కల్పనలని అధికమించటం
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
(Overcoming Fantasies)
ఇప్పుడు మనం మూలాధార చక్రం గురించి తెలుసుకుందాం. మూలాధార చక్రం వెన్నుముక క్రింది భాగంలో ఉంటుంది. సంస్కృతంలో మూలాధార అంటే అనంత సృష్టికి ఆధారభూతమైన అని అర్థం. మూలా అంటే వేర్లు (roots), ఆధార అంటే ఆధారము. అంటే మూలాలకి ఆధారం. కాబట్టి ఇది సమస్త సృష్టికి ఆధారం అని అర్థం.
మనం కల్పనలలో, ఊహ జగత్తులో ఉంటే ఈ చక్రం బంధింపబడుతుంది. కల్పనలని, ఊహలని వదలివేసి సత్యాన్ని గ్రహించినపుడు ఈ చక్రం వికసిస్తుంది.
ధ్యానపద్ధతి :
మూలాధార చక్రం లైంగికపరమైన విషయాలకి, కల్పనలకి, ఊహలకి సంభందించిన చక్రం.
లైంగిక జ్ఞానం అనే విషయం బహుశః అతి ఎక్కువగా మాట్లాడిన, చాల ఎక్కువగా ఆలోచించిన, చాల ఎక్కువగా వ్రాయబడిన విషయం. అదే విధంగా ఇది అతి తప్పుగా అర్ధం చేసుకున్న, తప్పుగా వాఖ్యానింపడిన, చాలా అయోమయాన్ని సృష్టించిన విషయం కూడా లైంగిక జ్ఞానమే. మనం ఈ విషయాన్ని పూర్తిగా వదిలేస్తాము లేదా దీనిలో అతిగా నిమగ్నమయిపోతాము. లైంగిక విషయాలని లోతుగా మన అచేతన వ్యవస్థతో కప్పేస్తాము. మొదటి నుంచి కూడా, మనకి ఈ విషయాలని విపులంగా వివరించే వారే ఉండరు. దీనిలోని అసలు విషయాన్ని మనకు చెప్పే వారే ఉండరు.
లైంగిక సంభందమైన విషయాలని అన్నింటికంటే ముందుగా వివరించాలి. దీనిని పూర్తి చేతన స్థితిలో ఈ శాస్త్రాన్ని వివరించాలి. ఈ విషయంలో మన పరిస్థితి ఎలా ఉన్నదంటే:
బాగా చీకటి రాత్రి ఒక వ్యక్తి అడవిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఎక్కడో అడవిలో ఒక చోట పెద్ద గొయ్యి తవ్వబడి ఉన్నది. ఆ నడచి వెళ్ళే అతనికి ఆ గొయ్యి సంగతి తెలియదు.అది ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. అప్పుడు అతను దానిని ఎలా తప్పించుకుంటాడు. సబ్జక్టు గురించి తెలియని మనిషి, దానిని తెలుసుకోకూడదు అనుకున్న వ్యక్తికి ఇతనిలాగానే ఏమీ తెలియదు.
సరే ఈ విషయం గురించి తెలిసిన మనిషి ఎలా ఉంటాడు ఆ నడచి వెళ్ళే అతనికి గొయ్యి ఉన్నది అని తెలుసు. కానీ ఆ చీకటిలో దానిని తప్పించుకోవటానికి అతనికి వేరే దారే లేదు. కాబట్టి ఆ గోతిలోనికి దూకవలసిందే. ఈ పై రెండూ సమస్యకి పరిష్కారాలా? కాదు. కాబట్టి ఏం చేయాలి. అసలు గొయ్యి ఎక్కడ ఉన్నదో తెలుసుకుని, దానిలో పడకుండా పక్కనుంచి వెళ్ళిపోవాలి.
లైంగిక విషయాలని ఎప్పుడు తివాచి కిందకి తుడిచేస్తారు. బయటకి కనపడనీయరు. ఇది నిషేదింపబడిన విషయం. తల్లితండ్రులు పిల్లలతో ఈ విషయం మాట్లాడరు. అసలు వాళ్ళకి ఆ విషయంలో నిజాలు తెలిస్తేగా పిల్లలకి చెప్పటానికి. ఎప్పుడయినా ఏ విషయాన్నైనా ఆ విషయంలో బాగా తెలిసిన నిష్ణాతులని మాత్రమే దాని గురించి అడగాలి. లేకపోతే విషయాన్ని సరియైన పద్ధతిలో అర్ధం చేసుకోలేరు. అటువంటప్పుడు ఆ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉన్నది.
ఒక చిన్న కధ :
ఒకామెకి వాళ్ళ అబ్బాయి స్కూలు టీచర్ దగ్గర నుంచి ఒక ఉత్తరం వస్తుంది. అందులో మీ అబ్బాయి బోర్డుమీద అక్షరాలు సరిగ్గా చూడలేకపోతున్నాడు. దాంతో రాసేటప్పుడు చాలా తప్పులుచేస్తున్నాడు అని ఉంటుంది.
వెంటనే ఆమె తన కొడుకుని కళ్ళ డాక్టర్ దగ్గరకి తీసుకు వెళుతుంది.
డాక్టరుగారు పరీక్షలన్నీ చేసి ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తారు. అందులో ఇలా ఉంటుంది. “మీ అబ్బాయికి వెంటనే హెయిర్ కట్ చేయించాలి” అని.
(అంతా నవ్వుతారు)
మనం ఈ జోక్ విని నవ్వుతాం. కానీ మన నిజ జీవితంలో ఇలానే చేస్తాం: మీరు ముందే సరియైన వాళ్ళ దగ్గరకి వెళితే, సరియైన పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే వాళ్ళని, వీళ్ళని ఎంతో మంది దగ్గరకి వెళ్ళి ఉపయోగంలేనివి ప్రయోగించి జీవితాన్ని వృధా చేసుకుంటారు.
ఇంకా భయంకరమైన విషయం, ఈ ఉపయోగం లేని విషయాలని ముందు తరాలవారికి కూడా బోధిస్తారు. ఈ విధంగా ఒక సాంప్రదాయాన్ని సృష్టించుతారు. ఒక్కసారి సాంప్రదాయం అని దేనినైనా స్థాపించితే అది ఒక బలమైన విషంయంగా నాటుకుపోతుంది.
మీరు గురువు సమక్షానికి వచ్చినప్పుడు ఆయన చేసే మొదటి పని మీలో పేరుకుపోయిన అటువంటి విషయాలనన్నింటిని తొలగించటం. అలా చేసిన తరువాత ఆయన మీలోపలికి ప్రవేశింపగలడు. అప్పుడే అసలు మీరేమిటో ఆయన మీకు చూపించగలడు. ఇది ఆయనకి కొంచం కష్టమైనపని. ఎందుకంటే మీరు మీ దారిలో చాలా ముందుకి వెళ్ళిపోయారు. మీరు ఎంత దూరం వెళ్ళి పోయారంటే, మిమ్ములని చూసి మీరే ఆ తప్పుడుదారిలో అంత దూరం ఎలా వెళ్ళగలిగానా అని ఆశ్చర్యపోయేంతగా వెళ్ళిపోయారు.
ఇప్పుడు మనం అసలు విషయంలోనికి వద్దాము. లైంగిక జ్ఞానం అంటే ఏమిటి? లైంగిక విషయం గొప్ప శక్తిని పుట్టిస్తుంది. అది ధ్యానమయమైన శక్తి. ఈ ప్రపంచమంతా ఆ శక్తి లోపల నుంచే ఉద్భవించింది. మన ప్రాచీన కాలంనాటి ఋషులు, జ్ఞానోదయం పొందిన మహాయోగులు, ఈ విషయం మీద చాలా స్పష్టమైన
వివరణని ఇచ్చారు. మీకు వాత్సాయనుడు అంటే ఎవరో తెలుసా? ఆయనే కామసూత్రాలు అనే గ్రంథాన్ని వ్రాసిన వ్యక్తి. అది లైంగిక విషయాలను తెలిపే ఒక శాస్త్రము. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఒక సన్యాసి. ఆయన బ్రహ్మచారి.
వాత్సాయనుడు జ్ఞానోదయమయిన గొప్ప యోగి. ఆయన కామసూత్రాలని మొట్ట మొదట తన తల్లికి వివరించాడు.
ఆయన జ్ఞానోదయమయిన తరువాత మొదటి సారి తల్లి దగ్గరకి వస్తాడు. ఆమె తన కొడుకుతో ఇలా అంటుంది. జ్ఞానోదయమయిన వ్యక్తికి ఈ భూమి మీద ఉన్న అన్ని శాస్త్రాలు తెలిసి ఉండాలి అని. ఆయన ఆ విషయం నిజమే అని ఒప్పుకుంటాడు. అప్పుడు ఆయన తల్లిని, నీకు ఏ విషయంలో వివరణ కావాలి అని అడుగుతాడు.
అప్పుడు ఆమె తన కొడుకుతో ఇలా అంటుంది “కుమారా! నీ తల్లిగా నాకు నీవు పుట్టుక దగ్గరనుంచీ బ్రహ్మచారివి అని తెలుసు. కాబట్టి నీకు లైంగిక సంబంధమైన విషయాలు ఏమీ తెలిసే అవకాశం లేదు. నీవు నాకు ఆ విషయాల గురించి చెప్పగలవా?” అని అడుగుతుంది.
అప్పుడు వాత్సాయనుడు చిరునవ్వు నవ్వి అలాగే చెబుతాను అని లైంగిక శాస్త్రంగా బహుళ ప్రాచుర్యం పొందిన ప్రాచీన శాస్త్రం కామ సూత్రాలు తల్లికి చెబుతాడు.
ఒక సారి ఎవరో వాత్సాయనుడిని “నీవు లైంగిక శాస్త్ర విషయాలు మాట్లాడటానికి ఏమి అధికారం ఉన్నది?” అని అడుగుతాడు.
ఇది చాలా సహజమైన ప్రశ్న. మీలో చాలా మంది నిశ్శబ్దంగా ఈ ప్రశ్న నాకు కూడా వేస్తుండవచ్చు. దీనికి వాత్సాయనుడు,. “నేను మీకోసం ఉన్న విషయాన్ని మీకు అర్ధమయ్యే ఆధునిక భాషలో, ఆధునిక పోలికలు ఉపయోగించి చెబుతున్నాను. అంతే” అని జవాబు చెబుతాడు.
ఒక ఎలక్ట్రీషియన్‌కి మీ ఇంట్లో ప్రతి గదిలో ఉండే ప్రతి స్విచ్ తెలుసు. ఏ స్విచ్ వేస్తే ఏమవుతుందో అతనికి కచ్చితంగా తెలుసు. గోడల వెనుక ఉన్న వైర్లు , వాటి సర్క్యూట్సు అన్నీ వివరంగా తెలుసు. ఎక్కడయినా ఏదైన సమస్యవుంటే దానిని పసిగట్టి కారణం కనుక్కుని మీకు పరిష్కారం వెబుతాడు. అవును కదా?
అతనికి ఎలక్ట్రిసిటి అనే శాస్త్రం తెలుసు. అలా కాకుండా మీరు, ఎవరైతే ఆ స్విచ్ని రోజుకి ఏభైసార్లు వేస్తూ తీస్తూ ఉంటారో, వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో ఏమి తెలియదు. అంతేనా? మనలో చాలా మందికి కేవలం స్విచ్ వేయటం, తీయటం మాత్రమే వచ్చు. అందుకే కొన్ని సార్లు మనకి షాక్ కొడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. మీలో అమ్మ, నాన్నలుతాతయ్యలుఅమ్మమ్మనానమ్మలు ఇలా చాలా మంది ఉండవచ్చు. కానీ మీకు ఎవరికీ లైంగింక విజ్ఞానం గురించి సరియైన అవగాహన లేదు. మీకు ఆ విషయాలు శాస్త్రీయంగా తెలియదు.
మనమందరం నిరంతరం హార్మోన్ల చిత్రహింసలో ఉంటాం. టి.వి. కార్యక్రమాలు, మిగతా మీడియాలు రకరకాలుగా కోరికని చూపిస్తాయి. మనం వాటిని చూసి అదే లైంగిక విజ్ఞానం, అదే ప్రేమ అని అనుకుంటాము.
మీకు సరియైన లైంగిక విజ్ఞానాన్ని శాస్త్రీయంగా చెప్పాలి అంటే అది జ్ఞానోదయం పొందిన జ్ఞాని మాత్రమే ఇవ్వగలడు.
భారత దేశం కొన్ని సంవత్సరాలుగా దోపిడీకి గురైంది. ఈ దేశంలో ఉండే అపారమైన సంపద కోసం, ఈ భూమి కోసం ఎంతో మంది ఈ దేశం మీద దాడి చేసి సంపద దోచుకున్నారు. అయితే ఇవి ఏవీ కూడా ఈ దేశాన్ని ఎక్కువ నష్టపరచలేదు. ప్రతి దాడి తరువాత ప్రతి యుద్ధం తరువాత దేశం కుదుటపడేది. తిరిగి ఈ సమాజం నిలబడేది. చివరికి దోపిడీల కారణంగా గురుకుల వ్యవస్థ పూర్తిగా కనుమరుగయిపోయింది. ఆ తరువాత ఆ వ్యవస్థనే పూర్తిగా తీసివేసారు. గురుకుల వ్యవస్థ అనేది ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ. శిష్యులు గురువుల పాదల దగ్గర కూర్చోని విద్యని అభ్యసించే వ్యవస్థ. దానితో పాటు లైంగిక శాస్త్రమైన కామసుత్రాలని
బోధించే పద్ధతిని కూడా మనం పోగొట్టుకున్నాము. ఇది భారతదేశానికి తగిలిన పెద్ద ప్రమాదకరమైన దెబ్బ. దీనితో ఎవరికీ కూడా లైంగిక విషయాలు అంటేనే తెలియకుండా పోయింది. చివరికి దాని అర్థం ఒక కోరిక లేదా కామంగా మిగిలిపోయింది.
మీరు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు చెస్ ఆడేటప్పుడు చూసారా? మీరు కేవలం ఆటని గమనిస్తుంటే, చాలా సార్లు సరియైన ఎత్తు ఎలా వేయాలో మీకు తెలుస్తుంది, కానీ ఆ ఆట ఆడే వాళ్ళకి ఆ ఆలోచన రాదు. అలా ఎందుకు జరుగుతుందో చెప్పగలరా?
ఎవరో జవాబు చెబుతారు, "స్వామీజీ, మేము ఆటలో నిమగ్నమవ్వలేదు కాబట్టి"
అవును నిజానికి ఆటని గమనించే వ్యక్తిపైన ఆట గెలవాలి అనే మానసిక వత్తిడి ఉండదు. ఎప్పుడు అయితే ఒత్తిడికి, ఆందోళనకి లోనవుతామో మైండ్ నెమ్మదిగా, మొద్దుగా (dull) అయిపోతుంది. కాబట్టి ఆటలో లేకుండా, ఆటని బయట నుంచి గమనించే వ్యక్తికి మంచి ఎత్తులు, ఆలోచనలూ వస్తాయి. గురువుకి అన్నీ తెలుసు, అందుకే ఏ విషయం మాట్లాడాలన్నా వారికి అధికారం ఉంటుంది.
సరే ఈ లైంగిక విద్య లేదా లైంగిక విషయం అంటే ఏమిటి?
ఈ రోజుల్లో జీవ శాస్త్రం ఏమని నిరూపించిందంటే, పురుషులు 100 శాతం పురుషుడు కాదు, అలాగే స్త్రీ 100 శాతం స్త్రీ కాదు. పురుషుడు 51 శాతం పురుషుడు 49 శాతం స్త్రీ, అలాగే స్త్రీ 51 శాతం స్త్రీ, 49 శాతం పురుషుడు అని నిరూపించింది. అంటే ఇద్దరికి తేడా కేవలం 1 శాతం మాత్రమే.
మీరు మీ తండ్రి మూలాధార, తల్లి మూలాధార నుంచి జన్మించుతారు. అటువంటప్పుడు మీరు కేవలం స్త్రీగానో లేదా కేవలం పురుషునిగానో ఎలా ఉంటారు. ఆ ఇద్దరి లక్షణాలు మీలో ఉండాలి కదా!
ఇదే పరమేశ్వరుని అర్ధనారీశ్వర తత్వానికి అర్ధం. మనం ఒప్పుకున్నా లేకపోయినా మనం స్త్రీ పురుష లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులం. మనం స్త్రీ పురుష శక్తులు రెండూ కలిగి ఉన్నాము. మనం ఒక సంపూర్ణ ఏకత్వం కలిగిన వ్యక్తులం, మనం విభజింపబడిలేము.
తంత్ర అనేది లైంగిక జ్ఞానాన్ని అందంగా వివరిస్తుంది. మన పురాణాలలో పరమేశ్వరుడు దేవి పార్వతికి దీనిని అద్భుతంగా వివరించుతాడు. ఏ విషయాలయితే 5000 సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయో అవి ఈ రోజు జీవ శాస్త్రంలో అదే విధంగా నిరూపించబడ్డాయి.
మనం సంపూర్ణత్వం పొందాలంటే మనలోని స్త్రీ, పురుష లక్షణాలు రెంటిటినీ స్వీకరించాలి, వాటిని మనం చూపగలగాలి.
కానీ అది నిజంగా జరుగుతుందా? మనలని అలా వెళ్ళడి చేయనిస్తారా?
పుట్టిన క్షణం నుంచీ సమాజం స్త్రీ, పురుషుడు అనే ముద్రలు వేస్తుంది. మనం అలానే ప్రవర్తించాలి అని ఆశిస్తుంది. సమాజం బాలుడిని స్త్రీ లక్షణాలు చూపనీయదు. అలాగే ఆడపిల్లలని పురుష లక్షణాలు వెల్లడి చేయనీయదు. దాంతో చిన్న వయస్సు నుంచే మనలో ఒక భాగం అణచివేయబడుతుంది. ఏడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ సమాజ నిబంధనలు పిల్లల మనసులో లోతుగా నాటబడవు. అప్పటి వరకూ వాళ్ళు ఆడపిల్లా లేక మొగపిల్లవాడా అనే ఆలోచన వాళ్ళకి ఉండదు. అందుకే చిన్న పిల్లలలో సంపూర్ణత్వం కనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ మీద ఏకాగ్రత కలిగి ఉంటారు. భద్రతా భావంతో ఉంటారు. అందుకే పిల్లలని చూస్తే అందంగా, సంతోషంగా అనిపిస్తుంది. ఏడు సంవత్సరాలు దాటగానే వాళ్ళు సమాజపు నియంత్రణలోనికి వచ్చేస్తారు.
మగ పిల్లలని బొమ్మలతో ఆడుకోనీయరు. ఆడ పిల్లలు రేసు కార్లతో, రాకెట్లతో ఆడితే ఒప్పుకోరు. ఆఖరికి బట్టల రంగుల విషయంలో కూడా చాలా తేడా ఉంటుంది. మగపిల్లలకి బ్లూకలర్వి కొంటే ఆడపిల్లలకి పింక్ కలర్ బట్టలు కొంటారు, అవును కదా?
పూర్వకాలంలో పిల్లలు పుట్టటం వరకే తల్లితండ్రుల బాధ్యత ఉండేది. వారికి నాలుగు సంవత్సరాల వయస్సు రాగానే వారిని గురుకులంలో చేర్పించే వారు. గురుకులంలో వారికి 7 వ సంవత్సరంలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేవారు. ఆ మంత్రం వారిలో విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలింపచేస్తుంది. వారికి 14 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి, వారికి ఆధ్యాత్మిక అనుభవాలు జరిగితే వారికి బ్రహ్మసూత్రాలు నేర్పేవారు. అది ప్రపంచంలోనే అత్యుత్తమ వేదాంత గ్రంథం. లేకపోతే వారికి కామసూత్రాలు నేర్పేవారు. అదే లైంగిక శాస్త్రం. దాంతో వారు గృహస్థ జీవితానికి సంబంధించిన విషయాలు నేర్చుకునే వారు. ఒక వేళ 21 సంవత్సరం లోపు వారికి జ్ఞానోదయమయితే, వారిని సన్యాసాశ్రమానికి ప్రోత్సహించే వారు, అదీ కాకపోతే వారికి యోగ శాస్త్రాన్ని నేర్పేవారు. ఈ విధంగా పిల్లలను వారికి నచ్చిన విధంగా వారి శక్తిని అనుసరించి వాళ్ళ వాళ్ళ మార్గాలలో అభివృద్ధి చెందేటట్టుగా గురువులు వారిని ప్రేమతో, వాత్సల్యంతో ప్రోత్సహించే వారు. దారి చూపి సహాయం చేసే వారు.
కాని ఇప్పుడు బలమైన నిబంధనలు పిల్లలలోపలికి పంపబడుతున్నాయి. అది చాలా ప్రమాదకరమై పని. దానితో పిల్లలు తమకు కాని రెండవ భాగాన్ని, దేనినైతే సమాజం ఒప్పుకోదో ఆ భాగాన్ని అణచివేయటం మొదలుపెడతారు.
మనిషి యొక్క అనువంసిక (inherent) లక్షణం, సఫలంచేసుకోవటం లేదా సిద్ధింపచేసుకోవటం (fulfillment) అతను సఫలమనే తత్త్వం నుంచి వస్తాడు, దానిని పొందటానికే చూస్తాడు. కాబట్టి అతను తాను పోగొట్టుకున్న సగ భాగం కోసం బయట వెతుకుతుంటాడు. తను పోగొట్టుకున్న భాగానికి సరిపోయే ప్రత్యామ్నాయాన్ని వెతుకుతాడు. మగపిల్లలు, ఆడపిల్లల సమక్షాన్ని, ఆడపిల్లలు మొగపిల్లల సమక్షాన్ని వెతుక్కుంటారు. ఇక్కడే లైంగిక విషయం అసలు ప్రారంభమయ్యేది. ఇక్కడే ఈ విషయం పిల్లలో నాటుకునేది.
పిల్లలు 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకూ తల్లి తండ్రులకు బాగా దగ్గరగా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఆదర్శమైన స్త్రీ పురుష లక్షణాలని సేకరించుతారు. మగపిల్లవాడు తనలో అణచివేయబడిన సగభాగం అయిన స్త్రీ లక్షణాలని తల్లిలో చూసుకుంటాడు. అలాగే ఆడపిల్లలు తమలో అణచివేయబడిన పురుష లక్షణాలను తండ్రిలో చూస్తారు. అందుకే ప్రతి మగపిల్లవాడికి అతని మొదటి హీరోయిన్ తల్లి. ఆడపిల్లకి మొదటి హీరో ఆమె తండ్రి. ఇది వ్రాయని న్యాయ సూత్రము.
తనలోంచి తీసివేయబడిన భాగాన్ని వెతుక్కోటాన్నే Freudian అనే మానసిక శాస్త్రవేత్త Oedipus మరియు Opehelia లక్షణాలుగా వర్ణించాడు. ఒక యువకుడు తన భార్య నుంచి తన తల్లి ఎలాంటి అధరణ ఇచ్చేదో అటువంటి ఆధరణ, ఆప్యాయతలని ఆశించుతాడు. అలాగే యువతి భర్త నుంచి తన తండ్రి తనకి ఇచ్చిన రక్షణని, అభయాన్ని ఆశిస్తుంది.
భార్య, భర్తలు విడిపోయిన కుటుంబాలలో లేదా తల్లిగాని, తండ్రి గాని చనిపోయిన కుటుంబాలలోని పిల్లలు ఎవరో ఒకరిని పోగొట్టుకున్నప్పుడు వారి వ్యక్తిత్వంలో పరిపూర్ణత లోపిస్తుంది. వారి మనసులో ముందుగా లోతైన ముద్ర వేసేది తల్లితండ్రులే. మీరు పెద్దవారయిన తరవాత కూడా, చాలా సంవత్సరాలు గడచినా, మీకు మీ తల్లి తండ్రులకి మధ్య అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా మీలో మీ తల్లి లేదా తండ్రి తాలూకా ముద్రలు అలానే ఉంటాయి. మీరు వాటిని మీ అంతరంగం నుంచి అసలు తుడిచి వేయలేరు. పిల్లలకి 14వ సంవత్సరంలో భౌతికంగా పరిణితి (maturity) వస్తుంది. అప్పుడు సమాజపు నిబంధనలు వారిని వారి తల్లితండ్రులతో పూర్వం ఉన్నంత అన్యోన్యతతో, అంత దగ్గరగా ఉండనీయరు. ముఖ్యంగా ఆడపిల్ల తండ్రితో, మగపిల్లలు తల్లితో అంత దగ్గరగా ఉండరు. వీరి పనులు వేరు అవుతాయి. దానితో పిల్లలు తల్లితండ్రులతో ఎక్కువ సమయం గడపలేరు.
కాబట్టి 14వ సంవత్సరం నుంచీ వెతకటం మొదలుపెడతారు. వారు పోగొట్టుకున్న భాగం కోసం వారు ఈ సారి బయట ప్రపంచంలో వెతుకుతారు. ఈ రోజుల్లో ఇది 14 సంవత్సరాల కంటే ముందే ప్రారంభమవుతుంది. ఈ రోజుల్లో పిల్లలు ఇంటర్నెట్, టీ.విలు బాగా చూస్తున్నారు. దాంతో వారు మానసికంగా తొందరగా ఎదుగుతున్నారు. అది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. అది సరే! 14వ సంవత్సరంలో వాళ్ళు బయట ప్రపంచంలో వెతకటం మొదలుపెడతారు.
ఇప్పుడు పిల్లలు తమకి కావలసిన లక్షణాలని బయట వారి నుంచి లేదా టీ.వి సినిమాల నుంచి సేకరించటం ప్రారంభించుతారు. మీడియాకి ఈ విషయం చాలా బాగా తెలుసు. అందుకే అడ్వర్టైజ్మెంట్లు కూడా అందమై యువతీ యువకులనే చూపించుతాయి. ఆడపిల్లకి అవసరం లేని వస్తువులకి కూడా వారితోనే అడ్వర్టైజ్ చేస్తారు. మోటర్ సైకిల్‌కి కూడా ఆడపిల్లలని చూపిస్తారు. ఎంత మంది అమ్మాయిలు మోటర్ సైకిల్ నడుపుతున్నారు. అది ఏవస్తువయినా నవ్వుతూ ఉన్న అందమయిన అమ్మాయిలు ఆ వస్తువు కొనమని సిపార్సు చేస్తారు. మీరు షాపుకి వెళ్ళి ఆ వస్తువే కొంటారు. ఆ వస్తువుతో పాటు ఆ అమ్మాయి రాదు అని మర్చిపోతారు. ఈ విధంగా మీడియా మీలో అణచివేయబడిన కోరికలని డబ్బుచేసుకుంటుంది.
అన్ని రకాల మీడియా కూడా కలలని అమ్మే వాళ్ళే . మనం ఈ కలలన్నీ పోగుచేసుకుని వాటిని మన మైండ్‌లో పరిగెత్తిస్తాము. దాంతో మన దాహం తీరుతుంది అనుకుంటాం. అది సాధ్యమేనా? మంచి నీళ్ళు కోసం దాహం వేసినప్పుడు ఉప్పుతీసుకుంటే దాహం తీరుతుందా? లేదు, ఒక వేళ మీరు అలా చేస్తే మీ దాహం పెరుగుతుంది, అవును కదా?
మీరు అప్రమత్తంగా ఉంటే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు మిమ్ములని మోసం చేయవు. కాకపోతే వాటి ద్వారా మార్కెట్ లోనికి వచ్చిన కొత్త వస్తువులు ఏవో మీరు తెలుసుకోవచ్చు, అంతే కాని వాటిని చూసి మోసపోకూడదు.
వాటిని చూసి మీరు వాటి బారిన పడకుండా వదిలేస్తారు. వాటి వైపు చూసినప్పుడు మీకు తెలియకుండా వాటివైపు ఆకర్షితులు కాకుండా ఉంటారు. మీరు ఎప్పుడైతే ప్రతిచర్యాయుతమైన మైండ్ (reactive mind) కి మీ నిర్ణయాలు వదిలేస్తారో, అప్పుడు మీకు సమస్యలు ప్రారంభమవుతాయి. మీరు ఆ మైండ్ ని వదిలి మీ వివేకంతో పని చేయండి. అప్పుడు మీరు నిరంతరం తెలుసుకునే తత్వంతో ఉంటారు. ఈ విషయం సాధించటానికి ధ్యానం మీకు సహాయం చేస్తుంది.
చూడండి, ఒక ప్రక్క మీడియా మీ ఊహలని, కల్పనలని పెంచుతూ ఉంటుంది. మరో వైపు సమాజం మిమ్ములని అణచి వేస్తుంది. సమాజం మీ ఊహలని, కోరికలని అణచివేసే కొద్దీ, అవి మరింత విజృంభిస్తాయి.. ఎందుకంటే సమాజం అసలు మూల కారణాలను వెలికి తీయకుండా కేవలం వాటిని అణచివేస్తుంది. మీరు చెట్లకొమ్మలని నరికి వేర్లని భూమిలో ఉంచితే ఏమవుతుంది? చెట్లు మరిన్ని కొమ్మలు రెమ్మలతో పెరుగుతాయి అంతే.
సరే! మనం ఈ రోజుల్లో అన్ని రకాల మీడియా ద్వారా రకరకాల భావాలను పోగు చేసుకుంటాము. దానిలో ఒక పురుషుడు లేదా స్త్రీ రూపాన్ని తయారు చేసుకుంటాము. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి తీసుకుంటాము. అందమైన ముక్కు, అందమైన కళ్ళు, అందమైన అవయవ సౌష్టవం ఇలా అందమైనవన్నీ పోగుచేసుకొని మనకు కావలసిన ఆదర్శ రూపాన్ని తయారు చేస్తాము. కంప్యూటర్ లో మనం కట్ (cut) పేస్ట్ (paste) చేస్తాం కదా! అలా కావలసిన వాటితో తయారు చేస్తాం. అవును కదా?
ఈ దశ 7 సంవత్సరాల వరకూ ఉంటుంది. అది సుమారు మనకి 20 లేదా 21 సంవత్సరాలు వచ్చే వరకూ ఉంటుంది. అప్పుడు ఈ మీడియాలో ఊహలని వెతకటం మానేస్తాము. కానీ మనం అంతకు ముందు పోగుచేసుకున్న ఊహలు, భావాలు మనలోపల చాలా లోతుగా నాటుకు పోయి ఉంటాయి. ఇప్పుడు మరొక కొత్త శోధన మొదలుపెడతాము. మన ఊహలలో ఉండే రూపం నిజ జీవితంలో ఎక్కడ దొరుకుతుందా అని. ఈ వెతకటం మనకి కాబోయే భార్య లేదా భర్త ఎలా ఉండాలి అని వెతుకుతుంటాము. ఇక్కడ ఆశించటం (expectations). మొదలవుతుంది.
ఈ వెతకటం మరొక ఏడు సంవత్సరాలపాటు సాగుతుంది. ఒక మనిషి తరువాత మరొకరిని చూడడం, నిరుత్సాహపడడం. కొంతమంది తెలివైన వాళ్ళు కొంతకాలానికి కలలు, ఊహలు నిజంకాదు అని తెలుసుకుంటారు. కలలు నిజం కావు కాబట్టే కలలు అని అంటారు. కానీ కొంత మంది ఇంకా వెతుకుతూనే ఉంటారు.
ఒక చిన్న కధ
ఒక 90 సంవత్సరాల వ్యక్తి రోజూ బీచ్ లో ఉదయం నుంచీ సాయంత్రం వరకూ కూర్చొని అక్కడ ఉన్న మనుషులని గమనిస్తూ ఉంటాడు. మరొక వ్యక్తి ఇతనిని చాలా రోజులు గమనించి ఒక రోజు అతని దగ్గరకి వెళ్ళి ఇలా అడుగుతాడు, "మీరు ఇక్కడ రోజూ కూర్చుని ఏం చేస్తుంటారు?".
దానికి ఆ పెద్దాయన, “నేను నా భార్యకాదగిన అమ్మాయి కోసం వెతుకుతున్నాను” అని అంటాడు.
అడిగిన వ్యక్తి నిర్ఘాంతపోతాడు. పెద్దాయనని మరలా ఇలా అడుగుతాడు, “మీరు మీ చిన్న వయస్సులో ఎందుకు వెతకలేదు?“ అని
ఆ ప్రశ్నకి పెద్దాయన, "నేను నా 30 సంవత్సరాల వయసప్పటి నుంచీ వెతుకుతున్నాను" అని జవాబు ఇస్తాడు. జవాబుకి ఆశ్చర్యపోయి పెద్దాయనని ఇలా అడుగుతాడు. "మీరు ఎటువంటి స్త్రీ కోసం వెతుకుతున్నారు?”. పెద్దాయన ఇలా జవాబు చెబుతాడు, “నేను పరిపూర్ణమైన స్త్రీ కోసం వెతుకుతున్నాను”..
“అయితే ఇంత వరకూ మీకు అటువంటి స్త్రీ దొరకలేదా?” అడుగుతాడు ఆ వ్యక్తి.
ఆ ప్రశ్నకి పెద్దాయన ఇలా చెబుతాడు. “నా మైండ్‌లో నేను కోరుకున్నట్లే ఉన్న ఒక స్త్రీని చూసాను, కానీ సంబంధం కుదరలేదు”. ఆ వ్యక్తి ఎందుకు సంబంధం కుదరలేదు అని అడుగుతాడు. దానికి పెద్దాయన ఇలా జవాబు చెబుతాడు, "ఆమె ఒక పరిపూర్ణ పురుషుని కోసం వెతుకుతుంది".
(పెద్దగా నవ్వుతారు)
మీ మైండ్‌లో మీరు జాగ్రత్తగా మోస్తున్న ఊహలకి సరిపడా వ్యక్తి కావాలని అనుకుంటే ఇలానే జరుగుతుంది.
సరే! ఇలా చాలా కాలం వెతికాక అకస్మాత్‌గా చాలా దూరం నుంచి, మన ఊహలకి సరిపోయే వ్యక్తి దొరుకుతుంది. మన మైండ్‌లో ఉన్న రూపం ఆకుపచ్చ, మనం దూరం నుంచి చూస్తున్న వ్యక్తి కూడా ఆకుపచ్చ అంటే మనకి సరిపడా జోడి కుదిరుంది అనే కదా!
ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే "ప్రేమలో పడటం" అనేది జరుగుతుంది. ప్రేమలో పడటం అనే మాట వెనుక ఉన్న శాస్త్రం ఇదే. జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రేమలో 'పడటమే' కానీ ఎప్పటికి ప్రేమలో 'లేవటం' కాదు. ఇది కేవలం హార్మోన్లు చేసే పిచ్చి పని మాత్రమే. దీనినే మనం ప్రేమ అని భ్రమ పడతాం అసలు ఇక్కడ ఏమిజరుగుతుందంటే, మనం బలమయిన కోరికతో అకాంక్షతో దేనినైనా చూస్తే మనకి అవి అలానే కపడతాయి. మన మనస్సులోని బలంగానాటుకున్న భావాలని ఎదుటి వాటిపై చూపిస్తాము.
సరే! ఏదోఒకటి: ఇప్పుడు ప్రపంచమంతా ఆకుపచ్చగా అందమయిన సంగీతంలా ఉంటుంది. జీవితం ఒక కవితలా అనిపిస్తుంది. చివరికి మన శోధన, అదే వెతకటం ముగుస్తుంది. ఈ దశలోనే మనం కవితలు వ్రాయటం మొదలుపెడతాం. ఒకరి చిత్రాలు ఒకరు చిత్రించుకుంటాము. ఒకటి ఏమిటి ఎన్నోచేస్తాం.
ఈ దూరం ఉన్నతంతకాలం, అన్ని విషయాలు సున్నితంగా జరిగిపోతాయి. ఒకరి ఊహలు మరొకరిలో ఆశిస్తుంటాము అవి వారిమీద రుద్దుతుంటాము. క్రమంగా ఒకరికి ఒకరు దగ్గరకి వస్తారు., అప్పుడు మనం చూసిన ఆకుపచ్చ అంత నిండు
ఆకుపచ్చలా కనిపించదు. అది వెలసిపోయిన ఆకుపచ్చ రంగులా ఉంటుంది. అయినా పరవాలేదులే అనుకుని మీరు ముందుకి సాగుతారు. అప్పుడు ఇంకా దగ్గరవుతారు. అప్పుడు మీకు అది వెలసిన ఆకుపచ్చ కూడా కాదు, నిజానికి ఒక రకమైన పసుపు అని మీకు అనిపిస్తుంది. కానీ ఈదశలో మన ఊహలు తప్పాయి, అవి అబద్ధం అని ఒప్పుకోవటానికి ఇష్టపడం. అప్పుడు అలా జరగటానికి ఏవో కారణాలు సర్దిచెప్పుకుంటాము. మనకి మనం ఇలా సర్ది చెప్పుకుంటాం, "ఇది జీవితం! ఏదీ కచ్చితంగా ఉండదు!" ఇలా ఏదో సర్దుకుంటాం.
నిజంతో జీవించాలి అంటేచాలా ధైర్యం, చాలా వివేకం ఉండాలి. అందుకే నిజం నుంచి పారిపోవటానికి ఇలాంటి సర్దుబాటు మాటలు చెప్పుకొని ఆ నిజాలని దాచేస్తాం. చివరికి పూర్తిగా దగ్గరయ్యాక అప్పుడు అసలు అది పసుపు కూడా కాదు, కేవలం తెలుపు అని తెలుసుకుంటాం. మన ఊహలలో ఉన్నది ఆకుపచ్చ కాని బయట మనం పొందినది తెలుపు. అందుకే కల్పనకి నిజానికి చాలా తేడా ఉంటుంది.
ఒక చిన్న కథ:
ఒక వ్యక్తి మూడవ అంతస్తు మేడమీద నుంచి క్రిందకి రోడ్డు మీద పడతాడు. ఆ దారిలో వెళుతున్న ఒక వ్యక్తి పరిగెత్తుకు వెళ్ళి అతనితో "పై నుంచి పడ్డావు కదా! బాగా దెబ్బ తగిలిందా?" అని అడుగుతాడు.
దానికి ఆ వ్యక్తి, "లేదు. పై నుంచి పడటం నాకు బాధ లేదు. కానీ ఏదో నన్ను అకస్మాత్తుగా ఆపింది. దానివలన బాగా దెబ్బ తగిలింది." అని అంటాడు.
(అంతా నవ్వులు)
మనం ప్రేమలో తేలుతున్నంతకాలం, మనం ఒకరి మధ్య ఒకరికి దూరం ఎక్కువగా ఉన్నంతకాలం, వారు కలసి ఉండే కాలం తక్కువగా ఉన్నంత వరకూ అంతా చాలా బాగా జరుగుతుంది. మనం మన ఊహల జగత్తులో ఉంటాము. మనం నిజాలకి దగ్గరగా ఉండము. ఎప్పుడైతే ఈ తేలటం ఆగిపోతే, ఎప్పుడైతే నిజమైన సంబంధాలు ప్రారంభమవుతాయో అలాగే మధ్యలో ఉండే దూరం తగ్గిపోయినపుడు, కలసి ఉండే సమయం ఎక్కువయినపుపడు సమస్యలు మొదలు అవుతాయి.
మీరు ఎన్ని ఊహలని పోగుచేసుకుంటారో, మీరు క్రిందకి పడే సమయం అంత ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి క్రిందకి పడ్డాకా దెబ్బలు కూడా దానికి తగినట్టే చాలా బలంగా తగులుతాయి. తక్కువ ఊహలు పోగుచేసుకుంటే మీరు పోల్చుకోవటానికి తక్కువ విషయాలు ఉంటాయి. దాంతో మీకు సమస్యలు తక్కువగా ఉంటాయి. మీరు కల్పనలు, ఊహలు లేకపోతే, మీరు మీ మనస్సులో ఉన్న వ్యక్తిని వెంటనే కలుసుకోగలుగుతారు. మీలో ఊహలు లేకపోతే మీరు ఎవరిని వివాహం చేసుకుంటే ఆమె మీ మనస్సులో అనుకున్న వ్యక్తి, మీ ఆత్మీయురాలవుతుంది.
మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జీవించి ఉన్న ఏ మనిషీ కూడా ఊహలలో ఉన్నట్టుగా జీవించలేరు. ఎందుకంటే మన ఊహలలోని రూపం నిజాల నుంచి తయారయినది కాదు. అది మన కలల ప్రపంచంలో రకరకాల ఊహల నుంచి కొన్ని ముక్కలు తెచ్చి అతికించిన రూపం. ఏ ఊహాకూడా నిజాలకి సరిపోదు. ఎందుకంటే చివరికి అది ఊహగానే మిగిలిపోతుంది.
మీరు నిజమైన జీవితంలోని వ్యక్తుల నుంచి రూపాలని పోగుచేసుకుంటే పరవాలేదు. మీరు మీ చుట్టుప్రక్కల ఉన్న వారి దగ్గర నుంచి రూపాన్ని తయారు చేసుకుంటే సమస్య ఉండదు. కానీ మీరు టి.వి., సినిమాలు వీటి నుంచి సేకరించుకుంటారు. ఈ మీడియానో కోరికతో బాధలుపడుతుంది. అటువంటి మీడియా మీకు పరిష్కారం ఎలా చూపిస్తుంది. మీకు సరియైనమార్గం ఎలా చూపిస్తుంది.
అందుకే మీరందరూ అనుకునే ప్రేమ చివరికి బాధతో ముగుస్తుంది. మనం చివరికి ఎదుటి వారి చేతిలో మోసపోయామని, ఎదుటి వారిచే అధికంగా ఉపయోగించబడ్డామనే బాధతో మన విషయం ముగింపుకి వస్తుంది. మనలో ఉండే ప్రాథమికమైన సహజ లక్షణం ఎదుటి వారిని నిందించటం. మనకి ఏమీ
జరిగినా ముందు ఎదుటివారి మీద నెపం నెడతాము. కాని ఇది ఎదుటి వారి తప్పా? కాదు. తప్పు మీలో ఉన్నది. ఎందుకంటే మీరు ఏదో ఆశించారు. మీ ఊహలని కల్పనలని ఎదుటి వారిలో చూడాలనుకున్నారు. ఆ విషయంలో అపజయం పొందారు. తప్పు ఎవరిది?
చూడండి కొన్ని సందర్భాలలో ఎవరో ఒకరు, ఇద్దరు మనుషులు విపరీతంగా ప్రవర్తించుతారు,అర్థం లేకుండా ఉంటారు. ఇలాంటి వారు చాలా ప్రత్యేకమైన, చాలా అసాధారణమైన వ్యక్తులు. అటువంటి విషయాలు కూడా మామూలు కాదు. అటువంటి వ్యక్తుల విషయంలో మీరు వారితో కలసి జీవించాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోవాలి. అటువంటి సందర్భాలలో నేను ఇప్పుడు చెప్పిన విషయాలను మీరు అన్వయించుకోవద్దు
ప్రత్యేకమయి, విపరీతమైన అసాధారణమైన వ్యక్తులు, సంఘటనలూ ఎప్పుడూ ఉంటాయి.
నేను చెప్పే విషయాలు మన నిత్య జీవితంలో ప్రతి ఇంట్లో మామూలు మనుషుల మధ్య జరిగే విషయాల సంగతి. వాళ్ళలో ఉండే ఆందోళన సంగతి, కానీ మనం ఆ కలతలు, ఆందోళనలని చూడము. మనం నిజాలని తెలుసుకోవటానికి ఇష్టపడము. నిజాలని మనం నిరంతరం అందమైన తివాచీల కిందకి తోసేయటానికి ప్రయత్నిస్తాము. ఆ తివాచీ మీద నడుస్తూ మనని మనం మోసం చేసుకుంటాము.
మీకు ఏదైనా గాయం అయినదనుకోండి, మీరు ఏం చేయాలి. దానికి వెంటనే సరియైన చికిత్స చేసి మానిపోయేట్టుగా చూడాలి. అలా కాకుండా ఆ గాయానికి బంగారు రేకు తొడిగి ఒక పట్టు వస్త్రంతో కట్టు కట్టేసి ఆ గాయాన్ని దాచేసి, ‘అబ్బే నాకు గాయం లేదు' అనుకుంటే గాయం మాయం అవుతుందా. నొప్పి తగ్గిపోతుందా? ఇంకా పెరుగుతుంది. ఈ పని ఎంత తెలివితక్కువగా ఉన్నదో కదా. అందుకే నేను ఏమీ చెబుతున్నానో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి.
మీ ఊహలని, కల్పనలని వదిలివేయండి. నిజాలతో అసలైన సత్యం ఏదో దానిలో జీవించండి.
ఒక వ్యక్తి అతని స్నేహితుని వివాహ కానుకగా ఒక కుక్క పిల్లని ఇస్తాడు. కొన్ని రోజులయ్యాక వాళ్ళు ఇద్దరూ కలుసుకుంటారు.
ఆ వ్యక్తి స్నేహితుడిని, “వివాహ జీవితం ఎలా ఉన్నది?” అని అడుగుతాడు.
స్నేహితుడు ఇలా జవాబు చెబుతాడు, “ఏముంది. ఏవో చిన్న చిన్న మార్పులు అంతే.”
అవ్యక్తి “మార్పులా! ఏమీటి ఆ మార్పులు?” అని అడుగుతాడు.
దానికి ఆ వ్యక్తి “పెళ్ళయిన కొత్తలో నువ్వు ఇచ్చిన కుక్క పిల్ల నన్ను చూసి అరిచేది. నా భార్య నాకు న్యూస్ పేపర్ తెచ్చి ఇచ్చేది. ఇప్పుడు నా భార్య నామీద అరుస్తుంది. కుక్క పిల్ల న్యూస్ పేపర్ తెచ్చి ఇస్తుంది” అని జవాబు ఇస్తాడు.
(అంతా నవ్వుతారు)
ఒక సారి హనీమూన్ అయిపోయాక ఏమవుతుంది? దీనిని హనీమూన్ అనటం ఆశ్చర్యం కాదు. దీనిని హనీసన్ అనరు. ఎందుకంటే ఆ ఆనందం 15 రోజులు మాత్రమే ఉంటుంది. నేను మీకు చెబుతున్నాను., మీరు ప్రపంచంలోని గొప్ప అందమైనవారిని వివాహం చేసుకున్నా ఆ అందం 15 రోజుల్లోనే మీ దృష్టిలో పాలిపోతుంది. ఎందకంటే మీరు మీ మనస్సులో ఏవో కొన్ని ఊహలు కల్పనలు ఏర్పరచుకున్నారు. మీరు అలా ఊహలను ఏర్పారచుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు పొందాలి అనుకున్న వాటి కోసం మీ లోపల చూసుకోకుండా బయట ప్రపంచంలో వెతుకుతారు. వాటిని వేరు వేరు భ్రమలతో చూస్తుంటారు.
ఒకచిన్న కథ:
ఒక ఆమె తన కూతురికి వివాహ విషయం గురించి ఇలా చెబుతుంది. "అమ్మాయి జాగ్రత్తగా విను. నీవు ఎవరినైనా ప్రేమిస్తే అది జీవితాంతం ఉండాలి. అప్పుడే అది నిజమైన ప్రేమ."
కూతురు తల్లి చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వింటుంది.
ఆమె తిరిగి ఇలా చెబుతుంది, "నేను చెప్పే సలహాలు జాగ్రత్తగా విను. నేను నీకు ఏం చెబుతున్నానో నాకు బాగా తెలుసు. నేను ఇప్పటికి మూడు సార్లు వివాహం చేసుకున్నాను."
(అందరూ పెద్దపెట్టున నవ్వుతారు)
సమస్య ఏమిటంటే అందరూ సలహాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఎవరూ సలహాలు తీసుకోవటానికి ఇష్టపడరు. ప్రతి ఒక్కరు ప్రేమ, ఊహలు, కల్పనలు ఇలా చాలా వాటి మీద ఉపన్యాసాలు ఇవ్వటానికి సిద్ధం. కానీ అదే వారి విషయానికి వస్తే ఏమి జరుగుతుంది. అది మరొక కల్పనగా మిగిలిపోతుంది. అది మరొక ఊహ అంతే.
సరే! కనీసం ఈ పాయింట్ దగ్గర అయినా మనం నిజాన్ని ఒప్పుకుంటే బాగుంటుంది. అప్పుడు సమస్య ఉండదు. కానీ మనం ఊరుకుంటామా? లేదు. మనం రంగులు, బ్రష్ లు తీసుకుని తెల్లని దానికి ఆకుపచ్చ రంగు వేయటానికి ప్రయత్నించతాము. అవ్యక్తిని మన కల్పనకి, ఊహలకి సరిపోయేట్టుగా మార్చటానికి ప్రయత్నించతాము. ఇది ఏ మానవ సంబంధాలలోనైనా చాలా ప్రమాదకరమైన విషయం. మనం ఒకరిని ఒకరు మన ఊహల్లో ఉన్నట్టుగా తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తాము. ఎదుటి వారిని మన గుప్పిట్లో పెట్టుకుని మన ఇష్టంవచ్చినట్టు మార్చాలని చూస్తాము. మనం శక్తిని ఒక పదార్థంలా తక్కువ స్థితికి తీసుకువస్తాము. ఇక్కడే అసలు సమస్యలు ప్రారంభమయ్యేది. ఇక్కడే అంతంలేని జీవిత యుద్ధాలు, పోరాటాలు ప్రారంభమయ్యేది.
ఒక చిన్న కథ:
ఒక వ్యక్తి వృత్తి రీత్యా పెయింటర్. అతను తన స్నేహితుడితో ఇలా చెబుతుంటాడు. "ఇవాళ ఒక అమ్మాయి నీలం, నలుపు రంగుల్లో ఉన్న ఒక చిన్న చిప్ ని తీసుకువచ్చింది. ఆ రంగుతో ఒక మోడల్ ఇంటికి పెయింట్ వేయమన్నది. ఎన్ని విధాల ప్రయత్నించినా ఆ అమ్మాయికి ఆ రంగు నచ్చలేదు. అసలు ఈ పని మనేయాలా అన్నంత విరక్తి వచ్చింది."
స్నేహితుడు ఇలా అడుగుతాడు, "చివరికి ఆ అమ్మాయి అడిగిన రంగుకి మేచ్ చేయకలిగావా?" దానికి పెయింటర్ ఇలా జవాబు ఇచ్చాడు, "నా అదృష్టం బాగుండి ఆ అమ్మాయికి అప్పుడే ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ లో మాట్లాడే సమయంలో ఆ చిప్ మీద రంగు వేసేసాను."
(అంతా నవ్వులు)
ఒక రోజంతా భార్యా భర్త మాట్లాడుకునే మాటలు జాగ్రత్తగా వినండి. మీరు ఉలితో చెక్కుడు చెక్కే చెక్కుడులు వింటారు. నాకేమనిపిస్తుందంటే వివాహంలో మంగళ సూత్రం బదులు ఒక ఉలి, సుత్తి ఇస్తే బాగుంటుంది.
చిన్నకథ
ఒక సాయంత్రం ఒక వ్యక్తి అతని స్నేహితునితో కలసి టీ తాగుతుంటాడు. ఆ వ్యక్తి స్నేహితునితో ఇలా అంటాడు, "నేను నాభార్యకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను. గడచిన ఆరునెలలో ఆమె నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు."
దానికి స్నేహితుడు, "నీవు ఆ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించు. ఎందుకంటే నీకు అటువంటి భార్య మళ్ళీ దొరకదు" అని అంటాడు.
(అంతా నవ్వులు)
మనం జీవితంలో నిరంతరం మనలోని ఊహలని బయట ప్రపంచంలోని నిజాలతో పోల్చి చూసుకుంటాము. మనకి ఎప్పుడు కచ్చితమైన జోడి దొరకదు. మనం మనలోని ఊహలని వదిలివేయవలసిన అవసరం ఉన్నది. అలా చేస్తే మనకి అనంతమైన అవకాశాలు దొరుకుతాయి.
మీకు వివాహం కాకపోతే, మీ కల్పనలని వదిలివేయండి. అప్పుడు మీ జీవిత భాగస్వామిని ఎన్నుకోగలుగుతారు, మీ కలల భాగ స్వామిని కాదు. మీరు మీ జీవిత భాగ స్వామిని ఎన్నుకున్న తరువాత, మీరు ఆమె/అతని తో మీ జీవితమంతా గడపబోతున్నారని గుర్తు తెచ్చుకోండి. మీరు వాళ్ళతో ఏదో కొద్ది రోజులు మాత్రమే ఉండటం లేదు. ఇది హేళన కాదు. తీసి పారేసే విషయం కాదు. ఇది జీవితాంతం ఉండే విషయం.
ఇప్పుడు మీ కలల ప్రపంచంలోనికి నల్ల జీన్సు,బ్లూ షర్టులు వస్తే, మీరు వాటికి ఆకర్షింపబడతారు. కాని ఒక విషయం అర్ధం చేసుకోండి. నలుపు, బ్లూ రంగులు ఆరు నెలలలో వెలసి పోతాయి.
మీకు వివాహం అయ్యుంటే, మీ ఊహలని వదిలివేయండి. అప్పుడే మీ భాగస్వామితో నిజమైన సంబంధం కలిగి ఉంటారు. మీరు ఆ బంధం లోనికి సుత్తి, ఉలితో వెళితే, నిజమైన సంబంధం మీ మధ్య ఏర్పడదు. చూడండి. ఎదుటి మనిషిని మీ ఊహల ప్రకారం చెక్కటం మొదలు పెట్టారనుకోండి, మీరు చెక్కటం పూర్తి చేసే సరికి, మీ ఊహలు మారుతాయి. అప్పుడు మీ ఊహలలో రూపం వేరు, మీరు చెక్కిన రూపం వేరు. అప్పుడు మీరు మళ్ళీ మనిషిని మారిన ఊహలకి తగినట్టు మలచటానికి ప్రయత్నించతారు. ఈ విధంగా ఎదుటి మనిషిని మీరు నిరంతరం మారుస్తూనే ఉంటారు.
మీరు కలల కల్పనలలో ఉన్నంత వరకూ నిజమైన సంబంధం ఏర్పడదు. మీరు 24 గంటలూ కలసి ఒకే ఇంట్లో ఉన్నా మీరు ఒకరి కళ్లలోనికి ఒకరు చూసుకోరు. ఎందుకంటే మీరు మీ ఊహలలో జీవిస్తారు. గాని నిజాలలో కాదు. మీరు నిజమైన వ్యక్తితో జీవించరు. మీరు అవతల వ్యక్తి చేసేవన్నీ మీ ఊహలతోనే చూస్తారు. అప్పుడు మీరు మీ జీవితం ఒక శాపం, భగంతుడు మీకు వేసిన శిక్ష అని అనుకుంటారు.
మీకు వివాహం కాకపోతే మీ ఊహలని వదిలివేయండి. అప్పుడు మీరు చల్లబడతారు. అప్పుడు మీకు ఈ హార్మోన్ల హింస ఉండదు. మీరు ఒంటరి వారైతే ఊహలని వదిలివేయండి. మీరు ఒంటరి తనపు బాధల నుంచి విముక్తులవుతారు.
మీరు మీ పిల్లలని వీలయినంతవరకూ టి.వి.లో వచ్చే డ్యుయెట్లు చూడనివ్వకండి. వాళ్ళు డాన్సు, పాటలు చూసి సంతోషపడితే పరవాలేదు. కాని వాళ్ళు, చూసినవన్నీ మనసులో నింపేసుకుంటారు. డ్యూయెట్స్, అందులోను భావావేశాలు ఇలా అన్నీ. ఇక్కడే అన్ని సమస్యలు ప్రారంభమవుతాయి. ఇవన్నీ కూడా మూలాధారా చక్రంలో పోగుచేయబతాయి. మూలా ధార చక్రం లైంగిక విషయాలకి సంబంధించినది.
అధికమైన ఆశలు, ఎక్కువగా ఆశించటాలు చేస్తే మూలధార చక్రం ముడుచుకుపోతుంది. మీరు మీ ఊహలని మరొక వ్యక్తితో నింపుకున్నప్పుడు, టి.వి. చూస్తున్నప్పుడు, మీ ఊహలు ఎదుటివారిమీద విధించినప్పుడు ఈ చక్రం బంధించబడుతుంది. జీవితానికి బయట ప్రపంచంలోని విషయాలకి, బ్రహ్మచర్యానికి, దీనికి ఎటువంటి సంబంధం లేదు. అది మీ లోపల విభజింబడిన మీ వ్యక్తిత్వానికి సంబంధించినది.
బ్రహ్మచర్యం అంటే ఏమిటి?
మీలో అణచివేయబడిన రెండవ భాగం కోసం ప్రాకులాడక పోవటమే బ్రహ్మచర్యం, మీరు పురుషులయితే ఆ పరిపూర్ణతని మీలోనే చూసుకోగలగటం, అలానే ఆ భాగాన్ని కోల్పోయాము అన్న భావం నుంచి బయట పడడం బ్రహ్మచర్యం. మీరు స్త్రీ అయితే మీలోనే ఆ పరిపూర్ణతని చూడగలగటం. దానికోసం బయట వెతకకపోవటం.
ఒక్కసారి మీరు ఈ స్థితికి చేరితే మీరు బయట ప్రపంచంలో స్త్రీ ఉన్నా, లేకపోయినా జీవించగలుగుతారు. మీరు ఈ స్థితిని సాధించకపోతే, మీరు వివాహమయినా కూడా మీరు హార్మోన్ల చిత్రహింసకు గురి అవుతారు. హార్మోన్ల చిత్ర హింస అంటే, మీరు మీలోపల నుంచి పొందగలిగే పరిపూర్ణతని సాధించటానికి బదులు మీరు బయట ప్రపంచంలో దాని కోసం వెతకటమే. మీరు దీనిని సాధించినప్పుడు మీకు వివాహం అయినా కాకపోయినా మీరు ప్రశాంతంగా ఉండగలరు. అప్పుడే మీరు వివాహం చేసుకున్నా బ్రహ్మచర్యంలో ఉండగలరు. అదే నిజమైన బ్రహ్మచర్యం.
ఇలా చేయకుండా చాలా మంది బ్రహ్మచర్యమని చెప్పి వాళ్ళలోని కోరికలని అణచివేస్తారు. దానితో మానసిక సమస్యలు వస్తాయి. మీకు నేనేం చెబుతున్నానో అర్థమవుతున్నదా.?
ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా?
ప్రశ్న: స్వామీజీ మేము మా మైండ్‌లో ఇంకొక రూపాన్ని మోస్తూ తిరుగుతున్నాము అని మాకు తెలియదు.
అవును ఎందుకంటే మనం ఎప్పుడూ మనలోపలికి చూడం. మనం అన్ని చోట్లకి వెళతాం. కానీ మనలోపలికి వెళ్ళము. మీకు మన లోపల ఉన్న శక్తిలో 80% మూలాధార చక్రంలోనే బంధింపబడి ఉన్నది. ఈ చక్రానికి శక్తిని ఇవ్వనవసరం లేదు. ఇది వికసించి, చురుకుగా ఉంటే చాలు. అందులోపల నుంచి ప్రవహించే శక్తి మీ జీవితాన్ని మార్చివేస్తుంది.
మీరు మీలోపలకి లోతుగా చూడగలిగితే, మీరు నిరంతరం వ్యధ చెందుతూ ఉంటారు. ఎందుకంటే మీరు మనసులో ఊహించుకున్న రూపం ఒకటి, కాని నిజ జీవితంలో చూసేది ఒకటి. ఈ రెండూ సరిపడవు. మీరు చూడాలనుకున్నదానికి, మీరు చూసే దానికి సరిపడదు. అదే సమస్య . మీరు చూడాలనుకున్నది మీ
ఊహ. అది మీలోపల మీరు మోస్తున్న రూపం.
కనీసం ఇప్పటినుంచైనా, తెలుసుకునే తత్వంతో చూస్తే మీ మైండ్ ఆడే ఆటలు చూడగలుగుతారు. మీరు చూసేవన్నీ మీ మైండ్ ఇచ్చిన తీర్పులు, నిర్ణయాలు చేయక ముందే వాటిని వాటిలా చూడటానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు మీ మైండ్ ఎంత సూక్ష్మంగా, గుర్తించటానికి వీలు లేకుండా ఎలా ఆటలు ఆడుతుందో చూడగలుగుతారు. అలా ఆడుతూ మీరు చూసేవన్నీ తప్పులే అని ఎలా చెబుతుందో మీరు తెలుసుకోగలుగుతారు. సంస్కృతంలో రెండు మాటలు ఉన్నాయి. అవి మనకి నిజాలని భోధిస్తాయి.
దృష్టి సృష్టిః సృష్టి దృష్టిః సృష్టి అంటే ప్రపంచాన్ని యధాతదంగా చూడటం . అది మన దగ్గరకి ఏవి ఎలా వస్తాయో వాటిని అదే విధంగా స్వాగతించటం. అది సత్యం. సృష్టి దృష్టి అంటే ప్రపంచాన్ని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూడటం. మనం పెట్టుకున్న రంగుల కళ్ళ అద్దాల గుండా, మన కల్పనలు ఊహల గుండా ఈ ప్రపంచాన్ని చూడటం. ముందు పద్ధతిలో ఉడగలిగితే మీకు జీవితం ప్రశాంతంగా ఉంటుంది. రెండవ పద్ధతిలో సమస్యలు, బాధలు ఉంటాయి.
చిన్న సంఘటన:
ఒక వ్యక్తి నాదగ్గరకి వచ్చి, “స్వామీజీ, మా ఇంట్లో ఉండేది ఇద్దరమే, నేను నా భార్య . అయినా మాకు ప్రశాంతత అనేది లేదు అని చెప్పాడు.
నేను అతనితో, “మీరు ఇద్దరే ఉన్నారు అని ఎవరు చెప్పారు? మీ ఇంట్లో ఉన్నది నలుగురు” అని అన్నాను. నామాటలతో అతను నిర్ఘాంత పోయాడు.
అతనికి నేను చెప్పాను, “నీవు, నీ ఊహలలో ఉన్న స్త్రీ, నీ భార్య, ఆమె ఊహలలోని పురుషుడు. అందుకే మీరు నలుగురు అని చెప్పాను. ముందుగా మీరు మీలోపలి మనుషులని వదిలివేయటం నేర్చుకోండి. అప్పుడు మీ ఇంట్లో జరిగే మార్పులు చూడండి”, అతను నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు.
ప్రశ్న: స్వామీజీ, మా సంబంధాలలో, అంటే తల్లితండ్రులు, పిల్లల మధ్య ఇలాంటి సంబంధాలలో కూడా చికాకులు ఉంటాయి. ఎందు వలన?
అవును. ప్రతి సంబంధంలోని ఆశలు, ఒకరి నుంచి మరొకరు దేనినో ఆశించటం ఉంటాయి. నేననుకోవటం ఏ సంబంధం కూడా ఆశించటాలు లేకుండా ఉండదు. తల్లి తండ్రులు పిల్లలని తమకి అననుగుణంగా మలచాలని చూస్తారు. అలాగే పిల్లలు తల్లితండ్రులు తమకి అనుగుణంగా ఉండాలని అనుకుంటారు. తల్లి తండ్రులు తమకు తీరని కోర్కెని తమ పిల్లలు ద్వారా తీర్చుకోవాలని అనుకుంటారు. ఈ మొత్తం విషయాన్ని మీరు లోతుగా విశ్లేణ చేస్తే నేను చెప్పే విషయం నిజమే అని మీరుకూడా నమ్ముతారు. తల్లితండ్రులు తమ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలని కలలు కంటారు. పిల్లలనే వారికి ఏది ఇష్టమో అది అడిగి తెలుసుకోవచ్చుకదా! వాళ్ళ కలలు ఏమిటో, వాళ్ళు ఏమీ సాధించాలని అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు కదా! అది మీ పిల్లలకి చాలా సహాయం చేస్తుంది.
ఏరోజైతే మీ పిల్లలు మీకు ఎదురు జవాబు ఇస్తారో ఆరోజే ఆ అబ్బాయి ఒక వ్యక్తిగా అవుతాడు. అతనితో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అతని తో కొంత సమయాన్ని గడపాలి. అతనితో మనస్సు విప్పి మాట్లాడాలి. అతనికి ఒక మంచి స్నేహితునిగా మారి అతను జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి. అతను సాధించేలా మీరు సహాయం చేయండి.
నాతో చాలా మంది పిల్లలు ఇలా చెబుతుంటారు, "స్వామీజీ, నేను డాక్టరు అవ్వాలని మా నాన్నగారి కోరిక. మా నాన్నగారు నన్ను లాయర్ అవ్వాలి అని అంటున్నారు." పిల్లలు వారంతట వాళ్ళు కొన్ని నిర్ణయాలు చేయలేరు. అందుకే వాళ్ళు మిమ్ములని అడుగుతారు. మీరు వాళ్ళని గమనించిన దానిని బట్టి, వాళ్ళకున్న ఇష్టాలు, నైపుణ్యాలు, వాళ్ళకి ఉన్న శక్తి, వీటి ఆధారంగా వాళ్ళకి సరియైన దారి చూపించండి. మీరు వాళ్ళకి సలహా ఇవ్వవచ్చు. కానీ ఏది బలవంతంగా వాళ్ళ మీద విధించకూడదు. అలాగే పిల్లలకి మీరు తగినంత స్వేచ్ఛ ఇస్తున్నామని అర్ధమయ్యేలా చేయాలి. వాళ్ళకి మరొక విషయం స్పష్టంచేయాలి. చివరలో వాళ్ళు ఎవరినీ నిందించకూడదు. ఇది వాళ్ళకి స్పష్టంగా అర్ధం కావాలి.
మనం ఉలిని పట్టుకు తిరుగుతుంటాము. నిరంతరం మన చుట్టూ ఉండే వారిని, బంధువులని, కొత్తవాళ్ళని కూడా మన ఊహలకి అనుగుణంగా మలచాలని ప్రయత్నిస్తుంటాము. వాళ్ళు కూడా వాళ్ళ ఉలిని చేతిలో పట్టుకు తిరుగుతుంటారు. వాళ్ళు మిమ్ములని వారికి అనుగుణంగా చెక్కాలని చూస్తుంటారు., ఇది ఏమి హింస?
ఇవాళ మీకు నేనొక హోం వర్క్ ఇస్తాను. మీరందరూ ఆదర్శమైన, కచ్చితమైన భర్త, భార్య, అమ్మ, నాన్న పిల్లలు, స్నేహితులు ఇలా ఎవరైనా సరే మీ ఉద్దేశంలో ఎలా ఉండాలి అనే మీ భావాలని వ్రాయండి. మీరు ఏదైనా ఐదు సంబంధాలని తీసుకోండి. వాటి గురించి వ్రాయండి. మీరు నిష్కపటంగా చేయండి మీలోతైన అచేతన స్థితిలో (unconscious) మీ ఐడియాలన్నీ ఏదో ఒక మీడియా నుంచి తీసుకున్నవే ఉంటాయి. టి.వి. సీరియల్ ఒక ప్రాతని లింక్ చేస్తారు. అదే బలమైన సత్యమని అనుకుంటారు. అటువంటి ప్రవర్తనే ఎదుటివారిలో ఆశించుతారు.
మీకు తెలుసా? చాలా మంది మనస్సులో ఒక ఆదర్శ గురువు ఉంటాడు. ఆయన చాలా పెద్ద వయస్సు వ్యక్తి అయి ఉంటాడు. తెల్లని జుట్టు. పొడవై గడ్డం ఇలా ఇదంతా మీరు టి.వి.లోనో లేదా పుస్తకాలలోనో చూస్తారు. వాళ్ళు నాదగ్గరకి వచ్చి నన్ను చూసినపుడు నన్ను గురువు అని అనుకోలేకపోతారు. ఇంత చిన్న వ్యక్తిని వాళ్ళు గురువుగా స్వీకరించటానికి కష్టపడతారు. అందుకే నేనూ కొంత సమస్యను ఎదుర్కొంటాను. వాళ్ళు నన్ను గురువుగా స్వీకరించే ముందు వాళ్ళలోని అపోహలు, భావాలను తొలగించి గురువు అంటే ఏమిటో చెబుతాను.
ప్రశ్న: స్వామీజీ, కొన్ని సార్లు మేము కొందరిని చెక్కవలసి వస్తుంది. మా దగ్గర పనిచేసే ఉద్యోగులని మాకు అనుగుణంగా మలచాలి కదా..
అప్పుడు మీరు మీ చేతనస్థితిలో (consciously), మీరు చేసే పని మీకు తెలిసేటట్టుగా మలచండి. మీరు అలా చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా తెలుసుకోండి. అప్పుడు మీరు అవసరానికి మించి ఏమీ చేయరు. మీరు మీ ఉద్యోగస్తులనుంచి ఏమి ఆశిస్తున్నారో అవి నిజాలయి ఉండాలి. దాని కంటే
మరేదయినా పరిష్కారం దొరుకుతుందేమో చూడండి . అది తప్పని సరిగా అవసరం అనిపించినప్పుడే ఎదుటి వ్యక్తి ఎవరైనా, మీరు వాళ్లని అనుగుణంగా మలచటానికి ప్రయత్నించండి.
మీరు ఎటువంటి అధికారంలో ఉన్నా, దానిని ఉపయోగించేటప్పుడు పూర్తిగా మిమ్ములని, మీ చర్యలని తెలుసుకునే విధంగా ఉపయోగించండి. కోపము. కోరిక కూడా భగవంతుడు ఇచ్చిన గొప్ప శక్తులే. మీకు శక్తిమీద గౌరవం ఉంటే వాటిని మీరు వృధాపరచరు. అనవసరంగా వాడరు.
మనం ఎప్పుడైనా డబ్బుని అనవసరంగా వాడతామా? మనం అలా చేయం. ఎందుకంటే మనకి డబ్బు అంటే చాలా గౌరవం. ఎవరైనా మనకి పది రూపాయలు పని చేస్తే అతనికి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వము. అదే కోపాన్ని అయితే ఎప్పుడూ ఇవ్వవలసిన దాని కంటే ఎక్కువగా ఇస్తాము, ఎవరైనా పది రూపాయల విలువైన తప్పు చేస్తే మనం వంద రూపాయల విలువైన కోపాన్ని అతనికి ఇస్తాము. అవును కదా! ఎందుకంటే మీరు కోపాన్ని మీకు తెలియని స్థితిలో ఉపయోగించుతారు. అదే తెలిసేటట్టుగా ఉపయోగించితే, మీరు తరువాత అపరాధ భావంతో బాధపడనవసరంలేదు. ఈ విషయంలో నేను మీకు హామి ఇస్తాను.
మీరు మీ కోపం వలన అలజడి చెందవద్దు. మీరు కోపం వలన కలత చెందితే అది మీరు మీకు తెలియని స్థితిలో చేసారు అని అర్థం. అంటే కోపం మిమ్ములని తన అధీనంలోనికి తీసుకున్నది అని అర్థం. మీరు కోపాన్ని ఎలా ఉపయోగించారో కొలుచుకోగల స్కేలు ఇదే.
చిన్న కథ:
ఒక సాధువు చాలా చోట్ల తిరుగుతూ ఉండే సాధకుడు. ఒక రోజు ఒక గ్రామం గుండా వెళుతుంటాడు. అపుడు ఆ గ్రామప్రజలు అతనికి అక్కడ తిరుగుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న త్రాచు పాము గురించి చెబుతారు. సాధువుకి జంతువులతో
మాట్లాడే శక్తి ఉన్నదని తెలిసి ఆ త్రాచుపాముతో గ్రామస్తులని ఏమీ చేయవద్దు అని చెప్పమని ప్రార్థించుతారు.
అప్పుడు ఆ సాధువు పాముతో మాట్లాడతాడు , పాము గ్రామస్థులని కాటేయనని సాధువుకి మాట ఇస్తుంది. కొన్ని నెలలు అయ్యాక సాధువు అదే గ్రామం నుంచి వెళుతుంటాడు. ఆయన చాలా దెబ్బలు తగిలి పడివున్న త్రాచు పామును చూస్తాడు. అది కదలలేని స్థితిలో ఉంటుంది. దానిని చూసి సాధువు ఎందుకు అన్ని దెబ్బలు తగిలాయి అని అడుగుతాడు.
దానికి ఆ పాము “ఓ! సాధువా! ఇది నీ వల్లనే జరిగింది. నేను గ్రామస్తులని కరవను అని నీకు మాట ఇచ్చాను. నేను ఆ రోజు నుంచి ఆ మాట మీదే ఉన్నాను. కానీ ఈ గ్రామస్తులు అంతకు ముందు నేనంటే భయపడే వాళ్ళు, ఇప్పుడు నా బలహీనతని చూసి, నా మంచితనాన్ని చూసి నన్ను హింసిస్తున్నారు. వాళ్ళని కరవను అని తెలిసి నన్ను ప్రతిరోజు హింసించుతున్నారు. చూడు నేను ఏ స్థితిలోనికి వచ్చానో” అని బాధపడుతూ చెబుతుంది.
అప్పుడు సాధువు దానికి ఇలా సమాధానం చెబుతాడు. “అయ్యో! తెలివితక్కువ స్నేహితురాలా! నేను నిన్ను వాళ్ళని కరవ వద్దు అన్నాను కానీ, వాళ్ళమీద బుసకొట్టవద్దు అన్నానా?
మీరు కోపాన్ని సరియైన సమయంలో సరియైన మోతాదులోనే ఉపయోగించాలి. దానిని సరియైన పద్ధతిలో ఉపయోగించగలిగితే అది గొప్ప శక్తిగా మారుతుంది. కోపం గురించి మీకు బాగా తెలిస్తే, ఆ జ్ఞానం కోపాన్ని తగ్గిస్తుంది.
కొంత మంది నాతో “స్వామీజీ, నేను నా భార్యని చాలా ఎక్కువగా ప్రేమించుతాను. అందుకే ఆమె ఇంకా బాగా మారాలి అని అనుకుంటాను. అందుకే తనతో పొట్లాడతాను” అని అంటుంటారు.
నేను వాళ్ళతో "మీరు మీ భార్యని ప్రేమించటం లేదు. మీరు మీ మైండ్ లో ఉన్న రూపాన్ని మీ భార్యకి అనుగుణంగా మార్చుకుంటారు. అలా కాకుండా మీ మైండ్ లో ఉన్న రూపాన్ని మీ భార్యకి అనుగుణంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అలా కాకుండా మీ మైండ్ లో రూపాన్ని ప్రేమిస్తే, మీ భార్యని మార్చాలనిచూడరు" అని చెబుతాను.
మనలో చాలా మంది మన మైండ్‌లోని ఊహా రూపాలని ప్రేమిస్తాము. అది నిజము. ఇదే మన ఇంటిలో అశాంతికి ప్రారంభ కారణం. ఇదే అన్యోన్య యుద్ధాలకి ప్రారంభం. నిజం చెప్పాలంటే ప్రేమికులు అన్యోన్య శత్రువులు. వాళ్ళ అనోన్యంగా ఉంటారు. కానీ నిరంతరం ఒకళ్ళని ఒకరు కాపలా కాస్తుంటారు. నిరంతరం ఒకరి మీద ఒకరి ఆధిపత్యం కోసం చూస్తుంటారు. వాళ్ళ మధ్య చాలా దగ్గర శత్రుత్వం ఉంటుంది. వాళ్ళ దానిని అన్యోన్యత అని అంటారు నిజమైన అన్యోన్యతలో మీరు ఎదుటి వారి సమక్షంలో విశ్రాంతిగా ఆహ్లాదంగా ఉంటారు. అదే నిజమైన అన్యోన్యత.
ప్రశ్న: స్వామీజీ, మేము ఎదుటి వ్యక్తిని వారిలోని లోపాలతో పాటు స్వీకరించాలని మీరు చెబుతున్నారు కదా?
లేదు!
స్వీకరించటం అనే పదమే తప్పు అర్ధాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడైతే "వాళ్ళలోని లోపాలతో" అని అంటారో అది మీరు నిశ్శబ్దంగా ఇచ్చే పిర్యాధు. అది ఎలా ఉంటుందంటే, "ఏమి చేస్తాం. మేము వీటితోపాటే ఆమె లేదా అతని తో జీవించాలి" అని. అది సరియైన పద్ధతి కాదు. నేను చెబుతాను అర్ధం చేసుకోండి ఎదుటి వ్యక్తిని మీ జీవితంలోనికి ఆమెని ఆమెగా! అతనిని అతనిగా ఆహ్వానించండి. స్వీకరించటం అంటే సర్దుకు పోవటం. ఆహ్వానించటం అంటే మిమ్మలని మీరు ఆ వ్యక్తి కోసం ఎటువంటి నిబంధనలు, ఎటువంటి ఆశించటాలు లేకుండా విప్పారిన అంతరంగం తో ఆ వ్యక్తిని మీలోపలికి రానీయటం.
గుర్తుంచుకోండి: ఈ సమస్త సృష్టి సర్వాంతర్యామి యొక్క, ఈ అనంత చైతన్యం యొక్క బహుమతి. దానిని ఆహ్లాదంగా, వినయంతో తీసుకోండి. మీరు అలా చేసినప్పుడు, మూలాధార చక్రం నుంచి అద్భుతమైన శక్తి విడుదల అవుతుంది. ఈ చక్రం వికసించితే అందులోని నిరంతరం ప్రవహించే అంతులేని శక్తిని అందుకున్నట్లే. అంత అద్భుతశక్తి ప్రస్తుతం మీ ఊహలలో, కల్పనలలో, ఆశించటంలో, మీ అత్యాశలో బంధింపబడింది. ఈ శక్తిని మీరు విడుదల చేయగలిగితే దానిని మీ సృజనాత్మకతకి, మీ వ్యాపారాన్ని సమర్ధవంతంగా చేసుకోవటానికి, మీ జీవితానికి సత్యాన్వేషణకి ఇలా మంచి విషయాల సాధనకి ఉపయోగించవచ్చు.
అంతే కాదు. మీ ఇల్లు ఒక పవిత్ర క్షేత్రమవుతుంది. శాంతి నిలయంగా మారుతుంది. మన ఇళ్ళు ధర్మక్షేత్రాలుగా ఉండాలి, కాని కురుక్షేత్రాలుగా కాదు. ధర్మక్షేత్రంలో ధర్మం విలసిల్లుతుంది. కురుక్షేత్రంలో నిరంతరం యుద్ధాలు జరుగుతాయి. అవును కదా? అందుకే కొన్ని గృహాలు కురుక్షేత్రంలా ఉంటాయి. ఎందుకంటే మనం నిరంతరం మనుషులని ఉలితో చెక్కుతుంటాము. మనం విగ్రహాలను చెక్కలను చెక్కితే, వాటినుంచి అందమైన బొమ్మలని, సామానులని ఇలా ఏవైనా చేయవచ్చు. కానీ మనుషులని చెక్కితే వారి మనసులు గాయాలవుతాయి. మానసిక క్షోభ మిగులుతుంది. ఒక వ్యక్తి నన్ను ఇలా అడిగాడు, "స్వామీ, దయచేసి చెప్పండి: నేను 18 చేతుల దేవిని దర్శించి, నిరంతరం ఆమెతో సంబంధం ఉండే మార్గాన్ని చూపించండి" అని నేను అతనితో చెప్పాను. "ముందుగా రెండు చేతులు ఉన్న నీ భార్యతో మంచి సంబంధాన్ని పెంచుకో. ఆ తరువాత 18 చేతుల దేవితో సంబంధ ఆలోచించుదాం".
(అంతా నవ్వులు)
మరొక వ్యక్తి నా దగ్గరకి వచ్చి “స్వామీజీ నేను విడాకులు తీసుకోవాల్నుకుంటున్నాను. ఆశీర్వదించండి!" అని అడిగాడు.
నేను అతనితో చెప్పాను, “నేను వివాహానికే దీవెనలు ఇస్తాను, కాని విడాకులకి కాదు.”
అతనిని అసలు మీ సమస్య ఏమీటి? ఎందుకు విడాకులు అడుగుతున్నావు అని అడిగాను. అతను ఈ విధంగా జవాబు చెప్పాడు, “స్వామీజీ, ఉదయం నేను కాఫీ అడిగాను, ఆమె కాఫీ కంగారుగా తీసుకువచ్చి నామీద పోసింది.”
నాకు ఆశ్చర్యం అనిపించింది. అతనితో అన్నాను “అంత చిన్న విషయానికి మీకు విడాకులు కావాలా?”
అతను ఇలా చెప్పసాగాడు, “స్వామీజీ, మీకు తెలియదు. ఇవాళ కాఫీ పోసింది. రేపు యాసిడ్ పోయవచ్చుకదా!”
నాకు నిజంగా ఒక షాక్ లా అనిపించింది. నేను అతనితో “అయ్యా ఎటువంటి కారణం లేకుండా కాఫీ దగ్గర నుంచి నీవు యాసిడ్ దాకా వెళ్ళిపోయావు. ఇంతకీ ఆమె నీ మీద కొంచం కోపంతోనో లేక కంగారుతోనో కాఫీ పోసిందనుకో. ఆమె కదా ఆబట్టలు ఉతికేది” అని అన్నాను.
అతను ఇంకా ఇలా చెప్పడు, “స్వామీజీ, మా వివాహ వేడుకలలో ఒక సాంప్రదాయం ఉన్నది. కుండలో నీరుపోసి అందులో ఉంగరం వేసి భార్య భర్తలని తీయమంటారు. అప్పుడే ఆమె నాచేతిని గోళ్ళతో గీరింది”.
(అంతా నవ్వుతారు)
భార్య భర్తల మధ్య దూరాన్ని తగ్గించటానికి వివాహ వేడుకలలో అలా ఆడించుతారు. ఇతను ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ రికార్డు చేసినట్టు ఉంచాడు. నేను అతనితో “అయ్యా, నీవు అలా పోలీసు రికార్డులు తయారు చేస్తుంటే, నీతో ఎవరు బ్రతకగలుగుతారు” అని అన్నాను.
చూడండి., మనం రెండు పనులు చేస్తాము. మనం చెప్పదలచుకున్నది చెప్పి తీర్పు కోసం చూడటం. రెండవది. మనం తీర్పులు నిర్ణయించి దానికి అనుగుణంగా వాదనలని తయారు చేసుకోవటం. వీటిలో 99% వరకూ మనం రెండవ పద్ధతి పాటిస్తాము.
చూడండి. మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి. కానీ మనం మనకి కావలసినవి మాత్రమే మనలో రిజిస్టర్ చేసి గుర్తు ఉంచుకుంటాము. అంతే కానీ నిజంగా జరిగిన విషయం కాదు. దీని మూలంగా నిజాలని మనం కోల్పోతున్నాము. సత్యం ఎప్పుడూ ఉంటుంది. కానీ మనం ఏమి చూడాలనుకుంటామో అది మాత్రమే చూస్తాము. వివాహం అయ్యాక ముందు కొన్ని నెలలలోనే ఒకరి మీద ఒకరు అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. అప్పటి నుంచీ ఎదుటి వారు ఏం చేసినా, దానిని తను చేసుకున్న నిర్ణయం లేదా ఏర్పరచుకున్న అభిప్రాయం ఆధారంగానే అన్నింటినీ చూస్తారు. ఆ అభిప్రాయాలు నిలుపుకోవటాకి సరిపడా వాదనలని పోగుచేసుకుంటూ ఉంటారు.
అందుకే, మీరు మీ భార్య తెలివితక్కువది అని నిర్ణయించుకుంటే, మీరు ఆమెని నిరంతరం తెలివిలేని వ్యక్తిగానే చూస్తారు. మీరు మీ భర్త మీ మీద అధికారం చూపించే వ్యక్తి అని అనుకుంటే ఆయన చేసే ప్రతిపనీ, ప్రతి చర్యా కూడా అధికారం చెలాయిస్తున్నట్టే మీకు అనిపిస్తుంది.
మీరు అలా చేస్తే మీరు ఎప్పటికీ మీ జీవిత భాగస్వామిలో నిజమైన, అసలైన తత్త్వం కనిపించదు. కేవలం మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలకి అనుగుణమైన లక్షణాలే కనిపించుతాయి. ఇది ఎలా ఉంటుందంటే మీరు బాగా ఆకలిగా ఉన్నప్పుడు రోడ్డు మీద హోటల్స్ మాత్రమే కనపడతాయి. ఒక కుక్కని చంపాలి అంటే ఏం చేస్తారు. దానిని పిచ్చి కుక్క అని అప్పుడు చంపుతారు.
ఇటువంటి లక్షణాలను వదిలిచేయండి. అప్పుడు మీకు ప్రతి వ్యక్తిలోనూ ఒక కొత్తదనం కనిపిస్తుంది. ప్రతి వస్తువు కొత్తగా ఉంటుంది.
చిన్నకథ:
ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్‌కి వచ్చి తన భార్య 3 గంటల క్రితం తప్పిపోయిందని, కనిపించటం లేదని పిర్యాదు చేస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసరు ఆ వ్యక్తిని ఇలా అడుగుతాడు, "మీ భార్య గురించి కొన్ని వివరాలు చెప్పండి. ఆమె ఎత్తు, బరువు వగైరా."
దానికి ఆ వ్యక్తి "తెలియదు సార్" అంటాడు.
పోలీస్ ఆఫీసర్ ఇలా అడుగుతాడు, "ఆమె ఇల్లు విడిచి వెళ్ళేటపుడు ఏరంగు చీర కట్టుకున్నది?".
ఆ వ్యక్తి "నేను గమనించలేదు. సార్, కానీ ఆమెతో పాటు కుక్కని తీసుకెళ్ళింది.. అది నాకు తెలుసు" అని అంటాడు.
అపుడు పోలీస్ ఆఫీసరు, "అది ఏమి కుక్క" అని అడుగుతాడు.
ఆ వ్యక్తి" డాల్మేషన్ జాతి కుక్క. దానికి గ్రే కలర్ మచ్చలు ఉంటాయి. దాని బరువు 50 lbs. దాని తోక పూర్తిగా తెల్లగా ఉంటుంది. తోక మీద మచ్చలు ఉండవు. దాని మెడలో వెండి చైన్ ఉన్నది. దాని పేరు స్పాట్ అని విరాలు చెబుతాడు.
అప్పుడు పోలీస్ ఆఫీసర్, " ఆ వివరాలు చాలు. వాళ్ళని వెతుకుతాము" అని అంటాడు.
(అంతా నవ్వుతారు)
భార్య భర్త కొత్తదనంతో పెళ్ళయిన కొన్ని రోజులు మాత్రమే సరదాగా సంతోషంగా ఉంటారు. ఆ కొన్నిరోజులలోనే ఒకరి మీద మరొకరు కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు. ఆ తరువాత ఇద్దరికీ ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళు అసలు వ్యక్తిని చూడరు. వాళ్ళు కేవలం వాళ్ళ అభిప్రాయాలతో మాత్రమే సంబంధం కలిగి ఉంటారు. అంతే.
భర్త, భార్య గురించి తాను ఇంతకాలం సేకరించిన ఊహల రూపాలతో సంబంధం పెట్టుకుంటాడు. అలాగే భార్య కూడా తాను ఇంతకాలం పోగుచేసుకున్న భర్త యొక్క ఊహల రూపంతో సంబంధం పెట్టుకుంటుంది. భర్త, భార్య వారి ఊహలలో రూపాలతో మొత్తం ఆ ఇంట్లో నలుగురు ఉంటారు.
మీరు నిజాయితీగా ఒక్కసారి పరీక్ష చేసుకోండి. మీరు మీ భార్య లేదా భర్త కళ్ళలోకి చూసి మాట్లాడి ఎంత కాలమయింది. చాలా కాలమయి ఉంటుంది. కానీ మనం తొలి రోజులు బంగారం అని అనుకుంటాం. ఇప్పుడు జీవితం బోరు అని అనుకుంటాం. జీవితం ఎప్పుడూ బోరుకాదు, మీ దృక్పథం బోరు.
ఒక వ్యక్తి వ్యక్తిగా మారటానికి మీరు అవకాశం ఇవ్వరు. మీరు వాళ్ళ రూపాన్ని ముద్రించటానికి చాలా తొందరపడతారు. వాళ్ళ విషయంలో కొత్తవి ఏవీ మీరు తీసుకోరు. నేను మీకు చెబుతున్నాను. మీరు వివాహం అయిన కొంత కాలం తరువాత మీ భార్య లేదా భర్తని అసలు చూడరు. కేవలం మీ మైండ్‌లో మీరు ఏర్పరుచుకున్న రూపాలని చూసి ఆనందపడతారు.
అప్పుడు ఏమవుతుంది? ఇందాక నేను చెప్పిన కథలోని వ్యక్తిలా, భార్య గురించి కనీసం ఒక్క వివరం కూడా చెప్పలేని వ్యక్తిగా తయారవుతారు. భార్య గురించి అసలు ఏమీ తెలియదు అనేది మిడి మిడి జ్ఞానం, ఒక తెలివితక్కువతనం. అసలు విషయం ఈ సమస్య కంటే లోతైనది. మీతో నివసిస్తున్న నిజమైన వ్యక్తిని మీరు కోల్పోతున్నారు. కేవలం ఆ వ్యక్తిపై మీరు మీ మైండ్‌తో ఏర్పరచుకున్న భావంతో జీవిస్తున్నారు అంతే.
ఒక్క 24 గంటలు మీ భార్య లేదా భర్తని మొదటి సారి చూస్తున్న భావంతో చూడాలి అని నిర్ధారించుకుని మీ మైండ్‌ని అలా తయారు చేయండి. మీ భార్య చెప్పే ప్రతి మాట, ఆమె చేసే ప్రతి పనీ ఒక కొత్త దానిలా గమనించండి. ప్రతి విషయానికి ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేందుకు కంగారు పడకుండా అమాయకంగా, స్వచ్ఛంగా ఆమెని గమనించండి. ఆమెపై ప్రేమతో ఉండండి.
ఆమె మాటలు రెచ్చగొట్టేట్టు ఉన్నా మీరు తెలుసుకునే తత్త్వంతో వినండి. నెమ్మదిగా ప్రేమతో జవాబు ఇవ్వండి. అసలు వాదనలకి దిగవద్దు. అప్పుడు మీరు మీ ఇద్దరికీ కొత్తదారులు ఏర్పరచినట్లు గమనించుతారు. మీరు మీ ఇద్దరికీ వికసించటానికి వీలయిన పరిస్థితులని కల్పించుతారు.
అకస్మాత్‌గా మీరు ఇంత కాలం ఉన్న ఈ సమస్యలన్నింటికి మీద్భృక్పధమే కారణం అని అర్థం చేసుకుంటారు. అయితే మీరు ఒక మాట అనవచ్చు. భార్య కూడా అదే విధంగా స్పదించాలి కదా! అని. నేను మీకు చెబుతున్నాను. మీలో మిమ్ములని ఎదుటివారిని మార్చగల శక్తి ఉన్నది. మీ మానసిక స్థితిలో మార్పు వస్తే మీరు ఎంతో చేయగలరు. మిమ్ములని మీరు మార్చుకుంటే మీ భార్య అప్రయత్నంగా మారిపోతుంది.
చిన్న కథ:
ఒక వ్యక్తి శ్మశానం ప్రక్క నుంచి నడచి వెళ్ళుతుంటాడు. అతనికి శ్మశానం లోపలి నుంచి ఎవరో గట్టిగా ఏడవటం వినిపిస్తుంది. అతను అక్కడ ఆగి ఆ వ్యక్తి కి ఏమైనా సహాయం చేయగలనా అని అనుకుంటాడు. అతను లోపలికి వెళతాడు. అక్కడ ఒక వ్యక్తి ఒక సమాధి దగ్గర కూర్చుని "నీవు ఎందుకు వెళ్ళిపోయావు? నీవు ఎందుకు వెళ్ళిపోయావు?" అని పదే పదే అంటూ బిగ్గరగా ఏడుస్తుంటాడు. ఈ వ్యక్తికి అతని మీద చాలా జాలి కలుగుతుంది. అతని దగ్గరికి వెళ్ళి "సార్, నాకు చాలా విచారంగా ఉన్నది. ఈమె మీ భార్యనా?" అని అడుగుతాడు. దానికి ఆ ఏడ్చే వ్యక్తి, "కాదు ఆమె మొదటి భర్త" అని జవాబు ఇస్తాడు.
(అంత పెద్దగా నవ్వుతారు)
మనలోపలి ఊహలకి, బయట ఉన్న సత్యాలకి పోలిక కుదరక పోతే అవి మానవ సంబంధాల విషయాలలో పెద్ద పెద్ద మానసిక గాయాలుగా మిగిలిపోతాయి. ఇంకా దారుణమైన విషయం, ఊహల రూపాలలోని వ్యక్తి దొరుకుతుంది అనే ఆశతో
కొంత మంది ఒక వ్యక్తితో సంబంధాన్ని వదిలి మరొక వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకుంటారు. అక్కడా కుదరలేదని మరొకరితో, ఆ తరువాత మరొకరితో వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటా ఏదో లోపం కనిపిస్తుంది. అలా లోపం లేని సంబంధం వాళ్ళకి ఎక్కడా దొరకదు. దీనికి కారణం ఆ లోపం వారి ఊహలు, కల్పనలే కాని, వారి ఎదుటి వ్యక్తులు కాదు. ఎదుటి వారిలో ఎటువంటి లోపం ఉండదు.
వాళ్ళు వాళ్ళ ఊహల ప్రపంచంలో ఎంతగా స్థిరపడిపోతారంటే, వాళ్ళకి అసలైన నిజాలు ఊహలుగా కనపడతాయి. ఇదే చాలా సమస్యలకి ప్రారంభదశ. అటువంటి జాలి గొలిపే స్థితిలోనే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక్కడే మీరు మేలుకోవాలి. మీరు ఎప్పుడైతే లోతుగా అర్థం చేసుకుంటారో అప్పుడే మీరు మేలుకోగలుగుతారు.
మానవ సంబంధాల విషయం వచ్చే సరికి మనం వేళ్ళని ఎదుటి వారివైపు చూపించుతాము చప్పట్లు కొట్టాలన్నా, శబ్దం రావాలన్నా రెండు చేతులూ కలవాలి అన్న విషయాన్ని మనం మర్చిపోతాము. మీరు మీ మీద పని చేయగలిగితే, అన్ని విషయాలు మీకు అనుకూలంగా చక్కబడతాయి. అలాగే మీ ప్రతి చర్యా ఇతరులకి కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఎదుటి వ్యక్తి కూడా మారాలి కదా అన్న విషయాన్ని మీరు పూర్తిగా వదిలివేయండి.
ఇప్పటి వరకూ వచ్చిన ప్రేమ కథలని మీరు గమనించితే ఇంతవరకూ కూడా ఎక్కడా ఏ కథలోనూ ప్రేమికులు పూర్తిగా కలసి ఉన్న సందర్భాలు కనిపించవు. అది నిజం. రవింద్రనాధ్ ఠాగూర్ రచించిన శాశ్వత ప్రేమికుల కథలో హీరో హీరోయిన్లు గంగానదికి రెండు ప్రక్కలా నివసిస్తుంటారు. వారానికి ఒక సారి ప్రేమికులు ఇద్దరూ కలుసుకుని కొంత సేపు ఉండి వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇలా చేయటం వలన వాళ్ళు కలుసుకున్న ప్రతి సారీ ప్రశాంతత ఉంటుంది. కలసిన ప్రతీ సారి వారిలో నూతనత్వం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కలసి ఉండేది కొన్ని గంటలు మాత్రమే. అందుకే ఆ క్షణాలు వాళ్ళకి చాలా విలువయినవిగా అనిపిస్తాయి.
ఇలాంటి శాశ్వత ప్రేమికులు, రోమియో, జూలియట్, లైలామజ్నూ అంబికాపతి అమరావతి వాళ్ళు ఎవ్వరూ కూడా కలసి బ్రతకలేదు. వాళ్ళు గనక కలసి ఉండి వుంటే వాళ్ళ ప్రేమ కథలు మరొక విధంగా చెప్పబడేవి.
అసలు సమస్య ఏమిటంటే, జీవితానికి నేపథ్య సంగీతం ఉండదు. మనం సినిమాలో, టి.వి.లో ప్రేమకథలు చూసినప్పుడు అవి నేపథ్య సంగీతంతో వస్తాయి. అప్పుడు మీరు చాలా తేలికగా ఊహల ప్రపంచంలోనికి వెళ్ళిపోవచ్చు. సంగీతానికి మిమ్మలని కరిగించే శక్తి ఉన్నది. అది మిమ్మలని చాలా మృధువైన సున్నితమైన దశకి తీసుకువెళుతుంది. ప్రతి ప్రేమ ఘట్టం సంగీతంతో మీ ముందుకు వస్తుంది. ఆ సంగీతం మూలంగానే మీరు ఆ సీనులు చూసి అంత ఆనంద పడతారు. ఆ సంగీతానికే మీరు పూర్తిగా మంత్ర ముగ్దులవుతారు.
నిజ జీవితంలో మీరు ఆ సంగీతం కోసం వెతుకుతారు. అది మీకు దొరకదు. ఊహలలో ఉండి కవితలు వ్రాయటం చాలా తేలిక. నిజాలని కవితలుగా వ్రాయటం కష్టం. ఎందుకంటే ముందు చెప్పినది ఊహ. అంటే ఆకాశాన్ని అంటుకోవటమే. తరువాతది సత్యం.
గుర్తుంచుకోండి, మీ భార్య లేదా భర్త భగవంతునిచే సృష్టింపడిన వారు. మీ సృష్టి భగవంతుని సృష్టితో పోటీ పడలేదు. భగవంతుని సృష్టి మాత్రమే గెలుస్తుంది.
ఈ రోజులలో ఎక్కువగా చెడు చిత్రాలు చూసి ప్రేరణ పొందటం, విపరీత భావాలని పెంపొందించుకోవటం, పగటి కలలు కనటం, వక్ర మార్గాలలో వెళ్ళటం అనేవి సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమ విపరీతమైన కోరికలు తీర్చుకోవటానికి చవకబారు పద్దతులవైపు వెళుతున్నారు. ఇవేవి లైంగిక జీవితానికి తృప్తిని ఇవ్వవు. ఇవి ఇంకా విపరీత భావాలని పెంచి మరింత చెడు మార్గాల్లోనికి తోస్తాయి. అంతే కానీ బలహీనులై తెలివి లేనివారయినప్పుడు అన్నీ అవసరమే. మీరు దృఢంగా, వివేకంతో ఉంటే ఇవేవి అవసరంలేదు. అప్పుడు మీరు ఇవన్నీ వదిలివేయవచ్చు.
ప్రశ్న: (ఒకామె ఈ విధంగా అడుగుతున్నారు) స్వామీజీ, “మీరు మమ్మలని మేము ఎలా ఉంటామో అలానే ఉండాలి అని అంటున్నారు. కానీ ఈ సమాజంలో మేము అలా ఎలా ఉండగలం. మేము సమాజానికి, కుటుంబానికి అనువుగా మారాలి కదా?”.
అవును. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఇది. మీరు అంటారు. “స్వామీజీ, మేము ఎదుటి వారికి అనుగుణంగా మారాలి కదా” అని నేనంటాను “మరి వాళ్ళు కూడా మారాలి అని మీకు నమ్మకం ఉండాలి కదా”. నిజమే సమాజంలో మనం ఒకరి మీద ఒకరం ఆధారపడాలి. దానికి వేరే మార్గం లేదు. కాకపోతే మీహద్దులు విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు స్వతంత్రులుగా ఉంటూ ఒకరి మీద ఆధారపడండి (Be independently dependent) మీరు స్పష్టంగా మీ పరిధి ఏది ఎదుటి వారి పరిధి ఏది అనే విషయం తెలుసుకోండి. మీరు సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి సమస్యలు సృష్టించకుండా మీ జీవితాన్ని అభివృద్ధి చేసుకోండి.
అయితే దీనికి నేను పరిపూర్ణమైన పరిష్కారాన్ని ఇవ్వలేను. నేను ఏదో ఒక మంత్రం జపించి భార్య భర్తల మధ్యన ఉండే సమస్యలని తొలగించ గలిగితే నేను ఈ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందే వ్యక్తిని అవుతాను.
(అంతా చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని తెలియచేసారు)
ప్రశ్న: స్వామీజీ, ఎదుటివ్యక్తి మూలాధార చక్రాన్ని వికసింపచేసి, అతని ఆశలను ఆకాంక్షలని వదిలివేసేటట్టు చేయగలమా?
(స్వామీ నవ్వుతారు) అది మీరు ఎలా చేస్తారు? మీరు మీ ఆకాంక్షలు వదలగలరు. అప్పుడు ఒక ఇంట్లో ఉండే నలుగురు వ్యక్తులు, కనీసం ముగ్గురవుతారు.
ఎదుటి వ్యక్తిని ఎలా మార్చాలి? ఈ రోజులలో మ్యారేజ్ కౌన్సిలర్స్ , హిప్నటిజం గురించి చెబుతున్నారు., ఈ హిప్నటిజం అన్నది ఎదుటి వ్యక్తి స్వేచ్ఛా పరిధిలోనికి మనం ప్రవేశించటమే. అది పూర్తిగా తప్పు పద్ధతి. అంతకు ముందు నేను ఎక్కడో చదివాను. ఒకామె తన భర్త కోపాన్ని తగ్గించాలని అనుకుంటుంది. మీరు కూడా చదివి ఉంటారు. చికాగో యూనివర్సిటీలో దీని మీద కొన్ని పరిశోధనలు చేసారు. అందులో వాళ్ళు మనిషి మెదడులో కొన్ని ఎలక్ట్రోడ్స్‌ని ప్రవేశపెట్టారు. అవి వాళ్ళ కోపాన్ని పూర్తిగా నియంత్రించాయి. వాళ్ళు పరిశోధన కోసం కొంత మంది వాలంటీర్లు కావాలి అని అడిగినప్పుడు, వందల మంది స్త్రీలు వాళ్ళ భర్తలని బలవంతంగా యూనివర్సిటీకి తీసుకువచ్చారంట.
(అంతా నవ్వుతారు)
ఈ పరిశోధన అయ్యాక, 72 మంది స్త్రీలు యూనివర్సిటికి వచ్చి వారిని ఇలా అడిగారంట "దయచేసి, మా భర్తల తలలోని ఎలక్ట్రోడ్స్‌ని (electrodes) తీసివేయండి . నాకు నా పాత భర్తే కావాలి. నాకు కోపంగా ఉండే నా భర్తే కావాలి" వాళ్ళు ఈ విధంగా అన్నారంట "మాకు జీవితంలో రుచి పోయింది. మేము పోట్లాడుకోకపోతే మాకు అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం లేదు. అతను నన్ను పట్టించుకోవటం లేదు."
ప్రతి ఒక్కరికీ ఎదుటి వారు తమ మీద శ్రద్ధ చూపించాలి అని అనుకుంటారు. ఈ సందర్భంగా శాస్త్ర వేత్తలు ఏమని చెబుతారంటే సామాన్య మానవుడు ఆహారం లేకుండా 90 రోజులు బ్రతకగలడు కాని వేరే వ్యక్తితో సాటి మనుషులతో మాట్లాడకుండా 14 రోజులు కూడా ఉండలేడు. ఆ తరవాత అతను పిచ్చివాడై పోతాడు.
అసలు జరిగినది ఏమీటంటే, మనం ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలో మర్చిపోయాము. ఒకరంటే మరొకరు ఎలా శ్రద్ధ చూపించుకోవాలో మరచిపోయాం. ప్రేమ మనం మరచిపోయిన భాష. అందుకే ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపాలన్నా,
కనీసం ఏదో ఒక విధంగా మాట్లాడాలన్నా, పరస్పర మానవ సంబంధాలు నిలుపుకోవాలన్నా, మనకి పోట్లాడుకోవటం ఒకటే దారి అయ్యింది.
నేను అనుకోవటం, ఇక్కడ కూర్చున్న వారిలో కూడా వాళ్ళ భార్య లేదా భర్త ఆధ్యాత్మికంగా ఉండరు అని అనుకున్న వాళ్ళు కూడా ఒక వేళ వాళ్ళు ఆధ్యాత్మికంగా అయితే, తిరిగి వచ్చి మాకు మా పాత భార్య/భర్తే కావాలి అని అడుగుతారు. అవును కదా.
(అంతా నవ్వి, కాదు కాదు అని అంటారు)
సరే! మీరు అందరి లాంటి వారు కాదు. మీరు వేరుగా ఉండే వ్యక్తులు అంటారు. సరే అదీ చూద్దాం.
ఈ మూలాధార చక్రం యొక్క చక్కని విశేషం ఏమిటంటే ఈ చక్రం వికసించినప్పుడు మీలో ఉండే50% సమస్యలు మాయం అయిపోయినట్లు తెలుసుకుంటారు. ఈ ఒక్క చక్రమే మీ జీవితంలో సగ భాగాన్ని నియంత్రిస్తుంది. మీరు ఏపని చేసినా ఈ చక్రం తాలూకా గుర్తులు అందులో కనపడతాయి. మీరు చేసే సంతకంలో కూడా ఈ చక్రం యొక్క ఛాయ కనిపిస్తుంది. మూలాధార చక్రం చురుకుగా ఉన్నప్పుడు మీ సంతకం కూడా వేరుగా ఉంటుంది. ఆ సమయంలో మీరు పూలు కొసినా ఆ కోసే పద్దతి వేరుగా ఉంటుంది.
తమిళనాడులో నాయనార్లు అనే యోగులు ఉంటారు. ఒక పాటలో వారి గురించి ఇలా ఉంటుంది.వాళ్ళు పువ్వులు కోసినప్పుడు చెట్టుకి ఎటువంటి బాధ ఉండదని. దాని అర్ధం ఏమిటంటే ఈ చక్రం వికసించి చురుకుగా ఉన్నప్పుడు మీరు అంత సున్నితంగా ప్రేమగా ఉంటారు. ఈ చక్రంలో శక్తి విడుదల అయినప్పుడు అది ప్రేమగా మారి మీ లోపలి నుంచి ఆ ప్రేమపొంగి ప్రవహిస్తుంది.
సెక్స్ బొగ్గు అయితే ప్రేమ వజ్రం. సెక్స్ బురద అయితే ప్రేమ అందులోంచి పుట్టి వికసించే పద్మం అందులో ఉండే పదార్ధం ఒకటే అయితే దానిని
క్రమబద్ధీకరించటంలోనే అంతా ఉంది. క్రమబద్ధీకరణ మీకు తెలియాలి. మీ ఆకాంక్షలని వదిలివేయండి. అప్పుడు మీలో ఒక అద్భుతమైన శక్తి ప్రవహించుతుంది.
ఇవాళ నేను మీ అందరికీ ఒక పద్ధతి చెబుతాను. మీ ఇంటికి వెళ్ళాక దానిని ప్రయత్నించండి. మీరు కూర్చుని మీ మూలాధార చక్రం మీద మీ ఏకాగ్రతని నిలపండి. అక్కడ మీరు చక్రం బిగువుగా బంధింపబడినట్టు అనుకుంటే అయిదు నిముషాలు మీ భార్య లేదా భర్తని మనస్సులో క్షమించండి. వాళ్ళు మీకు కలిగించిన ఆందోళనకి, వాళ్ళు సృష్టించిన సమస్యలకి వాళ్ళని క్షమించండి. వాళ్ళని నిజంగా క్షమించండి. మీరు ఆ విషయం మూలలలోనికి లోతుగా వెళ్ళి మీ కోపాన్ని వదిలివేయండి. ఆ పనిని పూర్తిగా నిజంగా చేయండి. వాళ్ళని వాళ్ళ లాగానే స్వీకరించండి. వారికి మీ లోతైన ప్రేమని ఇవ్వండి.
అలా ఐదు నిముషాలు గడిచాక మీ మూలాధార చక్రం వదులుగా అవటం మీరు గమనించుతారు. కేవలం ఐదు నిముషాల ఏకాగ్రత ఇంత ఫలితాన్ని ఇచ్చినప్పుడు మీ దృక్పథం పూర్తిగా మారితే ఎంత అద్భుతం జరుగుతుందో ఊహించండి. అప్పుడు మీరు ఎంతో గొప్ప శక్తి ప్రవాహాన్ని మీలో అనుభవించవచ్చు. ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారంటే, మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి అందులో 90,000 రూపాయలని మీరు ఎక్కడో దాచేసి వాటిని మర్చిపోయారనుకోండి. మీ జీవిత మంతా మిగిలిన పదివేలు రూపాయలతోనే గడిపేస్తారు. అప్పుడు మీరు పేదవారమని అనుకుంటారు.
ఇదే విధంగా మనం మన శక్తిని తప్పు దారులలో ఉపయోగిస్తున్నాము. అది ఈ చక్రంలోని కోపం, కోరిక, సెక్స్ ఇలా ఎన్నో ఉపయోగం లేని వాటిల్లో ఆ శక్తిని బంధించేస్తున్నాము. దాంతో మన నిత్య జీవితంలో కొన్ని పనులు చేసుకోవటానికి కూడా మనకి శక్తి లేకుండా పోయింది. ఒక్క సారి ఈ చక్రం వికసించితే మీరు భాగ్యవంతులవుతారు. మీరు బాగా ఆలోచించగలుగుతారు. మీరు ఏ విషయాన్నైన చక్కగా ఆలోచించి మంచి ప్రణాళికలు వేయగలుగుతారు. మీరు ఈ శక్తి మీ
చేతన స్థితిలో పని చేయటం గమనించుతారు. మీరు మీ భార్య, భర్త, మీ చుట్టుప్రక్కల వాళ్ళు అందరు ఆధ్యాత్మిక ఉట్టిపడే వ్యక్తులుగా కనిపించుతారు.
ఒక విషయం అర్ధం చేసుకోండి. స్వర్గం, నరకం అనేవి ఎక్కడో నిర్మించబడ్డ ప్రదేశాలు కావు. వాటిని ఏ పటంలోనూ చూడలేరు. అవి మీ మనసులో ఉంటాయి. అవి మానసికంగా ఏర్పడతాయి. మీ జీవితాన్ని నరకం చేయాలన్నా, స్వర్గం చేసుకోవాలన్నా అది మీ నిర్ణయం. మీ ఇష్టం. మీరు మీ మెదడుని ఆశలు, కోరికలతో నింపేసుకుంటే మీలో మీరు నరకాన్ని మోస్తున్నట్టే. దాంతో మీరు ఎక్కడికి వెళ్ళితే అక్కడికి ఈ నరకం కూడా వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే సర్కస్ గ్రూపులు, వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి టెంట్ మోసుకెళ్ళి, వాళ్ళు వెళ్ళిన దగ్గర వాటిని పరిచేస్తారు. మీరు కూడా ఎక్కడకి వెళ్ళితే అక్కడకి ఈ నరకాన్ని మోసుకెళ్ళి, దానిని పరుచుకుని అందులోనే జీవించుతారు. మీరు అసలు తప్పించుకోలేరు. అటువంటి ఇద్దరు మనుషులు ఎదురు పడితే రెండు నరకాలు ఢీకొంటాయి. అవి ఢీ కొన్నప్పుడు భయంకరమైన మోతలు తప్ప అక్కడ అందమైన చిరు మువ్వల ప్రేమ రవళులు మాత్రం వినిపించవు.
మీరు ఎందుకు ఈ బరువు ఇలా మోస్తు తిరుగుతారు. దానిని వదిలేయండి. మీ ఆలోచనలకు తగ్గట్టుగా ఎదుటి వారిని తయారు చేయలనే మీ ఆకాంక్షతో మీరు మీలోని అధ్భుతమైన శక్తిని నిరుపయోగం చేస్తున్నారు. దాని కంటే ఎదుటి వారిని ఉలితో మలిచే కార్యక్రమాన్ని వదిలివేయటం తేలిక కదా! దీనిలోని కనీసం 10% శక్తిని ధ్యానానికి ఉపయోగించితే మీ జీవితంలో అధ్భుతమైన మార్పులు వస్తాయి. అదే నిజమైన జీవితం. తెలుకునే తత్వంతో స్వేచ్ఛగా ముందుకు సాగేదే నిజమైన జీవితం. మీకు ఆ అవకాశం ఉన్నది. మీరు చేతన స్థితిలో జీవించాలా వద్దా అనేది పూర్తిగా మీ నిర్ణయం. ఎలా కావాలంటే అలా జీవించవచ్చు.
ప్రశ్న: స్వామీజి, మేము కోరికని వదిలేసి ప్రేమని ఎలా అభివృద్ధి చేసుకోవాలి?
అవును, చివరికి మీరు అసలు పాయింట్ దగ్గరకి వచ్చారు. కోపానికి ఉన్నట్టే కోరికకి చాలా శక్తి ఉన్నది. మీరు అసలు ఈ కోరిక అంటే ఏమిటో అర్ధం చేసుకునే వరకూ, అది ఎలా మార్పు చెందుతుందో తెలుసుకునే వరకూ, మీరు ఏ పని చేసినా అది కోరికతోనే ఉంటుంది. మీరు ఒక పెన్ను తీసినా అది కోరికతోనే ఉంటుంది. చిన్న పిల్లల వీపు మీద తట్టినా అది కోరికతోనే ఉంటుంది. కోరికలో కొంత పశుత్వ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే మీ శక్తి ఇంకా చాలా క్రింది స్థితిలో (bass level) ఉంటుంది. అది ఉన్నత స్థితిలోనికి మారలేదు కాబట్టి.
ఏ విధంగా అయితే కోపం గురించిన జ్ఞానం కోపాన్ని తగ్గిస్తుందో, కోరిక గురించి తెలుసుకున్న జ్ఞానం కోరికని తగ్గిస్తుంది. ఎందుకంటే రెండింటిలోని శక్తి ఒకే విధమైన శక్తి. ఈ కోరిక, సెక్స్ విషయంలో అసలు సమస్య ఏమిటంటే అది వున్న పరిమాణం కంటే చాలా పెద్దదిగా ఊహించుకుంటారు. దానిని భూతద్దంలో చూస్తారు. ఇక్కడే మొత్తం సమస్య ప్రారంభమవుతుంది. అది రకరకాల మీడియా మూలంగా బాగా కలుషితమయిపోతుంది.
ఎప్పుడైతే మీ కోరికని ఎదుటి వ్యక్తి అంగీకరించరో, అది వారి పట్ల కోపంగా మారుతుంది. అందుకే మీరు అప్పుడప్పుడు పేపర్లలో యువకులు ఆడపిల్లల మీద యాసిడ్ పోసారు, ఎందుకంటే వాళ్ళు ప్రేమని తిరస్కరించారు కాబట్టి అని చదువుతుంటారు.
ముందుగా మీరు ఒక విషయాన్ని అర్ధం చేసుకోండి. సమాజం మనుషులని ఎప్పుడు ఉత్తములుగా, అధములుగా విభజించుతూనే ఉన్నది. తీవ్రమైన కోరికలు ఉన్న వారిని తక్కువగా చెబుతుంది. కానీ ఎక్కడా అలా ఉన్నతమైన తక్కువ అని ఉండరు. మనలో మార్పు జరగాలి అంతే. ఆ రెండు గుణాలు మనసులోనే, అంటే ఒక్కరిలోనే ఉంటాయి.
ఎవరైతే అన్ని చోట్ల నీతి నియమాలని స్థాపిస్తూ, వాటిని ప్రచారం చేస్తుంటారో, వాళ్లు కేవలం నీతివంతులు అని నటించేవారు మాత్రమే. వారి వెనుక దాచి పెట్టబడిన కోరికలు, విపరీతమైన భావనలు ఉంటాయి. వీళ్ళు ఈ ఆలోచనలోకి వెళ్ళటానికి భయపడతారు, లేదా తాము తప్పు చేసామన్న అపరాధ భావంతో నీతుల వెనుక దాక్కుంటారు. అందుకే నీతి నియమాల ముసుగులో జీవితాన్ని నడిపించుతారు. ఇటువంటి వాళ్లే ఉన్నతము, నీచము అనే భేదాలు సృష్టించుతారు. దీనితో సమాజంలో అలజడి, గొడవలను సృష్టిం చుతారు.
ఎక్కడా ఉన్నతమైన, తక్కువైన మనుషులు వుండరు అని అర్ధం చేసుకోండి. ఏ క్షణాన అయితే మీరు తక్కువ అని అనుకుంటారో మీరు ఆ భావంతో పోరాటానికి దిగుతారు. దాంతో ఆ భావం లోపలినుంచి బయటికి రావటం చాలా కష్టమైపోతుంది. దాంతో అటువంటి వారిలో మార్పు సంభవించటం చాలా కష్టమవుతుంది.
మీరు దేనినైతే ఆపాలనుకుంటారో, అది విజృంభిస్తుంది. మీ చేతన స్థితిని మీ లోపలికి రానీయండి. చేయవలసిన మార్పులని అదే చేస్తుంది. మీరు కేవలం అర్ధం చేసుకునే తత్త్వాన్ని మీలో వృద్ధి చేసుకోండి. చేయవలసిన మార్పులు అదే చేస్తుంది. ఎప్పుడూ విశ్లేషించకండి. విశ్లేషణ విభజిస్తుంది. అది మిమ్ములని రెండు భాగాలుగా చేస్తుంది. ఈ రెండు భాగాలు నిరంతరం పోరాడుతూ ఉంటాయి. సమాజం మిమ్ములని అలా విభజించాలని చూస్తుంది.
విశ్లేషణ అనేది శాస్త్రజ్ఞులకి, పరిశోధనలు చేసేవారికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడదు. మీరు విభజించడానికి, విశ్లేషణ చేయడానికి ఎంతగా అలవాటు పడిపోయారంటే, మీరు వాటిని ఏ సందర్భంలోనూ వదలలేకపోతున్నారు. ఎప్పుడైనా ఎవరైనా మీ మీద ఉన్నతము, తక్కువ అనే భావాలని విధించితే, మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. మనలో ప్రతి ఒక్కరం ఈ అనంత చైతన్య సృష్టిలో భాగమే. అందులో ఎవరూ ఉన్నతులు కాదు, తక్కువ కాదు. మీరు ఎప్పుడైతే నిజాలని మర్చిపోతారో అప్పుడే ఇటువంటి మాటలని ఉపయోగించాలి.
ఇక పోతే మీ ప్రశ్నలోని కోరిక: ముందుగా ఈ విషయం అర్ధం చేసుకోండి: ఎక్కడా కూడా ప్రేమ మాత్రమే ఉంటుంది. కోరిక ఉండదు. అది సత్యం. కోరిక అనేది లోతైన అజ్ఞానం.
కోరికని ప్రేమగా మార్చటం అనేది ఒక విధమైన రసాయన ప్రక్రియ (alchemy process) . ఈ రసాయన ప్రక్రియలో తక్కువ విలువైన లోహాలని అత్యంత విలువైన లోహాలుగా మార్చుతారు. అదే విధంగా మనలో తక్కువ దశలో ఉండే భావావేశాలని ఉన్నతమైన భావాలుగా మార్చటమే. అదే ప్రేమ. అదే కోరికని ప్రేమగా మార్చే రసాయన సిద్ధాంతం. అదే అంతిమ రసాయన సిద్ధాంతం.
నేను నా సత్యాన్వేషణలో హిమాలయాలలో తిరిగే రోజులలో నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీకు చెబుతాను.
ఆ రోజులలో నేను హిమాలయాలలో ఎక్కడికి వెళ్ళాలనిపించితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. నాకు ఏమీ సామాను ఉండేవి కాదు. ఎక్కడ పడితే అక్కడ తిరిగే వాడిని. ఎక్కడ పడితే అక్కడ నిద్ర పోయే వాడిని. ఆ సమయంలోనే నేను చాలా మంది యోగులను కలిసాను.
అటువంటి సందర్భంలో నేను ఒక యోగిని కలిసాను. ఆయన సరియైన దుస్తులు వేసుకోలేదు. ఆయన చూపులు, ముఖ వైఖరి కోపంగా ఉన్నాయి. ఆయన నాగా బాబా, నాగా యోగులకు సంబంధించిన ఒక యోగి. నాకెందుకో ఆయన అంటే ఆకర్షణ కలిగింది. ఆయన దగ్గరకి వెళ్ళాను. అప్పుడు నాకు హిందీ అంత బాగా రాదు. ఏదో వచ్చీరాని హిందీలో ఆయనతో మాట్లాడే వాడిని. ఆయనతో నేను కొన్ని రోజులు ఉన్నాను. ఆయన రోజంతా హుక్కా పీలుస్తూ ఉండేవాడు. ఆయనని గమనించుతూ ఉండేవాడిని. ఆయన చేసేదేమిటి అని ఆశ్చర్యంగా చూసేవాడిని. ఆయన హుక్కాలో రెండు రాగి నాణాలు వేసి, కొంత సేపు హుక్కా పీల్చేవాడు. తరువాత ఆ పైపుని క్రింద దులిపేవాడు. అందులోంచి రెండు బంగారు నాణాలు క్రింద పడేవి. ఆయన వాటిని బయట అమ్మి చాలా రాగి నాణాలు కొనే వాడు. ఈ విధంగా చాలా సార్లు ఆయన చేసే వాడు.
ఒక రోజు ఆయనని ఇది ఎలా జరుగుతుంది అని అడిగాను. దానికి ఆయన జవాబు చెప్పకుండా ఆ పైపుని నాకు ఇచ్చాడు. ఎందుకో నాకు పొగాకు, అల్కాహోలు వాసనలు పడవు. అందుకే కొన్ని అడుగులు వెనక్కి వేసాను.
ఆయనతో నేను హిమాలయాలకి ధ్యానం నేర్చుకోవటానికి, జ్ఞానోదయం, ఆత్మ సాక్షాత్కారం పొందటానికి వచ్చాను కాని పొగతాగటానికి, బంగారు నాణాలకోసం రాలేదు అని చెప్పాను. ఆయన నావైపు చూసి మొట్టమొదట సారిగా నాతో తమిళంలో ఇలా చెప్పాడు. అంగం పజుత్తాల్ తంగం జుక్కుం. దాని అర్ధం "ఎపుడయితే నీ ఆత్మ (Being) పరిణితి పొందితే (ripens) బంగారం పండుతుంది" నా నోట మాట రాలేదు.
ఆయన సరదాగా నాముఖం మీద ఆ పొగని ఊదాడు. ఆ తరువాత నేను మూడు రోజుల పాటు గొప్ప పరమానందంలో ఉండిపోయాను.
రాగిని బంగారంగా మార్చటం రసాయన ప్రక్రియ. అది బయట ప్రపంచంలో ఒక రసాయన పద్దతి. మన అంతరంగంలోని రసాయన ప్రక్రియ అంటే, మనలో అధమస్థానంలో ఉన్న శక్తిని ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తిగా మార్చటం. మీరు ఎప్పుడైతే మీలో తక్కువ స్థాయిలో ఉండే శక్తిని ఉన్నత స్థాయిలోగల శక్తిగా మార్చటం అనే కళలో ప్రవీణులవుతారో అప్పుడు రాగిని బంగారంగా మార్చటమనేది గొప్ప విషయం కాదు. మీరు ఎప్పుడైతే మీ అంతరంగంలో రసాయన ప్రక్రియలని నైపుణ్యంతో చేయగలుగుతారో, అప్పుడు బయట ప్రంచంలోని రసాయన సిద్ధాంతాలు చాలా సులభం. అవి మీకు కేవలం చిన్న పిల్లల ఆటలుగా అనిపిస్తాయి.
ఈ సంఘటన, నా అనుభవాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, ఈ రసాయన ప్రక్రియని అర్ధం చేసుకుంటారని. అంతే కాని బయట ప్రపంచంలో రసాయన సిద్దులు చేస్తారు అని కాదు. బాగా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. బయట ప్రపంచంలోని రసాయన క్రియలు సామాన్యమైనవి. మీ అంతరంగంలో మీరు సాధించే నిజమైన రసాయన సిద్ధాంతం మిమ్మలని నిజమైన గొప్ప యోగులుగా చేస్తుంది.
ఇటువంటి రసాయన క్రియ జరిగినప్పుడు లోహాలలో ఎటువంటి మార్పు వస్తుంది? ముందుగా తక్కువలువయిన లోహంలోని కల్మషాలని బయటకి తీసేస్తారు. ఆ తరువాత ఆ లోహంలోనికి కొన్ని పదార్థాలని కలుపుతారు. అప్పుడు మొత్తం రసాయన ప్రక్రియ జరుగుతుంది. చివరికి తక్కువ విలువైన లోహం ఉన్నతమైన లోహంలా మారుతుంది.
మనలోని పశుత్వ లక్షణాలు, భావాలు దైవత్వంతో కూడిన భావాలుగా మార్పు చెందాలి. మనందరిలో కోరిక ఉన్నది. అది పశుతత్త్వపు భావన. మరొక విషయం. కనీసం పశువులలో ఉండేది స్వచ్ఛమయిన కోరిక. అవి ఆ బంధంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోతాయి. కానీ మన విషయానికి వస్తే మనలోని కోరిక కూడా స్వచ్ఛమయిన కోరిక కాదు. దాంట్లో అపరాధ భావం అత్యాశ, ఆకాంక్ష ఎప్పుడూ ఉంటాయి.
మనపై ఎప్పటినుంచో విధించబడిన నింబంధనలు మనలో అపరాధ భావాన్ని కలిగించవచ్చు. దాంతో ఆ కోరిక నుంచి దూరంగా వెళ్ళిపోతారు. లేదా అదే దారిలోనికి మళ్ళీ మళ్ళీ అతిగా వెళ్ళి, తిరిగి అపరాధ భావం తెచ్చుకోవటం, ఆ భావంతో మళ్ళీ అందులోనికే వెళ్ళటం జరుగుతుంది. ఇది ఛేదించలేని ఒక వృత్తం. దానిలో ముందుకి తోసి, వెక్కిలాగి మరలా అందులోకి వెళతారు. అందుకే కోరిక కూడా కలుషితమైపోతుంది. మనుషుల కోరికలు అందువలననే స్వచ్ఛమైనవి కావు.
మీరు ఎప్పుడైనా గమనించితే ఒక విషయం తెలుస్తుంది. మీరు ఏక్షణంలో అయితే మీ ఊహలని నిజం చేసుకుని సాధించుతారో అప్పుడు మిమ్ములని అపరాధ భావం చుట్టుముడుతుంది. అందుకే సెక్స్ మిమ్ములని అపరాధ భావంలోనికి తోస్తుంది. మీరు చిన్న పిల్లలుగా ఉన్నపుడు మొట్టమొదట కుటుంబం మీలో ఈ అపరాధ భావాన్ని ప్రవేశపెడుతుంది. ఆ తరువాత అపరాధ భావాన్ని తెచ్చి దానిని పెంచుకోవటంలో మీరు ప్రవీణులవుతారు. ముందుగా అపరాధ భావాన్ని అర్థం చేసుకోండి. ఎవరైతే మిమ్ములని తమ ఆధీనంలోనికి తీసుకుని మిమ్ములని నియంత్రించాలని అనుకుంటారో, వాళ్ళు ముందుగా మీలో ఈ అపరాధ భావాన్ని నింపుతారు. వాళ్ళు మిమ్ములని మీరు చాలా తక్కువ అనే భావంలో ఉండేటట్టుగా చేస్తారు. అప్పుడు ఎటువంటి ప్రతి ఘటనా లేకుండా, వారిని ఎదిరించకుండా వాళ్ళు ఏమి చెబితే మీరు దానిని అనుసరించుతారు.
మనకి నియంత్రణ అనేది కేవలం అపరాధ భావంతో నియంత్రించటం మాత్రమే తెలుసు. నేను చెబుతున్నాను. అర్థం చేసుకోండి. చిన్న పిల్లలకి నిబంధనలు ఉండాలి. ఎప్పుడూ కొన్ని నిబంధనలతో జీవితం ప్రారంభించటం చాలా మంచిది. కానీ మీ అంతట మీరు మీ వివేకంతో అభివృద్ధి సాధించటం చాలా ముఖ్యం. మీ వ్యక్తిత్వం ఏకమై పరిపూర్ణంగా ఉన్నప్పుడు, మీలోపల అపరాధ భావాన్ని ఎవరూ ప్రవేశపెట్టలేరు. నిజానికి ఒక సంఘటన మీలో అపరాధ భావాన్ని నింపదు. ఆ సంఘటన తాలూకా ప్రభావం మాత్రమే మీ లోపల అపరాధ భావాన్ని పెంచుతుంది.
మనుషులు గుడ్డిగా నిబంధనలని తయారు చేసి ఒక తరం తరువాత మరొక తరానికి వాటిని అందిస్తుంటారు. దాంతో పాటు అపరాధ భావనని కూడా తరతరాలకి అందిస్తుంటారు. అది వంశ పారంపర్యంగా తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుకుకి, కొడుకు నుంచి మనవడికి ఇలా జాగ్రత్తగా అందుతూనే ఉంటుంది.
కాస్మటిక్స్ వాటికి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా మీరు అందంగా లేరు అని మరీ మరీ చెబుతాయి. అప్పుడు మీరు ఏదో తక్కువ అని బాధపడతారు. మీలో అపరాధ భావం వస్తుంది. మీ శరీరాన్ని చూసి బాధపడి, బజారుకి వెళ్ళి ఆ వస్తువులన్నీ కొంటారు. ఆ తరువాత వాటిని వాడతారు. అప్పుడు మీరు ఆ కంపనీ నియంత్రణలో, వారి ఆధీనంలో పడిపోతారు. అలా ఒక సారి అలవాటు పడ్డాక, మీకు మరో అపరాధ భావం వస్తుంది. నేను వీటితో లేని పోని సమస్యలు తెచ్చుకుంటున్నానా? అని. ఏ నిమిషాన అయితే మీరు ఏదైనా సాధించుతారో వెంటనే మిమ్ములని అపరాధ భావం చుట్టుముడుతుంది.
ఇకపోతే కోరిక విషయంలో మీలో ఉండే ఊహలు మిమ్ములని ఉపయోగం లేని ఒక వృత్తంలో బంధించుతాయి. మీరు రకరకాల మీడియా ద్వారా, సినిమా, టి.వి., పుస్తకాలు, ఇంటర్నెట్ ఇలా అన్నింటి నుంచి చూసిన విషయాలతో మీ మెదడులో ఊహలు కల్పనలు అనే ఒక పొరని ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఎటువంటి సంబంధాలలోనైనా మీరు ఆ పొరతో పోల్చుకుంటారు. ఆ పొరలోని ఊహలతోనే మైండ్‌లోని ఊహలతో పోల్చి చూస్తే, మీ భార్యా, లేదా భర్త చాలా తక్కువగా అనిపించుతారు. అప్పుడు మీ కోరిక కలుషితమయిపోతుంది.
మీరు ఎప్పుడైతే ఇటువంటి పద్ధతికి అలవాటు పడిపోతారో, అప్పుడు మీరు ఛేదించలేని విషవలయంలో చిక్కుకుపోతారు. అందుకే మీరు లోతులోనికి వెళ్ళలేరు. దానిలోంచి బయటికి వచ్చేస్తుంటారు. అయితే బయటికి వచ్చిన ప్రతిసారి విపరీతమైన కోరికతో వస్తారు. అలా కాకుండా మీరు లోతులోనికి వెళ్ళగలిగితే మీరు అందులోంచి వికసించుతారు.
అందుకే పూర్వకాలం ఎవరైనా 40 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి వాళ్ళ కోరికలని వదిలేసేవారు. వాళ్ళ మైండ్‌లో కష్టతరమైన ఊహలు, కల్పనలు ఉండేవి కావు. వాళ్ళు నేరుగా తమ భార్య లేదా భర్తతోనే సంబంధాలు పెట్టుకొనే వారు. అందుకే వాళ్ళు ముందుగానే ఆ కోరిక నుంచి బయటపడి వికాసం పొందేవారు. వాళ్ళు కోరిక లోతులలోనికి వెళ్ళి బయటకి వచ్చేసేవారు. దాంతో కోరిక వారి నుంచి మాయమైపోయేది. వాళ్ళకు దానిని వదులుకునే అవసరం ఉండేది కాదు.
భారతీయ వివాహ వేడుకలో పూజారి భార్యతో ఇలా భర్తకి చెప్పించుతాడు. “నీవు నా 11వ కుమారుడివు అవుదువుకాక” అంటుంది. భర్త భార్యతో “నీవు నా 11వ కుమార్తెవు అవుదువు గాక” అని అంటాడు. దీని అర్థమేమిటంటే వివాహం అయిన
11 సంవత్సరాలకి వాళ్ళు ఒకరినొకరు కుమార్తె, కుమారునిలా చూసుకుంటారు. అప్పటికి వారి వివాహ సంబంధంలో అంత మార్పు వస్తుంది.
పిల్లలని చూస్తే మీకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అవును కదా. మీ భార్యతో ఉన్న సంబంధంలో కూడా ఎంత మార్పు రావాలంటే, వారిని మీరు చూచినప్పుడు, మీకు అంత ఆనందం రావాలి. స్త్రీకి భర్త కొడుకుగా మారతాడు, పురుషునికి భార్య కూతురైపోతుంది.
మీ మనస్సుల్లో ఉండే ఊహలు స్పష్టంగా లేకపోతే, మీరు భాధపడతారు. అర్ధం చేసుకోవటం అనేది ఆ బాధల నుంచి బయట పడే గొప్ప మార్గం. మీరు బాధలు లేకుండా ఎలా బతకాలో తెలుసుకుంటే మీరు ఆధ్యాత్మిక జీవితం కొనసాగిస్తున్నట్టే. మీకు బాధలని ఏ విధంగా పరిష్కరించుకోవాలో, వాటిలోంచి ఏ విధంగా బయటకి రావాలో తెలియకపోతే మీరు ఈ వస్తు ప్రపంచంలో జీవిస్తున్నట్టే. జీవితం అనేది రెండు రకాలు. అర్ధం చేసుకుని జీవించటం అర్ధం చేసుకోకుండా జీవించడం, వీటినే బుద్ధ జీవితం, బుద్ధు జీవితం అనవచ్చు.
మీరు మీ కోరికలు, కల్పనల విషయంలో చాలా అయోమయంలో ఉంటారు. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండలేరు. మీరు నేల మీద చాప వేసుకుని కూర్చున్నప్పుడు, మీరు ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే అప్పుడు మీరు కుర్చీ గురించి ఆలోచించుతారు. మీరు కుర్చీని పొందినప్పుడు మరలా ఆనందంగా ఉండరు. అప్పుడు సింహాసనం గురించి ఆలోచించుతారు. మీకు సింహాసనం దొరికినప్పుడు, దానిని ఆనందించే శక్తి పోగొట్టుకుంటారు. మీకు ఏమి చెప్పటానికి ప్రయత్నిస్తున్నానో అర్ధమవుతుందా?
మీ కోరిక స్వచ్ఛమయినది అయితే, అందులో మీకు అత్యాశలు, అపరాధ భావాలు లేకపోతే, అప్పుడు మీరు అందులో లోతులకి వెళ్ళగలుగుతారు. మీరు అందులోంచి బయటకి వచ్చి వికసించగలుగుతారు. ఎప్పుడైతే మీ మెదడులో ఏర్పరుచుకున్న పొర పనిచేయటం మొదలు పెడుతుందో అప్పుడు మీరు అంత వరకూ సేకరించుకున్న ఊహలని కల్పనలని ముందుకు తెచ్చుకుంటారు. దాంతో మీరు వికసింపలేరు.
ముందు మీరు మెదడులోని పొరని వదిలివేయండి. మీ శరీరాన్ని. ఎదుటి వారి శరీరాన్ని ప్రేమించటం నేర్చుకోండి. మీ శరీరం లోపల పరమానందం నిరంతరం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు దానిని బయటకి రానీయటం లేదు. ఎందుకంటే మీరు మీ ఊహలలో చిక్కుపోయారు. ఎప్పుడైతే మీ శరీరం గురించి, ఎదుటివారి శరీరం గురించి మీకు ఉన్న ఊహలని వదిలివేస్తారో, అప్పుడు మీ కోరికలలోని కల్మషం తొలగిపోతుంది. ఇదే రసాయన ప్రక్రియలో మొదట దశ, కల్మషాలని తొలగించటం.
ఎప్పుడైతే మీరు మీ శరీరంతో సౌకర్యంగా, సంతోషంగా ఉంటారో అప్పుడు మీలో ఒక రకమైన అందమైన సౌమ్యత, సొగసు ఏర్పడతాయి. అర్థం చేసుకోండి. చాలా చర్మ వ్యాధులకి కారణం మీరు మీ శరీరాన్ని ద్వేషించటమే. అలా ఎందుకు జరుగుతుంది అంటే మీ శరీరం అంటే మీకు గౌరవం లేకపోవటం, అభిమానం తక్కువగా ఉండటమే.
మీకు ఈ విషయం అర్థం కాదు. దాంతో జబ్బుకి చికిత్స చేయించాలి అని డాక్టర్ల దగ్గరకి వెళతారు. దాని మూలాలు (roots) మీరు ఎన్నో సంవత్సరాలుగా సేకరించి తయారు చేసుకున్న మెదడులోని పొరలో ఉన్నాయి. మీరు నిరంతరం ఎదుటి వారి శరీరాన్ని చూసి అటువంటిది కావాలి అని కోరుకుంటారు. మీరు మీ శరీరంతో సౌకర్యంగా ఉంటూ, దానిని ప్రేమించగలిగితే, మీరు చాలా అందంగా ఉంటారు, అందాన్ని అనుభూతి పొందగలుగుతారు.
తులసీదాసు రామాయణంలో సీతాదేవి జనకుని సభలోనికి వస్తుంటే అందరూ ఋషులు, యోగులు, చివరికి ఆమె తండ్రి జనకుడితో సహా అందరూ లేచి నిలబడి ఆమెని గౌరవించుతారు. ఆమెలోని సున్నిత సౌందర్యం, ఉదాత్తత అంత లోకోత్తరమయినవి. ఆ ఉదాత్తత ఆమె నుంచి పొంగి ప్రవహిస్తుండేది.
తంత్రాలలో ఒక పద్ధతి ఉన్నది. ఉదయం నిద్రలేవగానే శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రేమతో తడుముకోవాలి. మీలోని సూక్ష్మ శరీరం మీరు మేలుకున్నప్పుడు మీభౌతిక శరీరంలో స్థిరపడుతుంది.
మీరు బయట ప్రపంచంలో ఎక్కువ ఊహలు, కల్పనలు సేకరించితే, మీ మెదడులోని పొర చాలా మందంగా తయారవుతుంది. పూర్వకాలం మనుషులకి ఇన్ని మానసిక సమస్యలు ఉండేవి కావు. వాళ్ళు చాలా సామాన్యంగా ఉండేవారు. వాళ్ళకి అసలు మెదడులోని పొర ఏర్పడేది కాదు. ఒక వేళ ఉన్నా చాలా పలుచగా ఉండేది.
మీరు మీ శరీరం గురించి ఎదుటి వారి శరీరం గురించి ఊహలని కల్పనలని వదిలివేస్తే అప్పుడు మీరు ఎదుటి వారి శరీరం పట్ల సున్నితంగాను, స్నేహపూర్వకంగా ఉంటారు. స్నేహం అనేది కోరిక నుంచి ప్రేమకి మార్పు చెందే రసాయన క్రియకి చేరవలసిన ఒక పదార్ధం.
గుర్తుంచుకోండి. హింస సరియైన మార్గం కాదు. మనం మన సమాజంలో, మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న హింసని గురించి మాట్లాడతాము. మరి మన ఇళ్ళ సంగతి ఏమిటి? మన శరీరం లోపల, మనస్సులోపల ఉండే హింస సంగతి ఏమిటి? మీకు చెబుతున్నాను, హింస అనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుంది.
మీరు అనవచ్చుః “స్వామీజీ! మేము మా దైనందిన జీవితంలో ఎక్కడా హింసాత్మకంగా ఉండము” అని. మీకు చెబుతున్నాను, మీరు అనుకుంటారు నేను స్నేహపూర్వకంగా ఉంటాను, హింసాత్మకంగా ఉండను అని. నేను చెప్పే స్నేహానికి మీ మైండ్ లో ఉన్న స్నేహానికి తేడా ఉన్నది. మిమ్ములని మీరు దగ్గరగా గమనించండి. మీరు రోడ్డు మీద గాని, తోటలో గానీ నడిచేటప్పుడు మీకు తెలియకుండా చెట్ల ఆకులు కొమ్మలు, పూవులు తెంపుతుంటారు. రాళ్ళని కాళ్ళతో తన్నుతారు. చెట్ల తీగలని బలంగా గుంజుతారు. ఇలా ఎన్నో చేస్తుంటారు. ఇవన్నీ కూడా హింసతో కూడిన పనులే.
మీరు ఒక సారి మీ తోటలో నడుస్తూ పూలని, ఆకులని దగ్గరగా ప్రేమతో, వినయంగా చూడండి. వాటి అందాల అనుభూతిని మీ మనస్సు నిండా పరచుకోండి. వాటిని ప్రేమతో అనురాగంతో చూడండి. ఆ పూల ద్వారా ఈ అనంత చైతన్య ఉనికితో సంబంధాన్ని నిలపండి. అప్పుడే పుట్టిన పసి బిడ్డలా లాలించండి. మీ అంతరంగంలో పొంగిపొర్లుతున్న భావాన్ని అనుభవించండి.
ఇప్పుడు మీరు అక్కడ నడిచేటప్పుడు మీకు తెలియకుండా ఎన్నిసార్లు ఆ చెట్టు ఆకులూ, పూలు తెంపేవారో గుర్తు తెచ్చుకోండి. ఈ రెండు భావాలలో ఉన్న తేడాలను మీరు గమనించారా? ఆ రెండు దృక్పథంలోని తేడాని అర్థం చేసుకున్నారా? ఇప్పుడు చెప్పండి. మీరు మీ చుట్టు ప్రక్కల ఉన్న ప్రతి దానితో ప్రతి విషయంతో స్నేహంగా ఉంటున్నారా?
ప్రతి దానిని వాస్తవ దృష్టితో చూడండి. ఇప్పుడు మీరు మీ అచేతన స్థితి నుంచి మీపనులు చేస్తున్నారు. అందుకే మీరు హింసాత్మకంగా ఉన్నారు. కానీ మీరు అలా ఉన్నారు అని మీకు తెలియదు. మీరు వాటి వైపు వాస్తవంతో, తెలుసుకునే తత్వంతో చూస్తే, వాటిలో ఉండే అద్భుతమైన అందాలు కనిపించుతాయి. వాటిని ప్రేమతో స్పృసించటం చేయండి.
సరే ఇప్పుడు మరొక విషయం. మీరు మీ శరీరాన్ని ఎంత తిట్టుకుంటారు. మీరు అతిగా తిని మీలోపల చక్కగా పని చేస్తున్న జీర్ణవ్యవస్తని పాడుచేస్తారు. రాత్రి పూట చాలా సేపు మేలుకుని ఉండి, నాకు విశ్రాంతి కావాలి అని గోలపెట్టే శరీరాన్ని హింసించుతారు. మీరు తాగుతారు, సిగరెట్టు కాలుస్తారు. అది మీ శరీర ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసి ఆపనులు చేస్తారు. ఇవన్నీ మీరు మీ శరీరం పట్ల చుపించే స్నేహమేనా? కొంత మంది తమ శరీరాన్ని ద్వేషించుతారు. అందుకే దానిని నిర్లక్ష్యంచేస్తారు.
కాబట్టి బయట జరిగే హింస గురించి మాట్లాడటం మానేయండి. మీలోని హింసని తగ్గించటానికి ప్రయత్నించండి. అప్పుడు బయట ప్రపంచంలోని హింస అప్రయత్నంగా తగ్గిపోతుంది. మనం ఎప్పుడూ ఎదుటివారిలోని లోపాలను చూపించటానికి సిద్ధంగా ఉంటాము. మనలో ఉండే ఎన్నో లోపాల మాట ఏమిటి?
ఒక సారి ఒక వ్యక్తి నాదగ్గరి వచ్చి తన కుటుంబ విషయాలు గురించి చెప్పాడు. అతను తన భార్య లాయర్ అని చెప్పాడు. అప్పుడు నేను "అహో! కోర్టులో వాదిస్తుందా? అని అన్నాను". దానికి అతను "లేదు స్వామీజీ, ఇంట్లో వాదిస్తుంది" అని జవాబు ఇచ్చాడు.
మనం నిరంతరం వేళ్ళని ఎదుటివారివైపు చూపించి వాధిస్తాము. దాని బదులు మనలోపలి కల్మషాలని తొలగించుదాము. అపుడు బయట వాధించ వలసిన అవసరం ఉండదు.
మీకు, ఎదుటివారికి మంచి జరిగే మంచితనాన్ని నింపుకోండి. ఎదుటివారి శరీరానికి, మనస్సుకి వారి అంతరాత్మకి మీ ప్రేమని పంచండి. స్నేహంతో ఉండండి. దీనినే "ప్రయోగాత్మక ఆధ్యాత్మికత" అంటారు. ఆధ్యాత్మికత అంటే పూజ గదిలో ప్రతి రోజు గంట మోగించటం కాదు. లక్ష్మీదేవికి అష్ట ఐస్వర్యాల కోసం పూజ చేయటం కాదు. ఆదేవి యొక్క సౌమ్యతని, శుభ గుణాలని నేర్చుకోవటం. అప్పుడు అష్ట ఐస్వర్యాలు వాటంతట అవే వస్తాయి.
మనం అనుకుంటాము ఏవో పుణ్యక్రతువులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అని. అలా జరగదు. ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి: మీరు మనస్సు లగ్నం చేయకుండా, మీలో మార్పురావాలి అని కోరుకోకుండా "రామరామ" అని వెయ్యి సార్లు జపించితే ఏమీ ఉపయోగం ఉండదు. దాని కంటే 'కోకో కోలా' అని రోజుకు వెయ్యి సార్లు జపించితే మంచిది. అసలు ఈ పూజలు వ్రతాల ఉద్దేశం ఏమిటి అంటే అందులో ఉండే మంచి లక్షణాలని గ్రహించి వాటిని అలవరచుకొని, వాటి సహాయంతో మీలో మార్పు తీసుకురావాలి. అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మీరు కోరుకున్నవి మీకు అప్రయత్నంగానే లభిస్తాయి.
మీరు ఒక్క సారి ఎదుటి వారితో స్నేహపూర్వకంగా ఉండగలిగితే, అప్పుడు మీరు ఓపికగా, పట్టుదలగా మీలోని భావావేశాలలో మార్పుని తేగలుగుతారు. అప్పుడు మీరు ఉన్నత భావావేశమైన ప్రేమని దాని అనుభూతులని అనుభవించగలుగుతారు. అప్పుడు మీరు ధ్యానం బాగా చేసినట్టవుతుంది.
మీలో ప్రేమ ఎప్పుడైతే ఒక ముఖ్య భాగమవుతుందో, సెక్స్ అనేది ఇద్దరి అంతరంగాలలో ఒక లోతైన సంయోగం అవుతుంది. కానీ సమస్య ఏమిటంటే నిజమైన ప్రేమ ఎక్కడో కప్పబడిపోయింది. కోరిక పైకి వచ్చింది. దానితో అంతరంగంలోని అంతరాత్మలు ఎపుడూ చేరువకాలేదు. కేవలం శరీరాలు మాత్రమే చేరువయ్యాయి. వారి మధ్య సంబంధాలన్నీ కపటాలుగా పైపైనే ఉంటున్నాయి. ఏదైతే పైపైనే ఉంటుందో దానిని కదిలించటం చాలా సులభం. అలా కదిలించ లేకుండా ఉండాలి అంటే అవి చాలా లోతైన మూలాలతో ఉండాలి. ఇది చాలా చిన్న తర్కం.
అలాగే కోరిక నిరంతరం మిమ్మలని అంధులని చేస్తుంది. అది మీకు తెలియని మత్తులోనికి మిమ్మలని తీసుకు వెళుతుంది. ప్రేమ కూడా మిమ్మలని మత్తులోనికి తీసుకువెళుతుంది. కానీ ఈ మత్తు మిమ్మలని లోతైన వాస్తవంలోనికి తీసుకువెళుతుంది. అది చాలా అందమైన స్థితి. కోరిక, ప్రేమ అనేవి ఒకే వర్గమాల లోని రెండు చివరలు. ఏదైతే మిమ్మలని వాస్తవాల లోతులలోనికి తీసుకువెళ్ళగలుగుతుందో అదే ధ్యానం. ఏదైతే మిమ్మలని అచేతన స్థితిలోనికి తీసుకువెళుతుందో అది ఏమాత్రం ఉపయోగం లేనిది. ఇదే మీరు అనుభవించే ఏవిషయమైనా మీకు మంచి చేస్తుందా లేదా అనే విషయాన్ని తెలిపే స్కేలు.
మరొక విషయం మీరు లోతుగా ప్రేమించితే, అప్పుడు అసూయ అనేది అసలు ఉండదు. ఎప్పుడైతే వేర్లు పటిష్టంగా ఉండవో, అవి పైకి లేచి పోతాయేమో అనే భయంతో మీరు అసూయచెందుతారు. అదే వేర్లు లోతుగా నాటబడితే మీకు భయం ఉండదు. అసలు మీరు ఎందుకు అసూయపడతారు. నేను ఏమి చెప్పటానికి ప్రయత్నించుతున్నానో మీకు అర్థమవుతున్నదా? మీ భాగస్వామి మీద నమ్మకం ఎప్పుడు చెదిరిపోతుందంటే మీ మధ్య సంబంధం పైపైనే ఉన్నప్పుడు. అలాగే మీ మధ్య ఉన్న సంబంధం కల్పనలు, ఊహలు, కోరికల మీద ఆధారపడి ఉంటుందో అప్పుడు మీకు నమ్మకం ఉండదు.
ప్రేమ అనేది కేవలం ఒక వ్యక్తి పట్ల మాత్రమే ఉంటే అది నిజమైన ప్రేమ కాదు. జీవితమే ప్రేమ. అంతరంగంలోని ఉనికి ప్రేమని ఈ అనంతచైతన్య సృష్టి వైపు ప్రవహింప చేస్తుంది. అలా కాకుండా మీ ఉనికి మేధస్సు నుంచి వెల్లడి అయితే అది కరుణగా ప్రవహిస్తుంది. అది మీ శరీరం నుంచి ప్రవహించితే అది పరమానందమవుతుంది.
మీరు ఈ స్థితికి చేరుకున్నప్పుడు మీ ఆనందం కోసం బయట ఎవరిమీదా ఆధారపడనవసరంలేదు మీ అంతరంగంలో ఆనందం నిరంతరం వెల్లివిరుస్తూ ఉంటుంది. దానిని ఇతరులతో పంచుతూ దానిని మీరు మరింత ఎక్కువగా చేసుకోగలుగుతారు.
మీరు ఎవరైన ఒక వ్యక్తితో చాలా లోతైన సంబంధాన్ని కలిగి ఉంటే మీరు ఆ వ్యక్తి సమక్షంలోనే ఉండాలి అని అనుకోరు. మీరు కేవలం ఆ సంబంధం తాలూకా అనుభూతితోనే ఎంతో తృప్తిగా, ఆనందంగా ఉంటారు. మీలో మీరు పరిపూర్ణులుగా ఉండగలుగుతారు. ఆ పరిపూర్ణ సిద్ధి కోసం మీరు మరెక్కడా బయట ప్రపంచంలో వెతకరు. ఇటువంటి సంబంధంలో మీరు దూరమైనా అది మిమ్మలని బాధించదు. ఒక వ్యక్తితో సంబంధం అంటే అది లోతైన, అన్ని విషయాలకి అతీతమైన బంధం యొక్క అనుభూతి. మీకు ఈ విషయం అర్ధం కాకపోతే, మీరు ఎదుటివారితో కొన్ని షరతులతోనూ, నిర్బంధాలతో కూడిన బంధాన్ని ఏర్పరచుకుని, దానినే సంబంధం అనుకుంటారు.
అటువంటి బంధం తేలికగా కదలిపోతుంది. దానితో మీరు ఆ బంధాన్ని నిలపటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. అటువంటి సంబంధాలు మిమ్ములని బాధపెట్టే హింస అని మీరు ముగింపులు చెబుతారు.
కొంతమంది నన్ను అడుగుతుంటారు. "స్వామీజీ, నేను మీ ఆశ్రమానికి వచ్చి ఉంటాను. నాకు, ఇంటి లో ఆనందం, శాంతి లేవు" అని.
నేను వాళ్ళకి ఎపుడూ ఒకటే చెబుతాను. మీరు నలుగురు మనుషులతో మీ ఇంట్లో ఆనందంగా ఉండలేనప్పుడు. ఇక్కడ 100 మందితో ఎలా ఉండగలరు అని. ఆశ్రమం అంటే తప్పించుకునే వారందరికి వసతి నిచ్చే వసతి గృహం (lodge) కాదు.
స్పష్టంగా అర్థం చేసుకోండి ఇల్లు అనేది ఎక్కడా మీ బయట లేదు. మీరు నిరంతరం పరమానందంలో ఉండగలిగితే అపుడు మీ చుట్టు ప్రక్కల ఏమీ జరిగినా, ఏమి ఉన్నా లేకపోయినా, మీరు ఆనందంలో ఉండగలిగితే మీరు మీ ఇంట్లో ఉన్నట్టే. మీరు ఈ విధంగా ఉండలేకపోతే, మీరు ఎక్కడ ఉన్నా ఇంట్లో లేనట్లే.
నేను కొన్ని నెలలపాటు 8X8 అంత చిన్న గదిలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఈ రోజు ఈ సింహాసనం మీద కూర్చొని అదే ఆనందంలో ఉన్నాను. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ శక్తి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవటంలో ఉన్నది. అది మీలో మీరు పొందే ఆనందానికి బయట ప్రపంచంలోని ఏ వస్తువు, ఏ విషయం కారణం కాదు అది తెలుసుకోవటంలో ఉన్నది. అవి ఆ ఆనందాన్ని మీరు పొందటానికి ఏ విధంగా కూడా ఉపయోగపడవు.
ఒక కుక్క ఎముకని కొరుకుతూ ఉంటుంది. దానికి గాయం అయ్యి రక్తం కారుతుంది. అది దానిని ఆ ఎముకనుంచి వస్తుందని అనుకుని ఆ ఎముకని ఇంకా అలానే కొరుకుతుంది. చివరికి ఆ కుక్కకి ఏమవుతుంది? కేవలం గాయం అయ్యి నొప్పి మిగులుతుంది. మీరు చేసేది ఈ పనే. సంతోషం, బాధ అనేది ఎక్కడో బయట ప్రపంచానికి సంబంధించిన విషయాలని మీరు అనుకుంటారు. తిరిగి తిరిగి మీరు ఆ పనిలోనే నిమగ్నమయిపోతారు. అదే చివరికి అన్ని సమస్యలకి కారణం అవుతుంది. అర్థమయినదా?
ప్రశ్న: స్వామీజీ మా పిల్లలని ఇటువంటి అలవాట్ల నుంచి , సమస్యల నుంచి ఎలా కాపాడాలి?
నిజం చెప్పాలంటే మీరు వాళ్ళని పూర్తిగా నియంత్రించలేరు మీరు మీ పిల్లలకి సమాజంతో ఉన్న అన్ని సంబంధాలని నియంత్రించలేరు. కాకపోతే మీరు ఇళ్ళలోనే కొన్ని పద్ధతులని పాటించవచ్చు.
ఇంతకు ముందు మీకు నేను చెప్పినట్లు, వాళ్ళలోని సగ భాగాన్ని అణిచివేయకండి. వాళ్ళని స్వేచ్ఛగా వెల్లడి చేయనీయండి. ఆ అనుభూతులని స్వేచ్ఛగా అనుభవించనీయండి. వాళ్ళకి అసలు లింగ వివక్షం, స్త్రీ పురుష బేధాలు కలిగించకండి.
వాళ్ళని వాళ్ళ సహజ పద్ధతిలో ఉండనీయండి. వాళ్ళ గురించి వాళ్ళు బాగా తెలుసుకునే విధంగా వారికి సరిపడా అవకాశాన్ని కలిగించండి. సమాజపు నిబంధనలు వారిని అంటుకోనంత వరకూ వారు తమలోపల తమ పరిధిలో సౌఖ్యంగా ఉంటారు.
మీరు చిన్న పిల్లలని గమనించి వుంటారు. వాళ్ళు వాళ్ళ శరీరంలోని అంగాలతో ఆనందంగా ఆడుకుంటారు. కాలి బొటన వేళ్ళు నోట్లో పెట్టుకుంటారు. అలా ఎన్నో రకాలుగా ఆడుకుంటుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ అంతరంగంలో ఎంతో సౌకర్యంగా సంతోషంగా ఉన్నారు అని తెలియచేస్తుంది. వారి అంతరంగం ప్రేమతో నిండి ఉంటుంది. వారిలో వారు శోధనలు చేస్తూ ఆనందించుతారు. కానీ మనం వాళ్ళని ఈ పనులు చేయనీయం. వాళ్ళు అలా చేయగానే మనం వాళ్ళని మందలించుతాము. అది తప్పు అని చెబుతాము. కానీ వాళ్లని అలా ఆడుకుంటూ వారి గురించి వారిని తెలుసుకోనీయటం మంచిది.
ఇక వాళ్ళ బట్టల విషయానికి వస్తే, ఎప్పుడూ పైనుంచి కింద వరకూ ఒకే విధంగా అంటే ఒక్కటే ఉండేట్టుగా వేయండి. రెండు ముక్కలుగా ఉన్న బట్టలు వేయకండి ఎందుకంటే, అవి శరీరాన్ని రెండు భాగాలుగా చేసినట్టు ఉంటాయి. కొంత కాలం గడిచేటప్పటికి వాళ్ళు క్రింది భాగాన్ని మర్చిపోతారు. అలా చేయటం మనిషి యొక్క చేతన స్థితిని రెండు విధాలుగా విభజించటమే. ఇప్పుడు మిమ్ములని మీరు చూసుకోండి అనగానే మీకు కేవలం పై భాగమే కనిపిస్తుంది. ప్రతి సారి మనకు మన మనస్సులో పై భాగమే మెదులుతుంది. మీరు మీ కింద భాగాన్ని నిర్లక్ష్యం చేస్తారు.
పిల్లలని వారికి నచ్చిన విధంగా స్వేచ్ఛగా ఉండనీయండి. అలా చేయటం వలన మీరు కొంత శ్రమపడాలి మీరు సాహసం చేసి అయినా వారికి స్వేచ్ఛనీయండి. పిల్లలకి వారిలో కొంత సహజమైన ఆత్మప్రబోధన ఉంటుంది. దానితో మీరు కొంత జాగ్రత్త తీసుకుని వారిని వారిలోనికి శోధించనీయండి.
అలాగే పిల్లలు వారిని వారు పూర్తిగా వెల్లడి చేసుకుంటారు. అలా చేసినప్పుడు వారిని అణచకండి. వాళ్ళ మైండ్ లోపలికి కృత్రిమతత్వం, కపటం అనే ప్రవర్తనలను తెచ్చుకోవటం వాళ్ళకి తెలియదు. మనం ఈ కపటాన్ని ప్రదర్శించటంలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించుకున్నాము. అందుకే మనలని మనం ఎప్పుడూ పూర్తిగా వెల్లడి చేయం.
వాళ్ళని రెండు చేతులూ స్వేచ్ఛగా ఉపయోగించేటట్టు ప్రోత్సహించండి. మనం కొన్ని పనులకి వాళ్ళ ఎడమ చేతిని ఉపయోగించితే వద్దు అని అంటాము. పిల్లలు రెండూ ఎందుకు ఉపయోగించకూడదు. అందులో తప్పు లేదు. మహా భారతంలో అర్జునుడు రెండు చేతులతో బాణం వేయగలడు అని చదివాం కదా? మీకు ఆ పవర్ తెలుసుకదా! అలాంటి విషయాలు చెప్పినపుడు మనం వినయంతో వింటాము కానీ అందులో అసలు విషయాలు అర్థం చేసుకోము. ఆ పనులు మనం కూడా చేయగలము అని అనుకోరు. మనం మనకి అవకాశాన్ని ఇచ్చుకోగలిగితే ఆ పనులన్నీ మనం కూడా చక్కగా చేయగలం.
మరొక విషయం, పిల్లలు తమ చుట్టూ గిర గిరా తిరుగుతూ ఆనందపడతారు. అలా చేయటంతో వారిలో శక్తి వారి మధ్యలో కేంద్రీకృతమవుతుంది. మీ మణిపూరక చక్రం శుభ్రంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు అలా తిరగ గలుగుతారు. చిన్న పిల్లలు చాలా అమాయకులు. వారికి సమస్యలు ఉండవు. అందుకే వాళ్ళు ఎంతో తేలికగా, సౌక్యంగా అలా తిరగగలుగుతారు. కానీ మనం వారిని అలా తిరగనీయం. అలా తిరిగితే కళ్ళు తిరుగుతాయి అని చెప్పి వాళ్ళని మానిపించుతాము. వెళ్ళి ఒక ప్రక్కన కూర్చోమని చెబుతాము. అది ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటాము. ఇలా ఎన్నో చెబుతాము. నేను మీకు చెబుతున్నాను. వాళ్లని అలా తిరగనీయండి. వాళ్లు కిందపడి దెబ్బ తగులుతుంది అని అనిపించితే కింద దుప్పటి పరచండి.
మరొక విషయం, పిల్లలలో ఎప్పుడూ భయాన్ని నింపకండి, వారిని స్వేచ్ఛగా ఉండనీయండి. ఏదైనా ఎక్కితే ఎక్కనీయండి. పడిదెబ్బలు తింటే మంచిదే. వాళ్ళని నిరంతరం నిరుత్సాహ పరిస్తే వాళ్ళకి రక రకాల భయాలు పెరుగుతాయి. చీకటంటే కొందరికి భయం, కొందరికి నీళ్ళంటే భయం. చాలా భయాలు. ఎత్తు ఎక్కటానికి భయపడే వాళ్లు కొత్తది తెలియని విషయాలలో నిర్ణయాలు చేయలేరు. ఇలా చిన్న చిన్న పద్ధతులు పాటించండి. అంతా బాగుంటుంది.
ప్రశ్న: స్వామీజీ, కచ్చితమైన భాగస్వామం ఉండదు అని మీరు చెబుతున్నారు కదా! మరి వివాహానికి ముందు జాతకాలు కలవాలి అని చూస్తారు. మరి దాని ఉద్దేశం ఏమిటి?
ఇప్పుడు నేను ఈ విషయం మాట్లాడటం మొదలుపెడితే మొత్తం జ్యోతిష శాస్త్రాన్ని, దాని నిర్మాణాన్ని, ఆ వ్యవస్థని మీ ముందుకి తేవాలి. జ్యోతిష శాస్త్రము కాదు కాని, దానిని అనుసరించే పద్ధతి చాలా తెలివితక్కువ పద్ధతి. ఉపయోగం లేనిది కూడా.
అర్థం చేసుకోండి. ఇది మీ జీవితం మీరు అందులో జీవించుతున్నారు. అందులోని లోటుపాట్లు, లోతులు మీరు తెలుసుకోవాలి. కానీ మీకు మీ జీవితం గురించి ఏమీ తెలియదు. ఎవరి దగ్గరకో వెళ్ళి వాళ్ళని వీళ్ళని అడుగుతారు. మీ తెలివితేటలు ఏమయ్యాయి.
మీ జీవితాన్ని ఎవరో ఒక కొత్త వ్యక్తి చేతిలో పెట్టి, అతనిని మీ జీవితాన్ని సంబంధించిన నిర్ణయాలు చేయమంటారు. ఇదంతా చూస్తే మీకు మీ దైన జీవితం ఎలా గడపాలో తెలియదు అనిపిస్తుంది. స్పష్టంగా తెలుసుకోండి. మీ జీవితానికి బాధ్యత మీరే తీసుకోవాలి. నా దగ్గరకి ఎవరైనా వచ్చి వాళ్ళ భవిష్యత్ గురించి ఏవైనా ప్రశ్నలు అడిగితే నేను వాళ్ళతో ఇలా చెబుతాను మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి నా దగ్గరకు రావద్దు. మీ భవిష్యత్‌ని గొప్పగా, చక్కగా తీర్చిదిద్దుకోవాలని అనుకుంటే నేను తప్పకుండా సహాయం చేస్తాను.
ఈ భవిష్యత్‌లో జరగబోయే వాటిని తెలుసుకొనే వాళ్ళంతా మానిసికంగా బలహీనులు. ఈ విషయం స్పష్టంగా తెలుసుకోండి.
పూర్వం పిల్లలని గురుకులానికి పంపించినప్పుడు, గురువు ఈ జ్యోతిష శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని, ఆ పిల్లల వ్యక్తిత్వాన్ని, వాళ్ళ దృక్పథాన్ని అర్ధం చేసుకునే వాళ్ళు. ఇది వాళ్ళకి ఉండే సహజమైన అర్హతలని, నైపుణ్యాలని కూడా తెలియచేస్తుంది. దాని ప్రకారం ఆ పిల్లలకి విద్యని భోదించేవారు.
అదే విధంగా పూర్వ కాలంలో కులాలు అనేవి పుట్టుకతో ఉండేవి కాదు. అవి వ్యక్తి యొక్క సహజ లక్షణాలు, వాళ్ళకి సహజంగా ఉండే కొన్ని నైపుణ్యాలు, శక్తి వీటి ఆధారంగా వాళ్ళకి వృత్తులు నిర్ణయించేవారు.
ఎప్పుడైతే ఒక అబ్బాయిని గురుకులంలో చేర్పించుతారో, అప్పుడు గురువు ఆ అబ్బాయి అభిప్రాయం, సహజ గుణాలను గమనించేవాడు. ఒక వేళ అతనికి బ్రాహ్మణ నైపుణ్యం, అంటే తెలివితేటలు ప్రముఖంగా ఉంటే అతనికి వేద విద్యని భోదించేవారు. వాళ్ళకి వేదాలు, పురాణాలు భోధించేవారు. ఒక వేళ అతని శరీరదారుడ్యం, వ్యక్తిత్వం క్షత్రియంగా ఉన్నట్లైతే అతనికి క్షేత్ర విద్యలు నేర్పేవారు.
వాటికి ధైర్యం, బలం కావాలి. అప్పుడు అతనికి యుద్ధవిద్యలు నేర్పేవారు. ఆ అబ్బాయి వైశ్య నైపుణ్యమైన వ్యాపార వ్యవహారాలలో నైపుణ్యాన్ని చూపించితే అతనికి దాని సంబంధించిన విద్య నేర్పించేవారు. అలా కాకుండా శూద్ర నైపుణ్యమైన సేవలకి సంబంధించిన నైపుణ్యం కలిగి ఉంటే వారు ఏదో నిత్య జీవితంలో మామూలు పనులు చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడిపే లక్షణాలు ఉంటే ఇతర సేవలకి సంబంధించిన విద్య నేర్పించేవారు. ఆ రోజులలో ఈ నాలుగు రాకాల వృత్తులకి సమానమైన గౌరవం, ఆదరణా ఉండేవి.
జ్యోతిష శాస్త్రాన్ని దీని కోసం మాత్రమే ఉపయోగించేవారు. అది మనిషిలోని సహజ లక్షణాలను కనిపెట్టే శాస్త్రం. ఈ రోజు ప్రపంచంలో చూడండి. ప్రతి ఒక్కరూ తప్పు స్థితిలో ఉన్నారు. చాలా వరకూ అందరు తప్పు పాత్రలని పోషించుతున్నారు. డాక్టరు కావలసిన వ్యక్తి ఇంజనీరు అవుతున్నాడు. ఇంజనీరు కావలసిన వ్యక్తి టీచరు అవుతున్నాడు. అందుకే సమాజంలో ఇంత గందర గోళం. వ్యాపారం చేయవలసిన వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోనికి వస్తే ఏమవుతుంది? ఆధ్యాత్మికతే ఒక వ్యాపారం అయిపోతుంది.
ప్రశ్న: స్వామీజీ! జ్యోతిష శాస్త్రం నిరూపించబడిన శాస్త్రమే కదా!
నేను దీని గురించే భయపడ్డాను. నేను ఎప్పుడైతే 'అవును' అని అంటానో మీరందరూ ఈ జ్యోతిష శాస్త్రం వెనుక పరిగెడతారు. రేపు ఉదయం నా ముందు పెద్ద లైనులో జాతకాలు పట్టుకుని నిలబడతారు. అవి చూపించి "స్వామీజీ! దీనిని చూసి నాభవిష్యత్ గురించి చెప్పండి", అని అడుగుతారు. మీకు చెబుతున్నాను, దీనిని గురించి అసలు మీరు ఆలోచించవద్దు. జ్యోతిషం గురించి కలత చెందకండి.
ఈ సందర్భంలో జ్యోతిష శాస్త్రం గురించి స్వామి వివేకానంద ఒక చక్కటి తగిన సమాధానం ఇస్తారు. ఎవరో కొందరు వచ్చి ఆయనని జ్యోతిషం మీద ప్రశ్న అడుగుతారు. అప్పుడు ఆయన వారితో ఇలా అంటారు, "ఇంటికి వెళ్ళి బాగా తినండి, బాగా వ్యాయామం చేయండి చక్కగా నిద్రపోండి. అప్పుడు మీరు భౌతికంగా, మానసికంగా బలంగా తయారవుతారు. అప్పుడు మీరు ఇలాంటి విషయాల గురించి ఆందోళనపడరు."
ఎవరైతే మానసికంగా బలహీనంగా ఉంటారో వాళ్ళే జ్యోతిష శాస్త్రాన్ని అతిగా నమ్ముతారు.
ప్రశ్న: స్వామీజీ అయితే జ్యోతిష శాస్త్రాన్ని నమ్మే వారంతా మానసికంగా బలహీనులేనా?
కాదు మీరు అలా చెప్పలేరు. కానీ వారిలో చాలా మంది మానసికంగా బలహీనులు. మామూలుగా తెలివైన వారు కూడా ఈ విషయంలో కొన్ని సార్లు తెలివి తక్కువగా ప్రవర్తించుతారు కొందరు నన్ను అడుగుతుంటారు. "స్వామీజీ, నేను ఫలానా రత్నం పెట్టుకుంటే నాకు అదృష్టం కలసి వస్తుందా?" అని. మీరు రాళ్ళ మీద ఎలా ఆధారపడగలరు. మీరు చేతన స్థితిలో జీవిస్తుంటారు. మీరు భగవత్ స్వరూపులు నేను ఇది ఊహించలేక పోతున్నాను. నేను మీకు ఈ సర్వ విశ్వశక్తిని కట్టడి చేయగల శాస్త్రాన్ని నేర్పిస్తున్నాను. కానీ మీరు నన్ను రాళ్ళ గురించి అడుగుతున్నారు.
మీరు యతీశ్వరానంద స్వామీ గురించి విని ఉంటారు. ఆయన గొప్ప ఋషి, జ్ఞానోదయం పొందిన యోగి. ఆయన మొదటి సారి విదేశాలకు రాహుకాలంలో బయలు దేరారు. ఎవరో ఆయనని, "స్వామీ మీరు రాహుకాలంలో ఎలా బయలుదేరుతారు" అని అడుగుతారు.
ఆ ప్రశ్నకి ఆయన, "ఓ తెలివితక్కువ మనిషీ! నేను ఈ గ్రహాలని నడిపే శక్తిని. అవి నన్ను ఎలా నియంత్రించుతాయి" అని జవాబు చెబుతారు.
ఆయన ధైర్యం చూడండి. ఎప్పుడైతే ఏ విషయాన్నైనా చాలా లోతుగా అర్థం చేసుకోగలిగితే మీకు అటువంటి ధైర్యం వస్తుంది.
నేను మీకు నేర్పించే శాస్త్రంతో మీరు గ్రహాలని నియంత్రించగలరు. ఇంకా మీరు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని అయోమయపడతారెందుకు. అవి అసలు మీ మీద ఎలా ప్రభావం చూపించగలుగుతాయి? మీరు ధ్యానం అనే ఈ శాస్త్రాన్ని నేర్చుకోండి. అప్పుడు ఏ గ్రహం మీ వైపుకి రాదు.
ప్రశ్న: స్వామీజీ, ఇది మన సమాజ నిర్మాణంలో విలువల వ్యవస్థలో భాగమైపోయింది కదా?
స్పష్టంగా అర్థం చేసుకోండి. మనం చెప్పుకునే ఈ విలువలు అన్నీ కూడా మన చేతన స్థితికి ప్రత్యామ్నాయాలు. మీరు చేతన స్థితిలో ఉండి మీరు ఏమి చేస్తున్నారో తెలుసుకోగలిగితే, అప్పుడు విలువలు వచ్చి మీకు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని చెప్పనవసరం లేదు. అప్పుడు మీరు ఏ నిబంధనలూ పాటించనవసరం లేదు. ఆ నిబంధనలే మిమ్ములని అనుసరించుతాయి. అప్పుడు క్రమ శిక్షణ, నైతిక విలువలు, ఆధ్యాత్మిక జీవనం అన్నీ మీలోనే ఉంటాయి. అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో వికసింపగలుగుతారు.
ఎందుకో గాని, మీరు ఆధ్యాత్మిక జీవితం, చేతన స్థితి అనే మాటలు విన్నప్పుడు, అబ్బో ఇవి నాకోసం కాదు. నాకు సంబంధించినవి కావు అని అనుకుంటారు. కనీసం ఒక్క ధ్యాన పద్ధతయిన ప్రయత్నించకుండా, చేతన స్థితిలో ఉత్తమ దశకు చేరగలిగే మార్గమైనా చూడకుండా, మీరు ఇటువంటి అభిప్రాయాలని వ్యక్తం చేస్తారు. అప్పుడు ప్రత్యామ్నాయాల కోసం వెళతారు. అబద్ధపు చేతన స్థితికి చేరతారు. వీటినే నైతిక విలువలు అని మనం అంటాము.
విలువలు అనేవి ప్రారంభ దశలో మంచివి. కానీ చివర దశలో కాదు.
స్వామీ వివేకానంద చక్కగా చెబుతారు, “చర్చిలో పుట్టడం మంచిది. అక్కడ మరణించటం కాదు”.
ముందుగా మీరు, “ఆధ్యాత్మిక జీవితం అంటే కష్టం, అది వేరుగా ఉంటుంది” అనే భావనని మీలోంచి తీసివేయండి.
భగవాన్ రమణ మహర్షి ఒక పాటని ఈ విధంగా పాడేవారు, “ఆయే అతి సులభం ఆత్మావిద్యాయె. అతి సులభం” అని. దీని అర్థం ఏమిటంటే, “ఓ!ఈ ఆధ్యాత్మికత ఎంతో సులభం, ఎంతో సులభం”.
తరువాత పల్లవిలో ఆ పాట ఇలా ఉంటుంది
మీకు డబ్బు కావాలి అంటే మీరు చాలా కష్టపడాలి.
మీకు పేరు ప్రతిష్టలు కావలి అంటే మీరు చాలా కష్టపడాలి.
మీకు ఆత్మసాక్షాత్కారం (self realizaion) కావాలంటే మీరు చేయవలసినది కదలకుండా కూర్చోవటం.
మీరు బాగా సోమరితనంతో ఉంటే, అప్పుడు మీరు దైవత్వం లోనికి వెళతారు. ఈ సోమరితనం మనందరికి తెలిసిన సోమరితనం కాదు. అది భౌతికమైన సోమరితనంకాదు. ఇది మానసికమైన సోమరితనం. మీరు పూర్తిగా, సంపూర్ణంగా నిశ్శబ్దమైపోతే, ఆ నిశ్శబ్దంలోనికి పూర్తిగా వెళ్ళిపోతే, మీరు నిశ్చయంగా ఆధ్యాత్మికంగా ఉంటారు.
ఆధ్యాత్మికంగా ఉండటం అంటే కష్టమూ కాదు, సులభము కాదు. అది కేవలం మీకు ఉండే భావం. అది సులభమే అని మీరు అనుకుంటే, అది చాలా సులభం. అది కష్టం అని మీరు అనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు మీరు ఉన్న స్థితిలో ఇది కష్టమా? తేలికా? (స్వామి ప్రశ్నించుతారు.)
(ఎవరో జవాబు ఇస్తారు)
ఇది సులభమే స్వామీజీ.
మీరు సులభము అని కూడా చెప్పలేరు. మీరు ఏది అయితే అది కూడా అదే. మీరు ఇప్పటికే అది అయిపోయారు. ఇక తేలిక అనేది రాదు.
ఒక్కసారి చూడండి. మీ లోపలికి మళ్ళండి. మీ అధ్యాత్మికత మీద కొంచం విశ్వాసం, ధ్యానం మీద కొంత విశ్వాసం ఉంచండి. అది చాలు. ఎప్పుడుయితే ఆధ్యాత్మికత కష్టం అనే భావనని భయాన్ని మీరు వదిలివేస్తారో, అప్పుడు మీకు “అవును నేను ఆధ్యాత్మికంగా ఉండగలను. నేను చేతన స్థితిలో ఉండగలను” అనే నమ్మకం మీ మీద మీకు కలుగుతుంది. అప్పుడు మీకు విలువలను వదలటం సభబేనా అనే సంశయం రాదు.
ఇప్పుడు మీరు మీ విలువలని వదిలివేయటానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆధారంగా పట్టుకుని నిలబడటానికి మీకు ఏమీలేవు. ఒక్కసారి విలువలని వదిలేస్తే, ఇంత వరకూ మనలో అణచివేయబడిన కోరికలు విజృంభిస్తాయి. అని మనకి తెలుసు. పండోరా బాక్స్ (Pandora Box) తెరవబడుతుంది. అది గనక తెరవబడితే అంతా కల్లోలమయిపోతుంది. మనం సుప్త చేతన స్థితికి (sub conscious) భయపడతాము. అప్పుడే మనకి ఈ ప్రశ్న వస్తుంది.
మీరు నింతరం ధ్యానాన్ని సాధన చేస్తే సుప్త చేతనావస్థ నిర్మలమవుతుంది. అప్పుడు మీరు Pandora Box తెరచినా అందులోంచి విజృంభించటానికి ఏమీ ఉండవు. అందులో మీ ముఖం చక్కగా కనిపిస్తుంది. మీరు స్పష్టంగా ఉన్న అద్దాన్ని చూడగలుతారు. నేనేం చెబుతున్నానో అర్ధమవుతుందా?
ఇప్పుడు మనం దుఃఖ హరణ అనే ధ్యాన పద్ధతిని నేర్చుకుందాము. ఆ ధ్యానం మన మూలాధార చక్రంపై పని చేస్తుంది. అందులోని శక్తిని మేలుకొలుపుతుంది.
దుఃఖ హరణ ధ్యానం
(మొత్తం సమయం 30 నిముషాలు)
ఈ ధ్యాన పద్ధతిని దుఃఖ హరణ అని అంటారు. దీనిని కులార్ణవ తంత్రం నుంచి తీసుకున్నాము. ఇది మీలో అణిచివేయబడిన భావావేశాలన్నింటినీ బయటకి తెస్తుంది. చాలా మంది యోగులు, గురువులు ఈ ధ్యాన పద్ధతిని ఇంతకు ముందు ఉపయోగించారు. ఈ ధ్యానం చేయటానికి మొత్తం 30 నిముషాల సమయం పడుతుంది.
శ్వాస విశ్వానికి సేతువు. మీరు, మీ మైండ్ ఈ శ్వాస వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తున్నారు. మీ ఆలోచనలు శాంతంగా నిశ్చలంగా ఉన్నప్పుడు మీ శ్వాస కూడా శాంతంగా ఉంటుంది. మీ ఆలోచనలు దౌర్జన్య పూర్వకంగా ఉంటే, మీ శ్వాస కూడా దౌర్జన్య పూరితంగానే ఉంటుంది. మీరు మీ మైండుని నియంత్రించాలి అంటే ముందుగా మీశ్వాసని నియంత్రించాలి.
అణచి వేయబడి ఉన్న ప్రస్తుత పరిస్థితిలో, మనలో సగ భాగం జీవంతోను మరొక భాగం జీవం లేకుండా ఉన్నాయి. ఈ ధ్యాన పద్ధతి మొదటి భాగంలో బాగా లోతుగా శ్వాస తీసుకోవాలి. అప్పుడు ఆ శ్వాస మనలో అణచబడిన సగ భాగాన్ని బాగా చిలికినట్టుగా చేసి తిరిగి తెరుస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ లోపలికి తీసుకోవటంతో మీ మానసిక వ్యవస్థ మొత్తం జీవంతో ఉత్సాహంగా అవుతుంది. ఇది ముఖ్యమైన ప్రాణాధార శక్తి అవుతుంది. మీ శరీరంలోని ప్రతి కణం ఎక్కువ శక్తిని పొందుతాయి. దానితో అవి జీవ సంబంధమైన శక్తిని సృష్టించుతాయి. ఈ శక్తి మనలోని అణచబడిన భావావేశాలని కరిగించివేస్తుంది. ఇది మూలాధార చక్రాన్ని బాగా వికసింప చేసి చురుకుగా చేస్తుంది.
ఈ ధ్యానాన్ని మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేయటం మంచిది. ఈ ధ్యానాన్ని మీరు 21 రోజులు చేస్తే మీలో చాలా మార్పువస్తుంది. అది మీ అంతరంగంలోని మీ ఉనికి మీ అంతరాత్మ దశలో మార్పు తెస్తుంది. దానితో మీలో ఒక విధమైన తేజస్సు వస్తుంది. ఇది ఒక విధమైన మానసిక స్నానం లాంటిది. మీరు మీ అంతరంగంలో నిశ్శబ్దాన్ని చూడగలుగుతారు. మీరు ఎప్పుడైతే మీలో దుఃఖాన్ని నాశనం చేస్తారో, అప్పుడు మీలో పరమానందం వికసించుతుంది. ఆ వికాసం నుంచి మధుర పరిమళాలు దశదిశలూ వ్యాపించుతాయి, శాంతంగా ఉంటుంది.
నిలబడి కళ్ళు మూసుకోండి మీ లోపలి నుంచి లోతుగా, లయ బద్ధంగా శ్వాశతీసుకోండి. శ్వాశ ఎప్పుడు ముక్కు ద్వారా తీసుకోండి. ఆ సమయంలో మీరు నోరు మూసి ఉంచాలి. మీ చేతులని కిందకి పైకి కదపండి. మోకాళ్ళు వంచి కిందకి కుంగినట్టు వంచి మరలా పైకి లేవండి. ఇది ఎలా అంటే పక్షి ఎగురుతున్నట్టుగా చేయాలి. మీరు కిందకి పైకి మోకాళ్ళని వంచి వంగుతూ దానితో పాటు చేతులు కూడా కదపాలి. అవి మీ శ్వాసకి అనుగుణంగా కదలాలి.
మీరు శ్వాస తీసుకోవటం, వదలటం, మెల్లగా మృధువుగా ఉండాలి. మీరు పైకి లేచినప్పుడు గాలి పీల్చండి. క్రిందకి కుంగేటప్పుడు గాలి వదలండి. మీకు గుండె సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎంత వరకూ చేయగలరో అంత వరకే చేయండి. దీనిని 10 నిముషాలు చేయండి.
తరువాత 10 నిముషాలు కళ్ళు మూసుకుని మీ శరీరంలో ప్రతి భాగాన్ని బిగువుగా చేసి, ఆ తరువాత వదులు చేయండి. ఒక అవయవం తరువాత ఒకటి అలా చేయండి. ముందుగా మీపాదాలతో మొదలు పెట్టండి. తరువాత కాళ్ళు, తొడలు, పిరుదులు, కడుపు భాగం, చాతీ భాగం, వీపు క్రింద భాగం, వీపు పై భాగం, చేతుల వేళ్ళు, చేతులు, భుజాలు, మెడ, ముఖం, చివరలో తల ఇలా మొత్తం శరీరాన్నంతా వదులుగా చేసి విరామంగా ఉంచండి. ఇది సమక్ష వ్యవస్థ (iso-metric) ఎక్సర్సైజులాంటిది.
పది నిముషాలు అలా చేసాకా, మీ అంతరంగంలో ఖాళీ ఏర్పడుతుంది. మీరు శాంతంగా చల్లగా, కూర్చినట్టు అవుతారు.
తరువాత పది నిముషాలు కళ్ళు మూసుకుని కూర్చుని 'హూ' అనే శబ్దాన్ని చేయండి కేవలం 'హూ' అనే మాట. దీనిని లోతుగా, గట్టిగా అనఅవసరం లేదు. విరామంగా అంటే చాలు. అలా అనేటప్పుడు మీలోపల ఏమీ జరుగుతుందో గమనించండి.
ఈ ధ్యానంలో మొదటి రెండు భాగాలు, అసలైన మూడవ భాగానికి సిద్ధమవటం. మీరు మూడవ దశకి వచ్చే సరికి మీ మైండ్ ఎటువంటి ప్రయత్నం లేకుండా నిశ్శబ్దంగా అయిపోతుంది. అది మీ మీద బలవంతంగా తెచ్చిన నిశ్శబ్దం కాదు. దాని అంతట అదే ఏర్పడిన నిశ్శబ్దం.
మీరు ఇదే విధంగా విరామంగా, నవ్వు ముఖంతో ఆనందంగా ఉన్న స్థితిలోనే ఉండండి. ఈ సమయంలో మీకు చాల అనుభవాలు జరగవచ్చు. వాటిని టి.వి. లో ప్రోగ్రాం చూస్తున్నట్టుగా చూడండి. మీ మైండ్‌లో ఆలోచన తరువాత ఆలోచనని గమనించండి. ఈ ధ్యానం చేస్తే అది మరిన్ని కల్పనలని, ఊహలని సృష్టిస్తుంది.
(అందరూ ధ్యాన పద్ధతిని సంగీతంతో సాధన చేస్తారు)
స్వామి చివరలో ఇలా చెబుతారు.
ఓం శాంతి శాంతి శాంతిః
నెమ్మదిగా చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ శక్తిని, ఈ నిశ్శబ్దాన్ని మీతోనే ఉండనీయండి. తరువాత సెషన్లో కలుద్దాము.
ధన్యవాదములు.
