KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/భగవద్గీత : నేపథ్యం (Background)Sign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

భగవద్గీత : నేపథ్యం (Background)

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

భగవద్గీత దీనినే మనం గీతా అని కూడా అంటాము. దీనిని చాలా పవిత్ర గ్రంధంలా భావిస్తారు. ఇది స్మృతి. (సృతి అంటే వినటం ద్వారా ఒకరి నుంచి మరొకరు నేర్చుకునేది) మన ప్రాచీన పవిత్ర గ్రంధాలయిన వేదాలు, ఉపనిషత్తుల లాగానే ఇది కూడా స్మృతి వేదాలు, ఉపనిషత్తులు చాలా మంది అనుకుంటున్నట్టుగా భగవంతుడు ఇచ్చినవి కావు. గొప్ప గొప్ప ఋషులు సమాధి స్థితిలో ఉండగా వారికి కలిగిన జ్ఞానంతో వారిలోని అంతరంగం జ్ఞానంతో చెప్పబడినవి.

భగవద్గీత హిందూ పురాణమయిన మహాభారతంలో ఒక భాగం. ఇది శాశ్వత సత్యాలను వెల్లడి చేసే వేదాలు వంటిది కాదు. వేదాలు మహాఋషులు అంతరంగపు జ్ఞానంతో చెప్పబడిన సత్యాలు. అలాగే ఇది మహాఋషుల బోధనలయిన ఉపనిషత్తుల వంటిది కూడా కాదు. మనకి ఉన్న ఏ పురాణం కూడా గీతకున్న ప్రాముఖ్యతని కలిగిలేవు. గీత శ్రీకృష్ణుని యొక్క అత్యున్నత చేతన స్థితి నుంచి, పరబ్రహ్మ నుంచి ఉదయించినది. అందుకే దీనిని పవిత్ర గ్రంధం అంటారు.

మహాభారతం అంటే అర్థం గొప్ప భారతం. ఇది ఎంతో గొప్ప సంస్కృతి కలిగిన భారత దేశం గురించి చెబుతుంది. దీనిని భరతుడు అనే చక్రవర్తి పరిపాలించాడు. అందుకే ఈ ప్రాంతాన్ని భారతదేశం అంటారు. మహాభారత కథ, రెండు వర్గాలకి సంబంధించిన యుద్ధ కథ. వాళ్ళే కౌరవులు, పాండవులు. వాళ్ళు చాలా దగ్గర సంబంధం కలిగిన రక్త సంబంధీకులు. అంధరాజు అయిన ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజు. ఆయన వందమంది కౌరవులకు తండ్రి. ఆయన పాండురాజుకు అన్నయ్య. పాండురాజు ఐదుగురు కొడుకులూ పాండవులు.

ధృతరాష్ట్రుడు పెద్దవాడయినా, పాండురాజుని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు అంధుడు. రాజ్యపాలన చేయలేడు. అందుకని ఆ బాధ్యత పాండురాజు మీద పడుతుంది. అయితే పాండురాజు ఒక మునీశ్వరుని శాపానికి గురి అవుతాడు. అప్పుడు పాండురాజు తన రాజ్యాన్ని, బిడ్డలని ధృతరాష్ట్రునికి అప్పజెప్పి అతని భార్యలయిన కుంతి, మాద్రితో కలిసి అడవికి వెళ్ళిపోతాడు. ఈ మహాభారత కథ చెప్పిన వ్యాసుడు పాండవులు కుంతీ, మాద్రులకు దేవతల ద్వారా జన్మించినట్టు చెబుతారు. ఎందుకంటే ముని శాపం వలన పాండురాజుకు పిల్లలు పుట్టరు. కుంతి చిన్నతనంలో దైవశక్తిని ఆహ్వానించగలిగే శక్తిని వరంగా పొందుతుంది.

ధుర్యోధనుడు కౌరవుల యువరాజు. అతనికి పాండవులకి మధ్య మంచి సంబంధాలు, ప్రేమ ఏర్పడలేదు. అతని తమ్ముడు, దుర్మార్గుడయిన దుశ్శాసనుడుతో కలిసి పాండవులని చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఆ విషయంలో అతను ఎప్పుడూ విజయం సాధించలేకపోతాడు.

కుంతికి సూర్యదేవుని అనుగ్రహంతో ఒక కుమారుడు ఆమె అవివాహితగా ఉన్నప్పుడు జన్మిస్తాడు. అతనే కర్ణుడు. అతను పాండవులకంటే పెద్దవాడు. అయితే కుంతికి

శ్రీ కృష్ణుడు యాదవరాజ్యానికి రాజు. ఆయన కౌరవులకి పాండవులకి సహాయంగా ఉంటానంటాడు. ఆయన వారితో ఇలా అంటాడు, "మీలో ఒకరు నన్ను తీసుకోండి. అయితే నేను యుద్ధం చేయను. మరొకరు మా యాదవ సైన్యాన్ని తీసుకోండి". ధుర్యోధనుడు యాదవ సైన్యాన్ని కోరుకుంటాడు. అందరూ కురుక్షేత్రంలో యుద్ధానికి దిగుతారు. కురుక్షేత్రం ప్రస్తుతం హర్యానాలో ఉన్నది. శ్రీకృష్ణుడు అర్జునుని రథసారధి అవుతాడు. యుద్ధారంభంలో తన శతృ సమూహంలోని అన్నతమ్ములని, స్నేహితులని, గురువులని, బంధువులని చూసిన అర్జునుడు అవరాధభావంతో దుఃఖపడతాడు. దాంతో అర్జునుడు యుద్ధ భూమిని వదిలి వెళ్ళిపోతానంటాడు.

అప్పుడు శ్రీకృష్ణునికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత. భగవద్గీత అంటే అర్ధం భగవంతుని పాట. శ్రీకృష్ణుడు అర్జునుని ఆయుధాలు చేపట్టి శతృనాశనం చేయమంటాడు. "వీళ్ళంతా మరణించారు. నిన్ను ఎదుర్కొంటున్న వీళ్ళందరూ అప్పటికే మరణించారు. కాబట్టి ముందుకి వెళ్ళు. నీవు చేయదలచుకున్నది చేయి. అది నీ బాధ్యత" అంటాడు.

భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి. ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పటమే. ధృతరాష్ట్రుడు యుద్ధాన్ని చూడలేదు. కాబట్టి సంజయుణ్ణి అక్కడ జరిగే విషయాలు ప్రతి ఒక్క సంఘటనా వివరంగా చెప్పమని అడుగుతాడు. అప్పుడు సంజయుడు యుద్ధాన్ని యధాతధంగా అంధరాజయిన ధృతరాష్ట్రునికి చెబుతాడు. మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరుగుతుంది. చివరికి పాండవులు యుద్ధంలో గెలుస్తారు. తిరిగి తమ రాజ్యాన్ని పొందుతారు.

ఈ యుద్ధంలో కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ భగవంతునికి (నారాయణు నికి) మనిషికి (నరునికి) మధ్య జరిగిన సంభాషణ. సంస్కృతంలో వీరిని నర,

నారాయణులు అని అంటారు. అర్జునుడు అడిగిన ప్రశ్నలు, వెల్లడి చేసిన అనుమానాలు మనందరిలోనూ ఉన్నాయి. భగవాన్ శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానాలు ఏ కాలానికి అయినా ఏ సమయానికి అయినా సరిపోతాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు నేటికి కూడా అత్యంత విలువైనవే.

కొన్ని వేల సంవత్సరాల క్రితం అర్జునుడు ఏ విధంగా తన గురువు, దైవం అయిన శ్రీకృష్ణునితో సంభాషణ చేసాడో ఈ రోజు మీరు అదే విధంగా గురువు సమక్షంలో ఉన్నారు. గురువు మాటలు మీలోని అనుమానాలని నివృత్తి చేయుగాక. ఆమాటలు మీ ప్రశ్నలకి జవాబులునిచ్చుగాక. నిత్యానందం.