ఉపోద్ఘాతం
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
(Introduction)
ఇప్పుడు మనం మన ప్రధాన విషయానికి వద్దాము. మీరు ఎందుకు ఈ చక్రా ధ్యానం కోర్సుకి వచ్చారు? ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది మీకు ఎలా ఉంటుంది? ఈ సమావేశంలో ముందుగా మీకు ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పటానికి ప్రయత్నించుతాను. దీని గురించి ముందుగా మీకు మనస్సు లేదా మైండ్ అనేది ఎలా పనిచేస్తుందో చెబుతాను. ఈ మైండ్ అనేది మీకు, మీ అంతరంగానికి మధ్యలో నిలబడే ఏకైక విషయం. మీరు ఈ మైండ్ ని వదిలివేస్తే మీరు జ్ఞానోదయం పొందిన జ్ఞానులు అవుతారు.
అసలు ఈ మైండ్ ఎలా పనిచేస్తుంది ? ఈ చార్టులో బొమ్మని చూడండి. ఈ చిత్రపటం ఏదైనా ఒక సమాచారం కళ్ళ ద్వారా మనలోనికి ప్రవేశించినప్పుడు, అది ఎలా క్రమబద్ధీకరింపబడి ఎలా దానిని తయారు చేస్తుందో చూపిస్తుంది. ఇది కేవలం కళ్ళతో మాత్రమే చూసిన సమాచారం కాదు, ఏ స్పర్శేంద్రియం నుంచి మనలోనికి ప్రవేశించే సమాచారం : అది చెవుల ద్వారా, లేదా నాలుక ద్వారా లేదా స్పర్శ ద్వారా ఎలా అయినా సరే : అలా చేరిన సమాచారం, ఎలా పనిచేస్తుందో ఇది చూపిస్తుంది. ఇక్కడ ఉదాహరణకి కళ్ళని తీసుకుందాము. ముందుగా నేను మీకు కళ్ళ గురించి వివరిస్తాను.
మనం ఏదైనా ఒక దానిని చూస్తే ముందుగా దానిని మన కళ్ళు చూస్తాయి. అక్కడ మనకి చక్షువుల (సంస్కృతం పదం) అని ఉండే భాగం, కళ్ళు చూసిన దృశ్యాన్ని లేదా విషయాన్ని గ్రహించుతాయి. ఇది డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్గా Digital

Signal Processor పనిచేస్తుంది. అలా కళ్ళ ద్వారా లోపలికి వచ్చిన సమాచారాన్ని ఈ చక్షువులు డిజిటల్ ఫైల్‌గా మారుస్తాయి. ఇలా ఏ స్పర్శేంద్రియం నుంచి వచ్చిన సమాచారాన్నయినా అవి అలా డిజిటల్ ఫైల్‌గా మారుస్తాయి.
అప్పుడు ఈ ఫైల్ జ్ఞాపకాలు అనే భాగంలోనికి వెళుతుంది. ఈ భాగాన్ని సంస్కృతంలో ‘చిత్తము’ అని అంటారు. ఆ భాగంలో ఈ ఫైలులో మరికొంచెం పని జరుగుతుంది. ఉదాహరణకి : మీరు ఇక్కడ నన్ను చూస్తున్నారు కదా. ఆ విషయం అనే ఫైలుని చక్షువులు చిత్తంలోనికి పంపించుతాయి. చిత్తం అంటే జ్ఞాపకాలు ఉండే భాగం ఆ ఫైలుని విశ్లేషించటం మొదలుపెడుతుంది. ఈ భాగం ఫైలులో ఉన్న సమాచారంలోని అనవసర విషయాలని తొలగిస్తుంది. అది ఫైలు గురించి ఇలా చెబుతుంది : ఇది జంతువు కాదు, ఇది మొక్క కాదు, ఇది రాయి కాదు ఇలా చెబుతుంది. ఇలా తీసివేసే కార్యక్రమం చిత్తంలో జరుగుతుంది.
ఇప్పుడు ఆ ఫైలు మనస్సు లోనికి వెళుతుంది. ఇక్కడ మైండ్ ఆ ఫైల్ ఏమిటో గుర్తించుతుంది. అది ఇలా చెబుతుంది : ఇది ఒక మనిషి లేదా ఒక వ్యక్తి క్లాసులో ఏదో బోధిస్తున్నారు. ఇలా అసలు ఆ ఫైలు ఇది అని ముగింపుని ఇస్తుంది.
ఆ తరువాత ఈ ఫైలు మొత్తం ఒక్కసారిగా అహంలోనికి వెళుతుంది. ఇప్పుడు మీ అహం, మీకు ఇది వరకు ఉన్న అనుభవాల ఆధారంగా ఆ తరువాత ఏమి చేయాలి. ఎలా నిర్ణయించాలి అనే విషయాన్ని నిర్ణయించుతుంది. మీకు అంతకు ముందే ఇటువంటి క్లాసులు, అంటే యోగా, మెడిటేషన్ ఇలాంటి క్లాసులు తెలిస్తే, అవి మీకు ఉపయోగపడి ఉంటే, అవి మీకు బాగుండి ఉండి ఉంటే అప్పుడు అహం మిమ్ములని ఇక్కడ కూర్చోవచ్చు అని నిర్ణయించుకునేలా చేస్తుంది. అలా కాకపోతే ఇక ఇక్కడి నుంచి వెళ్ళి పోవటం మంచిది అని నిర్ణయిస్తుంది.
ఈ క్రమ పద్ధతిని అర్థం చేసుకోండి. మీరు నన్ను చూస్తున్నారు. కళ్ళు ఆ విషయాన్ని చక్షువుల దగ్గరకి పంపిస్తుంది. దానిని చక్షువులు డిజిటల్ సిగ్నల్స్ మారిస్తాయి. అవి మీ జ్ఞాపకాల భాగంలోనికి పంపబడతాయి. అక్కడ అనవసరమయినవన్నీ తీసివేయబడతాయి. అప్పుడు తన దగ్గరికి వచ్చిన ఫైలుని మైండ్ గుర్తిస్తుంది. ఆ ఫైలు అహంలోనికి పంపబడుతుంది. అప్పుడు మీరు మీ పాత అనుభవాల ఆధారంగా ఇక్కడ ఉండాలా వద్దా అని నిర్ణయించుతుంది. ఇప్పుడు మనం కంటికి, మైండ్‌కి మధ్య విషయం చేరే ప్రక్రియకి పట్టే సమయాన్ని Tp అని అనుకుందాము. Tp అంటే ఒక విషయం కంటి నుండి మైండ్‌కి ప్రయాణించటానికి పట్టే సమయం. ఈ కంటికి మైండ్‌కి మధ్య జరిగే క్రమము అంతా తార్కికంగాను చేతన స్థితిలో ఉంటుంది. ఈ పూర్తి కార్యక్రమం మీకు తెలుస్తుంది. అది మీ తెలుసుకోగల స్థితిలోనే జరుగుతుంది.
ఇప్పుడు ఫైలు మొత్తం ఒక్కసారిగా మనసు నుంచి అహంలోనికి వెళుతుంది. అహం అనేది ఎక్కువగా అచేతన స్థితిలో ఉంటుంది. అంటే నిర్ణయాలు చేసే సమయమంతా మీకు తెలియని అచేతన స్థితిలోనే జరుగుతుంది. ఆ కార్యక్రమం మొత్తం మీకు తెలియకుండా జరిగిపోతుంది. ఈ సమయాన్ని మనం Tq అని అనుకుందాము. ఈ సమయంలోనే మీరు అర్ధం లేని నిర్ణయాలు చేస్తారు. మీ తార్కిక ఆలోచనలకి విరుద్ధంగా నిర్ణయాలు చేస్తారు. మీరు అర్ధం లేని నిర్ణయాలను చేస్తారు.
ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు మీకు తెలియకుండా నిర్ణయాలు చేసి ఆ తరువాత అలా చేసినందుకు విచారిస్తారు?
కారణం ఏమిటంటే, మీ అచేతన స్థితి యొక్క భాగం మొత్తం మీ వ్యతిరేకపు జ్ఞాపకాలతో అసహనంతో నిండిపోయి ఉంటుంది. మీ పాత జ్ఞాపకాలు, వీటినే సంస్కృతంలో "సంస్కారాలు" అని అంటారు, మీ పాత ఆలోచనా క్రమాలు అన్నీ కూడా ఈ అచేతన భాగంలో నిలువచేయబడి ఉంటాయి. అవి కొన్ని ఫైల్స్ రూపంలో నిలువ చేయబడి ఉంటాయి. వీటినే మానసిక శాస్త్రంలో ఎన్ గ్రామ్స్ అని అంటారు. ఎన్ గ్రామ్స్ అంటే నిలువచేసివుంచిన పాత జ్ఞాపకాలు. ఈ భాగంలో చాలా ఫైల్సు ఉంటాయి. వాటి మధ్య ఎటువంటి అర్ధవంతమైన సంబంధాలు ఉండకుండా వాటిని అక్కడ సేకరించి వుంచుతాయి.
ఇక్కడ ఏమి జరుగుతుందంటే, ఫైలు ఒక్కసారిగా ఈ భాగంలోనికి రాగానే అక్కడ చాలా సమాచారం నిలువ చేయబడి ఉంటుంది. అది మీలో అసహనాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఆ ఫైలు నిర్ణయం కోసం పూర్తిగా అహాన్ని కూడా చేరదు. అక్కడికి ఫైలు రూపంలో వచ్చిన మొత్తం సమాచారం మీద జ్ఞాపకాలు పని చేయటం మొదలు పెడతాయి. అవి వాటిని ఆ ఫైలు మీద ప్రభావం చూపేలా చేస్తాయి. దానితో నిర్ణయం చేసే కార్యక్రమం కల్లోలమయిపోతుంది.
దాని ఫలితంగా అహం తొందరపాటు నిర్ణయాలే చేస్తుంది. ఇదంతా స్వభావసిద్ధమైన దశలో జరుగుతుంది. అహం వెంటనే ఆ ఫైలుని తిరిగి మైండ్ దగ్గరకి పంపించి వేస్తుంది. ఇదంతా ఏ మాత్రం తెలియని స్థితిలో జరిగిపోతుంది.
ఉదాహరణకి : మీరు సేకరించిన సమాచారం ప్రకారం పొగతాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. అని మీకు తెలుస్తుంది. అది మీ శరీరానికి, మైండ్ కి మంచిది కాదు అని తెలుస్తుంది. మీరు ఈ నిర్ణయానికి ఈ Tp స్థితిలో ఉన్నంత సేపు కట్టుబడి ఉంటారు. కాని ఫైలు ఎప్పుడయితే అహం లోనికి వెళుతుందో, అక్కడ ఉన్న పాత జ్ఞాపకాలు మిమ్ములని సిగరెట్ కాల్చమని చెబుతాయి. అంతే మీరు సిగరెట్ కాల్చటానికే నిర్ణయించుకుంటారు. మీ చేతన స్థితిలోని క్రమం మాత్రం సిగరెట్టు ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటుంది. కానీ ఆ చేతన స్థితి మాత్రం సిగరెటు కాల్చమని నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయాన్ని అమలు చేస్తుంది ఇదంతా కూడా పూర్తిగా సహజమైన ప్రాధమిక దశలో జరిగే నిర్ణయం
మన అచేతన స్థితి చాలా శక్తి గలది. అది మూడు దశలలో పనిచేస్తుంది. అవి స్వభావ సిద్ధమయిన సహజ దశ తెలివితేటల దశ, ఆత్మప్రభోధ దశ అచేతన స్థితి వ్యతిరేకపు ఆలోచనలు, జ్ఞాపకాలతో నిండిపోయి అసహనంగా ఉంటే అది స్వాభావ సిద్ధమయిన దశలో పని చేస్తుంది. అప్పుడు మనం నిర్ణయాలని అచేతన స్థితిలో, ఏమి తెలియని దశలో చేస్తాము.
మీరు సహజ స్థితిలో ఉన్నప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలకి తరువాత బాధపడతారు. నేను ఆ విధంగా ఎలా చేసాను అని ఆశ్చర్యపోతారు. ఇది నేను కాదు, నేను దీనిని ఎలా జరగనిచ్చాను? ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నాను? అని అనుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మీ అచేతన స్థితి మీ సహజ స్వభావం దశలో పని చేస్తుంది. ఈ దశలో మీరు ఈ విషయాన్ని అర్థవంతంగా ఆలోచించరు. కేవలం నిర్ణయాలకి తొందరపడతారు. ఉదాహరణకి : మీరు ఎప్పుడైన ఎవరైనా తెల్లటి బట్టలు వేసుకున్న వ్యక్తి వలన సమస్యలని ఎదుర్కొన్నారనుకోండి. ఆ తరువాత మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఆ తెల్లటి బట్టలలో కనిపించితే, మీ పాత జ్ఞాపకాల ముందుకు వచ్చి మీకు కోపాన్ని కలిగించుతాయి. ఈ సంగతి మీకు తెలియదు. ఇదంతా సహజ స్థితిలో జరుగుతుంది. మీకు, మీ చేతన స్థితిలోని మైండ్‌కి ఏమి తెలియకుండా, మీకు ఏమీ అర్ధం కాకుండా అది అలా జరిగిపోతుంది.
మీరు చక్షుపటంలో సహజ దశలో (instinct level) ఉన్నప్పుడు ఫైలు అచేతన స్థితికి వెళ్ళుతుంది. అక్కడ నిర్ణయం చేయబడుతుంది. మీరు నిరంతరం మీ అభిప్రాయాలని తీర్పుని తెలియచేస్తుంటారు. మీ అచేతన స్థితి మీ జ్ఞాపకాల ఫైల్స్‌తో నిండిపోయి ఉంటుంది. మీరు అలా పనిచేసినప్పుడు మీరు బాగా నీరస పడిపోతారు.
ఇది ఎలా ఉంటుందంటే మీ హార్డ్ డిస్క్ హై రెజల్యూషన్ ఫోటోలతో నిండిపోతే ఇక అక్కడ పనిచేయటానికి కుదరదు. అదే విధంగా మీ అచేతన స్థితి పాత జ్ఞాపకాలతో నిండిపోతే అది సరిగా పని చేయలేక ఏదోపై పై నిర్ణయాలు చేస్తుంది.
దీని తరువాతది తెలివితేటలు దశ (intellect level) లేదా మేధస్సు దశ ఇక్కడ మీకు అన్ని తెలుస్తాయి. మీరు అర్ధవంతమైన నిర్ణయాలు చేయగలుగుతారు. కాని మీలో ఎటువంటి అదనపు కుతూహలం కానీ, శక్తి కానీ ఉండవు. మీరు కేవలం చేతన స్థితిలో ఉండే మైండ్‌తో ఉంటారు. అంతే . మీరు సృజనాత్మకతలో ఉండరు. మీరు పెద్ద నిర్ణయాలు చేయలేరు. మీరు ఎదగలేరు. మీరు కేవలం ఒక నమ్మకమైన సేవకుడిగానే ఉంటారు. ఐన్‌స్టీన్ చెబుతారు. “ తెలివితేటలు ఒక నమ్మకమైన సేవకుడు” అని మీరు జీవితమంతా ఒక సేవకుడిగా ఉండిపోతారు. అంత కంటే ఎక్కువ కాలేరు.
ఈ దశలో మీరు కేవలం సమాచారాన్ని పోగుచేసి, దానిని క్రమబద్దీకరించి, అవసరమయినప్పుడు బయటికి ఇస్తారు. ఇంతకంటే మీరు ఏమీ చేయలేరు. మీరు ఒక కంప్యూటర్‌లా చేస్తారు. అంతే. మీరు అసహనంతో కాని లేదా అచేతన స్థితిలో కాని నిర్ణయాలు చేయరు. మీరు హేతు బద్దమయిన నిర్ణయాలను, చేతన స్థితిలో, మీకు తెలిసేటట్టుగా చేస్తారు.
మీరు ఈ దశలో ఉన్నప్పుడు నీరసపడరు. అలా అని చెప్పి శక్తితో ఉండరు. మీరు ఎక్కువ తక్కువో కాని Break-even స్థితిలో ఉంటారు. ఈ స్థితిలో కూడా మీరు మీలోని శక్తిని పూర్తిగా వినియోగించరు. దానిని ఉపయోగించదగిన స్థాయిలో ఉపయోగించరు.
దీని తరువాత స్థితి ఆత్మప్రభోద దశ (intuition level) లేదా అంతఃప్రేరణ దశ ఈ స్థితిలో మీరు మీలో నిగూఢంగా ఉన్న శక్తులని యదార్ధపరచగలరు మీరు లోతైన నిశ్శబ్దాన్ని, తెలుసుకునే తత్వాన్ని మీ అచేతన భాగంలో నింపగలిగితే, అక్కడా ఉన్న పాత జ్ఞాపకాల పైళ్ళు తొలగింపబడతాయి. ఆ స్థానంలో ఈ నిశ్శబ్దం, తెలుసుకునే తత్త్వం నింపబడతాయి. అప్పుడు మీరు అంతఃప్రేరణ దశకి చేరవచ్చు
మీరు ఎప్పుడయితే మీ పాత జ్ఞాపకాల నుంచి స్వేచ్ఛని పొందుతారో, అది ఖాళీ అయిపోయి మీ అచేతన స్థితి శాశ్వతానందంలో నిండిపోతుంది. పాత జ్ఞాపకాల
బరువులు లేకుండా ప్రతి క్షణం కొత్తగా స్వేచ్ఛగా తేలికగా ఉండగలుగుతారు. అప్పుడు మీలోని శక్తి దాని యొక్క స్వచ్ఛమైన రూపంలో మీకు కనిపిస్తుంది ఇది జరిగినప్పుడు మీ తెలివితేటలు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే శక్తి మేధస్సు. ఇది జరిగినప్పుడు మీరు నిర్ణయాలని మేధస్సు అనే శక్తి ఆధారంగా చేస్తారు. అవి మీకు చాలా స్పష్టంగా కనిపించుతాయి.
మీరు ఆత్మప్రబోధ దశలో ఉన్నప్పుడు మీరు నిర్ణయాలన్నీ కూడా లోతైన తెలుసుకునే తత్వంతో, శాంతితో, పరమానందంతో చేస్తారు. ఈ విషయాన్ని మీరు చాలా లోతుగా అర్ధం చేసుకోవాలి. ఈ మొత్తం శాస్త్రం లోపలికి బాగాల్లోతుగా వెళ్ళాలి. అప్పుడు గానీ మీకు అంతరంగ ప్రేరణ అంటే ఏమిటో అర్ధం కాదు. ఇది మీలోని తెలివితేటలకి అతీతంగా జరుగుతుంది.
ఆత్మప్రబోధన లేదా అంతఃప్రేరణ అంటే ఏమిటి?
మీకు వివరించుతాను.
మీకు కావలసిన శక్తి మీ దగ్గర ఉన్నదని మీకు తెలుసు, కానీ దానిని సాధించటానికి ఉపయోగించే పద్ధతులు కాని దారులు కానీ తెలియవు. ఏ దశలో, పద్దతులలో వెళితే ఆ పని ముగింపుకి దారి తీస్తుందో మీకు తెలియదు. కానీ మీ నిర్ణయం, అభిప్రాయం కచ్చితంగా తప్పుకానిది, నిజమైనది. అని తెలుసు, దీనినే ఆత్మ ప్రబోధం లేదా అంతఃప్రేరణ అంటారు.
ఇంతకు ముందు జరగని, మీకు తెలియని కొత్త స్థితిని ఎదుర్కొనటానికి మీకు ఇటువంటి శక్తి కావాలి. మీ దగ్గర సరిపడా సమాచారం లేకుండా, మీ దగ్గర ఉన్న చాలా ప్రత్యామ్నాయాల లోపల నుంచి ఒకదానిని నిర్ణయించవలసి వచ్చినప్పుడు , మీకు నిర్ణయం తీసుకోవటం కష్టంగా ఉన్నప్పుడు ఈ శక్తి మీకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా మీరు పూర్తిగా మీ అంతరంగంలో ఉండగలిగి, ప్రతి నిముషం అందులో పూర్తిగా ఉండగలిగి మీరు కొత్త క్షణాలను, భవిష్యత్తుని సృష్టించాలంటే ఇది సహాయం చేస్తుంది.
నేను ఇప్పుడు మీకు చెబుతున్న విషయాలని అర్థం చేసుకొని, జీర్ణించుకోవటానికి ప్రయత్నించితే, మీరు కొన్ని నిముషాలయినా కేవలం మీతోనే ఉండగలిగితే, అలాగే మీలో ఉన్న పాత జ్ఞాపకాలు మీలో ఎలాంటి కల్లోలాన్ని రేపుతున్నాయో, మీకు ఎంత బరువుగా ఉన్నాయో మీరు తెలుసుకోగలిగితే, నేను చెప్పే దానిలో నిజాలని మీరు చూడగలిగితే, అప్పుడు మీరు నెమ్మదిగా క్రమక్రమంగా ఆ వృత్తంలోంచి ఆ చక్రంలోంచి బయటపడి, మీ అంతరాత్మలో ఉన్నత స్థితికి చేరగలుగుతారు.
మరొక విషయం : ఈదశలో మీరు పొందే శక్తిని నిర్ణయాలు చేయటానికే కాదు వాటిని సమర్థవంతంగా అమలు చేయటానికి కూడా ఉపయోగించవచ్చు. నేను ఈ విషయాన్ని చెప్పినప్పుడు చాలామంది నన్ను 'స్వామీజీ, నాలో తెలివితేటల దశ ఉన్నదా లేక ఆత్మ ప్రబోధ దశ ఉన్నదా అని ఎలా తెలుస్తుంది" అని అడుగుతారు. వాళ్ళు ఇంకా “ ఈరెండు దశలకి మధ్య తేడా అర్థం కాక అయోమయంగా ఉన్నది” అని అంటారు.
స్పష్టంగా తెలుసుకోండి : మీరు అయోమయంలో ఉంటే మీరు తెలివితేటల దశలో ఉంటారు మీరు ఆత్మప్రబోధ దశలో ఉంటే మీ మీద నమ్మకంతో, ఆసక్తితో కూడిన శక్తితో ప్రకాశవంతంగా ఉంటారు. అక్కడ అయోమయం, అర్థం కాకపోవటం అనేవి అసలు ఉండవు.
మీలో ఉన్న నిగూఢ శక్తిని ఈ దశ విడుదల చేస్తుంది. మీరు వికసించుతారు. మీరు దానిని చక్కగా వెల్లడి చేయగలుగుతారు. ఆ శక్తి మీ నుంచి ప్రవహించుతూ ఉంటుంది. మీరు గొప్ప గొప్ప శాస్త్రవేత్తల విజయాల గురించి చదివితే వారు కనుగొన్న విషయాలు, వారు సాధించిన విజయాలు అన్నీ కూడా తెలివితేటలకి అతీతమైనవి అని తెలుస్తుంది. వారికి ఆ సమయంలో సరైన నిర్ణయాలు చేసే ధైర్యాన్ని శక్తిని ఈ ఆత్మప్రబోధ దశ మాత్రమే ఇస్తుంది అని ఎన్నోసార్లు నిరూపించబడినది అని మనకి తెలుస్తుంది.
ఒక విషయం తెలుసుకోండి : మీ ప్రతి ఒక్కరిలో అంతః ప్రేరణ శక్తి ఉన్నది. నేను మిమ్ములని ఒకటి అడుగుతాను. మీరు మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి అప్పుడే మీకు ఫోను చేయటం, లేదా మీరు ఎక్కడికైన వెళ్ళినప్పుడు, ఆప్రదేశం మీకు ఇంతకు ముందే తెలిసినట్టు అనిపించటం, ఇలా మీలో ఎందరికి జరిగింది?
(80% కంటే ఎక్కువ మంది చేతులు ఎత్తారు)
చూడండి. ఆసమయంలో మీరు అనుకోకుండా ఆత్మప్రబోధ దశలో ఉన్నారు. ఆసమయంలోనే మీరు అనుకోకుండా ధ్యాన స్థితిలో ఉన్నారు. వీటి ద్వారా మీ అంతరాత్మ మీతో సంబంధం ఏర్పరచుకోవటానికి ప్రయత్నిస్తుంది. కాని మీరు ఏమి చేస్తారు. ఏదో అనుకోకుండా జరిగిన మామూలు విషయంలా దానిని పక్కకి తీసేస్తారు. ఆ విధంగా మీ అంతరాత్మని నిర్లక్ష్యం చేస్తారు. మన ఉనికి యొక్క ఉన్నత స్థితిని మనం ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తాం. 80% మందికి జరిగినది అనుకోని సంఘటన ఎలా అవుతుంది?
స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఈ ఆత్మ ప్రబోధ శక్తి మీ అంతరంగంలోని అంతర్గత శక్తికి సంకేతం. మీరు దీనిని గుర్తించి ప్రోత్సహించితే, మీ అంతరంగపు ఉనికి యొక్క ఉన్నత స్థానాన్ని తెలుసుకోవచ్చు
నేను ఈ మధ్యనే నోబుల్ ప్రైజు విజేత అయిన Dr. Charlel Towes అనే వ్యక్తితో భోజనం చేసాను. నేను ఆయనని ఏ విషయాన్ని LASER & MASER కనుగొన్నందుకు నోబుల్ బహుమతి ఇచ్చారో ఆ విషయాన్ని గురించి ఈ విధంగా అడిగాను. " ఇది ఎలా జరిగింది ? మీరు దీనిని ఎలా సాధించారు?"
ఆ ప్రశ్నలకి ఆయన చాలా చక్కగా జవాబు ఇచ్చారు " నేను వాషింగ్టన్ డి.సిలో ఒక పార్కులో కూర్చొని ఉన్నాను. అకస్మాత్తుగా నాకు ఏదో అయినట్టనిపించింది. నాకు కావలసిన ముగింపు పరిష్కారం నాకు దొరికాయి. అది అకస్మాత్‌గా నాకు అర్ధమయింది. నాకు అలా తెలిసిన విషయాన్ని వెంటనే పేపరు మీద రాశాను. అప్పుడు నాకు తెలియదు. నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పటానికి లేదు. ఎందుకంటే నా దగ్గర ముగింపు ఉన్నది కాని దానిని చేరే పద్ధతి లేదు. ఆ తరువాత నేను కూర్చుని దానిని హేతుబద్ధంగా ఒక క్రమంలో వ్రాయగలిగాను".
ఈయనే కాదు. ఐన్‌స్టీన్ కూడా ఇదే విధంగా చెప్పారు. " నాకు కొత్తగా జరిగిన ఇదంతా కూడా నా అంతఃప్రేరణతో జరిగింది. కానీ నా తెలివి తేటలతో కాదు" ఆయన చక్కగా ఇలా చెప్పారు. " ఈ ఆత్మ ప్రభోదం అనేది ఒక పవిత్రమైన బహుమతి. కాని బుద్ధిగల మైండ్ మాత్రం నమ్మకంబైన సేవకుడు' ' కానీ మనం సృష్టించిన ఈ సమాజం ఆ సేవకుడిని గౌరవిస్తుంది కానీ ఈ పవిత్రమైన బహుమతిని మర్చిపోతుంది.
మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకున్నా లేకపోయినా ఆత్మ ప్రభోద శక్తిఅనేది ఉన్నది. ఐన్‌స్టీన్ అంతటి వాడు కూడా దీనిని బహుమతి అని అన్నాడు. ఎందుకంటే అది శాశ్వతంగా తనలో లేదు కాబట్టి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అసలు జరుగుతుందో లేదో తెలియదు.
కాని యోగులు, గొప్ప గొప్ప గురువులు, అద్భుత ఋషులు ఎన్నోసార్లు ఈ విషయాలని చెప్పారు. వాళ్ళు పదే పదే చెప్పేది ఒక్కటే, మీరు దానిని ప్రయత్నించితే, ఆశక్తిని శాశ్వతంగా నిరంతరంగా పొందగలుగుతారు అని. అప్పుడు మీరు దానిని ఒక బహుమతి అని అనుకోనవసరం లేదు. మీరు దాని కోసం ప్రయత్నించవచ్చు. అది మీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది.
ఎప్పుడయితే అంతరంగ శక్తి మీ తెలివితేటలకి అతీతంగా జరుగుతుందో మీ ఉనికి మొత్తం పరిపూర్ణంగా ఏకత్వంతో ఉంటుంది. మీరు అత్యున్నత స్థితిలో ఉండగలుగుతారు. మీరు ఆ ఉన్నత స్థితికి చేరితే మీ కోసం ఏదో ఒక దారి తెరవబడుతుంది. మీరు దానిని బహిర్గతం అవటం తెలుసుకోగలగటం లేదా ఆత్మ
జ్ఞానం అనవచ్చు. లేదా మరే పేరుతో అయినా పిలవవచ్చు. యోగులు పదే పదే ఇది ఒక శాస్త్రం అని చెప్పారు. మిమ్ములని మీరు ఈ శక్తికి అనుసంధానం చేసుకోగలిగితే మీరు దానికి అనుగుణంగా ఉండగలిగితే, అది మీ అంతరంగంలోనే మీ అంతరాత్మలోనే నిరంతరం మీకు లభిస్తుంది. దానిని మీ నిత్య జీవితానికి ఉపయోగించుకోవచ్చు
అంతఃప్రేరణ శక్తి మీ అంతరంగంలోని మీ నిజమైన ఉనికి యొక్క శక్తి. ఈ స్వచ్ఛమయిన శక్తి మీ నుంచి ప్రవహించినప్పుడు అది మీలోని భౌతిక, మానసిక, భావావేశాల అనారోగ్యాలని బాగుచేస్తుంది. అంతేకాదు. మీ మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు అప్రయత్నంగా, అకస్మాత్తుగా నిర్ణయాలు చేయటానికి సహాయం చేస్తుంది.
అప్రయత్న నిర్ణయాలకి సమాచార సేకరణ అవసరం లేదు. మీరు సమాచారాన్ని క్రమబద్దీకరించే పద్దతి చాలు. అదే సమాచారాన్ని చాలా రకాలుగా, చాలా పద్ధతులలో ఉపయోగించవచ్చు. సమాచారాన్ని వివిధ పద్ధతులలో ఎలా ఉపయోగించాలో ఈ శక్తి మనకి తెలియజేస్తుంది. ఆ పద్ధతులనే మనం ధ్యానం పద్ధతులు అంటాము. మనం మనలోని అంతరాత్మకి విశ్వశక్తితో అనుసంధానం చేయటానికి ఉపయోగించే పద్ధతిని ధ్యానం అని పిలుస్తాము. ఆ విశ్వశక్తి మనని నిరంతరం ఆహ్వానిస్తూ ఉంటుంది. అనుభవాలని పొందమని చెబుతుంది.
మీకు సమయం దొరికినప్పుడు, కేవలం మీతోనే మీరు కూర్చుని గమనించండి. మనం నిరంతరం బయటవారికి అప్యాయింట్మెంట్ ఇస్తాం. కాని మనకి మనం ఇచ్చుకోము. మీరు కేవలం మీతోనే కూర్చున్నపుడు, మీ అంతరాత్మలో ఒక భాగం మీకు ఏదో తెలియచేస్తుంది. మీకు ఏదో మరి కొంచెం చేయాలని అనుకుంటుంది కానీ మనం ఆ భాగానికి ఆ అవకాశం, ఆ సమయం ఇవ్వం. మనం నిరంతరం మన తెలివితేటల పనులలో ఇరుక్కుపోయి ఉంటాము. మనం మన తెలివితేటలే అంతిమం అనుకుంటాం. కానీ పదే పదే యోగులు మనకి చెబుతూనే ఉన్నారు. ఈ తెలివితేటల కంటే అతీతమైన దానిని పొందటం సాధ్యమే అని.
ఈ ధ్యాన తరగతులన్నీ మైండ్ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీదే ఉంటాయి. మనలో లోతుగా పాతుకుపోయిన మన పాత జ్ఞాపకాలను ఎలా దింపుకోవాలో, ఇక మీద అనవసరమైన జ్ఞాపకాల బరువులు పడకుండా ఎలా చూడాలో నేర్చుకుంటారు. మనలోని తెలివితేటల దశ నుంచి ఆత్మజ్ఞాన శక్తికి ఎలా చేరాలో, సేవకుడిగా కాక యాజమానిగా ఎలా ఉండాలో తెలుసుకుంటారు.
ఈ కార్యక్రమం మీలోని భావావేశాల గురించి తెలియచేస్తుంది. ఈ కార్యక్రమమం మీరుమీ మైండ్ ఎలా ఆటలు ఆడుతుందో చూడగలగుతారు. మీకు మీరు మీ భావాలని ఎలా సృష్టించుకోవాలో తెలుసుకుంటారు. అంతేకాని భావావేశాలకి బానిసకారు. మీ భావావేశాలు మీ మీద, మీ శరీరం, మీ మానసిక వ్యవస్థ మీద ఎలా పని చేస్తాయో తెలుసుకుంటారు.
(స్వామీజీ చార్టు చూపించుతారు)
మీరు ఒకసారి ఈ చార్టు చూడండి. ఇది ఒక మనిషి రూపం. దీనిలో కొన్ని గుర్తులు చూపించబడి ఉన్నాయి. మీరు చూడగలుగుతున్నారా? మనిషిలో ఉండే ఈ ఏడు గుర్తులని 'చక్రాలు' అంటారు.
ఈ చక్రాలు మన శరీరంలో సూక్ష్మమైన శక్తి పీఠాలు. ఇవి మన శరీరంలోని ఏడు శక్తి చక్రాలు. మనం అనుకుంటున్నట్టుగా మనకి శరీరం ఒక్కటే కాదు. మనవి మొత్తం ఏడు శరీరాలు. ఇవి ఏడు శక్తి శరీరాలు. ముందు మీకు వీటిలోని మూడు శరీరాలని గురించి ఇప్పుడు వివరించుతాను.
వీటిలో మొదటి శరీరం జాగ్రత శరీరం. ఆ శరీరంతోనే మీరు ఇక్కడికి వచ్చారు. ఆ శరీరంతోనే మీరు నడుస్తున్నారు. మాట్లాడుతున్నారు. వ్రాస్తున్నారు. ఇది భౌతిక శరీరం, మెలకువతో ఉన్న శరీరం.