జోర్డాన్ ప్రభుత్వం
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
అమ్మాన్: జోర్డాన్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన రాజు రెండవ అబ్దుల్లా మంగళ వారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య సంస్కరణల కోసం దేశంలో గత కొద్దివారాలుగా నిరసన ప్రదర్శనలు చోటుచేసుకుంటున్న నేప థ్యంలో.. అబ్దుల్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈజిప్ట్ పరిణామాలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త ప్రధానమంత్రిగా మారూఫ్ బాఖిత్ (64)ను అబ్దుల్లా నియమించారు. 2005- 07 మధ్య బాఖిత్ జోర్డాన్ ప్రధానిగా పనిచేశారు. 'జోర్డాన్ లో ప్రజాస్వామ్యాన్ని దృఢతరం చేసేందుకు, నిజమైన రాజకీయ సంస్కరణలను ప్రారంభించేందుకు, జోర్డాన్ ప్రజలకు సరైన జీవన ప్రమాణాలు సమకూర్చేందుకు బాఖిత్ ను నియమించాం' అని రాజభ వనం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, బాఖిత్ నియామకాన్ని శక్తివంత మైన ఇస్లామిక్స్ ప్రతిపక్షం వ్యతిరేకిస్తోంది. బాఖిత్ ప్రజాస్వామ్య సంస్కరణ
• నూతన ప్రధానిని నియ
• ప్రతిపక్షం అసంతృప్తి;
కొనసాగిస్తామని హెచ్చ
లకు మద్దతుదారు కాదని పేరొం
జాతీయ ఎన్నికలు జోర్డాన్ చరిత్ర
ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టె
ప్రతిపక్ష ఇస్లామిక్ యాక్షన్ ఫ్రంట్
సంస్కరణలు ప్రారంభం కాలేదని
ఐఎఎఫ్ అధినేత హంజా మన్సూర్
కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

దెబ్బతిన్న గుండె ఇక త్వరగా కోలుకుంటుంది!
పిల్ ను రూపొందిస్తున్న డాక్టర్లు
లండన్: గుండెపోటు నుంచి కోలుకోవడం ఇకపై చాలా సులభమంటున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. తాము తయా రుచేస్తున్న పిల్ తో దెబ్బతిన్న గుండెను మామూలు స్థితికి తీసుకురావచ్చని చెబుతున్నారు. గాయపడిన గుండెను పూర్వస్థితికి తెచ్చుకునే సామర్థ్యమున్న జీబ్రాఫిష్, ఇతర జంతువులపై పరిశోధనల ఆధారంగా ఈ పిల్‌ను రూపొందిస్తున్నట్లు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్(బీహెచ్ ఎఫ్) పరిశోధకులు తెలిపారు. తమ పరిశోధన విజయవం మైతే విరిగిన కాలును అతికించడం కన్నా సులభంగా గుండెపోటుకు చికిత్స అందిం చవచ్చని అన్నారు. ఇంపీరియల్ కాలేజీ, యూనివర్సిటీ కాలేజీ లండన్ సహా పలు యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరుపుతున్నారు. వచ్చే దశా బ్దంతానికి ఈ మందు అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.