అధ్యాయం - 4: బాధారహిత జీవితము
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(Living without Worries)
ఇప్పుడు మనం తరువాత చక్రాన్ని చూద్దాం. అది మణి పూరక చక్రం. ఇది నాభిస్థానంలో ఉంటుంది.
సంస్కృతంలో మణిపూరక అంటే మణుల పట్టణం అని అర్థం.
మీరు నిరంతరం బాధ పడుతుంటే ఈ చక్రం బంధించబడుతుంది. మీరు బాధల గురించి బాధ పడటం మానేస్తే ఈ చక్రం వికసిస్తుంది.
ధ్యానపద్దతి : మణిపూరక శుద్ధిక్రియ - ఇది క్రైస్తవుల ధ్యాన పద్దతి.
ముందుగా ఈ బాధ లేదా దుఃఖం అంటే ఏమిటో చూద్దాము.
మీలో ఎవరైనా బాధ అంటే ఏమిటో చెప్పగలరా ?
(ఒకామె జవాబు ఇస్తుంది)
"స్వామిజీ ! మాకు మా వ్యాపారం గురించి, పిల్లలు ఆరోగ్య సమస్యల గూర్చిగాని..."
మీరు చెప్పేవి బాధలకి ఉండే కారణాలు. నేను బాధలకి కారణం అడగలేదు మిమ్మలని బాధలు అంటే ఏమిటి ? అని అడిగాడు. నేను మిమ్మలని బాధలకి కారణాలు అడిగితే ఈ క్లాసు పూర్తి అవ్వదు. మీరందరూ పెద్దపెద్ద జాబితాలు తయారు చేస్తారు. అది ఈ విధంగా
స్వామిజీ ! నా వ్యాపారం దెబ్బతిన్నది !
స్వామిజీ ! నాకు ప్రశాంతత లేదు.
స్వామీజీ ! నా కష్టాలు మీరు ఊహించలేరు.
స్వామీజీ ! నాకు పిల్లలు లేరు. అదే బాధ.
స్వామీజీ ! నాకు పిల్లలే అసలు బాధ.
(పెద్దపెట్టున అంతా నవ్వుతారు)
మనం చాలా చాలా చాలా బాధలతోనే ఉంటాము. ఒకవేళ బాధ పడటానికి బాధలు లేకపోతే, అది మరీ బాధాకరం. అలా బాధలు లేకపోతే మనం అభద్రతా భావంతో విలవిలలాడతాము. అప్పుడు మనం దేని గురించి బాధపడాలా అని ఆలోచిస్తాం. ఇది నిజం.
కొంత మంది పెద్దవాళ్ళు నా దగ్గరకి వచ్చినపుడు ఇలా చెబుతుంటారు ; "స్వామీజీ! మాకేం చేయాలో తెలియటం లేదు. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఎవరి జీవితాలలో వాళ్ళు స్థిరపడ్డారు. వాళ్ళు మమ్మలని ఏమీ అడగరు. మాకేం చేయాలో తెలియటం లేదు. అసలు ఆలోచించటానికి కూడా ఏమీ లేదు. అసలు మేము దేనికి బ్రతకాలి అనిపిస్తుంది. మాకు ప్రశాంతంగా మరణించాలనిపిస్తుంది".
వాళ్ళకి ఏంచేయాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి బాధలు లేవు. వాళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ ఏదో ఒక ఆలోచనతో వాళ్ళ మైండ్‌ని నింపుదామని ప్రయత్నిస్తారు. కాని వారికి ఏ ఆలోచనా రాదు. ఈ పరిస్థితులు వారికి కొత్త. ఎందుకంటే వారి మైండ్ జీవితమంతా ఏదో ఒక బాధతో గాని ఆలోచనతో గాని నిండి ఉండేది.
బాధ అంటే ఏమిటో నిర్వచించే ముందు, మీకు ఒక విషయం చెబుతాను. మనం ఏ సంస్కృతి సంప్రదాయాలకు చెందిన వాళ్ళమయినా, ఎటువంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నా, ఏ వయస్సువారమయినా, అందరికీ సామాన్యంగా ఉండే ఒక విషయం, బాధ.
నేను మిమ్మలని మీరు ఎందుకు బాధపడతారు అని అడిగితే మీరు నాకు కారణాలతో ఒక పెద్ద జాబితాని ఇస్తారు. మీ బాధలకి కారణం బయట ప్రపంచానికి సంబంధించిన విషయాలని మీరు అనుకుంటారు. అందుకు మీరు బయట
ప్రపంచాన్ని తప్పుపడతారు. మీ చుట్టూ ఉండే మనుషులే మీ బాధలకి కారణం అని వాళ్ళని నిందిస్తారు.
మీరు కొంచెం ఆలోచించండి. బాధలకి పూర్తిగా బయట ప్రపంచంలోని విషయాలు, మన చుట్టూ ఉన్న మనుషులే కారణం అయితే, కనీసం ఒక్క వ్యక్తి అయినా ఈ కారణాలని ఛేదించి బాధలనుండి విముక్తి కారా ? అవును. కాని అదా అసలు విషయం ?
మీరు ఎవరిని కలిసినా వాళ్ళకి ఏదో ఒక సమస్య లేదా బాధ ఉంటుంది. వాళ్ళు ధనవంతులయినా, పేదవాళ్ళయినా, వివాహం అయినా, కాకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, సొంత వ్యాపారమయినా అందరికీ ఏవో కొన్ని బాధలు ఉంటాయి.
ఇలా ఎందుకు ఉంటుంది అంటే, మన బాధలకి బయట ప్రపంచంలోని విషయాలే కారణం అనుకుంటాం. కాని అసలు కారణం మన అంతరంగపు లోతులలో ఉండే కారణాలే మనకు బాధలు కలిగిస్తాయి. ఇది నిజం, అందుకే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ లేదా సమస్య అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.
ఇప్పుడు అసలు బాధ అంటే ఏమిటో చూద్దాము.
మీరు మీ అంతరంగపు లోతుల్లోనికి వెళితే, బాధ అనేది ఏదైనా ఒక సంఘటనకి మీ నుంచి వచ్చే స్పందన అని తెలుస్తుంది. ఒక సంఘటన మిమ్మలని బాధించిందా లేదా అనేది మీరు ఆ సంఘటన లేదా విషయానికి ఎలా స్పందించాలని నిర్ణయించుకుంటారో ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ బాధ అనేది నిరంతరం మీ లోపల మీకు వినిపించే అనవసరపు మాటల వలన మీకు కలిగే అసౌకర్యం మాత్రమే.
ఉదాహరణకి మీ స్నేహితునికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. అతను మీ దగ్గరకి వచ్చి, ఆ ఉద్యోగం సంగతి, దానికి ఉండే జీతం, అలవెన్సులు, ఇతర సౌకర్యాల గురించి సంతోషంగా చెప్పాడనుకోండి. మీరు ఎలా స్పందించుతారు ? మీకు
తెలియకుండానే మీ అంతరంగంలో ఏవో సంభాషణలు జరుగుతాయి. మీ ఆధీనంలో లేని మాటలు పదే పదే వినిపిస్తుంటాయి.
మీరు ఈ విధంగా ఆలోచించటం మొదలు పెడతారు. అతనికి కొత్త ఉద్యోగం వచ్చింది. అతనికి చాలా జీతం, అలవెన్సులు, సౌకర్యాలు ఇస్తున్నారు. కాని నా పరిస్థితి ఏమిటి? ఈ జీతం అలవెన్సుల సంగతి నా భార్యకి తెలిస్తే ఏమనుకుంటుంది? ఇతను నాభార్యను కలువకూడదు. ఇవన్నీ నా భార్యకి తెలిస్తే నాకు సమస్య. నేను కూడా ఏదైనా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలా ? ఒకవేళ కొత్త ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏమిటి ? కాని నావిషయంలో ఎప్పుడూ ఏదీ కలసి రాదు. అది అంతే...
దీనినే బాధ లేదా వ్యథ అంటారు.
మీరు నిరంతరం మిమ్ములని మీ బయట ప్రపంచంతో పోల్చుకోవటమే బాధ. దానిని గురించి నిరంతరం మీ లోపల మీరే మాట్లాడుకునే మాటలే వ్యధ. చివరకి ఇది మీ మనస్సులో ఒక రూపంలా మారిపోతుంది
నేను నాప్రక్కవాడి అంత బాగున్నానా ?
నేను నా బాస్‌ని ఎలా మెప్పించగలను ?
నా పిల్లలు ఏమనుకుంటారు ?
ఇలా ఎప్పుడూమనం ఎదుటివారి మెప్పుని వారి సమ్మతిని ఆశిస్తాము. వాళ్ళు మన కుటుంబ సభ్యులైనా కావచ్చు లేదా సమాజమైనా కావచ్చు. మన వ్యథలకి ఇదే కారణం. జీవితమంతా మనం చేసే కార్యక్రమం ఈ సర్టిఫికెట్లని పోగు చేసుకోవటం. ఒకవేళ మంచి భర్త, మంచి ఉద్యోగం, మంచి పొరుగువారు... ఇలాంటి సర్టిఫికేట్లు ఎదుటి వాళ్ళు ఇవ్వటవ మానేస్తే, మన జీవితం వృథా అని బాదపడతాము.
మనం మన వ్యక్తిత్వాన్ని ఎదుటివారు ఇచ్చే సర్టిఫికేట్ల ఆధారంగా తయారు చేసుకుంటాము. మనని మనం నమ్మటం మానేస్తాం. ఇదీ అసలు సమస్య.
మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన ఏకాగ్రతని మన మీదే నిలుపుకుంటాం. మీరు ఎప్పుడయినా చిన్న పిల్లలు ఎదుటివారు ఏమనుకుంటారో అని బాధ పడటం చూసారా? లేదు. అందుకే చిన్న పిల్లలని చూస్తే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళకి సమస్యలుండవు. వాళ్ళు వాళ్ళు చేసే పనిలో పూర్తిగా నిమగ్నమవుతారు. వాళ్ళు వీళ్ళు నన్నేమనుకుంటారు అనే బాధ వుండదు.
మనం పెరిగే కొద్దీ, సమాజం ఈ విషయాన్ని మన మైండ్‌లో నిలకడగా ఉండేట్టు చేస్తుంది. ఈ సమాజం, తల్లిదండ్రులు, టీచర్స్, స్నేహితులు, కొత్తవాళ్ళు ఇలా వాళ్ళ అభిప్రాయాల ఆధారంగా మనని మనం విలువ కట్టుకోవటం నేర్పుతుంది. మనం చేసే ప్రతీ పనికి, ప్రతీ మాటకి మనం ఎదుటి వారి సహాయం, వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ల మీద ఆధారపడేటట్టు చేస్తుంది.
అందుకే మనం ఎప్పుడూ ఎదుటివాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అనే బాధ పడుతుంటాము. మీరు బాధపడిన ప్రతిసారి కూడా, మీరు ఏదో ఒక కచ్చితమైన చోట ఏదో ఒక పోలికతో మీరు చేసే పనిని, మిమ్ములని విలువకడతారు. అందుకే ఈ బాధ పడటం అనే ప్రక్రియ మీ జీవితాన్ని నిర్దేశించుతుంది. బాధలు లేకపోతే మీరు కదలటానికి ఆధారం లేనట్టు అయిపోతారు. అందుకే మనం నిజంగా, రహస్యంగా ఈ బాధనే ప్రేమిస్తాము.
మీకు ఒక కథ చెబుతాను:
మనిషి సంచారం లేని ఒక దీవిలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు అక్కడ ఎంత కాలం నుంచీ ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఒక రోజు వాళ్ళు ఉన్న చోటుకి సముద్రంలో ఒక సీసా కొట్టుకు వస్తుంది. వాళ్ళు దానిని చేతులలోకి తీసుకొని శుభ్రపరచడానికి చేతులతో తుడుస్తారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవకన్య ప్రత్యక్షమౌతుంది. వాళ్ళు ఆమెను చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆమె వాళ్ళని చూసి, “మీరు నన్ను ఈ సీసా నుంచి బందవిముక్తురాలిని చేసారు కాబట్టి మీకు ఒకొక్కక్కరికి ఒక వరం ఇస్తాను కోరుకోండి” అంటుంది.
వాళ్ళు చాలా సంతోషపడతారు.
వాళ్ళలో మొదటి వ్యక్తి "నేను నా ప్రియురాలిని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండాలి" అని కోరుకుంటాడు. అప్పుడు ఆమె తథాస్తు అంటుంది.
వెంటనే మొదటి వ్యక్తి మాయం అవుతాడు.
రెండవ వ్యక్తి, "నేను గొప్ప ధనవంతుడయిన వ్యాపారిని కావాలి" అంటాడు. ఆమె తథాస్తు అంటుంది. రెండవ వ్యక్తి కూడా మాయమవుతాడు.
మూడవ వ్యక్తి, "నేను వీళ్ళ ఇద్దరినీ పోగొట్టుకున్నాను. ఇంతకాలం వీళ్ళు నా దగ్గరే ఉన్నారు. వాళ్ళు నాతోనే ఉండేలా వరం ఇవ్వు" అంటాడు.
వెంటనే మొదటి ఇద్దరూ అక్కడికి వచ్చేస్తారు. ఆ ముగ్గురినీ ఆ దీవిలోనే వదిలేసి దేవకన్య మాయం అవుతుంది.
(హాలులో అంతా నవ్వులు)
వాళ్ళు ఆ దీవిలో ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడ్డారు. కొత్త జీవితం వస్తుంటే ఆ మూడవ వ్యక్తి ఆ జీవితానికి సిద్ధపడలేకపోయాడు. ఆ దీవిలోని జీవితానినే అతను ఇష్టపడతాడు. మనం కష్టాలు అని నేను అన్నదానికి అర్థం ఇదే. మనం ఎదుటివాళ్ళు మనకి కష్టాలు కలిగిస్తున్నారని అనుకుంటాం. కాని మనమే వాటి మీద చాలా అనురాగం పెంచుకుంటాం. మీరు బాధలని ప్రేమిస్తారు అని నేను చెబితే మీరు నమ్మరు. కాని అది నిజం.
కొందరు నా దగ్గరకి వచ్చి చెబుతుంటారు; "స్వామీజీ! నా వ్యాపారం పూర్తిగా పడిపోయింది. క్రితం నెల చాలా నష్టాలు వచ్చాయి. వచ్చే నెల అవి ఇంకా ఎక్కువగా ఉండవచ్చు" అని.
అప్పుడు నేను వారితో, "మీకు నష్టాలు వస్తాయని తెలిసినప్పుడు, మీ వ్యాపారాన్ని మూసివేయవచ్చు కదా! ఎందుకు ఇలా బాధపడతారు" అంటాను.
దానికి వాళ్ళు నిర్ఘాంతపోతారు. అపనమ్మకంతో ఇలా అంటారు; "ఏమిటి స్వామీజీ మీరు చెప్పేది? అప్పుడు నేనేం చేయాలి" అంటారు.
(నవ్వులు)
మీకు బాధలు లేనప్పుడు మీ అహం ఉండటానికి కారణం కనబడదు. అందుకనే మీరు ఈ సమస్యలలో ఉండటానికే ఇష్టపడతారు. మీరు ఏవో బాధలతో ఉంటేనే మీరు ఒక వ్యక్తిని అని భావిస్తారు. మీరు ఒక సంపూర్ణ వ్యక్తిని అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడూ ఈ బాధల గురించి ఆలోచిస్తూ, వాటిని ఎలా పరిష్కరించాలా అని చూస్తుంటారు. కాబట్టి మీరు పరిపూర్ణంగా, స్థిరంగా అనిపిస్తారు.
అలా కాకుండా, మీరు ఈ నిరంతర బాధల నుంచి విముక్తి పొందితే మీరు పరమానందంలో ఉంటారు. ఇటువంటి దశలలో మీరు ఒక వ్యక్తిగా ఉండరు. మీ లోపల ఆక్రమించడానికి ఎటువంటి పదార్ధం ఉండదు. మీరు పరిష్కరించడానికి ఏమి ఉండదు. అప్పుడు మీలో అభద్రతా భావం పెరుగుతుంది. మీరు లేనట్టే అనిపిస్తుంది., అందుకే బాధలు లేని జీవితం కావాలంటే మీరు ఆనందంగా ఉండాలంటే, ముందుగా మీరు మీ అహాన్ని విడిచిపెట్టాలి. ఆ అహం మిమ్ములని ఒక స్థిరమయిన వ్యక్తి అనిపించేట్టు చేస్తుంది.
అసలు బాధ పడటం అనేది మీరు మీ మైండ్‌కి ఆహారాన్ని ఇవ్వాలి అనే మీ నిర్ణయమే. అప్పుడే మీ మైండ్ ఏదో పనిలో నిమగ్నమై ఉంటుంది. వీటన్నిటినీ మించి, ప్రతి ఒక్కరూ నాకు మాత్రమే ఇన్ని కష్టాలు ఉన్నాయి; నేను సంతోషంగా లేను, కాని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు. అంతేకాదు ఈ భూమి మీద ప్రతీ ఒక్కరూ, కేవలం నేనే దురదృష్టవంతుణ్ణి, కష్టాలన్నీ నాకే ఉన్నాయి, నాకు అసలు సంతోషం లేదు అని అనుకుంటారు. అసలు ఇది ఎలా సాధ్యం.
ఒక చిన్న కధ :
ఒక రాజ్యంలో ఆ దేశపు రాజుగారు తన ప్రజలంతా చాలా దుఃఖంలో ఉన్నట్టుగాను, వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నట్టు గమనిస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాము చాలా బాధలలో ఉన్నామని ఎదుటివారికి అలాంటి కష్టాలు ఏమీ లేవు అని అనుకునే వాళ్ళు.
ఒక రోజు రాజుగారు ‘బాధల మార్పిడి’ అనే కార్యక్రమాన్ని ప్రజలకు ప్రకటించారు. ఈ కార్యక్రమం ప్రకారం ఆ రోజున ప్రజలు వాళ్ళ బాధలను తెచ్చి వాటిని ఎవరైనా చిన్న బాధలు ఉన్న వాళ్ళతో మార్చుకోవచ్చు. ఈ కార్యక్రమం కోసం ఒక పెద్ద స్థలంలో ‘బాధల బాండారం’ అనే ఒక పెద్ద బానని ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే తమ బాధలని అందులో వేసి తనకి కావలసిన ఏ బాధనైనా తీసుకోవచ్చు. కాని తప్పని సరిగా ఏదో ఒక బాధని తీసుకోవాలి.
ఆ కార్యక్రమం రోజు ప్రజలంతా మైదానంలో చేరతారు. అందరూ, బాధల బాండారం చుట్టూ తిరుగుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటారు. అలా కొంతసేపు జరిగాక, ‘ఇక మీ బాధల మార్పిడి మొదలు పెట్టవచ్చు’ అనే ప్రకటన వస్తుంది. చాలా సమయం గడిచిపోతుంది. అయినా ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ బాధలని ఆ బాధల భాండారంలో వేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాక, వాళ్ళ సమస్యలు చిన్నవిగా, మిగతావారి సమస్యలకంటే కాస్త మెరుగ్గా అనిపించాయి. అంతే కాకుండా ఎవరి సమస్యలు వాళ్ళకి బాగా అలవాటు అయి వాళ్ళకి తెలిసినట్టుగా ఉన్నాయి. కాని ఎదుటివారి సమస్యలు కొత్తగా ఉన్నాయి.
మీకు స్పష్టంగా చెబుతున్నాను : అసలు మీరు ఈ బాధల లోతులలోనికి వెళ్ళి చూస్తే అవి అసలు పెద్ద విషయాలు, అనుకున్నంత చెడ్డవి కావు. అంతేకాదు చాలా చిన్న విషయాలని మనం భూతద్దంలో చూస్తామని కూడా మీకు తెలుస్తుంది.
సరే ఇప్పుడు మనం ఒక విషయం చూద్దాము. మనం బాధపడినప్పుడు మన మనస్సులో ఏం జరుగుతుందో విశ్లేషించుదాము. మీరు ఏదైనా ఒక విషయం గురించి బాధపడేటప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుందో కొంచం గమనించండి.
మీ మైండ్లోనికి ఎన్నో ఆలోచనలు నిరంతర ప్రవాహంలా రావటం చూస్తారు. ఈ ఆలోచనలు అన్నీ కూడా ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. మామూలుగా ఇవి వ్యతిరేక భావాలు కలిగి వుంటాయి. వ్యతిరేకపు భావాలు కలిగిన మాటలు పదేపదే ప్రవాహంలా మీ మనస్సులోనికి ప్రవహించుతాయి.
చూడండి : మనందరం రెండు రకాలుగా మాట్లాడుతాము. మొదటిది బయటకి మాట్లాడటం ఇంకొకటి లోపలికి మాట్లాడటం. బయటకి మాట్లాడటం అంటే వేరే వారితో మాట్లాడటం. దీనినే మనం సభాషణ, ప్రసంగం అంటాము.
లోపలికి మాట్లాడటం అంటే మనతో మనం మాట్లాడుకోవటం. నిజానికి ఇలా మనలో మనం మాట్లాడుకోవటాన్ని 'అంతరంగపు మాటలు' అంటారు. ఈ నిరంతరం సాగే అంతరంగపు మాటలనే 'బాధలు' అంటారు.
బాధ అంటే మన మనస్సులో నిరంతరం సాగే వ్యర్ధపు మాటల ప్రవాహం. ఇవి నియంత్రణ లేకుండా సాగే మాటలు. ఈ అంతరంగపు వ్యర్ధ మాటలే మీ యజమాని అవుతాయి. అవి మిమ్ములని నియంత్రిస్తుంటాయి. ఇది ఇలా నిరంతరంగా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
మీరు ఏ మాటలయితే బయటకి మాట్లాడతారో వాటిని జాగ్రత్తగా మాట్లాడతారు. ఎందుకంటే మీరు అలా జాగ్రత్తగా మాట్లాడకపోతే సమాజం మీకు జాగ్రత్త చెబుతుంది. అవును కదా! కానీ మీరు మీతో మాట్లాడుకునేటప్పుడు వాటికి ఏ విధమైన నియంత్రణ ఉండదు. మీరు బయటకి మాట్లాడే మాటలు కొంత పరిమాణాన్ని కలిగి ఉంటాయి. అందుకే వాటిని నియంత్రించవచ్చు. ఎటువంటి పరిమాణం లేని మీ మనస్సులోని మాటలని నియంత్రించలేరు.
మీతో మీరు మాట్లాడే మాటలను మీరు జాగ్రత్తగా నియంత్రించరు. ఎందుకంటే మీకు మీ మీద గౌరవం ఉండదు. మీకేది అనిపిస్తే దాన్ని మీ మనస్సులో మాట్లాడేస్తారు. ,మనం చెత్తని భోజనం ప్లేటులో వేస్తామా? లేదు. చెత్త బుట్టలో వేస్తాము. అంటే మీరు బయట వారిని భోజనం ప్లేటుగాను, మిమ్ములని చెత్తకుండీలుగాను ఉపయోగిస్తున్నారు. దీని వలననే మీకు ఈ సమస్యలు, బాధలు దీని వలననే మీకు అజీర్తి ఉంటుంది.
మనం బయట వాళ్ళతో మాట్లాడే మాటలకు ఏదో ఒక విరామం వుంటుంది. కాని మనలోపలి మాటలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. అవి మిమ్ములని పిచ్చి వాళ్ళని చేస్తాయి. నిజానికి మీరు బయట వాళ్ళతో మాట్లాడడం, ఈ అంతరంగపు వ్యర్ధపు మాటలనుంచి తప్పించుకోవటానికే. అందుకే ప్రపంచంలో ఇంతగా సంభాషణలు నిరంతరం జరుగుతుండేది. ప్రజలు నిశ్శబ్దంగా ఉండటానికి భయపడతారు. ఎందుకంటే లోపల ఒక పిచ్చి గృహం ఉంది. అందుకే అందరూ నిరంతరం ఒకరినొకరు కలిసికొని మాట్లాడుతూనే ఉంటారు. ఆ పనిలో నిమగ్నమైపోయి లోపలి మాటల నుంచి తప్పించుకుంటారు.
అసలు ఈ అంతరంగంలోని వ్యర్ధపు మాటలు అంటే ఏమిటి? మీరు మీరుగా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ చిన్న ఎక్సర్ సైజు చేయండి.. కళ్ళు మూసుకొని కొంచెం సేపు కూర్చోండి. ఒక పెన్ కాగితం దగ్గర పెట్టుకోండి. మీ మైండ్‌ని దేని మీద కేంద్రీకరించవద్దు. అలా మీ మైండ్‌ని గమనించండి. మీరు కళ్ళు మూసుకోగానే మీ మనసుంసలోనికి నిరంతరం ఆలోచనలు ఎలా ప్రవహిస్తాయో చూడండి. మీరు నిజాయితీగా ఆ ఆలోచనలన్నీ పేపరు మీద వ్రాయండి. అలా ప్రతి ఆలోచననీ పేపర్ మీద వ్రాయండి. అలా ఐదు నిమషాలు చేయండి.
ఇప్పుడు మీరు కూర్చుని పేపర్ మీద రాసినదంతా చదవండి. అది చదివితే మీరు నిర్ఘాంతపోతారు. ఇలా పేపర్ మీద రాసిన దంతా మీ మనస్సులో మీరు మాట్లాడుకునే మాటలే. మీరు వాటిని చదివితే అవి ఎంత అర్ధంలేకుండా ఉంటాయో ఎంతగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయో మీకే తెలుస్తుంది. ఒక్క క్షణం ఇక్కడ ఉంటారు. మరు క్షణం అమెరికాలో ఉంటారు. ఆ తరువాత మీ ఆఫీసులో ఉంటారు. ఆ మరుక్షణం మీ పిల్లల గురించి ఆలోచిస్తారు.
ఇది మీ మానసిక పరిస్థితి. ఇదంతా నియంత్రణలేని ఆలోచనల ప్రవాహం. ఇటువంటి మైండ్‌కి మీ జీవితాన్ని అప్ప చెప్పారు. ఈ మైండ్ లేదా ఈ మానసిక స్థితే మీ బాధలను సమస్యలను సృష్టించేది. ఈ మనస్సే మీ జీవితాన్ని తాను జీవిస్తుంది. ఈ చిన్న విషయం మీరు అర్ధం చేసుకోగలిగితే చాలు మీరు ఈ సమస్యల నుంచి స్వేచ్ఛ పొందే దిశగా ఒక పెద్ద అడుగువేసినట్టే. మీరు ఈ బాధలనుంచి, మీ మనస్సులో సాగే నిరంతరపు వ్యర్ధపు మాటల నుంచి స్వేచ్ఛపొందినట్టే.
ఒక చిన్న కథ :
ఒక రోజు రోడ్డు మీద ఒక ప్రమాదం జరిగింది. అందరూ దాని చుట్టూ గుమ్మిగూడారు. అక్కడ ఒక కొత్తకారు బాగా దెబ్బతిని కనిపించింది.
వాళ్ళు డ్రైయివర్ని, “ఏమండీ! మీకు కారు నడపడం సరిగ్గా రానపుడు ఎందుకు కారు నడిపారు” అని అడిగారు.
దానికి అతను “నాకు కారు ఎలా నడపాలో వచ్చు. కానీ కారుని ఎలా ఆపాలో రాదు” అన్నాడు.
(నవ్వులు)
ఇది చాలా ప్రమాదకరమయిన విషయం. మీ మనస్సు కారులాంటిది. దీనిని ఆపటం మీకు రాదు. మీలో నిరంతరం సాగే లోపలి మాటలను కొంచెం సేపు ఆపటానికి ప్రయత్నించండి.
కొన్ని క్షణాలు ఆపగలరా ?
ఎప్పుడయితే ఈ మాటలని ఆపాలని చూస్తారో ఆలోచనల వేగం మరింత ఉధృతం అవుతుంది. వాటిని నియంత్రించటం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు మరొక కొత్త ఆలోచన వీటితో కలుస్తుంది. అది “ఈ ఆలోచనలను ఎలా ఆపాలి”, అని.
మీరు మీ మనస్సుని నడిపించటంలేదు. అదే మిమ్ములను నడుపుతుంది. బాధలను అర్థం చేసుకోవాలంటే మీ మనస్సు యొక్క లక్షణాలని చాలా లోతుగా తెలుసుకోవాలి. బాధపడే మార్గం మనస్సులోంచి వస్తుంది. అలాగే ఆ బాధల నుండి బయట పడే దారి కూడా మనస్సులోంచే వుంటుంది. కాని మనం మన సమస్యలకి, బాధలకి పరిష్కారం కోసం ఎప్పుడూ కూడా బయట ప్రదేశాలలో వెతుకుతాము. కానీ మన బాధలకి గల అసలు మూలం లోనికి మాత్రం చూడము. మనం అనుకుంటుంటాం ; నా దగ్గర డబ్బు ఉన్నట్లయితే నా సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. నేను ఇంకా అందంగా ఉన్నట్లయితే.. నాకు ఇంకా మంచి ఉద్యోగం ఉన్నట్లయితే.... అయితే ..... అయితే.......అయితే.
వీటికి పరిష్కారం బయట ప్రపంచంలో దొరకదు. ఇది కేవలం మనలోనే దొరుకుతుంది.
ఒక చిన్న కధ.
బుద్ధుడికి పదివేల మంది శిష్యులు ఉన్నారు. ఆయన ప్రతి రోజు ఉదయం వారితో మాట్లాడేవారు. ఒక రోజు అయిన గట్టిగా ముడివేయబడిన తాడుని ఒకదానిని తెచ్చి వాళ్ళ ముందుపెట్టి, “మీలో ఎవరైనా ఈ ముడిని విప్పగలరా ?” అని అడిగారు.
కొంతమంది శిష్యులు ముందుకు వచ్చి దానిని ఇటు లాగి అటు లాగి ప్రయత్నించారు. కాని ముడి వీడలేదు. ఒక తెలివైన శిష్యుడు ముందుకు వచ్చి ఆ ముడిని జాగ్రత్తగా గమనించి దానిని తేలికగా విప్పాడు.
మీరు ముందుగా ముడి ఎలా వేయబడిందో చూడాలి. అలా చూసాక, దాని వ్యతిరేక దిశలో విప్పటానికి ప్రయత్నిస్తే ముడి ఊడిపోతుంది. అలా కాకుండా దానిని అటూ ఇటూ లాగితే ముడి ఎప్పటికీ వీడదు సరికదా ఇంకా బిగుసుకుపోతుంది.
ఇదే విషయం మన సమస్యలకి కూడా అన్వయించవచ్చు. మీకుండే సమస్యలు, కష్టాలు, భావోద్వేగాలు, వ్యాధులు అన్నీ కూడా మీ వ్యవస్థలో పడిన ముడులే. వీటిని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే ఆ సమస్యని పరిష్కరించటానికి సరియైన మార్గంలో వెళ్ళవచ్చు.
బాధలు మణిపూరక చక్రంతో దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఈ చక్రం మన నాభికి దగ్గరలో ఉంటుంది. వ్యతిరేకపు ఆలోచనలు సరాసరి ఈ మణిపూరక చక్రాన్ని ప్రభావితం చేస్తాయి.
చిన్న పరీక్ష చేయండి. మీకు వ్యతిరేక ఆలోచనలు కలిగినప్పుడు, వాటిని జాగ్రత్తగా గమనించండి. అవి ఎక్కడ నుండి వస్తున్నాయో కొంచం చూడండి. అవి మన నాభి ప్రాంతం నుంచి రావటం మీరు గమనించవచ్చు.
మీకు సమస్యలు ఉన్నప్పుడు, మీరు నియంత్రించలేని, పరిష్కరించలేని కష్టం కలిగినప్పుడు, మొట్ట మొదట మీ నాభి ప్రాంతం ప్రభావితం అవుతుంది. అప్పుడు మీ కడుపు భాగంలో బరువుగా అనిపిస్తుంది. అందుకే మనం అంటుంటాం "నేను ఈ బాధని జీర్ణించుకోలేకపోతున్నాను. నేను ఈ వ్యధని భరించలేను” అని. ఈ విధమైనటువంటి భావాలు అన్ని భాషలలోనూ ఉన్నాయి. ఇవి విశ్వవ్యాప్తమయిన మాటలు. ఎందుకంటే బాధలు మణిపూరక చక్రాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి, నిరంతరం బాధలు వ్యధలు ఉంటే మణిపూరక చక్రం బంధించి ఉంటుంది.
ఈ చక్రాన్ని ఎలా బంధ విముక్తి చేయాలి ? ఈ చక్రాన్ని మంచి వికసించిన స్థితిలో ఎలా ఉంచాలి ? ఎవరయినా చెప్పండి.
ఒకరు జవాబు ఇస్తారు.
"స్వామిజీ ! ఏ పరిస్థితులలో కూడా మనం కలతపడ కూడదు........."
ఈ జవాబుకి స్వామి ఇలా చెబుతున్నారు.
అంటే మీరు ఏం చెప్పటానికి ప్రయత్నిస్తున్నారంటే మీరు బాధ పడకూడదు అని. అప్పుడు ఏం జరుగుతుంది. మీరు మరొక సమస్యని సృష్టించుతున్నారు. అది ‘బాధపడకూడదు’ అనే కోరికని మరొక బాధలా తయారు చేస్తున్నారు. ఎప్పుడూకూడా “బాధ పడటంమానేయండి” అని చెప్పవద్దు. ఎందుకంటే ఇది పూర్తిగా అసాధ్యమైన విషయం. మీరు చేయవలసింది. ‘బాధల గురించి బాధపడటం మానేయటమే’
బాధల గురించి బాధపడవద్దు అని నేను అన్న మాటలకు అర్ధం ఏమిటి ? అంటే సమస్యలని అలా చూడండి. వాటి గురించి ఆందోళన పడవద్దు. ఎప్పుడయితే మీరు మీ బాధలను పదే పదే ఒక వ్యధలా మీకు అన్వయించుకుంటారో అప్పుడే అసలు బాధ మీలో నాటుకుంటుంది. ఇదే బాధల గురించి బాధపడకండి, అని నేను చెప్పే మాటలకి అర్ధం. వాటిని అలా ఉండనివ్వండి. వాటికి జీవితాన్ని ఇవ్వకండి. వాటికి రక్తమాంసాలు ఇచ్చి బలంగా తయారు చేయకండి.
మీరు “మనస్సుని నియంత్రించండి. వ్యతిరేకపు ఆలోచనలను రానివ్వకండి”, అంటే అది ముడిని మరింతగా బిగదీయటం అవుతుంది. ఈ ముడి అప్పుడు విడదీయటానికి ఏ విధంగాను కుదరదు.
ఎప్పుడయితే మీ మనస్సుని అణచివేస్తారో, ఆ అణచివేయబడిన ఆలోచనలు సరాసరిగా మీ మణిపూరక చక్రం లోనికి వెళతాయి. ఎప్పుడయితే మణిపూరక చక్రం విషమయం అవుతుందో మీరు మీ అచేతనావస్థలో మీరు చేసే ప్రతి పని హింసాత్మకంగా తయారవుతుంది. ఏదైనా పీకివేయటం, దేనినైనా పాడుచేయటం, మీ శరీరంతో అనుచితంగా ప్రవర్తించటం, మీతో మీరే పోట్లాడుకోవటం, లేదా ఎదుటివారితో గొడవలు పడటం ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తారు.
ఇవన్నీ కూడా అణచివేతకి సంబంధించిన సూక్ష్మమయిన అభిప్రాయాలు. అందుకే అంటారు. కోపంతో నా కడుపు మండిపోతుంది. నా కడుపు రగిలి పోతుంది; నాకు కడుపులో ఏదో బరువుగా ఉంది అని. మీలో ఎంతో అణచివేయబడిన కోపం ఉంటే చాలా వ్యతిరేక భావాలు ఉన్నప్పుడు అవి తిరిగి మరింత ఉధృతమై ఎన్నో వ్యతిరేక భావాలని మీలో కలిగిస్తాయి.
అసలు వ్యతిరేక భావాలు అంటే ఏమిటి ?
ఒక వేళ మీకు వ్యాపారంలో నష్టాలు వచ్చాయనుకోండి. మీరు ఎలా స్పందించుతారు; మీరు వ్యాపారంలో అపజయం పొందాము అని విచారిస్తారు. అంత వరకు ఫరవాలేదు. కాని మీరు అక్కడితో ఆగరు. మీరు మానసికంగా కుంగిపోతారు. కోపం తెచ్చుకుంటారు. ఇలా ఎన్నో రకరకాల విషయాలు మీ తలలోనికి వెళతాయి.
అయ్యో ! ఇది నాకు చాలా చెడ్డకాలం.
నేను ఏది ముట్టుకుంటే అది కచ్చితంగా నాశనం అవుతుంది.
నేను దేనికి పనికి రాను.
ఎందుకు నేను ఎప్పుడూ దురదృష్ట వంతుడిని ?
నేనేం చేయాలి ? ఇలా ఇంకా ఎన్నో ఆలోచనలు,
వీటినే వ్యతిరేక భావాలు అంటారు. ఇవే అన్ని రకాల సమస్యలకి మూలకారణం. మన బాధల విషయంలో ఒక ముఖ్య విషయమేమిటంటే వీటిలో 99% నిజమైన బాధలు కావు. 99% మన బాధలు కారణం లేనివి.
క్రమంగా ఈ వ్యతిరేక భావాలు, వ్యతిరేకపు మాటలు మీ అంతరంగంలో గట్టిపడిపోయి శాశ్వతంగా నిలిచిపోతాయి. అవి మీరు చేసే ప్రతి పనిమీద వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఇలా గట్టిపడిపోయిన విషయం మీ అచేతనావస్థలో మీకు తెలియకుండా జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మీ అంతరంగిక వ్యవస్థలో ఈ ప్రవాహం ఉన్నది అనే విషయాన్ని మీరు కచ్చితంగా తెలుసుకోగలగటం అనేది ఒక పెద్దపని. ఎందుకంటే అది మీ సహజ లక్షణంలా తయారు అయిపోతుంది. అది మీ నుండి వేరే విషయం అని మీరు గుర్తించలేరు. మీరు దాంట్లో ఒక భాగం అయిపోతారు.
వైద్య పరిభాషలో ఈ వ్యతిరేకపు దృక్పదాన్ని మనస్సు కుంగుబాటుఅని అంటారు. కొందరు ఎక్కువగా కుంగిపోతారు. కొందరు తక్కువగా కుంగిపోతారు. అంతే. ఈ వ్యర్ధపు మాటలని మీరు ఎక్కువగా మీలోనికి రానిస్తే మీరు ఎక్కువగా కుంగిపోతారు. మానసికంగా తక్కువ కుంగుబాటు గలవాళ్ళు దీనిని అప్పుడప్పుడూ అనుభవిస్తారు. ఎక్కువ మానసిక క్షోభకి గురయ్యేవాళ్ళు ఎప్పుడూ కుంగిపోయి కనపడతారు. అయితే ఈ వ్యతిరేకపు ప్రవాహం ఇద్దరిలోనూ ఉంటుంది.
కాబట్టి మానసిక క్షోభ లేదా వ్యతిరేకత అనేవి కేవలం మీతో మీరు మీ అంతరంగంలో మాట్లాడుకునే మాటలను ప్రోగుచేసిన ఒక రాశి. ఒక్కసారి మీరు ఆ ఆలోచనలని మీ మైండ్‌లోని రానిస్తే ఆ ఆలోచనలు మీరు ఎప్పుడు చిన్న అపజయం కలిగిన తిరిగి పదే పదే మీకు వినిపించేట్టు చేస్తాయి. అవి మీ దృక్పధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. బాధపడటం అనేది బలవంతంగా మీలోనికి తీసుకురాబడిన అలవాటు మాత్రమే.
అయితే ఇది ఒక అలవాటు మాత్రమే. మిగతా అలవాట్లలా దీనిని మీరు బయటకి తరిమి కొట్టవచ్చు. కాని మీరు దానిని ఒక అలవాటు అనుకోరు. మీరు దీనిని ఒక ఘనమైన, గంభీరమైన నిజమని అనుకుంటారు. అదే అసలు సమస్య. అందుకే మీరు ఈ అలవాటును వదుల్చుకో లేకపోతున్నారు.
మానసిక వ్యవస్థ అనేది గొప్పగా విషయాలను నమోదు చేయగల వ్యవస్థ. ఇది మీలోని వ్యతిరేకపు ఆలోచనా సరళిని, మీ సమస్యలని, చిక్కులని, బాధలని చక్కగా నమోదు చేసి నిల్వ ఉంచుతుంది. మీరు మీ మైండ్ (మనస్సు) కి ఏం నేర్పిస్తే దానిని చక్కగా నేర్చుకుని, నమ్మకంగా తిరిగి మీకు అప్పచెప్పుతుంది. ఈ విధంగా మీరు ఒక గట్టి మేధో రూపాన్ని మీ వ్యతిరేక భావాలతో తయారు చేసుకుంటారు. కాబట్టి మీరు మీ మైండ్‌కి ఏమైనా చెప్పదలచుకున్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటాము. కానీ మనతో మనం మాట్లాడుకునేప్పుడు మాత్రం ఎటువంటి శ్రద్ధ తీసుకోము.
ఇది ఎలా ఉంటుందంటే మీకు సరియైన ఆహారపు అలవాట్లు లేవనుకోండి. మీ రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే మీరు నిరంతరం బాధపడుతుంటే ఆ బాధలు మీ అంతరంగంలో పేరుకుపోయి గట్టి పడిపోతాయి. ఏ విధంగా అయితే పేరుకుపోయిన కొవ్వు రక్తనాళాలలో అడ్డంకులని సృష్టించుతుందో ఆ విధంగా బాధలు మనలో శక్తిని ప్రవహించనీయకుండా అడ్డంకులు సృష్టించుతాయి.
కొంతకాలం పూర్తి అయ్యేటప్పటికీ బాధపడటం అనేది మీ సహజ లక్షణంలో ఒక భాగం అవుతుంది. ఇది మీకు తెలియని ఒక ముఖ్య చర్య అవుతుంది. దీనికి కారణాలు పట్టుకోగలిగినా, అది మిమ్ములను నిరుత్సాహంలోనే ఉంచుతుంది. ఎందుకు? ఎందుకు అంటే మీలోని కోపాన్నంతా మీరు కొన్ని సంవత్సరాలుగా అణచి వేసారు. అవి మీ అంతరంగంలో కనపడని ఒక పొరలా ఉంటాయి. బాధ అనేవి ఒక కెరటంలా అప్పుడప్పుడూ పైకి లేస్తుంటుంది. కాని మానసిక కుంగుబాటుతనం మాత్రం నీరులా ఉంటుంది.
మనం ఈ మానసిక కుంగుబాటుతనానికి లేదా వ్యతిరేకతకు అతీతంగా ఎలా వెళ్ళగలము ?
మీరు ఎప్పుడూ ఈ విషయాన్ని తెలుసుకుని మెలకువగా ఉండాలి. ఎప్పుడయితే వ్యతిరేకపు ఆలోచనలు పైకి వస్తున్నట్లు మీరు తెలుసుకుంటారో, అప్పుడు మీరు వీటిని కనపడే విధంగా చిందరవందరగా, దూరం విసిరేయండి. మీరు ఈ విధంగా చేస్తూ ఉంటే, మీరు ఆ వ్యతిరేక క్రమాన్ని కాలాంతోపాటు మీలో స్థిరపడనీయరు. మీ మనోరూపం మీ మానసిక కార్యక్రమం పూర్తిగా వేరుగా ఉంటాయి. ఆ తరువాత అవి ఎప్పుడూ వ్యతిరేకతను కలిగి వుండవు.
మీలో మీరు మాట్లాడే అంతరంగపు వ్యర్ధపు మాటలకి అతీతంగా మీరు కొన్ని క్షణాలపాటు ఉండగలిగినా, మీరు చాలా తెలుసుకోగలరు. బాగా జీవించగలుగుతారు. అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. బాధ అనేది నిజం కాదు. అది ఒక అనవసరమైన విషయం. మీరు ఇలా చేయగలిగినప్పుడు మణిపూరక చక్రంలోని సంపదలు సహజంగా విడుదల అవుతాయి.
ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?....అడగండి.
ప్రశ్న : స్వామీజీ ! ఆలోచనలు మైండ్‌లో ఒక భాగమా ? లేక అవి మైండ్ యొక్క భావాలా ?
మీ మైండ్, మీ ఆలోచనలూ ఒక్కటే. ఈ రెండింటికి మధ్య తేడా లేదు. ఆలోచనే మైండ్; మైండే ఆలోచన. అసలు మైండ్ అంటేనే పోగుచేయబడిన ఆలోచనల సమూహము. అంతే కాదు అది ప్రవహించే అభిప్రాయాలు కూడా. ఇక ఆలోచనలు అంటే మరేమిటో కాదు. మీలో మీరు మాట్లాడుకునే మాటలు.
మీకు బాధ కలిగినప్పుడు, మీరు లోతుగా దీనిలోనికి వెళ్ళండి. మీరు అంగీకార భావంతో, స్పష్టతతో దాని లోపలికి వెళ్ళండి. బాధ లోతుల్లోనికి వెళ్ళటానికి భయపడకండి. గుర్తుంచుకోండి. అంగీకరించటం ఒక దౌర్బల్యం కాదు. అది గొప్ప ధ్యానపద్ధతి. అంగీకారం గొప్పశక్తిని విడుదల చేస్తుంది. మీకు స్పష్టతని, స్వేచ్ఛని ఇస్తుంది.
ఎప్పుడయితే మీరు మీ బాధలని అంగీకరిస్తారో, ఎప్పుడయితే మీరు వాటి లోపలికి లోతుగా వెళ్ళగలుగుతారో అప్పుడు మీరు ఈ సమస్యలన్నీ కేవలం మీరు సృష్టించుకున్నవే అనే విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంటారు.
మీరు మీ మైండ్ ఎలా ఆడిస్తుందో చక్కగా చూడగలుగుతారు. అది మీకు ఎలా ఆందోళనలు కలిగిస్తుందో తెలుసుకోగలుగుతారు. నేను మీకు చెప్పినపుడు మీరు కేవలం మీ తెలివితేటలతో అర్థం చేసుకుంటారు. ఎప్పుడయితే అది మీ స్వంత అనుభవమవుతుందో, ఎప్పుడయితే అది మీకు స్పష్టముగా ఉంటుందో, అప్పుడు మీరు ఈ బాధలకి అతీతంగా వెళ్ళగలుగుతారు. అప్పుడు మానసిక కుంగుబాటు అనేది మీ దగ్గరికి రాలేదు. మిమ్ములను అంటలేవు.
ఒక చిన్న సంఘటన చెబుతాను :
నేను కలకత్తాలో ఉన్న రోజులలో, నేను ఈశావాస్య ఉపనిషత్తుల మీద క్లాసులు తీసుకునే వాడిని. అప్పుడు ఒక వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. అతను నాతో
“స్వామీజీ ! నాకు ఒక సమస్య ఉన్నది. రాత్రి పూట తృప్తిగా నిద్రపోవటంలేదు. ఎందుకంటే నేను ఉన్న ప్రాంతంలో వీధి కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజు రాత్రంతా అవి మొరుగుతూనే ఉంటాయి. నాకు అసలే నిద్ర తక్కువ. ఈ గొడవతో అసలు నిద్ర ఉండటం లేదు. నాకు విశ్రాంతి లేకుండా పోయింది. అని చెప్పాడు.
నేనప్పుడు ఆ వ్యక్తితో ఇలా అన్నాను. “ఇవాళ ఇంటికి వెళ్ళి ప్రయత్నించు. ఎప్పుడయితే కుక్కలు మొరిగిన శబ్దం వినిపిస్తుందో, నీకోపాన్ని, నీలోని వ్యతిరేకపు ఆలోచనలని వదిలి వేయి. ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆ శబ్దాలను విను. నీకు నీవే ఇలా చెప్పుకో, “కుక్కలు మొరుగుతున్నాయి అంతే” అని. నీవు ఆ శబ్దాలకి అసలు స్పందించకు. నీ అసలు సమస్య కుక్కలు మొరగటం కాదు. నీవు ఆ శబ్దాలకు చేసే ప్రతిఘటన మాత్రమే”.
అతను వెళ్ళి నేను చెప్పినట్లుగా ప్రయత్నం చేసాడు. కొన్ని రోజులు తరువాత ఒక రోజు నాదగ్గరకి వచ్చి, “స్వామీజీ ! మీరు చెప్పినట్లుగా నేను ఆ శబ్దాలకు స్పందించకుండా, ఆ ప్రతిఘటనని వదిలివేసాను. ఈ కుక్కలకి ఎంత ధైర్యం నా నిద్ర పాడు చేస్తున్నాయి, అని ఆలోచించేవాడిని. దానికి బదులుగా నేను నా ఆలోచనలని ఈ విధంగా మార్చుకున్నాను. “కుక్కలు మొరుగుతున్నాయి. దానివలన నా నిద్రపాడవుతుంది”....... “కుక్కలు మొరుగుతున్నాయి.......” “ కొన్ని జంతువులు ఏదో శబ్దాలు చేస్తున్నాయి......” ఈ చివరి వాఖ్యం దగ్గరకి వచ్చేసరికి, నాకు నిద్రపట్టేసేది. ఏమైనా కానివ్వండి. ఈ రోజులలో నేను చాలా హాయిగా, తృప్తిగా నిద్రపోయాను. మీకు కృతజ్ఞతలు స్వామీ”.
ఇది మీ విషయంలో కూడా జరుగవచ్చు. మీరు వ్యతిరేక భావాలని విడిచిపెట్ట గలిగితే, వ్యతిరేకపు ప్రతిఘటన లేదా స్పందనని మీరు వదిలేయగలిగితే, మీరు ఎటువంటి పరిస్థితినైనా నియంత్రించగలరు. ఇదే మణిపూరక చక్రాన్ని వికసింపచేయగల చాలా ముఖ్యమైన మార్గం.
కానీ మనస్సు మాత్రం తనకి బాగా తెలిసిన మీ లోపలి వ్యర్ధపు మాటల క్రమంలో స్థిరపడాలి అనే ఆతృతతో ఉంటుంది. ఇదే బాధలు అనేవి పని చేయటానికి ఆధారం. మైండ్ ఎప్పుడూ తనకి ఇష్టమైన రూపాలని సృష్టించి వాటివైపు మాత్రమే చూస్తుంది. ఇది నిరంతరం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలతో పోల్చుకుంటూ ఉంటుంది. ఈ విధంగా పోల్చటంతో, అభిప్రాయ వ్యక్తీకరణలోనే బాధలు పుడతాయి.
బాధలు అనేవి కేవలం మన మైండ్‌కి పరిచయమైన నివాస స్థలాలు, ఇలా పరిచయమైన క్రమాలనే సైకాలజీలో (మానసిక శాస్త్రము) ఎన్గ్రామ్స్ అంటారు. ఎన్గ్రామ్స్ అంటే మనలో లోతుగా నాటుకుపోయిన భూతకాలపు (గడచిపోయిన కాలపు) జ్ఞాపకాలు. ఇవి మన లోపల అభ్యంతరకరమై వనరులుగా ఉండి అవి మనం ప్రస్తుతం చేస్తున్నా, చేయబోయే పనులకు ఆధారమవుతాయి. ఇటువంటి జ్ఞాపకాల వలన ఇప్పుడు అర్థంలేకుండా స్పందించుకుంటాము.
మనం ప్రతి క్షణాన్ని అలాగే ఎందుకు తీసుకోలేము ? ఎందుకు మనం ప్రతి క్షణాన్ని కూడా జరిగిపోయిన కాలానికో, రాబోయే కాలానికో కలిపి ముగింపులు నిర్ణయిస్తాము ? ఎందుకు మైండ్ ప్రతి దానితోనూ స్థిరత్వాన్ని చూస్తుంది? ఇలా చూడలేనప్పుడు, ఎందుకు ఆ విషయాన్ని జీర్ణించుకోలేదు ? ఇదంతా ఎందుకంటే, మీరు నిరంతరం చూసే విషయాలకి రూపం ఇవ్వటానికి, మీరు మీ మైండ్‌లో నిలువ చేసుకున్న జ్ఞాపకాల సహాయం తీసుకుంటారు. అలా చేయలేనప్పుడు మీరు బాధపడతారు.
నేను బాధపడటం మీరు ఎప్పుడయినా చూసారా ? నన్ను ఎంతమంది అడగలేదు. నేను ఎప్పుడూ సంతోషంగా, నిశ్చలంగా ఎలా ఉండగలుగుతున్నాను అని. మీకు చెబుతాను ; దానికి కారణం నేను ఈ క్షణంలోనే ఉంటాను. అంతే. నేను జరిగిపోయిన విషయానలని దేనికీ అన్వయించటానికి నామైండ్‌లో ఉంచుకోను. ఇటువంటి అన్వయించుకోవటాలతో నామైండ్ని బరువెక్కనివ్వను. నేను సమయానుకూలంగా, అప్రయత్నంగా స్పందించుతాను కాని ఒక క్రమ పద్ధతిలోనో, ఒక రీతిలోను కాదు.
నేను ప్రవహిస్తున్న నదిలాంటి వాడిని. నాతో పాటు హిమాలయానికి వచ్చిన వాళ్ళు, ఆ హిమాలయాలలో ప్రవహిస్తున్న గంగానదిని చూసి ఉంటారు. గంగానది చాలా అందంగా ఉంటుంది. ఇది కొన్ని చోట్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని చోట్ల దూకుడుగా ఉంటుంది. కొన్ని చోట్ల స్వచ్ఛంగా, మరికొన్ని చోట్ల మురికిగా ఉంటుంది. ఎవరు ఆ నదిని ఏ రూపంలో చూస్తే, వారికి ఆ నది ఆ అనుభవాన్ని ఇస్తుంది.
ఏ ఇద్దరు వ్యక్తులయినా ఆ నది దర్శనంతో వారు పొందిన అనుభవాన్ని పోల్చుకుని; నాకు ఇలా ; నీకు ఇలా ; అని అనుకోగలరా ? ఫిర్యాదులు చేయగలరా ? అలా చేస్తే అది ఎంత తెలివి తక్కువగా ఉంటుందో ఆలోచించండి. నది ఈ అనంత చైతన్య సృష్టికి ఆ సంగీతానికి అనుకూలంగా ప్రవహిస్తుంది. అంతే. దానికి ఒక ప్రణాళిక ఉండదు. నేనూ గంగానది లాంటివాడిని. నేను కూడా ఎటువంటి ప్రణాళికా లేకుండా ప్రవహిస్తాను. అప్రయత్నంగా, అసంకల్పితంగా ప్రవహిస్తాను. ఎటువంటి సమస్య, బాధ లేకుండా ఉంటాను. ఈ అనంత చైతన్య సృష్టి ఒక గొప్ప ప్రణాళికా కర్త.
నా అసంకల్పిత చర్యలని చూసి చాలా మంది నేను అసంబద్ధంగా, ఒకే రీతిలో లేని వ్యక్తినని అభిప్రాయాలు వెల్లడి చేస్తారు. ఇక్కడ ఉన్న మీలో ఎంత మంది నేను, నా మాటలు, నా ప్రవర్తన ఒక రీతిలో ఉండవని, అవి అసంబద్ధతతో కూడినవనే అభిప్రాయం వ్యక్తం చేసారో చెప్పండి. చేతులు ఎత్తండి.
(చాలా సమయం గడిచాక కొంతమంది చేతులు ఎత్తారు)
చూడండి ! బహుశః మీ అందరికీ అదే అభిప్రాయం ఉండి వుంటుంది. కనీసం ఏదో ఒక సందర్భంలో ; ఏదో ఒక సమయంలో అయినా ఉండి వుంటుంది. కాకపోతే వీళ్ళకి మాత్రమే చేతులు ఎత్తే ధైర్యం వుంది.
గంగానది అసంబద్ధంగా ప్రవహిస్తుందని చెప్పగలరా ? గంగానది ఒక పద్ధతిలో ఒక ప్రణాళికతో ప్రవహించాలి అని చెప్పగలరా ? లేదు. నదీ ప్రవాహం అలాగే వుంటుంది. అంతే. మీరు గంగా ప్రవాహం మీద తీర్పులు అభిప్రాయాలు వెల్లడించకూడదు. అదే విధంగా నేను కూడా నదిలా ప్రవహిస్తాను. నేను స్థిరత్వం లేని వాడిని అని మీరనలేరు. నేను క్షణక్షణం జీవిస్తాను. కానీ మీరు చిక్కు సమస్యలని ఒకదానితో మరొకటి కలిపి పెనవేసుకున్న సమస్యలతో ఆ క్షణాలలో జీవిస్తారు. దాని ఫలితమేమిటి. మీకు జీవితం బరువుగా, బాధామయంగా అనిపిస్తుంది.
మీ మీద అన్ని క్షణాలు బరువులు ఒక్కసారే ఉన్నప్పుడు మీరు బరువుగా ఎందుకు అనుకోరు. అదే విధంగా ఏక్షణం ఆ సమయంలో మీ మీద ఉంటే మీరు తేలికగా అనుకోరా ? మీ సమస్యలన్నింటికీ కారణం మీరు ఈవిధంగా వర్తమానాన్ని రాబోయే కాలాన్ని జరిగిపోయిన క్రమాలతో కలిపేసి జీవిస్తారు. అదే సమస్యకి కారణం. ఈ పూర్తి క్రమంలో మీరు 'ప్రస్తుతాన్ని' పోగొట్టుకుంటున్నారు. అసలు వర్తమానం మీకు ఇవ్వబడిన బహుమతి. కానీ మీరు నిరంతరం, జరిగిపోయిన రాబోయే కాలాల కోసం ఈ బహుమతిని పోగొట్టుకుంటున్నారు. చివరికు మీకు జరిగిపోయిన జ్ఞాపకాల కాలం, రాబోయే కాలం మాత్రమే మిగిలిపోతాయి. మీకు వర్తమానం ఎప్పటికీ దొరకదు.
ఈ క్రమాలన్నీ కూడా బాధల ప్రవాహాన్ని కలుగచేస్తాయి. అదే మీ జీవితంలో స్థిరమయిన వస్తువుగా మీ మైండ్‌లో మిగిలిపోతుంది.
ఒక చిన్న కథ.
ఇద్దరు స్నేహితులు ఒక కొత్త సినిమాకి వెళతారు. అందులో ఒక వ్యక్తి మధ్య మధ్యలో వాచీ చూస్తుంటాడు ;
అది గమనించిన స్నేహితుడు “ఏమిటి? నువ్వు సినిమా చూసి ఆనందించటం లేదా ? అని అడుగుతాడు”. దానికి ఆవ్యక్తి. “ ఈసంతోషం ఇంకా ఎంత సేపు ఉంటుందో అని చూస్తున్నాను” అంటాడు.
(నవ్వులు)
నిజానికి మనలో చాలా మంది ఇలానే ఉంటారు. మనం బాధ పడటానికి ఎంతగా అలవాటుపడిపోయామంటే, బాధలు లేని సమయం ఉంటే అది ఇంకా ఎంత సమయం ఉంటుందో అని మరీ బాధపడతాము. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఈ సంతోషం ఎంతసేపు ఉంటుందో అని బాధపడతాము. ఇలా అయితే మనం ఎలా సంతోషంగా ఉండగలం. మీరు నిరంతరం ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే మిమ్మలని మీరు ఎప్పుడూ రాబోయే కాలంలోనే ఉంచుతారు. మీరు ఎప్పుడయితే భవిష్యత్తులోని ఏదైనా ఒక్క క్షణాన్ని పట్టుకుని ఆనందపడాలి అనుకుంటే, మీరు ఈ క్షణం యొక్క ఆనందాన్ని పూర్తిగా పోగొట్టుకోవటమే.
నేను ఏమి చెప్పటానికి ప్రయత్నిస్తున్నానో అర్ధమవుతున్నాదా ?
మీరు మిమ్మలని మీ కుటుంబంలో ఉన్న మిగతా వారిని లోతుగా, వివరంగా విశ్లేషణ చేశారంటే అప్పుడు మీకు నేను చెప్పే విషయాన్ని గమనించవచ్చు.
ప్రతి ఒక్కరూ బాధలని తమలో నింపుకుని, తమకు చాలా ముఖ్యమైన వాళ్ళమని, ఉపయోగకరమైన వాళ్ళమని అనుకుంటారు. ఎక్కువ బాధలు వాళ్ళకి చాలా బాగున్నట్లుగా అనుకుంటారు. అన్ని బాధలని చక్కగా నిర్వహిస్తున్నాను (మేనేజ్ చేస్తున్నాను) అనే తృప్తి అహంకారానికి పూర్తిగా దొరుకుతుంది. ఈ కారణం వలనే కొంతమంది మన సమస్యలు విన్నప్పుడు, “ఆ! ఇదేమంత సమస్యకాదు. నా కష్టాలు విను. అప్పుడు నీకు తెలుస్తుంది. కష్టాలంటే ఏమిటో ? ” అని అంటుంటారు. ఇలా ఎందుకు అంటారు. అంటే వాళ్ళు బాధలని భరించటం చాలా ఉన్నతమైన విషయంలా, గొప్పగా అనుకుంటారు.
నిరంతరం బాధల గురించి మాత్రమే ఆలోచిస్తే ఏమవుతుంది? ఏమీ జరగదు. మీకున్న పది సమస్యలకి తోడుగా పదకొండవ సమస్య ; మానసిక కుంగుబాటు కూడా కలుగుతుంది. అంతే.
మనం పనిచేస్తున్నప్పుడు బాధ పడుతుంటాము. స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఎప్పుడయితే బాధ ఉన్నదో అప్పుడు పని చేయలేము. మీరు నిజంగా పనిచేసేటప్పుడు
బాధపడలేరు. ఎక్కడ అయితే బాధలు ఉన్నాయో అక్కడ సృజనాత్మకత అనేది ఉండదు. ఎక్కడ అయితే సృజనాత్మకత ఉంటుందో అక్కడ బాధలు ఉండవు. ఏ సమయంలోనైనా బాధకాని, సృజనాత్మకత కానీ ఏదో ఒక్కటే ఉంటుంది. ఈ రెండూ కలిసి ఉండవు. సృజనాత్మకత అనేది నిజమైన ఆరాధన. మీరు ఏదైనా సృష్టించారనుకోండి, మీరు భగవంతుని దగ్గరగా ఉంటారు. సృజనాత్మకత అనేది హృదయంలో నుంచి వస్తుంది. బాధ మైండ్‌లో నుండి వస్తుంది.
జరిగిపోయిన కాలం వెనుక పరిగెత్తినా, రాబోయే కాలం గురించి ఆలోచిస్తూ ఉన్నా మీరు వర్తమానాన్ని ; అంటే ఈ క్షణాలని పోగొట్టుకుంటారు. ఆధ్యాత్మికత అంటే జరిగిపోయిన కాలాన్ని వదిలివేసి వర్తమానంలో ఉండటమే. ప్రస్తుతం మీరు జరిగిపోయిన విషయాలని చాలా ఎక్కువగా పోగుచేసుకుంటున్నారు. దాంతో రోజు రోజుకీ ఆ బరువు పెరిగిపోతుంది. ఈ బరువుతో మీరు బరువుల బురదలో కూరుకుపోతున్నారు.
ఈ బరువుని ఎలా దించుకోవాలో మీకు తెలియదు ; కేవలం ఆ బరువులని మోయటం మాత్రమే మీకు తెలుసు. మీరు ఆ బరువుని అలా మోయాలి కాబోలు అనుకుంటారు. సమాజం మీకు ఆ బరువుని మోస్తూ ఉండాలని నేర్పిస్తుంది. ఒకవేళ ఆ బరువుని దింపాలని ప్రయత్నిస్తే మీరు తప్పు చేస్తున్నట్టు బాధ పడేలా సమాజం మీకు నేర్పించింది.
మీరు ఈ పాతకాలపు బరువుని దింపేస్తే సమాజం మిమ్ములని స్వార్థపరులుగా, కృతజ్ఞతా భావం లేనివారిగా చిత్రిస్తుంది. ఇదంతా అర్ధంలేని విషయం. జరిగిపోయిన విషయాలని మీరు మోయవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇలా బరువులు మోయటమే కృతజ్ఞత అని చెప్పేవారికి అసలు కృతజ్ఞత అంటే తెలియదు. కృతజ్ఞత అంటే ఈ అనంత చైతన్య సృష్టి పట్ల మీరు నిరంతరము పొందే అనుభూతి. ఇది అందరూ ఒకే మొత్తం అనే భావనే కాని ఏవో ఒకటి రెండు విడిగా మీరు జీవితంలో జరిగిన సంఘటనల యొక్క అనుభూతులు కాదు. మీరు ఎప్పుడయితే జరిగిపోయిన కాలాన్ని వదిలేస్తారో, వర్తమానం మీరు ఆశ్చర్యపోయే రీతిలో మిమ్ములను తనలోనికి తీసుకుంటుంది. అప్పుడు వర్తమానం మీ చేతుల్లో వుంటుంది. సమాజం మీకు వర్తమానాన్ని జరిగి పోయిన కాలంలా ఆనందించమంటుంది.
నేను చాలా మందిని చూస్తుంటాను. శలవలలో ఎక్కడికయినా వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్న సమయమంతా కెమేరాలు, వీడియో కెమేరాలతోనూ గడుపుతుంటారు. చాలా అందమైన సీనరీ చూసినప్పుడు దానిని చూసి సంతోషించకుండా ఆ పరిసరాలలోని అందమైన అనుభూతులని ఆస్వాదించకుండా, ఫోటోలు తీయటంలో మునిగిపోతారు.
వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఆ ఫోటో ప్రింట్లు వేసుకొను నాలుగు గోడల మధ్య గదిలో కూర్చుని ఆ అందమైన సీనరీలని ఫోటోలలో చూసి ఆనందపడతారు. దీనివలన వాళ్ళు అసలైన అందాల అనుభూతులని పోగొట్టుకుంటున్నారు. అంతే, ఈ ఫోటోలని స్నేహితులకి, చుట్టాలకి చూపించి వాళ్ళు ఏ ప్రదేశాలు చూసారో చూపిస్తూ వివరించతారు. కాని వాళ్ళు ఆ ప్రదేశాలలో ఉన్నప్పుడు మాత్రం ఆ అందాలని, ఆ అనుభూతులని చూసి ఏ మాత్రం సంతోషపడరు. వాటిని వారు పూర్తిగా పోగొట్టుకున్నట్లే.
మీరు ఎప్పుడూ కూడా వర్తమానాన్ని గడిచిపోయాక అనుభవిస్తారు. అందుకే అంటుంటారు. "ఆ రోజులు బంగారు రోజులు" అని. ఆ రోజుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అలా అనుకొని వారు ఉండరు. ఆ రోజుల్లో వాళ్ళు అంతకు ముందు రోజులు మంచి రోజులు అనుకుంటారు. అంతే. ఈ విధంగా మీరు ఎలా బాధల భ్రమలో ఉంటారో అర్ధం అవుతుంది. మీరు ఇప్పటి అందాలని పూర్తిగా పోగొట్టుకుంటున్నారు. మీరు గనుక వర్తమానం యొక్క శ్రుతితో ఉండగలిగితే ప్రతి క్షణాన్ని మీరు ఒక ఉత్సవంలా జరుపుకోవచ్చు. అప్పుడు మీరు ఉత్సవం చేసుకోవటానికి పాత జ్ఞాపకాలలో వెతుక్కోనవసరంలేదు. ఎప్పుడయితే ప్రతిక్షణం కూడా ఒక ఉత్సవంలా ఉంటుందో మీరు వర్తమానంలో ఉంటారు. ఎందుకంటే ప్రతి క్షణాన్ని ఆనందంలో గడుపుతారు. కాబట్టి అప్పుడు మీరు మీ గడిచిపోయిన రోజులలోకి ఆనందం కోసం వెళ్ళరు. అంతే కాకుండా జరిగిపోయిన విషయాలను
పదేపదే గుర్తుచేసుకొని బాధపడటం వృద్ధా అయిన విషయం : ఎందుకంటే మీరు ప్రతిక్షణం ఒక కొత్త వ్యక్తిగా ఉంటారు. ప్రతి క్షణం మీరు కొత్తగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలని, కొత్తదనాన్ని నింపుకుంటుంటారు. మీరు ఆ అనంత చైతన్యపు సృష్టిలో ఒక భాగం. ఈ సృష్టి ప్రతి క్షణం మారే చైతన్య స్రవంతి. అటువంటప్పుడు మీరు మీ పాతవిషయాలను కొత్తదనంతో ఎలా కలపగలరు? ఇది పూర్తిగా అసంబద్ధమైన విషయం.
పాత విషయాలని కొత్తగా నేర్చుకున్న తెలివితేటలతో విశ్లేషించ కూడదు. ఇది చాలా తెలివితక్కువ పని. దీని వలన మీకు అపరాధభావం, వ్యథ కలుగుతాయి. అంతే. ప్రతిక్షణం మీరు మరణించి కొత్త వారిగా జీవిస్తారు. కాబట్టి ప్రతి క్షణం మీరు ఒక కొత్త వ్యక్తిగా అవుతుంటారు. ఇది నిజము. అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి.
మీరు ఎప్పుడైనా ఆవులు, గేదెలు కలత పడడం చూసారా? మీరు ఎప్పుడైనా చెట్లు ఆందోళన పడ్డటం, బాధపడ్డట్టు విన్నారా? అవి అన్నీ బాధలు లేకుండా బ్రతకటం లేదా? మీ కెందుకు ఈ బాధలు? నేను చెబుతున్నాను. అర్ధం చేసుకోండి. బాధపడటం అనేది ఏ మాత్రం ఉపయోగం లేని అలవాటు. ఈ బాధలు అనేవి నిరంతరం మీ అంతరంగంలోని వ్యర్ధపు మాటల రూపంలో పుడుతుంటాయి. అవి మిమ్ములను ఉపయోగం లేని విధంగా వాటిలో నింపుకుంటాయి.
మీకు తెలిసిన భాషలోని పదాలన్నీ కలిపి పోగుచేసినవే మీ బాధలు. ఈ పదాలు మీలో చాలా గందరగోళాన్ని సృష్టించుతాయి. అలాగే అవి మీకు తప్పు అర్ధాలను సూచిస్తాయి. కానీ ఏం చేస్తాం. మన భావ వ్యక్తీకరణకి మనకి తెలిసిన పద్దతి : భాష, పదాలు వాడటమే
నేనెప్పుడూ చెబుతుంటాను. నేను ఒకటి చెబితే మీరు మరొక విధంగా అర్ధంచేసుకుంటారు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఎవరికివారు వాళ్ళు డిక్షనరీని మోస్తుంటారు. దాని సాయంతో పదాలకు ఎవరికి ఇష్టం వచ్చిన అర్ధాలు వాళ్ళు ఇచ్చుకుంటారు.
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తి అతని భార్యతో ఇలా అంటాడు "నీకు తెలుసా ఎవరో అన్నారు : ప్రతి సంవత్సరం రంగులు వేసే బ్రష్షులని తయారు చేయటానికి 5000 ఒంటెలని వాడతారంట".
దానికి అతని భార్య! "అలాగా! అయ్యో భగవంతుడా! నిజంగా మనుషులు జంతువులతో ఎన్ని రకాల పనులు చేయించుస్తారో కదా! చాలా ఆశ్చర్యం" అంటుంది.
(అంతా నవ్వుతారు)
ఈ కథలో భర్త ఒకటి చెప్పాడు. భార్య మరొకటి అర్థం చేసుకుంది. మనలో చాలా మంది ఇలానే చేస్తుంటారు. అందుకే నేను చెబుతుంటాను. మాటలు చాలా గందరగోళం సృష్టిస్తాయి. కాని విచారకరమైన విషయం ఏమిటంటే మనిషి కేవలం పదాలను ప్రయోగించి మాత్రమే భావాలని వ్యక్తీకరించగలడు. ఆ విధంగా మనిషి మాటలలో, మరిన్ని మాటలలో చిక్కుకుపోతున్నాడు.
చూడండి : మాటలు నిరంతరం మరిన్ని మాటలని సృష్టించుతాయి. కాని మాటకి మాటకి మధ్య నిశ్శబ్దం (లేదా) ఖాళీ ఉంటుంది. మనం చూడలేనంత సూక్ష్మమైన నిశ్శబ్దం అది. మనం ఈ ఖాళీ గురించి తెలుసుకోవాలి. ఈ ఖాళీనే మనం దేనికోసం వెతుకుతున్నామో, మనం ఏం కోరుకుంటున్నామో మనకి తెలియచేస్తుంది. ఈ చిన్న ఖాళీ ఒక సూక్ష్మప్రపంచం. అది ఎంత సూక్ష్మమంటే మనం రోజు మొత్తం దాని గుండా వెతుకుతూ కూడా ఆ విషయాన్ని మనం గమనించకుండా హాయిగా మరిచిపోతాము. నేను మాట్లాడేటప్పుడు మీరు నా ఉపన్యాసంలో నిమగ్నమయిపోయి, మీ అంతరంగంలోని వ్యర్థపుమాటలని మర్చిపోతారు. మీరు నా మాటలలో పూర్తిగా నిమగ్నమయినపుడు నేను మీకు కొంత ఖాళీ ఇస్తాను. ఆ ఖాళీలో ఉండే నిశ్శబ్దమే మీరు వెతుకుతున్న నిజమైన పరిష్కారం
కొన్ని సార్లు నా ఉపన్యాసాలలో నేను మాట్లాడే మాటల మధ్య ఎక్కువ ఖాళీ ఇస్తాను. నా ఉద్దేశం ఏమిటి అంటే, ఈ ఖాళీ సమయాలలో మీరు నిశ్శబ్దాన్ని గ్రహిస్తారని. దాంతో మీలో తెలుసుకొన గలగటం అనే నేర్పు బాగా పెరుగుతుందని నా ఉద్దేశం. కాని అప్పుడు కచ్చితంగా ఏం జరుగుతుంది? నేన ఎప్పుడయితే ఖాళీ ఇస్తానో, అందరూ అసహనంగా అయిపోతారు. వాళ్ళు వాళ్ళ సొంత విషయాలను గుర్తుకు తెచ్చుకొని ఇబ్బంది పడతారు (వ్యాకులత చెందుతారు) తరువాత క్రమంగా చుట్టూ చూడటం, మాట్లాడటం, మొదలు పెడతారు. దాంతో మరిన్ని మాటలను పోగుచేస్తారు.
నిజమైన నిశ్శబ్దం మీలో ప్రవహించాలంటే అది కేవలం సచేతన స్థితిలో మీరు తెలుసుకోగలిగినప్పుడే జరుగుతుంది. మరొక విధంగా సాధ్యం కాదు. నిశ్శబ్దం అంటే కేవలం నోరుమూసుకుని ఉండటం కాదు. మీరు ఈ నిశ్శబ్దాన్ని సచేతన స్థితితో చూడగలిగిప్పుడు మీకు నేను ఇప్పటి వరకూ ఏమి చెప్పానో బాగా అర్థమవుతుంది.
ఇప్పుడు మీ మైండ్ మిమ్ములని " నా ఆలోచలని నా అంతరంగంలోని వ్యర్ధపు మాటలని ఎలా ఆపగలను? నేను ఏవిధంగా నిజమైన నిశ్శబ్దాన్ని అనుభవించగలను?" అని ప్రశ్నిస్తుంది. ఈ ఆలోచన మిమ్ములని వెంటాడుతూ ఉంటుంది. దాంతో మీకు మరొక వ్యధ కలుగుతుంది.
చూడండి. నేను చెప్పేది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు ఆలోచించటాన్ని ఎప్పుడు ఆపలేరు. ఆలోచలని ఆపివేయాలి అనే ఆలోచనే మీకు మరొక ఆలోచన అవుతుంది. మీరు బలవంతంగా ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉంటే, ఆ నిశ్శబ్దం కాదు మనం సాధించవలసిన నిశ్శబ్దం ఎందుకంటే అది బలవంతపు నిశ్శబ్దం. అది ప్రాణం లేని నిశ్శబ్దం. మనకి కావలసిన నిశ్శబ్దం, ప్రతి ధ్వనించే నిశ్శబ్దం, ఆనందమయమైన నిశ్శబ్దం. అదే ఈ అనంత చైతన్య సృష్టి యొక్క నిశ్శబ్దం
సరే అయితే అది సాధించటానికి ఏమి చేయాలి? కేవలం మైండ్‌ని అలా గమనించండి అంతే. కేవలం ఒక పరిశీలకుడిగా ఉండండి. ఎటువంటి తీర్పులు, నిర్ణయాలు చేయకండి. ఆలోచనలని ఆపటానికి ప్రయత్నించకండి. ఆలోచనలని లోతుగా, ఇది భగవంతుని బహుమతి అనే కృతజ్ఞతతో పరిశీలించండి. ఇది మీ అంతరంగంలో నిశ్శబ్దాన్ని పొందటానికి మొదటి మెట్టు.
మీలోని వివేకశీలత క్రమంగా, నెమ్మదిగా పెరుగుతుంది. ఇది మీ ఏకాగ్రతని మీ లోపల నిలిపేటట్టు చేస్తుంది. అప్పుడు నిశ్శబ్దం ఇంకా పెరుగుతుంది. నేను 'నిశ్శబ్దం పెరుగుతుంది' అంటే దాని అర్ధం మీ లోపలి మాటలు తగ్గుతాయి. మీరు ఎక్కువసేపు పరిశీలకుడిగా ఉండగలుగుతారు. ఎప్పుడయితే నిశ్శబ్దం మీలో పెరుగుతుందో, మీలో సచేతనస్థితి మరింత విస్తృతం అవుతుంది. ఇదంతా ఒక చక్రంలా ఒకదాని తరువాత మరొకటి జరుగుతూ వుంటాయి.
మీరు సచేతన స్థితిని పొందినప్పుడు (తెలుసుకోగలిగినప్పుడు) మీ చుట్టూ ఉండే అందాలని చూసి ఆనందించగలుగుతారు. ఈ అందం అక్కడికి అకస్మాత్తుగా రాలేదు. అది ఎప్పుడూ ఉంటుంది. కానీ మీకు ఆ విషయం తెలియదు. మీరు మీ అంతరంగంలో చాలా బిజీగా ఉంటారు. అందుకే ఆ అందాలు చూడలేరు. ఇప్పుడు మీకున్న సచేతన స్థితి వలన మీరు ఆ అందాలను ఉత్సవాలుగా ఆనందించ గలుగుతున్నారు. అకస్మాత్తుగా ప్రకృతి తన వైభవాన్ని మొత్తం మీకు తెలియచేస్తుంది. ఇది జరిగినప్పుడు మీ అంతరంగం పూర్తిగా మారుతుంది. అప్పుడు బయట ప్రపంచం కూడా అసంకల్పితంగా మారుతుంది.
మీరు సచేతన స్థితిలో ఉండటం నేర్చుకుంటే మీ మైండ్‌ని మీ ఇష్టప్రకారం ఉపయోగించుకోవచ్చు. ఇది మరొక ముఖ్యమైన పరికరం అవుతుంది. మీకు అవసరమయినప్పుడే మీరు దానిని వాడుకోవచ్చు. ఒక భయంకరమైన శత్రువుగా ఉన్న మీ మైండ్ మీకు ఒక నమ్మకమైన స్నేహితునిగా మారిపోతుంది.
మీలోని నిరర్థకపుమాటలు తగ్గగానే, ఎప్పుడయితే క్షణానికి వచ్చే ఆలోచనల సంఖ్య TPS (Thoughts per Second) తగ్గుతుందో,ఆ ఆలోచనల సంఖ్య కేవలం క్షణంలో సగభాగం సమయంలో తగ్గినా అప్పుడు మీరు పూర్తిగా వర్తమానంలో ఉంటారు. అప్పుడు మీకు జరిగిపోయిన భూతకాలం, జరగబోయే భవిష్యత్ కాలం కూడా మీ అందుబాటులోని లోనికి వస్తుంది. అది మీకు తెరచిన పుస్తకంలా కనిపిస్తుంది. ఎప్పుడయితే లోపలి మాటలు ఎక్కువగా ఉంటాయో, TPS ఎక్కువగా ఉంటుందో అప్పుడు మీరు ఉన్న సమయమంతా జరిగిపోయిన కాలంలో కాని లేదా భవిష్యత్ కాలంలో కాని ఉంటారు. ఎప్పటికీ వర్తమానంలో ఉండలేరు.
జరిగిపోయిన కాలం భవిష్యత్ కాలం అందుబాటులో ఉండటం అంటే ఏమిటో మీకు వివరంగా చెబుతాను.
మీకు ఒక్కొక్కసారి ఇటువంటి అనుభవం జరిగి ఉండవచ్చు. మీరు ఏదైనా ఒక ఉపన్యాసం వినేటప్పుడు లేదా ఏదైన పార్టీకో లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా అనుకోకుండా అక్కడ జరుగుతున్న మొత్తం తతంగం అంతా అంతకుముందు ఎప్పుడో జరిగినట్టు అనిపించవచ్చు. ఆ మాటలుగాని, సంభాషణగాని, ఆ స్థలంకాని, అక్కడ కొత్త వస్తువులు కాని మీకు అంతకుముందే తెలిసినట్టుగా అనిపించవచ్చు. అదంతా రీప్లేలో చూస్తున్నట్టు అనిపించవచ్చు. అటువంటి అనుభూతి కలిగినప్పుడు మీరు కదిలిపోతారు.
లేదా అకస్మాత్తుగా మీరు ఒక వ్యక్తిని గురించి ఆలోచించుతుంటే ఆ వ్యక్తితో మీకు చాలా కాలంగా ఎటువంటి సంబంధం లేదనుకోండి, అప్పుడే ఆ వ్యక్తి మీకు ఫోన్ చేయవచ్చు. అంటే కొన్ని సార్లు మీరు కొన్ని క్షణాల తరువాత జరగబోయే విషయాన్ని చెప్పగలుగుతున్నారు. ఎప్పుడయితే ఇలాంటి సంఘటనలు జరుగుతాయో మీరు ఆశ్చర్యంతో ఒక రకమైన అనుభూతితో కదలిపోతారు. ఆ కొన్ని క్షణాలు మీరు పూర్తిగా వర్తమానంలో ఉన్నారు అని అర్థం. అనుకోకుండా మీరు కొన్ని క్షణాలు అలా వర్తమానంలో ఉండగలిగారు.
మీరు మీకు తెలిసి ఎప్పుడూ వర్తమానంలో ఉండరు. మీరు ఎప్పుడూ జరిగిపోయిన లేదా జరగబోయే కాలంలో మాత్రమే ఉంటారు. మీరు భూతకాలం నుంచి భవిష్యత్‌కి భవిష్యత్ నుంచి భూతకాలం లోనికి మారుతుంటారు. కాని ఎట్టి పరిస్థితిలో కూడ వర్తమానంలోనికి రారు. ఇది నిజం. ఒక్కొక్కసారి అనుకోకుండా మీ TPS ఆ క్షణంలో తగ్గిపోతుంది అప్పుడు మీరు వర్తమానంలోనికి వచ్చేస్తారు.
ఎప్పుడయితే మీరు పూర్తిగా వర్తమానంలో ఒక్క క్షణం పాటు ఉండగలిగినా, మీకు మీ జరిగిపోయిన కాలం, జరగబోయే విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అటువంటప్పుడు మీకు ఇలాంటి సహజమైన సంఘటనలు జరుగుతాయి.
చూడండి : మన ఆలోచనలు ఎప్పుడూ స్పష్టంగా ఉండవు. అవి ఎప్పుడూ దేనినో ఆశ్రయించి ఉంటాయి. ఇవి నిజమైన ఆలోచనలు కావు.
సంబంధించి ఉండటం లేద ఆశ్రయించి ఉండటం అంటే అర్ధమేమిటో మీకు వివరిస్తాను.
మీరు ఉదయాన్నే నిద్రలేవగానే మీ తోటలో అందంగా విరబూసిన గులాబీని చూసారనుకోండి. వెంటనే మీ మైండ్ మీకు ఇది వరకు ఎప్పుడో ఎవరో గులాబి పూవు ఇచ్చిన విషయం దగ్గరకి వెళుతుంది. మీ ఆలోచనలు అప్పుడు గులాబీని చూడగానే ఎలా అనుభూతి పొందారు అనే దానిలోనికి వెళుతుంది. లేదా ఆ గులాబిని ఇచ్చిన వ్యక్తి మీదకి మీ ఆలోచనలు వెళతాయి. ఆ తరువాత మీరు ఆ వ్యక్తితో జరిగిన కొన్ని సంఘటనలని గురించి ఆలోచిస్తారు. ఇదంతా అయిన తరువాత, చివరికి ఏమవుతుంది? మీరు మీ ముందు ఉన్న అందమైన గులాబీని చూసి ఆనందపడే క్షణాలను పోగొట్టుకుంటారు.
మీరు ఈవిధంగా జరిగిపోయిన వాటివెంట వెళుతూ వర్తమానాన్ని పోగొట్టుకుంటారు. నేను సంబంధించి లేదా ఆశ్రయించి అని చెప్పిన పదానికి అర్ధం ఇదే. ఇది మీ ప్రస్తుతపు మానసిక స్థితి . ఎప్పటివరకయితే మీ మానసిక స్థితి దేనినో ఒక దానికి సంబంధించి ఉంటే మీరు భవిష్యత్ వెనుకగాని, భూతకాలం వెనుకగాని పరిగెడుతూనే ఉంటారు. దీనితో మీరు మరిన్ని మాటలు మీఅంతరంగంలో సృష్టించుకుంటారు.
యోగులు ఎప్పుడూ వర్తమానం లోనే ఉంటారు. దీనివలన మహాసముద్రము లాంటి భూత, భవిష్యత్ కాలాలు వారికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. అదే మీ విషయంలో అయితే ఇది ఒక అకస్మాత్తుగా జరిగే విషయం. ఇది మీకు క్షణంలో ఒక భాగమంత సమయంలోనే జరుగుతుంది. మీరు అలా జరిగినప్పుడు భయపడతారు కూడా. మీరు ఎంతగా అచేతనస్థితికి అలవాటు పడిపోయారంటే, ఎప్పుడయితే మీరు అకస్మాత్‌గా వర్తమానంలోనికి విసరబడతారో, అది మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. నిజం మీకు భరించలేనంత అధికంగా ఉంటుంది.
మీరు వర్తమానం నుంచి లేదా సత్యం నుంచి ఎంత దూరంలో ఉన్నారు అనేది నిర్ధారణ చేయటానికి TPS చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీ TPS ఎక్కువగా ఉంటుందో అప్పుడు మీరు అచేతనస్థితిలో నివసిస్తుంటారు. మీరు వర్తమానం నుంచి సత్యం నుంచి దూరంగా విసిరివేయబడతారు.
అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు ఏ పనులు చేస్తుంటారో. అవే చర్యలే మీరు ఏమిటో తెలియచేస్తాయి. అంతేగాని మీరు మాట్లాడే మాటలు కాదు. మీరు మీ లోపల మీతో మాట్లాడుకున్నా లేదా బయట ఎవరితోనైనా మాట్లాడినా, ఏదైనా ఒక్కటే. ముందుగా మీరు చేతనావస్థ లోనికి రండి. అప్రయత్నంగా మీరు అనవసరపు మాటలు తగ్గించేస్తారు.
కొంతమంది చెబుతుంటారు, “స్వామీజీ! మేము శలవలకి వెళ్ళాము. అది కాస్తా నరకంలా అయింది” అని
మీకు ఒక విషయం చెబుతాను. నరకం అనేది మీలోనే ఉంది. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి దానిని మోసుకువెళతారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా అది మీతోనే వస్తుంది.
వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు అందరికీ నరకాన్నే ఇస్తారు. వాళ్ళు మరణించాకా నరకాన్నే పొందుతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నరకాన్ని కూడా తీసుకువెళ్ళాలి అని అనుకుంటారు. వాళ్ళు నరకానికి ఎంత అలవాటుపడిపోతారంటే, స్వర్గాన్ని చూపించినా వాళ్ళు అందులో ఇమడలేరు.
చిన్న కథ:
ముగ్గురు చేపల అమ్మే అమ్మాయిలు ఒక రోజు చేపలు అమ్మటానికి వెళతారు. ఆ రోజు తిరిగి బయలుదేరే సమయానికి బాగా రాత్రయిపోయింది. కాబట్టి ఆ రాత్రికి ఎక్కడయినా ఉందామని నిర్ణయించుకున్నారు.
వాళ్ళు మల్లెపూలు అమ్మే ఒకామె ఇంటికి వచ్చి ఆమె ఇంట్లో రాత్రికి పడుకుంటాం అని అడుగుతారు. దానికి ఆమె ఒప్పుకుంటుంది. వాళ్ళకి ఒక గది చూపిస్తుంది. ఆ ఇల్లంతా మల్లెపూల వాసనతో నిండి ఉంటుంది.
ఆ ముగ్గురు పడుకుంటారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా నిద్రపోలేక పోతారు. నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతుంటారు. వాళ్ళకి ఏంచేయాలో తెలియదు. అకస్మాత్‌గా ఒకామె ఖాళీ చేపల బుట్టలని తెచ్చి వాళ్ళ తలలదగ్గర పెడుతుంది. అంతే వాళ్ళు హాయిగా నిద్రపోతారు.
(అంతా నవ్వుతారు)
మనం ఎక్కడికి వెళితే అక్కడికి మన బాధలు తీసుకెళుతుంటాము. వాటిని చక్కగా పోషిస్తుంటాము. కానీ మనకి ఎప్పుడూ బాధలు ఉన్నాయి అంటూ పిర్యాదులు చేస్తుంటాము. మనం వాటి నుంచి స్వేచ్ఛపొందటానికి ఇష్టం ఉండదు. ఈ విధంగా మనం మనలో పరస్పర విరుద్ధ భావాలతో ఉంటాం.
సరే! మనం వీటి నుంచి ఎలా స్వేచ్ఛ పొందాలి? మన దృక్పథం ఎలా ఉండాలి?
ఏ విధంగా స్వేచ్ఛ పొందాలి? మీ దృక్పథం ఎలా ఉండాలి. ఈ రెండు ప్రశ్నలకి జవాబు ఒకటే : మీరు ఏం చేసినా దానిని పరమానందపు (Bliss) అనుభూతితో చేయాలి. అంతే. చూడండి :మీ అంతరంగం లేదా మీ చేతనావస్థ మీ జీవితం యొక్క నాణ్యతని పద్ధతిని నిర్ణయిస్తుంది. మీ అంతరాత్మ ఎప్పుడూ స్వచ్ఛంగా పరమానంద భరితంగా ఉండాలి.
ఒక శాస్త్రవేత్త ఒక ప్రయోగాన్ని చేయాలంటే అతని చేతనస్థితి ఆ ప్రయోగంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. అని నిరూపించబడింది. వేరు వేరు శాస్త్రజ్ఞులు ఒకే ప్రయోగాన్ని, ఒకే పరిస్థితిలో చేసినప్పుడు ఫలితాలు వేరు వేరు వచ్చాయి. దీనిని బట్టి మన అంతరంగపు ఆలోచనలు మన పనులని వాటి ఫలితాలని నియంత్రిస్తాయి అని నిర్ధారణ అయింది.
మీకు చెబుతున్నాను. పరమానందం అదృష్టాన్ని ఆకర్షించుతుంది. ఇది ఒక గొప్ప సత్యం. మీరు పరమానందంలో ఉన్నప్పుడు ఈ అనంత సృష్టి (Existence) సకల ఐశ్వర్యాలని మీ మీద వర్షింపచేస్తుంది. అన్ని భాగ్యాలు అసంకల్పితంగా మీ వైపు ప్రవహించుతాయి. మీరు మాత్రం నిరంతరం కృతజ్ఞతా భావంతో ఉండండి. మిగతావన్ని వాటంతట అవే జరిగిపోతాయి.
మీరు ఏ విషయం గురించి కూడా బాధపడకూడదు అని నిర్ణయించుకోండి. ఏదైనా బాధ కాని, విషాద సంఘటన కానీ, అపరాధ భావం కానీ మీ మనస్సు లోనికి వస్తే దానిని అలా చూసి చిరునవ్వుతో “నేను నీ వలన ఏమీ ప్రభావితం కాను. నీవు నన్ను ఏమీ చేస్తావు?” అనండి. కేవలం దానివైపు చూసి ఇలా చెప్పండి అప్పుడు ఆ సంఘటన గాని అపరాధ భావం కానీ మిమ్ములను ఏమీ చేయవు.
అవి మీ మీదకి దాడి చేయనీయటం వలన మీకేమైనా మంచి జరుగుతుందా? మీరు ఏమైనా పొందగలరా? లేదు దానిని చూసి మీరు దానిని దగ్గరకు రానీయను అని చెప్పినప్పుడు మీరు ఆ సమస్యలని తొలగించుకోవచ్చు. నేను మిమ్మలని సమస్యలనుంచి పారిపొమ్మని చెప్పటం లేదు. నేను మిమ్మలని ఆ సమస్యలవైపు చూసి ఈ విధంగా చెప్పమంటున్నాను. ఈ పాయింట్ స్పష్టంగా అర్ధంచేసుకోండి.
మీరు మీ ఆలోచనలని అణచివేస్తే, అవి మీ మైండ్ వెనకనే దాగి ఉంటాయి. అవి ఏ సమయంలోనైనా తిరిగి వస్తాయి అని మిమ్ములని బెదిరిస్తుంటాయి. వాటికి పైకి రానీయండి. కేవలం వాటివైపు చూడండి. అలా చూస్తూ మీకు ఏమీ శక్తి లేదు అని చెప్పండి. అప్పుడు వాటంతట అవే మాయమవుతాయి. అవి మిమ్ములని వెంటాడటం ఉపయోగంలేని పని అని అనుకుని మాయమయిపోతాయి.
ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఏదైతే మీకు శరీరం, మనస్సు ఆత్మ ద్వారా మీకు శక్తిని ఇస్తుందో అదే ఆధ్యాత్మికమైనది. అది మిమ్ములని దానంతట అదే పరమానందం వైపు నడిచేలా చేస్తుంది. ఏదైతే మిమ్ములని శక్తి హీనులని చేస్తుందో అది ఆధ్యాత్మికమైనది కాదు. కాబట్టి అటువంటి వాటిని ఆ దృష్టితో చూడకండి. ఇది అందరూ అనుసరింపదగిన నిర్దిష్టమైన సూత్రం. మీరు పరమానందము మీ నిజమైన సహజమైన లక్షణం అని మరచిపోవచ్చు.
మరొక విషయం మీరు ఏదైనా అందమైన దానిని చూసినప్పుడు ఆ అందాల అనుభూతిని పొందండి. అంతేకాని మీకు అలవాటయిన క్రమంలో దానికి ఒక రూపాన్ని ఇచ్చి మీరు అనుభూతులు లేని పరిశీలకుడిగా మాత్రం మారకండి. మీరు ఎప్పుడైనా సూర్యోదయాన్ని కానీ, సూర్యాస్తమయాన్ని గాని ఇక్కడ ఆశ్రమంలో లేదా మరెక్కడయినా చూసారా? మనలో చాలా మందికి సూర్యాస్తమయం తెలియదు. తెలిసినా, “అవును. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అయితే ఏమిటి. సూర్యుడు ప్రతి రోజు అస్తమిస్తాడు” అని అంటాము.
మీకు చెబుతున్నాను. జ్ఞానం మీలోని అమాయకత్వాన్ని మూసివేస్తుంది. అది మీ జీవితాలను కాంతి విహీనంగా నిరుత్సాహంగా తయారు చేస్తుంది. మీరు సూర్యోదయం కాని, సూర్యాస్తమయాన్ని కానీ చూస్తున్నప్పుడు అది మీకు అందమైన ధ్యానం అవుతుంది. దానిని మీ లౌకిక జ్ఞానతో చూడకుండా దానిలో ఒక భాగమై అందులో మమేకమైపోగలిగితే మీరు అనంత సృష్టిలో ఒక భాగమైపోయిన ఆ ఆనందాన్ని ఉత్సవంలా చేసుకోగలగుతారు.
కాని మనం మనకున్న జ్ఞానంతో మందబుద్ధులమవుతున్నాము. ఈ పరిస్థితి మనం మాటలను పోగుచేసుకుని, మన అంతరాత్మలోని వ్యర్ధపు మాటలు, బాధలు మూలంగా ఇలా అవుతుంది. మనం ఎన్నో మాటాలని పోగుచేసుకొని ఆ మాటలతోనే బ్రతుకుతున్నాము. అందుకే మనం దేనికీ ఆశ్చర్యపోము. ఒక వేళ భగవంతుడే మీ దగ్గరికి వచ్చి నేను భగవంతుణ్ణి అని చెబితే మీరు ఏమంటారు. అయితే ఏమిటి? అంటారు. ప్రతి విషయాన్ని యధాలాపంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇదంతా మీలోని జ్ఞానం వలన.
మీలోని ఆ విజ్ఞానం వలన మీరు ఈ అనంత చైతన్య సృష్టినే యధాలాపంగా తీసుకుంటారు. ఈ విధంగా చేయటం వలన ఈ సృష్టిని పొగొట్టుకుంటున్నారు. మీరు అత్యాశని, బాధని, భయాన్ని ఇచ్చే ప్రాపంచిక విషయాల వెంట పరుగుల పెడతారు. ఈ విషయాలే మిమ్ములని మీ అంతరంగానికి దూరం చేస్తాయి. ఈ విషయాలే మిమ్ములని మీలోనికి చూడనివ్వకుండా బయట ప్రపంచంలోనికి చూసేలా చేస్తాయి. ఇవి మిమ్ములని మీ మీద ఆధారపడకుండ ప్రాపంచిక విషయాల మీద ఆధారపడేటట్లు చేస్తాయి. ఇవి మిమ్ములని సంతోషానికి, మానసిక క్షోభకు ఒకదాని తరువాత ఒకదానికి ఆధీనులనుగా చేస్తాయి. అంతేకాని ఈ విషయాలు మీలోని శాశ్వతానందం మీద ఏకాగ్రతని నిలుపనీయవు.
ప్రతి విషయం బయట ప్రపంచంలో జరుగుతుంది అని అనుకుని మీరు వాటిని అందరికంటే ముందుగా అందుకోవాలనే తపనలో వాటి వెంట పరిగెడుతుంటారు. అందుకే మీరు ఎప్పుడు హడావూడిగా మీలో మీరు నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే మీరు నిరంతరం పోటీలో ఉంటారు. అందుకే మీరు నిరంతరం భవిష్యత్‌లోనే ఉంటారు. కానీ వర్తమానంలో ఎప్పుడూ ఉండరు.
జ్ఞానం అంటే కొన్ని వివరాలు సమాచారం, స్టాటిటిక్స్ అంతే. ఇది జీవం లేనిది. జ్ఞానాన్ని సంపాదించండి. కాని దాని చేతిలో కీలు బొమ్మ అవ్వొద్దు. అది మిమ్ముల్ని నియంత్రించేలా చేసుకోకండి. దానిని ఒక ప్రక్కన పెట్టి జీవితాన్ని భక్తి, వినయంతో చూడటం నేర్చుకోండి. మీ మనస్సు దేనిని చూస్తుందో ఆ విషయాల ఆధారంగా ముగింపులు ఇస్తుంది. క్లుప్తీకరిస్తుంది తీర్పులు చెబుతుంది. అందుకే మీరు మాటల మీద మాటలను పోగుచేసుకుంటుంటారు. అంతే. అయితే దీనివలన ఉపయోగం ఏమిటి?
నేను కొంత మంది భక్తులతో కలిసి శ్రీ కృష్ణుని జన్మ స్థానమైన మధురకి వెళ్ళాను. అది చాలా అందమైన ప్రదేశం. మేము పడవలో యమునానదిలో తిరిగాము. మేము శ్రీ కృష్ణుని రోజులలోనికి వెళ్ళిపోయాయి. నాతో ఉన్న భక్తులు చాలా తెలివైన వారు. వాళ్ళతో నా పరమానందాన్ని పంచుకుంటున్నాను. నేను వాళ్ళకి శ్రీకృష్ణుని రోజులను గుర్తు చేసాను. నేను వాళ్ళకి రాసలీలలు జరిగిన ప్రదేశాలు చూపించాను. నేను పూర్తిగా పరమానందపు అనుభూతిలో ఉన్నాను. అప్పుడు భక్తులలో కొందరు అక్కడవున్న రాతి పలకలు చూపించి అవి కొత్తగా వేసినట్టు ఉన్నాయి కదా! అని నాతో అన్నారు. నేను నిశ్చేష్టుడనయ్యాను. నేను అప్పుడు వాళ్ళతో అన్నాను "నేను కొంత మందిని, తక్కువ విద్యా జ్ఞానం ఉన్నవాళ్ళని, కొంత అయినా భక్తి, వినయం ఉన్నవాళ్ళని తీసుకురావలసింది. నేను నా పరమానందాన్ని వాళ్ళతో పంచుకోగలిగేవాడిన" అని అన్నాను.
జ్ఞానం ఆ రోజు చివరలో జీవం లేకుండా పోతుంది. ఎందుకోగాని, మనుషులు విలువLookup జ్ఞానంతో కలిపి నిర్ణయించుతారు. ఎక్కువ విద్యా జ్ఞానం ఉన్నవాళ్ళని ఎక్కువగా గౌరవించుతారు.
జ్ఞానంతో ఉంటే మీరు మైండ్‌తోనే జీవిస్తారు. కాని ఈ అనంత సృష్టిని మీరు జ్ఞానంతో చూడలేరు. దీనిని కేవలం హృదయంతో మాత్రమే చూడగలరు. కేవలం ప్రేమతోనే ఈ అనంత చైతన్య సృష్టిని తెలుసుకోగలరు. మైండ్‌కి ప్రేమ తెలియదు. కేవలం హృదయానికి మాత్రమే ప్రేమ తెలుసు. మైండ్‌కి లెక్కలు కట్టే ప్రేమ మాత్రమే తెలుసు. అది అసలు ప్రేమకాదు ఇది మిడిమిడి జ్ఞానంతో, మిమ్ములని మీరు తృప్తిపరచుకునే మరొక లెక్కల పద్దతి మాత్రమే
ఆధ్యాత్మిక అంటే ఈ అనంత సృష్టి కి మనిషికి మధ్యల గల ఒక లోతైన కచ్చితమైన స్నేహసంధాన్ని అర్థం చేసుకోవటమే. ఎప్పుడయితే మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు మీలోని ఈ పోరాటాన్ని విడిచిపెట్టి మీరు ఒక నదిలా ప్రవహిస్తారు. ఆ నది తనకు నచ్చిన రీతిలో ప్రవహించి ఆ అనంతర సాగరాన్ని చేరుతుంది. దానిని అలా ప్రవహించనిస్తే చాలు.
అంటే మీరు ఏదో ఒక మూల కూర్చొని ఉంటే ఏదో ఒక నది వచ్చి మిమ్మలని తీసుకువెళుతుంది అని అర్థం కాదు. నేను అలా చెప్పటం లేదు. మీరు చేయవలసిన పనిని నిర్భయంగా నమ్మకంతో మీ వెనుక, ఈ విశ్వాన్ని నడిపించే అద్భుతమైన జీవన శక్తి మిమ్మలని కూడా నడిపిస్తుందనే నమ్మకంతో మీ పని మీరు చేయండి. ఆశక్తే మిమ్ములను రక్షిస్తుంది అనే నమ్మకంతో ఉండండి. ఆ శక్తే మీ ఊపిరిని లోపలికి పంపి బయటకు తెస్తుంది అని తెలుసుకోండి. అది చాలు.
కేవలం మీ బాధ్యతని మీ పై ఉన్నఅధికారికి బదలాయించి మీరు విరామంగా విశ్రమించండి. అప్పుడు మీరు ఒక మహారాజులా జీవిస్తారు. అప్పుడు మీరు ప్రవహిస్తున్న నదీ జలాల సవ్వడుల సుస్వరాలను వినగలుగుతారు. ఈ అనంత చైతన్యపు సృష్టిలోని సంగీత మధువులని రుచి చూస్తారు. మీకు ఈ అనంత సృష్టికి మధ్యలో ఉన్న స్నేహ మాధుర్యాల అనుభూతిని పొందుతారు. మీరు ఈ స్నేహరాగాల శ్రుతిలోనికి ఇమిడిపోవాలి. అప్పుడు మీ బాధలన్ని మాయమవుతాయి.
కానీ ఈ అనంత సృష్టి మనని రక్షిస్తుంది అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు. కొన్ని విషయాలని మనం నిరూపించలేము. ఈ దిక్కు తూర్పేనని మీరు నిరూపించగలరా? లేదు. మీరు సూర్యోదయం సూర్యాస్తమయాల క్రమాన్ని నిరూపించలేదని వీటిని నిరూపించలేము అని చెప్పగలరా? అలా అయితే మీరూ సూర్యోదయాన్ని శాస్త్రాల ద్వారా ఆపగలరా?
ఒక విషయం అర్థం చేసుకోండి. ఈ అనంత సృష్టి తర్కానికి అతీతమైనది. ఒక వేళ ఈ సృష్టిని తర్కంతో నిరూపించదలచుకుంటే దాని అర్థం తర్కం ఈ అనంత చైతన్య సృష్టికంటే గొప్పది అని. కాని అది ఎప్పటికీ ఈ సృష్టికంటే గొప్పది కాదు. కాలేదు
ఒక వ్యక్తి నన్ను ఇలా అడిగాడు, స్వామిజీ! "నేను ఆధ్యాత్మికంగా ఉండాలంటే హిందువుగా మారాలా?" అని ఆ ప్రశ్న విని నేను నిర్ఘాంతపోయాను. అతనితో " నీవు హిందువువి కానవసరం లేదు" అని చెప్పాను. స్పష్టంగా అర్థం చేసుకోవటానికి
ప్రయత్నించండి. మీ పరిధిలో ఏదైనా సరే మీ గ్రహింపు జ్ఞానానికి ఆటంకంగా ఉంటే అది ఆధ్యాత్మికమైనది కాదు. ఆధ్యాత్మికమైనది మిమ్మలని సదా ఆవరించి ఉంటుంది.
“నేను ఇది” “ నేను అది” అనే అభిప్రాయాలని వదిలివేయండి. మీ జీవితాన్ని వికసింపచేయండి. పూర్తిగా తెరచివుంచండి. అదే ఆధ్యాత్మికతకి ఆధారం. అది ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక వ్యక్తి ఎప్పుడూ మూసివేసిన గదిలోనే ఉంటే అతనికి స్వచ్ఛమైన ఆరుబయట గాలి, సున్నితమైన మలయమారుతం (Breeze) గురించి తెలియవు. అతనికి ఒక రకమైన వేరు ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడయితే మీరు మీ మీద ఇటువంటి నిబంధన పెడతారో అప్పుడు మీరు మీలో ఉన్న అనంతమైన ప్రేమని, కరుణని తెలుసుకోలేరు. మీరు బాధపడుతూ పిర్యాధులు చేస్తూనే ఉంటారు. మీరు వికసింపలేరు.
బుద్ధుని ఒకసారి ఎవరో ఇలా అడిగారు : కరుణ లేనివారికి ఎటువంటి నరకాన్ని ఇవ్వాలి అని. దానికి ఆయన “ వాళ్ళని నరకంలోకి పంపనవసరం లేదు. వాళ్ళు ఉండటమే నరకంలో ఉన్నారు” అని అన్నారు. మీరు నరకంలో ఉన్నప్పుడే ఇతరులకి నరకాన్ని సృష్టించుతారు. ఎందుకంటే నీకు ఏముందో అదే ఇతరులకి ఇవ్వగలవు.
చిన్నకథ :
ఒక తల్లీ కొడుకూ ఏదో విషయం మీద చాలా సేపు వాదించుకుంటుంటారు. చివరికి అతని తల్లి “నీకు మెదడు ఉన్నదా?” అని అడుగుతుంది
కొడుకు నవ్వుతాడు. తల్లీ అతనిని ఎందుకు నవ్వావు అని అడుగుతుంది.
దానికి ఆ అబ్బాయి “నీకు ఎప్పుడయితే లేదో అప్పుడే దాని కోసం ఎదుటివాళ్ళని అడుగుతావు” అంటాడు.
(అంతా నవ్వులు)
మనం ప్రశాంతంగా లేనప్పుడు ఎదుటివాళ్ళ ప్రశాంతతని పాడుచేస్తాము.
మనం మన మైండ్‌తో పదే పదే పని చేసే మనకి సంతోషాన్ని పరమానందాన్ని ఇచ్చే విషయం ఏమిటి అనేది చూసుకోవాలి. స్పష్టంగా అర్థం చేసుకోండి. సంతోషం, పరమానందం అనేవి వేరు వేరు విషయాలు. పరమానందం అనేది అంతరాత్మలోని తీవ్రమైన సాంద్రతతో ఉన్న ఒక అందమైన అనుభూతిని కలిగిస్తుంది. సంతోషం అనేది బయట ప్రపంచపు విషయానికి సంబంధించినది. ఇది మనకి నిరంతరం బాధను కలిగిస్తుంది
సంతోషం అనేది సంబంధరహితమైనది, సాపేక్షకమైనది పరమానందం సంపూర్ణమైనది. పరమానందం అనే పదానికి వ్యతిరేకర్థాలు లేవు. అలా కాకుండా సంతోషానికి వ్యతిరేకాలు ఉన్నాయి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు విచారం ఏదో ఒక మూల ఉంటుంది. మీరు చాలా ఆహ్లాదంగా ఉన్నప్పుడు బాధలు కూడా ఉంటాయి. కానీ మీరు పరమానందంలో ఉన్నపుడు మీరు అలానే ఉంటారు. దానికి ఎటువంటి వ్యతిరేకపు పదాలు లేవు. సంతోషం, ఆహ్లాదం అనేవి ఒక లోలకం లాంటివి. అవి ఊగి ఆ చివరికి వెళ్ళి తిరిగి వెనక్కి వస్తాయి. కాని పరమానందం లోలకం కాదు. అది ద్వైత్వానికి అతీతం ఇది ఎప్పుడుఊగదు. ఇది కేవలం ఇదే. పరమానందం.
మీరు మీ మైండ్‌ని మరలా మరలా స్కాన్ చేసి, మీకు సంతోషాన్ని కలిగించే అంశమేమిటో చూడండి. దానిని అనుసరించండి. ఒక్కసారి మీ అంతరాత్మ మీతో మీరు శాశ్వతమైన ఆనందంవైపు వెళుతున్నారు అని చెబితే, ఒక్కసారి మీ మీద మీకు నిశ్చయమైన నమ్మకం ఏర్పడితే మీ జీవితానికి సంబంధించిన విషయాలని తిరిగి నిలబెట్టి, అవసరమైనట్టుగా సర్దుబాటు చేసుకొని వాటిని పరమానదం వైపు మళ్ళించండి. మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి పని కూడా ఈ పరమానందపు అనుభూతి వైపే ఉండాలి. అప్పుడు మీరు ఖర్చుచేసిన శక్తి మీరు పొందే శక్తి అవుతుంది. మీరు ఎల్లప్పుడూ శక్తివంతులుగానే ఉంటారు.
కొంతమంది “మాకు బాధలు లేకుండా, ప్రశాంతంగా ఉండాలని ఉంది” అంటారు. వాళ్ళు మాట్లాడే ప్రశాంతతలో జీవం ఉండదు. అది జీవంలేని నిద్రస్తున్న ప్రశాంతత.
ఈ ప్రశాంతత అనేది మనకి మన జీవితంలోని భావావేశాలని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనప్పుడు కలిగే ప్రాణంలేని, నిద్రిస్తున్న ప్రశాంతత. ఇటువంటి ప్రశాంతతని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే జీవితాన్ని సంబాళించుకోవటం (Handle) వాళ్ళకి చాలా పెద్ద విషయం. ఇది ఒక సామెతలా ఉంటుంది. “అందని ద్రాక్ష పుల్లన”. అలా అని దానికి దూరంగా వెళ్ళిపోతారు.
నిజమైన ప్రశాంతత అనేది మీలోనే ఉంటుంది. బయట ప్రపంచంలో ఏమీ జరుగుతున్నా కూడా దానితో సంబంధం లేకుండా ఉంటుంది. మీరు నిరంతరం మీ అంతరంగంలో సంతోషంగా ఉంటారు. మీరు అందరివైపు, అన్నింటివైపు కూడా ఒక చక్కని మలయమారుతం మిమ్ములని ముద్దు పెట్టుకొన వెళ్ళినట్టుగా వాళ్ళ వైపు చూస్తారు. మీరు ఉండేది ఎటువంటి వ్యక్తులతోనైనా ఎటువంటి పరిస్థితులలోనైనా మీ ప్రశాంతత మాత్రం మీతోనే ఉంటుంది. మనుషులు కాని, పరిస్థితులు గాని ఈ ప్రశాంతతని ఏవిధంగా కూడా మార్చలేవు.
ప్రశాంతత అనేది మీ అంతరంగంలో మీరు అనుభవించే పరమానందం. ఎప్పుడయితే ప్రశాంతత పరమానందం నుంచి పుడితే అది మిమ్ములను, మీ చుట్టు పక్కల వాళ్ళని కూడ ప్రశాంతమైన స్థితిలో ఉంచుతుంది. ఒక్కసారి మీరు ఈ ప్రశాంతతని మీలో చూడగలిగితే మీరు నన్ను ప్రశాంతతంగా ఉండనివ్వండి. నాకు శాంతి కావాలి అనే మాటలని ఎప్పుడూ అనరు. ఎప్పుడయితే మీరు ఇటువంటి మాటలు అంటారో, దాని అర్ధం మీరు ప్రశాంతత కోసం ఎదుటివారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడ్డారు అని అర్ధం. అటువంటి ప్రశాంతత అసలు ప్రశాంతతే కాదు.
ప్రశాంతత అనేది ఒక స్థిరమైన కేంద్రంలా మీలోనే అభివృద్ధి చెందుతుంది. అది మీ అంతరంగాన్ని సంతోషంగా ఉంచుతుంది. బయట ప్రపంచంలో ఏమి జరిగినా అది మరొక సంఘటనగా మాత్రమే ఉంటుంది అంతే . ఆ సంఘటనని మీలోని ప్రశాంతతకు ముడిపెట్టరు. ఒకవేళ ఎప్పుడయినా అలా సంఘటనని మీలోని
ప్రశాంతతతో సంబంధం ఉంది అని మీరు అనుకున్న క్షణం మీలో నిజమైన ప్రశాంతత రాలేదు. అని తెలుసుకోండి.
ప్రతి సంవత్సరం మేము వెళ్ళే హిమాలయాల యాత్రా సమయంలో కొంతమంది అక్కడ వుండే కష్టాల గురించి ఇబ్బందుల గురించి, అలాగే పరిశుభ్రత గురించి చాలా పిర్యాదులు చేస్తుంటారు. నేను వాళ్ళకి ఎన్నో సార్లు చెప్పాను. హిమాలయాలకి రావటం ఒక గొప్ప వరం. చాలా మందికి ఆ అదృష్టం ఉండదు. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని హాయిగా హిమాలయాల అద్భుత అందాలను చూసి ఆనందించండి. మిగతా విషయాలు వదిలివేయండి అని చెబుతాను. కానీ చాలా మంది వెంటనే చలించిపోయి ఇదే విషయాన్ని పదే పదే మాట్లాడుతుంటారు.
ఇటువంటి సందర్భంలో ఇద్దరు యువభక్తులు నా దగ్గరికి వచ్చి "స్వామిజీ! వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాని మాకు ఎక్కడా కష్టం అనిపించటంలేదు. మేము చాలా సంతోషంగా, ఆహ్లాదంగా ఉన్నాము" అన్నారు. ఇదే నేను మీకు చెప్పే విషయం. మీరు మీ అంతరంగంలో సంతోషంగా ఉండగలిగితే 'నీ శాంతి' 'నాశాంతి' అనేవి ఉండవు. అక్కడ ఏమి ఉంటే అదే వుంటుంది. అంతే. అక్కడ మీరు ఉంటారు. అవి ఉంటాయి దేనికి అది వేరే. ఒకదానికి మరొక దానికి ఏమి సంబంధం లేదు. మీ అంతట మీరు మీ పద్ధతిలో, మీ ఆనందంలో మీ ప్రశాంతతతో మీరు వెళుతుంటారు.
పిర్యాదులు ఇవ్వటం అనేది బాధకి సంబంధించిన విషయం. ఎందుకంటే మీరు ఇబ్బందిగా ఉండి మాటలలో ఇరుక్కుంటారు. హిమాలయాలలో తిరుగుతుంటే యోగులు, బ్రహ్మచారులు, ధ్యాన సాధకులు మొదలయిన వాళ్ళంతా కేవలం ఒక మంచి నీళ్ళ సీసా, రెండు జతల బట్టలు మాత్రమే దగ్గర పెట్టుకొని తిరుగుతుంటారు. మీకు తెలుసు, మీకు మీ దగ్గర ఉన్నవాటికంటే ఎక్కువగా ఏమీ అవసరం లేదు అని. కాబట్టి పిర్యాదులు చేయటానికి ఏమీ లేదు.
మరి ఎందుకు పిర్యాదులు చేస్తుంటారు. నిజానికి పిర్యాదులు ఎక్కువగా చేసే వారికి ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి. ఎక్కువ వస్తువులు ఉంటాయి. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అందుకే పిర్యాదులు చేస్తుంటారు. మీకు సౌకర్యాలన్నీ సమకూరినప్పుడు జీవనపోరాటం చేయవలసిన అవసరం లేదు. అప్పుడు మీకు పిర్యాదులు చేయటానికి చాలా సమయం దొరుకుతుంది. మీకు జీవనం అనేది సమస్యగా మారినప్పుడు ఉన్న సమయమంతా పని మీద కేంద్రీకరిస్తారు. అంతే కాని పిర్యాదులు చేయరు. ఎందుకంటే మీరు పిర్యాదులు చేయటం మొదలుపెడితే ఎవరు పనులు చేస్తారు.
హిమాలయాలలో నివసించాలి అంటే దానికి తగిన తత్త్వం ఉండాలి. ఆ పరిస్థితులలో ఇమడగలగాలి. మీరు ప్రతి క్షణం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులని ఎప్పటికప్పుడు గమినంచుకుంటూ ఉండాలి. అక్కడ అకస్మాత్తుగా మంచు పలకలు జారి పడుతుంటాయి. అవి మీ మీద ఎప్పుడడైని పడవచ్చు. ఉన్నట్టుండి మంచు ఎక్కువగా కురిసి మీకు తెలిసిన ప్రాంతమంతా కప్పబడిపోవచ్చు. ఆహారపదార్థాలు, అవసరమయిన సామాగ్రి ఒక్కొక్కసారి వారికి అందకపోవచ్చు. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి.
ఇటువంటి పరిస్థితులలో అక్కడ నివసించే ప్రజలని చూడండి. వాళ్ళు అమాయకంగా ఉంటారు. ఎప్పుడూ స్వాగతం పలికే చక్కని వ్యక్తులు, కానీ వాళ్ళు ఎప్పుడూ పిర్యాదులు చేయరు. మనం వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి. వాళ్ళు దేనిని తప్పుగా, చెడ్డగా చూడరు. వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తారు. అంతే వాళ్ళు రోజూ చేసే పనులని వారి చుట్టు ప్రక్కల పరిస్థితికి అనుగుణంగా తిరిగిమార్చుకుంటుంటారు. వాళ్ళు బాధ పడరు. పిర్యాదులు చేయరు.
మీరు మీ దగ్గర ఉన్నదానితో ఎందుకు ముందుకుసాగరు. ఇక్కడ పుట్టి పెరిగి అమెరికా వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇండియా వచ్చినప్పుడు అన్నీ పిర్యాదులే చేస్తుంటారు. బాత్రూంలు బాగాలేవు. రోడ్లు బాగాలేవు. ఇలా ఎన్నో అంటారు. మీకు ప్రపంచం గురించి బాగా తెలిసిన కొద్ది ఇంకా ఇంకా చాలా అంటారు. చాలా వివరాలు ఇస్తుంటారు. దాంతో పిర్యాదులు ఎక్కువ అవుతాయి. ఇంత మంచి లోకజ్ఞానంతో మీరు ఇంకా వికసించాలి కాని పిర్యాదులు చేయకూడదు. ప్రతి దానికి వంకలు పెట్టకూడదు. మీరు దేనినైనా లోతుగా అర్థం చేసుకుంటే ఇలా పిర్యాదులు ఇవ్వరు. ఈ అనంత సృష్టి ఎన్నో వరాలను మీ మీద కురిపిస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఏదో గొప్పవారని కాదు, ఈ సృష్టి సహజ లక్షణం ఎవరికైనా ఏమైనా ఇవ్వటమే. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే, మీరు పిర్యాధులు ఇవ్వరు. మీరెందుకు పిర్యాదులు ఇస్తారంటే, మీరు ఏదో చాలా పొందే అర్హులమని. అయితే మీ అర్హతలకి తగినన్ని మీకు దొరకలేదని మీరు అనుకున్నప్పుడు మీరు పిర్యాదులు ఇస్తారు.
స్పష్టంగా తెలుసుకోండి. ఈ అనంత చైతన్య సృష్టిలో ఎవరూ అర్హులుకారు అనర్హులూ కారు. ఎవరూ యోగులూ కారు, పాపులూ కారు. ఇదంతా ప్రకృతిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మీరు నడుచుకోవటమే. అప్పుడు ఈ అనంత సృష్టి మీకు చాలా బహుమతులని ఇస్తుంది. ఇదంతా కూడా మీరు వికసించి ఉంటే సృష్టి అన్నీ ఇస్తుంది. ఇదంతా కూడా మీరు లోతుగా అర్థంచేసుకోవటంలోనే ఉంది. అది మీ అంతరంగంలో మార్పుని ఇస్తుంది. మీరు వికసించి ఉంటే సృష్టి అన్ని ఇస్తుంది. ఈ సృష్టి మీకు నిరంతరం ఇస్తూనే ఉన్నది. కానీ మనకే వాటిని ఎలా స్వీకరించాలో (తీసుకోవాలో) తెలియదు. కానీ వాటి కోసం ఎప్పుడూ మరెక్కడో వెతుకుతుంటాము. మనం మణిపూరక చక్రంలో ఎంతగానో నిమగ్నమైపోతాము. మనం ఈ మాటలని సేకరించుకోవటంలో చాలా బిజీ అయిపోతాము.
మీరు మీతో ఉండగలగటం నేర్చుకుంటే మీరు ఈ అనంత చైతన్య సృష్టితో కూడా ఉండగలరు. కానీ మనం ఎప్పుడూ మనతో ఉండము. మనం నిరంతరం మనుషులతో శబ్దాలతో ఉంటాము. మనం మన ఉనికిని, వ్యక్తిత్వాన్ని ఇతరులలో చూస్తాం. కానీ మనలో చూడం. మనం మనతో ఉండటానికి భయపడిపోతాము. మనం మనతో ఉన్నప్పుడు కుంగిపోతాయి.
మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు ఒంటరిగా ఉండేవారు. అదే మీ సహజమైన నిజమైన లక్షణం కానీ ఆ తరువాత ఏమయింది? మీరు సంతోషంగా ఉండాలి అంటే మనుషులు కావాలి అని ఆలోచించటం మొదలుపెట్టారు. మీరు వాళ్ళతో కలసి నవ్వారు. కలిసి ఏడ్చారు. వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళ మూలాన బాధలు పడ్డారు. ఇలా ఎన్నో కానీ మీకు కేవలం మీతోనే ఉండగలిగి ఆనందాన్ని ఉత్సవంలా చేసుకోవటం మాత్రం తెలియదు.
మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నట్టు తెలుస్తుందో అప్పుడు మీరుపాకులాడటం పెనుగులాడటం మొదలు పెడతారు. మీ అంతరంగంలో వ్యర్ధపు మాటలు పెరిగిపోతాయి. మీ బాధలు కలతలు మిమ్ములను స్వాధీనం చేసుకుంటాయి. అప్పుడు మీరు ఎలా శబ్దాన్ని సృష్టించాలి అని ఆలోచిస్తారు లేదా ఎవరితోనైనా మాట్లాడాలని లేదా కంప్యూటర్లో చాట్ చేయాలని ఇలా ఎన్నో ఉపయోగంలేని విషయాలు వస్తాయి.
మీరు ఎప్పుడూ మనుషులతో, శబ్దాలతో ఉండాలనుకున్నారంటే మీరు మీతో ఉండటానికి భయపడుతున్నారు అని స్పష్టంగా తెలుస్తుంది. మీరు మీలోనికి చూసుకోవటానికి భయపడుతున్నప్పుడు బయట ప్రపంచంలోనికి చూస్తారు. ఎప్పుడయితే మీరు ధ్యానం చేస్తారో, మీకు నెమ్మదిగా, క్రమంగా ఈ సంతోషం కోసం ఇలా సంబంధాల మీద ఆధార పడనవసరం లేదు అని తెలుస్తుంది. మీకు మీరు చాలు. కాని మీరు మీతో ఉన్నప్పుడు శాంతిని పొందలేకపోతే మీరు అక్కడే ఉండిపోయి ఈ బంధాలలో చిక్కుకుపోతారు.
ముందుగా మీతో మీరు మంచి సంబంధాన్ని ఏర్పరుచుకోవాలి. ఎప్పుడయితే ఈ బంధం బలంగా స్థిరంగా ఉంటుందో బయటవారితో సంబంధాలు అంత ముఖ్యమైనవిగా అనిపించవు. ఇప్పటికిప్పుడు మీకు మీ పరిధిలో చాలా ముఖ్యమైన భాగం అనిపించేది కేవలం పరిధి మాత్రమే. మీరు పరిధి అనుకున్నది మాత్రం ముఖ్యభాగం. కాబట్టి మీరు ఈ పరిస్థితిని తిరగవేయాలి. దాని కోసం మీరు మీలోపలికి చూడగలగాలి. మీ లోపల శాంతిని నింపాలి.
దీని కోసం మీరు మీ మైండ్ వెనుకకి ధైర్యంగా వెళ్ళాలి. మీరు అందరికి అపాయింట్మెంట్ ఇస్తారు కానీ మీకు ఇచ్చుకోరు, వేరే వారికి అందుబాటులో ఉంటారు. ఎందుకంటే అది మీ అహాన్ని సంతోషపెడుతుంది. మీరు మీకు అందుబాటులో ఉండరు. ఎందుకంటే అసలు సత్యాలు పైకి వస్తాయని భయం. వాటిని భరించే శక్తి మీకు లేదు. పరమానందం కోసం ఎక్కడెక్కడో తప్పు అడ్రస్సుల దగ్గర వెతుకుతారు. ఆనందం దొరకలేదు అని పిర్యాదు చేస్తారు. మీకు నిజంగా పరమానందాన్ని పొందాలని ఉంటే మీరు దానిని తప్పకుండా పొందగలరు. కానీ మీకు ధైర్యం కావాలి.
నిజానికి మనందరం వెతికేది ఒక్కటే శాశ్వతానందం. అదే పరమానందం (Bliss) కానీ మనందరం కూడా దానిని తప్పు అడ్రస్ లో వెతుకుతున్నాము. నేను ఎవరినైనా ఒక యువవకుడిని నీకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే వెంటనే అతను డ్రగ్స్ లో అని చెబుతాను. అతను కూడా పరమానందాన్ని, శాశ్వతమైన శాంతినీ వెతుకున్నాడు. కానీ తప్పు దిశలో వెతుకుతున్నాడు.
మనం మన మార్గాల నుంచి చాలా దూరమైపోయాము. మన సహజమైన ఆలోచనా సరళి పూర్తిగా వ్యతిరేకపు ఆలోచనలతో నిండిపోయింది. సహజంగా ఉండవలసిన మన జీవితం ఎంతో భిన్నంగా తయారయింది. మత్తు మందులతో పరమానందాన్ని పొందగలరా? ఈ మత్తు పదార్థాలు వాడుతూ మిమ్ముల నుంచి మీరు తప్పించుకొని పారిపోతున్నారు. దీంతో మీ పరిస్థితి మరింత అధ్యాన్నంగా తయారవుతుంది. ఎందుకంటే త్వరలోనే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇదంతా కూడా ఎంత తెలివితక్కువగా ఉన్నదో అర్ధం చేసుకోండి.
ఇదంతా చాలా తెలివి లేని విషయంలా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా విపరీతమైన విషయం. ఇది మీ నైతికతన (నీతి నియమాలను) కాలుస్తుంది. అందుకే ఇది మీకు ఒక దెబ్బలా తగులుతుంది. కానీ మీ చిన్న చిన్న ఇతర పనులు సంతోషాన్ని వెతికే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ అవి పూర్తిగా చేరే స్థాయిలో, అంతగా అవినీతి లేని స్థాయిలోనూ ఉంటాయి. అందుకే మీరు అవి తెలివి తక్కువ పనులు అనుకోరు. మీకు కాస్త సమయం దొరికినప్పుడు
మీ మైండ్ నిర్వహణని చేపట్టండి. అప్పుడు మీకు నేను ఏమి చెప్పటానికి ప్రయత్నిస్తున్నారో అర్థం అవుతుంది.
మీరు మీ అంతరంగంలోనికి తెలుసుకునే తత్వంతో చూడండి. మీ మైండ్ ఎలా పనిచేస్తుందో గమనించండి. మీ బాధలు అందులో ఎలా నాటబడతాయో చూడండి. మనం నిరంతరం మాటలు పోగుచేసుకుంటూ కొత్త నిర్ణయాలు అభిప్రాయాలు సృష్టించుకుంటూ, వాటిని పదే పదే మనన చేసుకుంటూ వెళతాము. ఇవే బాధలుగా మారి మనలో నాటబడి బలంగా తయారవుతాయి.
ఒక రోజు మీ అబ్బాయి ఇంటికి ఆలస్యంగా వచ్చాడనుకోండి. కేవలం ఆ రోజే అలా జరిగిందనుకోండి. వెంటనే మీరు ఆ అబ్బాయి గురించి ఏమేమో ఊహించేసుకుంటారు. ఇప్పటి వరకు చెడ్డ వాళ్ళ సహవాసంలో ఉన్నడేమో, అందుకే ఆలస్యమైంది అనుకుంటారు. ఇది మీ మైండ్‌లో రికార్డు అయిపోతుంది. మరొక రోజు మీ అబ్బాయి కాలేజీలో ఏదో క్లాసుకు అటెండ్ అయి ఆలస్యంగా వచ్చాడనుకోండి. మీరు అంతకుముందు రికార్డు చేసుకున్నది పైకి వస్తుంది. దానికి తగినట్టు మీ అబ్బాయితో మీ ప్రవర్తన ఉంటుంది.
దీని వలన మీ అబ్బాయి మానసిక క్షోభ చెందటమే కాదు అతనిని మీ పట్ల మొండివాడుగా అవిధేయుడిగా తయారు చేస్తుంది. దీంతో అతను మీ మీద తిరగబడతాడు. ఈ సందర్భంలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పరిణితి చెందుతారు. వారంతట వారు నిలబడతారు. అప్పుడు మీరు మీ ఊహల పరిధిలో ఉండిపోతే అది ఏవిధంగా కూడా మీకు సహాయపడదు.
ఊహలలో బ్రతకడం చాలా తేలిక. మీకు చెబుతున్నాను. మీరు నిజమని అని నమ్మే వాటిలో 98% తప్పులే. మీకు ఇతరులకి మధ్యపెద్ద తెర ఉన్నది, అనే విషయం మీరు తెలుసుకుంటారు. మీరు ఆకుపచ్చ కళ్ళ అద్దాలు పెట్టుకుంటే, ప్రపంచమంతా మీకు ఆకుపచ్చగా కనిపిస్తుంది. అంతే.
మొహమ్మద్ నాబి ఇలా చెబుతారు. “ మీరు ప్రపంచాన్ని ఏదో ఒకటి అన్నట్టుగా చూస్తే, ఆ ఏదో ఒకటి మీరే” మీరు ఎవరిగురించైనా నాతో మాట్లాడినా లేదా పిర్యాదు చేసినా, మీరు ఏదో బాధపడుతున్నారు అని అర్ధం. అందుకే మీరు ఈ విషయలన్నీ నాకు చెబుతారు. మీరు నిజానికి మీ మైండ్‌ని సృష్టంగా చూపిస్తారు. ఎందుకంటే మీరు ఏ విషయాలని ఎలా చూడాలి అనుకుంటారో అలానే చూస్తారు. అంతే కాని వాటిని వాటిలా చూడరు. మీరు ఎలా చూడాలనుకుంటే అలానే చూసేటప్పుడు చాలా పొగొట్టుకుంటారు. మీకు నిజంగా జరిగిన ఒక సంఘటన చెబుతాను
కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆశ్రమం నుంచి సిటీకి వెళ్ళటానికి ఒకే డ్రయివరుని తీసుకెళ్ళేవాడిని. ఒక రోజు నేను ఒక వీధికి వెళ్ళాలి. అ డ్రయివరుకి ఆ వీధి అడ్రస్ గుర్తులు చెబుతూ, ఆ వీధి దగ్గర ఒక మసీదు ఉన్నది అనిచెప్పాను.
దానికి అతను ఆ వీధిలో మసీదు లేదు అన్నాడు
అప్పుడు అతనికి నేను మసీదు దగ్గరే ఉన్న పెద్ద హోటల్ గురించి చెప్పాను. అతను అదికూడా తెలియదు అన్నాడు. అప్పుడు అతనికి అక్కడే ఉన్న హనుమాన్ గుడిని గుర్తుచేశాను. వెంటనే అతడు తనకి ఆ వీధి తెలుసు అన్నాడు.
ఆతరువాత ఆ వీధిలోనికి వెళ్ళాము. అతనికి నేను మసీదు చూపించాను. అది హనుమాన్‌గుడి ప్రక్కనే ఉన్నది. ఆ మసీదు గుడికంటే ఐదురెట్లు పెద్దది.ఆ డ్రయివర్ ఆశ్చర్యపోయాడు. అతను ఒక దృడమైన హిందూ అభిమాని. అన్ని నెలల లోనూ అతను ఆ మసీదుని గమనించలేదు.
మీకు చెబుతున్నాను. మీకు మూఢ భక్తి ఉండకూడదు. దేనినీ అతిగా పట్టుకుని వేలాడకూడదు.
మీరు ఒక నదిని చూడండి : మీరు అందులో మొదటిసారి కాలుపెట్టి తీసివేయండి. మరలా రెండవసారి కాలుపెట్టండి. ఇప్పుడు అది ఇందాకటిదేనా? కాదు. ఆ నది మారిపోయింది. ఇందాకటి నీరు అక్కడలేదు. కొత్తనీరు వచ్చింది అవును కదా?
అందుకే మిమ్మలని మీరు ఏదో ఒక దానిలో గుర్తింపబడేటట్టు చేసుకోకండి. జీవితం నిరంతరం మారిపోతూ ఉంటుంది. మీరు మీ ఇరుకైన నమ్మకాల పరిధిలో ఉండిపోతే మీలో ఆధ్యాత్మిక వెల్లివిరియదు. అది ఎటువంటి అభివృద్ధి లేకుండా ఆగిపోతుంది. అప్పుడు కళ్ళకు గంతలు కట్టబడిన గుఱ్ఱానికి ఎలా అయితే రోడ్డు మొత్తం కనబడదో మీరు కూడా అలానే అయిపోతారు.
జీవితానికి విశాలమైన దృక్పథం అవసరం
మనపూర్వీకులు మనకి చాలా అద్భుతమయిన ఆహారాన్ని ఇచ్చారు. కానీ దాని రుచి చూడటానికి తగిన నాలుకని ఇవ్వలేదు. ఈ ప్రపంచాన్ని ఆనందంగా అనుభవించటం అనేది మీపైనే ఉంది. కానీ బయట ప్రపంచంలోని వస్తువులలో లేదు. దీనిని మీరు స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. మీ మానసిక స్థితి, దాని రూపం అనేది మీ జీవితాన్ని సంతోషమయం కానీ, దుఃఖమయం కానీ చేయగలదు.
మీరు మీ ప్రస్తుత మానసిక స్థితితో పూర్తి సంతోషంగా ఉండగలిగితే చాలా మంచిది. అలా కాకుండా దానిని కొంచెం చక్కదిద్దాలి అనుకుంటే ఎక్కడో ఒక చోట ఒకసమస్య ఉంది అని అర్ధం. మొక్కలకి అప్పుడప్పుడూ కొమ్మలు కత్తిరిస్తుంటే (ట్రిమ్ చేస్తే) అవి బలంగా పెరుగుతాయి. అలాగే మీ మానసిక రూపాన్ని కూడా అప్పుడప్పుడు చక్కదిద్దుతూ ఉండాలి.
మీకు స్వచ్ఛమైన మానసిక రూపం ఉంటే మీకు సమస్యలే ఉండవు. మీరు ఎప్పుడయితే కష్టమయిన ఆలోచనా ధోరణులు చాలా మాటలుతో తికమకపడతారో అప్పుడే బాధపడతారు. నేనెప్పుడు చెబుతుంటాను. మీకు మీ మీద నమ్మకం లేనప్పుడు మీరు గ్రహాల గురించి బాధపడతారు. అప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది? అది మీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అనే విషయాలని విశ్లేషించుతుంటారు. కానీ అసలు సమస్య ఏమిటంటే మీరు మీ మీద శ్రద్ధ చూపరు.
మీకు సమయం దొరికినప్పుడు మీ మైండ్పైన పనిచేయండి. మీ మైండ్ లోపలికి చూసి దానిని చక్కగా ఉంచుకోండి. మీరు మీ మైండ్‌తో 24 గంటలూ ఉంటారు. అవును కదా? మరి దానిని పరిశుభ్రంగా ఎందుకు ఉంచుకోరు.
నాకు ఇల్లు ఉంది అని గర్వపడే ఇంటి యాజమానిని చూసాను. వాళ్ళు ఇంటిని చాలా అందంగా ఉంచుతారు. వ్యాక్యూం క్లీనరు ఉపయోగించి ఇంటిలో ఎక్కడా కొంచెం దుమ్ము ధూళీ కూడా లేకుండా చేస్తారు. ఇంటిలో ఎక్కడా కొంచం దుమ్ము ఉన్నా వాళ్ళు భరించలేరు. వాళ్ళు కార్పెట్ ని చిల్లులుపడేలా శుభ్రం చేస్తారు. మరి మీరు 24 గంటలూ ఉండే ఇంటి శుభ్రత మాట ఏమిటి? అదే మీ మైండ్ సంగతి? మీరు దీనితో 24 గంటలూ ఉంటారు. మీ ప్రతి ఆలోచనలోను ప్రతి పనిలోనూ మీ మైండ్ నిమగ్నమవుతుంది.
మీ ఇంటిని స్వచ్ఛంగా శక్తిమయంగా ఉంచటానికి మీరు వాస్తు శాస్త్రం అంటే, మీ ఇంటిని శక్తితో నింపే శాస్త్రాన్ని తీసుకువస్తారు. కానీ మీరు ఒక విషయాన్ని మాత్రం అర్ధం చేసుకోరు. మీరు మీ ఇంటిని నిరంతరం శక్తిమయం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు నిరంతరం దానిని మీ వ్యతిరేకపు ఆలోచనలతో కల్మషం చేస్తుంటారు కాబట్టి. ఇది సత్యం
మీరు ఎప్పుడయితే మీ ఇంటి లోపలి భాగాన్ని మీ వ్యతిరేకపు ఆలోచనలో, మీ బాధలతో కల్మషం చేస్తారో అప్పుడు అది ఈ వ్యతిరేకపు ఆలోచనలని మీ మీదకి ప్రసరించేటట్టు చేస్తుంది. దాంతో మీరు ఎప్పుడయితే మీ ఇంటి లోపలికి వస్తారో, అప్పుడు మీరు ఈ వ్యతిరేకపు ఆలోచనల విషవలయంలో చిక్కుకుపోతారు.
మీరు ఎన్ని సార్లు అనుకొని ఉంటారు, ఇంటిలోపలికి వచ్చే వరకూ బాగానే ఉన్నాను అని? మీరు ఇంటిలోపలికిరాగానే మీకు బాగా తెలిసిన వ్యతిరేకపు ఆలోచనల క్రమంలో ఇరుక్కుపోయినట్టు అనుకుంటారు. ఇదంతా కేవలం మీరు ఇంటి నిండా నింపిన వ్యతిరేకపు ఆలోచనలు కారణంగా అలా జరుగుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? వాస్తు శాస్త్రం తెలిసిన పండితులని పిలుచుకు వచ్చి ఇంటికి మార్పులు చేయించుతారు. గుడిలో పూజారిని పిలిపించి అన్ని రకాల పూజలు చేయించి ఇంటిని శుభ్రపరుస్తారు.
ఇవన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా చేస్తే ఇవి చాలా వరకూ మీరు అనుకున్న విధంగా ఉపయోగపడతాయి. కానీ మీరు మరొక విషయం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా కేవలం అనుబంధ పద్ధతులు మాత్రమే. అసలు మిమ్మలను మీరు శుభ్రపరచుకోండి. మీలోని పరమానందాన్ని నలుదిశలా వెదజల్లండి. అప్పుడు దానంతట అదే ఇల్లుమొత్తం ఈ పరమానందాన్ని వ్యాప్తింపచేస్తుంది.
ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో "నీకు జరిగిపోయిన కాలానికి ఇప్పటికి ఉన్నతేడా ఏమిటి? అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి "ఇది వరకు నేను నేల మీద చాప వేసుకొని భోజనం చేసేవాడిని ఇప్పుడు టేబుల్‌పైన భోజనం చేస్తున్నాను." అన్నాడు
చూడండి : ఇదివరలోనూ ఇప్పుడూ కూడా అతని నోరు ఒక్కటే. మీలో బలీయమైన మార్పు రాకపోతే జీవితంలో పెద్ద తేడా ఉండదు. ఇది ఎలా అంటే అందం చూసే వారి కళ్ళలో ఉంటుంది. రుచి తినే వారి నాలుక మీద ఉంటుంది. అందుకే మీ మానసిక స్థితి, దాని రూపం మీ జీవితపు నాణ్యతని నిర్ణయిస్తుంది.
చాలాసార్లు మనం మారవలసిన పరిస్థితి వస్తుంది. కానీ మనం ఏదో ఒక విధంగా ఉన్న స్థితిలోనే సౌకర్యంగా సర్దుకుపోతాయి. ఆ చక్రపు పరిధిలోనే మరలా ఇరుక్కుపోతాము. మనలోని ఒక భాగం మనం మారాలి అని సూచిస్తుంది. మరొక భాగం మనకి తెలియకుండానే మనకి తెలిసి పాతక్రమాలలోనికి జారుతుంటుంది. మీరు మారటానికి చాలా అవకాశాలు ఇచ్చినా మీరు ప్రస్తుత స్థితిలోనే ఉంటారు. మిగతా చక్కటి అవకాశాలు కోల్పోతారు.
మీ మానసిక రూపం మీకు ఒక ఘనమైన సత్యంలా ఉంటుంది. అది దాని లక్షణాలని చక్కగా అన్ని వైపులా వ్యాపింప చేస్తూ ఉంటుంది. దానిని మార్చటానికి ప్రయత్నించండి.
మీకు ఒక విషయం చెబుతాను. మీరు అలాంటి మానసిక స్థితిలో ఉండిపోతే దాని వలన మరొక ప్రమాదం కూడా ఉన్నది. మీ పిల్లలు కూడా అవే పద్దతులను అలవాటు చేసుకునే అవకాశాలు ఎక్కువ. ఇది మరీ ప్రమాదకరం.
ఒక భార్య భర్త ఇద్దరూ జేబు దొంగలే, వాళ్ళు తమకి పిల్లలు పుడితే చాలా బాగుంటుంది అనుకునే వాళ్ళు. కొంతకాలానికి వాళ్ళకి ఒకపాప పుట్టింది.
అప్పుడే పుట్టిన ఆ పాప కుడి చేయి గుప్పిట గట్టిగా మూసుకొని ఉంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ పాప గుప్పిట తెరవదు. అప్పుడు డాక్టరు వచ్చి చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు. అయినా ఆ పాప గుప్పిట తెరవదు. చివరిగా ఆ డాక్టరు తన బంగారు గొలుసు తీసి పాప కళ్ళ ముందు అటూ ఇటూ తిప్పుతాడు. అప్పుడు పాప నెమ్మదిగా తన చేతిని విప్పుతుంది. ఆ చేతులో నర్సు బంగారు ఉంగరం ఉంటుంది
(అంతా పెద్ద నవ్వుతారు)
ఇది కేవలం ఒక జోక్ మాత్రమే కానీ తల్లిదండ్రుల మానసిక స్థితి, ఆ లక్షణాలు పిల్లలకి కూడా వస్తాయి. ఈవిషయం మీరు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ విషయాన్ని మీరు ప్రతి క్షణం అప్రమత్తతతో గుర్తుంచుకోండి. ఈ విషయం గురించి మీ చేతనావస్థలో బాగా తెలుసుకోగలిగేలా చేయండి. మీ అంతరంగంలోని వ్యర్ధపు మాటలని శుభ్రపరచుకోండి
మనం నిరంతరం పిల్లలని నియంత్రిస్తూ వాళ్ళని మన చేతుల్లో తోలు బొమ్మలలా తయారు చేస్తాము. పిల్లలు అమితమైన క్రమంలేని శక్తులు వంటివారు. అందుకే ఆశక్తిని ఒక డబ్బాలో ఇమిడ్చేస్తాము. అలా అయితేనే మనం వాళ్ళని నియంత్రించగలుగుతాము. అందుకే అలా చేస్తాము.
ఒక చిన్న కథ :
రెండు కుక్కలు రోడ్డు మీద వెళతూ ఉంటాయి. వాటిలో ఒకటి రెండవ దానితో "నాపేరు సాండీ నీ పేరు ఏమిటి" అంటుంది. రెండవది కొంచెం సేపు ఆలోచించి ఇలా అంటుంది. "నో..నో రోజర్ అనుకుంటా"
(అంతా నవ్వులు)
బహుశ : రెండవ కుక్క యాజమాని ఆ కుక్క ఏంచేసినా నో.. నో.. రోజర్ అనేవాడు అనుకుంటా. అంటే అది ఏదైనా చిలిపి పని చేయబోతే వద్దు.. వద్దు.... అంటాడు. అందుకే ఆ కుక్క తన పేరు నో...నో.... రోజర్ అనుకుంది. ఇలాగే పిల్లలు కూడా మన మాటలు, పనులు, మన శరీర భాష అంటే మన శరీరం యొక్క కదలికలు ద్వారా విషయాలని చెప్పటం ద్వారా మన నుంచి వచ్చే భావాలని వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలకి ఏదైనా ఆశ్చర్యంగా అనిపిస్తే వాళ్ళు వెంటనే మనం అంతకు ముందు మాట్లాడిన మాటలుకుగాని, పనులుకు గాని ఈ విషయాన్ని కలిపి దాన్ని ఆధారంగా వాఖ్యలు చేస్తుంటారు. అందుకే మీరు పిల్లలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ తెలివితేటలు సజీవంగా ఉండేటట్టు చూడండి. అంతే కాని వారి తెలివి తేటలకి అడ్డంకులు సృష్టించకండి. వాటిని అణచివేయకండి
సామాన్యంగా తల్లి కొన్ని రకాల నిబంధనలని పెడుతుంటుంది. ఉదాహరణకి వర్షం పడుతుందనుకోండి అమ్మ వెంటనే పిల్లలకి లోపలికి వచ్చేయమంటుంది. లేకపోతే జలుబు చేస్తుంది అని అంటుంది. ఆ విధంగా కొన్ని సార్లు అన్నదనుకోండి, ఆ మాటలు పిల్లల మైండ్‌లో రికార్డు అయిపోతాయి. వర్షంలోనికి వెళితే జలుబు చేస్తుంది అనేది ఉండిపోతుంది. ఎప్పుడైనా కొంచెం చినుకులు వాళ్ళమీద పడగానే వాళ్ళు తుమ్మటం మొదలుపెడతారు.
నిజానికి మనిషి శరీరం చాలా తెలివైనది. దానికి తనను తాను సరిదిద్దుకోవటం తెలుసు, ఏ మాత్రం చిన్న అనారోగ్యం వచ్చినా తనంతట తాను దానికి చికిత్స చేసుకోగలుగుతుంది. ఎందుకో గాని మనం మనమైండ్నే నమ్ముతాము కాని శరీరానికి ఉన్న తెలివి తేటలన్ని నమ్మం. ఇక్కడ మనకు అసలు సమస్యలు బాధలు మొదలు అయ్యేది.
ఒక కథ :
జూలో ఒక తండ్రి ఒంటె కొడుకు ఒంటెకు వాళ్ళ శరీర నిర్మాణం గురించి వివరిస్తూ ఉంటుంది. అది కొడుకుతో ఇలా చెబుతుంది
“నీకు తెలుసా! మనకి వీపుమీద పెద్ద మూపు ఉంటుంది. దాంట్లో మనం నీళ్ళు నిలువ చేసుకుంటాము. అప్పుడు మనం చాలా రోజులు ఎడారిలో ఉన్నా, నీళ్ళ విషయంలో మనకి ఇబ్బంది ఉండదు” కొడుకు ఒంటె అంటుంది “ అయితే మన కళ్ళ వెంట్రుకలు అంత పొడవుగా ఎందుకు ఉన్నాయి ” అని
దానికి తండ్రి ఒంటె ఇలా చెబుతుంది “ అవి ఎడారిలో వచ్చే ఇసుక తుపానలు నుంచి మన కళ్ళని కాపాడతాయి.
కొడుకు ఒంటె మళ్ళీ అడుగుతుంది “ మన పాదాలు అలా ఎందుకు ఉబ్బి ఉంటాయి” అని
“అవి మనం ఎడారిలో తొందరగా నడవటానికి” అని తండ్రి ఒంటె చెబుతుంది. దానికి కొడుకు ఒంటె “నాన్న! మరియితే మనం జూలో ఏంచేస్తున్నాము. ” అని అడుగుతుంది.
(అంతా నవ్వుతారు)
చూడండి : మన శరీరం చాలా చక్కగా తయారు చేయబడింది. దానిని సహజ సిద్ధంగా ఉంచితే తన సహజమైన తెలివితేటలతో చక్కగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడయితే దాని మీద నిబంధనలు రుద్దితే అప్పుడే మీకు కష్టాలు సమస్యలు మొదలవుతాయి.
హిమాలయాలలో యోగులు గుహలలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎండా, వర్షం మంచు ఏది వచ్చినా వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళ శరీరం అన్ని పరిస్థితులకి అనుగుణంగా దానంతట అదే సర్దుకుపోతుంది. మనం ప్రకృతిని, దానిలో ఉండే వ్యాధినిరోధక శక్తిని నమ్మితే చాలు. ఎందుకని మనం మన సమస్యలని, మానసిక స్థితిని మన శరీరం యొక్క పనుల మీద ఉపయోగిస్తాము. ఇదే మనకు ఉండే అన్ని రకాల వ్యాధులకి మూలకారణం.
గురువులు మీకు కొత్త మానసిక స్థితిని, మంచి మానసిక రూపాన్ని ఇవ్వగలరు. అది మీకు పునర్జన్మ. దీనిని మీరు గురుదేవుని సన్నిధిలో ఉండి ఆయన నుంచి గ్రహించి నేర్చుకోగలరు. ఎప్పుడయితే గురుదేవునిలోని శక్తి మీలో ప్రవహిస్తుందో మీ మానసిక స్థితిలో మార్పు వస్తుంది. అది మీకు పునర్జన్మ లాంటిది. మీలోనే ఉన్నది అని మీకు తెలియని ఒక కొత్త ప్రదేశంలోకి మీరు వెళ్ళ గలుగుతారు.
మీరు ఈవిధంగా తిరిగి జన్మించగలిగితే మీరు బాధలు, అనారోగ్యం భావావేశాలు ఇలాంటి వాటి చెర నుంచి స్వేచ్ఛ పొందుతారు. తరువాత ఇలాంటివి ఏవైనా మీకు జరిగితే మీరు ఇంతకు మునుపు లేని విధంగా వాటిని చక్కగా నియంత్రించగలుగుతారు. మీ లోపల, మీ చుట్టు ప్రక్కల జరిగే విషయాలను ఒక చక్కని పరిశీలకుడిగా మీరు గమనించగలుగుతారు.
ఇంతకు ముందు ఒక రోజు నేను మెడిటేషన్ ప్రోగ్రాం జరుగుతున్న హోటల్లో ఉన్నాను. అప్పుడు టి.వి.లో ఒక ఇండియన్ ఛానల్ పెట్టాను. అప్పుడు ఒక పాత సినిమాలో డ్యూయెట్ వస్తుంది. నేను మరొక ఇండియన్ ఛానల్ పెట్టాను. అక్కడ కొత్త సినిమాలో డ్యూయెట్ వస్తుంది. ఇది చూసి నా సెక్రటరీతో ఈ రెండు ఛానల్స్ ఏమి చూపించాయంటే అప్పటికి ఇప్పటికి మనిషి అచేతనావస్థలో ఎటువంటి అభివృద్ధి లేదు అని చెప్పాను. అతను నేను అన్నమాటికి ఆశ్చర్యపోయాడు. అవును అని అతను కూడా అంగీకరించాడు.
ఒకే రీతిలో విషయాలు, తిరిగి పదే పదే జరుగుతున్నాయి. అది ఎలా ఉంది అంటే తలుపులు మూసిన గదిలో ఒక బంతిని ఐదుగురు వ్యక్తులు తన్నుతుంటే ఆబంతి ఆ గదిలోనే తిరుగుతూ ఉంటుంది. కనీసం ఈ పశ్చిమ దేశాల వాళ్ళు ఎక్కడో తెలియని ప్రాంతాలకి వెళ్ళి పరిశోధనలు చేసి తిరిగి వెనక్కి వస్తారు. కనీసం వారికి సామాజిక తెలివితేటలు ఉంటాయి. కాకపోతే వారి సచేతనావస్థలో అంతగా అభివృద్ధి ఉండదు.
ఎప్పుడూ మనకి తెలిసిన ఒక క్రమంలో ఉండిపోతే మన తెలివితేటలకు జీవం లేకుండా పోతుంది. మన బాధలు అన్నీ కూడా ఇలా మనలో పేరుకు పోయిన మనకు పరిచితమైన విషయక్రమాలే. అవి మన మీద మళ్ళీ మళ్ళీ విధింపబడతాయి. అంతే.
నేను ఈ విషయాలు చెప్పినప్పుడు కొందరు అడుగుతుంటారు “స్వామీజీ! మీరు ఏం చెబుతున్నారో అర్ధమవుతుంది, కానీ నేను వాటిని అధిగమించలేకపోతున్నాను” అని అంటారు.
నేను మీకు ఒకటే చెబుతాను. నేను చెప్పే మాటలని మీ లోనికి వెళ్ళనివ్వండి. అవి మీలో ఒక చక్కని ప్రదేశాన్ని సృష్టించుతాయి. అంతే ఈ విషయంలోనే మీకు ధ్యానం చాలా సహాయం చేస్తుంది. నేను నా ధ్యాన కార్యక్రమాలలో ముందుగా ఈ విషయాలన్ని అర్ధమయ్యేట్టు చేసి, మీ ధ్యానం ద్వారా అవి మీలోపల పని చేసేటట్టుగా చూస్తారు.
కానీ కొంతమంది అంటుంటారు “స్వామీజీ! మాకు చాలా పనులు ఉంటాయి. కొన్ని బిల్లులు కట్టవలసి ఉంటాయి. కొన్నిటికి లాస్ట్ డేట్లు అయిపోతాయి. ఇలాంటి పనులతో మేము ధ్యానం ఎలా చేయగలుగుతాము?” నేను వాళ్ళకి ఒక చిన్న ధ్యాన పద్దతితో జవాబు చెప్పాను. మీరు బిల్లులు కట్టటానికి సమయం ఉన్నదో లేదో తెలియదు కాని మీరు శ్వాస తీసుకోవటానికి టైం ఉంటుంది కదా! అలా లేకపోతే జీవించలేము. ఇప్పుడు మీరు శ్వాసమీద దృష్టిని నిలపండి. అంతే. మీ శ్వాశని గమనించండి. ఇది చాలా చిన్నది అయినా శక్తివంతమైన ధ్యాన పద్దతి. మీరు తేలికగా ఈ ధ్యానాన్ని చేయగలరు.
మీరు ఎప్పుడూ ఈ ధ్యాన పద్దతిని గుర్తు పెట్టుకొని సాధన చేయండి. త్వరలోనే ఇది మీకు ఒక అలవాటుగా మారుతుంది. మీరు ఎప్పుడయితే మీ శ్వాస క్రమంలోనికి మీ తెలుసుకునే తత్వాన్ని ప్రవేశపెడతారో, ఎప్పుడయితే దానిని తెలుసుకోగలుగుతారో అప్పుడు మీరు వర్తమానంలో ఉంటారు. ఎప్పుడయితే మీరు ఈ క్షణంలో ఉండగలరో అది మిమ్ములని పరమానందం వైపు తీసుకుళుతుంది.
వర్తమానంతో ఉండటం అనే శక్తి మిమ్ములను సరాసరి పరమానందం వైపుకి తీసుకు వెళుతుంది. కేవలం ప్రతి శ్వాసపైన మీ దృష్టిని కేంద్రీకరించండి. అంతే.
కాబట్టి పరమానందాన్ని పొందాలి. అంటే దానికి ప్రత్యేకమైన సమయం మీరు కేటాయించనవసరం లేదు. మీరు వేరే సమయం తీసుకొని ధ్యానం చేసే ప్రత్యేకమైన గదిలోనికి వెళ్ళి ధ్యానం చేయనవసరం లేదు. దీనిని మీరు మీ దైనందిన పనులతో పాటు చేయవచ్చు. ఈ విషయాన్ని మీరు ఎంత బాగా తెలుసుకోగలిగితే మీ పనులని మీరు అంత సమర్ధతతో చేసుకోగలుగుతారు.
ధ్యానం అంటే మీ చేతనావస్థలో మార్పు తేవటం. ఇది మీలోని మీ అంతరంగంలోని శక్తిని మార్చటం. ఇది ఒక మూల పద్మాసనంలో తిన్నగా కూర్చొని మనస్సుని నియంత్రించటం కాదు. మీరు అలా చేస్తే మీకు మెడనొప్పి, వెన్ను నొప్పి వస్తాయి తప్పా మరే ఫలితం ఉండదు. అప్పుడు మీకు మరొక బాధ తయారవుతుంది "అయ్యో నేను కూర్చోలేకపోతున్నాను. నేను ధ్యానం చేయలేకపోతున్నాను" అని.
మీరు చేయవలసినది కేవలం ఇప్పుడు, ఇక్కడే ఈ క్షణాలలోనే, పూర్తి వర్తమానంలో జీవించటానికి ప్రయత్నించటం. మీరు వర్తమానంలో జీవించినప్పుడు ఈ అనంత సృష్టిని చూసి ఆనందించగలుగుతారు. మీరు వర్తమానంలో ఉంటే ఈ సృష్టికి అనుగుణంగా సాగిపోగలుగుతారు. మీరు వర్తమానంలో ఉన్నప్పుడు ఈ అనంత చైతన్య సృష్టి మీకు అన్నీ నేర్పిస్తుంది. ఈ సృష్టి గొప్ప గురువు. జీవితమే గొప్ప గురువు అని చెప్పే మాటలకి అర్ధం అదే. ఇది మీరు పొగొట్టుకుంటే నేర్చుకోవటానికి మీకు ఇష్టమయినంత సమయాన్ని మీరు తీసుకుంటారు. అటువంటప్పుడు అది మీకు కొన్ని షాక్ లు ఇస్తుంటుంది. అప్పుడు మేలుకొని తొందరగా నేర్చుకుంటారు. లేదా మీరు ఈ విషయాలన్ని జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటారు.
ఇప్పుడు చూడండి, మీరు జరిగిపోయిన వాటివైపు విచారంతో పరిగెడుతున్నారు, లేదా జరగబోయే వాటి వెంట ఆతృతతో పరిగెడుతున్నారు. ఇటువంటి దృక్పధం వలన మీరు వర్తమానాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందంటే
మీరు ఎప్పుడూ ఏ పనీ సరిగా చేయరు. మీరు కేవలం మీ పాత జ్ఞాపకాల ఆధారంగా గాని లేదా భవిష్యత్ మీద ఉండే ఆతృతతో గాని ఇప్పటి విషయాలని స్పందించుతారు. మీరు కేవలం ఒక రోబోటులా లేదా కీ ఇచ్చిన బొమ్మలా ప్రవర్తించుతారు. మీరు కేవలం గుడ్డిగా తర్కాన్ని అనుసరించారు, తప్ప మీ తెలివితేటలని మీలోని చేతనని ఉపయోగించుకోరు.
మీలోని 80% శక్తి భూత భవిష్యత్ కాలంలో బంధించబడింది. కేవలం 20% శక్తి మాత్రమే మీకు మీ వర్తమానంలో దొరుకుతుంది. అందుకే మీరు నీరసంగా నిర్జీవంగా ఉంటారు. మీరు ఈ విషయాన్ని మీలోతైన అంతరంగంలోని చేతనావస్థలో తెలుసుకోగలిగితే, ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ జీవితం మంచి ఉన్నత స్థితిలో ఉంటుంది. అది ఎంతో పరమానందంతోనూ సంతోషంతోను, ఉత్సాహంగానూ ఉంటుంది.
ఒక ప్రశ్న: స్వామీజీ! మీరు చెబుతున్నట్టుగా మేము కేవలం మా శ్వాసమీద ధ్యాస నిలిపి పరమానందాన్ని పొందగలమా?
అవును. ఇది చాలా శక్తివంతమైన ధ్యాన పద్ధతి. చూడండి మీరు మీ శ్వాశని గమనించేటప్పుడు మీలోని చేతనావస్థ చాలా చురుకుగా వుంటుంది. దాంతో మీ ఏ ఆలోచనా కూడా మీకు తెలియకుండా వెళ్ళవు. ఎప్పుడయితే ఒక ఆలోచన మీనుంచి వెళుతుంది, అని తెలుసుకుంటారో అప్పుడు మీరు వ్యతిరేకపు ఆలోచనలు రానీయకుండా చూసుకుంటారు.
ఈ ఆలోచనలని సరిదిద్దటానికి మీరు ఏమీ చేయవసరం లేదు. దాని కోసం మీరు ఏమి సమయాన్ని వినియోగించనవసరం లేదు. మీ చేతనావస్థ అన్ని చూసుకుంటుంది. మీ ఆలోచనా పద్ధతి దానంతట అదే తిరిగి నిర్మించబడుతుంది. మీ చేతనావస్థ యొక్క శక్తి మీ ఆలోచనలని సరియైన పాజిటివ్ శక్తిగా మార్చేస్తుంది.
మీరు గనుక గమనిస్తే తెలుస్తుంది, మనం ఎలా ఆలోచించాలి అని నేర్పించారంటే కేవలం మనం పనిచేస్తేనే, లేదా ఏదో ఒక రూపంలో బాధని అనుభవిస్తేనే మనం సంతోషానికి అర్హులం అని. కాబట్టి మనం దెబ్బ తగిలి బాధపడే వరకూ పరిగెడుతుంటాము. మనం గోడకి గుద్దుకుని దెబ్బ తగిలే వరకూ పరిగెడతాం. ఈ విషయానికి మనం ఎంత అలవాటు పడిపోయామంటే అక్కడ గోడ లేదు, అక్కడ హద్దులేవి లేవు అని చెప్పినా మనం నమ్మలేము. మనం పెరిగెత్తి దేనికో గుద్దుకొని దెబ్బ తగిలించుకోని బాధ పడి అప్పుడు ఆగుతాం. ఆబాధతో చాలా తృప్తిపడతాం. అప్పుడు మన కోర్కెలు తీరుతాయి అని అనుకుంటాం. ఏదైనా సంతోషం పొందాలి అంటే మనం తప్పని సరిగా ఆందోళన పడాలి, బాధ పడాలి, అని అనుకుంటాము. మనం శ్వాశతత్వాన్ని పొందటానికి బాధలు కష్టాలు అవసరం అనుకుంటాం.
కొంతమంది ఉంటారు. వాళ్ళంతటవాళ్ళు కష్టాలను సృష్టించుకుని, అవి మర్చిపోవటానికి తాగుడికి బానిస అవుతారు. అది ఈ రోజుల్లో సర్వ సామాన్యమైపోయింది. ఇది ఎలా ఉంటుందంటే ఒకపంది మురికిలోని చెడ్డ వాసనని భరించలేక దాని ముక్కుని ఆ మురికి లోపలికి పెట్టేసినట్టుగా ఉంటుంది. మీరనుకుంటారు తాగటంవలన మీ బాధలన్నీ జయించానని, కానీ నిజానికి ఆ బాధలలోనికే మీ తలని పూర్తిగా ముంచేస్తారు.
మనం మనకి ఏదో కావాలి అనుకొని దానికి పూర్తిగా పరస్పర వ్యతిరేక ఫలితాలను మనకి మనమే సృష్టించుకుంటాము. దీనితో మనకి బాధలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇది అసలయిన సమస్య. కానీ మనం దీనిని తెలుసుకోలేము.
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తి ఒకరి ఇంటికి పిలవని అతిథిలా వస్తాడు. అతనిని చూసి ఆ ఇంటాయన గట్టిగా భార్యతో కాఫీతీసుకురా అంటాడు. భార్య అంతకంటే గట్టిగా ఇవాళ ఇంట్లో కాఫీలేదు. కొనటానికి డబ్బులు కూడా లేవు అని అరుస్తుంది
భర్తకి చాలా కోపం వచ్చి ఆమెని బాగా తిట్టి, చివరికి చెంపమీద కొడతాడు, దాంతో భార్య ఏడుస్తుంది. వచ్చిన అతిధి ఇదంతా గమనించి మెల్లగా బయటికి వెళ్ళిపోతాడు.
అప్పుడు భార్య కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ భర్తతో “ చూసారా నేను ఎంత బాగా ఏడ్చినట్టు నటించి అనిని పంపేశానో”, అంటుంది
దానికి భర్త “ బాగుంది నేను నీ మీద కోపాన్ని ఎంత బాగా చూపించి నిన్ను ఏడ్పించాను, కదా! అంటాడు.
అప్పుడు అతిథిలోపలికి వచ్చి “ నేను బయటికి వెళ్ళిపోయినట్టు నటించి మళ్ళీ చక్కగా లోపలికి వచ్చేసాను. కదా!” అంటాడు
(అంతా నవ్వులు)
మన ఆలోచనలకి మన మాటలకి సంబంధం ఉండదు. అందుకే మనం జీవించే జీవితంలో జీవనాన్ని కోల్పోతాము. రామకృష్ణ పరమహంస ఇలా చెబుతారు “ మన ఆలోచనలని, మన మాటలని కలపటం అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవటంలాంటిది” అని
కానీ మనం ఏం చేస్తున్నాము? మన ఆలోచనలని తీసివేసి మన మాటలని బయటకి తెస్తున్నాం. ఆ మాటలు బయటికి వచ్చే ముందు మనం చాలా లెక్కలు కడతాము. అక్కడ లాభ నష్టాలని తేల్చుకుంటాము. తరువాత భవిష్యత్ లోనికి వెళ్లి ఆ మాటల ప్రభావాన్ని విశ్లేషించుతాము. ఆ తరువాతే మాట్లాడతాము. మన వ్యక్తిత్వం ఎప్పుడూ దీనితో కలవదు. అందుకే ఇది మన వ్యక్తిత్వాన్ని విభజిస్తుంది. మనం అలా విభజింపబడి ఉంటాము.
చాలా మంది నన్ను అడుగుతుంటారు. ఇటువంటి విషయాలను ముందుగా తయారు చేసుకోకుండా ఇలా నిరంతరం ఎలా మాట్లాడగలుగుతారు. నేను ఏ విషయాన్ని ముందుగా తయారు చేసుకొని పెట్టుకోను. నేను సత్యాన్ని సత్యంలా (ఉన్నది ఉన్నట్టుగా) అసంకల్పితంగా, యధాతధంగా మాట్లాడతాను. నిజాన్ని బయటకి చెప్పటానికి నేను బాధ పడను. నాలోంచి వచ్చే మాటలని ఎప్పుడూ ఎడిట్ చేయను (అవసరమైనవి తీసివేయటం ఎడిట్) నా ఆలోచనలే నా మాటలు. కానీ మీరు ముందు ఆలోచించుతారు. తరువాత అనవసరం, నష్టం అనుకునే మాటలని తీసివేస్తారు. ఆ తరువాతే మాట్లాడతారు. మీ మాటల్లో అమాయకత్వం ఉండదు. మీరు చాలా మాటలలో చిక్కుకుపోతారు కూడా.
నేను మాట్లాడేప్పుడు మీరు ఎన్ని గంటలైనా వింటారు. ఎందుకంటే నేను అప్రయత్నంగా, అసంకల్పితంగా మాట్లాడతాను. లేకపోతే మీరు మీ మానసిక స్థితిలో స్థిరపడిపోతారు. మీరు ఒకే విధమైన మైండ్‌తో ఉంటారు.
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తి తన ఇంట్లో నిద్రపోవటానికి చాలా ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకంటే అతని ప్రక్క ఇంటిలో కుక్కలు మొరుగుతూ ఉన్నాయి. ఇలా చాలా రాత్రులు గడిచాయి. చివరికి అతను ప్రక్కింటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కుక్కల గురించి ఫిర్యాదు చేస్తాడు. కానీ ఆ యాజమాని ఏమీ పట్టించుకోకుండా “నేనేం చేయలేను. నీవు ఏం చేద్దాం అనుకుంటున్నావు” అని అంటారు.
దానికి ఆ వ్యక్తి “ సరే ఈ రాత్రికి వాటిని నా ఇంటి వెనుక స్థలంలో కట్టేస్తాను అప్పుడు తెలుస్తుంది” అంటాడు
మీరు ఆలోచించండి. ఆ వ్యక్తి మాటలు ఎంత తెలివి తక్కువగా ఉన్నాయో కదా! అతను మళ్ళీ మళ్ళీ అదే సమస్యలోనికి వెళుతున్నాడు. ఇంక అతనికి పరిష్కారం ఎలా దొరుకుతుంది. మీరు అప్రయత్నంగా ఉంటే మీరు ఒక్కక్షణం కూడా సవాలును ఎదుర్కొనరు. మీకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. మీరు అసంకల్పితంగా స్పందించగలిగితే ఎటువంటి ఇబ్బంది నుంచైనా దూకేయగలరు. మీరు క్రిందికి రెక్కలు కట్టుకొని జాగ్రత్తగా దిగుతారు.
ప్రశ్న: స్వామీజీ! మా జీవితంలో ఇన్ని సమస్యలు ఇంత ఆందోళన ఉండటానికి మూలకారణం ఏమిటి?
మీరు ఈ ప్రశ్న అడిగారు అంటే అర్ధం, మీరు ఈ విషయాన్ని లోతుగా తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చారు అని.
చూడండి. మనం ప్రతి విషయంలోనూ కొంత ఊహలతో ఉంటాము. ఈ ఊహలు మన చుట్టూ ఉన్న మనుషుల విషయమై ఉండవచ్చు. పరిసరాల విషయమై ఉండవచ్చు. మనకి ఎదురైన సంఘటనలు విషయమై ఉండవచ్చు. లేదా మనం అనుసరించే జీవన సరళి అయి ఉండవచ్చు. మనం నిరంతరం ఏవో ఊహాలోకాల్లో ఉంటూ మనం ఊహించినట్టుగా ప్రతీది జరగాలి అని కోరుకుంటుంటాం. కానీ నిజం ఊహలకంటే చాలా వేరుగా ఉంటుంది. నిజాలకి, ఊహలకి మధ్య ఉండే ఖాళీలే మన ఆందోళనలకి సమస్యలకి కారణం. మనం నిజముకాని ఊహలాంటి ప్రపంచాన్ని మనలో నిర్మించుకుంటాము. మనం దానిని పొందటానికి నిరంతరం నిజమువైపు చూస్తుంటాము. నిజానికి మన ఊహలకి మధ్య ఖాళీ పెరిగే కొద్దీ మనలో ఆందోళన, కంగారు పెరిగిపోతుంటాయి.
మనం ఎప్పుడు కూడా మన ఊహలని సాధించే పాయింట్ దగ్గరకి, ఎప్పటికై చేరుకుంటాము అని అనుకుంటాము. మనం ఆ పాయింట్ దగ్గరకు చేరగానే మన ఊహలు ఇంకా ముందుకు సాగిపోతాయి.కాబట్టి మనం ఎప్పటికీ ఆ పాయింటిని చేరం. ఇదే మనకి ఆందోళన, బాధ, మానసిక క్షోభలని కలిగిస్తుంది.
కానీ విషయమేమింటే : మనం ఊహలలో, ఊహలతో పని చేస్తున్నామని మనకి తెలియదు. మన ఊహలు ఎంతగా మనలో గట్టిపడియాయంటే మనం వాటిని చూసి అవి ఊహలు అని అనుకోము. మనం వాటిలో పూర్తిగా చిక్కుకుపోతాము.
స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు ఏదైనా దేని గురించైనా పని చేసేటప్పుడు మీకు కంగారుగాను, ఆందోళనగాను, ఉందనుకోండి. మీరు నిజంలో పని చేయటం లేదు అని అర్థం. మీరు మీ ఊహల పరిధిలలో పని చేస్తున్నారు అని అర్థం.
ప్రతి క్షణం మనం మన ఆశలని కోరకలని బయట ప్రపంచంలో సాధించాలి అని చుస్తూంటాము. మనం ఊహించిన విధంగా బయటవాళ్ళు స్పందించకపోతే మనం కుంగిపోతాము. ఇది మన అంతరంగములో మనకు తెలియకుండా జరిగే కార్యక్రమం. అందుకే మన ఆందోళనకి కారణం మనకి తెలియదు. కారణం అనేది మొత్తం విషయంలో సూక్ష్మంగా కలిసిపోయి ఉంటుంది. అందుకే మనం దానిని గుర్తించలేము.
మీరు ఈవిషయంలో పూర్తిగా, కచ్చితంగా తెలుసుకోగలిగి మిమ్మలని మీరు కొన్ని గంటల పాటు గమనించగలిగితే అప్పుడు మీ మైండ్ ఎలా పని చేస్తుందో మీరు తెలుసుకోగలరు. మీరు కేవలం మీ మైండ్‌కి పరిశీలకునిగానే ఉండాలి, అని నిర్ణయించుకోవాలి. అలాగే మీ చుట్టు ప్రక్కలవారిని కూడా ఒక పరిశీలకునిగా గమనించాలి. అప్పుడు మీకు మీ మైండ్ ఏవిధంగా ప్రతి చిన్న ఆలోచనా లేదా పనిలో ఏ విధంగా నిరంతర ఆశలని, ఆశించటాన్ని సృష్టిస్తుందో అర్ధమవుతుంది. కొన్ని సార్లు నిజం అనేది ఎలా మీ ఊహలకి సరిపోతుంది, కొన్ని సార్లు ఎలా జారిపోతుంది, దాంతో మీలో ఆందోళన బాధ అనేవి ఎలా వస్తాయి అనేది స్పష్టంగా అర్ధమవుతుంది.
కేవలం పూర్తిగా తెలుసుకోవటం అనే విషయాన్ని మీ లోపలకి ప్రవేశపెడితే, మీరు మీ మైండ్ ఆడే ఆటలని, అది మీకు ఆందోళని ఎలా సృష్టిస్తుందో దానిని కూడా చూడగలుగుతారు. మీరు పరిశీలకునిగా ఉండటం నేర్చుకుంటే మీ బాధలు పోతాయి. బయట జరిగే సంఘుటనలని మీలోనికి తెచ్చుకోరు. ఎప్పుడయితే బయట జరిగే వాటిని మీలోపలికి తెచ్చుకుంటారో అప్పుడు మీరు చాలా ఎక్కువ మాటలని మీ లోపల పోగుచేస్తారు. దాంతో మీకు కొత్త సమస్యలు , బాధలు మొదలవుతాయి.
మరొక విషయం : మీరు ఎప్పుడయితే కాలక్రమంలో కాలానికి అనుగుణంగా మీ ప్రణాళిక ప్రకారం సమయం వృధా కాకుండా పనులు చేయగలరో అప్పుడు మీరు నిజం బాటలో నడుస్తున్నట్టే. మీరు చేసే పని కంటే ఎక్కువ బాధపడుతుంటే అలాగే ఏదీ సాధించలేకపోతే అప్పుడు మీరు నిజానికి చాలా దూరంలో ఉన్నట్టు అర్ధం చేసుకోండి. అటువంటప్పుడు మీరు మీలోనికి చూసుకోవాలి అని గుర్తుంచుకోండి. మీ ఆలోచనలని ఒక క్రమంలో పెట్టే సమయంకూడా ఇదే.
కాలానికి అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలి అని ఆలోచించటం మంచిదే. అయితే ఈ ప్రణాళికలను అమలు పరచటానికి మీరు ఆలోచించే పద్దతి మాత్రం సరియైనది కాదు. దీనిని మానసిక ప్రణాళిక అంటారు. ఇదే మీకు ఆందోళలని, బాధలని సృష్టించేది.
మీకు ప్రణాళిక వేయటానికి గంటల పడితే మిగతా 2 గంటలూ ఆ ప్రణాళికని అమలు చేయటానికి ఉపయోగించుకోవచ్చు. మరి ఎందుకు అవి అమలు కాదు? ఎందుకంటే మీరు 80% మిగిలిన సమయాన్ని వేసిన ప్రణాళికని ఎలా అమలు చేయాలి అని బాధపడటానికి ఉపయోగించుతారు. మీరు ప్రణాళికలని మళ్ళీ మళ్ళీ వేస్తుంటే మీ శక్తి అంతా దానిలోనికే వినియోగింపబడుతుంది. అంటే ఆ ప్లాన్ ని అమలు చేయటానికి ఉపయోగించే శక్తిని మీరు వృధా చేసినట్టే. అటువంటప్పుడు మీకు ఎలా పనులు అవుతాయి.
మరొక విషయం : మీకు నిజంగా ఒక పనిని సాధించాలి అని ఉంటే మీరు ఏ మాత్రం ఆందోళన పడకుండా సాధించుతారు. మీకు ఒక విషయం చెబుతాను. బాధపడటం, ఆందోళన పడటం అనేవి కేవలం నిజం నుంచి, అసలైన పని నుంచి తప్పించుకోవటానికి మీరు చూపించే సాకులు మాత్రమే. ఆందోళన బాధ అనే వాటి పేరు మీద మీరు బాధ్యతల నుంచి తప్పించుకుంటారు.
ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. మీరు నిజంగా పరిష్కరించాలి అనుకుంటే, తప్పకుండా పరిష్కరించుతారు. మీరు చేయవలసినదంతా కేవలం ఆ సమస్యలోనికి లోతుగా చూడగలిగి, దానిని తెలుసుకోగలగటమే. అప్పుడు దానంతట అదే పరిష్కారం బయటికి వస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఆసమస్యని పరిష్కరించకూడదు అనుకుంటారో మీరు దానిని గురించి మాట్లాడటంలోనే సౌకర్యాన్ని పొందుతారు. దానిని గురించి నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. చివరికి అలా మాట్లాడే వృత్తంలోకి వచ్చేస్తారు. బాధపడటానికి చాలా ఉన్నది అని గొప్పగా భావిస్తారు.
బాధ్యతలు వదిలించుకోవటానికి చక్కని మార్గం, మీ మైండ్ ని సమస్యలు ఆందోళన స్థితిలోనికి తీసుకువెళ్ళటమే. చాలామంది మానసిక క్షోభతో బాధపడుతూ చాలా సౌకర్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి బాధ్యతని తీసుకోనవసరం లేదు. వాళ్ళు అన్ని బాధ్యతల నుంచీ బయటకి వచ్చి స్వేచ్ఛగా ఉంటారు.
ఒక చిన్న కథ :
ఒక వ్యక్తికి ఎటువంటి అనారోగ్యాన్నైనా మాన్పగల సమర్ధుడు అని పేరు ఉంది. అతను ఒక గ్రామానికి వస్తాడు. అది తెలిసి ఆ గ్రామస్తులంతా ఆయన దగ్గరకు చేరతారు. ఆయన ఒక వ్యక్తి గొంతుక దగ్గర తాకగానే అతనికి ఉధృతంగా ఉన్న గొంతు నొప్పి తగ్గిపోతుంది
మరొక వ్యక్తి తలపై చేయి చేయగానే అతనికి ఉన్న తల నొప్పి వెంటనే మాయమైపోతుంది. ఆ తరువాత ఆయన చక్రాల కుర్చీలో ఉన్న వ్యక్తి దగ్గరకి వెళతాడు. వెంటనే ఆ వ్యక్తి వెనక్కి జరిగి " నన్ను ముట్టుకోవద్దు" అంటాడు.
ఈ హీలర్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకు తాకకూడదు అని అడుగుతాడు . దానికి ఆ చక్రాల కుర్చీలోని వ్యక్తి " నేను ఈ మధ్యనే వికలాంగుల సంక్షేమ పథకానికి అప్లై చేసుకున్నాను" అంటాడు.
(అంతా నవ్వులు)
మనందరం సమస్యల గురించి అవిశ్రాంతంగా, నిరంతరం మాట్లాడుతూనే ఉంటాము. ఆ సమస్యకి వెంటనే పరిష్కారం ఎవరైనా ఇస్తే దానిని తీసుకోవటానికి చాలా కష్టపడతాము. ఎవరైనా వెంటనే పరిష్కారమిస్తే మనలో ఏదో ఒక పెద్ద వెలితి ఏర్పడినట్టు అనుకుంటాము. మనకి జీవితంలో ఇక చేయటానికి ఏమీ లేదు అనిపిస్తుంది. మనం మరీ ఎక్కువ స్వేచ్ఛని పొందినట్టు అనుకుంటాము. ఎప్పుడయితే మన సమస్యల అకస్మాత్‌గా మాయమవుతాయో అప్పుడు మనం సరిగ్గా ఆలోచించలేకపోతున్నామని అనుకుంటాము. ఎందుకంటే మనం మన సమస్యలకి అతీతంగా ఎప్పుడూ ఆలోచించలేదు కాబట్టి.
నిజానికి మన బాధలు, సమస్యలు అన్నీకూడా మనకి ఉండే ఒక సౌకర్యమైన పరిధిలాంటివి. మనం నిజాల నుంచి పారిపోయి అక్కడ దాక్కుంటాము. మీరు నిజంగా ఏదైనా చేయాలి అనుకుంటే అది చేయకుండా ఏది మిమ్ములని ఆపుతుంది? ఎందుకు మిమ్ములని మీరు ఉపయోగంలేని బాధలు ఆందోళనలలో ముంచుకుంటారు? ఇలా ఎందుకు చేస్తారంటే మీచేతిలో చాలా సమయం ఉండే ఉండాలి లేదా మీరు నిజం నుంచి పారిపోవాలి అనుకొని అయినా ఉండాలి. ఎందుకంటే గొప్ప కష్టానికి ఆందోళనలని మీలో నింపుకొని మీరు చాలా గొప్ప వాళ్ళమని ఆనందపడిపోతారు. అంతే.
అందుకే మనుషుల గురించి, మీ జీవన సరళి గురించి మీకు ఉన్న ఊహలని వదిలేయండి. వర్తమానంలో ఆ క్షణంలో జీవించటం మొదలుపెట్టండి. అప్పుడు జరగవలసివన్నీ వాటంతట అవే జరుగుతాయి.
గుర్తుంచుకోండి: మీరు మీ సౌకర్య పరిధిలో ఎక్కువ కాలం ఉండలేరు. ఏదో ఒక రోజు నిజం మిమ్ములని కునుక్కుంటుంది. అందుకే చేతనావస్థలో తెలుసుకునే తత్వంతో జీవించండి. మీ చేతనావస్థలో నిర్ణయాలు చేయండి. చేసిన నిర్ణయాలకి బాధ్యత వహించండి.
వేరే వారి నిర్ణయాల ప్రకారం నడుచుకోవటం తేలిక. ఎందుకంటే చివరలో వారిని నిందించవచ్చు. ఎప్పుడు అలా చేయకండి ఇది చాలా తెలివి తక్కువ పని, పిరికి పని. ఎవరినీ దేనికీ తప్పుపట్టవద్దు. మీరు ఎప్పుడైతే ఒక పనిని చేయలేరో అప్పుడే ఎదుటి వారిని తప్పుపడతారు.
ప్రశ్న: స్వామీజీ! మేము ఎప్పుడూ విరామంగా స్వేచ్ఛగా ఉండాలి అంటే ఎలా? ఎప్పుడయితే మీ సచేతనస్థితి అప్రమత్తతతో ఉంటుందో అప్పుడు మీరు స్వేచ్ఛగా విరామంగా ఉండగలుగుతారు. ధ్యానం ద్వారా మీరు ఈ స్థితిని పొందవచ్చు. కనీసం మీ తెలివితేటల దశలోనైనా మీరు దీనిని అర్ధం చేసుకోండి. అప్పుడు మీరు కొద్ది సమయంలోనైనా ఈ స్థితిని అనుభవించగలుగుతారు ఈ సమయాన్ని తరువాత పెంచుతూ వెళ్ళవచ్చు. చివరికి దానిని శాశ్వతంగా పొందవచ్చు
నేను ఎప్పుడూ చెబుతుంటాను : ఒక యోగి నిద్రిస్తున్నపుడు చూస్తే అతను నిజమైన యోగియేన కాదా అనేది తెలుస్తుంది. ఆయన నిజంగా యోగి అయితే నిద్రలో ఆయన ఒక వికసించిన పువ్వులా ఉంటారు. ఆయన పూర్తి విరామంలో ఉంటారు. చూడానికి చాలా అందంగా ఉంటారు. ఆయన నిద్రిస్తున్నప్పుడు పసిబిడ్డలోని అమాయకత్వాన్ని వెదజల్లుతూ ఉంటారు. మామూలు వ్యక్తి నిద్రిస్తుంటే చాలా ఆందోళనతోను బిగుసుకుపోయినట్టు ఉంటాడు.
ఒక యోగి ఎప్పుడూ సర్వోన్నతమైన చేతనస్థితిలో ఉంటాడు. ఆయన శరీరానికి విశ్రాంతిని ఇవ్వటానికే నిద్రపోతాడు. మీరు నిరంతరం మీ చేతన స్థితిలో ఉండగలిగితే అసలు ఆందోళన చెందరు. ఎప్పుడయితే మీరు మిమ్ములని అచేతన స్థితిలోనికి పడేటట్టు చేస్తారో, ఎప్పుడయితే మీరు అవిశ్వాసంతో ఉంటారో అప్పుడుమీలో ఆందోళన మొదలవుతుంది. మీరు ఎప్పుడూ విరామంగా, స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటే దానికి ఒకే ఒక్క మార్గం, మీలోపల మీ బయట జరిగే ప్రతి విషయాన్ని మీ చేతన స్థితిలో నిరంతరం తెలుసుకుంటూ ఉండగలగాలి.
తెలుసుకుంటూ చేతనస్థితిలో విరామంగా ఉండటం నేర్చుకోండి. మీరు గురువుల సమక్షంలో ఉన్నప్పుడు విరామంగా విశ్రాంతిగా ఉండగలిగితే ఆయన మీలోనికి ప్రవేశింపగలుగుతాడు. ఆయన మీలోనికి చొచ్చుకుపోగలరు. మీరు ఆందోళనతో ముడుచుపోయి ఉంటే ఆయన మీ లోనికి ప్రవేశింపలేడు.
‘ఉపనిషత్తులు’ అంటే గురువు పాదాల దగ్గర కూర్చోవటం అని అర్థం. మీరు గురువు పాదాల దగ్గర విరామంగా వికసించిన మనస్సుతో కూర్చోగలిగితే ఆయన కరుణతో మీ లోపల ప్రవేశింపగలుగుతారు. మీ మీద ప్రభావం చూపగలడు. అప్పుడు మాటలతో అవసరం ఉండదు. ఆయన మాటలని కేవలం నిన్ను శ్రద్ధగా ఉంచటానికే మాట్లాడతాడు. అప్పుడే ఆయన మీలోనికి ప్రవేశింపగలడు. గురువులు మీకు ఎలా విరామంగా, ఉండాలో నేర్పించుతారు.
మీరు గురువుల సమక్షంలో విశ్రాంతిగా ఉండగలిగితే మీలోపలికి మీరు చక్కగా సర్దుకుంటారు. అందులో స్థిరపడతారు మీ వ్యక్తిత్వంలో మీరు విరామంగా ఉండగలుగుతారు. అప్పుడు మీలోఎటువంటి విభజనలు, చీలికలు ఉండవు. మీరు సంపూర్ణ వ్యక్తిగా ఉండగలులగుతారు. కాబట్టి గురువు సమక్షంలో రిలాక్స్ అవటాన్ని సాధన చేయండి. ఇదే విరామంగా ఉండగలగటానికి దగ్గర దారి, చివరి దారి కూడా.
ప్రశ్న: స్వామీజీ! మీరు ఎప్పుడూ పరమానందలోనే ఆనందంగా ఉంటారా? మీరు ఎప్పుడూ భావావేశాలకి లోనుకార?
(స్వామి నవ్వుతారు)
అవును. నేను ఎప్పుడు పరమానందంలో మహదానందంగా ఉంటాను. మీ భాషలో చెప్పాలంటే. 24గంటలూ. ఎందుకంటే నాలోంచి బహుళతత్త్వం అనేది మాయమయిపోయింది. ఎక్కడ పరమానందం ఉంటుందో అక్కడ బహుళతత్త్వం ఉండదు. ఈ బహుళతత్త్వం లేనప్పుడు పరమానందం అనేది సాధ్యమవుతుంది
నాలోపల నా ఉనికిలో ఎక్కడా భయం, ఆశ, దేనికైనా అంటిపెట్టుకొని ఉండటం, ద్వేషించటం ఇలాంటి వ్యతిరేక భావాలు ఉండవు. నాకు ఉన్న ఒకే ఒక్క భావం పరమానందం. నేను చెప్పేదాన్ని అర్థం చేసుకోవటం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ప్రయోగాత్మకంగా అర్థం చేసుకుంటే తప్ప ఇది మీకు అర్థం కాదు. మీరు మహా అయితే మీ తెలివితేటల దశలో అర్థం చేసుకోగలరు. ప్రస్తుతానికి ఒక్క విషయం అర్థం చేసుకోండి. నేను నిరంతరం శాశ్వతమైన బ్రహ్మానందంలో ఉంటాను. అది అర్థం చేసుకోండి. చాలు.
అర్థం చేసుకోండి : పరమానందానికి మొదటి మెట్టు మీరు పరిశీలకులుగా ఉండటం. కేవలం జీవితాన్ని ఒక నాటకంలా చూడండి. అలా చూస్తున్నప్పుడు మీ మైండ్ స్థిరంగా ఉంటుంది ఎప్పడయితే మానసిక స్థితి స్థిరంగా ఉంటుందో మీరు దాని అంతర్భాగమైన అసలైన దారాన్ని పట్టుకోగలుగుతారు. ఎప్పుడయితే మీ అనుభవాన్ని కనీసం ఒక్క సారయినా పొందగలరో,అప్పుడు మీరు ఆ దారాన్ని పట్టుకోగలరు.
ఆ దారం మిమ్మలని ఎక్కువసేపు స్థిరంగా ఉండే దిశగా మార్గాన్ని చూపుతుంది. ఆ స్థిరత్వమే మీ గురువు మీ బయట ప్రపంచపు గురువు మీ లోపలి గురువుని చూపించుతారు. అంతే. ఎప్పుడయితే మీరు ఈ స్థిరత్వాన్ని కనుక్కుంటారో అప్పుడు ఈ భావావేశాలన్నీ కూడా మీ మనస్సు ఆడే ఆటలు అని మీకు తెలుస్తుంది.
అర్ధం చేసుకోండి : మీరు ఎప్పుడూ కూడా ఏ భావావేశాన్ని కూడా మీకు తెలుస్తూ ప్రయత్న పూర్వకంగా దానిని వదలేయలేరు. మీరు వదిలివేయాలని ప్రయత్నించే కొద్దీ మీరుదానికి మరింతగా చేరువయిపోతారు. అది మీకు ఒక హింసలా తయారవుతుంది. ఆ భావావేశం మిమ్మలని వెంటాడుతుంది. దీనికి ఒకే ఒక మార్గం ఆ భావావేశాలని కేవలం పరిశీలించటమే. మీరు గమనించే కొద్దీ మీకు మీ భావావేశానికి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు మీరు మీ భావావేశాలలో ఎంతగా చిక్కుకుపోయారంటే మిమ్మలని మీరు వాటి నుంచి వేరు చేసి చూడలేనంతగా. మీరు వాటిని గమనించటం మొదలు పెడితే మీరు మీకు వాటికీ మధ్య దూరాన్ని సృష్టించుతారు. క్రమంగా ఆ దూరం పెరుగుతుంది. క్రమంగా పరిశీలకుడు అక్కడి నుంచి మాయమవుతాడు.
అప్పుడు మీరు మీ భావాలని విడిచిపెట్టటానికి శ్రమ పడనవసరము లేదు. అవి వాటంతట అవే మాయమవుతాయి. మీరు వీటి నుంచి వేరయిపోతారు. మీరు ఇక వీటితో ఎటువంటి సంబంధం పెట్టుకోరు. అది మీ అంతరంగంలోంచి మాయమవుతాయి. మీ చేతనస్థితిలో మార్పు వస్తుంది. మీరు ఒక కొత్త వ్యక్తిగా మారుతారు.
ఈ ఆనంద చైతన్యం అనేది నిరంతరం మనకి అనేక విధాలుగా అది ఏమిటో మనకి తెలియజేస్తుంది. దానిని అర్ధం చేసుకొని పూర్తిగా చేతనస్థితిలో దానితో పాటు ప్రవహించటమే మన పాత్ర.
ఎప్పుడయితే మీరు ఒక పరిశీలకునిగా మారితే, మీలో బాధలు,కష్టాలు అనేవి అసలు ఉండవు. మీలో కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. అప్పుడు మీరు ఈ
అనంత చైతన్య సృష్టి మీ మీద అనంతమైన ప్రేమ వర్షాన్ని నిరంతరం కురిపిస్తూ ఉంటుంది.
ఒక చిన్నకథ:
ఒక వ్యక్తి గుండె చాలా బలహీనమైనది. అందువలన అతని కుటుంబ సభ్యులు అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ అతనిని జాగ్రత్తగా చూసుకుంటారు.
ఒక రోజు అతని మామయ్య తాలూకు కోటి రూపాయల ఆస్తి వచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళు చాలా ఆనందపడతారు. కానీ ఆ వార్త అతనికి ఎలా చెప్పాలో తెలియక ఆందోళన పడతారు. ఆ వార్త చెబితే అతనికి గుండె ఆగిపోతుందేమోనని భయపడతారు.
వాళ్ళలో ఒక వ్యక్తి వాళ్ళకి ఒక సలహా ఇస్తాడు. మనం డాక్టరు గారిని పిలిపించి అతనితో చెప్పించుదాము అంటాడు. దానికి అందరూ ఒప్పుకుంటారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డాక్టరుని పిలిచి విషయమంతా వివరించతారు.
అప్పుడు డాక్టరు వాళ్ళతో " మీరు కంగారు పడకండి. ఈ వ్యవహారం నేను జాగ్రత్తగా చూసుకుంటాను . అదేమంత కష్టమైన పనికాదు అంటాడు"
అలా చెప్పి డాక్టరు ఆ వ్యక్తి గదిలోనికి వెళ్ళి అతనితో మాట్లాడటం మొదలుపెడతాడు. డాక్టరు అతనిని చాలా మామూలుగా అడుగుతూ “ మీకు అకస్మాత్తుగా కోటి రూపాయలు ఆస్తి వచ్చింది” అని ఎవరైనా చెప్పారనుకోండి మీరు ఏమి చేస్తారు ” అంటాడు. దానికి ఆ వ్యక్తి “ అందులో సగం మీకు ఇస్తాను” అంటాడు.
ఆ డాక్టరు గుండె ఆగిచనిపోతాడు
(నవ్వులు)
మనం ఎదుటి వారి జీవితాలని నాటకంలా చూడగలం కానీ మన విషయంలో మాత్రం దానిని మనం జీర్ణించుకోలేము. మనం ఎదుటివారికి సలహాలు ఇవ్వటానికి ఎప్పుడూ సిద్ధంగాఉంటాము. నేను ఒక పుస్తకంలో చదివాను. సలహా అనేది ప్రతి ఒక్కరూ ఒకళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడతారు. కానీ తీసుకోవటానికి సిద్ధంగా ఉండరు అని
పద్మం నీళ్ళలో ఉంటూ కూడా నీరు తనని అంటకుండా ఎలా ఉండగలుగుతుందో మీరు కూడా అలా ఉండగలిగినప్పుడు జీవితం అనే ఆటని ఎలా ఆడాలో నేర్చుకుంటారు. ఒక విషయం అర్థం చేసుకోండి.
ఈ సృష్టి మొత్తం కూడా అనంత చైతన్యానికి అనుకూలంగా ప్రవహిస్తుంది అని మీరు అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకున్నప్పుడు మీరు మీ బాధలని, ఆందోళనని అప్రయత్నంగానే వదిలేస్తారు. మీరు ఏ స్థితికి రావాలంటే మీలోపల ఉన్న అంతర్భాగాన్ని బయట ప్రపంచపు విషయాలేమి అంటలేనంత స్థితికి రావాలి. అది జరగాలి అంటే ఈ అనంత చైతన్య సృష్టి నిరంతరం మారుతూ ఉంటుంది అని మీరు ప్రయోగాత్మకంగా అర్థం చేసుకోవాలి.
బయటికి మీరు ఎన్నో భావాలను చూపించుతారు. కానీ మీ అంతరంగపు లోపల మాత్రం ఇవన్నీ కూడా ఈ అనంత చైతన్యం అనే దారానికి గుచ్చిన పూసలే అన్నట్టు చూడాలి. ఈ దారమే అన్నింటినీ పట్టి ఉంచుతుంది అని తెలుసుకోవాలి.
ప్రశ్న : స్వామీజీ ! మేము కావాలని ఏసమస్యలని తెచ్చుకోము కదా. మరి మేము సమస్యలను కోరితెచ్చుకుంటాము అని మీరు ఎలా చెబుతారు?
బాధలు అనేవి మీ మైండ్ యొక్క అచేతనస్థితి అయిపోయింది. అంతే కానీ మీరు దానిని ఉద్దేశపూర్వకంగా మీ మైండ్లోనికి తీసుకురారు. ఇది కేవలం ఉంటుంది. అంతే. దీనికోసం మీరు తెలిసి ఏమీ శ్రమ పడనవసరంలేదు. బాధ అనేది నిరంతరం మీతోనే ఉంటుంది.
ఒక చిన్న కథ :
ఒక హోటల్ రూంలో ఉండే ఒకావిడ రిసెప్షనిస్టుని రమ్మని గట్టిగా కేకలు పెడుతుంది. రిసప్షనిస్టు ఆమె రూమ్ దగ్గరకి వస్తుంది.
అప్పుడు ఆమె గట్టిగా "ఒక వ్యక్తి ఆ రూమ్‌లో నగ్నంగా ఉన్నాడు. నేను కిటికిలోంచి చూసాను" అంటుంది.రిసెప్షనిస్టు కిటికీలోంచి చూస్తుంది. ఒక వ్యక్తి పై భాగం నగ్నంగా అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పుడు రిసెప్షనిస్టు. ఆమెతో "మేడం! అతనిపై భాగమే నగ్నంగా ఉన్నది. అతను నగ్నంగా ఉన్నాడని మీరు ఎలా చెబుతారు" అని అడిగింది.
ఆమె పెద్దగా అరుస్తూ "ఆ అలమారు పైకి ఎక్కి చూడు" అంటుంది.
(అంతానవ్వులు)
మనకి అన్ని సవ్యంగా ఉన్నప్పుడు కూడా మనం టార్చిలైట్ వేసి మరీ సమస్యల కోసం వెతుకుతాము. ఇదంతా కావాలి అని చేయం. మనం దీనిని చాలా సహజంగా చేస్తాము. అది అసలు సమస్య. మన మానసిక పరిస్థితులలో 180° మార్పురావాలి.
ఒక చిన్నకథ :
ఒక పోలీసు రాత్రి పూట డ్యూటీ చేస్తుంటాడు. అతనికి రోడ్డు మధ్యలో చనిపోయిన ఆవు కనిపిస్తుంది. అతను దానిని ప్రక్క వీధిలోనికి ఈడ్చుకెళుతుంటాడు. ఆ ప్రక్కనే వెళుతున్న ఒక వ్యక్తి, ఎందుకు చనిపోయిన ఆ జంతువుని అంతదూరం ఈడ్చుకువెళుతున్నావు అని అడుగుతాడు.
దానికి ఆ పోలీసు "రేపు ఉదయం నేను ఈ విషయం రిపోర్టు చేసేటప్పుడు వీధి పేరు చెప్పాలి. నాకు ఈ వీధి పేరు తెలుసు" అని జవాబు ఇస్తాడు.
(నవ్వులు)
మనకి సందర్భానుసారం అప్రయత్నంగా స్పందించటం రానప్పుడే నిరంతరం బాధపడుతుంటాము. మన పరిధిలోనికి విషయాలను సరిగ్గా అమర్చటం కోసం మనం విషయాలను కష్టమయిన చిక్కు సమస్యలుగా తయారు చేస్తాము. మీరు ద్రవ పదార్థంలా (మృదువుగా) జీవించరు. అలా జీవించగలిగితే మీరు అనవసరంగా ఏపనీ అధికంగా చేయనవసరంలేదు. మీరు సంతోషపడి ముందుకు సాగిపోవచ్చు.
ఉదాహరణకి : ఇప్పుడు నేను మిమ్ములని శాశ్వతానందంలో ఉండండి అని చెప్పాననుకోండి. వెంటనే మీరు ఆ ఆనందాన్ని ఎలా పొందాలి అని బాధపడిపోతారు. ఏ పనికైనా బాధతో ప్రారంభించటం మాత్రమే మీకు తెలుసు. అది అసలు సమస్య. అందుకే మీరు నన్ను ఏదైనా అడిగినప్పుడు మీకు నేను ఏ విషయం సూటిగా చెప్పను. అలాగే ఎక్కువ పదాలు ఉపయోగించను. చిన్న స్టేట్మెంట్ లాగా చెబుతాను. అప్పుడు మీ మైండ్ లో కొత్త సమస్యలు పుట్టవు. కానీ ఆ సమయంలో మీరు ఆ విషయంలోనికి అర్థం చేసుకుంటూ చొచ్చుకుని వెళ్ళేల మీకు నేను శక్తిని ఇస్తాను.
ప్రశ్న : స్వామీజీ! మేము బాధ పడకుండా మీరు చెప్పినవి చెప్పినట్టుగా అనుసరించాలి అంటే ఏం చేయాలి. ఎలా మొదలుపెట్టాలి?
మీరు కేవలం నేను చెప్పే మాటల వెనక ఉన్న శక్తిని ప్రేరణని, మీ మైండ్‌ని ఉపయోగించకుండా గ్రహించండి. మీరు వర్తమానంలో జీవించటం మొదలుపెట్టండి. అంతే. మీరు ఎప్పుడైయితే మీమైండ్ని ఉపయోగిస్తారో అప్పుడు హేతువాదం తర్కం ఇవన్నీ వస్తాయి. దాంతో సమస్యలు మొదలవుతాయి.
మీరు కేవలం నా మాటల వెనుక ఉన్న శక్తి యొక్క అనుభూతిని పొందండి. దానినే నేను నిశ్శబ్దం అంటాను. ఈ నిశ్శబ్దంతోనే నేను నిరంతరం మీలోపలికి రావటానికి ప్రయత్నిస్తుంటాను. ఈ నిశ్శబ్దం చివరికి మిమ్ములని ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికే తీసుకు వెళుతుంది. మీరు నేను చెప్పే మాటల అర్ధాల కోసం ఎప్పుడూ ప్రయత్నించకండి.
మీరు ఎప్పుడూ మాటలని పోగుచేయకండి. కేవలం అతి తెలివితేటలు గల వాళ్ళు మాత్రమే చాలా చాలా మాటలు పోగుచేస్తారు. వాళ్ళు మాటలని పోగుచేసుకొని మరింత గందరగోళం తెచ్చుకుంటారు. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర అయినా స్పష్టంగా
తెలుసుకోవచ్చు అని అనుకుని మాటలని పోగుచేస్తారు. కానీ అది ఎప్పటికీ జరగదు. చూడండి నేను మాట్లాడేటప్పుడు వాటిని విశ్లేషణ చేస్తే అవిమీకు పరస్పర విరుద్ధంగా అనిపించవచ్చు. నేను చెప్పిన సందర్భానికి ఆ సమయంలో అవి పూర్తిగా సత్యమే. నేనుమాట్లాడే క్షణంలో నేను ఏది మాట్లాడితే అది సంపూర్ణ సత్యము. కానీ మీరు నేను మాట్లాడే మాటల అర్ధాల నుంచి మాత్రమే భావాన్ని గ్రహించవద్దు. ఆ క్షణానికి వాటిని అలాగే ఎటువంటి ప్రశ్నలు వేయకుండా తీసుకోండి. అవి మీకు వాటిని అర్థం చేసుకునే శక్తిని తెలివిని ఇస్తాయి.
మీరు పూర్తి నమ్మకంతో ఉంటే మీరు అసలు బాధపడలేరు. అది నిజమైన ప్రార్ధన. ప్రార్ధన అంటే మీ సమస్యలన్నింటిని చెప్పి, వాటికి పరిష్కారం అడగటం కాదు. ప్రార్ధన అంటే అనంత బ్రహ్మాండం మీద నమ్మకాన్ని ఉంచటం అది మీ కోసం పనిచేస్తుంది అని అనుకోవటమే
కాబట్టి మీ తెలివితేటలతో వినవద్దు. పూర్తిగా లోతైన ధ్యానంతో వినటం నేర్చుకోండి. ఆ సమయంలో మీ భావావేశాలు ఎలా ఉన్నా, మీ మార్గం ఏదైనా మీరు నేను చెప్పే విషయాలలోనికి లోతుగా వెళ్ళండి. అప్పుడు నేను చెప్పేది వినండి. అదిచాలు. అప్పుడు మీలో శక్తి నింపబడుతుంది. మీరు చాలా శక్తివంతులవుతారు. ఇవన్నీ కొన్ని ప్రాథమిక రహస్యాలు. మీకు నేను చెబుతున్నాను.
మీరు నా మాటలని పట్టుకోవాలి అని ఆరాటపడితే, ఆమాటలు మర్చిపోతాము అని బాధపడటం మొదలుపెడతారు. అప్పుడు ఆ మాటలని వ్రాసుకుంటారు. ఎప్పుడయితే మీరు వ్రాయటం మొదలు పెడతారో నేను చెప్పే విషయాలను మొత్తం వినలేరు. కొంత పోగొట్టుకుంటారు. దాంతో మొత్తం విషయమంతా మిస్ అవుతారు. మీరు నేను చెప్పే మాటల వెనుక ఉన్న శక్తిని గ్రహించలేరు. అలాగే నేను చెప్పే మొత్తాన్ని మీ నోట్సులో రాసుకోలేరు. ఇంటికి వెళ్ళేటప్పటికి పిచ్చిరాతల నోట్సు మిగులుతుంది. దానిని తరువాత ఇంట్లో ఒక మూల పడేస్తారు. కొంత కాలం అయ్యాక ఆ నోట్సు చూసినా మీకు ఏమీ అర్ధం కాదు. అందులో మొదలు, తుది ఏమీ కనపడదు.
ఇదంతా ఎలా ఉంటుందంటే, మీరు ఒక పుస్తకాన్ని చదివి దాంట్లో చివరి రెండు పేజీలు మాత్రమే మీ చేతిలో పెట్టుకున్నారనుకోండి. మీ చేతిలో ఉన్న రెండు పేజీలతో మీరు పుస్తకమంతా తిరిగి తయారు చేయగలరా? లేదు. అదే విధంగా నేను చెప్పే మాటల్లో ఏవో కొన్ని రాసుకుని, ఆ మాటలతో నేను చెప్పిన విషయాన్ని మొత్తం గుర్తు చేసుకోవాలంటే కుదురుతుందా? నేను మాట్లాడేటప్పుడు మీరు పూర్తిగా ఇక్కడే ఉండండి. అది చాలు.
నేను చెప్పే మాటలు మర్చిపోతామేమో అనే బాధని మరచిపోండి. మీర మిమ్ములని పూర్తిగా నా సమక్షంలో ఉంచగలిగితే నా మాటలు మీలోనికి చొచ్చుకొని పోయి అవి చేయవలసిన పనిని అవి చేస్తాయి. మీలో మార్పు రావటం ముఖ్యం కానీ నా మాటలు కాదు. మీలోని అంతరాత్మతో నేను చెప్పేది వినండి. మీ మైండ్‌తో కాదు. ఎప్పుడయితే మీరు అర్ధం చేసుకుంటారో, ఎప్పుడయితే మీలో మార్పు జరుగుతుందో అప్పుడు మీరు మర్చిపోరు. మీరు మర్చిపోయారు అంటే మీకు అర్ధం కాలేదు అని అర్ధం.
నా మాటలనే కాదు, దేనిని పట్టుకొని వేలాడవద్దు. ప్రతినిముషం పాతబడిపోతుంది. అప్పుడు మీరు దేనిని పట్టుకుంటారు. ఇలా దేనినైనా పట్టుకొని వేలాడటం అనే దాని వలన ఒకసమస్య తరువాత మరొకటి వస్తుంది. అలాగే జరగబోయే దానిని గురించి ఆలోచిస్తున్నారు. మీ భవిష్యత్తు కూడా ఈ క్షణంలా వస్తుంది. కాబట్టి ఈ క్షణం మీద ఏకాగ్రతని నిలపండి.
చూడండి : మీరు వర్తమానంలో ఉన్నప్పుడు దేనిని కోరుకోవలసి వుండదు. ఎప్పుడయితే మీరు కోరుకొని ఎంచుకొనే స్థితి వస్తుందో అప్పుడే బాధలు ప్రారంభమవుతాయి. అలా కోరుకోకుండా లేదా ఎంచుకోకుండా మొత్తాన్ని మీరు
ఎందుకు ఎన్నుకొని కోరుకోరు? ఎందుకంటే మిమ్ములని మీరు ఒక ఘన పదార్థంలా గుర్తిస్తారు. అందుకే తప్పని సరిగా ఉన్న దాంట్లో ఎంతో కొంతని మాత్రమే మీరు కోరుకుంటారు. ఇది కేవలం మీ అహం ఆడే ఆట. ఈ విషయాన్ని అర్ధం చేసుకోండి. చాలు.
కొందరు నన్ను అడుగుతుంటారు. స్వామీజీ! ప్రపంచం అకస్మాత్తుగా అంతమయిపోతే ...' అనే ఆలోచన వస్తే భయమేస్తుంది. అని అలా వస్తే ఏమవుతుంది. ప్రపంచం అంతమయిపోతే దాంతో పాటు మనుషులు కూడా అంతమయిపోతారు. అప్పుడు ఎవరూ ఉండరు. ఎవరికీ ఏదీ మిగలదు. ఇంతకు ముందు ప్రపంచంలో ఏదో ఉంది అని బాధపడ్డారు. ఇప్పుడు ప్రపంచం లేదు అని బాధపడుతున్నారు. అసలు ప్రపంచమే లేకపోతే ఇక బాధపడటం దేనికి. కానీ మీరు దానికి కూడా బాధపడుతున్నారు.
చూడండి : మన మైండ్ ఎంత పరస్పర విరుద్ధంగా ఉంటుందో. ఇక్కడ ఏదైన ఉన్నది అంటే బాధపడతారు. ఏదీ లేదు అన్నా దాని గురించి కూడా బాధాపడతారు. మీరు బాధలన్నింటిలోనికి తెలుసుకోగలిగే తత్త్వంతో చూడగలిగితే అవి ఎంత జిత్తుల మారిగా మీ అచేతన స్థితి మీద ఆటలు ఆడుతున్నాయో అర్ధమవుతుంది. మీ బాధలన్నీ కూడా ఆధారం లేనివి. మీరు వాటిని దేనికీ పట్టి ఉంచలేరు. ఎందుకంటే వాటికి ఆధారం లేదు. అవి పదార్థంలా గట్టివి కావు.
నిజానికి మీ భావావేశాలు కూడా మీ అచేతనస్థితి ఆడే ఆటలే. ఎప్పుయితే మీరు పూర్తి వాస్తవంలో తెలుసుకోగలిగే స్థితిలో జీవించుతారో, మీరు మీ భావావేశాల ఆధీనంలో ఉండరు. అందుకే మీకు నేను పదే పదే చెబుతాను. మీరు పూర్తిగా తెలుసుకోగలిగే స్థితిని మీలో నింపుకోండి. మీరు పూర్తిగా దానితో ఉండండి.
చూడండి : మీ బాధల మీ మాటలు మిమ్ములను నిజంగా తయారు చేస్తాయి లేదా మీ జీవితాన్ని ముక్కలు చేస్తాయి. వాటికి అంత శక్తి ఉంది. అవి మిమ్ములని ఎదుటి వారిని కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి నేను ‘ఆవు’ అన్నాననుకోండి. వెంటనే ఏం జరుగుతుంది? మీ మైండ్లోనికి ఒక నాలుగు కాళ్ళు, రెండు కొమ్ములు, ఒక తోక ఉన్న జంతువు బొమ్మ వస్తుంది. అవును కదా? ఒక రెండక్షరాల మాట మీ మైండ్లోనికి అంత పెద్ద బొమ్మ మొత్తాన్ని తేగలిగింది. అందుకే మాటలకి చాలా శక్తి వుంటుంది. ఎప్పడయితే మనం మాటలని గౌరవించమో, ఎప్పుడయితే వాటిని తప్పుగా వాడతామో, మనం సమ్సలని కోరి తెచ్చుకున్న వాళ్ళమవుతాము.
ఒక చిన్న కథ :
బీర్బల్ ఒక జ్ఞాని, ఒక గురువు. ఒక రోజు అక్బర్, బీర్బల్ ఒక వీధిలో నడిచి వెళుతుంటారు. అక్కడ వాళ్ళు ఒక గంధపు చెక్కలు అమ్మే వ్యక్తిని చూస్తారు. అప్పుడు అక్బర్ బీర్బల్తో ఇలా అంటాడు, “నాకెందుకో గానీ ఆ వ్యక్తిని ఉరితీయాలి అనిపిస్తుంది”.
ఒక నెల తరువాత, వాళ్ళు ఇద్దరూ అదే వీధినుంచి నడిచి వెళుతుంటారు వాళ్ళు అదే గంధపు చెక్కల వ్యాపారిని చూస్తారు. అప్పుడు అక్బర్ బీర్బల్తో “ఇదేదో కొత్తగా ఉంది. ఆ వ్యక్తికి మంచి బహుమతి ఇవ్వాలి అనిపిస్తుంది” అంటాడు
బీర్బల్ కొంచంసేపు సాలోచనగా చూసి ఇలా అంటాడు “నెల క్రితం ఈ గంధం చెక్కల వ్యాపారి వ్యాపారం అసలు బాగాలేదు. మీరు నడిచివెళుతున్నప్పుడు అతను మిమ్మలని చూసి, ఈయన చనిపోతే బాగుండును. రాజభవనం వాళ్ళు వచ్చి గంధపు చెక్కలు కొనుక్కొంటారు అని తనలో తాను అనుకున్నాడు. అతనిలోని ఈ వ్యతిరేకపు ఆలోచనల తరంగాలు మిమ్మలని చేరి మీరు అతనిని అసహ్యించుకునేలా చేశాయి. వెంటనే నేను అతని దగ్గర గంధపు చెక్కలు చాలా కొని రాజభవనానికి కావలసిన కుర్చీలు, టేబుల్స్ చేయించాను. ఈ రోజు అతను మీరంటే కృతజ్ఞతాభావంతో ఉన్నాడు. అతనిలోని మంచి ఆలోచనా తరంగాలు మిమ్మలని చేరి మిమ్మలని సంతోషపెట్టాయి. అందుకే మీరు అతనికి బహుమతి ఇవ్వాలి అని అనుకుంటున్నారు” అని చెప్పాడు.
మీరు ఈ విషయాన్ని అర్ధం చేసుకొండి. మీ ఆలోచనలకి గొప్పశక్తి ఉంది. అందుకే మీకు సమస్యలు లేని, స్పష్టమైన మానసిక స్థితి ఉండటం చాలా ముఖ్యం
ప్రశ్న : స్వామీజీ ! కొన్ని పుస్తకాలలో “చిన్న విషయాల గురించి ఎక్కువ శ్రమపడవద్దు” అని ఉంటుంది. కాని చిన్న విషయాలుకూడా ముఖ్యమే కదా!
మీరు తెలివితేటలతో పనిచేస్తే మీరు చిన్న విషయాల గురించి ఎక్కువగా శ్రమపడే వారిలోనికి రారు.
ఒక చిన్న కథ :
ఒక యువకుడు అతని స్నేహితుణ్ణి కలవటానికి వెళ్ళాడు. అతను గోడకి ఉన్నవాల్ పేపర్ని తీసేస్తున్నాడు.
అతను ఇలా అడిగాడు “ ఏమిటి నీవు పెయింట్ తిరిగి చేస్తున్నావా?” అని దానికి స్నేహితుడు “నేను ఇల్లు ఖాళీ చేసి వెళుతున్నాను” అని.
చూడండి చిన్న విషయాలని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. కానీ మీరు తెలివిగా దేనికి ఎంత ఏకాగ్రత చూపించాలో అంతే ఏకాగ్రత చూపించాలి. లేకపోతే మీరు అనవసరంగా ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. ఎవరైనా మీతో చిన్న విషయాలను పట్టించుకోవద్దు అని అంటే ఆ మాటలు మీరు వినకండి. గుర్తుంచుకోండి చిన్నరంధ్రం పెద్ద ఓడని ముంచేస్తుంది. మీరు ఏ పని చేసినా తెలివిగా తెలుసుకోగలిగే తత్త్వంతో ఆ విషయంలో పనిచేయండి
ముందుగా చిన్న విషయాలు అని మీరు వేటి గురించి అనుకుంటున్నారో వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి. అలా స్పష్టంగా అర్ధం చేసుకుంటే మీలో పరస్పర విరుద్ధ భావాలు తలెత్తవు. అప్పుడు ఆ పనులు చేయటానికి శక్తి దానంతట అదే వస్తుంది కానీ మీరు వీటి విషయమై పూర్తి అవగాహన లేకపోతే అప్పుడు మీరు ఆ పనులు చేయటానికి కావలసిన స్ఫూర్తి శక్తి మీ దగ్గర ఉండవు. అవి మీరు అనుకున్నట్టుగా చేయలేరు. దీని అర్ధం ఏమిటంటే మీ తెలివితేటలు పూర్తిగా మీ వెనుక లేవు అని అర్ధం. ఎందుకంటే తెలివితేటలే శక్తి. శక్తే తెలివితేటలు
మీరు వీటి గురించి ఎక్కువ శ్రమ పడితే ఎక్కడో ఏదో లోపం ఉంది అని అర్ధం. స్పష్టంగా అర్ధంచేసుకోండి. మీలోని పరస్పర విరుద్ధ భావాల వలన మీలో సమస్యలు ఏర్పడతాయి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీకు స్పష్టంగా తెలియదు. అందుకే మీరు ఏమీ చేయలేకపోతున్నారు. ఆ స్పష్టత కావాలి అనుకుంటే మీరు తెలివితేటలని అభివృద్ధి చేసుకోవాలి.
మీ తెలివితేటలు మాత్రమే మిమ్మలను సమస్యల నుంచి బయటకి పడవేయగలవు
మీరు నిజంగా మీలోపలి వ్యర్ధపు మాటల సమస్యలని వదిలివేయాలి అని అనుకుంటే ఒక చిన్న ఎక్సర్సైజు చేయండి.
మీకు సంతోషాన్ని ఇచ్చే విషయాలను గురించి ఆలోచించండి. కేవలం ఆ విషయాల మీద మాత్రమే మనస్సు లగ్నం చేయాలి అని మీ మైండ్‌కి సూచనలివ్వండి. మరే ఇతర విషయాలు పట్టించుకోకండి. మిగతా విషయాలలో ఆపని జరిగేంతవరకు మాత్రమే శక్తిని ఇవ్వండి. తరువాత ఆ విషయాన్ని మరచిపోండి. ఈ ఎక్సర్సైజు ప్రయత్నించండి. మీరు చాలా శక్తిని అదా చేయవచ్చు. కాపాడుకోవచ్చు.
ఈ విషయం అర్ధం చేసుకోండి. మీరు బాధల గురించి చాలా చాలా మాట్లాడటానికి చాలా శక్తిని వినియోగిస్తున్నారు. ఉదాహరణకి : ఒక గృహిణి ఫోనులో తన స్నేహితురాలితో ఆ రోజు పని అమ్మాయి రాలేదని దాంతో తాను ఎంత మానసిక క్షోభని అనుభవించిందో చెబుతుంది. మీరు నిజంగా ఈ విషయం గురించి బాధపడినట్లయితే మీరు నిజంగా ఈ సమస్య నుంచి బయటకి రావాలి అంటే
ముందుగా మీరు ఆ సమస్యని వదిలివేయాలి. ఉన్న పని మొత్తం చేసుకోవాలి. ఇది బాగుంది కదా!
కానీ మీరేం చేస్తారు? ఈ విషయం గురించి మీ స్నేహితురాలితో చాలా సేపు మాట్లాడతారు. మీరు పడిన మానసిక క్షోభని ఆమె తెలుసుకోవాలి. ఒక వేళ ఆమె మీ మీద సానుభూతి చూపించకపోయినా లేదా జీవితం ఇంతే. ఏదో సర్దుకుపోవాలి అని చెప్పినా, వెంటనే మీరు మరొకరికి ఫోన్ చేసి మీ స్నేహితురాలు ఎంత పట్టించుకోని, సానుభూతి లేని మనిషో చెబుతారు. నిజంగా మీరు మీ జీవితంతో కలసి ముందుకు పోవాలను కుంటే ఆమెచెప్పిన మాటలని మెచ్చుకుంటారు. అవును కదా? మీరు నిజంగా సమస్య నుంచి బయటకి రావాలి, జీవితంలో ముందుకి పోవాలి అని అనుకుంటే మీరు తప్పకుండా మీ తెలివితేటలని ఉపయోగిస్తారు. కానీ మీరు ఎందుకు వేరే విధంగా ప్రవర్తిస్తారు. కారణం ఏమిటి అంటే, సమస్యల గురించి మాట్లాడటంలోనే మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అంతేకాని వాటి నుంచి బయట పడే మార్గాలలో కాదు.
నేనుచెప్పిన ఆ చిన్న ఎకర్ సైజు చేస్తే మీ సమస్యలు మాయమయిపోతాయి. మీకు కొత్త మానసిక రూపం వస్తుంది మీరు మీలో ఉప్పొంగుతున్న శక్తిని చూస్తారు. ఎందుకంటే ఇప్పటివరకూ ఆ శక్తిని మీరు మీ సమస్యలని ఉంచటానికి ఉపయోగించారు. ఇప్పుడు ఆశక్తి అకస్మాత్తుగా మీకు దొరుకుతుంది.
మీరు నిష్పక్షపాతంగా మిమ్ములని పరీక్షించుకోండి. ఒక వేళ మీరు మీ సమస్యలని రహస్యంగా పెంచుతున్నారేమో లేదా అసలు మీరు మారటానికి సిద్ధంగా ఉన్నారో లేదో అని పరీక్షించుకోండి
మీరు సమస్యల వెంటపడటం ఆపేస్తే, అప్పుడు మీరు ఎదుటివాళ్ళు ఎలా నిస్సహాయులుగా ఆ సమస్యల వలయంలో చిక్కుకుపోయారో చూడగలుగుతారు. వాళ్ళ సమస్యలని భూత అద్దంలో చూస్తూ వాటి గురించి అంతులేకుండా ఎలా మాట్లాడతారో మీరు చూడగలుగుతారు. ఇలా బాధల గురించి మాట్లాడటానినే నేను బాధల గురించి బాధపడటం అంటాను. ఎప్పుడయితే మీరు వీటిని చూడగలుగుతారో అప్పుడే బాధలు ఆగిపోతాయి. మీరు ఒక పరిశీలకుడిగా అయ్యే వరకు మీరు భావావేశాలలో చిక్కుకుపోయి ఉంటారు. వాటికి చాలా శక్తిని ఉపయోగిస్తూ వాటిని నియంత్రిస్తారు.
మీకు నేను మళ్ళీ చెబుతున్నాను. నేను మిమ్ములని బాధల నుంచి పారిపోమ్మని చెప్పను.
నేనేం చెబుతానంటే ఆ సమస్యల గురించి ఎక్కువ మాట్లాడి వాటిని పెద్దవిగా చేయకండి. మీ శక్తిని వాటిమీద ఉపయోగించకండి. కాకపోతే వాటిని ఆపటానికి ఏది అవసరమో అదే చేయండి. అప్పుడు అవి మిమ్ములని బాధపెట్టటం ఆపేస్తాయి. సమయం వృధా చేసుకోకుండా వాటిని పట్టించుకోండి. అంతే.
మీరు ఒకవేళ సమస్యలతో సౌక్యంగా ఉన్నట్టు అనుకోవటం మొదలు పెట్టారేమో పరీక్షించుకోండి. ఇది మీకు ఒక స్కేలు లాంటిది. దీనితో మీరు బాధలని నియంత్రిస్తున్నారా లేక బాధలు మిమ్ములని నియంత్రిస్తున్నాయా అనే విషయం తెలుస్తుంది. మీరు బాధల గురించి మరీ మరీ మాట్లాడటంలోనే సౌకర్యంగా ఉండి, వాటిలోంచి బయటపడే ఏ చర్యా తీసుకోకపోతే బాధలు మిమ్ములని కట్టడిచేస్తున్నాయని అర్థం. ఒక వేళ మీరు సమస్యలని పట్టుకువేలాడ కుండా, వాటిని సరైన పద్ధతిలో పరిష్కరించుకోగలిగితే మీరు వాటిని నియంత్రిస్తున్నట్టు అర్థం.
ఒక ప్రశ్న : స్వామీజీ! మీరు ఇంతకుముందు ఒకసారి తాగుడు గురించి చెప్పారు. నా భర్త చాలా ఎక్కువగా తాగుతారు. అదంతా బాధలు మరిచిపోవటానికే అంటారు. నేను ఏం చేయను?
నేను ఇంతకముందే చెప్పాను. ఇది సాధారణమైన సమస్య. అదిసరే. ఇక్కడ మీ భర్త కూడా ఉంటే చాలా బాగుండేది. మీరు ఈ తాగుడు అలవాటును విశ్లేషించితే మీరు ఎంత పరస్పర విరుద్ధంగా ఉంటారో అర్ధమవుతుంది. మీకు వివరంగా చెబుతాను.
మీరు సంతోషంగా ఉండటానికి తాగుతారు. కాని చివరికి చాలా దీనమైన పరిస్థితికి చేరుకుంటారు.
మీరు తాగినప్పుడు చాలా కలుపుగోరు మనిషి అని సంఘం మిమ్మలని గౌరవిస్తుంది అని తాగుతారు, కాని ఆ సంఘానికే మీరు ఒక వివాదస్పద వ్యక్తి అవుతారు.
మీరు చాలా నాగరికంగా కనపడటానికి తాగుతారు. కానీ మీరు సహించలేని అనాగరిక వ్యక్తిగా తయారువుతారు.
మీరు మీ సమస్యలు మర్చిపోయి నిద్రపోవటానికి తాగుతారు. కాని చాలా సమస్యలతో నిద్రలేస్తారు.
మీరు ఆనందం కోసం తాగుతారు కానీ మానసికంగా కుంగిపోతారు. మీ మీద మీకు నమ్మకం రావటానికి తాగుతారు. కానీ మిమ్ములను చూసి మీరు భయపడిపోతారు.
మీరు మాట్లాడటానికి తాగుతారు. కానీ ఏమీ మాట్లాడలేరు.
మీరు మీ సమస్యలు తీరటానికి తాగుతారు. కాని అవి మరింత ఎక్కువ అయిపోతాయి.
ఇవన్నీ నిజాలు. మీకు ఈ విషయాలన్నీ నాకన్నా బాగా తెలుసు. మీరు నిస్పక్షపాతంగా నాకు చెప్పండి. తాగటం మంచిదేనా? దీనిని బట్టి చూస్తే మీరు ఎంత పరస్పర విరుద్ధ భావాలతో ఉంటారో తెలుస్తుంది. ఈ విషయంలోనే కాదు, మీరు మీ జీవితానికి సంబంధించిన విషయాలలో కూడా ఇలా పరస్పర విరుద్ధంగా ఉంటారు.
మీరు ఏం చేయాలనుకున్నారో మీకు స్పష్టంగా తెలిస్తే అప్పుడు మీలో ఉన్న ప్రతి ఔన్సు శక్తిని ఆపనికే ఉపయోగించవచ్చు. అప్పుడు మీరు స్థిరంగా వృద్ధి చెందుతారు. ఆనందాన్ని అనుభవిస్తారు. అప్పుడు మీరు పరస్పర విరుద్ధ భావాలతో ఉండరు.
మీరు ఎప్పుడు తాగినా పూర్తిగా తెలుసుకునే స్థితిలో తాగండి. మీకు ఇంకా వివరంగా చెబుతాను. మీరు తాగిన ప్రతిసారీ, మీ చేతనస్థితిలో మీకు తెలిసేటట్టుగా తాగండి. నెమ్మదిగా, మీ శరీరంలోని ప్రతి కదలికని గమనిస్తూ మీరు తాగే ప్రతి చుక్కని రుచి చూస్తూ తాగండి. దీనికంతకీ మీ శరీరంలో జరిగే ప్రతి మార్పునీ గమనించండి. ఇదంతా కూడా పూర్తి చేతనస్థితిలో నింపబడిన కార్యక్రమంలా చేయండి. మీకు ఎప్పుడు తాగాలని అనిపించినా మీరు ఇదే విధంగాచేయండి. నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు ఇలా చేస్తే మీరు అలవాటుని మానుకో అక్కరలేదు. అలవాటే మిమ్ములని వదలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతుంది.
ఏ అలవాటుకైనా బానిసగా మారటం అనేది మీ అచేతనస్థితిలో యాంత్రికంగా జరిగే కార్యక్రమము. ఇది కేవలం తాగుడుకి, సిగరెట్లకే బానిస కావటం కాదు. మతానికి కూడా బానిస అయ్యేవాళ్ళూ ఉంటారు. ఎవరైతే అచేతనస్థితిలో యాంత్రికంగా దినచర్యలో భాగంగా ప్రార్థనలు, పూజలు చేస్తారో వాళ్ళు ఏదైనా ఒక రోజు ఆ పూజ చేయకపోతే ఆరోజు మొత్తం ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడతారు. వాళ్ళు ఈ అలవాటుకి బానిసలు. అందుకే ఒక్కరోజు పూజ చేయకపోయినా చాలా పొగొట్టుకున్నట్టుగా ఉంటారు. ఇది ఎలా అంటే తాగుడికి అలవాటు పడిన వ్యక్తి ఒక్కరోజు తాగకపోతే, అభద్రతా భావంతో ఎలా వణికిపోతాడో, మతం అనే వ్యసనానికి అలవాటుపడిన వ్యక్తి కూడా ఒక్క రోజు పూజ చేయకపోయినా చాలా పెద్దలోటు ఉన్నట్టు బాధ పడిపోతాడు.
పనులని పూర్తిగా తెలుసుకునే స్థితిలో చేయటానికి, యాంత్రికంగా భయంతో చేయటానికి మధ్యఉన్న తేడాని అర్ధం చేసుకోవటం చాలా ముఖ్యం. పనులకి
మీకు తెలిసిన స్థితిలో చేస్తే మీమీద ఎటువంటి కట్టు బాటులూ, నిబంధనలూ ఉండవు. ఇది మిమ్ములని ఒక కాలానికి లేదా ఒక స్థలానికి బంధించదు. మీరు ఒక యాజమానిలా కాకుండా పనులని యాంత్రికంగా చేస్తే మీరు నిర్భందించబడతారు. అది మీకు కష్టాలని కలుగచేస్తుంది. అప్పుడుమీరు కేవలం సేవకులు మాత్రమే.
ఒక అలవాటుని మానకోవాలంటే దానిని తెలుసుకునే తత్వంతో పూర్తిగా నింపండి. అప్పుడు ఆ అలవాటు పూర్తిగా మారుతుంది. మీరు ఎప్పుడూ కూడా ఒక అలవాటును మానివేయాలి అని అనుకోకండి. విషయం బాగా గుర్తు పెట్టుకోండి. మీరు దేనినైతే ఆపాలి అనుకుంటారో అది మరింతగా విజృంభిస్తుంది. మిమ్ములని గట్టిగా పట్టుకుంటుంది. మీరు చాలా లోతుగా తెలుసుకుని మారాలి. అంతే. మీరు ఎప్పుడయితే ఈ మార్పు యొక్క భాషని అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు సరియైన మార్గంలో ఉన్నట్టే : మీరు వికసించే దారిలో ఉన్నట్టే.
కొంతమంది అంటూంటారు “స్వామీజీ! మీరు మాట్లాడుతుంటే చాలా ఉత్తేజంగా ఉంటుంది. దీనిని ఇప్పుడు మేము మా నిత్య జీవితంలో ఉపయోగించి అది ఎలా పనిచేస్తుందో చూడాలి.
స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను ఎప్పుడూ అనుభవ పూర్వకంగా మీకు జీవితాలకి ఉపయోగపడే విషయాలు మాత్రమే చెబుతాను. మీరు నిత్య జీవితంలో ఉపయోగించలేని విషయాలను నేను ఎప్పుడూ చెప్పను.
నిజానికినేను చేస్తున్న పని అదే. వేదాంతాన్ని తిరిగి చెబుతున్నాను. కాకపోతే ఇప్పటి సమాజానికి అనువుగా ఉండే పదాలతో చెబుతున్నాను. అలా చెబితే మీకు అర్థమవుతుంది. మీకు కూడా వినటానికి సౌకర్యంగా ఉంటుంది. అప్పుడు నేను చెప్పే విషయాలు మీకు సరిపోతాయి అని మీరు అనుకుంటారు. దాంతో ఈ విషయాలని మీరు అనుసరిస్తారు.
మరొక విషయం : ఇదే విషయాలని మీరు పుస్తకంలో చదివారనుకోండి అవి ఆ పుస్తక రచయిత తలలోంచి మీ తలలోనికి వెళతాయి. అటువంటప్పుడు ఎక్కడ అనుభవానికి అవకాశం లేదు. అవే విషయాలని మీరు గురువు ద్వారా విన్నారనుకోండి, ఆయన తన అనుభవాల ద్వారా మాట్లాడతారు. కాబట్టి అవి మీ అంతరంగం లోపలికి చొచ్చుకుని వెళతాయి. ఈ విషయం మీకు తెలియవచ్చు లేదా మీరు తెలుసుకోలేకపోవచ్చు
స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను నాకున్న జ్ఞానాన్ని మీతో పంచుకోవటం లేదు. నేను నా అనుభవాలని పంచుతున్నాను. నా జీవితాన్ని మీకు చెబుతున్నాను. నేను ఎప్పుడయితే నా అంతరాత్మతో లోపల నుంచ మాట్లాడతానో అది తప్పకుండా మీ అంతరాత్మని తాకుతుంది. అది మీ జీవితాన్ని మార్చుతుంది. ఇంతకు మించి వేరే మార్గం లేదు.
స్వామి వివేకానందుడు చికాగోలో మాట్లాడినప్పుడు “నా ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా” అన్నప్పుడు ఆడిటోరియం చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ విషయం గురించి ఒకామె ఇలా వ్రాసిం” ఇది కేవలం మెచ్చుకోవటం కాదు. ఆయన మొత్తం దేశాన్ని గెలిచాడు మేమంతా ఒక ప్రేమ వాహిని మా గుండా మా అంతరాత్మ లోపలగా ప్రవహించినట్టు అనుభూతిని పొందాము...
ఆమె తరువాత స్వామి వివేకానందుని ఇలా అడిగింది “ అది ఎలా జరిగింది” అని దానికి స్వామి” ఎందుకంటే అది నా అంతరాత్మ నుంచి వచ్చింది” అని చెప్పారు. స్వామి వివేకానంద తన అంతరాత్మ లోపలి నుంచి మాట్లాడారు. ఎప్పుడయితే మాటలు మెదడు నుంచి వస్తాయో అవి వినేవారి మెదడుని మాత్రమే స్పృసించగలుగుతాయి. దానిని మనం సమాచారం చేరవేసే సంభాషణ అంటాము.
ఎప్పుడయితే మాటలు మనస్సులోంచి వస్తాయో అవి వినే వార హృదయాన్ని తాకుతాయి. దీనినే కలిసిమాట్లాడుకోవటం అంటాము. మనకి సంభాషణ మాత్రమే కాదు. మనసులు కలిసి మాట్లాడుకునే ది కూడా అవసరం. నేను చెబుతున్నాను. నేను నా హృదయాంతరాలలోంచి మాట్లాడతాను. కాబట్టి మీరు హృదయపూర్వకంగాను వినగలుగుతున్నారు.
ఎప్పుడయితే మాట్లాడే వ్యక్తి సంపూర్ణత్వంతో మాట్లాడతారో, వినేవారు కూడా పూర్తిగా నిమగ్నమైవింటారు. అటువంటి వ్యక్తి జీవితం తప్పని సరిగా మార్పు చెందుతుంది. నేను స్పష్టంగా చెబుతున్నాను. ఒక వేళ నామాటలు మిమ్ములని మీ జీవితాన్ని స్పృసించలేదు అని అనుకుంటే, నాకు మాట్లాడే అధికారం లేదు. మీరు నా అనుభవాల సత్యాన్ని ప్రశ్నించవచ్చు. ఒకవేళ నామాటల మీ జీవితాన్ని మార్చలేకపోయాయి అని మీకు అనిపిస్తే, మీరు ఆ విషయం స్పష్టంగా చెప్పవచ్చు. మీరు ముందుకు వచ్చి చెప్పండి. కానీ నేను చెబుతున్నాను. తప్పని సరిగా నామాటలు మీ జీవితాలని మిమ్ములని స్పృసించుతాయి. అంతకు మించి వేరే మార్గంలేదు
మీరు నేను చెప్పే విషయాలు మనస్పూర్తిగా వినగలిగితే, సమయమొచ్చినప్పుడు వాటంతట అవే మీ జీవితం మీద పని చేస్తాయి. ఏ గురువుకి అయితే తను చెప్పే విషయాల మీద నమ్మకం ఉండదో ఆ గురువు తన శిష్యులని వెళ్ళి తిరిగి వాటిని సాధన చేయమని చెబుతాడు. నిజమైన గురువు మాట్లాడేటప్పుడు మీరు వింటే చాలు. మీరు సంపూర్తిగా వినగలగాలి. అప్పుడు మార్పు అనేది దానంతట అదే జరుగుతుంది.
ఛాందోగ్యఉపనిషత్తు ఈ విషయాన్ని చాలా చక్కగా వివరించింది : గురువు శిష్యులచేత “తత్ త్వం అపి” అని తొమ్మిది సార్లు అనిపించుతారు. అంటే “అది మీరు” అని అర్థం కేవలం వినటం వలన, గురువుని అంతరాత్మ లోపలి నుంచి వచ్చే మాటలు వినటం వలన శిష్యులకి నిజమైన ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుంది . ఎప్పుడయితే గురువు శిష్యులు ఇద్దరూ కూడా సంపూర్ణంగా నిమగ్నమయితే అప్పుడు ఇది జరుగుతుంది.
మీరు గురువుల సమక్షంలో ఉన్నప్పుడు మాటలు అనేవి పూర్తిగా అసంబద్ధమైనవి. అవసరంలేనివి. మీరు గురువుల సమక్షంలో నిశ్శబ్దంగా ఉండి ఆయనని పూర్తిగా గ్రహించగలిగితే మీలో నిజమైన మార్పు వస్తుంది. కానీ ఏం చేస్తాం? మీరు మీ అంతరంగంలో వ్యర్థపు మాటలలో చిక్కుకుపోతారు. నేను మీ లోపలికి చొచ్చుకు పోవాలనే మిమ్ములని నిశ్శబ్దంలో ఉంచుతాను.
నేను మీతో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు? ఎందుకంటే నేను మాట్లాడకపోతే మీరు మీ లోపల నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటారు. జరిగిపోయిన విషయాలని విశ్లేషణ చేసుకుంటూ, భవిష్యత్ గురించి ఆందోళన పడుతూ, అభిప్రాయాలు, తీర్పులు చెబుతూ. ఒకటేమిటి ఇలా ఎన్నో. నేను మాట్లాడితే మీరు ఏకాగ్రతతో వింటారు. నేను చెప్పేది ఎదయినా మిస్ అవుతామేమో అనే భయంతో పూర్తిగా నిమగ్నమైపోయి వింటారు. దానిని అవకాశంగా చేసుకొని నేను మీలోపలికి ప్రవేశించుతాను.
నేను మాట్లాడేటప్పుడు నా అంతరంగంలో నిశ్శబ్దంగా ఉంటాను. చూడండి. గురువు మాట్లాడేటప్పుడు ఆయన అంతరంగంలో చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అందుకే ఆయన గురువు. కానీ మీ విషయంలో ఇది వేరుగా ఉంటుంది. మీరు నిశ్శబ్దంగా ఉన్నా మీ అంతరంగంలో మీరు మాట్లాడుతూనే ఉంటారు. మీ లోపలి వ్యర్థపు మాటలు అలా జరుగుతూనే ఉంటాయి. ఇదే గురువుకి మీకూ ఉన్న తేడా. మీ నిశ్శబ్దం వినిపించని శబ్దాలని లోపల చేస్తూనే ఉంటుంది. మీ అంతరంగంలోపల మీరు ఒక విషయం నుంచి మరొక విషయంలోనికి దూకుతూనే ఉంటారు. ఏ రెండు విషయాలకి సంబంధం ఉండదు. మీలోపల ఒక పిచ్చి గృహం ఏర్పడుతుంది. కానీ బయటికి మాత్రం నిశ్శబ్దంగా ఉంటారు. అంతే.
కాబట్టి ఎలా వినాలో నేర్చుకోండి. మీ తలలతో, మెదళ్ళతో వినవద్దు. మీ అంతరంగాన్ని పూర్తిగా వికసింపజేయండి. నా కోసం తెరచి ఉంచండి. సంపూర్ణ విశ్వాసంతో వినండి. పూర్తిగా అధీనులై వినండి. మాటల మీతో మోసుకువెళ్ళవద్దు. నన్ను మీ అంతరంగంలోనికి తీసుకోండి. ఇది చాలు. నేను మీ అంతరంగంలో ఉన్నప్పుడు అది మిమ్మలని ఆనందపరవసులని చేస్తుంది.
ఇప్పుడు మనం మణిపూరక శుద్ధిక్రియ అనే ధ్యానపద్ధతిని నేర్చుకుందాం. ఇది మణిపూరక చక్రాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది.
మణిపూరక శుద్ధిక్రియ ధ్యానం (సమయం : 30 నిముషాలు)
మణిపూరక శుద్ధిక్రియ అనే ఈ ధ్యాన పద్ధతి ప్రాచీన క్రైస్తవం నుంచి తీసుకున్నారు. దీనిని 'గ్లాస్సోలోలియో' అని అంటారు. దీనిని తరువాత సుఫీలు గిబ్బరీష్ అభివృద్ధి చేసారు. ఈ ధ్యాన పద్ధతిలో మీలో లోతుగా పేరుకుపోయిన బాధలు వ్యతిరేకపు భావాలని శుభ్రపరుస్తుంది. ఇది ఒక సారి చేస్తే మీ మణిపూరక ప్రాంతంలో అంటే నాభి ప్రాంతంలో చాలా తేలిక అయినట్టు మీకు తెలుస్తుంది. మణిపూరక ప్రాంతంలో బాధలు, సమస్యలు పేరుకొనిపోయి ఉంటాయి. ఈధ్యానం చేసాక, మీరు మళ్ళీ బాధలని, సమస్యలని, కోపం మొదలయినవాటితో ఆ ప్రాంతాన్ని నింపకుండా చూసుకోవాలి.
ఈ ధ్యానాన్ని ఖాళీ కడుపుతో కాని ఆహారం తీసుకున్న రెండు గంటల తరువాత కానీ చేయాలి.
నిలబడి కళ్ళు మూసుకోండి. మీ మణిపూరక ప్రాంతం లోనికి బాగా లోతుగా వెళ్ళండి. అక్కడ ఎంత బరువుగా ఉంటుందో ఒక్కసారి అనుభూతితో తెలుసుకోండి. అవి మీ బాధలతో నిండిపోయి ఉంటుంది. ఒక నిముషం పాటు ఆ ప్రాంతం మీద దృష్టిని ఏకాగ్రతతో నిలపండి. అక్కడ ఉన్న బాధలని కోపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి.
ఇపుడు మీరు ఏమైన అర్థం లేని శబ్దాలను ఎంత గట్టిగా చేయుగలిగితే అంతగట్టిగా అనండి. ఈ శబ్దాలు మీ లోపల నాభి ప్రాంతం నుంచి రావాలి. అరవటానికి పదాలని ఉపయోగించకండి. మీరు మాటలని వాడితే పైపైనే మీకు తెలిసిన బాధలు మాత్రమే బయటకి వస్తాయి. అంతే కాకుండా ఇంకా ఎక్కువ మాటలని అవి సృష్టిస్తాయి. అంతేకాని అవి మీలోపల భావావేశాల మీద పనిచేయవు. కొన్ని శబ్దాలని అరవండి. అప్పుడే మీకు తెలియని మీ లోపల ఎక్కడో ఉన్న భావాలన్నీ బయటికి వస్తాయి. చేతులు ఊపండి. అరవండి. గట్టిగా అనండి. కళ్ళుల్లో నీళ్ళు వస్తే రానీయండి.
మీ శక్తి కొద్దీ మీలోని వ్యతిరేకభావాలను బయటకి రప్పించండి. మీకు బాగా బాధ కలిగించిన సంఘటనలని గుర్తు చేసుకోండి. మీకు కోపం తెప్పించిన మనుషులను గుర్తు తెచ్చుకోండి. ఆ సంఘటనల తాలూకా భావాలను గుర్తు చేసుకోండి. అన్నిభావావేశాలనూ బయటకు రప్పించండి. పూర్తిగా దీనిలో నిమగ్నమవ్వండి. మీరు ఇంక ఏ విషయం గురించి ఆలోచించవద్దు. అనుకోవద్దు
ఇరవై నిముషాలు అయ్యాక ఆపండి. కళ్ళు మూసే ఉంచండి. 10 నిముషాల నిశ్శబ్దంగా కూర్చోండి. మీ ఆలోచనలని గమనించండి. మీ మణిపూరక ప్రాంతం తేలిక అయిన అనుభవాన్ని పొందండి. మీరు చాలా తేలికగా ఆనందంగా ఉంటారు. మీరు ఇప్పుడు సంపూర్ణమైన ఆనందంలో ఉంటారు. మీ మొత్తం ఉనికి చాలా తేలికగా ఉంటుంది.
(అందరూ మణిపూరక శుద్ధి క్రియని మ్యూజిక్‌తో సాధన చేస్తారు)
(చివరలో స్వామి ఇలా అంటారు)
ఓం శాంతి శాంతి శాంతిః మెల్లగా, చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి. మనం తరువాత సెషన్లో కలుద్దాం
ధన్యవాదములు

అధ్యాయం - 5
