగలుగుతారు.

మీరు అసూయని అధిగమించాలి అంటే ముందుగా ఈ అసూయ మీలోపలికి ఎలా వచ్చిందో చూడండి. దాని మూలంగా మీలో వచ్చే ఆలోచనలని విశ్లేషించండి. అలాగే మీ భావావేశాలని విశ్లేషించండి. అప్పుడు మీ తెలివితేటలు, మీ వివేకము ఉపయోగించి వాటికి కారణాలు కనుక్కుని ఒక్కొక్క దాన్ని మీ నుండి తొలగించండి.

ఒకసారి మీరు ఈ అసూయ అనేది కేవలం ఎటువంటి ఆధారంలేని నీడ మాత్రమే అని అర్ధం చేసుకోగలిగితే, అప్పుడు మీరు ఈ అసూయ అనేది ఎంత అసంబద్ధమైనదో అది మిమ్ములని ఎంత బాధపెట్టిందో స్పష్టంగా అర్ధం చేసుకోగలుగుతారు. ఈ

అసూయ నుండి స్వేచ్ఛ పొందటం అంటే జీవితంలో ఒక గొప్ప స్వేచ్ఛని అనుభవించటమే.

మరొక విషయం. అసూయ యొక్క లక్ష్యాన్ని మీరు ఖండించవచ్చు. అలా చేస్తే మీరు అసూయ నుండి విముక్తి కాలేరు. ఎందుకంటే ఎప్పుడయితే మీరు అసూయని దాని లక్ష్యాన్ని ఖండించుతారో, మీలో దాని తాలూకా బాధ ఉన్నది. ఇలా చేయటం వలన మీరు దానిని దాచేస్తారు.

అసూయకి సంబంధించి ఒక లక్ష్యాన్ని లేదా ఒక విషయాన్ని మీరు ఖండించితే మీరు కేవలం ఆ ఒక్క విషయంలోనే అసూయ నుండి విముక్తులవుతారు. అయితే మీరు మరొక విషయంలో అసూయకి అంటిపెట్టుకు పోతారు. అంతే. ఇది ఎలా ఉంటుందంటే పుల్లటి ద్రాక్ష అని చెప్పి అందని దానిని వదిలి మరో ద్రాక్ష తోటలోనికి వెళ్ళటమే. కాబట్టి అసూయ నుండి బయట పడటానికి ప్రయత్నించటం మాత్రం పరిష్కారం కాదు. మీరు ఆ అసూయ అనే విషయం మీద కొంత పని చేయవలసి వుంటుంది.

ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ; మీరు ఏదైనా ఒక భావాన్ని కాని, ఒక ఆవేశాన్ని కాని కలిగి ఉన్నారు. అనిపించి, మీరు దానిని మీలోంచి తొలగించుకోవాలి అనుకున్నారనుకోండి, అది మీ అభివృద్ధికి ఆటంకం అనిపించి దానిని వదిలివేయాలను కున్నారనుకోండి; అప్పుడు దానిని ఆపకండి. ఎప్పుడయితే మీరు దానిని అడ్డుకుంటారో మీరు దానిని చాలా శక్తివంతురాలని చేసినట్టే. ఎప్పుడయితే మీరు "నేను ఎట్టి పరిస్థితిలో అసూయ పడకూడదు" అని అనుకుంటారో మీరు అసూయ అనే పదానికి చాలా శక్తిని ఇచ్చినట్లే "పడకూడదు" అనే పదంలో ఎంత శక్తి ఉందో అసూయకి అంతే శక్తిని ఇస్తారు.

ఎప్పుడూ కూడా అలా అనకండి. దాని బదులు మీకు మీరు ఇలా చెప్పుకోండి. "నేను అందరితోను ఎప్పుడూ మృధువుగా, కరుణతో ఉండాలి". అసూయ అనే మాటని ఎక్కడా ఉపయోగించవద్దు. భావావేశాన్ని వ్యతిరేకించటం వలన మీరు కోరుకున్నది సాధించలేరు. ఈ సందర్భంలో అనుకూలమైన, వాస్తవమైన దృక్పథంతో మాట్లాడండి. అంతే.

అలాగే మీరు అసూయ నుండి పారిపోకుండా దానిలో, పూర్తిగా తెలుసుకునేతత్వంతో ఉండండి. ఎప్పుడయితే మీరు దాని నుండి పారిపోవాలనుకుంటారో, అది ఆ తరువాత మరింతగా విజృంభించి మీలోనికి చేరుతుంది. ఒక విషయాన్ని లోతైన వాస్తవిక దృష్టితో అర్ధం చేసుకోండి. అసూయ మీ సహజ లక్షణం కాదు. సమాజం అసూయని మీకు నేర్పించింది.

ఒక్క విషయం నమ్మండి. అసూయ మీరు కాదు. అంతే. అప్పుడు మీరు దానిని చూసి నవ్వుతారు గాని దానిలో నిమగ్నమవ్వరు. మీరు ఎప్పుడయితే దానిని చూసి నవ్వగలరో, అప్పుడు మీరు దానిని కేవలం చూస్తారు గాని దానిలో భాగం కారు. మీరు ఎప్పుడయితే కేవలం దానిని గమనించగలుగుతారో, అప్పుడు మీరు దానికి అతీతంగా వెళ్ళగలుగుతారు.

మరొక విషయం : మీరు ఈ సంపూర్ణ సృష్టిని గమనిస్తే ఈ సర్వం దైవికమైన ఒక ఆట అని తెలుస్తుంది. అప్పుడు మీకు ఈ అసూయ కూడా ఆటలో భాగంగా కనపడుతుంది. అది నిజం కాదు అని తెలుస్తుంది. అసూయలో మీరు పడిపోకుండా కేవలం దానిని చూడండి. అప్పుడు అది దాని శక్తిని మీ మీద ప్రయోగించలేక మెల్లిగా కరిగిపోతుంది.

మీరు ఈప్రపంచంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, మీ లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు అని తెలుసుకుంటే అప్పుడు మీలో ఈ పోల్చుకోవటం అనే లక్షణానికి అర్ధం లేకుండా పోతుంది. అప్పుడు మీరు అసూయ పడటం అప్రయత్నంగానే మానేస్తారు. ఒక్క విషయం అర్ధం చేసుకోండి. ఈ అనంత చైతన్యం, ఈ బ్రహ్మాండం అందరిని అన్నింటినీ సమానంగా ప్రేమిస్తుంది.

ప్రశ్న : స్వామీజీ : గురువులు మాకూ ఎన్నోసార్లు మాలో మంచి లక్షణాలయిన ప్రేమ, అసూయ లేకుండా ఉండటం, బాగా అర్ధం చేసుకోగలగటం, నిర్ణయాలు చేసే, తీర్పులు చెప్పే దృక్పథం లేకపోవటం... ఇలా ఎన్నో మంచి విషయాలు చెబుతారు. కాని ఎందుకు మాలో అవి 'అర్ధం చేసుకోవటం' అనేది జరగటం లేదు ?

చూడండి ; ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఎప్పుడయితే మనం గురువు యొక్క సూత్రాలని, సిద్ధాంతాలని అర్ధం చేసుకుని, వాటిద్వారా మనలో మార్పు రావాలి అని నిజంగా అనుకుంటే మనం సరియైన ఆధారపూరిత దారాన్ని పట్టుకున్నట్టే. అప్పుడు మనం శాశ్వతానందాన్ని పొందగలుగుతాము. కానీ ఏం జరుగుతుంది. మనం గురువుకి ప్రాముఖ్యాన్ని ఇవ్వటం మొదలు పెడతాం. మనం గురువు యొక్క సిద్ధాంతాలకి సూత్రాలకి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి కాని గురువుకి కాదు. మీరు గురువుకి ఇస్తే ఆయన చెప్పేవన్నీ పోగొట్టుకుంటారు. ఆయన సందేశాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేరు.

అర్ధం చేసుకోండి : మీరు ఆయన బోధనలని అనుసరిస్తే మీరు ఒక ఆధ్యాత్మిక ఫలమవుతారు. అలా కాకుండా మీరు ఆయననే పట్టుకు వేలాడితే మతత్వంతో నిండిపోయిన ఒక గట్టి గింజలా తయారవుతాయి. ఈ మత తత్వపు గింజలే అన్ని రకాల గందర గోళాలు సృష్టించేది. వీళ్ళే అందరిలో చీలికలు తెచ్చేది. వాళ్ళు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారు. వాళ్ళలో ఎటువంటి అభివృద్ధి ఉండదు.

అది శ్రీకృష్ణుని సందేశమైన భగవద్గీత కావచ్చు. మహమ్మదు ప్రవక్త సందేశమైన పవిత్ర ఖురాన్ కావచ్చు లేదా జీసస్ క్రైస్ట్ బోధనలు అయిన బైబిల్ కావచ్చు. వారి సందేశం ఒక్కటే. కాకపోతే చెప్పే దారులు, పద్ధతులు వేరు. మీరు ఏగురువు యొక్క ఉపదేశాన్నయినా అనుసరించండి. కానీ ఆ గురువల బోధలకంటే వాళ్ళే మీకు ముఖ్యమయినప్పుడు సమస్యలు వస్తాయి. శ్రీ కృష్ణుడు మీకు భగవద్గీత కంటే ముఖ్యమయినప్పుడు, మీరు మీకే కాదు ఇతరులకి కూడా సమస్యలు సృష్టించుతారు.

ఎప్పుడయినా శ్రీ కృష్ణుడు, జీసస్ క్రైస్ట్ కలిస్తే వారు ఒకరినొకరూ కౌగలించుకుంటారు. కానీ శ్రీ కృష్ణుని గోవులు జీసస్ క్రైస్ట్ గొఱ్ఱెలు మాత్రం పోట్లాడుకుంటాయి.

ఒక్కొక్కరు ఒక్కొక్క గురువు వద్ద బోధనలను నేర్చుకొని దాని ద్వారా శాంతిని నెలకొల్పటానికి “నా గురువుగారి బోధనలే మంచివి”, అని అంటారు. అప్పుడు ఏమి జరుగుతుంది. శాంతిని స్థాపించకుండా, మానవులను ముక్కలుగా విభజించేస్తారు. మీరు ఎప్పుడయితే మీరు చెప్పే శాంతిని ఎదుటి వారి మీద రుద్దితే అక్కడే సమస్యలు ప్రారంభమవుతాయి. మనం ఈ విధంగా విషయాలని చిక్కు సమస్యలుగా మార్చుతాము. ఈ విధంగా చేయటం వలన తెలుసుకోవాల్సిన అసలు సందేశాన్ని ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలయినా తెలుసుకోలేము.

గురువులు ఈ భూమి మీద కేవలం మానవులంటే ఉండే అపారమైన కరుణతో జన్మిస్తారు.

మరొక విషయం : మనం మన వేళ్ళని ఎదుటి వారి వైపు చూపకుండా, మంచి సాధనని మంచిరోజు మొదలుపెడదాములే అని ఎదురు చూడకుండా, మంచి సాధనని మీరు అవి విన్న క్షణం నుంచే సాధన చేస్తే మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మార్పులు వాటంతట అవే సంభవిస్తాయి.

ఉదాహరణకి : నేను మీతో మొక్కలని, జంతువులని ప్రేమించండి, వాటిని మనుషులతో సమానంగా ప్రేమించండి అన్నాననుకోండి, మీరు అలా చేయటానికి ఒక మంచి రోజు కోసం చూడనవసరం లేదు. ఎందుకంటే ఆ మంచి రోజు వచ్చేటప్పటికి మీరు ఈ విషయం మర్చిపోతారు. మీరు వెంటనే ఈ విషయాన్ని మీ అంతరంగంలో నింపుకొని అది విన్నప్పటి నుండి సాధన మొదలు పెట్టాలి.

దానికి మొదట మెట్టు ఏమిటంటే, మీరు రోడ్డు మీద నడిచేటప్పుడు ప్రకృతిని నిందించటం, పాడుచేయటం చేయకూడదు. అలాగే మీ ఇంట్లో కూడా. మీలో చాలా మంది నడుస్తూ చెట్టు ఆకులు, కొమ్మలు, పూలు తెంపుతారు. దీనిని మీరు

చేయటం చేతన స్థితిలో ఆపివేయాలి. వీటివైపు ఎక్కువ వాస్తవిక దృష్టితో, ప్రేమతో చూడటం మొదలు పెట్టండి. మీరు ప్రకృతిని ప్రేమతో దగ్గరికి తీసుకోండి. దానితో మీలో అసూయ పోయి, సంతోషం, ఎదుటివారిని మెచ్చుకోవటం అనే లక్షణాలు వస్తాయి.

మీరు ఈ విధంగా గురువులు చెప్పే విషయాలు మర్చిపోకుండా ఉండగలరు కానీ మీరు ఏంచేస్తారు ? మీరు ఇక్కడికి వస్తారు. నేను చెప్పేదంతా వింటారు. నాపుస్తకాలు కొన్ని కొనుక్కొని చదువుతారు. నన్ను చాలా గొప్పగా మాట్లాడారు అని పొగుడుతారు. మర్చిపోతారు. లేదంటే మీరు నా ప్రవచనాలు, ప్రసంగాలు వినమని వేరేవారికి చెబుతారు. మీరు వెనక్కి వెళ్ళి మీ పాత పనులతో బిజీ అయిపోతారు. అప్పుడు ఏం చేయాలి ? అర్ధం చేసుకోండి : మీరు నేను చెప్పే విషయాలు ఇతరులకి బోధించకండి. మీరు మీ జీవితంలో ఉపయోగించండి.

ఒక చిన్న కథ :

ఒక వ్యక్తి శెలవలు గడపటానికి ఆఫ్రికా వెళ్ళాడు. ఒక రోజు అతను ఇంటి వెనుక భాగంలో నడుస్తుండగా ఒక సింహం అతని మీదకి దూక బోతుంది. వెంటనే అతను నీళ్ళలోకి తటాలుగా మునిగాడు. సింహం అక్కడే ఉన్న ఒక చెట్లగుబురు దగ్గరికి వెళ్ళింది. మర్నాడు కూడా అతను నడుస్తుండగా సింహం వస్తే అతను నీళ్ళలో మునిగాడు. అది చెట్ల గుబురు దగ్గరికి వెళ్ళింది. మూడవ రోజు ఆ వ్యక్తి ఇంటి కిటికీలోంచి చూస్తుంటూ ఆ చెట్ల గుబురు సింహం చిన్న చిన్నగా గెంకటం ప్రాక్టీసు చేస్తూ కన్పిస్తుంది.

చూడండి. మీరు సంపాదించిన జ్ఞానాన్ని మీ జీవితానికి ఉపయోగించుకుంటే మీరు వృద్ధిలోనికి వస్తారు. అలా కాకుండా జ్ఞానాన్ని పోగుచేసుకుంటే అది ఉపయోగం లేనిపని. అలా జ్ఞానాన్ని పోగుచేసుకుంటే మీ జ్ఞాన శక్తి పెరుగుతుంది. కానీ మీ వ్యక్తిత్వం కాదు.

మీరు సంపాదించిన జ్ఞానాన్ని మీ అంతరంగంలోని మిమ్ములని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగించాలి. లేకపోతే మీరు ఒక నడుస్తున్న గ్రంథాలయం మాత్రమే. నేను కొంత మందిని చూస్తుంటాను. వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదువుతారు, చాలా ఉపన్యాసాలు వింటారు ; అన్ని విషయాలు అనర్గళంగా మాట్లాడతారు. కానీ ఆ విషయాలను ఉపయోగించే స్థితికి వచ్చే సరికి వాళ్ళలో ఏమీ ఉండవు. వాళ్ళు కేవలం వేరే వాళ్ళు చూసుకోవటానికి పనికి వచ్చే రెఫరెన్సు గ్రంథాలు మాత్రమే. వాళ్ళూ చదువుతారు కానీ జీర్ణించుకోలేరు. వేరే వారి దగ్గర మొత్తం చెబుతారు అంతే దీని వలన ఉపయోగం ఏమిటి?

మీరు ఎప్పుడైతే వాస్తవంలో, తెలుసుకునే స్థితిలో అభివృద్ధి సాధించుతారో, అప్పుడు మీకు మీరు సహాయం చేసుకుంటారు. ఇతరులకి కూడా సహాయం చేస్తారు. మీరు వినేవి, చదివేవి ప్రయోగాత్మకంగా అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ విన్న విషయాలని బయట ప్రపంచపు ఉపయోగాలు కోసం కాదు. వీటిని మీ అంతరంగంలో తెలుసుకోగల నేర్పుని తేవటానికి దానితో బయట ప్రపంచం అంటే ఒక మాయ ఒక భ్రమ అని అర్థం చేసుకోవటానికి అలాగే మీకు కావలసినవన్నీ మీలోనే మీకు దొరుకుతాయి అని మీరు అర్థం చేసుకోవటానికి, అలాగే మీకు కావలసినవన్నీ మీలోనే మీకు దొరుకుతాయి అని మీరు అర్థం చేసుకోవటానికి వీటిని ఉపయోగించండి. అప్పుడు మీరు బయట ప్రపంచంలో సాధించిన మైలు రాళ్ళన్నీ కేవలం కొన్ని సంఘటనలు మాత్రమే అని మీకు తెలుస్తుంది.

మీరు గురువులు చెప్పేటప్పుడు వాటిని గ్రహించి, మీరు మీలోపల అలవాటుగా చేసుకోవాలి. గురువుల ఎప్పుడూ నిజాలే మాట్లాడతారు.

ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద అడవిలోనికి మీరు అన్వేషణ, పరిశోధన చేయాలని సంకల్పించి మీ మెదడు అనే చిన్న దీపం సహాయంతో వెళతాడు. మీకు ఆ చిన్నన దీపపు కాంతిలో కేవలం మీ ముందు ఉన్న కొన్ని అడుగుల స్థలం మాత్రమే కనబడుతుంది. మీరు దానినే సత్యం అని అనుకుంటారు. శాస్త్రజ్ఞులు చేసేది ఇదే.

వాళ్ళు ఏవో నాలుగు అడుగులు చేసి వచ్చి ఈ రోజు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. మళ్ళీ కొన్నాళ్ళు తరువాత ఇంకా కొన్ని అడుగులు ముందుకు వెళ్ళి అదే చిన్న దీపంతో మరి కొన్ని అడుగులు చూసి ఇప్పుడు మరి కొంత కనుకున్నాం అంటారు.

వాళ్ళు అంతకు ముందు చెప్పిన సిద్ధాంతం తప్పు అని దానిని తీసివేసి ఈ కొత్త సత్యాన్ని మరొక సిద్ధాంతంలా చూపిస్తారు.

స్పష్టంగా తెలుసుకోండి. నిన్న నిజమయింది ఇవాళ నిజం కాదు అంటే, అది నిన్న కూడా నిజం కాదు అని అర్థం. అది సరే, వాళ్ళు ఈ విధంగా ఒక పెద్ద అరణ్యాన్ని తమ మైండ్‌తో అన్వేషిస్తున్నారు. దానిని పరిశోధిస్తున్నారు.

ఒకసారి ఇలా ఊహించండి. అక్కడ ఒక పెద్ద మెరపు మెరిసి అడవి అంతా మెరుపు వెలుగులో స్పష్టంగా కనిపించిందనుకోండి. అప్పుడు మీకు అడవి మొత్తం కనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ అడవిలోనికి ఎక్కడికైనా వెళ్ళగలరు. ఎప్పుడ ఏది అవసరమైన దాని గురించి వివరాలు చెప్పగలరు.

జ్ఞానోదయమేంటే ఇదే. అంత పెద్ద అరణ్యాన్ని ఒక్క మెరపు లాంటి వెలుగులో చూడగలగటమే. అది జరిగినప్పుడు మీరు సమస్తం తెలుసుకోగలుగుతారు.

అందుకే ఒక గురువుకి సత్యం గోచరించే విషయం మరొక గురువుకి కూడా సత్యమే అవుతుంది. వాళ్ళు వివరించే పద్ధతి వేరుగా ఉండవచ్చు. కాని వారి అనుభవం మాత్రం ఒక్కటే. అనుభవంతో మీరు ఇది తెలుసుకోగలరు. ఒక్కొక్కసారి తెలుసుకోలేరు. కూడా మీరు మీ వివేకంతో జవాబులు చెప్పటానికి ప్రయత్నించితే, మీరు వేదాంతాన్ని సృషించుతారు అంతే కాబట్టి దానిని వేదాంతం చేయవద్దు. మీరు అర్థం చేసుకున్న విషయాన్ని ఒక అనుభవంగా మార్చటానికి ప్రయత్నించండి.

ఇండియాలో టీ షాపుల దగ్గర మామూలుగా కనిపించే ఒకసీను ఉంటుంది. అక్కడికి రోజూ వచ్చే ఒకరు లేదా కొందరు వ్యక్తులు ప్రపంచంలోని గొప్ప వేదాంతాలన్నీ చర్చిించుతారు. వాళ్ళు దేవుళ్ళ గురించి యోగులు గురువుల గురించి రాజకీయ నాయకుల గురించి ఎంత బాగా చర్చిించుతారంటే ఆ విషయాలన్నీ వాళ్ళకి పూర్తిగా జీర్ణమయ్యేలా చర్చిించుతారు. వారి వారి ఊళ్ళో జరిగే ఘోరాలు, ప్రమాదాలు అన్ని చర్చిించుతారు. క్రమశిక్షణ పద్ధతి లేవు అని ప్రపంచాన్నంతా వాళ్ళ ముందుకి తెచ్చేస్తారు ఇదంతా మాట్లాడేసి ఆ వ్యక్తి టీ తాగటం పూర్తిచేసి టీకి డబ్బులు రేపు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు.

ఏ వ్యక్తి అయితే తాను తాగిన టీకి డబ్బులు కూడా కట్టలేడో, ఆ వ్యక్తి టీ షాపు బెంచి మీద కూర్చొని పేపరు మొదటి లైను నుంచి చివరి వరకూ చదివి, అతను చదివిన ప్రతి విషయం మీద తన తీర్పుని ప్రకటిస్తాడు. తన అభిప్రాయాలని చెబుతాడు. ఆ పేపరు ఎడిటర్ కూడా పేపరుని అంత క్షుణ్ణంగా చదివి వుండడు.

వాళ్ళు ఆ టీ షాపు బెంచీల మీద ఎంత సమయం వృధా చేస్తారంటే, వాళ్ళు అక్కడ ఉన్న సమయానికి టేబుళ్ళు అరిగిపోవచ్చు. వాళ్ళు అంత సమయాన్ని కేవలం అలాగే గడిపేస్తారు. వాళ్ళు కనీసం ఒక్క నిముషామైనా ఏదైనా సాధించటానికి ఉపయోగించరు.

కాబట్టి మీరు కనీసం నేను చెప్పే విషయాలని మీ అంతరంగంలోనికి తీసుకుని నేను చెప్పే విషయాల వెనుక ఉన్న సత్యాన్ని అర్ధం చేసుకొని అనుభూతి పొందటం ప్రారంభించండి. పతంజలి ఈ విధంగా చెబుతారు: “ఇవాళ మీరు 5 అంగుళాలు వంగగలిగితే రేపు అర అంగుళం ఒంగటానికి ప్రయత్నించండి” అని. ఈ విధంగా మీరు సత్యాన్ని తెలుసుకోవటానికి, నేను మీకు చెప్పే నిజాల అనుభూతిని పొందటానికి స్థిరంగా పని చేయండి. లేకపోతే మీరు కూడా ఆ టీ షాపులో వారిలాగానే ఉంటారు. వాళ్లు బెంచీలని అరగ దీస్తారు. మీరు ఇక్కడ ఉన్న కార్పెట్లకి చిల్లులు చేస్తారు. అంతే.

విజ్ఞానదాయకమైన, వివేకస్పూర్తిగల ఉపన్యాసాలు వినేటప్పుడు మనలో చాలా మంది ఈ విషయాలన్నీ నా స్నేహితులకి, లేదా నా బంధువులు ఎవరైతే అదే ఉపన్యాసం వింటుంటారో వాళ్ళకి చాలా చక్కగా సరిపోతాయి అని అనుకుంటారు. అదే పెద్ద సమస్య. వీటిని వారికి అన్వయించి, వాళ్ళకి తప్పకుండా ఇందులో సందేశం చేరి ఉంటుంది అని అనుకుంటారు. ఇలా చేయటం వలన అసలు సందేశాన్ని మీరు వినకుండా మిస్ అవుతున్నారు. అంతే, మీకు మరొకసారి చెబుతున్నాను. నేను మీ కోసం మాట్లాడుతున్నాను. నేను చెప్పేది కేవలం మీకు మాత్రమే. హాలులో వెయ్యిమంది ఉన్నా నేను చెప్పేది మీకు మాత్రమే. దయచేసి ఈ విషయాన్ని అర్థ చేసుకోండి.

నేను చెప్పే ప్రతీ మాట నేను మీ కోసం ఇచ్చే శక్తిని మీ దగ్గరకి మోసుకు వస్తుంది. కాబట్టి అటువంటి భావనలతో, మైండ్‌తో నా ఉపన్యాసాలు వినవద్దు. ముఖ్యంగా నా ఉపన్యాసాలకి భార్యా భర్తా ఇద్దరూ వచ్చినపుడు. నేను వాళ్ళ నిత్య జీవితానికి సంబంధించి ఏ విషయమైనా చెప్పాననుకోండి. వెంటనే భర్త, "నా భర్త ఈ విషయం తప్పకుండా వినాలి” అనుకుంటుంది. భర్త కూడా, “ఈ విషయం నా భార్య తప్పకుండా వినాలి” అని అనుకుంటాడు. చివరికి ఇద్దరూ వినరు.

మనిషికి ఉన్న మరో సహజ లక్షణం డబ్బుని, వస్తువులని పోగుచేసుకోవటం. ఏదో ఒక రోజు అతను తప్పకుండా తెలుసుకునే విషయం, “డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి” అని. అప్పుడు ఐశ్వర్యం కూడబెట్టటం తగ్గించేస్తాడు. అప్పుడు అతను జ్ఞానాన్ని, మాటలని పోగు చేయటం మొదలు పెడతాడు. ఎందుకోగాని ఈ పోగుచేసే కార్యక్రమం మాత్రం ఆగదు. అతను ఈ మాటలు పోగుచేయటంలో మహా ఆశపరుడిగా తయారయ్యి మాటల మీద మాటలు పోగు చేసుకుంటాడు.

ఎవరైతే ఆస్తిని, మాటలని పోగుచేయటం మానేస్తాడో అతను నిజమైన జ్ఞానం కోసం వెతుకుతాడు. మనం కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు వేస్తాము. అవి నిజంగా ఏదో తెలుసుకోవాలని కాదు. కేవలం మరికొన్ని మాటలు పోగుచేసుకోవాలనే అత్యాశతో. ఎందుకంటే మాకు చాలా విషయాలు తెలుసు అని చెప్పుకోవటానికి.

మీరు బాగా లోతుగా మీ అంతరంగంలోనికి చూడగలిగితే, ఒకే ఒక ప్రశ్న వస్తుంది. అదే నిజమైన, మీకు కావలసిన ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు దొరికితే మీకు జ్ఞానోదయమయినట్టే.

ఒక వ్యక్తి నన్ను, “స్వామీ, భగవంతుడు అంటే ఏమిటి?” అని అడిగాడు. నేను మెల్లగా టాపిక్ మార్చి వేరే విషయాలు అతనితో రెండుగంటలు మాట్లాడాను. ఆ రెండు గంటలలో అతను ఒక్కసారి కూడా ఆ ప్రశ్నని మరలా అడగలేదు.

చివరికి అతనితో నేను ఇలా అన్నాను. “అయ్యా! మీరు రాగానే నన్ను ఒక ప్రశ్న అడిగారు. దానికి నేను జవాబు ఇవ్వలేదు ఎందుకంటే అది మీ అంతరంగం నుంచి రాలేదు కాబట్టి.” ఒక ప్రశ్న మన అంతరంగం లోపలి నుంచి వస్తే, దానికి తృప్తికరమైన జవాబు వచ్చే వరకు మరలా నన్ను జవాబు ఇమ్మని అడుగుతారు. కాని వీళ్ళు కేవలం నా దగ్గర నుంచి కొన్ని అనుబంధపు పదాలు పోగుచేసుకోవటానికి జవాబు అడుగుతారు, అంతే,

ప్రశ్నలు అనేవి పదాలని పోగుచేసుకోవటానికి, వాటిని లోపల నిల్వచేయటానికి పడే పాట్లు మాత్రమే. ఇలా చాలా పదాలని పోగుచేసుకొని, మన గురించి మనం చాలా గొప్పవాళ్ళము అని అనుకుంటాము. కానీ అలా చేయటం వలన మనం గొప్ప సత్యాన్ని మిస్ అయిపోతున్నాము. మనం నిజాలని గ్రహించటం కంటే కూడా మాటలని పోగుచేసుకోవటానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తున్నాము. ఈ విధంగా మనం గురువుగారిని ఆయన అసలు సందేశాన్ని మిస్ అవుతున్నాము. అలాగే ఆయన మాటల వెనుక ఉన్న శక్తిని పోగొట్టుకుంటున్నాము.

కొంతమంది నన్ను అడుగుతుంటారు, "స్వామీజీ! మేము పోల్చుకోవటం మానేస్తే అప్పుడు అది సర్వ పరిత్యాగం అవుతుంది కదా! అప్పుడు మేము కూడా ఆధ్యాత్మిక యోగులు అయిపోతామా?

నేను ఎప్పుడయితే పోలికలు వద్దు, పోటీ పరుగులో పరిగెత్త వద్దు అని చెప్పాననుకోండి. వెంటనే చాలా మంది నన్ను ఇలానే అడుగుతారు. నేను వాళ్ళని ఈ ప్రాపంచిక విషయాల నుంచి వెళ్ళిపోయి ఆధ్యాత్మికంగా అయిపోమంటానను కుంటారు. ముఖ్యంగా నేను విశుద్ధి చక్రం గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఈ విధంగా అనుకుంటారు.

చూడండి ఆధ్యాత్మికత లేదా సన్యాసం అంటే అన్నీ వదిలివేయటం కాదు. ఇది చాలా లోతుగా వాస్తవాలని తెలుసుకోవటమే. ఎప్పుడయితే అలా తెలుసుకుంటామో అప్రయత్నంగా మనలోని కోరిలు తగ్గిపోయి కేవలం ప్రాథమిక అవసరాలు మాత్రమే మనలో ఉంటాయి. అంటే మనలో ఉండే పిచ్చి కోరికలు పోయి అవసరాలు మాత్రమే ఉంటాయి. అవి మీకు ఆ అవసరాలు తీర్చ గలిగే శక్తిని ఇస్తాయి. తరువాత మీ లోపలికి మీరు చూడగలుగుతారు.

బయట ప్రపంచంలో మీరు చేయవలసిన పనులు చేయాలి. దానిలో అనుమానం లేదు. మీరు జీవించటానికి సంపాదించాలి. వాటికి సంబంధించిన విషయాలను చూడాలి. మీ శరీరంలోని ప్రాణాన్ని కాపాడుకోవాలి. అయితే నేను చెప్పేది ఏమిటంటే మీరు చేసే ప్రతి దానిలోనికి తెలుసుకునే తత్వాన్ని నింపండి. దీనివలన మీరు ఈ ప్రపంచంలో అనవసరమయిన విషయాలలో చిక్కుకోరు. అవి అన్నీ మాయమవుతాయి. మీరు ప్రతి దానిని స్పష్టంగా సాధించుతూ అర్ధవంతమైన జీవితాన్ని గడపవచ్చు..

అన్ని రకాల ఊహలు, అప్పు తెచ్చుకున్న కోరికలు, మీ లోపలికి పంపబడిన భయాలు. అన్నిరకాల అసూయలు, పోలికలు, అత్యాశ, అతి కోరిక, అవన్నీ కూడా శాశ్వతానందంగా రూపాంతరం చెందుతాయి. ఇవన్నీ కూడా మీరు అనంతమైన, పరమానందమయిన శక్తిగా మారుతాయి.

ఒక చిన్న కథ :

ఒక గురువు ఆయన శిష్యులతో నడిచి నది ఒడ్డుకు వచ్చారు. ఒక శిష్యుడు గురువుని ఇలా అడిగాడు, “గురుదేవా! ఇప్పుడు మనం ఈ నదిని దాటాలా?” అని.

దానికి గురువుగారు నెమ్మదిగా ప్రశాంతంగా ఇలా జవాబు ఇస్తారు. “అవును. మనం దాటాలి. మీరు దాటేటప్పుడు జాగ్రత్త. కాళ్ళకి తడి అంటకుండా చూసుకోండి”.

శిష్యుడికి గురువుగారి మాటలు అర్ధం కాలేదు. గురువు వాళ్ళకి ఏమి చెప్పటానికి ప్రయత్నిస్తున్నారంటే, ఆధ్యాత్మికత అంటే; జీవితం అనే సముద్రాన్ని దాటేటప్పుడు మీ పాదాలకు తడి అంటనివ్వకండి అని. ఇదంతా కూడా ఎలా ఉండాలంటే, సరస్సులో ఉంటే పద్మం నిండా మునిగి కూడా ఒక్క బొట్టు నీటిని కూడా తనకి అంటనివ్వదు. ఆధ్యాత్మికత అంటే ప్రపంచపు విషయాలనుంచి పారిపోవటం కాదు. దీనిని స్పష్టంగా అర్ధం చేసుకోండి.

ఆధ్యాత్మికత అంటే జీవితపు సాంకేతిక సూత్రము. మీకు కాలేజీలలో చాలా ఇంజనీరింగు పద్ధతులు నేర్పించుతారు. అవన్నీ కూడా మీ మెదళ్ళని అమ్మి మీరు తెచ్చుకునే సర్టిఫికేట్లు. కానీ జీవితపు ఇంజనీరింగ్ మాత్రం అందరికీ నేర్పవలసిన శాస్త్రం. ఆధ్యాత్మికత అనేది మనం పరమహంసలా, అనుభవసిద్ధమయిన ఒక సిద్ధిలా. ఈ భౌతిక ప్రపంచంలో బ్రతకటం నేర్పిస్తుంది. ఈ భౌతిక ప్రపంచం అనే సరస్సులో గొంతుక వరకూ మునిగినా, ఒక్క నీటి బొట్టు కూడా మిమ్మలని అంటకుండా జీవించటం నేర్పిస్తుంది.

ఆధ్యాత్మికత ఏ వ్యక్తికి కాని, ఎవరి సంపదలకి కానీ ఎటువంటి హాని జరగకుండా పరిపూర్ణమైన సాఫల్యంతో నిండిన జీవితాన్ని మీకు నేర్పిస్తుంది. ఇది మీకు తెలివి తేటల నుండి నిన్ను నీవు ఎలా సంబంధం లేకుండా ఉండాలో, నేర్పుతుంది.

విశాలంగా విప్పారిన కళ్ళతో ఈ అనంత చైతన్యం యొక్క అద్భుతాలను అమాయకంగా చూడటం నేర్పుతుంది. మీలో భ్రమలు, కల్పనలు, పోలికలు, అసూయ, కోరికలు, అత్యాశ అనే మాయలు కమ్ముకుండా నేర్పిస్తుంది. ఈ అనంత చైతన్య సృష్టి లయలకి అనుగుణంగా ఎలా సాగిపోవాలో చూపిస్తుంది. మీ అంతరంగంలో పొంగిపొర్లే మహదానందానికి అనుగుణంగా, అప్రయత్నంగా జరిగే విషయాల శక్తిని మీకు అనుభవం కలిగేలా నేర్పిస్తుంది.

ఆధ్యాత్మికత మీకు ప్రతి క్షణం ఆరాధనతో, కృతజ్ఞతతో ఉంటూ ఈ అనంత సృష్టి మీపై కురిపించే ప్రేమామృతాలని, అద్భుత వరాలని తీసుకోగలిగే స్థితిలో ఉండటం నేర్పుతుంది. అది మిమ్ములను మీ అంతరంగంలోపలి నుండి పొందే అద్భుత ఆనందాన్ని ప్రతి క్షణం అనుభవించేలా చేస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ప్రపంచంలో మీ ఆనందం కోసం చూడనవసరం లేకుండా చేస్తుంది. మీ భావావేశాలతో ఎటువంటి అవసరం లేకుండా చూస్తుంది. మీకు మీ జీవితంలో ప్రతి క్షణం ఒక ఉత్సవంలా చేసుకోవటం నేర్పుతుంది. ఆ ఉత్సవానికి కారణాలని చూడనవసరం లేకుండా ఉండేలా నేర్పిస్తుంది.

మీ అంతరంగంలో వివేకపు వెలుగులు తెస్తుంది. ఆ తెలివి తేటలతో మీరు బయట ప్రపంచంలోని పనులని అత్యంత సామర్థ్యంతో చేసుకోగలుగుతారు. అది మీ లోపల తెలుసుకోగలిగే జాగ్రధావస్థని మేలుకొలుపుతుంది. మిమ్మలని మీ చేతన స్థితిలోపలికి తీసుకు వెళుతుంది. ఇది మిమ్ములని కోరిక నుంచి ప్రేమకి ; బాధల నుండి అద్భుతాలకి ; అబద్ధాల నుండి నిజంవైపుకి ; క్షోభనుండి అనంత నిత్య ఆనందం వైపుకి తీసుకు వెళుతుంది.

మరొక విషయం : చాలా మంది అనుకుంటారు. ఆధ్యాత్మికత కోసం వేరే సమయాన్ని కేటాయించాలి కాబోలు అని. అసలు అవసరం లేదు. నేను చెప్పిన దానిని బట్టి మీకు ఆ అవసరం లేదు. ఎవరయినా మీతో దీని కోసం వేరే సమయాన్ని కేటాయించాలి అని అంటే, వాళ్ళు ఆధ్యాత్మికమైన వారు కాదు, కేవలం మత ప్రేమికులు మాత్రమే, అర్థం చేసుకోండి.

మతానికి వేరే సమయం కావాలి, ఎందుకంటే పూజలు, జపాలు చేయాలి కాబట్టి. ఆధ్యాత్మికతకి అలా అవసరం లేదు. దానికి కొంత పరిమాణం గల సమయం అవసరం లేదు. అది మీ జీవితం యొక్క నాణ్యతని మాత్రమే కోరుతుంది. మీరు నిష్కపటంగా సత్యాన్వేషకులయితే చాలు. అప్పుడు మీరు ప్రతి పనీనీ ఒక ధ్యానంలా చేస్తారు. మీ సమయాన్నంతా వీటికే కేటాయించవచ్చు. అలాగే మీరు సాధించాలనుకున్నది సాధించగలుగుతారు. మీ లోపల శక్తి వాహినికి ఎటువంటి అసూయ, కోపం, పోలిక అనే అడ్డంకులు ఉండవు.

మీరు ఎటువంటి పరిస్థితిలోనైనా తేలికగా ఇమిడిపోగలుగుతారు. మీరు ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నట్టే ఉండగలుగుతారు. మీరు ఎవరితోనైనా సౌకర్యంగా ఉండగలుగుతారు. మీ భౌతిక, మానసిక నిర్బంధాల నుండి స్వేచ్ఛని పొందుతారు. ఈ అనంత చైతన్యపు సృష్టిలో కరిగిపోయి అందులో ఒక భాగమైపోతారు.

కానీ అసలు సమస్య ఏమిటంటే అందరూ పూజలు, వ్రతాలు చేసి తృప్తి పడతారు. అలా చేసి ఆనందపడటంలో వాళ్ళకి కొంత భద్రత ఉన్నది. ఈ పూజలు, హోమాల వెనుక గల శాస్త్రం అసలు ఎవరికీ తెలియదు. కాకపోతే అవి వారి అహంకారాన్ని తృప్తిపరుస్తాయి. ఇవన్నీ చాలా కష్టమయిన పనులు అయినా వాళ్ళు వాటినే ఒక సవాలుగా తీసుకుని మరీ ఈ పూజలూ, వ్రతాలు చేస్తారు.

నా దగ్గరికి చాలా మంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి పరిష్కారం అడుగుతారు. నేను వాళ్ళకి నేను చూచుకుంటాను. మీరు ఆశ్రమంలో ఉండే మర్రిచెట్టు దగ్గర కూర్చోమని చెబుతాను. అదంతా ఒక పెద్ద శక్తి ప్రదేశం. కానీ వాళ్ళు అలా చేయటానికి సంతోషంగా ఒప్పుకోరు. వాళ్ళు నన్ను ఏం పూజలు చేయమంటారు. అని అడుగుతారు.

నేను వాళ్ళతో ఆ మర్రిచెట్టు చుట్టూ 108 ప్రదక్షణలు చేయండి అని అంటే చాలా సంతోషపడతారు. అలాగే చేస్తారు. అలా చేయటం వలన వారిలోని అహం తృప్తిపడుతుంది. నేను 108 సార్లు తిరిగి చాలా కష్టపడ్డాను. కాబట్టి నాకు ఏదో మంచి జరుగుతుంది అని, మతానికి సంబంధించి మన మైండ్ని అలా తయారుచేసేసారు.

ఈ మతము, దానికి సంబంధించిన పూజల విషయంలో కూడా మళ్ళీ పోటీ ఉంటుంది. ఎదుటి వాళ్లు ఒక గుడిలో ఏదైనా ప్రత్యేకమైన పూజ గాని, వ్రతంగాని చేస్తే, వీళ్ళు కూడా అదే గుడిలో అలాంటి పూజలు వ్రతాలు చేస్తారు. అలా చేసేటప్పుడు వారి ఏకాగ్రత గుడిలోని దేవుని విగ్రహం మీద ఉంటుందా ? లేకపోతే ఎదురింటి వారి మీద ఉంటుందా ? దాంతో ఇలా పూజలు చేయటంలోని అసలు సత్యాన్ని పూర్తిగా పోగొట్టుకుంటారు. అలాగే కొంతమంది చాలా గర్వంగా వాళ్లు తిరిగిన ముఖ్యమైన దేవాలయాల గురించి, ఆయా ఊర్ల గురించి అందరికీ చెబుతారు. దాంతో అది విన్న వాళ్ళు, వాళ్ళు కూడా ఎలా అయినా ఆ ఊళ్ళన్నీ తిరగాలి, వాళ్ళ కంటే ఎక్కువ సాధించాలి అనుకుంటారు.

ఇవన్నీ తిరిగి వచ్చే సరికి వాళ్ళ అహంకారం ఇంకాస్త గట్టిపడిపోతుంది. అప్పుడు విశుద్ధి చక్రం ఇంకా బంధింపబడుతుంది. మీరు ఎప్పుడయినా దానిని గురించి ఆలోచించారా ? ఇటువంటివన్నీ మనం ఎందుకు చేస్తాం ? మన అంతరంగంలోని మన సూక్ష్మ ప్రపంచం విశాలమవటానికి; పోలిక ; అసూయ అనే వాటి నుండి స్వేచ్ఛ పొందటానికి. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి ? మీరు అసలైన పాయింట్ మళ్ళీ మళ్ళీ మిస్ అయిపోతున్నారు. మళ్ళీ కూడా బయట ప్రపంచం కోసం అన్నీ చేస్తున్నారు.

నేను చాలా మందిని చూస్తుంటాను. విగ్రహం ముందు స్తోత్రాలు, అష్టోత్తరాలు చదువుతారు. కొన్ని లైన్లు చదువుతారు. వాళ్ళకి తను చేయవలసిన పని చేసానా లేదా అనుమానం వస్తుంది. చేసాలే అనుకుంటారు. మరికొన్ని లైన్లు చదువుతారు.

ఇంకా ఎన్ని పేజీలు చదవాలో చూసుకుంటారు. ఈ విధంగా వాళ్ళు భగవంతునితో బంధం ఏర్పరుచుకుంటారు. చివరికి మొత్తం చదివేసాను అని తృప్తి పడతారు.

దీని కంటే ఇంకా ముఖ్యమైంది వాళ్ళకి ఇంకొకటి ఉంది. ఇలా 21 రోజులు చేస్తారు. ఎందుకంటే 21 రోజులు అలా చదువుతాము అని మొక్కుకుంటారు. అలా పూర్తి చేశాక వాళ్ళు గర్వంగా అందరికీ 21 రోజులు పూర్తి చేసినట్లు చెప్పుకుంటారు.

మనం చేసే చాలా పనులు కేవలం అందరికీ ఇలా చేసాము అని చెప్పుకోవటానికే. ఇలా చెప్పటం వలన మనం వారిలో పోలికకి విత్తనం నాటుతాము.

చూడండి, పూజలు, వ్రతాలు చేయాలంటే వాటిలో నిమగ్నమై నిజాయితీగా, మన పూర్వంగా చేయాలి. ఈ అనంత సృష్టితో లోతైన గాఢమైన బంధంతో చేయాలి. అలా చేసినప్పుడు మీరు ఎవరికీ చెప్పరు.

ఎప్పుడయితే ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే ఈ దారిలో మీరు వెళ్ళాలి అని అనుకుంటే నిబద్ధత, నిష్కపటము, మనస్ఫూర్తిగా ఆపనిలో నిమగ్నమవటం అనేవి మీ ప్రాధాన్యతా అంశాలు కావాలి. కాబట్టి మనస్ఫూర్తిగా చేయండి. ఇలా మతపరమైన ఆచారక్రియలు ఈ రోజులలో చాలా ఉన్నాయి. వీటిల్లో దేనిని అనుసరించాలి అని ఆందోళన పడవద్దు. ఏదో ఒక దానిని ఎంచుకుని నిబద్ధతతో, కట్టుబాటుతో నిష్కపటంగా దానిని ఆచరించండి. మీలోని నిష్కపటం, నిబద్ధత మీకు ఫలితాలని ఇస్తాయి. అంతే కానీ మీరు చేసే మాతాచార పూజలు కాదు.

మరొక విషయం : వెంటనే ఫలితాలు రావాలని చూడకండి. ఈ రోజుల్లో అందరికీ తక్షణమే కనపడే ఫలితాలు కావాలి. ఇన్స్టంట్ టీ, కాఫీ లాగా వెంటనే విషయాలు ఫలితాలనిచ్చేయాలి. చాలా మంది అనుకుంటుంటారు. ఎదుటి వారి పూజలకి త్వరగా ఫలితాలు వచ్చాయి. కానీ నాకు రాలేదు అని. అలా అనుకుని ఈ పద్ధతి నుంచి మరో పద్ధతికి మారతారు. ఇదంతా నిరర్థకమైన పిచ్చిపని. పూజలు,

ఆరాధనలలో కూడా పోలికలే. మీరు చేసే పని నిబద్ధతతో, నమ్మకంతో చేయండి. మిగతా విషయాలు వదిలివేయండి. జరగవలసినవి వాటంతట అవే జరుగుతాయి.

మీరు ఈ ఆచార, సాంప్రదాయ పూజలు చేసేటప్పుడు అందులో ఉండే అసలు శాస్త్రాన్ని అర్థ చేసుకొనండి. అప్పుడు మీ మైండ్ దానికి అనుగుణంగా ఆ ఆరాధనలో నిమగ్నమవుతుంది. లేకపోతే కేవలం యాంత్రికగా పూజలో పనులు చేసుకుళ్ళటంలోనే చిక్కుకుపోతారు. ఏ మతానికైనా, ఏ ఆచార వ్యవహారాలకైన చివరి లక్ష్యం ఈ అనంత చైతన్య సృష్టితో మమేకమవ్వడమే. ఆ సృష్టికి అనుగుణంగా సాగిపోవటమే. ఈ విషయాన్ని మీరు కచ్చితంగా అర్థం చేసుకోవాలి.

పూజలు భగవతునితో వ్యవహారాలు నడిపే లంచాలు కాదు. అవి మిమ్ములని మీరు రక్షించుకోవటానికి సృష్టించుకున్న బ్యాంక్ బ్యాలెన్స్లు కావు. ఇవి మీరు వేరే వారు ఎంత చేసారు అని పోల్చుకొని వాళ్లతో పోటీ పడే పోటీలు కావు. ముందు పోల్చుకోవటం,. పోటీపడటం ఆపేయండి. మీరు చేసే పని నిష్కపటంగా మనస్ఫూర్తిగా చేయటానికి ప్రయత్నించండి.

నాకు ఒక కథ గుర్తుకొస్తుంది.

ముగ్గురు వ్యక్తులు కలిసి వ్యాపారం మొదలుపెడతారు. వాళ్ళు భగవంతుని కూడా ఆ వ్యాపారంలో భాగస్వామిగా చేసుకుంటారు. వాళ్లు వచ్చే లాభాలలో ఒక శాతం భగవంతునికి ఇవ్వాలి అని నిర్ణయించుతారు.

వాళ్ళు వ్యాపారం ప్రారంభించుతారు. వాళ్ళకి చాలా లాభాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ సమస్య. అంత వాటా భగవంతునికి ఎలా ఇవ్వాలి అని. ఒక్కొక్కరూ ఒక్కొక్క సలహా ఇస్తారు.

వాళ్ళలో మొదటి వ్యక్తి : మనము ఒక వృత్తాన్ని గీద్దాము. డబ్బు మొత్త దాని మీద వేద్దాము. ఆ వృత్తంలో పడిన డబ్బు దేవుడికి ఇచ్చి బయటపడిన దానిని మనం పంచుకుందాము అంటాడు.

రెండవ వ్యక్తి ఇలా చెబుతారు : అలా కాదు. నేను ఇంకా మంచి సలహా ఇస్తాను. మనం చాలా పెద్ద వృత్తాన్ని గీద్దాము. డబ్బంతా అందులో వేద్దాము. లోపల పడిన డబ్బుని మనం తీసుకుందాం బయట పడిన దానిని దేవుడికి ఇద్దాము.

మూడవ వ్యక్తి ఇలా చెబుతాడు : చూడండి. నేను చెప్పేది విననండి. భగవంతుడు మన పైన ఉన్నాడు. మనం డబ్బుని పైకి విసురుదాము. ఎంత కావాలో ఆయన తీసుకుంటాడు. కిందికి వచ్చే డబ్బు మనం తీసుకుందా.

(అంతా పెద్ద నవ్వులు)

మనకి ఏదైనా అవసరం అయినప్పుడు మనం దేవుడికి లంచాలు ఇస్తామని చెబుతాము. ఆ కోరిక తీరగానే దేవుడిని మర్చిపోతాము,. మరలా ఏదైనా కోరిక రాగానే మనకి దేవుడు గుర్తుకువస్తాడు. మళ్ళీ లంచం ఇస్తామంటాము. ఇలా మనకి నేర్పించారు.

ప్రశ్న : స్వామీజీ! మీరు మతాచార ఆరాధనల విషయం చెబుతున్నారు కదా! మీరు మాకు పూజలు వ్రతాలు చేసే పద్ధతి, ధ్యానం చేసే పద్ధతి ఈ విషయాల మీద ఇంకొంచం వివరాలు చెబుతారా..

చూడండి. ఆచార సంబంధమైన పూజల విషయంలో కొంత కచ్చితమైన పద్ధతి, విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో నిర్మించబడ్డాయి. వీటి విషయంలో మీకు కచ్చితంగా ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి. ఎక్కడ చేయాలి, దేనికోసం చేయాలి అనే విషయాలు మీకు విపులంగా, వివరంగా చెప్పబడి ఉంటుంది. ఈ పూజలలోనికి మీరు ఒక వ్యక్తిగా వెళ్ళి ఆ వ్యక్తిగానే బయటకి వస్తారు. ఈ పద్ధతిలో పూర్తి భద్రత ఉంటుంది. అందుకే ఈ వ్యవహారాలు అంత విస్తృతంగా పాటించబడతాయి. ఏదైతే కచ్చితంగా ఉంటుందో అది విస్తృతంగా అందరి చేతా ఉపయోగింపబడుతుంది.

కానీ ధ్యానం విషయం అలా కాదు. ముందుగా, ఈ ధ్యానం చాలా తేలికగా చిన్న విషయంగా అనిపిస్తుంది. దాంతో ఫలితాలు తక్కువ అని అనిపిస్తుంది. కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఆశ్రమంలో ఈ పూజలు ఎందుకు చేస్తారు అని. అలా ఎందుకు చేస్తానంటే నేను విమ్ములని ఆశ్రమంకి వచ్చి మర్రిచెట్టు కింద కూర్చొని ధ్యానం చేయమంటే చేస్తారా? మాములుగా అయితే అది చాలు. కాని అలా వినరు.

నా దగ్గర దక్షిణామూర్తి విగ్రహం, నటరాజ విగ్రహం లేకపోతే, వాళ్లు చెట్టు కింద ఖాళీ ప్రదేశాన్నిని చూడటానికి వస్తారా? బహుశః నేను ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంటాను. అంతే.

అందరినీ వాళ్ల అంతరంగంలోనికి తీసుకెళ్లటానికి మొదటి మెట్టులా ఈ కష్టతరమైన పూజలు చేస్తాను. ఇవి వాళ్ళ మైండ్‌లో ఉండే విషయాలు. అలా చేయకపోతే వాళ్ళని నేను ఇక్కడికి రప్పించలేను. నేను వాళ్ళకి అర్ధం అవ్వాలి అంటే వాళ్ల భాషలోనే మాట్లాడాలి కదా!

వాళ్లు దక్షిణామూర్తి విగ్రహాన్ని చెట్టు కింద చూసి చాలా సంతోషపడిపోతారు. కానీ వాళ్ళు ఆ చెట్టు దగ్గరకి రాగానే ఆనందపరవశులవుతారు. ఎందుకంటే అక్కడ, ఆ చెట్టు దగ్గర ఉండేది ప్రాణ శక్తి. అక్కడ దక్షిణామూర్తి విగ్రహం లేకపోయినా ఆ శక్తి అలాగే ఉంటుంది. అక్కడి నిశ్శబ్దం ఆ ప్రాంతమంతా వెదజల్లబడి ఉంటుంది. మీరు ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే చాలు. మీరు కష్టమైన పూజలు చేయనవసరం లేదు. ఆ చెట్టులో ప్రతి ఆకు, ప్రతి కొమ్మా నాతో మాట్లాడతాయి.

మీరు విగ్రహాలన్ని పూజించేటప్పుడు మీరు ఈ మహాద్భుత సృష్టిని ఈ విగ్రహాలకి అనుసంధానంచేపి ఆ అనంత చైతన్యం యొక్క ఉనికిని చాలా లోతుగా తెలుసుకొని అప్పుడు పూజలు చేయాలి. అప్పుడు మీరు ఎటువంటి ప్రయత్నం లేకుండానే భగవంతుణ్ణి అని చోట్లా చూడగలుగుతారు. అప్పుడు మీకు ఇది కేవలం విగ్రహం కాదు. ఇది భగవంతుని తనలో నింపుకున్న అనంత మహాద్భుత చైతన్య సృష్టి అని మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు మీరు సర్వాంతర్యామితో మంచి బంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు.

ఇక ధ్యానం విషయానికి వస్తే : మీరు నిజంగా నిమగ్నమై ధ్యానం చేస్తే వచ్చే ఫలితం కచ్చితం కాదు. మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. మీరు పూర్తిగా కొత్త వ్యక్తిలా మార్పు చెందుతారు. ఇది చాలా పెద్ద అపాయంతో కూడిన సాహసంలా అనిపిస్తుంది. ఇది ఒక జూదంలా ఉంటుంది. మీలో మార్పు జరగటం ప్రారంభమవుతుంది. మీరు కోరుకునే మార్పు మీలో వస్తుంది. కానీ తీరా ఆ మార్పు ప్రారంభం కాగానే మీరు భయపడిపోతారు.

మీరు మీ పూజలలో ఉండే భద్రతలో సౌకర్యంగా ఇమిడిపోతారు. అవి మీ దైనందిన జీవితంలో ఒక భాగమయిపోతాయి. అవి మీరు అనుసరించే ప్రాణంలేని ఒక వృతంలో భాగమవుతాయి. ఎందుకో అవి మీకు తృప్తినిస్తాయి. మీరు ఎక్కడ ఉంటారో అక్కడే ఉండిపోతారు.

ధ్యానం చేసినప్పుడు మీలో స్థిరపడిపోయిన ఆదర్శాలు కొంత వరకూ కదిలిపోతాయి. అప్పుడు మీరు భయపడతారు. మీరు కొన్ని సంవత్సరాలుగా ఏర్పరచుకొన్న నమ్మకాలు అకస్మాత్తుగా కదిలిపోతాయి. మీరు తేలిక అయిన, తక్కువ నిబంధనలు ఉన్నటువంటి మార్గంలోనికి వస్తారు. అది మీకు భయాన్ని కలుగజేస్తుంది.

మీరు ధ్యానం చేస్తూ మీలో వాస్తవాన్ని తెలుసుకునే శక్తి వృద్ధి అవుతుంది. మీరు మీ అంతరంగంలో విషయాలను లోతుగా తెలుసుకోగలుగుతారు, అది జరిగినప్పుడు, మీ చుట్టూ మీరు, మీ సమాజం నిర్మించిన గోడలు కరిగిపోతాయి. అప్పుడు మీరు మీ అచేతన స్థితి మీద, మీ తెలివి లేని పరిస్థితి మీద తిరగబడతారు. సమాజం మీద కాదు. దీనితో మీరు ఈ పరిస్థితికి కారణాలని లోతుగా అన్వేషించుతారు. అది మీకు ఇంకా అభివృద్ధి పొందటానికి, మీరు ఇంకా విశాలమవటానికి చాలా దారులని తెరుస్తుంది.

ఈ విధంగా మీరు మీ అంతరంగంలోని ముఖ్య ప్రదేశం లోపలికి వెళ్ళగలుగుతారు. ఇంతకు ముందు ఎప్పుడూ మీరు అలా ఆ లోలోపలికి వెళ్లలేదు. ఆ ప్రదేశం గురించి సమాజానికి తెలియదు. ఆ ప్రదేశం మీలో ఎప్పటి నుంచో ఉన్నది కానీ దానిని మూసి వేసి తాళం వేయబడింది. ఆ తాళం తీయటానికి కావలసిన తాళం చెవి కోసమే మీరు ఎంతో కాలంగా అన్వేషిస్తున్నారు. కానీ ఆ విషయం మీకు తెలియదు. ఈ జన్మలోనే కాదు. ఇంతకుముందు ఎన్నో జన్మల నుంచీ మీకు తెలియదు. ఎప్పుడయితే మీర ఆ లోతులను కనుగొంటారో, ఆ ప్రదేశంలోనికి వెళ్ళగలుగుతారో మీరు వెళ్ళవలసిన చోటికి వెళ్ళినట్టే.

అది ఈ విధంగా ఉంటుంది.

ఒక ఆవుని ఒక కర్రకి తాడుతో కట్టి కొన్ని మీటర్ల పరిధిలో అది తిరిగేటట్టు తాడుని వదులుగా ఉంచుతారు. అది ఆ పరిధిలోనే తిరుగుతూ, కొంత వాస్తవం తెలుసుకొని తన తెలివితేటలతో పరిణితిని సాధిస్తుంది.

ఆ తరువాత ఆ తాడుని ఇంకాస్త వదులుతారు. ఆవు ఇంకా కొంచెం ఎక్కువ దూరం తిరగగలుగుతుంది, ఇంకాస్త తెలివి గలది అవుతుంది. అప్పుడు దాని తాడు ఇంకా వదులుతారు. దాంతో అది ఎక్కువ దూరం తిరగగలుగుతుంది. ఇలా ఆ ఆవు తాను పెంచుకునే తెలివితేటలు, తెలుసుకోగల శక్తి ఆధారంగా తాడుని వదులుతుంటారు. అలా కొంత కాలానికి దానికి పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది, మనుషులకి కూడా ఇలానే జరుగుతుంది. కట్టబడిన తాడు లేదా మీ చుట్టూ ఉన్న కంచె (గోడ) మీ చేతన వ్యవస్థ యొక్క పరిధికి సమానంగా ఉంటుంది. మీరు ఎప్పుడయితే ఎక్కువగా చేతన స్థితిలో ఉండగలరో, అంత స్వేచ్ఛని పొందగలుగుతారు, ఎంత స్వేచ్ఛని ఆనందించగలుగుతారో అంత ఎక్కువగా మీ చేతన వ్యవస్థ పరిధి విస్తృతం అవుతుంది.

చూడండి. ఇదంతా కూడా మీ సమ్మతి మీద ఆధారపడింది. మీరు ఎంత ఎక్కువగా మీ లోపలి శక్తిలో మార్పు రావాలని కోరుకుంటారో అంత బాగా ఈ స్వేచ్ఛని పొందుతారు. ఇలా జరగటానికి ఇది ఒక్కటే మార్గం.

ఇలా జరిగినప్పుడు సమాజం మీరు సమాజానికి దూరం అవుతున్నారు అని అంటుంది. మీరు సరియైన మార్గం నుంచి దూరం వెళ్ళిపోతున్నారు అంటుంది. అప్పుడు మీరు అయోమయంలో పడిపోతారు. ఇది సంభవించినప్పుడు మీలో ముందుకు వెళ్ళగలిగే ధైర్యం ఉండాలి. మీకు మీ మీద ఈ సర్వాంతర్యామి మీద అపార నమ్మకము ఉండాలి.

ఈ సందర్భంలోనే, ఈ సమయంలోనే పుస్తకాలు, ఉపన్యాసాల కంటే కూడా గురువు మీకు ఒక యోగదండనలాగా మీ ప్రక్కన ఉండి మీరు నిలబడేలా చేస్తారు. ఎప్పుడైతే సమాజం మీ మీద దాడి చేస్తుందో, మీ ఆధ్యాత్మికతని అడ్డుకుంటుందో, ఎప్పుడయితే మీరు ఎక్కువ మందిని ఎదిరించ,వలసివస్తుందో, అప్పుడు గురువు మిమ్ములని ఆయన మార్గంలో, ఆయన పద్ధతిలో బయటకి తీస్తాడు. మిమ్ములని ముందుకు సాగమని ప్రోత్సహిస్తాడు. కొన్ని బలహీన క్షణాలలో ప్రోత్సహించటానికి మీకు గురువుకావాలి. గురువు ఒక కర్రలా మారి మిమ్ములని ఆ క్షణాలలో ప్రోత్సహించి, మీకు ఆధారంగా నిలుస్తారు. మీ అంతట మీరు మీ తలపైకి నిలిపి నడవ గలిగే వరకూ ఆయన మీకు ఆధారంగా నిలబడతారు.

గురుదేవుని సహాయంతో మీరు ఒక స్వేచ్ఛ కలిగిన వ్యక్తిగా నిలబడగలుగుతారు. అప్పుడు మీరు మీలోని ప్రత్యేక లక్షణాలని చక్కగా గుర్తిస్తారు. దీనికి అర్థం మీరు గురువుపై ఆధారపడ్డారని కాదు. అలా ఎప్పటికీ కాదు. ఇది మరొక తప్పు. ఊహఇటువంటి స్థితిలో మీరు జీవితాంతం మరొకరిపై ఆధారపడ్డారని కొందరు అనుకుంటారు.

ఇది ఎలా ఉంటుందంటే: మీరు ఒక చోటికి వెళదాము అని అనుకుంటారు. మిమ్ములని ఒంటరిగా వదిలేస్తే, ఆ దారి ఎటు అని మీరు చాలా మందిని అడుగుతారు. కొన్నిసార్లు మీకు తప్పుదార్లు చూపబడతాయి. అప్పుడు మీరు తిరిగి అసలు దారి కనుక్కోవాలి. ఇలా అందరినీ అడుగుతూ చివరికి మీ గమ్యం చేరతారు. ఇలా చేయటం వలన మీరు మీ గమ్యాన్ని ఆలస్యంగా చేరతారు. అలా కాకుండా మీ దగ్గర ఒక మార్గం చూపే పటం కానీ, లేదా ఎవరైనా గైడ్ (మార్గదర్శి)గాని ఉంటే మీరు తిన్నగా ఎటువంటి సమయం, వృధాకాకుండా తక్కువ సమయంలోనే, తక్కువ కష్టంతో మీ గమ్యాన్ని చేరగలుగుతారు. అలా అని మీరు మాప్ మీద మీరు ఆధారపడిపోయారు అనటానికి లేదు. ఇది పనులను త్వరగా, సులువుగా చేసుకోగల సాధనం. అంతే. ఇదే విధంగా గురువు సరియైన దారి తెలిసిన మార్గదర్శి. ఆయన అంతకుముందే ఆ ప్రదేశానికి వెళ్ళిన వ్యక్తి. ఆయన మీకు సరియైన మార్గాన్ని చూపిస్తారు. మీరు మీ గమ్యాన్ని తేలికగా చేరేలా సహాయం చేస్తారు. అంతే.

మీరు పూర్తి అంకిత భావంతో ఉన్నపుడు, మీ గమ్యాన్ని చేరటానికి ఎంత కష్టమయినా భరిస్తారు. కానీ మీ అంకిత భావానికి, ధైర్యం కూడా తోడయితే., మీరు మీ లక్ష్యం వైపుకి చాలా పెద్ద అడుగు వేయగలుగుతారు. మీకు ఈ ధైర్యం రావాలి అంటే మీరు బయట వారి వైపు చూడకుండా, కేవలం మీ లోపలికే చూసుకోండి. మీరు బయట వారితో పోల్చుకోవటం ఆపివేసి, మీ లోపలికి మీరు వాస్తంతో చూసి తెలుసుకోగలిగితే, మీ అంతరంగంలో సూక్ష్మమైన మార్పులు జరుగుతాయి.

మీరు మీ మార్గంలో ధైర్యంగా నిలబడగలగాలి. అలా నిశ్చయించుకునే ధైర్యం కేవలం మీ దృష్టిని, మీ ఏకాగ్రతని మీ అంతరంగం వైపు మరల్చినప్పుడు, మీరు ఇతరులతో పోల్చుకోవటం ఆపినప్పుడే సాధ్యపడుతుంది.

sమాజం నిరంతరం మిమ్ములని మీ పాత క్రమాలలోనికి లాగటానికి ప్రయత్నిస్తుంటుంది. ఇది మిమ్ములని మీ పాత సమస్యలలోనికి దింపాలని చూస్తుంది. అదే మిమ్ములని అణిచివేసే మార్గం. ఆ దారిలో పడటం చాలా తేలిక. దానికి ధైర్యం అవసరం లేదు. కానీ నిర్బంధాలు లేని ఆధ్యాత్మిక దారిలో పడటానికి మాత్రం ధైర్యం కావాలి. నేను ధైర్యం అనేది మామూలు ధైర్యం కాదు సంపూర్ణ ధైర్యం.

మామూలు పూసలు మెడలో వేసుకోవటానికి ధైర్యం అవసరం లేదు. కానీ రుద్రాక్షలు వేసుకోవటానికి ధైర్యం కావాలి. ఎవరైనా వేసుకోవటానికి ఇష్టం చూపిస్తే నేను వాళ్ళకి రుద్రాక్ష మాలలు ఇస్తాను. ఆ రుద్రాక్ష శక్తిని నిలువ చేసే శక్తి గృహాలు. అవి విశ్వంలోని శక్తిని మీ కోసం వాటిలో నిక్షిప్తం చేస్తాయి. అవి బాటరీల లాంటివి. మీరు ఎప్పుడయితే బలహీనపడతారో అప్పుడు అవి మీకు శక్తిని ఇస్తాయి. కానీ సమాజం వీటిని కేవలం సన్యాసులు వేసుకునే మాలలుగానే చూస్తుంది. అవి కేవలం సర్వ సంగ పరిత్యాగులు వేసుకునేవిగానే గుర్తిస్తుంది. కానీ అలా అనే వాళ్ళకి సన్యాసం అన్నా సర్వసంగ పరిత్యాగమన్నా అర్ధం తెలియదు.

ఎవరైన మామూలు సంసార జీవితంలో ఉండి వాటిని వేసుకుంటే ఆ విషయాన్ని ఖండిస్తారు. అదే రుద్రాక్షలు విగ్రహాలలో లేదా సాధువుల మెడలో చూస్తే ఆనందపడతారు. వాళ్ళని పూజిస్తారు. కొంత మంది భక్తులు నాతో చెబుతుంటారు. వాళ్ళు రుద్రాక్షలు వేసుకున్నప్పుడు కుటుంబ సభ్యులు ఎలా అడ్డుకున్నారో, వద్దని చెప్పారో, చెబుతారు. ఈ రుద్రాక్షలు గురించి రకరకాల కథలు ప్రచారం చేస్తారు.

వాళ్ళు పూజలు చేసినప్పుడు, ఈ అనంత విశ్వ శక్తికి పూజలు చేస్తారు. కానీ అదే శక్తి వారికి దొరికినప్పుడు మాత్రం, దానిని తీసుకోవటానికి భయపడతారు. వాళ్ళు పూజలు చేస్తారు. ప్రార్థిస్తారు, కానీ దగ్గరకి తేలికగా వస్తే పారిపోతారు.

మీరు కొంచం లోతుగా విశ్లేషణ చేస్తే ఇది ఎంత అర్ధం లేని విషయమో, ఇలా చేయటం ఎంత అసంబద్ధంగా, ఎంత అర్ధం లేని చర్యగా ఉన్నదో కదా! అని తెలుస్తుంది. వాళ్ళు వాళ్ళని భగవంతుని నుంచి వేరు చేసుకొని చూస్తారు. అదే అసలు సమస్య. వాళ్ళు వాళ్ళని భగవంతుని రూపాలుగా అంగీకరించరు. నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను. మీకు తెలిసినా తెలియకపోయినా, ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, మీరు నమ్మినా, నమ్మకపోయినా, మీరు భగవంతుడే. ఇదే

విశుద్ధి చక్రం లోపలి అంశం కూడా. మీ లోపలి అనంతశక్తిని మీలోని ప్రత్యేకతని మీరు కనుక్కోవటమే విశుద్ధి చక్రం ఉద్దేశం.

ఎప్పుడయితే మీ ధైర్యం పెరుగుతుందో, క్రమంగా సమాజం మసక బారుతుంది. తరువాత పూర్తిగా మీ నుండి వెళ్ళిపోతుంది. మీకు ధైర్యం తక్కువగా ఉన్నప్పుడు సమాజం మీ మీద అధికారాన్ని చలాయిస్తుంది. ఇదంతా మీ మైండ్లోనే ఉన్నది. మీరు సమాజానికి ఎంత శక్తిని ఇస్తారో, అంత శక్తితో మిమ్ములని నియంత్రిస్తుంది. అందుకే ఏ విషయానికి కూడా సమాజాన్ని తప్పుపట్టవద్దు. దానిని నిందించవద్దు.

ఎంపిక అనేది మీది. మీకు ధైర్యం లేక సమాజం ఏమి చెబితే అది చేస్తారు. మీరు వేరే వారితో పోల్చుకుంటూ, ముందుకీ, వెనక్కీ వెళుతూ, ఒకరి మీద మరొకరు పోటీ పడుతూ, చివరికి సమాజాన్ని నిందిస్తారు. ఇది మీరు చేసే చాలా అసంబద్ధమైన పని. గుర్తుంచుకోండి. దైనికైనా ఎంపిక చేసుకునేది మీరు.

మీరు వాస్తవంతో తెలుసుకునే తత్వంతో పని చేయండి. అనంతమైన ఒక ప్రదేశం ఏర్పడి, అందులో మీలో వికసిస్తారు. అది విశాలమైన ప్రదేశాన్ని చూడలేరు కాబట్టి. మీరు ఎప్పుడూ హద్దులు చూడటానికి అలవాటు పడిపోయారు కాబట్టి. ఇప్పుడు మీకు మీ చుట్టూ గోడలు, కంచెలు కనపడవు. మీరు భయపడతారు. అది గ్రహించటం మొదలు పెడతారు.

ముందుగా మీరు తప్పు చోటకి వచ్చామనుకుంటారు. సత్యం అనేదానిని మీరు గ్రహించుకోవటానికి, జీర్ణించుకోవటానికి కష్టంగా ఉంటుంది. మీరు అభద్రతకి లోనవుతారు. మీరు మీ పాత నమ్మకాలలోనికి, భ్రమలలోనికీ వెళ్ళిపోవాలనుకుంటారు. మీరు ఈ సమాజం మాట వినకుండా తప్పు చేసానా అని అనుకుంటారు. సమాజం ఇది తప్పుదారి అని చెప్పినప్పుడు ఎందుకు వినలేదా అని బాధపడతారు. అప్పుడు మీరు ఉన్న దారిని అనుమానిస్తారు. ఆ అనుమానాన్ని అనుమానిస్తారు.

అకస్మాత్గా జీవితం కదిలిపోయినట్టవుతుంది. మీరు ఎక్కడికి వెళుతున్నారో మీకు తెలియదు. మీరు ఎడారి మధ్య వదిలివేయబడ్డ చిన్న పిల్లవాడిలా భయపడతాడు. ఇటువంటి సమయంలోనే మీరు ఈ అనంత సృష్టి మీలోనే ఉన్న అని గుర్తుంచుకోవాలి. ఈ ధైర్యం ఇంకా పరిణితిని పొందాలి. మీరు ఆ అనంత సృష్టి మీ తోనే ఉన్నది అని గుర్తుంచుకోవాలి. ఈ ధైర్యం ఇంతా పరిణితిని పొందాలి. మీరు ఈ అనంత చైతన్యం మీద నమ్మకంతో దానితో పాటుగా ముందుకి సాగాలి. అప్పుడు అన్నీ సవ్యంగా ఉంటాయి. నమ్మకం అనేది మిమ్మలని గుచ్చి మీ ధైర్యాన్ని ప్రోత్సహించే కర్ర.

మీలో విప్లవం రానిదే మీరు విప్పారి చెట్టుగా ఎదగలేరు. మనలో చాలామంది విత్తనంలా ఉండిపోయి అలానే మరణిస్తారు. అలా ఎందుకంటే మొలకెత్తి, చెట్టుగా పెరిగే ధైర్యం లేకపోవటం వలన. మనం నిరంతరం ఆ విత్తనాన్ని అడ్డు కోత కోసి అంంతులో పూవులు, పళ్ళు ఉన్నాయేమోనని చూస్తాయి. అది మనకి ఏ విధంగా అయినా సహాయం చేస్తుందా? లేదు. ఆ విత్తనం విడబడాలి. పగలాలి అప్పుడే అందులోంచి మొలక వస్తుంది. అది పెరుగుతుంది. ఈ ధ్యాన పద్దతులన్నీ కూడా విత్తనాన్ని పగలగొట్టే పద్ధతులే.

ఎప్పుడయితే మీరు విడబడటం మొదలు పెడతారో, ఎప్పుడయితే విత్తనం లాంటి మీరు పగలటం మొదలు పెడతారో, అప్పుడే మీలోని ప్రాధాన్యాలు మారుతాయి. అంతకుముందు చాలా ప్రాముఖ్యం అనిపించినవి ఇప్పుడు అసలు ఉపయోగం లేనివిగా ఉంటాయి. ఏవైతే మీ ఉనికి అభివృద్ధికి తోడ్పడతాయో, అవి మీరు ప్రాధాన్యాలవుతాయి. మీ పూర్తి దృక్పధం మారిపోతుంది, మీ వైఖరి, మీ పద్ధతి, మీ ఉనికి పూర్తిగా మరిపోతాయి.

మీ ఉనికి, మిగతా వారికి మీ వైపు ఆకర్షితులని చేస్తుంది. కానీ మీరు దానికి ఒప్పుకోరు. మీలోంచి వెదజల్లబడే మీ అంతరంగం ప్రజలని కూతూహలంగా మీ వైపు ఆకర్షింపచేస్తుంది. ఒక వైపు మీలో సంభవించిన అప్పుడు మీకు జ్ఞానోదయమవుతుంది.

జ్ఞానోదయం పొందాలి అనే కోరిక చాలదు. ఇది మీ చేతన స్థితిలో మీరు చేసే నిర్ణయం అయివుండాలి, మామూలు కోరికలు కేవలం అత్యాశలు మాత్రమే. అది మిమ్ములని మీరు నిర్ధేశించుకున్న లక్ష్యంవైపు నడిపించలేవు. మీరు చేతన స్థితిలో చేసుకున్న నిర్ణయాలు మాత్రమే మీరు సాధించగలిగే వైపు మిమ్ములని ప్రోత్సహిస్తాయి.

అందరికీ ఈ విషయాలు తెలియవు, అర్థకావు. అందుకే పై పై మాటలు మాట్లాడతారు. మీకు ఏదైనా అర్థ కాకపోతే దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ మీరు విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను అని అనుకుంటారు. ఇక్కడే సమసయ్యలు ప్రారంభమవుతాయి.

అధ్యాత్మికత అనేది ఒక శాస్త్రం. ఇది మన శరీరం, మైండ్, ఆత్మ గురించి చాలా లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. మీరు దీనిలోనికి అర్థం చేసుకోగలిగే తత్వంతో వెళ్ళగతిగితే, బయట ప్రపంచం క్రమంగా కరిగిపోతుంది. బయటనుంచి ఎవరైనా మిమ్ములని చూస్తే, మీరు సర్వ సంగ పరిత్యాగం చేసారేమో అనుకుంటారు. కానీ మీకు తెలుస్తుంది, మీరు అలా చేయట లేదని అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. బయట ప్రపంచంలోని విషయాలు వాటంతట అవే క్రమంగా మాయమవుతాయి. మీ భ్రమలు తొలగుతాయి. మీరు హిప్నటైజ్ అయిన స్థితి నుంచి బయటకి వస్తారు.

నేను ఒక కార్యక్రమంలో, ప్రేక్షకులలో ఇలా అడిగాను. మీలో ఎంతమంది నేను మిమ్ములని హిప్నటైజ్ చేసాను అని అనుకుంటున్నారు, అని. మొత్తం 80 మందిలో ముగ్గులు చేతులు ఎత్తారు. అలా చెయెత్తిన అమ్మాయి పక్క కూర్చున్న ఒకామె, అలా చేయెత్తిన అమ్మాయిని చూసి నవ్వింది. నేను ఎందుకు నవ్వుతున్నారు అని ఆమెని అడిగాను. ఆ అమ్మాయి నిజాయితీగా చేయి ఎత్తింది అన్నాను. నేను చాలా నమ్మకంగా చెబుతున్నాను. మీలో చాలా మందికి చేయి ఎత్తాలని ఉన్నది. కానీ

నేను ఏమంటానో అని భయం. సరే! ముగ్గురు చేయి ఎత్తారు. నేను వాళ్ళకి చెప్తాను, నేను మిమ్మలని హిప్నటైజ్ చేయలేదు. మిమ్మలని హిప్నటైజ్ అయి ఉన్న స్థితిలోంచి బయటకి తెచ్చాను అని.

వాళ్ళు వాళ్ళలోని భ్రమలు, మాయా క్రమంగా తొలగింపబడటం అనుభవించారు. కానీ మీరు ఈ భ్రమలకి ఎంతగా అలవాటు పడిపోతారంటే, అవి ఎప్పుడయితే తొలగిపోతాయో అప్పుడు మీరు ఏదో పోగొట్టుకున్నట్టు అయిపోతారు. ఎప్పుడయితే ఎక్కువ నిజాలు చెబుతామో వాటిని అర్ధ చేసుకోలేరు. దాంతో కొన్ని రకాల భయాలు వీళ్ళలో చేరతాయి. వాళ్ళు తెలివితక్కువ తనం అనే కవరులో సౌకర్యంగా ఉంటారు.

మీలోని అజ్ఞానం ఎంత పరిమాణంలో కరిగిపోతుందో అదే పరిమాణంలో మీరు భగవంతుని చేతులలోనికి వెళతారు. మీరు మీ రోజువారి జీవితంలో ఉపయోగించే ప్రయత్నాలని,పద్ధతులని మీ లోపల ఖాళీ చేసుకోవటానికి నిర్దేశించండి. అప్పుడు మీలో ఈ అనంత సృష్టి నిండుతుంది. మిగతా విషయాలన్నీ కేవలం కొన్ని సంఘటనలు మాత్రమే. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి.

మీరు తీసుకునే ప్రతి శ్వాస మీలో చేతన స్థితిని, తెలుసుకునే తత్వాన్ని పెంచేదిగా ఉండాలి. అప్పుడు మీరు మీ చేతన స్థితిలో భగవంతుని లేదా ఈ అనంత చైతన్య శక్తి యొక్క అనుభవాలని పొందాలి అని నిర్ణయం చేయగలుగుతారు. ఒక వేళ అదే జరగకపోతే మీరు చూడాలి అని అనుకోవటంతోనే సరిపోతుంది. ఎప్పుడూ కనీసం ఒక్క క్షణమయినా ఎదుటి వారు మిమ్ములని మోసం చేస్తున్నారు అని అనుకోవద్దు, మిమ్ములని మీరు మోసం చేసుకుంటారు.

మీ అడుగులు బయట నుంచి ముందుగా మీ లోనికి మారాలి. ఎప్పుడయితే ఇటువంటి ఏ మలుపు జరుగుతుందో అదే చాలా ముఖ్యమైన క్షణం. మీలోని చేతన స్థితి మీకు మీరు ఏ మలుపు తీసుకున్నారు అని చెబుతుంది. అప్పటివరకూ కూడా మిమ్మలని మీలో కలిసిపోనివ్వకుండా మీ మైండ్ చాలా కారణాలు చెబుతుంది. చాలామంది మనుషులని, సందర్భాలని చూపిస్తూ క్షమాపణలు కోరుతుంది.

ఒకసారి మీరు ఏ మలుపు తీసుకోగానే ఇవన్నీ మసకబారి మాయమవుతాయి. అవి వాటి ప్రాముఖ్యాన్ని కోల్పోతాయి. వాటిని పక్కన పడేసి మీరు క్రమంగా అభివృద్ధి దిశగా సాగుతారు. అవి మిమ్మల్ని ఒక పరిశీలకుడిగా చేస్తాయి. అయితే మీరు తీసుకునే ఈ మొదటి అడుగు, ఈ ఏ మలుపు చాలా ముఖ్యమైనది, చాలా కష్టమైనది. ఎప్పుడయితే మీరు ఈ అడుగు వేయగలుగుతారో, మీరు సాధించాలనుకున్నది, సగం పూర్తయినట్టే. అప్పుడు మీరు చాలా తేలికగా ఈ అనంత సృష్టి యొక్క దారిలో సాగగలుగుతారు.

మీరు ఈ ఏ మలుపు తీసుకున్నాక, ప్రతిదీ కూడా మీకు ఒక ధ్యానమే అవుతుంది. మీరు నడిచినా, మాట్లాడినా, డాన్సు చేసినా, మీరు బట్టలు మార్చుకుంటున్నా అన్నీ కూడా ఒక ధ్యానమే అవుతుంది. ఇవన్నీ మీరు చేతన స్థితిలో చేయగలరు.

మీరు ఇవన్నీ చేయటాన్ని గమనించగలరు. అప్పుడు క్రమంగా మీకు ఈ ప్రపంచమంతా ఒక భ్రమ, ఒక మాయ అని అర్థమవుతుంది. మీరు మీ లోపలకి తీసుకునే మొదటి అడుగు ఒక పెద్ద అడుగు అవుతుంది. మీ మొదటి అడుగే పెద్ద అడుగు. ఎందుకంటే అప్పటివరకూ మీరు మిమ్ములని, ఎదుటివారి మీరు ఏదో వెతుకుతున్నట్టు నమ్మించుతారు. దాంతో మీలోని తగ్గిపోతున్న పట్టుదల చూసి అయోమయం అవుతారు.

మీరు మొదటి అడుగు వేసారు. అంటే మిమ్ములని గెలిచికోవటానికి సిద్ధంగా ఉన్నట్టే. అప్పుడు ఎదుటి వారిని గెలవటం చాలా తేలిక. మీరు ఏ పద్ధతి అయినా పాటించండి. ఎదుటి వారిని గెలవటం సులభమవుతుంది. మీరు మిమ్ములని మీరు గెలవటానికి మీకు ధైర్యం కావాలి. ఈ విశుద్ధి చక్రం మిమ్ములని మీరు గెలవటానికి సహకరిస్తుంది.

మీరు మీ లోపలికి చూడగలిగితే, మిమ్ములని మీరు గెలవటానికి సిద్ధపడినట్టే. అయితే మీరు మీ లోపలికి సాగించే ప్రయాణంలోనే ఉన్నారనుకోండి, మీలో, మీరు చేసే

పనులలో బయట వాళ్ళకి స్పష్టంగా ఏమీ కనపడదు. కానీ మీకు మాత్రం మీ లోపల ప్రతీదీ జరుగుతున్నట్టు, బయట ఏమీ జరగటం లేదు అని తెలుస్తుంది. కేవలం మీకు మాత్రమే మీలో జరిగే విప్లవం అర్ధమవుతుంది. కేవలం మీరు మాత్రమే మీలో వికసించుతున్న వివేకాన్ని, తెలివిని గురించి చెప్పగలరు.

మీ చుట్టు ప్రక్కల ఉండే వారు ఎవరూ కూడా మీలో మీరు పొందుతున్న ఆనంద అనుభూతులని ఏ మాత్రం అర్ధం అచేసుకోలేరు.

నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను. మీలో జరిగే విషయాలను చెప్పి ఎదుటి వారిని నమ్మించటానికి, ఒప్పించటానికి ప్రయత్నించకండి. మీలో జరిగే అనుభూతులని మీ ఆధ్యాత్మిక స్నేహితులతో పంచుకోండి. మీ ఆలోచనా సరళి వాళ్ళ ఆలోచనా సరళి ఒక్కలా ఉండటం వలన, వాళ్ళు అర్ధం చేసుకుంటారు. కానీ ఈ విషయాలు మీరు వేరే వ్యక్తులతో పంచుకుంటే, వాళ్ళకి అంతరంగం, అందులో మార్పు అంటే అర్ధం కావు. తెలియవు, దాంతో మీకు సమస్యలు మొదలవుతాయి.

కేవలం మీలో అనుభవాలని అలా జరగనీయండి. వాటిని పట్టుకోవద్దు; వాటి వెనుక పరిగెట్టవద్దు. వాటిని మీ మీద ఒక ఆవిరిలా పనిచేయ నీయండి. అప్పుడు మీరు పూర్తిగా పక్వానికి వస్తారు. వాటిని పట్టుకుంటే ఏదో ఒక చోట మీరు నిలిచి పోతారు. అప్పుడు మొత్తం అంతా మీరు మిస్ అయిపోతారు.

ఈ అనుభూతులు, అనుభవాలు మీరు మీ అంతరంగంలోనికి చేసే ప్రయాణం యొక్క గుర్తులు. అవి మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మీరు చూసే హెచ్చరిక బోర్డులు లాంటివి. మీరు ఈ బోర్డులని పట్టుకొని గమ్యం చేరాం అని అనుకోవద్దు. వాటిని పట్టుకోవద్దు. మీ గమ్యంవైపు సాగిపోండి.

మీరు ఎప్పుడయితే మీ మైండ్ని వదిలేస్తారో - అంటే మీ సమాజాన్ని, మీరు ఎప్పుడయితే మీ హృదయంతో నివసించగలుగుతారో, ఎప్పుడయితే మీరు

ప్రయోగాత్మకంగా ఈ మైండ్ సమాజానిది, హృదయం మాత్రం, సహజమైనది అని అర్థం చేసుకుంటారో అప్పుడు మీ గమ్యం అప్రయత్నంగా మీకు దొరుకుతుంది.

మరొక విషయం : ఎవరైనా మిమ్ములని మీ అనుభవాలని నిరూపించమంటే, మీరు ఎవరికి ఏమి నిరూపించనవసరం లేదు. మీ అనుభవాలన్నీ కూడా పూర్తిగా మీ సొంతము, మీ వ్యక్తిగతం. వాటిని మీరు సరిగ్గా ఎవరికీ చెప్పలేరు. ఎవరితోనూ పంచుకోలేరు. అసలు మీరు అలా ఒకరితో పంచుకుంటే మీ అనుభూతులన్నీ కిందికి తెచ్చేసినట్టే. అంతే కదా. ఎదుటి వ్యక్తి మీరు చెప్పేది నిజమని నమ్మటానికి సిద్ధపడరు. ఇష్టపడరు. వాళ్ళు మీతో మీరు మిమ్ములని మోసం చేసుకుంటున్నారు అని అంటారు. అన్నింటినీ హేతుబద్ధంగా వివరించమని అడుగుతారు.

హేతువాదం మీ అనుభవాలను వివరించలేదు. భగవంతుడు తర్కానికి అతీతుడు. తర్కం కనుక భగవంతుడు అంటే ఏమిటో చెప్పగలిగితే, అది భగవంతుని కంటే గొప్పది అవుతుంది. అలా ఎన్నటికీ కాదు. మీకు నిశ్చలంగా, విరామంగా ఉండండి. ఆ అనుభవాలని అలా జరగనీయండి. మిమ్ములని ఎవరయినా ప్రశ్నిస్తే, వారి వైపు ఒక చిరునవ్వుతో చూసే పరిణితిని పొందండి. ముందుకు సాగిపోండి. మీరు మాటలలో చెప్పలేని విషయాలని ఒక చిన్న నవ్వుతో చెప్పవచ్చు.

గొప్ప యోగులు, జ్ఞానోదయం పొందిన జ్ఞానులు, ఈ అనంత చైతన్య సృష్టి (భగవంతుని)తో మమేకమై, ఏకమైనప్పుడు వాళ్ళు అద్భుతమైన ఆనందాన్ని అనుభవింటారు. కొంతమంది నన్ను నా అనుభవాలు చెప్పమని అడుగుతారు. కానీ ఇది చాలా వ్యక్తిగతమైనది. దానిని మాటలో మీకు వివరించటం కష్టం. నేను ఎప్పుడయితే ఆ అనుభూతిని, ఆ అనుభవాన్ని వివరిస్తానో అది లౌకికమైపోతుంది.

కానీ, మీకు ఒక విషయం చెబుతాను: మీకు పూర్తి నమ్మకాన్ని, హామీని ఇవ్వగలను. మీలో ఆ అనుభవం పొందాలి అనే కోరిక జ్వలిస్తుంటే మీరు ఆ అనుభవాన్ని తప్పకుండా పొందగలుగుతారు. ఒక గురువు చేసే ప్రమాణం, మీకు అది సాధించటానికి సరిపడా శక్తిని ఇస్తుంది.

ఒక విషయం అర్ధం చేసుకోండి. మీరు ఆనందపడటానికి ఒక కారణం ఉండదు. కొంతమంది అలా ఆనంద పడేవాళ్ళని చూసి పిచ్చి వాళ్ళు అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి కారణం లేకుండా ఆనందంలో ఉన్నారు. వాళ్ళకి ఆనందం విషయంలో కూడా కారణము, దాని ప్రభావము కావాలి. వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏదైనా బయట ప్రపంచపు విషయం మాత్రమే మీలో ఆనందాన్ని కలిగించగలుగుతుంది.

నేను ఈ విషయాలన్నీ కూడా మీరు మెడిటేషన్, ఆధ్యాత్మికత అనే విషయం మీద మీరు అడిగిన ప్రశ్నకి జవాబుగా చెబుతున్నాను. మనం అసలు విషయం వదిలేసి ఏవో మాట్లాడుతున్నాము అని అనుకోవద్దు. ఈ విశుద్ధి చక్రం దీని అంతటికీ సంబంధించినది. ఈ చక్రం మీరు ఎలా వికసించాలి, మీరు ఎలా విశాలమవ్వాలి అనే విషయాలని చెబుతుంది. ఇది మిమ్మలని మీలో ఎలా కనుక్కోవాలి, మీలోని ప్రత్యేక లక్షణాలని ఎలా తెలుసుకోవాలి అనే విషయం వివరిస్తుంది. మిమ్మలని పూర్తి చేతన స్థితిలో అర్ధం చేసుకోవటం; అలాగే అసూయ పోలికలు అనేవి మీ పరిధిలో లేకుండా చేస్తుంది. నేను చెప్పే విషయాలు యధాతదంగా తీసుకోండి. ఆ మాటల వెనుక ఉన్న శక్తి మీలో మార్పును తేవటానికి అంగీకరించండి. నేను చెబుతున్నాను. మీకు అద్భుతాలు జరగవచ్చు. అవి మీ జీవితాన్ని, మీ ఉనికిని పూర్తిగా మార్చివేస్తాయి.

సరే ఇప్పటివరకూ చెప్పిన దాని బట్టి మనకి అర్ధమయింది ఏమిటి అంటే, పోల్చుకోవటం, అసూయలనేవి అసలు లేవు. అవి మనకు తగినవి కావు. ఇప్పుడు మీకు విశుద్ధి చక్రం గురించి మరికొన్ని వివరాలు చెబుతాను. ఇది ఒక గొప్ప శక్తి నిలయం.

చూడండి: మనలోపల మూడు శక్తి పొరలు ఉంటాయి. అందులో మొదటిది మన మైండ్ నుంచి వస్తుంది. దీనినే మనం మన దిన చర్యలకి ఉపయోగించుతాము, ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి, నిద్రపోయేదాకా ప్రతి పనికి దీనినే ఉపయోగించుతారు. దీనిని ఎక్కువగా ఉపయోగించి మీరు అలసిపోతారు. విసుగు పెరుగుతుంది. మీకు ఎక్కువ పని చెబితే విసుక్కుంటారు.

రెండవ పొర అత్యవసర శక్తి పొర. ఇది మన భావావేశాల నుంచి వస్తుంది. మనకి ఏదైనా అత్యవసరమయినప్పుడు ఈ శక్తి విడుదల అవుతుంది. ఉదాహరణకి : మీరు రోడ్డు మీద నడుస్తున్నారనుకోండి. ఒక కుక్క వెంటపడితే భయం అనే భావం బయటకి వస్తుంది. దాంతో మీరు చాలా స్పీడుగా పరిగెడతారు. మామూలు స్థితిలో మీరు అలా అంత వేగంగా పరిగెత్తలేరు. మీకు కాళ్ళు కదపలేనంత నీరసంగా ఉన్నా, మీరు నడవలేని స్థితిలో ఉన్నా, కుక్క వెంటపడితే మీరు వేరే రకం శక్తితో పరిగెడతారు. అదే అత్యవసర శక్తి. అది భావావేశాల నుంచి పుడుతుంది.

మూడవ పొర, మన ఉనికి దశలోని శక్తి. అది మీ లోపల ఉండే అంతులేని శక్తి. దీనిని మీరు అసలు ఉపయోగించరు. ఈ శక్తి పొరని మీరు లోతైన ధ్యానం ద్వారా మాత్రమే వికసింపచేయగలరు. మీరు ఒప్పుకున్నా లేకపోయినా మీరు ఈ మూడు శక్తి పొరలతో సంబంధం కలిగి ఉంటారు. విశుద్ధి చక్రం ఈ ఉన్నతమైన శక్తిని పట్టి ఉంచుతుంది. నేను హిమాలయాలలో తిరిగే రోజుల్లో జరిగిన ఒక సంఘటన చెబుతాను.

హిమాలయాలలో ఆల్మోరా అనే అందమైన ప్రదేశం ఉంది. అక్కడ ఒక చిన్న ఆశ్రమము, చిన్న చిన్న పాకలు లాంటి ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఎవరైనా ధ్యానం చేసుకోవచ్చు. కాకపోతే ఆ ప్రాంతానికి రాత్రి పూట పెద్దపులులు వస్తుంటాయి. నేను అక్కడ కొంతకాలం ఉన్నాను. అక్కడ నేను చాలా సమయం ధ్యానం చేసేవాడిని.

ఆ ఆశ్రమం పెద్ద (గురువు) ఎప్పుడయినా పులి వస్తున్నట్టు గమనిస్తే గంట మోగించేవాడు. అది విన్న సాధువులంతా ఆ చిన్న ఇళ్ళలోనికి వెళ్ళి తలుపులు వేసుకునే వాళ్లు. మళ్ళీ బయటికి రమ్మనే వరకూ లోపలే ఉండేవాళ్ళు.

ఒక రోజు రాత్రి మేమంతా ధ్యానం చేస్తుంటే గంట శబ్దం వినపడింది. మేమంత ఇళ్ళ లోపలికి వెళ్ళిపోయాయి. మర్నాడు ఆ ఆశ్రమం పెద్ద వచ్చి చుట్టూ చూచుకొని మేమంతా క్షేమంగా ఉన్నమా లేదా అని చూసుకున్నాడు.

అప్పుడు ఒక ఇంట్లో తలుపులు వేసి ఉన్నాయి. ఒక సన్యాసి కిటికీలోంచి చూస్తూ తలుపు తీయమని అరుస్తున్నాడు. మేమంతా వెళ్లి చాలా ప్రయత్నించాము కానీ తలుపు రాలేదు. కిటికీలోంచి లోపలికి వెళ్ళి చూస్తే తలుపు దగ్గర ఒక పెద్ద రాయి పెట్టి ఉన్నది. అంటే పులి రాకుండా తలుపుకి అడ్డంగా రాయి పెట్టబడి ఉన్నది.

మేమందరం కలసి ఆ రాయిని పక్కకి తోసి తలుపు తీసాము. అప్పుడు మాకు అనిపించంది. ఒక వ్యక్తి అంత పెద్ద రాయిని తలుపు దగ్గర ఎలా పెట్టాడు అని. అతనిని అదే ప్రశ్న అడిగాము.

"నేను దానిని కదిపి ఎత్తి ఇక్కడ పెట్టాను" అని అన్నాడు. మేము పులి అన్న మాట విన్నప్పుడు అతను ఆ రాయిని తలుపు దగ్గర పెట్టాడు.

దీనినే నేను మీకు అత్యవసర శక్తి అని చెప్పింది. మామూలు పరిస్థితిలో ఒక మామూలు మనిషి ఆ రాయిని అక్కడ పెట్టలేరు. అర్ధమయిందా. ఆ సంఘటన తరువాత, ఆ అవసరం అయిపోయాక, అతను ఆ రాయిని అక్కడ నుంచి కదపలేకపోయాడు.

భయంతో కానీ, అత్యాశతో కానీ ఈ రెండవ శక్తి విడుదల అవుతుంది. ఉదాహరణకి, మీకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉందనుకోండి, మీకు నీరసం రాదు. ఎంత పనిచేసినా ఫ్రెష్గా ఉంటారు. ఆ మీటింగుకి వెళ్ళాలి అనే ఆశ చక్రం ముడుచుకుపోతుంది. మీలో ఆత్మగౌరవం తగ్గితే ఇది ముడుచుకుపోతుంది. తక్కువ ఆత్మగౌరవం అనేది అసూయ యొక్క సూక్ష్మ రూపం. అంతే. ఆత్మ గౌరవం తక్కువగా ఉంటే అసూయ చురుకుగా పనిచేస్తుంది. ఇవి రెండూ కూడా మనం పోల్చుకోవటం వలన ఏర్పడిన భావాలు. మీలో ఆత్మగౌరవం తక్కువగా ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉండదు.

మీరు సమర్ధులు కారు అనుకుంటారు. అసూయతో ఎదుటివారిని చూసి భరించలేరు. వారి విషయంలో వేరుగా స్పందించతారు.

ఒక విషయం అర్ధం చేసుకొండి. మీ ఆత్మ గౌరవం గురించి మీరు ఏమనుకుంటున్నారో అది మీరు భగవంతుడికంటే తక్కువ అంటే అది కూడా మీ ఆత్మ గౌరవం తక్కువ అని సూచిస్తుంది. ఎందుకంటే మీరే భగవంతులు. అందుకే నేనెప్పుడూ చెబుతుంటాను. మీరు వేరే వాళ్ళతో పోల్చుకునే అవకాశం లేదు అని.

మీరు ఈ చక్రంలో దాగి ఉన్న రెండవ, మూడవ శక్తి పొరలని అనుభూతి చెందాలి. ఎందుకంటే అప్పుడే మీకు మీ లోపలి ఉన్న అనంత శక్తి మీకు తెలుస్తుంది. ఈ చక్రం మనలోని శక్తికి పీఠం. మనం ఈ చక్రం మీద ఏకాగ్రతని నిలిపితే, మనం దానిలోంచి వెదజల్లబడే శక్తిని అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు.

నేను హిమాలయాలలో తిరిగే రోజుల్లో ఎన్నో మైళ్ళు కాలి నడకతోనే తిరిగే వాడిని. ముందు నెమ్మదిగా నడిచేవాడిని. విశుద్ధి చక్రం మీద నా ఏకాగ్రతని నిలిపేవాడిని. నెమ్మదిగా వేగం పెంచేవాడిని. అప్పుడు కూడా విశుద్ధి చక్రం మీద ఏకాగ్రత నిలిని నా ప్రమేయం లేకుండా నడిచే వాడిని. కొంత సమయం గడిచాకా నా శరీరం తేలిపోయినట్టు కదిలేది. నేను కేవలం ఈ విషయాన్ని ఒక పరిశీలకుడిగా గమనించేవాడిని. ఆ విధంగా ఎన్ని మైళ్ళన్నా నడిచేవాడిని.

మీరు తీసుకునే ఆహారం, చేసే ఎక్సర్ సైజులు కేవలం మీ మొదటి శక్తికే సహాయం చేస్తాయి. భోజనం ఒక్కటే మీకు పూర్తి శక్తిని ఇవ్వదు. అలా అనుకుంటే అది తప్పు. ఆహారం శక్తిని ఇచ్చే ఒక మార్గం మాత్రమే.

టిబెట్లో ఉండే యోగులు అసలు ఏమి తినరు. బిల్వ చెట్టు కాయల పెంకుతో నీళ్ళు పట్టుకుని తాగుతారు. నేను ఆ విధంగా హిమాలయాలో 6 నెలలు ఉన్నాను. నాకు కావలసిన శక్తిని, సూర్యుడి నుంచి, స్నానం చేసేటప్పుడు నీళ్ళ నుంచి, శ్వాశ తీసుకునేటప్పుడు గాలి నుంచీ పొందేవాడిని. ఇవన్నీ కూడా యోగులు పాటించే పద్ధతులు. తపస్సు ద్వారా జ్ఞానోదయం కోసం చేస్తారు. జీవితమంతా చేస్తారు. అదే మీ అంతరంగం ఉనికిలో ప్రకాశించుతుంది.

మీరు వేరే వారితే పోటీ పడేటప్పుడు, మీరు మీ గురించి మర్చిపోతారు. మీరు మీ అంతరంగంలోని ఉనికిని శక్తిమయం చేయటం మరిచిపోతారు. నిజానికి అదే మీరు ఉపయోగించని, మీ శక్తికి మూలం. మీకు భౌతిక శక్తి, మేధో శక్తి ఉండి ఆత్మ శక్తి లేకపోతే ఏమి ఉపయోగం ఉండదు. మీరు ఎప్పుడయితే మీ ఆత్మ యొక్క శక్తిని కనుగొనగలరో అప్పుడే మీ ప్రాణాధారాన్ని, జీవాధారాన్ని అందుకోగలరు.

ప్రశ్న : స్వామీజీ మేము అసూయ లేకుండా ఉండగలిగితే, కనీసం ఒక్క విషయంలోనైనా మేము మా స్వేచ్ఛని పొందగలుగుతామా ?

అవును. మీరు అసూయ లేకుండా మీలోపల అంతరంగంలో ఉండే ప్రేమని చూడగలిగితే, మీరు ముందుకి వెళుతున్నట్లే. అలా పూర్తి చేతన స్థితిలో ముందుకి సాగిపోండి. ఎందుకంటే మీరు చాలా తేలికగా మీ పాత అచేతన స్థితిలోనికి జారిపోవచ్చు. తిరిగి మీకు ఆ పాత భావావేశాలలోనికి పడిపోవచ్చు.

మీరు కొత్తగా కనుగొనే చేతన స్థితిని అలా పట్టుకోండి. దానితో పాటుగా ముందుకి సాగండి నేను మీకోసం ఎన్నో అందమైన దారులు ఏర్పాటు చేస్తాను. దాని ద్వారా ఆ కొత్త ప్రదేశాలలోనికి వెళ్ళి అన్వేషించండి. ఎక్కడా ఆగవద్దు. ఇక్కడ ఒక ప్రమాదం ఉన్నది. మీలో ఏవో కొన్ని అనుభవాలను పట్టుకుని అవే గమ్యం అని ఆగిపోవచ్చు. అలా చేయవద్దు.

గురువులు తమ శిష్యులని ఎక్కడో ఒక అనుభవం దగ్గర ఆగిపోనీయరు. వాళ్ళు శిష్యులని మరింత ముందుకి వెళ్ళాలా ప్రోత్సహిస్తారు. దానితో వాళ్ళు మరింత లోతులలోనికి వెళ్ళగలుగుతారు. కొందరు దేవుడి రూపాలు చూసి అక్కడే ఆగిపోతారు.

అంతకు మించి చూడటానికి ఏదీ లేదు అని అనుకుంటారు. దాంతో ఆ అనుభవాన్ని పట్టుకుని అక్కడే ఆగిపోతారు. ఇది ఎప్పుడూ జరగకూడదు.

చూడండి. మీరు శాశ్వతమైన పరమానందాన్ని, ఆ బ్రహ్మానందపు స్థితిని చేరే వరకూ ముందుకు సాగాలి. మీకు ఏదైనా రాతి దెబ్బ తగలవచ్చు. చేతన స్థితిలో లోతుగా అర్థం చేసుకుంటూ ఇంకా లోతులోనికి వెళ్ళండి.

ఒక విషయం అర్థం చేసుకోండి. ఇక్కడ గురువు బాధ్యత చాలా సున్నితంగా ఉంటుంది. ఆయన శిష్యులందరినీ ఎంతో జాగ్రత్తగా, సున్నితంగా చూడాలి. మీలోని ఎవరు ఏవిధంగా అభివృద్ధి సాధించుతారు. ఎవరు ఏ విధంగా వికశించుతారో గమనించి అలా చేయాలి. మీలో ఒక్కొక్కరూ ఎన్నోజన్మలుగా అజ్ఞానాన్ని పోగుచేసుకున్నారు. దానంతటి నుంచి మిమ్ములని మేలు కొలపాలి.

ఒక విషయం గుర్తుంచుకోండి. జీవితం చాలా పరిష్కారాల నిస్తుంది. వాటిలో తప్పనిసరిగా మీకు బాగా సరిపోయే పరిష్కారం ఉంటుంది. మీ తెలివితేటలు, వివేకాన్ని ఉపయోగించి దానిని మీరు కనుక్కోవాలి. మీరు మీ వివేకాన్ని ఉపయోగించి కనుక్కుంటే ఉపయోగాలను మీరు ఆనందించుతారు. మీరు ఇతరుల వైపు చూసి వాళ్ళు ఇచ్చే పరిష్కారాలు ఉపయోగింతే, మీరు మీ మార్గాన్ని తప్పుతారు.

ఒక చిన్న కథ :

ఒక చిన్న పల్లెటూరులో ఒకామె ఇల్లు, దులుపుకుంటూ ఉంటుంది. అక్కడికి ఒక సేల్స్మేన్ వచ్చి ఆమెతో ఎంతో ఉద్వేగంతో మాట్లాడటం మొదలు పెడతాడు. అతను ఆమెకి చిన్న చిన్న ఇనుస్ట్రుమెంట్స్, మెషిన్స్ తీసి చూపించుతూ వాటిని ఉపయోగించి ఇల్లు ఎంత బాగా శుభ్రం చేసుకోవచ్చో చెబుతుంటాడు.

అపుడు ఆమె ఏదో చెప్పబోయి, కానీ.... అంటుంది. అతను వినిపించుకోకుండా ఆ ఇంట్లో కొంత చెత్త పారేసి దాని నేలంతా పరుస్తూ చెబుతుంటాడు.

ఆమె మళ్ళీ అతనితో "అదికాదు ..." అని చెప్పబోతుంది. కానీ ఆ అబ్బాయి ఆమెని నిలబడి చూడమంటాడు. బ్యాగులోంచి ఒక వస్తువు తీసి ఆమెకి చూపించి, “ఈ మెషిన్ చూడండి. ఇంట్లో ఎంత చెత్త ఉన్నా కొంచెం సేపట్లో శుభ్రం చేస్తుంది. పెద్ద బరువు ఉండదు. మీరు కూడా తేలికగా ఉపయోగించవచ్చు. మీకు చూపిస్తాను” అంటాడు.

ఆ పెద్దావిడ మళ్ళీ చెప్పబోతుంది. “కాని....”.

మళ్ళీ ఆవిడని మాట్లాడనీయకుండా “మీ ఇంట్లో ప్లగ్ ఎక్కడుందో చూపించండి,” అంటాడు. చివరికి ఆమె “కానీ... మాఊరికి ఇంకా కరెంటు రాలేదు” అంటుంది.

(అంతా నవ్వులు)

మనం జీవితంలో మనకి ఏది బాగా సరిపోతుందో చూసుకో గలగాలి. ఈ విషయంలో మనకి స్పష్టత ఉంటే మీరు సమస్యలు లేకుండా అభివృద్ధి సాధించుతారు. కానీ చాలా సార్లు మనం ఎదుటి వారి పరిష్కారాలు మనకి అన్వయించుకుంటాము. దాంతో మనం మన సంతోషాన్ని పోగొట్టుకుంటాము.

మనం ఎక్కడ ఉన్నామో, మనకి ఏమి కావాలో స్పష్టంగా తెలిస్తే, మనం స్థిరంగా ఎదుగుతాము. ఏవైనా ఎదురు దెబ్బలు తగిలినా వాటి నుండి మనం కొంత వివేకాన్ని జ్ఞానాన్ని పొందుతాము. ఈ విధంగా మీరు మీ వివేకంతో పనిచేస్తే అది మీకు ప్రయోగాత్మకమైన అనుభవాలు ఇస్తుంది.

మీరు వేరే వాళ్ళు చెప్పే పరిష్కారాలు అనుసరిస్తే మీ అంతరంగంలో ఏమీ జరగదు. మీరు కేవలం మీ పరిధిలో నుండి మాత్రమే పనిచేస్తారు. మీ అంతరంగంలో ఏ మార్పు లేకపోతే మీరు అభివృద్ధి చెందలేరు. అంటే నేననే దానికి అర్థం ; మీలోపల మీరు ఎదగలేరు అని. మీకు వస్తు రూపేణా చాలా రావచ్చు. కానీ మీ అంతరంగంలోపలి నుండి వృద్ధి పొందితినే మీరు నిజంగా అభివృద్ధిని సాధిస్తారు. మీరు బయట ప్రపంచపు పోటీల ప్రమాదంలో ఇరుక్కోవద్దు. వాళ్ళు ఆడే ఆటని ఆటలా చూడండి. వస్తువులు మీరు జీవించటానికి అవసరం. కానీ అవన్నీ కూడా

మీ పరిధిలోనే ఉండాలి. మీ అంతరంగం క్రమంగా ఎదగాలి. అదే మిమ్మలని బయట ప్రపంచపు ఆటల్లో మీకు మార్గాన్ని చూపిస్తుంది.

ఎప్పుడయితే మీరు మీలోని వివేకాన్ని బయటికి తీయగలరో అప్పుడు మీకు బయట వారి పనులు ఎంత ఉపయోగం లేనివో తెలుస్తుంది. మొత్తం అంతా ఎంత అర్ధం లేనిదో తెలుస్తుంది. మీలో వివేకం పెరిగేకొద్దీ, ఎవరికి వాళ్ళు పోటీలో పరిగెత్తాలి గానీ, వేరే వారితో కాదు అని అర్ధమవుతుంది. నిజమైన పోటీ మీలోని అంతులేని వివేకాన్ని కనుగొనటానికే అని అర్ధం చేసుకోండి. అప్పుడు అసలు పోల్చుకోవాల్సిన అవసరం ఎక్కడ ఉంటుంది.

మీ లోపలి అంతులేని వివేకాన్ని కనొక్కోవటమే జీవితమంటే. అందుకే నేనెప్పుడూ చెబుతుంటాను. “జీవితం అనేది ఒక మార్గం. అది గమ్యం కాదు” అని. మీలో తెలివి తేటలు పెరిగేకొద్దీ, మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు జీవితం అనే ఆటని చాలా సమర్ధవంతంగా ఆడగలుగుతారు. అందుకే పోల్చుకోవటం ఆపేసి మీలోని అంతరంగాన్ని కనుక్కోండి. అదే మీకు నిజమైన వృద్ధికి ఆధారం.

విశుద్ధి చక్రం సృజనాత్మకతకి గొప్ప పీఠం. ఈ చక్రంలోని శక్తి విడుదల అయితే మీలో అద్భుతమైన సృజనాత్మకత యొక్క ప్రవాహం మీకు అందుతుంది.

మీరు ఎప్పుడయితే మీ ఉనికిలోని నాణ్యతని మార్చుతారో, మీరు చేసే పనులన్నింటిలోనూ నాణ్యత కూడా మారుతుంది. మీరు ఏమి చేసినా గొప్ప సమర్ధతతో, చక్కని సృజనాత్మకత తో చేస్తారు. దాని ఫలితంగా మీకు ఉన్న విషయాల నాణ్యత కూడా మారుతుంది. మీకు ఏమి దొరికినా, మీ జీవన మార్గంలో ఏది అందినా చాలా సంతోషపడతారు. మీవైపుకి సంపదలు, విజయాలు, వాటంతట అవే వస్తాయి. అవి చాలా సహజంగా మీ వైపుకి ప్రవహించుతాయి. కాబట్టి పోల్చుకోవటాన్ని వదిలి వేయండి. మీ అంతరంగం వైపుకి తిరగండి. అందులోని శాశ్వతమైన పరమానందాన్ని, నిత్యానందాన్ని కనుగొనండి.

ఇప్పుడు మనం ధ్యాన పద్ధతిని చూద్దాము. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ధ్యాన పద్ధతి శక్తి సాగర ధ్యానం. ఈ ధ్యానం మీరు ఏ విధంగా మీకు విశుద్ధి చక్రం ద్వారా దొరికే అద్భుతమైన శక్తిని ఎలా నియంత్రించాలో మీకు ప్రయోగాత్మకంగా అర్ధమయ్యేటట్లు చేస్తుంది.

శక్తి సాగర ధ్యాన పద్ధతి (మొత్తం సమయం 30 నిమిషాలు)

శక్తి సాగర ధ్యాన పద్ధతి బౌద్ధుల నుండి తీసుకోబడింది. ఈ ధ్యానం విశ్వ శక్తిని పొందటానికి సహాయం చేస్తుంది. ఈ ధ్యానంలో ముఖ్యాంశం, మీ శరీరం కదిలేటప్పుడు కూడా మీ ఏకాగ్రతని విశుద్ధి చక్రం మీద నిలపటం. మీరు ఈ ధ్యానాన్ని చేసేటప్పుడు మీరు డైరెక్ట్‌గా విశ్వశక్తిని పొందవచ్చు.

మీరు నిలబడి కళ్ళు మూసుకుని విశుద్ధి చక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మీరు కుర్చీవెనుక గానీ లేదా దేనినైనా పట్టుకుని నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మీరు నిలబడ్డ దగ్గరే నడవండి.

ఇప్పుడు నెమ్మదిగా వేగం పెంచండి. నిలబడ్డచోటులోనే ఉండి వేగంగా నడవండి. మీరు మీ పరిధి వరకూ ఎటువంటి అసౌకర్యం లేకుండా నడవండి. చేస్తున్నంత సేపు విశుద్ధి చక్రం మీద ఏకాగ్రత నిలపండి. ఎక్కువ ఆయాసపడేంతగా చేయకండి. మీరు మీ విశుద్ధి చక్రం నుండి శక్తి రావటం తెలుసుకుంటారు. మీరు మధ్యలో నెమ్మది అవ్వకండి. 20 నిమిషాల తరువాత ఆగండి.

తరువాత 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీరు కళ్ళు మూసుకునే ఉండండి. విశుద్ధి చక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మీరు కదులుతున్నప్పుడు వచ్చిన శక్తిని ఇప్పుడు మీరు గ్రహించుతారు. ఈ ధ్యానంలో ముఖ్య అంశం మీ శరీరం కదిలేటప్పుడు విశుద్ధి చక్రం మీద ఏకాగ్రతని నిలపటం ఎప్పుడయితే మీరు ఇలా చేస్తారో, విశ్వంలోని శక్తి విశుద్ధి చక్రం ద్వారా మీ లోపలికి ప్రవేశించుతుంది. అది మీకు అద్భుతమైన శక్తి అవుతుంది.

ఈ ధ్యానం చేసేటప్పుడు మీరు మీ మాలని మెడలో వేసుకోండి. అది మీరు ధ్యానం చేసేటప్పుడు సృష్టించే శక్తిని నిలువ చేస్తుంది.

(అందరూ శక్తి సాగర ధ్యానాన్ని సంగీతంతో సాధన చేస్తారు)

చివరలో స్వామి ఇలా చెబుతారు :

ఓం శాంతి శాంతి శాంతి :

నెమ్మదిగా చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి. తరువాత సెషన్లో కలుద్దాం.

ధన్యవాదాలు.....

portrait of a person wearing a turban and traditional attire