KAILASA Library/చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/లే, నాట్యం చెయ్యి !Sign in
చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

లే, నాట్యం చెయ్యి !

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

సహజంగా ఉండు

సహజంగా ఉండు

సు ప్రసిద్ధులయిన జెన్ మాస్టరు బేంకీ దేశాటన చేస్తూ ఒక కొత్త పట్టణానికి వచ్చారు.

(నా కథలు ఎప్పుడూ జెన్ నుంచి గ్రహించబడతాయి. మరే ఇతర మతం కూడా జెన్ లాగా సుందరంగా జీవితాన్ని గౌరవంతో, ధైర్యంతో, హాస్యంతో చూడలేదు.

జెన్కు జీవితంతో ప్రేమ వ్యవహారం ఉంది!)

జెన్ మాస్టర్ తమ పట్టణానికి వచ్చినట్లు తెలుసుకొని ఆయనను అడిగేవారు:

ప్రియమయిన మాస్టర్ గారు, మీ గురించి మేము చాలా విన్నాము! మీ దర్శన మాత్రం చేతనే ప్రజలు మిక్కిలి సంతోషంగా ఉంటారని మేము విన్నాము. వారు అద్భుతంగా రోగవిముక్తులవుతున్నారు. వారు తమ కోరికలు నెరవేరినట్లుగా భావిస్తారు! ఈ శక్తులను పొందటానికి మీరు అభ్యసించిన ప్రత్యేక విధానం ఏమిటి?

మాస్టర్ గారు సామాన్యంగా సమాధానమిచ్చారు;

నేను ఆకలిగా ఉన్నప్పుడు తింటాను. నాకు నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాను. అది నా ధ్యానం. జెన్ మాస్టర్లు సామాన్యంగా ఇలాగే మాట్లాడతారు!

ఇప్పుడు మీరు కంగారు పడినట్లుగానే, అతని మాటలు విన్న ప్రజలు కూడా కంగారు పడ్డారు. బహుశా తినటం, నిద్రపోవటం కంటే తేలికైన పనులు ఏమి ఉంటాయి? జీవితమంతా వారు, తింటూ నిద్రపోతూనే ఉన్నారు. ఇక్కడ గొప్ప మాస్టర్ గారు, శక్తిమంతమయిన ధ్యాన రీతి అని పేర్కొంటున్నారు.

కాబట్టి వివరణ అడిగారు.

మాస్టర్ వారిని అడుగుతున్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు మీరు నిజంగా తింటున్నారా? మీకు నిద్ర వస్తున్నప్పుడు మీరు నిద్రపోతున్నారా?

మీరు ఇలా చేస్తున్నారా?

మనం సామాన్యంగా ఎప్పుడు తింటాం?

మధ్యాహ్నం భోజనం సిద్ధమయినప్పుడా? మనకు సమయం దొరికినప్పుడా? గడియారం సమయాన్ని సూచించినప్పుడా?

మనకు తెలియకుండానే, మన జీవితాన్ని ప్రవర్తనా పద్ధతిలో ఉంచుకుంటున్నాము. తినటం, నిద్రపోవటం వంటి వ్యక్తిగత పనుల పట్ల కూడా మనం ఏర్పరచుకొన్న జాబితాపై ఆధారపడి ఉన్నాము! మన జీవితాన్ని నియంత్రించే ఈ పద్ధతిని అలవాట్లు అని మనం వ్యవహరిస్తున్నాము. చాలామంది ప్రజలు కప్పు టీ లేదా కప్పు కాఫీ తాగకుండా రోజును ప్రారంభించలేని స్థితిలో ఉన్నారు! ఉదయమే టీ లేదా కాఫీ తాగకపోతే, వారికి తలపోటు వస్తుంది, రోజు సరిగా గడపలేరు. మనందరికీ ఇష్టమయిన అలవాట్లు ఉంటాయి. వాటిని మనం 'మన అలవాట్లు' అంటాం. కాని నిజానికి అవి మనల్ని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నాయి.

తీవ్ర ఉన్నత స్థితిలోకి తీసుకుపోయి, అలవాటుతో రంధి పడటం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మానసిక రోగ చికిత్సా విధానంలో దీన్ని పునఃపునర్నిర్భంధ లోపం (ఓసిడి) అంటారు. ఈ లోపంతో బాధపడే ప్రజలు ఒకే పనిని మాటిమాటికి చేస్తూంటారు. చేతుల్ని కాళ్ళను మాటి మాటికి కడుక్కోవటం, లేదా తలుపు తాళం సరిగ్గా పడిందో లేదో అని నిరంతరాయంగా లాగిలాగి చూడటం వంటి చిన్న చిన్న పనులు కావచ్చు. కాని వారు తమ జీవితమంతా దాని మీదనే ఆధారపడి ఉన్నట్లు

చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. ఆస్టిక్ ప్రజలు తమ పరిసరంలో ఏ చిన్న మార్పు వచ్చినా తమ గదిలో సామానును మరల మార్చి సర్దినా తీవ్రంగా కలవరపడతారు. చిన్న చిన్న కారణాలు వారి కలవరపాటుకు చాలు.

ఈ ప్రవర్తనను పిచ్చి అని నవ్వవద్దు!

బాగా స్పష్టంగా ఉండండి: సాధారణ ప్రజలకు వ్యాకుల పడిన ప్రజలకు మధ్య ఉన్న తేడా స్థితికి సంబంధించింది - స్వల్పమయినది.

అలవాటు జీవిత యథార్థ పరిణామాన్ని మొద్దుబారుస్తాయి. అలవాటును తప్పించు కోవటం ప్రతిక్షణం జీవితం కల్పించే మార్పు అవకాశాలన్నిటినీ కోల్పోవటమే అవుతుంది.

మన జీవిత ప్రతిఘటన క్షణాలలో కూడా, మనం అలవాటు వైపు మొగ్గుచూపుతాము.

చిన్నకథ:

ఒక జేబుదొంగ మరణించి స్వర్గానికి వెళ్ళాడు. ముత్యాల గేట్ల వద్ద కాపలాకాసే సెయింట్ పీటర్ అతణ్ణి ఆపాడు. దొంగ జీవితమంతా ప్రజలను మోసగిస్తూనే ఉన్నాడనీ అతడు స్వర్గానికి మారుగా నరకానికి పోవలసీ పీటర్ అతడికి గుర్తు చేశాడు. కాని జేబుదొంగ తనను క్షమించమని, కొత్త మనిషిగా మారిపోతానని పీటర్‌ను యాచించాడు.

తుట్టతుదకు సెయింట్ పీటర్‌కు అతడంటే దయ కలిగింది.

సరే, అని నీరసంతో పీటర్ అతడికి అంగీకారాన్ని తెలిపాడు. లోనికి వెళ్ళు, కాని మొదట, నా పర్సు తిరిగి ఇచ్చి వేస్తావా? అని అడుగుతాడు.

  • * * *

మన నాగరిక ప్రపంచంలో, మనం స్థిరతకు హాస్యాస్పదమయిన విలువనిస్తున్నాము. సామాన్యంగా, ప్రజలు తాము స్థిరంగా ఉన్నందుకు గర్విస్తుంటారు! వారు తాము గత 30 సంవత్సరాల నుండే ఒకే సమయానికి లేస్తున్నామని గర్వంగా చెప్పుకుంటారు, వారు తాము కమ్యూనిస్టులమని లేదా నాస్తికులమని లేదా చిన్ననాటి పాఠశాల దినాల నుండి ఏదో ఒకటని గొప్పగా చెప్పుకుంటూ గర్విస్తుంటారు.

స్థిరతా జనాలు చాలా విసుగు పుట్టిస్తారు. ఎవరైనా ఒకరు తాము స్థిరంగా ఉన్నామని చెబితే ఉన్న రెండు కారణాల్లో ఒకటి మాత్రమే అవుతుంది.

(అ) జీవితమంతా తన గురించి ఏ వస్తువును మార్చుకోవలసిన అవసరం లేని రీతిలో పుట్టుకతో సంపూర్ణ పురుషుడుగా ఉండి ఉండాలి లేదా (ఆ) గర్వం లేదా భయం వల్ల పురాతన భావాలను పట్టుకుని అంటిపెట్టుకొని ఉండాలి.

ఏ ఒక్కడు ముందుగానే సంపూర్ణ పురుషుడు అని నేను అనుకోను కాబట్టి ఇతర కారణం, మార్పు అంటే భయం. అలవాట్లు పరిచయమున్న, అంగీకృత జీవిత రీతులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అలవాట్లు భద్రతకు చిహ్నంగా ఉంటాయి. ఆ కారణంగానే, మనం అలవాట్లకు లేదా ప్రియ జీవితానికి అంటిపెట్టుకొని ఉంటున్నాము!

అలవాట్లు లేకుండా విశ్వాసాలు లేకుండా జీవించటానికి గొప్ప ధైర్యం కావాలి. ఏది ఒప్పు లేదా ఏమి చేయాలో మీకు చెప్పటానికి మీకు ఆలోచన అవసరం లేదని

అర్థం. కాని మనం తప్పు చేయటానికి మనం మన సహజత్వాన్ని నాశనం చేసినట్లు భావించి భయపడతాము.

నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పాపకూడా మొదట తొలిసారి అడుగులు వేయటానికి భయపడదు, మీరెందుకు భయపడుతున్నారు? జీవితంలోని ఆటుపోట్లను తట్టుకోవటానికి మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకొని జీవానందాన్ని అనుభవించండి, జీవితం అభద్రత! జీవిత భద్రతను అనుభవించి ఆనందించండి, మీకెప్పుడూ భయం కలగదు.

మనం పెద్దవాళ్ళమయ్యే కొద్దీ, మనం మార్పును అంతకంతకు ఎక్కువగా అడ్డుకుంటాము, మనం అనుకునే తప్పొప్పుల భావనకు వ్యతిరేకంగా ఉన్న కారణంగాను, మనకు ఏది పనికి వస్తుంది ఏది పనికిరాదు అని అనుకోవటం వల్ల మార్పు మనల్ని బెదిరిస్తుంటుంది. జీవితం ఆవశ్యకంగా వైరుధ్యాలతో కూడుకొన్నది కాదు అని మనం మరచిపోతుంటాము.

దానితో నేటికి, లేదా మనం రేపు ఏమి జరగాలనుకుంటామో దానితో నేటిని పోల్చుకుని జీవితం వైరుధ్యాలతో కూడినదని మనం అనుకుంటున్నాము. మనం మన ఆశంసల ఆకాంక్షల వలలో చిక్కుకున్న పరిస్థితులలో మాత్రమే మనకు వైరుధ్యాలు కన్పిస్తాయి.

ఒక కథ:

ఒక గ్రామంలో ఇద్దరు సాధువులు నివసిస్తుండేవారు. వారిలో ఒకరికి ధార్మిక గ్రంథాలలోను, తర్కశాస్త్రంలోను తనకు అపారజ్ఞానం ఉందనే గర్వం ఉంది. అతడు ఎప్పుడూ తత్వ శాస్త్రోపన్యాసాలనిస్తూండేవాడు. ఇంకొకడు సాదాసీదాగా సంతోషంగా గ్రామస్థులతో కలిసిమెలసి శాంతియుత జీవితాన్ని గడిపేవాడు.

ఒకరోజు, బజారుకు వెళ్ళే రోడ్డుమీద వాళ్ళిద్దరూ కలిశారు. తాత్త్విక చర్చను ప్రారంభించాలనే ఆశతో మొదటి సాధు "మీరెక్కడకు వెళ్తున్నారు?" అని అడిగాడు.

రెండో సాధు సంతోషంగా "నా కాళ్ళెక్కడకు తీసుకుపోతే అక్కడకు వెళ్తున్నాను" అని సమాధానమిచ్చాడు.

మొదటి సాధు అవాక్కు అయ్యాడు. దాన్నిబట్టి అతడు ఏమి ఉద్దేశించాడు? తాత్త్విక ప్రహేళికను తనకు ప్రతిపాదిస్తున్నాడా? అతడికి తాను జవాబు చెప్పటం ఎట్లా?

అతడు ఇంటికి వెళ్లి, సాధు వాజ్మూలం యొక్క అర్థాన్ని గూర్చి ఆలోచిస్తూ రోజంతా గడిపాడు. ఎంతో కష్టంతో, అతడు సమతుల్య వివేక వాజ్మూలాన్ని పన్నాడు.

మర్నాడు, అదే రోడ్డు మీద అతడు రెండో సాధువును విజయంతో సమీపించాడు.

'ఎక్కడకు వెళ్తున్నారు?' అతడు మళ్ళీ అడిగాడు.

రెండో సాధు మృదువుగా "గాలి నన్ను ఎక్కడకు తీసుకొని వెళ్తే అక్కడకు వెళ్తాను" అని సమాధానమిచ్చాడు. ఇది చాలా ఎక్కువ! రెండో సాధువు కలవరపడ్డాడు. అతడి వద్ద బాగా ఆలోచించి సిద్ధం చేసుకున్న ప్రతివాదం ఉంది, ఇప్పుడు రెండో సాధువు తన వాజ్మూలాన్ని మార్చివేశాడు! కాబట్టి అతడు తిరిగి ఇంటికి వెళ్లి, కొత్త సవాలు ఎదుర్కోవటానికి తయారయ్యాడు.

మూడో రోజు, అతడు దారి కాసి రెండో సాధువును అదే ప్రశ్నను మళ్ళీ అడిగాడు.

ఎక్కడకు వెళ్తున్నావు?

'నేరుగా బజారుకు కూరగాయలు తేవటానికి! నవ్వుతూ రెండో సాధువు సమాధానమిచ్చాడు.

ఇటువంటిది జీవితం!

జీవితంలో, ప్రతిరోజు సమాధానాలు మారుతుంటాయి. మార్పు మాత్రమే జీవిత వాస్తవమైనప్పుడు, ముందుగానే ఎలా ప్లాన్ వేసుకోగల్గుతారు?

చైనాకు సంబంధించినదే ఓ ఇజమ్‌లో జీవితం

యిన్ - యాంగ్‌లచే ప్రతీకగా రూపొందించబడింది.

యిన్ - యాంగ్‌లు విరుద్ధ జీవిత సూత్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.

ప్రతికూలం - అనుకూలం, చీకటి - వెల్తురు, సంకోచం - వ్యాకోచం. కాని యిన్ - యాంగ్‌లలో సుందర విషయమేమిటంటే రెండు దృష్టికోణాలు నిరంతరాయంగా ప్రతిక్షణం మారుతూ పరస్పరం వినిమయమవుతూండేవి. సదా యాంగ్‌లో చిన్నయిన్ ఉండేవాడు, చిన్నయిన్‌లో యాంగ్ ఉండేవాడు. జీవితంలాగానే సదా ద్రవస్థితిలో సదా మారుతూ ఉంటుంది. ప్రవర్తనా మనస్తత్వ శాస్త్రజ్ఞుడు నిర్వహించిన ప్రయోగంలో రెండు ప్రజా సముదాయాలను ఒకే కొద్ది సంగీతాన్ని విని - నాట్యం ద్వారా కలిసిపాడటం ద్వారా, నవ్వటం ద్వారా చేతులు ఊపటం ద్వారా లేదా సరిగ్గా కూర్చోవటం ద్వారా - వలె ఆ గ్రూపులు ఏ విధంగా అనుభూతి పొందాయో ఆవిధంగా ప్రతిస్పందించ వలసిందిగా అడిగాడు. తేడా మాత్రం ఒకటే ఉంది. రెండో గ్రూపు వారి కళ్ళకు గంతలు ఏమీ కనపడకుండా కట్టారు.

మొదటి గ్రూపులోని ప్రతినిధులలో చాలా 1/5 మంది సంగీతానికి వాస్తవంగా స్వాభావికమయిన రీతిలో ప్రతిస్పందించగా రెండో గ్రూపులోని దాదాపు ప్రతి ఒక్కరూ లేచి వెళ్ళిపోయారు అని చెప్పనక్కర్లేదు.

మనం తెలివి తక్కువగా కన్పించటానికి ప్రవాహానికి ఎదురీదటానికి భయపడతాము. భయం లేదా పక్షపాతం లేకుండా క్షణానికి ప్రతిస్పందించే శక్తిని సామాన్యంగా కోల్పోయాము.

హాస్యాస్పదమయిన విషయం, ఈ రోజుల్లో చాలామంది జనం సహజత్వ ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటున్నారు - ఇప్పటికే మనం దాన్ని ఎలా చేయాలో మరచిపోయాము.

ప్రతిచోట టీనేజర్లు టి - షర్టులను ధరించి ‘మీకు నచ్చిన దానిని మీరు చేయండి’ అని చెబుతూ కనిపిస్తారు. కాని, వాస్తవానికి వారు భయపడుతున్నారు. అంగీకృత విషయాన్ని సరిపోకపోవటాన్ని చేయకుండాటానికి విముఖులవుతున్నారు. సహజంగా ఉండటాన్ని నేర్చుకో నవసరంలేదని నేను మీకు చెబుతున్నాను! ప్రతి క్షణం మనమంతా జీవితాన్ని ఆనందంగా అనుభవించే సహజ శక్తితో పుట్టాము. తొర్లమధ్యంలో ఎక్కడో ఒకచోట వ్యక్తిగత అలవాట్లు సాంఘిక నియమాల మధ్య మనం ఆసక్తిని కోల్పోయాము, ప్రతి తరం తర్వాతి తరానికి ఇదేవిధంగా దీన్ని అందిస్తోంది. మన పిల్లల సహజత్వాన్ని సర్వనాశనం చేసే గొప్ప శక్తి మనకు ఉంది.

ఇప్పుడు పాడవద్దు, నాన్నగారు నిద్రపోతున్నారు!

గోడమీద గీయమని ఎవరు చెప్పారు?

ఇప్పుడు పడుకో!

బంతిని ఆడుకోవటానికి ఇది సమయమా?

కొంత ఎంత ప్రమాదకర విషయాన్ని మనం చేస్తున్నామో మనకు ఏమీ తెలియటం లేదు!

స్వచ్ఛతతో ఉండండి :

సహజంగా ఉండటం అంటే చట్టవిరుద్ధంగా ఉండటంకాదు. అది సాంఘిక జీవన మౌలిక చట్టాలను భగ్నం చేసే స్వాతంత్ర్యం కాదు. సహజత్వం అరాజకత్వం లేదా స్వయం లాలసకాదు. సహజంగా ఉండటమంటే కేవలం మీ అలవాట్లను వదులుకోవటం.

మీ పక్షపాత దృష్టిని విడనాడండి.

మీ గతాన్ని మీ భవిష్యత్తును పరిత్యజించండి.

భార రహిత మనస్సుతో నేడు స్పష్ట దృష్టితో ఉండండి.

క్షణానికి క్షణానికి సుసంపన్న జీవిత అనావరణానికి ప్రతిస్పందించండి.

మార్పును కౌగిలించుకోండి - జీవితం మిమ్మల్ని కౌగిలించుకుంటుంది!