KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/ఉపోద్ఘాతం :Sign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

ఉపోద్ఘాతం :

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ఈ గ్రంథంలో యువకుడయిన జ్ఞానోదయం పొందిన గురుదేవులు శ్రీ నిత్యానంద భగవద్గీతపై వ్యాఖ్యానించుతారు. కొన్ని సంవత్సరాలుగా భగవద్గీతపైన ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. అన్నింటికంటే ముందుగా చెప్పదగిన వ్యాఖ్యానం గురుదేవులు శ్రీ ఆదిశంకరాచార్యులవారిది. ఆయన దానిని కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవచించారు. ఆధునిక కాలంలో గురుదేవులయిన రామకృష్ణ పరమహంస, భగవాన్ శ్రీరమణ మహర్షి భగవద్గీత మీద చాలా విస్తృతంగా మాట్లాడారు. ఎంతో మంది ఈ పవిత్ర గ్రంథం మీద ఎన్నో గ్రంథాలు రాసారు.

ఈ పుస్తకంలో మేము శ్లోకాన్ని, దాని అర్థాన్ని వివరంగా ప్రతి పదానికి ఇచ్చాము. అలాగే ఆ శ్లోకం యొక్క భావాన్ని క్లుప్తంగా ఇచ్చాము. అలా ఇవ్వటం వలన దీనిని మరొక గ్రంథంతో పోల్చనవసరం లేదు. అలా పోల్చడం ఆపేస్తారు. భగవద్గీతపై శ్రీనిత్యానంద చేసిన వ్యాఖ్య కేవలం తర్జమా కాదు. ఆయన ఒక్కొక్క శ్లోకం గురించి

మాట్లాడే సమయంలో చదివేవారిని ప్రపంచం మొత్తం నుంచి తీసుకువెళతారు. భగవద్గీతలో ప్రతి శ్లోకానికి ఏడు స్థితులలో అర్థాలు ఉన్నాయని చెబుతారు. మామూలుగా వచ్చే వ్యాఖ్యానాలు మొదటి దశలో అర్థాన్ని మాత్రమే కలిగి వుంటాయి. ఇక్కడ జ్ఞానోదయం పొందిన గురుదేవులు సామాన్యస్థితి నుంచి అసాధారణ స్థితికి ఎంతో సులభంగా తీసుకువెళతారు.

పరమహంస నిత్యానందుని గీతావ్యాఖ్యానం చాలా అరుదయినది. అది మనకి అరుదయిన ఆత్మదర్శనం కలిగిస్తుంది. ఇది చదవటం మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప అనుభవం, ఇది ఒక ధ్యానం.

ఆదిశంకరాచార్య, గొప్ప తత్వవేత్త, గురుదేవులు ఈవిధంగా చెబుతారు.

భగవత్ గీతా కించిత్ డీతా
గంగాజల లావా కనికపీతా
సకృత్పి ఏన మురారి సమర్చ
క్రియాతే తస్యా యామేన చర్చ

భగవద్గీతని కొంచెం చదివినా, గంగానదిలోని ఒక నీటిబొట్టుని తాగినా, శ్రీకృష్ణుని ఒక్కసారి తలచినా, మనం మరణాన్ని సమీపించే సమయంలో ఎటువంటి సమస్యని ఎదుర్కొనము. చూపించి, ఆ విశ్వశక్తి యొక్క అనుభవాన్ని చేతనస్థితిలో అర్జునునికి ఇచ్చి, ఆ తరువాత భక్తి గురించి అర్జునునికి వివరిస్తాడు. అదే భక్తి ప్రేమ, దివ్య ప్రేమ, దైవ ప్రేమ.

శ్రీకృష్ణుడు అర్జునునికి చూపించిన విశ్వరూపం ఈ సర్వవిశ్వం యొక్క సచేతన స్థితి. అదే భగవానుని చేతనస్థితి. అదే మనందరిలోనూ ఉండే సమూహ చేతన స్థితియొక్క సంపూర్ణ రూపం. శ్రీకృష్ణుని విశ్వరూపదర్శనంతో అర్జునుడు తాను కూడా ఈ విశ్వచేతనలో భాగమేన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అంతేకాకుండా తాను చూడగలిగే కృష్ణుడు ఆయన యొక్క అనంతమయిన, శాశ్వతమయిన విశ్వాత్మలో ఒక చిన్న భాగమని అర్థం చేసుకున్నాడు.

దైవికమయిన శ్రీకృష్ణ భగవానుని విశ్వదర్శన అనుభవం తరువాత అర్జునునిలో ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి.

తాను ఇంతకుముందు చూసిన విశ్వరూపం ఈ సర్వవిశ్వం యొక్క అద్భుత సత్యమేనా?

తాను నిజంగా తన దృష్టిని కేంద్రీకరించవలసిన స్థితి ఇదేనా?

శ్రీకృష్ణుడు తాను ఇంతకుముందు చెప్పిన చాలా ముఖ్యమయిన విషయం, రూపంలేని ఆత్మ యొక్క స్థితి ఇదేనా?

మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే భక్తి (దైవప్రేమ) తరువాత ఆధ్యాత్మిక అనుభవం జరుగుతుంది అనుకుంటారు. కానీ, మీకు అసలు నిజమేమిటో చెబుతాను. ఆధ్యాత్మిక అనుభవం అయిన తరువాత మాత్రమే భక్తి ప్రారంభమవుతుంది. ఎప్పుడూ కూడా నిజమయిన భక్తి అనేది ఆధ్యాత్మిక అనుభవానికి ముందు జరగదు.

కొన్నిసార్లు అలా నటిస్తూ వాళ్ళు నిజంగానే ప్రేమిస్తున్నాము అని అనుకుంటారు. కానీ మీరు ప్రేమని ఎప్పుడూ నటించలేరు.

ప్రేమ మీ అంతరంగంలో మీ అసలయిన ఉనికి నుంచి పొంగి ప్రవహించాలి. ప్రేమ అనేది మీరు విశ్వ చేతన శక్తిని అనుభవించేటప్పుడే తెలుస్తుంది. మీ అహంకారం పూర్తిగా పోయినప్పుడు, మీకు ఆధ్యాత్మిక అనుభవం కలిగినప్పుడు మాత్రమే అటువంటి ప్రేమ మీలో సృష్టించబడుతుంది. శ్రీకృష్ణుడు ఈ పద్ధతిని ఒక క్రమమైన రీతిలో ఒక దాని తరువాత ఒకటిగా మనకోసం తీసుకువచ్చాడు. నేను మీకు చెబుతున్నాను : ఆధ్యాత్మిక అనుభవం తరువాత అంతులేని కృతజ్ఞత మీ లోపలినుంచి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మీలో పొంగి ప్రవహించే ప్రేమ అన్నివైపులకీ వ్యాపిస్తుంది. దానికోసం మీరు ఎటువంటి ప్రత్యేకమయిన ప్రయత్నాలు చేయనవసరం లేదు. అది అలా ప్రవహిస్తుంది. మీరు దానిని ఆపలేరు. ఎవరూ కూడా ఆధ్యాత్మిక అనుభవం లేకుండా ప్రేమని చూపించలేరు, ప్రేమ అనుభూతిని పొందలేరు.

నిజమయిన, షరతుల లేని ప్రేమని సృష్టించలేము. ఎప్పుడయితే మీ మనస్సు (మైండ్) నిశ్శబ్దంగా, పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడే అటువంటి ప్రేమ మీలో వికసిస్తుంది. అయితే మనం మామూలుగా చెప్పుకునే ప్రేమ నిరంతరం షరతులు, నిబంధనలతో ఉండే ప్రేమ. మనం మన ప్రేమతో వ్యవహారాలు నడుపుతాయి. అది ఈ విధంగా పనిచేస్తుంది. ముందుగా మనం ఎదుటి వారి మాటలకి, పనులకి మన అనుమతిని ఇస్తాము. అలా ఇచ్చిన సర్టిఫికెట్లకి బదులుగా వాళ్ళు మనం కోరుకున్న విధంగా ఉండాలి అని మనం ఆశించుతాము. దీనినే మనం ప్రేమ అంటాము.

మనం ఎదుటి వారిని ప్రేమిస్తున్నాము అని చెబుతుంటాము. మనం ఈ ప్రపంచాన్ని ప్రేమించగలుగుతున్నామని గర్వపడుతుంటాము. నిజజీవితంలో చూసినప్పుడు

The Song of God

శ్రీమద్భగవద్గీత మీద సంభాషణము 4 నుండి 21 సెప్టెంబర్ 2005 మాలిబు దేవాలయము, లాస్ ఎంజెల్స్, అమెరికా మాత్రం మన పక్క ఇంటివారిని ప్రేమించటం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు మనకంటే ధనవంతులయినప్పుడు మనకంటే ఒక మెట్టు పైన ఉన్నప్పుడు ఇదీ మరీ కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది ఎదుటివారి రెండు కళ్ళు పోతాయి అంటే తన ఒక కన్నుని పోగొట్టుకోవడానికి ఆనందంగా సిద్ధపడతారు. అటువంటి వ్యతిరేక భావాలు అసూయ, అత్యాశ వలన కలుగుతాయి. మనం మన పక్క ఇంటి వారినే ప్రేమించలేనప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఎలా ప్రేమించగలుగుతాము. మనం మన వాళ్ళు కోసం మాత్రమే పాటు పడేటప్పుడు, సమాజానికి ఎలా సేవ చేయ కలుగుతాము.

కొంతమంది నన్ను అడుగుతుంటారు 'స్వామీజీ, మీరు మీ శిష్యులని, భక్తులని ధ్యానం చేయి, ధ్యానం చేయి అంటుంటారు. దానివలన ఉపయోగం ఏమిటి? అది స్వార్థం కదా? వాళ్ళని సమాజ సేవ చేయమని ఎందుకు చెప్పరు? అది చాలామందికి ఉపయోగపడుతుంది కదా.' అని అంటారు.

చాలా ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. అవి ఆధ్యాత్మిక సంస్థలు అని చెప్పుకుంటాయి. అవన్నీ పేరుకోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం, లేదా సమాజంలో గొప్ప కోసం అలా చేస్తుంటాయి. ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. అవి ఇటువంటి దానధర్మాలు చాలా చేస్తుంటాయి. ఇటువంటి సంస్థలని నడిపేవారు, ఇటువంటి కార్యక్రమాలలో ఉండేవారు ఫోటోలు తీయించుకొని న్యూస్ పేపర్లలోనూ మేగజైన్లలోనూ వేయించుకుంటారు. అలాంటివి మీరు చాలా చూసి ఉంటారు.

నేను ఎప్పుడూ చెబుతుంటాను. దానధర్మాలు చేయటం, సమాజసేవ అనే కార్యక్రమాలు చేయటం అనేది మిమ్మలని మీరు చాలా అందంగా మోసం చేసుకోవటం, అలాగే ఎదుటివారినీ మోసం చేయటం. ఇది కేవలం పైపైన బయటకి వెల్లడి చేయటమే కానీ అంత రంగంలో ఏర్పడిన కోరిక కాదు. ఏ క్షణంలో అయితే మీరు ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించాలని అనుకుంటారో అప్పుడే ఈ కార్యక్రమం మొత్తం తన నాణ్యతని, రంగుని అసలు ఉద్దేశాన్ని పోగొట్టు కుంటుంది. ఇది మీకు ఆధ్యాత్మిక అనుభవం అయిన తరువాత జరిగితే అప్పుడు అది అలా ప్రవహిస్తుంది. అదే నిజమైన ప్రేమని వెల్లడి చేస్తుంది.

ఎదుటివారిని మార్చటానికి ప్రయత్నించేముందు, మన అంతరంగంలో మార్పురావాలి. ఎవరైతే తాను ఈ సర్వవిశ్వశక్తిలో భాగం అని అనుకోరో అలాగే ప్రతివ్యక్తి తనతో ప్రతి వ్యక్తికీ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయని తెలుసుకోరో, అటువంటివారు ఎదుటివారి కోసం నిజమైన ప్రేమతో ఏమీ చేయలేరు. వాళ్ళు చూపించేది కేవలం కృత్రిమమైన, కపటముయిన ప్రేమ మాత్రమే. అటువంటి వాళ్ళు వంచకులు.

మనందరం ఈ అనంత విశ్వసాగరంలో ఒక భాగమే. అందులో మనందరం నీటి బిందువులమే. మనం ఎంతకాలం·అలా నీటి బిందువులుగా ఉండిపోతామో, ఎంతకాలం మనం ఆ మహాసాగరంలోని ఒక భాగమే అని అర్థంచేసుకోమో, అంతకాలం మనం ఈ అనంత సాగరానికి వేరుపడి ఉంటాము. ఈ విధంగా వేరుగా ఉన్నంతకాలం మనలో నిజమైన ప్రేమ ఉండదు. మన అనుభవాల అనుభూతులు పూర్తిగా 'నేను' 'నాది' అనే వాటి మీదే ఆధారపడి ఉంటాయి. ఇటువంటి భేద భావం ఉన్నంతకాలం నిజమైన ప్రేమ ఉదయించదు. అటువంటప్పుడు షరతులు లేని ప్రేమని వెల్లడి చేయలేము.

జెన్ బౌద్ధమతంలో ఒక విషయాన్ని చాలా చక్కగా చెబుతారు. బుద్ధుడు ఏమిచేసినా, ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఏమి చేసినా, అది ఎవరినైనా చంపటం అయినా అది మంచి మాత్రమే చేస్తుంది. అది బుద్ధునికి, ఆ వ్యక్తికీ ఇద్దరికీ మంచి చేస్తుంది. బుద్ధుడు నిరంతరం విశ్వచేతన శక్తితో ముందుకు నడపబడతాడు. అందుకే అది ఎప్పుడయినా అందరికీ మంచిని మాత్రమే చేస్తుంది.

నేను ఒక మేగజైన్లో కొన్ని విషయాలకి సంబంధించిన డేటా చూసాను. ప్రపంచంలో అన్ని దేశాల ప్రభుత్వాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అవన్నీ కలిపి ప్రయోగిస్తే భూమిని వెయ్యిసార్లు నాశనం చేయవచ్చు. వాళ్ళ దగ్గర నిలువ వుంచిన అణ్వాయుధాలు ఈ భూమిని ఒకసారి కాదు వెయ్యిసార్లు నాశనం చేస్తాయి. అయితే నేను చదివిన రిపోర్టు పాత రిపోర్టు. ఈ నాటికి అవి రెట్టింపు అయి ఉంటాయి. ఇదంతా కూడా ఒక జ్ఞానోదయం పొందని సామాన్య మైండ్ చేసిన పని వలన వచ్చిన ఫలితం.

ఇప్పుడు మన శాస్త్రీయమయిన క్లోనింగ్, స్టెమ్ సెల్స్ అనే పనుల్లో మునిగిపోయాము. వాటి ఫలితాలు ఆ పరిశోధనలలో నిమగ్నమయిన వ్యక్తుల అంతరంగంపు ఉనికి యొక్క నాణ్యతమీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని వారి మైండ్ యొక్క నాణ్యత మీద కాదు. మైండ్ ఎప్పుడు అహంకారం చేతులలో ఉంటుంది. కానీ మన అంతరంగపు ఉనికి మనలోని విశ్వప్రేమని తెలుసుకోగల సచేతన స్థితి అధీనంలో ఉంటుంది.

తప్పు దృక్పథంతో ఉండే ఒక వ్యక్తిని అధికార పీఠం మీద కూర్చోబెడితే అతను మానవాళికే ప్రమాదకారిగా తయారవుతాయి.మనకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక చేయవలసినది కేవలం బటన్ నొక్కటమే ఆలస్యం. అయితే మతిలేని క్రూర స్వభావం కలవాడు ఆ పని చేస్తే ప్రపంచంలో నరమేధ జరుగుతుంది. అందరూ మరణిస్తారు. అదే ఎన్నో అణ్వాయుధాలు నిలవచేయబడి ఉండటమే ఇటువంటి స్థితికి ఒక ఉదాహరణ.

చూడండి. అణుశాస్త్రం ఒక గొప్పసత్యం. అది అణువిచ్ఛేద సూత్రం. ఇందులో సూత్రం ఏమిటంటే, అణువుని విచ్ఛిన్నం చేసినప్పుడు అందులోంచి చాలా ఎక్కువ

అర్జున ఉవాచ :

యేవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః (12:1)

అర్థం : అర్జున ఉవాచ = అర్జునుడు ఈ విధంగా అడిగాడు. ఏవం = ఈ ప్రకారంగా సతతా = ఎల్లప్పుడూ : యుక్తా ః = నిమగ్నమైన : ఏ = ఎవరయితే : భక్త = భక్తులు : త్వం = నీవు : పర్యుపాసతే = ఉపాసించుచున్నరో : ఏ = ఎవరైతే : చ= మరియు : అపి = కూడా : అక్షరం = నాశనం లేనిది : అవ్యక్తం = ఇంద్రియములకు గోచరం కాని : తేషాం = ఆ ఇరు తెగల వారిలో : కే=ఎవరు : యోగ-వి-తమః = యోగమును బాగుగా తెలుసుకున్నవారు.

అర్జునుడు ఈ విధంగా అడిగాడు : ఈ ప్రకారం ఎల్లప్పుడు నీయందే మనస్సుని నెలకొల్పిన వారె ఏ భక్తులు నీ రూపాన్ని పూజించుతారో లేదా ఎవరయితే నాశనం లేని, కనిపించని రూపం లేని నిన్ను పూజించుతారో : ఈ ఇద్దరిలో ఎవరు యోగ్యులు.

చూడండి : అర్జునుడు ప్రశ్నించే పద్ధతి మాట్లాడే విధము పూర్తిగా వేరుగా ఉంటుంది. అతని దృక్పథం, పద్ధతిలో పూర్తిగా మార్పు ఉంటుంది.

అర్జునుడు ఈ విధంగా అడుగుతాడు " భగవాన్, ఎవరు పాటించే పద్ధతి మంచిది : ఎవరు భక్తిభావంతో నిన్ను, నీ రూపాన్ని పూజిస్తూ ఉంటారో వాళ్ళ పద్ధతి మంచిదా? లేకపోతే ఎవరయితే రూపంలేని అనంత బ్రహ్మాండమయిన విశ్వశక్తి, విశ్వ ఆత్మలో,విశ్వచేతనస్థితిలో విలీనమయిపోతారో వాళ్ళ పద్ధతి మంచిదా? వీళ్ళు ఇద్దరిలో ఎవరి పద్ధతి మంచిది?"

స్పష్టంగా అర్థం చేసుకోండి : ఇక్కడ అర్జునుడు తన కోసం అడగటం లేదు. ఇక్కడి నుంచి భగవానుని ప్రవచనం చిన్న సంభాషణలా ప్రారంభమవుతుంది. ఇది ఒక సత్యాన్ని రాబోయే కాలం కోసం రికార్డు చేయటానికి ప్రయత్నించటమే. ఇక్కడ నుంచి వచ్చే ప్రశ్నలు అన్నీ కూడా అనుమానాలు కాదు. అలాగే విచారణ (ఎంక్వయిరీ) కాదు. ఆ సత్యం మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ క్రిందికి తెచ్చి రాబోయే కాలంలో ప్రజలకి అందించాలి అనే సంకల్పం మాత్రమే. ఇదంతా మానవుల పట్ల అర్జునుని నుంచి పొంగిపొరలే ప్రేమ. ఇది అర్జునుని యొక్క దివ్య అనుభవాన్ని వెల్లడి చేయటమే. ఇదంతా ప్రశ్నల రూపంలో వెల్లడి చేసి భగవంతుని దగ్గర నుంచి వచ్చిన జవాబులని రాబోయే కాలం కోసం రికార్డు చేయటమే.

అర్జునుడు కృష్ణుని ఇలా అడుగుతారు. నీలో సంపూర్ణంగా స్థిరపడిన వ్యక్తి ఎవరు? అతను నీ భక్తుడా? లేక జ్ఞానోదయం పొందిన వ్యక్తా? ఎవరు?

ఇక్కడ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. మతాన్ని ఆచరించే వ్యక్తులు, సామాన్యులు ఈ శ్లోకంలోని అర్ధాన్ని సరిగ్గా అర్ధంచేసుకోలేదు. వాళ్ళు కొంచెం అయోమయపడ్డారు. వాళ్ళు అర్జునుడి ప్రశ్నని వేరుగా అర్థంచేసుకుంటారు. అర్జునుడు శ్రీకృష్ణుని "నీ రూపాన్ని పూజించటం మంచిదా లేకపోతే రూపంలేని నిన్ను పూజించటం మంచిదా?" అని అడిగినట్లు అర్థం చేసుకుంటారు. ఇటువంటి వాళ్ళు ఎంత అయోమయంలో ఉంటారంటే అసలు విషయంలో నిజమే అవుతుంది.అలా జరగవచ్చునేమో నాకు తెలియదు. కానీ నా విషయంలో ఈ రెండు స్థితులు ఒకేసారి జరిగాయి.నేను ఈ రెండు స్థితులని వేరు వేరుగా సాధించలేదు. నాకు ఇవి ఒక్కసారే జరిగాయి. నేను నా అనుభవాలని వెల్లడి చేసే స్థితికి చేరాను.

ఇదంతా భగవంతుని (పరాశక్తి) సంకల్పం. ఒక విషయం అర్థంచేసుకోండి. వీళ్ళు ఈ స్థితిలో ఉండాలి అనేది వాళ్ళ ఎంపిక కాదు. ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందినవారికి ఇటువంటి ఎంపిక చేసే అవకాశం ఉండదు. సామాన్య ప్రజలకి అలా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. దానికి వారు కర్మని (తీరని కోరికల వృత్తం) అనుసరించతారు. కానీ ఎవరైతే సర్వాంతర్యామి అయిన విశ్వశక్తి (పరాశక్తి) అనుభవాన్ని పొందుతారో వాళ్ళు ఆ ఎంపిక అనే స్థితికి అతీతంగా వెళ్ళిపోతారు. వాళ్ళు వేసే ప్రతి అడుగుగా భగవంతుని నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అదే విశ్వ శక్తి, అదే శ్రీకృష్ణుని ఉన్నతమైన చేతనస్థితి. ఆ విషయంలో వారికి ఎంపిక అవకాశం ఉండదు. వాళ్ళు కళ్ళుమూసుకుని కూర్చోవాలా లేకపోతే కళ్ళు తెరిచి సర్వమానవాళికి మంచి చేయాలా అనే నిర్ణయం వాళ్ళ చేతులలో ఉండదు.

ఈ విషయం అర్జునుడికి తెలియదు అని కాదు. ఆయనకి భగవంతుని దివ్య అనుభవం అయిన తరువాత ఈ ఎంపిక లేని స్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అటువంటి అనుభవం అయిన అందరికీ ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అర్జునుడికి తన విషయంలో ప్రతి నిర్ణయం స్పష్టంగా అర్థమవుతుంది. అర్జునుడికి తన విషయంలో ప్రతి నిర్ణయం చేసేది శ్రీకృష్ణుడే కాని తాను కాదు అని తెలుసు, కానీ ఆయన శ్రీకృష్ణుని అన్నీ అడుగుతాడు. ఈ విధంగా ఈ విషయాలన్ని అందరికీ తెలియచేయాలనేది అర్జునుని కోరిక.

ఈ కారణంతోనే భగవద్గీతని ఈరోజుకి సజీవంగా నిలిచి ఉన్న పవిత్ర గ్రంధంగా చెప్పవచ్చు. ఈ కారణం వలననే అందలోని మాటలు ఇప్పటికీ ప్రతి ఎంతో కదలిపోతారు. ఆయన జగన్నాథుని తల నుంచి కాళ్ళ వేళ్ళ వరకూ ఆమె తన ముందు నిలడి ఉన్నట్టే వర్ణించుతారు. ఇది చిత్రాలతో కూడిన వర్ణన. ప్రేమతో నిండిన వర్ణన. ఆయనలో పొంగి ప్రవహించే భక్తిని వెల్లడి చేసే వర్ణన. అదేవిధంగా రామానుజాచార్యుని వేదాంత జ్ఞానం యొక్క లోతులు ఆయన అందించిన సూత్రాలపై వాఖ్యానాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన చూపించిన పద్ధతులు, ఆయన రాసిన పవిత్ర గ్రంథాలు గొప్ప జ్ఞాన సంపదలు. శంకరాచార్యుని రచనలకి ఏమాత్రం తగ్గవు. అందుకే అంటాను జ్ఞానం లేకుండా నిజమైన భక్తి ఉండదు. భక్తి లేకుండా నిజమైన జ్ఞానం ఉండదు.

అయితే ఈ వాదనలు అలా జరుగుతూఉంటాయి. కానీ మీరు జవాబులని గమనించిటే అర్జునుడు అడిగిన ప్రశ్న ఇది కాదు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అర్జునుడు అడిగిన విషయం, తాను తనకి కలిగిన ఆధ్యాత్మిక అనుభవంలోనే స్థిరపడిపోవాలా లేకపోతే తనలో జరుగుతున్న కృతజ్ఞతాభావాన్ని వెల్లడి చేయాలా అని మాత్రమే.

Tనలో జరిగిన ఆధ్యాత్మిక అనుభూతి, కృతజ్ఞతా భావాన్ని వెల్లడి చేయటమే భక్తి. అనుభవంలో ఆనందాన్ని పొందుతూ, ఆ అనుభవంలో ఉండటాన్ని జ్ఞానం అంటారు. అంతే.

ఈ ప్రశ్నకి శ్రీకృష్ణుడు చెప్పిన జవాబు ఈ రెండూ ఒక్కటే.

ఈ రెండు మార్గాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. మొదటి మార్గం రెండవదానిలోనికి, రెండవ మార్గం మొదటి దానిలోనికి దారితీస్తుంది. మీరు ఛేదించలేని వృత్తం (విషస్ సర్కిల్) గురించి విని ఉంటారు. అందులో మొదటి నుంచి రెండవదానికి, దాని నుంచి తిరిగి మొదటి దానికి వెళుతూనే ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు ఈ సందర్భానికి మరొక కొత్త పదాన్ని చెబుతాను. అది వాస్తవమైన ధర్మచక్రం, ఛేదించలేని చక్రం తక్కువ స్థితికి తీసుకువెళుతుంది. వాస్తవమైన ధర్మచక్రం ఉన్నత స్థితిలోని శక్తికి దారి తీస్తుంది. అది ఉన్నత

ఇప్పుడు భగవానుడు శ్రీకృష్ణుని జవాబు ఏమిటో విందాము :

శ్రీ భగవానువాచ :

మయ్యా వేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే
శ్రద్ధయా పరయోపేతాస్తేమే యుక్తతమా మతాః (12:2)

అర్థం : శ్రీ భగవానువాచ = శ్రీ భగవంతుడు చెప్పెను.

మయి = నాయందు : ఆవేశ్య = నిలిపి : మనః = మనస్సును (మైండ్) : నిత్య = నిరంతరం (శాశ్వతంగా) : యుక్తా = నిమగ్నమై : ఉపాసన = ఆరాధించుతారో : శ్రద్ధయా = శ్రద్ధతో, నమ్మకంతో : పరమా = మిక్కిలి ఉన్నతమైన : ఉపేతాః = కూడుకొనినవారై : తే= అటువంటి వారు : యుక్తా తమః = ఉత్తమ యోగులు : మే = నా యొక్క : మతాః = అభిప్రాయం.

భగవానుడయిన శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. ఎవరైతే నాయందు మనస్సు నిలిపి నిరంతరం మిక్కిలి శ్రద్ధతో, నమ్మకంతో నన్ను ఆరాధించుతారో అటువంటి వారిని ఉత్తమయోగులుగా నేను అంటాను. వారేనాలో ఐక్యమయిపోగల వారు.

మాటలని వడపోస్తుంటారు. దానిని తిరిగి అనటం చేస్తుంటారు. మనలో నిరంతరం జరిగే అంతరంగపు మాటలని బయటికి మాట్లాడే ధైర్యం చేయం. ఎందుకంటే బయటికి అనే మాటలని ఎవరూ స్వీకరించరని భయపడతాము. కాబట్టి మనం మన జీవితాలని పూర్తిగా అబద్ధాలతో నింపేస్తాము.

ఈ చిన్న ఉదాహరణని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఇప్పుడు మీకు ఈ బొమ్మ చూపించి వివరిస్తున్నాను. కొన్ని రోజుల అయ్యాక మీరు ఈ కార్యక్రమం మీద ఆడియో సి.డి.ని మీ స్నేహితునికి వినిపిస్తారు. అతను ఈ ప్రోగ్రాంకి రాలేదు. మీకు ఆధ్యాత్మిక అనుభవం లేదు. అప్పుడు మీరు అతనికి ఎంత వివరించగలరు. మీరు కేవలం నా అనుభవాన్ని అనువాదం చేస్తారు. నా అనుభవాన్ని మీరు ఎంతవరకూ వివరించగలరు? దానిని ఎంత బాగా వివరించగలరు? మీ స్నేహితుడు ఎంత అర్థం చేసుకోగలడు? మీరు సరిగ్గా వివరించలేరు. పూర్తిగా వెల్లడించలేరు. ఎందుకంటే ఆ అనుభవం మీది కాదు.

నేను మీకు ఈ బొమ్మ చూపించి వివరిస్తున్నాను. మీరు దీనిని చూడగలిగితే, వినగలిగితే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు కూడా సత్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం. కాబట్టి మీరు మీ స్నేహితుడుకి ఒక ఆడియో సి.డి. ఇస్తే, అతను ఈ కార్యక్రమానికి రాకుండా దానిని వింటే, అతను విషయాన్ని ఎంతవరకూ అర్థం చేసుకోగలుగుతాడు. అదే విధంగా ఆ సి.డి. విని అందులో విషయాల మీద అతను వేరే వారికి ఉపన్యాసం ఇవ్వాలి అని అనుకుంటే అది ఎంతవరకూ కచ్చితంగా ఉంటుంది.

అదే విధంగా ఈ కార్యక్రమానికి రాకుండా దీనిని ఒక పుస్తకంలో లేదా ఆడియో సి.డి. ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటే అతనికి ఏమీ అర్థం కాదు. భగవద్గీత కూడా ఒక ఆడియో రికార్డు మాత్రమే. ఇది తిరిగి వ్రాయబడిన ఆడియో మాత్రమే. ఇది పూర్తి ఆడియో రికార్డింగ్ కూడా కాదు. మీరు ఆడియో రికార్డింగ్ని వింటే సత్యాన్ని ఎప్పటికీ వివరించలేము. సత్యాన్ని వెల్లడి చేయాలన్ను, వివరించాలన్న దాని అనుభవాన్ని పొందాలి. అయితే మేధస్సుతో అర్థం చేసుకోగలిగితే మనం సత్యం గురించి చేసిన నిర్ణయాలని బలపరచుకోవచ్చు. ఇది ఆధ్యాత్మిక అనుభవం కావాలి అనే కోరిక ఉన్నవారికి అవసరం.

ఇక్కడ భగవానుడు ఇలా చెప్పాడు : మయ్యావేశ్య మనో యేమా నిత్యా యుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపే తాస్తేమే యుక్తతమా మాతాః (12:2)

ఎవరయితే తమలోని అనుభవాల అనుభూతిని భక్తి రూపంలో వెల్లడి చేస్తారో దానికి ఉపయోగించిన పదం ‘ఉపాస్తే’. ఉపాసన అనే పదాన్ని చాలా విధాలుగా అనువాదం చేయవచ్చు. ఎప్పుడయితే ప్రతి ఒక్కరిలోనూ మీరు భగవంతుని చూడగలుగుతారో, ఎప్పుడయితే మీలోని ఆధ్యాత్మిక అనుభవాన్ని వెల్లడి చేయగలుగుతారో అప్పుడు మీరు ఏది చేసినా అది ఉపాసన.

స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు భగవంతుడిని అందరిలో చూడలేనప్పుడు మీరు భగవంతుడిని విగ్రహాలలో చూడలేరు. లేదా ఆయనని గురువులో కూడా చూడలేరు. కాబట్టి మీరు భగవంతుడిని ప్రతిప్రాణిలో చూడలేనప్పుడు మీరు సర్వాంతర్యామిని దేవుడిలో చూడలేరు గురువులో కూడా చూడలేరు.

ఒకసారి ఒక వ్యక్తి రామానుజులవారి దగ్గరికి వెళ్తాడు. రామానుజులు గొప్ప గురువు. అయితే ఆయన దృష్టిలో దక్షిణభారతదేశం పూర్తిగా ఆధ్యాత్మికతను కోల్పోతుంది. శంకరాచార్యులు ఉత్తర భారత దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు. ఆయన దక్షిణ భారతదేశంలో పుట్టి పెరిగినా ఎక్కువభాగం ఉత్తర భారతదేశంలోనే ఉన్నారు. రామానుజాచార్యులు మూలంగా ఆధ్యాత్మికత దక్షిణ భారతదేశంలోనే తిరిగి తన వైభవాన్ని తెచ్చుకున్నది. ఆయన చివరివరకూ దక్షిణభారతదేశంలోనే తాగవద్దు. మీరు ఒకరిపై ఒకరు సొంత అధికారులు కాదు.

మీలో చాలా మంది మీ భార్య లేదా భర్తతో ఏమి చెబుతారు. మీరు ఏం చెప్పాలను కుంటారో అది చెప్పేస్తారు. ఏమి అనాలనుకుంటారో ఆ మాట అనేస్తారు. అలా అనే హక్కు మీకు ఉన్నది అని అనుకుంటారు. ఎవరయినా ఆ హక్కు మీకు లేదు. అని అంటే మీరు చాలా బాధపడతారు. అవును కదా? లేకపోతే ఇలా అనుకుంటారు : ఇవే మాటలు కొత్తవారితో అనే ధైర్యం ఉంటుందా? లేదు మనం సమాజ మర్యాదలని పాటించాలి. కానీ ఆ మర్యాదలు భార్య/ భర్త విషయంలో వర్తించవు. దానికి మీరు చెప్పే కారణం మీరు వారిని ప్రేమిస్తున్నాను అని. మీలో ఎంతమంది మీ భార్యలతో మాట్లాడే మాటలో ఏభైశాతం ఏ నిబంధనలూ, షరతులూ లేని ప్రేమనుంచి వస్తున్నాయి అని చెప్పగలరు. మీ గుండె మీద చేయిచేసి చెప్పండి.

కానీ మీరు మీ భార్యని నిజంగా ప్రేమించగలిగినప్పుడే మీరు ఈ ప్రపంచాన్ని ఎలా ప్రేమించాలో తెలుసుకుంటారు. మన వివాహ పద్ధతిలో ఉండే మంత్రాలు, ప్రమాణాల ముఖ్య ఉద్దేశ్యం ఇదే. ఎందుకు వివాహ బంధాన్ని పవిత్ర బంధం అంటారు? ఎందుకంటే, ఇద్దరి మధ్య ప్రేమ బంధాన్ని సృష్టించి వారి మిగతా జీవితమంతా కలసిమెలసి ఉంటే అందులో వారు పొందే అనుభవాలు, అనుభూతులే సత్యం. కాబట్టి ఈ సత్యమే మిమ్మలని సర్వమానవులను ప్రేమించే దిశగా తీసుకువెళుతుంది. వారి ఇద్దరి మధ్య నిజమయిన ప్రేమ లేనప్పుడు,వారి ఇద్దరిలో ఏఒక్కరయినా సర్వమానవులకి ప్రేమించగలిగే విషయంలో ఎలా ప్రతిభ సాధించగలరు.

అటువంటి సచేతన స్థితిలో స్థిరపడి దానిని సర్వ విశ్వానికి వెల్లడి చేసే విషయంలో ఇద్దరూ ఒక్కటే. ఎప్పుడయితే ఒక వ్యక్తి దీనిలో ఐక్యమయిపోతాడో, ఎప్పుడయితే అతను దీనిలో స్థిరపడతాడో, అప్పుడు అతను అప్రయత్నంగానే ప్రేమని వెదజల్లలుగుతాడు. స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఎప్పుడయితే ప్రేమ అనేది జరగదో, ఎప్పుడుయితే దానిని వెల్లడి చేయలేరో, ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక అనుభవం కాలేదు అని అర్థం.

ఎప్పుడుయితే నిజమైన అనుభవం సంభవించుతుందో, అది అప్రయత్నంగానే వెల్లడి అవుతుంది. అనుభవం అనే దానిని మీరు స్వాధీనం చేసుకొని మీ బీరువాలో దాచలేరు. అనుభవమే మిమ్ములని స్వాధీనపరచుకుంటుంది. అది మిమ్ములని దాని లోపలికి ముంచి వేస్తుంది. అది ఎంపికలేని విధంగా పొంగి ప్రవహించుతుంది.

ఒక జెన్ బౌద్ధ గురువుని అతని శిష్యుడు ఈ విధంగా అడుగుతాడు గురుదేవా, జ్ఞానోదయమయిన వ్యక్తి మాట్లాడతాడా?

ఆ ప్రశ్నకు గురుదేవులు ఇలా చెబుతారు "లేదు. జ్ఞానోదయమయిన వ్యక్తి ఎప్పుడూ మాట్లాడడు. ఎవరికైతే ఏమీ తెలియదో అతనే మాట్లాడతాడు".

అప్పుడు శిష్యుడు ఇలా అడుగుతాడు " అంటే జ్ఞానోదయమయిన వ్యక్తి మౌనంగా ఉంటాడా?"

గురువు వెంటనే "లేదు. జ్ఞానోదయమయిన యోగి అసలు మౌనంగా ఉండలేడు. అతను అలా మౌనంగా ఉంటే స్పష్టంగా అర్థం చేసుకో, అతనికి జ్ఞానోదయం కలుగలేదు అని అర్థం.

శిష్యుడు చాలా అయోమయంలో పడిపోతాడు. "గురుదేవా! మీరు అతను మాట్లాడడు అంటున్నారు. అతను నిశ్శబ్దంగా ఉండడూ అని అంటున్నారు. మరి ఆయన ఏమి చేస్తాడు?

శిష్యుడి ప్రశ్నకు గురువు ఇలా జవాబు ఇస్తాడు " అతను పాట పాడతాడు. అతని ఉనికి మొత్తం పాడుతుంది. అతను మాట్లాడడు. అతను మౌనంగా ఉండడు. జ్ఞానోదయమయిన వ్యక్తి యొక్క ఉనికి మొత్తం ఒక సంగీత వాహినిలా సాగుతుంది".

నేను మీకు వారణాసిలో నివసించే ఒక భక్తుని కథ చెబుతాను అతను గొప్ప కృష్ణభక్తుడు. అతని దగ్గర చిన్న భగవద్గీత పుస్తకం ఉండేది. అదే ఆయన సర్వస్వం. అది ఆయనకి ఉన్న సర్వ సంపద. ప్రతిరోజు ఉదయం ఆయన గంగానదిలో స్నానం చేసి, ఆ తరువాత భగవద్గీతని చదివేవాడు. అలా శ్రీకృష్ణుని సందేశమయిన భగవద్గీతని భక్తి పారవశ్యంతో చదివే వాడు. ఆయన ఆ రోజంతా కూర్చొని శ్రీకృష్ణునిపైన ధ్యానం చేసేవాడు. అతను నిరంతరం శ్రీకృష్ణ భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఉండేవాడు. అతను కృష్ణ భక్తిని నిరంతరం వెదజల్లుతూ ఉండేవాడు. అతని భక్తి, ప్రేమ నిరంతరం కృష్ణుని వైపు ప్రవహించుతూ ఉండేది.

అయితే అటువంటి వ్యక్తులని మీరు భారతదేశంలోనే చూడగలరు. చాలామంది అలా కూర్చోని భక్తి పారవశ్యంలో పూర్తిగా నిమగ్నమయి పోయి ఉంటారు. సమాజం వారిని, వారి నిశ్చలతని భంగం చేయదు. ఎవరూ వారి జోలికి వెళ్లరు. వాళ్ళ బాగోగులు సమాజం చూసుకుంటుంది. అదే మరే దేశంలోనైనా అయితే వాళ్ళని అనాధలుగా గుర్తించి వాళ్ళని దానికి సంబంధించిన హోమ్స్ కి పంపించి వేస్తారు. వాళ్ళని సమాజం చిన్న చూపు చూస్తుంది. పోలీసులు, ప్రజలు వారిని అలా ఉండనీయరు. అయితే భారతదేశ సంస్కృతి చాలా అందమయినది అద్భుతమయినది. మీరు ఏమీ చేయకుండా అలా కూర్చున్నా భక్తి పారవశ్యంతో ఉన్నా మిమ్ములని గౌరవించుతుంది. మిమ్ములని ఆరాధిస్తుంది.

ఈ కృష్ణ భక్తుడు కృష్ణుని పేరు స్మరించూతూ, కృష్ణుని ధ్యానం చేస్తూ అటువంటి భక్తి పారవశ్యంలో ఉంటాడు. అతను నిరంతరం శ్రీకృష్ణుని పై ధ్యానం చేస్తూ, కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉంటాడు. అతను పూర్తిగా శ్రీకృష్ణుని సచేతన స్థితిలో తనను తాను పోగొట్టుకునేవాడు.

ఒకరోజు ఒక బిక్షగాడు అతని దగ్గరికి వచ్చి "స్వామీ! దయచేసి నాకు ఏమయినా ఇవ్వండి. నేను భోజనం చేసి మూడు రోజులయింది" అని అడుగుతాడు. భక్తునికి

భగవానుడు ఇలా కొనసాగిస్తాడు

యే త్వక్షర మ నిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ (12:3)
సన్నియ మ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః (12:4)

అర్థము: ఏ=ఎవరయితే : తు= కాని : అక్షరం = నాశనములేని : అనిర్దేశ్యం = నిర్వచించలేనిది (ఇది అని చెప్పలేనిది) : అవ్యక్తం = వ్యక్తం చేయలేని (వివరించలేని) : పర్యుపాసతే = ధ్యానించుచున్నారో, ఆరాధించుచున్నారో : సర్వత్రగం = అంతటా వ్యాపించినది : అచింత్యం = ఊహించలేనిది : చ = కూడా : కూటస్థమ్ = నిర్వికారమైనది : స్థిరమైనది : అచలమ్ = చలించనిది : ధృవం = స్థిరముగా ఉన్నది (నిత్యమయినది) :

సంనియమ్య = స్వాధీనపరచుకొన్నది : ఇంద్రియగ్రామమ్ = ఇంద్రియముల సమూహం : సర్వత్రా = అంతటా : సమబుద్ధి = సమాన భావము కల : తే = వారు : ప్రాప్నువువంతి = సాధించి : మామ్ = నేను : ఏవ = ఒక్కటే : సర్వభూత హితే = సమస్త ప్రాణులయందు మంచి చేయాలనే సంకల్పం కలవారు : రతాః = నిమగ్నమై ఉన్నారు.

ఎవరైతే నాశనం లేని పరబ్రహ్మను, నిర్వచింపలేని దానిని, ఇంద్రియ గోచరము కానిది, సర్వవ్యాప్తి అయినది, ఇది అని నిరూపింపలేని, స్థిరమైనది, మార్పు లేనిది, శాశ్వతమయిన పరబ్రహ్మను, ఎవరయితే ఇంద్రియ నిగ్రహముతో ఆరాధిస్తారో, ఎవరయితే నిష్పాక్షిక బుద్ధితో సర్వమానవాళి హితం కోసం పని చేస్తారో వాళ్ళు కూడా నన్ను పొందుతారు.

శ్రీకృష్ణుడు సగుణ బ్రహ్మ. అతను విశ్వం యొక్క భౌతిక రూపం. ఆ రూపాన్నే ఆయన విశ్వరూప సందర్భంలో అర్జునునికి చూపించుతాడు. కృష్ణుడు నిర్గుణ బ్రహ్మకూడా ఆయన రూపంలోని సచేతన స్థితి. ఆయన రూపంతోను, రూపంలేని స్థితిలోనూ ఆయన శ్రీకృష్ణుడే. ఆయన దైవమే. ఆయన దివ్య చేతనస్థితి గలవాడే. శ్రీకృష్ణుడు చెప్పిన అన్ని విషయాలు ఆయనలోనే ఉన్నాయి.

అక్షరం అంటే నాశనం లేనిది. అదే దైవత్వంలోని శాశ్వతత్వం. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి పదార్థం వస్తుంది,పోతుంది. కనిపించుతుంది. మాయమవుతుంది. కానీ దైవం, దివ్యత్వం శాశ్వతమైనవి. అవి ఎల్లకాలం ఉంటాయి. నిర్దేశ్యం అనేది చాలా ప్రత్యేకమైనది. దానిని మరి దేనితో కూడా పోల్చలేము. అది అత్యున్నతమైనది. అవ్యక్తం అంటే వ్యక్తపరచలేనిది. దానిని ఎవ్వరిచేత కూడా వ్యక్తపరచలేము. అచింత్యం అంటే ఒక వ్యక్తి యొక్క శరీరం, మైండ్ తనకు జరిగిన ఆధ్యాత్మిక అనుభవాన్ని దైవదర్శనాన్ని, దాని అనుభవాలని ఎందుకు వ్యక్తం చేస్తుందో అదే అచింత్యం.

సర్వ త్రాగం అంటే సర్వాంతర్యామి. అన్ని చోటులలో ఉండగలిగే దివ్యత్వం. దైవం లేని చోటు ఉండదు. ఆయన సర్వాంతర్యామి.

రాక్షసరాజయిన హిరణ్యకశపుని కుమారుడు ప్రహ్లాదుడు. అతను ప్రహ్లాదుని హరినామ జపం చేయవద్దని అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశపునితో “నారాయణుడు అన్ని చోటులలో ఉంటాడు. ఆయన ఈ కొమ్మలో ఉంటాడు, ఈస్తంభంలో ఉంటాడు” అని అంటాడు.

ప్రహ్లాదుడు ఈవిషయాన్ని చెప్పే సమయానికి శ్రీమన్నారాయణుడు, ఆయననే విష్ణుమూర్తి అని కూడా అంటాము, ఆయన వైకుంఠంలో లక్ష్మీదేవితో ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి చాలా హడావిడిగా బయలుదేరతాడు. అప్పుడు అందరు

ఒక గోపిక ఇలా చెబుతుంది "రాధా! నీకు ఉన్నది భక్తి. భక్తి నీకంటికి కాటుకలా ఉన్నది".

ఇది ఈ విధంగా ఉంటుంది. మీరు కళ్ళకి నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుంటే, సమస్తం మీకు నల్లగా కనిపిస్తుంది. అలాగే ఆకుపచ్చ అద్దాలు పెట్టుకుంటే అంతా ఆకుపచ్చగా ఉంటుంది. అదే విధంగా మీరు భక్తి అనే కాటుకని పెట్టుకుంటే, మీరు ఎవరిని చూసినా వాళ్ళు శ్రీకృష్ణునిలా ఉంటారు. అందరూ భగవత్ స్వరూపులుగానే అనిపించుతారు.

ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమి చెబుతాడంటే : ఎవరయితే అత్యున్నతమైన చేతన స్థితిలో స్థిరపడతారో,ఎవరయితే భక్తిని వెదజల్లుతుంటారో ఈ ఇద్దరూ ఒకటే. వాళ్ళు రెండు వేరు వేరు గ్రూపులు కాదు.

అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు రెండు గ్రూపులని తయారు చేయటంలేదు. అర్జునుడు తాను చూసిన నిజంని రెండు గ్రూపులుగా చెబుతున్నాడు. వాళ్ళే. ఒకరు చేతనస్థితిలో స్థిరపడిన వారు : ఒకరు భక్తిని ప్రేమని వెల్లడిచేసేవారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ ఇద్దరూ ఒక్కటే అని చెబుతున్నాడు. ఆయన వారిని రెండు గ్రూపులుగా చేయటం లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి.

శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు. ఎవరయితే చేతనస్థితిలో స్థిరపడతారో అతను ప్రేమని వెదజల్లుతాడు, అన్ని దిశలలో వ్యాపింపచేస్తాడు. భక్తుడు ఎవరయితే భక్తిని, ప్రేమని వ్యాపింపచేస్తాడో సచేతన స్థితిలో స్థిరపడతాడు. నేను ఇంతకుముందు చెప్పిన శాశ్వత ధర్మచక్రం ఇదే .

రామకృష్ణ పరమహంస ఇలా చెబుతారు. “ఎప్పుడయితే గంట కొడతామో ప్రతి గంటకీ దాని శబ్దం దానికి ఉంటుంది. అలా గంట కొట్టటం ఆపిన తరువాత కూడా ఆశబ్దం మనకి వినిపిస్తూనే ఉంటుంది. భగవంతుడు అదే విధంగా రూపంతోనూ, రూపం లేకుండా మనకి కనిపించుతాడు.

భజగోవిందంలో శంకరాచార్యులు ఈ విధంగా చెబుతారు.

గురుచరణాం భుజ నిర్భరభక్తా
సంస్కృత్ అచిరత్ భవముక్తా
సేంద్రియా మానస నియామత్ ఏవమ్
ద్రిక్షసి నిజ హృదయాత్యం దేవం

ఎవరయితే తన ఇంద్రియాలని నిగ్రహించుతాడో, తన మనస్సుని పూర్తిగా గురువు మీద కేంద్రేకరించుతాడో, ఎవరు పూర్తిగా గురువునకు ఆధీనమవుతాడో, అటువంటివ్యక్తి తన హృదయంలో భగవంతుని చూడగలుగుతాడు.

శ్రీ కృష్ణుడు ఇక్కడ మరొకసారి ఇలా చెబుతాడు. ఎప్పుడయితే రూపరహితమైన భగవంతుని శాశ్వతము, నాశనము లేని, నిర్వచించలేని భగవంతుని, ఇంద్రియనిగ్రహం కలవాడై తెలుసుకుంటాడో అతడు మానవుల మంచి కోసం పాటుపడతాడు.

రూపంలేని భగవంతుని యొక్క అనుభవం, రూపంతో ఉన్న భగవంతుని యొక్క అనుభవంలోంటిదే. రెండూ కూడా ఒకే సత్యం వైపు దారి తీస్తాయి. అదే సర్వ చేతనస్థితిలో ఒక భాగం

అలా తెలుసుకున్న విషయాన్ని వెల్లడి చేయటమే లోతయిన కరుణ, వినయం. ఇదే కృతజ్ఞత ఆధీనతారూపంలో ఉంటుంది. అప్పుడు అటువంటివారు విశ్వశక్తితోపాటు ముందుకు వెళ్ళగలుగుతారు. వారికి జీవితంలో ఎదురువచ్చే కెరటాలతో పోరాటం చేయవలసిన అవసరం ఉండదు.

చైనా తత్వవేత్త అయిన తావొ ఇటువంటి ప్రవాహం గురించి, ప్రవహించటం గురించి చక్కగా చెబుతారు. నీటిప్రవాహానికి తలవంచే నీటి మొక్క బ్రతుకుతుంది. చక్కగా ఎదుగుతుంది. నిటారుగా ఉండే మొక్క ప్రవాహ ధాటికి వంగిపోయి, ఇరిగిపోతుంది. అది చివరికి లేకుండా పోతుంది. మనం చిన్న నీటి మొక్కలా పూర్తిగా అధీనమయినపోయి మన చుట్టుప్రక్కల వాటిని యథాతథంగా స్వీకరించగలిగితే మనం ప్రకృతితో పోరాడవలసిన అవసరం ఉండదు. అప్పుడు మనం నిరంతరం శాశ్వతానందంలో ఉండవచ్చు

ఎప్పుడయితే మనం అహంకారంతో నిండి ఉంటామో, మనం నియంత్రణలో ఉన్నట్టు అనుకుంటాము. ఈ ప్రపంచంలోని అల్లకల్లోలాలని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలమని అనుకుంటాము. ఈ భూమి ఈ విశ్వం మొత్తం మనం లేకపోయినా వాటిపని అవి నిరాటంకంగా చేసుకు పోతాయి అనే విషయం తెలుసుకోవటానికి ఒక్క క్షణం చాలు. కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఈ విశ్వంలో స్పష్టమయిన అవ్యక్త స్థితిలో (కల్లోల స్థితిలో) పనిచేస్తున్నాయి. ఈ సమస్త విశ్వం నిరంతరం అవ్యక్తస్థితిలోనే ఉంటుంది.

అహంకారం నిండిన మనం ప్రతీదీ ఒక క్రమపద్ధతిలో ఉండాలి అని అనుకుంటాము. నిజానికి మనమే ఒక క్రమం లేని స్థితిలో ఉంటాము. అసలు సత్యమేమిటంటే మనమే కల్లోలంగా ఉంటాము. ఎప్పుడయితే మనం ఈ విశ్వశక్తికి అధీనమయిపోతామో, అప్పుడు మనం ఆ అవ్యక్తి స్థితిలో, ఆ కల్లోల స్థితిలో ఉండే అద్భుతమయిన క్రమ పద్ధతిని చూడగలుగుతాము. మనం ఎప్పుడయితే కోరికలని వదిలివేస్తామో, మనం కోరినవి పొందుతాము. మనం నిజంగా కోరుకున్నవి పొందినప్పుడు సర్వ మానవ జాతికి ఉపయోగపడగలుగుతాము. ఎందుకంటే మనం అధీనమయిపోయినప్పుడే శ్రీకృష్ణుడు మన బాధ్యత తీసుకుంటాడు.

ఇక్కడ శ్రీకృష్ణుడు మనలో చాలామంది సత్యం అనుకునే విషయం గురించి చెబుతాడు. తెలివితేటలు కలవారు భగవంతుని గ్రహించటానికి కష్టపడతారు.

ఒకసారి బ్రహ్మ, విష్ణువు వారిలో ఎవరు గొప్ప వారో తెలుసుకోవాలని అనుకుంటారు. వాళ్ళు ఇద్దరూ శివుడి దగ్గరకి వెళతారు. శివుడు లింగాకారంతో ఒక కాంతి పుంజంలా ఈ విశ్వమంతా వ్యాపించుతాడు. దానికి ఆది, అంతం ఉండవు. అప్పుడు శివుడు వాళ్ళతో " మీలో ఎవరయితే నా చివరలు కనుగొనలుగుతారో వారే గొప్ప వారు" అని అంటాడు

అప్పుడు విష్ణుమూర్తి వరాహరూపంలో భూమిని తవ్వుతూ శివలింగం యొక్క కాంతి పుంజం చివరి చూడాలని వెళతాడు. బ్రహ్మ హంస రూపంలో ఎగురుతూ పైభాగం చూడటానికి వెళతాడు. అలా చాలా సమయం గడిచాక విష్ణువు, శివుని అంతం కాని, ఆది కాని తెలుసుకోలేను అని అర్థం చేసుకొని శివుని దగ్గరకి వచ్చి క్షమాపణ కోరతాడు.

బ్రహ్మ అలా వెళుతూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు బ్రహ్మ ఒక పూవు క్రిందికి రావటం గమనిస్తాడు. అది ఏమిటో కనుక్కుంటే ఆ పూవు శివుని శిరస్సునుంచి పడినట్టుగా తెలుస్తోంది. ఆ పూవు అలా కొన్ని బ్రహ్మజీవితకాలాలపాటు పడుతూ ఉన్నది అని అర్థం చేసుకుంటాడు. అప్పుడు బ్రహ్మ శివుని తల చివరి వరకూ వెళ్ళలేను అని నిర్ణయించుకుంటాడు. అతను ఆ పూవుని తనతోపాటు శివుని దగ్గరకి బలవంతంగా తీసుకువెళతాడు. తాను ఆ పూవ్వుని శివుని తల పై నుంచి తెచ్చినట్టు దానికి ఆ పూవుని సాక్ష్యం చెప్పమని చెబుతాడు.

బ్రహ్మ ఆ పూవుతో పాటు శివుని దగ్గరకి వెళ్ళి ఈ కథ చెబుతాడు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివునికి కోపం వచ్చి అతని ఒక తలను తీసేస్తాడు. బ్రహ్మ పూజకి అనర్హుడని శపించి, ఆ పూవుని తన పూజకి పనిరావని శపించుతాడు. కాదు. ఆయన దృష్టిలో బాలుడయిన శ్రీరాముడే. అతను రామ్‌లాలకు స్నానంచేయించి, భోజనం పెట్టి ఆ విగ్రహంతో మాట్లాడుతుంటాడు. కొన్ని రోజులు రామకృష్ణ దగ్గర ఉన్న తరువాత ఆయనకి రామ్‌లాలా ఎక్కువ సమయం రామకృష్ణతో గడుపుతున్నట్టు తెలుస్తుంది. అతనికి కోపం వస్తుంది. ఆయన దక్షిణేశ్వరంలో చాలాకాలం ఉంటాడు. ఎందుకంటే రామ్‌లాలాకి రామకృష్ణ అంటే ఇష్టం కాబట్టి. జటధారి చివరికి ఒకరోజు రామకృష్ణని వదలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు. అతను రామకృష్ణతో “రామ్‌లాలా మీతో ఉండడానికి ఇష్టపడుతున్నానని చెప్పాడు. రామ్‌లాలా నిన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తృప్తిగా ఉన్నది. చివరికి రామ్‌లాలా నాకు కనిపించాడు. అది నీ వలన జరిగింది. రామ్‌లాలాని నీ దగ్గర వదిలివెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఎంతో పరమానందంలో ఉన్నాను ” అని చెబుతాడు. అప్పటినుంచి రామ్‌లాలా రామకృష్ణ దగ్గర ఉండిపోతాడు.

రామకృష్ణ పరమహంస ఎంతో సామాన్యస్థితిలో ఉంటూ, సమాధి స్థితిలో ఉంటూ గొప్పగొప్ప పండితులకి వారి అహంకారం వదిలే విధంగా చేయగలిగాడు. మైండ్ శరీర స్థితిలో అటువంటి వ్యవస్థలో అహంకారం వదలటం అనేది చాలా కష్టమయిన పని. ఇది ముఖ్యంగా ఎవరయితే తమ మేధస్సు మీద ఆధారపడతారో, తమ జ్ఞానం మీద కేంద్రీకరించి ఉంటారో వారికి అహంకారాన్ని వదలటం చాలా కష్టంగా ఉంటుంది.

శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతాడు :

యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే

తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్
భవామి న చిరాత్పార్థ మయ్యావేశిత చేతసామ్

అర్థం : ఏ= ఎవరు : తు = కానీ : సర్వాణి = సమస్తములుయిన : కర్మాణి = కర్మములు : మయి = నాయందు : సన్న్యస్య = సమర్పించి : మత్పరాః = నన్నే తమ అత్యున్నత గతిగా తలచి : అనన్యేన = పూర్తిగా నిలిపి : ఏవ = అయినా : యోగేన = యోగము చేత : మామ్ = నన్నే : ధ్యాయంతః = ధ్యానం చేస్తున్నారో: ఉపాసతే = ఆరాధించుచున్నారో

తేషామ్ = అట్టివారికి : అహమ్ = నేను : సముద్ధర్తా = రక్షించేవాడిని : మృత్యు సంసారసాగరాత్ = జనన మరణాలు అనే సముద్రం నుంచి: నచిరాత్ = శీఘ్రముగా: పార్థ = అర్జునా! మయి = నాలో: ఆవేశిత చేతసామ్ = ఉంచబడిన మనస్సు గల

అర్జునా! ఎవరయితే సమస్త కర్మలని నాయందే వుంచి, ఒకే ఆలోచనతో అనన్య చిత్తముతో నన్నే ధ్యానించి పూజించుచున్నారో, నన్నే పరమగతిగా తలచుకున్న వారై ఉన్నారో. ఎవరు నాయందు మనస్సు లగ్నం చేశారో అట్టి వారిని జనన మరణాల అనే సంసార సముద్రం నుంచి శీఘ్రంగా బయటకి తీసుకువస్తాను.

భగవానుడు ఇక్కడ ఒక ప్రమాణం చేస్తాడు.

శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయంగా, నిస్సందేహంగా ఇలా చెబుతాడు. నేను వారిని ఈ లౌకిక ప్రపంచం నుంచి విడుదల చేస్తాను. అదే సంసార సాగరం నుంచి, జనన మరణాల చక్రం నుంచి వారిని నేను బయటకి తీస్తాను.

ఇదంతా చేయటానికి ఆయన తన భక్తులని అడిగినది ఒక్కటే. వారువారిని తనకు సమర్పించుకోవాలి. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు. మీరు నాకు అధీనులయితే, మీరు చేసే పనులు (కర్మలు) వాటి ఫలితాలని కూడా నా అధీనం చేయండి. నా సేవ చేయండి. నా మీద ధ్యానం చేయండి. నా సచేతన స్థితి మీద ఒకే ఒక మనస్సుతో ఉండండి. నేను మిమ్మలని అన్నింటి నుంచి బయటకి తెస్తాను. మీకు ఈ చక్రబంధాలనుంచి స్వేచ్ఛని ఇస్తాను. మీకు మోక్షం ప్రసాదించుతాను. మీరు తిరిగి జన్మించకుండా చేస్తాను.

ఇది ఒక సింహగర్జన. ఇది ఈ విశ్వానికి మహారాజయిన వాని గర్జన. నాకు అధీనులకండి, బంధాల నుంచి విముక్తులని చేస్తాను. నన్ను సేవించండి మీకు స్వేచ్ఛని ప్రసాదించుతాను.

ఒక నాస్తికుడు, భగవంతుని మీద నమ్మకంలేని వ్యక్తి, ఒక లోయలోనికి పడిపోతాడు. అలా జారిపోతుండగా అతను ఒక చెట్టు వేళ్ళలో చిక్కుకు పోతాడు. అతను ఆ వేళ్ళను అతికష్టం మీద పట్టుకొని వేలాడుతుంటాడు. అప్పుడు అతనికి భగవంతుడు ఉన్నాడా అని నమ్మాలా, వద్దా అనే ప్రశ్న వస్తుంది. అతనికి ఇప్పుడు ఉన్న బలమయిన కోరిక బతకాలని, అతనిని ఎవరైనా రక్షించాలి. అప్పుడు అతను గట్టిగా ఇలా అరుస్తాడు. "భగవంతుడా నువ్వు ఉన్నది నిజమే అయితే నన్ను రక్షించు"

అతనికి జవాబుగా ఒక గొంతు వినిపిస్తుంది. "సరే. నేను ఉన్నాను. నేను నిన్ను రక్షించుతాను. నీవు ఆ చెట్టు వేళ్ళని వదిలివేయి. అప్పుడు నేను నిన్ను రక్షించుతాను. నేను నిన్ను పట్టుకుంటాను"

అప్పుడు నాస్తికుడు "అయ్యో! భగవంతుడా! నన్ను రక్షించటానికి ఇంకా ఎవరయినా ఉన్నారా?" అని అరుస్తాడు.

మనకి భగవంతుని మీద ఉన్న నమ్మకం పైపైనదే. అన్నింటికంటే కూడా మనలో చాలామందికి భగవంతుడు అంటే అదొక కల్పన, భావము. మనం ఆ భావననే ఆరాధించుతాము. మన ఆరాధనలో చాలా సమయం మనం అడిగే విషయం మీదనే ఆధారపడి ఉంటాము. మనం చేసే ప్రార్ధన. నాకు ఇది ఇవ్వు భగవంతుడా! నాకు అది ఇవ్వు ప్రభూ! మన ప్రార్ధనకి భగవంతుడు జవాబు ఇచ్చీ ఇవ్వగానే మరొకటి మొదలుపెడతాము.

మన ప్రార్థనలకి భగవంతుడు జవాబు ఇస్తున్నంతకాలం, మనం అడిగివన్నీ గురువులు నెరవేరుస్తున్నంతకాలం వారిమీద మన నమ్మకం అలానే ఉంటుంది. ఎప్పుడయితే మన ప్రార్ధనకి జవాబురాదో వెంటనే మన నమ్మకం కరిగిపోతుంది. అప్పుడు మనం మరొక దేవుడి వైపు వెళతాము. మరొక గురువు దగ్గరికి వెళతాము. మనం ఈ విధంగా అడుగుతాము. "ఇంకా అక్కడ ఎవరయినా ఉన్నారా? ఎవరయినా నా ప్రార్థనకి జవాబు ఇవ్వగలరా? నేను అడిగిన విధంగా చేయగలరా?"

మనం ఒక విషయం అర్ధం చేసుకోము. భగవంతుడు మన మీద అంతులేని కరుణతో, ప్రేమతో మన మంచి కోసం కొన్ని ప్రార్థనలకి జవాబు ఇవ్వడు. కానీ మనలోని అజ్ఞానంతో మనం అలా అడుగుతూనే ఉంటాము. అలా ఎటువంటి నిలుపుదలా లేకుండా బిక్ష అడుగుతుంటాము. మనం ఈ ప్రార్ధనలన్నింటికీ భగవంతుడు జవాబు ఇస్తే ఏమవుతుంది అని కనీసం ఆలోచించము. దీనివలన మన పరిస్థితి బాగుంటుదా లేకపోతే మనకి ఇంకా కష్టం వస్తుందా? అందుకే

రామకృష్ణ పరమహంస ఈ విధంగా చెబుతారు. మీరు భగవంతుని కానీ, గురుదేవుని కానీ స్మరించగానే మీ కళ్ళలో నీరు వస్తే, స్పష్టంగా తెలుసుకోండి, ఇది మీకు చివరి జన్మ అని, మీరు స్వేచ్ఛ పొందటానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం.

ఇక్కడ మనం సిద్ధంగా ఉన్నాము. కానీ స్వేచ్ఛని పొందలేము. ఆ స్వేచ్ఛ మనం మూడవదశకి చేరినప్పుడు దొరుకుతుంది. ఈ దశలో మనం మన స్పర్చేంద్రియాలని అధీనపరిచేస్తాము. ఈ స్థితిలో చేసే అధీనత సంపూర్ణ అధీనత. ఇది నిబంధనలు లేని, అప్రయత్నంగా, సహజంగా జరిగే అధీనత.

మహాభారతంలో వ్యాసుల వారు శ్రీకృష్ణుడు అర్జునిని గురించి ఒక సంఘటనని వివరించతారు.

కృష్ణుడు అర్జునుడు నడుస్తుంటారు. ఆకస్మాత్గా కృష్ణుడు చెట్టు మీద ఉన్న కాకిని చూపించి “అర్జునా! ఆ ఆకుపచ్చని కాకిని చూసావా?” అంటాడు.

అప్పుడు అర్జునుడు, “అవును కృష్ణా నేను ఆకుపచ్చని కాకిని చూసాను అంటాడు”.

వాళ్ళు ఇంకా కొంచెం ముందుకి వెళ్ళాక, కృష్ణుడు మరొక కాకిని చూపించి “అర్జునా! ఆ నల్లని కాకిని చూడు” అంటాడు.

దానికి అర్జునుడు, అవును కృష్ణా ! నేను నల్లని కాకిని చూసాను” అంటాడు. కృష్ణుడు అర్జునిని వైపు తిరిగి “అర్జునా! నీవు మూర్ఖుడివిగా ఉన్నావు. నేను నిన్ను తెలియయినావాడిని అని అనుకున్నాను. కాకి ఎలా ఆకుపచ్చగా ఉంటుంది? మొదటి నేను చూపించిన కాకి నల్లగా ఉన్నప్పుడు నీవు ఎలా దానిని ఆకుపచ్చ కాకి అని అన్నావు? నీవు నన్ను ఆనందపరచాలని చూస్తున్నావా?” అని అంటాడు.

The Song of God

ఈ ప్రపంచంలోని పరమానందాన్ని చూసే వరకు ఈ లోకాన్ని విడిచి పెట్టవద్దని ప్రజలకు నేను ఎల్లప్పుడు చెపుతూ ఉంటాను. పరమానందం వైపు పనిచేయండి, దాన్ని విడుచుట ఎప్పుడు చేయకండి. ఎప్పుడైతే పరమానందం తటస్థిస్తుందో పూర్తిగా విడిచిపెట్టడం అనేది తనంత తానే నీలో సంభవిస్తుంది.

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ
నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వం న సంశయః

అర్థం : మయి = నాయందు : ఏవ = మాత్రమే : మనః = మనస్సుని : ఆధత్స్వ = స్థిరముగా నిలుపు : బుద్ధిమ్ = బుద్ధిని : నివేశయ = ప్రవేశపెట్టు : నివసిష్యసి = నివసింపగలవు : మయి = నాయందు : ఏవ = మాత్రమే : అతః ఊర్థ్వమ్ = అటు పిమ్మట : న = లేదు : సంశయః = సందేహము

నాయందే మనస్సుని స్థిరముగా నిలుపు. నాయందే బుద్ధిని ప్రవేశపెట్టు. ఆ తరువాత నాయందే నివసించుతావు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు.

మీ మనస్సుని అత్యున్నతమైన విశ్వాత్మలైన నాలో నిమగ్నం చేయండి. మీ మనస్సు, శరీరం, స్పర్శేంద్రియాలు అన్నింటినీ నాలోనే స్థిరపరచండి. అప్పుడు మీరు నాలో నివసించుతారు. ఈ విషయంలో మీకు ఎటువంటి సందేహం వద్దు (స సమస్య)

ఇప్పుడు శ్రీకృష్ణుడు పద్ధతి దగ్గరకి వచ్చాడు. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ధర్మచక్రం ప్రారంభం కావాలి. ముందుగా ఆయన ధర్మచక్రాన్ని వివరించుతాడు. ఆ తరువాత పద్ధతిని చెబుతాడు.

ఒక విషయం అర్ధంచేసుకోండి. ప్రేమ అంటే ఒక మూడ్ mood కాదు. అది కేవలం ఒక భావావేశం కాదు. అది మీ ఉనికి. అది ఎంత కాలం ఒక మూడ్ ఉంటుందో అది వస్తుంది, పోతుంది. ప్రేమ రెండు రకాలు. సమాంతరపు (hori-zontal) ప్రేమ, ఊర్ధ్వ (లేదా) నిలువుగా ఉన్న (verticle) ప్రేమ.

దీనిని మీకు వివరించుతాను : సమాంతరపు ప్రేమ, సమాంతర రేఖలా అడ్డంగా ఉంటుంది. అది కాలానికి సంబంధించింది ఉంటుంది. అది ప్రారంభమవుతుంది. ముగిసిపోతుంది. స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఏదైనా ప్రారంభమైతే అది ముగిసి తీరుతుంది. అది ముగింపుకి రావటానికి ఎక్కువ సమయం పడితే దానిని శాశ్వతం అని అనుకోవద్దు. ఏదైనా ప్రారంభమైతే ముగిసితీరాలి. దానికి కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలూ పట్టవచ్చు. కానీ అది చివరికి వస్తుంది. అది శాశ్వతం కాదు. కాలపరిమితికి లోబడి ఉంటుంది. దీనినే సమాంతర ప్రేమ అనవచ్చు.

సమాంతర ప్రేమ కాలానికి సంబంధించిన ఉంటే, ఊర్ధ్వ ప్రేమ చేతనస్థితికి సంబంధించినది. ఈ ప్రేమ ప్రారంభంకాదు, ముగింపుకి రాదు. దీనికి వేరే భావం ఉండదు. ఇది మీ సహజలక్షణం. అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు పిల్లలు పెద్దవారికి లేదు అని చెప్పినపుడు వారు పెద్దవారయినట్లుగా అనుకుంటారు. ఇది చాలా సహజమయిన విషయం. లేదు అని చెప్పినప్పుడే మీరు ఒక వ్యక్తిని అని అనుకుంటారు. వాళ్ళు మీరు ఏమిచెబుతున్నారో పట్టించుకోరు. వాళ్ళకి తెలిసింది ‘లేదు’ ‘కాదు’ మాత్రమే. వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు. వాళ్ళు లేదు,కాదు అని చెప్పినప్పుడు చాలా బలవంతులు అయినట్టు అనుకుంటారు. ఈ కారణంమూలానే ప్రపంచంలో యువత ఎదిరిస్తూ ఉంటారు. అది తూర్పు లేదా పశ్చిమదేశాలు కానీ, ఏ సంస్కృతిలోనైనా యువకులు ‘లేదు’, ‘కాదు’ అని చెబుతారు. ఎందుకంటే వాళ్ళు లేదు, కాదు అని చెప్పినప్పుడే చాలా గొప్పవారిగా, శక్తికలవారిగా అనుకుంటారు. కాదు అనేమాట వాళ్ళకి చాలా శక్తిని ఇస్తుంది.

మీకు ఒక విషయం చెబుతాను. మీ ప్రేమ జెను అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు జెను, సరే అనే మాట వచ్చినంతకాలం మీ ప్రేమ కూడ సరే. ఎప్పుడయితే మీరు లేదు, కాదు అనే వాటిని వినవలసివస్తుందో అప్పుడు మీ ప్రేమ కూడా లేదు, కాదు అవుతుంది. ఎందుకంటే ఇది సమాంతర ప్రేమ. అది ఏదో ఒక కారణంతో ముగుస్తుంది. అదే ఊర్ధ్వ ప్రేమ అయితే దానికి చివరి లేదు. ఎందుకంటే దాని మొదలు ఉండదు. అది ప్రారంభం కాదు. దానిని మీరు అకస్మాత్గా గుర్తిస్తారు. మీరు ఎలా అయితే మీ శరీరంలో ఉన్నారో, అదేవిధంగా మీరు ప్రతి శరీరంలోనూ ఉన్నట్టుగా గుర్తిస్తారు. అదే ప్రేమ

ఉపనిషత్తులలో ఒక చక్కని ఉదాహరణ ఉన్నది. ఒక గురువుగారు తన శిష్యుడుని ఈ విధంగా అడుగుతాడు. నీవు నీ స్పర్సేంద్రియాలతో పూర్తిగా ఆనందాన్ని పొందుతున్నావా?" అని శిష్యుడు అవును అని సమాధానం చెబుతాడు. అప్పుడు గురువు ‘నీ స్పర్సేంద్రియాలలో ఒకదాని కోల్పోతే, నీకు అదే ఆనందం ఉంటుందా?’ అని అడుగుతాడు.

ఆ ప్రశ్నకి శిష్యుడు "లేదు. అది ఇరవై శాతం తగ్గుతుంది. అలాగే రెండింటిని కోల్పోతే నలభై శాతం ఆనందం తగ్గుతుంది " అని జవాబు ఇస్తాడు.

అకస్మాత్తుగా గురువు ఈ విధంగా అడుగుతాడు “ నీకు మరొక ఐదు స్పర్శేంద్రియాలు అదనంగా ఉంటే ఏమవుతుంది?”

అప్పుడు శిష్యుడు “సహజంగానే నా ఆనందం నూరుశాతం పెరుగుతుంది. అలాగే నాకు ఇంకొక శరీరం ఉంటే ప్రతీది రెట్టింపు ఆనందాన్ని పొందగలుగుతాను. లేదా నాకు ఐదు శరీరాలు ఉంటే ఐదురెట్లు ఆనందం పొందుతాను అంటాడు

మీరు ప్రపంచంలోని ప్రతి శరీరంలో జీవిస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు ఆ అనుభవం ఎంత ఆనందాన్ని ఇస్తుంది? మీకు ఎంత పారవశ్యం కలుగుతుంది. లెక్కకట్టలేనంత ఆనందం అది. అది శాశ్వతమైనది. అంతిమమైనది. అవును కదా!

ఈ ఆనందాన్నే జ్ఞానోదయమైన యోగులు పొందేది. వాళ్ళు ఈ విశ్వంతా ఉన్నారు అనే అనుభవాన్ని పొందుతారు. వాళ్ళు ప్రతి శరీరంలో ఉంటారు. అందుకే అద్భుతమైన పారవశ్యంలో ఉంటారు. వాళ్ళు శాశ్వతమైన నిత్యానందంలో ఉంటారు. అందుకే వాళ్ళు బయట ప్రపంచం నుంచి ఏమీ ఆశించరు.

ఒకసారి మా కార్యక్రమం అయిపోయాక ఒక పెద్దాయన నా దగ్గరకి వచ్చి, నాకు చాలా సానుభూతిని చూపించుతూ, 'అయ్యో! ఇంత చిన్న వయస్సులో మీరు యోగిగా అయిపోయారు. మీరు జీవితంలో చాలా కోల్పోయారు” అని అన్నాడు.

ఆయన తన జాలిని చూపించాడు. ఆయన నేను ఏదో కోల్పోయానను కుంటున్నాడు. నేను అతనితో ఇలా చెప్పాను “మీరు నా మీద సానుభూతి చూపించనవసరం లేదు. నిజానికి నేనే మీ పట్ల జాలి చూపించాలి. అరవై సంవత్సరాలు వయస్సు వాసనలూ ఆహారమే. మీరు ఆనందించే స్పర్శ ఆహారం. కాబట్టి మీరు ఐదు స్పర్శేంద్రియాల ద్వారా లోపలికి తీసుకునేవన్నీ ఆహారమే. అవి పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే మీరు స్వచ్ఛతని అన్ని వైపులకీ వెదజల్లగలుగుతారు. అప్పుడే మీరు పరమానందాన్ని, పారవశ్యాన్ని దివ్యమేధస్సుని వెదజల్లగలుగుతారు. దానిని అన్ని దిశలకూ వ్యాపింపచేయగలరు. అర్థం చేసుకోండి. మీరు మీ ఆహారాన్ని స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచకపోతే, మీకు కలిగే జ్ఞాపకాలను స్వచ్ఛంగా ఉంచలేరు.

నేను అదృష్టం కొద్ది పల్లెటూరులో పుట్టాను. ఆ రోజులలో అక్కడ టి.విలు లేవు. నన్ను కొంతమంది అడుగుతుంటారు. "స్వామీజీ, మీరు విషయాలని అంత త్వరగా ఎలా గ్రహించగలుగుతారు? " అని. మీకు ఒక విషయం చెప్పాలి. నేను రెండు సంవత్సరాల క్రితమే ఇంగ్లీషు మాట్లాడటం నేర్చుకున్నాను. నేను ఇంగ్లీషు చదివాను కానీ నా చదవంతా నా మాతృభాష తమిళంలోనే జరిగింది. నేను ఆగష్టు 2003లో మొదటి సారి అమెరికా వచ్చినప్పుడే ఇంగ్లీషు మాట్లాడటం మొదలుపెట్టాను.

అందరూ అడుగుతుంటారు. నేను అంత త్వరగా ఎలా నేర్చుకోగలిగాను అని. కొంతమంది అడుగుతుంటారు, మీరు అన్ని పుస్తకాలు అన్ని పేజీలు ఎలా చదవగలుగుతున్నారు అని. ఎందుకంటే నేను ఎప్పుడూ టి.వి. చూడను. టి.వి. తిన్నగా వెళ్లి మీ చేతనస్థితిని నాశనం చేస్తుంది. అర్థం చేసుకోండి. టి.వి. చూడటం వలన మీ కళ్ళని, మీ చేతన స్థితిని పాడు చేసుకుంటారు.

మీకు ఒక ముఖ్యవిషయం చెబుతాను. ఈ ఉదాహరణకి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు ఏదో కారు లేదా స్కూటర్ మీద ప్రయాణం చేస్తున్నారనుకోండి. మీరు గంటకి 40 మైళ్ళ స్పీడుతో వెళుతున్నారనుకోండి. మీర రోడ్డు మీద బోర్డులని, అన్నీ చూడవచ్చు. రోడ్డు మీద ఉన్న వాటినన్నింటినీ మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ఒక వేళ మీరు గంటకి 100 మైళ్ళ వెళుతుంటే, అంటే దొంగ మీ కాపలాదారుని చంపి నేరుగా మీ ఇంటిలోనికి ఎలా వస్తాడో అలా లోపలికి వెళ్ళిపోతుంది.

మరొక విషయం : సమాచారం నేరుగా మీకు చేరుతుంది. దాంతో మీరు తార్కికంగా ఆలోచించే శక్తిని పోగొట్టుకుంటారు. మీ భావావేశాలు కూడా అదుపు తప్పుతాయి. అకారలంగానే, సినిమాలో వాళ్ళు నటించుతున్నారు, అని తెలిసి కూడా వాళ్ళు ఏడిస్తే మీరు ఏడుస్తారు. ఆ పాత్ర చనిపోతే ఆ నటించే వాళ్ళు బతికే ఉన్నారని తెలిసి కూడా మీరు బాధపడతారు. అది నిజంగా జరగటం లేదు అని, అది అంతా నటన అని మీకు తెలుసు. అయినా వాళ్ళు నవ్వితే మీరు నవ్వుతారు. వాళ్ళు ఏడిస్తే మీరు ఏడుస్తారు.

అక్కడ జరిగే సీన్ ప్రకారం మీ మూడ్ కూడా మారిపోతూ ఉంటుంది. అక్కడ మానసిక వ్యధతో ఉన్న సీన్ వస్తే మీరు కుంగిపోతారు. ఎందుకు? మీరు చదువుకున్న వారు, అదంతా కేవలం నటన అని మీకు తెలుసు. అందులో నటీనటులు బ్రతికే ఉన్నారు అని తెలుసు. వాళ్ళని మీరు చూసి ఉంటారు కూడా. కానీ సినిమా చూసినప్పుడు మాత్రం మీరు బాధపడతారు ఎందుకు? ఎందుకంటే, సమాచారాన్ని విశ్లేషణ చేసే తర్కాన్ని మీరు పక్కన పెట్టేస్తారు. అది నిజమా, అబద్ధమా అనే విషయం విశ్లేషించే అవకాశం ఉండదు. సమాచారం తిన్నగా, మీలోనికి చేరిపోతుంది. అది మీ వ్యవస్థలోనికి చేరిపోతుంది. అది మీ అచేతన స్థితిని చేరుతుంది. అప్పుడు మీ అచేతన స్థితి దానితో ప్రభావితం అవుతుంది. అందుకే స్పష్టంగా తెలుసుకోండి. మీకు మానసిక వ్యధ కలిగించే ఏవీకూడా చూడకండి.

అలా కాకుండా సరదాగా ఉండి మీకు సంతోషాన్ని కలిగించి, మిమ్మలని నవ్వించే కార్యక్రమాలు చూడటం మంచిదే. అవి మిమ్మలని బాధపెట్టవు. అవి మీ చేతనస్థితిని డైరెక్ట్‌గా బాధించవు. కాకపోతే దీని వలన మీకు సమయం వృధా (టైం వేస్ట్)

74 వాసన వస్తుంది. అంతే కాదు చేతిలో మంటని పట్టుకున్న చేయి కాలదు. హిప్నటిజంకి చాలాశక్తి ఉన్నది. అంటే అర్థం ఏమిటంటే మీ అచేతనస్థితికి అంతశక్తి ఉన్నది అని. మీకు తెలియని అచేతనస్థితిలో మీకు దెయ్యాలు ఉన్నాయి అని చెబుతారు. అది హిప్నటైజ్ చేసినట్టుగా ఉంటుంది. దాంతో మీరు దెయ్యాలని చూడగలుగుతారు. అలా మీకు ఒకసారి అనుభవమైతే దానిని మీరు చాలా నమ్ముతారు. అదే ఒక దృఢమైన నమ్మకమైపోతుంది.

ఇంతకంటే కూడా బాగా కలవరపెట్టే విషయాన్ని కనుక్కున్నారు. అమెరికాలోనే, క్రిందటి దశాబ్దంలో పిల్లలు తల్లిదండ్రుల చేతిలో లైంగిక హింసకి గురి అయి కష్టాలు పడినట్టు బయటికి వచ్చింది. ఈ విషయాలని వాళ్ళు పెద్దవారయ్యాక (టీనేజ్ కి వచ్చాక) కనుగొనగలిగారు. ఇలాంటి విషయాలు హిప్నటిజం ద్వారా కనుక్కోగలిగారు. ఆ తరువాత పోలీసులు, అధికారులు ఈ కేసుల మీద కొంత పనిచేశారు.

అధికారులు, పోలీసులు కొంత పరిశోధనలు చేశాక అసలు అటువంటి హింస జరగలేదు, ఇవన్నీ కూడా తీర్పులని తామేచేసేసి దాని ప్రకారం పేషెంట్స్ ని ట్రీట్ చేసిన సైక్రియాటిస్టులు చేసిన పని. వాళ్ళే ఈ యువకుల మైండ్‌లోకి ఇటువంటి విషయాలని వెళ్ళేలా చేశారు అని తెలిసింది. మానసిక గాయాలని వ్యధని తమ చికిత్స ద్వారా బాగుచేయవలసిన సైక్రియాటిస్టులు, వాళ్ళని మరింత బాధలని గురిచేశారు.

మీరు దయ్యాల సినిమాలు, హార్రర్ సినిమాలు వరుసగా మూడు రోజులు చూస్తే, మీకు దయ్యాలు కనిపిస్తాయి. కిటికీలకి, గుమ్మంకి కట్టిన కర్టెన్ కదిలినా అది దయ్యంలా కనిపిస్తుంది. మీ భార్య గదిలోనికి వస్తున్నా, దెయ్యం లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది. దీని గురించి మీరు దెయ్యాల సినిమాలు చూడనవసరం లేదు. ఎందుకంటే మీ చేతనస్థితిలో మీరు ఈ విషయంలో కలతతో ఉంటారు. సరే! మీ ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అవి నిజంగా ఉన్నా మీరు వాటికి భయపడనవసరం లేదు. అవి మీకంటే తక్కువ ప్రాణులు. మీకంటే చాలా తక్కువ దశలో జీవించే జీవాలు. ముందుగా చెప్పాలి అంటే అసలు అవిలేవు. మనవాదనకి అనువుగా ఉంటుంది అని అవి ఉన్నాయి అని అనుకున్నా, అవి చాలా చిన్న ప్రాణులు. మనకంటే శక్తిలేనివి. అందుకే మీరు వాటిని చూసి భయపడనవసరం లేదు. స్పష్టంగా అర్థం చేసుకోండి. దెయ్యాలతో మాట్లాడటం, మీడియాలద్వారా ఆత్మలతో మాట్లాడటం, చనిపోయిన మీ బంధువులతో మాట్లాడటం, ఇవన్నీ కేవలం కథలే. ఒక కథ పుడుతుంది దాని మీద మరొక కథ అల్లుతారు. ఆ తరువాత ఇంకొక కథ. ఇది కేవలం కల్పన.

ఒక చిన్న కథ :

ఒకామె ఆత్మలతో మాట్లాడించే మీడియం దగ్గరికి వెళ్ళి కొద్దికాలం క్రితం చనిపోయిన ఆమె భర్తతో మాట్లాడాలనుకుంటుంది. ముందు ఆ మీడియం ఎదురు చూస్తుంది. గొణిగినట్టు వస్తుంది. ఆ తరువాత మాట్లాడటం మొదలు పెడుతుంది.

ఆమె అడుగుతుంది "ఏమండీ! మనకి డబ్బులు ఇవ్వవలసిన వారి వివరాలు చెప్పండి. మీరు డబ్బు ఎక్కడ ఎక్కడ పొదపు చేశారో పెట్టుబడి పెట్టారో చెప్పండి" అంటుంది.

ఆమె భర్త జవాబు ఇస్తాడు " మన పాలుపోసే అతను మనకి ముప్పై అయిదువేలు బాకీ ఉన్నాడు"

ఆమె ఇలా అడుగుతుంది "ఇంకా ఎవరు ఇవ్వాలి"

మీడియం ఇలా చెబుతుంది. "నేను రెండు లక్షలు మన బ్యాంక్లో డిపాజిట్ చేశాను దానిని తీసుకో మన ప్రక్కింటి వాళ్ళు మనకి లక్షరూపాయలు ఇవ్వాలి. అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకో". కొంతమంది నన్ను అడుగుతుంటారు “స్వామీజీ ఇన్ని విషయాలని మేము ఎలా గుర్తుపెట్టుకోగలం, వాటిని ఎలా సాధన చేయగలం”అని నేను మీకు చెబుతున్నాను. ఈ విషయం గురించి మీరు అసలు పట్టించుకోవద్దు. కేవలం వినండి, అది చాలు. నేను ఈ మాటలని, మీకు నా అనుభవంతో చెబుతున్నాను. అవి సహజంగానే మీ అంతరంగంలోనికి, మీ ఉనికిలోనికి జొచ్చుకుని పోతాయి.

మీకు అవసరం కలిగినప్పుడు మీరు వీటిని గుర్తుపెట్టుకోనవసరం లేదు. ఆ మాటలే మిమ్మలని గుర్తుపెట్టుకుంటాయి. మీరు గుర్తుంచుకోవాలి అని అనుకోవద్దు. అవే మిమ్మలని గుర్తుంచుకుంటాయి. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవే మీ దగ్గరకి వస్తాయి. అవి మీ చేతనస్థితిలో స్థిరపడతాయి, అవసరమైనప్పుడు పైకి వస్తాయి. అవి మీకు మార్గాన్ని చూపించుతాయి. కాబట్టి మీరు ఏమీ చేయనవసరం లేదు. కేవలం వినండి. మీ అంతరంగం నుంచి, మీ ఉనికి నుంచి వినండి. ఈ మాటలని పదే పదే వినండి. అప్పుడు సహజంగానే మీ చేతనస్థితి భగవంతునిలో స్థిర పడిపోతుంది.

శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు : మీ మనస్సుని (మైండ్) పూర్తిగా నాలో నిమగ్నం చేయండి. మీ పూర్తి ఏకాగ్రతని నా మీద చూపండి. ఎటువంటి సందేహం లేకుండా మీరు నిత్యానంద స్థితికి చేరతారు అని.

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ

అభ్యాసే 'ప్యసమర్థో 'సి మత్కర్మపరమో భవ
మదర్థ మపి కర్మాణి కుర్వన్ సిద్ధిమ వాప్స్యసి

అర్థం : ధనంజయ = అర్జునా : అథ = ఇక (అయితే) : చిత్తం = మనస్సును : సమాధాతుం = నిలుపుటకు : న=లేదు : శక్నోషి = శక్తుడువు (చేయగలవాడవు) మయి = నాయందు : స్థిరమ్ = స్థిరముగా : అభ్యాసయోగేన = యోగ సాధనలో : తతః = అప్పుడు : మామ్ = నన్ను : ఆప్తుమ్ = పొందుటకు : ఇచ్చ = కోరుము

అభ్యాసే = చేయుటయందు : అసమర్థః = అసి = సమర్థత లేనివాడైన చో : మత్కర్మ = నాపని : పరమః = ఆసక్తి కలవాడవై, అధీనుడవై : భవ = అగుము : మత్ అర్థం = నా కొరకు : అపి = అయినా : కర్మాణి = పనులు : సిద్ధమ్ = చక్కగా : అవాప్స్యసి = పొందగలవు.

ఓ అర్జునా! ఒక వేళ ఆ ప్రకారం మనస్సుని నాయందు స్థిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో యోగమును క్రమం తప్పకుండా సాధన చేసి నన్ను పొందుటకు ప్రయత్నించుము. ఒక వేళ అభ్యాసము చేయుట యందును నీకు శక్తి లేకపోయినచో నాకు సంబంధమైన పనులు చేయుట యందు ఆసక్తి కలవాడివై వాటిని నా అధీనము చేయి. ఆవిధంగా నీవు సిద్దిని సాధించగలవు.

అంటుంది. ఆమెకి ఆ బాబు అంటే చాలా ఇష్టం. అప్పుడు రామకృష్ణ ఆమెని ఆ బాబు మీద ఏకాగ్రత నిలపమని, అతనిపైనే ధ్యానం చేయమని చెబుతాడు.

ఆమె కొన్ని వారాలయిన తరువాత రామకృష్ణ దగ్గరికి వస్తుంది. ఆమె చాలా సంతృప్తిగా ఉంటుంది. ఆమె తాను చాలా ఇష్టపడే ఆ చిన్న బాబు మీద ధ్యానం చేయటం మొదలుపెడుతుంది. అప్పుడు ఆమె బాగా ధ్యానం చేయగలుగుతుంది. ఒక్కసారి ఆమె ధ్యానం చేయగలను అనుకున్న తరువాత ఆమె ఏకాగ్రతని కాళీ మాతపైన పెట్టగలుగుతుంది. ఇప్పుడు కాళీమాత మీద ఆమె ధ్యానం చేయగలుగుతుంది.

మన మైండ్ మంచి శిక్షణని ఇవ్వగలము. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏకాగ్రతని నిలపగలగటం. ఒక్కసారి మనం మన ఏకాగ్రతని ఏదో ఒకదానిమీద పూర్తిగా నిలపగలిగితే, అప్పుడు మైండ్ ని ఒకే ఒక పాయింట్ మీద ఉంచవచ్చు. దానిని ఒక లేజర్ కిరణంలా ఉపయోగించవచ్చు. లేజర్ కిరణాన్ని ఒక దాని నుంచి మరొకదాని మీదకి చాలా సులభంగా ఒకే పద్ధతిలో చాలా చక్కగా విజయవంతంగా మార్చవచ్చు.

వివేకానందుడు ఈ విధంగా చెబుతాడు. “ఒక్కసారి మీరు మీ పూర్తి ఏకాగ్రతని నిలిపి గుప్పెడు మట్టి గురించి తెలుసుకోగలిగితే, అప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్న మట్టి గురించైనా తెలుసుకోగలుగుతారు”.

ఏదైనా ఒకపనిలో ఒకటి సాధించాలి అని అనుకుంటే దానికి క్రమశిక్షణ, సాధన అవసరం. మనం మన ప్రతి లక్ష్యానికి, మన ప్రాపంచిక లక్ష్యాల కోసం ఇదే పద్ధతిని అనుసరించగలిగితే మనం మన ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం కష్టాలు బాధలు అనుభవిస్తాము. మనం ఏమనుకుంటామంటే ఆధ్యాత్మిక అనుభవం దానంతట అదే వస్తుందని అనుకుంటాము. ఇప్పుడు మీరు భగవంతుని మాటలు విన్నారు కదా! అది అలా జరగదు అని.

శ్రీకృష్ణుడు ఈ సందర్భంగా ఏమని చెబుతాడంటే, నిరంతరం క్రమం తప్పకుండా ధ్యానం చేయటం ద్వారా మైండ్‌ని నియంత్రించవచ్చు. ధ్యానం యోగాలో ఒక సాధన పద్ధతి. ధ్యానం అంటే ప్రతిరోజూ కళ్ళుమూసుకొని అరగంట సేపు కూర్చోవటం కాదు. ఇలా ప్రతిరోజూ కానీ, లేదా మనకి టైం దొరికినపుడు కానీ చేయటం కాదు. ధ్యానం అంటే పూర్తిగా భగవంతుని మీద స్థిర భావంతో నిరంతరం ధ్యానం చేయాలి. ధ్యానమే జీవితం కావాలి.

శ్రీకృష్ణుడు ధ్యానాన్ని మనకి ఒక మార్గంలా చెప్పాడు. మనం మన మనస్సుని అతనిపైన (భగవంతుని) ప్రేమతో భక్తితో హృదయపూర్వకంగా నిలపలేకపోయినప్పుడు ధ్యానం అనేది ఒక ప్రత్యామ్నాయ పద్ధతిగా మనం ఎంచుకోవాలి. ఆయన ఏమని చెబుతాడంటే మీ మనస్సుని నాపై స్థిరపరచలేకపోతే, దీనిని ప్రయత్నించండి. ధ్యానం ద్వారా నాలో కలిసిపోవటానికి పదే పదే ప్రయత్నించండి.

ఈ రెండు పద్ధతులూ కూడా సాధ్యం కాకపోతే, భగవానుడు మనకి మరొక పద్ధతిని చెబుతాడు. నీవు ఏది చేయగలిగితే అది చేయి. నీవు చేయవలసిన పనులు, నీవు చేయగలిగిన పనులు నీవు చేయి. అయితే నీవు చేసే పనులన్నీ నా అధీనం చేయి. నీవు ఏం చేశావో, ఏమి చేస్తున్నావో నాకోసం చేయి.

మనం పూర్తి విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో ఆయనకి సంపూర్తిగా లోతుగా అధీనమయిపోయిన భావంతో పనులు చేస్తే, మనం ఆయనని చేరగలం.

శ్రీకృష్ణుడు ఇలా చెప్పటంలో రెండు విషయాలు ఇందులో ఉన్నాయి. మొదటిది ఏమిచేసినా అది ఆయనకి అధీనులమ్మేయ్యే దృక్పథంతో చేయాలి. మనం చేసే అన్ని పనుల ఫలితాలు ఆయనకే చెందుతాయి. మన బాధ్యత కేవలం చేయటం. చేసే పనిని బాగా చేయటం మన బాధ్యత. మనకి ఉన్న హక్కు కేవలం పనిచేయటమే మరింకే ఆలోచనా ఉండేవి కావు. వాళ్ళు ప్రార్థన చేసినా పాటలు పాడినా వారి మనస్సు, హృదయం వారి అంతరంగం అన్నీ పూర్తిగా వారు అనుభవిస్తున్న ఆనందంలో కలిసిపోయేవి. వాళ్ళు అంతరంగంలో రూపంలేని భగవంతుని రూపాన్ని చూడగలిగే వారు. రాతివిగ్రహాలు, పంచ లోహ విగ్రహాలు వారితో మాట్లాడేవి. అది వారిలో ఉండే చేతనస్థితి.

మనం పూజలు, ప్రార్థనలు చేసే సమయంలో ఏమవుతుంది? మన పూజ మొత్తం యాంత్రికంగా తయారవుతుంది. ఈ మహాత్ముల విషయంలో వారుచేసే పని ప్రార్థన, పూజ అయ్యేవి. పూజలు, వ్రతాలు చేసే వారిని గమనించండి. త్వరగా పూర్తి చేసేయాలి అనే ఆతృత కనిపిస్తుంది. తొందరగా పూర్తి చేసి వెళ్ళాలి అని ఉంటుంది. వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి? భగవంతునికి దూరంగా ఎక్కడకి వెళ్ళగలుగుతారు.

ఇటువంటి పూజల దగ్గర మనకి మోసగాళ్ళు, కపటమైనవారు కనిపిస్తుంటారు. వాళ్ళ దృష్టిలో పూజలు, ప్రార్థనలు అనేవి వ్యాపార వ్యవహారాలు. భగవంతుడు అంటే అమ్మకానికి పెట్టిన వస్తువు. వాళ్ళు వ్యాపారవేత్తలు. వాళ్ళ దృష్టి అంతా హుండీలో ఎంత డబ్బులు వచ్చాయి అనే విషయం మీదే ఉంటుంది. స్వర్గం అనే మహా సామ్రాజ్యం, ఆర్థికస్థితి వ్యాపారం, మొదటి తరగతి రేట్లతో వస్తుంది అని అనుకుంటారు. మీరు జాగ్రత్తగా ప్రయత్నించితే స్వర్గానికి వెళ్ళటానికి ఉండే రేటులో డిస్కౌంట్ కూడా దొరుకుతుంది.

బాలీ ద్వీపంలో ప్రజలు హిందూ మతాన్ని అనుసరించుతారు. వాళ్ళకి కులవ్యవస్థ కూడా ఉన్నది. అయితే పూజారి మాత్రం జన్మతః బ్రాహ్మణ కులంలో జన్మించడం వలన పూజారి అవ్వడు. పూజారి అవ్వాలంటే దానికి తగిన యోగ్యతని పొందాలి. ఆ ద్వీపంలో ప్రజలకి భగవంతుని ఆరాధించటమే జీవితం. ప్రతి ఒక్కరూ, స్త్రీ, సేవ చేయమన్నాడు. ఆయన మనందరినీ తన లక్ష్యం వైపుగా పనిచేయమన్నాడు. అయిన ఈ విధంగా చెబుతాడు "మీరు చేసే ప్రతి పని నా తరుపున చేయండి. అప్పుడు మీరు నన్ను పొందుతారు".

నేను ఎప్పుడూ చెబుతుంటాను. నేను మీతో భౌతికంగా ఉన్ననా లేదా అని ఆలోచించకండి. మీరు నా సమక్షంలో లేము అని బాధపడకండి. నేను మిమ్ములని వదిలి వేరొక చోటికి వెళ్ళేటప్పుడు కలత పడకండి. దుఃఖపడకండి. మీరు నావెంట పడితే మీరు నాతో ఎప్పుడూ ఉండలేరు.

మీరు నాలక్ష్యం వైపు పనిచేయండి. నా మిషన్ కోసం పనిచేయండి. మీరు ఏవిధంగా చేయగలిగితే ఆవిధమయిన పనులు అందరి మంచి కోసం చేయండి.నా తరుపున పనిచేయండి. అప్పుడు మీరు నాకోసం రానవసరం లేదు. నేనే మీ కోసం మీ వెంట వస్తాను. నేను నిరంతరం మీతోనే ఉంటాను.

భగవంతుని లక్ష్యసాధనకోసం పనిచేయండి. మీరు తప్పకుండా భగవంతుని చేరలుగుతారు.

శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా ప్రత్యామ్నాయాలని ఇస్తాడు. ఒకదాని తరువాత ఒకటి, ఇది కాకపోతే అది, ఇలా ఎన్నో చెబుతాడు. అర్జునుడి ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో శ్రీకృష్ణుడు చూపించే కరుణ, దయ హద్దులు లేనివి. నీవు ఈ విధంగా చేయలేవా! సరే అయితే ఆవిధంగా చేయి. లేదా కనీసం ఈ పద్ధతిలో చేయి. ఇలా చెబుతూనే ఉంటాడు. చివరి నాలుగు శ్లోకాలలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా ప్రత్యామ్నాయాలు చెబుతూనే ఉంటాడు.

కృష్ణుడు ఇలా మొదలుపెడతాడు. నీ మనస్సుని నా యందు మాత్రమే స్థిరపరచు నాలో జీవించు. ఒక వేళ అర్జునుడు ఈ పని చేయలేకపోతే అనుకొని అర్జునుడికి మరొక పద్ధతి చెబుతాడు. నీవు నాయందు నీ ఏకాగ్రతని, నీ మనస్సుని నిలపలేకపోతే, దానిని తిరిగి పదే పదే సాధన చేయి. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెబుతాడు. ఒక వేళ నీవు పదే పదే సాధన చేయలేకపోతే ఇది నీకు కష్టం అనిపించితే, అప్పుడు నా మిషన్ పని, నా లక్ష్యసాధనకి కృషి చేయి. నీవు ఏమి చేసినా నా కోసం చేయి.

ఇప్పుడు కృష్ణుడు ఇలా చెబుతాడు. ఒకవేళ ఇది చేయటం కూడా నీకు సాధ్యం కాకపోతే, అంటే నాఅక్ష్యసాధనకి పనిచేయలేకపోతే అప్పుడు కనీసం నీ అహంకారాన్ని వదిలి నీవు చేసే పనుల ఫలితాలని నాకు వదిలివేయి.

కృష్ణుడు అర్జునుడికి అతని దృష్టిలో చెప్పే విషయమేమిటి అంటే, కేవలం కృష్ణుని పనుల మాత్రమే చేయాలి అని. ఇక్కడ శ్రీకృష్ణుడు అనుకునేది ఏమిటంటే, ఏవో కొన్ని పరిస్థితుల మూలంగా అర్జునుడు తన సమయాన్ని మొత్తం కృష్ణుని పనికి కేటాయించలేకపోవచ్చు. బాధపడుతూ అయినా లేదా అపరాధ భావంతో అయినా అనుకుంటాము. మనలో ఉండే అహంకారం మనలని బాధ్యులని చేస్తుంది. మనం మనకి మనం చేసే పనులలోను, వాటి ఫలితాలలో మాత్రమే గుర్తించగలుగుతాము. విజయము, అపజయము అనేవి మన విషయంలో గొప్ప తేడాని చూపించుతాయి. ఎదుటివారు మనని చూసే విధానంలో కూడా ఆమార్పు చాలా తేడాతో ఉంటుంది. దానితో మన సంబంధాల విషయంలో మనకి ప్రాపంచకమయిన కీర్తి ప్రతిష్ఠల విషయంలోనూ ఆ భేదం కనిపిస్తుంది. దానిని మనం అలానే అన్వయించు కుంటాము.

ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు. నేను నీకు చెప్పినవన్నీ చేయలేకపోతే, కనీసం ఇదయినా చేయి. నీ అహంకారాన్ని వదిలివేయి నీవు చేసే పనుల ఫలితాలని వదిలివేయి. వీటనన్నింటినీ నాకు వదిలివేయి.

భగవానుడు మనకి ఇచ్చిన సలహాల ఫలితంగా మనం పొందే స్వేచ్ఛ నిజమయిన స్వేచ్ఛ. ఎప్పుడయితే ఈ విషయాన్ని మనం తెలుసుకుంటామో ఇక మనం మన గమ్యానికి అధికారులం కాదు. మనం చేసే పనుల ఫలితాలని నిర్ణయించే అధికారులం కాదు. మనం మన భుజాల మీద బరువుని తీసేసిన అనుభూతిని పొందుతాము. ఇప్పుడు మనం చేసే పనుల ఫలితాలకు బాధ్యత తీసుకునేది భగవంతుడే. మనం కేవలం పనులు చేసే వారమే, కాని వాటిపైన అధికారులం కాదు.

మీరు ఈ విషయంలో కొంత ఆశ్చర్యపోవచ్చు. ఈ ప్రపంచంలో, మనిషిని మనిషే దోచుకునే ప్రపంచంలో, అత్యంత పోటీ ఉండే ఈ పోటీ ప్రపంచంలో (రాట్ రేస్) ఇటువంటి దృక్పథంతో మనం ఎలా ఉండగలం? అని అనుకోవచ్చు.

గుర్తుంచుకోండి. మీరు ఈ రాట్ రేస్‌లో గెలిచినా మీరు రాట్(ఎలుక) గానే మనమే బాధ్యులం అని నేర్పించినది.

మనం ఈ విశ్వంలో ఉన్నాము. ఆ విశ్వశక్తి మనపై అంతా ఆవరించి ఉన్నది. ఆ శక్తి లేకపోతే మనం శ్వాసించలేము. జీవించలేము. ఆ ప్రాచీన శక్తికి మనం ఆధీనులం కాకుండా మనం ఏమీ సాధించలేము "నాకు ఏది మంచిదో అదే చేయిప్రభూ"! అని మీ సచేతన స్థితి నుంచి, తెలుసుకొని చూడండి. చివరికి మీకు భౌతికమయిన లాభాలు కలగటమే కాదు,మీకు గొప్ప ఆధ్యాత్మిక స్వేచ్ఛ మీనుంచి వస్తుంది. నాకు ఆధీనులవ్వండి అని భగవంతుడు చెబుతాడు. నాకు ఆధీనులవ్వండి మీకు స్వేచ్ఛని ఇస్తాను.

భగవాన్ శ్రీకృష్ణుడు చాలా సూచనలని ఇస్తాడు. ఒకదాని తరువాత ఒకటి ఒక క్రమ పద్ధతిలో మనకి చాలా అవకాశాలు ఇస్తాడు. ఇది కేవలం అర్జునునికి మాత్రమే కాదు, అన్ని రకాల వ్యక్తులకి రకరకాల మనస్తత్వాలకి ఇస్తాడు.

భగవాన్ రమణమహర్షి జీవితం నుంచి మీకు ఒక కథ చెబుతాను.

ఒక వ్యక్తి భగవానుని దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు. "భగవాన్ నేను ఏవిధమైన ఆధ్యాత్మిక పద్ధతిని ఉపయోగించాలి" అని.

దానికి రమణమహర్షి "ఆత్మ విచారణ చేయి. నిన్ను నీవు ఈ విధంగా ప్రశ్నించుకో, నేను ఎవరిని?" అని అతనితో చెబుతాడు.

కొన్ని రోజులు గడిచాకా ఆ వ్యక్తి తిరిగి భగవానుని దగ్గరకి వచ్చి "స్వామీ! ఆత్మ విచారణ చాలా కష్టంగా ఉన్నది. నేను కేవలం ధ్యానంచేయగలనా" అని అడుగుతాడు. దానికి భగవానుడు "సరే! ధ్యానం చేయి" అని అంటాడు.

మరొక వారం గడిచాక ఆ వ్యక్తి రమణ మహర్షి దగ్గరకి తిరిగి వచ్చి "ధ్యానం చేయటం కూడా చాలా కష్టంగా ఉన్నది. నేను ఏదయినా జపం చేయవచ్చునా. అంటే ఏవైనా మంత్రాలని - స్తోత్రాలని పదే పదే జపించటం భగవానుడు "సరే! అలాగే చేయి", అని అంటాడు.

మరి కొన్ని రోజులు గడిచాక ఆ వ్యక్తి తిరిగి మహర్షి దగ్గరికి వచ్చి "భగవాన్! జపం చేయటం కూడా కష్టంగా ఉన్నది. నేను ఏదైనా పూజ చేయవచ్చునా! పూజలు వ్రతాలు ఇటువంటివి చేయనా?" అతని ప్రశ్నకి రమణమహర్షి "సరే! అలాగే చేయి" అని అంటాడు.

మరలా కొన్ని రోజులు గడిచాక ఆ వ్యక్తి తిరిగివచ్చి "భగవాన్ ! పూజలు చేయటం కష్టంగా ఉన్నది. నేను కేవలం గుడికి వెళ్ళితే సరిపోతుందా" అని అడుగుతాడు. అప్పుడు భగవాన్ ఇలా అంటారు. "సరే! నీకు ఏది చేయాలనిపించితే అది చేయి".

మహా యోగులు, గురుదేవులు ఎవరికీ కూడా ఆధ్యాత్మిక ద్వారాలు మూయరు. అర్థం చేసుకోండి. వాళ్ళు మనకి చాలా అవకాశాలు ఇస్తారు. ఇక్కడ ఈ నాలుగు శ్లోకాలలో శ్రీకృష్ణుడు అందరికీ ఎన్నో అవకాశాలని ఇచ్చాడు.

ఇదంతా అర్థం చేసుకోవాలంటే మీరు దేనినైనా అప్రయత్నంగా చేయగలగాలి. అప్రయత్నపూర్వకంగానే మీరు ఈ నాలుగు సూచనలని పాటించగలుగుతారు. ఉదాహరణకి మీకు ధ్యానం చేయాలనిపించటం లేదనుకోండి, మీ మూడ్ సరిగా లేదనుకోండి అప్పుడు ఒక గదిలో తలుపులు వేసుకొని, కళ్ళు మూసుకొని ధ్యానం చేయటానికి బలవంతంగా ప్రయత్నించవద్దు.

అలా బయటకి వెళ్ళండి లేదా గుడికి వెళ్ళండి, స్వేచ్ఛగా, విశ్రాంతిగా నడవండి. ఎటయినా తిరగండి. అలా చేయటం వలన మీరు కొంత విరామస్థితిలోనికి వెళతారు. అప్పుడు మీరు ధ్యానంలోనికి వెళ్ళగలుగుతారు. ధ్యానం చేయగలుగుతారు. మీరు అలా కూడా చేయలేకపోతే ఇంకా ఏదైనా చేయండి. ఏదైతే మీకు విరామాన్ని ఇస్తుందో, మీకు హాయిగా అనిపిస్తుందో ఆపని చేయండి. ఆ తరువాత ధ్యానం చేయండి.

ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి దశలవారిగా, ఒకదాని తరువాత ఒక దశగా చాలా సూచనలని ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం అంతిమమయినది, చివరి దశ అయిన విశ్వచేతనస్థితిలో స్థిరపడే దశ. అదే నిత్యానందస్థితి. కానీ మీరు ఏదో ఒకటి చేయలేకపోయాము అని అన్నింటినీ వదిలివేయకండి. ఏదో ఒకదానిని ప్రారంభించండి.

చాలా మంది ధ్యానం గురించి, ఆత్మసాధన గురించి మాట్లాడటం విన్నాను. వాళ్ళు అన్నీ చాలా కష్టతరమయిన పనులు గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. అయితే దానిని నిజంగా చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం, ధ్యానం గురించి ఆలోచించినప్పుడు మాత్రం వాళ్ళు చేస్తున్న పూజలు మిగతా జపాలు అన్నీ మానేస్తారు. చివరికి వారు ధ్యానం కూడా చేయలేరు.

వాళ్ళని మీరు'ధ్యానం ఎందుకు చేయటం లేదు' అని అడిగితే, వాళ్ళు ఇలా అంటారు "స్వామీ! ఎందుకంటే నాకు టైం లేదు. నా మనస్సు దేనిమీద ఏకాగ్రతని నిలుపలేకపోతున్నది. నిశ్శబ్దంగా కూర్చోలేకపోతున్నాను” ముందుగా వాళ్ళు ధ్యానం చేసే నెపం మీద చేసే పూజలు అన్నీ మానేస్తారు. ఆ తరువాత ధ్యానం చేయటాన్ని మానేస్తారు. దీనికి మాత్రం చాలా కారణాలు చెబుతారు. అప్పుడు వాళ్ళకి అదీ వుండదు. ఇదీ ఉండదు. శ్రీకృష్ణుడు అది మనకి జరగకుండా చూస్తున్నాడు. అందుకు మీరు అప్రయత్నత్వం ఉండాలి. ఆ నిమిషంలో ఏది చేయాలో అది మీరు చేయగలగాలి.

నేను ఎప్పుడు అప్రయత్నం అనే మాటని ఉపయోగించినా నాకు సంఘటన గుర్తుకు వస్తుంది. ఇది మా ఊరిలో జరిగిన సంఘటన. మా ఊరు చాలా చిన్నది. ఇప్పుడు జిల్లాకి హెడ్క్వార్టరు అయింది. అక్కడ ప్రతి సంవత్సరం మహాభారత కథని చెప్పేవారు. ఇండియాలో పల్లెటూరులలో ప్రతి సంవత్సరం మహాభారతం కథని చెబుతారు. అలా చేస్తే సమయానికి వర్షాలు పడతాయి అని వాళ్ళ నమ్మకం. అందుకే మహాభారత కథని చెబుతారు. అలాగే ఉత్తర భారతదేశంలో భాగవతాన్ని చెబుతారు. దక్షిణ భారతదేశంలో రామాయణాన్ని కానీ, మహాభారత కథ కాని చెబుతారు.

మా ఊరిలో సంవత్సరానికి ఒకసారి మహాభారత కథని అరవై రోజులపాటు చెబుతారు పగలు కథ చెబుతారు. రాత్రి పూట చిన్న చిన్న నాటకాలు వేస్తారు. ఆ ఈ నాటకంలో దుశ్శాసనుడు చీరలు లాగేటప్పుడు వాటిని లెక్కపెట్టటం మరిచిపోయాడు. అతను ఆరు చీరలు లాగి స్పృహ తప్పి పడిపోవాలి. ద్రౌపది కృష్ణుని రక్షించమంటే కృష్ణుడు వస్తాడు. కానీ చీరలు లెక్కపెట్టడం మర్చిపోయి దుశ్శాసనుడు ఏడవ చీర కూడా లాగేస్తుంటాడు. ద్రౌపది పాత్రదారి అతనికి ఆ విషయం చెప్పటానికి ప్రయత్నిస్తాడు. "ఇది ఏడవ చీర! ఇది ఏడవ చీర' అని సైగ చేస్తుంటాడు, దుశ్శాసనుడికి అది అర్థం కాదు. అతను ద్రౌపది బాగా నటిస్తుంది అని అనుకుంటాడు. అలా అని చీరలాగుతుంటాడు.

అప్పుడు అకస్మాత్తుగా ద్రౌపతి దుశ్శాసనుడిని కొడతాడు. 'నా చీర వదుల, నా చీర వదులు " అని ద్రౌపతి పాత్ర వేసిన వ్యక్తి దుశ్శాసనుడి మీదకి దాడి చేస్తాడు. నాటకం చూస్తున్న మా అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఉదయం చెప్పిన కథ ఒక విధంగా ఉన్నది ఇక్కడ నాటకం మరో విధంగా ఉన్నది. ఆరవ చీర లాగగానే దుశ్శాసనుడు పడిపోతాడు. ద్రౌపతి కృష్ణుని పిలుస్తుంది. కృష్ణుడు స్టేజి మీదకి రావాలి.

అక్కడ కృష్ణుడు పాత్ర వేసిన వ్యక్తి ద్రౌపతి పిలుపు కోసం ఎదురు చూస్తూ బీడీ కాలుస్తుంటాడు. అతను స్టేజి వెనుక ప్రక్క ఉన్నాడు. కానీ ద్రౌపతి గట్టిగా ఏ! దుశ్శాసనా ఈ చీర తీయుకు, అని అరుస్తుంటుంది. దుశ్శాసనుడికి అర్ధం కాదు. ద్రౌపతి అతనిని కొడుతుంది. అయినా అర్థం కాదు. అతనికి చాలా కోపం వచ్చి చీర మొత్తం లాగేస్తాడు.

అప్పుడు ద్రౌపతి ప్రాతధారి స్టేజిమీద సగం ఆడ సగం మగ వేషంలో ఉంటాడు. పైన జాకీటు, కింద ఫాంటుతో స్టేజి మీద నిలబడతాడు. వెంటనే ద్రౌపతి పాత్ర వేసిన వ్యక్తి సమయస్ఫూర్తితో “ హే కృష్ణా! నీవురాలేకపోయినందుకు నన్ను మగవాడిగా మార్చి నా గౌరవాన్ని కాపాడావా!” అని గట్టిగా అంటాడు.

ఈ విధంగా ద్రౌపతి దుశ్శాసనుడు, కృష్ణుడు చేసిన తప్పులని కొంత సమయస్ఫూర్తితో కవర్ చేయగలిగాడు. అయినా కృష్ణుడు ఇంకా స్టేజి మీదకి రాకుండా ద్రౌపతి పిలుపుకోసం చూస్తుంటాడు.

మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించగలిగితే మీరు చాలా విషయాలని నియంత్రించగలరు. చాలా సంఘటనలతో జాగ్రత్తగా వ్యవహరించగలరు. నాకు సమయస్ఫూర్తి అనే మాట గుర్తు రాగానే ఈ కథ గుర్తు వస్తుంది.

నిజానికి సమయస్ఫూర్తి ఒక ఆధ్యాత్మిక లక్షణం. ఎవరైతే తన పాత జ్ఞాపకాలలో చిక్కుకుపోరో అతనే సమయస్ఫూర్తిగా, అప్రయత్నంగా ఉండగలడు. మీ పాత నిర్ణయాల మీద ఆసక్తి లేకపోతే అంటే మీరు గతంలో చేసిన తప్పులని పూర్తిగా తెలుసుకొని వాటిని ఇప్పటి కాలానికి అనుగుణంగా సరియైన పద్ధతిలోనికి మార్చుకోగలిగితే, అప్పుడు మీరు అప్రయత్నంగా, సమయస్ఫూర్తితో ఉండగలరు.

అలాకాకుండా మీకు మీ గతం మీద చాలా అభిమానం ఉండి ఉంటే, అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఇలా అనుకోవచ్చు. “అబ్బే! అసలు కుదరదు. నేను ఇన్ని సంవత్సరాలు ఈ విధమైనయిన నమ్మకంతో ఉన్నాను. నేను ఈ విషయాన్ని ఇంతకాలం ఇలాగే అర్థం చేసుకున్నాను. ఈ రోజు ఏదో చెప్పారు కదా అని నేను ఎందుకు మారాలి. నేను మారను. మారలేను. నేను ఎట్టిపరిస్థితిలో కూడా మారను. గత ఎభై ఏళ్ళుగా నేను ఈ నమ్మకం మీదే బ్రతికాను. ఇప్పుడు మారటం నా వల్ల కాదు” అలా అనుకుంటే మీరు ఎప్పటికీ సమయస్ఫూర్తిగా, అప్రయత్నంగా ఉండలేరు. అప్పుడు మీరు జీవితంలో చాలా పొగొట్టుకుంటారు. చాలా భయంకరంగా జీవితంలో చాలా పొగొట్టుకుంటారు.

స్పష్టంగా అర్థం చేసుకోండి. మీ జీవితం యొక్క నాణ్యతని మీరు ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవచ్చు. ఎంతకాలం మీరు మారే కాలానికి అనుగుణంగా మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూంటారో అంతకాలం మీరు వివేకంతో ఉన్నట్టే. అలా ఆధునికరించటం ఆపేస్తే దానిని తెలివితేటలు అంటారు. అది వివేకం కాదు. వివేకం జీవంతో ఉన్న శక్తి

సంస్కృతంలో ‘ధీ’ అనే పదం ఉన్నది. దాని అర్థం జీవించి ఉన్న అని. సంస్కృతంలో ‘ధీ’ అంటే వివేకం అని కూడా అర్థం. ‘ధీ’ అంటే శక్తి : జీవించిఉన్న శక్తి. అది నిరంతరం తనని తాను అభివృద్ధి పరుచుంటూ ఉంటుంది. గాయత్రిమంత్రం అనేది హిందూ మతంలోని ఆరాధనలో ముఖ్యమైనది. అది భగవంతుని మనం ప్రాధన చేసేటప్పుడు మనని అభివృద్ధి చేయమని అడగటం.

ఎప్పుడైతే మీకు మీ గతం మీద ఆసక్తి ఉండదో, మీరు గతంలో చేసిన నిర్ణయాల గురించి ఆలోచించరో అలాగే మీ గత జీవితం ఎలా గడిచిందో అనే విషయాన్ని పట్టించుకోరో, అప్పుడే మీరు సమయస్ఫూర్తితో అప్రయత్నత్వంతో ఉండగలుగుతారు. సమయస్ఫూర్తి గొప్ప ఆధ్యాత్మిక విలువ కలిగినది.

సమయస్ఫూర్తి గురించి మీకు మరొక సంఘటనని చెబుతాను.

ఒకసారి, నేను ఈశావాస్య ఉపనిషత్తు మీద మాట్లాడుతున్నాను. అప్పుడు ఒక పెద్దాయన కూడా వచ్చాడు. చూడటానికి పండితుడిలా ఉన్నాడు. ఆయన హాలులోపలికి వచ్చాడు. నేను మాట్లాడటం పూర్తి కాగానే, కనీస మర్యాద అయినా లేకుండా ఏదో అడగటం మొదలుపెట్టాడు. అతను నిలబడి "ఈ తెలివితక్కువ వాళ్ళు ఏమీ చదవలేదు. దాంతో నీవు ఏవి చెబితే అది వింటారు. కానీ నాలాంటి పండితుణ్ణి నీవు చెప్పేది వినేలా చేయలేవు" అని అన్నాడు.

అప్పుడు నేను "సార్! కొంచెం దగ్గరకు రండి. మీరేమంటున్నారో నాకు వినపడటం లేదు " అన్నాను.

ఇప్పుడు మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, క్రింది స్థాయిలో ఆగిపోకూడదు. ఎప్పుడూ ఉన్నతస్థితికి వెళ్ళటానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మీరు ఉన్నతస్థితికి వెళ్ళలేరో, కనీసం తక్కువస్థాయిలోనైనా ఉండండి. అంతేకానీ ప్రయత్నాలు మాత్రం ఆపకండి. నన్ను ఒకరు ఈవిధంగా అడిగారు “స్వామీజీ, మనకి ఇండియాలోనూ, తూర్పు దేశాల మతాలలోనూ ఎందుకు ఇంతమంది దేవుళ్ళు ఉంటారు”? అని

తూర్పుదేశాల మతాలలో చాలామంది దేవుళ్ళుంటారు. మీరు హిందూమతం, బౌద్ధమతం లేదా జైనమతం చూడండి. అన్నింటిలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలామంది ఋషులు, యోగులు, గురువులు ఉంటారు. అదే పశ్చిమ దేశాల మతాలలో ఒక్కడే దేవుడు.ఎందుకు?

ఈ సందర్భంగా వివేకానందుడు ఆయన ప్రవచనాలలో చాలా చక్కగా చెప్పారు. “స్వేచ్ఛ అనేది అభివృద్ధికి చాలా అవసరమయిన విషయం. ఇది ఏరంగమయినా సరే. ఎక్కడయినా అభివృద్ధి ఉన్నది అంటే అక్కడ స్వేచ్ఛ ఉన్నది అని అర్థం.

తూర్పుదేశాల వారికి అంతరంగ ప్రపంచానికి సంబంధించి పూర్తి స్వేచ్ఛ వున్నది. మీ మతాన్ని ఎవరూ భంగపరచరు. ఏ ఆధ్యాత్మిక పద్ధతి అనుసరించాలి అనేది పూర్తిగా మీ నిర్ణయమే. అందుకే మనకి ‘ఇష్టదేవత’ అనే పద్ధతి ఉంటుంది. ఇష్టదేవతా అంటే భగవంతుణ్ణి మీకు ఇష్టమయిన మీ మనస్సుకి సరిపోయే రూపంలో పూజించవచ్చు. కొన్ని పురాణాలలో మొత్తం ముప్పయి మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెప్పబడి ఉంటుంది. నిజానికి, నేనే మనుకుంటానంటే బహుశః అప్పటి జనాభా ముప్పై మూడు కోట్లు ఉండవచ్చు. అంత మందికి ఎవరికి ఇష్టమయిన రూపంలో వారు ఆరాధించి ఉండవచ్చు. అదే పురణాలు ఇప్పుడు వ్రాస్తే వారిని ఆరువందల కోట్ల దేవుళ్ళు అని చెప్పేవారేమో, ఎవరికి ఇష్టమయిన ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు , కొన్ని లక్షల విషయాలు వెల్లడి చేయబడు తున్నప్పుడు, అక్కడక్కడా కొన్ని నల్లటి మచ్చలు ఉంటాయి. మూఢ విశ్వాసాలు ఆధ్యాత్మిక రంగంలోనేకాదు శాస్త్ర విజ్ఞానంలో ఇంత కంటే ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికరంగంలో కనీసం స్వార్ధమనేది ఉండదు. వారు ఏదయినా ఒక సత్యాన్ని ప్రకటించారు అంటే అందులో వారికి స్వార్థపూరిత కోరికలు ఉండవు. ఇలా చేయటం వలను యోగులకి గురువులకి వారి వ్యక్తిగత జీవితాలలో ఎటువంటి లాభమూ ఉండదు. వాళ్ళు ఆ మామూలు భోజనమే చేస్తారు. మామూలుగా సామాన్యంగా ఉండే ఏదో రెండు ముక్కలుగా ఉండే బట్టలు చుట్టుకుంటారు. వారి జీవితాలలో ఎటువంటి మార్పూ ఉండదు.

అయితే శాస్త్రజ్ఞుల విషయంలో, వారు ఏదైనా ఒక సత్యాన్ని ప్రకటించిత్ అదే వారికి పేరు ప్రతిష్టలని తెస్తుంది, ధనం ఐశ్వర్యాలనిస్తుంది. వారి జీవితాల్లోనికి ఎన్నో సౌకర్యాలు వస్తాయి. కాబట్టి సహజంగానే వారిలో స్వార్ధం ఉంటుంది. యోగులు, ఆధ్యాత్మిక గురువులు ఎంత ఎక్కువగా ప్రాపంచిక విషయాలని వదిలివేయగలిగితే,అంత ఎక్కువగా వారు సౌకర్యాలని వదిలివేస్తారు. వారు ఎంత సౌకర్యాలు వదిలివేస్తే,అంత ఎక్కువ గౌరవం పొందుతారు. కాబట్టి సహజంగానే వారు ఎన్ని సత్యాలు చెప్పినా వారి వ్యక్తిగతజీవితంలో పెద్ద మార్పు ఉండదు. వారి పరిశోధనలు వారి జీవితాలకి కొత్తగా ఏమీ సమకూర్చవు. వారు పొందే గౌరవం వారి జీవన పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. కాని వారు చెప్పే మాటల మీద కాదు.

శాస్త్రజ్ఞుల విషయంలో వారు పొందే గౌరవం వారు చెప్పే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి శాస్త్ర విషయంలో నల్ల మచ్చలు (బ్లాక్ షీప్) ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒకరో ఇద్దరో మోసగాళ్ళు ఉన్నంతలో మతపరమైన స్వేచ్ఛ తప్పు అని అనటం, ఆధ్యాత్మిక స్వేచ్ఛ సరియైన పద్ధతి ఇవ్వలేదు. ఒక వేళ ఒక విషయాన్ని వాళ్ళు స్వీకరించితే సరే. లేకపోతే వారు మతాన్ని వదిలేస్తున్నారు. అంతే.

తూర్పు సంస్కృతుల వారికి చాలా అవకాశాలని ఇచ్చారు. ఒక వ్యక్తి మేధస్సు మీద ఏకాగ్రత ఉండి దానిని అభివృద్ధి చేయాలి, అంటే శివుడిని పూజించుతారు. వాళ్ళు నిరంతరం ధ్యానం చేస్తుంటారు. మరొకరు భక్తి మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటే విష్ణుమూర్తిని ఆరాధించుతారు. ఈ మార్గంలో వెళ్ళేవారు పాటలు పాడతారు. నాట్యం చేస్తారు. చైతన్య ప్రభు, మీరాబాయి ఇటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. భగవంతుని వైభవాన్ని భక్తితత్వంతో అద్భుతంగా పాడతారు. తమిళనాడులోని ఆళ్వార్లు అనే యోగులు విష్ణుభక్తులు. వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. యోగా మార్గాన్ని ఎంచుకున్నవారు దేవిని పూజిస్తారు. ఆమెపై ధ్యానం చేస్తారు. వాళ్ళు పూజలు చేస్తారు. తాంత్రికాన్ని సాధన చేస్తారు.

ఇక్కడ ఈ విధంగా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీకు తిరిగి మళ్ళీ మళ్ళీ ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి.మీకు సంప్రదాయమయిన పద్ధతులు, మార్గాలు ఉన్నాయి. అవి మీ వ్యక్తిగతమైన అభివృద్ధికి సహాయపడతాయి. కాబట్టి సహజంగానే ఒక మార్గాన్ని ఎన్నుకొని అందులో అత్యున్నతస్థాయికి చేరవచ్చు. ఇక్కడ అన్నిరకాల, అన్ని సైజులలో నిచ్చెనలు దొరుకుతాయి. అన్ని రకా మెట్లు ఉంటాయి. మీకు నిరంతరం అవకాశాలు ఇవ్వబడతాయి. కాబట్టి సహజంగానే ప్రతి ఒక్కరూ ఏదో ఒకదానిని ఎంచుకుంటారు.

తూర్పుదేశాల వారు ఎంతో అన్వేషణ చేశారు. మన అంతరంగ ప్రపంచం లోతుల్లోనికి అన్వేషణలు చేసి పరిశోధనలు చేశారు. పశ్చిమదేశాలవారు సమాజపరంగా చాలా సాధించారు. ఎందుకంటే వారికి స్వేచ్ఛ ఉన్నది. ఇండియాలో ఆ స్వేచ్ఛ లేకపోవటం వలన చాలా పోరాడవలసి వచ్చింది, కానీ వాళ్ళు చాలా అద్భుతాలని ఆధ్యాత్మిక స్వేచ్ఛ ద్వారా సాధించగలిగారు. మనం ఏక్షణాన్ని తప్పించలేము. దానినే మనం అర్ధం చేసుకోవాలి. నేను చెప్పే జ్ఞానం అంటే ఇదే. జీవితంలో తప్పించుకోలేనివాటిని అర్ధం చేసుకోవటం, పరిష్కారాల జ్ఞానాన్ని పోగుచేసుకోవటం, అటువంటి క్షణాలని జాగ్రత్తగా నియంత్రించటానికి అవసరమైన పరికరాలని సమకూర్చుకోవటం దీనినే నేను జ్ఞానం అంటాను. మనం ఇటువంటి భూకంపాల కిట్టుని మన జీవితం కోసం ఏర్పరచుకోవాలి.లేకపోతే మనం వాటి నుంచి విజయవంతంగా బయటపడలేము.

ఆ తరువాత ఫలితాలు భయంకరంగా ఉంటాయి. భయంకరమైన తుఫాను గురించి మనం తయారుగా లేకపోతే ఆ తరువాత జరిగే విషయాలు భయంకరంగా ఉంటాయి. ప్రజలు చాలా పోరాడవలసి ఉంటుంది. అది చాలా కష్టం. అదే విధంగా మన అంతరంగంలో వచ్చే భూకంపాలు, తుఫానులకి మనం తయారుగా లేకపోతే ఆ తరువాత జరిగే పరిణామాలు చాలా కష్టంగా ఉంటాయి. వాటిని మనం సంభాళించలేము. అందుకే ఆ తరువాత జరిగే పరిమాణాలకి మనం ముందుగా సిద్ధమవ్వాలి.

తూర్పుదేశాలలో ప్రజలు వారి అంతరంగంలో వచ్చే తుఫానులకి నిరంతరం తయారవుతుంటారు. అక్కడ వచ్చే భూకంపాలని జ్ఞానం అనే భూకంప కిట్టుతో సిద్ధంగా ఉంటారు. మనం అంతరంగంలో వచ్చే భూకంపాలని సిద్ధపడే కిట్టునే జ్ఞానం అంటాము. ప్రస్తుతం ప్రజలు ఎంతో అభివృద్ధి సాధించారు. వారు అంతరంగ ప్రపంచం, బయట ప్రపంచం అని వేరువేరుగా ఎంపిక చేసుకోవనవసరంలేదు. మీరు మీ కారులో బయట ప్రపంచానికి సంబంధించిన భూకంపాల కిట్టు పెట్టుకోవచ్చు. మీ హృదయంలో అంతరంగపు భూకంపాల కిట్టుని అమర్చుకోవచ్చు. మీరు ఇదా, అదా అని ఒకదానినే ఎంపిక చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఈ రెండింటినీ ఉంచుకోవచ్చు.

ఒకసారి నన్ను ఒక వ్యక్తి ఇలా అడిగాడు “స్వామీజీ! బుద్ధుడు పదివేలమందికి జ్ఞానోదయం కలిగేలా చేశాడు. మరి మీ లక్ష్యం ఏమిటి? అని” నేను చెప్పాను. న్యూస్ పేపర్లు, టెలిగ్రాంలు, ఫోనులు, ఇంటర్నెట్, విమానాలు ఇవేమీ లేని రోజుల్లోనే బుద్ధుడు పదివేలమందికి జ్ఞానోదయాన్ని కలిగించగలిగితే మనం ఇన్ని సౌకర్యాలని ఉంచుకొని కనీసం పదిలక్షల మందికైనా జ్ఞానోదయం కలిగించాలి. అప్పుడే ఈ సౌకర్యాలని కలిగి ఉండటంలో అర్థం ఉంటుంది.

ఇప్పుడు మీకు అన్నీ ఉండవచ్చు. మీకు బయట ప్రపంచం ఉంటుంది. మీ అంతరంగ ప్రపంచం ఉంటుంది. మీకారులో ఒక భూకంపపు కిట్టు, మీ హృదయంలో అంతరంగపు భూకంప కిట్టు పెట్టుకోవచ్చు. మన అంతరంగంలో వచ్చే భూకంపాలని తేలికగా తీసుకోవద్దు.

అంతరంగపు భూకంపాలని తేలికగా తీసుకుంటున్నారు అంటే దాని అర్థం మీరు అజ్ఞానంతో పనులు చేస్తున్నారు అని. అంటే మీరు చాలా పెద్ద సమస్యని ఆహ్వానిస్తున్నారు అని అర్థం. దానికి సరిపడే విధంగా మీరు తయారూగా ఉండటం లేదు. స్పష్టంగా తెలుసుకోండి. బయటప్రపంచంలో భూకంపమొస్తే మీరు ఎవరో ఒకరిని నిందించవచ్చు. వారిని బాధ్యులని చేయవచ్చు. గవర్నమెంటుని, అధికారులని, రాజకీయనాయకులని ఇలా అందరినీ బాధ్యులని చేయవచ్చు. కానీ మీ అంతరంగపు ప్రపంచం విషయానికి వస్తే, మీరు బయటవారిని నిందించలేరు. మీరే బాధ్యత తీసుకోవాలి.

ఇంతకుముందు అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు.

ఉద్ధరేదాత్మనా త్మానం నాత్మానమవసాద యేత్
ఆత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మనః

ఉన్నత స్థితికి చేరటానికి నీకు నీవే సహాయం చేసుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నీవు అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేసుకుంటావో అప్పుడు నీకు నీవు పెంచుకుంటాము. దానితో మనలో మనం ఒత్తిడి, వృధ అనే ఉపయోగంలేని వాటిని నింపుతాము. అవి మనం పనులని నాణ్యతతో చేయనీయవు. మనం బాగా చేయవలసిన పనులని తక్కువ నాణ్యతతో చేస్తాము.

మనం ఎప్పుడైతే పూర్తిగా మనం చేసే పని మీద, మనం నడుస్తున్న మార్గం మీద ఏకాగ్రతని నిలుపుతామో, ఎప్పుడైతే ఫలితాలగురించి కలతపడకుండా, మన గమ్యం గురించి ఆందోళన పడకుండా ఉంటామో అప్పుడు మనం ఏ పనిచేసినా చాలా అద్భుతంగా నాణ్యతతో త్వరగా, కచ్చితంగా చేయగలుగుతాము.

శ్రీకృష్ణుని బోధనలు అన్నీ కేవలం ఆధ్యాత్మికమయినవి కాదు. అవి ఆరోగ్యకరమయిన జీవన పద్ధతులు. ఇవి కేవలం మన జన్మ తరువాత జరిగే విషయాలు కాదు, ఈ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే పద్ధతులు.

శ్రీకృష్ణుడు శాంతి అనంతరం... అని అంటాడు. ఆయన ఈ విధంగా చెబుతాడు ఎవరైతే తాను చేసిన పనుల ఫలితాలని భగవంతునికి సంపూర్ణంగా సమర్పిస్తారో (భగవంతునికి వదిలివేస్తారో) వారు శాశ్వతమయిన, శ్రేష్ఠమయిన శాంతి పొందుతారు. ఎవరైతే పనులని, వాటి ఫలితాల పైన అధికారాన్ని భగవంతునికి బదలాయించుతారో, వారు శాశ్వత శాంతి, పరమానందం అనే వాటిని పొందగలుగుతారు. చేసే పనుల ఫలితాల నుంచి బంధ విముక్తులవ్వగలిగేతే, వారు సంపూర్ణమయిన స్వేచ్ఛని పొందుతారు. ఆ స్వేచ్ఛ మనం చేసే పనుల నుంచి మనం ఏమీ ఆశించనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి తాను ఆక్షణలో చేస్తున్న పనిమీద మాత్రమే పూర్తి ఏకాగ్రతని నిలుపగలుగుతాడు. ఎప్పుడైతే అతను వర్తమానంలో ఉంటాడో అప్పుడు అతను ప్రశాంతంగా, పరమానందంలో స్వేచ్ఛలో ఉండగలడు. అదే మోక్షం అంటే.

ఇంతకుముందు శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునునికి నీవు ఇది చేయి లేదా అది చేయి అని చెప్పాడు. ఇప్పుడు ఇది చేయి అది చేయి అని చెప్పటం లేదు. ఆయన ఏమని చెబుతున్నాడంటే ఎవరైతే ఇవన్నీ చేస్తాడో అతనే నాకు ప్రియమయిన వాడు. ఒక వేళ నీవు అలా చేయకపోయినా పరవాలేదు. కానీ నీవు అలా చేయగలిగితే నాకు చాలా ప్రియమయినవాడివి అవుతావు. మరొక విధంగా చెప్పాలి అంటే ఆయన మానసికంగా బ్లాక్ మైల్ చేస్తున్నాడు. అయితే అది డైరెక్ట్ గా కాదు. తెలియకుండా ఇదంతా మన మంచి కోసమే.

ఎవరయితే ద్వేషభావం లేకుండా ప్రతిప్రాణి పట్ల స్నేహభావంతో ఉంటారో ఎవరయితే తాను యజమానిని అని ఆలోచించరో, ఎవరికైతే అహంకారం ఉండదో, ఎవరయితే దుఃఖాన్ని సుఖాన్ని సమభావంతో చూడగలరో, ఎవరయితే నిత్యం తృప్తిగా ఉంటారో, మనస్సుని నియంత్రించి, దృడ చిత్తంలో భగవంతుని సేవలో నిమగ్నమవుతారో, ఎవరయితే తమ మనస్సుని, మేధస్సుని నాపై నిమగ్నం చేసి ఉంటారో అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమయిన వాడు. అతనే నా ప్రియమయిన భక్తుడు.

ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. ఆయన ఈ విధంగా చెబుతారు. "ఎవరయితే ప్రతి ప్రాణి పట్ల ద్వేషభావం లేకుండా స్నేహభావంతో ఉంటాడో...." ఇవి చాలా విలువయిన లక్షణాలు. మనం మన మనస్సుని విశ్లేషించి చూద్దాము. మనం మన మనస్సుని నిజాయితీగా విశ్లేషించి చూస్తే మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఎప్పుడయినా ఎవరైనా మీ దగ్గరకి వచ్చి వాళ్ళు మిమ్ములని ప్రేమిస్తున్నారు, అని అంటే మీరు నమ్మరు. ముందుగా మీరు ఏమి ఆలోచిస్తారు. అతను ఏం కోరి, నా దగ్గర నుంచి ఏమీ ఆశించి అలా అన్నాడు అని. మిమ్ములని అతను ప్రేమించే అర్హత మీకు ఉన్నది అని మీరు నమ్మరు. తరువాత మరొక వ్యక్తి మిమ్ములని నిజాయితీగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మీరు నమ్మలేరు. ఎందుకంటే మీరు

BHAGAVAD GITA (The Song of God)

నేను, నాది అనేవి వదలి వేయండి అని గురువు చెప్పినప్పుడు, వాటిని గురువు తీసేసుకుంటాడని ప్రజలు భయపడతారు. బహుశా ఆయన వాటిని తీసుకుంటే ఏం చేయాలి. వాటి అవసరం ఆయన కుందేమో అని ఆలోచిస్తారు. ఎవరినీ నిజాయితీగా ప్రేమించలేదు కాబట్టి.మీరు ప్రతి విషయంలోనూ లెక్కలు కడతారు కాబట్టి అలాగే ఎదుటి వ్యక్తి కూడా లెక్కలు కడతాడని మీరు అనుకుంటారు. మన అందరి ప్రేమ పైపైన ప్రేమ.

శ్రీకృష్ణుడు ఇక్కడ మరో విషయం చెబుతాడు. ఎవరైతే ప్రతి ఒక్కరి (ప్రాణి) పట్ల స్నేహభావంతో ఉంటాడో, ప్రతి ఒక్కరికి దయగల స్నేహితుడిగా ఉంటాడో, ఎవరైతే నిజాయితీగా సేవ చేస్తారో, ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటారో అబద్ధపు అహంకారపు లేకుండా ఉంటారో.... ఇక్కడ అబద్ధపు అహంకారం అంటే ఏమిటో చూద్దాం. అహంకారం అంటే మీకు లేనిదానిని చూపించటం. అబద్ధపు అహంకారం అంటే మీకు ఉన్నదానిని దాచిపెట్టటం.

అహంకారం రెండురకాలుగా ఉంటుంది. చురుకైన అహంకారం, నెమ్మది అయిన అహంకారం. చురుకైన అహంకారం అంటే మీకు లేనిదానిని చూపించటం, నెమ్మది అయిన అహంకారం ఇలాంటి ఆలోచనలతో ఉంటుంది. "నేనేమి చేయగలను, నేను ఒకసామాన్యమయిన వ్యక్తిని. నేను ఏదీ సాధించలేను. నేను ఏ పని చేయలేను" ఇలా తనకి ఉండే న్యూన్యతా భావం (ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్) ఇదీ విధమయిన ఒక రూపంలో ఉండే అహంకారం.

స్పష్టంగా అర్థం చేసుకోండి. తనను తాను గొప్పగా భావించే సుపీరియారిటీ కాంప్లెక్స్ లో ఒక మంచి గుణం ఉన్నది. అటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్లినా వాళ్ళని గుర్తించటం సులభం. దాంతో వారిని ఎదుర్కొనవచ్చు. సమాజం కూడా అటువంటి వారిని ఎదుర్కొంటుంది. వారికి తగిన సమాధానం ఇస్తుంది. అటువంటివారు తాము అహంభావంతో బాధపడుతున్నాము అని తెలుసుకోగలుగుతారు. అలా కాకుండా న్యూన్యతా భావంతో ఉండేవారిని అహంభావులుగా ఎవరూ గుర్తించలేరు. అది చాలా కపటంగా దాచిపెట్టబడి ఉంటుంది. అంతేకాదు ఆ భావం ఉన్నవారు దానిని గుర్తించలేరు కూడా. దాంతో న్యూన్యత వెనుక దాగిన మనిషి తన అహంకారంతో బాధపడుతున్నట్టు తెలుసుకోలేరు.దాంతో వీరు చాలా లోతుగా ఎక్కువగా ఆ బాధని అనుభవించుతారు.

ఏ వ్యక్తి అయితే పేరు ప్రతిష్టలకోసం ఎదురుచూస్తుంటాడో ఆ వ్యక్తి అలాగే ఎవరికైతే పేరు ప్రతిష్టలు అవసరం లేదో అటువంటి వ్యక్తి, ఇద్దరూ కూడా అహంకారులే. పేరు ప్రతిష్టలు కావాలి అనుకుంటే అది అహంకారమే. అది వద్దూ అని అనటం కూడా అహంకారమే. ఎవరయితే ఏది జరిగితే దానిని జరగనీయి అని అనుకుంటాడో,ఎవరైతే విషయాలని జరిగేవి జరగనిస్తాడో అతను మాత్రమే అహంకారంలేని సత్యంలో జీవిస్తాడు.

శ్రీకృష్ణ భగవానుడు ఒక వ్యాఖ్య చేస్తాడు. “నీవు ఎవరో ఎవరికి తెలుసుకోవాలని ఉంటుంది? ఎందుకు నీవు గొప్పవ్యక్తిని అని అనుకుంటావు? ఎందుకు నీకు గొప్ప పేరు ఉందనీ, అందరికీ నీపేరు తెలుసు అని అనుకుంటావు? ఎందుకు అందరూ నీ పేరు అనుకుంటే సిగ్గుపడి వెళ్ళిపోతావు? ఎందుకంటే నీపేరు చాలామందికి తెలుసు అనుకొని సిగ్గుపడి వెళ్ళిపోతావు. అందుకే నీ పేరు అందరికీ తెలియటం నీకు ఇష్టముండదు. నేనుచెబుతున్నాను. నీ పేరు ఎవరికీ తెలియదు.రిలాక్స్ అవ్వు. విరామంగా ఉండు “ భగవంతుడు “నీ పేరు ఎవరికీ తెలియదు విరామంగా ఉండు ” అంటాడు

ఎవరికీ మన పేరు తెలియదు. స్పష్టంగా అర్థం చేసుకోండి. పేరు ప్రతిష్టలుకావాలి అనుకోవటం, అవి వద్దు అనుకోవటం రెండూ అహంకారమే. రెండు రకాల అహంకారం. న్యూనతతో ఉండే అహంకారం నెమ్మదిగా ఉండే అహంకారం.దానినే అబద్ధపు అహంకారం అంటాం. మీరు రెండు అహంకారాల నుంచీ స్వేచ్ఛగా ఉండాలి. మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వెనుక (న్యూనతా భావం) దాగవద్దు.

చెప్పనవసరం లేదు. ప్రజలు మీ మాటలనే ఉదాహరణలుగా చెప్పుకుంటారు. ఎప్పుడైతే పవిత్రగ్రంథాలని అర్థం చేసుకోకుండా అందులో మాటలని ఉదాహరించితే అది దయ్యపు పనే. ఎందుకంటే వాటిని అర్థం చేసుకున్న వాళ్ళు వాటిని పదే పదే చెప్పరు.

ఎప్పుడైతే మీ లక్ష్యం నిరర్థకమైనది అని తెలుసుకుంటారో అలాగే మీ ఐశ్వర్యాలు అర్థం లేనివి అని తెలుసుకుంటారో, ఆ ఐశ్వర్యం మీకు కలకాలం ఉండదు అని అర్థం చేసుకుంటారో అప్పుడు అన్నీ పైన చెప్పిన మంచి లక్షణాలన్నీ మీ నుంచి అన్ని దిశలకీ వ్యాపించుతాయి. అప్పుడు మీరు ఒక వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. ఆ వ్యక్తి క్షమాగుణం కలిగి సమదృష్టికల మనస్సుతో సంతృప్తిగా యోగంలో ఐక్యమయి ఉంటాడు. ఎప్పుడైతే మీరు అంతరంగంలో పరమానందంతో ఉంటారో మీరు ఈ లక్షణాలని అన్నివైపులకి మీ నుంచి వ్యాపింప చేస్తుంటారు. ఎవరయితే అంతరంగంలో నిత్యానంద స్థితిని పొంది ఉంటారో, ఆ వ్యక్తి తన ఆనందాన్ని ఏకారణం లేకుండానే అన్నివైపులకి ప్రసరింప చేస్తాడు.

నేను ఈ మధ్యనే ఒక ఉపన్యాసం ఇచ్చాను. అందులో ఇలా చెప్పాను. మనం నిరంతరం మన లోపల కోపం పుట్టించే గుణాన్ని (ఇరిటేషన్ ని) మోస్తూ ఉంటాము. దాంతో ఎప్పుడు ఎవరిమీద విరుచుకు పడదామా అని చూస్తుంటాము. ఏక్షణంలో మనకి అవకాశం వస్తే ఆక్షణంలో ఎదుటివారి మీద దూకి వారి మీద అరచి యాగి చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు. వాళ్ళ మీదకి దూకుతాం, వాళ్ళని కరుస్తాం. చిన్నగా మనని రెచ్చగొడితే చాలు, చాలా పెద్ద గొడవ చేస్తాము. ఎందుకంటే మనలోపల మనం ఇరిటేషన్ అనే గుణాన్ని మోస్తుంటాము. దాంతో ఎదుటివారికి నిరంతరం బాధలని, కష్టాలని చూపిస్తుంటాము.

ఈ విధమైన గుణం మనలో ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మనం నిరంతరం మాట్లాడుతూ ఉంటాము. ఇదంతా మనం అనుకున్నది అనుకున్నట్టు

జరగదు, అందుకే అలా చేస్తాము. మన వ్యధలు, బాధలు అన్ని కూడా జరిగిపోయిన విషయాల ఆధారంగా మనకి జరగబోయే విషయాల గురించే ఉంటుంది. భవిష్యత్ లో మనకి ఏమి జరగబోతోందో అనేది మన అసలు బాధ. ఇది మనం ఆశించిన దానికి మనం అది సాధించటానికి మనకి ఉన్న సామర్థ్యానికి మధ్య ఉన్న ఖాళీవలన మనం బాధలు అనుభవించుతాము. అందుకే మనం అనుకున్నవి భవిష్యత్ లో మనకి జరుగుతాయో లేదా అనే ఆతృతతో ఉంటాము.

వ్యధలు, బాధలు అనేవి ఏమాత్రం ఉపయోగం లేని విషయాలు ఎందుకంటే మనం ఏదయినా సాధించాలి అని అనుకుంటే, అది సాధించటానికి మన సామర్థ్యం ఒక్కటే సరిపోదు. దాని కంటే కూడా కావలసిన విషయాలు చాలా ఉన్నాయి. మనం చేయబోయే పని నుంచి దేనినైనా ఆశించటం నిరర్థకమైనది, ఎందుకంటే భవిష్యత్ అసలు నమ్మకం లేనిది. అది ఊహ. మన తరువాత శ్వాసనే మనం నియంత్రించలేము. మన తరువాత శ్వాస తీసుకుంటాము అని కచ్చితంగా చెప్పలేము. మనం ఎటువంటి గర్వంతో మనం మన భవిష్యత్ ని నిర్ణయించగలం. అలాగే మనం చేసే పనుల ఫలితాలని కూడా ఏమాత్రం నిర్ణయించలేము.

బాధ, ఆతృత, ఆందోళన, కోపం కలిగించే గుణం ఇవన్నీకూడా మనం వర్తమానంలోనికి రాగానే కరిగిపోతాయి. ఎప్పుడైతే మనం పూర్తిగా వర్తమానంలో ఉండగలుగుతామో అప్పుడు మనం మన పనులని ప్రభావితం చేయగల స్థితిలో ఉంటాము. అలాగే వాటి ఫలితాలని ప్రభావితం చేయవచ్చు. ఎప్పుడైతే మనం వర్తమానంలో స్థిరపడతామో మన ఆలోచనలన్నీ పోతాయి అలాగే బాధలు, ఇరిటేషన్, ఆతృత మాయం అవుతాయి. అప్పుడు మన వ్యధ అనేది ఎంత ఉపయోగం లేని విషయమో మనకి అర్థం అవుతుంది.

నేను ధ్యానం కార్యక్రమాలలో క్లాసుకు వచ్చిన వారిని వాళ్ళ బాధలు వ్రాయమనే వాడిని. వాళ్ళు చాలారాసేవారు. నేను వాళ్ళని ఆపేపర్లు దాచి ఉంచి, ఆరునెలలయ్యాక అసలు అందులో నిజంగా వారికి వచ్చిన బాధలు ఎన్నో చెప్పమనే వాడిని. నేను చెబితే మీరు ఆశ్చర్యపోతారు, అందులో కనీసం ఇరవై శాతం బాధలు కూడా వారికి రాలేదు.

బాధలు, ఇరిటేషన్ అనేవి అసలు ఆధారం లేని విషయాలు ఒక్కసారి మీరు అవి ఎంత అర్థం లేనివో, ఎంత ఉపయోగం లేనివో తెలుసుకోగలిగితే, మిమ్మలని ఎంత రెచ్చగొట్టినా, ఎంత ఇరిటేట్ చేసినా అవి మీ దగ్గర పనిచేయవు. ఆతృత, కోపం అనేవి అసలు మీలో ఉండవు. మీరు సచేతనస్థితిలో ఎలా జీవించుతారో, ఏ చేతన స్థితిలో అయితే ఒక దానిని ఎంచుకుంటారో అది మాత్రమే మీతో ఉంటుంది. మీరు మీ ఉనికి యొక్క స్థితిని అర్థం చేసుకుంటే, మీరు అప్రయత్నంగానే మీలోని మనోహరమయిన ఆనందాన్ని వ్యాపించటం ప్రారంభించుతారు. మీలోంచి సంతోషాన్ని వెదజల్లుతారు.

నేను ఒక చిన్న ధ్యాన పద్ధతిని అందరికీ నేర్పిస్తుంటాను. ఆ ధ్యానం మనకి నిజమయిన భక్తియోగం యొక్క అనుభవాన్ని ఇస్తుంది. ఈ చిన్న ధ్యానపద్ధతిని సాధన చేయండి. అది మీలోని సౌమ్యతని తెలియజేసేలా చేస్తుంది. దానిని ఎలా చేయాలి? మీరు ఉదయం నుంచీ రాత్రి వరకూ చాలా మనోహరమయిన ఆనందం యొక్క లక్షణాలని మాత్రమే శ్వాసించండి. కేవలం అందమయిన ఆనందాన్ని మాత్రమే మీ లోపలికి తీసుకుంటున్నారు : ఆనందాన్ని మాత్రమే ఊపిరిగా వదులుతున్నారు అని ఊహించుకోండి. అప్పుడు మీ అంతరంగం, మీ ఉనికి మొత్తం సంతోషంతో నిండిపోయి ఉంటుంది. మొదటిలో మీరు ఊహించుకుంటారు కొన్ని రోజులుకాగానే దాని గొప్పతనమేమిటో మీరే తెలుసుకుంటారు.

మరొక విషయం అర్థం చేసుకోండి. కల్పన, భావన అనేవి రెండు వేరు వేరు విషయాలు. కల్పన అంటే కొన్ని విషయాలని ఊహించటం. ఆ విషయాలు నిజ ప్రపంచంలో జరుగవు. ఉదాహరణకి ఒక ఏనుగుకి పది తొండాలు ఉన్నట్టుగా అతని చేతిలోనికి మంచులో గడ్డ కట్టుకుపోయిన పాము పడుతుంది. అతనికి కర్రలా అనిపిస్తుంది. ఆ వ్యక్తి దానిని కర్ర అనుకొని “ఓహో! నాకు మంచి చేతి కర్ర దొరికింది' అని అనుకొని దాంతో నడుస్తుంటాడు.

దారిలో ఒక సన్యాసి ఆ అంధుని చేతిలో పాము చూసి “ఓ! అయ్యా! నీ చేతిలో దానిని పారవేయి. నువ్వు అనుకుంటున్నట్టుగా అది కర్రకాదు. అది పాము. ఇంకొక గంటలో సూర్యకిరణాలు వస్తాయి. అప్పుడు ఆ పాము మామూలు స్థితికి వస్తుంది. అది నిన్ను కాటు వేస్తుంది. నిన్ను చంపేస్తుంది” అని గట్టిగా చెబుతాడు.

దానికి ఆ అంధవ్యక్తి “అదే మీ కాదు! నాకు తెలుసు. నీవు మరి మాట్లాడకుండా నీ పని నీవు చేసుకో” అంటాడు.

సన్యాసి అతనికి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాడు. అది కర్ర కాదు. అది పాము నిన్ను కరిస్తే చనిపోతావు. దానిని పారవేయి అని. అతనికి చాలా కోపం వస్తుంది. సన్యాసితో ఇలా అంటాడు “ బహుశః నీకు కర్ర లేదనుకుంటాను. నేను దీనిని పారేస్తే దాన్ని నీవు తీసుకోవాలి అని చూస్తున్నావు. నేను కర్రని పారవేయను. నాకు నీలాంటివాళ్ళు సంగతి బాగా తెలుసు,” అంటాడు.

అప్పుడు సన్యాసి ఇలా అంటాడు “ఓ తెలివితక్కువ మూర్ఖుడా! అది కర్ర కాదు. అది నిన్ను చంపేస్తుంది” అని అతని చేతిలో పాముని లాగేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ అంధుడు దానిని సన్యాసికి ఇవ్వకుండా ఆ కర్రతోనే సన్యాసిని కొడతాడు. జీవితంలో సరిగ్గా ఇలాగే జరుగుతుంది.

ఎప్పుడైతే గురువులు 'నేను, నాది' అనేవాటిని పారేయమంటే మీరే మనుకుంటారు, అమ్మో వాటిని పారేస్తే గురువు వాటిని తీసేసుకుంటాడు అని అనుకుంటారు. గురువు వాటిని తీసి పారేస్తాడు. మరేం చేయాలి, వాళ్ళు అనుకుంటారు, గురువుకి ఇది కావాలి అని. ఆయన మనని అవి పారేయమని చెప్పి ఆయన తీసేసుకుంటాడు అని అనుకుంటారు. వాళ్ళు నిరంతరం అనుమానంతో ఉంటారు. అందుకే గురువులు ఏమంటారంటే "ఇది అసలయిన దారి, మీకు ఎలా కావాలంటే అలా చేయండి".

ఎవరయితే వారి మనస్సుని, మేధస్సుని (బుద్ధిని) నాయందు నిలుపుతారో.... అని అంటాడు శ్రీకృష్ణుడు. భక్తులకి, శిష్యులకి కూడా గురువులకి కానీ విశ్వశక్తికి కానీ ఆధీనమవటం చాలా కష్టం. ఎంత కాలమయితే గురువు వారిని వారు ఇష్టమొచ్చినట్టు ఉండనిస్తాడో, అన్ని విషయాలు వారి ఇష్ట ప్రకారం జరుగుతాయో వారికి గురువు చాలా గొప్ప వ్యక్తి. ఆయనని పూజించటానికి, ఉత్సవం చేయటానికి అర్హుడు అని అనుకుంటారు. కానీ గురువు ఒక్కసారి తన భాధ్యతని సీరియస్గా తీసుకొని ఆధ్యాత్మిక ఆపరేషను మొదలుపెట్టగానే శిష్యులు పారిపోతారు.

నేను ఎప్పుడు చెబుతాను "నేను మీకు సరియైన గురువునా కాదా అని ముందుగా నిర్ణయించుకోండి". ఒక్కసారి అవును అనుకుంటే గురువులు ఆ బాధ్యతని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఆయనకి ఉండే పెద్ద బాధ్యత సర్జరీ. అహంకారం అనే కాన్సర్ని ఆపరేషన్ చేసి తీసేయటం. ఒక్కసారి శిష్యుడు ఒప్పుకుంటే గురువు చాలా బాధ్యతాయుతంగా ఆ పనిని చేపడతాడు. ఆపరేషన్ టేబుల్ మీద నుంచి పారిపోతే అది చాలా ప్రమాదం. అలా చేస్తే ఈ జీవితాన్ని కోల్పోతాడు. తిరిగి అతను ఆ అవకాశం కోసం కొన్ని జన్మలు ఎదురు చూడాలి.

ఇక్కడ శ్రీకృష్ణుడు అదేస్థితిలో ఉన్నాడు. ఆయన అందుకే "నాకు ప్రియమైన భక్తుడు ఇలా ఉంటాడు' అని చెబుతాడు. అంతే ఆయన శిష్యుడు యొక్క నిబద్ధత గురించి చెబుతాడు. ఆయన ఇలా అంటాడు "ఎవరయితే నాకు అధీనులవుతారో ఎవరయితే వారి మనస్సు బుద్ధిని నాయందు స్థిరపరచుతారో అతను నాకు ప్రియమైన భక్తుడు. అతనికి నేను స్వేచ్ఛని ఇస్తాను. బంధ విముక్తుణ్ణి చేస్తాను."

కృష్ణుడు ఈ అధ్యాయాన్ని చాలా అందంగా ముగించుతాడు. ఇది చాలా చిన్న అధ్యాయం. అందుకే మనం మొత్తం అధ్యాయమంతా చూడగలుగుతున్నాము.

ఎవరయితే ప్రపంచము వలన వ్యతిరేకముగా ప్రభావము కారో, ఎవరి వలన ప్రపంచం భయపడదో లేదా ఆపద తెచ్చుకోదో....

మనందరం ఎవరైతే ఈ ప్రపంచంలో జన్మించామో, ఈ ప్రపంచంలో జీవిస్తున్నామో మనం ఒంటరిగా జీవించటం లేదు. జాన్ డోన్ అనే తత్వవేత్త అంటారు " ఏవ్యక్తి కూడా ఒక ద్వీపం కాదు" అని

మనం ఎవరమూ ఒక ద్వీపం కాదు. మనందరం ఒకరితో ఒకరం పరస్పర సంబంధాలు కలిగి ఉంటాము. మనం ఏమి ఆలోచిస్తామో, ఏమి చేస్తామో, ఏది కోరుకుంటామో అవన్నీ ఈ ప్రపంచంలో ఉండే ఇతరులని ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలు, కోరికలు, చర్యలు ఈ భూమి మీద ఉండే శక్తి తరంగాలని సృష్టించుతాయి. తిరిగి ఈ విశ్వం ఇంకా కొన్ని తరంగాలని సృష్టిస్తుంది. ఇవన్నీ మిగతావారి భావాలతో పనులతో పరస్పర సంబంధం నెలకొల్పుకొని తిరిగి మరిన్ని తరంగాలని సృష్టిస్తాయి.

కార్ల్ జంగ్ అనే మానసిక విశ్లేషకుడు, ఫ్రాడ్ (Freud) నిర్వచించిన ఐ.డి. మరియు అహంకారానికి, అధిక స్థానంలో ఉండే అహంకారాన్ని (super ego) కలిపాడు.

వీరి ఉద్దేశ్యం ప్రకారం ఐ.డి. మానవులలో ఉండే ముఖ్యమయిన మేధస్సుని తెలియజేస్తుంది. అందులో జ్ఞాపకాలు ఒక పరిణామ క్రమంలో అమర్చబడి ఉంటాయి. మెదడులోని ఈ ప్రాంతాన్ని రెపటీలియన్ మెదడు అంటారు. ఇందులోని జ్ఞాపకాలు మాముల్ అనేవి భూమిమీదకు రాక ముందు నుంచీ ఉంటాయి.

ఐ.డి. అనేది మెదడులోని సహజమయిన బుద్ధి యొక్క చర్యలకి సంబంధించినది. అవే అచేతన సుషుప్త్యవస్థలు. మనలో తొంభై శాతం పనులు, మనస్సుయొక్క చర్యలు ఇందులోనే జరుగుతాయి. సహజంగా ఈ ప్రాంతం అందుకే తయారు గ్రూపు తీసుకొని వాటికి శిక్షణనిస్తే చాలు దీని తరువాత భూమి మీద ఉన్న కోతులన్ని ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించుతాయి. అవి పుస్తకాలు చదవనవసరం లేదు. అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకోవనవసరం లేదు. అవి టి.వి. చూడనవసరం లేదు. ఇంటర్నెట్ ఓపెన్ చేయనవసరం లేదు. ఈ జ్ఞానం, నైపుణ్యం వాటికి చేరుతుంది. అది ఎలా చేరుతుంది అనే విషయాన్ని శాస్త్రజ్ఞులు ఇంతవరకూ తెలుసుకోలేకపోయారు. ఇది జరుగుతున్నది అని తెలుసు కానీ ఎలా జరుగుతుందో తెలియదు.

ఈ విధంగా ఒక విషయం లేదా విశేష నైపుణ్యం మరొక చోటికి అప్రయత్నంగా వెళ్లటం అనేది శాస్త్రీయ పరిశోధనలలో చాలా సార్లు జరిగింది. మేడమ్ క్యూరి రేడియంలో ఉండే రేడియో యాక్టివిటీని కనుగొన్నప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలలో వేరువేరుగా శాస్త్రజ్ఞులు ఇదే విధమైన పరిశోధనలని వెల్లడి చేశారు.

అత్యున్నత అహం అనేది ఒకసామూహిక అచేతన స్థితి యొక్క రూపం. అయితే ఇది నిజానికి అచేతనస్థితి కాదు. ఇది అత్యున్నతమైన చేతనస్థితి. సమూహంగా ఉండే చేతనస్థితి మానవజాతి ఉనికికి చాలాముఖ్యమైన విషయుం. మనందరం ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉంటాము. మన ఆలోచనలు, పనులు వేరే వారిని ప్రభావితం చేస్తాయి. ఈ సమూహంలోని చేతనస్థితిలోకి ప్రవేశించటం ద్వారా మనం విశ్వశక్తి యొక్క పరిధిలోనికి ప్రవేశించుతాము. మన వ్యక్తిగతం ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ, విశ్వ ఆత్మలో ఒక భాగం అవుతుంది. మనం భగవంతుడవుతాము.

సమూహ చేతనస్థితిలోనికి మనం చేరువయినప్పుడు ఒక కొత్త విషయం, ఒక కొత్త సంగతి జరుగుతుంది. దానికి చేరువ కాకముందు మనం తరంగాలు సృష్టిస్తుంటాము. మనం ఒకరికి ఒకరు ప్రభావితం చేసుకుంటాము. చాలసార్లు అది చాలా చెడుగా ప్రభావితం చేస్తాం. ఎందుకంటే మనలో నిస్వార్థం అనేది ఆదుర్దా లేదా ఆతృత అనేది మన ఆత్మకి ఉన్న కాన్సర్. మనం ఎప్పుడయితే ఆలోచించగల స్థాయికి చేరతామో, మనం ఆదుర్దాలో ఉండటం మొదలు పెడతాము. దీనితో వ్యధ చెందుతాము. మనం నిరంతరం బాధపడుతుంటాము. బాధపడటం, ఆదుర్దా పడటం. ఒత్తిడి అనేవి మన జీవితానికి ఊతకర్రలు వంటివి.

ఆతృత అనేది మనం అనుకున్నది చేయలేమేమో అనే భయం వలన కలుగుతుంది. మనకి మన కోరికలు ఆశలు ఉంటాయి. మనకి తెలిసిన మన నైపుణ్యం, శక్తి మనకి ఉంటాయి. కానీ చాలా సార్లు మన కోరికలు మనశక్తికి మన నైపుణ్యానికి సరిపడా ఉండవు. అవి నిజంగా సాధించగల దిశలో ఉండవు. అక్కడ కొంత ఖాళీ ప్రదేశ్ం ఏర్పడుతుంది. ఆ ఖాళీ ప్రదేశమే వ్యధ, బాధగా రూపాంతరం చెందుతుంది.

మనం కళ్ళుమూసుకొని ఒకదానిమీద కాని ఒక సంఘటన మీద కాని ఏకాగ్రత నిలపాలి అని అనుకోగానే, మన ప్రయత్నాన్ని ఆలోచనలు అడ్డుకుంటాయి. మనం దేనిమీద అయితే ఏకాగ్రత నిలపాలనుకుంటామో అది తప్ప మిగతా ఆలోచనలు వస్తాయి. అదే మన మనస్సు మన అంతరంగంలో నిరంతం మాట్లాడే వ్యర్థపు మాటలు (chatter) దీనినే బుద్ధుడు ‘కోతి వంటిమనస్సు’ ‘మనస్సు కోతి’ (mon-key mind) అని అంటాడు.

ఈ అంతరంగంలోని మాటలు అనేవి మన మైండ్ అస్థిరంగా మన భూత, భవిష్యత్ల మధ్య తిరుగుతూ ఉండటం వలన జరుగుతాయి. ఇది మన మనస్సు మనకి జరిగిపోయిన అనుభవాలు మనం జాగ్రత్తగా నిలువచేసిన జ్ఞాపకాలు వీటికి, మనకు తెలియని మన ఆశలు, ఆశించటాలు జరగబోయేవి ఊహించే విషయాలకి మధ్య ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా స్థిరం లేకుండా మనస్సు చేసే ప్రయాణాన్నే ఆలోచనలు అంటాము.

ఆదుర్దా అనేది ఎప్పుడయితే మనం ఆశించినది జరగదు అని మన మైండ్ తెలుసుకుంటుందో అప్పుడు కలుగుతుంది. ఇది అసలు జరగని ఏదో ఒక దానికి సంబంధించిన నష్టం. ఇది పూర్తిగా ఒక ఊహ. అది మనలోపల తీవ్రమైన భావావేశాలని సృష్టిస్తుంది. మనం ఏదో ఒక భయంకరమైనది జరగబోతున్నది అని ఆదుర్దాతో చూస్తాము. అయితే అసలు ఏదీ జరగకముందే మనం ఆచెడు జరిగే దాని గురించి చూస్తాము. ఆతరువాత తీవ్రమైన కోపంతో అది జరిగేదాకా ఎదురు చూస్తాము.

చాలాసార్లు మీరు చెడు జరుగుతుంది, అని అనుకున్నది జరిగిపోయాకా చాలా విరామంగా అయిపోతారు. ఎప్పుడయితే భవిష్యత్ వర్తమానంలోనికి వస్తుందో మీలో ఆదుర్దా అనేది ఉండదు.

ఆదుర్దా అనేది భవిష్యత్‌కి సంబంధించినది : దాని మూలం మన అహంకారం. అహంకారం ఆశలు, ఆశించటాలు వంటి వాటిని సృష్టిస్తుంది. అవే 'నేను' 'నాది' అనేవి ఆశించినది జరగదేమో అనే భయం. దీనితో పాటు వస్తుంది. ఆదుర్దాని దాటిపోవాలి అంటే మనం వర్తమానంలో ఉండాలి.కేవలం వర్తమానం అనే ఆ పాయింట్ దగ్గరే మన అంతరంగంలోని మాటలు ఆగిపోయేది. ఎప్పుడయితే ఆ మాటలు ఆగిపోతాయొ అప్పుడే ఆదుర్దా అనేది మాయం అవుతుంది.

శ్రీకృష్ణుడు 'ఎవరయితే ఆదుర్దా లేకుండా ఉంటారో, వారే నన్ను పొందగలుగుతారు' అని అంటాడు. ఈ మాట అర్ధం ఏమిటంటే ఎవరియితే వర్తమానంలో, అంటే ఈ క్షణంలో ఉంటారో వారే నా దగ్గరకి రాగలరు అని. వర్తమానంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు మనం మన ఉనికిలోని సత్యాన్ని స్పష్టంగా చూడగలుగుతాము.అదే శ్రీకృష్ణుని చేతనస్థితి. అప్పుడే మనం అతనిలో ఒకటిగా అయిపోగలం.

కోపాన్ని పోనివ్వు, ఎవరికైతే కోపం ఉండదో అతను నన్ను చేరగలడు అని భగవానుడు అంటాడు. పై మాటలని యధాతధంగా అర్ధం చేసుకుంటే మనం ఎవరిం కూడా శ్రీకృష్ణుని చేరలేము. నుంచి అలా పేరుకుపోతూ ఉంటుంది. అది ఏవేవో చాలా కారణాల వలన గుట్టలుగా ఏర్పడిపోతుంది. మనం మనలోని వ్యతిరేకపు ఆలోచనలని సమాజానికి వ్యతిరేకంగా మనలో నింపుకుంటాము. సమాజపు నిబంధనలననుసరించి మనం వాటిని వెల్లడి చేయలేము. అలా చేయటం సంస్కారం కాదు కాబట్టి, బాగుండదు కాబట్టి వెల్లడి చేయము. అయితే అది ఎప్పుడో ఒకప్పుడు ఆకస్మాత్గా పేలిపోతుంది.

మనం కోపాన్ని మనుషుల మీద చూపించే కంటే విషయాల మీద చూపించటం నేర్చుకోవాలి. కోపం మనుషుల మీద వచ్చినప్పుడు దానిని వెంటనే కోపకారణమయిన అసలు సంగతి మీదకి మరలించాలి. అంతేకాని అది మనుషుల మీద ఉండకూడదు. వ్యక్తులు కేవలం కోపానికి మీరు చూపే కారణం మాత్రమే. అలా మనుషుల మీద కోపం వెల్లడి చేస్తే, అసలు విషయం లోతుగా ఎక్కడో కప్పబడిపోతుంది. అది ఎప్పుడో ఒక ప్రమాధికారిగా తిరిగి వస్తుంది. అది ఒక ఛేదించలేని విషవలయంలా తయారవుతుంది.

ఏదిఏమైనా మనం కోపాన్ని వెల్లడి చేయాలి. దాన్ని పూర్తిగా ఆ సంఘటన మీద చూపించండి. అంతేకాని దానికి వ్యక్తులకు సంబంధాన్ని పెట్టవద్దు. మనం మనకి కాని, ఎదుటి వారికి కానీ హాని కలుగకుండా కోపాన్ని వెల్లడి చేసి దానిని వదిలించుకోవాలి. అది సంభవమే. దీనికి కొంచెం సాధన చేయాలి. అంతే.

ఎప్పుడైతే కోపాన్ని వెల్లడి చేస్తామో దానికి సంబంధించిన జ్ఞాపకాలు కరిగిపోతాయి. ఇక కోపం ఉండదు. అలా కొంతకాలం గడిచే సరికి కోపం అనేది రాకముందే అది మాయం అయిపోతుంది.

శ్రీకృష్ణ భగవానుడు ఈ స్థితినే కోపానికి అతీతమయిన స్థితి అని అంటాడు. ఆ స్థితికి చేరినవారు ఆయనని చేరగ‌లరు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా ఉన్నత స్థాయికి వెళతాడు. ఎప్పుడైతే మీరు సంతోషం, ఆతృత, కోపం వంటి భావావేశాలని వదిలివేస్తారో, మీరు ఒక విధమైన నిశ్చలస్థితిని, శాంతి స్థితిని చేరుతారు. ఆ నిశ్చలస్థిత మిమ్మలని భగవంతునికి దగ్గరగా తీసుకువెళుతుంది. దేనితోనూ సంబంధాలు పెంచుకోకుండా, భావావేశాలతో ఉన్న సంబంధం నుంచి కోరికలపై మమకారం తెంపుకునే స్థితికి మీరు చేరుతారు.

మనం అవసరాలకి, కోరికలకి మధ్య తేడా తెలుసుకోవాలి. ఈ భూమి మీద మనం జీవించటానికి మనం మన అవసారాలని తీర్చుకోవాలి. అవి భోజనం, నిద్ర, ఇల్లు ఇలాంటివి. మహావీరుడు ఈవిధంగా చెబుతాడు. ఈ విశ్వశక్తి నీకు కావలసిన అవసరాలన్నింటినీ నీవు జన్మించినప్పుడే నీకు సమకూర్చింది.

మీరు కేవలం ఆ విశ్వశక్తిని (భగవంతుని) నమ్మితే చాలు. మనం ఈ భూమి మీద బ్రతకటానికి కావలసినవన్నీ సమకూరుతాయి. అంతకుమించి మనకి ఏమీ కోరికలు ఉండవు.

కానీ మనం ఇంకా కావాలి అని అడగటం మొదలుపెడతాం. మన అవసరాలు తీరటం మనకి సరిపోదు. మనం మన చుట్టు ప్రక్కల ఉన్నవారిని గమనించి, వాళ్ళు మన కంటే సౌకర్యాలతో జీవిస్తున్నారు అని అనుకుంటాము. ఎదుటివారు మనకంటే సంతోషంగా ఉంటే మనం భరించలేము. మనం ఎదుటివారు నిరంతరం బాధపడుతుంటే అప్పుడు ఆనందంగా ఉంటాము. ఎందుకంటే వారితో పోల్చితే మన దుఃఖం తక్కువగా అనిపిస్తుంది.

మన ప్రక్క ఇంటివారు కొత్త ఎ.సి. మెషిన్ కొంటే, మన ఇంట్లో వేడి పెరిగిపోతుంది. మన ఎదురింటి వారు రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్) కొంటే, మన ఇంట్లో ఆహార పదార్థాలు పాడయిపోతుంటాయి. ఇవన్నీ మన మైండ్ ప్రారంభిస్తుంది. ఎదుటివారు కొత్తకారు కొనగానే మనకారు స్లోగా అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్కటీ ఎదుటివారితో పోల్చుకోవటంతో సరిపోతుంది.

ఇది మనలో నిరంతరం 'తరువాత' ఏమిటి, తరువాత ఏమిటి? అని అనటమే మనం సాధించినది. సంపాదించిన కోరికని ఉపయోగించుకోవటం మొదలు పెట్టకుండానే, మన తరువాత కోరికకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము. మనం పొందిన దానితో ఎప్పుడూ సంతోషపడటం. కోరిక వెనుక పరుగులు తీయటంలోనే ఆనందపడతాము. ఈ కోరిక వెనుక పరిగెత్తటానికి అంతం (చివర) ఉండదు.

మీరు మీ కుటుంబంలో అందరి కంటే ధనవంతులైతే, ఆ వీధికి ధనవంతులు అవ్వాలనుకుంటారు. ఆ తరువాత ఆ ఊరికి, దేశానికి ప్రపంచానికి ఇలా వెళుతూనే ఉంటారు. దీనికి చివర అనేది ఉండదు.

భగవాన్ రమణ మహర్షి చాలా అందంగా, ఆర్ధంగా ఇలా చెబుతారు. "ఈ విశ్వం ప్రపంచంలో అందరి అవసరాలు తీర్చగలుగుతుంది : కానీ ఒక్క మనిషి కోరికలని మాత్రం తీర్చలేదు".

కోరికలకు అంతం ఉండదు. కోరికలు అంటే బాధలే. కోరికలు అనేవి మనం ఎదుటివారితో పోల్చుకున్నప్పుడు వస్తుంటాడు. అవసరాలు మనం ముందుకు పోగల శక్తిని ఇస్తాయి. మనకి దేనినైనా సాధించే శక్తిని ఇస్తాయి. కోరికలు మాత్రం బాధలని, కలతలని మోసుకువస్తాయి.వాటిలో మన బాధలు యొక్క విత్తనాలు ఉంటాయి.

నేను నిత్యానంద స్ఫురణ కార్యక్రమం (NSP) లో క్లాసులు తీసుకున్నప్పుడు అందులో పాల్గొన్నవారిని శక్తి పొరల నుంచి ప్రయాణం చేయించుతాను. మనం చనిపోయినప్పుడు ఆత్మ మనలో ఉండే ఏడు శక్తి పొరలని దాటి వెళుతుంది. ఆ

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి
శుభాశుభా పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః

అర్థం : యో = ఎవరూ ; న హృష్యతి = సంతోషంతో ఉప్పొంగడో : నద్వేష్టి = ద్వేషింపడో : నశోచతి = శోకింపడో : న కాంక్షతి = కోరికలు కోరడో : యః = ఎవరు : శుభాశుభ పరిత్యాగి = శుభా అశుభములని వదిలివేస్తాడో : సః భక్తిమాన్ = అటువంటి భక్తుడు, మే = నాకు : ప్రియః = ప్రియమైనవాడు.

భావం : ఎవరయితే సంతోషింపడో, ద్వేషింపడో, శోకమును పొందడో, ఎవరయితే శుభాశుభములని వదిలివేస్తాడో, అట్టి భక్తుడు నాకు ప్రియమైనవాడు.

శ్రీకృష్ణుడు మన మనస్సుని నియంత్రించగల మరొక దశకి వెళ్తాడు.

ఇప్పుడు ఆయన ఎవరయితే ప్రేమించరో, ఎవరయితే ద్వేషించరో అని అంటారు. ఆయన ఎవరినీ ప్రేమించని వ్యక్తి గురించి మాట్లాడటం లేదు. మనం ప్రేమించినప్పుడు అందులో చాలా నియమ నిబంధనలు, షరతులు, ఆశించటాలు ఉంటాయి. మనం ఆశించేవి అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నంతకాలం ఈ ప్రేమ బాగానే పని చేస్తుంది. ఎప్పుడయితే మనం ఆశించినడానికి కొంచెం వ్యతిరేకంగా ఏదయినా జరిగితే ఆ ప్రేమ సూర్యకిరణం పడిన మంచు బిందువులా మాయమవుతుంది. అప్పుడు ఆ స్థానంలోనికి ద్వేషం వస్తుంది.

ద్వేషం, ప్రేమ అనేవి ఒక నాణానికి ఉండే రెండు వైపులు. ఇది మన ప్రేమలో నియమ నిబంధనలు, ఆశించటం ఉన్నంత వరకూ ఈ రెండూ ఒకే నాణంలో ఉంటాయి. ఎప్పుడయితే మన ఆశలకి, ఆశించటానికి ఏదైనా సవాలు ఎదురైతే ప్రేమ కాస్తా ద్వేషంగా మారిపోతుంది. ఇటువంటి ప్రేమలో ఉండే సంతోషం కేవలం బయట సంతోషం మాత్రమే.

చాలాసార్లు మనం అనుకునే ప్రేమ కాలానికి, స్థలానికి సంబంధించి ఉంటుంది. ఎంతకాలం అయితే ప్రేమికుల మధ్య దూరం ఎక్కువగా ఉండి, వారు కలసి ఉండే సమయం తక్కువగా ఉంటుందో, అంతకాలం ఒకరిలో మరొకరికి లోపాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా చాలా చిన్నవిగా తక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఆశించటాలు తెలపడానికి సరిపడా సమయం ఉండదు. అవి ఏర్పడే అంతగా వరి మధ్య సంబంధం, సంభాషణలు జరగవు. ఎప్పుడయితే ఒకరికొకరు బాగా దగ్గరగా వచ్చి, చాలా సమయం కలసి ఉంటారో అప్పుడు ఒకరినొకరు చాలాసేపు చూసుకుంటారు. అప్పుడు వారిలోని చిన్న చిన్న లోపాలు స్పష్టంగా కనపడతాయి. వారిలో చిరాకు భావాలు మొదలవుతాయి. అది ప్రేమని ద్వేషంగా మార్చుతుంది. ప్రేమ, ద్వేషం అనేవి ఒకే విధమయిన భావాన్ని వెల్లడి చేసే వేరు వేరు పద్ధతులు.

సంబంధ బాంధవ్యాలని ఏర్పరచుకోవాలి. వీటిలో ముఖ్యమయినది భార్య భర్తల సంబంధం.

మనం పెద్దవారమ్మే కొద్దీ మనకి ఆత్మాభివృద్ధి ముఖ్యం అనిపిస్తుంది. దానికి మనం ఇతరుల మార్గదర్శకత్వం తీసుకుంటాము. అప్పుడే మనం గురువుల కోసం వెతుకుతాము. గురువులతో ఉండే సంబంధం మన చిన్ననాటి సంబంధానికి వ్యతిరేకంగా ఉంటుంది. మనం మరొకసారి జీవనం గురించి ఆలోచించుతాము. అయితే ఈ జీవితం మన శరీరం, మనస్సు కాదు ఈ జీవితము ఆత్మకోసం మన ఆత్మయొక్క జీవనం కోసం మనం గురువులతో సంబంధాలని ఏర్పరచుకుంటాము. ఇది పూర్తిగా ఆధారపడే సంబంధం. అయితే ఈ ఆధారపడటం కొంచం వేరుగా ఉంటుంది. ఈ సంబంధాలు పనిచేయాలంటే, ఇది పూర్తిగా నిర్బంధాలు లేనిది అయి వుండాలి.

గురువుతో, శ్రీకృష్ణునితో సంబంధం సజావుగా పని చేయాలంటే ఇక్కడ కావలసినది నియమనిబంధనలు లేని ప్రేమ. అది పూర్తి అధీనత. అధీనతలో ప్రేమ, ద్వేషం ఉండవు. అధీనత మాత్రమే ఉంటుంది.

ఎప్పుడయితే గురువుకి, సర్వాంతర్యామికి పూర్తిగా అధీనమయిపోతామో అప్పుడు మంచి చెడు, పాపం, పుణ్యం ఇలా ఏమీ ఉండవు. అన్ని మాయమయిపోతాయి.

ఆధ్యాత్మిక పరిధిలో ఆలోచించిస్తే పాపం అనే మాట ఎక్కడా లేదు. మనపైన ఎవరూ కూర్చోని మన పాపాలని లెక్కలు కడుతూ పెన్సిల్, పేపర్ పట్టుకుని ఉండరు. అసలు స్వర్గం, నరకం అనే స్థలాలే లేవు. నరకం, స్వర్గం అనేవి ఏవో కంటికి కనపడే స్థలాలు కాదు. మనం మానసికంగా మన మనస్సులో

సమశ్శత్రా చ మిత్రే చ తథా మానాపమానయోః
శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సఙ్గవివర్జిత :
(12:18)

తుల్య నిన్దాస్తుతి రౌనీ సన్తుష్టో యేన కేనచిత్
అని కేతః స్థిర మతిర్భక్తిమాన్మే ప్రియో నరః
(12:19)

అర్థం : శత్రౌచ = శత్రువు నందును : మిత్రేచ = మిత్రులయందు : తథా = అటులనే : మానాపమానయోః = గౌరవము, అగౌరవమునందు : సమః = సమభావము కలవాడు : శీతోష్ణ = చలియందు, వేడియందు : సుఖ దుఃఖేషు = సుఖదుఃఖము నందు : సమః = భావముతో ఉండువాడు : సంఘ వివర్జిత = దేనియందు ఆసక్తి లేక అన్ని సంబంధాలు విడిచినవాడు. : తుల్య = సమానముగా : నిన్దాస్తుతిః = నిందలను, ప్రశంసలను : మౌని = మౌనంగా ఉండువాడు : యేనకేనచిత్ = దేనితో నైనా (దొరికిన దానితో) : సంతుష్టః = తృప్తి పొందువాడు : అనికేతః స్థిరమయిన నివాసం లేనివాడు (గృహముల యందు ఆసక్తి లేనివాడు) స్థితిమౌతిః = నిశ్చయబుద్ధి కలవాడు : భక్తి మాన్ = భక్తిలో నిమగ్న మయినవాడు : మే = నాకు : ప్రియః = ప్రియమయిన వాడు : నరః = మనుష్యుడు

శత్రువుల యందును, మిత్రులయందును సమాన భావం కలవాడు, గౌరవం, అగౌరవాన్ని, చలి, వేడి పరిస్థితులని సమానంగా చూడగలిగిన వానిని, దేనియందు ఆసక్తి లేనివాడును, ప్రశంసలయందు విమర్శలయందు మౌనంగా ఉండువాడు, దేని చేతనైనాసూ సంతృప్తి పొందువాడు నిర్దిష్టంగా గృహమునందు ఆసక్తి లేనివాడు, నిశ్చయముగు బుద్ధికల వాడును, భక్తితో గూడి యుండువాడును అగు వ్యక్తి నాకు ప్రియమయిన వాడు.

The Song of God

నీవు ఒకే ఇంటితో అనురాగం లేక ప్రేమ కలిగి ఉన్నట్లయితే, వేరొక నీకు కొత్త ప్రదేశం అవ్వవచ్చు. దానివలన నీవు ప్రయాస పడవచ్చు. ఒకే ఇంటితోనే అనురాగం లేక ప్రేమ అనే ఆలోచనే నీకు లేనట్లయితే నీవు ఎక్కడికెళ్లినా నీ ఇంటిలో ఉన్న భావనతోనే ఉంటావు.

శ్రీకృష్ణ భగవానుడు మరొకసారి "సంపూర్ణమైన భక్తిలో ఉండే వ్యక్తి నాకు చాలా ప్రియమయిన వాడు” అని అంటాడు. ఆయన ఇక ఎటువంటి రూల్స్ చెప్పటం లేదు. అంటే ఆయన తన సూచనలనీయటం ముగించబోతున్నాడని అర్థం. ఆయన ఇలా అంటాడు. ఈవిధంగా ఎవరయితే ఈ మార్గంలో ఉంటాడో అతనిని నేను ప్రేమించుతాను. అంతే. నాకు మరి దేని మీదా ఆసక్తి లేదు.

శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు 'ఎవరైతే స్నేహితులని, శత్రువులని ఒకే విధంగా చూడగలడో, ఎవరయితే గౌరవం పొందినప్పుడు అగౌరవం పొందినప్పుడు ఒకేవిధంగా ఉండగలరో, ఎవరయితే వేడియందు, చలియందు ఒకే విధంగా నిలవగలిగితే, సంతోషం బాధ కలిగినప్పుడు ఒకే విధంగా ఉంటే, ఎవరయితే పొగడ్తలకి, విమర్శలకి ఒకే విధంగా స్పందించుతారో, ఎవరెయితే తనకు ఉన్నదానిలో సంతృప్తిని పొందుతారో ఎవరైతే నిశ్చితమయిన మనస్సుతో ఉంటారో గృహమందు ఆసక్తి లేకుండా ఉంటారో అటువంటి వ్యక్తి, సంపూర్ణ భక్తితో నిండి ఉన్న వ్యక్తి, నాకు చాలా ప్రియమయిన వ్యక్తి.

ఇక్కడ ఒక చక్కని మాట ఉన్నది. ఎవరయితే ఎటువంటి ఇల్లు ;అనే దానిని పట్టించుకోడో, ఎవరయితే తన కోసం ఇల్లు కట్టుకోవాలి అని అనుకోడో....

మీకు ఒక కథ చెబుతాను. రావణాసురుడు ఒక కల్పకాలం (చాలా వేల సంవత్సరాలు) జీవించుతాడు. వ్యాసమునీంద్రులు నాలుగు కల్పాలు జీవించుతారు. రావణుడు లంకాపురిని కట్టుకుంటాడు లంకాపురిని శివుడు రావణునికి బహుమతిగా ఇస్తాడు. దానిని అతను బాగా అభివృద్ధి చేస్తాడు.

ఒకసారి వ్యాసుడు లంకాపురికి వస్తాడు. రావణుడు ఆయనతో “ఓ వ్యాసా! నా భవనం చూసావా! నాదేశాన్ని చూసావా! ఎంత గొప్పగా ఉన్నాయో కదా! అంటాడు. దానికి వ్యాసుడు “అవును నేను చూసాను” అంటాడు.

రావణుడు వ్యాసుణ్ణి నగరంలోనికి తీసుకెళ్ళి అంతా చూపించుతాడు. ఎంతోగర్వంగా తన వైభవాన్ని చూపిస్తాడు. ఆ తరువాత రావణుడు వ్యాసమునిని “నీవు కూడా నీ కోసం ఒక భవంతిని నిర్మించుకోవచ్చు కదా!” అంటాడు.

అప్పుడు వ్యాసముని చిరునవ్వు నవ్వి “రావణా! నా జీవిత కాలం నాలుగు కల్పాలే. నాకు అంత సమయం లేదు. ఇల్లు కట్టుకుంటూ ఉన్న ఈ కొంచెం సమయాన్ని నేను వృధా చేయలేను. ఇక్కడ నేను ఉండేది కేవలం నాలుగు కల్పాల కాలం మాత్రమే. ఎందుకు నేను ఇల్లు కట్టి సమయం వృధా చేసుకోవాలి?” అని అంటాడు.

రావణుడు జీవించినది కేవలం ఒక కల్పమే. దాని కోసం అతను అంత పెద్ద భవంతిని నిర్మించుకున్నాడు. వ్యాసుడు నాలుగు కల్పాలు జీవించాడు. రావణుడి కంటే నాలుగు రెట్లు ఎక్కువ కాలం జీవించాడు. అయినా కూడా ఇల్లు కట్టుకోవటం సమయాన్ని, తన జీవితంలో ఒక భాగాన్ని వృధా చేయటమే అని అనుకున్నాడు.

కాబట్టి ఎవరయితే తనకోసం ఇల్లు కట్టుకోవాలి అని ఏమాత్రం అనుకోని వ్యక్తి, పూర్తిగా భక్తితో నిండి ఉండే వ్యక్తి నాకు ప్రియమయిన వాడు అని శ్రీకృష్ణుడు చెబుతాడు.

ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలి. నేను భక్తుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారు నన్ను అడుగుతుంటారు “స్వామీజీ! ఇది కొత్త స్థలం. ఇల్లు మీకు కొత్త కదా! మీకు నిద్రపట్టిందా?”

నేను వాళ్ళకి చెబుతాను, ఎప్పుడయితే మీకు ఒక ఇంటితో మాత్రమే సంబంధం ఉంటే, అప్పుడు కొత్త చోటికి వెళ్ళినప్పుడు కష్టపడతారు. మీకు ఏ ఇంటితో ఎక్కువ అనుబంధం లేకపోతే మీరు ఎక్కడికి వెళితే అదే మీ ఇల్లు అనుకుంటారు.

ఆశ్రమ రికార్డుల ప్రకారం గత రెండేళ్ళలో నేను 1200 ఇళ్ళకి వెళ్ళాను. కొన్ని లీనమయిపోతుంది. మనం భగవంతునితో ఒకటిగా అయిపోతాము. అప్పుడు అందరూ మనవారే అయిపోతారు. అప్పుడు స్నేహితులు, శత్రువులు అనే తేడా ఉండదు. మనం ప్రకృతిలో ఒకటి అయిపోతాము. అప్పుడు చలి, వేడి అని అనుకోము కదా! దానితో అసౌకర్యంగా ఉండే ప్రశ్న లేదు. ఈ అనంత విశ్వంలో మనమూ ఒక భాగమయినప్పుడు అంతా ఒక్కటే అని అనుకున్నప్పుడు ఇంకా గౌరవం అగౌరవం అనే మాట ఉండదుగా.గౌరవం, అగౌరవం ఎవరి నుంచి? ఎవరితో? అనుభవమూ, అనుభవం పొందే వ్యక్తి ఇద్దరూ ఒక్కటే. అనుభూతిని వెల్లడి చేయటం, అనుభవము అన్నీ ఒక్కటే.

శ్రీ కృష్ణుడు మన అందరినీ ఒక స్థితికి తీసుకువెళుతున్నాడు. అదే శ్రీకృష్ణుని యొక్క చేతనస్థితి. అదే భగవంతునిలో ఒకటిగా విలీనమయ్యేస్థితి. ఆ భగవంతుని లోనే ద్వైతం అంతా విలీనం అయిపోతుంది. శ్రీకృష్ణుడు భగవంతునిలో భక్తితో విలీనం అయ్యే భక్తియోగం అనే ఈ అధ్యాయాన్ని ఈ మాటలతో ముగించుతున్నాడు.

ధర్మం అంటే ఆధ్యాత్మిక నీతి. దీనికి సమాజం చెప్పే నీతినియమాలకి, రూల్స్‌కి ఏమీ సంబంధం లేదు.

రూల్స్‌ని పాటించకపోవటం మానవుల లక్షణం. స్పీడు తక్కువగా వెళ్ళాలి అని రూల్ ఉంటే, అక్కడ పోలీసు లేకపోతే స్పీడుగా కారు డ్రైవ్ చేస్తూ వెళతారు. రూల్స్ అంటే మన స్వేచ్ఛని అణిచేస్తాయి అనే ఒక ఆలోచన ఉంటుంది.

సమాజపు రూల్స్ మన స్వేచ్ఛని తగ్గించి, మనని అన్ని రకాలుగా వెల్లడి చేయనీయవు. రూల్స్ అనగానే అవి ఎదుటి వారికే కానీ, మనకి కాదు అని అనుకుంటారు.

మతపరమైన రూల్స్ ఇంకా ఘోరమైనవి. అవన్నీ ఆశ, భయం అనే సూత్రాల మీద తయారు చేయబడ్డాయి. వాటిని కేవలం అందరినీ నియంత్రించాలనే ముఖ్య ఉద్దేశంతో తయారు చేశారు. సమాజంలోని నాయకులలా తమకి రాజ్యాంగపరమైన అధికారాలు లేవు అని మతాధికారులకి తెలుసు. కాబట్టి వాళ్ళు చాలా సూక్ష్మంగా రూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ అందరినీ తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే. అందులో ఒకటి పాపం.

పాపంతో పాటు మతం. స్వర్గం నరకం అనేవాటిని కూడా సృష్టించింది. స్పష్టంగా అర్థం చేసుకోండి. స్వర్గం, నరకం అనేవి ఎక్కడా లేవు. అవి మీ మైండ్‌లో ఉంటాయి. మీరు పాపం ఎందుకు చేస్తారంటే, మీరు మానసికమైన నరకంలో ఉంటారు కాబట్టి. అంతేకానీ మరొకటి కాదు. మీరు పాపం చేశాక నరకానికి వెళ్ళరు.

అయితే మతం అనేది బ్రతకాలి కదా! బ్రతకాలి అంటే అందరినీ కంట్రోల్ చేయాలి. వాళ్ళు మిమ్మలని భగవంతుడే, భగవత్ స్వరూపాలే అని తెలుసుకోగలిగితే, వాళ్ళు విమ్మలని ఎలా నియంత్రిస్తారు. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఉండగలిగే (జీవించే) అవకాశం తగ్గిపోతుంది. మతాధికారులు అలా నిలబడాలంటే, వాళ్ళు మిమ్మలని ‘పావులు’ అని అనాలి. వాళ్ళు మిమ్మలని మతం మాత్రమే మోక్షమిస్తుంది అని నమ్మించాలి. మీలో పాపాలు పోవు అని చెబుతారు. ఎందుకంటే మీరు పుట్టుకతోనే పావులు అని అంటారు.

అర్థం చేసుకోండి. మీరు పావులు కాదు. మీలో భగవంతుడు ఉన్నడు. మనలో ఉండే ఒకే ఒక పాపం మనలోని భగవంతుడిని గుర్తించలేకపోవటమే. కాబట్టి మనం మోక్షం కోసం పాట్లు పడనవసరం లేదు. మీ లోపలి భగవంతుడిని తెలుసుకోండి.

హిందూ పవిత్ర గ్రంథాలలోఆధ్యాత్మిక సత్యాలని ‘యామా’ అంటారు. అవి : సత్యం, అహింస, ఆస్తేయ, అపరిగ్రహ : బ్రహ్మచర్యం ఇవన్నీ టెన్ కమాండ్ మెంట్స్ వంటివే.

సత్యం : సత్యం అంటే నిజము. ఆలోచనలలో మాటలలో మనం చేసే పనులలో సత్యం ఉండాలి. మన అంతరంగంలో ఏముందో అదే బయటికి ప్రదర్శించాలి. సత్యాన్ని ప్రకటించాలి అంటే మనం వర్తమానంలో ఉండాలి. ఎప్పుడయితే, మనస్సు, అహంకారం అనేవి ఈ విషయంలో కల్పించుకోవో, అప్పుడు మనం బయటికి చెప్పేవాటిని వడపోయము. అప్పుడు మన అంతరంగంలో ఉన్నది ఉన్నట్టుగా బయటికి చెప్పగలము.

అహింస : మన ఆలోచనలు, మాటలు పనులలో అహింస అనేది పూర్తిగా ఉండాలి. అహింస అనేది మనం సామూహిక చేతన స్థితిని అర్థం చేసుకున్నప్పుడు దానిని పాటించగలము. సామూహిక చేతనస్థితిలో మనందరం ఈ విశ్వంలో ఒక భాగం, అందరం ఒక్కటే అని తెలుసుకుంటాము. ఎప్పుడయితే ఈ విషయాన్ని

ప్రశ్నలు - సమాధానాలు :

చాలా అధ్యాయాలకి సంబంధించి, చాలా ప్రశ్నలు వచ్చాయి. వీటిలో కొన్ని ప్రశ్నలకి జవాబులు ఇస్తాను. తరువాత ఈ సెషన్ ముగించదాము.

ప్ర : స్వామీజీ! సంస్కృతంలో డైవోర్స్ (విడాకులు) అనే మాట లేదు అని అన్నారు. కానీ పశ్చిమ దేశాలలో ఇది సత్యం. ఆధ్యాత్మికంగా విడాకులు సాధ్యమేనా?

జ : స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఆధ్యాత్మికాలు అయితే విడాకులు అవసరం లేదు. మీరు విడాకులు కావాలి అని అనుకుంటే ఏదో ఒక పెద్ద సమస్య ఉండి ఉంటుంది. అర్థం చేసుకోండి. నిజమైన ఆధ్యాత్మికత మిమ్మలని ఒక మంచి భర్త, మంచి భార్యగా తయారు చేస్తుంది. మీరు అబ్బే! లేదు నా భర్త అసలు ఆధ్యాత్మికంగా ఉండడు, అతను నా పంథాలో నడవడు ఇలాంటి ఫిర్యాదులు చేయవద్దు. మీరు ఎందుకు ఫిర్యాదులు చేస్తారంటే మీరు ఏదో ఆశించుతారు. అందుకే.

మన సంస్కారాలు, అంటే మన పాత జ్ఞాపకాలమీద ఆధారపడి ప్రస్తుతం మన చుట్టు ప్రక్కల ఉన్న వాటిని చూస్తాము. మనం ప్రతి ఒక్కరం మనకి అనువైన మూసలని తయారు చేసుకుంటాము. ఆ మూసలో, ఆ ప్రేమలో మాత్రమే మన జీవిత భాగస్వామిని చూస్తాము. మనం జీవిత భాగస్వామిని వెతుక్కోవటం అనేది ప్రకృతి సహజంగా జరిగే ఒక ప్రక్రియ. దీనివలననే మానవజాతి అనేది ఈ భూమి మీద నిలవగలుగుతుంది.

మనం చూసేది మనకి దొరకదు. మనం ఒక అందమయిన దృశ్యాన్ని చూసి, అది అందమయినది అనుకొని ప్రేమలో పడతాము. అర్థం చేసుకోండి. మనం ఎప్పుడూ నేను మీకు ఒక విషయం చెబుతాను. మీరు దేనినైతే ప్రొజెక్టు చేస్తారో దానినే చూస్తారు. ఇది మీ అహంకారాన్ని గాయపరచవచ్చు. కానీ మీరు లోపలకి చూడండి. మీరు కూడా సమస్యకి కారణమే అని తెలుస్తుంది. ఎవరూ మిమ్మలని మీ అనుమతి లేకుండా బాధపెట్టరు. ఎవరూ మీ అంగీకారం లేకుండా మీ నిశ్చలతని భంగం చేయరు. ఎవరూ మీ అనుమతి లేకుండా మిమ్మలని అధీనపరచుకోరు.

మీకు ఏదో స్వార్ధం ఉండి ఆ వ్యక్తిని మీ జీవితం లోనికి రానిస్తారు. మీకు సరిపడని వ్యక్తిని ఆకర్షించి మీ జీవితంలోనికి రానివ్వటం అసలు ఆధ్యాత్మికత కాదు. అంటే మీ అంతరంగంలో మీ అసలయిన ఉనికి దగ్గర ఏదో సమస్య ఉన్నది. దానిని వెతకండి. దానికి చికిత్స చేయండి. అప్పుడు అన్నీ స్పష్టమై శుభ్రపడతాయి.

ప్ర : నేను మరణానికి సమీపంగా వెళ్లిన వ్యక్తుల మరణ అనుభవాన్ని చదివాను, వారి దగ్గర విన్నాను. అది శరీరం బయట జరిగి అనుభవం. అందరూ కూడా దానిని చాలా అందమయిన అనుభవం అని చెప్పారు. మరి దానిని గీత ఎందుకు బాధతో కూడిన విషయంలో చెబుతుంది. వెయ్యి తేళ్ళుకుట్టిన బాధ అని ఎందుకు అయింది?

జ : అర్ధం చేసుకోండి. నేను మరణ అనుభవం గురించి మాట్లాడింది, ఒక సామాన్య మానవుని యొక్క మరణ అనుభవం. కానీ ఇక్కడ మీరు చెప్పినది 'నేను మరణాన్ని సమీపించిన వారి అనుభవాన్ని చదివాను విన్నాను' అని ఎప్పుడయితే మీరు 'నేను చదివాను' అని అంటారో మీరు చదివింది వారి అనుభవాన్ని. మీరు విన్నది కూడా మధ్యవర్తుల ద్వారా వినటమే, లేదా ఆధ్యాత్మిక సంబంధమయిన వ్యక్తుల ద్వారా వినటమే. అందుకే వారికి అనుభవం అయ్యి తిరిగి వెనక్కి వచ్చారు.

నేను చెప్పే విషయం మరణించిన వారి సంగతి. వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయిన వారే. మీరు చెప్పేది వారు అనుభవమయ్యక వెనక్కి వచ్చిన వారి సంగతి. అనుభవం

అయ్యి వెనక్కి వచ్చారు అంటే అది ఆధ్యాత్మిక అనుభవం. అది మరణ అనుభవం కాదు. కానీ నేను మీతో చెప్పినది నిజమైన భౌతికమైన మరణం గురించి, అంతేకాని సచేతన స్థితిలో జరిగే మార్పు గురించి కాదు.

రమణ మహర్షికి జరిగిన అనుభవం ఆయన చేతనస్థితిలో జరిగింది. కానీ నేను మీకు వివరించినది మామూలు వ్యక్తికి సంభవించే భౌతిక మరణం. ఆ తేడా అర్థం చేసుకోండి. ఇది ఒక సాధారణమయిన మనిషికి సంభవించే మరణం.

నా అనుభవమయిన సత్యం ఏమిటీ అంటే, మరణ సమయంలో ఆత్మ ఏడు శక్తి దశలు (పొరలను) దాటి, వాటి గుండా వెళుతుంది. అప్పుడు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అక్కడ ఆత్మ తిరిగి గుర్తు చేసుకుంటుంది. అన్ని సంఘటనలు వివరాలతో సహా చూడగలుగుతుంది. అప్పుడు ఆత్మ యొక్క ఉనికి బాధలని, ఆనందాన్ని, అపరాధ భావాన్ని కోరికలని అన్ని రకాల భావావేశాలని బయటకి చూపిస్తుంది. అదే మీరు నరకం, స్వర్గం ద్వారా వెళ్ళటం అంటే.

అప్పుడు అనుభవించే బాధనే వేయి తేళ్ళు ఒకేసారి శరీరాన్ని కుట్టిన బాధ, శరీరం మొత్తాన్ని కొట్టిన బాధ. ఈ బాధ నుంచి తప్పించుకోవాలి అంటే మీకు అంతిమ సత్యం యొక్క క్షణ దర్శనం జీవితంలో ఒక్కసారియినా జరగాలి. దానిని మీరు ధ్యానం ద్వారా సాధించగలరు.

నిత్యానంద స్ఫురణ కార్యక్రమంలో నేను మిమ్మలని మరణ సమయంలో ఆత్మ వెళ్ళే ఆ ఏడు శక్తి మార్గాల గుండా తీసుకువెళతాను. మిమ్మలని మీ సంస్కారాల (పాత జ్ఞాపకాల) మీద ధ్యానం చేయమంటాను. అది ప్రతి దశలోనూ జరుగుతుంది. అప్పుడు మీలోని సంస్కారాలన్నీ కరిగిపోతాయి. దాంతో మీకు బాధలేని మరణం సంభవిస్తుంది. మీకు పునర్జన్మ ఉండదు.

ప్ర॥ స్వామీజీ, శ్రీకృష్ణుడు తన భక్తులు ఎప్పటికీ నశించరు అని అన్నారు కదా. ఎలా సాధ్యం? మీరు అలా ఎలా చేస్తారు? శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెబుతాడు, నేనే సర్వస్వం అని వేరే ఏదీ లేదు అని” అన్నారు.

అప్పుడు నేను వారికి ఈ విధంగా వివరించాను. మహాభారత యుద్ధం తరువాత అర్జునుడు, శ్రీకృష్ణుడు బయట వ్యాహ్యాళికి వెళతారు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో “ శ్రీకృష్ణా! యుద్ధ ప్రారంభంలో నీవు నాకు చాలా విషయాలు చెప్పావు. కానీ నాకు ఏమీ గుర్తులేదు. దయచేసి నాకు మరొకసారి ఆ విషయాలు చెప్పగలవా?”

కృష్ణుడు చిరునవ్వు నవ్వి “ఓ!అర్జునా! నేను కూడా మర్చిపోయాను. అయ్యో! ఏమీ అనుకోవద్దు. నేను ఆ విషయాలన్నీ మరిచిపోయాను. ” అని అంటాడు.

అర్జునుడు కొంచెం కలవరపాటు పడి ఇలా అడుగుతుంది. “కృష్ణా అది ఎలా సాధ్యం”.

ఆ ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా జవాబు ఇస్తాడు. “నేను నీకు యుద్ధ భూమిలో ఆ విషయాలు చెప్పినప్పుడు, నేను అత్యున్నత చేతనస్థితి కలిగిన పరబ్రహ్మ శ్రీకృష్ణుడిని. ప్రస్తుతం నేను మామూలు వసుదేవ కృష్ణుణ్ణి. రూపంలేని విశ్వశక్తిగా ఉండి నేను నీకు ఏమి చెప్పానో నాకు గుర్తులేదు.

అయితే కరుణామూర్తి, ప్రేమమూర్తి అయిన శ్రీకృష్ణుడు మరొక సారి అర్జునునికి తన బోధలలోని ముఖ్యమైన విషయాలు చెబుతాడు. దానినే మనం అనుగీత అంటాము.

ఎప్పుడైతే శ్రీకృష్ణుడు దివ్యచేతనస్థితి అని అర్థం చేసుకుంటారో అదే దైవత్వం. అది ఏ రూపంలో అయినా ఉంటుంది, దానిని మనం ఏ రూపంలో అయినా పూజించవచ్చు అని చెప్పాను. వారు తృప్తి చెందారు.

శ్రీకృష్ణుడు “నా భక్తులకు నాశనం ఉండదు 'అని చెప్పినప్పుడు ఆయన పరబ్రహ్మ శ్రీకృష్ణ. ఆ స్థితిలో ఆయన మనందరిలో ఉంటాడు. ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటామో, మనం ఆయన భక్తులు అవుతాము. మనం కూడా కృష్టులం అవుతాము. మనం శ్రీకృష్ణుని చేతనస్థితిలో ఒక భాగం అవుతాము. మనకి నాశనం ఉండదు.

ప్ర॥ స్వామీజీ! దయచేసి సంస్కారాలని (మనలో ఉండిపోయిన జ్ఞాపకాలని) ఎలా పూర్తిగా వదలగమో, ఎలా సర్వస్వం వదిలి ఆధీనులం అవ్వగలమో వివరించండి.

జ॥ మీరు సంస్కారాలని, సర్వస్వాన్ని ఎలా వదిలి ఆధీనులు అవ్వాలో అడుగుతున్నారు. మీరు రేపు ఎల్లుండి క్లాసులకి రండి. ఆ వివరాలు చెబుతాను. తరువా రెండు రోజుల ఉపన్యాసమంతా సంస్కారాల మీద ఉంటుంది. మనం మన ప్రతి సంస్కారం మీద చాలా లోతుగా పనిచేస్తాం. కోరికల సంస్కారాలు, అపరాధభావ సంస్కారాలు, వ్యధ ఇలా ఒక్కొక్క దాని మీద పనిచేస్తాం.

అప్పుడు ఉపన్యాసమే కాదు మీరు ఏదయినా అడగవచ్చు, చెప్పవచ్చు. మనందరం కలసి సంస్కారాల మీద కొంత పని చేస్తాము. ముఖ్యంగా గుణత్రయ యోగా అధ్యాయాలలో మనం పూర్తిగా సంస్కారాల గురించి నేర్చుకుంటాము. మనం వీటి గురించి చూస్తాము. (ఈ అధ్యాయాలు వేరే పుస్తకాలలో ఉన్నాయి)

ప్ర॥ గౌరవనీయులైన స్వామీజీ, శవాసనం (పదుకుని వేసే ఆసనం) ధ్యానానికి పనికి వస్తుందా? లేక మేము కూర్చోని మాత్రమే ధ్యానం చేయాలా?

జ॥ మీరు పడుకుంటే నిద్రపోతారు. నిజానికి కూర్చొని కూడా నిద్రపోతారు. సహజంగానే పడుకోగానే నిద్రపోతారు. కాబట్టి పడుకుని ధ్యానం చేయకండి. లేదా మహాశివ రాత్రి అంటే పవిత్రత అత్యున్నత స్థాయిలో ఉన్న సమయం అని అర్థం. మీరు నిజాయితీగా తెలుసుకునేతత్వంతో చేసే ప్రార్ధనలను ఆ భగవంతుడు స్వీకరించి మీకు జవాబు ఇస్తాడు. ఆ పూజలు, ప్రార్థనలు అందరికీ మంచి చేసేవిగా ఉంటే ఆ ప్రార్థనలకి భగవంతుడు సమాధానం ఇస్తాడు.

నేను మీకు ఇంతకు ముందే చెప్పాను. స్వర్గం అనేది లేదు. అది కేవలం మతాల డిక్షనరీలోనే ఉన్నది. అది ఏదో ఒక స్థలం కాదు. అది మీ మైండ్‌లో ఉన్నది. మీరు చేతనస్థితిని చేరితే పరమానందాన్ని పొందగలుగుతారు. అప్పుడు మీరు స్వర్గంలోనే ఉంటారు.

ప్ర॥ ఒకవేళ ఎవరికైనా ఏ లక్ష్యం లేదనుకోండి. అప్పుడు పరమానందాన్ని పొందటం అనేదే ఒక లక్ష్యం అవ్వదా? దయచేసి దీనిని నేను అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి.

జ॥ పరమానందాన్ని పొందటం అనేది మీ లక్ష్యంగా చేసుకోకండి. అలా చేస్తే మీరు దానిని కోల్పోతారు. అంతా గందరగోళం అయిపోతుంది. మీ గోల్స్ల (లక్ష్యాలన్ని)న్ని వదిలి వేయండి. అప్పుడు పరమానందం మీలో జరుగుతుంది. మీరు పద్మాన్ని వికసించేలా చేయలేరు. మీరు దానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించి, అది వికసించే వరకూ ఎదురు చూడాలి. అప్పుడు ఆ పద్మం దానంతట అదే వికసిస్తుంది. మీరు ఈ విషయంలో ఏమీ చేయలేరు. మీరు రేకులని బలవంతంగా విప్పితే ఆ పుష్పం చనిపోతుంది. అది జీవంలేని పుష్పం. మీరు జీవం లేని ఆనందాన్ని అతికించిన నవ్వుతో పొందటానికి ప్రయత్నించవద్దు. మీ చిరునవ్వు మీ అంతరంగం నుంచి రావాలి. అది మీలోని సంతోషంతో ఉప్పొంగి ప్రవహించాలి.

మీరు ఒక మొక్కని నాటితే దానికి కావలసిన సరియైన పరిస్థితులని కల్పించాలి. కాబట్టి ఒక్కొక్కసారి వంటలో అన్నీ వేసినా అది మనం అనుకున్నట్టుగా తయారవదు. కానీ ఒక కూర చేయాలంటే దానిలో చాలా రకాల వస్తువులు వేయాలి. అలాగే ధనవంతునిలా జీవించాలి అంటే మీరు చాలా విషయాలను జీవితానికి కలపాలి. బాధ్యత, నిర్ణయాలు చేయగల నైపుణ్యం, ధైర్యం, జీవితాన్ని ఎదుర్కొనగల నేర్పు, ఇలాంటివన్నీ మీ జీవితంలో కలపగలిగితే, మీరు ధనవంతులుగా జీవించవచ్చు. దాని కోసం మీరు వేరే జన్మవరకూ చూడనవసరం లేదు.

కొంతమంది నన్ను అడుగుతుంటారు. 'ఎవరూ కూడా బిక్షగాళ్ళుగా జన్మించాలి అని అనుకోరు : అది అసాధ్యం. అప్పుడు ఎందుకు బిక్షగాళ్ళు ఉంటారు?

జీవితంలో చాలా ధనవంతుడయిన వ్యక్తి, చాలా ఆస్తి కూడ బెట్టి ఉండవచ్చు. ఇప్పుడు అతని ఆత్మకి ఇంక ఆస్తి మీద కోరిక లేకపోవచ్చు. అతనికి ఏమాత్రం బాధ్యతలు లేని జీవితం కావాలనిపించవచ్చు. దాన్నే వాసన అంటారు. ఆ ఆత్మ, మైండ్ అలా అయిపోయి అది ఆత్మలో ఉండి ఉంటుంది. అందుకే ఆత్మ బిక్షగాని జీవితాన్ని, ఎటువంటి బాధ్యతలూ లేని జీవితాన్ని కోరుకున్నది.

ప్ర॥ గౌరవనీయులయిన స్వామీజీ, నేను రూపంలేని దేవుడిని ఆరాధించుతాను. నేను మీ శిష్యుడిగా ఉండవచ్చానా? నేను మిమ్మలని అనుసరించ వచ్చునా?

జ॥ అర్థం చేసుకోండి. నేను ఈ ప్రశ్నకి జవాబు ఇచ్చాను. మీరు రూపం లేని రూపంలో భగవంతుని ఆరాధించేవారయితే నన్ను తేలికగా అర్థం చేసుకుంటారా? నాతో అనుబంధం పెంచుకో గలరా? నేను చెప్పాను. నేను నా శిష్యులకి స్పష్టమైన సూచనలు ఇస్తాను. వాళ్ళు నారూపం మీద ధ్యానం చేయకూడదు. అలా చేయలేరు. వాళ్ళు చేతనస్థితిలో అనుభవం లోనికి వెళ్ళగలిగాలి. వాళ్ళు నారూపంతో ఆగిపోకూడదు. అక్కడ చిక్కుపడిపోకూడదు. నా రూపమే కాదు ఏ గురువు రూపంలోనూ చిక్కి ఉండిపోకూడదు. ఎందుకు రాదు అనే విషయాలు ఏమీ తెలియవు. దీని గురించి మనం ఏమీ చేయలేము. అదే విధంగా పరాశక్తి నిర్ణయం కూడా మనకి ఏమీ తెలియదు.

జ్ఞానోదయమైన యోగికి సంస్కారాలన్నీ కరిగిపోతాయి. ఆయనకి వాసన (కోరిక)లు ఉండవు. పునర్జన్మ ఉండదు. తిరిగి పుట్టాలి అనేది ఆయన నిర్ణయం కాదు. ఇక్కడ ఏదో ఉంది అది గర్భంలోనికి లాగుతుంది.

నేను పుట్టినప్పుడు అక్కడ ఒక కాంతి ఉన్నది. అదే అరుణాచలం. ఆ కాంతి నాశక్తికి దారి చూపించినది.

రామకృష్ణ పరమహంస తన పునర్జన్మ గురించి ఇలా చెబుతారు. జ్ఞానోదయమైన కొందరు యోగుల మధ్య పసిబిడ్డ కనపడతాడు. ఆ పసిబాలుడిని వారంతా దీవించుతారు. ఆ బాబు రామకృష్ణ ఆయనో తిరిగి మానవునిగా జన్మించుతారు. ఆయనని దీవించిన ఒక యోగి వివేకానందుడు. జ్ఞానోదయం పొందిన యోగులు సృష్టించే శక్తివలయమే దైవం. అంతా పరాశక్తి నిర్ణయం.

ప్ర॥ గౌరవనీయులైన స్వామీజీ, ప్రతి రోజు నేను ఇక్కడికి వచ్చి చాలా చక్కని విషయాలు నేర్చుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. వెనక్కి వెళ్ళాక కొంచం అయోమయంగా ఉంటుంది. అసలు ఏమి జరుగుతుంది.

జ : మీకు సరియైనదే జరుగుతుంది. దీని గురించి బాధ పడవద్దు. మీలో ఏమి జరుగుతుందో అది సరియైన విషయమే. ముందు దశలలో ఇలానే ఉంటుంది. మీరు అయోమయాన్ని, మానసిక వ్యధని లెక్కించండి. మీ దీవెనలని లెక్కించండి. చూడండి, చంద్రుడు తన వెన్నెల కాంతిలో మచ్చలు చూపించుతాడు. అదేవిధంగా ఎందుకు అయోమయంలో ఉన్నారు అని తెలుసుకోవచ్చు. మీరు మానసికంగా వ్యధ చెందుతున్నారు. మీరు అయోమయంలో ఉన్నారూ అని తెలుసుకున్నారు అంటే మీరు తెలివైనవారు అని అర్థమవుతుంది. అది మీ తెలివితేటలలో చక్కని వృద్ధిని సూచిం చతుంది. ఆ ప్రకాశం వ్యాపించటం మొదలయింది.

మీకు ఆలోచనలు లేనప్పుడు మీలో అయోమయం ఉండదు.మీకు ఉన్నతస్థితికి చేరే క్లూ దొరకదు. మీరు మీ పనులలో, అంటే తినటం, ఆడుకోవటం, పనిచేసుకోవటం వీటితో చాలా సంతోషంగా ఉంటారు. ఆలోచనలు లేనివారు వారి పద్ధతిలో వారు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఆలోచించరు. వారు మనుషులలా ఆలోచించరు. వాళ్ళు వెతికే ఆనందం, పశుపక్ష్యాదులు వెతికే సంతోషం అది. వాళ్ళు ఆ దశలో ఉండే ఆనందంతో తృప్తిపడతారు. ఆ విధంగా జీవించి మరణించుతారు.

ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో, మీకు సమస్యలు ప్రారంభమవుతాయి. మీరు ఇక్కడ ఉండి చేయవలసిన పని చేయటం లేదు అని తెలుసుకోగలుగుతారు. మీరు ఒక ఉద్దేశం కోసం వెతుకుతారు. మీరు అయోమయంలో ఉంటారు. స్థిరంగా ఉండలేరు. కొంతకాలం మీరు ఎంతోకాలంగా అనుభవిస్తున్న సుఖాలకి ఆకర్షింపబడతారు. తరువాత వాటిని తిరస్కరించుతారు. అవి మీకు ఆనందాన్ని ఇవ్వవు అని తెలుసుకుంటారు. ప్రకాశాన్ని చూస్తారు. క్రమంగా, నెమ్మదిగా, చాలా నెమ్మదిగా చీకటి నుంచి వెలుతురు వైపు వెళతారు. అక్కడ మీకు గురువు దొరుకుతాడు. అక్కడ నుంచి ఆయన మిమ్మలని అజ్ఞానం అనే చీకటి నుంచి సత్యం అనే వెలుగు వైపు తీసుకువెళతాడు.

అప్పుడు మీరు మైండ్ లేని స్థితికి చేరతారు. అప్పుడు ఆలోచనలు ఉండవు. అది మీకు అంతకుముందు ఉన్న ఆలోచనలు లేని స్థితి కాదు. అది దైవత్వంతో కూడిన స్థితి. ఇది ఆత్మప్రభోధ స్థితి. ఆలోచనల స్థితి తార్కికమయిన మానవస్థితి.

భగవద్గీతలోని సంభాషణలు మొత్తం అర్జునుని అయోమయం వలన వచ్చినవే. అర్జునుడు మామూలు ఆలోచనలు ఉన్న మనిషిగా అడిగిన అనుమానాలే. వాటిని శ్రీకృష్ణుడు ఆలోచనలు లేని స్థితి నుంచి నివృత్తి చేస్తాడు. అదే శ్రీకృష్ణుని అత్యుత్తమ చేతనస్థితి. అనుమానాలు, అయోమయం మనుషుల లక్షణం. అవన్నీ కూడా ఆలోచనలు లేని స్థితి నుంచి అసలు ఆలోచన అనేది ఉండని (నో మైండ్) ఉత్తమ స్థితికి వెళ్ళే సమయంలో జరిగే విషయాలు.

ప్ర॥ గౌరవనీయులయిన స్వామీజీ, నాకు ఒక ప్రశ్న ఉన్నది. మీరు మెడిటేషన్ మీద లాస్ యాంజెలీస్లో ఏవైనా కార్యక్రమాలు చేయబోతున్నారా?

జ॥ గీతా జ్ఞాన యజ్ఞం అయ్యాక ఆరోగ్య స్ఫురణ కార్యక్రమం ఉంటుంది. అది ఆరోగ్యం గురించి ఉంటుంది. అది మీశరీరం, మనస్సు, ఆత్మలని ఆరోగ్య దిశగా తీసుకువెళుతుంది. అది మీ శరీరానికి, మనస్సుకి, ఆత్మకి చక్కని చికిత్సా పద్ధతిని ఇస్తుంది.

నాదృష్టిలో ఆరోగ్యం, ఆధ్యాత్మికత రెండూ ఒక్కటే. ఎప్పుడు మీరు నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే, మీరు చాలా ప్రత్యేకమయిన ఆరోగ్యాన్ని అన్ని దశలకూ వ్యాపింపచేస్తారు. అది మీ శరీరానికి అతీతంగా ఉంటుంది. శరీరం అనారోగ్యమయం, అందుకే ఇంక ఏవిధమయిన అనారోగ్యం దానిమీద దాడి చేయలేదు. శరీరమే అనారోగ్యం కాబట్టి నా దృష్టిలో మీరు ఎప్పుడైతే హద్దులు లేని స్వేచ్ఛని పొందుతారో, అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.

ఈ రెండు రోజుల కార్యక్రమం మీరు హద్దులులేని చేతన స్థితిని పొందటానికి, హద్దులు లేని స్వేచ్ఛని పొందటానికి సహాయం చేస్తుంది. సహజంగానే అది మన శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. లైఫ్ బ్లిస్ ప్రోగ్రాం ధ్యానపీఠం ఆచార్యులు నిర్వహించుతారు. నేను రెండు సెషన్స్ కి మాత్రం ఉంటాను. అయితే నేను పూర్తిగా ఆరోగ్య స్ఫురణ కార్యక్రమం తీసుకుంటాను. నేను అమెరికాలో నిత్యానంద స్ఫురణ కార్యక్రమం చేయటం లేదు. ఒకటి మాత్రం వేంకోవర్ లో చేస్తాను.

నేను మా ఆశ్రమంలో ఉండేవారికి మాత్రం పూర్తి శిక్షణని ఇస్తున్నాను. దీనిలో హీలర్స్ కూడా పాల్గొనవచ్చు. మీరు హీలరుగా నాచేత నియమించబడితే, మీరు ఈ క్లాసుకి రావచ్చు. నేను గీతా జ్ఞాన యజ్ఞం అయ్యాక రాత్రిపూట క్లాసులు తీసుకుంటున్నాను. ఉదయం క్లాసులకి ఎవరయినా రావచ్చు. కానీ సాయంత్రం క్లాసు మాత్రం కేవలం హీలర్స్ కే. ఎందుకంటే అందులో ధ్యానం చాలా లోతుగా, తీవ్రంగా ఉంటుంది. నేను ఆశ్రమం వారితో ఎక్కువ సమయం ఉండాలి కాబట్టి నేను వేరే కార్యక్రమములు చేయటం లేదు. కేవలం ఆరోగ్య స్ఫురణ కార్యక్రమం ఒకటే చేస్తున్నాను.

ప్ర॥ ప్రియమైన స్వామీజీ, మహాభారతయుద్ధంలో అందరూ అవినీతి పద్ధతులలోనే యుద్ధం చేశారు. ఎందుకు?

జ॥ మహాభారత యుద్ధం మొదలులో అందరూ ధర్మాన్ని అనుసరించారు. అందరూ నీతి మార్గంలో ఉండేవారు. ఆ తరువాత అధర్మం మొదలయింది. అవినీతితో, రాత్రిపూట చంపటం ఇలా జరగటం మొదలయింది. ఉప పాండవులని నిద్రపోయే సమయంలో చంపేసారు. అర్జునుడు కర్ణుణ్ణి, చేతిలో ఆయుధాలు లేని సమయంలో చంపాడు. అభిమన్యుణ్ణి, చేతిలో ఆయుధం లేని సమయంలో అందరూ కలసి చంపారు. అప్పుడు అతను చాలా చిన్నవాడు. అతనిని అతని తాత కళ్ళముందే బంధువులే చంపేసారు.

మీరు అడిగిన ప్రశ్న సరియైనదే. అసలు అప్పుడు ఏమి జరిగిందంటే యుద్ధ ప్రారంభంలో ధర్మం ఉండేది. క్రమంగా కౌరవులు అధర్మం మొదలుపెట్టారు. అద్భుతంగా ఉన్నది అనుకోండి. మీకు నిజంగా ఉన్నదా లేదా అనే విషయం పట్టించుకోవద్దు. అలా చేయండి. అంతే. అప్పుడు సర్వాంతర్యామికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు అంత అందమయిన తలని, జుట్టుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ విధంగా మీరు మీ శరీర భాగాలన్నింటినీ స్పృశించి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పండి.

ఇలా చేయటానికి మీకు 10 నిముషాల సమయం పట్టవచ్చు. ఇది చాలా శక్తివంతమయిన సుఫీ పద్ధతి. ఇలా చేస్తే మీ మూడ్ బాగా ఉండటమే కాదు, మీ మీద మీకు ప్రేమ పెరుగుతుంది. ఇలా చేసినప్పుడు మీకు ఇతరులన్నా కూడా ప్రేమ కలుగుతుంది. అవును. ప్రతి మేలుకొలుపు మీ జీవితాన్ని మార్చుతుంది. అయితే అలా మారాలి అంటే, మీరు దానిని ఎలా మార్చాలో తెలుసుకొని, దానిని మార్చనీయాలి.

మనందరం పరబ్రహ్మ శ్రీకృష్ణుని ప్రార్ధించుదాము. ఆయన మనవి భక్తియోగంలో సత్యాలని మనకి అనుభవం కలిగేలా చేయమని, ప్రతి ఒక్కరినీ మనం ప్రేమించగలిగే శక్తినివ్వమని ప్రార్ధించుదాము. మనందరికి సచేతనమయిన భక్తిని ప్రసాదించమని, ప్రేమని ఇవ్వమని శాశ్వతానందమయిన నిత్యానందాన్ని దాని అనుభవాలని ప్రసాదించమని ప్రార్ధించుదాము. మీరందరూ నిత్యానందపు ఆనందాన్ని అన్ని దశలూ వ్యాపింప చేయుదురు గాక. నిత్యానందం.

ధన్యవాదములు.