అధ్యాయం - 6: భయాన్ని ఎదుర్కొనటం
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(Facing Fear)
ఇ ఇప్పుడు మనం స్వాధిష్టాన చక్రం గురించి చూద్దాము. ఇది నాభికి రెండు అంగుళాల దిగువలో ఉంటుంది. స్వాధిష్టాన అంటే “మీ ఉనికి ఎక్కడ స్థిరపరచుకున్నదో ” అని అర్థం. ఇందులో 'స్వ' అంటే 'తనయొక్క' 'అధిష్టానం' అంటే స్థిరపడటం లేదా ఏర్పడటం. భయం ఈ చక్రాన్ని బంధిస్తుంది, ముఖ్యంగా మరణ భయం. భయాన్ని, మరణ భయాన్ని అంగీకరించటం ద్వారా ఈ చక్రాన్ని వికసింపచేయవచ్చు
(ధ్యాన పద్ధతి : నిర్భయ ధ్యానం : ఇది తాంత్రిక ధ్యానం నుండి గ్రహించబడినది. )
మన భయాలన్నీ కూడా మరణానికి సంబంధించిన భయాలే. కాకపోతే వేరే రూపాల్లో ఉంటాయి. అంతే మనం ప్రతి ఒక్క భయం కూడా మరణ భయానికి సంబంధించి ఉంటాయి. కానీ ఇవి మెలిక తిరిగి కనపడతాయి. అందుకే ఆ భయాలలో మనం మరణ భయాన్ని చూడలేము. భయమనేది లేనప్పుడు దీనికి సన్నిహితమైన ‘మరణం’ దాని అర్థాన్ని కోల్పోతుంది.
మరణం అంటే ఏమిటి?
ఈ ప్రశ్న నేను మిమ్ములను అడిగితే మీరు ' స్వామిజీ ! మరణం అనేది జీవితం చివరలో జరుగుతుంది అంటారు. ఒక వేళ మరణం అంటే ఇంతకుమించి వేరే ఏదీ కాకపోతే, ఇది చాలా తేలికయిన విషయం అవుతుంది.
కాని మరణం అనేది జీవితం చివరలో జరుగదు. ఇది మన జీవితంలో ప్రతి క్షణం జరుగుతుంది. మన ప్రతి పని మనకు తెలియకుండానే మరణం లేదా మరణ భయానికి సంబంధించి ఉంటాయి. మరణం మన జీవితం యొక్క శ్రేష్టతని, నాణ్యతని మార్చివేస్తుంది. ఇది చివర కాదు : ఇది మన జీవితానికి పరాకాష్ట. మన జీవితమంతా దీనివైపుగా నిర్ధేశించబడి ఉంటుంది.
నేను ఎందుకు అలా చెప్పాను?
ఎందుకంటే మన జీవితం మొత్తాన్ని కూడా మరణం అనే విషయం నియంత్రిస్తుంది. మన సమాజ నిర్మాణం కూడా ఈ మరణం అన్నదానికే అంకితమయినది.
ప్రపంచంలో గొప్ప గొప్ప మతాలు, వేదాంతాలు అన్నీ కూడా మరణం తరువాత ఏమవుతుంది?
అనే ప్రశ్నకి జవాబు చెప్పటంలోనే ఉద్భవించాయి.
ఈ ప్రశ్నకి జవాబు చెప్పటానికి, అనేక జీవిత పరిష్కారాలు అవి ఆవిష్కృతమయ్యాయి.
ఏ సంస్కృతులు అయితే ఒకే జీవితం అనే సూత్రాన్ని నమ్ముతాయో, పునర్జన్మని నమ్మవో అవి తమ శక్తి యుక్తులని జీవిత నైపుణ్యానికి ఉపయోగించాయి. ఆ సంస్కృతులు దానికి సంబంధించిన సమాచారాన్ని బాగా అర్ధం చేసుకోవటంలో, దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించటంలో, వస్తు సంబంధమైన సౌఖ్యాలలో (వాళ్ళు) అత్యున్నత ప్రగతిని సాధించాయి.
ఈ సంస్కృతులే శాస్త్రాన్ని పుట్టించాయి. శాస్త్రం మన జీవితాలను గరిష్ట స్థాయిలో జీవించటానికి సహాయకారిగా ఉంటుంది. శాస్త్రం మన జీవితం నుంచి చాలా సంపాదించగలిగేటట్టు సహాయం చేస్తుంది.
పునర్జన్మను నమ్మే సంస్కృతులు, వాళ్ళ దృష్టిని తమలోనికి మళ్ళించారు. వాళ్ళు శోధనవేరు. వాళ్ళు జీవితాన్ని కంగారుగా, హడావిడిగా జీవించటానికి ఉత్సాహం చూపరు. ఎందుకంటే వాళ్ళాకి శాశ్వతత్వం ఇవ్వబడినది.
ఈ విషయం యొక్క ఆటని మీరు మనుషుల ప్రవర్తనలో స్పష్టంగా చూడగలరు. ఇండియాలో ఏదైనా ఒక కార్యక్రమం 6.30కి ప్రారంభమవుతుంది అంటే, అది ఎట్టి పరిస్థితులలోనూ 7.30లోపు ప్రారంభంకాదు. ఎందుకంటే వాళ్ళ ముందు శాశ్వతత్త్వం (అనంతకాలం) ఉంటుంది. మన మానసిక పరిస్థితి, మన జీవన విధానము, మన సమాజము, సంస్కృతి, మతము ఇలా ప్రతి ఒక్కటీ కూడా మరణం అనే విషయం మీద ఆధారపడి ఉంటాయి. మనం మరణం గురించి ఎట్టి పరిస్థితిలోనూ ఆలోచించకూడదు అనుకుంటాము. కానీ మరణం మన జీవితంలో ప్రతి క్షణంలోనికి వ్యాపించి ఉంటుంది.
మనం మరణం గురించి లోతుగా అర్ధం చేసుకుంటే, అందులోని రహస్యాలని, అద్భుతాలని లోతుగా తెలుసుకోగలిగితే, మనం జీవిత రహస్యాలని అర్ధం చేసుకోగలుగుతాము. మనం మరణాన్ని పరిష్కరించాలి. ఇది కేవలం మరొక రూపంలోకి కొనసాగింపుగా దీనిని చూడాలి. లేకపోతే మనం జీవితాన్ని పోగొట్టుకుంటాం.
మనం మరణం అంటే కేవలం మరొక రూపంలోనికి వెళ్ళటమే అని అర్ధం చేసుకున్నప్పుడు మనం మరణానికి భయపడం. మనం మరణ భయాన్ని వదిలినప్పుడు జీవితంలో అంతకు ముందు ఎంత కోల్పోయామో మనకి తెలుస్తుంది.
మనం జీవితాన్ని మామూలుగా తీసుకొని ఏదో పైపైన బ్రతికేస్తాము. దీంతో జీవితంలో కొన్ని విషయాలు కోల్పోతాము. మరణం మనని మన జీవితంలోనికి తెలుసుకునే విధంగా చూడటం నేర్పిస్తుంది. మరణం మనకి గొప్ప గురువు.
మనం ఏదైనా ఒక విషయాన్ని నమ్మాలి అనుకున్నప్పుడు, రెండు పద్ధతులు పాటిస్తాము. ఒకటి, మనం మన మీద ప్రయోగం చేసి అందులో నిజం ఎంతో తెలుసుకుంటాం.
రెండవది : ఎవరైనా ఈ విషయంలో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని, అడిగి వాళ్ళ అభిప్రాయాలని మనం అన్వయించుకుంటాము. ఇప్పుడు మీకు ఉపనిషత్తులను ఈ విషయానికి అన్వయిస్తూ చెబుతాను.
ఉపనిషత్తులలో, కఠోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉన్నది. ఇది ఒక అబ్బాయికి, యమధర్మ రాజుకు మధ్య జరిగిన సంభాషణ. ఇది అద్భుతమైన వ్యక్తిగత భేటీ. హిందూ పురాణాల ప్రకారం మరణానికి దేవత యముడు. ఆయన మరణ శాసనకర్త. ఒకప్పుడు ఉచ్ఛైశ్రవా అనే రాజు ఉండేవాడు. ఆయనకి అకస్మాత్తుగా మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాలి, దానిని నియంత్రించాలి అనే కోరిక కలిగింది. ఆ కోరిక సాధించటానికి ఆయన ‘వాజపేయ యజ్ఞాన్ని’ చేస్తాడు. ఈ ప్రపంచాన్ని నియంత్రించాలంటే ఈ యజ్ఞాన్ని చేయాలి.
ఈ యజ్ఞ నియమాలను అనుసరించి యజ్ఞం చేసే వ్యక్తి తనకున్నవన్నీ దానంగా ఇచ్చివేయాలి. తనకి వేటితో అయితే అత్యధిక సంబంధం ఉంటుందో, ఏవయితే అధిక విలువనయిన వారి వాటినన్నింటినీ ఇచ్చి వేయాలి. అప్పుడే అతను ప్రపంచానికి ప్రభువు, పాలకుడు అవుతాడు.
రాజులు, చక్రవర్తులు మంచి వ్యాపారవేత్తలు. వాళ్ళు అలా ఉండాలి. లేకపోతే అనంతమైన ఐశ్వర్యం మీద అధికారం చెలాయించలేరు. వాళ్ళు అన్నింటికంటే తక్కువది ఇచ్చి, అన్నింటికంటే అధికమైనది పొందటానికి చూస్తారు.
ఆ రాజు జీవితపు చివరి దశలో ఉన్న ఆవులని, నిరుపయోగమైన ఆవులని, చావటానికి సిద్ధంగా ఉన్న ఆవులని దానంగా ఇచ్చేశాడు. అలా అన్నీ కూడా ఉపయోగంలేనివి ఇవ్వసాగాడు. ఆయన కొడుకు, నచికేతుడు 7 సంవత్సరాల బాలుడు, అతను జరుగుతున్నదంతా గమనించసాగాడు. నచికేత ఈ కథకి కథానాయకుడు. అతనికి తండ్రి చేసే పని సరియైనది కాదు అని తెలుసు, కానీ ఎలా అతనికి చెప్పాలో తెలియటం లేదు.
చూడండి : పిల్లలు చాలా తెలివైనవారు. చాలా చురుకైనవారు. వాళ్ళని మోసంచేయలేము. వాళ్ళని సమాజం ఇంకా కల్మషం చేయలేదు. వాళ్ళని నిర్భంధాలలో పెట్టలేదు.
మొదటి నుంచి తండ్రిని గమనిస్తూనే ఉన్నాడు నచికేత. చివరికి తండ్రి దగ్గరకి వెళ్ళి “తండ్రీ! మీరు మీ దగ్గర ఉన్న విలువైన వాటిని కదా ఇవ్వవలసినది. నేను మీకున్న అతి విలువైన వాటిలో ఒకతనిని కదా. నన్న మీరు ఎవరికి దానం ఇస్తారు,” అని అడిగాడు.
రాజుకు కొడుకు మనస్సు అర్ధమయింది. తను చేస్తున్న పని గురించి అతను ఇలా మాట్లాడుతున్నాడని అర్ధమయింది. కాని అతని అహం అతనిని ఆ పనినుంచి ఆపలేదు. అతను తిరిగి ఉపయోగంలేని వాటినే దానం ఇవ్వసాగాడు.
ఆ బాలుడు మరొక సారి అదే ప్రశ్న అడిగాడు తండ్రిని. రాజు ఏమీ సమాధానం ఇవ్వలేదు. మూడవసారి నచికేతుడు అదే ప్రశ్న అడిగాడు. తండ్రిని కుదుపుతూ నువ్వు నన్ను ఎవరికి దానం ఇవ్వాలనుకుంటున్నావు, అని అడిగాడు. రాజుకు పట్టలేని కోపం వచ్చింది. “నేను నిన్ను యముడికి ఇవ్వాలనుకుంటున్నాను. యముడి దగ్గరికి వెళ్ళు” అంటాడు.
అదే సామాన్య బాలుడు అయితే “నేనెందుకు వెళ్ళాలి? నువ్వుచాలా జీవితం గడిపావు నువ్వు వెళ్ళు” అనేవాడు
కాని నచికేత చాలా నిజాయితీ కలవాడు. మాటకి కట్టుబడినవాడు. కట్టుబాటు, నిజాయితీ అతనిని భూతంలా ఆవరించాయి. తండ్రిమాటని గౌరవించటానికి అతను యమధర్మ రాజును కలవటానికి నిర్ణయించుకున్నాడు.
గుర్తుంచుకోండి : ఈ భూమి మీద నుంచి యమధర్మరాజుని కలవటానికి వెళ్ళిన మొదటి వ్యక్తి చివరి వ్యక్తి కూడా నచికేతుడు. యముడే ప్రజల దగ్గరికి వస్తాడు.
కాని నచికేత యముడిని కలవటానికి వెళ్ళాడు. అతను యమలోకం వెళతాడు కాని యముడు అక్కడ వుండడు. ఆయన బయటకి వెళతాడు.
నచికేతుడు మూడు రోజులు ఆయన కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంటాడు.
ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ కథలో ఇక్కడ ఒక గొప్ప సత్యం స్థాపించబడినది. మనం మరణాన్ని వెతుకుతూ వెళ్ళినా లేదా మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న అక్కడ మరణం ఉండదు.
మూడు రోజులు గడిచాక యమధర్మరాజు తిరిగివచ్చాడు. ఆయన సేవకులు, ఆయనకి ఒక బాలుడు ఆయనకోసం ఎదురు చూస్తున్న విషయాన్ని చెబుతారు. వెంటనే యమధర్మ రాజు ఆ బాలుడిని కలవటానికి వెళతాడు.
యమధర్మరాజు ఆ బాలుడితో తాను అతనికి స్వాగతం చెప్పటానికి లేకపోయినందుకు క్షమాపణ కోరతారు.
ఆయన నచికేతునితో "నిన్ను నేను మూడు రోజులుగా ఎదురు చూసేటట్టు చేసాను. దానికి పరిహారంగా నీకు మూడు వరాలు ఇస్తాను కోరుకో ఆ మూడు కోరికలు తీరుస్తాను" అన్నాడు.
నచికేతకు మరణం వరాలు ఇచ్చే దేవత అయినది. అతను మూడు కోరికలు కోరాడు.
మొదటి కోరిక : "నాతండ్రి చేసిన పాపాలు పరిహారం చేయండి" అన్నాడు. యమధర్మరాజు తధాస్తు అని వరం ఇచ్చాడు.
రెండవ కోరిక : "మిమ్ములని కలసి వెళ్ళాక నా తండ్రి నన్ను స్వీకరించాలి" అది కూడా తీర్చాడు. యముడు.
మూడవ కోరిక : “మరణించాక ఏమవుతుందో నాకు చెప్పండి? కొంతమంది అంటారు మనిషి మరణించాక మళ్ళీ జన్మిస్తాడని : మనిషి చనిపోయాక మళ్ళీ జన్మించడు అని కొందరు అంటారు. ఏది నిజం?”
నచికేత ప్రశ్నకు యమధర్మరాజు నిర్ఘాంతపోతాడు.
ఆయన నచికేతతో “దయచేసి నన్ను ఈ ప్రశ్న అడగవద్దు. నీవు మరణం వెనుక ఉన్న రహస్యాన్ని అడుగుతున్నావు. అది నేను నీకు చెప్పలేను. నేను నీకు అది చెబితే నీవు జ్ఞానివి అవుతావు. నీకు ఎంత ఐశ్వర్యం కావాలంటే అంత ఇస్తాను. కానీ ఈ ప్రశ్న మాత్రం అడగవద్దు” అంటాడు.
కానీ నచికేత ఆ ప్రశ్నకి జవాబు కావాలని పట్టుపడతాడు.
నచికేత ఇలా అంటాడు. “నేను మీరు ఇచ్చే ఐశ్వర్యాన్ని తీసుకున్నాననుకోండి. నేను కేవలం మీ ఆస్తికి ధర్మకర్తను మాత్రమే అవుతాను. 100 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాల తరువాత నేను మీ సమక్షంలోకి రావలసిన వాడినే. ఆ ఐశ్వర్యం నాకు ఏవిధంగా కూడా ఉపయోగపడదు. కాబట్టి ఈ ఐశ్వర్యానికి బదులు మరణం వెనుక గల రహస్యాన్ని దయచేసి చెప్పండి” అంటాడు.
యమధర్మరాజుకి ఆ బాలుడిలో పరిణితి, సత్యాన్ని కనుక్కోవాలి అనే పట్టుదల ఉండటం గమనించాడు. ఆయన ఆబాలుడికి మరణం యొక్క అనుభవాన్ని తెలియచేయాలి, ఆ అనుభూతిని అతనికి చేతనావస్థలో పొందేట్టు చేయాలని నిర్ణయించుకున్నాడు.
యమధర్మరాజు ఇచ్చిన అనుభవానికి, అతని ఆత్మకి కలిగిన ఆ అనుభవానికి బాలుడు అయిన నచికేతుడు ఎంతో వికసించాడు. అతను జ్ఞానోదయం పొందాడు.
ఉపనిషత్తులో ఉండే ఇదొక అద్భుతమైన కథ. మీరు ఇది నిజమా! కథా ! అని విశ్లేషణ చేయకండి. ఇది ఎప్పుడు జరిగింది అని చరిత్రలో తారీఖులు చూడకండి.
ఈ కథ మనకి సత్యాన్ని వెల్లడిస్తుంది. అది చాలు. దీనిని ఒక నిచ్చెనలా చేసుకొని సత్యాన్ని చేరండి. అంతేకాని నిచ్చెన పట్టుకుని వ్రేలాడుతూ అసలు సత్యాన్ని వదిలివేయకండి.
మరణం ఒక గురువు. అదే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. సామాన్యంగా మన జీవితంలో మరణం మాత్రమే సరియైన సమయానికి వస్తుంది. మనం కనీసం ఒక్క నిముషం కూడా అదనంగా అడగలేము. మన జీవితాలలో మరణమొక్కటే మన నుంచి అన్నీ తీసుకెళ్ళగలదు. మన బంధువులని, మన ఐశ్వర్యాన్ని ఇలా అన్నింటినీ తీసుకెళుతుంది. కానీ నచికేతుని విషయంలో మరణం అన్నీ ఇచ్చింది. చివరికి జ్ఞానాన్ని కూడా ఇచ్చింది. ఎందుకు ఈ పక్షపాతం? నచికేతకు మనకు మధ్య తేడా ఏమిటి? ఒకే ఒక్క కారణం : మనం మరణం నుంచి పారపోతాం. నచికేత మరణాన్ని సమీపించాడు. ఈ అద్భుతమైన కథ నుంచి మనం నాలుగు విషయాలు అర్థం చేసుకోవాలి.
మొదటిది : మనం మరణాన్ని వెతుకుతూ వెళ్ళితే, మనం మరణానికి ఎదురుగా నిలబడితే అక్కడ మరణం ఉండదు
రెండవది : ఒక వేళ మరణం అక్కడ ఉంటే ఇది మనవి మనం అనుకునేటట్టు భయపెట్టదు. అది ప్రేమిస్తుంది, ఇస్తుంది.
మూడవది : మనకి ఎప్పుడూ కూడా మరణం గొప్ప గురువు
నాలుగవది : మరణం మనకి అంతిమ బహుమతిని ఇస్తుంది. అదే మహా జ్ఞానం
ఎందుకోగాని, చాలా మందికి జీవితం స్వాదిష్ట చక్రాన్ని దాటిపోదు. జీవితం, మరణం అంటే భయాన్ని దాటిపోదు. మనం మూలాధార చక్రానికి, స్వాధిష్టాన చక్రానికి మధ్య మరణిస్తూ జీవిస్తూ ఉంటాము. ఇంతకు మించి మనకి వేరే విధంగా జీవించటం తెలియదు. లేదా మనకి మరొక విధంగా జీవించాలనే నిర్ణయం తీసుకునే ధైర్యం ఉండదు.
పూర్వకాలంలో మనుషులు ఇప్పుడు మన జీవితానికి ఉన్నంత రక్షణ లేకుండానే జీవించేవారు. కొన్ని రకాల జబ్బులకి టీకాలు ఉండేవి కాదు. ఆ రోజులలో వాళ్ళకి ప్రకృతిలో సంభవించబోయే విపత్తులను ముందుగా హెచ్చరించే సెటలైట్స్ లేవు. కరువులకి, వరదలకి సంబంధించి ఏరకమైన రక్షణలూ లేవు. కాబట్టి మనుషులు ఎటువంటి ప్రమాదాలనైనా వాటిపైన కఠినంగా పోరాడేందుకు మానసికంగా సిద్ధంగా ఉండేవారు. అదే విధంగా మరణానికి కూడా. ముఖ్యంగా యోధులు ఎప్పుడూ మరణానికి సిద్ధంగా ఉండేవారు.
జపాన్‌లోని సమరాయ్ యోధలకు మరణాన్ని నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఎదుర్కోవటం వచ్చు. వాళ్ళు యుద్ధంలో ఓడిపోతే ఒక పొడవాటి సూదిని స్వాధిష్టాన చక్రంలోనికి గుచ్చేవారు. అది చాలా నైపుణ్యంతో చేసే పద్ధతి. దీంతో జీవించటానికి స్వాధిష్టాన చక్రంలో ఉండే శక్తి బయటకి విడుదలయిపోతుంది. అప్పుడు బాధలేని మరణం వెంటనే సంభవిస్తుంది. ఈ పద్ధతిని హరాకిరి అంటారు.
మనందరం నిరంతరం మరణ భయంతో జీవిస్తాము. మనం దీని నుంచి ఎంత కష్టపడి అయినా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాము. మరణాన్ని మనం గొప్ప శత్రువుగా భావిస్తాము.
సోక్రటీస్ గురించి ఒక చిన్న కథ : సోక్రటీస్ని విషపూరితమైన హెమలాక్ (Hem-lock) అనే మొక్క నుంచి తీసిన రసాన్ని బలవంతంగా తాగమని ఇచ్చి చంపేస్తారు. ఆయన విషం తాగేముందు, ఆయన శిష్యుడు ఒకతను ఇలా అంటాడు. “ గురుదేవా! మీకు మరణిస్తున్నాను అని భయంవేయటం లేదా? మీరు అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు?"
ఆ ప్రశ్నకి సోక్రటీస్ “ నేనెందుకు భయపడాలి? మరణం తరువాత రెండువిషయాలు జరుగుతాయి అని నాకు తెలుసు. నేను ఏదో ఒక రూపంలో కాని పేరుతో కాని జీవిస్తాను. లేదా మరణం తరువాత నేను ఉండకపోవచ్చు. మొదటిదే జరిగితే అసలు బాధే లేదు. రెండవది బాధపడటానికి ఎవరు ఉంటారు? కాబట్టి ఏ విధంగా చూసినా భయపడే విషయం లేదు " అంటాడు
సోక్రటీస్‌కి మరణం అంటే భయం లేదు. ఎందుకంటే అతనికి మరణం గురించి, దాని తరువాత జరిగే పరిణామల గురించి స్పష్టంగా తెలుసు. అందరూ మరణాన్ని ఎప్పుడు కూడా మధ్యలో నిలిచిపోయే విషయంలా చూస్తారు. అందుకు మరణాన్నిచూసి బాధపడతారు. మరణం గురించి వీరికి మౌలికమైన అర్థం తెలియదు. దానిని ప్రాథమికంగా అర్థం చేసుకోరు.
మరణం మధ్యలో ఆగిపోయే ప్రక్రియకాదు. ఇది నిరంతరం ఏదో రూపంలో సాగుతుంది. ఇది కేవలం స్వేచ్ఛ అంతే. ఈ విషయాన్ని మనిషి అర్థం చేసుకుంటే అతను మరణ విషయమై బాధ పడటం ఎంత తెలివితక్కువతనమో అర్థమవుతుంది. మనిషి తన భౌతిక రూపాన్ని అతిగా ప్రేమించుతాడు. అందుకే అంత భాదపడతాడు. కానీ ఈ శరీరం ఆత్మకి ఒక వాహనం లాంటిది. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
ఈ భూమి మీద మనిషికి నిశ్చితమైనది మరణం మాత్రమే కాని అది వచ్చినపుడు మాత్రం అతను ఆశ్చర్యపోతాడు. మనిషి విషయంలో చాలా ఆశ్చర్యంకలిగించే విషయం ఇదే.
ఒక చిన్న కథ :
ఒకామె తన వందవ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఆమె కుటుంబ సభ్యులు అంతా ఈ సందర్భంగా అక్కడ చేరారు. వాళ్ళు బహుమతులు చూపిస్తున్నారు. స్నేహితుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి వచ్చిన కార్డులు చదువుతున్నారు. ఆమెకి వాళ్ళు ఒక కార్డు చూపించారు. అది ఆమె 94 ఏళ్ళ వయసున్న స్నేహితురాలు పంపిన కార్డు. ఆకార్డు చూసి ఆమె, “ ఓ! భగవంతుడా ఈమె ఇంకా బ్రతికే ఉన్నదా!" అన్నది.
(నవ్వులు)
మనం మరణాన్ని అందరికి అన్వయిస్తాము. మనకి మాత్రం కాదు. మనందరం ఇలాగే ఉంటాం. జీవితంలో అన్నింటికి చక్కగా సిద్ధమవుతాము. మరణానికి తప్ప. మన జీవితంలో ఏదీ సంభవిస్తుంది అని కచ్చితంగా చెప్పలేము, ఒక్క మరణం తప్ప. జీవితంలో కచ్చితంగా జరిగేది మరణమే. కాని చివర మనం చెప్పుంచుకునే మాట మాత్రం “ఇప్పుడో తరువాతో, మనందరం మరణిస్తాము” అని.
భగవాన్ రమణమహర్షికి జ్ఞానోదయం ఆయన చేతనావస్థలో మరణాన్ని అనుభవించటం ద్వారా జరిగింది.
రమణ మహర్షి చిన్నప్పుడు ఒక రోజు ఆయన మధురైలోని వాళ్ళ మామయ్య ఇంట్లో మంచం మీద పడుకుని ఉంటారు. అకస్మాత్తుగా ఆయనకి తాను చనిపోతున్నట్టుగా అనిపించింది! మరణం ఆయన మీదికి వచ్చినట్టు ఆయనకి తెలిసింది.
ఆయనకి రెండు అవకాశాలుఉన్నాయి. ఆ అనుభూతిని అడ్డుకోవటం, లేదా దానిని స్వీకరించి దానిలోనికి వెళ్ళటం.
మామూలుగా అందరూ దానిని అడ్డుకుంటారు. అప్పుడు వాళ్ళు కోమాలోనికి వెళ్ళిపోతారు. తరువాత వాళ్ళకి తెలియని స్థితిలో శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. 99% మంది అచేతన అవస్థలో, తెలియనిస్థితిలో శరీరాన్ని వదులుతారు. మనకి మనం పుట్టినప్పటి నుంచి కూడా మన జీవితం మరణంతో ఉన్నత స్థితికి చేరుతుంది అని తెలిసి కూడా మనం ఎప్పుడు దానిని చూడలేము. మనం అది జరిగే అవకాశాన్ని యదార్థం చేయలేము. దానిని ఎప్పుడూ స్వాగతించము.
కనీసం ఒక్కసారయిన మీరు మీకు తెలిసేటట్టు ఆ అనుభవాన్ని పొందగలిగితే మీకు మరణం అంటే భయంపోతుంది.
రమణమహర్షి ధైర్యంగా రెండవ పద్ధతిని ఎంచుకున్నారు. ఆయన ఆ అనుభూతితో సహకరించారు. ఆయన మరణాన్ని సంభవించేలా చేసారు. మరణం సమయంలో ఏం జరుగుతుందో చూద్దాము అని అనుకున్నారు.
ఆయన ఒక భాగం తరువాత ఒక భాగం మరణించటం స్పష్టంగా చూసారు. మెల్లగ ఆయన శరీరం చనిపోయింది. ఆ శరీరం బూడిదగా మారటం చూసారు. ఆకస్మాత్‌గా ఆయన ఇంకా ఏదో సజీవంగా ఉండటం చూసారు.
అది నాశనం కానిది అని తెలుసుకున్నారు. అదే ఆయనను పూర్తి మెలకువ స్థితిలో ఉన్నావని చెబుతూ తట్టింది. అది శరీరం, మనస్సులకు అతీతంగా ఉంది. ఆయన దీనినంతా అలా చూస్తూనే ఉన్నారు. ఆ జ్ఞానం అద్భుతం. అది ఆయనను ఆ తరువాత వదలలేదు. ఆయన తిరిగి తన శరీరంలో ప్రవేశించాక, రమణ అనే ఆయన భగవాన్ రమణ మహర్షి మహాజ్ఞాని అయ్యారు.
మీరు మరణ భయాన్ని జయించితే మరణాన్ని జయించినట్టే. ఎందుకంటే మరణం మరొక ఊహ మాత్రమే. ఎలా అయితే మూలాధార చక్రంలో మన అత్యాశని ఎలా అయితే ప్రపంచం ఉన్న దానికంటే అందంగా ఉన్నట్టు ఊహల్లో నివశింపచేస్తుందో, అలాగే మరణ భయం కూడా దాని అసలు రూపం కంటే ఎక్కువ భయాన్ని కలుగ చేస్తుంది.
మనం అత్యాశ, భయం అనే కళ్ళ అద్దాలు పెట్టుకుంటాము. అవి మనం నిజాన్ని చూడకుండా చేస్తాయి. మీరు ఎప్పుడయితే మానసికంగా మరణాన్ని అనుభవిస్తారో అప్పుడు స్వాధిష్ఠాన చక్రంలో మరణ భయం వలన బంధించబడిన శక్తి విడుదల అవుతుంది. ఎప్పుడయితే స్వాధిష్ఠాన చక్రం తెరవబడుతుందో, మీ జీవితంలో నాణ్యత పూర్తిగా మారుతుంది.
మరణం అంటే మరొక రూపంలోనికి మారే నిరంతర ప్రక్రియఅనే విషయాన్ని అర్థం చేసుకొని, దానిని మీరు సమ్మతించగలిగితే, అప్పుడు జీవితాన్ని ఆనందంగా గడపగలిగే సామర్థ్యం ఉంటుంది. మీ శరీరమంతా విరామంలో ఉంటుంది. మీరు ఒప్పుకున్నా లేకపోయినా మరణ అభయం మీ జీవితంలో ప్రతి క్షణం మీ అచేతనావస్థలో ఉంటుంది. మీరు మరణాన్ని, మరణ భయాన్ని అర్ధం చేసుకోగలిగితే మీ జీవితం సంవృద్ధిగా ఉంటుంది. ఐశ్వర్యంతో కాకపోయినా సంతృప్తిగా ఉంటుంది. సంవృద్ధి అనేది జీవితానికి ముఖ్యం.
కానీ ఈ విషయం నేను ఇప్పుడు మీకు చెబితే మీరు నమ్మరు. ఇది ఏదో చేయలేని పని అని అంటారు.
చిన్నకథ :
ఒక వ్యక్తి పుట్టుకతో అంధుడు. డాక్టరు అతనికి చూపు వస్తుంది అని చెబుతాడు. డాక్టరు అతనితో " ఈ ఆపరేషన్ అయ్యాక నీవు చూడగలవు. అప్పుడు నీవు ఈ కర్రని ఉపయోగించనవసరం లేదు" అని అంటాడు.
ఈ మాట వినగానే అతనికి భయం చేస్తుంది. అతను డాక్టర్ తో అంటాడు " డాక్టర్ నేను చూడగలను అన్న మాట నాకు అర్ధమయింది. కానీ కర్ర లేకుండా నేను ఎలా నడవగలను?"
కర్ర అనేది అతనిలో ఒక ముఖ్య భాగమయిపోయింది. అతనికి చూపు వచ్చాక కూడా కర్ర లేకుండా ఎలా నడవాలి అనే విషయాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నాడు. అతనికి ఎలా వివరించాలి చూపు వచ్చాక కర్ర అవసరం లేదని అతనికి అర్ధమయ్యేట్టు ఎలా చెప్పాలి. ప్రస్తుతం అతను చాలా భయపడుతున్నాడు. కాబట్టి మనం చేయగలిగింది ఒక్కటే. అతనికి ఆపరేషన్ చేయాలి. అతనికి చూపురావాలి. అతను తనంత తానుగా చూడగలగాలి. అంతే. తనంత తానే అతను ఆ కర్రని పారవేస్తాడు.
ఇదే విధంగా నేను మీకు చెప్పినా : మీ భయాలన్నీ కూడా చివరికి మరణానికి సంబంధించినవేనని, మీ ఆత్మ మాత్రం శాశ్వతమైనది అని, కేవలం మీ శరీరం మాత్రమే మరణిస్తుంది అని చెప్పినా మీకు ఉండే భయాలు మీకు ఉంటాయి. మీరు వాటిని పట్టుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మీకు అనుభవం లేదు కాబట్టి మరణం అనేది మీకు తెలిసే స్థితిలో అనుభవం అయితే తప్ప మీకు ఆ భయంపోదు. కానీ మీరు ఒక పని చేయవచ్చు, మీరు ఈ మాటలు చాలాసార్లు వినండి. వాటిని పూర్తిగా అర్థం చేసుకుని మనస్సులో స్థిరపరచుకోండి. మీలోని చిన్నా పెద్దా భయాలు నిజానికి మరణానికి ఎలా భయపడుతున్నాయో చూడండి. మీకు నిత్య జీవితంలో ఉండే భయాలను స్పష్టంగా చూడండి. మీ భయాలన్నీ ఒక దానికి ఒకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయో గమనించండి. మీ భయాలలోనికి యదార్థతను తీసుకురండి. అప్పుడు మీరు స్థిరంగా వికాసంపొంది సత్యానికి దగ్గరగా వస్తారు మనం మనకున్న భయాలని అయిదుతరగతులుగా విభజించవచ్చు.
మొదటిది : మన ఐశ్వర్యం, సౌకర్యాలు, పేరు ప్రతిష్టలు ఇలా మిగతా ప్రాపంచిక వస్తువులు పోతాయేమోననే భయం
రెండవది : మన ఆరోగ్యం, మన శరీరంలోని కొన్ని భాగాలను ప్రమాదంలో పోగొట్టుకుంటాము అనే భయం, ఆరోగ్యం పాడవుతుందేమో అనే భయాలు.
మూడవది : మన మానసిక ఆరోగ్యం పాడవుతుందేమో అనే భయం. మానసిక స్థిరత్వcomposed|స్థిరత్వంపొతుందేమో అనే భయం
నాలుగవది : మనకి ఇష్టమైన వాళ్ళని, వాళ్ళ ప్రేమని పోగొట్టు కుంటామేమో అనే భయం.
అయిదవది : తెలియని భగవంతుడంటే భయం. భూతాలు, దయ్యాలు అంటే భయం. మరణం అంటే భయం
ఈ అయిదురకాల భయాలని విశ్లేషణ చేస్తే, ఈ అన్ని భయాలు కూడా మరణం అంటే ఉన్న భయం మాత్రమే. కాకపోతే ఆ మరణ భయం వేరు వేరు రూపాల్లో ఉంటుంది.
మరణం అంటే భయపడటానికి ముఖ్య కారణం, వాళ్ళు వాళ్ళ జీవితాలలో పూర్తిగా జీవించలేదు. వాళ్ళు చాలా నిరాశ చెందుతారు. ఎందుకంటే జీవితాన్ని సరిపడా జీవించలేదనే భావన. వాళ్ళు ఇలా భావించటానికి కారణం వాళ్ళు జీవితమంతా కూడా కేవలం జ్ఞాపకాలలో నివసించారు. భవిష్యత్ గురించి ఆందోళనలోను, ఇతరులకోసం జీవించారు. కానీ వర్తమానంలో జీవించలేదు.
మన ప్రతి చర్యా కూడా ఒకరికొకరు, ఎదుటివారి అహంకారాన్ని, కోరికలని, భావావేశలని లాగటం తీయుటం వలన కలిగినవే అంటే మన ప్రతి పని ఎదుటివారి అహంకారం, కోరిక, భావావేశాల ఫలితమే. మీరు మీ జీవితాలని లోతుగా విశ్లేషణ చేసుకుంటే, నేను ఏం చెప్పటానికి ప్రయత్నిస్తున్నానో మీకు అర్థం అవుతుంది. మీ తల్లిదండ్రులు వదిలేసిన దగ్గర మీరు మీ జీవితాన్ని ప్రారంభిస్తారు. మీరు కేవలం వారసత్వపు కోరికలని, అపరాధభావాన్ని, భయం మొదలయిన వాటిని వారి దగ్గర నుంచి తీసుకుంటారు. ఇవన్నీ వాళ్ళు మీకు వదిలివెళతారు. వీటిని ఒక తరం నుంచి మరొక తరానికి అందించి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే. అందువలన మీరు పూర్తిగా జీవించలేరు.
పూర్తిగా జీవించలేదు, అంటే అర్థం ఏమిటి? పూర్తి స్పష్టతతో జీవించటానికి ప్రయత్నించండి. అంతే చాలు ఎదుటివారు మీ మీద ఏదైతే మోపాలనుకుంటున్నారో వాళ్ళని అందులో కొంత అర్థాన్ని చూడగలిగేట్టు చేయండి. స్పష్టతలో మీరు మీ కోరికలని చక్కగా గుర్తించగలుగుతారు. స్పష్టత ఉన్నప్పుడు ఎదుటివారు మీ మీద మోపిన కోరికలని, మీరు వాళ్ళ నుంచి తెచ్చుకున్న కోరికలని స్పష్టంగా చూడగలుగుతారు. మీరు మీ కోరికలని మాత్రం తృప్తిపరచుకుంటే చాలు. అది కూడా ఎదుటివారికి కాని, వారి ఆస్తి పాస్తులకు కాని ఎటువంటి హాని కలగకుండా మీ కోరికలను తృప్తిపరచుకోవాలి. ఈ స్పష్టత సహాయంతో రెండవరకం కోరికలని వదిలివేయాలి. రెండవరకం అంటే ఎదుటివారి నుంచి మనం అనుకరించేవి.
మీరు ఈ విధంగా జీవించ గలిగితే మీరు ఎదుటివారి కోరికలు తీర్చుకోనవసరం లేదు. మీరు ఎదుటి వారి జీవితాలలో జీవించనవసరం లేదు. మీరు మీ జీవితాన్ని జీవిస్తారు. పరిపూర్ణతని అనుభవిస్తారు. మీరు సమయము వచ్చినప్పుడు మరణానికి సిద్ధపడతారు. మీకు మరణం గురించిన తికమకలు, ఆందోళనలు ఉండవు. మిమ్ములని స్వార్థపరులుగా ఉండమని నేను అనటం లేదు. నేను కేవలం మీ పూర్తి వ్యక్తిత్వానికి స్పష్టత తీసుకురమ్మని చెబుతున్నాను.
ఒక కథ :
ఒక సారి ఒక బౌద్ధ సన్యాసికి రాజు మరణ శిక్ష విధించాడు ఆయనకి మరునాడు శిక్ష అమలు చేయాలి. ఆ సన్యాసి ఆందోళన లేకుండా నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉన్నాడు.
ఆయన శిష్యుడు ఒకతను తన గురువు యొక్క నిశ్చలతను చూసి నిర్ఘాంతపోయాడు. శిష్యుడు ఆయనని ఇలా అడిగాడు. “మీరు ఇంకా 24 గంటలు మాత్రమే జీవిస్తారు అనే సంగతి మీకు తెలుసా? మీకు భయం వేయటం లేదా ?” దానికి, “నేను జీవించాను. అందుకే నాకు మరణం అంటే భయం లేదు” అన్నాడు. ఆయన చెప్పిన మాటకి అర్థం “ నేను ప్రతి క్షణం నా జీవితాన్ని జీవించాను. ప్రతి క్షణం నాకు ఎంతో విలువయిన జీవితాన్ని ఇచ్చింది. ఇక నేను ఎందుకు భయపడాలి?”.
మీరు మీ అంతరంగపు లోతుల్లోనికి చూడగలిగితే, మనలో చాలా మందికి మరణం అంటే భయం ఉండదు. కాని మనకు మన జీవితాన్ని సరిపడా జీవించలేదనే భయం ఉంటుంది. మనం అబద్ధపు జీవితాన్ని గడిపామనే భయం ఉంటుంది. మనం కోరుకున్నట్టుగా జీవించలేదని అనుకుంటాము. మనం సంపూర్ణతని పొందలేదని బాధపడతాము. ఇక్కడే మరణం అంటే భయం మొదలవుతుంది.
నిరంతరం ఎదుటివారికోసం సర్దుకుపోవటం, మనకి సహజం కాని జీవితాన్ని జీవించటం, సమాజం తయారు చేసిన మూసలోనికి ఇమడటానికి ప్రయత్నించటం...
ఇలా ఇవన్నీ కూడా మనకి సంపూర్ణమైన తృప్తిని లేకుండా చేస్తున్నాయి. జీవితం అంటే ఉండే భయం, మరణ భయంలో ప్రతిబింబిస్తుంది.
మీరు ఎప్పుడయితే మీకు అనుగుణంగా, మీకు చేతనయిన విధంగా లోతుగా జీవించి ఉంటే మీరు సంతృప్తి పొందుతారు. అప్పుడు మరణం అంటే భయం ఉండదు. భయం లేకుండా జీవిస్తారు. లోతైన వ్యక్తిత్వంతో, మీరు జీవించగల స్థాయిలో జీవించండి. మీరు పూర్తి సంతృప్తినిపొందే విధంగా జీవించండి. అప్పుడు మీకు మరణం అంటే భయం ఉండదు.
చూడండి: మీరు ఎవరినైనా పోగొట్టుకున్నప్పుడు బాధపడతారు. ఎందుకంటే ఆ సంబంధంలో మీరు మీ జీవితంలో ఎక్కడైనా, ఎలా అయినా న్యాయం చేయలేదు అనిపించినప్పుడు అలా అనుకుంటారు. ఆ బంధంలో సంపూర్ణంగా లేము అనుకుంటారు. అందుకే ఆవ్యక్తిని అలా వెళ్ళనీయరు. భౌతికంగా దూరం అవటం అనేది భయంలో ఒక భాగం మాత్రమే. నిజమైన కారణం మాత్రం ఆ సంబంధాన్ని సంతృప్తిగా పూర్తిగా నిర్వర్తించకపోవటం
న్యాయం చేయటం అనే మాట ఈ సంబంధాలలో ఎందుకు వస్తుందంటే, మనం నిరంతరం ఇతరుల కోసం జీవించటం, వాళ్ళ కోరికలు, అవసరాలు తీర్చటం మాత్రమే నేర్చుకున్నాం. మనకి సమాజం అదే నేర్పించింది. మీరు ఎప్పుడూ ఈ సంబంధాలకి ఇలాంటి పనులు చేస్తూ న్యాయం చేయాలని అనుకుంటారు. ఎప్పుడయితే ఈ పనులు చేయరో మీరు అపరాధ భావం, భయం అనే వలయంలో చిక్కుకుంటారు. మీరు సమాజం యొక్క ఆటని స్పష్టంగా, లోతుగా చూడగలిగినప్పుడు మీరు ఇటువంటి నిర్బంధాల గుప్పిళ్ళలో చిక్కుకోరు.
అలాగే ఈ సంబంధాలలోని ప్రేమని కోల్పోనవసరం లేకుండా మీరు పూర్తి సంతృప్తితో జీవించవచ్చు. ఈ విషయాన్ని మనం అనాహత చక్రం గురించి నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాము. భౌతికంగా దూరం అవుతున్నామన్న భయం కేవలం అపరాధభావం వలననే ఉంటుంది. మీరు సంపూర్ణంగా , జీవించినప్పుడు స్వచ్ఛమైన ప్రేమతో కూడిన శక్తిని ఇతరులకు చూపించినప్పుడు ఎప్పుడైతే ఆ సంబంధం ఒక వ్యవహారంగా ఉండదో, అప్పుడు ఈ అపరాధ భావాలు ఉండవు. భౌతికంగా దూరమవుతారు అనే భయం ఉండదు. ఆ వ్యక్తి చనిపోయిన, ఆ వ్యక్తి పట్ల మీ ప్రేమ అలానే ఉంటుంది. అప్పుడు భౌతికంగా దూరమవుతామనే భయం ఉండదు. అంతే.
మీరు ఒక వ్యక్తితో నివసించేటప్పుడు స్పష్టతతో, వాస్తవంలో ఉండగలగాలి. చాలాసార్లు ఈ సంబంధాల విషయంలో బాధలు కలిగేది అభద్రతా భావం వలన. అప్పుడే వారి నుంచి దూరం అవుతామనే భయాన్ని పట్టుకుని వేలాడతాము. ఏ సంబంధాన్నైనా మీరు లోతుగా విశ్లేషణ చేస్తే మీకు ఒక విషయం అర్ధమవుతుంది. అది ఈ సంబంధాలన్నీ కూడా ఒకరకంగా వ్యవహారాలవంటివే. అందుకే అందులో భయం ఉంటుంది.
భార్య భర్తకి మధ్యఉండే భయం, వాళ్ళు ఈ వివాహ బంధానికి బయట ఏదైనా వెతుకుతారేమోనని, తల్లీ కొడుకుల మధ్య ఉండే భయం, కొడుకు తనకంటే ఎక్కువగా భార్య మీద శ్రద్ధ చూపుతాడేమోనని, తండ్రీ కొడుకుల మధ్య ఉండే భయం, తండ్రి తనకు ఆస్తి పూర్తిగా ఇవ్వడేమోనని కొడుకు : కొడుకు కుటుంబ బరవు భాధ్యతలు, పరువు ప్రతిష్టలు తన భూజాలపై పెట్టుకోడని తండ్రి భయం.
ఇలా ప్రతి సంబంధంలోనూ ఎదో ఒక ముఖ్యమైనది ఆశించటం అనేది ఉంటుంది. దానిని తృప్తి పరచాలి. జాగ్రత్తగా కాపాడాలి. ఇదే భయాన్ని కలిగిస్తుంది. మీరు ఏ బంధాన్ని కూడా పూర్తిగా తృప్తిపరచలేరు. ఎవరైనా తన కుటుంబంలోని అందరినీ ఆనందింపచేయాలి అని ప్రయత్నించితే వాళ్ళు ఆ కుటుంబాన్ని వదిలివేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు.
ఒక వేళ ఈ సంబంధాలు, స్వచ్ఛమైన ప్రేమ మీద ఆధారపడి ఉండి, ఎటువంటి ఉద్దేశాలు అందులో లేకపోతే ఆ ప్రేమ మన అనాహత చక్రం గురించి తెలుసుకున్నప్పుడు చెప్పిన ప్రేమ వంటిది అయితే, అందులో భయం అనే మాట ఉండదు.
మీరు ఎప్పుడయితే భయం నుంచి ప్రేమలోనికి మారతారో అప్పుడు మీరు ఎంత స్వేచ్ఛను పొందుతారో మీకు తెలియదు. భయం మనలని ఎప్పుడూ బంధించుతుంది. ప్రేమ మనకి స్వేచ్ఛని ఇస్తుంది. సమాజం మీలోనికి భయాన్ని పంపిస్తుంది. ఎందుకంటే మీలోభయాన్ని నింపితేనే మీరు సమాజం మాటవింటారు. ఈ భయాన్ని సమాజం మీకు అందుబాటులోని అన్ని మార్గాల ద్వారా పంపిస్తుంది. అభద్రతా భావం, నిబంధనలు, ఆరాధనలు, పూజలు ఇలా ఎన్నో రకాలుగా చేస్తుంది.
సమాజం మీ నుంచి ఉత్తమ పురుషులని (ఋషులని) తయారు చేయటానికి ప్రయత్నిస్తుంది. ఈ ఉత్తమ పురుషులు ఈ అనంత ఉనికి భయపడతారు. ఎప్పుడూ ప్రతి విషయానికి భయపడతారు. నేను ఇక్కడ మిమ్ములని ఉత్తమ పురుషులుగా చేయటానికి లేను. నేను మిమ్ములని పరమానంద భరితులని చేయటానికి ఉన్నాను. మీరు సంపూర్ణంగా జీవిస్తారు. మీరు జీవకళతో చురుకుగా, పరాకు లేకుండా ఉండగలగుతారు.
సంబంధాలలో ఉండే భయం అసూయగా కూడా మారుతుంది. ఈ భయం అనేది మన చర్యలకి భావావేశాలకి కారణం. అసూయ, కోపం, అత్యాశ ఇలా ఎన్నో ఆవేశాలకి మూలం భయం. కానీ మనకి ఈ విషయం తెలియదు. భయమే ఇటువంటి లక్షణాలకి కారణం అని మనకి తెలియదు. అది అసలు సమస్య. అందుకే మన ప్రవర్తనాక్రమానికి సంబంధించి మనము నిరంతరం ఆ చీకటిలోనే ఉంటాము. అందుకే సంబంధాలు పెద్ద మానసిక గాయాలుగా మారతాయి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి : భయం, ప్రేమ ఎప్పుడూ కలసి ఉండవు.
బంధాలలో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే అందులో భయం అసలు ఉండదు. భయమున్నచోట స్వచ్ఛమైన ప్రేమ అసలు ఉండదు. స్పష్టంగా తెలుసుకోండి. ఏదైనా బాంధవ్యాలలో స్వార్ధపూరిత ఇష్టాలు ఉన్నా ఏవైనా లక్ష్యాలు ఉన్నా, ఆకాంక్షలు ఉన్నా, భద్రత కావాలి అనే ఆశ ఉన్న అత్యాశ ఉన్నా అక్కడ భయం స్థిరపడుతుంది.
మనం ప్రతి సమయంలోను భద్రతని ఆశించుతాము. మనం సౌకర్యంగా స్థిరపడటానికి భద్రత కావాలి. ఇది ఒక విధమైన నిర్భంధంలాంటిది. దానికి మనం ఆనందపడతాము. ప్రజలు స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. కానీ నేను చెబుతున్నాను. వాళ్ళు దానికి భయపడతారు. వాళ్ళకి బంధింపబడటమే ఇష్టం. వాళ్ళు నిర్భంధం అనే మెత్తటి పరుపులాంటి జైలులో స్వేచ్ఛగా ఉన్నామనుకుంటారు.
ఒక చిన్న కథ :
ఒక అమ్మాయి వాళ్ళా నాన్నగారిని ఒక రోజు ఇలా అడిగింది “నాన్నగారు అభయం అనే పదానికి అర్ధం ఏమిటి?” అని
దానికి ఆమె నాన్నగారు “ దాని అర్ధం ఏమిటంటే, ఏదైనా బాగా చేస్తే అది చాలా కాలం ఉంటుంది. అని చెప్పటం”
ఆరాత్రి ఆ అమ్మాయి నిద్రపోయే ముందు ఇలా అన్నది “ గుడ్‌నైట్ అభయమిచ్చే నాన్నగారు”
మనందరం మన జీవితంలో నిరంతరం భద్రత కోసం చూస్తుంటాము. కానీ మనం ఏమని చెబుతామంటే మనం ఎందుకు రక్షణ కోసం చూస్తాము? భయం ఎందుకు ? మీకు ఎంత కాలం భయమనేది ఉంటుందో అంత వరకూ రక్షణ కోసం చూస్తుంటారు. అంత వరకూ మీరు నాకు స్వేచ్ఛకావాలి అని చెబుతూ మిమ్ములని మీరు భ్రమలో ఉంచుతారు.
ఒక్క గురువు మాత్రమే అభద్రతని మీ జీవితంలో కల్పించుతాడు. ఆయన మాత్రమే మీకు పూర్తి స్వేచ్ఛని ఇవ్వగలడు. అందుకే అతని సమక్షంలో మీరు అభద్రతగా ఉంటారు. మీరు భయపడతారు. స్వేచ్ఛ భయాన్ని సృష్టిస్తుంది.
అదే మామూలు సంబంధాలలో అంత అభద్రతని అనుభవించరు. ఎందుకంటే అక్కడ అత్యాశ, కోపం, భయం అనేవి ముందుకి వెనక్కి వస్తుపోతూ ఉంటాయి. అలా వచ్చిపోయి అవి మిమ్ములను ఆ సంబంధాల క్రమంలో సర్దుకునేటట్టు చేస్తాయి. కాని గురువు సమక్షంలో మీరు పూర్తి స్వేచ్ఛతో ఉంటారు. అందుకే భయపడతారు.
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తి 20 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. ఒక రోజు అతనిని విడుదల చేస్తారు. ఆ విడుదల రోజున అతను చాలా ఆందోళనగా కంగారుగా కనపడతారు.
ఆ జైలులో ఉండే అతని స్నేహితుడు అతనిని ఇలా అడుగుతాడు. "నీకు ఏం అయింది. ఎందుకు అలా బాధగా ఆందోళనగా ఉన్నావు?" అంటాడు. దానికి ఆ వ్యక్తి "నాకు భయంగా ఉంది. నేను బయటికి వెళ్ళినపుడు ఏమి చేయాలో తెలియక భయపడుతున్నాడు". ఇదే రక్షణ క్రమంలో చిక్కుకుపోతే మనకు జరిగే ప్రమాదం.
గురువు మీకు మీరు ఎదురు చూసే రక్షణ ఇవ్వడు. అటువంటి తీరు తెన్నులు మనకి కల్పించడు. ఎప్పుడయithe మీరు ఎదురు చూసే భద్రత ఇవ్వబడలేదో, అప్పుడు మీరు మీ దృష్టిని, ఏకాగ్రతని మీ అంతరంగపు లోతులపై ఉంచుతారు. అప్పుడు భయం లేకుండా మీరు ఎదుగుతారు. ఎందుకంటే మీకు అక్కడ పోగొట్టు కోవటానికి ఏదీ లేదు అని అర్ధం అవుతుంది. ఎప్పుడయితే ఈ విషయం మీకు అర్ధమవుతుందో మీలో భయం పోతుంది. మీ లోపల పోగొట్టుకోవటానికి ఏమీ లేదు అనే విషయాన్ని మీకు చూపించటానికి గురువు మీకు పూర్తి అభద్రతని కల్పించుతాడు. మీ మీదుండే అవ్యాజమైన కరుణతో, మీ అభివృద్ధి పట్ల ఆయనకి ఉండే అత్యధికమైన
శ్రద్ధమూలంగా ఆయన మీకు భద్రతని ఇవ్వరు. ఎప్పుడయితే మీకు లౌకికమైన (ప్రాపంచిక) రక్షణ లేదో మీరు భగవంతుని చూడగలరు. మీకు ఈ బ్రహ్మాండ సృష్టి, అనంత ఉనికి అంటే ఏమిటో అర్థం అవుతుంది.
మన భయాలన్నీ కూడా మనం పోగొట్టుకోవటానికి అక్కడ ఏమీ లేదు అనే విషయం స్పష్టంగా మనకి తెలియకపోవటమే. ఎవరయితే, మరణాన్ని దగ్గరగా ఎదుర్కొంటారో, వాళ్ళు అక్కడ పోగొట్టుకోవటానికి ఏదీ లేదు అని, మీ భయాలన్నీ ఆధారంలేనివని చూపించుతారు. గురువులు ఈ విషయాన్ని ఆయన మార్గంలో మీకు అర్థమయ్యేలా చేస్తారు.
అందుకే గురువు దగ్గర నుంచి పారిపోవటానికి ప్రయత్నించకండి. ఆయన ఇక్కడ ఉన్నది కేవలం మిమ్ములని మీకు అసలు ఏమిటో చూపించటానికి అని అర్థం చేసుకోండి. మీ సహజమైన స్వభావము భయం లేకపోవుటం. కానీ ఎన్నో సంవత్సరాలుగా మీలో పేరుకుపోయిన ఆ పొరలని జాగ్రత్తగా తొలగిస్తారు. ఆయన మీపై ఆ పని చేయటానికి అంగీకరిస్తే, ఆయన మీద నమ్మకంతో ప్రేమతో ఒప్పుకుంటే, ఆయన మిమ్ములని మీ కళ్ళ ఎదుటే పూర్తిగా మారుస్తారు.
నాకు పరిచయమయిన ఒక స్వామి గురించి మీకు చెబుతాను.
ఈ స్వామి చాలా గడియారాలను తన గదిలో ఉంచేవారు. ఒక్కొక్క గడియారం ఒక్కొక్క టైం చూపిస్తాయి. ఈ విషయం గురించి ఆయనను నేను ఒక రోజు అడిగాను. దానికి ఆయన ఇలా చెప్పారు. "టైం నా యజమాని కాదు! నేను టైం యొక్క యజమానిని. నాకు ఏ టైం కావాలంటే ఆ టైంని ఆ గడియారం నుంచి తీసుకుంటాను" అని చెప్పారు.
ఈ స్వామికి తాను ఎప్పుడు ఈ శరీరాన్ని వదులుతారో ఆరోజు, ఆ టైం ముందే తెలుసు. ఆయన మరణానికి ముందు రాత్రి ఆయన తన శిష్యులందరినీ తన దగ్గరకి రమ్మని చెప్పి తన చుట్టూ ఉండి పాటలు పాడమని అడిగారు.
ఒక శిష్యుడికి తన సంగీతం పట్ల కొంచం గర్వం ఉండేది. అతను అప్పుడు పాడలేదు. వాళ్ళ పద్ధతి ప్రకారం స్వామి ఒక కాగితం మీద ఏదో రాసి ఆ శిష్యుడికి పంపించారు. ఆ శిష్యుడు ఆనందపడి అది తనని ఏదో ప్రత్యేకమైన పాట పాడమనే అభ్యర్థన అనుకున్నాడు. కానీ అతను ఆ కాగితం విప్పిచూస్తే అందులో స్వామి ఇలా రాసారు “దయచేసి నేను మరణించాక నీవు పాడవద్దు”
ఆయన తన మరణ శయ్య మీద కూడా ఎంతో హాస్యమైన మానసిక స్థితిలో ఉన్నారు. ఆ రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన తన శిష్యులకి చాలా జాగ్రత్తలు చెప్పసాగారు. ఆశ్రమంలో ఉండే అనాధపిల్లలను జాగ్రత్తగా చూసుకోమన్నారు. రేపు ఉదయం మీరు నా అంతిమ సంస్కారాలకి తయారు చేయటంలో పూర్తిగా మునిగిపోయి ఉంటారు. కాబట్టి పిల్లలకి, భోజనాలు సమయానికి పెట్టటం మరచిపోవద్దు” అని అన్నారు.
చివరి నిమిషం వరకు ఆయన తను వదిలివెళుతున్న వాళ్ళ మీద శ్రద్ధ, అభిమానంతో ఉన్నారు. మర్నాడు ఆయన చెప్పిన టైంకి, ఆయన నమస్కారం చెబుతున్న పద్ధతిలో చేతులు, జోడించారు. మెల్లగా పడిపోయాయి. ఎంత అద్భుతమైన, అందమైన, నిశ్చలమైన, ధైర్యమయిన పద్ధతిలో ఆయన మరణాన్ని సమీపించారో కదా! మనందరం ఆ విధంగా మరణాన్ని సమీపించాలి. మన బంధువులు, మన కుటుంబ సభ్యులు మరణించినప్పుడు కూడా మరణాన్ని మనం అదే విధంగాచూడాలి. మీరు దానిని అర్థం చేసుకుంటే భయం అనే మీ భావన పూర్తిగా కరిగిపోతుంది. ఎందుకంటే మీకు నేను చెప్పాను. అన్ని భయాలకి ఆధారం మరణమే కాబట్టి
ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా?
ప్రశ్న : స్వామీజీ! ఈ భయం ఎక్కువగా స్త్రీలలోనే ఉంటుందా?
చూడండి పురుషులు ఎక్కువగా మూలాధార చక్రంలో చిక్కుకుని ఉంటారు. స్త్రీలు స్వాధిష్ఠాన చక్రంలో చిక్కుకుంటారు. అందుకే పురుషులకి కోరిక ఎక్కువ. స్త్రీలకి
భయం ఎక్కువ. అసలు విషయం ఏమిటంటే ఈ విషయం ఇద్దరికీ తెలుసు. దాంతో వాళ్ళు అనువైన విధంగా ఒకరిని ఒకరు అతిగా ఉపయోగించుకుంటారు.
పురుషునికి స్త్రీ బలహీనత ఎక్కడో చూసి అక్కడ పట్టుకుంటాడు. ఆమె అభద్రతతో భయంతో ఆడుకుంటాడు. ఆమెను స్వార్ధానికి అతిగా వాడుకుంటాడు. వివాహంలో నిరంతరం జరిగేది ఇదే.
హిందూ వివాహ పద్ధతిలో దంపతులచేత ఒక ప్రమాణం చేయించుతారు. అది ఏమిటి అంటే మన ఇద్దరం కూడా మన కర్మలని పూర్తిగా అంతం చేయటానికి కలిసి పనిచేద్దాము అని. ఇవి తీరని కోరికలు. వీటిని సున్నితంగా, ఇంకా జీవితంలో ఎటువంటి కర్మలూ పోగుచేసుకోకుండా వీటిని పోగొట్టటం అని అర్థం. కాని ఈ రోజుల్లో ఎవరికీ కూడా అటువంటి ప్రమాణాలు చేసినట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మొత్తం వివాహతంతునంతా పూజారులే జరిపించేస్తున్నారు. అనవలసిన ప్రమాణాలు కూడా వాళ్ళే చేస్తున్నారు.
ఇది చాలా చక్కని ప్రమాణం. చూడండి : మనకి కావలసినన్ని కర్మలని మన జీవితంలో జమ చేసుకున్నాము. మన శ్రద్ధ అంతా కూడా వాటిని ఎలా తొలగించుకోవాలి అని ఉండాలి. కనీసం ఈ జన్మలోనైనా ఆ కర్మలని తొలగించుకుని స్వేచ్ఛని పొందాలి.
కానీ మనం ఏమి చేస్తున్నాము? ఒకరినొకరు దోచుకుంటున్నాము. జిత్తులుమారి ఆటలు ఆడుతున్నాము. అలా ఒకరికి ఒకరు కర్మలని ఇంకా కలుపుకుంటున్నాము. మీరు ఈవివాహం అనే డ్రామాని బయట నుంచి చూస్తే ఒకరికి ఒకరు ఎలా కర్మలను సృష్టించుకుంటున్నారో అర్ధమవుతుంది. చివరికి ఈ ప్రపంచాన్ని నిందిస్తారు. మీరు బయట నుంచి చూస్తే తెలుస్తుంది. ఇది చాలా తెలివి తక్కువ ఆట అని. నేనెప్పుడూ చెబుతుంటాను. యాక్టర్స్ కి జీవితాన్ని ఒక ఆటగా చూడటం చాలా తేలిక అని. వాళ్ళు ఎప్పుడూ కూడా పాత్రలని ఊహించి అందులో నటిస్తుంటారు. వాళ్ళు జీవితాన్ని ఒక నాటకంలా చాలా దగ్గర నుంచి చూస్తారు. మనం మన పాత్రలో ఎంతగా ఇమిడిపోతామంటే అవే మనకి గట్టి నిజాలవుతాయి.
స్త్రీలు చాల భయస్తులు ఎందుకంటే వారి మానసిక వ్యవస్థ అలా నిర్మించబడింది. స్త్రీ పురుషులు భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా వేరుగా ఉంటారు.
ప్రశ్న: స్వామీజీ! ఈ చిన్న చిన్న భయాలనుంచి మేం ఎలా బయటపడాలి?
ముందుగా ఈ భయాలన్నీ కూడా మరణం అంటే ఉండే భయం తాలూకా ముందుకు వచ్చే ప్రతిరూపాల పథకాలు, అలాగే భయాన్ని ఆపకండి. మీలో మీరే పదే పదే 'నాకు భయం ' అనుకోండి. దాని గుండా ఆలోచించండి. అంతే త్వరలోనే ఆ భయం మీలోంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు దాన్ని చూసారు కాబట్టి. మీరు ఎప్పుడయితే భయపడతారో అప్పుడు ఇదే పద్ధతి అనుసరించండి. మీరు మీకు తెలిసే విధంగా దీని మీద ఏకాగ్రత చూపితే, భయం అనేది కేవలం ఒక ఆలోచనకో, ఒక సంఘటనకో సంబంధించినది అని తెలుస్తుంది. మీ నుంచి వచ్చే స్పందనని బట్టి మీకు భయం ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది. ఇలా మీరు ఇంకా ఇంకా తెలుసుకోగలిగి వాస్తవంలో ఉంటూ భయానికి తగిన విధంగా స్పందించలిగితే భయం లేకుండా భయానికి తగిన జవాబు ఇవ్వగలరు.
ఈ విషయం గుర్తుంచుకోండి : ఎవరూ కూడా నిర్భయులం (భయం లేనివాళ్ళం) అని చెప్పలేరు. కాకపోతే వాళ్ళు భయాన్ని భయంలేకుండా నియంత్రించగలరు. అంతే. ఎవరయినా నాకు భయం లేదు అంటే వాళ్ళు భయం అనే విషయాన్ని పూర్తిగా విశ్లేషించలేదు. అలాగే దానికి ఇచ్చే మానవ స్పందనని తెలుసుకోలేదు అని అర్ధం. వాళ్ళు ఏదో సూపర్ మాన్లు అని, మీరు తక్కువ అని అనుకోవద్దు.
ప్రశ్న : స్వామీజీ మీరు నన్ను సాలి పురుగు అంటే ఉండే భయంనుంచి ఎలా బయటికి రప్పించారో గుర్తు ఉన్నది
(స్వామీ నవ్వుతారు) అవును. అది ఎలా వాళ్ళకి చెప్పమ్ము
యువతి ఇలా చెబుతుంది. మీ ప్రవచనాలు వింటున్నప్పుడు ఒకసారి నేను సాలిపురుగుని చూసి భయంతో గెంతాను. అప్పుడు మీరు (స్వామీ) నవ్వారు. మీరు నన్ను సాలెపురుగు మీదనే ధ్యానం చేయమన్నారు. అలా ఎప్పుడు దానిని చూసినా అలా చేసేదాని. దానిని నేను వాస్తవంతో ఏకాగ్రతతో చేసేదానిని. తరువాత క్రమంగా నేనెందుకు దానిని చూసి భయపడతాను, అని అనుకున్నాను.
అవును. మీ రందరూ విన్నారుగా? ఇది కేవలం మన భయాలలోనికి వాస్తవాన్ని తీసుకురావటమే. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. దానికి ఎలా భయపడ్డాను అని మరొక అమ్మాయి ఈ విధంగా చెప్పింది.
స్వామీజీ హిమాలయాలలో గంగానదిలో అందరం మీ చుట్టూ నిలబడినప్పుడు ఒక నీటి పాము వచ్చింది. నేను చాలా భయపడిపోయాను. కాని అనుపమ నిశ్శబ్దంగా దానినే చూస్తూ ఉంది. అది తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా. అప్పుడు మీరు నన్ను మందలించారు. మీ సమక్షంలో కూడా నేను వాస్తవంతో అక్కడ విషయాన్ని చూడనందుకు
అవును. నేను వాస్తవదృష్టి తెలుసుకొనటం అని చెప్పిన దానిని ఇప్పుడు అనుసంధానం చేసుకోగలిగారు.
ఈ భయాలనుంచి బయట పడగలిగే ఒకే ఒక మార్గం ఆ భయాలని చూడగలగటం. ఇలా చూసిన భయాల గుండా అవి వాస్తవమే అన్నట్టుగా మీరు చూడగలిగే శక్తితో వెళ్ళటమే. మీరు ఒంటరిగా కూర్చుని, మీకు భయాలు కలుగుతున్నట్టుగా ఊహించుకోండి. నిశ్చలతతో, లోతైన వాస్తవంతో మీరు వాటికి ఎదురుగా నిలబడండి. ఒక వేళ ఈ క్రమంలో మీరు బాధని అనుభవిస్తే పరవాలేదు. వాటిని అణిచివేయకండి. అలాగే వాటిని శిక్షించకండి. ఒక వేళ భయంతో మీ శరీరం
వణికితే అలాగే కానివ్వండి, మీ తెలివి తేటలకి సహకరించండి. మిమ్ములని మీరు దానితో ముందుకుపోనివ్వండి. దేనిలో అయినా సంపూర్ణంగా జీవిస్తే అది మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. మీ భయాలన్నీ కూడా భయం అంటే మీకుండే భయాలే.
ఒక చిన్న కథ :
ఒక రోజు ఒక శిష్యుడు నదిలో చిక్కుకుపోయాడు. అతను ప్రాణ భయంతో వణికిపోయాడు. నేను మునిగిపోతున్నాను రక్షించండి అని తన గురువుగారి కోసం గట్టిగా అరిచాడు.
అప్పుడు గురువు అతనిని 'లేచి నిలబడు' అన్నాడు.
అప్పుడు శిష్యుడు “స్వామి ఎలా నిలబడను. నేను మునిగిపోతున్నాను కదా” అంటాడు. దానికి గురువు ఇలా అంటారు. “మీకు మీరే సహాయం చేసుకోవాలి అని నేను మీకు చెప్పాను కదా! ఇప్పుడు లేచి నిలబడు”
అప్పుడు శిష్యుడు “ మీరు నాకు ఈ సమయంలో బోధలు చేస్తున్నారా! ఇప్పుడు నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను. నన్ను మీరు ఎందుకు రక్షించటం లేదు” అంటాడు దీనంగా. గురువుగారు చాలా గట్టిగా “నేను చెబుతున్నాను లేచి నిలబడు” అంటాడు.
గురువు అంతగట్టిగా అనేటప్పటికి శిష్యుడికి కోపం వస్తుంది. అతను లేచి నిలబడతాడు. నీళ్ళు అతని మోకాళ్ళ వరకు మాత్రమే వస్తాయి.
(అంతా పెద్దగా నవ్వుతారు)
నేను చెబుతున్నాను. మీ భయాలన్నీ కూడా భయం అంటే ఉండే భయాలే. మీరు మీ భయాలని దులిపివేసి మీ తెలివితేటలని బయటకి తేగలిగితే, అప్పుడు మీరు ఈ భయాలన్నీ కూడా నీడలేనని, అవి అసలు లేవు అని అర్ధం చేసుకుంటారు.
మీరు మరణం అంటే ఉండే భయాన్ని లోతుగా విశ్లేషించితే, మీకు ఒక విషయం అర్థమవుతుంది. అందరూ మరణించటానికి ఎందుకు భయపడతారంటే, వాళ్ళు అచేతన స్థితిలో ఇలా అనుకుంటారు. తాము ఇప్పుడు ఉన్న స్థితికంటే కూడా ఇంకా చాలా ఉన్నత స్థితిలో ఉండగలిగే వాళ్ళమని, వాళ్ళు తాము చేరవలసిన మంచి స్థితికి ఇంకా చేరలేదని అనుకుంటారు. అందుకే మరణించటానికి సిద్ధంగా ఉండరు.
కొందరు ఇలా కూడా అనుకుంటారు. (ఎవరిదో దిష్టి తగిలింది) ఎవరి చూపులో నామీద పడ్డాయి, అందుకే నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను అని. నిజానికి మీ దృష్టి మీ మీద పూర్తిగా లేదు. అందుకే మీరు అభివృద్ధి చెందరు. అందుకే మీ చివరి రోజుల్లో కూడా మీరు జీవితాన్ని సాగదీస్తారు. మరణాన్ని ఇంకా ముందుకితోసేస్తారు. మీరు మీ కోరికలని, భయాలని, భావావేశాలని అర్థం చేసుకొని వాటిని విశ్లేషించుకో గలిగితే, మీరు ఎవరినీ దేనికీ నిందించరు.
ఎవరైతే తమ జీవితంలో ఈ మెలికలు తిరిగి అర్థం కాని భయాలు లేకుండా జీవిస్తారో అలాంటి వాళ్ళు మరణంలో కూడా జీవిస్తారు. నేను ఇంతకు ముందు చెప్పాను. ఎంతో మంది గురువులు, యోగులు వాళ్ళు ఏ రోజు ఏ సమయానికి మరణిస్తారో కచ్చితంగా వాళ్ళ శిష్యులకి చెప్పి అదే సమయానికి అలానే మరణించేవారు.
చాలా మంది శిష్యులు మరణం అంటే ఏమిటో గురువులు బ్రతికి ఉండగా వాళ్ళ బోధనలలో అర్థం చేసుకొని వాళ్ళు : గురువుల మరణంతో అదంటే ఏమిటో నేర్చుకోగలిగారు. మరణంలో బ్రతకటం అంటే అర్థం వాళ్ళు తమ మరణాన్ని గురించి చెబుతారు. ఎప్పుడు మరణించేది కూడా ముందుగానే చెబుతారు. వాళ్ళ చేతనస్థితిలో వాళ్ళకి తెలిసేటట్లుగా జరుగుతుంది. వీళ్ళ విషయంలో మరణం అంటే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వదలటమే అంతే.
మనం మన శరీరాలని అచేతస్థితిలో, అంటే మనకి ఏమీ తెలియని స్థితిలో వదులుతాము. మనం మరణించేటప్పుడు చాలా ఆవేదన చెందుతాము. ముందకి వెనక్కిలాగే మన తీరని కోరికలు మనలని చిత్రహింసలకి గురిచేస్తాయి. మరొక ప్రక్క శరీరం ఇక ఈ హింసచాలు అని మనలని హింసిస్తుంది. ఇలా మన మైండ్‌కి శరీరానికి మధ్య ఏవిధమైన సంబంధం లేకపోవుటంతో మనం బ్రతికి ఉండగానే కాదు మరణించేటప్పుటు కూడా అవి మనని చిత్రహంసలకి గురిచేస్తాయి. మనం జీవించి ఉన్నప్పుడు మనం మన లోపల మాత్రమే ఉండగలిగి ఉంటే అప్పుడు మనం ఈ శరీరాన్ని ప్రశాంతంగా కానీ సమస్య ఏమిటి అంటే, మనం జీవించినంత కాలం మనం మన శరీరంలోపల కాకుండా బయటనే బ్రతికాము. ఎప్పుడూ మనలోపల మనం లేము.
ఈ విషయాన్ని మీకు స్పష్టంగా వివరిస్తాను.
మీరు ఒక్కసారి ఎలా మీ దైనందిన జీవితం ఉంటుందో, మీరు ఎలా జీవిస్తారో ఒక సారి లోతుగా ఆలోచించండి. ప్రతిరోజూ ఉదయాన్నే మీరు పళ్ళు తోముతారు. అప్పుడు మీరు ఏంచేస్తారు. అప్పటికే మీరు వెళ్ళబోయే మీ ఆఫీసు, పని వీటి గురించి ఆలోచిస్తుంటారు. ఆఫీసులోనో లేదా మీ పని దగ్గరో ఉన్నప్పుడు మీరు సాయంత్రం బస్సు పట్టుకుని ఇంటికి వెళ్ళటం గురించి ఆలోచిస్తారు. ఇంటికి వెళ్ళాక,రేపటి పని గురించి ఆలోచిస్తారు. మీరు శెలవులలో ఉన్నప్పుడు ఆఫీసు గురించి ఆలోచిస్తారు. ఆఫీసులో ఉన్నప్పుడు శెలవుల గురించి ఆలోచిస్తారు.
మీ శరీరం ఎక్కడ ఉన్నదో అక్కడ మీ మైండ్ ఉండదు. మీరు మీ జీవితంలో ఏ క్షణాన్ని పూర్తిగా జీవించరు. మీరు నిరంతరం జరిగిపోయిన కాలంలో కాని లేదా జరగబోయే దానిలో కానీ జీవిస్తారు. దానినే మీ పరిధిలో జీవించకపోవటం అని అంటాను. అందుకే మరణం సమయంలో మీరు ఏవో విషయాల ఆలోచనలతో నిండిపోయి వెళ్ళటానికి ఇష్టపడరు. అందుకే మరణం అంటే మీకు భయం
మీరు ఒక విషయం అడగవచ్చు. మనం తెలివిగల స్థితిలో, చేతన స్థితిలో ఎందుకు మరణించాలి అని. మీకు మరణం గురించి తెలిస్తే జీవితాన్ని సరియైన పద్ధతిలో అర్థం చేసుకొని చక్కగా జీవించగలుగుతారు. లేకపోతే సరియైన రీతిలో జీవించలేరు. మీరు జీవితంలో అన్నీ వాయిదా వేస్తారు. ఆనందాన్ని వాయిదా వేస్తారు. మీ పనులని వాయిదా వేస్తారు. అలా ప్రతీ దానిని రేపటికి వాయిదా వేస్తారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. రేపు కూడా ఇవాళ్ళ లాగానే వస్తుంది. అది ఇవాళ లాగా రాగానే మళ్ళీ మీరు రేపు చేస్తాను అంటారు. ఇది మీతో మీరు ఆడుకునే ఆట.
చివరిగా మరణం సమయం దగ్గర పడ్డప్పుడు మీరు అసలు తయారుగా ఉండరు. మీరు ఇంకా చాలా చేయాలని అనిపిస్తుంది. మిమ్ములని మీ జీవితం మోసం చేసిందని అనుకుంటారు. అసలు నిజమేమిటి అంటే ఇంతకాలం మిమ్ములని మీరు మోసం చేసుకున్నారు. కాని చివరికి ప్రతి విషయానికి మీరు జీవితాన్ని నిందిస్తారు. అందుకే మరణం గురించి మీరు స్పష్టంగా తెలుసుకుంటే, చక్కగా జీవించగలుగుతారు. అప్పుడు మీకు అవిశ్వాసం ఉండదు. సమయం వచ్చినప్పుడు మీరు మరణానికి సిద్ధపడతారు.
ప్రతి పనినీ వాయిదా వేస్తుండే మనస్తత్వం వలన మనం జీవితంలో చాలా పోగొట్టుకుంటాము. కొంతమంది నన్ను అడుగుతుంటారు. “స్వామీజీ,మీరు ఇంత తక్కువ సమయంలో అన్ని పనులు ఎలా చేయగలుగుతారు?” అని. నా సంవత్సర కాలెండర్ చూస్తే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సంవత్సరం మొత్తం ఎన్నో కార్యక్రమాలు ప్రపంచమంతా చేయగలుగుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. నేను వాళ్ళకి చెబుతాను. నేను పూర్తిగా ఈ క్షణంలో జీవిస్తాను. ఏవిషయాన్ని వాయిదా వేయను. వృధాచేయను. అంతే.
మీరు ఎప్పుడయితే పనులని ఆపేస్తారో, మీరు ఏదో పోగొట్టుకున్నట్టు అనుకుంటారు. మీరు ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్నా కూడా అలా వాయిదాలు వేయటం, సమయాన్ని వృధా చేయటం మాత్రం మానరు.
మా ధ్యాన కార్యక్రమాలలో మేము అందులో పాల్గొనే వాళ్ళని మార్గదర్శకమైన ధ్యానపద్ధతి ద్వారా వాళ్ళని మరొక 24 గంటలలో వాళ్ళు మరణిస్తారు అని అనుకోమని చెబుతాము. వాళ్ళు మరణించేలోపు పూర్తి చేయాలి అనుకున్న పనులన్నీ పూర్తి చేయమని చెబుతాము. ఇది చాలా చక్కని ధ్యాన పద్ధతి. వాళ్ళని మరణం తరువాత జరిగే కార్యక్రమాలను కూడా ఊహించుకోమని చెబుతాము.
ఒకసారి ఈ ధ్యానం చేసాక ఒక చిన్న అమ్మాయి ఇలా చెప్పింది.
“స్వామీజీ! నేను ఒక షాపులో ఒక పోస్టర్ చూసాను. దానిమీద ఇలా రాసి ఉన్నది” మీరు ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు రాబోయే సంవత్సరాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేయండి. కానీ దానిని అమలు చేసేటప్పుడు మాత్రం మీరు మరో నిమిషంలో మరణిస్తున్నారని అమలు చేయండి” అని ఉన్నది. ఈ ధ్యానం చేసాకా నాకు ఆ మాటల అర్ధం తెలిసింది”
చూడండి. మీరు ప్రణాళికలు చేసేటప్పుడు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా చేయాలి. అలా చేయగలిగితే కనీసం కొన్ని సంవత్సరాల వరకైనా పెద్ద పెద్ద మార్పులు చేయనవసరం లేదు. అయితే ఈ ప్రణాళికలు అమలు చేసేటప్పుడు మాత్రం మీ మాస్టర్ ప్లానులోని ప్రతిచిన్న విషయాన్ని కూడా ఎటువంటి లోటు పాట్లు లేకుండా అమలు పరచేటట్టు చూడాలి. ఇలా చేసేటప్పుడు మధ్యలో కొన్ని వదలటం లేకుండా పూర్తిగా, కచ్చితంగా అమలు చేయాలి.
ఇలా చేసినప్పుడు మీరు మరణించినా కూడా, ఆ ప్లాను ఎంత వరకూ అమలు అయిందో అంతవరకూ ప్రతి విషయం కచ్చితంగా అమలు అయ్యి ఉంటుంది.
దాని వలన తరువాత ఈ మాస్టర్ ప్లానుని చూసి మిగతా ప్లాను అమలు చేసేవారికి చేయబోయే ప్లానులో మార్పులు చేర్పులు అవసరం బట్టి చేయగలుగుతారు. లేదా ఉన్నది ఉన్నట్లుగా అమలు చేస్తారు. ఇలా చేయాలి అంటే మీ ప్లానులోని ప్రతి చిన్న అంశాన్ని ఏదీ వదలకుండా, దేనినీ వాయిదా వేకుండా చేయగలిగిప్పుడే సాధ్యమవుతుంది.
కొన్ని సార్లు వాయిదా వేయటం సమయం వృధా చేయటం వలన మీరు పేదరికంలోనికి నెట్టబడతారు. పేదరికం అనేది మీ సొంత ఎంపిక. మీరు మీ నిర్ణయాలను ఆపి వేసినా లేదా వాయిదా వేసినా మీరు పేదరికంవైపు అడుగులు వేస్తున్నట్టే . కానీ మీకు ఈ విషయాలేమీ తెలియవు. కానీ మీరేమనుకుంటారు భగవంతుడు నన్ను బాగా చూడటం లేదు అనుకుంటారు. అలాగే ఈ జీవితం చాలా చిన్నది. నా కలలు ఆశలు సాధించుకునే సమయం లేదు, అనుకుంటారు. మీరు గనుక మీ సర్వశక్తిని కూడా సరియైన రీతిలో స్పష్టతతో ఉపయోగించి ఉన్నట్లయితే మీరు ఇలా ఆలోచించరు.
అప్పుడు మీరు మరణానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
మీరు ప్రతి రోజు అద్దం ముందు నిలబడి నా జీవితానికి ఇదే చివరి రోజు అనుకోగలిగితే మీరు ఏ విషయాన్ని వాయిదా వేయరు. ఇలా మీరు జీవితాంతం చెప్పనవసరం లేదు. ఇలా ఒక నెల రోజులు చెబితే చాలు. ఆతరువాత మీరు ఏవిషయాన్ని వాయిదా వేయకుండా జీవించగలుగుతారు. అంతే కాదు మీకు ఉన్న కొన్ని భయాలు - పేరు ప్రతిష్టలు పోతాయేమో, మన ఆశలు కరిగిపోతాయేమో అనే భయాలన్ని పోతాయి. ఎందుకంటే పోగొట్టుకోవటానికి ఏదీ లేదు అని మీకు తెలుసు.
ఎవరైతే మరణం దగ్గర వరకూ ఏదో ఒక విధంగా వెళతారో, తృటిలో తప్పిన ప్రమాదంకావచ్చు లేదా ఏదైన జబ్బు నుండి అనుకోకుండా కోలుకోవటం కావచ్ఛు, ఇలా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు చావు అంటే భయం లేకుండా జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోగొట్టుకోవటానికి ఏమీ లేదు, అని తెలుసుకుంటారు. వాళ్ళ మిగతా జీవితాన్ని ఇంకా స్పష్టంగా తెలివితేటలతో జీవిస్తారు.
మీరు మీ విద్య ద్వారా నేర్చుకునే మొదటి పాఠం ఏమయి ఉండాలంటే, సరియైన పని సరియైన సమయంలో చేస్తూ ముందుకు సాగాలి అని. ఎందుకో గాని దీనిని చివరి పాఠంలా నేర్చుకుంటారు. నేర్చుకోవలసిన పాఠాలన్ని నేర్చేసుకున్న తరువాత దీనిని క్షుణ్ణంగా నేర్చుకుంటారు.
వాయిదా వేయటమనే విషయం మాత్రం మీ నుంచి మీరు తెచ్చుకున్న లక్షణం. కానీ మిగతా భయాలు మాత్రం మీలోపలికి సమాజం ద్వారా లేదా మీ బయట ప్రపంచం ద్వారా ప్రవేశపెట్టబడతాయి. సమాజం మిమ్ములని చూసి మీరు భయపడటం నేర్పుతుంది. అలాగే భగవంతుని చూసి, ఇతరులని చూసి భయపడటం నేర్పుతుంది. అది మిమ్ములని చూసి మీరు భయపడటం చాలా చిన్న చిన్న విషయాల ద్వారా నేర్పుతుంది. అవి నీతి నియమాలు, విలువలు, పేరు ప్రతిష్టలూ, ఇలా ఎన్నో విషయాలను మీ లోపలికి పంపించి మీరంటేనే మీరు భయపడేలా చేస్తుంది.
నీతి నియమాల పేరుతో మీ మీద నమ్మకం లేకుండా చేస్తుంది. అందుకే నీతి నియమాల విషయం వచ్చేసరికి మీ విషయంలో మీకు నమ్మకం ఉండదు. ఎప్పుడయితే మీరు నీతి నియమాలని భయంతో అనుసరిస్తారో అప్పుడు మీకు సరియైన దారి చూపగలిగే మీ అంతరంగంలోని తెలివితేటలకు అవకాశం ఉండదు. నేను స్త్రీలతో ప్రయాణం చేస్తున్నప్పుడు కొందరు అడుగుతుంటారు. "స్వామీజీ! మీరు ఒక ఆధ్యాత్మిక గురువు కదా! ఇలా స్త్రీలతో కలిసి ఎలా ప్రయాణం చేస్తారు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారో? వాళ్ళు ఏమైనా అనరా"? అని
ముందుగా వాళ్ళు ఒక జ్ఞానోదయమయిన గురువుతో మాట్లాడుతున్నాము అని మర్చిపోతారు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో పూర్తిగా అర్ధం చేసుకుని ఉంటే
వాళ్ళు అసలు అటువంటి ప్రశ్నతో నా ముందుకి రారు. సరే. నేను వాళ్ళకి వాళ్ళ భాషలోనే జవాబు చెప్పాను. నేను ఇలా సమాధానం ఇచ్చాను “ నాకు నా మీదా నమ్మకం ఉంది. ఆ స్త్రీలకి నా మీద నమ్మకం ఉంది. మీ కెందుకు ఈ బాధ!” అని నేను ఇలా జవాబు చెప్పగానే వాళ్ళు నిర్ఘాంతపోయారు.
మన జీవితంలో నీతి నియమాలు అనేవి మీ తెలివిలేనితనానికి ప్రత్యామ్నాయాలు మాత్రమే. మీరు మీ తెలివితేటలతో పనులు చేసుకుపోతే మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. కానీ మీరు నియమ నిబంధనలతో మీ పనులు చేసుకుంటూ వెళితే మీ పైన మీకు నమ్మకం, విశ్వాసం ఉండవు. ఎందుకంటే ఏ పనీ కూడా మీ కోసం, మీరు చేయరు. మీ మీద మీకు ఏకాగ్రత ఉండదు. మీ దృష్టి మొత్తం నియమనిబంధనల మీదే ఉంటుంది.
మీరు మీ తెలివితేటలతో జీవిస్తే ఇటువంటి భయాలు మిమ్ములను గుప్పిటిలోనికి తీసుకోవు. ఎవరైతే నీతి నియమాలు అధికంగా భోధిస్తారో వాళ్ళు అంతరంగాలలో చాలా భయాలతో ఉంటారు. అందుకే వాళ్ళు అవి భోధిస్తారు. వాళ్ళు ఎందుకు భయపడతారంటే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉండదు. లేదా వాళ్ళకి భయపడటమే నీతి అని మాత్రమే తెలుసు. ఈ నీతిమంతులు కొన్నాళ్ళకు ఈ నీతులు క్రమ శిక్షణ విషయాలతో మానసిక రోగులుగా తయారవుతారు.
ఒక చిన్న కథ :
ఒక క్రమ శిక్షణ, నీతి నియమాలను పాటించే వ్యక్తి, మామూలుగా రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగు అడుగూ లెక్క ప్రకారం వేస్తూ నడుస్తాడు. ఒక రోజు అకస్మాత్‌గా పెద్ద వర్షం ప్రారంభమయింది. అందరితో పాటు ఈ నియమాల వ్యక్తి కూడా పరిగెడతాడు.
అలా కొంతదూరం పరిగెత్తాక, అతని ప్రవర్తన గుర్తొచ్చింది. వెంటనే తనకి తాను ఇలా చెప్పుకున్నాడు. “నేనేం చేస్తున్నాను! హుందాగా నడవకుండా పరిగెట్టాను. ఒక సంస్కారమైన వ్యక్తి తన తప్పుని సరిదిద్దుకోవాలి” అని అనుకుని అతను ఎక్కడనుంచైతే పరిగెత్తాడో అక్కడికి తిరిగివచ్చి, అప్పుడు హుందాగా అడుగులు లెక్కించుకుంటూ నడవటం మొదలుపెట్టాడు.
(అంతా నవ్వులు)
నీతి నియమాలు మిమ్మలని నిర్జీవంగా నిరుత్సాహంగా తయారు చేస్తాయి.
ఒక విషయం అర్ధం చేసుకోండి. ఈ విషయం చెప్పేటప్పుడు మిమ్మలని ఇది స్వేచ్ఛా ప్రపంచం, మీ ఇష్టమొచ్చినట్టు మీరు చేయవచ్చు అని మాత్రం నేను చెప్పటం లేదు.
నేను మీకు ఏమి చెబుతున్నానంటే మీ తెలివితేటలని చక్కగా వృద్ధి చేసుకొని జీవించండి. అప్పుడు ఈ నీతి నియమాలనేవి మీరు అప్పటికే తెలుసుకొని జీవిస్తున్న జీవితాన్ని ధృవీకరించుకోవటానికి మాత్రం ఉపయోగపడతాయి. అది నిజమైన వివేకము. ఏ నియమమైనా సరే సరియైన పద్ధతిలో వికసించిన వివేకం చెప్పే విషయాన్ని ధృవీకరించేవి మాత్రమే. అంతరాత్మ చెప్పే మాటలని, మీ అంతరాత్మలోని గురువుని కనుగొండి.
ఒక చిన్న కథ :
ఒక యువకుడైన సన్యాసి ఒక అందమైన వేశ్య ఉండే ప్రాంతంలో నివసించేవాడు. ఆయన నిరంతరం ధ్యానం చేయటానికి ప్రయత్నించేవాడు. అక్కడ వేశ్య తన పద్ధతిలో తాను డబ్బు సంపాదించుకుంటూ ఉండేది. చాలా మంది ఆమె ఇంటికి వచ్చి వెళుతుండే వారు.
ఈ సన్యాసి ధ్యానం మీద మనస్సు లగ్నం చేయలేకపోతుంటాడు. ఎందుకంటే అతను నిరంతరం ఆ అందమైన అమ్మాయి గురించే ఆలోచించేవాడు. ఎప్పుడూ ఆ అమ్మాయి నీతిలేని జీవితాన్ని నిందిస్తూ ఉండేవాడు.
ఆ అమ్మాయికి మాత్రం ఈ సన్యాసి అక్కడ ఉన్న విషయం కూడా తెలియదు. ఆమె వృత్తి ఆమె చేసుకుంటూ ఖాళీ సమయంలో శ్రీ కృష్ణుని ప్రేమించేది. ఆయన విగ్రహంతో ఆడుకునేది.
కొంతకాలానికి సన్యాసి, వేశ్య ఇద్దరూ చనిపోయి యమలోకానికి వెళతారు. యమధర్మరాజు వాళ్ళ రికార్డులన్ని చూసి వేశ్యకి స్వర్గలోకం సన్యాసికి నరకం నిర్ణయించి ఆ చోట్లకి వాళ్ళని వెళ్ళమని ఆదేశిస్తాడు.
సన్యాసికి చాలా కోపం వస్తుంది. యమధర్మ రాజు తీర్పు నచ్చదు. అలా ఎందుకు చేసావని ఆయన యమధర్మరాజుని ప్రశ్నిస్తాడు.
యమధర్మరాజు చాలా శాంతంగా ఇలా జవాబు చెబుతాడు. “నీవు జీవితమంతా ధ్యానం పేరుతో ఆ వేశ్యమీద కోరికతోనే బ్రతికావు. కాని ఆమె జీవితమంతా భగవంతుని మీద ఏకాగ్రతని నిలుపుకుంది.” మీరు మీ వివేకంతో ప్రవరిస్తే మీలో స్వచ్ఛత వుంటుంది. మీరు నీతి నియమాల పరిధిలోనే జీవించారనుకోండి ఆ స్వచ్ఛత ఉండదు. అందులో అందం ఉండదు.
ఎవరయితే వాళ్ళని వాళ్ళు చూసి భయపడతారో, ఎవరికైతే వాళ్ళ మీద నమ్మకం ఉండదో అటువంటి వాళ్ళు కొన్ని నీతులు నిబంధనలు తయారు చేసుకొని వాటినే అనుసరిస్తారు. తెలివైన వాళ్ళు అప్రయత్నంగ యధాలాపంగా ప్రవర్తిస్తారు.
వాళ్ళు సరియైన సమయంలో సరియైన పనులు చేస్తారు. పూర్తి ఏకాగ్రతతో చేస్తారు. వాళ్ళకి భయం ఉండదు. అంతే.
నీతి నియమాల లాగానే, కీర్తి ప్రతిష్టలు కూడా భయాలని సృష్టిస్తాయి కీర్తి, ప్రతిష్ట సమాజంలో గౌరవం – ఇలాంటివన్నీ కూడా భయాలని పుట్టిస్తాయి. ఈ భయాలన్ని కూడా మీ అహంకారపు తాలూకా భయాలు. మీరు ఏ ప్రతిష్టని దాచాలని చూస్తున్నారు. మీ అంతరంగంలో తృప్తి ,సంపూర్ణతతో హుందాగా జీవించండి. అది చాలు. ఎవరయితే వాళ్ళ కీర్తికి కాపలా కాస్తుంటారో వాళ్ళంత కృత్రిమమైన, కపటమైన వాళ్ళు ఈ భూమి మీద ఎవరూ ఉండరూ. వాళ్ళే నిరంతరం చాలా భయంలో బ్రతుకుతుంటారు. వాళ్ళ ప్రతిష్ఠ వాళ్ళని అంతగా నియంత్రిస్తుంది.
ఒక కధ :
ఒక వ్యక్తి నది ఒడ్డున చేపలు పట్టటానికి గాలం నీళ్ళలో వేసి కూర్చుంటాడు. అలా చాలా సేపు కూర్చున్నా ఒక్క చేపకూడా దొరకదు. చేతిలో గాలంతోనే అతను ఒక కునుకు తీస్తుంటాడు.
అకస్మాత్‌గా ఒక పెద్ద చేప గాలానికి దొరుకుతుంది. అతను నిద్రలేచేలోపే ఆ ఊపుకి అతను నీళ్ళలో పడిపోతాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఒక అబ్బాయి వాళ్ళ తండ్రిని ఇలా అడుగుతాడు, “నాన్నగారు! అతను చేపని పడుతున్నాడా? లేకపోతే చేపే అతనిని పడుతుందా?
ఈ కీర్తి ప్రతిష్టలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తి ప్రతిష్టలు మీ జీవితాని కంటే పెద్దవిగా ఉంటే అవి క్రమంగా మిమ్ములనే మింగేస్తాయి. అంతే. మీరు ఇక దాని కోసం వెతకవలసిన అవసరం ఉండదు.
మీరు ప్రతిష్ట పోతుంది, కీర్తి దెబ్బతింటుంది అని ఎందుకు భయపడతారు ఎందుకంటే మీకీర్తి మీరు ఏదో గొప్ప వ్యక్తి, ప్రత్యేకమైన మనిషి అనే భావాన్ని కలిగిస్తుంది. అది మీకు సమాజంలో ఒక గట్టి గుర్తింపునిస్తుంది. సమాజంలో కీర్తి డబ్బు ఉన్న మనుషులు ఎన్నో అవినీతి పనులు, అర్ధంలేని వ్యవహారాలు చేసి ఆకీర్తి, డబ్బుతో ముందుకెళ్ళిపోతారు. కానీ ప్రజలు వాళ్ళ వెనుక అన్ని విషయాలు చెప్పుకుంటారు. కానీ ముందు మాత్రం గౌరవంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళాకి కీర్తి, అధికారం ఉంటాయి కాబట్టి.
ఇటువంటి ప్రతిష్టని వాళ్ళు నిరంతరం జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. మీకు ఒక విషయం చెబుతాను. మీరు ఇలా ఉన్నట్లయితే ఈ అనంత బ్రహ్మండం మిమ్ములను ఎంపిక చేయదు. మీరు ఎప్పటికి పేదవారిగా ఉండిపోతారు. ఈ సర్వాంతర్యామికి మనుషులని ఎంపిక చేసుకునే తన పద్ధతులు తనకి ఉన్నాయి.
ఒక విషయం అర్థం చేసుకోండి. పేరు, కీర్తి పరువు, అధికారం, ఇవన్నీ మీరు కల్పించుకున్న మీ ఊహలే. మీరు వాటికి ప్రాణాన్ని ఇస్తారు. వాటిని అభివృద్ధి చేస్తారు. దాంతోపాటు అవి పోతాయేమో అనే భయాన్ని వృద్ధి చేసుకుంటారు.
మీ చుట్టు ప్రక్కల ఉన్న ప్రతీ వ్యక్తినీ, ప్రతి వస్తువుని అనంతమైన ప్రేమతో చూస్తూ జీవించండి. మీ దగ్గరికి వచ్చే ప్రతివారిని, ప్రతిదానిని ప్రేమతో ఆదరించండి. మీరు ఈ విధంగా జీవించగలిగితే కీర్తి దానంతట అదే వస్తుంది. ప్రజలు మీలోని మంచితనాన్ని గౌరవిస్తారు. కానీ మీ దగ్గర ఏదో ఉందని కాదు. ఇటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నవారు అవి పోతాయి అని భయపడనవసరం లేదు. మీరు వాటికి నిరంతరం కాపలా కాయనవసరం లేదు. మీరు అటువంటి భయాలనుంచి స్వేచ్ఛగా ఉండండి. పదిమంది ముందు మాట్లాడటం, బహిరంగ సభలలో మాట్లాడటం అంటే చాలామంది భయపడతారు. ఇది కూడా ఒక విధంగా పరువుపోతుందేమోననే భయం మాత్రమే. మీరు ఒక పెద్ద సమూహం ముందు మాట్లాడటానికి భయపడ్డారు అంటే అసలు విషయం అది కాదు. వాళ్ళు మీ గురించి ఏమంటారో అనేది అసలయిన మీ భయం. మీ అహం దెబ్బతింటుందనేది మీ భయం. వాళ్ళు ఏదైనా అంటే అహం బాధపడుతుంది అనే భయం. ఇది మీరు నెమ్మదిగా మీ అహానికి కాపలా కాసే పద్ధతి భయం అనేది అహంకారం యొక్క స్పష్టమైన ఒక రూపం. అది అర్థం చేసుకుంటే చాలు.
మీరు మాట్లాడినప్పుడు వినేవాళ్ళు, ప్రజలు దానిని మెచ్చుకోకపోతే ఏ మవుతుంది? మీరు పూర్తిగా నిమగ్నమై మాట్లాడండి. అది చాలు. మీరు సంతోషంగా ఆనందపడుతూ ఆ పని చేయండి. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమంటారో అని భయపడితే అప్పుడు మీరు మీ అహంకారాన్ని కాపలా కాస్తున్నారు అని అర్థం.
చాలా మంది ధ్యానం చేయటానికి కూడా భయపడతారు. ఎందుకంటే ధ్యానం చేస్తే వాళ్ళ అహంకారం దెబ్బతింటుందనే భయం. ధ్యానం చేస్తే మిమ్ములని మీరు కోల్పోతారు, అనే భయం ఉంటుంది. మీరు ఈ అనంత చైతన్య సృష్టి లోనికి కోల్పోబడతారనే భయం. మీ చుట్టు ప్రక్కల ఉండే అనంత సృష్టి యొక్క శక్తికి దాసోహం అవుతారనే భయం. ఈ భయాలన్ని అహం బాధపడుతుందనే భయం మాత్రమే అందుకే దానిని అలా పట్టుకుంటారు. ధ్యానం చేయటానికి ఇష్టపడరు. దాని బదులు మిమ్ములని ఏవైనా నామాలు కాని, మంత్రాలు కాని జపించమంటే, చాలా ఆనందంగా జపించుతారు. అప్పుడు మీకు భయం ఉండదు.
మీ అహంకారం కరిగిపోతుందేమో అనే భయం. ఎప్పుడయితే మీ అహంకారం కరిగిపోతుందో అప్పటి వరకు మీకు అంటిపెట్టుకుని ఉన్న సమాజం తాలూకా ముద్రలు కూడా కరిగిపోతాయి. ఆ ముద్రలే మీకు గుర్తింపులు అనుకుంటారు. కాబట్టి అది మీ అహంకారానికి చాలా చాలా పెద్ద దెబ్బ. మీరు ఏమీ కానివారైపోతారు. అందుకే ధ్యానం చేయటానికి అడ్డుకుంటారు. మీరు పలానా అని కనీసం మీ వరకైనా ఉంటే చాలు అనుకుంటారు. ఇలా అడ్డుకోవటం అనేది పూర్తిగా మీ అహంకారం తాలూకా భయం. మీ అహంకారానికి దెబ్బలు తగులుతాయనే భయం.
కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు. దానికి కారణం కూడా ఒక రకమైన భయం. మీరు వాళ్ళని గమనిస్తే వాళ్ళు ఏదో చెప్పాలని బలవంతంగా లోపలి నుంచి ఏదో చెబుతుంటారు. అలా చెప్పలేకపోతే వాళ్ళని ఎదుటి వాళ్ళు తక్కువ అనుకుంటారని భయం. అందుకే వాళ్ళు ఏదో మాట్లాడుతూనే ఉంటారు. అందులో అర్ధం లేకపోయినా సరే. సందర్భం కాకపోయినా సరే. ఇవన్నీ భయం యొక్క సూక్ష్మరూపాలు, దీనిని స్పష్టంగా అర్ధం చేసుకోవటం మీకు చాలా కష్టం.
ఒక ప్రశ్న :
స్వామీజీ మీరు తెలియని వాటిగురించి భయపడతాం అన్నారు కదా! దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి.
నేను ఆ విషయంలోనికే వస్తున్నాను.
మనం తెలియని వాటి గురించి భయపడటం అంటే : చీకటి అంటే భయం, దెయ్యాలు, భూతాలు అంటే భయం, దేవుడు అంటే భయం, చివరికి మన చావు అన్నా భయమే. నిజానికి మనం మన భయాలని చూసి చాలా భయపడతాం అది నిజం. మనం మన భయాలని ఎదుర్కొవటానికి కూడా జంకుతాము. అందుకే మనం మన భయాలని చాలా ఎక్కువగా ఊహించుకొని, దాంతో మనం మరింత ఎక్కువగా భయపడతాం.
ఒక చిన్న కథ:
ఒక వ్యక్తి ట్రయిన్లో ప్రయాణం చేస్తుంటాడు. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడుగుతాడు. అతను చాలా కంగారుగా అతని పర్సులో, బ్యాగులో, పాంట్ జేబులో ఇలా వెతుకుతుంటాడు. ఇదంతా గమనిస్తున్న టికెట్ కలెక్టర్ “సర్ మీ కోటు జేబులో ఉందేమో చూడండి” అని అంటాడు. దానికి ఆ వ్యక్తి “ అక్కడ ఇప్పుడు చూడమని చెప్పకండి. అది అక్కడ వుంటుందనే ఒకే ఒక్క ఆశ నాకు ఉన్నది” అంటాడు.
(అందరూ నవ్వుతారు)
మనం చూడటానికి భయపడతాం. మన భయాలవైపు చూడటానికి చాలా భయపడతాం. అదే అసలు సమస్య. కాబట్టి మనం మన సౌఖ్యమైన పరిధిలో దాక్కొని మనని మనం మోసం చేసుకుంటూ ముందుకి సాగుతాము.
చూడటానికి భయపడకండి. ఎప్పుడయితే చూడటానికి భయపడతారో, అప్పుడు మీరు మరింత భయపడతారు. ఎందుకంటే అది మీకు ఇంకా తెలియని విషయం అవుతుంది. భయాన్ని చూడండి. భయం లోపలికి చూడండి. మీరు భయపడుతున్నారు, అని ఒప్పుకోండి. ఆ భయం దానంతట అదే మాయమైపోతుంది. మీరు మీ భయాలని ఒక దాని తరువాత ఒక దానిని ఎదుర్కొన గలిగితే, వాటిని వాస్తవ దృష్టితో చూడగలిగితే, ఎక్కడో ఒక చోట భయం స్థలంలోనికి మీ తెలివితేటలు వస్తాయి. అప్పుడు మీ లోపల ఈ భయం కొంచెం కొంచెం తగ్గిపోతుంది.
తెలియని వాటి గురించి భయపడటం, అంటే భూతాలు, దెయ్యాలు విషయంలో భయపడటం అనేది చాలా సామాన్య విషయం. వాటి గురించి మీరు అసలు భయపడనవసరం లేదు. ఒక్క విషయం అర్ధం చేసుకోండి. దెయ్యాలు, భూతాలు మన కంటే చాలా తక్కువ శక్తి గలవి. మనం వాటికి ఎక్కువ శక్తిని ఇచ్చి అవి మనలని మన భయాలని నియంత్రించేలా చేస్తాము. ఇక్కడ అసలు సమస్య ప్రారంభమవుతుంది.
దయ్యాలు, భూతాలు అనే విషయం గురించి మీరు లోతుగా వెళ్ళవద్దు. అది ఉపయోగం లేని పని. మీరు మీ మీద ఏకాగ్రత చూపించి, మీ గురించి మీరు స్పష్టంగా తెలుసుకుంటే, అదేచాలు. అప్పుడు ఏ విషయం మిమ్ములని తాకదు. అప్పుడు మీరు కూడా ఆ విషయాల గురించి భయపడరు.
చీకటి అంటే భయపడటం కూడా తెలియని వాటి గురించి భయపడటమే. చీకటి అంటే భయం అని అంటే అది మరణ భయమే. కొంచెం ఆలోచించండి, మీ ఇంటి ముందు ఉండే తోటలో మీరు పగలు నడుస్తారు. మరి రాత్రి పూట నడుస్తారా?
లేదు మీరు భయపడతారు. ఎందుకు? మీరు మీ తోట చూసి భయపడరు. చీకటిని చూసి భయపడతారు.
ఆ చీకటిలో మీకేమన్న అవుతుందని భయపడతారు. మీ జీవితం గురించి భయపడతారు. ఈవిషయమే నేను మీకు చెప్పేది. మీకు ఉండే భయాలు ఏదో ఒకలా మీకుండే మరణ భయానికి సంబంధించింది అని స్పష్టంగా తెలుస్తుంది. మిగతా భయాల విషయంలో అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంతే.
నిజానికి చీకటి చాలా అందంగా ఉంటుంది. అది మీ అమ్మ గర్భంలా ఉంటుంది. మీరు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు అక్కడ అంతా చీకటే. కానీ మీరు ఈ ప్రపంచం లోనికి వచ్చాక ఆ చీకటితో సంబంధం తెగిపోతుంది. మీరు ఇదేదో మీకు తెలియని విషయం అనుకొని భయపడతారు. తాంత్రికాన్ని అనుసరించేవాళ్ళు ఈ అనంత సృష్టి యొక్క గొప్పదనం యొక్క అనుభవాన్ని పొందటానికి చీకటి మీదే ధ్యానం చేస్తారు.
చీకటిని చూసి భయపడనవసరం లేదు. ఒక్కసారి ఈ చీకటిని గాఢమైన ప్రేమతో చూడగలిగితే అది అమ్మ గర్భం అనే అనుభూతితో చూస్తే మీకు ఎప్పుడూ చీకటి అంటే భయం అనిపించదు.
ఎవరైనా చిన్న పిల్లలు చీకటి చూసి భయపడ్డారనుకోండి, మీరు వాళ్ళని భయపడవద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పవద్దు. మీరు అలా చెబితే వాళ్ళు ఇంకా కంగారు పడతారు. వాళ్ళు చీకటి అనే భయాన్ని వదలలేరు. వాళ్ళని అలా భయపడనివ్వండి. కొంచెం వణికినా పరవాలేదు. దాంతో కనీసం వాళ్ళకి భయం ఉంది అని వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా చీకటిని చూసి రెండుమూడు సార్లు భయపడ్డాకా మెల్లగా చీకటంటే భయం పోతుంది. ఇప్పుడు భగవంతుడు అంటే ఉండే భయం సంగతి చూద్దాము. భగవంతుడు అంటే మనకు తెలియదు. అందుకే మనకి భయం. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. భగవంతుడు అనే పేరుని మనం ఈ
అనంత చైతన్య సృష్టికి ఈ అనంత విశ్వానికి ఇచ్చాము. ఈ బ్రహ్మండ చైతన్య శక్తికి ఈ సకల జగత్తులోనూ సర్వవ్యాప్తి మయమయిన నిరంతర చైతన్య జీవన శక్తికి మనం ఆ పేరు పెట్టాము. ఈ సృష్టికి, ఈ శక్తికి కేవలం ప్రేమించటం మాత్రమే తెలుసు. ఈ మాత్రం మీరు అర్ధం చేసుకోగలిగితే చాలు. భయాలన్ని వాటంతట అవే మాయమవుతాయి. అందరూ భగవంతుడు అంటే చాలా భయపడతారు. కొంత మంది నన్ను అడుగుతుంటారు. “స్వామీజీ మేము మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డపనులు చేస్తే పాపం వస్తుంది, పుణ్యం వస్తే స్వర్గానికి వెళతాము పాపం చేస్తే నరకానికి వెళతాము అని అంటారు కదా! ఇది నిజమేనా”?
ముందుగా మీరు ఒక విషయం అర్ధం చేసుకోండి. ఎక్కడా స్వర్గం, నరకం అనే స్థలాలు లేవు. అలాంటివి ఏవీ మీ తలపైపైన ఆకాశంలో లేవు. వాటిని మీ లోపల భయాన్ని, ఆశని సృష్టించటానికి మీకు నేర్పించారు. నరకం లేదా స్వర్గాన్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. నరకం అంటే కల్లోలమైన కలతలతో కూడిన మరణం: స్వర్గం అంటే ప్రశాంతమైన చేతనస్థితిలో సంభవించే మరణం. అంతే.
మీరు ధ్యానంలో గడిపే దంతా మంచి పనే. అదే పుణ్యం నేను ధ్యానం చేయమంటే దాని అర్ధం కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. మీరు ఆ క్షణంలో మీరు చేతనస్థితిలో, వర్తమానంలో ఉండగలగటమే. మీరు పూర్తిగా మీ చేతన స్థితిలోనే ఉంటే : మీ అచేతన స్థితి నుంచి మీరు బయటికి వచ్చి పూర్తి వర్తమానంలో ఉండగలిగినప్పుడు, ఎప్పుడయితే ఆ అనంత చైతన్య శక్తి యొక్క అనుభూతిని మీరు పొందినప్పుడు ఆ క్షణాలని ధ్యానం అంటాను. అదే మంచి పని. అదే పుణ్యం.
మీరు ఏ సమయాన్నియితే ఇలా గడపలేరో అదే పాపం. మీరు చేతనావస్థలో గడిపే ప్రతిక్షణం ఒక బ్యాంకు బాలెన్స్ లాంటిది. మీరు మరణ సమయంలో ఈ క్షణాలే మిమ్మలని స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంచేందుకు సహాయం చేస్తాయి.
చాలా మంది అనుకుంటారు. బిందెల కొద్ది పాలతో గుడిలో విగ్రహాలకి అభిషేకాలు చేస్తే పుణ్యం వస్తుంది, దాంతో స్వర్గానికి వెళ్ళవచ్చు అని భగవంతునికి పాలు సమర్పించితే ఏమీ కాదు. మీరు ఈ అనంత సృష్టి పట్ల పొంగిపొర్లే కృతజ్ఞతాభావంతో, గుడిలో విగ్రహాన్ని ఈ సృష్టి అని అనుకొని ఆరాధన చేస్తూ సమర్పించే వన్నీ కూడా సరియైనవే. అలా చేయటం సరియైన పద్ధతి. కానీ దానిని మాత్రం పుణ్యంతో సంబంధం పెట్టకండి
స్వచ్ఛమైన సంతోషం, కృతజ్ఞతతో మీరు ఒక చుక్క పాలు సమర్పించిన క్షణం నిష్కపటమైన మనస్సుతో చేసే ధ్యానం మీ మరణ సమయంలో మీ ప్రక్కన నిలబడతాయి. అంతే కానీ పుణ్యం సంపాదించుకోవాలనో లేదా కేవలం భగవంతుడంటే ఉండే భయం వలననో మీరు బిందెల కొద్దీ పాలు గుడిలో ఇస్తే మీకు ఏమీ ఫలితం ఉండదు. అందుకే వాస్తవాలని తెలుసుకొని చేతన స్థితిలో జీవించండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ప్రతి క్షణాన్ని ధ్యానంగా మలచుకోండి. అది చాలు. మీరు పాపాలు అనే భయం లేకుండా జీవించవచ్చు
మీకు ఒక సంఘటన చెబుతాను.
నేను ఒక పల్లెటూరులోని శివుడి గుడికి వెళ్ళాను. గర్భగుడి ద్వారం దగ్గర ఒక ట్యూబ్లైటు పెట్టి ఉన్నది. దాని కాంతి సరిగా లేదు. ఎందుకంటే దాని మీద నల్లటి ఇంకుతో విష్ణు నాధన్ .. అని రాసి ఉంది.
శివుడి పేరు విష్ణునాధుడు ఎలా అయిందా అని నేను ఆశ్చర్యపోయాను. దానికింద చిన్న అక్షరాలతో కైలస నాధన్ అనిరాసి ఉంది. అది శివుడి అసలు పేరు. ఆ ట్యూబ్లైటు గుడికి ఇచ్చిన వ్యక్తి పేరు విష్ణు నాధన్
(నవ్వులు)
మనం జీవితంలో మంచి పనులు చేయటం లేదేమో అని భయపడుతుంటాము. అందుకే మనం భౌతిక విషయాలపై ప్రేమ పెంచుకుంటాము. మంచి పనుల బ్యాంకు బాలెన్స్‌ని పెంచుకుంటాము. దానితో ఆపము. భగవంతునికి వీలయినన్నిసార్లు మనం చేసిన మంచి పనులని చెబుతూ ఉంటాము. అలా అయితే ఆయన మనని మరిచిపోడు అని. భగవంతుడి విషయంలో కూడా మనం ఎంత భౌతిక వాదంతో ఉంటామో కదా!
అర్థం చేసుకోండి : ఈ భూమి మీద పుణ్యకార్యాలు చేసేవారికి ప్రవేశం కల్పించటానికి భగవంతుడు స్వర్గలోకంలో విశ్రాంతి గృహాలు, విడుదలలు నడపటం లేదు. మీరు జీవించి ఉన్నంత కాలం ఈ పుణ్యకార్యాలను వాటి వెనుక ఉండే అసలు భావం కానీ, నిజంగానీ తెలుసుకోకుండా వాటిని చేస్తున్నారు. ఈ పుణ్యకార్యాలతో మీరు పుణ్యం అనే ఒక గొప్ప భవనాన్ని నిర్మించుకుంటారు. మీరు మరణించినప్పుడు ఆ భవనం మీ ప్రక్కన ఉంటుందనుకుంటారు.
ఇది ఎలా ఉంటుందంటే : మీరు కలలో ఒక ఇల్లుకట్టుకుని దానికి చక్కగా రంగులు వేసి అందంగా అలంకరిస్తారు. దానిని చూసి చాలా సంతోష పడతారు. మీరు నిద్ర నుంచి లేవగానే ఏమవుతుంది? ఇల్లు ఎక్కడ ఉంటుంది? మీరు నిద్రలేచాకా దాని వలన ఏమయినా ఉపయోగం ఉన్నదా? లేదు! అదే విధంగా మీరు ఈ పుణ్యము అనే మాయమాటలతో మోసం చేసుకుంటారు. దీని ద్వారా భగవంతుడిని కూడా తిన్నగా వ్యాపారంలోనికి లాగేస్తారు. అంతే.
నేను చాలా మందిని చూసాను. వాళ్ళు ప్రతి శనివారం ఒక గుడికి వెళ్ళి అందులో విగ్రహానికి ఏవో ఇవ్వాలి అని నిర్ణయించుకుంటారు. ఒక వేళ ఏ కారణం చేతనైనా వాళ్ళు ఒక శనివారం గుడికి వెళ్ళలేకపోతే వాళ్ళు ఇవ్వదలచుకున్నవన్నీ వాళ్ళ డ్రయివరుకి ఇచ్చి పంపిస్తారు.
స్పష్టంగా అర్థం చేసుకోండి. ఈ భౌతిక ప్రపంచంలోని ఏ వస్తువు, ఏ విషయం కూడా మీరు మరణించేటప్పుడు మీతో రావు. కేవలం మీరు వాస్తవంతో తెలుసుకునే తత్వంతో చేతన స్థితిలో ధ్యానం చేసే క్షణాలు మాత్రమే మీతో పాటు వస్తాయి.
ఈ విషయం కూడా అర్ధం చేసుకోండి. మీ గురించి మీకు తెలిసిన దాని కంటే మీ గురించి భగవంతునికి బాగా తెలుసు. ఆయన నుంచి మీరు ఏదీ దాచలేరు. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. అందుకని భగవంతుని చూసి భయపడటానికి కానీ, ఆయనను సంతోషపెట్టటానికి కానీ ఏమీ లేదు. ఒక వేళ భగవంతుడు మిమ్ములని అర్థం చేసుకోలేకపోతే అసలు ఈ ప్రపంచంలో అర్ధం చేసుకోవటం అన్నదే లేదు.
మీ తల్లిదండ్రుల కన్నా, మీ గురించి భగవంతునికి బాగా తెలుసు. మీగురించి భగవంతునికి ఈ జన్మలోనే కాదు. అన్ని జన్మలలోనూ మీరంటే ఏమిటో భగవంతునికి బాగా తెలుసు. అందుకే మీరుభయపడటానికి ఏమీ లేదు. మీరు ఆయన ముందు ఒక తెరచిన పుస్తకం. మీ గురించి ఏ పేజీలో ఏముందో ఆయనకి పూర్తిగా తెలుసు. ఎప్పుడయినా ఆయన దానిని చూడగలరు.
భగవంతుడు అంటే ఉండే భయాన్ని ముందు వదిలివేయండి. ఆయనని ఈ అనంత చైతన్య సృష్టి యొక్క సంపూర్ణ రూపంలా చూడండి. ఆయనని మీ స్నేహితునిగా చూడండి. సమాజం మీలో భగవంతుడు అంటే భయపడాలి అని చెప్పటానికి చాలా శ్రమపడుతుంది. అయినా మీరు వినవద్దు. మీకు నచ్చిన విధంగా భగవంతునితో సంబంధాన్ని అభివృద్ధి చేసుకోండి. ఆ సంబంధం గట్టిగాను, నమ్మకం తో కూడినదిగా ఉండాలి. ఎవరి జీవితానికైనా కావలసినది ఈ ఒక్క బంధం మాత్రమే.
మీరు ఎప్పుడయితే భగవంతుడు లేదా ఈ అనంత సృష్టితో సంబంధాన్ని పెంచుకుంటారో అప్పుడు మీ గురించి మీకు ఇంతకు ముందుకంటే బాగా తెలుస్తుంది. మీ లోపల కచ్చితంగా ఏమి జరుగుతుందో మీకు బాగా తెలుస్తుంది. స్పష్టత మీ లోపలికి వస్తుంది. మీ అంతరంగంలో తెలివితేటలు పెరుగుతాయి. మీ భయాలన్నీ పోతాయి. దేనినైనా భయంలేకుండా చూడగలుగుతారు. ఏ పనీ మీరు బలవంతంగా చేయరు. ఎందుకంటే మీ భయం స్థానంలోనికి వివేకము వస్తుంది. మీరు ఎప్పుడూ విరామంతో ఆనందంగా ఉంటారు. మీరు స్వేచ్ఛ పొందిన అనుభూతిని పొందుతారు.
మీరు ఎప్పుడయితే భగవంతుని గురించి ఈ అనంత సృష్టి గురించి తెలుసుకుంటారో అప్పుడు మతం పేరుతో జరిగే యుద్ధాలు ఉండవు. ఎవరైతే మతం అంటే భయపడతారో ఎవరయితే మతం కోసం యుద్ధాలు చేస్తారో వాళ్ళు ప్రేమ మయమైన ఈ అనంత చైతన్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేరు. వాళ్ళు నిరంతరం సమాస్తాన్ని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు గుడ్డివారిలా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు.
అన్నింటికి కంటే చాలా ముఖ్యమైనది, భగవంతుని గురించి మీ అభిప్రాయాలని మీ పిల్లలకి బదిలీ చేయొద్దు. భగవంతుడు ఈ అనంత చైతన్య సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడని పిల్లలకి నేర్పించండి. భగవంతుడంటే స్వచ్ఛమైన ప్రేమ అని నేర్పించండి. అంతే కాని మరేది కాదు. పిల్లలు భగవంతునిపట్ల ఈ చైతన్య సృష్టి పట్ల ప్రేమతో కూడిన దృక్పథాన్ని అలవాటు చేసుకునేలా వారికి సహకరించండి. ఇలా చేయటం వలన వాళ్ళలో భయాలు లేకుండా మామూలుగా పెరుగుతారు.
ప్రశ్న : స్వామీజీ మాకు జరిగే వన్నీ కూడా మా కర్మఫలం వలన జరుగుతున్నాయా లేక మా ఎంపిక వలన జరుగుతున్నాయా?
స్వామీ నవ్వుతారు. ఇది చాలా సామాన్యంగా అడిగే ప్రశ్న.
అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి : మీ ఈ క్షణం అనేది మీ జరిగిపోయిన కాలంలో మీ నిర్ణయాల యొక్క సంపూర్ణ రూపం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీరు తెల్లవారక ముందే నిద్ర లేవాలి అని నిర్ణయించుకున్నారు. సరియైన
దారిని ఎంచుకున్నారు. ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అలా కూర్చునే ఉన్నారు. అంతే కదా! నేను చెప్పింది సరియైనదేనా?
ఇదే విధంగా మీ భూతకాలపు నిర్ణయాల రూపమే మీ ఈ వర్తమానం ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఉండటం. అలాగే మీ భవిష్యత్ మీరు ఇప్పుడు చేసే నిర్ణయాల ప్రకారం ఉంటుంది.
ఇప్పుడు ఇదంతా కర్మ అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మనం నిర్ణయాలని అచేతనస్థితిలో చేస్తాము. అంటే తెలియని స్థితి. మనకు వచ్చే ఫలితాలను మనం ఊహించము ఇలా ఎప్పుడయితే మనం ఊహించని, మనకు నచ్చని ఫలితాలు వస్తాయో మనం కర్మ అంటుంటాం
మనం నిర్ణయాలని చేతనస్థితిలో మనకు తెలిసే విధంగా చేయగలిగితే మనం నిర్ణయాలే యొక్క అన్ని రకాల ప్రభావాలని తెలుసుకో గలుగుతాము. అనుబంధంగా, ఆ తరువాత వచ్చే రకరకాలు ఫలితాలను తెలుసుకోగలము. అలా తెలుసుకోలేకపోతే మనం వాటిని మన కర్మ లేదా కర్మఫలం అంటాము. నిజానికి జీవితం పూర్తిగా మీ సొంత ఎంపిక. మనమే అన్ని నిర్ణయాలు చేస్తాం. మనకి ఎవరూ నిర్ణయాల చేయరు.
భగవంతుడు గొప్ప దయాసాగరుడు. ఈ విశ్వం ఆయనది. ఈ ప్రపంచం ఆయన సొంతం. కానీ ఆ దయామూర్తి మనని మన ఇష్టం వచ్చిన ఎంచుకునే అవకాశాన్ని ఇచ్చాడు. మీరు సరియైన నిర్ణయాలు చేయాలంటే ఉన్న ఒకే ఒక మార్గం మీ నిర్ణయాలలోనికి వాస్తవాన్ని, తెలుసుకునే తత్వాన్ని తీసుకురండి. ఈ తత్వాన్ని మీప్రతి శ్వాసలో నింపండి : మీ ప్రతి పనిలో నింపండి. అప్పుడు మీ ప్రతి నిర్ణయం మీరు తెలుసుకునే స్థితిలోనే జరుగుతుంది. మీరు అచేతన స్థితిలో నిర్ణయాలు చేసే పరిస్థితులలోనికి జారిపోలేరు. అంతే. అటువంటప్పుడు మీరు మీ కర్మ గురించి మీ గమ్యం గురించి బాధపడనవసరం లేదు.
ఒక విషయం అర్థం చేసుకోండి. ఎవరూ కూడా మీ సంపదల మీద చేయి వేయరు.
మీకు ఎవరూ కూడా చెడుని చేయలేరు. ఎందుకోగాని మనం నిరంతరం ఎవరో వచ్చి మన సంపదలు కొల్లగొట్టుకు పోతారు అనే భయంతో ఉంటాము. ఇది మన సంపదలు పోతాయేమో అన్న భయం. ఈ భయంతో మనం మన చూట్టూ ఎన్నో గోడలు కట్టుకుంటాము. చివరికి మనం ఆ గోడల మధ్యలో బంధీలయిపోతాయి. అందుకే నేనెప్పుడు చెబుతాను. ద్వారాలు తెరవండి. మలయమారుతాన్ని మీ లోపలికి వీచనీయండి అని. ఈ అనంత చైతన్యపు ప్రాణ శక్తి మిమ్మలని సదా కాపాడుతుంది అని నమ్మండి. స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను మీ ఇళ్ళకి తాళాలు వేయవద్దు అని చెప్పటం లేదు. మీరు భౌతికంగా ఇళ్ళకి తాళాలు వేయండి. కానీ మానసికంగా ఎప్పుడూ తాళాలు వేసేకుని ఉండవద్దు అని చెబుతున్నాను.
ఉదాహరణకి : మీరు ట్రయిన్లో ప్రయాణం చేస్తున్నారనుకోండి మీరు మీ సీట్లలో సర్దుకోగానే మీరు ఏం చేస్తారు. మీ ప్రక్కన ఉన్న వ్యక్తులతో సంభాషణలు మొదలు పెడతారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో? ఎక్కడికి వెళుతున్నారు. వాళ్ళ మతం ఏమిటి? వాళ్ళ కుటుంబ నేపథ్యం గురించి ఇలా చాలా విషయాలు అడుగుతారు. ఇవన్నీ ఎందుకడుగుతారు? మీరు వాళ్ళ విషయాలలో ఉండే కుతూహలంతో కాదు. వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలిస్తే, మీకు వాళ్ళు తెలియని వారు అవ్వరు. అప్పుడు వాళ్ళు అపరిచితులు అనే భయంపోతుంది. అప్పుడు మీరు స్వేచ్ఛగా కూర్చుని ప్రయాణం చేయగలుగుతారు.
మాతా శారదా దేవి ఈ విధంగా చెప్పారు “మీకు అన్యాయం చేసిన వ్యక్తులని కూడా నమ్మండి ఎప్పుడయితే మీ అంతరంగంలో ఈ విశ్వాన్ని నమ్మే గుణం ఉంటుందో మీరు ఈ భూమి మీద జీవిస్తున్న దేవుడిగా ఉంటారు”
మీలో తెలివితేటలు పదును తేలితే మీరు ఒక శాస్త్రజ్ఞుడిలా ఆలోచించగలుగుతారు. మీలోని భావావేశాలు పదును తేలితే మీలో నమ్మకం వికసించుతుంది. మీలో
అనుభూతులు పదును తేలితే మీకు జ్ఞానోదయమవుతుంది. కాబట్టి భయాలని వదిలి వేయండి. అప్పుడు అర్ధం చేసుకోవటం, నమ్మకం అనేవి మీ లోపలికి వస్తాయి.
కాబట్టి మీ సంపదల గురించి ఉన్న భయాలన్ని వదిలివేయండి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోండి. ప్రతి ఒక్కటీ కూడా ఈ అనంత సృష్టి సొంతం : మీరు కేవలం వాటిని ఏదో కొంత కాలం మాత్రం కలిగి ఉంటారు. అంటే ఆ సంపదకి మీరు అశాశ్వత యజమానులు మాత్రమే. తిరిగి ఆ సంపదలన్నీ ఈ అనంత సృష్టి దగ్గరకే వెళ్ళిపోతాయి. అంతే. మీరు ఈ విషయాన్ని లోతుగా అర్ధం చేసుకోగలిగితే అప్పుడు సంపదల గురించి ఉండే భయాలు మిమ్ములని ఆక్రమించవు.
ఈ సందర్భంగా మనం కొత్త వాళ్ళంటే ఉండే భయం గురించి చెప్పుకున్నాము. అలాగే కీర్తి పేరు ప్రతిష్ఠల విషయంలో భయం ఎలా పని చేస్తుందో చూడండి. ఒక వేళ ఒక వ్యక్తి సమాజానికి వ్యతిరేకంగా సమాజం ఒప్పుకోని పని చేయాలనుకున్నాడక్కోండి ఉదాహరణకి వివాహేతర సంబంధం పెట్టుకోవాలను కున్నాడనుకోండి అతను ఏం చేసాడు? అతను తనకి తెలియని వ్యక్తితో వ్యవహారం నడుపుతాడు. తెలియని వాళ్ళతో సమాజం ఈ వ్యక్తిని గుర్తించలేదు కాబట్టి
ఇలా తెలియని వ్యక్తితో ' సంబంధం అంటే భయం అంతగా ఉండదు. ఎక్కడయితే నిమగ్నమవటము, నిబద్ధత కలిగి ఉండటము ఉన్నప్పుడు భయం అనేది ప్రారంభమవుతుంది. మనకు తెలియని వారి విషయంలో ఇది వుండదు. కాబట్టి భయము తక్కువగా ఉంటుంది. భయం అనేది ఎలా ఆడుతుందో చూడండి మీరు ఈ భయం సంకెళ్ళలో నిరంతరం ఎలా ఉంటారో చూడండి
ప్రశ్న : స్వామీజీ, మాకు భయము అనిపించినప్పుడు మీరు మమ్ములని ఆ భయంలోపలికి చూడమన్నారు. కానీ కొన్ని సార్లు అకస్మాత్తుగా భయం వేస్తుంది. అది అలా అకస్మాత్‌గా వచ్చి అలానే పోతుంది. ఇది ఒక షాక్‌లా. అప్పుడు మాకుదాని లోపలికి చూసే సమయం ఉండదు కదా.
అవును మీరు చెప్పేది విపత్తు లేదా అకస్మాత్‌గా కలిగే భయం. ఇలాంటి విపత్తు భయాలు భయం యొక్క చిన్న చిన్న దెబ్బలలాంటివి. అవి కొన్ని క్షణాలలోనే వచ్చి వెళుతుంటాయి. ఉదాహరణకి మీరు రోడ్డుమీద నడచి వెళుతుంటారు. అప్పుడు మీకు ఒక తాడు కనబడుతుంది. దానిని మీరు పాము అనుకుంటారు. అప్పుడు అకస్మాత్‌గా మీరు భయపడతారు. కానీ క్షణాలలోనే అదిపాము కాదు, తాడు అని అర్ధమవుతుంది. మీ భయం పోతుంది. ఇదే భయం యొక్క దెబ్బలేదా చిన్నవిపత్తు చూడండి మన లోపల భయమనే ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు అది బాగా పైకి లేస్తుంది. అంతే. ఇలా చిన్న చిన్న భయాలు కొన్ని సార్లు చాలా ఎక్కువ భయాన్ని పుట్టిస్తాయి. అవి ఉండే సమయం తక్కువ అయినా అవి పుట్టించే భయం యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చిన్న దెబ్బలు మనలోని రోగ నిరోధక శక్తిని తగ్గించి వేస్తాయి. అవి మానసిక కుంగుబాటును కలిగించే కొన్ని రసాయనాలని మనలో తయారయ్యేటట్టు చేస్తాయి. వీటివలన వృద్ధాప్యం త్వర్గగా వస్తుంది. వెంట్రుకలు తెల్లబడిపోతాయి. కొన్నిసార్లు గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.
సగటున మనలో ప్రతి ఒక్కరికి ఇటువంటి భయం దెబ్బలు 6 సార్లు చేతన, అచేతన స్థితులలో జరగవచ్చు. మనకి తెలిసే భయాలు ఎలా ఉంటాయంటే, అర్ధరాత్రి ఫోన్ మోగటం, కారులో వెళుతుంటే అకస్మాత్‌గా ఒక స్కూటర్ అడ్డం రావటం ఇలా ఎన్నో జరుగుతుంటాయి.
అలాగే చెప్పినట్టు ఈ అకస్మాత్తు భయాలని తెలుసుకోవటానికి సమయం ఉండదు. కనీసం భగవంతుడి పేరు తలవటానికి కూడా సమయం ఉండదు. మీరు ఆ
భయంలోనికి వెళ్ళ గలిగే టైం ఉండదు. ఎందుకంటే ఇది ఒక అకస్మాత్తుగా తగిలే దెబ్బ. కాకపోతే ఇలాంటి భయం మీకు కలిగాక దానిని చక్కగా విశ్లేషించండి. చాలా లోతుగా దాని తాలూకా గుర్తులలోనికి వెళ్ళండి. భయాల గురించి లోతుగా అర్థం చేసుకోండి. అప్పుడు అసలు భయం అనే సంగతి మీలోంచి మాయమయిపోతుంది
మీ అంతరంగం లోతుల్లో ఉండే భయాన్ని మీరు తగ్గించుకుంటే ఈ అకస్మాత్తు భయాల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. మీకు నిరంతరం ఉండే మామూలు భయాల మూలంగానే అకస్మాత్ భయాలు వస్తాయి. మీరు వీటిని, లోతుగా సృష్టంగా అర్థం చేసుకోగలిగితే ముందు మీలో ఉండే మామూలు భయాలు తగ్గుతాయి. వాటితో పాటు ఈ అకస్మాత్ గా వచ్చే భయాలు కూడా తగ్గుతాయి. భయాలకి చాలా శక్తి ఉన్నది. అవి పూర్తిగా మిమ్ములని మీ నియంత్రణలోంచి దూరంగా ఉంచగలుగుతాయి.
సుఫీ గురువుని ఒక శిష్యుడు తనకి ఉపదేశం ఇవ్వమని మరీ మరీ అడుగుతుంటాడు. చివరికి ఆ గురువు అతనితో నీకు ఉపదేశం ఇస్తాను. ముందుగా నీవు దగ్గరలోని గ్రామంలోనికి వెళ్ళి ఒక బురఖాలో ఉన్న స్త్రీని ముద్దు పెట్టుకోవాలి. ఆ తరువాత ఆ చివర ఉన్న అడవిలోని పెద్దపులిని కర్రతో కొట్టి రావాలి అని అంటాడు.
శిష్యుడు సరేనని బయలు దేరతాడు. మిగతా శిష్యులు ఇది చాలా చిన్న విషయం, ఇదేమి పెద్ద పరీక్ష కాదు అంటారు. దానికిగురువు నవ్వి “సరే చూడండి” అంటాడు
ఒక వారం గడిచాక శిష్యుడు తిరిగి వస్తాడు. అతను దారుణంగా దెబ్బలు తిని రక్తం కారుతూ ఉంటాడు. గురువు ఆ శిష్యుణ్ణి కారణమడుగుతాడు. దానికి శిష్యుడు ఇలా బదులు ఇస్తాడు. గురుదేవా అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. నేను ఒక స్త్రీని కర్రతో కొట్టాను. పెద్దపులిని ముద్దు పెట్టుకున్నాను” అంటాడు.
(అంతా పెద్దపెట్టున నవ్వుతారు)
భయం మిమ్ములని గుడ్డివాళ్ళనిచేస్తుంది. అది కొన్ని క్షణాల పాటు మీలోని వివేకాన్ని ఆలోచనా శక్తిని మాయం చేస్తుంది. అందుకే మీరు భయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. అప్పుడే దాని నుంచి మీరు బయట పడతారు.
చాలా సార్లు మనం వింటుంటాము. ఏదైన జరిగినప్పుడు ఆపద సంభవించినప్పుడు అగ్ని ప్రమాదం వరదలు ఏవైనా జరిగినప్పుడు అందరూ భయంతో అన్ని వైపులకి పరుగులు పెడతారు. తలుపులు ఎదురు వైపు తీయటానికి ప్రయత్నిస్తారు. గుమ్మం దారिलेని వైపు నుంచి బయటికి వెళ్ళాలని చూస్తారు. మామూలుగా అక్కడ దారिलेదని వాళ్ళకి తెలుసు ఇలాంటి పరిస్థితులు కొన్ని సార్లు ప్రాణాపాయాన్ని కూడా కలిగిస్తాయి. అందుకే భయం మనుషులని గుడ్డివాళ్ళుగా చేస్తుంది.
అందుకే మీకు చెబుతాను. మీ భయాల గురించి బాగా తెలుసుకోండి. ఇలా తెలుసుకోగలిగినప్పుడే మీలో ఉండే మామూలు శక్తి ఉన్నతమైన శక్తిగా మారుతుంది. ఇది ఎలా అంటే తెలుసుకోగలగటం ద్వారా కోరిక ఎలా అయితే ప్రేమగా మారుతుందో భయం, భయంలేని స్థితిగా మారుతుంది. అలాగే స్వచ్ఛమైన తెలుసుకునే తత్వంతో మీలో వివేకం పెరుగుతుంది.
మీరు దేనినైనా అణచివేస్తే అది మరొక రూపంలో విజృంభిస్తుంది. దానిని పూర్తిగా మూలాల నుంచి తీసివేయలేము. కాబట్టి. అణచివేయటం ద్వారా మనం భయాన్ని అధిగమించలేము. తెలుసుకోగలగటం ఒక్కటే దారి. అంతే కాదు మీరు భయాన్ని అణచివేస్తే దానిని పోగొట్టుకునే అవకాశాన్ని కోల్పోతారు.
మీరు ఎప్పుడయితే నిరంతరం భయాలని తెలుసుకోగలగటంతో చూస్తారో అప్పుడు మీకు మరణం సంభవించినా దాని వైపు చూడగలుగుతారు. దానికి స్వాగతం చెబుతారు. దానిని అలా జరగనిస్తారు. ఇది ఎలా చేయగలుగుతారంటే అన్ని భయాలకి మూలం మరణ భయమే కాబట్టి అందుకే మీకు ప్రతిరోజు ఉండే భయాలని జాగ్రత్తగా అధిగమించగలిగితే మరణం అంటే ఉండే భయం కూడా పోతుంది. ఎప్పుడయితే మరణం అంటే ఉండే భయం పోతుందో మీ మిగతా భయాలు కూడా పోతాయి.
ఇప్పుడు మనం చాలా చక్కటి ధ్యాన పద్ధతిని నేర్చుకుందాము. అది నిర్భయ ధ్యానం. ఇది సరాసరిగా వెళ్ళి స్వాధిష్టాన చక్రం మీద పనిచేస్తుంది.
చీకటి ధ్యానం మొత్తం సమయం 30 నిముషాలు :
నిర్భయధ్యాన పద్ధతిని వేదాంతం నుంచి తీసుకున్నాము. ఈ ధ్యానం మీ శరీరరానికి బయట అనుభవాలనిస్తుంది. శరీరం బయట అనుభవము అంటే మరణం పొందే అనుభవం. దీనిని క్రమంగా చేస్తూవుంటే ప్రతిసారీ కూడా విశ్వంలోని శక్తి చీకటిలో ఉంటుంది, ఆ శక్తి మీ శరీరాన్ని మైండ్‌ని శక్తివంతం చేస్తుంది. ఇది స్వాధీష్టాన చక్రాన్ని కూడా శక్తితో నింపుతుంది. ఈ ధ్యానం ఇక్కడ 30 నిముషాలు చేసేటట్లుగా తయారు చేయటమైనది.
నేలమీద సౌకర్యంగా కూర్చోండి. నేలమీద కూర్చోలేనివారు కుర్చీలో కూర్చోండి. మీ తల, మెడ, వెన్నుముక నిలువుగా ఉండాలి.
(మెల్లని సంగీతం వస్తుంటుంది)
కళ్ళు మూసుకోండి. లోతుగా శ్వాసతీసుకోండి. మీరు దట్టమైన అడవిలో నడుస్తున్నాం అనుకోండి. ఆ అడవి మధ్యలోనికి వెళుతున్నట్టుగా ఊహించండి. అందులో ఒక
చీకటి గుహలోనికి వెళ్ళారనుకోండి గుహలోపల భాగం చాలా లోపలికి ఉంది. మీ కళ్ళకి ఏమీ కనిపించటం లేదు. ఆ చీకటి గుహలో కూర్చోండి. మీకు మీ శరీరం కూడా కనిపించటం లేదు. కేవలం మీరు ఉన్నారు అనే ఫీలింగ్ తప్ప ఏమీ కనపడటం లేదు.
మీరు ఎంత కష్టపడి చూడాలనుకున్నా ఏమీ కనపడటం లేదు. చాలా చిక్కటి చీకటి కేవలం మిమ్ములని మీరు ముట్టుకుంటే ఈ స్పర్శతో మీరు ఉన్నట్టుగా తెలుస్తుంది (1నిముషం)
మీరు తల్లి గర్భంలోని చీకటిలోంచి పుట్టారు. ఇప్పుడు అదే ప్రేమమయిమైన కరుణాపూరితమైన ఆ చీకటిలోనే మీరు ఉన్నారు (1నిముషం)
మీ లోపలికి ఈ చీకటిని శ్వాశించండి. మీరు అనే గుర్తు పట్టలేని చీకటిని మీలోపలికి శ్వాసించండి.
నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మీ శరీరం ఆ చీకటిలో కరిగిపోవటాన్ని అనుభవించండి (5 నిముషాలు)
నెమ్మదిగా చాలా నెమ్మదిగా మీ శరీరం చీకటిగా మారిపోయింది అనుకోండి (5 నిముషాలు)
మీ శరీరంతో పాటు చీకటిని కూడా మీలోపలికి శ్వాసించండి (ఊపిరి తీసుకోండి). మీ శరీరంలోని ప్రతి అణువునీ చీకటితోపాటు మీ లోపలికి లోతుగా ఊపిరి తీసుకోండి
15 నిముషాల తరువాత
ఇప్పుడు మీ శరీరాన్ని అన్ని స్పర్శలతో ఉన్నట్టుగా అనుభూతి పొందండి. మీ శరీరాన్ని నెమ్మదిగా కూర్చున్న పద్ధతికి కదలించండి. మీరు లేచి గుహలోంచి బయటకి రండి. అడవిలోంచి బయటకి వచ్చేసేయండి. మీరు మెడిటేషన్ హాలుకి వచ్చేసేయండి (3 నిముషాలు)
ఓం శాంతి శాంతి శాంతిః
మనం తరువాత క్లాసులో కలిసే వరకూ ఈ నిశ్శబ్దంలోనే ఉండండి.
ధన్యవాదాలు.
