నవ్వు, దేవుడి దగ్గరకు మీ దారి!
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
నమ్మలేని హాస శక్తి

కిం దటిసారి మీరెప్పుడు నిజంగా చిరునవ్వు నవ్వారు?
సంతోషంతో అనియంత్రితంగా వెలువడ్డ హృదయపూర్వక అట్టహాసం మీరెప్పుడు చేశారు?
ఈ రోజుల్లో, ఎలా నవ్వాలో మరచిపోయాము.
మన హాసం చిరునవ్వు పొడిగింపు మాత్రమే - సాంఘిక ఆవశ్యకత. మనం నవ్వినప్పటికీ, మనం సామాన్యంగా ఇతరులవైపు చూసి నవ్వుతాము, లేదా కేవల విధి పూర్వకంగా నవ్వుతాము. హాస్యాన్ని నవ్వులు, చిరునవ్వులు స్థానభ్రంశం కావిస్తున్నాము.
కార్యాలయంలో, యజమాని ఒక జోకు వేస్తాడు. విసుగు చెందిన ఒక యువతి తప్ప ఆఫీసు ఆఫీసంతా బిగ్గరగా నవ్వుతుంది.
"సంగతేమిటి? నీవెందుకు నవ్వటం లేదు?" యజమాని ఆశ్చర్యంగా అడుగుతాడు.
"నాకు ఆ అవసరం లేదు. నేను వచ్చేవారం ఉద్యోగం నుండి నిష్క్రమిస్తున్నాను" యాదృచ్ఛికంగా జవాబిస్తుంది. హాసోక్తులు కాకుండా, నవ్వుకు అద్భుతమయిన శక్తి ఉంది. దాన్ని ఎలా వినియోగించుకోవాలో మనం మరచిపోయాము.
అది ప్రజలను కలిపే శ్రేష్ఠమయిన మార్గం. మీ చుట్టూ చూడండి. తెలివయిన విపణి నిపుణులు, సర్వశ్రేష్ఠ మహోపన్యాసకులు, అత్యంత ప్రభావ ప్రకటనలు వారి (టి)
సందేశాలు నలుమూలల చేరటానికి హాస్యాన్ని ప్రయోగిస్తారు. ఒక నాయకుడు తన టీమును హాస్యంలో ముంచెత్తినప్పుడు, తనకు వారికి మధ్య ఉన్న అడ్డంకిని సులభంగా తొలగించుకుంటాడు.
వాస్తవం, హాసధోరణిలో ప్రతిపాదించినప్పుడు తీవ్రభావాలను కూడా సులభంగా ప్రజలు అంగీకరిస్తారు. సామెత చెప్పినట్లు, పూర్తిగా నిండిన బియ్యం బస్తాలో పిడికెడు బియ్యంతో ఇంకా నింపాలనుకున్నప్పుడు ఆ బస్తాను కొంచెం కుదపాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రజలు పూర్వమే తత్వాలతో (మనలాగే!) నిండి ఉంటే చిరునవ్వు 'కుదుపు'ను కల్పిస్తుంది, అది తాజా భావాలను సులభంగా స్థిరపరిచేటట్లు వారి మనసులను ఆవిష్కరిస్తుంది.
పూర్వకాలంలో, రాజులకు పండితులకు నవ్వు ప్రాముఖ్యం బాగా తెలుసు. ఆశ్చర్యం లేదు, ప్రతి మహారాజుకు ఆస్థానంలో తరచు తెలివైన వివేకవంతుడైన సలహాదారుగా ప్రసిద్ధ విదూషకుడు ఉండేవాడు. షేక్స్పియర్ నాటి కాలంలోని 'హాస్యగాళ్ళు' మన భారతీయ విదూషకులు, తెనాలి రామకృష్ణుడు, బీర్బల్ మొదలయిన వారికి మనోహరమయిన దయాపూర్వక హాస్యంతో నిత్యసత్యాలను ప్రతిపాదించే కళ ఉంది.
ప్రతి ఒక్కరికి తమ చుట్టూ ఉండే వారిని నవ్వించే అద్భుత శక్తి, హాస సృజన ఉండదు. మనలో చాలా మంది నవ్వటానికి భయపడతాము. ముఖ్యంగా కొత్త వారితో ఉన్నప్పుడు - కారణం నవ్వు మిమ్మల్ని బయట పెడుతుంది.
నవ్వు అమాయకమయిన దుర్బలమయిన నీలో దాగియున్న నిన్ను బహిరంగ పరుస్తుంది. నవ్వటం కష్టంగా భావించేవారు తాము కోల్పోయినదేమిటో తెలుసుకోలేక పోతున్నారు. నన్ను నమ్మండి, నవ్వు వ్యాపారం కంటే తీవ్రతరం వ్యాపారం లేదు -
నవ్వగలగటం అతి ముఖ్యం! హాస్యోక్తి - మీ సమస్యల పట్ల నవ్వటాన్ని నేర్చుకోండి. కనీసం సదా మీకు నవ్వటం గురించి ఏదో ఒకటి ఉంటుంది.
తమను చూసి నవ్వినా మనసులో పెట్టుకోని జనాలు దైవకృపకల సుఖంకలవారు, ఎందుకంటే వారు అహంకారానికి అతీతమయిన మార్గాన్ని కనుగొన్నారు. నవ్వు అమిత శక్తికల ఆరోగ్యం పొంగిపొర్లటంకాక మరేమీ కాదు. మీతో మీరు మీ పరిసర ప్రాంతాలతో మీరు ప్రశాంతంగా ఉంటున్న సహజ ఫలితంగా నవ్వు వికసిస్తుంది. అందువల్లనే, సంతోషంగా నవ్వుతూ ఉండే జనాలు సామాన్యంగా మిక్కిలి సృజనాత్మకత సహజత కలిగి ఉంటారు.
నాకో వీథజ నాటకం గుర్తుకు వస్తోంది. నా బాల్యంలో ఒకసారి దాన్ని చూచాను. మన భారతదేశ గ్రామాలలో, వీథి నాటకాలు దాదాపు ఎల్లప్పుడు పురాతన మహాకావ్యాల నుండి గ్రహించబడతాయి.
మహాభారతం నుండి గ్రహించబడ్డ ప్రసిద్ధ ఉపాఖ్యానాలలో ఒకటి ద్రౌపది వస్త్రాపహరణం. ఆ నాటకంలో కౌరవ సభలో సభ్యులందరూ చూస్తూండగా దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయటానికి ప్రయత్నిస్తాడు. కౌరవుల మాయా ద్యూతంలో భార్యను కోల్పోయిన పంచ పాండవులు నిస్సహాయులై చూస్తుంటారు. అంతిమంగా ద్రౌపది కృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. కృష్ణుడు ద్రౌపది మానాన్ని రక్షించేటందుకు గాను దుశ్శాసనుడు ఎన్ని చీరలను విప్పినప్పటికి ప్రమాదం జరగని విధంగా ద్రౌపదిని అనంత వస్త్రదానంచే ఆశీర్వదించాడు. భగవదనుగ్రహం వల్ల ప్రతి నాయకులు పరాజయం పాలయ్యారు.
ఈ ప్రఖ్యాత దృశ్యాన్ని ప్రదర్శించే సమయంలో, నిర్ణీత కృష్ణుడు గైర్హాజరు కావటం జరిగింది, చివరి క్షణంలో ప్రతినిధి కృష్ణుడు ప్రవేశపెట్టబడ్డాడు. గ్రామాలలో సాంప్రదాయికంగా స్త్రీ పురుష పాత్రలు రెండింటినీ పురుషులే ధరిస్తారు. ద్రౌపది వేషధారి ఒక యువకుడు. అతడు సహజంగా ద్రౌపది వేషంలో చీర కింద పాంటు ధరించాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయటానికి ప్రయత్నించినప్పుడు, రెండో కృష్ణుడు భయపడి, రంగస్థలం వెనక భాగం నుండి అదనపు వస్త్రాలను విడవటం మరిచిపోయాడు.
ఫలితంగా, రెండు క్షణాల్లో, ద్రౌపది బుటేదారి రవికతోను, పాంటుతోను ఆశ్చర్య చకితులయిన గ్రామీణ ప్రేక్షకులముందు నిలబడింది!
కాని ద్రౌపది వేషధారి గొప్ప హాస్యభావ భరిత చతుర నటుడు. ప్రేక్షకులు స్పందించక ముందే, మోకాళ్ళను భూమికి ఆన్చి చేతులు జోడించి పెద్దగా ప్రార్థించాడు, "హే కృష్ణా! దీన దయాళో! ఆర్త జనాశ్రయా! నన్ను పురుషుడిగా మార్చటం ద్వారా నా మానాన్ని రక్షించావు! కృతజ్ఞతలు ప్రభూ! కృతజ్ఞతలు!
చెప్పనవసరం లేదు, ఆ రోజు ద్రౌపది వస్త్రాపహరణ దృశ్యం ఘన కరతాళ ధ్వనులతో మార్మోగి శ్లాఘించబడినట్లు అంతకు పూర్వమెప్పుడూ ప్రశంసించబడలేదు.
తీవ్రత వాస్తవంగా ఒక రోగం.
మీరెప్పుడయినా సీరియస్గా ఉన్న బిడ్డను చూశారా?
ప్రతి పరిస్థితిలోను పిల్లలు ఏదో ఒక వినోదాన్ని కనుగొనే సమర్థత కల్గి ఉంటారు -
ప్రత్యేకంగా ఇంట్లో అతిథులు ఉన్నప్పుడు! వినోదమేమిటో చూడలేని యువకులం మనం, పిల్లల నవ్వును బలవంతంగా ఆపివేస్తాము.
సమస్య ఇక్కడే మొదలవుతుంది! నవ్వును అణచివేయటం రోగానికి ఆరంభం.
కొన్ని వారాల కిందట, ఒక మనిషి తన టీనేజి కొడుకుతో నా ఆశ్రమానికి వచ్చాడు. అతడి కొడుకు తీవ్రమయిన కుంగుబాటుకు లోనయి బాధపడుతున్నాడు. 15 సంవత్సరాల వయసులో ఆ అబ్బాయి ముందే మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
మన శతాబ్దిలో కుంగుబాటు ప్రత్యేక బహుమతి!
ఇంకే కాలంలోను, ఏ యుగంలోను యువతీయువకులకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేటంతటి జీవితంపై విసుగుదల కలగలేదు.
ఏమయినప్పటికీ, ఆ అబ్బాయి తండ్రి సాధ్యమయిన ప్రతి చికిత్సను చేయించాడు, కాని ఫలితం దక్కలేదు. అతడు బాలుడికి నయం చేయమని నాకు నివేదించాడు.
ఆ బాలుణ్ణి కొన్ని రోజులపాటు నా వద్ద ఆశ్రమంలో ఉంచమని తండ్రిని అడిగాను. ఆ సమయంలో నేను, ఆ బాలుడితో - హాస్యోక్తులను పంచుకుంటూ కాలక్షేపం చేశాను! నేను అతడికి చదవటానికి జోక్ పుస్తకాలనిచ్చాను. ఆశ్రమం చుట్టూ తిరిగి ఆశ్రమవాసులతో పరస్పర క్రియ జరపవలసిందిగా అతణ్ణి కోరాను. ప్రతి రోజు, మేము కలుసుకొని అనియత "హాస్యోక్తి సమావేశకాలా"న్ని గడిపేవాళ్ళం. పదిరోజులలో, ఆ అబ్బాయి సంపూర్ణంగా కుంగుబాటు నుండి కోలుకున్నాడు. ఇది నిజంగా జరిగింది!
నవ్వుకు గొప్ప చికిత్సా విలువ ఉంది. నేడు, ప్రపంచ వ్యాప్తంగా హాస్యరోగ నివారణ ప్రభావాలను వైద్యులు, మనస్తత్వ వేత్తలు అంగీకరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న హాస్య క్లబ్బులు దానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.
హాస్యంచే ప్రేరేపించబడ్డ గాఢ అస్తవ్యస్త శ్వాసనం మన శరీరంలో అనుకూల కంపనలను పుట్టిస్తుంది, కడుపును సడలిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. నవ్వు మన నాభి ప్రదేశంగా లోని మనోవ్యథకు కుంగుబాటుకు ఆసనమైన మణిపూరక చక్రాన్ని పరిశుభ్ర పరుస్తుంది కూడా. నవ్వే సామాన్య క్రియకు మనలో ప్రగాఢంగా నాటుకొని ఉన్న మానసిక అణచివేతలను అణచివేసే శక్తి ఉంది. నవ్వుకు సహజంగా నయం చేసే శక్తి ఉంది. ఆ శక్తి ప్రకృతి మనకు ప్రసాదించిన వరం.
కాని నవ్వుకు ఆరోగ్యలాభాలకంటె ఇంకా ఎక్కువ లాభాలున్నాయి.
నవ్వు నిరూపిత ధ్యాన విధానం కూడా.
వాస్తవంగా, జెన్ మఠాలలో, ప్రతి రోజు నవ్వుతూ కొంత సమయం గడపటం అందరి సన్న్యాసులకు నిర్బంధంగా ఉంది.
చిన్న కథ:
ఒకప్పుడు యథార్థ ఆధ్యాత్మికత యొక్క అర్థం గురించి బౌద్ధ సన్న్యాసుల సదస్సు జరిగింది. ప్రతి బౌద్ధ సన్న్యాసి వేదికపైకి ఎక్కి వాస్తవంగా ఇతరులందర్నీ నిద్రపుచ్చుతూ దీర్ఘోపన్యాసాన్ని ఇచ్చాడు, తుదకు, జెన్ సన్యాసికి మాట్లాడే వంతు వచ్చింది.
అతడేమి చేశాడనుకుంటున్నారు?
అతడు కేవలం నవ్వటం మొదలుపెట్టాడు!
అస్తిత్వమంతటితోను నవ్వటం, నవ్వటం.
అతడి కడుపులోంచి నవ్వు పుట్టుకు వచ్చింది.
అతడు అనియంత్రితంగా నవ్వుతో ఊగిపోవటం మొదలుపెట్టాడు.
అతడి నవ్వు ఎంతగా అంటుకుపోయిందంటే, త్వరలోనే గదిలోని అందరూ తామెందుకు నవ్వుతున్నామో తెలియకుండానే నవ్వటం మొదలుపెట్టారు.
వారికి ఏమీ తెలియకుండానే, సన్యాసులందరి సాధారణ హాస్యం గదిలో పెద్ద అనుకూలశక్తి తరంగం ఉత్పన్నమయింది. సన్యాసులు అత్యధిక ఉన్నత స్థితికి చేరుకున్నారు. నవ్వే క్రమంలో వారు ఒక క్షణం అమనస్కులయ్యారు.
జెన్ మాస్టర్ ప్రకటించాడు: ఇది నిజమయిన ఆధ్యాత్మికత.
నవ్వు అత్యున్నత ఆధ్యాత్మిక గుణం. అది మిమ్ముల్ని జ్ఞానోదయానికి నడిపిస్తుంది. వాస్తవంగా నవ్వు జ్ఞానోదయానికి రాచబాట అని పేర్కొబడుతుంది. కారణమేమిటంటే, నవ్వు మొత్తం ఉనికి నిరవధిక శక్తి అయిన ప్రపంచ శక్తితో కలిపే సులభతమమయిన శక్తిమత్తమమయిన మార్గం.
కాబట్టి సదా నవ్వుతూండండి!