చక్రాలు
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

సహస్రార
ఆజ్ఞ
విశుద్ధి
అనాహత
మణిపూరక
స్వాధిష్ఠాన
మూలాధార
దీని తరువాతది సూక్ష్మ శరీరం. అది స్వప్నశరీరం దీనిని మీరు మీ కలల స్థితిలో చూస్తారు. మీ కలలో ఒక చోటు నుంచి మరొక చోటుకి ఈ శరీరంతోనే వెళతారు. మీ కలలో మీరు చాలా చోట్ల కనిపిస్తారు. మీరు కొన్ని సార్లు కలలలో మీకు తెలియని కొత్త ప్రదేశాలకి వెళతారు.
మూడవది కారణ శరీరం. ఇది మామూలు శరీరం. ఈ శరీరాన్ని మీరు గాఢ నిద్రలో ఉపయోగించుతారు. ఈ శరీరం కదలదు.
ఈ చివరి రెండు శరీరాలు మొదటి శరీరాన్ని ఏడు చోట్ల కలుస్తాయి. ఈ ఏడు పాయింట్లనే మనం చక్రాలు అని అంటాము. ఇవి మనలో ఉండే ముఖ్యమైన ఏడు చక్రాలు. ఇవి కాకుండా చిన్న చిన్న చక్రాలు మన శరీరంలో చాలా ఉన్నాయి. కానీ ఈ ఏడు చక్రాలు మన భౌతిక, మానసిక, ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన భాధ్యతని వహించే చక్రాలు.
ఈ చక్రాలని మన ప్రాచీన వేదకాలంలోనే కనుగొన్నారు. మీరు చాలా మతపరమైన కార్యక్రమాలలో ఈ పేర్లువాడటం గమనించి ఉంటారు. ఈ రోజులలో శాస్త్రాలు ఈ ఏడు చక్రాలు దగ్గర ముఖ్యమైన గ్లాండ్స్ ఉన్నట్లు నిరూపించాయి. ఒక్కొక్క గ్లాండ్ ఒక్కొక్క చక్రానికి సంబంధించి ఉంటాయి. ఈ చక్రాలే గ్లాండ్స్కి శక్తిని సరఫరా చేస్తాయి.
ఈ ఏడు చక్రాలు మన భౌతిక, మానసిక, భావావేశాల చర్యల పైన చాలా లోతుగా ప్రభావాన్ని చూపించుతాయి. వాటికి చాలా శక్తి ఉన్నది. అవి మనలో శక్తి పీఠాలు. వాటిని పరిశుభ్రం గాను, శక్తివంతంగా ఉంచగలిగితే అవి మనకి ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తాయి.మనకు కలిగే అనారోగ్యాలన్నీ కూడా ఈ చక్రాలలో సమతుల్యం లోపించినప్పుడు కలుగుతాయి. ఎందుకంటే మన శరీరం, మన మనస్సు మన అంతరంగంలోని చేతన స్థితిని చాలా లోతుగా నాటబడ్డాయి. ఈ చక్రాలని ఆరోగ్యంగా ఉంచగలిగితే, మనలో మానసిక, భౌతిక స్థాయిలో మార్పులు సంభవించుతాయి.
మీకు ఒక చిన్న కథ చెబుతాను.
మొదటి ప్రపంచ యుద్ధం జరిగాక, ఒక విమానాన్ని ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో వదిలివేసారు. ఆ ఊరి గిరిజనులు ఎప్పుడూ విమానాన్ని వాళ్ళ జీవితంలో చూడలేదు. దాంతో వాళ్ళు చాలా ఉత్సాహంతో, కుతూహలంతో దాని చుట్టూ గుమిగూడారు. అది ఏమిటీ? చాలా ఆశ్చర్యంతో చర్చించసాగారు. ఒక్కొక్కళ్ళు తమకి తోచిన సలహాలు ఇవ్వటం మొదలు పెట్టారు.
వాళ్లు దానికి చక్రాలు ఉన్నాయి కాబట్టి చివరికి దానిని కొత్తరకం ఎడ్లబండిగా నిర్ధారించారు. కొత్తది అంత పెద్ద ఎడ్లబండిని చూసి వాళ్ళు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. దానికి ఎడ్లని కట్టి ఎడ్లబండిలా వాడుకోవటం మొదలు పెట్టారు.
కొన్ని వారాలు గడిచాకా ఆ ఊరి అబ్బాయి. దగ్గరలోని పట్నంలో చదువుకుంటూ, సెలవులకి ఊరు వచ్చాడు. ఆ అబ్బాయి విమానం చుట్టూ చూసి దానిలోపలికి వెళ్ళాడు. అక్కడ గేర్లు అన్ని ఉండటం చూసి కొన్ని స్విచ్‌లు, గేర్లు వేసాడు. అప్పుడు అందులో ఒక ఇంజను పనిచేయటం ప్రారంభించింది. ఆ అబ్బాయి దానిని నేల మీద కొంతదూరం తిప్పాడు. ఆగ్రామస్తులంతా దానిని నిర్ఘాంతపోయి చూసారు. ఆ అబ్బాయి పట్నంలో ట్రాక్టర్లు చూసాడు. దాంతో అది ఎడ్లబండి కాదు ట్రాక్టరు అని చెప్పి దానిని ట్రాక్టరులాగా తిప్పటం మొదలు పెట్టాడు. గ్రామస్తులు ట్రాక్టరుని తెలుసుకున్న సందర్భంగా మరోసారి సంబరాలు చేసుకున్నారు.
ఆ తరువాత కొన్నాళ్ళకి ఒక సైనికాధికారి ఆ ఊరికి వస్తాడు. అతడు విమానాన్ని ట్రాక్టరుగా ఉపయోగించటం చూసి అది ట్రాక్టరు కాదు విమానం, అది గాలిలో ఎగురుతుంది, అని చెబుతాడు. కాని ఆ గ్రామస్తులు ఆ విషయాన్ని నమ్మరు. వాళ్ళ దృష్టిలో కేవలం పక్షులు మాత్రమే గాలిలో ఎగురుతాయి.
అప్పుడు ఆ సైనికాధికారి, విమానంలోనికి వెళ్ళి దానిని కొంచెం దూరం ఆకాశంలో తిప్పి కిందకి తెస్తాడు. వాళ్ళు దానిని చూసి ఆశ్చర్యంలో మునిగిపోతారు. అప్పుడు వాళ్ళు దానిలో ఉన్న నిజమైన శక్తిని తెలుసుకున్నారు.
చూడండి: మనిషి ఒక అద్భుతమైన యంత్రం. అతను గాలిలో ఎగరగలుగుతాడు. కాని మనలో ఉన్న ఆ శక్తి మనకి తెలియదు. మనకి మన గురించి చాలా తక్కువగా తెలుసు. మనలో చాలా మంది ఎడ్లబండి స్థితిలోనే అంటే మన స్వభావసిద్ధమైన స్థితిలోనే ఉన్నాము. ఈస్థితి మనం మన భావావేశాలకు అధీనులం అయిపోయిన స్థితి.
మనలో ఎవరైతే ప్రాపంచిక విషయాలైన, ఇల్లు, కారు, ఉద్యోగం, మిగతా ప్రాథమిక అవసరాలు ఇంతవరకే ఆలోచించి, వాటితోనే ఉండిపోతారో అప్పుడు వారు వారి శరీరాలని ఎడ్లబండిలా ఉపయోగిస్తున్నారు అని అర్థం. ఇటువంటి స్థితిలో మనం మన అచేతన స్థితిలో ఉండే మైండ్‌ని పూర్తిగా నింపేసి ఉంచుతాము.
మనలో ఎవరైతే దీనికి అదనంగా కళలు, సృజనాత్మకత, వేదాంతం ఇటువంటి విషయాలలో నిమగ్నమైతే, ఎక్కడైతే మైండ్‌తో పాటు హృదయాన్ని కూడా ఉపయోగించుతామో అప్పుడు మనం మన శరీరాన్ని ట్రాక్టర్‌గా ఉపయోగించుతాము. అప్పుడు మనలో ఏదో సాధించాము అన్న తృప్తి ఉంటుంది. ఒక పద్యాన్ని రాసిన కవి, ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లి కంటే ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే బిడ్డకి జన్మనిచ్చే తల్లి గర్భం కడుపులో ఉంటుంది. అదే కవికి హృదయంలో ఉంటుంది. అదే ఫలసిద్ధి పొందిన ఆనందం వీళ్ళంతా తెలివితేటలు దశ నుంచి పని చేస్తుంటారు.
చివరిగా, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలోనికి ప్రవేశించుతారో, ఎవరైతే నిజమైన జ్ఞాన తృష్ణని పెంచుకుంటారో, ఎవరైతే తాను సర్వాంతర్యామి అయిన విశ్వశక్తి యొక్క భౌతిక రూపం అని తెలుసుకుంటారో వాళ్ళు ఈ భౌతిక శరీరాన్ని విమానంలా ఉపయోగించుకుంటారు. జ్ఞానోదయం పొందిన యోగులు తమ శరీరాలని విమానంలా ఉపయోగించుతారు. వాళ్ళు నిరంతరం పరమానందంలో ఉంటారు. వాళ్ళు ఎడ్లబండి, ట్రాక్టరు దశలోని సమస్యలకి అతీతంగా ఉంటారు. వారు ఆకాశంలో రాజహంసలా ఎగరగలిగే పరమహంసలు. వాళ్ళు అంతఃప్రేరణదశలో పని చేస్తుంటారు.
మనం విమాన స్థితిని చేరలంటే ఏమి చేయాలి? గ్రామస్తులకి, సైనికాధికారికి తేడా ఏమిటి? విమానం ఒక్కటే. దానికి ఏదీ కలపలేదు. దాని నుంచి ఏదీ తీసివేయబడలేదు. దానికి భౌతికమైన మార్పులు చేయలేదు. అవును కదా? అయితే తేడా ఏమిటి? ఎవరైనా చెబుతారా...
(ఒకామె జవాబు ఇస్తుంది)
స్వామీజీ, అది జ్ఞానం
అవును జ్ఞానం విమానం పనిచేసే పద్ధతి గురించిన జ్ఞానం గ్రామస్తులకి తెలియదు అది గాలిలో ఎగర గలదని, దానికి అంత శక్తి ఉన్నదని. అటువంటి యంత్రాలు దానికి ఉన్నాయని తెలియదు. కాని సైనిధికారికి ఆ విషయాలన్నీ తెలుసు. అంతే వాళ్ళు విమానాన్ని ఉపయోగించటానికి వాడిన పద్ధతి, దానిని ఎడ్లబండిలా ట్రాక్టరుగా చివరికి దానిని విమానంగా మార్చింది.
మనం ఈ చక్రాలు వెనుక ఉన్న శాస్త్రాన్ని తెలుసుకుంటే మీరు మీ అంతరంగపు లోతులలో ఉండే అచేతన స్థితిని తెలుసుకోవచ్చు. ఒక్కసారి దాని గురించి తెలుసుకోగలిగితే మన అచేతన స్థితిలో ఉండే బరువుల నుంచి స్వేచ్ఛని పొందవచ్చు. అప్పుడు మనం మన ఉనికి యొక్క ఉన్నత స్థితికి చేరవచ్చు
ఈ చక్రాలు మన శరీరంలో భౌతికంగా ఉండవు. అవి అనంత చైతన్యపు శక్తి ఆ ఉనికి రూపంలో (meta physical) ఆ ఉనికి యొక్క ప్రతి రూపాలుగా ఉంటాయి. ఎందుకంటే అవి భౌతిక ఆకారం కలిగి ఉండవు. కిర్లియాన్ ఫోటోగ్రఫీ (Kirlian photography) ద్వారా వీటిని ఫోటో తీయగలిగారు. ఆఫోటోల ఆధారంగా వాటిని నిరూపించారు.
ఎప్పుడయితే ఒక వ్యక్తి ఏదైనా వ్యతిరేకపు భావావేశాలలో బంధింపబడతాడో. దానికి సంబంధించిన చక్రం చిన్నకోటు బటన్ సైజుకి తగ్గిపోతుంది. అది అంత చిన్నగా అయిపోతుంది. అదే వ్యక్తి ఒక అనుకూల భావావేశాన్ని కలిగి ఉంటే, అటువంటి స్థితిని అనుభవించితే, ఆ భావావేశానికి సంబంధించిన చక్రం బండి చక్రమంత విస్తృతం అవుతుంది. ఈ విధంగా మనలో భావావేశాలు అంత ఎక్కువగా ఈ చక్రాలను ప్రభావితం చేస్తాయి.
చక్రాలలో ప్రవహించే శక్తిని మనలోని వ్యతిరేకపు భావాల వలన అడ్డుకుంటాయి. కానీ మనకి ఆ విషయం అసలు తెలియదు.
అర్ధం చేసుకోండి. మనిషి నేలమీద పాకటానికి తయారు చేయబడలేదు. మనిషిని గాలిలో ఎగరగలిగే సామర్థ్యంతో అందుకు అనుగుణంగా తయారు చేయబడ్డాడు. ఎగిరే శాస్త్రం అంటే, ఈ చక్రాలని ఎలా ఉపయోగించాలి, వాటితో ఎలా వ్యవహరించాలో చెప్పే శాస్త్రం. మీ శరీరంలో ఈ ఏడు చక్రాలని ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకోగలిగితే అది చాలు.
గ్రామస్తులకి ఏ విధంగా అయితే విమానం ఎగురుతుందని తెలియదో, మనిషికి కూడా తన ఎగరగలననే విషయం తెలియదు. అందరూ జ్ఞానోదయం పొందినయోగులు చాలా గొప్పవారని, అందుకే వారికి చాలా దూరంగా ఉండాలి అని అనుకుంటారు. అలా అనుకొని వారివైపు వినయంతో గౌరవంతో చూస్తారు. కానీ వాళ్ళు ఆ యోగుల స్థితికి చేరాలని మాత్రం అనుకోరు.
నేను మీకు ఇప్పుడు చెబుతున్నాను. మీరు నిజంగా మీ అంతరంగంలోని ప్రపంచాన్ని సాధించాలి అని అనుకుంటే మీరు సాధించగలరు. కాని సమస్య ఏమిటంటే మీరు
సాధించగలరని మీకు నమ్మకం ఉండదు. అది ఎలా ఉంటుందంటే ఏవిధంగా అయితే గ్రామస్తులు విమానం ఎగురుతుంది అంటే నమ్మరో, మీరు కూడా అదే విధంగా మీరు సాధించగలరు అంటే నమ్మరు. మీరు ఇప్పటి కంటే ఎంతో ఉన్నత స్థితికి చేరగల శక్తి మీలో ఉన్నది అంటే మీరు నమ్మరు.
ఒక చిన్న కధ :
ఒక చిన్న అమ్మాయి పియానో నేర్చుకుంటూ ఉంది. ఆమెకి మాస్టరు చెప్పిన పాఠం ఎంత ప్రయత్నించినా రావటం లేదు. ఆ అమ్మాయి పక్కనే ఉన్న ఒక వ్యక్తి అందులో గొప్ప ప్రవీణ్యంగల వ్యక్తి, అతను తనంత తాను పాటని పియానో మీద వాయించుతున్నాడు.
ఆ చిన్న అమ్మాయి నెమ్మదిగా అతని దగ్గరకి వెళ్ళి అతనిని గమనించింది. కాసేపు అలా చూసి " సార్ మీకు నాకన్న ఎక్కువ వేళ్ళు ఉన్నాయా?" అని అడిగింది.
(అంతా నవ్వుతారు)
మనం ఎప్పుడూ అనుకుంటూంటాము. మనం మన అర్హతలకి తగినంత అదృష్టవంతులం కాదు అని. కానీ నిజం ఏమిటంటే మనకి కావలసినంత, మనకి అవసరమైనవి అన్నీ మనలోనే ఉన్నాయి. కాకపోతే వాటిని ఎలా ఉపయోగించాలో మనకి తెలియటం లేదు. మనలో చాలా మంది మన జీవితాలని, మనలో ఉన్న శక్తిని ఎడ్ల బండిలా లేదా ట్రాక్టరులా ఉపయోగించుతాము. మనం దానిని విమానంలా మార్చవచ్చు అని మనకి తెలియదు. అలా ఎగరగలిగే శక్తి మనలోనే ఉన్నది. కాకపోతే అది మీలోపల నిగూఢంగా ఉన్నది. మీరు ఈ చక్రాల వెనుక ఉన్న శాస్త్రాన్ని నేర్చుకున్నపుడు ఆ శక్తిని తెలుసుకోగలుగుతారు.
ఈ కొద్ది రోజులలో మీకు ఈ చక్రాల వెనుక ఉన్న భావావేశాల గురించి పూర్తిగా, స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ చక్రాలని ఏవి బంధించుతున్నాయి. వాటిని ఎలా వికసింపచేయాలి, వాటిని ఏవిధంగా శక్తివంతమైన స్థితిలో ఉంచాలి అనే విషయాలని వివరంగా తెలుసుకుంటారు.
ఒక యోగి, ఒక గురువు మాత్రం తనకు అనుభవం అయిన అంతిమ సత్యం గురించి మాట్లాడగలడు. ఆయన అంతిమ అధికారంతో మాట్లాడగలడు. ఎందుకంటే ఆయనకు ఆ విషయం మీద అంతిమ అనుభవం ఉన్నది. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతీ మాట, ప్రతీ విషయం ఆయన అనుభవాలే. మనం ఏమనుకుంటామంటే మనకి వయస్సు, అనుభవంతో పరిణితి వస్తుంది. అప్పుడు మనం వికసించుతాము అని, కానీ యోగులు, గురువులు అది నిజం కాదు అని నిరూపించారు. వారు మనకి కనపడుతున్న ఉదాహరణలు. వాళ్ళని గమనించితే పరిణితి పొందటానికి వయస్సు, కాలంతో అవసరం లేదు, అని తెలుస్తుంది. దీనిని మీకు ఇంకా వివరంగా చెబుతాను.
మీ చిన్నతనంలో బొమ్మలే మీకు ప్రాణం ఎవరైనా మీ బొమ్మని తీసుకుంటే ఎంత గొడవ చేస్తారో కదా ? గట్టిగా అరచి ఏడిచి నానా హడావిడీ చేస్తారు. ఏదో మీ ప్రాణం ఆ బొమ్మలోనే ఉందన్నట్టు. అంతే కదా? మీరు పెద్దవారయ్యాక ఎవరైనా ఆ బొమ్మ తీస్తే మీరేం పట్టించుకోరు. ఏడవరు. మీరు ఆ బొమ్మలతో ఎటువంటి అనుబంధాన్ని పెంచుకోరు. మీకు జ్ఞానం కలిగే కొద్దీ మీలో పరిణితి సహజంగా వస్తుంది.
ఇటువంటి జ్ఞానం, పరిణితి వయస్సుకి సంబంధించినవి అని మనం అనుకుంటాము. నిజానికి వీటికి మన భౌతికమైన వయస్సుకి ఎటువంటి సంబంధం లేదు. అది మనిషి మానసిక వయస్సుకి సంబంధించినది. మనిషి మానసిక వయస్సుని కనుగొనటానికి చాలా పరిశోధనలు చేశారు. చివరికి వారు తేల్చి చెప్పిన విషయం సగటు మనిషి యొక్క మానసిక వయస్సు 14 సంవత్సరాలలోపు మాత్రమేనని.
మనిషి భౌతిక వయస్సు విషయంలో అతను అన్ని రకాల అనుభవాలు పొందాలి. అన్ని రకాల తప్పులుచేయాలి. అప్పుడు అనుభవం సంపాదించాలి. ఆ తరువాత అతనికి పరిణితి కలుగుతుంది.
ఇది ఏవిధంగా ఉంటుందంటే : కొవ్వొత్తి మంటని ముట్టుకుంటే, చేయి కాలుతుంది. అప్పుడు అది కాలుతుంది అని నేర్చుకుంటాము.
తరువాత స్టౌ మంటని ముట్టుకున్నప్పుడు అది కాలుతుంది. అప్పుడు స్టౌ మంట కూడా కాలుతుంది అని తెలుసుకుంటాము.
తరువాత కాలుతున్న సిగరెట్ ముట్టుకుంటాము. అది కాలుతుంది. అప్పుడు సిగరెట్ కూడా కాలుతుంది. అని తెలుసుకుంటాము.
తరువాత మండుతున్న బొగ్గును ముట్టుకొని అది కూడా కాలుతుంది అని తెలుసుకుంటాము. ఈ విధంగా అన్ని రకాల మంటని ముట్టుకుని, చేయి కాల్చుకుని అప్పుడు మనకి అన్ని రకాల మంటలు కాలుతాయి అని తెలుసుకుంటాము. ఇలా మనం నేర్చుకునే సమయానికి మనం చితి మంటల దగ్గరకి వెళ్ళే సమయమైపోతుంది. దీనిని జీవితపు అనుభవం అంటాము. దీనినే మనం అనుభవం నుంచి నేర్చుకోవటం అని అంటాము. భౌతికమైన వయస్సుతో జ్ఞానాన్ని సంపాదించటం అంటే ఇదే. ఒక పాఠం నేర్చుకోవటానికి జీవితం సరిపోతుంది. అంటే జీవితం గడిచే కొద్ది వయసు అయిపోయే కొద్దీ క్రమంగా ఒక్కొక్క అనుభవం నుంచి ఒక్కొక్కటి చొప్పున నేర్చుకుంటారు.
అలా కాకుండా మంటని మొదటి సారి ముట్టుకున్నప్పుడు మీకు చేయి కాలితే, అన్ని రకాల మంటలూ కాలుతాయి అని మీరు అర్ధం చేసుకుంటే అప్పుడు మీరు తెలివైన వారు అవుతారు. ఇలా నేర్చుకోవటానికి వయస్సు అవసరం లేదు. దీనికి తెలివితేటలు కావాలి. దీనినే మానసిక వయస్సు అంటాము. అందుకే మేధస్సుకి భౌతికమైన వయస్సుకి ఎటువంటి సంబంధం లేదు. అది మీరు ఎంత తెలివైనవారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మీ అంతరంగంలోని వివేకంతో విషయాలను అర్ధం చేసుకునే శక్తి మీద ఆధారపడి ఉంటుంది.
మీకు మీ జీవితంలో జరిగిన విషయాల ఆధారంగా వివరించుతాను. మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఉద్యోగం వస్తే జీవితం సంతోషంగా ఉంటుంది అని మీకు అనిపిస్తుంది
మీకు ఉద్యోగం వచ్చాక, అదే సంతోషం చాలా రోజులు ఉండదు. అప్పుడు మీరనుకుంటారు, సరే వివాహం అయితే జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది అని, వివాహం అయ్యాక పిల్లలు ఉంటే సంతోషం అని అనుకుంటారు.
ఈ విధంగా మీరు ఒక కోరిక తరువాత మరొక దాని వెంట పరిగెడుతుంటారు. ఆ కోరిక తీరితే సంతోషంగా ఉంటాము అని అనుకుంటారు. ఈ విధంగా మీరు మీ జీవితం చివరి వరకూ పరిగెడూతూనే ఉంటారు. చివరికి ఈ కోరికలు ఏవీ మీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వవు అని తెలుసుకుంటారు. అప్పుడు ఆధ్యాత్మిక ధ్యానం వీటి వైపు వస్తారు. భౌతిక వయస్సుతో అనుభవంతో నేర్చుకోవాలి అనుకునే మనిషి జీవితం ఇలానే ఉంటుంది.
ఏ వ్యక్తి అయితే ముందుగానే అతని మానసిక వయస్సు వికసించి పరిణితి పొందితే అతను ఇవన్నీ కూడా తెలివి తేటలతో నేర్చుకుంటాడు. అటువంటి వ్యక్తి తన మొదటి కోరికతోనే, ఈ కోరికలు, వాటిని సాధించిన ఫలితాలు తనకు ఏ మాత్రం నిజమైన ఆనందాన్ని ఇవ్వవు అని తెలుసుకుంటాడు. ఇక్కడే మామూలు వ్యక్తికి, ఈ వ్యక్తికి తేడ ఉండేది. ఇతను ఒక్క విషయం ఆధారంగా మొత్తం అంతా విశ్లేషించి, అంతా అర్ధం చేసుకోగలుగుతాడు. ఇతనికి నిజమైన ఆనందం, నిజమైన ఫలసిద్ధి తన లోపలి నుంచి మాత్రం వస్తాయి అని అనుకుంటాడు. అంతే కానీ అది బయట ప్రపంచంలో దొరకదు, అని తెలుసుకుంటాడు.
ఈ వివేకం, ఈ జ్ఞానం రావాలి అంటే వయస్సుతో ఏమీ అవసరం లేదు. మీరు వర్తమానంలో ఉండగలిగితే చాలు. ఎప్పుడయితే మీరు వర్తమానంలో ఉండగలుగుతారో, ఈ అనంత చైతన్య సృష్టి మీకు అన్నీ నేర్పించుతుంది. ఈ అనంత సృష్టి గొప్ప గురువు. మనం వర్తమానంలో ఉండకుండా నిరంతరం భూత, భవిష్యత్ కాలాల వెనుక పరుగులు పెడుతుంటే అప్పుడు మనం ఏమి తెలుసుకోవాలన్నా మన వీలుని బట్టి సమయానుకూలంగా నేర్చుకుంటాం. అంతే.
పూర్వ కాలం నుంచీ గొప్ప యోగులు, జ్ఞానోదయం పొందిన జ్ఞానులని గమనించితే : గౌతమ బుద్ధుడు, స్వామీ వివేకానందా, శంకరాచార్యులు, రమణ మహర్షి, వీళ్ళంతా జ్ఞానోదయమయిన గొప్ప జ్ఞానులు. వీరందరూ గొప్ప చరిత్రలు సృష్టించిన వారే. వీరందరూ చాలా చిన్న వయస్సులోనే జ్ఞానోదయం పొందారు. కాబట్టి వయస్సుకి, ఆధ్యాత్మికతకి, నేర్చుకోవటానికి ఎటువంటి సంబంధం లేదు అని అర్థం చేసుకోండి.
అందుకే అంటుంటారు. నీవు ఏమిటో అదే నీ వయస్సు అని అంటే మీ మానసిక వయస్సు ఎంతో మీ వయస్సు అంతే. మీరు 70 సంవత్సరాల వ్యక్తి అయివుండి 20 సంవత్సరాల వయస్సులోపు పరిణితి ఉండవచ్చు 18 సంవత్సరాల వయస్సులో 80 సంవత్సరాల పరిణితి ఉండవచ్చు. వయస్సు ఎక్కువ కాబట్టి ఏదో గొప్పవారము అని అనుకోవద్దు.
స్వామీ బ్రహ్మానంద : శ్రీ రమణ మహర్షి శిష్యుడు ఆయన గురించి ఒక చక్కని కథ ఉన్నది.
ఒక రోజు స్వామి బ్రహ్మానంద బృందావనంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఆయన భక్తుడు ఒక దుప్పటి తెచ్చి ఆయన ముందు పెట్టి వెళ్ళిపోతాడు. స్వామీ బ్రహ్మానంద ఏమీ మాట్లాడరు. ఆయన నిశ్శబ్దంగా అంతా గమనిస్తూ ఉంటారు.
రెండు గంటలు పోయాక ఒక దొంగ దానిని గమనించి, ఆ దుప్పటి తీసుకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన నిశ్శబ్దంగా గమనించుతూ ఉంటాడు. ఆయనకి దుప్పటి పొందటానికి దానిని పోగొట్టుకోవటానికి ఎటువంటి తేడా ఉండదు.
అలాగే భగవాన్ రమణ మహర్షి విషయంలో కూడా ఒక చక్కని కథ ఉన్నది. ఒక రోజు ముగ్గురు దొంగలు ఆశ్రమంలోనికి వస్తారు. అక్కడ ఉన్న చిన్న చిన్న వస్తువులు అన్ని తీసుకుని వెళుతూ ఆయనని ఒక దెబ్బ కొట్టి వెళ్ళిపోతారు.
దానికిరమణ మహర్షి ఏమీ చలించలేదు. అంతేకాదు కనీసం ఆయన శ్వాసలో కూడా ఏమీ తేడా రాలేదు. ఈ మొత్తం సంఘటన ఆయనని కొంచెం కూడా చలింపచేయలేదు. ఆయన అంత ఉన్నత స్థితిలో ఉన్నారు.
మనం కేవలం పరిశీలకునిలా మారినప్పుడు, మన మైండ్ మన చేతిలో ఒక పనిముట్టుగా వుంటుంది. అప్పుడు దానిని మనం మన ఇష్టప్రకారం ఉపయోగించుకోవచ్చు. లేకపోతే అది మనలని తనకు బానిసగా చేస్తుంది. మీరు మీ మైండ్‌ని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవటం నేర్చుకుంటే మీరు దానిని వదిలివేయటం కూడా నేర్చుకుంటారు. అప్పుడు మీరు యోగులు కావచ్చు
ఇక్కడ మీరు ఉండే కొద్ది రోజులులో, మీరు మీ భావావేశాలతో ఎలా వ్యవహరించాలో, మీ జీవితానికి మీరు ఎలా పరిశీలకునిగా ఉండాలో, మీ మీద మీ అంతరంగం మీద, మీ ఉనికి మీద ఎలా ఏకాగ్రతని నిలపాలో నేర్చుకుంటారు. మీలోపల ఒక మానసిక స్థితిని ఎటువంటి పాత జ్ఞాపకాల బరువులు లేకుండా ఏర్పరుచుకోవచ్చునో తెలుసుకుంటారు. లోతుగా నాటుకుపోయిన ఈ పాత జ్ఞాపకాలే మీరు అచేతన స్థితిలో చేసే నిర్ణయాలకి బాధ్యులు. ఆత్మ ప్రభావిత శక్తి మనలో ఎలా నింపుకోవాలో చేస్తారు. అచేతన స్థితి నుంచి చేతన స్థితికి : చేతన స్థితి నుంచి అనంత చేతన స్థితికి ఎలా చేరుకోవాలో నేర్చుకుంటారు. అలాగే మన సహజ స్థితి నుంచి తెలివితేటల స్థితికి, అక్కడి నుంచి ఆత్మ ప్రభోద స్థితికి ఎలా చేరుకోవాలో నేర్చుకుంటారు. మన లోపలి నుంచి శాశ్వతానందమయిన నిత్యానందాన్ని ఎలా బయటకి తీసుకురావాలో నేర్చుకుంటారు.
తరువాత సెషన్లో కలుద్దాము.
ధన్యవాదములు.
