KAILASA Library/చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/ప్రతి ఒక్కరికి తెలుసు ... !Sign in
చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

ప్రతి ఒక్కరికి తెలుసు ... !

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

మీలోని తెలివితేటల్ని నమ్ముకోండి

వ్యక్తి ముఖచిత్రం

కొ ద్ధికాలం కిందట స్పోర్ట్స్ గేర్‌బ్రాండ్‌లో ఒక ప్రకటనను చూశాను. ఒక మనిషి పోటీకి తయారు కావటాన్ని చిత్రం చూపింది. శీర్షిక ఇలా ఉంది.

మీ శరీరం మిమ్మల్ని ఆగమని చెబితే, మీ శరీరాన్ని మూసుకోమని చెప్పండి.

ఎంత తరచుగా మీ శరీరాన్ని మీరు మూసుకోమని చెబుతున్నారు? దాదాపు సమయమంతా అని నేను ఊహిస్తున్నాను! ప్రస్తుతానికి, ఉదయం మేల్కొంటారు, మీ శరీరంతో గుంజాటన. మీకు తెలుసా, ఉదయం లేవటానికి మానవ ప్రాణికి మాత్రమే అలారం గడియారం అవసరం - ఎందువల్లనంటే ప్రకృతి లయతో అతడికి సమన్వయంలేదు. మీరు లేచినప్పుడు, మీ శరీరం ఇంకా నిద్ర కావాలి అంటుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన కారణంగా కోలుకోవటానికి మీ శరీరానికి సమయం సరిపోదు. కాని సోమవారం ఉదయం, కాబట్టి మీ శరీరాన్ని మూసుకో అని చెప్తారు. ఆఫీసులో కంప్యూటర్‌ను గంటల తరబడి చూసి మీ కళ్ళు పొడివారి అలసిపోతాయి. కాని మీరు ప్రాజెక్ట్ రిపోర్టును పూర్తిచేయాలి. మీ శరీరానికి ఏమి చెబుతారు? అవును, మూసుకో!

పార్టీలో అతిగా ప్రవర్తించినప్పుడు, అతిగా తాగినప్పుడు, టి.వి.ని చూస్తూ రాత్రి ఆలస్యంగా పడుకున్నప్పుడు, మీరు అనారోగ్యంగా ఉండి పని చేయవ లచ్చినప్పుడు - మీరు శరీరం చేసే హెచ్చరికలను నిరంతరం ఉపేక్షిస్తుంటారు

ఈ రోజుల్లో మనమంతా శరీరాన్ని మూసుకో అని చెప్పినందుకు గర్విస్తుంటాం. మనము ఊపిరితిత్తులను కలుషిత వాయువుతో కష్టపెడుతుంటాము, మన కడుపులను ఘాటయిన అనారోగ్యకరమయిన ఆహారంతోను, కాలేయాలను మద్యంతోను శ్రమ పెడుతుంటాము. కొంత మేరకు మన శరీరాలు అతి తక్కువ మృదుత్వం కలిగి కూడా దాడిని ఎదుర్కోవటానికి అలవాటు పడతాయి.

ఈ కారణంగానే మన సహన చైతన్య పరిమితి ప్రతిరోజు పెరుగుతుంది. తాగేటప్పుడు అంతకంతకు మోతాదును పెంచుకోవాల్సి వస్తోంది. నొప్పిని తగ్గించుకోవటానికి నొప్పి నివారణ మాత్రల మోతాదును పెంచుకోవలసి వస్తోంది.

మన శరీరం మనస్సు పరస్పరం ప్రభావితం చేసుకుంటాయో తెలుసుకుంటే, మన శరీరాన్ని ఇంకా బాగా చూసుకునే వాళ్ళం! 60 కోట్ల సంవత్సరాల క్రమ పరిణామంలో సంపాదించుకున్న మహామtheme మేధ మన శరీరానికి ఉంది.

క్రియలు మనం సామాన్యంగా పేర్కొనే చేతన ప్రక్రియలు. మన కేంద్ర నాడీ వ్యవస్థచే నియంత్రిత మవుతాయి- మెదడు, వెనుపాము. ఈ ప్రక్రియలో స్వచ్ఛంద చర్యలు, ఆలోచన మొదలయినవి ఉన్నాయి. కాని చేతన ప్రక్రియలు మన శరీరంలో జరిగే చర్యలలో అతి తక్కువ ప్రక్రియా భాగం. ప్రక్రియలలో అత్యధికం అచేతనం. ఈ ప్రక్రియలను స్వతంత్ర నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంటుంది. ఊపిరి పీల్చటం, ఆహారాన్ని జీర్ణంచేసుకోవటం, మనం నడుస్తున్నప్పుడు సమతుల్యతను పాటించటం వంటి ప్రక్రియలన్నీ మన నియంత్రణ లేదా మన జాగృతి కూడా లేకుండానే బాగా నడుస్తాయి. ఊహించండి, మన శరీరాలను నిర్వహించటానికి మనం శ్రమించవలసి వస్తే, మనం దేనినీ పొందలేము.

ఇదంతా ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?

ఇది శరీర మేధా అద్భుతం.

సరిగా మీ శరీరాన్ని పరిశీలించండి!

మీ శరీరంలోని ప్రతి ఒక్క జీవకణం తన ప్రత్యేక విధులను నిర్వహించే తెలివితో ఉంటుంది. శరీరానికి సంక్రమణం తాకినప్పుడు, మీరు ఆ ప్రమాదాన్ని పసికట్టక పూర్వమే మీ తెల్లకణాలు తమంత తాము ప్రతి క్రియకు పూనుకుంటాయి.

కాని విచారకర వాస్తవం, మన శరీర వివేకం మీద నమ్మకం మనకు లేదు.

జలుబు లేదా తలపోటు వచ్చిన రోజున యాంత్రికంగా మాత్రను వేసుకుంటారు. ఎందుకు? మీకు తెలియదా? మీ శరీరం పెద్ద పారిశ్రామిక కర్మాగారం చేసే పనిని నిర్వహిస్తుంది! అది స్వయంగా పర్యావరణ వ్యవస్థ. మీ శరీరం ఆహారాన్ని జీర్ణంచేసుకో గలిగినప్పుడు, నియత ప్రాతిపదికన రక్తాన్ని పంపుచేస్తూ, సంక్రమణలతో పోరాడుతున్నప్పుడు, అది తనంత తాను మామూలు తలపోటుతో తలపడలేదా?

మీరు ఆశ్చర్యకరమయిన సంక్లిష్ట డిఎన్ఎ ప్రపంచంలో ప్రవేశిస్తుంటే, మీ భావోద్రేకాలు మీ జ్ఞాపకాలు, మీ అభిప్రాయాలు కూడా మీ శరీరం చేత నియంత్రితమవుతాయని మీరు చూస్తారు! డిఎన్ఎలు మన జన్యుస్మృతి వాహకాలు. అవి భౌతిక లక్షణాల ముద్రలనే కాకుండా మానసిక స్థితి ముద్రలను కూడా తీసుకుపోతాయి. జన్యు శాస్త్రజ్ఞులు ప్రతివ్యక్తి తన డిఎన్ఎచే నిర్మితమయిన ప్రపంచ ప్రత్యేక అవగాహన కలిగి ఉంటాడని తెలిపారు. శరీరం మనసును ప్రభావితం చేయటమేకాదు, మనస్సు కూడా శరీరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

ఒక రోగం నుండి ఒక వ్యక్తి నయంచేయబడినప్పటికి లేదా మత్తు పదార్థం నుండి నయంచేయబడి పునరావాసితుడయినప్పటికి, ఇంకా శరీరంలోని కొన్ని రోగ స్మృతులు ఆ వ్యక్తికి ఉంటాయి. అదేవిధంగా, మీరు స్థిరంగా కలత పొందుతున్నట్లయితే, కలతలచే ప్రేరేపితమయిన వ్యతిరేకత మీ శరీరంలో మీ అస్తిత్వంలో ఘనీభవిస్తుంది. దీనినే 'కుంగిపోవటం' అంటాము. ఆ కారణంగానే కుంగిపోయిన ప్రజలు తామెందుకు కుంగిపోయింది చెప్పలేరు. సమస్య పరిష్కారమయిన చాలా కాలానికి కూడా, దానికి సంబంధించిన ఒత్తిడి వారి స్మృతి పథంలో శారీరకంగా మానసికంగా ఒక అవరోధంగా ఉంటుంది. కేవలం కుంగిపోవటమేకాదు, కాని ప్రయోగాత్మకంగా ప్రతి వ్యాధి శరీరం చేత మనస్సు చేత సమానంగా ప్రభావితమవుతుంది. వాస్తవంగా, మన వ్యాధులలో 85%కు పైగా ప్రకృతిపరంగా మనశ్శరీర సంబంధమయినవి.

తలపోటులు, గుండె జబ్బులు మాత్రమే కాదు సెప్టిక్ అల్సర్లు, చర్మ శ్వాసకోశ వ్యాధులు, కేన్సరు కూడా మన ఆలోచనలచే ప్రభావితమవుతాయి.

మన శారీరక రుగ్మతలను కలిగించే లేదా బాగుచేసే మనస్సుకు ఊహాతీతమయిన శక్తి ఉంది. జపానులో ఒక రకం మొక్కకు ప్రతికూలతగల కొంతమంది ప్రజలపై ప్రయోగం నిర్వహించారు. భాగస్వాముల కళ్ళకు గంతలు కట్టి విభిన్న మొక్కల ఆకులను వారి చర్మంపై ఉంచారు. ప్రతిసారి భాగస్వాములకు పరిశోధకులు వారిపై ఏ ఆకు పెడుతున్నదీ చెప్పారు. ఆశ్చర్యంగా చాలా కేసుల్లో మొక్క పేరు చెప్పగానే భాగస్వాములకు మొక్కకంటే ఎక్కువగా అలెర్జీ కలిగింది. అలెర్జీ కలిగించే ఆకును భాగస్వాములపై పెట్టి రోగికి అవి ప్రమాద రహితమయిన ఆకు అని చెప్పినప్పుడు, రోగికి అలెర్జీ కలగలేదు. ప్రత్యామ్నాయంగా, ప్రమాదరహిత పత్రాన్ని చర్మంపై పెట్టినప్పుడు అది ప్రమాదకర అలెర్జీని కలగజేసే ఆకు అని రోగికి చెప్పినప్పుడు, చర్మంపై వెంటనే దద్దుర్లు వస్తాయి!

విభిన్న వ్యక్తిత్వాలు కల బాలుడితో అధిక ఆశ్చర్యకర ప్రయోగంచేసినప్పుడు మనస్తత్వ శాస్త్రవేత్త డేనియల్ గోల్‌మన్ బాలుడి అలెర్జీల హెచ్చుతగ్గులు ఆ సమయంలో ఏ వ్యక్తిత్వం ప్రబలంగా ఉంటే ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటాయని కనుగొన్నాడు. అదే మనస్సు శరీరానికి ఆజ్ఞలను జారీచేసి నిర్దిష్ట వ్యక్తిత్వానికి ఏది తగి ఉంటుందో ఆ ప్రతి క్రియ పై ఆధారపడి అలెర్జీ ఉండేటట్లు లేదా అలెర్జీ లేకపోయేటట్లు చూస్తుంది.

ఆధునిక వైద్యశాస్త్రం విభిన్న పరిస్థితులలో మీ మస్తిష్కంలో రసాయనిక మార్పులను కనుగొనే పెట్‌స్కాన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ప్రతిసారి మీరు విభిన్న జ్ఞాపకాన్ని, లేదా అనుభవాన్ని గాఢ భావోద్రేకాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారొ అది మీ మనస్సులో విభిన్న రసాయనిక రీతిని రేకెత్తిస్తుంది అని పరిశోధకులు కనుగొన్నారు.

అంతేకాదు, తత్క్షణం వార్త మీ శరీరమంతా వ్యాపిస్తుంది. మీరు సంతోషంగా ఉన్నా, కోపంగా ఉన్నా, లేదా విచారంగా ఉన్నా వెంటనే మీ శరీరంలోని ప్రతి జీవాణువుకు సూచన పంప బడుతుంది. కాబట్టి మీ శరీరం వాస్తవంగా ఆ క్షణంలో మీరు ఆలోచించే దాని మారుతున్న ప్రతిబింబం!

మనశ్శరీర రోగాలు మన అచేతన మనస్సు మన చేతన క్రియలను నియంత్రిస్తున్నట్లు మనకు చూపుతున్నట్లుగా ధ్యానం చేతన మనస్సు అచేతన క్రియలను నియంత్రించటానికి ఎలా ఉపయోగించాలో మనకు బోధిస్తుంది. యోగా జెన్లలో ఆత్మ ప్రబోధాత్మకంగా మీ నాడీ, సూచిని, జీర్ణాన్ని, జీవనక్రియను, శరీరోష్ణోగ్రతను నొప్పిని మీ సున్నితత్వ స్థాయిని నియంత్రించ కలిగే విధానాలున్నాయి.

వాస్తవంగా, ఈ మూలాంశాల గురించి అద్భుత మేమీలేదు. అవి అద్భుతంగా మనకు కన్పించటానికి కారణం మనకు మన శరీరానికి మనస్సుకు ఉన్న గాఢ సంబంధం తెలియక పోవటమే.

శరీర మనస్సులు రెండూ సమాన చేతన యొక్క వ్యక్తీకరణలు మాత్రమే. అవి వేర్వేరుగా పని చేయలేవు, పని చేయవు. మనం వాటిని రెండింటిని గౌరవిస్తే తప్ప, మనం సంపూర్ణం కాలేము, సమైక్య ఆధునిక నాగరికతలో, మన శరీరాలను పణంగా పెట్టి మన మనస్సులను అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇప్పటి నుండి కొన్ని వందల తరాల తర్వాత గొప్ప మేధతో గిడసబారిన శరీరాలతో అల్పప్రాణులుగా తగ్గిపోవచ్చు. అని మానవ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. మనం మన శరీరంలోని రోగాలలో మెదడును మాత్రమే ఉపయోగించటమే దీనికి కారణం. శరీరాన్ని నిందించటం ఆధునిక సమస్యకాదు. మన పరమాసహ్యభాగంగా సాంప్రదాయికంగా శరీరం నిందించబడుతోంది.

డిజైర్లు కలవర పరుస్తున్నందుకు, ప్రపంచాకర్షణలవైపు మనల్ని లాగి మాయలో పడవేస్తున్నందుకు మనమెప్పుడూ శరీరాన్ని నిందిస్తుంటాము. ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మికతను సాధించటానికి శరీరాన్ని ఉపేక్షించటం అవసరమని యోగులు అనుంటారు. కాబట్టి వారు శరీరాన్ని హింసించేవారు, దేహాన్ని నిరోధించేవారు, వారు అంతరంగంలో నేను శరీరాన్ని కాను, నేను శరీరాన్నికాను అని పదేపదే స్మరించేవారు. అది ఒక మార్గం, కాని ఇది కొద్దిమందికే పనికి వస్తుంది. శరీరం ద్వారానే ఆధ్యాత్మికతకు వెళ్ళవచ్చని నేను చెబుతున్నాను! జీవిత సంసార నదిని దాటించేది శరీర నావ. మీ నావలో రంధ్రం ఉంటే, దోషం ఉంటే మీరు నదిని ఎలా దాటగలరు? మీ శరీరాన్ని

గౌరవించటం మీరు నేర్చుకుంటే తప్ప, శరీరం అవతలికి మీరు ఎలా వెళ్ళగలరు? మీ శరీరంతో గాఢమయిన ప్రేమ పూర్వకమయిన సంబంధాన్ని పెట్టుకోండి.

శ్రీ రామకృష్ణ సుందరంగా చెబుతున్నారు: మాయా నదిని దాటటానికి రెండు మార్గాలున్నాయి: మీ బలాన్ని అంతటినీ కూడగట్టుకొని దూకటం ఒక మార్గం.

దాని ముందు నిలబడి చేతులు జోడించి "ఓ మాయా! దయతో దాటటానికి అనుమతి నివ్వు!" అని ప్రార్థించటం రెండో మార్గం.

ఇది గౌరవ, సహనశీల మార్గం.

మీ శరీరంతో శాంతిని కుదుర్చుకోండి.

మీ శరీరాన్ని నిరోధించే భావాన్ని వదులుకోండి

మీ శరీర వివేకాన్ని నమ్మండి.

స్పష్టతతో, దయతో మీ శరీరాన్ని బాగా అర్థం చేసుకోవటం ద్వారా మాత్రమే దాని అవతలకు పోయే మార్గాన్ని కనుక్కోగలరు.