₹ వంద కోట్లివ్వాలని బెదిరిస్తున్నారు: నిత్యానంద
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

మీడియాతో మాట్లాడుతున్న నిత్యానంద
బెంగళూరు, న్యూస్‌లైన్: బెడ్లను లైంగికంగా లొంగదీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద తనను కొంత మంది బలవంతులైన నాయకులు ₹ వంద కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. అయితే ఇందుకు తన వద్ద సాక్ష్యా లు లేవన్నారు. ఆయన మంగళవారం బెంగళూరు శివార్లలోని బిదిదిలో తన ఆశ్రమంలో విలేకర్లతో మాట్లాడారు. 'నేను అమాయకుడిని. ఏ తప్పూ చేయలేదు. నా నుంచి డబ్బు గుంజడానికి పరిపతి గల నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మొదట ₹ వంద కోట్లు డిమాండ్ చేశారు. తర్వాత 60 కోట్లకు దిగొచ్చారు. ఆ నాయకుల పేర్లను పోలీసులకు చెప్తాను' అని వివరించారు.
ఎమ్మెల్యేల 'అనర్హత'పై విచారణ పూర్తి.. తీర్పు వాయిదా
బెంగళూరు, న్యూస్ లైన్: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వానికి మద్దతు ఉపసంహ రించుకుని ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు గురైన ఐదుగురు ఎమ్మెల్యేల కేసు విచా రణను హైకోర్టు మంగళవారం పూర్తి చేసింది. తీర్పును వాయిదా వేసింది. గత ఏడాది అక్టోబర్ 11న యడ్యూరప్ప శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనడానికి కొద్ది గంటల ముందు స్వతంత్ర ఎమ్మెల్యేలు నరేంద్రస్వామి, గూళిహట్టి శేఖర్, డి.సుధాకర్, శివరాజ్ తంగడగి, వెంకటరమణప్ప లపై స్పీకర్ కేజీ బోపయ్య అనర్హత వేటు వేయడం తెలిసిందే. దీంతో ఆ ఎమ్మెల్యేలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
'స్టేపుల్డ్ వీసా' సమస్యను 2 నెలల్లో పరిష్కరిస్తాం'
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు చైనా జారీ చేస్తున్న స్టేపుల్డ్ వీసా సమస్యను రెండునెలల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జీకే పిళ్లై తెలిపారు. శనివారం ఢిల్లీలో అరుణాచల్ ప్ర దేశ్ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ విషయం చెప్పారు. రాష్ట్రంలోని తిరప్, చాంగ్ లాంగ్ జిల్లాల్లో భద్రత పునరుద్ధర ణకు హోంశాఖ చర్యలు చేపడుతోందని, దశా బ్దాల తరబడి నలుగుతున్న వివాదాస్పద చర్చ్వా -హజోంగ్ అంశంపై శాశ్వత పరిష్కారం కోసం ఒక కమిటీని నియమించిందని వివరించారు.