KAILASA Library/చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/జ్యోతిశ్శాస్త్రం & అవతలSign in
చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

జ్యోతిశ్శాస్త్రం & అవతల

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

జ్యోతిశ్శాస్త్రానికి శాస్త్రీయ ఆధారం ఉందా?

portrait

జ్యోతిశ్శాస్త్రం వ్యవహారంలో సంక్లిష్టమయిన అంశం. కారణమేమిటంటే దాన్ని నమ్మేవారి సంఖ్య నమ్మని వారి సంఖ్య సమానంగా ఉంది.

నమ్మని వారికి, జ్యోతిశ్శాస్త్రం నిరూపిత శాస్త్రం అని చూపించవలసి ఉంది. జ్యోతిశ్శాస్త్రమే అంతిమ శాస్త్రంకాదని జ్యోతిశ్శాస్త్రాన్ని నమ్మిన వారికి నచ్చ చెప్పాలి. జ్యోతిశ్శాస్త్ర జ్యోస్యాలకు అతీతమయిన మార్గం ఉంది.

రెండని నేను వివరించటానికి ప్రయత్నిస్తాను. ప్రాచీన కాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా సంస్కృతులచే బాబిలోనియన్ల చేత, గ్రీకుల చేత, రోమన్ల చేత, అరబ్బుల చేత, భారతీయుల చేత - జ్యోతిశ్శాస్త్రం అభ్యసించబడింది.

విశ్వమూలాంశాలు భూమి మీది జీవితాన్ని సంఘటనలను ప్రభావితం చేస్తాయి అనేది జ్యోతిశ్శాస్త్ర మౌలిక సిద్ధాంతం.

ఇది నిశ్చితంగా వాస్తవం.

భూమి ఒంటరిగా ఉన్న గ్రహంకాదు. మనం తెలుసుకున్న తెలుసుకోలేకపోయినా మన మందరమూ వ్యోమగాములం! బహిరాకాశంలోని సంఘటనలు మన జీవితాలను నిశ్చితంగా ప్రభావితం చేస్తాయి.

ఎలా !

సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నీ భూమి మీది జీవిత లయలను ప్రభావితం చేసే అయస్కాంత క్షేత్రాలు భూమ్యాకర్షణ శక్తులు, కిరణ ప్రసారాలు కలిగి ఉన్నాయి.

దినసరి ప్రాతిపదికన సూర్య చంద్రులు మనల్ని ప్రభావితం చేస్తున్నాయని మనకు తెలుసు.

ప్రతిరోజు సూర్యుడి స్థితిపై ఆధారపడి ఉష్ణోగ్రత హృదయస్పందన మొదలయిన వాటి శారీరక మార్పులను మనం అనుభవిస్తున్నాము.

పౌర్ణమి సమయంలో ‘పిచ్చి’ ముదురుతుంది అనే విషయానికి సాక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సంస్కృతుల నుండి మనకు లభిస్తుంది. వాస్తవానికి, చంద్రుడికి సంబంధించింది అనే అర్థం కల ‘లూనార్’ పదం నుండి లూనటిక్ (పిచ్చది, పిచ్చివాడు) పదం పుట్టింది. ఇది కేవలం డొల్ల విశ్వాసం కాదని ప్రయోగాలు నిరూపించాయి. పౌర్ణమి రోజులలో వినాశకర వాహన చోదన, దహనకాండ, ఆత్మహత్యలు వంటి వాటి పెరుగుదల మానసిక ప్రవర్తన వల్ల జరుగుతున్నాయని తెలపటానికి అమెరికన్ వైద్య వాతావరణ శాస్త్రసంస్థ వద్ద విస్తృత గణాంక సాక్ష్యం ఉంది. చంద్రుడి దశలు శ్వాసకోశ రక్త ప్రసరణ వ్యాధులతో సంబంధం కలిగి ఉన్నాయని మృత్యు సమయాన్ని కూడా ప్రభావితం చేసేవిగా ఉన్నాయని జర్మనీ ప్రయోగాలు నిరూపించాయి. సూర్య జ్వాలల లేదా సూర్యుడిలోని గందరగోళ పరిస్థితుల సమయంలో మానసిక చికిత్సాలయాలలోని ప్రవేశాల సంఖ్య అధికంగా పెరగటాన్ని మనం గమనించాము. సూర్యుడు, చంద్రుడు మన శారీరక, భావోద్రేక, మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేయ గల్గుతున్నప్పుడు, గ్రహాలు కూడా అదేవిధంగా చేస్తాయి అనే విషయాన్ని మనం ఎలా సందేహించగలము?

రసాయనిక సంవిధానంలో, గ్రహాలలోని పదార్థాలవంటి దానితో సమానమయిన దానితోనే మనిషి తయారు చేయబడ్డాడు. సహజంగా, ఇతర గ్రహాలచే భూమి అయస్కాంత క్షేత్రాలలో ఉత్పన్నమవుతున్న మార్పులకు మనం స్పందిస్తాము. ఈ స్పందనలు రోజు వారి ప్రాతిపదికన ఉన్నప్పుడు, వాటిని అర్ధం చేసుకోవటం తేలిక. ఇంతేకాదు గ్రహాలు మనపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. ఇది జ్యోతిశ్శాస్త్ర జ్యోస్యాలకు ఆధారం.

జ్యోతిశ్శాస్త్ర జ్యోస్యాలు ప్రాచ్యదేశాలలో ముఖ్యంగా భారతదేశంలో జనాదరణ పొందాయి. ప్రతి హిందువు దగ్గర భవిష్యత్తును తెలిపే వ్యక్తిగత జాతక చక్రం ఉంటుంది. జాతక చక్రాన్ని బిడ్డ పుట్టగానే తయారు చేస్తారు. జాతక చక్రం బిడ్డ శుభ-అశుభ సమయాలను, బిడ్డ తీసుకోబోయే ఉద్యోగం మొదలయిన వాటిని, బిడ్డకు ఎప్పుడు పెళ్ళి కాబోతుంది అనే విషయాన్ని, ఇంకా ఎన్నో ఇతర విషయాల్ని తెలుపుతుంది.

గ్రహాలు మనల్ని ప్రభావితం చేస్తాయి అని జనం విశ్వసించినప్పటికి, వారు ఈ ప్రభావాలను మనం ముందుగా తెలుసుకోగలం అనే దానిని నమ్మటంలేదు. మీరు పుట్టినప్పటి గ్రహాల స్థితిగతులు మీరు అవలంబించబోయే వృత్తులను ఏవిధంగా నిర్ణయిస్తాయి?

కాని అనుభవం దాన్ని నిరూపించింది !

ప్రాస్ బర్గ్‌లో మనశ్శరీర ధర్మ ప్రయోగశాలలో పనిచేస్తున్న ప్రయోగకారుడు మైఖేల్ జాగ్విలిన్ 1084 ప్రసిద్ధ భౌతిక శాస్త్రజ్ఞులను పరీక్షించి కుజశనిగ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వారంతా జన్మించారనే అద్భుత విషయాన్ని కనుగొన్నాడు. ఫలితాలు కాకతాళీయమనుకోవటానికి కేవలం కోటి రెట్లు అవకాశముంది !

ఇంకో ప్రయోగం : వెర్నన్ క్లార్క్ అనే అమెరికా మనస్తత్వ శాస్త్రజ్ఞుడు వివిధ వృత్తులకు చెందిన అనేక ప్రజా సముదాయాల నుండి జాతక చక్రాలను సేకరించాడు. అతడు ఈ జాతక చక్రాలను 20 మంది జ్యోతిశ్శాస్త్ర వేత్తలకు వ్యక్తుల వృత్తులకు సంబంధించి జోస్యాన్ని తెల్పవలసిందని పంపాడు. 20 మందిలో 17 మంది సరయిన వృత్తిని కాకతాళీయమని చెప్పటానికి వీలులేని విధంగా 100 రెట్లు ఖచ్చితంగా జోస్యం చెప్పారు! క్లార్క్ ఈ పరీక్షలను పునరావృతం కావించాడు, ప్రతిసారి పరీక్షలను కఠినతరం కావించాడు. అతడు ఇతోధికంగా ఆకట్టుకునే ఫలితాలనే సాధించాడు ! ప్రాచీన కాలం నుండి భారతదేశంలో జ్యోతిషం ఖచ్చితంగా దీనికోసం ఉపయోగించారు: వ్యక్తి జీవితంలో ఏ మార్గాన్ని అనుసరించాలో నిర్ణయించటానికి.

గురుకులంలో బాలుడు ప్రవేశించినప్పుడు అతని వ్యక్తిత్వం ఏవిధమయినదో, అతని వైఖరి ఎటువంటిదో, అతని సహజాభిరుచి ఎటువంటిదో నిర్ధారణ చేయటానికి జ్యోతిషం ఉపయోగపడేది. తదనుగుణంగా, వేదాధ్యయనంలో, సాముగరిడీలలో, వ్యాపార నైపుణ్యాలలో లేదా అతడికి ఏది తగినదో దానిలో అతడికి శిక్షణనిచ్చేవారు. భారతదేశంలో జ్యోతిషం వ్యాప్తి చెందటానికి ఇది ఒక హేతువు.

ఈ రకమయిన జోస్యం ఎలా సాధ్యం ?

చంద్రుడి కార్యకలాపం కొంత మేరకు మన మనఃస్థితులను నిర్ణయించినట్లుగా, చంద్రుడు, గ్రహాలు కూడా గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతాయి. నిశ్చిత తరంగ దైర్ఘ్య కిరణ ప్రసారం నిశ్చిత మస్తిష్క క్షేత్రాన్ని ఉద్రేకపరుస్తుంది. అది చిట్టచివరకు ఒక వ్యక్తి గణితంలో రాణిస్తాడా, కళాత్మకంగా అభివృద్ధి పొందుతాడా మొదలయిన వాటిని నిర్ణయిస్తుంది. శిశువు అభివృద్ధి సమయంలో ఏ గ్రహాలు చురుకుగా ఉన్నాయో మనం తెలుసుకుంటే, మనం వాడి భవిష్యత్తును గురించి కొంతవరకు ఖచ్చితంగా జోస్యం చెప్పవచ్చు. మీ అవగాహనకు మౌలిక వివరణ. అంతేకాకుండా పదార్థమంతా ఒకే రకమయిన మౌలిక రేణువులతో కూర్చబడింది. ప్రతి చోట ఈ రేణువులు ఒకే విధంగా ప్రవర్తిస్తాయి - అవి గ్రహంలో భాగం కావచ్చు, చెట్టులో లేదా మీలో భాగం

కావచ్చు! పదార్థం కూడా తరంగ గతి విశేషమని క్వాంటమ్ మెఖానిక్స్ నిరూపించింది. కాబట్టి గ్రహాలలో ప్రతి ఒక్కదానికి ప్రత్యేక తరంగ గతి ఉంది. భిన్న తరంగ దైర్ఘ్యాల రెండు తరంగాలు (భిన్న గ్రహాల నుండి) పరస్పరం కలుసుకున్నప్పుడు, ఒకదానిపై ఒకటి ముద్రవేసుకున్నపుడు, కొన్ని ఉన్నత బిందువుల (రెండు తరంగాలు క్రమ పద్ధతిలోను, గుణాలు పెరిగిన సమయంలోను) కొన్ని నిమ్నబిందువులు (అవి పరస్పర ప్రభావాన్ని రద్దు చేసుకుంటాయి) ఉంటాయి. ఈ విధంగా వివిధ గ్రహాల ప్రభావాన్ని లెక్కిస్తారు.

తరంగాలకు నియత పౌనఃపున్యం ఉన్న కారణంగా, నియత వ్యవధానంలో క్రమబద్ధతా, భంగాల సమయాలు కూడా సంభవించవచ్చు. దీన్ని ఆధారంగా తీసుకొని, జ్యోతిశ్శాస్త్రజ్ఞులు మీ జీవితంలోని ఒడిదుడుకులను (జోస్యం) చెబుతారు.

జ్యోతిశ్శాస్త్రానికి ఆధారం గారడీకాదు, ఇది గణితం, జ్యోతిశ్శాస్త్ర సమీకరణ వంటిది. ఈ సమీకరణలో సూర్యుడి చంద్రుడి గ్రహాల స్థితులను చరరాశులుగా చూడగలం.

ఈ స్థితులపై వాటి ప్రభావాలపై ఆధారపడి చేసిన సంక్లిష్ట గణనల ద్వారా నిష్ణాతుడయిన జ్యోతిశ్శాస్త్ర వేత్త ఖచ్చితంగా సరిగా నిరూపించ తగ్గ ఫలితాలను సాధించగల్గుతాడు.

ఇతర సమాచారంలాగానే, జ్యోతిశ్శాస్త్ర దత్తాంశం గణాంక రీత్యా విశ్లేషించవచ్చు, గుణాన్ని నిర్ణయించవచ్చు.

పెద్ద సమస్య ఏమిటంటే అతి విస్తృతమయిన అనేక చరరాశుల దత్తాంశం తెలుసుకోవాలి, గుర్తించుకోవాలి, విభిన్న ప్రస్తార సంయోగాలను పూర్తిగా లెక్కలేసి చూసుకోవాలి, గ్రహాల ప్రత్యేక సమ్మిళిత ప్రభావాన్ని పరిశీలించాలి. ఇంతేకాకుండా గ్రహాలు మనల్నే కాకుండా ఇతరుల్ని కూడా ప్రభావితం చేస్తాయి.

ఇది మిక్కిలి కఠినమయిన విధి, కాబట్టి ఈరోజుల్లో చాలామంది జ్యోతిశ్శాస్త్రవేత్తలు చిట్టచివరకు ఖచ్చితమయిన ఫలితాలను ఇవ్వని కొన్ని మౌలిక చరరాశులను ఉపయోగిస్తున్నారు. అన్నిటి కంటే మించి, ఫలితాలను ఎవరికి వారు బహిరంగంగా అన్వయించవచ్చు. దీని ఫలితంగా ఈ శాస్త్రం తక్కువ విశ్వసనీయతను పొందుతుంది. ఈనాడు జ్యోతిశ్శాస్త్రం విశ్వసనీయ శాస్త్రంగా చూడబడకపోవటానికి ఇవి కారణాలు. నేను ఇక్కడ జ్యోతిశ్శాస్త్రాన్ని నిరూపించటానికి లేదా ఖండించటానికి లేను.

నేను ఇక్కడ దాని రహస్యాన్ని ఛేదించటానికి ఉన్నాను. జ్యోతిశ్శాస్త్రం మీమీద పనిచేసే ప్రభావాల గురించి స్పష్టమయిన భావాన్ని కలగజేస్తుంది. అది మీ సమస్యను తెలియజేస్తుంది కాని పరిష్కారాన్ని చూపించదు.

ధ్యానం పరిష్కారాన్ని చూపించగల్గుతుంది. ధ్యానం సూర్యుడికి, గ్రహాలకు, మీకు దారి చూపించే విశ్వశక్తితో అనుసంధానం చేసేది మాత్రమే. మీరు విశ్వశక్తితో కలిసి సామరస్యంతో పని చేస్తున్నప్పుడు, ఈ ప్రభావాల నుండీ మీకు సహజంగా మంచి రక్షణ లభిస్తుంది. ఏ వ్యక్తి అయినా వర్షంలో తడిసి వెళ్తున్నప్పుడు, ఈ వ్యక్తికి రొంప పట్టటం సహజం, కాని రైన్కోటు వేసుకొని వర్షంలో వెళ్ళినప్పుడు, ఆ రైన్కోట్ తప్పకుండా సాయపడుతుంది.

పౌర్ణమినాడు ప్రతి వ్యక్తికి పిచ్చిపడుతుందా?

అలాకాదు ! పౌర్ణమి అప్పటికే సమతూకం తప్పిన మనస్సును ప్రభావితం చేస్తుంది. మీ పరిస్థితులు స్థిరంగా ఉంటే, ఈ అంశాలు మిమ్ముల్ని కేవలం ప్రభావితం చేయలేవు.

ధ్యానం మిమ్ముల్ని ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరకంగాను, మానసికంగాను భావోద్రేకంగానూ కూడా బలపరుస్తుంది.

ధ్యానంతో మీరు జ్యోతిశ్శాస్త్ర పరిధి దాటి వెళ్ళగల్గుతారు.