KAILASA Library/చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/బాధ ఎందుకు ?Sign in
చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

బాధ ఎందుకు ?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

సంతోషం ఒక ఎంపిక

సత్య సాయి బాబా చిరునవ్వుతో ఉన్న చిత్రం

ప్రశ్న : స్వామీజీ ! బాధ ఏమిటి? మన జీవితాలలో బాధ అత్యావశ్యకమా?

మనోహర బౌద్ధ సూత్రం ఒకటి ఉంది :

బాధలేదు, కారణంలేదు, అంతం లేదు.

ఖచ్చితంగా బాధ ఏమిటి?

మన జీవితంలో ఏదో ఒక సమయంలో దాదాపు మనమందరమూ బాధపడిన వాళ్ళమే.

బాధ పడటాన్ని మీరెందుకు ఎంచుకున్నారు? మీరు బాధపడటం అవసరమా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాననుకోండి.

మీరు నిశ్చయంగా అసందర్భ ప్రశ్న అనుకుంటారు!

స్వామీజీ! ఎవరైనా బాధపడటాన్ని ఎంచుకుంటారా? అని మీరు నన్ను అడుగుతారు. బాధ నాకు కలిగింది, అంతే. అది తప్పనిసరి.

వాస్తవమేమిటంటే, బాధ ఒక ఎంపిక!

బాధ జీవిత స్థితికాదు - అది మానసిక స్థితి. అది అంతరంగిక సంఘటన, బహిరంగ సంఘటన కాదు! ప్రత్యేక పరిస్థితిలో మీరు బాధపడుతున్నారా లేదా అనేది పూర్తిగా మీరు ఆ పరిస్థితిని ఎలా నిర్వహించటాన్ని ఎంచుకుంటారన్న దానిపై ఆధారపడి

ఉంటుంది. నేను మీకు మీ బాధ అవాస్తవమని చెప్పితే అది అబద్ధమవుతుంది. ఎందుకంటే మీకు మీ బాధ తప్పని సరిది! మీ అంతట మీరు బాధపడకుండా ఉండటానికి ఇచ్చికాన్ని ఇవ్వలేదు! మీకు ఎంపిక అవకాశమున్న విషయం కూడా మీకు తెలియదు.

కాని ఇప్పుడు, ఈ ప్రశ్నకు సచేతనంగా పరిశీలించండి. మీరు ఎప్పుడు బాధకు లోనయ్యారు? మీకు ఎప్పుడు జబ్బు చేసింది? మీ పక్కింటివారు కారు కొన్నప్పుడా? మీ భాగస్వామి మిమ్ముల్ని విడిచిపెట్టి వేరొకరికోసం వెళ్ళిపోయినప్పుడా?

మంచిది - కోపం లేదా రోషం లేకుండా ఈ పరిస్థితులను అంగీకరించటానికి మీరు నిర్ణయించుకున్నారని ఊహించుకోండి. మీరు ఇంకా అంత బాధ పడతారా? ఏది ఏమయినా, మీ పక్కింటి వారు కొత్త కారు కొనుక్కోవటాన్ని గురించి సహజంగా బాధపడవలసింది ఏమీ లేదు! ప్రేయసి లేదా ప్రియుడు విడిచి వెళ్ళినప్పుడు ఆ క్షణంలో బాధ ఉన్నప్పటికి మీరు ఆ విధంగా జరగకుండా ఆపలేరు. ఆ క్షణాన్ని అంగీకరించటం ద్వారా దాన్ని నిరోధించటానికి బదులుగా, మీరు యాంత్రికంగా మీ బాధ స్థాయిని తగ్గించుకోగలరు.

బాధ సదా, సదా వర్తమానాతోషణ నిరోధజన్యం

మీరు అడ్డుకోవటాన్ని ఆపినప్పుడు మీరు బాధను ఆపుతారు!

ఒక మనిషి రెండో అంతస్తు కిటికి నుండి కిందికి పడి ఆశ్చర్యకరంగా బతికి బయటపడ్డాడు, ఒక స్నేహితుడు అతణ్ణి ఆసుపత్రిలో చేర్చాడు. స్నేహితుడు మర్యాదగా

అతణ్ణి దెబ్బ తగిలిందా? అని యోగక్షేమాన్ని విచారించాడు. "ఓ లేదు, పడటం పూర్తిగా బాధారహితంగా ఉంది. భూమిమీద పడటంవల్ల మాత్రమే దెబ్బతగిలింది!" అని రోగి జవాబిచ్చాడు.

ప్రవాహానుగుణంగా మీరు వెళ్ళినంతకాలం, నొప్పి ఉండదు, బాధ ఉండదు. జీవిత మార్గంలో మీ ఆలోచనలను, ఆశలను ఉంచితే, ఆ ప్రవాహానికి మీరు ఆటంకాలను కల్పిస్తారు. తరచుగా, బాధ నుంచి తప్పించుకోవటానికి మీరు కల్పించుకునే రక్షణలు సంఘటనకు మించిన ఎక్కువ బాధను కల్గిస్తాయి!

మృత్యువును కూడా పరిశీలించండి ! ఒక సంఘటనగా చూస్తే ఒకసారి మాత్రమే చావు మిమ్ముల్ని బాధిస్తుంది. కాని మీ జీవితమంతా మృత్యుభయం మిమ్మల్ని వెంటాడుతుంది. మృత్యువు నుంచి మీ నిరంతర ధావనం మృత్యువు కంటే అధికబాధను కలిగిస్తుంది.

దుర్ఘటన లేదా మరణాంతక వ్యాధి వంటి పెద్ద సంఘటన అరుదుగా బాధను కల్గిస్తుంది. ప్రతిరోజు బంధుత్వాలలోని ఘర్షణల - పత్రి దిన జీవనంలోని పెనుగులాటల - నుండి మన బాధలలోని ఎక్కువ భాగం ఉద్భవిస్తుంది.

చాలా ఇళ్ళల్లో, 30 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత కూడా, ప్రతిరోజూ భార్యాభర్తలు ఒకే రకం విషయాలమీద పొట్లాడుకుంటూంటారు! వారు తమ సొంత ప్రవర్తనను మార్చుకోరు. మరొకరిని అంగీకరించలేరు. ఇదే వాస్తవ ప్రపంచం - మీరు గుర్తించలేని, నియంత్రించలేని పునరుక్తమయ్యే జీవన నమూనాలను మీరు కలిగి ఉంటారు, కాని నిరంతర బాధను అవి కలిగిస్తుంటాయి. మీరు ఇతర జనాల్ని

బాధ ఎందుకు ?

లేదా బహిస్సంఘటనలపై భావోద్రేకంతో చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు, బాధ కల్గుతుంది. ఏది ఏమయినా వారిపై మీకెంత నియంత్రణ ఉంది?

ఎందుకంటే మీ ప్రేరణకు మూలం మీరే. మరొకరికి మీ సంతోషాన్ని తనఖా పెట్టకండి! జ్ఞాపక ముంచుకోండి.

మీ సొంత సంతోషానికి మీరు 100% బాధ్యులు.

మీ నిశ్శబ్ద అంగీకారం లేకుండా ఎవరూ లేదా ఏదీ మిమ్మల్ని బాధపడేటట్లు చేయలేరు! చేయలేదు. ఇవి మిమ్మల్ని ప్రేరేపించే మాటలు మాత్రం కావు. అది నగ్న సత్యం.

మీ సొంత అనుభవాలను సాక్ష్యంగా చేసుకునే అలవాటును అలవరచుకోవటానికి ప్రయత్నించండి. ప్రత్యేక పరిస్థితిలో మిమ్మల్ని బాధించేది ఏమి?

దాని గురించి మీరు చేయగలిగింది ఏదైనా ఉందా? మీరు ఏదయినా చేయగలిగితే, చేయండి, పరిస్థితి మీ చేయి దాటిపోతే, మీరు ఈ రెండిటిలో ఏదో ఒకటి చేయండి:

(అ) మీ అంతట మీరు బాధ పడటానికి అనుమతించండి, లేదా (ఆ) మీరు ఆ పరిస్థితిని అంగీకరించి మీ జీవితంతో ముందుకు సాగండి - అది మీ ఎంపిక!

చిన్నకథ :

కేన్సరు వ్యాధి పీడితుడయినప్పటికి కూడా శ్రీరామకృష్ణ పరమహంస తన అవసాన దశలో సాధారణ జీవితాన్ని కొనసాగించారు. శరీరకంగా, కేన్సరుపై సాగించే అనుదిన పోరాటం, కాని పరమహంస ప్రశాంతంగా ఉండేవారు.

ఒకరోజు ఆందోళన పడ్డ శిష్యుడు ఆయనను అడిగాడు:

ఇలా ఎలా నవ్వగలుగుతున్నారు? ఇంతటి బాధను ఎలా తట్టుకోగలుగుతున్నారు? బాధ ఏమిటి? బదులుగా శ్రీరామకృష్ణ పరమహంస ప్రశ్నించారు.

ఇది నొప్పి, కాని ఖచ్చితంగా ఇది బాధకాదు!

బాధ నుండి విముక్తి పొందటమంటే నొప్పి ఏమీలేదని అర్థంకాదు. జీవితం ఇంకా కేన్సరుకు, ఆకలితో మాడటానికి లేదా సామానుకు తగిలి మీకాలి వేలికి గాయమయిన దానికి ప్రతి క్రియ ఏమీ ప్రసాదించలేదు. నొప్పిని తిరస్కరించటం - ప్రతి క్రియలో మాత్రమే, మీ మీద దాని ప్రభావాన్ని అనుమతించకపోవటంలో మాత్రమే స్వాతంత్ర్యముంది.

మీరు నన్ను అడుగుతున్నారు - బాధ ఆవశ్యకమా?

అవును, ఒక రకంగా అది అవసరమే.

ఎందుకంటే బాధ పెరుగుదలకు శక్తిమంతమయిన ఉత్ప్రేరకం. మొక్క పెరిగి వికసించటానికి విత్తనం మొదట పగలటంలాగా, ఎక్కువ బాధ మిమ్మల్ని బహిరంగ పరుస్తూ అస్తిత్వంకోసం మిమ్మల్ని భేదిస్తూ, అహంకార రక్షణల్ని భగ్నపరుస్తుంది. మీ సాధారణ ఆలోచన నమూనాలు చెల్లాచెదురు కాగా, మీరు విషయాలను ఉన్న వాటిని యధాతథంగా చూడటానికి మొదలు పెడతారు.

బాధ ప్రతివాడి జీవితంలోను భాగం, వాస్తవ పరిపక్వత ఆ బాధను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవటంలో ఉంది - అది మిమ్మల్ని ఉపయోగించు కునేలోగా!

చిన్నకథ :

ఇద్దరు మనుష్యులు, ఒకడు జ్ఞాని - ఇంకొకడు సామాన్య వ్యక్తి, అమావాస్య రాత్రి అడవిగుండా పయనిస్తున్నారు.

అకస్మాత్తుగా, ఆకాశంలో మెరుపు మెరిసింది. సామాన్య వ్యక్తి భయంతో వణికిపో సాగాడు. తుఫాను! వెంటనే అతడు కలవరపడసాగాడు. నడవగలడా? లేదా తుఫాను ఆగేవరకు అతడు ఆగటానికి సురక్షిత ప్రాంతాన్ని చూచుకుంటాడా? ఆ మనిషి తాను ఆ విధంగా ప్రయాణానికి సిద్ధపడకుండా ఉంటే బాగుండేదని అనుకున్నాడు. అతడు తాను తెలివి తక్కువ వాడనీ, దురదృష్టవంతుడనీ తనలోతాను తిట్టుకున్నాడు. ఇంకో మాటలోచెప్పాలంటే, అతడు బాధలో నిలువునా కూరుకుపోయాడు!

జ్ఞాని, మరోవైపు, కేవలం ఆ క్షణాన్ని ముందున్న రోడ్డును బాగా చూడటంలో వినియోగించాడు. అతడు తాను సరైన దిశలో పయనిస్తున్నట్లుగా దృఢపరచుకున్నాడు. అతడు మెరుపుకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపి ముందుకు సాగాడు.

బాధ కూడా మెరుపు కాంతి వంటిదే. మీకు దాని ఉనికి మీద నియంత్రణ లేదు. కాని దాని నుండి మీరు బాధపడుతున్నారా లేక దాని నుండి నేర్చుకుంటున్నారా అనేది మొత్తం మీ మీదే ఆధారపడి ఉంది!

మీరు బాధను ఆస్వాదిస్తున్నారా?

బాధకు బాగా దాగి ఉన్న కారణాలతో ఒకటి:

మీరు దానిని ఆనందిస్తుండాలి !

మీరు ఆశించే సావధానత, జాగ్రత్తలు అనారోగ్యం మీకు కలిగిస్తే, అనారోగ్యం పాలు కావటం కూడా ఆనందానికి మూలమవుతుంది.

చిన్నకథ :

పెద్ద ఫర్మ్ లో పనిచేసే ఒక మనిషి ప్రతిరోజు మధ్యాహ్న భోజనానికి ఒకే రకమయిన భోజన పదార్థాన్ని తీసుకు వస్తుండేవాడు. ప్రతి రోజు అతడు ఆ పదార్థాన్ని తానెంత ద్వేషిస్తున్నాడో చెప్పేవాడు. సానుభూతి పరులయిన అతడి స్నేహితులు తమ భోజన పదార్థాన్ని అతడి అతడితో పంచుకునేవారు. అతడి స్థితికి జాలిపడ్డ అతడి స్నేహితులు చివరకు అతడికో సలహా ఇచ్చారు, నీ భార్యను మార్పుకోసం నీకు ఇష్టమయిన దానిని వండమని ఎందుకు అడగవు? ఈ భోజన పదార్థాన్ని నీవు అసహ్యించు కుంటావని ఆమెకు తెలియదా? భార్య ఏమిటి? ఆ మనిషి ఆశ్చర్యంతో సమాధానం చెప్పాడు. నేను బ్రహ్మచారిని, నేను నా మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా వండు కుంటాను!

ఎంత తరచుగా మీరు స్వయంగా ఈ పనిని చేస్తుంటారని కనుగొన్నారు - సూక్ష్మ మార్గాలలో ఇతరుల సానుభూతిని పొందటానికి మీ అంతట మీరు బుద్ధిపూర్వకంగా బాధను సృష్టించుకున్నారు? ఉదాహరణకు, మీరు ద్వేషించి ఎవరితోనైనా మీకు దెబ్బలాట వచ్చినప్పుడు, రాత్రిభోజనం చేయకుండా వెళ్ళిపోవటం మీకు మీరు స్వయంగా నొప్పిని కలిగించుకోవటం లేదా ఇతరులకు నొప్పి కలిగించటం. కొన్నిసార్లు మీకు ఎందుకు సంతోషాన్ని కల్గిస్తుందో పరీక్షించుకోండి. అదే ఆనందాన్ని గ్రహించటానికి ఇంకా మంచి వాహకముందా - బాధ లేకుండా? మీ అవసరాలను

బాధ ఎందుకు ?

సంబాళించుకోవటానికి అనుకూల మార్గముందా?

బాగా తెలుసుకోండి - ఇది మొదటి మెట్టు.

రెండోది పూర్తిగా అంగీకరించటం ఇక్కడ, ఇప్పుడే.

అంగీకారంతో జాగృతి - ఇది మాత్రమే బాధా నివారణ.

మీ పరిస్థితిని మెరుగుపరచుకోవటానికి మీరు తగిన చర్యలు తీసుకోకూడదని నా ఉద్దేశంకాదు. తగిన చర్యలన్నిటిని తీసుకోండి - కాని పరిస్థితిని చేయిదాటనివ్వకండి.

ప్రతిచర్య తీసుకోకండి - సరిగా చర్య తీసుకోండి!

A close-up profile portrait of a smiling young person with long hair

మొత్తం జీవం ఒక విశ్వమూలాన్నుంచి ఉద్భవించిందా?

మనమంతా మనసు గ్రహించలేనంతటి లోతుగల మార్గాలతో సంబంధించి ఉన్నామా?