KAILASA Library/పరమహంస శ్రీ నిత్యానంద/భగవంతునికి ఆధీనులవటం అంటే ఏమిటి?Sign in
పరమహంస శ్రీ నిత్యానంద

భగవంతునికి ఆధీనులవటం అంటే ఏమిటి?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

భగవంతునికి ఆధీనమవటం అనేది నిబంధనలతో ఉండకూడదు. అది సంపూర్ణంగా జరగాలి. అందులో ‘అయితే’ ‘కానీ’ వంటివి ఉండకూడదు. నీవు నా ఈ కోరిక తీరిస్తే నేను నీకు ఆధీనమవుతాను లేదా మరొక దేవుడిని చూసుకుంటాను అనే పద్ధతి భక్తి కాదు, వ్యాపారం. స్పష్టంగా అర్థం చేసుకోండి. భగవంతుడు అంటే మేధస్సు. ఆయనకి సమస్తం తెలుసు. మనం అడిగేవి అడగబోయేవి కూడా తెలుసు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మనం చేసే పూజా ప్రార్థనలలో గొప్ప మార్పు వస్తుంది.

భగవంతునికి ఆధీనమవటం అనేది మూడు విధాలుగా ఉంటుంది.

మొదటి రకం ఆధీనత అనేది మన మేధస్సుని ఆధీనపరచటం. ఇది సులభమే. విశ్వశక్తి, భగవంతుడు అనేది చాలా గొప్పశక్తి. ఆ మేధస్సు మన మేధస్సు కంటే గొప్పది అని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆశక్తికి మనం మన ఆధీనపరుస్తాం. అంటే తెలివితేటల దశలో ఆధీనులవుతాము. అప్పుడు నిర్ణయాలు భగవంతునికి వదログインగుతాము.ఆ తరువాత ఆధీనత భావాత్మక దశలో జరిగేది. అటువంటివారు భగవంతుని స్మరించగానే కరిగిపోతారు. అలా అనుకోగానే ప్రేమ కృతజ్ఞతా భావం వారిలోంచి పొంగి ప్రవహిస్తుంది. కళ్ళ నుండి నీరు ప్రవాహంలా వస్తుంది. అప్పుడు వారు భక్తులుగా మారిపోతారు. ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస ఈవిధంగా చెబుతారు, “మీరు భగవంతుని కానీ గురుదేవులని కానీ స్మరించుకోగానే మీ కళ్ళలో నీరువస్తే, స్పష్టంగా తెలుసుకోండి. ఇది మీకు చివరి జన్మ అని, మీరు స్వేచ్ఛని పొందటానికి సిద్ధంగా ఉన్నారు అని”

ఇక మూడవదశ స్పర్శేంద్రియాలని ఆధీనపరిచే దశ, ఇది చివరి దశ. రామకృష్ణ పరమహంస చెప్పిన స్వేచ్ఛని రెండవ దశలో పొందలేము. ఆ స్వేచ్ఛ ఈ దశలో పొందగలం. ఈ దశలో మనం మన స్పర్శేంద్రియాలని ఆయనకి ఆధీన పరుస్తాము. ఇదే సంపూర్ణ ఆధీనత. ఇది నిబంధనలు లేని అప్రయత్నంగా, సహజంగా జరిగే ఆధీనత.

కృష్ణార్జునుల కథ :

మహాభారతంలో వ్యాసమహర్షి శ్రీ కృష్ణుడు, అర్జునికి గురించి ఒక చక్కని సంఘటనని వివరిస్తారు. ఒక రోజు సాయంత్రం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు అలా నడచి వెళుతుంటారు. వారు ఇద్దరూ మంచి స్నేహితులు, బంధువులు దగ్గర దగ్గర ఒక వయస్సు వారు, చిన్నతనంలో కలసి ఆడుకున్నవారు. అంతే కాదు అర్జునుడు శ్రీ కృష్ణుని భక్తుడు. నిజానికి వారి మధ్య ఉన్న బంధం భగవంతుడు, భక్తుడు మాత్రమే.

అలా నడుస్తూ ఉండగా ఆకస్మాత్తుగా కృష్ణుడు అక్కడ చెట్టు మీద ఉన్న ఒక కాకిని చూపిస్తూ, "అర్జునా! ఆ ఆకుపచ్ఛని కాకిని చూసావా?" అంటాడు.

అప్పుడు అర్జునుడు, "అవును కృష్ణా! నేను ఆ ఆకుపచ్ఛని కాకిని చూసాను" అంటాడు.

వాళ్ళు ఇంకా కొంచం ముందుకు వెళ్ళాక, శ్రీకృష్ణుడు మరొక కాకిని చూపించి, "అర్జునా! ఆ నల్లని కాకిని చూడు" అంటాడు. అప్పుడు అర్జునుడు, "కృష్ణా! నేను నల్లని కాకిని చూసాను" అంటాడు. కృష్ణుడు అర్జునిని వైపు తిరిగి, "అర్జునా! నీవు మూర్ఖుడివిగా ఉన్నావు. నేను నిన్ను తెలివైనవాడివి అని అనుకున్నాను. కాకి ఎలా ఆకుపచ్ఛగా ఉంటుంది? మొదటి నేను చూపించిన కాకి నల్లగా ఉన్నప్పుడు నీవుఎలా దానిని ఆకుపచ్ఛ కాకి అని అన్నావు? నీవు నన్ను ఆనందపరచాలని అలా అన్నావా?" అని అడుగుతాడు.

అప్పుడు అర్జునుడు, "కృష్ణా! నీవు చూపించి, ఆకుపచ్ఛ కాకి అన్నప్పుడు నాకు ఆకుపచ్ఛని కాకి కనిపించింది. నేను ఏమి చేయను. నేను అప్పుడు నల్లటి కాకిని చూడలేకపోయాను. నా కళ్ళు నా స్పర్శేంద్రియాలు నన్ను మోసం చేసాయి" అని జవాబు ఇస్తారు.

అర్జునుని స్పర్శేంద్రియాలు ఆయనని మోసం చేయలేదు. అవి భగవంతునికి అధీనమైపోయాయి. ఒక్కసారి ఆ స్థితికి చేరితే ఇక వెనక్కి వచ్చే ప్రసక్తి ఉండదు. ఇదీ సంపూర్ణమయిన అధీనత అంటే.

కృష్ణుడు భగవద్గీతలో ఇలా చెబుతాడు, "మీరు నా అధీనులయితే మీకు స్వేఛ్చని ఇస్తాను" అని ఆయనని చేరటానికి మనం పూర్తి అధీనులమయిపోవాలి. మన స్పర్శేంద్రీయాలని అధీనపరచాలి. మన చేతనస్థితి, మన తెలుసుకునే తత్త్వం సర్వం ఆయనే అయిఉండాలి. అప్పుడే మనం భగవంతుణ్ణి చేరగలంచం. నిజమయిన భక్తుడు భగవంతుని సందేశానికి దాసుడవుతాడు కానీ రూపానికి కాదు :

నన్ను చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు. అది మతం పేరిట, ఆధ్యాత్మిక పేరు మీద లేదా భగవంతుని పేరు మీద ప్రపంచమంతా ఎందుకు ఇంత హింస జరుగుతుంది? ఎందుకు ఇన్ని పోరాటాలు జరుగుతాయి, అని.

ముందుగా మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇదంతా ఆధ్యాత్మికత కాదు. అలాగే ఇది ఏమతం యొక్క ఉద్దేశం కాదు. ఎన్నో సంవత్సరాలుగా అవతార పురుషుల, యోగీశ్వరులూ అంతిమ సత్యమయిన భగవంతుడిని గురించి చెప్పే సత్యం ఒక్కటే. అయితే ఆ సత్యాన్ని చెప్పే భాషా, పద్ధతి, మార్గం కాలానగుణంగా, అప్పటి పరిస్థితులని బట్టి మారుతుంటాయి. అయితే ఇక్కడ జరిగే పొరపాటు ఏమిటంటే భక్తులు, అనుచరులు గురువులు చెప్పే మాటలు సందేశాలను పట్టించుకోకుండా వారి రూపానికి వారి పేరుకి ప్రాముఖ్యాన్ని ఇస్తారు. గీతలోని సందేశాన్ని వదిలివేసి కృష్ణుణ్ణి, అతని మురళిని, నెమలిపించాన్ని పట్టుకొని వేలాడితే వచ్చే ఫలితమే హింస. ఇది ఏ కాలానికైనా వర్తిస్తుంది.

అలాకాకుండా శ్రీకృష్ణుని సందేశాన్ని గ్రహించి ఆయన రూపానికి, పేరుకి ప్రాముఖ్యాన్ని ఇవ్వనప్పుడు వాళ్ళు నిజమయిన కృష్ణ భక్తులవుతారు. అటువంటివారు కృష్ణ ప్రేమని, శ్రీకృష్ణుని సేవా మార్గాన్ని ప్రపంచమంతా

వెదజల్లగలుగుతారు.
ఒక చిన్న కథ:
వారణాసిలో శ్రీకృష్ణుని భక్తుడు :

నేను మీకు వారణాసిలో నివసించే ఒక భక్తుని కథ చెబుతాను. అతను గొప్ప కృష్ణ భక్తుడు. అతని దగ్గర భగవద్గీత పుస్తకం ఉన్నది. అదే ఆయన సర్వస్వం, అదే అతని సర్వసంపద. అతనికి ఎటువంటి ఆస్తులు లేవు.

శ్రీ కృష్ణ భక్తుడు ప్రతి రోజు గంగానదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్న తన పూరిపాక దగ్గర ఉన్న చెట్టు క్రింద కూర్చొని ఆ గీతనిచదివేవాడు. శ్రీకృష్ణుని సందేశమయిన భగవద్గీతని అతను అత్యంత భక్తి పారవశ్యంతో చదివేవాడు. అలాగే కూర్చొని రోజంతా కృష్ణుని ధ్యానం చేసేవాడు. అతను నిరంతరం శ్రీకృష్ణుని భక్తి పారవశ్యంలో ఉండేవాడు. అతని ధ్యానం, ధ్యాస సర్వస్వం కృష్ణమయమే. అతను శ్రీకృష్ణుని చేతనస్థితిలో తనకు తానులీనమై తాను అనే విషయాన్ని మరిచిపోయే వాడు.

ఆ భక్తుడి సంగతి ఆ ఊరివారందరికీ తెలుసు. అందరూ ఆయనని ఎంతో గౌరవంతో, భక్తితో ఆదరించేవారు. భారతదేశం, ఇక్కడ ప్రజలు ఈ విషయంలో ఎంతో గొప్పవారు. ఎవరైనా ఒక వ్యక్తి ఎటువంటి పనీపాటు చేయకుండా, ఏ చెట్టుక్రింద అయినా కూర్చొని భక్తిపారవశ్యంలో ఉన్నా లేదా ధ్యానం చేసుకుంటూ ఉన్నా ఎవరూ వారి నిశ్చలతని భంగపరచరు. వారే ఆ వ్యక్తి బాగోగులు చూసుకుంటారు. అదే మరే దేశంలో అయినా అయితే అటువంటివారిని తీసుకెళ్లి జైలులోనో లేదా ఏదయినా హోమ్‌లలో వేస్తారు.

ఇలా ఉండగా, ఒక రోజు ఒక బిక్షగాడు అతని దగ్గరకి వచ్చి "స్వామీ! దయచేసి ఏమయినా ఇవ్వండి. నేను భోజనంచేసి మూడు రోజులు అయింది అని దీనంగా అడుగుతాడు".

ఆ భక్తునికి ఏమిచేయాలో తెలియదు. అతనే ఒక బిక్షగాడు. అతనికి ఉన్న ఏకైక ఆస్తి భగవద్గీత. ఆ సమయంలో బిక్షగాడు వచ్చి తాను మూడురోజుల నుంచీ ఏమీ తినలేదు అని అనగానే, భక్తుడు చాలా బాధపడతాడు. అతను తన పాకలో వెతుకుతాడు. ఆయనకి భగవద్గీత తప్పా ఏమీ కనిపించదు. ఆ పుస్తకమే అతని దైవం, అతని సర్వస్వం.

అకస్మాత్తుగా ఆ భక్తుడు దైర్యాన్ని తెచ్చుకొని,ఆ పుస్తకాన్ని చేత్తో పట్టుకొని,“అయ్యా! నా దగ్గర ఏమీ లేదు, ఈ పుస్తకం నీకు నేను ఇచ్చాను అని చెప్పి ఎవరికైనా అమ్ముకో. ఊరిలో చాలామందికి నేనంటే గౌరవభావం ఉన్నది. ఎవరయినా నీకు డబ్బులు ఇచ్చి ఈ పుస్తకాన్ని కొనుక్కుంటారు. ఆ డబ్బులతో నీవు ఆకలి తీర్చుకో,” అని చెప్పి పుస్తకాన్ని ఆ బిక్షగాడికి ఇస్తాడు.

బిక్షగాడు ఆ పుస్తకాన్ని తీసుకువెళ్లిపోతాడు. మర్నాడు ఆ భక్తుడు గీత చదివే సమయంలో ఇలా అనుకుంటాడు, “శ్రీకృష్ణా నేను నీ మాటలని నిలబెట్టటానికి నీ మాటలని ఇచ్చివేసాను” అని

ఇతను నిజమయిన భక్తుడు. అతను సత్యాన్ని చూడగలిగాడు. ఆ సత్యాన్ని అనుభవించాడు. ఆ అనుభూతులని వెల్లడి చేయగలిగాడు. అతను శ్రీకృష్ణుని ప్రేమని, సేవా మార్గాన్ని, భక్తిని అందరికీ తెలియచేయగలిగాడు. ఇటువంటి భక్తులు ఉన్నప్పుడు గొడవలు, పోరాటాలు హింసలు జరగవు. అలా కాకుండా గీతలోని సందేశాన్ని వదలి గీతనో, కృష్ణుణ్ణో పట్టుకొని వేలాడినప్పుడే సమస్యలు వచ్చేది.

Photograph of a smiling person

Our Nithyananda Meditation Acadamies (NMA) INDIA: Nithyananda Dhyanapeetam Nithyanandapuri Kallugopahalli, Mysore Road, Bidadi Bangalore - 562 109 Karnataka, INDIA Phone: 91 +80 65591844 / 27202084 Fax: 91 +80 7288207 Email: [email protected] URL: www.nithyananda.org

Nithyananda Dhyanapeetam Sri Ananda Rajarajeshwari Temple, Nithyananda Giri Pashambanda Sathamrai Village, Shamshabad Mandal Rangareddy District Andhra Pradesh - 501 218, INDIA Ph.: +91 93470 65288 E-mail: [email protected]

Nithyananda Dhyanapeetam
HYDERABAD CENTRE,
Cell : 93910 35463

Nithyananda Dhyanapeetam VISKHAPATNAM CENTRE Viskhapatnam District, Andhra Pradesh, INDIA

Nithyananda Dhyanapeetam ELURU CENTRE, West Godavari District, Andhra Pradesh - 534 003, INDIA Ph : 08812 - 250712, Cell : 94908 26692

Nithyananda Dhyanapeetam BHIMAVARAM CENTRE, West Godavari District, Andhra Pradesh, INDIA Ph : 9912144429, 99498 33599

Nithyananda Swamiji

మనలో ప్రతి ఒక్కరూ నిరంతరం వెతికేది ఆనందం కోసమే. అది ఐశ్వర్యంతో, అధికారంతో సంబంధబాంధవ్యాలతో మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చిన్న సం ఘటన ద్వారా మనం వెతికేది కేవలం ఆనందం కోసమే. అయితే మనకి ఆ విష యం తెలియదు.

మనం ఎంత అభివృద్ధి సాధించినా, ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా, ఎన్ని అత్యుత్తమ అవార్డులు పొందినా, ఎంత ఐశ్వర్యం సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్ట లు పొందినా చివరికి మనలో శూన్యం ఏర్పడుతుంది. ఆనందం ఉండదు.ఎందుకు?

ఎందుకు మన సంతోషం తాత్కాలికంగా, చంచలంగా ఉంటుంది? ఎందుకు మనం ఎప్పటికీ శాశ్వతంగా ఆనందస్థితిలో ఉండలేకపోతున్నాము?

ఇంత విశాలమయిన ప్రపంచం, ఎన్ని రకాల వస్తువులు, సౌఖ్యాలు,విలాసాలు, ఐశ్వర్యం, చదువు, జ్ఞానం, మేధస్సు.... ఎందుకు మనని శాశ్వత ఆనందస్థితిలో ఉంచలేకపోతున్నాయి?

Ebook ISBN: 979-8-88572-943-7

నిత్యానంద ధ్యానపీఠం శ్రీ ఆనందేశ్వరి దేవాలయం పొషంబండ, సౌతంరాయ్ విల్లేజ్, శంషాబాద్. రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 93470 65288, 98665 00350 www.nithyananda.org