Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
మా గురుదేవులు పరమహంస శ్రీ నిత్యానంద
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహాం
ఓ! అర్జునా! ఎప్పుడెయితే ధర్మానికి హాని జరుగుతుందో, ధర్మం క్షీణ దశకు చేరుతుందో : ఎప్పుడెయితే అధర్మం పెచ్చరిల్లుతుందో అప్పుడు నేను ( ఈభూమి మీద) అవతరించుతాను.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే
సాదు సజ్జనులను సంరక్షించుటకు, దుర్మార్గులను అధర్మనాన్ని నాశనం చేయుటకు ధర్మమును స్థాపించుటకు నేను ప్రతి యుగమున అవతరించెదను.
(శ్రీకృష్ణ భగవానుడు)
ఇది భగవంతుడు తన బిడ్డలకి ఇచ్చిన చాలా అందమయిన, అద్భుతమయిన ప్రమాణం. మనం ఆయన దగ్గర పొందిన ఒక అపూర్వప వరము. విశ్వం మొత్తం విశ్వనాధుడయిన సర్వాంతర్యామి యొక్క అధీనంలో ఉన్నది. ఆ సర్వాంతర్యామినే మనం విశ్వశక్తి, విశ్వాత్మా, విశ్వచేతన స్థితి, సర్వచేతన్య స్వరూపం ఇలా ఎన్నో విధాలుగా అంటాము. విశ్వశక్తికి స్త్రీ రూపాన్ని ఇస్తే, మనం పరాశక్తి, జగన్మాత అని అంటాము. ఈశక్తినే మన వాడుక భాషలో భగవంతుడు, దేవుడు అని ఆరాధించుతాము.
అనంత విశ్వంలో, భూగోళం భగవంతుని అందాల సృష్టి. ఆయన సౌందర్యోపాసకుడు, గొప్ప కళాకారుడు అని చెప్పటానికి నిదర్శనమే ఆయన సృష్టించిన అద్భుతాలు అందాల ప్రపంచం. దీనిని ఆయన తన బిడ్డల కోసం ఎంతో కళాత్మకంగా, అపూర్వంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దాడు. ఇంత కళాత్మకమయిన ఇంజనీరు ఆ సర్వాంతర్యామి కాక మరెవరు అవుతారు? ఆ పరాశక్తి బిడ్డలే ఆరువందల కోట్ల మానవులు, శత శతాను కోట్ల ఇతర ప్రాణులు. ప్రతి ప్రాణిలో తన అంశను నింపి వారి ఆనందనిలయంగా ఈ భూమిని తీర్చిదిద్దాడు.
తన బిడ్డలకి ఆపదలు ఎదురయినప్పుడు, ఈ భూమి మీద అధర్మం పెచ్చుమీరి ధర్మానికి హాని జరిగినప్పుడు, ధర్మం క్షీణదశకి చేరినప్పుడు విశ్వ జననీజనకుడయిన దేవుడేవుడు ఏదో ఒక రూపంలో ఈ భూమి మీద అవతరించి, ధర్మపరులు, సజ్జనులు, నీతినియమాలలో భక్తి మార్గాన ఉన్న దీన జనులని రక్షించి వారిని అభివృద్ధి పథంలో నిలబెడతాడు. అధర్మపరులని దుర్మార్గులని, దుష్టులని తన ప్రేమ హస్తాలలోనికి తీసుకొని వారిలోని దుర్మార్గాన్ని దౌర్జన్య అవినీతులని సర్వనాశనం చేసి, వారిని ధర్మపరులుగా సజ్జనులుగా మార్చి తనదైన ధర్మ మార్గంలో తన వైపుకు తీసుకువచ్చే భక్తి పథంలో నిలబెడతాడు. అందుకే ఆయన భగవంతుడు.
భగవంతుడు తాను తన బిడ్డలకి ఇచ్చిన ప్రమాణాన్ని ఎప్పుడూ మరచిపోలేదు. తాను ఇచ్చిన మాటకి కట్టుబడి యుగయుగాలుగా ఈ భూమి మీద అవతరించి, మానవులలో క్రమంగా పెరుగుతున్న రాక్షసత్వాన్ని, దుష్ట బుద్ధులని వినాశన పరచి తిరిగి తాను విశ్వశక్తిగా మారిపోయి తన వారిని కాపాడుకుంటున్నాడు.
ఇందులో అద్భుతమయిన మరొక విషయం ఏమిటంటే, సర్వశక్తి సంపన్నుడయిన సర్వాంతర్యామి, విశాల విశ్వానికి అధిపతి అయ్యి వుండి కూడా తన వారి కోసం, వారిలో ఒకనిగా ఉదయించి, వారితోపాటు జీవిస్తూ సామాన్య మానవునిలా అన్ని శ్రమలూ అనుభవిస్తూ తనవారిలో తాను ఒకడుగా వారందరిని రక్షించుతూ తాను అనుకున్నది సాధించుతాడు. తాను కష్టపడుతూ తన బిడ్డలని అధర్మం, అశాంతి అనే చీకటి నుండి ధర్మం, శాంతి, తృప్తి, అనే వెలుగులోకి తీసుకువెళతాడు. ఆ ప్రేమమూర్తి తాను అనుకున్నది సాధించాకా తిరిగి పరాశక్తిగా మారిపోయి విశ్వశక్తిలో లీనమైపోతాడు. మరలా ఈ భూమి మీద తన అవసరం కలిగినప్పుడు తిరిగి మరొక అవతారం దాల్చి అప్పటి సమాజ, ఆర్థిక, సాంస్కృతిక, జీవన సరళికి అనువైన రూపంలో మన మధ్యకి మనలాగానే, మన రూపంలోనే వస్తాడు. హద్దులు లేని ఆ కరుణా ప్రవాహం, అంతులేని ఆయన ప్రేమవాహిని ఆయనను మనలో ఒకనిగా ఉండేలా చేస్తాయి.
ఈ పరంపరలో ఆది గురువు మహేశ్వరుడు, జగన్మాత పార్వతీ దేవి రూపాలతో మొదలయ్యి, శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా, బుద్ధునిగా ఆదిశంకరునిగా ఇలా కాలానుగుణంగా ఎన్నో రూపాలలో భగవంతుడు అవతరించి దీనజనులని అక్కున చేర్చుకున్నాడు.
భగవంతుని మరొక అవతారం :
రెండవ సహస్రాబ్ది చివరలో ప్రపంచంలో అనేక సమస్యలతో, ప్రమాదాలతో అల్లకల్లోలమయిపోయింది. చిత్ర విచిత్రమైన సమస్యలు మానవులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఊహించని ప్రమాదాలు ఎదుర్కొనలేని భయానక సంఘటనలు, భయంకరమయిన ప్రకృతి వైపరీత్యాలు, టెర్రరిజం దావానలంలా మానవజాతిని అన్నివైపుల నుంచి చుట్టుముడుతుంటే, కొత్త రకమయిన అనారోగ్యపు సమస్యలు చాపకింద నీరులా ప్రవేశించి మానవజాతిని నాశనం చేసేస్తున్నాయి. మనిషిని మనిషే చంపుకునే విద్వేష వలయాలు అంతటా ఆవరించి ఉన్నాయి. అత్యాశ, కోరికలు, అసూయ, అపనమ్మకం, మానసిక దౌర్బల్యం, సున్నిత మనస్కులయిన ఆ భగవంతుని బిడ్డలని రాక్షసులుగా మార్చేస్తున్నాయి. శాంతి, ప్రేమ, దయ, క్షమా, నమ్మకం, నీతి నియమాలు పూర్తిగా అడుగంటిపోయి, చమురులేని దీపాలలా మినుకు మినుకు మంటున్నాయి.
క్రమంగా మనషులు మానవత్వాన్ని సన్యసించి, రాక్షసత్వం పెంచుకుంటున్నారు. పోటీ పేరుతో ఒకరొనొకరు నాశనం చేసుకుంటూ, తాను కూర్చున్న చెట్టుకొమ్మని తానే నరుక్కున్నాడు. అణ్వాస్త్రాలని, ఆయుధాలని కూడ గట్టుకోవడంలో ఉన్న శ్రద్ధ శాంతి, ప్రేమని ప్రతిష్టించటంలో చూపటం లేదు. ఏ క్షణాన అయినా ఈ భూమి సర్వనాశమవటానికి పూర్తిగా రంగం సిద్ధం చేసి ఉంచబడింది.
భౌతికంగా, మానసికంగా కుంగిపోయిన జనుల మనస్సులలో ఒకటే ప్రశ్న పదేపదే మోగుతున్నది “భగవంతుడు తన ప్రమాణాన్ని మరచి పోయాడా? తన బిడ్డలని రక్షించుతాను అని ఇచ్చిన మాట తప్పాడా లోక రక్షకుడు? ఎందుకు అరాచకాలు పెరిగిపోయి సర్వనాశనం జరుగుతుంటే ఈ భూమిని ఇలా వదిలివేశాడు? జగన్మాత తన బిడ్డలని ఎలా మర్చిపోయింది? ఎందుకు ఈ దౌర్భాగ్యపు స్థితిలో మన అందరినీ వదిలివేసింది? జగన్మాత, జగత్పిత ఏమయ్యారు? పరిస్థితులు హద్దులు దాటిపోతున్నాయి, వారికి కనపడటం లేదా?
అమ్మ బిడ్డలని ఎప్పటికీ మరిచిపోదు. అందులో ఆ జగన్మాత ఎలా బిడ్డలని మరచిపోతుంది? తండ్రి తన తనయులని, తనయులని అక్కున చేర్చుకొని ప్రేమ రక్షణ ఇవ్వకుండా ఉండగలడా? ఈ సృష్టికర్త కరుణామయుడు, ప్రేమ సాగురుడు. తన బిడ్డలకోసం, అల్లకల్లోలమయిన మానవుల అంతరంగాలలో శాంతిస్థాపన చేయటానికి, కల్లోలంలో కొట్టుకుపోతున్న ఈ ప్రపంచానికి ప్రేమ వారధి కట్టి, సుస్థిరత తేవడానికి లెక్కకు మించిన దుష్ట బుద్ధులను, రాక్షసత్వాన్ని, దుర్మార్గాన్ని, అశాంతిని, స్వార్థాన్ని చీల్చి చెండాడి భూమిని స్వర్గమయం చేయటానికి ఆయన ఈ భూమి మీద అవతరించారు. ఆయనే పరమహంస శ్రీ నిత్యానంద స్వామి. ఆయన సమక్షంలో క్షణకాలం నిలచిన వ్యక్తి కూడా “స్వామీ! నీవు భగవంతుడివి” అని అనని వ్యక్తి ఇంతవరకూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు.
ఇప్పటి సమస్యలకి, ఇప్పటి జీవన స్థితి గతులకి అనుగుణంగా భగవంతుడు స్వామి రూపంలో మన మధ్యకి వచ్చాడు. దుష్ట శిక్షణ కోసం, నందకము, సుదర్శన చక్రం, కోదండం, త్రిశూలం, పాంచజన్యం, డమరుకం అన్నింటినీ కలబోసి ఒక అద్భుతమయిన ఆయుధాన్ని చేత పట్టుకుని భూమి మీద అవతరించారు. ఆ ఆయుధమే “ధ్యానం.” త్రిమూర్తుల ఆయుధాలలోని శక్తి, జగన్మాత ప్రేమలోని అమృతము కలబోసి ఉన్న ఈ ఆయుధం అచిరకాలంలోనే మహాద్భుతాలని సృష్టించగలిగింది.
పరాత్పరుడు సామాన్య మానవుల పక్షపాతి అనే మాట నిజమేనేమో! శ్రీ రామచంద్రుడు రాజపుత్రుడయి కూడా అడవిజనుల ఉద్ధరణకోసం, అడవి బిడ్డల దేవుడయ్యాడు. విలాసాలు వదిలిపెట్టి సామాన్య మునిపుంగవుల రక్షణ కోసం పడరాని పాట్లుపడి, తన బిడ్డలకి ఆదర్శ పురుషునిగా తిరిగి ఆదర్శాలు నిలబెట్టగలిగాడు. శ్రీరాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం స్థాపించిన ఆదర్శాలు నేటికి మనం గౌరవిస్తూ, పాటిస్తున్నాము.
శ్రీకృష్ణుడిగా అమాయకపు యాదవుల చేతులలో పెరిగి, రాజు పేద, పండిత పామర, స్త్రీ; పురుష భేదం లేకుండా అందరి హృదయాలలో దేవుడయిన పురుషోత్తముడు శ్రీకృష్ణుడు, సామాన్యునిలా అన్ని ప్రమాదాలు చవి చూసాడు. అన్ని కష్టాలని అనుభవించాడు. అందరికి సమానంగా తన ప్రేమామృతాన్ని పంచాడు. ప్రేమకి భక్తికి నిర్వచనం చెప్పాడు. అందుకే ఆయన పూర్ణపురుషుడు. పరమేశ్వరుడు పావనమూర్తి అతి సామాన్యమైన జీవన సరళితో మామూలు భక్తులకు, పేదలకు దీనబంధువు అయ్యాడు. భిక్షగా భక్తిని తీసుకొని ముక్తిని ప్రసాదించే ఆదిభిక్షువుకి సాటిరాగల సామాన్య జీవితం ఎక్కడయినా చూడగలమా.
తన చిన్న చిన్న మాటలతో ప్రపంచాన్ని మార్చివేసిన గౌతమ బుద్ధుని జీవితం పేదసాదల మధ్య పండిత పామర తేడా లేకుండా గడిచిపోయింది. ఈ విధంగా చూస్తే ఎన్నో రూపాలతో భగవంతుడు ఈ భూమి మీద అవతరించి మన మధ్యలోనే ఉండి మనని రక్షించాడు. ఇంత గొప్ప పుణ్యభూమిలో జన్మించిన మనం ఎంత అదృష్టవంతులమో కదా! ఇది ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా!
ఆ దేవదేవుని అంతర్యం మామూలు మనుషుల పట్ల పరమ కరుణతో, అవ్యాజమయిన ప్రేమతో పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. హద్దులు లేని ఆ కరుణ, అంతులేని ఆ ప్రేమ ఆయనని మన మధ్య జన్మించేలా చేస్తుంది. నిత్యానందోదయం :
జనవరి ఒకటవ తేదీ, 1978 అర్థరాత్రికి 15 నిముషాల ముందు అష్టమీ శుభ గడియలలో సర్వాంతర్యామి ఒక కాంతి పుంజముగా మారి పవిత్ర అరుణాచలం శిఖరం వైపుగా ప్రయాణించి, అక్కడ ఆగాడు. ఎన్ని జన్మల తపః ఫలితమో, ఆ పర్వతశిఖరం చేసిన పుణ్యమే పుణ్యం, భగవంతుడు మరొకసారి ఆ శిఖరాన్ని తన జన్మస్థలంగా, ఆట స్థలంగా మార్చుకొని అరుణాచలం ఉన్న పవిత్ర పట్టణమయిన తిరువణ్ణామలై అనే చిన్న పట్టణంలో అద్భుతమయిన బాలుడిగా జన్మించారు పరంధాముడు.
నిత్యానంద, జన్మతః జ్ఞానోదయం పొందిన యోగీశ్వరులు. సాక్షాత్ త్రిమూర్తుల అంశలో జన్మించిన భగదవతారం. ఆయనకి తన జన్మ మొత్తం ఆయన చేతనస్థితిలో జరిగింది. ఒకసారి ఆయన తన శిష్యులకి తన జన్మ వృత్తాంతాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంగా మనకి అర్ధమయిన విషయం ఏమిటంటే, భగవత్ స్వరూపులు సామాన్యుల పక్షపాతి. అదే విధంగా ఆయన తమిళనాడులో తిరువణ్ణామలై అనే ఊరిలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు.
అరుణాచలం : అరుణాచలం అంటే ఎర్రటి పర్వతం. నిశ్చలమయిన పర్వతం. నిశ్చలమయిన ఉదయతార అని అర్ధం. అరుణాచలంకి విశేష ప్రాముఖ్యత ఉన్నది. కొన్ని వేల సంవత్సరాలుగా, ఇది మహార్షులకు, యోగులకు, అవతార పురుషులకు నివాసస్థానంగా విలసిల్లినది. ఎందరో జ్ఞానులకు తపస్వికులకు ఇది తపోభూమి. ఇది ఆధ్యాత్మికాలకు ఆనంద మందిరం. ఆదిశంకరాచార్యులవారు అరుణాచలంని మేరువుగా వర్ణించారు. ఆయన దీనిని పరమేశ్వరుని హృదయంగా చెప్పారు. భగవాన్ రమణ మహర్షి ఈ పర్వతాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ణించేవారు. ఈ పవిత్ర పర్వతం చుట్టూ అభివృద్ధి చెందిన ఊరు, తిరువణ్ణామలై భగవంతుని ఆటపాటలతో పవిత్రమయిన పట్టణం.
స్వామి జన్మించినప్పుడు దైవజ్ఞులు ఆ బాలుని జాతక చక్రం చూసి ఈ బాలుడు 'రాజర్షి' అని చెబుతారు. ఆ మాటకి కలవరపడిన తల్లిదండ్రులు, దైవాను గ్రహంతో సర్దుకుని, ఆ దివ్యాంశునికి తాము కొద్దికాలం రక్షకులమని తెలుసుకుంటారు.
ఈ సందర్భంగా స్వామి తన శిష్యులతో తన చిన్నతనంలోని ఒక విశేషాన్ని ఈ విధంగా చెప్పారు. ఆయనకి మూడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ ఆయన నిదురించే సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో, తన చుట్టూ భైరవుల వలయం ఉండేదట. వారిని చూసి ఆయన తన బంధువులే అనుకునేవారట. ఆయన కొంచెం పెద్ద అయ్యాక వారు భైరవులు అని ఒక మహా యోగి ద్వారా స్వామికి తెలిసిందని చెప్పారు.